[
    {
        "DESCRIPTION": "మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం, ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు. మనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.\n\nఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.\n\nఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1,
        "IMAGE": "cat_1",
        "NAME": "ముంగిస - పిల్లాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.\n\nఅలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.\n\nతన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.\n\nయువకుడు ఆ వ్యక్తిని \"ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న\" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'\n\n\"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను\" అని అవతలి వ్యక్తి అన్నాడు.\n'లండన్‌' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.\n\"వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.\n\"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను\" అన్నాడా వ్యక్తి.\n'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.\nయువకుడు \"పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.\nనీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను\" అన్నాడు.\nమొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.\n\nఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.\n\nఆ వ్యక్తి \"ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది\"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.\n\nకుతూహలం పట్టలేక యువకుడు \"ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?\" అని అడిగాడు ఆ వ్యక్తిని.\n\"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను\" అన్నాడా వ్యక్తి.\nఅవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 2,
        "IMAGE": "cat_1",
        "NAME": "మితిమీరిన విశ్వాసం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. బాబూ గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరో వైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబూ! అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్.\n\nనవీన్ చూపులకు బయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ ఆగుతుందిలే అంటూ మరో వైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదోరకంగా ఫీలవుతున్నాడు. అదీగాక ఈ బస్‌స్టాండ్‌లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్‌లో ఆగింది. బిల బిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకర్నొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతిరుమాళ్ళు, బ్రీఫ్‌కేసులు వేసి సీటులు రిజర్వ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్‌కేస్‌ను ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తరువాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు.\n\nకొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ! ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూసాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థంకాని నవీన్ ఒక్క ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్‌కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్న మాట. అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేసాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులో కొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్ళాడు.\n\nఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్‌కు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకూ తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేసాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, రెండువేలరూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి ఋణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాతా! నీకు చాలా నీరసంగా ఉంది కదూ! నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందువుగానీ రా తాతా! అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 3,
        "IMAGE": "cat_1",
        "NAME": "మార్పు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.\n\n\"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?\" అని సవాలు విసిరాడు.\n\nఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.\n\n\"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరెట్టగల మేధావులే లేరా?\" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.\n\nమహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.\n\"అమ్మో! కాపాడండి!\" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.\n\nమహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో \"మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి.\" అని చెప్పాడు.\nపండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 4,
        "IMAGE": "cat_1",
        "NAME": "మాతృభాష",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కధ పేరు చూసి గాడిద మాట్లడటం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా! అవునర్రా! నిజంగా గాడిద నిజంగానే మాట్లడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం.\n\nసమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు.\n\nఅతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ \"మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. \"అన్నాడు.\n\nఅంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. \"అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!\" అని అడిగాడు మహారాజు\n\"అవును మహారాజా\" అన్నాడు బీర్బల్\n\"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!\" అని అడిగాడు అక్బర్.\n\nమళ్ళీ 'అవునని' చెప్పాడు బీర్బల్\nవెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.\nబీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? \" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\nబీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. \"అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను\" అన్నాడు బీర్బల్.\nరాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.\nరాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు.\n\"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?\"\n\nఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?\"\n\"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?\"\n\"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు..\"\n\n\"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు\" అని మరొక వర్గం వారు.\n\nఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.\n\nఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు.\n\n\"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?\" కుతూహలంగా అడిగాడు అక్బర్.\n\"చిత్తం మహారాజా\" అన్నాడు బీర్బల్.\nబీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు.\n\"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!\"\n\"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు\" \"బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు.\"\nఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు.\n\"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?\" అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు\" అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\nవెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది.\nఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.\n\n\"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి\" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు.\nబీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు.\n\"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?\" అని అడిగాడు మహారాజు\n\"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!\" అన్నాడు బీర్బల్.\n\nఅంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. \"సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?\" అని అడిగాడు అక్బర్.\n\nఅక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు \"మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు.\" అన్నాడు బీర్బల్.\nఅక్బర్ అందుకు అంగీకరించాడు.\n\n\"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.\r\n\nఅంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు.\nఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.\r\n\nచూసారా పిల్లలూ! బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా ఎంత సులభముగా పరిష్కారిస్తున్నాడో! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 5,
        "IMAGE": "cat_1",
        "NAME": "మాట్లాడే గాడిద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు - ఆ గొర్రెల కాపరి దంపతులకు, రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదు. చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడవికి పంపితే, అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి \"నీ మొహం చూపించ వద్ద\" ని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. \"అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది\" అని, వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచీ రామన్న కాస్తా మర్యాద రామన్నగా అందరి మన్ననలూ అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మ బద్ధమైన న్యాయవేత్తగా - తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు, నలుగురు దొంగలతో తగువొచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం, వాళ్ళెప్పుడో అమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలూ, నలుగురూ కలిసి అడగ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూండగా, వాళ్ళని చూపిస్తూ నలుగో దొంగ, పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటునుంచి అటే ఉడాయించాడు.\n\nఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, \"ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే\" అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమనీ కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.\n\nశేషయ్య అనే రైతు, పెళ్ళి వేడుకల కోసం, ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాన అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదు ఇస్తానంటే, ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్, మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకు రమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంట్లో, తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలాయి. తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికీ, పగిలిన ఈ కుండలకీ చెల్లు! ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న.\n\nరంగమ్మకీ, గంగమ్మకీ వీశెడు నెయ్యి బాకీ దగ్గర తగువొచ్చింది. రెండు గేదెల పాడి వున్న రంగమ్మ దగ్గర, ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా, ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.\n\nతీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, \"అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?\" అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. \"ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?\" అడిగాడు పేరయ్య.\n\n\"పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది\" అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు పెట్టుకుంటూ, అందరితోనూ \"ధర్మప్రభువు మర్యాద రామన్న\" అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 6,
        "IMAGE": "cat_1",
        "NAME": "మర్యాదరామన్న కథలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హయిగా ఉండేవాడు. ధనం లేక పోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు.\n\nసోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా, ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య.\n\nఒక రోజు సోమయ్య రామయ్యను పిలిచి నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు.\n\nరామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టె వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది.\n\nతెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్యా నన్ను ఇలాగే ఉండనివ్వు నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 7,
        "IMAGE": "cat_1",
        "NAME": "మనశ్శాంతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.\n\n'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.\n\nఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు.\n\nఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది.\n\nఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.\n\nచిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు.\n\nవేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి.\n\nవలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు.\n\nచిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు.\n\n'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను.\n\nచూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 8,
        "IMAGE": "cat_1",
        "NAME": "మంచి మిత్రుడు (పావురం - ఎలుక) ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్లచావిడిలో దూరింది. ప్రాణభయంతో తమ చావిడిలో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, \"మిత్రమా! ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో!\" అని హెచ్చరించింది.\n\nబదులుగా దుప్పి, \"మిత్రమా! దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను\" అని చెప్పింది. సాయంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్లచావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దాణా వేసి వెళ్లారు. కాని అక్కడే, ఎద్దులు, ఆవులతో పాటే వున్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతోపాటే దుప్పిని కుడా గడ్డి మేయమని కోరాయి. కాని, \"మిత్రమా! నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచివున్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్ళేవరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి\" అని అన్ని పశువులూ ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపొమ్మని చెబుతుండగానే యజమాని రానేవచ్చాడు.\n\nవచ్చీ రావడంతోనే, \"నా పశువులకు నేను వేసే దాణా ఎందుకు సరిపోవడం లేదు. నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది\" అంటూ చావిడంతా కలియదిరిగాడు. అన్ని పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్లారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి, దుప్పిని బంధించమని పురమాయించాడు.\nపాపం! పశువుల మంచి మాట పెడచెవిన పెట్టిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 9,
        "IMAGE": "cat_1",
        "NAME": "మంచి మాట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడు కోవటం కూడా మానేశారు.\n\nఓ రోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. \"అయ్యా...చాలా దూరం నుంచి వచ్చాను. ఏదైనా పనుంటే ఇప్పించండి.\" అని వడ్రంగి అడిగాడు.\nరామయ్య కొంచెం ఆలోచించి, 'అటు చూడు...ఆ కాలువ కనిపిస్తోంది కదా! దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటు వైపు రావటం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంత పౌరుషముంటే నాకెంతుండాలి. కాబట్టి నువ్వేం చేస్తావో తెలీదు. వాడి ముఖం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు' అన్నాడు రామయ్య.\r\n\nఅలాగే అన్నట్లు తలూపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావల్సిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య.\r\n\n'నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపొండి. తెల్లారే సరికి నా పని పూర్తి చేస్తాను' అన్నాడు వడ్రంగి.\n\nతెల్లారింది. ఇక తమ్ముడి ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్ర లేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి.\r\n\n'అన్నయ్యకి నాపై కోపం తగ్గొందేమో! ఇటుపైపు రావటానికి వంతెన నిర్మించాడు' అనుకున్నాడు సొమయ్య.\r\n\nతమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అనుకున్నాడు రామయ్య.\nఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ల దగ్గరకి వచ్చాడు.\n\nనన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేధాలు ఇంకాపెరుగుతాయి. నేనలా చెస్తే శాశ్వతంగా మీరు విడిపోయే వారు. ఆ పాపం నాకొద్దు. అందుకే వంతెన నిర్మించాను' అన్నాడు. ఇందులో క్షమించాల్సింది ఏమి లేదు. మనం చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియచేశావు. అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. అని వడ్రంగికి బహుమానాలిచ్చి పంపించారు రామయ్య, సోమయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 10,
        "IMAGE": "cat_1",
        "NAME": "మంచి పని ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులూ ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ, స్నేహంగా ఉండేది.\n\nఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, \"ఏయ్‌ చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి\" అంటూ అరవడం మొదలెట్టింది.\n\nకప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. \"నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కాని నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను\" అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది.\n\nకప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. \"నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా\" అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి \"బెక బెక\" మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 11,
        "IMAGE": "cat_1",
        "NAME": "భేషజాల కప్ప",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలంన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు.\n\nప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహలు ఉండడం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకి. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రముఖమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగానే ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ.సంతోషించాడు.\n\nతరువాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా? అని శిల్పిని ప్రశ్నించాడు ప్రయాణికుడి రూపం లో ఉన్న బ్రహ్మ దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను దానికి కొంత డిమాండ్ ఉంది. కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుందని సమాధానమిచ్చాడు.\n\nకొద్ది సేపు విగ్రహాలన్నింటిని పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మరి ఈ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు.\n\n\"మీరు ఆ రెండు విగ్రహాలనూ తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను\" అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిల్చుండిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 12,
        "IMAGE": "cat_1",
        "NAME": "బ్రహ్మ - శిల్పి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలీ, దాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది. ఒకటొకటిగా మరణించసాగాయి. తమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి.\n\nఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపునిండా భోజనం దొరుకుతుంది\" అన్నది ఒక కుంటి నక్క. \"నేను చంపుతా\" అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి. \"ఇది ఆడుకొనే ఏనుగు అనుకొన్నావా? కాదు. దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో\" అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా \"వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరి కాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా\" అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క \"సరే! చూద్దాం! కానీ!\" అన్నాయి.\n\nమరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి \"మహారాజుకు జయము! జయము! అంటూ వినయంగా నిలుచుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. \"ఎవరు నువ్వు\" అంది బిగ్గరుగా. \"ప్రభూ నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్ని మీలో ఉన్నాయి, కాబట్టి మహారాజా! అని పిలిచాను. ఈ అడవికి మిమ్ముల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి. బయల్దేరండి\" అంది నక్క పిల్ల.\n\nఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. \"ఎంతదూరం వెళ్ళాలి మనం\" అని గర్వంగా అడిగింది. \"దగ్గరే. నాతోరండి స్వామీ!\" అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుగా ముందు నడవసాగింది. దాని వెనకే రాచఠీవితో మాతంగం నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలులు కంటూ అడుగులేస్తున్న ద్విరదం హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని \"కాపాడండి! కాపాడండి\" అని అరవసాగింది.\n\n\"ప్రభూ! జిత్తులమారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు\" అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరే సరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్నీ నక్క పిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 13,
        "IMAGE": "cat_1",
        "NAME": "బుద్ధి బలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి, సురేష్ అనే కొడుకు ఉన్నాడు. అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె! అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి \"అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే! చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాక పోవును కదా\" అని దుఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 14,
        "IMAGE": "cat_1",
        "NAME": "బాలుడు - తోటకూర",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి \"స్వామీ! అబద్దాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా, ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు?\" అని అడిగాడు.\n\n\"ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశముంది\" అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్ళ గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు.\n\nఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిసాడు. స్వామీజీ రాఘవయ్యతో \"నాయనా! ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు?\" అని అడిగాడు. \"స్వామీ! మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను?\" అన్నాడు రాఘవయ్య.\n\nనీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్ప లేదు కదా! మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా జీవించగలం\" అన్నాడు స్వామీజీ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 15,
        "IMAGE": "cat_1",
        "NAME": "బాబా బోధన",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "బీర్బల్‌ శాకాహారి. మద్యమూ, మాంసమూ ముట్టుకోడు. ఒకరోజు అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌కు ఒక కోడిని బహుమతినివ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్‌లో అందరి ముందు \" బీర్బల్‌ నీకు ఒక బహుమతి ఇస్తాను. అది తినదగినదే. మరి నీవు తింటావా? \" అని అడిగాడు.\n\n'చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి వుంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు ' అని ఒక్కక్షణం ఆలోచించి బీర్బల్‌ \" ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం \" అన్నాడు. \" తీసుకోవడం కాదయ్యా. తింటావా, లేదా? బాగా ఆలోచించి చెప్పు. తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా! \" అన్నాడు అక్బర్‌.\n\n\"అన్నమాట మీదే నిలబడతాను ప్రభూ! మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను \" బదులిచ్చాడు బీర్బల్‌. అక్బర్‌ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. \" ఈ కోడిని నువ్వు తింటావా? \"బీర్బల్‌ని అడిగాడు అక్బర్‌. తప్పకుండా ప్రభూ! మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని \" అన్నాడు బీర్బల్‌. అక్బర్‌తో పాటు సభలో వున్న వారంతా ఆశ్చర్యపోయారు. \" నువ్వు శాకాహారివి కదా!కోడినెలా తింటావు? \" అన్నాడు అక్బర్‌.\n\n\"అవును ప్రభూ నేను శాకాహారినే. నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదు ప్రభూ ఎలాగైనా తింటానని \" ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్‌.ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 16,
        "IMAGE": "cat_1",
        "NAME": "బహుమానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "దశరధం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని పన్నెండేళ్ళ కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరధం తోటలో పని చేస్తున్న రాము వైపు చూసి, \"రామూ! నీ పక్కనున్న ఈ రాయిని తొలిగించు. మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం\" అన్నాడు.\n\nరాము వెంటనే ఆ రాయిని తొలిగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదల్లేదు. \"నాన్న! ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలిగించడం నావల్ల కావట్లేదు\" గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరధం \"బాబూ! మళ్ళీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి, తొలిగించు\" అంతే బిగ్గరగా అరిచాడు.\n\nఎంత బలంగా ప్రయత్నిచినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెట్టాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరధం. \"నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా?\" ప్రశ్నిచాడు దశరధం. ఏడుస్తూనే రాము, \"అవును, నాన్నా. కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. కానీ రాయి కనీసం కదలనుకూడా లేదు.\" అని చెప్పాడు. \"కానం రామూ! నీవు నన్ను మర్చిపోయావు నాన్నా. నీవు నా సహాయం కోరవచ్చు కదా! నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు?\" అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్‌న మెరిసి ఏడుపు తానంతట అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 17,
        "IMAGE": "cat_1",
        "NAME": "బలం బలహీనత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం! సువర్ణ ఎంత పని చేసినా, మందరమ్మ తిడుతూ, కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి \"బంగారు బొమ్మలా ఉందమ్మా\" అని మెచ్చుకుంటుంటే, మందరమ్మ, చూసి పళ్ళునూరేది! మందరమ్మ అసూయ, కోపంతో, సువర్ణని ఎండలో పనిచేయించేది! అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని. మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి, పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి, సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్క పిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి, నడిచి, ఆకలివేసింది. దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది. కుక్క పిల్ల పరుగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకు వచ్చింది. అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్ళు జల్లి లేపింది.\n\nఅవ్వ సువర్ణతో, తన ఇంట్లో పనిచేస్తే \"మంచి కానుక\" ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు! ప్రతి పనీ ఎంతో శ్రద్దగా, కష్టపడి చేస్తుంది! ఎవ్వరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ, గది నిండా బంగారు నగలు పెట్టి, తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది! సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది! అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ, వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది! ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడనివారే, ఇతరులకు చాలా మేలు చేస్తారు! మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి! అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు యిచ్చింది! అంతేకాదు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి ఝుళిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరు గంటలు శబ్దం చేస్తుండగా, ఒక చక్కటి బంగారు ఊయల ధగ ధగ మెరుస్తూ ప్రత్యక్షం అయింది.\n\nఅవ్వ సువర్ణని చేయిపట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది! \"అమ్మాయి! నువ్వు చాలా మంచి పిల్లవి! నీకు నేను ఈ 'కొరడా' కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికి ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు యీ 'ఊయల'లో కూర్చొని ఏది కోరితే, అది నీ దగ్గరకు వస్తుంది\" అంటూ సువర్ణ చేతకి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని, 'చక్కటి గౌను ఒకటి కావాలి' అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది! సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దానితో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని \"బంగారు తల్లి\" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మందరమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ 'కొరడా' తీసుకోవాలని అనుకుంది. 'నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా' అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందరమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకొని ఊయలలో కూర్చుంది! అంతే!\n\nఒక్కసారి ఊయల ఇనుపముళ్ళతో మందరమ్మని బంధించివేసిది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు! ఆమె అందులో కాలిపోయింది. \"అమ్మాయి! ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే!\" చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే, వారికి ఇదే 'శాస్తి!' అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ, చెడ్డ బుద్దులు మానేసి, మంచి నడవడికతో నడుచుకున్నారు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 18,
        "IMAGE": "cat_1",
        "NAME": "బంగారు ఊయల ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు, గుట్టల మధ్య దారితప్పి పోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తూ ఒక ఊబిగుంటలోకి చిక్కుకు పోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా, అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు.\n\n\"గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయట పడేయగలడు.\" అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తు, \"ఈ ముసలి గంగ అంత పని చేయగలదా?\" అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు, ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు.\nరైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి \"రాధా, రాణీ! రాజా, గంగా! గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది.\nఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞ్తలు చెప్పి, \"నువ్వు గంగ అని పిలిచేముందు అన్ని పేర్లెందుకు పిలిచావు?\" అని అడిగాడు.\n\nరైతు చిరునవ్వుతో, \"ముసలిదైన గంగ ఒక గుడ్డిగుర్రం. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కుడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగాచేయలేదు\" అని చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 19,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రోత్సాహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా వుండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళి అయింది. భార్య అందగత్తె, చదువుకున్నది. తెలివితేటలుగలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒక రోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీ దేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను. ఈ రోజు ఎలా వుంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వి నా ముఖం చూసినవారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకి వెళ్ళాడు.\n\nరామయ్యకి ముందు వెనుకా ఎవరూ లేరు. తల్లీ, తండ్రీ చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనుమడిలా వున్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తనుకూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానివేశాడు. ఆ ఆలోచనలతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా వున్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చర్రుబుర్రులాడాడు. బేరాలు కూడా సరిగాలేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తూండగా కొందరు అవ్వ వూరివారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్యా అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది. నిన్నే తలస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారముతో లంకెబిందెలు దొరికాయి. మంచి యిల్లు కట్టుకొని పొలముగట్రాకొంది. నిన్ను కలవరిస్తూ మనవూరి వాళ్ళను తలాదిక్కుకు పంపిందిరా అన్నారు.\n\nఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామము వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ అమ్మాయి! మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నన్ను వంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వదగ్గరే వుండి వ్యవసాయము చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాణ్ణి కని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందముగా గడిచింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 20,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రాప్తం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!\n\nఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!\n\nఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. \"ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ\" అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా వుందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.\n\nమిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెర పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి వూరుకొన్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ వుంటే, బంగారు పిచ్చుక చూసి, రివ్వున చక్కా వచ్చి, ఆ మిణుగురు పురుగును ముక్కుతో కరచుకొని, చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి, నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టిముద్దకు అంటుకు పోవడం వల్ల, మిణుగురు పురుగు కదలలేక పోయినది. ఎగరలేక పోయినది.\n\nఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు \"చూశారా? నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకేవుంది\" అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మిణుగురు పురుగు గతి ఏమైందో! దానిని చూసి మనం బుద్దితెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి\" అనుకొంటూ, అటూ ఇటూ వెళ్ళిపోయాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 21,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రాణం తీసిన గొప్ప ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేదదీరింది.\nచిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది.\nఆ ఎలుక భయపడి \"అయ్యా నేను అల్ప ప్రాణిని. అవివేకం వల్ల మీ మీదకు దూకాను. నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి\" అంటూ ప్రాధేయపడింది.\nసింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి \"మీరు చేసిన మేలును నేనెన్నటికీ మరచిపోను\" అని తన బొరియలోకి వెళ్ళిపోయింది.\n\nకొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంసి. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది. కాని బయటపడలేకపోయింది.\n'ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుందీ అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది.\nదాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది.\n\"బాధపడకండి మహారాజా! మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది\" అంటూ వల తాళ్ళని తన వాడియైన పళ్ళతో పటపటా కొరికేసింది.\nప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 22,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రత్యుపకారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.\n\nఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్టి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. ఈ ప్రకారంగా అతను ఎనిమిది కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వానకురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థంకాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించినపని. అదిగమనించి యువకుడతనివద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలూ కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు.\n\nఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకిపోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశచూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగుచేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్నిచెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడా యువకుడికొక ఉపాయంతోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలుచేశావు. మేము నీకేంచేయమంటావు? అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు. అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ళ దగ్గరకెళ్ళి రేపు మీరునాకు ఒక్కొక్కరూ ఒక గడ్డిమోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకూ మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళంగీకరించారు.\n\nమరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని, ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసివచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో 'రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది' అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో 'బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి'. అన్నాడు. రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని... అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు వెళ్ళబోయారు. యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు తీసుకువెళ్ళారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కక్కరూ నౌకలో భాగమునకు వెయ్యిచొప్పున సరుకుకి వెయ్యిచొప్పునా నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు రెండు లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు . మర్నాడతను లక్ష నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్టి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శ్రేష్టి 'నాయనా! నీకీ ధనమెలా వచ్చింది?' అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశమువలననే వచ్చింది. ఆరు మాసములలో యిదంతయూ నాకు లభించింది'. అన్నాడు యువకుడు వినయంగా.\n\nవివరంగా చెప్పు అన్నాడు శ్రేష్టి. చచ్చిపోయిన ఎలుక, శ్రేష్టి మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్టి ఆనందానికి మేరలేకపోయింది. ఇతన్ని యితరుల చేతిలో పడనివ్వకూడదు అనుకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకడు అవివాహితుడు, ఇంకేంకావాలి? ఆ శ్రేష్టి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్టి మరణానంతరం యువకుడు శ్రేష్టి పదవిని పొందాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 23,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రతిభే పెట్టుబడి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాధిగా సమాధానం చెబుతున్నారు.\n\nఅంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు.దెబ్బ బాగా తగలడంతో \"అమ్మా\" అని అరిచాడు.అతను అరవకున్నా మరోసారి \"అమ్మా\" అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోనించి రావడాన్ని గమనించాడు.\n\nఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు \"ఎవరు నువ్వు\" అని అడిగాడు శబ్దం వినిపించినవైపు చూస్తూ \"ఎవరు నువ్వు\" మరల ఆ గొంతుక పలికింది.\n\nరఘు మళ్ళీ కొంచెం గట్టిగా, \"నీకు ధైర్యం ఉందా?\" అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు \"పిరికి పందా!\" అని నరాలు బిగపట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిదంగా మరింత గట్టిగా \"పిరికి పందా!\" అని వినిపించిది.\n\nఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో \"నాన్నా! ఏంటీది? ఎవరు నాన్నా అక్కడ?\" అని అడిగాడు.తండ్రి నవ్వుతూ \"కొంచెం ఓపిక పట్టు\" అంటూ \"నువ్వు చాంపియన్ వి\" అన్నారు గట్టిగా. \"నువ్వు చాంపియన్ వి\" అన్న శబ్దమే మళ్ళీ వినిపించిది.ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కాలేదు.\n\nరఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు. \"దీన్ని ప్రతిధ్వని అంటారు బాబు! జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది.ప్రపంచం లో ప్రేమ శాంతి వికసించాలి, 'అందరూ నీతో ప్రేమగా వుండాలి' అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయ కాంక్ష రగిలిచాలంటే నీలో అవి పుష్కలంగా వుండాలి. లేకపోతే విజయ కాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్బాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 24,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రతిధ్వని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువ వాడా? పిసినారి రాజుకు తగ్గవాడే! రాజుకు తెలీయకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి, పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసినప్పుడు. వాళ్ళిద్దరూ, ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసి రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడంవలన ధనం మాయం కావడం గమనించాడు.\n\nరాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని, అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్ళాడు సోదరుడు. రాజు తెలివితక్కువ వాడా? ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన మొడెం కోటగుమ్మానికి వ్రేలాడ దీయించి, కాపలా వాళ్ళకి చెప్పాడు. అది చూసి ఎవరయినా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని. తల్లిపోరు పడలేక, తల నరికిన వాడు, నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి, మత్తులో ముంచి, మొండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు.\n\nఅతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది. తన కూతురు అందాలరాశిని ఎరగా వేశాడీసారి. అతి దారుణమైన పని, నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ళ తల నరికిన సంగతీ, మొండెం మాయం చేసిన సంగతీ చెప్పి పెళ్ళడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి, కాపలా వాళ్ళకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాటి అసాధ్యడు అల్లుడయితే దిగుల్లేదు అనుకున్న రాజు, అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు బైటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు? అడిగాడు రాజు. తమరు మారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు. కాని మీరు ఆడిన మాట తప్పితే, రేపు పరలోకంలో అల్లాకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అన్నాడా చిన్నవాడు. అతడి ధైర్యానికి మెచ్చి, రాజు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. అంతే కాదు! అర్థరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 25,
        "IMAGE": "cat_1",
        "NAME": "ప్రజ్ఞాశాలి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు.\n\"నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని\" అని చెప్పాడతడు.\n\"ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గరికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు\" అన్నారు ద్వారపాలకులు.\n\"నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి\" అని చెప్పాడు ఆవ్యక్తి.\nద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. \"అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి\" అని ఆదేశించాడు.\nఆ వ్యక్తిని చూడగానే రాజు \"అన్నగారికి స్వాగతం. ఏమిటి విశేషాలు?\" అని అడిగాడు.\n\nఅతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ \"సోదరా...నా దగ్గర మంచి వార్తలేం లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నారాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న ముఫ్ఫైరెండుమంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నాఅయిదుగురు రాణులు కూడా ముసలివాళ్ళైపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి\" అన్నాడు. పృధ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారితో అతనికి ఒక యాబై రూపాయలు ఇవ్వమని చెప్పాడు. \" యాబై రూపాయలు చాలా తక్కువ\" చెప్పాడతను.\n\"సోదరా... ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా ఖాండాగారం తరిగిపోయింది\" అన్నాడు రాజు.\nఆ వృద్దుడు ఒకసారి గాడంగా నిట్టూర్చి \"ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక వుంది. నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అన్నాడు\"\n\"మరి ఆ సముద్రాలను దాటటం ఎలా?\" సందేహంగా అడిగాడు పృధ్వీపాలుడు.\n\"నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే వుంటావు. నేను సముద్రం లో అడుగు పెడితే అక్కడి నీరు కూడ ఆవిరైపోతుంది\" అన్నాడు వృద్దుడు.\nపృధ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి \"ప్రభూ...మీ ఇద్దరి సంభాషణ నాకు అర్ధం కాలేదు\" అన్నాడు.\n\nపృధ్వీపాలుడు చిన్నగా నవ్వి \" అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు. అదృష్టం నాణేనికి ఒకవైపు నన్ను రాజుగా రెండోవైపు అతణ్ణి పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే. అతని ముఫ్ఫైరెండు సేవకులంటే అతని పండ్లు. అయిదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు. అంతేకాదు ఖాండాగారం తరిగిపోయింది అని నేనన్న మాటకు, తనెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తనమీద వేసుకున్నట్లు మాట్లాడిన సున్నితంగా నన్ను విమర్శించాడు\" అని వివరించి చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 26,
        "IMAGE": "cat_1",
        "NAME": "పేదవాడైన రాజుగారి అన్న",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.\n\nచెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.\n\nబయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. \"బానా బానా దొర్లు,దొర్లు\" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి \"సరే\" అని వదిలి పెట్టింది.\n\nపెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 27,
        "IMAGE": "cat_1",
        "NAME": "పేదరాశి పెద్దమ్మ కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది .\n\nనువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.\n\nశివశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.\n\nచూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 28,
        "IMAGE": "cat_1",
        "NAME": "పెద్దపులి - బాటసారి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకె్ళ్ళాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.\n\nపులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంకాగానే \"పులిరాజా! ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను మూడు నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలెయ్యాలి\" అంది మేకపిల్ల.\nమేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో \"సరే చెప్పు\" అంది పులి కుతూహలంగా.\n\"నువ్వు మిగతా పులులతో 'ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశానూ అని చెబితే అవి నమ్మవు నిజమేనా?\"\n\"నిజమే!\" అని తలూపింది పులి.\n\"అలాగే నేనూ మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా?\" అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది.\n\n\"ఇక మూడో నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ!\" అంది మేకపిల్ల.\nఅంత చిన్న పిల్ల తనముందు నిలబడి అంత ధైర్యంగా మాట్ల్లాడటం చూసి పులికి ముచ్చటేసింది.\n\"నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో\" అంది.\n'హమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదూ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 29,
        "IMAGE": "cat_1",
        "NAME": "పులి మేకపిల్ల",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి వుండలేదు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. 'ధన్యవాదాలు స్వామీ' అంది. అయితే ఒక యిబ్బంది వుంది. ఆ మందుకు అన్నీ వున్నాయి. ఒక దినుసు తక్కువ అయింది. మరి ఆ దినుసు నీవు తీసుకు రాగలవా? అన్నారు స్వామీజీ. అలాగే స్వామీ. నా భర్తకోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి యిలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకు రాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామీ. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్దపులి మీసం తెస్తాను.\n\nపులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికి పోయింది ధర్మావతి. అయినా గుండెదిటవు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన యింటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకోచోట నిలబడింది. పులి మళ్ళి గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆతర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురు మంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్ళకు పులి బాగా అలవాటు అయింది. ఇప్పుడూ ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒక రోజు ఆ పులిని నిమురుతూ వుంది ధర్మావతి. అదను చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందేగానీ ఏమీ అనలేదు. ధర్మావతి పర్గుపరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామీ ఎంతో శ్రమ పడి పులి మీసం స్మపాదించాను తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె యిచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింద్ది. అయ్యో స్వామీ! యిలా చేశారేంటి? అని తెగ గాధపడింది. అప్పుడు ఋషి యిలా అన్నాడు. అమ్మా ధర్మావతీ నీకు ఏ మందుతోనూ పనిలేదు. నువ్వు నాకు ఓక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో! అవునా? ఎంతో కౄరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటృఇ ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్ళించుకో. నీ ప్రేమను పంచి, అతని ప్రేమను పొందు. అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరచుకున్నాయి. ధైర్యంగా యింటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 30,
        "IMAGE": "cat_1",
        "NAME": "పులి మీసం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. \"ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా\"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత \"హ్యపీ బర్తడే\" అంటు శుభాకాంక్షలు తెలిపింది. \"ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు\" అంటూ వెళ్ళిపోయింది.\n\nరవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి \"నీ కిష్టమైన వస్తువు కొనక్కో\" అని చెప్పి వెళ్ళి పోయాడు.\n\nరవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాసులో ఉమ టీచర్ \"మదర్ థెరీసా\" పాఠం చెబుతోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి 'మదర్ థెరీసా' అంటే ఎవరు టీచర్? అని అడిగాడు. \"దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయిదేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్దులకు ఆసుపత్రులు శిశుకేంద్రాలు, వృద్దుల పునరా వాస కేంద్రాలను స్ధాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం, ఆమెకు \"భారతరత్న\"నిచ్చి గౌరవించింది. అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫొటోను చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు.\n\nరవి మనస్సులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొన్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న వంద రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనస్సును అభినందించారు. ఒక మంచి పని చేసానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు. రవి రావడం తండ్రి గమనించి \"ఒరేయ్! రవీ! ఎందుకాలస్యంగా వచ్చావ్? బజారుకెళ్ళి ఏమైనా కొన్నావా? అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలవంచుకొని నిలబడ్డాడు.\n\nకొడుకు మౌనంచూసి రాఘవ \"ఏమైందిరా! నీకు! అలా మౌనంగావున్నా\" వంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగినదంతా చెప్పి తండ్రివంక భయంగా చూసాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలచి భుజంతట్టి ఇంత మంచి పనిచేసి భయపడతా వెందుకు? అంటూ మెచ్చుకొన్నాడు. తండ్రి పొగడ్తవిని రవి ఆనందంతో ఎగిరి గంతేసాడు.\n\nఆ రాత్రి భోజనం చేసి నిదుర పోయాడు. ఆ నిదురలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడ నుంచో \"రవీ!\" అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె \"రవీ! నన్ను గుర్తుపట్టలేదా!\" అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమెవంక ఆశ్చర్యంగా చూసి \"మదర్! మీరా!\" అంటూ దగ్గరికి వెళ్ళాడు.\n\n\"రవీ! ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులెన్నో చెయ్యాలి? అంటుంటే కల చెదిరింది. రవి మదర్! మదర్! అని కలవరిస్తున్నాడు.\n\n\"ఓరేయ్! రవీ! ఏమైందిరా నీకు?\" అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీలేదని తలూపి మళ్ళీ నిదురపోయాడు. మరుసటిరోజు క్లాసులో జరిగినదంతా టీచర్‌కు చెప్పాడు. టీచర్ \"పిల్లలూ! విన్నారు కదూ! మదర్ ఏమి చెప్పిందో! మీరు కూడా బాగా చదువుకొని గొపవాళ్ళు కావాలి. మదర్‌ను ఆదర్శంగా చేసుకొని ఆమె అడుగు జాడాల్లో నడచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్! అన్నారు ఒక్కసారిగా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 31,
        "IMAGE": "cat_1",
        "NAME": "పుట్టినరోజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు.\n\nఅందరూ మంచి కూరలు అమ్మేవారు. పేరయ్య పుచ్చూ చచ్చూ అమ్మేవాడు. ఎక్కువ ధర తీసుకునే వాడు. మాటలు మాత్రం మంచిగా ఉండేవి. బాగా సంపాదించాడు. పొలం కొన్నాడు. భవనం కట్టించాడు. పొలం వెళ్ళేవాడు. అజమాయిషీ చేసేవాడు. ఇంట్లో వారికి మంచి దుస్తులు ఉండవు. మంచి తిండి ఉండదు. రూపాయికీ తనకూ లంకె. ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు. తనకు అయిన వారికి గూడా ఏది విదిలించేవాడు కాడు. చీకటి పడేది. ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు. దానిని చూసుకుంటూ మురిసి పోయేవాడు. అక్కడే నిదురించేవాడు. భార్యకు నలతగా ఉంది. లేవడం లేదు. పేరయ్యకు బాధలేదు. ఆమెకు వైద్యం లేదు. నీరసంగా వుండేది. పాలు పితకమనేవాడు. ఇంటి చాకిరీ చేయించేవాడు. నీరు తోడించేవాడు. కొడుకేమీ చేయడు. పాపం ఆమెకు జ్వరం మొదలయింది. అందరూ వైద్యునికి చూపించమన్నారు. అదే నయమవుతుందనేవాడు. అన్నిటికీ మిరియాల కషాయమే మందు అనేవాడు. రోజు రోజుకూ ఆమెకు సుస్తీ ఎక్కువయింది. పేరయ్యకు ఖర్చు అంటే భయం. వైద్యుని కలవలేదు. ఆమె మంచం మీద వుంది. కదలలేక పోతోంది. కాఫీ అడిగే వారు లేరు. పేరయ్య బేరం చేస్తూనే వుండేవాడు. మందూ లేదు, మాకూ లేదు. అమె మరణించింది.\n\nకొడుకు కాసేపు ఏడిచాడు. చిరు తిండి ప్రారంభించాడు. పేరయ్యకు బాధేలేదు. మందుల పైకం మిగిలిందని ఆనందం. దహనం చేయించాడు. బంధువులకు తెలియదు. కర్మకాండలు లేవు. పైకం మిగిలిందని పేరయ్య ఆనందం. బంధువులు కూడా వచ్చేవారు కారు. అతని సంగతి అందరికీ తెలుసు. పనిమనిషి కుదిరింది. పేరయ్యకు పని జరిగిపోతోంది. కొడుకు జులాయిగా మారాడు. చదివించమనేవారు ఊరివారు. పైకం దండగ అనేవాడు పేరయ్య. బాలరాజు తిండికి ముందుండే వాడు. తరువాత కోతి కొమ్మచ్చులు ఆడేవాడు. అయినా పేరయ్యకు చీకూ చింతా కలుగలేదు. చివరకు జులాయిగా మారాడు. ఇంటికి పేచీలు, కొట్లాటలు తెచ్చేవాడు. దుకాణంలో కరివేపాకు వుండేది. కానీ కరివేపాకు మరొకరిని అడిగేవాడు. ఏమిటంటే మంచిది కాదు అనేవాడు. పాడి గేదెను కొనడు, మజ్జిగ ఎదురింటి వారిని అడిగేవాడు. వంటపని ఒకరికి పురమాయించేవాడు. ఒకరి సహకారం వొకరికి అవసరమంటాడు. తన పైకం మాత్రం తీయడు. ఎదుటి వారిని అడిగేవాడు. అందరూ హేళన చేసేవారు. తనకు రోగం వచ్చేది. జీలకర్ర, మిరియాలు నమిలేవాడు. వైద్యం చేయించుకునేవాడు కాదు. శరీరం శాశ్వతం కాదనేవాడు. పైకం దాపరికం దేనికని అడిగేవారు. పైసా యే పరమాత్మా హై అనేవాడు.\n\nమరికొంత పొలం బేరం చేశాడు. ఇంకో రెండు ఇండ్లు కొన్నాడు. అయినా వొంటికి సుఖం లేదు. మంచి లేదు. బాలరాజుకు చిరుతిండి ప్రధానం. ఇంకేమీ అవసరం లేదు. పేరయ్య ధనాన్ని ప్రేమించాడు. ధనం గురించే ఆలోచించాడు. మనుషులను నమ్మలేకపోయాడు. ప్రేమించలేకపోయాడు. దొంగల భయం. కంటికి నిదురరాదు. తిండి సహించేది కాదు. ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చింది. వైద్యుని చూడలేదు. పైకం పాడవుతుంది. అదీ అతని ఆలోచన. చేసేవారు లేరు. కొడుకును నమ్మడు. బాలరాజు బరి తెగించాడు. దొరికింది దుబారా చేయసాగాడు. పేరయ్య బావమరిదికి ఈ తంతు అంతా తెలిసింది. అయినా రాలేకపోయాడు. ఇతరుల సలహా మీద బావమరిదిని పిలిపించాడు పేరయ్య. కొడుకుని దారి చేయమని అడిగాడు. పైకం యీయనని చెప్పాడు. అందరూ మందలించారు. అయినా వినలేదు. బావమరిదికి అక్కగారి మీద అభిమానం. బాలరాజును తీసుకుపోయాడు. ఆ ఊరి నదికి వరద వచ్చింది. చాలా ప్రాణాలు పోయాయి. నీరు ఊరంతటినీ ముంచింది. పేరయ్య పెట్టెను కౌగిలించుకున్నాడు. వదలలేదు. నీరు బాగా త్రాగాడు. వరద నీటిలో హరీమన్నాడు. పెట్టెను కౌగిలించుకున్నాడు. ప్రాణం నిలుపుకోలేకపోయాడు.\n\nఅందుకే వేమన చెప్పింది. లోభిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. పైకం అడిగితే చాలు పడి చస్తాడు అని నీతిని చెప్పాడు. సంపాదించాలి. సంపాదించింది అనుభవించాలి. అతడే మనిషి. ఇది మనకు వేమన తెలియ చేసిన నీతి. మరిచిపోకండి. అంటూ పంతులు గారు పాఠం ముగించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 32,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిసినారి పేరయ్య ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది.\n\nకొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది.\n\nపిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి.\n\nఅవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 33,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిశాచాలు చేసిన సహాయము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితోపాటు గడ్డిమేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాయి.\n\nహఠాత్తుగా ఆ దుప్పులకు వేటకుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్నా తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకుక్కలు ఎటునుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్ధంకాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది.\n\nతల్లిని చూసి విషయం అర్ధం కాని దుప్పిపిల్ల \" అమ్మా! వేటకుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా. మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరుగెత్తుతావు. నీకు కొమ్ములు కూడా ఉన్నాయి. వాటితో ఆ వేటకుక్కలను తరిమికొట్టచ్చు\" అని అంది.\n\nదుప్పిపిల్ల మాటలకు తల్లి, \"అవును, నిజమే,\" అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్ధంకాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 34,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిరికి దుప్పి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అననగనగా ఒక వనము. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒక రోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచీ దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు... ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది.\n\nకాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచీ ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనక బడింది. \"పావురం మిత్రమా. మనం అతి వేగంగా చాలాదూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటి పోవడం అసంభవం... కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం\" అంది కాకి. \"సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా\" అంది పావురం. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లూ, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి.\n\nకొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. \"మమ్మల్ని ఓడించావు కొంగ గారు. మా పిచ్చి కబుర్లూ, ఊసులే కొంపలు ముంచాయి... ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు... నీకు అభినందనలు... \"\nఅన్నాయి పావురము, కాకి తలదించుకొని...\nచూశారా పిల్లలూ పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో... ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 35,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిచ్చి కబుర్లు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు!అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాలో చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల, ఆ పావురాలు బాగా బలిసి, నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి.\n\nఓ నాడు, గూళ్ళల్లోని పావురాలనన్నిటినీ విడిచి పెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసి పోతున్నాడు!\n\nఅంతలో ఆ పావురాలు నేలమీద వున్న చిన్నచిన్న రాళ్ళ పిసళ్ళను వెదుక్కొంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కల్గింది! అసహ్యం కూడా వేసింది; \"మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూవుంటే, ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి?\" అని కోపం కూడా వచ్చింది. వెంటనే, ఛీ!మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు\" అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను, వాటి మీద బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్ని ఎగిరి పోయాయి కానీ, పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతూవున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది.\n\n'అయ్యో' అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది, ఆ పిచ్చుక, బాధపడుతూ \"మన బతుకు పద్దతి ఇతడికి తెలియదు అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి! ఆ విషయం తెలుసుకోక, అతడు మనలను కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువవాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడానూ, పద, పోదాం\" అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరి పోయింది! పావురాలన్నీ తలొక దిక్కుకూ ఎగిరిపోయాయి.\n\nనిశ్చేష్టుడై వెంకయ్య అలానే కూర్చుండి పోయాడు, ఆకాశంలోకి ఎగిరి పోతున్న పావురాల కేసి చూస్తూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 36,
        "IMAGE": "cat_1",
        "NAME": "పావురాళ్ళు-రాళ్ళు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.\n\nప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారంలేక ఆకలితో చాలా బాధపడుతూ వుండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళూ మేల్కొని వుండి కనబడిన ఎలుకనన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలోగాని, ఇరుగు పొరుగు ఇండ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది.\n\nఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూచి, బాగా పెంచిన వారికి బహుమతి యివ్వబడనున్నట్లు ప్రకటించారు. తమవద్ద నుండి పిల్లులను తీసుకొని వెళ్ళినవారంతా వాటిని పౌర్ణమినాడు తప్పక తీసుకొనివచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణకవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు. ' ఆవు ఇచ్చిన పాలన్నీ నేను, మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడయినా పాలు ఇవ్వలేదు. సరిగా తిండికూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చేస్థితిలో వుంది. దీనిని తీసుకొని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి యిక వారం దినాలున్నది. ఈ అగండం నుంచి బయటపడడమెలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా వున్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది. ఆ గిన్నె నొకచోట పెట్టి పిల్లిని తీసుకొనివచ్చి దానిచేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది, ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది. అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొనివచ్చి పాలదగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్ని సార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడంలేదు. అది పాలను చూసి ముఖం త్రిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించింది. కాని పాలు త్రాగుటకు సిద్దపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకొని గట్టెక్కగలననుకున్నాడు.\n\nపౌర్ణమినాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైది, ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లికంటే ఒకటి బాగా బలిసి వున్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగువేయలేక ఆయాసపడే స్థితిలో వున్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్ళలేనంత లావుగా వున్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణకవి తాను పెంచుటకు తీసుకొని వెళ్ళిన పిల్లిని తీసుకొనివచ్చి రాయలవారికి చూపించినాడు. అది బాగా కృశించిపోయి రేపోమాపో చస్తుందేమో అనుకొనేటట్లు వున్నది.\n\nఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవిగారు! మీ పిల్లి యిలా వుండడానికి కారణం ఏమిటని అందరు పిల్లులూ ఒకదాని కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా వుండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా వుందేం? మేము ఇచ్చిన ఆవుపాలు దీనికి పట్టడంలేదా? అని అడుగగా, రామకృష్ణుడు వినయంగా మహాప్రభు! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్నీ కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలమీదే! దీని పుణ్యమా అని మేమేగాక, మా యిరుగు పొరుగు యిండ్లలోని వారుకూడా ఎలుకల బాధ లేక హాయిగా వున్నారు అని చెప్పినాడు.\n\nరామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో వున్న మంత్రులు మున్నగువారు కూడ ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు, ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు! రామకృష్ణుడు పట్టుకొనివున్న పిల్లిని తీసుకొనివెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణకవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు.\n\nఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. ' లోకంలో పాలుత్రాగని పిల్లి వుంటుందా? రామకృష్ణుడేదో కొంటె పని చేసివుంటాడు. అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది ' అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరుపరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాతపడినట్లున్నది. వాటిని చూచి రాయలవారు కోపించి రామకృష్ణకవీ! పిల్లి పాలు త్రాగకుండ మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెపితే క్షమించి విడిచిపెడతాను లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను. అని బెదిరించగా, రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి ' మహాప్రభూ! మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దానిని పెంచుటకు ఆవును యిచ్చినారు. ఆ పిల్లివలన మా యింటిలోని ఎలుకల బాధయే గాక, మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధకూడా పోయినది. మీరు ఎవరినైనను పంపి మా యింటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి, నేను నా పిల్లిని, ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక, మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగువానిని లోటు కలుగకుండ ఆవును కూడ యిచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లివలె యిచటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపునిండాతిని, బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చినవారినడిగి తెలిసికొని నన్ను శిక్షించుటయో, రక్షించుటయో చేయుడి అని చెప్పాడు.\n\nరామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని యింటి పరిసరములలో నున్నవారిని విచారించగా తమకు ఎలుకలబాధ ఏ మాత్రం లేదని చెప్పిరి. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరియైనదేనని మెచ్చుకొని, వందవరహాలు బహుమతిగా యిచ్చి సత్కరించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 37,
        "IMAGE": "cat_1",
        "NAME": "పాలు ముట్టని పిల్లి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు.\n\nగోపాలుడు బాగా చదువుకొని కచ్చేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్ళి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి, తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్నీ వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా వుండగా గోపాలుడి ఆశలూ, కోరికలూ అందుకు భిన్నంగా వున్నవి. తాముంటున్న వీధిలోనే, నాలుగిళ్ళ అవతల వున్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనమూ, సహనమూగల పిల్ల. అయితే, తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు, నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో వుండడం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకూ, తన తల్లికీ మధ్య ఏవో కుటుంబాల పాత తగువుల కారణంగా నివురుకప్పిన నిప్పులాంటి శత్రుత్వం వుండడం మరొక కారణం.\n\nఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలాకాలం మధనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని, తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్నతల్లి! ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే, నీ వంటిదాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో, మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు.\n\nతల్లిలాగా కాకుండా మంచివాడూ, నెమ్మదస్థుడూ అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ, సిగ్గుతో తలవంచుకుని కొద్దిసేపు మౌనంగా వూరుకున్న నిర్మల, చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చుకాని ఎటుతిరిగీ అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు. అన్నది. దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిశాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు, నిర్మలా! అన్నాడు. గోపాలుడికి తన మీద వున్న అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే! సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి, నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడమూ, గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి.\n\nఆ రోజు నుంచి వారం గడవకుండా, ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుఝామున, ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి, వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి, సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును, మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతణ్ణి గురించిన వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ, అనేక మహిమలు గడించాడు. మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం, తాను నిర్వాణం చెందేలోగా, జనావాసాలన్నీ కాలినడకన తిరిగి, తన మహిమలన్నీ మంచివాళ్ళకూ, కరుణాహృదయులకూ ధారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణభారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరివాళ్ళలో కొందరు పూలు, పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్ళకు మాత్రం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా వుంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు, అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు.\n\nఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చుని, నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల, సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు, నిర్మలకు మహాలక్ష్మీ మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమీ శుక్రవారం నాడు, ఆ మంత్రాన్ని ఎనిమిదిసార్లు జపిస్తే, ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి!\n\nఇది వింటూనే సూరమ్మకు, నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి, సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి, అతణ్ణి తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుకాదు, తల్లీ! ఏచోటా వారం రోజులకు మించి వుండరాదని గురువాజ్ఞ. మరొక ఆరునెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మీ మంత్రం జరిపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను, ఆరోజున ఇక్కడికి వచ్చి, నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను, అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం . స్వామీ కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు.\n\nమీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే, నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామీ! ఎంతోకాలంగా దాన్ని నా కోడలిని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత గౌరవం కూడా లేదు, అన్నది సూరమ్మ. సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు! వాడు కచ్చేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా? అని ప్రశ్నించాడు. అవును స్వామీ! అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది.\n\nసాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్యా! ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామీ అన్నాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే రామయ్య నిర్మలకూ, గోపాలుడికీ వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీలచేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగుచేయించి, రకరకాల కూరగాయల మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాకవేయించి, అందులో రెండు గేదెల్ని కొనితెచ్చిపెట్టి పాలవ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా నాలుగునెలలు గడిచేసరికి కూరగాయలూ, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది.\n\nతన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాయిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మీ మంత్రం జపించి, ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్ళకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య, గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిధి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మా! ఇల్లు కళకళలాడుతున్నది. నీ కోడలు మంత్రం జపించకుండానే, నీ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందన్నమాట! అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డమూ, జడలూ తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటీ మోసం? అంటూ కోపంగా మరేదో అనబోయింది. కాని, కరుణానందుడిగా వేషం వేసుకు వచ్చిన వృద్దుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయేముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మా! అన్నాడు. అతణ్ణి పరీక్షగా చూసిన సూరమ్మ అతణ్ణి గుర్తుపట్టి తడబడుతూ మీరా! అంటూ తల వంచుకున్నది.\n\nఅప్పుడు వృద్దుడు శాంతంగా గుర్తుపట్టావు గదా! అని, అక్కడే వున్న గోపాలుడికేసి తిరిగి, నాయనా! నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పిన మామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటుండేది. అది మా అన్నయ్యకు అంటే, మీ తాతకు ఇష్టం ఉండేదికాదు. నా అభిరుచి వదులుకోలేక, నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్దురాలైన అత్త మామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా, వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకూ కొడుకు కోసం బాధపడుతూనే వున్నారు, అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లీ నేను చెప్పిన దాంట్లో అబద్దం పాలు ఏమీ లేదుగదా? అని ప్రశ్నించాడు.\n\nసూరమ్మ వెలవెలపోతూ, తల పక్కకు తిప్పుకున్నది. వృద్దుడు ఒక్క క్షణం ఆగి, గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకూ, గంగాధరానికీ తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత, నిర్మల రూపొందించిన పథకంలో, సాధువు పాత్రకు రామయ్యా, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆపైన జరిగినదంతా తెలిసిందే! ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది. అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్త మామలను కాల్చుకుతిన్న నీ వంటి దానికి, నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి, నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే, ఈ ఆరునెలలు గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరేసరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది. అన్నాడు.\n\nఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటా బొటా కన్నీళ్ళు కారుస్తూ మామయ్యా! నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం. ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో వున్న ఆమె పినమామతో పాటు అక్కడ వున్నవారందరూ చాలా సంతోషించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 38,
        "IMAGE": "cat_1",
        "NAME": "పారిన పథకం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ముసలి పిల్లి తన కిష్టమైన ఆహారం, ఎలుక పిల్లలను పట్టుకోలేక చతికిలపడిపోయింది. పారిపోతున్న ఎలుకులను పట్టుకునేంతలోనే అవిచేజారిపోతున్నాయి. వయసు మీద పడుతుండడంతో ఇక ఎలుకులను పట్టడం తనవల్ల కాదని నిర్ణయించుకుంది.\n\nఎలుకులను చంపి తినేందుకు తన ఒళ్ళు కరగకుండా, ఆయాసం రాకుండా ఉండే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. ఎలుకులు బొయ్యారం దగ్గర్లోని గోడవద్ద ఒక తలదిండు కవర్‌ను మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడింది. ఎలుకులు తను చనిపోయిందనుకుని తన దగ్గరకు వస్తాయని, గుట్టు చప్పుడు కాకుండా వటిని గుటుక్కుమనిపించవచ్చని ఆలోచించింది ముసలి పిల్లి. చిట్టెలుకలన్నీ తమ బొయ్యారపు ద్వారం దగ్గర నిలబడి పిల్లిని చూస్తున్నాయి. అది గమనించిన ఒక తెలివైన ముసలి ఎలుక పిల్లి పన్నాగాన్ని అర్ధం చేసుకుంది. కాని ఈ విషయం చెబితే చిట్టేలుకులు నమ్మవని దానికి తెలుసు కాబట్టి వాటిని కాపాడాలంటే తను కూడా పిల్లిలాగా అబద్ధపు ఆలోచన చేయాలని భావించింది. అంతే, అనుకున్నదే తడవుగా చిట్టెలుకల వద్దకు వచ్చి ఆహా ఎంత మంచి బ్యాగు. నేనెప్పుడూ పిల్లి తలతో ఉన్న ఇలాంటి బ్యాగ్‌ను చూడలేదే! చాలా బావుంది కదా! అంది. అది బ్యాగేనని తలపోసిన చిట్టెలుకలు వాటి దారిన అవి వెళ్లిపోయాయి. ముసలి పిల్లి ఆశలు అడి యాశలయ్యాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 39,
        "IMAGE": "cat_1",
        "NAME": "పారని పన్నాగం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్‌మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు. అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూం నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమసమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయన.\n\nఆఫీస్ టైం అయిపోయింది కదా! వస్తుంటారు నాన్నా అని చెప్పింది శైలజ. మనువడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డాడు రాఘవరావుగారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురుచూస్తుంది. ఆఫీస్, దారి కబుర్లు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగున వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా వున్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి క్షేమసమాచారాలు అడిగాడు. టవల్ తీసుకొని బాత్‌రూం వైపు నడిచాడు. తండ్రి తనను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది.\n\nరంగనాథం డ్రస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టి.వి. ఆన్ చేసాడు. పవన్ పలక చేత పట్టుకొని పరుగున వచ్చాడు. పలకలో ఓ సున్నా చుట్టి, దానికి రెండు కళ్ళు, ముఖం, చెవులు పెట్టాడు. నాన్నా! నాన్నా! నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టి.వి పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా ఎబిసడిలు రాసుకోకుండా ఈ బొమ్మలేంటి? వెళ్ళి ఎబిసిడిలు రాయి వెళ్ళు అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశ పడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఎబసిడిలు వచ్చినవన్నీ రాసాడు. నాన్నా నాన్నా! ఎబసిడిలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించు అన్నాడు రంగనాథం. ఉరకలు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకుని తాతయ్య దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలయ్యాక టి.వి లో వార్తలు వింటున్నాడు రంగనాథం. పవన్ వచ్చాడు. నాన్నా! నాన్నా! కథ చెప్పవా? గడ్డం పట్టుకుని లాగుతూ అడిగాడు. \"కథకు కాళ్ళులేవు. ముంతకు చెవుల్లేవు పడుకోకన్నా\" అన్నాడు రంగనాథం. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకులాగుతున్నాడు. వార్తలు వినాలి. చెబుతుంది నీక్కాదా విసిగించకు వెళ్ళి పడుకో! లేకుంటే పిచ్చోడికి పట్టిస్తా అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవరావుగారు అల్లుడూ వాడికి కథ చెప్పు అన్నారు.\n\nఅదేంటి మామయ్యా! వాడేదో పిల్ల తనం కొద్దీ కథ చెప్పమంటున్నాడు. అలాగని కథలు చెబుతూ కూర్చోవటమేనా? అంత తీరికెక్కడుంది. అన్నాడు రంగనాథం. వచ్చినప్పటి నుండీ గమనిస్తున్నాను. నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవరావుగారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయటమేమిటి? వాడు నాప్రాణం. వాడికి పదిహేను జతల బట్టలు తెచ్చాను. కోరిన తినుబండారాలు కొనిచ్చాను. వందలకొద్దీ ఫీజ్‌తో స్కూల్లో చేర్చాను. వాడికేంతక్కువైంది? అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావని నీ వనుకుంటున్నావు. సంతృప్తి పడుతున్నావు కానీ, వాడి ఒంటరితనాన్ని దూరం చేసే నీ ప్రేమ మాత్రం వాడికి లేదు అన్నారు రాఘవరావుగారు. వాడు నా ప్రాణం. వాడిపై నాకు ప్రేమలేక పోవడమేమిటి మావయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం.\n\nరాఘవరావుగారు అల్లుడి మాటలకు నవ్వి, పిల్లలకు తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది. తాము రాసిన అక్షరాలు, బొమ్మలు చూపి మెప్పుపొందాలని ఉంటుంది. కథలు వినాలని ఉంటుంది. తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పడి పట్టించుకోము. వారికేలోటు చేయలేదనుకుంటాం. వాళ్ళ మనసులో బాథ మనకర్థం కాదు. వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేము. వాళ్ళ ఉత్సాహాన్ని అల్లరి అంటాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గదమాయిస్తాము, భయపెడతాము. వాళ్ళ ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఆనకట్ట వేస్తాము. తెలుసుకోవాలనే ఉత్సుకతను ఆదిలోనే నరికేస్తాం. ఎన్నో పనులతో అలసిపోయామంటాము. కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోవచ్చని మనకు తెలియదు. పని, స్నేహితులు, ఊరి రాజకీయాలు, అనవసర కబుర్లు, టి.వి కోసం కేటాయించే సమయంలో కొంత టైం కూడా పిల్లలకోసం వినియోగించలేము. వారితో కలిసి కబుర్లు చెప్పలేం, ఆడలేం. వాళ్ళని మానసికంగా ఒంటరిని చేస్తాం. వాడికన్నీ అమర్చామనుకుంటాం. ఇదీ మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అన్నారు.\n\nఆయన మాటల్లోని యదార్థం అర్థమయ్యి రంగనాథం ఉలిక్కిపడ్డాడు. నన్ను క్షమించండి మామయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజమే! అంటూ తాత పక్కన నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 40,
        "IMAGE": "cat_1",
        "NAME": "పసిమనసు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతలతో, సకల సౌభాగ్యాలతో తులతూగుతూండేది ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు.\n\nఒకరోజు సాయంకాలం ఆ రాజు ఉద్యానవనంలో విహరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమై అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్దుడై ఆనందిస్తున్నాడు. కొంతసేపటికి ఆ రాజుకి ఆకలివేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు \"ఓ సాధువుంగవా ! ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో క్రుంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా, రసవంతంగా ఉంటాయి? ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమయమై ఉంటాయి? ఏ పళ్ళు తినాలి? ఏవి తినకూడదు?\" అని అడిగాడు.\n\nసాధువు \"ఓ స్నేహితుడా ఇక్కడ నీకిష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటివాడు. అతడి మంచితనంవల్ల ఈ రాజ్యంలోచేదుపళ్ళు అనేవి లేనేలేవు. రాజు చిరంజీవి అగుగాక ఆ వేప చిగుళ్ళు మధురాతిమధురమైన ద్రాక్షపళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడిపండులాగా తియ్యగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది\" అన్నాడు.\n\nవెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యం అని మధురరసం ఉట్టిపడే ద్రాక్షపళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అతి తియ్యని మామిడిపండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరివైపు బయలుదేరి వచ్చాడు.మనస్సులో అహంకారబీజం మొలకెత్తింది. \"నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవ్వరు? ఆహా నా కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది\" అనుకున్నాడు.\n\nరాజు అహంకార గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధచేయడం ప్రారంభించాడు. ప్రజల కష్ట సుఖాలను గుర్తించడంలేదు. సదా త్రాగుతూ, తింటూ, నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లరులు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడంలేదు. అనావృష్టి ప్రబలిపోయింది అయినా రాజు ప్రవర్తనలో మార్పురాలేదు. తుచ్చసుఖాలతో ఆనందపడిపోతున్నాడు.\n\nఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలు దేరాడు. పూర్వం వెళ్ళిన వనంలోకే వెళ్లాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూచిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. సాధువు వీపుపై తట్టి \"ఓ మానవా వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు. వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా??\"అని అడిగాడు.\n\nసాధుపుంగవుడూ నిర్లక్ష్యంగా \"రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు. తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచిన పుచ్చు, పురుగు మధురమైన మామిడిపండు మట్టిముద్దలా ఉంటూంది. ప్రజలు ఈ రాజ్యాన్ని వదులుకుని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు\" అన్నాడు. రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణకువతో నమ్రతతో సాధువు కాళ్ళపైబడి \"ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభూ\" అని వేడుకున్నాడు.\n\nసాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగి ధర్మయుక్తంగా పాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్ళను ఫలింపచేసాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధుల్లుతూంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 41,
        "IMAGE": "cat_1",
        "NAME": "పరివర్తన - 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామాపురం లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్దకస్తుడు. ప్రతీ పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు.\n\nఒక రోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు...'నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్యదిశలో రావిచెట్టుకి కుడివైపు పదిఅడుగుల దూరం లో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి' అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు.\n\n'బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో! ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే? శ్రమంతా వృధా అయిపోతుంది' అనుకుంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతీ పనీ ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు.\n\nకొంత కాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరు ప్రయత్నించినా నీళ్ళు పడలేదు.\nరాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.\nబంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హయిగా బతకొచ్చనుకున్నుడు.\n\nవెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్యదిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంతతవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచిపైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు.\nశ్రమపడితే అందరి ప్రశంసలతోపాటు విలువైన బహుమతులూ వస్తాయని గ్రహించిన రాజు, ఆనాటి నుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 42,
        "IMAGE": "cat_1",
        "NAME": "పరివర్తన - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.\n\nచాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో \"నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు\" అంది.\n\n\"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?\" అడిగాడు పనివాడు. \"ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు\" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు \"బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు\" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.\n\nపనివాడు ఆ కుండతో \"కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు\" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.\n\nమనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 43,
        "IMAGE": "cat_1",
        "NAME": "పగుళ్ళ కుండ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "నజీరుద్దీన్‌ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు.\n\nఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‌ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, \"అలాగే!నా భూమిలో నీవు పంట వేసుకో. కాని అద్దె కట్టాలి\"అన్నాడు.\n\"అలాగే.అద్దె ఎంత?\" అడిగాడు నజీరుద్దీన్‌.\n\"పొలం పండిన తర్వాత, భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి. అదే అద్దె\" అన్నాడు. ఆ కుటిల ఆస్వామి.\n\" అలాగే\". అని నజరుద్దీన్‌ ఆ రోజునుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.\nకొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజరుద్దీన్‌ దగ్గరకి వెల్లాడు.\n\"భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను. తీసుకువెల్లండి\"అన్నాడు.\nఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయ మూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.\nఆయన నజీరుద్దీన్‌ని కూడా పిలిపించి విచారించాడు.\"\nఈ ఆసామి చెప్పేది నిజమేనా?\" అని అడిగాడు.\n\"అవును. నిజమే\" అన్నాడు నజీరుద్దీన్‌.\n\n\"మరి మోసం చేశావెందుకు?\" అడిగాడు. మోసం ఏం ఉంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయన కిచ్చి, గింజలు నేను తీసుసున్నాను\". అన్నాడు నజీరుద్దీన్‌.\nనజీరుద్దీన్‌ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని, అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 44,
        "IMAGE": "cat_1",
        "NAME": "పంటలో వాటా ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.\n\nఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి.\n\nఒకరోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకులగుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటివాడినొంటరిని చేసి పారిపోగా కుంటివాడు 'నేను మహారాజా' అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని 'ఏమయ్యా! మావద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.\n\nరాజతనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లు కెదురుగా పురోహితుడి ఆసనం వేయుంచి ఆయనవచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటుప్రకారం పురోహితుడు తెరచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర యివతల కుంటివాడు మేకపెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాటలాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకీ యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్షరూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని యిబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 45,
        "IMAGE": "cat_1",
        "NAME": "నోరుమూయించడం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము వుంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమయిన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా ఎనిమిది మైళ్ళ దూరమయినా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారుకొమ్మపై వున్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తుంటాడు.\n\n\"మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్ధులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు\" అని గ్రామములోగల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు వుండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్ధుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు.\n\nకృష్ణ \"జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి. నేను గొప్పవాణ్ణికాదా? నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను\" అని అత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ ఊరిలో పెద్దతోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్ళరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు.\n\nమరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది. అది గమనించిన కృష్ణ రెండుకాయలు తిని మరి నాలుగు కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయము కూడా కలిగింది కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది. రాజమహేంద్రవరములోగల శంకరతర్ధులవారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు.\n\nకృష్ణ \"తమరు శంకరతీర్ధుల వారా? తమకి రానివిద్య లేదంటారు గదా? ఈ ఒక్క విద్యకోసం వెతుక్కుంటూ నావద్దకి వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా? \" అని అడిగాడు. \"నాయనా! నాకే గనక అహంకారం వుంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకరతీర్ధులవారు అనగా\" అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా? \" అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసమూ కాదు. నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే.\n\nనేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్ధులు. కృష్ణ హేళనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరచిపోయి నందువల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు.\n\n\"ఉంది నాయనా! మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి. అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని, మొసలి గాని బయటకు వస్తే బలహీనమయి ప్రాణము కోసం విలవిలలాడగలవు. హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు. విద్యలను, గ్రంధస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము\" అని చెప్పారు శంకరతీర్ధులవారు.\n\nవారు చెప్పిన మటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి \"నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను.\n\n\"నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్థాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి\" అని అన్నాడు.\n\nవిద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజూ గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగ, ఉత్తమపౌరునిగ ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును. విద్యలేనివాడు వింత పశువని సామెత కలదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 46,
        "IMAGE": "cat_1",
        "NAME": "నేనే గొప్పవాణ్ణి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒక రోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలని వుంది. మీ సహాయం కావాలని అంది. సరేనన్నాడు మేనమామ.\n\nనేను ఉదయమే లేచి వూరు వెళుతున్నాను. సాయంత్రానికి తిరిగి వస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికి వెళ్ళారు. వాళ్ళతోపాటు మేనమామ భార్యకూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారము ఆలస్యముగా లేచి పొలము వెళ్ళాడు. పొలము నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా? లేక నీవే దొంగవా? అంటూ రవిని గద్దించింది. అందరము వెళ్ళిపోయాక నీవే వున్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడుకాదు. రవి దొంగ అన్నావంటే బాగుండదు. అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్దమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబూ అని అంది.\n\nరాము, రవి, మేనమాల కృషి వల్ల పంటలు బాగాపండాయి. కొంతకాలము గడిచేసరికి వారిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వారిద్దరికి పెళ్ళి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖసంతోషాలతో హాయిగా కలిసి మెలసి ఏటా పొలముకొంటూ వూరిలో మోతుబరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 47,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిద్రమత్తు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "నస్రు చాలా తెలివిగలవాడే కాని ఉదయాన్నే నిద్రలేవడం అతని వల్ల అయ్యేది కాదు. బారెడు పొదెక్కేవరకూ బద్దకంగా నిద్రపోవడం అతనికి చాలా ఇష్టం.\n\nఅతని అలవాటు మాన్పించడానికి అతని తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుపడలేదు.\n\nఒక రోజు నస్రు తండ్రి ఉదయాన్నే లేచి అలా ఊరి చివరకు నడకకు బయలుదేరాడు. దారిలో అతనికి బంగారు నాణాలున్నసంచి ఒకటి కనిపించింది. అది ఎవరో పారేసుకున్నట్టుంది. దాన్నితీసుకుని ఇంటికి వచ్చేసరికి నస్రు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.\n\nనస్రు తండ్రి నస్రుపై చెంబెడు నీళ్లు కుమ్మరించాడు, నస్రు నిద్రలేచి, ఎందుకు నాన్నా ఇలా చేశావని అడిగాడు.\n\nఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు లాభం ఉంది. చూడు, నాకు సంచి నిండా బంగారు నాణాలు దొరికాయి అదే నేనూ నీలా పడుకుని ఉంటే ఇలా ధన లాభం కలిగేదా? అన్నాడు తండ్రి.\n\nలాభం గతేమో గాని, ఆ ధనం పోగొట్టుకున్నవాడికి మాత్రం బోలేడు నష్టం కలిగింది. నీకంటే ముందు నిద్రలేవడం వల్లే కదా అతను పారేసుకున్న డబ్బు నీకు దొరికింది అంటే ముందుగా నిద్రలేవడం వల్ల నష్టమేగా? అని మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు నస్రు.\nఏం చెప్పాలో తెలియక నస్రు తండ్రి వెనుదిరిగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 48,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిద్ర మొహం నస్రు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు.\n\nఅదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.\n\nఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి \"బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?\" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - \"నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది\" అని బదులిచ్చాడు.\n\nరంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటిగ్గాని అర్ధంకాలేదు.\n\nఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడా గునపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 49,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిదానమే ప్రధానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు.\n\nమరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలు పెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే! ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడుకి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వతగిన వస్తువును వెదుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు.\n\nఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, \"నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?\" అని అడిగాడు. ఆ బాలుడు, \"అయ్యా ! లెక్కలన్ని సరిగా చేశాననిగదా, మీరు నాకు బహుమతి ఇస్తున్నారు! ఈ లెక్కలు అన్ని నేను చెయ్యలేదు. వీటీలో ఒక లెక్క నా స్నేహితుడు అన్న గారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను.\" అన్నాడు. అయితే, ఏడవటం ఎందుకు? అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్ని విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా, మీ ఉద్దేశం? కాని నేను ఒక లెక్కను ఇతరులచేత చెప్పించుకొని చేసి, మిమ్ములను మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి. అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టడు.\n\nఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించటం కాదు. అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు. అంతకంటే గొప్ప పనికి! నీ \"నిజాయితీకి\" అని ఆ బాలుడుకి బహుమతిని ఇచ్చాడు ఉపాధ్యాయుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 50,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిజాయతీ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.\n\nఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి, వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్ర మేమిటోగాని ఆరోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తోడ్కొనిపోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, \"రాజా! నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్లటం తధ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడి పోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు\" అని హితబోధ చేశాడు.\n\nఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. \"నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతివాక్యాలు పలుకుతున్నావు. నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్లం,\" కళ్లు నిప్పులు కక్కుతుండగా ఆసాధువును భటులతో బయటకు గెంటివేయించాడు.\n\nకొన్నిరోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్లాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడిని ఎలాగైనా పట్టి, బంధించి, తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రధాన్ని దాని వైపుకి ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడి ఈ హాడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజ పరివారమంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను, పుట్టలను అతి లాఘువంగా దాటుకొని పరుగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటువెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనుకే రధాన్ని పరుగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చెల్లాచెదరయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలిసిపోయిన ఆ గుర్రం మూర్చపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడుకూడా కిందపడిపోయి తీవ్రమైన గాయాలపాలై స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంగుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహతప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీదపడి నిలువుదోపిడీ చేశారు. చివరకు రాజు గారి ఒంటిమీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్లి పోయారు. ఇరుగు పొరుగు రాజ్యాలపాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్దిసమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతీ రాజ్యానికి మహారాజైన తనను, తన పరివారమంతా విడిచివెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమై పోయాయి. తాగడానికి మంచినీటి చుక్కయినా లేదు. ఎండతీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాథుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.\n\nవెంటనే \"ఓ భగవంతుడా! ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇకనుంచి ఈ ధన, కనక, వస్తు, వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు\" అని అతి దీనంగా ప్రార్ధించాడు.\n\nఇంతలో దూరము నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్ధన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. \"బతుకుజీవుడా\" అనుకుంటూ సింహగుప్తుడు గుర్రానెక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకో గలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి, ప్రజా శ్రేయస్సుకై పాటుపడ సాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 51,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిజమైన సంపద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.\n\nచిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో \"ఎవరు నువ్వు?\" అని అడిగాడు. \"నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను\" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.\n\nతెలివైన రాజు, \"నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?\" అని అడిగాడు. దానికి ఆ భూతం \"ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను\" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం \"దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను\" అని బతిమాలసాగింది. \"నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు\" అన్నాడు రాజు. భూతం \"నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది\" అని చెప్పింది.\n\nదాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 52,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిజమైన మేధావి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "స్వర్ణపురంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి, తోచిన సలహాలిచ్చి, నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అన్నారు మిత్రులు. నాకు రావలసిన డబ్బు మొత్తం బ్యాంకు నుండి డ్రా చేసి ఇంట్లో వుంచాను. ఉదయమే పట్నం వెళ్ళీ వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు నారాయణరెడ్డి. మిత్రులు కొంతసేపు మాట్లాడి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.\n\nఆ రోజు రాత్రి నారాయణరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు సర్వం దోచుకెళ్ళారు. విచారంగా వున్న మిత్రుడ్ని ధైర్యంగా వుండమని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయారు మిత్రులుముగ్గురూ! శ్రీనివాస్ మాత్రం ఇంటికెళ్ళి ఐదువందల రూపాయలు డబ్బు తీసుకొని వచ్చి పట్నం వెళ్ళి పోలీస్ రిపోర్టు ఇద్దాం . అవసరానికి ఈ డబ్బు వుంచు అని నారాయణరెడ్డికి ఇవ్వబోయాడు.\n\nడబ్బు తీసుకోవడానికి నారాయణరెడ్డి నిరాకరిస్తే, కష్టంలో వున్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా! నీవు కష్టంలో వున్నావని నిన్ను వదిలివెళ్ళే స్వార్థపరుడ్నికాదు అంటూ బలవంతంగా డబ్బు చేతిలో పెట్టాడు శ్రీనివాస్. శ్రీనివాస్ రోజూ మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు. డబ్బిచ్చేవాడు. దొంగతనం జరిగినప్పటి నుండి చలపతి, రఘుపతి తప్పించుకుని తిరగసాగారు. ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు. తమను ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావడం మానివేశారు. మిత్రులలో వచ్చిన మార్పు చూసిన నారాయణ రెడ్డికి \"ఎప్పుడు సంపదే కలిగిన అప్పుడు బంధువులు వత్తురది వెంట్లన్నన తెప్పలుగ చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరు సుమతీ\" అన్న సుమతీ శతకంలో ఎప్పుడో చదువుకున్న పద్యం గుర్తుకువచ్చింది. ఓ రోజు నారాయణరెడ్డి శ్రీనివాస్‌ను కలిసి శ్రీనివాస్ తనకు ఇచ్చిన డబ్బు వాపసు ఇచ్చి నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా వుందిరా! కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా వున్నవాడే నిజమైన మిత్రుడు. చలపతి, రఘుపతి నా దగ్గరకు రావటంలేదు. పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికిదొంగతనం జరిగినట్లు నాటకమాడాను. పట్నంలో ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా వుండు. వచ్చిన లాభం సమంగా పంచుకుందాం అన్నాడు.\n\nస్వచ్ఛమైన స్నేహంతో మిత్రులిద్దరూ కలిసి ప్రెండ్స్‌ అండ్‌ కో అనే పేరుతో వ్యాపారం ప్రారంభించి అనతికాలంలోనే మంచిపేరు డబ్బు సంపాదించారు. కొంత కాలానికి చలపతి, రఘుపతి యిద్దరూ ఉద్యోగాలు దొరక్క, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగాన్వేషణలో పట్నం చేరారు. అక్కడ నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు ప్రారంభించిన ప్రెండ్స్ అండ్ ‌కో గురించి గొప్పగా విని ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడకి వెళ్ళిన తరువాత గాని వాళ్ళకి తెలియలేదు. ఆ కంపెనీ తమ మిత్రుడు నారాయణరెడ్డిదేనని. మిత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని పాత విషయాలు మరచిపోయి వారిద్దరికీ ఉద్యోగాలు యిచ్చారు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 53,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిజమైన మిత్రుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతి పెద్ద భూస్వామి, కాని పరమ పిసినారి. పిల్లికి కుడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేద వాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడా, ఇక్కడా పాచి పనిచేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్లు లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది.\n\nతమ పాక పక్కనగల భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికెళ్ళి \"అయ్యా! మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్ధితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను\" అని బతిమిలాడింది. కనికరమేలేని నారాయణ \"ఛీ పో!\" అంటూ ఛీత్కరించుకున్నాడు. అక్కడే ఉన్న సురయ్య అనే కూలీ ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయిన సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు.\n\nలక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. \"ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి,\" అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. \"అమ్మా లక్ష్మి! నీ గోడు విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు\" అని పలికిందా గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి \"ఎవరు మీరు?\" అని ప్రశ్నించింది. \"నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుడిని\" అని సమాధానం వచ్చింది. \"వెళ్ళు త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు\" అని మళ్ళీ పలికిందా గొంతు.\n\nఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను \"అవునా\" అన్నట్టుగా ఊరుకున్నాడు.\n\nసహాయం చేయగల స్తోమత ఉండీ లక్ష్మిని ఆదుకోని నారాయణ సిరిసంపదలు, చాలీచాలని జీవితంలో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడుపే కదా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 54,
        "IMAGE": "cat_1",
        "NAME": "నారాయణ సాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. 'నాన్న నాన్న పులి వచిందీ అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు.\n\nకాని రంగడు నవ్వూతూ 'పులీ లేదు గిలీ లేదు హాస్యానికి కేకలువేశాడు అన్నాడు. సోమయ్య, కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే' అన్నాడు రంగడు. సోమయ్య రంగడ్ని కోప్పడి వేళ్ళి పోయ్యారు.\n\nమరి కొద్ది సేపటికి పులి నిజాంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ 'నాన్నా నాన్నా పులీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరచినా సోమయ్య వాళ్ళు వినిపించుకో లేదు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్ల నొకదాన్ని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుస్తుంచని తెలుసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 55,
        "IMAGE": "cat_1",
        "NAME": "నాన్నా పులి వచ్చే ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక వృద్ధ వితంతువు ఉండేది. ఆమె వద్ద నూరు బంగారు నాణాలు ఉండేవి. వయసు మీద పడుతుండడంతో రాజమ్మ తీర్ధయాత్రలకు బయల్దేరాలనుకుంది. ఆమె తన దగ్గరున్న బంగారు నాణాలను ఒక సంచిలో వేసి లక్కతో కట్టేసింది. ఆ నాణాల సంచిని పొరుగింటి షావుకారుకు దాచమని ఇస్తూ \"అయ్యా ఒకవేళ నేను తిరిగి వచ్చినట్లయితే నా నాణాల సంచిని తీసుకుని నీ సేవకు ప్రతి ఫలంగా పది బంగారు నాణెములు ఇస్తాను. నేను రాకపోయినట్లయితే ఈ సంచి నీదే అని చెప్పింది.\n\nరాజమ్మ వెళ్ళిన వెంటనే షావుకారు సంచిలోని నూరు బంగారు నాణాలను లెక్కపెట్టాడు. ఆ నాణాలను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు.\n\nరాజమ్మ తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చి తన బంగారు నాణాల సంచిని ఇవ్వమని కోరగా షావుకారు సంచిని ఆమెకు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, రాజమ్మ షావుకారుకు మాట ఇచ్చినట్లు పది బంగారు నాణాలు ఇవ్వడానికి సంచి బిరడా తొలగించి చూడగా, సంచిలో బంగారు నాణాలకు బదులుగా ఇనప నాణాలు ఉన్నాయి. ఆమె ఆ సంచి తీసుకుని షావుకారు దగ్గరకెళ్లి జరిగినదంతా వివరించింది. కాని షావుకారు తనకేమీ తెలియదని బుకాయిస్తూ, తనకు రావలసిన పది బంగారు నాణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.\nరాజమ్మ న్యాయం కోసం రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది.\nరాజు షావుకారును న్యాయస్థానానికి రప్పించి ఏం \"ఈ విషయంపై నీవేమి చెప్పాలనుకుంటున్నావు?\" అనడిగాడు.\n\nఅప్పుడు షావుకారు \"నాకేమీ తెలియదు మహారాజా! ఈ అవ్వ నాకు ఒక లక్కతో బిగించిన సంచిని భద్రపరచమని ఇచ్చింది. నేను తిరిగి భద్రంగా అప్పగించాను, ఇంతవరకు నాకు రావలసిన రుసుము అందలేదు\" అన్నాడు.\n\nఇద్దరి వాదనలు విన్న రాజు సంచిని సునిశితంగా పరిశీలించాడు. సంచికి చేసిన రంధ్రం దానిని నిపుణతతో కుట్టిన క్రమం రాజును ఆలోచించేలా చేసింది. రాజు రాజమ్మను, షావుకారును రెండు రోజుల తర్వాత న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించాడు.\n\nఈ క్రమంలో, రాజు పట్టణంలోని నిపుణులైన కుట్టుపని వారిని తన ఆస్థానానికి రప్పించి వారికి ఆ సంచిని చూపించాడు. వారిలో ఒకడు ఆ సంచిని షావుకారు అడిగితే కుట్టించానని చెప్పాడు.\n\nరెండు రోజులు గడిచిన తరవాత, రాజమ్మ, షావుకారు రాజుగారి ఆస్థానంలో హాజరయ్యారు. రాజు రాజమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.\n\nషావుకారు తను తప్పు చేయలేదని వాదించాడు. అప్పుడు రాజు ఆ కుట్టుపనివాడిని చూపించాడు. అంతే! షావుకారు తప్పు ఒప్పుకున్నాడు.\n\nమొత్తం బంగారు నాణాలు రాజమ్మకి ఇవ్వవలసిందిగా షావుకారును రాజు ఆదేశించాడు. షావుకారు తనకి రావలసిన పది బంగారు నాణాలను కూడా జరిమానా రూపంలో కోల్పోయాడు. రాజమ్మ కోరిక మేరకు రాజు షావుకారుకు జైలుశిక్ష విధించలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 56,
        "IMAGE": "cat_1",
        "NAME": "ధర్మ విజయం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రాంబాబు అయిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు. స్కూలులో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు. స్కూల్లో ఇంటర్‌వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బైటికి వెళ్ళిపోతే వారి స్కూలు బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు. ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేసాడు. వాడు ఏడుస్తూ రెండురోజులు బడికి కూడా రాలేదు. స్కూల్లో అమ్మే నోటుపుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటుపుస్తకంలో అయిదు, పది రూపాయల నోట్లు పెట్టుకుని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు.\n\nదొంగతనాలు చేయడం రాంబాబుకి ఎంతో సరదాగా ఉండేది. వస్తువులు పోయినవారు ఏడుస్తున్నా, బాధపడుతున్నా సంతోషించేవాడు. ఇతరుల వస్తువులు దొంగతనంగా తీసుకు వస్తున్నానని తల్లిదండ్రులకు కూడా తెలియనిచ్చేవాడుకాదు. ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు గానీ దొంగతనం చేయడంలో సరదా ఉండేది. ఇతరుల వసువులు మాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. శనివారం సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మురళీ అనే కుర్రవాడు ఖరీదైన అందమైన చెప్పులు తొడుక్కొని వచ్చాడు. క్లాస్ రూం బయట విప్పి అందరూ లోపల కూర్చుంటారు. టీచర్‌ని పాస్‌కి వెళతానని బయటికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళి దూరంగా తుప్పల్లో పడవేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ క్లాస్‌రూం లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఆ చెప్పులు ఎలా పోయాయన్న విషయం ఎవరికీ తెలియలేదు. చెప్పులు పోగొట్టుకున్నందుకు మురళీని వాళ్ళ నాన్నగారు చితక్కొట్టారు.\n\nరాంబాబు మామయ్య అమెరికాలో ఉంటున్నాడు. ఒకనాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రాంబాబుకి ఒక కారు బొమ్మను ప్రజెంట్ చేసాడు. నేలమీద పెట్టి ఆ కారుకి కీ ఇస్తే అది అటు ఇటూ తిరుగుతుంది. దానికి ఏ వస్తువైనా అడ్డువస్తే హారన్ కూడా కొడుతుంది. ఈ కారు బొమ్మ రాంబాబుకి ఎంతో నచ్చింది. ఇంటి పక్క పిల్లలకు, స్కూలు పిల్లలకు ఈ బొమ్మని చూపించి నడిపించి ఆనందించేవాడు. ఈ కారు బొమ్మ ఇండియాలో ఎక్కడా దొరకదని దేశం మొత్తం మీద తన దగ్గరే ఉందని మురిసిపోయేవాడు. ఒకనాడు ట్యూషన్‌కి కారు బొమ్మని తీసుకువెళ్ళి అక్కడ పిల్లలందరికీ చూపించాడు. వచ్చే సమయానికి ఆలస్యమైపోయి చీకటి పడిపోయింది. ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని పుస్తకాలతో పట్టుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ మీద బ్యాగుతో సహా కారుని గద్దలా తన్నుకుపోయాడు. రాంబాబు దొంగ దొంగ అంటూ అరచుకొని సైకిలు వెంట పరుగెట్టినా ఫలితం కనిపించలేదు. ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాడు. అన్నం కూడా తినాలనిపించలేదు. బెంగపెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు. రాంబాబు ఫ్రెండ్స్ సానుభూతి చూపిస్తూంటే మరీ ఏడుపు వస్తుంది.\n\nఒక రోజు బీరువా మీద పుస్తకాలు సర్దుతుండగా అట్టపెట్టె కింద పడి దొంగతనంగా తెచ్చిన పెన్నులు, పెన్సిళ్ళు ఇతర వస్తువులు కిందపడ్డాయి. వాటిని చూసిన రాంబాబు మనసు చలించిపోయింది. మన వస్తువులు ఇతరులు తస్కరిస్తే ఎంత బాధ కలుగుతుందో మొదటిసారి అర్థమైయింది. తాను చేసిన దొంగతనాల కారణంగా తన ఫ్రెండ్స్ ఎంతలా బాధపడ్డారో అప్పటి నుంచి ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా దొంగతనాల జోలికి పోకుండా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 57,
        "IMAGE": "cat_1",
        "NAME": "దొంగలో మార్పు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహరంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకొని 'అయ్యా ! నా పేరు దీర్ఘకర్ణము నేను పిల్లిని' అని చెప్పింది. వెంటనే జరధ్గవము...' నీవు పిల్లివా! ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను' అంటూ హెచ్చరించింది.\n\nఅయ్యా! కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకూ ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని, మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకి జరధ్గవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరధ్గవము దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి.\n\nచెట్టుపై నున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి కట్టుగావచ్చి జరధ్గవమును తమ పిల్లలు మాయం అయపోతున్నాయి అన్న విషయం అడిగాయి. జరధ్గవము తంకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరధ్గవము తొర్ర లోపలకు వెళ్ళి చూసాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవము తొర్రలో తెలివిగా పడేసినవి.\n\nపక్షులన్నీ జరద్గవమే తమ పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్ధను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి చంపాయి. అయ్యా! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు. అనిగ్రద్ధ ప్రాణాలు విడిచింది.\n\nచూసారా! పూట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్ధకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్ళు చెప్పీ మాటలను మనం నమ్మరాదు. నమ్మితే జరద్గవములా మనం కూడా చిక్కుల్లో పడతాం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 58,
        "IMAGE": "cat_1",
        "NAME": "దొంగపిల్లి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అమాయకులను తెలివైన వాళ్ళు ఎలా మోసం చేస్తారో చివరికి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ కధ వల్ల మనకు తెలుస్తుంది. మోసం, దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు అది బయటపడ్డప్పుడు ఆ తప్పుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిందే అన్నది ఈ కధలో నీతి. పూర్వం ఒక అడవిలో చంపక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవటం వల్ల ఇతర కొంగల లాగా వేటాడి ఆహారం సంపాయించటం కష్టంగా అనిపించి అందుకు ఒక ఉపాయం ఆలోచించింది. బదరికావనంలో కాసారం అనే సరస్సు ఉండేది. అక్కడ మంచి చేపలు సరస్సు నిండా ఉన్నాయని తెలుసుకుంది. ఆ కొంగ వెంటనే ఎగిరి వెళ్ళి ఆ సరస్సులో మకాం పెట్టింది. వంటికాలు మీద నిల్చుని జపం చెయ్యసాగింది. సరస్సులోని చేపలు కొంగచుట్టూ చేరాయి. అయినా కొంగ వాటిని చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి కొంగా! నీకు మేం ఆహారం. పైగా నీకు అందుబాటులోకి వచ్చినా మమ్మల్ని తినవేంటి? అంటూ అమాయకంగా అడిగాయి .\n\nఅప్పుడు ఆ కొంగ ఓ... నా చేప మిత్రులారా! నేను గంగా నది ఒడ్డునున్న మర్రిచెట్టు మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆ చెట్టు క్రింద ఓ యోగి తన శిష్యులకు ధర్మాలను చెబుతూ సకల ప్రాణులయందు దయతో ఉంటే కాని మోక్షం లభించదని చెప్పాడు. అది విన్న నేను ఇక నుంచి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది. చేపలు సంతోషించాయి. కొద్దిరోజుల్లోనే చేపలు కొంగ మంచి మిత్రులయ్యాయి. ఒక రోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనిపించింది. మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాయి చేపలు. ఏం చెప్పను మిత్రలారా! ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇటు వైపు వచ్చారు. వాళ్ళు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి, త్వరలో వచ్చి ఈ నీళ్ళన్నీ తోడేసి చేపలు పట్టుకుందాం అని అనుకోవటం విన్నాను అని బాధగా చెప్పింది కొంగ.\n\nకొంగ మాటలకు చేపలు భయంతో బిక్కచచ్చిపోయాయి. ఇప్పుడెలా..? అని చేపలు మనసులో భయపడసాగాయి. కొద్దిరోజులలోనే మనం మంచి మిత్రులం అయ్యాం... త్వరలో మీరంతా చేపలవాళ్ళ చేతికి దొరికి మరణిస్తారని తల్చుకుంటుంటేనే నా మనసు ఏదోలా అయి పోతోంది అంటూ కొంగ దొంగ కన్నీరు కార్చింది. కొంగ మాటలకి చేపలన్నీ మరింత బెదిరిపోయి ఏడ్చాయి. కొంగ మిత్రమా? మమ్మల్ని ఈ ఆపదనుండి నువ్వే కాపాడాలి అంది ఓ చేప. అయ్యో! నేను ముసలి కొంగను మిమ్మల్ని ఎలా రక్షిస్తాను. అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న కొండలలో నాకు తెలిసిన సరస్సు ఉంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మీలో ఇద్దరిద్దరి చొప్పున ముక్కుతో పట్టు కెళ్ళి ఆ సరస్సు లో వదిలేసి వస్తాను అన్నది. చేపలన్ని ఆనందంగా తలలూపాయి.\n\nఆ రోజు నుంచి కొంగ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు రెండు చేపలని ముక్కుకు కరుచుకుని వెళ్ళి కొంత సేపటి తరువాత ఖాళీ నోటితో తిరిగివచ్చి తీసుకెళ్ళిన చేపలని క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని చెప్పేది. కొద్ది రోజులు గడిచిపోయాయి. చెరువులో చేపలు సగం పైగా ఖాళీ అయిపోయాయి. అదే సరస్సులో జంత్రుడు అనే ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ చేపలకు చేస్తున్నది మేలు కాదు కీడు అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకు చెప్పి మరనాడు తను కూడా వెళతానంది అవి సరే అన్నాయి. ఒక రోజు కొంగ మిత్రమా ఈ రోజు నా వంతు నన్ను తీసు కెళ్ళు అన్నది. ఆహా! రోజూ ఈ చేపలను తిని నా నోరు చప్పబడిపోయింది. ఈరోజు ఈ ఎండ్రకాయతో విందుభోజనం చేసుకుంటాను అననుకుని సరే అంది కొంగ .\n\nఎండ్రకాయను నోటికి కరుచుకుపోయింది. కొంగమిత్రమా! నన్ను ముక్కున కరుచుకుంటే నా కొండె నీ కళ్ళలో దిగబడే ప్రమాదం ఉంది అందుకని నీ మెడను కరిచి పట్టుకుంటాను అన్నది. కొంగ ఇదీ ఒకందుకు మంచిదే అనుకుని సరే అన్నది. ఎండ్రకాయ కొంగ మెడను పట్టుకున్నాక కొంగ ఆకాశంలోకి ఎగిరింది. కొంతదూరం ప్రయాణం చేసాక ఎండ్రాకాయ క్రిందకు చూసింది. అప్పుడు ఎండ్రకాయ నిజమే! ఇది దొంగ కొంగ. ఈ రాళ్ళు రప్పలలో నీటి చుక్క కూడా ఉండదు. దీనికి తగినశాస్తి చెయ్యాల్సిందే అనుకుని కొంగ మెడను కొరికేసింది. కొంగ ప్రాణాలు వదులుతూ నేల మీద పడిపోయింది. ఎండ్రకాయ కొంగ మెడను వదిలి తాపీగా తన చేప మిత్రులు ఉన్న సరస్సు వైపు నడిచింది. చూసారా! మోసం ఎంతో కాలం దాగదు... తాడిని దన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. అబద్దాలు చెప్పి చేపలను చంపి తిన్న కొంగ ఎండ్రకాయ చేతిలో చచ్చింది. అందుకే ఎవ్వరిని మోసం చెయ్యరాదు. అలా చేస్తే కొంగలాగా చివరికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 59,
        "IMAGE": "cat_1",
        "NAME": "దొంగ కొంగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.\n\nశౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.\n\nనీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 60,
        "IMAGE": "cat_1",
        "NAME": "దేశ సేవ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు.\n\nపిచ్చిదానా! యాభైవేలరూపాయలు ఊరకే వస్తూంటే వదులుకోవటం మూర్ఖత్వం. నానాసాహెబ్‌ను అరెస్ట్ చేసి ఆ బహుమతి డబ్బు సంపాదిస్తా అన్నాడు. భార్యా, భర్తల మధ్య వాగ్వివాదము మొదలైంది. వీరి మాటలు వింటున్న నానాసాహెబ్ తాను దాగివున్న గది నుండి బయటకి వచ్చాడు. నా కారణంగా మీ కుటుంబంలో కలతలు రావటం నాకిష్టంలేదు. చేతనైతే అరెస్ట్ చేయండి అన్నాడు. తనకందిన సూచన ప్రకారం నానాసాహెబ్ తన ఇంట్లోనే దాగి వుండటం చూసి ఆ ఇన్‌స్పెక్టర్ కు చాలా సంతోషం కలిగింది. వెంటనే పిస్తోలు గురిపెట్టి హేండ్సప్ అన్నాడు. ఆయన మహనీయుడు, దేశభక్తుడు, ఆయన్ని అరెస్ట్ చేస్తావా? అంటూ ఆమె భర్త మీదకు వచ్చింది.\n\nఆమెను దూరంగా త్రోయడంతో పిస్తోలు జారి క్రిందపడింది. వెంటనే ఆ వీరనారీమణి పిస్తోలుతో తన చాతిలో పేల్చుకుంది. మీకు యాభైవేల రూపాయల పాపపు సొమ్ము కావాలి. ఆ పాపపు సొమ్ములో నేను భాగం పంచుకోలేను. నీలాంటి దేశద్రోహితో జీవించలేను. అంటూ ఆమె ప్రాణం వదిలింది. అమ్మా! సోదరీ! ఏంటమ్మా ఇలా నీ ప్రాణాలు తీసుకున్నావు. అంటూ పరుగున వచ్చాడు నానాసాహెబ్. ఆమెరక్తంతో తిలకం దిద్దుకున్నాడు. నన్ను అరెస్టుచేసి, నీ వృత్తి ధర్మాన్ని నిర్వహించు ఇన్‌స్పెక్టర్ అన్నారు నానాసాహెబ్. నానాజీ! నేను ద్రోహిని. నన్ను క్షమించండి. నా కర్తవ్యం ఏమిటో నాకు బోధపడింది. నా జీవితాన్ని ఇప్పుడు దేశం కోసం ధారపోస్తాను. మీరు ఇక్కడి నుండి వెంటనే పారిపోండి. ఈ భారతభూమి మీ కోసం ఎదురుచూస్తోంది. అంటూ ఆ ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 61,
        "IMAGE": "cat_1",
        "NAME": "దేశభక్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.\n\nఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.\n\nదేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.\n\nపోస్ట్‌మాన్‌ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్‌ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనియార్డరు పంపించాడు.\n\nనాలుగురోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో... దేవుడా! నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రుపాయలు పంపించి ఉంటావు. కాని పోస్టుమాన్‌ అందులోంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు పరవాలేదు. అది నీ తప్పు కాదుగా... మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానూ అని ఉంది. అది చదివిన పో్స్టుమాస్టర్‌ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 62,
        "IMAGE": "cat_1",
        "NAME": "దేవుడికి ఉత్తరం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి \"ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ అడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది\" అని చెప్పాడు.ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు.\n\nమూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి \"ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది?: అని అడిగాడు. ఆ పెద్ద మనిషి \"మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను\" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. \"నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది\" అని చెప్పి వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 63,
        "IMAGE": "cat_1",
        "NAME": "దురాశ దుఖమునకు చేటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. ఓ రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ అతడిని వెంబడించింది. అదిలిస్తే ఆగిపొతుంది. నడుస్తుంటే అతడిని వెంబడిస్తుంది. \"నేను వెతుకుతున్నది నిన్నే\" అన్నట్లుగా చూస్తున్నది. అదిలించడం మానేసి, మిన్నకుండిపోయాడు రాజయ్య. అతడిని వదిలిపోలేదు అది. చూపు మరల్చుకోకుండా గునగునమంటూ ఇంటి దాకా వచ్చేసింది. ఆ క్షణం నుండి ఆ ఇల్లే దానికి ఆవాసమైపోయింది. అతను, ఆ కుక్కపిల్లా - ఇద్దరే ఆ ఇంట్లో!\n\nవయసు పైబడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తానే చేసుకుంటాడు. నెల నెలా వెళ్లి పింఛను తీసుకుంటాడు. అవసరమైనప్పుడు బజారుకు వెళ్లి వస్తాడు. చారెడు బియ్యం ఉడుకేసుకుంటే రోజు గడిచిపోతుంది. పట్టెడన్నం తాను తిని, మిగిలింది కుక్కకు పెడతాడు. రాజయ్య కన్ను అయితే, తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది కుక్కపిల్ల. అతను ఎక్కడుంటే, అదీ అక్కడే!\n\nఇంటికి వచ్చిన రోజునే దానికి \"ఒరే దశరధ రాముడూ\" అని పేరు పెట్టుకున్నాడు రాజయ్య. \"ఒరే దశరధ రాముడూ!\" అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో! దాని ఒళ్లు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో! కాలం గడుస్తున్నది. కుక్కపిల్ల పెద్దదైంది. రాజయ్యకు అదే తోడూ నీడా అయింది. అతను క్రమంగా కృశించి పోతున్నాడు. దశరధ రాముడి కళ్ళలో దిగులు గూడు కట్టుకుంటున్నది. పగలు రాత్రి అది అతడి కాళ్ల వద్దే పడి ఉంటోంది.\n\nఆఖరికి రాజయ్య కన్నుమూశాడు. కుక్కకు కన్నీళ్లు ఆగలేదు. దూరాభారం కదా, మర్నాటికి గానీ రాలేకపోయాడు కొడుకు 'దశరధ రామయ్య.' పన్నేండేళ్ల తరువాత మళ్లీ ఇదే రావడం! అతనితో బాటే అతని భార్య, పిల్లలు!\n\nతల కొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు. కుక్క వీధిన పడింది. అది వీలు చూసుకుని రోజుకొకసారైనా శ్మశానానికి వెళుతుంది. రాజయ్యను పాతిపెట్టిన మట్టిదిబ్బ మీద కాసేపు మౌనంగా కూచుని లేచి వస్తుంటుంది. ఆ వీధిలోని వాళ్లు ఇప్పటికీ దాన్ని \"దశరధ రాముడూ\" అనే పిలుస్తుంటారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 64,
        "IMAGE": "cat_1",
        "NAME": "దశరధ రాముడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రె పిల్లను చూసింది.\nతోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది. అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది.\nగొర్రెపిల్లను చూస్తూ తోడేలు - \"నేను ఈ సెలయేట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం?\" అని అంది.\n\nతోడేలుకు గొర్రెపిల్ల బదులిస్తూ \"నీవు ఉన్నచోటి నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి. అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను?\" అంది.\nతోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది. గొర్రెపిల్లపై అరుస్తూ, \"నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు\" అంది.\nతోడేలు మాటలకు \"నేనింకా అప్పటికి పుట్టనే లేదు\", అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల.\n\"కావచ్చు. అప్పుడు నీ తండ్రి కావచ్చు. అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 65,
        "IMAGE": "cat_1",
        "NAME": "తోడేలు సాకు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. \"ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం\" అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. ఈ తోడేలు చాలా జిత్తులమారింది. ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది. దీని మాటలు అసలు నమ్మకూడదు. ఇది నన్ను కూడా మోసం చేస్తుంది. అందుకని దీని వలలో పడకూడదు. కాని పైకి ఇలా అంది \"నేను నమ్మను. నీది బాగా చెడు బుద్ది. చాలా జంతువులను మోసం చేశావు. అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు\" అంది.\n\nఅది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, \"మామా! నేను ఇపుడు చాలా మారాను. అసలు మాంసాహారము ముట్టడం లేదు. నేను శాకాహారమునే తీసుకుంటున్నాను. నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు. నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు. నన్ను నమ్ము. నువ్వు ఎలా చెబితే అలా వుంటాను. అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు. మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను. అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును. ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది. ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది. \"నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను\".\n\nఅందుకే తోడేలు \"నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను. మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం. కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది. ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది. ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది. వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.\n\nఒకరోజు తోడేలు ఒంటెతో \"మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది. నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి, చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!\" అని అంది. ఒంటె ఒప్పుకుంది. తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది. ఒంటెకు నోరు ఊరింది. చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి. మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది. ఒంటెకు ఉత్సాహంగా ఉంది. దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి \"నీవు నా వీపు మీద కూర్చో\"అంది. తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది. రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి. చెఱకు తోటలోకి నడిచినాయి.\n\nఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి \"మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది. నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు\"అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు. ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది. తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది. తోట యజమానికి వినపడేలా అరిచింది. ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.\n\nతోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు. చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు. అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు. కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది. వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది. అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది. \"మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు. ఇంటికి చేరగానే మందు రాస్తాను పద\" అంది. ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది. దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది\n\nఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది. తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది. ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె, నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది. నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. \"అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో\" అంది. తోడేలుకు అప్పుడు అర్దమైంది. దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది. ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 66,
        "IMAGE": "cat_1",
        "NAME": "తోడేలు - ఒంటె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక రోజు రాజ్యంలో పర్యటిస్తున్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును \"నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా?\" అని అడిగాడు. \"సంతోషంగా ఉన్నాను రాజా! నేను రోజుకు ఒక రూపాయి మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను\" అని చెప్పాడు రైతు.\n\n\"అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?\" అడిగాడు రాజు. \"రాజా! నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చ చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంటుంది. చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను.\n\nరైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, \"నా మొహం వందసార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు\" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు.\n\nరైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరకెళ్ళి అతనికి బంగారు నాణాల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు.\n\nమర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నలకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతు రాజు \"నీకెంత ధైర్యం! నా మొహం వందసార్లు చూపిన తరువాత గాని జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా! అని రైతు మీద ఆగ్రహించాడు.\n\n\"రాజా! మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు వంద బంగారు నాణాలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను వందసార్లు మీ మొహం చూసిన తరువాత గాని ఈ జవాబు అధికారికి చెప్పలేదు\" అని వివరించాడు రైతు.\n\nరాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 67,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివైన రైతు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు.\n\nఅంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు రైతు.\n\nఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బలు పెట్టసాగింది. తరువాత అరవకుండా ఉండిపోయింది.\n\nకొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 68,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివైన గాడిద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు.\n\nచాలా బాగుంది. చాలా పాతది. బాగా తాగమని బాలుడికి చెప్పాడు. ఆనందంగా తాగమన్నాడు. ఆ పేద బాలుడికి ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీరు కూడా లేదు. నవాబు మోసం గ్రహించాడు. బుద్ది చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్లు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దానికి నవాబుకు కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు? తెలుసా? అని అరిచాడు. మీరిచ్చిన మత్తు పానీయంతో నాకు మత్తెక్కింది. నాకేం తెలియటంలా అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు దానితో తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. దాన ధర్మాలు చేయసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 69,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివిగల బాలుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ అవి ఐకమత్యంగా ఉండేవికావు. అవి ఒక్కొక్కటీ వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది.\nరోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు, భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.\n\"మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం\" అంది ఒక పావురం.\nఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కూడా కష్టమైంది.\nఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. \"నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. మీతో స్నేహం చేయడానికి వచ్చ్హాను\" అంది.\n\nముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, \"మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని మీకో నాయకుదు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉండవచ్చు\" అంది.\n\nపావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద, \"మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను\" అంది. \"అలాగే\" అన్నాయి పావురాలు. \"అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మేరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి\" అంది గ్రద్ద.\n\nపావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 70,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివిగల పావురాలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అదొక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో రెండు తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండో తొర్రలో చిట్టెలుక వుంటున్నాయి. అడవిలో తిరిగి, పళ్ళు కాయలూ ఏరుకొచ్చి పావురము, ఎలుక కలసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి రెండూ మంచి స్నేహంగా వుంటూ ఒకదానిని విడిచి, మరొకటి వుండేవికావు. పావురము, ఎలుక కలసివుండటం ఓ తోడేలు కనిపెట్టింది. పళ్ళూ, కాయలు తిని బాగా బలసి వున్న వాటిని తినాలని ఆశ పడింది. వాటిని పట్టుకొనే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని వున్నది.\n\nఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మగ్గిన పళ్ళు వేలాడుతూ వుండడం ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడినది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో వున్న యేరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరి వెళ్ళగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకు పోతానని ఎలుక భయపడింది. ఎలాగా? అని బాగా ఆలోచించి, ఓ తాడుతో పావురం కాలుకూ, ఎలుక కాలుకూ కట్టుకుంటే, పావురం ఎగిరి ఆ పళ్ళచెట్టు మీద వాలుతుంది! తాడు కట్టుకుంది కనుక, పావురంతో పాటు ఎలుక కూడా ఆ చెట్టు మీదకు వెళుతుంది అని బాగా ఆలోచించి,తమ ఆలోచన బాగా వున్నదని తాడు కట్టుకున్నాయి. పావురం రివ్వున ఎగిరింది. కాలి తాడుతో వేలాడుతూ ఎలుక కూడా గాలిలో ఎగురుతూ, పళ్ళ చెట్టు మీద వాలాయి రెండూనూ! వాటిని తోడేలు గమనిస్తూనే వుంది. మెల్లగా ఏరు దాటి ఆవలి వొడ్డుకు చేరి చెట్టు మొదట్లో కూర్చుంది. తోడేలును చూసిన ఎలుక కంగారుపడి అటూ ఇటు పరిగెత్తింది. కాలుజారింది. పావురం కాలితో, తన కాలు తాడుతో కట్టి వుండటం వల్ల గాలిలో వేలాడుతూ పైకి ప్రాకాలని ప్రయత్నిస్తోంది ఎలుక!\n\nఆ స్థితిలో ఆ ఎలుక కింద పడుతుందేమో నని తోడేలు తల పైకి ఎత్తి ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో ఓ డేగ బాణంలా దూసుకు వచ్చి, ఎలుకను తన్నుకుపోయింది. తాడు కట్టివుండటం వల్ల పావురం కూడా ఎలుకతో పాటే డేగకు ఆహారమై పోయినది! తోడేలు ఆకాశంలోని చిత్రాన్ని చూస్తూ చతికిలపడింది.\n\n\"స్నేహం వుండటం మంచిదే! కాని, బతికే పద్దతుల్లో తేడా వున్నప్పుడు స్నేహం చేయడం అంత మంచిదికాదు\" అంటారు పెద్దలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 71,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివి లేని స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అరణ్యంలో రకకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒక రోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్ని కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి.\n\nఇదంతా నక్కకు నచ్చలేదు \"రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్దిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతే కాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు\" అని అనుకుంది.\n\nఒక రోజు ఆ నక్క ఆహరం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి, ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం జోలికి వెళ్ళకుండా గబగబా కోతి రాజు దగ్గరికి పరిగెత్తింది.\n\n\"రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికేచోటు చూపిస్తాను\" అని చెప్పింది నక్క.\nకోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరకు తీసుకెళ్ళింది.\n\"ఇదుగో రాజా... ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు\" వినయంగా అంది నక్క.\nవెనకా ముందూ ఆలోచించకుండా కోతి ఒక గెంతులో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది.\n\"రాజనే వాడికి కొంచెం తెలివితేటలు ఉండాలి\" అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 72,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివి తక్కువ రాజు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి \"ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!\" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.\n\nవేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.\n\n\"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను\" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో.\n\n\"చచ్చానురా\" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, \"పిల్లలూ్! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను\" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.\n\nవేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. \" మీకు నా గానం నచ్చిందా?\" \"నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామ\" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.\n\nపిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు. \"చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు. \"ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో స్నానం చేద్దామ\" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.\n\nనీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 73,
        "IMAGE": "cat_1",
        "NAME": "తాబేలు తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.\n\nఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు. అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది. జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది. ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు. ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.\n\nపట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది. అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ \" మూర్ఖురాలు \" ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. \" ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు \" ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.\n\nఅప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:\" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి \" అమ్మా \" అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు \" మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 74,
        "IMAGE": "cat_1",
        "NAME": "తల్లి ప్రేమ సాటిలేనిది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "గర్భవతిగా వున్న సీతమ్మ భర్త పొరుగూరు వెళ్ళి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు-కోడలు వద్ద వుండి జీవితాన్ని వెళ్ళదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతియై మగ శిశువును కన్నది. అత్తా-కోడలు అన్యోన్యముగా వుండసాగారు. కొంతకాలము గడిచే సరికి చెప్పుడు మాటలకు లోనై భర్త వూళ్ళోలేని సమయంలో అత్తగారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు.\n\nసీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూరప్రాంతానికి వెళ్ళి కొడుకు-కోడలు క్షేమమే తన సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషంగా వుంటోంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారి పై లేనిపోని చాడీలు చెప్పి, తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కాని కొడుకు నమ్మక ఉద్యోగము చెయ్యక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడసాగారు. తల్లి ప్రేమకి కరువయి మానసికముగా క్రుంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసము ఎంత వెదికినా కనిపించలేదు.\n\nకొంతకాలము గడిచింది. భర్త-భార్య కలసి సీతమ్మని వెదకటానికి బయలుదేరారు. తిండిమాని శుష్కించిపోయి సీతమ్మ ఉండే గ్రామము మీదుగా వెళ్తున్న కొడుకు-కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది. సీతమ్మ కాళ్ళపై పడి క్షమించమని కోరారు కొడుకు-కోడలు. తను సుఖంగానే ఉన్నానని, మీ సుఖసంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది.\n\nఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయము గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే వుండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాల సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకుని, పొలము, ఇల్లు కొనుక్కొని సుఖసంతోషాలతో కాలము గడిపారు. రైతు కొడుకు-కోడలు విదేశాలలో వుండటం వలన వారినే సొంత వాళ్ళుగా చూడడం వలన ఆ రైతు కూడా ఆనందించాడు.\n\nసీతమ్మతో రైతు \"అమ్మా! నీ ఓర్పు, సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కోడుకు నా కోసమే తపించిపోయాడు. కోడలు ధన సంపాదనలో మునిగి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాల అదృష్టవంతురాలివి\" అని కన్నీరు కార్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 75,
        "IMAGE": "cat_1",
        "NAME": "తల్లి ప్రేమ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.\n\"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను\" అన్నాడు.\n\"అలాగా! దీని ఖరీదు ఎంత?\" అన్నాడు రాజు.\n\n\"వెయ్యి వరహాలు రాజా\" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు \"రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు.\" అని చెవిలో చెప్పాడు.\n\nమంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, \"నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?\" అని అడిగాడు.\n\n\"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!\" అన్నాడు నస్రు.\n\nనస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.\nవరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు\" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 76,
        "IMAGE": "cat_1",
        "NAME": "తలపాగా ఖరీదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 76,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి. సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి. సిరిపురం సింగడంటే గజదొంగలు కూడా తలలూపుతూ కిటికీలతో సహా మూసుకుంటారు. సింగడికి సిబ్బంది లేదు. తోటి దొంగలు లేరు. అతని సైన్యం అంతా అతనొక్కడే. చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు. వేషాలు మార్చడం, భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి. పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయ్యాలనుకున్న యింట అనుపాన్లు, గుట్లు గ్రహిస్తాడు. నాలుగయిదు రోజులు ఆ ఇంటి వాళ్ళు తన వేషాన్ని మర్చిపోయేంత వరకూ మౌనంగా ఉండిపోతాడు.\n\nఆ తరువాత ఓ రాత్రి విజృంబించి తన చాకచక్యం చూపి మూడోకంటివాడికి కూడా తెలియకుండా ఆయింటిని దోచేస్తాడు. ఫలానా వారి ఇల్లు దోచుకుంటానని ముందు చెబుతాడు. అందరూ అప్పటికే బహు హెచ్చరికగా ఉంటారు. అయితే అర్థరాత్రి దాటాక ఓ కుంటివాడుగానో, గుడ్డివాడుగానో హెచ్చరికవున్న వారి దగ్గరికొచ్చి మీరంతా ఇక్కడున్నారు, అవతల మీ ఇల్లు కాలిపోతున్నది అని చెప్పేవాడు. దాంతో వాళ్ళు ఆదుర్థాగా అక్కడకు పరుగెడతారు. ఆ ప్రదేశం నిర్మానుష్యం అయిన తరువాత రెండూ మూడిళ్ళు దోచుకొని దొరికిన సొమ్ము మూట కట్టుకొని వెళతాడు. మళ్ళీ ఆ ఇళ్ళవాళ్ళు మోసగింపబడ్డామని తెలుసుకొని తిరిగి వచ్చేలోగా కలసిపోతాడు.\n\nఅయితే ప్రతిసారి అదే ఎత్తుగడ ఉపయోగించక కొత్త ఎత్తులు ఆలోచిస్తుంటాడు. ఇలా ఊళ్ళకి ఊళ్ళు దోచి చాలా డబ్బు కూడబెట్టాడు సింగడు. కోటి రూపాయలు సంపాదించిన తర్వాత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని హాయిగా బ్రతకాలని వాడి ఆశ. ఆ ఊరు చేరి అది రెండో రోజు. ఆ వేషంలో తిరిగి, ఈ వేషంలో తిరిగి మాణిక్యంశెట్టి కొట్లకి పడగలెత్తాడని విని ఆ యింటి అనుపాసులు వెతుకుతున్నాడు. మాణిక్యంశెట్టి ఇంటికి ఆ ఉదయం ఒక సాధువు వచ్చాడు. శెట్టిగారు తమకి తమ కుటుంబానికి ఉన్న రకరకాల వ్యాధుల్ని గురించి చెప్పాడు. సాధువు కొంచెం తెల్లపొడిని ఇచ్చి ఈ రోజు ఈ పొడి వేసి వంటకాలు చెయ్యండి. అది తింటే మీ వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పాడు.\n\nఅలాగే ఆ పొడి వేసి వంటకాలు వండి తిన్న మాణిక్యంశెట్టి కుటుంబసభ్యులంతా మత్తుగా నిద్రపోయారు. సింగడు తన తెలివితేటలతో దొడ్డి తలుపు తెరచి యింట్లో ప్రవేశించాడు. నగదు, నగలు మూట కట్టుకుంటుండగా ఓ పక్క అద్దాల బీరువాలో అందంగా చేసి పెట్టిన లడ్డూలు కనిపించాయి. లడ్డూలు సింగడి బలహీనత. అందువల్ల ఆ బీరువా తెరచి అయిదారు లడ్డూలు గబగబా తిన్నాడు. అంతవరకే అతనికి తెలుసు. కళ్ళు తెరచి చూస్తే మంచానికి కట్టివేయబడి ఉన్నాడు సింగడు. నువ్వు యిచ్చింది మత్తుమందు అని తెలియక మేందాన్ని నేతిలో వేసి దాంతో అన్ని వంటకాలూ చేశాం. అయితే మత్తు ఆవరించకుంటుండగా నాకు అర్థమయింది. నేనేం చెయ్యలేకపోయాను. నువ్వు వస్తావని తెలిసి అతి కష్టం మీద ఆ నేతితో చేసిన లడ్డూలు ఈ అద్దాల బీరువాలో పెట్టి పారిపోయాను. అవి తిని నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావు. తాడి తన్నే వాడి తల తన్నేవాడుంటాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాసేపటిలోగా రక్షకభటులు వస్తారు. అంతవరకూ మరో లడ్డూ ఇవ్వనా అని శెట్టిగారు, అతని కుటుంబ సభ్యులు హేళనగా నవ్వారు. తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాడు గజదొంగ సింగడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 77,
        "IMAGE": "cat_1",
        "NAME": "తప్పింపతరమా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 77,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులూ, సింహాలు, పాములు, తోడేళ్ళు, పొడుగాటి చెట్లూ, ఎత్తైన గట్లూ గుర్తుకు రావొచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే కాని, ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం.\n\nఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపునిండా నిద్రపోయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారూ! ఆ వేళ మరీ చలివేస్తోంది. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది! జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకు పోతోంది. మనకంటే దుప్పట్లు ఉంటాయి. కోతులకేం ఉంటాయ్? 'ఏంచేద్దాం? ఏంచేద్దాం' అన్నాయి కోతులు. ఒక ముసలికోతి' చలి మంట వేసుకుందాం అని అంది. భేష్! భేష్! అన్నాయి. మంద మందంతా ఇంకేం తలో మూలకి వెళ్ళాయి. తలా ఒక గుప్పెడు ఎండు టాకులు, పుల్లలూ తెచ్చాయి. ఓ చెట్టు కింద పోగేశాయి. పెద్ద గుట్టయింది. ఓ మహా చక్కగా రాత్రి తెల్లార్లూ చలికాగొచ్చు అని అంది ఓ పండు ముసలి కోతి.\n\n\"ఊ చప్పున మంట వెయ్యండి\" ఓ పడుచు కోతి అంది. మంట వెయ్యడానికి నిప్పేది?\nఆకులున్నాయ్\nఅగ్గి లేదోయ్\nఅగ్గి లేందే\nమంట రాదోయ్\nమంట లేందే\nచలి వదలదోయ్\n\nఅని పాడింది ఒక ఆడ కోతి. అయితే అగ్గి నిప్పు తెండి ఎక్కడుందీ వెతకండి, వెతకండీ! నిప్పు కోసం తలో మూలకి బయల్దేరాయి. ఇంతలోకే పొద్దు గూకింది. అడవిలో మరింత చీకటి కదూ? ఆ చీకట్లో ఒక పొదమీదనుంచి మిణుగురు పురుగులు ఎగురుతున్నాయి. నల్లని చీకట్లో పచ్చని వెలుతురూ మిలమిలా తళతళా మిణుగురులు మెరిసెను నల్లని చీకట్లు తెల్లబడి పోయెను, మిణుగురుల్ని కోతులు చూశాయి. అదుగో నిప్పురవ్వ! 'ఊ పదండి తలో నిప్పురవ్వా తెద్దాం' అన్నాయి కోతులు. చప్పునపోయి తలో మిణుగురిని పట్టుకున్నాయి. గుట్ట దగ్గరకు వచ్చాయి. ఆకులు గుట్టలో మిణుగురుల్నికుక్కి మంట వెలిగించడానికి ప్రయత్నించాయి. కొన్ని ఊహూ అంటూ ఊదుతున్నాయి. మరికొన్ని కోతులు టేకు ఆకులు మన విసనకర్రలల్లే ఉంటాయి. వాటిని తెచ్చి విసురుతున్నాయి. ఉహు ఎంత శ్రమ పడినా ఆకులు గుట్ట రాజుకోలేదు. ఊదీ ఊదీ విసుగెత్తుతోంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పుకోగలరా చెట్టు కొమ్మమీద కూచున్న పాలపిట్ట చూస్తోంది. పాలపిట్ట చాలా మంచిది. కోతుల తెలివి తక్కువతనం చూసి జాలిపడి ఇలా అంది.\n\nఅక్కలారా! అక్కలారా!\nనిప్పుకాది మిణుగురమ్మా\nమిణుగు రెప్పుడు మండదమ్మా\nమిణుగు రెప్పుడు వెలుగునంతే!\n\nపాలపిట్ట పాటవిని కోతులు మండిపడ్డాయి. మాకు తెలియదట. ఈ పిట్టకు తెలుసట! అని కోపగించాయి. పాలపిట్టను గద్దిస్తూ కోతులు - నోరు ముయ్యవే పాలపిట్టా తెలిసినట్టు మహా చెప్పవచ్చావ్! నిప్పు సంగతి నీటి సంగతి నీకు తెలుసా? మాకు తెలుసా? అని అన్నాయి. పాపం, పాలపిట్ట మాత్రం తన గొడవ మానుకోలేదు. మళ్ళా అంది కదా\n\nనా మాట వినుడక్కలారా!\nఅగ్గిగాదిది మిణుగురమ్మా!\nవెలుతురిచ్చే మిణుగురమ్మా!\nమిణుగు రెప్పుడు మండదమ్మా!!\n\nకోతులికి పట్టరాని కోపం వచ్చింది. కూస్తంత పిట్ట తమని ఎగతాళి చేస్తోందని భావించాయి. ఏయ్ జాగ్రత్త అని బెదిరించాయి. కాని పాలపిట్ట మాత్రం పాడుతూనే ఉంది;\n\nనామాట విను డక్కలారా!\nఅగ్గికాదిది మిణుగురమ్మా!\"\n\nకోతులు పిచ్చి కోపంతో పాలపిట్టను పట్టుకున్నాయి. తోక పీకేశాయి. చివరికి పీక నులిమి చెట్టుకేసి బాదాయి. పాల పిట్ట చచ్చిపోయింది. కోతులు ఎంత తన్నుకున్న ఆకులు గుట్ట మండలేదు. వాటికి చలి తీరలేదు. పాలపిట్ట మాట నిజమని గ్రహించనూ లేదు. తెలివి తక్కువ కోతిమందకు తగని సలహా చెప్పి ప్రాణము కోల్పోయిన పిట్టకథ ఇది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 78,
        "IMAGE": "cat_1",
        "NAME": "తగని సలహా ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 78,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి. వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.\n\nసింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద - మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి. సింహం ఎద్దు వేపు చూసి 'ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ' అని అంది. ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.\n\nసింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది. నక్క తెలివిగలది. చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. 'సరే! నేనే పంచుతాను' అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :\n\n'నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!' అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి, 'దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!' అని అంది. కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి. ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.\n\nసింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది. కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు. 'బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా' ననేది. గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.\n\nఓ రోజున గాడిద వచ్చింది.'నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?' అని గ్రుడ్లురిమి చూసింది సింహం. 'ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా! చింత చచ్చినా పులుపు చావలేదే!' అంది గాడిద. సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది. సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది. దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.\n\n'ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది. అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?' అని ఏడ్చింది సింహం. కాని ఎవరికి జాలి? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 79,
        "IMAGE": "cat_1",
        "NAME": "తగని గర్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 79,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "తుంగభద్ర వొడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి! ఇంతా అంతా అనికాదు ఎంతో అందం! అంతకుమించిన ఆనందంతొ పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమ కొక 'పెద్ద' ని యెంచుకొనేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం యెక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పి నృత్యం చేస్తాయి. ఆ నృత్యం కళ్ళారా చూడవలసిందే!\n\nపక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని యెంచుకొన్నాయి. వరుణుడు చాలా సంతోషించాడు. 'నెమలిని యెందుకు యెన్నుకొన్నారు? ' అనడిగింది బొంతకాకి. 'అందచందాలున్నవి కనుక' అని జవాబిచ్చాయి పక్షులు. మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు. ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిలను యెంచుకున్నాయి. కోకిలపాట యెంత తియ్యగా ఉంటుందో ఎవరికి తెలియదు? సూర్యుడు సంతోషించాడు. కాని, బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టు అయింది. గురగుర లాడింది నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు. మరి కోకిల? తనకన్న అందగత్తె కాదు కదా? తనలో తాను గొణుక్కున్నది.\n\n\"ఏం చూసి కోకిలను యెంచుకొన్నారు?\" ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి. పక్షులు నవ్వాయి. 'దాని కంఠం ఎంత కమ్మగా ఉందో చూడు! అందుకనే పెద్దగా యెంచుకొన్నాం' అని జవాబిచ్చాయి. బొంతకాకి తెగ గొణిగింది. వచ్చే వసంత ఋతువు నాటికి యేమైనా సరే, తనే పెద్ద కావాలని నిశ్చయించుకొంది. సరే! వసంత ఋతువు రానేవచ్చింది. ఈసారి పక్షులు తమ అతిధిగా చంద్రుణ్ణి పిలిచాయి. నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు. పండగ మంచి జోరుగా ఉంది. అందరూ ఒక చోటుకు చేరారు. పెద్దని యెంచుకోవలసిన సమయం.\n\nఇంతలో ఒక వేపునించి ఒక చిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది. వింత వేషం! పొడుగాటి తోక, రెక్కల నిండా తెల్లని మెత్తటి యీకలు, నెత్తిమీద వింత జుట్టు. కాని అది నెమలీ కాదు, హంసా కాదూ, కోడి కాదు. పక్షులన్నీ యీ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి. అది పెద్దను యెంచుకోవలసిన సమయం మరి. 'నెమలికన్నా అందమైన పక్షిని. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. నెమళ్ళు తల వంచాయి. మిగతా పక్షులు నోరు మెదపలేదు.\n\n'కోయిలలకన్నా చక్కగా పాడగలను. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. కోయిలలు తలలు వంచాయి పక్షులు మాత్రం ఏమంటాయి. ' ఒక పాట పాడి వినిపించు ' అని అడిగే దైర్యంకూడా లేదు. 'ఊఁ... ఏకగ్రీవంగ నన్నే పెద్దగా యెంచుకోండి! ' అంది కొత్త పక్షి మంచి డాబుసరిచేసి. పక్షులు నోరెత్తకుండ రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్దమయ్యాయి. ఇంతలో హంస ముందుకువచ్చింది. ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటోంది. కొత్తపక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది. హంస అసాద్యురాలు, వింతని కనిపెట్టింది.\n\n' అయ్యా! ఈ కొత్తపక్షిగారిని పెద్దగా యెంచుకొవడానికి అభ్యంతరంలేదు. మాంచి డాబుసరిగా ఉన్నరు. ఇంత దర్జా గలవారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం. కాని, చిన్న మనవి!... అంటూ హంస కొత్తపక్షి దగ్గరకంటా వెళ్ళింది. కొత్తపక్షి తోకని పట్టి గుంజింది. చిత్రం... ఎక్కడ ితోక అక్కడ రాలిపోయింది! కొత్త పక్షి తల నేలకు వంచింది. కొత్తపక్షి రెక్కల్ని దువ్వింది పెట్టుడు ఈకలు జారి పోయాయి. నెత్తిమీంచి జుట్టులాగేసింది. తీరాచూస్తే... అది బొంతకాకి!\n\nబొంతకాకి ఎలాగో పెద్దరికం సంపాదించాలని అడవిలో అక్కడక్కడా రాలిపడిన ఈకలన్నీ తగిలించుకుంది. డాబుసరి వేషం వేసుకుని వచ్చింది. కాని, హంస తెలివితేటల వల్ల అసలురంగు బయటపడింది. తర్వాత పక్షులు బొంతకాకిని అడవినుంచి తరిమేశాయి. హంసను ఆ ఏటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి. చంద్రుడు చాలా సంతోషించాడు. నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవరికీ తెలియలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 80,
        "IMAGE": "cat_1",
        "NAME": "డాబుసరి వేషాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 80,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.\n\nఅనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. తిరిగి పాఠశాల తెరవగానే వారి వారి స్టాండర్డ్‌ను అనుసరించి పాఠశాలలో చేరుతున్నారు. నువ్వు అందుకేగా వచ్చింది అన్నాడు. మాష్టారు! నా సంగతేమో గాని, నా చిట్టి తమ్ముణ్ణి ఆశీర్వదించండి, వీడి పుట్టిన రోజు ఈ రోజే! అన్నాడు స్వీట్స్ తమ్ముడి చేత ఇప్పించి. మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లు బాబూ! అన్నాడు సత్యం మాస్టారు. అంతే! అనిల్ ఆ మరుక్షణం తన తమ్ముడిని ఒకటో తరగతిలో కూర్చుండబెట్టి ఇంటి ముఖం పట్టాడు. తన అంచనా తప్పవడంతో సత్యం మాస్టారు, అనిల్‌ని వెనక్కి పిలిచి అనిల్ నిన్ను - నీ వాలకాన్ని చూసి తిరిగి పాఠశాలలో చేరి బాగా చదువుకోవడానికి వచ్చావనుకొన్నానే! బడిలోచేరి చదువుకోవా? అన్నాడు.\n\nనాకూ చదువుకోవాలనే ఉంది మాష్టారు. కాని కుటుంబ పరిస్థితులు సహకరించడంలేదు. యాక్సిండెంట్‌లో నాన్న పోగానే అమ్మ ఏకాకి అయ్యింది. బంధువుల సాయం అంతంతమాత్రమే! నోటికింత ముద్దపెట్టే పొలాన్ని, పాడి గెదెలను చూసుకుంటూ అమ్మకి సాయంగా ఇంటి పట్టునే ఉంటున్నాను. అన్నాడు అనిల్. దాంతో అనిల్‌ని అర్థం చేసుకొన్న సత్యం మాస్టారు బాబూ! అనిల్ నీకు నేను చదువు చెబుతాను. రాత్రి పాఠశాలకు రా! ఈ రోజుల్లో చదువు ఎంతో అవసరం! పట్టాల కోసం, ఉద్యోగాల కోసం అనుకోవడం పొరపాటు. విద్య మన జీవితాలకో వెలుగు! అన్నాడు. ఆ మాటలతో జ్ఞానోదయం కలిగిన అనిల్ రాత్రి పాఠశాలకెళ్ళి చక్కగా చదువుకొని, సత్యం మాస్టారి సలహా సంప్రదింపులతో ఎన్నో పరీక్షలు రాసి పాసై ఒక ఉద్యోగస్తుడయ్యాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 81,
        "IMAGE": "cat_1",
        "NAME": "జ్ఞానోదయం 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 81,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.\n\n'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది. 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు' అనుకుంది. కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, అనుకుని అక్కడి నుండి కదలలేదు.\n\nశిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.\" ఆ(! పోతే పోయాడు\" అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది. \"అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 82,
        "IMAGE": "cat_1",
        "NAME": "జ్ఞానోదయం 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 82,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు. \"నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు\" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.\n\nఅవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, \"చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?\" అని అడిగింది. \"ఛీ. అస్సలు తినలేను\" అన్నాడు మనవడు. \"మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?\" అని నానమ్మ అడగ్గా \"లేదు\" అని జవాబిచ్చాడు మనవడు. \"కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. \"అమ్మో! నావల్ల కాదు\" చెప్పాడు మనవడు. \"మరి ఉప్పు\" అని అడిగిన నానమ్మను \"లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?\" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.\n\n\"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.\n\nమనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకూ ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి\" అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 83,
        "IMAGE": "cat_1",
        "NAME": "జీవిత సత్యం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 83,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. చిరంజీవి చెప్పిన పని సవ్యముగానే పూర్తి చేసేవాడు. నెలరోజులు పూర్తి కావటానికి ఒకరోజే మిగిలింది. వినాయకరావుకి ఏంచెయ్యాలో ఎలా చెప్పి జీతం తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడు.\n\nఆ రోజున అక్కడికి ధనవంతులు వచ్చారు. వచ్చిన వాళ్ళు బాగానే కొనుగోలు చేశారు. ఆ ఆనందములో వినాయకరావు చిరంజీవితో అందరికీ డ్రింక్ తీసుకురా అన్నాడు. యజమాని మాట ప్రకారము అందరికీ డ్రింక్‌లు తెచ్చి ఇచ్చాడు. అందరూ త్రాగివెళ్ళారు. ఇంకా రెండు డ్రింక్‌లు ఉన్నాయి. ఈ రెండు డ్రింక్‌లు ఎవరికి? నిన్ను డ్రింక్‌లు తెమ్మన్నానుకానీ వాళ్ళకి ఇవ్వమన్నానా అంటూ నీకు ఈ నెల జీతం ఇవ్వను అన్నాడు వినాయకరావు. ఇంతలో వెనక్కి వెళ్ళిన ధనవంతులు రావటం ఆ సంభాషణ వినడం వలన చిరంజీవి నెల జీతం తాము ఇస్తామనిచెప్పి, అతని వద్ద కొనుగోలు చేసిన కొన్ని వస్తువులు బాగాలేవని చెప్పి తిరిగి ఇచ్చివేశారు. వినాయకరావు గురించి ఆ ధనవంతులు అందరివద్దా చెప్పటం వల్ల అతని వ్యాపారము పూర్తిగా దెబ్బతినింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 84,
        "IMAGE": "cat_1",
        "NAME": "జీతము ఇవ్వని యజమాని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 84,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు.\n\nఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న కోతి పల్లె కారులు వలలు విసరడం చూసింది. పల్లెకారులు వలలను విసురుతూ వుంటే, చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ళ మీద పడుతూ వుండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది. తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది. చెట్టు దిగి, అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్ళకే చుట్టుకుంది. వలను విసరడం చేతకాక కాళ్ళకు చుట్టుకొన్న వలను తీసుకోవడానికి ప్రయత్నిచడంవలన, ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది. ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొని పోయింది. కాళ్ళు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది. ఇంతలో పల్లె కారులు అక్కడకి వచ్చారు. కోతి అవస్థ చూసి, జాలి కలిగి మెల్లిగా వలను వూడదీశారు.\n\nఅంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసి పోయి, ఆ పక్కనే వాలిపోయింది! పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు \"ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు, పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు\" పిచ్చికోతి మనషులు చేసినట్లు చేయబోయి, వలలో చిక్కుకుంది. ఇలాంటి వాటినే 'కోతిచేష్టలు' అంటారు, అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 85,
        "IMAGE": "cat_1",
        "NAME": "చేతకాని పని హాని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 85,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.\n\nసాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.\n\nఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నగం పన్నింది.\n\nవంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, \"అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు\" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచి తనంతో మెలిగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 86,
        "IMAGE": "cat_1",
        "NAME": "చెరపకురా... చెడేవు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 86,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి నీటిలో సరిగా ఈదలేని తేలు నదిని దాటాలన్న తన ముచ్చటను తీర్చుకోవాలనుకుని ఒక తాబేలు దగ్గరకు వచ్చి \"నేను నీ వీపు మీద ఎక్కుతాను. నన్ను నది దాటిస్తావా?\" అని అడిగింది. బదులుగా తాబేలు, \"నేను నది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీ కొండితో కుట్టావంటే నేను మునిగిపోతాను కదా!\" తన సందేహం వెలిబుచ్చింది.\n\n\"మిత్రమా! నేను నిన్ను కుడితే నీవు మునిగిపోతావు. నీతో పాటు నేను కూడా మునిగిపోతాను కదా! మరి నిన్ను నేనెందుకు కుడతాను\" అని తాబేలు సందేహం నివృత్తి చేసింది తేలు. \"అవును. నువ్వన్నదీ నిజమే! సరే ఎక్కు\" అని తేలును తన వీపు మీద ఎక్కించుకుంది తాబేలు.\n\nదర్జాగా తాబేలు వీపుపైకెక్కిన తేలు, నది మధ్యభాగంలో ఉండగా తాబేలును తన పదునైనకొండితో కరవడంతో నొప్పికి విలవిల్లాడిన తాబేలు నది మట్టానికి చేరుకుంది. దానితోపాటే తేలు కుడా నది మట్టానికి చేరువైంది.\n\nఆ సమయంలో తాబేలు... తేలును \"నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కుట్టవని చెప్పావు కదా! మరి ఎందుకు కుట్టావు?\" అని అడిగింది. \"నేను ఎవరినైనా కుట్టే సమయంలో నేనేం చేస్తానో నాకే తెలియకుండా జరిగిపోతుంది. అది నా స్వాభావిక లక్షణం. దానికి నేనేమీ చేయలేను.\" చెప్పింది తేలు మునిగిపోతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 87,
        "IMAGE": "cat_1",
        "NAME": "చెడుస్నేహం - 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 87,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కొన్ని కాకులు అదే పనిగా పంటచేలలో పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఒక పావురం చాలా రోజులుగా తిండి లేక బాధపడుతూ ఉంది. తన యజమానేమో తనకు ఆహరం పెట్టడం లేదు కాని కాకులు మాత్రం చాలా స్వతంత్రంగా ధాన్యాన్ని దోచుకుంటున్నాయని పావురం అనుకుంటూ ఉంది.\n\nఒక రోజు పావురం కాకుల నాయకుడిని అడిగింది ప్రతి రోజు మీకు చాలా ఆహరం లభిస్తుంది కదా! నన్ను కూడా మీగుంపులోకి చేర్చుకోండి. నేను కూడా మీతో పాటే ఎగరగలను, మీతో పాటే పొలంలో ధాన్యం తింటాను అందుకు కాకులన్నీ సరే అన్నాయి. ఆ రోజు నుండి కాకులన్నీ పావురాన్ని తమతో తీసుకునివెళ్తూ కలిసి ధాన్యాన్ని తింటున్నాయి. అలా కొంతకాలం హయిగా గడిచిపోయింది. పావురం తన యజమానిని పూర్తిగా మరిచిపోయింది.\n\nఒక రోజున రోజులాగే కాకులన్నీ పొలంలో ధాన్యం కొల్లగొట్టి తినడానికి నిర్ణయించుకున్నాయి. అన్నీ కలసి ఎగిరి పొలంలో గుంపులుగా వాలాయి. కాని, పాపం ఒక్క కాకి కూడా మళ్ళీ పైకి ఎగరలేక చతికిలబడిపోయాయి. పొలం యజమాని తన పొలం మీద ఒక వలను పరిచాడు. అతను పరిచిన వలలో కాకులన్నీ ఇరుక్కుపోయాయి. వాటితో పాటే పావురమూ ఆ వలలో చిక్కి రైతుకు ఆ రాత్రి భోజనమయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 88,
        "IMAGE": "cat_1",
        "NAME": "చెడుస్నేహం - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 88,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.\n\nఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!\" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. \"ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు,\" అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.\n\nవిక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది.\n\nచనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 89,
        "IMAGE": "cat_1",
        "NAME": "చీమ - రాజు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 89,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది.\n\nకండ చీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండ చీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి, గుంపుగా!ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్క సారిగా తినెయ్యవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది.\n\nకలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయం భయంగా చూస్తూ వున్న చీమలకు ధైర్యం వచ్చి, కండ చీమ చుట్టూ చేరాయి. కండ చీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి!\n\n'మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకొంటున్న తొండను దిగమింగింది పాము' అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ! తన ఎత్తు ఫలించినందుకు ఎంతో ఆనందించింది. అందుకే \"ఉపాయం వుంటే అపాయం తప్పించు కోవచ్చును\" అంటారు పెద్దలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 90,
        "IMAGE": "cat_1",
        "NAME": "చీమ యుక్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 90,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది ఎండ మండుతున్న వేసవి కాలం. వేడి వాతావరణం. శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ ఆసహనానికి గురి చేసింది. ఆస్ధాన పూజారి మరింత అసహనంతో \"ప్రభూ! ఉద్యానవనంలో తెల్లవారు ఝామున ఉండే స్వచ్చమైన గాలి ఎంత చల్లగా, మధురంగా ఉంటుంది. ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా?\" అని అడిగాడు రాయలవారిని.\n\n\"ఆహా! చలా మంచి ఉపాయం. ఎవరైనా తోటలోని స్వచ్చమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే, వారికి ఐదు వందల వరహాలు బహుమతిగా ఇస్తాను\" అని ప్రకటించాడు రాజు. ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా మొఖాలు వేలాడేసుకున్నారు. రాజుగారికి, ఆస్ధాన పూజారికి పిచ్చి పట్టిందని లోలోపల నవ్వుకున్నారు.\n\nమరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని, కానీ అది అసాధ్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే రామలింగడు లేచి \"రాజా! మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్చమైన, సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకొచ్చాను\" అన్నాడు \"అవునా? ఏది?\" అని ఆతృతగా, సంతోషంగా అడిగాడు రాజు.\n\nరామలింగడు సైగ చేసి, నలుగురు సైనికులను పిలిచాడు. వారు నేరుగా రాజు గారి పక్కకు వెళ్ళి నిలుచున్నారు. వారి చేతిలో పచ్చి వెదురు బొంగులతో, తయారు చేసిన విసనకర్రలు, గులాబి, మల్లెపూవులతొఈ అలంకరింపబడి ఉన్నాయి. ఆ విసనకర్రలు అతారు పూయబడి, నీటిలో తడపబడి ఉన్నాయి.\n\nరామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనుకులు రాజుగారికి విసరటం మొదలెట్టారు. దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది.\n\nఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది. \"తెనాలిరామా! నీ తెలివి అమోఘం, నీ మేధస్సు అమోఘం అంటూ కాస్సేపు రామలింగడిని పొగిడిన రాజు \"నీవు నా కోరికను నెరవేర్చావు. నీకు ఐదు వందల వరహాల బదులుగా పదిహేను వందల వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను\" అంటూ సభను ముగించారు రాయలవారు. రామలింగడి తెలివిని సభికులంతaాచప్పట్లతో మెచ్చుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 91,
        "IMAGE": "cat_1",
        "NAME": "చల్లటి ఎండాకాలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 91,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో ధర్మయ్యకున్న గొప్ప పేరును చూసి రంగయ్య అసూయపడేవాడు. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన ధర్మయ్యకే అప్పగించారు. అది చూసి ఓర్వలేని రంగయ్య మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు. ధర్మయ్య గుడి తాళాలను పెట్టెలో పెట్టి భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.\n\nఒక రోజు ధర్మయ్య భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి రంగయ్య ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు ధర్మయ్య వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్ద భీమన్న ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు ధర్మయ్య, రంగయ్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద భీమన్న, ధర్మయ్యా! తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. ధర్మయ్య గ్రామ పెద్ద వంక చూసి \"అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు\" అని బదులిచ్చాడు. \"ఈ ధర్మయ్య మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని రంగయ్య చెప్పాడు.\n\nగ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలుగలేదు. ధర్మయ్య నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ధర్మయ్య ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను భీమన్నకు అందజేసారు. భీమన్న ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే \"రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు భీమన్న \"రంగయ్య నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన ధర్మయ్యపై నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను\" అన్నాడు. అప్పుడు ధర్మయ్య రంగయ్యను క్షమించి వదిలివేయమని గ్రామపెద్దను వేడుకున్నాడు. భీమన్న ధర్మయ్య మాట కాదనలేక రంగయ్యను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే ధర్మయ్య గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. రంగయ్య, ధర్మయ్య చేతులుపట్టుకొని \"అసూయతో చేసిన నేరానికి క్షమించమని\" అడిగాడు. ధర్మయ్య \"ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడు. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 92,
        "IMAGE": "cat_1",
        "NAME": "గొప్ప గుణం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 92,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక గడ్డి మైదానంలో రెండు కోడిపుంజులు నివాసముండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి.\n\nరెండు పుంజులూ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధనికి సన్నద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. పోరు మొదలైంది. ఆ రెండు పుంజులలో ఒకటి అత్యంత బలమైనది. కాగా మరోటి కొంత బలహీనమైనది.\n\nకొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది.\n\nఅంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. \"చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజునుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి\" అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలనీ, ఓటమిపాలైన పుంజు అవమానపడాలనీ గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తలవంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.\n\nఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేక పోయిందా కోడిపుంజు. ఇంకేముంది గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది. ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 93,
        "IMAGE": "cat_1",
        "NAME": "గెలుపు గర్వం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 93,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మోగటంతో వారంతా బడిలోకి గబగబ అడుగులు వేయసాగారు. గదుల నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటాడోనని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నాం చివరి పీరియడ్ \"నీతిబోధన\" తరగతికి తెలుగు మాష్టారు వచ్చారు. మాష్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాష్టారు చెప్పబోయే కథకోసం పిల్లలెంతో ఆత్రుతతో ఎదురు చూడసాగారు. కానీ మాష్టారు తాను చెప్పిన నీతికథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు.\n\nతెలుగు మాష్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాష్టారు చెప్పిన కథలు వినడం వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలోని వివిధ సందర్భాలలో ఎలా అన్వయించుకోవాలో తెలియక, బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాష్టారు వేసిన ప్రశ్నకు బిక్కముఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతికథలు బాలల ఆలోచనల్లో ఏ మాత్రం కదలిక తేలేకపోయినందుకు మాష్టారు బాధపడ్డారు. మాష్టారి మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు, తాను ఆచరించిన పనులను మాష్టారి ముందుంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడంలేదోనని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే, మాష్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాష్టారికి చెప్పి అతడి వేదన పోగొట్టాలని తలచిన సూరిబాబు \"మాష్టారూ! నేను చెబుతా!\" అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాషార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారని కబురు రావడంతో మాష్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాష్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంత సేపటికి లాంగ్‌బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు.\n\nమరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ కొత్త వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్దాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాష్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాష్టారి నీతికథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా, అందరూ ఆ విధ్యార్థి ఎవరో? అని ఎదురు చూడసాగారు. తెలుగు మష్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తమ తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండటం, ఏమి జరుగుతుందో ఏమీ అర్థంకాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడిరోడ్డుపై అడ్డంగా వెళుతున్న ఓ అంధ వృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమేకాక అతణ్ణి వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసర్ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.\n\nవిద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వవనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబుని మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. \"తాను ఆచరించడమే కాక, నీతికథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొదిస్తున్న మా తెలుగు మాష్టారే నాకు ఆదర్శం\" అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ, గురువుని మించిన శిష్యుడని అభివర్ణించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 94,
        "IMAGE": "cat_1",
        "NAME": "గురువును మించిన శిష్యుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 94,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక గురువుగారు, ఆయనకిద్దరు శిష్యులు. శిష్యులు స్వతహాగా మంచివారే కానీ కొంచెం అమాయకులు, మరి కొంచెం తెలివితక్కువ వారు. ఒకడి పేరు రామ, మరోకడి పేరు సుధామ. వారి ప్రవర్తన గురువుకు అప్పుడప్పుడు చాలా తలనొప్పిగా తయారయ్యేది. అయినా సరే ఆయన వాటన్నింటిని సహిస్తూ వారికి కొంతైనా విద్య ఒంటబట్టాలనే ఉద్దేశ్యంతో తన దగ్గరే ఉంచుకున్నాడు.\n\nఒకరోజు గురువుకి కాస్త ఒంట్లో నలతగా ఉండి కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. శిష్యులను పిలిచి, \"రామా, సుధామా! నాకు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి. మీరిద్దరు నా కాళ్ళు నొక్కాలి నేను కొంచెంసేపు నిద్రపోతాను.\" అన్నాడు.\n\nగురువుగారికి సేవ చేసే అవకాశం రావడంతో శిష్యులకు చాలా సంతోషం కలిగింది. \"తప్పకుండా గురువుగారు!\" ఎంతో ఉత్సాహంగా అన్నారు.\n\nరామ, సుధామ గురువు చెరో కాలు తమ ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో కాళ్ళు నొక్కసాగారు. కొంచెంసేపు తరువాత నిద్రలో గురువు రెండు కాళ్ళు దగ్గరకు తీసుకోవడంతో రామ ఒత్తుతున్న కాలు సుధామ దగ్గరున్న కాలికి తగిలింది.\n\"ఏయ్‌ రామా, నీ కాలును దూరంగా ఉంచు. లేకపోతే బాగోదు.\" అన్నాడు సుధామ కోపంగా.\n\"పోవోయ్‌, నీదేమైనా గొప్పకాలా? ఛండాలమైన కాలు. నువ్వే నీ కాలును దూరంగా ఉంచుకో\" అని జవాబిచ్చాడు రామ.\n\nసుధామ ఇంకోమాటన్నాడు. దానికి రామ ఇంకోలా జవాబిచ్చాడు. ఈ విధంగా వాదన కాస్త పోట్లాటలోకి మారిపోయింది. ఒకడు కాలిని నరికేస్తానంటే మరొకడు నిప్పుతో తగలెడతానని అన్నాడు. అంతే రామ కోపంగా వంటింటి వైపు పరిగెత్తి మండుతున్న కట్టెను తీసుకుని వచ్చాడు. సుధామ బయటకు పరిగెత్తి గొడ్డలి పట్టుకుని వచ్చాడు.\n\nఈ గందరగోళానికి గురువుకు మెలుకవ వచ్చి చూస్తే ఏముంది? ఆయన్ని తగలబెట్టడానికి, నరకడానికి ఇద్దరు శిష్యులు యమదూతల్లా నిలబడి ఉన్నారు.\n\"ఒరేయ్‌ నాయనల్లారా ఏమిటిరా ఇది!\" కంగారుగా పైకి లేచాడు గురువు. జరిగింది తెలుసుకుని ఇద్దరిని బాగా చివాట్లు వేసాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 95,
        "IMAGE": "cat_1",
        "NAME": "గురువుగారి సేవ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 95,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ముల్లా నస్రుద్దీన్‌ తన పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి. చాలామంది తాము కూడా నస్రూలా చతురత, మేధాశక్తి కలిగివుండాలని కోరుకునేవారు. ఒకరోజు కొందరు విద్యార్ధులు నస్రును కలిసి ఇలా అడిగారు, \"గురువుగారూ! మేము మీ గురించి చాలా విన్నాం. మీకు ప్రతి ప్రశ్నకూ జవాబు తెలుసని అంతా అనుకుంటారు. మీ చతురత, మేధాశక్తిలో మేము కొంతభాగం సంపాదించుకోగలిగినా చాలు, మమ్మల్ని మీ శిష్యులుగా అంగీకరించండి.\"\n\nమొదట నస్రు తిరస్కరించాడు. అతనికి చాలా సిగ్గు, అతనొక గురువుగా ఉండటానికి ఇష్టపడలేదు. కాని విద్యార్ధులు ప్రాద్ధేయపడడంవల్ల అతను ఒప్పుకోక తప్పలేదు. నస్రు విద్యార్ధులతో \"సరే! నేను మిమ్మల్ని నా శిష్యులుగా అంగీకరిస్తున్నాను, కాని కొన్ని రోజుల వరకే. మీరు ఏమి చేస్తున్నారో చూసి కొన్నిసార్లు ప్రజలు నవ్వుతారు, కాని ప్రతీ పని వెనుక ఒక కచ్చితమైన ఉద్దేశ్యం వుంటుంది.\" అని చెప్పడంతో విద్యార్ధులు సంతోషించారు.\nవారిలో ఒక విద్యార్ధి ఇలా అన్నాడు, \"ముల్లాగారూ! ప్రజలు మీలా గొప్ప శక్తులను పొందాలని కోరుకుంటారు. మీరేమైనా శక్తులను పొందారా?\n\nనస్రు నవ్వుతూ, \"హా! అవును! నేను చీకటిలో కూడా చూడగలిగే శక్తిని సంపాదించాను\", అన్నాడు. విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. మరో విద్యార్ధి \"గురువుగారూ! మీరు చీకటిలో లాంతరు పట్టుకుని నడవడం నేను చూశాను. మీకు చీకటిలో కనిపించినట్లైతే మీరు అలా ఎందుకు చేస్తారు?\" అన్నాడు\n\n. నస్రు నవ్వుతూ, \"ఆహ్‌ ఎందుకంటే ఇతరులు చీకట్లో చూడలేరు కదా! లాంతరు నన్ను ఇతరులు ఢీకొట్టకుండా కాపాడుతుంది\" అని చెప్పాడు.\n\nవిద్యార్ధులు నవ్వుతూ నస్రు మేథోశక్తి, చతురతను పొగిడారు. కొంత సమయం తర్వాత నస్రు విద్యార్ధులతో \"పదండి మిత్రులారా! ఇంటికి వెళ్ళిపోదాం. మీకు ఇంటికెళ్ళడానికి గుర్రాలున్నాయా?\" అని ప్రశ్నించాడు.\nవిద్యార్ధులు, \"లేవు గురువుగారూ!\" అని బదులిచ్చారు.\nదాంతో నస్రు గుర్రం మీదకు ఎక్కి మెల్లగా స్వారీచేస్తుండగా, విద్యార్ధులు నడుస్తూ అతన్ని అనుసరించారు.\nకానీ నస్రు తన గుర్రం మీద తల వెనుకకు, వీపు ముందుకు చేసి కూర్చోవడంతో విద్యార్ధులంతా ఆశ్చర్యపోయారు. వీధుల్లో వెళ్తున్న ప్రజలు నస్రును చూసి పగలబడి నవ్వడం మొదలెట్టారు.\n\nఒక విద్యార్ధి ఉండబట్టలేక కుతూహలంతో \"గురువుగారూ! మీరు గుర్రంపై ఎందుకిలా వెనుదిరిగి కూర్చున్నారో కాస్త చెప్తారా? ప్రజలంతా మనల్ని చూసి నవ్వుతున్నారు\", అని అడిగాడు. నస్రు, \"కూర్చోవడంవల్ల మీకు ఒక పాఠం అబ్బుతుంది. మీరు ఇతరుల పరిహాసాన్ని పరిగణలోకి తీసుకోరాదు మిత్రులారా!\" అని బదులిచ్చాడు.\n\nతర్వాత అతనిలా అన్నాడు. \"నేను వెనుదిరిగి ఎందుకు కూర్చున్నానంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను కాబట్టి. మీరు నా ముందు నడుస్తూ, నేను మిమ్మల్ని అనుసరిస్తే అది నాకు అగౌరవం. అదే నేను ముందు వెళ్తూ, మీరు నన్ను అనుసరిస్తే అది మీకు అమర్యాద. వెనుదిరిగి స్వారీచెయడమే మనందరికీ గౌరవప్రదమైన పద్ధతి\". అది విన్న విద్యార్ధులు చప్పట్లు చరుస్తూ. తమ కొత్త గురువు నస్రుతో నవ్వుతూ ప్రయాణం కొనసాగించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 96,
        "IMAGE": "cat_1",
        "NAME": "గురువా! మజాకా! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 96,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు, రెండు మెడలు ఉన్నాయి. కాని ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా దానికొక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, \"ఆహా! ఎంత రుచిగల పండు. ఎన్నో పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు తినలేదు\" అనసాగింది మొదటినోరు.\n\n\"నాక్కుడా సగం ఫలం ఇవ్వవా? నేను కూడా రుచి చూస్తాను\" అని రెండోనోరు. \"నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదాపోయేది\" అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటినోరు. ఎలాగైనా మొదటినోటికి గుణపాఠం చెప్పాలనుకున్నది రెండోనోరు.\n\nఆ రోజు నుండి మొదటినోటితో మాట్లాడటం మానేసింది రెండోనోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండోనోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పు ఫలం కనబడింది.\n\n\"అది విషపుఫలం. నీవు దానిని తింటే నువ్వు, నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా!\" అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తిన వద్దని వారించసాగింది.\n\nవిషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండోనోరు మొదటినోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటినోరు అనుకుంటున్న తరుణంలో, \"చుశావా? నేనీ విషఫలం తింటే నువ్వు, నేను ఇద్దరం చచ్చే వాళ్లం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్నా మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యతగా ఉంటే సమస్యలే రావు\" చెప్పింది రెండోనోరు.\nఅవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటినోరు ఆ రోజు నుండి రెండోనోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 97,
        "IMAGE": "cat_1",
        "NAME": "గుణపాఠం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 97,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.\n\nఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు \"ఎవరు, ఎవరక్కడా?\" అని అరిచింది.\n\nరాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, \" నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా\" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది.\n\"నేను పిల్లిని\" అని జవాబిచ్చింది పిల్లి.\n\"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను\" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి \"గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే\" అని ప్రాధేయపడింది.\n\"మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?\" అని రాబందు పిల్లిని నిలదీసింది.\n\n\"నీవు ఎంతో బుద్ధి, తెలివితేటలు గలవాడివని విని, నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. కాని నీవు ఈ బక్క పిల్లిని చంపాలనుకుంటున్నావు. \"నన్ను అతిధిలా ఆదరించాలి\" అని చెప్పింది పిల్లి. పిల్లి మాటలకు రాబందు \"కాని నువ్వు మాంసాహారివి. నిన్ను నేనెలా నమ్మగలను?\" అంది. బదులుగా పిల్లి \"నేను జీవహింస చేయడం పాపమని తెలుసుకుని శాకాహారిలా మారిపోయాను\" అని చెప్పింది. గుడ్డి రాబందు పిల్లిని నమ్మింది. చెట్టుపైన ఉన్న తన గూట్లో ఉండనిచ్చింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి, జిత్తులమారి పిల్లి పక్షి కూనలను ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా తినడం మొదలు పెట్టింది. గుడ్డి రాబందుకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.\n\nకాని పక్షులు మాత్రం తమ పక్షి కూనలు కనబడకపోతుండడం గమనించాయి. ఎప్పుడైతే తన పని ముగిసిందో, పిల్లి మెల్లగా్ జారుకుంది. కొన్ని రొజుల తర్వాత, పక్షులు తమ పక్షి కూనల ఎముకలను గుడ్డి రాబందు గూటిలో కనిపెట్టాయి.\n\n\"ఈ గుడ్డి రాబందు మన పిల్లల్ని తినేసింది\" అనుకుని, పక్షులన్నీ కలిసి ఆ గుడ్డి రాబందును పొడిచి చంపేశాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 98,
        "IMAGE": "cat_1",
        "NAME": "గుడ్డి రాబందు - జిత్తులమారి పిల్లి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 98,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద, కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా, దిట్టంగా ఉండేది. రెండు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి,తినాలని అనుకుంది.\n\nసరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి, గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని \"కొక్కొరోకో....కొక్కొరో\" మని అరవసాగింది. కోడి పుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని, తనను తాను మృగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది.\n\nసింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకేఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించి బ్రేవుమంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 99,
        "IMAGE": "cat_1",
        "NAME": "గాడిద గర్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 99,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.\n\n\"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి వుంటుంది!నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి, అరుస్తుందని నాకు భయం వేసింది. పరుగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. కౄరమృగమో, దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్తిమితం కలగదు\" అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టింది సింహం...! నక్కకు విషయం అంతా అర్ధమైయింది. ఆ అరుపులు, ఇది వరకు ఎన్నోసార్లు విన్నది నక్క! అందుచేత దానికి భయం కల్గలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకు వచ్చింది. బిగ్గరగా అరవమంది, ఆ అరుపులు, విని శత్రుమృగం బైటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క . సింహం, కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లి పోయేలా అరుపులు మీద అరుపులుగా అరిచింది.\n\nవెంటనే, అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి, ఓ బోదురుకప్ప గభాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక్క దూకు దూకింది. అసలే భయంతో వున్న సింహం, మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చచ్చింది.\n'హమ్మయ్య' అనుకొంటూ సింహం చతికిలపడి కూర్చుంటే నక్క అన్నది.\n\n'ఏవో అరుపులు విని, ఎవరో శత్రువులు అనుకొని గాబరా పడ్డావు గాని, కప్ప అల్పమైన జంతువు; దాని గొంతు మాత్రం పెద్దది! కర్ణ కఠోరంగా అరుస్తుంది... బలం లేని వాడు ఇలాగే అరుస్తాడు' అందుకే \"బూకరింపులు బలహీనుని ఆయుధాలు\" అంటారు పెద్దలు! అని హితవు చెప్పింది నక్క!\nతన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 100,
        "IMAGE": "cat_1",
        "NAME": "గాండ్రించిన కప్ప",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 100,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు పక్షులు, పెద్ద జంతువులు తమ మధ్య ఆధిపత్యం కోసం యుద్దం చేయాలని భావించాయి. పక్షిలా ఎగరగలిగే లక్షణమున్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు, జంతువుల రెండింటి లక్షణం ఉండడం వలన అది ఏ గ్రూపులోనూ చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమవైపు రావలసిందిగా కోరినా... \"నేను జంతువును\" అని గర్వంగా చెప్పుకుంది. తరువాత కొన్ని జంతువులు దానిని తమవైపు రావల్సిందిగా కోరగా \"నేను పక్షిని\" అని వాటితో చెప్పింది.\n\nకొన్ని రోజుల తరువాత యుద్దం ఆగిపోయి శాంతియుత వాతవరణం ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం వెళ్ళి పక్షులతో కలిసుండాలని వాటి వద్దకు వెళ్తే అవి దానిని తిరస్కరించాయి. తరువాత అది జంతువులతో జతకూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి అవమానం ఎదురైంది. అప్పటి నుండి గబ్బిలం చిన్న చిన్న పాడుబడ్డ బొయ్యారాలలో నివసిస్తూ, రాత్రి అయ్యే వరకు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 101,
        "IMAGE": "cat_1",
        "NAME": "గతిలేని గబ్బిలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 101,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో గంగ, మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న రెండు గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన ఎనిమిది గేదెలతో, పాలు అమ్ముకుని బతుకుతూ ఉంది.\n\nఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాళిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా? అని ఆలోచించిన గంగ ఒకనాడు, \"మంగక్కా! నువ్వు నా దగ్గర ఆరు నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు, చుట్టాలొచ్చ్హారు కాస్త ఆ నెయ్యి బాకీ తీరుస్తావా?\" అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి \"నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? ఎనిమిది గేదెలున్న నేనెక్కడ, ముష్టి రెండు గేదెలతో బతుకీడుస్తున్న నువ్వెక్కడ?\" అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజలా రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది.\n\nమరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ \"అయ్యా! ఇదేమి న్యాయం? ఎనిమిది గేదెలున్న నేను రెండు గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం\" అని విరుచుకుపడింది.\n\nమంగ మాటలను గమనించిన న్యాయాధి కారి ఆమె మాటలలో ఉన్న కపటబుద్దిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు.\n\nఆ రోజు తన న్యాయస్ధానం ముందు దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగ మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చ్హారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్ళు ఇచ్చ్హారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి మూడు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో \"ఏమ్మా! మూడు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేక పోయావు. గంగ మాత్రం సగం చెంబెడు నీటితో శుభ్రం చేసుకుంది. ఎనిమిది గేదెలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయటం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకు ఇవ్వవలసిన కిలో నెయ్యితో బాటు మరో నాలుగు కిలోల నెయ్యి కలిపి మొత్తం ఐదు కిలోల నెయ్యి ఇచ్చేయి. లేకపోతే నీకు కఠినశిక్ష వేస్తాను\" అన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 102,
        "IMAGE": "cat_1",
        "NAME": "గంగ మంగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 102,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక దొంగ... విలాసాలకు సరిపడేంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో దొరికినంత దోచుకుందామని ఒక సత్రంలో తలదాచుకున్నాడు. రెండు రోజులు గడిచినా తన పాచిక పారక పోవడంతో నిరాశచెంది, ఏదో ఆలోచిస్తూ గది బయటకొచ్చి నిలబడ్డాడు. ఎంతో ఖరీదైన కొత్త కోటు వేసుకున్న సత్రం యజమాని తన గది ముందు కుర్చీలో కూర్చొని ఉండటం గమనించిన దొంగ మెల్లగా వెళ్లి అతనితో మాటలు కలిపాడు.\n\nవారి ముచ్చట్లు మంచి ఊపుమీదుండగా దొంగ అత్యంత భయంకరంగా, అచ్చం తోడేలులా ఆవలించాడు. అదివిన్న యజమానికి ఒళ్లు జలదరించి \"ఎందుకింత భయంకరంగా ఆవలిస్తావు?\" అని అడిగాడు. \"అది ఒక పెద్ద కధ. మీరు నమ్మినా, నమ్మలేకపోయినా చెప్పడం నా కర్తవ్యం. నేను ఇలా ఎప్పుడైతే మూడోసారి ఆవలిస్తానో, అప్పుడు నేను తోడేలులా మారిపోయి మనుషుల మీద దాడి చేస్తాను. ఇది గతజన్మలో నేను చేసిన పాపాల ఫలితం. అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకోవాలి. లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసి తోడేలులా మారిపోతాను\" అని నమ్మబలికాడు దొంగ. ఇదంతా చెబుతూనే రెండోసారి కూడా ఆవలించాడు.\n\nఅది విన్న సత్రం యజమాని అక్కడి నుండి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా, \"అయ్యా! ఎక్కడికెళ్తున్నారు. నన్ను పట్టుకోండి. లేదంటే నేను నా దుస్తులు చింపుకుని తోడేలులా మారిపోతాను.\" అంటు అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొంగ చేతిలో నుంచి తప్పించుకోవాలని చుశాడు సత్రం యజమాని. సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకుని తప్పించుకుని కాళ్లకు బుద్ధిచెప్పాడు. కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది. దొంగ తన పంటపండిందనుకుని కోటుతో ఉడాయించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 103,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఖరీదైన కోటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 103,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం.\n\nపూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందునున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.\n\nఅది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది.\n\nఅందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.\nపాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 104,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోతులు - పాలపిట్ట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 104,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు కొందరు నావికులు సముద్రయాత్రకు బయలుదేరారు. వారు తమతోపాటు తమ పెంపుడు కోతిని వెంటబెట్టుకుని యాత్రను మొదలెట్టారు. వారు సముద్రం మధ్యలో ఉండగా ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన ధాటికి అందరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కోతి కూడా తాను మునిగిపోయానని అనుకునే సమయంలో ఒక డాల్ఫిన్‌ వచ్చి కోతిని తన వీపుపై ఎక్కించుకుంది.\n\nకోతి, డాల్ఫిన్‌ ఇద్దరూ సురక్షితంగా ఒక దీవికి చేరుకున్నారు. కోతి... డాల్ఫిన్‌ వీపు మీది నుండి దిగి ఒడ్డుపై కూర్చుంది. డాల్ఫిన్‌... కోతితో, \"మిత్రమా! నీకు ఈ ప్రదేశం తెలుసునా?\" అని అడిగింది. అపాయం నుంచి గట్టెక్కి సురక్షితంగా ఉన్నానని రూఢీ చేసుకున్న కోతి, \"ఈ ప్రదేశం నాకు తెలియకపోవడం ఏమిటి? ఈ దీవిని పరిపాలించే రాజు నాకు మంచి స్నేహితుడు. నీకోక విషయం తెలుసో లేదో! నేను ఒక రాజకుమారుడిని.\"\n\nకోతి వ్యర్ధప్రెలాపనలు పేలుతోంది. ఆ దీవిలో ఒక్క జీవికూడా నివసించదని తెలిసిన డాల్ఫిన్‌కు చిర్రెత్తుకొచ్చినా సమ్యమనంతో, \"ఓహో! నువ్వు రాజకుమారుడివి. కాని ఇప్పటి నుంచి నువ్వు రాజువన్నమాట!\" అంది. కోతికి డాల్ఫిన్‌ మాటలు అర్ధంకాక \"నేను రాజునెలా అవుతాను?\" అని అడిగింది డాల్ఫిన్‌ను. ఒడ్డు నుంచి కోతికి అందకుండా దూరంగా వెళ్లిన డాల్ఫిన్‌. \"చాలా సులభం. ఈ దీవిలో ఉన్న జీవివి నువ్వొక్కడివే కాబట్టి నీవే ఈ దీవికి రాజువు\" అని సమాధానమిచ్చి కోతిని ఆ దీవిలోనే వదిలి వెళ్లిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 105,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోతిగొప్పలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 105,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక బిచ్చగాడుండేవాడు. దొరికినదేదో తిని, ఏ అరుగు మీదనో నిద్రపోయేవాడు. ఖరీదైన కోరికలు లేనందున వాడికి సుఖాల మీదికి మనసు పోలేదు. ఒకసారి వాడికి, ఓ గొప్పదాత ఐదు దీనారాలు బహుమతిగా ఇవ్వగా దాంతో ఒక కోతిని కొన్నాడు. అది ఆడిస్తూ బతికితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని బిచ్చగాడి ఊహ. ఓ రాత్రి వేళ కోతి ఒక యువకుడిగా మారిపోయింది. అతడు బిచ్చగాణ్ణి పేరుపెట్టి పిలిచి, ఒక బంగారు నాణెం ఇచ్చి ఇద్దరికీ భోజనం తెమ్మన్నాడు. నువ్వు ఏ శాపం వల్ల ఇలా అయ్యావని అడగబోయాడు బిచ్చగాడు. అదంతా అనవసరం వెళ్ళి చెప్పింది చెయ్యమన్నాడు. ఆకలిగా ఉన్న బిచ్చగాడు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ యువకుడే, ఓ డబ్బుసంచి సృష్టించి నగరం మధ్యలో ఒక గొప్ప మేడ కిరాయికి కుదిర్చేలా చూశాడు. ఇప్పుడు భాగ్యవంతుడి దర్పాన్ని, ఠీవిని బిచ్చగాడికి నేర్పాడు. రాజకుమార్తెతో నీకు పెళ్ళి చేయిస్తాను అనగానే నమ్మలేక విచిత్రంగా చూశాడు బిచ్చగాడు. అప్పటికే అతనికి యువకుడి మీద చాలా కృతజ్ఞతగా ఉంది. యువకుడు ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు.\n\nఅతడి సలహా మేరకు ఆ దేశపు రాజుగార్ని కలిసి, వజ్రాలను బహుకరించి, కూతుర్ని ఇమ్మన్నాడు. రాజు తన న్యాయాధికారితో ఆలోచించి వివాహానికి సమ్మతించాడు. ఇంత మేలు చేసినందుకు తనకు తిరిగి ఏదైనా ఉపకారం చెయ్యమన్నాడు యువకుడు. ప్రాణాలైనా ఇస్తానన్నాడు బిచ్చగాడు. నీభార్య చేతికున్న తావీజు కావాలి అన్నాడు యువకుడు. అది తీసుకెళ్ళి ఇచ్చాడు బిచ్చగాడు. అంతే! అతడికి అంతవరకూ వచ్చిన సంపదా, రాజకుమారీ అన్నీ మాయం. బిచ్చగాడి బతుకు మరల మొదటికి వచ్చింది. ఒకరోజు జ్యోతిష్కుని సంప్రదించాడు. అతడు పైశాచీ భాషలో ఓ రేకుమీద ఏదో రాసి, ఎడారిలోకి వెళ్ళమన్నాడు. బిచ్చగాడు అలాగే వెళ్ళాడు. అక్కడ ఒక చోట కేవలం మనుషుల్లేకుండా కాగడాలు నడుస్తూ, ఓ పల్లకీ గాల్లో తేలుతూ కనిపించింది. జ్యోతిష్కుడు తనకిచ్చిన కాగితాన్ని పల్లకీలోని వ్యక్తికి చూపించాడు బిచ్చగాడు. అతడికి విషయం అర్థమైది. వెంటనే బిచ్చగాణ్ణి మోసం చేసిన కోతి యువకుణ్ణి మంత్ర శక్తులతో పిలిపించి విచారించాడు. తావీజుని ఆ యువకుడు వెంటనే మింగేసి, నాయకుడి ఆగ్రహానికి గురైనాడు. అతడు తన అరచెయ్యి బాగా సాచి, తన ఆజ్ఞ ధిక్కరించిన కోతి యువకుని పాతాళానికి అణగతొక్కేశాడు. తావీజు తిరిగి బిచ్చగాడి వశమైంది. అసలు మహిమంతా తావీజులోనే ఉంది. అది చేతికి రాగానే బిచ్చగాడి పరిస్థితి మళ్ళీ మారిపోయింది. భాగ్యం, సంపదా, రాజకుమార్తె అన్నీ అతడికి దక్కాయి. ఆ తరువాత అతడెప్పుడూ ఆమె చేతి నుంచి తావీజును తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇంకెప్పుడూ కోతుల గురించి ఆలోచించలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 106,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోతి - యువకుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 106,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పిల్లలు శృతిమించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అనటం కద్దు. ఈ కోతి చేష్టలు ఎవరికీ ఉపయోగపడవు సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదమో ఈ కధలో ఓ కోతి పాత్ర ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం 'అరిదుర్గ' అనే పట్టణంలో శుభదత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్దికాలంలోనే ఆ పట్టణము మొత్తంలోకే ఏకైక ధనవంతుడు అయ్యాడు. శుభదత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సంపాదించిన ఆస్తిని అనుభవించటానికి సంతానం లేదు. ఒక రాత్రి శుభదత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివరున్న రామాలయాన్ని బాగుచేయిస్తే శుభదత్తుడికి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.\n\nమర్నాడు శుభదత్తుడు ఆ రామాలయం బాగు చేయించటానికి కొంతమంది పనివాళ్ళను నియమించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయిన దూలాల స్ధానంలో కొత్త దూలాలని అమర్చటానికి పనివాళ్ళు మంచిజాతి టేకు దుంగలని ఆ దేవాలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రంపంతో కొయ్యటం మొదలు పెట్టారు. దేవాలయంలోని చెట్ల మీదున్న కోతులు దుంగను రంపంతో కోస్తున్నప్పుడు వచ్చే వింతశబ్దం విని 'ఇదేదో భలే బాగుంది' అనుకున్నాయి. మధ్యాహ్నం అయింది. పని వాళ్ళందరూ భోజనములకు బయలుదేరారు. అప్పటివరకు రంపంతో నిలువుగా కోసిన దుంగ కలిసిపోకుండా మధ్యలో ఓ మేకును అడ్డంగా కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. పనివాళ్ళు భోజనానికి వెళ్ళగానే చెట్ల మీద కోతులు క్రిందకు దిగాయి. అక్కడే ఉన్న రంపం అందుకుని పనివాళ్ళు కోసినట్లుగా దుంగను కొయ్యాలని ప్రయత్నాలను మొదలు పెట్టాయి. దుంగ మధ్యలో పనివాళ్ళు కొట్టిన మేకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ఏం చెయ్యాలా...? అని బుర్రలు గోక్కున్నాయి. ఒక కోతి ఆ మేకును అడ్డం తీసేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులన్నిటకీ నచ్చింది. ఆ కోతుల గుంపులో బలమైన కోతి మందుకు వచ్చి ఆ మేకును తను లాగుతానంది. మిగతా కోతులు దానికి జయ జయ ధ్వానాలు చేశాయి. ఆ కోతి ఓ సారి మిగతా కోతుల వంక గర్వంగా చూసి చీలి ఉన్న దూలం మధ్యల కూర్చుని రెండు చేతులతో మేకుని పట్టుకుని పైకి లాగింది. మరుక్షణం రెండుగా చీలి ఉన్న దూలం దగ్గరకు అతుక్కు పోయింది. మధ్యలో కూర్చున్న కోతి దెబ్బకి చచ్చిపోయింది.\n' అందుకే ! పనికి మాలిన పనులు ఎప్పుడు ప్రాణాంతకం' అని ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 107,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోతి - దూలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 107,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి ఎన్నో పచ్చటి, పొడవైన పైన్‌ చెట్లతో నిండి ఉండేది. వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా, దట్టంగా తయారయింది.\n\nఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి పైన్‌ చెట్టు పైన గూడు కట్టుకుంది. అది ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్బుతమైన స్వరగానాలతో అడవినంతా హాయిగాఉంచేది.\n\nఆకురాలే కాలం రానే వచ్చింది. పైన్‌ చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒక రోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి, మంచి పుష్పాలు విరబూసి, ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.\n\nఅద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండటం చూసిన పైన్‌ చెట్టు, కోకిలతో \"సోదరీ! ఎక్కడికెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కన్పించినంతమాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా\" అని అంది.\n\nబదులుగా కోకిల, \"లేదు, లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను\" అంది.\n\nపైన్‌ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధకంటే, కోకిల వెళ్ళిపోయిందన్న బాధతోనే పైన్‌చెట్టు మరింత కుంగిపోయింది. అతి చిన్నదైన కోకిల, చాలా పెద్దదైన పైన్‌చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 108,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోకిల స్వార్ధం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 108,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విజయేంద్రవర్మ ఆదర్శవంతుడైన రాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు పేదలందరికీ దానధర్మాలు చేసేవాడు. తన రాజ్యంలో భూమిలేని రైతులకు కొంత భుమినిచ్చి సాగుచేసుకోమనేవాడు. తద్వారా రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రాజు భావించేవాడు.\n\nఅలా భూమిని పొందిన చంద్రన్న అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టనిపించింది. అక్కడ తవ్వి చుడగా ఒక బంగారు రోలు, రోకలి దొరికాయి. ఆ రైతు నిజాయితీ గలవాడు. అందుకే ఆ రోలు, రోకలి భూమి యజమాని అయిన రాజుకే చెందాలనుకున్నాడు. అయితే రోలును రాజుకి బహుకరించి, రోకలిని తన కష్టానికి ప్రతిఫలంగా తనవద్దే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ రైతుకు ఒక కుతురు ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె తండ్రితో \"మీరు రోలు మాత్రమే ఇస్తే రాజు రోకలి ఏదని అడుగుతారు. కాబట్టి రోలు, రోకలి రెండూ ఆయనకు బహుకరించండి\" అని చెప్పింది.\n\nకూతురి సలహాను పెడచెవిన పెట్టి చంద్రన్న రోలు మాత్రం తీసుకెళ్ళి రాజుకు బహుకరించాడు. రోలును చుసిన రాజా విజయేంద్రవర్మ రోకలి ఏదని చంద్రన్నను ప్రశ్నించాడు. చంద్రన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో రాజు అతడిని చెరసాలలో బంధించమని సైనికులను ఆదేశించాడు. సైనికులు అతడిని చెరసాలకు తీసుకువెళ్తుండగా, \"నా కూతురి సలహా విని ఉంటే నాకీ దుస్ధితి పట్టేది కాదు కదా!\" అని అతను ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. రాజు చంద్రన్నను వివరాలనడగగా కూతురి గురించి చెప్పాడు. చంద్రన్న కూతురిని తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు రాజు. ఆమె రాజసభలోకి ప్రవేశించి జరిగినదంతా వివరించింది. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడైన రాజు ఆమెను తన మంత్రిగా నియమించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 109,
        "IMAGE": "cat_1",
        "NAME": "కూతురి సలహా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 109,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం.\n\nఊరి పక్క నున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది.\n\nఎప్పటికైన సరేబయటకు రాకుండాపోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది. 'ప్రతి రోజు కుందేలు ఆహారం కోసం ఉండలేదు. కచ్చితంగా బయటకు రావాల్సిందే! అప్పుడు దాన్ని పట్టుకుని తినచ్చు .\n\nఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది గాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు. ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి, కావు కావు మని అరవడం మొదలు పెట్టింది.\nఅంతే! ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేపచెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్ధంకాలేదు.\n\nకాకి తోటికాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్ని ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచి పెట్టాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపు రానేలేదు.\n\nనక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియనుండి ఇవతలకు వచ్చింది. \"నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ణతలు మిత్రమా!\" కాకి చేసిన సాయానికి కృతజ్నలు చెప్పింది కుందేలు.\nరెండూ కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 110,
        "IMAGE": "cat_1",
        "NAME": "కాపాడిన స్నేహం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 110,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.\n\nనమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.\n\nభూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.\n\nరమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.\n\nఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.\n\"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?\" అడిగాడు రామయ్య .\n\"రాదు. ఏం?\"\n\"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది\" చెప్పాడు రామయ్య.\n\"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా...\" అంది వసుధ.\n\"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి\" వెంటనే అందుకున్నాడు వంశీ.\n\nరామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.\nరామయ్యను పిలిచి, \"టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?\" అని అడిగాడు రాహుల్.\n\"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?\" అడిగాడు రామయ్య.\n\"అవును. అవే...ఎక్కడ పెట్టావు?\" ఆతృతగా అడిగాడు రాహుల్.\n\"అవి పనికిరాని కాగితాలు అనుకొని...\"\n\"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు\" కోపంగా అన్నాడు రాహుల్.\n\"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను\" భయం భయంగా చెప్పాడు రామయ్య.\n\n\"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?\" ఆవేశంగా అన్నాడు రాహుల్.\n\nరామయ్య దిగాలుగా ముఖం పెట్టి. \"అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి\" అన్నాడు.\n\n\"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు\" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.\n\nవిషయాన్ని గ్రహించి, \"ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది\" అంటూ సర్ధిచెప్పింది.\nరామయ్యవైపు తిరిగి, \"రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో\" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.\nమర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.\n\"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ\" అంది రమ్య.\nరామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 111,
        "IMAGE": "cat_1",
        "NAME": "కాగితం పడవలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 111,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి, బాగా రద్దీగా ఉండే దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో వెళ్లేవాళ్లందరూ దానిని దాటి వెళ్ళే ప్రయత్నం చెసేవారు. కానీ ఎవరూ ఆ రాయిని తొలగించే ప్రయత్నం మాత్రం చెసేవాళ్లు కాదు.\n\nరాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్ళేవారే తప్ప, ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ఒక రైతు, పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి, ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించ గలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది.\n\nరాయిని దొర్లించి వెన్నక్కి తిరుగుతుంటే, రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే, అందులో కొన్ని బంగారు నాణాలూ, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో - \"అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించినవారికి ఈ బంగారం\" అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ, తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు.\n\nఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రితో -\"చూశారా మంత్రిగారూ, అందరూ అడ్దంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గానీ, ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాల్లాంటివి\" అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 112,
        "IMAGE": "cat_1",
        "NAME": "కష్టే ఫలి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 112,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "\"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో\" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య.\n\nతను పదేళ్లుగా స్వీట్ షాప్ నడుపుతున్నాడు. వంటలకు వాడే సరుకుల నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేవాడు కాదు. కాబట్టే ఇన్నేళ్లల్లో కొత్త దుకాణాలు ఎన్ని వెలిసినా రాఘవయ్య స్వీట్ షాప్‌లో రద్దీ తగ్గలేదు. అలాంటిది ఇవాళ మిత్రుడు సీతారామయ్య అన్న మాటలు రాఘవయ్యను ఆలోచనలో పడేశాయి. మొదట వంటవాళ్ల పనితనం మీద అనుమానమొచ్చింది. కానీ అదంతా తన భ్రమ అని కొద్దిరోజుల్లోనే రూఢీ అయ్యింది. మరి సరుకు విషయంలో ఏమైనా లోపముందా? గత పదేళ్లుగా ఒకే దుకాణంలో సరుకులు కొంటున్నాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా తేడా రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తుందంటే నమ్మబుద్ధికాలేదు.\n\nఈ మధ్య తమకు సరఫరా అవుతున్న నెయ్యి కాస్త తేడాగా అనిపిస్తోందని భార్య సుభద్ర రెండు, మూడుసార్లు అంది. తానే పెద్దగా పట్టించుకోలేదు. ' ఒకవేళ నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుతోందా?' అని రాఘవయ్యకు అనుమానమొచ్చింది.\n\nఅసలు కల్తీ జరిగిందో? లేదో? ఎవరికి తెలుసు? జరిగితే దుకాణం యజమాని రంగారావును గద్దించవచ్చు. లేకపోతే....అనవసరంగా అనుమానించినట్లవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అని ఆలోచించసాగాడు రాఘవయ్య అదే విషయం మాటల సందర్భంలో పెద్ద మనవడు శ్రీధర్‌తో చెప్పాడు.\n\nపదవ తరగతి పాసైన శ్రీధర్‌కి సైన్స్ అంటే మహా ఇష్టం. ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినా తప్పకుండా వెళతాడు. అలా ఓ ఎగ్జిబిషన్‌లో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీని గుర్తించడమెలాగో వివరించారు. అక్కడ చూపించిన పదార్ధాల్లో నెయ్యి కూడా ఉంది. 'చిన్న ప్రయోగం చేసి చూస్తే కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది' కదా అనుకున్నాడు శ్రీధర్. తన దగ్గర వున్న కొన్ని రసాయనాలను తీసుకొచ్చాడు.\n\nమనవణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న రాఘవయ్యతో, \"తాతయ్యా! ఇది బయట కొన్న నెయ్యి, ఈ గిన్నెలోది మన ఇంట్లో వెన్న కరగబెట్టిన నెయ్యి ఇవేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్. ఈ రెండింటితోనే ఏది స్వచ్ఛమైన నెయ్యో తెలిసిపోతుంది\" అన్నాడు శ్రీధర్.\n\"అదెలా?!\" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య.\n\n\"ముందు మన ఇంట్లో కాచిన నెయ్యితో ప్రయోగం చేద్దాం. ఎంత నెయ్యి వుందో అంతే పరిమాణంలో మొదట హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్ ద్రావణాన్ని దీనికి చేర్చాలి. కాసేపట్లో నెయ్యి రంగు మారితే నకిలీది. లేకపోతే స్వచ్ఛమైనది\" అన్నాడు శ్రీధర్. రెండు గిన్నెల్లోనూ ద్రావణాలు కలిపాడు. ఇంట్లో చేసిన నెయ్యిలో ఏ మార్పూలేదు. కానీ బయట కొన్న నెయ్యి గులాబీ రంగులోకి మారింది.\n\n\"చూశారుగా తాతయ్యా! మనం బయట కొన్న నెయ్యిలో డాల్డా కలిసింది. అందువల్లే నెయ్యి రంగు మారింది. ఇన్నాళ్లూ ఆ దుకాణం యజమాని మనల్ని మోసం చేశాడు\" ఒకింత ఆవేశంగా అన్నాడు శ్రీధర్. రాఘవయ్యకు అసలు విషయం అర్ధమైంది.\n\nమర్నాడు శ్రీధర్‌ని తీసుకొని రంగారావు దుకాణానికి వెళ్లాడు. వీళ్ల మాటలు విన్న రంగారావు మొదట దబాయించాడు. కానీ ప్రయోగాత్మకంగా నిరూపించిన మీదట తన తప్పు ఒప్పుకున్నాడు. ఇకమీదట నిజాయితీగా వ్యాపారం చేస్తానని, ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాడు.\n\n\"రంగారావ్! ఏ వ్యాపారానికైనా నమ్మకమే పునాది. దాన్ని పోగొట్టుకుంటే నష్టాలపాలయ్యేది నువ్వే. ఇకమీదట ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నలుగుర్నీ పిలిచి నీ గుట్టు రట్టు చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఊళ్లోనే కాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా దుకాణం నడపలేవు\" అని తీవ్రంగా మందలించాడు రాఘవయ్య. చిన్న ప్రయోగం ద్వారా పెద్ద మేలు చేసిన శ్రీధర్‌ను మెచ్చుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 113,
        "IMAGE": "cat_1",
        "NAME": "కల్తీ నెయ్యి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 113,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ నాలుగు ఆవులు కలిసే వెళ్ళేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ నాలుగు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి.\n\nఅంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. \"ఆహా! ఈరోజు నాకువిందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను\" అని సింహం అనుకుంది.\n\nసింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి. కానీ అవి ఏమాత్రం భయపడలేదు. \"చూడండి సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరుభయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమికొడదాం\" అని చెప్పింది ఆ నాలుగు ఆవులలో ఒక ఆవు. \"నీఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దం\" అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి.\n\nఅంతే సింహం తమ మీద దూకేలోపునే నాలుగు ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే సింహంవాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి.\n\nఅయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ నాలుగు ఆవులను విడి విడిగా కలిసింది.\n\nఆ రోజు మీరంతా కలిసి నామీద పోట్లాడినప్పుడు \"నీ కొమ్ముల వాడితనం ఉందే అబ్బో నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని నేనునీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా మూడు నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది\" అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది.\n\nఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో నాలుగు ఆవులు మిగతావాటి కన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదైయింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ నాలుగు ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్ళడంలేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముంది అదునుచూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది.\n\nచూశారా! ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలూ వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 114,
        "IMAGE": "cat_1",
        "NAME": "కలిసి ఉంటే కలదు సుఖం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 114,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రంగాపురం గ్రామం లో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు.\n\nపట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడం లో మొదటివాడు దిట్ట. రెండో వాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలను అమ్మగల సమర్ధుడు. ఇక మూడో వాడు లాభనష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది.\n\nముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.\n\n'నావల్లే వ్యాపారం పెద్దదైంది' అని ఒకరంటే 'కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు.. ఇలా ముగ్గురు కొడుకులూ వాదులాడుకోవటం ప్రారంభించారు.\n\nఈ పరిస్ధితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకీ పంచేశాడు.ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు, కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బందిపడ్డాడు.\n\nరెండో వాడికి పట్టణం వెళ్ళి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడు సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా కష్టంగానే తోచింది.\n\nకొద్దిరోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పులపాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు వచ్చారు. 'చూశారుగా ఏంజరిగిందో. ముగ్గురూ కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా వుండేది. విడిపోయి ఎవరికివారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండీ' అన్నాడు చలపతి.\nతమవల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములూ మళ్ళీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 115,
        "IMAGE": "cat_1",
        "NAME": "కలిసి ఉంటే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 115,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మంచివాడేకానీ, పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి, ముగ్గుర్నీ పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు. ఇంకోటి పడమరకేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు. మూడో ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవానిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేలమీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది కనిపించింది. గదిలోపలి నుండి కప్పల రాజును నేను. కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది. మూడో వాడు లోపలికి వెళ్ళి చూస్తే, ఒక పెద్దకప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని వున్నాయి.\n\nకప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టి తెండి! అది నా మహిమల దుట్టి! అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకువచ్చాయి. కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు మూడో వాడు తెచ్చిన బంగారు శాలువా చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు రెండో పరీక్ష. ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి. అంటూ మూడు ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే, మూడోవాడు మళ్ళీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్ప రాజు పెట్టెలోంచి వజ్రపుటుంగరం తీసి ఇచ్చాడు.\n\nఈ సారి కూడా రాజు మూడో వాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి. అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈ సారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కూతురైన ఈ ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేదిలేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి, మూడోవాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది? అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.\n\nరాజు మళ్ళీ 'శభాష్' అని మూడో వాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళుకదా? తండ్రి మీదకే కత్తులు దూసి 'ఇక మేమే రాజులం. మీరంతా రాజ్యం విడిచి పొండి' అన్నారు. అప్పుడో చిత్రం జరిగింది. పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి, పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్దకొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 116,
        "IMAGE": "cat_1",
        "NAME": "కప్పరాజు సాయం...కష్టాలన్నీ మాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 116,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది.\n\n\"అయ్యో నా అందమైన బంతి\", అంటూ ఏడ్చిందా యువరాణి. \"ఏమయింది యువరాణి?\" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది.\n\"నా బంతి బావిలో పడిపోయింది\" ఏడుస్తూ చెప్పింది యువరాణి.\n\"ఏడవకు\", అంది కప్ప. \"నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?\" అని అడిగింది. \"నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?\" అని అడిగింది యువరాణి.\n\n\"అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను\". అంది కప్ప. \"సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను\", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.\n\nఅంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. \"ఆగు, ఆగు\", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.\n\nమరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.\n\"ఏమయింది, తల్లీ?\" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి.\n\"ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు\" అన్నాడు రాజు.\n\nయువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. \"నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి\" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.\n\n\"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది\". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.\n\nఅది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 117,
        "IMAGE": "cat_1",
        "NAME": "కప్ప రాకుమారుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 117,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.\n\nవనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.\n\nఅప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.\n\nబాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.\n\nకొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 118,
        "IMAGE": "cat_1",
        "NAME": "కనువిప్పు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 118,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.\n\nఅతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.\n\nవాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 119,
        "IMAGE": "cat_1",
        "NAME": "కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 119,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక ఒంటికన్ను దుప్పి ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని గడ్డివైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు అని అనుకునేది ఆ దుప్పి.\n\nకాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. దుప్పిని చూసిన వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ దుప్పి అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది.\n\n'నేను గడ్డి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం అన్ని వైపుల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి' అని అనుకుంది.\nఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలు పెట్టింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 120,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఒంటికన్ను దుప్పి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 120,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.\n\nనలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. \"ఐకమత్యమేబలం\" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 121,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఐకమత్యమే బలం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 121,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.\n\nయువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.\n\nసైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.\n\nఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 122,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఏడుమల్లెల రాకుమారి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 122,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.\n\nఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.\n\nరాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.\n\nరాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 123,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఏడు కూజాల కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 123,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. పిల్లనచ్చిందన్నారు. కట్నం అక్కరలేదన్నారు. కాని పెళ్ళి గుళ్ళో చెయాలని ఇంటిలోని వారు అన్నారు. ఏ గుడిలో చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం కలగలేదు. పరంధామయ్యగారి పెద్దల్లుడు వేంకటేశ్వర స్వామి గుడి అని, పరంధామయ్య హనుమంతుడి గుడి అని, రెండవ అల్లుడు రామాలయం అని, మూడవ అల్లుడు ఆది దేవుడైన వినాయకుని గుడి అని రకరకాలుగా చెప్పసాగారు.\n\nవీళ్ళ మాటలకి పెళ్ళి కూతురు ఏం చెప్తే ఎలా వుంటుందోనని ఆలోచించి 'పెళ్ళి ముహూర్తము పెట్టే జ్యోతిష్కుణ్ణే అడగండి. ఏ గుళ్ళో చేయమంటారో తెలుసుకోండి. ఆయన ఇష్ట ప్రకారము చేయండి' అని చెప్పింది. జ్యోతిష్కుడు అందరి అభిప్రాయాలు తెలుసుకొని పెళ్ళి ఏ గుడిలోను జరగడం అంతమంచిదికాదు. వేంకటేశ్వరునికి ఇద్దరు భార్యలు. హనుమంతుడు బ్రహ్మచారి. వినాయకుడు బ్రహ్మచారి అనీ, కొందరు ఇద్దరు భార్యలు కలరని అంటారు. ఇహపోతే శ్రీరాముడు అన్ని విధాల యోగ్యుడే అయినా అతన్ని వివాహమాడిన సీతాదేవి ఎన్ని ఇబ్బందులు పడిందో మనకు తెలుసుకదా. నిక్షేపంగా ఆలోచించకుండా మీ స్వగృహములోనే వివాహము చేయండి. ఇంకేమీ ఆలోచించకండి. అనగానే వారు అంగీకరించి పెళ్ళి ఇంటివద్దనే చేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 124,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఏ గుళ్ళో పెళ్ళి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 124,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు అదృష్టానికి, తెలివితేటలకు మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రెండూ వాదించుకున్నాయి. వారిరువురూ వారివారి వాదనలను ప్రొయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు.\n\nఅదృష్టం తన సామర్ధ్యాన్ని నిరూపించడానికి ఒక పేదరైతును ఎంచుకుంది. అతని గోధుమ పంటని ముత్యాలుగా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా గులకరాళ్ళుగా మారిపోయాయని చింతించింది. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దు:ఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. ముత్యాలపంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న మంత్రితో \"ఇతనెవరో కానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను\" అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనడంతో \"నీ పంటనంతా రాజమహల్‌కు తీసుకురా. నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్ళి జరిపిస్తాను\" అని రైతుతో అన్నాడు రాజు.\n\nరాజు మాటకు రైతు ఎగిరిగంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్ధులు అతడిని ఆట పట్టించారు.\n\nరైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య (రాకుమార్తె) నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్ళికూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం కధ గుర్తుకు వచ్చింది. రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు.\n\nరాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుతీసి అతన్ని కాపాడి, తీసుకువచ్చారు. రాజు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు.\nవిజ్ణానం అదృష్టంతో ఇలా అంది. \"చూసావా, నీవు ఆ పేదరైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేను అతడిని కాపాడతాను\".\n\nవిజ్ణానం రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు. \"రాజా! ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను. పెళ్ళి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్ళికూతురికి అశుభసూచకం కదా అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే\".\nఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 125,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎవరు గొప్ప - 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 125,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది.\n\nమొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. \"నేను మీ అందరికీ రాజును. మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్మలను నడిపిస్తున్నాను. నేని లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు\" అంది. మనస్సు చెప్పిన దానికి కోపంతో ఉద్రేకించిపోయి కన్ను\" నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళూ, చేతులూ తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు\" అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. \"నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు. నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు ఏంచేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని\" అంది. వెంటనే ముక్కు లేచింది. \"నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నావల్లే జరుగుతూంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీఅందరికంటే గొప్పదానిని\" అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవడం ప్రారంభించింది. \"అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి తెలీనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని\" అంది.\n\n\"ఇలా మనలో ప్రతివారూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకూ పనికిరానివారని అనుకుంటున్నాం. ఈ తగవు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం ఒక సంవత్సరంపాటు ఒకరి తరువాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు, క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడతారు. ఈ తీర్పుకు అన్నీ ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు ఒక సంవత్సరంపాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానికా అంగం తమ పనులు చేసుకుంటున్నాయి. మనసు ఆశ్చర్యం వెలుబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ \"ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం. మాకు ఏ విచారమూ లేదు\" అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అదికూడా తిరిగివచ్చి వివిధాంగాలు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయల్దేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలూ చెప్పాడు. శరీరం అంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తికాకుండానే తిరిగివచ్చింది. తరువాత ముక్కు బయల్దేరింది. ముక్కుకి దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తరువాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూసీచూట్టంతోనే తిరిగివచ్చేసింది.\n\nఅన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది, \"ఇప్పుడైనా గ్రహిస్తారా నేనే గొప్పదాన్నని?\" అని ఋజువు చేయడానికి శరీరం నుంచి బయటకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. కొంచెం కదిలిందో లేదో శరీరావయవాలన్నీ చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి, నాలుక బైటికొచ్చేసింది, శరీరం మొద్దుబారసాగింది. దాంతో అవయవాలన్నీ \"ఓ ఆత్మా, మమ్మల్ని క్షమించు. నువ్వుమాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు\" అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ \"మనలో ఏ ఒక్కరు లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనం అందరం పొందికగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా, సుఖంగా ఉంటుంది. రండి. మనం అందరం చేదోడువాదోడుగా సంఘీభావంతో కలసి మన పనులు చేసుకుందాం\" అనడంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యలతోపాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీదే ఆధారపడి ఉంటాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 126,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎవరు గొప్ప - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 126,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "\"మన నగరంలో ఎంతమంది గుడ్డివారున్నారు\" అని ఒకరోజు అక్బరు దర్బారులో ప్రశ్నించాడు. ఎవరు జవాబు చెప్పలేకపోయారు. అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. ఏదో ఒక సమాధానం బీర్బల్ కు చెప్పక తప్పుతుందా!\n\n\"ప్రభూ చాలమంది గుడ్డి వారు ఉంటారు. ఇప్పుడిప్పుడే లెక్క చెప్పమంటే వీలు కాదు. మీరు నాకు ఒకరోజు సమయం ఇస్తే జాబితా తయారు చేసి ఇవ్వగలను.\" అని చెప్పాడు బీర్బల్. అందుకు అక్బర్ ఒప్పుకున్నాడు.\n\nఆ మరునాడు బీర్బల్ చక్రవర్తి కోటకు దగ్గరలో జనసంచారం ఎక్కువగా ఉన్నచోట చిన్న చొప్పుల దుకాణం పెట్టి అందులో ఒక చొప్పుల జత కుడుతూ కూర్చున్నాడు. కొద్ది దూరంలో బీర్బల్ నియమించిన పనివారు కాగితం, కలం పట్టుకుని నిలబడి ఉన్నారు.\n\"ఆయన చేస్తున్న పనిని చూసి చాలామంది బీర్బల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?\" అని అడగసాగారు. అలా అడిగిన వారి పేర్లను బీర్బల్ సేవకులు కాగితంలో వ్రాసుకుంటున్నారు.\n\nసాయంకాలం చక్రవర్తి విహారానికి బయలుదేరాడు. బీర్బల్ కూర్చున్న చోటు వైపు వచ్చారు. బీర్బల్ ను చూసి అక్బర్ కూడా అందరిలాగే అదే ప్రశ్న వేశాడు. \"చెప్పులు కుడుతున్నాను ప్రభూ\" అని బీర్బల్ సమాధానం చెప్తుండగానే, సేవకులు రాస్తున్న జాబితాలో అక్బర్ చక్రవర్తి పేరు కూడా చేరింది .\nమరునాడు బీర్బల్ దర్బారులో చక్రవర్తికి.\nగుడ్డి వారి జాబితాను సమర్పించాడు. ఆ జాబితా తీసుకుని ఆసక్తిగా పరీశీలించాడు చక్రవర్తి. అందులో చివరన తన పేరు చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి బీర్బల్? ఇందులో నా పేరు కూడా ఉంది. నేను గుడ్డివాడినా?\" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బరు.\n\nబీర్బల్ చేతులు జోడించి \"ప్రభువులవారు నన్ను మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండి కూడా గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతోంది అయినా 'ఏం చేస్తున్నారని'? అందరూ నన్ను ప్రశ్నించారు. చివరకు ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వారు గుడ్డివారే కదా ప్రభూ!\" అన్నాడు బీర్బల్.\nతను అడిగిన ప్రశ్నకు జవాబు మరొక కోణంలో సరదాగా చూపించిన బీర్బల్ యుక్తికి ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బరు చక్రవర్తి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 127,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎవరు గుడ్డి?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 127,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.\n\nఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.\n\nదానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.\nఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.\n\nపక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.\n\nతరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 128,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎప్పుడో చదువుకున్న చందమామ కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 128,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో రామనాథం అనే భూస్వామి ఉండేవాడు. అతను తరచుగా తనకున్న లెక్కలేనంత పొలాన్ని చూస్తూ పొంగిపోతూ ఉండేవాడు. పంటను అమ్మగా వచ్చిన డబ్బులో ఒక్క రూపాయిని కూడా దానధర్మాలకు కేటాయించేవాడు కాదు. కనీసం కూలిపని చేసేవారికయినా సరిగా కూలీ కూడా ఇచ్చేవాడు కాదు.\n\nరామనాథం పొలానికి పక్కనే శివయ్య అనే వ్యక్తి పొలం కూడా ఉండేది. శివయ్య రామనాథం లాగా కాకుండా, తన పొలంలో పనిచేసే కూలీలకు తగినంత డబ్బు ఇవ్వటమేగాకుండా, తన లాభాలలో కొంత భాగాన్ని పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. ఇంకా మిగిలినట్లయితే దానధర్మాలకు కేటాయించేవాడు.\n\nఒకరోజు రామనాథం, శివయ్యలిద్దరూ పొలంగట్టుపైన నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. \"హమ్మయ్య ఈ ఏడు దేవుడు చల్లగా చూడబట్టి, పంటలు బాగా పండి అందరం సుఖంగా ఉంటున్నాం కదండీ..?\" అన్నాడు శివయ్య రామనాథంతో. దానికి బదులుగా రామనాథం మాట్లాడుతూ... \"ఎంత డబ్బు ఇస్తే ఏం సుఖం శివయ్యా.. ఉన్న డబ్బునంతా దానధర్మాలంటూ వృధా చేయడమే తప్పిస్తే, ఒక్క రూపాయన్నా దాచిపెడుతున్నావా..?\" అని దెప్పిపొడిచాడు.\n\n\"నాకు సరిపోయేంత డబ్బును ఉంచుకుని మిగిలిన డబ్బును మాత్రమే నేను దాన ధర్మాలకు పంచుతున్నాను. దాంట్లో నాకు ఎలాంటి కష్టమూ లేదండీ..\" అని చెప్పాడు శివయ్య. \"అన్నట్టు.. చెప్పడం మరచిపోయాను.. ఈ రోజు రాత్రి మన ఊర్లో అందరికంటే సంపన్నుడైన ఓ వ్యక్తి చనిపోతాడని నిన్న రాత్రి నాకో కల వచ్చిందండి\" అన్నాడు శివయ్య.\n\nశివయ్య మాటలను కొట్టిపారేసిన రామనాథం... \"ఆ.. కలలు నిజమవుతాయా. ఏంటి..?\" అని పట్టించుకోలేదు. కాసేపటికి ఇద్దరూ ఎవరి దారినవాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు. శివయ్య చెప్పిన మాటలను కొట్టిపడేశాడేగానీ, రామనాథానికి మనసులో మాత్రం కాస్తంత దిగులుగానే ఉంది. ఊరిలో తానే ధనవంతుడన్న విషయం అతనికి పదే పదే గుర్తుకొచ్చేది.\n\nఇక లాభం లేదనుకుని వైద్యుణ్ణి పిలిపించాడు రామనాథం. ఆయన్ని పరిశీలించిన వైద్యుడు... \"మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రాణానికి ఎలాంటి హానీ లేదని\" చెప్పాడు. అయినా కూడా రామనాథం మనసు ప్రశాంతంగా లేదు. శివయ్య మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని దిగులు చెందాడు. భయం వేయడంతో వైద్యుడిని తనతోపాటే ఉండిపోమని చెప్పాడు. రాత్రంతా రామనాథం జాగారం చేయక తప్పలేదు.\n\nతెల్లవారగానే ఒక పనివాడు పరుగెత్తుకుంటూ వచ్చి... \"అయ్యా... శివయ్యగారు రాత్రి నిద్రలోనే చనిపోయారట..!\" అని ఏడుస్తూ చెప్పాడు. ఏనాడూ కూడా డబ్బులకు ఆశపడని ఆ మహానుభావుడు ఎలాంటి కష్టం లేకుండా, చాలా సుఖంగా నిద్రలోనే చనిపోవడం ఆయన చేసుకున్న పుణ్యమేనని అన్నాడు రామనాథం పక్కనే ఉన్న వైద్యుడు.\n\n\"సంపన్నుడు అంటే... డబ్బులు ఎక్కువగా ఉండేవాడు కాదు.. గొప్ప గుణం కలిగినవాడే నిజమైన సంపన్నుడు\" అని తల్లి చెప్పిన మాటలు లీలగా గుర్తుకు రాసాగాయి రామనాథానికి. అంతే... ఆరోజు నుంచి తన ప్రవర్తనను మార్చుకున్న అతడు తనకున్న సంపదనుంచి వచ్చిన డబ్బుతో నలుగురికీ సాయం చేయడం మొదలుపెట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 129,
        "IMAGE": "cat_1",
        "NAME": "ధనం కంటే గుణమే గొప్ప ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 129,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు.\n\nవ్యాపారి \"నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి\" అనుకున్నాడు.\n\nకనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. \"నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా\" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. \"ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!\" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం \"స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు\" అన్నాడు.\n\nఅతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, \"ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు\" అని ఉత్సాహపరిచాడు.\n\nఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు.\n\nఅక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 130,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎడారి విచిత్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 130,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.\n\nఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.\n\nఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 131,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఊరికోసం బావి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 131,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కోసంగిపురం అనే ఊరి పరిసరాలలో ఒక నల్లత్రాచు ఉండేది. ఎంతోమంది దాని కాటుకు బలై ప్రాణాలు విడిచారు.\nపాము భయంతో చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఊరును వదిలి వెళ్ళిపోయారు. నల్లత్రాచువల్ల ఆ ఊరిలో అభద్రతాభావం పెరిగిపోయింది.\nఒకరోజు ఒక సాధువు కోసంగిపురం వచ్చాడు. ప్రజలలో ఉన్న నల్లత్రాచు భయాన్ని తెలుసుకుని జాలిపడ్డాడు. వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.\n\nసాధువు పామును వెతుకుతూ దాని పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే పాము... కోపంగా బుసకొడుతూ పుట్ట నుండి బయటకు వచ్చింది. కాటువేయడానికి పడగ ఎత్తిన పాము ఆ సాధువు కళ్ళలో కనిపిస్తున్న మహిమకు చప్పున పడగ దించేసుకుని చలనం లేనట్టు నిలబడిపోయింది.\n'నిష్కారణంగా మానవులను చంపడం పద్ధతి కాదని, దానివల్ల అది చాలా పాపం మూట కట్టుకుంటోదని...' బోధించాడు.\nసాధువు చెప్పిన మాటలతో పాములో చాలా మార్పు వచ్చింది. 'ఇకముందు ఎవ్వరినీ కాటువేయననీ ఆయనకు మాటిచ్చింది పాము.\n\nఇక పాముతో భయం లేదని ఆ ఊరి ప్రజలతో చెప్పి అక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాడు సాధువు. నెల తర్వాత తిరిగి సాధువు ఆ ఊరికి రావడం జరిగింది. ఊరిలోకి అడుగుపెట్టగానే ఆయనకి ఒక దారుణమైన దృశ్యం కనబడింది. ఒకప్పుడు అందరిని భయపెట్టి నిద్రలేకుండా చేసిన నల్లత్రాచుని యువకులు రాళ్ళతో కొడుతుంటే... ఆ పాము నిశ్శబ్దంగా ఆ దెబ్బలను భరిస్తోంది.\nసాధువు వాళ్ళని వారించి ఇళ్ళకు పంపేసాడు.\n\nగాయాలతో రక్తసిక్తమైన నల్లత్రాచు సాధువు వైపు దీనంగా చూస్తూ... \"స్వామీ... ఎవరినీ ఇబ్బంది పెట్టరాదని మీరు చెప్పారు. ఆ రోజు నుండి మీ ఆజ్ణను పాలిస్తూ వచ్చాను. కాటువేయడం మానేసాను. మనుషుల జోలికి వెళ్ళకుండా కప్పలను... చిన్న చిన్న పక్షులను భుజిస్తూ నా మానాన నేను బతుకుతున్నాను. కాని ఎప్పుడైతే నావల్ల ప్రమాదం లేదని తెలిసిందో... అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. నిష్కారణంగా నా దగ్గరకు వచ్చి నా మీద రాళ్ళు విసురుతున్నారు. మీరే చెప్పండయ్యా ఒకప్పటి నా మార్గం సరైనదే కదా?\".\n\nసాధువు ప్రేమగా దానివైపు చూస్తూ... \"మనుషులను కాటు వేసినప్పుడు నీది సరైన మార్గం కాదు. అలాని వాళ్ళ హింసను నిశ్శబ్దంగా భరించే ఈ మార్గం కుడా సరైనది కాదు. నిన్ను కాటు వేయకూడదని చెప్పానేగాని ఆత్మరక్షణ కోసం బుసకొట్టకూడదని చెప్పలేదు. హింస నుండి నిన్ను నువ్వు రక్షించుకునే హక్కు నీకు వుంది\" అని చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 132,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఉపదేశం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 132,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ \"మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహితం' కూడా ఇలానే ఉండాలి తెలుసా\" అని సలహా ఇచ్చాడట.\n\nవిన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారటా. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, \"చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు\" అన్నారట.\n\nవిన్న ఆపెద్ద మనిషి \"మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి\" అని అడగగా, \"ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు\" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 133,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఇది నిజం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 133,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసి మెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసి మెలసి తిరుగుతున్నాయి గాని, హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒక రోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి. అవి చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని, తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్లు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్ధం వినిపించింది. ఏమిటో అనుకొని, తన పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కిన లేచి ఆ చెట్టు కిందపడ్డ దాని దగ్గరకి పరిగెత్తింది.\n\nఅదృష్టం. ఏదో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మ మీదికి తెచ్చుకొని తింటున్నది. పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగానే పోయేప్రాణం లేచి వచ్చింది. ఆ ఎంత అదృషం ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా వున్న మరోనక్క లేచి పరుగు పరుగున తన దగ్గరకి రావడం చూసింది. అది వస్తే నన్నిక ఈ ఎముకను కొరక నివ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది. మింగేటప్పుడు ఆ ఎముక నక్కనోటికి అడ్డంగా పడింది. ఎముక అటు నోట్లోకి ఇటు బయటికి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేలమీద పడి గిజగిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏంచేయాలో తోచలేదు. ఎముక మింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 134,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఆత్రపడ్డ నక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 134,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.\n\nసేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి \"మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం\" అని వెండి నాణెము తీసి చూపించి \"నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం\" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.\n\nనేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 135,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఆత్మవిశ్వాసము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 135,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.\n\nఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయ\n\nఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 136,
        "IMAGE": "cat_1",
        "NAME": "అసలుకి ఎసరు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 136,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ప్రతాపవర్మ అనే రాజుకు వేట అంటే అమితమైన నినోదం. రాజ్య వ్యవహారాలకంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్లి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంత:పురం బాధ్యతను అప్పగించాడు. అంత:పురాన్ని భద్రంగా చూసుకుంటానని మాటంచ్చాడు భద్రయ్య.\n\nకొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో \"భద్రయ్యా! అంతా క్షేమమేనా?\" అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలూపుతూ \"అంతా భద్రంగా ఉంది ప్రభూ\" అని బదులిచ్చాడు.\n\"రాణిగారెక్కడ?\" అని అడిగాడు తన వేట ముచ్చట్లను అడిగి తెలుకోవడానికి. రాణి కనిపించలేదేమిటా! అని కలయచూస్తూ.\n\"యువరాజు గారిని చూడడానికి ఆస్దాన వైద్యుడి విడిదికి వెళ్లారు\" అన్నాడు భద్రయ్య.\n\"యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి ఏమైది?\" అన్నాడు రాజు.\n\"పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభూ\" అన్నాడు భద్రయ్య.\nరాజు మనసు కీడు శంకించింది. \"పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఏ ప్రమాదం మంచుకొచ్చింది\" అన్నాడు ఆందోళనగా.\n\"మన యువరాణి గారిని అపహరించుకుని వెళ్లడానికి వచ్చారు ప్రభూ, అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు\" అన్నాడు.\n\"ఏమిటీ? మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణిగారు ఎలా ఉన్నారు?\" కంగారుగా అడిగాడు రాజు.\n\"అపహరించుకుని వెళ్లిపోయారు ప్రభూ! బహుశా రాక్షసంగా వివాహమాడి ఉండవచ్చు\" వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. అంత:పురం అంతా భద్రంగానే ఉందన్నట్లు.\n\nరాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్యవ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంత:పురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్దితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించక పోవడం ఒక్కటే కాకుండా అసమర్ధుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించడం వల్ల ఎంతటి అనర్ధం ముంచుకు వచ్చిందో అర్ధం చే్సుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 137,
        "IMAGE": "cat_1",
        "NAME": "అసమర్ధునికి బాధ్యత ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 137,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరిని ఇలా అడిగాడు - \"ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?\" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.\n\n\"నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను\" అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?\". అయినా చేతులు లేపడం ఆగలేదు.\n\n\"సరే!\" అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తరువాత దాన్ని చేతిలోకి తీసుకుని \"ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?\" అని అడిగాడు. నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు.\n\n\"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా, దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని, మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం.కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే\" అని వివరించాడు ఉపన్యాసకుడు.\nమరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగి పోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 138,
        "IMAGE": "cat_1",
        "NAME": "అమూల్యమైన బహుమతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 138,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు. తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.\n\nచూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని మరలా అబద్దం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది. అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో. ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 139,
        "IMAGE": "cat_1",
        "NAME": "అబద్దం తెచ్చిన అనర్థం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 139,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊళ్లో ఓ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఉన్నచోటనే బక్కచిక్కిన కుక్క ఒకటి ఉండేది. ఏనుగుకు తెలియకుండా చడీచప్పుడు కాకుండా డేరాలోకి వచ్చి ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహారపదార్ధాలను ఆ కుక్క తింటుండేది. ఆ ఏనుగు కుక్క రాకపోకలు గమనించింది. తరచూ అలా వస్తూపోతుండటంతో కుక్కతో ఏనుగుకు క్రమేపీ స్నేహం కుదిరింది.\n\nఆ ఏనుగు, కుక్క మంచి స్నేహితులయ్యయి. ఒకరు లేకుండా మరొకరు తినేవారు కాదు. రెండూ ఎంతో ఆనందంగా, ఆటలతో గడిపేవి.\nఒకరోజు ఓ గ్రామస్తుడు నగరానికి వచ్చి, ఈ ఏనుగు డేరావైపు వచ్చాడు. అతను ఎవరూ గమనించకుండా కుక్కను తన గ్రామానికి తీసుకెళ్లాడు.\nతన స్నేహితుడు లేకపోయేసరికి ఏనుగుకు దిగులు పట్టుకుంది. ఏమీ చేయబుద్ది కావడం లేదు. తినడానికి, స్నానం చేయడానికి మనస్కరించడం లేదు. మాలి ఈ సంగతిని రాజుకు తెలిపాడు.\n\nరాజు దగ్గరున్న మంత్రికి జంతువులను అర్ధం చెసుకునే తెలివితేటలు ఉన్నాయి. మంత్రిని పిలిచి ఆ ఏనుగు పరిస్ధితి కంక్కోమని చెప్పాడు రాజు. ఆ మంత్రి ఏనుగు డేరా దగ్గరికి వెళ్లాడు. ఏనుగు చాలా దిగులుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే వున్న సేవకులను పిలిచి, \"ఏనుగుతో ఎవరైనా స్నేహంగా ఉండడం మీలో ఎవరైనా గమనించారా?\" అని అడిగాడు మంత్రి.\n\nవెంటనే వాళ్లు కుక్కతో ఏనుగు స్నేహంగా ఉండేదని, అవి రెండూ మంచి మిత్రులని చెప్పారు. \"ఆ కుక్కను ఎవరో తీసుకెళ్ల్లారు\" అని చెప్పారు.\n\nమంత్రి రాజు దగ్గరికి వచ్చి, జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. \"రాజా్, మీ ఏనుగుతో స్నేహం కట్టిన ఆ కుక్కను ఎవరు బంధించి ఉంచారో వారికి జరిమానా వేస్తానని ఓ ప్రకటన చేయండి\" అని సూచించాడు.\nరాజు ప్రకటన జారీచేశాడు. కుక్కను తీసుకెళ్లిన ఆ గ్రామస్తుడు ఆ ప్రకటన తెలుసుకుని కుక్కను వదిలేశాడు. అది పరుగు పరుగున ఏనుగు డేరాను చేరింది.\nఏనుగు ఆనందానికి అంతేలేదు. తన స్నేహితుడిని తొండంతో పట్టి లేపి తన తలపై కూర్చోబెట్టి ఆడించింది. తోకను ఆడిస్తూ కుక్క కూడా ఎంతో ఆనందంతో ఆడుకుంది. అప్పట్నుంచీ ఆ రెండూ సంతోషంగా కలిసే ఉన్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 140,
        "IMAGE": "cat_1",
        "NAME": "అపూర్వ స్నేహం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 140,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.\nఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.\n\nఅరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.\n\nకష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.\n\n\"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.\n\n\"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని\" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా \"నేనే ఈ అడవికి రాజుని\" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా\" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. \"మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి\". అంది.\n\nకుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 141,
        "IMAGE": "cat_1",
        "NAME": "అపాయానికి ఉపాయము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 141,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.\n\n\"సహాయం చెయ్యి\" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.\n\nకనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ..\nఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. \"ఎందుకు ఏడుస్తున్నావు\" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.\n\n\"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో...\"\nకనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ... ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 142,
        "IMAGE": "cat_1",
        "NAME": "అనుభవించని ఐశ్వర్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 142,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన ప్రకటనలు చేయటం సరదాగా ఉండేది. ఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటించాడు.\nఎందరో రాజాస్ధానానికి వచ్చ్హి అబద్ధలు చెప్పారు. కాని ఎవరూ బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్పలేదని ఆ రాజు భావించాడు.\nఒకరోజు, రాజు తన సిణాసనంపై కూర్చుని ఉండగా, ఒక యువకుడు వచ్చాడు.\n\"ప్రభూ! మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను\" అని అడిగాడు \"అవును. అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు\".\n\"కాని దానికన్నా ముందు మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు\" వాదించాడు యువకుడు.\n\"పెద్ద అబద్ధం. నేనెప్పుడూ అలా ప్రకటించలేదు\" యువకుడి ఆలోచన పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు.\nఅప్పుడా యువకుడు \"ప్రభూ! మీరే ఒప్పుకున్నారు. నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి\" అన్నాడు.\nరాజుగారు అతని చతురతకి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 143,
        "IMAGE": "cat_1",
        "NAME": "అతి పెద్ద అబద్ధం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 143,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.\n\n'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.\n\nఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి \"మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు\" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.\n\nపండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 144,
        "IMAGE": "cat_1",
        "NAME": "అతి పండితుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 144,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మౌల్వీ నజీరుద్దీన్‌ చాలా గ్రంథాలు చదివి అపార జ్ఞానం సంపాదించాడు. కానీ అసలు జ్ఞానం కావాలంటే అది జీవితం నుండే నేర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. అందుకే ప్రజలను కలుసుకునే వీలుండే పనేదైనా చేస్తే జీవిత సత్యాలు తెలుస్తాయని, అన్వేషణ ఆరంభించాడు.\nనజీరుద్దీన్‌కి ఈత బాగా తెలుసు. అందువల్ల పడవ నడిపే పని బావుంటుందని, దానిలో చేరాడు. రోజూ నదికి అటూ ఇటూ మనుషుల్ని పడవపై చేరవేయడం అతని పని.\nఒకరోజు అతని పడవలో ఒక ముసలి గురువు ఎక్కాడు. ప్రయాణిస్తుండగా మాటా మాటా కలిసి, ఆ గురువు ఒక మహా పండితుడని తెలిసింది. మౌల్వీ నజీరుద్దీన్‌ తన పేరు చెప్పకుండా, తన గురించి తెలియనివ్వకుండా ఉన్నాడు.\nకొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. \"నీకు వర్షం ఎలా కురుస్తుందో తెలుసా?\" అని అడిగాడు గురువు.\n\"నాకు తెలియదు \" అన్నాడు నజీరుద్దీన్‌.\n\"వర్షం ఎలా కురుస్తుందో తెలియకపోతే నీ సగం జీవితం వ్యర్థం\" అన్నాడు గురువు ఎగతాళిగా.\n\"అవునా గురువుగారూ? మరెలా?\" అని అడిగాడు అమాయకంగా.\n\n\"ఇంకేముంది? నువ్వు సగం చచ్చినవాడితో సమానం\" అన్నాడు గురువు. ఇంతలో వర్షం ఎక్కువైంది. పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. అలలు పెద్దవై పడవ అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది.\n\"గురువుగారూ! మీకు ఈత వచ్చా?\" అని అడిగాడు నజీరుద్దీన్‌. అప్పటికే భయం భయంగా వణుకుతున్న గురువు \"రాదు\" అన్నాడు.\n\"అయితే మీ పూర్తి జీవితం వ్యర్థం \" అని నజీరుద్దీన్‌ పడవలో నుండి నీటిలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 145,
        "IMAGE": "cat_1",
        "NAME": "అజ్ఞానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 145,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడుత సేవకుడిలా ఉండేది. ఏ పని చెప్పినా చీకటిలో చేసేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. ఉడుత పనికి మెచ్చుకుని, సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది. \"ఏమిటా బహుమానం, మహారాజా?\" అని ఆత్రుతగా అడిగింది ఉడుత. \"నువ్వు పదవీ విరమణ చేసే సమయానికి నీకు ఓ బండెడు బాదం గింజలు ఇప్పిస్తాను. అదే బహుమానం\" అంది సింహం.\n\nబహుమానం తెలుసుకుని ఉడుత మహా సంబరపడిపోయింది. అందరూ ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చుని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది. తనంత అదృష్టం ఇంకెవరికి రాదని, మిగతా ఉడుతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్టలేవని అది చాలా సంతోషించింది. రోజూ, తనకు పట్టిన అదృష్టాన్నే తలచుకుంటూ కాలం గడిపేది. అలా అలా కాలం గడిచి, ఉడుత ముసలిది అయింది. ఇక పదవీ విరమణ చేసే సమయం వచ్చింది.\n\nపదవీ విరమణ చేసే రోజున సింహం తనమాట ప్రకారం ఒక బండెడు బాదం గింజలను ఉడుతకు ఇచ్చింది. ఆనందంగా బండినిండా ఆహారాన్ని పెట్టుకుని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడుతలన్నీ స్వాగతం పలికాయి.\n\nస్నానపాదులన్నీ పూర్తి చేసి, ఇక బాదం పప్పులు తిందాం అనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. బాదం గింజలపై ఎంతోకాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధపడింది.. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 146,
        "IMAGE": "cat_1",
        "NAME": "అక్కరకురాని బహుమానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 146,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.\n\n\"సహాయం చెయ్యి\" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.\n\nకనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ...\n\nఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. \"ఎందుకు ఏడుస్తున్నావు\" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.\n\n\"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో...\"\nకనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ... ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 147,
        "IMAGE": "cat_1",
        "NAME": "పీనాసి కనకయ్య ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 147,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఆ రోజు ప్రజల కొరతలు వింటున్నాడని తెలియగానే ఒక ముసలావిడ గంపెడాశతో ఆయన్ను చూడడానికి బయలుదేరింది. కాపలా భటులు సంగతేమిటని అడిగారు. ‘‘నాయనా, నేను చక్రవర్తిని చూడాలి,’’ అన్నది ఆమె ఆయాసంతో రొప్పుతూ.\n\n‘‘నెమ్మదిగా రా,’’ అంటూ భటులు ఆమె చేయిపట్టుకుని కొలువుతీరి వున్న చక్రవర్తి సమక్షానికి తీసుకువెళ్ళారు. ఆమె సభలో అడుగుపెట్టగానే, వంగి నేలను తాకి చక్రవర్తికి సలాం చేయడానికి ప్రయత్నించింది.\nఆమె వయసును గమనించిన చక్రవర్తి సింహాసనం నుంచి లేచి, ‘‘ఫరవాలేదు. వచ్చిన పనేమిటో చెప్పు,’’ అన్నాడు.\n‘‘ఆలంపనా, నా పేరు సుందరీ బాయి. పేద ముసలిదాన్ని,’’ అన్నది ముసలావిడ ‘‘అవన్నీ చూస్తూనే తెలుస్తున్నవి. ఇక్కడ పేదలు, ధనికులు; చిన్నా, పెద్దా తేడాలుండవు. నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.\n‘‘తమరు కాదంటే నాకెవ్వరూ న్యాయం చెయ్యలేరు ఆలంపనా,’’ అన్నది ముసలావిడ గద్గద స్వరంతో.\n‘‘నన్నేం చెయ్యమంటావో, నీ సమస్య కాస్త గట్టిగా చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.\n\n‘‘ఆలంపనా, గత సంవత్సరం బదరీనాథ్ యాత్ర చేసిరావాలనుకున్నాను. ఆరోగ్యం బాగానే ఉందికానీ, వయసు పైబడడం వల్ల కాళ్ళుచేతులు బాగున్నప్పుడే వెళ్ళి వద్దామనుకున్నాను. ముందూ వెనకా ఎవరూ లేరు గనక, ఇన్నాళ్ళు కొద్ది కొద్దిగా కూడబెట్టినదంతా అమ్మి బంగారు మొహరీలుగా మార్చాను. వాటిని ఒక సంచీలో వేసి మూతి బిగువుగా కట్టి లక్కముద్ర వేశాను. బాగా ఆరిన తరవాత ఒకసారి ఆడించి చూశాను. దృఢంగా కనిపించింది,’’ అని ఆగింది ముసలావిడ.\n\n‘‘ఇంతవరకు చాలా చక్కగా చేశావు. ఆసక్తికరంగా ఉంది. ఆ తరవాత ఏం జరిగిందో చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘నేను ఆ సంచీని మన నగరంలో అందరూ గౌరవించే గృహస్థు అయిన గుల్‌షా దగ్గరికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చేంతవరకు భద్రంగా దాచమని వేడుకున్నాను. అతడందుకు అంగీకరించగానే సంచీని తీసి చూపాను. అతడు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. నన్ను వెంటబెట్టుకుని అతడి ఇంటి పెరట్లో ఉన్న పాకలోకి తీసుకుపోయి గొయ్యి తవ్వి దాన్ని అందులో పూడ్చి పెట్టమన్నాడు. చుట్టు పక్కల ఒక్కరూ లేరు. నేను అతడు చెప్పినట్టే చేశాను. ‘నీకిక ఎలాంటి విచారమూ వద్దు. తిరిగి వచ్చి నువ్వే దానిని నిక్షేపంగా తీసుకోవచ్చు,’ అని చెప్పి పంపాడు.\n\n‘‘కృతజ్ఞతలు తెలియజేసి వచ్చిన నేను తీర్థయాత్ర ముగించుకుని నెల తరవాత తిరిగి వచ్చాను. నాణాల సంచీకోసం గుల్‌షా వద్దకు వెళ్ళాను. నన్ను ఆయన నవ్వుతూ పాకలోకి తీసుకుపోయి, పాతిపెట్టిన చోట తవ్వి సంచీని తీసుకోమన్నాడు. అలాగే తవ్వి తీసుకున్నాను. పూడ్చిపెట్టిన సంచీ అక్కడే ఉన్నది. లక్కముద్ర కూడా చెక్కుచెదరకుండా అలాగే ఉండడంతో సంతోషంగా మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి తిరిగి వచ్చాను.\n\nఇంటికి చేరగానే లక్కముద్ర తొలగించి మూట విప్పి చూడగానే ప్రాణం పోయినట్టయింది. బంగారు నాణాలు కనిపించలేదు. వాటికి బదులు అదే పరిమాణంలో రాగి నాణాలున్నాయి,’’ అంటూ ముసలావిడ ఆ తరవాత మాట్లాడలేక భోరున ఏడ్వసాగింది. ‘‘ఏడవకు, ఊరుకో,’’ అని ఓదార్చిన చక్రవర్తి సభికుల కేసి తిరిగి, ‘‘ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం?’’ అని అడిగాడు.\nముసలావిడ ఆత్రుతగా వాళ్ళకేసి చూడసాగింది. సభలోని ఒక్కరూ నోరు విప్పలేదు. ఆఖరికి బీర్బల్ లేచి నిలబడి, ‘‘ఈ మర్మాన్ని నేను ఛేదించగలననుకుంటాను షహేన్‌షా!’’ అన్నాడు.\n‘‘ఆ నమ్మకం నాకూ ఉన్నది, బీర్బల్,’’ అన్నాడు చక్రవర్తి తలపంకిస్తూ.\n‘‘షహేన్‌షా, ఆ నాణాల మూటను ఒకసారి పరిశీలించి చూడాలనుకుంటాను,’’ అన్నాడు బీర్బల్.\n‘‘ఇదిగో సంచీ,’’ అంటూ ముసలావిడ సంచీని బీర్బల్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపింది.\n\nబీర్బల్ ఆ సంచీని తీసుకుని తిప్పి తిప్పి కొంతసేపు పరిశీలనగా చూశాడు. ఇందులో ఏదో తిరకాసు ఉంది అనుకుంటూ పెదవులు బిగించి ఆ తరవాత ముసలావిడతో, ‘‘నువ్వు చెప్పేది నిజమయితే, నీ నాణాలు నీకు తప్పకుండా వస్తాయి,’’ అని ధైర్యం చెప్పాడు.\n‘‘నేను అబద్ధం చెబితే నా నెత్తిన పిడుగు పడి చస్తాను,’’ అంటూ ముసలావిడ చేతులెత్తి ఆకాశం కేసి చూసింది.\n‘‘తప్పకుండా నిజాన్ని బయట పెడతాం. ఎల్లుండి రావమ్మా,’’ అన్నాడు చక్రవర్తి.\nముసలావిడ వంగి నమస్కరించి అక్కడి నుంచి వెలుపలికి నడిచింది.\nచక్రవర్తి ఆసనం నుంచి లేవగానే సభికులు లేచి నిలబడ్డారు. ఆయన వెలుపలికి నడుస్తూండగా వంగి నమస్కరించారు. ఆ తరవాత బీర్బల్ కూడా ముసలావిడ ఇచ్చిన సంచీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు.\n\nతక్కిన సభికులు బీర్బల్ ఈ మర్మాన్ని ఎలా ఛేదిస్తాడో తెలియక మల్లగుల్లాలు పడసాగారు. ఛేదించలేకపోతే బీర్బల్, చక్రవర్తి ఆగ్రహానికి గురికావడం తథ్యమనీ, దాంతో ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుందనీ అసూయాపరులైన వాళ్ళు ఆశతో ఎదురు చూడసాగారు. సమస్యను పరిష్కరించడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఇల్లు చేరిన బీర్బల్‌ను భార్య చిరునవ్వుతో పలకరించింది. బీర్బల్ దాన్ని పట్టించుకోకుండా ముభావంగా తలాడించడంతో తాగడానికి నీళ్ళందించి వంట గదిలోకి వెళ్ళిపోయింది భార్య.\n\nబీర్బల్ బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. భోజనం అయిందనిపించి, వరండాలో కాస్సేపు అటూ ఇటూ తిరిగాడు. మధ్యాహ్నం కునుకు కోసం వెళ్ళి నడుంవాల్చిన బీర్బల్ మెరుపులాంటి ఆలోచనతో చివుక్కున లేచి కూర్చున్నాడు. వెంటనే కత్తెర తీసుకుని పడక పైతొడుగును ఒక వైపు చకచకా కత్తిరించాడు. ‘‘ఏమిటండీ, బంగారం లాంటి బట్టను అలా కత్తిరించేశారు,’’ అంటూ వాపోతూన్న భార్య మాటలను పట్టించుకోకుండా పడక పైతొడుగును జాగ్రత్తగా విడిగా లాగుతూ నౌకరును పిలిచాడు. నౌకరు పరిగెత్తి రాగానే దానిని వాడి చేతికిచ్చి, ‘‘నగరంలో గట్టివాడైన దర్జీ చేతికిచ్చి దీన్ని చక్కగా కుట్టించుకుని రావాలి,’’ అన్నాడు.\n‘‘మన్సూర్ అలీకి మించిన దర్జీ నగరంలో లేడు. అతడు నేను బాగా ఎరిగినవాడే,’’ అని చెప్పిన నౌకరు, ‘‘అవునూ, ఇది తమకెప్పుడు కావాలి?’’ అని అడిగాడు.\n‘‘రేపు మధ్యాహ్నానికల్లా ఇస్తే చాలు,’’ అన్నాడు బీర్బల్.\n\nచెప్పినట్టుగానే మరునాటి సాయంకాలానికల్లా కుట్టిన బట్టతో తిరిగివచ్చాడు నౌకరు. బీర్బల్ దానిని తీసుకుని నాలుగు మూలలా పరిశీలించి, చేత్తో తడివి చూశాడు. తను కత్తిరించిన చోటు తెలియకుండా చాలా చక్కగా కుట్టబడి ఉన్నది. ‘‘చాలా బాగా కుట్టాడు. మన్సూర్ అలీని చూడాలి. రా వెళదాం,’’ అంటూ నౌకరును వెంటబెట్టుకుని బయలుదేరాడు.\nబీర్బల్‌ను చూడగానే, ‘‘హుజూర్!తమరు ఇంత దూరం రావాలా? ఒక్క మాట చెప్పి పంపి ఉంటే నేనే వచ్చేవాణ్ణి కదా?’’ అంటూ లేచి వంగి సలాం చేశాడు మన్సూర్ అలీ.\n‘‘అద్భుతమైన నీ పనితనాన్ని మెచ్చుకోవాలనే స్వయంగా వచ్చాను,’’ అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ.\n‘‘దీన్ని పుచ్చుకో,’’ అంటూ బీర్బల్ ఒక మొహరీ అతడిచేతిలో పెట్టాడు.\n‘‘నాకు ఇవ్వవలసింది ఇందులో సగమే,’’ అంటూ మిగిలిన చిల్లర కోసం జేబులు వెదకసాగాడు మన్సూర్ అలీ.\nఅంతలో బీర్బల్ ముసలావిడ నుంచి తీసుకున్న సంచీని తీసి మన్సూర్ అలీకి చూపుతూ, ‘‘ఈ సంచీ చిరిగిందని ఎవరైనా వచ్చి కుట్టించుకుని వెళ్ళారా? కాస్త జాగ్రత్తగా చూసి చెప్పు,’’ అని అడిగాడు బీర్బల్.\nమన్సూర్ అలీ కళ్ళు అతడు కుట్టిన చిరుగు సంచీని చూడగానే కనిపెట్టేశాయి. ‘‘హుజూర్, దాదాపు నెల క్రితం గుల్‌షా ఈ సంచీని తెచ్చి చిరుగును కుట్టించుకుని వెళ్ళాడు,’’ అని చెప్పాడు మెరిసే కళ్ళతో.\n‘‘చాలా కృతజ్ఞతలు,’’ అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు.\n\nమరునాడు ఉదయం సభాసదులందరూ రాగానే చక్రవర్తి సభలో అడుగుపెట్టాడు. అందరూ లేచినిలబడి ఆయనకు వంగి సలాం చేసి, ఆయన ఆసనంలో కూర్చున్నాక తామూ కూర్చున్నారు. భటులు గుల్‌షాను, ముసలావిడను సభలో ప్రవేశపెట్టారు.\nచక్రవర్తి బీర్బల్ కేసి తల తప్పి, ‘‘ఈ ముసలావిడ ఫిర్యాదులోని నిజానిజాలు నిగ్గు తేల్చావా?’’ అని అడిగాడు.\n\n‘‘ఆమె చెప్పింది అక్షరాలా నిజం షహేన్‌షా! అందులో ఏమాత్రం అనుమానం లేదు,’’ అంటూ బీర్బల్ తను ఆ నిజాన్ని ఎలా కనుగొన్నదీ చక్రవర్తికి స్పష్టంగా వివరించాడు. గుల్‌షా దిగ్భ్రాంతి చెందాడు. అతడి ముఖం వెలవెల బోయింది. మోకాళ్ళ మీదికి వంగి, రెండు చేతులతో తలను పట్టుకున్నాడు. ఆ తరవాత తలతో నేలను తాకి చక్రవర్తికి సలాం చేశాడు.\n‘‘ఇప్పుడైనా నిజం ఒప్పుకో,’’ అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి.\n‘‘క్షమించండి ఆలంపనా! దురాశతో మోసానికి పాల్పడ్డాను,’’ అంటూ చక్రవర్తి పాదాలపై బడ్డాడు గుల్‌షా.\n‘‘మోసగాణ్ణి క్షమించడమా! పదేళ్ళు కఠిన కారాగారశిక్ష విధిస్తున్నాను,’’ అన్నాడు చక్రవర్తి.\nఆ తరవాత ముసలావిడకు చెందవలసిన బంగారు మొహరీలు ఆమెకు అప్పగించబడ్డాయి.\n‘‘తమ నోటి గుండా ఆ మాట వినడం నా కెంతో సంతోషంగా ఉంది, హుజూర్,’’ అన్నాడు మన్సూర్ అలీ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 148,
        "IMAGE": "cat_1",
        "NAME": "బంగారు నాణాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 148,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండే వారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అయ్యా అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరవాత వాతాపి తమ్ముడైన వాతాపిని మేకకా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తరవాత ఇల్వలుడు \"వాతాపి బయటకురా \" అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు.\n\nఒక రోజు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచిగురుటాకులను ఆధారం చేసుకుని వ్రేలాడుతున్న తన పితరులను చూసాడు. అగస్త్యుడు వారితో \"అయ్యా! మీరెవరు? ఇలా ఎందుకు వ్రేలాడుతున్నారు \" అని అడిగాడు. బదులుగా వారు \"నయనా!మేము నీపితరులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతాన హీనుడవ్వావు. కనుక మేముఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు \" అన్నారు.\n\nఅగస్త్యుడు అలాగే అన్నాడు.ఆ సమయంలో విదర్భ రాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపోమహిమతో అతనికి ఒక కూతురిని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు \" ఈ నిరుపేద బ్రాహ్మణుడా నాకుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరెలు ధరించవలసినదేనా? \" అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది.\n\nగత్యంరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునకిచ్చి వివాహం చేసాడు. ఆమె నారచీరెలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్య్డుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర \"నాధా! సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి \" అన్నది. అగస్త్య్డుడు \" నా వద్ధ ధనం, ఆభరణములు లేవు వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్ధం \" అనుకుని ధనం కొరకు అగస్త్య్డు శతర్వురుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతర్వురుడు తనవద్ద ధనం లేదని చెప్పాడు. అగస్త్య్డుడు, శతర్వురుడు బృహదశ్వుని వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు.\n\nఆ తరువాత ఆ ముగ్గురూ ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి \"మునీద్రా! ఇల్వలుడు ధనవంతుడు. అతడిని అడిగితే మీకోరిక తీరుతుంది \" అన్నాడు.వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్య్డు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్య్ని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్ర్హించిన రాజఋషులు \"మునీంద్రా! ఇల్వవుడు తన తమ్ముని మేకగా మార్చి వండి మ్రాహ్మణులచే త్నిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్ట్ను చీల్చుకుని ఆబ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు.కనుక మీరు భుజించరాదు \" అన్నారు.\n\nఅగస్త్య్డుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు.అగస్త్య్డుడు పొట్టను తడుముకుని తేన్చాడు. అంతే వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు \"వాతాపీ బయటకు రా \" అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో \"అయ్యా మీరు కోరిన ధనం ఇస్తాను \" అన్నాడు. ఆ ధనంతో అగస్త్య్డు లోపా ముద్ర కోరికను తీర్చాడు.\n\nఅగస్త్య్డుడు లోపాముద్రతో \"నీకు పది మందితో సమానమన నూరుగురు కొడుకులు కావాలా? లేక నూరుగురుతో సమానమైన ఒక్క కొడుకు కావాలా? లేక నూరుగురు కొడుకులతో సమానమైన వెయ్యి మంది కొడుకులు కావాలా లేక వెయ్యి మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా ? \" అని అడిగాడు. అందుకు లోపాముద్ర \"నాకు వేయి మందితో సమానమైన బలవంతుడూ, బుద్ధిమంతుడూ అయిన ఒక్క కుమారుని ప్రసాదంచండి \" అని కోరింది. లోపాముద్ర గర్భందాల్చి తేజోవంతుడూ, గుణవంతుడూ అయిన దృఢస్యుడు అనే కొడుకును కన్నది.ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 149,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఆగస్త్యమహాముని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 149,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో \"జరద్గవము\" అను ముసలి గద్ద నివసిస్తుండేది. పాపం ఆగద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది.\n\nఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి. ఆ ఆహారంతో గ్రద్ద జీవిస్తూ ఉండేది.ఓకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టువద్దకు నిశబ్దముగా చేరింది. దనిని చూచిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. \"ఎవరక్కడ?\" అని గట్టిగా అరచింది.\n\nగద్దను చూచి పిల్లి భయపడింది. దనికి తప్పించుకొనే అవకాశం లేదు. అందువలన అది వినయంగా గద్దతో \"అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక పిల్లిని. మీ దర్శనము కొరకు వచ్చాను\" అన్నది. గద్ద కోపంగా \"ఓ మార్జాలమా! వెంటనే ఇచటి నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు\"అన్నది. పిల్లి గద్దతో \"అయ్యా మీరు పెద్దలు. మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను.\"\n\nపిల్లి జాతిలో పుట్టినా నేను రోజు గంగలో స్నానం చేస్తాను, కేవలం శాకాహరం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మానివేసిచాంద్రాయణ వ్రతంను ఆచరిస్తున్నాను. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథిని శత్రువయినను గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాని మీరు నన్ను తరిమేస్తున్నారు\" అన్నది.\n\nగద్ద పిల్లి మాటలకు మెత్తబడింది. \"చెట్టు పైన పక్షిపిల్లలున్నాయి. పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా. అందుకని నిన్ను వెళ్లమన్నాను.\" అంది. పిల్లి తన రెండు చెవులు మూసుకొని \"కృష్ణ! కృష్న పూర్వజన్మలో ఏంతో పాపం చేసి ఈ జన్మలో పిల్లిగా పుట్టాను. అందువలనే ఇంత ఖటినమైన మాటలు వినవలసి వస్తుంది. అయ్యా! మీ మీద ఒట్టు.\n\nనేను మాంసమును ముట్టను. అహింసయే పరమ ధర్మము అను సూత్రమును నమ్మినదానిని\" అన్నది. గ్రద్ద పిల్లిని అనునయిస్తూ \"కోపగించకు. కొత్తగా వచ్చిన వారి గుణ శీలములు తెలియవు కదా. అందువలన ఆ విధముగా పరుషంగా మాట్లాడినాను. ఇకనుంచి నీవు నా వద్దకు రావచ్చు..... పోవచ్చు. నీకు అడ్డులేదు \" అన్నది. పిల్లి ఎంతోషంతోషించింది.\n\nపిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మింది. గద్దతో పాటు తొఱ్ఱలో ఉండసాగింది. అర్థరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొఱికి, వాటిని చంపేది. పక్షిని తొఱ్ఱలోకి తెచ్చుకొని దానిని తిన్నది. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి.\n\nపక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి వాటికోసం వెదకసాగాయి. ఆ సంగతి తెలిసి పిల్లి పారి పోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ తోఱ్ఱ వద్దకు వచ్చాయి. తొఱ్ఱలో పక్షులు ఎముకలను చూసి , గద్దయే తమ పిల్లలను చంపి తింటున్నదని అనుకున్నాయి. అవి కోపంతో గద్దను తమ గోళ్ళతో రక్కి దానిని చంపాయి. \"నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని\" అనుకుంటూ గద్ద చని పోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 150,
        "IMAGE": "cat_1",
        "NAME": "ముసలి గ్రద్ద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 150,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "నక్క బావ కొత్తగా భోజనశాల తెరిచింది. అడవిలోని జంతువులతోపాటు మృగరాజు సింహాన్ని కూడా ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించింది. అడవిలోని జంతువులు, పక్షులు వీలు చూసుకుని నక్క భోజనశాలకు వెళ్లి విందారగిస్తున్నాయి.\n\nపాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో అతిథులకు ఎంతో రుచితో కొత్త కొత్త వంటకాలు వండి వడ్డిస్తుంది. అన్నీ లొట్టలేసుకుంటూ తిని, నక్కబావ చేతివంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. ప్రతిఫలంగా అవి ఇచ్చే బహుమతులు పుచ్చుకునేది నక్క. నక్కబావ అద్భుతమైన చేతివంట గురించి రెండురోజుల్లోనే అడవంతా పాకింది. కొద్దిరోజుల్లోనే చుట్టుపక్కల అడవుల్లోకి పాకింది దాంతో.. పక్కనున్న అడవుల్లోని జంతువులు కూడా నక్కబావ చేతివంట తినాలని ఆరాటపడేవి. ఇంత జరిగినా...అడవిరాజు సింహం మాత్రం నక్కబావ తెరిచిన భోజన శాలకు రావడం కుదరలేదు. పక్కనున్న అడవుల నుంచి కూడా వచ్చి రుచి చూసి పోతున్న విషయం దానికి తెలిసింది.\n\nనక్క రాజుగార్ని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వీలు చిక్కక పోవడంతో వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు వెళ్లాలని నిశ్చయించుకుంది సింహం.\n\nదుప్పిని తినగా అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ నక్క తెరిచిన భోజనశాలకు వెళ్లే ఏర్పాట్లు చేయమని మంత్రి తోడేలును ఆదేశించింది. మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టు నక్కకు వార్త అందింది. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా వంటలు చేసింది. రాజుగారికి ఎదురెళ్లి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి, ప్రేమతో దగ్గరుండి వడ్డించింది నక్క.\n\nరాజుగారితో విచ్చేసిన తోడేలు, ఎలుగుబంటి, ఏనుగు లొట్టలేసుకుంటూ తినసాగాయి. కానీ సింహం మాత్రం లొట్టలేయలేదు. ఏదో తిన్నానని అనిపించింది. సింహం తృప్తిగా తినలేదని నక్క గ్రహించింది. లొట్టలేసుకుని తింటే విలువ తగ్గుతుందని సింహం భావించింది కాబోలనుకుంది.\n\nనక్కకు ఖరీదైన కానుకలిచ్చి అక్కడినుండి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు. ‘‘వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో..! నేనింత వరకు ఇంత కమ్మని వంట తిని ఎరుగను’’ అంది ఎలుగుబంటి. ‘‘నిజమే! అన్ని వంటలూ ఎంతో రుచిగా ఉన్నాయి’’ అన్నాయి ఏనుగు, తోడేలు. దాంతో.. సింహానికి చిరాకేసింది.\n\n‘‘ఆపండి మీ తిండిగోల..!’’ అంటూ కసురుకుంది. తనకు అస్సలు ఆ వంటల్లో ప్రత్యేకతే కనపడలేదంది. పైగా రుచిగా కూడా లేవంది. అడవి అడవంతా నక్కబావ చేతివంట మెచ్చుకుంటుంటే... ఒక్క సింహానికే ఎందుకు నచ్చలేదో వారికి ఆ క్షణం అర్థం కాలేదు. సింహం తృప్తిగా తినలేకపోయిందని నక్క బాధ పడిన విషయం మంత్రి తోడేలుకు తెలిసింది. ఈ విషయమై లోతుగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. నక్కను బాధపడొద్దని, త్వరలోనే రాజుగారు మరోమారు విందుకు వస్తారని ఈ సారి తప్పనిసరిగా మెచ్చుకుంటారని తోడేలు కబురు పంపింది.\n\nఒకరోజు సాయంత్రం తోడేలు రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్లేలా ఒప్పించింది. సింహం అనాసక్తిగానే తిరిగి తన పరివారంతో విందుకు వెళ్లింది. ఈసారి సింహం లొట్టలేసుకుని తిన్నది పైగా ‘‘ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్నాయి కదా..!?’’ అంటూ తనతో వచ్చిన వాటిని ఉత్సాహపరిచింది.\n\n‘‘రాజా! నక్క వంటలో ఏమాత్రం తేడాలేదు. అప్పుడు, ఇప్పుడు రుచిగానే వండింది. కానీ గతంలో మీరు ఆకలితో లేరు. అప్పుడే దుప్పిని వేటాడి, ఆరగించి ఇక్కడ విందుకు కూర్చున్నారు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అంది తోడేలు. తన పొరపాటు గ్రహించి నక్కను తిరిగి అభినందించి, బహుమతులిచ్చి సంతోషంగా అక్కడి నుంచి తన పరివారంతో వెనక్కు వెళ్లాడు మృగరాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 151,
        "IMAGE": "cat_1",
        "NAME": "నక్క బావ పాకశాస్త్ర ప్రావీణ్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 151,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి మృగరాజు సింహానికి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్టించాలన్న కోరిక కలిగింది. వెంటనే కాకితో అడవంతా చాటింపు వేయించింది. శిల్ప విద్యలో ప్రవేశమున్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క మృగరాజు సింహాన్ని సంప్రదించాయి. ‘శిల్పులారా! గతంలో ఈ అడవిని పాలించిన మా తండ్రి మృగరాజు సింహం శిల్పాన్ని ఆయన చనిపోయిన రోజున ప్రతిష్టించాలన్న కోరిక మాకు కలిగింది. చాటింపు విని విచ్చేసిన మీకు స్వాగతం!’’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు మృగరాజు.\n\nఇంతలో ఓ చీమ ఆయాసపడుతూ ‘‘మృగరాజా! నేనూ మీరు వేయించిన చాటింపు వినే వచ్చాను. నాకూ అవకాశం ఇప్పించండి’’ అంది. మృగరాజు కళ్లు చిట్లించి ఆ చిన్ని చీమవైపు చూశాడు.‘‘ఏంటీ..నువ్వు కూడా శిల్పం చేద్దామనే వచ్చావా!’’ గంభీరంగా అంది సింహం. ‘‘మహారాజా! నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను. శిల్పవిద్యలో మా జాతికి ఎంతో పేరుంది. ఈరోజు పెద్ద పెద్దనిర్మాణాలు కట్టడాలు మేము నిర్మించిన పుట్టలు చూసి స్ఫూర్తిపొందే మానవజాతి నిర్మిస్తుంది. నాకూ ఒక అవకాశం ఇప్పించండి’’ అంది చీమ.\n\nఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క చీమను చూసి నవ్వుకున్నాయి. ‘మృగరాజా! మీరు తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది’ అంది ఏనుగు. సింహం ఆలోచనలో పడింది. ‘నాకు నీమీద నమ్మకం కలగడంలేదు. అయినా నీకు అవకాశం ఇస్తాను. మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పిగా పదవి అందచేస్తాను’ అంది సింహం. సింహం తనను నమ్మకున్నా అవకాశం ఇచ్చినందుకు సంతోషించింది చీమ., ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు, ముడి సరుకులు మృగరాజును అడిగి తెప్పించుకున్నాయి.\n\n‘‘ఏం..చీమ మిత్రమా! నీకు పనిముట్లు ముడిసరుకులు అవసరం లేదా?!’’ అడిగింది సింహం .‘అది పనిముట్లు మోయగలదా?’ నవ్వింది ఎలుగుబంటి. ‘శిల్ప కళ అంటే ఆషామాషీ కాదు’ అంది నక్క. చీమ వాటివైపు వింతగా చూసింది. ‘‘ఏం మాట్లాడవు?! గర్జించాడు మృగరాజు. ‘‘మహారాజా! నాకు నాలుగు అడుగుల నేల ఇప్పించండి చాలు’ అంది చీమ. మృగరాజు చీమ కోరిక మీద నాలుగు అడుగుల స్థలం చూపించాడు. ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి. సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది.\n\nమరుసటిరోజుకు శిల్పాలు సిద్ధమయ్యాయి. సింహం స్వయంగా శిల్పులను చేరుకుని వాటి పనితనాన్ని పరీక్షించింది. ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్పాలు ఒకదాన్ని మించి ఒకటి అందంగా కనిపించాయి. చివరగా చీమను చేరుకుంది సింహం. చీమ తను చెక్కిన శిల్పాన్ని మృగరాజుకు చూపించింది. అంతే... మృగరాజు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి తన ఎదురుగా నిలుచున్నంత మహా అద్భుతంగా ఉందా శిల్పం. పనిముట్లు లేకుండా కేవలం మట్టితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి మలిచిన శిల్పమది. సింహంతోపాటు ఏనుగు, ఎలుగుబంటి, నక్క ఆశ్చర్యపోయాయి. మృగరాజు చీమను దగ్గరకు తీసుకుని ‘మిత్రమా! నిన్నూ నీ ఆకారాన్ని చూసినమ్మకున్నా... నీ పనితనం చూసి నమ్ముతున్నాను. ఈ సృష్టిలో నీవే అద్భుత శిల్పివి’ అన్నాడు.\n\nఏనుగు, ఎలుగుబంటి, నక్క సిగ్గుపడ్డాయి. జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి. అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పుట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాయని తెలుసుకున్నాయి. చీమకు విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పి పదవి ఇచ్చి గౌరవించింది సింహం. ‘ఇతరులు మనల్నిచూసి నమ్మకున్నా.. మన పనితనం చూసి నమ్ముతారు. పనికి ఉన్న గొప్పతనం అది’ అనుకుంది చీమ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 152,
        "IMAGE": "cat_1",
        "NAME": "చీమ కళా నైపుణ్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 152,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రిచెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలా సార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది.\n\nకాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి \" కాకి బావ కాకి బావ! ఎందుకు ఏడుస్తున్నావ్ నీకు వచ్చిన సమస్య ఏమిటి? \" అని అడిగింది. కాకి నక్కతో \" నక్క బావా నక్కబావా నా గర్భశొకాన్ని ఎవరితో చెప్పుకొనేది నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అని కావ్ కావ్ మని అరుస్తుంటే విని ఆనందించాలను కున్నాను. కాని నాకు ఆ అదృష్టం లేదు\" అని బాధపడింది.\n\nనక్క కాకితో \"మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా! \"అన్నది.కాకి \"నిజమే కాని నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది\" అని బధతో అన్నది. నక్క \"మరి ఆ పాముని చంపబోయావా?\" అన్నది. ఆ పని నా వల్ల కాదుకదా\" అన్నది కాకి. అప్పుడు నక్క \" శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయముతో అతనిని తప్పించాలి \" అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలా సేపు ఆలోచించినది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అను పట్టణం ఉన్నది. ఆపట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకి వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణి గారి ముత్యాలా హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు.\n\nరాజభటులు కాకి వెంటబడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్టవద్దకు వచ్చింది రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అపుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి, చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారంకోసం పుట్టను త్రవ్వారు. అపుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు. పాము పీడ వదలినందుకు కాకుల జంట సంతోషించాయి ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 153,
        "IMAGE": "cat_1",
        "NAME": "కాకి బావ ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 153,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యానికో రాజు. రాజుకు ఏడుగురు కొడుకులుండేవారట. ఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులూ, చేపల వేటకని బయలుదేరి వెళ్ళారట. ఏడుగురు కొడుకులూ కలసి ఏడుచేపలు పట్టారట. పట్టుకొచ్చిన ఏడుచేపలనూ ఒక బండ మీద ఆరబెట్టారట.\n\nఅందులో పెద్దవాడి చేప మాత్రం ఎండలేదట. పెద్దకొడుకు చేపతో, చేపా! చేపా! ఎందుకెండలేదు? అని అడిగాడట. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప, \" గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకనే ఎండలేదు\" అని చెప్పిందట. రాకుమారుడు గడ్డివాము దగ్గరికెళ్ళి దానితో, \"గడ్డివామూ! గడ్డివామూ! ఎందుకు అడ్డం వచ్చావు?\" అని అడిగాడట. అప్పుడా గడ్డివాము \"ఆవు నన్ను మేయలేదు\" అని అన్నదట. ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికెళ్ళి \"ఆవూ! ఆవూ! నువ్వెందుకు గడ్డి మేయలేదు?\" అని అడిగాడట. అప్పుడా ఆవు, \"జీతగాడు నాకు మేత వేయలేదు\" అని చెప్పిందట.\n\n\"జీతగాడా! జీతగాడా! నువ్వెందుకు మేత వేయలేదు?\" అని అడిగాడట. \" అవ్వనాకు బువ్వ పెట్టలేదు\" అని జీతగాడు చెప్పాడట. \"అవ్వా! అవ్వా! జీతగానికి ఎందుకు బువ్వ పెట్టలేదు?\" అని అడిగాడట రాకుమారుడు. \" పాప ఏడుస్తోంది. అందుకనే నాకు వీలుకాలేదు\" అని అవ్వ చెప్పిందట. \"పాపా! పాపా! ఎందుకు ఏడుస్తున్నావు?\" అని పాపనడిగాడట రాకుమారుడు. \"నన్ను చీమ కుట్టింది\" అని పాప అన్నదట.\n\nరాకుమారుడు చీమను వెళ్ళి అడిగాడట, \"చీమా! చీమా! ఎందుకు పాపను కుట్టావు?\"అని. అప్పుడు చీమ అన్నదట, \"నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! గిట్టనా!\" అని.........! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 154,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఏడు చేపల కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 154,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.\n\nమొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.\n\n“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు… ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 155,
        "IMAGE": "cat_1",
        "NAME": "అమాయక బ్రాహ్మడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 155,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి నక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది.\n\nఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి నక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.\n\n‘‘నక్క మామా! నక్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. నక్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.‘‘నువ్వు మేలుజాతి నక్కలా ఉన్నావు. నీలాంటి నక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన నక్క ‘సరే’ అని తలూపింది.\n\nవెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి నక్క వెనుకకు, మరొక కాకి నక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా నక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన నక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ నక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 156,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిసినారి నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 156,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. అది ఓసారి సరదాగా షికారుకు బయల్దేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి, ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. అది కాస్త లోతుగా ఉండటంతో బయటికెలా రావాలో అర్థం కాలేదు. పైకి ఎగిరింది. గోడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఓ మేక వచ్చింది.\n\nమేక అసలే దాహంతో ఉంది. నీళ్లకోసం బావిలోకి తొంగి చూసింది. దానికి నక్క కనబడింది. అది అక్కడ ఏం చేస్తున్నదో తెలుసుకోకుండా -‘‘నక్క బావా, నక్క బావా! బావిలో బాగా నీళ్లున్నాయా’’ అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టింది.\n\n‘‘ఓ.. లేకేం! ఎంత తోడినా తరగనన్ని నీళ్లున్నాయి. వచ్చి తాగు’’ అంది. మంచి దాహంతో ఉన్న మేక, వెనకా ముందూ ఆలోచించకుండా బావిలో దూకేసింది. అప్పుడుగానీ దానికర్థం కాలేదు. ‘‘అయ్యో, ఇందులోంచి బయటికెలా వెళ్లడం’’ అంది దిగులుగా. అందుకు నక్క- ‘‘మనం బయటపడటానికి నేనో మంచి మార్గం చెప్తాను. నువ్వు నీ ముందర కాళ్లు ఎత్తి, గోడకు ఆన్చి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్లిపోతాను. తర్వాత నువ్వూ వచ్చేద్దువు గాని’’ అంది.\n\nనక్క మాటల్లోని మర్మం గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. దాని మీద ఎక్కి ఎంచక్కా పైకి వచ్చేసింది నక్క. ‘‘మరి నేను...’’అంది మేక. ‘‘ఏమో... నాకేం తెలుసు’’ నిర్లక్ష్యంగా అంది నక్క.అప్పుడర్థమయ్యింది మేకకు నక్క చేసిన మోసం. ‘‘నన్నిలా మోసం చేయడం నీకు తగదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘ఇందులో నా తప్పేముంది! నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుని నన్నంటావేం’’ అంటూ చక్కా పోయింది. మంచి చెడులు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది మేకకి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 157,
        "IMAGE": "cat_1",
        "NAME": "జిత్తులమారి నక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 157,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పులి, నక్క, గాడిద మంచిమిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి.\nఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటుకి చేరింది.\n\nఆ రోజు పులి మాంచి ఆకలిమీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలెయ్యమని అడిగింది.\n‘‘వయస్సులో పెద్దది గాడిద. కనుక ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది...’’ అని నక్క తెలివిగా తప్పుకుంది.\nనక్క మాటలతో గాడిద ‘‘అబ్బో మనకింత పెద్దరికం ఇస్తున్నారే...’’ అనుకుని ఉప్పొంగిపోయింది.\nజింక మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది.\n‘‘ఏంటీ గాడిదా, నీకూ నాకూ సమానా వాటానా?’’ అని పులి అమాంతం గాడిదమీద పడి చంపేసింది.\nతర్వాత నక్క వంక చూసింది పులి. ‘‘నక్కా నక్కా ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి?’’ అడిగింది పులి.\nఅప్పుడు నక్కేమందో తెలుసా?\n\n‘‘మిత్రమా, నువ్వు నీక్కావలసిందంతా తినగా మిగిలినదేమైనా ఉంటే అది చాల్లే నాకు. అదే నా భాగ్యమనుకుంటాను’’ అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. ‘‘అన్నట్టు స్నేహితుడా...నీకింతటి తెలివి ఎలా వచ్చింది?’’ అని పులి అడిగింది.\n‘‘ఏం చెప్పమంటావు? ఈ గాడిద నుంచే నాకంత తెలివొచ్చింది’’ అని నక్క వినయంగా చెప్పి అటూ ఇటూ చూసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 158,
        "IMAGE": "cat_1",
        "NAME": "అపాయంలో ఉపాయం - చిట్టి కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 158,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అడ్డదిడ్డంగా చెట్లు, తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూలమొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటిని నరికి చదును చేయాలి కదా! అందుకోసం రాముడు, భీముడు అని ఇద్దరు పనివాళ్లని పెట్టుకున్నాడు. భీముడు పేరుకు తగ్గట్లుగా బలంగా, లావుగా ఉంటే, రాముడేమో సన్నగా, బక్కపల్చగా ఉన్నాడు.\n\nఇద్దరూ చెట్లు నరకడం మొదలు పెట్టారు. మొదటిరోజు ఇద్దరూ సమానంగానే నరికారు. రెండవరోజు భీముడి కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవరోజూ, నాలుగవ రోజూ కూడా అంతే! రాముడికన్నా ఎక్కువ పని చేయాలన్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు. కాని, అదేమి చిత్రమో రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసినా, అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తిసామర్థ్యాల మీద అనుమానం వచ్చింది.\n\nఅదే విషయం రాముణ్ణడిగాడు. రాముడు నవ్వేస్తూ ‘‘అన్నా, నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు కానీ, విశ్రాంతి తీసుకోవడం, నీగొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు, నే నేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయంలో గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువయింది’’ అని జ వాబిచ్చాడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది.\nనీతి: కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా అవసరం. అప్పుడా పని మరింత తేలికవుతుంది కూడా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 159,
        "IMAGE": "cat_1",
        "NAME": "పనిలో మెళకువలు! - చిట్టి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 159,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా రెండు కాకులు. బోలు, గోలు వాటి పేర్లు. రెండూ మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై, ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది.చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి. రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట!\n\nఈ రెంటిలోనూ బోలు కొంచెం గడుసైనది. గోలు కాస్తంత అమాయకురాలు. బోలు ఏం చేసిందంటే - ఒక సంచిలో కొన్ని దూది ఉండలు, మరో సంచిలో ఉప్పురాళ్లు పెట్టి, వాటిని మూటల్లా కట్టింది. దూది సంచినేమో తను తీసుకుంది, ఉప్పుమూట కట్టిన సంచిని గోలు కిచ్చింది.\n\nసరే, రెండూ ఎగరడం ప్రారంభించాయి. బోలు ముక్కుకున్న సంచి తేలికగా ఉండటంతో అది సునాయాసంగా ఎగరసాగింది. చూస్తుండగానే గోలును మించిపోయింది. దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది.\n\nఇంతలో వర్షం కురవడం మొదలైంది. బోలు ముక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది. గోలు ముక్కుకున్నది ఉప్పుమూట కావడాన వానకు ఆ ఉప్పంతా కరిగి, తేలిగ్గా మారిపోయింది.\n\nదాంతో బోలు ఆయాసంతో వెనకపడిపోతే, గోలు మాత్రం సులువుగా ఎగిరి పైపైకి వెళ్లిపోయింది. విజేతగా నిలిచింది. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయింది బోలు పరిస్థితి!\nనీతి: మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని, అంతిమ విజయం మాత్రం న్యాయానిదే! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 160,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎవరు గొప్ప? - చిట్టి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 160,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది జిత్తులమారిదే కాదు. ఆకతాయిది కూడా! ఓ రోజది అనుకోకుండా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది.\n\nదాని నుంచి బయట పడడానికి రకరకాలుగా ప్రయత్నించింది. ఎట్టకేలకు బయటపడింది. కాని దాని తోక మాత్రం అందులో ఇరుక్కుపోవడంతో గట్టిగా లాగేసరికి పుటుక్కున తెగిపోయింది. బయటకి వచ్చాక తనకు తోక లేకపోవటం చూసి నాలుక్కరుచుకుంది. తోక లేకపోతే అడవిలోని మిగిలిన నక్కలన్నీ తనను ఎగతాళి చేస్తాయే, ఎలాగా అనుకుంది. చివరికి ఓ ఉపాయం ఆలోచించింది, అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. తానో మహారాజులాగా అభినయిస్తూ ఇలా ప్రసంగించింది.\n\n‘‘మిత్రులారా! తోక వల్ల మనకు ఎన్ని ఇబ్బందులెదురవుతున్నాయో తెలుసా! ఒక్కోసారి వేటగాళ్లకు ముందుగా మన తోకే దొరుకుతుంది. దాంతో మనం వాళ్లకి దొరికిపోతాం. ఆ తర్వాత నానా తంటాలూ పడాల్సి వస్తుంది. అందుకే మనందరం మన తోకలను తెంపేసుకుంటే సరి! ఏమంటారు?’’ అంది ఎంతో తెలివిగా! అడవిలోని జంతువులన్నింటికీ దీని సంగతి బాగా తెలుసు. అందుకే దాని అతి తెలివికి అవన్నీ ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత తెలివి తెచ్చుకున్నాయి.\n\n‘‘నీ జిత్తులు మా దగ్గర చూపించకు, గతంలో ఆ తోక గురించి ఎన్ని కబుర్లు చెప్పేదానివి! అసలు తోకే లేకుంటే మనకు అందమే ఉండేది కాదన్నావు, ఇప్పుడు నీ తోక తెగేసరికి మా అందరి తోకలూ కత్తిరిద్దామని కుతంత్రం పన్నావు. నీ ఆటలు మా దగ్గర సాగవు. నీలాంటి తోకలేని నక్క ఈ అడవిలోనే ఉండటానికి వీల్లేదు’’ అంటూ దాన్ని దూరంగా తరిమికొట్టేశాయి. నీతి: అతి తెలివి అన్నివేళలా పని చేయదు సరికదా ఒక్కోసారి అది అనర్థాలకు కూడా దారితీస్తుంది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 161,
        "IMAGE": "cat_1",
        "NAME": "తోక తెగిన నక్క! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 161,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు గడ్డిని నెమరేస్తుండే ది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి\n\n‘‘మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు.\n\nనీ గిట్టలన్నీ అరిగిపోయాయి. మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు! నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్కపెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు తెంచుకో! పచ్చికబయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు’’ అంటూ హితబోధ చేసింది.\n\nఅంతా విన్న ఎద్దు ‘‘మిత్రమా! నీవ నుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు’’ అని తాపీగా చెప్పింది.\nఆ మాటలతో కాకికి కళ్లు తెరుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.\nనీతి: ఇతరుల దగ్గర్నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండికన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్న. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 162,
        "IMAGE": "cat_1",
        "NAME": "కాకి ఎద్దు - చిట్టి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 162,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వలీదాద్‌ వడ్రంగి పని చేసేవాడు. అతనికి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. అతను సంపాదించిన దాన్లో ఎక్కువ ఖర్చయ్యేది కాదు. మిగిలిన డబ్బంతా ఒక పాత్రలో వేసి దాచిపెట్టేవాడు. ఎవరికే సహాయం కావాలన్నా చేసేవాడు. ఊళ్లో అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.\n\nఅదే వూరి వాడైన సాహెబ్‌కి వలీ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందరూ వలీనే పొగుడుతున్నారని అసూయపడేవాడు. ఎలాగైనా ఊరందరి ముందు వలీని చెడ్డవాడిగా చిత్రించాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలేవీ ఊరి ప్రజలు నమ్మేవాళ్లు కాదు.\n\nకొన్ని రోజులకు వలీ దాచుకున్న డబ్బుతో పాత్ర నిండిపోయింది. 'వెంటనే దీన్ని ఖాళీ చెయ్యాలి. లేకపోతే ఇకపై సంపాదించేది దాచడానికి వేరే పాత్ర లేదు' అనుకున్నాడు వలీ.\n\nఆ పాత్రను ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి అతని ముందు కుమ్మరించాడు. 'ఆ డబ్బుకు సరిపడా ఒక బంగారు కంకణం ఇవ్వమని కోరాడు.\nఅందంగా నగిషీలు చెక్కిన బంగారు కంకణం వలీకి ఇచ్చాడు నగల వ్యాపారి.\n\nఅయితే ఆ కంకణాన్ని ఏం చెయ్యాలో వలీకి అర్థం కాలేదు. తనెటూ పెట్టుకోడు కనుక ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. అంతలో అతనికి ఒంటెల బారు, వీటిమీద సరుకులు, ఒక వర్తకుడు కనిపించాడు.\n''అయ్యా! తమరెక్కడికి వెళ్తున్నారు?'' అడిగాడు వలీ.\n''రాజమందిరానికి. యువరాజుగారు కొన్ని కొత్త దుస్తులు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అవి తీసుకెళ్తున్నా'' అన్నాడు వర్తకుడు.\n''దయచేసి ఈ కంకణం అతనికి ఇవ్వండి. ఇది వలీ కానుక అని చెప్పండి'' అని ఆ కంకణాన్ని వర్తకుడికి అందజేశాడు.\nవలీ పంపిన కంకణం యువరాజుకి ఎంతో నచ్చింది. ప్రతిగా అతను కొన్ని అందమైన సిల్కు వస్త్రాలు అదే వర్తకునితో పంపాడు.\nవీటిని తీసుకుని తిరుగు ప్రయాణంలో వలీకి అందజేశాడు వర్తకుడు.\n''వీటిని నేనేం చేసుకోను?'' అన్నాడు వలీదాద్‌.\n\n''నీకు అవసరం లేకపోతే ఎవరికన్నా ఇవ్వు. యువరాజుగారు పంపించారు. నీను ఇస్తున్నాను. అంతే. ఇక వాటిని ఏమైనా చేసుకో'' అన్నాడు వర్తకుడు.\n''ఎవరికి ఇవ్వను? నాకెవరూ లేరు. ఇటువంటి సిల్కు దుస్తులు నేనెప్పుడూ వేసుకోలేదు. వీటిని ఎవరికి ఇస్తే బాగుంటుందో నువ్వే చెప్పు?'' అన్నాడు వలీ.\n''పక్కరాజ్యంలోని సుల్తాన్‌ మహారాజుకు ఇవ్వు. ఆయనికి ఇటువంటి సిల్కు దుస్తులంటే చాలా ఇష్టం. వీటిని తప్పక తీసుకుంటారు. నీకు మంచి బహుమానం ఇస్తారు'' చెప్పాడు వర్తకుడు.\nబహుమానం అవసరం లేదు. వీటిని తీసుకుంటే చాలనుకుని, వర్తకుడు చెప్పిన ప్రకారమే వాటిని సుల్తాన్‌ మహారాజుకి పంపించాడు వలీ.\nవాటిని చూసి సుల్తాన్‌ చాలా సంతోషించాడు. వాటికి బదులుగా ఆరు మేలుజాతి గుర్రాలను వలీకి కానుకగా పంపించాడు.\nవాటిని ఏం చేసుకోవాలో తెలీక తిరిగి యువరాజుకి పంపించాడు వలీ.\n''ఈ వలీ ఎవరు? నాకెందుకు కానుకలు పంపిస్తున్నాడు?'' యువరాజు తన స్నేహితులను అడిగాడు.\n\n''ఇతనెవరో తన సంపదతో మీ మనసు చూరగొనాలని ఇలా విలువైన కానుకలు పంపుతున్నాడు. ఈ సారి అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప కానుక పంపించండి. దాంతో అతని గర్వం అణుగుతుంది'' అన్నారు వాళ్లు.\nవెంటనే వలీకి 20 గుండిగల నిండా వెండి నాణేలు పంపాడు యువరాజు.\n''ఒంటరిగా ఉండేవాణ్ణి. ఇంత సంపద నేనేం చేసుకోను'' అనుకున్న వలీ దాన్ని సుల్తాన్‌ మహారాజుకు పంపించాడు. అంత సంపదను చూసి సుల్తాన్‌ ఆశ్చర్యపడ్డాడు.\n''ఈ వలీ ఎవరు? నాకెందుకు ఇన్ని కానుకలు పంపిస్తున్నాడు? అని సుల్తాన్‌ తన సలహాదారుణ్ణి అడిగాడు.\n\nఇతనెవరో చాలా గొప్ప ధనవంతుడిలా ఉన్నాడు. తన సంపదతో మీ మనసును ఆకట్టుకోవాలని, తన గొప్పను ప్రదర్శించుకోవాలని ఇంత విలువైన సంపదను పంపిస్తున్నాడు మహారాజా. అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప బహుమతిని పంపించండి. అప్పుడు మీరంటే ఏంటో అతనికి తెలుస్తుంది'' అన్నారు వాళ్లు.\n20 గంగాళాల నిండా విలువైన రత్నాలు పంపించాడు సుల్తాన్‌.\nఇంత సంపద నేనేం చేసుకోను? అనుకున్న వలీ వాటిని తిరిగి యువరాజుకి పంపాడు.\n\nఇంత విలువైన రత్నాలు పంపించాడు... అసలు ఎవరితను? ఎలాగైనా అతన్నొక సారి చూడాలనుకున్న యువరాజు తన స్నేహితులను వెంటబెట్టుకుని వలీ ఉన్న ఊరికి వచ్చాడు. అలాగే సుల్తాన్‌ మహారాజు కూడా వలీని చూద్దామన్న కుతూహలం కొద్దీ తన అనుచరులతో బయల్దేరాడు.\n\nఎలాగో కష్టపడి వలీ ఇంటిదగ్గరికి చేరుకున్నారు యువరాజు, సుల్తాన్‌ మహారాజులు. కానీ అతను ఇంటిదగ్గర లేడు. అటుగా వెళ్తున్న సాహెబ్‌ని వలీ అంటే ఎవరని అడిగారు.\n\nజరిగిందంతా తెలుసుకున్న సాహెబ్‌ తానే వలీనని చెప్పి వారి దగ్గర్నుండి విలువైన కానుకలు పొందాలనుకున్నాడు. వారి దగ్గరికి వెళ్లి తనే వలీనని చెప్పాడు కూడా. అది నిజమేనని నమ్మిన సుల్తాన్‌ మహారాజు, యువరాజులు అతనికి విలువైన కానుకలు ఇవ్వబోయారు.\n\nఅంతలోనే వలీ వచ్చి తన ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన సుల్తాన్‌, యువరాజులు నిజమైన వలీ ఎవరో తెలుసుకోవాలనుకున్నారు.\n\nవెంటనే ఆ ఊరిపెద్దలను పిలిపించారు. వారు సాహెబ్‌ ఎటువంటి వాడో, వలీ ఎంత మంచివాడో చెప్పారు. నిజం తెలుసుకున్న మహారాజు, యువరాజు సాహెబ్‌ని వంద కొరడా దెబ్బలతో శిక్షించారు. వలీని తమ రాజ్యంలో కోశాధికారిగా నియమించాడు సుల్తాన్‌.\nవలీ నిజాయితీ, నిస్వార్థం యువరాజుకి ఎంతగానో నచ్చాయి. అతణ్ణి తన స్నేహితుడిగా చేసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 163,
        "IMAGE": "cat_1",
        "NAME": "వద్దంటే సంపద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 163,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి ''అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్తవయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్లమన్నా వెళ్లడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటివాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి, దారిలో పెట్టాలి'' అని వేడుకున్నారు.\nశ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు.\n''ఏంటి పాండయ్యా! ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా?'' అడిగారు రాయలువారు.\n\n''అయ్యా! నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించీ పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు'' చెప్పాడు పాండయ్య.\n''నేను నిన్ను పనిలో పెట్టుకుంటా'' అని చెప్పి...\nభటులతో ''వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి'' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు.\nభటులు పాండయ్యని తీసుకెళ్లారు.\n''మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్లండి'' అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.\nదండంపెట్టి వెళ్లిపోయారా దంపతులు.\nలలల తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. ''నేనీ పని చెయ్యను. వెళ్లిపోతాను'' అని పేచీ పెట్టాడు.\n\n''లద్దె ఎత్తి, పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పనిచేయకుండా రోజుకో వంద కొరడాదెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో... ఇది రాజుగారి ఆజ్ఞ'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య.\n\n''లద్దే ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను'' అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య.\n\nఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిడండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది.\n\nమరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్నీ జేబులో వేసుకుని, గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం, జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేక పోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు.\n\nఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ''ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్లి పోవచ్చు'' అన్నాడు గుర్రపుశాల కాపలా దారు కాంతయ్య.\nపాండయ్య బేర్‌మన్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు.\n\n''అయ్యా! మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్లాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు'' అని మూడు వందల అరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు.\nరాయలు చిన్నగా నవ్వాడు.\n\n''తమరివల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే, పిచ్చివాడై పోతున్నాడు. ఇలా అర్థాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి, ఏదో ఒక పని ఇప్పించి, మా కుటుంబాన్ని ఆదుకోండి'' అని వినయంగా నమస్కరించారా దంపతులు.\n\nశ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి ''మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను'' అని చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 164,
        "IMAGE": "cat_1",
        "NAME": "సోమరి పని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 164,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం... బోలెడంత మంది పనివాళ్లు... ఇంటినిండా బంధుమిత్రులతో వైభవంగా జీవించేవాడు.\n\nఆ భవనానికి కొద్దిదూరంలో ఓ పేదవాడు. చిన్న పూరిగుడిసె... వారసత్వంగా వచ్చిన తోట... అందులో పండ్లచెట్లు, పూల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఫలసాయంతో పొట్టపోసుకునేవాడు.\n\nధనికుడికి ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోవడంతో కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్రపోవడానికి నోచుకోలేదు. దాంతో అసంతృప్తితో బాధపడేవాడు. పేదవాడు మాత్రం ఎంతో హాయిగా, ఆనందంగా జీవించేవాడు. అన్నీ ఉన్న తనకు లేని సంతోషం ఏమీలేని ఆ పేదవాడికి ఎలా దక్కుతోందో తెలుసుకోవాలనుకున్నాడు ధనికుడు.\n\nదాంతో ఓ రోజు పేదవాడి దగ్గరకెళ్లి, అతడి సంతోషానికి కారణమేంటో చెప్పమన్నాడు. కష్టపడి పని చేయటం, ఉన్నదానితో తృప్తి పడటమే తన ఆనందానికి కారణాలని చెప్పాడు పేదవాడు. ధనికుడు ఎంతో సంతోషంతో అతణ్ని తన ఇంటికి పిలుచుకెళ్లి, విందుభోజనం పెట్టి, వెయ్యి బంగారునాణాలు కానుకగా ఇచ్చాడు.\n\nఆ రోజు రాత్రి ధనికుడికి కంటినిండా నిద్రపడితే, తన దగ్గరున్న డబ్బును ఎవరైనా దోచుకుపోతారేమోనన్న భయంతో పేదవాడికి కునుకే కరువైంది. దాంతో అతడు మర్నాడు ఆ డబ్బు మూటను తిరిగి ధనికుడికిచ్చేసి వ చ్చేశాడు. ఆ రోజు యథాప్రకారం హాయిగా నిద్రపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 165,
        "IMAGE": "cat_1",
        "NAME": "పేద గొప్ప - చిట్టి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 165,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక సముద్రతీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది. ఒకరోజు అది మాంసం కోసం అడవిలోకి వెళ్లింది. అక్కడ ఓ తోడేలు ఎదురుపడింది.\n‘‘నక్కా నువ్వు ఎక్కడ ఉంటున్నావు?’’ అని అడిగింది తోడేలు.\n‘‘నేను ఇక్కడికి దగ్గర్లో ఉన్న సముద్రతీరాన ఉంటున్నాను’’ అని జవాబిచ్చింది నక్క.\n‘‘ఏంటీ? సముద్రమా? ఆ మాటే నేనిప్పటిదాకా వినలేదు’’ అని తోడేలు ఆశ్చర్యంగా చూసింది.\n‘‘నా ముందంతా నీళ్లే. మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో. నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను’’ అని నక్క తోడేలును తన వెంట సముద్రతీరానికి తీసుకుపోయింది.\n\nఅవి రెండూ సముద్ర తీరం చేరాయి. అప్పుడు ఒక అల తీరంకేసి వ స్తోంది. ఆ కెరటాన్ని చూసిన నక్క ‘‘రా, కెరటమా రా, నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. వాడికోసారి కనిపించి మళ్లీ వెనక్కి వె ళ్లిపోవాలి’’ అంది. అల వచ్చి వెళ్లిపోయింది. తోడేలు విస్తుపోయింది.\n‘‘కె రటమా... నువ్వు వచ్చిపోతుండు. నేనూ నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం’’ అని నక్క తోడేలుతో మాటల్లో పడింది. అలలు వస్తున్నాయి. పోతున్నాయి.\n‘‘నీ అధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది. వెళ్లొచ్చా?’’ అనడిగింది తోడేలు. వెళ్లమంది నక్క.\nసముద్రంలోకి అడుగుపెట్టిన తోడేలు కొంచెం దూరం వెళ్లిందో లేదో పెద్ద అలొచ్చింది. ఆ అల తాకిడికి తట్టుకోలేక పల్టీకొట్టింది. దాంతో ఊపిరాడక చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చింది.\nనీతి: ఎవరైనా ఏదైనా చెప్పింది వినడం తప్పుకాదు. కానీ ఆ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ముందు వెనుకలు ఆలోచించడం అవసరం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 166,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెలివి తక్కువ తోడేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 166,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది, ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది, ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.\n\nఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో! పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.\n\nపులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.\n\nఅడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవచణురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవచణురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 167,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఆవు-పులి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 167,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా, నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి, తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు.\n\nపండితులు రాజుగారి ఆజ్ఞను శిరసావహించి పురుషోత్తముడిని తమతోపాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగీ తండ్రివద్దకు తీసుకొచ్చారు. \"మహారాజా..! మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామనీ, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండని\" అన్నాడు పండితులు.\n\nదీంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడయిన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి.. \"మహారాజా..! యువరాజుగారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని\" సూచించాడు.\n\nఅవును నిజమే కదా..! అని మనసులోనే అనుకున్న రాజుగారు.. \"సరే.. ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండని\" మంత్రిని అడిగాడు. \"మహారాజా..! ఈ భవిష్యత్ జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు గానీ, లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం\" అని చెప్పాడు మంత్రి.\n\nతనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసనీ.. అతడయితే మన రాజకుమారుడికి తగిన వివేకాన్ని, విచక్షణను నేర్పగల సమర్థత కలిగినవాడని చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా.. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.\n\nమూడు నెలల తరువాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకొచ్చిన మాధవుడు.. తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలిపించి మీరే రాకుమారుడిని పరీక్షించండని అన్నాడు. వృద్ధమంత్రి లోపలి గదిలోకి వెళ్లి గుప్పిట్లో ఏదో పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు.\n\nపురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా \"ఉంగరం\" అని చెప్పాడు. దాంతో రాజుగారితోపాటు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి కూడా ఆశ్చర్యానికి గురై నోట మాట రాకపోగా.. \"సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా..?\" అని ప్రశ్నించాడు.\n\n\"ఏమీలేదు మంత్రివర్యా...! మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్లి వచ్చిన తరువాత ఉంగరం మీ వేలికి లేదుకదా..!\" అన్నాడు. దీనికి సంతోషించిన మంత్రి.. \"మహారాజా..! పరిశీలన ఉంటే, భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉంద\"ని అన్నాడు.\n\nతన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజావారు.. వృద్ధ మంత్రితోపాటు, తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి, సత్కరించారు. ఇక ఆరోజు నుంచి భవిష్యత్తుపై బెంగలేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 168,
        "IMAGE": "cat_1",
        "NAME": "రాజకుమారుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 168,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక నక్క. ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని దాటింది. నగరంలోకి వచ్చి పడింది. నెమ్మదిగా నేత పనివాళ్ల వాడకు వెళ్లింది. దాహం వేయడంతో నీళ్ల పీపా అనుకుని నీలిమందు కలిపిన ఓ పీపాలోకి దూకింది. దాంతో అది నీలినక్కగా మారిపోయింది. ఎలాగో మళ్లీ అడవిలోకి చేరుకుంది.\n\nతీరా అది అడవిలోకి వెళ్లేసరికి జంతువులు దాన్ని గుర్తించలేక పోయాయి. నీలిరంగులో వుండే సరికి ఇదేదో కొత్త జంతువనే అనుకున్నాయి. ఆ జిత్తుల మారి నక్క తన రంగుతో లాభం పొందాలనుకుంది. అన్ని జంతువులను చేరబిలిచి, ‘‘నేను మీ కొత్త రాజును. నాకు రోజూ మీరే ఆహారం తెచ్చి పెట్టాలి’’ అంది. ‘‘...అందుకు ప్రతిఫలంగా మీకే హానీ చేయను’’ అని కూడా హామీ ఇచ్చింది. దాంతో జంతువులన్నీ తలలూపాయి. అప్పటినుంచి దానికి తామే ఆహారం సమకూర్చి పెట్టసాగాయి.\n\nఅలా కాలం గడిచింది. ఒక రాత్రి కొన్ని నక్కలు ఊళ వేయసాగాయి. ఒంటరిగా ఉన్న నక్క అది వింది. తాను కూడా బదులుగా వూళ వేసింది. అంతే, దొరికిపోయింది. ఆ జంతువులన్నీ అది నక్కే అని తెలుసుకుని ఇక తరిమి తరిమి కొట్టాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 169,
        "IMAGE": "cat_1",
        "NAME": "నీలిరంగు నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 169,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది.. నేను మా అత్తగారింటికి వెళ్లాలి అని.. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగా రింటికి బయలుదేరింది. అలా..అలా.. నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పేద్ధ బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది.\n\nఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువెైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు ? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా?...’ ఆలోచించింది.. ఒక ఉపా యం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి, మిగతా తనపెై రెండు కాళ్లను ముడు చుకుని ఎంతో కష్ట పడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది..\n\n‘ఏం! నక్కబావ ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్‌?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రా గానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను.. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచీ అ న్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది. ’ అని పులితో బాధగా అన్నది నక్క..పాపం పులికి జాలి కలి గింది.. నక్కతో అన్నది కదా..‘సరే ! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా.. అ ప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను..నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను..నేను మొయ్యనుగాక మొ య్య ను.. త్వరగా వెళ్లిరా..’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది.\n\nనక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తనభారం అప్ప చెప్పింది. ఇక పులికూడా ఆ కొండ ఎక్క డ మీ ద పడుతుందోనని కాళ్లు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పు డు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ..‘వస్తా పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వ చ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే..’ అంటూ నీరసంగా మాట్లాడింది.\n\n‘పాపం.. వెళ్లిరా..’ అంటూ నక్కమీద పులి జాలిపడింది..పులి. అంతే ఇక కొద్దిగా ముం దుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క.గంట...గంటా గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్ఛర్యం.. కొండ కొద్దిగా కూడా కదలలేదు. ‘అరె..నక్క నన్ను ఎంత మోసం చేసిం దీ’ అనుకుంటూ ఈ సారికి బతికి పోయింది అనుకుంటూ తనదారిన తాను పులి వెళ్లిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 170,
        "IMAGE": "cat_1",
        "NAME": "నక్కబావ సమయస్ఫూర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 170,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులమారి. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడవి రాజు సింహం దగ్గరకు వెళ్లింది. ‘‘రాజా మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు సహాయం చేయాలి’’ అని అడిగింది నక్క. పందిమాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది, ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది.\n\nనక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్లింది. ‘‘నిన్ను అడవికి రాజును చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువి కావచ్చు’’ అని ఆశపెట్టింది. తెలివితక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్లింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్లింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయింది. పంది తప్పించుకుని పారిపోయింది.\n\nనక్క మరలా పంది దగ్గరకు వెళ్లింది. ‘‘ఎందుకు పారిపోయి వచ్చేశావు?’’ అని అడిగింది. ‘‘సింహం నన్ను చంపబోయింది, తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పింది పంది. ‘‘సింహం నిన్ను చంపటానికి రాలేదు. కాబోయే రాజువు కదా అని నిన్ను కౌగిలించుకుని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు’’ అని పందికి సర్ది చెప్పి దానిని మళ్లీ సింహం దగ్గరకు తీసుకెళ్లింది నక్క.\n\nసింహం దగ్గరకు వెళ్లిన తర్వాత పందిని ‘తల వంచి నమస్కరించ’మని చెప్పింది నక్క. పంది తల వంచగానే, సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క వారించింది.\n\nపంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది. అలాగేనని వెళ్లింది సింహం. అది స్నానం చేసి వచ్చే లోపుగానే పంది మెదడును తినేసింది నక్క. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది. ‘‘రాజా, ఆ పందికి మెద డే ఉంటే రెండుసార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకు కొస్తుంది?!’’ అన్నది నక్క. ‘నిజమే దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు’ అనుకుంది సింహం. సింహం మాంసం తినటం మొదలు పెట్టింది. ఈ లోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క ఆ విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 171,
        "IMAGE": "cat_1",
        "NAME": "మెదడు లేని వరాహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 171,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది.\n\n‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క.\n\nమన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.\n\nమూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 172,
        "IMAGE": "cat_1",
        "NAME": "తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 172,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.\n\nచిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... \"ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం...\" అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.\n\nఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.\n\nచిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... \"ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు\" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 173,
        "IMAGE": "cat_1",
        "NAME": "చిట్టెలుక ఉపకారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 173,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. తను ఉండటానికి ఎంతో శ్రమపడి ఒక గుహను నిర్మించుకుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు ఏరుకునివచ్చి గుహకు అలంకరించింది. దాంతో ఎలుగుబంటి గుహ చాలా అందంగా తయారైంది. జంతువులన్నీ వచ్చి ఆ గుహను చూసి ఎలుగుబంటిని అభినందించసాగాయి. ఆనోటా ఈనోటా ఈ విషయం ఆ అడవికి రాజైన సింహానికి తెలిసింది. దానికి ఈర్ష్య కలిగింది. ‘అడవికి రాజును నేను. అంత అందమైన గుహ నా దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండటానికి వీల్లేదు’ అనుకుని వెంటనే ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరింది.\n\nసింహం ఆ గుహను చూసింది. ‘నిజంగా చాలా బాగుంది. నేనిక్కడే ఉంటాను’ అనుకుంటూ లోపలకి వెళ్లింది. అక్కడున్న ఎలుగుబంటితో ‘‘ఇకనుండి ఈ గుహ నాది. నువ్వు బయటకు వెళ్లి మరో గుహ కట్టుకోపో’’ అని శాసించింది.ఎలుగుబంటికి ఏం చేయాలో తోచలేదు, పాపం ఏడుస్తూ వెళ్ళిపోసాగింది. దారిలో ఒక నక్క ఎదురైంది. జరిగిన విషయం విని నక్క ‘‘బాధ పడకు. నేను చెప్పినట్టు చెయ్యి’’ అంటూ ఒక ఉపాయం చెప్పింది.\n\nమరునాడు ఎలుగుబంటి ఒక సంచి తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతోంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆ సంచిని అక్కడే ఉన్న ఒక బల్ల మీద పెట్టి బయటకు వచ్చేసింది. కాస్సేపటి తరువాత సింహం నిద్ర లేచింది. బల్లమీద సంచి కనబడగానే ఆసక్తిగా దాన్ని విప్పి చూసింది. సంచి మూతి తెరుచుకోగానే ‘గుయ్‌’ మని కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చాయి. అంతసేపు సంచిలో బంధింపబడి ఉండటం వల్ల అవి చాలా కోపంగా ఉన్నాయి. ఒక్కసారిగా అవి సింహం మీదకు దాడి చేసాయి.\n\nవాటిని తప్పించుకోవడానికి సింహం గుహ బయటకు పరుగెత్తింది. తేనెటీగలు దాన్ని వదలక వెంటబడి మరీ కుట్టసాగాయి. అలా తేనెటీగలు సింహాన్ని చాలా దూరం తరిమాయి. సింహం ఎలాగోలా వాటి బారి నుండి తప్పించుకుంది. ఆ సంఘటనతో భయపడ్డ సింహం మళ్ళీ ఎలుగుబంటి గుహ పేరెత్తలేదు. సింహం పీడ విరగడవడంతో ఎలుగుబంటి తిరిగి తన గుహలో ఆనందంగా ఉండసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 174,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎలుగుబంటి ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 174,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.\n\nతాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.\n\nగుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 175,
        "IMAGE": "cat_1",
        "NAME": "కుందేలుకు గుణపాఠం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 175,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "నది ఒడ్డున ఉన్న ఒక మర్రిచెట్టుపైన ఒక పావురం నివసిస్తూంది.ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది.ఆ చీమను ఎలాగైన కాపాడాలి అనుకున్నది.వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్ళలో వేసింది పావురం.\n\nఆ అకుపై చీమ ఎక్కి కూర్చుంది.తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురమును చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలను తెలియజేసింది చీమ. ఒకరోజు చీమ పక్షులకోసం నాలుగువైపుల గాలిస్తున్న వేటగాన్ని చూసింది.చెట్టుపైన కూర్చుని ఉన్న తన ప్రాణాలను కాపాడిన పావురాన్ని చూసింది.ఆ వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురం పైకి విల్లు ఎక్కు పెట్టి గురి పెట్టాడు.ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి ఆలస్యం చేయకుండ కుట్టింది.బాదతో వెటగాడు అరిచాడు.బాణం గురి తప్పింది.పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది.వేటగాడు వెళ్ళిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 176,
        "IMAGE": "cat_1",
        "NAME": "చీమ ప్రత్యుపకారం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 176,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు.వారు ఒకరోజు పక్కఊరికి ప్రయణమై వెళ్ళారు.మధ్యలో ఒక అడవి ఉంది.తిరుగు ప్రయాణమై వస్తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి ఒకటి వీరిని చూచింది.వీరివైపు పరుగెత్తుకు రావడం చూచారు.\n\nవెంటనే రామయ్య గబ గబ చెట్టుమీదకు ఎక్కి కూర్చున్నాడు.కాని సోమయ్య మాత్రం చెట్టు ఎక్క రాకరాక పొవడంతో చనిపోయినట్టుగాకింద పడుకున్నాడు.ఎలుగుబంటి సోమయ్య దగ్గరకు వచ్చి వాసన చూసి చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయింది.అది అటు వెళ్ళగానే రామయ్య చెట్టు దిగి వచ్చి ఏమి సోమయ్య ఎలుగుబంటి నీతో చెవిలో ఏదొ రహస్యం చెప్పినట్టుంది అని హాస్యామాడాడు.అప్పుడు సోమయ్య అందుకు బదులుగా స్వార్ధపరులతో స్నేహం చేయకు అని చెప్పింది అంటూ బదులిచ్చాడు.అది విన్నాకా రామయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 177,
        "IMAGE": "cat_1",
        "NAME": "స్వార్ధపరులతో స్నేహం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 177,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.\n\nఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 178,
        "IMAGE": "cat_1",
        "NAME": "రామయ్య ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 178,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.\n\n‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు.\n\nరాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు.\n\nచాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.\nవర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 179,
        "IMAGE": "cat_1",
        "NAME": "వర్తకుడి సమయస్ఫూర్తి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 179,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.\n\nవెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.\n\nగంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.\n\nచివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 180,
        "IMAGE": "cat_1",
        "NAME": "చిత్రకారుడి సమయస్ఫూర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 180,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.\n\nఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.\n\nతల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, \"నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!\" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... \"నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు\" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి \"తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది\" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. \"నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి\" అని అన్నాయి.\n\nఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 181,
        "IMAGE": "cat_1",
        "NAME": "టక్కరి నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 181,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.\n\nరోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.\n\nకుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. \"ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు\" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. \"అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను\" అంది కోపంగా.\n\n\"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!\" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.\n\nఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 182,
        "IMAGE": "cat_1",
        "NAME": "మతిలేని మృగరాజు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 182,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.\n\nఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.\n\nరాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. \"నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను\" అన్నాడు రాక్షసుడు.\n\nరాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు \"రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!\" అన్నాడు.\n\nఅంతలో అతడి భార్య \"మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి\" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.\n\nసరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి \"విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను\" అన్నాడు.\n\nవిక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, \"భేతాళా! ఆబాలుడి నవ్వులో \"ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?\" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు\" అన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 183,
        "IMAGE": "cat_1",
        "NAME": "బ్రాహ్మణబాలుడి కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 183,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే. ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.\n\nదాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.\n\nతైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు.\n\nవర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. \"అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?\" కుతుహలంగా అడిగాడు తైమూర్.\n\n\"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది.\"ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. \"హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. \"ఎందుకు?\" ఆత్రంగా అడిగాడు తైమూర్.\"ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్.\n\n\"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్.\n\nతైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.\n\nనసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్.\n\nమర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్.\n\nఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 184,
        "IMAGE": "cat_1",
        "NAME": "నసీరుద్దీన్ కథలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 184,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక సారి ఎవరో నసీరుద్దీన్ సాటిలేని విలుకాడు అంటుంటే, పాదూషా విన్నాడు. దాంతో ఆయనకి చాలా కుతూహలంగా అనిపించింది. సరే అని నసీరుద్దీన్ ని పిలిపించాడు. వాళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక చెట్టు కనిపించింది. వెంటనే పాదూషా నసీరుద్దీన్ ని ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని గురి చూసికొట్టమని కానీ 3 మాత్రమే అవకాశాలు అని చెప్పాడు. నసీరుద్దీన్ మొదటి బాణం పొరపాటున గురి తప్పింది. పాదూషా వెటకారంగా నవ్వాడు.\n\n\"నవ్వకండి, ప్రభూ! యిది తమరి నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత రెండో బాణం కూడా గురితప్పింది. పాదూషా మళ్ళీ నవ్వాడు.\"నవ్వద్దు, ప్రభూ!యిది తమరి మంత్రుల నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత మూడో బాణం మాత్రం సూటిగా వెళ్ళి కాండానికి గుచ్చుకుంది.\n\nనసీరుద్దీన్ వంగి సలామ్ చేస్తూ “వినయంగా చెప్పాలంటే యిది నసీరుద్దీన్ నైపుణ్యం” అన్నాడు. పాదూషా గతుక్కుమన్నాడు. గతుక్కుమన్నది నసీరుద్దీన్ చివరి మాటకి కాదు. `ఇందాకటి దాకా నసీరుద్దీన్ తనని, తన మంత్రులని అన్నప్పుడు తను నసీరుద్దీన్ కొట్టలేడు అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు కానీ తన మీద నసీరుద్దీన్ విసిరిన చలోక్తులకి ఎవరైనా నవ్వుతారేమోనని.’ ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 185,
        "IMAGE": "cat_1",
        "NAME": "సాటిలేని విలుకాడు నసీరుద్దీన్",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 185,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?\n\n“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.\n\nసత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.\n\n“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.\n\nఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 186,
        "IMAGE": "cat_1",
        "NAME": "బ్రహ్మరాక్షసుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 186,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒకరోజు. మామిడిమల్లి ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు.\"వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?\" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.\n\n\"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది\" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి. ఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. \"డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!\" అంటూ చెప్పుకొచ్చాడు.\n\n\"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి\" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. మహర్షిని ఆటపట్టించసాగారు.\"నీ దగ్గర ఏముంది ముసలోడా...?\" అన్నాడొక వ్యాపారి.ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ...\n\n\"నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు\" అన్నాడు. \"అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!\" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.పడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి.\n\nగాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను \"సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు\" అని చెప్పాడు.దీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.\n\nబ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... \"నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం...\" అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.అప్పుడు మహర్షి నవ్వుతూ... \"నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు\" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 187,
        "IMAGE": "cat_1",
        "NAME": "మహర్షి శంఖం - నీతి కథలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 187,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది.\n\n\"అయ్యో నా అందమైన బంతి\", అంటూ ఏడ్చిందా యువరాణి. \"ఏమయింది యువరాణి?\" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది. \"నా బంతి బావిలో పడిపోయింది\" ఏడుస్తూ చెప్పింది యువరాణి.\n\"ఏడవకు\", అంది కప్ప. \"నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?\" అని అడిగింది. \"నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?\" అని అడిగింది యువరాణి.\"అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను\". అంది కప్ప. \"సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను\", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.\n\nఅంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. \"ఆగు, ఆగు\", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.\n\n\"ఏమయింది, తల్లీ?\" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి.\"ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు\" అన్నాడు రాజు.యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. \"నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి\" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.\n\n\"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది\". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 188,
        "IMAGE": "cat_1",
        "NAME": "కప్ప- రాకుమారుడు - నీతి కథలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 188,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే గ్రామంలో రంగడు అనే బాలుడు ఉండేవాడు. వాడికి సోమరితనం ఎక్కువ. ఒక్కపని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బడికి వెళ్ళమని పంపిస్తే మధ్యలో బడి ఎగ్గొట్టి ఊరవతలి మైదానానికి వెళ్ళి ఆడుకునేవాడు. తల్లితండ్రులు ఎంత చెప్పినా, కొట్టినా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు.\n\nఒకరోజు రంగడికి ఆడుకోవడానికి ఎవరూ కనిపించలేదు. సరిగా ఆ సమయంలో వాడికి ఒక చీమ కనబడింది. ఆ చీమ ఆహారం మోసుకుని హడావుడిగా వెడుతోంది. ‘‘చీమా, చీమా ఎక్కడికి ఆ పరుగు. కాసేపు ఆగు. ఆడుకుందాం’’ అని అడిగాడు.\n\n‘‘నాకు అంత సమయం లేదు. వానాకాలం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించకపోతే రేపు నేను చాలా కష్టపడతాను. నేను రాను’’ అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది చీమ.\n\nఏమీ తోచక అలా బయటకు వెళ్లిన రంగడికి, చెట్టు కొమ్మ మీద కూర్చుని అరటిపండు తింటున్న ఒక కోతి కనిపించింది. ‘‘కోతి బావా! కోతి బావా! కోతికొమ్మచ్చి ఆడుకుందామా?’’ అని అడిగాడు.\n\n‘‘అమ్మో! నీతో నేను ఏ ఆటా ఆడలేను. మా యజమానితో నేను పట్నానికి వెళ్ళాలి. ఎన్నో తమషా ఆటలు ఆడి డబ్బు సంపాదించి పెట్టాలి. అతని కోసం ఎదురుచూస్తున్నాను. అదుగో మాటల్లోనే వచ్చేశాడు. ఇంకెప్పుడైనా ఆడుకుందాం. వస్తాను’’ అంటూ కోతి చెట్టు దిగి పరుగెత్తింది.\n\nరంగడికి ఎంతో నిరాశ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక ఎద్దు పొలం వైపు వెళ్తూ కనిపించింది. ‘‘ఎద్దు మామా! ఎద్దుమామా! నాతో కాసేపు ఆడవా?’’ అని అడిగాడు.\n\n‘‘ఇప్పుడు నేను పొలానికి వెళ్ళాలి. పంటలు పండించడానికి బోలెడంత పని చేయాలి. ఇప్పటికే నాకు ఆలస్యం అయ్యింది. రైతు అక్కడ నా కోసం ఎదురుచూస్తూంటాడు. నేను రాలేను!’’ అని చెప్పి ముందుకు కదిలింది ఎద్దు. అది విని రంగడు ఆలోచనలో పడ్డాడు. ‘అమ్మానాన్నలు పనుల్లోకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకోవడానికి వెళ్ళారు. ఇళ్లలో ఉన్న ముసలివారు కూడా ధాన్యం బాగు చేయడం లేదా, చిన్న పిల్లల్ని చూస్తూ ఇంటికి కాపలా ఉన్నారు. ఇలా ప్రతివారూ ఏదో ఒక పని చేస్తున్నారు. తనొక్కడేనా ఏ పనీపాటా లేకుండా ఉన్నది?’ ఈ ఆలోచన కలుగగానే రంగడికి తను చేస్తున్న తప్పేమిటో అర్థం అయింది. ఇక ఆరోజు నుండి తన ప్రవర్తన మార్చుకుని బుద్ధిగా బడికి వెళ్ళసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 189,
        "IMAGE": "cat_1",
        "NAME": "రంగడికి బుద్ధొచ్చింది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 189,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.\n\nవెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.\n\nఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.\n\nఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 190,
        "IMAGE": "cat_1",
        "NAME": "వింతగొర్రె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 190,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. అది అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో స్నేహం చేసింది. కొద్దిరోజుల్లోనే అవి రెండూ మంచి స్నేహితులై పోయాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. సరస్సు దగ్గరున్న నెమలిని చూసాడు. వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప బాధతో విలవిల్లాడి పోయింది.\n\n‘‘దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది.‘‘నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది’’ అన్నాడు వేటగాడు.కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ‘‘ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా?’’ అని అడిగింది.‘‘తప్పకుండా!’’ అన్నాడు వేటగాడు.\n\nకప్ప నీటిలోకి మునిగి, కాస్సేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ‘‘ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అని అంది.వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య ‘‘వెర్రినాగన్న! ఇది ఎంతో విలువైన ముత్యం. ఒక్కటే తీసుకుని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా!’’ అని చెప్పింది.\n\nవేటగాడు తిరిగి అడవికి బయలుదేరుతుంటే అతని భార్య ‘‘ఈ ముత్యం తీసుకెళ్ళి ఆ కప్పకు చూపించి ఇలాంటివే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పు. లేదంటే ఇంకేదైనా పట్టుకుని వస్తుంది’’ అంది. వేటగాడు సరస్సు దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. ‘‘మళ్ళీ వచ్చావేమిటి?’’ అని అడిగింది కప్ప.\n\n‘‘నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను’’ అని బెదిరించాడు.‘‘సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు. అలాంటివే వెదికి తెస్తాను’’ అంది కప్ప. వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి ‘‘అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పొగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నీకు దొరకదు. నేను కూడా దొరకను. వస్తా’’ అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 191,
        "IMAGE": "cat_1",
        "NAME": "వేటగాడి దురాశ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 191,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి పది గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకుని కోడిపిట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకువె ళ్లింది. గింజలు ఏరుకుని ఎలా తినాలో నేర్పించసాగింది.\n\nఅంతలో హఠాత్తుగా పొద చాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని ఇవతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జిబుజ్జి పిల్లల్ని పారిపొమ్మని హెచ్చరికగా అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకుని కోడిపిల్లలు చెల్లాచెదరయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకుని వెళ్లిపోయింది.\n\nఅది మొదలు ఆ పాము పొదల వెనుక, చెట్ల చాటున మాటువేయడం, అదను దొరకగానే కోడిపిల్లను పట్టుకుని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారమవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్లింది. కొద్దిదూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది.\n\nవెంటనే దాని దగ్గరకు వెళ్లి, ‘‘నువ్వు ప్రతిరోజూ నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు రెండు పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు’’ అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా ‘‘పోవమ్మా! నేను నా ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వచ్చి వాటిని కూడా తినేస్తాను’’ అంది.\n\nకోడిపెట్ట ఎంత బతిమాలినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చేయాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామనుకుంది. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్లి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని అర్థించింది. తేనెటీగలు ఒప్పుకున్నాయి.\n\nతేనెతుట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసికట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకుని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసి పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా దాని మీదకు దాడి చేసి కసిదీరా కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది.పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 192,
        "IMAGE": "cat_1",
        "NAME": "పాము-కోడిపెట్ట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 192,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక చిట్టి కుందేలు ఉండేది. దానికి పిరికితనం ఎక్కువ. పెద్ద జంతువులను చూడాలంటేనే భయం. తనకంటే పెద్ద జంతువులు వస్తున్నట్లు తెలిస్తే చాలు... ఏ చెట్టు వెనకో, పుట్ట వెనకో దాక్కునేది. చిన్న శబ్దం వచ్చినా, చివరకు ఆకులు గలగలమన్నా కూడా బెదిరిపోయి పరుగెత్తేది. దానిని మిగతా కుందేళ్ళు పిరికిదని వెక్కిరించేవి.\n\nకొన్ని రోజుల తరువాత కుందేలుకు జీవితం మీద విరక్తి కలిగింది ‘ఛీ... ఛీ.... నా అంత పిరికివాళ్ళు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. అనుక్షణం భయపడుతూ బతికేకంటే చచ్చిపోయినా బాగుణ్ణు’ అనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది. నీటిలో దూకి ప్రాణం తీసుకోవాలని సరస్సు వైపు వెళ్ళింది.\n\nఆ సరస్సు ఒడ్డున కొన్ని కప్పలు ఉన్నాయి. పెద్ద కప్పలు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి. చిన్న కప్పలు నీటిలోంచి ఒడ్డుకు, ఒడ్డు నుండి నీటిలోకి గెంతుతూ ఆడుకుంటున్నాయి. కుందేలు రాకను పసికట్టిన ఒక కప్ప ‘‘అటు చూడండి. ఒక కుందేలు ఇటువైపే వస్తోంది’’ అని గట్టిగా అన్నది.\n\nదాంతో కప్పల్లో కలకలం బయలుదేరింది. ‘‘అమ్మో ఇక్కడుంటే ప్రమాదం. పదండి... దాక్కుందాం పదండి’’ అని ఒకదానిని మరొకటి హెచ్చరించుకున్నాయి. వెంటనే దబ్బు దబ్బుమని సరస్సులోకి దూకాయి. కుందేలు అక్కడికి చేరేసరికి అక్కడున్న కప్పలన్నీ నీటిలోకి చేరిపోయి తల మాత్రం బయటికి పెట్టి కుందేలు వైపు భయంగా చూడసాగాయి. అది చూసి కుందేలు నోరు వెళ్ళబెట్టింది. ‘ఇదేమిటి, అవి నన్ను చూసి ఎందుకు భయపడ్డాయి. నేను వాటినేం చేయనుగా!’ అనుకుని ఆశ్చర్యపోయింది.\n\nఅప్పుడు కుందేలుకు ఒక సత్యం బోధపడింది. ‘ఈ ప్రపంచంలో తనకన్నా బలహీనమైన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికీ భయపడటం సరైనది కాదు. ఆపద కలిగినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకానీ ఆపద కలుగుతుందేమోనని ఊహించి భయపడటం మూర్ఖత్వం’ అనుకుంటూ అక్కడ నుంచి తన స్థానానికి బయలుదేరింది. ఆ సంఘటన కుందేలులో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. ఇక ఆరోజు నుండి చీటికీ మాటికీ భయపడకుండా, హాయిగా ఉండసాగింది. ఈ కుందేలులో వచ్చిన మార్పు మిగిలిన కుందేళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అన్నీ దాన్ని మెచ్చుకోసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 193,
        "IMAGE": "cat_1",
        "NAME": "కుందేలు నేర్చుకున్న పాఠం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 193,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు సోము తండ్రి పాతకాలం నాటి ఇనుపపెట్టెను శుభ్రం చేస్తూ ఉంటే, సోము దానిలో ఉండే బంగారు పళ్లాన్ని బయటికి తీసి, దానితో ఆడుకోసాగాడు. అది చూసిన తండ్రి సోము వీపు మీద రెండు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని, ‘‘ఇది ఆడుకునే వస్తువు కాదు. దీన్ని మన వంశప్రతిష్ఠకి గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం.\n\nఇంకెప్పుడూ దీనితో ఆడకు’’ అని కోప్పడ్డాడు. బంగారు పళ్లాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు సోము చాలా బాధ పడ్డాడు. ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు నడిచాడు.\n\nఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడసాగాడు. అంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి, ఆ చెట్టుకి మరో వైపున కూర్చున్నారు. వాళ్లు దొంగిలించిన నగల్ని పంచుకోవడానికి గొడవ పడసాగారు. వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న సోముకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి, బావిలోకి చూస్తూ , ‘బంగారు పళ్లెం’, ‘బంగారు పళ్లెం’ అని గట్టిగా ఏడ్వసాగాడు. అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లారు.\n\nసంగతేంటని అడిగారు. ‘‘మా ముత్తాత గొప్ప పండితుడు. అప్పట్లో ఆయనకి రాజుగారు పే...ద్ద బంగారు పళ్లెం బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో పెట్టెలో ఉన్న ఆ పళ్లాన్ని తీసి, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది. దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న కొడతాడు. ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు’’ అని సోము పెద్దగా ఏడవసాగాడు. దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది. ‘‘నేను తీసిస్తానంటే నేను తీసిస్తాను’ అంటూ పోటీ పడ్డారు. వాళ్ల చేతుల్లో ఉన్న నగలమూటని కింద పెట్టి ఇద్దరూ బావిలో దూకారు.\n\nసోము వెంటనే ఆ నగల మూటని తీసుకొని ఊరిలోకి పరుగెత్తాడు. ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకొని రాజభటులకి అప్పగించారు. ఆ నగలు ఎవరివో కనుక్కొని వారికి అందచేశారు. సోము తెలివిని, సమయస్ఫూర్తిని ఊరివారంతా మెచ్చుకున్నారు. సోము తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 194,
        "IMAGE": "cat_1",
        "NAME": "బంగారుపళ్లెం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 194,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు వేటకు వెళుతూ తనతో పాటు తోడేలు, నక్కలను తీసుకు వెళ్ళింది. ఆ మూడూ కలవడంతో ఆ రోజు అడవిలోని చాలా జంతువుల ప్రాణాలు అపాయంలో పడ్డాయి.\n\nతోడేలు, నక్క జంతువుల జాడలను పసికట్టి, వాటిని భయపెట్టి సింహం ఉన్న వైపునకు తోలాయి. సింహం ఏ మాత్రం శ్రమ లేకుండా ఆ జంతువులను చంపింది. నక్క, తోడేలు వాటి మాంసాన్ని సింహం గుహ ముందు కుప్పగా పోశాయి. ‘‘బాగా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఇక వేట చాలు. వీటిని మూడు సమభాగాలుగా చేసి మీ వాటా మీరు తీసుకు వెళ్ళండి’’ అంది సింహం.\n\nసింహం అలా చెప్పగానే తోడేలు ఉత్సాహంగా ముందుకు వచ్చింది. చాలా జాగ్రత్తగా జంతువుల మాంసాన్ని మూడు భాగాలు చేసి, ‘‘మీ వాటా తీసుకోండి రాజా!’’ అంది. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చి తోడేలును చంపేసింది. వాటాలు పంచమని ఈసారి నక్కతో చెప్పింది. నక్క చాలా తెలివిగా తోడేలు వేరు చేసిన కుప్పలను కలిపేసి, అందులోంచి కొంచెం పక్కకి తీసింది. ‘‘నాకు ఇది చాలు మహారాజా! అదంతా మీరు తీసుకోండి’’ అంది. సింహం సంతోషించి ‘‘ఇంత బాగా వాటాలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావు?’’ అని అడిగింది.‘అనుభవంతో సింహరాజా!’’ అంది నక్క. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 195,
        "IMAGE": "cat_1",
        "NAME": "సింహభాగం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 195,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.\n\nఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.\n\nకొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.\n\nఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 196,
        "IMAGE": "cat_1",
        "NAME": "రంగు వెలిసిన ఏనుగు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 196,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రాఘవేంద్రస్వాములు ఒక ఆశ్రమ పాఠశాలను నడిపేవారు. అందులో ఎంతోమంది విద్యార్థులు చిన్నతనంలోనే చేరి యుక్తవయసు వచ్చేసరికి మంచి విజ్ఞానవంతులై తిరిగి వెళ్ళేవారు. వారిలో విశ్వనాథుడు, శ్రీనివాసుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. అన్ని విద్యల్లోనూ ఇద్దరూ సమానమైన ప్రతిభ కనబరిచేవారు. స్వాముల వారికి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం. తన తరువాత ఆ ఆశ్రమపీఠాన్ని వారిలో ఒకరికి ఇవ్వాలనుకున్నారు. అయితే ఎవరు దానికి అర్హులో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు.\n\nఒకరోజు స్వాములవారు వారిని పిలిచి, ‘‘నాయనల్లారా! నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. రేపటిలోగా నాకో జింక చర్మం కావాలి. తీసుకురండి’’ అన్నాడు. కానీ, అసలు కారణం చెప్పలేదు.\n\nవిశ్వనాథుడు, శ్రీనివాసుడు చెరోదిక్కుకు వెళ్లారు. అడవిలో ఎక్కడైనా చనిపోయిన జింక కనబడుతుందేమోనని విశ్వనాథుడు వెతికాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ల్లకి వెళ్ళి జింక చర్మం అమ్మేవారి గురించి ఆరా తీశాడు. అక్కడకూడా దొరక్కపోవడంతో వట్టి చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.\n\nశ్రీనివాసుడు దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి ముందుగా వెళ్ళి విల్లు, బాణం, చురకత్తి మొదలైన ఆయుధాలు కొన్నాడు. అరణ్యానికి వెళ్ళి ఒక జింకను వేటాడి చంపాడు. దాని చర్మాన్ని ఒలిచి గురువుగారికి ఇవ్వడానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు వెళ్ళే సమయానికి విశ్వనాథుడు చేతులు కట్టుకుని గురువుగారి ముందు నిలబడి జింక చర్మం కోసం తను చేసిన ప్రయత్నం గురించి వివరిస్తున్నాడు.\n\nతరువాత శ్రీనివాసుడు ఎంతో గర్వంగా జింక చర్మం గురువుగారి ముందు పెట్టి దాన్ని తను ఎలా సంపాదించాడో చెప్పాడు. రాఘవేంద్రస్వాములు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత ఇలా అన్నారు, ‘‘నాయనా శ్రీనివాసా! నేను ఇంతకాలం ఈ భూమి మీద పుట్టిన ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంటుందనీ, సాటిజీవుల పట్ల దయ కలిగి ఉండాలనీ బోధిస్తూ వచ్చాను. నువ్వు విజ్ఞానాన్ని సంపాదించావే కాని, జ్ఞానాన్ని పొందలేదు. విశ్వనాథుడు నా మాటకంటే భూతదయకే ఎక్కువ విలువనిచ్చాడు. ఈ ఆశ్రమ బాధ్యతలను నా తదనంతరం అతనికి అప్పగిస్తున్నాను. ఒక జీవి చనిపోవటానికి నేనూ ఒక కారణం అయ్యాను. నా మనసేం బాలేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను హిమాలయాల్లోకి వెళ్ళిపోతున్నాను’’ అని చెప్పి ఆశ్రమ బాధ్యతలు విశ్వనాథుడికి అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 197,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఉత్తమ శిష్యుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 197,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఒకరోజున, మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో‌ఉన్న కర్రను నక్కమీదికి విసిరేసాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి, గుంటనక్క తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది; గుంటనక్క కూడా అడవిలోకి పరుగుతీసింది.\n\nఆ బంగారు పక్షి చాలా మంచిది. “నన్ను రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మనిషీ” అనుకున్నది అది, తన మనసులో. మరుసటిరోజున అది మల్లయ్యకోసం అదే అరుగు మీద కూర్చొని ఎదురుచూసింది. కానీ‌ మల్లయ్య రాలేదు. ఎందుకంటే, మల్లయ్యకు ఆరోగ్యం‌ బాగా లేకుండింది. ఆ తరువాత మల్లయ్య రెండు రోజులు మాత్రమే బ్రతికాడు- తరువాత అతను చనిపోయాడు.\n\nబంగారు పక్షి అతనికోసం ప్రతిరోజూ ఎదురుచూసేది. చివరికి అది మల్లయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి పోయింది. అప్పుడుగాని దానికి అర్థం కాలేదు- మల్లయ్య తనకు ఎందుకు కనబడలేదో. భర్త లేని సుబ్బమ్మను చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటినుండీ అది ప్రతిరోజూ వచ్చి, మల్లయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళటం మొదలు పెట్టింది.\n\nసుబ్బమ్మ ఆ ఈకల్ని ఒక్కటొక్కటిగా ప్రక్క ఊళ్ళో అమ్ముకొనేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అంతలో బంగారు పక్షి మరిన్ని ఈకలు వదిలి వెళ్ళేది. అలా రానురాను సుబ్బమ్మ ఊళ్ళోకెల్లా ధనవంతురాలైంది.\n\nసంపద పెరిగిన కొద్దీ సుబ్బమ్మకు ఆశకూడా హెచ్చింది. తనకు ఈకలు ఇస్తున్న బంగారు పక్షిని పట్టుకొని దాని ఈకలన్నిటినీ పీక్కోవాలని ఆమె కలలు కనటం మొదలు పెట్టింది. బంగారు పక్షికోసం మాటువేసి, ఆమె ఒకరోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి, ఆమెనుండి తప్పించుకొని పారిపోయింది. సుబ్బమ్మ దానికోసం తరువాత చాలా రోజులపాటు ఎదురుచూసింది గానీ, అది ఇక తిరిగి అటువైపుకు రాలేదు.\nఆశపోతు సుబ్బమ్మకు మామూలుగా వచ్చే బంగారుఈక కూడా దొరకకుండా అయ్యింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 198,
        "IMAGE": "cat_1",
        "NAME": "బంగారు పక్షి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 198,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "గణపతి స్వామి ఊరూరా తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు ప్రబోధిస్తుండేవారు. ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షణను ఆయన ఖర్చులకోసం స్వీకరించేవారు. అలా ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ ఆయనవద్ద పోగయ్యాయి. వాటిని మూటగట్టుకుని ఆయన బొడ్డులో దోపుకునేవారు. దీనిని గమనించిన ఓ ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు.\n\nఓ చెట్టుకింద సేదతీరుతున్న గణపతి స్వామిని కలిసిన ఆ ఆకతాయి.. \"అయ్యా.. నేనొక అనాధను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే, మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను\" అని వేడుకున్నాడు. అతడి మాటలు నమ్మశక్యంగా అనిపించటంతో సరేనని అంగీకరించిన గణపతి స్వామి \"సరే, అలాగే కానీ.. ఇదిగో ఈ జోలెను భుజానికి తగిలించుకో, వేరే ఊరికి వెళదాం..\" అన్నాడు.\n\nతన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆ ఆకతాయి గణపతి స్వామికి శిష్యుడిగా చేరిపోయాడు. ఇక అప్పటినుంచి ప్రతిరోజూ ఊరూరా తిరుగుతూ, రాత్రివేళల్లో ధర్మసత్రాలలో బసచేస్తూ గడిపారు ఆ ఇద్దరు గురు శిష్యులు. ఎవరి జోలెను వారి పక్కన పెట్టుకుని వాళ్లు నిద్రపోయేవారు.\n\nఅలా కొన్ని రోజులు గడచిన తరువాత గణపతి స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూట కోసం శిష్యుడు వెదికాడు. ఎంత వెతికినా కనిపించలేదు. చప్పుడు చేయకుండా స్వామీజీ జోలెను కూడా తీసి అంతా వెదికాడు. ఎక్కడా డబ్బుల మూట జాడ తెలియలేదు.\n\n\"అబ్బా గురువుగారు చాలా గట్టివారే. డబ్బుల మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు\" అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు. మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన గురువుగారివద్ద డబ్బుల మూట ఎప్పట్లాగే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు. ఆ రాత్రి కూడా డబ్బుల మూట కోసం అంతటా వెతికిచూశాడు. కానీ ఎక్కడా ఆ మూట కనిపించలేదు. అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడికి కనిపించలేదు.\n\nదీంతో విసుగుచెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి \"అయ్యా.. ఇలా ఊరూరా తిరుగుతూ ఎంతకాలం గడిపేది. ఏదైనా ఒక ఊళ్లో స్థిరపడి, ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని అనిపిస్తోంది. తమరు సెలవిప్పిస్తే వెళ్లిపోతాను\" అని అన్నాడు.\n\n\"అలాగే.. తప్పకుండా వెళ్లిరా నాయనా..? ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడచుకో..!\" అని ఆశీర్వదించి పంపించాడు. అయితే అలా వెళ్లిన శిష్యుడు కాస్త దూరం వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగివచ్చాడు. \"ఇప్పడే కదా వెళ్లావు. మళ్లీ ఇంతలోనే వచ్చేవేంటి నాయనా..?\" అని ప్రశ్నించారు గణపతి స్వామి\n\n\"మరేం లేదు అయ్యా.. నాదో చిన్న సందేహం. అది తీర్చుకుని వెళదామని మళ్లీ తిరిగి వచ్చాను\" అన్నాడు. \"సందేహమా.. ఏంటో అడుగు నాయనా..?\" అన్నారు గురువుగారు. \"మరేంలేదు స్వామీ.. మీ మొలకు ఎప్పుడూ ఓ డబ్బుల మూట వేలాడుతూ ఉంటుంది కదా.. అతి రాత్రిపూట కనిపించదేంటి..? ఎక్కడ దాస్తున్నారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది చెప్పరూ..?\" అన్నాడు.\n\n\"మొదట్లోనే నీ వాలకం నాకు అర్థమైంది నాయనా..? ప్రతిరోజూ రాత్రిపూట డబ్బుల మూట కోసం నీ వెదుకులాటను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. అందుకే నిద్రపోయేందుకు ముందుగా నా డబ్బుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను. మరుసటి రోజున నువ్వు లేచేందుకు ముందుగానే లేచి తీసుకుని నా జోలెలో పెట్టుకునేవాడిని\" చెప్పాడు గణపతి స్వామి.\n\n\"అలాగా..?\" అంటో నోరెళ్లబెట్టాడు దొంగ శిష్యుడు. \"చూడు నాయనా... ఇతరుల ధనాన్ని, వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు, తన దగ్గరున్నవాటిని ఎప్పటికీ గ్రహించలేడు\" అని అన్నాడు గణపతి స్వామి.\n\nసిగ్గుతో తలవంచుకున్న దొంగ శిష్యుడు \"అయ్యా.. తప్పు చేశాను. నన్ను మన్నించండి. ఇకపై ఇలాంటి అపరాధం జరగదు. ఎల్లకాలం మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను. ఇకపై ఇతరుల సొమ్ముకు ఆశపడను\" అంటూ ప్రాధేయపడ్డాడు.\n\nతప్పు తెలుసుకుని ప్రశ్చాత్తాప పడుతున్న శిష్యుడిని పైకి లేపి... \"ఇకనైనా బుద్ధిగా నడచుకుంటే అంతే చాలు నాయనా..? పదా పక్క ఊరికి వెళ్దాం...\" అంటూ బయల్దేరాడు గణపతి స్వామి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 199,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఆకతాయి శిష్యుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 199,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలంలో హిమవంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగే అతనెప్పుడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ప్రతిరోజూ విలాసాల్లో తేలిపోతుండేవాడు. ఆ రాజుకు తన సుఖం తప్ప, రాజ్య ప్రజలు ఎలా బ్రతుకుతున్నా పట్టేది కాదు. విలాస పురుషుడైన ఆ రాజు, తనకు తోచినప్పుడు వినోదాన్ని అందించేలాగా ఓ ఇద్దరు హాస్యగాళ్లను కూడా రాజ మందిరంలో ఉంచుకున్నాడు.\n\nఆ ఇద్దరిలోనూ ఎక్కువగా హాస్యాన్ని అందించే ఒకడికి \"ఉత్తమ అవివేకవంతుడు\" అనే బిరుదాన్నిచ్చాడు. అంతేగాకుండా ఆ పదాలను ఒక బంగారు పతకంలో చెక్కించి ఆ పతకాన్ని బిరుదుపొందిన హాస్యగాడి మెడలో తగిలించాడు రాజు హిమవంతుడు. అలా కాలం గడుస్తుండగా రాజు ముసలివాడు అయ్యాడు. వ్యాధితో మంచపట్టాడు.\n\nఓ రోజు ఉత్తమ అవివేవవంతుడికి కబురు పంపించాడు హిమవంతుడు. \"బ్రతికినంతకాలం నాకు లెక్కలేనంత హాస్యాన్ని అందించిన మిత్రమా..?! ఇక నేను వెళ్లిపోతున్నాను\" అన్నాడు రాజు బాధగా.\n\nవెంటనే అందుకున్న ఉత్తమ అవివేకవంతుడు \"మహారాజా.. గుర్రపు బగ్గీ కట్టించేదా..?\" అని అడిగాడు \"ఒరేయ్ అవివేకి.. బుద్ధిహీనుడా.. నేను వెళ్లేచోటికి గుర్రపు బగ్గీలపై వెళ్లరు\" అని అన్నాడు.\n\n\"అవునా ప్రభూ.. సరే అయితే ఏనుగును తెప్పించేదా..?\" మళ్లీ అడిగాడు అవివేకి. \"అబ్బా.. ఓరీ మూర్ఖా, అక్కడికి ఏనుగుపై కూడా వెళ్లరురా..?\" గట్టిగా అరిచి చెప్పాడు రాజు హిమవంతుడు.\n\n\"పోనీలేండి ప్రభూ.. సరే పల్లకీ అయినా తెప్పించేదా..?\" అన్నాడు అవివేకి. రాజుకు పట్టలేనంత కోపం, విసుగు వచ్చేసింది. వీడికి ఎలా చెబితే అర్థం అవుతుంది. \"ఎలా చెప్పినా అర్థంచేసుకోలేని నీకు ఎలా చెప్పేదిరా.. అక్కడికి పల్లకీ కూడా వెళ్లదురా\" అన్నాడు నీరసంగా.\n\n\"భలే చిత్రంగా ఉంది ప్రభూ.. పైన చెప్పిన వేటిపైనా వెళ్లలేని మీరు.. నడిచి వెళ్లేంత ఖర్మ ఎందుకొచ్చింది మహారాజా..?\" అన్నాడు అవివేకి బాధగా. ఇంత తెలివితక్కువవాడితో ఇన్నాళ్లూ వేగినందుకు మరణశయ్యపైన కూడా నవ్వు ముంచుకొచ్చింది మహారాజుకు. అయినా తమాయించుకుని \"ఓరీ పిచ్చి సన్యాసీ.. నేను వెళ్లే చోటికి నడిచి వెళ్లేందుకు కూడా వీలుకాదురా..?\" అన్నాడు.\n\n\"ఆహా.. భలేగుందే.. అయితే ఆ చోటు ఏదో చూడాల్సిందే.. ప్రభూ, ప్రభూ.. ఆ చోటుకి నేను కూడా మీతో వచ్చేదా..\" అడిగాడు అవివేకి. \"ఛీ పోరా దుర్మార్గుడా.. నన్ను ఈ సమయంలో కూడా వేధించుకు తింటున్నావు. అక్కడికి ఎవరంతట వాళ్లే వెళ్లాలిగానీ, ఇంకొకరితో కలిసి కాదు.\" అన్నాడు రాజు.\n\n\"ఇదేం విచిత్రం మహాప్రభూ.. ఎప్పటికప్పుడు నా ఆతృతను మరింతగా పెంచేస్తున్నారు. దయచేసి మీరు ఎక్కడికి వెళుతున్నారో ఇప్పటికైనా సెలవియ్యండి\" వేడుకున్నాడు అవివేకి. దాంతో ఆలోచనలో పడ్డ మహారాజు.. \"నేను ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలియదురా..\" అన్నాడు.\n\nవెంటనే ఆ ఉత్తమ అవివేకవంతుడు తన మెడలో వేలాడుతున్న బంగారు పతకాన్ని తీసి మహారాజుకి ఇచ్చేశాడు. అంతేగాకుండా.. \"మహా ప్రభూ.. దీన్ని ధరించేందుకు మీరే అర్హులు. ఇంత పెద్ద రాజ్యానికి రాజుగా ఉన్నారు. అష్టైశ్వర్యాలను అనుభవించారు. చివరికి ఎక్కడికి వెళతారో ఏంటోనని, జీవితంలో ఒకసారి కూడా ఆలోచించలేకపోయారు. ఇంతకంటే అవివేకం వేరే ఏముంటుంది చెప్పండి. కాబట్టీ.. ఇన్నాళ్లూ నా మెడకు వేలాడిన ఈ బంగారు పతకం మీకే సరిగ్గా సరిపోతుంద\"ని అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆ హాస్యగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 200,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఈ బిరుదానికి మీరే తగినవారు.. నేను కాదు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 200,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం వైకుంఠపాళి అనే నగరంలో ఓ గురువు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. \"బ్రహ్మం అంటే దేవుడని అర్థమనీ, దేవుడు నీలో, నాలో, అందరిలోనూ.. అంతటా ఉన్నాడనీ, సర్వమూ బ్రహ్మమేనంటూ\" గురువు శిష్యులకు బోధించాడు. గురువు చెప్పిన పాఠం ఆసక్తికరంగా ఉండటంతో, శివయ్యకు ఆ పాఠం బాగా నచ్చింది. దాన్ని గురువు ఎలా చెప్పాడో, అలాగే మనస్సులో ముద్రించుకున్నాడు.\n\nఒకరోజున శివయ్యకు వాళ్ల అమ్మ ఏదో పని చెప్పింది. దాంతో ఆ పనిమీద వీధిలో నడచివెళుతున్నాడు. సాయంకాలం కావటంతో రోడ్లపై జనంతో వీధులన్నీ సందడిగా ఉన్నాయి. ఇంతలో ఉన్నట్టుండి జనాలంతా కేకలుపెడుతూ పరుగులు పెడుతున్నారు. శివయ్యకు ఏమీ అర్థం కాలేదు. పక్కనే వెళుతున్న ఓ పెద్దాయనను ఆపి, జనమంతా అలా ఎందుకు పరుగులు పెడుతున్నారని ఆరా తీశాడు.\n\n\"ఏం లేదు నాయనా..? వీధిలో దేన్నో చూసి జడుసుకున్న ఓ ఏనుగు పరుగులు పెడుతోంది.. ఇక్కడే ఉంటే తొక్కేస్తుంది. నువ్వు కూడా పారిపో\" అని చెప్పి మెల్లిగా పరిగెడుతూ వెళ్లిపోయాడు ఆ పెద్దాయన. పెద్దాయన చెప్పినట్లుగా ఏనుగు ఒకటి తనవైపు పరుగులు పెడుతూ రావటాన్ని శివయ్య గమనించాడు.\n\nఏనుగుమీద కూర్చున్న మావటివాడు \"ఏనుగు బెదిరిపోయింది.. దాన్ని దారిలోకి తేవటం సాధ్యం కావటంలేదు. అందరూ పక్కకు తప్పుకోండి\" అంటూ కేకలు పెడుతూ, ఏనుగుకు కళ్లెంవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దీంతో జనాలంతా భయంతో పక్కకు తప్పుకుని వెళుతుంటే.. శివయ్య మాత్రం అలాగే నిలబడ్డాడు. పైగా \"నేనెందుకు తప్పుకోవాలి. నేనూ బ్రహ్మాన్నే, ఏనుగూ బ్రహ్మమే. బ్రహ్మానికి, బ్రహ్మంవల్ల అపాయం ఏమీ రాదు కదా..?\" అని మనసులో అనుకుంటూ ఉండిపోయాడు.\n\nఇంతలో ఏనుగు శివయ్యకు దగ్గరగా వచ్చేసింది. \"పక్కకి తప్పుకోమంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేంటయ్యా.. తప్పుకోకపోతే ఏనుగుకింద పడి చచ్చిపోతావు\" అంటూ మావటి హెచ్చరించాడు. అయినప్పటికీ శివయ్య అంగుళం కూడా కదల్లేదు. దీంతో ఏనుగు శివయ్య దగ్గరికి వచ్చి, తొండంతో పైకెత్తి పక్కకు విసిరేంది. అంతే శివయ్య దూరంగా స్పృహతప్పి పడిపోయాడు.\n\nకళ్లు తెరిచి చూసేసరికి ఇంట్లో మంచంపై పడి ఉన్నాడు శివయ్య. పక్కనే తల్లి రోదిస్తూ.. \"అందరూ అంతలా చెబుతున్నా అక్కడ్నించి ఎందుకు కదలలేదు నాన్నా..?\" అంటూ కొడుకును సుతిమెత్తగా మందలించింది. కొన్ని రోజులకు కోలుకున్న తరువాత గురువు వద్దకు వెళ్లిన శివయ్య.. \"మీరు ఆరోజు పాఠంలో అలా చెప్పారుగానీ.. ఏనుగు కూడా బ్రహ్మమే అయినప్పుడు అలా ఎందుకు చేసింది గురువుగారూ..?\" అంటూ నిలదీశాడు.\n\n\"అయినా ఏనుగు బ్రహ్మం తప్పేముంది శివయ్యా..? నువ్వూ బ్రహ్మమే, ఏనుగూ బ్రహ్మమే.. సర్వమూ బ్రహ్మమే అయినప్పుడు.. మావటి బ్రహ్మం నిన్ను ముందుగానే హెచ్చరించింది కదా..? మావటి కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆయన చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు..?\" అని ప్రశ్నించాడు గురువుగారు.\n\nదాంతో ఆలోచనలో పడ్డ శివయ్య.. పాఠాన్ని మక్కీకిమక్కీగా అర్థం చేసుకున్న తన తెలివితేటలను నిందించుకున్నాడు. ఇకపై అలా ఉండకూడదని, గురువు చెప్పిన పాఠాలను సందర్భానికి తగినట్లుగా మంచి విషయాలకు అన్వయించుకుని.. తెలివితేటలతో జీవించాలని మనసులోనే అనుకున్నాడు శివయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 201,
        "IMAGE": "cat_1",
        "NAME": "తలతిక్క బ్రహ్మం.. బుద్ధిచెప్పిన ఏనుగు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 201,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే ఊర్లో రాజయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు కష్టపడి పనిచేస్తూ.. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవాడు. కానీ రెండోవాడు మాత్రం తల్లిదండ్రుల పనుల్లో ఏ మాత్రం సాయపడకపోగా, సోమరిపోతుగా, జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతుండేవాడు.\n\nఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు, నలతగా ఉన్నప్పుడు తండ్రి చిన్నకొడుకును పిలిచి.. \"ఈరోజు నేను పొలంపనికి వెళ్లలేను, నువ్వెల్లి వరిపొలానికి నీళ్లు పట్టేసి రా నాయనా..?\" అని అడిగేవాడు. అయితే సోమరితనానికి బాగా అలవాటు పడిపోయిన చిన్నకొడుకు ఏదో ఒక సాకు చెప్పి సులభంగా తప్పించుకునేవాడు.\n\nకాలం ఇలా గడుస్తుంటే.. ఒకరోజున తన స్నేహితుడైన రామయ్యతో రాజయ్య మాట్లాడుతూ.. \"నా ప్రాణం ఉన్నంతవరకు చిన్నవాడిని ఎలాగైనా సరే పోషిస్తాను. నా ప్రాణం కాస్తా పోతే, వీడెలా బ్రతుకుతాడో\"నని వాపోయాడు. దాంతో స్నేహితుడిని ఊరడించిన రామయ్య \"నీ కొడుకును ఎలాగైనా సరే నేను మారుస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు\" అని అన్నాడు.\n\nమరుసటి రోజున వాకిట్లో కూర్చుని పళ్లు తోముకుంటున్న రామయ్యకు.. దార్లో రాజయ్య చిన్నకొడుతూ స్నేహితులతో కలిసి వెళుతుండటం కనిపించింది. వెంటనే అతడిని పిలిచిన రామయ్య.. \"రోజంతా ఇలా జులాయిగా తిరుగుతూ ఉండకపోతే మీ నాన్నకు పొలం పనుల్లో సాయం చేయవచ్చుగా..!!\" అని అన్నాడు.\n\n\"ఆరుగాలం కష్టపడితే వచ్చేవి నాలుగు గింజలే. అలాంటి పని నావల్ల కాదు. నేను ఏదైనా పనిచేస్తే బోలెడన్ని డబ్బులు రావాలి. అలాంటి పని అయితేనే చేస్తాన\"ని బల్లగుద్ది మరీ చెప్పాడు రాజయ్య చిన్నకొడుకు. దానికి చిరునవ్వు నవ్విన రామయ్య \"అయితే నీకు మంత్రపు గింజలు కావాల్సిందేరా..!!\" అన్నాడు.\n\n\"మంత్రపు గింజలా.. అవేంటి..? అయినా అవెందుకు..?\" అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాజయ్య చిన్నకొడుకు. \"మరేం లేదురా.. వాటి గురించి నాకు ఓ స్వామీజీ చెప్పాడు. ఆ మంత్రపు గింజలను పొలంలో నాటి, వాటికి ప్రతిరోజూ నీళ్లు పోసి కాపాడితే.. వాటిలో గింజలకు బదులుగా డబ్బులు కాస్తాయట..!\" అన్నాడు రామయ్య.\n\n\"అలాగా.. భలేగుందే.. నాక్కూడా ఆ గింజలు ఇప్పించండి..\" అంటూ రాజయ్య కొడుకు బ్రతిమలాడాడు. \"అలాగే తెచ్చిస్తాలే.. నువ్వు రేపోసారి వచ్చి కనబడు\" అన్నాడు రామయ్య. మరుసటి రోజు ఓ గుప్పెడు వడ్ల గింజలు తెచ్చి రాజయ్య కొడుకు చేతిలో పోశాడు రామయ్య. వెంటనే ఆత్రంగా పెరట్లో మంచి స్థలం చూసిన అతను అక్కడ వాటిని నాటాడు. ప్రతిరోజూ నీళ్లుపోస్తూ భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ వడ్ల గింజలు కొన్ని రోజులకు మొలకెత్తాయి.\n\nఓరోజు రాజయ్య ఇంటికి వచ్చిన రామయ్య \"ఏంట్రా చిన్నోడా.. మంత్రపు గింజలు మొలకెత్తాయా..?\" అని అడిగాడు. \"భలేగా మొలకెత్తాయి. రండి చూద్దురుగానీ..\" అంటూ పెరట్లోకి తీసుకెళ్లాడు రాజయ్య కొడుకు. వాటిని చూసిన రామయ్య వెంటనే వాటిని పీకి అవతల పడేశాడు. \"నేను ఇంతలా కష్టపడి పెంచి, కాపాడుకుంటే అలా పెరికి పారేశారేంటి..?\" అంటూ కోపంగా నిలదీశాడు రాజయ్య కొడుకు.\n\n\"ఆహా.. అవి సరిగా పెరగలేదు అందుకే పీకేశాను. పనికిరానివి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.. నీలాగన్నమాట..!!\" అన్నాడు రామయ్య అంతే కోపంగా. \"అదేంటి నాలాగా.. అంటున్నారు..?\" అన్నాడు రాజయ్య కొడుకు. \"మరి నీలాగా కాకపోతే మరేంటి..? కొన్నిరోజులుపాటు నువ్వు పెంచిన మొక్కల్ని పెరికేస్తేనే అలా బాధపడుతున్నావే.. ఎన్నో ఆశలతో నిన్ను పెంచి పెద్దచేసిన మీనాన్న.. తన కొడుకు ఎందుకూ కొరగాకుండా పోతున్నందుకు మరెంతలా బాధపడుతాడో ఎప్పుడైనా ఆలోచించావా..?\" అన్నాడు.\n\n\"అయితే మంత్రపు గింజలని చెప్పి ఇచ్చారు కదా.. వాటిని నాటితే డబ్బులు కాస్తాయని కూడా చెప్పారే.. ఎందుకలా..?\" అన్నాడు రాజయ్య చిన్నకొడుకు. \"మరేం లేదురా.. నిన్ను మార్చేందుకు నేనలా చెప్పానంతే. లోకంలో కష్టానికి మించిన మంత్రం మరొకటి లేదు. మీ నాన్న పొలంలో నాటే గింజలు మొలకెత్తి డబ్బులు ఇవ్వటం లేదా..? కష్టపడకుండా ఫలితం ఆశించకూడదని ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని, బుద్ధిగా మసలుకుంటే అంతే చాలు..\" అన్నాడు రామయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 202,
        "IMAGE": "cat_1",
        "NAME": "పనికిరానివి ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 202,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సిద్ధవటం అనే ఊర్లో తిమ్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అనుభవించలేనంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినడు, ఇంకోళ్ళకు పెట్టడు. అందుకనే అతడిని ఆ ఊర్లో వాళ్లంతా పిసినారి తిమ్మయ్య అని పిలుస్తుండేవారు. అతను పిసినారి అయినప్పటికీ ఎంతో కొంత సాయం చేయకపోతాడా అన్న ఆశతో ఆ ఊరి ప్రజలు అతనివద్దకు సాయం కోరి వచ్చేవాళ్లు.\n\nఅయితే ఏ మాత్రం మనసు కరగని సిద్ధయ్య ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడేగానీ, గడ్డిపరకంత సాయంచేసి ఎరుగడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాయం కోరుతూ తన ఇంటిముందు వాలే బంధువులు, ఊరి జనాలు బాధను తప్పించుకునేందుకు సిద్ధయ్య ఒక పథకం వేశాడు. అలా అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నింటినీ అమ్మేసి పెద్దఎత్తున బంగారం కొన్నాడు.\n\nఒకరోజు తన బంగారాన్నంతా ఒక బిందెనిండా కుక్కి దాన్ని గుడ్డతో గట్టిగా మూటకట్టాడు. ఊర్లో జనాలంతా నిద్రపోయిన తరువాత ఆ బిందెను తీసుకుని ఊరికి దూరంగా ఉండే పాడుబడ్డ బావిలో లోపల గొయ్యితీసి దాచిపెట్టాడు. ప్రతిరోజూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అన్నట్లుగా ఒక చెంబు చేతబట్టుకుని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తుండేవాడు సిద్ధయ్య. ఊర్లో జనాలంతా సిద్ధయ్యను చూసి బహిర్భూమికి వెళుతున్నాడనుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయేవాళ్లు.\n\nఅయితే ప్రతిరోజూ చెంబు పట్టుకుని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు సిద్ధయ్య వెళ్తుండటాన్ని ఒక దొంగ గమనించాడు. బావిలో సిద్ధయ్య ఏం చేస్తున్నాడో చూడాలనుకుని ఓ చోట నక్కి కూర్చున్నాడు. ఎప్పట్లాగే సిద్ధయ్య బావిలో పూడ్చిపెట్టిన బంగారాన్ని చూసి, అంతా భద్రంగా ఉందని తృప్తిగా మళ్లీ మూటకట్టి పూడ్చిపెట్టాడు. దీన్నంతా గమనించిన దొంగ మనసులోనే సంతోషించసాగాడు.\n\nఆ రోజు చీకటిపడేదాకా వేచి చూసిన దొంగ ఎంచక్కా బావిలోకి దిగి, సిద్ధయ్య పూడ్చిపెట్చిన బంగారం బిందెను తవ్వి మూటగట్టుకుని ఆనందంగా వెళ్లిపోయాడు. మరుసటి రోజు చెంబు చేతబట్టుకుని పాడుబడ్డ బావివద్దకు వచ్చిన సిద్ధయ్య, తాను దాచిపెట్టిన బిందె కోసం గాలించగా, దాన్నెవరో తవ్వి తీసుకెళ్లిపోయినట్లు అర్థం చేసుకుని బావురుమన్నాడు.\n\nఅంతే సిద్ధయ్య గుండె చెరువుకాగా.. కష్టపడి సంపాదించి, తినీ తినకా కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారే.. ఇప్పుడేం చేసేది దేవుడా అంటూ భోరున ఏడవసాగాడు. అలా నెత్తీ నోరూ బాదుకుంటూ, గుండెలవిసేలా ఏడుస్తూ సిద్ధయ్య ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. ఆ దార్లో వెళుతున్న ఓ ముసలాయన సిద్ధయ్యను చూసి ఎందుకేడుస్తున్నావని? ప్రశ్నించాడు. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాడు సిద్ధయ్య.\n\nఅంతా విన్న ముసలాయన.. \"ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం. ఆ బంగారం నీవద్ద ఉన్నప్పుడు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించని ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడ్వటం దండగ. ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వరం నీకెందుకు చెప్పు..? పైగా దాన్ని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డావు. అంత కష్టపడినా అది పోయింది. పోనీలే ఇలాగైనా నీ బాధ విరుగుడైంది. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని హాయిగా బ్రతికే మార్గం చూడు..\" అంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు.\n\nముసలాయన వెళ్లిపోగానే ముక్కు చీదుకుంటూ సిద్ధయ్య ఇంటిదారి పట్టాడు. ఇంటికెళ్లాక ఇన్నిరోజులు డబ్బు సంపాదన కోసం, దాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని పాట్లు పడింది గుర్తు తెచ్చుకున్నాడు. ఎంత సంపాదిస్తే ఏం లాభం.. దాన్ని తాను అనుభవించలేకపోయాను, ఇతరులకు సాయం చేయలేకపోయాను. ఈ సమస్యలన్నింటికీ పిసినారితనమే మూలకారణం. ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ, ఇతరులకు సాయపడటంలోనే అసలైన ఆనందం ఉందని ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే బ్రతకటమే దండగ అని మనసులో అనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సిద్ధయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 203,
        "IMAGE": "cat_1",
        "NAME": "అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకట..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 203,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ పాముల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా పాములుండేవి. అయినా అవి ఏరోజు గొడవపడకుండా ఎంతో ఐకమత్యంగా జీవిస్తుండేవి. ఒకరోజున బాగా బలిసిన ఒక ముళ్లపంది పాముల పుట్టకు దగ్గరగా వచ్చింది. దాని శబ్దానికి ఉలిక్కిపడిన పాములు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.\n\n\"ఏయ్ ముళ్లపందీ.. మా పుట్టదగ్గరికి వచ్చి అలా గొణుగుతూ నిల్చున్నావేంటి..?\" అంటూ హెచ్చరికగా అడిగాయి పాములు.\n\n\"ఆ మరేం లేదు పాములూ.. తిండి కాస్త ఎక్కువగా దొరకటంతో ఆబగా తినేశాను. భుక్తాయాసం ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకునేందుకు ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే ఎక్కడ చూసినా పక్షుల కూతలు, ఇతర జంతువుల శబ్దాలతో ఒకటే రొదగా ఉంది. అందుకే మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి, తరువాత వెళ్లిపోతాను\" బ్రతిమలాడుకుంటూ అడిగింది ముళ్లపంది.\n\n\"అయినా మా పుట్టలో ఇప్పటికే చాలా పాములున్నాయి. మాకే చోటు సరిగా సరిపోవటం లేదు. ఇప్పుడు నీకు చోటివ్వాలంటే మాకు బాగా కష్టమైపోతుంది. ఎలా..?!\" అన్నాయి పాములు.\n\n\"బాబ్బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఈ ఒక్కసారికి ఎలాగైనా సర్దుకోండి. ఇంకెప్పుడూ మీ సహాయం అడగను\" అంటూ వేడుకుంది ముళ్లపంది.\n\n\"సరేలే రా.. మేమే ఎలాగోలా ఒదిగి పడుకుంటాం. ఈ మూలన నువ్వు సర్దుకుని పడుకో..\"మని చెప్పాయి పాములు. అంతే ముళ్లపంది మెల్లిగా లోపలికి దూరింది. పుట్టలో ఎలాంటి శబ్దాలు లేకుండా వెచ్చగా ఉండటంతో హాయిగా నిద్రలోకి జారుకుంది.\n\nముళ్లపంది నిద్రపోయిందేగానీ, దాని ఒంటిమీదుండే ముళ్లన్నీ ఒక్కొక్కటీ విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. అంతే కోపంతో ఊగిపోయిన పాములన్నీ ఒక్కసారిగా లేచి బుసలు కొడుతూ, ముళ్లపందిని లేపి ఇక్కడినుంచి వెళ్లిపో అంటూ గట్టిగా కేకలు పెట్టాయి.\n\n\"చూడండి పాములూ.. ఇక్కడ నాకు చాలా హాయిగా, వెచ్చగా ఉంది. పైగా నిద్ర కూడా ముంచుకొస్తోంది. నా నిద్రను పాడు చేయకుండా మీ మానాన మీరు వెళ్లండి.. అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి వెళ్లిపోండి అంటూ ముళ్లను ఇంకాస్త పొడవుగా చాపుకుని పడుకుంది\".\n\nదాంతో ముళ్లపంది ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, ఆ ముళ్లు గుచ్చుకుని చనిపోయినా ఆశ్చర్యం లేదని అనుకున్న పాములన్నీ ముళ్లపందిని తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాయి. అంతే కథ కంచికి మనం ఇంటికి. ఇక ఈ కథ ద్వారా తెల్సుకోవాల్సిన నీతి ఏంటంటే.. దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 204,
        "IMAGE": "cat_1",
        "NAME": "దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే.. మొదటికే మోసం..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 204,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పార్వతీపురంలో శీనయ్య అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతను పరమ పిసినారే కాకుండా, మితిమీరిన అహంకారంతో నడుచుకునేవాడు. ఓరోజు అతని అంగడిగుండా ఓ సన్యాసి చిన్న పిల్లవాడిని వెంటబెట్టుకుని వెళుతున్నాడు. ఇంతలో ఆ పిల్లవాడు ఆకలిగా ఉందని చెప్పటంతో, సన్యాసి అంగడివద్ద ఆగాడు.\n\nవెంటనే శీనయ్యను \"బాబూ.. పిల్లవాడు ఆకలిగా ఉందంటున్నాడు. ఓ పండును దానం చేయవూ..?\" అని అడిగాడు సన్యాసి. అది విన్న శీనయ్య ఎగాదిగా చూసి, వెటకారంగా నవ్వుతూ.. \"కాషాయం బట్టలతో సన్యాసం వెలగబెడుతున్న సాములోరికి చిన్నపిల్లాడు ఎక్కడినుంచి ఊడిపడ్డాడో..!!\" అని అన్నాడు\n\n\"ఈ పిల్లాడొక అనాధ నాయనా.. ఎవరూలేక దారిలో ఏడుస్తుంటే వెంట తీసుకుని వెళుతున్నాను\" అని బదులిచ్చాడు సన్యాసి. దానికి మరింత ఎగతాళి చేసిన శీనయ్య \"తమరు తపస్సులు గట్రా చేసే సాములోరు కదా.. ఆకలి లేకుండా మంత్రం ఏదైనా వేయరాదూ...? అలా చేస్తే అడుక్కునే బాధయినా తప్పుతుంది కదా..\" నవ్వుతూ అన్నాడు.\n\n\"ఆకలి దప్పికలనేవి మానవులందరికీ సహజమైనవే నాయనా.. వాటికోసం మహిమలను ఉపయోగించటం తప్పు కదా..\" చాలా సహనంగా బదులిచ్చాడు సన్యాసి. దానికి పెద్ద పెట్టున శీనయ్య నవ్వుతూ.. \"ఆహా.. తమరికేదో పెద్ద మహిమలున్నట్లు.. మేము నమ్మాలా.. అది సరేగానీ నువ్వు పట్టుకున్న కర్రకేదో పండు మూట కట్టినట్లుగా ఉందే, దాన్ని ఆ పిల్లాడికిస్తే సరిపోతుంది కదా..!!\" అంటూ ఆరా తీశాడు.\n\n\"నువ్వన్నట్లు ఈ మూటలో ఉండేది పండే కానీ.. అది తినేందుకు పనికిరాదు నాయనా..\" అన్నాడు సన్యాసి. దీనికి రెచ్చిపోయిన శీనయ్య \"తినలేని పండా.. చాలా చిత్రంగా ఉందే.. ఏదీ చూపించు\" అన్నాడు. దానికి సన్యాసి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో.. \"అది తినలేనిదేగానీ, చూడలేనిది కాదు కదా.. ఏదీ చూపించు సాములోరూ..\" అంటూ ఆటపట్టించాడు శీనయ్య.\n\nఎంత చెప్పినా వినకపోవటంతో చేసేదేమీలేక సన్యాసి మూటను విప్పి.. \"చూడు నాయనా, చూడు. ఈ తినలేని పండును బాగా చూడు\" అంటూ చూపించాడు. ఆత్రంగా తొంగిచూసిన శీనయ్యకు ఆ పండే కాదు, చుట్టూ ఉన్న మరేదీ కనిపించటం మానేసింది. చుట్టూ చిమ్మచీకటి ముసురుకున్నట్లు కళ్లు కనిపించకపోవటంతో, సాములోరి విషయంలో తాను చేసిన తప్పేంటో బోధపడింది శీనయ్యకు.\n\nవెంటనే సన్యాసితో \"నన్ను మన్నించండి సాములోరూ.. మీ మహిమలు తెలియక వెటకారం చేశాను..\" అంటూ వేడుకున్నాడు శీనయ్య. \"ఎవరైనా ఏదైనా అడిగితే చేతనైతే సాయం చేయాలేగానీ, అవమానించటం సరికాదు నాయనా.. ఇప్పుడు చూడు తినలేని పండు ఏదైనా కనిపిస్తుందేమో..\" అన్నాడు ఆ సన్యాసి.\n\nవెంటనే కళ్లు నులుముకుని మూటలోకి తొంగిచూసిన శీనయ్యకు అందులో విభూది ఉండ కనిపించింది. వెంటనే తనకు కళ్లు కనిపిస్తున్నందుకు సంతోషపడిన శీనయ్య.. ఇంకెప్పుడూ ఇతరులను అవమానించనని సన్యాసికి చెప్పి.. ఓ పండ్ల బుట్టను ఆయనకు కానుకగా ఇచ్చాడు. అయితే ఆ బుట్టలోని ఒకే ఒక్క పండును మాత్రం తీసుకున్న సన్యాసి, పిల్లవాడికి ఇచ్చి తన దారిన తాను వెల్లిపోయాడు. ఇక ఆ రోజునుంచి శీనయ్య ఎవ్వరినీ అవమానించలేదు, ఎగతాళి చేయలేదు. బుద్ధిగా జీవించసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 205,
        "IMAGE": "cat_1",
        "NAME": "సాములోరు కదా.. ఆకలి లేకుండా మంత్రం వేయొచ్చుగా..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 205,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వెంగళాపురం జమీందారు ఊర్లో జరిగే ప్రతి పండుగకు రకరకాల పోటీలు పెట్టి, వాటిలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. అలాంటి పోటీలలో భీముడు అనే అబ్బాయే ఎప్పుడూ గెలిచేవాడు. దీంతో అతడికి గర్వం తలకెక్కి అందరిపై పెత్తనం చేసేవాడు. అయితే అదే ఊర్లో ఉన్న రాముడు అనే అబ్బాయి మాత్రం భీముడి ప్రయత్నాలను వారిస్తూ, బుద్ధిగా నడచుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవాడు.\n\nబుద్ధిమంతుడిగా ఉంటూ, ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రాముడి గురించి తెలుసుకున్న జమీందారు ఒకసారి అతడిని సన్మానించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎలాగైనా సరే ఆ సన్మానాన్ని అడ్డుకోవాలని భీముడు తన స్నేహితులతో కలిసి సభకు హాజరయ్యాడు.\n\n\"అందరూ మంచివాడని పొగుడుతూనే ఉన్నారుగా.. మళ్లీ రాముడికి ప్రత్యేకంగా ఈ సన్మానం ఎందుకో..?\" అంటూ సభలో చలోక్తులు విసిరాడు భీముడు. దీనికి అతని స్నేహితులు కూడా వత్తాసు పలికారు. జమీందారు ఎంతచెప్పినా వినకుండా.. సన్మానం పొందాలంటే రాముడు తన గొప్పదనం ఏంటో అందరిముందూ నిరూపించుకోవాలని భీముడు పట్టుబట్టాడు.\n\nజమీందారు ఆలోచనలో పడిపోవటంతో.. మెల్లిగా చిరునవ్వు లేచి నిలుచున్న రాముడు.. \"నాకు సవాళ్లంటే గిట్టదు. కానీ జమీందారుగారి నిర్ణయాన్ని భీముడు ధిక్కరిస్తున్నాడనే కలుగజేసుకోవాల్సి వచ్చిందని\" వేదిక పైకి వచ్చాడు. అవేమీ పట్టని భీముడు తన స్నేహితులతో కలిసి వెటకారం చేస్తూ అల్లరి చేయసాగాడు.\n\n\"భీముడు నువ్వు చాలా బలవంతుడవు కదా.. నీకింత బలం రావడానికి రోజూ ఏం తింటున్నావేంటి..?\" అని ప్రశ్నించాడు రాముడు.\n\"ఇంకేం తింటా.. కోడిగుడ్లే..\" ఉత్సాహంగా అన్నాడు భీముడు.\n\"అయితే ఆ కోడిగుడ్డే నిన్ను ఓడించేలా చేస్తాను చూడు..\" అంటూ రాముడు కోడిగుడ్డును తెప్పించాడు. కోడిగుడ్డు ఓడించటం ఏంటబ్బా అంటూ... అందరూ ఆసక్తిగా చూడసాగారు.\n\n\"ఇదిగో భీముడూ.. ఈ కోడిగుడ్డును నువ్వు బల్లమీద నిటారుగా నిలబెట్టగలిగితే.. ఈ ఊర్లో నువ్వే గొప్పవాడివి\" అని సవాల్ విసిరాడు రాముడు. \"ఓస్ అంతేనా..?\" అని గొల్లున నవ్వారు ప్రజలంతా. భీముడు కూడా కాస్త జడుసుకున్నాడు. అయితే తన భయాన్ని బయటికి కనిపించకుండా, ఆ.. అలాగే అన్నాడు బింకంగా. వెంటనే వేదికపైకి వచ్చి బల్లపైన కోడిగుడ్డును నిలబెట్టేందుకు ప్రయత్నించాడుకానీ, అది పగిలిపోయింది. దాంతో భీముడు బిక్కమొహం వేసుకుని నిలుచున్నాడు.\n\nవెంటనే రాముడు వేరే కోడిగుడ్డును తీసుకుని దాని మొనను బల్లమీద సుతారంగా కొట్టాడు. నిలబెట్టేందుకు వీలుగా గుడ్డు కాస్తంతే పగిలింది. దీంతో రాముడు దాన్ని సులభంగా బల్లపైన నిలబెట్టగలిగాడు. వెంటనే ప్రజలంతా రాముడికి మద్ధతుగా గట్టిగా చప్పట్లు కొట్టారు. భీముడు మాత్రం తలదించుకుని కిందికి దిగాడు.\n\nతరువాత జమీందారు మాట్లాడుతూ... \"భీముడూ.. బల గర్వంతో ప్రవర్తించి నువ్వు అవమానం పాలయ్యావు. తెలివిగా ప్రవర్తించి రాముడు విజేత అయ్యాడు. అందుకే తెలివి ఒక్కరి సొత్తే కాదనీ నువ్వు ఇకనైనా గుర్తు పెట్టుకో...\" అంటూ మందలించాడు. రాముడిని ఘనంగా సత్కరించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 206,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఈ గుడ్డును బల్లమీద నిటారుగా నిలబెడితే నువ్వే గొప్ప..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 206,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విరాటపురం రాజు ఓ రోజు గుర్రమెక్కి తన పరివారంతో నగర సందర్శనానికి బయలుదేరాడు. తన పాలనలో నగరమంతా సంతృప్తిగా జీవిస్తోంది. వీధులన్నీ చక్కగా పరిచినట్లుగా అందంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆనందంతో తుళ్లుతూ కనిపించారు. ఎవరైనా ప్రజలను ఆపి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, \"మీ పాలనలో సమస్యలా ప్రభూ..!!\" అంటూ ఎదురు ప్రశ్నిస్తుండటంతో రాజుకు చాలా సంతోషమేసింది.\n\nప్రజల జవాబుతో మనసంతా ఆనందంతో నిండిపోగా, తిరిగి రాజభవనానికి తిరుగుముఖంపట్టాడు రాజు. అలా వెళ్తుండగా దారిప్రక్కన ఓ చెట్టుకింద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఓ ముసలావిడ కనిపించింది. వెంటనే తన పరివారకులను ఆపమని చెప్పిన రాజు.. \"ఏంటవ్వా.. ఇక్కడ కూర్చున్నావు.. నీకు ఇల్లు లేదా..?\" అని అడిగాడు.\n\n\"ఈ లోకమే నాకున్న ఇల్లు, ఈ ప్రజలందరూ నా వాళ్లే\"నంటూ వేదాంత ధోరణిలో రాజుకు బదులిచ్చింది ఆ ముసలావిడ. దీంతో వెంటనే రాజుకు చాలా జాలేసింది. \"నువ్వు నాతో రా అవ్వా\" అంటూ ఆమెను తనతోపాటు రాజభవనానికి తీసుకెళ్లేందుకు వెంటనే సేవకులను పల్లకి తెమ్మనిచెప్పి అందులో ఎక్కించి తీసుకురమ్మని బోయీలకు చెప్పాడు.\n\nఇంతలో రాజభవనం రానే వచ్చింది. భవనం మధ్యలో ఒకచోట ముసలావిడను కూర్చోబెట్టి, తాను ఇప్పుడే వస్తానని చెప్పి లోనికి వెళ్లాడు రాజు. భవనాన్నంతా పరికించి చూస్తున్న ముసలావిడకు లోపలి పూజామందిరంలోంచి దేవుడిని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి గొంతు వినిపించింది. మెల్లిగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది.\n\nఅక్కడ మహారాజు దేవుడిని ప్రార్థిస్తూ.. \"ఓ దేవుడా.. నన్ను చల్లగా చూడు. నీ కరుణాకటాక్షాలను నాపై ఎల్లప్పుడూ ప్రసరించేలా చూడు. నాకు ఆయురారోగ్యాలను ప్రసాదించు, నా వంశాన్ని ఉద్ధరించు. నా రాజ్యాన్ని విస్తరింపజేయి, నాకున్న ధన కనక వస్తు వాహనాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచు. నాకు ఎప్పుడూ తరగనంత కీర్తిని అనుగ్రహించు\" అంటూ వేడుకుంటున్నాడు.\n\nపూజ అయిపోయిన తరువాత మెల్లిగా ముసలమ్మ వద్దకు వచ్చాడు రాజు. \"అవ్వా.. నువ్వేమీ భయపడకు. నీకు ఓ వంద బంగారు కాసులు ఇస్తాను. వాటితో నువ్వు సుఖంగా జీవించు. నీ చివరికాలం హాయిగా గడిచిపోతుంది\" అని అన్నాడు. వెంటనే లేచి నిలబడిన ఆమె, ఓ చిన్న సంచిని బయటికి తీసింది.\n\n\"నువ్వు ఎందుకో రమ్మంటున్నావని వచ్చాను. బంగారు కాసులు ఇచ్చేందుకే ఇక్కడికి తీసుకొచ్చావా. రేపో మాపో పోయే ప్రాణం నాది. నాకెందుకు ఇంత డబ్బు..? కాయకష్టంతో జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాను. ఎంత వద్దనుకున్నా కొంత సొమ్మును పోగుచేశాను. ఎవడైనా కటిక దరిద్రుడికి దాన్ని ఇచ్చేద్దామని చూస్తున్నా. ఎవరికి ఇద్దామన్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక తృప్తితో బ్రతికేస్తున్నారు. ఎవ్వరూ కంటికి కనిపించలేదు. చివరికిలా నువ్వు దొరికావు\" అంటూ ముగించింది.\n\nరాజుకు ఏమీ అర్థంకాక అలా అయోమయంగా చూస్తూ ఉండగా.. ఇందాక నువ్వు దేవుడికి మొరపెట్టుకోవటం చూశాను నాయనా..! అయ్యో.. ఈ లోకంలో ప్రజలెవ్వరికీ లేనన్ని కోరికలు నీకున్నాయి. జీవితంలో ఎంత కొరతతో బతికేస్తున్నావు నీవు. ఎన్ని ఉన్నా నీకు ఇంకా ఎన్ని ఆశలున్నాయి..? అందుకే నాకు నీకంటే దరిద్రుడెవ్వడూ ఇప్పటిదాకా కనిపించలేదు. అందుకే ఇదిగో నా దగ్గర ఉన్న సొమ్మునంతటినీ నువ్వే తీసేసుకుని నీ కోర్కెలన్నింటినీ తీర్చుకోమని చెప్పి ఎంచక్కా వెళ్లిపోయింది ఆ ముసలావిడ. సిగ్గుతో మొహం కిందికి దించుకున్న ఆ రాజు లోకంలో తనకంటే దరిద్రుడు ఇంకెవడూ లేడేమోనని ప్రశ్చాత్తాపంతో కుంగిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 207,
        "IMAGE": "cat_1",
        "NAME": "నా సొమ్ముకూడా నువ్వే తీసేసుకో నాయనా..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 207,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "వాల్మీకిపురం మహారాజు చిత్రగుప్తుడు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లంటూ హఠం చేసే ఓ మూర్ఖశిఖామణి. ఒకరోజు రాత్రిపూట ఆయన ఉద్యానవనంలో సంచరిస్తుంటే.. ఆకాశంలో వెన్నెల వెండి వర్షం కురిపిస్తున్నట్లుగా ఉంటుంది. తదేకంగా చందమామను చూసిన ఆ రాజుకు ఎంతో అసూయ కలిగింది.\n\nఆ క్షణంలో చంద్రుడు తనకంటే ఉన్నతమైనవాడిగా తోచాడు. అంతేగాకుండా సూర్యుడు, నక్షత్రాలు సైతం తన తలపైనే ఉంటారనే విషయం ఆయనకు గుర్తుకొచ్చింది. తన సింహాసనంకంటే ఎత్తులో వారుండటం అవమానంగా తోచింది చిత్రగుప్తుడికి. వారి సంగతి ఎలాగైనా సరే తేల్చాల్సిందే అనుకుంటూ తన భవంతిలోకి వెళ్లిపోయాడు.\n\nమరుసటి రోజున సభలో మంత్రి వీర వర్మతో.. \"మహామంత్రీ..! ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతమైన వ్యక్తులున్నారా..?\" అంటూ ప్రశ్నించాడు. మహారాజు అసలే మొండితనం, మూర్ఖత్వం కలగలిసినవాడని తెలిసిన మంత్రి తెలివిగా.. \"ఎవరూ లేరు ప్రభూ..!\" అంటూ వినయంగా సమాధానం చెప్పాడు.\n\n\"పోనీ.. ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు. నీకు తెలుసా..?\" అని అడిగాడు రాజు. వెంటనే \"ఎవరు ప్రభూ.. ఆ దుర్మార్గులు. వారికి శిరచ్ఛేదం విధిద్దాం. వారెవరో సెలవివ్వండి\" కాస్తంత కోపం నటిస్తూ అడిగాడు వీర వర్మ.\n\n\"వాళ్లవరో కాదు మహామంత్రీ... సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకపోతే, వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో, యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండుదినాల్లో తేల్చండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది\" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్లిపోయాడు మహారాజు.\n\nసభికులతోపాటు వీర వర్మ, విదూషకుడు రాయవర్మలు తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మీదే మహామంత్రీ.. అన్నట్లుగా అందరూ వీర వర్మవైపు తదేకంగా చూశారు.\n\nమరుసటిరోజు సభ ప్రారంభంకాగానే వచ్చాడు వీర వర్మ. ఆయన వెనకాలే రాయవర్మ ఉన్నాడు. మహారాజుకి నమస్కరించి.. \"రాజా..! మీ ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు, నక్షత్రాలకు కబురు పంపాము. అల్పప్రాణులమైన తమపై దండయాత్ర తగదని వేడుకున్నారు. రాబోయే శనివారం నాడు సూర్యుడు, ఆపై ఓ పక్షంరోజుల తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఉద్యానవనంలో మీకు క్షమాపణలు చెబుతామని విన్నవించుకున్నారు. కావునా యుద్ధసన్నాహాలు చేయించలేదు' సభికులు మంత్రముగ్ధులై వింటుండగా చెప్పాడు.\n\nవెంటనే రాయవర్మ అందుకొని.. \"వారి వేడుకోలుకు నేను కూడా సాక్షిని ప్రభూ..! వారు మాట తప్పితే మరుక్షణమే శిక్షించేందుకు యుద్ధానికి సమాయత్తమవుదాం. అప్పటివరకు మీరు శాంతించాలి\" అంటూ రాజుని చల్లబరిచాడు.\n\nవీర వర్మ చెప్పిన శనివారం వచ్చింది. ఉద్యానవనంలో సూర్యుడు క్షమాపణకై ఎదురుచూస్తున్న చిత్రగుప్తుడికి అమితాశ్చర్యం కలిగిస్తూ, ఆకాశంలో చీకటి కమ్ముకుంది. పక్షులు గూళ్లకు చేరుకోసాగాయి. \"సూర్యుడు శరణు కోరేందుకు రాబోతున్నాడు. అయితే తను ప్రాధేయపడడమే మీకు వినబడుతుంది. ఎదురుపడితే మీరు కోపోద్రిక్తులవుతారని ఆయన భయపడుతున్నాడని\" మెల్లగా చెప్పాడు మహామంత్రి.\n\nఅతను చెప్పినట్లుగానే ''భూపాలా..! నన్ను క్షమించు. నీకంటే అల్పుడను. అవసరార్థం ఆకాశంలో ఉండవలసి వచ్చింది. దయచేసి నాపై యుద్ధానికి రాకు..\" అనే మాటలు వినిపించాయి. చిత్రగుప్తుడు ఎంతో సంతోషించాడు. కాసేపటికే చీకటిపోయి వెలుతురు వచ్చింది. అదేవిధంగా పక్షం రోజుల తర్వాత రాత్రి అదే ఉద్యానవనంలో చంద్రుడు, నక్షత్రాలు ఆకాశం నుంచి మాయమై చిత్రగుప్తుడిని క్షమాపణలు కోరారు. ఈ రెండు సంఘటనల తర్వాత విచిత్రగుప్తుడి కోపమంతా తగ్గిపోయింది.\n\nఇదిలా ఉంటే.. గండం గట్టెక్కినందుకు వీర వర్మ, రాయవర్మలు ఒకరినొకరు అభినందించుకున్నారు. అదే విధంగా ఇద్దరూ వెంటవెంటనే వచ్చిన సూర్య, చంద్ర గ్రహణాలకు ఓ నమస్కారం పడేశారు. ఆపత్కాలంలో మంచి సలహా ఇచ్చినందుకు వీర వర్మ రాయవర్మ పొగిడితే, రాయవర్మ మాత్రం \"ఆ ఘనతంతా దీనిదే\" అంటూ తన చంకలోని ఖగోళశాస్త్ర పుస్తకాన్ని చూపాడు.\n\nఆ పుస్తకంలో సూర్యకుటుంబంలోని గ్రహాల గతులు, సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడే తేదీలు వివరంగా ఉన్నాయి. అది చూసిన వీర వర్మ ''నీ హాస్యంతో సభికులను ఆనందింపజేయడమేగాక, విజ్ఞానం పట్ల నీకున్న ఆసక్తితో ఓ పెద్ద విపత్తు నుంచి రక్షించావు సుమీ'' అంటూ భుజం తట్టి సంతోషంగా అన్నాడు. \"మన మూర్ఖ రాజు ముందు ముందు ఇంకెవరిమీద యుద్ధం చేస్తాడో, ఏంటో..?\" అనుకుంటూ వారిద్దరు అక్కడి నుంచి నిష్క్రమించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 208,
        "IMAGE": "cat_1",
        "NAME": "సూర్యచంద్రులు క్షమాపణలు చెబితే సరే సరి.. లేదంటే..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 208,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో రకరకాల జంతువులన్నింటితోపాటు ఒక లేడిపిల్ల, మరో జిరాఫీ కూడా నివసిస్తుండేవి. లేడిపిల్లకు కుందేలు, కంచరగాడిద, అడవిదున్న, జింక.. లాంటి స్నేహితులు ఎక్కువ. వాటితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, గంతులేస్తూ ఆనందంగా జీవిస్తుండేది. అయితే జిరాఫీని చూస్తే మాత్రం వెంటనే గేలిచేస్తూ పొడవాటి మెడదానా అంటూ వెక్కిరించేంది. దాని మాటలు విన్న ఇతర జంతువులన్నీ పగలబడి నవ్వుతుండేవి.\n\nఅయినా అన్నింటినీ ఓర్చుకున్న జిరాఫీ \"నా పుట్టుకే అలాంటిది. కొంగకు పొడవాటి మెడలాగే, ఏనుగుకు పొడవైన తొండంలాగే తనకు కూడా దేవుడు ఈ పొడవాటి మెడను ఇచ్చాడు. అయినా నా మెడ ఉపయోగం కూడా తెలిసివచ్చే రోజు ఏదైనా రాకుండా పోతుందా\" అని మనసులోనే అనుకునేది.\n\nఒకరోజు జిరాఫీ దగ్గరికి వచ్చిన లేడిపిల్ల భళ్లున నవ్వుతూ.. \"నీ మెడ చెట్టుమీది ఆకులు తినేందుకు తప్ప ఎందుకయినా పనికొస్తుందా..?\" అంటూ గేలి చేసింది. దీనికి దాని స్నేహితులు కూడా విరగబడి నవ్వాయి. దాంతో \"వీరి మాటలు గొడవకు దారితీసేలా ఉన్నాయే.. సాధు జంతువుల పోట్లాట, క్రూర జంతువులకు విందుగా మారే ప్రమాదం లేకపోలేదని\" జిరాఫీ అక్కడినుంచి వెళ్లిపోయింది.\n\nఆ తరువాత లేడిపిల్ల దాని స్నేహితులు కలిసి కడుపునిండా పచ్చిక తిని, నది ఒడ్డుమీద హాయిగా గంతులు వేయసాగాయి. లేడిపిల్ల ఆడుకుంటూ, ఆడుకుంటూ వెళ్లి అమాంతం ఊబిలోకి పడిపోయింది. బయటికి రావాలని చాలానే గింజుకుంది కానీ, దానికి సాధ్యం కాలేదు. ప్రయత్నించేకొద్దీ ఇంకా లోపలికి వెళ్లసాగింది.\n\nవెంటనే \"నన్ను రక్షించండి మిత్రులారా..! నేను బురద గుంటలో దిగబడ్డాను\" అంటూ వేడుకుంది. \"అమ్మో అది ఊబి. మేం కూడా అక్కడికి వస్తే నీతోపాటు బురదలో కూరుకుపోతాము. నిన్ను బయటికి తేవటం మావల్ల కాదు. ఇంకెవరైనా వస్తారేమో చూద్దామని\" అన్నాయి. \"ఎవరైనా వచ్చేలోపు ఏ పులో, నక్కో చూసిందంటే నా పని అంతే. మీరే ఏదైనా ఆలోచించి బయటికి లాగండ\"ని మళ్లీ అడిగింది లేడిపిల్ల.\n\nఅయినా తన స్నేహితుల వాలకం చూస్తుంటే ఇప్పట్లో కాపాడేలా లేవని అర్థం చేసుకున్న లేడిపిల్ల \"నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నాన\"ని గట్టిగా కేకలు పెట్టింది. దగ్గర్లోనే తిండికోసం వెతుకులాడుతున్న జిరాఫీకి లేడిపిల్ల కేకలు వినిపించాయి. వెంటనే కేకలు వినిపించినవైపుగా వేగంగా చేరుకుంది.\n\nజిరాఫీని చూసిన లేడిపిల్ల \"అహంకారంతో కళ్లుమూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు\" అంటూ ప్రాధేయపడింది. \"అయ్యో.. దానికేం భాగ్యం తమ్ముడూ... మనం ఒకే అడవిలో కలిసి జీవిస్తుండేవాళ్లం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిన్ను వెంటనే బయటికి లాగుతాను, అయితే కదలకుండా అలాగే ఉండు\" అని చెప్పింది.\n\nఏ మెడ అయితే పొడవుగా ఉందని లేడిపిల్ల పదే పదే వేళాకోళం చేసిందో, అదే మెడను జింక కొమ్ముల మధ్యన దూర్చి, గట్టిగా పెనవేసి, బలంగా బయటకు విసిరింది. అంతే లేడిపిల్ల లేడిపిల్ల దభాలున ఒడ్డున పడింది. ఆనందంతో లేచి, ఒళ్లు దులుపుకుని జిరాఫీ వద్దకు పరుగులు తీసింది. \"నీ మెడపై ఎంతగా గేలి చేశాను. అదే మెడే ఈరోజు నన్ను రక్షించింది. ఇంకెప్పుడూ ఎవరినీ ఎగతాళి చేయను, నాకు బాగా బుద్ధి వచ్చింద\"ని జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసింది లేడిపిల్ల. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 209,
        "IMAGE": "cat_1",
        "NAME": "లేడిపిల్ల వెక్కిరింత.. జిరాఫీ సాయం..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 209,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజున శ్రీకృష్ణదేవ రాయలవారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆరోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు.\n\nవెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి \"రామలింగా.. మీరూ, నేనూ ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికోగానీ మనం ఇద్దరిమే వెళుతున్నామట. నడుస్తూ, నడుస్తూ ఓ రెండు పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే, మరో గుంటనిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతోపాటు చెత్తా, చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది\" అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు.\n\nమళ్లీ కొనసాగించిన రాయలవారు \"ఇద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యంకాక మీరూ, నేనూ పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే, మీరేమో మురికిగుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తియ్యటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే.. మీరేమో..... అబ్బ నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికిగుంటలో పడిపోయారని\" చెబుతూ ముక్కు మూసుకున్నారు.\n\nరాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడి పడి నవ్వారు. కొంతమందయితే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. ఎప్పుడుచూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందనీ.. కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, మరికొందరయితే ఎగతాళి చేస్తూ \"భళీ.. భళీ\" అంటూ కేరింతలు కొట్టసాగారు.\n\nసభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ.. \"తానేమో తాగగలిగినంత తేనెను తాగి, ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి, ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ, ఇటూ జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు. అంతలోనే ఏమయిందో ఏమోగానీ ఒక్కసారిగా జారిపోయి దభీమని మళ్లీ ఆ గుంటలోనే తలక్రిందులుగా పడిపోయారనీ, అంతలోనే తనకు మెలకువ వచ్చేందని\" చెప్పారు.\n\nరాయలవారు చెప్పింది విన్న సభికులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. అయితే అంతటినీ కిమ్మనకుండా విన్న రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఎంత రాయలవారు అయితేనేం, కవీంద్రుడిని ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు.\n\nతర్వాతి రోజున రాయలవారు కొలువుతీరి ఉండగా.. రామలింగడు లేచి నిలబడి “మహారాజా..! నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు. రాత్రి నాకూ ఓ కల వచ్చింది. చిత్రంగా, అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి శలవైతే, నేను వివరంగా మనవి చేసుకుంటాన”ని అన్నాడు.\n\n“ఏదో నవ్వులాటకు మొదలుపెడితే, నాకే చుట్టేట్లున్నాడే..!” అని మనసులో అనుకున్నారు రాయలవారు. అయినా సరసులు కనుక, కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువయ్యింది. ఒకింత భయపడుతూనే, బింకంగా.. “చెప్పండి రామకృష్ణా\" అన్నారు.\n\n\"మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే, చాలాసార్లు ప్రయత్నించిన మీదట, చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురయ్యింది\" అంటూ కాసేపు ఆపాడు రామలింగడు.\n\nఏం సమస్య.. అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు. \"ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్లటం..? అని ఆలోచించాం. దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతటినీ శుభ్రంగా నా నాలుకతో నాకేశాను. ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేసేశారని\" కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు.\n\nరామలింగడు చెప్పినదాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోర్లెళ్లబెట్టారు. నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో, నవ్వాలో కూడా అర్థం కాలేదు. మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్యసాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా, సందేహంతో ఎలాంటి భావాలను బయటికి వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు. అయితే చివరకు రాయలవారే గట్టిగా నవ్వటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.\n\nఅప్పటినుంచి \"రామలింగడిని ఏడిపిస్తే చాలా ప్రమాదం\" అని శ్రీకృష్ణదేవ రాయలవారికి అర్థం అయింది. ఇక అప్పటినుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 210,
        "IMAGE": "cat_1",
        "NAME": "నేనేమో తేనె గుంటలో... మీరేమో మురికి గుంటలో..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 210,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లోని కోనేట్లో కోటి రకాల కప్పలు ఉండేవి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు... ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలసి మెలసి బ్రతుకుతూ.. ఎండా, వానా తేడా లేకుండా.. ఎర పొరుపులు రాకుండా కలకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూ, చింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవి.\n\nకోనేటికి నాలుగువైపులా రాతి మెట్లుండేవి. సాయంత్రం అయ్యేసరికి నగరంలోని వాళ్లంతా మెట్ల మీదకు చేరుకునేవారు. వెన్నెల రాత్రుల్లో ఆ మెట్లమీదనే గడిపేవారు. వాళ్లు చేసే చర్చలు, వాదనలను కప్పలన్నీ జాగ్రత్తగా వింటూ ఉండేవి. అలా రాన్రానూ మనుషుల పద్ధతులన్నీ కప్పలకు బాగా అంటుకున్నాయి.\n\nకొంత కాలానికి కప్పలకు ఓ సరికొత్త విషయం ఒకటి బోధపడింది. మనుషులు తమను పాలించుకునేందుకు ఒక రాజుని ఎన్నుకున్నారనేదే ఆ విషయం. ఈ వార్త విన్న కప్పలు.. మనుషులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం ఎందుకు ఉండకూడదని అనుకున్నాయి.\n\nవెంటనే కప్పలు సూర్యుడిని ప్రార్థించాయి. సూర్యుడు వచ్చి.. \"ఏం కావాలి..?\" అని అడిగాడు. \"వెంటనే మాకో రాజును ఇవ్వు ప్రభూ..!\" అని వేడుకున్నాయి కప్పలు. \"ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా...! ఇంకా రాజెందుకు..?\" మళ్లీ ప్రశ్నించాడు సూర్యుడు. \"మనుషులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండకూడదా..?\" ఎదురు ప్రశ్నించాయి కప్పలు.\n\n\"పోనీ మీలేనే ఎవరో ఒకరిని ఎంచుకోరాదూ..?\" సలహా ఇచ్చాడు సూర్యుడు. \"ఉహూ.. మాకు కొత్త రాజే కావాలి..\" పట్టుబట్టాయి కప్పలు. వాటి అమాయకత్వాన్ని చూస్తే సూర్యుడి జాలి కలిగింది. వెళ్తూ, వెళ్తూ.. పెద్ద జీలగ బెండును కోనేట్లో వేసి వెళ్లిపోయాడు. ఆ జీలగబెండును చూసి బెదిరిపోయిన కప్పలు.. రెండు, మూడు రోజులు దాని దగ్గరకే వెళ్ళలేదు.\n\nఆ తరువాత కాస్త బెదురు తీరగానే జీలగబెండు మీదికి చేరాయి కప్పలు. గెంతినా, పొర్లాడినా ఉలుకూ, పలుకూ లేదు జీలగబెండులో. తనివితీరా గెంతిన కప్పలు.. \"ఓస్.. రాజంటే ఇంతేనా..?\" అనుకున్నాయి. అయితే వాటికి ఆ రాజు నచ్చలేదు, మళ్లీ సూర్యుడిని వేడుకున్నాయి.\n\n\"దేవా..! మాకీ చచ్చురాజు పనికిరాడు.. మరో కొత్త రాజుని ఇవ్వు\" అని అడిగాయి. \"మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలియకుండా ఉంది. పోనీ.. హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే.. కాదు కూడదంటున్నారు\" మందలించాడు సూర్యుడు. \"ఇంతకంటే మంచి రాజును ఇవ్వు దేవా..!\" ప్రాధేయపడుతూ అడిగాయి కప్పలు.\n\nచాలా సేపు ఆలోచించిన సూర్యుడు.. చంద్రుడిని ఇచ్చాడు. అప్పట్నించి కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు, ఆడుకునేవాడు. కలసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండు వెన్నెల ఇచ్చేవాడు. అయితే తినగా తినగా గారెలు చేదయినట్లుగా.. చంద్రుడి మీద కూడా కప్పలకు అసంతృప్తి కలిగింది. వెంటనే సూర్యుడిని ప్రార్థించాయి.\n\n\"ఎంతసేపూ పనికిమాలినవాళ్ళనే రాజుగా ఇస్తున్నావుగానీ.. కాస్త కరుకైన వాళ్లను రాజుగా ఇవ్వు దేవా..!\" అని వేడుకున్నాయి కప్పలు. \"మీరు మూర్ఖులు.. రాజును ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని ఇచ్చాను. అయినా ఏం లాభం.. వాళ్ళ మంచి మీకు చేదయింది\" కోపగించుకున్నాడు సూర్యుడు.\n\n\"మీరు ఏమైనా అనండి.. మాకు రాజు కావాలి\" పట్టుబట్టాయి కప్పలు. \"రాజు కింద ఎన్నెన్ని బాధలు వస్తాయో మీకు తెలీదు..\" అనునయిస్తూ అన్నాడు సూర్యుడు. \"బాధలు ఎన్ని వచ్చినా సరే.. మాకు రాజు కావాలి\" పట్టుబట్టాయి కప్పలు. చివరికి విసుగెత్తిన సూర్యుడు.. అనుభవిస్తేగానీ మీకు తెలీదు అని మనసులో అనుకుంటూ.. కొల్లేటి కొంగను రాజుగా ఇచ్చి వెళ్లిపోయాడు.\n\nజీలగబెండు, చంద్రుడిలాగా కాకుండా.. నిబ్బరంగా గట్టుమీద కూర్చుంది కొల్లేటి కొంగ. మహా బెట్టు చేస్తున్న కొంగను చూసిన కప్పలకు అదేదో గొప్ప లక్షణంలా కనిపించింది. \"ఓహో కొంగరాజా..! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకుముందున్న రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు. నీ ఠీవి, గంభీరత అద్భుతం..! మాకు అన్నివిధాలా నచ్చావు. చంద్రాయుధం లాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్మల్ని పరిపాలించటానికి\" అంటూ పొగడ్తల వర్షం కురిపించాయి.\n\nకొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటివైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్తలకు లోలోనే మురిసిపోయింది. ఆ మరుసటి రోజునుంచి తన ప్రతాపం చూపించింది. రోజుకొక కప్ప చొప్పున తినేయటం ప్రారంభించింది. కొద్దిరోజుల్లోనే కప్పలకు విషయం అర్థమైపోయింది. ఏ ముక్కును పొగిడాయో, ఆ ముక్కే మృత్యువయ్యింది.\n\nరోజురోజుకూ మాయమైపోతున్న సహచరులను తలచుకుని కుళ్లి కుళ్లి ఏడవసాగాయి. వెంటనే.. \"ఓ సూర్య దేవుడా.. మమ్మల్ని రక్షించు.. మాకు రాజూ వద్దూ.. గీజూ వద్దూ..! ఈ బాధలను తప్పించు\" అంటూ వేడుకున్నాయి. అయితే సూర్యుడు మళ్లీ కనిపించనూ లేదు.. కొల్లేటి కొంగ రాజరికం పోనూ లేదు....!!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 211,
        "IMAGE": "cat_1",
        "NAME": "రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు.. నీ ఠీవి, గంభీరత అద్భుతం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 211,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విదర్భ దేశస్థుడైన సూర్య నారాయణ శాస్త్రి తన పాండిత్యంతో కోశల దేశానికి చెందిన పండితుడు శంకర శాస్త్రిని ఓడించాలని బయలుదేరాడు. ఇంకాస్త దూరంలో కోశల దేశం చేరుకుంటాడనగా ఒక పశువుల కాపరి ఆయనకు ఎదురుపడ్డాడు.\n\nసూర్య నారాయణ శాస్త్రిని ఎగాదిగా చూసిన పశువుల కాపరి, ఊరికి ఇతడెవడో కొత్తవానిలా ఉన్నాడనుకున్నాడు. వెంటనే \"స్వామీ.. నమస్కారం. మీరెవరో కొత్తవారిలా ఉన్నారు. ఎందాక మీ ప్రయాణం..?\" అంటూ వినయంగా ప్రశ్నించాడు.\n\n\"సకల శాస్త్రాలూ ఔపోశన పట్టిన ఉద్ధండ పండితుడిని. నా పేరు సూర్య నారాయణ శాస్త్రి. మీ కోశల దేశంలో ఉండే శంకర శాస్త్రిని ఓడించేందుకు విదర్భ దేశం నుండి వస్తున్నా\"నని జవాబిచ్చాడు శాస్త్రి.\n\"అలాగా..! మంచిది స్వామీ.. నేనొక చిన్న ప్రశ్న వేస్తాను. జవాబు చెప్పగలరా..?\" మళ్లీ అడిగాడు పశువుల కాపరి.\n\"ముందే చెప్పాను కదా.. ఎంతటి గొప్ప ప్రశ్నకైనా క్షణకాలంలో జవాబు చెప్పగల పండితుడినని.. అడుగు చెప్పేస్తా...\" అన్నాడు శాస్త్రి.\n\nఅలాగే స్వామీ అన్న పశువుల కాపరి... శాస్త్రి చూస్తుండగానే, నేలమీదికి వంగి, తన కుడిచేతి నిండా ఇసుక తీసుకున్నాడు. వెంటనే \"స్వామీ... ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత..?\" అని అడిగాడు.\n\"ఇసుక రేణువులను ఎన్ని రేణువులని తను లెక్కించగలడు..? అది తనకు సాధ్యమయ్యే పనేనా..?\" అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శాస్త్రి.\nకాసేపటి తరువాత పశువుల కాపరి.. \"స్వామీ...! నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు..\" అంటూ మళ్లీ ప్రశ్నించాడు.\n\"నువ్వే చెప్పవయ్యా..!!\" అన్నాడు శాస్త్రి.\n\n\"ఒక పిడికిట్లో ఉన్న ఇసుకను పిడికెడు ఇసుక అంటారని చెప్పలేని మీరు ఏం పండితుడివయ్యా..!!\" అంటూ ఎగతాళిగా నవ్విన పశువుల కాపరి.. పిడికిట్లో ఉన్న ఇసుకను నేలమీద పడేసి తన దారిన తను వెళ్లిపోయాడు.\n\n\"ఒక పశువుల కాపరి అడిగిన అతి చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేని నేను.. శంకర శాస్త్రిని ఎలా ఓడించగలను..?\" అని తనను తానే ప్రశ్నించుకున్న సూర్య నారాయణ శాస్త్రి.. పశువుల కాపరికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 212,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఇసుక రేణువులను ఎన్నని లెక్కించగలను..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 212,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సూరంపల్లి సుబ్బయ్య దీపావళి పండుగకు ఒక రోజు ముందుగానే అత్తగారి ఊరికి భార్యతో సహా బయల్దేరాడు. ఇంటికెళ్లాక మధ్యాహ్నం భోంచేసి మంచంమీద పడుకున్నాడు. ఇంతలో అతని భార్య కమలమ్మ వచ్చి, \"మా అమ్మ మీకు ఇష్టమని గారెలు చేసింది తిందువు లే మామా..!\" అంది.\n\nఅది విన్న సుబ్బయ్య వెంటనే \"మీ అమ్మ ఎన్ని గారెలు చేసిందో చెప్పనా..?\" అన్నాడు. \"ఏదీ చెప్పండి చూద్దాం\" అంది కమలమ్మ. \"ఇరవై ఎనిమిది\" అన్నాడు. మంచంమీద పడుకున్నాక నిద్ర పట్టక అటూ, ఇటూ పొర్లుతూ ఉంటే, అత్తగారు గారెలు వేయటం మొదలెట్టింది. సుబ్బయ్యకు ఏమీ తోచక పోవటంతో సుయ్‌మన్నప్పుడల్లా లెక్కపెట్టడం మొదలెట్టాడు. అందుకే అత్తగారు వేసిన గారెల లెక్కను సరిగ్గా లెక్కపెట్టగలిగాడు.\n\nఇదంతా తెలియని కమలమ్మ వెంటనే లోనికివెళ్లి \"అమ్మా మీ అల్లుడు నువ్వు 28 గారెలే చేసినట్లు చెబుతున్నాడు. ఇంకా ఎవరూ తినలేదు కదా. ఒకసారి లెక్కపెట్టి చూడమ్మా..\" అంది. వెంటనే లెక్కపెట్టిన ఆమె.. \"అవునే అల్లుడుగారు చెప్పింది నిజమే, ఆయనకు జ్యోతిష్యం తెలుసా..?\" అంటూ ఆశ్చర్యంగా అడిగింది. వెంటనే పొంగిపోయిన కమలమ్మ \"అవునమ్మా.. మా ఆయన జ్యోతిష్యంలో దిట్ట\" గారాలుపోతూ చెప్పింది.\n\nఆ విషయం అలా ఊరంతా పాకిపోయింది. సాయంత్రం షికారుకెళ్లిన సుబ్బయ్య ఇంటిబయట తిన్నెమీద కూర్చుని అలా వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి \"బాబూ.. ఆకలేస్తోంది. ఒక రూపాయి ఇవ్వవూ..?\" అన్నాడు. \"ఎవరు నువ్వు..? దుక్కలా ఉన్నావే, అలా అడుక్కోవచ్చా..?\" అన్నాడు సుబ్బయ్య.\n\n\"నా పేరు భీమయ్య బాబూ..! నేను మీ పక్కింటి యల్లమ్మ భర్తనే. మా ఇంట్లో రెండువేలు పోయాయి. నేనే తీశానని నా భార్య నన్ను తిట్టి, ఇంట్లోంచి వెళ్లగొట్టేసింది. అందుకని పదిరోజులుగా ఇలా ఈ వీధిలోని గుట్టుగా అడుక్కుంటున్నానని\" అన్నాడు. \"అయితే ఆ డబ్బు నువ్వు తీయలేదా..? మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు..?\" ప్రశ్నలు గుప్పించాడు సుబ్బయ్య. \"మా ఇంటికి పాలేరు తప్ప మరెవ్వరూ వచ్చేవారు కాదయ్యా..!!\" చెప్పాడు భీమయ్య.\n\n\"అది సరే.. నీవు ఏ భయం లేకుండా ఇంటికెళ్లు. రేపు సరిగ్గా పదిగంటలకు ఇల్లు చేరుకో, మిగతా కథను నేను నడిపిస్తానని\" అన్నాడు సుబ్బయ్య. తరువాత ఇంట్లోకి వెళ్లిన సుబ్బయ్యతో భార్య కమలమ్మ \"ఏమండీ.. పక్కింటి యల్లమ్మ పిన్ని మిమ్మల్ని ఏదో అడగాలని వచ్చింద\"ని చెప్పింది. \"చూడమ్మా నీ భర్త రేపు పదిగంటలకల్లా ఇంటికొస్తాడు. మీ ఇంట్లో డబ్బు కాజేసింది మీ పాలేరు నాగన్నే..\" అని అన్నాడు.\n\nతానే యల్లమ్మను పిలిచి విషయం చెబుదామనుకునేంతలోనే, ఆమె వచ్చి తనను జ్యోతిష్యం అడగటంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు సుబ్బయ్య. యల్లమ్మ వెంటనే పాలేరుమీద మునసబుకు ఫిర్యాదు చేసింది. పొద్దున్నే వచ్చిన భర్తను చూసి సంతోషించింది. పాలేరు వచ్చి తప్పు ఒప్పుకుని ఆమె పాదాలపై పడ్డాడు. ఇంకేముందీ జ్యోతిష్యుడంటే సుబ్బయ్యే అని తెగ పొగిడేశారు యల్లమ్మ దంపతులు.\n\nఆ తరువాత ఓ చాకలామె వచ్చి.. \"అయ్యా మూడు రోజుల నుంచి నా గాడిద కనిపించటం లేదు, రేవుకెళ్లాల్సిన గుడ్డలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి\" అంటూ తన సుబ్బయ్య ముందు గోడు వెల్లబోసుకుంది. \"దిగులుపడకమ్మా రేపు తెల్లారేసరికల్లా నీ గాడిద నీ ఇంటిముందు ఉంటుంది\" అన్నాడు. చెప్పేదేమో చెప్పాడుగానీ, తనకు జ్యోతిష్యం తెలియదని ఊర్లో అందరికి తెలియకుండా ఉండాలంటే, ఆ గాడిదను తానే వెతికి ఆమె ఇంటిముందు ఉంచాలని మనసులో అనుకున్నాడు.\n\nరాత్రి అందరూ నిద్రపోయాక ఊరంతా వెతికినా గాడిద కనిపించలేదు. మరింత గాబరాగా వెతకగా, ఓ అరటితోటలోంచి గాడిద ఓండ్ర వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సుబ్బయ్య.. గాడిద తనదే ఇవ్వమని తోటవాడిని అడిగాడు. అయితే అది తోటలోని అరిటాకులను నమిలి, మొక్కల్ని నాశనం చేసింది కాబట్టి 500 రూపాయలు ఇచ్చి తోలుకెళ్లమని అన్నాడు తోటవాడు. చేసేదేమీలేక డబ్బులిచ్చి గాడిదను తీసుకొచ్చి చాకలామె ఇంటిముందు కట్టేసి వెళ్లిపోయాడు సుబ్బయ్య.\n\nతెల్లారగానే.. \"కమలమ్మా నా గాడిద దొరికింది, మీ ఆయన మాటకు తిరుగులేదు\" అంటున్న చాకలామె మాటలు సుబ్బయ్యకు వినిపించాయి. \"సొమ్మూపోయి దిమ్మా పట్టిందన్నట్లు\" అటు 5 వందలుపోయి, ఇటు గాడిద మెడకున్న తాడును లాగి లాగి చేతులు బొబ్బలెక్కినందుకు మనసులోనే తిట్టుకున్నాడు సుబ్బయ్య. ఆ తరువాత.. వెనుకింటి, ఎదురింటి అమ్మలక్కలు ఏదో సమస్యతో ఇంటిముందుకు రావటం గమనించిన అతను.. చెప్పాపెట్టకుండా సూరంపల్లికి చెక్కేశాడు. అది లగాయితు సుబ్బయ్య జ్యోతిష్యులు అన్నా, జ్యోతిష్యం అన్నా ఒకటే వణుకు..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 213,
        "IMAGE": "cat_1",
        "NAME": "అది లగాయితు సుబ్బయ్యకు జ్యోతిష్యం అంటే వణుకు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 213,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక పెద్ద అడవిలో బాగా బలిసిన సింహం ఒకటి జీవిస్తుండేది. ఈ సింహానికి సహజంగా వచ్చిన బలపరాక్రమాలతోపాటు, అంతులేని అహంకారంతో మిడిసిపడుతుండేది. అడవిలో బ్రతికే జంతువున్నింటిచేతా అది అడ్డమైన చాకిరీ చేయించుకుంటుండేది. తను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా.. అడ్డూ, ఆపూ లేకుండా అడవికి మహారాజుగా పెత్తనం చెలాయిస్తూ ఉండేది.\n\nఅలా ఉండగా.. ఆ సింహం అడవిలో ఒకసారి బాగా కరువు వచ్చింది. ఆ కరువుకు తట్టుకోలేని ఇతర జంతువులన్నీ తట్టా, బుట్టా సర్దుకుని తలోదారి పారిపోయాయి. జంతువులకు రాజయితే మాత్రం సింహానికి తిండీ తిప్పలు ఊరికే వచ్చేస్తాయా..? ఇతర జంతువులన్నీ ఉన్నంతకాలం వాటిలో ఏదో ఒకదాన్ని గుటుక్కుమనిపించి తన ఆకలి తీర్చుకునేది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క జంతువు కూడా ఆ అడవిలో లేదు.\n\nఅయినా బెట్టుగా అదే అడవిలో కొన్నాళ్లపాటు నీల్గుతూ కాలం వెళ్లబుచ్చింది సింహం. కానీ ఆకలికి తట్టుకోలేక వేరే అడవికి బయలుదేరింది. ఆ అడవిలో ఒక నక్క, గాడిద, ఎద్దు కలిసి స్నేహంగా జీవిస్తుండేవి. వాటి తిండీ తిప్పలు వేరువేరయినా కూడా కలసిమెలసి ఉండేవి. వాటి దగ్గరికి చేరింది సింహం.\n\nవలస వచ్చినా గర్వాన్ని వదలని ఆ సింహం.. ఈ అడవికి కూడా తానే రాజునని అంది. అయినా ఎద్దు, నక్క, గాడిద ఒప్పుకోక పోవటంతో వాటితో ఒక ఒప్పందం చేసుకుంది. ఎలాంటి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తినాలని అంది సింహం. దానికి మిగతావి కూడా సరేనన్నాయి. ఒకరోజు ఆహారం దొరికింది. అందరికీ సమానంగా పంచిపెట్టాలని ఎద్దును కోరింది సింహం.\n\nఆహారాన్ని నలుగురికీ 4 వాటాలుగా వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దుమీదికి దూకి పంజాతో చరిచింది. అంతే ఎద్దు చచ్చిపోయింది. నక్క, గాడిదా లోలోపలే ఏడుస్తూ కూర్చున్నాయి. ఈసారి నక్కవైపు తిరిగిన సింహం.. నువ్వు పంచు అంది. అయితే తెలివిగల నక్క.. ఈ ఆహారాన్ని పంచటం నావల్ల కాదు, నువ్వే పంచు అంది.\n\nదాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది. సరే నేనే పంచుతానని, ఆహారాన్ని మూడు వాటాలు చేసింది. నేను మృగరాజును గనుక ఒక వాటా నాది, రెండోవాటా మీతో పంచుకోవాలి గనుక ఇంకోటి కూడా నాదే అని చెప్పింది సింహం. అలాగే ఇక మిగిలింది మూడో వాటా.. మీ ఇద్దరికీ దమ్ములుంటే దీన్ని తీసుకోండి అంటూ రెచ్చగొట్టింది.\n\nదాంతో జడుసుకున్న నక్క, గాడిద భయపడిపోయాయి. దౌర్జన్యంగా ఆహారాన్నంతా కాజేసిన సింహం కడుపునిండా తిని హాయిగా నిద్రపోగా.. నక్క, గాడిద మాత్రం ఆకలితో అల్లాడిపోయాయి. అయితే ఒక్కసారిగా దొరికిన ఆహారాన్ని ఆత్రంకొద్దీ గబగబా తినేసిన సింహం ఆ మరుసటిరోజు జబ్బుపడింది. పడుకున్న చోటునుంచి కదలలేకుండా అయిపోయింది.\n\nఅది చూసిన ఇతర జంతువులన్ని కసితీరా సింహాన్ని తిట్టి, తన్ని, కొట్టి వెళ్లేవి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లు ఉరిమి చూసి మూలిగేది, కానీ ఏ ప్రాణి కూడా భయపడేది కాదు. బ్రతికి బట్టకడితే మీ సంగతి చూస్తానని వాటిని సింహం బెదిరించేది అయినా అవి లెక్కచేసేవి కావు.\n\nఒక రోజున గాడిద తన దగ్గరకు రావటం చూసిన సింహం.. నువ్వు కూడా తన్నిపోయేందుకే వచ్చావా..? అంటూ గుడ్లురిమి చూసింది. ఇంకా గుడ్లురుముతున్నావా మృగరాజా... చింత చచ్చినా పులుపు చావలేదే అంటూ వెక్కిరించింది గాడిద. సింహం మళ్లీ గుడ్లు ఉరిమి చూడటంతో కోపం నషాలానికెక్కిన గాడిద తన వెనుకకాళ్లతో సింహం మొహంపై తన్నింది. వెంటనే సింహం రెండు కళ్లూ రాలి నేలమీద పడ్డాయి.\n\nఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిదచేత కూడా తన్నులు తిని చావవలసిందేనా..? అయ్యో..? నాదెంత దిక్కుమాలిన చావు.. అనుకుంటూ ఏడ్చి దొర్లాడింది సింహం. అయినా కూడా ఏ ఒక్క జంతువూ దానిపై జాలి చూపించలేదు. ఇన్ని రోజులు తమను కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటూ ఆరోజు నుంచి జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 214,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఇంత బ్రతుకూ బ్రతికి గాడిదచేత తన్నులా...?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 214,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానానికి సూర్య శాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు. రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్య శాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు. ఇంతలో \"మహారాజా..! నేను అవునన్నది కాదనీ, కాదన్నది అవుననీ వాదన చేసి విజయం సాధిస్తాను. మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని\" సవాలు విసిరాడు సూర్య శాస్త్రి.\n\nసూర్య శాస్త్రి పాండిత్యం దిట్ట అనీ, అతడిని ఓడించటం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్ట దిగ్గజ కవులు మౌనం వహించారు. దీంతో అష్ట దిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో \"అప్పాజీ.. మన అష్ట దిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికే తీరని మచ్చ. నేనే అతడితో వాదిస్తానని చెప్పండ\"ని అన్నాడు.\n\nఅప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడి \"ప్రభూ.. ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి. పెద్దన, తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా.. అని నేను మౌనం వహించాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్య శాస్త్రితో నేనే వాదిస్తానని\" అన్నాడు.\n\nరాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా \"సరే\"నని అన్నాడు. వెంటనే రామలింగడు సూర్య శాస్త్రితో వాదనకు దిగాడు. మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు. మిగిలిన అష్ట దిగ్గజ కవులు, సభలోని పెద్దలు, విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు.\n\nరామలింగడు సూర్య శాస్త్రితో ఇలా అన్నాడు. \"అయ్యా.. మీరు నేను అవునంటే, కాదని వాదిస్తారు కదూ..?\" అన్నాడు. \"అవునోయ్.. నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నాన\"ని గర్వంగా బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వినయంగా తలవంచిన రామలింగడు \"మీ అమ్మాయి విధవ కాదు కదా...!!\" అన్నాడు. వెంటనే సూర్య శాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయ్యింది. \"సౌభాగ్యవతి అయిన కూతురును విధవ అంటే ఎంత తప్పు. ఏ తండ్రి అయినా విధవ అని ఎలా చెప్పగలడు\" అని మనసులో మధనపడ్డాడు సూర్య శాస్త్రి.\n\nకళ్లలో నీళ్లు గిర్రున తిరుగగా.. \"రామలింగా.. నాలోని అహంకారాన్ని జయించావు. నీకు వేనవేల నమస్కారాలు\" అని బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వెంటనే రాయలవారివైపు తిరిగిన సూర్య శాస్త్రి \"మహారాజా.. నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను. నన్ను మన్నించండని\" దీనంగా సభను విడిచి వెళ్లిపోసాగాడు.\n\nఅలా వెళ్లిపోతున్న సూర్య శాస్త్రిని ఆపిన రామలింగడు \"అయ్యా.. తర్కంలో మీరు ఉద్ధండ పండితులే, విద్య వల్ల వినయం రావాలేగానీ, అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని\" అన్నాడు. అలాగే రాయలవారితో \"మహారాజా.. దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండని\" అన్నాడు.\n\n\"తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగా..\" అన్నాడు సంతోషంగా రాయలవారు. అంతేగాకుండా సూర్య శాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించాడు శ్రీ కృష్ణ దేవరాయలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 215,
        "IMAGE": "cat_1",
        "NAME": "విద్య వల్ల వినయం రావాలేగానీ.. అహంభావం కాదు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 215,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఓ వేటగాడు తన పొడవైన తుపాకీని భుజానికి తగిలించుకుని... మరో భుజంమీద తూటాల పెట్టెను పెట్టుకుని అడవికి బయలుదేరాడు. చాలా దూరం వెళ్లిన అతను ఓ లోయ వద్దకు చేరుకున్నాడు. \"ఈ లోయ దాటుకుని అటువైపు ఉన్న అడవిలోకి వెళితే అక్కడ రేగుపండ్ల చెట్లు చాలా ఉన్నాయి. అక్కడికి ఎలుగుబంట్లు చాలా వస్తుంటాయి. సులభంగా వేటాడవచ్చు\" అని మనసులో అనుకుంటూ మెల్లిగా లోయను దాటి.. రేగుపండ్ల చెట్ల వద్దకు వెళ్లాడు.\n\nవెంటనే రేగుపండ్ల చెట్లకు దగ్గరగా ఓ సన్నటి బాటగుండా ఒక చిన్న ఎలుగుబంటి వెళుతుండటం గమనించాడు వేటగాడు. తాను ఇప్పుడు తుపాకీ గనుక పేలిస్తే.. ఈ పిల్ల ఎలుగుబంటి లోయలో పడిపోతుంది కాబట్టి లాభం లేదని అనుకుని అలాగే ముందుకెళ్లసాగాడు. అయితే పిల్ల ఎలుగుబంటికి ఎదురుగా మరో పెద్ద ఎలుగుబంటి అటువైపు నుంచి వస్తుండటం వేటగాడి కంటబడింది.\n\nఇద్దరు వ్యక్తులు ఒకేసారి నడిచేందుకు కూడా వీలు లేనంత ఆ సన్నటి దారిలో ఒకరు వెనకకు తిరిగితేగానీ.. రెండోవాళ్లు వెళ్లేందుకు దారి ఉండదు. ఆ క్రమంలో వెనుకకు వెళ్లేందుకు ఇష్టపడని ఆ ఎలుగుబంట్లు రెండూ ఎదురుపడి.. పోట్లాడుకుని చివరకు లోయలో పడి చనిపోతాయని అనుకున్నాడు.\n\n\"పోనీ ఒకదాన్ని కాల్చేస్తే.. ఆ సౌండ్‌కు రెండోది లోయలో పడిపోతుంది.. కాబట్టి వాటిని ఏం చేసినా తనకు ఏ ప్రయోజనమూ ఉండదు\" అని గట్టిగా నిర్ణయించుకున్నాడు వేటగాడు. అది సరే.. ఇప్పుడు ఆ సన్నటి దార్లో అవి రెండూ ఏం చేస్తాయోనన్న ఆసక్తి కలిగింది అతగాడికి. అందుకే పక్కనే ఉన్న చెట్లలో దాక్కుని ఆ రెండింటినీ ఆసక్తిగా గమనించసాగాడు.\n\nఅంతలోనే ఆ ఎలుబంట్లు రెండూ ఒకదానికి ఒకటి ఎదురుపడ్డాయి. అవి వాటి భాషలో ఏం మాట్లాడుకుంటున్నాయో వేటగాడికి అర్థం కాలేదు. కాసేపటి తరువాత పెద్ద ఎలుగుబంటి మౌనంగా కూర్చుండిపోగా.. చిన్న ఎలుగుబంటి దానిమీద ఎక్కి ఇటువైపుకు వచ్చేసింది. తరువాత వేటి దారిన అవి వెళ్లిపోయాయి.\n\nఇదంతా కన్నార్పకుండా చూసిన వేటగాడు.. \"జంతువులు ఇంత తెలివిగా ఉంటాయా..? మూర్ఖులైన మనుషులే ఎప్పుడు చూసినా నేనే గొప్ప.. నేను గొప్ప అనుకుంటూ అహంకారంతో గొడవపడుతుంటారే..?\" అనుకున్నాడు. \"ఇంత మంచిగా జీవిస్తున్న ఈ నోరులేని జీవాలనా తాను చంపబోయింది\" అనుకోగానే అతడికి ఎవరో చెంపమీద కొట్టినట్లయ్యింది. అంతే అక్కడికి నుంచి ఇంటికి వెళ్లిన ఆ వేటగాడు ఆరోజు నుంచి వేట మానేసి.. కష్టించి పనిచేసి భార్యాపిల్లలను పోషిస్తూ ఆనందంగా జీవించసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 216,
        "IMAGE": "cat_1",
        "NAME": "వేటగాడికి జ్ఞానోదయం చేసిన భల్లూకాలు...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 216,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "బీద, సాద ప్రజలకు మేలు చేస్తూ.. వారికి మంచి చేయటం కోసం ప్రాణాలకు కూడా లెక్కచేయని రారాజుగా, కోసల రాజ్యాధిపతి వీరసింహుడి పేరు దేశ విదేశాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పొరుగుదేశపు రాజు అయిన విదర్భ చక్రవర్తి విరూపాక్షుడికి చాలా అసూయ కలిగింది.\n\n\"ఇంత పెద్ద రాజ్యానికి చక్రవర్తినైన తనకు లేని కీర్తి ఆ వీరసింహుడికా వచ్చేది..?\" అంటూ కోపంతో ఊగిపోయాడు విరూపాక్షుడు. వెంటనే అదనుచూసి తన సైన్యంతో దండెత్తి కోసల రాజ్యాన్ని వశపరచుకున్నాడు. అదే సమయంలో వేట కోసం అడవికి వెళ్లిన వీరసింహుడు ఇదంతా తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.\n\nవీరసింహుడి కోసం విరూపాక్షుడు దేశమంతటా వెదికించాడు. అయినా సరే అతని జాడ తెలియలేదు. దాంతో \"ఎవరైనా సరే, వీరసింహుడిని పట్టిస్తే, వారికి లక్ష వరహాలను కానుకగా ఇస్తాన\"ని చాటింపు వేయించాడు. అదలా ఉంటే.. అజ్ఞాతంగా అడవుల్లో తిరుగాడుతూ జీవనం సాగిస్తుంటాడు వీరసింహుడు.\n\nఒకరోజు వీరసింహుడికి కొంతమంది పండితులు ఎదురై.. \"అయ్యా... కోసల రాజ్యాధిపతి వీరసింహుడిని కలవటం కోసం తాము ఎంతో దూరం నుంచి వస్తున్నామనీ, అడవిలో దారి తప్పిన తమకు దారి చూపించాలని\" వేడుకున్నారు. దాంతో \"మీరెందుకు ఆయనను కలవాలని అనుకుంటున్నారని?\" ప్రశ్నించాడు వీరసింహుడు.\n\n\"ఆయనో గొప్ప దయగల మారాజు. నిరుపేదలైన తాము ఆయనను అర్థించి ధన సహాయం పొందాలని బయల్దేరాం..\" అని బదులిచ్చారు పండితులు. వెంటనే విషయం అర్థం చేసుకున్న వీరసింహుడు.. \"పదండి మీకు నేను దారి చూపిస్తా\"నంటూ వారిని స్వయంగా వెంటబెట్టుకుని విరూపాక్షుడి రాజధానికి బయలుదేరాడు.\n\nవిరూపాక్షుడు కొలువుతీరి ఉండగా సభలోకి ప్రవేశించిన వీరసింహుడు.. \"వీరసింహుడిని పట్టిస్తే లక్ష వరహాలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు కదా..? ఆ సొమ్ము ఈ పండితులకు ఇప్పించండి. నేనే వీరసింహుడిని\" అంటూ ఏ మాత్రం భయం లేకుండా నిర్భయంగా అన్నాడు.\n\nదీంతో వీరసింహుడి ధైర్యానికి, ప్రజలపట్ల ఆయనకున్న నిబద్ధతకు ఆశ్చర్యపోయాడు విరూపాక్షుడు. ప్రజలంతా వీరసింహుడిని ఎందుకలా కీర్తిస్తున్నారో, తన కంటే అతనెంతటి ఉన్నతుడో అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలు తీర్చటం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని అతడి ఔధార్యానికి చలించిపోయాడు విరూపాక్షుడు.\n\nవెంటనే సింహాసనం దిగి వచ్చిన విరూపాక్షుడు \"వీరసింహా.. నన్ను మన్నించు. అసూయతో నీ రాజ్యాన్ని వశపరచుకున్నాను. కానీ నీ గొప్పదనం ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రజలను ఎళ్లవేళలా కంటికి రెప్పలాగా కాపాడే నువ్వే అసలైన చక్రవర్తివి. నా రాజ్యాన్ని కూడా నువ్వే పాలించు\" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు. విరూపాక్షుడికి ఆ విధంగా కనువిప్పు కలిగినందుకు సభికులంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 217,
        "IMAGE": "cat_1",
        "NAME": "వీరసింహుడు.. లక్ష వరహాల బహుమానం...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 217,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. జేష్టాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరీ ఓ చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంటంటే.. తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా.. వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు.\n\nఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జేష్టాదేవి, లక్ష్మీదేవిలు అతడిముందుకెళ్లి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి, అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో, బాధపడాలో కూడా అతడికి తెలియలేదు.\n\nఏదయితే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి.. ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండని అడిగాడు. అప్పుడు జేష్టాదేవి, లక్ష్మీదేవిలు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి, ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు. అంతే విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జేష్టాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే.. తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి.. తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏంచేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు.\n\nఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే \"అమ్మా ఓ మహాలక్ష్మీ...! నువ్వు ఇంట్లోంకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలోగానీ, స్వర్గలోకంలోగానీ ఎవరూ ఉండరు\" అని అన్నాడు. అలాగే \"అమ్మా ఓ జేష్టాదేవీ..! నువ్వు ఇంటినుంచి బయటికి వెళ్తుంటే నీ అందం, సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము\" అని అన్నాడు.\n\nఆ వ్యాపారి ఎవరి మనసులనూ నొప్పించని విధంగా చెప్పిన తీరు జేష్టాదేవి, లక్ష్మీదేవిలను సంతృప్తి పరచింది. అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడినుంచి మాయమయ్యారు.\n\nఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలూ... జేష్టాదేవి, లక్ష్మీదేవిలు ఎవరికివారు విజేతలమని అనుకుంటూ వెళ్లారేగానీ... నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే.. అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమేగాక.. లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జేష్టాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 218,
        "IMAGE": "cat_1",
        "NAME": "మాలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు....?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 218,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మంగాపురంలో రంగారావు అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా ఆశపోతు, స్వార్థపరుడు. అతడికి చాలా ఎకరాల భూములు, తోటలు ఉన్నాయి. అయినప్పటికీ సంతృప్తి అనేదే లేదు. ఇంకా, ఇంకా కావాలని ఆశపడుతూ... ఎంతోమందిని మోసం చేస్తూ చాలా ఆస్తులను సంపాదించాడు.\n\nఅదే ఊర్లో రాములమ్మ అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు. వీరికి చిన్నప్పటినుంచీ కంటిచూపు లేదు. భర్త చనిపోయాక.. కొడుకులకు అన్నీ తానే అయి చూసుకుంటూ ఉండేది. ఆ ఊర్లోనేగల ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, వచ్చిన పంటతో సంసారాన్ని నెట్టుకొచ్చేది.\n\nఅయితే దురదృష్టంకొద్దీ రాములమ్మ పొలం.. రంగారావు పొలానికి ఆనుకునే ఉంది. దాంతో రంగారావుకి ఎప్పటినుంచో ఆ ఎకరం పొలంపైన కన్ను పడింది. అవకాశం కోసం వేచిచూస్తూ ఉన్నాడు. అయితే అసలే ఆశపోతు, దుర్మార్గుడు అయిన రంగారావు తన పొలాన్ని ఏరోజు కబ్జా చేస్తాడోనని రాములమ్మ కూడా ప్రతిరోజూ భయపడుతూ ఉండేది.\n\nఓ రోజు రాములమ్మ భయపడినట్లే జరిగింది. ఆమె పొలాన్ని కబ్జా చేసేసిన రంగారావు, తన పొలంలోకి కలిపేసుకుని చుట్టూ కంచె కట్టేశాడు. రోజులాగే పొలంలో పనిచేసేందుకు వచ్చిన రాములమ్మ, రంగారావు చేసిన పని కళ్లారా చూసి గోడు గోడున విలపించింది. రంగారావు మనసు ఏ మాత్రం కరగలేదు. అతడిని ఎదిరించే ధైర్యం, డబ్బు రాములమ్మకు లేవు. \"చేసేదేమీలేక ఓరి భగవంతుడా నాకేంటి దారి\" అనుకుని ఏడుస్తూ ఇంటిదారి పట్టింది.\n\nఒకరోజున రంగారావు పొలంలో ఉన్న సమయం చూసుకుని.. ఓ గోనెసంచి పట్టుకుని పొలానికి వెళ్లింది రాములమ్మ. \"ఇక్కడికి ఎందుకొచ్చావు అన్నట్లుగా\" ఆమెవైపు చూశాడు రంగారావు. \"బాబ్బాబూ.. ఈ భూమిని మీరే ఉంచుకోండి. కానీ, ఇన్ని రోజులు నేను కాయకష్టం చేసిన బ్రతికిన ఈ భూమిలోంచి ఈ సంచినిండా మట్టిని తీసుకుని వెళ్లిపోతాన\"ని బ్రతిమలాడింది.\n\nఅది విన్న రంగారావు పెద్ద పెట్టున నవ్వుతూ.. \"అయ్యో.. వెర్రిదానా..! సంచెడు మట్టిని తీసుకెళ్తావా.. అయినా దాంతో ఏం చేసుకుంటావు.. సర్లే ఏదో ఒకటి చేసుకో, తీసుకెళ్లు\" అని చెప్పాడు. వెంటనే రాములమ్మ సంచి నిండా మట్టి నింపే పనిలో నిమగ్నమయ్యింది. ఈలోగా ఈ విషయమంతా ఊరిలోని జనానికంతటికీ తెలిసిపోయింది. ఈ వింతను చూసేందుకు ఒక్కొక్కరుగా పొలానికి వచ్చారు.\n\nసంచి నిండా మట్టి నింపిన రాములమ్మ దాని మూతి గట్టిగా బిగించి కట్టింది. \"అయ్యా..! దయచేసి తమరు ఈ మూటను కాస్త పైకి లేపి నా తలమీద పెట్టారంటే.. మోసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతానని\" అడిగింది. అలాంటి పనులేమీ కుదరవని చెబుదామనుకున్న రంగారావు చుట్టూ ఉన్న జనాన్ని చూసి కాస్త జడుసుకున్నాడు. సరేనని మూట లేపేందుకు ముందుకొచ్చి మూటను ఎత్తేందుకు ప్రయత్నించాడు.\n\nచాలా పెద్దదైన ఆ గోనెసంచి నిండా మట్టి నింపడంతో.. దాన్ని లేపేందుకు రంగారావుకు ఏ మాత్రం సాధ్యంకాలేదు. ఎవరైనా సరే దీన్ని ఎత్తగలరా అనే సందేహం కూడా వచ్చిందతనికి. చాలా సార్లు మూట ఎత్తేందుకు ప్రయత్నించిన అతడు \"ఓసీ పిచ్చిదానా..! ఈ మూట ఇంత బరువుంది కదా.. దీన్ని గనుక లేపి నెత్తిమీద పెట్టుకుంటే ఉన్నపళంగా కూలబడి చచ్చిపోతావ\"ని హెచ్చరించాడు.\n\n\"అయ్యా..! కేవలం ఓ సంచినిండా మట్టి ఉన్న ఈ మూటనే మోయలేనని అంటున్నారు. మరి మీకు ఇన్ని భూములున్నాయి కదా.. అవన్నీ ప్రజల నోర్లుకొట్టి సంపాందించినవే కదా..! ఆ భూముల్లోని మట్టినంతటినీ మీరు మోయగలరా చెప్పండి..?\" అంటూ ప్రశ్నించింది. ఓహో.. రాములమ్మ వింత వెనుక ఇంత మంచి విషయం ఉందని వెంటనే గ్రహించారు చుట్టూ ఉన్న ప్రజలు. బాగా అడుగు రాములమ్మా..! అలాగైనా రంగారావు బుద్ధి వస్తుందేమో చూద్దామని ఆమెకు మద్ధతుగా వచ్చారు.\n\nఅందరిముందూ తన బండారం బయటపడటంతో సిగ్గుతో తలదించుకున్న రంగారావు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్నిరోజులకు తన దుర్మార్గాలు ఇలాగే సాగితే ఉన్న పొలాలన్నింటినీ ప్రజలు లాగేసుకుంటారని భయపడిన అతడు అన్యాయంగా కబ్జా చేసుకున్న రాములమ్మ పొలాన్ని ఆమెకి తిరిగి ఇచ్చేసి.. ఇక అప్పటినుంచి బుద్ధిగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 219,
        "IMAGE": "cat_1",
        "NAME": "అంత మట్టిని మీరు మాత్రం మోయగలరా..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 219,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం కారంపూడి రాజ్యాన్ని కార్యవర్థి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు భార్య బాలనాగమ్మ. ఆమె చాలా అందంగా ఉండేది. హాయగా కాపురం చేస్తున్న వీరికి బాలవర్థి అనే కుమారుడు జన్మించాడు. మాయల ఫకీరు అనే మంత్రగాడు ఒకడు కారంపూడి అడవిలోని ఓ పెద్ద గుహలో మాయా మందిరాన్ని ఒకదాన్ని నిర్మించుకుని ఉండేవాడు.\n\nమంత్ర విద్యల్లో ఆరితేరిన మాయల ఫకీరు.. తన మంత్రశక్తితో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేవాడు. ఒక రోజు తన దగ్గరున్న మాయా దర్పణంలో అపురూప సౌందర్యవతి అయిన బాలనాగమ్మను చూశాడు. ఆమె అందాన్ని చూసి, ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు.\n\nవెంటనే శివభక్తుడి వేషంలో రాజ మందిరానికి వెళ్లి బాలనాగమ్మను బిక్ష వేయమని అడిగాడు. బిక్షం వేసేందుకు బయటికి వచ్చిన బాలనాగమ్మను వెంటనే తన మంత్రదండంతో కుందేలుపిల్లగా మార్చి జోలెలో వేసుకుని వెళ్లిపోయాడు మాయల ఫకీరు. తన మాయా మందిరానికి వచ్చిన వెంటనే బాలనాగమ్మను మామూలుగా చేసి, తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు. భయంకర రూపంతో ఉన్న వాడిని చూడగానే ఆమె వెంటనే స్పృహతప్పి పడిపోయింది.\n\nఈలోగా రాజమందిరంలో తన భార్య కనిపించక పోవటంతో.. ఇది మాయల ఫకీరు పనే అయి ఉంటుందని భావించిన కార్యవర్థి రాజు వెంటనే తన సేనలతో బయలుదేరాడు. తన మాయా మందిరానికి వచ్చిన కార్యవర్థిని మాయల ఫకీరు తన మంత్ర శక్తితో అందరినీ శిలల్లాగా మార్చివేశాడు.\n\nఅలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా బాలనాగమ్మ కుమారుడికి పదహారేళ్లు వచ్చాయి. తన తల్లిని చెరబట్టి, తండ్రిని శిలగా మార్చిన మాయల ఫకీరు గురించి తెలుసుకున్న బాలవర్థి ఆవేశంతో ఊగిపోయాడు. తల్లిని, తండ్రిని ఎలాగైనా సరే రక్షించాలని మాయా మందిరానికి బయలుదేరాడు. అక్కడ ఓ ముసలమ్మను మంచి చేసుకున్న అతడు.. ఆమె మనుమడిగా ఆ మందిరంలోకి ప్రవేశించాడు.\n\nమెల్లిగా తన తల్లిని కలిసి తానెవరో చెప్పి.. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుందో కనుక్కోమని చెబుతాడు. వెంటనే బాలనాగమ్మ మాయల ఫకీరుతో మంచిగా మాట్లాడి.. పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటున్నట్లుగా నటించింది. \"అయితే మీ ప్రాణం ఎక్కడుందో నాకు చెప్పాలని\" ఆమె ఫకీరుకు షరతు పెట్టింది.\n\nదాంతో.. \"ఓసీ చిన్నదానా..! నా ప్రాణం గురించి నీకు ఎంత ఆసక్తి. మరేం భయంలేదు. నన్నెవరూ చంపలేరులే నువ్వు నిశ్చింతగా ఉండు\" అని చెప్పాడు మాయల ఫకీరు. \"లేదు స్వామీ మీరు చెప్పి తీరాల్సిందే\" అని బాలనాగమ్మ ఒత్తిడి చేసింది. దాంతో... \"ఏడు సముద్రాల అవతల జీవగడ్డ అనే దీవిలో ఉన్న పెద్ద మర్రిచెట్టు ఉంటుందనీ.. ఆ చెట్టు తొర్రలో ఓ బంగారు పంజరం ఉంటుందనీ, ఆ పంజరంలో ఉండే చిలుకలో తన ప్రాణం\" ఉందని చెప్పాడు ఫకీరు. ఆ చిలుకను చంపితే తన ప్రాణాలు పోతాయని అన్నాడు.\n\nఈ విషయాన్నంతా కుమారుడితో పూసగుచ్చినట్లు చెప్పింది బాలనాగమ్మ. అంతా విన్న బాలవర్థి చిలుక కోసం బయలుదేరాడు. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిని దాటి.. గండబేరుండ పక్షులు నివసించే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ గండబేరుండ పక్షి పిల్లల్ని తినబోతున్న పాముని చంపాడు. బాలవర్థి చేసిన సహాయానికి మెచ్చిన గండబేరుండ పక్షి తన వీపుపై కూర్చోబెట్టుకుని ఏడు సముద్రాలను దాటించి.. జీవగడ్డ దీవిలో దించింది.\n\nవెంటనే మర్రిచెట్టు తొర్రలో, బంగారు పంజరాన్ని తీసి చిలుకను పట్టుకున్నాడు బాలవర్థి. గండబేరుండ పక్షిపైనే కూర్చొని మాయా మందిరానికి వచ్చిన అతడు పకీరు ఎదురుగానే చిలుకను చంపివేశాడు. అంతే మాయల ఫకీరు కూడా వెంటనే చనిపోయాడు. అతని మాయా మందిరం కూడా అదృశ్యమైపోయింది. శిలలుగా మారి ఉన్న కార్యవర్థి అతని సైనికులు మామూలుగా అయిపోయారు. దాంతో తల్లిని, తండ్రిని వెంటబెట్టుకుని తమ రాజ్యానికి వెళ్లిపోయాడు బాలవర్థి. చిన్న వయసులోనే బాలవర్థి ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రజానీకం అతడికి జేజేలు పలికారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 220,
        "IMAGE": "cat_1",
        "NAME": "మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది...? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 220,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా నందనుడనే రాజు ఒకరు ఉండేవాడు. ఆ రాజుగారి రాజ్యంలో శేఖరుడు అనే మంత్రి పనిచేస్తుండేవాడు. ఒకరోజు మహారాజు తన మంత్రిని పిలిచి \"నమ్మకం గొప్పదా..? శ్రమ గొప్పదా..?\" అని ప్రశ్నించాడు. \"శ్రమ గొప్ప\"దని మంత్రి బదులిచ్చాడు. అయితే రాజుగారికి అది అంతగా నచ్చలేదు. అదే మాట మంత్రితో అనగా... కావాలంటే నిరూపించి చూపిస్తానన్నాడు మంత్రి.\n\nఅలా కొంతకాలం గడిచింది. నందనుడి సైన్యం పక్క రాజ్యం మీదికి దండెత్తి వెళ్లింది. మహారాజు మాత్రం కోటలోనే ఉండి.. తన సైన్యం గెలవాలని వేయి దేవుళ్లకు ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలోనే రాజుగారి ఆస్థానంలో పనిచేసే పూజారి ఒకడు రాజు దర్శనార్థం వచ్చాడు. అప్పుడు రాజు తన సైన్యం గెలవాలన్న కోరికను పూజారికి చెబుతాడు.\n\n\"మరేం భయపడకండి మహారాజా..! పొరుగూళ్ళో ఒక స్వామి సమాధి ఉంది. అది చాలా మహిమగలది. దాన్ని తాకి మొక్కితే కోరింది జరిగి తీరుతుందని\" చెబుతాడు పూజారి. పూజారి చెప్పిన విషయాన్ని నమ్మిన రాజు.. మంత్రిని పిలిపించి ఆ సమాధిని దర్శించుకునేందుకు తగిన ఏర్పాట్లను చేయమని పురమాయించాడు.\n\nదాంతో.. \"మన సైన్యం తగిన శక్తియుక్తులతో పోరాడాలే గానీ.. సమాధికి మొక్కితే లాభం ఏముంటుంది మహారాజా..?\" అని అన్నాడు మంత్రి. \"మీకు తెలీదు, అది చాలా మహిమగల సమాధి అని చుట్టుప్రక్కల జనం అందరూ అనుకుంటున్నారు. కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి\" అంటూ గద్దించాడు.\n\n\"సరే.. అలాగే కానివ్వండి\" అంటూ మంత్రి రాజుగారి ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. రాజుగారు మంత్రితో కలిసి సమాధి వద్దకు వెళ్ళాడు. సమాధికి ప్రదక్షిణ చేశాడు. అలసటగా ఉండటంతో పక్కనే ఉన్న చెట్టునీడలో కూర్చున్నాడు. ఇంతలో ఒక భటుడు రాజువద్దకు వచ్చి \"మహారాజా..! మన సైన్యం యుద్ధంలో గెలిచింది\" అని చెప్పాడు.\n\nవెంటనే... \"చూశారా మంత్రిగారూ..! మీరు ఈ సమాధిలో మహిమే లేదని అన్నారు. ఇప్పుడేమంటారు\" అని నిలదీశాడు రాజు. \"మహారాజా తమరు నన్ను మన్నించాలి. మన సైనికులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు. అందుకే గెలిచారు. అంతేగానీ ఈ సమాధికి మొక్కినందువల్ల మాత్రం కాదు\" అని అన్నాడు మంత్రి.\n\nరాజుగారికి వెంటనే బుస్సుమని కోపం వచ్చేసింది. కళ్లెర్రజేసి.. మంత్రి ఉరిమి చూశాడు. \"మహారాజా..! ఆ రోజు మీతో మాట్లాడుతూ.. నమ్మకం కంటే శ్రమే గొప్పదని మీకు చెప్పాను గుర్తుందా..! దాన్నే మీకు ఇప్పుడు ఈ రకంగా రుజువుచేసి చూపించాను. ఇది స్వామి సమాధి కాదు. ఇది కుక్క సమాధి, ఇందులో ఉండేది కుక్క శవం. దీన్ని నేనే కట్టించా\"నని చెప్పాడు మంత్రి.\n\nఅంతేగాకుండా.. అది చాలా మహిమగలిగిన సమాధి అని ప్రచారం కూడా చేయించాను. దాంతో అందరూ ఈ సమాధిలో ఏదో మహిమ ఉందని నమ్మారు. అలాగే మీకు కూడా చెప్పారు. అయితే అదంతా నిజం కాదు. కావాలంటే మీరే చూడండి అంటూ సమాధిని తవ్వించి అందులో గల కుక్క ఎముకలను రాజుగారికి చూపించాడు.\n\nదీంతో తన తప్పును గ్రహించిన మహారాజు.. గుడ్డి నమ్మకంతో ప్రదర్శించిన తన ప్రవర్తనను తలచుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. కాబట్టి పిల్లలూ..! గుడ్డి నమ్మకం మంచిది కాదని.. ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేస్తేనే మంచి ఫలితం, విజయం దక్కుతుందన్న ఈ కథలోని నీతి మీకు అర్థమయ్యింది కదూ...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 221,
        "IMAGE": "cat_1",
        "NAME": "అదో కుక్క సమాధి.. దాన్ని నేనే కట్టించా...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 221,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న సింహబలుడికి \"ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారంతా నామమాత్రపు వారే\"నని గురువు ధనంజయ ముని బోధించాడు. అయితే సింహబలుడికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అదే విషయాన్ని గురువుతో అన్నాడు.\n\n\"నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ తనను ఎంతో శ్రద్ధతో, భక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేనిదే వారు ఒక క్షణమైనా నిలువలేరు. వారి ప్రేమను నేనెలా శంకిస్తాను..?\" అని గురువును ప్రశ్నించాడు సింహబలుడు. \"నాయనా.. వారి ప్రేమ తాత్కాలికమైనది. అది నిజమని, శాశ్వతమని తలచటం అవివేకం. ఈ విషయాన్ని నేను నీకు ప్రత్యక్షంగా నిరూపించి చూపిస్తాన\"ని అన్నాడు.\n\nవెంటనే కొన్ని మాత్రలు తీసి సింహబలుడి చేతిలో పెట్టిన ధనంజయ ముని... \"ఇంటికి వెళ్లి తాను చెప్పినట్లగా, ఈ మాత్రలు మింగి పడుకో. కాసేపటికి నువ్వు చనిపోయినట్లు పైకి కనిపించినా.. కళ్లముందు జరిగేదంతా నీవు చూస్తావు, వింటావు\" అని అన్నాడు.\n\nసింహబలుడు గురువు చెప్పినట్లుగానే ఇంటికివెళ్లి.. ఆయన ఇచ్చిన మాత్రలు మింగి స్పృహతప్పి మంచంపై పడుకున్నాడు. అతని తల్లి, భార్య అందరూ దుఃఖిస్తూ పక్కనే కూర్చున్నారు. ఇంతలో అతని గురువు వైద్యుడి వేషంలో అక్కడికి వచ్చాడు. సింహబలుడి నాడిని పరీక్షించిన అతను.. ఇతడిని బ్రతికించేందుకు తన వద్ద మందు ఉందని చెప్పాడు. అది విన్న శిష్యుడి భార్య, తల్లి ఆనందానికి అవధే లేకుండా పోయింది.\n\n\"అయితే ఆ మందు పనిచేయాలంటే.. అందులో సగం ముందుగా రోగి బంధువులు ఎవరైనా మింగాలనీ.. మిగిలిన సగం భాగం రోగికి తాగిస్తేనే అతడు బ్రతుకుతాడని.. ముందుగా మందు తాగినవారు చనిపోతారని\" కిటుకు పెడతాడు గురువు ధనంజయ ముని. కాబట్టి.. సింహబలుడిపై ప్రేమ కలిగిన వారెవరయినా ముందుకొచ్చి, మందుతాగి అతడిని బ్రతికించమని కోరతాడు.\n\nఈ మాటలన్నింటినీ స్పృహ తప్పినట్లుగా పడి ఉన్న సింహబలుడు వింటున్నాడు. వైద్యుడి వేషంలో ఉండే అతని గురువు ముందుగా.. సింహబలుడి తల్లిని పిలిచి \"మాతా..! ఈ మందు తీసుకుని నీ కుమారుని ప్రాణం దక్కించుకో.. కుమారుడి కోసం నీ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో..\" అని అన్నాడు.\n\nవెంటనే తల్లి ఆ మందును చేతిలోకి తీసుకుని కాసేపు ఆలోచించి ఇలా అంది. \"అయ్యా..! నాకింకా ఇద్దరు పిల్లలున్నారు. నేను లేకపోతే వారు ఏమైపోతారు..? వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు..?\" అని బాధగా అంది. తరువాత సింహబలుడి భార్యను పిలిచిన గురువు మందు తాగమని ఆమెని కోరతాడు.\n\nఏడుస్తూ మందు చేతిలోకి తీసుకున్న సింహబలుడి భార్య.. కాసేపు ఆలోచించి \"నా భర్త కోసం నేను మరణించేందుకు సిద్ధమే. కానీ నేను లేనిదే ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు..? కనీసం పిల్లల కోసం అయినా తాను జీవించి ఉండాల్సిందే కదా స్వామీ..!\" అంటూ రోదిస్తూ బదులిచ్చింది.\n\nఈ మాటలన్నింటినీ వింటున్న శిష్యుడికి గురువు బోధనలోని యథార్థం అర్థమైంది. వెంటనే అతడు మంచంపైనుంచి దిగ్గునలేచి.. గురువుకు నమస్కరించి.. \"మహాత్మా..! మీరు చెప్పింది వాస్తవం. వీరంతా నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను. నేనిప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను. మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడేనని తెలుసుకున్నాన\"ని అన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 222,
        "IMAGE": "cat_1",
        "NAME": "నిజమైన బంధువు, మిత్రుడు.. భగవంతుడే..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 222,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం అరేబియా దేశంలో ఎంతోమంది మంత్రగాళ్లు ఉండేవారు. వారి దగ్గర ఎన్నోరకాల అద్భుత శక్తులు ఉండేవి. వాళ్లను చూసి ప్రజలు, రాజులు భయపడుతుండేవారు. ఆ దేశంలోని మక్కా నగరం వింతలకు, విడ్డూరాలకు పేరుగాంచింది. ఆ నగరానికి పడమటి కొండల మధ్యలో ఓ మంత్రాల దిబ్బ ఉండేదట. ఆ దిబ్బ కింద పెద్ద గుహ, ఆ గుహలో ఓ అద్భుత దీపం ఉండేది. అది కోరిన వరాలు ఇచ్చేదట. దాన్ని సంపాదించాలని ఎంతోమంది మాంత్రికులు వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎవరికీ సాధ్యం కాలేదు.\n\nచివరకు పకీర్ బాబా అనే మాంత్రికుడు ఆ రహస్యాన్ని కనుగొన్నాడు. కానీ అందుకు తెలివితేటలు, ధైర్యసాహసాలు కలిగిన పదేళ్ల కుర్రాడు కావాలి. అలాంటి కుర్రాడి కోసం మక్కా నగరమంతా గాలించినా ఎవరూ కనిపించలేదు. చివరికి అల్లా ఉద్దీన్ అనే కుర్రాడు ఇందుకు తగినవాడని నిర్ణయించుకుని.. నీకు కావలసిన బంధువునని అతడితో మెల్లగా పరిచయం పెంచుకున్నాడు పకీర్ బాబా.\n\nఅల్లా ఉద్దీన్ కుటుంబం చాలా పేద కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో, తల్లి దిగులుతో మంచం పట్టింది. తినేందుకు తిండి కూడా లేదు. అలాంటి సమయంలో పకీర్ బాబా వారి ఇంటికి వచ్చి.. వాళ్లకు అవసరమైన వస్తువులన్నీ ఇచ్చాడు. దాంతో అల్లా ఉద్దీన్ బాబాను పూర్తిగా నమ్మాడు. ఒకరోజు ఆ మాంత్రికుడు అల్లా ఉద్దీన్‌ను తీసుకుని మంత్రాల దిబ్బ వద్దకు వెళ్లాడు.\n\nఓ మంత్రం చదివి కర్రతో కొట్టగానే ఆ దిబ్బలో పెద్ద గుహ కనిపించింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ అందమైన తోట కనిపించింది. ఆ తోట మధ్య సన్నటి సొరంగం కనిపించింది. వెంటనే లోపలికి ఒక తాడు వదిలి, అల్లా ఉద్దీన్ వీపుతట్టిన బాబా అందులోకి దిగమన్నాడు. దాంతో అల్లా ఉద్దీన్ తాడు సహాయంతో గుహలోపలికి దిగాడు.\n\nగుహలోని అన్ని మూలల్లోను వెదికితే ఒక ఇత్తడి దీపం కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని పైకి వచ్చేయమని అల్లా ఉద్దీన్‌కు చెప్పాడు బాబా. అలాగే.. అయితే దీపాన్ని నడుముకు కట్టుకుని తాడు గట్టిగా పట్టుకుంటాను పైకి లాగేయమని చెబుతాడు అల్లా ఉద్దీన్. లేదు ముందు దీపాన్ని పంపించు.. ఆ తరువాత నిన్ను పైకి లాగుతానని చెప్పాడు మంత్రగాడు.\n\nదీంతో అల్లా ఉద్దీన్‌కు ఏదో అనుమానం వచ్చి.. దీపాన్ని ఇచ్చేది లేదని మొండికేశాడు. తీవ్రమైన కోపానికి గురైన ఆ మాంత్రికుడు అల్లా ఉద్దీన్‌ను ఎన్నో రకాలుగా భయపెట్టాడు, బెదిరించాడు, బ్రతిమలాడాడు. అయినా అతడు వినకపోయేసరికి నీ చావు నుమూసేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.\n\nఅయ్యో.. దేవుడా..! ఎంతపని చేశావు..? ఇప్పుడు నేను పైకెలా వెళ్లేది అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు అల్లా ఉద్దీన్. అలాగే ఏడుస్తూ గుహలో తిరుగాడుతున్న అతడికి గబ్బిలాలు, గుడ్లగూబలు మిల మిలా మెరుస్తూ కనిపించాయి. ఇంకోవైపు మనుషుల అస్థిపంజరాలు వేలాడుతూ కనిపిస్తే.. మరోవైపు వెలుతురు కనిపించింది. ఓ చోట మంచినీళ్లు కనిపించగానే అక్కడికెళితే.. నీళ్లు మాయమయ్యాయి.\n\nనిండా మామిడిపండ్లతో కనిపించిన చెట్టు దగ్గరికి వెళితే.. చెట్టుతో సహా మాయమైపోయింది. ఆకలి, భయంతో వెంటనే కిందపడిపోయాడు అల్లా ఉద్దీన్. అతడితోపాటు నడుముకు కట్టి ఉన్న దీపం కూడా కింద పడగానే.. ఆ దీపంలోంచి ఓ భూతం వచ్చి అల్లా ఉద్దీన్ ముందు చేతులు కట్టుకుని నిలుచుంది. బాగా భయపడ్డ అతను.. కాసేపటికి కోలుకుని, ధైర్యం తెచ్చుకుని \"ఎవరు నువ్వు..?\" అని ప్రశ్నించాడు.\n\n\"నేను భూతాన్ని, ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే.. వాళ్లు చెప్పినట్టల్లా చేస్తాను. ఏం కావాలో సెలవు ఇవ్వండి..?\" అంది ఆ భూతం. దాంతో అల్లా ఉద్దీన్‌కు దీపం మహత్యం అర్థమై, మెల్లిగా ధైర్యం వచ్చింది. \"నన్ను వెంటనే మా ఇంటికి చేర్చు\" అన్నాడు. వెంటనే ఆ భూతం అతడిని ఇంటికి చేర్చింది. అయితే అతడి తల్లి.. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి స్పృహ లేకుండా మంచంలో పడి ఉంది.\n\nఅది చూసి చలించిపోయిన అల్లా ఉద్దీన్ తల్లి దగ్గరకు వెళ్లి \"అమ్మా.. అమ్మా..!\" అని గట్టిగా పిలిచాడు. దాంతో కొడుకు గొంతువిన్న ఆమె కళ్లు తెరిచి ఆనందంతో గట్టిగా కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది. \"ఏడ్వకమ్మా..! మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇదిగో అద్భుత దీపం.. కోరిన వరాలు ఇస్తుంది\" అంటూ జరిగినదంతా తల్లితో పూసగుచ్చినట్లు చెప్పాడు అల్లా ఉద్దీన్.\n\nకొడుకు మాటలు విన్న అల్లా ఉద్దీన్ తల్లి సంతోషించింది. భూతాన్ని ఓ పెద్ద మేడను సృష్టించమని కోరాడు అల్లా ఉద్దీన్. వెంటనే రాజమహల్ లాంటి పెద్ద మేడ తయారయ్యింది. అలాగే పది మూటల బంగారు నాణాలు, దాసదాసీ జనాలు, గుర్రాలు.. ఇలా తనకు అవసరమైన అన్నింటినీ కోరాడు. వెంటనే భూతం అన్నీ అమర్చి పెట్టింది. ఈ రకంగా అద్భుత దీపం మహితో తల్లితో సంతోషంగా జీవనం సాగించాడు అల్లా ఉద్దీన్. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 223,
        "IMAGE": "cat_1",
        "NAME": "అల్లా ఉద్దీన్.. అద్భుత దీపం..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 223,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో సింహం ఉండేది. అడవికి రాజైన అది ఎప్పుడు చూసినా జంతువులన్నింటినీ భయభ్రాంతుల్ని చేస్తుండేది. ఆ సింహానికి ఒక నక్క చాడీలు చెబుతూ పబ్బం గడుపుకునేది. సింహం బాధలు ఓర్చుకోలేని జంతువులన్నీ ఒకచోట చేరి దాన్ని ఎదిరించాలని తీర్మానించుకున్నాయి.\n\n\"మన అడవిలో అందరూ రాజులే. ఎవరి తిండి వాళ్ళం సంపాదించుకుంటున్నాం. ఎవరి బ్రతుకు వాళ్ళం బ్రతుకుతున్నాం. కాలం మారుతోంది. రాజుల్లేరు.. గీజుల్లేరు..\" అంటూ ఒక కోతి మిగతా జంతువులన్నింటికీ హితబోధ చేసింది. అంతే కోతి చెప్పిన మాటలకు తమ అంగీకారం తెలిపిన జంతువులన్నీ కలిసి.. ఇక లాభం లేదు సింహానికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని అనుకున్నాయి.\n\nవెంటనే సింహం ఉండే గుహవద్దకు జంతువులన్నీ చేరుకున్నాయి. గుహ ముందు నిలబడి.. \"రాజుల కాలం పోయింది, మాకు మేమే రాజులం\" అంటూ పెద్దపెట్టున అరవసాగాయి. బాగా నిద్రపోతున్న సింహానికి ఆ మాటలు, అరుపులు వినిపించాయి. \"అడవిలోని జంతువులన్నీ ఏదో పెద్ద కుతంత్రం చేస్తున్నాయని నక్క చాలా రోజుల నుంచి చెబుతోంది. ఇదేనన్నమాట..!\" అని మనసులోనే అనుకుంది.\n\n\"తాను ఒక్కసారి గర్జిస్తే సరి.. జంతువులన్నింటికీ గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. ఎక్కడివక్కడ పారిపోతాయి\" అనుకుంటూ సింహం గుహలోంచే పెద్దగా అరిచింది. అయితే విచిత్రంగా దాని గొంతులోంచి \"మ్యావ్.. మ్యావ్...!\" అనే శబ్దం రాసాగింది. ఎంత కూడదీసుకుని గట్టిగా గర్జించే ప్రయత్నం చేసినా... పిల్లిలా మ్యావ్.. మ్యావ్ అన్న శబ్దం తప్ప గాండ్రింపు అసలు రానే లేదు. దీంతో సింహానికి భయం పట్టుకుంది.\n\nఈ సంగతి జంతువులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా..? పరువు పోతుందని గాబరా పడిపోయింది సింహం. గుహలోంచి తల పైకెత్తి చూస్తే... గుహ బయట ఏనుగులు, పులులు, చిరుతలు, తోడేళ్లలాంటి పెద్ద జంతువులే గాకుండా.. కుందేళ్లు, కోతులు, జింకల్లాంటివి కూడా \"రాజుల కాలం పోయింది.. మాకు మేమే రాజులం\" అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాయి.\n\nఅది సరే.. సింహం ఎందుకు శబ్దం చేయకుండా ఉందా..? అని నక్కకు అనుమానం పట్టుకుంది. ఆత్రం పట్టలేక అది మెల్లగా గుహలోకి దొంగతనంగా ప్రవేశించింది. సింహాన్ని కుశల ప్రశ్నలు వేసింది. \"రాజా..! ఈ జంతువులెంతగా బరితెగించాయో చూశారా..?\" అని అంది. సింహం నోరు తెరిస్తే ఒట్టు. \"మహారాజా.. మీరు ఈ అడవి రాజ్యానికి రాజు కదా.. అలా చూస్తూ ఊరుకుంటారేంటి..? రెట్టించి అడిగింది నక్క. అయినా సరే సింహం నోరెత్తలేదు.\n\n\"ఓహో..! మీరు మంచివారు, కాలం మారిందని ఎంతో బాగా తెలుసుకుని రాచరికాన్ని వదిలేసుకున్నారన్నమాట..!\" అని తనకుతానుగా మళ్లీ అంది నక్క. అయినా సరే సింహం నోరు తెరవలేదు. ఈలోపు గుహ బయటి జంతువులన్నింటికీ \"నక్క ఏం చేస్తోంది.. సింహంతో మంతనాలు ఆడుతోందా..?\" అనే సందేహం వచ్చింది. దాంతో నక్క బయటికి రావాలని అవి గట్టిగా అరిచాయి.\n\nనక్కకు పై ప్రాణాలు పైనే పోయాయి. మెల్లగా బయటికి వచ్చింది. జంతువులన్నీ దానిమీద పడి చంపబోయాయి. \"మిత్రులారా..! నా మాట వినండి. నేను సింహంతో మాట్లాడాను. ఇప్పుడు సింహం కూడా తాను రాచరికం వదిలేసింది. గర్జించటం కూడా మానుకుంది. ఈ సంతోషమైన వార్త మీకు చెబుదామని నేనే వస్తునాన్నాను. ఇంతలో మీరే పిలిచారు\" అని మొరపెట్టుకుంది.\n\nదాంతో జంతువులన్నింటికీ సింహం గురించి, నక్క జిత్తులమారితనం గురించి అర్థమైంది. సింహం తోక ముడిచేటప్పటికి నక్క కూడా చాడీలు చెప్పటం మానుకొనే రోజు వచ్చేసిందని వాటన్నింటికీ తెలిసిపోయింది. ఇకపై ఎవరికీ భయపడాల్సింది లేదు.. మాకు మేమే రాజులం అని నవ్వుకుంటూ అక్కడ్నించి జంతువులన్నీ సంతోషంగా వెళ్లిపోయాయి.. అంతే.. ఇక కథ కంచికి.. మనం ఇంటికి...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 224,
        "IMAGE": "cat_1",
        "NAME": "మ్యావ్, మ్యావ్.. సింహం.. జిత్తులమారి నక్క...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 224,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో శీనయ్య అనే వంటవాడు ఉండేవాడు. పక్క ఊర్లో ఏదో శుభకార్యం కోసం వంటపని ఒప్పుకున్నాడు. దాంతో శుభకార్యం రోజున ఆ ఊరికి వెళ్లి వంట చేశాడు. అతడు బాగా వంటచేయటంతో మెచ్చుకున్న ఆ ఇంటివారు.. శీనయ్యకు ఇవ్వాల్సిన డబ్బుతోపాటు ఓ అరమూట వడ్ల గింజలను కూడా బహుమతిగా ఇచ్చారు. వాటిని భుజంపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు శీనయ్య.\n\nనడచి, నడచి బాగా అలసిపోవటంతో.. విశ్రాంతి తీసుకునేందుకు ఓ కుమ్మరి ఇంటివద్ద ఆగుతాడు శీనయ్య. బాగా నీరసంగా ఉంది, కాసేపు మీ ఇంటి అరుగుమీద కునుకుతీసి వెళ్తానని ఆ ఇంటివారిని అడిగాడు. వాళ్లు ఒప్పుకోవటంతో అరుగుమీద పడుకున్నాడు. ఎంతసేపటికీ నిద్ర రాకపోవటంతో ఏవేవో ఆలోచనల్లో పడిపోయాడు శీనయ్య.\n\nఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఇలా అనుకోసాగాడు.. \"తన వద్దనుండే ధాన్యం మూటలోని గింజల్ని విత్తనాలుగా పెరట్లో వేస్తే.. అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దవై పంట చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాలలో నాటితే ఇంకా ఎక్కువగా ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అప్పుడు తాను కాలుమీద కాలు వేసుకుని మహారాజులాగా బ్రతుకుతాను.\n\nఅలా సంపదతో తులతూగుతున్న తనవద్దకు బంధువులు అందరూ వచ్చి.. వారి అందమైన అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేస్తామని పోటీ పడుతూ ఉంటారు. తానేమో వాళ్లందరినీ చీకొట్టి నా అంతస్తుకు మీరు సరిపోరని పంపించేస్తాను. అయినా వాళ్లు వినకుండా తన కాళ్లావేళ్లా పడతారు. అప్పుడు తాను ఛీ, పో అంటూ కాలితో ఒక్క తన్ను తన్నేస్తాను\" అనుకుంటూ.. ఎదురుగా పేర్చి ఉన్న కుండల దొంతరలను తన్నేస్తాడు శీనయ్య.\n\nఅంతే వెంటనే ఆ ఇంటి యజమాని లబోదిబోమంటూ.. \"కాసేపు కునుకు తీస్తానని నేను ఎంతో కష్టపడి తయారు చేసిన కుండలన్నింటినీ పాడు చేశావు కదయ్యా..?\" శీనయ్యపై విరుచుకుపడ్డాడు. అయినా కూడా శీనయ్య ఊహాలోకంలోంచి బయటకు రాకపోవటంతో.. కోపంతో మండిపోయిన ఆ ఇంటి యజమాని రెండు తగిలించి మరీ అక్కడినుంచి తరిమివేశాడు.\n\nకాబట్టి ఈ కథ ద్వారా మనం తెల్సుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలూ..! పగటి కలలు కంటూ గాలిలో మేడలు కట్టకూడదనే. ఏదైనా ఫలితం రావాలంటే ముందుగా కష్టించి పనిచేయాలి. అలా పనిచేసినప్పుడే రాబోయే ఫలితం గురించి ఆలోచించాలి. అంతేగానీ ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని గాలి మేడలు కట్టినట్లయితే.. శీనయ్యలాగా తన్నులు తినాల్సిందే మరి..! దీనికి మీరేమంటారు..?! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 225,
        "IMAGE": "cat_1",
        "NAME": "శీనుగాడి పగటి కలలు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 225,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. \"మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి\" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.\n\nమొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి \"మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని\" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు \"మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని\" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి \"మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని\" చెప్పాయి.\n\nఅంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.\n\nఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... \"నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని\" అడిగింది. వెంటనే రాజు రెండో భార్యను తరిమేశాడు.\n\nఅలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.\n\nఅంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి వెళదాం పిల్లలూ..!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 226,
        "IMAGE": "cat_1",
        "NAME": "రాజుగారు.. ఇద్దరు భార్యలు...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 226,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు వీరయ్య, శూరయ్య అనే ఇద్దరు పేరుమోసిన గజదొంగలు ఉండేవారు. వీరు వేర్వేరు ప్రాంతాలలో పేరు మోసినవారు కావడంతో ఒకరి గురించి మరొకరు విన్నారు గానీ, ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే, అనుకోకుండా ఓసారి ఇద్దరు దొంగలు కలుసుకున్నారు. వెంటనే వీరయ్య, సూరయ్యని తన ఇంటికి భోజనానికి పిలిచాడు.\n\nవీరయ్య కోరిక మేరకు భోజనానికి వెళ్లిన సూరయ్యకి వీరయ్య భార్య బంగారు గిన్నెలో భోజనం వడ్డించింది. సూరయ్యకి తనకు అన్నం వడ్డించిన గిన్నెపై కన్నుపడింది. ఎలాగైనా సరే ఈ గిన్నెను దొంగిలించాలని మనసులోనే పథకం వేశాడు. అయితే అతడి ఉద్దేశ్యాన్ని సులభంగానే పసిగట్టాడు వీరయ్య.\n\nజాగ్రత్త కోసం ఆ గిన్నె నిండా నీళ్లుపోసి, ఉట్టిమీద ఉంచి, రాత్రిపూట ఆ ఉట్టి కింద పడుకున్నాడు వీరయ్య. గిన్నె దొంగిలించాలని భావించిన సూరయ్య కూడా ఆ ఇంట్లోనే మరోచోట పడుకున్నాడు. వీరయ్య మంచి నిద్రలో ఉండగా.. సూరయ్య ఆ గిన్నెలో ఓ పాత గుడ్డను వేశాడు.\n\nఆ గుడ్డ ఆ గిన్నెలోని నీటినంతా పీల్చేసుకున్న తరువాత దాన్ని దొంగిలించి, దగ్గర్లోని చెరువులో మోకాళ్లలోతు నీటిలో పాతిపెట్టి.. గుర్తుగా ఓ కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్లుగా వచ్చి పడుకున్నాడు సూరయ్య. వీరయ్యకు మెలకువ వచ్చి చూడగానే గిన్నె కనిపించలేదు. అది సూరయ్య పనే అనుకుని అతడి వద్దకు వచ్చి పరిశీలనగా చూడగా... మోకాళ్ల వరకు తడిచి ఉండటాన్ని గమనించాడు.\n\nవెంటనే వీరయ్య చెరువు వద్దకు వెళ్లి గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర గిన్నెను వెతికి తెచ్చుకున్నాడు. మర్నాడు సూరయ్య ఆ గిన్నెను చూసి ఇలాంటివి మీకు రెండు గిన్నెలు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. అబ్బే లేదు సూరయ్యా..! నాకు ఉండేది ఒకటే గిన్నె, అది నిన్నటిదే అని చెప్పాడు. దాంతో విషయం అర్థమయిన వెళ్లొస్తానని చెప్పి... గుట్టు చప్పుడు కాకుండా అక్కడ్నించి జారుకున్నాడు సూరయ్య. అది చూసిన వీరయ్య దంపతులు \"దొంగను దొంగే కదా పట్టగలడు\" అనుకుంటూ నవ్వుతూ చూడసాగారు.\n\nకాబట్టి... దొంగతనం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, కోతలు కోసేవారికి అలాంటి వారే తటస్థించినప్పుడు వారి గుట్టు సులభంగా బయటపడుతుంది. కారణం వారి రహస్యాలు వారికే బాగా తెలుస్తాయి. అందుకే ఇలాంటి వాటిని ఉదాహరణలుగా చెబుతూ మన పెద్దలు \"దొంగను దొంగే పట్టాలన్న\" సామెతను వెలుగులోకి తీసుకొచ్చారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 227,
        "IMAGE": "cat_1",
        "NAME": "దొంగను దొంగే పట్టాలి...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 227,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు.\n\nఅక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. \"బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?\" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, \"లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ\"ని చెప్పాడు.\n\nబీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... \"క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు\" అని అన్నాడు. \"లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద\"ని చెప్పాడు బీర్బల్‌.\nకష్టపడకపోతే ఇంతే మరి...!!\n\nవెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... \"బీర్బల్...‌! నువ్వన్నట్లుగానే ఈ వ్యక్తి గాఢనిద్రలో ఉన్నాడు. కానీ యితనికి ఈ రాళ్ళ మీద యింత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేద\"ని అన్నాడు.\n\n\"జహాపనా...! ధనికుడై ఉండడానికి, నిద్ర పట్టడానికి ఏమీసంబంధంలేదు. నిద్ర ష్టపడితేనే వస్తుంది. ఈ పేదవాడు కష్టపడి పనిచేసి అలసిపోయాడు. అందువల్లనే ఇతనికి గాఢనిద్ర పట్టింది. ఇటువంటి సుఖనిద్ర కష్టపడితేనే లభిస్తుంద\" ని వివరించి చెప్పాడు బీర్బల్‌.\n\nఅయినప్పటికీ... బీర్బల్‌ మాటలపై అక్బర్‌కు నమ్మకం కలుగలేదు. \"అది కాదు బీర్బల్‌..! ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలూ, నిద్రపోవడానికి హంసతూలికా తల్పాలు వుంటే... ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగలడు కదా..!\" అని అన్నాడు అక్బర్. \"హుజూర్...‌! మీరు అన్న మాటలు నిజంకావు. కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిగా చేసి చూడండి\" అని చెప్పాడు బీర్బల్‌ .\n\nదీంతో.. తాను చెప్పిన మాటలే నిజమని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్‌ చక్రవర్తి. ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. రుచికరమైన ఆహార పానీయాలు, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన హంసతూలికాతల్పం వగైరా అన్ని ఏర్పాట్లు చేయిం చాడు.\n\nకష్టపడి కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజ భవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప, వేరే పనేమీ లేకుండా పక్షంరోజులు గడిచిపోయాయి. ఒకనాడు అక్బర్‌ ఆ వ్యక్తిని గురించి బీర్బల్‌ని అడిగాడు. \"ప్రభూ..! ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం\" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అక్బర్... \"అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట, ఎవరి నిర్లక్ష్యంవల్ల ఇలా జరిగింద..?\"ని ప్రశ్నించాడు.\n\n\"జహాపనా...! నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చుని షికారు వెళ్ళాడు. దారిలో చలిగాలి తగిలింది. దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది\" అని చేప్పాడు బీర్బల్‌ . \"చలి నుండి రక్షించుకోడానికి ఆ సమయంలో అతని దగ్గర కంబళి లేదా..?\" అని ప్రశ్నించాడు అక్బర్‌. \"లేకేం ప్రభూ...! ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంక వస్త్రాలకు లోటేమిటి..? అతని తల నుండి కాళ్ళ వరకూ ఉన్ని వస్త్రం కప్పి ఉంది. అయినా అతనికి జలుబు చేసింద\"ని చెప్పాడు బీర్బల్‌.\n\n\"అతనికి నిద్ర బాగా పడుతున్నది కదూ..?\" అడిగాడు అక్బర్‌. \"ఏపూటా సరైన నిద్రలేదు. హంసతూలికాతల్పం మీద విశ్రమించిన పిదప నౌకర్లు కాళ్ళుపడితే కాసేపు నిద్ర పోగలుగుతున్నాడని\" చెప్పాడు బీర్బల్‌. \"ఏం..? ఎందుకని..? అక్కడ రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు. ఇక్కడ ఉన్ని వస్త్రం కప్పుకున్నా చలి వల్ల జలుబు చేసింది. అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఎంత ఆశ్చర్యం?\" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్.\n\n\"దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీలేదు ప్రభూ..! అతడు పాపం ధనికుడై కష్టాలపాలయ్యాడంతే..\" అన్నాడు బీర్బల్‌. \"రాళ్ళురప్పలపై హాయిగా నిద్రించిన వ్యక్తి హంసతూలికాతల్పం మీద నిద్రించలేకపోతున్నాడు. ఇది ధనికుడైనందు వలన అతడికి కలిగిన శిక్ష. ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు. అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది. దాంతో మంచి నిద్రపట్టేది. ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు. మామూలు చలి, వేడి కూడా ఇతను ఇప్పుడు భరించలేకపోతున్నాడ\"ని వివరించి చెప్పాడు బీర్బల్‌.\n\nఅక్బర్‌కు ఇప్పుడు కూడా బీర్బల్‌ మాటలపై నమ్మకం కలుగలేదు. ఆ రాత్రి ఆయన బీర్బల్‌ని వెంట బెట్టుకుని ఆ నకిలీ ధనవంతుడున్న భవంతికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్రపట్టక అవస్థపడుతున్నాడు. \"ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేద\"ని బీర్బల్‌ని అడిగాడు అక్బర్.\n\n\"జహాపనా..! అతని పక్కమీద ఏదో ఉండి గుచ్చుకుంటోంది. అందుకే అతనికి నిద్ర పట్టలేదు\" అన్నాడు బీర్బల్. బీర్బల్‌ లోపలికి వెళ్లి అతని తల్పాన్ని పరీక్షించాడు. దుప్పటి కింద ఒక ప్రత్తి గింజ కనిపించింది. దాన్ని అక్బర్‌కి చూపించి \"చూడండి ప్రభూ..! దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్రపట్టడం లేద\"ని అన్నాడు.\n\n\"ఇంతకు ముందు ఇతనికి రాళ్ళు కూడా గుచ్చు కోలేదు. ఇప్పుడు ఈ చిన్న విత్తనం ఇతనికి కష్టం కలిగింది. మీరు ఇతని చేత్తో పక్కకూడా దులపనివ్వడం లేదు. ఇది ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష. కష్టపడి పనిచెయ్యకపోవడమే దీనికి కారణం\" అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్. అప్పటికి బీర్బల్‌ మాటలతో ఏకీభవించిన అక్బర్.. మరునాడు ఆ వ్యక్తిని రాజ భవనం నుంచి పంపిస్తూ.. ముందులాగే కష్టపడి, శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 228,
        "IMAGE": "cat_1",
        "NAME": "ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 228,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అల్లరి పిల్లాడైన సన్నీని మార్కులు సరిగా రాలేదని కర్రతో కొడుతున్నాడు తండ్రి సూర్యారావ్. \"నేను బాగానే చదివాను నాన్నా..! అయినా మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో తెలియదు. నన్ను కొట్టకండి నాన్నా...!\" అంటూ ప్రాధేయపడుతున్నాడు సన్నీ. \"బాగా చదివితే మార్కులెందుకు రావురా వెధవా...!\" అంటూ మరింత కోపంతో కొట్టసాగాడు సూర్యారావ్.\n\n\"అబ్బా.. వద్దు నాన్నా.. కొట్టొద్దు.. ఇకనుంచి బాగా చదువుతాను\" అంటూ ఏడుస్తూ అన్నాడు సన్నీ. కొడుకును కొడుతుంటే చూడలేని సన్నీ తల్లి సునీత చిన్న కొడుకును ఒళ్లో దాచుకుని గడపకు ఆనుకుని ఏడుస్తూ ఉంది. సన్నీ ఏడుపులు విని చుట్టుప్రక్కల వాళ్ళంతా సూర్యారావ్ ఇంటిముందు గుమికూడారు.\n\nపక్కింటి పాపారావు ఇక ఉండబట్టలేక.. పరుగున వచ్చి సూర్యారావ్ చేతిలో కర్ర లాక్కుని.. \"ఎందుకండీ చిన్ని పిల్లాడిని అలా కొడుతున్నారు\" అంటూ ప్రశ్నించాడు. \"మీకు తెలియదు లేండీ.. వీడు బాగా చెడిపోయాడు. తిరుగుళ్లు నేర్చి చదువు అటకెక్కించాడు. వీడికి మరి నాలుగు తగలాల్సిందే\" అంటూ మళ్లీ కర్ర తీసుకున్నాడు సూర్యారావ్. మంచిమాటలతో.. సరైన దారిలో..!!\n\n\"సర్లేండి. పిల్లాడిని కొడితే మాత్రం చదువొస్తుందా..? నిదానంగా వాడికి అర్థమయ్యేలా చెబితే సరిపోతుంది కదా..!!\" అంటూ పాపారావు సూర్యారావ్‌ను శాంతింపజేశాడు. బాగా దెబ్బలు తిన్న సన్నీ.. తన తండ్రికి తానంటే ఇష్టంలేదు కాబట్టే ఇలా కొడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. అంతే ఓ ఉత్తరం రాసి, అర్ధరాత్రిపూట తండ్రి దిండుకింద పెట్టేసి ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు బయల్దేరాడు.\n\nచీకట్లో మెల్లిగా అడుగులు వేసుకుంటూ రైల్వేస్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు సన్నీ. ఇంతలో \"ఎక్కడికి వెళ్తున్నావ్ సన్నీ..?\" అనే పిలుపుతో పాటు, అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారెవరో. క్షణకాలంపాటు వణికిపోయిన సన్నీ.. తండ్రికి దొరికిపోయానని, ఇక తనపని గోవిందా..! అని బిక్కమొహం వేసుకుని తిరిగి చూశాడు.\n\nఅయితే అక్కడ తన తండ్రికి బదులుగా పక్కింటి పాపారావు అంకుల్ ఉండటంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నాడు సన్నీ. అంతే ఒక్కసారిగా భోరున ఏడుస్తూ, తన తండ్రికి తానంటే ఇష్టం లేదనీ, తనను సరిగా చూసుకోవటం లేదని వాపోయాడు. అంతా విన్న పాపారావు.. లేదు సన్నీ నువ్వు పొరపాటు పడుతున్నావు. పిల్లల్ని ఏ తల్లిదండ్రులు ద్వేషించరు. నువ్వు బాగుండాలనే మీ నాన్న అలా చేశాడు అని సర్ది చెప్పాడు.\n\n\"బాధ్యతగా చదువుకోవాల్సిన వయసులో అల్లరిచిల్లరిగా తిరిగే నీ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనని భయపడే మీ నాన్న నిన్ను కొట్టాడేగానీ... నీమీద ప్రేమలేక కాదు\" అని పాపారావు సన్నీని ఓదార్చాడు. కావాలంటే నువ్వంటే మీ అమ్మానాన్నకు ఎంత ప్రేముందో తెలుసుకుందుగానీ, నేను చెప్పినట్లు చేసి చూడు అన్నాడు.\n\nఅదలా ఉంటే.. ఉదయాన్నే కొడుకు రాసిన ఉత్తరాన్ని చూసిన సన్నీ తల్లిదండ్రులు ఏడుస్తూ కుప్పగూలిపోయారు. అలా ఏడుస్తూ పాపారావు ఇంటికి వెళ్లిన వారు \"చూశారా వాడు అంత అన్యాయం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో ఏమో\" అంటూ ఏడ్వసాగారు. సాయంత్రందాకా అన్నిచోట్లా వెతికిన వారు, రోజంతా తిండీ నిద్ర లేకుండా గడిపారు.\n\nఅలా రాత్రయిన తరువాత పాపారావు తన ఇంట్లో దాచిన సన్నీని పిలిచి, తల్లిదండ్రుల వద్దకు వెళ్లమని చెప్పాడు. ఏడుస్తూ \"అమ్మా, నాన్నా నేను ఎక్కడికి వెళ్లలేదు\" అంటూ వారిని అల్లుకుపోయాడు సన్నీ. బిడ్డ దొరికాడన్న ఆనందంలో ముద్దుల వర్షం కురిపించసాగారు సన్నీ తల్లిదండ్రులు.\n\nకాసేపటికి ఏడుపుమాని... \"నేను బాగా చదువుకుంటాను నాన్నా. ఈసారి తక్కువ మార్కులు రాకుండా మరింత కష్టపడతాను. తప్పయింది క్షమించండి నాన్నా..!\" అని అన్నాడు సన్నీ. అంతకుముందురోజు రాత్రి జరిగిన సంఘటనను సన్నీ తల్లిదండ్రులకు వివరించిన పాపారావు.. \"మీ బిడ్డకు మీరేంటో తెలిసి రావాలని అలా నాటకం ఆడాననీ, తప్పయితే క్షమించమని\" అడిగాడు.\n\nపాపారావు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పిన సన్నీ తండ్రి సూర్యారావ్... \"ఇకపై నేను కూడా నిన్ను కొట్టనురా బాబూ.. నువ్వు చక్కగా చదివి నన్ను కూడా బాధపెట్టకుండా ఉంటే చాల\"ని అన్నాడు. పిల్లల్ని కొడితే చదువురాదనీ, మంచిమాటలతో పిల్లలను సరైన దారిలో నడిపించాలని బాగా అర్థం చేయించిన పాపారావుకు మనసులోనే అభినందించిన సూర్యారావ్, సన్నీని ప్రేమగా, ఆప్యాయంగా తల నిమురుతూ ఉండిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 229,
        "IMAGE": "cat_1",
        "NAME": "పిల్లల్ని కొడితే చదువు వచ్చేస్తుందా...?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 229,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా, నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి, తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు.\n\nపండితులు రాజుగారి ఆజ్ఞను శిరసావహించి పురుషోత్తముడిని తమతోపాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగీ తండ్రివద్దకు తీసుకొచ్చారు. \"మహారాజా..! మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామనీ, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండని\" అన్నాడు పండితులు.\n\nదీంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడయిన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి.. \"మహారాజా..! యువరాజుగారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని\" సూచించాడు.\n\nఅవును నిజమే కదా..! అని మనసులోనే అనుకున్న రాజుగారు.. \"సరే.. ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండని\" మంత్రిని అడిగాడు. \"మహారాజా..! ఈ భవిష్యత్ జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు గానీ, లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం\" అని చెప్పాడు మంత్రి. గుప్పిట్లో ఏముంది రాకుమారా..?!\n\nతనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసనీ.. అతడయితే మన రాజకుమారుడికి తగిన వివేకాన్ని, విచక్షణను నేర్పగల సమర్థత కలిగినవాడని చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా.. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.\n\nమూడు నెలల తరువాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకొచ్చిన మాధవుడు.. తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలిపించి మీరే రాకుమారుడిని పరీక్షించండని అన్నాడు. వృద్ధమంత్రి లోపలి గదిలోకి వెళ్లి గుప్పిట్లో ఏదో పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు.\n\nపురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా \"ఉంగరం\" అని చెప్పాడు. దాంతో రాజుగారితోపాటు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి కూడా ఆశ్చర్యానికి గురై నోట మాట రాకపోగా.. \"సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా..?\" అని ప్రశ్నించాడు.\n\n\"ఏమీలేదు మంత్రివర్యా...! మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్లి వచ్చిన తరువాత ఉంగరం మీ వేలికి లేదుకదా..!\" అన్నాడు. దీనికి సంతోషించిన మంత్రి.. \"మహారాజా..! పరిశీలన ఉంటే, భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉంద\"ని అన్నాడు.\n\nతన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజావారు.. వృద్ధ మంత్రితోపాటు, తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి, సత్కరించారు. ఇక ఆరోజు నుంచి భవిష్యత్తుపై బెంగలేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 230,
        "IMAGE": "cat_1",
        "NAME": "మంత్రిగారి గుప్పిట్లో ఏముంది..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 230,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక మడుగులో తాబేలు ఒకటి ఉండేది. నీటిలో తిరిగి తిరిగి విసుగు పుట్టినప్పుడు అది ఒడ్డుమీదకు వచ్చి షికార్లు కొట్టేది. ఇలా ఒకరోజు తాబేలు మడుగు ఒడ్డున షికార్లు చేస్తుంటే, జిత్తులమారి నక్క ఒకటి చూసింది. లొట్టలేసుకుంటూ వచ్చి తాబేలును పట్టుకుంది.\n\nఅంతే వెంటనే తాబేలు తన కాళ్ళను, తలను డొప్పలోపలికి ముడుచుకున్నది. నక్క తాబేలును అటూ, ఇటూ ఎటువైపు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు. కోపంతో తాబేలును బండకేసి కొట్టసాగింది నక్క. నక్క చేస్తున్న పనికి తాబేలుకు వెన్నులో వణుకు తన్నుకురాగా భయంతో బిక్కచచ్చిపోయింది. ఎలాగైనా నక్క బారినుంచి తప్పించుకోవాలని ఒక పథకం వేసింది.\n\n\"నక్కబావా, నక్కబావా ఎందుకు అవస్థపడతావు...? నేను పుట్టింది నీకోసమే. నీ బాధ చూడలేకున్నాను. నన్ను నీటిలో వదులు, కొద్దిసేపటికి బాగా నాని మెత్తబడిపోతాను. అప్పుడు నువ్వు నన్ను శుభ్రంగా తినేయవచ్చు\" అని చెప్పింది తాబేలు. తాబేలు చెప్పిన ఉపాయం నక్కకు కూడా నచ్చినా, లోలోపల ఏదో అనుమానం ఉన్నప్పటికీ.. సరేనని చెప్పింది.\n\nతాబేలును నమ్మినట్లే నమ్మి, నీటిలో దాన్ని వదిలిపెట్టి... కాలితో గట్టిగా నొక్కి పట్టుకుంది. తాబేలు బారినుంచి తప్పించుకోవాలని తాను పథకం వేస్తే, ఈ జిత్తులమారి ఇంకో పథకం వేసిందే.. ఇప్పుడెలాగబ్బా...? అని మళ్లీ ఆలోచించసాగింది తాబేలు. మళ్లీ వెంటనే దానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.\n\n\"నక్కబావా... నక్కబావా...! నా ఒళ్లంతా బాగా నానింది కానీ, నువ్వు కాలుపెట్టిన చోట మాత్రం కాస్త గట్టిగానే ఉంది. నువ్వు కాసింత కాలు తీస్తే, అక్కడ కూడా బాగా నానుతుంది. నువ్వు హాయిగా తినవచ్చు\" అని చెప్పింది తాబేలు. దానికి సరేనన్న నక్క తన కాలును కాస్త తీసిందో లేదో, వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంది.\n\n\"హమ్మయ్య...! బ్రతుకుజీవుడా...!!\" అనుకుంటూ తాబేలు నీటి అడుగుకు వెళ్లిపోయింది. ఇక ఆరోజు నుంచి తాబేలు బయట షికార్లు మాని బుద్ధిగా ఉండసాగింది. అయితే \"నక్కజిత్తులన్నీ నా దగ్గరుండగా, తప్పించుకు పోయెరా తాబేటి బుర్ర\" అని నక్క తన తెలివితక్కువ తనానికి విచారిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 231,
        "IMAGE": "cat_1",
        "NAME": "తప్పించుకు పోయెరా తాబేటి బుర్ర..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 231,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "సురభయ్యకు చుట్టాలంటే భలే ఇష్టం. ఎప్పుడూ తన ఇల్లు చుట్టాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకునేవాడు. అతడు ప్రతిరోజూ నాలుగు వీధుల కూడలిలో నిలబడి చుట్టాలను వెతికిపట్టి మరీ ఇంటికి తీసుకెళ్లేవాడు. సురభయ్య భార్య సూర్యకాంతం చాలా పిసినారి. చుట్టాల పేరుతో ఇల్లు గుల్ల కావటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు.\n\nఅదీగాక ప్రతిరోజూ వచ్చే చుట్టాలకు వండి వార్చలేక సూర్యకాంతం సురభయ్యపై విరుచుకుపడేది. కానీ సురభయ్య మాత్రం ఆమె మాట వినేవాడు కాదు. \"ఆ మాత్రం చుట్టాలకు పెట్టకపోతే మన బ్రతుకెందుకు..?\" అంటూ ఆమెకే సర్దిచెప్పేవాడు. సురభయ్య పద్ధతి చూసి చూసి సూర్యకాంతానికి విసుగొచ్చేది. ఎలాగైనా సరే సురభయ్య చుట్టాల పిచ్చిని వదలగొట్టాలని పథకం వేసింది.\n\nఒకరోజు సురభయ్య ఇద్దరు చుట్టాలను ఇంటికి తీసుకుని వచ్చాడు. వారిని కూర్చోబెట్టి.. ఉప్పూ, పప్పూ, కూరగాయలు కొనుక్కొస్తానని బజారుకు వెళ్లాడు. ఇంతలో సూర్యకాంతం రోకటి బండకు పసుపు, కుంకుమతో పూజ చేయసాగింది. చుట్టాలిద్దిరికీ అది చాలా వింతగా తోచింది. \"ఎందుకు రోకలికి పూజచేస్తున్నా\"ని అడిగారు.\n\nఅందుకామె చేతులు తిప్పుతూ... \"ఏమి చెప్పమంటారు నాయనా... ఈయనకి ఈ మధ్య చుట్టాల పిచ్చి బాగా ముదిరిపోయింది. చుట్టాలకు రోకలిపూజ చేయడం చాలా మంచిదని ఎవరో సన్యాసి చెప్పాడట. ఇక అప్పటినుంచి రోజూ చుట్టాలను పిలుచుకు రావటం, ఈ రోకలిబండతో తరిమి తరిమి కొట్టడం చేస్తున్నాడు. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి, ఆయనేమో కల్లు తాగేందుకు వెళ్లాడు. వస్తూనే మీకు కూడా రోకలి పూజ ఖాయం\" అని చెప్పింది.\n\nఈ మాటలతో చుట్టాలకు పై ప్రామాలు పైనే పోయాయి. ఒకటే పరుగు లంకించుకున్నారు. సురభయ్య సామాన్లన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాడు. \"చుట్టాలేరీ..?\" అని భార్యను అడిగాడు. \"వాళ్లకు రోకలిబండ కావాలంట నేనెక్కడ తెచ్చిచ్చేది..?\" లేదని చెప్పగానే వాళ్లు వెళ్లిపోయారని చెప్పింది సూర్యకాంతం.\n\n\"అయ్యో..! ఇవ్వలేకపోయావా అంటూ\" రోకలిబండతో పరుగుతీశాడు సురభయ్య. రోకలిబండతో వస్తున్న సురభయ్యను చూసిన చుట్టాలు.. అతను తమకు రోకలిపూజ చేసేందుకు వస్తున్నాడని భావించి, భయంతో మరింతగా పరుగుతీశారు. సురభయ్య వారితోపాటు పరిగెత్తలేక ఉస్సూరంటూ ఇంటికి చేరాడు.\n\nఈ విషయం అంతా ఊర్లోని జనాలకు, చుట్టుప్రక్కల గ్రామాలలోని జనాలకు తెలియడంతో... ఆ రోజునుంచి సురభయ్య ఇంటికి చుట్టాలు రావడం మానుకున్నారు. తాను వేసిన పథకం బాగా కలసిరావడంతో ఆనందంతో పండుగ చేసుకోసాగింది సూర్యకాంతమ్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 232,
        "IMAGE": "cat_1",
        "NAME": "చుట్టాల సురభయ్య.. రోకలి పూజ...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 232,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊర్లో నర్సయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు. తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పొలం పండిస్తుంటే, కొడుకులు మాత్రం ఏమీ పట్టనట్లుగా బలాదూర్‌గా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్లకి ఎప్పుడూ తినడం, పడుకోవటం తప్ప మరో పని చేసేందుకు మనస్కరించేది కాదు.\n\nతనకేమో వయసయిపోతోంది, కొడుకులు చూస్తే ఇలా సోమరిపోతుల్లా తయారయ్యారని ప్రతిరోజూ దిగులుపడుతున్న నర్సయ్య ఒకరోజు మంచంపట్టాడు. దీంతో కొడుకులను దగ్గరకు పిలిచి... తనకు ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, ఇక ఎన్నిరోజులు బ్రతుకుతానో కూడా తెలియదని వాపోయాడు.\n\nకాసేపటికి తేరుకున్న ఆయన... \"నా కథ అలా వదిలేయండి నాయనలారా..! నేను కూడబెట్టిన డబ్బు అంతటినీ ఒక పెట్టెలో పెట్టి మన పొలంలోనే దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టానో గుర్తు రావటం లేదు. ఒకవేళ నేను చనిపోయినట్లయితే, ఆ డబ్బును వెతికిపట్టుకుని మీరందరూ సమానంగా తీసుకోవడం మర్చిపోవద్దని ఆయాసంతో కళ్లు మూసుకున్నాడాయన.\n\nఆయనలా కళ్లు మూసుకున్నారో లేదో అంతే వెంటనే పొలంలో వాలిపోయారు ఐదుగురు పుత్నరత్నాలు. డబ్బు దాచిపెట్టిన చోటును మర్చిపోయినందుకు ఆయనను మనసులో తిట్టుకుంటూ, వారందరూ పొలం నాలుగుమూలలా వెతికారు. ఎక్కడా డబ్బు కనిపించే జాడలే లేవు.\n\nఅయినా పట్టువదలని విక్రమార్కులలాగా పొలాన్నంతటినీ తవ్విచూశారు. అయినా ఎక్కడా డబ్బు దాచిన పెట్టె కనిపించలేదు. దీంతో ఉస్సూరుమంటూ తండ్రి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. అంతా విన్న తండ్రి నవ్వుతూ, ఖచ్చితంగా తాను ఆ భూమిలోనే డబ్బు పెట్టెను దాచాననీ, ఈరోజు కాకపోతే మరో రోజైనా దొరికి తీరుతుందని వారిని ఓదార్చాడు నర్సయ్య.\n\nచేసేదేమీలేక తండ్రిని మనసులో శపిస్తూ... ఆ పొలాన్ని సాగు చేయటం ప్రారంభించారు నర్సయ్య కొడుకులు. నర్సయ్యకు క్రమంగా ఆరోగ్యం కూడా కుదుటపడసాగింది. ఈలోపు కొడుకులు పండించిన పొలం బాగా విరగబడి కాసింది. దాంతో వారికి లెక్కలేనంత డబ్బు చేతికి వచ్చింది. కొడుకులందరి సంతోషాన్ని చూసిన నర్సయ్య వారివద్దకు వచ్చి ఇదే మన సంపద \"కష్టేఫలి, శ్రమయే సంపద\" అని అన్నాడు.\n\nతండ్రి పొలంలో డబ్బు పెట్టె దాచానని ఎందుకు అబద్ధం చెప్పాడో.. నర్సయ్య కుమారులకి అప్పుడు అర్థమయ్యింది. ఇంతకాలం వారు చేసినపనికి సిగ్గుపడ్డారు. తండ్రి డబ్బు దాచినట్లు చెప్పకపోయి ఉంటే, తాము ఆ భూమిని దున్నేవాళ్లము కాదనీ, ఇంత డబ్బును కళ్లజూసేవాళ్లము కాదని అనుకుని తండ్రికి క్షమాపణలు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 233,
        "IMAGE": "cat_1",
        "NAME": "కష్టే ఫలి... శ్రమయే సంపద...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 233,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి.\n\nఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా... ఆ గుమ్మడికాయలతోపాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డ వాటినల్లా కొరికేస్తూ, చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదలిపెట్టదు.\n\nరోజులలా గడుస్తుండగా.. ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా..? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ... డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే... మే... అని అరుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.\nఇదండి పిల్లలూ... పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే కథ. ఏదీ మీరూ ఒక్కసారి \"పుటుక్కు జర జర డుబుక్కు మే\" అనండి. భలే తమాషాగా ఉంది కదూ...?! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 234,
        "IMAGE": "cat_1",
        "NAME": "పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 234,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో నాలుగు ఆవులు కలసిమెలసి, ఒకేచోట మేతమేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి. అవి ఎక్కడికి వెళ్లాలన్నా కలిసికట్టుగా వెళ్ళేవి. సంతోషాన్నయినా, కష్టాన్నయినా కలసే పంచుకుంటూ ఆనందంగా గడిపేవి.\n\nఒకరోజు అడవిలో మేతమేస్తున్న నాలుగు ఆవులను బాగా ఆకలిమీదున్న సింహం ఒకటి చూసింది. \"ఆహా ఈరోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికిందని\" నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది సింహం. సింహం తమవైపు రావడం గమనించిన ఆవులు ఏ మాత్రం భయపడకుండా నిల్చున్నాయి.\n\n\"ఏంటీ తాను వస్తే ఎలాంటి జంతువయినా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా...! మరేంటి ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిలుచుని ఉన్నాయే...?\" అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆవులు ఏ మాత్రం బెదరకుండా వాటి వాడి అయిన కొమ్ములతో సింహం పనిబట్టేందుకు అమాంతం దానిపై పడ్డాయి.\n\nఊహించని ఎదురుదాడి జరగడంతో ఒక్కసారిగా భయపడ్డ సింహం, ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం అనుకుని.. ఆవుల నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడి పారిపోయింది. అయితే, ఆరోజు నుంచి ఆ ఆవులపై పగబట్టిన సింహం వాటిని కడుపారా తినేందుకోసం ఎదురుచూడసాగింది.\n\nఅనుకున్నట్లుగా కొంతకాలం తరువాత ఆ నాలుగు ఆవుల మధ్య గొడవలు రావడంతో అవి విడిపోయి, వేరు వేరుగా జీవించసాగాయి. అంతేగాకుండా, మేతకు వెళ్లినప్పుడు కూడా వేరు వేరుగా మేయసాగినాయి. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్న సింహం తన పంట పడింది అనుకుంది.\n\nఎందుకంటే... నాలుగు ఆవులు కలసికట్టుగా దాడి చేస్తే తన ప్రాణాలు హరీమనడం ఖాయం. అయితే ఒక్కోదాన్ని పట్టుకుని భుజించటం చాలా తేలికైన పని కదా అని సంబరపడసాగింది. ఓ మంచి రోజుకోసం ఎదురుచూడసాగింది సింహం. అలా ఒకరోజున మొదటి ఆవు మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న సింహం ఒక్కసారిగా దానిపై పడి చంపి తినేసింది. అలాగే రెండు, మూడు, నాలుగు ఆవులను కూడా అలాగే చంపి తినేసి తన శపథం నెరవేర్చుకుంది.\n\nఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలూ... విడి విడిగా జీవించి ఆపదలను కొనితెచ్చుకోవడం కంటే, కలసిమెలసి జీవించటం మంచిది. అందరూ ఐకమత్యంగా ఉన్నట్లయితే, ఎంత పెద్ద సమస్యనయినా చక్కగా ఎదుర్కోవచ్చు. అందుకే మన పెద్దలు \"కలసి ఉంటే కలదు సుఖం\" అని అన్నారు..!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 235,
        "IMAGE": "cat_1",
        "NAME": "కలసి ఉంటే కలదు సుఖము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 235,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే బట్టల మూటలు మోసే ఓపిక లేక ఏలాగోలా చేసి ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనగానే సరిపోతుందా..? దాన్ని మేపాలంటే ఈ చాకలివాడి తలప్రాణం తోకకు వచ్చింది.\n\nగాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చయిపోతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదేంటంటే... బాగా పాతదైపోయిన పులితోలును ఒకదాన్ని సంపాదించిన అతడు, దాన్ని గాడిదపై కప్పి, రాత్రుళ్లు గ్రామస్తుల చేలల్లో వదిలివెసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిని చాకలి ఇంటికి వెళ్లిపోయేది.\n\nపులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కావలి ఉండే గ్రామస్తులు... \"అయ్యబాబోయ్.. పులి వచ్చింది\" అని భయపడి పారిపోయేవారు. భయం వల్ల గ్రామీణులెవరూ ఆ పులిని ఏంచేయగలం అంటూ ఊరకుండిపోయారు. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ఒక యువకుడికి మంచి ఆలోచన తట్టింది.\n\nదాంతో అతడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికే తన పెంపుడు గాడిదలను వెంటబెట్టుకుని పంటపొలానికి కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా విలాసుడి గాడిద.. యజమాని కప్పిన పులితోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసాగింది.\n\nఅక్కడే పొలానికి కాపలాగా ఉన్న ఆ యువకుడు దీన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో అతడివద్ద ఉన్న గాడిదలు పులిని చూసిన భయంతో కాబోలు ఓండ్రబెట్టినాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయటం అలవాటయిన చాకలివాడి గాడిదకు తన జాతివారి అరుపులు వినబడటంతో సంతోషం పట్టలేక పోయింది.\n\nవెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా ఓండ్రపెట్టసాగింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ఆ యువకుడు అది నోరుతెరచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తనవద్దనుండే దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడితెపూజ చేశాడు. ఆ రకంగా చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది.\n\nఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... యదార్థం బయటపడే వరకు మాత్రమే ఎవరి ఆటలైనా కొనసాగుతాయి. కాబట్టి, నిజాన్ని ఎంతకాలమూ దాచలేము. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు. నిజం బయటపడ్డాక మోసకారుల ఆటలు సాగవు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 236,
        "IMAGE": "cat_1",
        "NAME": "పులితోలు - గాడిద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 236,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలోని మర్రిచెట్టుపై రెండు చిలుక పిల్లలు నివసిస్తుండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లలను పట్టుకుని, గోదావరీ తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండోదాన్ని ఒక వ్యాపారికి అమ్మివేశాడు. సాధువు కొనుక్కున్న చిలుక పిల్లకు \"రామయ్య\" అనీ, వ్యాపారి కొనుక్కున్న పిల్లకు \"శీనయ్య\" అనే పేర్లను పెట్టి, వాటిని పంజరాల్లో పెట్టి పెంచుకోసాగారు.\n\nసాధువు వద్ద పెరుగుతున్న చిలుక మంచి మాటలను, గొప్ప సంస్కారాన్ని అలవర్చుకుంది. సాత్వికమైన ఆహారాన్ని తింటూ, అతిథులను గౌరవించే పద్ధతులను గమనించి, మంచి స్వభావాన్ని నేర్చుకుంది. క్రమంగా అది ఇంటికి వచ్చిన వారినందరినీ మంచి మాటలతో గౌరవిస్తూ సంతోషపరిచేది.\n\nవ్యాపారి పెంచుకుంటున్న చిలుక... ఆ ఇంట్లోవారు మాట్లాడే చెడ్డమాటలను వినడం, హింసతో కూడిన పనులను చూడటం వల్ల రోజురోజుకీ చెడ్డ అలవాట్లకు లోనయ్యింది. వ్యాపారి ఇంటికి వచ్చే వారందరితోనూ అది పరుషంగా మాట్లాడుతూ.. ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది.\n\nఇలా కొంతకాలం గడిచాక ఈ రెండు చిలుకలూ అదృష్టవశాత్తూ పంజరంలోంచి తప్పించుకుని బయటపడ్డాయి. అలా బయటపడ్డ చిలుకల్లో రామయ్య మామిడిచెట్టుమీదకు, శీనయ్య మర్రిచెట్టు మీదకు వెళ్లి గూడు కట్టుకుని అక్కడే జీవించసాగాయి.\n\nఒకరోజు మర్రిచెట్టు ఉన్న దార్లో వెళుతున్న బ్రాహ్మణుడొకడు అలసిపోయి, ఆ చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు అక్కడ ఆగాడు. ఇంతలో శీనయ్య పేరుతో ఉండే చిలుక వెంటనే తన పక్కనే ఉంటున్నవారందరితో.. \"ఎవరో మనిషి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. రండి వాడి శరీరాన్ని పొడిచి, పొడిచి హింసిద్దాం\" అని పిలిచింది.\n\nఅదంతా విన్న బ్రాహ్మణుడు పారిపోయి, పక్కనే రామయ్య నివసిస్తున్న మామిడి చెట్టు కిందకు వెళ్ళి నిల్చున్నాడు. ఇంతలో బ్రాహ్మణుడిని గమనించిన చిలుక... \"ఎవరో అతిథి ఎండవేడికి తాళలేక అలసిపోయి మన చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు వచ్చాడు. స్వాగతం పలికి, పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, తరువాత ఆయనకు సేవ చేసి తరించండి\" అని తోటి పక్షులకు చెప్పింది.\n\nఈ కథలోని నీతి ఏంటంటే... ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లల ప్రవర్తన వారు పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. కాబట్టి, చిన్నతనంలో ఎవరైతే మంచివారి స్నేహం, సత్ప్రవర్తన, నీతి నియమాలను అలవాటు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయ్యాక మంచి సంభాషణ, మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, సద్గుణాలను కలిగి ఉంటారు. కాబట్టి, చిన్నప్పటి నుంచి పిల్లలను సక్రమమైన మార్గంలో పెంచడం ఉత్తమం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 237,
        "IMAGE": "cat_1",
        "NAME": "సత్ప్రవర్తన... పరిసరాల సంబంధం...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 237,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి పనులు చేసుకుంటూ ఉండే వీరిద్దరూ ఒకరోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవిగుండా నడచివెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి తారసపడింది.\n\nఅంతే దాన్ని చూసి బెంబేలెత్తిన రాము, సోములిద్దరూ భయంతో పరిగెడుతూ ఒక చెట్టువద్దకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. రామూకి చెట్టెక్కడం రాకపోవడంతో సోమూని సాయం చేయమని వేడుకున్నాడు.\n\nతాను దిగివచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందనీ, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు కాబట్టి... నేను దిగిరాను నువ్వే ఏదో ఒకటి చేసేయమని రామూతో అన్నాడు సోము. అయ్యో సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈ రోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా..? అంటూ ఆలోచనలో పడ్డాడు రాము.\n\nవెంటనే ఓ ఉపాయం తళుక్కున మెరిసింది. అంతే చచ్చిపోయినవాడిలా ఆ చెట్టుకింద కదలకుండా, మెదలకుండా పడిపోయాడు రాము. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు.\n\nఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కిందపడిన వాడు నిజంగా చనిపోయాడా లేదో? తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే రామూ దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి, చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీలేక అక్కడినుంచి వెళ్లిపోయింది.\n\nఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చిన సోము... భలే ఉపాయం పన్నావు మిత్రమా..? ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు. అది సరేగానీ.. ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరకి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదా...? ఏం చెప్పింది..? అని ఆరా తీశాడు సోము.\n\n\"ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని\" చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రాము. అప్పటికిగానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోమూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కానివారు అసలు స్నేహితులే కారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 238,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది...?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 238,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక రోజున కాకికి బాగా ఆకలిగా ఉండటంతో మర్రిపండునొక దానిని తీసుకొచ్చి, తాటిచెట్టుపై కూర్చుని తినసాగింది. కాకి మర్రిపండును తింటుండగా, పండులోని మర్రిగింజ రాలి తాటిమట్టల మధ్య పడిపోయింది. ఆ చిన్న మర్రిపండు విత్తనాన్ని చూసిన తాటిచెట్టు ఎగతాళిగా నవ్వింది.\n\n\"నా కాయలు ముంతడేసి, గింజలు చారడేసి ఉన్నాయి. ఇనుపగుండ్లలాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడలో నిలబడరు. మనుషుల పైనగానీ, జంతువులమీదగానీ నా కాయలు రాలిపడితే, వారి నడ్డి విరిగిపోతుంది. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుందని\" గేలి చేసింది తాటిచెట్టు.\n\nమర్రిగింజపైన తాటిచెట్టు రకరకాలుగా జాలిపడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటిచెట్టు అలసిపోయింది. కాకికూడా ఆ చెట్టుమీద నుంచి ఎగిరి వెళ్లిపోయింది. మర్రి విత్తనం మాటను కూడా మెల్లిగా మర్చిపోయింది తాటిచెట్టు. అలాగే కొంతకాలం గడిచింది. తాటిమట్టల మధ్యన మర్రిగింజ మొలకెత్తి, చిన్న చెట్టుగా అవతరించింది.\n\nఅప్పుడు కూడా చిన్నదిగా ఉన్న మర్రిచెట్టును చూసి గేలి చేసింది తాటిచెట్టు. నువ్వెంత, నువ్వు నన్నేమీ చేయలేవనీ ఎగతాళి చేస్తూ నవ్వింది. తాటిచెట్టు మాటలన్నింటినీ ఓపికగా విన్న మర్రిచెట్టు క్రమంగా పెరగసాగింది. రోజురోజుకీ మరింత పెద్దదవసాగింది. కొంత కాలానికి మర్రిచెట్టు తాటి చెట్టును మించిపోయేలాగా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంతకాలం విర్రవీగిన తాటిచెట్టు క్రమంగా మర్రిమాను కౌగిట్లో బందీయై ప్రాణాలు విడిచింది.\n\nఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ధనముందని, బలముందని అహంకారంతో మంచివారిని కించపరిచినా, వారికి చెడు చేయాలని ప్రయత్నించినా చివరకు తాటిచెట్టుకు పట్టిన గతే పడుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి, మీరెప్పుడూ తాటిచెట్టులాగా ప్రవర్తించరు కదూ పిల్లలూ....!!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 239,
        "IMAGE": "cat_1",
        "NAME": "మర్రిమాను కౌగిట్లో తాటిచెట్టు ప్రాణాలు హరీ...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 239,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విష్ణుపురం మహారాజు ఒకరోజు గుర్రంపై స్వారీ చేస్తూ అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అలా వెళ్తుండగా, పక్కనే కొంతమంది సాధువులు యాగం చేస్తుండటాన్ని ఆయన గమనించాడు. అది చలికాలం అయినప్పటికీ సాధువులు భుజంపై ఉత్తరీయం కూడా ధరించకుండా ఉండటాన్ని కూడా రాజు చూశాడు.\n\nఅది చూసిన రాజు మనసు నొచ్చుకుంది. వెంటనే తన సేవకులను పిలిచి, ఆ సాధువులకు కావలసిన ఉన్ని గుడ్డలను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. రాజు సేవకులు వెంటనే ఆ పనికి పూనుకున్నారు. మహారాజు గుర్రం దిగి సాధువుల వద్దకు చేరుకున్నాడు. రాజు రాకను సాధువులందరూ గమనించారు.\n\nవెంటనే వారిలో ఒక సాధువు కల్పించుకుంటూ...\"నేను మీకైమైనా సాయపడగలనా...?\" అని అడిగాడు. సాధువు అలా అడగ్గానే రాజు ఆశ్చర్యచకితుడైనాడు. కానీ ఆయనకు వెంటనే చాలా కోపం కూడా వచ్చింది. అయితే కోపాన్ని తమాయించుకుని శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాడు.\n\n\"మీనుంచి నాకెలాంటి సహాయమూ అక్కర్లేదు. ఈ చల్లటి వాతావరణంలో ఒంటిపై గుడ్డలు లేకుండా ఉన్న మిమ్మల్ని చూశాను. వెంటనే నా సేవకులకు చెప్పి మీ కోసం కొన్ని ఉన్ని గుడ్డలను తెప్పించాను, అన్నట్టు నేను ఈ దేశం రాజును\" అని తనను తాను పరిచయం చేసుకున్నాడు మహారాజు.\n\n\"అయితే చిన్న చిన్న దేశాలను జయించి, వాటిని కొల్లగొట్టే రాజువు నీవేనన్నమాట. దోపిడీదారుడు మాకు ఏమి ఇవ్వగలడ?\"ని ఆ సాధువు రాజు ముఖంలోకి నిశితంగా చూస్తూ చెప్పాడు. అది విన్న రాజుకు మరింతగా ఆశ్చర్యం వేసింది. మహారాజునని చెప్పినా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న సాధువు ముఖంలోని తేజస్సు ఆయనకు కొట్టొచ్చినట్లు కనిపించగా ఆలోచనలో పడిపోయాడు.\n\nఈలోపు కల్పించుకున్న సాధువు \"రాజా... నువ్వు ప్రజల హృదయాలను జయించినప్పుడే విజేతవు అవుతావు. మా వరకూ మాకు ఏదీ అక్కర్లేదు. మా దగ్గర ఉన్నంతలో మేము ఇతరులకు ఇవ్వగలం. మీకు ఏమైనా సాయం కావాలా చెప్పండ\"ని రాజు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు సాధువు.\n\nతాను ఎదురుచూడని సంఘటన జరగడంతో ఆశ్చర్యంతోపాటు ఆలోచనల్లో పడిపోయిన మహారాజు... సాధువు మాటల్లో దాగుండే సందేశాన్ని అర్థం చేసుకున్నాడు. అన్యాపదేశంగా రక్తపాతం వద్దంటూ సాధువు చేసిన సూచనతో బుద్ధి తెచ్చుకున్న రాజు, ఆ రోజునుంచీ యుద్ధ ప్రయత్నాలు చేసి రక్తపాతం కల్గించకూడదని గట్టిగా మనసులో అనుకున్నాడు. సాధువుకు నమస్కరించి వెంటనే అక్కడినుంచి తన కోటకు బయలుదేరి వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 240,
        "IMAGE": "cat_1",
        "NAME": "మహారాజుకు బుద్ధి చెప్పిన సాధువు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 240,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "క్రిష్ణాపురంలో శంకరప్రసాద్ అనే జమీందారు ఉండేవాడు. ఆయన పశువుల చావిడిలో మంచి మేలురకం ఆవులు ఎన్నో ఉండేవి. ప్రతిరోజూ పశువుల కాపరులు వాటిని ఇంటికి తోలుకురాగానే, ఆ ఆవుల మందను చూసి చాలా సంతోషపడేవాడు. ఒకరోజు తాను ఎంతో ఇష్టంగా చూసుకునే ఆవుల మందలోని ఒక కోడెదూడ తప్పిపోయింది.\n\nకోడెదూడ తప్పిపోయిన విషయాన్ని పశువుల కాపరులు జమీందారుకు చెప్పగానే... దాన్ని వెదికేందుకు తానే బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. తానే కోడెదూడని వెదకబోతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, ఆయన ఒక రైతు వేషంలో బయలుదేరాడు. కనిపించిన వారినల్లా తన కోడెదూడ కోసం ఆచూకీ తీశాడు.\n\nఎవరిని అడిగినా, \"మాకు తెలియదు, మేము చూడలేదు\" అని చెప్పసాగారు. చివరికి శివపురం గ్రామ పెద్ద శేషయ్య దగ్గర తన కోడెదూడ ఉందన్న విషయం తెలుసుకుని సంతోషంగా అక్కడికి వెళ్లాడు జమీందారు. తప్పిపోయిన కోడెదూడను వెతుక్కుంటూ వచ్చినట్లు శేషయ్యకు తెలిపాడు.\n\nదీంతో మారు వేషంలో ఉన్న జమీందారుతో \"మా ఊరి రైతు సుబ్బయ్య పంటపొలాల్లో ఈ కోడెదూడ విచ్చలవిడిగా మేసి నష్టపరిచింది. అది మీదే అయితే, తగిన నష్టపరిహారం చెల్లించి తోలుకు పోవచ్చు\"నని చెప్పాడు శేషయ్య. పశువుల చావిడిలో కట్టేసి ఉన్న కోడెదూడను చూసిన జమీందారు, అది తనదే అని నిర్ధారించుకున్న తరువాత శేషయ్యకు నష్టపరిహారం చెల్లించి దానిని తోలుకెళ్లాడు.\n\nజమీందారు వెళ్లిపోయిన తరువాత శేషయ్యకు తన ఇంటి ఆవరణలోనే ఒక చేతి ఉంగరం దొరికింది. దాన్ని పరీక్షించి చూడగా, దానిపై జమీందారు ముద్ర కనిపించింది. వెంటనే తేరుకున్న శేషయ్య జమీందారు దగ్గరకు వెళ్లి, జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు.\n\nఅప్పుడు జమీందారు మాట్లాడుతూ... \"శేషయ్యా ఆ ఉంగరం నేనే కావాలని నీ ఇంట్లో జారవిడిచాను. రైతు వేషంలో వచ్చింది కూడా నేనే\"నని చెప్పాడు. దీంతో వెంటనే అందుకున్న శేషయ్య \"మరి తమరు విషయం చెప్పకుండా దాచారెందుకు, దీనికి నేను చాలా బాధపడుతున్నాన\"ని అన్నాడు.\n\nఅప్పుడు జమీందారు నవ్వుతూ... \"బాధపడాల్సిన అవసరం లేదు శేషయ్యా... నేను నిజం చెప్పినట్లయితే, నువ్వు నష్టపరిహారం తీసుకోకుండానే నా కోడెదూడను ఇచ్చేసేవాడివి. నా ధర్మం నెరవేర్చే అవకాశం నాకు ఆ రకంగా కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. నీ బుద్ధిని పరీక్షించాలనే నేను అలా చేశాను. నా పరీక్షలో నువ్వు ధర్మంగా ప్రవర్తించి నెగ్గావ\"ని చెప్పాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న శేషయ్య జమీందారుకి నమస్కరించి, ఇంటిదారి పట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 241,
        "IMAGE": "cat_1",
        "NAME": "జమీందారు... కోడెదూడ...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 241,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక రోజున ఓ లేడిపిల్లలకు అలా నది ఒడ్డుకు వెళ్లి షికారు చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా నదీ తీరానికి వెళ్లిన లేడిపిల్ల హాయిగా తిరగసాగింది. అలా పచార్లు చేస్తుండగా దానికి నీటిలో పెద్ద చేప ఒకటి కనిపించింది. నీళ్ళల్లో నుండి పైకి ఎగురుతూ, కిందికి పడుతూ ఉండే చేపను చూసిన లేడి పిల్లకు భలే ముచ్చటేసింది.\n\nచేప ఫీట్లను చాలాసేపు అలాగే చూస్తుండిపోయిన లేడిపిల్లకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే... నీటిలో ఇలా విన్యాసాలు చేసే చేపతో, నేలపైన చెంగు చెంగున గంతులేయగలిగే తాను స్నేహం చేస్తే ఎలా ఉంటుందని మనసులో అనుకుంది లేడిపిల్ల.\n\nఅలా అనుకున్న లేడిపిల్ల చేపను పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మో.. భూమిమీద తిరిగే ఈ జంతువుతో నాకేమైనా ప్రమాదం సంభవిస్తే అని ఆలోచించిన చేపపిల్ల, అయినా ఈ లేడిపిల్ల తననేమీ చేయదులే అని మనసులోనే అనుకోసాగింది చేప. కాసేపటి తరువాత లేడిపిల్ల అభ్యర్థనకు చేప తన అంగీకారాన్ని తెలిపింది.\n\nఇంకేముంది చేప, లేడిపిల్ల ఇద్దరూ మంచి స్నేహితులయిపోయారు. ప్రతిరోజూ అవి రెండూ కలుసుకుని నీటిలో విశేషాలను, భూమిపైన విశేషాలను కథలు కథలుగా చెప్పుకుని సంతోషపడుతుండేవి. చేప తనకు తెలిసిన ఫీట్లను రోజుకొకటి చేసి చూపిస్తుంటే లేడిపిల్లకు చెప్పలేనంత సంతోషం కలిగేది. అలాగే లేడిపిల్ల గంతులేస్తూ ఎగరటం చూసి చేపకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది.\n\nఇలా గడుస్తుండగా ఒకరోజు నది ఒడ్డున కూర్చొని నీటిలోని చేపతో కబుర్లు చెబుతున్న లేడిపిల్లపైకి తోడేలు ఒకటి దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న లేడిపిల్ల తన శక్తికొద్దీ దాంతో పోరాడింది. అయితే నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అది అంతగా నిలదొక్కుకోలేక పోయింది. వెంటనే తనకు ఏదైనా సాయం చేయమని చేపని అడిగింది.\n\n\"అయ్యో...! మిత్రమా.. నేను నీటిలో ఏమైనా సరే చేయగలనుగానీ, నేలమీదకు వస్తే నేను ఏమీ చేయలేను సరికదా, కాసేపట్లోనే చచ్చిపోతానని\" చెప్పింది చేప. అవును కదా అనుకున్న లేడిపిల్ల ఏలాగోలా తోడేలును నిలవరించింది. ఎంతసేపటికీ దారిలోకి రాని లేడిపిల్లను వదిలేసి తోడేలు ఎంచక్కా పారిపోయింది.\n\nఅప్పుడు \"మిత్రమా... నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేక పోయాను. ఇక మన స్నేహానికి అర్థమేముంటుంది చెప్పు. అందుకే నేను నీకు మిత్రుడిగా ఉండేందుకు తగనని\" చెప్పి బాధపడింది చేప. ఇది విన్న లేడిపిల్ల, \"నువ్వు నేలపైన పోరాడగలిగితే నా దారిన నన్ను వదిలేసేదానివి కాదు కదా, ఒకవేళ నీటిలో ఏదయినా ఆపద జరిగితే, నేను కూడా నీకు సాయం చేయలేను కదా...!\" అంటూ ఓదార్చింది.\n\nఇంకా... \"నువ్వు నీటిలో అయితే ఎలాగోలా నన్ను కాపాడేదానివి, నేను కూడా నేలపైనే కదా ఏమైనా చేయగలను. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సింది లేదు మిత్రమా\" అని చేపతో అంది లేడిపిల్ల. ఎలాంటి లాభాపేక్షా లేకుండా చేసేదే స్నేహం కాబట్టి, నువ్వేమీ బాధపడవద్దు, మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందామని చెప్పి, చెంగు చెంగున ఎగురుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది అందాల లేడిపిల్ల. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 242,
        "IMAGE": "cat_1",
        "NAME": "స్నేహం లాభాపేక్షను ఆశించదు...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 242,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డుపైనుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి, స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్లు తెలీనంత మైకంలో పడివున్న నక్కను చూడగానే కోతికి జాలివేసి దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది.\n\nతనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తరువాత నక్కకు స్పృహ వచ్చింది. \"ఏమయ్యింది... ఎందుకు అక్కడ పడుకున్నావు..?\" అని ఆరా తీసింది.\n\nఅప్పుడు నక్క \"నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండటంతో నది వద్దకు వచ్చి, నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే...!\" అంటూ నిట్టూర్చింది.\n\nకోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి “ఎవరూ లేరని బాధ పడకు. మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్క నున్న ఇల్లు కూడా నాదే ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడా ఇల్లు ఖాళీగా ఉంది, నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు. అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదులే...!” అని చెప్పింది.\n\nదీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి, కోతి సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒక రోజున నక్క బయటకు వెళ్ళి వస్తూ, ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని “అయ్యో, నా తాళంచెవి పోయిందే ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం..?” అని దిగులుపడ సాగింది.\n\nఅప్పుడే వచ్చిన కోతి “ఏం జరిగింది...? ఎందుకలా దిగులుగా ఉన్నావు..?” అని నక్కని అడిగింది. \"కోతిబావా... ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అదిలేకుండా తలుపు తీయటం అసాధ్యమైన పని. ఇప్పుడెలా..?” అంటూ ఏడవటం మొదలెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళంచెవి ఒకటి తెచ్చి ఇచ్చి “మరేం ఫరవాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో...!” అని చెప్పింది.\n\nఅది నక్క ఇంటి తాళానికే మరొక తాళంచెవి. కానీ టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళంచెవి కోతి ఇంటిదే అనుకుంది. ఇంకేముంది వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో, దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్కా పారిపోవాలని అనుకుంది. సమయం కోసం వేచి చూడసాగింది.\n\nఒకరోజు కోతిబావ, టక్కరి నక్కలు ఇద్దరూ కలిసి అలా షికారుకి బయల్దేరారు. సగం దూరం వెళ్ళగానే గాడిద “అబ్బా..! కోతిబావా, నాకు పొట్టలో నొప్పిగా ఉంది, షికారుకి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వెళ్ళు...” అని చెప్పి తిరిగి వచ్చేసింది. నక్క సరాసరి కోతిబావ ఇంటికెళ్లి, తన దగ్గరుండే తాళంచెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళంచెవి కోతి ఇంటిది కాదు కాబట్టి, అది తాళంలో ఇరుక్కుపోయింది.\n\nదీంతో కంగారుపడిన నక్క... తాళంచెవిని అటూ, ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే, జరిగినదంతా తెలుసుకుని తనని అసహ్యించుకుంటుంది అనుకుంది. ఈలోగానే ఇక్కడినుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేనని అనుకుని, తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడినుంచి ఉడాయించింది.\n\nచూశారా పిల్లలూ... జాలిపడి స్నేహం చేసిన కోతిబావను మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్తి జరిగిందో...! ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే... అర్హత లేనివారికి, జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే, వాళ్ళకు తగిన శాస్త్రి జరుగుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 243,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోతిబావ... టక్కరి నక్క..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 243,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "విజయేంద్ర మహారాజు ఆస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న కవి దివాకరుడు. ఒకసారి మంగోల్ రాజు ఆహ్వానం మేరకు దివాకరుడి నాయకత్వంలో కవుల బృందం ఆ రాజ్య పర్యటనకు బయలుదేరి వెళ్లింది. చిన్న వయస్సులోనే దివాకరుడు విజయేంద్రుడి ప్రశంసలు పొందటం, తమ విదేశీ పర్యటనకు నాయకుడిగా ఉండటంతో మిగతా కవులందరూ ఈర్ష్యాసూయలతో రగిలిపోయేవారు.\n\nమంగోల్‌ రాజు గొప్పవాడే కానీ అతడి ముందు అంతా మోకరిల్లాలనే తత్వం కలిగినవాడు. అతనిలోని మంచి లక్షణాల్ని చెబుతున్నపుడు చూపే శ్రద్ధ లోటుపాట్లను చెప్పినపుడు కనిపించదు. కొద్ది రోజుల పరిచయంతోనే దివాకరుడికి ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా అర్థమయ్యాయి.\n\nఒకసారి కవి సమ్మేళనంలో తననూ విజయేంద్రుణ్నీ పోల్చుతూ ఓ పద్యం చెప్పమని మంగోల్‌ రాజు దివాకరుణ్ని అడిగాడు. తన పద్యంలో మంగోల్‌ రాజును పున్నమి చంద్రుడితోనూ, విజయేంద్రుణ్ని నెలవంకతోనూ పోల్చి చెబుతాడు దివాకరుడు. ఆ పోలిక మంగోల్‌రాజుకు ఎంతో నచ్చి దివాకరుడికి విలువైన వస్తువులు బహూకరించాడు.\n\nదీంతో కవుల బృందంలోని మిగిలిన వారికి దివాకరుడిపై ద్వేషం మరింతగా పెరగసాగింది. కొద్దిరోజులకు మంగోల్‌ పర్యటనను ముగించుకొని కవుల బృందం స్వదేశానికి చేరుకుంది.\n\nమంగోల్‌ పర్యటన విశేషాలను ఒక్కొక్కటిగా విజయేంద్రుడికి చెబుతున్నాడు దివాకరుడు. ‘ఏదేమైనా మీ తర్వాతే మంగోల్‌ రాజు’ అన్నాడు. ఆ మాటలకు ‘మరి మన రాజావారిని నెల వంకతోనూ, మంగోల్‌ రాజును పున్నమి చంద్రుడుతోనూ పోల్చావు కదా...!’ అని అక్కసుగా అన్నారు మిగిలిన కవులందరూ.\n\n\"అవును, మంగోల్‌ రాజు పున్నమి చంద్రుడే.. మన మహారాజు నెలవంకలాంటివారే..! పున్నమి చంద్రుడి వెలుగు ఒక్కరోజే, నెలవంక మెలమెల్లగా పెరుగుతుంది. దినదినాభివృద్ధి దాని లక్షణం. విజయేంద్రుల వారి నైజమూ అలాంటిదే. అందుకే అలా చెప్పా, మీరు భావిస్తున్నట్టు మన రాజుగారిని తక్కువ చేసి చెప్పలేదు’ అన్నాడు దివాకరుడు.\n\nఆ మాటలతో విజయేంద్రుడి మనసు ఉప్పొంగిపోగా... విలువైన కానుకలిచ్చి దివాకరుణ్ని పొగడ్తల్లో ముంచెత్తడంతో పాటు మిగిలిన కవులందరినీ మందలించాడు. అసూయతో దివాకరుడిని రాజు ముందు దోషిగా నిలబెట్టాలనుకుని, తామే పరాభవం పాలైనందుకు సిగ్గుతో తలదించుకున్నారు కవులు. కాబట్టి పిల్లలూ... ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మంచివికావని అర్థమైంది కదూ...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 244,
        "IMAGE": "cat_1",
        "NAME": "పున్నమి చంద్రుడు... మంగోల్ రాజు...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 244,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "నరసాపురం అనే ఊర్లో సన్నీ అనే ఓ పదేళ్ల అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తుండేది. ఎవరైనా ఏదైనా అంటే సన్నీకి కోపం పెరిగిపోయి, వారికి చేత్తోనే సమాధానం చెప్పేవాడు. అలా కోపిష్టిగా ఊర్లో అందరివద్దా ముద్ర వేయించుకున్న సన్నీకి, తనని అందరూ అసహ్యించుకోవడం చాలా బాధగా అనిపించేది.\n\nదీంతో తనకున్న విపరీతమైన కోపమే, ఊర్లో వారందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తోందనీ... తన ప్రవర్తనను ఎలాగైనా సరే మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి, తనకా దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చేయమని వేడుకున్నాడు.\n\nకొడుకులో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి... కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి, ఓ సంచినిండా మేకులను ఇచ్చాడు. దానికి సరేనన్న సన్నీ, మొదటిరోజు గోడకు 40 మేకులు కొట్టాడు. అలా నెమ్మది నెమ్మదిగా సన్నీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు.\n\nఅలాగే, కోపంతోపాటు సన్నీ గోడకు కొట్టే మేకులు సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. గోడలు మేకులు కొట్టడంకన్నా తన కోపాన్ని తగ్గించుకోవటమే సులభమనిపించింది సన్నీకి. చిట్టచివరికి ఓ రోజంతా సన్నీకి కోపమే రాలేదు. ఆ విషయం తండ్రివద్దకు పరుగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు.\n\n\"చూడు బాబూ...! నీకు ఏ రోజైతే కోపం రాదో, ఆ రోజున గోడకు కొట్టిన మేకుల్లో ఒక్కోదాన్నీ తీసేయి\" అని చెప్పాడు సన్నీ తండ్రి. తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజున గోడకున్న మేకులను ఒక్కోదాన్నీ తీసివేయటం మొదలుపెట్టాడు సన్నీ. చివరికి ఓరోజు గోడకు కొట్టిన మేకులన్నింటినీ తీసివేశానని తండ్రికి చూపించాడు.\n\nదీంతో సన్నీ ఇచ్చిన మేకులను చేతుల్లోకి తీసుకున్న తండ్రి, గోడవద్దకు తీసుకెళ్లాడు. \"చూడు నాన్నా... గోడకు పడిన రంధ్రాలు చూశావా..? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనం అనే మాటలు జీవితాంతం దాకా చెరగని మచ్చల్లాగే ఉండిపోతాయి. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బకన్నా ఒక మాట కలకాలం నిలిచి పోతుంద\"ని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి.\n\nకాబట్టి పిల్లలూ...! కోపం అనేది మనిషికి విచక్షణా జ్ఞానం అనేది లేకుండా చేస్తుంది. కోపంలో మనం అనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గరివారిని ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలమంతా మనతో సరిగా ఉండలేరు. మనం వారివద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందలేము కాబట్టి, కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకుని, బుద్ధిగా మసలుకుంటారు కదూ...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 245,
        "IMAGE": "cat_1",
        "NAME": "కోపం అనర్థాలకు మూలదాయకం...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 245,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు.\n\nఒకరోజు సుబ్బయ్య ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్తూ... \"శంకరయ్యా...! నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగీ వచ్చేందుకు వారం రోజులుదాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను\" అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య, సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.\n\nసుబ్బయ్య ఊరెళ్లిన తరువాత రెండు రోజులపాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం... మూడోరోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకు ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా...! అంటూ తలపట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది.. సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తననుతాను సముదాయించుకున్నాడు.\n\nచెప్పినట్టుగానే వారం రోజుల తరువాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో.. \"చూడు శంకరయ్యా...! నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బుగానీ, మరే ఇతర గుర్రముగానీ వద్దు...! ఏమైనా చేయి, నాకు దాంతో సంబంధం లేదు\" అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకెళ్లి జరిగినదంతా చెప్పి వాపోయాడు.\n\nఅంతా విన్న మర్యాద రామన్న... ఒక గొప్ప ఎత్తువేసి, వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచుక్కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమేగాకుండా, గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు.\n\nదీంతో \"అయ్య బాబోయ్..! నా కుండలు బద్ధలైపోయాయి సుబ్బయ్యా... ఇప్పుడెలా..?\" అని గట్టిగా అరిచాడు శంకరయ్య. \"దీని కోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్యా...? వాటి ఖరీదు నేను కట్టిస్తాన్లే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను\" అన్నాడు సుబ్బయ్య. \"అయ్యో అలా చెబుతారేంటి..? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు\" అని గట్టిగా పట్టుబట్టాడు శంకరయ్య.\n\nసుబ్బయ్య, శంకరయ్యలు ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో... చివరకు ఇద్దరూ కలసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న... సుబ్బయ్యను మందలించి, గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని, అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో.. తప్పు తెలుసుకున్న సుబ్బయ్య ప్రశ్చాత్తాపంతో ఇంటిదారిపట్టాడు ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 246,
        "IMAGE": "cat_1",
        "NAME": "మర్యాద రామన్న... సుబ్బయ్య గుర్రం..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 246,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్లీడు వచ్చింది. పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురి స్వయంవరానికి ఏర్పాట్లు చేసి, దగ్గర్లోని పెళ్లికుమారులను ఆహ్వానించేందుకు వెళ్లింది.\n\nదారిన వెళ్తున్న చిలకమ్మకు... గుడిసె పైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. \"అల్లుడూ.. అల్లుడూ...! రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను నువ్వు తప్పకుండా రావాలి\" అని అంది.\n\nదీంతో.. \"నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా..?\" అంటూ నసిగింది కోడిపుంజు. \"నా కూతురికేం బాబూ... చక్కదనాల చుక్క కాదూ...!\" అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది.\n\nచక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలిబాబు చిలకమ్మకు కనిపించగానే... \"నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా...!\" అని అంది. \"నా అంత అందగాడికి నీ కూతురా...?\" అంటూ చిర్రుబుర్రులాడాడు నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికేం తక్కువకాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ.\n\nఅలాగే చిలుక, పావురాయి, కొంగ బాబుల ఇళ్లకు వెళ్లి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే, అందరూ కోడిపుంజు, నెమలిబాబులకుమల్లే తలోమాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్లందరికీ ఏదో ఒక విధంగా సర్దిచెప్పి, వాళ్లను సమాధానపర్చి.. కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది.\n\nమరుసటిరోజు ఓ మామిడిపండ్ల తోటలో.. చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న చిలకమ్మకు... ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింకబాబు కనిపించాడు.\n\nచిలకమ్మను చూడగానే... \"స్వయంవరానికి నన్ను పిలవకపోయినా, నేనే వచ్చాశానత్తా..!\" అన్నాడు గోరింకబాబు. వస్తే \"వచ్చావుగానీ... కాళ్ళకూ, వేళ్ళకూ అడ్డుపడకుండా ఓ మూలన వెళ్ళి కూర్చోపో..!\" అంటూ చిర్రుబుర్రులాడింది చిలకమ్మ. సరే అత్తా అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింకబాబు.\n\nచిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి, వేదిక వద్దకు తీసుకువచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్ళికొడుకులవైపు నడిచింది. ముందుగా కోడిపుంజు ఆ తరువాత నెమలిరాజు, చిలుక, కొంగ, మైనా ఇలా ఒక్కొక్కరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.\n\nఅలా వెళ్లిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగిపోయింది. అక్కడే ఉన్నాడు గోరింకబాబు. గోరింక కళ్లలోకి సిగ్గుమొగ్గై చూసింది చిలకమ్మ కూతురు. గోరింకబాబు కూడా మెల్లిగా కన్నుగీటాడు. అంతే అతని మెడలో మాల వేసేసి, నవ్వుతూ తల్లిదగ్గరకు చేరి, వెనుకన దాక్కుంది.\n\nదీంతో మామిడితోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలివచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమానభారంతో వాడిపోయాయి. వద్దు వద్దంటే, ఒప్పించి మరీ తీసుకువచ్చి, ఇంతలా అవమానిస్తారా...?! అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు.\n\nకూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ... తాను చేసిన పొరపాటును గ్రహించి, వెంటనే తేరుకుని... \"నాయమ్మే... నా తల్లే..! నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే..! ముందే నాకీ విషయం తెలిసి ఉంటే, ఆ పొగరుబోతుల దగ్గరకు వెళ్లి బ్రతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా...!\" అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 247,
        "IMAGE": "cat_1",
        "NAME": "చిలకమ్మ కూతురి కళ్యాణం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 247,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒకరోజు. మామిడిమల్లి ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు.\n\n\"వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?\" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.\n\n\"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది\" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి.\n\nఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. \"డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!\" అంటూ చెప్పుకొచ్చాడు.\n\n\"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి\" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. మహర్షిని ఆటపట్టించసాగారు.\n\"నీ దగ్గర ఏముంది ముసలోడా...?\" అన్నాడొక వ్యాపారి.\nఆ మహర్షి చిన్నగా నవ్వుతూ... \"నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు\" అన్నాడు.\n\"అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!\" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.\n\nపడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి. గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను \"సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు\" అని చెప్పాడు.\n\nదీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.\n\nబ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... \"నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం...\" అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.\n\nఅప్పుడు మహర్షి నవ్వుతూ... \"నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు\" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 248,
        "IMAGE": "cat_1",
        "NAME": "మహర్షి శంఖం నేర్పిందేంటి...? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 248,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఆరోజు స్కూలుకు సెలవు ఇవ్వటంతో... తోటలోకెళ్లి పువ్వులు కోసుకోవాలని అనుకున్న పింకీ, అమ్మా... తోటలోకెళ్లి పూలు కోసుకొస్తాను అని పరిగెత్తింది. జాగ్రత్తే తల్లీ... ఆ గులాబీ చెట్లకు ముల్లుంటాయి అని అంది పింకీ తల్లి అరుణ. అలాగేనమ్మా అంటూ తోటలోకి అడుగుపెట్టింది పింకీ.\n\nపచ్చని మొక్కల మధ్య విరబూసేందుకు సిద్ధంగా ఉన్న తెల్లగులాబీ ఒకటి పిల్లగాలికి చిరునవ్వులు చిందిస్తూ... అటూ, ఇటూ రాజసంగా ఊగుతోంది. ఆ దృశ్యాన్ని తన బుల్లి కళ్లతో చూసిన పింకీకి భలే ముచ్చటేసింది. వెంటనే అక్కడి వెళ్ళి... భలే భలే గులాబీ, నువ్వు నాతో స్నేహం చేస్తావా... నిన్ను ముద్దుగా చూసుకుంటానే అంది పింకీ.\n\nస్వచ్ఛమైన నవ్వులు పూయిస్తూ.. దీనంగా తనతో స్నేహం చేయమని అడుగుతున్న పింకీని చూసిన గులాబీ వెంటనే... సర్లే పాపా... నేను కూడా నీతో స్నేహం చేస్తాను, నిన్ను మురిపించి.. మైమరిపిస్తాను అంది. దీంతో ఇంటివెనుకనున్న ఆ గులాబీ చెట్టును మెల్లిగా తీసుకువచ్చి ఇంటిముందు పెట్టింది పింకీ.\n\nఇక అప్పటినుంచీ... ప్రతి రోజూ హాయిగా ఆడుతూ, పాడుతూ సంతోషంగా నీళ్ళు పోస్తూ గులాబీ మొక్కను పెంచుతోంది పింకీ. తెల్లగులాబీని చూస్తూ, అమ్మచేతి గోరుముద్దలు తింటూ హాయిగా గడపసాగింది ఆ పాప. మూడు రోజుల తరువాత ఆ గులాబీ పెద్దగా విచ్చుకుంది.\n\nఅది గమనించిన పింకీ... ఒకరోజు గులాబీని కోయబోయింది ఆత్రంగా..! పువ్వును తాకిందో లేదో అంతలోనే \"అమ్మా\" అంటూ తన చేతిని వెనక్కు తీసేసుకుంది బాధగా.. వేలిమొన చురుక్కుమంటోంది. చూస్తే రక్తం కారుతోంది. దాన్ని చూసిన ఆ అమ్మాయి గాబరాపడుతూ ఏడ్వసాగింది.\n\nఅది చూసిన గులాబీ, \"అయ్యో నా నేస్తమా..! నన్ను జాగ్రత్తగా కోయాలి కదమ్మా...! నా రక్షణకోసం నేను కనపడని సిపాయిల్లాంటి ముళ్ళను కలిగి ఉన్నాను. అవి లేకపోతే దొంగలు నన్ను సులభంగా కోసుకెళ్లిపోతారు. అందుకని ఆత్మరక్షణ కోసం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకొన్నాను\" అని చెప్పింది గులాబి.\n\n\"ఏడుపు మర్చిపోయిన పింకీ.. అమ్మో..! నువ్వు ఇలాంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నావా, ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలో నీకు... అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం\" అంది పింకీ. నిన్ను చూస్తోంటే నాకెంత ముచ్చటేస్తోందో తెలుసా..? మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఉంటే... తీవ్రవాదులు, విధ్వంసక శక్తులు అమాయక ప్రజలను చంపే పరిస్థితి ఉండేది కాదు బాధగా చెప్పింది పింకీ.\n\nఅయితే... \"దేశాన్ని కాపాడేందుకు రాత్రింబవళ్లూ కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన వీర జవానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి పాదాల వద్ద నిన్ను ఉంచి వారికి జోహార్లు చెబుదామని నిన్ను కోయబోతే ఇలాగైంది, సారీ గులాబీ నేస్తమా\" అంది పింకీ.\n\nఅంతా ఓపికగా విన్న తెల్లగులాబీ... \"పాపా.. పాపా...! అలాంటి చోటుకు వెళ్లడం కంటే నాకు అంతకంటే ఏం కావాలి..? త్వరగా నన్ను కోసుకుని అక్కడికి తీసుకెళ్లు పాపా... నేను కూడా ఆ వీర జవానులకు నివాళి చెబుతాను\" అని వేడుకుంది గులాబీ. దీంతో పింకీ గులాబీ మొక్కను కోసుకుని వీరజవానులకు నివాళులర్పించేందుకు బయలుదేరింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 249,
        "IMAGE": "cat_1",
        "NAME": "తెల్ల గులాబీ... పింకీ నేస్తాలట..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 249,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "ఢిల్లీ దర్బారులో కొలువుతీరిన ఔరంగజేబు, సింహాసనం నుంచి లేచి అసహనంగా, పట్టరాని ఆవేశంతో అటూ ఇటూ తిరగసాగాడు. బాజీ ప్రభు, మరికొందరి అనుచరుల సాయంతో, శివాజీ పన్హాలా నుంచి తప్పించుకున్నాడు. ఆ తరవాత ఆయన మళ్ళీ మొగలులపై దాడులు ప్రారంభించాడు. దక్షిణాదిలో గోవా వరకు వశపరచుకుని, తీరంలోని శత్రు స్థావరాలను చిన్నాభిన్నం చేస్తూ అహమ్మదాబాదుకేసి సేనలను నడిపిస్తున్నాడు.\n\nఔరంగజేబు అసహనానికి, అశాంతికి, పట్టరాని ఆవేశానికి అదే కారణం. శివాజీ దుందుడుకు చర్యలను అరికట్టి, అతన్ని ఎలాగైనా అణచివేయూలి అని ఔరంగజేబు పదేపదే పలవరించసాగాడు. మొగల్‌ చక్రవర్తికి ఆ సమయంలో శివాజీ బాల్యంలో జరిగిన ఒక సంఘటన గుర్తురావడంతో మరింత అసహనానికి లోనయ్యూడు. పన్నెండేళ్ళ వయసులో శివాజీ తండ్రి షాజీ వెంట బిజాపూర్‌ సుల్తాను వద్దకు వెళ్ళాడు.\n\nసభలో ప్రవేశించగానే షాజీ వంగి మూడు సార్లు నేలనుతాకి సుల్తానుకు నమస్కరించాడు. ఆ తరవాత శివాజీని కూడా అలాగే సుల్తానుకు నమస్కరించమన్నాడు. అయితే, శివాజీ నాలు గడుగులు వెనక్కు వేసి తలెత్తి చూశాడు. పరాయి పాలకుడికి తలవంచనన్న ధీమా అతడి చూపుల్లో కనిపించింది. సుల్తాను సభలో అంతకు ముందెవరూ అలా ప్రవర్తించింది లేదు. సుల్తానుతో సహా సభికులందరూ అమితాశ్చర్యంతో చూస్తూండగా బాల శివాజీ సభనుంచి వెలుపలికి నడిచాడు.\n\nకొడుకు ప్రవర్తనకు షాజీ లోలోపల ఎంతగానో మురిసిపోయూడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి ఔరంగజేబు 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సాధుస్వభావుడూ, పండితుడూ అయిన సోదరుడు దారాసుఖోతో సహా ముగ్గురు అన్నదమ్ములను హతమార్చాడు. ఎదురు తిరగగలరన్న అనుమానంతో కన్న బిడ్డలనే కారాగారంలో బంధించిన పరమ క్రూరుడు ఔరంగజేబు.\n\nకొండలతో నిండిన దక్కను ప్రాంతంలో శివాజీ అనుసరించే గెరిల్లా యుద్ధ విధానం ఔరంగజేబును కలవరపెట్టింది. మరాఠా నాయకుణ్ణి అణచడానికి 1660లో విశ్వాస పాత్రుడైన తన మేనమామ షయిస్తఖాన్‌ను సేనలతో పంపాడు. అయితే, షయిస్తఖాన్‌కు అది అంత సులభంగా తోచలేదు. తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోలేక వందలాది మంది సైనికులు చనిపోయూరు. ఎలాగో పూనాను ఆక్రమించి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు షయిస్తఖాన్‌. మరో మూడేళ్ళలో తనవశంలో ఉన్న అనేక ప్రాంతాలను శివాజీ కోల్పోవలసి వచ్చింది.\n\nఅయినా ఎదురు దాడికి సరైన సమయం కోసం ఎదురుచూడ సాగాడు. పూనా నగర వీధిలో ఒకనాటి రాత్రి వెళుతూన్న పెళ్ళి ఊరేగింపులో శివాజీ తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. పెళ్ళి ఊరేగింపు షయిస్తఖాన్‌ బసచేసివున్న భవనం గుండా వెళుతూండగా, శివాజీ రహస్యంగా భవనంలో ప్రవేశించాడు. సాహసవీరులైన అనుచరులతో వీరశివాజీ హఠాత్తుగా తన శయనమందిరంలో ప్రత్యక్షం కావడంతో షయిస్తఖాన్‌ ఇది కలా, నిజమా అని దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏం చేయడానికీ తోచక గడగడ వణికిపోయూడు.\n\nఉన్నట్టుండి కిటికీగుండా వెలుపలికి దూకి ప్రాణాలతో పారిపోయూడుగాని, శివాజీ కత్తి వేటుకు బొటన వేలును కోల్పోయూడు. ఆ మెరుపు దాడిలో షయిస్తఖాన్‌ కొడుకు, మరి కొందరు సైనికులు మరణించారు. మొగలు సేనలు మేలుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగా శివాజీ అక్కడి నుంచి సురక్షితమైన తన స్థావరానికి చేరుకున్నాడు.\n\nఇరవై వేలమంది సైనికులతో అభేద్యమైన రక్షణా వలయంలో ఉన్న మొగలు సేనాధిపతి మీదికి వ్యూహాత్మకంగా దాడి చేసిన శివాజీ అద్భుతమైన శక్తియుక్తులను దేశప్రజలు ఆశ్చర్యానందాలతో కథలు కథలుగా చెప్పుకోసాగారు. బొటన వేలిని పోగొట్టుకుని ఢిల్లీకి తిరిగివచ్చిన షయిస్తఖాన్‌ను చూసి ఔరంగజేబు ఆగ్రహం చెందాడు. మరింత అసహనానికి లోనయ్యూడు. 1664లో శివాజీ సిరిసంపదలకు పేరుగాంచిన సూరత్‌లోని కొన్ని మొగల్‌ స్థావరాలను దోచుకున్నాడు.\n\nదాంతో అమితాగ్రహం చెందిన ఔరంగజేబు సాహస యోధుడూ, రాజనీతికోవిదుడూ అయిన రాజపుత్ర వీరుడు రాజా జైసింగ్‌ను సేనలతో దక్కను నాయకుడు శివా జీని అణచడానికి పంపాడు. అసంఖ్యాకమైన సేనలతో బయలుదేరిన రాజా జైసింగ్‌ పురందర్‌ను ముట్టడించి దానితో పాటు క్రమక్రమంగా మరో ఇరవై కోటలను వశపరచుకున్నాడు.\n\nఅమితమైన సైనికబలంతో, వ్యూహాత్మకంగా దూసుకువస్తూన్న జైసింగ్‌ను నిలువరించడం అసాధ్యం అని గ్రహించిన శివాజీ అతడితో సంధి ఒడంబడికకు సంసిద్ధుడయ్యూడు. రాజా జైసింగ్‌ అభ్యర్థనమేరకు సంధి చర్చలు జరపడానికి ఔరంగజేబు సభకు వెళ్ళడానికి శివాజీ సమ్మతించాడు. ఔరంగజేబు శివాజీని దక్కను వైస్రాయిగా చేయగలడన్న ఊహాగానాలు కూడా వచ్చాయి.\n\nఅయినా, పరమక్రూరుడైన ఔరంగజేబు సభకు వెళ్ళడం రాక్షసుడి కోరల్లోకి జొరబడడమేనని శివాజీ మిత్రులు భావించి వారించారు. అయినా, శివాజీకి ఎలాంటి ఆపదారాకుండా చూసుకోవడం తన బాధ్యత అని రాజా జైసింగ్‌ వారికి హామీ ఇచ్చాడు. శివాజీ తన చిన్న కొడుకు శంభూజీతో కలిసి మొగలుల సభకు వెళ్ళాడు. ఆరోజు ఔరంగజేబు జన్మదినం గనక, ఆగ్రా కోటలోని దర్బారు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నది.\n\n‘‘రాజా, శివాజీకి స్వాగతం!'' అంటూ హేళనగా పలకరించిన ఔరంగజేబు తన భటులకు సైగ చేశాడు. భటులు ఆయన్ను సాధారణ పౌరులు కూర్చునే చోటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తరవాత ఆయన్నెవరూ పట్టించుకోలేదు. దానిని తీవ్రమైన అవమానంగా భావించిన శివాజీ, ఆగ్రహంతో లేచి ఇచ్చిన మాట నిలుపుకోలేదని నిందిస్తూ, కొడుకుతో సహా సభనుంచి వెలుపలికి నడవసాగాడు. ఆయన్ను దోషిగా ప్రకటించి, ఖైదు చేయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు. తండ్రీ కొడుకులు ఒక ఇంట్లో బందీలయ్యూరు.\n\nఅలాగే మూడు నెలలు గడిచిపోయూయి. శివాజీ తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు ఒక రోజు తెలియజేయబడింది. ఇంటి నుంచి రోజూ, గంపల నిండుగా ఫలపుష్పాలూ, ఫలహారాలూ పేదలకు, సాధుసన్యాసులకు పంపడానికి అనుమతించాలనీ, వారి ప్రార్థనలతో తన ఆరోగ్యం బాగుపడగలదనీ శివాజీ కోరాడు. ఔరంగజేబు ఆయన కోరికను మన్నించాడు. రోజూ ఇద్దరు మనుషులు కావడి బద్దకు రెండు వైపులా రెండు బుట్టలను తగిలించుకుని అందులో పువ్వులు, పళ్ళు, ఫలహారాలు వెలుపలికి తీసుకువెళ్ళేవారు.\n\nమొదట ఒకటి రెండు రోజులు భటులు బుట్టలో ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి బయటికి పంపేవారు. కాని రోజులు గడిచేకొద్దీ అంత జాగ్రత్తగా చూడడం మానేశారు. ఒకనాడు మధ్యాహ్నం శివాజీ ఆరోగ్యం ఆందో ళనకరంగా ఉన్నదనీ, ఎవరూ లోపలికి రాకూడదనీ తెలియజేయబడింది. సాయంకాలం మొగలు సైనికులు కిటికీగుండా తొంగిచూశారు.\n\nశివాజీ ఒళ్ళంతా దుప్పటితో కప్పబడి పడుకుని ఉన్నాడు. కుడి చేయి మాత్రం బయటకు కనిపిస్తున్నది. సైనికులు తృప్తిగా వెనుదిరిగారు. పొద్దుగూకుతూండగా పనిమనిషి వెంట ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్దమనిషి, ‘‘ఇప్పుడే ఆయనకు నిద్ర పట్టింది. శబ్దం చేయకండి,'' అని చెప్పి వెళ్ళిపోయూడు. అంతకు ముందే, రోజూ బుట్టలతో ఫలాలను మోసుకువెళ్ళే మనుషులు రెండు కావళ్ళతో ఇంటి నుంచి వెలుపలికివెళ్ళారు. వాటిలో ఒక బుట్టలో శివాజీ, మరొక బుట్టలో శంభూజీ ఉన్నారు.\n\nపళ్ళను తీసుకువెళ్ళడం ప్రతిరోజూ మామూలుగా జరుగుతున్నదే గనక, కాపలాభటులకు ఎలాంటి అనుమానమూ రాలేదు. ఆ తరవాత ఇంటి నుంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో అనుమానం కలిగి కాపలా భటులు లోపలికి వెళ్ళి చూశారు. ఒక్కరూ లేరు. తాము చూసినప్పుడు శివాజీలాగా పడకపై పడుకున్నది శివాజీ కాదనీ, ఆయన పోలికలున్న మారాఠీ యోధుడు హీరాజీ ఫర్సంద్‌ అనీ ఆ తరవాత తెలియవచ్చింది.\n\nనగర పొలిమేరలు దాటాక శివాజీ, ఆయన కుమారుడూ తమ అనుచరులు సిద్ధంగా ఉంచిన గుర్రాలపై స్వస్థలం కేసి బయలుదేరారు. మార్గ మధ్యంలో శత్రువుల కంటబడకుండా తప్పించుకోవడానికి సాధువుల వేషంతో తమ నివాసాన్ని చేరుకున్నారు. శివాజీ తప్పించుకోవడానికి నిజానికి మొగలు సేనాధిపతి రాజాజైసింగ్‌ సాయపడ్డాడని చెబుతారు.\n\nఆ విధంగా శివాజీ భద్రతకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడన్న మాట! అదే సమయంలో, కాపలాభటుల నాయకుడు ఔరంగజేబు వద్దకు వెళ్ళి ఏం చెప్పాలో తెలియక భయంతో వణుకుతూ, ‘‘గదిలోనే ఉన్నాడు. ఎలా మాయమై పోయూడో ఏమో! ఆయనకేవో అద్భుత శక్తులు ఉన్నాయి,'' అని చెప్పసాగాడు. ఆ మాటలు వింటూంటే ఔరంగజేబుకు వెయ్యి తేళ్ళు ఒక్కసారిగా కుట్టినట్టయి మౌనంగా ఉండిపోయూడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 250,
        "IMAGE": "cat_1",
        "NAME": "ఫలదానంతో ప్రాణరక్షణ! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 250,
        "TYPE_ID": 1
    },
    {
        "DESCRIPTION": "చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ \"రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి.\" అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.\n\nఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి \"మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు\" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.\n\nఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.\nనీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 251,
        "IMAGE": "cat_2",
        "NAME": "మంచి స్నేహితుడెవరు?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. ప్రతిరోజూ మూడుపూట్లా హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామేవ్వరమూ మిగలమని తెలుసుకొని, ఒకరాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి.\n\nచేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమైఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 252,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెలివిగల చేప",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచాసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చోపున ప్రతి రోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వళ్ళు మరచిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు పేరయ్య దంపతులు \"ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా! దీని పొట్టలో చాల బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది\" అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదువారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరూ కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి క్రుశించిపోయారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 253,
        "IMAGE": "cat_2",
        "NAME": "బాతు-బంగారు గుడ్డు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకొంటూ... అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. 'కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు'? అని ఎంతో దిగులుపడింది.\n\nఅప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. 'ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!' అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, \"హమ్మయ్య! ఎంత గండం గడిచింది?\" అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 254,
        "IMAGE": "cat_2",
        "NAME": "జింక అందం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. నాలుగు రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది.\n\nఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందున్నా భూముల్ని ముంచేస్తుందని తెలుసుకున్నాడు. కింద పొలాల్లో వందలమంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు.\n\nవాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందూ వెనుక ఆలోచించకుండా వెంటనే తన వరికుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందర్నీ పిలిచాడు. కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పని చేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అపుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథంను అభినందించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 255,
        "IMAGE": "cat_2",
        "NAME": "రైతు త్యాగబుద్ది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా వున్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్ళకు అపజయం అనేది కలగదు అని చెప్పాడు. అప్పడినుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాడు.\n\nవెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజ మందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండని తాకి రావాలనీ, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు.\n\nఅందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికిమాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేసారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి, తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 256,
        "IMAGE": "cat_2",
        "NAME": "దొంగను పట్టే మసికుండ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి, ఆరబెట్టి తిరిగి వచ్చేటపుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్టజెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తి పడే రకం కాదు. ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏ మాత్రం ఇష్టం లేదు.\n\nఒకరోజు గాడిద దేవుడిని ప్రార్ధించి,\"ఓ దేవుడా! దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తోంది. ఈ రామన్న నాచేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు\" అంటూ ప్రార్దించింది. గాడిద ప్రార్ధనకు దేవుడు ప్రత్యక్షమై \"నాకు నువ్వు చేసే చాకిరి గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను\" అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్లి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగుపుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్దించింది. \"దేవుడా! కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గానీ చాకలి దగ్గర పనికీ, కుమ్మరి దగ్గర పనికీ తేడా కనిపించటం లేదు. దయ చేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు\" అన్నది.\n\nరెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి, ఒక చెప్పులు కుట్టే వాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. \"ఇక్కడ కూడా నాకు బాగోలేదు' నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు\" అని ఆలోచించింది గాడిద.\n\nగాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్ధించింది. కానీ ఈ సారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. \"నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ దండగ. నీకసలు ఏపనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏపని చేసినా విసుగు పుట్టదు\" అని గాడిదను గట్టిగా మందలించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 257,
        "IMAGE": "cat_2",
        "NAME": "తీరని కోరిక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు.\n\nమర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. \"బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?\" అన్నాడు మిత్రుడు. \"నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి\" అని సమాధానం చెప్పాడు వ్యాపారి.\n\nఇంతలో ఒక గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు.\n\nకొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు\"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను\" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు.\n\nఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో \"రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి\" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 258,
        "IMAGE": "cat_2",
        "NAME": "ప్రతిఫలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయ నగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు. ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారున్నీ, గుర్రాన్నీ చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి.\n\n\"ఇంత విలివైన గురాన్ని అంత తక్కువకు అడగటం నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా?\" అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. \"ఏమీలేదు. మూడు కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు యిస్తా\"నన్నాడు.\n\nవ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాశకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి 'చెళ్' మని కొట్టాడు. \"అబ్బా\"... అని మూల్గి \"ఇంకా రెండు... కానీ...\" మళ్ళీ కొరడా 'చెళ్' మంది. \"ఆ! తర్వాత మూడోది కూడా కానీ\" అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి \"మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో\" అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంభరపడ్డారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 259,
        "IMAGE": "cat_2",
        "NAME": "తగిన శాస్తి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక తూనీగ చెట్టుకొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. రెండు మిణుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్చగా తిరుగుతూ తూనీగను చూచి, గర్వంతో \"ఓహో నీవా! తూనీగా! దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము. ఆ వేలుగులో వెళతావా?\" అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ \"మిత్రమా! నేను వెలుగు లేకపోయినా, ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసేముందు మీరు ఏమిటో తెలుసుకోండి!\" అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ \"నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు. ఎదుటవారిని కించపరచకూడదు.\n\nమేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మన కన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశం లోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు\". ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగ. అప్పుడు మిణుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 260,
        "IMAGE": "cat_2",
        "NAME": "గర్వం పనికిరాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయస్సులో చాలా పెద్దవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు ముగ్గురు కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలు పెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో ముగ్గురు కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండోవాడికి మూడో వంతు, మూడో వాడికి తొమ్మిదో వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు.\n\nఅంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్లు పంచుకోడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవులలో సగం ఎలా పంచుకోవాలి? అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్దిమంతుడు. ముగ్గురన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రి గారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెళుకువ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కట్టిన తాడు ముడి తీసి \"ఈ ఆవుని తీసుకెళ్ళి, మీ ఆవుల మందలో కలపండి. తరువాత బాగాలు పంచుకోండి\" అని అన్నాడు.\n\nపెద్దవాడు \"అయ్యా! రంగాచారి గారు మీ ఆవును మేము తీసుకోలేము\" అన్నాడు.\n\"పరవాలేదు తీసుకెళ్ళండి! మీ వాటాలు పంచుకోండి ఆ తరువాత ఏమైనా మిగిలితే నా ఆవుని నాకు ఇవ్వండి\" అని వారికి ఆవునిచ్చి పంపించాడు.\nముగ్గురన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రి గారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 261,
        "IMAGE": "cat_2",
        "NAME": "చివరి కోరిక ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాల సేకరణ చేయడం ప్రారంభించారు. గోవిందరావు అనే భక్తుడు తన వంతు సేవ నిమిత్తం పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాముల వద్దకు వెళ్లి విరాళాలు వసూలు చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరడానికి మధ్యలో అడవి దాటాలి, చీకటి పడసాగింది. గోవిందరావు తొందర తొందరగా అడవిలో నడుస్తున్నాడు. చేతిలో డబ్బు సంచి ఉంది. ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకీ గురి పెట్టి గోవిందరావును ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు. చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని \"నాయనా! ఇది నా డబ్బు కాదు. గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను. ఈ ధనంతో దేవాలయం నిర్మించాలని తీసుకెళ్తున్నాను. నా దారిన నన్ను పోనీ\" అని బ్రతిమలాడాడు.\n\n\"ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బు ఇవ్వు!\" అంటూ చేతిలోని డబ్బు సంచిని లాక్కున్నాడు.\n\n\"ఈ డబ్బుని నువ్వు లాక్కున్నావు. డబ్బిచ్చిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి! నాకో చిన్న సహాయం చేసి పెట్టు\" అని గోవిందరావు అన్నాడు. \"ఏంటది?\" అన్నాడు బందిపోటుదొంగ. \"ఏం లేదు... నీ చేతిలో తుపాకీ ఉంది. కాబట్టి నేను నీ మాట వినక తప్పదు... నేను ఏమి చెప్పినా మావాళ్ళు నమ్మరు. అందుకని... తుపాకీతో నాపై కండువాను కాల్చు. అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరి వారందరూ నమ్ముతారు\" అని చెప్పాడు. దొంగ 'సరే' అని తుపాకీతో కాల్చాడు. కానీ కండువాకి చిల్లి పడలేదు. \"ఇదేంటి తూటా తగిలినా చిల్లు పడలేదు\" అని అడిగాడు గోవిందరావు.\n\n\"నా తుపాకీలో తూటాలుండవు. తుపాకీ మందు కూరుతాను. శబ్దం వస్తుందే తప్ప దెబ్బ తగలదు. ఇది కేవలం భయపెట్టడానికే చంపటానికి కాదు\" అని విరగబడి నవ్వసాగాడు దొంగ. అదును చూచి గోవిందరావు దొంగను అదిమి పట్టి చెట్టుకు కట్టి సంచి తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 262,
        "IMAGE": "cat_2",
        "NAME": "సమయస్పూర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామాపురం జమిందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడు ఉన్నాడు. తాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూ, అందరిని కూడగల్పుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటలు కోటలు దాటుతాయి. ఒకనాడు చంద్రయ్య \"నాకేగనుక జమిందారుకి ఉన్నంత భూమి ఉంటే... చూస్కో... నాసామిరంగ... అదరగొట్టేస్తాను... ఒక్కొక్కరి కూలి రెట్టింపు చేస్తా...\"నంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమిందారు గారికి తెలిశాయి. వెంటనే జమిందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. \"ఇదిగో చంద్రయ్య! నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తుంది.\n\nనీవు ఇక్కడినుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు సూర్యాస్తమయం వేళకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా!\" అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో 'సరే'నని పరుగు లాంటి నడకతో బయలుదేరాడు. ఆకలిదప్పులు లేవు. ఆశ... అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి... తనదేనని నడుస్తున్నాడు. నడచినకొద్దీ సారవంతమైన భూములు కనబడుతున్నాయి. మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కాని అత్యాశ ముందుకే లాక్కుపోతుంది.\n\nమధ్యాహ్నం రెండు గంటలయ్యింది. వెనక్కు తిరుగుదాం అనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళదాం అనుకున్నాడు. సాయంకాలం కావస్తుంది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనుకకు మరలాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారాం చేస్తున్నాయి, ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చలాయించింది. ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెడుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగి పోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగపట్టి పరిగెడుతున్నాడు. నవనాడులు కుంగి పోతున్నాయి. అడుగులు పడుతున్నాయో లేదో! గమనించే శక్తి కోల్పోయాడు. జమిందారు ఇంకా పది గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒక్కసారిగా చంద్రయ్య నేలమీద బోర్లాపడ్డాడు. అంతే! మళ్ళీ లేవలేదు.\nఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి ఆరడుగుల నేలే సరిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 263,
        "IMAGE": "cat_2",
        "NAME": "అత్యాశ-ప్రాణ సంకటం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది. అది చాలా నిటారుగా ఉంది. ఆ కొండ మీదకు వెళ్ళటానికి గానీ, రావటానికి గానీ ఒకటే దారి. ఆ దారి వెంట మేకలు, గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేతమేసి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు రెండు మేకలు ఒకటి పైనుండి కిందకు, రెండవది కిందనుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి. రెండింటికీ తప్పుకోవడానికి దారి లేదు. ఏదో ఒకటి వెనక్కి నడవటం తప్ప వేరే మార్గం లేదు. ఒక మేక రెండోదాంతో \"తన దారికి అడ్డం తప్పుకో\"మన్నది. \"ఈ సన్నటి దారిలో వెనకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలియదా! నువ్వే వెనుకకు వెళ్ళటం తేలిక. నన్నే ముందు పోనివ్వు!\" అన్నది రెండవది.\n\n\"అది జరగని పని నీకు కిందకు వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనుకకు, పైకి పోవటం కూడా అంతే ప్రమాదం\" అన్నది మొదటి మేక. \"ఒక పని చెయ్యి. ఈ దారిలో నువ్వు నేలకు వదిగి పడుకో నేను నీ మీద నుంచి దాటి వెళతాను. ఇంతకు తప్ప వేరే మార్గం లేదు\" అన్నది రెండవ మేక. \"నేను చస్తే ఆ పని చెయ్యను. నువ్వు నా మీదనుంచి దాటి వెళితే, నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్లే... \"అన్నది ఆవేశంగా మొదటి మేక. ఆ విధంగా ఆ రెండింటికి మాటా మాటా పెరిగింది.\n\nఅంతే పోట్లాట మొదలైంది. ఒకదాన్నొకటి నెట్టుకున్నాయి. చివరకు రెండు మేకలు కొండపైనుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 264,
        "IMAGE": "cat_2",
        "NAME": "పొగరుబోతు మేకలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో చెట్టుపైన చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ ఒకటితో ఒకటి గొడవపడి ఐకమత్యంగా ఉండేవి కావు. అవి ఒక్కొక్కటీ వేరువేరుగా ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉంది. అది తరుచూ పావురాలను పట్టి తినేది. రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాల్లో కంగారు భయం పట్టుకుంది. అవన్నీ కలిసి ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిక్ష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.\n\n\"మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తుంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం\" అన్నది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరకు వెళ్లి \"నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికే వచ్చాను\" అంది.\n\nముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవరోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరకి వచ్చి, \"మీ గుంపుని చూస్తుంటే ముచ్చటేస్తుంది. కాని, మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బలంగా ఉండవచ్చు\" అంది. పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికీ అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద 'మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకునిగా ఉంటాను\" అంది. \"అలాగే\" అన్నాయి పావురాలు. \"అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు ఆహారంగా రావాలి\" అంది గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్భుద్ది అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. ఆనాటి నుండి అవి కలిసి మెలిసి జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 265,
        "IMAGE": "cat_2",
        "NAME": "పావురాల తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలించుచున్నాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకొనేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి ప్రక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముల్లు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ సృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్లి దొంగిలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకొన్నారు. భోజనం చేసి పంచుకొందాం అనుకొని మూడోవాడిని ఊర్లోకి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు.\n\nఇద్దరు దొంగలు మూడోవాడుంటే మనకు వాటా తగ్గుతుంది. వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది, అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళినవాడు ఇద్దర్నీ చంపితే మొత్తం నాకే గదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కుని మూడో వాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే.\n\nతెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుటకు ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే సృహ తప్పిన తమ తండ్రినీ, గుర్రాన్నీ గుర్తించారు. చుట్టు పక్కలా ఎవరైనా ఉన్నారేమో అని వెతగగా గుహముందు దొంగలు చచ్చి పడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రిగారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 266,
        "IMAGE": "cat_2",
        "NAME": "ధర్మమే జయిస్తుంది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.\n\nఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా \"ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది\" అన్నది పినతల్లి సురుచి.\n\nజరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి \"నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది\" అన్నది తల్లి.\n\nతల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ \"నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో\" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు \"మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను\" అని చెప్పాడు. \"పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి\" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.\n\nఅతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి \"ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు\" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 267,
        "IMAGE": "cat_2",
        "NAME": "ధ్రువనక్షత్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి \"ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి\" అని వారితో చెప్పాడు.\n\nపెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్టు వైపు వేగంగా వెళ్లి, మార్కెట్టులో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు.\n\nరెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివి తేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాన్ని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి, గదిలో క్రొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది.\n\nరాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్దకొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 268,
        "IMAGE": "cat_2",
        "NAME": "నిజమైన తెలివి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడివిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండటంతో ఎక్కడైనా తల దాచుకుని ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుంది. అక్కడకి దగ్గరలోనే ఒక గుహ కన్పించింది. ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది. ఉదయాన్నే అడవి నుండి బయటకు వెళ్ళే దారి కోసం ప్రయత్నించింది. కానీ దారి కనిపించలేదు. నిరాశతో ఆ గుహలోకే వెళ్ళి నిద్రపోయింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది.\n\nఈ విషయం గమనించిన ఒక పులి పొట్టేలు ఎలాగూ రాత్రి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడే దాన్ని తినేయొచ్చు. అనవసరంగా వేటాడటం ఎందుకు అనుకుని, ఆ గుహలోకి వెళ్లి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నీరసపడి, గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్లబోయేముందు పెద్దపెద్ద అడుగుజాడలు చూసింది. లోపలేదో జంతువు ఉంది అనుకుని, ఒక ఉపాయం పన్నింది.\n\n\"ఓ గుహ మిత్రమా! నిద్రపోతున్నావా? ఏమిటి నన్ను చూసి లోపలి ఆహ్వానించలేదు\" అని అరిచింది. గుహనుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. \"అదేంటి గుహా! నువ్వు రమ్మనందే నేను లోపలి రానని తెలుసు కదా నీకు! నువ్వు పిలవడం లేదు, కాబట్టి నేను లోపలి రాను వెళ్ళిపోతున్నాను\" అంది. గుహ లోపలున్న పులి, రోజూ గుహ పోట్టేలుని పిలుస్తుంది కాబోలు అనుకుని \"రా మిత్రమా రా\" అంది. ఆ శబ్దం విన్న పొట్టేలు, లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడినుండి వేరే చోటికి పరుగు తీసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 269,
        "IMAGE": "cat_2",
        "NAME": "మాట్లాడే గుహ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఎలుక రెండు రోజులనుండి ఆహారం దొరకక దాని కోసం వెతుకుతూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండటం గమనించింది. ఎంతో ఆకలిగా ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది. వెంటనే బుట్టపైకి ఎక్కింది. కానీ ఆ ఇంటి వారు దాని పైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందకి దిగి, ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికో ఆలోచన వచ్చింది. వెంటనే చకచకా అది పట్టేంత రంధ్రాన్ని బుట్టకు చేసింది. చకచక లోపలి ప్రవేశించింది. ఎన్నో జొన్న గింజలు... ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలోని గింజలన్నింటినీ తినేసింది. నిండి బాగా లావేక్కింది. ఇక బయటపడటమే అనుకుంది. వెంటనే రంధ్రంలోంచి బయటకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప, పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం, దానితో లోపలే కూలబడి అరవడం ప్రారంభించింది.\n\nఈ లోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి, బుట్టలో ఉన్న ఎలుకను చూచి ఏం జరిగింది? అని అడిగింది. ఎలుక జరిగిందంతా చెప్పింది. అంతా విని పందికొక్కు \"నువ్వు నాలుగు రోజులు ఉపవాసం ఉండు. అప్పుడుగాని ఈ రంద్రంలోంచి బయటకు రావచ్చు. అయినా తేరగా దొరికింది కదా అని మితి మీరి తింటే ఇలాగే జరుగుతుంది\" అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. ముందూ, వెనుక ఆలోచించనందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 270,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఆశపోతు ఎలుక ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను! అని ప్రాధేయపడింది. నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది. సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది. చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!” అనుకుని తన దారిని వెళ్ళింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 271,
        "IMAGE": "cat_2",
        "NAME": "సింహము-ఎలుక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాల కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు. ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు.\n\nఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు. అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని? ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి గ్యానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.\nఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 272,
        "IMAGE": "cat_2",
        "NAME": "చాణక్యుని గ్యానోదయం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.\n\nఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు. నా దగ్గర నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.\n\nరాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 273,
        "IMAGE": "cat_2",
        "NAME": "శ్రీ కృష్ణదేవరాయుల కల",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.\n\nకొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు. అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 274,
        "IMAGE": "cat_2",
        "NAME": "బ్రాహ్మడి మేక ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి. అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి? అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క.\n\nపీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది. రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి. కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి.\n\nపీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 275,
        "IMAGE": "cat_2",
        "NAME": "నక్కా, పీతలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది.కొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి వచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాల భయపడి పోయాడు. పారిపోయే క్షణంలో పులి, “నన్ను చూశి భయపడకండి – నేను మిమ్మల్ని యేమి చేయను. నాకు మీ అమ్మయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నాను” అంది. అతను భయంలో కూడా చాల చురుకుగా ఆలోచించాడు.“నాకు ఇష్టమే, కాని మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో – పెళ్ళికి ఒప్పుకోక పోతే?” అన్నాడు. పులి ఆలోచించకుండా, “మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు, గోళ్ళు తీయించేస్తాను” అంది. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు కోసేసాడు. దంతాలు, గొళ్ళు లేని పులి అంటే భయం వుండదు కదా! కట్టెలతో, రాళ్ళతో, చేతికి అందిన ప్రతీ దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళి ఆ పులి యే మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 276,
        "IMAGE": "cat_2",
        "NAME": "పులి ప్రేమ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక బక్కచిక్కిన కాకి ఉండేది అది రోజూ ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది. అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ బాగా స్థితి మంతులు ఉన్నారు. వాళ్ళు బాగా బలమైన బలమైన ఆహారం తిని మిగిలింది విదిల్చేవారు. ఆ విదిల్చింది తిని కాకి బాగా బలిసింది. (లావయ్యింది). క్రమేపి బలం పుంజుకుంది. అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది. సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి. కొన్నాళ్ళ పాటు ఈకాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించి హంసలకి తన కోరిక వెల్లడించింది. హంసలు సరేనని ఈకాకిని వాటితో పాటు కలుపుకున్నాయి. చాలా హాయిగా సాగుతుంది కాలం. ఒకనాడు హంసలమీద కాకికి ఈర్ష్య కలిగింది. నేను వాటికంటే బలంగా ఉన్నాను. నాకేంతక్కువ! అందానికి అందం, బలానికి బలం, ఎంత ఎత్తైన ఎగరగలిగే చాకచక్యం నాదగ్గర ఉన్నాయి. లేదంటే నేను కోరగానే నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి. వీటికి తెల్లగా ఉన్నామని పొగరు. వీటి పొగరుని చిన్న పందెంతో అణిచి వేస్తాను. అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరికి వెళ్లి మిత్రమా! ఒక్కసారి మన బలాబలాలు చుసుకుందామా! అనగానే హంస ఆశ్చర్యపోయి! మిత్రమా! ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్ధ ధోరణి. వద్దు మిత్రమా అనగానే కాకి పకపకా నవ్వి ఓహో నాతో పోటి పడితే ఓడిపోతానని భయమా? లేదంటే ఇంత బేలతనమేలా!\nబేలతనం కాదు మిత్రమా! నిన్ను బాధపెట్టడం ఎందుకా అని!\n\nనాకు బాధ! హహహ ! నన్ను సరిగ్గా చూశావ! సప్త సముద్రలనైన అవలీలగా ఎగరగాలను, భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను. ఎంత ఎత్తైన ఎగరగలను. ధైర్యం వుంటే నాతో పందేనికి సిద్దం అవ్వు. చేతకాకపోతే ఓడిపోయానని ఒప్పుకో.\n\nసరే స్నేహితుడి ముచ్చట కాదనడం ఎందుకు! పదా అలా సముద్రం మీద విహారానికి వెళ్లి వద్దాం.\nపందెం మొదలైంది.\nకాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోకి పైపైకి ఎగురుతూ తన కున్న బలాన్ని ప్రదర్శిస్తుంది. హంస చూసి! మిత్రమా! మరీ బలం అంత ఒకేసారి వాడేయకు రెక్కలు నెప్పులు వస్తాయి. అలసిపోతావు. ఆ తరువాత ఎగరడం కష్టం అవుతుంది. నామాట విని క్రిందికి రా! సూర్యకాంతి ఎక్కువగా ఉంది.\n\nకాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది. చూసావా! ఎలా ఎగురుతున్నానో? అనుకుంటూ కొంతదూరం ప్రయాణం చేసేసరికి కాకిగారికి ఎండ వేడిమికి ఆయాసం వచ్చింది. అలాగే ఇంకొంతదూరం వెళ్లేసరికి నీరసం వచ్చి రెక్కలు అడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరకపోతుందా అని చుట్టూ చూసింది. కానీ చుట్టూ నీరు తప్ప మరేమీ కనపడలేదు. అప్పుడు ఏడ్చింది..\n\nఅయ్యో! నా మిత్రుడు ముందే చెప్పాడు. అయినా నేను వినలేదు. ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగి చనిపోతాను. అని ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఒడుపుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకి తీసుకొచ్చింది. కాపాడి ఒడ్డుకి చేర్చినందుకు హంసకి కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రదేయపడింది. హంస చిరునవ్వు నవ్వి!\n\nమిత్రమా! ఎదుటి వారి శక్తి యుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా, మంచి చెప్పినపుడు వినకుండా పెడచెవిన పెట్టినా, ''నేను'' అని అహంకారించినా, బలంగా ఉన్నాను కదా (సంపదలో, శరీర ధారుడ్యంలో, తెలివిలో,) అని అహంకరిస్తే ఇలాంటి గతే పడుతుంది.\n\nఎదుటివారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవలసింది మన జన్మ గురించి, తరువాత బలం గురించి(సంపద కావచ్చు, తెలివిలో కావచ్చు,) తరువాత పెరిగిన స్థానం, స్థానబలం, చూసుకోవాలి. అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి. ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చేవరకు వేచి చూడాలి. ఇది మన సమయం అవునా?కదా? అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి. ఆ పరిస్థితులకి తగ్గట్టు నడచుకోవాలి. ఎదుటివాడు ఎదిరించలేని శక్తివంతుడు అయితే, వారివల్ల మన కార్యం పూర్తీ అవుతుందనుకుంటే మొక్కి లోంగిపోవలసిందే. లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి. అంతేకాని గుడ్డిగా వెళ్లి గొడవకి దిగితే మేడమీద తలకాయి ఉండదు. వట్టి మొండెం మాత్రం మిగులుతుంది. అంటూ ధర్మసూక్ష్మాలు చెప్పింది హంస. కాకి సిగ్గుతో తలదించుకుని అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తన అర్హతలు, తన స్థోమత తెలుసుకొని స్నేహంగా మెలిగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 277,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఓ బక్కచిక్కిన కాకి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగవులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. ఐతే ఈకోడిని ఎలాగైనా సేమ్య ఉప్మా లాగా లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ వుండేది. ఈవిషయం గమనించి రంగయ్యని భార్య \"ఈపిల్లిని వదిలేయండి. లేదంటే కోడిని చంపేస్తుంది\" అని హెచ్చరించింది.\n\nరంగయ్య భార్యమాట వినకుండా అశ్రద్ధ చేసాడు. ఒకరోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీదపడి కోరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు. ఏమైంది?అనగానే \"ఆపిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికిమాలిన పిల్లి కొరికి చంపింది\". అంది. దానికి రంగయ్య నవ్వి! ఒసేయ్ పిచ్చి మొగమా! పుట్టిన ప్రతిజీవి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతంగా ఉండరు. దీనికేందుకే ఏడుస్తావ్. అనగానే రంగమ్మకి మండిపోయింది. మనసులో \"ఏదో ఒకరోజు ఆ పిల్లి సంగతి చుడకపోను\" అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.\n\nఆమరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వేసి పెంచుతుంటే, దిట్టంగా, పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకుని కూర్చున్న పిల్లి; రంగయ్య చూస్తూ ఉండగానే కచక్ మని కొరికింది. అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకొని పిల్లిమీదకి విసిరాడు. అది కాస్త గురితప్పి కొనఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది. ఇక చుడండి ఒకటే ఏడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నాకోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడీ. ఆపిల్లి కోరికేసింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్గాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏమి జరిగింది? ఆ దీర్గాలు ఏంటి? అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూ చూడవే! నాకోడిని ఆదిక్కుమాలిన పిల్లి చంపేసింది. అనగానే రంగమ్మ పకపకా నవ్వి! పోనివ్వండి.. ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే? అంటూ మనసులో సంతోషంతో, పైకి కొంచం బాధగా అడిగింది. అపుడు రంగయ్య! ఆపిచ్చిక నాదా! అందుకే ఏడవలేదు. ఈకోడికి ప్రేమతో ప్రతిరోజు పప్పులు, జీడిపప్పు పకోడీ పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఈపిల్లి దాన్ని కాస్త పోత్తనబెట్టుకుంది అంటూ దీర్గాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి!\n\nమమ.. ఇది నాది అనుకుంటే ఏడుపే! నమమ. ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది. కష్టం, సుఖం తో సంభందం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది. మీరు చెప్పినట్టు ఎవరూ శాశ్వతం కాదు. ఇది ఆచరణలో ఉండాలి. మాటలదగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తుంది. కాబట్టి నుండి దేనిమీద అతిగా ప్రేమని పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నాం అంటే అది ఋణం, ఋణానుబందం మాత్రమే. ఋణం తీరగానే ఎవరితో ఎవరికీ సంబంధం ఉండదు. ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్లిపోవలసిందే. ఇదే జీవిత సత్యం. జీవిత పరమార్ధం. అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగయ్య ఏడుపు ఆపి నిజమే కదా ఎందుకీ ప్రేమలు పెంచుకుని బాధ పడటం తప్ప మిగిలేది ఏముంది? అనుకుంటూ ఎప్పటిలాగే తనపనిలో నిమగ్నమైపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 278,
        "IMAGE": "cat_2",
        "NAME": "పిల్లి - కోడి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసిగట్టింది. బాగా బలిసి కండ పట్టి ఉన్న కోడిపుంజుని చూడగానే నక్క నోట్లో నీళ్ళూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కాని కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే గాని పట్టుకోడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడును వెనుకవైపు ఒక కిటికీ ఉంది. అక్కడకు వెళ్లి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క.\n\n\"అబ్బా ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావ! తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెపితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా?\" అని కళ్ళు విప్పార్చుకొని కోడిపుంజుని పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడం చూసి, ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచీ చెడ్డ మాట్లడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. \"నీ శరీరమే కాదు నీ కంఠం కూడా బావుంది నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుష్యులను నిద్ర లేపేది\" అని పొగిడింది.\n\nఇలా రోజూ నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్ళిపోడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒక రోజు సాయంత్రం \"నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చుడాలనుకుంటున్నారు. నీ గురించి చెపితే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు అని తియ్యగా, కమ్మగా అడిగింది.\n\nనక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించి, తను దారిన తను పోయింది నక్క. కనుక నక్కలాంటి జిత్తుల మారి మాటలను నమ్మి మనము మోసపోకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 279,
        "IMAGE": "cat_2",
        "NAME": "మోసపోయిన కోడిపుంజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి, తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారమంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్ళపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏరహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు.\n\nమరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చుసిన సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. \"ఏదీ నా బంగారం ఏదీ?\" నెత్తీ నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. \"అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు?\" అడిగాడు పెద్దమనిషి. \"ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందాం అనుకున్నాను\" అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య.\n\n\"అలాగా!... అయితే ఈ పెద్ద గులక రాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్దా అనుకొని ఎప్పటిలాగే రోజూ వచ్చి, ఈ గులక రాయిని చూసి నీ బంగారం ఎక్కడికీ పోలేదని వెళ్ళిపో\" అంటూ ఓ పెద్ద గులక రాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. చేయునది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 280,
        "IMAGE": "cat_2",
        "NAME": "పిసినారి సోమయ్య ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు. కాని గొడ్డలిని రాలేకపోయాడు. ఎంతో బాధ పడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టుకింద కూలబడి భగవంతుడ్ని ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థన విని గంగా దేవి ప్రత్యక్షమైంది. \"ఎందుకు విచారించుచున్నావు?\" అని అడిగింది. \"తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు\" అని బాధపడ్డాడు. \"సరే ఉండు\" అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. \"ఇదేనా నీ గొడ్డలి\" అని బంగారు గొడ్డలిని చూపించింది. \"నాది కాదు తల్లీ!\" అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. \"ఇదేనా నీ గొడ్డలి?\" అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది. \"ఇదేనా?\" అన్నది. రాజయ్య సంతోషంతో \"అమ్మా! ఇదే నా గొడ్డలి\" అని ఆనందంతో పరవశించాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగా దేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 281,
        "IMAGE": "cat_2",
        "NAME": "నిజాయితీ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి ద్రోణాచర్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ది గల యువరాజు దుర్యోధనుడు అతిమంచి మనిషిని వెదకడానికి బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోటా, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు. కాని తనని గురించి తాను ఆలోచించుకున్నపుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి.\n\nవెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి \"గురూజీ! ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉంది. కాని ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని\" అని తెలియజేశాడు. మరొక ప్రక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్టుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి \"ధర్మరాజు\" మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి, ధర్మరాజు తనలో ఉన్న దోషాలనూ, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు ద్రోణాచార్యులవారి వద్దకు వచ్చి గురువు గారికి నమస్కరించి \"ఈ ప్రపంచంలో అందరికన్న చెడ్డవాణ్ణి నేనే\" అని తనకు తను తెలియజేసుకొన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 282,
        "IMAGE": "cat_2",
        "NAME": "అందరికన్నా చెడ్డవాడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని తిమాలింది. \"సరే\" అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, \"ఈ పావురం నా ఆహారం. దీనిని నేను తరుముతూ వచ్చాడు. ఇది నాది, నాది నాకు ఇచ్చేయ్\" అని కోపంగా అడిగింది డేగ. \"పక్షిరాజా! ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను. పావురం తప్ప ఇంకేమైనా అడుగు\" అన్నాడు శిబిచక్రవర్తి. \"మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురమంత బరువుగల నీ తొడ మాంసం ఇయ్యి\" అని అడిగింది డేగ. శిబిచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి, రెండోవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంత తినెయ్యమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్ని దేవునిగా మారినవి. వారిద్దరిని చూసి శిబిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్ని దేవుడు ఇలా అన్నారు \"శిబిచక్రవర్తీ! మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దాన గుణమూ, గ గుణమూ పది మంది చెప్పుకుంటే విన్నాము కానీ, ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి, సూర్య చంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది అని దీవించి వెళ్ళిపోయారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 283,
        "IMAGE": "cat_2",
        "NAME": "శిబిచక్రవర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "లోకంలో శత్రుత్వం లేదు. శత్రువు లేడు. మరి ఉన్న శత్రువులు ఎక్కడినుండి వచ్చారు?\n\nనీ మనసే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది.\n\nఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ \"అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు. నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం\" అని తెగ బాధ పడిపోతుంది.\n\nఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు. ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ? అని అడిగింది. దానికి సమధానంగా స్వామీజీ;\n\n\"బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా!\" అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని \"సచ్చినోడా! నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా!\" అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ. నవ్వుతూ ఆగమ్మా ఆగు. ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా! అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన బాష నీకు నచ్చలేదు. కనుకనే శత్రువు అనుకుంటున్నావు.\n\nఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం. అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే. కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు. అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు. అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు. ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు. కథ సుఖాంతం అయింది.\n\nభావం: మనం మాట్లాడే తీరును బట్టి శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. మనం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరూ శత్రువులే ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మిత్రులు ఏర్పడతారు. ఎప్పుడైనా మనం మాట్లాడే తీరే మనకి ముఖ్యం. మన మనస్సే మనకి శత్రువు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 284,
        "IMAGE": "cat_2",
        "NAME": "శత్రువులు - మిత్రులు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండ, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.\n\nఒక రోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్దమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపునిండ పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.\n\nఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా! ఏమి మాయమాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను” కోపంగా అన్నది పులి. “నీవు అలా అనుకోవడం సరి కాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.\n\nఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని “సరే” అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా! బుద్దిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండి, ఎట్టి పరిస్థితులలోను అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు మంచి బుద్దులు చెప్పి ఆవు అడవికి చేరుకొన్నది. ఆవుని చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవుని వదిలివేసింది పులి.\n\nఈ కథలోని నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 285,
        "IMAGE": "cat_2",
        "NAME": "సత్యమేవ జయతే ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలొ ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా! అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తుండేది.\n\nఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవిపంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల పందికి గాయం అయింది తప్ప వేంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిమీదికి దూకి అతడిని చంపి మరికొంత సేపటికి పంది కూడా చచ్చిపోయింది.\n\nఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురశ కదా! వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ” ఈ నాల్గింటి మాంసం తరువాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపేట్టుకుందాం ” అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగతంతో వంగి ఉన్న బానంబద్ద ఊపుగా నిటారుగా సాగి, నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించినది.\n\nఈ కథలోని నీతి దురాశ దుఃఖం చేటు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 286,
        "IMAGE": "cat_2",
        "NAME": "మితిమీరిన ఆశ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక మంత్రిగారు పనిమీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. అతనికి దాహంగా ఉండి దగ్గర్లోనే ఉన్న పొలంలోకి వేళ్ళాడు. మంత్రిగారికి రైతు తన చెరకు తోట నుండీ తాజా చెరకురసాన్ని తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పేరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకోంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తియ్యగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వేలిబుచ్చాడు. ” మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది” అని రైతు సమధనం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్నడు మంత్రి.\n\nఈ కథలోని నీతి “చెదు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి” .",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 287,
        "IMAGE": "cat_2",
        "NAME": "చెడు అలోచనల ప్రభావం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ధనం ఉందని ఎదుటివాడిని కించపరచగూడదు. తనకైతాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినినని మీరనుకుంటే మీకంటే ఎక్కువ ధనవంతులయిన వారు, గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నరు. సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయటికొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతూన్నానని భావిస్తుంది. కాని నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగు గర్వం పటాపంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కాని చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులో చంద్రుడు ఉన్నచోటు తెలియకుండా పొతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు.\n\nఈ కథలోని నీతి “తనే గొప్ప అని ఎన్నడూ విర్రవీగకూడదు”. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 288,
        "IMAGE": "cat_2",
        "NAME": "గర్వం పనికిరాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.\n\nవయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.\n\nఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతని అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు.\n\nఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయమడిగాడు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు. “కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.\n\nఅద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.\n\nఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాంకారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డా, అతను చేసే పనులు, నడవడిక మార్చుకోలేదు.\n\nకొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.\n\nఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.\n\nతెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.\n\nఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 289,
        "IMAGE": "cat_2",
        "NAME": "అద్దం లో మనిషి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.\r\n\r\nసాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.\r\n\r\nరాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.\r\n\r\nరాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.\r\n\r\nఅమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”\r\n\r\nరాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.\r\n\r\nరాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”\r\n\r\nఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…\r\n\r\nచిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు. ఇది ఏంగ్లిష్ లో కూడ ఒక కవిత రూపం లో మనం వినే వుంటాము:\r\nFor want of a nail the shoe was lost.\r\nFor want of a shoe the horse was lost.\r\nFor want of a horse the rider was lost.\r\nFor want of a rider the message was lost.\r\nFor want of a message the battle was lost.\r\nFor want of a battle the kingdom was lost.\r\nAnd all for the want of a horseshoe nail.\r\n\r\nTranslation in telugu:\r\nమేకు లేక గుర్రపు లాడం పోయె.\r\nలాడం లేక గుర్రం పోయె.\r\nగుర్రం లేక బంటు పోయె.\r\nబంటు లేక సందేశం పోయె.\r\nసందేశం లేక యుధ్ధం పోయె.\r\nయుద్ధం పోతే రాజ్యం పోయె.\r\nఅంతా చూస్తే మేకు లేక రాజ్యం పోయె.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 290,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఒక రాజు, యేడుగురు కొడుకులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.\n\nఅలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.\n\nరుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.\n\nచదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.\n\nళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.\n\nలేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.\n\n“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 291,
        "IMAGE": "cat_2",
        "NAME": "వేరుశనగ దొంగ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.\n\nసాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.\n\n‘స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. ‘అవును నిజమే!’ అన్నాయి ఎలుక, కాకి. ‘ఇప్పుడు ఏం చేద్దాం!’ అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను’ అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.\n\nతాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో ‘వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా’ అంది. ‘భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!’ అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.\n\nఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. ‘చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.\n\nమీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. ‘నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.\n\nజింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి ‘అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే’ అనుకుని బాధపడ్డాయి.\n\nఅప్పుడు హిరణ్యకుడు ‘స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. ‘హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. ‘వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను’ అని చెప్పింది.\n\nఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని ‘ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.\n\nవెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి ‘కావ్! కావ్’మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.\n\n‘ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.\n\nఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 292,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్నేహబలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజూ అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్ర్రెలను తీసుకెళ్ళి మేపేవాడు. ఓరోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు.\n\nకొన్ని రోజుల తరువాత, అతను ఒక రాతిగుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి, అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరుగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శ బ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస,ి ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే, అప్పటిదాకా అతను కూర్చున్ను రాతి గుండు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా, అదే గద్ద తన ముందుకు వచ్చి, అతని టోపీని అతని మీద విడిచిపెట్టి, మళ్ళీ పైకి ఎగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం మరిచిపోవు అని తెలుసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 293,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఉపకారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్ళే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణీకులకు చల్లటి నీళ్ళు ఇచ్చి, దాహం తీర్చేది.\n\nఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే, చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ, ఆకులు గలగల లాడిస్తూ, కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది.\n\nఒక రోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం.. చెట్టు ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి, ఎండ అతనిపై పడకుండా చూడసాగింది.\n\nదుష్టబుద్ధి కాకి ఇది సహించలేక పోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది.\n\nవెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి, గాయమైంది.హంసకి ఆ గాయం మానడానికి చాలాకాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 294,
        "IMAGE": "cat_2",
        "NAME": "చెడ్డ కాకి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ అడవిలో ఒక చిలుకల గుంపు నివసించేది. ఇది గమనించిన ఒక బోయవాడు, ఓ రోజు ఉదయాన్నే వచ్చి చాలా చిలుకల్ని పట్టుకున్నాడు. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాయి ఈ చిలుకలు. వీటిని పట్టణంలో మంచి ధరకు అమ్మవచ్చు. వీటికి కొన్ని చిన్న చిన్న మాటలు నేర్పితే ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చు' అని అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతడు పట్టిన చిలుకలలో కుశలబుద్ధి అనే ఒక చిలుక ఉంది. అది చాలా తెలివైనది.\n\nఎలాగైనా ఆ బోయవాడి నుండి తప్పించుకోవాలనుకుంది. బోయవాడు చిలుకలను తన ఇంటికి తీసుకెళ్లి, ఒక్కో చిలుకను ఒక్కో పంజరంలో బంధించి, వాటికి ఆహారం, నీళ్ళు పెట్టాడు. తప్పించుకోవడానికి అప్పటికే ఒక ఉపాయం ఆలోచించిన కుశలబుద్ధి నీటిని కానీ, ఆహారాన్ని కానీ ముట్టుకోక, ఏదో రోగం వచ్చినట్టు, పంజరంలో పడి ఉంది.\n\n'అయ్యో! దీనికి ఎదో జబ్బు చేసినట్టు ఉందే, ఇది కోలుకున్నాక అమ్ముదాం' అని మనసులో అనుకుంటూ, మిగతా చిలుకల్ని పట్టణానికి తీసుకెళ్ళి, అమ్మి బాగా డబ్బు సంపాదించాడు. అలా రోజులు గడుస్తున్నాయి గానీ చిలుక అసలు అహారం ముట్టుకోవడం లేదు. దీంతో అది బక్కచిక్కిపోయింది. ఆ బోయవాడు దానికి అసలు ఏమైందో చూద్దాం అనుకుంటూ ఆరుబయట కూర్చుని దాన్ని పంజరం నుండి బయటకి తీశాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న ఆ చిలుక తుర్రుమని ఎగిరిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 295,
        "IMAGE": "cat_2",
        "NAME": "వేటగాడు - చిలుక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రంగన్న ఒక గాడిదను, కుక్కను పెంచేవాడు. గాడిద చెరువుకు మాసిన దుస్తుల మూటలు మోసుకుని వెళ్ళేది. ఆ దుస్తులు ఉతికాక రంగన్న వెంట ఇంటింటికి తిరిగి ఎవరివి వారికి చేరవేసేది. ఈ విధంగా ఆ గాడిద దినమంతా పనిచేస్తూ విశ్రాంతి లేకుండా ఉండేది.\n\nఇంటికి కాపలాకాసే కుక్క మాత్రం రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేది. హాయిగా దినమంతా ఇంటి అరుగుమీద పడుకుని, నిద్రపోయేది. రంగన్న భార్య పెట్టే భోజనం శుష్టుగా ఆరగించేది. రంగన్న పండూ ఫలహారం ఏది తిన్నా కొంచెం కుక్కకు పెట్టేవాడు. సాయంత్రం రంగన్న ఇంటికి తిరిగి రాగానే వీధి మలుపు దగ్గరే ఆ సంగతి పసిగట్టి, కుక్క తోక ఊపుతూ ఎదురు పరుగెత్తుకు వచ్చేది. రంగన్న శరీరాన్ని నాకుతూ, రెండు కాళ్ళెత్తి అతని మీద ఎగబడేది. రంగన్న ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ప్రేమగా దాని తల మీద నిమిరేవాడు.\n\nప్రతిరోజూ ఇదంతా చూసిన గాడిదకు ఒక ఆలోచన కలిగింది. యజమానితో కుక్క ఆ విధంగా మెలగడం వల్లే యజమాని దానిని అంత ప్రేమగా చూస్తున్నాడు. తను కూడా కుక్కలా యజమాని మీద ప్రేమ ఒలకబోయాలి అని అనుకుంది.\n\nఆ రాత్రి రంగన్న భోజనం ముగించుకుని అరుగు మీదకు వచ్చాడు. వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ కుక్కలా రెండుకాళ్లూ పైకెత్తి రంగన్న పైకి దూకింది. గాడిద బరువు భరించలేని రంగన్న వెల్లకిలా పడిపోయాడు. గాడిద అతని ముఖాన్ని నాకడానికి ప్రయత్నించడంతో భయపడి రంగన్న గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకొచ్చి దుడ్డు కర్రలతో గాడిదను చావబాదారు. పారిపోతున్న గాడిదను వెంటబడి ఊరవతలకి గెంటేశారు. దానితో ఆ గాడిదకు తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 296,
        "IMAGE": "cat_2",
        "NAME": "గాడిద ప్రేమ!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ కొలనులో చాలా చేపలు ఉండేవి. వాటిలో రెండుచేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి. ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు. ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది.\n\n''ఆహా! ఈ చేప ఎంత పెద్దగా ఉంది. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది'' అని సంతోషపడ్డాడు చేపలవాడు. ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించాడు అతడు.\n\n''ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా?'' అని అడిగాడు చేపలవాడు ఆ చేపని.\n\n''నేను నా గురించి ఏడవట్లేదు. నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది'' జవాబిచ్చింది ఆ చేప.\n\n''బాధపడకు! నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు. ఇంకో చేప తప్పించుకుంది'' అని అన్నాడు చేపలవాడు.\nఇది విని ఆ చేప చాలా సంతోషించింది.\n\n''ఓ చేపలవాడా! నా మాట విను!'' అని నీటి నుంచి వినిపించింది. చేపలవాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని నీళ్ళల్లోకి చూశాడు. రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది.\n\n''నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా?'' అడిగింది రెండోచేప. ''అవును!'' బదులిచ్చాడు చేపలవాడు.\n\n''నీకు చేపలన్నీ సమానమే కదా! దయచేసి నన్ను పట్టుకుని, నా స్నేహితుడిని విడిచిపెట్టు! లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు. నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను'' అని ప్రాధేయపడింది రెండోచేప.\n\nచేపలవాడు ఆ చేపల స్నేహానికి ముగ్దుడయ్యాడు. ''మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు!'' అని అంటూ మొదటిచేపను నీటిలో వదిలేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 297,
        "IMAGE": "cat_2",
        "NAME": "జాలరి - రెండుచేపలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మొదలు, కొమ్మలు వంకరగా ఉండి చూడ్డానికే ఆ చెట్టు వింతగా ఉండేది. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు పొడవుగా, మంచి ఆకారంతో ఉండేవి. వాటిని చూసి ఆ వంకర చెట్టు 'ఆహా! ఆ చెట్లన్నీ ఎంత బాగున్నాయో!' అని అనుకుంటూ 'నేను ఎంత దురదృష్ట వంతురాలిని. నేనొక్కదానినే ఇలా వంకర టింకరగా, వికారంగా ఉన్నాను' అని బాధపడేది.\n\nఓ రోజు అడవికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. ఆ వంకర చెట్టును చూసి 'ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయడానికి వీలుకాదు. ఈ ఒక్క చెట్టును వదిలి, మిగిలిన ఆ పొడవైన, మంచి ఆకారంతో ఉన్న చెట్లని కొట్టేస్తాను' అని అనుకుంటూ ఆ వంకర చెట్టుని తప్ప మిగతా చెట్లను కొట్టేశాడు.అప్పుడా చెట్టు 'నేను నా ఆకారము చూసి బాధపడేదాన్ని. ఈ రోజు ఈ ఆకారమే నన్ను ఆ కట్టెలు కొట్టేవాడి నుండి కాపాడింది' అని అనుకుని, ఆ రోజు నుండి హయిగా జీవించసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 298,
        "IMAGE": "cat_2",
        "NAME": "వంకర చెట్టు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఒకతను తన కొడుకును, గాడిదను తీసుకుని బజారుకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్దమనిషి వీరిని చూసి, ''అదేంటయ్యా! అంత గాడిదను పెట్టుకుని నడుస్తూ పోతున్నారు?'' అని అడిగాడు.\n\nనిజమే కదా అనుకుని ''బాబూ! నువ్వు ఎక్కు'' అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి, తను నడుస్తూ వెళ్తున్నాడు.\n\nఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్లని ఆపి, ''ఏం కొడుకువయ్యా నువ్వు? పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కి పోతున్నావా?'' అన్నాడు.\n\nదాంతో కొడుకు దిగిపోయి, తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంతదూరం పోయాక ఇంకో మనిషి వీళ్లని ఆపి, ''అసలేం తండ్రివి నువ్వు? చిన్న వాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా?'' అన్నాడు.\nఅది విని, కొడుకు కూడా గాడిదపైకి ఎక్కి కూర్చున్నాడు.\n\nఅలా కాస్త దూరం వెళ్లారో లేదో - ఇంకొక అతను వీళ్లని చూసి, ''ఛ! ఛ! మీకసలు దయ, జాలి ఉన్నాయా? మీరే గాడిదల్లా పెరిగి, పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా?'' అన్నాడు.\n\nఇదెక్కడి గొడవరా బాబూ అనుకుని, తండ్రీ కొడుకులిద్దరూ దిగి, గాడిదను భుజాల మీదకెత్తుకుని నడవసాగారు. అది చూసి దారిన పోయేవాళ్లందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టారు. దాంతో గాడిద కంగారుపడి, పారిపోయింది.\nచూశారా! ఏమైనా అందర్నీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 299,
        "IMAGE": "cat_2",
        "NAME": "గాడిద కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పరీక్షిత్‌, గోపీనాథ్‌ ఇద్దరు స్నేహితులు. ఒకరిని వదిలి ఒకరు ఒక్కక్షణం కూడా విడిచి ఉండేవాళ్ళు కాదు. స్నేహితులంటే వాళ్ళిద్దరిలా ఉండాలని ఆ ఊరి వాళ్ళంతా ఎంతో పొగిడేవారు.\n\nఒకరోజు పరీక్షిత్‌, గోపీనాథ్‌లు కలిసి మరో స్నేహితుడి పెళ్ళికి పొరుగూరుకి వెళుతున్నారు. ఆ ఊరికి చేరుకోవాలంటే అడవి దాటాలి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దట్టమైన అడవిమార్గంలో ప్రయాణిస్తు న్నారు. ఇంతలో ఒక ఎలుగుబంటి అరుపు వినిపిం చింది. అది ఆ దగ్గరలోనే ఉన్నట్టు ఆకుల గలగలలా డాయి. భయంగా స్నేహితులిద్దరు ముఖాలు చూసు కున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే పక్కనున్న పొదల్ని తప్పించుకుంటూ ఎలుగుబంటి రావడం కనిపించింది. గోపీనాథ్‌ గబుక్కున చెట్టెక్కి పోయాడు. చెట్టెక్కడం రాని పరీక్షిత్‌ భయంగా నిలబడిపోయాడు.\n\n'ఎలుగుబంటి చాలా దగ్గరగా వచ్చేస్తోంది. పారిపోయే సమయం లేదు. ఎలా ఈ ఆపదలోంచి బయటపడటం?' ఒక పక్క భయపడుతూ, మరోపక్క ఆలోచించాడు. అడవి జంతువులకు సంబంధించి తను విన్న విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. 'క్రూర మృగాలు చనిపోయిన శరీరాలను గాయపర్చవు' తన తాతయ్య చెప్పిన సంగతి స్ఫురించింది. వెంటనే పరీక్షిత్‌ నేల మీద పడుకుండి పోయాడు.\n\nఎలుగుబంటి పరీక్షిత్‌కి దగ్గరగా వచ్చింది. అతని ముఖం దగ్గర ముఖం పెట్టి చూసింది. పరీక్షిత్‌ ఊపిరి బిగపట్టాడు. ఎలుగుబంటి అతన్ని నేలపైన అటు ఇటు దొర్లించింది. చూట్టూ తిరిగింది. మళ్లీ ఒకసారి అతని ముఖం దగ్గర వాసన చూసింది. అతను చనిపోయాడని నమ్మింది ఎలుగు బంటి.\n\nకాస్సేపు అక్కడే తచ్చాడి ముందుకు వెళ్ళిపోయింది. పొదల చాటుకు కనుమరుగైంది ఎలుగుబంటి. ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక నెమ్మదిగా కిందకు దిగాడు గోపీనాథ్‌. పరీక్షిత్‌ని తట్టి లేపాడు.\n\n'హమ్మయ్య! గండం గడిచింది' అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు పరీక్షిత్‌.\n\n''నీ చెవిలో ఎలుగుబంటి ఏం చెప్పింది?'' ఆసక్తిగా అడిగాడు గోపీనాథ్‌.\n\nఅతని ప్రవర్తనవల్ల బాధపడుతున్న పరీక్షిత్‌ ''స్వార్థపరులైన వారితో స్నేహం చేయకూడదని ఎలుగుబంటి నాకు ఉపదేశం చేసింది'' అని చెప్పి ముందుకు కదిలాడు.\n\nకష్టాలలో తోడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 300,
        "IMAGE": "cat_2",
        "NAME": "నిజమైన స్నేహితుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లోనే మిగతా జంతువులతో పాటు కలిసి జీవించేవి. ఒకరోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది. ''దయచేసి నన్ను కాపాడండి! అడవిలోని ఒక సింహం నన్ను చంపాలనుకుంటోంది'' అంటూ ప్రాధేయపడింది.\n\n''భయపడకు మిత్రమా! నేను నిన్ను రక్షిస్తాను. సింహం నిన్ను ఏమీ చేయలేదు'' అన్నాడు మానవుడు.\n\nదానితో గుర్రం ఎంతో సంతోషించింది. కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తిరిగి మానవుడు ఇలా చెప్పాడు ''మరి నువ్వు నేను ఏం చెప్పినా వినాలి!'' అని.\n\n''నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు'' అంది గుర్రం.\n\n''సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి.'' అన్నాడు.\n\nప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకొంది. మానవుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు. అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి ''ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు. నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమీ ఉండదు. నేను నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పు డల్లా నీ వీపు మీద స్వారీ చేస్తుంటాను. నేను నీతో ఉంటే ఆ సింహం నిన్ను ఏం చేయలేదు'' అని అన్నాడు. ఆ తర్వాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు.\n\nగుర్రం ఒంటరిగా మిగిలిపోయింది. ''నేనిక్కడ జాగ్రత్తగా ఉండగలను. కానీ నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. నా రక్షణను కొనుక్కున్నాను కానీ స్వేచ్ఛను కోల్పోయాను. ఇది చాలా చెడ్డ బేరం'' అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం.\n\nఇక ఆ రోజు నుండి మానవుని అదుపాజ్ఞలో బతకసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 301,
        "IMAGE": "cat_2",
        "NAME": "చెడ్డ బేరం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు బ్రాహ్మ ణుడు మేకను తీసుకుని ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణించసాగాడు. అది చూసి ముగ్గురు దొంగలు ఆ బాటసారి దగ్గర నుండి మేకను దొంగలించాలనుకున్నారు.\n\n''ఏరు చూడరా..! ఒంటరిగా ఉన్నాడు. ఈ అడవిలో అరిచినా కాపాడే దిక్కులేదు. అతని మేకను లాక్కుని పారిపోదామా?'' అన్నాడు ఒకడు.\n\n''ఆ పని మనం చేయడం ఎందుకురా? నాలుగు తగిలిస్తే వాడే మేకను వదిలి పారిపోతాడు.'' అన్నాడు రెండోవాడు.\n\n''బెదిరించో.... లేదా రహస్యంగానో దొంగతనాలు చేసి చేసి విసుగ్గా ఉందిరా... మన బుర్రలు ఉపయోగించి, అతన్ని బురిడీ కొట్టిద్దాం!'' అంటూ తన ఆలోచన చెప్పాడు మూడోవాడు. దానికి మిగతావాళ్ళు కూడా ఒప్పుకున్నారు.\n\nఇద్దరు చెట్టు చాటున దాక్కోగా, ఒకడు మాత్రమే బ్రాహ్మణుడి ముందుకు వెళ్ళాడు.\n\n''అయ్యా, నమస్కారం! మీ కుక్క భలే అందంగా ఉంది ఇది ఏ జాతిది?'' అంటూ అడిగాడు.\n\n''పరాచికాలు అడడానికి నీకు నేనే దొరికానా? మేకను పట్టుకుని కుక్కంటావా? వెళ్ళవయ్యా వెళ్ళు!'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.\n\n''ఏమిటి? ఇది మేకా? అహ్హా..హ్హా..!'' గట్టిగా నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడా దొంగ.\nకొంతదూరం వెళ్ళాక మరొక దొంగ బ్రాహ్మణుడిని కలిశాడు.\n\n''ఇది విచిత్రంగా ఉందే. గుర్రం ఉండగా ఎందుకు మీరు నడుస్తూ వెళుతున్నారు. దీనిపై స్వారీ చేయొచ్చుకదా?'' అన్నాడు రెండో దొంగ.\n\n''ఏమిటి? నా మేక నీకు గుర్రంలా కనిపిస్తోందా?'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.\n\n''అయ్యా! మీరు గొప్ప పండితుడిలా ఉన్నారు. గుర్రానికి, మేకకు తేడా తెలీదంటే నేను నమ్మను'' అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు.\nఆ మాటలతో కొంత అయోమయంలో పడిపోయాడు బ్రాహ్మణుడు.\nమరి కొంతదూరం వెళ్ళాక ఈసారి మూడో దొంగ ఎదురుపడ్డాడు.\n\n''పండితులకు నమస్కారం. గాడిదను మీరు తాకటం ఏమిటి? పైగా దాన్ని మీవెంట తోలుకెళుతున్నారు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా?'' అన్నాడా దొంగ వినయంగా.\n\n''ఇది గాడిదా?'' భయంగా మేకవైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు బ్రాహ్మణుడు. ''అవును! ఇందులో సందేహం ఏముంది?'' అమాయకంగా చెప్పాడు మూడో దొంగ.\n\nఆ మాటలతో విపరీతంగా భయపడ్డాడు బ్రాహ్మణుడు. 'బహుశా ఇది దెయ్యమేమో? ఒక్కొక్కరికి ఒకోలా కనబడుతోంది. బాబోరు దీన్ని నా వెంట తీసుకుపోయి, నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటానా?' అని ఆలోచించిన ఆ బ్రాహ్మణుడు మేకను అక్కడే వదిలి పారిపోయాడు.\n\nఆ బ్రాహ్మణుడి తెలివి తక్కువతనానికి పెద్దపెట్టున నవ్వుకుంటూ... మేకను తీసుకుని వెళ్ళిపోయారు ముగ్గురు దొంగలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 302,
        "IMAGE": "cat_2",
        "NAME": "ముగ్గురు దొంగలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక బట్టలు ఉతికేవాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ యజమాని ఇంటికి కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపుమీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంతకాలం గడిచాక 'ఇంతవరకూ ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులూ ఈ కుక్క తిండి కోసం అనవసరంగా చాలా ఖర్చు చేశాను'' అని యజమాని తన భార్యతో అన్నాడు.\n\nఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మెలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం యజమాని విస్మరించాడు' అనుకుని ఎంతో బాధపడింది.\n\nఆ రోజు నుండి యజమాని భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే యజమాని ఇంటికి వచ్చేది. లేదంటే ఉళ్లో ఎక్కడో ఒకచోట ముడుచుకుని పడుకునేది. కొన్నిరోజులు గడిచాక... ఒక అర్ధరాత్రి దొంగ ఒకడు యజమాని ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కానీ మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసికట్టింది.\n\n''ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?'' గుసగుసగా అంది గాడిద. ''అవును తెలుసు'' అంది కుక్క.\n''మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?''\n''నా ఇష్టం'' నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.\n''నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత'' అని చెప్పింది గాడిద.\n\n''నోర్మూసుకుని పడుకో! అనవ సరమైన సలహాలివ్వకు'' అని కుక్క కోపంగా చెప్పింది. ''సరే నువ్వు మొర గకు. నేను గట్టిగా అరిచి యజమాని ని నిద్రలేపుతాను. కుక్కకంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను'' అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.\n\nలోపల గాఢనిద్రలో ఉన్న యజ మాని ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినం దుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డుకర్ర తీసుకువచ్చి ''ఏం పోయేకాలమే నీకు. అర్ధరాత్రి రచ్చ చేస్తున్నావు''అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.\n\nరహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తు వులను చక్కగా మూటకట్టుకుని, పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన యజమాని ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడుకున్న కుక్కని చూశాకగానీ అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న యజమాని ఆ రోజు నుండి కుక్కకు ఆహారం పెట్టి, మంచిగా చూసుకోసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 303,
        "IMAGE": "cat_2",
        "NAME": "కుక్క-గాడిద ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక వేటగాడు వేట కోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలాదూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు దాని కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ప్రయాణించలేరు.\n\nవంతెనకు ఒక పక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు ఒక పెద్దరాయి వెనుక నక్కి అటుగా వచ్చే ఏదైనా ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.\n\nకాస్సేపు గడిచాక నేరెడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతనికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని అతను భావించాడు. వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదురుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కిందకూర్చుని, చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.\n\nదీంతో వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని అతను గ్రహించాడు.\n\nఅందుకే మనిషి జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 304,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెలివైన ఎలుగుబంట్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసే పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించింది. ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి, ఎన్నోరోజులు శ్రమించి ఆ ధనవంతురాలి చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు. చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారుడు ఆమెను తన స్టుడియోకి ఆహ్వానించాడు.\n\nఆమె టామీ అనే తన పెంపుడుకుక్కను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు తన కుక్కంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది.\n\n''టామీ డార్లింగ్‌! ఇదుగో నీ యజమాని'' అంటూ ఆమె తన చిత్రపటాన్ని ఆమె టామీకి చూపించింది. టామీ ఆ బొమ్మను చూడటానికి ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.\n\nఅప్పుడా ధనవంతురాలు చిత్రకారుడివైపు తిరిగి ''ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది. అందుకే టామీ నా బొమ్మను గుర్తుపట్టలేక పోయింది'' అంది.\n\nఆ చిత్రకారుడు కాస్త తెలివైనవాడు. ధనవంతులు ఎన్నిరకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు. అతను ఆమెతో వాదించలేదు. ''మేడమ్‌! మీరు రేపు రాగలరా? మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను'' అన్నాడు.\n\nమరునాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది. ఈ సారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగుదీసింది. చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలెట్టింది.\n\n''ఓV్‌ా అద్భుతంగా గీశారు. మా టామీకే కాదు నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది'' సంతోషంగా అందామె.\n\nఆమె చిత్రకారుడు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కుని తనతో తీసుకుని వెళ్ళిపోయింది.\n\nఆమె వెళ్ళిపోÄయాక ఆ చిత్రకారుడు పడీ పడీ నవ్వాడు. అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు. ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది అంతే! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 305,
        "IMAGE": "cat_2",
        "NAME": "చిత్రపటం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "శ్రీధర్‌కు పక్షులు వేటాడటం సరదా. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా చిలుకలు కనిపించాయి. అతనికి ఎప్పటినుండో ఒక చిలుకను పెంచుకోవాలనే కోరిక ఉంది. కొన్ని ధాన్యం గింజలు చెట్టుకింద నేలమీద చల్లి, వాటి మీద పలచని వల వేశాడు. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ అక్కడ వల ఉందన్న విషయం తెలియదు. వల పన్నడం అయ్యాక, ఆ చెట్టు వెనకే నిశ్శబ్ధంగా మాటువేశాడు.\n\nకాస్సేపు గడిచాక రెండు చిలుకలు నేల మీదున్న గింజలను పసికట్టాయి. ''ఆరు... ఎన్ని గింజలో! భలే.. భలే!'' అంటూ కిందకు రివ్వున దిగిందో చిలుక.\n\n''ఆగు నేస్తం! ఈ అడవిలో ఒక చెట్టు కింద ధాన్యం రావడం ఆశ్చర్యంగా లేదూ..'' అని హెచ్చరించింది రెండో చిలుక. తిండి చూసిన తొందరలో దానికి ఆ మాటలు చెవికి ఎక్కలేదు. నేల మీద వాలడం..వలలో చిక్కుబడి పోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.\n\n''నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు వినలేదు. దేనికైనా అంత తొందర పనికిరాదు'' ఆ వలకి కొంచెం దూరంగా నేలమీద వాలుతూ అంది రెండోచిలుక. ''నిజమే! చాలా తొందరపడ్డాను ఇప్పుడు విచారించి ఏం లాభం! జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా!'' కన్నీళ్ళు పెట్టుకుంది మొదటి చిలుక.\n\nఇంతలో చెట్టు చాటు నుంచి ఇవతలకు వచ్చాడు శ్రీధర్‌. అతన్ని చూడగానే రెండో చిలుక చెట్టుపైకి ఎగిరిపోయింది. అతను వలలో చిక్కుకున్న చిలుకను బయటికి తీయడం, ఒక పంజరంలో బంధించడం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది అది.\n\nశ్రీధర్‌ చిలుకును తన ఇంటికి తీసికెళ్లి ఒక పంజరంలో పెట్టాడు. అతని పిల్లలు దాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో బందీ అయింది చిలుక. ఎన్నో రకరకాల పండ్లు తినడానికి ఇచ్చేవారు. కానీ స్వేచ్ఛలేని ఆ జీవితం ఆత్మహత్యతో సమానంగా భావించింది చిలుక. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి క్షణం తన దుస్థితికి చింతిస్తూ రోజులు గడపసాగింది.\n\nశ్రీధర్‌ ఆ చిలుకకు చిన్న చిన్న మాటలు పలకడానికి ప్రతిరోజూ తర్ఫీదు ఇవ్వసాగాడు. 'హలో..! నమస్కారం..! రండి..!' అనే చిన్న చిన్న పదాలు నేర్చుకుంది చిలుక. శ్రీధర్‌ దాన్ని ముందుగదిలో ఉంచి తన ఇంటికి వచ్చే బంధువులకు, స్నేహితులకు చిలుక పలుకులు వినిపించి, అందరిచేత ప్రశంసలు పొందసాగాడు. చిలుకను చూసి అందరు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ చిలుకకు మాత్రం ఎంతో విషాదంగా ఉండేది.\n\n'ఒరే మీ ఆనందం పాడుగాను. నన్ను వదలండిరా! నేను మీలా స్వేచ్ఛగా బతుకుతాను' అని మనసులో ఆక్రోశించేది. కానీ తన భావం వాళ్ళకి తెలియజేయడానికి దానికి అంత భాష రాదు.\n\nఒకరోజు శ్రీధర్‌ని అతని కొడుకు బాగా విసిగించడంతో వాడి వీపుమీద ఒకటి పీకి, ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ కోపంగా తిట్టాడు. అది విన్నది చిలుక. శ్రీధర్‌ తిట్టడంతో ఏడుస్తూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం చూసింది. వెంటనే దాని మనుస్సులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. 'చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌!' అన్న ఆ పదాలని పదే పదే మననం చేసుకుంది. రాత్రంతా అది తను నేర్చుకున్న మిగతా మాటలు మర్చిపోయి ఆ ఒక్క పదమే కంఠతా వచ్చేవరకూ మననం చేసుకుంటూనే ఉంది.\n\nమరునాడు శ్రీధర్‌ వాళ్ళ ఆఫీసర్‌ ఇంటికి వచ్చాడు. ''ఏదయ్యా నీ దగ్గర ఒక మాట్లాడే చిలుక ఉందని విన్నాను.. చూపించు!'' అని ఆసక్తిగా అడిగాడు. శ్రీధర్‌ ఆయనకి ఎంతో గర్వంగా తన చిలుకను చూపించి... ''సార్‌కి హలో చెప్పు!'' అన్నాడు.\n\nవెంటనే చిలుక ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ ముద్దు ముద్దుగా పలికింది. ఆ మాటలు విని ఆఫీసర్‌ ముఖం అవమానంతో ఎర్రబడింది. శ్రీధర్‌ కంగారుపడి, వారిస్తున్నా చిలుక వినలేదు. ''రాస్కెల్‌ గెటవుట్‌! గెటవుట్‌!'' అని అంటూనే ఉంది. ఆఫీసర్‌ కోపంగా వెళ్లిపోయాడు.\n\nఆ రోజు నుండి అదే తంతు. ఎవరు ఇంటికొచ్చినా ఆ చిలుక 'గెటవుట్‌ రాస్కెల్‌! చంపేస్తాను రాస్కెల్‌!' అని గట్టిగా అరిచేది. దానితో ఎవరినైనా తనింటికి పిలవాలంటే భయపడే స్థితికి వచ్చాడు శ్రీధర్‌.\n\n''ఏంటయ్యా చిలుకకు మంచి మాటలు నేర్పించాలి కానీ, తిట్లు నేర్పిస్తారా?'' అని చాలామంది శ్రీధర్‌ని ముఖం మీదే చివాట్లు వేయసాగారు. చిలుక చేత ఆ మాటలు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాడు శ్రీధర్‌. అది నేర్చుకోగపోగా, మరింతగా రెచ్చిపోయి, అవే మాటలు పదే పదే అనసాగింది.\n\nదీంతో అతను ఇక ఆ చిలుకను ఇంట్లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే ఊరి బయటకు పంజరం తీసుకెళ్ళి, చిలుకను వదిలేశాడు. తన ఎత్తు పారినందుకు సంతోషిస్తూ.. ఆ చిలుక అరణ్యం వైపు హాయిగా ఎగిరిపోయింది. అందుకే అపాయం వచ్చినప్పుడు ఉపాయం చేయాలి. అప్పుడే ప్రమాదం నుండి బయటపడతాం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 306,
        "IMAGE": "cat_2",
        "NAME": "చిలుక పలుకులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "హిమాలయ పర్వతాల అడుగుభాగంలో ఒక దట్టమైన అరణ్యం ఉండేది. అందులో ఎన్నో పక్షులు, జంతువులు ఉండేవి. ఒక ముని తన తపస్సు కోసం ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు.\n\nఅది వేసవికాలం. ఆ ఎండలకు అరణ్యంలో ఉన్న నదులు, సరస్సులు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్క పక్షులన్నీ వలస వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళని జంతువులు అల్లాడిపోయాయి. వాటి పరిస్థితి చూస్తున్న ముని హృద యం జాలి పడింది. ఆ రోజు నుండి అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి కుండలతో నీళ్ళు నింపుకొని, అడవికి తీసుకురాసాగాడు. జంతువులు మూగేచోట వాటిని ఉంచసాగాడు. ప్రతిరోజూ ముని ఉదయం నుండి చీకటి పడేవరకూ ఆ పనే చేసేవాడు. ఆ పనిలో పడి తన భోజనం విషయం కూడా మర్చిపోయాడు.\n\nఇది గ్రహించిన జంతువులు తమ కోసం అంత కష్టపడుతున్నా మునికి కృతజ్ఞత చూపాలనుకున్నాయి. అన్నీ కలిసి నీళ్ళు తాగడానికి వస్తూ, తలా ఒక పండు తీసుకు రాసాగాయి. ముని వాటిలో కొన్ని తిని, మిగతావన్నీ పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. వాళ్ళు ప్రతిగా నీళ్ళు అడవికి తీసుకురావటంలో సహాయం చేశారు. ఇలా ఆ వేసవి కాలమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జీవించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 307,
        "IMAGE": "cat_2",
        "NAME": "కృతజ్ఞత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అవంతీపురం అనే నగరంలో రామా చారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తల్లా ఒక పెంకుటిల్లు, ఒక ఎద్దు. దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే, రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. 'నంద కుమారా!' అని దాన్ని ఆప్యాయంగా పిలిచుకునేవాడు రామాచారి.\n\nరామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు 'తను పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఈ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి' అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది.\n\nఒకరోజు అది రామాచారితో ''అయ్యా! మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో! నాలా బరువులు లాగే వారు ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్రభూపతిని కలుసుకుని, నా నందకుమారుడు యాభై నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి!'' అని చెప్పింది.\n\nరామాచారి నరేంద్రభూపతి దగ్గరకు వెళ్ళి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు తన ఎద్దు యాభై బండ్లు లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని, ఆశ్చర్యపోయిన నరేంద్రభూపతి వెయ్యి రూపాయల పందానికి సిద్ధపడ్డాడు.\n\nఆ పందెం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపిన యాభై బండ్లు నందకుమారిడికి కట్టారు. వాటిని ఆ ఎద్దు లాగడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రామాచారి దాన్ని ఎంతగానో అదిలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దానితో రామాచారి పందెం ఓడిపోయి వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడు.\n\nఅతను ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడా ఎద్దు అతనితో ''అయ్యా! నన్ను మన్నించు. నేను లాగలేక కాదు. ఆ మాత్రం శక్తి నాలో ఉంది. ఎందుకనో నా కాళ్ళు ముందుకు పడలేదు. ఈసారి నూరు బండ్లు లాగగలనని పందెం కాయండి!'' అని అంది.\nకానీ రామాచారి దాని మాటలు విశ్వసించలేదు.\n\n''కొడుకులా మీ ఇంట పెరిగాను. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈసారి కానీ మీరు పందెం ఓడిపోయేలా చేస్తే నా ముఖం మీకు చూపించను'' అంటూ నంద కుమారుడు ఎంతో బతిమిలాడిన తర్వాత రామాచారి తిరిగి నరేంద్రభూపతిని కలుసు కున్నాడు. వృషభం చెప్పినట్లే పది వేలకు పందెం కాశాడు. అంతేకాదు ఊళ్ళో ఎవరైనా సరే పందెంలో పాల్గొనవచ్చని చెప్పాడు. రామాచారి తన పెంకుటిల్లు అమ్మేసి డబ్బు సిద్ధంచేశాడు.\n\nఅంతా రామాచారికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయినా ఆ పందెం చూడడానికి తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. ధాన్యపు బస్తాలతో నిండిన నూరు బండ్లు ఒకదాని తర్వాత ఒకటి కట్టబడ్డాయి. రామాచారి మొదటి బండి ఎక్కి కూర్చుని పగ్గాలు పట్టుకుని ''నాయనా ముందుకు కదులు'' అని ప్రేమగా ఎద్దును తట్టాడు.\n\nఅంతే.. అందరు చూస్తుండగా ఆ ఎద్దు ముందుకు అడుగువేసింది. దానితో పాటే నూరు బండ్లూ కదిలాయి. అలా పదడుగులు ముందుకు నడిచింది వృషభం.\n\nరామాచారి పందెం గెలిచాడు. నరేంద్రభూపతి పదివేల రూపాయలు అతనికి ఇచ్చాడు. అంతేకాదు ఆ ఎద్దు బలానికి ఆశ్చర్యపోయిన జనాలు కూడా తలా కొంత వేసుకుని డబ్బు పోగేసి, ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తున్న రామాచారితో నందకుమారుడు ''అయ్యా! నేను మొదటిసారే పందెం గెలిస్తే మీకు చాలా తక్కువ మొత్తం డబ్బు ముట్టేది. నేను మొదటిసారి లాగకపోవడానికి కారణం ఇదే'' అని చెప్పింది. ఆ మాటలు విన్న రామాచారి దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 308,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఓడి గెలిచిన ఎద్దు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు రంగయ్య అనే ఓ పిసినారి ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపా దించాడు. అయినా ఒక నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన పెరట్లో ఓ గొయ్యిని తవ్వి, తను కూడబెట్టిన బంగారమంతటినీ అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం - బంగారాన్ని చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ గొయ్యిని కప్పేయడం... కొన్నేళ్ళపాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది.\n\nఅయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఓ దొంగ ఇదంతా చూడనే చూశాడు. ఇంకేముంది. ఆ రాత్రే గొయ్యిని తవ్వి, మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడు ఎప్పటిలాగే గొయ్యిని తవ్వి చూసుకున్న రంగయ్య తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ''ఏదీ! నా బంగారం ఏదీ? అంటూ లబోదిబోమని ఏడ్వడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఓ పెద్దమనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు.\n\n''అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు?'' అని అడిగాడు పెద్దమనిషి. ''ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందామనుకున్నాను'' అన్నాడు రంగయ్య. ''అలాగా!... అయితే ఈ గులకరాయిని ఆ గోతిలో వేసి నీ బంగారం ఎక్కడికీ పోలేదనుకో. ఎప్పటిలాగే రోజూ వచ్చి, ఈ గులకరాయిని చూసి వెళ్ళిపో!'' అంటూ ఓ గులకరాయిని అందించి, తన దారిన తాను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. రంగయ్య అయోమయంగా చూశాడు. సరిగ్గా ఉపయోగించని వస్తువు ఎంత ఖరీదైనదయినా వ్యర్థమే కదా! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 309,
        "IMAGE": "cat_2",
        "NAME": "పనికిరాని బంగారం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "సీత శివాలయానికి చెందిన ఏనుగు. మావటివాడు రోజూ దాన్ని ఆ దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకుని వెళ్ళేవాడు. చెరువుకు వెళ్ళేదారిలో గోపయ్య ఇల్లు ఉంది. అతను తన ఇంటి అరుగుమీద కూర్చుని బట్టలు కుట్టేవాడు.\n\nసీత రోజూ గోపయ్య ఇంటి ముందు కొంచెంసేపు ఆగేది. గోపయ్య అరటి పండ్లు, కొబ్బరిచిప్పలు, తన దగ్గర ఏమి ఉంటే అవి ఏనుగుకు ఇచ్చేవాడు. సీత అవి తీసుకుని అతన్ని తన తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది.\n\nఒకరోజు గోపయ్యకు, అతని భార్యకు మధ్య చిన్న తగువు జరిగింది. ఆ కోపంలోనే వచ్చి కుట్టుమిషను ముందు కూర్చున్నాడు. ఎప్పటిలా చెరువుకు వెళుతూ సీత అతని ముందు ఆగింది. కానీ కోపంగా ఉన్న గోపయ్య దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. చాలాసేపు నిలబడి, నిలబడి తను వచ్చానని తెలపడానికి సీత గట్టిగా ఘీంకరించింది.\n\nగోపయ్య ఆ శబ్ధానికి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా చిరాకు కలిగింది. తన చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండంలో గుచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 310,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఏనుగుకు కోపం వచ్చింది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అరణ్యంలో జింక ఒకటి ఉండేది. దానికి తొందర పాటుతనం ఎక్కువ. అది పసికట్టి వాళ్ళమ్మ ''నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒకరోజు ఏ వేటగాడి చేతిలోనో ఇరుక్కుంటావు!'' అని ఎప్పుడూ హెచ్చరించేది. కానీ తల్లి మాటలు ఈ జింకపిల్ల ఏ రోజూ పట్టించుకునేది కాదు. చాలా నిర్లక్ష్యంగా తల్లి మాటల్ని కొట్టిపారేసేది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించేది కాదు.\n\nఒకరోజు కొందరు వేటగాళ్లు ఒక జింకను తరమడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి ఆ జింక చెట్ల పొదల వెనుక దాక్కుంది. ఆ వేటగాళ్ళు దానికోసం వెతికారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వారు అలాగే ఆలోచిస్తూ నిలబడ్డారు. వారు వెళ్ళిపోయారనుకున్న జింక అక్కడ చెట్లకున్న లేత ఆకులను కొరికి తినడం ప్రారంభించింది.\n\nదానితో ఆ చెట్టుకొమ్మలు కదిలాయి. ఆలోచిస్తూ నిలబడ్డ వేటగాళ్ళలో ఒకరి దృష్టి కదిలే కొమ్మలపై పడింది.\n\nవెంటనే అతడికి విషయం అర్థమైంది. ఇంకేం! తన విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం వేశాడు. పాపం! జింక ప్రాణాలు కోల్పోయింది. దాని తొందరపాటే దాని ప్రాణాలు మీదకు తెచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 311,
        "IMAGE": "cat_2",
        "NAME": "తొందరపాటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక జింకను వేట కుక్కలు తరుమడం ప్రారంభించాయి. దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది. అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయిచిన స్థలానికి వచ్చింది. అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది. గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది కానీ కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది.\n\nనెమ్మదిగా చీకటి పడింది. జింక అమ్మయ్య అనుకుంది. ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడీచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది. అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం, అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది.\n\nతమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని, అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది. ఆ మాటలను పూర్తి చేస్తుండగానే, యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు. అక్కడ కుప్పలా ఉన్న గడ్డిని చూసి, తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు. దానితో పాలేర్లు అవేమిటో చూసేందుకు వెళ్ళి జింకను పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడం దానికి అసాధ్యమై పోయింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 312,
        "IMAGE": "cat_2",
        "NAME": "నిర్ణయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దూడ ఉండేవి. రైతు రోజూ పెందలాడే ఎదు,్ద దూడ లను పొలానికి తోలుకెళ్ళేవాడు. దూడను మేత మేయడానికి పొలంగట్టు వెంట వదిలేసేవాడు. ఎద్దుని నాగలికి కట్టేవాడు. ఎద్దు విశ్రాంతి అనేది లేకుండా చీకటిపడే వరకూ పొలం దున్నేది. దూడేమో చెట్లనీడలో కునుకు తీసేది. చెంగు చెంగున గంతులు వేస్తూ స్వేచ్ఛగా తిరిగేది.\n\nఒకరోజు ఎద్దు దగ్గరకు వెళ్ళింది దూడ. ''నిన్ను చూస్తోంటే చాలా జాలి కలుగుతోంది ఎద్దు మామా! నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేవరకూ విరామమనేది లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎంతటి బానిస జీవితం గడుపుతున్నావు? నన్ను చూడు ఎంత స్వేచ్ఛగా, ఉల్లాసంగా జీవితం గడుపుతు న్నానో! నీ స్థితిపట్ల నాకు చాలా బాధ కలుగు తోంది'' అంది.\n\nఎద్దు ఆ మాటలు వినిపించుకోనట్టు తన పని తాను చేసుకుపోయింది. పొగరెక్కిన దూడ వదిలేస్తేగా! ఎద్దుకు అడ్డంపడి, తన జీవితంలోని సుఖం గురించి చెప్పసాగింది.\n\nచీకటిపడే సమయానికి సుందరయ్య వచ్చి ఎద్దు కాడి విప్పి, గడ్డి మేయడానికి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత దూడ మెడలో వేప మండలు కట్టి, పలుపుతాడు బిగించాడు. సుందరయ్య గ్రామదేవతకు మొక్కుకున్న మొక్కు ప్రకారం ఆ సాయంత్రం దూడను బలి ఇవ్వటానికి దాన్ని లాక్కుపోసాగాడు.\n\nగింజుకుంటున్న దూడ దగ్గరకు వచ్చింది ఎద్దు. ''అల్లుడూ..! నా స్థితి చూసి గేలి చేశావు. నన్ను చూసి జాలిపడ్డావు. ఇప్పుడు చూడు నీకు ఎలాంటి గతి పట్టిందో? యజమాని ఈ పని కోసమే నిన్నింత స్వేచ్ఛగా తిరగనిచ్చి, బాగా బలిసేలా చేశాడు. ఇప్పుడు చెప్పు నీ స్థితి మంచిదా? నా స్థితి మంచిదా?'' అని అడిగింది ఎద్దు. జవాబు చెప్పలేని దూడ తల వంచుకుని యజమాని వెంట నడిచింది.\n\n''అందుకే ఏ ఒక్కరినీ ఎగతాళి చేయడం, మిడిసిపాటు పడడం తగదు'' అంటూ కథ ముగించాడు తాతయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 313,
        "IMAGE": "cat_2",
        "NAME": "బడాయికి పోయిన దూడ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు ఒక ఆసామి వీధి వీధీ తిరిగి టోపీలు అమ్ముకొని జీవించే వాడు. ఒక రోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మర్రిచెట్టు నీడలో తన టోపీల బుట్టను దించుకొన్నాడు. భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టు మీద గల రెండు కోతులు రంగు రంగుల టోపీలను చూసి, కిందకు దిగి రెండు టోపీలను పట్టుకొని పైకి పోయాయి. అయ్యో! నా టోపీలుఅంటూ అతడు ఎంత అరచినా అవి వినిపించుకోలేదు. ఇలా కాదని అతడొక టోపీని తలమీద పెట్టుకొని అటు ఇటు ఊగుతూ, టోపీని గాలిలోకి విసిరాడు. కోతులు కూడా అతడి లాగే అటు ఇటు వూగి టోపీలను గాల్లోకి విసిరాయి.బతుకు జీవుడా! అనుకొంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు.\n\nకొంత కాలానికి అతడు ముసలివాడై పోయాడు. అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఒక రోజున సరిగ్గా అతడికి తండ్రికి జరిగినట్టే జరిగింది. చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకొని, భోంచేస్తుంటే రెండు కోతులు వచ్చి రెండు టోపీలను ఎత్తుకు పోయాయి. కాని అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి, అతడిలాగే అటు ఇటు వూగి టోపీని గాలిలోకి విసిరాడు. కాని కోతులు వాటి దగ్గర టోపీలను విసరలేదు. నువ్విలా వూగి టోపీని గాలిలోకి విసురుతావని అయినా సరే టోపీలను విసరొద్దని మా అమ్మ చెప్పిందిగాఅన్నాయి.\n\nదాంతో ఇంకా చేసేదేమి లేక అతడు మిగిలిన టోపీలను తీసుకొని వెళ్ళి పోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 314,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెలివి మీరిన కోతులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.\n\nఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.\n\nభైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది.\n\nఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.\n\nదగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది \"ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది.\" అనుకుంది.\n\nఅనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన \"వింటి కోపు\" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.\n\nభైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 315,
        "IMAGE": "cat_2",
        "NAME": "దురాశ దుఃఖానికి చేటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "మిణుగురు పురుగు సమయస్ఫూర్తి\nఅనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.\n\nకాకి “యేమిటది” అని అడిగింది.“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.\n\nకాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది. ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 316,
        "IMAGE": "cat_2",
        "NAME": "బలం కన్నా బుద్ధి గొప్పా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!\n\nఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.\n\nఅయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... \"ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?\" అంటూ ప్రశ్నించాడు.అప్పుడు శిబి చక్రవర్తి \"ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను...\" అని చెప్పాడు.\n\nదానికి డేగ మాట్లాడుతూ... \"అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు\" అని అంది.దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.\n\n\nసరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 317,
        "IMAGE": "cat_2",
        "NAME": "శిబి చక్రవర్తి దానశీలత ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.\n\n***\nఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.\n\n***\nజరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....\n\n***\n\"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి\" అని అడిగింది.\n\n***\n\"ఎందుకు?\" దొంగ అడిగాడు.\n***\n\"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు\"\n***\n\"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?\" దొంగ అడిగాడు.\n***\n\"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను\" అంది.\n\n***\nదాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. \"అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.\n\n***\n\"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం\" అంది గుర్రం.\n\n***\nగుర్రం మాటలకు నవ్వాడు దొంగ, \" కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు...\" అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.\n\n***\nఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 318,
        "IMAGE": "cat_2",
        "NAME": "గుర్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.\n\nఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.\n\nమన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.\n\n“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.\n\nసాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సాధువు దెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.\n\nమొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.\n\nవెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.\n\nఅప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.\n\nఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 319,
        "IMAGE": "cat_2",
        "NAME": "నోరు జారిన మాటలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండే వాడు. అతని పేరు విద్యా నాధుడు. అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. విద్యా నాధుడు శిష్యులను ప్రేమతో చూస్తూ విద్య బుద్దులు నేర్పేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యలోనే కాక వేరే విషయాలలో కుడా పరీక్షలు పెడుతుండే వాడు. ఆయన వద్ద అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు.\n\nఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగిన ఇస్తాను అని తోటి విద్యార్దులతో గొప్పలు చెప్పాడు. ఆవిషయం గురువు గారికి తెలిసింది. అవి నేరేడు పండ్లు కాసే రోజులు కావు. కాని అనంతుని పరీక్షించ డానికి గురువు గారు అనంతుని నేరేడు పండ్లు తీసుక రమ్మని చెప్పాడు. అందరు ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడ సాగారు. అనంతునికి గూడా ఏమి చెయ్యాలో తోచలేదు. గురువు గారు ఏది అడిగిన ఇస్తానని తోటివారితోచెప్పాడు. ఇప్పుడు గురువు గారుఅడిగిన పండ్లు దొరికేరోజులు కావు. ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది. గురువుగారి దగ్గరకు వెళ్లి “గురువుగారు నేను పండ్ల కోసం వెళుతున్నాను. నేను వచ్చేదాకా మీరు ఇక్కడినుండి కదలవద్దు.” అనిచెప్పి వెళ్ళాడు.\n\nఅతడు కాసేపట్లోవచ్చి పండ్లుదొరకలేదని చెపుతాడని అప్పుడు గొప్పలు చెప్పవద్దని బుధ్ది చెప్పాలనుకున్నాడు గురువుగారు. అనంతుని కిచ్చిన మాట ప్రకారం గురువు గారు కదలకకూర్చున్నాడు. ఒకరోజు గడిచింది. రెండు రోజులు మూడు రోజులు గడిచాయి. అనంతుడు రాలేదు. కాని ఒక మనిషి వచ్చాడు. అతడు గురువు గారితో “అయ్యా మీకాడ సదువుకొనేపిల్లడంట. అడవిలో తిరుగుతొండు. నేరేడు పండ్లుకావాలంట. ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేదు. మిమ్ము మాత్రం పండ్లు తెచ్చే దాకా ఈడనే కుసోమన్నాడు.” అని చెప్పాడు.\n\nగురువు గారికి మిగతా శిష్యులకు గుండెల్లో రాయి పడ్డట్లయింది. అనంతుడు రానిదే గురువు గారు కదలటానికి లేదని తెలిసి శిష్యులందరు అనంతుని వెదకటానికి అడవికి వెళ్లారు. అనంతుడు కనిపించాడు కాని పండ్లు లేనిదే రానని చెప్పాడు. అప్పుడందరూ కలసి నచ్చచెప్పి గురువు దగ్గరకు తీసుక వచ్చారు. అనంతుడు వచ్చాడు కాబట్టి గురువు గారు కదలగలిగారు. అనంతుడుకూడా గురువు గారి ఆశ్విర్వాదంతో చదువు కొనసాగించాడు.\n\nనీతి: పిల్లలు గొప్పలు చెప్పకూడదు, పెద్దలు కుడా పిల్లలకు చెయ్యలేని పనులు చెప్పకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 320,
        "IMAGE": "cat_2",
        "NAME": "గురుశిష్యులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక నక్క ఉండేదట, ఒక రోజు అది రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది.\n\nమామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి,\"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?\" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.\n\nఅలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 321,
        "IMAGE": "cat_2",
        "NAME": "అందని ద్రాక్ష పుల్లన",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "భీమిరెడ్డి సన్నకారు రైతైనా ఉన్న ఆ అయిదెకారాల పొలం మెట్టకావడం వల్ల, ప్రతిసంవత్సరం వర్షాల మీద ఆధారపడి నిత్యం కనిపించని దేవునికి మొక్కుకోవడమే. తిండికీ, బట్టకీ కరువు లేకుండా పరువుకూ ప్రతిష్ఠకూ అరువులేకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా ఎన్నాళ్లు కష్టంగా బతుకు వెళ్లదీసుకురావాలని ఆలోచించిన కొద్దీ అప్పోసొప్పోజేసి మెట్టపొలాన్ని మడికట్టుగా మార్చాలన్న తపన ఎక్కువయ్యింది. అప్పుజేయడానికి పరువు అడ్డొచ్చింది. అలా మెట్టని మడికట్టుగా మార్చాలన్న అతని పంతం ముందు భార్య మహాలక్ష్మి మెడలోని నాలుగు తులాల కెంపులనెక్లెస్సు, మూడుతులాల రెండుమాసాలన్నర ఉండే పుస్తెలతాడు, చివరాకరికి తాను ఎంతో ఇష్టపడి చేయించుకున్న రెండుతులాలన్నర నల్లపూసలదండకూడా హరించుకుపోయాయి.\n\nకూతురు వైష్ణవి పెళ్లీడుకొచ్చింది. అప్పోసొప్పో జేసి పిల్లపెళ్లి జేయాల్సింది పోయి. మడికట్టు కట్టాలని పంతం బట్టి కూర్చున్న భీమిరెడ్డి ప్రవర్తన గ్రామస్తులకు, బంధుమిత్రులకే కాదు చివరాకరికి కట్టుకున్న పెళ్లాం మహాలక్ష్మికి కూడా విచిత్రంగా అనిపించింది. బోరువేసి అందులో నీళ్లు వచ్చినంత మాత్రాన భీమిరెడ్డి పంటపండేయదు. దానికి కరెంటులైను, మోటారు, పైపులు వగైరావగైరా ఖర్చులుంటాయి. మెట్టపొలాన్ని మడికట్టుగా మార్చాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్నపని. అందరూ భీమిరెడ్డికి మతిచెడిందని అంటుంటే వెనకేసుకొచ్చిన మహాలక్ష్మి చివరకు “నిజంగానే ఈయనకు మతి చెడలేదు కదా!” అనుకుంది. అదీ తనకు ఎంతో ఇష్టమైన నల్లపూసల దండను బలిపెట్టినప్పుడు కూడా బోరులో నీళ్లుపడకపోవడంతో బోరుమన్న మహాలక్ష్మితో ఆ రోజు రాత్రి ఇంకో బోరువేసి చూద్దామని పంతంగా భీమిరెడ్డి అన్నప్పుడు అలా అనుకోక తప్పింది కాదు. అదే మాట దైర్యం చేసి భీమిరెడ్డితో కూడా అన్నది. ‘పంతొమ్మిదేళ్ళ దాంపత్యంలో ఏనాడు అనుమానించని మహాలక్ష్మీ తననలా అనుమానించడంలో తప్పులేదు. కానీ ఆమే అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. తమకున్న కష్టాల్లోంచి గట్టెక్కే మార్గం ఏది’. ఆ రాత్రల్లా జాగారం చేసి, చేయించి చివరాకరకు తెల్లతెల్లవారుతుండగా ఒప్పించగలిగాడు.\n\n“అయితే మనకు అప్పుచేయక తప్పదన మాట” అన్నది భీమిరెడ్డికి ఛాయ్ ఇస్తూ. పరధ్యానంగా ఎటో చూస్తూ ఛాయ్ అందుకుంటూ “తప్పదు లక్ష్మీ” అన్నాడు భీమిరెడ్డి ముక్తసరిగా.\n\nఅదే రోజు అన్న పరంధాములురెడ్డి దగ్గరకెళ్లి పదియేనువేల రూపాయలు తీసుకువచ్చింది. అన్న పరంధాములురెడ్డిది ప్రక్కనున్న గ్రామం ఇక్కారెడ్డిగూడెం. చెన్ వెళ్లికి ఇక్కారెడ్డి గూడేనికి కిలోమీటరున్నర దూరం మాత్రమే. అన్న పరంధాములురెడ్డి కూడా వ్యవసాయదారుడే అయినప్పటికీ మడికట్టుపొలాలలో ఎప్పటినుంచో వ్యవసాయం చేసి పంటదిగుబడులు కాస్తంతా ఎక్కువ సాధించడం వల్ల చుట్టుపట్ల గ్రామాలలో పలుకుబడి ఎక్కువగానే ఉంది. చెల్లెలు అడిగిన కొద్దిసేపట్లోనే పదియేను వేలరూపాయల అప్పుపుట్టించగలిగినా “బావగారు ఇలా చేయడం నాకే మాత్రము ఇష్టం లేదమ్మా” అంటూ చిన్నగా చివాట్లు వేసారు. మరుసటిరోజే బోరు బండిని తెప్పించి ఈసారి ఏ జ్యువాలజిస్టును, ఏ మంత్రాగాణ్ణి సంప్రదించకుండానే తానే స్వయంగా ఒక స్థలం చూపించి బోరు వెయ్యమంది మహాలక్ష్మి. ‘మొగడితో పాటు ఈమెకు మతిపోలేదు కదా’ అని జనాలు చెవులుకొరుక్కున్నారు. మొత్తం మీద మహాలక్ష్మి వేదన దేవుడు విన్నాడో, ఆ గంగమ్మకే కరుణపుట్టిందో తెలియదు గానీ… మొత్తం మీద మూడువందల యాభైయారు ఫీట్లలోతులో నీళ్ళు పడ్డాయి. అది గుడ్డిలో మెల్లలా రెండున్నర ఇంచుల నీళ్ళు. “ఆ మాత్రమన్న చాలు మమ్మల్ని దేవుడు కరుణించాడు” అనుకున్నారు భార్యభర్తలిద్దరూ. నీళ్లు పడ్డంతమాత్రాన పంటపండేయదు కదా. ఇతరత్రా ఖర్చులు, మడులు కట్టడాలు కలిసి తడిసి మోపెడై మొత్తం మీద లక్షాపదియేను వేల లెక్కతేలింది. అదీ పరంధాములురెడ్డిగారి పరపతి మీద మూడురూపాయల ధర్మవడ్డికి. ఆ సంవత్సరం టమాట పంటమీద ఖర్చులు పోను యాభై వేల రూపాయలు వచ్చాయి. అసలు కొంత, వడ్డికొంత చెల్లిద్దామంటే వల్లకాదన్నాడు సేటు. వడ్డి చెల్లించండి. మొత్తం అసలు చెల్లించగలిగితేనే అసలు జోలికి వెళ్లండని తిరకాసు పెట్టడంతో ‘అబ్బాయి రుత్విక్ రెడ్డి చదువులకు, ఇతరత్రా ఇంటి ఖర్చులు, వ్యవసాయఖర్చులకు డబ్బు ఎలాగు అవసరం కదా!’ అని ఆలోచించి కేవలంలో ఇరవై వేలు మాత్రం చెల్లించి నోటు తిరగ రాయించుకున్నారు. అలా తిరగరాయించుకున్న నోటు అసలు, వడ్డి కలిపి ఒకలక్షా యాభైయారువేల నాలుగు వందలు కాగా చెల్లుపెట్టిన ఇరవై వేలు పోను ఒక లక్షా ముప్ఫైయారువేల నాలుగు వందలకు కొత్త నోటు తయారైంది. వైష్ణవి పెద్దది కాగా, రుత్విక్ రెడ్డి చిన్నవాడు. ఇప్పుడు వైష్ణవికి పద్ధెనిమిది యేళ్లు ఉంటాయనుకుంటే సరిగ్గా రెండు సంవత్సరాలు చిన్న అయిన రుత్విక్ కు పదహారు యేండ్లు ఉంటాయి.\n\n‘మహాలక్ష్మీ!… మనకు బోరులో నీళ్లయితే పడనీ నీకు మునుపున్న ఆభరణాలతో పాటు కొత్తవికూడా చేయిస్తాన’ని ఆ రోజు రాత్రి ఊరించాడు. ‘తనకు వేసుకోవడానికి కొత్తవి లేకున్నా సరే తనకూతురికి మంచి సంబంధం దొరికి పెళ్లైతే చాలుననుకుంది మహాలక్ష్మి. ‘తానారోజు ఊహించినట్టే బోరులో నీళ్ళు పడ్డాయి. తన భర్తకలగన్నట్టే మడికట్టు తయారైంది. మరి జీవితాలలో మార్పింకారాదేం’. ఈ మధ్య మహాలక్ష్మిని తొలుస్తున్న ప్రశ్న ఇదే. మొత్తం మీద రాత్రనక, పగలనక కష్టం చేస్తే రెండుసంవత్సరాలకి గానీ బోరుకు చేసిన అప్పుతేరి పోయినట్టయ్యింది. ఇంకా అక్కడక్కడా కొన్ని చిల్లర అప్పులు అలాగే మిగిలి ఉన్నాయి. మహాలక్ష్మికి ఇప్పటికీ ఇదంతా ఒక కలలా ఉంది. మెట్టపొలంతో వ్యవసాయం చేసినప్పుడు, మడికట్టుకట్టి వ్యవసాయం చేస్తున్నప్పుడు తమ జీవితాలలో ఎటువంటి మార్పురాలేదు. కానీ ఏదో కాస్తంతా కొత్తమార్పు మాత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. పుట్టింటివారు కూడా మునుపటిలాగా ఇప్పుడు సౌకర్యవంతమైన జీవితం గడపడం లేదు. తరచి చూస్తే ఈ రెండేళ్లలో ఎంతో మార్పు వచ్చినట్టుంది. మునుపటిలా కూరగాయల మండిలోని సేట్లు రైతులకు పెద్దమొత్తంలో అప్పులు ఇవ్వడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు బెంగళూరు, మహారాష్ట్ర తదిరప్రాంతాల నుండి లారీల మీద సరుకులు తెప్పించుకోవడం వల్లనైతేమి, కొత్త కొత్తవంగడాలు మార్కెట్టలోకి రావడం వల్లనైతేమి మడికట్టు రైతులకు కూడా మెట్టరైతులకు వలె పెద్దగా గిట్టుబాటు జరగడం లేదు. బోరులో నీళ్లపడితే తమదశనే తిరిగిపోతుందని కలలుగన్న మహాలక్ష్మికి భూమి గుండ్రంగా ఉంటుందన్న కఠోర సత్యం తెలిసొచ్చింది. వైష్ణవి పెళ్ళీడు దాటుతుందని అందరూ హెచ్చరిస్తున్నారు.\n\nఎంతో పంట పండినట్టు అనిపిస్తున్నా దమ్మిడీ కూడా కూడ బెట్టలేక పోతున్నారు. మహాలక్ష్మి మెడలోంచి హరించుకుపోయిన బంగారం తిరిగి సమకూరలేదు సరికదా. పిల్లపెళ్లికైనా మాసం తాసం అన్నా కూడబెట్టలేక పోయారు. చివరాకరికి ఒక మంచి సంబంధం దొరికిందని, పిల్లాడు మెడికల్ కంపెనీలో సెల్స్ రిప్రజెంటివ్ గా చేస్తాడని కనీసం ఇరవైతులాల బంగారం, పెట్టిపోతలు, లాంఛనాలు, ఆడపిల్లకట్నాలనీ అవన్నీ, ఇవన్నీ ఖర్చుచేసి చివరాకరుకు చూసుకుంటే పన్నెండు లక్షలపైనే అప్పయికూర్చుంది. ‘మెట్టను మడికట్టుగా మార్చి రెండుసంవత్సరాలు అవుతున్న దాదాపు దాని అప్పేతీర్చలేక పోయాము పైగా నాదగ్గరున్న బంగారం అంతా హరించుకుపోయింది. ఇప్పుడీ పిల్ల అప్పెలా తీర్చాలిరా భగవంతుడా’ అని తలపట్టుకు కూర్చుంది మహాలక్ష్మి.\n\n“కాస్తోకూస్తో అన్ని వృత్తులు బాగుపడుతున్నాయి, అన్నికులాలు బాగుపడుతున్నాయి. మన వృత్తి, మనకులం బాగుపడడంలేదు నాన్న. బహుశా మనం వ్యవసాయం చేసేతీరు, ఆడంబరాలకు పోయి సంబరాలు చేసుకునే తీరు మార్చుకోవాలేమో!” అంటున్న రుత్విక్ రెడ్డి మాటలు మహాలక్ష్మిని, భీమిరెడ్డిని దీర్ఘాలోచనలో పడేసాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 322,
        "IMAGE": "cat_2",
        "NAME": "వ్యయ సాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "మహారాజా క్రిష్ణ చంద్ర గారి దర్బారుకు గౌరవనీయ నవాబుగారి సమ్ముఖం నుండి ఒక ఫర్మానా వచ్చింది. ఈ భూమి మొత్తాన్నీ - ఆ వైపు నుండి ఈ వైపు వరకూ; ఆ చివరి నుండి ఈ చివరి వరకూ- కొలిచి పెట్టమన్నారు నవాబుగారు. దానితోబాటు మహారాజావారుగనక ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ లెక్కించే పనిని సొంత పనిలాగా చేపట్టితే సంతోషిస్తామని కూడా తమ ఫర్మానాలో రాసి పంపారు.\n\nక్రిష్ణచంద్ర మహారాజుగారు నిర్ఘాంతపోయారు.\"నేను మీ ఆజ్ఞను మీరదల్చుకోలేదు- కానీ, మీరు.. అసాధ్యమైనవి అడుగుతున్నట్లుంది?!\" అని కబురు పంపారు నవాబుకు.\n\"అయినా చేయాల్సిందే\" నన్నారు నవాబుగారు కఠినంగా.\n\nదాంతో మహారాజావారి మనస్సు విరిగిపోయింది. ఆయన ఏకాంత మందిరంలో కూర్చుని 'నవాబు కోరికల్ని తీర్చే విధానం ఏంటా', అని ఆలోచనలో మునిగిపోయారు.\n\nఅనతికాలంలో గోపాల్ భాండ్ కు సంగతి తెల్సింది. ఆయన రాజభవనానికి వచ్చి, చింతాక్రాంతుడై ఉన్న రాజావారిని కలిసి, \"మహారాజా! నేనేం చూస్తున్నాను? మీకేమైనా కష్టం వచ్చిందంటే ఈ గోపాల్ కు చెబితే చాలు, అన్నీ చక్కబడతాయి\" అన్నాడు.\n\nరాజావారు అంత సులభంగా తేరుకోలేదు. ఆయనన్నారు 'లేదు, గోపాల్! ఈ సమస్య నీకు కూడా కొరుకుడు పడనిది. భూమండలాన్నంతా- ఆ పక్కనుండి ఈ పక్కకు; ఆవైపు నుండి ఈ వైపుకు- మొత్తం కొలిచి పెట్టాలని నవాబుగారు హుకుం జారీ చేశారు. అది చాలదన్నట్లు. నేను ఆకాశంలోని నక్షత్రాలన్నింటిని కూడా లెక్కించాలట!\" అని.\n\nగోపాల్ ఏ మాత్రం తొణకలేదు- \"అయ్యో, మహారాజా! వీటంత సులభమైన ప్రశ్నలు ఇంక వేరే ఏవీ ఉండవు. నన్ను మీ అధికారిక 'భూమండల కొలతల అధికారి'గాను, 'నక్షత్ర గణకుడి'గాను నియమించండి. ఆ పైన నిశ్చింతగా ఉండండి. నా పని పూర్తయ్యాక, నాకు నేనుగా ఫలితాన్ని తీసుకెళ్లి, నవాబుగారిని కలిసి వస్తాను. ఒక్క సాయం మాత్రం చేయండి: పని పూర్తి చేసేందుకు నవాబుగారిని ఒక సంవత్సరం గడువూ, ఖర్చుల కోసం ఒక పది లక్షల బంగారు నాణెలు కోరండి. ఒక్క సంవత్సరంలో నేనాయనకు ఫలితాలనందిస్తాను\" అన్నాడు.\n\nమహారాజుగారు చాలా సంతోషపడ్డారు. ఆయన ఆందోళన మాయమైపోయింది - ఎందుకంటే, పని ఒకవేళ పూర్తవ్వకపోతే తెగేది- తన తల కాదు! గోపాల్ భాండ్ తల!! అందుకని ఆయన గోపాల్ కోరిన విధంగా చేసి, సంతోషంగా చేతులు దులుపుకున్నారు.\n\nఇక గోపాల్ భాండ్ ఆ పది లక్షల బంగారు నాణాలతో ఇష్టం వచ్చినట్లు జల్సా చేసుకున్నాడు. రాజ్యంలోని రకరకాల ఆహార పదార్థాలు రుచి చూశాడు, పెద్ద పెద్ద బంగళాలు, ఏనుగులు, వజ్రవైఢూర్యాలు, బంగారం, దాస దాసీజనాలను సమకూర్చుకున్నాడు. అలా అతను సంవత్సరాన్నంతా అద్భుతంగా గడిపి, సంవత్సరం చివర్లో మహారాజుగారి దగ్గరికి తిరిగి వెళ్లి, తీసుకున్న పది లక్షల బంగారు నాణేలకుగానూ తన వద్ద మిగిలిన నాలుగు రాగి నాణేలను చూపిస్తూ- \"మహారాజా, నిజంగా నేను అనుకున్న దానికంటే చాలా కష్టమైంది ఈ పని! అయితే నేను ఆ పనిని మొదలుపెట్టడం మటుకు చాలా‌బాగా చేశాను- ఫలితాలన్నీ చాలా ఆశాజనకాలుగా కనబడుతున్నై. కానీ నాకు ఇంకొక సంవత్సరం గడువు అవసరం. మరి అలాగే, ఇంకో పది లక్షల బంగారు మొహరీలు కావాలి...-ఖర్చులు!\" అన్నాడు కొంచెం ఆందోళన పడుతున్నట్లు ముఖం పెట్టి.\n\nఅయిష్టంగానే మహారాజుగారు నవాబుగారికి మనవి చేసుకున్నారు. నవాబుగారు కూడా అయిష్టంగానే అదనపు సమయాన్నీ, అదనపు పదిలక్షల్నీ మంజూరు చేశారు. దాంతో గోపాల్ ఈ సంవత్సరాన్ని మొదటిసారి కంటే మరింత జల్సాగా గడిపాడు- అనుభవం ఎక్కువైంది గదా మరి!\n\nఇక కచ్చితంగా రెండు సంవత్సరాలు అవుతుందనగా, గోపాల్ భాండ్ పెద్ద పటాలాన్ని ఒకదాన్ని వెంటబెట్టుకొని, నవాబుగారి దర్బారును చేరుకున్నాడు. అతనితోబాటు పదిహేను ఎద్దులబండ్లు! ఒక్కో బండి నిండా, బండి అంచులు దాటేట్లు గట్టిగా నొక్కి నొక్కి పెట్టిన- అతి సన్నని దారం, వంకరలు తిరిగి, చిక్కుపడిపోయి, అతుక్కుపోయి- ఉన్నది. ఇవికాక, ఒత్తైన బొచ్చుతో, ముద్దుగా ఉన్న ఐదు గొర్రెలు కూడా.\n\nఈ వింత పటాలాన్ని తీసుకొని గోపాల్ రాజప్రాసాదంలోకి ప్రవేశించి, నవాబుగారి దర్బారుకు చేరుకున్నాడు. నవాబుకు వంగి ఓ పెద్ద సలాం చేసి \"హుజూర్! మీరు కోరిన విధంగానే మొత్తం పనినీ పూర్తి చేశాను. భూమిని ఆ చివరి నుండి ఈ చివరి వరకూ, ఆ పక్కనుండి ఈ పక్క వరకూ కొలిచి తెచ్చాను. ఆకాశంలోని నక్షత్రాల్ని కూడా ఖచ్చితంగా లెక్కించి తెచ్చాను\" అన్నాడు.\n\n\"భళా! చెప్పు! అంకెల్ని ఇప్పుడు బయట పెట్టు! కచ్చితమైన కొలతలు వినిపించు!\" అన్నారు నవాబుగారు, ఉత్సాహంగా.\n\n\"అంకెలా హుజూర్?!\" అన్నాడు గోపాల్- \"అవి లేవు, ఒప్పందంలో! అయితే నేను మాత్రం మీరు ఆదేశించినట్లే లెక్కించాను పూర్తిగా. చూడండి- ఈ మొదటి ఏడు ఎద్దులబండ్లలో తెచ్చిన దారం ఎంత పొడవు ఉన్నదో, భూమి అంత వెడల్పు ఉన్నది. ఇక, తర్వాతి ఎనిమిది బండ్లలో ఉన్న దారం ఎంత పొడవు ఉన్నదో, కచ్చితంగా అంత పొడవు ఉన్నది, భూమి! ఇకపోతే, నేను నక్షత్రాల్నికూడా కచ్చితంగా లెక్కించాను హుజూర్! ఈ ఐదు గొర్రెల మీద బొచ్చులో ఎన్ని వెంట్రుకలున్నాయో, ఆకాశంలో కచ్చితంగా అన్నే నక్షత్రాలున్నై! నిజానికి, ఇలా కచ్చితమైన సంఖ్యలో వెంట్రుకలుండే గొర్రెలు దొరికించుకునేందుకే, నాకు చాలా సమయం పట్టింది!\" అన్నాడు.\n\nనవాబుగారికి ఇక ఏమి అనేందుకూ వీలు లేకపోయింది. \"అసాధ్యం! నేను ఆ దారాన్నీ కొలవలేను, ఈ బొచ్చులోని వెంట్రుకలనూ లెక్కించలేను! అయినా ఒప్పందం ప్రకారం మీరు చేయాల్సిన పని మీరు చేశారు!! కనుక అందుకోండి, మేమిచ్చే బహుమానం; పది లక్షల బంగారు మొహరీలు!\" అని నవాబుగారు గోపాల్ ని మర్యాదగా సాగనంపారు.\nగోపాల్ వాటితో మరికొంత కాలం కులాసాగా గడిపాడు!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 323,
        "IMAGE": "cat_2",
        "NAME": "నక్షత్రాల లెక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.\n\nఅతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.\n\nఅయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు \"వద్దు\" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం \"వద్దు,వెళ్లకు\" అన్నది.\n\nబ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను \"ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?\" అని అరిచాడు.\n\n\"పైకి చూడు, నేనిక్కడున్నాను\" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.\n\nఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. \"గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది.\" అన్నాడు.\n\nపేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -\"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?\" అని.\n\n\"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు\" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.\n\n'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.\n\nబ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -\"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను.\n\nనన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో\" అని.\n\nబ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - \"ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను\" అని.\n\nఈ సంగతి వినగానే'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, \"ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు.\n\nఅంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: \"నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను.\" అన్నాడు. ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు.\n\nఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని.\n\nమైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు. అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి!\n\nఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - \"నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు\" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు.\n\nబ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- \"చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!\" అని.\n\n'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- \"వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను\" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు.\n\nఅటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 324,
        "IMAGE": "cat_2",
        "NAME": "బ్రహ్మరాక్షసుడి సంగీతం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు అతనికి.\n\nఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది!\n\nఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, \"నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?\" అని అడిగాడు.\n\n\"ఓ! నిర్భయంగా చెప్పు. నేను ఒక్క చీమకు కూడా తెలీనివ్వనని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను\" అన్నది భార్య. అప్పుడతను నిశ్చింతగా, తన ఉమ్మిలో కనబడ్డ తెల్లటి ఈక గురించి చెప్పాడు భార్యకు. అయితే, భార్య మాటైతే ఇచ్చింది కానీ, ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాయటం ఆమె వల్ల కాలేదు. ఆమె ఆలోచనల నిండా తెల్లటి ఈకలే మరి!\n\nఅందుకని, పొరుగింటి సుబ్బమ్మ కనబడగానే బ్రాహ్మణుడి భార్య ఆమెకు దగ్గరగా వెళ్లి- \"నా మనసంతా ఒక రహస్యంతో నిండి పోయి ఉంది. నేను ఆగలేక పోతున్నాను. నీకు ఆ రహస్యం చెప్పేస్తాను- అయితే ముందు నాకు ఓ మాట ఇస్తావా? దాన్ని నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పకూడదు- ఎవ్వరికీ తెలీనివ్వనని నేను మా వారికి మాట ఇచ్చాను, మరి!\" అన్నది.\n\nపొరుగింటి సుబ్బమ్మ ఒప్పుకున్నది. \"నెను రహస్యాల్ని ఎంత చక్కగా కాపాడతానో నీకు తెలీదా? నేను చీమక్కూడా తెలీనివ్వను- చెప్పు!\" అన్నదామె ఉత్సాహంగా.\n\n\"ఎవ్వరికీ చెప్పవు కదా?\"\n\"నీకంత అపనమ్మకమైతే చెప్పకు. నేనెన్నడైనా నీ రహస్యాన్ని ఇతరులకు చెప్పానా?\"\n\n\"సరే, సరే. చెప్పేస్తాను నీకు. నువ్వు మంచి స్నేహితురాలివని నాకు తెలుసు. నువ్వెవ్వరికీ చెప్పవు. మా ఆయన ఇంటికి వస్తూ పొలాన్ని దాటుతుండగా ఏమైందో తెలుసా? ఆయన ఏమి ఉమ్మేశాడో తెలుసా? ఆయన.. ఆయన ఉమ్మి నిండా కొంగ ఈకలు! ఎన్ని ఈకలో! ఆయనకు ఏమౌతోందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది!\"\n\n\"అయ్యో నువ్వేమీ ఆందోళన పడకు. ఒక్కోసారి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. కానీ, దాన్ని గురించి ఎవ్వరికీ తెలీకపోవడమే మంచిది. ఊరికే అందరూ పుకార్లు రేపుతారు, లేకుంటే\".\n\nకానీ ఆ రహస్యాన్ని ఐదు నిమిషాలపాటు దాచుకోవటం కూడా ఆమె వల్ల కాలేదు. అది ఆమెలోంచి తన్నుకొని బయటికి వచ్చేస్తున్నట్లు అనిపించిందామెకు. హడావిడిగా ఆమె ఇంకా ఇంటికి పరిగెత్తుతూ ఉండగానే 'తనకిప్పుడు ఎవరు కనబడతారో, వాళ్లకి ఈ రహస్యం చెప్తే ఎలా స్పందిస్తారో' అన్న ఊహ ఆమెను తబ్బిబ్బు పరిచింది. ఆమెకో మిత్రురాలు కనబడగానే ఆమె ఇక ఆపుకోలేక బయటికి కక్కేసింది.\n\n\"ఎవ్వరికీ చెప్పనని మాట ఇవ్వు ! నేను ఆమె రహస్యాన్ని కాపాడతానని బ్రహ్మణుడి భార్యతో ప్రమాణం చేశాను. ఇవ్వాళ ఏం జరిగిందో తెలుసా? పూజారిగారు పొలంలోంచి పోతూ పూర్తి కొంగనొకదాన్ని కక్కుకున్నారట! బ్రాహ్మణులు శాకాహారులేనని నేను అనుకునేదాన్ని. కానీ మనకేం తెలుసు, నిజానికి?\" అన్నదామె. \"పూర్తి కొంగనా? అంత పెద్ద పక్షి! ఎలా కక్కుకున్నాడబ్బా!? వింత మనిషే! కానీ- నేను ఎవ్వరికీ తెలీనివ్వనులే., నన్ను నమ్ము.\"\n\nఎంతో సేపు కాలేదు, వేరే ఒకాయనకు ఎవరో చెప్పగా తెలిసింది- పండితుడి నోట్లోంచి రెక్కలల్లార్చుకుంటూ అనేక కొంగలు వెలువడ్డాయని!\n\nఇక ఆరోజు సాయంత్రానికల్లా పట్టణమంతా తెల్సిపోయింది అందరికీ- పండితుడి నోట్లోంచి కొంగల గుంపులూ, బాతుల మందలూ, ఇంకా రకరకాల పెద్దపెద్ద పక్షులన్నీ ఎగురుకుంటూ బయటికి వస్తున్నాయని! చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆ సంగతి ప్రచారమైంది- దాంతో గ్రామాలకు గ్రామాలే ఎద్దుల బండ్లు వేసుకొని ఈ భయంకర ఘటనను చూసేందుకు పండితుడుండే ఊరికి తరలి వచ్చాయి. ఇదేదో నిజంగా అద్భుతం గదా, మరి? - రకరకాల పక్షులు, అన్ని రంగులవీ, అన్ని సైజులవీ,- కొన్ని సుదూర పక్షులు కూడా- పండితుడి నోట్లోంచి ఊడిపడి, ఆకాశాన్ని కప్పేస్తున్నాయట!\n\nబ్రాహ్మణుడికి పిచ్చెక్కినట్లయింది. అతను అందరి నుండీ‌ పారిపోయి కొండమీద, ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈ పుకారు పూర్తిగా సద్దుమణిగి, ఇంకోటి తలెత్తేంత వరకూ బయట తిరిగే సాహసం చెయ్యలేదు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 325,
        "IMAGE": "cat_2",
        "NAME": "నోటిలో కొంగ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుమంది భార్యలు. పిల్లలు కలగక పోవడం చేత ఆయన ఏడు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తరువాత చివరి భార్య గర్భవతి అయ్యింది. \"ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు. ఎలాగైనా చివరామెను బయటకి వెళ్ళగొట్టాలి\" అనుకున్నారు మిగిలిన భార్యలు.\n\nఒకనాడు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి, పెళ్లాలందరూ కలసి ఇద్దరు నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్ళకు చాలా ధనమిచ్చి, \"చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి, ఆమె కన్నులు పీక్కురమ్మ\"ని చెప్పి పంపారు. ధనాశచేత ఆ భటులు, చిన్న రాణిని తీసుకుపోయి, ఆమె కన్నులు పీక్కొని, చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు.\n\nవేట ముగించుకొని తిరిగొచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి నమ్మించారు.\n\nఇక అడవిలో పడ్డ ఆరాణి పాపం, కళ్లు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయి, ఒక చేనులో కందిచెట్టు కింద కూర్చొని మూర్ఛపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి, చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కానీ పురిట్లోనే ఆ రాణి చనిపోయింది!\n\nఅయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురుపిల్లి పిల్లవాడి ఏడ్పులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొనిపోయి, బాగా పెంచుకున్నది. ప్రతిరోజూ అది ఊరి లోనికి వెళ్లి, ఆహారం సంపాదించి, దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు.\n\nఒకనాడు ఆ పిల్లవాడు బావురుపిల్లితో \" ఈరోజు ఊళ్లోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో\"అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంతచెప్పినా వినకుండా అబ్బాయి, \"ఊళ్లోకి నేనే వెళతా\" అని మొండిపట్టు పట్టాడు. చేసేదిలేక `సరే' అని ఒప్పుకుంది పిల్లి. వెళ్లేముందు \"నాయనా! ఎటువైపుకైనా పో, కానీ, దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన మూడు దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ల ఇండ్లవద్ద నిలబడి,\n\n\"రాజుకు ఏడుగురు భార్యలంట\nకడతట్టాయమ్మ మాఅమ్మ\nకందిచెట్టు కింద నీళ్లాడ\nబావురుపిల్లి నన్ను సాకె\nబావురు బిక్షం పెట్టండి.\"\n\nఅని పాట పాడు\" అని, పాటని నేర్పించి పంపింది ఆ పిల్లి.\n\nసరే'నని వెళ్లిన ఆ అబ్బాయిపిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది? ఆ వైపున ఏముందో తెలుసుకోవాల'ని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకుని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి\n\"రాజుకు ఏడుగురు భార్యలంట\nకడతట్టాయమ్మ మా అమ్మ\nకందిచెట్టు కింద నీళ్లాడ\nబావురుపిల్లి నన్ను సాకె\nబావురు బిక్షం పెట్టండ\"ని పాట పాడాడు.\n\nఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నాడు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు, భవనం ముందు నిల్చుని పాట పాడిన పిల్లవాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి! రాజు ఆ అబ్బాయినీ, ఆ అబ్బాయి పాటనూ అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ఆధారంగా ఊహించుకోగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యలమీద అనుమానం కలిగింది. వాళ్లని పిలిపించి, గట్టిగా అడిగేసరికి వాళ్లంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్లందరినీ కఠినంగా శిక్షించి, ఆ పిల్లవాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఇంకొంతకాలానికి ఆ పిల్లవాడే రాజై, రాజ్యాన్ని బాగా పాలించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 326,
        "IMAGE": "cat_2",
        "NAME": "బావురు పిల్లి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 76,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో గువ్వంట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముల్లు గుచ్చుకుందంట. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకుపోయి \"మనవడా! మనవడా! నా కాలిలో ముల్లు తీస్తావారా?\" అని అడిగిందంట.\n\n\" నేను తీయను. నన్ను అవ్వ కొడుతుంది- పో \" అన్నాడట వాడు.\n\n\"అట్లనా!\" అని, ఆ గువ్వ అవ్వ దగ్గరకి పోయి, \"అవ్వా! అవ్వా! నా కాలి ముల్లు తీస్తావా అవ్వా?\", అని అడిగిందట.\n\n\"నన్ను తాత కొడతాడు. నేను రాలేను- పో\" అని అవ్వ చెప్పిందంట.\n\n\"సరేలె\"మ్మని, ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందంట. పోయి, \"తాతా! తాతా! నా కాల్లోంచి ముల్లు తీస్తావా తాతా?\" అని అడిగిందట.\n\n\"నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్టా!\" అని తాత అన్నాడట.\n\n\"సరే\"నని ఆవుదగ్గరికెళ్లి, \"ఆవూ! ఆవూ! నా కాలి ముల్లు తీస్తావా, ఆవూ?\" అని అడిగిందట గువ్వ.\n\nఅప్పుడు ఆవు, \"నన్ను దూడ కొడుతుంది\" అని చెప్పిందట.\n\n\"సరే అయితే. నేను దూడని అడుగుతాను ఉండు\" అని దూడ దగ్గరికెళ్లి, \"దూడా! దూడా! నా కాల్లో ముల్లు తీస్తావా దూడా?\" అని అడిగిందంట గువ్వ.\n\nదూడేమో, \"ఊ...నేను తేనీగతో ఆడుకోవాలమ్మా! లేకపోతే అది నన్ను తిట్టదూ?\" అని చెప్పిందట.\n\"ఐతే నేను తేనీగను అడుగుతాలే\" అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ.\n\n\"అయ్యో పాపం! నీ కాళ్లో గుచ్చుకున్న ముల్లును తీసెయ్యించడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటానుగానీ\" అని, అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవుపోయి తాతను గుద్దిందంట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడ్ని వేళ్లతో పొడిచిందంట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముల్లును తీసేశాడట.\n\nముల్లు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకుని ఎగిరిపోయిందంట!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 327,
        "IMAGE": "cat_2",
        "NAME": "గువ్వ కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 77,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఈ కథ చంద్ర సొంత కథ అని తెలుస్తూనే ఉన్నది..పగటిపూట కనే కలల్ని పగటి కలలు అంటారా? మీరే చెప్పాలి.\nరచన: యం.చంద్రశేఖర్, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.\nవాసు, వాసంతి అన్నా చెల్లెళ్ళు. వాళ్లిద్దరూ కలసి ఆడుకునేవాళ్లు, పాడుకునేవాళ్లు, చక్కగా బడికి పోయేవాళ్లు.\n\nఒకసారి వాళ్ల ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు. ఒట్టి చంద్ర కాదు వాడు- `కలల చంద్ర'. చంద్రకు కలలు కనడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుని, కలల్లో తేలిపోతుండేవాడు.\n\nచాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకొని, వాసు, వాసంతిలు వాళ్ల తోటకు వెళ్ళారు.\nతోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గరూ. చంద్రకు కూడా ఉయ్యాల ఊగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఊగుతానన్నాడు వాడు.\n`సరే' నువ్వే మొదట ఊగమని, వాడిని ఊపడం మొదలుపెట్టాడు వాసు.\n\nఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి.\n\nఊగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్ లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడినుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు! ఉయ్యాలలాగా ఊగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఊగుతూనే, చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులైతే పుట్టాయిగానీ, అక్కడ జనసంచారం అన్నది లేదు.\n\nఅంతలో అతనికి ఒకచోట పే..ద్ద- మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. 'ఏమిటా?' అనుకుని దాని దగ్గరికెళ్ళి చూశాడు- చూస్తే, ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో, అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని, వాడు ముందుకు వంగి, రెండు చేతుల్తోటీ వజ్రాన్ని పట్టుకొని, అతి ప్రయత్నంమీద, బలంగా ఎత్తాడు!! - ఇంకేం చెప్పాలి? వజ్రంకోసం చేతులు వదిలిన చంద్ర, ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు .\n\nపాపం, చంద్ర! కలలచంద్రకు పళ్ళు ఊడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతిలు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి, \"ఏమైంది? ఎందుకు, కింద పడ్డావు?\" అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకొన్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు.\nఆ తర్వాత వాసు, వాసంతిలు చాలాకాలం వరకూ కలల రాకుమారుణ్ని తలుచుకుని నవ్వుకున్నారు.\nచంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 328,
        "IMAGE": "cat_2",
        "NAME": "పగటి కలలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 78,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గర్లో ఉన్న పొలాలలో రైతులు రకరకాల పంటలు పండించేవారు. ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా, క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనబడ్డాడు. అన్ని పక్షులూ 'అది మామూలే' అనుకొని, తమ మానాన తాము ఎగురుకుంటూ‌వెళ్లిపోయాయి. కాని చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుక మాత్రం ఆ పొలంలోకి దిగి, ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే.\n\n\"ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు. ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లనూ, వలలను తయారు చేస్తారు. ఆ వలలతో మన లాంటి పక్షులని, చేపలను పట్టుకుంటారు. అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి \" అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది.\n\nకాని, దాని మాటలను ఏ పక్షీ వినిపించుకోలేదు. కొన్ని రోజులకు పొలంలో జనప మొలకలు వచ్చాయి.\n\"ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇకనైనా మనం మేలుకోవాలి. వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి\" అన్నది పిచ్చుక.\n\"ఆ... ఇప్పుడే ఏం తొందరొచ్చింది?!\" అంటూ మిగతా పక్షులు దాని మాటలు పెడచెవిన పెట్టాయి.\nరోజు రోజుకూ మొక్కలు పెరగసాగాయి! కొంతకాలం గడిచాక, \"ఇక లాభం లేదు\" అని, తెలివైన ఆ పిచ్చుక అక్కడినుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయింది.\n\nఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చుక చెప్పినట్లే జరిగింది. కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి, వాటితో పిట్టలను, చేపలను పట్టడం మొదలుపెట్టారు. పిచ్చుక హెచ్చరికను పెడచెవిన పెట్టిన పిట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి, పాపం!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 329,
        "IMAGE": "cat_2",
        "NAME": "ముందుచూపు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 79,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో ఒక కోతంట. ఆ కోతి కొండమీదికి ఎక్కుతావుంటే తోకలోకి ఒక ముల్లు గుచ్చుకుందంట. అప్పుడా కోతి ఊళ్ళోకి వచ్చిందంట. అప్పుడొక వేటగాడు ఒక కత్తి ఎత్తుకుని పోతావుంటే, ఆ కోతి వేటగాడి దగ్గరకిపోయి \"నాకు ముల్లు తీయవా?\" అని అడిగిందంట.\n\nఅప్పుడు వాడు ముల్లు తీసెయ్యడానికని ప్రయత్నిస్తే, దాని తోక తెగిపోయిందంట. అప్పుడా కోతి, వేటగాడితో \"నాకు నా తోకిస్తావా, లేక నీ కత్తిస్తావా?\" అని అడిగిందంట. అప్పుడు ఆ వేటగాడు కత్తినిచ్చేశాడంట.\n\nకోతి, కత్తెత్తుకుని పోతావుంటే, ఒక అక్క చేత్తోనే కట్లించుతా కనబడిందంట. \"ఎందుకక్కా కట్టెలను చేత్తో ఇంచుతావున్నావు?. కత్తుంది ఇద్దో తీసుకో. తీసుకొని దీంతో‌ కట్లు నరుక్కో\" అని కత్తిచ్చిందంట.\n\nఆ అక్క కత్తితో కట్లు నరుకుతావుంటే కత్తిశీల పూడ్చిందంట.\nఅప్పుడు కోతి ఆ అక్కతో \"నా కత్తిస్తావా, లేక నీ కట్లిస్తావా?\" అని అడిగిందంట.\nఅప్పుడా అక్క కోతికి కట్లిచ్చేసిందంట.\n\nకోతి ఆ కట్టెలను తీసుకొని పోతావుంటే, ఒక అవ్వ పొయ్యిలో కాగితాలుపెట్టి దోసలు కాలుస్తా కనబడిందంట. చూసిన కోతి, \"ఎందుకవ్వా కాగితాలు పెట్టి కాలుస్తున్నావు? ఇవిగో ఈ కట్లు తీసుకుని కాల్చుకో\" అని కట్లిచ్చిందంట.\n\nముసలమ్మ దోసెలన్నీ కాల్చేపాటికి కోతి తనకిచ్చిన కట్టెలన్నీ అయిపోయాయంట. అప్పుడు కోతి ఆ అవ్వతో, \"నా కట్లిస్తావా? లేక నీ దోసెలిస్తావా?\" అని అడిగిందంట.\n\nఅవ్వ కోతికి దోసెలు ఇచ్చిందంట.\nదోసెలు తీసుకుని పోతున్న కోతికి మడకను దున్నే ఒక అన్న ఆకలిగొని నీరసంగా కనిపించాడంట. \"ఇవిగో ఇవి తినన్నా\" అని ఆ కోతి అతనికి దోసెలిచ్చిందంట. అతనేమో ఆకలితో ఉండి దోసెలన్నీ తినేశాడంట.\nఅప్పుడు కోతి \"నా దోసెలిస్తావా, లేక నీ మడకిస్తావా?\" అని ఆ అన్నను అడిగిందంట.\n\nఅన్న మడకిచ్చేసినాడంట. మడకను తీసుకుని ఒకచోట పెట్టిందంట కోతి. దావంట బొయ్యే చాకలాయన దొందురుకుని పడితే, మడక ఇరిగిపోయిందంట. \"నా మడకనిస్తావా, లేక నీ తొట్టిబాననిస్తావా?\" అని అడిగిందట. \"సరే, నీతో నాకెందుకు?\" అని చాకలాయన దానికి బాననిచ్చేశాడంట.\n\nతొట్టిబాననుకూడా తీసుకుని పోతావుంటే దానికి ఒకచోట చేతుల్తో పూలతోటకు నీళ్లుపోస్తున్న మనుషులు కనిపించారంట. అప్పుడది \"ఎందుకన్నా, చేతుల్తో నీళ్లు పోస్తున్నారు? ఇదిగో ఈ బానతో పోసుకోండ\"ని వాళ్లకు ఆ బానను ఇచ్చిందంట.\n\nబాన తీసుకుని పూల తోటకునీళ్ళు పోస్తుంటే ఆ బానకు చిల్లు పూడ్చిందంట. అప్పుడు కోతి నాబానిస్తావా లేక నీ పూలిస్తావా?\" అని అడిగిందంట.\n\"పూలే తీసుకొమ్మ\"ని కాసిన్ని పూలిచ్చారంట వాళ్లు.\n\nపూలను తీసుకుని పోతున్న కోతికి , తలలో పూలు లేకుండా పోతున్న ఒక పెళ్లి కూతురు కనిపించిందంట. అప్పుడు కోతి \"ఓ పెళ్లికూతురా! ఎందుకట్లా పూలు పెట్టుకోకుండానే పోతున్నావు, ఇవిగో పూలు తీసుకో\"మని ఆమెకు పూలిచ్చిందంట. పెళ్లికూతురు పూలు పెట్టుకున్నాక ఆ పూలన్నీ వాడిపోయాయంట.\nఅప్పుడా కోతి, అక్కడే ఉన్న డప్పునెత్తుకొని,\n\n\"కాలు పోయి కత్తొచ్చె డాం డాం డాం!\nకత్తిపోయి కట్లొచ్చె డాం డాం డాం!\nకట్లు పోయి దోసెలొచ్చె డాం డాం డాం!\nదోసెలు పోయి మడకొచ్చె డాం డాం డాం!\nమడకా పోయి తొట్టిబానొచ్చె డాం డాం డాం!\nతొట్టిబాన పోయి పూలొచ్చె డాం‌ డాం డాం!\nపూలు పోయి పెళ్లికూతురొచ్చె డాం డాం డాం!!! అని పాడిందంట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 330,
        "IMAGE": "cat_2",
        "NAME": "డాం డాం డాం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 80,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.\n\nభర్త అన్నాడు: \" నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను\" అని.\n\nభార్య శృతి కలిపింది- \"అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి\" అని.\n\nమర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: \" ఏం కొనుక్కొచ్చావు?\" అని.\n\n\"ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!\" అన్నది భార్య.\n\n\"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌\" అడిగాడు భర్త.\n\n\"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌\" అన్నది భార్య.\n\n\"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?\" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.\n\nఇక భార్య తిరగబడింది- \" ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!\" అని.\n\n\"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు\" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.\n\nఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- \"ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?\" అని.\n\n\" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!\" అన్నాడు భర్త.\n\"మీ ఆవా?!\" అడిగాడు గోపాల్ భాండ్.\n\"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!\"\n\"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?\" అడిగాడు గోపాల్.\nభర్త అన్నాడు- \" చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో\" అని.\n\n\"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!\" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.\n\n\"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?\" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.\n\n\"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!\" అని చిందులేశాడు గోపాల్.\n\"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?\"\n\n\"నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!\" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి.\n\nపొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 331,
        "IMAGE": "cat_2",
        "NAME": "నేను కొనబోయే ఆవు కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 81,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.\n\nఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.\n\nఅయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.\n\nఅలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: \"ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.\"\n\"అయితే నేను వెళ్లి వాడి పనిపడతా\"నన్నది సువర్ణ.\n\n\"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!\" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.\n\nఅలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.\n\n\"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు\" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.\n\nగుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!\n\nఅలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ \"అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు\" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది. కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను \"పదివేలమందీ పూర్తయ్యారా?\" అని అడిగాడు. \"అయ్యార\"న్నది అవ్వ. \"అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.\n\nరాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. \"పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు\" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.\n\nసువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. \"అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి\" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. \"నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు\" అన్నది సువర్ణ. \"అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి\" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.\n\nరాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.\n\nఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 332,
        "IMAGE": "cat_2",
        "NAME": "సువర్ణ సాహసం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 82,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని, అందులో ఒక ముసలమ్మ జీవించేది.\n\nముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి, ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్లు, మేడిపండ్లు, బలిజ పండ్లు, నేరేడుపండ్లు వంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్లో అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది.\n\nఇలా ఉండగా, ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్లదయ్యాలకు కాళ్లూ చేతులు ఉలఉలా అన్నాయి. ముసలమ్మను ఆటపట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్లదయ్యాలు రెండింటికీ ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండూ ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి, ఏదైనా చేద్దామనుకున్నాయి; కానీ కొంచెం ఆలోచించినమీదట, తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి.\n\nఇక ముసలమ్మేమో పళ్ళన్నిటినీ బుట్టనిండా ఏరి, ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దెయ్యాలు రెండింటికీ ముసలమ్మ కొట్టం ఉన్న మర్రిచెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండూ మర్రి ఊడల్ని పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళి, పళ్ళన్నీ అమ్మి, చీకటిపడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండూ ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి రెండూ అవ్వకు కనిపించాలనుకుని, ఒక్కసారిగా కనిపించి ఇకిలించాయి.\n\nఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ ఖంగుతిన్నది. కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ- \"ఎవరు మీరు? ఏం కావాలి మీకు?\" అని ప్రశ్నలు వేసింది దర్జాగా.\n\n\"మేము దయ్యాలం. మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడివేడి రొట్టెలు కావాలి\" అని దయ్యాలు రెండూ ఏకకంఠంగా అరిచాయి.\n\nముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలెమ్మని, ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ `దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా?' అని ఆలోచించేసుకుంది ముసలమ్మ.\n\nఆపైన పథకం ప్రకారం మూడు జొన్న రొట్టెలను చేసి, వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి.\n\"కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం\" అన్నది మొదటి దయ్యం.\n`సరే'నన్నది రెండో దయ్యం.\n\nమరి లెక్కపెడితే రొట్టెలేమో మూడున్నాయి! ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్కపెట్టిన మొదటి దయ్యం. దానికిగాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి, రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది:\n\n\"ఒరేయ్! మనం ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె. గెలిచిన వాడికి రెండు రొట్టెలు\" అన్నది.\n\"సరే\" అన్నది రెండవ దెయ్యం.\n\nఇక అవి రెండూ ఒకదాని కళ్లల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంత సేపటికీ పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళ రెప్పలు ఆర్పలేవాయె!\n\nఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో నాలుగు ఇనుప చువ్వలను పెట్టి ఎర్రగా కాల్చి, ఆ రెండింటినీ తీసుకొని, మెల్లగా వెళ్ళి, ఒక దయ్యానికి వెనక అంటించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనైంది. అది ఎగ్గిరి దూకి, బోర్లా పడి, మొత్తుకోసాగింది.\n\nతనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దెయ్యం అవ్వను, అవ్వ చేతిలోకి చేరుకున్న మరో రెండు చువ్వల్నీ గమనించలేదు. అది గంతులేసుకుంటూ \"నాకు రెండు! నాకు రెండు! అని బిగ్గరగా అరిచింది.\n\n'రెండేం ఖర్మ! నాలుగిస్తా'నని అవ్వ దానికీ రెండు అంటించింది. ఆ వాతల దెబ్బకు దెయ్యాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి.\n\nమూడు రొట్టెల్నీ మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని, హాయిగా నిద్రపోయింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 333,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఒకటి-రెండు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 83,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! \"అతి సర్వత్రావర్ష్యమేత\"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.\n\nపదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.\n\nఅదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.\n\nఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.\n\nసభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. \"సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను\" అని గొప్పగా చెప్పాడు.\n\nమహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, \"ఏంటిసార్! అలా ఉన్నారు\" అని అడిగాడు.\n\n\"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను\" అని చెప్పారు చక్రపాణిగారు.\n\nఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 334,
        "IMAGE": "cat_2",
        "NAME": "అభిమాని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 84,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”\n\nగురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”\nసందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 335,
        "IMAGE": "cat_2",
        "NAME": "సందేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 85,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ అడవిలోచాలా కుందేళ్లు ఉండేవి అవనీ పక్కనే ఉన్న మరోఅడవికి బయలుదేరాయి కొంత దూరం వేళ్ళేసరికి దారిలొ ఓ నీటి కాలువ ఎదురైంది వీటికి ఈత రాదు కదా! కాలవ చుట్టూ తిరిగి వేళితే గాని అవతలి ఒడ్డు చేరుకోలేవు. చేసేదిలేక కుందేళ్లన్నీ కాలవ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి.\n\nఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చినదానిలా.\n\n'మీరు వెళ్ళండి, నేను తరువాత వస్తాను 'అంది' ఎలాంటి ఆకతయి పనులూ చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేయ్' అను దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది.\n\nదాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి. మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి.\n\n'ఓయ్ బాతు మామా... నిన్నే... నువ్వు చాలాఅందంగా ఉన్నావోయ్! నీటిలో భలేగా ఈదుతున్నవే!' కాలవ మధ్యలో ఉన్న బాతుకి వినిపించేలా అంది కుందేలు.\n\n'నిజంగానా... అంత అందంగా ఉన్నానా' ఆ మాటలకు మురిసిపోయింది బాతు ఒడ్డుకు వచ్చేసింది.\n\n'ఈ రోజు నుంచి మనం స్నేహితులం. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు' అంది బాతు.\n\n'అయితే్... నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డు కు వెళ్లాలి. చుట్టూ తిరిగి వెళదామంటే కాళ్లు నొప్పులాయె! మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకెళతావా?' అని అడిగింది కుందేలు.\n\n'ఓ... అదెంత పని' కుందేలును వీపుపై వీపు పై ఎక్కించుకుంది బాతు.\n'మావాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకి చేరుకుంటాను. నాతెలివితేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తా' అని లొలోపల అనుకుంది కుందేలు.\n\nఈదుతున్న బాతుకు నీటి మద్యలో ఓ పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగున ఎగిరి బాతుపై దూకింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 336,
        "IMAGE": "cat_2",
        "NAME": "ముందుజాగ్రత్త",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 86,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన కొమ్ములతో యెవ్వరినైన ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయ్యారయ్యింది. వచ్చే పొయే ప్రతి చిన్న జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దెగ్గిరకు వెళ్ళి ఆ నక్క “ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు – నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను” అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. “ఆ విరొధి యెవరు?” అని నక్కను అడిగింది. “అదుగో ఆ కొండను చూడు – యెంత యెత్తుగా కనిపిస్తొందో! దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది” అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపొయాయి. గొర్రెపోతు బుధ్ధి తెచ్చుకుని అందరితో వినయంగ మెలగడం నేర్చుకుంది.\n\nఇందిలో నీతి యేమిటంటే, యెదుటి వారి బలం తెలీయకుండ మనం విర్రవేగిపోకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 337,
        "IMAGE": "cat_2",
        "NAME": "పొగరుగల గొర్రెపోతు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 87,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది. ఒక రోజు ఆవిడ దెగ్గిర పొరుగింటామె వచ్చి ఒక గిన్న అడిగి తీసుకుంది. తిరిగిచ్చేడప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆష్చర్యపోయింది. రెండు గిన్నెలిచ్చావేంటి? అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది.\n\nకొన్ని రోజులు గడిచాయి. పొరుగింటామె మళ్ళీ ఒక రోజు గిన్నె కోసమొచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈ సారి తిరిగిచ్చేడప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆత్రుతతో ఎదురుచూసింది. కాని పొరుగింటామె అసలు గిన్నెను తిరిగివ్వలేదు. చాలా రోజులు చూసాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించడిగింది. పొరుగింటామె యేడుపుమొహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఖసమాచారము చెప్పింది. గిన్నె చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆష్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామె గిన్ని పిల్లలిని పెట్టగా లెనిది చనిపోతె ఆష్చర్యమెందుకు? అనడిగింది.\nఇది విన్న ధనవంతురాలు యేమి మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 338,
        "IMAGE": "cat_2",
        "NAME": "ధనవంతురాలి గిన్ని",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 88,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమయిపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది.\n\nఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టుకింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది. దెగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసినవెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తనదెగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది. “నీ దెగ్గిరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను” అన్నాడు మనిషి.\n\n“నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు – నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నయిపోయాను” అంది పులి. ఈ మాటవిని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దెగ్గిరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది.\nనిజంగా దురాశ దు:ఖానికి చేటు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 339,
        "IMAGE": "cat_2",
        "NAME": "పులి చేతిలో గాజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 89,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలోడింటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది.\n\nఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, “నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?” అనడిగింది.\n\n“మన యెజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడ పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?” అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.\n\n“ఇది మనం మొరబెట్టుకునే సమయంకాదు. మన యజమానికి సహాయం చేయాలి” అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది.\n\nదెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడకొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు.\n\nఎవరి పని వాళ్ళే చేయాలని అప్పుడు గాడిదకు అర్ధమయ్యింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 340,
        "IMAGE": "cat_2",
        "NAME": "చాకలోడి గాడిద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 90,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది.\n\nఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి.\n\nమూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.\n\nరూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 341,
        "IMAGE": "cat_2",
        "NAME": "కోపం వచ్చిన కోతులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 91,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఛత్రపూర్ రాజ్యాన్ని జ్ఞాన్ చంద్ అనే రాజు పరి పాలించేవాడు. పేరుకు జ్ఞాన్చందే తప్ప, ఆయన గుణగణాలలో గాని, స్వభావంలో గాని మచ్చుకు కూడా జ్ఞానం కనిపించేది కాదు. ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ కనబరిచేవాడు కాదు. వ్యవ సాయూభివృద్ధికి బావులు, చెరువులు తవ్వించడం, బాటలు వేయడం మొదలైన వాటిని పూర్తిగా ఉపే క్షించాడు. దాంతో ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక తరచూ కరువు కాటకాలతో కటకటలాడ సాగారు.\n\nఅయినా రాజు జ్ఞాన్ చంద్ ఇలాంటి పరిస్థితులలోనూ ప్రజల మీద మోయ లేని పన్నులు విధించేవాడు. వాటిని చెల్లించలేక ప్రజలు చెప్పలేని బాధలు అనుభవిస్తూ, ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించ సాగారు. ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మర్రిచెట్టు కింద గుమిగూడి చర్చిస్తూన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒకాయన, ఇలాగే చూస్తూ కూర్చుంటే మన గతి ఏమవుతుంది? మనలో మనం మథన పడ్డంవల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం.\n\nఇక ఏమాత్రం సహించడానికి వీలుకాదు! అన్నాడు. ఆ మాటలన్న వ్యక్తి పేరు కుంజీలాల్. ఆయన ఇప్పటి రాజు జ్ఞాన్ చంద్ తండ్రి మహారాజు అతుల్య చంద్ సైన్యంలో సైనికుడిగా అనేక యుద్ధాలలో పాల్గొన్నవాడు. ఆ మాజీ సైనికుడు ఇప్పుడు తమ సమస్యల కేదైనా పరిష్కారం చూపగలడా అని గ్రామ ప్రజలు ఆతృతగా ఎదురుచూడసాగారు. మొదట పన్నులు చెల్లించడం మానేద్దాం. పన్ను వసూలుకు వచ్చే అధికారి వట్టిచేతులతో తిరిగి వెళ్ళనీ.\n\nఆ తరవాత రాజు ఏం చేస్తాడో చూద్దాం, అన్నాడు కుంజీలాల్ సాలోచనగా. అవును. అలాగే చేద్దాం. ఒకవేళ అధికారి తిరిగి వెళ్ళనంటే నాలుగు తగిలించి మరీ పంపుదాం, అన్నారు, అన్నాళ్ళు ఎంతో ఓర్పుతో కష్టాలను భరిం చిన గ్రామస్థులు ధైర్యాన్ని కూడదీసుకుంటూ. పన్నులు వసూలు చేసే అధికారి అదృష్టమో ఏమోగాని అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పన్నులు చెల్లించడానికి నిరాకరించిన గ్రామానికి పన్నులు వసూలు చేసే అధికారిని కాకుండా, గ్రామస్థుల మీదికి సైనికులను పంపడానికి నిర్ణ యించాడు రాజు.\n\nగ్రామం పొలిమేరలో రాజధాని నుంచి సైని కులు కొందరు వచ్చి విడిది చేసి రాజు రాక కోసం ఎదురుచూస్తున్నారని కొందరు గ్రామస్థులు కుంజీ లాల్‌కు చెప్పారు. ఆ వార్త విని కుంజీలాల్‌ ఏమాత్రం భయపడలేదు. తమ్ముడు కీర్తిలాల్‌ను వెంటబెట్టు కుని వెళితే, రాజు సేనలను సులభంగా ఎదుర్కొని పారదోలవచ్చు అనుకుని అతని వద్దకు వెళ్ళాడు. అయితే, పిరికివాడైన కీర్తిలాల్‌ అన్న వచ్చిన ఉద్దేశం గ్రహించి, క్షమించు అన్నయ్యూ.\n\nఆరోగ్యం బాగా లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు, అన్నాడు బాధ నటిస్తూ. ఆ మాట విని కుంజీలాల్‌ ఆశ్చర్యం చెందలేదు. ఆశాభంగానికి గురికాలేదు. గ్రామంలోని యువకు లందరినీ కూడగట్టుకుని రాజు సైనికులను ఎదు ర్కొన్నాడు. అదృష్ట వశాత్తు, గ్రామయువకులు సైనికులకన్నా అధిక సంఖ్యలో ఉండడంతో, వాళ్ళు సైనికులను ధైర్యంగా ఎదుర్కొని సులభంగా ఓడించారు.\n\nవిజయం సాధించి వచ్చిన గ్రామ యువ కులకు కీర్తిలాల్‌ గ్రామస్థులతో కలిసి ఘన స్వాగతం పలికాడు. అన్నను తెగమెచ్చుకున్నాడు.అన్నయ్యూ, నువ్వు పిలిచినప్పుడు నిజంగానే నేను నీతో రావాలనుకున్నాను. అయినా వైద్యుడి సలహాను జవదాటలేక పోయూను. అయినా, సైనికుల నుంచి కొల్లగొట్టిన దాంట్లో నాకూ కొంత ఇవ్వు. ఎంతయినా, నీ తమ్ముణ్ణి కదా? అన్నాడు. కుంజీలాల్‌కు తమ్ముడితో గొడవ పడడం ఇష్టంలేదు.\n\nఅందువల్ల సైనికుల నుంచి కొల్లగొట్టిన దానిలో కొంత ఇచ్చి అతన్ని సంతోషంగా సాగనంపాడు. రాజు జ్ఞాన్‌చంద్‌ తనను విజయోత్సా హంతో అట్టేకాలం ఉండనివ్వడనీ, తనను శిక్షించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడనీ కుంజీలాల్‌ గ్రహించాడు. తనను గురించి భయపడ లేదు గాని, తన భార్యను తలుచుకుని విచార గ్రస్తుడయ్యూడు. ఆయన భార్య గంగాదేవి నిండు చూలాలు. ఆయన ఒకనాడు, గంగా, రాజు నన్ను శిక్షించాలన్న కక్షతో నీకు హాని కలిగించవచ్చు.\n\nఅందువల్ల నిన్ను దూరంలో ఉన్న సురక్షితమైన ఒక కొండ గుహలో వదిలిపెడతాను. అక్కడ నీకు ఎలాంటి హానీ జరగదు. ఇక్కడి ప్రమాదకర పరిస్థితులు కుదుట పడ్డాక నేనే వచ్చి నిన్ను తీసుకు వస్తాను,అన్నాడు. భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి గంగా దేవి మొదట ఒప్పుకోలేదు. ప్రభూ, తమరు వెళ్ళి రాజుగారికి క్షమాపణలు చెప్పుకుంటే సరి పోతుంది కదా.\n\nఆయన తప్పక క్షమించగలడు, అని ప్రాథేయపడింది. అది జరగని పని గంగా. మన రాజు అలాంటి రకం కాదు. నిరుపేదలైన గ్రామప్రజలను అతడు వేధించడం చూస్తున్నావు కదా! రాజు తన వైఖరిని మార్చుకునే వరకు నేను పోరాడక తప్పదు, అన్నాడు కుంజీలాల్‌ దృఢనిశ్చయంతో. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 342,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఇద్దరన్నదమ్ములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 92,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒకావిడ ఉండేది. ఆవిడ కొడుకు జబ్బు పడి ప్రాణాలను కొలిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ క్రుంగి పోయింది. చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మట్టుకు తగ్గలేదు, యే రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలో యెప్పుడూ వుండెది.\n\nఒక రోజు ఊరిలోకి ఒక బొధిసత్త్వుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానముగల వాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింప చేయ గలుగుతాడేమోనని ఆశ పడింది. వెళ్ళి ఆ బొధిసత్త్వుడి కాళ్ళ మీద పడి, తన కొడుకుని మళ్ళి తనకు దక్కేలా చెయమని అడిగింది.\n\nఆ బొధిసత్త్వుడు ఊళ్ళో యెవ్వరూ మరిణంచిని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రమ్మన్నాడు.\n\nమొన్నాడు ఉదయమే లేచి, స్నానం చేసి, దెవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటలోని నిలుచుని వాళ్ళింట్లో యెవరైన మరణించారా అనడిగింది. ప్రతి ఇంట్లోను యెవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు. నిరాశ చందినా అవిడకు జీవితంలో చావు కూడ ఒక భాగమని, అది యెవ్వరు తప్పించలేరని అర్ధం అయ్యింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 343,
        "IMAGE": "cat_2",
        "NAME": "కన్న మమకారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 93,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.\nకాకి “యేమిటది” అని అడిగింది.\n\n“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.\n\nఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.\n\nకాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది.\n\nఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 344,
        "IMAGE": "cat_2",
        "NAME": "మిణుగురు పురుగు, కాకి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 94,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాల సార్లు ఆహ్వానించాడు. కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు.\n\nఒక రోజు ఆ చక్రవర్తి మారు వేశం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్యారాడు. బజారును తనిఖి చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళో కి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు.\n\nపర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు.\n\nఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి యెందుకలా చేసాడని కన్నుక్కున్నాడు. దానికి మంత్రి, “మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రొధం చూస్తే అతన్ని గొర్రెను కోసినట్టు సమ్హరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి, మీ మనస్థిథి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి” అని జవాబు చెప్పాడు.\nచక్రవర్తి ఆ వివేకంగల మంత్రి దూరదృష్టిని అభినందించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 345,
        "IMAGE": "cat_2",
        "NAME": "మంత్రి, సామంతరాజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 95,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.\n\nఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.\n\nసింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.\n\nసింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.\nదుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 346,
        "IMAGE": "cat_2",
        "NAME": "నక్కా, సింహం, జింకా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 96,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని బల్లపై కొన్ని వస్తువులను ఉంచి విద్యార్ధుల ముందు నిల్చున్నాడు. క్లాసు మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా ఉపాధ్యాయుడు ఒక గాజుపాత్రను రాళ్ళతో నింపసాగాడు.\n\nఆ తరువాత కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని వాటిని ఆ పాత్రలోకి నింపసాగాడు. ఆ గాజుపాత్రను ఊపగానే గులకరాళ్లు పెద్ద రాళ్ళ మధ్యన ఉన్న ఖాళీ స్ధలంలోనికి చేరిపోయాయి. మళ్ళీ ఉపాధ్యాయుడు \"ఇప్పుడు ఈ పాత్ర నిడిందా?\" అని అడగ్గానే \"నిండింది\" అనే సమాధానం చెప్పారు విద్యార్ధులు.\n\nఒక సంచిలో నుంచి కొంత ఇసుకను తీసి పాత్రలో నింపాడు ఉపాధ్యాయుడు. ఆ పాత్ర మిగిలివున్న ఖాళీ స్ధలాన్ని ఆ ఇసుక ఆక్రమించేసింది. మళ్ళీ \"పాత్ర నిండిందా?\" అని ప్రశ్నిచిన ఉపాధ్యాయుడికి \"నిండింది\" అనే సమాధానమే ఇచ్చారు విద్యార్ధులు.\n\n\"ఇప్పుడు చెప్పండి ఈ గాజుపాత్ర మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కదా! గమనించారా? పెద్ద రాళ్ళు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు - మన కుటుంబం, ఆరోగ్యం మొదలైనవి. ఈ రెండు అంశాలు ఉంటే మిగతా అంశాలు మన జీవితానికి అవసరం లేదు\".\n\n\"చిన్న గులకరాళ్ళు మిగతా అంశాలు - మన ఉద్యోగం, వృత్తి, ఇల్లు మొదలైనవి. ఇసుక మిగతా చిన్న చిన్న అంశాలు. మనం ముందుగానే ఇసుకతో గాజుపాత్రను నిలిపినట్లయితే గులకరాళ్ళకు, పెద్ద రాళ్ళకు చోటు ఉండేది కాదు. మన జీవితము అంతే. చిన్న చిన్న సుఖాలు కోసం సమయం, శక్తి వృధా చేసుకుంటే ముఖ్యమైన అంశాలను కోల్పోతాం. మన సంతోషానికి కారణం కాగల అంశాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. కుటుంబసభ్యులతో ఆడటం, ఇంటి దగ్గర గడపడం... ఇలాంటివి సమయం ఉన్నప్పుడు కోల్పోతే ఆ క్షణాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మన జీవిత గమనం అనేది నిర్దేశిత లక్ష్యాలతో, ముఖ్యమైన అంశాలు ప్రాతిపదికను సాగాలి\" అని విద్యార్ధులకు వివరించాడు ఉపాధ్యాయుడు. ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామన్న తృప్తితో విద్యార్ధులు చప్పట్లతో తరగతి గదిని హోరెత్తించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 347,
        "IMAGE": "cat_2",
        "NAME": "ముఖ్యమైన పాఠం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 97,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.\n\nరంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.\n\nఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 348,
        "IMAGE": "cat_2",
        "NAME": "చారలు కోరిన నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 98,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”. ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.\n\nకొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.\nఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.\n“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.\n“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 349,
        "IMAGE": "cat_2",
        "NAME": "అద్దం, రాయి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 99,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "టర్కీ రాజు మంచి పాలకుడు, కాని కొంచెం మూఢనమ్మకాలెక్కువ.\nరాజుగారికి రోజూ ఉదయం లేవగానే సూర్యుడిని చూడాలని, ఇతరులెవరినైనా చూస్తే ఆ రోజు దురదృష్టం వెంటాడుతుందని అతని మూఢనమ్మకం.\n\nఒకరోజు వేటకెళ్లడానికి ఉదయాన్నే నిద్ర లేచిన రాజుగారు తోటలో ఎవరినీ చూడకుండా నడుస్తూ వెళ్తున్నాడు. ముల్లా నస్రుద్దీన్‌ కూడా మంత్రి గారికి ఒక సమాచారం తెలపడానికి అటువైపే వచ్చాడు. రాజుని చూసిన నస్రు \"రాజుగారూ శుభోదయం! బావున్నారా?\" అని పలకరించాడు.\n\nదానికి రాజుగారు మారు మాట్లాడకుండా నేలను చూస్తూ ముందుకు కదిలాడు. ఆశ్చర్యపోయిన నస్రు రాజుగారి మెహంలోకి చూస్తూ \" ఏమయింది రాజా?! మీ మెడగానీ పట్టేసిందా?\" అన్నాడు.\n\nనస్రుని చూడడం దురదృష్టం అని భావించిన రాజు కోపంతో, \"ఇంత ఉదయమే నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? నన్ను కలవాల్సిన అవసరం ఏంటి? నీకు తెలీదా నేను సూర్యుణ్ణి చూసిన తర్వాతే ఇతరులను చూస్తానని?\" అని అరిచాడు.\n\nకోపం పట్టలేని రాజు సైనికులను పిలిచి, \"నస్రుని తీసుకెళ్ళి గదిలో బంధించండి. ఆహారం, నీరు ఇవ్వండి, కాని నేను వేటకు వెళ్ళి వచ్చేవరకు గదిలోనే ఉంచండి. ఇతన్ని చూడడం వలన నాకేదైనా దురదృష్టం కలిగిస్తే నేను వచ్చిన తర్వాత ఇతన్ని శిక్షిస్తాను\" అన్నాడు.\n\nసైనికులురాజు చెప్పినట్టే చేశారు. వేటకెళ్ళి తిరిగొచ్చిన తర్వాత రాజుగారు చాలా ఆనందంగా కనిపించారు. ఆ రోజు వేట ఆయనకు బాగా కలిసొచ్చింది. అతనికి తన మూఢనమ్మకం తప్పని తెలిసింది. నస్రుతో ఇలా అన్నాడు \"రా మిత్రమా! నిన్ను చూడడం దురదృష్టం కలిగిస్తుందని భావించిన నాకు కళ్లు తెరుచుకున్నాయి. ఈ రోజు వేట ఓ అధ్బుతం. నన్ను క్షమించు.\"\n\nబదులుగా నస్రు \"నన్ను తప్పుగా అనుకోకండి రాజా! నేను ఉదయాన్నే మీ మెహం చూసినందుకు చూశారుగా ఈ శిక్ష. నాకు దురదృష్టం తెచ్చిందెవరో?\"\n\nఅతని మాటలకు రాజు నవ్వుతా నస్రుని ఆలింగనం చేసుకుని వరహాల సంచిని కానుకగా ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 350,
        "IMAGE": "cat_2",
        "NAME": "మూఢ నమ్మకం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 100,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు బోధిసత్వుడు ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ వర్తకంలోని మెళకువలను పెద్దలనుంచి నేర్చుకున్నాడు. ప్రతి విషయాన్నీ అన్ని కోణాల నుంచీ పరిశీలించి నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునే వివేకం పెంపొందించుకున్నాడు. పెద్ద వాడై అతను అయిదువందల బండ్ల మీద సరకు వేసుకుని తూర్పు నుంచి పడమరకూ, పడమరనుంచి తూర్పుకూ తరచూ వెళ్ళి వర్తకం చేసేవాడు. అలా వెళ్ళిన ప్రతిసారీ మంచి లాభాలు గడించేవాడు.\n\nకాశీనగరంలోనే మందమతి అయిన మరొక వర్తకుడు ఉన్నాడు. అతను ఉపాయహీనుడు కూడానూ. ఒకసారి బోధిసత్వుడు తన బండ్లమీద సరకు వేసుకుని, ప్రయాణానికి సిద్ధంగా ఉండగా, మందమతి ఆయన దగ్గరికి వచ్చి తాను కూడా అదే సమయంలో బయలుదేరుతానన్నాడు.\n\nబోధిసత్వుడు మందమతితో, \"నీ బళ్ళూ, నా బళ్ళూ ఒక్కసారిగా బయలుదే రితే, దారి ఇరుకై, ప్రయాణానికి ఇబ్బంది కలగవచ్చు. అందుచేత ఒకరి వెనుక ఒకరు బయలుదేరటమే అన్నివిధాలా మంచిది. ముందు నువ్వు బయలు దేరమన్నావా? నీ ఇష్టప్రకారమే చేద్దాం,\" అన్నాడు.\n\nమందమతి తనలో ఇలా అనుకున్నాడు: \"ముందు నేను పోయినట్టయితే చాలా లాభాలుంటాయి. దారి నలగదు. ప్రయాణం హాయిగాసాగుతుంది. దారి పొడవునా పశువులకు మంచి పచ్చికా, మనుషులకు మంచి కాయలూ, ఫలాలూ, కూరలూ లభించవచ్చు. నిర్మలమైన నీరు లభ్యమవుతుంది. వెళ్ళిన చోట సరకుల ధరలు నా ఇష్టప్రకారం నిర్ణయించవచ్చు.\" బోదిసత్వుడు కూడా తనలో ఇలా అనుకున్నాడు:\n\n\"అందరికన్నా ముందు వెళ్ళడంకన్నా, ఒకరు తొక్కిన దారిన ప్రయాణిం చటం తేలిక. ఒకసారి పశువులు మేసిన చోట గడ్డి మళ్ళీ చిగురు పట్టిన ప్పుడు రెండింతలు అవు తుంది. కూరగాయలు కూడా అంతే. ముందు వెళ్ళిన వారు నీటి వనరులు ఎక్కడ ఉన్నవో కష్టపడి కనిపెడతారు. లేదా నీటికోసం బావులు తవ్వుతారు. అని తవరాత వెళ్ళేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త చోటికి మొదటి సారిగా వెళ్ళి అక్కడివారితో ధరలను గురించి బేరాలాడటం అంతమంచిది కాదు. ముందు వెళ్ళిన వాళ్ళూ నిర్ణయించిన ధరలకు వెనక వెళ్ళేవాళ్ళు ఎలాంటి సమస్యా లేకుండా అక్కడి వారితో చాలా మంచిగా వర్తకం చేసుకోవచ్చు.\"\n\nఇలా అనుకుని మందమతి ముందు తాను పోతాననేసరికి బోధిసత్వుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. మందమతి మనసులో ఎంతగానో సంతోషించాడు. మందమతి వెళ్ళవలసిన చోటు అరవై యోజనాల దూరాన ఉన్నది. మధ్యలో పెద్ద ఎడారి ఉన్నది. దానిని దాటి గమ్యం చేరుకోవాలి. అందుచేత ప్రయాణానికి అవసరమైన తినుబండారాలూ, పీపాలతో తాగటానికి నీరూ సిద్ధం చేసుకుని మందమతి బోధిసత్వుడికి మంచిటోపీ వేశాననుకుని సంతోషంగా బయలు దేరాడు.\n\nమందమతి బిడారు చాలా దూరం ప్రయాణంచేసి, కొన్నిరోజులకు ఎడారి ప్రాంతం చేరుకున్నది. అందులో కొంత దూరం వెళ్ళేసరికి మందమతికి అపూ ర్వమైన వాహనం ఒకటి ఎదురయింది. దానికి ఉత్తమజాతి ఎద్దులు, తెల్లనివి, పూన్చి ఉన్నాయి. అందులో ఒక రాజపురుషుడు చాలా ఠీవిగా కూర్చుని ఉన్నాడు. ఆ బండి ముందు సేవకులు కత్తులూ, కటార్లూ, విల్లమ్ములూ ధరిం చి నడుస్తున్నారు. వెనక మరికొందరు నడుస్తున్నారు. బండిచక్రాలకు బురద అంటి ఉన్నది. అందరి తలలకూ తామర తూండ్లు చుట్టి ఉన్నాయి. వారి చేతు ల్లో తామరపూలు ఉన్నాయి.\n\nరాజపురుషుడు మందమతితో, \"ఏం వర్షం! కుంభపోతగా ఒకటే వాన! అదుగో, కనిపిస్తూన్న ఆ అడవి ఆ ప్రాంతమంతా జలమయమే. ఏళ్ళూ, ఊళ్ళూ ఏకమై పోయాయి! అలాంటి వర్షం నా జీవితంలో చూడలేదు. మీరు అటే పోతున్నారు గదా, ఈ పీపాలతో నీరేమిటి? ఎందుకొచ్చిన బరువు? నీరు పారబోసి తేలికగా వెళ్ళండి,\" అని సలహా ఇచ్చాడు మందహాసం చేస్తూ.\n\nఆ రథంలో ఉన్నవాడూ, వాడి వెంటవున్న పరివారమూ నరభక్షకులైన యక్షు లు. వాళ్ళు ఇటువైపు వచ్చే ఎడారి ప్రయాణీకులను ఇలాగే మంచి మాటలతో వంచించి, వారు తిండికి మాడి, దాహంతో చచ్చినాక వాళ్ళను హాయిగా పీక్కు తింటారు.\n\nఈ సంగతి గ్రహించక మందమతి బండ్లలోని పీపాలన్నీ ఖాళీ చేయించి, ముందుకు కదిలాడు. దూరాన రాజపురుషుడు చూపిన అడవి కనబడుతు న్నదేగాని, ఎంత దూరం వెళ్ళీనా అది చేరువకాలేదు. వర్షం కురిసిన ఆనవాలు ఏ మాత్రం కనిపించలేదు.\n\nఅందరూ దాహంతో బాధపడుతున్నారు. తాగటానికి నీటిచుక్క కూడా లేదు. గొంతులు ఎండిపోయి సొమ్మసిల్లి ఒక్కొక్కరే మరణించసాగారు. క్రమంగా ఎడ్లు కూడా సోలిపోయాయి, చచ్చిన మనుషులనూ, పశువులనూ యక్షులు వచ్చి తెనేసి, అస్థిపంజరాలను ఎడారి ఇసుకలో వదిలేశారు.\n\nనలభై అయిదు రోజులు గడవనిచ్చి, బోధిసత్వుడు కూడా తన బిడారుతో అదే తోవన బయలుదేరాడు. అతను కూడా సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన తిను బండారాలూ, పీపాలతో నీరూ బళ్ళల్లో సమకూర్చుకున్నాడు. వాళ్ళూ ఎడారి ప్రాంతం చేరగానే బోధిసత్వుడు తన మనుషులతో, \"నాతో చెప్పకుండా ఎవరూ ఒక్కచుక్క నీరు పారబోయవద్దు. ఇలాటి ఎడారిలో రకర కాల విషవృక్షాలుంటాయి. కొత్తరకం కాయగాని, ఆకుగాని ఎవరూ తినవద్దు,\" అన్నాడు.\n\nబిడారు కొంత దూరం వెళ్ళేసరికి రాజపుషుడు రథం లాంటి తన వాహనంలో అంతకు ముందు ఎదురుపడి, మందమతితో చెప్పినట్టే చెప్పాడు. అతనితో బోధిసత్వుడు, \"మీ దారిన మీరు వెళ్ళండి. చాలా దూరం ప్రయాణం చేయవల సి ఉంది. మేం వర్తకులం. ఇంకో చోట నీరు కనబడితేగాని ఉన్న నీరు పారబో యం. మొదటి నీరు కనిపించనీ. కావాలంటే అప్పుడు బరువు తగ్గించుకుం టాం,\" అన్నాడు.\n\nయక్షుడు ఆ తరవాత ఏమీ చెప్పకుండా మౌనంగా తనదారిన వెళ్ళిపోయాడు. అతని మాటలు నమ్మి సేవకులు కొందరు నీరు పారబోద్దామన్నారు. బోధిస త్వుడు వారితో ఇలా అన్నాడు:\n\n\"ఈ ప్రాంతంలో జలాశయం ఏదన్నా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ మనిషి కుంభపోతగా వర్షం కురిసిందన్నాడు. మనకేసి తడిగాలి ఏమైనా వీచిం దా? ఆకాశంలో ఎక్కడైనా మబ్బుతునకలాటిది కనబడుతున్నదేమో చూడం డి? మెరుపులు కనబడ్డాయా? ఉరుములు వినబడ్డాయా? మనం చూసిన వాళ్ళు యక్షులు. మనం శోషపడి పోతే తినటానికి ఎత్తు వేశారు. మన ముందు పోయిన వర్తకుణ్ణీ, అతని మనుషులనూ తినేసే ఉంటారు. వాళ్ళ అస్థిపంజరాలు దారిలో మనకు కనబడవచ్చు కూడా!\" అతను చెప్పినట్టే, బిడారు కొంత దూరం వెళ్ళేసరికి, మందమతి తాలూకు అయిదువందల బళ్ళూ, వాటిలోని వర్తక సరులులూ కనిపీంచాయి. వాటి చుట్టూ మనుషులవీ, పశువులవీ అస్థిపంజరాలు చెదురు మదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడడానికి చాలా బీభత్సంగా ఉంది.\n\n\"చూశారా? మందమతి దూరాలోచన చెయ్యక, ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీరు పారబోసుకోవటం వల్ల ఏం జరిగిందో? \" అన్నాడు బోధిసత్వుడు.\n\nఆ ప్రాంతంలోనే ఆ రాత్రి మజిలీ చేసి, బోధిసుత్వుడు, మర్నడు ఉదయం, చచ్చి పోయిన వర్తకుడి బళ్ళలో చెడిపోనివీ, సరుకులలో బాగా ఉన్నవీ తన వెంట తీసుకుని గమ్యస్థానానికి వెళ్ళి, లాభసాటిగా తన దేశనికి తిరిగి వచ్చాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక్క ప్రాణి కూడా నష్టం కాలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 351,
        "IMAGE": "cat_2",
        "NAME": "సఫలయాత్ర",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 101,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు. ఆ గిత్త నల్లని నిగనిగ లాడే రంగుతో, చూడముచ్చటగా వుండేది. దాని అందం, గాంభీర్యం చూసి, దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసి పోయేవారు.\n\nఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశిపెద్దమ్మ ఇంటి భాగంలో కాపరం వుంటూ వచ్చారు. కొన్నాళ్ళ తరవాత వాళ్ళు, ఆ ఊరు వదిలి పోవలసి వచ్చింది. వాళ్ళు పేదరాసి పెద్దమ్మకు ఇంటి అద్దెకింద, ఆ నల్లగిత్తను ఇచ్చేశారు. పెద్దమ్మకు నా అన్నవళ్ళెవరూ లేరు. ఆమె ఆ నల్లగిత్తనే బిడ్డలా చూసుకుంటూ రాసాగింది.\n\nబియ్యపు కడుగూ, గంజినీళ్ళూ కలిపి, అందులో తౌడువేసి మంచి కుడితి తయారు చేసి, పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది. రోజూ కాలవకు తీసుకుపోయి మెత్తని గడ్డిపరకలతో దాని ఒళ్ళంతా తోమి, శుభ్రంగా కడిగేది. ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడూ కట్టుకొయ్యకు కట్టివేసి ఎరగదు.\n\nనల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ, దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినై. అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్చగ తిరెగేది. పిల్లలూ దానిమీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు. దాని గంగడోలు దువ్విదానితో ఎన్నో ఆటలు ఆడేవారు.ఒక రోజున నల్లగిత్త తనలో ఇలా అనుకున్నది: \"నన్ను పెంచే పెద్దమ్మకడు పేదరాలు. నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది. నే నామెకు కొంత ధనం సంపాయించి పెట్టగలిగితే, ఆమె శ్రమ చాలావరకు తగ్గించిన దానినవుతాను!\"\n\nఇటువంటి ఆలోచన కలగగానే, అది ధనం సంపాయించే మార్గాలకోసం వెదకసాగింది. ఆ స్థితిలో ఒక రోజున, ఐదు వందల బండ్లపైన ధాన్యం వేసుకుని వర్తకుడొకడు, ఆ ఊరు కేసి బయలుదేరాడు. బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులూ లేకుండా కదిలినై. కాని, ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది. ఆ ప్రాంతమంతా ఇసుకమయం.\n\nఆ ఇసుకలో బళ్ళవాళ్ళూ ఎంత ప్రయత్నించినా ఎడ్లు బండ్లను లాగలేక పోయినై. ఆ కారణంగా అన్ని బళ్ళూ ఏటిపక్కన ఆగిపోవలసి వచ్చింది. ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి, బళ్ళను లాగించాలని చూశారు. కాని, ఆ ప్రయత్నం ఫలించలే దు. ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త, ఏటికి ఆవలిగట్టున మరికొన్ని పశువులతో కలిసి మేతమేస్తున్నది. ఆ పశువులలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా వున్నవేమో అని చూసేందుకు, వర్తకుడు తన మనుషు లతో అక్కడికి వచ్చాడు.\n\nఆ వర్తకుడి దృష్టిని బలంగా, చలాకీగా వున్న నల్లగిత్త ఆకర్షించింది. \"ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తున్నది. దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరుదాటించవచ్చు,\" అనుకున్నాడు వర్తకుడు.\n\nవర్తకుడు, అక్కడ వున్న పశువుల కాపరి కుర్రవాళ్ళను పిలిచి,, \"ఒరే, ఈ నల్లగిత్త ఎవరిది? దీన్ని కొంచెం సేపు ఎరువిస్తారా? బళ్ళను ఏరు దాటించాలి. కోరిన ధనం ఇస్తాను,\" అన్నాడు. \"గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి. దీనికి యజమాని అంటూఎవరూ లేరు. అలా ఇష్టం వచ్చిన చోటునల్లా తిరుగుతూంటుంది,\" అన్నారు పశువుల కాపరి కుర్రవాళ్ళు.\n\nవర్తకుడు గిత్తమెడకు తాడు కట్టించు దాన్ని అక్కడినుంచి లాక్కుపోవాలని చూశాడు. కాని, నల్లగిత్త ఒక అంగుళమైనా కదలలేదు. దాన్ని ఈడ్చుకు పోవడం వర్తకుడి మనుషుల వల్ల కాలేదు.\n\nవర్తకుడు కొంచెం సేపు ఆలోచించి, బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తూండాలి, అనుకుని, నల్లగిత్తతో, \"నీ రూపురేఖలు చూస్తుంటే, వృషభరాజులా వున్నావు! దయతలచి నా ఐదు వందల బళ్ళనూ ఏరు దాటించు. నీ కష్టం ఉంచు కోను. బండి ఒక్కింటికి రెండేసి వరహాల చోప్పున వేయి వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను,\" అన్నాడు.\n\nవర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి, ఏటి ఒడ్డున వున్న బళ్ళ దగ్గిరకు పోయి నిలబడింది. వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు. గిత్త సునాయాసంగా బండిని అవతలి గట్టుకు లాక్కుపోయింది. ఇలా ఐదువందల బళ్ళనూ అది కొద్ది సేపట్లో అవతలిగట్టుకు చేర్చింది.\n\nతన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టీలోపల ఐదువందల వరహాలు పెట్టి, ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు. వర్తకుడు మోసం గ్రహించిన బోధిస త్వుడు, \"ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది. మాట తప్పాడు!\" అనుకుని ఏటిగట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి, అటకాయిం చాడు.\n\nదానితో వర్తకుడికి, నల్లగిత్త మామూలు పశువు కాదనీ, మహత్తు గలదనీ అర్థమైంది. అతను మరొక ఐదువందల వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి, దానిని గిత్తమెడకు బిగిస్తూ, \"అయ్యా, నన్ను క్షమించు. నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలూ నీ మెడకు కట్టాను. ఇక, నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు,\" అన్నాడు.\n\nగిత్త అక్కడినుంచి బయలుదేరి, సరాసరి తనను ఇంతకాలంగా సాకుతూన్న పెద్దమ్మ దగ్గరకు పోయింది. ఐదువందల బండ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలిసిపోయివున్నది. అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ, మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టివున్న పట్టీలు కనిపించినై.\n\nవాటిని ఊడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కంటబడినై. ఆమె ఆశ్చర్య పోతునంతలో గొడ్లకాపరి కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి, జరిగింది చెప్పారు. పెద్దమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని, గిత్త తల నిమురుతూ , \"తండ్రీ, నా కోసం ఎంత శ్రమ పడ్డావు! ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను?\" అని, అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి, వేడినీళ్ళతో కడిగింది.\n\nఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ప్రేమగా పెంచిన తల్లిఋణం తీర్చిన కొంత కాలానికి, సంతోషంగా నల్లగిత్త అవతారం చాలించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 352,
        "IMAGE": "cat_2",
        "NAME": "తల్లి ఋణం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 102,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు ఆయన వద్ద క్రయాధికారిగా వుండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరం అయిన వస్తు, వాహనాల్లాంటివి నాణ్యం చేయటంలోనూ, వాటి విలువ కట్టటంలోనూ నేర్పుగలవాడన్నమాట.\n\nబోధిసత్వుడు, కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులనూ గుర్రాలనూ, వెండి బంగారాలనూ పరీక్ష చేసి, విలువ కట్టి, తన అంచనా ప్రకారం, ఆ జంతువులనూ, వస్తువులనూ తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుతూండేవాడు.\n\nరాజు బ్రహ్మదత్తుడు పరమలోభి. ఈ క్రయాదికారి కొనే ప్రతి వస్తువుకూ ఎక్కువ ధర చెల్లిస్తున్నాడని కొందరంటున్నారు. ఇది నిజమే అయుండాలి. ఇలా అయితే, త్వరలోనే నా రాజ్యం దివాలా ఎత్తుతుంది!\n\nరాజు ఒకనాడు ఇలా ఆలోచిస్తూ, ఉద్యానం వైపు కిటికీరెక్కలు తెరిచాడు. అక్కడ ఎండలో ఎంతో శ్రమిస్తూ చెట్లకు నీళ్ళు పోస్తున్నవా డొకడు ఆయన కంటబడ్డాడు. వెంటనే ఆయనకు, \"ఆహా, వీడెంత నమ్మకస్థుడు కాకపోతే, ఇలా ఎండలో శ్రమపడతాడు!\" అన్న ఆలోచన వచ్చింది.\n\nఆ మర్నాడే రాజు తోటపని చేసేవాణ్ణి, బోధిసత్వుడి స్థానంలో క్రయాధికారిగా నియమించాడు. ఈ కొత్తవాడు తన బుద్ధికుశలత వల్ల వస్తువులు క్రయం చేయటంలో యుక్తిచేసి, తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ. కాని ఈ కొత్తక్రయాధికారి దురాశపరుడేతప్ప, వివేకం గలవాడు కాదు. అతడికి వస్తుతత్వం గాని, నాణ్యం గాని, దాని విలువ తెలియదు. అందుచేత ఏనుగులూ, గుర్రాలూ, వస్తు సామాగ్రీ బేరం చేయవలసి వస్తే, తన బుద్ధికి ఏమి తోస్తే అది అడగటమే తప్ప, ఒక సరఅయిన పద్ధతీ, అంచనా వుండేది కాదు. ఆ కారణంగా వస్తువులు అమ్మకానికి తెచ్చే వర్తకులకు తరుచు నష్టం కలుగుతూండేది. తన వస్తువులు కొనేది రాజుగారి క్రయాధికారి గనక, నష్టం కలిగినా మారు మాట్లాడలేక వర్తకులు, ఇచ్చిందేదో పుచ్చుకుని ఇళ్ళకు పోయేవాళ్ళు.\n\nఒక రోజున ఉత్తరదేశం నుంచి, ఒక అశ్వవ ర్తకుడు, ఐదు వందల మేలుజాతి గుర్రాలను తీసుకుని కాశీ రాజు వద్దకు వచ్చాడు.\n\nక్రయాధికారి వచ్చి ఐదువందల గుర్రాలనూ పరీక్షించి, \"ఎంత ఆలొచిం చినా వీటి విలువ ఒక కుంచెడు బియ్యం కన్న ఎక్కువ కాదని పిస్తున్నది. వీటి యజమానికి కుంచెడు బియ్యం ఇచ్చి గుర్రాలను శాలలో కట్టి వెయ్యండి,\" అని ఉత్తరువులు జారీ చేశాడు.\n\nఅశ్వవర్తకుడు సరాసరి రాజుగారి పూర్వపు క్రయాధికారి అయిన బోధిసత్వుడి దగ్గిరకు పోయి, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు.\n\nబోధిసత్వుడు అంతా విని, \"అయ్యా, ఒకపని చెయ్యి. ఈ కొత్త క్రయాధి కారిని తృప్తి పరిచేందుకు, ముందుగా అతడికి లంచం డబ్బులు ఇచ్చి, తరవాత ఇలా అడుగు: ' నా గుర్రాలకు తమరు కట్టిన కుంచెడు బియ్యం విలువ న్యాయం గానే ఉన్నది. అయితే ఈ కుంచెడు బియ్యానికి విలువ ఎంతో తమరు సభలో రాజు గారి ఎదుట చెప్పగలరా?' ఇందుకు క్రయాధికారి అంగీకరిస్తే అతణ్ణి రేపు రాజుగారి దగ్గిరకు తీసుకుపో, ఆ సమయంలొ నేను అక్కడ వుండి, నీకు న్యాయం జరిగేలా చూస్తాను,\" అన్నాడు.\n\nబోధిసత్వుడు చెప్పినట్టుగా ఆ అశ్వవర్తకుడు అప్పటికప్పుడే క్రయాధి కారి దగ్గరకు బయలు దేరి వెళ్ళి, అతడికి లంచంగా కొంతడబ్బిచ్చి, బోధిసత్వుడు అడగమన్న విధంగా అడిగాడు.\n\nక్రయాధికారి పరమానంద పడిపోతూ, \"దానిదేముంది! ఈ కుంచెడు బియ్యం విలువ చెప్పటం ఏమంత కష్టం కాదు. రేపు సభలో రాజు గారికి ఆ సంగతి చెప్పి, ఆయన చేత సరే అనిపిస్తాను,\" అన్నాడు. మర్నాడు రాజసభ కిటకిటలాడుతున్నది. రాజు గారి అనుమతి పొంది బోధిసత్వుడు కూడా వచ్చాడు.\n\nనష్టపోయిన అశ్వవర్తకుడు రాజుతో, \"ప్రభూ, తమ కొత్త క్రయాధికారి, నా ఐదు వందల గుర్రాలకూ కుంచెడు బియ్యం విలువ కట్టటం బాగానే వున్నది. ఇందులో నాకొక చిన్న సందేహం కలుగుతున్నది. ఆ కుంచెడు బియ్యానికీ విలువ ఎంత?\" అన్నాడు.\n\nఆ క్షణం వరకూ రాజుకు ఈ విషయంగా జరిగినదేమిటో అసలు తెలియదు. ఆయన ఆశ్చర్యపోతూ, కొత్త క్రయాధికారిని, \"ఐదు వందల గుర్రాల విలువ ఎంత కట్టావు?\" అని అడిగాడు.\n\n\"కుంచెడు బియ్యం, ప్రభూ!\" అన్నాడు క్రయాధికారి తొణకకుండా. \"అలాగా! అయిదు వందల గుర్రాల విలువ కుంచెడు బియ్యం అయితే, ఆ కుంచెడు బియ్యం విలువ ఎంత?\" అన్నాడు రాజు.\n\nకొత్త క్రయాధికారి తడువుకోకుండా, \"కుంచెడు బియ్యం విలువ మరెంతో కాదు, ప్రభూ! కాశీరాజ్యమూ, ఇరుగు పొరుగు సామంత రాజ్యాలూ కలిపితే, ఎంత విలువ వుంటుందో, అంత!\" అన్నాడు.\n\nవిడ్డూరమైన ఈ జవాబు విని, మంత్రులూ సభలోని రాజోద్యోగులూ, పురప్రముఖులూ అవహేళన చేస్తూ చప్పట్లు కొడుతూ రాజు సభలో వున్న సంగతే మరిచి, పొట్టలు చక్కలయ్యేలా నవ్వటం ప్రారంభించా రు.\n\nవాళ్ళల్లో ఒక ప్రముఖుడు లేచి, కొత్త క్రయాధికారితో, \"ఇంతకాలం రాజ్యాలకు విలువ కట్టటం అసాధ్యం అనుకుంటూ వచ్చాం. కానీ, కాశీరాజ్యమంతా కలిసి కుంచెడు బియ్యం విలువ చేస్తుందని, నీ వల్ల ఇప్పుడే తెలుసుకున్నాం. ఆహా, నీ తెలివితేటలు అద్భుతం. ఎంత గొప్ప వివేకివి!\" అంటూ గేలిచేశాడు.\n\nఅప్పుడు బోధిసత్వుడు సభ ముందుకు వచ్చి,\" ఈ క్రయాధికారి చెప్పినది పరమసత్యం, అందులొ విడ్డురం ఏమీ లేదు. అతణ్ణి చూసి నవ్వకండి. ఐదు వందల గుర్రాలూ ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యమూ, సామంత రాజ్యాలూ కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి, ఆ ఐదు వందల గుర్రాల విలువ, కాశీ రాజ్యమూ, సామంతరాజ్యాలూ కలిపినంత అని అర్ధమవుతున్నది. ఇందువల్ల క్రయాధికారి గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా కనబడుతున్నది,\" అన్నాడు.\n\nబోధిసత్వుడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. విచారించగా జరిగినదంతా తెలియవచ్చింది. అప్పుడు కాశీ రాజు తన పొరబాటు గ్రహించి, లంచగొండి క్రయాధికారిని పదవి నుంచి తొలిగించి, తిరిగి బోధిసత్వుణ్ణి ఆ పదవిలో నియమించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 353,
        "IMAGE": "cat_2",
        "NAME": "లంచగొండి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 103,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడుగా జన్మించాడు.అతడు పెరిగి,పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమయింది. అతడికి ఒక తమ్ముడు కూడా వున్నాడు.\nకొంత కాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు.\nకుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావలసిన వసూళ్ళ కోసం అన్నదమ్ములిద్దరూ ఒకనాడు బయలుదేరి వెళ్ళారు.అక్కడ రైతుల నుంచి తమకు రావలసిన ధాన్యం వగైరా వసూళ్ళ ద్వారా వెయ్యి వరహాల నగదు లభ్యమయింది.\n\nఆ డబ్బు తీసుకుని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి బయలుదేరారు.దారిలో వారొక నది దాటవలసి వున్నది. అవతలి తీరానికి తీసుకువెళ్ళే పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి వుండడం చేత,వాళ్ళు ఒకచెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకున్న ఫలహారం మూటవిప్పి తిని, ఇన్ని మంచినీళ్ళు తాగారు.\n\nభోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత ఫలహారం మిగిల్చి, దానిని నదిలోకి విసిరాడు.\n\nభోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో వుండే ఒక జలభూతం అందుకున్నది. ఆ ఫలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది.దాని ద్వారా, ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారెవరైందీ సులభంగా గ్రహించింది.\n\nభోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకుని పడుకున్నాడు.అతడి తమ్ముడిది దొంగబుద్ధి.అన్నకు భాగం లేకుండా వెయ్యి వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధిపుట్టింది. ఆ వెంటనే అతడు వరహాలున్న మూట వంటిదే,అక్కడ దొరికిన రాళ్ళతో మరొక మూట తయారు చేశాడు. ఆ రెండు మూటలూ అన్నకు కనబడకుండా తన దుస్తుల్లో భద్రంగా దాచాడు.\n\nతరవాత కొంతసేపటికి పడవవాడు రాగానే బోధిసత్వుడు నిద్రలేచాడు.అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు.పడవనది మధ్యకు వచ్చింది.తమ్ముడు అతి తీవ్రంగా ఆలోచించసాగాడు.తను చేసిన యుక్తిప్రకారం అతడు రాళ్ళమూటను నదిలో జారవిడవ దలిచాడు.చేసేది దొంగపని గనక,చేతులు వణుకుతూండగా అతడు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జారవిడిచి, \"అయ్యో,అన్నయ్యా!వరహాలమూట కాస్తా నదిలో పడిపోయింది,\" అంటూ బిగ్గరగా అరిచాడు.\n\nఈ మాటకు అన్న, \"పోనీలే తమ్ముడూ, అది మన సొమ్ముకాదు, అందువల్లనే నదిలో పడిపోయింది. దానికోసం విచారించడం తెలివిమాలిన పని అవుతుంది,\" అని వూరుకున్నాడు.\n\nబోధిసత్వుడు విసిరిన ఫలహారం తిన్న జలభూతం, ఆ నదిలో పడింది వరహాలమూట అని తెలుసుకోవడమేగాక, తమ్ముడి దుర్మార్గం కూడా గ్రహించింది.అది వెంటనే ఒక పెద్ద చేపను ప్రోత్సహించి, ఆ వరహాల మూటను మింగేలా చేసింది.\nఆ తరవాత, ఆ చేప తన కన్నుగప్పి,ఎక్కడికీపోకుండా జలభూతం దివారాత్రాలు కాపలాకాయసాగింది.\n\nబోధిసత్వుడూ, అతడి తమ్ముడూ కాశీనగరానికి తిరిగి వచ్చారు.ఇంటికి చేరుతూనే తమ్ముడు తనవద్ద వున్న రెండవ మూటనువిప్పి చూశాడు. అందులో రాళ్ళు కనిపించాయి.తను చేసిన పొరబాటు తెలుసుకుని అతడు విచారంతో కుంగిపోతూ, మంచం పట్టాడు.\n\nఒక రోజున జాలరివాళ్ళు నదిలో వలలు వేశారు.జలభూతం తన శక్తి వల్ల, లోగడ వరహాలమూటను మింగిన చేప వాళ్ళ వలల్లో పడేలా చేసింది.\n\nజాలరివాళ్ళు ఆ చేపను నగరానికి తీసుకుపోయి,'దీని ఖరీదెంత?' అని అడిగిన వాళ్ళతో, \"వెయ్యివరహాలూ,అదనంగా ఒక్క వరహా!\" అనసాగారు.\n\nజాలరివాళ్ళకు మతులు పోయినవని అందరూ నవ్వుకోసాగారు.వాళ్ళు ఆ వీధీ,ఈ వీధీ తిరిగి ఎవరూ కొనక పోవడంతో ఆ చేపను బోధిసత్వుడి ఇంటికి తీసుకుపోయి,దాన్ని అమ్మజూపారు.\n\n\"ఈ చేప ఖరీదెంత?\" అని అడిగాడు బోధిసత్వుడు \"మీకైతే ఒక వరహా మాత్రమే!\" అన్నారు జాలరివాళ్ళు.\n\n\"ఇతరులకైతే ఎంత వెల చెబుతున్నారు? మీ మాటల ధోరణి చూస్తూంటే,నాకు ఆశ్చర్యం కలుగుతున్నది,\" అన్నాడు బోధిసత్వుడు.\n\n\"మరెవరికైనా అయితే వెయ్యివరహాలు,పైన మరొకవరహా తీసుకుంటాం,\" అన్నారు జాలరివాళ్ళు.\n\nబోధిసత్వుడు వాళ్ళ జవాబుకు ఆశ్చర్యపోతూ, వాళ్ళడిగిన వరహాయిచ్చి ఆ పెద్ద చేపను కొన్నాడు.\n\nతరవాత అతడూ,భార్యా ఆ చేపను కోయగా,దాని పొట్టలో నుంచి వెయ్యివరహాలున్న మూట బయటపడింది.బోధిసత్వుడు దాన్ని గుర్తించాడు.\n\n\"ఈ వరహాల మూట మనదే!\" అని బోధిసత్వుడు భార్యకు జరిగినదంతా చెప్పి, \"ఈ జాలరివాళ్ళు దివ్యజ్ఞానం కలవాళ్ళలా కనబడుతున్నారు.చేప పొట్టలోని వరహాల మూట నాదేనని వాళ్ళు గ్రహించారు.అందుకే ఇతరులకైతే చేప ఖరీదు వెయ్యిన్నొక్క వరహా,నాకైతే వరహా అని చెప్పారు.వాళ్ళు చేపను పట్టేందుకు పడిన శ్రమకు కూలీ అన్నమాట,\" అన్నాడు బోధిసత్వుడు.\n\nతరవాత బోధిసత్వుడు,జాలరి వాళ్ళకు అంతటి దివ్యజ్ఞానం ఎలా కలిగిందా అని ఆలోచిస్తూండగా, ఒక దివ్యవాణి ఇలా పలికింది: \"మహానుభావా, నేను నదిలో నివసించే జలభూతాన్ని.ఒకనాడు నువ్వు నదిలోకి విసిరిన ఫలహారాన్ని తిని,దివ్యశక్తిని పొంద గలిగాను.నీటిలో పడిన వరహాల మూటను చేప చేత మింగింప చేసినది నేనే.జాలరి వాళ్ళను ప్రోత్సహించి నీ వద్దకు పంపినది కూడా నేనే.ఈ విధంగా నీ రుణం తీర్చుకో గలిగాను.ధనాశాపరుడూ,దుర్మార్గుడూ అయిన నీ తమ్ముడికి మాత్రం, ఆ ధనంలో భాగం ఇవ్వకు.\"\n\nజలభూతం చేసిన ఉపకారానికీ, దాని మంచితనానికీ బోధిసత్వుడు చాలా సంతోషించాడు.ఐతే,అతడు తన తమ్ముడి విషయంలో మాత్రం దాని సలహా పాటించలేదు.సోదరన్యాయాన్ని అనుసరించి,బోధిసత్వుడు తన తమ్ముడికి ఐదు వందల వరహాలు ఇచ్చి,తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 354,
        "IMAGE": "cat_2",
        "NAME": "వరహాల మూట ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 104,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రఘువీరపురంలో అజయుడు, విజయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ, జీవితంలో ఒక్కొక్కమెట్టుగా పైకిరావాలని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజయుడిది. అయితే, విజయుడిది ఎప్పుడూ పెద్ద పెద్ద ఆలోచనలే. \"పులి ఏనుగు మెదడునే కోరుకుంటుందిగాని, ఆకలయిందని పచ్చిగడ్డి తినదు కదా. నేను పులిలాంటి వాణ్ణి. అజయుడిలా పరిగ ఏరడం నా వల్ల కాదు,\" అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. బాగా డబ్బున్న కుటుంబం గనక, విజయుడు సంపాయించక పోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు. కాకుంటే అతడి భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు.\n\nఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్యనేర్పిన గురువు విద్యాసాగరుడు, తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళదామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చాడు. మిత్రులిద్దరూ గురువుగారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. గురువు చాలా సంతోషించి వారి స్థితిగతులు గురించి ఆరా తీశాడు.\n\n\"వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ నేను మా తండ్రికి సాయపడుతున్నాను. సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంత కాలం పట్టవచ్చు,\" అన్నాడు అజయుడు వినయంగా.\n\n\"చాలా సంతోషం. చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ, అనుభవం అవసరం కదా. మంచిపనే చేస్తున్నావు,\" అని గురువు, \"నీ పరిస్థితి ఏమిటి?\" అన్నట్టు విజయుడికేసి చూశాడు.\n\n\"ప్రస్తుతానికిఏమీ చేయడం లేదు. చేయవలసిన అవసరం కూడా లేదు. మా తండ్రి నడుపుతూన్న నగల దుకాణానికి సాటిరాగల దుకాణం ఈ చుట్టుపక్కలలేదు. మా నగలు నాణ్యతకు పెట్టింది పేరు.\n\nనేను దుకాణానికియజమానినైతే, నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను. మా నాన్నకన్నా పదింతలు ఎక్కువ సంపాయించి, పట్టణంలోనే నా అంత ధనవంతులులేరని పేరుతెచ్చుకుంటాను,\" అన్నాడు విజయుడు ధీమాగా.\n\nఆ మాటకు విస్తుపోయిన గురువు, \"ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి. లేని పోని దురాశకు పోతే అరిష్టాలు తప్పవు. పేరాశకుపోయి, విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమయిందో చెబుతాను, విను,\" అంటూ ఇలా చెప్పాడు:\n\nలంబోదరపురంలో తిమ్మయ్య అనే ఒక తిండిపోతు ఉండేవాడు. వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలన్న కోరిక ఉండేది. ఇంట్లో వండిన వంటంతా తినేసి ఇంకా పెట్టండి అని అడిగేవాడు. పనిపాటుల మీద దృష్టిపెట్టి, తిండియావ తగ్గించుకోమని పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాడు. ఇంట్లో వాళ్ళు ఖాళీగిన్నెలు చూపించే సరికి, ఊళ్ళో ఇంటింటికీ వెళ్ళి తిండి పెట్టమనేవాడు.\n\nఊళ్ళో వాళ్ళు ఎంత కాలం పెడతారు? కొన్నాళ్ళు భరించి మావళ్ళ కాదన్నారు. ఎవరూ ఆదరించక పోవడంతో, రాత్రి వేళ ఇళ్ళల్లో జొరబడి తిండి దొంగిలించేవాడు.\n\nపగటి పూట వాడు దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడి జంతువులను చూడగానే వాడికి నోరూరేది. ఒక బల్లెం సంపాదించి జంతువులను వేటాడి రాక్షసతిండి తినడం ఆరంభించాడు.\n\nతిండిపోతు తిమ్మయ్యను చూడగానే చిన్నా చితక జంతువులు భయంతో పారిపోతూండేవి. ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది. మొదట దానిని చూసి భయపడ్డాడు. ఆ ఏనుగు అవలీలగా చెట్టు కొమ్మలను విరిచి ఆకులు రెమ్మలతో సహా తినడం; చూస్తూండగానే అంత పెద్ద చెట్టు క్షణాలలో మోడయిడపోవడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత అంత పెద్ద ఏనుగును అమాంతం పట్టి నమిలి మింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది. వెంటనే చిన్నదిగా ఉన్న పొట్టను చూసుకుని ఏనుగు ఇందులో పట్టదు కదా అన్న నిరుత్సాహంతో చాలా బాధ పడిపోయాడు.\n\nఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంగా ఒక మునీశ్వరుడు కనిపించాడు.\n\nవాడు పరుగునవెళ్ళి ఆయన పాదాలపై బడి, తన కూరికను చెప్పి, అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకున్నాడు.\n\nమునీశ్వరుడు వాడి కోరిక విని విస్తుపోయాడు. అయినా, అడిగిన వారికి లేదనకూడదనే నియమం ఉన్న వాడు గనక ఆయన, \"నేనొక మంత్రం ఉపదేశిస్తాను. అదిగో, ఆ కనిపిస్తున్న కొండ గుహలోకి దూరి, ఆ మంత్రాన్ని దీక్షగా జపించు, నీ కోరికనెరవేరుతుంది,\" అని మంత్రం ఉపదేశించాడు.\n\nవెంటనే, తిమ్మయ్య గుహలోకి వెళ్ళి, \"ఏనుగును కూడా ఇముడ్చుకోగలిగినంత పెద్ద్డపొట్ట నాకు కావాలి,\" అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుడలతో జపించసాగాడు.\n\nమూడో రోజు తెల్లవారుతూండగా తిమ్మయ్యపొట్ట ఎంతో పెరిగిపోయింది వాడి ఆనందానికి హద్దులు లేకపోయింది. ఇక అరణ్యంలోని అన్నిరకాల జంతువులనూ హాయిగా తినవచ్చుననుకుంటూ గుహ లోపలి నుంచి బయటకు రాబోయాడు.\n\nఅయితే భారీకాయం వల్ల గుహ ద్వారం నుంచి బయట పడలేకపోయాడు.ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెలుపలికి మరొక దారిలేదు. విపరీతమైన ఆకలి. గుహలో రాళ్ళూ రప్పలూ తప్ప మరేమీ లేవు. గుహ లోపలికి జొరబడేప్పుడు, గుహ ముఖద్వారం మనిషి ప్రవేశించడానికి చాలినంత మాత్రమే ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు. తన పేరాశకూ, విపరీత కోరికకూ పశ్చాత్తాప పడుటూ ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహలోనే ప్రాణాలు వదిలాడు.\n\nగురువు ఈ కథ చెప్పి, \"చూశావా, పేరాశకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే దురాశ దు:ఖం చేటు అన్నారు పెద్దలు. ఆకాశానికి నిచ్చెన వేయడం ఎలాగా అని ఆలోచించడంమాని, మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి పళ్ళుకోయటం నేర్చుకో,\" అన్నాడు మందహసంతో.\n\n\"చిత్తం, గురువర్యా. ఈ రోజు నుంచే మా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి, వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంటాను,\" అన్నాడు విజయుడు గురువుకు నమస్కరిస్తూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 355,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఆశ-పేరాశ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 105,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒకప్పుడు బోధిసత్వుడు వారణాశీ నగరంలోని ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించాడు. అతడు యుక్తవయస్కుడవుతూనే సర్వ శాస్త్రాలూ అభ్యసించి, పండితులందరిలోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా రాజు అంత చిన్న వయసులోనే ఆయనను తన ఆస్థానంలో ప్రధాన పౌరోహితుడుగా నియమించాడు.\n\nబోధిసత్వుడు తాను శాస్త్రగ్రంథాలు పఠిస్తున్న సమయంలో, ఒక అద్భుతమైన మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చదివితే, ఎంతటి వాళ్ళయినా దాసోహం అనవలసిందే!\n\nఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైనా అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశలేదు కాని, దాన్ని మరిచిపోకుండా జాగ్రత్తపడాలన్న ఆలోచన కలిగింది.\n\nఇందుకు బోధిసత్వుడు అరణ్యంలోని ఒకానొక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతిపై కూర్చుని, ఆయన పరిసరాలను ఒకసారి చూశాడు. ఎక్కడా మనిషిగానీ,జంతువుగానీ ఆయన కంటబడలేదు.\n\nబోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివి, సూర్యాస్తమయం అవుతూండగా, రాతి మీది నుంచి లేచి నగరానికి బయలుదేరాడు.\n\nఆ సమయంలో రాతి వెనుక వున్న బొరియలోంచి నక్క ఒకటి గెంతుతూ బయటికి వచ్చి, \"ఓయ్, పండితుడా! నువ్వు చదివిన మంత్రాన్ని, నేను కంఠస్థం చేశాను; వేయి నమస్కారాలు!\" అంటూ అక్కణ్ణించి పరిగెత్త సాగింది.\n\nనక్కలాంటి హీనప్రాణి అంత శక్తివంతమైన మంత్రం నేర్చుకోవడం చూసి, బోధి సత్వుడు ఎలా అయినా దాన్ని పట్టుకోవాలని వెంటబడ్డాడు. కాని,అప్పటికే చీకటి కమ్ముతున్న కారణంగా దాపులవున్న పొదలచాటున నక్కుతూ, అది పారిపోయింది.\n\nఈ నక్క అంతకు పూర్వజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి, బతికినన్నాళ్ళూ అమితమైన జిత్తులమారితనం తోనూ, పరులకు హాని చేస్తూనూ కాలం వెళ్ళబుచ్చింది. ఆ మానవ జన్మ కారణంగా దానికి మంత్రానికి వున్న అద్భుతశక్తి తెలిసిపోయింది.\n\nపారిపోతున్న నక్కకు ఎదురుగా తనకన్న మంచి కండబలం, వాడిపళ్ళూ వున్న నక్క ఒకటి రావడం కంటబడింది. వెంటనే అది భయంతో మంత్రం చదివింది. ఎదురు వస్తున్న నక్క అక్కడే ఆగి మెల్లగా దానికి వంగి నమస్కరించి, ఎంతో అణకువగా దారి తొలిగింది. మంత్రం నేర్చిన నక్కకు ఎక్కడలేని ఆనందం కలిగింది.\n\nఈ విధంగా నక్క కొద్దిరోజుల్లో ఎన్నో వందల నక్కల పై ఆధిపత్యం సంపాయించింది. తరవాత అది తన మంత్రశక్తిని అడవి పందుల మీదా; పులులూ, సింహాలూ, ఏనుగుల పై ప్రయోగించి, వాటన్నిటినీ లోబరుచుకున్నది. ఆ జంతువులన్నీ నక్కను తమ రాజుగా అంగీకరించి, గొప్ప ఉత్సవం జరిపినై.\n\nరాజు నక్క, ఒక ఆడనక్కను వివాహమాడి, దాన్ని రాణీగా ప్రకటించింది. సింహాలూ, పులులలో నుంచి కొన్నింటిని మంత్రులుగా, సేనానాయకులుగా ఎన్నిక చేసింది. ఇన్ని అరణ్యమృగాలు తన ఆజ్ఞలను శిరసావహిస్తూ, తనకూ, తన భార్యకూ సేవలు చేస్తూండడం దానికి ఎక్కడలేని గర్వాన్నీ కలిగించింది.\n\nరెండు ఏనుగులను పక్క పక్కన నిలబెట్టి, వాటిపైన సింహాన్ని నిలిపి, దానిపైన రాజునక్క ఆసీనురాలయ్యేది. కొన్ని జంతువులు, దాన్ని మించిన రాజు ప్రపంచంలో లేడంటూ విపరీతంగా పొగడసాగినై.\n\nనక్కకు ఇవన్నీ వింటూంటే ఆనందంతో పాటు గర్వం కూడా అధికం కాసాగింది. \"ఈ జంతువులకు రాజునన్న తృప్తితో ఎందుకు కాలం గడపాలి? ఏకంగా వారణాశీ నగరాన్నే ఎందుకు జయించ కూడదు?\" అన్న ఆలోచన దానిక్కలిగింది.\n\nకొద్ది రోజుల్లోనే అది మృగాల్లో సాటిలేని బలంగల సింహాలనూ, కొద్దిపాటి ఇతర జంతువులనూ సైన్యంగా సమకూర్చుకుని వారణాశీ నగరం పైకి దాడివెళ్ళింది. అవి రావడం చూసిన నగర వాసులు కొందరు భయకంపితులై, నగర వీధుల్లో పరిగెత్తుతూ, ఈ వార్తను ప్రజలకు తెలియబరిచారు. నగరంలో కల్లోలం ప్రారంభమయింది.\n\nరాజునక్క నగర ద్వారం చేరి, చావు భయంతో వణికిపోతున్న కాపలావాళ్ళతో, \"ఒరే, మీరు తక్షణం పోయి, మీ రాజును లొంగిపొమ్మని చెప్పండి. అలా లొంగక పోయాడో, నా సైన్యంతో మీ నగరం మీద దాడి చేయగలను,\" అన్నది.\n\nకాపలావాళ్ళ ద్వారా ఆ సంగతి విన్న రాజుకు ఏమిచేయాలో పాలుబోలేదు. బోధిసత్వుడు ఆయనతో, \"మహారాజా, ఈ సమస్యను పరిష్కరించే పని నాకు వదలండి,\" అన్నాడు.\n\nతరవాత ఆయన కోటగోడ మీదికిపోయి, నక్కరాజును, \"నగరాన్ని ఎలా జయించదలిచావు?\" అని అడిగాడు.\n\nరాజునక్క పెద్దగా నవ్వి, \"ఆ పని చాలా తేలిక! నా సైనిక సింహాలన్నీ ఏకకంఠంతో ఒక్కసారి గర్జించితే, మీ సైనికులూ, పౌరులూ ప్రాణభయంతో చెల్లా చెదురుగా పారి పోతారు,\" అన్నది.\n\nబోధిసత్వుడికి నక్కమాటలు అబద్ధం కాదని తోచింది. ఆయన గోడదిగువ నున్న రాజోద్యోగులతో, \"మీరు వెంటనే వెళ్ళి, నగరవాసులందర్నీ బయటి శబ్దం వినిపించకుండా తమ చెవుల్లో దూది పెట్టుకోవసిందిగా చెప్పండి,\" అన్నాడు.\n\nఆ పని పూర్తికాగానే ఆయన రాజునక్కతో, \"నగరాన్ని జయించేందుకు నువ్వేం చేయదలిచావో చెయ్యి!\" అన్నాడు.\n\nరెండు ఏనుగుల పై నిలబడిన సింహం మీద కూర్చుని వున్న రాజునక్క, సింహాలన్నిటినీ ఒక్కసారిగా భయంకర గర్జన చేయమని ఆజ్ఞాపించింది. ఆ మరుక్షణం పరిసరాలన్నీ దద్దరిల్లిపోయేలా సింహాలు గర్జించినై. తమ చెవి రంధ్రాలను దూదితో దట్టించిన కారణం వల్ల నగరవాసులకు సింహగర్జనలేవీ వినిపించలేదు. కాని, ఆ గర్జనలు వింటూనే రాజు నక్కను మోస్తున్న రెండు ఏనుగులూ ఎగిరి గంతు వేసినై. దానితో వాటి మీద నిలబడి వున్న సింహం కిందపడింది.ఏనుగులు భీతిల్లి పరిగెత్తుతూ తమ కాళ్ళతో రాజునక్కను చితకతొక్కినై. మిగిలిన మృగాలు భయపడి పారిపోతూ, ఒక దాన్నొకటి తొక్కుకుని కొన్ని చావగా, కొన్ని అరణ్యం చేరినై.\n\nఈ జరిగినది చాటింపు ద్వారా తెలుసుకుని నగరవాసులు తమ చెవులలో దట్టించిన దూదిని తీసి వేశారు. ముంచుకు వచ్చిన ఆపద తప్పిపోయినందుకు వాళ్ళందరూ ఎంతో సంతోషించారు.\n\nరాజుతోపాటు నగరవాసులందరూ, తమను ఇంత ఘోరమైన ఆపద నుంచి కాపాడిన బోధిసత్వుడికి తమ కృతజ్ఞత తెలియజేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 356,
        "IMAGE": "cat_2",
        "NAME": "నగరాన్ని జయించబోయిన నక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 106,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారువృక్షంగా పుట్టి, ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూండేవాడు. ఆ కొండ దిగువున పండితుడొకాయన గురుకులం స్థాపించి, శిష్యులకు విద్యా బోధ చేసేవాడు.\n\nఒకసారి ఆ పండితుడు కూడనిపని ఏదో చేసి, ఆ పాపపరిహారానికి ఒక వ్రతం చేయ సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే, విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి వుంటుంది.\n\nఆయన ఒక ధనవంతుణ్ణి మేక కోసం యాచించాడు. అతడు తన మందలో వున్న మేకల్లో నుంచి వయసులో బలంగా వున్న దాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, దాన్ని నదిలో శుభ్రంగా స్నానం చేయించి, మెడలో ఒక పూలదండ వేసి, తిరిగి తన వద్దకు తీసుకురమ్మనాడు.\n\nశిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గిరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి వున్నది. శిష్యుల్లో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగాడు. ఆ పని పూర్తయ్యేలోపల రెండవవాడు తీరంలో వున్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు.\n\nశిష్యులిద్దరూ పూలదండను మేక మెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో, అది బిగ్గరగా నవ్వింది.మొదట్లో వాళ్ళు, ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కాని, చుట్టు పక్కల మరొక వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కుంటున్నంతలో,మేక నవ్వడం మాని, కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. ఇది చూసి దైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు.\n\nవాళ్ళు గురువుతో రహస్యంగా, \"ఈ మేక నేదో భూతం ఆవహించినట్టున్నది. నది దగ్గిర ఇది మనిషిలా నవ్వింది; ఏడ్చింది. ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా?\" అన్నారు.\n\nగురువు ఏదో అనబోయేంతలో మేక, \"నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి.ఎందుకు సంశయిస్తారు!\" అన్నది.\n\nఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ వణుకుతున్నంతలో మేక, \"అలా భయపడకండి. మీకెలాంటి ప్రాణహానీ కలిగించను,\" అన్నది.\n\nపండితుడు భయం నుంచి కాస్త తేరుకుని, \"మేక మనిషిలా మాట్లాడడం ఎంతటి మహాశ్చర్యం!\" అన్నాడు.\n\n\"ఇందులో ఆశ్చర్యపడవలసింది రవంత కూడా లేదు. నేనూ ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణీ, పండితుణ్ణీ కూడా!\" అన్నది మేక.\n\n\"అలాగా! అయితే, ఇంత నీచజన్మ నీకెందుక్కలిగింది?\" అని అడిగాడు పండితుడు.\n\nఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి, \"నేను చాలా పాపకర్మలు చేశాను. ఒకానొక వ్రతం చేసి వాటినుంచి బయటపడవచ్చునన్న భ్రమతో, నేనూ ఒక మేకను బలి ఇచ్చాను. అయినా, విధిని మోసగించలేకపోయాను. ఆ తర్వాత ఐదువందలసార్లు మేకగా జన్మ ఎత్తడం జరిగింది!\" అన్నది.\nపండితుడు అమితాశ్చర్యంతో, \"ఐదు వందలసార్లు మేకజన్మా!\" అన్నాడు.\n\n\"అవును. ఇందులో నాలుగువందల తొంభైతొమ్మిది సార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఇవాళ నా తల ఐదు వందలసారి తెగబోతున్నది. దీనితో నాకు పాపవిముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక, హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అందుకే నవ్వాను,\" అన్నది మేక.\n\"అది బాగానే వుంది, మరి ఎందుకు ఏడ్చావు?\" అని పండితుడు అడిగాడు.\n\n\"నిజం చెబుతున్నాను. ఐదు వందల జన్మల ముందు, నేనేం చేసి పాపం మూట కట్టుకున్నానో, అలాంటి పనే నువ్వు చేయబోతున్నావని గ్రహించాను. కనుక, నువ్వూ నాలాగే మేక జన్మలు ఎత్తి బాధల పాలవుతావు. నీ బుద్ధిహీనతకూ, ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలూ తలుచుకుని,నాకు కన్నీరాగింది కాదు,\" అన్నది మేక.\n\nపండితుడు ఆలోచనలోపడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి, మేక చెప్పినదంతా విని ఆశ్చర్యం చెందారు.మేకను బలి ఇవ్వడం ద్వారా, రాబోయే జన్మల్లో గురువు గారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే, వాళ్ళకు ఆగకుండా కళ్ళవెంట నీరు కార సాగింది. పండితుడు తన శిష్యుల కేసీ, మేక కేసీ ఒకసారి సాలోచనగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి, ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన, తాను చేసిన పాపాలు తుడిచి పెట్టుకు పోతాయనుకోవడం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది.అంతే కాక, ఇప్పుడు తానొక అల్పజీవిని చంపడం ద్వారా, మరింత పాపాన్ని మూటకట్టుకోవడం జరుగుతుందని గ్రహించాడు.\nఆయన మేకతో, \"భయపడకు! నేను, నిన్ను బలియివ్వను,\" అన్నాడు.\n\"నాకు చావంటే భయంలేదు. ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను,\" అన్నది మేక.\n\"అదంతా నీ ఇష్టం. నేను మాత్రం చంపను! నువ్వెంత బ్రతిమాలినా, నా నిర్ణయం మాత్రం మార్చుకోను,\" అన్నాడు పండితుడు పట్టుదలగా.\n\"నాకు ఇవ్వాళ మృత్యువు రాసి పెట్టి వున్నది. అది నీ చేతి మీదుగా జరక్కపోతే, మరొకరు చేస్తారు!\" అన్నది మేక.\nపండితుడు ఒక్క క్షణం అలోచించి, \"అలా జరగకూడదు. నీ కెవ్వరి నుంచీ హాని కలగకుండా చూసే బాధ్యత నాది,\" అన్నాడు.\n\nఆయన తన శిష్యులకు మేకను వదిలి పెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి, దాపులనున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటూ ఇటూ తిరిగింది. తరవాత నదీతీరానికి బయలుదేరింది. పండితుడూ, ఆయన శిష్యులూ దానికి కొంచెం దూరంగా నడవసాగారు.\n\nరెండు, మూడు గంటలకాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండ కేసి బయలుదేరింది. అది కొండ పైకి ఎక్కుతుండగా పండితుడూ, ఆయన శిష్యులూ దిగువున వుండి దాన్ని గమనించసాగారు.\n\nఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమిగూడాయి. మేక ఒక్కొక్క కొండరాయినే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడూ, ఆయన శిష్యులూ చూస్తూండగా ఆకాశం పెద్దగా ఒకసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళను మిరుమిట్లు కొల్పుతూ పిడుగొకటి వచ్చి మేక మీద పడింది.\n\nపండితుడూ, ఆయన శిష్యులూ ఈ జరిగింది చూసి, ఒకసారి నిట్టూర్చి, వెనుదిరిగి గురుకులానికి బయలుదేరారు.\n\nకొండ మీద దేవదారు వృక్షంగా వున్న బుద్ధుడు వాళ్ళను చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలూ, యజ్ఞాల్లాంటివి చేసి బలులు ఇవ్వడం వృధా అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్దిమందికైనా కలగడం, ఆయనకు సంతోషకారణం అయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 357,
        "IMAGE": "cat_2",
        "NAME": "మేక నవ్వింది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 107,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడుండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకుండేవాడు. ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక, ఆయన భార్య తన కుమారుడికి, ``నాయనా, ఇకనైనా సత్ప్రవర్తన అలవరుచుకో. దానాలు చెయ్యి; నియమాలు పాటించు; ధర్మం అనుసరించు!'' అని ఎంతో హితబోధ చేసింది. కాని వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది.\n\nమిత్రవిందకుడితో అతని తల్లి, ``నాయనా, ఇవాళ పుణ్యదినం. తెల్లవార్లూ విహారంలో ధర్మోపదేశం చేస్తారు. నువు్వ అక్కడ అందరితో పాటు పూజ చేసుకుని, ఉపదేశం విని రా. తిరిగి వచ్చాక నీకు వెయ్యి రూపాయలిస్తాను,'' అన్నది. డబ్బుకోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు. అతను ఉపదేశం వినటానికి విహారానికి వెళ్ళాడు గాని, ఒకమూల పడుకుని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి హడావుడిగా ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు.\n\nతన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి ఎంతో సంతోషంగా వంటచేసి సిద్ధంగా వుంది. కొడుకు ఒంటరిగా రావటం చూసి, ``ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా, నాయనా?'' అని అడిగింది. ``ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా? నా కాయనతో పని లేదు!'' అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గిర వెయ్యి రూపాయలు తీసుకుని తన పని మీద తాను వెళ్ళాడు. ఈ డబ్బుతో అతను బాగా వ్యాపారం చేసి అతి త్వరలోనే ఇరవై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు.\n\nఈ డబ్బు పెట్టుబడి చేసి సముద్ర వ్యాపారం సాగిస్తాను; ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను; అనుకున్నాడు మిత్రవిందకుడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి, సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పిపోవటానికి, తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంటతడి పెట్టి, ``నాయనా, నాకు నీవొక్కడవే కొడుకువు! నీ దగ్గిర ఇంత డబ్బున్నది గదా. ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం క్షేమం కాదు.\n\nనిన్ను వదిలి నేను ఉండలేను. నా మాట విని ఈ ప్రయాణం మానుకో, ఇంటి పట్టున వుండు!'' అన్నది. మిత్రవిందకుడు తల్లి మాట వినక, పోయితీరాలని మూర్ఖించాడు. ఆవిడ చెయ్యి పట్టుకుని వెళ్ళవద్దని ఎంతగానో బతిమాలింది. అతడు ఆగ్రహంతో తల్లిని కొట్టి, తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజే అతని పడవ బయలుదేరింది. ఏడు రోజులపాటు ప్రయాణం సరిగానే సాగింది. కాని ఎనిమిదవ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది.\n\nఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనేవున్నారనే ఉద్దేశంతో నావికులు చీటీవేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు మూడుసార్లు చీటీ వేశారు. మూడు సార్లూ అది మిత్రువిందకుడికే వచ్చింది. నావికులు మిత్రవిందకుడికి, ఒక తెప్ప ఇచ్చి దాని మీద అతణ్ణి వుంచారు. మరు క్షణం పడవ శరవేగంతో ముందుకు వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకకు చేరుకున్నాడు. ఆ లంకలో అతని కొక స్ఫటికభవనం కనబడింది. అందులో నాలుగు ఆడపిశాచాలు కాపురం వుంటున్నాయి. ఈ పిశాచినులు వారం రోజులు సరదాగా గడుపుతాయి; మరి వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రవిందకుడు ఆ పిశాచినులతో ఒక వారం పాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు.\n\nపిశాచి నులు వ్రతం ఆరంభించేసరికి అతనికి అక్కడ వుండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది. దానిలో ఎనిమిదిమంది పిశాచినులున్నారు. మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి, వారు కఠోరవ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్పమీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో పదహారు మంది పిశాచినులతోనూ, ఇంకొక దీవిలో ముపై్ఫరెండు పిశాచినులతోనూ ఒక్కొక్క వారం గడిపి, ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు.\n\nఈ లంకలో ఒక పెద్ద నగరం వున్నది. దాని చుట్టూ గోడా, ఆ గోడలో నాలుగు ద్వారాలూ వున్నాయి. అది ఉస్సదనరకం. అయితే, మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు. అందమైన నగరం లాగా కనబడింది. ``నేనీ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను!'' అనుకున్నాడతను. నగరంలో ఒక చోట మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అసిధారాచక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా వుండటం వల్లనూ, అది చాలా బరువైనది గనకనూ, ఆ చక్రం అతని తలలోకి దిగబడిపోయింది. తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది. ఆ మనిషి శరీరం అయిదు పేటల గొలుసుతో బంధించబడి వున్నది. అతను బాధతో దీనంగా మూలుగుతున్నాడు.\n\nఇదంతా కళ్ళారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు. అసిధారాచక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనబడింది; అతని వంటి మీది గొలుసు అలంకార భూషలలాగా తోచింది; అతని మూలుగు గంధర్వ గానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, ``అయ్యా, తమరు చాలాకాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు. నన్ను కూడా ధరించనివ్వండి!'' అని అడిగాడు.\n\n``బాబూ, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం!'' అన్నాడు నరకవాసి. ``చూశావా? నాకివ్వటం ఇష్టంలేక ఆ మాట అంటున్నావు!'' అన్నాడు మిత్రవిందకుడు. ``నేటితో నా పాపానికి పరిహారం అయి పోయినట్టుంది. వీడు కూడా నాలాగే తల్లిని కొట్టినవాడై ఉంటాడు. పాపఫలం అనుభవించటానికే వీడిక్కడికి చేరివుంటాడు!''అని అనుకుని నరకవాసి తన నెత్తి మీద వున్న అసిధారాచక్రాన్ని, మిత్రవిందకుడి నెత్తిన పెట్టి, సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పుడు స్వర్గంలో ఇంద్రుడుగా వుంటున్న బోధిసత్వుడు దేవగణాలను వెంటబెట్టుకుని నరకాలన్నిటినీ తణిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు.\n\nఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ, ``స్వామీ, కరుణించండి! ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి!'' అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు, మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు: ``నీకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరావు. పిశాచినులతో కాలక్షేపం చేశావు. మానవుడు నడవదగిన ఉన్నత మార్గాలు నీకు నచ్చలేదు. ఇతరులు నీ మేలుకోరి చెప్పిన సలహా వినక ఈ చక్రాన్ని కోరి నెత్తికి తెచ్చుకున్నావు! నువు్వ బతికి వున్నంత కాలమూ ఆ అసిధారా చక్రం నిన్ను వదలదు.'' మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశ తెలుసుకుని, విచారంతో కుంగిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 358,
        "IMAGE": "cat_2",
        "NAME": "నరకవాసి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 108,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు బోధిసత్వుడు కాశీ రాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరీ జరిపారు. పితూరీదార్లను అణచే నిమిత్తమై రాజు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి, ఆయనతోపాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతోసహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు.\n\nఆ సమయంలో అక్కడ గ్రామంలోని ముపై్ఫ గడపలవారూ చేరి గ్రామవ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తీ, డాలూ, కవచమూ ధరించి, యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి, రచ్చపట్టులో చేరినవారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక్క గ్రామస్థుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్థుడు రాజును సమీపించి, ``నువు్వ పితూరీదారువా? రాజు పక్షం వాడివా?'' అని అడిగాడు. ``అయ్యా, నేను రాజు పక్షమే!'' అని రాజు జవాబు చెప్పాడు.\n\nఈ మాట విని గ్రామస్థుడు, తృప్తి పడ్డట్టు కనబడి, ``అయితే, మా ఇంటికి పోదాం, రా!'' అని రాజును తన అతిథిగా తీసుకుపోయి, తన భార్యచేత ఆయన కాళు్ళ కడిగించి, భోజనం పెట్టించి, అతిథి మర్యాదలన్నీ చేయించాడు. తరవాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీరు పెట్టి, దాణా వేశాడు. రాజు ఆ గ్రామస్థుడి ఇంట నాలుగు రోజులు అతిథిగా ఉండి తన గాయాలను మాన్పుకున్నాడు. ఈ లోపలే ఆయన సైనికులు పితూరీని అణచి వేయడం జరిగింది.\n\nరాజు తిరిగి వెళ్ళిపోతూ, గ్రామస్థుడికి కృతజ్ఞత తెలుపుకుని, ``అయ్యా, నేను కాశీనగరవాసిని, మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకొక భార్యా, ఇద్దరు కుమారులూ ఉన్నారు. మీరు కాశీ నగరానికి వచ్చి కుడిచేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గిర కాపలావాణ్ణి, `మహాశ్వారోహుడి ఇల్లెక్కడ?' అని అడిగితే, వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు.\n\nమీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు!'' అని చెప్పాడు. తరవాత రాజు తన బలాలను చేరుకుని, కాశీ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుణ్ణి పిలిపించి, వాడితో రహస్యంగా, ``ఒరే, ఎవరన్నా నీ వద్దకు వచ్చి, `మహాశ్వారోహుడి ఇల్లెక్కడ?' అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గిరికి తీసుకురా!'' అని చెప్పాడు. ఆ గ్రామస్థుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కాని అతను రానేలేదు. అతన్ని ఏవిధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు.\n\nఅప్పటికీ గ్రామస్థుడు రాజు వద్దకు రాలేదు. మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు. ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక, ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళు్ళ గ్రామస్థుడి దగ్గిరికి పోయి, ``ఈ పన్నులతో చచ్చి పోతున్నాం. కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడున్నాడని చెప్పావు గదా. నువు్వ వెళ్ళి ఆయనను చూసి, పన్నులు ఇచ్చుకోలేక మనం అందరం నానా అగచాట్లూ పడిపోతున్నామని మొరపెట్టి, వీటిని తీసివేయించలేవా?'' అన్నారు.\n\n``నా స్నేహితుణ్ణి చూడటం కష్టం కాదు. కాని ఆయన దగ్గిరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకొక భార్య ఉన్నదిట, ఇద్దరు కొడుకులున్నారుట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్యకు కానుకగా నగా నట్రా తీసుకుపోవద్దా? వాటన్నిటినీ త్వరలో సిద్ధం చెయ్యండి. అలాగే బయలుదేరి వెళతాను,'' అన్నాడు గ్రామస్థుడు. మిగిలినవాళు్ళ బట్టలూ, నగలూ సమకూర్చారు. అవి గ్రామస్థులకు పనికివచ్చే ముతక వస్త్రాలూ, మోటు నగలూనూ. గ్రామస్థుడు తన భార్యచేత రొట్టెలూ, పిండివంటలూ తయారు చేయించాడు.\n\nతాను తీసుకుపోయే స్తువులన్నీ ఒక మూటకట్టి వెంటతీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీ నగరపు కోట చేరి, కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి, అక్కడి ద్వారపాలకుణ్ణి, ``బాబూ, నేను మహాశ్వారోహుడింటికి వెళ్ళాలి. దారి ఎటు?'' అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్థుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదట పెట్టాడు.\n\nఅతణ్ణి చూసి రాజుకు పరమానందమయింది. గ్రామస్థుడు తనకోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేతా, కుమారులచేతా, తన మంత్రి సామంతులచేతా తినిపించి, తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతకబట్టలను తన భార్యా బిడ్డలచేత కట్టించి, తాను కూడా కట్టుకున్నాడు. తరవాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి, తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు.\n\nతన గ్రామం మీద వేసిన పన్నులు తీయించటానికి అతను వచ్చాడని తెలిసి, రాజుగారు ఆ పన్నులను రద్దు చెయ్యవలసిందిగా మంత్రులకు ఉత్తరువిచ్చాడు. తరవాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్థుణ్ణి తన అర్ధ రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్థుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతనిపట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతడికి అర్ధ రాజ్యం పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది.\n\nకాని రాజుగారికి ఎదురు చెప్ప టానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుణ్ణి చేరదీసి, ``నాయనా, మహారాజుగారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాగరికుడికి కట్టబెడుతున్నారు. ఇందుకు గాను మహారాజుగారి దగ్గిర ఆక్షేపణ తెలుపుకోవలసినవాడవు నువ్వే!'' అంటూ ఆ కురవ్రాడికి బాగా బోధించి పంపారు.\n\nరాజకుమారుడు తండ్రి దగ్గిరికి వెళ్ళి, వాళు్ళ చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, ``నాయనా, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడడిగిన ప్రశ్న సభలో అడుగు. అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను!'' అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ``ఈ గ్రామస్థుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి?'' అని అడిగాడు.\n\nవెంటనే రాజు, ``కుమారా, ఈ గ్రామస్థుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు,'' అంటూ సరిహద్దున పితూరీ జరిగిన సమయంలో బాగా గాయపడిన తనను గ్రామస్థుడు కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తరవాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: ``అపాత్రుడికి దానం చెయ్యటం ఎంత తప్పో, పాత్రుడికి దానం చెయ్యకపోవటం కూడా అంత తప్పే. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్థుడు నాపట్ల విశ్వాసం చూపాడు. సమయానికి సాయపడ్డాడు.\n\nనేను రమ్మని ఆహ్వానించినప్పటికీ, ప్రత్యుపకారం పొందే ఉద్దేశం లేని కారణంచేత, అతడు రానే లేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధ రాజ్యానికి ఇంతకంటె అర్హుడెవరు?'' ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటినుంచి రాజు తన జీవితాంతం వరకూ ఆ గ్రామస్థుణ్ణి ఎంతో ఆదరంతో చూశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 359,
        "IMAGE": "cat_2",
        "NAME": "దానపాత్రుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 109,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కోసలదేశానికి రాజైన బింబిసార మహా రాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కలలు వచ్చాయి. మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి, తనకు వచ్చిన కలల గురించి చెప్పి, ‘‘ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి!'' అని కోరాడు. బ్రాహ్మణులు రాజు నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశంగా భావించి, ‘‘మహారాజా, మీకు వచ్చిన కలలు చాలా ప్రమాదం కలిగించేవి.\n\nవాటివల్ల మీకూ, మీ వంశానికీ, మీ రాజ్యానికీ, మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనున్నది!'' అని చెప్పారు. ఈ మాటలు వినగానే రాజుకు మతి పోయినట్టయింది. ‘‘అయితే ,ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి?'' అని అడిగాడు. ‘‘దీనికల్లా ఒకటే విరుగుడు. మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటనల్లా ఒక యజ్ఞం చేయించండి.\n\nయజ్ఞం ముగిశాక బ్రాహ్మణులకు సంతర్పణలూ, దానాలూ ఇవ్వండి. దానితో అన్ని పీడలూ విరగడయిపోతాయి, మేలు కలుగుతుంది,'' అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. బింబిసార మహారాజు ముందూ వెనకా చూడకుండా, బ్రాహ్మణులు చెప్పినదంతా నమ్మేసి, తన కోశాధికారిని పిలిచి, ‘‘నాలుగు దారులు కలిసిన చోటనల్లో యజ్ఞం జరగాలి.\n\nసంతర్పణలూ, సంభావనలూ, దానాలూ మొదలైనవి జరగాలి. అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి,'' అని చెప్పాడు. ఈ వార్త మహారాణి తెలుసుకున్నది. ఆమె తన భర్తతో, ‘‘ప్రభూ, తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి.\n\nఅన్నీ తెలిసిన మహాజ్ఞాని, బుద్ధభగవానుడు జేతవనంలో ఉంటున్నాడు. మీరు అక్కడికి వెళ్ళి, ఆయనకు మీ కలల వైనం చెప్పి, వాటి ఫలితం ఏమిటో అడగండి. ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అలాగే చేద్దురుగాని!'' అన్నది. దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు. ఆయన స్వయంగా జేతవనానికి వెళ్ళి బుద్ధభగవానుణ్ణి తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు భిక్షకోసం రాజసౌధానికి వచ్చాడు.\n\nఅప్పుడు మహారాజు బుద్ధభగవానుడితో, ‘‘స్వామీ, తమకు తెలియని రహస్యాలుండవు. నాకు కొన్ని పీడకలలు వచ్చాయి. వాటివల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయూలని నా ప్రార్థన!'' అన్నాడు. ‘‘ఆ కలలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను,'' అన్నాడు బుద్ధుడు, రాజు అమాయకత్వానికి నవ్వుతూ. ‘‘మొట్టమొదటగా నేను కలలో నాలుగు ఆబోతులను చూశాను. అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి.\n\nఅవి పోట్లాడుకుంటే చూసి ఆనందించుదామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కాని ఆ ఆబోతులు పోట్లాడుకోక, వేటి దారిన అవి వెళ్ళిపోయూయి. దీని అర్థమేమిటి?'' అని మహారాజు అడిగాడు. ‘‘రాజా, ఈ కల నీకుగాని, నీ తరానికిగాని సంబంధించినది కాదు. ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు. అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి. వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు, '' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఇంకొక వింత చూశాను.\n\nభూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి, కాయలు కాయటం చూశాను. దీని రహస్యమేమిటి?'' అని మహారాజు అడిగాడు. ‘‘నే నింతకు మునుపు చెప్పిన పాపిష్ఠి కాలంలో స్ర్తీలకు బాల్యవివాహాలు జరుగు తాయి. వారు పెరిగి పెద్దవారు కాక పూర్వమే బిడ్డల తల్లులవుతారు! అంతకంటె ఇంకేమీలేదు!'' అన్నాడు బుద్ధుడు. ‘‘ఆవులు దూడలవద్ద పాలు తాగేట్టు మరొక కల వచ్చింది,'' అన్నాడు రాజు. ‘‘ముసలివాళ్ళు తమ తిండికోసం చిన్నవాళ్ళపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం,'' అన్నాడు బుద్ధుడు.\n\n‘‘తరవాత కలలో కొందరు రైతులను చూశాను. వారు కాడి నుంచి బలిష్ఠమైన ఎద్దులను తొలగించి, ఆ కాడికి లేగదూడలను కట్టటం కనిపించింది,'' అన్నాడు మహారాజు. ‘‘నే నింతకు పూర్వం చెప్పిన అవినీతిగల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి, ప్రపంచజ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగించబోతారు. అదే ఆ కలకు అర్థం!'' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఒక వింత గుర్రాన్ని చూశాను.\n\nదానికి రెండు వైపులా తలలున్నాయి. ఆ రెండు తలలతోటీ అది దాణా తింటున్నది. ఈ ఘోరం ఏమిటి, స్వామీ?'' అని మహారాజు అడిగాడు. ‘‘రాబోయే పాపిష్ఠికాలంలో న్యాయూధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు, రెండు పక్షాలవారి నుంచీ లంచాలు మేస్తారు.అదే దాని అర్థం,'' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఇంకొక చిత్రం చూశాను.\n\nరాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరున్నది, దాని చుట్టూ ఇంకా చిన్న కడవలెన్నో ఖాళీగా ఉన్నాయి. అక్కడికి అన్ని కులాలవారూ నీరు పట్టుకు వచ్చి, అదివరకే నిండివున్న కడవలోనే నీరు పోసి, అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళి పోతున్నారు. ఖాళీ కడవల్లో ఎవరూ నీరు పొయ్యరు. ఏమిటి దీని అర్థం?'' అని మహారాజు అడిగాడు. ‘‘ముందు, ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది.\n\nప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు. ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ వుంటే, ఇంకో వంక శ్రమించే ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కుండల్లాగా ఉంటాయి,'' అన్నాడు బుద్ధుడు. ‘‘మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను. ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకడం లేదు.\n\nఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చిమిడిపోయింది. ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది. వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది,'' అన్నాడు మహారాజు. ‘‘రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని, ఈ కల చెబుతున్నది.\n\nపాలకులు వరదలను గురించీ, అనావృష్టి గురించీ తగు శ్రద్ధ తీసుకోరు. అందుచేత కొన్నిచోట్ల వర్షం హెచ్చుగా కురిసి, వరదలవల్ల పంటలు పాడవుతాయి. సరిగా వాన కురవని చోట అసలు పంటలే పండవు,'' అన్నాడు బుద్ధుడు. ‘‘స్వామీ, ఇంకొక కలలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుం టూండటం చూశాను,'' అన్నాడు మహారాజు.\n\n‘‘భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజల కిచ్చి, అతితుచ్ఛమైన ఐహికసుఖాలను దానికి ప్రతిఫలంగా పుచ్చుకుంటారు,'' అన్నాడు బుద్ధుడు. ‘‘ఇంకా, నా కలలలో నీళ్ళ మీద బరువైన రాళ్ళు తేలికొట్టుకుపోతూండటం చూశాను. ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను. మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే, తోడేళ్ళు సయితం భయంతో కంపించటం చూశాను.\n\nఇవన్నీ అరిష్ట దాయకాలు కావా, స్వామీ?'' అని మహారాజు అడిగాడు. ‘‘ఈ కలలు నీకుగాని, నీ కాలానికి గాని సంబంధించినవి కానేకావు. వాటిని గురించి నీకు ఎలాటి విచారమూ వద్దు. భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంత మహిమ గలవాళ్ళు సయితం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాలప్రవాహంలో నువ్వు చూసిన రాళ్ళలాగా కొట్టుకుపోతారు.\n\nపరమ నీచులు పదవులకు రావటంవల్ల రాజహంసల వంటి యోగ్యులు సయితం వారి అడుగుజాడలలోనే నడవవలసిన వారవు తారు. అధములకు అధికారబలం లభించేసరికి సత్వసంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది. అంతే కాదు, ఏమాత్రం సంకోచం అన్నది లేకుండా అధములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది,'' అన్నాడు బుద్ధుడు. బింబిసార మహారాజుకు సందేహం తీరిపోయింది. ఆయన భయూలు తొలగి పోయూయి. ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి, బుద్ధభగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 360,
        "IMAGE": "cat_2",
        "NAME": "కలల మర్మం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 110,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్య నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు. ఆయన భోగలాలసుడూ, అవినీతిపరుడూ అయి, రాజ్యపరిపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ వహించ లేదు. యథా రాజా, తథా ప్రజా అన్నట్టు, రాజునుబట్టి మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించ సాగారు. ప్రజలపై పన్నుల భారం హెచ్చసాగింది.\n\nఅరాజకం తల ఎత్తింది. ఈ అరాజక స్థితిలో ప్రజల జీవితం తారుమారయింది. పగలు రాజభటుల పీడా, రాత్రి దొంగల పీడా హెచ్చిపోయింది. అందు చేత నగరవాసులు తమ ఇళ్ళకు తాళాలు పెట్టి, వాకిళ్ళకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి, తమ భార్యాబిడ్డలతో అరణ్యానికి వెళ్ళి అక్కడ తల దాచుకోసాగారు. వాళ్ళు పగలల్లా అడవిలో గడిపి, అర్ధరాత్రివేళ తమ ఇళ్ళకు వస్తూండేవారు.\n\nఈ సమయంలో బోధిసత్వుడు నగరం వెలుపల వుండే ఒక తిందుకవృక్షానికి అధి ష్ఠాన దేవతగా జన్మించాడు. రాజు ఆ వృక్షానికి ఏటా పూజలు జరిపి, దాని కింద వెయ్యి మాడలు ఖర్చు చేసేవాడు. ‘‘అయ్యో, నన్ను ఇంత శ్రద్ధాభక్తులతో ఆరాధించే ఈ రాజు అవివేకంవల్ల తన దేశానికి అరాజకం తెచ్చి పెట్టుకుంటున్నాడు.\n\nఇతనికి సరి అయిన ఉపదేశం చెయ్యటానికి నేను తప్ప ఇంకెవరూ లేరు!'' అనుకున్నాడు తిందుకదేవుడు. ఆయన ఒక రాత్రి నిద్రిస్తున్న రాజుకు ప్రత్యక్షమై, ‘‘రాజా, నేను తిందుక దేవుణ్ణి. నీకు సరి అయిన బోధ చెయ్య వచ్చాను!'' అన్నాడు. ‘‘ఏమిటా బోధ?'' అని రాజు భక్తి పూర్వ కంగా అడిగాడు. ‘‘రాజా, నీ రాజ్యం నాశనమయి పోతున్నది.\n\nఅశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని కడగండ్లపాలై, పర లోకంలో నరకం అనుభవిస్తాడు,'' అన్నాడు తిందుకదేవుడు. ‘‘దేవా, నే నిప్పుడేం చెయ్యూలి?''అని అడిగాడు రాజు. ‘‘ఇప్పటికైనా నీ రాజ్య పరిపాలన విషయూ లను నీవే స్వయంగా చూసుకుని అరాజ కాన్ని తొలగించి, రాజ్యాన్ని కాపాడుకో!'' అని తిందుకదేవుడు అదృశ్యుడయ్యూడు.\n\nరాజుకు జ్ఞానోదయమయింది. ఆయన తన రాజ్యం ఎలా ఉన్నదీ స్వయంగా చూడ టానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయమే ఆయన తన మంత్రులను పిలిచి రాచకార్యాలు చూస్తూ ఉండమని నియో గించి, తన పురోహితుణ్ణి వెంటబెట్టుకుని, తూర్పుద్వారం కుండా నగరం దాటి మారు వేషంతో బయలుదేరాడు. నగరం వెలుపల ఒక ఇంటి ముందు వృద్ధు డొకడు కనిపించాడు. ఆయన ఇల్లు తాళం పెట్టి, ఇంటి చుట్టూ ముళ్ళకంప పెట్టి భార్యా బిడ్డలతో అడవికి పారిపోయూడు.\n\nచీకటి పడగానే ఆయన తన ఇంటికి తిరిగివచ్చి, వాకిలి తీయబోతూండగా కాలిలో ఒక ముల్లు గుచ్చుకున్నది. వెంటనే ఆయన నేలపై చతికిలబడి, కాలిలో గుచ్చుకున్న ముల్లును తీస్తూ, ‘‘నా అరికాలిలో ఈ ముల్లు గుచ్చు కున్నట్టే పాంచాల రాజుకు యుద్ధంలో బాణం గుచ్చుకొనుగాక!'' అని తిట్టుకున్నాడు. ఈ తిట్టు విని రాజపురోహితుడు ఆ వృద్ధుణ్ణి సమీపించి, ‘‘అయ్యూ, తమరు వృద్ధులు. కన్ను సరిగా కనిపించక మీరు ముల్లు తొక్కితే అది రాజుగారి దోషం ఎలా అయింది?'' అని అడిగాడు.\n\n‘‘రాజు అవినీతిపరుడైనందుచేతనే అధి కారులు దుష్టులైనారు. పగలు రాజభటుల బాధా, రాత్రి దొంగల బాధా భరించలేక ప్రజలు ఇళ్ళకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి, భార్యా బిడ్డలతో అడవికి పారిపోతున్నారు. లేకపోతే నా కాలిలో ఈ ముల్లు విరగవలసిన పనేమిటి?'' అన్నాడు వృద్ధుడు. రాజూ, పురోహితుడూ ఇంకొక గ్రామానికి వెళ్ళారు. అక్కడ వారికొక స్ర్తీ కనిపించింది. ఆమెకు యుక్తవయసు వచ్చి ఇంకా పెళ్ళి గాని కుమార్తెలు ఇద్దరున్నారు.\n\nవారిని అడవికి తీసుకుపోవటం ఇష్టంలేక ఆమె తన ఇంటనే దాచివుంచి, ఇంటికి కావలసిన కట్టెలూ, ఆకులూ తానే తెస్తూవుండేది. ఇప్పుడామె ఏవో ఆకులు కొయ్యటానికి ఒక చెట్టెక్కి దానిపై నుంచి కిందపడి, ‘‘ఈ రాజు చచ్చి పోను! వీడు బతికుండగా కన్యలకు పెళ్ళిగీత కూడా లేదు!'' అన్నది. ఈ మాటలు విని పురోహితుడు ఆమెను సమీపించి, ‘‘బుద్ధిహీనురాలా, రాజ్యంలో ఉండే ప్రతి కన్యకూ భర్తను వెతకటమే రాజు గారి పనా?'' అన్నాడు.\n\n‘‘పగలు రాజభటుల భయం, రాత్రి దొంగల భయం. కన్యలకు భర్తలెలా దొరుకు తారు?'' అన్నదా స్ర్తీ. రాజూ, పురోహితుడూ అక్కడి నుండి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారు. ఒక పొలాన్ని దున్నుతూ ఒక రైతు వారి కంటపడ్డాడు. అతను దున్నుతూ వుండగానే నాగలికర్రు గుచ్చుకుని ఒక ఎద్దు పడి పోయింది.\n\nవెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో, ‘‘ఈ పాంచాల రాజు గుండెలో బల్లెం గుచ్చు కుని ఇలాగే పడిపోరాదా? మా కష్టాలు తీరు తాయి!'' అన్నాడు. పురోహితుడు రైతుతో, ‘‘ఏమోయ్‌! నీ అశ్రద్ధవల్ల ఎద్దుకు దెబ్బ తగిలి పడిపోతే అందులో రాజుగారి తప్పేమిటి?'' అన్నాడు. ‘‘రాజుగారి తప్పు కాకపోతే ఎవరి తప్పు? పాలకులు దుర్మార్గులయితే బక్కవాళ్ళేం బతుకుతారు? పగలు రాజభటుల భయం, రాత్రి దొంగల భయం.\n\nనా భార్య, నా కోసం వండి తెచ్చిన కూడు బలవంతంగా లాక్కుని దుర్మార్గులు మెక్కేశారు. మళ్ళీ వండి ఎప్పుడు తెస్తుందా అని నేను నోరు తెరుచుకు చూస్తుండటం మూలాన బంగారమంటి ఎద్దు కాస్తా దెబ్బ తిని పడిపోయింది!'' అన్నాడు రైతు. అక్కడి నుండి బయలుదేరి రాజూ, పురోహితుడూ తమ రాజధానికి పోసాగారు. దారిలో వారికొక దృశ్యం కనిపించింది. ఒక మడుగులో వున్న కప్పలను, బతికి వుండగానే కాకులు పొడుచుకు తింటున్నాయి.\n\nఆ కప్పలలో ఒకటి క్రోధావేశంతో, ‘‘ఈ కాకులు మమ్మల్ని ఎలా బతికి వుండగానే పీక్కు తింటున్నాయో అలాగే పాంచాల రాజునూ, అతని సంతానాన్నీ శత్రువులు పీక్కు తిందురుగాక!'' అన్నది. ‘‘ఓసి మతిమాలిన కప్పా! మిమ్మల్ని పీక్కుతినే కాకుల్ని ఏమీ అనలేక రాజుగారికి శాపనార్థాలు పెడుతున్నావా?'' అన్నాడు పురోహితుడు కప్పతో. దానికి కప్ప, ‘‘రాజుగారిని తృప్తి చెయ్యటా నికి పురోహితుడు అలాగే అడుగుతాడు, అందులో ఆశ్చర్యంలేదు.\n\nకాని దేశంలో కాకబలులు కూడా కరువై పోబట్టేగదా కాకు లకు బతికున్న కప్పల్ని పీక్కుతినే దుస్థితి పట్టింది. అటువంటి రాజు ఛస్తే ఎంత మేలు!'' అన్నది. అది విని రాజు, ‘‘నన్ను కప్పలు కూడా శపిస్తున్నాయి. ఇక లాభం లేదు. మనం నగరానికి తిరిగివెళ్ళి, ఈ అరాజకాన్ని తుద ముట్టించుదాం!'' అన్నాడు. ఆ ప్రకారమే ఆయన రాజ్యపాలనలో శ్రద్ధ చూపి, లోపాలను సవరణ చేసి, ప్రజలకు శాంతిసౌఖ్యాలు కలిగేలాగు చాలాకాలం పరి పాలన సాగించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 361,
        "IMAGE": "cat_2",
        "NAME": "అరాజకం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 111,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊర్లో 'గోపి' అనే పిల్లవాడు ఉండేవాడు. గోపి బొమ్మలు చాలా బాగా వేస్తాడు. గోపికి ఒక చెల్లి ఉంది. ఆ పాప పేరు హరిత. గోపి 6వతరగతి చదువుతున్నాడు. హరిత 3వతరగతి చదువుతున్నది.\n\nఒక రోజు రాత్రి గోపి, హరిత, వాళ్ల అమ్మ అందరూ పడుకున్నారు. అప్పుడు గోపికి ఒక కల వచ్చింది:\n\nఅది ఏమిటంటే, \"ఒక ఊరు ఉందట. ఆ ఊరు నది పక్కన ఉందట. ఆ ఊరిలో ఒక పూరిగుడి సె ఉంది. అందులో ఒక అవ్వ, అమ్మ, బాబు ఉండేవాళ్లు. వాళ్ళకి ఒక గాడిద కూడా ఉండేది. ఒక రోజు పెద్ద తుఫాను ఒకటి వచ్చింది. విపరీతంగా వర్షం కురిసింది. వాళ్ళుండే పూరిగుడిసె లోకి నీళ్ళు రావటం మొదలుపెట్టాయి. అప్పుడు అమ్మ, అవ్వ, బాబులకు ఏమిచెయ్యాలో అర్థం కాలేదు. ఇక ఆ ఊరు విడిచిపెట్టి పోవడానికే నిశ్చయించుకున్నారు వాళ్ళు. తమతో పాటు గాడిదను కూడా వెంట తీసుకుపోయారు. అట్లా పోతూ పోతూ‌ వాళ్ళు గోపి వాళ్ళ ఇంటి ముందునుండే పోతున్నారు.\n\nకిటికీలోంచి వాళ్ళని చూసాడు గోపి- \"ఇదేంటి, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఇంత వానలో?\" అనుకొని, వాళ్ళని తమ ఇంట్లోకే పిలిచాడు. తాము ఉండే చిన్న ఇంట్లోనే వాళ్ళకీ‌ ఉండేందుకొక చోటు చూపించాడు\" అంతలో కల అయిపోయింది. గోపికి మెలకువ వచ్చేసింది కూడా.\n\nమరుసటి రోజున గోపి తన కలకి సంబంధించి మంచి బొమ్మనొకదాన్ని వేశాడు. బొమ్మ చక్కగా వచ్చింది. 'కానీ దాన్ని ఏం చెయ్యాలి?' అప్పుడు గుర్తుకొచ్చింది వాడికి- \"రేపు రాఖీపండుగ కదా, హరిత నాకు రాఖీ కట్టిన తర్వాత నేను తనకు ఈ బొమ్మనే బహుమతిగా ఇస్తే భలే బాగుంటుంది!\"\n\nమరునాడు గోపి అనుకొన్నట్టే \"అన్నా, ఇటు రారా\" అని పిలిచి రాఖీ కట్టింది హరిత. గోపి నవ్వి, తను గీసి పెట్టిన ఆ బొమ్మను హరితకు కానుకగా ఇచ్చాడు.\n\nహరితకి ఆ బొమ్మ ఎంత బాగా నచ్చిందంటే చెప్పలేం! అప్పటినుండీ హరితకు గోపికి పండుగ అంటే రాఖీపండగే. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ కోసం ఎదురుచూస్తూంటారు వాళ్ళిద్దరూ. హరిత తను సొంతగా తయారు చేసిన రాఖీలు కడుతుంటుంది; గోపీ తను గీసిన బొమ్మల్ని చెల్లికి కానుకగా ఇస్తుంటాడు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 362,
        "IMAGE": "cat_2",
        "NAME": "గోపి కల ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 112,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక కమలమ్మ, ఆమె కొడుకు రాము ఉండేవాళ్ళు. ఒక ముసలి అవ్వ తప్పిస్తే వాళ్లకు నా అన్నవాళ్ళే ఎవరూ‌ ఉండేవాళ్ళు కారు. ఒకసారి వాళ్ళుండే ఊళ్ళో విపరీతమైన కరువు వచ్చింది. దాంతో వాళ్ళు వేరే ఊరికి వలస పోవలసి వచ్చింది.\n\nఅట్లా వాళ్ళు దోవ వెంబడి పోతూ ఉంటే దారిలో వాళ్లకొక గాడిద కనిపించింది. దాని యజమానులెవరో దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లున్నారు; అది బక్క చిక్కిపోయి, ఆకలికి నకనకలాడుతున్నట్లు ఉంది, బలహీనంగా. దాన్ని చూడగానే రవి చాలా ముచ్చటపడ్డాడు. \"ఆ గాడిదను పెంచుకుందాం అమ్మా\" అని అడిగాడు. కమలమ్మ ఒప్పుకోలేదు. \"తింటానికి మనకే ఏమీ లేదు; ఇంక దాన్నెట్లాగ, సాకేది?\" అన్నది.\n\nకానీ రాము బ్రతిమిలాడాడు. దాంతో‌ కొద్ది సేపటికి ఆమె మెత్తపడి \"సరే, కానియ్యి. కానీ దాన్ని చూసుకునే బాధ్యత నీదే. అది చచ్చిపోతే మటుకు నన్ను ఏమీ అనకు\" అంది.\n\nరాము సంతోషంగా పోయి దాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అక్కడక్కడా నిలచి ఉన్న చెట్లలోంచి కొన్ని ఆకుల్ని కోసి దానికి తినిపించాడు. అది వాటిని నముల్తూ, వాళ్ళవెంట నడవసాగింది. కొద్ది దూరం పోయాక రాము తన నెత్తి మీద ఉన్న మూటను దాని మీదే వేశాడు- అది అలవోకగా ఆ బరువును మోస్తూ పోయింది.\n\nరాము వాళ్ళు ఎంత దూరం పోయినా కరువు ఛాయలు పోనే లేదు. చివరికి వాళ్ళు ఏదో ఒక ఊరు చేరుకున్నారు. ఆ సరికి సాయంత్రం కావస్తున్నది. అవ్వ, కమలమ్మ ఇద్దరూ ఒక చెట్టుక్రింద బిచాణా పరచి, మూడు రాళ్ళ పొయ్యిలో వంట మొదలు పెట్టారు.\n\nఅంతలో ఊళ్ళోంచి ఒకాయన వచ్చి వాళ్ళ ముందు నిలబడి, \"ఊళ్ళో చాకలి వాళ్ళు లేక చాలా కష్టంగా ఉంది- మీరు వచ్చారు గనక ఇక బాధే లేదు. రేపు ఉదయాన్నే మా బట్టలొక ఇరవై పంపుతాను- ఉతికి త్వరగా వెనక్కి ఇచ్చేయాలి మరి\" అన్నాడు.\n\nకమలమ్మకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు- ఎందుకంటే వాళ్ళు అసలు చాకలివాళ్ళు కాదు గద! ఉన్న ఊళ్ళో గడవక, కడుపు చేతబట్టుకొని వచ్చారు వాళ్ళు. అయితే తమతోబాటు ఉన్న గాడిదను చూసి ఆయన అట్లా అనుకున్నట్లుంది. 'ఏదో ఓ బ్రతుకు తెరువు- బట్టలు ఉతికితే కాసిని డబ్బులు వస్తాయి కదా, బ్రతుక్కోవచ్చు' అని ఆమె \"సరేలెండి సార్! అలాగే కానివ్వండి\" అన్నది.\n\nమరునాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసింది- 'ఎవరో చాకలివాళ్ళట, వచ్చి ఉన్నారు- బట్టలు బాగా ఉతుకుతారట! ఏ కాసిని డబ్బులు ఇచ్చినా చాలట!' అని. ఇక అందరూ వాళ్ల వాళ్ల బట్టలు తెచ్చి వేయటం‌ మొదలు పెట్టారు. కమలమ్మ కు, అవ్వకు చేతినిండా పని దొరికింది. రెండు మూడు రోజుల్లో గాడిద బాగా కోలుకున్నది కూడాను. బాగా అనుభవం ఉన్న గాడిద అవ్వటంతో అది వీళ్లకు చాలా సేవ చేసింది. అమ్మ, అవ్వ, రాము ముగ్గురూ ఒళ్ళు వంచి పని చేశారు. రాము గాడిదను వెంటబెట్టుకొని వెళ్ళి ఇంటింటినుండీ బట్టలు సేకరించుకొని వచ్చేవాడు. అట్లాగే ఉతికిన బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అమ్మ, అవ్వ ఇద్దరూ వంక దగ్గర బట్టలు ఉతకటం‌ మొదలు పెట్టేసారు.\n\nకరువు కారణంగా ఎలా బ్రతుక్కోవాలో అర్థంకాక వలస పోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు మూడుపూట్ల భోజనం దొరకటం మాత్రమే కాదు- ఒక్క సంవత్సరంలో సొంత ఇల్లు కూడా‌ ఏర్పడింది. మరుసటి సంవత్సరం నుండీ రాము బడికి వెళ్ళి చదువుకోవటం కూడా మొదలు పెట్టాడు.\n\nఅంతేకాదు; ఇప్పుడు వాళ్ళకు జీవితం అంటే భయం పోయింది-తమ శక్తి యుక్తుల పట్ల గౌరవం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్ళినా చాకలి పని చేసుకొని పొట్టపోసుకోగలరు. 'దేనికీ పనికి రాదు' అనుకున్న గాడిదే ఇప్పుడు వాళ్ళకి జీవనాధారమూ, జీవన స్ఫూర్తీ అయ్యింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 363,
        "IMAGE": "cat_2",
        "NAME": "జీవనాధారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 113,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "సోమయ్య ,రాజయ్య, బసవయ్య ముగ్గురూ చాలా తెలివైనవాళ్లని ప్రతీతి. ఆ ఊరిలోనే వీళ్లంత తెలివైనవాళ్ళు లేరు.\n\nవాళ్ళు ముగ్గురికీ ఒకసారి అనిపించింది-\"ఇంత తెలివి తేటలు ఉన్నవాళ్లం; ఒకసారి రాజుగారి మెప్పు పొందితే బాగుంటుంది కదా\" అని, ముగ్గురూ బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళారు.\n\n\"మహారాజా! మేం ముగ్గురం మా తెలివితేటల ఆధారంగా అనేక సమస్యల్ని పరిష్కరించాం. ఇన్నేళ్లకు మీ మెప్పు పొందాలని వచ్చాం. మా తెలివిని పరీక్షించి తగిన బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం\" అన్నారు.\n\"ఓ, తప్పకుండా! అలాగే చేద్దాం\" అన్నాడు రాజు, భటులను పిలిచి వారికి ఏదో చెబుతూ.\n\nరాజ భటులు ఒక పెద్ద పెట్టెను తెచ్చి అక్కడ దింపారు- \"సరే, తెలివిగల పిల్లలూ, ఇప్పుడు చెప్పండి, ఈ పెట్టెలో ఏముంది?\" అని వాళ్ళు ముగ్గురినీ అడిగాడు రాజు.\nముగ్గురూ ఒక్కసారిగా అన్నారు: \"అందులో మామిడి పళ్ళు ఉన్నాయి!\" అని.\nరాజయ్య అన్నాడు- \"అందులో నిండా పళ్ళు లేవు ప్రభూ! కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నై\" అని.\nబసవయ్య అన్నాడు- \"అవునవును- అందులో మహా ఉంటే ఒక డజను పళ్ళు ఉన్నై\" అని.\nరాజుగారి ఆజ్ఞ మేరకు పెట్టెని తెరిచారు భటులు- చూస్తే అందులో నిజంగానే డజను మామిడిపళ్ళు ఉన్నాయి! సభికులందరూ ఆశ్చర్యపోయారు.\n\" 'ఇందులో మామిడి పళ్లే ఉన్నాయి' అని మీకు ఎలా తెలిసింది?\" అడిగాడు రాజు.\n\nసోమయ్య అన్నాడు- \"ప్రభూ! మామిడిపళ్ళు అంత చక్కని వాసన వేస్తుంటే మరొక ఆలోచన ఎలా వస్తుంది? నేను వాసనను బట్టి ఇవి మామిడి పళ్ళేనని కనుకొన్నాను\" అని.\n\n\"వాసన ఎలాగూ ఉన్నది- భటులు పెట్టెను తెస్తున్నప్పుడు వాళ్ళు అసలు కష్టపడలేదు- అలవోకగా మోసుకొచ్చారు. దాన్ని బట్టి పెట్టె నిండుగా లేదని అర్థమైంది నాకు\" అన్నాడు రాజయ్య.\n\"ప్రభూ! వాళ్లు పెట్టెను క్రిందికి దింపేటప్పుడు వచ్చిన శబ్దాన్ని బట్టి నేను అందులో సుమారు ఒక డజను పళ్ళు ఉంటాయని ఊహించాను\" నవ్వాడు బసవయ్య.\n\nరాజుగారికి వాళ్ళ తెలివితేటలు చాలా నచ్చాయి. ముగ్గురినీ సత్కరించటమే కాక, వారిని తన ఆంతరంగిక సలహాదార్లుగా నియమించుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 364,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెలివి తేటలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 114,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు సాయంత్రం అవ్వ, అమ్మ, బాబు చెరువు గట్టుమీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. చెరువులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. వాతావరణం చాలా బాగున్నది. \"అవ్వా, అవ్వా! ఓ మంచి కథ చెప్పవూ?\" అని అవ్వ దగ్గరికి వెళ్ళాడు బాబు. \"ఇక్కడ కూర్చొని కథలు చెప్పుకుంటూంటే చీకటి పడిపోదూ? ఇంటికెళ్ళాక చెప్పుకుందాంలే\" అంది అవ్వ. \"కాదు, ఇప్పుడే ఓ చిన్న కథ చెప్పు, రాక్షసుడి కథ\" అని పట్టు పట్టాడు బాబు. అమ్మ, బాబు చెట్టుకింద కూర్చొని కథ వింటుంటే, అవ్వ కథ చెప్పటం మొదలుపెట్టింది ఇలాగ-\n\n\"అనగనగా ఒక రాజ్యంలో ఒకరాజు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. ప్రజలకి సాయం చేస్తూఉంటాడు. ఒకరోజున ఆ రాజ్యంలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ప్రజలను తినడం మొదలుపెట్టాడు. రోజుకో ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వారిని తింటున్నాడు వాడు.\n\nఅట్లా ఒకరోజున వాడు రాజు గారి ఇంటికి వెళ్ళి \"నాకు ఆకలిగా ఉంది- నీ కూతురు కావాలి\" అన్నాడు. అంత పెద్ద రాక్షసుడిని చూసి రాజుకూడా భయపడ్డాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆయనకు. అప్పుడు రాక్షసుడే అన్నాడు- నీ బిడ్డని రక్షించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితే నీ కుమార్తెను వదిలివేస్తాను. తప్పు సమాధానం చెప్పిన వాళ్ళని నాకు ఆహారంగా ఇవ్వాలి నువ్వు\" అని చెప్పాడు రాక్షసుడు.\nరాజు \"సరే ఆ ప్రశ్న ఏమిటో అడుగు\" అన్నాడు.\n\n\"పొద్దున నాలుగు కాళ్లతో నడుస్తుంది, మధ్యాహ్నం రెండుకాళ్ళతో నడుస్తుంది, రాత్రి మూడు కాళ్ళతో నడుస్తుంది- ఏమిటది?\" అడిగాడు రాక్షసుడు. రాజుకు ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు . తెల్ల మొఖం వేశాడు. రాక్షసుడు నవ్వాడు- \"పో, మరి దీనికి సరైన సమాధానం చెప్పమని ఊరంతా దండోరా వేయించు\" అన్నాడు.\n\nరాజ్యంలో ఎవ్వరికీ ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు. తప్పు సమాధానం చెప్పినవాళ్లను అందరినీ రాక్షసుడు భోంచేసేడు. రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు, యువకులు సగం మంది రాక్షసుడికి భోజనం అయిపోయారు. \"ఎలాగబ్బా, వీడిని ఓడించేది ఎవరు?\" అని రాజు ఆలోచనలో పడ్డాడు.\n\nచివరికి ఒకబాబు ముందుకు వచ్చాడు- \"నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అది తప్పైతే నువ్వు ఎలాగూ నన్ను తినేస్తావు. మరి ఒకవేళ అది సరైన జవాబు అయితేనో?\" అన్నాడు.\n\n\"నీలాంటి బుడతల్ని చాలా మందిని చూశానురా, దీనికి సరైన సమాధానం నువ్వు ఊహించలేవు. అయినా ఒకవేళ నీ జవాబు సరైనదే అనుకో, అప్పుడు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోతాను- సరేనా?\" అన్నాడు రాక్షసుడు గర్వంగా.\n\nఆ బాబు చెప్పాడు: \"నీ ప్రశ్నకు సమాధానం- 'మనిషి' \" అని. \"మనిషి తన జీవితం ప్రారంభంలో నాలుగు కాళ్లమీద పారాడతాడు. నడిమి వయసులో రెండు కాళ్లమీద నడుస్తాడు. ఇక ముసలితనం వచ్చేసరికి కట్టె పట్టుకొని మూడుకాళ్లతో మళ్ళాడుతాడు- అంతేగా?\" అన్నాడు. ఆ సమాధానం సరైనదేగదా, మరి రాక్షసుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకని వాడు కొండపైకి ఎక్కి ఒక పెద్ద రాయికి తన తలని గుద్దుకుని చచ్చిపోయాడు. రాజు, రాజ్యంలోని వాళ్లందరూ ఆ బాబుని మెచ్చుకున్నారు.\n\nఅవ్వ కథ ముగించి చూసేసరికి చంద్రుడు వచ్చేశాడు- బాబు, వాళ్ళ అమ్మ ఇద్దరూ చందమామని చూస్తూ ఆ చెరువు గట్టునే నిద్రపోయి ఉన్నారు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 365,
        "IMAGE": "cat_2",
        "NAME": "కథలో కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 115,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలా రోజుల క్రితం ఒక ఊళ్లో రంగారావు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. పట్నంలో అతనికి ఓ చిన్న స్థలం ఉండేది. అందులో కనీసం ఒక్క గదైనా కట్టాలని అతనికి బలే కోరిక. పట్నంలో గది కట్టాలంటే కనీసం పది వేల రూపాయలైనా ఉండాలి. కానీ రంగారావు దగ్గర ఏనాడూ అంత డబ్బు జమ కాలేదు.\n\nఒక రోజున రంగారావు పొలం దున్నుతున్నాడు. అకస్మాత్తుగా అక్కడ అతనికి ఒక బంగారు నాణెం దొరికింది. \"అబ్బ బంగారు నాణెం! దీంతో నా అవసరాలన్నీ తీరతాయి!\" అనుకొని అతను పని ఆపి, దాన్ని జేబులో వేసుకొని ఇంటికి బయలు దేరాడు.\n\nఇంటికిపోతుంటే, దారి మధ్యలో ఒక ముసలాయన ఎదురు పడ్డాడు రంగారావుకు. ఒక గాడిదను తోలుకొని వస్తున్నాడాయన. \"నాయనా! చాలా ఆకలిగా ఉంది. రెండు రోజులుగా ఏమీ తినలేదు. నీకు మేలు జరుగుతుంది- నీ దగ్గర ఏమైనా ఉంటే దానం చెయ్యి బాబూ\" అన్నాడు ముసలాయన, రంగారావుతో.\n\nసంతోషంగా ఉన్న రంగారావుకు అబద్ధం చెప్ప బుద్ధి కాలేదు. \"పోనీలే, ఇది నాకు దొరకలేదనుకుంటాను\" అని అతను తన జేబులోని బంగారు నాణెం తీసి ఆ ముసలాయనకి ఇచ్చేశాడు.\n\n\"చాలా గొప్ప పని చేశావు నాయనా, దీనితో నా అవసరం నెరవేరుతుంది. ఇదిగో, ఈ గాడిద చాలా మంచిది. దీన్ని నువ్వు తీసుకెళ్ళు\" అని ఆ ముసలాయన తన గాడిదను రంగారావుకు ఇచ్చి ముందుకు సాగాడు.\n\nరంగారావుకు ఆ గాడిదను ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వద్దన్నా వినేట్లు లేదు, ముసలాయన. అందుకని అతను దాన్ని తోలుకొని ఇంటికి పోయాడు.\n\nఇంటికి పోయేసరికి అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నది. వాళ్ల పక్కింటి వాళ్ళు వేరే ఏదో ఊరికని బయలు దేరి ఉన్నారు. తీరా సమయానికి బండి జాడ లేదు!\n\n\"దానిదేముంది, ఇదిగో ఈ గాడిద ఉంది కదా, మీ సామాన్లను దీనిమీద తీసుకెళ్దాం, రండి\" అని రంగారావు వాళ్ల సామాన్లన్నిటినీ పొరుగూరు చేర్చాడు. వాళ్ళు చాలా సంతోషపడి, అతనికి ఒక వందరూపాయలు ఇచ్చి, భోజనం కూడా పెట్టి పంపారు.\n\nవెనక్కి వస్తూ ఒకచోట విశ్రాంతిగా కూర్చున్నాడు రంగారావు. అంతలోనే ఒక చిన్న పిల్లవాడి ఏడుపులూ, వాళ్ల అమ్మ అరుపులు వినపడ్డాయి. రంగారావుకి జాలివేసింది. \"పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడమ్మా?\" అని అడిగాడు. \"చూడు నాయనా, మా బండి చక్రం విరిగి అవతల ఎక్కడో నిలిచి పోయింది. నడక తప్పితే ఇక వేరే మార్గం లేదు మాకు. వీడేమో నడవనని మారాం చేస్తున్నాడు\" అంది ఆ తల్లి.\n\n\"అయ్యో, దానిదేముందమ్మా, నా గాడిద మీద కూర్చోబెట్టండి వాడిని. చిటికెలో అందరం పట్నం చేరుకుందాం\" అన్నాడు రంగారావు ఆ పిల్లవాడిని సముదాయిస్తూ. పిల్లవాడు సంతోషంగా గాడిదనెక్కి కూర్చున్నాడు. పట్నం చేరాక వాళ్ల నాన్న రంగారావుకు బలవంతంగా వందరూపాయలు ఇవ్వటమే కాక, \"నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, సంకోచించకు\" అని మాట కూడా ఇచ్చాడు.\n\n\"ఏదైనా ఒక చిన్న పని ఇప్పించారంటే, మీ పేరు చెప్పుకొని బ్రతుక్కుంటాను\" అన్నాడు రంగారావు వినయంగా. \"పనిదేముంది, మన సైకిల్ షాపులోనే పని చెయ్యి. నీ పనిని బట్టి ఎంతో కొంత జీతం ఇస్తానులే\" అన్నాడు ఆ పెద్దమనిషి!\n\nఅలా రంగారావు సైకిల్ షాపులో పనికి కుదురుకున్నాడు; వళ్ళు వంచి ఇష్టంగా పని చేయటం మొదలు పెట్టాడు. నెల తిరిగేసరికి రంగారావుకి రెండువేలు జీతంగా ఇచ్చాడు షాపు యజమాని. \"అంత డబ్బు వద్దండీ, ఖర్చులకు ఎంతో‌ కొంత ఇవ్వండి చాలు\" అన్నాడు రంగారావు. యజమాని అతనికి ఖర్చులకు డబ్బు ఇచ్చి, మిగతా సొమ్మును అతని పేరనే బ్యాంకులో వేశాడు.\n\nసంవత్సరం తిరిగే సరికి రంగారావు పేర బ్యాంకులో ఇరవైవేల రూపాయలు జమ అయ్యాయి. ఆ డబ్బుతో అతను తన స్థలంలో‌ చిన్న ఇల్లు ఒకటి కట్టుకోగలిగాడు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 366,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఎక్కడినుండి ఎక్కడికి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 116,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "సూరికి అందమైన తోట ఒకటి ఉండేది. ఆ తోటలో రకరకాల పక్షులు ఉండేవి. అతను రోజూ తోటకు వెళ్ళి చెట్లకు నీళ్ళు కట్టి వచ్చేవాడు. ఒక రోజు తోటకి పోయి చూస్తే తోటంతా నిశ్శబ్దంగా ఉంది. పక్షులన్నీ మూగపోయి ఉన్నాయి.\n\n\"రోజూ ఎన్ని పక్షులు ఉండేవి! ఈ రోజు తగ్గిపోయినట్లున్నాయే! ఎవరో ఈ పక్షులను తినేస్తున్నారు. పట్టుకోవాలి\" అనుకొని, సూరి ఆ రాత్రికి తోటలోనే పడుకున్నాడు.\n\nరాత్రి 9గంటల ప్రాంతంలో పెద్ద గ్రద్ద ఒకటి వచ్చింది ఎక్కడినుండో. వచ్చీ రాగానే అది ఒక పక్షిపిల్లని తినేసింది! దాన్నే గమనిస్తున్న సూరి కోపం పట్టలేక ఆ గద్ద మీదికి దూకాడు. తన చేతిలో ఉన్న కట్టెతో దాని ముఖానికి నాలుగు అంటించాడు.\n\nఅయితే అది మామూలు గ్రద్ద కాదు- సూరితో సహా ఆకాశంలోకి ఎగిరింది అది. పోయి పోయి ఒక సముద్రంలోకి దూకింది!\n\nగద్ద మీద ఉన్న సూరి కూడా సముద్రంలోకి జారిపోయాడు. గ్రద్ద ఎక్కడికి వెళ్ళిందో‌ తెలీదు. సూరి మటుకు ఈదుకుంటూ ఒక దీవిని చేరుకున్నాడు. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. చాలా చెట్లు, మొక్కలు, తీగలు దట్టంగా పెరిగి ఉన్నై.\n\nఅంతలో‌ అకస్మాత్తుగా అతనికి ఒక ఎలుగుబంటి అతనికి ఎదురైంది! దాన్ని చూసి సూరి చాలా భయపడ్డాడు. కానీ అది వాడితో తెలుగులో మాట్లాడింది! \"భయపడకు\" అని అది సూరి చెయ్యిపట్టుకొని తమ ఇంటికి తీసుకుపోయింది వాడిని.\n\nఅక్కడికి వెళ్లగానే ఎలుగుబంటి అన్నది- \"సూరీ! నాకు ఆకలివేస్తున్నది. మీ మనుషులు అన్నన్ని వంటలు చేసుకుంటారు కదా, నాకు ఏమైనా చేసిపెడతావా?\" అని అడిగింది. సూరి ఇంకా భయపడుతూనే ఉన్నాడు. \"సరేలే, ఇలా అయితే నువ్వు నాకు ఆహారం పెట్టలేవు గానీ, ఏదైనా మంచి హోటల్‌కి పోదాం, రా!\" అని పిలిచిందది.\n\n\"ఇదేమి ఎలుగుబంటి, ఇక్కడేం హోటలు \" అని భయపడుతూనే సరేనన్నాడు సూరి. అలా పోతూవుంటే దారిలో ఇటుప్రక్కన ఒక పే..ద్ద గ్రద్ద ఒకటి కనిపించింది. దాన్ని వెంటనే గుర్తుపట్టాడు సూరి. మరుక్షణం ఎలుగుబంటి చెయ్యి పట్టుకొని హోటల్‌లోకి పరుగుతీశాడు.\n\"ఏమయింది, ఇంత తొందరపడుతున్నావు?\" అంది ఎలుగుబంటి.\n\n\"ఇందాక అక్కడ ఉందే, ఆ గ్రద్దే, మా ఊరికి వచ్చేది! అది నా తోటలో పక్షులన్నిటినీ తినేస్తోంది! దాన్ని తరుముకుంటూనే నేను ఇక్కడికి వచ్చాను!\" అన్నాడు సూరి.\n\n\"ఓ అదా! అది చాలా తుంటరిది! దానిమీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. రేపు కోర్టులో చెబుదాంలే, దాని సంగతి!\" అన్నది ఎలుగుబంటి. తెల్లవారగానే ఇద్దరూ కోర్టుకు పోయారు.\n\nఎలుగుబంటి కోర్టులో చెప్పింది: \"మన ప్రాంతంలో ఉండవలసిన గ్రద్ద వేరే ప్రాంతానికి పోయింది; అక్కడ ఉన్న పక్షులను తింటోది; తిరిగి ఇక్కడికి వస్తున్నది. దీనికి తమరు తగిన శిక్ష విధించాలి యువరానర్!\" అని.\nజడ్జిగారు అడిగారు: \"ఆ గ్రద్ద ఇదేనని ఎలా గుర్తుపడతారు?”అని.\n\nసూరి ముందుకు వచ్చి చెప్పాడు: \"నిన్న కట్టెతో ఆ గ్రద్ద కంటిమీద ఒక దెబ్బ వేశాను. ఇద్దుగో, ఇప్పటికీ ఆ గుర్తు ఉంది- చూడండి! జడ్జి గారికి కోపం వచ్చింది. \"ఆర్డర్ ఆర్డర్! ఈ దొంగ గ్రద్దకొక ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాం\" అన్నారు.\n\nవచ్చిన పని పూర్తి కాగానే సూరికి ఇంట్లోవాళ్లంతా గుర్తుకొచ్చారు. \"నా కోసం మా వాళ్ళు ఎదురుచూస్తుంటారు. ఎలుగుబంటీ, ఇప్పుడు సముద్రం దాటి ఎలా వెళ్ళను? అడిగాడు సూరి.\n\"మా సీతాకోక చిలుక ఉందిగా, దానిమీద ఎక్కి పోవచ్చులే\" అని ఎలుగుబంటి సీతాకోక చిలుకను రమ్మన్నది.\nసూరి ఆ సీతాకోకచిలుక మీద ఎక్కి, అందరికీ నమస్కారం పెట్టి బయలు దేరాడు.\nఇంటికి రాగానే సూరి వాళ్ళ అమ్మ \"ఎక్కడికి పోయినావురా, ఇన్నాళ్ళూ!\" అంటూ ఏడ్చింది.\n\"ఏమీ లేదమ్మా! ఓ దొంగ గ్రద్ద వచ్చి మన తోటలోని పక్షులను తింటుంటేనూ, ఆ గ్రద్దని చంపేసేందుకు వెళ్ళాను\" చెప్పాడు సూరి నిజాయితీగా.\n\"మరి ఇన్ని రోజులు పోయావేరా?\" అడిగింది అమ్మ.\n\"అటునుండి అటు మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి పోయాను; వాడి పుట్టినరోజు కదా!\" అన్నాడు సూరి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 367,
        "IMAGE": "cat_2",
        "NAME": "సూరి తోట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 117,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రవి, శాంత అనే దంపతులు ఉండేవారు. రవి బాగా వ్యాపారాలు చేసి చాలా డబ్బును పోగు చేశాడు. ఈ దంపతులు ఇద్దరూ చాలా పొదుపుగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ కొడుకు సతీష్ మాత్రం దుబారా మనిషి. స్కూలుకి వెళ్ళడమంటే వీడికి పరమ చిరాకు. రవి, శాంతి సతీష్‌ను ఒక మంచి బడిలో చేర్పించారు; కానీ సతీష్ స్కూలుకు వెళ్తున్నట్టే వెళ్ళి, ఊరి చెరువు కట్ట మీద ఆడుకునేవాడు. అంతేకాదు- వాళ్ళ నాన్న కూడబెట్టిన డబ్బును తీసుకెళ్ళి, ఏవేవో ఆటలు ఆడేవాడు; ఆ డబ్బును పోగొట్టుకునేవాడు.\n\nఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి, సతీష్‌ను కొట్టాడు, తిట్టాడు. \"ఇలాంటి పనులు మంచివి కావురా\" అని ఎన్నో విధాలుగా చెప్పాడు. \"ఇంకొకసారి ఇలా చేస్తే ఇంట్లోంచి గెంటేస్తా- జాగ్రత్త\" అని బెదిరించాడు. కానీ సతీష్ ఆ మాటలు పట్టించుకోలేదు. ఒక చెవితో విని, మరొక చెవితో వదిలేశాడు.\n\nసతీష్ స్నేహితుడు మహేష్ అని ఒకడు ఉండేవాడు. \"ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావురా, నేను స్కూలుకు వెళ్తున్నాను కదా, నువ్వూ నాతో రా, వెళ్దాం. బాగా చదువుకుంటే నీ కాళ్ళమీద నువ్వు నిలబడచ్చు కదా, ఇలా దొంగతనం చేయడం ఎందుకు? వాళ్ళకు నీ మీద ఉన్న ప్రేమను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా కాలాన్ని వృధా చేయకురా, బాగా చదువుకో\" అని చెప్పాడు మహేష్. అతని మాటల్ని కూడా సతీష్ పెడచెవిన పెట్టాడు.\n\nవాళ్ల నాన్న తిట్టినప్పుడల్లా సతీష్ ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేవాడు. \"వాడు ఇక మారడు\" అని నిర్ధారించుకొని రవి వాడిని వదిలేశాడు. అట్లా సతీష్ దుబారాగా పెద్దవాడ య్యాడు; కానీ సోమరిపోతుగానే మిగిలిపోయాడు. పెద్దయ్యాక మహేష్ పోలీసు ఇన్‌స్పెక్టరు అయ్యాడు. ఆ ఊరి రౌడీల పట్టికలో సతీష్‌ను చూసి, చాలా బాధ పడ్డాడు.\nఅతన్ని పిలిచి \"సతీష్, ఎలా వున్నావ్ రా! మీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు?\" అని అడిగాడు.\n\"నన్ను మా అమ్మా, నాన్నలు ఇంట్లోంచి తరిమేసారురా\" అని చెప్పాడు సతీష్.\n\n\"మరి తమిమెయ్యక ఎలా ఉంటారు? నువ్వు అలాంటి చెడు పనులు చేస్తూంటే ఎవరైనా అలాగే చేస్తారు. అదే నువ్వు చదువుకుంటే మంచి డాక్టరో, ఇంజనీరో అయ్యేవాడివి! కానీ కాలం విలువ తెలియక అలా చేశావు. ఇప్పటికైనా మీ అమ్మా, నాన్నల దగ్గరికి వెళ్ళు. క్షమించమని వేడుకో. సోమరిపోతుగా ఉండకు. దొంగ పనులు మాని ఏదైనా వ్యాపారం చేసుకో, నేనూ నీకేమైనా సాయం చెయ్యగలనేమో చూస్తాను. అలా కాక చెడుదారినే ఉంటానంటే మటుకు, ఇన్‌స్పెక్టరుగా నా బాధ్యత నేను నిర్వర్తించాల్సి ఉంటుందని మర్చిపోకు!\" అని చెప్పి వెళ్ళిపోయాడు మహేశ్. మిత్రుడి మాటలు సతీష్‌ని ఆలోచింపజేశాయి. అతని మనసు మారింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పాడు. వాళ్ళ సాయంతో తను కూడా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. నిలకడమీద అందులో విజయం సాధించాడు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 368,
        "IMAGE": "cat_2",
        "NAME": "కాలం విలువ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 118,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ, అవ్వ, బాబు ఉండేవారు. ఒక రోజు వాళ్ళు ముగ్గురూ ప్రక్క ఊరికి బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక గాడిద పిల్ల కనిపించింది.\n\nబాబు అన్నాడు \"అమ్మా! ఈ బుజ్జి గాడిద చూడు ఎంత అందంగా ఉందో! మనం దీనిని పెంచుకుందామా?\" అని.\n\"సరే అట్లాగే కానివ్వురా, నీ ఇష్టం\" అన్నది అమ్మ.\n\nగాడిదను కూడా వాళ్ళు తమతోపాటు తీసుకువెళ్ళారు. దానికి ఏ పనులూ చెప్పకుండా ముచ్చటగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. కొన్ని రోజులకు అది కొంచెం పెద్దది అయ్యింది.\n\nఅంతవరకూ వాళ్లమీదే ఆధారపడి బ్రతికిన ఆ గాడిదకు పెద్దవ్వగానే వేరే ఆలోచనలు మొదలయ్యాయి- అది తన మనస్సులో అనుకుంది-\"ఏంటి ఇది? నేను ఒకలాగా ఉన్నాను, వీళ్ళు ఒకలాగా ఉన్నారు! అసలు నేను ఎవరిని, వీళ్ళు ఎవరు? వీళ్ళేమో ఇడ్లీలు- దోశెలు తింటారు; నాకేమో గడ్డీ, గాదం తినిపిస్తారు. సరిగ్గా తిండి కూడా‌ పెట్టరు; పైపెచ్చు నాతో పని చేయించుకుంటారేమో ఇంక!\" అని అనుకుంది.\n\nదాంతో దానికి బాధ మొదలైంది. 'తనని ఎవ్వరూ ప్రేమించటం లేదు; తన శ్రమను మాత్రం దోచుకుంటారు' అనుకున్నదది. \"నేను ఈ రోజు రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయాననుకో, మరి వాళ్ళు నన్ను వెతుకుతారా, వెతకరా?\" అని సందేహించి, అది ఒక రోజున కట్లు తెంచుకొని బయట పడింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక రోజంతా ఎవ్వరికీ కనపడకుండా ఒక చోట దాక్కున్నది.\n\nబాబు గాడిదకోసం‌ చాలా వెతికాడు; కానీ వాడికి అది కనబడితేగా? గాడిద ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు.\n\n\"చూశావా, ఎవ్వరూ నాకోసం వెతకను కూడా వెతకలేదు! అంటే వీళ్ళెవ్వరికీ నామీద ప్రేమలేదన్న మాట. కేవలం పనికి మాత్రమే వాడుకుంటారన్నమాట నన్ను!\" అనుకొని గాడిద వాళ్ళనుండి దూరంగా పారిపోయింది.\n\nఆ తర్వాత అది చాలా మంది దగ్గరికి వెళ్ళింది. దాన్ని దగ్గరికి తీసినవాళ్ళంతా దాని చేత చాకిరీనే చేయించుకున్నారు. పాపం ఎవ్వరూ దానికి ఏనాడూ ఇడ్లీలూ, దోసెలూ పెట్టనే లేదు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 369,
        "IMAGE": "cat_2",
        "NAME": "గాడిద బ్రతుకు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 119,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఇతరులకు సాయపడే మనస్తత్వం ఉన్న రామానందుడు ఆ గ్రామంలో ఉన్న గుడ్డివాడైన సోముడికి సాయపడాలనుకున్నాడు. సోముడు అంగవైకల్యం అధిగమించి జీవితంలో స్థిరపడాలంటే ఏదైనా విద్య నేర్పించడం అవసరమని గ్రహించి, తన సంపాదనలో కొంత ఖర్చు చేసి ఒక సంగీత విద్వాంసుడి దగ్గర చేర్పించాడు.\n\nభగవంతుడు దయామయుడు. సోముడికి కళ్లు ఇవ్వకపోయినా గొంతులో మాధుర్యాన్ని ఇచ్చాడు. నిరంతర సాధనతో కొద్ది కాలంలోనే గురువు మన్ననలను పొందాడు.\n\nసోముడు రామానందుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ‘‘మొదట నువ్వు సాయపడతానంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తాత్కాలిక సాయం చేస్తావనుకున్నాను. ఇలా శాశ్వత సంపద అందచేస్తావనుకోలేదు. నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుంది. అంగవైకల్యం ఉన్నవారికి తాత్కాలిక సాయంగాని, సానుభూతి గాని పెద్దగా ఉపయోగపడదు. ఆత్మస్థయిర్యం పెంచే నీ సాయం కొండంత అండ’’ రామానందుడ్ని ఆలింగనం చేసుకున్నాడు సోముడు.\n\n‘‘నా మనస్సుకు పుట్టిన బుద్ధితో నాకు చేతనైనంత సాయం చేసాను. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినంత గొప్పతనం లేదు. ఇచ్చి పుచ్చుకోవడమే మానవ జీవితం. రేపటి రోజు ఈ సంగీతాన్ని నలుగురికి నేర్పి ప్రతిభావంతుల్ని వెలికి తీస్తావు. ఈ రోజు నేను అందజేసినది రేపు నువ్వు నలుగురికి పంచుతావు ఇది నిజం కదా!’’ అంటూ తల నిమిరాడు రామానందుడు.\n\nరామానందుడి ఆప్యాయతకు సోముడి కళ్లు చెమర్చాయి. ‘‘అన్నా! నువ్వు చెప్పినట్టే ఈ శాశ్వత సంపదను నలుగురికీ పంచుతాను’’ అన్నాడు సోముడు.\n\n‘‘ఈ రాజ్యంలో రాజుగారు కళాప్రియులు. అతని దగ్గర నీ ప్రతిభ చూపించి సంగీత కళాశాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుందాం’’ అంటూ అభయమిచ్చాడు రామానందుడు.\n\nకొద్దిరోజులు సోముడితో సావాసం రామానందుడికి కూడా సంగీత ప్రవేశం కలిగింది. సోముడిలో ఒంటరితనం పోగొట్టేందుకు రామానందుడు తనకు తీరిక దొరికినపుడల్లా వచ్చి సోముడితో సంగీత సాధన చేస్తుండేవాడు. చివరకు రామానందుడు కూడా సంగీతంలో ప్రావీణ్యత సంపాదించాడు.\n\nఒకరోజు రామానందుడు సోముడ్ని వెంటపెట్టుకుని సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు రాజుగారి కోటకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్దే అడ్డంకులు ఎదురయ్యాయి. రాజదర్శనం అంత తేలిక కాదన్నారు కాపలాదారులు.\n\nకాపలా భటులు లంచం ఆశిస్తున్నట్టు గ్రహించిన రామానందుడు రాజుగారు ఇచ్చే కానుకల్లో సగం ముట్టచెబుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడు.\n\nరాజాస్థానంలో ప్రవేశం కలిగింది. రాజుగారి అనుమతితో సంగీత ప్రతిభను ప్రదర్శించారు. చూసిన వారంతా చప్పట్లతో జేజేలు పలికారు.\nరాజు సంతృప్తి చెంది చెరో వంద బంగారు నాణేలు ఇద్దరికి బహూకరించాడు.\nరామానందుడు తన వాటాలో యాభై నాణేలను లెక్కించి రాజుగారికి తిరిగి ఇవ్వబోయాడు.\n\nరామానందుని చర్య రాజుగారిని అవమానించేట్టు ఉండడంతో రాజుగారికి కోపం వచ్చింది. పక్కనే వున్న మంత్రి కలగజేసుకుని ‘నువ్వు చేస్తున్న పని ఏమిటి?’ అని నిలదీసాడు.\n\n‘‘క్షమించండి! నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’ ధైర్యంగా అడిగాడు రామానందుడు రాజుగారికి కోపం చల్లారింది. రామానందుడి చేతల్లో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించి ‘‘ముందు అబద్ధం చెప్పు. అది మాకు సబబుగా అనిపించకపోతే మీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది’’ హెచ్చరికగా చెప్పాడు.\n\n‘‘అబద్ధం వినండి! మేమిద్దరం గుడ్డివాళ్లమనే సానుభూతితో చెరో వంద బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు. నాకు ఒక కన్ను కనిపిస్తోంది. నా మిత్రుడికి రెండు కళ్లూ కనిపించవు. అతనికి వంద నాణేలు ఇచ్చినప్పుడు న్యాయంగా యాభై నాణేలు మాత్రమే నేను తీసుకోవాలిగా అందుకే తిరిగి యాభై నాణేలు మీకు అందించింది’’ అన్నాడు రామానందుడు.\nరాజు సంతృప్తి చెందాడు. ‘అయితే ఈ సారి నిజం చెప్పు‘ అన్నాడు రాజు.\n\n‘‘మీరు నటనా సార్వభౌములు. గొప్పగా నటించగలరు. అందులో ఇప్పుడు నటిస్తున్న గుడ్డివాడి పాత్ర అమోఘంగా ఉంది. తోటి కళాకారుడ్ని ప్రోత్సహించడం కళాకారుడిగా నా ధర్మం. అందుకే యాభై నాణేలు ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వచూపింది’’ అన్నాడు రామానందుడు.\n\nఒక్కసారిగా రాజుగారి ముఖ కవళికలు మారిపోయాయి. ‘‘నేను గుడ్డివాడిగా నటిస్తున్నానా! రుజువేంటి?’’ కోపంతో అడిగాడు.\n\nఅప్పుడు కాపలా భటుల లంచాల గురించి తెలియజేస్తూ కోటలో జరుగుతున్న అవినీతి చర్యలను చూడలేని మిమ్మల్ని గుడ్డివాడిగా అంచనా వేయడంలో తప్పులేదుగా అదే రుజువు!’’ అన్నాడు రామానందుడు.\n\n\nనిప్పులాంటి నిజం చెప్పిన రామానందుడి మాటల్లో యదార్థాన్ని మంత్రి ద్వారా ఆరా తీయించాడు రాజు. నిజమని తేలింది. భటులకు శిక్ష విధించాడు.\n\nకోటలో జరుగుతున్న అవినీతి బండారాన్ని సమయస్ఫూర్తితో తెలియజేసిన రామానందుడిని మెచ్చుకుని మరిన్ని కానుకలతో సత్కరించాడు ఇద్దరిని ఆ రాజుగారు.\n\nఆకానుకలతోసంగీతకళాశాలస్థాపనకుపూనుకున్నాడురామానందుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 370,
        "IMAGE": "cat_2",
        "NAME": "సమయస్ఫూర్తి ‍‍‍ కథ‌",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 120,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ధర్మపురి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు సత్యవంతుడు. ఆ రాజు వద్ద చిత్రాంగుడు అనే సేవకుడు పనిచేసేవాడు. రాజు దర్శనం కోసం ప్రతిరోజు దర్భారుకు వచ్చే ప్రజలను లోనికి అనుమతించడానికి పదో, పాతికో పుచ్చుకోవడం అతని అలవాటు. ప్రజల సమస్యలను సాను కూలంగా విని ధర్మానికి లోపడి పరిష్కారించే రాజు కు సేవకుడి తీరు వేగుల ద్వారా తెలిసింది. అక్రమంగా సేవకుడు ప్రజలను దోచుకోవడం రాజుకు నచ్చలేదు. వెంటనే ఆ సేవకుణ్ణి రాజ మందిరం నుంచి తొలగించి భక్తులను వరుసగా పంపించేలా దేవాలయం ముందు నియ మించాడు.\n\nకనీసం దైవభక్తి, పాపభీతి తో నైనా డబ్బులు తీసుకోవడం మానివేస్తాడని రాజు ఆలోచించాడు. రెండురోజులు నమ్మకంగా పనిచేసి గుడికి వచ్చిపోయేవారిని గమనించిన ఆ సేవకుడు మూడోరోజునుంచి ప్రత్యేకదర్శనం అంటూ భక్తులతో కూడా డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. వేగుల ద్వారా విషయం తెలుసుకున్న రాజు చిత్రాంగుడిలో మార్పురాకపోవడంతో ఆశ్చర్యపోయాడు.\n\nఉద్యోగం నుంచి తొలగిస్తే అతని కుటుంబం వీధిన పడుతుందని భావించాడు. ఏలాగైన అతనిలో మార్పు తీసుకురావాలన్న ప్రయత్నంతో శ్మశానం వద్ద కాపలాదారుడిగా నియమించాడు. రాజ మందిరంలో దర్జాగా, దేవాలయం లో నిత్యం దేవుడిని చూస్తూ ఉండాల్సిన తాను శ్మశానం ముందు కాపలా దారుడిగా పనిచేస్తున్నందుకు సేవకుడు పశ్చాత్తాప పడతాడని రాజు భావించారు.\n\nకాని సేవకుడిలో మార్పులేదు. రెండు, మూడు రోజులు పరిస్థితులు గమనించాడు చిత్రాంగుడు. ఆ తరువాత కర్మకాండలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలుచేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన రాజు ఇక లాభం లేదనుకున్నాడు. చిత్రాంగుడినే పిలిచి కారణం తెలుసుకుని కఠినంగా శిక్షించాలని నిర్ణయించాడు. అతడిని రాజదర్భారుకు పిలిపించి, నిండు సభలో 'ఉచితంగా చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పుకదా. ఎందుకు చేశావు' అని ప్రశ్నించాడు.\n\nశాంతంగా ఉండే మహారాజు ఉగ్రరూపం చూసి సభలోని వారందరూ భయంతో వణికిపోయారు. చిత్రాంగుడికి మరణశిక్ష తప్పదని భావించారు. కాని చిత్రాంగుడు మాత్రం బెదరలేదు. ఎంతో శాంతంగా 'మహారాజా!, నేను చేసింది తప్పే. కాని రోజు అనేకమందిని డబ్బులు అడిగాను. కొందరు ఎమి అనకుండా ఇచ్చారు, మరికొందరు తిట్టుకుంటూ ఇచ్చారు. కాని ఎవ్వరు కూడా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేదు. మీకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. మీరు రోజు అందరినీ కలిసి వారి సమస్యలు వింటారని తెలుసు. కాని ముందుగా తామే మీ మందిరానికి రావాలన్న ఆరాటంతో నేను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేవారు.\n\nఇక దేవాలయంలో దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. కాని ఎక్కువ తప్పులు చేసిన వాడికి ప్రత్యేకపూజలు అనగానే తాము చేసిన పాపాలు పోతాయని నమ్మకం. అందుకే డబ్బులు ఇచ్చేవారు. ఇక శ్మశానంలో కూడా కర్మకాండలు త్వరగా ముగించాలని ఆరాటమే తప్ప పోయిన మనిషిపై మమకారం లేదు. అందుకే డబ్బులు ఇచ్చారు.\n\nతూతూ మంత్రంగా కర్మ కాండ చేసి వెళ్లిపోయారు. డబ్బులు ఇచ్చే ప్రజలకు లేని పట్టింపు తీసుకునే నాకు ఎందుకు రాజా'' అని ఎదురు ప్రశ్నవేసాడు. చిత్రాంగుడి తీరుకు సభలోని వారు ఆశ్చర్యపోయారు. రాజు నోట మాటలేదు. తప్పు సేవకుడిది కాదు అతనిని అవినీతి దిశగా ప్రేరేపించిన ప్రజలదే అన్న వాస్తవం తెలుసుకున్నాడు. లంచం తీసుకునే వాడికన్నా ఇచ్చేవాడికే ఎక్కువ శిక్ష ఉంటుందని సభలో ప్రకటిం చాడు.\n\nఅంతే ఆ రోజు నుంచి చిత్రాంగుడితో పాటు అనేక మందిలో మార్పు వచ్చింది. ధర్మపురి రాజ్యం ఎందరికో ఆదర్శం అయ్యింది. పిల్లలూ! ఇప్పుడు చెప్పండి! ఈ కథ ద్వారా మీకు ఏం అర్థం అయ్యిందో! ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాళ్లకి లోటు లేదు. అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 371,
        "IMAGE": "cat_2",
        "NAME": "దోచుకునేవాడికి దొరికినంత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 121,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక టక్కరినక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది. ‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే.\n\nఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళుతెరిచి చూసింది.\n\n‘‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’’ అని ప్రాధేయపడింది.\n\n‘సరే’నంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరకి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది’ అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది.\n\nఅయితే ఎలుగుబంటి పడటం పడటం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గూబ మీద ఒక్కటిచ్చింది. గూబ గుయ్యిమన్న నక్క పట్టు తప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది. నీతి:దుష్టులకుఆశ్రయంఇవ్వకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 372,
        "IMAGE": "cat_2",
        "NAME": "నడ్డి విరిగిన నక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 122,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవంతా వెతకసాగింది. ఒకచోట దానికి చచ్చిపడున్న ఒక జింక కనిపించింది. ‘ఆహా! ఇవాళ నా అదృష్టం బావుంది. రెండు రోజులపాటు ఈ జింక మాంసం తిని కడుపు నింపుకోవచ్చు’ అనుకునేంతలో ఒక సింహం గట్టిగా గర్జించింది. ఆ శబ్దం వినపడగానే నక్క చెట్టు వెనుక నక్కింది.\n\n‘అయ్యో! ఈ సింహం ఇప్పుడొచ్చిందేమిటి? అసలే దీని కడుపు పెద్దది. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది,’ అనుకుంది నక్క నిరాశగా.\n\nసింహం జింక మాంసం తినబోయింది. ఇంతలో ఒక ఎలుగుబంటి అక్కడకు దూసుకు వచ్చింది. ‘‘ఏయ్! దాన్ని ముట్టుకోకు. అది నాది. నేనే ఆ జింకను వేటాడి చంపాను,’’ అంటూ గట్టిగా అరిచింది.\n\n‘‘నువ్వు చంపడమేమిటి? అబద్ధాలు చెప్పకు. అయినా ఈ అడవికి నేను రాజును. కాబట్టి ఏ పదార్థాన్నైనా ముందుగా తీసుకునే అధికారం నాకే ఉంది. నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో,’’ అంటూ కోపంగా గర్జించింది సింహం.\n\nఎలుగుబంటి తక్కువేం తినలేదు. ‘‘నువ్వు రాజయితే నాకేంటి? కాకపోతే నాకేంటి? న్యాయం న్యాయమే! ఈ మాంసం నాది, అంతే’’ అంది కోపంగా.\n\nఇంకేం, నాదంటే నాదని రెండూ కాసేపు వాదించుకున్నాయి. తరువాత ముష్టియుద్ధానికి దిగాయి. సింహం తన పంజాతో ఎలుగుబంటి మూతి మీద కొడితే, ఎలుగుబంటి సింహాన్ని కిందపడేసి దాని నడుము మీద పిడికిలితో ఒక్కటిచ్చింది. చెట్టుచాటున దాగున్న నక్క ఇదంతా గమనిస్తోంది. సింహం ఎలుగుబంటి రెండూ భీకరంగా పోట్లాడుకోసాగాయి. అరగంట... గంట గడిచింది. చివరకు రెండూ కొట్టుకుని కొట్టుకుని సృ్పహ తప్పి పడిపోయాయి.\n\nనక్క నెమ్మదిగా చెట్టుచాటు నుంచి ఇవతలకు వచ్చింది. సింహం, ఎలుగుబంట్ల వైపు చూసింది. ఆ రెండూ చలనం లేనట్టు పడున్నాయి. నక్క ఏమాత్రం చప్పుడు చేయకుండా ఎంతో జాగ్రత్తగా జింక మాంసాన్ని కడుపునిండా తింది. మిగిలిన దానిని పొదలమాటుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 373,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెలివైన నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 123,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి కుక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా కుక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది.\n\nఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి కుక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.\n\n‘‘కుక్క మామా! కుక్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. కుక్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.\n\n‘‘నువ్వు మేలుజాతి కుక్కలా ఉన్నావు. నీలాంటి కుక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన కుక్క ‘సరే’ అని తలూపింది.\n\nవెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ కుక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి కుక్క వెనుకకు, మరొక కాకి కుక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా కుక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన కుక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ కుక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 374,
        "IMAGE": "cat_2",
        "NAME": "తిక్కకుదిరింది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 124,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏ మాత్రం తెలివితేటలు లేవు. దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రవూదం ఎదురు కాలేదు. అందువల్ల దానికి భయువుంటే ఏమిటో కూడా తెలీదు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. కుందేలుకు విపరీతమైన దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు బయులుదేరింది. దారిలో ఒక నక్క ఎదురరుుంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీళ్లూరారుు. అరుుతే అది కుంటినక్క. ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలును వేటాడడం దానికి సాధ్యం కాదు. అందుకని ఒక ఉపాయం పన్నింది.\n\nకుందేలును చూస్తూ, ‘‘ఏంటి అల్లుడూ! ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నావు? రా! ఇలా వచ్చి నీడలో కాసేపు విశ్రాంతి తీసుకో’’ అంటూ పిలిచింది నక్క.\n\n‘‘నాకు దాహంగా ఉంది వూవూ! వుుందు నీళ్లు తాగి వస్తాను’’ అని ఎంతో వుర్యాదగా చెప్పి అక్కడి నుంచి కదిలింది కుందేలు.\n\nకుందేలు నీటి కాలువ దగ్గరకు వెళ్లి చల్లటినీళ్లను కడుపునిండా తాగింది. దాహం తీరాక తిరిగి అది నక్క దగ్గరకు వచ్చింది.\n\nకుందేలును చూసి నక్క ఆశ్చర్యపోరుుంది. ‘ఇది పిచ్చిదానిలా ఉంది. దీన్ని నమ్మించి మోసం చేయూలి?’ అనుకుంది.\n\n‘‘నక్క వూవూ! నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వంటే వూ వాళ్లకు చాలా భయుం తెలుసా? నిన్ను టక్కరినక్క అంటూ తిడుతుంటారు’’ అంది.\n\n‘‘నిజమే అల్లుడూ! నేనెంతో వుంచిదాన్ని. కాని ఎవరూ నన్ను మెచ్చుకోరు’’ అంది ఎంతో దిగులు నటిస్తూ.\n\n‘‘బాధపడకు. దీనికి పరిష్కారం కనుక్కుందాం. నువ్వు వుంచిదానివని అందరికి తెలిసేలా చేద్దాం?’’\n\n‘‘అరుుతే ఈ రోజు రాత్రి నా ఇంటికి వస్తావా? భోజనం చేస్తూ వూట్లాడుకుందాం?’’ అంది నక్క.\n‘‘తప్పకుండా వస్తాను!’’ అంది కుందేలు.\n\nనక్క తనలో తాను క్రూరంగా నవ్వుకుంది. ‘‘అహ్హహ్హా... ఈ పిచ్చి కుందేలు నా వలలో చిక్కుకుంది. ఈ రాత్రికి కుందేలు ఇగురు వండుకుని తింటాను’’ అనుకుంది.\nచీకటి పడగానే నక్క గుహకు బయులుదేరింది కుందేలు. నక్క ఎంతో ఆత్రంగా కుందేలు కోసం ఎదురుచూస్తూ ఉంది.\n‘‘రా అల్లుడూ! నీ కోసమే చూస్తున్నాను’’ అంటూ ప్రేవుగా పిలిచింది నక్క.\n\nఅరుుతే అక్కడ తినడానికి ఆహారం ఏమీ కనిపించలేదు. ఆహారం కోసం కుందేలు వెతకసాగింది. నక్క తొందరపడి, భీకరంగా అరుస్తూ ఒక్కసారిగా కుందేలు పైకి దూకబోయింది. అదృష్టం.... కుందేలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు. గుహ ద్వారానికి దగ్గరలోనే నిలబడి ఉంది. ప్రవూదం పసిగట్టిన కుందేలు నక్కకంటే వేగంగా వెనకకు దూకింది. కుందేలు మీద పడాల్సిన కుంటి నక్క దబ్బున నేలమీద పడింది.\n\n‘బాబోయ్ నక్కలు నిజంగానే కుందేళ్లను తింటారుు’ అనుకుంటూ భయుంగా పారిపోరుుంది కుందేలు.\n\nఆరోజు నుంచి కుందేలు నక్కలకు, కుక్కలకు దొరక్కుండా దూరంగా మసలుతూ ఎంతో జాగ్రత్తగా ఉండసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 375,
        "IMAGE": "cat_2",
        "NAME": "నక్కమామ- కుందేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 125,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.\n\nవెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.\n\nఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.\n\nఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 376,
        "IMAGE": "cat_2",
        "NAME": "వింతగొర్రె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 126,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో కాకి, పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటుండేవి. అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకోవడమే కాక ఒకదాని పిల్లల్ని మరొకటి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవి.\nఒకరోజు కాకి, పిచ్చుక పిచ్చా పాటిగా మాట్లాడుకొంటుండగా\n‘‘రక్షించండి! రక్షించండి! నేస్తాల్లారా! ’’ అంటూ భయంతో వణికిపోతున్న నెమలి ఒకటి వాటి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది.\n‘‘ఏమిటి నేస్తమా? ఎక్కడినుండి పరిగెత్తుకొస్తున్నావు? ఎందుకిలా కంగారుపడుతున్నావు? అని అడిగింది కాకి.\n\n‘‘ మా కుటుంబంలోంచి పొరపాటున తప్పిపోయి వేటగాని కంటపడ్డాను. అతను నా వెంట పడుతుంటే తప్పించుకునే యత్నంలో పూర్తిగా దారితప్పి పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరూ కనపడ్డారు. మీరే నన్ను ఆదరించి రక్షించాలి’’ అని వేడుకుంది నెమలి.\n‘‘సరే! అలాగే నేస్తమా’’ అని ఆదరించాయి కాకి, పిచ్చుక.\nతిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడంవల్ల కాకి, పిచ్చుకలతోపాటు అక్కడే వుండి వాటికి మంచి నేస్తమైంది నెమలి.\n\nకొన్నాళ్లు బాగానే గడిచిపోయిది వాటి స్నేహం. కాకి, పిచ్చుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయిన నెమలికి క్రమంగా వాటిపై అసూయ మొదలైంది. ఎలాగైనా కాకి, పిచ్చుకను విడదీయాలనే దురాలోచన మొదలైంది నెమలికి.\n\nఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పిచ్చుకతో ‘‘మిత్రమా, నీవు కాకితో ఎందుకు అంత స్నేహాన్ని పెంచుకుని అత్యంత చనువుగా ఉంటున్నావు? ఎందుకలా దాన్ని గౌరవిస్తావు? అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా? చనిపోయిన కుళ్లిపోయిన జంతు మాంసాన్ని తింటుంది. దాన్ని చూసి అందరూ చీదరించుకుంటారు. అది ఎవరి తలనైనా తాకితే అపశకునమని అంటారు. అంతేకాక చనిపోయిన వారికి పెట్టిన పిండాల్ని తెచ్చి మీ పిల్లలకు ఆహారంగా పెట్టడం నేను చాలాసార్లు చూసాను. నేను చెప్పవలసింది చెప్పాను. తరువాత నీ ఇష్టం’’ అంది నెమలి.\n\nఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పిచ్చుక ‘‘నిజమే నేస్తమా! నేను ఇన్నాళ్లనుండి కాకి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. దాని మొహం దాంతో స్నేహం చేయడమేంటి? నీలాంటి అందగత్తెతో స్నేహం చేస్తే నా విలువ, హోదా పెరుగుతుంది’’ అంది నెమలితో.\n\nతన పథకం పారినందుకు ఎంతో సంబరపడిపోయింది నెమలి. నెమలి, పిచ్చుక ప్రవర్తనలలో తేడాను గమనించసాగింది కాకి. తనను వాటినుండి దూరం చేయాలనే దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది కాకి.\n\nఒకరోజు మిత్రులారా! నావల్ల, నా పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోంది కాబోలు. అందువల్ల ఇక్కడకు సమీపంలో ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను. నా పిల్లలతో సహా అక్కడికి వెళ్లిపోతాను. సెలవివ్వండి‘‘అని బాధతో అంది కాకి.\n\nదానంతట అది వెళ్లిపోతున్నందుకు లోలోన ఎంతో సంతోషపడుతూ ‘‘సరే నీ ఇష్టం నేస్తమా!’’ అని అన్నాయి నెమలి, పిచ్చుకలు.\nకాకిపీడ విరగడైనందుకు విందు చేసుకున్నారు పిచ్చుక, నెమలి.\nఇలా కొంతకాలం గడిచిపోయింది.\n\nపాత మిత్రులను వదిలి వచ్చి చాలా రోజులైంది. ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకికి. నెమలి, పిచ్చుక నివశిస్తున్న వైపుకి వేగంగా వెడుతున్న కాకికి ఒక వేటగాడు పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిపై బాణాన్ని ఎక్కుపెట్టడం గమనించింది కాకి. కంగారు పడ్డ కాకి, నెమలిని రక్షించే ఉపాయం కోసం ఆలోచిస్తుండగా అక్కడ చనిపోయిన పాము ఒకటి కనపడింది కాకికి. దాన్నిచ టుక్కున నోట కరుచుకుని వేటగాడిమీద పడేట్టు జారవిడిచి ‘‘తప్పుకో నెమలి మిత్రమా! ఆపద ఆపద అని పెద్దగా అరిచింది కాకి.\n\nనెమలి తలతిప్పి చూసేసరికి\n‘‘అమ్మ బాబోయ్! పాము’’ అంటూ పెద్దగా అరుస్తూ భయంతో పరిగెడుతున్న వేటగాడు నెమలి కంటపడ్డాడు.\n\nజరిగిన విషయాన్ని గమనించిన నెమలికి గుండె ఝల్లుమంది. పరిగెత్తుకుంటూ వచ్చి కాకి కాళ్లపై పడి.\n\n‘‘క్షమించు మిత్రమా! అందగత్తెననే అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రద్రోహం చేశాను. అన్యోన్య స్నేహితులైన మీ ఇద్దరినీ అసూయతో వేరు చేశాను. కానీ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనో’అంది నెమలి కన్నీరు కారుస్తూ.\n\n‘‘పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. నేను మనస్పూర్తిగా క్షమిస్తున్నాను‘‘అని నెమలిని కౌగిలించుకుంది కాకి. అపుడే వచ్చిన పిచుక విషయం తెలుసుకుని బాధపడడమే కాక, తాను చేసిన తప్పుకు సిగ్గుతో తలవంచుకుంది.\n\nజరిగిన విషయాలన్నీ మరచిపోయి మనం మంచి నేస్తాలుగా ఉండిపోదాం అంటూ పిచ్చుక, నెమలిని దగ్గరకు తీసుకుని ప్రేమతో కౌగిలించుకుంది కాకి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 377,
        "IMAGE": "cat_2",
        "NAME": "పశ్చాత్తాపం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 127,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒకసింహం. నక్క, ఒంటె సింహానికి సేవచేసేవి. కొన్ని సంవత్సరాల తరువాత సింహం బాగా ముసలిదైపోయింది. అంతకుముందులా చురుకుగా పంజా విసరడం, జంతువుల మీదకు లంఘించడం వంటివి చేయలేకపోయింది. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండేది. ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు.\n\nఅప్పుడు సింహం నక్కను పిలిచి ‘‘నాకు బాగా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా తీసుకురా!’’ అని అడిగింది. ఆ సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోంది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క ‘‘ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఒంటె ఏమైనా ఉపయోగపడుతుందా రాజా?’’ అని అమాయకంగా అడిగింది. ‘‘ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం? అతను నా సేవకుడు. అతడిని రక్షించడం నా బాధ్యత,’’ అంది సింహం కోపంగా.\n\n‘‘కానీ, రాజా! ఒకవేళ ఒంటె తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే...’’ అంది నక్క.\nసింహం ఒక్క క్షణం ఆలోచించి ‘‘అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంది.\n\nఅప్పుడు నక్క నెమ్మదిగా ఒంటె దగ్గరకు వెళ్ళి రహస్యంగా, ‘‘మిత్రమా! మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం. రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతులు ఇస్తారు’’ అంది.\n\nఅందుకు సమాధానంగా ఒంటె, ‘‘అయితే మిత్రమా! ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో’’ అంది. నక్క ఒప్పుకుంది. రెండూ కలిసి లోపలికి వెళ్ళాయి. ముందుగా నక్క సింహంతో, ‘‘రాజా! మీరు ఆకలితో ఉన్నారు. దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’’ అని ఎంతో వినయంగా పలికింది. అది విని సింహం చాలా సంతోషించినట్టు కనిపించింది. ‘‘నువ్వు నా సేవకుడవయినందుకు నాకు ఆనందంగా ఉంది. నీకేం కావాలో కోరుకో’’ అని చెప్పింది. అది వినగానే ఒంటె కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది. ‘‘ఓ రాజా! నక్కను వదిలిపెట్టండి. దానికి బదులుగా నన్ను తినండి’’ అంది.\n\nఒంటె నుండి ఆ మాటల కోసమే ఎదురుచూస్తోంది సింహం. అంతే ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. ‘‘అయ్యో... రాజా! ఇదేమిటి? బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారు?’’ అని ఆందోళనగా అంది ఒంటె. కపటమైన నక్క ‘‘ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి. నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే నీ యజమాని చేతిలో మరణిస్తున్నావు,’’ అంది కుటిలంగా నవ్వుతూ.\n\nఒంటె మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది. మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 378,
        "IMAGE": "cat_2",
        "NAME": "కపటబుద్ధి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 128,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. భీముడు పేరుకు తగ్గట్టుగానే ఎత్తుగా, బలంగా ఉండేవాడు. రాముడు పొట్టిగా, సన్నగా ఉండేవాడు. కాని తెలివైనవాడు. ఒకరికి కండబలం ఉంటే మరొకరికి బుద్ధిబలం ఉంది. ఒకరోజు వారిద్దరూ పొరుగూరి సంతకు వెళ్ళి తిరిగి రాసాగారు. ఒక అడవి పక్కనుండి నడుచుకుంటూ వస్తూంటే వారికి ఒక చిన్న చేతిసంచి దొరికింది. ఆ సంచిని తెరిచిచూస్తే అందులో ఎంతో విలువైన వజ్రాలు ఉన్నాయి. ‘‘మనం చాలా అదృష్టవంతులం. ఈ వజ్రాలతో మన దారిద్య్రం తీరిపోతుంది,’’ అన్నాడు భీముడు సంతోషంగా.\n\n‘‘నిజమే కానీ, మనం ఊరు చేరేవరకు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దారిలో దొంగలు దాడి చేస్తుంటారని విన్నాను’’ అన్నాడు రాముడు.\n\n‘‘భయపడకు మిత్రమా! నా గురించి నీకు తెలియదా? ఎంతమంది వచ్చినా నా ముందు తోక ముడుచుకుని పారిపోవాల్సిందే!’’ అంటూ భీముడు మీసం దువ్వాడు.\n\nఆ వజ్రాలను భీముడు తన సంచిలో పెట్టుకుని దానిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. కొంతదూరం వెళ్ళాక వాళ్లు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగారు. ఇద్దరికీ కాస్త కునుకు పట్టింది. అలా ఎంతసేపు నిద్రపోయారో వాళ్లకి తెలీదు. ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి విని కళ్ళు తెరిచారు. ఎదురుగా ముగ్గురు దొంగలు నిలబడి ఉన్నారు.\n\n‘‘మర్యాదగా మీ దగ్గరున్నదంతా ఇచ్చి ప్రాణాలు రక్షించుకోండి’’ కత్తి చూపిస్తూ కరకుగా అన్నాడొకడు. రాముడు వణికిపోతూ ‘‘నా దగ్గర ఏమీ లేవు. నా కూరగాయల సంచి ఉంది తీసుకోండి’’ అన్నాడు.\nభీముడు ‘‘ఒరేయ్! నా దగ్గరున్న ఈ సంచిలో వజ్రాలున్నాయి. దమ్ముంటే రండిరా’’ అన్నాడు సంచిని వారికి చూపిస్తూ.\n\nదొంగలు భీముడుతో కలబడ్డారు. భీముడు ఒంటి చేత్తోనే వారిని మట్టి కరిపించాడు. అయితే అందులో ఒక దొంగ చాలా నేర్పుగా అతని చేతిలో ఉన్న సంచి లాక్కుని పారిపోయాడు. భీముడు తేరుకునేలోపు మిగతా దొంగలు కూడా పరిగెత్తారు. వజ్రాలు పోయాయని భీముడు బాధ పడసాగాడు. అప్పుడు రాముడు ‘‘బాధపడకు, వజ్రాలు మన దగ్గరే ఉన్నాయి. నువ్వు నిద్రిస్తున్న సమయంలో నీ సంచిలోని వజ్రాలను తీసి వాటి స్థానంలో కొన్ని రాళ్లు పెట్టాను. వజ్రాలను నా కూరగాయల సంచి అడుగున దాచాను,’’ అంటూ తీసి చూపించాడు. కండబలంకంటే బుద్ధిబలం గొప్పదని భీముడు ఒప్పుకున్నాడు. తరువాత స్నేహితులిద్దరూ ఆనందగా ఇంటిదారి పట్టారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 379,
        "IMAGE": "cat_2",
        "NAME": "బుద్ధిబలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 129,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామభద్రపురంలో గోపన్న అనే రజకుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. గోపన్న ఆ గాడిదతో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బండచాకిరి చేయించేవాడు. కానీ దానికి ఏ రోజూ కడుపునిండా తిండి పెట్టిన పాపాన పోలేదు. దాంతో గోపన్న మీద గాడిదకు చాలా కోపంగా ఉండేది.\n\nఒకరోజు ఆ ఊరి కరణం భార్య ఉతకడానికి రెండు పట్టుచీరలు వేసింది. అవి చాలా విలువైనవి. అవంటే ఆమెకు ప్రాణం. వాటిని గోపన్నకు ఇస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.\n\nఆమె మాటలు వింది గాడిద. రోజూ కడుపు మాడ్చే గోపన్నకు బుద్ధి చెప్పాలనుకుంది. గాడిదను చెరువు వైపు తోలాడు గోపన్న. అది అక్కడికి చేరేలోపు తనూ వెళ్ళిపోవచ్చని సబ్బులు కొనడానికి బజారుకు వెళ్ళాడు. అదే అవ కాశంగా తీసుకుని గాడిద తన మీదున్న బట్టలమూటతో ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళి దాక్కుంది.\n\nచెరువు దగ్గర గాడిద కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు గోపన్న. ఊరంతా వెతికాడు. దొంగలెవరైనా గాడిదను దారి మళ్లించి తన బట్టల మూటతో ఉడాయించి ఉంటారేమోనన్న ఆలోచన కలగగానే గోపన్న ఒళ్ళంతా చెమట పట్టింది. ‘అమ్మో అందులో కరణం గారి భార్య పట్టుచీరలు కూడా ఉన్నాయి. అవి పోయాయని తెలిస్తే తన పని గోవిందో గోవిందా!’ అనుకుని భయంతో తలబాదుకున్నాడు.\n\nఆ ఆపద నుండి ఎలా గట్టెక్కాలో తోచని గోపన్న పనికి వెళ్ళక దిగులుగా ఇంట్లోనే దాక్కుండిపోయాడు. తిండి మానేసాడు. గాడిద కనిపించక పోయేసరికి దాని విలువ అతనికి తెలిసి వచ్చింది. తన కోసం అది చేసిన సేవలు గుర్తుకు వచ్చాయి. ‘పాపం ఎక్కడుందో, ఏం తింటుందో? దాన్ని తీసుకెళ్ళిన దొంగాడు తన దగ్గరే ఉంచుకున్నాడో లేదా ఎటైనా తోలేసాడో!?’ అని జాలిగా అనుకున్నాడు నాలుగు రోజులు గడిచాయి. కరణం భార్య తన చీరల కోసం మనిషిని పంపించింది. ఆరోగ్యం బాలేక ఇంకా ఉతకలేదని చెప్పి ఆ పూటకి తప్పించుకున్నాడు గోపన్న.\n\nవారం రోజుల తరువాత గాడిద తిరిగి ఇంటికి వచ్చింది. దాని మెడలో కరణం భార్య పట్టుచీరలు ఉన్నాయి. వాటిని చూడగానే గోపన్న ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. సంతోషం ఆపుకోలేక గాడిదను పట్టుకుని ఏడ్చేశాడు.‘‘ఒరే నువ్వు గాడిదవు కావురా, నా కొడుకువి. పెద్ద ఆపదను తప్పించిన ఆపద్బాంధవుడివి. ఈ చీరల విలువ తెలిసి వీటిని తీసుకుని దొంగ దగ్గర నుండి తప్పించుకుని వచ్చేసావా? ఇకనుండి నీతో పనులు చేయించను. నా బిడ్డలా చూసుకుంటాను’’ అంటూ గాడిద వీపును ప్రేమగా నిమిరాడు. గోపన్న ఆరోజు నుండి గాడిదను అభిమానంగా చూసుకోసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 380,
        "IMAGE": "cat_2",
        "NAME": "గాడిద తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 130,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం జంపయ్యు, మొగలయ్యు అనే పేరుమోసిన దొంగలు ఉండేవారు. ఎవరి ప్రాంతాలలో వారు పెద్దదొంగగా పేరు సంపాదించారు. ఒకరి గురించి వురొకరు విన్నారు గానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.\n\nఅనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు. జంపయ్యును తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్యు. అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య. మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు. జంపయ్యు కన్ను ఆ గిన్నెపై పడింది. ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు. మొగలయ్యు అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు. సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.\n\nజంపయ్యుకు ఆ ఇంట్లోనే వురొక చోట పడక ఏర్పాటు చేశాడు. మొగలయ్యు గాఢ నిద్రలో ఉండగా జంపయ్యు వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు. అవి నీటిని పీల్చుకున్నాయి. జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్లు తిరిగి వచ్చి పడుకున్నాడు.\nమొగలయ్యు మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు.\n\nఅది జంపయ్యు పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు. వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్యు గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.\n\nవురునాడు జంపయ్యు ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయూ?’’ అని అడిగాడు. అప్పుడు మొగలయ్యు తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు. జంపయ్యుకు అంతా అర్థవురుుపోరుుంది. ‘దొంగను దొంగే పట్టాలి కదా’! అని వునసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 381,
        "IMAGE": "cat_2",
        "NAME": "దొంగను మించిన దొంగ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 131,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక ఏగునుల గుంపు ఉండేది. ఆ గుంపులో నిక్కి అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. ఆ గుంపులో అదొక్కటే పిల్ల ఏనుగు కావడంతో దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవి కాదు. అది పేరుకు పిల్ల ఏనుగే కానీ ఆ అడవిలో ఉండే మిగతా అన్ని జంతువుల కంటే ఎత్తుగా, లావుగా ఉండేది. నిక్కికి స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడేది. ఒకరోజు దానికి ఆ అడవిలో ఉన్న మిగతా జంతువుల పిల్లలు ఆడుకోవడం కనిపించింది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లింది.\n\n‘‘హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిక్కి. నేను కూడా మీతో ఆడతాను. నన్నూ మీ జట్టులోకి చేర్చుకోరా?’’ అని వాటిని అడిగింది నిక్కి.\n\n‘‘అమ్మో! నువ్వు చూడు ఎంత భయంకరంగా ఉన్నావో, నీ కాళ్ళ కిందపడితే మేము చచ్చిపోతాం’’ అంది కుందేలు.\n\n‘‘అయినా నువ్వు మాతో ఏ ఆట ఆడగలవు? ఒంటికాలి మీద గెంతగలవా? దాగుడుమూతలు ఆడగలవా? చెట్టెక్కి ఊగగలవా? ఇంత పెద్ద శరీరంతో నువ్వు ఏ ఆట ఆడగలవు చెప్పు,’’ అంటూ కిచా కిచా నవ్వింది కోతి.\n\nఅది విని మిగతా జంతువులు ఎగతాళిగా నవ్వాయి. నిక్కికి బాధ కలిగింది. అయినా వాటి మాటల్లో నిజం లేకపోలేదు. తనకు ఒంటికాలి మీద గెంతడం రాదు. చెట్లెక్కడం అంతకన్నా రాదు. పాపం నిక్కి దూరంగా కూర్చుని వాళ్ళు ఆడుకునే ఆటలను చూస్తూ సంతోషించింది.\n\nఅది ఎండాకాలం... ఒకరోజు కోతి, కుందేలు, సింహం పిల్లలు కలిసి చాలాసేపు ఆడుకున్నాయి. తరువాత వాటికి దాహం వేసి చెరువు దగ్గరకు వెళ్లాయి. అప్పటికే నిక్కి అక్కడ ఉంది. చెరువులో నిలబడి తొండంలో నీళ్ళు నింపుకుని తన మీద చిలకరించుకుంటోంది.\n‘‘ఏయ్ ఆ నిక్కిని చూడండి! ఎంత చక్కగా స్నానం చేస్తోందో!’’ అంటూ గట్టిగా అరిచింది కోతి.\n‘‘ఎంచక్కా షవర్‌బాత్ చేస్తోంది. అలా నీళ్ళలో తడుస్తుంటే చాలా బావుంటుంది.’’ అంది సింహం పిల్ల.\n\nనెమ్మదిగా అవన్నీ నిక్కి దగ్గరకు పరుగెత్తాయి. ‘‘నిక్కీ! నిక్కీ! మా మీద కూడా అలా నీళ్ళు పోయవా?’’ అంటూ అడిగాయి. నిక్కి తొండంతో వాటి మీద నీళ్ళు చిలకరించింది. ఆ నీళ్ళలో తడిసిపోతూ అన్నీ కేరింతలు కొట్టాయి.\n\n‘‘మనకి ఈ ఆట ఆడటం రాదు. ఒక్క నిక్కీకే వచ్చు’’ అంది కుందేలు పిల్ల. ఆ మాట విని మిగిలిన పిల్లలన్నీ అవునంటూ ఒప్పుకున్నాయి.\n\n‘‘నిక్కీ! మనం రేపు ఇక్కడే ఈ ఆట ఆడుకుందామా? మా జట్టులో కలుస్తావా? ప్లీజ్’’ అంటూ బతిమిలాడాయి. నిక్కి సరేనంది. ఇక ఆరోజు నుండి నిక్కికి కూడా బోలెడుమంది స్నేహితులు దొరికారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 382,
        "IMAGE": "cat_2",
        "NAME": "షవర్ బాత్ స్నేహితులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 132,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. ఆ వర్తకుడికి ముగ్గురు కొడుకులు. తనకు వయసు మీద పడుతుండడంతో తన వ్యాపారలావాదేవీలను కొడుకులకు అప్పగించాలి అనుకున్నాడు వర్తకుడు. తన కొడుకులలో అందుకు సమర్థుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు.\n\nఒకరోజు ముగ్గురు కొడుకులనూ పిలిచి, ‘‘అబ్బాయిలూ! ఈ ఆస్తిపాస్తులన్నీ మీవే. నా తరువాత వాటిని ఎవరికో ఒకరికి అప్పగిస్తాను. నేను ఆరునెలలపాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాను. మీకు తలా కొంత ధనం ఇస్తాను. వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుచేయండి’’ అని చెప్పాడు. తన దగ్గర సిద్ధం చేసుకుని ఉన్న బంగారు కాసుల్లోంచి పెద్దవాడికి మూడు వాటాలు, రెండో వాడికి రెండు వాటాలు, చిన్నవాడికి ఒక వాటా ఇచ్చాడు.\n\nపెద్దవాడు తండ్రి తనకు మూడు వాటాలు ఇవ్వడంతో చాలా సంతోషించాడు. ‘నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆస్తంతా నాకే అప్పగిస్తాడనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేం కావాలి?’ అనుకున్నాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాలని తన ఖర్చులన్నీ తగ్గించుకుని, ఒక్క బంగారు కాసు కూడా ఖర్చు చేయకుండా సాదాసీదాగా బతకసాగాడు.\n\nరెండోవాడు ‘తండ్రి ఎలాగూ నాకు ఆస్తి నిర్వహణ బాధ్యత అప్పగించడు. బంగారు కాసులు పంచడంలోనే అతని ఉద్దేశ్యం అర్థమైంది. ఇక వేరే ఆలోచన ఎందుకు? నా వంతుకు ఏం వస్తే అది తీసుకుని సంతోషంగా ఉండాలి’ అనుకుని తన దగ్గరున్న ధనాన్ని విలాసాల కోసం ఖర్చు చేయసాగాడు. మూడోవాడు అన్నయ్యలిద్దరి కంటే భిన్నమైనవాడు. ‘చిన్న వాడిని కాబట్టి నాకెప్పుడూ తక్కువ భాగమే వస్తుంది. నేనేంటో రుజువు చేసి చూపిస్తాను’ అనుకున్నాడు. ఆరునెలల గడిచాక తండ్రి తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడు. కొడుకులను పిలిచి తను ఇచ్చిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పమని అడిగాడు.\n\nపెద్దవాడు ‘‘నాన్నా! నేను ఒక్క కాసు కూడా తీయలేదు. నా అవసరాలు తగ్గించుకుని మీరిచ్చిన ధనాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను’’ అన్నాడు గర్వంగా.\n\nతండ్రి పెదవి విరిచాడు. ‘‘ఏం లాభం? నువ్వు తినలేదు. ఇతరులను తిననివ్వలేదు’’ అని రెండో కొడుకు వైపు చూశాడు.\n\n‘‘మీరు చెప్పింది నిజమే నాన్నా! నేనయితే ఒక్క కాసుకూడా మిగల్చకుండా అన్నీ ఖర్చు చేసేశాను’’ అని చెప్పాడు రెండోవాడు.\n\nఇక మూడోవాడి వంతు వచ్చింది. అతను తండ్రి ఇచ్చిన దానికి రెండురెట్లు ఎక్కువ ధనాన్ని ఆయన ముందుంచి, ‘‘నాన్నా! నేను వ్యాపారం చేశాను. మొదటి నెల లాభాలు వచ్చాయి. లాభాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చాను. చివరకు ఇంత సంపాదించగలిగాను’’ అన్నాడు.\n\nతండ్రి ముఖంలో సంతోషం కనిపించింది. వ్యాపార దక్షత కలిగిన చిన్న కొడుకుకే తన వ్యాపారాన్ని అప్పగించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 383,
        "IMAGE": "cat_2",
        "NAME": "వ్యాపార వారసుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 133,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కాశీనాథ్ అనే పేద యువకుడు ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అతను విష్ణుభక్తుడు. అతనికి మార్గమధ్యంలో ఒక సాధువు కలిశాడు.\n\n‘‘ఏం నాయనా! ఒంటరిగా అడవిలో ఎక్కడికి వెళుతున్నావు?’’ అని ప్రశ్నించాడు సాధువు.\n\n‘‘పని వెతుక్కోవడానికి పట్నం వెళుతున్నాను స్వామీ! ఇది దగ్గరదారి కదా అని ఇలా వచ్చాను’’ అని ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు.\n\nఇద్దరూ కలిసి నడక సాగించారు. కొంతదూరం ప్రయాణించాక అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగారు. వాళ్ళకు కొద్దిదూరంలో ఒక నక్క కనిపించింది. దాని కాలికి గాయం కావడంతో నడవలేక కుంటుతోంది.\n\n‘‘ఆ నక్కను చూశారా స్వామీ! పాపం నడవలేకపోతోంది. మనుషులం మనం ఇంత కష్టపడితేగానీ పొట్ట నిండటం లేదు. మరి వేటాడలేని ఈ నక్క పొట్ట ఎలా నిండుతుంది’’ అన్నాడు కాశీనాథ్ ఎంతో జాలిగా.\n\nసాధువు జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలకలం మొదలైంది. పక్షులు గోలగోల చేస్తూ అటుఇటు ఎగరసాగాయి. ఉడుతలు గబగబా చెట్టెక్కాయి. కుందేళ్ళు బొరియల్లోకి పారిపోయాయి.\n\n‘‘ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది. పద ఈ చెట్టెక్కుదాం’’ అని సాధువు చెప్పడంతో కాశీనాథ్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు ఎక్కి గుబురుకొమ్మల్లో దాక్కున్నారు.\n\nఒక సింహం తను వేటాడిన జంతువును ఆ చెట్టు కిందకు ఈడ్చుకు వచ్చింది. తను తినగలిగినంత తిని మిగతాది అక్కడే వదిలి వెళ్ళిపోయింది. సింహం అటు వెళ్ళగానే నక్క వచ్చి సింహం వదిలి వెళ్ళిన ఆహారం తినసాగింది.\n\nఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న కాశీనాథ్, ‘‘చూశారా స్వామీ! భగవంతుడికి ఎంత పక్షపాతమో! నేను చిన్నప్పటినుంచి ఆ ఏడుకొండలవాడిని సేవిస్తూ వస్తున్నాను. నేనెన్ని కష్టాలలో ఉన్నా ఏ రోజూ దేవుడు నాకు సహాయం చేయలేదు. ఆ నక్క ఒక్కసారి కూడా భగవంతుడిని పూజించి ఉండదు. అయినా దానిని కష్టకాలంలో ఆదుకున్నాడు’’ అన్నాడు కించిత్తు నిరసనగా.\n\nసాధువు మళ్ళీ నవ్వాడు. ‘‘నాయనా! నువ్వు ఒక కోణంలోంచే ఆలోచిస్తూ నిస్సహాయురాలైన నక్కతో నిన్ను పోల్చుకుంటున్నావు. భగవంతుడు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చి నిన్ను బలవంతుడిని చేశాడు. అంటే సింహంలా కష్టపడి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోగలవు. నువ్వు తినగా మిగిలినది ఇతరులకు దానం చెయ్యగలవు. అంతటి శక్తిసామర్థ్యాలు భగవంతుడు నీకు ఇచ్చాడు. అంతేకాని ఎవరిమీదైనా ఆధారపడి తినడానికి నువ్వు కుంటినక్కవు కాదు’’ అని చెప్పాడు. దాంతో కాశీనాథ్ తను ఆలోచించిన పద్ధతికి సిగ్గుపడ్డాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 384,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఆలోచనా సరళి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 134,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక గులాబి తోటలో ఒక సీతాకోక చిలుక ఉండేది. అది రంగురంగుల రెక్కలతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం, ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది.\n\nఒకరోజు ఒక ఏనుగుపిల్ల ఆ తోటకు వచ్చింది. సీతోకోకచిలుక రివ్వున ఎగిరి దాని చెవి మీద వాలింది.\n‘‘నా చెవి మీద ఎవరున్నారు?’’ అని అడిగింది ఏనుగు.\n‘‘హలో! నీకు నేనెవరో తెలియదా? ఈ ప్రపంచంలో చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే. సీతాకోకచిలుకను’’ అన్నది ఎంతో గర్వంగా.\n\n‘‘అవునా! నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?’’ అని అడిగింది ఏనుగు.\n\n‘‘నేను ఎక్కడికైనా వెళ్ళగలను. తూర్పునుండి పడమరకు, పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను. నువ్వు నాలా ఎగురగలవా?’’ కొంటెగా అన్నది సీతాకోకచిలుక.\n‘‘ఊహూ, ఎగురలేను’’ అన్నది ఏనుగు బాధగా.\n‘‘చూసావా? మరి నేను నీకంటే గొప్పదాన్నన్నమాట. అవునా?’’ అని అడిగింది సీతాకోకచిలుక.\n‘‘అవును. గొప్పదానివే’’ అని ఒప్పుకుంది ఏనుగు.\n\nసీతాకోకచిలుకకు పట్టరాని సంతోషం కలిగింది. ‘‘ఒకరకంగా మనమిద్దరం ఒకటే తెలుసా? నీకు తొండం ఉంది. నాకు తొండం ఉంది. అయితే నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను. నువ్వు తీయలేవు. కాబట్టి నేను నీకంటే గొప్ప’’ అన్నది సీతాకోక చిలుక మరింత బడాయిగా.\n‘‘నిజమే’’ అంది ఏనుగు.\n\n‘‘నీకెన్ని కాళ్లున్నాయి?’’ అని అడిగింది సీతాకోకచిలుక. ‘నాలుగు’ అని చెప్పింది ఏనుగు. ‘‘ఇందులో కూడా నేనే గొప్ప. నాకు ఆరు కాళ్ళున్నాయి’’ అంది. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలి వేగానికి సీతాకోకచిలుక పట్టుతప్పి ఎగిరిపోసాగింది. ‘‘అయ్యో! నన్ను కాపాడండి... కాపాడండి’’ అని గట్టిగా కేకలు వేసింది.\n\nఅది విన్న ఏనుగు వెంటనే తొండంతో సీతాకోకచిలుకను పట్టుకుంది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్న సీతాకోకచిలుకకు, ఆ సంఘటనతో బుద్ధి వచ్చింది. గొప్పలు చెప్పుకోవడం మానేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 385,
        "IMAGE": "cat_2",
        "NAME": "సీతాకోకచిలుక గర్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 135,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అది వేసవికాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం మూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. వురీ నేల మీద ఎందుకులే అని, అక్కడ నుండి ఎగిరి గేదె కొమ్ముల మీద వాలింది. ఆ గేదె కాకిని అసలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా ఆ గేదె కొమ్ముల మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళదావునుకున్న సమయంలో, కాకి తన వునసులో ఇలా అనుకుంది.\n\n‘పిచ్చి గేదె! నేను ఇంత సేపు దీని కొమ్ముల మీద కూర్చుని సేద తీరాను. దీనికి తెలియును కూడా తెలియలేదు. అంటే నేను ఈ గేదె గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియుకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను.’ అని కాకి తన తెలివికి తనే మురిసిపోయింది.\n\nగేదె కొమ్ముల మీద నుంచి ఎగిరి, గేదె ముందు గర్వంగా వాలింది. ‘‘నేను ఇప్పుడు వెళ్లవచ్చా?అని ఎగతాళిగా గేదెను అడిగింది.\n\n‘‘నీలాంటి అల్పప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్లడం నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంత సేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది’’ అని బదులిచ్చింది ఆ గేదె. దీంతో కాకి గర్వం పటాపంచలయింది. సిగ్గుతో తల దించుకొని మారువూట్లాడకుండా అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 386,
        "IMAGE": "cat_2",
        "NAME": "కాకి - గేదె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 136,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి వివేకవర్మ మహారాజు దగ్గరకు ఒక వ్యక్తి న్యాయుం కోసం వచ్చాడు. అతడు మహారాజుకు వందనం చేసి, ‘మహారాజా! నా పేరు గోపాలుడు. మా యజమాని పేరు నీలంకంఠుడు. ఆయన నాకు వజ్రాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. మీరే నాకు న్యాయుం చేయూలి’’ అని వేడుకున్నాడు.\n‘‘నీకు జరిగిన అన్యాయాన్ని వివరంగా చెప్పు’’ అన్నాడు మహారాజు.\n\n‘‘ప్రభూ! ఒకరోజు నేను, మ యజమాని వేరే రాజ్యం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాం. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో దగ్గరలో ఉన్న ఒక పురాతన ఆలయుం లోపలికి వెళ్ళి తలదాచుకున్నాం. ఆ ఆలయుంలో మాకు వజ్రాలు కనిపించాయి. మా యజమాని వెంటనే వాటిని తీసుకొని మూట కట్టాడు. ‘ఈ ఆలయుంలో మనకు వజ్రాలు దొరికాయుని ఎవరితోనూ చెప్పకు. ఇంటికి చేరాక నీకు వీటిలో సగం వాటా ఇస్తాను’ అని చెప్పాడు. నా వాటాగా వచ్చే వజ్రాలను అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని నేను అప్పుడు ఏమీ అనలేదు. మీరే న్యాయుం చెప్పండి’’ అని వివరించాడు గోపాలుడు.\n\nగోపాలుడి యజమాని అయిన నీలకంఠుడిని పిలిపించాడు వుహారాజు.\n\n\"మహాప్రభూ! ఇతడు చెప్పే వూటలు పచ్చి అబద్ధాలు. ఆ వజ్రాలు దొరికినవూట నిజమే. ఏ వస్తువు దొరికినా అది మీకే చెందుతుందని భావించి, ఆ వజ్రాలను నేనే స్వయంగా మూటకట్టి ఇతనితో మీ వద్దకే పంపించాను\" అని చెప్పాడు. \"దీనికి సాక్షులు ఎవరైనా ఉన్నారా?\" అని అడిగాడు వుహారాజు. \"లేకేం, నా భార్య, అత్తగారు చూశారు ప్రభూ\" అన్నాడు నీలకంఠుడు.\n\nమాహారాజు వారిద్దరినీ పిలిపించాడు. వారు వచ్చాక, వారిద్దరినీ వజ్రాలు కట్టిన మూట ఏ రంగులో ఉంటుందో చెప్పమని విడివిడిగా అడిగాడు. ఇద్దరూ వేరువేరు సవూధానాలు చెప్పారు. దీంతో నీలకంఠుడి మోసం బయుటపడింది.\n\n\"నీలకంఠా! వెంటనే వజ్రాలు నాకు అప్పగించు. గోపాలుడిని మోసం చేసినందుకు అతనికి వేయి బంగారు నాణాలు పరిహారంగా ఇవ్వు\" అని తీర్పు ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 387,
        "IMAGE": "cat_2",
        "NAME": "వజ్రాల మూట ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 137,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి, పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది. ఆ చెట్టు మీద ఒక పావురం, పిచ్చుకల జంట, కాకి జీవిస్తున్నాయి. అవి ఒక దాని జోలికి వురొకటి వెళ్లేవి కావు. దేని ఆహారం అది సంపాదించుకుంటూప్రశాంతంగా జీవించేవి. కోతిది మాత్రం చంచల వునస్తత్త్వం.\n\nఅది ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కోతులన్నీ ఇలాగే ఉంటాయి, కానీ దీనిది వురీకోతి బుద్ధి. వుధ్యాహ్నం ఎండ పూట పక్షులు వాటి గూళ్లలో చిన్న కునుకు తీస్తుంటే కోతి దబ్బువుని ఒక కొవ్ము నుండి వురొక కొవ్ము మీదకు గెంతేది. ఆ చప్పుడును శత్రువుల దాడి అనుకుని పక్షులు ఠారెత్తిపోయేవి. ప్రాణరక్షణ కోసం తలా ఒకవైపు ఎగిరిపోయేవి.\n\nకోతి చేష్టలతో ఆ పక్షులకు వునశ్శాంతి కరువయింది. అడవిలోని మిగతా జంతువుల పరిస్థితి ఎలా ఉన్నా రావిచెట్టు మీద నివసిస్తున్న పక్షుల పరిస్థితి వురీ అధ్వాన్నంగా తయారయింది. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి.\n\n‘‘రాను రాను కోతి చేష్టలు వురీ మితిమీరి పోతున్నారుు. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నుంచి తరిమేయూలి’’ దిగులుగా అంది పిచ్చుక. ‘‘నాకో ఉపాయుం తట్టింది’’ అంటూ ఒక ఆలోచన చెప్పింది పావురం. ‘‘నిజంగా ఇలాగే జరుగుతుందా?’’ సందేహంగా అడిగింది కాకి.\n\n‘‘ప్రయుత్నించి చూద్దాం. ఇది పని చేయుకపోతే వురొకటి ఆలోచిద్దాం. నాకెందుకో ఈ దెబ్బతో కోతి పని అరుుపోతుందని అనిపిస్తుంది’’ అన్నది కాకి. అన్నీ కలసి తేనెను సంపాదించి కోతి నివసించే చోట ఒక రంధ్రంలో పోశారుు. కోతి ఎప్పటిలాగే అడవిలోని జంతువులను, పక్షులను హడలగొట్టడం పూర్తయ్యాక తిరిగి వచ్చింది. వుుందు ఆ తేనెను చూసి సంశయుంగా ఒక వేలితో తాకి, నాకి చూసింది. దానికి ఆ రుచి నచ్చింది. మొత్తం తేనెను నాకేసింది. అది మొదలు ఒక వారం పాటు పక్షులు రోజూ తేనెను సంపాదించి ఆ రంధ్రంలో పోసేవి. కోతి ఆ తేనెను తాగేది. నెవ్ముదిగా అది తేనె రుచికి అలవాటు పడింది. కొన్ని తేనె చుక్కలు గొంతులో పడితే కాని ఉండలేని స్థితికి వచ్చింది.\n\nపక్షులు తమ పథకంలో భాగంగా ఒకరోజు తేనెను పోయలేదు. రంధ్రంలో తేనె కనిపించక పోయేసరికి కోతికి పిచ్చి పట్టినంత పనైంది. చెట్టంతా వెతికింది. దానికి చిటారు కొవ్మున తేనెతుట్టె కనిపించింది. తేనె కోసం ఆతృతగా తేనెతుట్టెలో వేలు పెట్టి కెలికింది. తుట్టె కదలడంతో తేనెటీగలు పైకి లేచాయి. వందలు... వేల... తేనెటీగలు ఒక్కసారిగా కోతిపై దాడి చేసాయి. వాటి బారి నుండి తప్పించుకోవడానికి కోతి పరుగో పరుగు! తేనెటీగలేమో కోతిని వెంబడించి కసిదీరా కుట్టి వదిలారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి అయి౦ది కోతికి. ఇక ఆ పరిసరాలలోకి వస్తే ఒట్టు. కోతి బాధ తప్పిపోయినందుకు పక్షులు ఆనందించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 388,
        "IMAGE": "cat_2",
        "NAME": "కోతి తిక్క కుదిరింది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 138,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక చిలుక, కందిరీగ జీవిస్తూ ఉండేవి. చిలుక తనను తాను చూసుకుని గర్వంతో పొంగిపోయేది. కందిరీగను తరచుగా ఆటపట్టిస్తుండేది. ఒకరోజు చిలుక తన గూటిలో వుూడు గుడ్లు పెట్టింది. మరుసటి రోజు చిలుక నివసించే చెట్టు దగ్గరలో ఒక పిల్లి తచ్చాడుతుండడం గవునించింది. ‘‘అయ్యు బాబోయ్! నా గుడ్లను ఈ దొంగ పిల్లి తినేస్తుందేమో’’ అని తెగ కంగారు పడిపోరుుంది. అది అలా అనుకుంటూండగానే, పిల్లి ‘‘ఈ రోజుకు నాకీ గుడ్లు చాలు’’ అనుకుంటూ చెట్టును సమీపించి, మెల్లిగా చెట్టు ఎక్కడం మొదలెట్టింది. భయుంతో చెవుటలు పట్టిన చిలుక ‘‘కాపాడండి, కాపాడండి’’ అని అరవడం ప్రారంభించింది.\n\nచిలుక అరుపులను, పెడబొబ్బలను అక్కడే తిరుగుతున్న కందిరీగ వింది. ఎందుకో అరుస్తోంది, నేను వెళ్లి దానిని కాపాడతాను’’ అని చిలుక దగ్గరకు బయులుదేరింది కందిరీగ.\n\nకందిరీగ చిలుక గూటి దగ్గరకు వచ్చేసరికి, పిల్లి గూట్లోకి చూస్తూ ‘‘ఆహా! ఎంత అందమైన గుడ్లు, నా పంట పండింది’’ అనుకుంటూ గుడ్లను తీసుకోబోతుండగా, ఝువ్ముని ఎగురుతూ వచ్చిన కందిరీగ పిల్లి కంట్లోకి దూరింది. కంగారులో పిల్లి చెట్టు మీదినుంచి దూకేసింది. దాంతో పిల్లి కంటికి బలమైన గాయుమైంది. దానికితోడు చెట్టుపై నుంచి పడడంతో దానికి కాలు కూడా విరిగింది. గండం తప్పడంతో, కందిరీగ చిలుకతో, ‘‘మిత్రవూ, నీవిక బాధపడనవసరం లేదు’’ అని ఓదార్చింది. ‘‘నీ బుుణం ఈ జన్మలో తీర్చుకోలేను మిత్రవూ’’ అని చిలుక కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది.\n\n‘‘నేను నా అందం చూసి తెగ గర్వపడే దానిని. ఆ గర్వంతో నేను నిన్ను ఆట పట్టించి అవవూనించేదానిని. కానీ నేను ప్రవూదంలో ఉన్నప్పుడు నువ్వు అదేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడావు’’ అని పలికింది చిలుక.\n\n‘‘సరేలే, ఈ రోజు నుంచి వున వుధ్య స్నేహం వురింత బలంగా చిగురించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’’ అని బదులిచ్చింది కందిరీగ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 389,
        "IMAGE": "cat_2",
        "NAME": "కందిరీగ సహాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 139,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక నదిలో రకరకాల అందమైన చేపలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున ఒక నేరేడుచెట్టు ఉంది. ఆ చెట్టు మీద కొన్ని కోతులు ఉన్నాయి. ఆ కోతులు నేరేడుచెట్టు కొమ్మల మీద గెంతుతూ, పండ్లు కోసుకు తినేవి. అప్పుడప్పుడూ కొన్ని పండ్లు జారి కింద ఉన్న నదిలో పడిపోయేవి. ఆ పండ్లు నీళ్ళలో మునిగిపోకుండా చేపలు వాటిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువచ్చి కోతులకు అందించేవి. అలా కోతులకు చేపలకు స్నేహం కుదిరింది.\n\nఒకరోజు చేపలు పట్టేవాడు అటువైపు వచ్చాడు. తన బట్టల మూటను ఒడ్డు మీద పెట్టి చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. ఆ వలలో ఎన్నో చేపలు పడ్డాయి. అక్కడే చెట్టు మీద ఉన్న కోతులు జరుగుతున్నదంతా చూశాయి.\n‘‘అయ్యయ్యో. మన మిత్రులను వాడు ఎత్తుకుపోతున్నాడు’’ అంది ఒక కోతి.\n‘‘అవునవును. ఎలాగైనా సరే మనం మన మిత్రులను రక్షించుకోవాలి’’ అంది మరో కోతి.\n\nఅన్నింటిలోకి తెలివైన ఒక కోతి చేపలను కాపాడే ఉపాయం చెప్పింది. వెంటనే ఒక కోతి చెంగున కిందకు దూకింది. చేపలు పట్టేవాడి బట్టల మూటను ఎత్తుకుని పారిపోసాగింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనను చేపలు పట్టేవాడు చూశాడు.\n\n‘‘అయ్యో నా బట్టలు’’ అంటూ వలను అక్కడే వదిలేసి కోతి వెంట పరుగెత్తాడు. అప్పుడు ఇంకో కోతి గబగబ చెట్టు మీద నుంచి కిందకు దిగింది. చేపలు ఉన్న వలను విప్పి, అందులో ఉన్న చేపలను నీళ్లల్లోకి వదిలేసింది. బట్టల మూట ఎత్తుకెళ్ళిన కోతి కొద్ది దూరం వెళ్ళాక మూటను కింద పడేసి పారిపోయింది. ఈ విధంగా కోతులు తమ మిత్రులను కాపాడుకున్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 390,
        "IMAGE": "cat_2",
        "NAME": "కోతుల సహాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 140,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం అవంతి రాజ్యాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్యంలో సుఖశాంతులు నిండుగా ఉన్నాయి. సకాలానికి వర్షాలు పడి పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. న్యాయం నాలుగు పాదాల నడుస్తుంది. దానికి ముఖ్య కారణం ధర్మపాలుడనే న్యాయాధికారి కొలువులో పనిచెయ్యడమే.సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేవాడు. అందువల్ల రాజన్నా, న్యాయాధికారి ధర్మపాలుడన్నా ప్రజలకు ఎంతో ఇష్టం.\n\nసునంద మహారాజుకి ప్రకృతంటే చాలా ప్రేమ. ప్రకృతిలో దాగిన అందాల్ని చూడడమంటే ఎంతో సరదా.అప్పుడప్పుడు వేటకు తోటకు వెడుతుండేవాడు. తనతోపాటు ఒకోసారి న్యాయాధికారిని కూడా తోడుగా తీసుకువెడుతుండేవాడు. వారిద్దరి మధ్య అభిమానం,ప్రేమ నిండుగా ఉన్నాయి. ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి రాత్రిళ్లు మారువేషాలతో రాజ్యంలో తిరుగుతుంటారు.\n\nఒకరోజు ప్రశాంత వాతావరణంలో రాజుగారికి ప్రకృతి సౌందర్యం చూడాలని న్యాయాధికారిని తోడుగా తీసుకుని నగరం వెలుపలకి వెళ్లాడు. ప్రకృతి అందాలను చూస్తూ చాలా దూరం నడిచాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో వున్న చెట్టునీడకు వెళ్ళారిద్దరూ. కూర్చుని పరిసరాల్ని నిశితంగా చూస్తున్నారు. చెట్టుకు దగ్గరలో తళతళ మెరుస్తూ ఒకటి కనపడింది. వెళ్లి తీసుకురమ్మని చెప్పాడు. ఇది వెండి ఉంగరం ప్రభూ! రాయిమాత్రం ఖరీదు కలిగింది. ఎవరిదో పేదవాడిదై ఉంటుంది. ఇక్కడ కాసేపు విశ్రమించినట్టు గుర్తులు కూడా ఉన్నాయని న్యాయాధికారి అన్నాడు.\n\nపాపం ఎంతో కష్టపడి దీన్ని తయారు చేయించుకుని ఉంటాడు. దీనిని పోగొట్టుకున్నవాడికే చేర్చాలి అని రాజన్నాడు. అవును ప్రభు అని న్యాయాధికారి అన్నాడు.రేపే ఉంగరం పోయిందని, పోగొట్టుకున్న వాళ్లు వచ్చి తీసుకోవచ్చని దండోరా వేయిద్దామని రాజు అన్నాడు. దండోరా వింటే పోగొట్టుకున్నది నేను, నేనని ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు ప్రభూ! వాళ్లలో నిజంగా పోగొట్టుకున్న వాళ్ళెవరో గుర్తించడం చాలా కష్టం అని న్యాయాధికారి అన్నాడు. అయితే దీని ఆనవాళ్లు చెప్పిన వాళ్లకు ఇద్దామన్నాడు రాజు. అలా కూడా కష్టం ప్రభూ. ఈ చెట్టుకింద అయిదారుగురు కలిసి విశ్రమించిన దాఖలాలున్నాయి. ఉంగరాన్ని పోగొట్టుకున్న వాడితో వున్న మిగతావాళ్లు తప్పకుండా చూసిఉంటారు. వాళ్లలో ఎవరికైనా దుర్భుద్ధి పుట్టి ఉంగరం నాదంటే నాదని ఆనవాళ్లు చెబితే న్యాయం జరగదు. నిజంగా వస్తువు పోగొట్టుకున్న వాళ్లకు వస్తువు దక్కదు. దీనిని తమ దగ్గరుంచండి. రేపు ఉపాయం ఆలోచిస్తానని న్యాయాధికారన్నాడు.\n\nఆ రాత్రి ధర్మపాలుడు తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించగా, ఆలోచించగా ఉపాయం తట్టింది.మరుసటిరోజు అదే ప్రదేశానికి విహారానికి వెడదామని సునందుడ్ని ధర్మపాలుడు ఆహ్వానించాడు. ఇద్దరూ ఆ చెట్టుదగ్గరకు చేరారు. ఉంగరం మీద మట్టి పోసి కనపడి కనపడనట్టుగా చేశాడు.\n\n\"ప్రభూ! దీన్ని పోగొట్టుకున్నవాడు తప్పకుండా వెదుక్కుంటూ వస్తాడు. ఇది ఎక్కడపోయింది,పోగొట్టుకున్న వాడికొక్కడికే తెలుసు. వాడు రహస్యంగా ఒంటరిగా వస్తాడు. వచ్చి చుట్టూ పరికించి చూస్తాడు. మట్టిని అటు ఇటు వస్తువు కనపడడానికి చిమ్ముతాడు. అప్పుడు ఇది బయటపడుతుంది. సంతోషంగా తీసుకుంటాడు. న్యాయంగా పోగొట్టుకున్న వాడికే చెందాలంటే ఇంతకన్నా మార్గం లేదని ధర్మపాలుడన్నాడు. పరాయి వాళ్లెవరైనా రేపో, మాపో ఇక్కడ విశ్రమించారనుకో, వాళ్లకు దక్కుతుంది గదా అని సునందుడన్నాడు.పరాయివాళ్లకు ఇక్కడ ఉంగరం పోయిందనే ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ల ఉంగరం పోలేదు కనుక.ఆలోచనొస్తే గదా వాళ్లు వెదికేది. వాళ్లకెందుకుంటుంది ఆలోచన అని ధర్మపాలుడన్నాడు. న్యాయం సరిగా జరగదేమో అన్న అభిప్రాయం రాజుగారికున్నా ధర్మపాలుడి ఆలోచన కాదనలేకపోయాడు. నాలుగురోజుల తర్వాత ధర్మపాలుడు, సునందుడు అదే చెట్టుదగ్గరికి విహారానికి వెళ్లారు. ప్రభూ! మీ పరిపాలన న్యాయంగా ఉంది. నేను పోగొట్టుకున్న ఉంగరం తిరిగి దొరికిందని ఉంగరం పోగొట్టుకున్న వాడు దండం పెడితే నిజంగా న్యాయం జరిగిందనిపించింది రాజుగారికి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 391,
        "IMAGE": "cat_2",
        "NAME": "సరియైన న్యాయం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 141,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక పండితుడి ఇంట్లో పాడి ఆవు ఉండేది. ఒక దొంగ కన్ను ఆ ఆవుమీద పడింది. ఎలాగైనా దానిని దొంగలించాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. దొంగ ఆ రాక్షసునితో ‘‘అయ్యా! నమస్కారం, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు?’’ అని అడిగాడు.\n\n‘‘ఈ పండితుడిని మింగడానికి. మరి నీవెందుకు వచ్చావు?’’ అడిగాడు బ్రహ్మరాక్షసుడు.\n\nదొంగ, ‘‘ఆవు కోసం’’అని చెప్పి, ‘‘నాకు ఆవు, నీకు పండితుడు కావాలి, కాబట్టి మనం గొడవ పడకుండా ఎవరి పని వాళ్లు చేసుకుందాం’’ అన్నాడు.\n\n‘‘సరే కానీ నేను బ్రాహ్మణుడిని తిని వెళ్ళే వరకు నువ్వు ఓపిక పట్టాలి. ముందుగానే నీవు ఆవు దగ్గరకు వెళ్తే అది నిన్ను చూసి అరుస్తుంది, ఆ అరుపులకు అందరూ మేల్కొంటారు. అప్పుడు నా పని కష్టమవుతుంది. కాబట్టి నా పని ముందు జరగాలి. పైగా నీకన్నా నేను బలవంతుడిని కూడా. కాబట్టి నా నాయకత్వాన్ని నీవు అంగీకరించాలి’’ అన్నాడు రాక్షసుడు.\n\nదొంగ అందుకు ఒప్పుకోలేదు. ‘‘నీవు పట్టుకోగానే పండితుడు అరుపులు, పెడబొబ్బలు పెడతాడు. ఇరుగుపొరుగు పోగైతే నేను ఒట్టి చేతులతో వెళ్ళాల్సి ఉంటుంది. నీవు బలవంతుడివి, పండితుడిని ఎలాగైనా తినగలుగుతావు, నాయకుడు ముందు అనుచరులకు మేలు కలిగేలా చూడాలి, కాబట్టి నేను ఆవును తోలుకెళ్ళే వరకు నీవు ఆగాలి’’ అన్నాడు.\n\nఇద్దదూ నేనంటే నేను ముందు అని వాదులాడుకుంటూ పెద్దగా అరుచుకున్నారు. దాంతో పండితుడికి మెలకువ వచ్చింది.\n\nదొంగ వెంటనే తాను దొంగతనానికి వచ్చిన సంగతి కూడా మరిచిపోయి, ‘‘ఓయ్! పండితుడా! ఈ రాక్షసుడు నిన్ను తినడానికి వచ్చాడు’’ అని అరిచాడు. రాక్షసుడు కూడా ‘‘వీడు దొంగ, నీ ఆవును దొంగలించడానికి వచ్చాడు’’ అని చెప్పేసాడు.\n\nపండితుడికి విషయం అర్థమైంది. అందరికీ వినబడేలా ‘ఆంజనేయదండకం’ చదవడం ప్రారంభించాడు. ఆంజనేయుడి పేరు వినగానే బ్రహ్మరాక్షసుడు హడలి పారిపోయాడు. ఇంటిల్లిపాదీ, ఇరుగుపొరుగువాళ్ళు లేవడం చూసి దొంగ కూడా కాళ్ళకు బుద్ధి చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 392,
        "IMAGE": "cat_2",
        "NAME": "శత్రువైరం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 142,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలాకాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ధైర్యసాహసాలుగల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యం కన్నులపండువుగా సంపదలతో తులతూగుతూ ఉండేది.\n\nమగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి దగ్గర ఎక్కువమంది సైనికులు లేరు. అందువల్ల విక్రమసేనుడు యుద్ధంలో పరాజయం పొందాడు. ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి, ఒక కొండగుహలో దాక్కున్నాడు.\n\nఒంటరితనం, పరాజయం, బాధ, అలసట.. అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుడిని ఆవరించాయి. ‘‘కన్నబిడ్డల్లాంటి ప్రజలను, రాజ్యాన్నీ కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి?’’ అని ఆలోచించిన విక్రమసేనుడు, ‘తనకు చావే శరణ్యం’అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటబడింది.\n\nఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగిపోతోంది. దాంతో సాలీడు కిందికి జారిపోతోంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది.\n\nఅది చూసిన విక్రమసేనుడిలో కొత్త ఆలోచన కలిగింది. ‘ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరించక మళ్ళీమళ్ళీ ప్రయత్నించి, అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు. నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తున్నప్పుడే గెలవడానికి ఒక నిచ్చెన కూడా వస్తుంది.’ ఈ రకమైన ఆలోచన కలిగిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.\n\nవిక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 393,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్ఫూర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 143,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, చేపలు, పళ్లు, కీటకాలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా కొంగ దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను ప్రేమతో పలకరించేది కొంగ. అలా వ్యాపారపరంగా చాలా పక్షులు కొంగకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది.\n\nఅదే అడవిలో ఓ కాకి ఉండేది. అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొంగ దగ్గరే ఖరీదు చేసేది. కాకికి ఆ అడవి నిండా స్నేహితులే ఉన్నాయి. తను కూడా కొంగలా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కాకికి కొంగ వ్యాపారం చూసి అసూయ కలిగింది. తనకున్న స్నేహితులనే పావులుగా వాడి కొంగ వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకుంది.\n\nకాకి అడవిలో అంగడి తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది. కొంగ అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవిమధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై తనవద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది.\n\nకాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులైన కోడిపుంజు, బాతు, చిలక, నెమలి, గద్ద, పావురం...ఇలా పక్షులన్నీ రావడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో కొంగ వ్యాపారం తగ్గిపోయింది.\nకోడిపుంజు చేతిలో పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది.\n\n‘కాకి బావా! కాకిబావా! నాకు కిలో గోధుమలు, కిలో వడ్లు, అరకిలో చేపలు, పావుకిలో పురుగులు కావాలి!’ అంది కోడిపుంజు.\n\nకోడిపుంజు కోరినవన్నీ కాకి కొలిచి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.\n\n‘ఇస్తాలే కాకిబావా! ఎక్కడికి పోతా!’ అంది కోడిపుంజు. స్నేహం కొద్దీ కాకి సరేనంది.\n\nఅది వెళ్లిందో లేదో చేతిలో సంచీతో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది. చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది.\n\n‘‘కాకి బావా! కాకిబావా! నాకు జామపళ్లు, రేగిపళ్లు, పెసరగింజలు కావాలి!’’ అంది చిలకమ్మ.\nకాకి అందించింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.\n\n‘‘తీసుకుందువులే! మళ్లీ రానా...ఏంటీ!’‘ అంది చిలకమ్మ. స్నేహంకొద్దీ కాకి అలాగేనంది.\n\nఅది వెళ్లిందో లేదో చేతిలో సంచితో గద్ద వాలింది. గద్ద రాకకు కాకి పొంగిపోయింది.\n‘‘అన్నా! రా అన్నా!’’ అని ప్రేమతో పిలిచింది కాకి.\n\n‘‘కాకి తమ్మి! నాకు చేపలు కావాలి!’’ అంది హుందాగా! కాకి గబగబా సంచీనిండా చేపలు నింపి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.\n‘‘డబ్బులా!సరే, తర్వాత చూద్దాం తమీ!’’ అంటూ సంచీతో రివ్వున పైకెగిరిపోయింది గద్ద.\n\nఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కానీ పైసా తిరిగి రాలేదు. గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది. కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది.\n\nకొంగ వ్యాపారం మీద వున్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి. అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని కొంగలా వ్యాపారపరంగా ఏర్పరచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది కాకి.\n\nస్నేహానికి, వ్యాపారానికి ముడిపడదని గ్రహించిన కాకి మరునాడు చేతిలో సంచితో, జేబులో డబ్బుతో కొంగ అంగడివైపు అడుగులేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 394,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్నేహంతో వ్యాపారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 144,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఒకరోజు ఆడుకుంటూ వాళ్ల ఇంట్లో పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్దం కనిపించింది. నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్‌లో ఆ గుండ్రటి అద్దం సంతోష్‌కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘‘సరే నాయనా! కాని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు ’’ అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్.\n\nఆ అద్దాన్ని తీసుకున్న సంతోష్ దాన్ని శుభ్రంగా తుడిచి అందులో ముఖం చూసుకున్నాడు, అతని ముఖం దిగులుగా కనిపించింది. ‘అదేంటి నా ముఖం ఎందుకు దిగులుగా ఉందబ్బా అనుకున్నాడు. తన ఆట వస్తువుల్ని తీసుకుని ఆడుకున్న తర్వాత మళ్లీ అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కూడా ముఖంలో దిగులు కనిపించింది. కాసేపటి తర్వాత తనకి ఇష్టమైన తిండి తిన్నాడు. తిన్న తర్వాత అద్దంలో ముఖం చూసుకున్నా ముందులాగే కనిపించింది.\n\n‘ఛీ! ఈ అద్దంలో ముఖం చూసుకోకూడదు’ అని తనను తను తిట్టుకున్నాడు సంతోష్, ఆ రోజు సాయంత్రం తల్లికి చెప్పి పార్కులో ఆడుకోవటానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా సంతోష్‌కి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు, ఆ బాబు పక్కన పెద్దవాళ్లు ఎవరూ లేరు. బాబు తప్పిపోయాడని గ్రహించాడు సంతోష్. తన దగ్గర ఉన్న డబ్బులతో బాబుకి వేరుశనగకాయలు కొని వాటిని ఒలిచి తినిపించాడు. మంచినీళ్లు కూడా తాగించాడు, అప్పుడు ఆ చిన్న బాబు ఏడవటం ఆపాడు. బాబుని ఆడిస్తూ తల్లిదండ్రుల కోసం వెతకసాగాడు. ఈలోగా బాబు తల్లిదండ్రులు కనిపించారు. బాబుని చూసి చాలా సంతోషించారు. బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు సంతోష్‌ని మెచ్చుకున్నారు.\n\nతమ ఇంటికి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు సంతోష్, తల్లి కూడా సంతోషించింది. అప్పుడు అద్దం గుర్తుకు వచ్చి అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖం అద్దంలో వెలిగిపోతూ కనిపించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 395,
        "IMAGE": "cat_2",
        "NAME": "సంతోషమైన ముఖం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 145,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూర్లో కొండ పైన ఒక పెద్ద మేఘం ఉండేది. ‘‘ఈ మేఘం కురవడం వల్లనే కొండ పక్కనున్న చెరువు నిండుతోంది. అక్కడున్న మన పొలాలన్నీ చక్కగా పండుతున్నాయి’’ అని ఆ మేఘాన్ని ఆ ఊరి రైతులు మెచ్చుకునే వాళ్లు.\n\nఒకసారి ఆ మేఘానికి దాని కన్నా కాస్త పెద్దగా ఉన్న మరో మేఘం కనిపించింది. దానితో అది దిగులు పడింది. ‘‘నేను దాని కన్నా పెద్దగా ఉండాలి. లేకపోతే నన్నెవరూ మెచ్చుకోరు’’ అనుకుంది.\n\n‘‘నేను కురిస్తే దాని కన్నా చిన్నగా అయిపోతానేమో’’ అనుకొని వర్షించకుండా ఉండడం మొదలు పెట్టింది. అయితే ఆ మేఘం ఆశించినట్లుగా అది చూసిన మరో మేఘం కన్నా పెద్దగా కాలేదు.\n\nకొండ దగ్గర వర్షం కురవక పోవడంతో చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. పొలాల్లో సరిగా పంటలు పండడంలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడసాగారు. వర్షం కురవడం లేదని మేఘాన్ని తిట్టడం మొదలు పెట్టారు. కొన్నిరోజులకి నెమ్మదిగా చెరువు కూడా ఎండిపోయింది. దానితో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి అందక అది గతంలో కన్నా చిన్నగా, తేలికగా అయిపోయింది.\n\nగాలివాటుకి పక్క ఊరి వైపు కొట్టుకు పొయింది. అక్కడ చెరువుల నిండా నీళ్లు ఉండడంతో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి దొరికింది. తిరిగి తనుండే కొండ వైపు వచ్చింది. దానితో అక్కడ గతంలోలాగా వర్షాలు కురిసాయి. ప్రజల ఇబ్బందులు తగ్గాయి.\n\nఅప్పుడు ఆ మేఘానికి తాను అంతకు ముందు చేసిన తప్పు ఏమిటో అర్ధమయింది. ఆకారం పెద్దదా, చిన్నదా అనేది ముఖ్యం కాదని అనుకుంది. వర్షాలు కురిస్తేనే తనకీ, ప్రజలకీ మనుగడ ఉంటుందనీ, లేకపోతే ప్రజలతో పాటుగా తనకీ కష్టాలు తప్పవనీ గ్ర హించింది. అప్పటి నుంచి తన ఆకారం గురించి పట్టించుకోకుండా తను చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టింది. దానితో మేఘంతో పాటు ఆ ఊరి ప్రజలు కూడా సంతోషంగా ఉండసాగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 396,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఆలోచనా మేఘం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 146,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కళింగ రాజ్యాన్ని పాలించే గుణశేఖరుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు రాజశేఖరుడు. యుక్త వయసు వచ్చేసరికి అతను అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. అతని జ్ఞానం పరిపూర్ణమయిందని గురువులు ఒప్పుకున్నారు. ఆ జ్ఞానానికి తగిన అనుభవం కూడా ఉంటే తన కొడుకు రాణించగలడనే ఉద్దేశ్యంతో గుణశేఖరుడు తన కొడుకును దేశాటన చేసి రమ్మన్నాడు. తండ్రి మాట ప్రకారం రాజశేఖరుడు తూర్పుదిక్కు ప్రయాణమై వెళ్లాడు. ఒక రోజు చీకటి పడే వేళకు అరణ్య ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ అతనికి ఒక మూలుగు వినిపించింది. భూగర్భంలోకి ఎగుడు దిగుడుగా మెట్లు ఉండటం చూశాడు. వాటి వెంబడి దిగిపోతే ఒక పాతాళ భైరవి విగ్రహం దానికి ఎదురుగా స్తంభానికి కట్టి ఉన్న సుందరి కనిపించారు. ఎవరు నువ్వు? నిన్నిక్కడ ఎవరు కట్టేశారు? అని రాజశేఖరుడు సుందరిని అడిగాడు. తనను ఒక మాంత్రికుడు బలి ఇవ్వబోతున్నట్లు ఆమె తెలిపింది. కొంత సేపటికి మాంత్రికుడు వచ్చి విగ్రహం ముందు కూర్చొని కళ్ళుమూసుకొని మంత్రాలు చదవటం ప్రారంభించాడు. ఇదే అదునుగా రాజశేఖరుడు వాడి తల నరికేశాడు. రాకుమారిని ఆమె తండ్రి అయిన మాళవరాజుకు అప్పగించాడు. ఆయన రాజశేఖరునికి కృతజ్ఞతలు తెలుపుకొని తన కూతురును అతనికి ఇచ్చి వివాహం చేశాడు. రాజశేఖరుడు భార్యను తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పాడు.\n\nనీ దేశాటనతో నేను అంతగా తృప్తి పడలేదు. మరోసారి నువ్వు దేశాటన చేసిరా అన్నాడు తండ్రి. ఈసారి అతను పడమట దిశగా బయలుదేరాడు. ఆ ప్రయాణంలో రాజశేఖరుడికి బీటలుబారిన పొలాలు, ఎముకలగూళ్లలా ఉన్న మనుషులు కనిపించారు. గుంపులు గుంపులుగా వలస పోతున్న జనం అతనికి ఎదురై తమ దేశంలో క్షామం తాండవిస్తున్నదని దానికితోడు కర్కోటకుడైన రాజు తమను పన్నులతో వేధిస్తున్నాడని చెప్పారు. మరో గ్రామంలో సైనికులు రైతులను పన్ను కట్టలేదని హింసిం చడం కళ్లారా చూశాడు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఆ దేశపు రాజును కలుసుకొని అతని పాలనను తిట్టిపోశాడు. ఆ రాజు రాశేఖరుడిని బంధించాడు. ఈ వార్త చారుల ద్వారా గుణశేఖరుడికి తెలిసింది. వెంటనే ఆయన పెద్ద సేనను వెంటబెట్టుకుని వచ్చి ఆ రాజును సంహరించి ఆ దేశంలోనూ పరిపాలన ఏర్పాటు చేశాడు.రాజశేఖరుడి రెండో దేశాటన గుణశేఖరుడికి తృప్తి కలిగించింది. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా! నాకొక సందేహం.\n\nగుణశేఖరుడు తన కొడుకు చేసిన మొదటి దేశాటన పట్ల ఎందుకు తృప్తి చెందలేదు? కుమారునికి అష్టకష్టాలను తెచ్చిపెట్టిన రెండో దేశాటన ఎందుకు తృప్తి కలిగించింది? అని అడిగాడు. దీనికి సమాధానంగా విక్రమార్కుడు ఇలా బదులిచ్చాడు. రాజు తన కొడుకును దేశాటనకు పంపింది సుఖప్రయాణానికి, భార్యని సంపాదించుకోడానికి కాదు. రాజు కావడానికి కావలసిన వాస్తవ అనుభవం సంపాదించుకోడానికి. రెండో దేశాటనలో అతనికి కలిగిన అనుభవం విలువ గలది. అతను ప్రజల బాధలను చూడటమే. వాటి పట్ల మంచి పాలకుడు ప్రదర్శించవలసిన వైఖరి ప్రదర్శించాడు. అందుకే అతని తండ్రికి ఆ దేశాటన తృప్తి కలిగించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 397,
        "IMAGE": "cat_2",
        "NAME": "దేశాటన",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 147,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అది నల్లమల అటవీ ప్రాంతం. జంతువులన్నీ ఓ అత్యవసర విషయం గురించి సమావేశం అయ్యాయి. ప్రతి జంతువు ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముందుగా సింహరాజు లేచి 'జంతు ప్రజలారా! మనుషులు మన నివాసమైన అటవీ ప్రాంతాన్ని నిర్ధాక్షిణ్యంగా నరుకుతున్నారు. కలప దొంగలు, స్థలాల వ్యాపారులు తమ వ్యాపారాల గురించి ఇలా నరుక్కుంటూ పోతే మన గతి ఏమిటి? మనం ఎక్కడికి పోతాము? ఇప్పటికే మన జంతువులు అనేక రకాలు అంతరించిపోయాయి. కొన్ని తరలిపోయాయి. ఇప్పుడు మనం ఎటువంటి భేధభావము లేకుండా భేటీ అయ్యాము. ఎవరికి తోచిన సలహాలు వారు ఇవ్వండి అంది. దానికి నక్క 'ప్రభూ! ప్రాణాలు మీదకు వచ్చినప్పుడు ఎలాంటి మార్గమైనా అవలంభించవచ్చు అని నీతిశాస్త్రంలోనే ఉంది. మన జీవనానికి అడ్డు అవుతున్న వారితో పోరాటమే ఇప్పుడు మన ముందు ఉన్న ఉపాయము.\n\nభగవంతుడు మనకు ఇచ్చిన శక్తి మనకూ ఇచ్చాడు. మన డేగకళ్ళు వారి బైనాక్యు లర్స్‌ కన్నా శక్తివంతమైనవి, మన గబ్బిలాన్ని చూసే వారు రాడార్‌ యంత్రాన్ని కనిపెట్టారు. మన కుక్కలు మనిషి వాసనను చాలా దూరం నుంచే పసిగట్టకలవు. మన కందిరీగలు తలచుకొంటే ఎంత పెద్ద సైన్యాన్ని కూడా చుట్టు ముసిరి చంపగలవు. మనలోని కొన్ని జంతువులు ఆహారం, నీరు లేకుండా చాలా కాలం బ్రతకగలవు. అలాగే మన ఏనుగులు, త్రాచులు, ఒంటెలు అన్నీ గండర గండలే. ముందు కలప స్మగ్లర్స్‌ పని పడదాము అంది. తరువాత ఏనుగు లేచి తరువాత జనారణ్యంపై పడదాము. మా ఏనుగుల మందలు ఊళ్ళు అన్నింటిని నాశనం చేస్తాము అంది. పులిలేచి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాము. దుర్మార్గ జనాలను చీల్చివేస్తాము అంది ఆగ్రహంగా. ఇలా ప్రతి జంతువు పోరాటానికి సిద్దం అయ్యాయి. సింహరాజు మిత్రులారా ఒక లక్ష్యం గురించి కలిసి పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే త్రోవ అదే కన్పిస్తుంది. ప్రజల్లో కూడా చాలా మంది మంచివారు ఉన్నారు.ప్రభుత్వాలు కూడా మన సంక్షేమం గురించే ఆలోచిస్తున్నది. జీవకారుణ్య సంఘాలు మనవైపు ఉండనే ఉన్నాయి అంది.\n\nసింహ రాజు మాటకు జంతువు లన్నీ సంఘీభావం చెప్పి ఆమె ఉనికి గురించి పోరాటము మొదలు పెట్టాయి. ముందుగా అడవిలోకి వచ్చిన కలప దొంగలను కడతేర్చాయి. తరువాత ఏనుగులు మందలు మందలుగా పోయి గ్రామాలను ధ్వం సం చెయ్య సాగాయి. నక్క లాంటి మేధావి వర్గం ఊళ్ళల్లోకి పోయి అక్కడ ఉన్న ఎద్దు, ఆవు, గుర్రం, గాడిద లాంటి పెంపుడు జంతువులకు కూడా తమ సిద్ధాంతం నూరిపోసి పోరాటానికి సిద్దం చేశాయి. జంతు లోకం తిరగబడింది. మానవ లోకం గడగడలాడింది. నక్కలు రాత్రివేళల్లో మందలు, మందలుగా గ్రామాలకు పోయి అక్కడ పెంపుడు జంతువులను సమావేశపరచి మిత్రులారా! మనిషి స్వార్థపరుడు తాను సంతోషంగా ఉండటానికి ఎంతకు అయినా తెగిస్తాడు. సర్వజంతు ప్రపంచం నాశనం అయిపోయినా ఫర్వాలేదు. చెట్లు లేక ఆరణ్యం వేడెక్కి గూడు లేక, దారి లేక మనం మలమల మాడిపోయినా ఫర్వాలేదు. ఎద్దును పెంచుతున్నది తన వ్యవసాయం కోసం అంతే కాని ప్రేమతో కాదు. ఎద్దు ముసిలి అయిపోతే ఇన్నాళ్ళ సేవను మరిచి కటింగ్‌కి అమ్ముతారు. ఆవుని పెంచేది పాల కోసము, గొర్రెను ముద్దుగా బలిపించేది దాని మాంసం కోసం, కోళ్ళను పెంచేది గుడ కోసం, పిల్లిని పెంచేది ఎలకల కోసము, గుర్రాన్ని పెంచేది సరుకుల రవాణా కోసము, ఇలా ప్రతి పెంపుడు జంతువును తన స్వార్థం కోసం బంధించి పెంచుతున్నాడు. అవసరం తీరగానే చంపుతున్నారు అని నక్కలు ఆ విధంగా బోధించేసరికి పెంపుడు జంతువులు కూడా అడవి జంతువులతో కలిసి పోరాటము చెయ్యటానికి నిశ్చయించుకున్నాయి. తెల్లవారి తమ వద్దకు వచ్చిన యజమానులపై తిరగబడ్డాయి. వారు బిత్తరపోయి తమ కర్రలు వదిలి పారిపోసాగారు.\n\nజంతువులు పగలబడి నవ్వాయి. ఎద్దులు, పోతులు గాడిదలు మొదలగు జంతువులు తిరగబడేసరికి వీధుల్లోంచి జనాలు అడవులువైపు పారిపోసాగారు. అడవివైపు వచ్చినవారిని ఏనుగులు తరమసాగాయి. ఆహారం, పాలు, గ్రుడ్లు, ధాన్యం దొరక్క జనాలు మలమలమాడ సాగారు. సాధు జంతువు ఆవు వద్దకు పోయినా మహంకాళిలా చూస్తోంది. మన పని అయిపోయింది కలికాలం అనుకోసాగారు ప్రజలు.\n\nప్రభుత్వం పెద్ద మిలట్రీని దించింది. జంతువులను క్రూరంగా తుపాకులతో చంపసాగారు. దాంతో జీవకా రుణ్య సంఘాలవారు జంతు శ్రామికులు జంతువులు తరపున పెద్ద ఉద్యమం లేవదీశారు. అక్కడ మేధావులు సమావేశమై ఈ ప్రపంచాన్ని భగవంతుడు అన్ని జీవరాశుల గురించి పుట్టించారు. ఒక్క మనుషుల గురించే కాదు. వాటి నివాసాలను మనం కబళిస్తే అవి మన నివాసాలపై పడతాయి. చెట్లు నరికితే జంతువులతో పాటూ మనమూ పోతాము. భూగోళం నాశనం అవుతుంది. కనుక ఎవరి చోటవారు ఉందాము. చెట్లను పెంచుదాం, జీవరాశుల ఎడల ప్రేమ కలిగి ఉందాం అని నిశ్చయించుకొన్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 398,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెగించిన జంతువులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 148,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు రాజు అనే ఓ కొడుకు ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒక ఆవ్ఞను పెంచుకుంటూ, ఓ పూరి గుడిసెలో ఉండేవారు. ఆవ్ఞపాలు అమ్ముకుంటూ, ఆ వచ్చిన డబ్బుతో బతికేవారు. ఈ ప్రపంచంలో ఏదైనా ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. కొంత కాలానికి రాజు వాళ్ల ఆవ్ఞ ముసలిదైపోయింది. ఇదివరకులా పాలను ఇవ్వడం మానేసింది. దాంతో ఎలా బతకాలా అని రాజు, అతని తల్లి బెంగపడసాగారు. ఒకనాడు రాజుకి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఈ ఆవ్ఞని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెడితే ఎలా ఉంటుందమ్మా? అని తల్లిని అడిగాడు. ఆమె సరేనంది. ఇంకేం ఆవ్ఞని తీసుకుని రాజు సంతకు వెళ్లాడు. అయితే అతను ఎంతసేపు ఉన్నాగానీ ఎవరూ ఆ ఆవ్ఞని కొనుక్కోలేదు. సాయంత్రం అయింది. ఇంకొంచెం సేపటిలో చీకటిపడుతుంది. ఇంతలో ఓ ముసలతను రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో అబ్బా§్‌ు ఈ ఐదు గింజల్ని తీసుకుని నీ ఆవ్ఞని నాకిస్తావా? అని అడిగాడు. రాజు అయోమయంగా చూశాడు. ఇవి మామూలు గింజలు కాదులే. మంత్రపు విత్తులు. ఇవి నీకు బాగా పనికొస్తాయి అన్నాడు ముసలతను. రాజుకి నమ్మకం కలిగింది. ఆ గింజల్ని తీసుకుని ఆవ్ఞని అతనికిచ్చేశాడు.\n\nఇంటికి వచ్చాక రాజుని వాళ్ల అమ్మ బాగా తిట్టింది. ఇంత తెలివి తక్కువ పని చేశావేంట్రా, అంటూ గింజల్ని విసిరికొట్టింది. ఆ తరువాత రాజు ఆ గింజల కోసం వెతికితే అందులో ఒక్కటి మాత్రం దొరికింది. వెంటనే దాన్ని నేలలో పాతి కొంచెంనీళ్లు పోశాడు. ఆశ్చర్యం! మరుసటిరోజు తెల్లారేసరికి అక్కడో పెద్ద చెట్టు కనిపించింది. చాలా పెద్ద చెట్టు. రజుకి చెట్లేక్కడం బాగా వచ్చు. అందుకని చకచకా ఆ చెట్టుపైకి ఎక్కాడు. దాని చిటుకొమ్మలు మబ్బుల్ని తాకుతన్నాయి. అక్కడ ఓ పెద్ద కోట. అందులో ఓ అందమైన భవనం ఉన్నాయి. రాజు ఆ భవనంలోకి దూరి అన్ని గదులూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక దేవత ప్రత్యక్షమయింది. ఒరే§్‌ు అబ్బా§్‌ు నువ్ఞ్వ భలే ధైర్యవంతుడివిరా. అందుకే నీకో సాయం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీకు బోలెడంత బంగారం దొరుకుతుంది అంటూ రాజుకి ఓ రహస్యం చెప్పింది.\n\nదేవత చెప్పినట్లుగానే కొంత సేపటికి అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చీ రాగానే వాడు పీకనిండా తిని, మంచంమీదికి చేరుకున్నాడు. క్షణంలో నిద్రలోకి జారుకున్నాడు.\n\nఅప్పటిదాకా గదిలో దాక్కుని ఉన్న రాజు మెల్లగా బయటికి వచ్చి రాక్షసుడి మంచం కిందికి దూరాడు. అక్కడ ఓ బండరాయి కనిపించింది. రాజు దానిని మెల్లగా పక్కకు జరిపాడు. దానికింద ఉన్న గొయ్యిలో ఒక పెద్ద బంగారు నగల మూట ఉంది. రాజు ఆ నగల మూటను తీసుకుని మెల్లగా మంచం బయటకు వచ్చాడు. ఆ తరువాత చకచకా నడుచుకంటూ భవనం బయటకు వచ్చి తన ఇంటికి బయలుదేరాడు. ఆశ్చర్యం రాజు ఇలా దిగాడో లేదో ఆ చెట్టు టక్కున మాయమైపోయింది. రాజు తెచ్చిన ధనంతో అతను, అతని తల్లి ఎంతో హాయిగా జీవించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 399,
        "IMAGE": "cat_2",
        "NAME": "మంత్రపు విత్తులు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 149,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక పిచ్చుక ఒక తోటలో నున్న ఒక పెద్ద మర్రిచెట్టు కొమ్మకు గూడును అల్లుకొని తన ఇద్దరి పిల్లలతో హాయిగా నివసించసాగింది. ఆ చెట్టుకు సవిూపంలోనే మరొక చెట్టుమీద గూడును నిర్మించుకొని తన ఇద్దరి పిల్లలతో నివసించసాగింది కాకి. ఒకరోజు కాకి, పిచ్చుక దగ్గరకు వెళ్ళి మిత్రమా! నాకు ఒక సహాయం చెయ్యాలి. నా గూడును పుల్లలతో నిర్మించుకోవడం వల్ల చిన్నపాటి వర్షానికి తడిసిపోవడం, కొద్దిపాటి గాలికే చెదిరిపోవడం జరుగుతోంది. నీవ్ఞ అల్లిన గూడు వర్షానికి, గాలికి ఏమాత్రం చెక్కు చెదరకుండా వ్ఞంటోంది. కాబట్టి నువ్ఞ్వ గూడును ఎలా అల్లుకుంటావో నాకూ నేర్పవా? అంది. మిత్రమా! నీ ఆలోచన బాగానే వ్ఞంది. నాకులా నీవ్ఞ నా గూడును అల్లటం అసాధ్యమైన పని. నీకు నేర్పాలన్నా నీవ్ఞ నేర్చుకోలేవ్ఞ. అంతగా కావాలంటే నా గూడులాంటిదే మరొక గూడును అల్లిస్తా అంది పిచ్చుక.\n\nపిచ్చుక సమాధానం తన వ్యక్తిత్వానికి భంగం కలిగించినట్లుగా భావించి కాకి, క్రమంగా పిచ్చుక దాని పిల్లలపై అసూయ పెంచుకోసాగింది. కాకి అలా మొదలైన అసూయ పిచ్చుక, దాని పిల్లల్ని చంపివేయాలనే నిర్ణయందాకా వచ్చింది. కాకి ఒకరోజు పిచ్చుక దగ్గరకు వెళ్ళి మిత్రమా! ఇక్కడినుండి దక్షిణ దిక్కుకు రెండు కోసుల దూరంలో ఒక గుడి వ్ఞంది. ఆ గుడిపై చదునుగా వ్ఞన్నచోట చాలా వడ్ల గింజలున్నాయి. నీవ్ఞ అంతదూరం వెళ్లి తెచ్చుకోగలిగితే నీకూ, నీ పిల్లలకు ఆహారకొరతే వ్ఞండదు అంది. ఓహో అలానా మిత్రమా! చాలా కృతజ్ఞతలు అని పైకి అంటూనే ఏదో పన్నాగం పన్ని వ్ఞంటుందని లోలోపల ఆలోచింపసాగింది పిచ్చుక.\n\nకాకి మనస్తత్వం వూహించుకుని ఎందుకైనా మంచిదని తలచి అక్కడికి కొంచెం దూరంలో వ్ఞన్న మరొకచెట్టు కొమ్మకు గూడును అల్లి తన ఇద్దరి పిల్లల్ని వ్ఞంచి వాటికి తగిన జాగ్రత్తలు చెప్పి, కాకి దగ్గరకు వెళ్ళింది పిచ్చుక. మిత్రమా! నేను ఆహారం కోసం బయలుదేరుతున్నాను కాస్త మా పిల్లల్ని కనిపెట్టుకుని వ్ఞండు. నేను కనపడలేదని ఒక్కోసారి ఎగిరిపోతుంటాయి అంది పిచ్చుక. ఓ అలానే మిత్రమా! నీవ్ఞ ఏవిూ భయపడవద్దు. నేను చూసుకుంటాలే నీవ్ఞ నిశ్చింతగా వెళ్ళిరా అంది కాకి. కొద్దిసేపటికి కాకి సవిూప పిచ్చుక గూడు దగ్గరకు వెళ్లి పిల్లలు లేకపోవడం చూసి తన పిల్లల్ని అందులో నిద్రపుచ్చి పిచ్చుక పిల్లల్ని చంపటంకోసం వాటిని వెతకసాగింది. ఇంతలో అటుగా వెళుతున్న వేటగానికి పిచ్చుక కనపడింది. ఆహా ఎన్నిరోజులకు పిచ్చుక మాసం తినిబోతున్నానని భావించి నిదానంగా చెట్టు ఎక్కి గూడును తీసుకుని చూస్తే కాకి పిల్లలు కనిపించాయి. పిచ్చుక పిల్లలు అని అనుకుంటే ఇవ్ఞన్నాయే అనే కోపంతో వాటిని తీసి నేలకు బాదాడు. అవి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాయి.\n\nతరువాత వచ్చిన కాకి తన పిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి బోరున విలపించసాగింది. గింజలు కనపడక అలసిపోయి తిరిగి వస్తున్న పిచ్చుకకు,అయ్యా ''కాకులు కూడా పిచ్చుక గూళ్ళు అల్లుతాయా? ఇయాల నేను పిచ్చుక గూడును చూస్తే అందులో కాకి పిల్లలుండాయి అందుకని వాటిని అక్కడే సంపేసా అని మాటలు వినబడ్డాయి. పిచ్చుకకు విషయం అర్థమైంది. హడావ్ఞడిగా తన గూడు దగ్గరకు వెళ్ళి తన పిల్లలు క్షేమమేమని తెలుసుకుని పాత గూడువ్ఞన్న చోటకు వెళ్ళింది పిచ్చుక. కాకి పిచ్చుకను కౌగలించుకొని విలపిస్తూ క్షమించు మిత్రమా! అసూయతో నీ బిడ్డల్ని చంపాలని చూశాను. కాని నా అసూయ నా బిడ్డల్నే హతమార్చింది. బిడ్డలులేని నాకు చావే శరణ్యం అంటూ తలను నేలకు బాదుకోసాగింది కాకి. విధిరాత తప్పదు మిత్రమా! బిడ్డల్ని కోల్పోయినంత మాత్రాన ప్రాణం తీసుకోవడం భావ్యమా. నా బిడ్డలు క్షేమంగా వ్ఞన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మాతో వ్ఞండవచ్చు అంది పిచ్చుక. నాటినుండి అన్ని అవలక్షణాల్ని వీడి పిచ్చుక దాని పిల్లలతో హాయిగా కాలం గడుపసాగింది కాకి. వాటి స్నేహానికి మిగతా పక్షులన్నీ ఆశ్చర్యంలో మునిగిపోసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 400,
        "IMAGE": "cat_2",
        "NAME": "అసూయ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 150,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో 'బబ్లూ అనే ఒక ఎలుగుబంటి ఉండేది. అది చూడడానికి చాలా నల్లగా, పొట్టిగా, బలంగా, భయంకరంగా ఉండేది. దానిని చూసి మిగిలిన జంతువ్ఞలు భయపడేవి. కానీ నిజానికి బబ్లూ చాలా మంచిది. అందరికీ సహాయం చేసే గుణం కలది. ఆ కారణంగా ఎలుగును ఆ అడవిలో గల జంతువ్ఞలు తమ నాయకునిగా భావించేవి. బబ్లూ తన సలహాదారునిగా 'బన్నీ అనే నక్కను తన దగ్గర నియమించుకుంది. బన్నీ మహా మేథావి. ఎంతో నమ్మకమైంది కూడాను. అందుకే బబ్లూకు బన్నీ అంటే చాలా ఇష్టం. బన్నీ తక్కిన నక్కల్లా కాకుండా తమ నాయకునిపై చాలా విశ్వాసాన్ని చూపేది. ఏ తగాదా వచ్చినా బన్నీ సలహా ప్రకారమే బబ్లూ తీర్పు చెప్పేది. తన తీర్పుకు అన్ని జంతువ్ఞలు కట్టుబడి ఉండేవి. బబ్లూను, బన్నీని ఆ అడవిలో నున్న చాలా జంతువ్ఞలు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసేవి.\n\nబబ్లూ పెత్తనం, బన్నీ సలహాలు ఆ అడవిలో ఉండే 'సిఖిముఖి అనే తోడేలుకు, దాని స్నేహితులకు నచ్చేవి కాదు. సిఖిముఖి తన స్నేహితులు త్రోవనపోయే అమాయక జంతువ్ఞలను అల్లరి చేసేవి. అందుకు శిక్షగా రోజంతా అడవి చుట్టూ తిరగాలని బబ్లూ ఆ తోడేళ్ళను శాసించేది. ఆ కారణంగా బబ్లూ అంటే వాటికి పడేది కాదు. బబ్లూను నాయకత్వ స్థానంనుండి ఎలాగైనా తొలగించాలనుకొనేవి. దానికి ఏం చేయాలో సిఖిముఖి దాని స్నేహితులకు అర్థం కాలేదు.\n\nబబ్లూ దగ్గర ఉన్న బన్నీ చాలా తెలివైనది. జిత్తులమారిది. మనకు తట్టని ఆలోచనలు దానికి తడతాయి. అంచేత దానిని లేపుకొచ్చి చితకబాదితే అదే సరైన సలహా ఇస్తుంది అని సిఖిముఖి దాని స్నేహితులతో అంది. అందులో ఒక తోడేలు లేచి కొట్టడం తిట్టడం చేస్తే ఎవరైనా సలహాలిస్తారా? బన్నీకి సకల మర్యాదలు చేసి మన పథకానికి సలహా అడుగుదాం. ఇంకా మన దారికి రాలేదనుకో అప్పుడు రెండు తగిలిద్దాం. ఎలాగుంది మన ఆలోచన! అంది. పథకం ప్రకారం బన్నీని ఎత్తుకు వచ్చాయి.\n\nసకల మర్యాదలు చేసి వారికి కావలసిన సలహాను అడిగాయి. తను ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకున్నానని బన్నీ గ్రహించింది. తోడేళ్ళ ముఠాను దెబ్బ తీయాలనుకుంది. బబ్లూ మీద ఉన్నవీ లేనివీ కల్పించి వారికి చెప్పింది. బబ్లూను నాయకునిగా తొలగించి సిఖిముఖిని నాయకుని చేయడం తనకెంతో ఇష్టమని చెప్పింది. అన్ని జంతువ్ఞల కంటే బబ్లూ నల్లగా ఉండబట్టే భయంకరంగా కనిపిస్తున్నాడనీ, ఆ కారణంగానే అందరూ తన పెద్దరికానికి తలొగ్గుతున్నారని చెప్పింది. సిఖిముఖి నల్ల రంగు శరీరానికి పులుముకుంటే బబ్లూ కంటే భయంకరంగా తయారవ్వవచ్చనీ తోడేళ్ళు, నక్కలు ఒక్కటై బబ్లూను తరిమేయవచ్చని బన్నీ తెలివితేటలుగా సలహాఇచ్చింది. సిఖిముఖి దాని మిత్రులు బన్నీ మాటలు పూర్తిగా నమ్మేసాయి. సిఖిముఖి ఆతృతగా బన్నీనుద్దేశించి నల్లరంగు ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది.\n\nబన్నీ ఒక్క క్షణం ఆలోచిస్తూ వీళ్ళ పీడ ఎలాగైనా విరగ్గొట్టుకోవాలి? బబ్లూను ఎలా కాపాడుకోవాలి? అనే ఆలోచనలో పడింది. బన్నీ ఉన్నట్టుండి ఆ మధ్య మన అటవీ మార్గం గుండా కొత్తగా తారు రోడ్డు వేయడాన్ని చూసాను. ఆ తారు చాలా నల్లగా ఉంటుంది. అక్కడ చాలా తారుంది. దానిని మీ శరీరాలకు పూసుకుంటే మిమ్మల్ని ఎవరూ పోల్చుకోలేరు. అప్పుడు ఈ అడవికి కొత్తగా వచ్చిన భయంకరమైన జంతువ్ఞల్లా కనిపిస్తారు అని చెబుతుంది. కొద్ది క్షణాలలో సిఖిముఖి తన స్నేహితులతో కలిసి తారు డబ్బాలున్న ప్రదేశానికి పరుగు పరుగున వెళ్ళి పోటాపోటీగా తారు డబ్బాల్లో గెంతేసాయి. ఆ డబ్బాలలో మునిగి వాటి నుండి బయటకు రాలేక గిల గిల కొట్టుకుంటూ చచ్చాయి. జరిగిన సంఘటనను అడవిలో నున్న జంతువ్ఞలకు తెలిసి దుర్మార్గులకు తగిన శాస్తి జరిగిందని సంతోషించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 401,
        "IMAGE": "cat_2",
        "NAME": "కీడు తెచ్చిన కోరిక ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 151,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒక రోజు పనిమీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు.\r\n\r\nఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచే సరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించినది. దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరు దాము అనుకున్నాడు.\r\n\r\nఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది, దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి, అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు వైపు వెళ్లాడు.\r\n\r\nఅక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంతా చిన్న కాయల.\r\n\r\nఇది మరీ అన్యాయం అనుకొని కన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడి కాయలు కా ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన చెట్టు నీడన.\r\n\r\nఇంతలో గాలికి మర్రిచెట్టు కోమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తల పై పడింది వెంటనే, ఉలిక్కిపడి. దేవుడు చాలా తెలివైనవాడు. కాబట్టి అలా సృష్టించాడు.\r\n\r\nలేకపోతే మర్రిచెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలు అయిపోయింది అనుకున్నాడు. దేవుడిని తప్పు పట్టడం ఆ తెలివి తక్కువ తనం అనుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 402,
        "IMAGE": "cat_2",
        "NAME": "దేవుడు సృష్టి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 152,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఉజ్జైని నగరంలో మాధవా అనబడే బ్రాహ్మడుండేవాడు. ఒక రోజు ఆ బ్రాహ్మడి భార్య పక్కవూరికి పేరెంటానికి వెళ్తూ వాళ్ళ పసి పాపను ఆ బ్రాహ్మడికి అప్పచెప్పి వెళ్ళింది. ఇదిలా ఉండగా ఆ రోజు మహారాజుగారు ఆ బ్రాహ్మడిని సభకు రమ్మని కబురు పెట్టారు. పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్ళడమని ఆలోచిస్తున్న బ్రాహ్మడికి అతని ముంగిస కనిపించింది. “ఈ ముంగిస చాలా యేళ్ళగా నా దెగ్గిర నా కొడుకులానే పెరుగుతోంది, దీనికి పాపను అప్పచెప్పి వెళ్తాను” అనుకుని రజ్యసభ వైపు బయలుద్యారాడు.\n\nముంగిస తనను నమ్మి ఈ పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వ పడింది. వెళ్ళి పాప దెగ్గిరే కూర్చింది. సమయానికి ఒక పామును పాప వైపుకు వెళ్తూ చూసింది. వెంటనే ఆ పామును చంపేసింది.\n\nకొంత సేపటికి మాధవ రజ్యమర్యాదలన్ని స్వీకరించి, రాజు ఇచ్చిన బహుమానాలతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆనందంతో ముంగిస అతని దెగ్గిరకు గబగబా వెళ్ళింది. మాధవ ముంగిస మూతికున్న నెత్తురును చూసాడు. పాపను చంపేసిందని అపోహ పడ్డాడు. కోపంగా ఆ ముంగిసను చంపేసాడు. బాధతో ఇంటిలోకెళ్ళాడు. ఎదురుగానే పసి పాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది. పక్కనే చచ్చి పడున్న పామును చూసి మాధవ అన్ని అర్ధం చేసుకున్నాడు. అయ్యో తొందరపడ్డానే! అని చాలా పశ్చాతాప పడ్డాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 403,
        "IMAGE": "cat_2",
        "NAME": "మాధవ ముంగిస",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 153,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు.\n\nఒక రోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది.\n\nఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. “హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!” అంది కోడి పుంజు.\n\n“లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది” అని జవాబు చెప్పిందా నక్క.\n\nపుంజు వెంటనే తన పిల్లలను లెక్ఖ పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. “ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ వున్నా నాకు తెలియలేదే,” అంది.\n\n“యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనె వచ్చావు” అంది నక్క వ్యంగ్యంగా.\n\nనిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 404,
        "IMAGE": "cat_2",
        "NAME": "నక్కా, కోడి పుంజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 154,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక కుక్కల వ్యాపారస్తుడుండేవాడు. అతను కుక్కలను కొని, వాటిని పెంచాలనుకునే వాళ్ళకు అమ్ముకునేవాడు.\n\nఒక రోజు అతను పొలాల్లోంచి వెళ్తుంటే అక్కడొక కుక్కను చూసాడు. ఆ కుక్క అతని దెగ్గిరకు వెళ్ళి తనని కొనుక్కోమని ప్రాధేయ పడింది. ఆ వ్యాపారస్తుడు “నీలాంటి కురూపిని ఎవరు కొనుక్కుంటారు?” అని ఛీ: కొట్టాడు.\n\nకొద్ది రోజుల తరవాత ఆ కుక్క రజగృహం దెగ్గిరకు వెళ్తే అక్కడ రక్షక భటుడు దాన్ని చూసి నిమురాడు. అప్పుడే ఆ వ్యాపారస్తుడు అటు వైపు వచ్చాడు. కుక్క అతన్ని మళ్ళీ తనను కొనుక్కొమని అడిగింది.\n\n“నువ్వు రాజ మహలులో వుంటున్నావు, చక్రవర్తిని కాపలా కాస్తున్నావు – నీ విలువ నేను ఇచ్చుకోలేను” అని వెళ్ళి పోయాడు.\n\nనిజమే, మనం ఎక్కడున్నామో, ఎవరితో ఉన్నామో, దాన్ని బట్టే మనుషులు మన విలువను నిర్ధారిస్తారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 405,
        "IMAGE": "cat_2",
        "NAME": "కుక్కా, వ్యాపారస్తుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 155,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.\nభల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు.\nతోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.\nఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.\n\nచివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది.\nకోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 406,
        "IMAGE": "cat_2",
        "NAME": "కోతి, అద్దం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 156,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "శాలదేశంలో సోమేశ్వరం అనే గ్రామంవుంది. అక్కడి రైతులు వ్యవసాయoలో మరింత ఫల సాయo పొందుతున్నారు. వ్యాపారులు న్యాయoగా వుంటూనే లాభాలార్జిస్తున్నారు. గ్రామస్థులందరు సత్ప్రవర్తన అలవరుచుకుని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగావుంటున్నారు. సోమేశ్వర గ్రామంలోని జనార్దన స్వామి ఆలయo ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడివారూ స్వామిని దర్శించుకోవాలని అక్కడకు వెళ్ళేవారు.\n\nక్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం గురించి, ఆ దేశపురాజు దేవనందుడిదాకా వెళ్ళింది. ఆయన మంత్రి గంగుభద్రుణ్ణి పిలిచి, ‘‘మంత్రివర్యా! అక్కడి జనార్దనుడి ఆలయo వెయళ్ళనాటిది. కానీ నాకు తెలిసి పది సంవత్సరాల క్రితం వరకూ, ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు. కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమకాకుండా, ఇంకేదో కారణముండాలని, నా అనుమానం. మీరేమంటారు?'' అని అడిగాడు.\n\nదానికి మంత్రి వెంటనే, ‘‘ప్రభూ! ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ప్రెూజనముండదు. మనమే స్వయoగా మారువేషాల్లో, ఆ గ్రామంలో సంచరించి అసలు విషయo తెలుసుకుందాం,'' అంటూ రాజుకు కర్తవ్యబోధ చేశాడు. ఆ ప్రకారం రాజు, మంత్రి జ్యోతిష్కుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు. అక్కడి వైభవం వారికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు జోస్యం చెబుతామంటూ ఒక ఇంటికి వెళితే, ఆ గృహస్థు, ‘‘ మీ ముఖంలో తేజస్సు చూస్తూంటే విద్యావంతులనిపిస్తున్నది.\n\nకానీ ఇలా జోస్యం చెప్పడం వల్ల, మీ విద్య వృధా అవుతుంది. ఎందుకంటే, మనిషి ఏమి సాధించాలన్నా కృషి చేయాలి. కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది. అదృష్టమెలావున్నా, మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు. ఫలితమెలాగున్నా, కృషి మానని మనిషికి జోస్యంతో పనేముంటుంది?'' అన్నాడు.రాజు, ఆ గృహస్థు వివేకానికి ఆశ్చర్యపడి, ‘‘జనార్దనస్వామిదయవల్ల, మీ గ్రామస్థుల సుఖసంతోషాలకు లోటులేదు. మావంటివారిని మీవంటివారే ఆదరించాలి; కాదనకూడదు,'' అన్నాడు. దీనికా గృహస్థు నవ్వి, ‘‘అయ్యా! దేవుడు మనకు జన్మనిచ్చాడు; మంచి వనరులిచ్చాడు. మనిషి అంతకుమించి ఆయన నుంచి ఆశించకూడదంటాడు, మా ఊరి రామనాధం. ఆయన మాటలు వినడంవల్లనే, మా గ్రామానికింత వైభవం పట్టింది. పదేళ్ళ క్రితం ఆయనను మా ఊరికి పంపడమే, దేవుడు మా మీద చూపించిన దయ అని మేమంతా అనుకుంటూంటాం.\n\nమీరొక్కసారి ఆయన్ను కలుసుకోండి. మీ విద్యకూ, సమర్థతకూ తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు,'' అన్నాడు. అప్పుడు రాజుకూ, మంత్రికీ, ఆ ఊరి వైభవానికి కారణం, రామనాధం సలహాలేనని తెలిసింది. వారు రామనాధాన్ని కలుసుకున్నారు. ఆయన వారు చెప్పింది విని, ‘‘అయ్యాలారా! జ్యోతిషం గొప్ప శాస్ర్తమే. కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పడానికి ఉపెయోగించడంవల్ల నష్టాలెక్కువ; లాభం స్వల్పం. శాస్త్రాన్ని సరిగ్గా ఉపెూగిస్తే వాన, వరద, తుఫాను, భూకంపం, కరువు వగైరాల గురించి ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.\n\nజ్యోతిషాన్ని మీరా దృష్టితో అధ్యయoనం చేయoడి,'' అన్నాడు. ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయటపెట్టారు. ఆనతో, ‘‘మహానుభావా! రాజు ఎన్ని శాసనాలు చేసినా, నీవంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు ఎక్కువ ప్రెయోజనాన్నిస్తాయి. మేము నీ వద్దకు కొందరు మెరికల్లాంటి యువకుల్ని పంపుతాం. వారికి నీవు శిక్షణ ఇవ్వాలి. తర్వాత వారు, నీ సలహాలకు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు.\n\nఆ విధంగా నీ పేరు చెప్పి, మన దేశం మరింత సుభిక్షమవుతుంది,'' అన్నారు. ఇందుకు రామనాధం సరేనన్నాడు. ఆ విధంగా ఆయున ఆరు మాసాల్లో ఇరవైమంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. వారు వివిధ గ్రామాలకూ వెళ్ళి, ఆయన సలహాలు ప్రచారం చేశారు. కానీ ఏడాది గడిచినా, ఆయా గ్రామాల్లో ఏ మార్పూ కనబడలేదు. పైగా, ఏ గ్రామస్థులూ ఆ సలహాలపట్ల ఆసక్తిని చూపలేదు. ఇది రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది.\n\nసోమేశ్వర గ్రామవైభవానికి దేవుడి మహిమే కారణమా అని కూడా ఆయనకు అనుమానం వచ్చింది. అయితే, మంత్రి గంగుభద్రుడు ఆయనతో, ‘‘ప్రభూ! అది దేవుడి మహిమే అనుకుంటే, మనం ప్రజలకు చేయగలదే లేదు. రామనాధం మహిమే అనుకుంటే, ఆయన నివాసం మరో గ్రామానికి మార్చితే, ఆ విషయo ఋజువౌతుంది,'' అన్నాడు. రాజుకీ సలహా నచ్చింది. ఆయన రామనాధాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాస ముండవలసిందిగా కోరాడు. ఆ గ్రామంలో నాలుగేళ్ళుగా కరువు విలయతాండవం చేస్తోంది.\n\nప్రజలు వున్న పూట తింటూ, లేని పూట పస్తులుంటూ, ఎందుకొచ్చిందిరా అన్నట్లు బ్రతుకులీడుస్తున్నారు. రామనాధం తన భార్య మీనాక్ష, పిల్లలు రాము, గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు. గ్రామస్థులాయన వుండేందుకు శిథిలావస్థలో వున్న ఒక ఇంటిని ఇచ్చారు. ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు.\n\nమీనాక్ష ఇల్లు చక్కదిద్దుకుంటే, ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి, ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఒక్కొక్కరినే పలకరించి విశేషాలడిగి తెలుసుకుని, వారివారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు. ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తివున్నదో, నెలరోజులు తిరక్కుండానే ఊరివారంతా ఆయన వద్దకు సలహాలకోసం రాసాగారు. రామనాధం వాళ్ళకు, ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు.\n\nతక్కువ నీటితో పండేపంటల గురించి చెప్పాడు. పంటలు పండనప్పుడు, పట్నం వెళ్ళి తాత్కాలికంగా డబ్బు సంపాయించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి చెప్పాడు. పలు ఆరోగ్యసూత్రాలను వారికి వివరించి చెప్పి, ‘‘ఈ భూమ్మీద ఎడారులున్నాయి. అడువులున్నాయి. మంచు పర్వతాలున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు. ఇదితెలుసుకుంటే, మనిషి ప్రకృతి బీభత్సాలకు భయపడ్డం మానేసి, ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు,'' అన్నాడు.\n\nఆరు మాసాలు తిరిగే సరికి పాడుపడినట్లుండే రామనాధం ఇల్లు పచ్చదనంతో కళకళలాడింది. ఊరికి కూడా కొత్త కళవచ్చింది. ఈ మార్పుకు కారణమైన రామనాధానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని వారనుకున్నారు. అయితే, రామనాథం నవ్వి, ‘‘మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ, నా సలహాలు పాటిస్తున్నారు. అంతకు మించిన కానుక మరేమీ లేదు,'' అన్నాడు. అప్పుడు గ్రామస్థులు, ఆయన భార్య మీనాక్షతో, ‘‘అమ్మా! పాడుబడ్డ ఇంట్లో కాపరం ప్రారంభించి, ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు కాబట్టి, నీ భర్త మా అందరికీ మేలుచేసే సలహాలివ్వగలిగాడు. ఒక విధంగా, ఈ ఊరి అసలు బాగుకు కారణం, నువ్వు. నీకోసం ఏదైనా తెచ్చి ఇవ్వాలని, మా కోరిక.\n\nఏదైనా అడిగి, మా మనసులకు పూర్తి సంతోషం కలిగించు!'' అని వేడుకున్నారు. మీనాక్ష, ‘‘ఒకప్పుడు బీడులావున్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో, రంగు రంగుల పూలతో కళకళలాడుతున్నది. అయితే, ఇంటి తోటకు ఎరగ్రులాబీ లేక పోవడం పెద్ద లోటు. మీరు నాకా మొక్క సంపాదించియిస్తే, మీ మేలు మరవను,'' అన్నది. ఆ రోజు నుండీ గ్రామస్థులు ఎరగ్రులాబీ మొక్క కోసం అన్వేషణ ప్రారంభించారు.\n\nగ్రామంలోనేకాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది దొరకలేదు. ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది. ఆయన మంత్రి గంగుభద్రుడితో సంప్రదించి కబురంపగా, ఐలవరం నుంచి కొందరు గ్రామపెద్దలు రాజధానికి వచ్చారు. వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ, రామనాధం కారణంగా, గ్రామం బాగు పడిందని చెప్పారు. గంగుభద్రుడు వారితో, ‘‘ ఇక రామనాధం లేకున్నా మీగ్రామాభివృద్ధికి ఏలోటూరాదు.\n\nమహారాజుగారు ఆయన్ను యోగవరం గ్రామానికి పంపాలనుకుంటున్నారు,'' అన్నాడు. ఇది వింటూనే గ్రామస్థులు తమలో తాము చర్చించుకుని రాజుతో, ‘‘ప్రభూ! రామనాధం గృహిణి మీనాక్ష కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చియిస్తామని చెప్పాము. అది ఇంతవరకూ మాకు లభ్యంకాలేదు. త్వరలోనే సాధించగలమని, మా ఆశ. కొంత గడువు ఇవ్వవలసిందిగా ప్రార్థన,'' అన్నారు. రాజుకు వాళ్ళ కోరిక ఉచితమనిపించింది. అయితే ఆర్నెల్లు గడిచినా ఎరగ్రులాబీ మొక్క దొరికినట్లు లేదు. ఈ విషయమై విచారిస్తూనే వున్న మంత్రి గంగుభద్రుడు రాజుతో, ‘‘ప్రభూ! ఐలవరం గ్రామస్థులకు ఎర్ర గులాబీ మొక్క దొరికినట్టులేదు.మనమే దాని కోసం ప్రయత్నిద్దాం. సమస్య పరిష్కారమౌతుంది,'' అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. భటుల ద్వారా ప్రయత్నించగా, పొరుగు దేశంలోని ఓ కుగ్రామంలో దొరికిందో ఎరగ్రులాబీ మొక్క. ఒక శుభదినాన దేవనందుడు, మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు. అక్కడ విలువైన కానుకలతో రామనాధాన్ని సత్కరించి, ఆ మొక్కను గ్రామస్థుల తరఫున తనే స్వయoగా ఆయన కిచ్చి, ‘‘నీ అర్ధాంగి కోరిక తీరింది.\n\nనీవిక యోగవరం తరలివెళ్ళి, ఆ గ్రామానిక్కూడా మేలు కలిగించాలి,'' అన్నాడు. ఆ మరుక్షణం మీనాక్ష కలుగజేసుకుని, ‘‘ప్రభూ! ఇక్కడ మా ఇంటి తోటలో, ఈ మొక్కను నాటి బ్రతికించి, మొగ్గతొడిగించి, ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగా చూసి వెళ్ళాలని, నా కోరిక,'' అన్నది. ఈ మాటలకు దేవనందుడు ఆశ్చర్యపడి, ‘‘అమ్మా! ఈ గ్రామం విడిచి పెడుతూ దీన్నిక్కడ పాతడమెందుకు? నీతో యోగవరం తీసుకుని వెళ్ళు,'' అన్నాడు.\n\n‘‘ప్రభూ! ఈ మొక్కను నేనడిగింది, ఈ ఇంటి తోట కోసమే. మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే వుండాలి,'' అన్నది మీనాక్షి. అప్రయత్నంగా రాజామెకూ, ఆ వెంటనే రామనాధానికీ చేతులు జోడించి నమస్కరించి, మీనాక్షతో, ‘‘అమ్మా! నాకిప్పుడు మీ కుటుంబం ప్రత్యేకత అర్థమైంది. ఏ ఇంట్లో వుంటే ఆ ఇల్లు తనదనుకుని, ఏమనుషులతో మసిలితే, ఆ మనుషులు తనవాళ్ళనుకుని అంకితభావంతో కృషిచేయడంవల్లనే, మీ ప్రబోధాలు సత్ఫలితాలనిస్తున్నాయి.\n\nగొప్ప తనం ప్రబోధాలలోనే వుంటే శాస్ర్తం చదివిన ప్రతివాడూ మహాత్ముడే అయ్యాoవాడు. ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు. ఇక మీదట మీరు నేను చెప్పానని కాక, మీ వీలును బట్టి సంచరిస్తూ, మనదేశ పౌరులను ప్రభావితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను,'' అన్నాడు. ఆ తర్వాత రామనాధం ప్రబోధాలే కాక, ఆయన కథ కూడా విశాలదేశ పౌరులను ప్రభావితం చేయగా, ఆ దేశం నిత్యకళ్యాణం పచ్చతోరణాలతో కలకాలం వర్థిల్లింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 407,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఎరగ్రులాబి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 157,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రిని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై \"ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? \"అని అడిగాడు. యువక్రీతుడు \"నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి \" అని కోరాడు. ఇంద్రుడు \" ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖత॰ నేర్చుకోవడం ఉత్తమం \" అన్నాడు.అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు.\n\nఇంద్రుడు వెళ్ళి పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చీసి యువక్రీతుడు నవ్వి \" వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది \" అన్నాడు. ఆ వృద్ధుడు \"నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను \" అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి \"యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో \" అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందేనని పట్టు పట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు.\n\nతన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి \" మీరు యువక్రీతుని వధించండి \" అని పంపాడు. ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు.వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరవాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు. తరవాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు.\n\nయజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆస్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావాశూ ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పాడు. పరావసు అర్ధవసుతో \"అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ్ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆ యాగాన్ని పోయి ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి \" అన్నాడు.\n\nఅలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు \" మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు \" అన్నాడు.రాజు అనుచరులు పరావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. అర్ధావసు రాజును చూసి \" రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను పెరాయశ్చిత కర్మలు చేసి వస్తున్నాను. అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను \" అని సత్యం చెప్పాడు.\n\nఅందుకు దేవతలు సంతోషించి \" అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో \" అని అడిగారు. అర్ధవసుడు \"అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నాతమ్ముని దోషం కూడా పరిహరించండి \" అని కోరుకున్నాడు. దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి \" దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? \" అని అడిగాడు. దేవతలు \" యువక్రీతా! గురుముఖత॰ నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు. అని పలికి స్వర్గాలికి వెళ్ళారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 408,
        "IMAGE": "cat_2",
        "NAME": "తపస్సు వలన వచ్చే విద్య వలన జరిగే అనర్ధాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 158,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు:\n\nధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపాలోచించి, ‘‘ఏ నేరంపైన అయినా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివనీ తెలుసు, భూష…య్య మోసగాడనీ తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే, నీవువెయ్యి వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీగురించి హామీ ఇవ్వాలి,'' అన్నాడు.\n\nఅప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతివుంది కాబట్టి అప్పు పుడు తుందనుకున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి, ఎవరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు. ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాధుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే, అదే సమయంలో విశ్వనాధుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్ళి ఖర్చులకు అయిదు వేల వరహాలదాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాధుడు శతవిధాల ప్రయత్నిస్తూంటే భూషయ్య అతణ్ణి కలుసుకుని, ‘‘నీకు నేను సాయపడతాను. బదులుగా నువ్వు నాకు సాయపడాలి,'' అన్నాడు.\n\nవిశ్వనాధుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీవుండడానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయింది.అప్పుడు ధర్మాంగదుడికి, భూషయ్య మీదకంటే విశ్వనాధుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకు డనిపించుకుని ఉరికంకంబ మెక్కాల్సివస్తుంది.\n\nపోనీ, విశ్వనాధుణ్ణి కసితీరాకొడదామన్నా - అప్పుడూ అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు!విశ్వనాధుడి మీద పగతీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు, ఊరిచివర కొండగుహలో వుండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడనీ, ఆయన మహిమలు చేయగలడనీ అంతా చెప్పుకుంటారు. బైరాగి, ధర్మాంగదుడు చెప్పింది విని, ‘‘తన స్వార్థంకొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాధుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాధుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వూ మంచి మిత్రుడివి కావు!'' అన్నాడు.\n\n‘‘స్వామీ, అపకారం చేసింది విశ్వనాధుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను,'' అన్నాడు ధర్మాంగదుడు. ‘‘ఇప్పుడు నీ మనసునిండా పగవుంది. పాముకు విషమెలాంటిదో, మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచి పెట్టిరా. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం,'' అన్నాడు బైరాగి. ‘‘స్వామీ! నామనసులోని పగపోయే మార్గం కూడా, మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టు కోలేకుండావున్నాను,'' అన్నాడు ధర్మాంగదుడు.\n\nబైరాగి కొద్దిసేపు ఆలోచించి, ‘‘అయితే విను. నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి, నీతలలో చేరుతుంది. ఆ విషం బారినుంచి బయట పడగానే, నీకు తిరిగి మనిషిరూపు వస్తుంది. పాము రూపంలో వున్నంత కాలం నీకు పూర్వజ్ఞానం వుంటుంది కానీ, బుద్ధులు మాత్రం పామువే వుంటాయి. ఎటొచ్చీ పాము రూపంలో వుండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆరూపంలోనే మరణిస్తావు!'' అన్నాడు. ధర్మాంగదుడు మారాలోచనలేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతణ్ణి పాముగా మార్చేశాడు.పాముగా మారిన ధర్మాంగదుడు, అక్కణ్ణించి పాకుతూ పొలాలవైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కరన్రు నేలకు తాటిస్తూ వస్తూంటే, దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది.\n\nఅతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి, ధర్మాంగదుడితో, ‘‘నువ్వా మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసుగదా!'' అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషివల్ల అపకారం జరిగినా, ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది, ధర్మాంగదుడికి. కానీ విశ్వనాధుడు తన శత్రువు. అతణ్ణి మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాధుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్షావుండదు!\n\nధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని, ఎవరికంటా పడకుండా విశ్వనాధుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరిగదిలో విశ్వనాధుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో, ‘‘పాము!'' అని గట్టిగా అరిచాడు. ఆ కురవ్రాణ్ణి కాటేసి విశ్వనాధుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ, తనకే అపకారమూ చేయనివాడి జోలికి వెళ్ళడం తప్పని, అతడికి అనిపించింది. అందుకని అక్కణ్ణించి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు.\n\nఇంతలో ఇంటిల్లపాదీ విశ్వనాధుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పిందివిని, అంతా పూజగదిలోకి వెళ్ళారు. చూస్తే, అక్కడ పూజామందిరంలో, పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. ‘‘నాగదేవత! కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు! ఈ రోజుతో మనకూ, మనవాళ్ళకూ వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగి పోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా,'' అన్నది విశ్వనాధుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు.\n\n‘‘ఛీ! నాయీ విషంవల్ల ఏ ప్రయోజనమూ లేదు,'' అనుకుంటూ ధర్మాంగదుడు తనకోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బ…యట పడగానే, అతడి పాము రూపంనశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే వుండడంతో తనూ లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాధుడి తల్లి, మందిరంలో నాగదేవత మాయంకావడం చూసి, మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాముపుట్టలో పాలు పోసివచ్చేది.\n\nఎలాంటి కష్టాలు వచ్చినా, నాగదేవత కరుణవల్ల తొలిగి పోతాయని కొడుకుకు చెపుతూండేది. విశ్వనాధుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి, పక్కనేవున్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలి…యక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, ‘‘మిత్రమా! నీ అవసరం నీచేత చేయించిన పనివల్ల, నాకు పొలం పోయింది. అంత మాత్రాన, అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగాలేను,'' అన్నాడు.\n\nఈ మాటలకు విశ్వనాధుడితో పాటు, అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశానికెత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళోవారందరు కూడా, ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా, ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! విశ్వనాధుడు, ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా వుంటూ, ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ, అతడికి సహాయం నిరాకరించాడు.అటువంటి మిత్రద్రోహి మీద పగసాధించేందుకు ధర్మాంగదుడు, మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడుగదా? కానీ, పూజామందిరంలో అవకాశంవున్నా అతడు, విశ్వనాధుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకూ, పాముగా అతడి ప్రవర్తనకూ పొంతన వున్నట్టు లేదుకదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు.\n\nదానికి విక్రమార్కుడు, ‘‘మనుషులలాగే పశుపక్ష్యాదులక్కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి వుంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో, పాములకు తను సహజంగా వున్నవనుకుంటున్న దుష్టస్వభావం, పగల గురించి ఆలోచించాడు. బైరాగి, అతడికి పాముగా పూర్వజ్ఞానం వుంటుందనీ, బుద్ధిమాత్రం పాములదేననీ చెప్పాడు! ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు, ఆ పాము - పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయనీ, వాటికి పగ అన్నది తెలి…యదనీ చెప్పింది.\n\nఆ సమయాన, బుద్ధి విషయంలో పాముల స్థాయిలో వున్న ధర్మాంగదుడికి, అది ఆచరించదగిందిగా తోచింది. పైగా, విశ్వనాధుడు, ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే, ఆ సమయంలో విశ్వనాధుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండడం వల్ల, స్నేహితుడు కోరిన సాయం చేయలేక పో…యాడు. అయితే, ధర్మాంగదుడు అది గ్రహించలేక, ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాధుడి తల్లి అన్నమాటలతో ధర్మాంగదుడికి తన పొరబాటు తెలియవచ్చింది. అందువల్లనే, అతడు విశ్వనాధుణ్ణి కాటువేయలేదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 409,
        "IMAGE": "cat_2",
        "NAME": "నాగదేవత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 159,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.\n\nఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!\" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. \"ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు,\" అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.\n\nవిక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 410,
        "IMAGE": "cat_2",
        "NAME": "విక్రమసింహుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 160,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.\n\nవిచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.\n\nకొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 411,
        "IMAGE": "cat_2",
        "NAME": "కోడిపుంజును చూసి భయపడిన సింహం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 161,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ \"రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి.\" అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.\n\nఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి \"మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు\" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.\n\nఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 412,
        "IMAGE": "cat_2",
        "NAME": "రాజు తెలివితేటలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 162,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజూ ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్లేటపుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. బాతు పిల్లలు ఆ జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారే ఈదడం మొదలుపెట్టాయి.\n\nఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకి వెళ్లింది. ‘‘ నీరు వేగంగా వెళ్లేచోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు’’ అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి ‘‘నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా! ప్రమాదం ఏమీ ఉండదులే!’’ అనుకుంది ఆ బాతుపిల్ల. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది.\n\nబాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పినమాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధ పడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది.\n\nఅక్కడ చెట్టు మీద ఉన్న ఒక పెద్ద కోతి అంతా గమనించింది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీది నుంచి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను చుట్టి బయటికి లాగేసింది. బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది. బాతుపిల్లలు రెండూ కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 413,
        "IMAGE": "cat_2",
        "NAME": "ప్రమాదంలో పడ్డ బాతు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 163,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో కిట్టూ అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టూ తల మీద జుట్టు ఎక్కువ ఉండేది కాదు. దాంతో ఆ ఊరిలో ఉండే ఆకతాయి పిల్లలు కిట్టూని ‘గుండూ... గుండూ...’ అని ఏడిపించేవారు. అందుకే కిట్టూ ఆడుకోవడానికి బయటికి వెళ్లే వాడు కాదు. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ ఊరి పిల్లలందరూ ఆడుతూ ఉంటే కిట్టూ ఇంటి లోపల నిలబడి చూసేవాడు.\n\nరోజూ సాయంత్రం ఆ వీధిలో నుంచి ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లే వారు. అక్కడ ఆడుకుంటున్న వారిలో ఆకతాయి పిల్లలు ఎంత హేళనగా మాట్లాడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లి పోయేవాడు. దాంతో తాతగారికి చెవులు సరిగా వినిపించవని అనుకున్నారు వాళ్లు. అప్పటినుంచి ఆయన ఆ దారిలో వెళుతున్నపుడల్లా ‘చెవిటి తాతా’ అని అరిచేవారు. ఆయన ఏమీ వినబడనట్టే వెళ్లి పోయేవాడు.\n\nఒక రోజు కిట్టూ గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. రోజూ అక్కడ ఆడుకునే పిల్లలు ఎవరూ ఆ రోజు ఇంకా రాలేదు. రోజూ లాగే తాతగారు ఆ వీధిలో నుంచి వెళ్తున్నారు. రోజూ ఎవరో ఒకరు ఆ తాతని ఏదో ఒక మాట అనడం గుర్తు వచ్చిన కిట్టూ ‘‘చెవిటి తాతా! నీ పేరేంటి?’’అని అరిచాడు. వెంటనే తాత గారు కిట్టూ దగ్గరగా వచ్చి ‘‘నా పేరు రాఘవయ్య’’ అని చెప్పాడు. కిట్టూ ఆశ్చర్యంతో నోరు తె రిచాడు. భయంగా లోపలికి పారిపోబోయాడు. అప్పుడు రాఘవయ్య కిట్టూని చేతిలో పట్టుకొని ఆపాడు.\n\n‘‘చూడు బాబూ! నిన్ను వాళ్లు హేళన చేస్తారనే కదా నువు ఆడుకోవడానికి వెళ్లకుండా ఉంటున్నావు. మరి నువ్వు కూడా వాళ్లలాగే ప్రవర్తిస్తే ఎలా? నాకు చెవుడు లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ అందరూ నాలాగా ఉండరు కదా! నీలాగ బాధ పడే వాళ్లు కూడా ఉంటారు.\n\nకాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు. ఇదంతా మిగిలిన వాళ్లెవరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెపుతున్నానంటే, నువు మంచి పిల్లాడివి. మంచి విషయాలు చెపితే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం’’ అని రాఘవయ్య వెళ్లిపోయాడు. ఆయన చెప్పిన మాటల గురించే కిట్టూ చాలా సేపు ఆలోచించాడు. ఆయన చెప్పినది బాగా నచ్చింది కిట్టూకి. ఆ రోజు తర్వాత కిట్టూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. అంతే కాకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా బయటికి వెళ్లి ఆడుకోవడం మొదలు పెట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 414,
        "IMAGE": "cat_2",
        "NAME": "కిట్టూ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 164,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కర్మపూరు రాజయిన బోపదేవుడికి మగ పిల్లలు లేరు. ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవలపిల్లలు. కాని వారిలో ఒకతె తెల్లనిది. ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది. ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్నా, ఇద్దరూ ఒకే పోలిక. ఇద్దరు పిల్లలూ చాలా గారాబంగా పెరిగి పదేళ్ళ వయసుగల వాళ్లయ్యారు.\n\nఒకనాడు శ్వేతా, కృష్ణా ఉద్యానంలో నడుస్తూండగా, ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి, పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారకులు పరిగెత్తుతూ వచ్చి, పక్షిగూడు చూశారు. అందులో రెండు గుడ్లు ఉన్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదలలో పారేసి, రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు.కాని భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్యభాషలో రాజుతో ఇలా అన్నది:\n\n‘‘రాజా, నేను దేవతా పక్షిని. నేను ఈ తోటలో ఒక చెట్టుమీద గూడుకట్టి, అందులో రెండు గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి, నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కాని, మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు.'' ‘‘నేను ఇప్పుడే ఆ గుడ్లను వెదికి తెప్పిస్తాను,'' అన్నాడు రాజు. ‘‘అది ఇప్పుడు సాధ్యం కాదు. అవి చిట్లటమూ; వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరి పోవటమూ జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండశిఖరం మీద ఉంనువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి, వాటిని తీసుకువచ్చి, వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తిపడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి. అయిదేళ్ళ అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండశిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది,'' అన్నది పక్షి.\n\n‘‘ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరూ, ఎన్నడూ ఎక్కి ఉండలేదు,'' అన్నాడు రాజు. ‘‘నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు. కాని నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబి రంగులో ఉంటుంది.\n\nశ్వేత, గులాబి రంగుగల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ, తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే,'' అని చెప్పి పక్షి మాయమయింది. బోపదేవుడు వెంటనే నిద్రలేచి, రాణికి తన కల గురించి చెప్పాడు. మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి. వారితో తన కల గురించి చర్చించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేక పోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు.\n\nఅకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలికి వచ్చి, గోడ మీదికి పాకి, మళ్ళీ గోడ దిగి, రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, ‘‘మహారాజా, దేవుడు తమపట్ల అనుగ్రహించి, తమకు సహాయంగా ఉడుమును పంపాడు,'' అన్నాడు. ‘‘ఇది నాకు ఎలా సహాయపడుతుంది, శాస్ర్తిగారూ?'' అన్నాడు రాజు. ‘‘అదే చూపింది గద! కోటగోడలలాటివి ఎక్కటంలో ఉడుములాటిది మరొకటి లేదు. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండశిఖరం మీదికి పంపితే, ఆ తాడు పట్టుకుని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు,'' అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో.\n\nఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు, రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా, ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒక రోజు ఉదయం రాజు తన ఖడ్గమూ, ఆహారమూ, నీరూ తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగానూ, దృఢంగానూ ఉండే తాడు కట్టి, శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది. ఇద్దరూ పట్టి లాగినా ఉడుము తన పట్టు వదలలేదు. తరవాత రాజు దైవధ్యానం చేసుకుని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులూ, రాణీ భయపడుతూ నిలబడి ఉన్నారు.\n\nరాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి, పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి, దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక రెండు తలల పాము చుట్టుకుని ఉండి, ఆయనను చూసి తన రెండు పడగలూ విప్పి, నోళ్ళు తెరిచి, కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి, పాముతలలు నరికేశాడు.\n\nబోపదేవుడు చెట్టు మీది పక్షులనూ, ఉడుమునూ తీసుకుని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవారవస్తున్నది. కింద ఉంచగానే, ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకుని, ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునే సరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి, మాయమైపోయాయి. రాజు ఆ గుడ్లను ఒక వెండిబుట్టలో ఉంచి, దాన్ని ఇనపపెట్టెలో భద్రం చేయించాడు. అయిదేళ్ళు గడిచాయి. శ్వేతా, కృష్ణా పెరిగి, పదిహేనేళ్ళవాళ్ళు అయ్యారు. రాజు ఇనపపెట్టె తెరవగానే దానినుంచి కాంతికిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు ధగధగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉన్నది. రెండోది గులాబి రంగుగా ఉన్నది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు.\n\nరాజు వారితో, ‘‘అమ్మళ్ళూ, ఈ వజ్రాలు మీకే! ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంకాలం మీ కిద్దరికీ తెల్ల సంపంగిపూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజూ ఆ పూలను గమనిస్తున్నట్టయితే, ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది,'' అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, ‘‘వజ్రాలు వచ్చాయి. ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది,'' అన్నాడు. ‘‘అదంతా మీరే సులభంగా చెయ్యవచ్చు గదా, మహారాజా! శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగిపూల పాత్రలో కొంచెం ఎరస్రిరా కలిపి, పూలకాడలు అందులో ముణిగేటట్టు అమర్చటమే గదా! క్రమంగా పూల రెక్కలు వాటంతట అవే గులాబిరంగుకు మారతాయి. ఇదంతా రెండు రోజులకు ముందే మీకు వివరంగా చెప్పేశానుగా?'' అన్నాడు మాయాపాలుడు.\n\n‘‘చెప్పావనుకో, అయినా అది నీ చేతి మీదుగా జరిగితేనే బాగుంటుంది గదా!'' అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకూ, కృష్ణకూ రెండు గుత్తుల తెల్ల సంపంగిపూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లూ స్పష్టంగా రాసి ఉన్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమతమ గదులలో ఉంచుకుని, పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండి పోయాయిగాని, శ్వేత కిచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి.\n\nఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, ‘‘అమ్మాయిలూ, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది గద?'' అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలు చూపాడు. శ్వేత, గులాబీ వజ్రాన్ని తీసుకున్నది. కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది. మాయాపాలుడి మాటా? ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 415,
        "IMAGE": "cat_2",
        "NAME": "రాజకుమార్తెలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 165,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, \"రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక వత్తిళ్ళుకు గురై విసిగి వేశారి, చివరకు తాముసాధించదలచినదేమిటో కూడా మరిచిపోతూండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి, ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక, ఇతరుల మేలుకోసం కోరింది. నువ్వు అలాంటి పొరబాటు చేయకుండా వుండేందుకు ఆమెకధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,\" అంటూ ఇలా చెప్ప సాగాడు.\n\nవీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల్లికి మాత్రం భయపడేవాడు.\n\nఒకసారి భీముడు తల్లికోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టు చీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కురంగులు, చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా, తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీరకనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని, భీముడికి తెలుసు. అందుకని, ఏం చేయాలో తోచక, ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టుకింద దిగులుగా కూర్చున్నాడు.\n\nఆ సమయంలో కొందరాడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలుచేసి, బిందెలతో నీళ్ళు తీసుకుని వెళతారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి, చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, \"ఎవరయ్యా, సిగ్గులేదూ, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు!\" అని చీవాట్లు పెట్టింది. భీముడు దీనంగా ముఖంపెట్టి, తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పికున్నాడు. అది వన్న అరుణ హేళనగా నవ్వి, \"హా, గొప్ప తెలివైనదే, మీ అమ్మ! చీరల ఎంపికకు తను రావాలి; ఎవరైన ఆడవాళ్ళను పంపాలి. మగవాణ్ణి - అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా! సరేలే, నీకు నేను సాయపడతానుకానీ, నువ్వు ఇక్కణ్ణుంచి లేచి, ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్యగారిల్లెక్కడా అని అడిగి తెలుసుకుని, ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక, మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర, నీ చేత కొనిపిస్తాను,\" అన్నది.\n\nభీముడు అక్కడినుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి, సాంబయ్య ఇల్లు తెలుసుకుని, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి, వాణ్ణి పలకరించి, వీరమ్మ చూపులకెలా వుంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని, ఒక నేతగాడి ఇంటికివెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది\n\nఇలా పని ముగిశాక అరుణ, భీముడితో, \"ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత, ఆమెతో - నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్ని విని, అచ్చం అలాంటి చీరే ఆరేళ్ళక్రితం ఈదేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులుగల మరొక స్త్రీ ఉన్నందుకు, అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా, అమ్మకు తృప్తి కలక్కపోతే - మహారాణి జాతకురాలికి, ఈ చీర నచ్చి తీరుతుందనీ, ఒక వేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయుండదనీ అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బందీవుండదు,\" అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.\n\nభీముడు తిరిగి తన ఊరు వెళ్ళి, అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి, భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. \"వాడు, తండ్రితో జరిగిందంతా చెప్పి, \"అరుణ ఈ ఇంటికోడలైతే, అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా వుంది,\" అన్నాడు. మర్నాడు వాడు పనిమీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి, గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ, గబగబా వాడి దగ్గరకు వచ్చి, \"మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా?\" అంది, భీముడి మీద జాలిపడుతూ.\n\n\" లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను,\" అన్నాడు భీముడు.దానికి అరుణ ఆశ్చర్యపోయి, \" ఏమిటా ముఖ్య విషయం?\" అని అడిగింది. భీముడు కాస్త బెరుకు బెరుకుగా, \"నిన్ను పెళ్ళాడాలని వుంది,\" అన్నాడు. \"నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో, మా పెద్దలను అడగమని చెప్పు,\" అన్నది చిరాగ్గా అరుణ.\n\n\"పెద్దల సంగతి తర్వాత. నాకు నువ్వు నచ్చావు. నేను నీకు నచ్చానో లేదో తెలుసు కుందామనే, ఇప్పుడిలా వచ్చాను,\" అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖంకేసి చూసి, \"నువ్వు అందంగా వున్నావు. మంచి వాడివి. నచ్చావుకాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను,\" అంటూ సిగ్గుపడింది.అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, \"నీ తెలివి తేటలతో, మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో!\" అన్నాడు.ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వమహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశసంచారం చేస్తూ, గంగవరం వచ్చి, కాలువ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూంటే, స్నానానికి వచ్చిన ఆడపిల్లలు, ఆయన్ను అపహాస్యం చేయడమే కాక, తొందరగా అక్కణ్ణించి వెల్ళిపొమ్మని కేకలు వేశారు.\n\nఅరుణ వాళ్ళను మందలించి, బిల్వమహర్షికి తగిన శుశ్రూషచేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడాయన అరుణతో, \"అమ్మాయీ, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను!\" అన్నాడు. అయితే, ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వమహర్షి సరేనని, \"కళ్ళు మూసుకుని మూడుమార్లు నాపేరు తలచు కుంటే ప్రత్యక్షమై, నీకోరిక తీరుస్తాను,\" అని వెల్ళిపోయాడు.\n\nఅరుణ ఇప్పుడు భీముడికి, బిల్వమహర్షి కధ చెప్పి, \"మీ అమ్మను మార్చడం మామూలు మనుషులవల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వమహర్షి సాయం అర్ధిద్దాం!\" అంటూ, ముమ్మూరు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వమహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని, భీముడితో, \"పద నాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం,\" అన్నాడు.\n\nమహర్షి భీముడితో వాళ్ళ ఊరుచేరి, భీముడి ఇంట్లో ప్రవేశించి, మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, \"అమ్మా, నాకు భిక్ష కావాలి!\" అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని, \"బిచ్చం కోసం వచ్చావు. మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా?\" అంటూ మహర్షిని తిట్టడం మొదలు పెట్టింది.\n\n\"అమ్మా! ఇష్టముంటే బిచ్చం వెయ్యి; లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బధిస్తాయి, \"అన్నాడు బిల్వ మహర్షి. \"తిట్టడం నాకు అలవాటు. అమ్మనాన్నలను తిట్టాను. నాకేమి కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్ళే పోయారు. మొగుణ్ణీ, కొడుకునూ తిడుతున్నాను. చచ్చినట్టు పడుతున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు!\" అన్నది వీరమ్మ నిరసనగా.\n\n\"నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడా తిట్టు నీ దగ్గరే వుండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్ధంకావడం కోసం, ఈ క్షణంలోనే -- అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్టున్నాను,\" అన్నాడు బిల్వమహర్షి.\n\nఅంతే! ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి, \" అహొ, వీరమ్మా! నేను నీ తిట్లభూతాన్ని! ఇంకొక నాలుగేళ్ళ తర్వాత, నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే, భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు. లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను,\" అన్నది.\n\nవీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక, మహర్షి కాళ్ళమీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, \"భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటుమామిడి చెట్టుంది కదా! దాన్ని నాశనం చెయ్యమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది,\" అన్నాడు. వీరమ్మ సరేననగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ మామిడి చెట్టు లేదు.\n\nఅప్పుడు బిల్వమహర్షి ఎంతో శాంతంగా, \"వీరమ్మా! నువ్వికనుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా వుంటే, నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి! నీ కొడుక్కు, గంగవరంలో వుండే అరుణ అనే అమ్మయితో పెళ్ళి చేయి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే, క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో. నీ కష్టసుఖాలిక నీలోనే వున్నాయి,\" అని చెప్పి, బిల్వ మహర్షి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.\n\nతర్వాత కొద్దిరోజుల్లోనే భీముడికీ, అరుణకూ పెళ్ళయింది. భేతాళుడు ఈ కధ చెప్పి, \"రాజా, బిల్వమహర్షి ఇచ్చిన వరాన్ని, అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు. ఆ వర ప్రభావంతో ఆమె, ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలూ అనుభవించవచ్చు. ఆమె వరాన్ని, తనకోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలుకోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పాక పోయావో, నీ తల పగిలిపోతుంది,\" అన్నాడు.\n\nదానికి విక్రమార్కుడు, \"ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెల్ళి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనేగదా కోరుకునేది! ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే - సాధారణంగా మగవాళ్ళకు చిరాకెక్కువ. అలాంటప్పుడు, ఎన్నిమాటలన్నా నోరెత్తకుండా వుండే భీముడులాంటివాణ్ణి ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది. అట్లని, తిట్లభూతం శక్తి చూసిన అరుణ, భీముడిపట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ కారణాలవల్ల అరుణ, మహర్షి ఇచ్చిన వరాన్ని తనకూ, తన వాళ్ళకూ శుభంకలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల, అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు,\" అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 416,
        "IMAGE": "cat_2",
        "NAME": "తిట్ల భూతం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 166,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో, భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరిజనం అందరూ వారం రోజులుగా శాస్ర్తిగారి గీతోపన్యాసాలు విని పరవశించి పోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్ర్తిగారు ఇలా చెప్పారు: ‘‘మహాజనులారా! ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమంవుంది. మోక్షసాధనకై నిరంతరం ప్రయత్నిస్తూవున్నప్పుడే, మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.''\n\nఊరిజనం బరువెక్కిన హృదయాలతో, శాస్ర్తిగారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు. భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగిరాగానే, వీర్రాజు పరవశంతో, ‘‘అమ్మమ్మా! ఆ శాస్ర్తిగారు ఎంతటి మహాపండితులో గదా! జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా!'' అన్నాడు పేర్రాజుతో. ‘‘అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు!'' అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక క్షణం ఆగి, ‘‘శాస్ర్తిగారి మాటలు విన్నప్పటి నుంచీ, నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా, పేర్రాజూ. సద్గురువును వెతికి పట్టుకుని, ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకుని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ళపాటు నా వ్యవసాయాన్నీ, ఇంటి పనులనూ చూసి పెడతానంటే, నేను ఆ పనిమీద వెళతాను, ఏమంటావ్‌?'' అని అడిగాడు.\n\n‘‘నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ, ఒక్క మాటగురువును వెతికి పట్టుకుని పరీక్షించి, మనకు తగినవాడో కాడో నిర్ణయించుకునే స్థితిలోనే కనుకమనంవుంటే, మనకు అసలు గురువుతో పనేముంటుంది? ఆలోచించుకో,'' అన్నాడు పేర్రాజు.\n\n‘‘నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయూనికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడనీ, నీళ్ళపై నడుస్తాడనీ, నిప్పుల్లో నర్తిస్తున్నాడనీ చెప్పుకుంటున్నారు. పగలు పరమకరుణతో భక్తులను అనుగ్రహిస్తూ, రాత్రి సమయాల్లో మాయమై, హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతేమిటో తెలుసుకుని వస్తాను,'' అన్నాడు.\n\nవీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, ‘‘నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మ తృప్తితో తిరిగిరావాలని దైవాన్ని ప్రార్థిస్తూవుంటాను,'' అన్నాడు. వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళే సరికి, నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలావుంది. ఆ జనసందోహాన్ని చూసే సరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకుని, స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు, స్వామీజీ వుండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూవే వీర్రాజు, ‘‘ఆహా, ఏమి తేజస్సు! ఏమి వర్చస్సు!'' అనుకుంటూ, అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయూడు. ‘‘లే, వీర్రాజూ! నీకు కొన్ని భవబంధాలు వున్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంత కాలం సాధన చెయ్యక తప్పదు.\n\nఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరిః ఓం తత్సత్‌!'' అని ఆశీర్వదించారు గురువుగారు. ‘‘ఆహా! నా గురించి సర్వజ్ఞులైన మీకు అంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి,'' అంటూ వేడుకున్నాడు వీర్రాజు. గురువు మందహాసం చేసి, ‘‘అంతా నీ చేతుల్లోనే వుంది, వీర్రాజూ. నీలో వైరాగ్యం పెరగాలి. ఇదుగో, ఈ ప్రసాదం భక్తితో కళ్ళకద్దుకుని ఆరగించు,'' అంటూ స్వామీజీ గాలిలోకి చేయిచాపి, ఒక సీతాఫలం అందుకుని, వీర్రాజు చేతుల్లో ఉంచాడు.వీర్రాజు ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. అనుగ్రహ ఫలం ఆరగిస్తుంటే అతడిలో ఎన్నెన్నో సంకల్పాలు.\n\nఈ విధంగా-వీర్రాజు ఇల్లొదిలి, నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి ఆరు నెలలు దాటింది. ఏవిధమైన సమాచారం తెలియక ఊరిజనం, అతణ్ణి గురించి తలా ఒకరకంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని కొందరూ, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరూ చెప్పుకోసాగారు. వీర్రాజు భార్యా, కొడుకూ, కూతురూ, ఆ గాలికబుర్లు వింటూ, లబోదిబోమని గోలపెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి, వాళ్ళకు ధైర్యం చెబుతూ, ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.\n\nపులిమీద పుట్రలా ఒకరోజున వీర్రాజు నుండి రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతడి భార్యకు, మరొకటి పేర్రాజుకు: ‘నేను శ్రీ శ్రీ శ్రీ నిత్యానంద స్వామివారి ఆశ్రమంలో వుంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలను తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నా భార్యా పిల్లలకు భుక్తికిలోటు లేకుండా ముగ్గురికీ మూడెకరాలూ, ఇల్లూ వుంచి తక్కిన భూమి, తోట అమ్మేసి, ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తిసాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే, నేను వచ్చి, భూమిని స్వాధీనం చేసి, తక్కిన వ్యవహారాలన్నీ చక్కబరిచి, తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు, నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం వుండదని గ్రహించగలరు!' అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు.\n\nఉత్తరం చూసిన వీర్రాజు భార్యాపిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్ళను ఓదార్చి; నేను చెప్పినట్టుగా చెయ్యండి. మీ సమస్య పరిష్కారమవుతుందని నచ్చ చెప్పాడు. తర్వాత పేర్రాజు రెండు ఉత్తరాలూ తీసుకుని, గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే, వీర్రాజు విషయమంతా చెప్పివుంచాడు. ఇప్పుడు ఈ రెండు ఉత్తరాలూ చూసి గ్రామాధికారి, పేర్రాజుతో కాస్సేపు చర్చించాడు.\n\nనెల తిరక్కుండా వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి, ‘‘అయ్యా! ఇంతటి అన్యాయం, మిత్రద్రోహం లోకంలో ఎక్కడా వుండదు. నమ్మి నా ఆస్తిపాస్తులను, భార్యాబిడ్డలను తనకు అప్పగించి వెళితే, ఈ మిత్రద్రోహి పేర్రాజు ఇంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని, నా భార్యాపిల్లల్ని దిక్కులేని వారిని చేసి, ఇంట్లోంచి గెంటేసి వీధిపాలు చేస్తాడా? వెంటనే వాడిని పిలిచి విచారణ చెయ్యండి. తగిన విధంగా వాణ్ణి శిక్షించి, నాకు న్యాయం జరిపించండి,'' అంటూ గొడవ చేశాడు.\n\nగ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ‘‘ఇంతకూ నీకు జరిగిన అన్యాయమేమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి?'' అని అడిగాడు. ‘‘ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించడానికి బయలుదేరుతూ, నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంత కాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడా ద్రోహి నా ఆస్తిపాస్తులన్నిటినీ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇది అన్యాయం కాదా?'' అన్నాడు వీర్రాజు ఆవేశంగా.\n\n‘‘అది సరే. ఇంతకూ మీ గురువుగారు, నీకు చేసిన ఉపదేశమేమిటి?'' అని అడిగాడు గ్రామాధికారి. ‘‘భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకువస్తే, తిరుగు లేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు,'' అని చెప్పాడు వీర్రాజు. ‘‘అయితే, నీకున్న అసలు భవబంధాలేమిటి?'' అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా. ‘‘భవబంధాలంటే-భార్యాపిల్లలూ, బంధుమిత్రులూ. ఆస్తులూ అప్పులూ, ఇలాంటివన్నీ,'' అన్నాడు నసుగుతూ వీర్రాజు.\n\n‘‘నీలో వైరాగ్యం బలపడిందనీ, భవబంధాలను వదిలించుకుంటున్నాననీ, నీ ఉత్తరాల్లో రాశావుకదటయ్యా. ఇక నీకు, ‘నాది, నాకు' అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరకు తిరిగిపోయి, ఆయన చెప్పినట్లుగా భాగవతసేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా!''\n\nఅన్నాడు గ్రామాధికారి. ‘‘పని పూర్తికాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీమరీ చెప్పారు.నా ఆస్తి నాకు దక్కకుండా, ఇక్కడ నుంచి కదలను,'' మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకు గ్రామాధికారి పెద్దగా నవ్వి, ‘‘నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి. అతడికి ఇప్పుడే కబురు పెడతాను, సరా!'' అన్నాడు. ‘‘ఆ పత్రాలన్నీ అతడు సృష్టించివుంటాడు,'' అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. ‘‘నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు. నీకెందుకీ గొడవలన్నీ?''\n\nఅన్నాడు గ్రామాధికారి గంభీరంగా. ‘‘వద్దను కోవటమేమిటి? కావాలనే కదా వచ్చాను,'' అన్నాడు వీర్రాజు. ‘‘ఏం కావాలని వచ్చావయ్యా, వీర్రాజూ? ఆస్తిపాస్తులూ, భార్యాబిడ్డలా? లేక నీ గురువూ, ఆయన చెప్పిన భాగవతసేవా? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించడంలేదు,'' అన్నాడు గ్రామాధికారి కాస్తకటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగినదాంట్లో తిరకాసు అతడికి అర్థమైంది. ‘‘మహాప్రభూ! నేను చేసిన పొరబాటు, నాకిప్పుడు అర్థమయింది. నన్ను మన్నించండి. నాకళ్ళు తెరుచుకున్నాయి!'' అంటూ గ్రామాధికారి కాళ్ళమీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, ‘‘సంతోషం, వీర్రాజూ!\n\nనీలో ఇలాంటి మార్పురావడం కోసమే నేనూ, పేర్రాజూ ఈ నాటకమాడాం. నీ ఆస్తికీ, నీ కుటుంబానికీ చిన్నమెత్తు నష్టం కూడా లేదు, చూడు!'' అంటూ అతణ్ణి లోపలి గదిలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ పేర్రాజూ, వీర్రాజు భార్యాపిల్లలూ ఆతృతగా అతడికోసం ఎదురు చూస్తూ నిలబడివున్నారు.\n\nపేర్రాజు, వీర్రాజును కౌగలించుకుని, ‘‘నీకు అప్పుడే చెప్పబోయాను; కానీ వినేస్థితిలో లేవని వూరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు, నీకు గురువు అవుతాడుగానీ, నీ నుంచి ఆశించేవాడు బరువు అవుతాడు తప్ప, గురువు ఎలా అవుతాడు?'' అన్నాడు చిన్నగా నవ్వుతూ. వీర్రాజు సిగ్గుతో తలదించుకుని చేతులు జోడించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 417,
        "IMAGE": "cat_2",
        "NAME": "గురువుగారు చేసిన ఉపదేశమేమిటి?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 167,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చీమలు దూరని చిట్టడవి లో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి. వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.\n\nసింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద – మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి. సింహం ఎద్దు వేపు చూసి ‘ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ’ అని అంది. ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.\n\nసింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది. నక్క తెలివిగలది. చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. ‘సరే! నేనే పంచుతాను’ అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :\n\n‘నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!’ అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి, ‘దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!’ అని అంది. కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి. ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.\n\nసింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది. కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు. ‘బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా’ ననేది. గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.\n\nఓ రోజున గాడిద వచ్చింది. ‘నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?’ అని గ్రుడ్లురిమి చూసింది సింహం. ‘ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా! చింత చచ్చినా పులుపు చావలేదే!’ అంది గాడిద. సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది. సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది. దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.\n\n‘ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది. అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?’ అని ఏడ్చింది సింహం. కాని ఎవరికి జాలి? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 418,
        "IMAGE": "cat_2",
        "NAME": "చీమలు దూరని చిట్టడవి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 168,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే.\n\nకానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి.\n\nకూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు! ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యే సరికి, వారికి తాతలనాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు. నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నదీ గుణదీపుడికి తెలియదు. వాడు అదే ఊళ్ళోని జడనాధుడనేవాడితో కలిసి దూరప్రాంతాలకు వెళ్ళి, వైద్యవిద్యనభ్యసించాడు. కొడుకు గుణదీపుడికేకాక జడనాధుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూండేవాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భద్రపురం వచ్చేసరికి, గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసివచ్చాయి.\n\n‘‘పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేసి, నాచేతికి చిప్పనిచ్చావు. ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవడం లేదు,’’ అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో. ‘‘నాయనా! సంపదలు మనవెంట రావు. మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది. నీ తండ్రి చేసిన పనులన్నింటి వెనకా, నా ప్రోత్సాహం కూడా వుంది. అది తప్పని నీవనుకుంటే, ఆ తప్పు మా ఇద్దరిదీ. ఇప్పటికీ మనకు వచ్చిన లోటులేదు. నిలువ నీడ వుంది. నువ్వు వైద్యవృత్తి ప్రారంభించావంటే, నీకు బోలెడు ఆదాయం వస్తుంది,’’ అంటూ కొడుకును సముదాయించింది వేదవతి.\n\nగుణదీపుడు వైద్యవృత్తిని స్వీకరించాడు. అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా, అతడికి తృప్తిగా వుండేది కాదు. అందుకు కారణం జడనాధుడు. సంవత్సరం తిరక్కుండానే జడనాధుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది. వైద్యం కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే రోగులతో, అతడి ఇల్లు కిటకిటలాడిపోతూండేది. క్రమంగా అతడివద్ద సంపద పెరగసాగింది. ‘‘నీ డబ్బుతోనే వైద్యవిద్య నేర్చుకుని, నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడీ జడనాధుడు! నీ మూలంగా నా ఆస్తీ పోయింది. నేర్చిన వైద్యవిద్యా అక్కరకు రావడం లేదు,’’ అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు.\n\n‘‘నాయనా! ఇప్పుడు నీ ఆదాయం తక్కువేంకాదు. వైద్యవృత్తిలో సేవాధర్మమే ప్రధానం. నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు. నీకు జీవితంలో ఏ లోటూ వుండదు,’’అని మణిదీపుడు, కొడుక్కు హితవు చెప్పాడు కానీ, గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే వుండేది. అదేమో పెరక్కుండా వుంది! ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది. ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు. తనకు మగబిడ్డలు లేనందున, ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకుని, ‘‘బాబూ!\n\nనీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నీ పూర్వీకులు ఎన్ని దానధర్మాలు చేసినా, మీ కుటుంబం సిరిసంపదలతో వర్థిల్లుతూండేది, అది వారి జాతకబలం. నీ తల్లిదండ్రులు నష్టజాతకులు! వారితో కలిసివుంటే నీకు ఏమీ అచ్చిరాదు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. నా ఇంటికి ఇల్లరికం వచ్చేయి. నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు,’’అంటూ తనకు అనుకూలంగానూ, అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు. ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి. అటుపైన రత్నమాల అందం కూడా అతణ్ణి ఆకర్షించింది. తానామెను పెళ్ళాడాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు వాళ్ళు, ‘‘నాయనా! నీవు పెద్దవాడివయ్యావు. నీ మంచిచెడ్డలు నీకే బాగా తెలుసు. మేము నిన్ను దీవిస్తున్నాం!’’ అన్నారు.\n\nదీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి, ‘‘మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు. కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద వుంది. నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే, లోకులు నన్ను దుమ్మెత్తిపొయ్యరా?’’అని అడిగాడు. మణిదీపుడు నవ్వి, ‘‘లోకాపవాదుకు భయపడి, నీవు మమ్మల్ని చేరదీయవద్దు. మా గురించి నీకు ఏ బెంగా వద్దు. నారు పోసినవాడే నీరూ పోస్తాడు,’’ అన్నాడు గుణదీపుడు, రత్నమాలను పెళ్ళిచేసుకుని, అత్తవారింటికి వెళ్ళిపోయాడు. ఈ లోగా జడనాధుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది. అతడు వారిని చూడబోతే వాళ్ళు, ‘‘మేము సుఖంగా వున్నాం. మా అబ్బాయి ఎంత బ్రతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు. మా కట్టెలు, ఈ ఇంటనే వెళ్ళిపోవాలని మా కోరిక!’’ అంటూ, పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు.\n\nజడనాధుడు కొద్దిక్షణాలు మౌనంగా వూరుకుని, ‘‘నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను. మీ పెరట్లో ఒక చెట్టు వుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అయితే, ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని, నాకు తెలిసింది. అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే వుంటుంది గదా. ఒక్కోకాయ పది బంగారు కాసుల విలువచేస్తుంది. ఐతే, అంత ధర నేనివ్వలేను. మీరు రోజూ నాకు ఒక కాయ ఇస్తే, నేను మీకు ఒక్క బంగారు కాసు ఇవ్వగలను. మీరు జీవించి ఉన్నంతకాలం, ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమనీ, ప్రతిరోజూ నాకొకకాయ తప్పక అమ్మగలమనీ పత్రం రాసి ఇస్తే, నాకెంతో మేలుచేసినవారౌతారు,’’ అని చెప్పాడు.\n\nమణిదీపుడు ఆలోచనలో పడి, ‘‘నీవు చెప్పేవరకూ నాకు మా చెట్టుకాయల విలువ తెలియదు. వాటిని నీవడిగిన ధరకు తప్పక ఇవ్వగలను. కానీ నేను నీకు పత్రమెందుకు రాయాలో తెలియడంలేదు,’’ అన్నాడు. ‘‘అయ్యా! ఈ కాయల విలువ బయటి వాళ్ళకు తెలిస్తే ప్రమాదం. వాటిని అమ్మమని చాలామంది అడుగుతారు. ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది; మరొకరకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు. ఇవి నావంటివాడి చేతిలో వుంటేనే దురుపయోగం కాకుండా వుంటాయి. మీరు పత్రం రాయడం వల్ల, మీపై వేరెవరూ ఒత్తిడిచేసే అవకాశం లేదు,’’ అని జడనాధుడు వివరించి చెప్పాడు. మణిదీపుడు, జడనాధుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచీ మణిదీపుడి దశ తిరిగింది. ఆయన తను సుఖంగా తింటూ, అవసరంలో వున్నవారిని ఆదుకుంటూ, ఎప్పటిలా పరోపకారం కొనసాగిస్తున్నాడు.\n\nతండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్టు గ్రహించిన గుణదీపుడు, కారణం అర్థంకాక సతమతమయ్యాడు. అతడి భార్య రత్నమాల, అతడితో, ‘‘నీ తండ్రి నిన్ను మోసం చేశాడు. ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా వుండి వుంటుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు,’’ అంటూ రెచ్చగొట్టింది\n\nగుణదీపుడు, తండ్రిని కలుసుకుని, ఆస్తివిషయమై నిలదీశాడు. మణిదీపుడికి పెరటిచెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు. ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి, అవి వేల సంఖ్యలో వుండడంతో గుండెలు బాదుకుని, ‘‘ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమేకాక, నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు. ఇది చాలా అన్యాయం. నా వాటాకోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను,’’ అంటూ గొడవ చేశాడు. ఈ సంగతి గ్రామాధికారిదాకా వెళ్ళడం ఇష్టంలేక, మణిదీపుడు, జడనాధుడికి కబురుపెట్టాడు. అతడు వచ్చి సంగతి తెలు సుకుని, ‘‘గుణదీపుడి మాటల్లో న్యాయముంది. నేనొక ఉపాయం చెబుతాను. ఈ చెట్టు కాయల్లో నాలుగువేల కాయలను తీసుకుని వెళతాను.\n\nఅందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున, పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి, మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది. అందువల్ల నేను, మీరు జీవించి వున్నంతకాలం రోజుకొక్క బంగారు కాసు ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచీ, ఈ చెట్టుపైనా, దాని కాయలపైనా సర్వాధికారాలు గుణధీపుడికే విడిచిపెడదాం,’’ అన్నాడు మణిదీపుడితో. ఇది గుణదీపుడికీ నచ్చింది. ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే, ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు. చివరకు గుణదీపుడు, జడనాధుడి వద్దకే వెళ్ళి, ‘‘నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో,’’ అన్నాడు. జడనాధుడు నవ్వి, ‘‘ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను?’’ అన్నాడు.\n\n‘‘అవి పిచ్చికాయలా? వాటికేగా నువ్వు కాయకు బంగారుకాసు చొప్పున వెల గట్టావు!’’ అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా. ‘‘నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే, ఆ కాయలు నాకు విలువైనవి. మీ పెరటిచెట్టు వడ్డికాసుల చెట్టు! నీతండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలనది కాస్తుంది!’’ అన్నాడు జడనాధుడు. ఆ జవాబుకు గుణదీపుడి ముఖం వెల వెలపోయింది. అతడు తలవంచుకుని కొంతసేపు మౌనంగా వూరుకుని, ‘‘జడనాధా! నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు. ఏమైనా నాకళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు!’’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.\n\nబేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! వైద్య విద్య పూర్తిచేసి తిరిగివచ్చినప్పటి నుంచీ, మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాధుడి ప్రవర్తన విచిత్రంగానూ, నిగూఢంగానూ వున్నట్టు తెలుస్తూనే వున్నది కదా? తన సహాధ్యాయి అయిన గుణదీపుడు, తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ, జడనాధుడికి తెలియంది కాదు. ఐనా, అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు. వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన వున్నది గనక, మణిదీపుడి పెరటిచెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది. అది తను వైద్యవిద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాదా, కృతఘ్నతా అనిపించుకుంటుంది గదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,’’ అన్నాడు.\n\nదానికి విక్రమార్కుడు, ‘‘జడనాధుడి ప్రవర్తనలో విచిత్రం, నిగూఢత కాక; ఆర్థికంగా, మానసికంగా స్థాయీభేదాల్లో వుండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులు కోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది. ఎంత నిరాదరణకు గురైనా నిర్మల మనస్కు లైన తల్లిదండ్రులు, తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. ఆ కారణం వల్లనే మణిదీపుడు, జడనాధుడితో - మా అబ్బాయి ఎంత బతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు, అన్నాడు.\n\nఅలాంటి పరిస్థితుల్లో చేసేది లేక, తనకు మేలు చేసినవారి పట్ల కృతజ్ఞత కనబరచడానికి, జడనాధుడు పెరటిచెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి, మణిదీపుడికి సాయపడ్డాడు. ఆ తర్వాత, గుణదీపుడు చెట్టుకాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాధుడు - నీతండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు. ఆ జవాబుతో, జరిగిన వాస్తవం, తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ, ఏమిటో గ్రహించిన గుణదీపుడు, నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళి పోయాడు,’’ అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 419,
        "IMAGE": "cat_2",
        "NAME": "వడ్డికాసుల చెట్టు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 169,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రైతు దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. ఊళ్ళో అందరికీ సహాయంచేస్తూ మంచిపేరు పొందారు.\n\nఓరోజు వాళ్ళు భోజనం చేసే సమయంలో ఇంటిముందు ఎడ్లబండి ఒకటి వచ్చింది. ఆ బండి యజమాని బండిని ఆపి ఎడ్లను వారింటి రేగుచెట్టుకి కట్టివేసి మేతవేసి, బావి వద్దకు వెళ్ళి అక్కడే ఉన్న బాల్చీతో నీటిని తెచ్చి ఎడకు పెట్టాడు. కాళ్ళూ చేతులు శుభ్రపరచుకొని సరాసరి ఇంట్లోకివచ్చి అక్కడేఉన్న తువ్వాలుతో తుడుచుని వెళ్ళి అరుగుపై కూర్చున్నాడు.\n\nరైతుకి అతడెవరైంది తెలియలేదు అతని చొరవచూసి చాలా దగ్గరి బందువులాగే ఉన్నాడు అనుకున్నాడు. అడగటం మర్యాదకాదని మౌనంగా ఉండిపోయాడు.\n\nరైతు భార్య ఆ వచ్చినాయన భర్త తరుపు చుట్టమని అనుకుంది, కుశలం అడుగుదామనుకుంది గానీ వచ్చినాయన ఎవరో ఇప్పటిదాకా తను చూడలేదు, మీరెవరూ అని అడగటం మర్యాదకాదు అనుకుంది తరువాత భర్త చెపుతాడులే అని ఊరుకుంది.\n\nస్నానానికి నీళ్ళు పెడితే స్నానం చేసి వచ్చాడు అతను.ఒక్కమాటా మాట్లాకుండా రైతుతో పాటుగా కూర్చుని రైతు భార్య పెట్టిన భోజనం సుష్టుగా తిన్నాడు. తరువాత కాసేపు అరుగుపై నడుంవాల్చాడు.\n\nఎండతగ్గి చల్లబడగానే బండి కట్టుకున్నాడు, బయల్దేర బోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక్కమాటా మాట్లాడలేదు, వెళ్ళే ముందు కనీసం పలకరించటం తన బాధ్యత అనుకున్న రైతు ఆ వ్యక్తి ని మాట్లాడిస్తూ “అప్పుడే వెళ్ళిపోతున్నారు, రెండు రోజులు ఉండి వెళ్ళండి. ఇంతకీ మీరు నా భార్యకి ఏమవుతారు?” అన్నాడు.\n\nఅప్పుడా బండి యజమాని “నా బండి చక్రాలు రేగు కర్రతో చేసినవి మీ ఇంట్లో రేగుచెట్టు ఉంది. అలా మీకు మాకు రేగు సంబంధం వల్ల చుట్టరికం కలిసింది” అంటూ బండితోలుకుని వెళ్ళిపోయాడు.\nఇదీ బాదరాయణ సంబంధం వెనుక ఉన్న కథ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 420,
        "IMAGE": "cat_2",
        "NAME": "బాదరాయణ సంబంధం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 170,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒకరాజుగారు ఆయకు ఏడుగురు కూతుళ్ళు ఉండేవారు. వాళ్ళలో అందరికంటే చిన్నఅమ్మాయి అద్భతమైన అందగత్తె,చాలా మంచిది, కానీ ఆమెచాలా అమాయకురాలు.\n\nరాజుకి చిన్న కూతురిపై ఎంతో ఇష్టం, చాలా ముద్దుగా చూసేవాడు. అది మిగతా కూతుళ్ళకి అస్సలు నచ్చేదికాదు. వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏడిపించేవాళ్ళు.\n\nఓరోజు వాళ్ళు పొన్నాగ పూలు ఏరుకురావటానికి వెళ్ళారు. ఆ చెట్టు చాలా పెద్దది చిన్నమ్మాయితో ఆమె అక్కలు అన్నారు\n\n“చిన్నమ్మాయి నిన్ను చెట్టు ఎక్కిస్తాము, నీ బుట్ట మేము నింపి పెడతాము నువ్వు పూలు దులుపు” అని.\n\nఅందరూ కలిసి చిన్న అమ్మాయిని చెట్టుఎక్కించేసారు. ఆమె పూలన్నీ దులిపింది. ఆరుగురు అమ్మాయిలు తమ గంపలనిండా పూలన్నీ ఏరుకున్నారు.\n\nచీకటిపడబోతూ ఉంది అందరూ కలిసి కూడబలుక్కుని చిన్నమ్మాయిని చెట్టు దించకుండానే వదిలేసి వెళ్ళిపోయారు.\n\nచీకటి పడిపోయింది. చిన్నమ్మాయికి చాలా భయం వేసింది, కాని ఆమెకి చెట్టు దిగడం చాతకాదయె. అలాగే ఏడుస్తూ చెట్టుపై ఉండిపోయింది.\n\nఇంతలో ఆపక్కగా ఓ పిల్లి వెడుతూ కనిపించింది. “పిల్లీ పిల్లీ నన్ను కాస్త కిందకు దింపవూ” అంటూ అడిగింది చిన్నమ్మాయి.\n\n“నేనే చాలా చిన్నదాన్ని నిన్నెలా దింపగలను” అంటూ తనదారిన తాను వెళ్ళిపోయింది పిల్లి.\nఇంతలో అటుకేసి ఓ కోతి వచ్చింది. దాన్ని అడిగితే అదీ అలాగే సమాధానమిచ్చి వెళ్ళిపోయింది.\n\nఅలాగే పిట్టా, చెవులపిల్లి, ముళ్ళపంది ఇలా ఎన్నో చిన్న చిన్న జంతువులు వచ్చాయి ఆ దారి వెంట. కానీ ఏ ఒక్కటి చిన్నమ్మాయి చెట్టుమీదనుండి కిందకు దించలేదు. పాపం ఆమె అలాగే ఏడుస్తూ చెట్టుపైనే ఉండిపోయింది.\nఅర్ధరాత్రి అయ్యాక ఓ పులి అటు వైపుగా వచ్చింది.\n“పులీ నువ్వు ఎంతో బలంగా పెద్దగా ఉన్నావు నన్ను కిందకు దింపి వెళ్ళవా” అని అడిగింది చిన్నమ్మాయి.\n\nదానికి పులి “నేను పులిని తినేయటమేగానీ నేను అలాంటి పనులు చేయను. ఇప్పుడు నిన్ను తినేయబోతున్నాను” అంటూ మీదకు వచ్చింది.\nచిన్నమ్మాయి బాగా ఆలోచించి. “సరే నన్ను తినేసేయ్ కానీ దయచేసి నాకోరిక ఒకటి తీర్చు” అంది.\n“సరే ఏమిటో చెప్పు” అంది పులి.\n“నన్ను పూర్తిగా తినకుండా నా చిటికన వేలు మాత్రం వదిలేయి” అంది పులి ఆ అమ్మాయిని భోంచేసి ఆమెకి మాటిన ప్రకారం ఆమె చిటికెన వేలు మాత్రం వదిలేసి తనదారిన వెళ్ళిపోయింది.\n\nతెల్లవారగట్ల చీకటితోనే ఆ దారిలో జగం వాడొకడు వెళుతున్నాడు. ఆ చెట్టుకింద పడిఉన్న ఆమె చిటికెన వేలు అతడి కాలికి తగిలింది. అతడు దాన్ని సొంటికొమ్ము అనుకుని తీసుకెళ్ళి ఓ కుండలో పెట్టేసిమర్చిపోయాడు.\n\nకొద్దిరోజులు పోయాక ఆ జంగంవాడికి ఓ రోజు బాగా తలనెప్పి వచ్చింది. కుండలో దాచిన సొంటికొమ్ము గుర్తొచ్చింది, దానితో తలకు పట్టీ వేసుకుంటే తలనెప్పి తగ్గిపోతుంది అందుకే వెళ్ళి కుండ మూత తీసి చూసాడు. విచిత్రంగా దాంట్లోంచి అమ్మాయి బయటకి వచ్చింది. ఆమెని చూసిన జంగం వాడు పిల్లలులేని తనకు దేవుడే ఈ పిల్లను పంపాడని మురిసిపోయి పెంచుకోసాగాడు.\nఅలా కొద్దిరోజులు గడిచాక ఓనాడు ఆమె “నాన్నా నేనూ భిక్షకి వెళతాను” అని అడిగింది.\nసరే కాస్త పెద్దదైపోయిందిగా తప్పిపోకుండా తిరిగొస్తుంది లెమ్మని ఆ జంగం వాడు ఆమెని భిక్షకి పంపించాడు.\nఆమె అందరి ఇండ్లూ తిరుగుతూ రాజుగారి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకి గతం గుర్తొచ్చింది. వెంటనే ఇలా పాడింది.\n\nఒక రాజుకి ఏడుగురు పిల్లలం\nపొన్నాపూలకు పోయాము\nపొన్నాచెట్టు ఎక్కాను\nఅక్కలు వదిలిపోయారు\nపులిరాజు బుక్కపెట్టే భిక్షాం దేహీ\nఆ పాటవిని రాజు వచ్చి “ఎవరునువ్వు పొన్నా పూల సంగతి చెపుతున్నావేమిటి” అని అడిగాడు.\n\nఅప్పుడు ఆ అమ్మాయి అక్కలు మోసం చేసారని జరిగిన కథంతా చెప్పింది. ఆమే చిన్నమ్మాయి అని రాజు ఎంతో సంతోషించాడు. మిగతా ఆరుమంది కూతుళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 421,
        "IMAGE": "cat_2",
        "NAME": "పొన్నాపూల కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 171,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉంటుండేవి. ఆ అడవిలోని సింహం అంటే వాటికి చచ్చేంత భయం. అది గనక ఏ జంతువునన్నా చూసిందో ఇక దానికి మూడినట్టే ఆకలి వేసినా వేయకున్నా కనిపించిన జంతువునల్లా చంపి పడేసేది. అందుకే జంతువులన్నీ ఆ సింహానికి కనిపించకుండా జాగ్రత్తగా మెసలుతుండేవి.\n\nఆ అడవిలోనే ఓ కుందేలు ఉండేది. ఓ చోట పెద్దగుబురు పొదలో అది నివసించేది. శత్రువుల కంటపడకుండా ఉండేట్టు దట్టంగా ఉండేవి ఆ పొదలు. వాటికి కావలసిన మెత్తటి పచ్చగడ్డి, క్యారెట్ లు ఆపొదలోనే దొరికేవి ఇక అవి ఎక్కడికీ వెళ్ళకుండా ఆ పొదలోనే ఉండేవి హాయిగా.\n\nఓ సారి ఆకుందేలు అడవంతా తిరిగి చూడాలని అనుకుంది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆ పొద విడిచి బయల్దేరింది. ఎంచక్కా హాయిగా అడవి అందాలు చూస్తూ ఆ రోజంతా తిరిగింది. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అది ఇంకా అడవిలోని అతి పెద్ద నదిని చూడనేలేదు. ఆ నదిని గురించి అందరూ మాట్లాడుకొనే మాటలు గుర్తొచ్చాయి. ఆ నది ఎంతో పెద్దది, అందమైనది, తెల్లటి పాల నురుగు లాంటి నీరు వేగంగా వెళుతూ ఉంటుందట, దాని తుంపర్లు ఒడ్డున పడుతూ అక్కడంతా అద్భుతంగా ఉంటుందట.\n\nనది తీరంలోని అందమైన పూల, పండ్ల చెట్లు ఉంటాయట. ఆ నది చూడకుండా ఇంటికి వెళ్ళటం దానికి అస్సలు నచ్చలేదు. ఎంత, ఇలావెళ్ళి అలా వచ్చేయవచ్చు అనుకుంది. నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నది ఒడ్డున పచ్చిక పై ఆడింది పాడింది. నదిలోని నీటి తుంపర్లు దానిపై పడుతూ ఉంటే దానికి భలే గమ్మత్తు గా అనిపించింది. అది ఆటల్లో పడి చీకటి పడిందనే సంగతే గమనించలేదు.\n\nకాసేపటికి అది ఇంటికి వెళదామని బయల్దేరింది. చూస్తే దాని ఎదురుగా సింహం. అది నీటికొరకు నదికి వచ్చింది. కుందేలుకి దాన్ని చూడగానే భయం వేసింది, ఎందుకంటే ఆ చెడ్డ సింహం గురించి అది ముందే వినిఉంది. ఎలా తప్పించుకోవాలా అని గబ గబా ఆలోచించింది. దానికో ఉపాయం తట్టింది.\nఅది వెంటనే సింహం వైపు పరిగెడుతూ “ప్రమాదం! ప్రమాదం!” అంటూ అరచింది.\nసింహానికి చాలా కోపం వచ్చింది “ఎవరికి ప్రమాదం? నన్నెవరూ ఏమీ చేయలేరు. నీ పిచ్చిమాటలు ఆపు.” అంది.\n“సింహం గారు నేను ఈ పొదలో ఉండి చూస్తూ ఉన్నాను. పదిమంది మనుషులు వచ్చారు, చూడబోతే వేటగాళ్ళలా ఉన్నారు. చేతిలో తుపాకీలు ఉన్నాయి.” అంది కుందేలు.\nసింహానికి కాస్త భయం వేసినా జంకకుండా “ఓహో! మరి వాళ్ళేరి? ఎందుకోసం వచ్చుంటారు?” అంటూ అడిగింది.\n\n“వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, చుట్టూ ఉన్న ఆపొదల్లో దాక్కుని ఉంటారు. ఈ రోజు ఎలాగైనా సింహాన్ని చంపి పట్టుకుపోవాలని వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవులారా విన్నాను, మీరు తప్పించుకోవాలంటే వెంటనే ఈ నది దాటి ఆ ఒడ్డుకు వెళ్ళి పోవలసిందే.ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం” అంటూ తెలివిగా చెప్పింది.\n\nసింహానికి భయం వేసింది కానీ కుందేలు ముందు బయట పడకుండా “వాళ్ళు నన్నేం చేయలేరు. నేనంటే ఏమిటో నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు త్వరగా వెళ్ళిపో లేకపోతే నీకే ప్రమాదం వాళ్ళు నిన్ను పట్టుకు పోతారు.” అంది. కుందేలు చూస్తుండగా పారిపోవటం అంటే సింహానికి సిగ్గేసి అలా అందన్నమాట.\n\nఅప్పుడు కుందేలు ఇదే అదను అనుకుని “ఆహా ఓహో సింహం గారు మీరు చాలా గొప్పవారు, నా కైతే భయం వేస్తుంది నేను పారిపోతున్నాను.” అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.తననెవరూ చూడటం లెదని నిర్ణయించుకున్న సింహం వెంటనే నదికి అడ్డం పడి ఈదుతూ పారిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 422,
        "IMAGE": "cat_2",
        "NAME": "కుందేలు ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 172,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక పేను చేటంత పెసరచేను వేసుకుంది. ఆ చేను చక్కగా కాసింది. ఓనాడు ఆ దారిన వెళుతున్న రాజుగారు ఆ చేను చూసి పంటంతా కోసుకుపోయాడు. పేనుకు చాలా దుఖం వేసింది.\n\nనా పంట అంతా దోచుకు పోయిన రాజు ని ఎలాగైనా చంపాలి అనుకుని, ఓ బండికట్టుకుని బయల్దేరింది. తనతోపాటుగా అది కొన్ని రొట్టెలు కూడా తెచ్చుకుంది.\n\nఅది అలా వెళుతూ ఉంటే దానికి దారిలో ఓ తేలు కనిపించింది “పేను బావా ఎక్కడికి బయల్దేరావు?” అంటూ అడిగింది తేలు.\n\nదానికి పేను “నా పెసర చేనంతా నాశనం చేసి పంటంతా దోచుకెళ్ళాడు రాజు, ఆ రాజుని చంపేసేయడానికి బయల్దేరాను నువ్వూ నాతో వస్తావా?” అని అడిగింది.\nసరే నని తేలు పేనుతో కలిసి బయల్దేరింది. దానికి ఒక రొట్టె ఇచ్చింది పేను.\nఅవి రెండూ కలిసి ప్రయాణం సాగించాయి.\nకొద్దిదూరం వెళ్ళాక వాటికి ఒక పాము కనిపించింది తేలూ, పేనూ కలిసి ఎక్కడి వెళుతున్నాయో తెలుసుకుంది పాము.\n\n“నువ్వూ మాతో రాగూడదూ అందరం కలిసి ఆ రాజుకి తగిన శాస్తి చేద్దాం.” అని అడిగాయి అవి. సరేనంది పాము. పాముకి కూడా తన రొట్టేల్లోంచి ఒకటి తీసి ఇచ్చింది పేను.\n\nఅలా అవి మూడూ వెళ్తుండగా వాటికి కనిపించింది ఒక గుండ్రాయి. దానికి రాజు చేసిన పని చెప్పి, మాతో వస్తావా అని అడిగారు వీళ్ళు ముగ్గురు. సరే నని బయల్దేరింది గుండ్రాయి.\n\nపేను, తేలు, పాము, గుండ్రాయి నలుగురు రాజుగారి ఊరు సమీపానికి వచ్చేసరికి వాటికి అక్కడ ఒక పెద్దపులి ఎదురైయ్యింది.\n” ఏంటీ! అందరూ కలిసి ఇలా బయల్దేరారు? ఎక్కడికి? ఎందుకు?” అంటూ ప్రశ్నలు కురిపించింది పెద్దపులి.\n\n“రాజు నా చేను నాశనం చేసి నా పంటంతా దోచుకెళ్ళాడు అతడికి తగిన బుద్ది చెప్పి, నా పంట వెనిక్కి తెచ్చుకుండామని ఇలా వచ్చాను వీళ్ళంతా నాకు సాయం వచ్చారు.” అని చెప్పింది పేను పెద్ద పులితో.\n” అయ్యో అలాగా నేనూ మీతో వస్తాను.” అంది పెద్దపులి.\nసరేనని దానికి బదులుగా పులికి ఒక రొట్టే ఇచ్చింది పేను.\nఅందరూ కలిసి రాజుగారి ఇంటికి చేరుకున్నారు. పులి ఎవరి కంటా పడకుండా లోపలికి వెళ్ళలేదు కనుక అది వీధి లోనే దాక్కుంది.\nగుండ్రాయేమో ఇంటిబయట గుమ్మంపైన నక్కి దాక్కుంది.\nపేను రాజుగారి దువ్వెనలో దాక్కుంది. తేలు తల గడలో కనిపించకుండా దాక్కుంది. పాము ఆ గదిలో ఓ మూలన ఎవరికీ కనిపించకుండా నక్కింది.\n\nఅంతలోకి రాజుగారు వచ్చారు అతడు తలదువ్వుకుంటూ ఉంటే పేను తలలోకి చేరి కసా పిసా కుట్టేసి తన కోపం తీర్చుకుంది. రాజు కి చిరాకు ఎక్కువై కాసేపు పడుకుందామని పడుకున్నాడు.\n\nచీకటి పడేదాక ఆగిన తేలు రాజుని కుట్టేసింది, ఆ చీకట్లో రాజు కంగారుగా లేచికూర్చున్నాడు, అంతలోకి అక్కడే ఉన్న పాము బుస్సు బుస్సు మంటూ బుసకొట్టసాగింది. దానితో రాజుకి భయం వేసి గబ గబా ఇంటి బయటకి రావటానికి తలుపు తీయగానే ఆ గుండ్రాయి టప్పు మని ఆయన తలపై పడింది.\n\nదానితో హడలిపోయిన రాజు గబ గబా వీధిలోకి పరిగెత్తాడు వీధిలో చీకటి చాటున దాక్కున్న పులి అమాంతంగా రాజుపై పడి ఆయన్ని తినేసింది.\nపేను తన పెసలు తాను తీసుకుని సంతోషంగా ఇంటికి తిరికి వచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 423,
        "IMAGE": "cat_2",
        "NAME": "అనగనగా ఒక పేను కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 173,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఏడుమంది కొడుకులు ఉన్నారు. ఓరోజు వాళ్ళు వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండలో పెట్టారు. అందరి చేపలూ ఎండాయి కానీ చివరి అబ్బాయి చేప ఎండలేదు. అప్పుడు ఆ చిన్న అబ్బాయి చేపని ఇలా అడిగాడు. “చేపా చేపా ఎందుకు ఎండలేదు?”\n“ఎండ సరిగా తగలకుండా గడ్డిమోపు అడ్డంగా ఉంది.” అంది చేప\n“గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డంగా ఉన్నావు?” అని గడ్డిమోపుని అడిగాడు అబ్బాయి.\n\n“నన్ను ఆవు మేయలేదు అందుకే అలా అడ్డంగా ఉన్నా.” అంది గడ్డిమోపు.\n\n“ఆవూ ఆవూ ఎందుకు గడ్డి మేయలేదు?” అడిగాడు అబ్బాయి.\n\n“పిల్లవాడు మేపలేదు.” అంటూ చెప్పింది ఆవు.\n\n“పిల్లవాడా.. పిల్లవాడా ఎందుకు ఆవుని మేపలేదు.” అని అడిగాడు అబ్బాయి.\n\n“అమ్మ అన్నం పెట్టలేదు, అందుకే నేను ఆవుని మేపడానికి వెళ్ళలేకపోయాను.” అంటూ బదులిచ్చాడు గొల్లపిల్లవాడు.\n\n“అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు?” అమ్మనడిగాడు అబ్బాయి.\n\n“చిన్ని పాప ఏడుస్తోంది.” అందుకే వండలేదంది అమ్మ.\n\n“చిన్ని పాప చిన్ని పాప ఎందుకేడుస్తున్నావు?” అన్నాడు అబ్బాయి.\n\n“నన్ను చీమ కుట్టింది.” అంది చిన్ని పాప “చీమా చీమా ఎందుకు కుట్టావు?” చీమని ప్రశ్నించాడు అబ్బాయి.\n\n“మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే.. కూట్టనా..కుట్టనా… కుట్టానా……. అంటూ కుట్టేసింది చీమ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 424,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఏడు చేపలు చెక్కిలిగిలి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 174,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒకరాజుకి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్యకి రెండు వెంట్రుకలు ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాళి, ఎవరితోనూ సరిగ్గా నడచుకోదు. రాజుగారి చిన్న భార్యకి ఒక్కటే వెంట్రుక ఉంది. ఈవిడ చాలా నెమ్మది గుణం కలది అందరితో స్నేహంగా దయగా ఉండేది.\n\nపెద్ద భార్యకి తనకి రెండు వెంట్రుకలున్నాయని అందుకని ఒకటే వెంట్రుక ఉన్న చిన్న రాణీ కంటే తనే అందంగా ఉన్నానని అనుకునేది. ఓ రోజు రాజుతో ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయమని చెప్పింది. దానితో రాజు చిన్న రాణీని అడవికి పంపించేసాడు.\n\nచిన్న రాణి అడవిలో అలా వెళుతూ ఉంటే దారిలో ఆమెకి ఆవులు కనిపించాయి “మాకు కాస్త కుడితి కలిపి పెట్టి వెళ్ళవా.” అని అడిగాయి. ఆమె సరేనని ఎంతో దయతో వాటికి కుడితి కలిపి పెట్టి తన దారిన తను వెళ్ళసాగింది.\n\nఅలా కొంత దూరం అలా వెళ్ళాక ఆమెకి ఓచోట దారికి రెండువైపులా గులాబీ తోట కనిపించింది. ఆ గులాబీ మొక్కలు చిన్న రాణిని చూడగానే “ఇక్కడ ఉన్న బావినుండి నీళ్ళు తోడి మాకు పోయావా.” అని అడిగాయి. ఆమె వాటికి కావలసినన్ని నీళ్ళు తోడి పోసింది.\n\nఇంకాస్త ముందుకెళ్ళగానే ఆ దారిలో ఎన్నో చీమలు వెళుతూ ఉన్నాయి అవి ఆమెతో “దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు.” అని అన్నాయి. ఆమె వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడవసాగింది.\n\nకొద్దిదూరం నడిచాక ఆమెకి ఒకచోట పెదరాసి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళగానే పెదరాసి పెద్దమ్మ చిన్నరాణీని పిలిచి “నా ఇంటిని అలికి, అలంకరించి, నాకు కాస్త వంట చేసి పెడతావా? నాకు ఈరోజు అస్సలు ఓపిక లేకుండా పోయింది.” అంది.\n\nదానికి చిన్న రాణీ ’అయ్యో పాపం ముసలమ్మ అన్ని పనులు చేసుకోలేదు కదా’ అనుకుకుని పెదరాసి పెద్దమ్మ ఇల్లు అలికి ముగ్గులేసి, వంటచేసింది.\n\n“ఎందుకిలా అడవిలోకి వచ్చావు ?” అని చిన్న రాణిని అడిగింది పెద్దమ్మ.\n\nతనకు ఒకటే వెంట్రుక ఉందని పెద్ద రాణీ రాజుతో చెప్పి వెళ్ళగొట్టించేసింది అంటూ జరిగింది చెప్పింది ఆమె.\n\n“నీకు చాలా పొడవుగా వత్తుగా జుట్టు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, కనిపించే ఆ నది వద్దకెళ్ళి ఈ కొబ్బరి కాయ కొట్టి నమస్కరించి నదిలో మూడు సార్లు మునిగి బయటకు వచ్చేసేయి.” అని చెప్పింది పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ చెప్పినట్టుగానే మూడుసార్లు నదిలో మునిగి లేచేసరికి చిన్న రాణికి బారెడు జుట్టు వచ్చేసింది.\n\nఆమె సంతోషంతో ఇంటికెళదామని అనుకుంది కానీ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియలేదు. అప్పుడు అక్కడే ఉన్న చీమలన్నీ కలిసి మీ ఇంటికి దారి మేము చూపిస్తాము అంటూ బారులుగా ముందు నడుస్తూ దారి చూప సాగాయి.\n\nఅలా వెళ్తుండగా గులాబీతోటలోని పూలన్నీ “ఓ రాణీ నువ్వు నీళ్ళు తోడిపోసినందునే మా తోటంతా ఇలా పువ్వులతో నిండిపోయింది, ఇలా వచ్చి నీకు కావలసినన్ని పువ్వులు తీసుకుని వెళ్ళు.” అన్నాయి.\n\nఆమె కావలసినన్ని పూలు తలలో పెట్టుకుని అందంగా ముస్తాబై వెళ్ళసాగింది.\nఅలా కొద్ది దూరం వెళ్ళాక మొదట ఆమె కుడితి పెట్టిన ఆవులు ఆమెని చూసాయి.\n\n“చిన్న రాణీ నువ్వు ఎంతో మంచిదానివి మేమూ మీ ఇంటికి వచ్చేస్తాం రోజూ పాలు ఇస్తాం, నువ్విలా నడుస్తూ ఎందుకువెళ్ళడం అదిగో ఒక బండి ఉంది దానికి మమ్మల్ని కట్టి బండిపై హాయిగా వెళ్ళు.” అన్నాయి.\n\nఎంచక్కా బండిలో కూర్చుని చీమలు దారిచూపిస్తుండగా ఇంటికి వచ్చేసింది చిన్నరాణీ. అప్పుడు ఆమెని చూసిన రాజు ఎంతో సంతోషంతో ఇంట్లోకి పిలిచి, రెండే వెంట్రుకలు ఉన్న పెద్దరాణీ ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు.\n\nపెద్దరాణీని రాజు అడవికి పంపేసాడు అక్కడ రాణీ కి కొన్ని ఆవులు కనిపించాయి అవికూడా కుడితి కోసం పెద్ద రాణిని అడిగాయి. పెద్ద రాణి వాటిని పట్టించుకోకుండా తనదారిన తాను వెళ్ళసాగింది.\n\nగులాబీ తోట లోంచి వెళుతోంటే అవి చిన్న రాణిని అడిగినట్టే పెద్ద రాణీని కూడా నీళ్ళు తోడి పోయమని అడిగాయి.\n\nపెద్దరాణి “ఇక నాకేం పనిలేదా మీకు నీళ్ళు పోస్తూ ఉండాలా.” అంటూ కోపంతో తన దారికి అడ్డంగా ఉన్న కొమ్మలని విరిచేస్తూ వెళ్ళింది.\n\nకొద్దిదూరం వెళ్ళాక ఆమెకి చీమలు కనిపించాయి “దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు.” అన్నాయి.\n\nపిచ్చి చీమలు మీవల్ల ఏం ఉపయోగం అంటూ వాటిని తొక్కేస్తూ కాళ్ళతో నలిపేస్తూ నడిచింది పెద్దరాణీ.\n\nకాసేపటికి ఆమె పెదరాసి పెద్దమ్మ ఇల్లు చేరుకుంది. “నా ఇల్లు అలికి అలంకరించి, నాకు వంటచేసి పెట్టు.” అంది పెద్దమ్మ.\n\n“హు నేను రాణీని నేను అలాంటి పనులు చేయను.” అంటూ విసుక్కుంది పెద్దరాణి.\n“సరే ఈ అడవిలోకి ఎందుకొచ్చావు?” అంటూ అడిగింది పెద్దమ్మ.\n\n“ఎక్కువ వెంట్రుకలు ఉన్నవాళ్ళే అందమైన వాళ్ళని నేను రాజుతో చెప్పాను అందువల్ల ఇప్పుడు చిన్నరాణికి నాకంటే ఎక్కువజుట్టు వచ్చేసింది అందుకే నన్ను వెళ్ళగొట్టేసాడు.” అని జరిగిందంతా చెప్పింది పెద్దరాణీ.\n\n“కనిపించే ఆ నది దగ్గరకు వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కరించి, నదిలో మూడుసార్లు మునగి లేస్తే నీకుకూడా చిన్న రాణి జుట్టంత జుట్టు వస్తుంది.” అంటూ చెప్పి కొబ్బరికాయ ఇచ్చింది పదరాసి పెద్దమ్మ.\n\nనది దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి నదిలో మూడు సార్లు మునిగింది పెద్దరాణీ. ఆమెకీ చిన్న రాణి కున్నంత జుట్టు వచ్చేసింది.\n\n’చిన్న రాణి కున్నంతే ఉంటే ఇంక నా గొప్ప ఏముంది! రాజుతో చెప్పి మళ్ళీ ఆమెని వెళ్ళగొట్టించేసేయాలంటే ఆమెకంటే పెద్దజుట్టు నాకు ఉండాలి అనుకుంది పెద్దరాణీ.\n\nవెంటనే ఇంకో మూడు మునకలు వేసింది. అంతే ఉన్న జుట్టంతా ఊడిపోయి బోడిగుండై పోయింది.\n“అయ్యో నాకున్న రెండువెంట్రుకలూ పోయాయే.” అని ఏడ్చుకుంటూ వెళ్ళింది పెద్దరాణీ.\nఅడవిలో దారి తప్పిపోయింది చీమలని అడిగినా అవిచెప్పలేదు పైగా ఆమెని బాగా కుట్టేసాయి.\nగులాబీ తోటలోకి రాగానే ఎండిపోయిన గులాబీ కొమ్మలన్నీ ఆమెని ముళ్ళతో బాగా కొట్టాయి.\nఅంతలోకి అక్కడికి వచ్చిన ఆవులు ఆమెని తమ కొమ్ములతో పొడుస్తూ అడవిలోకి తరిమేసాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 425,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఒక్క వెంట్రుక రాణి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 175,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక రామ చిలుక ,కాకి ఉన్నాయంట.. అవి రెండూ స్నేహితులు..\nఅయితే చిలుకచురుకైనది …కాకి బద్దకస్తురాలు..ఒక రోజు రెండింటికి బాగా ఆకలి వేసింది..\nఅక్కడ దగ్గరలో ఉన్న జామ చెట్టు పై వాలి మంచి జామ కాయ కోసం వెతకడం మొదలు పెట్టాయి..\nచిలక ఓర్పుగా అన్నీ వెదికి ఒక పండు జామకాయను తెచ్చుకుంది..కాకి బద్ధకం\nతో ఒక పచ్చిజామను కోసుకుంది.. అయితే చిలుక తెచ్చిన పండిన జామను చూడగానే కాకి నోరు ఊరింది…\nఎలాగైనా అది దొంగిలించి తినేయాలనే ఆశ కలిగింది.. అందుకని చిలుకతో” బాగా అలసిపోయాం కదా స్నానం చేసి తిందామా” అంది.. పాపం అమాయకపు\nచిలుక “మరి స్నానం చేస్తే ఎవరు మన జామకాయలకు కాపలా కాస్తారు” అని అడిగింది..\n“ముందు నువ్వు చేసిరా నేను కాపలా కాస్తాను,తరువాత నేను స్నానం చేస్తాను నువ్వు\nకాపాలా కాద్దువు” అని కాకి చిలకతో అంది..చిలుక అంగీకరించి కాకి కి తన జామకాయను అప్పగించి వెళ్లి పోయింది..\n\nఆ వెంటనే కాకి చిలుక జామకాయను తీసుకుని పారిపోయింది.. కొద్ది సేపటి తరువాత వచ్చిన\nచిలుకకు జరిగిన మోసం అర్ధం అయ్యి ఏడుపు మొదలుపెట్టింది … సరిగ్గా అటు పైన\nపార్వతి పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళుతూ ఏడుస్తున్న చిలుకను చూసారు … వాళ్లకు\nజాలి కలిగి చిలకమ్మ దగ్గరకు వచ్చి విషయం అడిగారు.\nచిలుక ఏడుపు ఆపి కాకి చేసిన మోసం చెప్పింది వెక్కుతూ … అప్పుడు పార్వతి\nపరమేశ్వరులు చిలకను ఓదార్చి మమ్ములను తల్చుకుని” ఒక చిన్ని గొయ్యి తవ్వి చూడు “అని\nచెప్పి మాయం అయ్యారు..\n\nచిలుక సరే అని దణ్ణం పెట్టుకుని చిన్న గొయ్యి తీసింది.. చిన్న జామకాయ\nదొరికింది దానికి.. తింటే చాలా తీయగా ఉంది.. ఈసారి కొంచెం పెద్ద గొయ్యి తీసి\nచూద్దాం అనుకుని కొంచెం పెద్ద గొయ్యి తీసింది..ఈసారి ఇంకొంచెం పెద్ద జామ కాయ\nదొరికింది.. అది ఆనందం తో మళ్లీ దణ్ణం పెట్టుకుని ఇంకా పే..ద్ద గొయ్యి తీసింది\n…దానికి చాలా పెద్ద జామ కాయ దొరికింది.. అది సంతోషం తో దాని పైకి ఎక్కి ఆడుకోవడం\nమొదలు పెట్టింది..\n\nఅటుగా వెళుతున్న కాకి చిలుకను చూసింది …అంత పెద్ద జామ కాయ దానికి ఎలా\nదొరికిందని ఆరా తీసింది.. మంచిదైన చిలుక కాకి చేసిన ద్రోహం\nమర్చిపోయి జరిగిందంతా కాకికి చెప్పింది.. కాకి కి దుర్బుద్ధి పుట్టింది …\nఅది కూడా ఒక చోట కూర్చిని పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది.. విషయం అర్ధం\nఅయిన పార్వతి ,పరమేశ్వరులు నవ్వుకుని కాకి దగ్గరకు వెళ్లి ఎందుకేడుస్తున్నావ్ ?అని\nఅడిగారు..నా జామకాయ చిలుక దొంగిలించింది అని అబద్దాలు చెప్పింది కాకి..\nఅయితే చిన్న గొయ్యి తీసి చూడు అని కాకి కి చెప్పి మాయమయ్యారు వాళ్ళు..\nకాకి ఆనందం గా చిన్న గొయ్యి తీసి చూసింది ..అందులో నుండి చిన్న తేలు వచ్చి\nకుట్టింది దాన్ని.. అమ్మోయ్,బాబోయ్ అని గెంతుకుంటూ ఈ సారి పెద్ద గొయ్యి తీసింది\n…ఈ సారి పెద్ద తేలు వచ్చింది అందులో నుండి.. కాకి కి తను చేసిన తప్పు\nఅర్ధం అయ్యిఎగురుకుంటూ చిలుక దగ్గరకు వచ్చి క్షమాపణ కోరింది..\nఅవి రెండు మళ్లీ మంచి స్నేహితులు అయిపోయాయి.. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 426,
        "IMAGE": "cat_2",
        "NAME": "చిలుక  కాకి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 176,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ వూళ్ళో పుల్లయ్య, పుల్లమ్మ అని ఇద్దరు భార్యా భర్తలు వుండేవారు. వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది. పుల్లయ్యకు కోపం ఎక్కువ. మొండివాడు కాస్త మూర్ఖత్వం కుడా ఉండేది. పుల్లమ్మ నెమ్మది తనం మంచితనం వల్ల భార్యతో పేచీలేవీ లేకుండా హాయిగానే ఉండేవాడు.\n\nఓ నాడు పుల్లయ్య ను వాళ్ళ మేనమామ తన పొలానికి బావి కడుతున్నామని సాయం రమ్మని కబురు చేస్తే ఆ వూరు వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చేప్పుడు నీకోసం ఏదైనా తెస్తాను నీకేం కావాలో చెప్పు అని అడిగాడు భార్యని.\n\nనాకు వేరే ఏదీ వద్దు. మీరు వెళ్ళే వూరినుండి దగ్గరే గనుక మా అమ్మ గారి ఊరి దాకా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుని రావాలి అని అడిగింది. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోను లు ఉత్తరాలు లేవు. పెళ్ళైన నాటినుండీ ఊరి నుండి ఎవరూ రాలేదు.\n\nఅలాగే లెమ్మని పుల్లయ్య బయల్దేరి వెళ్ళాడు. మేనమామ వూళ్ళో పని పూర్తయిన తరువాత అక్కడికి కొంత దూరంలోవున్న అత్తగారి ఊరు వెళ్ళాడు.\n\nఅల్లుడిని చూసి అత్తారింట్లో అందరూ ఎంతో సంతోషించారు. అత్తగారు పిండివంటలు చేసి వడ్డించింది. అన్నింటిలోకి బెల్లం కుడుములు బాగా నచ్చాయి పుల్లయ్యకి. ఎన్ని తిన్నా ఇంకా తినాలని పించిది. మా ఇంట్లో ఇవి ఎన్నడూ వండుకోలేదు. వీటి పేరేమిటి అని అత్తని అడిగాడు.\n\nనా కూతురు కుడుములు బాగా వండుతుంది, వెళ్ళగానే అడిగి చేయించు అని చెప్పింది అత్తగారు.\n\nఇప్పటిలా బస్సులూ అవీ ఆ కాలంలో లేవుగా . ఇంటికి వెళ్ళడానికి రెండ్రోజులు సమయం పడుతుంది. ఈ లోగా ఆ కుడుములు అనే పేరు ఎక్కడ మర్చిపోతానో నని భయం పట్టుకుంది పుల్లయ్యకి. దారివెంటా కుడుములు కుడుములు అనుకుంటూ నడక మొదలెట్టాడు. అలా వెళ్ళేదారిలో ఓ కాలువ దాటాల్సివచ్చింది. కుడుముల ఆనందంలో ఒక్క సారిగా ఐసరబజ్జీ అంటూ ఎగిరి కాలవ దూకాడు . ఆవలకి దూకాక కుడుములు పేరు మర్చిపోయాడు. ఐసరబజ్జీ అని మాత్రమే గుర్తుంది అతడికి. ఇంక అక్కడి నుండి ఐసర బజ్జీ ఐసర బజ్జీ అనుకుంటూ రెండ్రోజుల పాటు నడిచి తన ఊరు చేరుకున్నాడు.\n\nపుల్లయ్య ను చూడగానే భార్య ఆనందంతో ఎదురొచ్చింది. మా అమ్మగారింటి సంగతులు ఏమిటీ అంటూ కుశలం అడగటం మొదలెట్టింది. అవన్నీ తీరిగ్గా చెపుతాగానీ నువ్వు వెంటనే ఐసరబజ్జీలు చెయ్యి నేను స్నానం చేసొచ్చి తింటాను అన్నాడు.\n\nఅదెమిటీ ఐసరబజ్జీ చేయడం ఏమిటీ? నాకు చేతగాదు. అంది భార్య. మీ అమ్మ నాకు చేసి పెట్టింది. నీకు బాగా చెయ్యటం వచ్చనీ చెప్పింది. వీటికోసం నేను దారివెంటా ఒక్కచోటా ఆగకుండా ఒక్కరితో మాట్లాడకుండా సరాసరి వచ్చాను. వెంటనే నాకు చేసిపెట్టమని గదమాయించాడు పుల్లయ్య.\n\nఅవి ఎట్లా చేస్తారో కనీసం అదైనా చెప్పు. నేను ఎలాగో తంటాపడతా అంది ఆమె. అబ్బో ఇది బద్దకంతో ఇలా వేషాలు వేస్తుంది. అనుకున్నాడు దాంతో చాలా కోపం వచ్చింది అతడికి. ఇలా సాకులు చెప్పి వండడం తప్పించుకుంటే తంతా వెంటనే వండి పెట్టు అంటూ కేకలు వేసాడు. ఐనా తనకు వండడం చేతకాదనే చెప్పింది పుల్లమ్మ. అసలే మూర్ఖుడూ కోపిష్టి తన మాట వినలేదని భార్యను తన్నడం మొదలెట్టాడు. జుట్టు పట్టుకుని చెంపలు వాయించేసాడు. ఇరుగు పొరుగు వచ్చి వద్దని చెప్పినా వినలేదు. అంతలో పుల్లయ్య తల్లి పరిగెత్తుకు వచ్చి ఒరే కోపిష్టి వాడా పెళ్ళాన్ని అంతలా కొడతావేరా? పాపం దాని చెంపలు కుడుముల్లా ఉబ్బిపోయాయి… అంటూ కొడుకును తిట్టడం మొదలెట్టింది.\n\nఅప్పుడు వెంటనే గుర్తొచ్చింది పుల్లయ్యకి కుడుములు అన్న పేరు. అదే అదే కుడుములు వండిపెట్టమంటే ఇది చాత కాదందే అమ్మా అంటూ చెప్పాడు. కుడుములంటే వండిపెట్టనా. నువ్వు ఐసరబజ్జీలు వండిపెట్టమని కదూ నన్ను కొడుతున్నావ్. అంది పుల్లమ్మ. ఇరుగు పొరుగు వాడి కోపిష్టి తనాన్ని చూసి వెక్కిరిస్తూ ఐసరబజ్జీ పుల్లయ్యా అని పిలవడం మొదలెట్టారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 427,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఐసరబజ్జీ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 177,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక వూళ్ళో ఓ వ్యాపారి ఉండేవాడు.అతడు పరమ పిసినారి, పైసా ఖర్చు చేసేవాడు కాదు. ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా డబ్బు సంపాదించేవాడు. ఇంకా ఇంకా ధనం సంపాదించాలి అనుకునేవాడు.\n\nఓ రోజు అతడు పని పై అడవిగుండా పొరుగూరు వెళుతూ మధ్యహాన్నం వేళ ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాడు. సాయంత్రం లేచి చూసేసరికి పక్కనే అతడికి ఓ గుడి కనిపించింది. చుట్టూ చెట్లనిండా పూలూ పండ్లూ ఉన్నాయి. పోన్లే కొనుక్కునే పనిలేదు. అన్నీ కోసి గుళ్ళో పూజచేసేద్దాం పోయేదేముంది అనుకుని. పండ్లూ పూలు అన్నీ కోసి ఆ గుళ్ళో దేవతకు పూజ చేశాడు. వెంటనే ఆ దేవత ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగింది. ఆ వ్యాపారి ఆనందంతో ఉప్పొంగి పోతూ“నాకు చాలా ధనం కావాలి.” అని అడిగాడు. ఎంత కావాలో చెప్పమని మళ్ళీ అడిగింది దేవత. “నేను పట్టిందల్లా బంగారం కావాలి.” అన్నాడు అత్యాశతో. అలాగే అంటూ దేవత మాయమయి పోయింది.\n\nవ్యాపారి ఆనందంతో వెనిక్కి తిరిగి ఇంటికి తిరిగి వచ్చేశాడు. జాగ్రత్తగా లోనకు వెళ్ళి ఇంటిని తాకాడు. ఇంటి గోడలు బంగారపు గోడలుగా మారిపోయాయి. ఇక అతడికి వెర్రి ఆనందం వేసింది. ఇంట్లో వస్తువులన్నీ తాకుతూ వాటిని బంగారం చేస్తూ రోజంతా గడిపాడు.\n\nచివరికి బాగా అలసిపోయాడు. ఆకలి వేయడం మొదలెట్టింది. భార్యను పిలిచి భోజనం పెట్టమని చెప్పాడు. పళ్ళెం ముందు కూర్చుని అన్నం లో చేయి పెట్టగానే అది బంగారంగా మారిపోయింది. నీళ్ళు తాగుదామని చెంబు పట్టుకుంటే నీళ్ళూ చెంబూ కూడా బంగారమయిపోయాయి. అంతలో ఆ వ్యాపారి కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి అతడి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే ఆ పిల్లవాడూ బంగారు విగ్రహంగా మారిపోయాడు.\n\nవ్యాపారి భయంతో ఏడుస్తూ నా అత్యాశ వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటూ అడవిలోని గుడికి వెళ్ళి దేవతను ప్రార్థంచడం మొదలెట్టాడు. “నా జీవితం నా బిడ్డా నాకు ముఖ్యం నీ వరం నాకు అక్కరలేదు వెనిక్కి తీసుకో” అంటూ దేవతను అడిగాడు.\n\nసరే అంది దేవత. ఆ పై వ్యాపారి అత్యాశను పిసినారి తనాన్ని వదిలేసి హాయిగా జీవించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 428,
        "IMAGE": "cat_2",
        "NAME": "పట్టిందల్లా బంగారం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 178,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ముగ్గురు వ్యక్తులు వాళ్ళదగ్గర ఉన్న డబ్బు తో పదిహేడు (17) గాడిదలు కొన్నారు. దానికై మొదటివాడు సగం, రెండోవాడు మూడోవంతు, మూడోవాడు తొమ్మిదో వంతు పెట్టుబడిగా పెట్టారు. వాటిని వాళ్ళు ఆ ప్రకారంగానే పంచుకోవాలనుకున్నారు. దానిప్రకారం కొన్న గాడిదలలో సగం మొదటి వాడికి, మూడో వంతు రెండో వాడికి, తొమ్మిదవ వంతు మూడవ వాడికీ రావాలి.\n\nఅలా చూస్తే మొదటి వ్యక్తి కి (ఎనమిదిన్నర) 8 1/2 గాడిదలు, రెండవ అతనికి 5 2/3 (ఐదూరెండూ బై మూడు గాడిదలు), మూడో అతడికి 1 8/9 (ఎనిమిదీ బై తొమ్మిది గాడిదలు) రావాలి. ఇలాంటి పంపకం సాధ్యం కానిది. గాడిదలను ముక్కలుగా కోసి తీసుకోవడం వాళ్ళకి నచ్చలేదు. పరిష్కారంకోసం కాజీ దగ్గరకు వెళ్ళారు వాళ్ళు.\n\nకాజీ కి ఎంతగా ఆలోచించినా పరిష్కారం తట్టలేదు. ఆ సమస్య కు మౌల్వీ నసిరుద్దీన్ మాత్రమే పరిష్కారం చూపగలడు అనుకుని నసిరుద్దీన్ కి కబురు చేసాడు.\n\nనసిరుద్దీన్ తన గాడిదను ఎక్కి అక్కడికి వచ్చాడు. వాళ్ళు చెప్పింది, కలిగిన సమస్య అంతా విని. ఆ పదిహేడు గాడిదలకు తన గాడిదను కలిపి పంపకం మొదలెట్టాడు. అతడి గాడిదతో కలిపి అవి పద్దెనిమిది అయ్యాయి (18). వాటిల్లో సగం తొమ్మిది (9) గాడిదలను మొదటి వాడిని తీసుకోమని చెప్పాడు.\n\nసాబ్ మీ గాడిద మాకు ఇవ్వడమేమిటి? మా సమస్య కోసం మీరు గాడిదను పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు అన్నారు ఆముగ్గురూ.\n\nనా గాడిదను ఇచ్చేంత తెలివితక్కువ వాడిని కాను. మీరు ముందు మీ వాటాలు తీసుకొండి అంటూ ఇలా పంపకం చేశాడు.\n\nమొదటి వాడు సగం డబ్బు పెట్టేడు గనుక ఉన్న మొత్తం గాడిదలలో సగం వాడికి రావాలి. మొత్తం 18 గాడిదలలో సగం 9 వాడికి.\n\nరెండో వాడికి మూడో వంతు వాటా రావాలి అంటే 18 గాడిదలలో మూడోవంతు 6 కనుక వాడికి 6 గాడిదలు ఇచ్చేశాడు.\n\nఇక చివరి వాడి పెట్టుబడి తొమ్మిదో వంతు. మొత్తం గాడిదలలో తొమ్మిదో వంతు రావాలి. 18 లో తొమ్మిదో వంతు 2 కనుక 2 గాడిదలు అతడికి ఇచ్చేశాడు.\n\nఅలా మొదటి వాడికి 9 రెండోవాడికి 6 మూడోవాడికి 2 మొత్తం కలిపితే 17 గాడిదలు లెక్క సరిగ్గా సరిపోయింది. అందరూ తమకు రావలసిన దానికంటే ఎక్కువే వచ్చిందని ఆనంద పడ్డారు. గాడిదలను ముక్కలు చేసే పని లేనందుకు హమ్మయ్య అనుకున్నారు.\n\nఅలా అందరికీ పంచగా చివరికి మిగిలిన తన గాడిదపై ఎక్కి నసీరుద్దీన్ వెళ్ళాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 429,
        "IMAGE": "cat_2",
        "NAME": "గాడిదల పంపకం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 179,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు గారు ఉండేవారు. ఆ రాజు గారికి అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన సందేహాలు వస్తూ ఉండేవి. అలా ఏదన్నా సందేహం వచ్చిందే తడవుగా ఆయన ఆస్థానంలోని మేధావులందరినీ అడిగేవారు. ఆయనకి సంతృప్తికరంగా అనిపించే సమాధానం ఎవరో ఒకరు చెప్తేనే గానీ ఆ సందేహం మీద నుంచి ఆయన ధ్యాస మళ్ళి మనసుకి శాంతి లభించేది కాదు.\n\nఒకసారి ఏదో పండుగ సందర్భంగా రాజు గారి వంటశాలలో రాచపరివారం మొత్తానికి విందు ఏర్పాటు చేసారు. విందు కోసమని అన్నం, ఆ కాలంలో దొరికే అన్నీ కూరలూ, పచ్చళ్ళూ, అదీ ఇదీ అని కాకుండా సమస్తం వండించారు. రాజు గారి ఆస్థానంలో ఉండే వంటవారు తీపి మిఠాయిల తయారీలో సిద్ధహస్తులని ప్రఖ్యాతి గడించిన వారవడం చేత బోల్డన్ని రకాల మిఠాయిలు కూడా తయారు చేసారు.\n\nభోజనాల సమయానికి రాజుగారు సపరివార సమేతంగా వంటశాలకి విచ్చేసి విందు భోజనం ఆరగిస్తూ ఉన్నారు. అత్యంత రుచికరంగా ఉన్న మిఠాయిల రుచి చూసిన మంత్రులూ, రాజోద్యోగులూ అందరూ “ఆహా ఓహో.. ఇంతటి మధురమైన మిఠాయిలు వేరెక్కడా తినలేదు.. అద్భుతం!” అంటూ రాజు గారిని పొగడ్తల్లో ముంచెత్తసాగారు.\n\nవాళ్ళ మాటలు వింటున్న రాజు గారికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే “అసలు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యని రుచి కలిగినది ఏది?” అని.\n\nరాజు తలచుకుంటే సమాధానాలకేం కొదవ! అంచేత వెంటనే, తన సందేహాన్ని సమస్త రాచపరివారం ముందు పెట్టారు. “ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?” అని.\n\nఅక్కడున్న అందరూ అప్పటి దాకా ఆ మిఠాయిల తీపిదనంలో ఓలలాడుతున్నారేమో, ఒకరు లడ్డూలు అద్భుతం అంటే, మరొకరు అరిసెలు అన్నీటికన్నా ఉత్తమం అనీ, మరొకరేమో సున్నుండలు మధురాతి మధురం అనీ, వరుసబెట్టి ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మిఠాయి పేరే చెప్పేస్తున్నారు. ఏ సమాధానం చెప్పినా రాజు గారికి మాత్రం సంతృప్తికరంగా అనిపించట్లేదు. ఉదాహరణకి ఎవరన్నా లడ్డూ అని చెప్తే రాజు గారు “ఏం.. అరిసెలు అంతకనా మధురం కాదా?” అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.\n\nచివరికి రాజు గారితో పాటుగా అందరికీ అయోమయంగా అనిపించింది.. అన్నీ మిఠాయిలు మధురంగానే ఉన్నాయి కానీ, అన్నీటిల్లోకీ అత్యంత మధురమైనది ఏంటబ్బా అనుకుంటూ అందరూ ఆలోచనలో పడ్డారు.\n\nఇంతలో రాజు గారి అమ్మాయిలు ఇద్దరూ వంటశాలకి వచ్చారు. తరచూ రాజు గారికొచ్చే చిత్రమైన సందేహాల గురించి వాళ్ళ అమ్మాయిలని కూడా అడగడం ఆయనకి అలవాటే! అంచేత వాళ్ళని ప్రేమగా దగ్గరికి పిలిచి అక్కడ జరుగుతున్న చర్చని వివరించి “ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?” అని ప్రశ్నించారు. ఇద్దరమ్మాయిలూ కొద్దిసేపు ఆలోచించి సమాధానం దొరికింది అన్నారు. రాజు గారు ముందు చిన్నమ్మాయిని చెప్పమన్నారు.\n“ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యని రుచి కలిగిన పదార్ధం ఉప్పు” అని చెప్పింది చిన్నమ్మాయి.\n\nఆ సమాధానం వినగానే అందరూ మొహాలన్నీ వికారంగా పెట్టారు రాజుతో సహా! “మేము అడుగుతోంది.. ప్రపంచంలోకెల్లా తియ్యనిది ఏంటని? అసలు ఉప్పు ప్రపంచంలోకెల్లా తియ్యనిది అని ఎవరైనా ఏ రకంగానైనా నిరూపించగలరా? అది అసాధ్యం కదా!” అంటూ అందరూ కలిసి వాదించి ఆ సమాధానం తప్పని సర్ది చెప్తారు చిన్నమ్మాయికి.\n\nఇంక పెద్దమ్మాయి వంతు వచ్చినప్పుడు “ప్రపంచంలో కెల్లా తియ్యనిది చక్కెర.. ఎందుకంటే మీరందరూ అత్యంత మధురం అని చెప్తున్న ఈ రకరకాల మిఠాయిలన్నీటినీ తయారు చేసేది చక్కరతోనే కదా!” అని చెప్తుంది.\n\nవెంటనే రాజు గారితో సహా అందరూ పెద్దమ్మాయి చెప్పిన సమాధానానికి సంతోషించి అదే సరైన సమాధానమని తీర్మానించడమే కాకుండా పెద్దమ్మాయిని మెచ్చుకుంటారు. హమ్మయ్యా.. ఎలాగైతేనేం ఈసారికి రాజు గారి సందేహం త్వరగానే తీరిపోయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.\n\nకొన్నాళ్ళు గడిచాక రాజు గారి చిన్నమ్మాయి రాజు గారి దగ్గరికొచ్చి ఒక కోరిక కోరుతుంది. త్వరలో రాజ్యంలో జరగబోయే ఉత్సవాల సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేసే బాధ్యత తనకి అప్పజెప్పమంటుంది. తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటానని అడుగుతుంది. సరేనని అంగీకరిస్తారు రాజు గారు.\n\nఆ విందు ఏర్పాట్ల కోసమని రాజు గారి చిన్నమ్మాయి దేశవిదేశాల నుంచీ పేరుగాంచిన నలభీముల్లాంటి పాక శాస్త్ర నిపుణులని ఎంతోమందిని పిలిపిస్తుంది. ఆ ఉత్సవాలు మొదలయేనాటి రోజు రాత్రికి వైభవోపేతంగా రాజపరివారం మొత్తానికి కనీ వినీ ఎరుగని రీతిలో విందుని ఏర్పాటు చేస్తుంది. వందలమంది పరివారం అంతా కూడా ఒకేసారి కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా అతి పెద్ద భోజనాల బల్లను సిద్ధం చేయిస్తుంది. ఎంతో శ్రమ తీసుకుని వండించిన రకరకాల భోజన పదార్థాలనీ, నవకాయ పిండివంటలన్నీటినీ కూడా ఆ భోజనాల బల్ల పొడవునా అందంగా అమరుస్తుంది.\n\nసరిగ్గా భోజనాల సమయానికి రాజు గారితో సహా అందరూ వచ్చి కూర్చుంటారు. భోజనాల బల్ల మీద ఒక్కొక్కరి ముందూ ఒక్కో రకమైన తిండి పదార్ధం అమర్చబడి ఉంటుంది. అందరూ భోజనం చేయడం మొదలెట్టి మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే “ఛీ.. ఇది రుచీ పచీ లేదు..” అంటూ ఒక్క పెట్టున అరుస్తారు చిరాగ్గా! అంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందో అర్థం కాని రాజు గారు చిన్నమ్మాయికేసి ప్రశ్నార్థకంగా చూస్తారు.\n\nఅప్పుడు రాజు గారి చిన్నమ్మాయి “ఇప్పుడు మీరందరి ముందూ ఉన్న ఈ వంటలన్నీ కూడా చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణుల చేత తయారు చేయించబడ్డాయి. ఆయా వంటలు ఎలా వండాలో, క్షుణ్ణంగా తెలిసినవారు ఒక్క పొల్లు తప్పు పోకుండా, అతి జాగ్రత్తగా వండారు. కానీ, నా ఆదేశం మేరకు అన్నీ వంటల్లోనూ కేవలం ఉప్పు మాత్రమే వెయ్యలేదు. కానీ, కేవలం ఉప్పు వెయ్యని కారణంగా ఇన్ని వందల రకాల పదార్థాలకి ఏ రుచీ లేకుండా పోయింది చూసారా? ఇప్పటికైనా అంగీకరిస్తారా.. ప్రపంచంలోకెల్లా తియ్యనైన పదార్థం ఉప్పు అని” వివరణ ఇస్తుంది.\n\nఅప్పుడు రాజు గారితో సహా అందరూ చిన్నమ్మాయి తెలివితేటలకి అబ్బురపడిపోయి “నిజమే! ఉప్పు లేకపోతే ఏ పదార్థానికీ రుచి అన్నదే రాదు.. ప్రపంచంలోకెల్లా తియ్యనిది ఉప్పే!” అని ఒప్పుకుంటూ చిన్నమ్మాయి వివేకాన్ని, సమయస్ఫూర్తినీ మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతారు.\n\nతర్వాత చిన్నమ్మాయి అక్కడున్న ఉప్పు లేని చప్పిడి వంటకాలన్నీటినీ తీసివేయించి ఉప్పు వేసి రుచికరంగా వండిన పదార్థాలని అందరికీ వడ్డన చేయించి విందుని జయప్రదం చేస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 430,
        "IMAGE": "cat_2",
        "NAME": "ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 180,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట! ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.\n\nఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు.\n\nసాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉందని చూస్తాడు. అందులో తను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ్ పొట్టోడికి భలే బాధేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.. ఇలా తను కష్టపడి పని చేసి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో, గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న, బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళమేసి దాచిపెట్టుకుంటే ఎవడో దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్లిపోయాడని.\n\nవెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి గబగబా వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని తెచ్చి, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని లాక్కుని మిరపకాయ పొట్టోడికి ఇచ్చేస్తాడు. దోసకాయంత దొంగోడిని నాలుగు తన్నాక వాడిని జాంకాయంత జైల్లో పడేస్తారు.\n\nఅప్పుడు మిరపకాయ పొట్టోడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చిచ్చినందుకు పొట్లకాయంత పోలీసుని మెచ్చుకుని, ఆ తరవాత సొరకాయంత సైకిలేస్కుని, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తాటికాయంత తాళం వేస్కుని దాచుకుంటాడు.\nఇంకంతే ‘మిరపకాయ్ పొట్టోడు’ కథయిపోయింది. :-)\n\nకొసమెరుపు: ఈ కథని ఒక్క పోలిక కూడా మిస్సవకుండా, తప్పు చెప్పకుండా మీరు చెప్పండి చూద్దాం. చిన్నప్పుడు నేనూ, మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పుకునేవాళ్ళమో యీ కథని. మధ్యలో ఏ ఒక్క పోలిక మర్చిపోయినా, తప్పు చెప్పినా ఓడిపోయినట్టే. మళ్ళీ మొదటినుంచీ చెప్పాల్సిందే! అలా అని మెల్లగా ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్పకూడదు. గబగబా చెప్పెయ్యాలి. మీరూ ప్రయత్నిస్తారా మరి!? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 431,
        "IMAGE": "cat_2",
        "NAME": "మిరపకాయ్ పొట్టోడి కథ! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 181,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "నిప్పూ-నీరు ప్రేమించుకున్నాయి. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాయి. వాటి లక్షణాలే వాటి పెళ్ళికి అడ్డం. నిప్పు తాకితే నీరు ఆవిరవుతుంది. నీరు, నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్ళి చేసుకోవడం ఎట్లా? బాగా ఆలోచించాయి. వారి చుట్టాలను సంప్రదించాయి. నీరేమో వారి బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా “మనకు వాటికి జన్మజన్మల వైరం ఎట్లా కుదురుతుంది” అని కోప్పడ్డాయి.\n\nనిప్పేమో పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పును కోప్పడ్డాయి. వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు. అందరిలాగే పెళ్ళి చేసుకోవాలని పిల్లాజెల్లాతో హాయిగా ఉండాలనుకున్నాయి. కాని ఆశ తీరే దారే కనపడలేదు. చివరకు మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి.\n\nఅతను ఆలోచించి, “సరేలే! మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను” అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు. కాని పెళ్ళికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్ళి వద్దని ప్రమాదమని, కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా యాగి చేశాయి. కార్మికుడు వారిని ఒప్పించాడు.\n\nవారిద్దరి పెళ్ళి చేసి వారిని బాయిలర్ అనే క్రొత్త ఇంట్లో కాపురముంచాడు. వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కాక “ఆవిరి” అనే కొడుకును కన్నాయి. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు, పిడుగు, అగ్నిపర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి.\n\nఆవిరిగాణ్ణి చూసి అందరూ ఆనందించారు. వీడు రైళ్ళను నడుపుతున్నాడు. ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నాడు.\nపెళ్ళి చేసిన కార్మికుడికి కృతజ్ఞతలు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 432,
        "IMAGE": "cat_2",
        "NAME": "నీటికి నిప్పుకు పెళ్ళంట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 182,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది. ఒక రోజు పంకజం మొగుడికి గారెలు తినాలని కోర్కె కలిగి, గారెలు చేయమని భార్యను అడిగాడు. దానికి పంకజం “నాకు ఎలా వండాలో తెలియదు” అంది. పంకజం భర్త “మన పక్కింటి బామ్మ గారు ఉన్నారు కదా ఆవిడని కనుక్కొని చేయమని” అనడంతో, ఆమె పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలని అడిగింది. దానికి బామ్మగారు “చాలా ఈజీ నేను చెపుతాను ఎలా వండాలో. ముందు మినపప్పు నానబెట్టుకోవాలి” అని అనీ అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు అంటూ వెళ్ళి, కొద్దిసేపటికి తిరిగివచ్చి ఆ తరవాత ఏమి చేయాలి అంటుంది. ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు.. నాకు తెలుసు అని వెళ్ళిపోయింది.\n\nపప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పప్పు గా కడిగి రుబ్బేసి, మళ్ళీ బామ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత ఏమి చేయాలని అడిగింది. ఆ తర్వాత నూనె కాగపెట్టి పిండి ని అందులో వేయటమే అని బామ్మ గారు చెపుతుండగానే మళ్ళీ మాములుగానే నాకు తెలుసు ..నాకు తెలుసు అని నూనె కాగకుండానే వేసేసింది. కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు చేశావా అనగానే ఒక గ్లాసులో వేసుకొని తీసుకునివచ్చింది.\n\n“అదేమిటి! గారెలు ఇలా ఉన్నాయేమిటి?!” అని ఆశ్చర్యంగా అడిగిన భర్తతో … “ఏమో బామ్మ గారు చెప్పారు , నేను చేశాను” అని బదులిచ్చింది పంకజం.\n\nవెంటనే పంకజం భర్త బామ్మగారి దగ్గరికి వెళ్ళి “ఇదేమిటి ఇలా చెప్పారు! అంటే, దానికి బామ్మగారు “అసలు నీ భార్య పూర్తిగా వింటే కదా !\n\nపూర్తిగా వినకుండా నాకు తెలుసు.. నాకు తెలుసు అని వెళ్ళిపోతుంటే నేనేమి చేసేది అంది!\n\nఅప్పుడు అతడు భార్యతో ఇలా చెప్పాడు “రేపు బామ్మగారు కూడా గారెలు చేస్తారు చూసి నేర్చుకో బామ్మగారు ఎలా చేస్తారో నువ్వు కూడా అలాగే చేయి మాట్లాడకుండా.. సరేనా?”\nసరే సరే అంది పంకజం.\n\nప్రక్క రోజు పంకజం పొద్దున్నే లేచి బామ్మగారు ఏమి చేస్తే అదే చేయాలనుకుంటుంది. ఆ రోజు బామ్మగారు తల మీద జుట్టు బాగా పెరగటం వలన క్షరకుడిని పిలిపించుకొని నున్నగా గుండు చేయించుకుంది.\n\nఇదంతా చూస్తున్న పంకజానికి రాత్రి భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ‘బామ్మ గారు ఏమి చేస్తుంటే నువ్వు కూడా మాట్లాడకుండా అలాగే చేయి’ అన్నది.\n\nఇంకేముంది పంకజం కూడా నీటు గా గుండు కొట్టించుకుంది. ఆ తర్వాత చక్కగా తల స్నానం చేసి ఒక మడి బట్ట కట్టుకొని సేం బామ్మగారు ఎలా చేస్తారో అలాగే చేసింది.\n\nఆ సాయంత్రానికి భర్త వస్తూనే “గారెలు చేశావా” అని పెద్దగా పిలవగానే, చేశానని లోపలి నుండే అంది పంకజం . పట్టుకురా అని అనగానే గారెలు తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళి తలవంచుకొని నిలబడింది. వెంటనే భర్త నిలబడి అయ్యో బామ్మ గారు మీరు తెచ్చారేమిటి పంకజం ఏమయ్యిందని లోపలకి చూస్తూ అడగగానే ఆమె వెంటనే తల ఎత్తి నేను బామ్మగారిని కాదండి మీ పంకజాన్నే అంది. అంతే పంకజం భర్త ఒక్కసారి విస్తుపోయి “నీకేమి మాయ రోగం వచ్చింది ఇలా గుండు కొట్టించుకున్నావని కోపంగా అడిగాడు.\n\nదానికి పంకజం “మీరే కదా బామ్మగారు ఏమి చేస్తే అలాగే చేయమన్నారు అంది” అలా అమాయకంగా అడుగుతున్న భార్యని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తలపట్టుకుకూర్చొని అసలు గారెలు ఎందుకు చేయమన్నానా అని వాపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 433,
        "IMAGE": "cat_2",
        "NAME": "పంకజం గారెలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 183,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక వూళ్ళో సోమయ్య అని ఒక యువకుడుండేవాడు. అతనికి ఒక చెరుకు తోట ఉండేది. ఒకసారి పంట బాగా పండింది. ఇక రేపో మాపో అమ్ముదామనుకుంటుండగా, ఒకరోజు కొంత చెరకు మాయమైనట్లనిపించింది. మర్నాడు కూడా అలాగే జరిగింది. ఎవరు దొంగిలిస్తున్నారో తేల్చుకోవాలనుకున్నాడు\n\nఆ రాత్రి తోటలోనే కాపలాగా ఉన్నాడు. అర్థరాత్రి అయింది. హఠాత్తుగా వెన్నెలకాంతి లాంటి కాంతి పరచుకుంది ఐరావతం లాంటి ఒక తెల్లని ఏనుగు ఆకాశం నుంచి దిగింది, కొన్ని చెరకుగడలు తిని మళ్ళీ ఆకాశంలోకి( రెక్కలు లేకపోయినా) వెళ్ళిపోయింది.\n\nసోమయ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మర్నాడు మళ్ళీ తోటలో మాటు వేసాడు ఈ సారి ఏనుగు తోక పట్టుకుని దానితో పాటు తను కూడా పైకి వెళ్ళాడు.\nఅక్కడ ఏముందీ…\n\nఒక అద్భుతలోకం. స్వర్గమంటే ఇదేనా అనిపించేటటువంటి ఒక బంగారు లోకం. రకరకాల ఫలవృక్షాలు, అందమైన పక్షులు, తటాకాలు, సెలయేళ్ళూ- నందనవనంలాగా ఉంది. సోమయ్య మర్నాడు పగలంతా ఆ లోకంలో విహరించి ఎంతో ఆనందించాడు. మళ్ళీ రాత్రి ఏనుగుతో పాటు భూమ్మీదకి వచ్చేసాడు తన అద్భుతమైన అనుభవాన్ని దాచుకోలేకపోయాడు. ఎవరికైనా చెప్పాలనిపించింది. తన మితృలకు చెప్పాడు. వాళ్ళు తమని కూడా తీసుకెళ్ళమని సోమయ్యని ఎంతో బతిమాలారు. అతనికి ఇక ఒప్పుకోక తప్పలేదు మర్నాటిరాత్రి అందరినీ తన తోటకి రమ్మన్నాడు. పదిమంది దాకా వెళ్ళడానికి సిద్ధమయి వచ్చారు ఏనుగు రానే వచ్చింది. ముందు సోమయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు …అలా అందరూ ఏనుగుతో పాటు ఆకాశంలోకి ఎగిరారు.\n\nప్రయాణం సాగుతుండగా వాళ్ళు మాట్లాడుకోసాగారు. అంతలో ఒకడికి ఒక సందేహం వచ్చింది. అక్కడ మామిడి చెట్లు ఉంటాయా అని . తన పైనున్న వాడిని అడిగాడు. అతను తన పైనున్న వాడిని … అలా ప్రశ్న సోమయ్య వరకూ వెళ్ళింది సోమయ్య ఉంటాయని చెప్పాడు. జవాబు కిందనున్న అతనికి చేరింది.\n\nకాసేపయాక కిందివాడికి మళ్ళీ సందేహం వచ్చింది – అక్కడ మామిడి పళ్ళు ఎంత వుంటాయని, ప్రశ్న సోమయ్యకి చేరింది అక్కడ చాలా పెద్ద మామిడిపళ్ళు ఉనాయని చెప్పటానికి ‘ ఇంతా ‘ అని సోమయ్య తన రెండు చేతులూ చాపాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 434,
        "IMAGE": "cat_2",
        "NAME": "తెల్లని ఏనుగు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 184,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపైవుంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ వున్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వున్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారికేసి చూసింది. రాయలు ఆమెదగ్గరగా వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరకీ వినిపించ లేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులుకేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడిపళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడిపండు పట్టుకొచ్చాడు (ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పా డవకుండా జగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో). కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు.\n\nఅయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక వుపాయం చెప్పారు “మహారాజా! తమ తల్లి గారి కర్మ పన్నెండో రోజున భ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది” అని.\n\nఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడిపళ్ళు తయారుచేయించమని హుకుం జారీచేసారు.\n\n“వెయ్యి బంగారు మామిడి పళ్ళూ!! అంటే ఎంతో ఖర్చు. ఈ దుబరా ఆపుచేసే మార్గమేలేదా” అని ఆలోచించి ఇందుకు తగిన వాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా వుపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తలవూపి వెళ్ళిపోయాడు.\n\nరాయల వారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచివున్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి “అయ్యలారా! ఈపక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు. ఆగదిలో ప్రతివారి వంటిమీద వాతపెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు” అని ప్రకటించాడు.\n\nకొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు. మిగిలినవారు ఒక్కొక్కరే లోపలకి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు వుండి “అయ్యలారా! మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడిపళ్ళు ఇస్తారు ఆనక మీ యిష్టం” అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండువాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు. రాయలువారు అతనిచేతిలో ఒక బంగారు మామిడిపండు పెట్టారు.\n\n“అయ్యా! నేను రెండువాతలు పెట్టించుకున్నాను. మరి తమరు ఒక్క టే ఇచ్చారు” అని తన వీపుమీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు.\nరాయలవారు నిర్ఘాంతపోయారు. “వాతలేమిటి?” అని అడిగారు.\n\n“అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభూ!” అన్నాడు బావురుమంటూ.\n\nరాయలవారు కోపంతో రామకృష్ణుడు వున్న గదిలోకి వచ్చి, వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి “ఏమిటి కవీశ్వరా! ఈపని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు?” అని గద్దించి అడిగారు.\n\n“మహాప్రభో! నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించినరోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాతపెట్టేలోగా అమె కాస్తా గుటుక్కుమంది. ఆమె చివరకోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ వుండగా తమరు తమ తల్లి గారి ఆత్మ తృప్తికోసం బంగారుపళ్ళు ఇస్తున్నారని విని, వాతలు పెడతానంటే ఎవరూ వప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవచేసి ఈనిర్ణయం తీసుకున్నా” అన్నాడు రామకృష్ణుడు.\n\n“వూరుకోవయ్యా! బ్రాహ్మణులకు వాతలపెడితే ఆమె వాతరోగం పోతుందా?” అన్నారు రాయలవారు కోపంగా.\n\n“చిత్తం. తమ తల్లిగారి కోసం ఎన్నోలక్షలు ఖర్చుపెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే, వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభూ!” అన్నాడు రామకృష్ణుడు.\n\nరాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడడానికి సిగ్గుపడి లోపలకి వెళ్ళిపోయారు.\nతిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగలించుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 435,
        "IMAGE": "cat_2",
        "NAME": "చివరి కోరిక ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 185,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగాఓఅందమైన అడవి. అక్కడ ఉన్నవన్నీసాదుజంతువులుమాత్రమే. అన్నీకలసికట్టుగా సంతోషంగాఆటపాటలతోకాలంగడపుతూఉండేవి. ఆఅడవిలోనేఉండేవనదేవత వాటికి ఏకష్టమూరాకుండాకంటికిరెప్పలాకాపాడుతూఉండేది.\n\nఅక్కడ అన్నింటికన్నాచిన్నదిచందూఅనేకుందేలు. చందూఅంటేఅక్కడివారందరికీభలేముద్దు. అదిఅస్తమానంగెంతులేస్తూఅల్లరిచేస్తూఆటలాడుతూఉండేది.\n\nచందూఇంటిపక్కనేసూర్య అనేఏనుగుఉండేదిచాలాఎత్తుగా, బలంగాచూడగానేబాబోయ్అనిపించేలాఉండేదది. ఎవరన్నామాటవినకుండాసతాయిస్తేవాళ్ళ అమ్మలుఅదిగోసూర్యనిపిలుస్తాననగానేవెంటనేఅల్లరిమానేవాళ్ళు.\nఅదిఎవరైనాసాయంకావాలంటేచేసిపెట్టేది. అందరికీఇండ్లూఅవీ కట్టుకోవడానికిసాయపడేది.\nచందుకుందేలుకిసూర్య ఏనుగంటేచెప్పలేనంత ఆశ్చర్యం. సూర్యాకిఉన్నంత బలంనాకుంటేనా! అనిఎప్పుడూఅనుకునేది.\n\nరానురానూచందూప్రతిదానికీసూర్యాతోపోల్చిచూసుకోవటంఎక్కువైపోయింది. “నేనేమోచిన్నగాముద్దుగాఉన్నానునన్నుచూసిఎవరూబయపడరు, సూర్యాఘీంకరించిందంటేఅడవంతావినిపిస్తుంది, నేనుఎంత అరచినాఇంటిబయటకుకూడావినపడదు” అనుకుంటూబాధ పడుతూఉండేది.\n\nఆసూర్య ఏనుగుకికూడాచందూనిచూస్తేచెప్పలేనంత ఇష్టం. “అందరూదాన్నిముద్దుచేస్తారు, ఎంత బుజ్జిగాఅందంగామెరిసిపోతుందో. ఇప్పుడేఇక్కడ కనిపిస్తుంది అంతలోకేమాయమైమరోపొదకింద ఉంటుంది! అబ్బ ఎంత హాయిగాచలాకీగాపరుగులుపెట్టేస్తుందో! దానిచర్మంఎంత మృదువుగాఉందీ! తనకేమోగరుకుగాఅసహ్యంగాఉంది. దానిచెవులెంత అందంగాఉన్నాయి! తనకేమోచాటల్లాఏంబావోలేవు”. అనుకునేది.\n\nఓసారిచందూసూర్యామాటల్లోతమ మనసులోఉన్న సంగతితెలుసుకున్నారు. ఇంకేం! వాటికిబోల్డంత ఆనందంవేసింది. ఇద్దరూకలిసివనదేవత దగ్గరికిబయల్దేరారు. వనదేవత తోతమ బాధ చెప్పుకునితమనితమకిష్టమైనట్టుగామార్చమనికోరారు.\nవనదేవత చాలామంచిదికదామరికాదనకుండాసూర్య శరీరంలోకిచందూని , చందూబుజ్జిశరీరంలోకిసూర్యనిమార్చేసింది.\nరెండూమారిన తమ శరీరాలుచూసుకునిబోల్డంత ఆనందపడిపోతూఇంటిమొహంపట్టాయి.\n\nచందూకిపెద్ద ఏనుగుశరీరంభలేవింతగాఅనిపిస్తూఉంది, నేలపైనుండితనుచాలాఎత్తులోఉండటంగమ్మత్తుగాఉంది. ఆరోజంతాతన్నితానుచూసుకుంటూ, చెట్లకొమ్మల్నితొండంతోపట్టుకుఊపుతూచిన్న చిన్నాజంతువుల్నిసరదాగాబెదరగొడుతూఅలాగడిపేసింది.\n\nఇక్కడ సూర్యకేమోచందూశరీరంతేలిగ్గాహాయిగాఅనిపించిందిఅడవంతాగెంతులేస్తూ, అందరిఇళ్ళలోగారాబాలుపోతూఆరోజుగడపింది.\n\nఅలాఓరోజుగడవగానేచందూకిఆశరీరంకాస్తాబోర్కొట్టడంమొదలైంది “ఏంటోగెంతులేయడంకుదరదు, పల్టీలుకొట్టలేనుఅడవంతాపరిగెత్తలేను, నాస్నేహితులతోఆడలేను. నన్నుముద్దుచేసేపిల్లలంతానేనుదగ్గరికివెళ్ళగానేభయపడిపోతున్నారు! “ అనుకుంది. ” ఆడుకోనీకుండాఅందరూఏదోఓపనిచెపుతూనేఉన్నారుఓరిదేవుడోయ్ఏనుగులాఉండడమంటేఇంత కష్టమనుకోలేదు. “ అనిఏడ్చేసింది.\n\nఈసూర్య ఏమనుకుందంటే” ఈచిన్న శరీరంలోఇరుక్కుపోయాను, తనివితీరానదిలోస్నానంచేసిరెండురోజులైపోయింది, హాయిగానాకిష్టమైన వెలగ పండ్లుచెట్లపైనుండికోసుకుతినేదాన్ని అస్తమానంఈక్యారెట్లూపచ్చిగడ్డీనమలలేక చస్తున్నానుబాబోయ్! అందరూనాసాయంకోరివచ్చేవాళ్ళు, ఇప్పుడెవరూనన్నుపట్టించుకోరు. అందరికీసాయంచేసివాళ్ళ మెప్పుపొందడంఎంత బావుండేదో! అనిదిగులుపడడంమొదలెట్టింది. పనిలేక మహాబోరుగాఉందిఈచిన్న చిన్న కుందేళ్ళ తోఎంత సేపనిఆడనూ! అనుకుందివిసుగ్గా.\n\nచివరకిఎవరిశరీరంలోకివాళ్ళువెళ్ళిపోవాలనిఅనుకుని, ఇద్దరూకలిసివనదేవత దగ్గరికివెళ్ళి“అమ్మావేరేవాళ్ళలాఉండడంమాకేంబావోలేదుమమ్మల్నిముందులామార్చేసేయీ”అనివేడుకున్నాయి.\n\nవనదేవత చాలామంచిదనిముందేచెప్పుకున్నాంకదా, వేంటనేతిరిగిఎవరిశరీరంలోకివాళ్ళనిచేర్చేసింది.\nఅప్పుడుచందూగెంతులేస్తూహాయిగాపరిగెత్తింది.\nసూర్యానదిలోకిదిగినీళ్ళుచిమ్ముతూహమ్మయ్య! అనుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 436,
        "IMAGE": "cat_2",
        "NAME": "చందు సూర్య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 186,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఓ పెద్ద మామిడి చెట్టుపై రెండు కోకిలలు గూడు కట్టుకుని ఉంటుండేవి. పాటలు పాడుకుంటూ, ఆటలాడుతూ సరదాగా అడవి అంతా తిరుగుతూ హాయిగా కాలం గడిపేవి. కొన్నాళ్ళకి కోకిలమ్మ నాలుగు గుడ్లు పెట్టింది. ‘ఇన్నాళ్ళూ మనిద్దరమే ఉన్నాం, ఇకపై మనకి చిన్న చిన్న పిల్లలు రాబోతున్నాయి’ అని సంతోషంగా అనుకున్నాయి అవి. కోకిలమ్మ ఆ గుడ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగింది. కొత్తగా రాబోయే పిల్లలకు ఆ చిన్ని గూడు సరిపోదని తలచి ఆ చెట్టుమీదే మరో ఎత్తైన బలమైన కొమ్మల్లో ఇంకో కొత్త గూడు కట్టడం మొదలెట్టాడు కోకిలయ్య.\n\nగుడ్లను వదిలి ఒక్క క్షణమైనా అవతలికి పొయ్యేది కాదు కోకిలమ్మ. వాళ్ళ ఆట పాటలు అన్నీ మానుకున్నారు ఐనా ఎంతో సంతోషంతో ఉండేవారు.\n\nఅలా కొద్ది రోజులు గడిచాక ఓ నాడు గుడ్డులోంచి ఒక పిల్ల బయటకు వచ్చింది. కోకిలలు ఎంతో సంబర పడ్డాయి. ఆరోజే కోకిలయ్య కడుతున్న గూడు కూడా పుర్తయ్యింది. ఆ కొత్త గూడు ఎంతో విశాలంగా, సౌకర్యంగా చాలా బావుంది. కోకిలమ్మ దాన్ని చక్కగా అలంకరించింది. కోకిలయ్య మెత్తటి పరకలూ, వాటి పై దూదీ వేసి చక్కటి పడకలు తయారు చేశాడు.\n\nఆ తరువాతి రోజు ఇంకో గుడ్డులోంచి, మరునాడు మరో గుడ్డులోంచి కూడా పిల్లలు బయటకి వచ్చాయి. అవి మెల్లిగా కళ్ళు తెరచి చూస్తూ కోకిలయ్య తెచ్చి అందించే ఆహారాన్ని తినటం నేర్చుకోసాగాయి.\n\nనాలుగో గుడ్డులోంచి పిల్ల ఇంకా బయటకి రాలేదేమానని కోకిలమ్మ కంగారు పడసాగింది. “ఈ చివరి బిడ్డను కూడా మాకు భద్రంగా అందించు దేవుడా” అని దేవుడిని ప్రార్ధించాడు కోకిలయ్య.\n\nమూడు పిల్లలూ మెల్లిగా లేచి నిలబడటం, అడుగులు వేయటం, చక్కగా ఆహారం తినటం నేర్చేసుకున్నాయి. చివరకు కొద్ది రోజుల తరువాత ఆ నాలుగో గుడ్డులోంచి కూడా పిల్ల బయటకి వచ్చేసింది. ’హమ్మయ్య’ అనుకున్నాయి కోకిలలు. చివరకు దక్కదేమో అనుకున్న పిల్ల దక్కింది’ అనుకున్నాయి ఆనందంగా.\n\nరోజూ అందరికీ ఆహారం తెచ్చేవాడు కోకిలయ్య. కోకిలమ్మ గూడువద్దే ఉండి పిల్లలను భద్రంగా చూసుకునేది. చక్కగా నడవటం, రెక్కలను ఉపయోగించడం నేర్పించేది. నాలుగో పిల్లంటే అందరికీ చాలా ముద్దు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వారు.\n\nమెల్లిగా మూడు పిల్లలూ ఎగరడం నేర్చుకున్నాయి. నాలుగోది మాత్రం నేర్చుకోలేది. పోనీలే పాపం చిన్నపిల్ల అసలే అది అపురూపమైంది, మెల్లిగా నేర్చుకుంటుంది అని సరిపెట్టుకున్నాయి కోకిలమ్మా కోకిలయ్యా.\n\nమూడు పిల్లలు ఆడే ఆటలతో, అవి నేర్చుకునే పాటలతో ఆ చెట్టు ఎంతో సందడిగా మారింది. మన చెట్టు ముందెన్నడూ లేనంత అందంగా ఉంది అనుకున్నాయి కోకిలమ్మా కోకిలయ్యా.\n\nఓనాడు కోకిలయ్య ఆహారానికి వెళుతూవుంటే “మేమూ వస్తాం” అన్నాయి పిల్లలు. కోకిలమ్మ ఎంతో సంతోషించింది. వాళ్ళను పంపుతూ తనూ కూడా వెళ్ళాలని అనుకుంది. కానీ ఆ చిన్న పిల్లేమో ఇంతవరకూ ఎగరడం నేర్చుకోలేదు. హాయిగా అమ్మనోట్లో పెడితే తినడం దానికెంతో బావుంది. అందరూ దానిని గారాబం చేశారు అందుకే దానికి కష్టపడటం ఇష్టంలేదు.\nచిన్న పిల్లగురించి కోకిలయ్య ఎంతో దిగులు పడుతూ ఉండేవాడు.\n\nరోజూలాగే ఓనాడు ముగ్గురు పిల్లలతో కలిసి అడవిలో తిరుగుతున్న కోకిలయ్యకి ఓచోట తన చిన్ననాటి నేస్తమైన చిలుక కనిపించింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. కోకిలయ్య తన ముగ్గురు పిల్లల్ని చిలుకకు చూపించాడు. నాలుగో పిల్ల గురించి తన బాధ చెప్పుకున్నాడు. “ఎంతో ఆనందంగా ఉన్నాము కానీ ఆ చిన్న పిల్ల భవిష్యత్తు తలచుకుంతేనే ఈ ఆనందమంతా ఎగిరిపోతూ ఉంది.” అన్నాడు.\n\nదానికి చిలక “నీ చిన్న పిల్ల సంగతి నేను చూసుకుంటాను. నా దగ్గరో ఉపాయంవుంది.” అంటూ “ రేపు మీరంతా చిన్న పిల్లను ఒంటరిగా గూటిలోనే వదిలేసి ఆహారానికి వెళ్ళండి.” అంది.\n\n“అమ్మో అసలే సరిగా ఎగరలేని పిల్ల దాన్ని వదిలేసి ఎలా అందరం వెళతాం ! దాని దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే ! వాళ్ళ అమ్మ పాటలు పాడుతూ దాన్ని కనిపెట్టుకుని ఉంటుంది.” అన్నాడు కోకిలయ్య.\n\n“మరేం పరవాలేదు దాని దగ్గర నేను ఉంటాను. మీరంతా ఉదయాన్నే లేచి వెళ్ళిపొండి. మళ్ళీ చెపుతున్నా ఎవ్వరూ దాని దగ్గర ఉండొద్దు.” అంది చిలక.\n\nచిలక మాటలపై కోకిలయ్యకు ఎంతో గురి. “అది చాలా తెలివైంది, తన పిల్లను బాగు చెయ్యగలదు” అనుకున్నాడు. “సరే నీమాటపై నమ్మకంతో నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు రేపు పెందలాడే రావాలి, మేం తిరిగి వచ్చేదాకా పిల్ల దగ్గరే ఉండాలి సుమా!” అన్నాడు.\n\n“నీకేం భయం అక్కర్లేదు. రేపు మీరు తిరిగి మీ గూడు చేరుకునే సరికి మీ పిల్లను ఎగిరేలా చేస్తాను. నువ్వే చూస్తావుగా.” నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయింది చిలక.\n\nవాళ్ళ పధకం ప్రకారం మర్నాడు ఉదయాన్నే కోకిలయ్య కోకిలమ్మనూ ముగ్గురు పిల్లలను తీసుకుని ఆహారానికై అడవిలోకి వెళ్ళిపోయాడు. చెట్టుమీద గూటిలో చిన్నపిల్ల ఒంటరిగా ఉండిపోయింది.\n\nఅప్పటికే అక్కడికి వచ్చిన చిలక ఓ గుబురు కొమ్మ పై ఆకుల చాటున కూర్చుంది. గూట్లో చిన్న పిల్లకు ఒంటరితనం విసుగ్గా ఉంది. తనతో మాట్లాడేవాళ్ళు లేరు, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఏఅడవి పిల్లి, ఇంకేదైనా వచ్చి తనను తినేస్తుందేమో నని భయం! మెల్లిగా మధ్యహ్నాం అయ్యింది. గూట్లోని చిన్న పిల్లకు భయం విసుగు ఎక్కువైపోయాయి. బయట ఏ చిన్న శబ్దం ఐనా ఉలిక్కి పడసాగింది. ఇంకాసేపటికి ఎడవటం మొదలెట్టింది.\n\nఅంతదాకా ఆకులచాటున దాగి ఉన్న చిలక చిన్నపిల్ల ముందుకు వచ్చి “ ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది?” అని ప్రశ్నించింది.\n\nచిన్న పిల్ల ఏడుపు ఆపి చిలకను చూస్తూ “నేనొక్క దాన్నే ఉన్నాను భయంవేసి ఏడుస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు?” అంది.\n\n“నన్ను చిలక అంటారు. నేను కోకిలయ్య నేస్తాన్ని. ఇలా ఈ దారిలో వెళూతూ ఉన్నాను, నీ ఏడుపు విని వచ్చాను. నువ్వు చక్కగా ఉన్నావు అందరితో పాటు బయటకి వెళ్ళకుండా ఒంటరిగా గూటిలో ఎందుకున్నావ్? అని ఏమీ తెలియనట్టు అడిగింది చిలక.\n\n“నాకు ఇలా ఉంటేనే బావుంటుంది. అందుకే ఈ రోజు దాకా వాళ్ళతో వెళ్ళలేదు. అదీ గాక నాకు ఎగరటం అంటే విసుగు. కష్టపడీ అవన్నీ నేర్చుకునేది తిండి కోసమే కదా. నాకు అమ్మా నాన్నా ఎంచక్కా తెచ్చి పెడతారు, అందుకే నేను ఎగరడం నేర్చుకోలేదు. మా గూడు ఇంత అందమైంది దీన్ని విడిచి బయటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది! హాయిగా మెత్తగా ఇలా పడకపై పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.” అంటూ కారణం వివరించింది పిల్ల.\n\n“అయ్యో నువ్వెంత అమాయకంగా ఉన్నావు! ఎగిరితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఇలా పడుకుంటే కలిగే హాయికంటే ఎక్కువ హాయిగా ఉంటుంది. పందేలు, పల్టీలు, ఉయ్యాల్లు ఇలా ఎన్నెన్ని రకాల ఆటలు ఆడవచ్చో నీకు తెలియదల్లే ఉంది! ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది.” అంటూ ఊరించి చెపుతున్న చిలక వైపు “నిజంగానా!” అన్నట్టు ఆశగా చూసింది పిల్ల.\n\n“ఊ మరేం అనుకున్నావ్? బయటకెడితే అడవిలో ఎన్నెన్ని వింతలు చూడవచ్చు విసుగనేదే ఉండదు. వేటాడొచ్చు, రకరకాల తిండి తినవచ్చు. కొత్త కొత్త స్నేహితులు దొరకుతారు. వాళ్ళతో బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. ఎన్ని వింతలూ అందాలు చూడవచ్చు. గొంతెత్తి పాడితే, రెక్క విప్పి ఎగిరితే, అడవంతా షికార్లు కొడితే అదీ అదే అసలైన ఆనందం.” అంటూ చెప్పింది చిలక.\n\n“నిజమా! ఐతే నేను ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటా. దయచేసి నాకు సహాయం చేయవా?” అంది పిల్ల.\n\nసాయంత్రం అమ్మా నాన్నా అన్నలు వచ్చే సరికి ఎంచక్కా ఎగరటం నేర్చేసుకుని వాళ్ళని ఆనందంలో ఆశ్చర్యంలో ముంచెత్తాలని నిర్ణయించుకుంది చిన్నపిల్ల. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 437,
        "IMAGE": "cat_2",
        "NAME": "అసలైన ఆనందం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 187,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కాకీ, ఎలుక, తాబేలు కలిసిమెలసి సంతోషంగా కాలం గడుపుతుండగా ఓ నాడు ఓ లేడి అక్కడికి రొప్పుతూ పరుగుతో వచ్చింది. దాన్ని చూసి భయంతో ఎలుక కలుగులోకి, తాబేలు చెరువులోకి కాకి చెట్టుపైకి వెళ్ళిపోయాయి. ప్రమాదంలేదని నిర్ధారించుకుని తిరిగి అన్ని ఒకచోట కూడాయి. “నువ్వు ఎవరివి? ఇలా పరుగుతో ఇక్కడికి ఎందుకొచ్చావు?” అంటూ ఆ లేడి ని అడిగాడు మంథరుడు.\n\n“నా పేరు చిత్రాంగుడు.నన్నొక వేటగాడు తరమగా ఇలా వచ్చాను.” అని చెప్పి వారి మిత్రుడిగా తననూ చేర్చుకోమనీ, అక్కడ తనకు ఆశ్రయం ఇవ్వవలసిందని అడిగిందా లేడి.\n\nలేడి సాధు స్వభావి కనుక దాని స్నేహం ఒప్పుకో తగ్గదే నంటూ మాలో ఒకడిగా ఇక్కడే ఉండవచ్చు అని అంగీకరించింది తాబేలు.\nఅప్పటినుండీ ఆ నలుగురూ స్నేహితులుగా ఎంతో సఖ్యంగా ఉండసాగారు.\nఓనాడు బయటకి వెళ్ళిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. మంథరుడు ఆందోళనపడసాగాడు. లఘుపతనకం చిత్రాంగుడి జాడకోసం వెతుకుతూ వెళ్ళింది.\nదానికి ఓ చోట వేటగాడి వలలో చిక్కుకున్న లేడి కనిపించింది.\nలేడి కాకితో ఈ వెటగాడు రాకముందే నేను బయట పడాలి. నువ్వు త్వరగా వెళ్ళి హిరణ్యకుడిని తీసుకురా. తను ఈ వలకొరికి నన్ను విడిపించగలడు. అంది.\n\nలఘుపతనకం వెంటనే ఎగిరివెళ్ళి మిగతా మిత్రులతో ఈ సంగతి చెప్పి. హిరణ్యకుడిని తన వీపుపై కూర్చోబెట్టుకుని ఎగురుతూ వచ్చి లేడి వద్ద వాలింది. ఎలుక ఆ వలని ముక్కలుగా కొరికివేయగా చిత్రాంగుడు వలనుండి బయటపడ్డాడు.\n\n\n\nముగ్గురూ కలిసి తామున్న చోటికి బయల్దేరి వస్తుండగా. హిరణ్యకుడు చిత్రాంగుడిని . ” నువ్వెంతో తెలివైన వాడివి. ఇలా ఆపదలో ఎలా చిక్కుకున్నావు”? అంటూ అడిగాడు.\n\nతెలివైనవాడైనా తెలివితక్కువ వాడైనా ఎప్పడు ఏ ఖర్మ అనుభవించాలో అది అనుభవించక తప్పదు. అనే మాటకు నా జీవితమే నిదర్శనము.\nఅంటూ తన కథను ఇలా చెప్పింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 438,
        "IMAGE": "cat_2",
        "NAME": "మిత్రలాభం — చిత్రాంగుని కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 188,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక పిల్ల ఉంది. అది అల్లరిది .. దానికి తొందరెక్కువ.. చెప్పిన మాట వినదు.. ఒకరోజు దానికి పరమాన్నం తినాలనే కోరిక పుట్టింది..\n\nఅది అమ్మ దగ్గరకు వెళ్లి దాని కోరిక చెప్పింది.. పరమాన్నానికి పాలు, బెల్లం, జీడి పప్పు , నెయ్యి అన్నీ కావాలమ్మా, నాన్న రాగానే వండుతా అని చెప్పింది అమ్మ.\n\nఅయినా సరే ” ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి” ఏడుపు మొదలు పెట్టింది పిచ్చుక పిల్ల. చేసేది లేక వాళ్ళ అమ్మే అన్నీ తెచ్చుకుని వంట మొదలు పెట్టింది.\n\nవంట చేస్తున్నంత సేపు పిచ్చుక ఎప్పుడు పెడతావ్? ఎప్పుడు అవుతుంది ? అని అమ్మను విసిగించడం మొదలు పెట్టింది.. పరమాన్నం వండి చిన్న గిన్నెలో దానిని వేసి. “వేడిగా ఉంది కొద్ది సేపు ఆగమ్మా” అని చెప్పింది తల్లి ..\n\n“లేదు లేదు నేను ఇప్పుడే తింటాను” అని ముక్కు పెట్టింది పిచ్చుక .. దానికి బాగా కాలింది.. అది ఏడుస్తూ కూర్చుంది …\n\nచెప్పిన మాట వినవు కదా అని అమ్మ దానికి చల్లార్చి ఇచ్చింది.. అయినా పిచ్చుకకు బుద్ది రాలేదు… నేను బయటకు వెళ్లి తింటాను అని మళ్లీ గొడవ మొదలు పెట్టింది..\n\nవద్దమ్మా..నువ్వు చిన్న పిల్లవు..నీకు లోకం తీరు తెలియదు అని అమ్మ ఎంత చెప్పినా వినలేదు..\n\nదాని గిన్నె ముక్కుతో పట్టుకుని ఒక పెద్ద చెట్టు పై కూర్చుని తినడం మొదలు పెట్టింది..\n\nఎక్కడినుండో ఒక కాకి వచ్చింది.. “ఓయ్ ఆ గిన్నె నాకు ఇచ్చి వెళ్ళిపో” అని పిచ్చుక పై అరిచింది కాకి..\n\n“ఇది మా అమ్మ వండింది నేను ఇవ్వను ” అని పిచ్చుక గొడవ చేసింది.. ఆ పెనుగులాటలో మొత్తం క్రింద ఇసుకలో పడిపోయింది … కాకి కి కోపం వచ్చి పిచ్చుకను ముక్కుతో బాగా పొడిచి గాయ పరచి వెళ్ళిపోయింది..\n\nపిచ్చుకకు బుద్ది వచ్చింది.. అమ్మ దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది..\nఅందుకే పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి… ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 439,
        "IMAGE": "cat_2",
        "NAME": "పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 189,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో దేవర్షి అనే గురువు వద్ద బాలరాజు, ద్రోణుడు విద్యనభ్యసించారు. శిక్షణ పూర్తికాగానే వారిద్దరూ వేర్వేరుగా ఆశ్రమాలు స్థాపించారు.\n\nబాలరాజు తన శిష్యులకు శాస్త్రం బోధించి నేర్పించేవాడు. వాళ్ళ సమయం వృథాకాకుండా తన సమక్షంలోనే చదివించేవాడు. ఏదైనా మార్పుచేస్తే సహించేవాడు కాదు. తాను చెప్పిన శాస్త్రాన్ని వల్లె వేయించేవాడు. తాను చెప్పిందే తు.చ. తప్పకుండా చెప్పాలనేవాడు. ద్రోణుడు తమ శిష్యులను మిత్రుల వలే చూసేవాడు. వారు వారి పక్కవారిని అడిగి తెలుసుకొని, ఆ పైన సొంతంగా ఆలోచించి చదివేవారు. ఆ సంవత్సరం రాజస్థానంలో విద్యాసభలు జరిగాయి. బాలరాజు శిష్యులు శాస్త్రాన్ని పొల్లుపోకుండా చెప్పి అందరి మెప్పు పొందారు.\n\nద్రోణుడు శిష్యులు శాస్త్రాలలో ఉండే రహస్యాలూ, అనుపానులు అన్నీ చెప్పి లోపాలను ఎత్తి చూపారు. సవరణలు కూడా సూచించారు. రాజు వారి ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాజు వారికి కానుకలు బహుకరించాడు.\n\nబాలరాజు వాళ్ళ గురువు అయిన దేవర్షి వద్దకు వెళ్ళి “గురుదేవా! నేను మా శిష్యులకు బాగా పాఠం చెప్పి క్షణం వృథా కాకుండా శిక్షణనిచ్చాను. అయితే నా శిష్యులకన్నా ద్రోణుడి శిష్యులకు మంచిపేరు ఎలా వచ్చింది? సెలవీయండి” అని అడిగాడు.\n\nదానికి దేవర్షి చిరునవ్వు నవ్వాడు. “వత్సాబాలరాజా! నీవు శిష్యులకు బాగా బోధించావు. కాదనటం లేదు. కాని వాళ్ళ ఊహాశక్తికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చిలుక పలుకుల్లా నీవు బోధించేదే వాళ్ళు అభ్యసించారు. అలాకాక ద్రోణుడు తాను బోధించి, ఆ తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఆలోచించి, అవగాహన చేసుకొన్నారు. యథేచ్చగా చర్చించుకొని శాస్త్రంలోని అంశాలు లోతుగా తెలుసుకొన్నారు. మళ్ళీ ప్రశ్నించి వాళ్ళు తెలుసుకొన్న దానికి తుది మెరుగులు దిద్దుతాడు గురువు.\n\n“ఆచార్యాత్ పాదమాదత్తె\nపాదం శిష్యః స్వమేధయా!\nపాదం సత్ బ్రహ్మ చారిభ్యః\nపాదం కాలక్రమేణచ॥\nఅనే శ్లోకం వినలేదా!” అన్నాడు.\n\n(శ్లోకం భావం; గురువు శిష్యునికి అందించే జ్ఞానము ఒక పావు భాగము మాత్రమే. శిష్యుడు సొంత తెలివి తేటలతో నేర్చుకొనేది మరో పావు భాగం. ఇక సమవయస్కులతో నేర్చుకొనేది మరొక పావు భాగం. మిగతా పావు భాగాన్ని కాలక్రమేణా అనుభవాలతో నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు. ఇదీ మన విద్యతత్వం)\nదాంతో బాలరాజు తాను చేసిన పొరపాటేమిటో తెలుసుకొని, సిగ్గుతో తలవంచుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 440,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఉత్తమ బోధన ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 190,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ ఓళ్ళో ఓ కమ్మరి ఉండేవాడు. ఓసారి ఒక ఇనుప ముక్కతో రెండు నాగలి కొర్రులు తయారు చేశాడు. రెండిటిలో మొదటి దాన్ని ఓ రైతుకి అమ్మివేశాడు. అది చూసి రెండో నాగలి కొర్రు “నన్ను అమ్మొద్దు, నాకు పని చేయడం ఇష్టం లేదు. నీ దగ్గరే నన్ను ఉండనివ్వు” అని కమ్మరిని అడిగింది. కమ్మరి సరే నని ఆ రెండో దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు.\n\nకొంత కాలం గడిచాక ఓ రోజు రైతు తను కొనుక్కున్న ఆ మొదటి నాగలితో కొర్రు తో కమ్మరి వద్దకు వచ్చాడు. ఆ కొర్రు తయారైన నాటి కంటే నిగ నిగ లాడుతూ పదును తేరి, ఎంతో అందంగా కనిపించింది.\nకమ్మరి వద్దనున్న కొర్రు మాత్రం తుప్పు పట్టి ఓ మూలన పడి ఉంది.\n\n“మనిద్దరినీ కమ్మరి ఒకేసారి తయారు చేశాడు ఒకే ఇనుప ముక్కనుండి పుట్టిన వాళ్ళం. నేను తుప్పు పట్టి ఈ స్థితిలో ఉన్నా! నువ్వు మెరిసి పోతున్నావ్. మొదటి కంటే అందంగా తయారైపోయావు! కారణం ఏమిటని?” అడిగింది రెండో నాగలి కొర్రు మొదటి నాగలి కొర్రుని “పని చేస్తూ ఉంటాను కాబట్టి నేనిలా అందంగా పదునుగా ఉన్నాను. నువ్వు పనిలేక ఉంటావు గనక తుప్పుపట్టి నీరసించి పోయావు. పని చేయటంలోనే ఆనందం, ఆనందంలొనే అందం ఉంది.” అంది మొదటి కొర్రు.\n\nదానితో రెండో నాగలి కొర్రు తన పొరపాటుని గ్రహించి, తననూ బాగు చేసి ఎవరైనా రైతు కి అమ్మివేయమని కమ్మరితో చెప్పింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 441,
        "IMAGE": "cat_2",
        "NAME": "పని లోనే అందం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 191,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అదొక పల్లెటూరు. అపుడే సూర్యుడస్తమించాడు. చీకటి నలుదెసల అలముకుంటున్నది. వీధి దీపాలు లేని కుగ్రామమది. పొలాలకు వెళ్ళిన కర్షకులు గేదెలను తోలుకొని ఇళ్ళకు చేరుతున్నారు. దోవ సరిగా కానరావడం లేదు. మిణుగురు పురుగులు ఆ చీకటిలో ఎగురుతూ అందమైన కాంతులనిస్తున్నాయి. “మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని గర్వంతో ఎగురుతున్నాయి.\n\nకొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమని ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాల వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తూ వున్నది. తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వలన మిణుగురు పురుగుల గర్వమణిగింది. అపుడు”ఈ చీకటిలో మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని నక్షత్రాలు గర్విస్తున్నాయి.\n\nమరికొంతసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారబోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాడు. తమకంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించుటవలన నక్షత్రముల గర్వమణిగిపోయినది. అపుడు “నేను వెన్నెలనిస్తున్నాను, నేను వెన్నెలనిస్తున్నాను” అని చంద్రుడు గర్వించాడు. తన వలననే భూమి మీద జనులు వెన్నెట్లో తిరగగలుగుచున్నారని భావించాడు.\n\nకొలది గంటల పిదప తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించాడు. అంతటితో చంద్రుని గర్వం తగ్గిపోయింది. ప్రకాశాన్ని కోల్పోయి చంద్రుడు వెలవెలపోయాడు. ప్రకృతిలోని ఈ సన్నివేశాన్ని గమనించి ఎవరూ తమకు విద్య ఉన్నదనీ, అందం ఉన్నదనీ, ధనమున్నదనీ గర్వపడకూడదు. విద్యార్థులు తమకంటే అధిక విద్యావంతులతో పోల్చుకొని గర్వాన్ని దూరం చేసుకోవాలి. గర్వం అభివృద్ధికి అడ్డంకిగా ఉంటుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 442,
        "IMAGE": "cat_2",
        "NAME": "గర్వము దరి చేరరాదు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 192,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "గిరి సీతానగరం హై స్కూలులో ఎనిమిదవ తరగతిలో కొత్తగా చేరాడు. ఆటలలో ప్రావీణ్యం చూపడంతో, చేరిన కొద్దిరోజులకే గిరి స్కూలులో అందరినీ బాగా ఆకట్టుకొన్నాడు.\n\nస్కూలులో త్రైమాసిక పరిక్షలు జరుగుతున్నాయి. “గిరీ ఏమిటి నువ్వు చేస్తున్న పని, తప్పు కదు,” గద్దించారు (పర్యవేక్షకుడి) గా వచ్చిన లెక్కల మాస్టారు. పక్క విద్యార్థి జవాబు పత్రం నుంచి కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్న గిరి తల దించుకుని “క్షమించండి సార్! నేను సరిగా చదవలేదు. మార్కులు బాగా రాకపొతే మా అమ్మ- నాన్న గారు తిడతారు. అందుకని ఇలా చేసాను. ఇంకెప్పుడూ ఇలా చేయను మాస్టారు” అన్నాడు.\n\nపరీక్ష రాయడం ఆపి గిరికేసి చూస్తున్న మిగతా విధ్యార్థులను పరిక్ష రాయమని హెచ్చరించి, పరిక్ష అయిపోయాక ఇంటికి వెళ్ళేముందు తనను కలిసి వెళ్ళమని గిరితో చెప్పి పరిక్ష రాస్తున్న విధ్యార్థులను గమనించసాగారు లెక్కల మాస్టారు. పరీక్ష అయిపోయాక, ఇంటికి వెళ్ళేముందు స్టాఫ్ రూమ్ కి వెళ్ళి లెక్కల మాస్టారిని కలిసాడు.\n“మాస్టారు, దయచేసి ఈ విషయాన్ని మా అమ్మ, నాన్న గారికి చెప్పకండి” అంటూ బ్రతిమిలాడాడు.\n\n“నువ్వు చాలా తెలివైన వాడివని విన్నాను. మరి ఇలా చేసావేమిటి? నీకు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజం చెపితే మీ వాళ్ళకు పిర్యాదు చెయ్యను. అసలు కారణం చెప్పు” అని అడిగారు లెక్కల మాస్టారు.\n\n“కొన్ని పాఠాలు అర్ధం కాలేదు మాస్టారు. క్లాసులొ సందేహాలు అడుగుదామంటే మిగతా పిల్లలు నవ్వుతారేమో అని సంకోచించాను. వాటిని చదవకుండా వదిలేసాను. పైగా పరీక్షల ముందు టీవీలొ క్రిక్రెట్ మ్యాచ్ లు చూసాను. దాంతో పరీక్ష ముందు చదువుదామనుకున్నా ప్రశ్నలకు జవాబులు చదవలేక పోయాను. అందువల్ల ఇలా కాపీ కొట్టి మార్కులు పొందాలని ప్రయత్నించాను మాస్టారు” అని నిజాయితీగా తన తప్పు ఒప్పుకున్నాడు గిరి.\n\n“చూడు గిరీ, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. ఇలా కాపీ కొట్టి మార్కులు సంపాదించుకొంటే అది తాత్కాలిక విజయం మాత్రమే! అది ఇప్పుడు నీకు, మీ వాళ్ళకు సంతొషాన్ని కలిగించినా, భవిష్యత్తులొ నీకు ఏ మాత్రం ఉపయోగ పడదు. కాపీ కొడితే మార్కులైతే సాధిస్తావేమో కానీ, ఆయా పాఠాలపై ఎప్పటికీ పట్టు సాధించలేవు. వాటిలోని విజ్ఞానాన్ని గ్రహించలేవు. పైగా ఈ సారి కాపీ కొట్టడంలొ సఫలమైతే, మరోసారి లేదా ప్రతీసారీ దానికే అలవాటు పడిపోతావు. అప్పుడు నీ భవిష్యత్తు ఏమిటి? తెలివితేటలు, జ్ఞాపకశక్తి, కస్టపడేతత్వం ఇలాంటి సుగుణాలన్నీ మరుగున పడిపోయి, నువ్వు ఇతరులపై ఆధార పడిపోయే వ్యక్తిలా మిగిలి పోతావు. నువ్వు ఇలా తయారవ్వాలని మీ తల్లి దండ్రులు కోరుకోరు కదా” అడిగారు లెక్కల మాస్టారు.\n\nఈ సంభాషన అంతా వింటున్న మరో మాస్టారు ” ఇంత వివరణ ఎందుకు మాస్టారు నాలుగు దెబ్బలు వేస్తే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయడు” అని అన్నారు. “అన్ని సంధర్భాలలోనూ దండన అవసరంలేదు మాస్టారు” అన్నారు లెక్కల మాస్టారు. ఆయనే మళ్ళీ మాట్లాడుతూ “గిరీ, విజ్ఞానాన్ని కష్టపడి గ్రహించాలి కానీ ఇలాంటి తప్పుడు పద్దతుల వల్ల కాదు. పాఠాలలోని విజ్ఞానాన్ని గ్రహించాలంటే క్లాసులో పాఠాలు శ్రద్దగా వినాలి. ఏవైనా సందేహాలుంటే, వెనుకాడకుండా వాటిని నివృత్తి చేసుకోవాలి. ఏ రోజు చెప్పిన పాఠాలు ఆరోజే చదువుకోవాలి. అలా ముఖ్యంగా విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా అవసరం. సమయాన్ని వృధాచేయకుండా, చదువుకు, మానసిక అభివృధ్ధికి ఉపయోగించుకొవాలి. అప్పుడే మీ తల్లి దండ్రులు ఆశించినట్టు నువ్వు జీవితంలో అభివృద్ధిలోకి వస్తావు” అని వివరించారు.\n\nతన భావి జీవితాన్ని సరైన మార్గంలొ నడిపించడం కోసం, మాస్టారు చేసిన విలువైన సూచనను గ్రహించిన గిరి, ఆ తరువాత ఎప్పుడూ కాపీ కొట్టకుండా, కష్టపడి చదువుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 443,
        "IMAGE": "cat_2",
        "NAME": "సరైన మార్గం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 193,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "” తాతయ్యా ..!తాతయ్యా..! ” అం టూ పిల్ల నక్క పరుగెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు.\n\n” ఏంట్రా… చిన్నోడా..ఆ హడావుడి…” పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క.\n\n”తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము….! ” అంది.\n\n” నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. ” అంది తాత నక్క గతాన్ని గుర్తుకు తెచ్చు కుం టూ.\n\n”నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని…వాళ్ళ నాన్నలు చెప్పారని చెప్పారు. ఏంటి తాతయ్యా…ద్రాక్ష తియ్యగా వుండదా…? ” అడిగింది పిల్ల నక్క.\n\nతాత నక్కకు ఏమి చెపాలో తోచ లేదు. ద్రాక్ష రుచి తనకూ తెలియదు. ఆ రోజుల్లో ద్రాక్ష తినాలని ఎంతగానో ప్రయత్నించి, వీలుకాక వదిలేసిన సంగతి గుర్తుకొచ్చింది. ఎగిరి ఎగిరి .. అందుకోలేక …వెల్లికిలా పడి, నడ్డి విరగ్గొట్టుకుని వెనక్కి వచ్చేసిన తను. …, ఆ రోజు నక్కలకి రాజైన తనే దానిని అందుకోలేక పోవటం తో , మిగిలిన నక్కలకు…’ అందని ద్రాక్ష పుల్లన ‘ అనే పుల్లటి అబద్దం చెప్పడం జరిగింది.\n” ఏంటి తాతయ్యా ..ఆలోచిస్తున్నావ్…? ”\n\nఆలోచనల నుండి బయటకు వచ్చిన తాత నక్క ..” దాని రుచి నాకు మాత్రం ఏమి తెలుసురా..చిన్నోడా..! అందరు పుల్లన అంటా వుంటే..నేనూ అలాగే అనుకున్నాను. తింటే గాని రుచి తెలియదు…”\n”అయితే నువ్వు కూడా యెప్పుడూ ద్రాక్ష తిన లేదా..? ”\n” ప్రయత్నించాను…. కానీ, కుదర లేదు…”అని, తన అనుభవాన్ని .. ప్లాష్ బ్యాక్ స్టోరీ లాగ పిల్లనక్కతో చెప్పింది.\n\nఅది విన్న పిల్ల నక్కకు పట్టుదల పెరిగింది. తన తాత సాధించ లేనిది …. తను సాధించాలి..! తన జాతికి అందనిదిగా మిగిలిపోయిన పనిని తాను సాధించి తీరాలి. తన నిర్ణయం తాత తో చెప్పింది.\nతాత నక్క నవ్వింది.\n”చిన్నోడా..! మన జాతిలో ఎవరూ ఇప్పటిదాకా ద్రాక్ష తిన లేదు. నీకెందు కంత పట్టుదల …. వదిలేయ్..” అంది.\n\n” లేడుతాతయ్యా..! ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. ఈ రోజు రాత్రికి నాతొ రా..! సాధించి తీరుతాను…” పట్టుదలగా అన్న పిల్లనక్క మాటలకు బదులు చెప్పలేక ” సరే,,! ” నని అంది తాత నక్క.\n\nరాత్రి బాగా పొద్దు పోయాక తాతా మనవాళ్ళు బయలుదేరాయి. ద్రాక్ష తోటను చేరుకున్నాయి. తలెత్తి ద్రాక్ష గుత్తుల వంక చూసాయి. అవి ఎత్తులో వేలాడుతున్నాయి. పిల్ల నక్క ఎగిరి అందుకోవాలని రెండు సార్లు ప్రయత్నించి విఫల మైంది.\n\nఅది తన గత అనుభవమే..! నవ్వుకుంది తాత నక్క. ” వెళదాం రా..రా ..చిన్నోడా..! చెపితే విన్నావు కాదు..” విసుక్కొంది.\n\n”తొందరేంటి..తాతయ్యా…! కాసేపాగు . ప్రయత్నించాలి…” పట్టుదలతో చెప్పింది పిల్ల నక్క.\n\nవిధి లేక ఓ చోట కూలబడింది తాతనక్క . ఎలా సాధించాలి… …అనే ఆలోచనలో పిల్లనక్క ..పరి పరి విధాలా ఆలోచించింది. చుట్టూ పరిశీలించింది. మెదడుకు పదును పెట్టింది.\n\nపిల్లనక్క ఈ తరాని చెందింది. బుద్ధిబలం పెరిగిన తరానికి చెందినది. దాని బుర్రలో ప్లాష్ లా ఓ ఉపాయం …వెలిగింది.\n\nగబ గబ ఆ వైపు నడిచింది. అక్కడ పెద్ద పెద్ద గంపలు వున్నాయి.\n\nపండిన ద్రాక్ష తీసుక వెళ్ళటానికి క్రితం రోజు తోట యజమాని వాటిని తీసుకుని వచ్చాడు. కొన్ని గంపలతో క్రితం రోజు ద్రాక్ష తీసుకెళ్లగా మిగిలిన గంపలను ప్రక్కన పడేసి వెళ్ళాడు..\n\nవాటి లోంచి ఒక గంపను లాక్కువచ్చింది పిల్లనక్క. గంపను ద్రాక్ష గుత్తుల క్రిందుగా బోర్లించింది.\nపిల్లనక్కను తాతనక్క ఆశ్చర్యంగా చూస్తోంది.\nబోర్లించిన గంప మీదికి ఎక్కింది పిల్లనక్క. దానికి ఇప్పుడు ద్రాక్ష గుత్తులు అందుతున్నాయి.\nపిల్లనక్క కళ్ళలో సాధించాననే ఫీలింగ్… ! తాత నక్క కళ్ళలో ఆశ్చర్యం.. ఆనందం …!!\nగబ గబా ద్రాక్ష గుత్తులు కోసింది. కడుపారా తిన్నాయి.\nకొంత నోటితో పట్టుకుని అడవి వైపు పరుగు తీసాయి.\nతాత నక్క గర్వపడింది….తను సాధించ లేనిది..తన మనవడు సాధించాడు…!\n” అందిన ద్రాక్ష పుల్లనా .. తీయనా…!! ‘.. నక్కల నడిగి తెలుసుకుందాం…! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 444,
        "IMAGE": "cat_2",
        "NAME": "అందిన ద్రాక్ష",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 194,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పినాకిని నదీ తీరం లోని ఒక ప్రదేశములో కొన్ని ఎలుకలు స్థావరం గా చేసుకొని , చుట్టుపక్కల దొరికిన ఆహార ధాన్యాలు తిని తిరుగుతూ వుండేవి. వాటిలో ఒక ఎలుక పిల్లకు హుషారు ఎక్కువ. ఎప్పుడూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ వున్నందున దానికి విసుగు పుట్టి ….అలా .. అలా తిరిగి ఏదైనా కొత్త ప్రాంతం చూడాలని , తోటి ఎలుకలు వారిస్తున్నా వినకుండా బయలుదేరింది.\n\nకొత్త, కొత్త ప్రదేశాలను చూస్తూ ,ఎంతో వుత్సాహంగా …సాగిపొతూ వుంది. ఆ ఆనందం లో పరిసరాలను సైతం గమనించక పోవటముతో ఆహారము కోసము పొంచి యున్న ఒక పక్షి కంటిలో పడింది. తన కాళ్ళతో లటుక్కున ఎలుక పిల్లను పట్టేసింది పక్షి. ఉహించని పరిణామానికి బిత్తర పోయి కెవ్వున అరిచింది ఎలుకపిల్ల .\n\nఆ పైన తెప్పరిల్లి.. ” అయ్యో..అయ్యో..!నన్ను వదిలేయ్.. నీకు పుణ్యం వుంటుంది…’’ అంది ఎలుకపిల్ల.\n“ పుణ్యం సంగతి దేవుడెరుగు..! రెండు రోజుల నుండి నేను … నా పిల్లలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాము. లడ్డులా దొరికావు నిన్నెలా వదలను..” అంది పక్షి.\nఅంతలో అక్కడకు పక్షి పిల్లలు ఎగురుతూ వచ్చాయి. వాటిని చూసిన పక్షి. . “ ఇదిగో పిల్లలూ ..! మనకు మంచి ఆహారం దొరికింది. రండి… తిందురు గాని…” అని పిలిచింది .\n” అమ్మా..పక్షి తల్లీ..! నాకు మరి కొంత కాలము బ్రతకాలని వుంది. దయ చేసి నన్ను వదలిపెట్టు…” ఎలుక పిల్ల దీనంగా ఏడుస్తూ …పక్షిని బతిమలాడ సాగింది.\nఆ దృశ్యం చూసిన పక్షి పిల్లలకు ” అయ్యో….! ” అనిపించింది.\n” పోనీలేమ్మా అది భయపడి ఏడుస్తూ వుంది..మరికొంత కాలం బ్రతకాలని ఆశ పడుతూ వుంది. పాపం వదిలి పెడదాము..” అన్నాయి పక్షి పిల్లలు.\n” వదిలి పెడితే మనకు ఆహారము ఎలా..?” అడిగింది పక్షి .\n\n” పిల్లలూ మీరైనా మీఅమ్మతో చెప్పి నన్ను వదిలి వేయరూ….! మీరూ ..నేనూ.. నేస్తాలుగా వుందాము..” అంది. పక్షి పిల్లల మనసు కరిగింది. వాళ్ళమ్మను ఒప్పించి …ఎలుకపిల్లను విదిపించాయి. ఆ తర్వాత ఎలుక పిల్ల అక్కడే వుండిపొయింది. పక్షి పిల్లలతో చెలిమి చేసింది.\n\nఇలా వుండగా ఒక రోజున ఒక వేటగాడు వచ్చి పక్షుల కోసం వల పన్నాడు. అది తెలియని పక్షి పిల్లలు అందులో చిక్కుకు పోయాయి. తప్పించు కోలేక బిగ్గరగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చి వలలోచిక్కుకుని వున్న తన నేస్తాలను చూసి, గబగబా పరుగెత్తుకొచ్చింది.\n\n” నేస్తాలూ..భయపడకండి ..” అని, ధైర్యం చెప్పి, గబ గబ తన పదునైన పళ్ళతో వల తాళ్ళను పట పట కొరికి వేసింది. పక్షి పిల్లలు క్షేమంగా బయట పడ్డాయి.\n\nసాయంత్రం పక్షి ఇంటికి రాగానే విషయమంతా చెప్పి , ” అమ్మా..! ఎలుకన్నతో చెలిమి చేయబట్టి మనకు ఎంతో మేలు జరిగింది. లేకపోతె ఈ పాటికి మా ప్రాణాలుపోయి వుండేవి..” అన్నాయి పక్షి పిల్లలు.\n\n” నిజమే మరి.. ! ” అంది పక్షి. తన పిల్లలను సమయానికి రక్షించిన ఎలుక పిల్లకు కృతజ్ఞతలు తెలిపినది. అప్పటి నుండి వాటి మధ్య చెలిమి మరింతగా బలపడింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 445,
        "IMAGE": "cat_2",
        "NAME": "చెలిమి చేసిన మేలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 195,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తూ దారిలో ఒక పాము గద్దను పట్టి బందించడం చూసాడు, వెంటనే కర్రతో పామును అదిలించి గద్దను విడిపించాడు.\n\nతరువాత పొలం పనుల్లో ఉండిపోయి, మధ్యాహ్నం అన్నం తిందాం అని దగ్గర్లో ఉన్న కాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుకోటానికి వెళ్ళాడు. రామ్మయ్య పై కోపంగా ఉన్న పాము, ఇదే అదునుగా తీసుకొని రామయ్య తెచ్చుకొన్న అన్నపు మూటలో విషం కక్కి, వెళ్ళి పొదలలో దాకొంది.\n\nచెట్టు పైనుండి ఇది చూ సిన గద్ద తనకు సాయం చేసిన రామయ్య ని ఎలాగైన కాపాడుదాం అని, రామయ్య అన్నం మూట విప్పి ఒక్క ముద్ద నొట్లో పెట్టుకొనే సమయానికి వెళ్ళి తింటున్న అన్నాన్ని నేలపాలు చేసి ఎగిరిపోయింది. రామయ్య కి కోపం వచ్చి గద్ద ని తిట్టాడు. ఇంతలో ఓ కుక్క వచ్చి కింద పడ్డ అన్నాన్ని తిని అక్కడిక్కకడే చనిపోయింది. రామయ్య గద్ద ని తిట్టినందుకు బాధ పడ్డాడు. గద్ద చేసిన మేలు వల్ల అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. తాను గద్దకి చేసిన ఉపకారం తన ప్రాణాలను నిలబెట్టిందని తెలుసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 446,
        "IMAGE": "cat_2",
        "NAME": "పరోపకారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 196,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "మనుష్యులు చేసిన పుణ్యపాపాలను బట్టి కొందరు స్వర్గానికి వెళ్ళారు. మరికొందరు నరకానికి పోయారు. దేవతలు వీళ్ళను పరీక్షించుదామని ఒక సమస్య సృష్టించారు.\n\nఒకనాడు స్వర్గంలో వున్నవారికీ, నరకంలో వున్నవారికీ ఒకే రకమైన జబ్బు పట్టుకున్నది. ఆ జబ్బు ఏమంటే, వాళ్ళ చేతులు నిటారుగా బిర్రబిగిసి పోయాయి. చెక్కలాగా అయిపోయాయి. మోచేయి వద్ద ముడుచుకొనవు. దేవతలు బోలెడు లడ్లు తయారుచేయించి నరకంలో వున్నవారి వద్దకు పళ్ళెములలో పెట్టి పంపించారు. వారికి ఆకలి కూడా తీవ్రంగా ఉన్నది. కాని చేతులు ముడతకు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా చేతులు వంగడం లేదు. అందుచేత ప్రతి ఒక్కడూ వచ్చి లడ్డును పట్టుకుంటాడేగాని నోటివద్దకు తీసుకుపోలేకపోతున్నాడు. అన్నీ వుండి కూడా నరకంలో అందరూ ఆకలితో అలమటిస్తూ వుండిపోయారు.\n\nదేవతలు స్వర్గంలో వున్నవారికి గూడ రుచికరమైన లడ్లు తయారుచేయించి పళ్ళెములలో పెట్టి పంపించారు. అయితే వాళ్ళ చేతులు గూడ నిటూరుగా బిర్రబిగుసుకుపోయి మోచేయి వద్ద వంగడం లేదు.\n\nఅయితే వారిలో పరస్పరం సహకరించుకొనే గుణమున్నది. అందుచేత ప్రతి ఒక్కడూ తన చేత్తో లడ్డు తీసుకొని ఎదుటివాని నోట్లో పెట్టాడు. ఇలా అందరూ చేయడం వలన పళ్లెములు ఖాళీ అయినవి. ఒక్క లడ్డు గూడ మిగలలేదు!\n\nస్వర్గం అంటే ఎక్కడో లేదు. సహకారం ఎక్కడ వుంటుందో స్వర్గం అంటే అక్కడే వుంటుంది. జీవితాన్ని మధురవంతంగా చేసుకొనే రహస్యమిదే! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 447,
        "IMAGE": "cat_2",
        "NAME": "సహకారంలోనే స్వర్గం ఉన్నది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 197,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ చిట్టడవి. ఆ అడవిలో ఒక గుంపుగా కలిసిమెలసి ఉండే ఒక కప్పల గుంపు. ఒక రోజు ఆ కప్పల గుంపంతా ఆ అడవిలో గెంతుతూ గెంతుతూ సరదాగా విహారానికి బయలుదేరాయి.\n\nఆ గుంపులో రెండు చిట్టి కప్పలు ఉన్నాయి. అవి మిగిలిన వాటికంటే మరీ ఉత్సాహంగా గెంతుతూ.. బెక బెకమని వాటి భాషలో కూని రాగాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా గెంతుతూ గెంతుతూ చూసుకోకుండా ప్రమాదవశాత్తూ ఒక లోతైన గుంటలో ఆ రెండు చిట్టి కప్పలూ పడిపోయాయి. ఇంకేముందీ.. మిగిలిన కప్పల గుంపంతా గుంట చుట్టూ చేరి తొంగి తొంగి లోపలకి చూడసాగాయి. గుంట చాలా లోతుగా ఉండడంవల్ల ఎక్కడో అడుగున ఉన్న చిట్టి కప్పలు కనిపించట్లేదు వీళ్ళకి. అలాగే లోపల చిట్టి కప్పల పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడు బయట ఉన్న కప్పలన్నీ తమ అనుభవ పరిజ్ఞానం అంతా ఉపయోగించి పరిస్థితిని బాగా అర్ధం చేసుకుని బెక బెక మంటూ సలహాలు చెప్పడం ప్రారంభించాయి.\n\n“గుంట చాలా లోతుగా ఉంది కాబట్టి.. ‘మీరు ఈ గుంట నుంచి బయటపడటం అసాధ్యం” అని చాలా బాధపడిపోతూ తమ జాలినీ సానుభూతినీ ప్రకటించాయి. వాటి మాటల్ని పట్టించుకోకుండా ఆ రెండు చిట్టి కప్పలూ తమ శాయశక్తులా బయటపడడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.\n\nఅలా ఒక అరగంటసేపు గడిచిపోయింది. గెంతీ గెంతీ పాపం చిట్టి కప్పలు అలసిపోయాయి. అప్పుడు మళ్లీ బయట నేల మీద ఉన్న కప్పలు తమ నైరాశ్యాన్ని ప్రకటిస్తూ “మీరు వెలుపలికి రాలేరు. ఇంక మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోండి” అని సలహా ఇచ్చాయి. ఈ బయటి కప్పల మాటలని ఆలకించిన ఒక చిట్టి కప్ప తన ప్రయత్నాలు వ్యర్థమని తోచి గెంతడం విరమించింది. రెండో కప్ప మాత్రం ఈ బయట కప్పల మాటలని పరిగణించలేదు. గెంతుతూ గెంతుతూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది.\n\nబయటి కప్పలు “ఎందుకు అనవసరంగా శ్రమిస్తావు? చచ్చిపోయే ముందు ఈ యాతన కూడా దేనికి? ఈ బాధంతా పడిన తరవాత కూడా చావు ఎలాగూ తప్పదు కాబట్టి.. ఉన్నట్టు ఉండిపోయి ప్రశాంతంగా చనిపోవడం మేలు కదా..!” అని సలహా ఇచ్చాయి.\n\nకానీ మరి కొంతసేపు గడిచాక.. అందరూ ఆశ్చర్యపోయేట్టుగా.. గుంటలోని చిట్టి కప్ప మరింత గట్టిగా ఎగిరి గంతేసి గుంట వెలుపల నేల మీదికి వచ్చి పడింది. మిగతా కప్పలన్నీ ఆ చిట్టి కప్ప చుట్టూ చేరి “నీ పాటికి నువ్వలా ఎగురుతూనే ఉన్నవేంటి మా మాటలు వినిపించుకోకుండా..?” అని అడిగాయి ముక్తకంఠంతో. అప్పుడు తెలిసిన కొత్త సంగతేంటంటే.. మన ఈ చిట్టి కప్పకి చెవుడు ఉందని! అందుకే అ గుంటలో ఉన్నంతసేపూ కూడా ఆ బయటి కప్పలు తనని ప్రోత్సహిస్తూ ‘మరింత గట్టిగా ప్రయత్నించు’ అని చెప్తున్నాయని అనుకున్నదట. వాటికి ఆశాభంగం కలుగజేయకూడదని భావించి, తన శక్తినంతా పుంజుకొని, ఓపికంతా కూడగట్టుకుని ఎగరసాగిందట. చివరకి బయటపడగలిగింది.\n\nమరి గుంట లోపలే మరో కప్ప ఉండిపోయింది కదా..! అది ఎక్కువసేపు అలా నీటిలోనే స్తబ్దుగా ఉండడం వల్ల దాని ప్రాణాల మీదకి వచ్చింది. ఈలోపు బయటనుండి అన్నీ కప్పలు బెక బెకమని దానికి హితబోధలు చేసి.. ఉత్సాహపరిచాయి. మొత్తానికి అది కూడా గెంతీ గెంతీ ఎలాగో కొన ప్రాణాలతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఏదో బ్రతికి బయటపడింది.\n\nపట్టినపట్టు విడరాదనే తత్వం కప్పలకే కాదు మనుషులకు కూడా అవసరమే. సాక్షాత్తూ చెవుడే ఉండక్కరలేదు గానీ, ఏదయినా కార్యం తలపెట్టినప్పుడు ఇతరులు పెట్టే భయాలనూ, సంకోచాలనూ, చెవిన పెట్టకుండా ముందుకి సాగిపోయే ధైర్యముండాలి. అప్పుడు గానీ, విజయలక్ష్మి వరించదు. అంతే కాదు.. ఒక్కరు సాహసంతో చూపిన విజయపు బాట ఆ వెనుకగా ఎంతోమంది జీవితాలకి బాసటగా నిలుస్తుంది కూడా..! అదే ఈ చిట్టి కప్ప మనకి తెలియచెప్పే గొప్ప జీవిత సత్యం..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 448,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఒక చిట్టి కప్ప కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 198,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కుంతల దేశపు రాజధాని నగరం పక్కనే వున్న ఓ సుభిక్షమైన గ్రామం సౌభాగ్యపురం. భట్టుమూర్తి ఆ గ్రామంలో పేరు మోసిన రైతు. ఆయన ఏకైక కుమారుడు శంతనుడు ఆ గ్రామానికి కొంచెం దూరంలో వున్న ముని ఆశ్రమంలో చదువుకుంటున్నాడు. అదే ఆశ్రమంలో శంతనుడి సహాధ్యాయిగా ఆ దేశపు రాజవంశీకుడు చంద్రసేనుడు వుండేవాడు. చంద్రసేనుడి కోసం అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే రాజోద్యోగులను రాజభటులను చూసినప్పుడల్లా శంతనుడికి తాను కూడా రాజునైతే బావుంటుందని అనిపించేది. రాజరికంలోని దర్జా, హోదా, వైభోగాలను అనుభవించవచ్చని ఆశ పడేవాడు.\n\nచదువు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చిన శంతనుడు ఏ పని చేపట్టక ఊరికే ఆలోచనలలో కాలం గడిపేవాడు. దేశానికి రాజవ్వాలన్న కోరిక రాను రాను అతనిలో బలపడ సాగింది. ఇదే కోరికను శంతనుడు తన మిత్రులతో చెప్పుకునే వాడు. “ఫలానా సాహస కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే, రాజకుమారిని ఇచ్చి వివాహం చేస్తానని, అర్ధ రాజ్యం ఇస్తానని” మహా రాజు ఏదైనా ప్రకటన చేస్తాడేమోనని శంతనుడు నిత్యం ఎదురు చూసేవాడు. ఎప్పుడూ ఊహాలోకాల్లో విహరించే శంతనుడికి, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమనో లేదా తమ భూముల్లో వ్యవసాయం చేపట్టమనో భట్టుమూర్తి పలు మార్లు చెప్పి చూశాడు. శంతనుడు తండ్రి మాటలను లక్ష్య పెట్టేవాడు కాదు. శంతనుడి సంగతి తెలుసుకున్న గ్రామస్తులు చాటుగా నవ్వుకునే వారు.\n\nరాజపదవి పై శంతనుడి వ్యామోహం గురించి తెలుసుకున్న ఓ మోసగాడు భట్టు మూర్తి ఇంట్లో లేనప్పుడు జ్యోతిష్యుడి వేషంలో వచ్చి శంతనుడిని కలిసాడు. శంతనుడిని పరీక్షగా చూస్తున్నట్టు నటిస్తూ …. “ఆహా! ఏమి తేజస్సు! మొఖంలో మహారాజు లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఏదీ, నీ చేతి రేఖలు చూడనీ….“ అంటూ శంతనుడి చేతిని పరిశీలించసాగాడు.\n\nకొన్ని క్షణాల తరువాత మళ్ళీ మాట్లాడుతూ .. ..”నాయనా! నీకు రాజయోగం ఉన్నది. నీవు ఒక యాగము చేస్తే ఈ దేశానికి రాజవుతావు. నాకు వంద బంగారునాణాలు ఇస్తే, నీ కోసం ఆ యాగాన్ని నేను జరిపిస్తాను. యాగానికి రేపు రాత్రే ముహూర్తం. రాజధాని నగరానికి ఆవలవున్న అడవిలోని పెద్ద మర్రి చెట్టు యాగానికి అనువైన స్థలము! నా దగ్గర నిప్పు తప్ప , యాగానికి కావలసిన అన్ని వస్తువులూ ఉన్నాయి. రేపు రాత్రి నువ్వు కాగడా తో నిప్పు తీసుకుని అక్కడికి వస్తే యాగం జరిపిస్తాను….” అన్నాడా జ్యోతిష్యుడు. తన చిరకాలవాంచ నెరవేరుతున్నందుకు శంతనుడు మురిసి పోతూ అతనికి వంద బంగారు నాణాలు సమర్పించు కున్నాడు. వాటిని పుచ్చుకున్న జ్యోతిష్కుడు మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు.\n\nమర్నాడు చీకటి పడ్డాక, కాగడా పట్టుకుని అడవిలోని మర్రిచెట్టు వద్దకు చేరిన శంతనుడికి జ్యోతిష్కుడు కనబడలేదు. “ఏదో పనిమీద బయటకు వెళ్ళి వుంటాడు. రావటం ఆలస్యం అయి వుంటుంది” అని అనుకున్నాడు శంతనుడు.\n\nఎంతోసేపు వేచి చూసినా జ్యోతిష్కుడు రాకపోయే సరికి శంతనుడికి అనుమానం కలిగింది. ఆ జ్యోతిష్కుడిని వెతుకుదామని బయలు దేరబోయాడు. ఇంతలో అటువైపుగా గస్తీకి వచ్చిన రాజ భటులకు కాగడాతో తిరుగుతున్న శంతనుడి ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది. వారు అతన్ని బంధించి తీసుకుపోయి ఆ దేశపు మంత్రి ముందు హాజరు పరిచారు.\n\n“ఎవరు నువ్వు? ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఏం చేస్తున్నావు? ఏ దేశపు గూఢచారివి? నిజం చెప్పు….” అంటూ మంత్రి గద్దించాడు. దాంతో కంగారు పడ్డ శంతనుడు…. తాను కుంతల దేశపు పౌరుడినేనంటూ మొదలు పెట్టి తాను ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇల్లు చేరిన సంగతి, నకిలీ జ్యోతిషుడికి వంద బంగారు నాణాలు సమర్పించుకున్న సంగతి…. అంతా వివరంగా చెప్పేశాడు.\n\nశంతనుడి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన మంత్రి…” పదవీ వ్యామోహంలో పడి నువ్వు యుక్తా యుక్త విచక్షణ కోల్పోయావు. విద్యావంతుడవైనప్పటికీ, వివేకంలేకుండా మూర్ఖుడిలా ప్రవర్తించావు. రాజరికపు బాహ్య లక్షణాలైన వైభోగం, ఆడంబరాలు, దర్జా, హోదాలపట్ల ఆకర్షితుడవయ్యావు. కానీ వాటిని వెన్నంటి వుండే బాధ్యతలను, ప్రమాదాలను గుర్తించలేదు. దేశ రక్షణ జనరంజకమైన పాలన ఆర్ధిక వ్యవహారాలు… లాంటి క్లిష్టమైన బాధ్యతలెన్నో మహారాజుకుంటాయి. నీ ఇంటి బాధ్యతే వహించని వాడివి, ఇంత పెద్ద దేశపు బాధ్యతనంతా ఎలా వహించగలననుకున్నావు? కష్టపడి పనిచేస్తూ, నిజాయితీగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే! ఇంత చిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేని నీ చదువు వృధా ….” అంటూ తీవ్రంగా మందలించి శంతనుడిని వదిలేయమని భటులను ఆదేశించాడు.\n\nమంత్రి మందలింపుతో శంతనుడికి కమ్ముకున్న పదవీ వ్యామోహ పొరలు తొలగి పోయాయి. తన గ్రామం చేరుకుని, తండ్రి చెప్పినట్టు వ్యవసాయం చేపట్టాడు. కష్టించి పని చేయడంతోపాటు నాణ్యమైన ఎరువులు, మేలురకపు విత్తనాలు వాడటంతో పంటలు బాగా పండాయి. రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి శంతనుడు ఆ గ్రామంలోకెళ్ళా ధనవంతుడయ్యాడు. సేవాభావం అలవర్చుకొని, పేరు ప్రఖ్యాతులు ఆశించక తన ధనాన్ని సద్వినియోగం చేయసాగాడు. గ్రామంలోని రహదారులలో వీధి దీపాలు ఏర్పాటు చేయించాడు. దేశం నలుమూలల నుంచి రాజధానికి వచ్చే బాటసారుల కోసం రాజధాని వెలుపల ఒక ధర్మ సత్రం కట్టించాడు, ఇవి గాక ఎన్నో గుప్త దానాలు చేయసాగాడు. తన గ్రామంలో వారికేగాక , చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకోసాగాడు.\n\nతమ మాటలలో శంతనుడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా గ్రామస్తులు….”గొప్ప మారాజు! ఆయన కలకాలం సుఖంగా వుండాలి” అంటూ దీవించే వారు. ఈ మాటలు చెవిన పడ్డ శంతనుడు, జ్యోతిష్కుడు తనకు చెప్పిన రాజయోగం ఇదేననుకుని తృప్తిగా నవ్వుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 449,
        "IMAGE": "cat_2",
        "NAME": "రాజయోగం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 199,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పినాకిని నదీ తీర ప్రాంతం లోని ఒక రైతు పొలం లో ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు పక్క పక్కన మొలిచాయి. వాటిని గమనించిన పొలం యజమాని మామిడి చెట్టుకు పాదు చేసి, మంచి ఎరువు వేసి నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టును గురించి పట్టించుకోలేదు.\n\nతానూ గొప్పది కాబట్టి రైతు తన పట్ల శ్రద్ద చూపుతున్నాడనే భావం మామిడిలో కలిగింది. కాసింత అహంకారం కూడా పెరిగింది.\n\nకాలక్రమంలో రెండు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. పూలు పూచి, కాయలు కాసాయి. మామిడి పండ్లు మధురంగా వుండగా వేప పండ్లు చేదుగా వున్నాయి. ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలని ఇష్టపడి తింటూ వుండటం తో మామిడికి మరింత గర్వం పెరిగి వేపతో మాట్లాడటం మానివేసింది .\n\nఅది గమనించిన వేప ” మామిడిగారూ ..! ఏమిటి ఇటీవల నాతొ మునుపటిలా వుండటం లేదు ..? ” అని అడిగింది .\n\n” నాకూ .. నీకు ఏమి పోలిక. మధుర రసాలను యిచ్చు వృక్షాన్ని నేను. నోట పెట్టుకోను పనికిరాని చెడు ఫలాలు నీవి. నా కంటే తక్కువ దానివి నీతో నాకు స్నేహమేంటి ….? ” గర్వంగా చెప్పింది మామిడి .\n\n” నీవి మధుర ఫలాలయినంత మాత్రాన గొప్ప దానివని మురిసిపోకు. నా విత్తనాలకూ మంచి గిరాకీ వుందని ఏరుకు పోతూ వున్నారు తెలుసా ..! అయినా అహంకారితో స్నేహం అవసరం లేదులే . .! ” అంది వేప .\n\nఅలా మామిడి , వేప వాదులాడుకోవడం వాటి పక్కన నిలువెత్తుగా పెరిగి వున్న కొబ్బరి చెట్టు వింది . రెంటి మధ్య మాటలు దానికి చిర్రెత్తి పోయి ” అబ్బా ..! ఆపండి మీ వాదులాట. వినలేకపోతున్నాను . .” అంది .\n” అదేంటి కొబ్బరిగారూ .. అలా విసుక్కుంటారు . మా ఇద్దరిలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చుకోలేక పోతుంటే ..” అంది మామిడి .\n” పోనీ మీరైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్పో …! దాంతో ఈ గొడవ తీరిపోతుంది . ఎవరి మానాన వాళ్లు బతుకుతాం ..” అంది వేప.\n\n”పిచ్చి మొఖాల్లారా …! ఒకరు గోప్పెంటి . ..మరొకరు తక్కువేంటి…! మన చెట్లు దేనికవే గొప్పవి. ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుంటుంది . మీ వాదులాట మానుకోండి ..” అని మందలించింది కొబ్బరి .\nకానీ తమలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చి చెప్పమని నిలదీసింది మామిడి .\n”సరే ..! అంతగా అడుగుతున్నావు కాబట్టి చెపుతున్నాను …చెప్పాక బాధ పడకూడదు …” అంది కొబ్బరి .\n” అలాగే ” అని తలలూపాయి మామిడి , వేప .\n” నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు ..” చెప్పింది కొబ్బరి .\n” ఎలా చెప్పగలవు …?” ప్రశ్నించింది మామిడి .\n\n” మధురమైన మామిడి ఫలాలు తిన టానికి అందరూ ఇష్టపడతారు. తిన్నవారికి రుచినీ, తృప్తినీ ఇవ్వగలవు మరి వేప పండ్లు తిన టానికి చేదుగా వుంటాయి. అయినా వేప విత్తనాలు ఔషధ గుణాలు కలిగి, ఎన్నో వ్యాధులు నయం చేయడానికి ఉపయోగ పడతాయి. అలాంటి మంచి లక్షణాలు కలిగిన వేపను ఉత్తమ చెట్టుగా నిర్ణయించాను. ఇక మీ ఇష్టం …” చెప్పింది కొబ్బరి .\n\n” అదేం లేదు. నీకు నేనంటే అసూయ. దానికి మద్దతుగా అలా చెప్పావు. నీ తీర్పును నేను అంగీకరించనుఅంది మామిడి .\nకాలం సాగి పోతూ వుంది.\n\nమామిడికి అంటు పట్టని చీడ పీడలు సోకాయి. వేరులో కుళ్ళు తెగులు పట్టింది . ఆకులు , కాయలు రాలి పోసాగాయి. కొమ్మలు కూడా అక్కడక్కడా ఎండు ముఖం పట్టాయి . మామిడికి పట్టిన తెగులు రైతు గమనించాడు . వెంటనే వేప చెట్టు క్రింద రాలివున్న కాయలను బాగా దంచి పొడిచేసి , దానిని మామిడి చెట్టు మొదట్లో వేసాడు . దానితో మామిడి వేరుకు పట్టిన పురుగు నశించి , తిరిగి మామిడి ఆరోగ్యంగా తయారైంది .\nఅప్పుడు మామిడికి కనువిప్పు కలిగింది .\n\nకొబ్బరి చెట్టు చెప్పినట్లు ‘ తీపిని యివ్వటం గొప్ప కాదు . ఆరోగ్యాన్ని యివ్వటం గొప్ప ..’ అన్న విషయాన్ని తెలుసుకుంది. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించి , తిరిగి స్నేహాన్ని కొనసాగించింది.\nనీతి: ఎదుట వారి గొప్ప గుణాలను తక్కువగా ఎంచకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 450,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఉత్తమ చెట్టు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 200,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక అడవి సమీపంలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఆయన కొంత మంది విద్ద్యార్థులకి వేదాలు కూడా భోదించేవారు.\n\nఒక రోజు అలా వేదాలు భోదిస్తున్నప్పుడు హఠాత్తుగా గాలి, వాన రావడంతో ఆశ్రమంలో ఉన్న పర్ణశాలల కప్పులన్నీ ఎగిరిపోయాయి. ఆశ్రమం అంతా చిందర వందరగా అయిపోయింది. వీటిని అంతటినీ చూసిన ముని తన విచక్షణా జ్ఞానాన్ని ఒక్కసారిగా మరచిపోయి తన తపశ్శక్తితో “నీ విలయతాండవాన్ని ఇంక ఆపు” అని శాసించాడు.\n\nప్రకృతి శాంతించింది. ఆశ్రమం లోని వారంతా మునీశ్వరుని; వేనోళ్ల పొగిడారు. అప్పుడు ముని ఇక్కడ వున్నవారే ఇంతగా నన్ను మెచ్చుకుంటున్నారు, ఇంక లోకమంతా ఇంకెంత మెచ్చుకుంటుందో అని తన మంత్ర శక్తితో మిగిలిన ప్రపంచం అంతా ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కళ్లు మూసుకుని ముని మిగిలిన ప్రపంచం ఏమనుకుంటుందో అని తెలుసుకోసాగాడు…\n\nఅప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. ముని వలన కొంత మంది ప్రాణాలు పోయాయని. అదీ ఎలా అంటే గాలి, వాన వస్తున్నదని సముద్రంలో చేపల వేట కని వెళ్ళిన వారు తమ పడవలకి తెరచాపలని వేశారు. కానీ హఠాత్తుగా గాలి, వాన తగ్గిపోవడంతో ముందు కాపాడిన తెరచాపే వారిపాలిట మృత్యుపాశమై వారి పడవలని మునిగిపోయేలా చేసింది అని తెల్సుకున్న ముని ఎంతవారలైనా ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఊండాలని తనకి తెల్సిన నీతి సూత్రాన్నే ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 451,
        "IMAGE": "cat_2",
        "NAME": "ప్రకృతి ధర్మం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 201,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక అరణ్యంలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో ఆ అరణ్యంలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. కోతులకు విపరీతమైన దాహం వేసింది. అవి నీటికోసం వెతకటం మొదలుపెట్టాయి. అలా... అలా వెతుకుతూ అవి అరణ్యాన్ని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఏండమావులు మెరుస్తూ కనిపించాయి.\n\nవాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటు వైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. దాహంతో కోతుల నాలుక పిడచగట్టుకుపోసాగింది. ఎండవేడికి తలలు మాడిపోయి, కాళ్ళు బొబ్బలెక్కాయి. ఇక నడవడం చేతకాక కోతులు ఒక చెట్టు క్రింద కూలబడిపోయాయి.\n\n\"నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది.\" దీనంగా అంది ఒక కోతి.\n\"ఏం చేద్దాం... నీళ్ళు కనబడుతున్నాయి కాని చేతికి అందటం లేదు. ఇదేమి మాయో...\" అంది మరొక కోతి.\nఆ చెట్టు పక్కన ఉన్న పొదలో నివసించే కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలన్న మంచి అభిప్రాయంతో వచ్చి వాటి ముందు నిలబడింది.\n\n\"మీ తెలివితేటలు మండిపోను.. ఎండమావులను చూసి నీళ్ళని భ్రమ పడ్డారు. ఎండమావుల్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా? ఇటు వైపు ఒక కోసు దూరంలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి\" అని చెప్పింది.\nకుందేలు మాటలు విని కోతులకు చాలా కోపం వచ్చింది.\n\"ఓహో... నువ్వే తెలివైన దానివా? మేము తెలివితక్కువ వాళ్ళమా?\" అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది.\n\"అయ్యో నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి\" భయంగా అరిచింది కుందేలు.\nఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.\nఆ తరువాత కోతులు కుందేలు చెప్పిన చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకున్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 452,
        "IMAGE": "cat_2",
        "NAME": "మూర్ఖులకు హితవు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 202,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి అన్నీ తుంటరి పనులు చేస్తూ దొంగ వేషాలేస్తూ అందరి చేతా దొంగ పిల్లి అని తిట్టించుకుంటూ ఉండేది. ఈ దొంగ పిల్లి వంకర బుద్ధిని కనిపెట్టి ఎవరూ రెండ్రోజుల కంటే ఎక్కువ దాని గురించి పట్టించుకునేవారు కాదు. దాంతో ఆ దొంగ పిల్లికి తిండి కూడా సరిగ్గా దొరక్క చాలా ఇబ్బంది అయిపోయేది. అయినా సరే, తన పద్ధతి ఏ మాత్రం మార్చుకోకుండా అలాగే చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ, అందర్నీ విసిగిస్తూ, తిండిని దొంగతనం చేస్తూ, ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరుగుతూ బతికేస్తూ ఉండేది ఆ దొంగ పిల్లి.\n\nఒకసారి ఇలాగే ఒకరింట్లో తిట్లూ తన్నులూ తిన్నాక మళ్ళీ పొట్ట నింపుకోవడం కోసం మరో ఇల్లు వెతుక్కుంటూ ఒక కొత్త గడప దగ్గరికి వెళ్ళింది దొంగ పిల్లి.\n\nఆ ఇల్లు బుజ్జిగాడు వాళ్ళు ఉండే ఇల్లన్నమాట. బుజ్జిగాడికి ఓ ఏడాది వయసుంటుంది. గడపలో నుంచి లోపలికి తొంగి చూసిన దొంగ పిల్లికి లోపల ఇల్లంతా పాకేస్తూ బుడి బుడి అడుగులేస్తూ ఉన్న బుజ్జిగాడు కనిపించాడు. అక్కడ నుంచి దొంగ పిల్లి వంటింటి వైపు వెళ్ళింది. మరి తినడానికి ఏదన్నా దొరికేది అక్కడే కదా! అక్కడ వంట చేస్తున్న బుజ్జిగాడు వాళ్ళమ్మ పిల్లిని చూసీ చూడగానే చిరాకు పడిపోయి కర్రొకటి పుచ్చుకుని గట్టిగా అదిలించింది దూరంగా పొమ్మని.\n\nదొంగ పిల్లికి అర్థమైపోయింది ఇంక ఈ ఇంట్లో తనకి తిండి దొరకడం కష్టమేనని. ఉసూరుమంటూ మళ్ళీ వీధి గుమ్మం వైపు వచ్చేసరికి లోపల నేల మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిగాడు కనిపించాడు. అంతలోనే బుజ్జిగాడు వాళ్ళమ్మ ఒక పళ్ళెంలో బిస్కెట్లు తీసుకొచ్చి బుజ్జిగాడి పక్కన పెట్టి తింటూ ఆడుకోమని చెప్పి వాడికో ముద్దిచ్చి మళ్ళీ వంటింట్లో పని చేసుకోడానికి వెళ్ళిపోయింది. ఇంతలోనే బోల్డన్ని దొంగ బుద్ధులున్న మన దొంగ పిల్లికి ఒక దొంగ ఆలోచన వచ్చింది. అస్సలు చప్పుడు చెయ్యకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన పళ్ళెంలో ఉన్న బిస్కెట్లన్నీ నోట కరచుకుని గబా గబా ఇంట్లోంచి బయటికి పారిపోయింది.\n\nఇలాగే రోజూ వచ్చి బుజ్జిగాడి కోసం వాళ్ళమ్మ పెట్టిన బిస్కట్లన్నీ లాగేసుకుని తినేస్తూ ఉండేది దొంగ పిల్లి. అయినా సరే బుజ్జిగాడు అరవడం గానీ, ఏడవడం కానీ చేసేవాడు కాదు. ఆ పిల్లిని చూసినప్పుడల్లా నవ్వుతూ కేరింతలు కొట్టేవాడు.\n\nఇలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి బుజ్జిగాడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇంటికి తాళం పెట్టి రెండ్రోజుల పాటు ఊరెళ్ళారు.\n\nఆ రెండ్రోజులూ దొంగ పిల్లికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా తిండి దొరకలేదు. దాంతో చాలా నీరసపడిపోయిన దొంగ పిల్లి అన్ని చోట్లా తిరిగి తిరిగీ మళ్ళీ చివరికి బుజ్జిగాడి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో బుజ్జిగాడి దగ్గర తిండి దొరుకుతుందన్న ఆశతో ప్రాణం లేచి వచ్చినట్టయింది దొంగ పిల్లికి. అయితే అప్పుడే బుజ్జిగాడు వాళ్ళమ్మ బిస్కెట్లు తీస్కొచ్చి బుజ్జిగాడికిచ్చి అక్కడే పక్కనే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఆవిడకి పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండదు, చూస్తే కోప్పడుతుందని తెల్సిన దొంగ పిల్లి ఆవిడ ముందు బయట పడలేక, మరో పక్కేమో ఆకలికి తాళలేక గుమ్మం దగ్గర నక్కి అప్పుడప్పుడూ లోపలికి తొంగి చూస్తోంది.\n\nకాసేపటికి ఇలా దాగుడు మూతలు ఆడుతున్న దొంగపిల్లి బుజ్జిగాడి కంట్లో పడింది. వాడు లేచి మెల్లగా బుడి బుడి అడుగులేసుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న బిస్కెట్ ని పిల్లి ముందు పడేసాడు. వెంటనే పిల్లి బిస్కెట్ అందుకుని తినేసింది. అప్పుడు బుజ్జిగాడు కూడా అక్కడే కూర్చుండిపోయి కిలకిలా నవ్వుతూ పిల్లి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. అన్ని రోజుల నుంచీ తన బిస్కెట్లు అన్నీ ఎత్తుకుపోయినా సరే అందరిలాగా చీదరించుకోకపోగా అంత ప్రేమగా తన కోసం ఇప్పుడు బిస్కెట్ తెచ్చిచ్చిన బుజ్జిగాడిని చూసి పిల్లికి పశ్చాత్తాపం కలిగింది. ఇంతలో బుజ్జిగాడు వాళ్ళమ్మ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పిల్లికి భయమేసి పారిపోబోయింది. కానీ, ఎప్పటి లాగా ఆవిడ విసుక్కోలేదు. ఇద్దర్నీ చూసి నవ్వేసి ఇంకో నాలుగు బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది.\n\nవాళ్ళ ఆదరణ చూసి దొంగ పిల్లికి బుద్ధొచ్చింది.\n\nఎంతసేపూ నేను, నా తిండి, నా కోసం అని స్వార్ధంగా ఆలోచించుకుంటూ ఇలా అందరి చేతా తిట్లు తింటూ బతకడం ఎంత మూర్ఖత్వమో తెలిసొచ్చింది. ఏదైనా మన చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండటంలోనూ, మరొకరితో పంచుకోవడంలోనే ఎంతో సంతోషం, సంతృప్తి ఉన్నాయని అర్థమయ్యాక దొంగ పిల్లి కాస్తా మంచి పిల్లిలా మారిపోయింది. బుజ్జిగాడికి మంచి నేస్తం అయిపోయింది.. ఎంచక్కా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండిపోయారు.\nఇంకంతే దొంగ పిల్లి కథయిపోయింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 453,
        "IMAGE": "cat_2",
        "NAME": "ఒక దొంగ పిల్లి కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 203,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ‘చేతన్’ అనే అబ్బాయి ఉ౦డేవాడు. పిల్లల౦దరిలాగే ఆ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఎప్పుడూ సంతోషంగానూ అందరితో సరదాగానూ ఉండేవాడు. రోజూ ఉదయాన్నే లేచి చక్కగా తయారై స్కూల్ కి వెళ్లి, టీచర్స్ చెప్పినవన్నీ ఫాలో అయ్యేవాడు. . ఇంటి దగ్గర కూడా తన పనులు చెప్పించుకోకుండా చేసేసేవాడు.\n\nఅంతే కాదు ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు, చురుకైనవాడు కూడా. అన్నీ ‘ఎ’ గ్రేడ్ లు తెచ్చుకుంటూ చక్కగా చదివేవాడు. ’టెన్నిస్’ కూడా బాగా ఆడేవాడు. వాళ్ళ అమ్మ, నాన్న ఆ అబ్బాయిని చూసి చాలా గర్వపడుతూ వుంటారు. అలా ఆ అబ్బాయికి అన్నీ మంచి అలవాట్లే.\n\nఒకసారి చేతన టెన్నిస్ టోర్న్ మెంట్ కి వెళ్తే ఫస్ట్ ప్లేస్ వచ్చి౦ది. ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు౦దరూ ఆ అబ్బాయిని చాలా మెచ్చుకున్నారు. ఇక అబ్బాయి ఎక్కడికెళ్ళినా తన టెన్నిస్ ఆట గురించి, తన గ్రేడ్స్ గురించి తన మంచితనం గురించి అందరికీ చెప్పుకోవడం మొదలు పెట్టాడు.\n\nఫ్రెండ్స్ అందరూ చేతన్ తో ఆడుకోవడం తగ్గించేశారు. చేతన్ కి ఏమీ అర్ధమవలేదు. “ఎందుకు నాతో ఆడుకోవట్లేదు? లంచ్ టైములో నేను వెళ్ళగానే ఎందుకు అందరూ ఏవో పనులున్నట్లు వెళ్ళిపోతున్నారు? ” అని ఆలోచించాడు. తను చేసిన తప్పేమీ కనిపించలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి…\n\n“అమ్మా, ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఎవరూ నాతో ఆడుకోవడానికి రావట్లేదు, స్కూల్లో కూడా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు” అని చెప్పి బాధ పడ్డాడు.\n\nఅపుడు వాళ్ళ అమ్మ “నాన్నా నువ్వు ఎవరినైనా ఏమైనా అన్నావా?” అంది.\n“లేదమ్మా ఏమీ అనలేదు నా గురించి చెప్పానంతే” “ఏమని చెప్పావ్?”\n“నేను అన్నీ బాగా చేస్తాను, నాకు ‘ఎ’ గ్రేడ్ లు వస్తాయి, ట్రోఫీలు వస్తాయి” ఇలా మంచిగా చెప్పానంతే.\n\n“చేతన్, అదే నువ్వు చేసిన పొరపాటు. అలా ఎప్పుడూ నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు.” అంది అమ్మ “నేనన్నీ చేసినవేగా చెప్పాను . అందులో తప్పేముందీ?” అని అడిగాడు చేతన్.\n\nనీ ఫ్రెండ్ నిఖిల్ చూడు యెంత బాగా బొమ్మలు వేస్తాడో, ‘ఆర్ట్ కంపిటిషన్లో’ ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. స్కూల్ న్యూస్ లెటర్ చదివితే గాని ఆ విషయం నాకు తెలియలేదు. అలాగే మోహిని ‘డిబేట్’ లో సెకండ్ ప్లేస్ తెచ్చుకుందిట. అలా ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో బాగా కృషి చేస్తారు. అప్పుడు పోటీల్లో గెలుస్తారు. నువ్వు కొన్నిటిలో బాగా చేసావు నీ ఫ్రెండ్స్ ఇంకోన్నిటిలో బాగా చేస్తారు. అందరూ గొప్పవారే. చిన్నప్పుడు నువ్వు బార్నీ చూసేవాడివి కదా ‘. బార్నీ ’ఎవ్రీ బడీ ఈస్ స్పెషల్’ అని చెప్పలేదూ! అలా అందరూ గొప్పవారే.\n\n” ఓ అందుకా ఎవరూ నాతో సరిగ్గా ఉండట్లేదు. ఇంకెప్పుడూ అలా చెయ్యను” అని వాళ్ళ అమ్మతో చెప్పాడు చేతన్.\nచేతన్ ఫ్రెండ్స్ కూడా చేతన్లో వచ్చిన మార్పు గమనించి మళ్ళీ వాళ్ళ గ్రూప్ లొ చేర్చుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 454,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వోత్కర్ష",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 204,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ..అతనికి మంచితనం తో పాటు పేదరికం కూడా ఉంది.. విష్ణు శర్మ రోజు పక్క ఊరికి వెళుతూ దారిలో రాజుగారి కోట వద్ద ఆగి రాజుగారిని ఆశీర్వదిస్తూ మంత్రాలు చదివి వెళ్ళేవాడు..అది అతని దినచర్య లో ఒక భాగం అయిపొయింది..\n\nఒక రోజు రాజు గారికి నిదర పట్టక ఉద్యానవనం లో తిరుగుతుంటే విష్ణు శర్మ తెల్లవారు జామున తనను ఆశీర్వదిస్తూ మంత్రాలు చదవడం వినబడ్డాయి..విషయం ఏమని ఆరా తీసి విష్ణు శర్మను కోటకు పిలిపించాడు రాజు..తనేం తప్పు చేసాడో తెలియక అయోమయంగా చూస్తున్న విష్ణు శర్మని విషయం అడిగాడు రాజు.. … దానికి విష్ణుశర్మ వినయంగా..\n\n“మహా రాజా!ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటున్న మీరు ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడే కదా మేమందరం బాగుండేది..అందుకే అలా చేస్తున్నాను “అని చెప్పాడు ..రాజు చాలా సంతోషించి “ఎటువంటి స్వార్ధం లేని నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది..నీకేం కావాలో ఒక కోరిక కోరుకో” తీరుస్తాను అన్నాడు ..\n\nవిష్ణు శర్మ కు అప్పటికప్పుడు ఏమి కోరుకోవాలో తెలియలేదు..వద్దు వద్దన్నా రాజు కోరుకోమంటున్నాడు ..చివరకు ఆలోచించి తనకు ఎప్పటి నుండో తినాలని ఉన్న పాకం గారెలు గుర్తొచ్చి..మొహమాటంగా రాజుకు చెప్పాడు ..రాజు నవ్వుకొని సరే ఇంటికి చేరు నీకు కావలసినవి పంపుతాను అని మాటిచ్చాడు..\nఈ లోపల రాజు విష్ణు శర్మను కోటకు పిలిపించిన సంగతి అతని గయ్యాళి భార్యకు తెలిసింది …\nశర్మ రాగానే “ఏమి కోరుకున్నారండి” అని ఆత్రంగా అడిగింది …పాకం గారెలు కోరిక వినగానే తలపట్టుకుని..\n\n“హరి భగవంతుడా ,ఇలాంటి వాడిని భర్తగా చేసావేంటి అని నెత్తి నోరు మొత్తుకుంది..” రాజంతటివాడు ఏమికావలో అడిగితే ఎవరైనా పొలం అడుగుతారు .పాడి అడుగుతారు,ధనం అడుగుతారు ,పసిడి అడుగుతారు..నువ్వేమో పాకం గారెలు అడుగుతావా “అని భర్తను తిట్టిపోసింది …\nఈ లోపల రాజు పంపిన రెండు బస్తాల మినపప్పు ,పెద్ద పెద్ద బెల్లం అచ్చులు ,పెద్ద గుండిగల నూనె ,రుబ్బురోలు అన్ని గుమ్మం దగ్గర చూడగానే ఆమె కోపం తారాస్తాయి చేరింది ..\nపాకం గారెలు కావాలా ఉండండి మీ పని చెప్తాను అని మినప్పప్పు నానబోసి రుబ్బి,బెల్లం పాకం పట్టి, వేడి వేడి పాకం గారెలు అరచేతి మందాన చేసి ఒక పెద్ద పళ్ళెం నిండుగా వేసి తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది …\n“ఇదిగో ఇవన్ని తినండి ఇవయ్యాకా ఇంకొకన్ని గారెలు ఉన్నాయిలోపల ..తినకపోయారో నా సంగతి తెలుసుగా “\nఅని చెప్పి కర్రపట్టుకు కూర్చుంది …\n\nశర్మ ఆనందంగా నాలుగు గారెలు గభ గభ తిన్నాడు ఆ తరువాత అతి కష్టం మీద ఇంకో అన్ని గారెలు తిన్నాడు …., ఇక కడుపు నిండి తినబుద్ది కావట్లేదు…\n“ఊ చూస్తారేం తినండి” అని గదమాయించింది భార్య …ఇంకో రెండు తినేసరికి తిన్నది బయటకు వస్తుందేమో అనిపించింది శర్మకు … మెల్లగా వెక్కుతూ..”వెక్కిళ్ళు ..మంచి నీళ్ళు” అన్నాడు భార్యకు సైగ చేస్తూ …\n“సరే ఇక్కడే ఉండండి పట్టుకొస్తా లోపల ఇంకో పళ్ళెం నిండా గారెలు కూడా ఉన్నాయి అవికూడా తెస్తాను ..ఒక్కటి కూడా మిగల్చకుండా తినాలి” అని వెళ్ళింది ఆమె.\n\nఅదే అదనుగా భయస్తుడైన శర్మ బయటకు పరుగులు పెట్టాడు …భార్య అది గమనించి వెనుక నుండి పిలవడం మొదలు పెట్టింది..అయినా ఆపకుండా పరుగు పెడుతూ పరుగు పెడుతూ చీకటి పడేవేళ ఒక చిట్టడివికి చేరుకున్నాడు శర్మ..ఆ చీకటిలో దారి తెలియక భయమేసి జంతువులూ తినేస్తాయేమో అన్న భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు.\n\nఅర్ధరాత్రి వేళ చెట్టు క్రింద కలకలం వినబడితే మెలుకువ వచ్చి చూసాడు విష్ణు శర్మ ..అక్కడ నలుగురు దొంగలు తాము ఆ రాత్రి రాజుగారి ఖజానా నుండి దోచుకున్న బంగారం ,వజ్రాలు ,రత్నాలు అన్ని పంచుకుంటున్నారు ..అయితే చీకటిలో శర్మకు అలికిడి తప్ప మనుషులు కనబడక పోయే సరికి..తన భార్య అనుకున్ని..\n“అన్నీ తినేస్తాను ఒక్కటి కూడా వదలను “ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ….అవి పిశాచాల అరుపులుగా భావించి దొంగలు అవన్నీ వదిలి పారిపోయారు …\nకాసేపటికి క్రిందకు దిగి విషయం గ్రహించిన విష్ణుశర్మ అవి ఎవరి వస్తువులైనా రాజుగారికి అప్పచెప్పడం భాద్యతగా భావించి వాటినన్నిటిని మూటగట్టి మోసుకుంటూ తెల్లవారే పాటికి కోటకు చేరుకున్నాడు …రాజు శర్మ నిజాయితీకి ఎంతగానో సంతోషించి అడక్కుండానే అతనికి ఇల్లుపోలం పాడి అన్ని కానుకగా ఇచ్చి పంపాడు..\nకాబట్టి నిజాయితీగా ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది … ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 455,
        "IMAGE": "cat_2",
        "NAME": "పాకం గారెలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 205,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకవూళ్ళో ఒక ముసలమ్మ వుంది. తాను గొప్పమాటకారినని గర్వం. ఎవరేంచెప్పినా ఠక్కున సమాధానం ఇవ్వగలనన్న ధీమా.\n\nఒకరోజు ఆమె వూరి బయట తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక నేరేడు చెట్టుమీద ఒక కుర్రాడు కనపడ్డాడు. చెట్టునిండా నేరేడుపళ్ళు విరగ కాసాయి. మన ముసలమ్మకు నోరూరింది. తను చెట్టు ఎక్కలేదు కనుక కుర్రడిని కాసిని పళ్ళు కోసి ఇమ్మంది.\nఅందుకా కుర్రాడు “అవ్వా! నీకు వూదుకు తినేపళ్ళు కావాలా లేకపోతే మామూలు పళ్ళు కావాలా?” అని అడిగాడు.\n\n“ఓరి కుర్ర కుంకా! నేరేడు పళ్ళు వేడిగా వుంటాయా ఏమన్నానా వూదుకుతింటానికి? వెధవకబుర్లు నాదగ్గర చెప్పకు” అంది వెటకారంగా.\n“నిజం అవ్వా! వూదుకునే తినాలి” అన్నాడు ఆకుర్రాడు.\n“ఏది అలా వూదుకుతినే పళ్ళు పడెయ్యి చూస్తా” అంది అవ్వ.\n\n“సరే అవ్వా నువ్వు నా మాటలు నమ్మడంలేదు కనుక ఇదిగో నీకు కొన్ని పళ్ళు కిందకి పడెస్తా! కాని జాగ్రత్త వూదుకు మరీ తిను” అని చెట్టు కొమ్మ దులిపాడు.\n\nకింద చాలా నేరేడుపళ్ళు పడ్డాయి. అవ్వ కొన్ని ఏరుకొని వాటికి మట్టి అంటుకోవడంతో ఒక్కొక్కటే మట్టిపోయేలా వూదుకొని తింది.\n\n“ఏం అవ్వా! చూసావా వూదుకుతినే పళ్ళు ?” అన్నాడు కుర్రాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 456,
        "IMAGE": "cat_2",
        "NAME": "వూదుకుతినే పళ్ళు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 206,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజ్యంలో ఒక పేను వుండేది. అది రాజుగారి హంసతూలికా తల్పాన్ని అంటి పెట్టుకుని, రాజుగారి రక్తం తాగుతూ హాయిగా జీవిస్తోంది. అది రాజుగారి రక్తం తాగినా అయనకి ఏమాత్రం నెప్పి కలుగకుండా తాగటం వల్ల రాజుగారికి ఎప్పుడూ ఏ బాధకలుగలేదు.\n\nఇలా వుండగా ఒక రోజు ఒక నల్లి వచ్చి ఆ పేనుని ఆశ్రయం ఇమ్మంది. ప్రతిరోజు పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం చేసే రాజుగారి రక్తం చాలా బాగుంటుంది అని, దానిని ఒకసారి రుచి చూసి వెళ్ళిపోతానని నల్లి పేనుని బ్రతిమాలింది. మొహమాటం కొద్దీ పేను సరేనని ఒప్పుకుంది.\n\nఐతే “రాజుగారికి నిద్రపట్టేవరకు ఆగి, మెల్లగా నొప్పి పుట్టకుండా తాగమని” పేను చెప్పింది. సరే నని నల్లి అంది.\nకానీ రాజు గారు వచ్చి మంచం మీద పడుకోగానే నల్లి ఆత్రంగా పుటుక్కున పొడిచి రక్తం తాగింది. ఆ బాధకు తట్టుకోలేకపోయాడు రాజు. వెంటనే సేవకుడిని పిలిచి అదేమిటో వెతకమన్నాడు.\n\nసేవకుడు దీపం తెచ్చి పట్టెమంచం, పరుపు అంతా గాలించాడు. ఈలోగా నల్లి పరుగెత్తి పారిపోయి పట్టె సందులో నక్కింది. ఏమీ తెలియని పేను దుప్పటినంటిపెట్టుకుని సేవకుని కంట పడింది. అదే రాజుగారిని కుట్టిందని అనుకున్న సేవకుడు ఆ పేనును పట్టుకుని చంపేసాడు.\n\nనీతి : గుణము, శీలము తెలియకుండా ఎవ్వరిని చేరదీయరాదు. అలా చేసిన, పేనుకి పట్టిన గతే పడుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 457,
        "IMAGE": "cat_2",
        "NAME": "పేను – నల్లి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 207,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామవరం అనే గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడా ఉండేది.ఆమె చాల గయ్యాళిది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.వాడి పేరు రంగడు. వాడంటే ఆమెకు చాలఇష్టం . కాని అడిగినవన్నీ ఇస్తే చెడిపోతాడని ఇచ్చేది కాదు.ఆ అలవాటు అందరి మీదకూడా చూపడం వచ్చింది .\n\nకొన్ని రోజులకు అందరికి ఆవిషయం తెలిసి తమకు కావలసిన వాటిని ఆమెకు వ్యతిరేకంలో చెప్పి చేయించు కొనేవారు. ఆపై నవ్వుకునేవారు . ఆవిషయం భర్త చెప్పిన వినిపించుకునేది కాదు . అలా జరుగుతుండగా రంగడికి పెళ్లీడు వచ్చింది. అదే గ్రామంలో విజయ అనే చక్కని పిల్ల ఉండేది.ఆమె అంటే రంగడికి చాలా ఇష్టం.కాని ఆ విషయం తల్లికి తెలిస్తే విజయతో పెళ్లి జరగానీయదని, స్నేహితుల దగ్గర విజయతో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఆ విషయం కాంతమ్మకు తెలిసింది. విజయ తల్లి తండ్రులతో మాట్లాడి రంగడికి విజయకు పెళ్లిచేసింది.\n\nకొత్తకోడలిపై కూడా తన పెత్తనం సాగించేది.రంగడు తన తల్లి మంచిదేనని,కాని ఆవిడకున్న అలవాటు సంగతి చెప్పి ఆమెను ఎప్పుడు బాధ పెట్టవద్దని చెప్పాడు. విజయ సరేనన్నది .కాంతమ్మ ఎదిచేబితే అదే చేసేది . అప్పటి నుండి విజయ తన ఇష్టా ఇష్టాలు అత్తకు తెలియనిచ్చేది కాదు. ఒకసారి విజయకు కాకర కాయ కూర తినాలనిపించింది. కాని అత్తకు తెలిస్తే తిననివ్వదని తెలిసి, అత్తా వినేటట్లుగా తనకు కాకర కాయ కూర అంటే అయిష్టమని ,పుట్టింట్లో కూడా కాకర కాయ కూర చేస్తే తినేదాన్నికాదని ,అమ్మ అరిస్తే కాకర కాయ కూర వేయించుకుని తండ్రికో ,చెల్లెళ్ళకో వేసేదాన్నని రంగడితో చెప్పింది .\n\nకాంతమ్మ కాకర కాయ కూర చేసి కోడలితో తినమని చెప్పింది. విజయ తిననన్నది . తినాల్సిందేనని కాంతమ్మ పట్టు పట్టింది .రంగడు వచ్చాక తింటానన్నదివిజయ. ఇప్పుడే తినాలని కాంతమ్మ పట్టు పట్టింది .\n\nవిజయ ఎడుస్తున్నట్లు నటిస్తూ కూర ఇష్టంగా తిన్నది. అలా తనకు కావలిన వాటిని సాధించుకునేది. కొద్ది సంవత్సరాల తర్వాత కాంతమ్మ జబ్బు చేసి చనిపోయంది అప్పటినుండి విజయ తనకు కావలసినవన్నీ తను చేసుకునేది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 458,
        "IMAGE": "cat_2",
        "NAME": "అత్తగారి పెత్తనం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 208,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కళ్యాణకతకం అనే పట్టణంలో ైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. అతనోరోజు వేటకు వెళ్ళి ాడవిలో ఒక లేడిని చూసి బాణంతో కొట్టాడు. ఆ దెబ్బకు చనిపోయిన లేడిని భుజాన వేసుకుని వెళ్ళసాగాడు. దారిలో అతడికి ఒక పంది కనిపించింది. లేడిని కిందపెట్టి పందిని కి బాణంవేసాడు అది వేటగాడి మీదకి వచ్చి అతడ్ని ఢీకొట్టింది వెటగాడు చనిపయాడు, పంది బాణం దెబ్బకు చనిపోయింది వాళ్ళ కాళ్ళకిందపడి అక్కడే ఉన్న ఒక పాము చనిపోయింది.\n\nధీర్ఘారావం అనే నక్క ఆహారం వెతుకుతూ అక్కడికి వచ్చి అక్కడ చచ్చి పడి ఉన్న లేడి, వేటగాడు, పంది, పాములను చూసి ఎంతో ఆనందంతో ’నాకు మూడునెలలకు సరిపడా ఆహారం దొరికింది.’ అనుకుంది. అన్నీ దాచుకుని ఈరోజుకి ఈ వింటినారతో పాముతో నా ఆకలి తీర్చుకుంటాను.’ అనుకుంటూ వెళ్ళి వింటి నారను నటితో కొరికింది. దానితో వింటి్బద్ద విసురుగా వచ్చి దానికి తాకి అది అక్కడిక్కడే మరణిచింది.\n\n“నక్క అత్యాశ వల్ల ఏం జరిగిందో చూసావుగా కాబట్టి అత్యాశ కూడదు. సరె జరిగిందేదో జరిగింది గతాన్ని తవ్వి ప్రయోజనం లేదు. ఇకపై మన ముగ్గరం స్నెహితులుగా ఉందాం. అంది మంథరము.\n\nఅప్పటినుండి లఘుపతనకం అనబడే కాకీ, హిరణ్యకుడనే ఎలుక, మంథరము అనబడే తాబేలు స్నేహితులుగా ఉంటూ సంతోషంతో కాలం గడపసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 459,
        "IMAGE": "cat_2",
        "NAME": "మంథరము చెప్పిన నక్క కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 209,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక బ్రాహ్మణుడు తన భార్యతో “రేపు అ మావాస్య బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.” అన్నాడు.\n“ఇంట్లో ఏమీలేవు మీరేదైనా తెస్తే నేను ఏదైనా చేసిపెట్తగలను లేపోతే నేనేం చేయగలను.” అంది బ్రాహ్మడి భార్య.\n\n“ఉన్నంతలో పొదుపుగా కాలంగడపాలి.” అన్న బ్రాహ్మణుడి మాటలకు “ఇంట్లో నువ్వులున్నాయి వాటిని దంచి నువ్వుపప్పుతో రేపటి కార్యక్రమం ఎలాగోలా చేద్దాం.” అంది.\n\nనువ్వులు దంచి పప్పు ఆరబోసింది. అంతలో ఓ కోడివచ్చి తన కాళ్ళతో ఆ పప్పుని కెలికింది.”అదిచూసిన బ్రాహ్మడు ఇది బ్రాహ్మణ బోజనానికి పనికిరావు అంటుపడ్డాయని అన్నాడు.\n\nదానికి అతడి భార్య ఆ నువ్వుపప్పు తీసుకుని ఒకరింటికి వెళ్ళి ఈ పప్పు తీసుకుని నువ్వులు ఇవ్వమని అడిగింది.\n\nఆ ఇల్లాలు కష్టపడకుండా నువ్వుల బదులుగా నువ్వుపప్పు వస్తుండడం అలాగే ఇస్తానని చెప్పింది. అంతలోకి ఆమె భర్త వచ్చి విషయం తెలుసుకుని భార్యతో ” ఓసి పిచ్చిదానా ఎవరైనా కష్టపడి నువ్వులు కడిగి ఆరబోసి దంచి చేసిన పప్పు ఇచ్చి ముడి నువ్వులు తీసుకుంటున్నారంటే అందులో ఏదో మోసం ఉండిఉంటుంది. అది నువ్వు తీసుకోకు” అన్నాడు.ఆ కథ చెప్పిన వీణాకర్ణుడు “ఈ ఎలక ఇంత ఎత్తుకి ఎగిరి ఆహారం తింటూ ఇక్కడే ఉండటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది.” అన్నాడు.అది తెలుసుకోవటానికి ఓ గునపంతో నేను ఉండే కలుగుని తవ్వి అందులో నేను ఎంతో కాలంగా పోగుచేసుకున్న ధనమంతా తీసుకున్నాడు. ధనం అంతాపోయి నేను నిస్సహాయుడనై అక్కడే తిరుగుతూ ఉంటే ఒకనాడు తన చేతికర్రతో నన్ను కొట్టాడు. కొద్దిలో దెబ్బతప్పించుకుని చావుతప్ప కన్నలొట్టబోయి అక్కడనుండి వచ్చేసాను. నాకు మీలాంటి మంచి మిత్రులు లభించారు. జీవితంలో కావలసినది సజ్జనసాంగత్యమే. అని తన కథని చెప్పాడు హిణ్యకుడు.\n\nదానికి మంథరుడు “మిత్రమా నీ కష్టాలకు నీ ధనాశయే కారణం. అవసరాన్ని మించి అతిగా సంపాధించాలనీ, అంతా దాచుకోవాలనే లోభత్వం మంచిదికాదు.నీకు జరిగినట్టుగానే చివరకది దొంగలపాలో, ఇతరులపాలో అవుతుంది. మంచి హృదయంతో చేసే దానం, గర్వంలేని జ్ఞానం, క్షమతో కూడిన శౌర్యం, త్యాగబుద్దితో సంపాదంచే డబ్బు ఎవరికైనా కీర్తిప్రతిష్టలను సంపాదిచి పెడతాయి. లోభబుద్దితో ధనమూ, వస్తువులూ పోగేసేవాళ్ళకి చివరకి దుఖం మాత్రమే మిగులుతుంది. అలాంటి గుణం వల్ల ఒక నక్క త్న ప్రాణాలు పోగొట్తుకంది అంటూ ఆ నక్క ను చెప్పసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 460,
        "IMAGE": "cat_2",
        "NAME": "వీణాకర్ణుడు చెప్పిన కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 210,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "“భాగీరథి నదీ తీరాన ఒక జువ్వి చెట్టు ఉండేది. ఎన్నో పక్శులు ఆ చెట్టుపై గూళ్ళు కట్టుకుని ఉండేవి. అక్కడే జరద్గవము అనే ఒక ముసలి గద్ద ఉంటుండేది. పక్షులు బయటకి వెళ్ళినప్పుడు వాటి పిల్లలను ఈ గద్ద జాగ్రత్తగా చూసుకునేది, పక్షులు తమ ఆహారంలో కొంత ఈ గద్దకి పెడుతుండేవి.\n\nదీర్ఘకర్ణము అనే ఒక పిల్లి ఆ పక్షిపిల్లలను చూసింది, ఎలాగైనా వాటిని తినాలనుకుంది. దానికై ఆ పక్షులకి కాపలాగా ఉన్న జరద్గవాన్ని మంచిచేసుకోవాలనుకుని దాని దగ్గరకి వెళ్ళి పలరించి తన గురించి ఇలా చెప్పుకుంది.\n\n“నా పేరు దీర్ఘకర్ణుడు. ఒకప్పుడు మాంసాహారినే తరువాత దైవక్తి తో పూర్తి శాకాహారిలామారాను. ఈ నదివద్ద నేను చాంద్రాయణవ్రతం చేస్తున్నాను. మీవంటి పెద్దల సజ్జునుల స్నేహం తో దర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని నా కోరిక.” అంది పిల్లి.\n\nపిల్లి నమ్మకం కలిగేలా చెప్పటంతో మొదట నమ్మక పోయినా చివరకు పిల్లిని నమ్మింది గద్ద. స్నేహానికి ఒప్పుకుంది. దానితో పిల్లి అక్కడికి వస్తూ పోతూ ఉండేది. కొంతకాలానికి గద్దని బాగా నమ్మించి దాని తొర్రలోనే ఉండసాగింది. గద్ద చూడకుండా మెల్లిగా ఒక్కో పక్షిపిల్లనూ చంపి తొర్రలోకి తెచ్చుకుని తినసాగింది.\n\nరోజు రోజుకి తమ పిల్లల సంఖ్య తగ్గడం గమనించిన పక్షులు ఎంతో దుఖించాయి. అంతటా వెతుకుతూ చివరకు గద్ద తొర్రలో ఎముకలు ఈకలు చూసాయి. ఈ గద్దే తమ పిల్లలను చంపి తిన్నదని పక్షులన్నీ జరద్గవాన్ని పొడిచి చంపేసాయి.\n\nకనుక కొత్తవారిని వారిగురించి పూర్తిగా తెలియకుండా నమ్మకూడదు.” అంటూ జింకతో చెప్పింది కాకి.\nదానికి నక్క కోపంతో “నువ్వుమాత్రం మొదట్లో జింకకి కొత్తవాడివేకదా, ఐనా మీరు ఇప్పుడు స్నేహంగా ఉన్నారు.” అంటూ వాదన మొదలెట్టింది.\n\nఅదివింటున్న జింక ఎందుకీ వాదనలన్నీ “ముగ్గురం కలిసి ఉందాం కొత్తవారు మెల్లిగా చనువువల్ల స్నేహితులుగా మారతారు.” అంది. నక్క వాటితో స్నేహం నటిస్తూ జింకను తినటానికై సమయం కోసం ఎదురుచూడసాగింది.\n\nఓ రోజు నక్క జింకతో నీకు మేతకై ఇక్కడికి దగ్గరలోనే చక్కగా కాచిన పొలమొకటి ఉంది ఉంటూ తీసుకుని వెళ్ళ ఓ పొలాన్ని చూపింది. జింక చాలా సంతోషంతో అప్పటినుండీ ఆ పొలంలోనే మేయటం మొదలెట్టింది.జింక పొలంలో పైరు నాశనం చేస్తున్నదని గ్రహించిన ఆ పొలం రైతు ఓరోజు జింకను పట్టుకోవటానికి ఒక వలను పైకి కనిపించకుండా ఏర్పాటు చేశాడు. అది తెలియని జింక ఆ వలలో చిక్కుకుంది.\n\nఅక్కడికి వచ్చిన నక్క తన ఉపాయం ఫలించినందుకు మనసులో ఎంతో సంతోషపడింది.”నేను వలలో చిక్కుకున్నాను వలను కొరికి నన్ను రక్షించు.” అంటూ నక్కని అడిగింది జింక.\n\nదానికి నక్క ఒప్పుకోకుండా “నేను నిష్ఠాపరుడ్ని ఆ వలను నా నోటితో కొరకను, మరేదన్నా ఉపాయం చెప్పు.” అంది.\n\nదానితో నక్క అసలు స్వభావాన్ని గ్రహించి జింక బాధపడ సాగింది. ఇంతలో వీళ్ళను వెతుకుతూ అక్కడికి వచ్చిన కాకి జింకను చూసి అలా వలలో చిక్కుకున్నావేమిటని అడిగింది.\n\n“నీ మాటలు విననందునే ఇలా జరిగింది. చెడ్డకాలము దాపురించిన మంచి మాటలు చెవినెక్కవు. సజ్జన సాంగత్యం మంచిని కలిగించినట్టే దుర్జన సాంగత్యము కష్టాలను కలిగిస్తుందని నాకు ఇప్పుడు తెలిసంది.” రైతు నన్ను చంపినతరువాత నన్ను తినాలని నక్క ఇక్కడే ఎక్కడో నక్కి ఉంది.” అంది జింక “జరిగిన దానికి విచారించి లాభంలేదు, . నువ్వు చచ్చినట్టుగా శరీరం బిర్ర బిగించి పడుకో, సమయం చూసి అరుస్తాను అప్పుడు పారిపో.” అంటూ ఉపాయం చెప్పింది కాకి.\n\nరైతు వచ్చేసరికి జింక చచ్చినట్టు పడిఉంది. కాకి దాన్ని ముక్కుతో పొడుస్తున్నట్టు నటించసాగింది. జింక చనిపోయిందనుకుని రైతు దాన్ని వలనుండి తీసి పక్కన ఉంచి వలను చుట్ట చుట్టసాగాడు. కాకి వెంటనే అరవసాగింది, కాకి అరుపులు వినగానే జింక లేచి వేగంగా పరిగెత్తి పారిపోయింది. అది చూసి రైతు తన చేతిలోని కర్రను జింకపైకి విసిరాడు. అది గురితప్పి పక్కనే నక్కి ఉన్న నక్కకి తగిలి అది చచ్చిపోయింది.\n\nకనుక కొత్తవారితో స్నేహం ప్రమాదకరం అంటూ చెప్పాడు లఘుపతనకంతో హిరణ్యకుడు. కానీ లఘుపతనకము హిరణ్యకుడిని వదలకుండా “నీ స్నేహితుడైన చిత్రగ్రీవడి వంటివానే నేను. నీతో స్నేహం కోరివచ్చాను, నువ్వు ఒప్పుకొనపోతే నీ ముందే అన్నపానియాలుమాని ప్రాణాలు వదులుతాను కానీ నీ స్నేహం లేకుండా కదలను.” అంది.\n\nకాకి పట్టుదలకు సంతోషించిన హిరణ్యకుడు దానితో స్నేహానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ స్నేహంగా ఉండసాగారు.\n\nఒకనాడు లఘుపతనకుడు ” ఇక్కడ నాకు ఆహారం దొరకటం కష్టంగా ఉంది, ఈ చోటుని విడిచి పోవాలని అనుకంటున్నాను.” అంది.\n\nదానికి హిరణ్యకుడు ఒప్పుకోకుండా “స్థానభ్రంశం పొందినవారు ఎవరూ రాణించరు. చోటుమార్చేఅ ఆలోచన చేయకు.” అన్నాడు.\n\n“బలవంతులు, సత్పురుషులు స్థానమార్పిడివల్ల వృద్ధి పొందుతారు, బలహీనులు స్థానమార్పుకి భయపడి నాషనమౌతూ ఉంటారు నేను అలా కాకుండా ఈ చోటు వదలి మరొ అడవికి వెళతాను.” అంది హిరణ్యకుడి మాటలను ఒప్పుకోకుండా.\n\n“ఇంతకీ ఎక్కడివెళ్ళాలనకుంటున్నావు?” అంటూ ప్రశ్నించాడు హిరణ్యకుడు.\n\n“దగ్గరలోనే ఉన్న అడవిలో కర్పూరగౌరము అనే సరోవరంలో మంథరుడు అనే తాబేళ్ళ రాజు ఉన్నాడు. నాకతను గొప్ప స్నేహితుడు. అతడే నన్ను ఈ సమయంలో కాపాడగలవాడు అక్కడికే వెళదామనుకుంటున్నాను.” అని చెప్పాడు.\n\n“జీవనం గడవని చోట, బంధుమిత్రులు లేనిచోట నివసించకూడదని పెద్దలు అంటారు. నీవు లేకుండా నేను ఒక్కడినే ఇక్కడ ఉండలేను నేను కూడా నీతో వస్తాను.” అంది ఎలుక.\n\nకాకి ఎలుకను తన వీపుపై ఎక్కించుకుని ఎగురుతూ వెళ్ళి చెరువుముందు వాలింది. దాన్ని చూసి తాబేలు ఎంతో సంతోషంచింది.\n\n“నిన్ను చూడడం సంతోషంగా ఉంది, చాలా కాలం తరువాత నిన్ను చూాను. ఇంతకీ నీతోపాటు వచ్చిందెవరు?” అంది తాబేలు.\n\nదానికి కాకి మంథరుడుతో “ఇతను నా స్నేహితుడు, పేరు హిరణ్యకుడు, ఇతనొక మూషిక రాజు. నా వలెనే నువ్వూ ఇతనితో స్నేహంగా ఉండాలి.” అంది.\n\nదానికి అంగీకరించిన మంథరము ఇలా అడిగింది” హిరణ్యకా జనవాసాలు ఉండుచోటే ఎలుకు ఉంటాయి, అక్కడే ఆహారం లభిస్తుంది కదా, మరు నువ్వు ఇలా అడవులలో ఉండటానికి కారణం?”\n\nదానకి ఎలుక “అది నిజమే నేనుకూడా పూర్వం ఒక పట్టణంలోనే ఉండేవాన్ని, కొన్ని కారణాలవల్ల ఇలా అడవిలో ఉంటున్నాను. నా కథ చెపుతాను వినండి.” అంటూ హిరణ్యకుడు తన కథ చెప్పగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 461,
        "IMAGE": "cat_2",
        "NAME": "జరద్గవము కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 211,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ పులి ముసలిదైపోయి వేటాడే శక్తి లేక, ఆకలితో బాధ పడసాగింది. శారీరక శక్తి లేక బుద్దితో ఆహారాన్ని సంపాదించాలని అనుకుంది. ఉపాయంతో ఓ బంగారు కాంకణాన్ని చేత పట్టుకుని చెరువు గట్టు పై కూర్చుంది.\n\nఆ దారిలో వెళుతున్న ఓ బాటసారి పులి చేతిలోని బంగారు కాంకణాన్ని చూసి ఆగాడు. పులి సంతోషంతో “నా దగ్గరకి రా వచ్చి ఈ బంగారు కంకాన్ని తీసుకో” అంది.\n\nఅందుకు బాటసారి “కౄర జంతువువైన నిన్ను నమ్మి దగ్గరికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావేమో” అన్నాడు.\n\nదానికి పులి “నేనింత కాలం ఎన్నో జీవులు చంపి తిన్నందుకు పశ్చాతాప పడుతున్నాను, ఇప్పుడు ములిదాన్ని అయ్యాను. వంట్లో బలం లేదు. నా పాపాలను తొలగించుకోవటానికి ఈ బంగారు కంకణాన్ని దానం చేద్దానుకుంటున్నాను. ఆ చెరువులో స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణాన్ని తీసకో నాకు పుణ్యం లభిస్తుంది సంశయించకు” అంది.\n\nబాటారికి పులి మలు నమ్మకం కలిగించాయి. స్నానానికని చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు. అది చూసి పులి బయటకు లాగుతానని చెప్పి చంపి తినేసింది.\n\n“అత్యాశకు పోయి కౄర జంతవున నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను, ఉచితంగా వస్తున్న దానికి ఆశపడరాదు” అనుకుంటూ పులికి ఆహారమైనాడు బాటసారి.\n\nఆ కథ చెప్పి చిత్రగ్రీవుడు “కనుక ఆ నూకలపై మనకు ఆశ వద్దు. వాటి వెనుక ఏ ఆపద ఉందో తెలిదుకదా!” అన్నాడు.\n\nదానికి వాటిలోని ఓ వృద్దపావురం “ఎక్కడో ఏదో జరిగిందని కళ్లఎదుట ఉన్న ఆహారాన్న వదులుకోవటం ఎందుకు? ఇలా ప్రతిదాన్ని అనుమానిస్తే సుఖం లేదు. వెళ్లి ఆ నూకలు తింద్దాం పదండి.” అంది.\n\nముసలి పావురం మాటలు విన్న పావురాలు ఆశతో ఆహారంకై వెళ్లి ఆ వలలో చిక్కుకుని పోయాయి. అప్పుడు వాటికి చిత్రగ్రీవుడి మాటల్లో నిజమేమిటో తెలిసింది.\n\n” బుద్ది ఉన్నవాడే వృద్దుడు గాని నీలా వయసు ఉన్న వాడ వృద్దుడా! నీ మాటలు నమ్మి చిక్కలో పడ్దాం” అని ఆ ముసలి పావురాన్ని నిందించాయి.\n\nదానికి చిత్రగ్రీవుడు “అతడిని అనటమెందుకు? మన బుద్ది ఏమయినట్టు. ఇలాంటప్పుడే ఉపాయం ఆలోచించాలి, నేనొక ఉపాయం చెపుతాన, మమందరం ఒక్కసారిగా ఎగిరి వలను మనతో తీసుకు వెళదాం. అందరూ ఒక్కసారిగా రెక్కలుకదల్చి పైకి ఎగరండి” అన్నాడు.\n\nఅందరూ కలిస్తే ఎంతటి పనినైనా సునాయాసంగా చేయవచ్చు,ఆన్న మాటలు నచ్చి పావురాలన్నీ వలతో పాటు ఆకాశ మార్గాన ఎగిరాయి.\nవేటగాడు ఆశ్చర్యపోతూ ఐకమత్యాన్ని మించిన బలమేమున్నది! అనుకున్నాడు.\n“ఇప్పుడు మనమేం చేద్దాము, ఇలా ఎంతసేపని ఎగరగలము” అంటూ మిగతా పావురాలు చిత్రగ్రీవుడిని అడిగాయి.\n\n“ఇక్కడికి దగ్గరలోనే హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు అతడు నాకు సన్నిహిత మిత్రుడు. అతడు ఈ వలను కొరికి మనకు సహాయం చేయగలడు, ఈ లోకంలో ఎవరికైనా తల్లి తండ్రులు, స్నేహితులే నమ్మదగిన వారు.” అన్నాడు చిత్రగ్రీవుడు.\n\nఅన్నీ కలిసి ఎగురుతూ హిరణ్యకుడి కలుగు దగ్గరకు వెళ్ళాయి. హిరణ్యకుడు స్నేహితుడికి కలిగిన కష్టాన్ని చూసి విచారించి తన పళ్ళతో ఆ వల కొరికి వాళ్ళను బంధ విముక్తులను చేసాడు.\n\nకనుక బుద్దిమంతుడైన వాడు “మొదట మంచి స్నేహితులను సంపాదించుకోవాలి..” అంటూ మిత్ర లాభం గురించి రాకుమారులకు చెప్పాడు విష్ణుశర్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 462,
        "IMAGE": "cat_2",
        "NAME": "బాటసారి – బంగారు కంకణం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 212,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం గోదావరి ఒడ్డున పెద్ద బూరుగు చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టుపై లఘుపతనకము అనే కాకి నివసిస్తూ ఉండేది. అది ఓరోజు ఉదయాన్నే నిద్రలేచి తన గూడు లోంచి బయటకు వచ్చి ఓ వేటగాడిని చూసింది. తెల్లవారగానే మొదట వీడి మొహం కనిపించిందే ఈ రోజు ఏంజరుగనుందో అనుకుంటూ వేటగాడినే గమనించసాగింది కాకి. వాడు చెట్టు పక్కనే వల పరచి దానిపై నూకలు జల్లి ఓ పొదలో దాక్కుని ఉన్నాడు.\n\nచిత్రగ్రీవుడు అనే పావురం మిగతా తోటి పావురాలతో కలిసి అప్పుడే అటుగా ఎగురుకుంటూ వచ్చి కింద నేలపై ఉన్న నూకలు చూసి “ఎవరూ లేని ఈ అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చాయి! ఇదేదో మోసంలా వున్నది, వీటికి ఆశపడి పోయామంటే బంగారు కంకణానికి ఆశపడి ప్రాణాలు పోగొట్తుకున్న బాటసారలా అవుతుంది. కనుక ఎవరూ కిందకు దిగకుండా ముందుకే వెళ్ళండి” అని అచెప్పాడు.\nమిగతా పావురాలన్నీ “ బంగారు కంకణమేమిటీ, ప్రాణాలు పోటంఏమిటి!” ఆ కథ చెప్పమని చిత్రగ్రీవుడిన అడిగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 463,
        "IMAGE": "cat_2",
        "NAME": "మిత్ర లాభం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 213,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.\n\nమహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.\n\nఅదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.\n\nనీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ది కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 464,
        "IMAGE": "cat_2",
        "NAME": "హంస - వేటగాడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 214,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "గ్రామాధికారి పరంధామయ్యకు సుస్తీచేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్నీ పిలిచి \"ఒరేయ్ అబ్బాయిలూ, ఇక నేను ఎంతోకాలం బతుకుతానని నమ్మకం లేదు. కాబట్టి నా దగ్గరున్న డబ్బు, బంగారం, పొలం మీకు పంపకం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి\" అన్నాడు.\n\nవెంటనే మూడో కొడుకు సుందరం భార్య, భర్తను గదిలోకి పిలిచి, \"చూడండీ! మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం. మేలైన రకం, ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది\" అని చెప్పింది. సుందరం భార్య మాటకు ఎదురు చెప్పలేక, \"అలాగే\" అని తల ఊపుతూ, తండ్రి దగ్గర కెళ్లి తనకు బంగారం కావాలనుకున్నాడు.\n\nరెండో కొడుకు గోపాలం భార్య కూడా భర్తను లోపలికి పిలిచి \"ఏమండోయ్! మీరు డబ్బు తీసుకోండి. ఎంచక్కా మనం పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు. మంచి బంగళా కొనుక్కోవచ్చు. ఈ పల్లెటూర్లో నేను ఉండలేను బాబూ. అయినా ఆ చవుడు భూమి మనకేందుకు, ఎంతకాలం కష్టపడితే అంతడబ్బు సంపాదించగలం\" అంది. గోపాలం కూడా భార్య మాటకు తల ఊపుతూ \"అలాగే\" అంటూ వెళ్లి, తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు.\n\nపాపం అమాయకుడైన కామేశం తన వాటాగా మిగిలిన బంజరు పొలాన్ని తీసుకుని భార్యాభర్తలిద్దరూ అహొరాత్రులూ కష్టపడి, దాన్ని మంచి వ్యవసాయ భూమిగా చేసుకుని చక్కని పంటలు పండించుకున్నారు. కొద్దికాలానికే పరంధామయ్య కాలం చేశాడు.\n\nడబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపాలం వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వాళ్ల సలహా, వీళ్ల సలహా విని, ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు. అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు.\n\nభార్యను తీసుకుని సుందరం పట్నంలో కాపురం పెట్టాడు. సుందరం భార్యకు బంగారమంటే మహా మోజు, రోజుకొక నగ సింగారించుకొని, ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది. ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్థరాత్రి సుందరం ఇంట్లో జొరబడి, కత్తులు చూపి బెదిరించి, ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు. ఇద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వచ్చి ఓదార్చారు.\n\nసుందరం, గోపాలం ఇద్దరూ బతుకు తెరువు లేక అన్న దగ్గరకొచ్చి బావురమన్నారు. భార్యల మాటలు విని, బంజరు భూమిని అన్నకు అంటగట్టి, మోసం చేసి, తమ స్వార్ధం తాము చూసుకున్నందుకు తగినశాస్తి జరిగిందని ఇద్దరూ పశ్చాత్తాప పడ్డారు. సిగ్గుతో తలవంచుకుని అన్నకు క్షమాపణ చెప్పుకున్నారు. ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించారు. తోబుట్టువును మోసం చేసినందుకు ఏం జరిగిందో చూశారా బాలలూ! ఇతరులను ఎప్పుడూ మోసం చెయ్యకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 465,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వార్ధం తెచ్చిన అనర్ధం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 215,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఆ మండలంలో అదే పెద్ద ఊరు. పూర్తిగా పట్టణం అనలేం, అలాగని పల్లెటూరు కాదు. మధ్యస్తంగా ఉంటుంది. ఆ ఊరిలో హైస్కూలు ఉంది, లైబ్రరీ ఉంది, రెండు మూడు ఆఫీసులూ వున్నాయి. భాస్కర్ పంచాయితీ ఆఫీసు గుమస్తా. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు గానీ, అతని భార్య శారద గురించి మాత్రం వివరంగానే చెప్పుకోవాలి. మంచి భక్తిగలది. ముఖ్యమైన దేవాలయాల్లో నిత్యం పూజలు, అభిషేకాలు చేయిస్తూ వుంటుంది. పిల్లలలో ఎవరికి జబ్బు చేసినా తాను ఉపవాసాలుంటుంది. ప్రతి శుక్రవారం పేదలకు పైసలు పంచుతుంది. కాషాయ రంగు దుస్తుల్లో ఎవరు కనిపించినా మహాసాధువని గౌరవించి భక్తితో సత్కరిస్తుంది. ఏ గుడిలో భజన జరిగినా ఆవిడ ముందుంటుంది. భక్తి గీతాలు కమ్మగా పాడుతుంది. చీరలు నగలు కొనడంలో ఎంత ఖర్చయినా వెనుకాడదు. వాళ్ళాయన శ్రీపతి నెలనెలా జీతం తెచ్చి ఆమె చేతికిస్తాడు. మిగిలిన ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే. శారదంటే ఆ వూళ్ళోనేకాదు చుట్టుపక్కల అమ్మలక్కలకు బాగా తెలుసు. ఆ రోజు అమావాస్య ఆదివారం, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో వయస్సులో ఉన్న ఒకావిడొచ్చింది. \"ఏమండీ మీ యింటికి గడ్డం మీసాలున్న నడివయస్సులో వున్న సాధువుగారేమయినా వచ్చినట్లు చూశారా మీరు?\" అంది.\n\n\"సాధువుగారా! ఎవరూ రాలేదండీ!\" కూర్చొండి అని చెప్పి ఎంతో గౌరవంగా మాట్లాడి వరండాలో కుర్చీ వేసింది శారద. ఫరవాలేదు వెళతానండి. \"ఆయన్ని గురించి మీకు రెండు మాటలు చెప్పాలి\" అందామె. \"చెప్పండి\" అంది శారద ఆతృతగా. ఆయన దేవుడు లాంటివాడు. దెయ్యాల్ని భూతాల్ని వదలగొడతాడు. మనలో మనకు తెలియని పెద్ద రోగాల గురించి ఇట్టే చెప్పేస్తాడు. ఇంటి దోషాల గురించి, మనకు సంభవించే ముప్పు గురించి ముందుగా చెప్తాడు. ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో ఎక్కడ పొలం కొంటే అధికంగా పండుతాయో చెప్తారు. మాకు, మా చుట్టాలలో కొందరికి, మరి కొందరు తెలిసిన వారికి చెప్పారు. రాబోయే ప్రమాదాల గురించి ముందుగా చెప్పి కాపాడాడని వివరాలు గడగడ చెప్పింది. ఈలోగా వస్తారేమో అటు హైస్కూలు వైపుగా వెళ్ళివస్తానండీ అని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పావుగంటకి ఆయన రానేవచ్చారు. శారదకు చాలా ఆనందం కలిగింది. ఎంతో ఆదరంగా ఆయన్ని లోనికి ఆహ్వానించింది. \"తల్లీ నేను మీ ఇంటికొచ్చిన కారణం ఓ ముఖ్య విషయం చెప్పి పోదామని\" అన్నాడు స్వామీజీ. \"చెప్పండి స్వామీ\"అంది. \"మీ ఆయనికి ప్రాణగండం ఉంది అదీ ఒక్క వారంలోగానే\" అన్నాడు. \"అమ్మో ప్రాణగండమే\" అని ఆవిడ నిలువెల్లా వణికి పోయింది.\n\n\"మరేం కంగారు పడకండి దానికి శాంతి చేయాలి.\" \"ఏం చేద్దాం చెప్పండి స్వామీ\" అంది. ఇంతలో ఆమె మరలా వచ్చి మీ కోసమే వెతుకుతున్నాను స్వామి అంటూ వచ్చింది. ఆమె రాక అతనికి మరికొంత ఆనందాన్నిచ్చినట్లు కనిపించాడు. ముగ్గురు చాప మీద కూర్చున్నారు. ఇవ్వాళ అమావాస్య ఆదివారం కొద్ది నిముషాల్లో మనం కాళీ మాతకి పూజలు చేయాలి. అప్పుడుగాని ఆయనకి ప్రాణగండం తప్పదు.\"ఇప్పుడేంకావాలో త్వరగా చెప్పండి\" స్వామీ. ముందు కర్పూరం, పటికబెల్లం, కొబ్బరికాయ తెప్పించండి మిగిలినవి ధూపదీప నైవేద్యాలు నా దగ్గరున్నాయి. అన్నారు. ఫరవాలేదు డబ్బివ్వండి నేను తెచ్చిపెడతాను\" ఎంతో సహాయకారిగా అంది ఆ వచ్చినావిడ. వెంటనే శారద లోపలకెళ్ళి బీరువాలోంచి డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆమె వేగంగా వెళ్ళిపోయింది. స్వామీజీ పూజకు అన్నీ సిద్దం చేస్తున్నారు. శారదని కాళ్ళూ, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని రమ్మన్నారు. ఆమె అలా చేసి వచ్చింది. ఈలోగా ఆమె కూడా కావలసినవి తీసుకువచ్చింది. ముగ్గురు కాళీమాత బొమ్మ దగ్గరగా కూర్చున్నారు.\n\nస్వామీజీ మూడు నిముషాలలో మూడు నాలుగు మంత్రాలు చదివాడు. అగరొత్తులు వెలిగించాడు. మీ నగలు ఒకసారివ్వండి కాళీమాత దగ్గరుంచి ధూపం వేసి తిరిగి తీసుకుందురుగాని అన్నాడు. ఆమె తన మెడలోని నానుతాడు, చంద్రహారం, నల్లపూసలు, గొలుసు, చేతిగాజులు రెండు ఆనందంగా తీసిచ్చింది.స్వామిజీ వాటిని అందుకున్నాడు. ఓ తెల్లని గుడ్డలో చుట్టి కాళీమాత ఫొటో ముందు ఉంచాడు. ఆ తరువాత తన దగ్గరున్న సంచిలోంచి మూడు పటిక బిళ్ళల్లాంటివి తీశాడు. ఒకటి తనునోట్లో వేసుకున్నాడు. ఇంకొకటి వచ్చినావిడకి ఇచ్చాడు. మరొకటి శారదకిచ్చాడు. అమె దాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. శారదకు మెలకువ వచ్చి చూసేసరికి ఏముంది! స్వామిజీ లేడు, ఆమె లేదు, నగలూ లేవు. సర్వం దోపిడీ జరిగింది. ఆ తరువాత ఏడ్పులు పెడబొబ్బలు. జనం చేరారు. తన నమ్మకం నవ్వులపాలై కన్నీళ్ళు మిగిలాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 466,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వామీజీ - సొమ్ములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 216,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పిదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు. అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు. అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బసచేసి మరుసటి రోజు సొంతముగా నీవు నీ భార్యా కలసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది. నీకు బంగారము తయారయ్యాక నీ భార్యకి నగలు చేయించాలి సుమా! అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలసి పనులు చేయాలి. పగలు నిద్రించరాదు. అని చెప్పాడు. బంగారము తయారు చెయ్యాలనే ఉద్దేశముతో తండ్రితో చెప్పి తనవాట పొలము తీసుకొని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యము పండించాలని కృషి చేశాడు. అతని అదృష్టము వలన పంటలు బాగా పండాయి. ధాన్యరాసులు ఇంటికి వచ్చాయి. మెజీషియన్ కొరకు ఎదురుచూడసాగాడు.\n\nఒకరోజున మెజీషియన్ వచ్చాడు. అందరికీ సహాయపడుతూ ఉన్న సోమూని చూసి ఆనందించి నీ భార్యకి నగలు చేయించావా? అని అడిగాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది. మీరు మాకు బంగారము తయారుచేయిస్తానన్నారుకదా! అని అమాయకంగా అడిగాడు. ధాన్యపు బస్తాలను చూపుతూ ఇవి బంగారము కాదా! అన్నాడు. అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క, బంగారము వలెనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ నీ గురించి విని, నీ పగటికలలకు స్వస్తి చెప్పాలనే, నాచెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తువేశాను. నేను నీకు బావని. మీ పెళ్ళికి రాలేకపోయాను. ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను. మాచెల్లెలు నన్ను గుర్తించింది. నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా. మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకొని అందరికీ నీవు బాగుపడటమే ఆనందమని తెలిసి మౌనం వహించారు అని చెప్పాడు. ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు. అన్న గారితో పొలము పనులలో సహాయము చేస్తూ సుఖసంతోషాలతో గడిపాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 467,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వశక్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 217,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు, ఇంద్రజాల విద్యలు ప్రదర్శించానని చెప్పుకుంటున్న ఒక సాధువు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతని గురించి విన్న గ్రామస్ధులు ఎంతో ఆనందంతో ఆయనకు సేవలు చేయసాగారు. రోజూ ఉదయం, సాయంత్రం అతని గుడారం వద్దకు చేరి పంచభక్ష్య పరమాన్నాలు, పట్టుపీతాంబరాలు సమర్పించేవారు. అలా కొంతకాలం గడిచింది. ఈ సంగతి ఆ నోట పొక్కి చివరకు తెనాలి రామలింగడి చెవిని చేరింది.\n\nఇందులో ఏదో మర్మముందని గ్రహించిన రామలింగడు సాధువు గుడారం వద్ద ఉండగా అతని వద్దకు వెళ్లి కూర్చున్నాడు. సాధువు శ్లోకాలు చదవడం మొదలెట్టాడు. ఒకటే శ్లోకం మరల చదవడంతో రామలింగడికి అనుమానం బలపడింది. రామలింగడు సాధువు నిజమైన భక్తుడు కాదని, ఆయనకు ఎలాంటి విద్యలు రావని గ్రహించాడు.\n\nహఠాత్తుగా రామలింగడు సాధువు వైపునకు వంగి అతని గడ్డంలో నుండి ఒక వెంట్రుకను తుంచాడు. అంతే వేగంగా బయటకు పరిగెత్తి \"నాకు స్వర్గానికి వెళ్లే దారి దొరికింది\" అని బిగ్గరగా అరవడం మొదలెట్టడు. గ్రామస్ధులంతా నివ్వెరపోతూ చూస్తుండిపోయారు.\n\n\"ఈ సాధువు ఎంతో మహనీయుడు. ఆయన గడ్డం లోని ఒక వెంట్రుకను నా దగ్గర ఉంచుకుంటే నేను బతికున్నంత కాలం సిరిసంపదలతోనూ, చనిపోయిన తర్వాత స్వర్గంలోనూ తుల్తూతానని చెప్పాడు\" అని గ్రామస్ధులతో అన్నాడు రామలింగడు. అంతే గ్రామస్ధులంతా ఒక్కసారిగా సాధువుపైన బడి సాధువు గడ్డం వెంట్రుకలను రక్తం వచ్చేలాగా తుంచసాగారు. సాధువు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పరుగులంకించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 468,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వర్గానికి దారి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 218,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. జాలర్లు వల పైకి తీసి ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళమీద సాష్టాంగపడ్డారు. \"ఈ చేపలతో కొన్నేళ్ళుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటిమీద మక్కువ ఏర్పడింది. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా ఇష్టమే నాకు! కనుక అలా చేయ్యండి. లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా! వాటితోపాటు నన్ను కూడా అమ్మెయ్యండి\" అన్నాడు. జాలర్లు భయపడుతూ వెళ్ళి ఆ సంగతి నహుష మహారాజుతో చెప్పారు. ఆయన భయసంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 'మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. అది ఏం చేస్తే పోతుందో సెలవియ్యండి' అన్నాడు. 'మహారాజా! బెస్తలు తమ కుల ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు' అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనస్సులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిచి, ఈ బెస్తలకు వెయ్యి మాడలు ఇవ్వండి అన్నాడు. 'ధర్మంగా ఇవ్వు మహారాజా' అన్నాడు ముని. 'అయితే పదివేలివ్వండి' చాలదు. 'లక్ష!' న్యాయం కాదు. సరే, 'కోటి' ఉహూ. 'పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను.' 'నువ్వూ నీ మంత్రులూ ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి!' దీనికింత చర్చేమిటి' 'నా రాజ్యమంతా ఇచ్చేస్తాను.' చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచార పడిపోయాడు. మంత్రులందరిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి 'ఇకేం చేద్దాం' అని ఆలోచన అడిగాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్యేమిటో అడిగి తెలుసుకున్నాడు. 'మహారాజా! చింత విడిచిపెట్టు, గోవులకు, విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరూ హవికీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకూ ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లబమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను. కనుక గోవు నివ్వు. వెల సరిపోతుంది.' అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి \"మహాత్మా! నన్ను దయ చూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను. అనుగ్రహించు అన్నాడు.\n\nచ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు. అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. \"అయ్యా! మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తిసుకోండి\" అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. \"సరే అలాగే ఇవ్వండి\" అని ఆ గోవును వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొని, మీరూ, ఈ చేపలూ స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడూ, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడూ, గవిజాతుడూ కలిసి నహుషుణ్ణి పిలిచి - \"నీకు మేము చెరో వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో\" అన్నాడు. \"మీరు తృప్తిపొందడం కంటే నాకింకేం కావాలి\" అన్నాడు నహుషుడు వినయంగా. \"రాజా! నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి\" అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. \"సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని\" చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 469,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్నేహ ఫలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 219,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. రాత్రవుతుండడంతో వేటగాడు గాభరా పడసాగాడు.\n\nచెట్టుకింద కాళ్లు చాపుకుని కూర్చున్న అతనికి పక్కనే ఉన్న పొదల్లో ఒక కుందేలు తచ్చాడుతూ కనబడింది. వెంటనే వెళ్ళి చాకచక్యంగా ఆ కుందేలుని గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ రోజుకి ఈ కుందేలే తనకు ఆహారం అనుకున్నాడు.\n\nవేటగాడి చెతుల్లో చిక్కిన కుందేలు విలవిలా తన్నుకుంటూ, \"దయచేసి నన్ను వదిలేయండి. నా మిత్రులకు ఆహారం తీసువద్దామని నేను ఇక్కడకు వచ్చాను. వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను మీతో తీసుకెళ్లి, చంపి తినేయండి. ఇప్పుడు మాత్రం దయచేసి నన్ను వదిలేయండి\" అని బతిమాలింది.\n\nవేటగాడు \"నేను పొద్దుటి నుంచి జంతువులకోసం వేటాడుతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు ప్రాణం మీద అంత తీపి, ప్రేమ ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. కాని నాకు ఒక మాట నీ స్నేహితుల ఆచూకీ చెప్పు. నేను నిన్ను వదిలిపెట్టేస్తాను\" అన్నాడు.\n\n\"నీకు ఆహారం కావాలి అంతే కదా! నేను నా స్నేహితుల జాడ చెప్పడం అసంభవం. నన్నే బలి తీసుకో, నీ ఆకలి తీర్చుకో. స్నేహధర్మాన్ని కాలరాయడం కంటే ప్రాణాలు త్యాగం చెయడమే ఉత్తమం. కాబట్టి నన్నే తిను\" అని చెప్పింది కుందేలు.\n\nకుందేలులో మిత్రులపట్ల ఉన్న ప్రేమను గ్రహించిన వేటగాడు, \"ఆహా! ఏమి నీ మిత్రధర్మం. నీలాగే ఈ ప్రపంచంలోని మనుషులందరూ సఖ్యంగా ఉంటే ఎంత బావుండేది\" అంటూ ఆ కుందేలుని విడిచిపెట్టాడు. వేటగాడికి కృతజ్ణతలు చెప్పి కుందేలు తన నివాసానికి చెంగు చెంగున గెంతుతూ వెళ్లి పోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 470,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్నేహ ధర్మం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 220,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "టర్కీ రాజు, నస్రుపట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. నస్రు యొక్క విజ్ఞానకాంక్ష, చతురత అతడిని రాజుగారికి మరింత ప్రీతిపాత్రుడిని చేశాయి.\n\nఒకరోజు రాజు నస్రును పిలిచి ఇలా చెప్పాడు. \"ముల్లా నస్రుద్దీన్‌, నేను నిన్ను నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి పంపదల్చుకున్నాను. అక్కడ చాలా మంది సాధుపుంగవులు, గురువులు వున్నారు. వారు కచ్చితంగా విజ్ఞాన సముపార్జనలో నీకు సహాయం చేస్తారు\".\n\nఈ మాటలకు ఉప్పొంగిపోయిన నస్రు, రాజు తన ప్రయాణానికి ఆర్ధిక సహాయం చేస్తానని చెప్పడంతో మరింత సంతోషించాడు.\n\nమధ్యమధ్యలో ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తూ, ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత నస్రు భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలోని ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, మహానదులు, అద్భుతమైన జంతు మరియు పక్షి సంపద అతడిని భారతదేశంపట్ల ఆకర్షితుడయ్యేలా చేశాయి.\n\nభారతదేశమంతటా పర్యటించిన తర్వాత, నస్రు రుషులు, ఆధ్యాత్మిక గురువులను కలవడం మొదలుపెట్టాడు. అతడు ఎందరో నిజమైన, తెలివైన ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. అలాగే తాము పుణ్యపురుషులమని ప్రజలను మోసం చేసే సోమరులనూ కలిసాడు.\n\nఒకరోజు ఒక అడవిలో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఋషిని కలిశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఋషి ఊరి ప్రజలను వారానికోసారి తనను దర్శించాలని తనకి నచ్చిన ఆహారం తీసుకురావాలని లేదంటే వారిని శపిస్తానని హెచ్చరించాడు.\n\nనస్రుకి ఆ ఋషి ప్రజలను మోసం చేస్తున్నాడని అర్ధమై, అతనితో తమాషా చేద్దామని అనుకున్నాడు. నస్రు ఋషి దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఋషి కళ్ళు తెరవగానే నస్రుని చూసి, \"నేను నీకు ఎలా సహాయపడగలను బాలకా?\" అన్నాడు. బదులుగా నస్రు, \"ఋషీ నేను దూరదేశమైన టర్కీ నుండి నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీ యొక్క విశ్వాసాలను నాకు వివరించండి.\" అన్నాడు.\n\nఅతనికొక అనుచరుడు దొరికాడన్న ఆనందంలో పెద్దదైన స్వరంతో ఋషి ఇలా చెప్పాడు, \"జీవితం అంతం లేనిది. ఒక జన్మలో నీవు మానవుడివైతే మరో జన్మలో నీవు జంతువు లేదా మొక్కలా పుడతావు\".\n\nనస్రు ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, \"అవును ఋషి ఉత్తమా! నిజంగా నేను ఒకసారి ఒక చేప వల్ల రక్షింపబడ్డాను\" అన్నాడు.\n\n\"ఏంటి! ఒక చేపా! ఎలా జరిగిందది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను\" పెద్దవైన కళ్ళతో, కుతూహలంతో ప్రశ్నించాడు ఋషి. ఆ ఋషికి వివిధ వ్యక్తుల నుండి కథలు సేకరించి, తన కథలుగా ప్రచారం చేయడం ఒక అలవాటు.\n\nబదులుగా నస్రు \"నేను ఒకరోజు ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఒక అడవిలో తప్పిపోయాను. చాలా రోజులు నేను తిండి, నీళ్ళు లేక తిరిగాను. నేను చనిపోతానేమో అనుకునేంతలో ఒక సరస్సు నా కంటపడింది. నా శక్తినంతా కూడదీసుకుని ఆ సరస్సును చేరుకున్నాను\"...\n\nఅతి కుతూహలంతో ఋషి నస్రు మాటలకు అడ్డు తగులుతూ, \"ఏమయింది? చెప్పు? నువ్వు ఆ సరస్సులో పడిపోయావా? ఏదైనా అద్భుతమైన శక్తిగల చేప వచ్చి నిన్ను కాపాడిందా? చేప దేవుడిగా మారిందా?\" అని అడిగాడు.\n\nనస్రు నవ్వుతూ ఇలా అన్నాడు, \"కాదు! కాదు ఋషి! నేను సరస్సు దగ్గరికెళ్ళి ఒక చేపను పట్టి, కాల్చి తిన్నాను. ఆ చేపే లేకపోతే నేను చనిపోయేవాణ్ణే కదా!\"\n\nనస్రు తనని వెర్రివాణ్ణి చేశాడని గుర్తించిన ఋషి కోపోద్రిక్తుడయ్యాడు. ఋషి స్పందించేలోగానే నస్రు అక్కడి నుండి పగలబడి నవ్వుతూ తన దారిలో తను వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 471,
        "IMAGE": "cat_2",
        "NAME": "సోమరి ఋషి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 221,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో \"మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?\" అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. \"వుండీ వుండీ మనమంతా సింహానికి ఆహారమవుదామా?\" అంది. ఆడ తోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది.\n\nఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. ఆ పథకానికి తోడేలు సంతోషించింది. ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా వుండమంది. అచట ఒక చెట్టు చాటున అవి వున్నాయి. ఆడ తోడేలు ఒక్కటీ నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు యేమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది.\n\nఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. \"పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను యేమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను.\" అంది. దానికి మగ తోడేలు యిలా అంది \"తొందరపడకు ఒక సింహం యిటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది యీ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను\" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల యే జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది.\n\nతోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. \"ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి యిలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు యీ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా\" ఈ మాటలకి సింహం యే సమాధానం చెప్పలేదు. దానికి భయం యింకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా యిలా అంది. \"ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా \"సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది. \"ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను\" అంది. నక్క అది యేమిటో చెప్పమంది. \"నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా\" అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు యేమి చేయలేవని నక్క ఆలోచన.\n\nసింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క యేదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. \"ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను\" అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది. ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో యిలా అంది \"నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్ళుదాం\" అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది.\n\nఆడతోడేలు నక్కని అరచినట్లే \"ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను\" అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి. అందుకే పెద్దలు అంటారు \"బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును\" అని. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 472,
        "IMAGE": "cat_2",
        "NAME": "సింహం - తోడేలు - నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 222,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. మరుసటి రోజు ఆ తోటలో సాధువు బసచేసాడన్న వార్త సుడిగాలిగా ఊరిలో ప్రాకి పోయినది. చాలామంది ప్రజలు, పండ్లు, తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పడ్డారు. కొంతమంది అతడి పాదాల వద్ద వెండి, బంగారం, డబ్బులు కూడా పెట్టారు.\n\n'నేను దొంగ సన్యాసిని కదా! అయినా ఎంతమంది ప్రజలు నాపట్ల భక్తిశ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అని దొంగ ఆలోచించాడు. 'నేను సాధువుగా మారితే ఇంకెంతగా గౌరవిస్తారో? అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి ఆ దొంగ తీర్మానించుకొన్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే ఒక సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 473,
        "IMAGE": "cat_2",
        "NAME": "సాధువుగామారిన దొంగ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 223,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుడు అంటే మక్కువ. పాప భీతి ఎక్కువ. ఆమె భర్త మరణించాడు. ఆమెకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు అంజయ్య. ఆ ఇద్దరు పిల్లలనూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేసింది. ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తామని మొక్కింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది. ఏమైతే నేం? అంజయ్యకి జబ్బు తగ్గింది. కానీ కొండకి వెళ్ళలేదు. మొక్కు తీర్చలేదు. ఇలావుండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు. కంగారు పడిపోయింది. అచ్చమ్మ \"ఏరా!స్వామి ముడుపు కనిపించటం లేదు. ఏమైందిరా\" అని కేకలు పెట్టింది. \"నేనే తీశానమ్మా\" అన్నాడు అక్కడే వున్న అంజయ్య. \"అపచారం!అపచారం!ఆ ముడుపు ఎందుకు తీశావురా? అంది అచ్చమ్మ చెంపలేసుకొంటూ. \"లేదమ్మా! ఆ పాతిక రూపాయలూ నారయ్యకు ఇచ్చాను\" అన్నాడు అంజయ్య. \"వాడికెందుకు ఇచ్చావురా? వాడికేమొచ్చిందిరా?\" \"ఏమొచ్చేదేమిటమ్మా! జ్వరమొచ్చింది. డబ్బు ఇస్తేగానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు. అందుకని....\" అని అంజయ్య అంటూ ఉండగానే - ఎంత ఘోరం\" అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ.\n\nఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు. వస్తూనే తల్లి కేకలు విన్నాడు. \"ఏమిటమ్మా! ఏం జరిగింది?\" అని అడిగాడు. జరిగింది అంతా చెప్పింది అచ్చమ్మ. \"ఏరా అంజీ!నిజమేనా?\" అని తమ్ముడ్ని అడిగాడు రామయ్య. \"నిజమే అన్నయ్యా! కాని ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు. నారయ్యకి జ్వరం తగ్గటానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య. భేష్!మంచి పని చేశావురా!\" అని మెచ్చుకొన్నాడు రామయ్య. \"ఏమిట్రా! తప్పు అని చెప్పకపోగా నీవూ వాడినే సమర్థిస్తున్నావా?\" అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ. \"అవునమ్మా! చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాల గొప్పది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవటం మానవ ధర్మం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా!. కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు-ముప్పులేదు. \"ఆపదలో ఉన్న ఒక అనాధ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు.\" - అన్నాడు రామయ్య. \"నిజమే బాబూ! మీరు ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. మానవ సేవే మాధవ సేవని చెప్పే వారే గాని చేసేదెవరు?\" \"ఒరే అంజయ్యా! వయస్సు చిన్నది అయినా నీ మనస్సు వెన్నరా.\" అని అంజయ్యని మెచ్చుకొంది అచ్చమ్మ.\n\nఅప్పుడే బీరువాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య. అమ్మ చేతికిచ్చి \"అమ్మా! ఈ సొమ్ము తీసుకో! మళ్ళీ స్వామి వారికి ముడుపు కట్టుకో! ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది. నీ దడుపూ తొలగిపోతుంది!\" అన్నాడు నవ్వుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 474,
        "IMAGE": "cat_2",
        "NAME": "సాటివారికి సాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 224,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.\n\nరెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. తదనుసారము పురోహితునతో సంప్రదించి పూజకై ఒకరోజును నిర్ణయించి, ఆపూజకు కావలసిన పదార్ధములన్నియూ రాసుకొని గుమస్తాచేత వాటిని తెప్పించెను. సరిగా ముహూర్తము వేళకు సత్యనారాయణ పటము పూజామందిరములో ప్రతిష్ఠించబడెను. పూజాద్రవ్యములన్నియూ సమకూర్చబడెను. సమయానుకూలముగా పురోహితుడు పూజ ప్రారంభించెను. ధనికుడు, అతని భార్య పీటలమీద ఆసీనులైరి.\n\nభగవంతునకు చేయవలసిన షోడశోపచారములతో ధూపము, దీపము పూర్తి అయినవి. తదుపరి నైవేద్యము తెప్పించబడెను. దానిని దేవుని పటము ముందు పళ్ళెరములోనుంచి నీటతో మంత్రోచ్చారణపూర్వకంగా సంప్రోక్షించి, 'ఓం ప్రాణాయ స్వాహా' అను మంత్రము చెప్పుచూ నైవేద్యమును దేవునకు అర్పించుటకై చేతిని పటమువైపు చూపుమని ధనికునితో చెప్పెను. కానీ ధనికుడు చేతిని తన పొట్టవైపు చూపించుచుండెను. \"అట్లు చేయవద్దు అది అపచారము\" అని పురోహితుడు చెప్పగా అంతట శ్రీమంతుడు \"నైవేద్యము తినునది నేనేకదా, పటము తినదు కదా! అట్లు చూపినచో తప్పేమి?\" అని అడిగెను.\n\n\"అప్పుడు పురోహితుడు తినువారు మీరే అయినను దేవునకు సమర్పించుచున్నట్లు భావనచేసి ఆ ప్రకారము దేవునకు చేయవలెను. భావన ప్రధానము\" అని చెప్పగా ధనికుడు అట్లే చేసెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 475,
        "IMAGE": "cat_2",
        "NAME": "శ్రధ్ధ లోపించిన పూజ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 225,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక మంత్రి, ఆ మంత్రి ఒక రోజు వేటకి బయలుదేరినాడు ఆ మంత్రి వెళ్ళిన అడవిలోనే ఒక జలపాతం, సుందరమైన దృశ్యం, అత్యంత మనోహరమైన శబ్దం, పక్షుల రాగాలు, జలపాతం పై దోబూచులాడుకునే మేఘాలు, ఆ పైన వెలిగిపోతూ ఎంతో ఎంతో అందంగా ఉన్నాయి.\n\nఆ జలపాతం దగ్గరలో ఒక శిల్పాల వరుస! శిల్పి తదేక దీక్షతో ఓ ఏనుగు బొమ్మ చెక్కుతున్నాడు. దానికి ముందు ఓ హంస శిల్పం, ఆ పైన ఒక సుందరాంగి, ఆ పైన ఓ నాట్య గత్తె, ఆ పైన ఓ పుంగవుడు, ఆ పైన ఓ బాలుడు ఇలా రక రకాల శిల్పాలు ఉన్నాయక్కడ. కొద్ది రోజులుగా చెక్కుతున్న ఆ ఏనుగు బొమ్మకి కూడా ఆ రోజుతో చివరి ఉలి పోటు పెట్టి తృప్తిగా చూసుకొని కొద్దిగా దూరంగా వెళ్ళి తన శిల్పాలు అన్నీ చూసుకున్నాడు. మరో సారి తృప్తిగా తలాడించినాడు. ఇంతలో అటువైపు కొంతమంది అటవి జాతులు, యువతలు, యువకులూ, బాలలు వెళ్తూ ఇతనికి హల్లో చెప్పి ముందుకు వెళ్ళినారు. మరొక సారి తన సృష్టిని చూసుకొని నిట్టూర్చి \"అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా అంటారా?\" అసలు నిజంగానే అద్భుతంగా ఉన్నాయా? లేక కాకి పిల్ల కాకికి ముద్దా? అని పెద్దగానే అన్నాడు. ఈ మాటలను అటువైపుగా వెళ్తున్న మంత్రిగారు విని వచ్చి చూసి, చూసి ఆశ్చర్యపోయి పెద్దగా, అసంకల్పితంగానే అనేసాడు. ?అద్భుతంగా ఉన్నాయి!? అని.\n\nఈ మాట వినగానే శిల్పి ముఖం వెలిగిపొయినది. తరువాత అన్నీ చక చకా జరిగిపొయినాయి. శిల్పి రాచనగరులో ఓ మూల శిల్పాలు చెక్కడం మొదలుపెట్టినాడు. అతని పనితనాన్ని చూసి వచ్చిన వారంత ముక్కున వేలేసుకోసాగినారు. అంత అద్భుతంగా చెక్క సాగినాడు. అతను చెక్కేవన్నీ దేనికదే సాటి అని అందరూ చెప్పుకోసాగినారు.\n\nఓ సుందరి, ఓ ఏనుగు, ఓ జింక, ఓ ఇంద్రుడు, ఓ విష్ణుమూర్తి, ఓ బ్రహ్మ, ఓ నారదుడు, ఓ కొలను, ఓ శిఖరం, ఓ గోపురం దేనికదే సాటిలా ఉన్నాయి.\n\nఓ రోజు మంత్రిగారు రాజును తోడ్కోని వీటిని అన్నీ చూపించడానికి వచ్చినాడు. శిల్పి నెమ్మదిగా అన్నిటినీ చూపించసాగినాడు. రాజుగారు ముందు సుందరాంగి బొమ్మ చూసినాడు, అద్భుతం అని ఆగిపొయినాడు ఇదేమిటి కళ్ళు చెక్కలేదు? ఇంకా పూర్తికాలేదు ప్రభూ అని తల వంచుకున్నాడు. తరువాత ఏనుగు బొమ్మ చూపించినాడు, చాల బాగుంది కానీ ఇంకా తొండం పూర్తి అయినట్టు లేదు అంటూ ముందుకు సాగినాడు. జింకకేమో కాలు పూర్తి కాలేదు, ఇంద్రునికేమో చేతులు పూర్తి కాలేదు, విష్ణుమూర్తికేమో కిరీటం పూర్తి కాలేదు, బ్రహ్మకేమో రెండే తలకాయలు ఇంకోటి? ఇలా అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళినాడు.\n\nశిల్పినేమో ఏమీ అనబుద్ది కాలేదు, ఎందుకంటే పూర్తి అయినంత వరకూ చాలా చాలా బాగా వచ్చినాయి. ఇలా చాలా సార్లు జరిగినది. రాజు గారు రావడం పూర్తికాని ఆ శిల్పాలు చూడటం అలాగే కొత్తగా చెక్కిన శిల్పాలు చూడటం మరళా పూర్తి కాలేదని నిట్టూర్చడం జరుగుతూనే ఉన్నది. ఒక రోజు మాత్రం రాజుగారి మూడ్ అస్సలు భాగోలేదు.\n\nదానికి తోడూ ఇలా ఎప్పటికీ పూర్తికాని శిల్పాలు చూసి మరింత రెచ్చిపోయి సరిగ్గా వారం రోజులు సమయం ఇస్తున్నాను ఈ లోపులో పూర్తి కాకపొయినాయో నీకు మెడకాయ మీద తలకాయ ఉండదని బెదిరించాడు.\n\nవారం రోజుల తరువాత రాజు గారు వచ్చి చూడ సాగినారు. సుందరి బొమ్మ కళ్ళు పూర్తి అయినాయి కానీ మెల్ల కన్ను, ఏనుగు తొడం పూర్తి అయినది కానీ నాలుగు వంకర్లు, జింక కాలు పూర్తి అయినది కానీ కుంటి కాలు!, ఇంద్రుడి చెయ్యి అవిటిది!, విష్ణు మూర్తి కిరీటం రివర్సు అయినది, బ్రహ్మ ముక్కు చప్పిడి ముక్కు అయినది.\n\nరాజు కోపం నషాలాన్నంటినది, వెంటనే శిల్పికి కూడా మెల్ల కన్ను చేసి, కుంటి కాలు చేసి, అవిటి చేయి, ముక్కు పగల గొట్టి, తల బొప్పి కట్టించమని ఆజ్ఞాపించి వెళ్ళి పొయినాడు. శిల్పి కథ అంతటితో ముగిసేదేమో, కానీ మంత్రిగారు కొద్దిగా జాలి చూపించి రాజు గారి దగ్గర సెకండ్ చాన్సు పొంది శిల్పి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు\nఏమిటయ్యా ఇది? అలా చేసినావు?\n\nశిల్పి చేతులు నులుముకుంటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు, ఆ ముఖంలో బాధ లేదు, సంతోషం లేదు. అడవిలో చక్కగానే చెక్కినావు కదా, ఇక్కడేమయినది? అయినా శిల్పం మొత్తం చక్కగా చెక్కి ఇదేమిటయ్యా ఇలా చివర్లో అంతా పాడు చేసినావు?\n\n?అదేమిటో తెలీదు కానీ శిల్పం మొత్తం పూర్తి అవుతుంది కానీ ఈ రాచ నగరులో ఈ జనాల మధ్య ముగింపు మాత్రం నా వల్ల కావడంలేదు, మనసు లేకుండా ముగిస్తే ఇదిగో ఇలా పూర్తి అయినాయి.\" అయితే ఏమంటావు?\n\nనేను అడవిలో, ఆ ప్రకృతి మధ్య బతక వలసిన వాడిని, ఇలా రాజుల కోసం, రాచ బిడ్డల కోసం చెక్కమంటే నా వల్ల కాదు. నా మనసు ఒప్పు కోవడంలేదు, నన్ను మరల పంపిస్తే అడవిలోకే పోతాను అని బతిమిలాడినాడు. ఇలా చాలా చాలా మాట్లాడుకున్నాక చివరకు ఎలాగో శిల్పి ప్రాణాలతో అడవిలోకి చేరినాడు. అడవిలో మరళా శిల్పాలు చెక్కసాగినాడు.\n\nఅందమైన రాజు బొమ్మ, రాచ నగరు బొమ్మ చెక్కి దూరంగా వెళ్ళి చూసుకోని ఇలా అనుకోసాగినాడు ?అద్భుతంగా ఉన్నాయని ఎవరన్నా అంటే భాగు? అర్థమయినదనుకుంటాను?.! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 476,
        "IMAGE": "cat_2",
        "NAME": "శిల్పి ప్రకృతి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 226,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్దకం. ఒక రోజు అతను ఎప్పటిలాగే ఎడ్లబండి నడుపుకుంటూ వెళ్తున్నడు. అది వర్షకాలం, ఆ ముందురోజే కుంభవృష్టి కురవడంతో రోడ్డంతా బురదగా, మడ్డిగా ఉంది. ఏదో పరధ్యానం లో ఉండి బండి తోలుతున్న శరభయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో బండి దిగి చూసాడు.\n\nఅతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. వెంటనే శరభయ్య దానిని భుజాలతో తీయడానికి ప్రయత్నించకుండా దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అరవడం ప్రారంభించాడు.\n\nతన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు శరభయ్య. కానీ, ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండిచక్రం తీయాలి అని బీష్మించుకు కూర్చున్నాడు శరభయ్య. పది నిమిషాల తర్వాత వర్షం మొదలైంది. అంతే బండిచక్రం మరింతగా బురదలో కూరుకుపోయింది. ఆ రాత్రంతా బద్దకస్తుడైన శరభయ్య అలాగే వానలో తడుస్తూ కూర్చున్నాడు. కానీ, ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరోదారిలేక ఎలాగోలా చక్రాన్ని పైకి తీసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 477,
        "IMAGE": "cat_2",
        "NAME": "శరభయ్య బద్దకం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 227,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒకసారి ఇద్దరు మిత్రులు వ్యాపార నిమిత్తం కాలినడకన ఒక ఊరు నుండి మరొక ఊరుకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక గ్రామానికి చేరుకోగానే వారికి చాలా ఆకలి వేసింది. వెంటనే వారు సత్రం ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. శాంతమ్మ అనే వంటావిడ సమయం కాని సమయంలో వచ్చినందుకు వారిపై విసుక్కోకుండా వేడివేడి అన్నం వండి పెట్టింది. బాగా ఆకలితో ఉండటంతో స్నేహితులిద్దరు కడుపారా తృప్తిగా భుజించారు.\n\n\"నీ రుణం తీర్చుకోలేం. ఇంద ఈ డబ్బులు ఉంచు\" అని ఇవ్వబోయారు. \"అయ్యో డబ్బులు వద్దు నాయనా... ఆకలి వేసిన వారికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అయినా ఇది ఉచిత సత్రం. ఒక దాత ఆధ్వర్యంలో ఈ సత్రం నడుస్తుంది.\" అని చెప్పింది అవ్వ.\n\nతరువాత మాటల సందర్భంలో ఆమె తనకు నడుం నొప్పి ఉందని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడిగింది.\n\nఆ స్నేహితులిద్దరిలో కాశీనాథ్‌ అనేవాడు అందరితో వేళాకోళాలు ఆడుతూ ఉంటాడు. మరొక స్నేహితుడు వారిస్తున్నా వినకుండా \"అవ్వా నడుముకు తాడు కట్టుకుని నీ పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు కొమ్మకి వేలాడి పదిసార్లు అటూ ఇటూ ఊగు. అప్పుడు కూడా నీ నడుము నొప్పి తగ్గకుంటే మా ఊరురా\" అని అతని పేరు ఊరు చిరునామా చెప్పాడు.\n\n\"పాపం ఎందుకలా అబద్ధం చెప్పావు? అమాయకురాలైన అవ్వను ఆటపట్టించడం సరికాదు\" అంటూ కాశీనాథ్‌ను చివాట్లు పెట్టాడు స్నేహితుడు.\n\n\"ఏదో తమాషాకి అలా చెప్పాను లేరా... ఆమెకు ఆ మాత్రం తెలీదా? తనంతట తానుగా తాడు కట్టుకుని ఊగలేదు. ఎవరినైనా సహాయం అడిగితే వారు ఆమెతో పాటు మనల్ని కూడా చివాట్లేస్తారు\" అని అన్నాడు కాశీనాథ్‌.\n\nకొంతకాలం గడిచింది. ఈ సంఘటన గురించి స్నేహితులిద్దరూ మర్చిపోయారు. ఒక రోజు కొందరు వ్యక్తులు కాశీనాథ్‌ను వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చారు.\n\n\"నేనే కాశీనాథ్‌ని. ఏంటి విషయం?\" అని అడిగాడు. \"అయ్యా మేము శాంతమ్మ అనే ధనవంతురాలు పంపించగా వచ్చాం. మీరేదో చిట్కా చెప్పారట కదా! అది బాగా పనిచేసిందని చెప్పమంది. అంతేకాదు చింతచెట్టు కొమ్మ విరగడంతో అక్కడ ఆమె పూర్వికులు దాచిన బంగారు కాసులు బయటపడ్డాయని, ఎప్పుడైనా అటువైపు రావడం జరిగితే ఆమె తప్పకుండా కలుసుకోమని చెప్పింది\" అని అన్నారు.\n\nవారు చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన కాశీనాథ్‌ ముందువెనుకలు ఆలోచించకుండా వెంటనే ఆ ఊరు వెళ్ళాడు. వేళాకోళానికి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ కాశీనాథ్‌ చెప్పినట్లు చేసి నడుము విరగ్గొట్టుకోవడంతో సత్రం కాస్తా మూత పడింది. జరిగింది తెలుసుకున్న గ్రామ ప్రజలు తెలివిగా కాశీనాథ్‌ను తమ ఊరికి రప్పించి దేహశుద్ధి చేసి పంపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని అయి కాశీనాథ్‌ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని లెంపలేసుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 478,
        "IMAGE": "cat_2",
        "NAME": "వేళాకోళం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 228,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఐదుగురు వెర్రివెంగళప్పలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పొరుగుదేశానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు నది దాటవలసి వచ్చింది. నది దాటిన తర్వాత వారిలో ఒక వెర్రివెంగళప్ప - \"ఆగండాగండి! ఇంతకీ మనమంతా సరిగానే నది దాటామా? లేదా ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోయామా?\" అనే సందేహాన్ని లేవదీశాడు.\n\n\"అయితే అందర్నీ లెక్కించు. మొత్తం మనం ఐదుగురం ఉండాలి\" సలహా ఇచ్చ్హాడో వెర్రివెంగళప్ప.\n\nమొదటి వెంగళప్ప లెక్కించడం మొదలెట్టాడు. 'ఒకటి... రెండు... మూడు... నాలుగు...' తనను తప్ప మిగతా వారందరినీ లెక్కపెట్టాడు. \"మనం ఇంతకు ముందు అయిదుగురం ఉన్నాం. కాని ఇప్పుడు నలుగురమే ఉన్నాం. అయ్యో మనలో ఒకడు నదిలో మునిగిపోయాడు\" అన్నాడు కంగారుగా.\n\nదానితో భయపడ్డ మిగతా వెంగళప్పలు, మొదటి వెంగళప్పలాగే లెక్కించారు. ఎన్నిసార్లు లెక్కించినా లెక్క నాలుగనే తేలుతోంది. తమలో ఒకడు మునిగిపోయాడని అంతా నిర్ధారించుకున్నారు. అంతా ఒకచోట కూర్చుని ఏడవడం మొదలెట్టారు. అటుగా వెళ్తున్న పండితుడు ఏడుస్తున్న వాళ్ళను చూసి \"ఏమైంది బాబూ ఎందుకేడుస్తున్నారు?\" అని ప్రశ్నించాడు.\n\"మేం ఐదుగురం ఉండేవాళ్ళం. మాలో ఒకడు నదిలో మునిగిపోయాడు\" జరిగింది వివరించి చెప్పారు వెంగళప్పలు.\n\"కాని మీరు ఐదుగురూ ఇక్కడే ఉన్నారు కదా!\" అన్నాడు పండితుడు.\n\"లేదు. ఒకడు మునిగిపోయాడు. మేము లెక్కపెట్టి చూశాం...\" అంటూ మళ్ళీ ఏడవటం మొదలెట్టారు.\n\nపండితుడు ఎన్ని రకాలుగా వివరించినా వెంగళప్పలకు అర్ధం కాలేదు. ఆయన విసిగిపోయి ఏదైనా కర్ర దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూశాడు. ఏమీ కనిపించకపోవడంతో తన కాలిజోడు విప్పాడు. \"ఏదీ అందరూ వరుసగా నిలబడి ఒక్కొక్కరు నా ముందుకు రండి\" అన్నాడు.\n\nపండితుడు కాలిజోడుతో ఒక్కక్కరి తలపై కొడుతూ వాళ్ళ చేతనే అంకెలు చెప్పించాడు. చివరివాడు 'అయిదు' అని అనగానే వెంగళప్పలు ముఖాలు ఆనందంతో విప్పారాయి. వెంటనే ఆ పండితుడి కాళ్ళపై పడ్డారు. \"అయ్యా మీ కాలిజోడు ఎంత మహత్తరమైనది. మునిగిపోయిన మా స్నేహితుడిని తిరిగి కాపాడింది. మీరు ఎంతో గొప్పవారు\" అని అన్నారు. పండితుడు వెంగళప్పల తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 479,
        "IMAGE": "cat_2",
        "NAME": "వెర్రి వెంగళాయిలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 229,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఎప్పుడూ నిజాలు చెప్పే రాము, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని రంగా ఇద్దరూ కలిసి ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిద్దరూ వానరాల రాజ్యంలో అడుగుపెట్టారు. ఆ సంగతి తెలిసిన వానర రాజు, అతని సైనిక కోతులకు రాము, రంగాలను బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశం జారీచేశాడు. అంతే, క్షణాల్లో సైనికకోతులు వారిద్దరినీ బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్ళాయి.\n\nరాజు తన సభికులతో కొలువుదీరి ఉన్నాడు. సభలో సింహాసనం మీద కూర్చున్న కోతుల రాజు రాము, రంగలిద్దరినీ తన సభలోకి ఆహ్వానించాడు. \"మానవుల్లారా! నేను ఈ రాజ్యానికి అధినేతను. నేను మీకు ఎటువంటి రాజులా కనిపిస్తున్నాను?\" అని అడి్గాడు.\n\nఎప్పుడూ అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని రంగా కోతుల రాజువైపు చూస్తూ. \"ప్రభూ! మీరు అత్యంత వీరులైన, శక్తిసంపన్నులైన రాజులా కనిపిస్తున్నారు\" అన్నాడు. \"మరి నా పక్కన ఉన్న నా సైన్యం, పరివారం ఎలా ఉన్నారు?\" అని అడిగారు కోతుల రాజు. \"శక్తి సంపన్నమైన రాజుకు బలవంతులైన బుద్ధిమంతులైన అనుచరులు, సహచరుల వలె ఉన్నారు వీరంతా\" అని బదులిచ్చాడు రంగా. తమని పొగిడిన రంగాను వానరులు ఒక సింహాసనం వేసి కూర్చొబెట్టడంతో అతను పొంగిపోయాడు.\n\nఆ తర్వాత ఎప్పుడూ నిజాలే చెప్పే రాము వైపు తిరిగి కొతుల రాజు. \"ఇప్పుడు మీరు చెప్పండి. నేను నా పక్కనున్న వారంతా మీకు ఎలా కనబడుతున్నాం? ఏ మాత్రం సంకోచించకుండా చెప్పండి\" అని పలికాడు. అబద్ధం చెప్పిన వాడిని సింహాసనం మీద కూర్చొబెట్టాడు ఈ కోతి గాడు. కాని నేను నా వ్యక్తిత్వాన్ని వదులుకో లేను. కాబట్టి నాకు తోచినట్టు నిజమే చెబుతాను అని మనసులో అనుకున్న రాము. \"నీవు ఒక అద్భుతమైన వానరానివి. నీ పక్కనున్న వారంతా నీలాగే వీరులైన కోతులు\" అంటూ చెప్పసాగాడు.\n\nఅంతే రాము నిజాయితీని, వ్యక్తిత్వాన్ని చప్పట్లతో అభినందించిన కోతుల రాజు అతనికి వజ్రాలు, రత్నాలు బహుమానంగా ఇచ్చాడు. అబద్ధం చెప్పిన రంగాకు వంద కొరడా దెబ్బల శిక్ష విధించాడు కోతుల రాజు. అబద్ధం చెప్పిన రంగా ఒళ్లంతా గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. వ్యక్తిత్వం చంపుకోలేక నిజం చెప్పిన రాము వజ్రాలు, రత్నాలతో ఇంటికి చేరుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 480,
        "IMAGE": "cat_2",
        "NAME": "విలువైన నిజం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 230,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చ్హాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి \"ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు\" అని చెప్పి వెళ్ళిపోయాడు.\n\nఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తళతళ మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే! దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు.\n\nఅందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని, వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్‌నానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కకట్టడం ఎవరి వల్లా కాలేదు. కాని అందరు కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు.\n\nదాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకు వచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరు ధైర్యం చేయకపోగా, నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని \"ఓస్‌ అదెంత పని\" అనుకుంటు ముందుకు నడిచి, \"రాజా! ఇది వెలకట్టలేని రాయి\", అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. \"రామలింగా! ఏంచేస్తున్నావ్‌\" సున్నితంగaామందలించాడు రాజు. \"ప్రభూ! నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను\" చెప్పాడు రామలింగడు. \"రాజా్! ఇది ఒక విలువలేని రాయి\" తేల్చేశాడు రామలింగడు. \"రామలింగా్! ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు\" మరోసారి మందలించాడు రాజు. \"సరే రాజా\" అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగaాచేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు.\n\n\"రాజా! మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం\" అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు \"అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా! నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను\" అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి, పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామలింగడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 481,
        "IMAGE": "cat_2",
        "NAME": "విలువ లేని వజ్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 231,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కాంభోజనగరంలో విమలుడనేవాడుండేవాడు. ధనవంతుడయిన అతను ఉదారుడే, అతిధిపూజలు చేసేవాడే. కాని అతని భార్య కుటిలమాత్రం పేరుకి తగ్గ స్త్రీ. ఆమె తన యింటికెవరయినా వచ్చి దాహం (మంచి నీళ్ళు) అడిగితే 'నేను విననిదీ, నీకు రానిదీ, భూమిలో లేనిదీ అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను' అనేది - మంచినీళ్ళివ్వకుండా. ఎవరెంత చిత్రమయిన కథచెప్పినా -'ఓస్ దింతేనా' అని పరిహాసం చేసి దాహమివ్వకుండానే పొమ్మనేది. శాంతుడనే వాడు ఉజ్జయినీ నగరం వాడే. కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడమూ, కుటీలను దాహమడగడమూ ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టంలేక మరో యింట దాహం తీర్చుకొని ఉజ్జయినీ తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించడమూ జరిగింది.\n\nవిక్రమార్కుడు శాంతడిని వెంటబెట్టుకొని కాంభోజ నగరం కుటిల, విమలుల యింటి విషయాలన్నీ బాగా తెలుసుకొని విమలుడింటిలో లేని మిట్టమధ్యాహ్నవేళ ఎండలో చెమట కారుతుండగా ఆ యింటి ముందు నిలుచుని కుటిలను దాహమడిగాడు. ఆమె ఎప్పటిలానే నేను విననిది, నీకు రానిది, భూమిలో లేని కథను చెప్పితివా చక్కని మజ్జిగయిస్తాను అంది. దానికి రాజు అమ్మా! నాకపరిమితమగు దాహం వేస్తుంది. అందుకు కారణముంది. నేనీ నగరానికి ప్రవేశిస్తూంటే తోటలో విమలుడను సజ్జనుడున్నాడని విని అక్కడికి వెళ్ళి దాహమడిగితే భార్యతో సరసములాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్యము పెట్టలేదు. నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు. పరుగెత్తిరావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది. దాహం తీరాక నువ్వడిగిన కథ చెబుతాను. అన్నాడు. ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పర స్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెదకుతూ పడమర దిక్కుకు పరుగెత్తింది. కొంతసేపటికి విమలుడు పొలం నుంచి అలసిసొలసి యింటికి వచ్చి భార్య కనబడక వీధి అరుగుమీద కూర్చున్న విక్రమార్కుని 'ఈ యింటామె ఎటు పోయింది?' అని అడిగాడు. 'నేను దాహమడిగాను. కాని ఆమె నా మాటలు వినిపించుకోకుండా ప్రియుడితో సరసాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది. మీరయినా నాకు దాహమీయరా?' అన్నాడు. తన భార్య వేరొకరితో పోయినదనే కోపంతో విమలుడామెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్ళిపోయాడు. అంతలో పొరుగూరిలో ఉన్న కూతురికి జబ్బుచేసిందని చూసిరావడానికి వెళ్ళిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగివచ్చి యింట్లో ఎవరూలేకపోవడం గమనించి వీధి తిన్నెమీదున్న అతన్ని 'ఈ యింటిలో వాళ్ళెక్కడికెళ్ళారు?' అని అడిగింది.\n\n'అమ్మా! ఈ యింటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వానిని పూడ్చి పెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగాపోయారు. అని చెప్పాడు మారువేషంలోని రాజు. ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరుగెత్తింది. ఒకరికి తెలియకుండా ఒకరు యింటినుంచి పోయిన విమలుడు కుటిలా ఒక చోట కలుసుకుని ఒకరినొకరు నిందించుకుంటూ, అసహ్యించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది. ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకునీ, కోడలినీ చూసి తను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలు ఆవిడ ఏడవసాగిందనుకొని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఏడవసాగారు. కాని, ఎవరు మాత్రం ఎంత కాలమని ఏడవగలరు? కొంతసేపట్లో వాళ్ళూ ఏడుపాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని యింటికి బయలుదేరారు. ఈ లోగా విక్రమార్కుడు వాళ్ళింట్లో ప్రవేశించి ఆ యింటి దూలములు, వాసములు, స్థంబములు మొదలగువాని లెక్క రాసుకున్నాడు.\n\nవిమలుడు, భార్య, అత్తగారు యింట్లోకి వెళ్ళబోతుంటే వారినడ్డుకొని విక్రమార్కుడు ఈ ఇల్లునాది. మీరెందుకు లోపలికి వెళ్తున్నారు? అని దెబ్బలాడసాగాడు. వాళ్ళు తెల్లపోయారు. 'ఈ ఇల్లు మాది, నీదంటావేం? నడు, వీధిలోకి నడు, పెద్దమనుషుల దగ్గర తేల్చుకుందా, అన్నారు. అతను 'సరే' అని పెద్దమనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా యింటిలో చొరబడబోవుచున్నారు అని తగవు పెట్టాడు. విమలుడి కుటుంబం పెద్దమనుషులని ఆ యిల్లు మాదని మీరెరుగరా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ యింటి దూలములు, వాసాలూ ఎన్నో చెప్పమనండి. లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు. ఇంక వాళ్ళేమీ చెయ్యలేక రాజువేపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్దమనిషిలాగే ఉన్నారు. ఇలాంటి అన్యాయానికెందుకు పూనుకుంటున్నారు? అన్నారు బతిమాలుతు. అప్పుడు విక్రమార్కుడు అయ్యా! నీ ఇల్లాలు విననిదీ, నాకు రానిదీ, భూమిలోలేనిదీ అయిన కథ చెప్పినవారికి దాహమిస్తానని చెప్పింది. అందుకే నేనీ కథ చెప్పితిని అనగా అతని యుక్తికందరూ మెచ్చుకున్నారు. కుటిలని అందరూ ఎగతాళీ చేశారు. దానితో కుటిల తన కుటిలమార్గాన్ని వదిలి బుద్ది తెచ్చుకొని జీవించడం మొదలుపెట్టింది. రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధములయిన కానుకలిచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 482,
        "IMAGE": "cat_2",
        "NAME": "విననిది, రానిది, లేనిది - వింతకథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 232,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.\n\nతెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?\n\nతోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.\n\nఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు.\n\n'వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు. అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు \"అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆవిధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమి కంపించవు\" అన్నాడు.\n\nతెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టీగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు.\n\nరామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైన ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేసారు.\n\nచాటునుంచి దొంగలు ఇదంతా చూసారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.\n\nఅనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు.\n\nబావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు.\n\nకానీ బావిలో అంతా చెత్త, చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్ళతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్నచిన్న రాళ్ళు అన్నీ తొలగించేసారు. అప్పటికి కూడా వాళ్ళకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు.\n\n\"ఇప్పుడేం చేధ్ధాం ?\" మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ.\n\"అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?\" తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ\n\"ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!\n\"అవును\" అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు.\n\"మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!\"\n\"నిజమే\" అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు.\n\n\"అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం..\" అన్నాడు.\n\"సరే..ఇప్పుడేం చేద్దాం\" అడిగాడు ఒక దొంగ.\n\n\"పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది\" అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.\nమిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.\n\nముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.\nఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది.\n\nదొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.\n\nచూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో...!?\n\nఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.\n\nవెంటనే లోపలికి వెళ్ళి...కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.\n\nనిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.\n\nబావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది...\nఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.\n\nరాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. \"నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?\" అంటూ నవ్వాడు.\n\nతెనాలి రామలింగడు \"అవును మహారాజా!\" అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను.\" అని చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 483,
        "IMAGE": "cat_2",
        "NAME": "మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 233,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు ఒక తేనెటీగ ఎంతో కష్టపడి తన తుట్టెలలో దానికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేది.\n\nఒకరోజు ఆ తేనెటీగ తన తుట్టెలోని తేనెను స్వర్గంలో ఉన్న బ్రహ్మ దేవుడికి సమర్పించాలని నిశ్చయించుకుంది. వెంటనే స్వర్గానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి తేనెను బహూకరించింది. బ్రహ్మ సంతోషంగా తేనెను అందుకున్నాడు. తేనెటీగ భక్తికి మెచ్చిన బ్రహ్మ ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు.\n\nకొంతసేపు ఆలోచించిన తేనెటీగ తనకు ఒక విషపు కొండిని ప్రసాదించమని కోరింది. ఎవరైనా తన దగ్గరకొచ్చి తేనె దొంగిలించాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీసేంత విషపూరితంగా ఆ కొండి ఉండాలని కోరుకుంది.\n\nబ్రహ్మదేవుడికి తేనెటీగ కోరుకున్న వరం నచ్చలేదు. కాని బ్రహ్మ ఏమీ అనలేక నువ్వు అడిగినట్లు విషపు కొండిని ఇస్తాను. నువ్వు ఆ కొండితో కుడితే మనిషి చచ్చిపోయేంత విషపూరితంగా ఉండదు కాని అతనిని కొంత గాయపరిచేట్లు ఉంటుందని చెప్పాడు. కాని ఇతరలను కుట్టడం నీకు కుడా అపాయమే, దానివల్ల నీ ప్రాణాలు పోతాయి, అని బ్రహ్మదేవుడు తేనెటీగకు వరమిచ్చాడు. తేనెటీగకు అది వరమో, శాపమో అర్ధంకాలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 484,
        "IMAGE": "cat_2",
        "NAME": "వింత కోరిక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 234,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "వల్లభుడు అడవిలో కట్టెలు కొట్టి జీవించేవాడు. ఆరోజు అడవికి వెళూతుండగా 'రేపు అమ్మాయి పుట్టినరోజు , దానికి చిలక బొమ్మ కావాలట! ఎకువ కర్రలు కొట్టి, ఎక్కువ డబ్బు తీసుకురా!' అన్నది వాడి భార్య. వల్లభుడుకి అడవిలో ఒక్క ఎండుపుల్ల కూడా దొరకలేదు. వాడు ఒక పచ్చని చెట్టును నరకబోయాడు. అతని ముందు వనదేవత ప్రత్యక్షం అయ్యింది. 'ఈ అడవిలో వున్న ఒకే ఒక గంధం చెట్టు ఇది! దానిని నరకవద్దు!' అంటూ వల్లభుడిని వేడుకుంది ఆమె. వల్లభుడు తన కష్టం చెప్పుకున్నాడు. 'మీ అమ్మాయికి మాట్లాడే చిలకను ఇస్తాను!' అంటూ చప్పట్లు చరిచింది వనదేవత. ఒక పంచవెన్నెల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది! ఆ చిలుకను వల్లభుడికి ఇచ్చింది వనదేవత!\n\nమాట్లాడే చిలుకను చూసి ముచ్చటపడింది. వల్లభుడి కూతురు. భార్యకి జరిగింది చెప్పాడు వల్లభుడు. 'వనదేవత పుణ్యాన నీకు శ్రమజీవితం తప్పింది! ఈ చిలుకతో నగర కూడలిలో కూర్చో! చిలుక మాటలు వినడానికి రుసుము వసూలు చేయి!' అన్నది వల్లభుడి భార్య. వల్లభుడు చిలకను పెట్టుకొని కూడలిలో కూర్చున్నాడు. జనం అతని చుట్టూ పోగుబడ్డారు! ఆవైపుకి తిక్కరాజు వచ్చాడు. అటువంటి చిలుకను తనకు బహుమతిగా ఇవ్వనందుకు వల్లభుడి మీద మండిపడ్డాడు. వల్లభుడికి ఆరుకొరడా దెబ్బలు శిక్షవేశాడు. చిలుకను తీసుకుపోయాడు. 'ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకు వుంది! ఈరోజు నా పుట్టిన రోజు అని చెప్పు! గంధం చట్టు నరుకుతున్నట్లుగా నటించు! నాకోసం చంద్రహారం అడుగు! అన్నది వల్లభుడి భార్య. ఆ విధంగానే వనదేవతకు చెప్పాడు వల్లభుడు. గంధం చెట్టు నరకనందుకు చంద్రహారం ఇచ్చింది వనదేవత!\n\nహారాన్ని వేసుకొని ఊరంతా తిరిగింది వల్లభుడి భార్య! ఆరాత్రి ఇంట్లో దొంగలు పడి హారం ఎత్తుకెళ్ళారు. 'మన దరిద్రం తీరిపోవాలి! వనదేవతను అడిగి బస్తా బంగారు నాణాలు తీసుకురా! పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దాం!' అన్నది వల్లభుడి భార్య. వనదేవత వల్లభుడికి బంగారు నాణాలు ఇచ్చింది. బస్తా భుజాన వేసుకొని వస్తున్నాడు వల్లభుడు దారిలో రక్షక భటులు వాడిని అడ్డగించారు! బస్తాలో బంగారం చూసి వాడిని తిక్కరాజు దగ్గరికి తీసుకుపోయారు. తిక్కరాజు వల్లభుడి మాటలు వినిపించుకోలేదు! 'ఈ గజదొంగని చెరసాలలో పెట్టండి! ధనాన్ని కోశాగారంలో జమ చేయండి!' అనాడు. చేయని నేరానికి పది నెలలు కారాగారం శిక్ష అనుభవించాడు వల్లభుడు.\n\nఅతను తిరిగి రాగానే భార్య గొడ్డలి చేతికి ఇచ్చింది. ' అమ్మాయి పుట్టిన రోజు దగ్గర పడుతుంది! వనదేవత నడిగి మంచి బహుమానం తీసుకురా!' అన్నది. వల్లభుడు. ఆ గొడ్డలిని బావిలో పడవేశాడు. గంధం చెట్టు చాయలకు వెళ్ళలేదు. అడవిలో కుంకుళ్ళు, జిగురు, చింతపండు ఏరాడు. అవి అమ్మి కూతురికోసం చిలక బొమ్మకొన్నాడు. బొమ్మ చిలక తెచ్చావేం? వనదేవత ఏం అన్నది? అనికోపంగా అడిగింది వల్లభుడి భార్య. ఆ మధ్య గాలివానకి గంధం చట్టు నేలకూలింది. వనదేవత కనిపించలేదు. అయినా మనం చెట్లు నరకనవసరం లేదు. మనం సుఖంగా బతకడానికి దారి లేకపోలేదు! ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా వుంది. అన్నాడు వల్లభుడు. అటవీ సంపదను పోగు చేసి బజారులో అమ్మిన వైనాన్ని భార్యకు వివరించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 485,
        "IMAGE": "cat_2",
        "NAME": "వల్లభుడు వనదేవత ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 235,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "\"ఒక గ్రామంలో ఒక వడ్లవాడు ఉండేవాడు. అతడు ప్రతిదినమూ అడవికి పోయి తనకు కావలసిన కట్టెలు తెచ్చుకొనేవాడు. ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఒక సింహము అతనికి ఎదురైనది. దానిని చూచి అతడు గడగడా వణికిపోతూ అక్కడే నిలబడిపోయెను. సింహము అతని చూచి జాలిపడి \"నేను నిన్ను ఏమీచేయను, భయపడకు\" అని చెప్పగా, అతడు సంతోషించి తన దగ్గరున్న అన్నమూ, కూరలు దానికి పెట్టెను. ఆ పదార్ధములు తిని సింహము తృప్తి పడెను.\n\nపిమ్మట ఆ వడ్రంగి ప్రతిదినమూ రుచిగల పదార్ధములు తెచ్చి సింహమునకు పెట్టసాగెను, క్రమముగా సింహమునకు వడ్రంగికీ మంచిస్నేహము కలిగెను. అతడు తెచ్చిపెట్టుచున్న పదార్ధములు తిని ఆడుచూ పాడుచూ కాలము గడుపుచుండెను. ఆ సింహమునకు మంత్రులుగావున్న కాకి, నక్క ఒకనాడు దానిని చూచి \"స్వామీ! మీరు ఈమధ్య వేటాడుటలేదు. మాతో పూర్వమువలే తిరుగుటలేదు. కారణమేమి అని అడుగగా, సింహము తనకు వడ్రంగితో స్నేహము కలిగినప్పటి నుంచి జరిగిన విషయములన్నింటినీ చెప్పెను. అది విని \"ప్రభూ! తమ క్రొత్త స్నేహితుడగు వడ్లవానిని చూడవలెనని కుతూహలముగా ఉన్నది. అని కాకి నక్క పలికినవి. \"సరే, నావెంట రండి\" అని సింహము వారిని తీసుకోని బయలుదేరెను.\n\nఇట్లు వచ్చుచున సింహమును చూచి వడ్రంగి పరుగెత్తిపోయి ఒక చెట్టెక్కి కూర్చుండెను. సింహము ఆ చెట్టుకిందకి పోయి 'చెలికాడా! నిన్ను చూడవలెనన్న కుతూహలముతో నాస్నేహితులు రాగా నువ్వు చెట్టెక్కి కూర్చుంటి వేమి?\" అని అడిగెను. అప్పుడు వడ్లవాడు 'మృగరాజా! నీవు మంచివాడవే కానీ నీ వెంట వచ్చిన సేవకులు మంచివారు కాదు. నీతో వచ్చిన నక్క యుక్తులు కలది. కాకి ఇష్టమైన ముక్కు, దొంగబుధ్ధి గలది. కనుక నీతో స్నేహము చేయుట మంచిది కాదని తలచి చెట్టేక్కితిని\" అని చెప్పగా, సింహము సిగ్గుపడి వెళ్ళిపోయెను, పిమ్మట చెట్టుదిగి వడ్లవాడు తన యింటికి పోయెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 486,
        "IMAGE": "cat_2",
        "NAME": "వడ్లవాడు - సింహము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 236,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజూ ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకుని కోశాధికారి రెండు వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకున్నాడు. తిన్నగా యింటిదారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు.\n\n'నన్ను రోజూ రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా! నేను రాజుగారి మంగలిని. రోజూ రాజుగారికి మర్దన చేస్తాను' అన్నాడు ఆ మనిషి. అవును. మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకూ నాతో ఏమిటి పని? అన్నాడు పుండరీకుడు. నేను రోజూ రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు. అంటే ఆ సంతోషం నావల్లనే కదా వస్తోంది! నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావలసిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలీ అంటే నువ్వు ఒక పనిచేయాలి. నాకు రోజూ నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజూ అర వరహా కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత \"నేను నీకు లంచం ఇవ్వను\" అని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య, శర్మను వదలలేదు. రోజూ దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. 'రాజుగారు మీమీద కోపంగా ఉన్నారు' అన్నాడు చెన్నయ్య శర్మతో.\n\nఎందుకూ? అన్నాడు శర్మ. 'మీరు ముక్కు నుండి వదిలేగాలి వాసన వస్తోందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు' అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు వొత్తుతూ 'కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు' అన్నాడు చెన్నయ్య. 'ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు?' అన్నారు మహారాజు. తమరి నుండి రోజూ రెండు వరహాలు తీసుకు వెళ్ళే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు. ఏమిటి సంగతి? అని అడిగాను నేను. రాజుగారి నోటినుండి చెడువాసన వస్తోంది. అది తట్టుకోవాలీ అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా! అన్నాడు చెన్నయ్య వినయంగా! మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకూ, మూతికీ ఎర్రని గుడ్డ కట్టుకుని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి? అని శర్మను అడిగారు. 'నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది. దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది. దానిని నివారించడానికే మహారాజా!' అన్నాడు శర్మ అమాయకంగా! రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ.\n\nమరురోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. 'ఈ రెండో ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి. మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి' అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు. నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. \"చెన్నయ్యా! నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధ పడుతున్నాను. ఈ రోజు నాకు డబ్బు అక్కరలేదు. ఈ ఉత్తరం తీసుకు వెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో\" అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. \"నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూదీ దారంతో కుట్టమని మహారాజుగారి ఆజ్ఞ. నీ లంచగొండి తనానికి యిదే తగిన శిక్ష\" అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 487,
        "IMAGE": "cat_2",
        "NAME": "లంచగొండికి శిక్ష తప్పదు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 237,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి మర్యాదరామన్న కొలువుకు ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో వచ్చారు. వారిద్దరిలో ఒకరు ఆ ఊరిలో పేరున్న ధనికుడు, మరొకరు రైతు.\n\n\"మా పూర్వికులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది. ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళితే ఇవ్వడం లేదు\" అని రైతు ఫిర్యాదు చేశాడు.\n\n'నీ సమాధానం ఏమిట'ని రెండో వ్యక్తి వైపు చూశాడు మర్యాదరామన్న. అప్పుడు ధనికుడు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి, కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి \"రైతు చెప్పింది నిజమే. అతని దగ్గరున్న వజ్రం లాంటిది కొండానికి, పొరుగుదేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి తీసుకెళ్లింది వాస్తవమే, అయితే నేను ఇంటికి చేరుకున్న క్షణమే అతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను. రైతు దురాశతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒకదాన్ని పొందటానికి ఎత్తు వేస్తున్నాడు\" అని చెప్పాడు.\n\nఆలోచనల్లో పడిపోయాడు రామన్న. ఇచ్చినప్పుడుగాని, పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్ష్యులు ఎవరూ లేరు. వ్యవహారమంతా కేవలం ఇద్దరి మద్యే గడిచింది.\n\n\"చూడండి! మీ లావాదేవీలో దేవుడే సాక్షి. మీకు ఇంకొక్క అవకాశం ఇస్తున్నాను. దేవుడు మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి\" అని ఆదేశించాడు రామన్న.\n\nధనికుడు వెంటనే తన కర్రను మళ్ళీ రైతు చేతిలో పెట్టి, రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టుగా పైకెత్తి \"ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను. రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను\" అని ప్రమాణం చేశాడు. ధనికుడు ప్రవర్తన నిశితంగా గమనించిన రామన్నకు విషయం మొత్తం అర్ధమ్మయింది.\n\nధనికుడు రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు. \"ఆగు! ఆ కర్రను తీసుకోవద్దు. అది రైతుకు పరిహారంగా ఇవ్వబడుతోంది\" అని తీర్పు చెప్పాడు. అది విని రైతు, ధనికుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.\n\n\"ఇంటికి వెళ్ళి ఆ కర్రను జాగ్రత్తగా విరగ్గొట్టి చూడు\" అని రైతుకు చెప్పి పంపించేశాడు. ఆ తీర్పుతో నిరాశచెందిన రైతు రామన్నను రెట్టించే ధైర్యం లేక ఇంటికి వెళ్ళి కర్రను పగలగొట్టి చూశాడు. అందులోంచి అతను ధనికుడికి ఇచ్చిన వజ్రం బయటపడింది.\n\nఅత్యాశకు పోయి రైతును మోసగించినందుకు ధనికుడికి తగినశాస్తి జరిగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 488,
        "IMAGE": "cat_2",
        "NAME": "రామన్న తీర్పు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 238,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.\n\nపూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.\n\nమరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో \"సురేంద్ర నగర్ మీదికాదు\" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే \"సురేంద్ర నగర్ మీదికాదు\" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.\n\nఅప్పుడు సుబుద్ది కాసేపు ఆలోచించి రాజుతో రాజా! మనవూరిలో రామశర్మ అనే కంసాలి వున్నాడు. అతడు రధాన్ని బాగా నడపగలడు. కానీ కొంత బంగారాన్ని మాత్రం మూడొ కంటికి తెలియకుండాతీసుకొన్నాడు! అని పలుకగా రాజు ఆశ్చర్య పడి అతనిని పిలుచుకురమ్మని ఆఙ్ఞాపించాడు. కొంత సేపటికి రామశర్మరాగా రాజు అతనిని చూచి \"ఓయీ! నీవు మాకొక బంగారు రధాన్ని చేయవలె. అందుకు ఎంత బంగారం కావాలని ప్రశ్నింపగా \"రాజా! ఆ రధమునకు యాబదివేల వరహాలు విలువచేసే బంగారం కావాలి\" అని బదులు చెప్పాడు. \"ఓయీ! నీవు మూడోకంటికి తెలియకుండా బంగారాన్ని తీసుకుంటావంటకదా!\" అని రాజు పలుకగా \"ఓ రాజా! నేను అనుకొంటే మొత్తం తీసుకోగలనని\" శర్మ బదులిచ్చాడు. \"ఓ రామశర్మ! నీవు చెప్పినట్లే మొత్తం బంగారాన్ని తీసుకోగలిగితే నేను నా ఆస్థాన స్వర్ణ కారునిగా నియమిస్తాను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 489,
        "IMAGE": "cat_2",
        "NAME": "రాజగురువు తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 239,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్ళో రంగమ్మ, గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ప్రక్కప్రక్కనే కాపురం వుంటున్నారు. రంగమ్మకు రెండు గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ వుంది. గంగమ్మకు ఎనిమిది గేదెలు వున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా వుండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీశెడు నెయ్యి అప్పుతీసుకున్నది. ఎన్నిరోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళతో నిష్కారణంగా తగవులాడుతూ వుంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ది మంతురాలయిన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి 'గంగమ్మక్కా! నా దగ్గార వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నావు. నీవే బాకీ తీరుస్తావని వూరుకున్నాను కానీ, నెలలు గడిచిపోయినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరచిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి అప్పు తీరుస్తావా అక్కా!' అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ వెర్రెత్తినట్లు బర్రెగొంతుతో బిగ్గరగా అరుస్తూ పొట్లాటకు దిగింది.\n\nఆహా! చోద్యంగా వుందే! నేనేమిటి? నీ దగ్గర నెయ్యి అప్పుతీసుకోవడమేమిటి! ఎనిమిది గేదెల పాడి చేస్తున్న నేను ముష్టి రెండు గేదెలతో బతుకుతున్న నీ దగ్గర వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవడైనా నమ్మే విషయమేనా? ఇక నోరుమూసుకొని ఊరుకో! ఎవరైనా వింటే నవ్విపోతారు. అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తిలేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తర్వాత మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి గంగమ్మ పై ఫిర్యాదు చేసింది.\n\nమర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగుపెడుతూనే గంగమ్మ గణాచారిలా చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అయ్యా! ఇదేనా మీధర్మం? నన్ను సభకుపిలిపించడం న్యాయమేనా? నాకు ఎనిమిది గేదెల పాడి వుంది. ఈ రంగమ్మ రెండు గేదెలు పెట్టుకొని బ్రతుకుతున్నది. అలాంటిది నేను ఆమె దగ్గరికిపోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరినయినా చెప్పమనండి. ఇది నమ్మదగిన విషయమేనా? వినడానికే వింతగాలేదూ? నాపై గిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్దాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ది చెప్పండి అని అన్నది రంగమ్మ. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటలలోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను, గంగమ్మను ఇద్దర్నీ సభకు రావలసినదిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా అడుసుపోయించి అంతా బురదగా వుండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ, గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడూస్తూ న్యాయసభ దగ్గరకు రావలసి వుంది. అలాగే రంగమ్మ, గంగమ్మ మోకాలి లోతు బురదలో నడుచుకుంటు మర్యాదరామన్న సమక్షానికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికి బురద కాళ్ళు కడుక్కోవడానికి రాజభటులచేత రెండు చెంబులతో నీళ్ళు తెప్పించాడు.\n\nరంగమ్మ చెంబుడు నీళ్ళలోసగం నీళ్ళతోనే శుభ్రంగా బురద కడుక్కొని ఇంకా సగం నీళ్ళు మిగిల్చింది. కాని గంగమ్మ చెంబుడు నీళ్ళు ఖర్చుచేసినా కాళ్ళబురద పోలేదు. మరో చెంబు నీళ్ళు అందించారు భటులు, రామన్న ఆజ్ఞ ప్రకారం. అలా రెండు చెంబుల నీళ్ళు ఖర్చు చేసినా గంగమ్మకాళ్ళకు బురద పూర్తిగా పోలేదు. అది చూచి రామన్న గంగమ్మతో ఏవమ్మా! రెండు చెంబులునీళ్ళు ఇచ్చినా నీవు నీ కాళ్ళబురద వదిలించుకోలేకపోయావు. కాని రంగమ్మ సగం చెంబు నీళ్ళతోనే శుభ్రంగా బురద కడిగేసుకున్నది. దీన్ని బట్టి నీవు ఎంతటి దుబారా మనిషివో తేలిపోతుంది. నీకు వుండటానికి ఎనిమిది గేదెలు ఉన్నా, నెయ్యితీసి పొదుపుచెయ్యడం నీకు చేతకాదు. దుబారాగా ఖర్చుచేయటం నీకు అలవాటు. నీకు రంగమ్మ దగ్గర వీశెడు అప్పు తీసుకున్న మాట వాస్తవమే! రంగమ్మకు రెండు గేదెలున్నా పొదుపుగా వాడుకొనే మనిషి కాబట్టి నీవు వెంటనే వీశెడు నెయ్యి రంగమ్మకు ఇవ్వు, లేకపోతే నీకు మరణశిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారూమాట చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని వీశెడు నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 490,
        "IMAGE": "cat_2",
        "NAME": "రంగమ్మ గంగమ్మ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 240,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది. ఆయుష్షు తీరిన జీవుల ప్రాణాలను హరించడం, వారికి నరక దండన విధించడం.... ఇదే పని కావడంతో ఆయనకు తన పనిమీద విసుగుపుట్టింది. మిగిలిన దేవుళ్లందరూ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకు ప్రత్యక్షం కావడం, కోరిన వరాలనివ్వడం... నీరాజనాలందుకోవడం... ఇట్లా వారంతా హాయిగా, ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడమెందుకనిపించింది. దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్ధితినంతా వివరించి, కొన్నాళ్లపాటు భూలోకానికెళ్లొస్తానని మొరపెట్టుకున్నాడు.\n\nఅందుకు బ్రహ్మ 'యమా! నిన్ను పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని అక్కడికెళ్లి ఏం చేస్తావు' అండిగాడు. \"లేదు ప్రభూ! నేనక్కడికి వెళ్లిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది - కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు\" అని ప్రాధెఅయపడ్డాడు యముడు. \"సరే, అలాగే వెళ్లు. కాని నువ్వక్కడ ఉన్నన్నాళ్లూ సామాన్యమానవుడిలా గడపాల్సి ఉంటుంది\" అన్నాడు. అందుకు ఒప్పుకుని సంతోషంతో భూలోకానికి వచ్చ్హాడు యముడు. భూమి మీది ప్రకృతి సౌందర్యాన్ని, అందమైన స్త్రీలను చూసి పులికించిపోయాడు. కొంతకాలంపాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు. తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని, మానవ జీవితం గడపాలని ఉవ్విళ్లూరాడు. తాను బస చేసిన చోట సుగంధి అనే చక్కటి యువతిని చూసి మోహించాడు. ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి, కాసేపు ఆ మాటా ఈమాటా మాట్లాడి, చివరికి అసలు విషయం చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది. అయితే ఇంటిపనంతా అతడేచేయాలని షరతు పెట్టింది. యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవమయ్యాయి. ఏమైనా చేద్దామంటే తన శక్తులేమీ పనిచేయవు. చివరికెలాగో ఇరుగు పొరుగు సలహాతో అతి కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి, భార్యను పిలిచాడు. పళ్లెంలో సంకటి ముద్దలా ఉన్న ఆ అన్నాన్ని చూసి, సుగంధి మండిపడింది. ఈసారి సరిగ్గా వండకపోతే ఊరుకోనని కేకలేసి విసవిసా వెళ్లిపోయింది. చివరికెలాగో అన్నం వండతం నేర్చుకున్నాడు యముడు. అయితే తిండిగింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యువు సమీపించిన వారిని వదిలి, మిగిలిన రోగులకు మందులివ్వసాగాడూ. దాంతోపాటూ డబ్బూ రావడం ప్రాంభమయింది. అలా కొంతకాలం బాగానే ఉంది కాని, కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి సంరక్షణ, ఇంటిపని, వైద్యం - అన్నీ చూసుకోవడం కష్టంగా మారింది. దీనికితోడు భార్య ప్రతిపనిలోనూ వంకలు పెట్టి సాధించేది. ఆ వేధింపులు భరించలేక పోయాడు యముడు. అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 491,
        "IMAGE": "cat_2",
        "NAME": "యముడి వింత కోరిక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 241,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. కాయలు నవనవలాడుతూ తాజాగా కనిపించాయి. బాగా నచ్చాయి. కాయ ఒకటి చేతిలోకి తీసుకుని వంద కాయలు కావాలి. ధర ఎంత? అని అడిగాడు.\n\nదుకాణాదారు కాస్త పరధ్యానంలో ఉన్నట్టున్నాడు. రాజయ్య ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి, వంద యాభైరూపాయలు అన్నాడు. రాజయ్య ముప్పైకి ఇమ్మన్నాడు. బండివాడు సరేనన్నాడు. రాజయ్య గబగబా వంద నిమ్మకాయలు ఏరుకొని సంచిలో వేసుకొన్నాడు. వందరూపాయలు నోటు అందించాడు. అందుకు తన దగ్గర చిల్లరలేదని త్వరగా చిల్లర తెస్తానని గబగబా జనంలోకి వెళ్ళాడు దుకాణందారుడు. రాజయ్య చాలాసేపు ఆ దుకాణం దగ్గర నిలబడ్డాడు. ఆ వెళ్ళినవాడు ఎంతకూ రాలేదుగాని వేరొకడు వచ్చాడు. తెచ్చిన చిల్లర గల్లాపెట్టెలో వేసుకొని మిగతాది రాజయ్యకు ఇవ్వబోయాడు. రాజయ్య అయోమయంగా చూస్తూ నేను ఇచ్చింది వంద. నాకు రావాల్సింది నిమ్మకాయలధర పోను డైబ్భై రూపాయలు అన్నాడు. దుకాణాదారు వెర్రిగా చూస్తూ నువ్వు ఉల్లిగడ్డలు తీసుకొని ఇరవై రూపాయల నోటు ఇచ్చావుకదా? అది తీసుకొని చిల్లర కొసం వెళ్ళి అష్టకష్టాలు పడి తీసుకొని ఇప్పుడే వచ్చాను. అంతేకదా! అన్నాడు. రాజయ్య ఉలిక్కిపడ్డాడు. తాను తీసుకున్నవి నిమ్మకాయలేనని సంచి గుమ్మరించాడు. తానిచ్చింది వంద గనుక నిమ్మకాయల ధర ముప్పై పోగా తనకు డెబ్బై రావాలని లబోదిబోమన్నాడు. ఆ గోలకు పదిమంది అక్కడ చేరారు. దుకాణం వాడికి పిచ్చెక్కిపోయింది. జరిగిన విషయం దుకాణం వాడికి పూర్తిగా అర్థమయింది. వాడు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి అయ్యా! ఈయనకంటే ముందు నా దగ్గరకు ఒకడొచ్చి కిలో ఉల్లిగడ్డలు కొని ఇరవై నోటు ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేకపోవడంతో ఆ నోటు తీసుకొని చిల్లర కోసం వెళ్ళాను. వాడు బండి దగ్గరే నా కోసం నిలబడ్డాడు. ఈలోగా ఇతనొచ్చి వాడే దుకాణం వాడనుకొని నిమ్మకాయలు కొన్నాడు. చిల్లర లేదంటూ వాడికి వంద నోటు ఇచ్చాడు. చిల్లరలేదంటూ వాడు నాలాగే ఆ నోటుతో వెళ్ళాడు. కాని తిరిగి రాలేదు. వాడు నా దగ్గర కొన్న ఉల్లిగడ్డలు ఇవిగో! మోసం జరిగిపోయింది. దానికి వాడు బాధ్యుడయితే నేనెలా మూల్యం చెల్లించేది చెప్పండి. అంటూ తల బాదుకున్నాడు.\n\nఅది పగటి మోసంగా భావించి జనం వెళ్ళిపోయారు. చేసేది మాష్టారు ఉద్యోగం కనుక ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాజయ్య. తన తెలివి తక్కువతనమే తనను మోసపోయేలా చేసింది. ఇందులో దుకాణాదారు తప్పులేదు. అని గ్రహించాడు రజయ్య. మరి కాసేపు తన డబ్బులు కోసం అరిస్తే ఆ నిమ్మకాయలు తనకు మిగిలేట్టు లేవని జడిసి రాజయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాజయ్య ఇంటిదారి పట్టాడుగాని అతని మనస్సు మనస్సులో లేదు. తనొక కొత్త తరహాలో మోసపోయాడని బాధపడుతూ నడుస్తున్నాడు. అల్లంత దూరంలో జనం గుమ్మిగూడి ఉండటం చూసి, అదేంటో చూద్దామని అక్కడికి నడిచాడు కుతూహలంగా. రాజయ్య జనాన్ని తోసుకొని లోనికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఒకడు రక్తం మడుగులో పడివునాడు. వాడి ముఖం పరిశీలనగా చూచి, అతను ఉలిక్కిపడ్డాడు. ఇంతకు వాడు ఎవరో కాదు? ఇందాక తానే దుకాణాదారుగా ఫోజు కొట్టి వందకు చిల్లర తీసుకువస్తానని వెళ్ళినవాడే. ఎవరో పాపం కంగారుగా పరుగెత్తుతూ వచ్చి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకొని పడిచచ్చాడు. అన్నారెవరో ఆ గుంపులోనుంచి. విషయమంతా రాజయ్యకు అర్థమయింది. మోసం చేసి పారిపోతున్న అతను కంగారులో ప్రమాదానికి గురై చచ్చాడన్నమాట. అవును పరధనం పామువంటిది. అది ఎప్పటికైనా కాటువేయకమానదు. కానీ ఆ మోసానికి తగిన శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాధంటే ఏమిటో. ఈ మోసగాడికి దేవుడే మరణశిక్ష విధించాడు. ప్రతి చెడ్డపనికి శిక్ష ఉన్నట్లే నమ్మిన తోడి మనుష్యుల్ని మోసగించినందుకు కూడా ఆ శిక్ష పడింది మరి. తన డబ్బు పోయినందుకుకాదు అతను చచ్చినందుకు తోటి మానవునిగా రాజయ్య మరింత బాధపడుతూ ఇల్లు చేరాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 492,
        "IMAGE": "cat_2",
        "NAME": "మోసానికి శిక్ష ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 242,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "రామశింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య. రెండవ వాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచు సుస్తీగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ పిలిచి తన ఆస్తిని వారిరువురూ చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. \"మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు\" అని సోమయ్య వాళ్ళకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్నీ, తెలివితక్కువతనాన్నీ, చూసి అతణ్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో వున్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్ళను పంచవలసివచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు! \"తమ్ముడూ! ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది.\n\nనువ్వు చిన్నవాడివి. ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని, ఆ కష్టమేదో నేనే పడతాను\" అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. \"తమ్ముడూ! కోళ్ళను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో!\" అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్ళను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకు వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తోంది. వాడు విచారంగా ఉండేవాడు. ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకొన్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు.\n\nఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకు వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్ళను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి, దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు.\n\nఅందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని, అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ జిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి! అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి వుంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యధాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను అశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వేళ్ళాడు. కోళ్ళ గూళ్ళ ముందు కొన్ని లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి, దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ది మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 493,
        "IMAGE": "cat_2",
        "NAME": "మోసపోయిన మోసగాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 243,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు, అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. ఇరవైరూపాయల టికెట్ పాతిక రూపాయలే అన్నాడు ఆ వ్యక్తి. వద్దురా ఇంటికెళ్దాం, ఇక్కడి పరిస్థితి నీకు తెలియదు. అంతా మోసం అనగానే చూస్తుండు అని చెప్పి యాభై రూపాయలనోటు ఇచ్చి రెండు టికెట్స్ తీసుకున్నాడు.\n\nఇద్దరు హాలులోపలకి వెళ్ళి గేట్‌కీపర్ కు ఇవ్వగా ఆ టికెట్స్ గమనించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని చెప్పాడు. చేసేది లేక వెనుదిరిగారు. కాని సూర్యం మాత్రము ఆనందంగా ఉండడం చూసి చంద్రశేఖరం, ఏమిటి ఆనందముగా వున్నావంటే నేను ఇచ్చిన యాభైరూపాయలు కూడా దొంగనోటే అని చెప్పాడు. నిన్న బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళితే బ్యాంకువారు అసలు నోటుకీ దొంగనోటుకీ గల గుర్తులు అవీ చెప్పారు. అది ఎలాగో మా వద్దకి ఒకటి చేరింది. దాంతో ఇక్కడ ఇచ్చాను. ఆ దొంగనోటుని చించవలసినది. వీళ్ళ వ్యవహారము తెలిసే ఆ విధంగా చేశాను.\n\nటికెట్ అమ్మిన వ్యక్తి ఆనందముగా పాన్ షాపులో ఇచ్చి సిగరెట్ పెట్టె ఇవ్వమన్నాడు. పాన్ షాపతను నోటును పరీక్షగా చూసి ఇది దొంగనోటు మీకెవరిచ్చారో అన్నాడు. నేనే మోసగాణ్ణి అనుకుంటే నన్నే మోసం చేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విచారముగా. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 494,
        "IMAGE": "cat_2",
        "NAME": "మోసగాళ్ళకు మోసగాడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 244,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!\n\nఅందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది.\n\nపాము మీద నుంచి గెంతుతూవున్న పిల్లలను చూసి కోడి భయపడింది. కదలకుండా వున్న ఆ పామును చూసి, అది చచ్చి పడి వుందని అనుకొని, తల్లికోడి పక్కగా పోయింది. ఇంతలో చీకటి పడుతూ వుండడం వల్ల, పిల్లలను వెంట బెట్టుకొని తల్లి కోడి వెళ్ళి పోయింది. అయితే వెనుక బడిన ఓ కోడి పిల్లను నోట కరచుకొని, పాము చరచరా పారిపోయింది!\n\nతన ఎత్తు బాగా పని చేసిందని సంతోషించింది పాము. మరునాడు కూడా మరో కోడి పిల్లను తినవచ్చునని, అదే చోటున చచ్చినట్టుగా పడుకుంది కోడి పిల్లలు అటు వచ్చే సమయానికి!\n\nపురుగులను ఏరుకొని తింటూ, కోడి, కోడిపిల్లలు మామూలుగా అటు వచ్చాయి. తల్లికోడి, అచట పడి వున్న పామును చూసింది. \"నిన్నటి నుంచీ ఇలాగే పడి వుంది. చచ్చిపోయిందో ఏమో, చూద్దామని\", పాము దగ్గరగా వచ్చి ముక్కుతో దానిని దొర్లించింది. పాము వెల్లికిలాపడినా కదల లేదు, మెదల లేదు. కోడి పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ పక్కగా వెళ్ళి పోయాయి. ఇంతలో రివ్వున ఓ గద్ద, బాణంలా దూసుకు వచ్చి ఆ పామును తన్నుకు పోయింది!\n\n\"పామును చంపిన వాడా! దానిని బోర్లా పడెయ్యకు, వెల్లకిలా పడేయ్\" అని సామెత! మామూలుగా పడుకుని వున్న పామును సాధారణంగా, గద్ద తన్నుకు పోదు. వెల్లకిలా పడి వుంటేనే, చచ్చిందని తన్నుకుపోతుంది. కోడి పిల్లలను తినాలని దొంగ ఎత్తు వేసిన పాముకు, దాని దొంగ ఎత్తే దాని చావుకు కారణమైంది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 495,
        "IMAGE": "cat_2",
        "NAME": "మోసం చేసిన మోసం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 245,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బుగడించాలని ఆశ. వివిధ వ్యాపారాలను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది-జయపురంలో సరైన పూటకూళ్ళ ఇల్లు లేక, వచ్చే వారికి మంచి తిండి దొరకడంలేదనీ, అందువల్ల మంచి పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించమనీ సూచించారు.\n\nజయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకుని కేదారయ్య పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. ఇద్దరు ముగ్గురు వంటగాళ్ళను మార్చాడు. కాని వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడనే వంటవాడు పనివెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడుగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి అద్భుతంగా ఉండడంతో, భోజనానికి వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది.\n\nరుచి, శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూటపూటకూ అభి వృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకూళ్ళ ఇల్లు కొన్నాళ్ళకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా వుండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి, సునందుడు కేదారయ్యను వందవరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు వంద వరహాలు ఇస్తే, మరలా వెయ్యి వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదనేశాడు. ఆ రోజునుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గసాగింది.\n\nరోజూ భోజనం చేయడానికి వచ్చే ుహీపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి, ‘‘ఈ మధ్య వంటలు మునుపటిలా అంత బావుండడం లేదు ఎందుకని?'' అని అడిగాడు కేదారయ్యను. ‘‘అదే నాకూ అంతుబట్టడం లేదు పంతులుగారూ.\n\nవంట సరుకులూ అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంటచేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు,'' అన్నాడు కేదారయ్య విచారంగా. మహీపతి కొంతసేపు ఆలోచించి, ‘‘సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా?'' అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, ‘‘అవును, పంతులుగారూ. సునందుడు వంద వరహాలు అప్పు అడిగాడు. నేను ఇవ్వలేదు,'' అన్నాడు.\n\n‘‘ఎందుకు ఇవ్వలేదు?'' అని అడిగాడు మహీపతి. ‘‘ఒకసారి ఇస్తే అదే అలవాటవుతుందని భావించాను,'' అన్నాడు కేదారయ్య. ‘‘అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది గనక, ఆయూ వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో! దాని మీది బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనబరచలేక పోవచ్చు.\n\nనీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటికి వెళ్ళి సాయం అర్థించలేడు కదా? ఇంతకూ అతడు అడిగింది అప్పుగానే కదా? వెంటనే వంద వరహాలు ఇచ్చి చూడు. ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పని చేసే వాళ్ళను మంచిగా చూస్తేనే, వాళ్ళ దగ్గరి నుంచి ఆశించిన పనిని రాబట్టగలం,'' అని సలహా ఇచ్చాడు మహీపతి. కేదారయ్య ఆ రోజే సునందుడికి వంద వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చినవాళ్ళు మెచ్చుకోసాగారు. వ్యాపారం మునుపటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 496,
        "IMAGE": "cat_2",
        "NAME": "మహీపతి సలహా ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 246,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "వింధ్య పర్వతాలకు ఆవల దక్కను పీఠభూమిలో బ్రహ్మాండమైన ప్రాకారాలతో ఎత్తయిన కుడ్యాలతో వందలాది కోటలు, రాతి నిర్మాణాలు-కడలి తరంగాలు, వర్షాల బీభత్సం, మండుటెండల తాకిడి మొదలైనవాటికి తట్టుకుని ఈనాటికీ మౌనంగా కాపలాభటుల్లా నిలబడి ఉన్నాయి. ఈ ప్రాంతం శత్రువులకు అభేద్యం. దురాక్రమణ దారులకు చొరరానిది. ఇక్కడి ప్రజలు అపూర్వ ధైర్య సాహసాలకు, మాతృభూమి పరిరక్షణకు పేరుగాంచినవారు.\n\nఅయినప్పటికీ 14వ శతాబ్ద ప్రాంతంలో కొందరు విదేశీయులు ఈ ప్రాంతంలో జొరబడ్డారు. మొగలులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి తమ అధీనంలోకి తెచ్చుకోవడంలో కృతకృత్యులయ్యూరు. ఇక్కడి జున్నార్‌ సమీపంలోని శివనేర్‌ కోటలో షాజీ భోన్‌స్లే, జిజాబాయి దంపతులకు 1627లో ఒక మగశిశువు జన్మించాడు. తమ ఇష్టదైవం ‘శివభవాని' పేరు మీదుగా బిడ్డకు శివాజీ అని నామకరణం చేశారు. బిడ్డ పుట్టాక తండ్రి భోన్‌స్లే, బిజాపూర్‌ సుల్తాన్‌ వద్ద జాగీరుదారుగా చేరి అక్కడికి వెళ్ళాడు. భక్తిసంపన్నురాలూ, వివేకవతీ అయిన తల్లి జిజాబాయి పెంపకంలో శివాజీ పెరగసాగాడు.\n\nఆమె పురాణేతిహాసాలలోని వీరసాహస గాథలను బిడ్డకు చెబుతూ, లేతహృదయంలో ఉన్నత భావాలను పాదుకొల్పింది. దాదాజీ కొండదేవ్‌ అనే కుటుంబ మిత్రుడు శివాజీ విద్యాభ్యాసానికి ఎంతగానో సాయపడ్డాడు. శివాజీ చిన్నప్పటి నుంచే సాహసకృత్యాలకు పేరొందిన స్థానికులైన మావళీలతో కలిసి మెలిసి మైత్రితో మసలసాగాడు.\n\nవారి నుంచి గురప్రుస్వారీ, కత్తిసాము, మల్లయుద్ధం, మొదలైన వాటిని నేర్చుకున్నాడు. క్రమంగా అద్భుతసాహసాలతో ఆ యువకులను ఆకట్టుకుని, వారిని తన అనుచరులుగా మలుచుకున్నాడు. యువకుడైన శివాజీ హృదయంలో మెల్లమెల్లగా స్వాతంత్య్రకాంక్ష మొగ్గ తొడగసాగింది. దేశానికి పరాయి పాలననుంచి విముక్తి కలిగించి సొంత రాజ్యం స్థాపించాలని సంకల్పించాడు.\n\nఒకనాడు తన ముఖ్య అనుచరులతో కలిసి శివాజీ రాయ్‌రేశ్వర్‌ సమీపంలోని ఒక గుహలో వున్న శివాలయూనికి వెళ్ళాడు. తమ బొటన వేలును కోసుకుని, శివలింగం మీద రక్తాన్ని బొట్టులు బొట్టులుగా అర్పిస్తూ-మాతృభూమికి మొగలుల దుష్టపాలన నుంచి విముక్తి కలిగించగలమని ఆ యువకులు ప్రతినబూనారు! స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా వున్న మావళీ వీరులను శివాజీ కూడ గట్టుకున్నాడు. 1646లో తోర్నా కోటను ముట్ట డించి వశపరచుకున్నాడు. ఆ తరవాత పురందర్‌, రాజ్‌గఢ్‌, సింహగఢ్‌, రాయ్‌గఢ్‌ అంటూ ఒక్కొక్క కోటగా వశపరచుకుంటూ, అనువైన ప్రాంతాలలో సైనిక బలాలను సమీకరించుకుంటూ విస్తరించసాగాడు. శివాజీ ప్రతాప్‌ ఘడ్‌లో చిన్న మందిరం నిర్మించి ‘భవానీదేవి' విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.\n\nఅంతవరకు నిశ్చింతగా విలాసాలలో మునిగి తేలుతూన్న మొగలు పాలకులు దక్కను పరిస్థితులకు ఉలిక్కిపడి ప్రమాదాన్ని గుర్తించారు. శివాజీని ఎలాగైనా నియంత్రించాలని ఆలోచించారు. ఆయన తండ్రి షాజీని ఖైదీగా పట్టుకుని, కొడుకు దురాగతాలను కట్టడి చేయమని ఆదేశించారు. అయితే శివాజీ ఎంతో చాకచక్యంతో, ఢిల్లీ నుంచి షాజహాన్‌ జోక్యం చేసుకునేలా చేసి, తండ్రిని విడిపించుకున్నాడు.\n\nతండ్రి ప్రమాదం నుంచి బయట పడ్డాక, శివాజీ మళ్ళీ దాడులను ప్రారంభించాడు. రాజా జావళీ పాలిస్తూన్న ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా వశపరచుకున్నాడు. ఆ తరవాత అహ్మదాబాదును వశపరచుకుని, బిజాపూర్‌ సరిహద్దులకు సైన్యాన్ని పంపాడు. యువకుడైన శివాజీ పుణే పరిసర ప్రాంతాలకు ఎదురులేని నాయకుడయ్యూడు. ఆయన అపూర్వ ధైర్యానికీ, సాహస కృత్యాలకూ దేశం అబ్బుర పడింది.\n\nఅదే సమయంలో శత్రువులైన మొగలు పాలకులు ఆయన్ను తుదముట్టిం చడానికి సరైన సమయం కోసం ఎదురుచూడసాగారు. సహ్యాద్రి కొండ మీది ప్రతాప్‌ఘడ్‌ కోట మీదికి ఒకనాడు కింది నుంచి పన్నెండు వేల మంది సైనికులు-తుపాకులు, ఫిరంగులతో రావడం కనిపించింది. దక్కను ప్రాంతాన్ని బాగా ఎరిగిన అఫ్‌జల్‌ఖాన్‌ శివాజీని పట్టుకోవాలన్న పట్టుదలతో సేనలకు నాయకత్వం వహించి వస్తున్నాడు.\n\nమైదానంలో కన్నా కొండపైనుంచి శత్రుసేన లను ఎదుక్కోవడం సులభమే అయినప్పటికీ, ఆ దృశ్యం శివాజీ అనుచరులకు ఓ క్షణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ తరవాత తేరుకుని శత్రువులను ఎదుర్కోవడానికి వ్యూహాలురచించ సాగారు. అయితే, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా-శివాజీని కలుసుకుని మంతనాలు జరపాలని సేనాధిపతి అఫ్‌జల్‌ఖాన్‌ దూత ద్వారా సందేశం పంపాడు! ఇద్దరు అనుచరులతో మాత్రం వచ్చేలా అయితే కలుసుకోవడానికి అభ్యంతరం లేదని శివాజీ తెలియజేశాడు.\n\nసమావేశ స్థలమూ, సమయమూ నిర్ణయించబడింది. పల్లకీలో వచ్చిన అఫ్‌జల్‌ఖాన్‌ సమావేశం కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కొంతసేపటికి శివాజీ అక్కడికి రాగానే ఆరడుగుల అఫ్‌జల్‌ఖాన్‌ లేచి నిలబడి నవ్వుతూ, ఐదడుగుల శివాజీని ఆప్యాయంగా చేతులు సాచి ఆహ్వానిస్తున్నట్టు నటించి, దగ్గరికి రాగానే ఎడమ చేత్తో ఆయన గొంతు పట్టి నులుముతూ, కుడిచేత్తో తన మొలలోని బాకు తీసి ఆయన డొక్కలో పొడిచాడు.\n\nశివాజీ బాధను భరిస్తూ, ఎడమ చేత్తో అఫ్‌జల్‌ఖాన్‌ కడుపును చీల్చి పేగులు బయటికి వచ్చేలా కింద పడగొట్టాడు! మంతనాలకు వస్తానన్న అఫ్‌జల్‌ఖాన్‌ కుట్రను ముందుగానే ఊహించి, శివాజీ తన శరీరానికి పలుచటి కవచమూ, ఎడమ చేతికి పదువైన ఇనుప పులిగోళ్ళూ ధరించి మరీ వెళ్ళాడు! కుట్రతో హతమార్చాలని వెళ్ళిన సేనాధిపతి హతుడవడంతో మొగల్‌ సేనలు హడలి పోయూయి. శివాజీ సైనికులు వారిని చీల్చి చెండాడి తరుమగొట్టారు. ఆ తరవాత శివాజీ కొల్హాపూర్‌ ప్రాంతంలోని పన్హాలా కోటను పట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోని చిన్న చిన్న కోటలను వశపరచుకుంటూ, మొగలుల బలమైన స్థావరమైన బిజాపూర్‌ను ముట్టడించాడు.\n\nఅయితే, సిద్దిజాహర్‌ నాయకత్వంలోని మొగలు సేనలు తమసేనలకన్నా ఎన్నోరెట్లు అధికంగా ఉండడంతో, అక్కడి నుంచి తిరుగుముఖం పట్టవలసివచ్చింది. సిద్దిజాహర్‌ అమితోత్సాహంతో యూభైవేల సైన్యంతో పన్హాలా కోటను ముట్టడించాడు.\n\nఅక్కడి నుంచి తప్పించుకోవాలి; లేకుంటే ఓటమి తప్పదు అన్న స్థితి ఎదురయింది. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టూ, అంతకు ముందు సంధి చర్చలు జరపడానికి తనను కొండ కిందికి రావడానికి అనుమతించాలనీ శివాజీ కోరాడు. సిద్దిజాహర్‌ అందుకు సంతోషంగా సమ్మతించాడు. 1660లో అది చీకటి కమ్ముకున్న ఒక తుపాను రాత్రి.\n\nభయంకరమైన ఉరుములు, మెరుపుల మధ్య రెండు పల్లకీలు పన్హాలా కోట …ుంచి వెలుపలికి వచ్చాయి. వాటి వెంట ఐదు వందల మంది సైనికులు నడిచారు. శివాజీకి అత్యంత విశ్వాస పాత్రుడూ, అసమాన వీరుడూ అయిన బాజీప్రభుదేశ్‌పాండే సేనలకు నాయకత్వం వహించాడు. పల్లకీలు సమతల ప్రదేశాన్ని సమీపిస్తూండగా మొగలు సేనలకు అనుమానం కలిగి వాటిని అడ్డుకోబోయూరు.\n\nఒక పల్లకీ ప్రధాన మార్గం గుండా నడూస్తూండగా, రెండవ పల్లకీ విశాల్‌గఢ్‌ కేసి పక్క దారిలో కదల సాగింది. ప్రధాన మార్గంలో వస్తూన్న పల్లకిని ఆపి, అందులో శివాజీ ఉండడం చూసి పట్టరాని ఆనందంతో ఆయన్ను తమ సేనాధిపతి వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన్ను చూడగానే, ‘‘ఆహా! ఇంత కాలానికి మంతనాలకు వచ్చావన్న మాట!'' అంటూ హేళనగా నవ్వాడు సేనాధిపతి. అయితే, వాళ్ళు పట్టుకున్నది అసలు శివాజీ కాదనీ, ఆయన పోలికలతో, అదే వేషధారణలో వున్న శివకాశిద్‌ అనే మరాఠీ వీరుడనీ గ్రహించి పట్టరాని ఆవేశానికి లోనయ్యూడు.\n\nతప్పించుకు పోతున్న అసలు శివాజీని పట్టుకోవడానికి మొగలు సేనలు గుర్రాలపై బయలుదేరాయి. ముందు వెళుతూన్న శివాజీని పట్టుకోవాలంటే మొగలు సేనలు ఒక ఇరుకైన కొండ కనుమ గుండా వెళ్ళాలి. వారిని అటు వెళ్ళకుండా అడ్డుకోవడానికి బాజీప్రభుదేశ్‌పాండే, కొందరు వీరులతో కలిసి కనుమ మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు. శత్రుసేనలు హాహాకారాలు చేస్తూ వచ్చాయి. మరాఠీ వీరులు కత్తులు దూసి వారిని ముందుకు వెళ్ళనీయ కుండా, తమ శక్తికి మించి పోరాడారు.\n\nచూస్తూండగానే ఆ ప్రాంతం మొగలు సేనల శవాలతో నిండిపోయింది. అంతలో మొగలు సేనల వద్ద మందుగుండు సామాను అయిపోవడంతో, వాళ్ళూ కత్తులతోనే పోరాడవలసి వచ్చింది. ఆ సమయూనికి తమవైపున పదిహేను మంది సైనికులు మాత్రం మిగిలి ఉన్నట్టు బాజీప్రభు గమనించాడు. శత్రుసేనలు వారిని చుట్టుముట్టాయి. ఆ స్థితిలోనూ బాజీప్రభు అసమాన ధైర్యంతో పోరాడాడు. ఆఖరికి ఆయన కూడా తీవ్రంగా గాయపడి నెత్తురోడుతూన్న శరీరంతో పోరాడసాగాడు. పన్నెండు గంటలు గడిచిపోయూయి! నిర్మలమైన ఆకాశంలో మూడుసార్లు ఫిరంగులు పేల్చిన శబ్దం ప్రతిధ్వనించింది.\n\nశివాజీ సురక్షితమైన విశాల్‌గఢ్‌ కోటకు చేరుకున్నాడనడానికి అది సంకేతం. ఆ క్షణం కోసమే ప్రాణాలు నిలుపుకుంటున్న బాజీప్రభు ఆనందంతో నేలకు ఒరిగాడు. తమ రాజు కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుల జ్ఞాపకార్థం ఆ కనుమకు ‘పావన్‌ ఖిండ్‌' (పవిత్ర కనుమ) అని పేరు పెట్టారు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 497,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్వాతంత్య్రం కోసం వీరోచిత త్యాగం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 247,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి, కొడుకులు. కొడుకును కమల రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్ళిలో చూసింది. అతను పెళ్ళికొడుకు స్నేహితుడు; పెళ్ళి జరిగినంతసేపూ చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, ‘‘వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట! తండ్రిని తీసుకుని వచ్చాడు.\n\nకాని తండ్రి కనీసం పదివేలు కట్నం కావాలంటున్నాడు. మనం తూగలేం. వాళ్ళకు ఇంత ఫలహారం పెట్టి పంపించేద్దాం!'' అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా ఫలహారం తయూరుచేసి, వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్ళాడటానికి ఆమెకు ఇష్టంగానే ఉన్నది. కాని పదివేలు కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను పదివేలు కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి, ఆ తండ్రీ కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు. కాని ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక, ‘‘వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకం అవుతుంది! ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్ళి చేస్తాను,'' అని కమలతో అన్నాడు.\n\n‘‘మరి కట్నం మాటో?'' అన్నది కమల. ‘‘అదేదో నేను చూసుకుంటాలే! ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది!'' అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పనీ చేశాడు.\n\nనిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడమూ పదిహేను రోజుల్లో ముహూర్తం నిర్ణయించడమూ కూడా అయిపోయింది! కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నదీ కమలకు అంతుబట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్ళి అనగా పెళ్ళివారు తరలి వచ్చారు. కరణంగారి ఇల్లు పెళ్ళివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్ళి కూతురుగా ముస్తాబు చేస్తూండగా, ‘‘మా వాడి ఎన్నిక చూడాలి! పెళ్ళికూతురు ఏది?'' అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు.\n\nఅతనికి పొడవైన మీసాలూ, గిరజాల జుట్టూ ఉన్నది. ‘‘నా పేరు మీసాలయ్య. పెళ్ళికొడుక్కు తండ్రిలాటి వాణ్ణి!'' అన్నాడు మీసాలయ్య. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఆశీర్వాదం పొందింది. పెళ్ళివారి తాలూకు పెద్ద అని తెలియగానే, మీసాలయ్యకు ఫలహారం ఏర్పాటు చేసి, రామయ్య చాలా మర్యాదచేశాడు. మీసాలయ్య ఫలహారం ముగించి, తిన్నగా విడిదికి వెళ్ళి, ‘‘మా అమ్మాయి ఎన్నిక చూడాలి! పెళ్ళికొడుకు ఏడి? నా పేరు మీసాలయ్య. పెళ్ళికూతురు నాకు కూతురులాటిది!'' అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి రాజయ్యతో.\n\nరాజయ్య మీసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి, ‘‘మీ పెద్ద మామగారు!'' అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్ళివారింటికీ, విడిదికీ మధ్య తిరుగుతూ తగని హడావుడి చేశాడు. అతను ఎవరితరఫు మనిషి అయినదీ నిర్థారణ చేసుకున్నవారు లేరు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, ‘‘బావగారూ, ఒకసారి మీరు ఇలా వస్తారా? మీతో కట్నం విషయం మాట్లాడాలి,'' అన్నాడు.\n\nకట్నం అనగానే రాజయ్య ఠక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉన్నది. రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుపోయూడు. ‘‘మా తమ్ముడు కట్నం డబ్బు...!'' అని మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్ళు కావాలని రాజయ్యకు సైగచేశాడు. రాజయ్య ఇవతలికి వచ్చి, చెంబుతో నీళ్ళు సేకరించి, మళ్ళీ గబగబా గదిలోకి వెళ్ళాడు.\n\nమీసాలయ్య మంచినీళ్ళు తాగి, కొంచెం తేరుకుని, ‘‘కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగ మన్నాడు,'' అన్నాడు. ‘‘పట్టుకు రమ్మనండి,'' అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడి నుంచి పెళ్ళివారింటికి వెళ్ళి, నలుగురి మధ్య ఉన్న రామయ్యను, ‘‘బావగారూ, ఇలా వస్తారా? ముఖ్యమైన విషయం!'' అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు.\n\nమరి కాస్సేపటికి రామయ్య, ‘‘మంచి నీళ్ళు! మంచి నీళ్ళు!'' అంటూ ఇవతలికి వచ్చి, ‘‘మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు,'' అని, మంచి నీళ్ళతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మరి కాస్సేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలోనుంచి వచ్చి, బయటికి వెళ్ళిపోయూడు. కొంత సేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రికేక పెట్టడం వినిపించి, అందరూ వెళ్ళారు.\n\nరామయ్య పెట్టె ముందు కూర్చుని, పెట్టెలో ఉన్న గుడ్డలూ అవీ కంగారుగా ఇవతలికి లాగుతున్నాడు. ‘‘కట్నం డబ్బు కనబడదు! పదివేలు! వియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడట! మీసాలయ్య చెప్పి వెళ్ళాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు. దగ్గు వంకన నన్ను బయటికి పంపి, డబ్బు కాజేశాడు! దొంగ! పట్టుకోండి! పట్టుకోండి!'' అంటూ రామయ్య కేకలు పెట్టాడు.\n\nఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు: ‘‘ఆ మీసాలయ్య ఎక్కడ? నా సొమ్ము అయిదువేలు కాజేశాడు! దగ్గు నటించి, నన్ను అవతలకు పంపించి, కొంపతీశాడు!'' ‘‘మీసాలయ్య నా పదివేలూ కాజేశాడు!'' అని రామయ్య అరిచాడు. ‘‘మీసాలయ్య నా అయిదువేలూ కాజేశాడు,'' అని రాజయ్య అరిచాడు. అప్పుడుగాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషీ కాడు! రవి తన తండ్రిని పక్కకు పిలిచి, ‘‘కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు! ఎంత రభస జరిగిందో చూడు.\n\nనీకున్న డబ్బుయూవ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి, అయిదువేలూ కాజేశాడు. ఇంకా నయం అడుగున ఉన్న పాతికవేలూ, నగలూ వాడి కంటపడలేదు. ఇప్పటికే మనం నవ్వులపాలు అయిపోయూం. కట్నం మాట ఎత్తకు!'' అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో, నలుగురూ రవిని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టేశారు.\n\nపెళ్ళి అయిన మర్నాడు పెళ్ళివారు జట్కా బళ్ళమీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ‘‘ఆ మీసాలయ్య ఎంతపని చేశాడూ! మా నాన్న డబ్బేగాక, మామగారి డబ్బు కూడా పోవడం బాధగా ఉన్నది,'' అన్నది. రవి నవ్వి, ‘‘ఏ డబ్బూ పోలేదు. అదంతా నేనూ, మీ నాన్నా ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్ళి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు, మా నాన్న బండివాడితో బేరమాడుతూండగా, మీ నాన్నను పక్కకు పిలిచి, ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతట ఒప్పుకోలేదనుకో! మీసాలయ్య నాకు తెలిసిన వాడే! అతను తన కూతురి పెళ్ళికోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు.\n\nనేను ముందే పెట్టెలో నుంచి అయిదువేలు తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికే దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గిర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది? తన అయిదువేలూ పోవడంతో మా నాన్న, కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు,'' అన్నాడు. ‘‘మీరు ఎంత మంచివారు! కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కాని, పాపం, మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే!'' అన్నది కమల.\n\n‘‘మీసాలయ్య వెర్రివాడు కాడు. అతని అసలు పేరు గుండయ్య. ఆ మీసాలూ, జులపాలూ పెట్టుడువి. ఎంత చెడ్డా నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు. తన కొడుక్కు ఉద్యోగం రాగానే అయిదువేలూ ఇచ్చేస్తాడు,'' అన్నాడు రవి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 498,
        "IMAGE": "cat_2",
        "NAME": "మీసాలయ్య-గుండయ్య ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 248,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "అది వెన్నెల రాత్రి. గుడారంలో కూర్చున్న వర్తకుడు తటాకానికి ఆవల ఉన్న గంభీరమైన కొండలను చూసి, తటాకం చుట్టూవున్న పూలచెట్ల నుంచి వీచే సుగంధ పరిమళాలను ఆస్వాదించి, ఎంతగానో ఆనందించాడు. అయితే, అన్ని అందాలకూ మించి ఆ ప్రశాంత వాతావరణంలో అప్పుడప్పుడు వినిపించిన కొన్ని పక్షుల పాటలు అతణ్ణి ముగ్థుణ్ణి చేశాయి. దాన్ని వింటూ అలాగే నిద్రపోయూడు. రాత్రంతా, ఎన్నడూ కనని అందమైన కలలు కన్నాడు. తెల్లవారకముందే నిద్రలేచి ఆ కలలకు కారణం పక్షుల పాటే కారణమని గ్రహించాడు. అతడు ఆ వింత పక్షుల పాట వినిపించిన గుబురు చెట్ల కేసి వెళ్ళి చూశాడు. ఒకటి రెండు పక్షులు ఇంకా అప్పుడప్పుడు పాడుతున్నాయి. ఒక పక్షి అప్పుడే గూటి నుంచి వెలుపలికి తొంగి చూస్తున్నది.\n\nసూర్యోదయం కాగానే పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయూయి. వర్తకుడి వెంట పక్షులుపట్టే వేటగాడొకడు ఉన్నాడు. వర్తకుడి కోరిక ప్రకారం వాడు చెట్టెక్కి పక్షి గూట్లో జిగురు వుంచి కంటికి కనిపించకుండా వలపన్ని వచ్చాడు. సూర్యాస్తమయం అవుతూండగా పక్షులన్నీ గూళ్ళకు తిరిగి వచ్చాయి. వేటగాడు వలపన్నిన గూటిలోకి కూడా, ఏమాత్రం అనుమానం లేకుండా పక్షి లోపలికి జొరబడింది.\n\nవేటగాడు చరచరా చెట్టెక్కి వెళ్ళి పక్షిని పట్టి తెచ్చి యజమానికి అప్పగించాడు. పక్షి రెక్కలు కొట్టుకుంటూ తన వ్యతిరేకతను తెలియ జేసింది. అయితే, వర్తకుడు దాన్నేమీ పట్టించుకోకుండా ప్రేమగా ఇలా అన్నాడు : ‘‘నువ్వేమీ భయపడకు. నిన్నేమీ చేయను. నీకు నవరత్నాలు పొదిగిన బంగారు పంజరం చేయిస్తాను. ఏ పక్షులకూ అందుబాటులో లేని సుమధుర ఫలాలను నీకు ఆహారంగా పెడతాను.\n\nనా సేవకులు రాత్రింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నువ్వు చేయవలసిందల్లా ప్రముఖులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు, రోజుకు ఒకటి రెండు సార్లు పాడడం మాత్రమే. దాని ద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి.'' ‘‘అయితే, బందీగా ఉన్నప్పుడు నేను పాడలేనుకదా! నన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టు. మీ వెంట ఎగురుతూ వచ్చి మీ ఇంటిని చూసుకుంటాను.\n\nఅప్పుడప్పుడూ వచ్చి నీకోసం తప్పకపాడుతాను. నా మాట నమ్ము,'' అన్నది పక్షి. పక్షి రంగురంగులతో చాలా అందంగా కనిపించింది. వర్తకుడు పక్షి విన్నపాన్ని పెడచెవిని పెట్టి ఏ కొరతా లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు. పక్షి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండి పోయింది. లోయను వదిలి వర్తకుడి వాహనాలు అతడి ఇంటి కేసి బయలుదేరాయి. ఇల్లు చేరాక పక్షి వర్తకుడి కోసం అప్పుడప్పుడు పాడుతున్నప్పటికీ మొదట వున్న శ్రావ్యత లోపించింది. మధురంగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా తీరని ఆవేదన ధ్వనించసాగింది.\n\nవ్యాపారి వద్ద ఉన్న పాటలు పాడే పక్షి గురించి ఊరంతా తెలిసిపోయింది. ఎందరెందరో ప్రముఖులువచ్చి దానిని చూడసాగారు. దానిని పట్టుకువచ్చిన వ్యాపారి అదృష్టాన్ని కొనియూడారు. పక్షికోసం రకరకాల కానుకలూ, చిన్న చిన్న ఆభరణాలూ ఇచ్చేవారు. అయినా స్వేచ్ఛకోల్పోయిన పక్షి ఎలాంటి కానుకలకైనా ఎలా ఆనందించగలదు? వారికేసి నిర్లిప్తంగా చూస్తూ ఊరుకునేది. ఇలా రెండేళ్ళు గడిచిపోయూయి.\n\nవర్తకుడు మళ్ళీ వ్యాపారం కోసం బయలుదేరుతూ, పంజరం దగ్గరికి వెళ్ళి, ‘‘నేను వ్యాపారానికి దూర ప్రాంతానికి వెళుతున్నాను. నేను ఇంటి వద్ద లేనప్పుడు నీకు ఎలాంటి కొరతా రాకుండా చూసుకోమని, ఇంట్లోనివారికీ పనిమషులకూ చెప్పాను. నీకు ఏ లోటూ రాదు. ఇంకో విషయం. నేను తిరిగి వచ్చేప్పుడు నీ స్వస్థలమైన లోయగుండా రావలసి ఉంటుంది.\n\nనీ బంధుమిత్రులయిన తటాకం దగ్గరి పక్షులకేమైనా చెప్పమంటావా?'' అన్నాడు పక్షితో. ‘‘చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ చక్కగా చూసుకుంటున్నారనీ, నిజానికి చాలా పేరు ప్రఖ్యాతులు పొందాననీ, అయితే, స్వేచ్ఛ మాత్రం లేదనీ, ఏం చేయడానికీ తోచడం లేదనీ చెప్పు,'' అన్నది పక్షి. ‘‘తప్పకుండా చెబుతాను,'' అని చెప్పి వర్తకుడు అక్కడి నుంచి బయలుదేరాడు.\n\nమూడు నెలల తరవాత వర్తకుడు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చీ రాగానే, ‘‘నేను చెప్పిన సంగతి నా మిత్రులకు చెప్పావా? అందుకు వాళ్ళు ఏమి సమాధానం పంపారు,'' అని పక్షి వర్తకుణ్ణి ఆతృతగా అడిగింది. ‘‘నువ్వు చెప్పిన మాటలను పక్షులతో బిగ్గరగా చెప్పాను. ఒకసారి కాదు. రెండు సార్లు చెప్పాను. ఒక్కటీ బదులు పలకలేదు. నా మాటలు వినగానే కిలకిలమని శబ్దం చేయడం కూడా మానేశాయి.\n\nనిశ్శబ్దంగా ఉండిపోయూయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పక్షి కొమ్మపై నుంచి కిందనున్న పొదలోకి దభీమని పడిపోయింది. బహుశా అది చచ్చిపోయిందనుకుంటాను,'' అన్నాడు వర్తకుడు ఎంతో విచారంగా. పక్షి మౌనంగా ఊరుకున్నది. ఆ వార్త వినడంతో పక్షి దిగ్భ్రాంతి చెందివుంటుందని వర్తకుడు భావించాడు. పక్షికి ఓదార్పుగా నాలుగు మాటలు చెబుదామని అనుకుంటూండగా, పంజరంలోని అడ్డు ఊచ మీద కూర్చున్న పక్షి హఠాత్తుగా కింద పడిపోయింది. ‘‘అయ్యో దేవుడా! ఆ లోయలోని పక్షి చనిపోయిన సంగతి చెప్పకుండా ఉంటే బావుండేది.\n\nపాపం ఆ వార్త విని తట్టుకోలేక ఇదీ చచ్చిపోయినట్టున్నది!'' అంటూ వర్తకుడు భోరున విలవించసాగాడు. పంజరం తలుపు తీసి పక్షిని వెలుపలికి తీశాడు. మౌనంగా ఇంటి పెరట్లో ఉన్న తోటకేసి నడిచాడు. తక్కినవారూ అతణ్ణి అనుసరించివెళ్ళారు. పక్షిని ఎక్కడ పాతి పెట్టాలన్న విషయం చర్చించి ఒక నిర్ణయూనికి వచ్చారు.\n\nఅయితే, పక్షిని వర్తకుడు పచ్చ గడ్డి మీద ఉంచగానే, అది రివ్వునలేచి క్షణంలో దాపులనున్న చెట్టు కొమ్మ మీదికి ఎగిరి వెళ్ళి కూర్చుని, ‘‘నా మిత్రుల సందేశం వినిపించినందుకు చాలా కృతజ్ఞతలు!'' అన్నది. ‘‘ఆ పక్షులు ఎలాంటి సందేశమూ పంపలేదే!'' అన్నాడు వర్తకుడు విస్మయంతో ఒక్కటీ అంతుబట్టక. ‘‘అవి నిజంగానే సందేశం పంపాయి. నేను చెప్పి పంపిన మాటలు నీ నోటి గుండా వినగానే ఒక పక్షి చచ్చిపోయినట్టు కింద పడిపోయిందని చెప్పావు కదా.\n\nస్వేచ్ఛ సాధించాలంటే నన్నూ అదేవిధంగా చేయమన్న సందేశం అందులో ఇమిడి ఉంది. నాకు ఆ సలహా ఎంత గొప్పగా పనిచేసిందో నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా?'' అన్నది పక్షి. వర్తకుడు ఆశ్చర్యంగా దానికేసి చూశాడు. పక్షి మళ్ళీ, ‘‘నువ్వు నా కోరిక మన్నించి మొదటే గనక నన్ను వదిలిపెట్టి ఉన్నట్టయితే, అప్పుడప్పుడు వచ్చి, నువ్వూ, నీ బంధుమిత్రులూ సంతోషపడే విధంగా పాడి ఉండేదాన్ని-ఎందుకంటే, స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే పాడగల పాట అది! అయితే నన్ను వదిలిపెట్టకూడదన్న లోభం నీలో పెరిగిపోయింది.\n\nఇప్పుడు నేను నీ కోసం తుదిసారిగా ఒక పాట పాడుతాను-అదే నీకు శిక్ష!'' అన్నది. ‘‘చాలా సంతోషం! అయినా అది నాకు శిక్ష ఎలా అవుతుంది?'' అని అడిగాడు వర్తకుడు అయోమయంగా. పక్షి సమాధానం చెప్పకుండా, పాడడం మొదలు పెట్టింది. అందరూ ఆ పాట విని తన్మయత్వం చెందారు. హఠాత్తుగా పాటను ఆపి పక్షి ఎటో వెళ్ళిపోయింది, సుదూర మేఘాలను దాటుకుంటూ. కొన్ని రోజులు గడిచాయి.\n\nపక్షి పాడిన పాట వర్తకుడి మనసులో తరచూ వినిపించ సాగింది. అది మళ్ళీ మళ్ళీ అతడి మనసులో ప్రతిధ్వనించడం వల్ల దాదాపు అతనికి పిచ్చెక్కినట్టయింది. ఇక భరించ లేక ఒకనాడు తిన్నగా అడవికి వెళ్ళి లోయను చేరాడు. పక్షులన్నీ ఆగ్రహంతో గుంవుగూడి కీచుకీచుమంటూ అతడి తల మీద వృత్తాకారంలో ఎగరడంతో, అతడు వెంటనే వెనుదిరిగాడు. అయితే, మనసులో వెంటాడే సంగీతం మాత్రం జీవితంలో ఆఖరి క్షణం వరకు అతణ్ణి వేధించసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 499,
        "IMAGE": "cat_2",
        "NAME": "వెంటాడిన సంగీతం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 249,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, ‘‘కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోదలచలేదు,'' అన్నాడు ఆవేశంగా. ఆ మాట విన్న భూషయ్య, ‘‘ఇంతకూ ఏం జరిగింది? కావాలంటే ఇప్పుడే వెళదాం, రా.\n\nనేనే అతనితో మాట్లాడుతాను,'' అన్నాడు సానుభూతిగా. ‘‘జరిగిన అవమానం చాలు. తిరగదోడి మళ్ళీ బాధ పడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను,'' అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయూడు భద్రయ్య. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో భూషయ్య ఊహించలేక పోయూడు. తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తనూ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోకూడదనుకున్నాడు.\n\nవారం రోజులు గడిచింది. ఆరోజు సాయంకాలం భూషయ్య కనకదుర్గ గుడికి వెళుతూండగా-భద్రయ్య, కనకయ్య గుడి నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి నిర్ఘాంతపోయూడు. రాత్రి భోజనం ముగించి మౌనంగా పడుకోబోయిన భూషయ్యను భార్య, ‘‘ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?'' అని అడిగింది.\n\nభూషయ్య భద్రయ్య గురించి చెప్పాడు. అంతా విన్న అతని భార్య, ‘‘ఇందులో వింతేముంది! మనసెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపొచ్చాలు పాలపొంగులాంటివే కదా. తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదయింది,'' అన్నది నవ్వుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 500,
        "IMAGE": "cat_2",
        "NAME": "స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 250,
        "TYPE_ID": 2
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు \"సాహితీ సమరాంగణ చక్రవర్తి\" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు \"భువన విజయం\" అని పేరు.\n\nఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.\n\nమొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! \" నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!\" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.\n\nమాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 501,
        "IMAGE": "cat_3",
        "NAME": "వింతపరిష్కారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు.\n\nఅనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా \"ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!\" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు.\n\nనీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.\n\nరామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 502,
        "IMAGE": "cat_3",
        "NAME": "దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది.ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగా రు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద ప డతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.\n\nఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.\n\nరామలింగడి సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు \"శభాష్ రామలింగా! శభాష్!\" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.\n\n\"ఎంత దురాశపరుడు\" అన్నాడు ఆస్ధాన పూజారి. \"గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు\" అన్నాడు సేనాధిపతి. \"అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి\" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో \"ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు\" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.\n\nరామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు \"రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. \"రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను\" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.\n\nరాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 503,
        "IMAGE": "cat_3",
        "NAME": "రామలింగడి రాజభక్తి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలో తెనాలి రామలింగడు కవి. ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు.రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా \"భలే శుంఠ\" అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5 వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే, ప్రతిసారీ ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు.\n\nదీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో \"ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు. ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి\" అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలయిన రోజు రామలింగడి గదికి బయటినుండి గడియ పెట్టించాడు.ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే... మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ, శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు.\n\nదీన్ని గమనించిన రాయలవారు \"అదేంటి రామలింగా...! ఎందుకింత ఆలస్యంగా వచ్చావు...?\" అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ... \"ప్రభూ...! నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది\" అని అన్నాడు.\"ఏంటీ... వంద బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా...? ఈ పోటీకి వచ్చి, గెలిస్తే నీకు 5వేల బంగారు నాణేలు దక్కేవి కదా...! ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా...? ఒట్టి శుంఠ లాగున్నావే...!\" అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. \"అవును ప్రభూ...! నేను శుంఠనే..!\" అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ... \"నిజంగా నువ్వు శుంఠవే...!\" కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయులు.\n\nఅప్పుడు రామలింగడు తెలివిగా... \"ప్రభూ...! నిజంగా శుంఠను నేనే కదా...! అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా...!\" అన్నాడు. దాంతో నాలిక్కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి, 5వేల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి, విజేతగా ప్రకటించాడు ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 504,
        "IMAGE": "cat_3",
        "NAME": "భలే శుంఠ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.\n\nపళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది.\n\nఅవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు.\n\nమరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 505,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడి కథలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.\n\nఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...\n\n\"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు\" అని అన్నాడు. దీనికి ఆమె \"ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను\" అంది.\n\n\"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను\" అన్నాడు రామలింగడు. \"ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!\" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.\n\nజరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.\n\nఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... \"మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం\" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 506,
        "IMAGE": "cat_3",
        "NAME": "దొంగకు రామలింగడు చేసిన మోసం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఓసారి విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు ఓ వర్తకుడు వచ్చాడు. పండ్లు, ఫలాలను కానుకగా తెచ్చిన అతడు \"ప్రభూ...! నేనొక వర్తకుణ్ణి. నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు (గుర్రాలు) దాదాపు వెయ్యిదాకా ఉన్నాయి. అవి గాలికంటే వేగంగా పరుగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంతదూరమైనా సరే పరుగులు తీస్తాయి...\" అంటూ చెప్పుకుపోయాడు.\n\n\"ఆహా...! అలాగా..!!\" అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభూ... \"ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకూ, నాకూ గౌరవం. కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి\" అని విన్నవించాడు ఆ వర్తకుడు.\n\n\"సరే అలాగే వర్తకుడా...! ఇదిగో ఈ ఐదువేల బంగారు నాణేలను తీసుకో. వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు\" అన్నాడు రాయలవారు. అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తోన్న తెనాలి రామలింగడికి ఏ మాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు.\n\nమరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి... అక్కడే ఓ మూలగ కూర్చొని ఏదో పట్టిక రాస్తోన్న రామలింగడిని చూశారు. \"ఏంటి రామలింగా... ఇక్కడేం చేస్తున్నావు.. ఏదో రాస్తున్నట్టున్నావే...?\" అంటూ ప్రశ్నించారు.\n\n\"మరేం లేదు ప్రభూ... మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా...!\" అంటూ పట్టిక చూయించాడు. చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయలవారు మొదటగా తనపేరే ఉండటం చూసి ఖంగుతిన్నారు.\n\n\"ఏంటి రామలింగా..? నేను మూర్ఖుడినా..?\" అన్నాడు కోపంగా.... \"\"క్షమించండి ప్రభూ...! ముక్కూ మొహం తెలియనివాడు వచ్చి వర్తకుడినని చెప్పాడు. దాన్ని మీరు నమ్మడమే గాకుండా ఐదువేల బంగారు నాణేలు అప్పజెప్పేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే...!\" అన్నాడు రామలింగడు.\n\nరాయలవారు మౌనంగా ఉండటాన్ని చూసిన రామలింగడు మళ్లీ మాట్లాడుతూ... \"అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తీ తిరిగి రాడు, అశ్వాలూ ఇవ్వడు కదా...!\" అన్నాడు. రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు. \"నిజమే రామలింగా... అతడు ఎవరో, ఏంటో తెలుసుకోలేదు. అదిసరేగానీ అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావ్?\" అంటూ ప్రశ్నించాడు.\n\nఊహించని ప్రశ్నతో గతుక్కుమన్న రామలింగడు రాయలవారికి తెలియకుండా జాగ్రత్తపడి... ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. తరువాత ఇలా అన్నాడు... \"ఏం లేదు ప్రభూ...! అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తాన్లే...!\" అన్నాడు. రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు భళ్లున నవ్వేయగా, రామలింగడు కూడా ఆయనతో జతకలిపాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 507,
        "IMAGE": "cat_3",
        "NAME": "రామలింగడు.. మూర్ఖుల జాబితా..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణ దేవరాయులుకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజపండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ... ఇవి చాలా ప్రత్యేకమైన నారింజపండ్లనీ, వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి.\n\nవాటిని ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజ ప్రతినిధి శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానానికి విచ్చేసి, ప్రభువుకు సగర్వంగా అందజేస్తాడు. పండ్ల బుట్టలో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లను చూసే సరికి దేవరాయులతో పాటు, సభలోని సభికులందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు.\n\nఅందరూ అలా చూస్తుండగానే... సభలో ఉన్న తెనాలిరామలింగడు ఒక్క ఉదుటున లేచి, టక్కున ఒక పండు తీసుకుని, ఒలిచి నోట్లో వేసుకుని...\"అబ్బా...! చాలా బాగుంది. అద్భుతమైన రుచి\" అంటూ పొగడసాగాడు. దీంతో సభికులందరూ హతాశులై చూస్తుండగా... రాయలవారికైతే రామలింగడిపైన పట్టరాని కోపం వచ్చింది.\n\nవెంటనే తమాయించుకుని... \"చైనా చక్రవర్తి నాకోసం పంపించిన పండ్లు అవి. నా అనుమతి లేకుండా తీసుకున్నావు. కాబట్టి నీకు మరణదండన తప్పదు\" అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలను విన్న రామలింగడు మరణదండన గురించి బాధపడకుండా... పకపకా నవ్వడం ప్రారంభించాడు.\n\nసభికులందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా... రామలింగడు నవ్వు చూసిన రాయలవారికి కోపం ఇంకా తీవ్రస్థాయికి చేరుకుంది. \"ఎందుకు రామలింగా...? నవ్వుతున్నావు?\" అని ప్రశ్నించాడు.\n\n\"నవ్వక ఏం చేయమంటారు ప్రభూ...! ఏ పండ్లు తింటే మృత్యువు దగ్గరికి రాదో... ఆ పండును నోట్లో వేసుకోగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా..? లేనట్టా? మీరే ఆలోచించుకోండి\" అన్నాడు నవ్వుతూ రామలింగడు.\n\nదీంతో విషయం అర్థమైన రాయలవారు కోపం తగ్గించుకుని రామలింగడితో జతకలిసి నవ్వసాగాడు. దీంతో సభికులందరూ కూడా... మృత్యువును దూరంచేసే శక్తి ఆ పండ్లకు లేదని అర్థం చేసుకుని నవ్వసాగారు. అంతేగాకుండా... రామలింగడి తెలివితేటలను మెచ్చుకుంటూ... మహిమ లేకపోయినా తియ్య తియ్యగా ఉన్న ఆ పండ్లను అందరూ రుచిచూశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 508,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడు... నారింజపండ్లు!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "తెనాలి రామలింగుని కథలు.. ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా! వీటిలో ఓ చిట్టికథ మీ కోసం... ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.\n\nపళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది.\n\nఅవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు.\n\nమరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు. కదా...\nనీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేథాశక్తితో జయించాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 509,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడి తెలివి అలాంటిది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "చలికాలంలో ఒక రోజున రాయలవారికి అనుకోకుండా ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన దాన్ని అమలు చేశారు కూడా: \"శీతాకాలం కదా ఇప్పుడు, గడగడ వణికించే ఈ చలిలో- మెడలోతు నీళ్లలో మునిగి, రాత్రంతా ఎవరైతే జాగరణ చేస్తారో, వాళ్లకు పది వరహాలు బహుమతినిస్తాం\" అని చాటింపు వేయించారు.\n\nఈ వార్త విన్నాడు ఒక పేదవాడు- \"ఒక్క రాత్రికి ఓర్చుకుంటే పది వరహాలు వస్తాయి. పొలంలో పంట పెట్టుకోవడానికి ఈ ఏడాదికి కావలసిన పెట్టుబడి దొరికినట్లవుతుంది\" అనుకొని, వాడు శ్రమకోర్చి నగరానికి నడిచిపోయాడు. నిండు సభలో వాడు రాజుగారిని కలిసి, తాను పందెంలో పాల్గొంటున్నట్లు తెలియజేసాడు. ఆ సరికే రాజోద్యోగులు, నగర పౌరులు, పురోహితులు అనేకమంది ఆ పనికి పూనుకొని ఉన్నారు. అంత చల్లటి నీళ్లలో రాత్రంతా గడపటం వాళ్ళెవ్వరికీ చేతకాలేదు. అందరూ మధ్యలోనే విరమించి ఉన్నారు. అందుకని సభలో ఉన్న పండితులు ఈ పేద రైతును చూసి ఎగతాళిగా నవ్వారు. రాయల వారుకూడా నవ్వుతూ \"ఇంత బక్క చిక్కిన నువ్వేంటి, గడగడ వణికించే ఈ చలిలో- అదీ నీళ్లలో మునిగి- జాగరణ చేయటమేమిటి?\" అని నిరాశపరచారు.\n\nకానీ రైతు పేదరికం అతని పట్టుదలను మరింత దృఢపరచింది. ఎవరు ఏమన్నా అతను తన పట్టు వీడలేదు. నీళ్లలో ఉంటానంటే ఉంటానన్నాడు. అనటమే కాదు- రక్తాన్ని గడ్డ కట్టించే ఆ చలిలో- రాత్రంతా మెడలోతు నీళ్ళలో మునిగి నిలబడ్డాడు. అనుకున్న పనిని పూర్తిచేసి, తెల్లవారుతుండగా తడి బట్టలతోనే రాజ ప్రాసాదానికి వచ్చాడు.\n\nరాయలవారు అతనిని ఒక గదిలో కూర్చుండబెట్టి, తన సహచరులతో చర్చించారు. \"ఈ రైతు చెబుతున్నది వాస్తవమేనా? రాత్రంతా చలిలో, చీకటిలో, మెడలోతు నీళ్ళలో‌మునిగి ఉన్నాడా, నిజంగానే?\" అని అడిగారు వాళ్ళను.\n\nఅక్కడ ఉన్న పండితులందరికీ రైతు నిజంగానే మాట దక్కించుకున్నాడని తెలుసు. అయినా తమకు రావలసిన ఖ్యాతి ఎవరో అనామకుడికి దక్కటం వాళ్ళకు ఇష్టం కాలేదు. వాళ్ళు రాయలవారితో \"ఇందులో ఏదో మోసం ఉంది మహారాజా!\" అన్నారు. రాయలవారు చెరువుకు కాపలాగా ఉంచిన భటుడొకడిని పిలిపించి అడిగారు వాళ్ళు. వాడు పండితుల ఆంతర్యాన్ని అర్థం చేసుకొని- \"చెరువు ఒడ్డునే తమరి అంత:పురం ఉన్నది గదా మహారాజా, నిన్న ఆ అంత:పురంలో‌ ఒక కాగడా వెలుగుతూ ఉండింది. ఆ కాగడానుండి వెలువడ్డ వెచ్చదనం చెరువునిండా పరచుకొని ఉన్నది. ఆ వేడిని గ్రహిస్తూ రాత్రంతా గడిపాడు ఈ రైతు- లేకపోతే ఇంత చలిని తట్టుకునేంత శక్తి ఎక్కడిది, ఈ బక్క ప్రాణికి?\" అన్నాడు.\n\nఈ చెప్పుడు మాటలు విన్నారు రాయలవారు. వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా రైతుకు ఇవ్వవలసిన బహుమానాన్ని రద్దు చేశారు. పదివరహాలమీద ఆశ పెట్టుకున్న ఆ పేదరైతుకు పాపం గుండె పగిలినట్లైంది. అయినా చేసేదేమీ లేక, దు:ఖాన్ని దిగ మ్రింగుకొని అతను ఇంటి దారి పట్టాడు.\n\nఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు రామలింగకవి. ఈ అన్యాయాన్ని సహించ-కూడదనుకున్నాడు. వెంటనే తన మనిషిని ఒకడిని పిలిచి, నిరాశగా పోతున్న రైతు వెంట పొమ్మన్నాడు. ఆ రైతును సగౌరవంగా తన ఇంటికి తీసుకెళ్ళి ఉంచమన్నాడు.\n\nఆపైన సభలో లేచి నిలబడి, రాజుగారిని, తోటి కవులను, పండితులను, రాజోద్యోగులను అందరినీ ఆరోజు సాయంత్రం తన ఇంట్లో జరుపనున్న విందుకు ఆహ్వానించాడు. ఇంటి తోటలో విందు. ఆ విందులో ఏమేమి వంటకాలు ఉండబోతు-న్నాయో ముందుగానే అందరికీ నోరూరేటట్లు వివరించాడు రామలింగడు.\n\n\"రామలింగడు రమ్మనటమేమిటి, తాము వెళ్ళకపోవటమేమిటి?\" అని, అందరూ ఆ రోజు సాయంత్రం పరగడుపులతోటే విందుకు హాజరయ్యారు- ఎక్కువెక్కువగా మెక్కి తినేందుకు సిద్ధంగా వచ్చారు. రాయలవారుకూడా విచ్చేశారు- వికటకవి ఇంట విందు ఎలా ఉంటుందో‌చూద్దామని. రామలింగడు అందరినీ తోటంతా తిప్పుతూ కాలక్షేపం చేశాడు తప్పిస్తే, వచ్చిన వాళ్లకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు.\n\nరాత్రి బాగా చీకటిపడింది. అందరికీ కడుపులు మాడుతున్నాయి. పైపెచ్చు చలి. విందు ఏర్పాట్లు మాత్రం ఎక్కడా మచ్చుకైనా కనబడటం లేదు. కనీసం వంటకాల వాసనకూడా దరిదాపుల్లో లేదు. భోజన సమయం దాటిపోయింది. రాయల వారి కోపం తారస్థాయికి చేరుకున్నది. ఇక తట్టుకోలేక ఆయన- \"కవిగారూ! విందు ఎక్కడ?\" అని అడిగారు. రామలింగడు \"ఇదిగో , మహారాజా ! వంట అవుతున్నది- కొంచెం ఓపిక పట్టండి- త్వరలోనే అయిపోతుంది\" అన్నాడు.\n\n\"ఏదీ, కనబడదేం? కనీసం వాసనలన్నా రావటం లేదు! ఎక్కడ వండుతున్నారో చూపించు, అసలు?\" అన్నారు రాయలవారు.\n\nరామలింగడు తోటలోనే ఒకమూలకు తీసుకువెళ్ళాడు అందరినీ- \"చూడండి మహారాజా! పైన చెట్టుకు తీగలతో గంగాళాన్ని కట్టి పెట్టాను. క్రింద కొత్త క్రొవ్వొత్తిని ఒకదాన్ని వెలిగించి పెట్టాను, చూడండి. ఈ వేడికి ఎసరు కాగటమే తరువాయి. ఒకసారి ఎసరు కాగిందంటే బియ్యం ఇట్టే ఉడికిపోతుంది\" అన్నాడు రామలింగడు తాపీగా.\n\n\"అయ్యో! రామలింగా, నీకేమయినా బుద్ధుందా, ఎప్పటికి వేడి తగిలేది, ఎప్పుడు ఎసరు కాగేది, ఎప్పటికి అన్నం ఉడికేది, ఇక ఎప్పుడు విందు ఆరగించేది? మాతోటే పరాచకాలా? మమ్మల్ని ఇంతగా అవమాన పరుస్తావా? ఈసారి నీకు దండన తప్పదు\" గర్జించారు రాయలవారు.\n\nఅప్పుడు రామలింగడు- \"క్షమించండి మహారాజా! కొలనులో మునిగి ఉన్న మనిషి కోటలో ఎక్కడో ఉన్న కాగడాతో చలిని కాచుకొన్నప్పుడు, ఇంత దగ్గరగా పెట్టిన క్రొవ్వొత్తి వేడికి అన్నం ఉడకదంటారా? ఏలినవారు మన్నించాలి\" అన్నాడు అనునయంగా. రామలింగని మాటల అంతర్యాన్ని గ్రహించిన రాయలవారు సిగ్గుపడ్డారు. తన మెడలోని ముత్యాల హారంతో రామలింగ కవి మెడను అలకరించారు.\n\n\"నా మెడ ఏలిన వారి ముత్యాల హారపు బరువుకు సంతోషంగా వంగిపోతున్నది. మరి ఈపేద రైతు కడుపుకూ తమరే రక్షణ కల్పించాలి\" అని రైతును రాయలవారి ముందు నిలిపాడు రామలింగడు. రాయలవారు నవ్వి, సభికుల హర్షధ్వానాల మధ్య, పందెం గెల్చినందుకు పది వరహాలు, అపరాధ క్షమాపణగా వంద వరహాలు బహూకరించి రైతును సత్కరించారు .\nరామలింగ కవిని పొగుడుతూ రైతు సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 510,
        "IMAGE": "cat_3",
        "NAME": "రామలింగని యుక్తి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజున రాయలవారికి రామలింగడిని ఏడిపించాలనిపించింది.\n\nనిండు సభలో ఆయన తనకు ఒక కల వచ్చిందని చెబుతూ, తెనాలి రామలింగడిని ఉద్దేశించి ఇలా అన్నారు- “రామకృష్ణా, మీరూ, నేనూ ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. మీరూ-నేనూ-మనం ఇద్దరమే పోతున్నాం- ఎక్కడికో. నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉన్నది. ఇక రెండోది మురికి గుంట - దానిలో నిండుగా దొడ్డీ, మూత్రమూ, చెత్తా, చెదారమూ అన్నీ ఉన్నై. దారేమో ఇరుకుగా ఉంది, కానీ మనిద్దరం దాన్ని దాటాల్సిందే.\n\nఇక మనిద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నాం. -అంతలోనే ఇద్దరం పట్టుతప్పి జారిపడి పోయామట! నేనేమో తేనె గుంటలో పడ్డాను. మరి మీరేమో- అబ్బ చెప్పలేను! -మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారు- నిలువునా!” రాయలవారు ఇది చెబుతూ ముక్కు మూసుకున్నారు.\n\nసభలోని వారంతా గట్టిగా, పడీ-పడీ నవ్వారు. కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. అందరినీ ఎగతాళి చేసే ఈ రామలింగడికి తగిన సన్మానం, కనీసం రాయలవారి కలలోనైనా జరిగిందని, చాలామంది ఎగతాళిగా “భళీ, భళీ” అన్నారు.\n\nరాయలవారు తన కలను మరింత రంజుగా కొనసాగించారు- “నేను తాగగలిగినంత తేనెను తాగి, ఆ గుంట అంచును పట్టుకొని కష్టపడి, ఎలాగో, పైకి ఎక్కాను. కానీ చూడగా, మీరు- పాపం! ఇంకా ఆ దొడ్డిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ ఇటూ జరుగుకుంటూ మీరు కూడా పైకి ఎక్కబోయారు, కానీ అంతలోనే ఏమయిందో-- ఒక్కసారిగా జారి, దభీమని ఆ దొడ్డి గుంటలోనే పడిపోయారు- ఈ సారి తలక్రిందులుగా! అంతలో నాకు మెలకువ వచ్చేసింది.”\n\nసభికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు- ఒక్క రామలింగడు తప్ప.\n\nఇక రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. “ఎంత రాయలవారు అయితేనేమి, కవీంద్రుడిని సన్మానించేది ఇలాగేనా?” అని రగిలిపోయాడు.తర్వాతి రోజున రాయలవారు కొలువుతీరి ఉండగా అతను లేచి నిలబడి “మహారాజా! నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు మాకు. రాత్రి నాకూ ఒక కల వచ్చింది. చిత్రంగా, అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి శలవైతే, నేను వివరంగా మనవి చేసుకుంటాను,” అన్నాడు.\n\n“ఏదో నవ్వులాటకు మొదలుపెడితే , నాకే చుట్టేట్లున్నాడే!” అనుకున్నారు రాయలవారు. అయినా సరసులు కనుక, కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఎక్కువ అయింది. “చెప్పండి రామకృష్ణా\" అన్నారు, ఒకింత భయపడుతూనే, బింకంగా.\n\nరామలింగడు చెప్పాడు- \"మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కానీ నేను- దొడ్డి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే, చాలాసార్లు ప్రయత్నించిన మీదట, చివరికి- ఎలాగో- పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురయింది- ఆ వేషాల్లో మనం ఇంటికి పోలేం కదా, ఎట్లా పోతాం? అందుకని, నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతా -నా నాలుకతో నాకేశాను-- శుభ్రంగా! ఆ తర్వాత మీరు కూడా నన్ను అదే విధంగా శుభ్రం చేసేశారు!” రామలింగడు కలను ముగించి కూర్చున్నాడు.\n\nసభ నివ్వెరపోయింది. సభికులకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు. చివరికి రాయలవారు గట్టిగా నవ్వాక, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.\n'రామలింగడిని ఏడిపిస్తే ప్రమాదం' అని రాయలవారికి అర్థం అయింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 511,
        "IMAGE": "cat_3",
        "NAME": "రామలింగని కల ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి \"రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?\" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. \"రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?\" అన్నారు. \"ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది\" అన్నాడు రామకృష్ణుడు.\n\nకొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: \"కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనపు గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాను నేనుకూడా\" అని. రాయలవారి ముఖం విప్పారింది. \"అద్భుతం! పాత, మసిబారిన చిత్రాల్ని తీసేసి, మీరు కొత్త చిత్రాలు గీయండి\" అన్నారు.\n\nతెనాలి రామకృష్ణుడు పాత పటాల మీద సున్నం కొట్టించేసి ఆయా స్థలాలలో తన సొంత చిత్రాలు గీశాడు. అక్కడొక కాలు, ఇక్కడో కన్ను, ఇంకోచోట ఒక వేలు గీశాడు. అలా గోడలనన్నింటినీ శరీర భాగాలతో నింపి తన హస్తకళా నైపుణ్యాన్ని చూసేందుకు రాయలవారిని ఆహ్వానించాడు. విడివిడి శరీర భాగాల్ని చూసిన రాజుగారు నివ్వెరపోయారు. \"మీరిక్కడ ఏం చేశారు రామకృష్ణా, చిత్రాలేవి?\" అన్నారు.\n\n\"చిత్రాల్లో వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి\" అన్నాడు రామకృష్ణుడు తాపీగా. \"మీరింకా నా చిత్రాల్లో అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు\" అన్నాడు మళ్లీ. రాయలవారికి ఉత్సాహం పెరిగి, చూపించమన్నారు. రామకృష్ణుడు రాయలవారిని ఒక గోడ దగ్గరికి తీసుకవెళ్లి చూడమన్నాడు గర్వంగా. ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చ రంగు గీతలు మాత్రం ఉన్నాయి అక్కడక్కడా. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 512,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రాముని చిత్రకళ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపైవుంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ వున్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వున్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారికేసి చూసింది. రాయలు ఆమెదగ్గరగా వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరకీ వినిపించ లేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులుకేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడిపళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడిపండు పట్టుకొచ్చాడు (ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పా డవకుండా జగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో). కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు.\n\nఅయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక వుపాయం చెప్పారు “మహారాజా! తమ తల్లి గారి కర్మ పన్నెండో రోజున భ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది” అని. ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడిపళ్ళు తయారుచేయించమని హుకుం జారీచేసారు.\n\n“వెయ్యి బంగారు మామిడి పళ్ళూ!! అంటే ఎంతో ఖర్చు. ఈ దుబరా ఆపుచేసే మార్గమేలేదా” అని ఆలోచించి ఇందుకు తగిన వాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా వుపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తలవూపి వెళ్ళిపోయాడు.\n\nరాయల వారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచివున్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి “అయ్యలారా! ఈపక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు. ఆగదిలో ప్రతివారి వంటిమీద వాతపెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు” అని ప్రకటించాడు.\n\nకొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు. మిగిలినవారు ఒక్కొక్కరే లోపలకి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు వుండి “అయ్యలారా! మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడిపళ్ళు ఇస్తారు ఆనక మీ యిష్టం” అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండువాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు. రాయలువారు అతనిచేతిలో ఒక బంగారు మామిడిపండు పెట్టారు.\n\n“అయ్యా! నేను రెండువాతలు పెట్టించుకున్నాను. మరి తమరు ఒక్క టే ఇచ్చారు” అని తన వీపుమీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు.\nరాయలవారు నిర్ఘాంతపోయారు. “వాతలేమిటి?” అని అడిగారు.\n“అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభూ!” అన్నాడు బావురుమంటూ.\n\nరాయలవారు కోపంతో రామకృష్ణుడు వున్న గదిలోకి వచ్చి, వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి “ఏమిటి కవీశ్వరా! ఈపని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు?” అని గద్దించి అడిగారు.\n\n“మహాప్రభో! నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించినరోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాతపెట్టేలోగా అమె కాస్తా గుటుక్కుమంది. ఆమె చివరకోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ వుండగా తమరు తమ తల్లి గారి ఆత్మ తృప్తికోసం బంగారుపళ్ళు ఇస్తున్నారని విని, వాతలు పెడతానంటే ఎవరూ వప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవచేసి ఈనిర్ణయం తీసుకున్నా” అన్నాడు రామకృష్ణుడు.\n\n“వూరుకోవయ్యా! బ్రాహ్మణులకు వాతలపెడితే ఆమె వాతరోగం పోతుందా?” అన్నారు రాయలవారు కోపంగా.\n\n“చిత్తం. తమ తల్లిగారి కోసం ఎన్నోలక్షలు ఖర్చుపెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే, వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభూ!” అన్నాడు రామకృష్ణుడు.\n\nరాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడడానికి సిగ్గుపడి లోపలకి వెళ్ళిపోయారు.\nతిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగలించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 513,
        "IMAGE": "cat_3",
        "NAME": "మామిడి పండు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఆ రోజుల్లో తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.\n\nఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...\n\n\"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు\" అని అన్నాడు. దీనికి ఆమె \"ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను\" అంది.\n\n\"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను\" అన్నాడు రామలింగడు. \"ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!\" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.\n\nజరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.\n\nఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... \"మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం\" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 514,
        "IMAGE": "cat_3",
        "NAME": "తేలు కుట్టిన దొంగ..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "తెనాలి అనే పట్టణంలోని ఓ దంపతుల కుమారుడు రామలింగడు. రామలింగడు చదువుసంధ్యలకన్నా ఆటపాటలకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చేవాడు. నిత్యం ఆటపాటలతో పొద్దుపుచ్చుతున్న రామలింగడిని చూసి తల్లిదండ్రులు బాధపడేవారు. తమ కుమారునికి చదువు సంధ్యలు వస్తాయో రావో నని దిగులుపడేవారు. తమ కుమారుడికి ఎలాగైనా చదువు నేర్పించాలని ఆరాటపడేవారు.\n\nబాల్యమంతా ఆటపాటలతోనే గడిపిన రామలింగడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతోన్న కొద్దీ, తల్లిదండ్రులు ఎంతో కాలముండరనీ, వారు లేకుంటే తాను బతకాలంటే విద్య అవసరమని, విద్య ఆవశ్య కతను గుర్తించాడు. కొన్ని కొన్ని విషయాలు మానవశక్తితో సాధ్యం కావని అందుకు దైవికమైన శక్తి ఉండాల్సిందేనన్నది రామలింగడి ప్రగాఢ విశ్వాసం. పెద్దలు దైవబలం గురించి కథలు కథలుగా చెప్పగా చాలామార్లు విన్నందువల్ల తనకు ఆ దైవశక్తే విద్యను ప్రసాదిస్తుందని, అందుకు దైవాన్నే ఆశ్రయించాలని భావించాడు ఆయన.\n\nఅనుకున్నదే తడవుగా ఆలస్యం చేయక, నిష్కల్మషమైన మనస్సుతో జగన్మాతను ఆరాధించసాగాడు. అలా రామలింగడు రోజూ అమ్మవారి ప్రార్థన చేయసాగాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.\n\nతెనాలి రామలింగడు రోజూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని జగన్మాత ప్రార్థనలో మునిగిపోయేవాడు. జగన్మాత ప్రార్థన తన నిత్యకృత్యాల్లో భాగమైపోయింది. క్రమం తప్పకుండా తదేక దీక్షతో, ప్రార్థిస్తూన్న రామలింగని ప్రార్థనను, నిష్కలష భక్తిని గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగనికి ప్రత్యక్షమైంది. ఓ చేతిలో ధనలక్ష్మి, మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి, వెండిగిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చిందా జగన్మాత.\n\nజగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగనికి నోటమాట రాలేదు. తనకు తెలియకుండానే చందోబద్ధమైన స్తుతి పద్యాలతో ఆమెను ప్రార్థించసాగాడు. అక్షరజ్ఞానం లేని అతడి నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లుల్లాగా పొంగిపొర్లడంతో ఇదంతా కేవలం ఆ జగన్మాత మహాత్మ్యమేనని గుర్తిం చాడు రామలింగడు. తన్మయ త్వంలో మునిగి తేలుతూన్న రామలింగనితో 'చూడు నాయనా! నీ భక్తికి సంతోషించాను. నీకు కావలసిన వరం ఇవ్వదలచాను. ఏం కావాలో కోరుకో!' అంటూ సర్వమూ తెలిసినా ఏమీ తెలియనట్లు అడిగిందా మాత. 'ఏమిస్తావు తల్లీ.. అన్నీ నీకు తెలుసుగా.. నీ బిడ్డకు కావలసింది నువ్వే ఏమైనా ఇవ్వు తల్లీ..' అంటూ దీనంగా వేడుకొన్నాడు రామ లింగడు. అపðడా జగన్మాత చూడునాయనా! నా కుడిచేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యాలక్ష్మి, ఎడమచేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి. ఈ రెండింటిలో ఏది కావాలో దాని తీసుకుని సేవిస్తే నీకు మేలు జరుగుతుంద'ని చెప్పింది జగన్మాత. అపðడు రామలింగడు 'తల్లీ బతికేందుకు ఈ రెండు లక్ష్ములూ అవసరమే కదా.. అందుకే తేల్చు కోలేకపోతున్నాను.. ఏదీ ఆ రెండు గిన్నెలూ నా చేతిలో ఉంచితే ఏది తాగాలో చిటికెలో తేల్చుకుంటాను ' అన్నాడు.\n\nవెంటనే అమ్మవారు రామలింగని కోరిక ప్రకారం రెండు గిన్నెల్నీ అతని చేతిలో ఉంచింది. అల్లరివాడు, కొంటెవాడైన రామలింగడు వెంటనే ఆ రెండుగిన్నెల్లోని పాయసాన్ని కలిపి మరీ చటుక్కున తాగే సాడు. రామలింగడు చేసిన పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడివంక చూడడంతో తపðను గ్రహించిన రామలింగడు జగన్మాతను శసరణు వేడాడు. దాంతో అమ్మవారికి రామలింగడిపై జాలి కలిగి, నువ్వు చేసిన తపðకు శిక్ష అనుభవించక తప్పదు. కఠిన శిక్షను తగ్గించి మామూలు శిక్షను విధిస్తున్నాను. పండితుడివైనా వికటత్వంతోనే అందరి మెపðను పొందెదవుగాక' అని వరమిచ్చి మాయమైంది. ఇక ఆనాటి నుంచి రామలింగడు 'వికటకవి'గా ప్రసిద్ధి చెందాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 515,
        "IMAGE": "cat_3",
        "NAME": "వికట కవి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్ధానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో \"రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో!\" అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు.\n\nమరునాడు, కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో - \"రాజా! మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా, మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు\" అని చెప్పాడు.\n\nఅది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతు, \"నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు\" అన్నాడు. \"అవును రాజా! మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు\" అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి.\n\nకోపంతో చిర్రెత్తు కొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా రెండు కళ్ల దగ్గర రెండు రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్ధం చేసుకున్న రాజు \"ఏంటి రామలింగా! ఈ వెకిలి వేషాలు? నీవు నా ఆదేశాలను ధిక్కరించావు\" అన్నాడు. దానికి రామలింగడు \"లేదు మహాప్రభూ! నా ముఖం మీకు చూపెట్ట వద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది\" అని బదులిచ్చాడు.\n\n\"రామలింగా! నీ తెలివికి జోహార్లు. ఇంక ఆ కుండను తొలిగించి, నీ స్ధానంలో నీవు కుర్చుంటావా?\" అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసి వేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 516,
        "IMAGE": "cat_3",
        "NAME": "ఇది ధిక్కారం కాదు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కిందపడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు.\n\nతనని కొట్టినవాడిని చూసిన రామలింగడు.. \"నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా..? నన్నెందుకయ్యా కొట్టావు..?\" అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారుపడుతూ.. \"అయ్యా..! తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే..!\" అని చెప్పాడు.\n\n\"సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..?\" అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.\n\n\"పోనీలేవయ్యా రామలింగా..! ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో..!!\" అన్నాడు మంత్రి. అయితే రామలింగడు ససేమిరా అన్నాడు. సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే, సందుచూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్లు మండిపోయింది.\n\nమంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు.. \"అయితే మంత్రిగారూ..! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే..!!\" అన్నాడు. \"అంతేగా మరి..!\" అన్నాడు మంత్రి. \"ఓహో..! అలాగా...!!\" అని నవ్వుతూ అన్నాడు రామలింగడు.\n\nవెంటనే మంతిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు. మంత్రి \"కుయ్యో.. మొర్రో..\" అంటూ.. \"ఎందుకయ్యా రామలింగా.. నన్ను కొట్టావు..!!\" అని అడిగాడు. \"మంత్రిగారూ..! నాకు అవతల బోలెడంత పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా..! నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి, మీరు దాన్ని ఉంచుకోండ\"ని చెప్పి ఎంచక్కా అక్కడినుంచి వెళ్లిపోయాడు తెనాలి రామలింగడు.\n\nచూశారా పిల్లలూ... జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి, నిందితుడు తనకు అయినవాడు కావటంతో విడిచిపెట్టాలని ప్రయత్నించటంతో, రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో..! న్యాయం చెప్పాల్సివస్తే... అయినవారయినా, కాని వారయినా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని.. మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమయ్యింది కదూ..!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 517,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడు.. లెంపకాయ ఖరీదు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయలవారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు, ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు \"మహారాజా...! మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైంద\"ని చెప్పాడు.\n\nఅంతే ఫక్కున నవ్విన రాయలవారు... \"రామలింగా...! ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగానీ, చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా.. చెప్పు..?\" అన్నాడు. \"లేదు మహారాజా..! చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే, కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి\" అన్నాడు రామలింగడు.\n\nఅయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోడం లేదని అన్నాడు రాయలవారు. నిజం \"మహాప్రభూ...! చిన్నపిల్లలు అది కావాలి, ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండీ..!!\" అని వివరించి చెప్పాడు రామలింగడు.\nరాజునూ పరుగులెత్తించాడు..!\n\nమహారాజు దీనికి కూడా ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి.. \"సరే మహారాజా..! కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగానూ, మీరు తండ్రిగానూ నటిద్దాము. పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను\" అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు.\n\nఅంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓస్ అంతేగదా.. అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్ళగా... వీధిలో అటూ, ఇటూ పరుగులెత్తాడు, తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగు రంగుల సంచీ చూపించి కొనివ్వమని రాజును అడిగాడు.\n\nసరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేదిలేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే...! ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు.\n\n\"సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగా..? మరొకటి ఏదైనా అడుగు\" అన్నాడు రాయలవారు. \"వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి. నాకింకేమీ వద్దు\" అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 518,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడు.. సంచిలో ఏనుగు...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు. కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.\n\nరామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. \"ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తా\"నని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.\n\nఅలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా..! రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.\nకొరడా దెబ్బలే కావాలి...!!\n\nకవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏంకావాలో కోరుకోమని అన్నాడు. దీంతో \"మహారాజా...! నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు..!!\" అన్నాడు రామలింగడు.\n\n\"ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా...?\" అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. \"తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి. దయచేసి ఇప్పించండి\" అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు \"సరే కొట్టండి\" అని భటులను ఆజ్ఞాపించాడు.\n\nభటులు కొరడాలతో సిద్ధమయ్యాక.. \"మహారాజా..! మన్నించండి. ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి. మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని\" చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ.. పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు.\n\nదాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది. ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలూ...! ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 519,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీ కృష్ణదేవరాయులు ఆస్థానంలో అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఈయనను తెనాలి రామలింగ కవి అనికూడా పిలుస్తుంటారు. ఆయన మహా తెలివైనవారు, చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, హాస్యకవిగా గుర్తింపు పొందిన ఈయనకు వికటకవి అనే బిరుదు కూడా కలదు.\n\nఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండటంతో... కోట గోడలకు వర్ణచిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ పనికోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా, అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.\n\nఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి... \"రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి?\" లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా.. \"రామలింగా.. మీరు ఆ మాత్రం ఎరుగలేరా..? వాటిని మీరు ఊహించుకోవాలి కదా...?\" అన్నారు రాయలవారు.\n\n\"ఆహా... అలాగా ప్రభూ... బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందిలెండి\" అన్నాడు రామలింగకవి. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన.. \"మహారాజా... కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాన\"ని అన్నాడు.\n\nదీంతో సంతోషం పట్టలేని రాయలవారి ముఖం విప్పారింది. \"అద్భుతం... రామలింగ కవి చిత్రాలు వేయటమా, వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి, మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి\" అన్నాడు రాయలవారు ఉత్సాహంగా...! వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు.\n\nఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకోచోట ఒక వేలు... ఇలా గీశాడు రామలింగ కవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకుని వచ్చారు. విడివిడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి.. \"ఏంటి రామలింగా... గోడలపైన ఏంచేశారు, చిత్రాలెక్కడ...?\" అని ప్రశ్నించారు.\n\n\"ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా, ప్రభూ...!!\" అన్నాడు రామలింగ కవి. రామలింగడి సమాధానంతో ఖంగుతిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు \"తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు ప్రభూ\" అన్నాడు రామలింగడు.\n\nరాయలవారికి తిరిగీ ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం.. అంటూ తొందరపెట్టారు. రాయలవారిని ఓ గోడ వద్దకు తీసుకువెళ్లి ఎలాఉందో చూడమన్నాడు రామలింగ కవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగుగల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి.\n\n\"ఇదేంటి రామలింగా...?\" అని అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. \"గడ్డిమేస్తున్న ఆవు ప్రభూ\" బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడ..? అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండీ అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది..? తిరిగీ ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్లిపోయింది ప్రభూ అన్నాడు రామలింగడు. రామలింగకవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్లబెట్టేశారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 520,
        "IMAGE": "cat_3",
        "NAME": "మీరే ఊహించుకోవాలి ప్రభూ...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండేవాడు. ఆయన చాలా తెలివిమంతుడు. తన తెలివితేటలతో ఎంతటివారినయినా సరే సులభంగా ఓడించగలిగేవాడు. ఆ రకంగా కృష్ణదేవరాయలను సంతోషపరచి అనేక బహుమతులను స్వీకరించేవాడు.\n\nరాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు. వారంతా కలిసి ఓ రోజున తెనాలి రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు. అనుకున్నట్లుగానే రామలింగడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు, పెరట్లోని అరటిచెట్ల పొదలో నక్కి కూర్చున్నారు.\n\nభోజనం వేళ కావడంతో రామలింగడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు. అనుకోకుండా అరటిచెట్లవైపు చూసిన ఆయనకు, చీకట్లో చెట్ల గుబుర్లో దాక్కుని కూర్చున్న దొంగలు కనిపించారు. వారిని చూసి కూడా ఏమాత్రం కంగారుపడకుండా, రామలింగడు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు.\n\nఅనుకున్నదే తడవుగా వెంటనే తన భార్యను పిలిచి... \"ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు, నాణాలు ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి మన పెరట్లోని బావిలో పడేద్దాం.. ఏమంటావు..?\" అంటూ మెల్లిగా కన్ను గీటుతూ అన్నాడు రామలింగడు.\n\nభర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రామలింగడి భార్య సరేనని ఒప్పుకుంది. తరువాత భార్య చెవిలో గుసగుసలాడిన రామలింగడు ఇంట్లోకి వెళ్ళి ఒక మూటను సిద్ధం చేసి భార్యతో సహా పెరట్లోకి వచ్చి, దాన్ని బావిలో పడవేస్తాడు. ఇదంతా అక్కడే దాగి ఉండి గమనిస్తున్న దొంగలు లోలోపల సంతోషపడసాగారు.\n\nవెదకబోయిన తీగ కాలికే తగిలిందని సంతోషపడిన దొంగలు... అందరూ నిద్రపోయేదాకా ఉండి, తరువాత బావిలోకి దిగుదాం అని నిర్ణయించుకున్నారు. అంతలో చీకటి పడింది. అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్ల చాటునుంచి బయటికి వచ్చారు దొంగలు. బావిలోకి తొంగి చూశారు. వెంటనే ఒకడు బావిలోకి దూకి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు, నీరు ఎక్కువగా ఉండటంవల్ల నగల మూట దొరకడంలేదని బయటికి వచ్చేశాడు.\n\nఇక లాభం లేదు, బావిలోని నీటిని తోడేస్తే నీళ్ళన్నీ తగ్గిపోతాయి.. అప్పుడు సులభంగా నగలమూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ. అతడి మాటకు సరేనన్న మిగిలినవారు ఒకరితరువాత ఒకరుగా బావిలోని నీటిని తోడి పోయసాగారు. దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగడు మెల్లిగా పెరట్లోకి వచ్చి, అరటి చెట్లకు బాగా పాదులు చేసి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు.\n\nదొంగలు ఎంతసేపు నీటిని తోడి పోసినా, బావిలోని నీరు ఏ మాత్రం తగ్గటం లేదు. అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది. తెల్లవారుఝాము కోడికూసే వేళ వరకూ అలా ఆపకుండా దొంగలు నీటిని తోడి పోస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు నగల మూట దొంగలకు దొరికింది. అబ్బా... కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ, మూటను విప్పారు దొంగలు. అయితే ఆ మూటలో నగలకు బదులుగా నల్లరాళ్ళు ఉండటం చూసి వారు ఖంగు తిన్నారు.\n\nరామలింగడు తమనెలా మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తలవంచుకుని అక్కడినుంచి ఉడాయించారు దొంగలు. వీరు ఇంతకాలం తమను మించినవారు లేరని మిడిసిపడుతూ, ఎంతోమంది ఇళ్లను సులభంగా దోచుకెళ్లేవారు. అలాంటిది రామలింగడి ఇంట్లో చిన్న వస్తువును కూడా దొంగిలించలేకపోయారు.\n\nఈలోపు జరిగిన తతంగమంతా కృష్ణదేవరాయలకు తెలిసింది. రామలింగడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు. కాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఉపాయంతో ఎంతటి అపాయాన్నయినా సరే జయించవచ్చును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 521,
        "IMAGE": "cat_3",
        "NAME": "తెనాలి రామలింగడు... నలుగురు దొంగలు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 3
    },
    {
        "DESCRIPTION": "ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూసాడు. అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది. \"సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?\"\n\nసభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంత సేపు గడిచిన పిదప అక్బర్, బీర్బల్ వైపు చూశాడు. అదేసమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు.\nఅక్బర్ : బీర్బల్ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు\nబీర్బల్ : చిత్తం ప్రభూ! సత్యం-అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపనా!\nఅక్బర్‌తో పాటు సభలోనివారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.\nఅక్బర్ : బీర్బల్ నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా?\nబీర్బల్ : తప్పకుండా ప్రభూ! మహారాజా కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్‌తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్, అతనిని వేయి బంగారు నాణేలతో సత్కరించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 522,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి అక్బర్‌ చక్రవర్తి కొలువుకు ఒక సాధువు విచ్చేశాడు. 'ప్రభూ, మీ కొలువులో 'నవరత్నాలు' అని పిలువబడే తొమ్మిదిమంది మహాపండితులున్నారని విన్నాను. మీరు అనుమతిస్తే వారిని పరీక్షించాలను కుంటున్నా. ఆ తొమ్మిదిమందిలో ఒక్కరైనా నా ప్రశ్నకు సమాధానం యిస్తే మీ సామ్రాజ్యాన్ని దీవించి వెళ్తా. ఇవ్వలేకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధపడి వుండండి' అన్నాడు. 'ఆయన సవాల్‌ను స్వీకరించాలా? వద్దా?' అని చక్రవర్తితో సహా అందరూ మీమాంసలో పడిపోయారు.\n\nకొద్దిసేపటి తర్వాత బీర్బల్‌ లేచి నిల్చుని, 'అయ్యా, అతని సవాల్‌ను స్వీకరించండి. ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా' అన్నాడు. చక్రవర్తి అనుమతితో సాధువు మొదలుపెట్టాడు, 'ఒకసారి ముగ్గురు ప్రయాణీకులు చీకటిపడే వేళకు ఒక సత్రం వద్దకు చేరుకున్నారు. 'మా ముగ్గురికి మూడు గదులు ఇవ్వండి' అని అడిగారు. అందుకు సత్రం అధికారి 'ప్రస్తుతం మూడు గదులు ఖాళీగా లేవు. కానీ ఒక పెద్ద గది, అందులో మూడు మంచాలు ఉన్నాయి. అందులో మీరు ముగ్గురూ వుండొచ్చు' అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. 'ఆ గదికి ముప్పయి కంచునాణేలు కిరాయి' అని అధికారి చెప్తే, వెంటనే చెల్లించారు. ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమాస్తా, అధికారి వద్దకు వచ్చి, 'అయ్యా ఆ గదికి అసలు అద్దె 25 నాణాలే. మీరు 5 నాణేలు ఎక్కువ వసూలు చేశారు' అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. ఆయన వెంటనే ఒక నౌకరును పిలిచి, 'అధికంగా తీసుకున్న 5 నాణేలు అతనికి ఇచ్చి వాటిని ఆ ముగ్గురికి తిరిగి ఇచ్చెయ్యమని ఆదేశించాడు.\n\nకాని ఆ నౌకరు అంత నిజాయితీపరుడేం కాదు. '5 నాణేలను ముగ్గురికి పంచటం అసంభవం', అనుకుని అతడు రెండు నాణేలు తన జేబులో వేసుకుని, మిగతా మూడు నాణేలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తిరిగి ఇచ్చేశాడు. అసలు సమస్య ఏమిటంటే మొత్తం నాణేలు 30. అందులో నౌకరు 2 నాణేలు తీసుకున్నాడు. గది కిరాయి 27 నాణేలు. అంటే మొత్తం 29 నాణేలు. మరి ఆ 30 వ నాణెం ఎటుపోయింది? ' అని అడిగాడు సాధువు.\n\nసమస్య సాధారణంగానే అనిపించినా, జవాబు జఠిలంగా ఉంది. సదస్సులో ఉన్న వాళ్ళంతా లెక్కలు మళ్ళీ మళ్ళీ చేశారు. కానీ జవాబు తెలుసుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళు అందరూ బీర్బల్‌ వైపు చూశారు, 'నీవే శరణ్యం' అన్నట్టుగా. అప్పుడు బీర్బల్‌, 'అయ్యా, సాధువు గారూ, మీరు చాలా సులభమైన ప్రశ్న అడిగారు. మీరు మీ మాటల ద్వారా ఆ సమస్య చాలా జఠిలమైందని అందరూ తికమకపడేలా చేశారు.\n\nఅసలు సమస్య ప్రకారం ముగ్గురు ప్రయాణీకులు 30 నాణేలు చెల్లించారు. 3 నాణెలు వాపస్‌ తీసుకున్నారు. అంటే నిజానికి వాళ్లు 27 నాణేలే చెల్లించారు అనుకుందాం. గుమాస్తా కూడా 27 నాణేలు అంగీకరించాడు. కానీ జవాబు చాలా సులభమైంది. ఆ ప్రయాణీకులు చెల్లించిన 27 నాణేలలో, 2 నాణేలు నౌకరు తీసుకున్నాడు. మిగిలిన 25 నాణేలు గది అద్దె. కాబట్టి ఒక నాణెం ఏమైంది అనే ప్రశ్నే ఉదయించదు. ఇది జనాలను మూర్ఖులను చేయటానికి ఉపయోగించిన చిన్న చిట్కా. అంతేనా? ఏమంటారు?' అన్నాడు.\n\n'భలే చెప్పావు బీర్బల్‌?' అన్నాడు సాధువు మెచ్చుకోలుగా. తర్వాత అక్బర్‌ వైపు తిరిగి, 'ప్రభూ మీరు చరిత్రలో గొప్ప మొఘల్‌ చక్రవర్తిగా, బీర్బల్‌ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు. ఇవే నా ఆశీస్సులు!' అని దీవించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 523,
        "IMAGE": "cat_4",
        "NAME": "గొప్ప మంత్రి బీర్బల్",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. ‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.\n\nకాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు. అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.\n\nగొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించ ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే.\n\nకసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్. కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు.\n‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు. అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 524,
        "IMAGE": "cat_4",
        "NAME": "గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక సారిఇరాన్ రాజుకి బీర్బల్ ను చూడాలనిపించింది ఒక సారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బెర్బల్కి సందేశం పంపించాడు మరో రెండు నెలలో ఇరాన్ కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడుబీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు టోపీ లూ పెట్టించి మరో ఐదుగుర్ని తనతో పాటు సింహాసనం పై కుర్చోబెట్టుకున్నాడు బీర్బల్ తెలివి తేటలకు ఇదిఒక పరీక్ష అనుకున్నాడు .\n\nబీర్బల్ రాణే వచ్చాడు రాజభటులు బీర్బల్ను సాదరంగా రాజ సభకు తీసుకువచ్చారు బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు ఆరుగురు రాజులు కూర్చొని వుండటం చూసి తనకు పరీక్షా పెట్టటానికే ఈ ఏర్పాటు అనుకున్నాడు ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్లి అభివాదం చేసాడు ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు ..... ఇంటమందిలో నీనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు ? అని బీర్బల్ని అడిగాడు ఏముంది రాజా ! మీరు తిన్నగా చూస్తువుంటే ఈ నకిలీ రాజులు మిమల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్ .\nఇంత నిశిత పరిశీలనా వుండి కాబట్టే మీరు మహా మేధావి మిమల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ ని కౌగిలించుకున్నాడు సభ లో ప్రజలందురు బీర్బల్ తెలివికి జోహర్లు అర్పించారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 525,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ తెలివి తేటలకు ఇరాన్ రాజు పరీక్ష ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "విజయం విజేతకు ఆనందాన్నిస్తుంది. అతడి మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ సంతోషాన్నిస్తుంది. తక్కిన వారిలో ఈర్ష్యాసూయలకు కారణమవుతుంది. ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు. అసూయతో కుతకుతలాడిపోతారు. బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.\n\nబీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకు పోయేవారు. బీర్బల్‌ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు. వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకుని, అది గనక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడి పోయారు!\n\nమరునాడు అలాంటి అసూయాపరుల నాయకుడు షైతాన్‌ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికీ, ఆసక్తికరమైన విశేషాలు వినడానికీ సమాయత్తమయ్యాడు.\n\nషైతాన్‌ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. ‘‘చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘షహేన్‌షా! మనకందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్. ‘‘గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్ సంతోషంగా.\n\n‘‘నిజమే షహేనషా! చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతే కాదు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్‌కు సాటి కాలేము,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.\n\nఆ తరవాత అతడు స్వరం తగ్గించి, ‘‘బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా వున్నాడు. మరి, ఆయన్ను కన్నతండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా?’’ అన్నాడు చక్రవర్తితో. ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకువచ్చింది. ఇన్నాళ్ళు తనకీ యోచన రానందుకు ఆశ్చర్యపోయాడు. ‘‘ఇంత గొప్ప వివేకిని కన్న ఆ మహామేధావిని రాజసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా, షహేన్‌షా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.\n\nఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు బీర్బల్ వెంటనే గుర్తించాడు. షైతాన్‌ఖాన్ అంత మంచివాడు కాదు. తెలివైనవాడేగాని, ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించే స్వభావంకాదతనిది. కుట్రలు, కుయుక్తుల మీదే ధ్యాస. షైతాన్‌ఖాన్ మాటల అంతరార్థం ఏమై ఉంటుందా అని బీర్బల్ ఆలోచించాడు. తన తండ్రి విద్యావంతుడు కాడనీ, నీతీ నిజాయితీతో ముక్కు సూటిగా ప్రవర్తించే వ్యక్తి అనీ అతడికి తెలుసు. పైగా రాజాస్థానంలోని వారి లౌక్యం, కపట ప్రవర్తన గురించి ఆయనకు అసలు తెలియదు. అలాంటి అమాయక వ్యక్తిని రాజసభకు పిలిచి ఆయనలోని లోపాలను బట్టబయలు చేసి తనను దెబ్బతీయాలనుకుంటున్నాడు కాబోలు. అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు. తను తవ్విన గోతిలో తనే చతికిల పడేట్టు చేయాలి అనుకున్నాడు.\n\nచక్రవర్తి ‘‘బీర్బల్!’’ అని పిలవడంతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగి ఆయన కేసి చూశాడు. ‘‘మీ తండ్రిని మేము చూడాలి,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘చిత్తం, ప్రభూ,’’ అన్నాడు బీర్బల్ వినయంగా. ‘‘వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి ఎల్లుండికల్లా మీ తండ్రిని వెంటబెట్టుకుని రావాలి,’’ అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి.\n\n‘‘చిత్తం ప్రభూ! తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను,’’ అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు. మరునాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరిలోని బీర్బల్ తండ్రి ఇంటి ముందు ఆగింది. బీర్బల్ వాహనం దిగి, ‘‘నాన్నా,’’ అంటూ వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు. ‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వచ్చావు నాయనా! బావున్నావా?’’ అంటూ బీర్బల్‌ను లేవనెత్తిన తండ్రి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఆ తరవాత అవీ ఇవీ మాట్లాడుకున్నాక భోజనం ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బల్ తను వచ్చిన సంగతి బయటపెట్టాడు.\n\n‘‘నేనా? రాజుగారి సభకు రావడమా? అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరి వాణ్ణి కదా?’’ అన్నాడు బీర్బల్ తండ్రి. ‘‘ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా? అదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు. సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాలి. ఆ తరవాత తలపైకెత్తుకుని వెళ్ళి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి. మీ పేరు, ఊరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి. ఇతర ప్రశ్నలేవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తలాడించండి చాలు,’’ అన్నాడు బీర్బల్.\n\n‘‘మౌనం సర్వార్థ సాధకం కదా?’’ అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ. ‘‘అవును, నాన్నా. మరో విన్నపం. అంతా అయ్యాక, ‘ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పలేదు?’ అని ఎవరైనా గనక అడిగి నట్టయితే,’’ అంటూ తండ్రి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. ముసలి తండ్రి ఆ మాటకు నవ్వు ఆపుకోలేక పకపకా నవ్వాడు.\n\nమరునాడు బీర్బల్ తండ్రిని వెంటబెట్టుకుని చక్రవర్తి సభలో అడుగు పెట్టాడు. బీర్బల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు. తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాడు.\n‘‘పెద్దలకు స్వాగతం! రండి! కూర్చోండి,’’ అన్నాడు చక్రవర్తి మందహాసంతో. బీర్బల్ తండ్రి, ‘‘షహేన్‌షా!’’ అంటూ మరొకసారి నమస్కరించి, వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు.\n\n‘‘మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది. మీ కుమారుడు ఒక అనర్ఘ రత్నం. అతడు గొప్ప మేధావి. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో పరిష్కారం చెప్పగలడు. అతణ్ణి కన్నందుకు మీరు గర్వించాలి,’’ అన్నాడు చక్రవర్తి. బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ, వినయంగా తల పంకించాడు తప్ప పెదవి విప్పలేదు.\n\n‘‘షహేన్‌షా! ఈ జ్ఞాన వృద్ధుణ్ణి చూడడానికి మాకూ ఎంతో సంతోషంగా ఉన్నది. ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు,’’ అంటూ షైతాన్‌ఖాన్, ఆయనతో మరింత సేపు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్టు చక్రవర్తి కేసి చూశాడు. చక్రవర్తి అనుమతిస్తున్నట్టు చేయి ఊపాడు.\n\nషైతాన్‌ఖాన్ చుట్టపక్కల ఒకసారి పరిశీలనగా చూసి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి, వంగి ఆయన పాదాలు తాకి నమస్కరించాడు. ‘‘దీర్ఘాయుష్మాన్ భవ!’’ అంటూ బీర్బల్ తండ్రి అతడి తలను తాకి ఆశీర్వదించాడు.\n\n‘‘బాబాజీ! మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు. మరి అతణ్ణి కన్న మీరు మరెంత మేధావంతులో కదా?’’ అన్నాడు షైతాన్‌ఖాన్. బీర్బల్ తండ్రి మందహాసం చేస్తూ తలపైకెత్తి చూశాడు. ‘‘అతడు మీకు చాలా అమూల్యమైనవాడు కదా?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్. బీర్బల్ తండ్రి మెల్లగా తలపంకించాడు.\n\n‘‘అతడు మీపట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలన్నీ సమకూరుస్తున్నాడా?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్. పెద్దాయన మళ్ళీ మందహాసంతో తల పంకించాడు.‘‘మన చక్రవర్తి గురించి తమరేమనుకుంటున్నారు?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్ ఆయన్ను ఇరుకులో పెట్టాలని. పెద్దాయన నవ్వి మౌనంగా ఊరుకున్నాడు.\n\nషైతాన్‌ఖాన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. పెద్దాయన చిరునవ్వు నవ్వాడుగాని ఒక్క మాట ఆయన నోటి నుంచి బయట పడలేదు. అప్పుడు బీర్బల్ లేచి నిలబడి చక్రవర్తితో, ‘‘షహేన్‌షా! ప్రభువులంటే ఆయనకు మహాగౌరవం. సాటిలేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు. వినయశీలి; విశ్వాసపాత్రుడైన పౌరుడు గనక తమ ఎదుట ఆ మాట అనడానికి ఆయనకు నోరు పెగలటం లేదు. మేటి మొగల్ చక్రవర్తిని గురించి న్యాయనిర్ణయం చేయవలసింది మనం కాదు. సాధారణ ప్రజలు. మా తండ్రికి దైవభీతి ఎక్కువ. మేమందరం అనునిత్యం తమలో దైవాన్ని సందర్శిస్తున్నాం. అటువంటి తమను గురించి ఆయన న్యాయనిర్ణయం చేయడానికి సాహసించ లేకపోతున్నాడు. అందువల్లే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వెలువడడం లేదు,’’ అన్నాడు. చక్రవర్తి పరమ సంతోషంతో, ‘‘మీ స్వభావం మాకెంతో ఆనందం కలిగించింది,’’ అన్నాడు బీర్బల్ తండ్రితో.\n\nబీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని నిరక్షరాస్యుడన్న సంగతి బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో, షైతాన్‌ఖాన్ ఆశాభంగానికి లోనయ్యాడు. తన సహచరుల కేసి చూశాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా బీర్బల్ తండ్రి, తలను రకరకాల భంగిమలతో అటూ ఇటూ మెల్లగా ఊపాడు తప్ప, నోరు తెరిచిన పాపాన పోలేదు. విసుగు చెందిన షైతాన్‌ఖాన్ లేచి, ‘‘షహేన్‌షా!’’ అన్నాడు.\n\n‘‘ఏమిటి షైతాన్‌ఖాన్? చెప్పు,’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం. మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడు,’’ అన్నాడు షైతాన్‌ఖాన్. సభలో గుసగుసలు బయలుదేరాయి. ‘‘ఆ వృద్ధుణ్ణి అలా కించపరచడం భావ్యమేనా?’’ అని అడిగాడు చక్రవర్తి.\n\nఅంతలో పెద్దాయన ఏదో చెప్పదలచినట్టు చెయ్యి పైకెత్తి, ‘‘ప్రభూ! మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను,’’ అన్నాడు గంభీరంగా.\n\n‘‘మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరు. నిజంగా తమరు వివేకవంతుణ్ణి కన్న జ్ఞాన సంపన్నులు,’’ అంటూ చక్రవర్తి, తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు.\n\nపెద్దాయన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు. ‘‘షహేన్‌షా! వృద్ధుడైన మా తండ్రి సుదూర ప్రయాణం కారణంగా బాగా అలిసిపోయారు. ఆయనకు విశ్రాంతి కావాలి. తమ అనుమతితో తీసుకువెళ్ళమంటారా?’’ అని అడిగాడు బీర్బల్.\n‘‘అలాగే బీర్బల్. ఆయన గొప్పవివేకి మౌనం శక్తి ఎరిగిన జ్ఞాని. మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం మౌనం అని నిరూపించాడు కదా!’’ అంటూ బిగ్గరగా నవ్వుతూ సభికుల కేసి చూశాడు. షైతాన్‌ఖాన్, అతడి అనుచరుల ముఖాలు సిగ్గుతో వెలవెలబోయాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 526,
        "IMAGE": "cat_4",
        "NAME": "మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "వేసవి మండిపోతోంది. కణకణలాడే అగ్ని గోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. అక్కడక్కడ నీటి చెలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించ సాగాయి. బావులు ఎండి పోయూయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటి పూట వీధుల్లో తిరగడానికే జనం భయపడసాగారు. ఒకనాటి వేకువ సమయంలో అక్బర్‌ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు. ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్‌తో సహా మరి కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. కొంతసేపు నడిచాక, ‘‘ఇప్పుడే వేడి ఆరంభమవుతున్నది. బావులన్నీ ఎండిపోతున్నాయి,'' అంటూండగా అక్బర్‌ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ‘‘ఆ బావిలో నీళ్ళున్నాయేమో చూద్దాం రండి,'' అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు.\n\nతక్కిన వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళారు. ‘‘బొట్టు నీళ్ళు లేవు,'' అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. ‘‘వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభూ! బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడడానికి ఇది అనువైన కాలం. నీళ్ళున్నప్పుడు వేస్తే అలా చూడలేము,'' అంటూ బీర్బల్‌ బాట పక్కనే ఉన్న చిన్నరాయిని తీసి బావిలోకి విసిరాడు.అది నేలను తాకిన శబ్దం ‘టప్‌'మని వినిపించింది.‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావాలి కదా,'' అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు. దాన్ని చూసి బీర్బల్‌ నివ్వెరపోయి, ‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావలసిందే. కాని, మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా?'' అన్నాడు.\n\nచక్రవర్తికి తను చేసిన పొరబాటు తెలియ వచ్చింది. తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది. బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది, అని అనుకుంటూండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది. ‘‘బీర్బల్‌, మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు. అయితే...'' అంటూ ఆగాడు చక్రవర్తి. ‘‘ఏమిటో సెలవివ్వండి, ప్రభూ!'' అన్నారు బీర్బల్‌తో సహా అందరూ ముక్త కంఠంతో.\n\n‘‘అయితే, బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘అసాధ్యం!'' అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు. ‘‘అంటే, బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు. అంతే కదా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘అంతే ప్రభూ. అందులో ఏమాత్రం సందేహం లేదు,'' అన్నాడు మరొక ప్రముఖుడు. ‘‘బీర్బల్‌, నీ అభిప్రాయమేమిటి?'' అంటూ బీర్బల్‌ కేసి తిరిగాడు చక్రవర్తి.\n\n‘‘ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను, ప్రభూ,'' అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కో సాగాడు బీర్బల్‌. ‘‘బురగ్రోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్‌,'' అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా. ‘‘అవును. నాకు తరచూ అలా జరుగుతుంది. నీకు జరగదేమో!'' అన్నాడు బీర్బల్‌. ‘‘నీకు మాత్రం ఎలా జరుగుతుంది?'' అని అడిగాడు ప్రముఖుడు. ‘‘బుర్ర ఉందిగనక! నీకు లేదు. ఆలోచన రావడం లేదు, అందుకునేనేం చేయను?'' అన్నాడు బీర్బల్‌. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ‘‘ఆ.. చెప్పానా... బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని. ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయూలో తెలిసిపోయింది,'' అన్నాడు బీర్బల్‌ ఉత్సాహంతో.\n\n\"ఎలా తీస్తావో చెప్పు,'' అని అడిగాడు చక్రవర్తిచాలా ఆత్రుతగా. ‘‘అందుకు కొంచెం సమయం కావాలి జహాపనా! అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికల్లా వెలికి తీయగలను. అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది,'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. ‘‘ఇందులో తిరకాసు ఏదీ లేదు కదా!'' అన్నాడు ఇంతకు ముందు బీర్బల్‌ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు.\n\n‘‘అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభూ! అయినా, ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు, అడ్డుదారులతో నాకు పనేమిటి?'' అన్నాడు బీర్బల్‌ ఎంతో విశ్వాసంతో. ‘‘బావుంది. కాని ఇద్దరు భటులను కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభూ,'' అన్నాడు ప్రముఖుడు అంతటితో వదలిపెట్టకుండా. ‘‘బీర్బల్‌ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా, నీ సలహాను కూడా పాటిస్తాను,'' అంటూ చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు.\n\nఅక్కడే ఉండిపోయిన బీర్బల్‌ చుట్టు పక్కల కలయచూశాడు. కొద్ది దూరంలో ఒక గుడిసె, దాని పక్కన చెట్టుకు కట్టబడిన ఒక ఆవు కనిపించాయి. బీర్బల్‌ చకాచకా గుడిసె వద్దకు వెళ్ళి, ‘‘లోపల ఎవరున్నారు?'' అని పిలిచాడు. వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికివస్తూ, ‘‘ఏం, నాయనా ఏం కావాలి? నువ్వెవరు?'' అని అడిగింది. ‘‘అమ్మా, ఒక కడియ ఆవుపేడ కావాలి.కావాలంటే డబ్బిస్తాను,'' అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు. ‘‘ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా. అదిగో ఆవు పేడ వేసింది చూడు. వెళ్ళి తీసుకో. అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తోంది,'' అంటూ గుడిసెలోపలికి వెళ్ళింది ముసలావిడ. బీర్బల్‌ ఎడమ చేత్తో పేడ కడియను తీసుకుని బావివద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు. వజ్రపుటుంగరం తళ తళా మెరుస్తున్నది. ఉంగరాన్ని గురి చూసి పేడను ముద్దగా చేసి దాని మీదికి వేశాడు. సరిగ్గా అది ఉంగరం మీద పడింది. ఇప్పుడు ఉంగరం కనిపించడంలేదు.\n\nబీర్బల్‌ తరవాత ఒక చిన్న రాయినీ, చేతా డంత పొడవాటి సన్నటి దారాన్నీ తీసుకున్నాడు. దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు. ఆ తరవాత రాయిని బావిలోని పేడ మీదికి గురి చూసి వదిలాడు. అది వెళ్ళి పేడమీద పడింది. బీర్బల్‌ సంతోషంగా దారం రెండవ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి, ‘‘మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి.\n\nసాయంకాలానికి వస్తాను,'' అని భటులకు చెప్పి, అక్కడి నుంచి బయలుదేరాడు. ఎండ తీవ్రంగా ఉంది. అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్‌ సంతోషించాడు. సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్‌ బావిదగ్గరికి వెళ్ళాడు. మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకుని, దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు. దారానికి కట్టిన రాయి, దాంతో పాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండి పోయిన పేడ, పేడలోపలి చక్రవర్తి వజ్రపుటుంగరం పైకి రాసాగాయి.\n\nబీర్బల్‌ పిడకను అందుకుని విరిచి చూశాడు. అందులో వజ్రపుటుంగరం కనిపించింది. దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్‌. రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు. ‘‘షహేన్‌షా!'' అంటూ బీర్బల్‌ వంగి సలాం చేశాడు. ‘‘ఉంగరం తెచ్చావా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘తెచ్చాను. ఇదిగో, ఆలంపనా!'' అంటూ బీర్బల్‌ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా. ‘‘ఎలా వెలికి తీశావు? ఇప్పుడు చెప్పు,'' అని అడిగాడు చక్రవర్తి. బీర్బల్‌ అంతా వివరించాడు. ‘‘వాహ్‌! వాహ్‌! నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైనవాడివి బీర్బల్‌,'' అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచీని బహూకరించాడు. ‘‘ఆశ్రీతపోషణలో, దయూగుణంలో మీకు సాటిరాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహేన్‌షా!'' అంటూ బీర్బల్‌ నాణాలను అందుకుని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 527,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్‌ కు పరీక్ష ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.\n\nఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. \"బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు.\" అన్నాడు రాజు గారు \"ఏమైనది మహారాజా!\" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు \"నామనసు బాగాలేదు\" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.\n\n\"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?\" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. \"మీమనసు ఎందుకు బావుండ లేదు?\" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. \"మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!\" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.\n\n\"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది.\" అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. \"ఊఁ ఏమైనా అర్థం అయిందా!\" అడిగాడు అక్బర్ చక్రవర్తి. \"అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది\" అన్నాడు. \"అయితే చెప్పు మా సమస్య?\" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!\" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. \"అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు.\"అన్నాడు అక్బర్. \"ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!\"\n\n\"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది.\" అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. \"ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది.\" \"మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి.\" అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు.\" అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.\n\nకొద్దిసేపటి తర్వాత అక్బర్ \"బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. \"చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి.\" అడిగాడు బీర్బల్. \"బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి.\" చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు.\" మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి.\" అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. \"ఇదిగో ఇక్కడే పెట్టాను\" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. \"ఆహఁ! అలాగా! సరే... సరే...\" అన్నాడు.\n\nబీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. \"ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!\" అన్నాడు. \"చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి.\" అన్నాడు.\n\n\"మహారాజా\" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు, అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి.\" అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. \"మహారాజా! దొంగ దొరికాడు\" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\n\"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు.\" అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వరించాడు బీర్బల్. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 528,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఉంగరం దొంగ ఎవరు? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "బీర్బల్‌ను ఎలాగైనా మాటలతో ఓడించాలని అక్బర్ సరదాగా ఎన్నో ఎత్తులు వేసేవాడు. అయితే బీర్బల్ సమయస్ఫూర్తితో ఆ ఎత్తులను చిత్తు చేసేవాడు. ఒకసారి అక్బర్‌కి ఒక ఆలోచన వచ్చింది. ‘ఈసారి బీర్బల్ కచ్చితంగా ఓడిపోతాడు. బీర్బల్ తెల్లముఖం వేస్తే చూడాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది’ అనుకుని సంతోషించాడు అక్బర్. ‘‘బీర్బల్, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తింటావా?’’ అని ఒకరోజు సభలో బీర్బల్‌ని అడిగాడు అక్బర్.\n\n‘‘జహాపనా, మీ చేతులతో విషం ఇచ్చినా తింటాను.’’ అని జవాబిచ్చాడు బీర్బల్. ‘‘మరొక్కసారి ఆలోచించుకో బీర్బల్. నీకు సందేహంగా అనిపిస్తే తినలేనని ఇప్పుడే చెప్పు. నీకు తెలుసుకదా ఎవరైనా చేస్తానని చెప్పి చేయకపోతే వారికి నేను శిక్ష విధిస్తానని!’’ నవ్వును అతి బలవంతంగా దాచుకుంటూ గంభీరంగా అన్నాడు అక్బర్.\n\n‘‘సందేహం ఏమీ లేదు ప్రభూ! మీ అమృత హస్తాలతో ఏది ఇచ్చినా తింటాను’’ అక్బర్ ఒక సేవకుడిని పిలిచి వెంటనే ఒక కోడిని తీసుకురమ్మని ఆదేశించాడు. సేవకుడు బతికి ఉన్న కోడిని కంచంలో పెట్టి తీసుకువచ్చాడు. ‘‘బీర్బల్ దీన్ని నువ్వు తినాలి’’ అన్నాడు అక్బర్. ‘‘తప్పకుండా తింటాను ప్రభూ’’ అంతే నిశ్చయంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ సమాధానంతో ఆశ్చర్యపోయాడు అక్బర్. ‘‘బీర్బల్ నువ్వు శాకాహారివి కదా. మాంసాహారం తినడం ఎప్పుడు మొదలు పెట్టావ్?’’\n‘‘ప్రభూ మీరు కోడిని తినమన్నారు. కానీ ఎలా తినాలో షరతులు విధించలేదుగా. నేను ఈ కోడిని అమ్ముకొని తింటాను’’ చిన్నగా నవ్వుతూ ఎంతో వినయంగా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ చతురతకు ఎంతో సంతోషించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 529,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ చతురత ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారంతా రకరకాల సమస్యలతో వస్తుంటారు. అందులో కొన్ని జటిలంగా ఉంటే, కొన్ని సరదాగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తేలికగా పరిష్కరించేవాడు.\nఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వారిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు. ‘‘అక్బర్ పాదుషా వారికి వందనాలు. ప్రభూ! నా పేరు చిత్రసేనుడు. ఇతడు సుగ్రీవుడు, మా పనివాడు’’ అని చెప్పాడు ఒక వ్యక్తి.\n\nవెంటనే రెండో వ్యక్తి ‘‘అబద్ధం. నేను ఇతని పనివాణ్ని కాదు. ఇతనే నా పనివాడు’’ అన్నాడు.‘‘ఇంతకూ ఎవరు పనివారు? ఎవరు యజమాని?’’ అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమానినంటే నేను యజమానినని, నువ్వు పనివాడివంటే నువ్వు పనివాడివని వారిద్దరూ వాదించుకోసాగారు. అక్బర్‌కు, అక్కడి సభలోని వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాలేదు. చివరకు అక్బర్ బీర్బల్ సహాయాన్ని అర్థించాడు.\n‘‘బీర్బల్! వీళ్ళిద్దరిలో పనివాడెవరో చెప్పగలవా?’’ అని అడిగాడు అక్బర్. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, ‘‘తప్పకుండా ప్రభూ. నేను చాలా తేలికగా పనివాడిని గుర్తించగలను’’ అన్నాడు.\nబీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు నటించి, ‘‘మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి’’ అన్నాడు. బీర్బల్ సూచించినట్టు చిత్రసేనుడు, సుగ్రీవుడు నేల మీద పడుకున్నారు. అక్బర్‌తో సహా సభికులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొద్దిక్షణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తులకు ఏం జరుగుతోందో తెలియట్లేదు.\nఇంతలో బీర్బల్ గట్టిగా ‘‘భటులారా! వీడే పనివాడు. వెంటనే అతని తలను నరకండి’’ అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడనే వ్యక్తి పైకి లేచాడు. ‘‘ప్రభూ! నేను పనివాడిని. నన్ను చంపకండి’’ కంగారుగా అంటూ చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వుతూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు.\n‘‘వాహ్... బీర్బల్! నీ తెలివి అమోఘం. శభాష్!’’ అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణం అక్బర్ కొలువంతా చప్పట్లతో మారు మోగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 530,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఎవరు యజమాని?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఓ సారి అక్బర్ చక్రవర్తి- బీర్బల్‌ను ‘‘నాకొక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి’’అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా వున్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా, ‘‘అలాగే సంపాదిస్తా ప్రభూ. కానీ నాకొక వారం రోజులు సమయమివ్వండి’’అని అడిగాడు. అలాగే అన్నాడు అక్బర్.సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దు పాలు తెమ్మని వారం రోజుల గడువుయిచ్చారు. కానీ అది అసాధ్యమైన పని. ఏం చెయ్యాలా?’ అని నిర్వేదంలో పడిపోయాడు.\n\nఅతని భార్య అది గమనించి, ‘‘ఏం జరిగింది?’’అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది. ‘‘అదేమంత అసాధ్యం కాదు. ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ మీరు ఆరురోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు’’ అందామె. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం వున్న బీర్బల్ ‘‘అలాగే’’అని ఇంటి పట్టునే వుండిపోయాడు. అయిదురోజులు గడిచాయి. ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డలమోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే వున్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డనీ ఉతకటం మొదలుపెట్టింది.\n\nఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీది వరండాలోకి వెళ్ళి ‘ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా?’అని చూసాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు భటులను పంపించాడు. ‘‘ఏమ్మా.. యింత రాత్రి పూట బట్టలు ఉతుకుతున్నావెందుకు?-’’అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ‘‘ప్రభూ, ఆరురోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి చీకటి పడింది. అందుకే యింత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా’’అని జవాబిచ్చిందామె వినయంగా.\n\n‘‘ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం?’’అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దు పాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు?’’ అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల వూపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో, అలాగే ఎద్దుకూడా పాలను యివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్‌ను తాను అసాధ్యమైన కార్యం చెయ్యమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివి తేటలకు మెచ్చుకున్న అక్బర్- ఆమెకు అనేక విలువయిన కానుకలిచ్చి పంపించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 531,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఎద్దు పాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు బీర్బల్‌ని ఏడిపించాలని అక్బరు చక్రవర్తి దర్బారులో \"బీర్బల్ రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో మనిద్దరం మన ఉద్యానవనంలో షికారు చేస్తున్నాం. అమావాస్య అవటం వల్ల అంతా చీకటిగా ఉంది. ఇంతలో మన దారులకడ్డంగా రెండు పెద్ద గొయ్యలు వచ్చాయి. మనిద్దరం వాటిలో పడిపోయాం. అదృష్టవశాత్తు నేను పడింది తేనె ఉన్న గొయ్యలో. నువ్వు పడ్డ గొయ్యిలో ఏముందో తెలుసా?\" బీర్బల్‌ని ప్రశ్నించాడు అక్బరు.\n\n\"ఏముంది ప్రభూ అందులో\" అమాయకంగా అడిగాడు బీర్బల్. \"బురద\". షాదుషా మాటలు విని సభలోని వారందరు పెద్దపెట్టున నవ్వారు. బీర్బల్‌ని ఏడిపించగలిగానన్న ఆనందం కలిగింది అక్బర్‌కు. సభలో నిశ్శబ్దం ఏర్పడ్డాక బీర్బల్ \"విచిత్రంగా ఉంది ప్రభూ నాకూ సరిగ్గా ఈ కలే వచ్చింది. అయితే మీరు అంతవరకే కలగని నిద్రలేచేసారు. నేను కల పూర్తయ్యే వరకు నిద్ర పోయాను. అప్పుడు మీరు చాలా రుచికరమైన తేనెతో, నేనేమో దుర్గంధమైన బురదతో పైకి వచ్చాం. శుభ్రపరచుకోవడానికి నీటి కోసం చుట్టూ వెతికాం. కానీ మనకు ఆ దగ్గరలో ఒక నీటి చుక్క కూడా కనిపించలేదు. అప్పుడేం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరా?\" అన్నాడు.\n\"ఏం జరిగింది?\" కొంచెం కంగారుగానే అడిగాడు అక్బర్. \"మనం ఒకరినొకరు నాకి శుభ్రపరచుకున్నాం\". అక్బరు ముఖం ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయాడు. తను చేసిన అవమానానికి బీర్బల్ సరైన సమాధానం చెప్పాడని ఊరుకున్నాడు. ఇంకెన్నడూ బీర్బల్‌ని ఏడిపించే ప్రయత్నం చేయలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 532,
        "IMAGE": "cat_4",
        "NAME": "అక్బర్‌ చేసిన అవమానానికి బీర్బల్ సరైన సమాధానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ \"మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. \"అన్నాడు. అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. \"అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!\" అని అడిగాడు మహారాజు\n\n\"అవును మహారాజా\" అన్నాడు బీర్బల్ \"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!\" అని అడిగాడు అక్బర్. మళ్ళీ 'అవునని' చెప్పాడు. బీర్బల్ వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.\n\nబీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? \" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\nబీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. \"అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను\" అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు. \"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?\" ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?\"\n\n\"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?\" \"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు..\" \"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు\" అని మరొక వర్గం వారు. ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.\n\nఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. \"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?\" కుతూహలంగా అడిగాడు అక్బర్. \"చిత్తం మహారాజా\" అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. \"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!\" \"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు\" \"బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు.\" ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు. \"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?\" అడిగాడు అక్బర్ చక్రవర్తి.\n\n\"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు\" అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.\n\n\"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి\" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు. \"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?\" అని అడిగాడు మహారాజు\n\n\"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!\" అన్నాడు బీర్బల్. అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. \"సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?\" అని అడిగాడు అక్బర్.\n\nఅక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు \"మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు.\" అన్నాడు బీర్బల్. అక్బర్ అందుకు అంగీకరించాడు.\n\n\"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.\nఅంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 533,
        "IMAGE": "cat_4",
        "NAME": "మాట్లాడే గాడిద ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "శీతాకాలం మధ్యాహ్న సమయంలో అక్బర్ చక్రవర్తి యమునానదీ తీరానికి షికారుకు వెళ్ళాడు. ఆయన వెంట బీర్బల్‌తో సహా కొందరు సభికులు నడుస్తున్నారు. మందగమనంతో సాగుతూన్న నదీ జలాలను చూస్తూ, ‘‘శీతల వాయువులు మంచుకొండల నుంచి మోసుకొచ్చిన చల్లదనాన్ని నదీజలాల్ల్లో కలిపి వాటికి మరింత చల్లదనం సమకూరుస్తున్నాయి,’’ అన్నాడు చక్రవర్తి.\n\n‘‘ఇంత చల్లటి నీళ్ళల్లో అడుగుపెట్టడానికి కూడా ఎవరూ సాహసించలేరు,’’ అన్నాడు ఒక అధికారి. ‘‘తగిన ప్రోత్సాహకం అందజేయాలేగాని, పగటిపూటే కాదు; కావాలంటే రాత్రంతా రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపే మహానుభావులూ ఉంటారు,’’ అన్నాడు బీర్బల్. ‘‘అసాధ్యం! ఎవడైనా అలాంటి దుస్సాహసానికి పూనుకుంటే రక్తం గడ్డకట్టుకుపోయి చస్తాడు,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘ప్రయత్నించనంత వరకే ఏదైనా అసాధ్యం షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్.\n\n‘‘నువ్వంత రూఢిగా ఎలా చెప్పగలవు?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘బహుమతి ప్రకటించి చూడండి. నేను చెప్పడం సరో కాదో తెలిసిపోతుంది,’’ అన్నాడు బీర్బల్ వినయంగా. యమునానదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో రాత్రంతా గడిపిన వారికి వంద మొహరీలు బహుమతిగా ఇవ్వబడుతుందని మరునాడు ఉదయమే చాటింపు చేయబడింది. ఆ చాటింపును మంగేష్ అనే ఒక రజకుడు విన్నాడు. అతడు డబ్బు అవసరంలో ఉన్నాడు. ‘‘వంద మొహరీలు! వాటితో నా అప్పులన్నీ తీరిపోతాయి. ఖర్చులన్నీ పోను కొంత మిగులుతుంది కూడా,’’ అన్నాడు భార్యతో.\n\n‘‘ఆలోగా నువ్వు చలికి బిరబ్రిగుసుకుపోకుంటే సరి,’’ అని హెచ్చరించింది భార్య. ‘‘ఆ భయమేం లేదు. నా చిన్నప్పుడు శీతాకాలం రాత్రుల్లో యమునలో ఈదేవాణ్ణి,’’ అంటూ భార్య చేతిని ఆప్యాయంగా పట్టుకుని, ‘‘వంద మొహరీలంటే మాటలా? ఆలోచించి చూడు,’’ అన్నాడు మంగేష్ నవ్వుతూ. మరునాడు మంగేష్ రాజభవనానికి వెళ్ళి, వచ్చిన పని చెప్పి చక్రవర్తి దర్శనం కావాలన్నాడు. అధికారి అతణ్ణి చక్రవర్తి వద్దకు తీసుకు వెళ్ళాడు. అతడు నేలను తాకి నమస్కరించి, ‘‘షహేన్‌షా, తమ చాటింపు విన్నాను. రొమ్ముల లోతు యమునానది నీళ్ళల్లో రాత్రంతా గడపడానికి నేను సిద్ధం,’’ అన్నాడు.\n\n‘‘మంచిది,’’ అంటూ చక్రవర్తి అధికారికేసి తిరిగి, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు. నదీ తీరంలో కాపలా కాయడానికి ఇద్దరు భటులు వచ్చారు. తెల్లవార్లూ అతడు రొమ్ములలోతు నీళ్ళల్లో ఉన్నాడా అని కనిపెట్టి చూడడం వాళ్ళ బాధ్యత. ఆ మాట వినగానే భటులు, ‘‘రాత్రంతా యమునా తీరంలోనా,’’ అని గొణుక్కున్నారు. అయినా రాజాజ్ఞ! పాటించక తప్పదు కదా!\n\nసాయంకాలం భటులు మంగేష్‌ను నదీ తీరానికి నడిపించారు. వాళ్ళు ఉన్నిబట్టలు ధరించి, నదీ తీరంలోని గుడారంలో కూర్చున్నారు. మంగేష్ మొలకు కట్టుకున్న బట్టను తప్ప తక్కిన దుస్తులన్నిటినీ తీసేశాడు. పెనుగాలిలో ఆకులా వణికిపోసాగాడు. ప్రాణాలను పణంగా పెడుతున్నానా అని ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా ఇంతదూరం వచ్చాక ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. ‘‘వంద మొహరీలు!’’ అనుకున్నాడు మనసులో. ‘‘ఒక్క రాత్రి చలి బాధను తట్టుకుని నిలబడితే వంద మొహరీలు నా చేతిలో,’’ అన్న ఆలోచనతో ధైర్యాన్ని కూడదీసుకుంటూ నీళ్ళలోకి దిగి నిలబడడానికి అనువైన, రొమ్ములలోతు నీళ్ళల్లో నిలబడ్డాడు.\n\nచీకటికమ్ముకోవడంతో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవసాగాయి. నెలవంక కనిపించి కనుమరుగయింది. ఎముకలు కొరికే చలి. రాత్రి అయ్యే కొద్దీ చలి ఉధృతం పెరగసాగింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని క్షణమొక యుగంగా గడపసాగాడు. ఉన్నట్టుండి అతడి చూపులు దూరంగా కోట బురుజు నుంచి మిణుకు మిణుకుమనే దీపం వెలుగుమీద పడింది. ‘‘ఆహా! దూరంలోని ఆ దీపం కూడా కొంత వెచ్చగానే ఉన్నది!’’ అనుకున్నాడతడు మనసులో.\n\nదీపమూ, వెచ్చదనమూ గురించిన ఆలోచనలు అతడి భయాలను పోగొట్టి ధైర్యాన్నివ్వసాగాయి. వాటి మీదే మనసును కేంద్రీకరించడంతో చలిని గురించి మరిచిపోయాడు. దూరంగా కోడి కూత వినిపించింది. తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించాయి. తన కష్టాలు గట్టెక్కనున్నాయని మంగేష్ పరమానందం చెందాడు. ‘‘వెలుపలికిరా మంగేష్! ఇంకాస్సేపటికి వంద మొహరీలు నీకు సొంతం!’’ అని కేక వేశారు గట్టుమీది భటులు.\n\nగట్టుమీదికి వచ్చిన మంగేష్ ఒళ్ళు తుడుచుకుని పొడిబట్టలు కట్టుకుని, రాజభవనానికి భటులతో బయలుదేరాడు. వాళ్ళు భవనంలో అడుగు పెట్టేసరికి చక్రవర్తి బీర్బల్‌తో సహా ప్రముఖులతో కొలువుదీరి ఉన్నాడు. ‘‘షహేన్‌షా! రాత్రి తెల్లవార్లూ ఇతడు నదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపాడు,’’ అన్నారు భటులు.\n\nచక్రవర్తికి ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. చలిని భరించడానికి ఆ మనిషి ఏదో కిటుకును ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానించాడు. ముందుకు వంగి, ‘‘చలిని ఎలా దూరంగా ఉంచగలిగావు? నిజం చెప్పు,’’ అని అడిగాడు. ‘‘షహేన్‌షా! కోట బురుజుమీది దీపం నాకు వెచ్చదనం సమకూర్చింది,’’ అని సమాధానమిచ్చాడు మంగేష్ అమాయకంగా.\n\n‘‘దీపం నీకు వెచ్చదనం ఇచ్చింది! అంటే నీకు వెలుపలి నుంచి సాయం అందిందన్నమాట! అందువల్ల బహుమతికి నువ్వు అనర్హుడివి!’’ అన్నాడు చక్రవర్తి. మంగేష్ ముఖం వెలవెలబోయింది. చక్రవర్తి తీర్పుకు బదులు చెప్పలేక అతడు బాధతో తలదించుకున్నాడు.\n\nబీర్బల్ కూడా ఆశ్చర్యపోయాడు గాని, ఒక్కమాట మాట్లాడలేదు. ఆశాభంగానికి గురైన మంగేష్ వంగి నమస్కరించి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మౌనంగా చూస్తూండిపోయాడు. బహుమతిని ఆశించి మంగేష్ ప్రాణాంతకమైన చలిని భరించాడు. కాని అతడి ఆశ ఫలించలేదు!\n\nమంగేష్‌కు తీరని అన్యాయం జరిగిందని బీర్బల్ భావించాడు. అతడికి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించాడు. మరునాడు ఇంటివద్ద తనకు అత్యవసరమైన పనిపడిందనీ, అందువల్ల ఆ రోజు సభకు రాలేననీ చక్రవర్తికి కబురు పంపాడు బీర్బల్. ‘‘అత్యవసరమైన పనా! చక్రవర్తి సేవకు మించిన పని, అదేమిటి?’’ అని గొణిగాడు చక్రవర్తి.\n\nబీర్బల్ అంటే అసూయగల కొందరు సభికులు సంతోషించారు. ఈసారి బీర్బల్ తప్పక చిక్కుల్లో పడగలడని ఆశించారు. చక్రవర్తి భటులను పిలిచి, బీర్బల్‌ను వెంటబెట్టుకు రమ్మని ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ ఇంటికి వెళ్ళి సంగతి చెప్పారు. ‘‘నేను కిచడి తయారు చేస్తున్నాననీ, ఆ పని పూర్తి కాగానే పరిగెత్తుకు రాగలననీ చక్రవర్తికి చెప్పండి,’’ అన్నాడు బీర్బల్. భటులు ఆ సంగతి చక్రవర్తికి విన్నవించారు.\n\n‘‘మూర్ఖుడా!’’ అని మండిపడ్డ చక్రవర్తి వెంటనే శాంతించి, ‘‘ఆ తుంటరి వెధవాయి దేనికైనా సమర్థుడు. ఏం చేస్తున్నాడో ఏమో స్వయంగా వెళ్ళి చూద్దాం,’’ అని అనుకున్నాడు. వెంటనే ఆయన గుర్రం మీద బీర్బల్ ఇంటికి బయలుదేరాడు. బీర్బల్ ఇంటి వాకిట్లో కనిపించాడు. పొయ్యిలో ఎండు కట్టెలు పెట్టి మంట రగిలిస్తున్నాడు. వట్టి పొయ్యికి ఐదడుగుల దూరంలో ముక్కాలి పీట మీద మట్టి కుండ కనిపించింది.\n\nచక్రవర్తిని చూడగానే బీర్బల్ చేతిలోని కట్టెను కింద పడేసి లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, నేలను తాకి నమస్కరించాడు. ‘‘ఏం చేస్తున్నావు బీర్బల్?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘కిచడి వంట చేస్తున్నాను షహేన్‌షా. అదిగో ఆ ముక్కాలిపీట మీది కుండలోకి బియ్యం, పప్పు వేశాను,’’అన్నాడు బీర్బల్. ‘‘కుండ కింద మంట కనిపించదే మరి?’’ అని అడిగాడు చక్రవర్తి కనుబొమలు ముడిచి. ‘‘అదిగో అక్కడ ఉంది కదా మంట,’’ అంటూ ఐదడుగుల దూరంలో మండుతున్న పొయ్యిని చూపాడు బీర్బల్.\n\n‘‘కుండకు మంట వేడి తగలకుండా అందులోని బియ్యం, పప్పు ఎలా ఉడుకుతుందనుకున్నావు?’’ అని అడిగాడు చక్రవర్తి విసుగ్గా. బీర్బల్ చిన్నగా నవ్వాడు. ‘‘నవ్వు సమాధానం కాజాలదు. పప్పు, బియ్యం ఉన్న కుండ మంటకు దూరంగా ఉంటే అవి ఎలా ఉడుకుతాయి?’’ అని అడిగాడు చక్రవర్తి మళ్ళీ కోపంగా.\n‘‘షహేన్‌షా! మంట వేడి చాలా దూరానికి చేరగలదని తమరే నాకు బోధించారు,’’ అన్నాడు బీర్బల్.\n\n‘‘నేను బోధించానా? ఎప్పుడు? ఎక్కడ?’’ అన్నాడు చక్రవర్తి అయోమయంగా. ‘‘తమరే బోధించారు షహేన్‌షా! యమునానది శీతల జలాల మధ్య నిలబడ్డ మంగేష్‌కి, కోట బురుజుపై వెలిగే మసక దీపం వెచ్చదనం అందించిందని నిండు సభలో తమరే సెలవిచ్చారు కదా?’’ అన్నాడు బీర్బల్ వినయంగా స్పష్టమైన కంఠస్వరంతో.\n\nబీర్బల్ మాటల అంతరార్థం గ్రహించి విస్తుపోయిన చక్రవర్తి, ‘‘ఆహా!’’ అంటూ భటులకేసి తిరిగి, ‘‘వెంటనే వెళ్ళి మంగేష్‌ను వెంటబెట్టుకు రండి. ప్రకటించిన బహుమతిని అతడికి అందజేయాలి,’’ అని ఆజ్ఞాపించాడు. ‘‘షహేన్‌షా, న్యాయం జరిగింది గనక, ఇప్పుడు ముక్కాలి పీట మీది బియ్యం, పప్పుకుండ పొయ్యి మీదికి చేరుతుంది,’’ అన్నాడు బీర్బల్. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 534,
        "IMAGE": "cat_4",
        "NAME": "యమునానది-వంద మొహరీలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు సభలో అక్బర్ చక్రవర్తి బీర్బల్‌ను ఈ విధంగా ప్రశ్నించాడు. \"ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు మరియు గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?\" \"సాధ్యమవుతుంది ప్రభూ\" అని చెప్పాడు బీర్బల్. \" అలాగా! అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా?\" . \"తప్పకుండా చూపిస్తాను ప్రభూ\" అని బీర్బల్‌ సభ నుండి బయటకు వెళ్ళి పోయాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు. \"ఇతను కడు బీదవాడు ప్రభూ! బిచ్చ మెత్తుకుని జీవిస్తాడు\" బీర్బల్ ఆ వ్యక్తిని అక్బరు ముందు నిలబెడుతూ చెప్పాడు.\n\"ఆ విషయం చూస్తేనే అర్ధం అవుతోంది. మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు?\" ఆసక్తిగా అడిగాడు అక్బరు. \"ఒక చక్రవర్తితో పాటు ఇతను కూడా ప్రజల ముందు సత్కారాన్ని పొందగలిగితే, ఇతను తన బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు\" అన్నాడు బీర్బల్.\nబీర్బల్‌ చాతుర్యానికి అక్బరు చక్రవర్తి ఎంతో ఆనందించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 535,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీదవాడు-గొప్పవాడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, \"అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా!'' అన్నాడు. \"అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం,'' అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప. అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. \"బీర్బల్‌, భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. \"ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌.\n\n\"అంటే నువు్వ నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్న మాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో. \"అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా,'' అన్నాడు బీర్బల్‌. ``ప్రమాదమా! గూలాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌.\"ముళ్ళు, గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు,'' అన్నాడు బీర్బల్‌. \"మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. \"మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణ రక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. \"మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు,'' అన్నాడు అక్బర్‌. ``శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు.\n\nముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానో, అసూయ వల్లనో ఎలాగైనా పడ గొట్టాలని చూస్తూంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం,'' అన్నాడు బీర్బల్‌. ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, \"హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదులనుద్దేశించి అడిగాడు. \"పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు.\n\n\"కత్తి పట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది,'' అన్నాడు బీర్బల్‌. \"దూరం నుంచే శత్రువు మీదికి ప్రయోగించవచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం,'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. \"ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌. \"ఫిరంగి!'' అన్నాడు మరొక సభికుడు. \"దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు బీర్బల్‌. \"ఖడ్గమూ కాదు. ఈటే కాదు.ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. \"పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. \"ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా. \"సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనాసరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది, ప్రభూ,'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా.\n\n\"అసంబద్ధం!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవు్వకున్నారు. \"సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళు్ళ నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళు్ళ చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు.\n\nఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, \"రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైవే వస్తున్నది. పారిపొండి. పారిపొండి!'' అంటూ వాడు వెళ్ళిపోయాడు. వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తి పిడి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు.\n\nఅక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది. అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చూసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగు వీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది. ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందికి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంట బడి తరుముకుంటూ పరిగెత్తింది.\nఅయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులనున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. \"బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను,'' అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 536,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఉత్తమమైన ఆయుధం ఏది?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్‌ చక్రవర్తి సభలో కొలువుదీరి వున్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్‌ చూపులు తనమీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. ప్రభూ! నా పేరు మహేశ్‌దాస్‌. ఆగ్రాకు నాలుగామడల దూరంలో వున్న కుగ్రామం మాది. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను,'' అన్నాడు ఆ యువకుడు. ``నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?'' అని అడిగాడు అక్బర్‌. ``నా తెలివితేటల్ని చూసి, `నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్లు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది,' అని మా పంతులే చెప్పారు. ఆయన మాటవిని అంతదూరం కాలినడకనే వచ్చి, అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌.\n\n``ప్రతి ఉపాధ్యాయుడూ, తన విద్యార్థుల గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగలిస్తాం,'' అన్నాడు అక్బర్‌. \"నేను ఉత్తముల్లోకెల్లా ఉత్తముడినని రుజువు చేయగలను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో. \"చేసి చూపు మరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు అక్బర్‌. ``అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకను దయచేయాలి,'' అన్నాడు మహేశ్‌. ``మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు,'' అన్నాడు అక్బర్‌. ``నేను అడిగే కానుకకు దమ్మిడీ ఖర్చుకాదు ప్రభూ!'' అన్నాడు మహేశ్‌. ``అలాగా? ఏమిటది?'' అని అడిగాడు అక్బర్‌. 30 కొరడా దెబ్బలు, ప్రభూ! అన్నాడు మహేశ్‌. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.\n\n``నీకేమైనా పిచ్చి పట్టిందా?'' అన్నాడు అక్బర్‌ అసహనంగా. ``ఆ సంగతి తరవాత తెలుస్తుంది. మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ వినయంగా. అక్బర్‌ వెంటనే కొరడా తెప్పించి, దాన్ని తెచ్చిన వాణ్ణి దగ్గరికి పిలిచి, \"కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టొద్దు. కొడుతున్నట్టు అభినయిస్తూ, మెల్లగా తాకించు,'' అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా ఝళిపిస్తూంటే, ముందుకు వంగిన మహేశ్‌, ఒకటి, రెండూ... అంటూ లెక్కించి, పది రాగానే, \"ఆగు!'' అని అరిచి తలెత్తి అక్బర్‌ చక్రవర్తిని చూస్తూ, \"ప్రభూ, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను.\n\nఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో ఇద్దరు సమంగా పంచుకుంటారు,'' అన్నాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు అక్బర్‌ అతడు చెబుతున్నది అంతుబట్టక. \"అవును ప్రభూ! భవన ద్వారం వద్ద నిలబడ్డ ఇద్దరు కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలనన్నారు. `నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువిచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను,' అని మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌. ``అలాగా!'' అన్నాడు అక్బర్‌ కోపంతో. \"వాళ్ళను పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది,'' అన్నాడు మహేశ్‌. అక్బర్‌ తల పంకించాడు.కొంతసేపటికి ఆ ఇద్దరు భటులూ అక్కడికి రాగానే, ``మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేదికాదని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా. ప్రభువులు ఇప్పిస్తారు. పుచ్చుకోండి,'' అన్నాడు మహేశ్‌.\n\nఇద్దరు భటులూ, సంతోషంగా తలలూపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని, కొరడా పట్టుకున్న వ్యక్తి పది దెబ్బలు కొట్టాడు. ఆ తరవాత రెండవ కాపలాభటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన పది కొరడాదెబ్బలూ తిన్నాడు. \"ఈ క్షణమే, లంచగొండులైన మిమ్మల్ని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను,'' అన్న అక్బర్‌ చక్రవర్తి, మహేశ్‌ కేసి తిరిగి, \"నువ్వు చాలా తెలివైనవాడివి.మీ బడిపంతులు చెప్పింది నిజం. నీ సమర్థత నిరూపించుకున్నావు. ఇప్పుడే నిన్నుపేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను,'' అన్నాడు చిన్నగా ననవ్వు తూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 537,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుండి లేచి, వెంటనే ఆస్ధాన జ్యోతిష్యులను పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి, దాని పర్యవసానాలు వివరించమన్నాడు.\n\nజ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని, \"అయ్యా! తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది. విన్నవించమంటారా?\" అని అడిగారు. \"కానీయండి\" అన్నాడు అక్బర్‌. \"జహాపనా! మీ బందువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభూ\" అన్నారు.\n\nఅక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపి వేశాడు. ఆ మరుసటి ఉదయం, యధాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు. బీర్బల్‌కి కూడా రాజు తన కల గురించీ, జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించీ చెప్పాడు. విషయం అర్ధమైన బీర్బల్‌ - \"జహాపనా! నాకూ కొద్దిగా స్వప్న ఫలితాల జ్ణానం ఉంది. మీ కల ప్రకారం మీ బందువలందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది\" అన్నాడు.\nఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్‌ని సత్కరించి పంపాడు. జ్యోతిష్యులు చెప్పిందీ, తను చెప్పిందీ ఒకటే అయినా, చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్‌. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 538,
        "IMAGE": "cat_4",
        "NAME": "చెప్పే విధానంలో తేడా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బర్‌ బీర్బల్‌ను ఇరుకున పెట్టాలనుకున్నాడు. ముస్లింలు అల్లాను, బౌద్ధులు బుద్ధుడిని, క్రైస్తవులు క్రీస్తును పూజిస్తారు మరి హిందువులు ఎందుకయ్యా అంతమంది దేవుళ్లను పూజిస్తారు? అని అడిగాడు. దానికి బీర్బల్‌ దేవుడు ఒక్కడే... రూపాలు అనేకం అన్నాడు. అదెలా సాధ్యం? అన్నాడు .\n\nఅక్బర్‌. చెబుతానంటూ బీర్బల్‌ ఒక సైనికుడిని పిలిచాడు. తలకు చుట్టుకున్న దానిని చూపి అదేమిటి అని అడిగాడు. 'తలపాగా' అన్నాడు సైనికుడు. దానిని విప్పి భుజంపై వేసుకోమన్నాడు. ఇప్పుడిదేమిటి అంటే 'కండువా' అన్నాడు. తరువాత దానిని నడుముకు చుట్టుకోమని ఇదేమిటీ అని అడగ్గా 'అంగీ' అన్నాడు. నీటిచుక్క ఆకాశంలో మేఘం రూపంలో ఉంటుంది. కిందపడితే నదిగా మారుతుంది. గడ్డకడితే మంచు అవుతుంది. చూశారా! మహారాజా వస్త్రం, నీటి చుక్కలు స్థలాన్ని బట్టి ఎన్ని రూపాలెత్తాయో? దేవుడూ అంతే అన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 539,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "శీతాకాలం మధ్యాహ్న సమయంలో అక్బర్ చక్రవర్తి యమునానదీ తీరానికి షికారుకు వెళ్ళాడు. ఆయన వెంట బీర్బల్‌తో సహా కొందరు సభికులు నడుస్తున్నారు. మందగమనంతో సాగుతూన్న నదీ జలాలను చూస్తూ, ‘‘శీతల వాయువులు మంచుకొండల నుంచి మోసుకొచ్చిన చల్లదనాన్ని నదీజలాల్ల్లో కలిపి వాటికి మరింత చల్లదనం సమకూరుస్తున్నాయి,’’ అన్నాడు చక్రవర్తి.\n\n‘‘ఇంత చల్లటి నీళ్ళల్లో అడుగుపెట్టడానికి కూడా ఎవరూ సాహసించలేరు,’’ అన్నాడు ఒక అధికారి. ‘‘తగిన ప్రోత్సాహకం అందజేయాలేగాని, పగటిపూటే కాదు; కావాలంటే రాత్రంతా రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపే మహానుభావులూ ఉంటారు,’’ అన్నాడు బీర్బల్. ‘‘అసాధ్యం! ఎవడైనా అలాంటి దుస్సాహసానికి పూనుకుంటే రక్తం గడ్డకట్టుకుపోయి చస్తాడు,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘ప్రయత్నించనంత వరకే ఏదైనా అసాధ్యం షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్.\n\n‘‘నువ్వంత రూఢిగా ఎలా చెప్పగలవు?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘బహుమతి ప్రకటించి చూడండి. నేను చెప్పడం సరో కాదో తెలిసిపోతుంది,’’ అన్నాడు బీర్బల్ వినయంగా. యమునానదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో రాత్రంతా గడిపిన వారికి వంద మొహరీలు బహుమతిగా ఇవ్వబడుతుందని మరునాడు ఉదయమే చాటింపు చేయబడింది. ఆ చాటింపును మంగేష్ అనే ఒక రజకుడు విన్నాడు. అతడు డబ్బు అవసరంలో ఉన్నాడు. ‘‘వంద మొహరీలు! వాటితో నా అప్పులన్నీ తీరిపోతాయి. ఖర్చులన్నీ పోను కొంత మిగులుతుంది కూడా,’’ అన్నాడు భార్యతో.\n\n‘‘ఆలోగా నువ్వు చలికి బిరబ్రిగుసుకుపోకుంటే సరి,’’ అని హెచ్చరించింది భార్య. ‘‘ఆ భయమేం లేదు. నా చిన్నప్పుడు శీతాకాలం రాత్రుల్లో యమునలో ఈదేవాణ్ణి,’’ అంటూ భార్య చేతిని ఆప్యాయంగా పట్టుకుని, ‘‘వంద మొహరీలంటే మాటలా? ఆలోచించి చూడు,’’ అన్నాడు మంగేష్ నవ్వుతూ. మరునాడు మంగేష్ రాజభవనానికి వెళ్ళి, వచ్చిన పని చెప్పి చక్రవర్తి దర్శనం కావాలన్నాడు. అధికారి అతణ్ణి చక్రవర్తి వద్దకు తీసుకు వెళ్ళాడు. అతడు నేలను తాకి నమస్కరించి, ‘‘షహేన్‌షా, తమ చాటింపు విన్నాను. రొమ్ముల లోతు యమునానది నీళ్ళల్లో రాత్రంతా గడపడానికి నేను సిద్ధం,’’ అన్నాడు.\n\n‘‘మంచిది,’’ అంటూ చక్రవర్తి అధికారికేసి తిరిగి, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు. నదీ తీరంలో కాపలా కాయడానికి ఇద్దరు భటులు వచ్చారు. తెల్లవార్లూ అతడు రొమ్ములలోతు నీళ్ళల్లో ఉన్నాడా అని కనిపెట్టి చూడడం వాళ్ళ బాధ్యత. ఆ మాట వినగానే భటులు, ‘‘రాత్రంతా యమునా తీరంలోనా,’’ అని గొణుక్కున్నారు. అయినా రాజాజ్ఞ! పాటించక తప్పదు కదా!\n\nసాయంకాలం భటులు మంగేష్‌ను నదీ తీరానికి నడిపించారు. వాళ్ళు ఉన్నిబట్టలు ధరించి, నదీ తీరంలోని గుడారంలో కూర్చున్నారు. మంగేష్ మొలకు కట్టుకున్న బట్టను తప్ప తక్కిన దుస్తులన్నిటినీ తీసేశాడు. పెనుగాలిలో ఆకులా వణికిపోసాగాడు. ప్రాణాలను పణంగా పెడుతున్నానా అని ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా ఇంతదూరం వచ్చాక ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. ‘‘వంద మొహరీలు!’’ అనుకున్నాడు మనసులో. ‘‘ఒక్క రాత్రి చలి బాధను తట్టుకుని నిలబడితే వంద మొహరీలు నా చేతిలో,’’ అన్న ఆలోచనతో ధైర్యాన్ని కూడదీసుకుంటూ నీళ్ళలోకి దిగి నిలబడడానికి అనువైన, రొమ్ములలోతు నీళ్ళల్లో నిలబడ్డాడు.\n\nచీకటికమ్ముకోవడంతో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవసాగాయి. నెలవంక కనిపించి కనుమరుగయింది. ఎముకలు కొరికే చలి. రాత్రి అయ్యే కొద్దీ చలి ఉధృతం పెరగసాగింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని క్షణమొక యుగంగా గడపసాగాడు. ఉన్నట్టుండి అతడి చూపులు దూరంగా కోట బురుజు నుంచి మిణుకు మిణుకుమనే దీపం వెలుగుమీద పడింది. ‘‘ఆహా! దూరంలోని ఆ దీపం కూడా కొంత వెచ్చగానే ఉన్నది!’’ అనుకున్నాడతడు మనసులో.\n\nదీపమూ, వెచ్చదనమూ గురించిన ఆలోచనలు అతడి భయాలను పోగొట్టి ధైర్యాన్నివ్వసాగాయి. వాటి మీదే మనసును కేంద్రీకరించడంతో చలిని గురించి మరిచిపోయాడు. దూరంగా కోడి కూత వినిపించింది. తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించాయి. తన కష్టాలు గట్టెక్కనున్నాయని మంగేష్ పరమానందం చెందాడు.\n‘‘వెలుపలికిరా మంగేష్! ఇంకాస్సేపటికి వంద మొహరీలు నీకు సొంతం!’’ అని కేక వేశారు గట్టుమీది భటులు.\n\nగట్టుమీదికి వచ్చిన మంగేష్ ఒళ్ళు తుడుచుకుని పొడిబట్టలు కట్టుకుని, రాజభవనానికి భటులతో బయలుదేరాడు. వాళ్ళు భవనంలో అడుగు పెట్టేసరికి చక్రవర్తి బీర్బల్‌తో సహా ప్రముఖులతో కొలువుదీరి ఉన్నాడు. ‘‘షహేన్‌షా! రాత్రి తెల్లవార్లూ ఇతడు నదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపాడు,’’ అన్నారు భటులు.\n\nచక్రవర్తికి ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. చలిని భరించడానికి ఆ మనిషి ఏదో కిటుకును ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానించాడు. ముందుకు వంగి, ‘‘చలిని ఎలా దూరంగా ఉంచగలిగావు? నిజం చెప్పు,’’ అని అడిగాడు. ‘‘షహేన్‌షా! కోట బురుజుమీది దీపం నాకు వెచ్చదనం సమకూర్చింది,’’ అని సమాధానమిచ్చాడు మంగేష్ అమాయకంగా.\n\n‘‘దీపం నీకు వెచ్చదనం ఇచ్చింది! అంటే నీకు వెలుపలి నుంచి సాయం అందిందన్నమాట! అందువల్ల బహుమతికి నువ్వు అనర్హుడివి!’’ అన్నాడు చక్రవర్తి.\nమంగేష్ ముఖం వెలవెలబోయింది. చక్రవర్తి తీర్పుకు బదులు చెప్పలేక అతడు బాధతో తలదించుకున్నాడు.\n\nబీర్బల్ కూడా ఆశ్చర్యపోయాడు గాని, ఒక్కమాట మాట్లాడలేదు. ఆశాభంగానికి గురైన మంగేష్ వంగి నమస్కరించి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మౌనంగా చూస్తూండిపోయాడు. బహుమతిని ఆశించి మంగేష్ ప్రాణాంతకమైన చలిని భరించాడు. కాని అతడి ఆశ ఫలించలేదు!\n\nమంగేష్‌కు తీరని అన్యాయం జరిగిందని బీర్బల్ భావించాడు. అతడికి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించాడు. మరునాడు ఇంటివద్ద తనకు అత్యవసరమైన పనిపడిందనీ, అందువల్ల ఆ రోజు సభకు రాలేననీ చక్రవర్తికి కబురు పంపాడు బీర్బల్. ‘‘అత్యవసరమైన పనా! చక్రవర్తి సేవకు మించిన పని, అదేమిటి?’’ అని గొణిగాడు చక్రవర్తి.\n\nబీర్బల్ అంటే అసూయగల కొందరు సభికులు సంతోషించారు. ఈసారి బీర్బల్ తప్పక చిక్కుల్లో పడగలడని ఆశించారు. చక్రవర్తి భటులను పిలిచి, బీర్బల్‌ను వెంటబెట్టుకు రమ్మని ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ ఇంటికి వెళ్ళి సంగతి చెప్పారు. ‘‘నేను కిచడి తయారు చేస్తున్నాననీ, ఆ పని పూర్తి కాగానే పరిగెత్తుకు రాగలననీ చక్రవర్తికి చెప్పండి,’’ అన్నాడు బీర్బల్. భటులు ఆ సంగతి చక్రవర్తికి విన్నవించారు.\n\n‘‘మూర్ఖుడా!’’ అని మండిపడ్డ చక్రవర్తి వెంటనే శాంతించి, ‘‘ఆ తుంటరి వెధవాయి దేనికైనా సమర్థుడు. ఏం చేస్తున్నాడో ఏమో స్వయంగా వెళ్ళి చూద్దాం,’’ అని అనుకున్నాడు. వెంటనే ఆయన గుర్రం మీద బీర్బల్ ఇంటికి బయలుదేరాడు. బీర్బల్ ఇంటి వాకిట్లో కనిపించాడు. పొయ్యిలో ఎండు కట్టెలు పెట్టి మంట రగిలిస్తున్నాడు. వట్టి పొయ్యికి ఐదడుగుల దూరంలో ముక్కాలి పీట మీద మట్టి కుండ కనిపించింది.\n\nచక్రవర్తిని చూడగానే బీర్బల్ చేతిలోని కట్టెను కింద పడేసి లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, నేలను తాకి నమస్కరించాడు. ‘‘ఏం చేస్తున్నావు బీర్బల్?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘కిచడి వంట చేస్తున్నాను షహేన్‌షా. అదిగో ఆ ముక్కాలిపీట మీది కుండలోకి బియ్యం, పప్పు వేశాను,’’అన్నాడు బీర్బల్. ‘‘కుండ కింద మంట కనిపించదే మరి?’’ అని అడిగాడు చక్రవర్తి కనుబొమలు ముడిచి. ‘‘అదిగో అక్కడ ఉంది కదా మంట,’’ అంటూ ఐదడుగుల దూరంలో మండుతున్న పొయ్యిని చూపాడు బీర్బల్.\n\n‘‘కుండకు మంట వేడి తగలకుండా అందులోని బియ్యం, పప్పు ఎలా ఉడుకుతుందనుకున్నావు?’’ అని అడిగాడు చక్రవర్తి విసుగ్గా. బీర్బల్ చిన్నగా నవ్వాడు. ‘‘నవ్వు సమాధానం కాజాలదు. పప్పు, బియ్యం ఉన్న కుండ మంటకు దూరంగా ఉంటే అవి ఎలా ఉడుకుతాయి?’’ అని అడిగాడు చక్రవర్తి మళ్ళీ కోపంగా.\n‘‘షహేన్‌షా! మంట వేడి చాలా దూరానికి చేరగలదని తమరే నాకు బోధించారు,’’ అన్నాడు బీర్బల్.\n\n‘‘నేను బోధించానా? ఎప్పుడు? ఎక్కడ?’’ అన్నాడు చక్రవర్తి అయోమయంగా. ‘‘తమరే బోధించారు షహేన్‌షా! యమునానది శీతల జలాల మధ్య నిలబడ్డ మంగేష్‌కి, కోట బురుజుపై వెలిగే మసక దీపం వెచ్చదనం అందించిందని నిండు సభలో తమరే సెలవిచ్చారు కదా?’’ అన్నాడు బీర్బల్ వినయంగా స్పష్టమైన కంఠస్వరంతో.\n\nబీర్బల్ మాటల అంతరార్థం గ్రహించి విస్తుపోయిన చక్రవర్తి, ‘‘ఆహా!’’ అంటూ భటులకేసి తిరిగి, ‘‘వెంటనే వెళ్ళి మంగేష్‌ను వెంటబెట్టుకు రండి. ప్రకటించిన బహుమతిని అతడికి అందజేయాలి,’’ అని ఆజ్ఞాపించాడు. ‘‘షహేన్‌షా, న్యాయం జరిగింది గనక, ఇప్పుడు ముక్కాలి పీట మీది బియ్యం, పప్పుకుండ పొయ్యి మీదికి చేరుతుంది,’’ అన్నాడు బీర్బల్. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 540,
        "IMAGE": "cat_4",
        "NAME": "యమునానది-వంద మొహరీలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది. బీర్బల్‌ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్‌ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.\n\nవెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి \"ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను.\" అని వినయంగా చెప్పింది.\n\n\"ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు\" అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది. అప్పుడు బీర్బల్‌ అక్బర్‌ దగ్గరకు వెళ్ళి \"ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు.\" అని చెప్పాడు.\n\"తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు.\"\n\"అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు\"\nసరే రమ్మని చెప్పు\" అని ఆదేశించాదు అక్బరు.\n\nరాణి సరాసరి అక్బరు ముందు నిలబడి \"ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు,\" అంది రాణి వణికే కంఠంతో.\n\nరాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు. ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్‌ వైపు చూశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 541,
        "IMAGE": "cat_4",
        "NAME": "ప్రియమైన వస్తువు - అక్బరు బీర్బల్ కథలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుండి లేచి, వెంటనే ఆస్ధాన జ్యోతిష్యులను పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి, దాని పర్యవసానాలు వివరించమన్నాడు.\n\nజ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని, \"అయ్యా! తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది. విన్నవించమంటారు?\" అని అడిగారు.\n\"కానీయండి\" అన్నాడు అక్బర్‌.\n\"జహాపనా! మీ బందువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభూ\" అన్నారు.\nఅక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపి వేశాడు.\n\nఆ మరుసటి ఉదయం, యధాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు. బీర్బల్‌కి కూడా రాజు తన కల గురించీ, జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించీ చెప్పాడు. విషయం అర్ధమైన బీర్బల్‌ - \"జహాపనా! నాకూ కొద్దిగా స్వప్న ఫలితాల జ్ణానం ఉంది. మీ కల ప్రకారం మీ బందువలందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది\" అన్నాడు.\nఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్‌ని సత్కరించి పంపాడు.\nజ్యోతిష్యులు చెప్పిందీ, తను చెప్పిందీ ఒకటే అయినా, చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్‌. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 542,
        "IMAGE": "cat_4",
        "NAME": "అక్బరు కల",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.\n\nదీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.\n\nనువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. \"నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?\" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు . ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 543,
        "IMAGE": "cat_4",
        "NAME": "దొంగ సాధువు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బరు, బీర్బలు కోట ఆవరణలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో అక్బరు ‘‘బీర్బల్, నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేసే వాళ్ళెవరో చెప్పగలవా?’’ అని అడిగాడు.\n\n‘‘వ్యాపారస్తులు ప్రభూ! కల్తీ సరుకులు అమ్ముతుంటారు. బియ్యంలో రాళ్ళు, పాలలో నీళ్ళు కలిపి కొన్ని వేల ప్రజలను మోసం చేస్తారు.’’ అన్నాడు బీర్బల్.‘‘వ్యాపారస్తులందరూ మోసగాళ్ళంటే నేను నమ్మను. కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చుగా!’’ ‘‘ప్రభూ, నాకు తెలిసి అందరూ ఏదో విధంగా ప్రజలను మోసం చేసేవాళ్ళే’’ అన్నాడు ‘‘అలాగని రుజువు చేయగలవా?’’ అని అన్నాడు అక్బరు. ‘‘తప్పకుండా ప్రభూ, నా దగ్గర ఒక పథకం ఉంది. మీరు అనుమతి ఇస్తే రుజువు చేస్తాను’’ అని బీర్బల్ అనగానే తలూపాడు అక్బరు.\n\nమరునాడు ఆగ్రా పట్టణంలోని వ్యాపారస్తులకు అక్బరు చక్రవర్తి ముందు హాజరు కావాల్సిందిగా అదేశాలు వెళ్ళాయి. కారణం తెలియని వ్యాపారస్తులు భయపడుతూ వచ్చారు. వాళ్ళతో అక్బరు ‘‘మంచి కార్యం కోసమే మిమ్మల్ని పిలిపించాము. నేను సర్వమతాలకూ సంబంధించేలా ఒక పండుగ చేయాలని అనుకుంటున్నాను. మీరంతా తలా ఒక చెంబుడు పాలు తేవాలి’’ అన్నాడు.\n\n‘‘చెంబుడు పాలెందుకు ప్రభూ మీరు ఆజ్ఞాపిస్తే ఒక బిందెనిండా తీసుకువస్తాము’’ అన్నారు వ్యాపారస్థులంతా ముక్తకంఠంగా. ‘‘మీరు ఎక్కువ కష్టం తీసుకోకండి. రేపు ఉదయాన్నే ఒక చెంబుతో పాలు తీసుకురండి చాలు’’ మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు బీర్బల్.\n\nబీర్బల్ వారి కోసం ఒక పెద్ద గంగాళాన్ని ఒక గదిలో ఉంచాడు. సూర్యోదయం కాకముందే వ్యాపారస్తులు చెంబులతో బారులు తీరారు. ఒక్కొక్కరిగా వచ్చి తమ చేతిలోని చెంబును కాగులోకి ఒంచి వెళ్ళిపోసాగారు. అందరూ వెళ్ళిపోయాక అక్బరు, బీర్బలు ఆ గదిలోకి వెళ్ళారు. ఎంతో కుతూహలంగా కాగులోకి చూసిన అక్బరు ముఖం తెల్లబడింది. ఆ కాగులో ఒక్క పాల చుక్కలేదు. కాగునిండా నీళ్ళున్నాయి.\n\n‘‘వ్యాపారస్తులందరూ ఒకేలా ఆలోచించారు ప్రభూ! మిగతా అందరు పాలు పోస్తారు. తనొక్కడే నీళ్ళు పోస్తే ఎవరికి తెలుస్తుందని అందరూ నీళ్ళే తీసుకువచ్చారు.’’ అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 544,
        "IMAGE": "cat_4",
        "NAME": "గొప్ప మోసగాళ్ళు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక సారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు.\nబీర్బల్ జ్వరం వల్ల నీరశించి, చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.\n\nఅక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు.\nతిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.\nఅక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు.\nకొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు.\n“ఈ గదిలో యేదో మారినట్టుంది,” అని బీర్బల్ జవాబు చెప్పాడు.\n“మారిందా? యేమిటి మారిందంటావు?” అని అక్బర్ అన్నారు.\n“ఈ మంచం ఒక మూల యెత్తుగా వున్నట్టుంది,” అని అన్నాడు.\n“జ్వరమొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది,” అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు.\n\n“మహారాజా! నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు!” అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు.\nఅక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 545,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ జ్వరం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.\n\n“బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు. బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”\n\nకొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు. అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.\n\nఅక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.\nబీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.\n\n“ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 546,
        "IMAGE": "cat_4",
        "NAME": "విష్ణు మహిమ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి, నగలు, రొక్కం తీసుకుని పారిపోయాడు.\n\nకొన్ని రోజులయ్యాక, ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. యెక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి, వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు.\n\n“దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? నా నగలు, రొక్కం తిరిగి ఇవ్వు!” అని అరవడం మొదలుపెట్టాడు.\n\nధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “నేను దొంగతనం చేయడం యేమిటి, వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను!” అని గొడవపడ సాగాడు.\nబజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు.\nబీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.\nబీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి, “ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను” అన్నాడు.\nఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక, బీర్బల్, “ఇప్పుడు పనివాడి తల నరికేయి!” అని ఆదేశించాడు.\nఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగారుగా తన తల లోపలకు లాగేసాడు. ఇలా బయటపడిపోయాడు.\nఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 547,
        "IMAGE": "cat_4",
        "NAME": "దొంగ ఎవరు?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ బాద్ షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒక నాడు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు.\n\nకొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.\n\nఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు.\n\nఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు.\n\nనిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది.\nతట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది.\nబీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో యెలా చెప్పాలని సతమతమయ్యాడు.\nఅలోచించగా ఒక ఉపాయం తట్టింది.\nకోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు.\n\nరోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు.\nతోట మాలి బీర్బల్ ఆదేశాననుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని చెప్పాడు.\nక్రొధంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. “మొక్కలు నీళ్ళు లేకపోతే యెండిపోవ?” అని కోపంతో కేకలు వేయ సాగాడు.\n\nబీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు యే తోట మాలి సహాయం లేకుండా, రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయికద? అలాగే మరి మన కోట లో తోటలకి ఇంత మంది సేవకులు యెందుకు?” అన్నాడు.\nవెంటనే అక్బర్కు ఙ్యానోదయమయ్యింది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణి గారికి పరిచారకులను పురమాయించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 548,
        "IMAGE": "cat_4",
        "NAME": "తోటలో మొక్కలు; అడవిలో చెట్లు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు.\n\nదారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.\nసామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.\nరాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు.\n\nకింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.\nఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు.\nఅక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.\nబీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు.\nతెల్లవారింది.\nఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ గుర్రం తీసుకో”, అన్నాడు.\nఅక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.\nఅదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది.\nవెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.\nసామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 549,
        "IMAGE": "cat_4",
        "NAME": "అసలు యజమాని ఎవరు? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.\n\nసరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.\n\nబీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.\nఆశ్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.\n“అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.\n“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్\n“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.\nఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 550,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ కాకి లెక్కలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.\n\nమరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.\n\nఆవిడ హజ్ యాత్రకు వెడుతోంది కదా! ఆ డబ్బు సంచిని ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు.ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఒక్కత్తే ఉంటుందని చెప్పుకున్నాం కదా! మరి ఆవిడ యాత్రకు వెడితే ఇంట్లో ఎవ్వరూ ఉండరు కదా! ఇల్లు తాళం పెట్టి వెడుతూ డబ్బంతా ఇంట్లో పెట్టి వెడితే అలా అని దొంగలకు తెలిస్తే వాళ్ళు ఊరుకోరు కదా! ఇంటికి వేసిన తాళం పగలకొట్టి ఇల్లు దోచుకుంటారు. అందుకని ఇంట్లో అంత డబ్బు పెట్టి యాత్రకు వెళ్ళడం అంత సురక్షితం కాదు అని ఆవిడకు అనిపించింది. పోనీ డబ్బంతా తన వెంట తీసుకుని వెడదామా అంటే వెంట తీసుకుని వెళ్ళడం కూడా మంచిదికాదు. మరి ఏం చేయాలి? ఇలా చాలా సేపు ఆవిడ ఆలోచించింది.\nఅట్లా ఆలోచించగా ఆలోచించగా ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది.\n\nఆ ముసలావిడ ఇంటి ప్రక్కన ఒక వ్యక్తి వున్నాడు. అతనిని అందరూ చాలా నిజాయితీ పరుడనీ, మంచివాడని అంటూ ఉంటారు. కాబట్టి అతని దగ్గర తన డబ్బును దాచి పెట్టుకుంటే డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆవిడకు అనిపించిది.\n\nఈ ఆలోచన రావడంతోటే తన డబ్బు సంచిని తీసుకుని అతని దగ్గరకు వెళ్ళింది. అతను ఆవిడను చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు.\n\"చూడు బాబు! నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి.\" అని అడిగింది ఆ పెద్దావిడ.\n\nఅందుకు అతను \" ఏం చేయాలో చెప్పండమ్మ\" అన్నాడు. అప్పుడు ఆవిడ తను యాత్రలకు వెడుతున్నట్టు చెప్పింది. తన దగ్గర వున్న నగలను అమ్మగా కొంత డబ్బు వచ్చిందని, అందులో కొంత డబ్బును తనతో తీసుకుని వెడుతున్నానని, మిగతా డబ్బును ఇదిగో ఇలా సంచిలో కట్టి మైనంతో అతికించానని చెప్పింది. నేను యాత్రనుంచి తిరిగి వచ్చే వరకూ ఈ డబ్బుసంచిని నీ దగ్గర ఉంచు. ఒక వేళ నేను యాత్ర నుంచి తిరిగి రాకపోతే అప్పుడు ఈ సొమ్మంతా నీదే అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చు.\" అని చెప్పింది ఆవిడ.\n\nఅందుకు అతను సరేనని అంగీకరించాడు. ఆవిడ డబ్బును తను భద్రంగా దాచి పెడతానని కూడా చెప్పాడు. డబ్బు మూటను అతనికి అప్పగించి ఆ ముసలావిడ నిశ్చింతగా యాత్రకు వెళ్ళింది.\n\nఈవిధంగా కొన్ని రోజులు గడిచాయి. హజ్ యాత్రకు వెళ్ళిన ఆ పెద్దావిడ మాత్రం తిరిగి రాలేదు. అందరి చేత నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రాకపోయే సరికి ఎంతో సంతోషించాడు. ఇక ఆ డబ్బులు తనవే కదా అని ఆనందపడ్డాడు. అనుకోకుండా అంత డబ్బులు కలిసి వచ్చినందుకు తన అదృష్టానికి పొంగి పోయాడు. ఇక తను స్వేచ్ఛగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటుండగా యాత్రకు వెళ్ళిన ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి వచ్చింది.\n\nఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రావడం తనకు చాలా బాధ కలిగించింది. అయితే పైకి మాత్రం ఆవిడ తిరిగి రావడం తనకు చాలా అనందంగా ఉందనట్టుగా నటించాడు.\nముసలావిడ తను హజ్ యాత్రకు వెడుతూ అతని దగ్గర దాచుకున్న డబ్బు సంచిని ఇవ్వమని అడిగింది.\n\nఅందుకు ఆ నిజాయీతీ పరుడు \"మీరు యాత్రనుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి... నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ సంచి మీకు ఇస్తాను\" అని చెప్పాడు.\nఅందుకు ఆ పెద్దావిడ \"అయ్యా! ఇన్ని రోజులుగా మీకు ఇచ్చిన శ్రమ చాలదా! ఇంకా మీరు ఇంటి వరకు వచ్చి నా సంచిని నాకు అప్పగించాలా?\" అంది.\n\nఅందుకు ఆ నిజాయితీ పరుడు \"అమ్మా! ఇందులో లేను పడిన శ్రమ ఏమున్నది? మీరు ఆ సంచిని నాకు ఇవ్వగానే దానిని అత్యంత భద్రంగా దాచి పెట్టాను. అక్కడినుంచి తీసుకుని రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందుకే అన్నాను... మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఆ సంచిని తీసుకుని వస్తాను\" అని అన్నాడు అతను. ఆ ముసలావిడ అతను చెప్పిన మాటలు నిజమని నమ్మింది. తన ఇంటికి తను వెళ్ళిపోయింది.\n\nఅతను చెప్పినట్టుగానే కాసేపటి తర్వాత ముసలావిడ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ యాత్రలకు వెడుతూ తన దగ్గర దాచుకున్న సంచిని భద్రంగా ఇచ్చాడు.\n\nతను యాత్ర్రలకు వెడుతూ అతని దగ్గర వదిలి వెళ్ళినప్పుడు సంచి ఎలా ఉందో అలాగే ఉండేసరికి ఆ ముసలావిడ ఎంతో ఆనందించింది. అతని నిజాయితీని మరోసారి అభినందించింది.\n\nఅతను వెళ్ళిన తరువాత ఆ ముసలావిడ తన డబ్బు సంచి తెరిచి చూసింది. అంతే ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ ముసలావిడ హజ్ యాత్రకు వెడుతూ తన దగ్గర మిగిలిన బంగారు నాణాలన్నీ ఒక సంచిలో మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించి మరీ అతనికి ఇచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు వున్నాయి. అవి చూసేసరికి ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది.\n\nఆవిడ వెంటనే తను ఎవరి దగ్గరైతే డబ్బు దాచుకుందో అతని దగ్గరకు పరిగెత్తింది. ఆవిడను చూడగానే అతను \"చెప్పండమ్మా! మీరు నా దగ్గర దాచుకున్న సంచి భద్రంగా ఉంది కదా!\" అని అడిగాడు.\n\n\" అవునయ్యా! సంచి మాత్రం చాలా భద్రంగా ఉంది. కాని అందులో ఉండాల్సిన బంగారు నాణాలు లేవు. వాటికి బదులుగా ఇవిగో ఈ రాగి నాణాలు ఉన్నాయి?\" అంది ఆవిడ.\"\n\"అమ్మా! మీరు చెప్తున్నది నిజమేనా?\" అని అడిగాడు.\n\n\" అవునయ్యా నేను నిజమే చెప్తున్నాను... నువ్వు చాలా నిజాయితీ పరుడవని నమ్మి నాడబ్బు నీ దగ్గర దాచి పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు. చూడు బాబు! నేను పెద్దదాన్ని... మీ అమ్మలాంటిదాన్ని దయచేసి నాడబ్బులు నాకు ఇవ్వు ఆ డబ్బుతోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలి.\" అంటూ అతన్ని ప్రాథేయపడింది.\n\nఅందుకు అతను ఇలా సమాథానం చెప్పాడు \"అమ్మా! మిమ్మల్ని నా తల్లిగా భావించి చెప్తున్నాను... అసలు ఆ సంచిలో ఏం ఉందో నాకు తెలీదు... సరే ఒక సంగతి చెప్పండి... నేను ఇచ్చిన సంచి మీదే కదా!\" అని అడిగాడు.\n\" అవును ఆ సంచి నాదే \" అంగీకరించింది ఆ పెద్దావిడ.\n\"సంచికి ఎక్కడైనా చిల్లు ఉందా!?\n\"లేదు\" అని అంగీకరించింది ఆ ముసలావిడ.\n\n\"మరి నన్ను ఎందుకమ్మా అనుమానిస్తున్నారు? మీరు ఆ రోజు హజ్ యాత్రకు వెడుతూ ఏ సంచినైతే నాకు ఇచ్చారో అదే సంచి ఇది అని ఒప్పుకుంటున్నారు కదా! నేను ఆ రోజున సంచిని దాచిపెట్టాను తిరిగి ఈ రోజు మీరు వచ్చి అడిగిన తర్వాత నేను ఆ సంచిని చూస్తున్నాను. ఆ సంచిలో ఏం ఉన్నాయో అందులో మీరేం దాచిపెట్టారో నాకు తెలియదు...\" అన్నాడు.\n\nఅతను అలా చెప్పాక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అతనిని బ్రతిమాలింది ఆవిడ ఎంత బ్రతిమాలినా అతను మాత్రం తను చేసిన తప్పు ఒప్పుకోలేదు ఆవిడ బంగారు నాణాలు ఆవిడకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు. రాజుగారి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుంది.\n\nఅక్బర్ చక్రవర్తి ఆ ముసలావిడ చెప్పినదంతా ఎంతో శ్రద్దగా విన్నాడు. ఆ తరువాత ఆవిడ ఎవరి దగ్గరైతే డబ్బులు దాచి పెట్టుకుందో అతనిని పిలిపించాడు.\nఅతను రాజుగారి దగ్గరకు రాగానే రాజుగారికి నమస్కారం చేసాడు.\nరాజుగారు ముసలావిడను చూపిస్తూ \"ఈవిడ నీ దగ్గర డబ్బులు దాచుకుందట నిజమేనా?\" అని అడిగాడు రాజుగారు.\n\n\"అదంతా నాకు తెలీదు మహారాజా! అసలు జరిగినదేమిటో నేను చెప్తాను... ఈ పెద్దావిడ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చింది నేను హజ్ యాత్రకు వెడుతున్నానని చెప్పి ఈ సంచి నా దగ్గర దాచిపెట్టమని అడిగింది. పెద్దావిడ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. సరేనని ఆ సంచి తీసుకున్నాను. ఆవిడ యాత్రనుంచి తిరిగి రాగానే ఆవిడ నా దగ్గర దాచిపెట్టుకున్న సంచి ఆవిడకు ఇచ్చేశాను. ఇది మహారాజా! జరిగింది. ఆవిడ నాకు దాచిపెట్టమని ఇచ్చిన సంచిని దాచి పెట్టానే కానీ అందులో ఏం ఉందో నేను చూడలేదు. ఆవిడ ఆ సంచిలో డబ్బులు దాచిపెట్టిందో లేక మరేమైనా దాచి పెట్టిందో నాకు తెలియదు. ఆ సంచిలో ఏం ఉన్నాయో నేను ఆ సంచిని తెరిచి చూడలేదు. తీరా ఇప్పుడు వచ్చి ఆ సంచిలో బంగారు నాణాలు దాచి పెట్టాను. నా బంగారు నాణాలు నాకు ఇవ్వు అంటే నేను ఎక్కడినుంచి తీసుకురాను? నేను ఎంతటి నిజాయితీ పరుడ్నో అందరికీ తెలుసు... ఈ పెద్దావిడ కూడా నేను నిజాయితీ పరుడిని అని నమ్మే కదా ఆవిడ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ సంచిని నా దగ్గర దాచుకుని వెళ్ళింది. ఇప్పుడు నా నిజాయితీని శంకిస్తే నేను ఏం చేయగలను మహారాజా\" అన్నాడు ఆ నిజాయితీ పరుడు.\nఅక్బర్ చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు.\n\nముసలావిడ సంచిలో బంగారు నాణాలు పెట్టి అతనికి ఇచ్చాను అని చెప్తోంది. ఆ నిజాయితీ పరుడేమో ముసలావిడ సంచి ఇచ్చిన మాట వాస్థవమే కానీ అందులో, బంగారు నాణాలు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో నాకు తెలీదు అంటాడు.\nఇద్దరూ నిజమే చెప్తున్నారని అనిపించసాగింది.\n\nఅప్పటికి మాత్రం ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోమని చెప్పాడు. ఇలాంటి చిక్కు సమస్యలు పరిష్కరించగల సమర్థత ఒక్క బీర్బల్ కు మాత్రమే ఉందని రాజుగారి నమ్మకం. అందుకే వెంటనే బీర్బల్ ను పిలిపించి సమస్య ఏమిటో అతనికి వివరించి చెప్పాడు రాజుగారు.\n\nఆ ముసలావిడ ఇచ్చిన సంచిని తీసుకుని బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. ముసలావిడ సంచి లాంటి సంచి తీసుకుని ఆ సంచులలో తనకు తోచిన వాటితో నింపాడు. ఆ తర్వాత వాటిని మైనంతో అతికించేశాడు. అలా అతికించాక ప్రతి సంచికి చిన్న రంధ్రం చేసాడు. అక్కడితో ఒక పని పూర్తి అయ్యిందని అనుకున్నాడు.\n\nఢిల్లీ నగరంలో ఉన్న దర్జీలను అందరిని పిలిపించాడు. ఆ చిరుగుల సంచులు ఇచ్చి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాలని చెప్పాడు. దర్జీలందరూ బీర్బల్ చెప్పినట్టుగానే చేశారు. వాళ్ళల్లో ఒక్క దర్జీని మాత్రం ఉండమని చెప్పి మిగతావారినందరినీ పంపించేసాడు. ఆ ఒక్క దర్జీ మాత్రం సంచి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాడు. సంచి చిరుగు ఏమాత్రం కనిపించకుండా కుట్టినందుకు బీర్బల్ అతనిని ఎంతో మెచ్చుకున్నాడు.\n\nఅప్పుడు ముసలావిడ సంచిని ఆ దర్జీకి చూపించాడు. \"నీకు ఎప్పుడైనా ఈ సంచిని చూసిన గుర్తు ఉందా?\" అని అడిగాడు బీర్బల్.\n\nమొదట ఆ దర్జీ తాను ఎప్పుడూ ఆ సంచిని చూడలేదని చెప్పాడు. అప్పుడు బీర్బల్ అతనిని రాజుగారి దగ్గరకు తీసుకుని వెడతానని బెదిరించేసరికి అప్పుడు నిజం చెప్పాడు.\nఆ ముసలావిడ ఎవరి దగ్గరైతే డబ్బు సంచి దాచుకుందో అతను తన దగ్గరకు వచ్చాడని, సంచి చిరుగు కనిపించకుండా కుట్టాలని చెప్పాడని దర్జీ చెప్పాడు.\n\"ఇది జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పగలవా\" అని అడిగాడు బీర్బల్.\n\"షుమారు సంవత్సరంన్నర క్రితం అనుకుంటాను నేను ఈ సంచి చిరుగు కుట్టాను అని చెప్పాడు ఆ దర్జీ.\n\"నువ్వు ఆ సంచిని కుట్టడానికి తీసుకున్నప్పుడు ఆ సంచిలో ఏం ఉన్నాయి?\"\n\"ఆ సంచిలో కొన్ని రాగి నాణాలు మాత్రం ఉన్నాయి\" అని చెప్పాడు ఆ దర్జీ.\n\"సరే రేపు ఈ విషయాన్ని నువ్వు రాజుగారి ఎదుట చెప్పాలి\" అని చెప్పాడు బీర్బల్.\nరాజుగారి దగ్గర చెప్పాలనేసరికి ఆ దర్జీ అతను భయపడిపోయాడు.\n\n\"రాజుగారు నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను... అయితే ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావో అదంతా రేపు రాజుగారి ముందు కూడా చెప్పాలి\" అన్నాడు బీర్బల్.\nసరేనని అంగీకరించాడు ఆ దర్జీ.\n\"చివరగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు... ఈ సంచిని కుట్టినందుకు అతను నీకు ఎంత డబ్బు ఇచ్చాడు?\"\n\"రెండు బంగారు నాణాలు ఇచ్చాడు\" అని చెప్పాడు ఆ దర్జీవాడు.\n\"ఇప్పుడు ఆ రెండు బంగారు నాణాలు నీ దగ్గర ఉన్నాయా లేక ఖర్చుపెట్టావా?\"\n\"వాటిల్లో ఒక దానిని ఖర్చుపెట్టాను మరొకటి మాత్రం నా దగ్గరే ఉంది.\" అని చెప్పాడు ఆ దర్జీవాడు.\nఆ బంగారు నాణాన్ని తీసుకుని రేపు రాజసభకు రావాలని ఆ దర్జీవానికి చెప్పి అతనిని పంపేసాడు.\n\nమరుసటి రోజు ఆ ముసలావిడ, ఆవిడ ఎవరిదగ్గరైతే డబ్బులు దాచుకుందో ఆ నిజాయితీపరుడు, దర్జీ అతను ముగ్గురు కూడా రాజ సభకు హాజరయ్యారు.\nఆ నిజాయితీ పరుడు కోర్టులో దర్జీ వానిని చూసి కొంచెం కంగారు పడ్డాడు.\nబీర్బల్ దర్జీ వాని దగ్గర నుంచి బంగారు నాణాన్ని తీసుకుని ఆ ముసలావిడకు ఇచ్చాడు.\n\n\"ఈ బంగారు నాణం నాదే మహారాజా! నేను వీటిమీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాను\" అంటూ బంగారు నాణం మీద తను పెట్టుకున్న గుర్తును చూపించింది.\n\nబీర్బల్ తన దగ్గర ఉన్న ముసలావిడ సంచిని ఆ దర్జీ వానికి ఇచ్చి \"ఈ సంచినేనా నువ్వు సంవత్సరంన్నర క్రితం కుట్టింది\" అని అడిగాడు బీర్బల్.\nదర్జీ వాడు భయం భయంగా రాజుగారి వంక చూసాడు.\n\"చెప్పు నీకేం భయం లేదు.\" అన్నాడు బీర్బల్.\n\n\"అవును ఈ సంచినే నేను సంవత్సరంన్నర క్రితం చిరుగు కనిపించకుండా కుట్టాను.\" అంటూ సంచికి చిరుగు ఎక్కడ ఉందో తాను ఎక్కడ కుట్టాడో కూడా చూపించాడు ఆ దర్జీవాడు.\n\"ఇప్పుడు చెప్పు ఆ పెద్దావిడ బంగారు నాణాలు నువ్వు దొంగిలించావా! లేదా!? \" రాజుగారు కోపంగా అడిగాడు.\nనిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను సిగ్గుతో తల దించుకున్నాడు.\n\nఆ తర్వాత రాజుగారు అతనిని ఖైదు చేసారు. భటులను పంపి అతని ఇల్లునంతా వెతికించారు. అతని ఇంట్లో ముసలావిడ అతని దగ్గర దాచుకున్న బంగారు నాణాలు దొరికాయి. వాటిని ఆ ముసలావిడకు ఇచ్చి పంపించి ఆ పెద్దావిడను మోసం చేద్దామనుకున్న అతనిని ఖైదు చేయించాడు అక్బర్ చక్రవర్తి.\nఆ విధంగా దొంగ దొరికాడు.\nమరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు లభించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 551,
        "IMAGE": "cat_4",
        "NAME": "దొంగ దొరికాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి అక్బరు చక్రవర్తి అడవికి వేటకు వెళ్ళినప్పుడు కొండజాతికి చెందిన స్త్రీలు ఎవరి సహాయం లేకుండానే కట్టెలు కొట్టడం, రాళ్లు ఎత్తడం వంటి కఠినమైన పనులు చేయడం చూశాడు. ఎంతో ఆశ్చర్యానికి గురైన అక్బరు \"చూశావా బీర్బల్‌! మన అంత:పుర స్త్రీలు ఇలాంటి పనులు ఎప్పుడైనా చెయగలరా? ప్రతి పనికి సేవకులు, పరిచారకులు... ఇలా ఎందరో కావాలి. దీనికి కారణం మన స్త్రీలను మనం ఎక్కువగా గారాబం చేయడమే. అందుకే వాళ్ళలా మరీ నాజూకుగా తయారవుతున్నారు\" అన్నాడు.\n\nఆ తరువాత అక్బరు కోటకు తిరిగి వెళ్లాక కూడా ఈ విషయమే మహారాణితో చర్చిస్తూ ఆమెను ఎగతాళి చేశాడు.\n\nదానితో రాణి మనసు గాయపడింది. అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలియజేయాలనుకుని బీర్బల్‌ని పిలిపించి జరిగినదంతా చెప్పింది. చక్రవర్తి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని బీర్బల్‌కి కూడా అనిపించింది.\n\nబీర్బల్‌ వెంటనే చక్రవర్తి తోటను పరిరక్షించే తోటమాలిని పిలిచి \"ఈ రోజు నుండి మొక్కలకు నీళ్ళు పోయడం మానెయ్యి. పాదుషాగారు ఏమైనా అంటే నా పేరు చెప్పు\" అని చెప్పాడు.\nబీర్బల్‌ ఊహించినట్టుగానే వారం రోజుల తరువాత అక్బరు నుండి పిలుపు వచ్చింది.\n\"ఏమిటి బీర్బల్‌ నువ్వు చేసిన పని. మొక్కలకు నీళ్ళు పెట్టొదని తోటమాలికి చెప్పావా? నీకేమైనా పిచ్చి పట్టిందా?\" అని చాలా కోపంగా అడిగాడు అక్బరు.\n\n\"ప్రభూ, రాజుగారి తోటకు చెందిన మొక్కలకు అనవసరంగా గారాబం చేయడం జరుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. అడవిమొక్కలను ఎవరు సమ్రక్షిస్తారు? ఎవరు నీళ్ళు పెడతారు? వాటంతట అవే పెరగవా? రేగుపండ్లు, నేరేడుపండ్లు ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోయినా ఎంతో మధురంగా ఉండవా? మరి అలాంటప్పుడు ఈ మొక్కలు నీళ్ళు పోయకుంటే బతకలేవా?\" అని నెమ్మదిగా చెప్పాడు.\n\nఅక్బరు ముఖం కోపంతో ఎర్రబడింది. \"నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎంతో నాజూకుగా పెంచుకుంటున్న మొక్కలను అడవి మొక్కలతో పోలుస్తావా?\" కాస్త గట్టిగానే అరిచాడు అక్బరు.\n\n\"క్షమించండి ప్రభూ! నేను మతి ఉండే మాట్లాడుతున్నాను. మీరు కొండజాతి స్త్రీలతో అంత:పుర రాణులను పోల్చినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది\" చేతులు జోడించి చెప్పాడు బీర్బల్‌.\nదానితో అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలిసి వచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 552,
        "IMAGE": "cat_4",
        "NAME": "అడవి మొక్కలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకసారి అక్బర్ చక్రవర్తి.. తన మందీ మార్బలంతోపాటు బీర్బల్‌ను కూడా వెంటబెట్టుకుని వినోదం కోసం అడవికి వెళ్లాడు. అయితే తన గుర్రం తాను కోరుకున్నంత వేగంగా పరిగెత్తక పోవటంతో అక్బర్‌కు చాలా కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకుని దాన్ని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.\n\nఅది చూసిన బీర్బల్ వెంటనే \"మహారాజా.. దయచేసి దాన్ని కొట్టకండి\" అంటూ అడ్డుపడ్డాడు. \"నా తిండి తింటుంది కాబట్టి అది చచ్చినట్లు కా కోసం పని చెయ్యాల్సిందే. అదలా చేయకపోతే దాన్ని కొట్టే హక్కు నాకుంద\"ని బదులిచ్చాడు అక్బర్. అయినప్పటికీ.. \"దయచేసి తమరు ఆ గుర్రంమీద జాలి చూపించండ\"ని పదే పదే వేడుకున్నాడు బీర్బల్.\n\n\"అది సరేగానీ.. నేను నువ్వు చెప్పినట్లుగానే వింటాను. కానీ నా తిండి తిన్న వాళ్లెవరైనా సరే నా పని చేయాల్సిందే\" అన్నాడు మొండిగా అక్బర్. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తరువాత వారికి జింక ఒకటి కనిపించింది. దాన్ని వేటాడి చంపేసి కోటకు తీసుకెళ్దామని అన్నాడు అక్బర్.\n\nఅలా ఆ జింకను వేటాడుతూ అక్బర్, బీర్బల్‌లు ఇద్దరూ మిగతా మందీ మార్బలం నుంచి వేరుగా అయిపోయారు. కాసేపటి తరువాత అక్బర్‌కు బాగా ఆకలి వేసింది. మన ఆహార పదార్థాలన్నీ మన వాళ్లవద్దనే ఉండిపోయాయి. ఇప్పుడెలా మహాప్రభూ..? అని అన్నాడు బీర్బల్. అయితే ప్రస్తుతం మనవద్ద గుర్రం తినే దాణా తప్ప మరింకేమీ తినేందుకు లేవని చెప్పాడు బీర్బల్.\n\n\"ఏమీ లేని దానికన్నా గుర్రం దాణా అయినా నయమే కదా..? అదే ఇవ్వు\" అన్నాడు అక్బర్. దాంతో ఇద్దరూ గుర్రం మెడకు వేళాడుతున్న సంచిలోని గుగ్గిళ్లు తీసుకుని గుప్పిళ్లకొద్దీ తిన్నారు. ఆకలి తీరిన తరువాత అక్బర్.. \"ఇక మనవాళ్ల కోసం వెతుకుదాం పదా..?!\" అంటూ గుర్రం ఎక్కబోయాడు.\n\nఅయితే అసలే ఆకలిగా ఉన్న ఆ గుర్రం అక్బర్‌ను వెనుక కాళ్లతో తన్నింది. కోపంతో ఊగిపోయిన అక్బర్ కొరడాతో దాన్ని బాదేందుకు సిద్ధపడగా బీర్బల్ అడ్డుకున్నాడు. \"ఎంత పొగరు, దాన్ని చంపేస్తానంటూ\" గుర్రం మీదికి ఉరికాడు అక్బర్. \"అయ్యా మీరు అలా చేయలేరు\" అన్నాడు బీర్బల్\n\n\"ఏం ఎందుకు చేయలేను? నన్ను ఆపవద్ద\"ని చెప్పి గుర్రం మీది మీదికి వెళ్లాడు అక్బర్. \"అలా చేయటం సరికాదు ప్రభూ..! ఎందుకంటే మీరు ఇప్పుడే దాని తిండి తినేశారు. మీరే దాని పని చేయాలి\" అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలకు అక్బర్‌కు కోపం స్థానంలో నవ్వు పలుకరించింది.\n\n\"ఏంటి బీర్బల్..? గుర్రంపని నేను చేయటమా..? ఏం చెయ్యాలేంటి..?\" నవ్వుతూనే అడిగాడు. మరేం లేదు మహారాజా..! మీరు దాని తిండి తినేశారు కాబట్టి దాని పని చేయాలి. దాని అది పని చేయాలంటే.. దాన్ని మీమీద ఎక్కి స్వారీ చేయనివ్వండి అన్నాడు. దాంతో బీర్బల్ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అక్బర్.. తన పొరపాటును గ్రహించాడు. ఆ తరువాత బీర్బల్‌ను వెంటబెట్టుకుని ఆ అడవిలో కనిపించకుండా పోయిన తమవాళ్లకోసం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 553,
        "IMAGE": "cat_4",
        "NAME": "నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.\n\nతెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.\n\nనక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.\nఆవగింజల్ని లెక్కపెట్టారట..!\n\nఅప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.\n\nమహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.\n\nఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.\n\nబీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 554,
        "IMAGE": "cat_4",
        "NAME": "చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "బీర్బల్ తెలివితేటలు, చతురత గురించి ప్రపంచదేశాలన్నింటికి కూడా పాకిపోయింది. అనేక దేశాల సభలలో బీర్బల్ అంటే తెలియనివారే లేకపోయేవారు. అలా బీర్బల్ గురించి విన్న అక్బర్ చక్రవర్తి మిత్రుడైన పర్షియా మహారాజు.. తమ దేశానికి ఓసారి రావాల్సిందిగా బీర్బల్‌ను ఆహ్వానించాడు.\n\nచక్రవర్తి ఆహ్వానం మేరకు పర్షియా రాజ్యానికి విచ్చేసిన బీర్బల్... అంతకుమునుపెన్నడూ పర్షియా చక్రవర్తిని చూడలేదు. దీంతో చక్రవర్తిని గుర్తుపెట్టడం ఎలాగబ్బా... అనుకుంటూనే, సభలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకు ఒకే రకమైన దుస్తులు ధరించిన ఏడుగురు వ్యక్తులు ఒకే రకమైన ఏడు సింహాసనాలపై కూర్చుని ఉండటం కనిపించింది. వారి కిరీటాలు కూడా ఒకేలా ఉండటం బీర్బల్ గమనించాడు.\n\nఈ ఏడుగురిలోనే పర్షియా చక్రవర్తి ఉన్నాడు. బీర్బల్ తెలివి తేటలను పరీక్షించేందుకు పర్షియా చక్రవర్తి ఇలాంటి ఏర్పాట్లను చేశాడు. దీన్ని గమనించిన బీర్బల్... సభలో ఎక్కడా ఆగకుండా నేరుగా పర్షియా చక్రవర్తి వద్దకు వెళ్ళి వందనం చేశాడు.\n\nదీనికి ఆశ్చర్యపోయిన పర్షియా చక్రవర్తి... \"బీర్బల్... నీ తెలివితేటల గురించి చాలా విన్నానుగానీ, ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అసలు నేను చక్రవర్తినని ఎలా తెలుసుకున్నావో, కాస్త చెప్పగలవా..?\" అని అన్నాడు. దీనికి బీర్బల్ నవ్వుతూ... \"చక్రవర్తీ... నేను మీ ముఖంలోని విశ్వాసంతో కూడిన హావభావాల ద్వారా మిమ్మల్ని గుర్తు పట్టాను. నేను దర్బారులోకి ప్రవేశించగానే, మీరు నన్ను చూశారు. కానీ మీలా తయారైన మిగతావారు మాత్రం మిమ్మల్నిచూశార\"ని చెప్పాడు.\n\nబీర్బల్ జవాబుకు సంతృప్తి చెందిన పర్షియా చక్రవర్తి ఆయన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. కొద్దిసేపు మాటామంతీ అనంతరం బీర్బల్‌కు పర్షియా ప్యాలెస్‌ను చూపించాల్సిందిగా తన మంత్రులను ఆదేశించాడు చక్రవర్తి. పర్షియా ప్యాలెస్‌నంతా చూపించిన మంత్రి... చివరికి మూత్రశాలను కూడా చూపించాడు.\n\nమూత్రశాలలో గోడకు వేలాడదీసిన అక్బర్ చిత్రపటాన్ని కూడా చూయించాడు. అలా చేసి బీర్బల్ సహనాన్ని పరీక్షించాలని చక్రవర్తి ముందే ప్లాన్ వేశాడు. అది గ్రహించిన బీర్బల్ నవ్వుతూ... \"అక్బర్ లాంటి మహనీయ వ్యక్తి చిత్రపటాన్ని చూస్తేగానీ మీ రాజుగారికి ఇక్కడ చేసే పనులు సజావుగా సాగవేమో...?\" అని చురక అంటించగా... మంత్రి మాత్రం మారుమాట్లాడకుండా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు.\n\nప్యాలెస్ చూసిన అనంతరం మంత్రి, బీర్బల్ ఇద్దరూ చక్రవర్తి సభకు చేరుకున్నారు. మూత్రశాలలో జరిగిన సంఘటనను మంత్రి చక్రవర్తికి వివరించగా.. చక్రవర్తి కోపగించుకోకుండా, బీర్బల్ తెలివికి నిశ్చేష్టుడై.. \"బీర్బల్... నేను నీలాంటి తెలివైనవాడే కాకుండా, సహనశీలియైన వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను\" అని అన్నాడు. అంతేగాకుండా... విలువైన కానుకలను ఇచ్చి, తన ప్యాలెస్‌లో గౌరవ అతిథిలా మరికొన్ని రోజులు ఉండాల్సిందిగా బీర్బల్‌ను కోరాడు పర్షియా చక్రవర్తి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 555,
        "IMAGE": "cat_4",
        "NAME": "పర్షియా మహారాజు... బీర్బల్...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్.\n\nఅక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు.\n\nప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి.\n\nఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు.\n\nతినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి.\n\nఇంతలో అక్బర్ చక్రవర్తి.. \"చూశావా బీర్బల్... రాణీగారు ఎంత తిండిపోతో.. ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో..?\" అని అన్నాడు. ఆ మాట విన్నవెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు.\n\nఅయితే బీర్బల్ ఊరికే ఉంటాడా... వెంటనే \"మహారాజా.. రాణీగారికంటే తమరే ఎక్కువ తిండిపోతులాగా ఉన్నారు. రాణీగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదలిపెట్టారు. తమరు పండ్లుతోపాటు గింజల్ని కూడా మింగేశార\"ని అన్నాడు. పాపం.. రాజుగారు.. సిగ్గుపడక తప్పలేదు. రాణీగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 556,
        "IMAGE": "cat_4",
        "NAME": "డామిట్.. కథ అడ్డం తిరిగింది..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు.\n\n`నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్.\n\nపరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... \"వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!\" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి \"మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది..\" అని అన్నాడు.\n\nఅక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ... \"చూశావా... మనకన్నా ఆ చదువురాని వాడే నయం.. గాడిద తోకను చూసే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు..\" అన్నాడు.\n\nతరువాత ఇద్దరూ కాసేపు అలా ముందుకు సాగిపోగానే... కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్, జమాలుద్దీన్‌లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకుపడుతూ... \"ఇలా జరిగిందేం జమాలూ... ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు..\" అన్నాడు.\n\nఅప్పుడు జమాలుద్దీన్ \"ప్రభూ... వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పు ఏముంది\" అన్నాడు.\n\n\"సరే... ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా, లేక ఇలాగే రాత్రిదాకా కొనసాగుతుందా..?\" మళ్లీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. \"కాసేపాగండి ప్రభూ...! ఇప్పుడే వస్తాను\" అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. \"ఎక్కడికి వెళ్తున్నావ్.. జమాలూ..!\" వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభూ...! \"ఇందాకటి గాడిదనే అడిగేసి వస్తా..! ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే, అదే తెలివైనది కదా..!\" అన్నాడు.\n\nఅప్పటిగానీ విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి... \"వాన రాకడ, పోకడ మనకు ఎలా తెలుస్తుంది. అంతా ప్రకృతి మాత చలవే కదా..!\" అని అనుకున్నాడు. \"ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా..!\" అంటూ తన సేవకుడు సుతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 557,
        "IMAGE": "cat_4",
        "NAME": "అందరిలోకి అదే తెలివైంది కదా..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.\n\nయమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.\nమరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.\nసభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.\nబీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.\nఅక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.\nరాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.\nవిషయమర్ధమయ్యింది.\n\n“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.\nసభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 558,
        "IMAGE": "cat_4",
        "NAME": "దారేది?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు.\n“మహారాజా, నేను మా కుమార్తెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. పెళ్ళికి ఊరి జనాలందిరిని పిలిచి, భోజనం పెట్టి, మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి, ఘనంగా సాగనంపాలన్నది నా కొరిక. దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి. సంపాదించే మార్గం చెప్పండి”, అన్నాడు.\nఅక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు. “నిన్ను చూస్తే చాలా బీద వాడిలా ఉన్నావు, నీ తాహతకు తగ్గట్టు పెళ్ళి చేయవచ్చు కదా, ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం యేముంది?”, అని అడిగాడు.\n“నాకున్నది ఒకటే బిడ్డ, ఇది నా జీవిత ఆశయం, సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా”, అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు.\nఅక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతుకి మించి పెళ్ళి చేయడం నచ్చలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోట మధ్యలో ఒక చెరువు వుంది. “రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను”, అని షరతు పెట్టాడు.\nఇప్పడిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలపడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు. “మహారాజా! ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్ళల్లో నిలుచుంటే ప్రాణాలు పోకొట్టుకుంటాడేమో” అని అన్నాడు\nదానికి బ్రాహ్మడు, “పరవాలేదు స్వామి, నేను నుంచుంటాను, నాకు వెయ్యి వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు యేమీ లేవు” అని బదులు చెప్పాడు.\nరాత్రి అక్బర్ భటుల పర్యవేక్శణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా మునిగి నుంచున్నాడు.\nతెల్లవారగానే అక్బర్, బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గిరకి వచ్చారు. భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు.\nబీర్బల్కి చాలా అశ్చర్యం చెందింది. “వృద్ధ బ్రాహ్మడా, ఇంత చలిలో రాత్రంతా యెలా నీటిలో నిలబడ్డావు?” అని అడిగాడు.\n“రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలపడ్డాను స్వామి” అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు.\nఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది. “అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు. మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నావు. మన షరతును నేను రద్దు చెస్తున్నాను!” అన్నాడు.\nఆశాభంగమయిన బ్రాహ్మడు యేమి చేయాలో తెలియక, అక్బర్ మహారాజుతో వాదించలేక, నిరాశతో వెళ్ళిపోయాడు.\nబీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది. అక్బర్కు తెలిశేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.\nమరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. “మహారాజా నేను ఖిచడి చాలా బాగా చేస్తాను, మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను” అని ఆహ్వానించాడు.\nఅక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. “తప్పకుండా వస్తాను” అని మాటిచ్చాడు.\nసాయంత్రం అక్బర్ తన మంత్రులతో, భటులతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. బీర్బల్ చాల మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్ళి, అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి, అతని ముందర పళ్ళెం మంచినినీళ్ళు సర్ది, “పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుదే ఖిచడి తీసుకుని వస్తాను”, అంటూ మాయం అయిపోయాడు.\nఅక్బర్ కొంత సేపు ఒపిక పట్టాడు. కాని యెంత సేపయినా బీర్బల్ మళ్ళి రాలేదు. కొంచం సేపటికి బీర్బల్ యేమి చేస్తున్నాడు, అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు.\nఅక్కడ బీర్బల్ ఒక చెట్టుకింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు, కాని నిప్పు మీద వంట పాత్ర యేది లేదు.\n“బీర్బల్! యేమి చేస్తున్నావు! ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద!” అని అక్బర్ కోపంగా అడిగాడు.\n“మహారాజా! కోపగించుకోకండి! నేను వంట చేస్తున్నాను!” అన్నాడు బీర్బల్.\n” ఎక్కడ చేస్తున్నావు? వంట పాత్రలు యేవి?” అన్నారు అక్బర్.\n“అదుగో మహరాజ”, అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు. చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేళాడతీసి వుంది.\nఅక్బర్కు అరికాలి మంట నెత్తికి యెక్కింది. అసలే ఆకలి, ఆ పయిన ఇది.\n“ఇంత దూరంగా కడితే దానికి మంట యెలా చేరుతుంది, ఖిచడి యెలా ఉడుకుతుంది?” అని క్రోధంగా అరిచాడు.\n“అదేమిటి మహారాజా, అలా అంటారు? నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా యెక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా, ఈ కుండకు కూడ అలాగే తగులుతుంది,” అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్.\nవెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరల్ను ప్రశంసించాడు.\nతెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.\nబీర్బల్ అక్బర్ని, ఆయిన మంత్రులని, భటులనీ లోపలకి తీసుకుని వెళ్ళి ఖిచడితో పాటు పంచభక్ష్య పరవాన్నాలు వడ్డించి సత్కరించాడు.\nమొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మడిని కోటకు పిలిచి, క్షమాపణ అడిగి, వెయ్యి బదులు రెందు వేల వరహాలు, పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలపెట్టుకున్నాడు.\nబ్రాహ్మడు తన కొరికమేర కు కూ\nతురి పెళ్ళి ఘనంగా చేసి ఆ అమ్మయిని సంతోశంగా అత్తారింటికి పంపించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 559,
        "IMAGE": "cat_4",
        "NAME": "బీర్బల్ ఖిచడి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అక్బర్‌కు అనేకమంది మంత్రులు ఉన్నారు. వారిలో ముల్లా దో పైజా అనే మంత్రి ఒకడు. ఒకరోజు అందరి ముందు బీర్బల్‌ను అవమానించాలని నిర్ణయించు కున్నాడు. ఆ రోజు వారిమధ్య సంభాషణ ఇలా జరిగింది.\n\n'బీర్బల్‌ మీరు మంత్రిగాకముందు ఏం చేసేవారు? వ్యవసాయం, మా తండ్రి కూడా రైతే ! అయితే ఆయనెలా మరణించాడు? చలికాలంలో పొలం వెళ్లి అక్కడే మరణించారు. మరి మీ తాత? ఆయనా పొలంలోనే మరణించారు. నీరుందా లేదా అని చూస్తూ కాలుజారి బావిలో పడ్డారు. అందుకేనయ్యా నే చెబుతా వ్యవసాయం చాలా చెడ్డది.\n\nఅయితే ముల్లాజీ మీ కుటుంబ సాంప్రదాయ వృత్తేమిటి? మాది తరతరాలుగా సైనికుల కుటుంబం. అలాగా! అయితే మీ తండ్రి ఎలా మరణించారు? ఆయనో సైనికుడు. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. మరి మీతాత? ఆయనా యుద్ధంలోనే మరణించారు. అందుకే నేను చెబుతున్నా సైనిక జీవితం మీ కుటుంబానికి చెడ్డది. కనుక వేరే వృత్తి చూసుకోవటం మంచిది అన్నాడు బీర్బల్‌.\n\nఅప్పుడు ఏ వృత్తీ చెడ్డది కాదని ముల్లాకు అర్ధమైంది.. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 560,
        "IMAGE": "cat_4",
        "NAME": "ఏ వృత్తీ చెడ్డది కాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 4
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: \"రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!\"ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు.\n\nఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది.\n\nఅయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరిపనులు వాళ్ళు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు! గురుశిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది.చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు గనక, వెళ్ళి ఏమైనా భోజన సామగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారిద్దరూ. చూస్తే ఆశ్చర్యం- అన్ని సామాన్లదీ ఒకే రేటు! ఒక్కోటీ ఒక్కో 'దుడ్డు'- అంతే. సోలెడు బియ్యమూ అంతే, డజను అరటి పళ్లూ అంతే. శిష్యుడు భోజన ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దుడ్లు కూడా ఖర్చవ్వలేదు మరి!\n\n\"ఇది పిచ్చివాళ్ల రాజ్యం నాయనా. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా. పోదాం పద, ఇక్కడ ఉండకూడదు\" అన్నారు గురువుగారు శిష్యుడితో, మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. \"ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం,ఇది! ఇక్కడే ఉండిపోదాం మనం\" అన్నాడు వాడు. \"ఇది ఎక్కువకాలం నడవదు నాయనా. అదీగాక వీళ్ళు నిన్ను -ఎప్పుడు- ఏం-చేస్తారో ఎవ్వరికీ‌-తెలీదు- నా మాట విని, నాతో వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం\" అని నచ్చ చెప్ప చూశారు గురువుగారు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచిమాటలు తెలవెలబోయాయి. \"ఏమైనా సరే! తను ఈ స్వర్గాన్ని వదిలి రాను\" అన్నాడు శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, \"నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను\" అని చెప్పి వెళ్ళారు.\nశిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజూ అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమరొట్టెలు- ఇట్లా ఏవిపడితే అవి మెక్కి, అచ్చోసిన ఆంబోతు మాదిరి- గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 561,
        "IMAGE": "cat_5",
        "NAME": "తలతిక్క రాజు కథ-1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 5
    },
    {
        "DESCRIPTION": "ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు. మామూలుగా కాదు; వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి, ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టుకొని, ఇక బయటపడదామనుకునేలోపల, వాడు కన్నం వేసిన గోడ నిలువునా కూలింది! వాడు తను త్రవ్విన గోడ క్రింద తానే పడి చచ్చిపోయాడు.\n\nఅయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు-\"ప్రభూ! మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతనిమీద కూలి అతని ప్రాణాల్ని నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతను గోడను బలంగా, దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు ధర్మమూర్తులు- దోషిని కఠినంగా శిక్షించి, మా అన్న కుటుంబానికి న్యాయం చెయ్యాలి\" అని.రాజుగారు వాడికి \"న్యాయమే గెలుస్తుంది\" అని భరోసా ఇచ్చి, వ్యాపారిని పిలువనంపాడు.\n\nవ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలైంది: \"నీ పేరు?\" \"వరహాల శెట్టి, ప్రభూ!\" \"చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?\" \"మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా! వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది వాడి మీదనే కూలింది.\" \"దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది. దీనికి పూర్తి బాధ్యత దోషిదే. మేం నీకు తగిన దండన విధిస్తాం, వరహాల శెట్టీ!\" \"కానీ మహారాజా..\" అన్నాడు వరహాల శెట్టి, \"కథ ఇలా అడ్డం తిరిగిందేమి?\" అని ఆశ్చర్యపోతూ. \"కానీ-గీనీ ఏమీ లేదు. నేరం చేసినవాడికి శిక్ష పడవలసిందే\" అన్నాడు రాజు, గంభీరంగా.\n\nతన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరహాల శెట్టి మెదడు చురుకుగా పని చేసింది. \"ఒక్క క్షణం ఆగండి మహారాజా! నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు. గోడను కట్టిన మేస్త్రీదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది; అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి, మహా ప్రభూ!\" అన్నాడు శెట్టి.\"గోడను కట్టిన మేస్త్రీ ఎవరు?\" అడిగారు రాజుగారు. \"ప్రభూ!‌ ఆ యింటిని మా నాన్నగారి హయాములో కట్టారు. అప్పుడు మా యింటి గోడ కట్టిన మేస్త్రీ ఇప్పుడు ముసలివాడయ్యాడు. నాకు బాగా తెలుసు అతను. ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు\" అన్నాడు వరహాల శెట్టి, ఊపిరి పీల్చుకుంటూ.\n\nమేస్త్రీని పిలుచుకురమ్మని సేవకులను పంపారు రాజుగారు, వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ. కొద్ది సేపటికి మేస్త్రీ వచ్చి నిలబడ్డాడు.\"ఏమయ్యా, వరహాల శెట్టి తండ్రి బ్రతికున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు- నిజమేనా?\" \"అవును ప్రభూ!\"\"ఇట్లాంటి గోడనా, కట్టేది? అది ఒక పేద దొంగ మీద కూలి, వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది గనక, మేం నీకు మరణ దండన విధించాలి ఇప్పుడు!\"రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రీ తెలివి మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు-\"ప్రభూ! నన్ను శిక్షించేముందు నా మొరను ఒకసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం. అది బాగా కట్టలేదన్నదీ వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసు మనసులో‌లేదు. నాకు ఇంకా గుర్తున్నది- నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి, తన కాలి అందెల్ని, చేతి గాజుల్నీ గలగలలాడించుకుంటూ అటూ-ఇటూ తిరుగుతూనే ఉన్నది, రోజంతా. దాంతో‌నా మనసు వశం తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు, నాకు\" అన్నాడు మేస్త్రీ.\n\n\"ఊఁ, నాకు తెలుసు.. కథ లోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలు లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకు రండి- ఆమె ఎక్కడున్నా సరే\" అన్నారు రాజుగారు.ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది- ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది. \"పాపం, ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు, నువ్వు గాజులు, అందెలు గలగలలాడించుకుంటూ వీధిలో అటూ-ఇటూ తిరిగావా- నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒకరోజున?\" అడిగారు రాజుగారు.\"నిజమే మహారాజా, తిరిగాను\" ఒప్పుకున్నదామె.\"అయితే నువ్వే దోషివన్నమాట. గాజులు, అందెలు గలగలలాడిం, నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బ తీసావు. దాంతో వాడు కట్టే గోడ పాడైంది. అది ఒక పేదవాడి మీద కూలి, వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలైంది- నీకు శిక్ష తప్పదు.\"\n\nఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది- \"మహారాజా! ఆగండి. నేను ఆరోజున అట్లా రోడ్డు మీద అటూ ఇటూ ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ కంసాలి చేసిన పని! నేనూ అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను. అతను వాటిని 'ఇప్పుడిస్తాను-ఇప్పుడిస్తాను' అంటూ ఆ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజనుసార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను. అది నా తప్పు కాదు ప్రభూ! అదంతా ఆ నీచుడు, కంసాలి చేసిన తప్పు!\" అని. \"పాపం, నిజంగానే ఈమెది ఏ తప్పూలేదు\" అనుకున్నాడు రాజుగారు, అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ. \"అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు- పోండి! పోయి ఆ కంసాలిని ఇటు ఈడ్చుకొని రండి!\" అని సైనికులను ఆజ్ఞాపించాడు.సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే,అతను కూడా తన కథ వినిపించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 562,
        "IMAGE": "cat_5",
        "NAME": "తలతిక్క రాజు కథ-2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 5
    },
    {
        "DESCRIPTION": "\"ప్రభూ! నేనొక పేద కంసాలిని. ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు తిప్పించుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక కారణం ఉంది- నామీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక వర్తకుడి ఇంట్లో పెండ్లి ఉండింది, ఆ సమయంలో. ఆయన తన నగల్నే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు గదా! ఆయన వల్లనే, నేను ఈమెకు నగల్ని అందివ్వటంలో జాప్యం అయ్యింది.\n\n\"\"ఎవడా ధనిక వర్తకుడు?! ధనబలంతో, తన నగల్ని ముందు చేయించుకొని, ఈ పేద నర్తకిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడెవ్వడు? వాడి మూలంగానే మేస్త్రీ మనసు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు. అతని వల్లనే ఆ గోడ విరిగి, ఒక మామూలు దొంగమీదికి విరిగి పడి, వాడి ప్రాణం తీసింది. దీనికంతకూ కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవ్వడు?\" అని అడిగాడు రాజుగారు, ఆవేశంగా.\n\n\"ఆ పని చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభూ!\" అన్నాడు కంసాలి చల్లగా. \"ఓహో! న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట! పిలిపించండి, వాడిని!\" ఆజ్ఞాపించారు రాజుగారు. \"మానాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము ప్రభూ! అయన చనిపోయి చాలా కాలమే అయ్యింది\" అన్నాడు వరహాల శెట్టి. \"అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు\" అన్నారు రాజుగారు, మంత్రిని సంప్రతించి.\"నీ తండ్రి హంతకుడు అని రుజువైంది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అతను చనిపోయాడంటున్నావు. నిజమే కావచ్చు. అయినా, అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగ?హంతకుడైన నీ తండ్రినుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సంక్రమించాయి- వాటితోబాటు అతని నేరాలు కూడానూ! నువ్వు ఆ నేరాలనుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను- ఈ ఘోరనేరం వెనక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయిఉంటావని. నా ఊహ నిజమైంది- నీకిక జీవించే అర్హత లేదు. మేం నీకు మరణ దండన విధిస్తున్నాం!!\"\n\nవర్తకుడిని వధించటం కోసం కొత్త వధ్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు. ఒకవైపున కటికవాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధంచేసి, శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుకుంటుండగా, మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది- \"ఈ శిల పెద్దది. దీని నిడివి ఎక్కువ. చూడగా వ్యాపారి మెడ సన్నం! ఇంత సన్నగా ఉండే మెడ, వధ్యశిలలో సరిగ్గా ఇమడదు గదా, మరెట్లా?\" అని. మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు.\n\n\"తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు?\" అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది. \"మరేం చేద్దాం?\" అని అయన మంత్రినే అడిగారు, మంత్రిగారి ముందుచూపును ప్రశంసిస్తూ. అయితే అదే సమయంలో‌ఆయనకు ఒక ఉపాయం తోచింది- \"ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయవలసిందే. వీడి బదులు, లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది!\"అని.\n\nమంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకటం మొదలుపెట్టారు- వధ్యశిలలో పట్టేంత పెద్ద మెడ ఉన్న, లావుపాటి మనుషులకోసం. అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యుడిమీద పడింది- అతను నెలల తరబడి అరటిపళ్లు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తినీ తినీ‌ బాగా క్రొవ్వు పట్టి ఉన్నాడు మరి! సైనికులు తన మీదికి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు.\n\nనేనేం తప్పు చేశాను? నేను నిరపరాధిని. సన్యాసిని!\" అని మొత్తుకున్నాడతను.\"కావచ్చు- కానీ, వధ్య శిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకు రమ్మని రాజాజ్ఞ\" అని, సైనికులు శిష్యుడిని శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు! అప్పటికి గానీ తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి. \" 'ఇది పిచ్చోళ్ళ రాజ్యం. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం' అని తనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారే, అయినా తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో‌చూడు!\" అని అతనికి ఏడుపు వచ్చింది.\"ఇక వేరే దారేదీ లేదు, దేవుడా! ఈ ఒక్కసారీ‌ అవకాశం ఇవ్వు. మరెప్పుడూ గురువుగారి మాటను జవదాటను\" అని అతను మౌనంగా ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు.\n\nదేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికే చేర్చాడు- అద్భుత శక్తులున్న ఆయన, తక్షణం శిష్యుడిముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చీవాట్లు పెట్టి, ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు. ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి, ధైర్యంగా అడిగాడు- \" రాజా! గురువు ఎక్కువా? శిష్యుడు ఎక్కువా?\" అని.\n\n\"గురువే ఎక్కువ. సందేహం లేదు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు?\" అన్నారు రాజుగారు.\"అయితే నా శిష్యుడికంటే ముందు నాకు శిరచ్ఛేదం చెయ్యండి. నా తర్వాతగానీ వాడి తల తీసేందుకు వీలు లేదు\" అన్నాడు గురువు.సంగతి అర్థమై శిష్యుడు అక్కడినుండే అరవటం మొదలుపెట్టాడు- \"నేను ముందు! మీరు ముందు నన్ను కదా, ఇక్కడికి తెచ్చింది? నా మెడే కదా, వధ్యశిలలో పట్టేది? అందుకని ముందు నన్నే వధించాలి. ఆయన్ని కాదు. ఆయనకు చెప్పండి, ఇక్కడినుండి వెళ్ళిపొమ్మనండి ముందు!\" అని. రాజుగారు, మంత్రిగారు నోళ్లప్పగించి చూస్తుండగానే గురు-శిష్యులమధ్య పోట్లాట మొదలైంది. \"నేను ముందు!‌ నేను ముందు!\" అని. రాజుగారికి, మంత్రిగారికీ వాళ్ల ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 563,
        "IMAGE": "cat_5",
        "NAME": "తలతిక్క రాజు కథ-3",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 5
    },
    {
        "DESCRIPTION": "రాజుగారు గురువుని అడిగారు- \"మీరెందుకు, చనిపోవాలని తొందరపడుతున్నారు? వధ్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నది గనక మేం అతనిని ఎంపిక చేసుకున్నాం\" అని. \"మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలూ అడక్కండి. ముందుగా నన్ను వధించాలి- అంతే\" అన్నాడు గురువు, మొండిగా. \"ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది. మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసినదానిని మాబోటి వాళ్ళకు వివరించటం మీ బాధ్యత. చెప్పండి\" అన్నారు రాజుగారు. \"నేను చెబితే మీరు నన్నే వధించాలి ముందు- మాట ఇస్తారా?\" అడిగాడు గురువు.రాజుగారు సరేనన్న మీదట, ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి, సేవకులెవ్వరికీ వినబడకుండా, గుసగుసగా చెప్పాడు.\n\n\"మేమిద్దరమూ ఇప్పుడే, ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా, మీకు? మేమిద్దరమూ అనేక దేశాలు తిరిగాం. ఈ భూమిమీద నిజానికి మేం చూడని ప్రదేశమే లేదు- కానీ ఇంతవరకూ మాకు మీ రాజ్యంలాంటి రాజ్యంగాని, మీలాంటి రాజుగారు గానీ ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందున్న వధ్యశిల మామూలుది కాదు- సాక్షాత్తూ ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది! దానిమీద ఇంతవరకూ‌ఎలాంటి నేరమూ మోపబడి లేదు! అలాంటి ఈ శిల మీద మొదట మరణించే వాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ‌రాజ్యానికి రాజుగా పునర్జన్మనొందుతాడు. దీనిమీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది. కొంతకాలంపాటు రాజుగాను, మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాటను నిలబెట్టుకోండి మహారాజా! మమ్మల్ని వధించండి! నేనుముందు! గుర్తుంచుకోండి!\"\n\nరాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు. 'నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా?' అని ఆయనకు చింత పట్టుకున్నది. \"ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు\" అని, ఆయన వెంటనే శిష్యుడి శిక్షను వాయిదా వేసేశాడు. ఆపైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు-\"వచ్చే జన్మలోకూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ల బదులు మనమే వధ్యశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు, -వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది?\" అని. మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. \"శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు వాళ్ళకు చేతులు రావు. అందుకని, మనం ఈ‌ గురుశిష్యుల్నిద్దరినీ వదిలేసి, వాళ్ల మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటారు, ప్రభువులు?\" అన్నాడు మంత్రి.\n\nఇద్దరూ కూడ బలుక్కొని, తలారులను పిలిచి, \"రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి. ముందుగా వచ్చిన వాడిని ముందు, తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి- తప్పు చేస్తే, జాగ్రత్త. మాకోసం ఎదురు చూడకండి\" అని చెప్పేశారు. ఆపైన గురుశిష్యులిద్దర్నీ వదిలేసి, వాళ్ల స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలీని తలార్లు పాపం, వాళ్ల పని వాళ్ళు కానిచ్చేసారు. తర్వాత చూస్తే ఏముంది? నేరస్తుల శరీరాలకు బదులు, తమ రాజు, మంత్రుల శరీరాలు కనబడ్డాయి!\n\nఇక రాజ్యం అంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని \"రాజ్యం నడిచేదెలాగ? కొత్తరాజు ఎవ్వరు? కొత్తమంత్రి ఎవ్వరు?\" అని చర్చలు జరిపారు. చివరికి, ఎవ్వరికీ తెలీకుండా రాజ్యం దాటి పోతున్న గురుశిష్యులిద్దర్నీ పట్టుకొని, \"మీరే మా రాజు, మంత్రీ\" అన్నారు వాళ్లంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు గానీ, గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి, \"పాత చట్టాలన్నిటినీ తొలగించచ్చు. పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయచ్చు\" అని హామీ‌ ఇచ్చాక, ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆపైన రాజ్యంలో పగలు పగలూ, రాత్రి రాత్రీ అయిపోయాయి. కొంత కాలానికి ఆ రాజ్యానికీ, ఇతర రాజ్యాలకూ తేడా లేకుండా అయ్యింది!\n--- సమాప్తం ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 564,
        "IMAGE": "cat_5",
        "NAME": "తలతిక్క రాజు కథ-4",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 5
    },
    {
        "DESCRIPTION": "గురువుగారు – పరమానందయ్యగరు. వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు. పేరు పరమానందయ్యగారి శిష్యులు. ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు\nపరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.\n\nపూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు.\nవీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెంకాలే\nస్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా\nచూస్తున్నారన్న అనుమానంతో —- మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి” అని శాపం ఇచ్చింది.\n\nవారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు – మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు. తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి – నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు. కనుక – నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు” అని ఆమెను శపించాడు. భూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు. ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అతను మహా పండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు\nమంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు.\n\nరాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు. ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.\nపరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో\nదిట్ట. ఆయనకు రాజాశ్రమముంది. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 565,
        "IMAGE": "cat_6",
        "NAME": "పన్నెండు మంది శిష్యుల కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.\n\n\"అమ్మో! వాగులో మునిగి పోతామేమో\" అంటూ భయపడ్డారు. \"మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం\" అన్నాడు ఒకడు. \"సరే\" అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి \"అందరం వాగుదాటామా?\" అనే అనుమానం వచ్చింది. \"ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను\" అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.\n\n\"ఒకటి, రెండు, మూడు..... పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు\" అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది.\n\n\"మనలో ఒకరు వాగులో మునిగిపోయారు\" అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరున విలపించారు.\n\nగురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కపెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్ళీ పదకొండే వచ్చింది. గురువుగారు శిష్యులూ చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 566,
        "IMAGE": "cat_6",
        "NAME": "పరమానందయ్య శిష్యులు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.\n\nఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.\n\nగురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై అంతులేని అపనమ్మకం.\n\nఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.\n\nగురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.\n\nఆ శిష్యబృందానికి ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షం లోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి ఈ ప్రయాణమే ఇదే సరయిన తరుణం అనుకున్నారు.\n\nఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున రైలు బోగీలో వున్న టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.\n\nసరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబాయ్ నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో పుణే వెళ్ళాలనుకున్నారు.\n\nతిరుగు ప్రయాణంలో ‘ఒకే టిక్కెట్టు’ అనే ట్రిక్కుతోనే ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.\n\nటీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది టీసీయే అని భ్రమపడి ఆనందయ్య శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు. ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.\nఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.\n\nపరమానందయ్య శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం వచ్చాడు. పరమానందయ్య శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే రైలెక్కిన ఆనందయ్య శిష్యులు టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్ ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.\n\nఅంటే నీతి ఏమిటంటే అనుసరణ మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 567,
        "IMAGE": "cat_6",
        "NAME": "అపర పరమానందయ్య శిష్యుల కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "గురువుగారు – పరమానందయ్యగరు. వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు. పేరు పరమానందయ్యగారి శిష్యులు. ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.\n\nపూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు.\n\nవీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో —- ” మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి” – అని శాపం ఇచ్చింది.\n\nవారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు – “మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు. తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి – “నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు. కనుక – నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు” అని ఆమెను శపించాడు.\n\nభూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు. ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అతను మహా పండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు. రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు.\n\nఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.\n\nపరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రాజాశ్రమముంది. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 568,
        "IMAGE": "cat_6",
        "NAME": "పన్నెండుమంది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరమయింది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు.\n\nనాలుగయిదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమయిపోయింది. తొందరగా చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్ళంతా గబగబా నడవసాగారు.\n\nదారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది. అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది. “మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు, అనుకుని “గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం” అంటూ గురువుగారికి విశ్రాంతి నిచ్చారు.\n\nశిష్యులంతా బాగా అలోచించి.. ఏరుకి ‘చురుకెయ్యడానికి ‘ నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాను శబ్ధం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు. ఆ కాగడాని ఏరులో ముంచాడు. వెంటనే అది చుయ్మని శబ్ధం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చి పడ్డాడు.\n\nఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు. ఆయనకు గాఢనిద్ర పట్టేసింది. అది చూసిన మిగతా శిష్యులు , “ఏమయిందిరా?” అని అడిగారు.\n\n“ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది. నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెర్టాలతో నన్ను కాటేసింది” అంటూ వణికిపోతూ … భోరుమని ఏడిచేశాడు.\n\nఅదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు. ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమి అనలేదు అనుకుని.. “ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం” అన్నాడు మరో శిష్యుడు.\n\nసరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని.. ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెల్ళి మెల్లగా శబ్ధం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు. కాగడాకి నిప్పులేదు కనుక నీళ్ళు ఏ శబ్ధం చేయలేదు.\n\nఏటినుండి ఏ శబ్ధం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి – “ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి” అని హడావిడి చేశాడు.\n\nశిష్యులు – గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు.\n\nఅయినా గురువుగారికి మెలకువ రాలేదు. ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ గోల ఏయకుండా నిశ్శబ్ధంగా వరుసలో నిలబడ్డారు.\n“ఎందుకు?” అని అడిగాడు ఓ శిష్యుడు.\n“మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో” అని అన్నాడా శిష్యుడు.\n“ఐతే ఇప్పుడేం చెయ్యాలి? అనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి.”\nఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వదిలి మిగిలిన పదకొండుమందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు.\n“బాబోయ్ .. మనలో ఒకర్ని ఏరు మింగేసింది” అని గట్టిగా అరిచాడతను.\n“అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో” అన్నాడు ఓ శిష్యుడు.\nలేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా” చెప్పాడు శిష్యుడు.\n“అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట” అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు.\n\nఅంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, “మీరెవరు? ఎందుకు బాధపడ్తున్నారు” అని ప్రశ్నిచాడు.\n\n“మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన పన్నెండుమంది శిష్యులం. మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది.” అని చెప్పారు శిష్యులు.\n\n“బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది. అందుకే వారిని ఆటపటించాలనుకున్నాడు “నేనెవరిని” అని అడిగాడు బాటసరి శిష్యులని.\n“తెలియదు” అన్నారు శిష్యులు\n“ఇంతకీ మీరెవరు?” అన్నాడు ఓ శిష్యుడు.\n“నేనెవరో ఓరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను” అన్నాడు బాటసారి చాలా తెలివిగా.\n\nమనం అన్ని విషయాలు తెలుసుకొవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి “చెప్పు నువ్వెవరు?” అని అడిగారు.\n“నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను”. అన్నాడు\n“నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా?” అన్నాడు ఓ శిష్యుడు.\n“తీసుకువస్తాను కాని కొంచం ఖర్చవుతుంది” అన్నాడు బాటసారి.\n“మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట” అని డబ్బు ఇచ్చారు.\n\nఅప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు. అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండుమంది శిష్యులు లెక్క వచ్చారు.\nఅప్పుడు బాటసారి, “చూశావా మీ వాడిని తెప్పించేశాను” అన్నాడు శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు.\n\n“మీరు సామాన్యమానవులు కారు. ఏరు మింగేస్న మావడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని?.. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం అంటు మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్ళిపోయాను బాటసారి.\n\nఅప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ళ తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 569,
        "IMAGE": "cat_6",
        "NAME": "కొంత డబ్బు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "ఓకసారి పరమానందయ్యగారికి సూది అవసరమొచ్చింది. ఆయన శిష్యులను పిలిచి సూది తీసురమ్మని చెప్పారు. శిష్యులంతా బజారుకి సూదికోసం బయలుదేరారు. సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది.\n\n“ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురువుగారికివ్వాలి?” అందరూ “నేను.”….”.నేను” .. అంటూ పోటి పడ్డారు.\n\nఆ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా, ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటిదూలం ఒకటి కనిపించింది . అతనికి ఓఆలోచన వచ్చిది.\n\nఅప్పుడు అతను మిగతావారితో ఇలా చెప్పాడు.. “మనం గొడవ పడొద్దు. అక్కడ ఉన్న తాటిదూలానికి సూదిని గుచ్చి అందరమూ దాన్ని మోసుకెళ్దాం. అపుడు గురువుగారి ఆజ్ఞను అందరూ సమంగా పాటించినట్లవుతుంది.\nఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది. వాళ్ళు “సరె” అన్నారు.\n\nఆ దూలం తీసుకొని దానికి సూది గుచ్చి, పన్నెండుమంది శిష్యులు మోసుకువెళ్ళారు. ప్రజలంతా వారి తెలివితక్కువ తనానికి ఎంతగానో నవ్వుకొన్నారు. మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటిదూలాన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు.\n\nగురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు. శిష్యులు జరిగినదంతా చెప్పారు. అది విని “సూదికోసం తాటి మాను మోసుకొస్తారా! ఇంతకీ సూదేదీ?” అని అడిగారు\n\nఅందరూ తాటిమానులోని సూది వెతికారు. ఎంత వెదికినా దొరకలేదు. చివరికి గురువుగారు వెదికినా దొరకలేదు. “మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్తా ఎక్కడో జారిపోయి ఉంటుంది. ముందు ఈ మాను తీసుకెళ్ళి దాని యజమానికిచ్చిరండి” అని నిరుత్సాహపడ్డారు ఆ గురువుగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 570,
        "IMAGE": "cat_6",
        "NAME": "సూది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "పరమానందయ్యగారి దగ్గరకు ఒకసారొక తర్కపండితుడు వచ్చాడు. స్నేహంతో చూడాలని వచ్చిన అతను ఆ మాటలూ, యి మాటలూ ఆడాక తన తర్క శాస్త్రం గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులూ తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్ళేం మాట్లాడుకుంటున్నా శ్రద్దగా వినమని గురువుగారు చెప్పారుకదా... అందుకని వాళ్ళు ఆ మాటలర్థమయినా కాకపోయినా వినేస్తున్నారు శిష్యులు. పండితులిద్దరూ తర్కం, మీమాంస మొదలయిన వాటి గురించి చర్చించుకుంటున్నారు. వాటిల్లో శిష్యులికేవీ అర్థంకావడంలేదు- ఏవో పొడిముక్కలు తప్ప. అయినా వినేస్తున్నారు. అంతలో గురుతపత్ని శిష్యులని పిలిచి – అతిథి వచ్చారు కదా. ఇంట్లోకి నెయ్యి తెండి అని గిన్నె, డబ్బులు ఇచ్చారు. ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే – ఈపాటిదానికిద్దరెందుకూ? అన్నారు గురుపత్రి. ఒక బుర్రకంటే రెండు బుర్రలు నయం అన్నారు గురువుగారు. అన్నాడు ఒకడు. రెండు బుర్రలంటే ఇద్దరుండాలి కదా ? అన్నాడు రెండొవాడు. మీరెందరెళ్ళినా ఒక్క బుర్ర కూడా కాదు – గొణుక్కుందావిడ. వాళిద్దరూ బజారులకెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకుని వస్తూంటే – గురువుగారికీ పండితుడుగారికీ జరిగిన మాటలు గుర్తుకొచ్చాయి. వీళ్లకి ఈ నేతికి గిన్నె ఆధారమా ? అడిగాడొకడు. గిన్నెకు నెయ్యే ఆధారము అన్నాడు రెండోవాడు. మహాతెలిసినట్లుగా. అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్దాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట. అన్నారు అర్థం తెలియకపోయినా(పడికట్టు) పదం ఉపయోగిస్తూ. ఔనంతే అన్నాడు రెండోవాడు ధీమాగా. ఇద్దరూ కాస్సేపు వాధించుకుని ఆ పైన కొట్లాట వరకూ వెళ్లిపోయారు. గిన్నెకి నెయ్యి ఆధారమన్నావుగా... చూడు నీ నేతిగతేమవుతుందో ; అంటూ గిన్నెను బోర్లించేశాడు. గాలిలో నెయ్యంతా నేలపాలయింది. రెండోవాడికి కోపమొచ్చింది. చటుక్కున మొదటివాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతిమీద కొట్టి ఎగర కొట్టాడు. ఇప్పుడు నీ గిన్నె కాధారమేదీ? నెయ్యంది కనుక గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యినే ఆధారం పోవడంతో నీ గిన్నె హూష్ – నవ్వాడు రెండోవాడు. బంగారంలాంటి వెండిగిన్నె వాళ్ల తర్కవితర్కాలలో ఎగిరి పంటకాలవలో పడి ప్రవాహం పాలయింది మరి చిక్కకుండా. ఇంటికెళ్లాక – ‘‘ నెయ్యేదీ’’ అని అడిగారు గురుపత్ని జరిగినదంతా చక్కగా చెప్పారిద్దరూ. ఈ జన్మలో మీరు బాగుపడరు అని తలకొట్టుకుందావిడ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 571,
        "IMAGE": "cat_6",
        "NAME": "నెతి గిన్నె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాస్సేపు నడుం వాల్చాలను కుంటారు. తన శిష్యుల్లో ఇద్ధరిని పిలిచి తన కాళ్ళు పట్టవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చి నిద్రకుపక్రమిస్తాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువు గారి కాళ్ళుపిసకటం మొదలు పెడతారు. ఆ మర్ధనా సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాళ్ళ పడుతున్న శిష్యుల్లో ఒకడు తను వత్తుతున్న గురువు గారి కాలును మురిపెంగా చూసుకొంటూ “నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు. ఎంత బాగా మర్ధనా చేసానో. మిలమిల్లాడుతోంది” అన్నాడు. రెండో వాడు “ఏడిశావ్ లేరా! నా కాలు చూడు. ఎలా తళతళ్లాడు తుందో? నేనే బాగా మర్ధనా చేసాను” అన్నాడు. మొదటి వాడికి చిర్రెత్తు కొచ్చింది. “కాదు. నాకాలే మెరుస్తోంది. నీకాలు వికారంగా ఉంది” అన్నాడు కోపంగా. రెండోవాడికి ఇంకా మండుకొచ్చింది. “నోరు ముయ్యి. నీకాలు చెత్తది. నా కాలు బంగారం” అన్నాడు గురువు గారి కాలుని చేత్తో నిమిరుతూ. మొదట వాడు కోపంతో రొప్పుతూ “నువ్వు నా కాలుని అవమానించావు. చూస్కో నేనేం చేస్తానో?\" అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలిని ఒక్కటి కొట్టాడు.రెండో వాడు అంతకంటే కోపంతో “నా కాలునే కొడతావా? చూస్కో నీ కాలుని నరికేస్తాను” అంటూ గొడ్డలి తెచ్చాడు. మొదటి వాడు “నీ కాలుని మాత్రం నే వదులుతానా?\" అంటూ కత్తి పట్టుకొచ్చాడు. ఇద్దరూ కలిసి గురువు గారి కాళ్ళని కొట్టటం అయిపోయి నరికేందుకు సిద్ధ పడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువు గారు ఇద్దరి అఘాయిత్యాల్ని ఆపమంటూ గావుకేక పెట్టారు. తర్వాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాళ్ళనే బాధించిన విషయాన్ని బోధపరచి వారిని వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 572,
        "IMAGE": "cat_6",
        "NAME": "మధ్యాహ్న భోజనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.\n\nరామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.\n\nఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపునొప్పి పట్టుకొంది. ఎన్నాళ్ళకూ తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్యగారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్యగారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్యగారు 'నేను వచ్చానుగదా భయపడకు! ఇదొక గొప్ప రోగమా? దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు. రెండు రోజులలో నీ సమస్త బాధలూ తీరిపోతాయి. నిర్భయంగా వుండు'. అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు.\n\nగురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో వున్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్ళు త్రాగించాడు. ఆ విధంగా మూడు పూటలు యిచ్చేసరికి రామయ్యగారికి కడుపునొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రామయ్య చాలా సంతోషించాడు. రెండవ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రామయ్య శరీరమంతా వేడి పుట్టింది. మూడవరోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు. దాంతో రామయ్య శరీరమంతటా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు. అది చూసి పరమానందయ్యగారు 'భయపడకు! రోగం తగ్గేముందు అలాగే వుంటుందని ' ధైర్యం చెప్పాడు. రామయ్య నిజమే కావచ్చుననుకొని మంటను ఓర్చుకొంటున్నాడు. నాలుగవరోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్దచేసి రామయ్య నడినెత్తిమీద వేసి కట్టుకట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు.\n\nఅతని స్థితి చూసి పరమానందయ్యగారు శిష్యులను పిలిచి కొంపముంచారు. రామయ్య చచ్చేస్థితిలో వున్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువు గారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడంలేదని ఆగ్రహించి 'గురువుగారూ! మీరేం దిగులుపడకండి. రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనియ్యం' అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలసి ఆలోచించసాగారు. మనం ఎన్నిరకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకొన్నారు. ఒకనాడు ప్రాణం ఎటువేపునుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు. మరొకనాడు తెలుసుకోవడానికేముంది? కడుపులోనుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుందన్నాడు. వేరొకడు కళ్ళలోనుంచి పోతుందన్నాడు. ఈ విధంగా తలోక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేక పోయారు. వారిలో ఒక బుద్దిమంతుడు యిలా చెప్పాడు. మన శరీరంలో నవరంధ్రాలున్నాయంటారు. ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూపోలేక చచ్చినట్టు పడివుంటుంది. అన్నాడు. అతని బుద్ది కుశలతకు అంతా మెచ్చుకొన్నారు.\n\nతమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్దకూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కదలక మెదలక పడి వున్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులనుకొన్నారు. మంచం చుట్టూ కూర్చొని కునుకుతున్నారు. తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య వున్న గదిలోనికి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రామయ్య చెయ్యిపట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది! రామయ్య చనిపోయాడు. లేవండిరా! వెధవల్లారా. అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువు గారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు, మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రామయ్య చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకొంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొనిరండి అని పంపారు.\n\nరామయ్య అంటే ఆ ఊళ్ళో వున్న వారికందరికీ చాలా కోపంగా వుంది. వాడు చస్తే మాకేం? బ్రతికితే మాకేం? మేము మాత్రం రాము. అని కబురు చేశారు. అంతట పరమానందయ్యగారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు. రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్యగారి మఠమునకు యిస్తానని వాగ్దానం చేసి వీలునామా వ్రాసిపెట్టాడు. దాని ప్రకారం రామయ్య ఆస్థిని గైకొని శిష్యసమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్యగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 573,
        "IMAGE": "cat_6",
        "NAME": "పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 6
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెళ్తుంటే.. దార్లో సుబ్బూకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తరువాత అక్కడే, ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు.\n\nఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పట్నించీ మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆరోజు నుంచీ ప్రతిరోజూ సుబ్బూ ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లుతిని, ఆడుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.\n\nఇక యాపిల్ చెట్టు కూడా రోజూ సుబ్బూ కోసం ఎదురుచూసేది. సుబ్బూ పెద్దవాడవుతున్నట్లుగానే, చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి. ఓ రోజు సుబ్బూ నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా.. ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బూ.\n\nనా దగ్గర కూడా డబ్బు లేదు కానీ.. నా పండ్లను అన్నింటినీ అమ్మి, ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బూ సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు. చాలా కాలందాకా సుబ్బూ ఆ చెట్టుదగ్గరికి రానేలేదు. చెట్టు మాత్రం సుబ్బూకోసం ఎదురుచూస్తూనే ఉండేది.\n\nఓ రోజు పెద్దవాడయిన సుబ్బూ తిరిగీ చెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టు సుబ్బూని చూసి ఆనందించి, నాతో కాసేపు ఆడుకోరాదూ? అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను.. నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బూ. నా దగ్గర ఇల్లు లేదుగానీ, నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు.\n\nదానికి సంతోషించిన సుబ్బూ... కొమ్మలను నరికి తీసుకుని వెళ్లిపోయాడు. సుబ్బూ తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏ మాత్రం బాధపడలేదు. అయితే, సుబ్బూ మళ్లీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నయిపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బూ ముసలివాడయిపోయి, తిరిగీ చెట్టుదగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది.\n\nఅయితే.. తానిప్పుడు ముసలివాడినయ్యాననీ.. కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బూ. తన దగ్గర పడవలేదుగానీ... తన చెట్టు మొదలును నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేననీ చెట్టు చెప్పినట్లుగా చేశాడు సుబ్బూ.\n\nచాలా సంవత్సరాల తరువాత మళ్లీ సుబ్బూ యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. అది చూసిన చెట్టు.. \"బాబూ నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీలేదని\" ఏడుస్తూ బదులిచ్చింది. ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు గానీ...ఈ ముసలి తనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టుమొదలు మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బూ. అది విన్న యాపిల్ చెట్టు.. సంతోషం నాయనా.. ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞురాలినంటూ కన్నీళ్లతో పకపకా నవ్వింది చెట్టు.\n\nఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలూ... కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా.. మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 574,
        "IMAGE": "cat_7",
        "NAME": "యాపిల్ చెట్టూ.. సుబ్బూ మంచి ఫ్రెండ్స్ అట..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పూర్వం సిరిపురంలో ఒక బాటసారి తలపై తేనె పెట్టుకుని వెళ్తూ... ఏవో ఆలోచనల్లో పడి బరువు సంగతిని మర్చిపోయాడు. ఇంతలో అతడి తలపై పాత్ర పట్టుతప్పి కిందపడి, తేనె అంతా నేలపాలయ్యింది.\n\nఆ తేనెను తాగేందుకు తేనెటీగ ఒకటి వచ్చి వాలింది. తేనెటీగను మింగేందుకు సాలీడు సిద్ధమయ్యింది. సాలీడును తినేందుకు బల్లి సన్నద్ధమయ్యింది. బల్లి ప్రాణం తీసేందుకు ఒక పిల్లి కూడా అక్కడికి చేరుకుంది. ఆ వీధిలో ఉండే వర్తకుడి పెంపుడు పిల్లే అది.\n\nఅక్కడే ఉన్న రాజసేవకుడి పెంపుడు కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతోంది. ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని సందేహించిన వర్తకుడు అక్కడికి చేరుకున్నాడు. అయితే, వర్తకుడు తన కుక్కను చంపుతాడేమోనని సందేహించిన రాజ సేవకుడు కూడా కత్తి తీసి సిద్ధంగా నిల్చున్నాడు.\n\nఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. ఆ తరువాత బల్లి సాలీడును తినేసింది. బల్లిని చంపేసింది పిల్లి. పిల్లి గొంతు పట్టుకుని కరచింది కుక్క. దీంతో వర్తకుడు కోపంతో ఊగిపోతూ, కర్రపుచ్చుకుని కుక్కని చంపేశాడు. కుక్క చనిపోవడంతో ఆగ్రహం చెందిన రాజ సేవకుడు వర్తకుడి మెడపై కత్తితో ఒక దెబ్బ వేశాడు. అంతే వర్తకుడు రక్తపు మడుగులో గిలాగిలా తన్నుకున్నాడు. దీంతో చుట్టుప్రక్కల ప్రజానీకమంతా కోపంతో రాజసేవకుడిని మట్టుబెట్టారు.\n\nఇదంతా విన్న సిరిపురం రాజు... \"ప్రజలకు ఇంత తెగింపా..? ఒక రాజ సేవకుడిని పట్టుకుని చంపేస్తారా..?\" కోపంతో కళ్లెర్రజేసి, ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు. ఇదంతా ప్రక్కనే ఉండి చూస్తోన్న మంత్రి ఇక ఈ విషయంలో కలుగజేసుకోకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో అని ఆలోచించి రాజు వద్దకు వెళ్లాడు.\n\n\"మహారాజా... ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది. నేలపాలైన తేనెపై తేనెటీగ వాలటం, దాన్ని సాలీడు మింగటం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగటం.. ఇవన్నీ ప్రకృతి సహజాలే. అయితే తన పిల్లిని చంపిదన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న ఆవేశంతో, రాజ సేవకుడు వర్తకుడి ప్రాణం తీశాడు. వర్తకుడిమీది అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగ తీర్చుకున్నారు\" అని వివరించాడు మంత్రి.\n\n\"ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించండి ప్రభూ.. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహావేశాలకు గురయినట్లయితే.. అదే అన్ని అరిష్టాలకూ మూలకారణం అవుతుందని తమరికి తెలియంది కాదు\" అని సూచించాడు మంత్రి.\n\nదీంతో మంత్రి మాటల్లోని విజ్ఞతను అర్థం చేసుకున్న మహారాజు.. కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు. జరిగినదాంట్లో ఎవరి తప్పూ లేదని గ్రహించాడు. మంత్రి చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పిన రాజు, ప్రజలమీదికి పంపాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 575,
        "IMAGE": "cat_7",
        "NAME": "విజ్ఞతతో ఆలోచించడమే ముద్దు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి, ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సిద్ధయ్య తన కొడుకూ, కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్ధయ్య.\n\nపదవతరగతి పాసైన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ బాగా చదివించాలని అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి, కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు.\n\nఅంతేగాకుండా... \"ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది... ఉద్యోగాలు చేయాలా, ఉర్లేళాలా.. అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్లి గుట్టుగా కాపురం చేసుకుంటుంది\" అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్నఫళంగా కూతుర్ని చదువు మాన్పించేసి, ఇంట్లో ఉంచేశాడు.\n\nఅదలా ఉంటే... ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు, షికార్లు, స్నేహితులతో జల్సా చేయసాగాడు. చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారుల్లో నడవటం తెలిసిన సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేదేమీలేక కొడుకును కూడా చదువు మాన్పించి, ఇంటిపట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు.\n\nకుండలు చేయడమే గాకుండా, ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని మంచి ధరకు అమ్మటం కూడా ఎలాగో నేర్పించాడు. దీంతో... నాలుగురాళ్లు సంపాదించటంతో సిద్ధయ్య కొడుకుకు కష్టంలోని తియ్యదనం తెలిసివచ్చింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోసాగాడు.\n\nఅయితే.. కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్లీ బడిలో చేర్పించాడు. తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని, త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు.\n\nచదువును పక్కనపెట్టి చెడుతిరుగుళ్ల పాలైన కొడుకు.. ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య... కొన్నిరోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం, కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కాబట్టి... కొడుకులు ఉద్ధరిస్తారు, కూతుళ్లకు చదువెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు, సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొంటారని ఆశిస్తూ....! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 576,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆడపిల్ల అంటే అలుసెందుకు...?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు. ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే... తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయి అని.\n\nమిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయి అని ఒక అమ్మాయి అంటే... మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది. అలాగే మరో అమ్మాయి కూడా... అలా వారిలో వారు వాదించుకోసాగారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక బిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది.\n\nచింపిరి జుట్టు, మాసిన బట్టలతో.. అంద వికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాకుమార్తెలు అసహ్యించుకుంటూ... పక్కకు వెళ్లమని ఛీకొట్టారు. దానికి నొచ్చుకున్న ఆ బిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టింది.\n\nపేదరాలైనప్పటికీ.. తనకు ఉన్నంతలో కడుపునిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య.. ఆమెకు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించింది. అంతే వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు రాకుమార్తెలు.\n\nబిచ్చగత్తె రూపంలోని ఆ దేవకన్య.. తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెల వద్దకు వచ్చింది. \"తోటివారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు\" అని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధితెచ్చుకున్న రాకుమార్తెలు, ఇకమీదట అలా ఉండకూడదని అనుకున్నారు.\n\nకాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే... ఇతరులకు సహాయం చేయడంలో అందము, గొప్పతనము దాగి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనస్సు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 577,
        "IMAGE": "cat_7",
        "NAME": "రాజ కుమార్తెలు... దేవకన్య..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే ఊళ్లో రామారావు అనే పెద్దమనిషి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు.\n\nఅయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని.. వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.\n\nకొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు... ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.\n\nదీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు.\n\nరెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి.. చివరకు ఒక్క రూపాయిని ఖర్చుచేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దానిని వెలిగించగానే, ఇల్లంతా వెలుగు పరచుకుంటుంది.\n\nదీన్ని చూసిన రామారావు.. తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది.. అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి, దగ్గరికి పిలిచి... తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు.\n\nకాబట్టి పిల్లలూ... ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే... తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 578,
        "IMAGE": "cat_7",
        "NAME": "తెలివితేటలుంటే.. ఏదైనా సాధ్యమే...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ, నడుస్తూ.. ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు.\n\nగురువుగారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండటంతో... ఎందుకలా చూస్తున్నారు గురువుగారూ...? అని ప్రశ్నించాడు శిష్యుడు. గురువు వద్ద నుంచీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు.\n\nఆ నాలుగు చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద ముక్క, మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది, నాల్గోది చాలా చాలా పెద్ద చెట్టు. అరే.. భలేగున్నాయి కదూ.. అని మనసులో అనుకుంటూ వాటివైపే చూస్తున్నాడు శిష్యుడు.\n\nఅప్పటిగానీ ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ.. దానిని లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగి పారవేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు చెప్పడంతో.. దాన్ని కూడా కష్టపడి లాగివేశాడు.\n\nమూడో దాన్ని కూడా గురువు లాగమని చెప్పడంతో... తన శక్తినంతటినీ ఉపయోగించి, అతి కష్టంమీద లాగి పారవేశాడు. ఇప్పుడు చివరిదైన నాలుగో చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులూ వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు.\n\nశిష్యుడు అగచాట్లును అంతసేపూ చూసిన గురువుగారు... చూడు నాయనా... మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే... వాటిని మార్చుకోవడం కష్టం, దానికి ఉదాహరణ ఈ నాలుగో చెట్టు. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతకు ఇదే అర్థం నాయనా...!\n\nచెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. నువ్వు లాగి పారేసిన ఒకటి, రెండు, మూడు చెట్లలాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే.. నాలుగో చెట్టులాగా దాన్ని మనము ఏమీ చేయలేము. కాబట్టి చెడు అలవాట్లకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి నాయనా..! అని చెప్పాడు గురువుగారు.\n\nఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే, ఆ చెట్లను ఉదాహరణగా చూయించి చెప్పాను అని అన్నాడు గురువుగారు. గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు.. ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు.\n\nకాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే... చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పారవెయ్యాలి. లేకుంటే అది పెరిగి మహా వృక్షమై మన అంతానికి దారితీస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 579,
        "IMAGE": "cat_7",
        "NAME": "మొక్కై వంగనిది.. మానై వంగునా...?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతడికి బంగారమన్నా, కూతురన్నా చాలా ఇష్టం. అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది.\n\nఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుండగా... కలలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది. అసలే అత్యాశాపరుడైన సోమనాథం తాను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్లుగా వరం కోరాడు. అంతా విన్న దేవత తథాస్తు అని వరం ఇచ్చి మాయమైపోయింది.\n\nమరుసటి రోజు ఉదయం నుండి సోమనాథం తన ఇంటి వెనుకనున్న తోటలోకి వెళ్లి, అక్కడున్న కొన్న వస్తువులను తాకి చూశాడు. వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి. దీంతో సోమనాథం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలా ఇంట్లో వస్తువులన్నింటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు.\n\nఇంతలో సోమనాథానికి ఆకలి వేసింది. ఫలహారం తీసుకునేందుకు పళ్లాన్ని తాకగానే అంది పళ్లెం, పళ్లెంలోని ఫలహారాలన్నీ బంగారంగా మారిపోయాయి. ఏది తాకినా అది బంగారంగా మారిపోతుండటంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక.. అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంతో కూలబడిపోయాడు.\n\nఇంతలో చదువుల కోసం పక్క ఊరికెళ్లిన కుమార్తె ఇంటికి రావడంతో.. సంతోషంగా కూతుర్ని కావలించుకున్నాడు సోమనాథం. అంతే వెంటనే ఆమె సైతం బంగారు విగ్రహంలాగా మారిపోయింది. అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే.. ఇప్పుడు నేనేం చేయాలంటూ విలపించాడు సోమనాథం.\n\nవెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ... తాను చేసిన తప్పేంటో తెలిసింది, తనను మన్నించమని కోరాడు. వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో, సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు. ఇప్పటికైనా అత్యాశ మానుకోమని చెప్పిన ఆ దేవత సోమనాథాన్ని మన్నించి ఓ చిన్న కూజా నిండా మంచినీటిని ఇచ్చింది.\n\nఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటిమీదా.. చల్లితే అవి మామూలు వస్తువుల్లాగా మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమై పోయింది. వెంటనే సోమనాథం ముందుగా తన కూతురుపైన ఆ నీళ్లను చల్లగా ఆమె మామూలుగా మారిపోయింది. వెంటనే బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటిమీదా ఆ నీటిని చల్లి మళ్లీ మామూలుగా మార్చుకున్నాడు సోమనాథం.\n\nఇకమీద అత్యాశతో ప్రవర్తించకూడదు.. ఉన్నదాంతోనే సంతృప్తిగా బ్రతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న సోమనాథం కూతురుతో సంతోషంగా తోటలో ఆడుకునేందుకు వెళ్లాడు. పిల్లలూ...! ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే... నిజమైన ఆనందం సంపదలో లేనేలేదని అర్థం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 580,
        "IMAGE": "cat_7",
        "NAME": "సంతృప్తిని మించిన సంపద లేదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.\n\nఅంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.\n\nచిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... \"ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం...\" అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది.\n\nకాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.\n\nఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.\n\nచిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... \"ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు\" అని చిట్టెలుకతో అంది.\n\nఅవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 581,
        "IMAGE": "cat_7",
        "NAME": "మృగరాజు - చిట్టెలుక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికో రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులుండేవారు.\n\nఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులూ, చేపల వేటకని బయలుదేరి వెళ్ళారు. ఏడుగురు కొడుకులూ, కలసి ఏడుచేపలు పట్టుకుని రాజ భవనానికి తీసుకొచ్చారు. ఆ ఏడు చేపలను ఒక బండరాయిపైన ఆరబెట్టారు.\n\nఅందులో అన్ని చేపలూ ఎండినా, ఒక పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు. దానికి బాధపడిన ఆ రాజు పెద్ద కొడుకు... చేప దగ్గరికి వెళ్ళి, \"చేపా.. చేపా...! ఎందుకు ఎండలేదు?\" అని అడిగాడు.\n\nదానికి ఆ చేప... \"ఓ రాకుమారా...! నాకు అడ్డంగా గడ్డివాము ఉంది. దాని నీడ నామీద పడి నేను సరిగా ఎండలేకపోయాను.\" అని చెప్పింది. దీంతో... రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి... \"గడ్డివామూ... గడ్డివామూ...! చేపను ఎండనీయకుండా నువ్వెందుకు అడ్డం వచ్చావని?\" ప్రశ్నించాడు.\n\nదీనికి ఆ గడ్డివాము.. \"నన్నేం చేయమంటావు రాకుమారా..? ఆవు నన్ను మేయలేదు\" అని చెప్పింది. అలాగా.. అంటూ ఆవుదగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. \"ఆవూ... ఆవూ...! నువ్వెందుకు గడ్డి మేయలేదు..?\" అని అడిగాడు.\n\n\"నేనేం చేయను రాకుమారా...! జీతగాడు నాకు మేత వేయలేదు\" అని బదులిచ్చింది ఆ ఆవు. దీంతో జీతగాడి దగ్గరికెళ్ళిన రాకుమారుడు \"జీతగాడా... జీతగాడా...! ఆవుకెందుకు మేత వేయలేదు..?\" అని అడిగాడు.\n\n\"ఏం చెప్పను రాకుమారా...! అవ్వ నాకు బువ్వ పెట్టలేదు.. చాలా ఆకలిగా ఉంది\" అని చెప్పాడు జీతగాడు. \"అవ్వా... అవ్వా...! జీతగాడికెందుకు బువ్వ పెట్టలేదు..?\" అని అడిగాడు రాకుమారుడు.\n\n\"పాప ఏడుస్తోంది.. అందుకనే నాకు బువ్వ పెట్టేందుకు వీలుకాలేదు నాయనా..!\" అని చెప్పింది అవ్వ. ఓహో అదా సంగతి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. \"పాపా... పాపా... ఎందుకేడుస్తున్నావు..?\" అని అడిగాడు.\n\n\"నన్ను చీమ కుట్టింది రాకుమారా..! అందుకే ఏడుస్తున్నాను\" అని చెప్పింది పాప.. వెంటనే ఊరుకోని రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి... \"చీమా...! చీమా...! పాపనెందుకు కుట్టావు...?\"అని అడిగాడు. \"ఆ.... నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా... గిట్టనా...!\" అని బడాయిగా బదులిచ్చింది చీమ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 582,
        "IMAGE": "cat_7",
        "NAME": "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనూ...? ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో చాలా ఆవులు, గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో, గేదెలతో గొడవలు పడకుండా, అన్నింటితో కలసి చాలా ఐకమత్యంతో జీవించేది.\n\nఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా, పక్కనే దాక్కుని ఉన్న పెద్దపులి ఒకటి మీదపడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏ మాత్రం భయపడకుండా... \"పులిరాజా...! కాస్తంత ఆగు. ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు. పాలుతాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి వచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువుగానీ\" అని చెప్పింది.\n\nగోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి... \"ఆహా... ఏమి మాయమాటలు చెబుతున్నావు. ఇంటికి వెళ్ళి, బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా..? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను\" అని కోపంగా సమాధానం ఇచ్చింది.\n\n\"ఓ పులిరాజా..! నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదానిని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా...! నీకు ఉపకారం చేసిన దాననవుతాను. అయితే ఒక్కసారి నా బిడ్డను చూసి, ఆకలి తీర్చి రావాలనేదే నా చివరి కోరిక\" అని చెప్పింది గోమాత.\n\nఆవు చెప్పిందంతా ఓపికగా విన్న పెద్దపులి... సరే ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంతమాత్రం నీతి ఉందో కనుక్కుందామని.. సరేనని చెప్పింది. దీంతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకుని, కడుపునిండా పాలిచ్చింది. తన బిడ్డతో \"నాయనా...! బుద్ధిమంతుడిగా, మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకుండా ఉండు. మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి\" అంటూ బుద్ధులు చెప్పి, అడవికి చేరుకుంది గోమాత.\n\nగోమాత చూసిన పెద్దపులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతగొప్ప గుణం కలిగినది. ఇంతగొప్ప సత్యవంతురాలిని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకున్న పులి, ఆవును మెచ్చుకుంటూ... తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్లిపోమని చెప్పింది. పెద్దమనసుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్దపులికి కృతజ్ఞతలు చెప్పి, అక్కడినుంచి బయటపడింది గోమాత. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 583,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఎప్పటికైనా సత్యానిదే గెలుపు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఒంటికన్ను కాకమ్మ. ఒకరోజు పున్నమి రాత్రివేళ చెట్టుమీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది కాకమ్మ. అదేంటంటే... ఈ ప్రపంచంలో నా కంటే గొప్పవాళ్ళు ఎవరంటూ... ఆలోచించి, ఆలోచించి అలసిపోయింది కాకమ్మ. ఎంతకూ తేలక పోయేసరికి ఆకాశంలో కనిపించే చందమామను ఎవరు గొప్ప? అని అడిగింది.\n\nఎవరేంటి? ఈ ప్రపంచానికంతటికీ ఒక్కసారిగా వెన్నెల కురిపించే నేనే గొప్పవాడిని కదా అన్నాడు చందమామ. అది విన్న ఆకాశం.. ఓస్..! నువ్వెలా గొప్పవాడివవుతావు? నువ్వూ, చుక్కలు, అంతా నాలోనే ఉన్నారు కాబట్టి నేనే గొప్పదాన్ని అంది.\n\nఅది విన్న బురదగుంట పకపకా నవ్వింది. చందమామ, ఆకాశమూ రెండూ కలిసి ఎందుకు నవ్వుతున్నావని బురదగుంటను అడిగాయి. ఆకాశమూ, చుక్కలూ, కాకమ్మ, చందమామ అన్నీ నాలోనే కనబడతాయి కదా.. అందుకనే నేనే గొప్ప అంది బురదగుంట.\n\nఅప్పుడు కాకమ్మ ... మీ అందరినీ నేను నా కంటితో చూస్తాను కాబట్టి నా కన్నే అందరికంటే గొప్పది అని అంది. ఇది విన్న కంటిరెప్ప ఏమందంటే... కంటిని మూసి, ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇతర వస్తువులను కూడా కనపడకుండా కూడా చేయగలను కాబట్టి నేనే గొప్పదాన్ని అంది.\n\nఆ కంటి రెప్ప కూడా నాలో కనబడుతుంది కదా.. అంటూ బదులిచ్చిన బురదగుంట, నేనే గొప్ప అంది. అలా అందరూ నేనంటే నేనే గొప్ప అంటూ వాదించుకుని, అలసిపోయి, చర్చను మరుసటి రోజుకు వాయిదా వేసేసి నిద్రపోయాయి. కానీ... \"కంటిరెప్ప కూడా నాదే కదా...!\" అనుకుంటూ ఆ రోజుకు తృప్తిగా నిద్రపోయింది ఒంటికన్ను కాకమ్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 584,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఒంటికన్ను కాకమ్మ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఓ ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఇతర జంతువులన్నీ కలసి జీవించేవి. అయితే తేనెటీగలు ఎంతో కష్టపడి పోగుచేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడటం తప్ప, తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి.\n\nఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా కుందేలు, ఏనుగు, ఇతర జంతువులన్నింటితో చెప్పుకుని విలపించాయి. ఎలాగయినాసరే ఆ ఎలుగు బాధను తప్పించమని అందరినీ వేడుకున్నాయి. అప్పుడే కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. అయితే దీనివల్ల తమకేంటి లాభం అని అడుగగా... మీ అందరికీ కావాల్సినంత తేనె ఇస్తామని తేనెటీగలు మాట ఇవ్వడంతో సరేనంది.\n\nకుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు \"తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ\"ని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. ఇంతలో ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు మాత్రం కుందేలుకు, ఇతర జంతువులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు.\n\nఅయినా కూడా ఆశచావని కుందేలు, ఇతర జంతువులన్నీ తేనెటీగలను నిలదీశాయి. అయితే అవి చేసిన మేలును మరచి, కాదు పొమ్మన్నాయి. దీంతో కోపంతో ఎలుగుబంటి దగ్గరకు వెళ్లిన అవి తేనెతుట్టె సంగతి చెప్పేశాయి. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మళ్లీ మొదటికొచ్చాయి. దీంతో చేసేందేంలేక తేనెటీగలు కుందేలు, ఇతర జంతువులను కలసి తమని క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి.\n\nపథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి \"ఎలుగుబంటి మామా...! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం\" అని చెప్పింది.\n\nఅయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూసిన ఎలుగు నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరడం, ఇరుక్కుపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.\n\nహాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు, ఇతర జంతువులన్నీ వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఏనుగు సహాయంతో ఎలుగును తారు డ్రమ్ము నుండి బయటికి తీసి కాపాడాయి. ఆ తరువాత అందరూ మిత్రులైనారు. తేనెటీగలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జంతువులన్నింటికీ తేనెతో మంచి విందును ఇచ్చాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 585,
        "IMAGE": "cat_7",
        "NAME": "తేనెటీగలు... ఎలుగుబంటి..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో చలిచీమల పుట్ట ఒకటి ఉండేది. చలిచీమలంటే, గండు చీమలు కావు. కుట్టకుండా ఊరికే మన ఒంటిమీద గబగబా పాకుతాయే, అలాంటి చీమలన్నమాట. వర్షం పడేముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటునుండి ఒక చోటికి మారిపోతుంటాయి కాబట్టే, వాటిని \"చలి చీమలు\" అంటుంటారు.\n\nఅలాంటి చలిచీమల పుట్ట అడవిలో ఓ చెట్టు నీడన ఉండేది. వర్షం భయం అసలే లేని ఆ చెట్టు నీడలో చాలా సంవత్సరాల నుంచీ జీవిస్తోన్న ఆ చీమలు, వాటికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పర్చుకుని సుఖంగా జీవిస్తుంటాయి. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవంటూ, వీటికి కూడా కష్టాలు వచ్చాయి.\n\nఎక్కడినుండి వచ్చిందో, ఒక పాము చెట్టు తొర్రలోకి వచ్చి చేరుకున్నది. ఎప్పుడైనా వాన పడిందంటే, ఆ పాము చెట్టుదిగి వచ్చేది; చీమల పుట్టలోకి దూరేది. చీమలు సన్నగా, ఇరుకుగా ఏర్పర్చుకున్న దారులను చీల్చుకుంటూ లోపలికి దూరేది. దీంతో చీమలు ఎంతో కష్టపడి కట్టుకున్న గోడలన్నీ కూలిపోయేవి. పాము దారి ఏర్పర్చుకుని వెళ్ళే క్రమంలో చాలా చీమలు చచ్చిపోయేవి. మరికొన్ని గాయాలపాలయ్యేవి, అవి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆహారం కాస్తా మట్టిపాలయ్యేది.\n\nచీమలన్నీ కలిసి పాముకు చాలాసార్లు చెప్పిచూశాయి. తాము ఎంతోకాలం కష్టపడి, శ్రమకోర్చి కట్టుకున్న ఈ పుట్టను వదిలిపెట్టి, వేరే ఏదైనా మంచి తావును చూసుకుని వెళ్లిపోమని బ్రతిమాలాయి. మా పుట్టలోకి నువ్వు దూరినప్పుడల్లా తాము వేల సంఖ్యలో చచ్చిపోతున్నామని, తమమీద కాస్త దయచూపమని అవి వేడుకున్నాయి.\n\nఅయినా పాము మనసు కొంచెం కూడా కరగలేదు, చలి చీమల బాధను అర్థం చేసుకోలేదు, వాటి గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారీ కావాలని పుట్టలోకే దూరేది. నవ్వుతూ, కావాలనే పుట్టలో అటూ, ఇటూ తిరుగుతూ సాధ్యమైనంత ఎక్కువ చీమల్ని చంపటం మొదలుపెట్టింది.\n\nపాము బాధను భరించలేని చీమలన్నీ ఒకరోజు సమావేశమై, ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకోవాలని నిశ్చయానికొచ్చాయి. ఈసారి గనుక పాము వస్తే ఊరుకోకూడదని, కసితీరా కుట్టి చంపేయాలని గట్టిగా అనుకున్నాయి. మరికొన్ని రోజులకు వర్షం పడగానే, ఎప్పట్లాగే పాము చీమల పుట్టలోకి దూరింది.\n\nపాము పుట్టలోకి దూరగానే... అసలే కోపంగా ఉన్న చీమలన్నీ కలిసి ఒక్కసారిగా దానిమీద దాడిచేసి, దొరికిన చోటల్లా గట్టిగా కుట్టేశాయి. పాము అటూ ఇటూ కొట్టుకున్నా, విదిలించుకున్నా, దొర్లినా, ఏం చేసినా చలిచీమలు మాత్రం దాన్ని వదలిపెట్టలేదు. ఎన్ని చీమలు చనిపోయినా సరే, మిగిలిన చీమలన్నీ పామును గట్టిగా కుడుతూనే ఉన్నాయి. చివరికి తట్టుకోలేని పాము చచ్చిపోయింది. ఎట్టకేలకు చలిచీమలు ఆ విధంగా పాము పీడను వదిలించుకున్నాయి.\n\nకాబట్టి పిల్లలూ... \"బలవంతుడ, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ అంటూ... ఏనాడో సుమతీ శతకకారుడు తన పద్యంలో చెప్పింది నిజమేనని అర్థమవుతోంది కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 586,
        "IMAGE": "cat_7",
        "NAME": "బలవంతమైన సర్పము చలి చీమల చేత..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో ముసలవ్వ, ఓ బుజ్జి మేక ఉండేవారు. తనకంటూ ఎవరూ లేని ఆ అవ్వ బుజ్జిమేకను పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజూ దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ. ఒకరోజు మాత్రం మేతకు తీసుకెళ్లలేదు. అది గమనించిన మేక ఏమయ్యిందవ్వా...! నన్ను మేతకెందుకు తీసుకెళ్లలేదు అని అడిగింది. ఏమీలేదు బుజ్జిమేకా...! నాకు జ్వరం వచ్చింది, నిన్ను మేతకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు అని చెప్పింది.\n\nమరేం ఫర్వాలేదవ్వా... నేను ఒక్కదాన్నే \"ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా\" అని చెప్పి బయలుదేరింది బుజ్జిమేక. అలా వెళ్తుండగా దార్లో నక్క ఒకటి ఎదురైంది. అది మీదపడి తినేసేందుకు రాగానే... మేక ఇలా అంది... \"నక్క బావా, నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే\" అని చెప్పింది. ఆలోచనలో పడ్డ నక్క సరేనని పంపించింది.\n\nతరువాత మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది. అది కూడా మేకను తినేసేందుకు రాగానే...\"వద్దు తోడేలు బావా... ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే\" అంది. తోడేలు కూడా సరేనని ఒప్పుకుంది.\n\nఅలా మేక మెల్లిగా నడుస్తూ, పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే... దార్లో పులి ఎదురైంది. అమాంతం మీదపడి తినేసేందుకు పులి మేక దగ్గరకు ఉరికి వచ్చింది. ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైన అందరికీ చెప్పినట్లుగానే చెప్పింది. అంతా విన్న పులి... సర్లేగానీ, త్వరగా వచ్చేయి, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి పంపించింది.\n\nహమ్మయ్య... బ్రతుకు జీవుడా అనుకుని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది. సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది. మేక కూడా ఎప్పట్లాగే... \"వద్దు సింహం బావా, వద్దు. ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా\" అని నమ్మబలికింది. మేక మాటలను నమ్మిన సింహం కూడా మిగతా అన్నింటిలాగే ఎదురుచూస్తూ కూర్చుంది.\n\nఅలా అన్నింటి బారినుండి ప్రాణాలతో బయటపడ్డ బుజ్జిమేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడగానే అందులోకి దూరి కూర్చుని \"దొర్లు దొర్లు గుమ్మడికాయ్; దొర్ల కుంటే దోసకాయ్\" అనుకుంటూ బయలు దేరింది.\n\nఅలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురౌతుంది. అపుడు సింహం \" ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా\" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ \"లేదు లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు.\" అన్నది.\n\nఅలా పోతూ ఉంటే... పులి ఎదురై, ఇటుగా ఓ మేక వెళ్లింది. నువ్వుగానీ చూశావా అంటూ ఆరాలు తీసింది. నాకలాంటి మేక అసలు కనబడనేలేదు అని చెప్పి తప్పించుకుంది బుజ్జి మేక. అలాగే మిగతా సింహం, తోడేళ్లకు కూడా ఇలాగే బదులిస్తూ... వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ పోయింది.\n\nఅయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి, గుమ్మడికాయకు ఓ పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది. దీంతో విషయం అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకుని బయటకు వచ్చి, చెంగు చెంగున ఎగురుకుంటూ, నక్కకు అందకుండా తప్పించుకుని పారిపోయింది. ఎలాగోలా అవ్వ దగ్గరకు చేరుకున్న బుజ్జిమేక సంతోషంగా అవ్వతో ఇలా అంది... \"ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను. పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను\". ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 587,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "చందమామ అంటే అందరికీ ఇష్టమే. చిన్నాగాడికైతే చెప్పలేనంత ఇష్టం. ఊహల్లో చందమామ చాలా బాగుంటాడు. తెల్లగా, చల్లగా ఉండే చందమామ దగ్గరికెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది చిన్నాకు. అయితే చిన్నా అందరిలా ఖాళీగా కూర్చోలేదు. ఓ రాకెట్ సంపాదించాడు.\n\nఒకరోజు సాయంత్రం అయ్యే సరికి ఆ రాకెట్‌పైన కూర్చొన్న చిన్నా చందమామ దగ్గరికి బయలుదేరాడు. వెళ్తుండగానే బాగా చీకటి పడిపోయింది. చీకట్లో భయం వేసింది. చీకట్లో చందమామ ఎక్కడున్నాడో కూడా కనిపించలేదు. దారి కూడా తెలియలేదు. అయినా కూడా పట్టువిడవని విక్రమార్కుడిలా చిన్నా.. వెనక్కి తిరగకుండా రాకెట్‌ను ఇంకా పైపైకి పోనిచ్చాడు.\n\nఅలా వెళ్ళగా, వెళ్ళగా... ఓ చోట చిన్నాకు చందమామ కనిపించాడు. ఇంకేముంది చిన్నా ఆనందానికి అంతే లేకుండా పోయింది. రాకెట్ మీదనుంచి ఒక్క ఉదటున కిందికి దిగిన చిన్నా... అటూ, ఇటూ కలియదిరిగాడు. పరుగులెత్తాడు. సంతోషంతో గట్టిగా అరిచాడు.\n\nఅయితే చిన్నాకు బాగా నిరాశ కలిగింది. ఎందుకంటే... చందమామపైన అక్కడక్కడా రాళ్లు, దూరంగా కొండలు ఉన్నాయేగానీ... చూద్దామంటే ఒక్క చెట్టుకూడా లేదు, కనీసం గడ్డికూడా లేదు. అలాగే ఏవేని పిట్టలుగానీ, జంతువులుగానీ ఏమీ లేవు. చాలా శూన్యంగా, ఒంటరిగా అనిపించింది.\n\nఇంతలో చిన్నాకు బాగా దాహమేసింది. చందమామపై కనిపించిన చోటల్లా వెతికినా ఎక్కడ కూడా చుక్క నీరు కనిపించలేదు. ఇక గాలి సంగతైతే చెప్పనక్కర లేదు. సరిగా ఊపిరాడక ఆయాసంతో ఇబ్బంది పడిపోయాడు చిన్నా. చందమామ అంటే తాను ఎంత గొప్పగా ఊహించుకున్నాడు. ఇక్కడేమో ఏమీ లేవు అంటూ కూలబడిపోయాడు.\n\nఅబ్బా...! ఇక్కడేమీ బాగాలేదు. మా ఊరే దీనికన్నా చాలా బాగుంది. అక్కడైతే అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, మామలు, అత్తలు, పిన్నమ్మలు, చిన్నాన్నలు అందరూ ఉంటారు. ఇక నాకిష్టమైన బంటీగాడు (కుక్కపిల్ల), సన్నీ (పిల్లి) అన్నీ, అందరూ మావూర్లోనే ఉన్నారు. అక్కడైతే ఎంచక్కా అందరితో ఆడుకోవచ్చు, హాయిగా ఉండవచ్చు. ఈ చందమామపైన ఏమీ చేయలేము, ఎవరూ లేరు. నాకు ఈ చందమామ వద్దు అంటూ ఊరికి తిరుగు ప్రయాణమైనాడు.\n\nఊరికి చేరుకుని తన వాళ్లనందర్నీ చూసిన చిన్నాకు ప్రాణం లేచివచ్చినట్లైంది. అందరూ ఇంతసేపు ఎక్కడికెళ్లిపోయావురా అంటూ తడిమి తడిమి చూస్తుంటే, నేనిక్కడే ఉన్నానని గట్టిగా అరుస్తూ... ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాడు. నేనెక్కడున్నాను? అంటూ అందర్నీ అడిగాడు. ఇంతసేపు ఇక్కడే నిద్రపోతున్నావు గదరా... ఎక్కడున్నానంటావేంటి? అంది చిన్నా అమ్మ ఎదురుగా కూర్చుంటూ...\n\nచిన్నాకు అప్పుడుగానీ అర్థం కాలేదు... తాను ఇంతసేపు కలగన్నానని... చందమామపైకి ప్రయాణం, తిరిగీ ఇంటికి రావటం అంతా కలేనని మెల్లిగా అర్థమైంది. మరుసటిరోజు ఉదయాన్నే స్కూలుకెళ్లిన చిన్నా, తన ఫ్రెండ్స్ అందరికీ తాను చందమామపైకి వెళ్లి వచ్చిన కల గురించి అందరికీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 588,
        "IMAGE": "cat_7",
        "NAME": "చిన్నాగాడు... చందమామ..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.\n\nఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. \"నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి\" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.\n\n\"బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!\" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.\n\nకొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.\n\nపండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు రాము. వెంటనే ఓ పలుగూ పార తీసుకుని ఈశాన్య దిశలో, రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు.\n\nఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా, ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి.. ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటిచెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది.\n\nరాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు.\n\nశ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులూ కూడా వస్తాయని గ్రహించిన రాము, ఆరోజు నుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి పిల్లలూ... మీరు కూడా సోమరులుగా కాకుండా, బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై... పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేస్తారు కదూ..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 589,
        "IMAGE": "cat_7",
        "NAME": "శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "జమ్మికుంట అనే ఊర్లో ఓ జమీందారు ఉండేవాడు. అతడి దగ్గర ఓ మేలుజాతి గుర్రం ఒకటి ఉండేది. ఆ గుర్రం అంటే జమీందారుకి చాలా ఇష్టం, అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ గుర్రం బాగోగులు చూసేందుకు ఒక పనిమనిషిని కూడా నియమించాడు.\n\nకొంతకాలానికి ఆ గుర్రం కుంటుతూ నడవటం మొదలెట్టింది. తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతోమంది వైద్యులకు చూపించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడూ అదెందుకలా కుంటుతోందో కారణం కనిపెట్టలేకపోయారు.\n\nఅలా కొంత కాలం గడచిన తరువాత... ఆ వూరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన ఆ సాధువు.. తన గుర్రం ఎందుకు కుంటుతోందో చెబుతాడని నమ్మిన జమీందారు అతడి వద్దకు గుర్రంతో సహా వెళ్లాడు.\n\nవిషయమంతా విన్న ఆ సాధువు... \"ఈ గుర్రం ఆలనా పాలనా చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి\" అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే జమీందారు అతడిని రప్పించాడు.\n\nపనివాడు వస్తుండగా చూసిన సాధువు... \"నాయనా నీ గుర్రానికి ఈ కుంటితనం ఏదో జబ్బువల్ల వచ్చింది కాదు. అదిగో అతన్ని చూశావా..? అతను కుంటివాడు. రోజూ తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించటం వల్లనే ఆ కుంటితనం వచ్చింది\" అన్నాడు.\n\nఅలాగే... \"నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గుర్రం కుంటితనం మానాలంటే, దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే...!\" అని తేల్చి చెప్పాడు సాధువు.\n\nఅంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి, మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టుకున్నాడు. కొంతకాలానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవటం మొదలుపెట్టింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 590,
        "IMAGE": "cat_7",
        "NAME": "జమీందారూ.. కుంటి గుర్రం..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సంబల్‌పురి పట్టణంలో ఒక ప్రత్తి వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. అతడికి నలుగురు కుమారులు. ప్రత్తి వ్యాపారంలో బాగా ఆస్తిపాస్తులను వెనుకేసుకున్న ఆ వ్యాపారి ఓ రోజు హఠాత్తుగా బాగా జబ్బుపడ్డాడు. తానింక ఎక్కువ రోజులు బ్రతకలేననుకున్న అతడు కొడుకులందరినీ పిలిచాడు.\n\n\"మనకున్న ఆస్తి అంతా ప్రత్తే కాబట్టి, మన గోదాములో ఉన్న ప్రత్తితో మీరందరూ కలిసికట్టుగా వ్యాపారం చేస్తూ, మంచిగా జీవించండి\" అని చెప్పాడు. అతనలా చెబుతుండగా, అక్కడికి ఓ పిల్లి వచ్చింది. అది వాళ్ల పెంపుడు పిల్లి కాబట్టి, \"మరి నాన్నా దీన్నేం చేయాలి?\" అని అడిగాడు చిన్న కొడుకు. \"దాన్ని కూడా మీరు సమానంగా చూసుకోవాలి\" అని చెప్పాడు తండ్రి.\n\nమరికొన్ని రోజులకు ఆ వ్యాపారి చనిపోయాడు. నలుగురు కొడుకులూ తండ్రి చెప్పినట్లుగా జాగ్రత్తగా వ్యాపారం చేస్తూ ఉంటారు. తండ్రి పిల్లిని సమానంగా చూసుకోమన్నాడు కాబట్టి, నలుగురూ తలా ఓ కాలుని తమ వంతుగా తీసుకుని, ఒక్కో కాలునీ తమకి నచ్చినట్లుగా అలంకరించుకోవటం మొదలుపెట్టారు.\n\nఒకరోజు పిల్లికి వెనక కుడికాలుకి చిన్నపాటి దెబ్బ తగిలింది. ఆ కాలు అందరికంటే చిన్నవాడు చూసుకుంటున్నది కాబట్టి, వెంటనే దానికి నూనె పూసి, బట్టతో కట్టుకట్టాడు. అలా కట్టుతో ఆ పిల్లి గోదాములో ఎలుకను పట్టబోయి, చమురు దీపంపై పడింది. అంతే.. అప్పటికే నూనెతో తడిసిన కాలికట్టుకి నిప్పు అంటుకుంది. కంగారులో పిల్లి ప్రత్తి బస్తాలపై దూకగా, ప్రత్తి మొత్తం తగలబడి పోయింది.\n\nజరిగిన నష్టానికి కారణం చిన్నకొడుకు చూసుకుంటున్న పిల్లి కాలు కాబట్టి, ముగ్గురు అన్నలూ తమ్ముణ్ణి నష్టపరిహారం చెల్లించమని చెప్పారు. అంత మొత్తం తాను చెల్లించలేనని తమ్ముడు మొండికేశాడు. దీంతో అన్నలు ఆవూరి పెద్దకు ఫిర్యాదు చేశారు.\n\nవిషయమంతా విన్న ఆ ఊరి పెద్ద \"గోదాము తగలబడింది నిప్పు అంటుకున్న కాలువల్లే. కానీ, ఆ పిల్లి పత్తి బస్తాల మీదకు దూకింది మాత్రం మిగతా మూడు కాళ్లతోనే కదా...! కాబట్టి, అసలు కారణం ఆ మూడు కాళ్లు. అందువల్ల మీ ముగ్గురూ కలిసి చిన్నవాడికే నష్టపరిహారం చెల్లించాలి\" అంటూ తేల్చి చెప్పాడు.\n\nదీంతో ముగ్గురు అన్నలూ నిరాశతో తలవంచుకుని నిల్చున్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఇలా అన్నాడు.. \"మీలో మీరు తెలివితక్కువగా పోట్లాడుకుంటే మీకే నష్టం జరుగుతుంది. పిల్లి కాళ్ల సంగతి పక్కనపెట్టి, మళ్లీ అందరూ కలిసి ఐకమత్యంతో, కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి\" అంటూ బుద్ధి చెప్పి పంపించాడు.\n\nఊరిపెద్ద మాటలు సబబుగా అనిపించటంతో ఆ నలుగురు అన్నదమ్ములు ఇంకెప్పుడూ తమలో తాము గొడవ పడదనుకుని గట్టిగా నిర్ణయించుకుని సంతోషంగా ఇళ్లకు బయలుదేరారు. ఆరోజు నుంచి నలుగురు అన్నదమ్ములూ ఆనందంగా జీవనం గడపసాగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 591,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఐక్యమత్యమే ముద్దు..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా శివపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి, తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు. ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. అదే అడవిలో పెద్దపులి ఒకటి ఉండేది. అది మేతకు వచ్చిన గొర్రెలను, మేకలను తినేస్తూ ఉంటుంది.\n\nఆరోజు గొర్రెలను తోలుకెళ్లిన గొర్రెల కాపరి... తాను పక్కనే ఉన్న చెట్ల నుంచి కట్టెలు కొడుతుంటానని, గొర్రెలకు కాపలా కాస్తూ... పులి వస్తున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు.\n\nఅయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరకే ఉంటాడా... ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో, లేదో చూద్దామనుకుని \"నాన్నా పులి వచ్చింది\" అంటూ గట్టిగా అరిచాడు. అదివిన్న అతడి తండ్రి పరుగు పరుగున వచ్చి పులి ఎక్కడ? అని ప్రశ్నించాడు. చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడ చూసినా పులి కనిపించలేదు. కొడుకు సరదాగా అలా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్లీ కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.\n\nఈ తుంటరి పిల్లవాడు ఊరుకోకుండా... మళ్ళీ కాసేపటి తరువాత \"నాన్నా.. పులి వచ్చింది\" అంటూ గట్టిగా, భయంగా అరిచాడు. అది విన్న తండ్రి ఈసారి నిజమే గాబోలు అనుకుంటూ, కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ పులిలేదు. కొడుకును చీవాట్లు పెట్టిన అతను ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి, మళ్లీ తన పనిలోకి వెళ్ళిపోయాడు.\n\nతండ్రి తిట్టడంతో చాలాసేపటి దాకా కిమ్మనకుండా ఉన్న ఆ పిల్లవాడు మళ్ళీ \"నాయనా... పులి వచ్చింది\" అంటూ గట్టిగా కేకలేసాడు. ఈసారి కూడా నిజంగా పులి వచ్చిందనుకున్న తండ్రి పరుగెత్తుకుని వచ్చి చూస్తే.. అక్కడ పులీ లేదు గిలీ లేదు. పట్టరాని కోపంతో ఆ పిల్లవాడికి ఒక్కటిచ్చిన తండ్రి విసురుగా అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.\n\nగొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది. ఒక్కసారిగా పులిని చూసిన ఆ పిల్లాడు \"నాయనా నిజంగానే పులి వచ్చింది\" అంటూ భయం భయంగా గట్టిగా కేకలేసాడు. ఆ... వీడికి ఊరికే ఆటలెక్కువయినాయి. పులి రాకపోయినా వచ్చిందంటూ ఇందాకటినుంచీ మోసం చేస్తున్నాడు. అరిస్తే అరుచుకోనీలే అనుకుంటూ తన మానాన తను కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయాడు తండ్రి.\n\nఇంకేముందీ... పులి ఎంచక్కా గొర్రెలన్నింటినీ తినేసి అడవిలోకి పారిపోయింది. కట్టెలు కొట్టడం పూర్తయిన తరువాత కొడుకు దగ్గరకు వచ్చిన తండ్రి గొర్రెలు లేకపోవడం చూసి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉండిపోయాడు.\n\nకాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే... ఒకసారి అబద్ధం చెప్పిన వారి మాటలను ఎవరూ నమ్మరు. ఒక్కసారి అబద్ధం చెప్పి, తరువాత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు. కాబట్టి, నవ్వులాటకు కూడా అబద్ధాలాడకూడదు. అబద్ధమాడితే ఆపదలను కొనితెస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 592,
        "IMAGE": "cat_7",
        "NAME": "అబద్ధం ఆపదకు చేటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శీనయ్యను, ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలయంలో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు త్రుణమో, పణమో సమర్పించుకునేవాళ్ళు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు.\n\nఅవ్వ కష్టపడి శీనయ్యను పెంచేది. కానీ వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో శీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడని తిడుతుంటే, వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే శీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువుసంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే, బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా, వాడి మొరటుతనం పెరగసాగింది.\n\nఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవణ్ణి దగ్గరికి పిలిచి... \"నాయనా శివయ్యా...! అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధ పడి, వాళ్ళ మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏదీ ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవారే, రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు\" అని చెప్పి కన్నుమూసింది.\n\nఅవ్వ పోయాక ఊరిజనం శీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి, అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడై తిరిగి వచ్చి, అందరిదగ్గరా మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూదీ కనిపించాయి.వాటిని చూడగానే...\"ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు,\" అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా, అక్కడ్నించి బయటపడ్డాడు.\n\nఅలా వెళ్తుండగా... ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో.. శీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు పదికాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో శీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి, వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది.\n\nదగ్గరికెళ్ళిన శీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముల్లు గుచ్చుకుపోయింది ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు.\n\n\"ఓస్, ఇంతేనా? అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన శీనయ్య జమీందారు కాలినుంచి ముల్లును సునాయాసంగా తీసి పారేశాడు. దీంతో ముల్లు బాధనుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లుకూడా శీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు.\n\nవిషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ... శీనయ్య వివరాలు అడిగి తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో శిస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి, వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను చేరుతావా..? అని అన్నాడు జమీందారు.\n\nపట్టరాని సంతోషంతో శీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత శిస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్ళిన అతడిని గ్రామస్థులంతా చాలా గౌరవంగా \"శీనయ్యగారూ\" అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. \"ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు\" అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగిపోయాడు శీనయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 593,
        "IMAGE": "cat_7",
        "NAME": "అవ్వ దీవెనలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో పెద్ద కొలను ఒకటి ఉండేది. ఆ కొలను దగ్గర మర్రిచెట్టు ఉండేది, ఆ చెట్టుమీద ఆడ, మగ కొంగలు నివాసం ఏర్పుర్చుకుని జీవిస్తుండేవి. ఇలా రోజులు గడుస్తుండగా కొంగ జంటలోని ఆడకొంగ గుడ్లుపెట్టి పొదగసాగింది.\n\nఒకరోజు మగ కొంగ తిండి కోసం వేటకు వెళ్లి తిరిగి రాగానే, ఆడకొంగ దిగాలుగా కూర్చుని కనిపించింది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? అంటూ ఆడకొంగను ప్రశ్నించింది. \"మరేం లేదు... ఈ చెట్టుకిందనే పెద్ద పుట్ట ఉందట. ఆ పుట్టలోని పాము చెట్టుపైకి వచ్చి చిన్న చిన్న పక్షి పిల్లలను అన్నింటినీ తినేస్తూందట. అందుకే చెట్టుమీద ఇంతకుముందున్న పక్షులన్నీ భయంతో ఈ చెట్టును వదలి పారిపోయాయి\" అంటూ బాధగా చెప్పింది.\n\n\"ఓస్... అంతేనా..? నువ్వేమీ భయపడవద్దు. నేనో మంచి ఉపాయం ఆలోచిస్తాను. ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకుందాంలే..\" అంటూ ఆడకొంగకు ధైర్యం చెప్పింది మగ కొంగ.\n\nతరువాత ఒకరోజు ఆడకొంగను పిలిచి... \"నేను కొన్ని చేపలను ముక్కున కరచుకుని వచ్చి వరుసగా పాము పుట్ట దగ్గర పడేస్తాను. అలా చేపల కోసం ముంగిస తప్పకుండా వస్తుంది. చేపలను తింటూ, తింటూ పాము పుట్ట దగ్గరకు కూడా వెళ్తుంది. అప్పుడు పామును కూడా ముంగిస తినేస్తుంది. తరువాత మనకేమీ భయం ఉండదు\" అని చెప్పింది.\n\nమరుసటి రోజు ఉదయాన్నే ముందు చెప్పినట్లుగానే మగ కొంగ చేపల్ని తీసుకొచ్చి పుట్టముందు పడవేసింది. చేపల్ని చూసిన ముంగిస ఆశగా ఒక్కొక్కదాన్ని తింటూ, పుట్ట దగ్గరకు చేరుకుంది. పుట్టలో ఉన్న పామును చూసి ముంగిస మరింత సంతోషం కలిగింది. కాసేపు పాముతో తలపడి, ఎట్టకేలకు దాన్ని చంపి తినేసింది ముంగిస.\n\nపామును చంపి తినేసిన ముంగిస విజయగర్వంతో పైకి తలెత్తి చూస్తే... కొంగ పెట్టిన గుడ్లు కనిపించాయి. ఇంకేముంది అలా కనిపించిన గుడ్లను ముంగిస ఊరికే వదులుతుందా, గబగబా చెట్టెక్కి, గుడ్లని కూడా సుష్టుగా భోంచేసి ఎంచక్కా వెళ్లిపోయింది.\n\nఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఏదేని అపాయం సంభవించినప్పుడు, ఉపాయం ఆలోచిస్తే మాత్రం సరిపోదు. ఉపాయాన్ని ప్రయోగించిన తరువాత వచ్చే ఆపదలను కూడా ఆలోచించగలగాలి. లేకపోతే కొంగల జంటకి పట్టిన గతే మనకూ పడుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 594,
        "IMAGE": "cat_7",
        "NAME": "కొంగ తెలివి..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "కైలాసగిరి అనే అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఒక పెద్ద పులి నివసిస్తుండేది. ఆ పులి మహా టక్కరిది. ఆహారం కోసం ఎలాంటి పనికయినా అది వెనుకాడేది కాదు. ఆ గుహకు సమీపంలోనే ఒక జువ్వి చెట్టు కూడా ఉండేది. ఆ జువ్వి చెట్టుపైన ఒక కొంగ నివసిస్తూ ఉండేది. ఈ పులికి, కొంగకు పెద్దగా స్నేహం అంటూ ఏమీ లేదు కాగనీ, అప్పుడప్పుడు మాట్లాడుకునేవి.\n\nఒకరోజు పులి ఒక మేకపోతుని వేటాడి తింటుండగా, ఓ సన్నటి ఎముక ఒకటి దాని గొంతులో గుచ్చుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, మెడ బలంగా విదిలించినా, గట్టిగా గాలి లోపలికి పీల్చినా ఎముక బయటకు రాలేదు. అలా నొప్పితో పులి కష్టపడుతూ ఉండగా సాయంత్రం అయ్యింది.\n\nకొంగ తన ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది. గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది. పులి పడుతున్న బాధను చూసి ఏం మిత్రమా...! ఏంటి అంత బాధపడుతున్నావు? అంటూ కుశల ప్రశ్నలు వేసింది.\n\nఅప్పుడు పులి.. \"మరేంలేదు మిత్రమా...! ఎముకు ముక్క ఒకటి నా గొంతులో గుచ్చుకుపోయింది. అది చాలా బాధ పెడుతోంది. దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదూ...!\" అంటూ బ్రతిమలాడింది. కొంగకి పులి బాధ చూసి చాలా జాలేసింది. కానీ పులి క్రూర జంతువు కాబట్టి, ఎముక ముక్క తీసేసిన తరువాత తననే మింగేసిన ఆశ్చర్యపడాల్సింది లేదు అనుకుంటూ అలాగే నిలబడింది.\n\nదీన్ని గమనించిన పులి \"ఓ మిత్రమా నేను నిన్ను ఏమీ చెయ్యను, భయపడకు. ఎముక ముక్క లాగి కొంచెం సహాయం చెయ్యి, నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను\" అంటూ దీనంగా అడిగింది. దీంతో కొంగ దయతలచి తన పొడుగయిన ముక్కుని పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది. అప్పటినుంచి పులి, కొంగ రెండూ స్నేహంగా మెలగసాగాయి.\n\nఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు పులి వేటకి వెళ్ళగా, సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికి దొరకలేదు. దిగాలుగా, నీరసంగా, ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది. ఏమీ తోచక గుహ బయటికి వచ్చి కూర్చుంది. అదే సమయంలో కొంగ కూడా ఇంటికి చేరుకుంది.\n\nదిగాలుగా కూర్చున్న పులిని చూసిన కొంగ \"ఏంటి మిత్రమా... మళ్ళీ ఏమయ్యింది?\" అంటూ ప్రశ్నించింది. అప్పుడు జిత్తులమారిదైన పులి \"మిత్రమా మళ్లీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు\" అంటూ దొంగ ఏడుపును నటించింది.\n\nపాపం... పులి ఏడుపు నిజమేననుకున్న అమాయకపు కొంగ తన పొడుగాటి ముక్కును మళ్లీ పులి నోట్లో పెట్టింది. ఇంకేముంది... జిత్తులమారి పులి తను బుద్ధిని చాటుకుంటూ క్రూరంగా కొంగ మెడ కొరికి చంపి తినేసింది.\n\nకాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే... దుష్టుడయిన వాడు స్నేహితుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడు. అలాంటివారితో స్నేహం చేస్తే, కొంగకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. కాబట్టి, చెడ్డవాళ్లతో స్నేహం చేయరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 595,
        "IMAGE": "cat_7",
        "NAME": "దుష్టులకు దూరంగా...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అసలే మే నెల... ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం కావడంతో పొలాలు, చెరువులు, బావులు.. అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఒక కాకికి బాగా దాహం వేస్తోంది. విపరీతమైన దాహంతో అది, దానికి తెలిసిన ప్రాంతాలన్నింటినీ నీటికోసం గాలించేసింది. ఎక్కడా దానికి ఒక్క నీటి చుక్క కూడా కానరాలేదు.\n\nఅలా... నీటి కోసం కాకి వెతకని చోటు లేదు. నీరు మాత్రం దొరకడం లేదు. దీంతో అది రోజు రోజుకూ నీరసించిపోతోంది. ఇక ఇప్పట్లో నీరు దొరుకుతుందన్న ఆశ కూడా లేకపోవడంతో... \"దేవుడా నన్ను నీవే రక్షించాలి\" అని మనసులో అనుకుంటూ, అలాగే ఉండిపోయింది.\n\nఎప్పట్లాగే ఒకరోజు కాకి నీటికోసం వెతుకుతుండగా... ఒక చెట్టుకింద ఓ మట్టి కూజాలో నీరు కనిపించింది. నీరు బాగా అడుగున ఉండటంతో, కాకి వాటిని తాగాలంటే అందటం లేదు. దొరక్క దొరక్క దొరికిన నీటిని ఎలాగైనా సరే... తాగి తీరాలని అనుకుంది. అయితే ఎలాగ..? అంటూ ఆలోచనలో పడింది.\n\nవెంటనే ఆ మట్టికూజాను ఒకవైపుకు వంచింది. కూజా మెడ ప్రాంతం బాగా సన్నగా ఉండటంతో నీటిని కాకి అందుకోలేక పోయింది. ఇప్పుడెలాగబ్బా..? అనుకుంటూ అటూ, ఇటూ తిరిగింది. అలా తిరుగుతుండగా వెంటనే దానికో ఉపాయం తట్టింది.\n\nఆ కూజాను నిటారుగా నిలబెట్టి, చెట్టుకింద ఉండే చిన్న చిన్న గులకరాళ్ళను ఒక్కోటిగా తెచ్చి వేయడం మొదలెట్టింది కాకి. అలా వేస్తుండగా కూజాలోంచి నీరు మెల్ల మెల్లగా పైకి రావటం మొదలైంది. పైకి వచ్చిన నీటిని చూసిన కాకి సంతోషంతో గబగబా తాగేసి దాహం తీర్చుకుంది. తాను చేసిన ప్రయత్నం ఫలించటంతో కాకి పట్టరాని ఆనందంతో ఎగిరిపోయింది.\n\nపిల్లలూ..! ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే... ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు, వెంటనే కుంగిపోకుండా.. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనం అనుకున్నది సాధించాలంటే ముందుగా, కష్టించి పనిచేయటం నేర్చుకోవాలి. బాగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య కయినా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 596,
        "IMAGE": "cat_7",
        "NAME": "కాకి దాహం తీరింది...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే ఊర్లో శివాజీ అనే అబ్బాయి ఉండేవాడు. ఐదో తరగతి చదువుతుండే శివాజీ ఒకానొక రోజున తన క్లాస్‌మేట్ పుస్తకాన్ని దొంగిలించాడు. ఇంటికొచ్చి తల్లికి చూపిస్తే... తల్లి సంతోషంతో మురిసిపోతూ.. మంచిపని చేశావు నాన్నా..! అంటూ మెచ్చుకుంది.\n\nఅంతేగాకుండా.. పక్కింటి వాళ్లందరికీ \"మా అబ్బాయి చాలా తెలివైనవాడు\" అంటూ కొడుకు గురించి గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూస్తోన్న శివాజీకి తాను చేస్తున్న దొంగ పనులు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. వయసు పెరిగేకొద్దీ శివాజీ దొంగతనాలు, హత్యలు కూడా పెరిగిపోయి ఆ ఊర్లో ఒక పెద్ద దొంగగా పేరు తెచ్చేసుకున్నాడు.\n\nఊర్లో రాను రాను దొంగతనాలు పెరిగిపోవడంతో ఆగ్రహించిన ఆ ఊరి ప్రజలు శివాజీపై పోలీసు కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఊరిపై దాడి చేసి ఎలాగోలా శివాజీని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కేసు విచారించిన జడ్జి లెక్కకు మించి దొంగతనాలు చేసి, మనుషుల ప్రాణాలను తీసిన శివాజీకి ఉరిశిక్ష విధించాడు.\n\nకోర్టులో జడ్జి తీర్పు విన్న శివాజీ తల్లి... గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన కొడుకును ఎలాగైనా కాపాడండి అంటూ కనిపించిన వారినల్లా అడుగుతుంది. శివాజీని ఉరిశిక్ష తీసేరోజు రానే వస్తుంది. చివరిసారిగా తన కొడుకుతో ఏమైనా మాట్లాడాలనుంటే మాట్లాడవచ్చని జైలు అధికారులు అతడి తల్లిని పిలిపించారు.\n\nతన కొడుకు ఇకపై తనకు దక్కడని, విపరీతమైన దుఃఖంతో ఏడుస్తూ... ఆమె కొడుకు దగ్గరికి వెళ్లింది. ఇనుప కమ్మీలకు అటువైపు నున్న కొడుకును చూసి పలుకరించగా, కొడుకు మాట్లాడేది ఆమెకు సరిగా వినిపించలేదు. ఏంటి నాయనా..! అంటూ తన చెవులను కమ్మీలకు దగ్గరగా పెట్టగా ఒక్కసారిగా శివాజీ ఆమె చెవిని కసిగా కొరికేశాడు.\n\nఇదంతా గమనిస్తూ ఉన్న జైలు పోలీసులు అతడిని పక్కకు లాగేసి... \"ఆమె నీకు కన్నతల్లేనా...? తల్లి అయితే ఆమె చెవినే కొరికేస్తావా..? నువ్వసలు మనిషివేనా?\" అంటూ తిట్టిపోశారు.\n\nఅప్పుడు నోరు తెరిచిన శివాజీ పట్టరాని కోపంతో ఇలా అన్నాడు. \"ఈరోజు నాకు ఉరిశిక్ష పడుతోందంటే.. దీనికంతటికీ ఆమె కారణం. చిన్నప్పుడు నేను దొంగతనం చేసిన రోజునే నన్ను దండించి, ఇది తప్పురా నాన్నా..! అని చెప్పి ఉంటే.. ఈరోజు నేను ఇలా తయారయ్యేవాడినే కాదు.\"\n\n\"తప్పుచేసిన ప్రతిసారీ ఈమె నన్ను ప్రోత్సహించిందేగానీ.. ఏనాడూ ఇది తప్పు అని చెప్పలేదు... అందుకనే నేను వ్యక్తిగా ఏమాత్రం ఎదగలేదు. ఈరోజు ఇలా అందరిముందూ దోషిలా నిలబడి, నా జీవితానికి నేనే సమాధి కట్టుకుంటున్నాను\" అంటూ... తనముందు అసలు నిలబడవద్దని తల్లిని హెచ్చరించి పంపేశాడు శివాజీ.\n\nఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి పిల్లలూ...! చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులు, అలవాట్లు నేర్చుకోవాలి. తప్పుడు దారుల్లో నడవకూడదు. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసినప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పటికీ, మీరు అలాంటి పనలు చేయకూడదు.\n\nతల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు.. \"ఇది తప్పు\" అని తెలియజెప్పాలే గానీ... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. లేకపోతే... శివాజీకి పట్టిన గతే మీ పిల్లలకూ పడుతుంది. జరగాల్సింది జరిగిపోయిన తరువాత ఎంత విచారించినా లాభం ఉండదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 597,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆరోజే దండించి ఉంటే...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సింగరాయగుంట అనే ఊర్లో సుబ్బయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతను ఊర్లోని వాళ్లందరికీ వడ్రంగి పనులు చేసి పెడుతూ జీవనం సాగిస్తుండేవాడు. అదే ఊర్లోని చెట్లపైన కోతుల గుంపులు కూడా చాలా ఉండేవి.\n\nఈ కోతులు చాలా అల్లరివి. ఊర్లో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు. ఇళ్లలో పెంచుకున్న పండ్ల మొక్కల్లోంచి పండ్లన్నింటినీ తెంపి తినేసి, ఇష్టం వచ్చినట్లుగా పడవేసేవి. ఎవరు ఎలాంటి పని చేస్తున్నా కోతుల గుంపు అక్కడ ప్రత్యక్షమై... ఆ పనిని నాశనం చేస్తూ ఉండేవి.\n\nఇదంతా చూసిన ఊరివాళ్ళందరూ... అబ్బా ఈ కోతుల పీడ ఎప్పటికి వదులుతుందో అని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉంటే... వడ్రంగి సుబ్బయ్య ఒకరోజు ఓ చెట్టు దగ్గర ఎండిపోయి ఉన్న చెక్క దూలాన్ని చూశాడు. తనకు పనికొస్తుందని భావించిన అతడు దాన్ని ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకున్నాడు. చెట్టునుంచి ఎండిన ఆ దూలాన్ని వేరుచేసే పనుల్లో నిమగ్నమయ్యాడు.\n\nఈలోపు మధ్యాహ్నం కావడం, బాగా ఆకలిగా ఉండటంతో భోజనానికి ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ, వెళ్తూ చెక్కదూలాన్ని విడిగా చీల్చి, మేకులు కొట్టి, అది దగ్గరకు రాకుండా వదిలిపెట్టాడు. ఇక మిగతా పనిని భోజనం చేసి వచ్చి చూద్దాంలే అనుకుంటూ దాన్నక్కడే వదిలేసి వెళ్లిపోయాడు సుబ్బయ్య.\n\nసుబ్బయ్య అలా వెళ్ళాడో లేదో, అల్లరిమూక అయిన కోతుల గుంపు అక్కడికి చేరిపోయింది. ఆ చెట్టుపైన ఒకటే ఆటలు పాటలు... చెప్పలేనంత అల్లరి చేస్తూ, ఆ ప్రాంతాన్నంతా అల్లకల్లోలం చేశాయి. అప్పుడే వాటి కన్ను మధ్యకు చీల్చి ఉన్న దూలంపై కన్నుపడింది.\n\nఇదేంటో చూద్దాం అనుకుంటూ ఓ కోతి చీల్చి ఉన్న దూలం మధ్యలో దూరి, కూర్చుని మధ్యలో ఉన్న మేకుల్ని తీసి అవతల విసిరి పారేసింది. ఎప్పుడైతే కోతి మేకుల్ని తీసేసిందో... అప్పుడే దూలం చటుక్కున దగ్గరికి అయిపోయింది. ఇంకేముంది దూలం మధ్యలో ఇరుక్కుపోయిన కోతి పొట్ట బాగా నలిగిపోయి, ఊపిరాడక చనిపోయింది.\n\nదీన్నంతా కళ్లారా చూసినా కోతులన్నింటికీ అప్పటికిగానీ బుద్ధి రాలేదు. తాము చేస్తోన్న అల్లరి పనులవల్లనే ఇలా అయ్యిందని, ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని అవి నిర్ణయించుకుని, ఏడుస్తూ... చచ్చిపోయిన కోతిచుట్టూ చేరాయి.\n\nపిల్లలూ మరి ఈ కథలో నీతి ఏంటో అర్థమైందా...? మనవి కాని పనుల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అనవసరంగా ఇతరుల పనుల్లో వేలు పెడితే... అది మనకే ప్రమాదంగా మారుతుందని, ఈ కోతుల కథ ద్వారా తెలుస్తోంది కదూ...!? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 598,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఇతరుల పనుల్లో వేలు పెట్టొద్దు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో నెమళ్ళు గుంపులు గుంపులుగా నివసిస్తుండేవి. అదే అడవిలో కాకుల గుంపులు కూడా నివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తుంటాయి. అసలే అందంగా ఉండే నెమళ్ళు ఒకరోజు సంతోషంతో చిందులు వేస్తూ, పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి.\n\nనెమళ్ళ అందాన్ని, నాట్యాన్ని చూసిన ఓ కాకి ఈర్ష్యాసూయలతో రగిలిపోయింది. \"నాకు కూడా నెమళ్ళకిలాగానే అందమైన పింఛాలుంటే ఎంత బాగుండు\" అని మనసులో అనుకుంది. అలా అనుకుంటూనే దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయింది.\n\nఆలోచనల్లోంచి తేరుకున్న కాకి ఓ నిర్ణయానికి వచ్చినదానిమల్లే... ఒక్క ఉదటున పరుగెత్తి అక్కడక్కడా ఊడిపోయి పడిఉన్న నెమలి ఈకలన్నింటినీ ఏరి తెచ్చుకుంది. ఎవరూ చూడకుండా తన తోకకు వాటిని అంటించుకుని, సంతోషంతో కులుకుతూ పరుగులెత్తింది.\n\nఇలా ప్రతిరోజూ రాలిపోయిన నెమలి ఈకలన్నింటినీ ఏరి తెచ్చుకుని తోకకు అంటించుకుంటోన్న కాకి \"నేనే గొప్ప, నేనే గొప్ప\" అంటూ చెప్పుకునేది. దీంతో కాకుల గుంపులోని ఏ కాకి కూడా దీని దగ్గరకు చేరేది కాదు.\n\nకొద్ది రోజులు గడిచిన తరువాత కాకి సంగతిని కనిపెట్టిన నెమళ్ళు, అది అతికించుకున్న ఈకలన్నింటినీ ఊడబెరికి, దేహశుద్ధి చేసి... ఇకనైనా బుద్ధిగా ఉండమని హెచ్చరించి వదిలిపెట్టాయి.\n\nఈకలన్నీ ఊడిపోగానే ఒక్కసారిగా కాకి రూపం అంధవికారంగా మారిపోయింది. దీంతో తమకంటే భిన్నంగా కనిపిస్తోన్న ఆ కాకిని మిగిలిన కాకులు తమ గుంపులోకి రానీయకుండా వెళ్ళగొట్టాయి. అటు నెమళ్ళ గుంపులోకీ, ఇటు కాకుల గుంపులోకి వెళ్ళలేక చేసిన తప్పుకు బాధపడుతూ... కాకి విచారంలో మునిగిపోయింది.\n\nపిల్లలూ...! ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే... తనకులేని వేషాలను వేయరాదు. వేరేవాళ్ళను చూసి, అబ్బా... వాళ్ళకి ఉన్నాయి మనకు లేవు అని అసూయ పడకూడదు. నెమలి ఈకలను అంటించుకున్న కాకికి ఏర్పడిన పరిస్థితి మనకు ఎదురుకాకుండా ఉండాలంటే... అసూయ అనేదాన్ని మనలో రానీయకుండా జాగ్రత్త పడాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 599,
        "IMAGE": "cat_7",
        "NAME": "పులిని జూసి నక్క చందంగా...! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి.\n\n\"అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం\" అని అనుకున్నాయి.\n\nమొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... \"సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు\" అని తేల్చి చెప్పింది.\n\nఇక మూడో చేప... \"నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ\" ఎంచక్కా వెళ్లిపోయింది.\n\nఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.\n\nచెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.\n\nఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.\n\nకాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే... మొదటగా ముందుచూపుతో ఆలోచించటం నేర్చుకోవాలి. ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి, తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేప పరిస్థితి లాగా అయిపోతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 600,
        "IMAGE": "cat_7",
        "NAME": "మూడు చేపల కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ముసలి పులి స్నానం చేసి ఒక చేతిలో దర్భలు, మరో చేతిలో బంగారు కంకణం చేతిలో పట్టుకుని ఏటి గట్టుపైన కూర్చుంది. అదే సమయంలో ఏట్లో స్నానం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణుడు ఆవలి గట్టుమీద ఉన్న పులిని చూసి భయంతో పారిపోబోయాడు.\n\nఇది చూసిన పులి \"ఓయీ బ్రాహ్మణుడా...! నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను\" అంది. దీంతో కాస్తంత బెరుకుగానే ఆగిపోయాడు బ్రాహ్మణుడు. ఇంకా అతడికి భయం పోలేదని గ్రహించిన పులి... \"ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకో..!\" అంటూ నమ్మబలికింది.\n\nబంగారం అనగానే, అసలే పేరాశ కలిగిన ఆ బ్రాహ్మణుడికి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ పులి క్రూరజంతువు కదా... దీన్నెలా నమ్మేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అది చూసిన పులి.. \"నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని బోలెడంత పాపం మూటగట్టుకున్నాను. ఇకమీదటైనా అలాంటి పనులు మానుకోవాలని అనుకుంటున్నాను\" అని చెప్పింది.\n\nఅయినా కూడా బ్రాహ్మణుడు తన దగ్గరకు రాకపోవడంతో... \"నేను పాపపు పనులు చేసేటప్పుడు ఒక పుణ్యాత్ముడు నామీద దయతలచి ఇకపై ఎప్పుడూ పశువులను, మనుషులను చంపకుండా ఉండి సత్కార్యములు చేశావంటే... కాస్తంత పుణ్యమైనా దక్కుతుందని\" హితబోధ చేశాడు అని చెప్పింది పులి.\n\n\"కాబట్టి... ఆరోజు నుంచి నేను పాపపు పనులేమీ చేయకుండా... ఇలా దానధర్మాలు చేస్తూ, నా పాపాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటున్నాను\" అని మళ్ళీ నమ్మబలికింది ఆ పులి. దాని మాటలకు పూర్తిగా లోబడిపోయిన ఆ బ్రాహ్మణుడు బంగారంపైన ఆశతో... ఏటి అవతలి ఒడ్డువైపున ఉన్న పులి వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించి బురదలో దిగబడిపోయాడు.\n\nఅప్పటిదాకా వేచిచూస్తోన్న పులి, బ్రాహ్మణుడికి దగ్గరికి వచ్చి.. \"అయ్యో...! బురదలో దిగబడిపోయావు కదా... ఉండు నేను వచ్చి నిన్ను బయటికి తీస్తాను\" అంటూ ఒక్కసారిగా మీదపడింది. అసలే ఆకలితో ఉన్న పులి, ఆ పేరాశ బ్రాహ్మణుడిని సుష్టుగా భోంచేసింది.\n\nకాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటంటే... పేరాశ ఎప్పటికీ మంచిది కాదు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే అన్ని రకాలుగా ఆలోచించిగానీ ఓ నిర్ణయానికి రాకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 601,
        "IMAGE": "cat_7",
        "NAME": "పులి.. పేరాశ బ్రాహ్మణుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సోమయ్య ఇంట్లో ఓ దున్నపోతు, గాడిద ఉండేవి. అతను గాడిదను ఇంటిదగ్గర చిన్న చిన్న పనులు చేసేందుకు ఉపయోగించు కునేవాడు. అలాగే దున్నపోతుతో పొలం దున్నించడం, బండి లాగించటం లాంటి బరువు పనులన్నింటినీ చేయిస్తుండేవాడు.\n\nబాగా కష్టమైన పనులు పదే పదే చేయటంతో దున్నపోతు బాగా అలసిపోయేది. దానికి తన యజమానిమీద అసహ్యం కలగసాగింది. అయినప్పటికీ చేసేదేం లేక నిస్సహాయంగా పనిచేస్తూ ఉంటుంది.\n\nఒకరోజు తన కష్టాలన్నింటినీ గాడిదతో చెప్పుకుంది దున్నపోతు. అంతా విన్న గాడిద దున్నపోతుకు ఓ మంచి ఉపాయం చెప్పింది. దీంతో దున్నపోతు మరుసటి రోజు పొద్దుటి నుంచీ నీరు త్రాగడం, గడ్డి మేయటం మానేసింది. రెండు రోజులుగా అది ఏమీ తినకుండా ఉండటంతో బాగా నీరసించిపోయింది.\n\nదున్నపోతుకు ఏదో జబ్బు చేసినట్లుందని భావించిన సోమయ్య దాన్ని పొలానికి తోలుకెళ్లడం మానేశాడు. అంతేగాకుండా గాడిదనే అన్ని పనులకూ ఉపయోగించటం మొదలుపెట్టాడు. \"దున్నపోతుకు సాయం చేద్దామని ఉపాయం చెబితే... నేనే అపాయంలో పడ్డానే... అది మాత్రం ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటోంది. దానిపని కూడా నేనే చేయాల్సి వస్తోందని\" గాడిద వాపోయింది.\n\nఇంక ఇలాగ కాదు.. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అనుకుంది గాడిద. అనుకున్నదే తడవుగా దున్నపోతు దగ్గరకు వెళ్లి.. \"ఈ భోగం ఇంకెన్నాళ్ళులే...! ఇక రేపటినుంచి నీ ఆటలు సాగవు. నీకు జబ్బు చేసిందని, ఏ పనీ చెయ్యలేక పోతున్నావని... మన యజమాని నిన్ను కసాయి వాళ్లకు అమ్మేస్తున్నాడు\" అని చెప్పింది.\n\nదీంతో ఖంగుతిన్న దున్నపోతు, బుద్ధి తెచ్చుకుని తెల్లారగానే పొలానికి వెళ్లిపోయింది. అలా చెబితేగానీ దున్నపోతు కదలదని భావించిన గాడిద, తెలివిగా అదనపు పనినుంచి తప్పించుకుంది. హమ్మయ్య... ఇకమీదట ఎవరిపని వాళ్లు చేసుకోవచ్చు. లేకపోతే తన ప్రాణానికొచ్చేదని నిట్టూర్చింది గాడిద.\n\nపిల్లలూ...! ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఎంటంటే.... ఎవరిపని వారే చేయాలి. ఉచిత సలహాలు ఇవ్వడం మానేయాలి. అలా చేస్తే... ఉపాయం కాస్తా తమకే అపాయంగా మారుతుందని గ్రహించాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 602,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఉచిత సలహాలు వద్దు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించే సీతయ్య ఎప్పట్లాగే ఆరోజు కూడా అడవికి కట్టెలు కొట్టేందుకు అడవికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారిలో ఓ వేటగాడు పావురాలను వేటాడుతూ... ఓ వలలో బియ్యం నూకలు చల్లి, వెళ్లడాన్ని గమనించాడు.\n\nఇంతలో.. వేటగాడు అలా వెళ్లాడో లేదో బియ్యం నూకలకు ఆశపడ్డ ఓ పావురాల జంట వచ్చి వలలో వాలాయి. అంతే ఒక్కసారిగా వలలో ఇరుక్కుపోయాయి. ప్రాణభీతితో అల్లాడుతున్న పావురాలను ఎలాగైనా రక్షించాలనుకున్న సీతయ్య వాటిని వలనుంచి తప్పి పైకి ఎగురవేసి కట్టెల కోసం వెళ్లిపోయాడు.\n\nఅలా కొంతకాలం గడచిన తరువాత సీతయ్య ఎప్పట్లాగే అడవికి వెళ్లి వస్తూనే ఉంటాడు. ఒకరోజు అడవిలో దారి తప్పి బాగా లోపలి ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. అతడు దారి తెలియక అవస్థపడుతూ తిరుగుతుంటే ఈలోపు చీకటి కూడా పడింది. అడవిలోని క్రూర మృగాలు తనను ఏం చేస్తాయో ఏమో అని భయపడుతూ ఉన్న సీతయ్య దగ్గర్లో ఓ చిన్న గుడిసె లాంటిది కనిపించింది.\n\nసీతయ్య గబగబా గుడిసె దగ్గరికి వేగంగా నడుస్తుండగానే జోరున వర్షం మొదలయ్యింది. ఏంటో ఈ పాడు వర్షం వేళాపాళా లేకుండా.. దారి తప్పోయాను, ఇంటికెళ్ళాలో తెలియటం లేదు. భగవంతుడా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రీ...! అంటూ మనసులో గొణుక్కుంటూ ఉండిపోయాడు.\n\nఅయితే... అదే గుడిసె పైనున్న పావురాల జంట సీతయ్యను గుర్తించి, తమ ప్రాణాలను కాపాడిన అతడిని ఎలాగైనా సరే ఇంటికి చేర్చాలని అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా అతడి తలపైనున్న గుడ్డను తన్నుకుని వెళ్ళాయి. తలగుడ్డ ఎగిరిపోవడంతో పైకెత్తి చూసిన సీతయ్య పావురాల జంటను వెంబడిస్తూ పరుగులు తీశాడు.\n\nఅలా అలా తనకు తెలిసిన దోవలోకి పరుగెత్తిన సీతయ్యకు పావురాలు చేసిన సహాయం అర్థమైంది. తనని ఇంటికి చేర్చేందుకే ఈ పావురాలు తన తలగుడ్డను తన్నుకుపోయాయని అర్థం చేసుకున్నాడు. చిన్న జీవులైనప్పటికీ, వాటిని కాపాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించాయని అనుకున్నాడు. వెంటనే ఆ పావురాలను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచుకుని పెంచుకోసాగాడు సీతయ్య. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 603,
        "IMAGE": "cat_7",
        "NAME": "సీతయ్య.. పావురాల జంట..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "శివపురం అనే ఊర్లో... ఒకరోజు రాత్రి దొంగ ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఊరి షావుకారు దుకాణంలో దూరాడు. దొంగను చూసిన వెంటనే షావుకారు ఎవడ్రా నువ్వు..? అంటూ గద్దించాడు.\n\n\"అయ్యయ్యో...! గట్టిగా అరవబోకండి షావుకారు గారూ.. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుంటే... రాజభటులు నన్ను చూసి ఈ దారినే వస్తున్నారు. వాళ్లు గనుక నన్ను పట్టుకున్నారంటే ఇక నాకు చావే శరణ్యం. వాళ్ల దగ్గర్నించీ నన్ను మీరు రక్షిస్తే... నేను దొంగతనం చేసిన డబ్బులో సగం వాటా మీకు ఇస్తాను\" అన్నాడు దొంగ.\n\nఅసలే దురాశాపరుడైన ఆ షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు. తలుపు చాటున దాక్కోమని దొంగకు చెప్పాడు. ఆ దారిలోనే వచ్చిన \"రాజభటులు దొంగ ఇటువైపుగానీ వచ్చాడా?\" అంటూ షావుకారును ఆరా తీశారు. ఎవరూ రాలేదని అతను అబద్ధం చెప్పాడు. దీంతో ఆ రాజభటులు దొంగను వెతుక్కుంటూ మరో దారిలో ముందుకు వెళ్లారు.\n\nభటులు వెళ్లిపోయిన తరువాత, దొంగను తన వాటా తనకు ఇమ్మని అడిగాడు షావుకారు. \"ఏంటీ... వాటానా.. ఇదిగో..\" అంటూ సంచిలోంచి కత్తితీశాడు దొంగ. బిత్తరపోయి నోట మాట రాలేదు ఆ షావుకారుకు. భయంతో అలాగే నిల్చుండిపోయాడు.\n\n\"నీకు ప్రాణాలమీద ఆశ ఉంటే, కేకలు వేయకుండా ఉండు\" అంటూ షావుకారును ఓ కుర్చీకి రెండుచేతులు విరిచి వెనక్కి కట్టివేసి, అతడి దుకాణంలోని గల్లా పెట్టెలో ఉండే డబ్బును కూడా తీసుకుని పారిపోయాడు దొంగ.\n\nదొంగ వెళ్లిపోయిన తరువాత షావుకారు కేకలు పెట్టడంతో పక్క దుకాణాల వారు వచ్చి అతడిని విడిపించి వెళ్లిపోయారు. దొంగకు ఆశ్రయం కల్పించటం వల్లనే తన డబ్బు పోయిందని లబోదిబోమంటూ మొత్తుకున్నాడు షావుకారు. కష్టపడి సంపాదించని డబ్బుకోసం ఆశపడితే... తన కష్టార్జితం కూడా పోయిందని అతడు బాధపడ్డాడు.\n\nతన డబ్బు దొంగతనం గురించి రాజుగారికి చెబితే... దొంగకు తాను సాయం చేసిన విషయం కూడా బయటకు వచ్చి మరింత చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు షావుకారు. అంతేగాకుండా మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూదని, తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ఆశపడకూడదని అతడు గట్టిగా బుద్ధితెచ్చుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 604,
        "IMAGE": "cat_7",
        "NAME": "దుష్టులకి దూరంగా...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో రాజేష్, కామేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తన పొరుగింట్లో ఉంటోన్న రాజేష్‌ను ఎలాగైనా అధిగమించాలని అనుకుంటాడు కామేశ్. తెలివితేటల్లోనూ, ఆస్తిపాస్తుల్లోనూ, మంచి తనంలోనూ, పరోపకారం చేయడంలోనూ... తనకంటే ఇంకెవరూ ఎక్కువగా ఉండకూదని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.\n\nఅయితే... ప్రతిసారీ ఇతడికి రాజేష్ చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రాజేష్ ఇంకెప్పటికీ వసూలు కాదని వదిలేసిన రెండు వేల రూపాయల బాకీ వసూలయింది. ఈ విషయం తెలిసిన కామేశ్ అసూయతో రగిలిపోతున్న సమయంలోనే దూరపు బంధువు ఒకడు వచ్చి అప్పు అడిగాడు. పట్టరాని కోపం వచ్చినా ఆపుకుని ఎలాగైనా సరే దీన్ని అవకాశంగా తీసుకుని రాజేష్‌ను దెబ్బతీయాలనుకుంటాడు కామేశ్.\n\n\"సమయానికి నా దగ్గరా డబ్బులేదు. పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రాజేష్ నీకు సాయపడవచ్చు. వెళ్దాం రా...'' అంటూ అతడిని రాజేష్ ఇంటికి తీసుకువెళ్ళాడు కామేశ్. ఊరిపెద్దలతో మాట్లాడుతున్న రాజేష్‌కు తన బంధువును పరిచయం చేసి... డబ్బు అవసరమట, మీరే ఇవ్వగలనని చెప్పాడు.\n\nఇంతలో కామేశ్ బంధువు రాజేష్‌తో మాట్లాడుతూ... మీరు నాకు అప్పు ఇవ్వలేకపోతే నా ఇంకా కోతకు రాని వరిపంటను తనఖాగా పెట్టుకుని ఇవ్వండి చాలా అవసరం అన్నాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్దమనుషులు ఇప్పుడు వరిపంటకు అంత డిమాండ్ ఏమీ లేదు కదా... అలాంటప్పుడు ఆ పంటను ఎలా తనాఖాగా పెట్టుకుంటారని రాజేష్‌కు సూచించారు.\n\nఇంతలో రాజేష్‌ను ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనుకున్న కామేశ్.. మన రాజేష్‌కేంటండీ... అతను ఎందులో చేయిపెట్టినా లాభమే సాధిస్తాడంటూ మాట్లాడాడు. పైన తథాస్తు దేవతలుంటారని, కామేశ్ మంచి ఉద్దేశ్యంతో చెప్పాడు కాబట్టి అప్పు ఇవ్వమని చెప్పేసారు ఆ పెద్దమనుషులు. సరేనన్న రాజేష్ అప్పుగా కొంత డబ్బును ఇచ్చి పంపేస్తాడు.\n\nతథాస్తు దేవతల దీవెనల చలువో, లేదా తాను చేస్తున్న మంచి పనుల చలువో, మెచ్చుకుంటోన్న ప్రజల ఆశీర్వాదాల చలువోగానీ రాజేష్ తనఖాగా పెట్టుకున్న వరిపంట బాగా పండింది. ఊహించని రీతిలో వరిపంట డిమాండ్ పెరిగి, అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.\n\nతాను అప్పుగా ఇచ్చిన డబ్బుకంటే పదింతల డబ్బును వరిపంట ద్వారా సంపాదించాడు రాజేష్. విషయమంతా తెలిసిన కామేశ్ ఇంకా అసూయతో రగిలిపోతూ... అరే ఎంతపని చేశాను. ఆ పంటను నేనే పెట్టుకుని ఉంటే... మంచిపేరుకు మంచిపేరు, డబ్బుకు డబ్బు వచ్చి ఉండేవి. అన్నింటినీ పోగొట్టుకున్నాను కదా అనుకున్న కామేశ్... ప్రతిక్షణం కుమిలిపోతూ కాలం వెళ్లదీయసాగాడు.\n\nకాబట్టి పిల్లలూ...! పక్క వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే... రోజు రోజుకూ ఎదిగిపోతుంటే అందుకు కుమిలి పోవడం, అసూయతో రగిలిపోవడం కాకుండా... మనం కూడా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 605,
        "IMAGE": "cat_7",
        "NAME": "అసూయ తెచ్చిన తంటా..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సోమయ్య అనే అతను నరసాపురం అనే ఊర్లో ఓ చిన్న రైతు. అతడికి కొన్ని ఎడ్లు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఎడ్లు, గేదెలతో అతడు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. పొలంలో పండిన పంటను బస్తాలలో నింపి... ఎడ్లబండికి గేదెలను కట్టి వాటిద్వారా ఇంటికి చేర్చేవాడు.\n\nఒకరోజు పొలంలో పనేమీ లేకపోవడంతో... ఎడ్లు, గేదెలు, మేకలను తోలుకుని దగ్గర్లోని అడవికి మేతకు తీసుకెళ్లాడు సోమయ్య. దొరకక దొరికిన స్వేచ్చతో... ఎప్పుడూ ఆ పనీ ఈ పనీ చేస్తుండే ఆ జంతువులన్నింటికీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆనందంగా గెంతులు వేస్తూ పరుగులెత్తాయి.\n\nఅన్నింట్లోకి కొంచెం బలంగా ఉండే గేదెకైతే మరీ ఆనందంగా ఉంది. ముళ్ల కంచెల వైపు పోవడం, గడ్డిపూలపై గంతులేయడం లాంటివి చేస్తూ... అన్నింటికంటే ముందు వెళ్ళాలన్న ప్రయత్నంలో వేగంగా పరుగులెత్తింది. మితిమీరిన ఆనందంలో పూర్తిగా ఒళ్లుమరచి పోయిందది.\n\nవెనకబడిన వాటిని అదిలిస్తూ... తోలుకొస్తున్న సోమయ్య ఈ గేదె సంగతిని మరచిపోయాడు. గేదె మాత్రం వేగంగా ముందుకు పోసాగింది. అలా వెళ్తుండగా దారిలో ఓ పెద్ద గొయ్యి అడ్డు వచ్చింది. అది ఎప్పుడో పూర్వకాలంలో తవ్విన బావి. నీళ్లు ఎండిపోవడంతో అడవిలోని చెత్తాచెదారం అంతా నిండిపోయి గొయ్యిలాగా తయారయ్యింది.\n\nఆనందంలో కన్నూమిన్నూ కానరాని గేదె ఆ గొయ్యిని గమనించలేదు. కాలిబాట నుంచి కిందికి పరుగులెత్తబోయి, పట్టుదప్పి గోతిలోకి జారి పడబోయింది. ఇంతలో కాస్త ముందుకు వచ్చి పరిస్థితిని గమనించిన సోమయ్య పరుగెత్తుకొచ్చి గోతిలోకి జారిపోబోతున్న గేదె తోకను పట్టుకుని ఆపబోయాడు.\n\nఅయితే... బాగా బలిష్టంగా ఉన్న ఆ గేదె తోకను పట్టుకున్న సోమయ్య దాని బరువును ఏమాత్రం ఆపలేకపోయాడు. ఫలితంగా గేదె తోక అతడి చేతిలోంచి జారిపోయింది. దాంతో, గేదె పట్టుదప్పి నూతిలో పడిపోయింది. అడవిలో సాయం చేసేవారు ఎవరూ కానరాక పోవడంతో సోమయ్య ఆ గేదెను వదిలేసి మిగతా వాటితో ఇంటిదారి పట్టాడు.\nకాబట్టి పిల్లలూ...! మితిమీరిన స్వేచ్ఛ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యింది కదూ..! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 606,
        "IMAGE": "cat_7",
        "NAME": "హద్దుల్లేని స్వేచ్ఛ అపాయం!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "దైవభక్తుడైన సింహాచలం ఊరూరా తిరుగుతూ.. దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి, పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు.\n\nమార్గమధ్యంలో ఓ అడవి గుండా వెళ్ళాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్ళి, దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్లుమూసుకుని పడుకున్నాడు.\n\nఇంతలో ఒక మూల నుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచచ్చిపోయాడు. దేవుడా ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం.\n\n\"ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది. నీ మహిమవల్లనే నేను బ్రతకగలను. నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామీ..!\" అంటూ భయంతో కళ్లుమూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికీ పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయం భయంగా కళ్లు తెరిచి చూశాడు.\n\nఅంతే.. మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే... ఎదురుగా పులి కూడా రెండు కాళ్లూ పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది...! ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు.\n\n\"ఓ పులిరాజా...! ప్రాణభయంతో ఉన్న నేను.. నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థం ఉంది. మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు...?\" అని ప్రశ్నించాడు సింహాచలం.\n\n\"ఓ మానవుడా...! నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను\" అని చెప్పింది పులి.\n\"ఎందుకు..?\" తిరిగీ ప్రశ్నించాడు సింహాచలం.\n\n\"ఎందుకంటే.. ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా...! దీంతో మా జాతులన్నీ అంతరించుకు పోతున్నాయి. మాకు స్వేచ్చగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరక్కుండా చూడాలనే నేనూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను\" అని చెప్పింది పులి.\n\nనిజమే కదా పిల్లలూ..! ఈ రోజుల్లో వన్య మృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో, వన్య ప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనీయాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. కాబట్టి... వన్యప్రాణులను వేటాడి, చంపేసే వారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 607,
        "IMAGE": "cat_7",
        "NAME": "మమ్మల్నీ బ్రతకనివ్వండి..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్ని కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతోపాటు ఉండిపోయింది.\n\nహంసల్లో పెద్దవయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్నవయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపర్చేవి.\n\nవీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానీయలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్ల బాతు అక్కడ్నించీ దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది.\n\nఅయితే... చిన్న హంసలు తనను దగ్గరికి రానీయకపోయినా, బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముందీ అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.\n\nఎందుకంటే... తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో... \"మీరందరూ నన్ను దగ్గరికి రానీయని నల్లబాతును నేనండ్రా...?! గుర్తు పట్టారా...?\" అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను. మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తు వచ్చి నోరుమెదపకుండా ఉండిపోయాయి.\n\nఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి... నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు? ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిల్చి చీవాట్లు పెట్టాయి.\n\nమీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు. మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరం అంటే ఏంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధపెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు. పెద్దవాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు.\n\nదీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు.. తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి, ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 608,
        "IMAGE": "cat_7",
        "NAME": "నల్లని బాతుపిల్ల... మనసు మాత్రం వెన్న..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.\n\nఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.\n\nఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.\n\nతల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, \"నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!\" అని అరచింది.\n\nలోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... \"నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు\" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి \"తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది\".\n\nఅమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. \"నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి\" అని అన్నాయి.\n\nఆహా...! అలాగా... అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది.\n\nకాసేపటికి తల్లిమేక మేత నుండి గుడిసె తిరిగి వచ్చేసరికి... ఒకే ఒక్క పిల్ల మాత్రం బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం తల్లీ...! ఏం జరిగింది అంటూ దగ్గరికి తీసుకుంది తల్లిమేక. అప్పుడు తల్లికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది పిల్లమేక.\n\nఅంతా విన్న తల్లి మేక ఆవేశంతో.... ఒక కత్తి, సూది, దారం తీసుకుని నక్క దాగి ఉండే గుహ దగ్గరికి వెళ్ళింది. అది మంచి నిద్రలో ఉండగా... పొట్టకోసి, తన పిల్లలను బయటకు లాగింది. కొన్ని రాళ్ళను నక్క కడుపులో వేసి తిరిగి కుట్టేసి పిల్లలను తీసుకుని బయటపడింది తల్లిమేక.\n\nమంచి నిద్రలో ఉన్న నక్కకు ఇవేమీ తెలియలేదు. ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచిన దానికి విపరీతంగా దాహం వేసింది. ఎక్కడా నీరు దొరకక పోవడంతో, నది దగ్గరకు నీళ్ళు తాగేందుకు వెళ్లింది. నదిలోని నీరు తాగేందుకు వంగగానే కడుపులో ఉన్న రాళ్ల బరువు వల్ల నీటిలో పడిపోయి, మునిగిపోయింది.\n\nచూశారా.. పిల్లలూ...! జిత్తుల మారి టక్కరి నక్కను, దానిలాగే తెలివిగా ఆలోచించిన తల్లిమేక తన పిల్లలను ఎలా రక్షించుకుందో, ఆ టక్కరి నక్క పీడను ఎలా వదిలించుకుందో.. అర్థమైంది కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 609,
        "IMAGE": "cat_7",
        "NAME": "తల్లి మేక... టక్కరి నక్క...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పొలం గట్టుపైన ఉన్న చెట్లలోంచి రెండు గింజలు కిందపడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడటంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ... \"మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి, మొక్కలుగా, వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వర్తించాలి\" అని చెప్పింది మొదటి గింజ.\n\n\"నీకెందుకు అంత తొందర. మొలకెత్తినప్పట్నించీ మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటినుంచీ కష్టాల పరంపర మొదలవుతుంది\" అని వాపోయింది రెండో గింజ. ఇంకా... చిగుర్లెత్తగానే పశువులు తినేస్తాయని భయం, పెద్దయ్యేదాకా అదే బాధ, పండ్లు కాస్తే ఫర్వాలేదుగానీ, లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండెకోతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది.\n\nకాబట్టి... ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే... వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మనదగ్గరకు వచ్చి సేదతీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది.\n\nఇతరులకు సహాయపడటం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇతరులకు అన్నివిధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. నీ సంగతి సరే...! కానీ.. నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ.\n\n\"ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను. నీ ఖర్మ అంటూ\" భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి.\n\nమొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్లకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమిలోపల వెచ్చగా దాక్కుంది.\n\nఅలా గడుస్తుండగా... ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజనుచూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది.\n\nఇంకేముందీ... \"అయ్యో...! తన స్నేహితుడు చెప్పినట్టు చేసిఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని\" ఏడుస్తూ... కోడిపుంజుకు ఆహారమైంది రెండో గింజ.\n\nకాబట్టి పిల్లలూ..! ఎవరు చేయాల్సిన పనిని వారే చేయాలని, అలా చేయని పక్షంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ గింజల కథ ద్వారా అర్థమైంది కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 610,
        "IMAGE": "cat_7",
        "NAME": "రెండు గింజల కథ..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పేదవాడైన తిమ్మయ్య కామందు దగ్గర అప్పుచేసి, జీవితమంతా ఆ అప్పు తీరకపోవడంతో మంచపట్టాడు. మనోవ్యాధి ఎక్కువైన తిమ్మయ్య కొడుకు సూరయ్యను కామందు దగ్గర పనికి అప్పగించి కన్నుమూస్తాడు. ఎలాంటి జాలీ, దయా, కరుణా లేని కామందు చిన్నవాడైన సూరయ్యను చిత్రహింసలు పెడుతుంటాడు.\n\nప్రతిరోజూ చాకిరి చేస్తున్నప్పటికీ, కడుపునిండా తిండి పెట్టకపోవడమే గాకుండా... పసివాడని చూడకుండా సూరయ్యను రాచిరంపాన పెడుతుంటాడు కామందు. కామందు హింసను తట్టుకోలేని సూరయ్య చెప్పా పెట్టకుండా ఊరు వదలి పారిపోతాడు. ఎన్నో చిత్రహింసలను అనుభవించిన సూరయ్యకు మనుషులంటే తీవ్రమైన అసహ్యం ఏర్పడింది.\n\nకామందు ఇంటినుంచి బయటపడ్డ సూరయ్య ఎటుబడితే అటు కొండలు, కోనలూ దాటుకుంటూ ఓ పెద్ద కారడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక జలపాతం కింద కొండ గుహ కనిపిస్తే అక్కడే ఆగిపోయి ఉండసాగాడు. అడవిలో దొరికే పండ్లూ, ఫలాలలను తింటూ జీవనం సాగించాడు.\n\nఅలా ఏడు సంవత్సరాలు గడిచాయి. గడ్డమూ, మీసాలూ పెరిగాయి. మౌనంలో మాటలే మరిచిపోయాడు సూరయ్య. పులులు, తోడేళ్ళు లాంటి క్రూరమృగాలు సైతం అతడితో సఖ్యంగా ఉండసాగాయి.\n\nఇలా ఉంటే... ఒకసారి శివయ్య అనే అతను ఆ దారిలో తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా... పెద్దపులితో ఆడుకుంటున్న సూరయ్యను చూశాడు. ఆశ్చర్యపోయిన శివయ్య వెంటనే సూరయ్య దగ్గరికి వచ్చి కాళ్లపై పడి... \"ఇంత పెద్ద అడవిలో తమరు ఏం చేస్తున్నారు మహాత్మా...!\" అని అడిగాడు.\n\nసూరయ్య బదులు చెప్పకపోయే సరికి, భయంతో... \"స్వామీ...! నేను రాజ దర్శనానికి వెళుతున్నాను. మంచి జరిగేలా దీవించండి\" అని వేడుకున్నాడు శివయ్య. తరువాత స్నేహితులతో కలిసి రాజదర్శనానికి సాగిపోయాడు.\n\nతిరుగు ప్రయాణంలో మళ్ళీ సూరయ్య దగ్గరికి వచ్చిన శివయ్య బోర్లాపడి, సూరయ్య కాళ్లకు నమస్కరిస్తూ... \"మీ ఆశీర్వాద బలం వల్లనే నాకు రాజానుగ్రహం లభించింది. ఈ చిరుకానుక స్వీకరించండి\" అంటూ బంగారు నాణేలను అతడిముందు పోశాడు. వాటిని తీసుకున్న సూరయ్య విసిరి పారేయగా ఆశ్చర్యపోయిన శివయ్య \"నిజంగా తమరు దేవుడికి ప్రతిరూపమే...\" అంటూ పాదధూళిని తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు.\n\nఇంకేముంది కొన్నిరోజులకే ఆ అడవిలో సూరయ్య పేరుతో శివయ్య ఒక ఆలయాన్ని కట్టించాడు. భక్తుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. సత్రాలూ, దుకాణాలు వెలశాయి. వ్యాపారాలు కూడా మంచిగా ఊపందుకున్నాయి. అడుగడుగునా హుండీలు, నౌకర్లు, సేవకులు ఎందరో తయారయ్యారు.\n\nమొక్కుబళ్లతో నానాటికీ పెరిగిపోతున్న భక్తులతో ఆ మహారణ్యమంతా జనసముద్రమైంది. దీంతో సూరయ్యకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. అతడికున్న ప్రశాంతత అంతా మటుమాయమైపోయింది. మనుషుల అంతరాలు, అత్యాశలు, కోరికలను చూసిన అతడికి మనుషులంటే వెగటు పుట్టింది. అంతే... ఒకరోజున అక్కడ్నించీ కూడా చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 611,
        "IMAGE": "cat_7",
        "NAME": "పెద్దపులితో ఆడుకునే సూరయ్య...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "యువకుడైన రామానుజులు పాత సామగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు. ఇతను పాత పాత్రలు కొంటూ, కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరుగడించాడు.\n\nరామానుజులు నివసించే ఊర్లోనే పాత సామగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన శీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినారి. అయినప్పటికీ రామానుజులు, శీనయ్యలు ఇద్దరూ కలసి ఊర్లు తిరుగుతూ... వ్యాపారం చేసేవారు. అలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్లారు.\n\nఆ ఊర్లోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సూరయ్య వాళ్ళు ఒకప్పుడు బాగా ధనికులే అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద అంతా ఖాళీ అవడంతో, కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిక గడిపేస్తుంటారు.\n\nఅయితే... వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర, బాగా బతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవడంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయడంతో అది మరకలు పట్టి ఉండటం వల్ల దాన్ని ఎవరూ బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు.\n\nఅదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన శీనయ్య, పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ... వస్తుంటాడు. దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్దావిడ అతడిని పిలిచింది. కూర్చోమని చెప్పి, అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి... \"బాబూ దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు\" అని అడిగింది.\n\nలోభివర్తకుడైన శీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరగేసి, బోర్లవేసి, తిప్పి తిప్పి చూసి, కడ్డీతో గీరి, అది బంగారమేనని రూఢి చేసుకున్నాడు. వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి... \"దీనికి ఏం వస్తుందమ్మా? ఇదేం అంత వెల చేయదు\" అంటూ ఆ పాత్రను విసిరేసి, లేచి వెళ్ళిపోయాడు.\n\nమరి కాసేపటికి ఈ ఇంటి దార్లోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులును పిలిచింది. కూర్చోబెట్టి.. లోనికెళ్లి బంగారు పాత్రను తీసుకొచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది.\n\nఆ పాత్రను చేతిలోకి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి... \"అమ్మా ఇది చాలా లక్షలు విలువచేసే పాత్ర. దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు\" అని చెప్పాడు. దీంతో ఆ పెద్దావిడ \"నాయనా...! ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్లిపోయాడు. ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా..! దీన్ని తీసుకుని మారుకు ఏదైనా ఇచ్చివెళ్ళు\" అని చెప్పింది.\n\nదీంతో రామానుజులు తన వద్దనున్న పాత, కొత్త సామగ్రినంతటినీ ఆమెకు ఇచ్చి... \"అమ్మా..! ఇవి తప్ప నా వద్ద ఇంకేవీ లేవు\" అని నిజాయితీగా చెప్పి, ఆమెకు నమస్కరించి అక్కడ్నించీ వెళ్లిపోయాడు.\n\nఇంతలో లోభి అయిన శీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగీ ఆ ఇంటికి వచ్చి... \"ఆ పాత్ర ఇలా పారేసి, ఏదో ఒకటి తీసుకుని వెళ్లండి\" అని పిలిచాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ... \"ఏం నాయనా..! లక్షలు విలువచేసే పాత్ర ఏ విలువా చెయ్యదన్నావుగా..! నువ్వు వెళ్లగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి, తనవద్దనున్న వాటినన్నింటినీ ఇచ్చి ఆ పాత్రను తీసుకెళ్లిపోయాడు\" అంటూ కసిగా చెప్పింది.\n\nఆ మాట విన్న శీనయ్య మతిపోయినట్లైంది. అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా? నాకు ఇంత నష్టం చేస్తాడా? అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పెద్దావిడ మాట విన్న శీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లై తన వద్దనున్న డబ్బూ, సరుకులూ అన్నింటినీ అలాగే విడిచి పరుగులెత్తాడు.\n\nఅతడు నదీతీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలివైపుకు దాటుతుండటం కనపించింది. అది చూసిన శీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకురాగా, గుండె వేగంగా కొట్టుకుసాగింది. అంతే ఒక్కసారిగా నోటివెంట రక్తం కూడా కారసాగింది. తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో శీనయ్య గుండెపగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దానదర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ.. తనకున్న మంచిపేరును నిలబెట్టుకున్నాడు.\n\nఅసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురిచేస్తాయో శీనయ్య కథను చదివితే అర్థమైందా పిల్లలూ...! ఎప్పుడూ కూడా నిజాయితీ, కష్టపడేతత్వమే మనిషిని విజయంవైపు నడిపిస్తాయి. రామానుజులు నిజాయితీగా నడుచుకోవడం వల్ల జీవితంలో సుఖపడ్డాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 612,
        "IMAGE": "cat_7",
        "NAME": "బంగారు పాత్ర... రామానుజులు..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం గ్రామంలో ఊరికి కాస్తంత దూరంగా రంగయ్య, సూరమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. రంగయ్య ప్రతిరోజూ దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి, పట్టణానికి వెళ్ళి అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో భార్యాభర్తలు జీవనం సాగించేవారు.\n\nఒకరోజు ఎప్పట్లాగే కట్టెల కోసం అడవికి వెళ్లాడు రంగయ్య. ఒక చెట్టును నరికేందుకు ఉపక్రమించాడు. అంతే...! చెట్టు చాటునుంచి ఒక స్త్రీ ఆకారం ఎదురుగా వచ్చి నిలిచింది. భయపడ్డ రంగయ్య దూరం జరగబోయాడు. అది గమనించిన ఆ స్త్రీమూర్తి తనను తాను వనదేవతగా పరిచయం చేసుకుంది.\n\n\"మీ మనుషులకు మల్లే ఈ చెట్టూ చేమలకు కూడా ప్రాణం ఉంటుంది కదా..! రంగయ్యా..! అంతేగాకుండా చెట్లను విపరీతంగా నరికడం వల్ల అడవి పాడవుతుంది కాబట్టి వాటిని నరకవద్దు\" అని చెప్పింది వనదేవత. \"అది సరే తల్లీ...! కట్టెలు కొట్టి అమ్మకపోతే నేనూ, నా భార్య ఎలా బ్రతుకుతాము. మాకు తిండి ఎలా వస్తుంది?\" అని ప్రశ్నించాడు రంగయ్య.\n\nఅవును నిజమే కదా..! అనుకున్న వనదేవత, సరే... నేను నీకో పాడి ఆవును ఇస్తాను దాని పాలు అమ్ముకుని సుఖంగా బ్రతుకు అని చెప్పి పాడి ఆవును ఇచ్చి మాయమైంది. ఆవును తోలుకుని ఇంటికి వచ్చిన రంగయ్య భార్యకు జరిగిన కథనంతా చెప్పగా, ఆమె కూడా చాలా సంతోషించింది.\n\nరోజులిలా గడుస్తుండగా... రోజూ ఆవుకి మేత వేస్తూ, పాలు పితుకుతూ ఉన్న సూరమ్మకు విసుగొచ్చి కష్టపడకుండా డబ్బు సంపాదించే వరం తీసుకురమ్మని మళ్ళీ భర్తను అడవికి పంపించింది. అడవికి వెళ్ళిన రంగయ్య చెట్టును నరకబోగా, తిరిగీ వనదేవత ప్రత్యక్షమై మళ్ళీ ఎందుకు చెట్టును నరుకుతున్నావని ప్రశ్నించింది.\n\nఅప్పుడు రంగయ్య ఈ ఆవు నాకు వద్దుగానీ, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పుమని అడిగాడు. సరే అన్న వనదేవత ఆవును తీసుకొని ఒక బాతుని ఇస్తూ... ప్రతీ రోజు అది ఒక బంగారు గుడ్డు పెడుతుందని, దాన్ని అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పి ఎప్పట్లాగే మాయమైంది.\n\nరంగయ్య బాతుతో ఇల్లు చేరాడు. అది ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు సూరమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా షావుకార్లు కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అంటూ భర్తను మళ్ళీ అడవికి పంపింది.\n\nబాతుని తీసుకొని అడవికి వెళ్ళిన రంగయ్య చెట్టు నరకబోగా... వనదేవత ప్రత్యక్షమయింది. \"ఏం రంగయ్యా...! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. అది మాకు వద్దు... ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు విపరీతమైన కోపం వచ్చి... బాతుతో పాటు మాయమైపోయింది.\n\nదీంతో డీలా పడ్డ రంగయ్య కోపంగా... చెట్టుకొమ్మను గొడ్డలితో బలంగా నరికేశాడు. కొమ్మ తెగి రంగయ్య కాళ్ళపై పడగా, కాళ్ళు విరిగి కూలబడిపోయాడు. భర్త ఎంతసేపటికీ రాకపోయేసరికి రంగయ్యను వెతుక్కుంటూ అడవికి వస్తుంది. కాళ్ళు విరిగిపోయిన భర్తను చూసి భోరుమంటూ ఇంటికి తీసుకొచ్చింది.\n\nభర్త ఏపని చేయలేడు. కాబట్టి, సూరమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకుని వచ్చేది. వాటిని తిని భార్యాభర్తలు బ్రతికేవారు. పండ్లు తినగా వచ్చిన గింజలను ఇంటివెనుక ఖాళీ స్థలంలో పారవేయగా అవి కొన్నాళ్ళకు మొలకలెత్తి పెరిగి పెద్దవై, కాయలు కాసాయి.\n\nసూరమ్మకు కూడా అడవికి వెళ్లే బాధ తప్పింది. వారు తినగా మిగిలిన పండ్లను సంతలో అమ్మి డబ్బులు సంపాదించేవారు. దీంతో చెట్లను కొట్టి బ్రతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగింగిచవచ్చని రంగయ్య, సూరమ్మలకు అర్థమైంది. అప్పటిదాకా తాము చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని తీర్మానించుకున్నారు.\n\nఅంతేగాకుండా... ఇంటివెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని అంతటినీ చదును చేసిన సూరమ్మ రకరకాల పండ్ల మొక్కలను నాటింది. వాటికి ప్రతిరోజూ నీటిని పోసి పెంచేది. అలా ఒక రోజు వనదేవత ప్రత్యక్షమై మంచిపని చేస్తున్నారంటూ భార్యాభర్తలిద్దరినీ దీవించింది. మొక్కల పెంపకం విలువ తెలిసిన రంగయ్య దంపతులు ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ, నలుగురి సాయపడుతూ.. ఆనందంగా జీవనం గడపసాగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 613,
        "IMAGE": "cat_7",
        "NAME": "కట్టెలు కొట్టే రంగయ్య.. వనదేవత..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టుమీద రకరకాల పక్షులు నివాసం ఏర్పర్చుకుని, ఎప్పుడూ పోట్లాడుకోకుండా కలసిమెలసి హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక కోతి వచ్చింది. అనుకోని అతిథి రావడంతో సంతోషించిన చిలుకలు, పావురాలు, మిగిలిన పక్షులన్నీ... జామపళ్లు, పాలపళ్లు, రకరకాల పండ్లను తెచ్చి, ఇచ్చి సత్కరించాయి.\n\nఆ పళ్లన్నింటినీ సుష్టుగా భోంచేసిన కోతిబావకు ఆ పళ్ల రుచి చాలా బాగా నచ్చేసింది. ఎంచక్కా ఇక్కడే ఉంటే... కష్టపడకుండానే రోజూ ఇలా రకరకల పళ్లు తినొచ్చు అని మనసులో అనుకుంది. మీరంతా నాకు బాగా నచ్చేశారని, ఇకపై మీతోనే ఉంటానని నమ్మబలికింది. పగలంతా పక్షులు కష్టపడి పళ్లను తెచ్చి ఇస్తే... తినేసి సోమరిపోతులాగా హాయిగా ఆ చెట్టుపైనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది కోతిబావ.\n\nకాలం అలా గడుస్తూ ఉంటుంది. ఏ రోజుకారోజు హాయిగా కాలం గడిపేస్తున్న కోతి వాలకం ఓ ముసలి పక్షికి అర్థమైపోయింది. మిగతా పక్షులన్నీ కూడా రోజూ పళ్లు తెచ్చి కోతికి ఇస్తూ.. విసిగిపోయి ఉన్నాయి. దీంతో పక్షులన్నీ కలసి సమావేశమై... కోతిని ఎలాగైనా సరే అక్కడ్నించీ వెళ్లగొట్టాలని నిర్ణయానికి వచ్చాయి.\n\nఉపాయం కోసం ముసలి పక్షి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించాయి. ఆ పక్షి ఒక ఉపాయం చెప్పగా అన్నింటికీ నచ్చడంతో... వెంటనే రంగంలోకి దిగిపోయాయి. తరువాతి రోజు పావురం కొంచెం తేనె తెచ్చి కోతికి ఇచ్చింది. తేనె రుచి చూసిన కోతికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చాలా బాగుందంటూ తినడం మొదలెట్టింది. అలా నాలుగు రోజులు గడిచింది.\n\nఒకరోజు పావురం ఎంతసేపటికీ రాకపోవడంతో.. తేనె కోసం ఎదురుచూస్తోన్న కోతి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ఇంక లాభం లేదు పావురం వచ్చేలా లేదుగానీ... తానే వెళ్లి తేనె తాగి రావాలి అనుకుని తేనెపట్టు ఉండే చెట్టుపైకి వెళ్లింది. అంతకుముందు ఎప్పుడూ కూడా తేనెపట్టుని చూడని కోతి, తేనెపట్టున్న కొమ్మని చూసి పట్టుకుని గట్టిగా ఊపింది.\n\nఅంతే... ఒక్కసారిగా తేనెటీగలన్నీ కోతిబావను చుట్టిముట్టి కసితీరా కుట్టేశాయి. దీంతో తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగెత్తి చివరికి అడవిలోకి పారిపోయింది. మళ్లీ ఎప్పుడూ కూడా ఆ మర్రిచెట్టువైపు కన్నెత్తి చూడలేదు కోతిబావ. అర్థమైందా పిల్లలూ..! సోమరితనంతో ఉన్న కోతిబావకు, తేనెటీగలతో పక్షులన్నీ ఎలా పెళ్లి చేయించి, వెళ్లగొట్టాయో...!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 614,
        "IMAGE": "cat_7",
        "NAME": "కోతి బావ...తేనెటీగల పెళ్లి..!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పిల్లలూ...! ఎక్కడికి వెళ్ళినా తోడు లేకుండా వెళ్ళవద్దని, ఒంటరిగా తిరగవద్దని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు కదా..! పెద్దవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచిని కోరే జాగ్రత్తలు చెబుతారు. \"పెద్దలమాట చద్దన్నం మూట\" అని ఊరకే అనలేదని ఈ చిన్ని కథను చదివితే మీకే అనిపిస్తుంది... మరి కథలోకి వెళ్దామా...!\n\nఅన్నవరం అనే ఊళ్లో ఒక తల్లీ కొడుకులు ఉండేవాళ్ళు. చిన్న చిన్న పనులు చేసి తన తల్లికి ఏలోటూ రాకుండా చూసుకుంటూ ఉంటాడు కుమారుడైన బ్రహ్మం. ఒకరోజున ఏదో పనిమీద పొరుగూరుకు వెళ్ళాల్సి వస్తుంది. దీంతో తన ప్రయాణం గురించి తల్లితో చెప్పాడు బ్రహ్మం.\n\nపొరుగూరికి వెళుతున్నావా...? సరే నాయనా...! ఒక్కడివే వెళుతున్నావా.. ఎవరైనా తోడు వస్తున్నారా..? అని అడిగింది బ్రహ్మం తల్లి. ఎవరూ రావట్లేదు... నేను ఒక్కడినే వెళుతున్నానమ్మా.. అని చెప్పాడు బ్రహ్మం. తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదని, ఎవరినైనా వెంటబెట్టుకెళ్లమని ఆమె కొడుక్కి సలహా ఇచ్చింది.\n\nఅయితే బ్రహ్మం మాత్రం.. మరేం ఫర్వాలేదు... నాకేమీ కాదు... నేను త్వరగా వచ్చేస్తానుగా...! అని తల్లికి నచ్చజెప్పి ఒంటరిగానే పొరుగూరికి బయలుదేరేందుకు సిద్ధపడ్డాడు. అయినా ఆ తల్లి మనసు ఊరుకోక వెంటనే ఇంటి పెరట్లోని బావిదగ్గరకి వెళ్లి... రోజూ తాను ఎంతో ఆప్యాయంగా పెంచుకునే ఎండ్రక్కాయను తెచ్చి కొడుకుకు ఇచ్చింది. నీకు ఏదైనా ఆపద వస్తే... ఇది ఎలాగైనా సరే నిన్ను కాపాడుతుందని అభయం ఇచ్చింది తల్లి.\n\nతల్లి మనసును కష్టపెట్టడం ఇష్టంలేని బ్రహ్మం సరేనంటూ... ఎండ్రక్కాయను తీసుకుని తన గుడ్డ సంచిలో దానిని జాగ్రత్తగా పెట్టుకుని ఊరికి బయలుదేరాడు. అలా బయలుదేరిన బ్రహ్మం నడచి నడచి బాగా అలసిపోయాడు. కాస్త చల్లబడ్డ తరువాత మళ్లీ ప్రయాణం సాగించవచ్చని ఒక చెట్టుకింద నిద్రకు ఉపక్రమించాడు.\n\nఆ చెట్టుకు సమీపంలో నివసించే ఒక తాచుపాము బ్రహ్మం గుడ్డసంచిలోని కర్పూరపు సువాసనలకు ఆకర్షితమై మెల్లగా మూట దగ్గరకు వచ్చింది. అంతటితో ఆగకుండా గుడ్డ సంచిలోకి తలదూర్చగా.. అందులో ఉన్న ఎండ్రక్కాయ కసికొద్దీ ఒడుపుగా పామును తన రంపపు నోటితో కసికొద్దీ కొరికేసింది.\n\nఆదమరిచి నిద్రపోతున్న బ్రహ్మానికి జరిగిందేమీ తెలియదు. నిద్రలేచిన తరువాత చూస్తే.... గుడ్డ సంచి పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూశాడు. తనకు ఆపద జరుగకుండా తల్లి ప్రేమతో ఇచ్చిన ఎండ్రక్కాయే పామును చంపివేసిందని గ్రహించాడు. తన తల్లి ఎంతో ముందుచూపుతో తన మేలుకోరి ఎండ్రక్కాయను తన వెంట పంపిందని అర్థం చేసుకున్నాడు బ్రహ్మం.\n\nకాబట్టి...! పెద్దల మాట చద్దన్నం మూట అనే వాస్తవాన్ని బ్రహ్మం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పెద్దలమాటను చిన్నవారు విధిగా వినడమే కాకుండా, వాటిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆరోజు నుండి బ్రహ్మం ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. తల్లిమాటలను తూ.చ. తప్పకుండా పాటించటం నేర్చుకున్నాడు.\n\nకాబట్టి... పిల్లలూ..! జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనకు నచ్చినా, నచ్చకపోయినా పెద్దవారు అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలను వినితీరాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళు సంతోషిస్తారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 615,
        "IMAGE": "cat_7",
        "NAME": "పెద్దలమాట చద్దన్నం మూట ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "వైకుంఠపురం అనే ఊర్లో ఉత్తముడు, ఉత్తమోత్తముడు అనే పేర్లతో ఇద్దరు వ్యాపారులుండేవారు. వారిలో ఉత్తముడనేవాడు న్యాయంగా, నీతిగా వ్యాపారం చేసేవాడు. అయితే పేరు మాత్రం ఉత్తమోత్తముడని పెట్టుకున్న అతను మాత్రం మితిమీరిన అత్యాశతో ఉండేవాడు.\n\nవీరు ఇద్దరూ కూడా ఉమ్మడిగా వ్యాపారం చేస్తూ... అందులో వచ్చిన లాభాలను సమానంగా పంచుకునేవారు. ఒకరోజు అలానే పిఠాపురం అనే ఊర్లో వ్యాపారం చేసి లాభంతో తిరిగివచ్చారు. ఎప్పట్లాగే లాభాన్ని సమాన భాగాలుగా చేసి పంచుతుండగా, ఉత్తమోత్తముడు తనకు రెండువంతుల లాభం కావాలి అని పట్టుబట్టాడు.\n\n\"ఇద్దరం సమానంగా కష్టపడ్డాం. లాభం కూడా ఇద్దరం సమానంగా పంచుకోవడం న్యాయం\" అని అన్నాడు ఉత్తముడు. అయితే ఉత్తమోత్తముడు మాత్రం \"నీకంటే నేనే ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి లాభం నాకు రెండు వంతులు రావాల్సిందే\" అని భీష్మించుకు కూర్చున్నాడు.\n\n\"సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ అన్నీ కూడా ఇద్దరివీ సమాన భాగాలు కదా? అలాంటప్పుడు నీకు మాత్రం రెండువంతులెందుకు రావాలి?\" అంటూ మళ్ళీ నిలదీశాడు ఉత్తముడు. \"నువ్వు ఉత్తముడివి మాత్రమే...! నేను ఉత్తమోత్తముడిని కాబట్టి రెండు భాగాలు ఇవ్వాల్సిందే\" అన్నాడు ఉత్తమోత్తముడు. ఇలా ఒకరితో ఒకరు వాదించుకుంటూ గొడవ కాస్తా ముదిరింది.\n\nఇలా అయితే కుదరదని ఆలోచించిన ఉత్తమోత్తముడు ఒక మెట్టు దిగివచ్చి... \"మన సమస్య తీరాలంటే ఒక ఉపాయం ఉంది. ఆ ప్రకారం నడుచుకుందామా...?!\" అని ఉత్తముడిని అడిగాడు. \"ఏంటది..?\" అని ఉత్తముడు ప్రశ్నించగా... \"ఎవరికి ఎంత వాటా చెందాలో ఆ వృక్ష దేవతనే అడుగుదాం. ఆ తల్లి ఎలా చెబితే అలా నడుచుకుందాం\" అని చెప్పాడు ఉత్తమోత్తముడు. దీనికి ఉత్తముడు కూడా సరేనన్నాడు.\n\nరాత్రికి రాత్రే ఉత్తమోత్తముడు తన తండ్రిని ఒక చెట్టు తొర్రలో ఎవరికీ కనబడకుండా కూర్చోబెట్టి తాను చెప్పినట్లుగా నడుచుకోమన్నాడు. మేము ఇద్దరం వచ్చి అడిగినప్పుడు \"తనకే రెండు భాగాలు చెందుతాయని చెప్పమని తండ్రిని ఆజ్ఞాపించి\"... ఇంటికొచ్చి ఏమీ తెలియనట్లు నిద్రపోయాడు.\n\nమరుసటి రోజు ఉదయం ఒక చెట్టు దగ్గరకు ఉత్తముడిని తీసుకుపోయిన ఉత్తమోత్తముడు జరిగిన తతంగం అంతా వివరించి చెప్పి... \"అమ్మా..! వృక్షదేవతా...! మాకు న్యాయం జరగాలంటే నువ్వే తగినదానవు కాబట్టి, ఎవరికి ఎక్కువ భాగం చెందాలో నువ్వే చెప్పు...?\" అంటూ వేడుకున్నాడు.\n\nఅప్పుడు చెట్టు తొర్రలో నున్న ఉత్తమోత్తముడి తండ్రి గొంతు మార్చి... \"ఉత్తమోత్తముడికే రెండు భాగాలు చెందాలి\" అని తీర్పునిచ్చాడు. అయితే అప్పటికే ఉత్తమోత్తముడు చేసిన పనిని చాటుగా గమనించిన ఉత్తముడు... చెట్టు తొర్రలో నుండి వినిపించిన గొంతుక వృక్షదేవతతో, దయ్యాలదో... ఇప్పుడే తేలుస్తానంటూ.... ఎండుగడ్డి తీసుకొచ్చి చెట్టు తొర్రలో వేసి మంట పెట్టాడు.\n\nచెట్టు తొర్రలో మంటల ధాటికి తట్టుకోలేని ఉత్తమోత్తముడి తండ్రి సగం కాలిన గాయాలతో అరుస్తూ... మెల్లిగా బయటపడ్డాడు. ఇద్దరూ సమానంగా కష్టపడినప్పటికీ అత్యాశకు పోయిన కొడుకును సమర్థిస్తూ... తాను కూడా తప్పు చేశానని... మన్నించమని వేడుకున్నాడు ఉత్తమోత్తముడి తండ్రి. తండ్రి గాయపడటంతో ప్రశ్చాత్తాపపడ్డ ఉత్తమోత్తముడు తాను చేసిన తప్పును అంగీకరించి... లాభాన్ని సమాన భాగాలుగా పంచుకుందామని ఉత్తముడిని కోరాడు.\n\nపిల్లలూ...! ఈ కథలోని నీతి ఏంటంటే... కుటిలత్వం అనేది మంచిది కాదు. కుటిల ఎత్తులకు పాల్పడేవారు తామే కాకుండా తనకు చెందిన ఆత్మీయులను కూడా బలి పెట్టుకున్న వారవుతారని ఈ కథ హెచ్చరిస్తోంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 616,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఉత్తమోత్తముడి అత్యాశ!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పూర్వం శాతవాహన నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. తన తెలివితేటలతో వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు. అన్నీ ఉన్నప్పటికీ అతడికి ఒకటే దిగులుగా ఉండేది.\n\nనలుగురు పిల్లల తండ్రి అయిన ఆ వ్యాపారికి దిగులంతా తన పిల్లలపైనే ఉండేది. పుట్టడంతోటే ధనవంతులు కావడం వల్లా వారందరినీ అల్లారు ముద్దుగా, ఏదీ లేదనకుండా పెంచాడు. అయితే మితిమీరిన గారాభం చేయడం వల్ల వారిలో ఎవరికీ విద్యాభ్యాసం అబ్బలేదు.\n\nఅంతేగాకుండా నలుగురు అన్నదమ్ముల్లోనూ ఒకరంటే ఒకరికి పడదు. వయసు పెరుగుతున్నా వారి బుద్ధులు, వారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అందుకనే పిల్లలపైన ఆ వ్యాపారి బాగా దిగులు పెట్టుకున్నాడు. ఆ దిగులుతోనే మంచపట్టాడు. చనిపోతానేమోనన్న బెంగపట్టుకుంది.\n\nఅయితే తాను చనిపోతే వారిలో వారే తగాదాలు పడుతున్న తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న దిగులుతో అతడికి వ్యాధి మరింత ముదిరింది. ఆ దిగులుతోనే ఆలోచించి వీరిని ఎలాగైనా సరే బాగుచేయాలని అనుకుంటుండగా మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది.\n\nఅనుకున్నదే తడవుగా ఆ వ్యాపారి తన నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలను తెప్పించాడు. ఒక్కొక్కడినీ ఒక్కొక్క కట్ట తీసుకుని విరవమని చెప్పాడు. నలుగురూ తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరమన్నాడు. అతి కష్టంమీదా ఆ కట్టెలను కూడా విరిచారు.\n\nతరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు వ్యాపారి. నాలుగేసి కట్టెలు విరవడం వారిలో ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు. నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు.\n\nఅప్పుడు వ్యాపారి తన కొడుకులను ఉద్దేశించి... \"చూశారా... నాయనలారా..! మీరు నలుగురూ కలిసి కట్టుగా ఒక పని చేయం వల్ల సులభంగా ఆ కట్టెలను విరిచేయగలిగారు. ఎవరికి వారు విడిగా ప్రయత్నించినప్పుడు చేయలేకపోయారు. ఇప్పటికైనా నలుగురూ కలసిమెలసి ఉండటంలో ఎంత లాభముందో, ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి\" అని అన్నాడు.\n\nఅంతేగాకుండా... \"ఐకమత్యమే బలం\" కాబట్టి నా తరువాత మీరందరూ ఐకమత్యంగా ఉంటామని నాకు ప్రమాణం చేయండి.. అని కొడుకులను కోరాడు ఆ వ్యాపారి. తండ్రి మాటల్లోని జీవిత సత్యాన్ని గ్రహించిన నలుగురు కొడుకులూ ఇకపైన కలసిమెలసి ఉంటామని తండ్రికి ప్రమాణం చేశారు.\n\nకాబట్టి పిల్లలూ...! నలుగురూ కలసిమెలసి ఉండటం వల్ల ఎంత పెద్ద లక్ష్యాన్నయినా సునాయాసంగా ఛేదించవచ్చు. మీరు మీ స్నేహితులతోగానీ, మీ అన్న దమ్ములు, అక్కచెల్లెళ్లతోగానీ ఎప్పుడూ స్నేహంగా, సఖ్యంగా, ఐకమత్యంతో మెలుగుతారు కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 617,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఐక్యమత్యం నేర్చవోయి..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పిల్లలూ...! ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గురువులు, మరెంతోమంది గొప్ప శిష్యులు ఉన్నారు. గురు శిష్యుల అనుబంధం గురించి మీరు చాలా కథలు విని ఉంటారు. అలాంటి ఓ గొప్ప గురు శిష్యుల కథను ఇప్పుడు మనం చదువుకుందాం...!\n\nపూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేకమంది శిష్యులు పాఠాలు చదు వుకుంటూ ఉండేవారు. ఆశ్రమంలోని శిష్యులంతా కలసిమెలసి చాలా సఖ్యంగా మెలిగేవారు. ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు వాల్మీకికి ఫిర్యాదు చేశారు.\n\nఅయితే విషయం అంతా విన్న వాల్మీకి ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... \"అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం\" అని అన్నారు.\n\nఅప్పుడు వాల్మీకి శిష్యులందరినీ సమావేశపరచి... \"మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు\" అని అన్నాడు.\n\nఇంకా... ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు. విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు వాల్మీకి మహాముని.\n\nఅంతేగాకుండా... తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వాల్మీకి చెప్పాడు.\n\nదొంగతనం చేసిన శిష్యుడు గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు ప్రశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు. జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు.\n\nగురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు. మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 618,
        "IMAGE": "cat_7",
        "NAME": "గురు శిష్యుల కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మంద ఉండేది. దానికి రామన్న అనే కోతి ఒకటి నాయకుడిగా ఉండేది. రామన్నకు ఒక సోదరుడు, గుడ్డిదైన తల్లి ఉండేది. తల్లిని ఒకచోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేటకోసం వెళ్ళేవారు.\n\nరామన్న, అతడి తమ్ముడు కలసి రోజూ అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి, మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. ఐతే మంచివారు కాని సేవకులు వాటికి ఆమెకి ఇవ్వకుండా వాళ్ళే తినేసేవారు.\n\nఒకరోజున తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయి \"ఏంటమ్మా ఇలా తయారయ్యావు\" అని ప్రశ్నించాడు. రోజూ మేము పంపించే ఫలాలు తింటున్నావా? లేదా? అని అడిగాడు.\n\nఫలాలా...?! నాకెవరూ ఏమీ ఇవ్వలేదు నాయనా..?! అని చెప్పింది రామన్న తల్లి. అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి... తమ్ముడూ...! ఇకపై నేను ఇంటిదగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను. నువ్వు మంద బాధ్యతను తీసుకో...! అని చెప్పాడు రామన్న.\n\nఅందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు. పైగా... ‘‘అన్నయ్యా! నేనూ నీతోపాటు ఇంటి దగ్గరనే ఉండి, అమ్మపోషణ చూస్తాను'' అని అన్నాడు. దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావిచెట్టుపై బస ఏర్పాటు చేసుకుని, తల్లి ఆలనా పాలనా చూసుకోసాగారు.\n\nకాలం అలా నడుస్తుండగా... మరోవైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువువద్ద విలువిద్య నేర్చుకుంటుంటాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు దగ్గరకు వెళ్ళి, ఇక తనకు సెలవిప్పించండి గురువుగారూ అని అడుగుతాడు.\n\nఅప్పుడు గురువు వేదముని ఉద్దేశించి... \"నాయనా...! నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు. సంతోషం. అయితే నీది దుడుకు స్వభావం. తొందరపడి ఎప్పుడూ క్రూరమైన పనులు చేయవద్దు. ఆ తరువాత ప్రశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదం. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో...!\" అని అన్నాడు.\n\nఅలాగే నంటూ ఊరికి బయలుదేరాడు వేదముని. కొన్ని రోజులకు పెళ్ళి చేసుకున్నాడు. ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు వేదముని. అయితే అతనికి ఏ పని దొరకక పోవడంతో జంతువులను, పక్షలను వేటాడి వాటి మాంసం అమ్మి జీవనం సాగించాడు.\n\nఒకరోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువును వేటాడలేకపోయాడు వేదముని. ఇక లాభం లేదు ఇంటికెళ్లిపోదాం అని అనుకుంటూ... రామన్న సోదరులు, గుడ్డితల్లి నివసిస్తోన్న రావిచెట్టు దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు రామన్న సోదరులు.\n\nఉత్తి చేతులతో ఇంటికెళ్లడమేంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. దీన్ని గమనించిన రామన్న... అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. ఆ తరువాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ తమ్ముడికి చెప్పి, చెట్టు దిగి కిందికి వచ్చాడు.\n\n\"ఓ వేటగాడా... మా అమ్మ ముసలిది, గుడ్డిది. ఆమెను చంపవద్దు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో...!\" అంటూ బ్రతిమలాడాడు రామన్న. ఓహో... అలాగా..?! అంటూ వేదముని నిర్దాక్షిణ్యంగా బాణంతో ఒక్కదెబ్బకు నేలకూల్చాడు. ఐతే.. అతడు మాటమీద నిలబడక మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది కనిపెట్టిన చిన్నవాడు బ్రతిమలాడినా కనికరం చూపలేదు వేటగాడు. అతడిని కూడా అన్నను చంపినట్లే చంపేశాడు.\n\nఈ రెండు కోతులతో ఈరోజుకు పొట్టపోసుకోవచ్చులే అనుకున్న వేటగాడు... కాసేపట్లోనే మళ్ళీ మనసు మార్చుకుని తల్లి కోతిని కూడా ఏ మాత్రం కనికరం లేకుండా చంపేసి... మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటిదారిపట్టాడు.\n\nవేటగాడు ఊరి పొలిమేరకు చేరుకున్నాడో లేదో... పిడుగులాంటి వార్త అతడి చెవినబడింది. అదేంటంటే.. ఇల్లు కాలిపోయి, అతడి భార్యాపిల్లలు సజీవదహనమైపోయారని. వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ పొరలి పొరలి ఏడ్చాడు.\n\nగురువుగారి మాటలను పెడచెవిన పెట్టి, పాపం...! అణ్యం పుణ్యం తెలియని ఆ మూగజీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. తనకు విముక్తి లేదు. చావు తప్ప మరో మార్గం లేదంటూ వేటగాడు కూడా... ఇంకా ఆరని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.\n\nకాబట్టి పిల్లలూ...! గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించడమేకాదు.. తూ.చ. తప్పకుండా పాటిస్తే మంచిది. గురువులైనా, తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలనే చెబుతారు కాబట్టి వాటిని ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. అలా చేసినట్లయితే వేదమునికి పట్టిన గతే పడుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 619,
        "IMAGE": "cat_7",
        "NAME": "మూడు కోతులూ... వేటగాడు...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సీతాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర ఒక గాడిద, కుక్క ఉండేవి. అయితే ఈ రెండూ ఎప్పుడూ సఖ్యంగా ఉండేవి కావు. గాడిదకు కుక్క అంటే అంతగా సరిపడేది కాదు. యజమాని కోసం ఎలాగోలా కుక్కను భరిస్తూ ఉంటుంది.\n\nవ్యాపారం కోసం సరుకులను గాడిదపై వేసుకుని రామయ్య ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేవాడు. అలా వెళ్లేటప్పుడు కుక్కను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. అలా ఒకరోజు వ్యాపారం కోసం వెళ్తూ... ఎండలు మండిపోతుండటంతో విశ్రాంతి కోసం ఓ చెట్టు దగ్గర ఆగుతాడు.\n\nబాగా అలసటగా ఉండటంతో రామయ్య కూర్చున్న చోటనే నిద్రలోకి జారుకున్నాడు. గాడిద, కుక్క రెండూ కూడా యజమానిని కనిపెట్టుకుని చెట్టుకిందే ఆగిపోయాయి. అయితే, ఈ రెండింటికి బాగా ఆకలి వేస్తుంటుంది. బాగా నిద్రలో ఉన్న యజమానిని లేపితే కోప్పడతాడనుకుని చేసేదేంలేక అలాగే ఉండిపోతాయి.\n\nదారిలో అక్కడక్కడా పచ్చగడ్డి కనిపించడంతో, దాంతో కడుపునింపుకున్న గాడిదకు మాత్రం అంతగా ఆకలి ఉండదు. కానీ కుక్కకు మాత్రం బాగా ఆకలిగా ఉండటంతో... \"మిత్రమా.... నువ్వు కనీసం దారిలోనయినా పచ్చగడ్డి తిన్నావు. నాకు ఏమీ దొరకలేదు కదా...! బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఇలా కూర్చుంటే నీ వీపుపైన ఉన్నరొట్టెముక్కలను తీసుకుని తింటాను.\" అంటూ గాడిదను బ్రతిమలాడింది.\n\nఅయితే గాడిద ససేమిరా అనటమే గాకుండా... \"నేను కూర్చోను. యజమాని నిద్ర లేచేదాకా ఆగు. లేకుంటే నువ్వే వెళ్లి యజమానిని లేపు\" అని అంది. నిద్రలోంచి లేపితే యజమాని కొడతాడు కాబట్టి... కుక్క మారు మాట్లాడకుండా ఆకలితో అలాగే కూర్చుంటుంది.\n\nఇలా ఉంటే... కాసేపటికి అక్కడికి ఒక తోడేలు వచ్చింది. బాగా కండపట్టి ఉన్న గాడిదను చూడగానే, ఒక్కసారిగా దూకి దాని గొంతు కొరికి రక్తం తాగాలన్న ఆశతో గమనించసాగింది. దీన్ని చూసిన గాడిదకు ఒళ్ళంతా చెమటలు పోశాయి. వెంటనే కుక్కను పిలిచి \"వెళ్లి యజమానిని లేపు, లేకుంటే ఈ తోడేలు నా ప్రాణాలు తీసేస్తుంది\" అని అరచింది.\n\nకుక్క అసలే గాడిదపై గుర్రుగా ఉండటంతో... \"ఏం ఫర్వాలేదులే... యజమాని లేచేదాకా ఊరుకో. ఆయన లేచాకే దాని సంగతి చూద్దాం..\" అంది. అప్పటికిగానీ తిక్క కుదిరిన గాడిద తాను చేసిన పనికి కుక్కను క్షమాపణ అడిగింది.\n\nదీంతో కాస్తంత మెత్తబడ్డ కుక్క... పెద్దగా మొరిగి తోడేలును తరిమి కొట్టింది. ఆ తరువాత నుండి గాడిద కుక్కతో చాలా స్నేహంగా మెలగసాగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 620,
        "IMAGE": "cat_7",
        "NAME": "గాడిద తిక్క కుదిర్చిన కుక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రైతు దంపతులైన కమలమ్మ, రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాభంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే... వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు.\n\nహరి తాత చాలా ముసలివాడు. ఏ పనీ చేయలేడు. పైగా... ఆయనకు అన్ని పనులకు కోడలు సపర్యలు చేయాల్సి వచ్చేది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకు ఈ కష్టాలు, ఈ ముసలాడు పోయే కాలమే రాదా...? అంటూ ఆమె చాలారోజులు ఎదురుచూసింది.\n\nఅయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరి తల్లి... తన భర్తతో, ‘‘మీ నాయినతో నాకు ప్రాణం విసిగిపోతోంది. ఇంట్లో చాకిరీ అంతా ఒక ఎత్తయితే, ఆ ముసలాడి చేసే చాకిరీ మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది.\n\nబాధపడకు... ముసలాడైపోయాడు. ఇంకెంత కాలం బ్రతుకుతాడులే...! అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డుకర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడింది ఆమె.\n\nతనకు ఆయుష్షున్నన్ని రోజులు బ్రతకనీ... ఏం చేస్తాం? చేతులారా చంపుకుంటామా?'' అన్నాడు రాజయ్య. ‘‘ఏం చంపితే? బతికి ఆయన ఎవరిని ఉద్దరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలాడి పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్యకు, తన తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఘోరంగా కనబడింది.\n\nఅయితే... పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట, ఆమె మాటలు వినీవినీ అందులో ఏమీ తప్పులేదని భావించాడు రాజయ్య. తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపేసి, మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు.\n\nఅంతే... అనుకున్నదే తడవుగా తండ్రి దగ్గిరికి వెళ్ళి, ‘‘నాయినా, పొరుగూళ్ళో అప్పు మాట్లాడాను. వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు. ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు,'' అన్నాడు. ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా, తాతతోపాటే బండి ఎక్కి కూచున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రినీ, కొడుకునూ వెంటపెట్టుకుని బయలుదేరాడు.\n\nఅలా వెళ్తూ.. వెళ్తూ దారిలో ఒక చోట రాజయ్య బండి ఆపి, ‘‘ఇప్పుడే వస్తా!'' అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. హరి కూడా... తాతతో, ‘‘ఇప్పుడే వస్తా!'' అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కనిపించాడు.\n\nఅదే పొద అవతలివైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వనారంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య... పని ఆపి, పొద అవతలికి వెళ్ళి, కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ‘‘ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు?'' అని అడిగాడు.\n\n‘‘నువ్వెందుకు తవ్వుతున్నావో నేనూ, అందుకే...!'' అన్నాడు హరి. ‘‘నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా?'' కోపంగా అడిగాడు తండ్రి. ‘‘నాకు తెలీదు. నువ్వెందుకు తవ్వుతున్నావు?'' అన్నాడు. ‘‘నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను!. నేను ఆయన కొడుకును కాబట్టి, ఆయన చస్తే పాతి పెట్టాలిసిన బాధ్యత నాకుంది\" అని అన్నాడు.\n\n‘‘ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా?'' బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును. కానీ నేను ఇప్పుడు ఆయనను చంపేసి, ఆ తరువాత పాతిపెడతాను అని అన్నాడు. అంతే హరి కోపంతో.... ఓహో అలాగా...! అయితే నా తండ్రి చస్తే, నాకు కూడా పాతిపెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు.\n\nకొడుకు మాటలకు శరాఘాతంగా గుచ్చుకోగా, అప్పటికిగానీ తాను చేస్తున్న తప్పేంటో తెలియని రాజయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. పార తీసుకుని కొడుకును పోదాం పదా...! అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్లిపోయాడు.\n\nఈపాటికి ఆ ముసలాడి పీడ వదిలే ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ, రకరకాల పిండివంటలు చేసి భర్తకోసం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బండిలోంచి ముగ్గురూ దిగటంతో నిరుత్సాహపడిన ఆమె ఏమయ్యింది అంటూ భర్తను ప్రశ్నించింది.\n\nఅప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. ‘‘వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం! తండ్రికే గొయ్యి తవ్వుతాడా? ఇక వాడి ముఖంచూసేదెలా!\" అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య \"నా తండ్రి మాత్రం నన్ను గారాభంగా పెంచలేదా...! ఇకమీదటైనా బుద్ధిగా ఉండు...\" అంటూ ఆమెని హెచ్చరించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 621,
        "IMAGE": "cat_7",
        "NAME": "మీరు చేసే పనే... నేనూ చేస్తున్నా..! ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.\n\nఅలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన \"సూర్యుడా...! దూరంగా వెళ్ళు\" అంటూ ఆజ్ఞాపించాడు.\n\nఅంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.\n\nఅయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.\n\nఅప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.\n\nఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.\n\n\"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని\" హెచ్చరించాడు.\n\nఅప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... \"ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు\" అన్నాడు కసిగా...\n\nజమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. \"ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం\" అని చెప్పుకొచ్చాడు.\n\nఅంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 622,
        "IMAGE": "cat_7",
        "NAME": "సూర్యదేవుడిపై జమదగ్ని యుద్ధం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అమలాపురం అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా, ఇతరులకు పెట్టకుండా పీనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు.\n\nసూరయ్య ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ, ఏ కొంతైనా సాయం చేయకపోతాడా...? అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు. సాయం చేయమని వేడుకునేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేవాడే గానీ, గడ్డిపరకంత సాయం మాత్రం చేసేవాడు కాదు.\n\nప్రతిరోజూ ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు, ఊర్లో వాళ్ళు అందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరకు రావడంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నింటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు.\n\nఉరికి దగ్గర్లో గల ఒక పాడుబడ్డ బావిలో, ఎవరూ కనుక్కోలేని చోటులో ఆ బంగారాన్నంతా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య. ప్రతిరోజూ ఉదయంపూట లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం ఎవరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చి, తనివితీరా చూసుకుని వెళ్తుండేవాడు. కాలం అలా గడిచిపోసాగింది....\n\nఅయితే ప్రతిరోజూ సూరయ్య ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ, వస్తుండటం ఒక దొంగ గమనించాడు. రహస్యంగా సూరయ్యను అనుసరించి బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనుక్కున్నాడు. అంతే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగారం పాత్రను దొరకబుచ్చుకుని, తీసుకొని వెళ్ళిపోయాడు.\n\nరోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుబడ్డ బావివద్దకు వచ్చాడు. తన బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువైంది. పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనబడింది. అంతే అతడి గుండె బద్ధలయినంతపని అయింది. తాను కష్టపడి సంపాదించి, కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారని పొరలి పొరలి ఏడ్చాడు.\n\nనెత్తీ నోరూ బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు. అప్పుడు ఆ దారినే వెళ్తూన్న ఆ ఊర్లోని ఒక ముసలాయన సూరయ్య చూసి విషయమేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అని ప్రశ్నించాడు.\nఅంతే.... జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు చెప్పాడు సూరయ్య.\n\nఅంతా విన్న ముసలాయన... \"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీ కెందుకు చెప్పు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నిఅవస్ధలు పడ్డావు. అది కాస్తా ఇప్పుడు పోయింది. నీ బాధా విరుగుడయింది. ఇకనైనా హాయిగా నిద్రపో...!\" అంటూ బుద్ధి మాటలు చెప్పాడు.\n\nదీంతో చేసేదేమీలేక ఏడుపు మానేసిన సూరయ్య.... నిజమే కదా...! అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి, పిల్లలూ...! ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించలేకపోతే అది వృధా అని, అలాగే పిసినారితనం అనేక సమస్యలకు మూలకారణమని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 623,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఇకనైనా హాయిగా నిద్రపో...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామనాథం, శారదాంబ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజేష్. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు రాజేష్‌ను బాగా గారాభంగా పెంచుకున్నారు. తను చెప్పినట్లల్లా తల్లిదండ్రులు వింటుండటంతో అతడి గారాభం ఎక్కువైంది. అంతేగాకుండా అల్లర చిల్లపనులు చేస్తూ... అనేక సాకులు చెబుతూ స్కూలుకు ఎగనామం పెట్టేవాడు.\n\nకానీ రాజేష్ తల్లిదండ్రులకు అతడు చేసే చిల్లరపనులన్నీ తెలిసేవి కావు. తమ బిడ్డ మంచివాడనుకుంటూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు స్కూలు ఎగ్గొట్టి, అద్దె సైకిలు తెచ్చుకుని ఊరంతా బలాదూర్ తిరుగుతాడు రాజేష్. అలా తిరుగుతుండగా, సైకిలు రాయికి గుద్దుకుని కిందపడిపోయాడు. దీంతో సైకిల్ బ్రేకులు అతడికి గుచ్చుకుని రక్తం కారుతుంది.\n\nఎలాగోలా ఓపిక తెచ్చుకున్న రాజేష్ కుంటుకుంటూ వెళ్లి సైకిలును బాడుగ షాపు వాళ్ళకు ఇవ్వడానికి వెళతాడు. అక్కడ ఆ షాపు యజమాని అతడిని చూసి అయ్యో...! ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. మీ అమ్మానాన్నలకు చెప్పి హాస్పిటల్‌కు వెళ్ళు అంటూ సానుభూతిగా చెప్పాడు.\n\nఇంటికి వెళ్ళగానే రాజేష్‌ని చూసిన తల్లిదండ్రులు అయ్యో...! ఏమయ్యింది నాన్నా...! ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అంటూ ఆదుర్దాగా అడిగారు. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అలా అబద్ధం చెప్పాడు రాజేష్.\n\nఅబ్బా...! ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ రాజేష్ కాలికి పసుపు రాసింది తల్లి. అలా రెండు రోజులు గడిచిపోయాయి. రాజేష్ కాలు బాగా వాచింది. కాలు కదపడానికి కూడా వీలు కావడం లేదు. అప్పుడు రాజేష్ తండ్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. దెబ్బను చూసిన డాక్టర్ ఎలా తగిలింది అంటూ రాజేష్‌ని ప్రశ్నించాడు.\n\nబడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను సార్...! రాయి గుచ్చుకుంది అంతే... అంటూ మళ్ళీ అబద్ధం చెప్పాడు రాజేష్. డాక్టర్‌కు రాజేష్ పరిస్థితి అర్థమై నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అంటూ బెదిరించాడు. దీంతో చేసేదిలేక నిజం చెప్పేశాడు రాజేష్.\n\nఅంతా విన్న డాక్టర్ చూడండీ... మీ వాడు అందరితో అబద్ధం చెప్పాడు. ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే ఉండిఉంటే... కాలు తీసేయాల్సి వచ్చేది అన్నాడు. వెంటనే టీటీ ఇంజక్షన్లు, యాంటీ సెప్టిక్ మందులు ఇచ్చాడు డాక్టర్. తరువాత రాజేష్ వైపు చూస్తూ... ఇకనైనా జాగ్రతగా ఉండాలని చెప్పాడు.\n\nహాస్పిటల్ నుండి ఇంటికెళుతూ... రాజేష్ తండ్రి మొహంలోకి కూడా చూడటానికి ఇబ్బంది పడుతూ... అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరాడు. ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయనని ప్రామిస్ చేశాడు. అలాగే తన మనస్సులో ఇలా అనుకున్నాడు... కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది, ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు.\n\nఆరోజు నుండి అబద్ధం చెప్పకుండా రాజేష్ బుద్ధిగా మసలుకున్నాడు. అంతేకాకుండా బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. కాబట్టి పిల్లలూ...! అబద్ధాలు ఆడకూడదు. చేసిన తప్పును మొదట్లోనే సరిదిద్దుకున్నవారే భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 624,
        "IMAGE": "cat_7",
        "NAME": "అబద్దం తెచ్చిన తంటాలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే, అంగబలంలోనూ, అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి, వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు.\n\nఒకరోజు గణపతిదేవుడికి ఆ అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవ్వాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు.\n\nఅయితే పాండ్య రాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందనీ, దీన్ని పోగొట్టుకోదలచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి, రాజుకు అవమానం జరుగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది.\n\nసేనాధిపతి, సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మ విశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు.\n\nగుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు \"ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ...! ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి...!\" అంటూ పిలిచాడు.\n\nఒక నాణెము తీసి చూపించి \"బొమ్మా... బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే...! విజయం మనదే...! అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్ళిపోదాం\" అంటూ నాణెం పైకి ఎగురవేశాడు. అంతే... నాణంపై రాజముద్రిక కనిపించింది.\n\nనాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఉరకలు వేసి, గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రుసైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు, మధురై పాండ్య రాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి, వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు\n\nయుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా... రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి \"యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి, విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ...!\" అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ... తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మా బొరుసూ వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండువైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.\n\nఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి పిల్లలూ...! అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ...! యుద్ధానికి ఏ మాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండినాణెం రెండువైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మా బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 625,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆత్మవిశ్వాసం ఉంటే గెలుపు తథ్యం!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలి బాధతో విలవిలలాడుతూ... ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించింది నక్క. తిరిగి తిరిగీ నీరసం వచ్చి పడిపోయిన నక్క ఇలాగైతే ఆకలితో చనిపోవడం ఖాయం అనుకుంటూ ఏడ్వసాగింది. ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలనుకున్నా, అప్పటికప్పుడు ఏంచేయాలో దానికి పాలుబోలేదు. చేసేదేమీ లేక దేవుడి వేడుకోసాగింది.\n\nఎక్కడ ఆహారం దొరుకుతుందా...? అంటూ తీవ్రంగా ఆలోచనలో పడ్డ నక్క, బాగా దాహం వేయడంతో కనీసం నీళ్లైనా తాగుదామనుకుంది. అసలే ఒంట్లో ఏ మాత్రం శక్తి లేని నక్క ఎక్కువ దూరం నడిచే ఓపిక లేక దగ్గర్లోని ఏదో ఒక చెరువు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా మెల్లగా నడుచుకుంటూ దగ్గర్లోని ఓ చెరువు దగ్గరకు వెళ్ళింది.\n\nచెరువులో ఒక కొంగ చేపల్ని పట్టి తినడం గమనించింది నక్క. అసలే ఆకలి బాధతో ఉన్న నక్కకు ఆ దృశ్యం మరింత కోపం కలిగించింది. తనకు తిండిలేక అలమటిస్తోంటే, కొంగ ఎంచక్కా చేపల్ని తింటుండటం నక్కకు ఈర్ష్యని కలిగించింది. అంతేగాకుండా కొంగ ఒంటికాలిపై నిలబడి చేపల్ని తినే విధానం చూసిన నక్కకు, తాను కూడా అలా చేపల్ని పట్టి తినాలన్న కోరిక కలిగింది.\n\nఅనుకున్నదే తడవుగా నీళ్ళలోకి దిగింది నక్క. అయితే దానికి కొంగలా చాలాసేపు నిలబడి చేపల్ని పట్టాలంటే చేతకాలేదు. ఎలాగబ్బా... అని ఆలోచనలో పడింది నక్క. ఇదలా జరుగుతుండగానే కొంగ మళ్ళీ యథావిధిగా చెరువులోకి వచ్చి చేపలవేట ప్రారంభించింది. ఇదంతా గమనిస్తోన్న నక్క వెనుకనుండి వచ్చి కొంగ మెడ పట్టుకుంది.\n\nహఠాత్ పరిణామానికి భయపడ్డ కొంగ వెంటనే తేరుకుని... \"మిత్రమా...! నీకు కలిగిన కష్టమేమిటి? ఎందుకు నా మెడ అలా పట్టుకున్నావని\" అడిగింది. దానికి నక్క కోపంగా.... నేను తిండిలేక అల్లాడుతుంటే... నీకేమో మంచి ఆహారం దొరుకుతోంది. అందుకే నీ మెడ పట్టుకున్నానని చెప్పింది.\n\nఎటూ పాలుబోని కొంగ ఒక ఉపాయాన్ని ఆలోచించింది. నీకు దొరకని ఆహారం నాకు దొరుకుతుండటానికి కారణం \"జపం\" చేయటమేనని నక్కతో చెప్పింది. అయితే ఆ జపం గురించి తనకు చెప్పమంది నక్క. నీవు కూడా ఒంటికాలిమీద నిల్చుని ఓం, హీం అంటూ జపం చేస్తూ రెండడుగులు ముందుకు వేయాలని చెప్పింది కొంగ.\n\nకొంగ మాటలను నమ్మిన నక్క, దాని మెడను ఒక చేత్తో పట్టుకుని జపం కోసం చెరువులోకి దిగుతుంది. అలా రెండడుగులు నీళ్ళలోకి వెళ్లగానే నక్క మునిగిపోతుంది. దీంతో కొంగ మెడను వదలిపెడుతుంది. అపుడు కొంగ నక్కబారి నుంచి తప్పించుకుని ఒడ్డుమీదకు చేరి నక్కతో ఇలా అంటుంది. \"నీకు చేపలు కావాలి కదా... చెరువులోని అన్నింటినీ నువ్వే బాగా తిను...!\" అని నవ్వుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది కొంగ.\n\nకాబట్టి పిల్లలూ...! కొంగ జపం అని ఊరికే అనలేదు పెద్దలు. ప్రాణాల మీదికి వచ్చినప్పటికీ తెలివిగా ఆలోచించి నక్క బారినుండి తప్పించుకున్న కొంగ కథను తెలుసుకున్నాం కదూ...! రేపు మరో కథను చదువుకుందాం...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 626,
        "IMAGE": "cat_7",
        "NAME": "జపం జపం...! కొంగ జపం...!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రమణ, కమల దంపతుల ఒక్కగానొక్క కొడుకు శీను అంటే పంచప్రాణాలు. శీనును చాలా గారాభంగా పెంచుకోవడమే గాకుండా ఏది అడిగినా వారు కాదనుకుండా తెచ్చి ఇచ్చేవారు. తల్లిదండ్రుల గారాభానికి బాగా అలవాటుపడిన శీను అవసరం ఉన్నా లేక పోయినా గొంతెమ్మ కోరికలు కోరసాగాడు.\n\nఅయితే... చిరుద్యోగి అయిన శీను తండ్రి రమణ వాడు కోరే కోరికలన్నింటినీ కాదనలేక... తన శక్తిమేరకు అప్ప సప్పో చేసి తంటాలు పడుతూ కొనిచ్చేవాడు.\n\nఇలా ఉంటే... ఒకరోజు శీను తనకు కొత్త సైకిల్ కావాలని పట్టుబట్టాడు. అసలే డబ్బుల్లేక అవస్థలు పడుతోన్న రమణకు అప్పటికప్పుడు కొత్త సైకిల్‌కు అవసరమైన రెండు వేల రూపాయలకు ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు లేవురా... వచ్చే నెల జీతం రాగానే కొనిస్తానని శీనుకు సర్దిజెప్పబోయాడు.\n\n\"అదేం కుదరదు. నాకు సైకిల్ ఇప్పుడే కావాలి. లేకుంటే నేను అన్నం తిననని\" మొండికేశాడు శీను. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చివరకు విసిగిపోయిన తండ్రి ఆఫీసుకు వెళ్లిపోయాడు. శీను స్కూల్ ఎగ్గొట్టి, అలిగి ఇంటిబయట అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాడు.\n\nఅలా కూర్చొని ఉండగా ఓ భిక్షగాడు భిక్షం కోసం వాళ్ల ఇంటికి వచ్చాడు. \"అమ్మా...! భిక్షం వేయండి తల్లీ...!\" అంటూ దీనంగా అడిగాడు. శీను భిక్షగాడిని పరిశీలించి చూశాడు. ఆ భిక్షగాడికి రెండు కాళ్లూ లేవు. చేతి కర్రల సాయంతో అతికష్టంమీద నడుస్తున్నాడు.\n\nభిక్షగాడి పరిస్థితిని గమనించిన శీనుకు ఆ క్షణంలో కళ్లు తెరచుకున్నాయి. దేవుడు తనకు ఆరోగ్యకరమైన రెండు కాళ్లు ఇచ్చాడు. తన అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ల ప్రేమను ఇచ్చాడు. ఆ భిక్షగాడితో పోలిస్తే తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను లేనిపోని కోరికలతో ఎందుకు దుఃఖపడుతున్నాను అని ఆలోచించాడు. వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు.\n\nతల్లిదండ్రులపట్ల కృతజ్ఞతతో శీను కళ్లు చెమర్చాయి. ఇంకెప్పుడూ తన అమ్మానాన్నలను అనవసరమైన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి, సంతృప్తిని మించిన బలం ఏదీ లేదని అనుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 627,
        "IMAGE": "cat_7",
        "NAME": "సంతృప్తే అన్నింటికన్నా మిన్న!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలంలో గోదావరి తీరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రకరకాల క్రిమికీటకాదులు, జంతువులు ఎంతో సుఖంగా, సంతోషంగా జీవనం గడుపుతుండేవి. ఆ అడవిలో కనకం అనే పెద్ద మదపుటేనుగు కూడా ఉండేది. అది చాలా పెద్ద శరీరంతో చిన్న కొండ కదలివస్తోందా అన్నట్లుగా ఉండేది. దాని ఆకారాన్ని, శక్తిని చూసిన చిన్న చిన్న జీవులు భయంతో గజగజా వణికిపోయేవి.\n\nమదపుటేనుగు పొడుగైన దంతాలు, అడుగుల బారినపడి జంతువులు చాలావరకు నశించిపోయాయి. ఏనుగు భయానికి భయపడ్డ మరికొన్ని ప్రాణులు అడవిని వదలి వేరే చోటికి వలసవెళ్ళి జీవనం సాగించాయి. అయితే అడవులోని జంతువులన్నీ సగం ఏనుగు ధాటికి చనిపోగా, మరికొన్ని అడవిని వదలి వెళ్లిపోవడంతో అక్కడ ఉండే నక్కలకు ఆహారం లేక క్రమంగా ఒక్కొక్కటిగా చనిపోతుంటాయి.\n\nతమ జాతి ఇలా అంతరించి పోవడాన్ని చూసి భోరున విలపించిన నక్కలన్నీ ఓ రోజు సమావేశమయ్యాయి. ఎలాగైనా సరే మదపుటేనుగు పీడ వదిలించుకోవాలని అనుకున్నాయి. \"ఈ ఏనుగు చచ్చిపోతే మనకు కొన్ని నెలలదాకా తిండికి లోటుండదు. ఇది చనిపోయిందని తెలిస్తే పారిపోయిన జంతువులన్నీ కూడా తిరిగి వస్తాయి. అప్పుడు ఎంచక్కా కడుపునిండా మనకు తిండి దొరుకుతుందని\" అనుకున్నాయి.\n\nఅలా అనుకున్నదే తడవుగా ఓ పిల్ల నక్క లేచి నిలబడి \"ఆ ఏనుగును నేను చంపుతాను\" అని చెప్పింది. దాని మాటలు విన్న మిగతా నక్కలు ఫక్కున నవ్వాయి. ఇంతలో అన్నింట్లో పెద్దదైన నక్క ఒకటి, మిగిలిన నక్కలను ఊరకుండమని హెచ్చరిస్తూ...\"ఇదేమైనా ఆడుకునే ఏనుగు అనుకుంటున్నావా..?! దీన్ని చంపటం మాకే చేతకాదు. నీవెళ్ళి ఏం చేస్తావు?\" అంటూ పిల్లనక్కను బెదిరించింది.\n\nఅయితే పెద్దనక్క మాటలు విన్న పిల్లనక్క వస్తోన్న కోపాన్ని తమాయించుకుని \"అయినా మీరు వయసును, శరీరాన్ని చూసి తెలివితేటలను లెక్కించటం సరికాదు. నాకు అవకాశం ఇస్తే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంటానని\" సవాలు చేసింది. ఈ మాటలు విన్న పెద్ద నక్క \"సరే.. చూద్దాం... కానీ...!\" అన్నాడు.\n\nమరుసటిరోజు ఉదయాన్నే పిల్ల నక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి... నమస్కారం చేసి \"మహారాజులవారికి జయము... జయము!\" అంటూ పక్కన నిలుచుంది. ఆ పిల్లనక్క తనను మహారాజు అంటూ పిలవడంతో ఆశ్చర్యపోయిన ఏనుగు ఎవరు నువ్వు? అంటూ గట్టిగా నిలదీసింది.\n\n\"ప్రభూ...! నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మహారాజా...! అని సంభోదించానని చెప్పింది. ఇకపై ఈ అడవికి రారాజు మీరేనని మేమందరం తీర్మానించుకున్నామని, మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చానని వివరించి చెప్పింది పిల్లనక్క.\n\nసంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన మదపుటేనుగు గర్వంగా, రారాజు ఠీవితో నడుస్తూ... ఎక్కడికెళ్ళాలి? ఇంకా ఎంతదూరం వెళ్ళాలి..? అంటూ ప్రశ్నించింది. \"దగ్గరే మహారాజా... నాతో రండి\" అంటూ జిత్తులమారి నక్క మెల్లగా ఊబివైపు తీసుకెళ్ళింది. ఇకపై తానే రాజునన్న సంతోషంతో మునిగితేలుతున్న ఏనుగు ఎటు వెళ్తుందో గమనించకుండా నడువసాగింది. అలా వెళ్తుండగానే హఠాత్తుగా ఊబిలోకి దిగబడిపోయింది.\n\nవెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఏనుగు \"కాపాడండి...! కాపాడండి...!\" అంటూ అరవసాగింది. దీంతో... జిత్తుమారి నక్కనైన నన్ను నమ్మి వచ్చిన నువ్వు తగిన ఫలితమే అనుభవించావు మహారాజా...? అని వెకిలిగా నవ్వసాగింది పిల్లనక్క. ఏనుగు కేకలు విన్న మిగిలిన జంతువులన్నీ అక్కడికి వచ్చేసరికే అది పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది. అది చూసిన మిగిలిన జంతువులన్నీ పిల్లనక్క తెలివితేటలను ప్రశంసించాయి. పెద్ద శరీరం, వయసు, అనుభవం లాంటి వాటికన్నా, బుద్ధిబలమే అన్నింటికంటే మిన్న జంతువులన్నీ గ్రహించాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 628,
        "IMAGE": "cat_7",
        "NAME": "జిత్తులమారి నక్క - ఏనుగు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పిల్లలూ...! ఈరోజు మనం శిబి చక్రవర్తి దానశీలతను తెలియజేసే ఓ కథను చదువుకుందాం. మీ రెప్పుడైనా శిబి చక్రవర్తి పేరు విన్నారా..? విని ఉంటే... ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయో తెలుసా...?\n\nమహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!\n\nఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.\n\nఅయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... \"ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?\" అంటూ ప్రశ్నించాడు.\n\nఅప్పుడు శిబి చక్రవర్తి \"ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను...\" అని చెప్పాడు.\n\nదానికి డేగ మాట్లాడుతూ... \"అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు\" అని అంది.\n\nదీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.\n\nసరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.\n\nకాబట్టి పిల్లలూ...! ఆపదలో ఉండి శరణుజొచ్చిన వారిని కాపాడటం మన విధి. దాని కోసం మన ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ, అందుకు సంసిద్ధంగా ఉండాలి అని చెబుతున్న ఈ కథలోని నీతిని తెలుసుకున్నారు కదా...! ఇంకేముందీ... కథ కంచికి, మనం ఇంటికి... వెళ్ళండి మరి...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 629,
        "IMAGE": "cat_7",
        "NAME": "మహాదానశీలి శిబి చక్రవర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సింగరాయగుంట అనే ఊర్లో నలుగురు మిత్రులు ఉండేవారు. రాము, సోము, చిన్నా, సుందరం వారి పేర్లు. ఒకేలాంటి అలవాట్లు లక్షణాలు కలిగిన వీరందరూ చాలా పేదవారు. నిలువ నీడలేని వీరు ఒక పూట తినీ మరోపూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు.\n\nఒకరోజు వీరందరూ ఒకచోట చేరి ఎలాగైనా సరే డబ్బు సాధించాలనే నిర్ణయానికి వచ్చి, ఊరు వదలి బయటపడ్డారు. అలా బయలుదేరిన వారు ఒక నది గట్టుమీద ప్రయాణం సాగిస్తుండగా... జడలు అట్టలు కట్టుకుపోయిన జట్టుతో ఒక సన్యాసి ఒకడు కనిపించాడు.\n\nభక్తిశ్రద్ధలతో సన్యాసికి నమస్కరించిన నలుగురు స్నేహితులు తమ కష్ట నష్టాలను అతడికి విన్నవించారు. యోగశక్తి కలిగిన మీరు ఎలాగైనా తమను కరుణించాలని సన్యాసిని వేడుకున్నారు. వీరి బాధలను విన్న సన్యాసి కరుణతో వారికి ఒక జ్యోతిని ఇచ్చి... \"ఈ జ్యోతిని పట్టుకుని మీరందరూ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో నుండి జ్యోతి ఎక్కడ కింద పడితే అక్కడ భూమిని త్రవ్వారంటే మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. దాంతో మీరందరూ సంతోషంగా జీవించండి\" అంటూ దీవించాడు.\n\nజ్యోతిని పట్టుకుని సంతోషంతో మునిగిపోతూ నలుగురు స్నేహితులూ దగ్గర్లోని పర్వతాల వైపుకు నడవటం ప్రారంభించారు. అలా వెళ్తుండగా వారి చేతిలోని జ్యోతి ఒకచోట కింద పడిపోయింది. దీంతో నడకను ఆపేసిన వారు అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. త్రవ్వుతుండగా అక్కడో పెద్ద రాగి గని బయటపడింది. దీంతో నలుగురిలో మొదటి వాడైన రాము తనకు ఈ రాగిగని మాత్రం చాలునంటూ... తృప్తిగా వెనుకకు వెళ్ళిపోయాడు.\n\nతరువాత మిగిలిన ముగ్గురూ మళ్ళీ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం పర్వతాలవైపు నడక ప్రారంభించారు. అలా వెళ్తుండగా మరోచోట జ్యోతి జారి కింద పడిపోయింది. దీంతో అక్కడ కూడా త్రవ్వి చూడగా పెద్ద వెండిగని బయటపడింది. అప్పుడు రెండోవాడైన సోము తనకు ఈ వెండిగని చాలునంటూ తృప్తిపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.\n\nమళ్ళీ మిగిలిన ఇద్దరూ ఇంకా మంచివి దొరుకుతాయన్న ఆశతో... జ్యోతిని పట్టుకుని పాటు పర్వాతాల వైపు నడక సాగించారు. వీరి ప్రయాణంలో జ్యోతి మళ్ళీ ఒకచోట జారి కింద పడిపోయింది. అక్కడ త్రవ్వి చూస్తే... పెద్ద బంగారం గని. దీన్ని చూసిన మూడోవాడైన చిన్నా బాగా తృప్తిపడి తనకు ఇది చాలునంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.\n\nఇక అందరిలో నాలుగోవాడైన సుందరం అత్యాశతో, ఇంకా గొప్ప గొప్ప వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు లాంటి వి సొంతం చేసుకోవాలన్న దురాశతో జ్యోతిని పట్టుకుని తిరిగీ నడక ప్రారంభించాడు. అలా చాలా దూరం నడుస్తూనే ఉన్నాడు సుందరం. ఒకచోట ఎప్పట్లాగే జ్యోతి కింద పడింది.\n\nమొదటి మూడుసార్లుకంటే... ఇప్పుడు ఇంకా ఎక్కువ విలువైనవి దొరకవచ్చన్న ఆశతో సుందరం త్రవ్వసాగాడు. ఎంత త్రవ్వినప్పటికీ ఏమీ బయటపడలేదు. త్రవ్వి, త్రవ్వి నీరసం వచ్చిన సుందరం అలాగే ఆ గోతిలోనే పడిపోయాడు. తరువాత మెలకువ వచ్చి చూసేసరికి సుందరానికి జ్యోతి కనబడలేదు.\n\nదొరికనదానితో సంతృప్తి పడకుండా... అత్యాశతో ప్రవర్తించిన సుందరానికి చివరికి ఏమీ మిగలలేదు. పైగా గోతిలో పడిపోయి, రక్షించేవారు లేక, తినడానికి ఏమీ లేక ఏడుస్తూ... ఎవరైనా కాపాడండి... అంటూ కేకలు వేస్తూ ఉండిపోయాడు. దొరికిన వాటితో సంతృప్తి పడిన అతడి ముగ్గురు స్నేహితులైన రాము, సోము, చిన్నాలు సంతోషంగా జీవితం గడపసాగారు.\n\nకాబట్టి పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటన్న విషయం ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! అలాగే, మీరందరూ ఈ కథలోని నీతిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 630,
        "IMAGE": "cat_7",
        "NAME": "అత్యాశతో ఆపదపాలైన సుందరం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్యా పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే పదేళ్ళ కొడుకు, భాగ్య అనే ఐదేళ్ళ కూతురు అంటే పంచ ప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య, చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు.\n\nఒకరోజు పొలంపని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ... పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్ళాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలంపనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు.\n\nనాయనా రామూ...! నేను పక్కనే కూలీలతో పొలంపని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కానీ... ఇక్కడకు అప్పుడప్పుడు పెద్దపులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి, కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య.\n\nఅసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా... \"నాన్నా...! నాన్నా...! పెద్దపులి వచ్చింది\" అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య... కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు, గడపారలతో పరుగు పరుగున వచ్చాడు.\n\nఇది చూసిన రాము నాన్నా...! పులి లేదు ఏమీ లేదు... ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటిపని ఇంకెప్పుడూ చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు.\n\nమరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ \"నాన్నా...! నాన్నా...! పెద్దపులి వచ్చింది\" అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు, గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే... ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు.\n\nరాము బాధతో ఏడుస్తూ కూర్చొని గొర్రెలవైపు చూస్తుంటే... నిజంగానే పులి వచ్చింది. \"నాన్నా...! నాన్నా...! ఈసారి నిజంగానే పెద్దపులి వచ్చింది\" అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్ళు ఎవరూ కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు.\n\nఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు.\n\nఏదో వేళాకోళానికి, నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే, అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడూ వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి పిల్లలూ...! హాస్యానికైనా అబద్దం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం . ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 631,
        "IMAGE": "cat_7",
        "NAME": "అబద్ధమాడితే అపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "నాగలంక అనే ఊర్లో శీనయ్య అనే మేకలకాపరి ఉండేవాడు. అతడికి ఉన్న మేకలలో ఒక మేకపోతు అంటే చాలా ఇష్టం.దానికి అతడు ప్రేమగా గోపయ్య అనే పేరు పెట్టుకున్నాడు. మిగతా మేకలన్నింటితో కలిపి గోపయ్యను కూడా శీనయ్య ఒకరోజు అడవికి మేతకు తీసుకెళ్లాడు.\n\nమేకల మందతో కలిసి గోపయ్య అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకు అలములు తింది. ఎంతో ఆనందంగా ఉన్న గోపయ్య అడవంతా ఉరుకులు పరుగులు పెడుతూ... అందరికంటే ముందే వెళ్లాలన్న ఉత్సాహంలో మందనుండి తప్పిపోయింది. ఎంతసేపు తిరిగినా గోపయ్య మేకల మందను చేరుకోలేక పోయింది. అప్పటికే చీకటి పడటంతో ఎటూ పాలుబోక దగ్గర్లో ఒక గుహ కనబడితే అందులోకెళ్లి పడుకుంది.\n\nఏదో అలికిడి వినిపించగానే గోపయ్యకు మెలకువ వచ్చింది. ఆ గుహలో నివాసం ఉంటోన్న సింహం తన వేటను ముగించి సుష్టుగా భోంచేసి త్రేన్చుకుంటూ లోపలికి వచ్చింది. సింహం గురించి అప్పుడెప్పుడో వినడం తప్ప ఎప్పుడూ దానిని చూడలేదు గోపయ్య. అలాంటిది ఒక్కసారిగా తన ముందు సింహం కనిపించగానే బిక్కచచ్చిపోయింది. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు గనుక తాను భయపడుతూ కనిపిస్తే సింహం వదిలిపెట్టదు కాబట్టి భయపడకూదని నిర్ణయించుకుంది.\n\nఅయితే విచిత్రం ఏమిటంటే... సింహం కూడా గోపయ్యను చూసి భయపడింది. చీకట్లో మిలమిలా మెరిసిపోతూ పెద్ద గడ్డము, కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహం కూడా జడుసుకుని, తనను చంపేందుకే తన గుహలోకి వచ్చి ఎదురుచూస్తోందని అర్థం చేసుకుంది.\n\nఇదంతా గమనిస్తోన్న మేకపోతు గోపయ్యకు కాస్తంత ధైర్యం వచ్చింది. సింహం తనను చూసి ఇలాగే భయపడుతుండగానే ఇంకా భయపెట్టాలని, భయపెడుతూనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలని పథకం వేసుకుంది. కానీ ఈ చీకట్లో ఎలా తప్పించుకోవాలి? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా... చీకట్లో, అడవిలో ఎక్కడకీ వెళ్లలేనని... ఒకవేళ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మంచిది కాదని ఆలోచించిన గోపయ్య ఎలాగోలా తెల్లవారుఝాముదాకా నెట్టుకురావాలని అనుకుంది.\n\nమరోవైపు సింహం కూడా ఇలాగే ఆలోచిస్తోంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకుని, ఒకవేళ అది తనకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చనీ, తనకన్నా బలహీనురాలైతే దాన్ని చంపి తినవచ్చునని పథకం వేసుకుంది. ఏదైనా తెల్లారే దాకా కాస్తంత మౌనంగా ఉండటం మంచిదని మనసులో అనుకుంది.\n\nమేకపోతు గోపయ్య, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని, అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా \"ఏయ్ ఎవరు నువ్వు?\" అంటూ గద్దించింది. సింహం కూడా అంతే ధైర్యంగా \"నేను సింహాన్ని, మృగరాజును. ఈ అడవికి రాజును నేనే.\" అంది ఓ వైపు భయపడుతూనే.\n\n\"నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉందే. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట అంది గోపయ్య. ఏది ఏమైనా తన అదృష్టం మాత్రం పండిందని, తాను ఇప్పటిదాకా లెక్కలేనన్ని పులులను, వెయ్యి ఏనుగులను చంపానని గొప్పగా చెప్పుకుంది మేకపోతు.\n\nఅయితే తన వాడి కొమ్ములతో వాటినన్నింటినీ కుమ్మి కుమ్మి చంపేశాననీ, ఒక్క సింహాన్ని మాత్రం చంపలేకపోయానని... ఆ సింహాన్ని కూడా చంపితే తన దీక్ష పూర్తి అవుతుందని భయపెడుతూ చెప్పింది మేకపోతు గోపయ్య. సింహం భయపడుతుండటాన్ని చూసిన మేకపోతు మరింత రెచ్చిపోతూ... సింహాన్ని చంపేదాకా ఈ గడ్డం తీయనని ప్రతిఙ్ఞ పూనాననీ, ఈనాటితో తన దీక్ష పూర్తయినట్లేననీ... ఒక్కసారిగా సింహం మీదికురికింది.\n\nఅంతే... సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగులు పెట్టింది. హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ... మేకపోతు గోపయ్య తెల్లారేదాకా అక్కడే ఉండి ఆ తరువాత అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే దాని యజమాని శీనయ్య వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. యజమానిని చూసిన గోపయ్య పరిగెత్తుకుంటూ అతడిముందు నిలిచింది.\n\nగోపయ్యను చూసి సంబరపడ్డ శీనయ్య \"నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని కంగారు పడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా! నాకంతే చాలు\" అంటూ గోపయ్యను దగ్గరకు తీసుకున్నాడు.\n\nతర్వాత మేకపోతు గోపయ్య, యజమాని శీనయ్య సంతోషంగా మేకల మందతో కలిసి ఇంటికెళ్లారు. పిల్లలూ... మీకు మేకపోతు గాంభీర్యం గురించి తెలిసే ఉంటుంది. అలాంటి ఓ మేకపోతు తన ప్రాణంమీదికి వచ్చినప్పటికీ ధైర్యంగా ఉంటూ, సింహాన్నే బెదరగొట్టి తనను తాను ఎలా కాపాడుకుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 632,
        "IMAGE": "cat_7",
        "NAME": "మృగరాజునే హడలెత్తించిన మేకపోతు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. \"అరే... మంచి విందు భోజనం దొరికిందే\" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క...\n\"పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త\" అంటూ పలకరించింది.\nశుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు.\n\nస్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క.\n\nకాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క.\n\nఅరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.\nనా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.\nఅమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది. అది చూసిన కోడిపుంజు...\nఅదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.\n\nనిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా...! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క. కాబట్టి, పిల్లలూ... తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! రేపు మళ్ళీ మనం బోలెడు కథలు చెప్పుకుందాం. శెలవా మరి...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 633,
        "IMAGE": "cat_7",
        "NAME": "తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలంలో ఉత్తానపాదుడు అనే రాజుకు సునీతి, సురుచి పేర్లతో ఇద్దరు భార్యలుండేవారు. రాజుగారికి చిన్న భార్య సురుచి అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆమెకు పుట్టిన కుమారుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకునేవాడు. ఒకరోజు పెద్ద భార్య కుమారుడైన ధృవుడు తనను కూడా ఒడిలో కూర్చోబెట్టుకోమని తండ్రిపై మారాం చేశాడు.\n\nదీన్ని గమనించిన సవతితల్లి సురుచి, ధృవుడితో \"నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే తపస్సు చేయాల్సిందే!\" అంటూ హేళన చేసింది. దాంతో ధృవుడు తపస్సు చేసేందుకు బయల్దేరుతుండగా, అతడి తల్లి సునీతి \"నాయనా...! నువ్వు పసివాడివి, తపస్సు చేయడం ఎంతో కష్టమైన పని, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను. వెళ్ళవద్దు\" అంటూ ఎంతగానో బ్రతిమలాడింది.\n\nతల్లి ఎంతగా వారించినప్పటికీ వినకుండా పట్టుదలతో ధృవుడు తల్లిని ఒప్పించి ఆశీర్వాదం పొంది, అరణ్యాలకు బయలుదేరాడు. దారిలో నారద మహాముని ధృవుడికి ఎదురై, అతడి గురించి తెలుసుకుని నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ, గాలినే ఆహారంగా తీసుకుంటూ ధృవుడు కఠోరంగా తపస్సు చేశాడు.\n\nధృవుడి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై, అతడి పట్టుదలకు మెచ్చుకుని ప్రేమతో చెక్కిలి నిమిరి... ఆకాశంలో ధృవతారగా వెలుగొందుతావని వరం ప్రసాదించాడు. ఆకాశంలో స్థానచలనం లేకుండా నిలబడే నక్షత్రం ధృవనక్షత్రం మాత్రమే. కాబట్టి పిల్లలూ... భక్తితోపాటు పట్టుదల అనేది ఉంటే సాధించలేనిదేమీ లేదనే నీతి మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 634,
        "IMAGE": "cat_7",
        "NAME": "సాధనమున పనులు సమకూరు ధరలోన",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి. ఆ అడవి మధ్యలో ఉన్న నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉంది. ఆ మర్రిచెట్టుపై ఒక పావురం నివసిస్తుండేది. చాలా మంచిదైన ఆ పావురం ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది.\n\nఇంకో విశేషం ఏమిటంటే... ఆ పావురానికి పాటలు పాడటం అంటే మహా సరదా. తన పనంతా అయిపోయిన తరువాత చెట్టుపై చేరి పాటలు పాడుతూ గడిపేసేది. అలా పావురం ఒకరోజు పాటలు పాడుతూ నదిలో నీరు తాగేందుకు రాగా, అక్కడ దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ ఒకటి కనిపించింది.\n\nఆ చీమను ఎలాగైనా కాపాడాలనుకున్న పావురానికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకునొకదానిని తీసుకొచ్చి చీమ పక్కన పడేసి... \"ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణాన్ని కాపాడుకో\" అంటూ గట్టిగా అరిచింది. అంతే, చీమ చటుక్కున ఆ ఆకుమీదికి వెళ్ళగా, ఆకు అలా నీటిపై తేలుతూ నది ఒడ్డుకు చేరడంతో తన ప్రాణాలను కాపాడుకుంది.\n\nగట్టుమీదికి చేరిన చీమ పావురంతో మాట్లాడుతూ... \"నా ప్రాణాలు కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను\" అంటూ పావురానికి కృతఙ్ఞతలు చెప్పింది. తరువాత తన ప్రాంతానికి బయలుదేరిన చీమ కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి, అతడు పక్షుల కోసం నాలుగు వైపులా గాలిస్తున్న వైనాన్ని గమనించింది. అంతేగాకుండా, తనని కాపాడిన పావురం ఉంటున్న చెట్టువైపుకు ఆ వేటగాడు వెళ్ళడాన్ని చీమ పసిగట్టింది.\n\nరెప్పపాటు క్షణంలలోనే ఆ వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. దీన్ని చూసిన చీమ కోపంతో వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి కసిగా కుట్టేసింది. బాణం గురితప్పిన వేటగాడు చీమకాటుతో బాధతో విలవిలలాడాడు. బాణం గురితప్పడంతో పావురం మరో చోటికి ఎగిరిపోయింది. తను ఎలా రక్షింపబడ్డానో పావురానికి తెలియలేదు.\n\nఅయినప్పటికీ చీమ తన ప్రాణాలను కాపాడిన పావురం ప్రాణాలను కాపాడినందుకు చాలా సంతోషపడింది. తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమ ఆనందంగా తన ప్రాంతానికి తరలిపోయింది. కాబట్టి పిల్లలూ...! మంచి చేసినవారికి, వారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుందని ఈ చీమ-పావురం కథ ద్వారా అర్థమైంది కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 635,
        "IMAGE": "cat_7",
        "NAME": "పరోపకారం నిధనం శ్రేయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లోని ధర్మాసుపత్రి గదిలో ఇద్దరు రోగులు ఉండేవారు. వారిలో ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండగా, మరో రోగి మంచం కిటికీకి దూరంగా ఉండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యాలు చాలా బాగున్నాయంటూ రెండో రోగికి వర్ణించి చెప్పేవాడు.\n\nఅబ్బా... ఎంత పెద్ద మైదానం, పచ్చని గడ్డి, చూడ చక్కని తోట, ఆ తోటలోని రంగు రంగుల పూవులు అంటూ కిటికీ పక్కన ఉండే రోగి రెండో రోగికి ప్రతిరోజూ చెప్పేవాడు. చల్లని సాయంకాలంలో చల్ల గాలి గురించి, ఆ గాలికి ఊగే పూలచెట్ల గురించి, తోట మధ్యలో ఉన్న పెద్ద చెరువు, అందులోని బాతులు, కలువ పూలు గురించి కూడా చెప్పేవాడు.\n\nఇవన్నీ ప్రతిరోజూ వింటోన్న రెండో రోగికి రోజు రోజుకీ అసూయ ముదిరిపోయి, \"తాను కూడా కిటికీ పక్కన ఉంటే ఎంత బాగుండేది, బయట దృశ్యాల్నన్నీ చూసేవాడిన\"ని అనుకుంటుండేవాడు. ఇలా కాలం నడుస్తుండగా ఓరోజు కిటికీ పక్కన ఉండే రోగికి ఓ రాత్రిపూట సీరియస్ అయింది. పక్కనే ఉన్న రోగి డాక్టర్‌ను పిలిచేందుకు ఏర్పాటు చేసిన బటన్‌ను నొక్కగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ అతడు నొక్కలేదు. ఇంకేముంది... కిటికీ పక్కన ఉండే రోగి డాక్టర్ అందుబాటులో లేనందుకు చనిపోయాడు.\n\nఇన్నాళ్లూ అసూయతో రగిలిపోయి, కిటికీకి దూరంగా ఉన్న రోగి హాస్పిటల్ సిబ్బందిని బ్రతిమలాడి తన మంచాన్ని కిటికీ పక్కకి మార్పించుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నేఅతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే... అక్కడ ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప అక్కడ ఇంకేమీ కనిపించలేదు.\n\nదీంతో ఆలోచనలో పడ్డ ఆ రోగి... ఇన్ని రోజులూ తన తోటి రోగి, తనను సంతోషపెట్టేందుకే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడా? అతనే తన నిజమైన స్నేహితుడు. అలాంటివాడికి చివరి దశలో తాను సాయం చేయలేకపోయానే అంటూ ప్రశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కాబట్టి, పిల్లలూ...! దీని నుండి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే... పక్క వాళ్ళకు ఉంది, మనకు లేదు అంటూ ఎప్పుడూ అసూయపడకూడదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 636,
        "IMAGE": "cat_7",
        "NAME": "అసూయ వద్దు - స్నేహమే ముద్దు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప తెలివితేటలు, మంచి వివేకం కలిగిన ఓ రాజు ఉండేవాడు. ఈ రాజు మంచితనం గురించి ఇతర రాజ్యాలకు కూడా ప్రాకడంతో అనేక కళలలో ఆరి తేరిన కళాకారులు రాజ్యానికి వచ్చేవారు. వారు రాజు మెప్పును పొందటమే గాకుండా, పారితోషికాన్ని కూడా పొందేవారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని కూడా పరీక్షించేవారు.\n\nఇలా ఉంటే... ఒక రోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. అతడు తాను తయారుచేసిన మూడుబొమ్మలను కూడా తనతోపాటు తీసుకొచ్చాడు. ఏ మాత్రం తేడా లేకుండా ఉన్న ఆ మూడు బొమ్మలను అతడు రాజు ముందు ఉంచుతూ... వీటిని పరిశీలించి వాటిలో తేడాలను చెప్పాల్సిందిగా కోరాడు.\n\nకళాకారుడి మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని తదేకంగా పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకే ఎత్తు, బరువు ఉండటం, అన్నింటి పోలికలూ ఒకేలా ఉండటం లాంటి వాటిని రాజు గమనించాడు. అలా పరిశీలిస్తున్నపుడు ఒకబొమ్మ రెండు చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించగా, సూది మరో చెవి నుండి సునాయాసంగా బయటకు వచ్చింది.\n\nఅలాగే మరో బొమ్మ చెవిలో, నోట్లో రంధ్రాలుండటాన్ని గమనించిన రాజు, వెంటనే సూదిని చెవిలో దూర్చగా, సూది నోటిగుండా బయటకు వచ్చేసింది. ఇక, మూడవ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రం లేకపోవడాన్ని రాజు గమనించి సూదిని చెవిలో దూర్చగా అది బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది.\n\nగంభీరంగా ఆలోచించిన రాజు, కాసేపటి తరువాత కళాకారుణ్ణి ఉద్దేశించి \"మీరు చాలా తెలివైనవారు\" అంటూ మెచ్చుకున్నాడు. ఆ కళాకారుడు మూడు బొమ్మల ఉన్న తేడాలను గురించి మాట్లాడుతూ... అవి మూడు రకాలైన స్నేహితులకు పోలికలని వర్ణించటం మొదలెట్టాడు.\n\nఇందులో మొదటి బొమ్మ మన కున్న చెడ్డ స్నేహితుడి గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నట్టు నటించి ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు. ఇక రెండోవాడు మన రహస్యాలను చెప్పినప్పుడు సానుభూతిగా వింటాడే గానీ, ఇతరులకు వాటిని చేరవేస్తాడు కాబట్టి ఇతనో ప్రమాదకరమైనవాడు.\n\nమూడో వాడి గురించి చెప్పుకుంటే... మనం చెప్పే మాటలను ఓపికగా వినటమేగాకుండా, రహస్యాలను కూడా తనలోనే భద్రంగా దాచుకుంటాడు. ఎంత కష్టమొచ్చినా సరే వాటిని బట్టబయలు చేయడు. కాబట్టి మూడో బొమ్మ ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం అంటూ కళాకారుడు ముగించాడు.\n\nఅంతా తదేకంగా విన్న రాజుగారు కళాకారుడి తెలివితేటలకు మెచ్చుకుని అభినందించడమేగాకుండా, కానుకలు సమర్పించాడు. కాబట్టి పిల్లలూ... మీరు కూడా పైన చెప్పిన మొదటి రెండు రకాల స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 637,
        "IMAGE": "cat_7",
        "NAME": "గొప్ప స్నేహితుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక ఊర్లో శివాలయం ఒకటి ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో పెద్ద పాము పుట్ట, అందులో రెండు త్రాచుపాములు కూడా ఉండేవి. గుడికి వచ్చిన భక్తులు గుడ్లు, పాలు ఆ పుట్టలోకి జారవిడుస్తుండేవారు. వాటితో కడుపునింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పాములు రాత్రుళ్ళు మాత్రం బయట సంచరించేవి.\n\nకాలం ఇలా నడుస్తుండగా ఓ రోజు పెద్ద గాలి, వాన రావడంతో ఆ పుట్టలోకి నీళ్ళు చేరాయి. దీంతో అందులో ఉండలేని ఆ పాములు బయటకు వచ్చి, శివుని గుడిలో ఆ రాత్రికి తలదాచుకున్నాయి. మర్నాడు ఉదయాన్నే పుట్టలోకి వెళదామంటే నీళ్ళు, ఊర్లోకి వెళ్తే జనాలు చంపేస్తారన్న భయంతో పాములు ఆలోచనలో పడ్డాయి. తరువాత అవి శివుడి విగ్రహం వెనకవైపు ఉండటమే క్షేమకరమని భావించి, కదలకుండా మెదలకుండా పడుకుండిపోయాయి.\n\nఎండ రావడంతో జనాలు నెమ్మదిగా గుడికి రావడం ప్రారంభించారు. ఎప్పటిలాగే శివుడిని దర్శించుకుని పాలు, పళ్ళు పుట్టలో వేసి వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయానికి పూజారి గుడి కట్టేసి వెళ్ళటంతో, అప్పటికే ఆకలితో దహించుకుపోతున్న ఆ పాములు రెండూ మెల్లగా పుట్టవైపు వెళ్లడానికి బయలుదేరాయి.\n\nఇదే సమయంలో ఓ కోతి పుట్ట దగ్గర కూర్చుని భక్తులు జారవిడిచిన గుడ్లు, పళ్ళను తీసుకుని తింటోంది. అసలే ఆకలితో ఉన్న పాములకు ఆ దృశ్యం కంటబడేసరికి ఎక్కడలేని కోపంతో కోతిపై దండెత్తేందుకు సిద్ధపడ్డాయి. అయితే, దీన్ని గమనించని కోతి తనపని తాను చేసుకుపోతోంది.\n\nకోతిమీదకు విరుచుకుపడ్డ పాములు తమ విషపుకోరలతో బలంగా కాటువేశాయి. దీంతో ఆ కోతి విలవిలా తన్నుకుంటూ చనిపోయింది. అదే క్షణంలో ఆడుకునేందుకు వచ్చిన కొంతమంది పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి, కోతిని పాములు అన్యాయంగా చంపివేశాయని భావించి, వాటిని రాళ్ళతో కొట్టి చంపేశారు.\n\nఅనవసరమైన ఆవేశానికి పోయి కోతిని ఉత్తి పుణ్యానికి చంపివేసిన పాములు, చివరికి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాయి. కాబట్టి, పిల్లలూ... ఆవేశం అనర్థానికి మూలం కాబట్టి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నవాడే బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అవుతాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు కదూ...! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 638,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆవేశం అనర్థాలకు మూలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక అడవి.. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక రోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చిది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్ల పందిని చూసి ఏంటి కథ అని అడిగాయి.\n\n\"ఈ రోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోల గోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను: అని అడుక్కుంది ముళ్లపంది.\n\n\"అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే. ఫరవాలేదు మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో\" అంటూ కొద్దిగా చోటి్చ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది.\n\nపంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీదగల ఒక్కొక్క ముల్లు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. పాములు దాని ముందుకెళ్లి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి.\n\nఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్రవస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకూ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంగా బాగా చాపింది. దీంతో ఆ ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి.\nపాపం పాములు. ఇంకేం చేస్తాయి. దీన్ని బాగన్నా రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి.\nకధలోని నీతి: దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం వస్తుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ కుట్టినట్లుగా అన్నమాట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 639,
        "IMAGE": "cat_7",
        "NAME": "తేలుకు పెత్తనమిస్తే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు.\nఅందరు రాజులకు మల్లే వేట అంటే అతడికి మహాపిచ్చి.\nవేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసమంటే పిచ్చి పిచ్చి ఆ రాజుకి.\nఒక రోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్లాడు\nబంధుమిత్రులు, సైన్య సపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి.\nరాజు భయపడాల్సిన పనిలేదు మరి.\nఓపిక ఉన్నంత వరకూ వేటాడారు.\nఅదేం ఖర్మో గాని ఆరోజు రాజు వేట పారలేదు.\nఎంతదూరం పోయినా జంతువు అలికిడి లేదు. పక్షుల జాడలేదు.\nతిరిగారు తిరిగారు తిరిగారు..\nతిరిగి అలసిపోయారు.\nఉన్నట్లుండి సింహం అరుపు వినబడింది.\nరాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది.\nకాని రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది.\nఅక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమ్మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో..\nఒక్కసారిగా లంఘించి ముందుకురికింది.\nఅందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగయిపోయింది.\nరాజభటులు తెప్పరిల్లి వెతికితే..\nగుర్రమూ లేదు... రాజూ లేడు...\nవేటమాని అడివంతా రాజుకోసం గాలించడం వారి పనయింది.\n\nఈలోగా మన రాజుగారి కథా కమామిషూ చూద్దాం మరి..\nతోవతప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు.\nపాపం. రాజు కదా.. దారి తెలీదు.\nదార్లూ గట్రా చూసిపెట్టేందుకు సేవకులూ లేరు కదా..\nచేసేదేమీలేక గుర్రం మీద పోయాడు పోయాడు పోయాడు..\nఎలాగైతేనే అడివి మార్గంలో పూటకూళ్ల ఇంటికి చేరుకున్నాడు.\nఆరోజుల్లో అడవిలో కూడా బాటసారులకు తిండి గట్రా చూసేందుకు పూటకూళ్లమ్మలు ఉండేవాళ్లులే..\nరాజ్యమంటే శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యం కాదు మరి..\nకోట దాని చుట్టూ పది ఊర్లూ, వాటి చుట్టూ పెద్ద అడవి ఉంటే చాలు..\nఅదీ రాజ్యమే అయిపోయేది మరి.\nఈ గొడవ మనకెందుకు గాని...\n\nరాజు పూటకూళ్లమ్మ ఇంటికి చేరుకున్నాడు.\nగుర్రాన్ని దాణాకోసం విడిచి దాని దాణా కోసం కాసులిచ్చాడు.\nతానూ కాళ్లూ చేతులూ కడుక్కుని పూటకూళ్ల ఇంట్లో చక్కాలు ముక్కాలు వేసుకుని కూచున్నాడు.\nఅకలితో కడుపు నకనకలాడిపోతోంది.\nపూటకూళ్లమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారుల్లాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది.\nవేటకోసం పోయి దారితప్పి డస్సిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.\nఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో..\nఏం వేసి పచ్చడి రుబ్బారో..\nవేరు శనక్కాయల పచ్చడి... ఆపై ఆకలి. దహించుకుపోతున్న జిహ్వ..\nరాజు ముందూ వెనుకా చూడలేదు.\nఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు...\nమొత్తానికి రాజుకు ఆకలి తీరింది.\nనాలుగు వరహాలు పూటకూళ్లమ్మకిచ్చి బయలుదేరాడు.\nపోగా పోగా పోగా... ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు.\nవేటకు వెళ్లి తప్పిపోయిన రాజసేవకులూ, సైన్యమూ, సవరివారసమేతమూ తిరిగి వచ్చేసింది.\n\nపాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు.\nకోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు.\nఒరేయ్ రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగగింజలతో ఊరుమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు.\nతలా తోకా లేకుండా రాజు జారీజేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది.\nపంచభక్ష్యపరమాన్నాలను ఆరగించే రాజు..\nమాంసం ముక్క చప్పరించనిదే ముద్ద దిగని రాజు..\nఎక్కడెక్కడినుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసారా సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు...\nఊరుమిండి చేసి పెట్టమంటాడేమిటీ..\nఅయినా.. రాజంటే రాజే..\nరాజు మాటంటే మాటే మరి..\nరాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా మరి..\n\nవంటవాళ్లు రంగంలోకి దిగారు..\nరాజ్యంలో పండగా రాజభటులు సేకరించిన మేలు రకం వేరుశనగ్గింజలను తెప్పించుకున్నారు.\nఊరుమిండికి కావలసిన పదార్ధాలకు అదనంగా మరికొన్నింటిని కలిపారు.\nఎంతైనా రాజు వంటవాళ్లు కదా..\nఊరుమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు.\nరాజు మెచ్చితే నాలుగు వరహాలు రాలకపోతాయా అనుకున్నారు.\n\nఆరోజు గడిచింది..\nతెల్లవారింది..\nరాజుకూ, వంటవాళ్లకు కూడా..\nరాజు ఎప్పటిలాగే సభకు వెళ్లాడు.\nవంటవాళ్లు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరుమిండిని తయారు చేశారు.\nదాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏ పోపులు పెట్టారో..\nఏ మసాలాలు దట్టింటారో..\nవంటశాల అంతా ఊరుమిండి వాసనేస్తోంది.\nవాళ్ల వంటను చూసి వంటవాళ్లు తమకు తామే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.\nఆహా. ఓహో.. భలే కుదిరింది.. అంటూ లొట్టలేసుకుంటున్నారు.\n\nమధ్యాహ్నం దాటింది.\nసభ ముగిసినట్లుగా గంట మోగింది.\nరాజు బయలుదేరాడు.\nఅంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు.\nభోజనశాలకు చేరుకున్నాడు..\nవంటవాళ్లు సిద్ధంగా ఉన్నారు.\nరాజు కూర్చున్నాడు.\nవంటవాళ్లు ఒక్కటొక్కటిగా వడ్డిస్తున్నారు.\nరాజుకోసం ప్రత్యేకంగా వండిన ఊరుమిండి గుండ తీసి రాజు పళ్లెంలో పెట్టారు.\nరాజు దైవాంశ సంభూతుడే కావచ్చు.\nకానీ భోంచెయ్యాలంటే చేతి వేళ్లు లోపలకు పోవలిసిందే గదా.\n\nఊరుమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.\nకాసేపటి తర్వాత ఒక వంటశాలనుంచి ఒక ఉరుము ఉరిమింది.\nఎవరక్కడ?\nఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరుగెత్తుకొచ్చారు.\nచిత్తం ప్రభూ..\nఈ వంటవాళ్లను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి. ఆజ్ఞాపించాడు..\nవంటవాళ్లు లబలబలాడారు. మొత్తుకున్నారు.\nతామే పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు.\nకాని రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి..\n\nపిల్లలూ.. ఈ కథలో నీతి ఏమిటి మరి?\nవంటవాళ్లది ఇందులో ఏ తప్పూలేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే.\n\nఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకూళ్లమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఊరుమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి....\nపంచభక్ష్యపరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి.\nఅందుకే ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు.... ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 640,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆకలి రుచెరుగదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు ఎప్పుడూ.\n\nరోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.\n\nఅతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న మూటను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని దాన్ని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.\n\nరంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మర్నాడు యథాలాపంగా ఇద్దరూ అడవికి వెళ్లారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలో పంపి, ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు.\n\nరంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేలను వజ్ర, వైఢూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణేలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.\n\nఅతని వద్ద ఉన్న అన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో దారితెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్లు తెరచి చూసిన సింగడికి పరిస్థితి అర్థమయ్యి దు:ఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణేల్ని పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపపడ సాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానంది.\n\nతన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచీ కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలూ మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దాని కోసం ప్రయత్నించండి విజయం మీదే అవుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 641,
        "IMAGE": "cat_7",
        "NAME": "దురాశకు పోతే దుఖ:మే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఓ పాఠశాలలో రామానంద గురువుగారు పాఠాలకు, నీతి కథలను జోడించి విద్యార్థులకు చదువు చెప్తుండేవారు. విద్యార్థుల్లో ఒకడైన గోపీ గురువుగారు చెప్పే విషయాలను శ్రద్దగా ఆచరిస్తూ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.\n\nఎప్పటిలాగానే ఓ రోజు పాఠం చెబుతూ దేవుని ఉనికిని చెప్పడం ప్రారంభించారు. ఈ సకలచరాచర సృష్టిలోని జీవులందరిలోనూ దేవుడు ఉంటాడు. తోటి మనిషిలో భగవంతుని చూడాలని రామానంద పిల్లలకు బోధించారు. న్యాయ మార్గాన నడిచే వారిని దేవుడు ఎల్లప్పుడూ కాపాడతాడని తెలిపారు.\n\nగురువు మాటను శిరస్సున దాల్చే మన గోపీ ఒక రోజు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా అదుపు తప్పిన గుర్రం అతనికి ఎదురుగా వస్తూ కనిపించింది. గుర్రం వస్తున్న తీరు గోపీలో ఎక్కడ లేని భయాన్ని కలిగించింది. గురువు గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి... గుర్రంలో కూడా దేవుడుంటాడు తనను కాపాడతాడని గుర్రం వస్తున్న మార్గంలో అలాగే నిల్చున్నాడు.\n\nదానిపైన స్వారీ చేస్తున్న వాడు పక్కకు తప్పుకోమని అరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ, గోపీ తప్పుకోలేదు. వేగంగా వచ్చి గుర్రం అతనిని ఓ పక్కకు తోసేసి వెళ్లిపోయింది. చేతులు, కాళ్లు కొట్టుకుపోవడంతో ఏడుస్తూ కూర్చున్న గోపీకి తన మాస్టారు వస్తూ కనిపించారు. ఏడుస్తున్న గోపీని చూసి ఆయన పలకరించాడు. జరిగింది తెలుసుకున్న మాస్టారు బాధపడ్డారు.\n\nగోపీ అన్ని ప్రాణులలో దేవుడు ఉన్నాడని చెప్పాను కదా అలాగే ఆ స్వారి చేసే వాడిలో కూడా ఉన్నాడు కనుకనే నిన్ను తప్పుకోమని హెచ్చరించాడు. అందరిలో దేవుడు ఉన్నాడని మనం మన ప్రయత్నం చేయకుండా మానకూడదు. అలాగే దేవుడు కాపాడతాడని ఏమి చేయకుండా కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలని చెప్పాడు. దాంట్లోని విషయాన్ని అర్థం చేసుకున్న గోపీ కళ్లు తుడుచుకుని ఇంటికి బయల్దేరాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 642,
        "IMAGE": "cat_7",
        "NAME": "అందరిలోనూ దేవుడున్నాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు పర్షియా పట్టణంలో ఖాసీమ్, ఆలీబాబా అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. ఖాసీమ్ ధనవంతురాలిని వివాహం చేసుకోగా, పాపం పేదవాడైన ఆలీబాబా అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని మూడు గాడిదలపై వేసుకుని వచ్చి పట్టణంలో ప్రజలకు అమ్ముకుని బతుకుతుండేవాడు. ఒకసారి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఆలీబాబాకు గుర్రాలపై వెళుతున్న నలభై మంది దొంగలు తారసపడతారు. వారి కంటపడకుండా ఒక చెట్టు పైన ఎక్కి దాక్కుంటాడు మన ఆలీబాబా. అలా ముందుకు వెళ్లిన దొంగలు ఒక గుహ ముందు నిలబడి 'తెరుచుకో సెసెమ్' అన్నారో లేదో గుహ ద్వారం తెరుచుకుంటుంది. తమతో పాటు తెచ్చిన మూటలను తీసుకుని గుహలో పడేసి వెలుపలకు వస్తారు దొంగలు. ఈ సారి దొంగలనాయకుడు 'మూసుకో సెసెమ్' అనగానే గుహ ద్వారం మూసుకుపోతుంది. వాళ్లు వెళ్లిపోగానే ఆలీబాబా గుహ ముందు నిలిచి తెరుచుకో సెసెమ్ అనగానే ద్వారం తెరుచుకుంటుంది. గుహ లోపల ఉన్న ధనరాశులను చూసిన ఆలీబాబాకు కళ్లు తిరుగుతాయి. అందినంత బంగారు నాణేలను సంచుల్లో నింపుకుని గాడిదలపై వేసుకుని ఇంటికి వెళతాడు.\n\nబంగారు నాణెలను కొలుద్దామని ఖాసీమ్ భార్యను కొలత పాత్రను ఇమ్మని అడిగుతుంది ఆలీబాబా భార్య. సందేహించిన ఖాసీమ్ భార్య కొలపాత్ర లోపలి వైపు అడుగున చింతపండును అతికించి ఇస్తుంది. నాణేలను కొలిచిన తర్వాత పాత్రను తీసుకున్న ఖాసీమ్ భార్య, పాత్ర అడుగున అంటుకొని ఉన్న బంగారు నాణేన్ని చూసి భర్తకు చెప్తుంది. అన్న పోరు భరించలేక అసలు విషయం బయటపెడతాడు ఆలీబాబా. తమ్ముడు చెప్పిన మార్గంలో గుహ లోపలకి వెళ్లిన ఖాసీమ్ తరువాత వచ్చిన దొంగల చేతిలో మరణిస్తాడు. గుహలోని అన్న శవాన్ని తీసుకువెళతాడు ఆలీబాబా. శవం మాయమైపోవడంతో తమ గుట్టు బయటపడిన వైనాన్ని దొంగల నాయకుడు గుర్తిస్తాడు. గుట్టు రట్టుకావడంలో సూత్రధారి ఆలీబాబా నివాసాన్ని కనుగొన్న దొంగల నాయకుడు నలభై చమురు పీపాలను కొనుగోలు చేసి అందులో 39 పీపాలలో తన అనుచరులను ఉంచి, ఒక పీపాను చమురుతో నింపి, బహు దూరం నుంచి వచ్చిన చమురు వ్యాపారి వలె ఆలీబాబా ఇంటికి వెళతాడు. దొంగల నాయకుని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు ఆలీబాబా.\n\nఅర్థరాత్రి వేళ ఇంటిలో చమురు లేకపోవడంతో పీపాల దగ్గరకు వెళ్లిన ఆలీబాబా సేవకురాలు మోర్జియానా పీపాలలోని దొంగలను గమనించి, పీపాలపై నూనెను పోసి నిప్పు అంటిస్తుంది. దాంతో 39 మంది దొంగలు మరణిస్తారు. మిగిలిన దొంగల నాయకుడు పారిపోతాడు. సంగతి తెలుసుకున్న ఆలీబాబా మోర్జియానాను మెచ్చుకుంటాడు. అనుచరులను కోల్పోయిన దొంగల నాయకుడు ఆలీబాబాపై ఆగ్రహంతో రగిలిపోతాడు. ఆలీబాబాను మట్టుపెట్టాలని ప్రతిన బూనుతాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు వస్త్ర వ్యాపారి అవతారంలో మారు వేషంలో వచ్చి ఆలీబాబా కుమారుని అభిమానాన్ని పొందుతాడు. కుమారుని స్నేహితుడైన దొంగల నాయకుని విందుకు ఆహ్వానిస్తాడు. విందు సమయంలో వస్త్ర వ్యాపారి ఉప్పును తీసుకోకపోవడాన్ని మోర్జియానా గమనిస్తుంది. పర్షియా ప్రజల సంప్రదాయాన్ని అనుసరించి ఎవరి ఉప్పును అయితే తిన్నారో, తిన్నవారు వారికి హాని తలపెట్టరు. తేరిపారి చూడగా అతడే దొంగలనాయకుడని గుర్తిస్తుంది మోర్జియానా.\n\nవిందు అనంతరం ఏర్పాటైన నృత్య కార్యక్రమంలో స్వతహాగా నృత్యకారిణి అయిన మోర్జియానా చురకత్తిని చేబూని ఆలీబాబా, ఆలీబాబా కుమారుడు మరియు మారువేషంలోని దొంగలనాయకుని ఛాతీపై చురకత్తిని తాకిస్తూ నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. కత్తిని అలా తాకించడం నృత్యంలో ఒక భాగమని భావించిన వీక్షకులు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా దొంగల నాయకుని గుండెలో చురకత్తిని దించుతుంది మోర్జియానా. దాంతో దొంగల నాయకుడు కిందపడి చస్తాడు. \"అయ్యో అతిథి మరణించాడే\" అని విలపిస్తున్న ఆలీబాబాకు అతిథి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది మోర్జియానా. తన సేవకురాలి సాహసానికి, స్వామి భక్తికి సంతసించిన ఆలీబాబా, మోర్జియానాను తన కుమారునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపేస్తారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 643,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆలీబాబా నలభై దొంగలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రాముకు చేపలను వేటాడటమంటే చెప్పలేనంత ఇష్టం. ముఖ్యంగా ఊరి మధ్యలో అమ్మవారి గుడి పక్కన ఉండే దొర గారి చెరువులో చేపలు పట్టడమంటే మన రాముకు మరీ ఇష్టం. చెరువు అంటే మరీ అంత పెద్దదేమీ కాదు. తన కొడుకు మీద ప్రేమతో మూడెకరాల భూమిలో చెరువు తవ్వించాడు కిష్టయ్య దొర. ఆ చెరువులో రంగు రంగుల చేపలు మొప్పలను అల్లర్చుతూ తిరుగుతుంటాయి. అంతేనా... బాతులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే కొంగలు, పెద్ద పెద్ద రెక్కలున్న పక్షులు దొరగారి చెరువు గట్టు మీది చెట్లపై గూళ్ళు కట్టుకుంటాయి.\n\nగూళ్ళలో పొదిగిన గుడ్లు పిల్లలు కాగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అయితే పిల్లలను చేపలు పట్టడానికి దొరగారు ససేమిరా అంగీకరించరు. ఎందుకంటే చెరువు దగ్గరకు వచ్చే పిల్లలు ఒకటే అల్లరి చేస్తారు. చేపలను బెదరగొడతారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలను నీళ్ళలో పడేసి, వాటి కాగితాలను చెరువు గట్టు పారేస్తారు. దీంతో దొరగారు పిల్లలను చెరువు దాపులకు రానివ్వరు. అంతేకాదు... ఆ చెరువును గురించి ఆ వూరి పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. చెరువులో పిల్లలను ఎత్తుకుపోయి తినేసే పెద్ద పెద్ద సొర చేపలు, తిమింగలాలు చెరువులో ఉంటాయట. పిల్లలు కనిపిస్తే చాలు... అమాంతం బయటకు వచ్చి గుటుక్కుమనిపిస్తాయట...\n\nఇదిలా ఉండగా ఒక రోజు దొరగారు పనిమీద పట్నానికి వెళ్ళారు. ఇంకేముంది. రాముకు చెప్పలేని హుషారు వచ్చేసింది. తన దగ్గరున్న గాలం తీసుకుని దొరగారి చెరువులో చేపలు పట్టడానికి బయలుదేరాడు. చెరువు దగ్గరకు వెళ్ళొద్దంటూ రాము స్నేహితులు అతనికి చెప్పి చూశారు. మన రాము వింటే కదా... ఒక్కటే చెరువు గట్టు మీదకు వెళ్ళాడు గాలం పట్టుకుని. గట్టు మీద కూర్చుని గాలాన్ని చెరువులోకి వదిలాడు రాము. చెరువుపై నుంచి వచ్చే చల్లని గాలులకు రాముకు నిద్ర ముంచుకొచ్చింది. హఠాత్తుగా రాముకు మెళకువ వచ్చింది. గాలం తనను లాగుతోంది.\n\nఏదో బరువైనది గాలానికి చిక్కుంది. బలమంతా ఉపయోగించి గాలాన్ని లాగాడు. తాటి చెట్టంత ఎత్తున్న సొర చేప గాలంతో పాటు పైకి లేచింది. రాము కాళ్ళు చల్లబడ్డాయి. ఎక్కడ లేని భయం ముంచుకొచ్చింది. అయినా ధైర్యం చేసి మరింత గట్టిగా లాగాడు. సొర చేప కాస్త తిమింగలంగా మారి రామును మింగేయ్యడానికి ముందుకు రాసాగింది. వచ్చేసింది... దగ్గరకు వచ్చేసింది. ఇల్లంత పెద్దది చేసి తన నోరును తిమింగలం తెరిచింది... ఇక రామును స్వాహా చేయడమే ఆలస్యం... పెద్దగా కేక పెట్టి నిద్ర లేచాడు రాము. అంతా కల... గాలానికి చిన్న చేప ఒకటి చిక్కుకుని ఉంది. ఆ పళంగా ఊర్లోకి తారాజువ్వలా పరుగుతీసాడు రాము. తనకు వచ్చిన కలను స్నేహితులకు చెప్పలేదు. చెపితే పిరికివాడనుకుంటారని భయం. అంతటితో చేపలను వేటాడే ఇష్టానికి స్వస్తి చెప్పాడు రాము. చదువు మీద శ్రద్ధ పెట్టి క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి, అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 644,
        "IMAGE": "cat_7",
        "NAME": "చిన్నారి చేపల వేటగాడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రాజుగారికి మరణం సమీపించింది. తనకు గల ముగ్గురు కుమారుల్లో ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలనే ఉద్దేశంతో తెలివైన కుమారుడు ఎవరని తెలుసుకోవాలని రాజుగారు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు ముగ్గురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నాడు. ఒకరోజు వాళ్ల ముగ్గురిని పిలిచి నాయనలారా! నేను మీకో పరీక్ష పెడతున్నాను. నెగ్గిన వారికే రాజ్యాధికారం అన్నాడు. అలాగే నాన్నగారూ అన్నారు. ముగ్గురు.\n\nమరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా పూర్తిగా నింపితే వారే గెలిచినట్టు అన్నాడు రాజు. మరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా నింపితే సరి అన్నాడు రాజు. వీరి ముగ్గురిలో పెద్ద కొడుకు గబగబా బయటికెళ్లి వజ్రాలతో గదిని నింపడానికి యత్నిస్తాడు. అయితే వజ్రాలతో గది నిండలేదు. దీనిని గమనించిన రెండవ కుమారుడు దూదితో గదిని నింపేందుకు ప్రయత్నించి గదిని దూదితో నింపుతాడు.\n\nఅయితే గదిలో ఎక్కడైనా ఓ చోట ఖాళీ కనిపిస్తుండటంతో విఫలమయ్యాడు. ఇద్దరి చర్యలను గమనించిన మూడో వాడు ఆ గదిలో ఒక దీపం ముట్టించాడు. దీనితో ఆ గది నిండా వెలుతురు వ్యాపించింది. ఏ మూలలో చూసినా వెలుతురే. వెలుతురుతో గదంతా నిండిపోయింది. మూడో వాడి తెలివిని రాజుగారు మెచ్చుకుని రాజ్యాధికారాన్ని అతడికి అప్పగిస్తాడు.\nనీతి: అన్నీ సమస్యలను తెలివితో చాకచక్యంగా సాధించాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 645,
        "IMAGE": "cat_7",
        "NAME": "తెలివైన వాడికే రాజ్యం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా దట్టమైన ఒక అడవిలో తోడేలు ఒకటి ఉండేది. వయస్సు మీద పడటంతో ముసలిదై పోయిన తోడేలు తనకు రక్షణ ఇచ్చే చోటు కోసం వెదకడం మొదలు పెట్టింది. అలా కొండలు, కోనలు దాటుకుంటూ ఒక అందమైన లోయలోకి మన తోడేలు అడుగు పెట్టింది. అక్కడ దానికి అతిపెద్దదైన చెట్టు ఒకటి కనిపించింది. చాలా సేపటి నుంచి తిరుగుతుండటంతో తోడేలు బాగా అలసిపోయింది. ఇప్పుడు దానికి రక్షణను ఇచ్చే విశ్రాంతి మందిరం కావాలి. చెట్టు ఎదురుగా నిలిచిన తోడేలు ఇలా పలికింది, \"చెట్టు మహాశయా! దయచేసి నేను సురక్షితంగా తలదాచుకునే స్థలాన్ని ప్రసాదించవూ\".\n\nఆశ్చర్యంగా తోడెలు లోపలికి వెళ్ళేందుకు వీలుగా చెట్టు తెరుచుకుంది. తోడెలు లోపలికి వెళ్ళగానే దానికి రక్షణ ఇచ్చేందుకు చెట్టు మూసుకుపోయి ఎప్పటిలాగానే ఉండిపోయింది. చెట్టు లోపల తోడేలు వెచ్చగా గుర్రు పెట్టి నిద్రపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో చెప్పడం కష్టమే!\n\nఅలసట తీర్చుకున్న తోడేలు ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచింది. చెట్టు తెరుచుకోవడానికి అడిగే పద్దతిని తోడేలు మర్చిపోయింది. \"ఏయ్ చెట్టు నన్ను బయటకు పంపించు\" కేక పెట్టింది తోడేలు. ఏం జరగలేదు. \"చెట్టు మహాశయా! దయచేసి నన్ను బయటకు పంపించు\" బ్రతిమాలుకుంది తోడేలు. చెట్టు కొంచం కూడా కదలలేదు. తోడేలు చెట్టును తట్టింది. పిసరంత కూడా తెరుచుకోలేదు. ఉన్న విషయం చెప్పాలంటే... తోడేలుపై చెట్టు అలగింది. ఎందుకంటే మొదటిసారి బయటకు పంపమని అడిగినపుడు తోడేలు మరి మర్యాద మరిచిపోయింది కదా! అలా ఏమీ చేయలేని పరిస్థితిలో తోడేలు చాలా సేపు చెట్టు లోపలే ఉండిపోయింది.\n\nతోడేలు కేకలు విని దానికి సహాయం చేద్దామని చెట్టు పైన ఉంటున్న కొన్ని పక్షులు కిందకు వచ్చాయి. కానీ అంత పెద్ద చెట్టును చిట్టి చిట్టి పక్షులు ఏం చేయగలవు! చివరగా ఇదిగో నేనున్నాను అంటూ పొడుగు ముక్కు వడ్రంగి పిట్ట ముందుకు వచ్చింది. తన పదునైన ముక్కుతో చెట్టుకు పెద్ద రంధ్రం చేసి తోడేలును బయటకు తెద్దామని ప్రయత్నించింది. కానీ పని మొదలు పెట్టిన కాసేపటికే దాని ముక్కు విరిగిపోయింది. అయితేనేం... వడ్రంగి పిట్ట శ్రమ వృధా పోలేదు. చెట్టుకు చిన్న రంధ్రం ఏర్పడింది. ఇక చెట్లకు రంధ్రాలు చేసేందుకు వడ్రంగి పిట్ట ముక్కు పనికి రాకుండా పోయింది.\n\nరంధ్రంలోకి ఒక చెయ్యి పెట్టి బయట పడదామనుకుంది మన తోడేలు. కానీ కుదరలేదు. కాలు పెట్టి చూసింది... ఊహూ... ఏం లాభం లేదు. వడ్రంగిపిట్ట పని మొదలు పెట్టగానే ఇంక హాయిగా బయటకు వెళ్ళవచ్చునని తోడేలు ఆశపడింది. కానీ మధ్యలోనే పిట్ట పొడువాటి ముక్కు కాస్త విరిగిపోయిందే! తోడేలుకు తిక్క రేగింది. ఏం చేయాలి?1 \"అయ్యో, నన్ను బయటకు పంపు ముసలి చెట్టూ\" వలవలా ఏడ్చింది తోడేలు. \"నన్ను వదిలిపెట్టరాదా!\" ఏం జరగలేదు, తోడేలుకు తోడుగా అంతులేని నిశ్శబ్ధం మాత్రమే మిగిలింది.\n\nచిన్నరంధ్రం ద్వారా ఏకకాలంలో భుజాలను తీసి బయటకు పడేసింది. అనంతరం తన కాళ్ళను బయట పడేసింది. తన దేహాన్ని బయట పడేసింది. \"ఇదేదో బాగుందే. హలో చెట్టూ చూస్తున్నావా! నన్నెంతో సేపు నీ అదుపులో ఉంచుకోలేవు సమా! \" ఆనందంతో మురిసిపోతూ మనసులో అనుకుంది తోడేలు.\n\nఇక మిగిలిన తలను బయటకు చేరిస్తే సరి.... కానీ తోడేలు తల చాలా పెద్దది. చిన్న రంధ్రం దానికి సరిపోదు. పైగా చేటంత చెవులు కూడా ఉన్నాయి కదా! అందుకే ముందు చెవులు తీసి రంధ్రంలో నుంచి బయట పడేసింది. మరో సారి ప్రయత్నించింది. కానీ దాని కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి మరి. ఇంకేముంది తన కళ్ళను తీసి రంధ్రం ద్వారా బయట పడేసింది.\n\nఅదేసమయంలో ఆకాశంలో ఎగురుతున్న నల్లపక్షి ఒకదానికి చెట్టు దాపున పడి ఉన్న తోడేలు కళ్ళు కనిపించాయి. ఇంకేముంది... రివ్వున కిందకు దూసుకుంటూ వచ్చి తన కాళ్ళతో ఒక్కసారిగా తోడేలు కళ్ళను ఎత్తుకుని ఆకాశం వైపు ఎగిరిపోయింది. ఆకాశపు నీలి రంగుతో అందంగా కనిపిస్తున్న తోడేలు కళ్ళు... నల్లపక్షిని అంతలా ఆకట్టుకున్నాయన్నమాట...అలా అందంగా కనిపించే వాటిని అన్నింటిని ఎత్తుకెళ్ళే నల్లపక్షి ఎవ్వరికి తెలియని చోట దాచి పెడుతుంది.\n\nఏమైతేనేం... చివరకు తన తలను కూడా రంధ్రంలో నుంచి బయటకు తీసుకు వచ్చింది. చెట్టు దాపున విడి విడిగా పడి ఉన్న శరీర భాగాలన్నింటిని మరలా అమర్చుకుంది. పూర్తి తోడేలు సిద్దమైంది. కానీ తలను అమర్చుకోగానే కళ్ళు ఎక్కడ ఉన్నదీ కనుక్కోలేక పోయింది. మిగతా శరీరం అంతా బాగానే ఉంది. చెవులు చక్కగా వినపడుతున్నాయి, కానీ చేతులతో తడుముకుంటే కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు లేవు.\n\nతనకు కళ్ళు లేవని తెలిస్తే మిగిలిన జంతువులు చులకనగా చూస్తాయి... ఏం చేయాలి? ఆలోచించసాగింది తోడేలు. అలా తడుముకుంటూ వెళ్తుండగా తోడేలుకు రోజా పుష్పాల పొద తగిలింది. పొదలో నుంచి గులాబీ రేకులను తీసుకుని కళ్ళు ఉండాల్సిన స్థానంలో అమర్చుకుంది. దీంతో తనకు కళ్ళు లేవని ఎవరూ అనుకోరు. కానీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాయి... ఆశగా అనుకుంది తోడేలు.\n\nతోడేలు ఇలా అనుకుంటుండగా అటుగా వచ్చిన నత్త తోడేలుకు కళ్ళ స్థానంలో గులాబీ రేకులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. \"నీ కళ్ళలో గులాబీ పువ్వు రేకులు ఎందుకు పెట్టుకున్నావ్?\" తోడేలు దగ్గరకు వెళ్ళిన నత్త ఆసక్తిగా అడిగింది. \"ఎందుకంటే అవి రంగురంగులుగా అందంగా కనిపిస్తాయి కాబట్టి. కావాలంటే నువ్వు కూడా పెట్టుకో. నీ కళ్ళను నేను పట్టుకుంటానులే\" నత్తను ఉత్సాహపరిచింది తోడేలు.\n\nతోడేలు మాటలను నమ్మిన నత్త తన కళ్ళను తీసి తోడేలు చేతులలో పెట్టి గులాబీ రేకులను కళ్ళ స్థానంలో అమర్చుకోవడానికి ప్రయత్నించింది. అదే అదనుగా నత్త కళ్ళను తన తలకు అమర్చుకున్న తోడేలు పొడవాటి తన తోకను ఊపుకుంటూ కనపడనంత దూరం పరుగు తీసింది.\n\nఆ రోజు మొదలు తన కళ్ళు దొరుకుతాయేమోనన్న ఆశతో తన తలను నేలకు రాపాడిస్తూ వెదుకుతున్నట్లుగా నత్త నడవడం ప్రారంభించింది. అంతే కాక అది మొదలు తోడేళ్ళన్నీ కూడా నీలి రంగు కళ్ళ స్థానంలో గోధుమ రంగు కళ్ళతో కనపడసాగాయి. తోడేలు, నత్త కళ్ళను పెట్టుకోవడంతో తోడేళ్ళనింటికి అవే కళ్ళు స్థిరపడిపోయాయన్నమాట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 646,
        "IMAGE": "cat_7",
        "NAME": "తుంటరి తోడేలు-అమాయకపు నత్త",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "గోపాలం మాట కూడా పొదుపే. తాను పొదుపరినని కూడా అతను ఎవరితోనూ చెప్పుకోడు. అయితే ఆ పల్లెలో చాలామంది మాత్రం అతణ్ని పిసినారి అంటుంటారు. గోపాలానిది మాత్రం వారి మాటల్ని పట్టించుకునే రకం కూడా కాదు. తప్పో ఒప్పో తన దారి తనది అనుకునే రకం. అలాగని మొండి మనిషి కూడా కాదు. అతని వ్యవహారం ఎలా ఉంటుందంటే ఏటా జరిగే గ్రామదేవత వేడుకలు ఘనంగా నిర్వహించడానికి విరాళాలు ఇవ్వమంటే ఎన్నడూ పది రూపాయల కంటె ఎక్కువ ఇవ్వడు. విరాళాల కోసం వచ్చిన వారు దేవత ఉత్సవాలకు ఇంత తక్కువ ఇస్తున్నావేమిటీ? అంటే- ఉత్సవాలు నిరాడంబరంగా చేసినా దేవత కోప్పడదు లేవోయ్‌.. ఎందుకు ఆర్భాటాలు అనేవాడు. అలాంటి గోపాలం, ఆ గ్రామదేవత గుడిలోనే ఓసారి నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు మాత్రం గ్రామంలోనే అందరికంటె ఎక్కువగా పదివేల రూపాయలు ఇచ్చాడు. అలాగని అతనిది ధనవంతుల కుటుంబం కూడా కాదు. గ్రామమంతా ముక్కున వేలేసుకుంది. అయినా అతనికున్న పిసినారి అన్న పేరు మాత్రం పోలేదు.\n\nగోపాలం కొడుకు వినోద్‌. ఆరోతరగతి చదివేవాడు. అతను చదువులో చురుకు. డబ్బు ఖర్చు చేసే విషయంలో తండ్రి మొండిగా వ్యవహరించడం వినోద్‌కు నచ్చేది కాదు. స్కూలు ఫీజు కట్టాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా ఎప్పుడు అడిగినా సరే.. కచ్చితంగా అందుకు సరిపోయేంత డబ్బు ఇచ్చేవాడు. సాయంత్రం మళ్లీ రసీదులు తెచ్చి చూపమనేవాడు. ఏ రోజైనా తోటి పిల్లల మాదిరిగా సరదాగా గడపాలంటే చేతిలో డబ్బు వెసులుబాటు ఉండేది కాదు. తన చేతిమీదుగా ఏం ఖర్చు చేయాల్సి వచ్చినా చిల్లర మిగిలేలా ఇచ్చేవాడూ కాదు. తినడానికి ఏమైనా కొనుక్కుందామని తండ్రిని డబ్బు అడిగితే ఇచ్చేవాడు కాదు గానీ, ఇంట్లో బోల్డన్ని తినుబండారాలు తెచ్చిపెట్టేవాడు. వారానికోసారి సినిమాకు వెళ్లడానికి ఒప్పుకునే వాడు కాదు గానీ, మంచి సినిమా ఏదైనా వస్తే తండ్రి తనే వెంటబెట్టుకుని తీసుకెళ్లేవాడు. రోజులిలా గడుస్తుండగా వినోద్‌లో తండ్రి పట్ల ఒక వ్యతిరేక భావం ఏర్పడిపోయింది. తను ఎప్పుడు డబ్బు అడిగినా తండ్రి ఇవ్వడనే అనుకుంటుండేవాడు. ఇంతలో వినోద్‌ పదో తరగతి కూడా పూర్తయింది. అయితే కాలేజీ ఎక్కడ చేరాలనే మీమాంస మొదలయింది.\n\nవినోద్‌ను మంచి కాలేజీలో చేర్పించేందుకు గోపాలం యాభై వేల రూపాయలు సిద్ధం చేసి ఉంచిన సంగతి ఇంట్లో అందరికీ తెలుసు! అయితే ఆ కాలేజీలో అర్హతగా నిర్ణయించిన దానికంటె వినోద్‌కు కొద్దిగా మార్కులు తక్కువ వచ్చాయి. అతడికి మాత్రం ఆ కాలేజీలోనే చేరాలని ఉంది. అదే కాలేజీలో సీటు కావాలంటే ఇంకో ఇరవై వేల రూపాయలు డొనేషన్‌ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఎన్నడూ పది రూపాయలు కూడా ఇవ్వని తండ్రి ఎంత బతిమాలినా సరే.. ఆ సొమ్ము చెల్లించి తనను కాలేజీలో చేర్పించడని వినోద్‌కు అర్థమైపోయింది.\n\nకాలేజీలో చేరాల్సిన రోజు దగ్గరపడింది. ముందురోజు రాత్రి గోపాలం వినోద్‌ను పిలిచి- రేపు కాలేజీలో జాయిన్‌ కావాలి కదా.. దానికి కావ్సాలినవి అన్నీ సిద్ధం చేసుకో- అన్నాడు! నాన్నా మరి ఇరవై వేల రూపాయలు తక్కువయ్యాయి కదా!- అడిగాడు వినోద్‌. సర్దుబాటు అయ్యాయి లేరా.. వినోద్‌కు అనుమానం కలిగింది - అప్పు చేశారా నాన్నా?- అడిగాడు. లేదులేరా. అవి నీ డబ్బులే- చెప్పాడు గోపాలం. నా డబ్బులా? ఇరవై వేల రూపాయలా? ఆశ్చర్యంగా అడిగాడు వినోద్‌ నమ్మలేనట్లుగా. అవున్రా! చిన్నప్పటినుంచి నువ్వు తినుబండారాలకని, సినిమాలకని, షికార్లకని అప్పుడప్పుడూ పది ఇరవై రూపాయలు అడుగుతుండేవాడివి. ప్రతిసారీ నేను ఇవ్వకుండా లేవని చెప్పేవాణ్ని. అయితే అలా ప్రతిసారీ నువ్వు అడిగినంత సొమ్మును విడిగా కూడబెడుతూ వచ్చాను. ఇన్నాళ్లలో అవి ఇరవై వేలకంటే ఎక్కువే అయ్యాయి. ఇప్పుడు అవసరమయ్యాయి కదా అని ఆ డబ్బులోంచి ఇరవై వేలు తీసుకున్నాను. - చెప్పాడు గోపాలం.\n\nవినోద్‌కు కళ్లలో నీళ్లు చిప్పిలాయి. ఇన్నాళ్లూ తను తండ్రి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో గుర్తుకు వచ్చి బాధ కలిగింది. తాను దుబారా చేయకుండా చూడడమే కాకుండా తను అడిగినంత డబ్బునూ తనకోసమే పొదుపు చేస్తూ వచ్చిన తండ్రి అంటే గొప్ప గౌరవం ఏర్పడింది.\nగొంతులో దుఃఖం ధ్వనిస్తుండగా - థాంక్యూ నాన్నా!- అన్నాడు.\n\nథాంక్యూ ఎందుకురా? ముందు నువ్వు రేపు కాలేజీలో చేరడానికి తయారవ్వు- అన్నాడు గోపాలం కొడుకును దగ్గరకు తీసుకుని భుజం తడుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 647,
        "IMAGE": "cat_7",
        "NAME": "మేలుచేసిన గోపాలం పొదుపు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "కొండపల్లి అడవికి కొదమ సింహం రాజుగా ఎన్నికయింది. కొదమసింహం సింహాసనం అధిష్టించగానే పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కొలువులో ఉన్న చిన్న చితక జంతువుల స్థానంలో బలమైన జంతువులను నియమించి బలమైన రాజ్యంగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగిన సన్నాహాలను ప్రారంభించింది. ‘ఇది మంచిపని కాదు. బలవంతులతో పాటు తెలివైన వారు రాజ్యానికి ఎంతో అవసరం, కేవలం శరీర దారుఢ్యంతో అన్ని పనులూ జరగవు’ అని మంత్రి నక్కగారు ఎంత చ్పెపినా వినలేదు. మొండి పట్టుదలతో కొదమ సింహం తన పంతం నెగ్గించుకుంది. ఇప్పుడు కొలువులో మంచి శరీర దారుఢ్యంగల జంతువులు పనిచేయడం ప్రారంభించాయి.\n\nఓ అర్ధరాత్రి పెనుగాలులతో తుఫాను ప్రారంభం అయింది. కొండ్లపలి అడవి అంతా సర్వనాశనం అయింది. ఎడతెరిపి లేని వర్షం, ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోయాయి. ఓ పెద్దకొండరాయి అత్యంత ప్రధానమైన రహదారికి అడ్డుగా పడిపోయింది. మూడురోజుల తరువాత తుఫాను తగ్గింది. చెల్లాచెదరైన జంతువులు తమతమ నివాసాలకు వచ్చి జరిగిన నష్టం చూసి కన్నీరుకార్చాయి. అన్నింటికంటే రహదారిపై పడి ఉన్న కొండరాయి వలన తమకు చాలా ఇబ్బంది అని గ్రహించాయి.\n\nఈ విషయం రాజుగారికి వివరించాయి. రాజుగారు తన కొలువులో ఉన్న బలమైన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నిజంగానే ఆ కొండరాయి వలన జంతువుల రాకపోకలకు విపరీతమైన అంతరాయం కలుగుతుందని గ్రహించి తన అనుచరుడైన ఏనుగువైపు చూశారు. ఏనుగు ఇదెంత పని తొండంతో ఒక్కటిస్తే జరజరా జారిపోతుందని అందరూ నా శక్తిని చూసి ఆశ్చర్యపోతారు’ అనుకుంటూ వెళ్ళి తన తొండంతో రాయిని పైకి లేపబోయింది. ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు. రాయిని తొండంతో పట్టుకోవడానికి పట్టుదొరకలేదు. ఏనుగు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత అత్యంత బలశాలి ఖడ్గమృగం చిందులు వేస్తూ వచ్చి బలమైన కొమ్ముతో రాయిని కదపాలని ప్రయత్నించింది. కొమ్ము విరిగింది. కానీ రాయి కదలలేదు. ఆ తరువాత నీటి ఏనుగు, ఎలుగుబంటి ఇలా బలమైన జంతువులన్నీ ప్రయత్నించి చతికిలపడ్డాయి. రాజుగారు కోపంతో చిందులు తొక్కారు. మంత్రి నక్క ముసిముసి నవ్వులు చూసి సింహం మరింత కోపంతో ‘అలా నవ్వుతూ చూడకపోతే పరిష్కారం సూచించలేరా?’ అంటూ ప్రశ్నించింది. ‘మహారాజా! మీకారోజే చెప్పాను. అన్ని పనులు శరీరదారుఢ్యంతో జరగవని, బుద్ధిబలం, కండబలం కంటే గొప్పదని, ఇప్పుడు చూడండి’ అంటూ చిన్న జంతువులన్నింటినీ పిలిచి ‘మీ బుద్ధిబలంతో ఈ రాయిని కదల్చటానికి ప్రయత్నించండి’ అని చెప్పింది.\n\nఓ కుంటి కుందేలు మెల్లగా కొదమసింహం దగ్గరకొచ్చి వినయంగా నమస్కరించి ‘మహారాజా! నేను ఈ రాయిని కదిలిస్తాను’ అనగానే రాజుతో సహా జంతువులన్నీ ఆశ్చర్యంగా చూశాయి. రాజు ‘సరే కానీ’ అన్నాడు. కుందేలు కుంటుతూ చిన్న పలుగు తీసుకొచ్చి రాయి చుట్టూ తిరిగి పల్లంగా ఉన్న ప్రాంతంలో గునపంతో మట్టిని తవ్వింది. ఆ తరువాత జిరాఫీ మామ దగ్గరకెళ్ళి ఓ పెద్ద చెట్టుకొమ్మను విరగదీసి ఇవ్వమంది. జిరాఫీ తన పొడవైన మెడను సారించి ఓ పెద్ద కొమ్మను విరిచింది. ఆ కొమ్మను కుందేలు దగ్గరకు కోతి ఈడ్చుకొచ్చింది. కుందేలు పక్కనున్న ఎలుగుబంటిని పిలిచి కొమ్మను చేతికిచ్చి తాను చూపిన చోట ఉంచమంది. ఎలుగబంటి కుందేలు చెప్పినట్లుగా రాయికిందకు కొమ్మ ఉంచింది. తాబేలు బావవచ్చి ఆ కొమ్మకింద, చిన్న రాయిని ఉంచింది. కుందేలు అంతా సరి చూసుకుని ‘రడీ అనగానే కొమ్మను కిందకు వంచమంది. జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి.\n\nకుందేలు ‘రెడీ’ అంది. ఎలుగుబంటి కొమ్మను కిందకు నొక్కింది. అంతే. ధనధనా అంటూ పెద్ద శబ్దంతో రాయి పల్లంకోకి జారిపోయింది. కళ్ళముందు జరిగిన సంఘటనకు జంతువులన్నీ హర్షధ్వానాలు చేశాయి. రాజుగారు కండబలం కంటే బుద్ధిబలం గొప్పదని గ్రహించి తిరిగి కొలువులో తెలివిగల వాళ్ళకి సముచిత ఉద్యోగాలిచ్చి అందరినీ సంతోషపెట్టారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 648,
        "IMAGE": "cat_7",
        "NAME": "కుందేలు తెలివి హర్షించిన కొదమసింహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "చాలాకాలం క్రితం ధర్మపురి రాజ్యంలో పరమానంద అనే ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పరమ పిసినారి. ఒకరోజు అతను రోడ్డుపై నడుసుండగా, జిలేబీ అంగడిని చూశాడు. అతనికి వాటిని తినాలనే కోరిక కలిగింది. కాని వాటిని కొనడానికి డబ్బు అవసరం. పైగా, అంగడి వద్దే తింటే పక్కన ఉన్న వారికి కూడా పెట్టాల్సి వస్తుంది. అది ఇష్టం లేని పరమానంద ఒక పధకం పన్నాడు. దాని ప్రకారం వెంటనే అతను ఇంటికి చేరుకొని, పనివాడిని పిలిచాడు. వాడికి డబ్బు ఇచ్చి అంగడి నుంచి జిలేబి తీసుకొని ఇంటికి కాకుండా ఊరు చివర కొలను వద్ద గల పొదల వద్దకు తీసుకు రమ్మని చెప్పాడు.\n\nఈ పరిస్ధితులలో ఒకవైపు పరమానంద జిలేబిలను తినేందుకు ప్రయత్నిస్తూంటే, మరోవైపు అచ్చం అతనిలానే ఉన్న మరో నకిలీ వ్యక్తి రాజుగారుతో ‘నేను నా సంపదలో సగభాగాన్ని పేదలకు దానం చేయాలని నిశ్చయించుకున్నాను, కనుక దయఉంచి మీరు ఇందుకు అనుమతించాలి‘ అని కోరాడు. దానికి రాజు సంతోషంగా సమ్మతించి, అతడిని అభినందించాడు.\n\nపరమానందలో వచ్చినఈ మార్పునకు సభలో ఉన్న వారందరూ ఆశ్చరపడటమే కాక, ఈ హఠాత్తు పరిణామానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించసాగారు. అప్పుడు నకిలీ పరమానంద సభ నుంచి నేరుగా, అసలు పరమానంద ఇంటికి నెళ్ళి, పనివాడితో ‘అచ్చు తనలాగే ఉన్న మరో మనిషి గ్రామంలో తిరుగుతున్నాడని, అతను కనుక ఇంటికి నస్తే నిర్ధాక్ష ణ్యంగా కొట్టి, బంధించమని‘ ఆజ్ఞాపించాడు.\n\nఇంటికి చేరుకొన్న నకిలీ పరమానంద, శుభ్రత లేని దుస్తులు ధరించినఅసలు పరమానంద భార్యను చూసి, సంతకి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కోమని చెప్పాడు. తన భర్తలో వచ్చిన ఈ మార్పునకు నివ్వెర పోయినపరమానంద భార్య కారణం ఏమిటని ప్రశ్నించింది. దానికి అతడు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని సమాధానం చెప్పాడు.\n\nకొంతసేపటికి రాజ్యంలోని ప్రజలంతా పరమానంద ఇంటికి చేరుకున్నారు. నకిలీ పరమానంద వారితో ‘మీకు నచ్చిన వస్తువులు, సరమజామా, ఏది అవసరమైతే వాటిని తీసుకు వెళ్ళమని‘ కోరాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా వారికి అవసరమైన వాటిని తీసుకోపోవడం ప్రారంభించారు. ఒక గ్రామస్థుడు తెలివిగా, ముందుగా ఇంటి వెలుపల ఉన్న బండిని తీసుకొని దాని నిండా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో నింపుకొని, పరమానంద ఉదారతను పాట రూపంలో పాడుకుంటూ, అసలైన పరమానంద ఉన్న మార్గం గుండా తన ఇంటికి ప్రయాణమయ్యాడు.\n\nఅప్పుడు ఆ పాట విన్న అసలు పరమానంద ఆశ్చరపడి, ఎవరు పాడుతున్నారో తెలుసుకొనేందుకు ఆ దారిలోకి వచ్చాడు. ఎదురుగా విలువైన వస్తువులతో బండి మీద తన గొప్పతనాన్ని పాడూతూ వస్తూన్న అతను చూచి, ఆ ఎడ్ల బండి, అందులోని వస్తువులను తనివిగా గుర్తు పట్టి ‘దొంగ.....దొంగ....‘ అని అరవడం ప్రారంభించాడు. దానికి సమాధానంగా ఆ బండివాడు నవ్వి..ఇవి నాకు పరమానంద గారే ఇచ్చారని చెప్పాడు. దానికి ఆశ్చరంతో ‘నేనే పరమానంద‘ అన్నాడు. దానికి ఆ బండివాడు నవ్వి, వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.\n\nవెంటనే పరమానంద తన ఇంటికి బయలదేరి వెళుతూ, దారిలో తన వస్తువులను తీసుకొపోతున్న కొంతమందిని అడ్డగించగా వారు అతనిని తీవ్రంగా గాయపరిచారు. అప్పుడు పరమానంద రాజుకు ఫిర్యాదు చేశాడు. దానికి రాజు ‘మరి నీ ఆస్తిని పేదలకు దానం చేయుటకు నా వద్ద అనుమతిని ఎందుకు తీసుకున్నావు‘ అని ప్రశ్నించాడు.\n\nఅప్పుడు పరమానంద ఆ అనుమతిని అడిగినది తాను కాదని, తన రూపంలో ఉన్న ఒక మొసగాడని అతనిని శిక్షించమని కోరాడు. అప్పుడు రాజు వెంటనే నకిలీ పరమానందను బంధించి తీసుకొని రమ్మని తన భటులను ఆజ్ఞాపించగా, వారు అతనిని సభలో రాజు ముందు హాజరు పరిచారు. అప్పుడు రాజుతో సహా ప్రజలందరూ వారిరువరూ అచ్చం ఒకేలా ఉండండతో ఆశ్చరపోయారు.\n\nచివరికి పరమానంద భార్య కూడా వారిద్దిరిలో అసలు పరమానందను గుర్తించ లేకపోవడంతో, అతను తన పరిస్దితికి మూర్ఛపోయాడు. కొంచెంసేపు తరువాత తేరుకొన్న అసలు పరమానంద వద్దకు నకిలీ పరమానంద వచ్చి, ‘నేను నీ తండ్రిని. నేను నీలాగే పిసినారిగా బ్రతకడంతో ఇప్పుడు నేను నరకంలో కష్టాలనుభవిస్తున్నాను. నీలో మార్పు కోసం ఈ నాటకం ఆడాను. ఇక పైన ధానధర్మాలను చేసి బుద్దిగా బ్రతకమని‘ చెప్పి అదృశ్యమైనాడు. అప్పటి నుంచి ధనరామ్‌ చివరివరకూ, దానధర్మాలు చేస్తూ, మంచి పేరు తెచ్చికొని, మరణాంతరం స్వర్గాన్ని చేరుకోన్నాడు.\nఅందుకని పిల్లలూ! మీరు కూడా ధానధర్మాలు చేసి మంచిపేరు తెచ్చుకొంటారు కదూ.\nనీతి : ఎల్లప్పుడు పరులకు సహయపడవలెను.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 649,
        "IMAGE": "cat_7",
        "NAME": "పరమానంద పరోపకారం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 76,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ప్రముఖ వ్యాపారి రాజారావు కుమారుడు నరేష్‌, రాజారావు దగ్గర కూలిపని చేసే రంగయ్య కుమారుడు సోము పదవ తరగతి ఊర్మిళానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రాజారావుకు ఆ స్కూల్లో మంచి పలుకుబడి ఉంది. అందువలన నరేష్‌ సరిగ్గా స్కూలుకు రాకపోయినా పరీక్షల్లో అసలు ఏమీ రాయకపోయినా కోపగించకుండా హాజరు వేస్తూ మార్కులు కూడా అవకాశాన్ని బట్టి వేస్తూ పాస్‌ చేసే వారు. అందువలన నరేష్‌ అందరితో తగవులు పెట్టుకొని అల్లరిగా తిరిగేవాడు.\n\nసోము స్కూలు వదలగానే తండ్రి దగ్గరకు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళవలసిన సరుకులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళేవాడు. ఇంటి దగ్గర సోమూ పాఠాలు అన్నీ చక్కగా చదువుకొని, నోట్సులు రాసుకొని రాని ప్రశ్నలను మరింత శ్రద్ధగా చదివి ఏ రోజు వర్క్‌ ఆ రోజుకే పూర్తిచేసేవాడు. పదవ తరగతి పరీక్షలంటే భయంతో మరింత శ్రద్ధగా చదివేవాడు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ‘ప్రతి విద్యార్ధి జీవితానికీ చక్కని మలుపునిచ్చేది ఈ పదవ తరగతి పరీక్షలే’. అందువలన సోము రాత్రంతా మేల్కొని ప్రతి పాఠాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తన మెదడులో నిక్షిప్తం చేసుకునేవాడు. కొడుకు కృషిని చూసి తల్లి, తండ్రి కూడా నిద్రపోకుండా అతనితోపాటు మేల్కొని తోడుగా ఉండేవారు.\n\nరాజారావు తన కుమారుడు ‘స్టేట్‌ ఫస్ట్ క్లాస్’ రావాలని, దానికోసం రకరకాల దారులు అన్వేషించి, లంచం ఇచ్చి చివరకు ప్రశ్నాపత్రాలు సంపాదించాడు. నరేష్‌ ఆ ప్రశ్నల జవాబులు చదువుకొని పరీక్షలు చక్కగా రాశాడు. సోము కూడా స్వయంకృషితో అన్ని పరీక్షలూ మంచిగానే రాశాడు. రెండునెలల అనంతరం ఫలితాలు వచ్చాయి. ప్రశ్నాపత్రాలు ముందుగా సంపాదించి రాసిన నరేష్‌ స్కూల్‌ ఫస్ట్ వచ్చాడు. సోము మాత్రం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. నరేష్‌ను స్కూలువారు అభినందించారు. నరేష్‌, సోము, ‘శారదా కాలేజీ’లో చేరారు. అప్పటినుండీ నరేష్‌కు కష్టాలు మొదలయ్యాయి.\n\nలెక్చరర్‌ చెప్పే పాఠాలు అర్థం కావడంలేదు. రోజురోజుకూ కాలేజీ అంటే భయం ఎక్కువయింది. ఆ భయంతో కాలేజీకి వెళ్ళటం, జులాయిగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. సోము బాగా చదివినవాడు కాబట్టి అన్నీ అర్థం చేసుకుని మంచి మార్కులు పొందాడు. నరేష్‌ తండ్రితో కాలేజీకి వెళ్ళనని చెప్పేశాడు. అతన్ని బలవంతం చేస్తే ఏమవుతాడో అని తన వ్యాపారంలోనే చేరమన్నాడు. అంతటితో అతని చదువు ఆగిపోయింది. కొడుకును ఉన్నత శిఖరాలు చేర్చాలన్న రాజారావు కలలు కరిగిపోయాయి.\n\nసోము అంచెలంచెలుగా ఎదిగాడు. కంప్యూటర్స్‌ నేర్చుకున్నాడు. పోటీ పరీక్షలు రాశాడు. అన్నిటిలో సులభంగా పాసయ్యాడు. అతనికి విదేశాలలో అవకాశం వచ్చినా వెళ్ళకుండా భారతదేశంలోనే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. ఆ విషయం ఆనందంగా చెబుతున్నాడు రంగయ్యను హృదయపూర్వకంగా అభినందించాడు రాజారావు. చేతులారా తాను తన కుమారుడి భవిష్యత్తును పాడు చేశానని గుర్తించాడు. ‘బాల్యంనుండీ చదువుని డబ్బుతో కొనడం అలవాటు చేశాను. ఆ అలవాటే నాకుమారుడి జీవితాన్ని చీకటి చేసింది. తప్పునాదే, తప్పు నాదే!’ అనుకున్నాడు.\nనీతి : స్వయంకృషితో చదవకుండా అడ్డదారుల్లో పాస్‌ అయితే విద్యార్థి భవిషత్తు అంధకారం అవుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 650,
        "IMAGE": "cat_7",
        "NAME": "అడ్డదారి విజయం.. భవిష్యత్ అంధకారానికి మార్గం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 77,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఏకలవ్యనగర్‌లో రామనాధరెడ్డి స్కూల్‌లో శివ, రవి 7వ తరగతి చదువుతున్నారు. శివ ప్రతిరోజూ స్కూల్‌కు పాకెట్‌మనీ పదిరూపాయలు పైగానే తెస్తాడు. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు శివచుట్టూ నలుగురైదుగురు స్నేహితులు ఉంటారు. చిరుతిళ్ళు తింటూ, అద్దె సైకిల్స్‌ తీసుకుని చక్కర్లు కొట్టడం, చ దువు కంటే ఆటలకే ఎక్కువ సమయం వృధా చేసే వారు. రవి ఇంట్లో ఇచ్చిన పాకెట్‌మనీని జాగ్రత్తగా హుండీలో వేసి దాచేవాడు. నోట్సులను చివరిపేజీ వరకూ ఉపయోగించేవాడు. పాఠ్యపుస్తకాలను పాతవి కొని, వాటికి చక్కగా అట్టలు వేసి రంగురంగుల నేమ్‌స్లిప్స్ అంటించి నీట్‌గా ఉంచేవాడు. ఉపాధ్యాయులు ఎంతగానో అభిమానించేవారు.\n\nకానీ విద్యార్ధులు మాత్రం ‘పిసినారి రవి’ అని ఏడిపించేవారు. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ తలదించుకుని వెళ్ళేవాడు. శివ ఇంట్లో ఏ పని చెప్పినా చేసేవాడుకాదు, మార్కెట్‌నుండి ఏవైనా సరుకులు తీసుకురమ్మంటే సమయానుకూలంగా కమీషన్‌ కొట్టేవాడు. ఆ డబ్బును తను పొగిడే వారికోసం ఖర్చు పెట్టేవాడు. రవి ఉదయం ఇంటికి కావలసిన పాలు, పాలబూత్‌ దగ్గరకు వెళ్ళి తీసుకువచ్చేవాడు. కాలనీలో ఉన్న కొందరు ఉదయానే లేవలేక రవితో పాలపేకేట్స్‌ తెప్పించుకునేవారు. అలా తెచ్చినందుకు నెలకు 15 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఆ డబ్బును రవి జాగ్రత్తగా కూడబెట్టేవాడు. వాళ్ళ నాన్నగారు ప్రతినెలా సినిమాకు వెళ్ళమని డబ్బులిచ్చినా, అవి కూడా దాచుకునేవాడు.\n\nఉపాధ్యాయ దినోత్సవానికి క్లాసులో అందరూ కలసి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేయాలని అనుకున్నారు. అందుకు తలా పదిరూపాయలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ లీడర్‌కు డబ్బులిచ్చారు. శివ మాత్రం ఇంట్లో 25 రూపాయలు గురుపూజ పేరు చెప్పి తీసుకొని, క్లాస్‌లో ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఆ డబ్బు ఖర్చు చేశాడు. గురుపూజరోజు రవి అన్ని పనులూ తానే చేశాడు. వసూలయిన డబ్బులు చాలక పిల్లలు ఆందోళన పడుతుంటే రవి వాళ్ళను గాబరాపడవద్దని తన సొంత డబ్బులు వందరూపాయలు ఇచ్చాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. పిసినారి రవి వందరూపాయలు ఇవ్వడం అందరూ చ ర్చించుకోవడం, శివకు ఎంతో బాధ కలిగింది.\n\nఆ బాధకోపంగా మారింది. స్కూలు వదిలిన తరువాత దారికాచి రవిని కొట్టడానికి ప్రయత్నించాడు. రవి భయపడకుండా “శివా! నేనంటే నీకెందుకు కోపం? నేనెప్పుడూ నీ గురించి వేరుగా అనుకోలేదు. మనం చదువుకోవడానికి వచ్చాము, ఇలా కక్షలు పెంచుకుంటే చదువు కుంటుపడుతుంది. అలా జరిగితే నీ జీవితం, నిన్ను గొప్పగా చదివించాలనుకున్న నీ తల్లిదండ్రుల ఆశలు చెదిరిపోతాయి. నువ్వు ఖర్చు చేయకపోతే ఈ చుట్టూ తిరిగే స్నేహితులు నీ దగ్గరకే రారు. నన్నుకొడితే నీకు ఆనందం కలిగితే కొట్టు” అని ధైర్యంగా నిల్చున్నాడు. అనుకోని సంఘటనకు శివ ఖంగుతిన్నాడు. ఆలోచనలోపడ్డాడు, తలదించుకుని వెళ్ళిపోయాడు.\n\nఆరోజు నుండి శివలో మార్పు వచ్చింది. ఆ మార్పు శివ స్నేహితులకు బాధ కలిగించింది. శివను తమ దారికి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు. శివ వారి దారికి రాలేదు. పూర్తిగా చదువుపైనే మనసు లగ్నం చేశాడు. పాత స్నేహితులు దూరం అయ్యారు. తనను మార్చిన రవిపై అభిమానం పెరిగింది. ఇంతకాలం రాయని నోట్సులు రవి దగ్గర తీసుకుని రాసుకున్నాడు. చిల్లరఖర్చులు, తిరుగుళ్ళు మానివేశాడు. బుద్ధిగా చదివి, పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఏకలవ్యనగర్‌లో 7వ తరగతి వరకే అవకాశం ఉంది. పై తరగతి చదవాలంటే పక్క ఊరు బస్సులో వెళ్ళాలి. ఏంచెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు శివ. తండ్రిని సైకిల్‌ కొనివ్వమన్నాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండునెలల తరువాత కొంటానన్నాడు.\n\nఆ రెండు నెలలు బస్సులో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ‘ట్రింగ్‌, ట్రింగ్‌’మన్న సైకిల్‌ శబ్దానికి శివ వెనక్కు తిరిగి చూశాడు. సైకిల్‌పై రవి, శివ ఆశ్చర్యంగా చూసి “కొత్త సైకిల్‌ ఎప్పుడు కొన్నావురా? మీ న్నాగారు కొన్నారా? ఎంతయింది?” అంటూ అడిగాడు. “మా నాన్నగారు కొనలేదు. నా స్వంత డబ్బుతో కొన్నా. పదహారు వందలయింది. రా!వెనక కూర్చో. ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్దాం” అన్నాడు రవి. శివ కూర్చుని “అంత డబ్బు ఎక్కడిదిరా” ఆశ్చర్యంగా అడిగాడు.\n\nరవి నవ్వుతూ “అనవసర ఖర్చులు చేయకుండా ఒక్కో రూపాయి జమ చేస్తే సైకిల్‌ ఏం ఖర్మ, లూనానే కొనుక్కోవచ్చు. డబ్బు ఖర్చుపెడితే దగ్గరకు చేరేవారు స్నేహితులు కారు, తెలుసుకో” అన్నాడు. శివ ఆ మాటలకు ఎంతో సిగ్గుపడ్డాడు, “రవీ! నువ్వేనా నిజమైన మిత్రుడివి. ఇక నుంచి నీ సలహాలతో మంచి దారిలో ప్రయాణం చేస్తాను..’ అన్నాడు.\nనీతి : పొదుపు బాల్యం నుండీ అలవాటు చేసుకుంటే రేపటి మంచి పనులకు ఎంతో ఉపయోగపడుతుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 651,
        "IMAGE": "cat_7",
        "NAME": "బాల్యం నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 78,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఊర్మిళా నగరంలో పురాతనమైన వేప, మర్రి కలిసిన మహావృక్షం గ్రామప్రజల పూజలు అందుకుంటోంది. ఆ చ్టెటుపై ఎంతోకాలంగా కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ, గ్రామప్రజలు చెట్టుకు నైవేద్యం పెట్టే వడపప్పు వంటివి తింటూ హాయిగా జీవిస్తున్నాయి.\n\nఓ రోజు ముసలికాకి ఒకటి ఎక్కడనుంచో వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చెట్టుపైన ఉన్న కాకులు దాన్ని చూసి ఎగిరివచ్చి చెట్టు దగ్గరకు చేర్చి సేవలు చేసి తెలివి తెప్పించాయి. పాపం ఆ ముసలికాకి కుంటిది. మెల్లగా లేచి తన చుట్టూ ఉన్న కాకులను చూసి ఆనందపడింది. అక్కడే ఉంటూ కొద్దిరోజులకు అది కోలుకుంది. తన గత అనుభవాలను ఇతర కాకులకు కథలుగా చెప్పేది. కాలం గడుస్తోంది. అయితే రోజూ వడపప్పు తింటూ అలా గడపడం ముసలికాకికి నచ్చలేదు.\n\nఓ రోజు ముసలికాకి చెట్టుపైన ఉన్న కాకులన్నింటినీ సమావేశపరిచి పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ‘నాతోటి కాకుల్లారా! ఎంతకాలం ఇలా జీవనం. మీకు, ఈ చెట్టు - చెట్టుకు పెట్టే నైవేద్యం తప్ప మరొకటి తెలీదు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి. తెలివి ఉపయోగిస్తే ఎన్నో రుచులను చవిచూడవచ్చు’ అని చెప్పింది. కాకులు అంతా విని మొహమాటం లేకుండా మాకు వేరే రుచులు వద్దు. ఈ జీవితమే హాయిగా ఉంది. రుచుల కోసం దొంగతనం చేయం’ అన్నాయి. ముసలికాకి మూతి ముడుచుకుని వంటరిగా మిగిలిపోయింది.\n\nఅయినా ఊరుకోకుండా సమయం చూసి ఓ బక్కకాకికి మళ్ళీ తన ఉపన్యాసం వినిపించి ‘ ఇలా బక్కగా ఉండటానికి కారణం సరైన తిండిలేకపోవడమే. నేను చెప్పినట్లు చేస్తే నెలరోజుల్లో కండలు పెరుగుతాయి’ అని చెప్పింది. పాపం బక్కకాకి ఆశపడి సరేనంది. ముసలికాకి ఆలస్యం చేయకుండా బక్కకాకిని వెంటపెట్టుకుని గ్రామంలోకి వచ్చింది. ముందు మాంసం కొట్టు దగ్గర పారేసిన మాంసం రుచిచూపించింది. మరోచోట చేపల రుచి.. ఇలా ఊరంతా తిప్పింది. కొత్త రుచులకు బక్కకాకి మురిసిపోయింది.\n\nకొద్దిరోజులు గడిచాయి. ముసలికాకి ఇళ్ళల్లోకి చొరబడి గారెలు, బూరెలు, వేపుళ్ళు తెచ్చుకుంటే బాగంటుందని సలహా ఇచ్చింది. ఆ రోజు నుంచి బక్కకాకి ఇళ్ళలో ఆహారం దొంగిలించడం మొదలు పెట్టింది. ఈ పని మంచిదికాదని తోటి కాకులు ఎంత చెప్పినా వినలేదు. రోజురోజుకూ దొంగతనం ఎక్కువయిపోయింది. ముసలికాకి హాయిగా కూర్చొని తెచ్చిన ఆహారాన్ని లొట్టలు వేసుకుని తింటూ బాగా బలిసింది. బక్కకాకి కూడా పహిల్వాన్‌లా తయారయింది. బక్కకాకి కుటుంబం కూడా దొంగతనాలు మొదలు పెట్టింది. రోజురోజుకూ కాకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రజలు జాగ్రత్త పడక తప్పలేదు. రానురాను దొంగకాకులకు ఆహారం దొరకడం కష్టం అయింది. రుచులకు అలవాటుపడిన నాలుక మామూలు ఆహారం తినడానికి మొరాయించింది.\n\nఓరోజు ఎలా అయినా మంచి ఆహారం దొంగిలించాలని ముసలికాకి, బక్కకాకి బయలుదేరి రెడ్డిగారి ఇంటిపై వాలాయి. పెరట్లో మార్కెట్‌ నుంచి తెచ్చిన చేపల సంచి చూసి మెల్లగా సంచి దగ్గరకు వచ్చాయి. ముసలికాకి తన ముక్కుతో ఓ చేపను పట్టింది. బక్కకాకి రెండు చేపలు పట్టింది. తొందరగా వెళ్ళిపోవాలని ఎగరడానికి రెక్కలు ఆడించాయి. అంతలో రెడ్డిగారు అదిచూశారు. ఇంతకాలం కాకుల బాధ అనుభవించిన రెడ్డిగారు కోపంతో చేతిలో ఉన్న కర్ర విసిరారు. కర్ర రివ్వున ఎగిరివచ్చి ముసలికాకిని తాకింది. దాంతో అది మరణించింది. బక్కకాకి భయంతో పరుగులు తీసింది. రెడ్డిగారు కోపంతో దాని వెంటపడ్డారు.\n\nకాకి తన గూడు చేరుకుంది. ఆయన ఆ గూడును వెదురుకర్రతో చిందరవందర చేశారు. ఆ గూడు కదిలిపోయింది. ఆగూట్లో స్టీలు చెంచాలు, ప్లేట్లు, చిన్నచిన్న గిన్నెలు ఎన్నో కింద పడ్డాయి. బక్కకాకి కుటుంబం నిలువనీడ లేకుండా పోయింది. ఎంత ప్రాధేయపడినా ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వలేదు. ఇక నుంచి దొంగతనం చేయనని మొరపెట్టుకున్నా ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదు. కాకులు దాన్ని వెలివేశాయి. చేసేదిలేక ఏడ్చుకుంటూ బక్కకాకి తన కుటుంబంతో మరో ఊరు వె ళ్ళిపోవలసి వచ్చింది.\nనీతి : దొంగతనం తాత్కాలిక సుఖం ఇస్తుంది. కానీ నిజం తెలిసిన తరువాత నిలువ నీడ కూడా దొరకదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 652,
        "IMAGE": "cat_7",
        "NAME": "దొంగతనం తాత్కాలిక సుఖం ఇస్తుంది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 79,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.\n\nసోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది.\n\nవాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. \"ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!\" అన్నది. సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.\n\nఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు.\n\nఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు. ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది.\n\nఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు. గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.\n\nఇక చేసేదేమీలేక, 'తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు చాటింపించారు.\n\nచాటింపును విన్న సోము ఆలోచించాడు: 'ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు.' అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది- ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు!\nసోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది.\n\nహారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు. సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 653,
        "IMAGE": "cat_7",
        "NAME": "సోము-తాబేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 80,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది.\n\nఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- \"ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!\" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది.\n\nనది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కానీ నదిలో ముసళ్లున్నాయి! అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను! మరెలాగ? నక్కకు జింక మాంసాన్ని వదలటం ఇష్టం కాలేదు. అలాగని మాంసపు తునకల్నీ వదలలేదు! అందుకని అది కష్టపడి, ఎలాగో ఒకలా ముసళ్ల కళ్లు కప్పి, నోట్లో ఉన్న మాంసపు తునకలను తన నోట్లోనే ఉంచుకొని నదిలోకి దిగి, అవతలి వైపుకు ఈదసాగింది. అయితే అనుకోకుండా నోట్లోని మాంసం ముక్కలు రెండూ నీళ్లల్లో పడిపోయాయి!\n\n'అందని ద్రాక్షపళ్లు పుల్లన ' అన్నట్లు, నక్క అనుకున్నది- \"ఈ రెండు ముక్కలు పోతే పోనీలే! అవతల వైపున పెద్ద జింకే దొరకబోతూంటే, ఈ చిన్న తునకలు ఎందుకు?\" అని. ఇక వేరే అడ్డు లేదు గనక, అది ఈదుతూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకుని, దాని అలవాటు ప్రకారం జింకను ఈడ్చుకుంటూ వెళ్లి నదిలోకి దిగింది.\n\nఅయితే చాలా రోజులనుండీ ఆహారం లేక విలవిలలాడుతున్న ఆ నదిలోని ముసళ్లు అంతకుముందే నక్క నోట్లోంచి పడ్డ మాంసపు తునకల్ని నమిలి, 'ఇంకా ఏం దొరుకుతుందా' అని ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇప్పుడు జింక మాంసపు వాసన రాగానే అవన్నీ వెంటబడి వేటాడి జింకను, దాన్ని‌ ఈడ్చుకెళ్తున్న నక్కను కూడానూ కరకరామని నమిలి తినేశాయి.\nఆశపోతు నక్క తన చావును తానే కొని తెచ్చుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 654,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆశపోతు నక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 81,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. \"ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో\" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది.\n\nఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, \"ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!\" అని అరిచింది.\nఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. \"అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా\" అంటూ గాండ్రించింది.\nకప్ప గర్వంగా తల పైకెత్తి \"నువ్వు నన్ను తినలేవు. నేను కప్పల రాజును. నీకంటే తెలివైన వాడిని!\" అంటూ బెకబెకలాడింది.\n\"నిరూపించు చూద్దాం!\" అంది పులి.\n\"అయితే, దుమకడంలో, తినటంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా\" అన్నది కప్ప.\n`సరే'నంది పులి.\n\nఇక దూకే పందెం మొదలయింది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది. అవతలి గట్టును దాటి మూడు మీటర్లు దూకిందది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే ఒక మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది! అయితే అది పులి తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియలేదు.\nఇక కప్ప విజయ గర్వంతో \"నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను. మరి నువ్వేమి తిన్నావు?\" అని అడిగింది.\nఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు.\nపులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది.\n\nపులి కొంచెం సేపు ఆలోచించి, ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలికి దూకి, ఆపకుండా అడవిలోకి పరుగుతీసింది. చాలా సేపు పరుగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురయింది.\nరొప్పుతూ, భయపడుతూ ఉన్న పులిని చూసి, నక్క \"సంగతేంటి పులిమామా?\" అని అడిగింది.\nజరిగినదంతా నక్కకు వివరించింది పులి.\n\"ఒక్క పూటకు రెండు పులులను తినే కప్ప ఎక్కడా ఉండద\"ని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే తనవెంట కప్ప దగ్గరకు రమ్మని, అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా.\nనక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకుగాను, ఇద్దరి తోకల్నీ కలిపి కట్టేసుకునే షరతుమీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి.\n\nఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకొని, ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి \" ఓ! తెలివైన నక్కా! నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను\" అన్నది గట్టిగా.\n\nఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలెట్టింది. నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరుగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్లంతా హూనమయిపోయి, శరీరమంతా రక్తమోడుతూ ఉండింది. చాలా ఎముకలు విరిగిపోయాయి పాపం.\n\nఅప్పుడుగానీ తోక ముడిని విప్పలేదు పులి! విప్పి, అయాసపడుతూ, అది నక్కతో \"ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు\" అని చెప్తూ, అయినా కోపం ఆగక దాని చెంప ఛెళ్ళుమనిపించింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 655,
        "IMAGE": "cat_7",
        "NAME": "పులి-కప్ప ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 82,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవచనాలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. \"వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే\" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.\n\nఅనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.\n\nరాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.\n\nమా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి \"పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.\n\nఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత \"కథ అంతా పుక్కిటి పురాణం\" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 656,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఎత్తుకు పై ఎత్తు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 83,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.\n\n'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.\n\nఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి \"మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు\" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.\n\nపండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.\nనీతి : కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 657,
        "IMAGE": "cat_7",
        "NAME": "అతి పండితుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 84,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రత్తయ్యశెట్టి ఏదో పనిమీద నగరానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ, తన భార్యకొక అద్భుతమైన ముక్కుపుడక కొనుక్కు వచ్చాడు. దాని ఖరీదు లక్ష రూపాయలు! ఈ వార్త క్షణాలలో ఊరంతా పాకిపోయింది. ఎక్కడ విన్నా ముక్కుపుడుక ముచ్చటే!\n\nచింతకాయల వీధిలో ఓ పదిమంది అమ్మలక్కలు పోగయ్యారు. అందరూ కూడా బలుక్కుని శెట్టి గారింటికి బయలుదేరారు.\n\nదారిలో వారికి భైరాగి తాత కనిపించాడు. రచ్చబండ మీద కూర్చుని తత్వం పాడుకుంటున్నాడు. \"జట్టుగా కదిలిపోతున్నారు, ఏమిటమ్మా విశేషం?\" అని అడిగాడు. \"ముక్కుపుడకను చూసొద్దామనీ...\" రత్తయ్య గారింటికేనా?... వెళ్లిరండమ్మా!\" అంటూ మళ్లీ తత్వం అందుకున్నాడు బైరాగి. మరో అరగంట తరువాత ఆ దారినే తిరిగివచ్చారు వాళ్లు. గలగలా మట్లాడుకుంటున్నారు వాళ్ళు. ముక్కుపుడకను పొగడటానికి వాళ్లకు మాటలు చాలటం లేదు.\n\nభైరాగి పలకరింపుతో వాళ్లు ఆగిపోయారు. \"అంతగా అశ్చర్యపడతన్నారేమిటి తల్లీ?\" అనగానే, \"ఆశ్చర్యం కాక మరేమిటి తాత! అలాంటి ముక్కుపుడక లోకంలో ఇంకెక్కడా ఉండదా!...\" అని ఒకరూ, శెట్టిగారి భార్యదే కదా అదృష్టమంటే!\" అని ఒకరూ, \"దాన్ని తయారుచేసిన వాడి నైపుణ్యమే నైపుణ్యం!\"అని ఒకరూ గోలగోలగా చెప్పసాగారు. \"ఎంతసేపు ముక్కుపుడకను గురించి తప్ప, ముక్కును చేసిన వాణ్ని మరిచిపోయి, ముక్కుపుడకను చేసిన వాణ్ని మెచ్చుకుంటున్నారేమిటమ్మా?\"\n\n\"ఆ మాటలకు ఎవరూ మారు పలకలేదు. మౌనంగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అద్దాలలో చూసుకుని \"అలాంటి ముక్కుపుడుక లేకపోతే మాత్రమేం? ఈ ముక్కే చాలు!\" అని మురిసిపోయారు. \"ఇంత చక్కగా ముక్కును ఎలా చేశాడో మరి, ఆ బ్రహ్మ!\" అని ఆశ్చర్యపోయారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 658,
        "IMAGE": "cat_7",
        "NAME": "ముఖానికే అందం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 85,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. దానికి పళ్లన్నీ ఊడిపోయాయి. అది ఆహారం కోసం వెదుకుతుండగా్, ఏనుగు మృతదేహం దాని కంటపడింది. ఆ చనిపోయిన ఏనుగు పక్కన కూర్చుని దానికి కాపలా కాస్తున్నట్లు నటించి ఏదైనా జంతువు వస్తే దానితో ఏనుగు చర్మాన్ని కొరికించి, ముక్కలు చేయించి మాంసం తినాలని అనుకుంది.\n\nఅప్పుడే అటుగా వస్తున్న సింహంతో \"మృగరాజా! నేను ఈ ఏనుగుకు కాపలా ఉన్నాను. కావాలనుకుంటే ఈ ఏనుగు మాసాన్ని తినవచ్చు\" అని చెప్పింది నక్క. \"నేను చనిపోయిన జంతువులను తినను\" అని తన దారిన తాను వెళ్లింది సింహం.\n\nమరికొద్ది సేపటికి ఒక పులి అటుగా రావడంతో \"పులిరాజా! ఈ ఏనుగును ఆరగిస్తారా?\" అంది నక్క. \"నేను ఏనుగుల మాంసాన్ని ఇష్టపడను\" అనుకుంటూ వెళ్లిపోయింది పులి.\n\nపులి వెళ్లీ వెళ్లగానే అటు వైపు వచ్చింది ఒక కోతి. కోతిని చూసిన నక్క ఈ సారి ఎలాగైనా తాననుకున్నది సాధించాలని, \"ఇప్పుడే ఒక సింహం ఈ ఏనుగుని చూసి నన్నిక్కడ కాపలా పెట్టి వెళ్లింది. నీకు తినాలనిపిస్తే ఈ ఏనుగును తిను, నేను సింహం వస్తూ ఉంటే నీకు సైగ చేస్తాను\" అని నక్క చెప్పింది కోతితో. కోతి ఏనుగు మృతదేహంపై ఎక్కి తన వాడియైన పళ్లతో ఏనుగు చర్మాన్ని ముక్కలుగా చించేసింది. అప్పుడే నక్క \"మిత్రమా పారిపో సింహం వచ్చేసింది\" అని అరవగానే కోతి ప్రాణభయంతో కనబడకుండా పారిపోయింది. ఇక తినడమే ఆలస్యమని ఏనుగు శరీరం మీదికెక్కిన నక్కకు \"మిత్రమా! పారిపో\" అంటూ ఒక అరుపు వినిపించింది. ఒక బలమైన నక్క అటుగా పరుగెత్తుకువచ్చి ఏనుగు మాంసాన్ని తినసాగింది. రెండు నక్కల మధ్య పోరు జరిగినా ముసలినక్క బలమైన నక్క దెబ్బలకు భరించలేక\" నాకు కూడా ఏనుగు మాంసమంటే ఇష్టంలేదు\" అని అక్కడి నుంచి పారిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 659,
        "IMAGE": "cat_7",
        "NAME": "ముసలి నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 86,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామచంద్రయ్య ఆ వూరిలో పెద్ద వ్యాపారస్తుడు. అతనికి పువ్వులంటే చాలా ఇష్టం. అందువలనే ఇంటి చూట్టూ వున్న ఖాళీస్థలంలో రకరకాల పూల మొక్కలను నాటించాడు. ఆ మొక్కల పెంపకం కొరకు రాజయ్య అనే ఓ తోటమాలిని ఏర్పాటు చేసాడు. రాజయ్య సోమరిపోతు. ఆ మొక్కలకు నీరు పోయడానికే చాలా కష్టపడేవాడు.\n\nవేసవికాలం వచ్చింది. దాంతో పాటు ఆ వూరికి నీళ్ళ కరువు వచ్చింది. రామచంద్రయ్య ఇంట్లో వారి ఉపయోగానికే నీరు దొరకడం చాలా కష్టమవసాగింది. అందువలన ఇంట్లోని నీరు మొక్కలకు పోయడానికి ఉండేదికాదు. తోటను గమనించడం రాజయ్య పని. అందువలన అతను మొక్కలకు నీరు కొరకు అక్కడికి మూడు ఫర్లాంగుల దూరంలో వున్న నూతి వద్దకు వెళ్ళిరావలసి వుండేది. అన్ని మొక్కలకు నీరు పోయాలంటే నాలుగు బిందెల నీళ్ళు కావాలి. ఒక్కసారే నాలుగు బిందెలు తీసుకురావడం కష్టం. రెండు బిందెల చొప్పున రెండు సార్లు వెళితేనేగాని, మొక్కలకు నీరు పోయడానికి వీలుపడదు. అంత దూరం నడిచి నీళ్ళు తీసుకురావడం తన శక్తికి మించిన పనవుతుందని అనుకున్నాడు రాజయ్య. రెండు రోజులు కష్టపడి తెచ్చాడు. ఆ పైన అతనికి కష్టమనిపించింది. పని తగ్గించుకోవాలని బుద్ది పుట్టిందతనికి. దాంతో రెండు బిందెల నీళ్ళు తెచ్చి, దాన్నే అన్ని మొక్కలకు కొంచెం, కొంచెం చొప్పున పోశాడు. చూడటానికి నీరు పోసినట్లు అందరికీ తెలుస్తుంది. తక్కువ నీళ్ళు పోశాడని ఎవరికీ తెలియదు. ఒకరోజు రామచంద్రయ్య తన తోటలో పువ్వుల మొక్కలు ఎలా పెరిగాయో చూద్దామని వచ్చాడు. చాలావరకు మొక్కలు వాడిపోయి వున్నాయి. వెంటనే రాజయ్యని పిలిచి, ఏరా! మొక్కలకు నీళ్ళు పోయడం లేదా! అన్నీ వాడిపోయివున్నాయే అని అడిగాడు. రాజయ్య చేతులు కట్టుకొని, అయ్యా! ప్రతిరోజు మూడు ఫర్లాంగుల దూరం వెళ్ళి, నీళ్ళు తీసుకొని వచ్చి మొక్కలకు పోస్తున్నానండీ అన్నాడు.\n\nరామచంద్రయ్యకు అతని మాటలలో నమ్మకం కుదరలేదు. ఒకసారి మొక్కలను చూసి ఆలోచనలో పడి తాను అనుకున్నది సరి అని నిర్ణయానికి వచ్చి, బయటకి వెళ్ళిపోయాడు. వారం రోజులైంది. రాజయ్య, రామచంద్రయ్య ఇంట్లోనే అన్నం తిని అక్కడే వుంటున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం ఆకలి వేయగానే కంచం తీసుకొని అమ్మగారి వద్దకు వెళ్ళాడు. రామచంద్రయ్య భార్య, రాజయ్యకి ఎప్పుడూ పెట్టే అన్నం కన్న సగం తగ్గించి అతనికి పెట్టింది. అది గమనించి రాజయ్య అమ్మగారూ అన్నం బాగా తగ్గించారు. ఇంకా అన్నం పెట్టండి అని అడిగాడు. అందుకామె, రాజయ్యా! బియ్యం ధర పెరిగింది. అంచేత అయ్యగారు తగ్గించి వండమన్నారు. అందుకే తక్కువ వండాను అంది.\n\nఅది విన్న రాజయ్యకి వళ్ళు మండింది. ఏమీ మాట్లాడకుండా బయటకి వచ్చి అన్నం తిన్నాడు. అరగంట గడిచేసరికి అతనికి ఆకలి మొదలైంది. మొక్కలకు నీళ్ళు పోయాలి. నీరసంతో నీళ్ళు తీసుకురావాలంటే చాలా కష్టమనిపించింది. అయినా తాను పనిచేయక తప్పదు కదా! మనసులో బాధపడుతూ, బిందెతీసుకొని మెల్లగా నడిచివెళ్ళి, నీళ్ళు తీసుకువచ్చి ఎప్పటిలా కొంచెం కొంచెం నీరు చొప్పున మొక్కలకు పోసాడు. అతనికి ఆకలి ఎక్కువకాసాగింది. కానీ యజమానురాలిని అడగడానికి ఆత్మగౌరవం అడ్డువచ్చింది. సాయంత్రం రామచంద్రయ్య ఇంటికి వచ్చాడు. రాజయ్య ఆయన వద్దకు వెళ్ళి అయ్యా! మీరు చేసింది అన్యాయమండి. ధరలు ఎక్కువ అయ్యాయని నాకు తిండి తగ్గించడం న్యాయం కాదు. మీరు అన్నం తినడం తగ్గించారా! మిమ్మల్ని నమ్ముకొని మీ వద్ద కష్టపడి పనిచేసుకుంటున్న నాకు కడుపునిండా తిండి పెట్టకపోతే ఎలా! అన్నాడు.\n\nవాడి మాటలకు రామచంద్రయ్య నవ్వుతూ రాజయ్యా! పనిమనిషిని ఇబ్బంది పెట్టకూడదని అంటున్నావు న్యాయమే. కానీ మనకి సువాసనలు యిచ్చే పూల మొక్కలకు కావలసినంత నీరు పోయకుండా నువ్వు అన్యాయం చేయడంలేదా! అమ్మగారు భోజనం పెట్టకపోతే నీ పొట్ట ఒక్కటే ఇబ్బంది పడుతుంది. కానీ నువ్వు అన్ని మొక్కలనూ ఇబ్బంది పెట్టావే! అన్నాడు. రాజయ్య కంగారుతో లేదండీ! నేను ప్రతిరోజూ సక్రమంగా అన్ని మొక్కలకు నీరు పోస్తున్నానండి అన్నాడు.\n\nనువ్వు నీళ్ళు పోయలేదు అని నేను అనలేదు. మొక్కలకు చాలీచాలని నీళ్ళు పోస్తున్నావు. అవి మాట్లాడవు అని వాటికి అన్యాయం చేస్తున్నావు. నీకు అన్నం కాస్త తక్కువకాగానే నన్ను అడిగావు. మరి వాటి సంగతి ఆలోచించావా. వృక్ష, జంతువులయందు దయకలిగి వున్నవాడే సత్‌పురుషుడు. నువ్వు మొక్కలకి తక్కువ నీరు పోస్తున్నది నేను నీకు తెలియకుండా పొంచి వుండి కనిపెట్టాను. ఆకలి అంటే ఎలా వుంటుందో నీకు తెలియాలని అమ్మగారికి చెప్పి అలా చేయించాను అన్నాడు రామచంద్రయ్య. రాజయ్య సిగ్గుతో తలవంచుకొని నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలా మొక్కలకు అన్యాయం చేయను. వాటికి ఎప్పటిలా నీళ్ళు పోస్తాను. ఈ రోజు నుంచి నా సోమరితనం తగ్గించి, కష్టపడి పనిచేస్తాను అన్నాడు. ఆ నెల నుండి రాజయ్యకి ఇరవై రూపాయలు జీతం పెంచాడు రామచంద్రయ్య. జీతం పెరగటంతో రాజయ్యకి ఉత్సాహం పెరిగి ఎంత దూరమైనా నడిచి, ఎన్నిసార్లు అయినా వెళ్ళి నీళ్ళు తీసుకొని అన్ని మొక్కలకు కావలసినంత నీళ్ళు పోయసాగాడు. కొన్ని రోజులలో అన్ని మొక్కలు పెరిగి రంగురంగుల పువ్వులు విరబూశాయి. వాటిని చూసి రాజయ్యకి ఎంతో ఆనందం కలిగి తాను పడిన కష్టాలన్నీ మరిచాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 660,
        "IMAGE": "cat_7",
        "NAME": "మారిన మనసు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 87,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఓ పేను ఉండేది. దానికి ఒక పెసర చేను ఉండేది. అది రోజూ పెసర చేనుకు కాపలా కాసుకుంటూ, కాలుమీద కాలు వేసుకొని తన చేనును చూసుకుంటూ, ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉండేది.\n\nఒకనాడు రాజు వచ్చి తన సైన్యంతో‌ పెసరచేనును తొక్కించాడు. చేను నాశనం అయ్యింది. అది చూసి పేను చాలా ఏడ్చింది. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నదది.\n\nమిగిలిన పెసరకాయల్ని కోసి, రుబ్బి, అది చాలా రుచికరమైన పెసరట్లు వేసింది. పేను ఆ పెసరట్లు తీసుకొని పోతుంటే 'ఘుమ ఘుమా' అని వాసన వస్తున్నది. ఆ వాసనకు ఓ సింహం పేను దగ్గరకు వచ్చి, \"నేను నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను. పెసరట్లు పెట్టు\" అన్నది. \"సరే\" అని పేను దానికి పెసరట్లు పెట్టింది. ఆ తరువాత అవి రెండూ కలిసి పోతా ఉంటే పాము ఎదురైంది. పెసరట్ల వాసన దానికీ చాలా నచ్చిందిట. అది కూడా సింహం అడిగినట్లే అడిగింది. పేను దానికీ పెసరట్లు పెట్టింది.\nఅప్పుడు ఆ మూడూ కలిసి పోతాఉంటే, ఈసారి తేలు ఒకటి ఎదురైంది వాటికి. అది కూడా సాయం చేస్తానని పెసరట్లు పెట్టించుకున్నది.\nఅవన్నీ కలిసి పోతా ఉంటే సీతాకోకచిలుక వచ్చి వాటితో స్నేహం చేసి పెసరట్లు తినింది. అన్నీ కలిసి రాజ భవనానికి పోయాయి.\n\nముందర ద్వారం దగ్గర సింహం నిల్చున్నది. వెనుక ద్వారం దగ్గరికి పాము, గూట్లోకి తేలు చేరుకున్నాయి. పేను మెల్లగా రాజుగారి గడ్డంలోకి దూరి, కమ్మగా కుట్టటం మొదలెట్టింది.\n\nహాయిగా నిద్రపోతున్న రాజుకు నిద్రాభంగం అయింది. ఎంత గోక్కున్నా దురద పోలేదు. దువ్వుకుందామని దువ్వెనకోసం గూట్లో చెయ్యి పెట్టాడు. అక్కడే కూర్చున్న తేలు చటుక్కున కుట్టింది. \"అబ్బా\" అని అరుస్తూ రాజు వేలిపైన గాటును చూసుకుందామని దీపం దగ్గరికి చేరుకున్నాడు. అంతలోనే సీతాకోకచిలుక రెక్కలతో దీపాన్ని ఆర్పేసింది. రాజు ముందుకు పరుగెత్తాడు- సింహం గాండ్రించింది. వెనక్కి పరుగెత్తితే పాము బుస్సుమన్నది. అప్పుడు పేను బయటికి వచ్చి నిల్చుని పకపకా నవ్వింది.\nరాజు పేనుకు క్షమాపణ చెప్పుకుని, ఇక ఎప్పుడూ చిన్న ప్రాణులను హింసించనని మాట ఇచ్చాడు. సంతోషపడిన పేను, తన సైన్యంతో సహా వెనుదిరిగింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 661,
        "IMAGE": "cat_7",
        "NAME": "పేను-పెసర చేను",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 88,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. దాన్ని 'రాజేంద్రుడు' అనే రాజు పరిపాలించేవాడు.\n\nఆ రాజూ మంచివాడే, రాజ్యపు ప్రజలూ మంచివాళ్లే- కానీ ఏం లాభం? ఆ రాజ్యంలోని భూముల్లో చాలా వరకూ పనికి రాకుండా పోయాయి. తూర్పు భూములేమో చవుడువి. పడమటి భూముల్లోనేమో ఇసుక మేటలు వేసింది. దక్షిణపు భూములు సున్నారపు నేలలు. ఒక్క ఉత్తరపు భూములు మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉండేవి. అందువల్ల రాజ్యంలోని ప్రజలంతా ఆ ఉత్తరపు భూముల్నే సాగు చేసేవాళ్ళు.\n\nఅసలే పరిస్థితి బాగాలేదంటే, ఆపైన రెండు సంవత్సరాలపాటు వరుసగా వానలు కురవలేదు. రాజ్యమంతటా కరువు ఏర్పడింది. రాజుగారు దిగులుతో క్రుంగిపోతున్నారు. ప్రజలు ఏంచేయాలో తెలీక పొట్టపట్టుకుని ఏ పని దొరికితే అది చేస్తున్నారు.\n\nఆ సమయంలో‌పొరుగు రాజ్యంనుండి ఒక కుటుంబం వలస వచ్చి, రాజు గారిని కలిసేందుకు వేచి కూర్చున్నది. మొదట భటులు వాళ్ళని లోపలికి రానివ్వలేదు గానీ, అంత:పురంలోంచే వాళ్ల దీనస్థితిని గమనించిన రాణి, వాళ్లను లోపలికి పంపమన్నది.\n\nవాళ్లు రాజును దర్శించుకొని, \"ప్రభూ! పొరుగు దేశంలో బ్రతుకు దుర్భరం అవ్వగా, అక్కడినుండి కట్టు బట్టలతో వలస వచ్చిన రైతులం మేము. మీ ధర్మ తత్పరత గురించి వినిఉన్నాం. మామీద దయ ఉంచి ఏదో కొద్దిపాటి భూమి ఇప్పించారంటే, దాన్ని సాగు చేసుకొని మా జీవితాన్ని మేం సాగించుకుంటాం\" అన్నారు.\n\nఅంత దు:ఖంలోనూ రాజుగారికి నవ్వు వచ్చింది. \"అయ్యో! నేనేం ఇవ్వమంటారు? మాకు అసలే వ్యవసాయానికి పనికి వచ్చే భూములు తక్కువ. అందులోనూ రెండేళ్ళుగా వానలు కురవక, పెద్ద పెద్ద రైతులే భూముల్ని బీడు పెడుతున్నారు. మీకు నేను వ్యవసాయ భూమినిచ్చే అవకాశమే లేదు\" అన్నాడు వాళ్లతో.\n\n\"అలా అనకండి ప్రభూ! ఎలాంటి భూమినిచ్చినా పరవాలేదు. ఎంత చవుడు భూమైనా పరవాలేదు. మా రెక్కల కష్టంతో ఆ భూమినే వ్యవసాయానికి అనువుగా చేసుకుంటాం\" అని వాళ్లు బ్రతిమిలాడారు. \"సరే, అయితే. మీకు తూర్పు వైపున ఉన్న చవుడు భూముల్లో నాలుగు ఎకరాలు ఇస్తున్నాను. అయితే ఆ భూమి వ్యవసాయానికి అస్సలు పనికిరాదు- ముందుగానే చెబుతున్నాను. ఆపైన మీ ఇష్టం\" అన్నాడు రాజు, వాళ్ళకు అనుమతి పత్రం మంజూరు చేస్తూ.\n\nవాళ్ళు ఆ మరుసటి రోజే పని మొదలు పెట్టుకున్నారు. చవుడు భూమిలోని రాళ్ళు రప్పలను ఏరివేశారు. గట్లు కట్టి, ఆ గట్లమీద చెట్లునాటి, పొలాలలోని హెచ్చు తగ్గుల్ని సమంచేసి, నేలను చదును చేశారు. కోత పడే నేలకు గట్లు కట్టి, భూసారాన్ని పరిరక్షించారు. ఎండిపోయిన చెరువులనుండి మట్టిని తీసుకొచ్చి పొలమంతటా సమంగా‌ పేర్చారు.\n\nఆ తరువాతి ఏడాది వానలు బాగా కురిశాయి. వాళ్ళు నాటిన చెట్లు బాగా నాటుకున్నాయి. గట్లమీద ఉన్న చెట్ల కారణంగా కావచ్చు, పొలంలో పంటకు గాలి తాకిడి తక్కువ ఉండింది. చూస్తూండగానే వారి పొలంలో ఎవ్వరికీ రానంత దిగుబడి వచ్చింది.\n\nకొద్ది సంవత్సరాలకల్లా వాళ్ల పొలంలో నేల స్వరూపం మారిపోయింది. ఇప్పుడు అందులో చవిటి పఱ్ఱ అనేదే లేదు. ఆ నేలను చూసినవాళ్లెవ్వరూ అది ఒకప్పుడు చవిటి నేల అంటే నమ్మరు.\n\nరాజుగారికి ఈ సంగతి తెలిసింది. ఆయన స్వయంగా వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తున్నారో‌ చూశాడు. వాళ్లను ఆదర్శంగా తీసుకొని చుట్టు ప్రక్కల రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశాక, ఆయన రాజ్యంలో ఇలా చాటించారు-\n\n\"భూమి ఊరికే పాడవ్వదు. మనమే దాన్ని పాడు చేస్తున్నాం. ఇకనుండి మీరంతా భూమిని కాపాడండి. భూసారాన్ని వృధా కానివ్వకండి. పొలాల గట్లను సరిచేసుకోండి. గట్లమీద చెట్లు నాటండి. పచ్చి ఆకుల్ని నేలమీద పరిచి, అవి నేలలో కలిసిపోయేందుకు సహకరించండి\" అని. రాజ్యంలో ఉన్న రైతులందరూ ఆయన చెప్పిన ప్రకారం సేద్యం చేయటం మొదలు పెట్టారు. క్రమంగా రాజ్యంలో బీడుగా పడిఉన్న భూములన్నీ సేద్యం క్రిందికి రావటం మొదలైంది.\nఅది గమనించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శనిదేవుడిని పిలిచి \"శనీ! ధర్మపురి రాజ్యంలో ప్రజలంతా భూమిని సంరక్షిస్తున్నారని మాకు తెలిసింది. వారి చిత్తశుద్ధిని కొంచెం పరీక్షించి రా\" అని పంపారు.\n\nశని దేవుడు రైతు మాదిరి వేషం వేసుకొని జనాల మధ్యకొచ్చి, \"ఆ, ఇవన్నీ ఏం పనులు? ఏమీ ప్రయోజనం లేదు. టైం వేస్టు, శక్తి వేస్టు\" అన్నాడు. కానీ కృషి ఫలితాల్ని స్వయంగా చూసిన రైతులు ఆ మాటల్ని పట్టించుకోలేదు.\n\nచివరికి శని దేవుడు రాజుగారి దగ్గరకు పోయి- \"మహారాజా! నేను శనిని. బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆజ్ఞ మేరకు మీ రాజ్య ప్రజల్ని పరీక్షించేందుకు వచ్చాను. వారిపై వారికి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఇలాంటి రైతులు ఉండేంతవరకూ ఇక మీ రాజ్యానికి నా భయం ఉండదు\" అని చెప్పి మాయమయ్యాడు.\n\nతరువాత కొద్ది సంవత్సరాలకు ధర్మపురిలో‌ బీడు భూమి అన్నదే లేకుండా పోయింది. వ్యవసాయ భూమి అంతా పూర్తిగా సాగులోకి వచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 662,
        "IMAGE": "cat_7",
        "NAME": "శని పట్టని సేద్యం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 89,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా చాలా రోజుల క్రితం భారతదేశాన్ని చూసేందుకు ఒక విదేశీయుడు వచ్చాడు. అతను ఒక సత్రంలో నివాసం ఉండి, ప్రతిరోజూ అక్కడికి దగ్గర్లో ఉన్న సుందర ప్రదేశాలనూ, వింతల్నీ, విశేషాల్నీ చూస్తూ ఉన్నాడు. అదే సత్రంలో చాలామంది భారతీయులు- విదేశీయులు కూడా ఉన్నారు. ఒకసారి ఈ విదేశీయుడు కొద్ది దూరంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసి అలసి పోయి వెనక్కి వచ్చేసరికి, తన గదిలో ఉండవలసిన విలువైన వస్తువులు లేవు! అయితే సత్రంలోకి ఆరోజున క్రొత్తవాళ్ళెవరూ రాలేదు. సత్రంలోని సామాన్లేవీ బయటికి వెళ్ళే అవకాశం లేదు. అంటే, విదేశీయుని వస్తువుల్ని దొంగిలించిన వాళ్ళు ఎవరో సత్రంలోపలి వ్యక్తులే అయిఉండాలి! సత్రపు యజమాని వెంటనే సత్రంలో తనకు అనుమానం ఉన్న ప్రదేశాల్లో అంతటా వెతికి చూశాడు- కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఈ దొంగ ఎవరో ఇంటి దొంగే- ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడట- కానీ తను మాత్రం దీన్ని ఎలాగైనా పరిష్కరించాలి- ఎలా?\"అ ని యజమాని చాలా ఆలోచించాడు.\n\nసత్రపు యజమాని భార్య చాలా తెలివైనది. ఆమె అతనికొక ఉపాయం చెప్పింది. దాని ప్రకారం బట్ట కప్పిన పళ్ళాన్నొకదాన్ని అతను అందరికీ‌ కనబడేటట్లు తీసుకొచ్చి ఒక చిన్న, చీకటి గదిలో‌పెట్టాడు. ఆపైన సత్రంలో‌ఉన్న వాళ్ళనందరినీ పిలిచి, అతను విదేశీయుడిని పరిచయం చేసి, అతని వస్తువులు పోవటం గురించి చెప్పాడు: \"మిత్రులారా, ఈ‌ దొంగ పని చేసిన వారెవరో‌మన మధ్యే ఉన్నారు. వాళ్ళు స్వయంగా బయటపడి తమ తప్పును ఒప్పుకుంటే క్షమించేందుకు నేను, ఈ విదేశీయుడు సిద్ధం. అయినా అలా ఎవ్వరూ బయటపడరనిపిస్తున్నది. దీనికొక పరిష్కారం ఉన్నది: చూడండి, చాలా రోజుల క్రితం ఒక సన్యాసి మన సత్రానికి వచ్చి, తిరిగి వెళ్తూ నాకొక కోడిబొమ్మను బహూకరించాడు. అది ఒక మహిమ గల కోడి. దొంగపని చేసిన వాళ్ళను గుర్తుపట్టే అద్భుత శక్తి ఉన్నది దానికి.\"\n\n\"దానిని నేను ఈ చీకటి గది మధ్యలో‌ బల్ల మీద పెట్టి ఉంచాను. మీరు ఒక్కరొక్కరుగా ఇటువైపునుండి గదిలోపలికి వెళ్ళి, లోపల ఆ కోడిని రెండు చేతులతోటీ శ్రద్ధగా తడిమి, అటువైపునుండి బయటికి రావాలి. మహిమగల కోడిని దొంగ ముట్టుకున్న మరుక్షణం అది 'కొక్కొరొకో' అని కూత వేస్తుంది. ఇక ప్రారంభిద్దాం. ముందుగా నేనే వెళ్తాను. మీరు ఒక్కరొక్కరుగా నన్ను అనుసరించి రండి\" అని గదిలోకి వెళ్ళి అవతలి వైపునుండి బయట పడ్డాడు. ఒక్కరొక్కరుగా సత్రంలోనివారందరూ గదిలోకి వెళ్ళి, గది మధ్యలో బల్లమీద పెట్టి ఉన్న కోడి బొమ్మను తడిమి, బయటికి రాసాగారు. కోడి చప్పుడు చేయటంలేదు. అలా బయటికి వచ్చిన ప్రతివారినీ‌ సత్రపు యజమాని చేతులు పట్టుకొని అభినందిస్తున్నాడు. ఇక మిగిలిన కొద్ది మందిలోనూ దాగున్న దొంగకు చెమటలు పట్టటం మొదలైంది. \"తను ముట్టగానే కోడి అరుస్తుంది- ఎలా? దొరకకుండా తప్పించుకోవటం ఎలా?\" అని వాడు ఒకటే ఆలోచించాడు. అంతలోనే వాడి వంతూ వచ్చింది!\n\nగదిలోపలికి వెళ్ళిన దొంగవాడు కోడిని కాదుగదా, దానిని ఉంచిన బల్లను కూడా ముట్టలేదు. \"ముడితేనే కద, కోడి అరిచేది? ముట్టకపోతే అది అరవదు, తను పట్టుపడడు!\" అని ఆలోచించి, వాడు కోడిని ముట్టనేలేదు. అలా కోడి అరవకుండానే వాడు కూడా రాజాలాగా బయట పడ్డాడు. గది బయటనే ఉన్న యజమాని సంతోషంగా వాడి దగ్గరికి వచ్చి రెండు చేతులూ పట్టుకొని అభినందించబోతూనే, ఆగి- \"దొంగ దొరికాడు! ఇదిగో దొంగ!\" అని అరిచాడు. బిత్తరపోయిన దొంగవాడికి, తనెలా పట్టుబడిందీ అర్థమే కాలేదు. తను కోడిని ముట్టుకోనేలేదు; అది అరవనే లేదు- అయినా తన దొంగతనం యజమానికి ఎలా తెలిసింది? అందరూ బెదిరించే సరికి, వాడు తన తప్పును ఒప్పుకొని, విదేశీయుడి సామాన్లన్నిటినీ తిరిగి ఇచ్చేశాడు.\n\nఇంతకీ ఇంటి దొంగను సత్రపు యజమాని ఎలా గుర్తించాడు? కోడిబొమ్మలో నిజంగా ఏం మహిమ ఉన్నది? (జవాబు: కోడిబొమ్మను దూదిలాంటి మెత్తటి పదార్థంతో చేశారు. గదిలో పెట్టేముందుగా , పెన్నుల్లో‌వేసుకునే ఇంకుతో దాన్ని బాగా తడిపారు. చీకటి గదిలో దాన్ని తడిమిన వారందరి చేతులకూ ఆ ఇంకు అంటి ఉన్నది. సత్రపు యజమాని వారిని అభినందిస్తున్నట్లు నటిస్తూ, నిజానికి వాళ్ల చేతుల్ని గమనిస్తూ వచ్చాడు. అయితే కోడిని ముట్టుకోని దొంగ చేతులు శుభ్రంగా ఉన్నై- అలా దొంగ దొరికిపోయాడు!) .",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 663,
        "IMAGE": "cat_7",
        "NAME": "కోడికూత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 90,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక ఊళ్ళో సుబ్బమ్మ అనే ఒక గయ్యాళి అత్త ఉండేది. ప్రతి క్షణమూ ఆమె, ఆమె కొడుకు సూరి కలిసి కోడల్ని రాచి రంపాన పెడుతుండేవాళ్లు. ఆ కోడలు సీత, పాపం- ఇంటి పనంతా చేసేది; పశువుల పాకను శుభ్రం చేసేది; బావి నుండి నీళ్ళు మోసుకొచ్చేది; బట్టలు ఉతికేది. ఆ సరికి సాయంత్రం అయ్యేది. ఆలోగా సుబ్బమ్మ, సూరి ఇద్దరూ సొంతంగా వండుకొని తిని, అతుకూ బొతుకూ ఆమెకు పెట్టే వాళ్ళు. సీత తిరిగి పల్లెత్తు మాట మాట్లాడిందంటే చాలు, చీపురు దెబ్బల వర్షం కురిసేది- ఆమె మీద.\n\nఅలాంటప్పుడు సీత ఏడిస్తే సుబ్బమ్మ అమెమీద మరింతగా విరుచుకు పడేది- \"నీ ఏడుపుతో మా ఇంటికి దరిద్రం తెద్దామను-కుంటున్నావా?\" అని. ఆ సమయంలో సూరి గుడ్లు మిటకరించుకొని చూస్తూ ఉండేవాడు తప్పితే, తల్లిని ఏమాత్రం కాదనేవాడు కాదు.\n\nప్రతి సంవత్సరమూ వాళ్ల ఇంటి పెరడులో ఒక పొట్లకాయ చెట్టు పెరిగేది. పొడవాటి పొట్ల కాయలు అందంగా వ్రేలాడుతూ ఉండేవి, దానినుండి. ఆ పొట్ల కాయల్ని చూస్తే అందరికీ నోట్లో నీళ్ళు ఊరేవి. ఆ సమయం వచ్చిందంటే చాలు- పెద్ద బాన నిండుగా మధురమైన 'పొట్లకాయ తలోదా' వండేది సుబ్బమ్మ. తనూ, తన కొడుకూ తినగల్గినంత తిన్నాక, మిగిలిన కొన్ని ముక్కల్ని మాత్రం కోడలికి ఇచ్చేది. ఆ ముక్కలు సీతకు ఒక్క పంటి కిందికి కూడా వచ్చేవి కావు.\n\n'తనకు ఇష్టమైన తలోదాను కడుపునిండా తినగలిగే రోజు ఎప్పటికి వస్తుందా,' అని సీత ఎదురు చూడని రోజే లేదు.\nఅలాంటి సమయంలో, ఓ సారి, బయట చెత్త పారేసేందుకు పోయిన కోడలు గాభరాగా పరుగెత్తుకొని లోపలికి కొచ్చింది- పెద్దగా అరుచుకుంటూ:\n\"ఏమొచ్చింది, అలా రాక్షసి మాదిరి అరుస్తున్నావు? నీకేమైనా పిచ్చిగానీ పట్టలేదు గద!\" అన్నది సుబ్బమ్మ చికాకుగా.\n\n\"ఇప్పుడే నాకు రోడ్లో పెద్ద మామయ్య ఎదురయ్యాడు - పెద్దత్తకు అరోగ్యం అస్సలు బాగా లేదట! నిన్ను తక్షణం చూడాలంటున్న-దట. నీకోసమే తన ప్రాణాలు నిల్చి ఉన్నాయని చెప్పమన్నదట\" అన్నది కోడలు కంగారుగా.\n\"అయ్యో! మా అక్క! చచ్చిపోతున్నదా! అక్కా, ఓయక్కా! ఇంత కష్టం ఎందుకు వచ్చింది, నీకు?\" అని గుండెలు బాదుకుంటూ లేచి బయలు దేరింది సుబ్బమ్మ.\n\nఅయితే ఆ సమయానికి తలోదా ఉంది, పొయ్యిమీద. \"ఇదిగో పొయ్యి మీద పొట్లకాయ తలోదా ఉంది - దాన్ని జాగ్రత్తగా కలిపి, సరైన సమయంలో క్రిందికి దించు. ఇంటిని బాగా చూసుకో. నేను మా అక్కను చూసేందుకు పోతున్నాను\" అని అరుచుకుంటూ, బిగ్గరగా ఏడుస్తూ ఇల్లు దాటిందామె. కోడలి ఉత్సాహం అవధులు దాటింది. ఇన్నాళ్ళకు చిక్కిన అవకాశాన్ని అమె జార విడుచుకో దలచలేదు. మరుక్షణమే ఆమె ఇంకొన్ని పొట్లకాయలు కోసింది- మరింత తలోదా చేసుకున్నది. దానితో బాటూ ఇంకా చాలా రకాల వంటలు చేసింది; భర్త సూరికి గొప్పగా విందు చేసింది. సూరికి ఇదేమీ అర్థం కాలేదు గానీ, ఏమీ అనలేక ఊరుకున్నాడు.\n\nఆతర్వాత, తలోదాని మొత్తాన్నీ‌ ఒక పెద్ద బానలోకి పోసుకొని, చెరువునుండి నీళ్ళు తెచ్చేందుకు పోతున్నట్లు ఆ బానను నడుం మీద పెట్టుకొని, ఊళ్ళోకి పోయింది సీత.\n\nఅలా పోయిన కోడలు పిల్ల, నేరుగా ఊరి చివరన ఉన్న కాళికాదేవి గుడికి పోయింది. గర్భ గుడిలోకి దూరి, తలుపు వేసేసుకున్నది. ఆపైన ఆమె ఒక్కతే కాళీమాత విగ్రహం ముందు బైఠాయించి కూర్చొని, బానెడు తలాదానూ ఏక బిగిన- లాగించి తినేసింది!\n\nఆ సమయంలో గర్భగుడిలో వేరే ఎవ్వరూ లేరు గాని , కాళీమాత అయితే ఉన్నది గదా! \"ఈ పిల్ల ఒక్కతే బానెడు తలాదాను ఎలా తిన్నది?\" అని ఆ కాళీమాతే నివ్వెరపోయింది. సీత తలాదాను తిన్న వేగాన్నీ, ఆమె మింగిన మొత్తాన్నీ చూసి, కాళికాదేవి ఏమైనా అందామనుకున్నది. అయినా ఏమీ అనలేక , కుడిచేత్తో గట్టిగా తన నోరు నొక్కుకున్నది కాళికమ్మ.అయినా కోడలు పిల్ల ఇవేమీ ఆలోచించే స్థితిలో లేదు. 'తనకు ఎంతో ఇష్టమైన తలాదా- తనను ఇన్నేళ్ళుగా ఊరించిన తలాదా- ఇప్పటికి గదా, తనకు అందింది?' అని, ఆమె మెక్కటంలోనే మునిగింది. చివరికి, బాన ఖాళీ అయ్యేసరికి , ఆమె గట్టిగా ఓసారి త్రేన్చి, ఖాళీ బానను శుభ్రం చేసేందుకని, చెరువు దగ్గరికి పోయింది.\nబానను కడుక్కొని, నీళ్లు నింపుకొని సీత వెనక్కి వచ్చేసరికి, ఇంటి వాకిలి మూసి ఉన్నది! -అత్త వెనక్కి వచ్చేసింది!\n\nతలుపు తీసీ తీయగానే సుబ్బమ్మ కోడల్ని నానా తిట్లూ తిడుతూ, గొడ్డు ను బాదినట్లు బాదింది. సూరి ఇంటికి వచ్చాక, తల్లి కోపం అతనికీ అంటింది- అతనూ సీతకు నాలుగు వడ్డించాడు. ఆలోగా పట్టణంఅంతా ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వ్యాపించింది: 'గుడిలో కాళీమాత- కుడిచేత్తో- తన నోటిని మూసుకున్నది!' అని. \"ఆ తల్లికి కోపం వచ్చింది- ఇక వానలు పడవు. గ్రామంలో ఇక పిల్లలన్న వాళ్ళే పుట్టరు\" అని వదంతులు వినిపించాయి. ఈ వింతను చూసేందుకు పొరుగు గ్రామాల నుండి కూడా భక్తులు, వేల సంఖ్యలో రాసాగారు. ఎవరికి వాళ్ళు ఈ సంఘటన ఫలితాల్ని ఊహించి చెప్పటం మొదలుపెట్టారు.\n\nఎవరిని చూసినా 'ఇది చాలా దుశ్శకునం' అనేవాళ్ళే. \"గ్రామానికి ఏదో తెలీని ఆపదరానున్నది\" అని అందరూ భయపడ్డారు. \"ఎవరో గుడిని అపవిత్రంచేసారు. అందుకనే, కాళీమాత తన చేత్తో తనే నోరు మూసుకున్నది\" అన్నారు అంతా. ఇక గ్రామమంతటా పూజలూ, పునస్కారాలూ, తంతులూ జరిగాయి. జాతరలు జరిపి, గొర్రెల్ని బలి ఇచ్చారు అమ్మవారికి. కానీ ఏం చేసినా కాళీమాత మాత్రం కరుణించలేదు. నోటి మీదినుండి చెయ్యి తీయలేదు.\n\nచివరికి ఊరి పెద్దలు ఊరంతటా చాటింపు వేయించారు- \"కాళీమాత తన చేతిని నోటి మీది నుండి తీసేసేట్లుగా చేసిన వాళ్ళకు గొప్ప బహుమతినిస్తాం' అని. అయినా కాళీమాత చేత ఆ పని చేయించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.\n\nమాట్లాడకుండా ఈ గందరగోళం మొత్తాన్నీ గమనిస్తూ కూర్చున్న సీతకు చికాకు వేసింది. చివరికి ఆమె అత్త దగ్గరికి వెళ్ళి, \"అత్తా! 'కాళీమాత చేతిని నోటిమీద నుంచి తీసేసేట్లు మనం చెయ్యగలం' అని చెప్పు, వాళ్ళకు. నాకు తెలుసు, అదెలాగో!\" అన్నది.\n\nమొదట్లో కోడలుమాటల్ని నమ్మలేదు సుబ్బమ్మ. \"చూడు, ఈ వెర్రి దాన్ని! ఊళ్ళో నా పరువు తీయాలని దాని ఆలోచన కాబోలు! ఏదో తనకే మంత్రాలు వచ్చినట్లు, గొప్పగా వ్యవహరిద్దామని చూస్తూన్నట్లుంది! ఎవ్వరూ చేయలేని పనిని, ఇది ఎట్లా చేయగలదు?\" అన్నది. కానీ కోడలు మళ్ళీ-మళ్ళీ అనేసరికి, ఆమె కొంచెం అనుమానంగానే, ఒప్పుకున్నది.\n\nమరుసటి రోజున కోడలు పిల్ల తన చింత ఈనెల చీపురుకట్టను, నిండుగా ఉన్న చెత్త బుట్టను తీసుకొని, గుడికి వెళ్ళింది. అందరినీ బయటికి పంపించి,తను గర్భగుడి లోపల గొళ్ళెం పెట్టుకున్నది. ఆపైన ఆమె తన చెత్త బుట్టను విగ్రహం ముందు పెట్టి, చీపురుకట్టను కోపంగా ఊపుతూ కాళికాదేవిని బెదిరించింది- \"ఏమ్మా నీకంత అసూయ? నా పొట్లకాయ తలాదాను నేను తింటే, నీకేంటి? నీ కళ్ళలో నిప్పులెందుకు పోసుకుంటావు? నీకే గనక అంత ఆశ పుట్టి ఉంటే, నన్ను అడగాల్సింది, నేను నీకూ కొంచెం పెట్టేదాన్ని కద! అంత గొప్ప తల్లివి, నీకింత కళ్ళు మంట ఎందుకు? మర్యాదగా ఇప్పటికైనా నోటి మీది నుండి ఆ చెయ్యి తీస్తావా, లేకపోతే ఈ బడితతో పూజ చెయ్యమంటావా? చెప్పు!\" అని అరిచింది.\n\nఅయినా విగ్రహం ఉలకలేదు, పలకలేదు. కోపం ఆపుకోలేక, సీత విగ్రహానికి దగ్గరగా వెళ్ళి, తన చీపురుకట్టతో నాలుగు అంటించింది. మరుక్షణంలో కాళీమాత 'కుయ్యో-మొర్రో-అయ్యో' అని, నోటి మీది నుండి చెయ్యిని తీసేసింది. ఇప్పుడు విగ్రహం యధావిధిగా, పవిత్రంగా కనబడుతున్నది మళ్ళీ. కోడలు ఆమెను కొట్టటం ఆపి,\"అద్దీ, అలా ఉండాలి!\" అని గొణుక్కొని, తన చెత్తబుట్టను చేత బట్టుకొని, చక్కా పోయింది.\n\nక్షణాల్లో ఊరంతటికీ కోడలు పిల్ల సీత గురించీ, ఆమె సరిదిద్దిన కాళీమాత చెయ్యి సంగతీ తెలిసిపోయింది. అందరూ గుడికివెళ్ళి చూశారు- కాళీమాత మునుపటి మాదిరే నాలుగు చేతులతో ఇంపుగా ఉండటం చూసి, అందరూ తల్లికి మ్రొక్కి, బయటకి పరుగెత్తారు. ఆపైన అందరూ సీతను దర్శించుకొని, ఆమెకూ మ్రొక్కుకున్నారు. ఊళ్ళో జనాలంతా ఆమెను 'పతివ్రతా శిరోమణి' అని పొగిడి, 'ఆమెను చూస్తే చాలు-తమ పాపాలన్నీ పటాపంచలు అవుతున్నాయ అన్నట్లు మాట్లాడారు. ఆమెకు అనేక బహుమానాలు, చాలా డబ్బు, ఇచ్చి సత్కరించారు కూడాను.\n\nఅయితే అత్త సుబ్బమ్మకు మాత్రం, ఈ సంఘటన తర్వాత ఏదో తెలీని భయం పట్టుకున్నది. 'తన కోడలికి మాయ మంత్రాలేవోవచ్చు' అని ఆమెకు భయంవేసింది. 'తన అత్త తనను ఎంతగా పీడించిందో సీత ఏదో ఒకనాడు గుర్తు తెచ్చు కోకుండా ఉండదు! అప్పుడు ఆమె తననూ, తన కొడుకు సూరిని కూడా- వదిలిపెట్టదు' అని సుబ్బమ్మ వణికిపోయింది.\n\"ఆలోగానే మనం ఏదైనా చెయ్యాలి!\" అనుకున్నదామె.\n\nఅదే సంగతి సూరిని అడిగితే, ఆ పిరికివాడు \"నాకేమీ తెలీదు-నువ్వేచెప్పు\"అనేశాడు. \"అది ఇప్పుడు పడుకొని ఉన్నది. మనం దాని నోట్లో గుడ్డలు కుక్కి, చాపలో మడిచి కట్టి, దాన్ని పొలంలో గుంత దగ్గరికి ఎత్తుకు పోయి, కాల్చేద్దాం. ఆ తర్వాత నేను నీకు ఒక మంచి, కొత్త భార్యను తెచ్చి పెడతాను\"అన్నది సుబ్బమ్మ గయ్యాళిగా.\n\"సరే! సరే! ఆపనేదో వెంటనే చేసేద్దాం\" అన్నాడు- సొంత ఆలోచన లేని కొడుకు.\n\nవెంటనే ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సీత నోట్లో గుడ్డలు కుక్కి, ఆమెను చాపతో సహా చుట్ట చుట్టి, ఎత్తుకు పోయారు. వాళ్ళ పన్నాగం అర్థమై కూడా సీత కదలక, మెదలక పడుకున్నది. పొలం చేరుకోగానే చాపచుట్టను గుంతలో పెట్టి, సుబ్బమ్మ, సూరి ఇద్దరూ కట్టెలు తెచ్చేందుకని పోయారు. కోడలు అప్పటికి ధైర్యం తెచ్చుకొని, కొంచెం బిగుసుకు పోయినట్లు చేసి, అలా చాపను వదులు చేసుకొని, బయటపడింది.\n\nఆపైన నోట్లో కుక్కిన గుడ్డల్ని తీసేసుకొని, ఆమె అక్కడ ఉన్న కట్టె మొద్దును ఒకదాన్ని చాపలో దూర్చి పెట్టింది. తను దూరంగా నడుచుకొని పోయి, ఓ మర్రి చెట్టు కనబడితే, దాని పైకి ఎక్కి కూర్చున్నది.\n\nఅంతలో వెనక్కి వచ్చిన తల్లీ కొడుకులిద్దరూ చెత్తా, చెదారం, కట్టె పుల్లలూ అన్నీ చాప చుట్టూ పేర్చి కాల్చేశారు. కట్టెలకణుపులు వేడికి పగిలి, 'టప టప' అన్నప్పుడల్లా వాళ్ళు \"అదిగో, ఎముకలు- ఎముకలుచిట్లి పోతున్నై!\" అనుకున్నారు. మధ్యలో ఓసారి, ఒక పెద్ద కట్టె కాలి, 'ఫట్'మని పగలగానే, \"హమ్మయ్య! ఇప్పుడు దాని కపాలం కూడా పగిలింది\" అని సంబరపడి, వాళ్లిద్దరూ ఆ అర్ధరాత్రి వేళ- పడుతూ లేస్తూ- ఇంటికి పోయారు.\n\nఇక సీత మాత్రం చేసేదేమీలేక, ఆ రాత్రికి అక్కడే, చెట్టు కొమ్మల మాటున- ముడుచు-కొని కూర్చున్నది. అదే రోజు రాత్రి నలుగురు దొంగలు, తాము దోచుకున్న డబ్బుల్ని, ఆభరణాల్ని పంచుకునేందుకని వచ్చి, ఆ చెట్టు క్రిందే కూర్చున్నారు. వాళ్లు అక్కడ కూర్చోగానే, అల్లంత దూరాన మండుతున్న కట్టెలు కనబడ్డాయి. 'ఆ మంట దగ్గర ఎవరైనా ఉన్నారేమో' అని వాళ్లకు అనుమానం వేసింది.\n\nసందేహ నివృత్తి కోసం, వాళ్లలో ఒకడు చెట్టు పైకి ఎక్కి, సరిగ్గా కోడలు కూర్చున్న కొమ్మమీదికే వచ్చాడు. అక్కడ ఈ స్త్రీ ఆకారాన్ని చూసి వాడు ఒక్క క్షణం బిత్తరపోయి, \"ఎవరది?\" అన్నాడు మెల్లగా.\n\nకోడలుపిల్ల వెంటనే \"ష్..గట్టిగా మాట్లాడకు. నేనొక దేవకన్యను. నాకు కాబోయే భర్తను వెతుక్కుంటూ ఇప్పుడే ఇక్కడికి వచ్చి వాలాను. నిన్ను చూస్తే చాలా మంచి వాడివి లాగున్నావు. నువ్వు సరేనంటే, నిన్ను పెళ్లిచేసుకొని, నువ్వు కలలో కూడా చూడని సంపదల్ని నీ వశం చేయగలను. మెల్లగా మాట్లాడు!\" అన్నది వాడితో.\n\nతాగిన మత్తులో ఉన్న ఆ దొంగకి, తనెక్కడ ఉన్నదీ అర్థం కాలేదు. 'తను స్వర్గం చేరుకొని, ఐరావతం మీద ఎక్కి కూర్చొని, ఊరేగు-తున్నట్లు' అనిపించింది వాడికి. \"నువ్వు నిజమా, లేక నా భ్రాంతా?\" అన్నాడు వాడు.\n\n\"పదహారణాల నిజం. కావాలంటే- ఇదిగో, ఈ వక్కాకు తిను!\"అని, సీత తన రొంటికున్న సంచీలోంచి రెండు తాంబూలాలు తీసి, తనొకటి నోట్లో వేసుకుని, వాడికొకటి ఇచ్చింది. ఆపైన ఆమె వాడికి తన నాలుకను చూపించి, వాడి నాలుకను చూపించమన్నది. మైకంలో ఉన్నట్లు, వాడు తన నాలుకను చాచగానే సీత మొండిగా ముందుకు వంగి, వాడి నాలుకను అందినంతమేరకు కొరికివేసింది!\n\nవాడు \"బబ్బబ్బబ్బ!\" అని అరుస్తూ, గయ్యని కేకలు పెడుతూ, బాధను భరించలేకపట్టు తప్పి, క్రింద కూర్చున్న తనవాళ్ల మీదనే పడ్డాడు. ఏదో లోకంలో‌ ఉన్న ఆ దొంగలుకూడా కంగారు పడి, తలొక దిక్కుకూ పరుగెత్తారు. నాలుక తెగిన వాడు \"బబ్బబ్బబ్బ\" అని అరుస్తూ వాళ్ల వెంట పరిగెత్తితే, మిగిలిన వాళ్ళకు మరింత హడలైంది. వాళ్ళు బాణాలు దూసుకు పోయినట్లు, దిక్కులు చూసుకోకుండా పరుగెత్తారు. వాడు కూడా అరుస్తూ వాళ్ల వెంబడి పరుగు తీశాడు. తెల్లవారుతుండగా కోడలు పిల్ల చెట్టు దిగి చూస్తే, ఏముంది? చెట్టు క్రింద- పెద్ద గోతం నిండుగా- డబ్బు! బంగారం! వెండి! ఆభరణాలు! ఆమె వెంటనే వాటినన్నింటినీ మూట గట్టుకొని, నేరుగా ఇంటికి పోయి, తలుపు తట్టింది- \"అత్తా! ఓ అత్తా! తలుపుతియ్యి!\" అంటూ.\n\nఅత్త సుబ్బమ్మకు గుండె ఆగినంత పనైంది. నోరు పిడచగట్టుకుపోయింది. ముఖం పాలిపోయింది. అయినా ధైర్యం చేసి తలుపు తీసి చూసేసరికి, తను స్వయంగా కాల్చేసిన కోడలు- ఇకిలిస్తూ నిలబడి ఉన్నది- కళ్లకెదురుగా.\n\nమరుక్షణం అత్త భయంతో మూర్చపోయింది. కోడలే ఆమెను లోపలికి ఎత్తుకెళ్లి, ముఖం మీద నీళ్లు చిలకరించి, సేవలు చేసింది. సూరి నోరు తెరుచుకొని అక్కడే నిలబడి పోయాడు శిలావిగ్రహంలాగా. కళ్లు తెరవగానే అత్త- \"నువ్వు- నువ్వు- ఎలా- ఇంకా బ్రతికే ఉన్నావా...? లేకపోతే..?\" అని గొణిగింది. \"మీరు నన్ను కాల్చేయగానే, యమ-దూతలు వచ్చి నన్ను యముడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా మండుతున్నాయి- అచ్చం మన కాళీమాత కళ్లలాగానే.\n\nనన్ను చూసీ చూడగానే ఆయన గర్జించాడు \"ఈమెను వెనక్కి పంపండి. ఈమె అత్తే, అసలైన పాపి! ఆమెను లాక్కురండి ఇక్కడికి. ఇనప కాకికి ఆ దొంగ అత్త పని అప్పగించండి. అది ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. ఆ తర్వాత ఆ పాపిని కాగే నూనెలో వేయించండి\" అని, పిడుగులు పడ్డట్టు, ఏమేమో అరిచాడు నీ గురించి. నేను అప్పుడు ఆయన పాదాలపై పడి, \"మా అత్తను అలా చేయకండి, దయచేసి ఆమెను క్షమించండి. నిజానికి ఆమె ఏమంత చెడ్డది కాదు. మీరు ఏ శిక్ష విధించాలన్నా, నాకు విధించండి- మా అత్తను మాత్రం ఏమీ చేయకండి\" అని ప్రార్థించాను.\n\nనా మాటలు విని ఆయన కొంచెం శాంతించాడు- ఒక చిరునవ్వు నవ్వాడు కూడా- \"నువ్వు ఇక వెనక్కి తిరిగి వెళ్లు. నువ్వు చెప్పినట్లే చేస్తాములే. కానీ ఒకవేళ మీ అత్త ఇకమీదట నిన్ను ఏమైనా అన్నదనుకో, ఆమెను నేనే స్వయంగా నరకానికి లాక్కు వెళ్తాను. మా భటులు ఎల్లవేళలా ఆమెను గమనిస్తుంటారు\" అన్నాడాయన. ఆ తర్వాత ఆయనే నాకు ఈ నగలు, బంగారం, డబ్బులు అన్నీ ఇచ్చి, సాగనంపారు. జనాలు యముడి గురించి చెడుగా ఏవేవో చెబుతుంటారు గానీ, ఆయన నా పట్ల ఎంత దయతో వ్యవహరించారో చెప్పలేను\" అన్నది సీత అమాయకంగా.\n\nఅత్త వణికే గుండెతో, భయం భయంగానే ఆమెను కౌగిలించుకున్నది- \"అయ్యో! నువ్వు నిజంగానే మా ఇంటి దేవతవు. యమదూతల బారినుండి నన్ను కాపాడింది నువ్వే. ఇప్పటినుండీ ఈ ఇంట్లో నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం. నా పాపాలేవీ మనసులో పెట్టుకోకు. క్షమించేసెయ్ నన్ను. క్షమిస్తావు గదూ, నా బంగారు తల్లీ?\" అని ప్రాధేయపడింది కోడల్ని.\nఇప్పుడు కోడలు పిల్లే ఆ ఇంటికి పెద్ద. సుబ్బమ్మా, సూరీ ఆమె ఏం చెబితే అది చేస్తున్నారు. అందరూ సుఖంగా ఉన్నారు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 664,
        "IMAGE": "cat_7",
        "NAME": "గయ్యాళి అత్త",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 91,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సుబ్రమణ్యం వాళ్ళ ఇంట్లో గ్యాసు అయిపోయింది. ఇంకా పదిహేను రోజుల వరకూ రాదు. వంటకు కష్టంగా ఉంది. సుబ్రమణ్యం భార్య కమలమ్మ పల్లె మనిషి. కట్టెలపొయ్యిమీద వంట చేయటం వచ్చు ఆమెకు. అయితే ఇంట్లో కట్టెలు లేవు. అందుకని ఆమె బాగా పోరి, సుబ్రమణ్యం చేతిలో పాత గొడ్డలినికదాన్ని పెట్టి, అడవికి పంపింది- ఒక మోపెడు కట్టెలు కొట్టుకు రమ్మని.\n\nసుబ్రమణ్యం పట్టణం మనిషి- 'పసుపు కొమ్ములెందుకు, ఒక ప్యాకెట్టు పసుపుపొడి కొనుక్కుంటే పోలేదూ?' అనుకునే రకం. అతను కట్టెలు కొడుతున్నవాళ్ళను చాలామందిని చూసి ఉన్నాడు- కానీ ఎన్నడూ స్వయంగా కట్టెలు కొట్టినవాడు కాదు. అయినా 'ఇదేమంత బ్రహ్మ విద్య?' అనుకున్నాడు. 'అంతమంది అలవోకగా కట్టెలు మోపులు మోపులు కొట్టుకొని తెచ్చుకుంటుంటే, నేను మాత్రం ఎందుకు తేలేను?' అనుకున్నాడు. \"మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను చూస్తుండు\" అని బీరాలు పలికి, అడవికి బయలుదేరాడు.\n\nఅడవిలో‌చక్కని ఎండుచెట్టును ఒకదాన్ని చూసుకొని, చొక్కావిప్పి, దాన్నీ, తను తెచ్చుకున్న అన్నాన్నీ ఓ చెట్టుకొమ్మకు తగిలించి, వాటంగా పెట్టి చెట్టును కొట్టటం మొదలుపెట్టాడు. కొట్టగా -కొట్టగా, చెట్టుకు గాట్లు అయితే చాలా పడ్డాయి గాని, అది ఇప్పట్లో తెగుతుందని మాత్రం‌అనిపించలేదు.\n\n\"కట్టెలు కొట్టటంలో ఏదో కిటుకు ఉంటుంది. కొంచెం సేపు కొడితే నాకు పని అలవాటైపోతుంది\" అనుకున్నాడు సుబ్రమణ్యం.\n\nఅంతలో‌అటువైపుగా‌పోతున్న రంగయ్య , సుబ్రమణ్యం పాట్లు చూసి దగ్గరకు వచ్చాడు. అతను రాగానే పనిని ఆపాడు సుబ్రమణ్యం- 'తనకు పని రాదని ఎవ్వరికీ తెలియకూడదు, మరి! \"పని ఎప్పటికవుతుంది,ఇలాగ? గొడ్డలి..\" అని ఇంకా ఏదో చెప్పబోయాడు రంగయ్య. \"పోయి నీ పని చూసుకో\" అని అతన్ని వెంటనే పంపించేశాడు తప్పితే, అతను ఏమంటున్నదీ విననేలేదు సుబ్రమణ్యం.\n\nరంగయ్య వెళ్ళిపోయాక, సుబ్రమణ్యం‌మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాడు, చెట్టుతో. రకరకాలుగా గొడ్డలిని తిప్పుతూ చెట్టును కొట్టాడు. చెమటలు క్రక్కాడు.\n\nమధ్యాహ్నం పనిని ఆపి అన్నం తిన్నాడు. ఆపైన మళ్ళీ‌కట్టెలు కొట్టాడు. బాగా అలిసిపోయాడు- కానీ ఒక పదికట్టెలు మాత్రం తయారైనై, అప్పటికి.\n\nవేరే ఊరికి పోయిన రంగయ్య, సాయంత్రం వెనక్కి వస్తూ రంగయ్యను పలకరించాడు మళ్ళీ. \"ఉదయం నుండి సాయంకాలం వరకూ కొట్టింది ఈ కాసిని కట్టెలేనా?\" అన్నాడు.\n\n\"మరి? ఎంత గట్టి కట్టె అనుకున్నావు?\" అన్నాడు సుబ్రమణ్యం \"నేను ఈ గొడ్డలితో‌ వెయ్యి వేట్లు వేసినా కట్టె విరగలేదు- అంత గట్టి కట్టె!\" అన్నాడు.\n\n\"నీ గొడ్డలి బాగా మొద్దు బారి పోయింది. దాంతో కట్టెలు కొట్టేందుకు అవుతుందా? కొంచెం పదును పెట్టుకొని ఉంటేనేమి?\" అడిగాడు రంగయ్య.\n\n\"నువ్వే చూశావు గదా? ప్రొద్దుటి నుండీ నేను ఒక్క క్షణంకూడా వృధా చెయ్యకుండా కట్టెలు కొడుతూనే ఉన్నాను. గొడ్డలికి పదును పెట్టుకునేంత తీరిక ఎక్కడిది?\" అన్నాడు సుబ్రమణ్యం, ఆ పది కట్టెల్నే మోపు కట్టుకుంటూ.\n\nగొడ్డలికి పదును పెట్టుకునేందుకు ఒక ఐదు నిముషాలు వెచ్చించి ఉంటే, బహుశ: సుబ్రమణ్యం‌పని వందరెట్లు తేలికయ్యేది. వందింతలు ఎక్కువ పని జరిగేది.\n\nమనం చదువుకునేందుకు అవసరమైన ప్రధాన పనిముట్లు- పుస్తకాలూ, పెన్నులూ, పెన్సిళ్లూ. ఉన్న డబ్బులన్నింటినీ పై పై మెరుగులపైన వెచ్చించి, \"పుస్తకాలు ఇప్పుడు వద్దులే, డబ్బులు లేవు. సంవత్సరం చివర్లో ఏవైనా గైడ్లు, ప్రశ్నలు-జవాబులు చదువుకుంటే చాలులే\" అనుకోకూడదు. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేస్తేనే అందం. పనిముట్లకు ముందుగానే పదును పెట్టుకోవాలి- ఏమంటారు? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 665,
        "IMAGE": "cat_7",
        "NAME": "పనిముట్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 92,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా \"కొత్త విషయాలు చెప్పండి- కొత్త విషయాలు చెప్పండి\" అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్ళకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు- \"మీరు కనుగొన్న క్రొత్త క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి\" అన్నాడు.\n\nఅందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి, వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి- కానీ వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు.\n\nశాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక, రాజుగారు ఆలోచనలో పడ్డారు: \"ఇవన్నీ కొత్త సంగతులు- సరే- కానీ, మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు?\" అని.\n\nఅప్పుడు మంత్రి \"ప్రభూ! నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమౌతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను\" అన్నాడు రాజుతో.\nరాజుగారు సంతోషంగా 'సరే'అనగానే, మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు.\n\nశాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి ఆరు కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి, శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేసాడు. ఈగ కొంచెం సేపు బాధపడి, ఆపైన మళ్ళీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది.\n\nరాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త -\"ప్రభూ! ఈ ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈ ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమ శక్తి, భూమి, గిట్టుబాటు ధర- ఈ ఆరూ రైతుకు ఆరు కాళ్ల లాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడి-పోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటంకోసం ఇలా చేయవలసి వచ్చింది- క్షమించాలి\" అన్నాడు.\n\nతన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 666,
        "IMAGE": "cat_7",
        "NAME": "ఆరు కాళ్ల కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 93,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి, వాటిని చక్కగా పెంచి, పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి.\n\nఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి \"చూడండి, నా మిత్రులారా! ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనందరం కట్టెపుల్లలు ఏరుకొద్దాం. వాటిని అమ్మితే మనందరికీ సరిపోయేన్ని డబ్బులు వస్తాయిలే!\" అన్నది.\n\nఆరోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి. దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి అమ్మారు అందరూ. ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసిన సరుకులు కొనుక్కున్నారు.\nమరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని, కుందేలు, పంది, కోడి సొంతగా అడవికి బయలుదేరాయి. అడవిలో‌ తిరుగుతూ తిరుగుతూ అవి దారి తప్పాయి. చివరికి రాత్రి చీకటిపడే సమయానికి వాటికి ఒక గుడిసె కనబడింది.\n\nఅవి మూడూ ఆ గుడిసె తలుపుతడితే, ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోనికి ఆహ్వానించింది. \"ఓహో! మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ, ముసలమ్మతోబాటూ? రండి రండి. ఈ పూటకి ఇక్కడే ఉండచ్చు. నేను మీకు భోజనం పెడతానులే, రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని\" అని ఆమె వాటికి భోజనం పెట్టి, పడుకునేందుకు చోటు చూపించింది.\n\nఅయితే వాటికి రాత్రి ఎంత సేపటికీ నిద్ర రాలేదు. ఏదో తెలీని భయం ఆవరించి ఉన్నది వాళ్లని. చివరికి కుందేలు అన్నది- \"ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తున్నది నాకు. మనం ఇక్కడంతా కొంచెం వెతికి చూద్దామా, ఏమైనా తెలుస్తుందేమో?\" అని.\n\nఅప్పుడు అవన్నీ అక్కడంతా వెతికాయి, నిశ్శబ్దంగా. ముసలమ్మ పడుకొని ఉంది. ఆమె పక్కనే టేబుల్ మీద ఓ డైరీ ఉంది- ఇవి మెల్లగా వెళ్ళి, ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి:\n\n\"నేను మామూలు ముసలమ్మను కాదు- మంత్రగత్తెను\" అని రాసుకున్నదామె ఒకచోట.\n\"నా దగ్గరున్న డబ్బు, బంగారము, నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు క్రింద పాతి పెట్టాను\" అని రాసుకున్నది ఒకచోట.\n\"ఈ కుందేలును, పందిని, కోడిని నేను బలి ఇచ్చేస్తాను\" అని రాసుకున్నది ఇంకోచోట.\n\nఅది చదివాక కోడి చాలా భయపడి పారిపోదామన్నది. అయితే పందికి ధైర్యం ఎక్కువ. అదన్నది- \"మనం వెళ్ళేముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకు పోదాం\" అని. కుందేలు ఇంకా తెలివైనది. \"అది అన్నది, మనం ఈ మంత్రగత్తె దగ్గరున్న మంత్రదండాన్ని, చీపురు కట్టనీ, కత్తినీ అన్నిటినీ దాచిపెట్టేద్దాం. పారిపోవద్దు, తెల్లారాక ఆమెనుండి మర్యాదగా శలవు తీసుకొనే వెళ్దాం\" అని.\n\n\"సరే\" అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి, బంగారం, నగలు అన్నీ మూటగట్టుకొని, దూరంగా ఓ పొదలో దాచిపెట్టాయి. ఆ గుంతను బాగా మూసేసి, దూరంగా వేరే ఓ గుంత తవ్వాయి. మంత్రదండాన్నీ, చీపురునూ, కత్తినీ తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి. ఆపైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రుపెట్టాయి.\n\nమంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీకూడా లేచి కూర్చుని ఆమెకు నమస్కారం పెట్టి, \"అవ్వా వెళ్ళొస్తాం\" అన్నాయి. మంత్రగత్తె \"అయ్యో! ఇప్పుడే వెళ్తారా, కొంచెం ఆగండి, మళ్లీ భోంచేసి వెళ్దురుగాని\" అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటే అది దొరకలేదు. కత్తి కోసం వెతికితే అదీ దొరకలేదు!\n\nఆ లోపల ఇవన్నీ తొందర నటిస్తూ, \"మాకేమీ ఒద్దులే అవ్వా, మా ముసలవ్వ కూడా ఎదురుచూస్తూంటుంది. వెళ్ళొస్తాం, నువ్వు మాకు ఎంత సాయంచేశావో, చాలా చాలా ధన్యవాదాలు\" అని చెబుతూ హడావిడిగా బయటికి పరుగు తీశాయి.\n\nవాటి వెంటపడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది- కానీ అదీ దొరకలేదు ఆమెకు, పాపం!\n\nముగ్గురు మిత్రులూ తాము బంగారం, నగలు దాచిన మూటను ఎత్తుకొని, నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి. దాన్నంతా అవ్వకు చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆపైన అందరూ కలిసి హాయిగా జీవించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 667,
        "IMAGE": "cat_7",
        "NAME": "మోసపోయిన మంత్రగత్తె!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 94,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రాజమాత మరణశయ్య మీద పడుకొని ఉన్నది. పాపం ఆవిడకు మామిడిపండు తినాలని ఉన్నది. తన కొడుకు కృష్ణరాయలను ఆవిడ నోరు విప్పి అడిగింది కూడాను- మామిడి పండ్లు తెచ్చిపెట్టమని.\n\nకానీ అది మామిడిపళ్లుకాసే కాలంకాదు!రాజుగారు భటుల్ని దూరప్రాంతాలకు కూడా పంపించి చూశారు- నెల-పదిహేను రోజులు వెతకగా, చివరికి ఒక్కపండు దొరికింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది-రాజమాత తన చివరి కోరిక తీరకుండానే పరమపదించింది. కోరక కోరక తన తల్లి ఓ చిన్న కోరిక కోరితే, రాజాధిరాజైన తాను ఆ కోరికను తీర్చకుండానే ఆమెను సాగ-నంపాల్సి వచ్చిందే\" అని రాయలవారు క్రుంగిపోయారు. కోరికలు తీరకపోతే ఆత్మకు శాంతి ఉండదని అంతకు ముందే విని ఉన్నాడాయన. మరేంచేయాలి? తల్లి ఆత్మశాంతి కోసం తాను ఏంచేయాలో చెప్పమని రాయలవారు రాజ్యంలోని పండితబృందాన్ని కోరారు.\n\nపండితులు ఆ సరికే లెక్క లు కట్టుకొని సిధ్దంగా ఉన్నారు: ఈ రకంగానైనా తమకు, తమ బంధు వర్గానికీ కొంత లాభం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.\n\nవాళ్లన్నారు-”మహారాజా!తమ తల్లిగారి చివరికోరిక తీరలేదు, కనుక నిజంగానే ఆవిడ ఆత్మకు శాంతి ఉండదు. కానీ మీరు గనక నూరుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు మామిడి పండును దానం చేసినట్లయితే, మీ తల్లి గారి ఆత్మకు శాంతి లభించే అవకాశం ఉన్నది\" అని.\n\nరాజుగారు తలచుకొంటే సాధ్యం కానిది ఏమున్నది? ఆయన రాజ్యంలోని కంసాలులను రావించి, వాళ్లచేత ప్రత్యేకంగా పెద్ద మామిడి పండంత సైజులో బంగారు పండ్లను చేయించారు. తల్లి ఆత్మ శాంతికోసం ఫలానా రోజున నూరుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆపైన వాటిని దానం చేయనున్నామని రాజ్యమంతటా చాటించారు. రామలింగడికి రాజుగారి ఈ చర్య సబబనిపించలేదు. నూరు బంగారు మామిడిపండ్లను ఎవరో కొందరు బ్రాహ్మణులకు దానం చేస్తే, తల్లిగారి ఆత్మకు శాంతి ఎందుకు లభిస్తుంది? ఈ వంకతో ప్రజాధనాన్ని సొంతం చేసుకోవాలనుకున్న బ్రాహ్మణుల్ని దండించకుండా వదలకూడదు అనుకొన్నాడు రామలింగడు.\n\nరాజుగారి భవనానికి వెళ్లే మార్గంలోనే రామలింగడి ఇల్లు ఉన్నది. దానం కోరి వెళ్లే బ్రాహ్మణులకు కనబడేటట్లు, రామలింగడు తన ఇంటిముందు బాగా మండుతున్న బొగ్గుల కుంపటి; దానిలో ఎర్రగా కాలిన ఇనప తీగలు- పట్టుకొని నిలబడ్డాడు. “నిన్న రాత్రి రాజుగారు చెప్పారు- నా చేత వాతలు పెట్టించుకొని వచ్చిన బ్రాహ్మణులకు, ఎన్ని వాతలుంటే అన్ని బంగారు పడ్లు అధికంగా ఇస్తామని!” అని రామలింగడు చెప్తుంటే, ఆశ కొద్దీ వాళ్ళు ఎగబడి వాతలు పెట్టించుకున్నారు. కొందరైతే ఏకంగా మూడు- నాలుగు వాతలు!అయితే రాజ భవనంలో వాళ్లకు నిరాశ ఎదురు అయింది. రాయలవారు అందరికీ ఒక్కొక్క పండే ఇచ్చారు! ఓపికగా కొంతసేపు ఎదురుచూసిన బ్రాహ్మణులు చివరికి తమ తమ వాతలు చూపించి ఎక్కువ పండ్లు ఇమ్మన్నారు.\n\nవిషయం తెలుసుకున్న రాయలవారు మండిపడ్డారు- “నేను గౌరవించే బ్రాహ్మణులను ఇంతగా అవమానిచేందుకు రామలింగనికి ఏం పట్టింది?” అని. భటులు వెళ్లి తెనాలి రామలింగడిని సభకు లాక్కువచ్చారు. రాయలవారు \"రామకృష్ణా! ఏంటిది?” అని అరిచారు నిప్పులు కురిపిస్తూ.\n\n\"మహాప్రభూ! మన్నించాలి. మా తల్లిగారు విపరీతమైన కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఈ మధ్యనే స్వర్గస్తురాలయ్యారు. స్థానికంగా ఉన్న వైద్యులు ఆమె బ్రతికి ఉండగానే సూచించారు- ఆమె జబ్బుకు చికిత్సగా, ఆమె కీళ్ళకు వాతలు పెట్టమని. ఆవిడా అదే కోరుకున్నది- కానీ నా మనసొప్పక, నేను ఆ పని చేయలేదు. చివరికి, తన కోరిక తీరకుండానే ఆమె కన్నుమూసింది. ప్రభువులవారు తమ తల్లి చివరి కోరికను తీర్చటం కోసం ఈ బ్రాహ్మణులకు బంగారు పండ్లు దానం చేస్తున్నారని తెలిసి, నేను కూడా మా తల్లిగారి చివరి కోరిక తీర్చాలని సంకల్పించాను. అయితే బంగారం కోసం ఎగబడ్డంత సరళంగా వాతలకోసం రాలేదు. అందుకని, దానికి ఓ చిన్న అబద్ధం జోడించానంతే- ప్రభులవారు క్షమించాలి. ఏమైనా, ఈ బ్రాహ్మణుల మహిమ వల్ల మనిద్దరి తల్లిగార్ల ఆత్మలకూ శాంతి లభించినందుకు నాకైతే చాలా తృప్తిగా ఉన్నది” అన్నాడు రామలింగడు తాపీగా.\n\nతాత్పర్యం గ్రహించిన రాయలవారు రామలింగడిని మందలించి వదిలిపెట్టారు- ప్రజాధనాన్ని ఇలాంటి కార్యాలకు వినియోగించ కూడదని మనసులోనే నిర్ణయించుకుంటూ! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 668,
        "IMAGE": "cat_7",
        "NAME": "రాయలవారి మామిడిపండ్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 95,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక గురువు గారికి దేశమంతటా వేలకొద్దీ శిష్యులు ఉండేవారు. ఎక్కడి కెళ్ళినా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.\n\nఆయన ఒక చోటి నుండి మరొక చోటికి పల్లకిలో వెళ్తుంటే, ప్రజలు బారులు తీరి నిలబడి కనక వర్షం కురిపించేవాళ్ళు. అలా ఆయన ఒక ఊరిలో నిలువక, దేశమంతా సంచరిస్తూ సంపన్నులైన శిష్యుల నుండి కానుకలు, దానాలు, స్వీకరిస్తూ ఉండేవాడు.\n\nఅయినా ఆయనకు ఎంతమంది శిష్యులు ఉండేవారంటే, ఒకసారి సందర్శించిన వారిని మళ్ళీ కలిసేందుకు ఆయనకు పన్నెండు సంవత్సరాలు పట్టేది.\n\nఒకసారి ఈ గురువుగారు ఒక పట్టణం దాటి వేరొక పట్టణానికి పోతుండగా మధ్య దారిలో ఒకడు గట్టిగా అరుస్తూ, దారికడ్డం నిలబడి, ఆయన్ని నిలువరించాడు. చూసేందుకు ఒట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడు గాని, అట్లా రోడ్డు మధ్యలో చేతులు చాపుకొని నిలబడి, గురువుగారు తనతో మాట్లాడేంత వరకూ పల్లకీని ముందుకు వెళ్ళనిచ్చేది లేదని మొండిపట్టు పట్టాడు.\n\nగురువుగారికి అసహనం ఎక్కువ అయింది; కానీ వాడు తనని ఊరికే వెళ్ళనిచ్చేట్లు లేడు! అందుకని, గతిలేక, 'వాడితో ఒక నిమిషం మాట్లాడి చూద్దాం' అనుకొని, ఆయన \"నీకేం కావాలి?” అని అడిగారు వాడిని, ఒకింత చికాకు పడుతూ,\n\nవెర్రిబాగులవాడు అన్నాడు- “నేను స్వర్గానికి పోవాలి. మీరొక గొప్ప గురువుగారనీ, స్వర్గానికి వెళ్ళే దారేదో మీకు బాగా తెలుసని జనాలు చెప్పారు నాకు. ఆ మార్గం ఏదో చూపించాలి మీరు” అని.\n\nగురువుగారు చిద్విలాసంగా నవ్వారు. “నువ్వు స్వర్గానికి ఎక్కుతావా? చాలా సులభం- అదిగో, అక్కడ నిలబడు. చేతుల్ని పైకెత్తి, స్వర్గం వైపు చాచి, నిలబడాలి - అంతే, నువ్వు స్వర్గం చేరుకుంటావు” అన్నారు.\nవెర్రిబాగులవాడు సంతోషపడ్డాడు- “ఓస్ అంతేనా!“ అని. మళ్ళీవాడు తేరుకొని ఇంకొక ప్రశ్న వేసే లోగా, గురువుగారు తన పల్లకీ బోయీలను తట్టి, బయలుదేరారు. పల్లకీ ముందుకు సాగిపోయింది.\nపన్నెండు సంవత్సరాల తర్వాత గానీ గురువుగారికి మళ్ళీ అటువైపుగా వచ్చేందుకు వీలు చిక్కలేదు. పల్లకీ పట్నపు పొలిమేరల్ని దాటుతుందనగా ఆయనకు మళ్ళీ ఆ మనిషి కనబడ్డాడు-\n\nఈసారి వాడు చేతులు ఎత్తి ఆకాశం వైపుకు చాపి, కదలకుండా నిలబడి ఉన్నాడు. వాడి జుట్టు, గడ్డం వెలిసిపోయి, అట్టలు కట్టి ఉన్నాయి. గోళ్ళు పెరిగి పోయాయి; నల్లగా వంకరలు తిరిగి ఉన్నాయి. బట్టలు చినిగి పేలికలై ఉన్నాయి. అయినా వాడికి అవేమీ పట్టనట్లు లేదు. వాడి చూపులు నిశ్చలంగా ఆకాశాన్ని చూస్తున్నై.\n\nగురువుగారు అతని ప్రక్కగా వెళుతుండగా ఒక అద్భుతం ఆయన కంట పడింది- ఆ వెర్రిబాగుల మనిషి- నిలబడ్డవాడు నిలబడ్డట్లే పైకి లేచి, మెల్లగా ఆకాశం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు!\n\nగురువుగారికి ఒక్క క్షణం పాటు మతి పోయినట్లు అయింది. ఏదో, ఆ వెర్రివాడిని ఆటపట్టించేందుకు తను ఆ ఉపాయం చెప్పాడు తప్పిస్తే, వాడు పన్నెండేళ్లపాటు దీక్షగా తన సలహాను అమలు పరుస్తాడని అనుకోలేదు మరి! అంతేకాదు, తన సలహా పని చేస్తుందన్న నమ్మకం తనకే లేదు! తనకి మాత్రం స్వర్గం చూడాలని లేదూ? మరుక్షణం ఆయన లేచి, పల్లకీలోంచి దూకి, ఆ వెర్రివాడి కాళ్ళు దొరక-పుచ్చుకున్నారు, -అలాగైనా వాడితో పాటు తాను స్వర్గాన్ని చూడొచ్చని!\n\nస్వర్గం చూడాలంటే తనలాంటి వాళ్ళకి ఇక వేరే దారి ఏదీ లేదని ఆయనకి అర్థమయింది మరి! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 669,
        "IMAGE": "cat_7",
        "NAME": "స్వర్గానికి దారి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 96,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వెళ్లాడు. అడవిలో వెళ్తుండగా ఒక పులి అతని మీద పడి చంపాలని ప్రయత్నించింది.\n\nఅటు నుండి వస్తున్న యువకుడొకడు దాన్ని చూశాడు. అతను వెంటనే ఆ పులిపైకి దూకి, తన చురకత్తితో దాన్ని పొడిచి, చంపేసి, రాజును రక్షించాడు.\n\n\"రాజా! అడవిలో‌తిరగాలంటే మీకు కత్తిని వాడటం తెలిసి ఉండాలి. లేకపోతే ఇలాంటి క్రూరజంతువులనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కావాలంటే నేను మీకు ఆ విద్య నేర్పగలను\" అన్నాడతను రాజుతో.\nకానీ రాజు దానికి ఒప్పుకోలేదు. 'ఒక సామాన్యుడినుండి ఏ విద్యనైనా నేర్చుకోవటం నాకు ఇష్టంలేదు' అన్నాడు.\nఆ మాటలకు నొచ్చుకున్న యువకుడు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయాడు.\n\nఆ తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. అక్కడ ఎదురైన సింహం అతని మీద పడి చంపింది. 'చురకత్తితో యుద్ధం చేయటం ఎలాగో నేర్చుకొని ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు గదా, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరించాలి' అనుకున్నాడు రాజు, చనిపోబోతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 670,
        "IMAGE": "cat_7",
        "NAME": "రాజు మూర్ఖత్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 97,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకొనేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు; అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవాళ్ళు. రామయ్య తనవంతుగా అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు.\n\nరామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశ భట్టు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆటపట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య, ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి, కారణం అడిగాడు. \"నేను చదువుకోను సార్!\" అన్నాడు తప్పిస్తే, సిద్ధయ్య భట్టుపై ఎలాంటి ఫిర్యాదూ చెయ్యలేదు.\n\nఇక చేసేదేమీ లేక, సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్ళేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో \"నీకు చదువు రాలేదని బాధ పడకు. చదువు రాకున్నా పరవాలేదు-చదివే వాళ్ళను గౌరవించు. నీ‌ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో\" అని చెప్పాడు.\n\nఇంటికి వెళ్ళిన తర్వాత, సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో‌ మెళకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నిటినీ తన పొలంలో అమలుపరచి, బంగారం‌ పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకొని, ఊళ్ళో వాళ్లందరిచేతా 'శభాష్' అనిపించుకున్నాడు. చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రతించేవాళ్ళు.\n\nఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో‌ ప్రవచనాలు ఇస్తున్నాడనీ, చక్కగా మాట్లాడతాడనీ విని, సిద్ధయ్య వెళ్ళి, ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్ళేసరికి, ఆయన వేరెవరో కాదు- చిన్ననాడు బడిలో‌తనని ఆట పట్టించిన గణేశభట్టు! సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి, భట్టుకు ఆశ్చర్యం వేసింది. ఊళ్ళోవాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకు తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది.\n\n\"నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్నీ‌ , నీలో ఉన్న మంచితనాన్నీ గమనించని నన్ను క్షమించు సిద్ధయ్యా!\" అన్నాడు అతను నీళ్ళు నిండిన కళ్ళతో.\n\"అలా అనకు మిత్రమా, పాండిత్యం‌ పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం, కాదూ?\" అన్నాడు సిద్ధయ్య, అణకువతో.\nమంచితనాన్ని మించిన చదువు లేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 671,
        "IMAGE": "cat_7",
        "NAME": "చదువు-సంస్కారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 98,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పవిత్రమైన న్యాయం ఒకటుందని నమ్ముతారు యూదు మతస్తులు. వాళ్ళ గురువులను 'రబ్బీలు' అంటారు. వాళ్ళు ఆ ధర్మాన్ని అధ్యయనం చేస్తుంటారు.\n\nఒకసారి రోమన్ దేశీయుడొకడు వచ్చాడు- యూదుల గురువు 'గింజో' దగ్గరికి: \"మీ యూదులంతా ఏదో న్యాయం గురించి చదువుతారట గదా, ఏంటది?\" అని అడిగాడు.\n\n\"దాన్ని వివరించటం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా విను- శ్రద్ధగా, మనసు పెట్టి వినాలి మరి. ఇద్దరు మనుషులు ఒక ఇంటి పై కప్పు మీదికి ఎక్కి, అక్కడున్న పొగ గొట్టంలోంచి క్రిందికి జారారు. ఒకడి ముఖం మసిబారింది. రెండోవాడి ముఖానికి మసి లేదు. మరి నువ్వు చెప్పు- ఎవరు ముఖం కడుక్కున్నారు?\" అన్నాడు గింజో.\n\n\"చెప్పేందుకు ఏమున్నది? శుభ్రంగా ఉన్నవాడు ముఖం కడుక్కున్నట్టు, అంతే గదా?\" అన్నాడు రోమన్.\n\n\"లేదు. నువ్వు చెప్పింది తప్పు. శుభ్రంగా ఉన్నవాడు ముఖం ఎందుకు కడుక్కోవాలి? ఇద్దరూ పొగ గొట్టంలోంచి జారి వచ్చారు. వచ్చాక , ఒకడు తన స్నేహితుడి ముఖం కేసి చూశాడు: అది మసిబారి ఉన్నది. దాన్ని చూసేసరికి, వాడికి 'తన ముఖానికీ మసి ఉన్నదేమో, అనిపించింది...\" \"ఒహో ! అహ్హా! మీరు ధర్మశాస్త్రం ఎందుకు చదువుతారో అర్థమైంది. మీకు మంచి 'తార్కిక శక్తి' లభించాలని ! అవునా ?\" అన్నాడు రోమను, ఉత్సాహంగా.\n\n\"లేదు, నీకు సరిగ్గా అర్ధం కాలేదు, వెర్రివాడిలా మాట్లాడకు . మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగావిను- \"ఇద్దరు వ్యక్తులు పొగగొట్టంలోంచి కిందకు జారారు. ఒకడి ముఖానికి మసి అంటి ఉన్నది. రెండో వాడి ముఖానికి లేదు. ఎవరు ముఖం కడుక్కుంటారు ?\" అడిగాడు రబ్బీ గింజో.\n\n\"మీరన్నట్లు, ముఖానికి మసి అంటని వాడు ముఖం కడుక్కున్నాడు. తన స్నేహితుడి ముఖానికి మసి అంటి ఉండడం చూశాడు అతను. తన ముఖం కూడా మసిబారి ఉందనుకున్నాడు. అందుకని వెళ్ళి ముఖం కడుక్కున్నాడు- సరిగ్గా ఉంది, ఇది.\"\n\nగింజో అన్నాడు- \" లేదు, పిచ్చివాడా! అలాకాదు. గదిలో ఒక అద్దం ఉంది. ముఖం కడుక్కున్నవాడు ఆ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు\" అని.\n\"ఓహో! మీ ధర్మశాస్త్ర అధ్యయనం అదన్నమాట ! వేరే విధంగా చెప్పాలంటే, 'తార్కికత'ను మీరు సమర్థిస్తారన్నమాట!\" అన్నాడు రోమను\n\n. \"అయ్యో, వెర్రాయనా, నీకు ఇంకా అర్థం కాలేదు. ఇద్దరు మనుషులు ఇంటి పైకప్పును ఎక్కి, పొగ గొట్టంలోంచి క్రిందకు జారారు. ఒకడి ముఖానికి మసి అంటింది; ఇంకొకడి ముఖానికి అస్సలు ఏమీ అంటలేదు- కానీ ఇది అసాధ్యం! అట్లా ఎట్లా కుదురుతుంది? పో, ఇలాంటి పిచ్చి ఊహలతో సమయం వృధాచేయకు\" అన్నాడు గింజో. \"ఓహో! అదేనన్న మాట, ధర్మం అదేనా? చాలా స్పష్టం- కనీస మాత్రంగా ఉండాల్సిన జ్ఞానం, ఇది- 'కళ్ళముందు కనబడే దాన్ని చూడాలి '-అని\". అన్నాడు రోమను కొంచెం సిగ్గు పడుతూ. \"అయ్యో, వెర్రివాడా, ఒకడి ముఖానికి మసి అంటి, రెండోవాడి ముఖానికి ఏమీ అంటకపోవటం అసాధ్యమెందుకు అవుతుంది? సుసాధ్యమే. చూడు, ముందుగా ఒకడు పొగగొట్టంలోంచి క్రిందికి జారుతున్నప్పుడు, దానిలోని మసి మొత్తం అతనికి అంటింది. అందుకని, వాడి తర్వాత జారిన రెండోవాడి ముఖానికి మసి అంటలేదు\" అన్నాడు గింజో.\n\n\"ఇది అద్భుతంగా ఉంది. నాకు అర్థమైంది, రబ్బీ గింజో. ధర్మం అంటే 'మౌలికమైన వాస్తవాలను చేరుకోవటం' కదూ?\"\n\n\"లేదు, లేదు. పిచ్చివాడిలా మాట్లాడకు- అట్లా అవ్వదు. ఎందుకంటే, పొగగొట్టంలో ఉన్న మసి మొత్తాన్నీ ఒక్కసారిగా ఎవరు ఊడ్చవేయగలరు? అది అసాధ్యం\" అన్నాడు గింజో.\n\n\"మరయితే మీరు ఎడతెరపి లేకుండా చదివే ధర్మం ఏంటి? దయచేసి చెప్పండి నాకు\" అన్నాడు రోమను, ప్రాధేయపడుతున్నట్లు.\n\n\"'మనం చూసే అతి చిన్న విషయాల వెనుక ఉన్న వాస్తవాల్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము' అని తెలుసుకోవటమే ధర్మాన్ని అధ్యయనం చేయటం అంటే. 'మనం అన్నింటినీ తెలుసుకోలేము' అని తెలుసుకోవటమే ధర్మాధ్యయనం. మనం ఆ భగవంతుని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునేందుకు మనకు చేతనైన ప్రయత్నం చేయవచ్చు, కానీ సర్వమూ తెలిసినవాడూ, తెలుసుకోగల వాడూ ఆ భగవంతుడొక్కడే: చూడు, నిజంగానే, ఇద్దరు మనుషులు ఇంటి పై కప్పు మీదికి ఎక్కి, పొగ గొట్టంలోంచి క్రిందికి జారారు. మొదటివాడు పూర్తిగా స్వచ్ఛంగా బయటపడ్డాడు. రెండోవాడి ముఖానికే, మసి అంటింది. ముఖం ఎవ్వరూ కడుక్కోలేదు- ఎందుకంటే, చెప్పనా?- నువ్వు నన్ను అడగటం మరిచావు- ఆగదిలో ముఖం కడుక్కు-నేందుకు నీళ్లు లేవు!\" చెప్పాడు గింజో తాపీగా. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 672,
        "IMAGE": "cat_7",
        "NAME": "అధ్యయనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 99,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "సోంపల్లెలో ఒక మంచి రైతు రంగయ్య ఉండేవాడు. రంగయ్య మనసు మంచిది. ఊళ్ళో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా వచ్చి రంగయ్యతో చెప్పుకునేవాళ్ళు. రంగయ్య వాళ్లకు తన చేతనైన సాయం చేస్తుండేవాడు.\n\nఒకసారి రంగయ్య పొలం దున్నుతుంటే ఒక పాము కనబడ్డది. మామూలు రైతులైతే పాము కనబడగానే దాన్ని చంపేస్తారు- అది విషపు పురుగా, కాదా అని కూడా చూడరు. కానీ రంగయ్య ఒక క్షణం ఆగి 'అది ఏ పాము' అని చూశాడు. చూడగా అది విషపు పాము! రంగయ్య దాన్ని చంపేద్దామనుకుంటుండగా అది అన్నది- \"రంగయ్యా! నేను పుట్టిందే నీ పొలంలో. ఇన్నాళ్ళూ నీ‌పొలం లోని ఎలుకల్ని తిని నీ పంటను కాపాడాను. ఇప్పుడు నేను ఇల్లు-వాకిలీ కోల్పోయి, చలికి వణుకుతూ దీనదశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపుతావా? దయచూడు!\" అని.\n\nరంగయ్యకు దానిమీద జాలి కలిగింది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి పొయ్యి దగ్గర, వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచి కాపాడాడు. దానికంటూ ఒక బుట్టను ఏర్పరచి, దాన్ని జాగ్రత్తగా సాకటం మొదలుపెట్టాడు. తను పొలానికి వెళ్ళేటప్పుడు రోజూ దాన్ని పొలానికి తీసుకెళ్ళేవాడు.\n\nఒకసారి ఆ పాము బుట్టలోంచి బయటికి వస్తుండగా చూసిన గ్రద్ద ఒకటి రివ్వున వాలి దాన్ని పట్టుకోబోయింది. దగ్గర్లోనే విత్తనాలు వేస్తున్న రంగయ్య తన చేతుల్లోని కొడవలిని గ్రద్దపైకి విసరకపోతే పాము పని ఆఖరయ్యేది. ఒక సారి పిల్లి ఒకటి దాన్ని పట్టుకోబోయింది. మళ్ళీ రంగయ్యే, సమయానికి పిల్లిని తరిమి, పామును రక్షించాడు. అలా చాలాసార్లు రంగయ్య దాన్ని శత్రువుల బారినుండి కాపాడాడు.\n\nఒక రోజున పాముకు తినేందుకు ఏవీ దొరకలేదు. ఆకలిగొని ఉన్న పాముకు గతం గుర్తొచ్చింది. రంగయ్య తనను చంపబోవటం గుర్తుకు వచ్చింది దానికి. రంగయ్య దయాగుణాన్ని మరచిన పాము, క్రోధంతో ఉడికిపోయింది. మెల్లగా రంగయ్య వెనక చేరి, కాటు వేసేందుకు పడగనెత్తింది.\n\nగిరుక్కున వెనక్కి తిరిగిన రంగయ్య, గబుక్కున దాని తలను దొరకబుచ్చుకున్నాడు. వదిలెయ్యమని ప్రాధేయపడుతున్న పాము మాట వినకుండా ఓ కట్టెపుల్లతో దాని నోటిని తెరచి పట్టుకొన్నాడు. దాని కోరలు రెండింటినీ- ఆ కోరల వెనక ఉన్న విషపు తిత్తులతో సహా- పీకేశాడు. ఇకమీద అది ఎవరికీ హాని చెయ్యలేదు! ఆపైన దాన్ని పొలంలోనే వదిలిపెట్టేశాడు.\n'చూడు, ఏం చేసినా పాము బుద్ధిమారలేదు' అనుకున్నాడు రంగయ్య, మనసులో.\n'చూడు, మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు' అనుకున్నది పాము, జరజరా దూరంగా పోతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 673,
        "IMAGE": "cat_7",
        "NAME": "పాము బుద్ధి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 100,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక తలారి ఉండేవాడు. తలారి అంటే తెలుసుకదా, కసాయివాడు అన్నమాట. జంతువుల్ని కోసి, మాంసం అమ్ముకుని జీవించేవాడు. అతని ఇంట్లో ఒక మేక ఉండేది. ఒకసారి అది పిల్లల్ని ఈనే సమయం దగ్గరపడింది. అతని భార్య రోజూ మేకల్ని తోలుకొని అడవికి పోయేది. తలారివాడు భార్యను పిలిచి- \"చూడు, దీనికి ఆడమేక పుడితే వెనక్కి తీసుకురా. అలాకాక పోతు పుడితే అక్కడే వదిలేసి రా!\" అని చెప్పాడు.\n\nఆ రోజునే మేక పోతును ఈనింది. తలారివాడి భార్య ఆ పిల్లను అక్కడే వదిలేసి మిగిలిన మందతో ఇంటికి వెళ్ళిపోయింది. అయితే తల్లిపాలకు నోచుకోని ఆ మేకపోతు అదృష్టం బాగుందేమో, అది బ్రతికింది- ఊరికే బ్రతకటమే కాదు- అడవిలో దొరికే ఆకులూ అలములూ, గడ్డీ గాదం మేసి మేసి బాగా లావుగా, బలంగా తయారైంది. బలంతోబాటు దానికి విపరీతమైన గర్వమూ, ధైర్యమూ వచ్చినై.\n\nఅయితే దానికి కాలం మూడే సమయానికి, అది తనకు కనబడిన ఒక గుహలో దూరి నిద్రపోతున్నది. ఆ గుహ ఒక నక్కది. ఆహారంకోసం బయటికి వెళ్ళిన నక్క వెనక్కి తిరిగి వచ్చి, తన గుహలోకి ఎవరో దూరారని గుర్తించింది. గుహచుట్టూ ఒకటి రెండుసార్లు తిరిగినా దానికి తన గుహలో దూరిందెవరో అర్థం కాలేదు. అందుకని అది పెద్ద గొంతుకతో \"ఎవరది, గుహలో ఉన్నది?\" అని అరిచింది.\n\n\"ఎవరని అడుగుతావా, నేనురా, గువ్వ చెవ్వులవాడిని, బాడిశె గడ్డపు వాడిని, బార్సి బార్సి పొడుస్తానురోయ్! జాగ్రత్త!!\" అని లోపలినుండే అరిచింది మేక.\n\"ఓహో! ఇది మేక! నా ఆహారం నా యింట్లోకి నడిచి వచ్చింది, ఈ రోజు నాకు పండగే!\" అనుకున్న నక్క అమాంతం లోపలికి దూకి, మేకను పట్టుకొని చంపేసింది.\n\nఅయితే అది ఎంత తిన్నా, మేక మాంసం అయిపోలేదు. ఆయాసం వచ్చిన నక్కకు అప్పుడుగాని స్నేహితులు గుర్తుకు రాలేదు. \"ఓయ్, రండి రండి! నేను మీకోసం మంచి మేకను చంపి పెట్టాను. రండి! వచ్చి తినండి!\" అని అది ఊళ పెట్టగానే, దగ్గర్లో ఉన్న నక్కలన్నీ పరుగున వచ్చి, మేకను చూసి సంతోషంగా కేకలు పెట్టాయి. \"తినండి తినండి! మీకు ఇంత మంచి ఆహారం సంపాదించిపెట్టినందుకు నాకు మీరంతా కలిసి సన్మానం చేయండి\" అన్నది నక్క గర్వంగా.\n\nనక్కలన్నీ‌మేకను కడుపారా మెక్కి, ఒక తడకను ఎత్తుకొచ్చి, దానికి రెండువైపులా తాళ్ళు కట్టి, దానిమీద నక్కను కూర్చోబెట్టుకొని , దాని కాళ్ళకు, చేతులకు తాళ్లతో ముడులు వేసి, తడకను భుజాలమీద ఎత్తుకొని అరుచుకుంటూ ఊరేగించటం మొదలుపెట్టాయి.నక్కల గొడవకు చుట్టూ ఉన్న జంతువులన్నీ చెవులు మూసుకున్నై గానీ, సన్మానపు మత్తులో ఉన్న నక్కకు అదేదీ పట్టలేదు. నక్కల ఊరేగింపు సింహం గుహ దగ్గరకు చేరుకునే సరికి, అప్పటికే ఆకలితో చికాకుగా ఉన్న సింహం దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జించింది. మరుక్షణం నక్క మిత్రులన్నీ తడకను క్రిందపడేసి తలో దిక్కుకూ పరుగులెత్తాయి. తడకకు కట్టబడి ఉన్న నక్క ఎటూ పారిపోలేక ఏడవసాగింది. దిక్కులు తెలీనట్లు పరుగెత్తుతున్న మిత్రుల కాళ్లక్రింద పడి దానికి నడుం విరిగినంత పనైంది.\nచివరికి సింహం దయతలచి దాన్ని వదిలింది గానీ, లేకపోతే నక్క ప్రాణాలు ఆనాడే గాలిలో కలిసి పోయేవి!\nచావు తప్పి కన్ను లొట్టబోయిన నక్కకు ఆ రోజుతో సన్మానాల పిచ్చి వదిలింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 674,
        "IMAGE": "cat_7",
        "NAME": "సన్మానాల పిచ్చి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 101,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం బంగ. బంగలో నివసించే ప్రతి ఒక్కరికీ తెలుసు- మంగళ్దాస్ ఎంత పిసినిగొట్టో. ఒకసారి మంగళ్దాసు దుకాణంనుండి ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య పుచ్చకాయ (కలింగరి కాయ)ముక్కలు తరిగి పెట్టింది. అయితే ఇంట్లో చూస్తే, దాని పై చెక్కు కనబడలేదు మంగళ్దాసుకు. దాంతో అతను ఎంత రగడ చేశాడంటే, చివరికి అతని భార్య విసిగిపోయి, తను బయట చెత్తకుప్పలో పారేసిన పుచ్చకాయ చెక్కుల్ని ఏరుకొచ్చి, వాటిని కడిగి, కూర చేసి పెట్టింది!\n\nఒకసారి ఆ మంగళ్దాసు పనిమీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు ఛార్జీలు మిగుల్చుకునేందుకుగాను అతను నగరం వరకూ నడిచి పోయాడు. మధ్యలో నదిని దాటేందుకు, మరబోటులో అయితే ఎక్కువ అడుగుతారని, తాతల కాలంనాటి పాత డింగీనొకదాన్ని ఎక్కాడు.\n\nవెళ్లటం బాగానే వెళ్ళాడు గాని, వెనక్కి వచ్చేటప్పుడు, కాలం చెల్లిన ఆ పడవకు చిల్లి పడింది. ఆ సమయానికి పడవ నది మధ్యలో ఉన్నది. దగ్గర్లో నేల అన్నది లేదు. రంధ్రంగుండా నీళ్లు బలంగా లోపలికి వస్తున్నాయి- చూస్తూండగానే డింగీ నీళ్లలో మునిగిపోనారంభించింది. మంగళ్దాసు ప్రాణాలు పోయినంత పనైంది- ఎందుకంటే అతనికి ఈత రాదు మరి. ఇక చేసేదేమీ లేక, అతను తన కుల దైవాన్ని ప్రార్థించటం మొదలు పెట్టాడు- \"స్వామీ, నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిస్తే, నీ సంతృప్తి కోసం నేను సంతర్పణ చేసి, వెయ్యిమంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను\" అని గొణగసాగాడు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని.\n\nపడవ మునిగిపోయింది. మంగళ్దాసు కూడా మునిగేవాడే- కానీ ఆ సమయంలో ఎక్కడినుండి వచ్చిందో మరి- ఒక పెద్ద కొయ్య దుంగ అతని పక్కకే వచ్చి ఆగింది. మంగళ్దాసు గబుక్కున ఆ దుంగను పట్టుకున్నాడు- మెల్లగా దాని పైకి ఎక్కి కూర్చున్నాడు- భద్రంగా సర్దుకొని, చతికిలబడి కూర్చున్నాడు. దాంతో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అతనికి ఊపిరి పీల్చుకునేందుకు కొంచెం సమయంకూడా దొరికింది. దాంతోటే ఆలోచనా మొదలైంది- \"అయ్యో, వెయ్యి మందికి భోజనం పెడతానని నేను ఎట్లా అనగల్గాను? వెయ్యి మంది అంటే మాటలు కాదే! అయినా ఆ దేవదేవుడికి ఈ లెక్క ఏమంత పెద్దది గనక? నేను ఐదు వందల మందికి భోజనం పెట్టినా ఆయనకు సంతోషమే అవుతుందిలే, పరవాలేదు\" అనుకున్నాడు.\n\nఅలా పోయి, పోయి, దుంగ ఒక పల్లపు ప్రాంతాన్ని చేరుకొని ఆగింది. మంగళ్దాసు కాళ్లకు ఒక పెద్ద బండరాయి తగిలింది. అతను దాన్ని కొంత తడిమి, చివరికి దాని పైకెక్కి నిలబడ్డాడు. దగ్గర్లోనే ఒడ్డు కనిపిస్తున్నది- ఇక ప్రమాదం తప్పినట్లే. అతని ఆలోచనలు తను భోజనం పెట్టాల్సిన ఐదువందల మంది బ్రాహ్మణుల వైపుకు మళ్ళాయి. \"ఐదు వందలమందికి భోజనం పెట్టనవసరంలేదు- ఐదు వందలలో ఏమున్నది? వందమందికి పెట్టినా మా ప్రభువుకు సంతోషమే. ఆయన నిత్య సంతోషి కదా, ఏమీ పరవాలేదు.\" అనుకున్నాడు.\n\nబండమీద కొంచెం సేద తీరిన తరువాత అతను మళ్ళీ దుంగపైకి ఎక్కి ప్రయాణం సాగించాడు ధైర్యంగా. అది త్వరలో ఒడ్డున ఉన్న ఇసుకను తాకింది. ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్లే. ఇక మంగళ్దాసు సంతృప్తిగా నిట్టూర్చి, ఇంకా బాగా అనిపించటంకోసం, తను భోజనం పెట్టాల్సిన బ్రాహ్మణుల సంఖ్యను ఒకటికి తగ్గించేసుకున్నాడు. \" 'భగవానుడు 'పత్రం, పుష్పం, ఫలం, నీళ్ళు'-ఇవి చాలు నాకు' అనలేదా, దానిదేమున్నది?\" అనుకున్నాడు ఇప్పుడు.\n\nఅయినా, భద్రంగా ఇల్లు చేరుకున్నాక ఆలోచిస్తే అతనికి అదీ భారంగానే అనిపించసాగింది- ఏమంటే \"ఈ బ్రాహ్మణులు తిండి బాగా తింటారు- పెద్ద పెద్ద బొజ్జల నిండా\" అని బాధ. అందుకని, అతను బాగా ఆలోచించి, ఒక బక్కపలచటి బ్రాహ్మణుడు 'రిఖీరాం' ను ఎంపిక చేసుకున్నాడు. రిఖీరాంకు కడుపు సౌఖ్యం లేదని ఊరందరికీ తెల్సు. అందుకని మంగళ్దాసు వాళ్ళింటికి పోయి, అతన్ని మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పి చక్కా వచ్చాడు.\"అయితే, బ్రాహ్మణుడు తనని చూశాడంటే ఏదో‌ ఒక పేరు చెప్పి బాగా దక్షిణ వసూలు చేస్తాడు- అదే, తను గనక ఇంట్లో లేకపోతే ఊరికే నోరుమూసుకొని, భోజనం చేసి పోతాడు- అందుకని, మంగళ్దాసు మరునాడు తెల్లవారకనే భార్యకు జాగ్రత్తలు చెప్పి, ఆ బ్రాహ్మణుడికి దొరక్కుండా 'ముఖ్యమైన పని' ఏదో పెట్టుకొని, వేరే ఊరికి వెళ్ళిపోయాడు.\n\nకానీ బ్రాహ్మణుడు రిఖీరాం చాలా తెలివైనవాడు. అతనికి మంగళ్దాసు నైజం బాగా తెలుసు. వీలైతే మంగళ్దాసు తనకు దక్షిణ కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టేయగలడు! అందుకని, తెల్లవారగానే బయలుదేరి మంగళ్దాసు ఇంటికి వెళ్ళాడు రిఖీరాం. అయినా ఆ సరికే మంగళ్దాసు వేరే ఊరికి వెళ్ళిపోయాడు! 'ఇదీ మన మంచికే' అనుకున్న రిఖీరాం మంగళ్దాసు భార్య 'పారో'తో- \"తల్లీ, నేను ఒక్కడినే భోజనానికి వస్తున్నానని వంట పరిమితంగా చేస్తావేమోనని, ముందుగా హెచ్చరించి పోదామని వచ్చాను- ఈ పూజ 'సంతర్పణ'-కనుక కనీసం పది మందికి సరిపడా భోజనం తయారు చేయవలసి ఉంటుంది. లేకపోతే ప్రయోజనం సిద్ధించద్దూ?!\" అన్నాడు. ఆమె ఇక ఏమీ అనలేక, సర్దుకొని, \"అయ్యో! ఆ మాత్రం నాకు తెలీదా, అలాగే చేస్తానులెండి!\" అని చెప్పింది.\n\nరిఖీరాం పూజ మొదలుపెట్టి, భోజనం మొత్తాన్నీ‌దేవుడి ముందు పెట్టించి, పారోతో‌ \"తల్లీ! ఒక వంద రూపాయలు దేవుని ముందు ఉంచండి\" అన్నాడు. ఈ విషయాల్లో పెద్దగా అనుభవం లేని పారో, ఆయన ఎలాచెబితే అలా చేసింది. పూజ తరువాత రిఖీరాం తృప్తిగా భోజనం చేసి, దేవుని ముందున్న పూజా- ద్రవ్యాలతోబాటూ ఆ డబ్బును కూడా తీసుకొని, మిగిలిన భోజన పదార్థాలన్నిటినీ‌ మూట గట్టుకొని, ఇంటికి బయలుదేరాడు. పోయేముందు పారోకు గుర్తుచేసి తన దక్షిణ-200రూపాయలు- ఇప్పించుకున్నాడు కూడా -మరి, 'వ్రతం చెడకూడదు' కదా, అందుకని! ఆపైన అతను సంతోషంగా పాటలు పాడుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు.\n\nఇంటికైతే చేరుకున్నాడు గానీ, మంగళ్దాసు వెనక్కి రాగానే తన ఇంటిమీదికి దండెత్తి వస్తాడని తెలుసు రిఖీరాంకు. అందుకని, అతను తను తీసుకొచ్చిన సామాన్లనీ, డబ్బునూ భార్య చేతికిచ్చి, మంగళ్దాసు వస్తే ఏంచేయాలో చెప్పి, హాయిగా పడుకున్నాడు.\n\nమధ్యాహ్నానికి ఇల్లు చేరుకున్నాడు మంగళ్దాసు. రాగానే భార్యను అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ ఖర్చును చూసేసరికి అతనికి గుండె ఆగినంత పనైంది. 'తను లేని సమయం చూసుకొని ఇంత మోసం చేస్తాడా' అని కోపంతో ఊగిపోయాడు. ఒక పెద్ద వెదురుకట్టెను చేత బట్టుకొని, ఆవేశంగా రిఖీరాం ఇంటికి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేసరికి, అతనికి ఏడుపులు, పెడబొబ్బలు వినబడ్డాయి. ఇంటి గడపలో కూర్చొని రిఖీరాం భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. \"అయ్యో!‌దేవుడా! ఏం చేసేది? నా భర్త చచ్చిపోతున్నాడు నాయనో! వద్దంటున్నా వినకుండా ఆ మంగళ్దాసు ఇంటికి పోయి భోజనం చేశాడు. అందులో ఏం విషం కలిపారో, ఏమో? ఉలుకూ పలుకూ లేదు; స్పృహలో లేడు. నాయనోయ్, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు బాబోయ్!\" అని గట్టిగా శోకాలు పెడుతున్నది ఆమె.\n\nమంగళ్దాసుకు అంత చలికాలంలోనూ చెమటలు పోశాయి. కట్టె చేతిలోంచి జారి పడిపోయింది. ముఖం పాలిపోయింది. పెదిమలు ఎండిపోయాయి. \"రిఖీరాం చచ్చిపోయాడంటే ఇక నన్ను జైల్లో పెడతారు- బహుశ: ఉరి తీస్తారేమో కూడా!\" అని అతనికి చెప్పరానంత భయం వేసింది. కిటికీలోంచి లోపలికి చూస్తే మంచం మీద కదలకుండా పడి ఉన్న రిఖీరాం కనబడ్డాడు. ఆ పరిస్థితిలో రిఖీరాంని చూసే సరికి అతనికి ఇంకా బెదురు పుట్టింది. \"రిఖిరాం స్పృహలో లేడు; కానీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు! అతను ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోకూడదు. లేకపోతే ఇదంతా నా తలకు చుట్టుకోక మానదు\" అని మంగళ్దాసు రిఖీరాం భార్య ముందుకెళ్ళి \"అతనికేమీ అవ్వదు. వెంటనే ఓ టాక్సీని పిలిపించు, నగరంలో చాలా మంచి ఆసుపత్రులున్నై, మంచి ఆసుపత్రిలో చేరిస్తే ఇట్టే కుదురుకుంటాడు\" అన్నాడు.\n\n\"ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ అలా చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా కావాల్సి ఉంటుంది. ఇంత సీరియస్ గా ఉన్న రోగిని ఏ ఆసుపత్రి వాళ్ళూ డబ్బు లేకుండా ఉచితంగా చేర్చుకోరు\" అంటూనే, రిఖీరాం భార్య \"అయ్యో, దేవుడో! మమ్మల్ని బికారుల్ని చేసి పోతున్నావా, స్వామీ! నేను ఇంకెన్నాళ్ళు బ్రతకాలి, ఇలా?\" అని గొంతు హెచ్చించింది.\n\nమంగళ్దాసుకు ఇక కాళ్లూ చేతులూ ఆడలేదు. మెదడు మొద్దుబారినట్లైంది. తన పిసినారితనం ప్రక్కన పెట్టి, అతను రిఖీరాం భార్యతో \" చూడమ్మా! డబ్బుకు వెనకంజ వేయాల్సిన సమయం కాదిది. త్వరగా ఏదైనా చేసి నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. నీ కొడుకును నాతో‌పంపించావంటే, నేను ఇస్తాను- ఆ వెయ్యి రూపాయలూ! కానీ- త్వరగా పంపాలి! -వెంటనే!\" అన్నాడు.\nఅట్లా పిసినారి మంగళ్దాసుకు మరో వెయ్యి రూపాయలు వదిలాయి!\n\nఒకటి రెండు రోజులయ్యేసరికి, ఈ కథ ఊరంతటికీ తెలిసిపోయింది. అందరూ మంగళ్దాసును తలచుకొని కడుపుబ్బ నవ్వుకున్నారు. బంగ పట్టణానికి వెళ్లి ఎవరైనా 'మంగళ్దాస్' అన్నారంటే చాలు- అక్కడ ఈనాటికీ నవ్వుల పువ్వులు పూస్తాయి! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 675,
        "IMAGE": "cat_7",
        "NAME": "పిసినారి పాట్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 102,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా సరాపల్లె అనే మారుమూల పల్లె ఒకటి ఉండేది. ఆ పల్లెలో నులకమంచాలు అల్లే జానయ్యకు రాజా అనే కొడుకు ఉండేవాడు. రాజా తన తండ్రితోబాటు నులకమంచాలు అల్లటానికి తోడుగా వెళ్తుండేవాడు. అలా వెళ్ళినప్పుడు, తండ్రి మంచం అల్లుతుంటే వాడు మంచం కోడును ఎత్తిపట్టుకునేవాడు. అలా రాజు మంచం కోడును చకచకా ఎత్తి, కదలకుండా పట్టుకోవటంవల్ల, వాళ్ల నాన్న 'నువ్వు కోడు ఎత్తటంలో మంచి పనోనివిరా!' అని పొగిడేవాడు. అలా ఆ గ్రామంలో చాలామంది వాడిని కోటిపనోడు అని పిలవసాగారు. అందరూ అలా పిలవటం వల్ల రాజుకు కొంత గర్వం పెరిగింది. 'నా అంతటి పనోడు లేడు' అనుకునేవాడు.\n\nతన కొడుకు గర్వాన్ని గమనించిన జానయ్య, \"నాయనా రాజా! ఈ లోకంలో చాలామంది పనిమంతులు ఉన్నారు. నువ్వు లోకం తెలియక నీలో నువ్వు గర్వపడుతున్నట్లుంది. అలా కొద్దిగా బయటిదేశాలు తిరిగి వచ్చావంటే నీకంటే గొప్పవాళ్ళు కనబడతారు\" అని చెప్పాడు.\n\nదానికి రాజా \"సరే, నాకంటే పనిమంతులు ఉన్నారా, వాళ్లు నిజంగా ఎంతటివాళ్ళో కనుక్కుంటాను\" అని మరుసటిరోజే సద్దిమూట కట్టుకొని బయలుదేరాడు. అలా బయలుదేరిన కోటిపనోడికి కోతులమర్రి అనే గ్రామ సమీపంలో రామయ్య అనే విలుకాడు కనబడ్డాడు. తన భార్య ముగ్గు వేస్తుంటే అతను ఆమె ముక్కుపుడకలోంచి లక్ష్యానికి గురిచూసి బాణాన్ని సంధిస్తున్నాడు. కోటిపనోడు అక్కడేనిలబడి, బాణం లక్ష్యాన్ని సూటిగా ఛేదించటం చూసి, ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాడు రామయ్యను కలుసుకొని 'మీ అంతటివాడు లేడు' అని పొగిడి, తను వచ్చిన పని చెప్పాడు.\n\nఅప్పుడు రామయ్య \"చూడు, నేనేమీ కాదు. నాకంటే ఇంకా గొప్ప నేర్పరులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి నేనూ నీతోబాటు వస్తాను పద\" అని బయలుదేరాడు.\n\nకోటి పనోడు, రామయ్య ఇద్దరూ ఉదయాన్నే పొలాల గట్టున వనములపాడు అనే గ్రామం సమీపంలోంచి వెళ్తుండగా, ఒకతను రెండు తాటిచెట్లను రెండు చేతులతో పట్టుకొని, ఒక తాటిచెట్టుతో పళ్లు తోముకుంటూ, వీళ్లకు ఎదురయ్యాడు. వీళ్లిద్దరూ అతన్ని ఆపి తాము వచ్చిన పనిని గురించి, గొప్పవాళ్లను వెతుకున్న సంగతి గురించి అతనికి చెప్పారు.\n\nఅతను తాటి చెట్లను పక్కకు పారవేసి, తన పేరు తాటయ్య అని చెప్పి, గొప్పవాళ్లను చూసేందుకు తనూ వాళ్లతోబాటు వస్తానన్నాడు.\n\nకోటిపనోడు, విలుకాడు, తాటయ్య ముగ్గురూ కలిసి పోతుండగా మధ్యాహ్న సమయంలో వాళ్లకొక వింతదృశ్యం కనిపించింది. కొండ ప్రాగటూరు అనే గ్రామానికి దగ్గర్లో ఒక రైతు, రెండు పులులను కాడికి కట్టుకొని, రెండు పెద్ద నల్లత్రాచుపాములను పగ్గాలుగా చేసుకొని పొలం దున్నుతూ కనబడ్డాడు. అది చూసి వీళ్ళు ముగ్గురూ అతని దగ్గరికి వెళ్ళి, తాము వచ్చిన విషయం గురించి చెప్పారు.\n\n\"నాపేరు పులికేశవ\" అని చెప్పి, అతను \"నాకంటే గొప్పవాళ్లు ఈ ఊరిలోనే ఉన్నారు \" అని చెప్పాడు. \"ఎవరు?\" అని ఉత్సాహంగా అరిచారు ఈ ముగ్గురూ. \"ఇంకెవరు, నా భార్యనే- కొంచెం సేపు ఆగారంటే మీరు నాభార్యను కూడా‌చూసి వెళ్లచ్చు. ఇప్పుడు ఆమె నాకోసం భోజనం తీసుకొని వస్తుంటుంది\" అన్నాడు పులికేశవ. ముగ్గురూ సరేనని పులికేశవతో కలిసి చెట్టుక్రిందకు చేరుకున్నారు. ఇంతలో పులికేశవ భార్య కావేరమ్మ పది మళ్ల అన్నాన్ని నెత్తిన పెట్టుకొని, వందలీటర్ల నీళ్ళు పట్టే బుంగనొకదాన్ని నడుముమీద పెట్టుకొని వచ్చింది. ఆమె శక్తిని చూసిన మిత్రులు ముగ్గురూ బిత్తరపోయారు.\n\nఆమె వాళ్ళు వచ్చిన పనిని తెలుసుకొని, వాళ్లందరికీ అన్నం పెట్టి, వాళ్లతోబాటు తన భర్త పులికేశవనుకూడా గొప్పవాళ్లను చూసివచ్చేందుకు పంపింది. అలా నలుగురూ దేశాలు పట్టుకొని వెళ్తుండగా చీకటిపడింది. వీళ్లు నలుగురూ 'ఎల్లాల' అనే గ్రామంలో పడుకుందామని వెళ్ళారు. అక్కడ ఒకతను ‌ఓ మైదానంలో నిలబడి ఎటో దీక్షగా చూస్తూ కనబడ్డాడు. అతను తనలోతాను నవ్వుకుంటుండటం చూసి- \"ఇతనెవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు- పాపం ఏవో కలలు కంటున్నట్లున్నాడు\" అనుకున్నారు వాళ్లు ఎగతాళిగా.\n\nఅతను వాళ్ల మాటలు విని, \"ఏంటయ్యా, నా గురించి తెలిసే మాట్లాడుతున్నారా, బహుశ: మీరు కంటిచూరయ్య గురించి విన్నట్లు లేదు. కంటి చూరయ్య ఎవరోకాదు, నేనే. నేనిప్పుడు పదివేలమైళ్ల దూరంలో జరుగుతున్న తోలుబొమ్మలాటను చూస్తున్నాను. ఎంతదూరంలో ఉన్న వస్తువునైనా చూడగల సత్తా నాలో ఉన్నది\" అన్నాడు. వాళ్లు నలుగురూ అతన్ని క్షమించమని అడిగి, తాము వచ్చిన పని గురించి చెప్పారు. కంటిచూరయ్య కూడ వాళ్ళతో కలిసి మరుసటిరోజు బయలుదేరాడు, గొప్పవాళ్లని చూసేందుకు.\n\nవాళ్ళు ఐదుగురూ నడిచిపోతుంటే ఒకతను వీళ్లను దాటుకొని వేగంగా ముందుకు నడుస్తూ పోయాడు. అతను తలపైకెత్తి, సూర్యుడివైపు చూస్తూ ఎంతో వేగంగా నడుస్తున్నాడు. వీళ్ళు అతని వెంట పరుగుతీస్తూ \"ఏమైంది అన్నా, ఎందుకు, అంత వేగంగా పోతున్నావు, తలపైకెత్తి సూర్యుడిని చూస్తూ పోతున్నావు ఎందుకు?\" అని అడిగారు. దానికి అతను \"నాపేరు \"సూరయ్య\". నేను రోజూ ఉదయించే సూర్యుని దగ్గరనుండి నడక మొదలుపెట్టి సాయంత్రంలోగా అస్తమించే సూర్యుడిని కలుసుకుంటుంటాను. అంతవేగంగా నడవగల శక్తిని ఆ దేవుడు నాకిచ్చాడు\" అన్నాడు. వాళ్ళు అతన్ని మెచ్చుకొని, తాము వచ్చిన పని గురించి చెప్పారు.\n\nఆ సంగతీ ఈ సంగతీ మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తుంటే సూరయ్య దారిలో తను విన్న సంగతినొకదాన్ని చెప్పాడు- \"లంకాపురి అనే రాజ్యపు రాకుమార్తెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఆ రాకుమారిని ఎవరైతే క్షేమంగా తీసుకొనివస్తారో అతనికి తన రాజ్యం ఇవ్వటంతోబాటు ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని రాజుగారు దండోరా వేయించారు\" అని.\n\nకోటిపనోడు అన్నాడు- \"మనందరం గొప్పవాళ్లను కలిస్తే బాగుండు అనుకుంటున్నాం- సరే. కానీ మన పరిధిలో మనం- ఈ రాకుమార్తెను కాపాడితే బాగుంటుంది కదా\" అని. అందరూ సరేనని, తమ తమ శక్తి కొద్దీ తలొక పనీ చేయటం మొదలుపెట్టారు.\n\nసూరయ్య వేగంగా నడిచి రాకుమారి ఎక్కడుందో కనుక్కున్నాడు. అతన్ని గమనిస్తూ పోయిన కంటిచూపయ్య మిగిలిన వాళ్లకు ఆ వివరాలు తెలియపరచాడు. ఆ రాక్షసుని స్థావరం ఎత్తుమీద ఉండటం వల్ల, అక్కడికి తాటయ్య, పులికేశవ వెళ్ళారు. తాటయ్య పులికేశవను పైకి ఎత్తి ఆ రాక్షసుడి కోటలోకి పంపాడు. అతని అనుచరులను హతమార్చిన పులికేశవ, కోట తలుపులు తెరిచిపెట్టాడు. ఆదారిన మిగిలినవాళ్లంతా కోటలోపలికి చేరుకున్నారు.\n\nకోటిపనోడు విలుకాడిని ఎత్తిపట్టుకున్నాడు. అప్పుడు విలుకాడు కంటి చూపయ్య వూపించిన వైపుగా బాణం వేసి, ఒక్క బాణంతోటే రాక్షసుడిని అంతమొందించాడు.\n\nఆ విధంగా ఆ ఆరుగురూ రాకుమార్తెను రక్షించి, రాజుగారికి అప్పగించారు. కానీ రాజుకు ఓ సమస్య వచ్చిపడింది. తన మాటప్రకారం ఈ ఆరుగురికీ రాజ్యాన్ని మాత్రం పంచెయ్యగలడు- కానీ తన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్ళి చేయాలి? ఆరుగురూ ఎవరికి వాళ్ళే తమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే రాకుమార్తె తమకు దక్కాలంటున్నారు!\n\nరాజుగారు, మంత్రిగారూ తీవ్రంగా ఆలోచించి, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను రాకుమారికే అప్పజెప్పారు. ఆమె, ఒక్క క్షణం ఆలోచించి, కోటిపనోడిని వరించింది!సభలోవాళ్లెవరికీ ఆమె ఇలా ఎందుకు నిర్ణయించుకున్నదీ అర్థం కాలేదు. అందరూ కారణం అడిగితే, ఆమె అన్నది: \" 'ఎవరు ఎంత బలవంతులు' అన్నది ముఖ్యంకాదు- ఎవరెంత సాధన చేశారన్నదే ముఖ్యం. గొప్పవాళ్లు అందరినీ కలుసుకోవాలన్న కోరికతో మొదలెట్టి, అందరినీ ఒకచోట చేర్చి, అందరూ కలిసి పనిచేసేందుకు, సమాజ శ్రేయస్సుకు నడుం బిగించేందుకు దోహదం చేసిన 'కోటిపనోడు\" గొప్పవాడు. అందుకని అతన్ని వరించాను\" అని. సభికులందరూ హర్షధ్వానాలతో ఆమె నిర్ణయాన్ని అభినందించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 676,
        "IMAGE": "cat_7",
        "NAME": "కోటి పనోడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 103,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక నక్క -ఒక పంది జతగా ఉండేవి. అడవిలోని జంతువులన్నీ నక్కనూ, పందినీ తమ రాజులుగా కొలిచేవి. మామూలుగా అవి రెండూ అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి. అయితే ఒకనాడు నక్కరాజు-పందిరాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరివైపుకు పోయాయి. పోయి -పోయి, అవిరెండూ ఊరి ముందర్నే ఉన్న తోటలోకి వెళ్ళాయి. అక్కడ ఆ రెండింటికీ కావలసినంత ఆహారం దొరికింది. ఆరోజు తోటలో వాటికి దొరికిన ఆ ఆహారం చాలా రుచికరంగా ఉంది; అంతేకాక అది కుప్పలు తిప్పలుగా ఉన్నది కూడా. అటు తర్వాత నక్కరాజు-పందిరాజు ప్రతిరోజూ ఆ తోటకే వెళ్ళి కడుపునిండా మెక్కటం మొదలుపెట్టాయి. ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్ళడం-అక్కడ కావలసినంత మెక్కటం - ఆ పైన ఇంటికి పోయి పడుకోవటం- ఇది రోజువారీ పనయింది మిత్రులిద్దరికీ.\n\nరోజూ అక్కడికి చేరుకొన్న వెంటనే, నక్క-పంది రెండూ తమకు దొరికిన ఆహారం మీదికి దూకేవి. అయితే నక్క త్వరగా మేసేసి, తోటనుండి బయటకు వచ్చి, గట్టిగా కూతలుపెట్టేది. పంది మాత్రం నిదానంగా, కడుపునిండా తిన్నాకగానీ అక్కడినుండి కదిలేది కాదు. ఈ తతంగమంతా ప్రతిరోజూ నడిచేది.ఒకనాడు నక్కపెట్టే కూతలను విన్న ఆ తోట యజమాని, అడవి జంతువుల బారి నుండి తన పంటను ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకున్నాడు. మంచి వేటకుక్కలను పట్టుకొచ్చాడు. ఆ మర్నాడు నక్క కూతలు పెట్టే సమయానికి వాటిని తోటలోకి వదిలాడు. ముందుగా తినేసి తోట బయటికి వెళ్ళి కూస్తున్న నక్క, వేటకుక్కల రాకను పసిగట్టి హడావిడిగా అడవిలోకి పారిపోయింది. కానీ, ఇంకా తోటలోనే తీరికగా మేస్తున్న పంది మాత్రం ఆ వేటకుక్కలకు దొరికిపోయింది. ఆ వెంటనే తోట యజమాని వచ్చి, పందిని పట్టుకొని, చెట్టుకు కట్టేశాడు. కట్టేసి, \"పందిరాజా! ఇన్నాళ్లూ నువ్వు నా తోటలో పంటనంతా తిన్నావు- అందుకుగాను నువ్వు నాకు నష్టపరిహారం తప్పక చెల్లించాలి \" అన్నాడు.\n\n\"నాదగ్గరేముంది, మీకు ఇవ్వటానికి? ఏదో, ఒక సంవత్సరంపాటు మీరు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోయి, మీ బాకీ తీర్చేస్తా\" అన్నది పంది. \"ఇప్పుడు దారిలోకి వచ్చింది\" అనుకున్న రైతు దానికి తోటలోనే పనిపెట్టాడు. పందికూడా నోరుమూసుకొని ఆ తోటలోనే పనిచేసుకుంటూ ఉండిపోయింది.\n\nకానీ పారిపోయిన నక్క కథ వేరుగా ఉండింది. అది ఆసరికే బాగా తినమరిగింది. తన మిత్రుడైన పంది వేటకుక్కలకు దొరికిపోయిన తర్వాత కూడా నక్క ఆ తోటకు పోకుండా ఉండలేకపోయింది. \"నా అంతటిది, మామూలు వేటకుక్కలకు దొరుకుతుందా?\" అనుకున్నదది. అయితే ఒకనాడు అదికూడా వేటకుక్కలకు చిక్కిపోయింది. పందితో కలిసి ఆ తోటలో పని చేయాల్సివచ్చింది.\n\nఅయితే అప్పటికే పందికి పని బాగా అలవాటయింది. అది బాగా కష్టపడి పనిచేసేది. కొత్తగా చేరిన నక్కకు పనిచేయటం వచ్చేది కాదు. అదీకాక, అంతవరకూ పనీపాటా లేకుండా తిని, తిరిగే నక్కకు పని చేయాలంటే మనసు కూడా ఒప్పేది కాదు. అందుకని అది పోయి, ఓ చెట్టుకింద పడుకొని , నిద్రపోతూ ఉండేది. అయితే రైతు తోటకువచ్చే సమయం అవుతున్నదనగా అది పంది దగ్గరకు వెళ్ళి, \"యజమాని అన్నం తెచ్చే పొద్దయింది. నువ్వు పోయి కాళ్లూ చేతులు కడుక్కో\" అని చెప్పేది. పంది అట్లా వెళ్ళి, తన కాళ్లూ చేతులు కడుక్కోగానే, నక్క తన ఒంటికి బురద పూసుకొనేది. యజమాని వచ్చి చూసి, \"ఓహో నక్క బాగా పనిచేస్తున్నది- అందుకనే దానికి బురద అంటి ఉన్నది - పంది చూడు, ఎంత శుభ్రంగా ఉన్నదో- అది అస్సలు పనిచేస్తున్నట్లు లేదు' అనుకునేవాడు. నక్కకు బాగా ఇష్టంగా, ప్రేమగా తిండిపెట్టేవాడు.\n\nయజమాని పోగానే, నక్క పందితో \"చూశావా? రైతుకు నేనంటే ఎంత ఇష్టమో? నువ్వు కూడా నాలాగానే చెట్టు నీడన పడుకో, పని అస్సలు చేయకు. అప్పుడుగానీ రైతు నీకు కడుపునిండా తిండి పెట్టడు\" అనేది.\n\nఅయితే ఒకనాడు నక్క ఖర్మ కొద్దీ యజమానికి ఏదో పనిపడి, రోజూకంటే ముందుగానే తోటకు వచ్చేశాడు. ఆ సమయానికి నక్క ఓ కొబ్బరిచెట్టు నీడన పడుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది. రైతు దాన్ని చూసికూడా ఏమీ అనకుండా తన పని తను చేసుకున్నాడు. అయితే ఇక యజమాని రోజూ వచ్చే సమయం అయ్యిందని అనిపించగానే నక్క కాస్తా లేచి, పందితో ఏదో మాట్లాడటం, పంది వెళ్ళి కాళ్లూ-చేతులూ కడుక్కోవటం, నక్క పోయి తన ఒంటికి బురద పట్టించుకోవటం - అన్నీ యథా ప్రకారం జరిగాయి. దీన్నంతా గమనించిన రైతుకు రోజూ జరుగుతున్న తతంగం అర్థమయిపోయింది.\n\nఆపైన రైతు నక్కను పట్టుకొని, ఎండుమిరపకాయలతో పొగబెట్టాడు. నీతి -నిజాయితీలు ఏనాటికయినా గెలుస్తాయని తెలుసుకున్న నక్క, అప్పటినుండి బుద్ధిగా మసలుకున్నది! త్వరలోనే ఆ రెండూ అప్పును తీర్చేసి, అడవిని చేరుకున్నాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 677,
        "IMAGE": "cat_7",
        "NAME": "నక్కరాజు - పందిరాజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 104,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "రామాపురం గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరి చివర్లో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ యింటి యజమాని గురించి వాకబు చేసాడు రామయ్య.\n\nఇంటి యజమాని ఎవరో దానయ్య అట. అతను చనిపోయి పదేళ్లయినా తన ఇంటిమీద మమకారం చావక, ఇంకా ఆ ఇంటినే అంటిపెట్టుకొని ఉన్నాడట. ఊళ్ళోవాళ్ళెవ్వరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు.\n\nఅయినా వేరే అవకాశం లేని రామయ్య, ఆ ఇంటికే వెళ్తానన్నాడు. \"సరే, మీ ఇష్టం; మేం చెప్పాల్సింది చెప్పాం\" అన్నారు ఊళ్ళో జనాలు.\n\nఅయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది! కమలమ్మ, రామయ్య చీపురు కట్టలూ, బూజు కట్టెలూ చేతబట్టుకొని ఆ యింట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో, లేదో, దానయ్య దయ్యం వాళ్లముందు ప్రత్యక్షమైంది \"ఊ.....\" అంటూ. ఇద్దరూ చటుక్కున ఆగిపోగానే అది వాళ్ల చుట్టూ గింగిరాలు కొడుతూ \"ఎవరు మీరు? ఎందుకొచ్చారు, నా యింటికి? ఇక్కడికి చీపురు కట్టలు, బూజు కట్టెలూ తేకూడదని మీకు తెలీదా?\" అని అరిచింది బిగ్గరగా.\n\nరామయ్యకు గుండె ఆగినంత పనైంది. దెయ్యం గియ్యం అని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు గానీ, అది ఇలా కళ్ళముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు మరి! కానీ కమలమ్మ మొండిది. ఆమె \"మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేం ఇక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైనా అంతే; కష్టమైనా అంతే\" అన్నది మొండిగా.\n\nదయ్యం ఇప్పటివరకూ అలాంటి సమాధానం విని ఎరగదు. ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్ళు. కమలమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నేళ్ళుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు ఎవరితోటో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది. అయినా కమలమ్మ వినేటట్టు లేదు. అందుకని అది \"ఇదిగో, ఇక్కడ నేను తప్ప, మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒక వేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే- సరే; కానీ నేను పెట్టే ఐదు షరతులకూ లోబడాలి మరి\" అన్నది తెలివిని ప్రదర్శిస్తూ.\n\"ఏమిటా షరతులు, నన్నూ విననివ్వు!\" అన్నది కమలమ్మ.\n\n\"ఈ ఇంట్లో చెత్తను ఊడవకూడదు. బూజు దులపకూడదు. మీరెవ్వరూ స్నానం చెయ్యకూడదు. గిన్నెలు తోమకూడదు- ఇవి కాక, నాకోసం రోజూ చేపలు వండిపెట్టాలి\" అన్నది దానయ్య దయ్యం, ఇకిలిస్తూ. మనిషన్నవాడెవ్వడూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు.\n\nకానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువనిపించలేదు. \"ఓస్! ఇంతేనా? నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నాను. ఇవేనా! చెత్తను ఊడవకపోతే, బూజు దులపకపోతే, నాకు శ్రమ ఉండదు. వంటగిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంత పని తగ్గుతుంది! స్నానం చెయ్యకపోతే అసలే పని ఉండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతున్నది. చేపల కూర నాకూ ఇష్టమే!\" అన్నది కమలమ్మ, మురిసిపోతున్నట్లు.\n\nమరునాడు తెల్లవారగానే కమలమ్మ, రామయ్య బయలుదేరి ఊరి చెరువుకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ రెండు పెద్ద కొడదల్ని పట్టుకొని ఇల్లు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దానయ్య దయ్యం ఎదురై, \"నా మాట ఎందుకు కాదన్నారు\" అని పళ్ళు కొరికింది. \"మేమేం చేశాం?\" అన్నారు వీళ్ళిద్దరూ.\n\"ఇంకా ఏమనాలి? స్నానం చేసి వచ్చారు కద!\" అన్నది దయ్యం కోపంగా.\n\n\"అయ్యో! ఏం చెప్పాలి? ఈ చేపల్ని పట్టుకునేందుకు మేం చెరువులోకి దిగాల్సి వచ్చింది. చలికి చచ్చాం అనుకో. అయినా నీ చేపలు నువ్వు తెచ్చిస్తే, మాకు ఈ స్నానం చేసే ఖర్మ తప్పుతుంది గద!\" అన్నది కమలమ్మ.\n\"నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు\" అన్నది దయ్యం కొంచెం తగ్గి.\n\"అలాగయితే నోరు మూసుకో. మేం‌ఇంత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పుపట్టటం తగదు\" అన్నది కమలమ్మ గడుసుగా.\nఆరోజునుండి దయ్యం ఇక వాళ్ల స్నానానికి అడ్డు చెప్పలేదు.\n\nకమలమ్మ ఆరోజు చేపల కూరను వండుతూ, కావాలని అక్కడున్న బూజును, సాలీళ్లను అందులోకి వేసింది. చేపలకూర వాసనకు ఆగలేని దానయ్య దయ్యం సంతోషంతో గంతులు వేసింది. అయితే కూర పూర్తై అది తినేందుకు కూర్చోగానే చేపలకు బదులు, సాలీళ్ళు, బూజు దాని కంటపడ్డాయి. అది కోపంతో \"సాలీళ్లకూర కాదు, నేనడిగింది చేపల కూర!\" అని అరిచింది బిగ్గరగా.\n\nచుట్టూ బూజు ఉంటే కూరలోకి అవికాక మరేమి వస్తాయి? అయినా దయ్యాలను సాలీళ్ళు ఏమీ చెయ్యవులే\" అన్నది కమలమ్మ తాపీగా.\n\nఅయినా దయ్యానికి కూర నచ్చలేదు. \"ఈసారి వంటలో చెబుతున్నాను- సాలీళ్ళు ఒక్కటీ రాకూడదు\" అన్నదది. \"మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు గట్టున తిరిగిరా, ఆలోగా నేను బూజు దులిపేస్తాను. అయినా నాకు ఇదేం పని పెడుతున్నావు అనవసరంగా\" అని విసుక్కున్నది కమలమ్మ.\n\nఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలిగిపోయింది కనుక కమలమ్మ కులాసాగా ఇల్లును శుభ్రం చేసేసింది. అయితే దులిపిన దుమ్మును, చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది- ఊడవటానికి లేదు గద!\n\nఇక ఆరోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి కడగకుండా. కమలమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ, దుమ్ము, చెత్త అన్నీ వేసి మురిగిపోయేట్లు చేసింది. అవి ఘోరమైన వాసన వస్తుంటే, వాటిలోనే మరునాటి రోజు చేపల కూర వండి పెట్టింది దయ్యానికి.\n\nఆ కూర తిన్న దయ్యానికి వాంతులు, బేదులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది. \"ఏం కూర వండావు తల్లీ! నేను బ్రతికున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేదు\" అన్నదది వణుక్కుంటూ.\n\n\"నేనేం చేసేది? గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజు, నిన్నటి చేపలు కుళ్ళి వాసన వేస్తున్నా దాన్ని చిమ్మక పోవటం వల్ల తయారైన క్రిములూ, దోమలూ అన్నీ కలిసి నీకు ఆ రోగం వచ్చి ఉండాలి. ఆచార్లు దగ్గరకు పోయి ఏమైనా మందు తెచ్చుకోరాదూ? గిన్నెలు తోమటం, ఇల్లు ఊడ్చటం నావల్ల కాదు బాబూ\" అన్నది కమలమ్మ ఆవులిస్తూ.\n\n\"కాదు కాదు. ఈ చెత్తను ఊడ్చి పారెయ్యి. గిన్నెలు శుభ్రంగా తోము. ఏమీ అనుకోకు. నేను ఈ వణుకును తట్టుకోలేకపోతున్నాను\" అన్నది దయ్యం ప్రాధేయపడుతున్నట్లు.\n\n\"సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా?\" అని గొణుక్కుంటూ కమలమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి, గిన్నెలు కడిగి పెట్టుకున్నది.\n\nఇంకో రెండు రోజులు గడిచేసరికి, దయ్యం రోగం కుదురుకున్నది. ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజూ ఉదయం, సాయంత్రం ఆరు బయట చల్లగాలిలో తిరిగి వస్తున్నది. రోజూ ఒక గంట ధ్యానంకూడా చేస్తున్నది. రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అని అనిపించసాగింది. ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది. పరలోక చింతన పెరిగింది కూడాను. అంతేకాదు- దానికి కమలమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే, ఆమె చేతిలో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతూ భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటి పైన మమకారం నశించింది. చివరికి అది ఇంటిని కమలమ్మకు, రామయ్యకు అప్పగించి తపస్సుకోసం నిశ్చింతగా అడవులకు వెళ్లిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 678,
        "IMAGE": "cat_7",
        "NAME": "మురికి దయ్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 105,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో గొప్ప పండితుడు ఒకాయన ఉండేవాడు. వాళ్ళ ఊరిలోనే ఒక విద్యాలయం స్థాపించి, ఆయన అనేకమందికి చదువు చెప్పేవాడు. ఆయన విద్యార్థులు దేశం నలుమూలలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు.\n\nఅయితే ఆయన కొడుకు రవిశంకరుడు మాత్రం ఎందుకూ పనికిరాని చవటగా తయారయ్యాడు. చదువు సంధ్యలు లేక, రవి ఊరంతా బలాదూరుగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునేవాడు. తండ్రి ఎంత తిట్టినా, కొట్టినా అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదు. అస్సలు చదవని కారణంగా అతను పదవతరగతి పరీక్షల్లో తప్పాడు కూడా. కొడుకు 'పరీక్షల్లో తప్పాడే' అన్న బాధకొద్దీ పండితుడు రవిని ఏదేదో అనేవాడు. వాడికి మొదట్లో ఆ మాటలు బాధ కలిగించేవిగానీ, రానురానూ వాడు వాటిని పట్టించుకోకుండా వదిలెయ్యటం‌ నేర్చుకున్నాడు. ఆ తరువాత తిట్టీ తిట్టీ తండ్రి సిగ్గుపడేవాడు తప్ప, రవిశంకరుడికి మాత్రం ఏదీ‌ తగలకుండా అయ్యింది.\n\nఅలాగని రవిశంకరుడు నిజంగా బండరాయి కాదు. వాడికి ఏ పనినైనా మళ్ళీ మళ్ళీ చేయటం ఇష్టం లేదు- అంతే. ఒకసారి చదివిన పాఠాన్ని వాడు మళ్ళీ చదివేవాడు కాడు. ఒకసారి రాసినదాన్ని మళ్ళీ రాయాలంటే వాడికి మహా బద్ధకంగా ఉండేది- అలాగని వాడు ఏకసంథాగ్రాహీ కాదు! అందుకని వాడికి ఏదీ రాకుండా అయ్యింది. వీటన్నింటికీ తోడు తండ్రి ఎత్తిపొడుపు మాటలు వాడికి చాలా కష్టం కలిగించేవి. ప్రేమగా ఎవరైనా చెబితే వాడికి ఈ సంగతులన్నీ అర్థం అయ్యేవేమో, కానీ అలా చెప్పేవాళ్ళు ఎవరూ వాడికి ఎదురు పడలేదు.\n\nఒక రోజున పండితుడు వాడితో విసిగిపోయి చెడామడా తిట్టేశాడు. దాంతో వాడికి విపరీతమైన కోపం వచ్చి, దొరికిన దారిన నడుస్తూ పోయాడు. ఊరి చివరన ఒక గుడిసె కనిపించింది వాడికి.\n\nఆ గుడిసె ముందు ఒక కుటుంబంలోనివాళ్లు అందరూ కూర్చొని రాతితో‌ రోళ్ళు-రోకళ్ళు, తిరగలిరాళ్లు, రుబ్బుడు గుండ్లు తయారు చేస్తున్నారు. ఆ శబ్దాలూ, వాళ్ళ పని తీరూ నచ్చి, వాడు అక్కడే కూర్చొని చూడసాగాడు.\n\n\"ఒరే, మెల్లగా, కొంచెం కొంచెంగా చెక్కాలి. గరుకుగా ఉందని ఇంకా ఇంకా చెక్కుతూ పోయేవు- జాగ్రత్త. రుబ్బగా రుబ్బగా- నున్నగా అవుతుంది తప్ప, రుబ్బుడు గుండును ఎంత చెక్కినా నున్నగా కాదు\" అంటున్నాడు, అక్కడ ఒక తండ్రి- కొడుక్కు రాళ్లు చెక్కటం నేర్పిస్తూ.\n\nఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో‌చూశాడు రవి. ఒక రుబ్బుడు గుండును మళ్ళీ మళ్ళీ ఉలితో చెక్కుతున్నాడు వాడు. 'టిక్కు టిక్కు టిక్కు' అని ఉలి చప్పుడు చేస్తుంటే రవి ఆలోచనలు ఎటో పరుగెత్తాయి-\n\n\"బండరాయి అనుకునే రుబ్బుడు గుండు కూడా రుబ్బీ రుబ్బీ అరిగి- నునుపుగా తయారౌతున్నది. అలాంటి రుబ్బుడు రాయిని చేసేందుకుగూడా కార్మికుడు మళ్ళీ మళ్ళీ- ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఉలితో పనిచేస్తాడు. మళ్ళీ మళ్ళీ పనిచేస్తే బండలే అరుగుతున్నాయి- అలాంటప్పుడు, నేను మాత్రం పాఠాల్ని మళ్లీ మళ్లీ ఎందుకు చదవకూడదు?\" అనిపించింది రవికి.\n\nఆ తరువాత రవి బాగా సాధన చేశాడు. పట్టుదలతో చదివాడు; మళ్లీ మళ్ళీ రాసాడు. తండ్రికంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అనేకమందికి తనే మార్గదర్శకుడైనాడు. సాధన చేస్తే సాధించలేనిది ఏముంది? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 679,
        "IMAGE": "cat_7",
        "NAME": "రుబ్బు రాయి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 106,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "నందనవనం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. దేశ దేశాలన్నీ తిరిగి, ఆయన అపారమైన జ్ఞానం సంపాదించాడు. తన సొంతఊళ్ళో జనాలంతా సమస్యలతో సతమతమౌతూ ఉన్నారని గమనించిన విష్ణుశర్మ , వారికి ఏదైనా వినూత్నమైన సేవను అందించాలనుకున్నాడు.\n\nఒక మర్రిచెట్టు కింద ఆయన తన అంగడిని ప్రారంభించాడు. చెట్టుకు ఒక బోర్డు వ్రేలాడదీశాడు: \"సలహాల అంగడి. పూర్తి హామీ!\" అని. దారి వెంబడి వచ్చిపోయేవాళ్లందరూ అంగడిపేరు చదివి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవరు వచ్చినా, రాకున్నావిష్ణుశర్మ మాత్రం ప్రతిరోజూ మర్రిచెట్టు క్రింద క్రమం తప్పకుండా కూర్చుంటూ వచ్చాడు. ఒక రోజున రాముడు, రంగడు అనేవాళ్లు ఇద్దరు వచ్చారు సలహాల అంగడికి. అక్కడ కూర్చొని ఉన్న విష్ణుశర్మను \"మీ దగ్గర ఏమి సలహాలు ఉన్నాయి, ఎంతకు అమ్ముతారు?\" అని అడిగారు. \"నేనిచ్చే ప్రతి సలహాకూ కనీస ధర 100 రూపాయలు. ఆ సలహా ఇవ్వటంలో ఉన్న కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది. ఒకవేళ మీరు గనక నా సలహా వద్దనుకుంటే, మీ ధనం మీకు తిరిగి ఇచ్చేస్తాను\" అన్నాడు విష్ణుశర్మ.\n\nరాముడు, రంగడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, \"సరే, మాకు ఇద్దరికీ చెరొక సలహా ఇవ్వండి\" అని రెండు వందల రూపాయలు విష్ణుశర్మ చేతికిచ్చారు.\n\n\"ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట మీరు ఉండకండి\" అని చెప్పాడు విష్ణుశర్మ, ఆ డబ్బును జాగ్రత్త చేసుకుంటూ. \"ఆ! ఇదో సలహా, దీనికో వంద రూపాయలు!\" అన్నాడు రాముడు తిరస్కారంగా. వెంటనే \"నీకు నా సలహా మంచిది కాదనిపిస్తే ఇదిగో, నీ వంద నువ్వు తీసుకో\" అని వంద రూపాయలు తిరిగి ఇచ్చేశాడు విష్ణుశర్మ.\n\nరాముడు డబ్బును వెనక్కి తీసుకున్నాడుగానీ, రంగడు మాత్రం విష్ణుశర్మకు ధన్యవాదాలు చెప్పి శలవు తీసుకున్నాడు. కొద్ది దూరం పోగానే రాముడు అతనితో \"నువ్వు డబ్బు నెందుకు వెనక్కి తీసుకోలేదు? ఊరికే వంద రూపాయలు వృధా ఖర్చు!\" అన్నాడు. \"లేదులేరా! విష్ణుశర్మ గారితో‌పరిచయంకోసం ఆ వందా ఖర్చు పెట్టాననుకుంటాను. నా దగ్గర ఉంటే కూడా ఆ వంద మరో విధంగా ఖర్చైపోయేది\" అన్నాడు రంగడు.\n\nరాముడు, రంగడు పోయే దారిలో ఇద్దరు ఆడవాళ్ళు తగవు పడుతున్నారు. ఇద్దరూ వాళ్లను దాటుకొని పోతుండగా \"రంగా, ఆ గొడవ ఏంటో చూసి వెళ్దాం, ఒక్క క్షణం ఆగు\" అన్నాడు రాముడు.\n\nఅయితే రంగడికి విష్ణుశర్మ ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. \"ఇద్దరు ఆడవాళ్ళు గొడవపడేచోట ఆగవద్దని గదా, విష్ణుశర్మ చెప్పింది?\" అని, రంగడు అక్కడ నిలువకుండా ఇంటికి వెళ్లి పోయాడు.\nరాముడు మాత్రం అక్కడే నిలబడి ఆ తగవులాటని చూడసాగాడు వినోదంగా.\n\nఅయితే అక్కడ తగవు పడుతున్నవాళ్ళు మరెవరో కాదు- ఆ దేశపు రాజుగారి భార్యలు. వాళ్ళిద్దరి గొడవా చిలికి చిలికి గాలివానైంది. 'నువ్వెంతంటే నువ్వెంత' అనుకున్నారు. 'రాజుగార్ని రానియ్, నీపని చెబుతా' అనుకున్నారు. 'నాకు సాక్షి ఇదిగో, వీడే!' అని ఒకామె రాముడిని చూపించింది. 'నాకు సాక్షి కూడా వీడే, నీ పక్షం ఎట్లా మాట్లాడతాడో నేనూ చూస్తాగా!'అని రెట్టించింది రెండో ఆమె. ఇక రాముడి పని అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయ్యింది. 'రాజుగారు రాక మానరు; నన్ను పిలువనంపక మానరు. నేను ఎవ్వరి పక్షం వహించినా, అవతలి వాళ్ళవైపునుండి నాకు ముప్పు తప్పదు. ఏం చేయాలి?!\" అని వాడు క్రుంగి పోయాడు; ఇంటికి వెళ్లి, సంగతంతా రంగడికి చెప్పుకొని బాధ పడ్డాడు.\n\n\"విష్ణుశర్మ మాట వినకపోవటం వల్ల కదా, ఇట్లా అయింది?\" అని రంగడు వాడిని విష్ణుశర్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. జరిగిన సంగతంతా విని విష్ణుశర్మ 500రూపాయలు ఇమ్మన్నాడు. \"అదేమి, పోయిన సారి సలహాకు ఒక వందనే తీసుకున్నావు గదా\" అని రాముడు గింజుకున్నాడు గానీ, 'కష్టాన్ని బట్టి ధర ఉంటుందని నేను ముందే చెప్పాను గదా!' అన్నాడు విష్ణుశర్మ, రాముడిచ్చిన ఐదు వందలూ భద్రపరచుకుంటూ.\n\n\"ఇవాల్టి నుండీ నువ్వు మూగవాడివి అనుకో. నీ కష్టం తీరిపోవాలంటే నువ్వు మాటలు రాని వాడి మాదిరి బ్రతకాలి\" అని సలహా ఇచ్చాడు విష్ణుశర్మ. \"ఈ మాత్రం సలహాకు ఐదు వందలా\" అనిపించింది రాముడికి- అయినా ఒకసారి దెబ్బతిని ఉన్నాడు గనుక, 'సరే' అనక తప్పలేదు. అనుకున్నట్లుగానే మరునాడు రాముడి కోసం రాజభటులు వచ్చారు. ఉన్నవాడిని ఉన్నట్లు రాజసభకు పిలుచుకు వెళ్ళారు. రాజుగారి భార్యలిద్దరూ వాడిని గుర్తుపట్టారు-\"ఇతనే, అక్కడ నిలబడి, మా పోట్లాట మొత్తం చూసిన ప్రత్యక్ష సాక్షి\" అన్నారు. రాజుగారు రాముడిని చూసి- \"ఏమయ్యా, నువ్వేనట, ప్రత్యక్ష సాక్షివి? మరి ఎవరిది తప్పో నువ్వే చెప్పు!\" అన్నారు గట్టిగా. 'బ్బె బ్బె బ్బె బ్బె' అన్నాడు రాముడు, నీళ్ళు నములుతూ.\n\nరాజు \"ఏమిరా, మాటలు రావా?\" అన్నాడు. 'బ్బెబ్బె బ్బె బ్బె' అన్నాడు రాముడు మళ్ళీ, విష్ణుశర్మను తలుచుకుంటూ. రాజుగారు భార్యలతో \"వీడికి మాటలు వచ్చినట్లు లేవే, మరి ఎలాగ?\" అన్నాడు. \"ఏమో మరి, మేమైతే ముందుగా ఊహించలేదు!\" అన్నారిద్దరూ. \"ఏమైతేనేం, వీడు మనకు పనికి రాడు!\" అని రాజు రాముడిని ఇంటికి పంపించేశాడు.\n\nగండం గడిచిందని రాముడు ఊపిరైతే పీల్చుకున్నాడు గాని, వాడి నోట మాట లేకుండా పోయింది. తాను మాట్లాడగలడని రాజుకు తెలిస్తే తనకు మరణశిక్ష ఖాయం! అందుకని ఆరోజునుండీ వాడు పూర్తిగా మూగ జీవితం గడపవలసి వచ్చింది!\n\nఇలా నాలుగు రోజులు గడిచాక వాడికి తన జీవితం మీదే విరక్తి కలిగింది. 'ఎలాగైనా సరే, మళ్ళీ తన మాట వెనక్కి తిరిగివస్తే చాలు' అనిపించింది వాడికి. సలహా కోసం మళ్ళీ విష్ణుశర్మ శరణు జొచ్చాడు.\n\nఈసారి వెయ్యి రూపాయలు పుచ్చుకొని, విష్ణుశర్మ దీర్ఘంగా ఆలోచించి, వేళ్ళమీద లెక్కలు వేసి, చెప్పాడు- \"నేటికి పదకొండవ రోజున, నువ్వు వెళ్లి రాజుగారిని కలువు. నిర్భయంగా జరిగిందంతా చెప్పెయ్!\" అన్నాడు.\n\n\"ఈరోజే చెప్పేస్తే ఏమి?\" అన్నాడు రాముడు. \"రాణులు నీ శరీర అవయవాల్లో ఏదో‌ఒకటి ఊడగొడతారు, పరవాలేదా మరి?\" అన్నాడు విష్ణుశర్మ.\n\nరాముడు కిక్కురుమనకుండా 'సరే' అన్నాడు. నాటినుండి పదకొండవ రోజున వెళ్ళి రాజును దర్శించుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు. నాటినుండీ తన నోటమాట లేక ఎంత కష్టపడిందీ చెప్పుకుని, మన్నించమని వేడుకున్నాడు.\n\nరాజుగారూ, రాణులూ పగలబడి నవ్వారు. \"ఒరే, ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు అని మాకు తోస్తున్నది- నీకెవరో తెలివిగలవాళ్ళు సలహాలు ఇచ్చి ఉండాలి. ఎవరు వాళ్లు?\" అని అడిగారు రాజుగారు, రాముడికి భోజనం పెట్టించి పంపుతూ.\n\nవిష్ణుశర్మ గురించి చెప్పాడు రాముడు. వెంటనే రాజుగారు సంతోషంగా నవ్వి, విష్ణుశర్మకు కానుకగా ఇవ్వమని ఒక రత్నాల హారాన్ని, ప్రశంసా పత్రాన్నీ పంపారు. \"ఊరికో విష్ణుశర్మ ఉంటే మన రాజ్యానికి ఇక ఏ ఆపదా రాదు. మన రాజ్యపు మంత్రి పదవి విష్ణుశర్మకోసమే ఎదురు చూస్తున్నది' అని చెప్పమన్నారు!!\n\nరాముడు విష్ణుశర్మకు వాటిని అందిస్తూ \"మరేం అనుకోకండి. పదిహేను రోజుల్లో ఏం జరిగినట్లు?\" అని అడిగాడు. \"ఏమీ లేదు రాముడూ, నిన్న రాజుగారి పుట్టినరోజు. ఆయన గొప్ప మనసుతో దాన ధర్మాలు చేసే పండుగ రోజు. ఆరోజున వాస్తవం చెబితే, ఆయన ఆనందం ముందు నీ సమస్య చిన్నదైపోయి నిన్ను మన్నించేస్తాడని, ఆరోజున వెళ్లమన్నాను. గుర్తుంచుకో- ఆనందం అధికం చేసుకుంటే సమస్యలు మాయమైపోతాయి!\" అన్నాడు విష్ణుశర్మ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 680,
        "IMAGE": "cat_7",
        "NAME": "సలహాల అంగడి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 107,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల, ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం నాలుగైదు నెలలపాటు చెట్టు తన తీయని పండ్ల ను వాటితో పంచుకొనేది.\n\nరాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకొని నివసించే \"కాలియా\" అనే కాకికి, రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది.ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజా- మెడ వరకూ నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకూ వేయించక శనగపప్పులు ఉన్నాయి! కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది.\n\nఆ సమయానికి కాలియా చెట్టు మీదనే ఒన్నది. క్రిందనుండే అరిచింది రాజు-”ఓ...కాలియా, చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచిరోజో! ఏంటో! ఊహించు! నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది! అదిన్నీ, నాకిష్టమైన భోజనం!\n\nకాలియాకు అదంతా నమ్మసక్యం కాలేదు. ఏ వేటగాడో, కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనకనేమో, దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకింత భయం కూడానూ. అందువల్ల అది రాజుతో \"ఒరే! దాని మానాన దాన్ని వదిలెయ్యి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో. ఈ ఒక్కసారికీ వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు, లేనిపోని ప్రమాదాల్లో పడతావు?” అన్నది.\n\nకానీ రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నై. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నదీ పూర్తీగా విననే లేదు. “ఈ కాకి ఎప్పుడూ 'వద్దు ' అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది, నిజమే. కానీ అది అన్నిసార్లూ ఎలా పనిచేస్తుంది? పట్టుబడకుండా ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు, నాకు. నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశ: ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ పప్పుల్ని ఎలాగైనా సరే, తినాల్సిందే.” అనుకున్నదది.\n\nఅలా అనుకొని, అది కూజా దగ్గరికి వెళ్లింది. సన్నటి దాని చేయి, కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చూ లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కానీ, చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి, చెయ్యి బయటికి రాలేదు! మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు! రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకూ వంచి, లాగి చూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకొని పెచ్చులు ఊడినై,తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలు పెట్టింది- పిడికిలిని మాత్రం తెరవటం లేదు.\n\nకొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినై. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో- “ఓరే! వదిలిపెట్టురా, కోతీ! నీ చేతిలోని పప్పుల్ని వదులు\" అని అరిచింది. “పిడికిలి బిగించకు, తెరిచి పెట్టు. ఆ పప్పుల్ని వదిలెయ్యి. వదిలేస్తే, నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది\" అని కాకి ఎంత మొత్తుకున్నా, మొండి కోతి తన పట్టును సడలించలేదు.\n\nవిడిచిపెట్టటం రాని రాజు, ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలెయ్యటం నేర్చుకోవాలి అందరమూ- పట్టు పట్టడం ఎంత అవసరమో గానీ, పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం! ఏమంటారు? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 681,
        "IMAGE": "cat_7",
        "NAME": "వదిలెయ్యండి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 108,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊళ్లో భీముడనే క్లీనరు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే, పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన మీసాలు, గట్టి శరీరంతో ఉండే భీమన్న అచిరకాలంలోనే డ్రైవరయ్యాడు. కొత్తగా డ్రైవరైన భీమన్నకు, సహజంగానే, తన వృత్తి ధర్మం అంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి.\n\nఅయితే, భీముడికి చిన్ననాటి నుండీ ఒక సమస్య ఉండేది. ఎప్పుడు పడుకున్నాసరే, వెంటనే అతనికి గొప్ప కలలు మొదలైపోయేవి. ఆ కలల ప్రపంచంలో ఉంటూ అతను ఒక్కోసారి భీకరంగా నవ్వేవాడు. ఒక్కోసారీ బాధగా మూలిగేవాడు. ఈ రెండూ చేయనప్పుడు, అతను ప్రశాంతంగా, గది అదిరేటట్లు, గురక పెట్టేవాడు. అట్లాంటి వ్యక్తితో సహజీవనం చెయ్యాలంటే ఎంత ఓపిక అవసరమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. భీముడి భార్య బంగారం నిజంగా బంగారం లాంటిదే. ఆమెకు భీముడే ప్రత్యక్ష దైవం. తన దైవం నిద్రపోతున్నప్పుడు తన కాలి అందెలు మ్రోగి ఆయనకు ఎక్కడ నిద్రాభంగం‌కలిగిస్తాయోనని ఆమె అందెలు పెట్టుకోవటం మానే ‌సింది! భర్త ఎంత పెద్దగా నవ్వినా, ఎంత గట్టిగా గురకపెట్టినా బంగారం మాత్రం బహు చక్కగా సర్దుకుపోతుండేది.\n\nఒకరోజు భీమన్న యథా ప్రకారం లారీ దిగి ఇంటికొచ్చాడు. దూరప్రయాణం చేసి వచ్చాడేమో, భోజనం చెయ్యగానే కునుకు పట్టింది. బంగారం కూడా‌ పని ముగించుకొని వచ్చి పడుకున్నది. నిద్రలో భీమన్నకు డ్రైవింగు పని పడింది. ఇంకేమి, లారీని సుతారంగా తోలటం మొదలు పెట్టాడు. చేతులు స్టీరింగు కోసం తారాడాయి. అంతలో చేతికి భార్య చెవులు దొరికాయి. వాటిని పట్టుకొని భీమన్న కులాసాగా స్టీరింగు తిప్పుతూ లారీని తోలసాగాడు. బంగారానికి ఠపీమని మెలకువ వచ్చేసింది- కా‌నీ భర్తకు నిద్రాభంగం‌కాకూడదని, మిన్నకుండిపోయింది.\n\nఅంతలో లారీ వేగం‌పెంచాల్సి వచ్చింది మెల్లగా. భార్య మెడ కాస్త వేగం పుంజుకున్నది. తల అటూ ఇటూ‌తిప్పేస్తున్నాడు భీమన్న. స్టీరింగు చేజారిపోకుండా ఉండేందుకని, ఆమె చెవుల్ని గట్టిగా దొరకపుచ్చుకుని, తలని బొంగరంలాగా తిప్పటం మొదలుపెట్టాడు. అంతలో‌మరి, రోడ్డుకు ఎత్తుపల్లాలు కనబడ్డాయి. వేగం తగ్గించాలి.. క్లచ్ నొక్కాలి.. గేరు మార్చాలి. ఎడమ కాలు భార్య కాలిని గట్టిగా నొక్కుతూండగా, భీమన్న చెయ్యి గేరుకోసం వెతకసాగింది. అతనికి ఇప్పుడు బంగారం చెయ్యి దొరికింది. ఇక డ్రైవరుగారు ఆ చేతిని ముందుకీ, వెనక్కీ లాగుతూ డ్రైవింగు మొదలుపెట్టారు. భార్యామణి అరుద్దామనుకున్నది- కానీ అరవలేక, రెండో చేత్తో నోటిని అదుముకున్నది. అంతలో ఇంకేముంది, వాహనానికి ఎదురుగా ఒక బర్రె వచ్చి నిలుచున్నది! బ్రేకు వెయ్యాలి! 'బ్రేకు ఏది?' భీమన్న కాలెత్తి, బాగా పైకి తీసి..ఎగ్గిరి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకు బంగారం కెవ్వున అరిచి మంచం మీదినుండి దభీమని నేలనపడింది. అయినా ఆవిడగారికి భర్తను తట్టి లేపేందుకు మనసొప్పలేదు.\n\nఅంతలో భీమన్న లారీ వేగం పెంచాడు. ఎదురుగుండా రోడ్డు వంకర తిరిగి కనబడ్డది, నిద్రలో. ఒక్క ఉదుటున శరీరాన్నంతా ఊపి స్టీరింగును తిప్పబోయాడు. అంతే ఊపుగా తను మంచం మీదినుండి దభీమని క్రిందపడిపోయి, ఒక్క క్షణంపాటు నిశ్చేష్టుడైపోయాడు. చెయ్యి యాంత్రికంగా వెతికింది లైట్ల కోసం. లైట్లువేసి చూసుకుంటే తను గదిలో‌ఒకమూలన పడి ఉన్నాడు. బంగారం రెండో మూలన కూర్చొని బొప్పిగట్టిన తలను తడుముకుంటున్నది! సిగ్గు పడ్డ భీమన్న భార్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు గానీ, మళ్ళీ పడుకోగానే ఇంకొక కల మొదలైతే, మరి ఎవరిది తప్పు? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 682,
        "IMAGE": "cat_7",
        "NAME": "కలతో‌వచ్చిన తిప్పలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 109,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.\r\n\r\nఅడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.\r\n\r\nఅనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.\r\n\r\nఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.\r\n\r\nకోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”\r\n\r\nసింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.\r\n\r\nరోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.\r\n\r\nకొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.\r\n\r\nపొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.\r\n\r\nకుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.\r\n\r\nకుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.\r\n\r\nఅసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.\r\n\r\nకుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.\r\n\r\nసింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.\r\n\r\nకుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.\r\n\r\nబలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 683,
        "IMAGE": "cat_7",
        "NAME": "సింహం-కుందేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 110,
        "TYPE_ID": 7
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్లో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకిక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు- కొట్టంలో చోటు లేదుమరి!\nతన దగ్గరున్న ఆవులన్నింటిలోకీ అణకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడిప్పుడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే, ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పనికూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది.\n\nసుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. రోజూ ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందర్నీ నిద్రలేపేది. ప్రతి రోజూ ఆ కోడిపుంజు కూసే మూడవ కూతకు సుబ్బన్న మేలుకొని, పాలు పిండటానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె- పిసినారి పుల్లమ్మ-కు ఒక దురాలోచన వచ్చింది: ఇక ఆమె రోజూ తొలి కోడి కూతకే మేలుకోవడం మొదలెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది; కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని, ఇంటికి పారిపోయేది.\n\nపాపం, మూడో కోడికూతకు మేలుకొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే, బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు! కారణం అర్ధంకాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు. ఇక లాభం లేదని, తానే స్వయంగా కాపలా ఉండి, ఒక రాత్రంతా మేలుకుని చూశాడు-మాయమవుతున్న ఆవుపాలన్నీ ఎటు పోతున్నాయో తెలుసుకునేందుకు.\nకోడి కూసిందో లేదో, ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరకే వెళ్ళి, ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆపైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థం అయ్యింది. రోజూ పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు.\n\nఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి, అతని గాడిదను ఒక్క రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్నయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు. గాడిదకు ఆ రాత్రి పండగేమరి. అందుకనే, 'ఒక్క రాత్రేమిటి? ఎన్ని రాత్రులైనా సరే, పట్టుకు పొమ్మ'న్నాడు పుల్లన్న.\nఇక సుబ్బన్న రోజూ కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి, దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపుబ్బేట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే, దాన్ని ఆవే అనుకుంటారు.\nఅన్నీ అమర్చిన తరువాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకుని హాయిగా నిద్ర పోయాడు.\nఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు.\nరోజూ సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి, \"అయ్యో! చాలా ఆలస్యమైందే\" అన్నట్లు, గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా 'ఆవు' దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్నిగానీ, పరిమాణాన్ని గానీ గమనించకుండానే, పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో ధబీమని ఒక గట్టి తన్ను శబ్దం, ఆ వెంటనే టంగుమన్న ఇత్తడి కుండ శబ్దం, 'అయ్యో'మన్న అరుపు వెలువడ్డాయి. బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది!\nదొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజులపాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది! దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులూ ఖర్చైనాయి! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 684,
        "IMAGE": "cat_8",
        "NAME": "దెబ్బకు దెబ్బ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "బెళుగుప్ప అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. చిన్న పుల్లయ్యేమో తెలివైనవాడు; కాగా పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు. వారికి అడవి పక్కనే రెండెకరాల పొలం ఉండేది. అదే వారికి జీవనాధారం.\nఒక సారి అన్నదమ్ములిద్దరూ కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు. కొన్నాళ్లకు దోసకాయలు కోతకొచ్చాయి. చిన్న పుల్లయ్యేమో, ఏరోజుకారోజు పండిన కాయలన్నింటినీ కోసి, వాటిని సంతకు తీసుకెళ్ళి, అమ్ముకొచ్చేవాడు; తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు.\nఇదిలా నడుస్తుండగా ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు \"ఏంరా, అన్నయ్యా! ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా, లేదా? అస్థిపంజరంలా ఇలా తయారవుతున్నావేమిటి? ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఎలాగో ఒకలా పరిష్కరిద్దాం\" అని\n\nఅప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. \"ఏం చెప్పమంటావురా చిన్న పుల్లా! రోజూ కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళుతున్నావా! నువ్వలా పోగానే పక్కనున్న అడవిలోనుండి జిత్తులమారి నక్క ఒకటి వస్తోందిరా,..\" అని చెబుతున్నంతలోనే కలుగజేసుకొన్న చిన్నపుల్లయ్య అన్నాడు- \"వస్తే వచ్చింది. అదొస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏమిటి?\" అని. \"అయ్యో ముందర నన్ను అంతా చెప్పనీరా చిన్న పుల్లా! అది వచ్చి, ’ఎవరు గుడిసెలో?’ అంటుంది. అప్పుడు నేను ’నేనే పెద్ద పుల్లయ్యను’ అని చెప్తాను.\n’నువ్వు పుల్లయ్యవైతేనేమి? పులుసయ్యవైతేనేమి? ముందు బైటికి రా’ అంటుంది అది. అప్పుడు నేను బైటికి పోతాను.\nఅప్పుడు ’ఫో!, పోయి నా కోసం మంచి మంచి దోసకాయలను పీక్కురా!’ అంటుంది అది.\nఅపుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి, దానికిస్తాను.\nఅప్పుడది, ’రా! నా వెనక్కొచ్చి నా నడ్డి గోకుదువు, రా!’ అంటుంది.\nఅప్పుడు నేను నడ్డి గోకడానికిగాను దాని వెనక్కు వెళతాను.\n\nఅప్పుడది నేనిచ్చిన దోసకాయలను తింటూ, నన్ను బెదిరిస్తుంది. ’నేనిలా వస్తున్నట్లుగానీ, దోసకాయలు నువ్వు నాకిస్తున్నట్లుగానీ ఎవరికన్నా చెప్పావో, నీ అంతు చూస్తా’నంటుంది. పైగా అప్పుడే అది కంపును విడుస్తుందిరా, చిన్న పుల్లా, అబ్బా! ఆ కంపును భరించలేకనూ, అది నన్నేం చేస్తుందోనన్న భయంతోనూ నేనిలా సన్నబడిపోతున్నానురా చిన్న పుల్లా!\" అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య. అంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నను ఓదార్చుతూ, \"నువ్వేం భయపడకు. దాని గురించి నేను ఆలోచిస్తానుగాని\" అని చెప్పాడు.\nమరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకురావడానికి తను పోకుండా, అన్నను పంపాడు చిన్న పుల్లయ్య. అన్నకు బదులుగా తోటలోని గుడిసెలో తను ఉండి, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. అంతలోనే ప్రతి రోజూమాదిరే నక్క వచ్చి కూర్చున్నది: ’ఎవరు లోపల?’ అని అడుగుతూ.\nఆ తరువాత ‘నడ్డి గోకమనే వరకూ’ అంతా యధాప్రకారం జరిగింది. నడ్డి గోకుతూ, చిన్న పుల్లయ్య నక్కతో అన్నాడు, \"దాహమవుతోంది లోపలికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను\" అని.\n\"ఊ..ఊ.. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళి త్వరగా రా\" అన్నది నక్క.\n\"ఇదిగో ఇప్పుడే వస్తానండీ నక్కగారూ!\" అని లోపలికి వెళ్ళాడు చిన్న పుల్లయ్య. చింతనిప్పుల్లో తాను ముందుగానే పెట్టిన ఇనుప కడ్డీని తీసుకెళ్ళి, ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టి వాత పెట్టాడు. ఆ దెబ్బకు హడలిపోయిన నక్క, కుయ్యో మొర్రోమంటూ వెనక్కి చూడకుండా పరుగుతీసింది. ఆపైన ఇక దానికి మళ్లీ దోసతోట గుర్తుకురాలేదు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 685,
        "IMAGE": "cat_8",
        "NAME": "దోసతోట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది.\nఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో\nలలిత, రాజులు మంచి స్నేహితులు.\nఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి\nఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే\nపిల్లవాడు అక్కడున్న పిల్లలతో \"ఒరే! మన ఊరి చివరి\nపెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి,\nఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి\nతెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను\nఇస్తాను\"అని చెప్పాడు.\nరాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి\nచీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ\nరోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి\nఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది.\nదాంతో వాడు \"నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి\nవెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి, నీకు\nచూపిస్తాను!\" అని సోముతో పందెం కాశాడు.\nఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా\nధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చిలైటును\nతీసుకొని, ఆరోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద\nబంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి\nబంగళాను సమీపిస్తుండగా, చీకట్లో రాజు కాలికి ఏదో\nతగిలినట్లనిపించింది! వెంటనే రాజు భయపడి,\nగట్టిగా \"దెయ్యం!దెయ్యం!\" అని అరిచాడు.\nఅప్పుడు లలిత \"భయపడకు రాజూ! నా దగ్గర\nటార్చిలైట్ ఉంది కదా! అదేమిటో చూద్దాం, ఆగు- ఒక్క\nనిముషం-\" అంటూ అటు వైపుకు\nటార్చిలైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న\nకుందేలు- భయం భయంగా రాజుకేసే చూస్తూ\nఉన్నది! 'హమ్మయ్య!' అనుకుని ఇద్దరూ\nముందుకు నడిచారు.\nబంగళా వచ్చేసింది- కానీ రాజుకు మాత్రం\nమనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి.\nఅవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం\nవేస్తోంది. బంగళా గేటు తీసేసరికి, రాజు ఏపనీ\nచెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పుడు లలిత\nతనే పెద్ద పూలచెట్టు పైకెక్కి, ఒక పువ్వును\nకోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు.\nపువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ\nరాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి..\nదారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మిణుగురు\nపురుగులు తిరుగుతూ ఉన్నాయి.. ఏవేవో\nగుర్తుకు వస్తున్నాయి! రాజు అలా\nభయపడుతూండగానే వాళ్లిద్దరూ ఊరు\nచేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి,\nటాటా చెప్పి, వాళ్ల ఇంటికి పోయింది.\nఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం\nపిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ\nపువ్వును తీసుకెళ్ళి సోముకు ఇచ్చాడు. కానీ,\nసోము మాట నిలుపుకోలేదు. పది నెమలి ఈకల్ని\nఇవ్వలేదు రాజుకు.\n\"రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి, ఈ\nపువ్వును తీసుకు వచ్చావు. -లేకపోతే నీకు\nఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ!\" అని సోము\nరాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు.\nతానొక్కడే వెళ్లి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు.\n\"ఒక వేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే-\nఅదిగో చూడు , లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్లి,\nఆమెను ఒక దెబ్బ కొట్టిరావాలి!\" అంటూ మరో\nపందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం\nలేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ\nతనని వెక్కిరిస్తారని, అతను పోయి లలిత చెంప మీద\nఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని\nఅందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు పది\nనెమలి ఈకల్ని ఇచ్చేశాడు.\nరాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి- కానీ, ఆ\nతరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు.\nబంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన\nపందెం కారణంగా చెడిపోయింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 686,
        "IMAGE": "cat_8",
        "NAME": "స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు. వాళ్లకు ఒక కొడుకు. వాడి పేరు రవి. ఒట్టి అమాయకుడు. వాళ్లకు రెండు మేకలు ఉండేవి. ఒకరోజున రవి వాళ్ల నాన్న \"ఒరేయ్ రవీ! ఇవ్వాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్లు\" అని చెప్పాడు.\n\n`సరే'నన్న, రవి చద్ది కట్టుకొని, కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే, బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టుకింద కూర్చుని, రవి తనతోపాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని రెండు మేకలూ నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకరా నమలుతున్నాయి. ఆ శబ్దం విన్న రవి మేకలు రెండూ తనను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు. ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి! అక్కడ పడివున్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి మళ్లీ! ఈ సారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు రెండింటినీ నరికేశాడు. ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు. రవి తండ్రి చాలా బాధ పడ్డాడు కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు.ఆ మరునాడు రవి నట్టింట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. పైన వాసాలమధ్యలో ఒక ఎలుక అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఎంత తరిమినా ఎలుక పోవటం లేదు. చూసి చూసి రవికి విసుగు అనిపించింది. ఎలుకను చంపడంకోసం ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు మొత్తం కాలిపోగా పడిపోతున్న వాసాలు ’కిర్ కిర్’ మని శబ్దం చేస్తూంటే, రవి మాత్రం ఎలుకను చంపానన్న ఆనందంతో గంతులు వేయసాగాడు. ఇంటికొచ్చి జరిగినదాన్ని చూసిన రవి తండ్రి రవిని నాలుగు వాయించాడు. కొత్త కొట్టం వేయడానికి వాసాలు కొట్టుకొని రమ్మని అడవికి పంపాడు. అడవికెళ్లి తీరికగా మూరెడు పొడవుండే కట్టెలు కొట్టుకొచ్చాడు రవి. కొడుకు వెర్రిబాగులతనానికి భాదపడ్డ అతని తండ్రి ’నేను అడవికి వెళ్లి వాసాలు కొడతాను. నువ్వు అన్నం తీసుకుని, బండి కట్టుకురా’ అని చెప్పి వెళ్లాడు.\n\n`సరే'నన్న రవి చద్ది గంపను బండిలో పెట్టుకొని, అడవివైపుకు బండిని తోలాడు. బండి అడవిలో ప్రవేశించింది. ఎక్కడా శబ్దాలు లేవు. దూరంగా పక్షులు కిల కిలమంటుంటే, రవి నడుపుతున్న బండి చక్రాలు కిర్రు కిర్రుమంటున్నై. వింటున్న రవి మెదడులో ఓ ఆలోచన మొదలైంది- \"అయ్యో! బండి చక్రాలకు ఆకలౌతున్నట్లుంది\" అని. చూసిచూసి వాడు చద్ది గంపలోని ముద్దలను కాస్తా బండి చక్రాలకిందికి వేశాడు. అయినా అవి కిర్రుమంటుంటే వాడికి అనిపించింది- చక్రాలకు నీళ్లు దప్పికౌతోందేమో’ అని. ఆ ఆలోచన రాగానే వాడు ఎద్దులను విడిచి, బండిని బావిలోకి తోస్తూ \"త్వరగా నీళ్లు తాగొచ్చెయ్\"మని చెప్పేశాడు. బావిలో పడ్డ బండి ఎంతకీ బయటికి రాలేదు. \"పాపం, బండికి ఇంకా దాహం తీరినట్లు లేదు\" అనుకున్నాడు రవి. ఎద్దులను అక్కడే వదిలి వాళ్ల నాన్నను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. జరిగినదాన్ని తెలుసుకున్న వాళ్ల నాన్న, ’ఇక నువ్వు ఇంట్లోకి రావద్ద’ని, వాడిని తరిమేశాడు.\nభయపడ్డ రవి ఆ నాటి రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఊరి చివరన గుళ్లో పడుకుందామని పోయేసరికి, అక్కడ ఒక దొంగ అమ్మవారికి మొక్కుతూ కనిపించాడు:\" అమ్మా! ఇవాళ్ల మంచి సొమ్ముండే ఇంటికి వెళ్ళేట్టుచూడు తల్లీ\" అని.\n’నేనూ వస్తాను’ అన్నాడు రవి.\n’సరే’నన్నాడు దొంగ.\nఇక ఇద్దరూ కలిసి ఆ చీకటి పూట ఒక ఇంటికి వెళ్లారు. అది ఊరి జమీందారు గారి ఇల్లు. \"ఇక్కడ మనమేం చెయ్యాల\"ని దొంగనడిగాడు రవి.\n\"ఏదైనా పెద్దదాన్ని పట్టుకుపోదాం\" అన్నాడు దొంగ.\nవెంటనే రవి దగ్గర్లోనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తాడు - ఎత్తుకు పోదామని. అయితే పాపం, ఆ బరువును మోయలేక వాడు దాన్ని మధ్యలోనే కింద పడేశాడు. `దబ్బు'మంటూ రాయి కింద పడగానే మేలుకున్న పని వాళ్లు దొంగను పట్టుకున్నారు.\nఅందుకు కారణమైన రవిని అభినందించారు జమీందారుగారు. మరి ఆయన అభినందనల ప్రభావమో, లేక ఆయన తనను పనిలో పెట్టుకున్నారన్న సంతోషం రవికి కలగటం వల్లనో ఏమో, క్రమంగా రవి వెర్రిబాగులతనం పోయి, అందరిమాదిరి సంతోషంగా జీవించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 687,
        "IMAGE": "cat_8",
        "NAME": "వెర్రిబాగుల రవి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "బాగా పేరున్న గణిత శాస్త్రవేత్త ఒకాయన, ఓసారి కులాసాగా ఒక పర్వత ప్రాంతంలో పోతుండగా ఆయనకో గొర్రెల కాపరి ఎదురయ్యాడు- పెద్ద గొర్రెల మందతో. ఆ మందలో చిట్టి చిట్టి గొర్రె పిల్లలు, బొచ్చు గొర్రెలు- చూసేందుకు ఎంతో ముచ్చటగా వున్నాయి. వాటిని చూడగానే ఆయన పరవశించి పోయాడు. 'ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించి పెంచుకోవాలి' అనే కోరిక ఒకటి ఉదయించింది ఆయన మనసులో . దాంతో ఆయన ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి \"ఏమోయ్! నీ గొర్రెను ఒకదాన్ని నేను కొనాలనుకుంటున్నాను; ఎంత ఖరీదు అవుతుందో చెప్పు\" అని అడిగాడు.\nగొర్రెల కాపరి శాస్త్రవేత్తను తేరిపార చూశాడు. ఓ నిముషం తర్వాత \"నా గొర్రెలు అమ్మేవి కావు\" అని సులభంగా ముగించేశాడు.\nకానీ శాస్త్రవేత్తకు గొర్రెని పెంచుకోవాలని ఉంది! ఆయన గొర్రెలతన్ని రకరకాలుగా బ్రతిమాలాడు; ప్రాధేయపడ్డాడు- అయినా ప్రయోజనం లేకపోయింది- ఎందుకనో, గొర్రెల కాపరికి గొర్రెను అమ్మటం ఏ మాత్రం ఇష్టం లేదు!\nచివరికి గణిత శాస్త్రవేత్తకు ఓ ఉపాయం తట్టింది. అతను గొర్రెల కాపరితో అన్నాడు- \"చూడు బాబూ! నీ మందలో ఉన్న గొర్రెలను నేను ఒక్కొక్కదాన్నీ లెక్కించను- అయినా నీ దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలున్నాయో ఖచ్చితంగా చెబుతాను. మరి నేను చెప్పే సంఖ్య సరయినదే అయితే, నా కష్టానికి ప్రతిఫలంగా నువ్వు నాకో గొర్రెను ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పు- సరేనా ?\" అని అడిగాడు.\nగొర్రెల కాపరికి ఆ పందెం ఏమంత నచ్చలేదు. అయినా పందానికి ఒప్పుకున్నాడు.\nవెంటనే గణిత శాస్త్రవేత్త తన సంచీలోంచి ఒక కంప్యూటరును బయటికి తీశాడు. దానిలో ఆ ప్రాంతపు ఉపగ్రహ చిత్రం వెతికాడు. అక్కడున్న గొర్రెలు ఎన్నో లెక్కించమన్నాడు కంప్యూటరును. \"ఇవి మొత్తం నూట రెండు\" అని తేల్చి చెప్పేశాడు.\n\"మీరు చెప్పింది నిజమే!\" ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి- \"...ఈ మందలోంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి\" అన్నాడు.\nశాస్త్రవేత్తగారికి చాలా సంతోషం వేసింది. వెంటనే మందలోకి వెళ్ళి, దిట్టంగా, బలంగా ఉన్న ఓ జీవాన్ని ఎంచుకొన్నారు. ఓసారి గొర్రెలకాపరికేసి చూసి, అతను గొర్రెపిల్లను ఎత్తుకున్నట్లే తనూ తను ఎంపిక చేసుకున్నదాన్ని భుజాల పైకి ఎత్తుకున్నారు.\nఅదేదో తేలికగానే ఉంటుందనుకున్నాడు తను- తీరా చూస్తే అది చాలానే బరువు ఉంది! \"దీన్ని మోసుకొని వెళ్ళటం కొంచెం చాలా కష్టమేరా\" అనుకుంటూ వచ్చిన దారినే పోయేందుకు వెనక్కి తిరిగారు, శాస్త్రవేత్త గారు.\nఅంతలోనే గొర్రెల కాపరి అరిచాడు వెనకనుండి- \"సామీ! ఒక్క నిమిషం ఆగండి! నాక్కూడా మీతో ఓ పందెం కాయాలని ఉంది. మీ వృత్తి ఏంటో నేను సొంతంగా ఊహించి చెప్పేస్తాను. ఒకవేళ నా ఊహ సరైనదే అయితే మీరు గెల్చుకున్న జీవాన్ని నాకు తిరిగిచ్చేయాలి...\" అన్నాడు.\nవాడి పల్లెటూరి మాటలకు లోలోపలే నవ్వుకున్నారు గణిత శాస్త్రవేత్తగారు. 'సమయం వృధా చేయడం తప్ప వీడు ఏమీ సాధించలేడు పాపం' అనుకున్నారు. పైకి \"అలాగే.. నువ్వడిగిందీ న్యాయంగానే వుంది. కానివ్వు- చెప్పు నేనెవరిని?\" అన్నారు చిద్విలాసంగా నవ్వుతూ..\nవెంటనే గొర్రెల కాపరి చెప్పేశాడు: \"తమరు ఒక గణిత శాత్రవేత్త! \" అని!\nఊహించని ఈ జవాబుకి ఒక్క క్షణంపాటు బిత్తర పోయారు గణిత శాస్త్రవేత్త గారు. కొంచెం సేపటి తర్వాత తేరుకొని \"నీకెలా తెలిసింది...?\" అని అడిగారు.\n\n\"చాలా సులభమండయ్యా! తమరు కంపూటర్లో చూసి గొర్రెలు ఎన్నో కచ్చితంగా చెప్పేశారు.. అంటే 'తమకు లెక్కలు బాగా వొచ్చు' అని అర్థం అయ్యింది. కానీ అయ్యా, మందలోంచి గొర్రెను ఎంచుకొనే దగ్గర తమరు పప్పులో కాలేసారు. తమరు ఎత్తుకున్నది గొర్రెపిల్ల కాదు.. అది నా పెంపుడు కుక్క! దీన్నిబట్టి నాకు అర్థం అయిందండయ్యా, తమరి వృత్తి ఏంటో- తమరు గాలిలో లెక్కలు వేయగల్రు గానీ, భూమ్మీది లెక్కలు చేయలేరు- అంటే తమరు గణిత శాత్రవేత్తే అవ్వాలి గదా!\" అన్నాడు. గొర్రెల కాపరి మొరటు తార్కికతకు గణిత శాస్త్రవేత్తగారి కళ్ళు తిరిగాయి. ఆయన గర్వం అణగిపోయింది. సిగ్గుతో నోట మాట రాలేదు! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 688,
        "IMAGE": "cat_8",
        "NAME": "గణిత శాస్త్రవేత్త",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలావాటినిసాధించాడు.ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టుకింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరు గాలితో కూడిన వాన ఒకటి, మొదలైంది.అలా మొదలైన వాన చాలా సేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు.\nదగ్గర్లోనే ఉన్న పొదలచాటుకు వెళ్ళాడు; తను కూర్చున్న చెట్టు మొదలుకు అంటిపెట్టుకుని,ముడుచుకు కూర్చున్నాడు; ఎంత చేసినా వాన చినుకులను ఆయనజయించలేకపోయాడు.బాగా తడిసిపోయాడు.వాన చాలాసేపు కురిసింది.\nఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటంలేదు కూడాను, అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది.చాలాసేపు జోరుగా కురిసిన తరువాత వాన ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది.\nపారే వాననీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి.ఆ సమయానికే, పశువులు కాసే పిల్లవాడొకడు, ఋషి కూర్చున్న చెట్టు ముందునుండి పోతున్నాడు.\nమేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను, వాడు ఊరి వైపుకు తోలుకుపోతున్నాడు. అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు. పొడిపొడిగా ఉన్న బట్టలతోపిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకు పోతున్నాడు.\nపైగా అతను వానమీద ఒక మంచి జానపదాన్ని రాగయుక్తంగా పాడుతూ పోతున్నాడు, కులాసాగా.ఋషికి ఆశ్చర్యం వేసింది.ఆయన అనుకున్నాడు: \"ఎన్ని విద్యలు నేర్చినాను, నేను? కానీ వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు. ఈ పిల్లవాడ్ని చూస్తే ఏ విద్యా నేర్చినట్లులేడు, కానీ వానకు ఏమాత్రం తడవలేదుకదా! ఏమిటో ఆ విద్య?\" అని\n.ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చాడో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్లు లేదు. తెల్లవారిన క్షణంనుండీ ఆయన 'ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకు వస్తాడా' అని ఎదురుచూశాడు.\n\nఅంతలోనే అబ్బాయి 'హెయ్! డ్రుర్, డ్రుర్ ర్ ర్' అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు.ఉండబట్టలేని ఋషి అడిగాడు: \"అబ్బాయీ! నిన్న జోరుగా వాన కురిసిన తరువాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా, పొడిపొడిగా ఉన్న బట్టలతో ఊరివైపుకి పోవడం నేను గమనించాను. ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వెలా ఉండగలిగావు?\" అని.పిల్లవాడు సిగ్గుపడుతూ నవ్వాడు: \"ఓ అదా! ఏమీ లేదు స్వామీ! వాన వస్తుందని అనిపించగానే, గోచితప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న లొట్టి (చిన్నకుండ) లోకి దురికేశాను(అదిమి పెట్టాను) . ఇక వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయిమీద బోర్లించి పెట్టేశాను. నేను వెళ్ళి చెట్టుకింద నెమర్లు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవుల నీడన కూర్చున్నాను- అంతే. నేనూ పెద్దగా తడవలేదు;\nనా బట్టలు అసలే తడవలేదు\" అన్నాడు.వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైన ఋషి చిరునవ్వు నవ్వాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 689,
        "IMAGE": "cat_8",
        "NAME": "దిగంబర రహస్యం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు.\nఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో \"ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను\"అని చెప్పాడు.\nరాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు \"నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి, నీకు చూపిస్తాను!\" అని సోముతో పందెం కాశాడు.\n\nఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చిలైటును తీసుకొని, ఆరోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా, చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది! వెంటనే రాజు భయపడి, గట్టిగా \"దెయ్యం!దెయ్యం!\" అని అరిచాడు. అప్పుడు లలిత \"భయపడకు రాజూ! నా దగ్గర టార్చిలైట్ ఉంది కదా! అదేమిటో చూద్దాం, ఆగు- ఒక్క నిముషం-\" అంటూ అటు వైపుకు టార్చిలైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు- భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది! 'హమ్మయ్య!' అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు.\n\nబంగళా వచ్చేసింది- కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేటు తీసేసరికి, రాజు ఏపనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పుడు లలిత తనే పెద్ద పూలచెట్టు పైకెక్కి, ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి.. దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మిణుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి! రాజు అలా భయపడుతూండగానే వాళ్లిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి, టాటా చెప్పి, వాళ్ల ఇంటికి పోయింది.\nఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్ళి సోముకు ఇచ్చాడు. కానీ, సోము మాట నిలుపుకోలేదు. పది నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు.\n\"రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి, ఈ పువ్వును తీసుకు వచ్చావు. -లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ!\" అని సోము రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్లి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు.\n\n\"ఒక వేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే- అదిగో చూడు , లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్లి, ఆమెను ఒక దెబ్బ కొట్టిరావాలి!\" అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని, అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు పది నెమలి ఈకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి- కానీ, ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 690,
        "IMAGE": "cat_8",
        "NAME": "స్నేహితులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అలగ్జాండర్ జైత్ర యాత్ర సందర్భంగా భారత దేశంలో\nప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక\nసాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు.\nసైనికులతో కూడిన రాజుని చూసినా ఆ సాధువు\nచలించలేదు. అలగ్జాండర్ మొదట్లో కోపం\nతెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల\nగురించి తన గురువు గారు ఇచ్చిన సూచనలు\nజ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరిగా వచ్చి అతడిని\nపరిశీలనా గా చూశాడు.\nఆనంద పారవశ్యం తో\nనిండిన తేజోవంతమైన సాధువు ముఖ వర్చస్సు\nచూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట.\nనేను విశ్వవిజేత అలగ్జాండర్ ని. ప్రపంచాన్ని\nఅంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని\nఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను\nఅంత ఆనందంగా ఉండలేక పోతున్నాను.\nఏమీ లేని\nఒక గోచీ పెట్టుకుని ఎండలో మాడుతూ అంత\nఆనందంగా ఉన్నావు ఎట్లాగ? అప్పుడు ఆ\nసాధువు ఎదురుగా ఉన్న ఒక బండ రాయి ముక్కని\nతెప్పించి రాజుని చేతులు చాచమని ఆ చేతులలో ఈ\nరాయిని ఉంచి అట్లాగే పట్టుకో మన్నాడు.\nకొంత\nసేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి\nపుట్ట సాగాయి. కాని సాధువు అట్లాగే పట్టుకో\nమన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు\nఇంకా నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు ఇంకా\nఅట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు\nగడిచింది.\nచేతులు విపరీతంగా నొప్పి పుట్ట\nసాగాయి. కానీ సాధువు లో ఉలుకు లేదు పలుకు\nలేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని\nజార విడిచాడు.\nఇప్పుడు ఎట్లా ఉన్నది అని సాధువు రాజుని\nఅడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబు\nఇచ్చాడు. ఒక్క రాయిని వదిలివేస్తేనే నీకు అంత\nహాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ\nవదిలి వేశాను కదా ఇంకెంత హాయిగా ఉంటాను అని\nసాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కు అయ్యాడట.\nఅప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం\nతలకి ఎక్కింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 691,
        "IMAGE": "cat_8",
        "NAME": "భారతీయత యొక్క అసలు గొప్పతనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు.\"అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు\" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.\n\nఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు.\"స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి\" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ \"అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు\" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి\" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.\n\nఅతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- \"నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం\" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.\n\nఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు. ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, \"స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం\" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ \"నాకేం భయం లేదు\" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.\n\nఅలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, \" దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?\" అని నిష్టూరమాడాడు.\n\nనారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు.\"అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?\" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?\" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. \"మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి\" అంటూ తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 692,
        "IMAGE": "cat_8",
        "NAME": "రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "మహా శివరాత్రి పర్వ దినాన తెల్లవారకముందే\nఒక బ్రాహ్మడు, సముద్ర స్నానానికి వెళ్ళాడు.\nఅప్పటికింకా ఆటే జనం సముద్ర తీరాన్ని చేరలేదు.\nబ్రాహ్మడి దగ్గర ఒక రాగి చెంబున్నది.\nదాన్ని ఒడ్డున విడిచి తాను సముద్రంలోకి దిగితే\nఎవరైనా చేతివాటు వెయ్యగలరని భయపడి , బ్రాహ్మడు\nతన రాగి చెంబుని ఇసుకలో పూడ్చి గుర్తుగా ఉంటుందని\nఅక్కడ ఇసుకతో ఒక లింగాకారం తయారు చేసి\nతరువాత స్నానానికి వెళ్ళాడు.\nఆ సమయానికి స్నానం కోసం అక్కడ చేరిన వాళ్ళు\nశివరాత్రి నాడు ఇసుక లింగం తయారుచేసి స్నానం చేస్తే\nపుణ్యం కాబోలని తాము కూడా ఇసుక లింగాలు చేసి\nసముద్రంలో దిగారు.\nవారిని చూసి వీరు, వీరిని చూసి ఇంకోరూ,\nఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చినవారంతా\nఒడ్డున వేనకు వేల సంఖ్యలో ఇసుక లింగాలు తయారు\nచేసి సముద్రంలో దిగడం వల్ల, బ్రాహ్మడు తిరిగి వచ్చి\nతాను చేసిన లింగం ఏదో పోల్చుకోలేకపోయాడు.\nరాగిచెంబు కాస్తా పోనేపోయింది ! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 693,
        "IMAGE": "cat_8",
        "NAME": "అనంతకోటిలింగాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి వుండేవాడు. ప్రతిరోజూ ఊరిబయట వున్న చెరువుకు వెళ్ళి, చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి. ఒక రోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదేదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి,\"ఓ జాలరీ! నేను ఈ చెరువుకు రాణీ చేపను. నీ చేపల వేటవలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది. అందువల్ల నేటినుండీ నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానెయ్యాలి. అయితే నీ నోటిదగ్గర కూటిని తీసేసే ఉద్దేశ్యం నాకు లేదు. చేపలవేట ఆపినందుకు ప్రతిగా నీకేంకావాలో కోరుకో ఇస్తాను.\" అని పలికింది.\n\nఅమాయకుడైన వెంకన్నకు ఏంకోరుకోవాలో అర్దంకాక,\"నేను రేపు వచ్చి అడుగుతాను\" అని చెప్పి, రాణి చేపను వల నుండీ విడిచిపెట్టి ఇంటి దారిపట్టడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగినదంతా చెప్పాడు. అంతావిని ఆమె \"ఏడ్చినట్టేఉంది మీ తెలివి. పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడగక, సలహాకోసం ఇంటికోస్తారా? ఆ రాణిచేప కాస్తా రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్పమిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి” అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరికమేరకు పెద్దబంగళా, బోలెడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు. చేప \"సరే ఇంటికి వెళ్ళు అన్నీ వస్తాయి\" అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది.\n\nవెంకన్న ఇల్లు చేరేసరికి తనగుడిసె స్థానంలో పెద్దబంగళా, ఇల్లంతా ఖరీదైన సామన్లతో కళకళలాడుతూ కనిపించింది. అతడి భార్య వంటినిండా నగలు దిగేసుకుని ఎదురొచ్చింది. \"అన్నీ బాగానే ఉన్నయిగానీ, నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా వుంది. కనుక తక్షణమే మళ్ళీ వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపను అడుగు\" అని వెంకన్నను చెరువుకు, తరిమింది. భార్యమాట కాదన లేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న. రాణిచేప బైటకు వచ్చి,\"ఇచ్చినవి చాలలేదా? ఇంకేం కావాలి? \" అని అడిగింది. \"నా భార్యను మహారాణిని చెయ్యి\" అని కోరుకున్నాడు వెంకన్న. రాణీ చేప నవ్వి \"రాణి యోగం ముళ్ళకిరీటం వంటిది. భరించడంకష్టం. బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా? \" అని ప్రశ్నించింది \" అదంతా నాకు తెలియదు. మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు\" అని పట్టుబట్టాడు. \"సరే నీఇష్టం. అభీష్టసిద్దిరస్తు . కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువుకు రావద్దు\" అని వెళ్ళిపోయింది.\n\nవెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. గత బంగళా స్థానంలో ఇప్పుడొక పెద్ద రాజమహలు వెలసింది. ఇంటినిండా నౌకర్లు, పరిచారికలతో రాణీవాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధానద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నరు. లోపలకు వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా \"నన్నెందుకు ఆపుతున్నారు? నేనీ ఇంటికి యజమానిని. లోపల ఉన్నమహారాణి నా భార్య\" అని చెప్పాడు. మట్టికొట్టుకుపోయినదుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. \"చేపలు పట్టేవాడిలా ఉన్నావు. నువ్వు రాణి గారి భర్తవేంటి? పోపో\" అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడాడు \"కావాలంటే ఒక సారి వెళ్ళి రాణిగారిని కనుక్కుని రండి\" అని బ్రతిమిలాడాడు. వెంకన్న ను వదిలించుకునే దారిలేక, వారిలో ఒకరు రాజమహలు పైఅంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పడు. \"ఎవరో అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి. మీ భర్తనని బుకాయిస్తున్నడు. పొమ్మంటే పోవడంలేదు\" అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తునుండీ ప్రధానద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరివలన ధనమదంతో కళ్ళుకు పొరలుకమ్మినట్లు భర్తను పోల్చలేక. \"ఛీఛీ! వీడెవడో అడుక్కునేవాడే. తన్ని తరిమేయండి.\" అని ఆజ్ఞాపించి లోపలకు వెళ్ళిపోయింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేసారు.\n\nఅవమానంతో దు:ఖం కమ్ముకోగా కాళ్ళీడ్చుకుంటూ తిరిగి చెరువుదగ్గరకు చేరాడు. రాణీచేపను పిలిచాడు. చేప బైటకు వచ్చి \"మళ్ళీ వచ్చి ఇంకేమి అడగవద్దని చెప్పానుగా ? ఎందుకొచ్చావ్?\" అంది కోపంగా. \"నేనిప్పుడు అడగడానికి రాలేదు. ఇచ్చినవి వద్దని చెప్పడానికి వచ్చాను. నువ్విప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుడ్ని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకంలేదు. చేపలు పట్టటం నీకు అభ్యంతరమైతే, కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాము. అదీ కుదరకపోతే కలోగంజో తాగి బ్రతుకుతాము. అంతేగానీ ఈ నడమంత్రపు సిరి మాకొద్దు\" అని వేడుకున్నాడు. రాణీ చేపనవ్వి \"సరే నీకు శుభం కలుగుతుంది వెళ్ళు\" అని మాయమైంది.\n\nవెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిశలో అతడి భార్య కట్టెల పొయ్యిమీద వంట చేయ్యడానికి అవస్తపడుతూ కనిపించింది. భర్తను చూస్తూనే ఆప్యాయంగా, \"ఇంతాలశ్యమైందేం? త్వరగా కాళ్ళు చేతులూ కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను\" అంది. వెంకన్న ఊపిరిపీల్చుకొని మనసులోనే రాణీచేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 694,
        "IMAGE": "cat_8",
        "NAME": "నడమంత్రపుసిరి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డతరువాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తియ్యని పండ్లు తింటూ, తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది.\nఒక పెద్దచెట్టు కింద కాళ్ళు బోర్లాచాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది.\nవెంటనే చెట్టుమీదనుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు\nమూపురంమీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు\nవిదిలించుకుంటూ కళ్ళు తెరిచింది.\n\nచిలుక చెట్టుమీదకి చేరి కిలకిలా నవ్వింది. ’ఏయ్ చిలకా! నా నిద్ర ఎందుకు పాడుచేశావ్?’ అంది ఏనుగు కోపంగా. ’ఊరికే’ అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్లు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి, ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి, వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు ’ఏయ్ చిలకా! నీకేం పనిలేదా?’ అంటూ కోపంగా ఘీంకరించింది. కానీ చిలుక మరో రెండుమూడు సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడినుంచి లేచి బయలుదేరింది.\n\nచిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టుమీద వాలింది. ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తలా, మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది.\nఅది చూసిన చిలుకకు మరింత ఉత్సాహమనిపించింది. అది అనుకుంది, \"ఆహా! నాకన్నా వెయ్యిరెట్లు బలమైన ఏనుగుకూడా నా\nదెబ్బకు భయపడిపోయి, వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు\" అని. ’ఊ.... ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా’ అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని\nపొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా\nఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని \"ఉఫ్...\" మంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక, ఇక ఎగరలేక, ఆ చెరువులో పడి గిలగిలా\nకొట్టుకున్నది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డుమీదికి విసిరేసింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను\nక్షమించమని అది ఏనుగును వేడుకొన్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి, తన దారిన తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం, చిన్నంతరం తెలిసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 695,
        "IMAGE": "cat_8",
        "NAME": "చిలుక-ఏనుగు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక\nరోజున తన పని చేసుకుంటూ ఉండగా\nకను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా\nకనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని\nగుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి\nభార్యకు ఇచ్చాడు.\n\nఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల\nతరువాత కుంకుడు కాయలు కొట్టడానికి\nరాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది\nతరువాత ఆ రాయిని అదే పనికి\nచాలా సార్లు వాడుకున్నది.\n\nఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ\nరాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.\nకొద్ది సేపటికి\nఅటుగా మిఠాయిలు అమ్ముకునే అతను\nవచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి\nచుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు\nచేతిలో పట్టుకుని\nవెళ్ళాడు.\n\nఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను\nబాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ\n(పల్లీపట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు\nసంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.\nసాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని\nస్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే\nఅతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని\nఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ\nస్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.\n\nఅతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి\nచెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి\nవస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి\nఅమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా\nఅని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము\nతీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.\nబాగుంది\nకదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా\nవాడసాగాడు.\n\nకొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి\nవచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ\nరాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి\nతీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు\nవిలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.\n\nనీతి :-\nఅదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు\nకొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ\nఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ\nకోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.\nఒకళ్ళు దాన్ని\nపేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని\nగురించి తెలిసిన వ్యక్తి దాని విలువ\nరాబట్టుకున్నాడు.\n\nఅట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో\nఅరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి\nఅన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి\nఉంటుంది. మానవ జీవిత పరమార్థం\nతెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ\nజీవన్ముక్తి పొంద గలుగుతారు.\nలేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.\nజీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం - జీవన గమనాన్ని\nసాగిద్దాం.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 696,
        "IMAGE": "cat_8",
        "NAME": "మానవజన్మ విలువ ఎంత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన\nప్రకటనలు చేయటం సరదాగా ఉండేది.\nఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం\nచెప్పిన వారికి 500 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటించాడు.\nఎందరో రాజాస్ధానానికి వచ్చ్హి అబద్ధలు చెప్పారు. కాని ఎవరూ బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్ప లేదని ఆ రాజు భావించాడు.\nఒక రోజు, రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా, ఒక యువకుడు వచ్చాడు.\nప్రభూ! మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను\nఅని అడిగాడు\nఅవును. అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు కాని దానికన్నా ముందు మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా\nఇస్తానని ప్రకటించారు వాదించాడు యువకుడు.\nపెద్ద అబద్ధం. నేనెప్పుడూ అలా\nప్రకటించలేదు యువకుడి ఆలోచన\nపసికట్టలేని రాజు వెంటనే అన్నాడు.\nఅప్పుడా యువకుడు ప్రభూ! మీరే\nఒప్పుకున్నారు. నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి అన్నాడు.\nరాజుగారు అతని చతురతకి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.\nనీతి : సమయస్పూర్తితో కూడిన\nచతురత అన్నివేళలా విజయం\nసాధిస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 697,
        "IMAGE": "cat_8",
        "NAME": "చతురతకి బహుమతి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక రాజుగారి తల్లి\nచనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు\nమామిడి పండ్లు తినాలని వుంది తెప్పించమని\nఅడిగిందట.\nఅది మామిడి పండ్ల కాలం\nకాకపోవడము తో ఎక్కడా పండ్లు\nదొరకలేదట.ఆమె మామిడి పళ్ళు తినకుండానే\nచనిపోయింది.రాజుగారికి తన తల్లి చివరి కోరిక\nతీర్చలేక పోయానే అని బాధపడుతూండే\nవాడట.\nదురాశా పరుడైన ఆయన పురోహితుడు\nరాజా! మీరు దిగులు చెంద వలిసిన అవసరం\nలేదు.ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి\nసంవత్సరమూ ఆవిడ తిథి నాడు\nబ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు\nదానం చేయ వచ్చు.\nఅని చెప్పాడట.రాజుకు అది\nనచ్చింది.రాజుతలుచుకుంటే దెబ్బలకు కొదువా\nఅన్నట్టు\nబంగారు మామిడి పళ్ళు తయారైనాయి.ఆవిడ\nతిథి నాడు అందరు బ్రాహ్మణు లకూ తలో\nబంగారు మామిడి పండు దొరికింది.\nమంత్రి గారికి\nమాత్రం యిది నచ్చలేదు.ప్రతి\nసంవత్సరమూ యిలా యిస్తూ పోతే ఖజానా ఖాళీ\nఅవడం ఖాయం.అని రాజుగారి విదూషకుడిని\nపిలిపించి దీని కేదైనా పరిష్కారం చెప్పు.అని\nఅడిగాడు\nఅతను సరే ననిమంత్రికి ఒక వుపాయ చెప్పి\nపంపించాడు.\nమంత్రి తన తల్లి ఆబ్దికం నాడు\nనేనూ ఆవిడ\nచివరి కోర్కె తీర్చదలుచుకున్నాను .అని\nప్రకటించాడు.బ్రాహ్మణు లంతా సంతోష\nపడ్డారు.రాజుగారు బంగారు మామిడి పడ్లు\nయిచ్చారు యింక ఈ మంత్రి కూడా ఆల్లాంటి\nదేదో యిస్తాడు అని సంబర పడ్డారు.\nమంత్రిగారి తల్లి ఆబ్దికం రానే\nవచ్చింది.\nఆయన ఒక్కొక్క బ్రాహ్మణు డినీ\nలోపలకు పిలిచి యినప గరిట కాల్చి వాత పెట్టి\nపెరటి దారిన వారిని పంపించసాగాడు.వాళ్ళు\nమంటకు తట్టుకోలేక అరుచుకుంటూ\nవెళ్ళిపోయారు.వాళ్ళు వెళ్లి రాజుగారికి\nఫిర్యాదు చేశారు.రాజు మంత్రిని పిలిపించి\nయిదేమి పని అడిగాడు.\nఅప్పుడు మంత్రి మహారాజా! మా అమ్మ\nకీళ్ళవాతం తో చనిపోయింది.చనిపోయే ముందు\nనాయనా దీనికి వాత ఒక్కటే మందు యినుప\nగరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది.నా\nభార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ\nచనిపోయింది.\nమరి కొడుకు గా ఆవిడ ఆఖరి కోరిక\nతీర్చడం నా విధి కదా! అందుకని మీరు చూపిన\nదారినే నేను నడిచాను. అన్నాడు రాజుకు\nజ్ఞానోదయ మయింది.అప్పటినుండీ బంగారు\nమామిడి పండ్ల దానం రద్దు చేశాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 698,
        "IMAGE": "cat_8",
        "NAME": "బంగారు మామిడి పళ్ళు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.\nఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.\nరాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.\nఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.\nఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.\nఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.\n“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.\nజవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.\nమొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 699,
        "IMAGE": "cat_8",
        "NAME": "దీపావళి పోటీ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ వూరూరా తిరుగుతుండేవాడు. ప్రజలిచ్చే దక్షిణను ఖర్చుల కోసం స్వీకరించేవాడు. కొంత కాలానికి ఆయన దగ్గర ఒక మూట నిండా కాసులు సమకూరాయి. దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు.\nఅది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు. ఓసారి వినయంగా స్వామి వారిని కలిసి, 'నేనొక అనాధను. నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను' అంటూ అభ్యర్థించాడు. స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలెను తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు.\nప్రతి రోజూ గురుశిష్యులు వూరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు. ఎవరి జోలెను వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు. నాలుగు రోజులు గడిచాక స్వామిజీ గాఢ నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూట కోసం శిష్యుడు వెదికాడు. అది కనిపించలేదు.\nనెమ్మదిగా ఆయన జోలె తీసి చూశాడు. అందులోనూ లేదు. 'గురువు గట్టోడే. కాసుల మూటను ఎక్కడో దాచాడు' అనుకున్నాడు శిష్యుడు. మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యధావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు.\nఆ రాత్రి కూడా వాడు వెతికి చూశాడు కానీ ఎక్కడా మూట కనిపించలేదు. మరో నాలుగు రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది. గురువుగారి దగ్గరకు వెళ్లి, 'స్వామీ. ఈ సంచార జీవితం మొహం మొత్తింది. ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను. సెలవిప్పించండి' అన్నాడు. 'తప్పకుండా పోయిరా నాయనా! ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు' అన్నారు సచ్చిదానంద స్వామి.\nవెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి, 'గురువుగారూ! నాదొక చిన్న సందేహం. పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూట రాత్రి వేళ కనిపించదేం? ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది' అన్నాడు. సచ్చిదానంద స్వామి నవ్వి, 'నాయనా! నీ వాలకాన్ని మొదటి రోజే గ్రహించాను.\nరోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను. అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను. మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి. ఇతరులది దోచుకోవాలనుకునే వాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్యా!' అన్నారు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 700,
        "IMAGE": "cat_8",
        "NAME": "సచ్చిదానంద స్వామి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు.\nనాయనలారా! నేను ఎంతోకాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని\nఅభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను\nచేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా.\nఅందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైనవాడు. నా వ్యాపారాభివృద్ధికి\nఅతను ఎన్నో సలహాలిచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి.\nఅప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాటివ్వండి’’\nఅన్నాడు.\nఅలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు. కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు.\nసత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను\nతెరిచారు.\nఅందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన ‘సత్యమూర్తి మాత్రమే చదవాలి’ అని రాసి ఉంది.\nసత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురి వైపు\nతిరిగి, అబ్బాయిలూ! ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు.\nఏంటది?’’ అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.\nఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ మూడు రాళ్లను\nపెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి’’ అని\nఅడిగాడు సత్యమూర్తి.\nఓస్! అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు మూడురాళ్లను\nవెనకేసుకోండి. అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి\nఉంటాడు. అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి\nచేసుకుంటాం’’ అన్నాడు పెద్దకొడుకు.\nఅంతే కాదు. మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా\nవేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు’’ అన్నాడు రెండోవాడు .\nఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు. అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది. అలాగే\nమేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని\nచెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు’’ అని వివరించాడు.\nముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని\nవారికి చూపాడు. అందులో ‘ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి. నా\nకోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’ అని రాసి ఉంది.\nచదివారు కదా! మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి. తండ్రి ఉద్దేశం\nఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు. అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’’ అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.\nఈ తాళాలు నా ఒక్కడివి కావు. మనందరివీ అని తన అన్నలిద్దర్నీ\nకలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు.\nతను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను\nపరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 701,
        "IMAGE": "cat_8",
        "NAME": "మూడు రాళ్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఒక ఆటో ప్రమాదవ శాత్తూ రోడ్డు\nప్రక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి\nపడిపోయింది... ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో\nపడిపోయారు...\nఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మూనిగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించసాగారు.. ముగ్గురిలో ఒక\nవ్యక్తి ఈతరాక వెంటనే మునిగిపొయాడు..\nమిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం\nచేయసాగారు... చుట్టూ ఉన్న గోడలన్నీ నున్నగా\nజారుడుగా ఉండడం వలన ఎంతకూ పైకి ఎక్కలేక పోతున్నారు...\nవారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహగా మీరు ఇంతే చని పోవడం ఖాయం అంటూ\nఅరవ సాగారు... ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంలో మునిగిపొయి చని పోతాడు..\nకానీ మూడవ వ్యక్తి మాత్రం వారు నిరుత్సాహ\nపరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకుని ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేయసాగాడు.. చివరికి ఒక గంట తర్వాత ఫైరింజన్ సర్వీసు వారు వచ్చి బావిలోపలికి నిచ్చెన వేసి ఆ వ్యక్తిని పైకి లాగుతారు...\nపైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ\nఅభినందిస్తూ... ఇంత మంది నిన్ను నిరుత్సాహ\nపరచినా ఎలా నిలవగలిగావు అని అడుగుతారు..\nఅందుకు ఆ వ్యక్తి... బాబూ నాకు బ్రహ్మ చెవుడు.. మీరు మాట్లాడేదేదీ నాకు వినపడదు.. కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశ్యం నాకు .అర్థమయింది.. అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహ పరచాయి.. మీకందరికీ\nధన్యవాదములు.. అని చుట్టూ ఉన్న వారికి\nచేతులు జోడించి నమస్కరిస్తాడు...\n\nమనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే...\nచుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే..\nమన ప్రయత్నం మనం చేస్తున్నపుడు.. ఎవరో\nఒకరు మనను ఆదుకునే అవకాశం ఉంది.. చివరి వరకు నిరుత్సాహ పడక... ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి...\nజీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం\nదొరకదన్నంత వరకు పోరాడు...\nలేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు..\nఆశను విడవకూడదు....\nచివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగవచ్చు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 702,
        "IMAGE": "cat_8",
        "NAME": "ప్రయత్నం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక బైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది.\nఆ వణుకుతున్న పామును చూసి ఆ బైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు.\nజాలితో ఆ బైతు పామును తన ఛాతీ దెగ్గిరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది.\nవేంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ బైతును కాటువేసింది. పాపం ఆ బైతు పాముకాటుకి మరణించాడు.\nదుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 703,
        "IMAGE": "cat_8",
        "NAME": "పాము-స్నేహం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో 'నేను\nచెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను' అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి 'సరే\nమహారాజా' అన్నాడు. 'అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా\nదాని విలువ దానిదే. కాదంటావా?' అన్నాడు రాజు నవ్వుతూ. 'అది నిజం కాదు మహారాజా! వస్తువు విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది' అన్నాడు\nవిదూషకుడు. 'అలా అని నిరూపించగలవా?' అన్నాడు రాజు. 'మీ\nచేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి. ప్రభూ' అన్నాడు విదూషకుడు. రాజు వెంటనే తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి\nఇచ్చి, 'మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి ఎంతకి కొంటాడో అడిగిరా' అంటూ పంపాడు. అలా\nవెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, 'ఇరవై వరహాలు ఇస్తానన్నాడు ప్రభూ' అన్నాడు. విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని\nపిలిచి కడియం ఇచ్చి 'మాధవయ్య దీన్ని ఎంతకు కొంటాడో కనుక్కో' అని పంపాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఆ అధికారి, 'నలభై వరహాలు ఇస్తానన్నాడు'\nఅన్నాడు. తర్వాత విదూషకుడు దారినపోయే బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి దగ్గరకు పంపాడు. అతడి వెంట ఓ సైనికుడిని\nరహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి, 'అయ్యా! దీని ధర ఎంత?' అని అడిగాడు. వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి చేతిలో పెట్టి, 'దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి\nఉంటావు. మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు చేస్తాను' అంటూ దబాయించాడు. ఆపై సైనికుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు, రాజు కేసి తిరిగి 'చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే\nవర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల, బీదవాడికి ఒక ధర చెప్పాడు. వస్తువు విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?'\nఅన్నాడు. రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 704,
        "IMAGE": "cat_8",
        "NAME": "అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ\nరచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని\nనిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ\nమాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికి రానిదిగా\nమారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక\nనిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.\n'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం\nరాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి.\nగ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు.\nసన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని\nకాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా!\nఅద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే\nతరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి\nపోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి\nవచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది.\nత్రిగుణయ్య చెప్పిన\nచోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి\nదారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య\nనుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది.\nకొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు\nత్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు\nకనిపించలేదు. గ్రామస్థులంతా ఓ రోజు త్రిగుణయ్యను\nచుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ\nమండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి\n'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో\nఅడవి లో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.\nఆ సన్యాసి\nకాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి\nచూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.\n'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని\nగ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ\nసారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి\nదగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా\nపనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.\nఅంతా విన్న వూరి పెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు\nచెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని\nపాడు పెట్టుకున్నాం' అన్నాడు.\nగ్రామస్థులంతా సిగ్గుపడి తలలు\nదించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగు చేసుకుని చక్కగా\nబతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి\nసన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య\nఎవరికీ చెప్పలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 705,
        "IMAGE": "cat_8",
        "NAME": "నిధికి దారి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "మనకి భక్తి ఎక్కువా, భయం ఎక్కువా?\nభయానికి, భక్తికీ\nపోటీ పెడితే చాలా సార్లు భయమే గెలుస్తుంది. ఈ\nవిషయాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తున్నది ఈ\nకథ .. చదవండి.. మన బలహీనతల్ని తలచుకొని\nఓమాటు నవ్వండి.\nచాలా సంత్సరాల క్రితం బోధిసత్త్వుడు కాశీరాజ\nకుమారుడిగా జన్మించాడు. ఆ రోజుల్లో ఆచారాలు,\nమతపరమైన తంతులు జన జీవితంలో ప్రధానపాత్ర\nపోషిస్తూ ఉండేవి. ప్రతి చిన్న విషయానికీ\nజంతువుల్ని బలి ఇవ్వటం, యజ్ఞాలనీ యాగాలనీ\nవిలువైన వస్తువులని నిప్పులో\nవేసేయటం చేస్తూ ఉండేవాళ్లు అందరూ.\nఅందరిలాగానే కాశీరాజు గారు కూడా అనేక తంతుల్లో\nఎప్పుడూ మునిగితేలుతూ ఉండేవాడు.\nరాజకుమారుడికి మాత్రం ఇదంతా చాలా\nఅనవసరం అనిపించేది. కారణాలు, ఫలితాలు ఎలా ఉన్నా,\nఅన్ని 'మూగ ప్రాణులను బలి పెట్టటం' అన్న\nఆలోచనే అతనికి అమానుషం అని తోచేది.\nతండ్రిగారు అలాంటి\nతంతులు చేపట్టినప్పుడల్లా\nరాజకుమారుడు వెళ్లి ఒక మర్రి చెట్టు క్రింద\nకూర్చొని ధ్యానం చేసుకునేవాడు.\nకొడుకు ప్రవర్తనని చూసి\nరాజుగారు ఏమనుకున్నారో తెలీదు కానీ, మొత్తం మీద\n\"ఇంకా పసివాడులే\" అని వదిలేసి ఉండచ్చు.\nఅయితే క్రమంగా రాజుగారు\nముసలివాడయ్యాడు. రాకుమారుడూ యువకుడయ్యాడు, రాజకుమారుడి\nపట్టాభిషేక సమయం దగ్గరపడింది. ఆ సమయంలోనే\nకాదు; అటుపైన రాజుగా కూడా ఆ దేశపు ఆచార\nవ్యవహారాలన్నిటినీ సంరక్షించాల్సిన బాధ్యత అతని\nమీద పడనున్నది - అంటే అప్పటి\nవరకు తండ్రిగారు చేసిన తంతులన్నీ\nఇప్పుడు ఇతను చేయాలి! ఎలాగ!?\nకొత్తగా సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో\nయువరాజు భయంకరమైన ప్రకటన ఒకటి చేశాడు. అది\nవిని రాజ్యం యావత్తూ హోరెత్తిపోయింది.\nఅదేమంటే- \"ప్రజలారా! ఇన్నేళ్లుగా నేను మర్రి\nచెట్టు దేవతను కొలుస్తున్న సంగతి మీకందరికీ\nతెలుసు, ఆ దేవత మామూలు దేవత కాదు.\nఇప్పుడు , నేను రాజపదవిని స్వీకరించిన\nతరుణంలో , ఆ దేవికి నివేదనగా వెయ్యిమంది\nమనుష్యులను బలి ఇస్తానని మొక్కుకున్నాను!! -\nఅయితే బలికి కావలసిన ఆ వెయ్యి మందీ వాళ్ల వాళ్ల\nదేవతలకు జంతు బలులిస్తూ ప్రీతి\nకలిగిస్తూన్నవాళ్ళే అవ్వాలి- అంటే, ఏ దేవత పేరునైనా\nసరే, జంతువుల్ని ఇష్ట పూర్వకంగా బలి\nఇస్తున్న వెయ్యిమంది మనుషుల్ని పట్టుకొని,\nనేను మా దేవికి బలి ఇవ్వాల్సి ఉన్నది! ఆ పని\nకోసం ప్రత్యేకంగా కొంత సైన్యాన్ని\nనియోగించనున్నాను కూడా!\" అని.\nఅటుపైన కాశీ రాజ్యంలో ఒక్కరు కూడా\nజంతువుల్ని బలి ఇవ్వలేదు.\nఒక్క మనిషినీ బలి ఇవ్వకుండానే బోధిసత్త్వుడి\nజీవితం గడచిపోయింది. అటు రాజ్యంలో\nజంతువుల్నీ బ్రతికి పోయాయి!! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 706,
        "IMAGE": "cat_8",
        "NAME": "భయం - భక్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "శ్రీరంగాపురంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ\nఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి\nచురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే\nమొరాయించసాగింది. బలవంతపెడితే కదలకుండా\nకూర్చుంటుంది. పనిచేయని ఆ ఒక్క\nఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి,\nరెండింటినీ విక్రయించాలనుకున్నాడు రామేశం.\nఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ\nపొరుగూరు నుంచి వచ్చాడు. అతను సామాన్య\nరైతు. “వర్మా.. ఇటీవలే కొన్న నా ఎద్దుల\nజతను సగం ధరకే అమ్మాలని\nనిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే\nకొనుగోలు చేసుకువెళ్లు. పైకం కూడా\nనీకు వీలున్నప్పుడివ్వు,” అన్నాడు రామేశం.\nపక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ\nవాటిని కొని తన వెంట తీసుకెళ్లాడు. అంత\nసులువుగా అవి అమ్ముడవడం రామేశానికి\nఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక\nఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో\nతెలుసుకోవాలనిపించింది. వెంటనే స్నేహితున\nగ్రామం బయలు దేరాడు. దారిలోనే ఉన్న\nపొలం వద్ద స్వరవర్మ కనిపించాడు.\nఅక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతంగా\nపొలాన్ని దున్నడం గమనించాడు రామేశం.\nఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా\nనాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది.\nమిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ\n“ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ\nపనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి, ఏ\nలోపం లేదని నిర్ధారించుకున్నాకే కొన్నాను.\nఎద్దు మొండికేయడానికి కారణం.. నీకున్న\nవిశాలమైన, గట్లు లేని పొలాన్ని చూసి గొడ్డు చాకిరీ\nచేయాలని అది భయపడటమే! మోర ఎత్తితే\nగట్లు కనిపించే నా చిన్న కమతాన్ని ప్రయాస\nలేకుండా దున్నుతోంది. నువ్వు దాని\nబాధను అర్థం చేసుకోలేక పోయావు,” అన్నాడు.\nసందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి,\nమిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో\nపొగిడాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 707,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఎద్దుబాధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది.\nఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది.\nకొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది.\nఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి వచ్చింది.\nపులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాల భయపడి పోయాడు. పారిపోయే క్షణంలో పులి, “నన్ను చూశి భయపడకండి – నేను మిమ్మల్ని యేమి చేయను. నాకు మీ అమ్మయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నాను” అంది.\nఅతను భయంలో కూడా చాల చురుకుగా ఆలోచించాడు.\n“నాకు ఇష్టమే, కాని మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో – పెళ్ళికి ఒప్పుకోక పోతే?” అన్నాడు.\nపులి ఆలోచించకుండా, “మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు, గోళ్ళు తీయించేస్తాను” అంది.\nఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు కోసేసాడు. దంతాలు, గొళ్ళు లేని పులి అంటే భయం వుండదు కదా! కట్టెలతో, రాళ్ళతో, చేతికి అందిన ప్రతీ దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు.\nదెబ్బకి మళ్ళి ఆ పులి యే మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 708,
        "IMAGE": "cat_8",
        "NAME": "ప్రేమలో పడ్డ పులి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణము లో ఒక\nబిక్షగాడు ఉండేవాడు. వాడికి చాలా కొద్ది\nమొత్తములో సాగు భూమి ఉన్నది.\nదాని మీద ఏమీ ఆదాయం లేక యాచన చేసుకుంటూ, ఆ వచ్చిన దానిని తిని\nబతుకుతుండేవాడు.\nవాడికి ఒక రోజూ ఒక ఇంటిలో మంచి\nఆహారం దొరికినది. వాడు ఆహారాన్ని ఆ\nఇంటివద్దే కడుపునిండా భుజించాడు.\nకడుపు నిండడం తో ఆ రోజుకి యాచన\nచలించి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక\nగృహస్థుడు వానికి కొద్దిగా పేలపిండి\nఇచ్చినాడు.\nవానికి ఆకలి తీరి ఉండటం తో\nదానిని భుజింపక తనతో తీసుకుని\nఇంటిదారి పట్టాడు. దారిలో ఒక చెట్టు నీడలో\nవిశ్రమింపదలచి, తన చెంత ఉన్న ఒక\nగుడ్డను చెట్టు కింద పరచి, తన\nమేను వాల్చి, తనలో తాను ఈ విధంగా\nఊహించుకోసాగాడు\n\"ఇపుడు నా కడుపు నిండినది కనుక ఈ\nపేలపిండిని సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్ది\nమొత్తము తో కొద్దిగా నువ్వులు కొని నా\nభూమిలో చల్లుతాను.\nకొంతకాలము తరువాత అవి మంచి\nకాపుకు వస్తాయి. వాటిని అమ్మి ఆ వచ్చిన\nమొత్తము తో వడ్డీ వ్యాపారము చేసి\nబాగుగా సంపాదిస్తాను.\nఅప్పటికి నాకు వివాహ వయసు కూడా వస్తుంది.\nబాగా డబ్బు సంపాదిస్తాను కనుక\nనాకు పిల్లను ఇవ్వడానికి\nఅందరూ ఆసక్తి చూపిస్తారు.\nఅందునుండి ఒక మంచి అమ్మాయిని\nఎన్నుకుని వివాహం చేసుకుంటాను.\nఎపుడైనా నా భార్య నా మాట విననిచో\nనేను ఊరుకోను, నా కాలితో గట్టిగా ఇలా\nతన్నుతాను\" అని అసంకల్పితంగా తన కాలితో పేల పిండిని తన్నాడు.\nఅది కాస్త కింద పడి గాలికి మొత్తం ఎగిరిపోయింది. ఏదో జరుగుతుంది అని ఏదో ఏదో\nఊహించుకుంటూ వాడి అత్యాశకు వాడే\nబలి అయ్యాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 709,
        "IMAGE": "cat_8",
        "NAME": "అత్యాశ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా\nవిక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత\nనీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో\nఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు.\nవిక్రమార్కుని మీద కించిత్ అసూయపడి\n“నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతు\nలు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే\nఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.\nఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి\nవచ్చాడు.యథావిధిగా అతనిని పూజించి\nరాజు “స్వామి! విక్రమార్కుని\nగుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను.\nఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు.\nఅట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని\nప్రార్థించాడు\nసన్యాసి “రాజా! నీకొక\nసూక్ష్మోపాయం చెబుతాను.\nహిమవన్నగర\nసమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన\nఆ ఆలయం వద్ద\nకొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు.\nనీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై\nఆలయప్రాంతంలోకి ప్రవేశించు.\nగుండమొకటి\nత్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో\nదూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో.\nదయాసాగరులైన ఆ\nయోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి\nమెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.\nసదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన\nకాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల\nధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా!\nప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి\nనిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే\nజరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది.\nఅవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి\nనగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి\nప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ\nధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి\nదానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.\nవిమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క\nకీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని\nకాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి\nఆలయములో హోమముచేసి తన శరీరాన్ని\nపూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై\nవరంకోరుకోమన్నది.\nకైలాశశిఖరమంత ఉన్నత\nహృదయం కల విక్రమాదిత్యుడు ఇలా\nకోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని\nపూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి\nవచ్చేటట్టు దానితో అతడు మరిన్ని\nదానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”.దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు”\nఅని ఆశీర్వదించింది\nఈ విషయం తెలుసుకున్న\nఅవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా!\nనీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి\nసౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని\nస్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని\nవెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 710,
        "IMAGE": "cat_8",
        "NAME": "వితరణశీలి విక్రమార్కుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "శ్రీకృష్ణదేవరాయల ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.\nబంగా రు నాణేలు గంప నిండా ఉండటంతో అది\nకనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన\nరామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.\nరామలింగడి సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన\nరాజు \"శభాష్ రామలింగా! శభాష్!\" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన\nరామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయ\nదాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.\n\"ఎంత దురాశపరుడు\" అన్నాడు ఆస్ధాన పూజారి.\n\"గంపెడు నాణేలున్నా కిందపడిన\nరెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు\"\nఅన్నాడు సేనాధిపతి.\nరామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత\nరాజు \"రామలింగా!\nనీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి\nఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల\nకోసం వెతికావు? అన్నారు.\n\"రాజా! ఇది దురాశ కాదు,\nకిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి\nఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను.\nకాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను\" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.\nరాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి\nరామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో\nగంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 711,
        "IMAGE": "cat_8",
        "NAME": "రాజభక్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజుకు కలలో దేవుడు ప్రత్యక్షమై ఒక\nరత్నాన్ని బహూకరించాడు.\nదానికి రెండు వైపులా రంధ్రాలు ఉన్నాయి. దాన్ని\nహారంలో వేసుకొని ధరించాలనిపించింది రాజుకు.\nఆస్థాన కంసాలిని పిలిచి \"మంచి హారంలోకి\nఎక్కించండి దీన్ని\" అని ఆదేశించాడు.\nమరుదినం కంసాలి వచ్చి \"మహారాజా! ఎంత\nప్రయత్నించినా బంగారు తీగ రత్నం గుండా\nదూరటం లేదు. రత్నానికి రంధ్రం సరిగా\nఉన్నట్లు లేదు- మధ్యలోనే అడ్డుకుంటున్నది.\nపోనీ, 'దారాన్ని ఇంకొంచెం సన్నం చేద్దామా' అంటే,\nఅది ఇప్పటికే చాలా సన్నం అయిపోయిందాయె!\"\nఅన్నాడు.\nదాంతో రాజు దేశ దేశాల\nస్వర్ణకారులను పిలిపించాడు. అయినా\nఫలితం లేదు- ఆ రత్నంలోంచి దూరేంత సన్నటి\nదారాన్ని ఎవ్వరూ చెయ్యలేకపోయారు.\nఅదే దేశంలోని తెలివైన యువకుడు ఒకడు ఒకసారి\nరాజువద్దకు వచ్చి, \"నేను ప్రయత్నించి\nచూస్తాను\" అన్నాడు. \"చూద్దువు గాని, అయినా\nఇంతమంది దగ్గర లేనిది, నీ దగ్గర ఉన్నది ఏమిటి? అన్నాడు రాజు.\n\"తెలివి, పట్టుదల- ఈ రెండూ ఉన్నై నాలో. అయినా\nప్రయత్నిస్తే తప్పేముంది?\"\nఅన్నాడు యువకుడు. రాజు సంతోషించాడు.\nకంసాలి తయారుచేసిన బంగారుతీగనే తీసుకున్న\nయువకుడు, ముందు ఒకరోజంతా ఆ రత్నంతో\nకుస్తీపట్టాడు- అయినా ఏమీ లాభం లేదు-\nరత్నపు రంధ్రంలోకి నిజంగానే\nదూరటంలేదు దారం.\nకొంత సేపటికి అతనికి ఓ ఆలోచన వచ్చింది. \"ప్రభూ! ఒక రోజు సమయం దయ చేయించండి\" అని అడిగాడు. రాజుగారు సరేనన్నారు.\nమరునాడు తెల్లవారే సరికల్లా రత్న హారాన్ని\nతీసుకువచ్చి రాజుకి అందజేశాడు యువకుడు!\nహారంలో రత్నం చక్కగా అమరి ఉన్నది!\n\"భళా! ఎందరో గొప్ప స్వర్ణకారుల వల్ల కాని పని\nనీవల్ల అయింది. ఎట్లా చేశావు?\" అని\nఅడిగాడు యువకుడిని\n\"మహారాజా! ఆ బంగారు తీగను తేనెలో ముంచి, రత్నపు బెజ్జంలో అది దూరినంత వరకు దూర్చి, గదిలో మూలగా- ఒక చీమల పుట్టకు ఎదురుగా- పెట్టాను.\nకొంచెం సేపటికల్లా తేనె వాసన పట్టి,\nచీమలు రత్నంలోకి రాసాగాయి. నేను రత్నాన్ని\nకదలకుండా ఇరికించి పెట్టాను; అలాగే తీగ\nరత్నంలోంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డాను.\nఅంతే, తెల్లారే సరికి చీమలు తీగను బెజ్జంగుండా\nరెండోవైపుకు లాక్కెళ్ళాయి! మరి అవి\nరత్నపు బెజ్జాన్నే పెద్దగా చేశాయో, లేక తీగను సన్నగా చేశాయో మరి, తెలీదు.\nఇది నా గొప్పతనం కాదు. ఆ చిన్న చీమలు చేసిన ఘనకార్యం ఇది\" అని జవాబిచ్చాడు.\nఅది విని సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు.\nరాజు ఆ యువకుడిని ఘనంగా సత్కరించటంతో\nపాటు, అతన్ని తన ఆంతరంగిక సలహాదారుగా\nనియమించు-కున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 712,
        "IMAGE": "cat_8",
        "NAME": "రత్నహారపు సమస్య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలాకాకులు కనిపించాయి.\nఆ కాకులను చూసి అక్బర్మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు.\nవెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి,“బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?”అని అడిగారు.\nబీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మనరాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందలనలభై మూడు కాకులు వున్నాయి” అనిబదులు చెప్పరు.\nఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంతకచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువకాకులుంటే?” అని అడిగారు.\n\"అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోనికాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.\nఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు,\nస్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు.నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశినచిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 713,
        "IMAGE": "cat_8",
        "NAME": "చిక్కు ప్రశ్న ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అననగానగా ఒక కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను\nనోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుద్యారింది.\nదారిలో ఒక నది వుంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది.\nకుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది.\n“ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క వుంది, అది కోడా నాకే దొరికితే బాగుంటుంది” అనుకుంది. నీటిలో వున్నా కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది.\nనోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధ పడింది.\nఅత్యాశకి పోకుండా వున్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్లి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 714,
        "IMAGE": "cat_8",
        "NAME": "అత్యాశగల కుక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.\nఓ రోజు రామయ్య పొలానికి వెళ్తూ దారిలో ఒక\nపాము గద్దను పట్టి బందించడం చూసాడు,\nవెంటనే కర్రతో పామును అదిలించి\nగద్దను విడిపించాడు.\nతరువాత పొలం పనుల్లో ఉండిపోయి,\nమధ్యాహ్నం అన్నం తిందాం అని దగ్గర్లో ఉన్న\nకాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుకోటానికి\nవెళ్ళాడు.\nరామ్మయ్య పై కోపంగా ఉన్న పాము, ఇదే\nఅదునుగా తీసుకొని రామయ్య తెచ్చుకొన్న\nఅన్నపు మూటలో విషం కక్కి, వెళ్ళి పొదలలో దాకొంది.\nచెట్టు పైనుండి ఇది చూ సిన గద్ద\nతనకు సాయం చేసిన రామయ్య ని ఎలాగైన\nకాపాడుదాం అని, రామయ్య అన్నం మూట విప్పి\nఒక్క ముద్ద నొట్లో పెట్టుకొనే సమయానికి వెళ్ళి\nతింటున్న అన్నాన్ని నేలపాలు చేసి ఎగిరిపోయింది.\nరామయ్య కి కోపం వచ్చి గద్ద ని తిట్టాడు.\nఇంతలో ఓ కుక్క వచ్చి కింద పడ్డ అన్నాన్ని తిని\nఅక్కడిక్కకడే చనిపోయింది. రామయ్య గద్ద ని\nతిట్టినందుకు బాధ పడ్డాడు.\nగద్ద చేసిన మేలు వల్ల అతడు ప్రాణాలతో బయట పడ్డాడు.\nతాను గద్దకి చేసిన ఉపకారం తన\nప్రాణాలను నిలబెట్టిందని తెలుసుకున్నాడు.\nనీతి : ఎప్పుడైన ఒకరివల్ల సాయం పొందితే, తిరిగి\nవారికి తప్పకుండా సాయం చేయాలి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 715,
        "IMAGE": "cat_8",
        "NAME": "సాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో రెండు పిల్లులుండేవి.అవి\nరెండూ స్నేహితులు.\nఒక రోజు రెంటికీ ఓ చోట రొట్టె\nకనిపించింది. దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి.\nతనకు పెద్ద ముక్క కావాలంటే\nతనకు కావాలని దెబ్బలాడుకోసాగాయి. ఇంతలో అటుగా వెళుతున్న కోతి ఒకటి వాటికి కనిపించింది. దాన్ని పిలిచి\nజరిగిన విషయాన్ని చెప్పాయి.\nఅప్పుడు ఆ కోతి ఓస్\nఇంతేనా మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి\nరొట్టెను తన చేతుల్లొకి తీసుకుంది కోతి.\nఎక్కడి నుంచో ఒక త్రాసు తెచ్చింది.రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో\nరెండు వైపులా పెట్టింది.\nత్రాసు కుదివైపు మొగ్గటంతో 'ఈ ముక్క\nపెద్దదైనట్టుందే' అని కుడివైపునున్న\nముక్కను కాస్త తినేసింది.\nఈ సారి ఎడమవైపు ఉన్న\nముక్కవైపు చూసి ఇప్పుడు ఇది పెద్దదైపోయింది\nఅని దానిలో కూడా కొంత బాగం తినేసింది.\nఇలా ఒక్కో\nముక్కా కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి\nరొట్తెను పంచుతున్నట్టు నాటకమాడింది.\nకోతి తినేస్తుంటే బాధగా ఉన్నా తమకు సమానమైన\nముక్కలు వస్తాయని పిల్లులు మాత్రం ఆశగా\nచూడసాగాయి.\nచివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచక్కా\nతన దారిన తాను వెళ్ళి పోయింది.\nఅప్పటికి గాని పిల్లులకు తాము చేసిన తప్పు అర్ధం కాలేదు.\nస్నెహితులమై ఉండి కూడా చిన్న రొట్టె ముక్క\nకోసం తగవులాడుకున్నాం.\nఎలాగోలా పంచెసుకుని\nఉంటే అది మన మద్యనే ఉండేది. ఇద్దరమూ తినక\nమొత్తం రొట్తెను కోతిని పిలిచి మరీ ఇచాము అని\nతమను తామే నిదించుకుని బాదపడ్డాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 716,
        "IMAGE": "cat_8",
        "NAME": "రొట్టె ముక్క ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు.\nపట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.\nపట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.\nఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి.\nపట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది.\nపల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.\nకాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం విని పించింది. పల్లెటూరి ఎలుక ఖంగారు పడి, “ఆ చప్పుడు ఏమిటి?” అని అడిగింది.\n“ఇంటి కుక్కలోస్తాన్నాయి, త్వరగా దాక్కో!” అంటూ పట్నం ఎలుక ఒక రంద్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. “ఇలా ఎంత సేపు?” అని అడిగింది.\n“అవి అలా వస్తూనే వుంటాయి. అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ రంద్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు” అని పట్నం ఎలుక జవాబు చెప్పింది.\nఇది విన్న పల్లెటూరి ఎలుక, “భయ పడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు!” అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 717,
        "IMAGE": "cat_8",
        "NAME": "పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు.\n“ఓ కోతి! ఓ కోతి! నా కత్తి!” అన్నాడు.\nకోతి వెనక్కి తిరిగి, “ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం”, అని వెక్కిరించి పారిపోయింది.\nకత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది.\nఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతని చేతికి కత్తి అందించింది. ఆ మనిషి సంతోశంగా మట్టెలు కత్తితో కొడుతుంటే, పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది.\n“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!\nకత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!” అని పాడుకుంటూ తన దారిని వెళ్ళిపోయింది కోతి.\nదారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి, ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకుని బెల్లం అచ్చులు వాటిమీద పెట్టడం మొదలు పెట్టాడు. అలవటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకుని, వెక్కిరిస్తూ పారిపోయింది.\n“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!\nకత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!\nమట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!”\n“న బెల్లం అచ్చులు! దొంగ కోతి!” అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ వుండిపోయాడు.\nకొంచం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది. అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది.\n“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!\nకత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!\nమట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!\nఅచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం!”\nకొంత సేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు యెదురయ్యారు. వాళ్ళకి బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మయిమరిచిపోయారు. కోతి గోవును తోలుకుని వెళ్ళిపోయింది.\n“కోతి! కోతి! మా గోవును ఇచ్చేయి!” అని చాలా దూరం కాపర్లు తరిమేరు. కాని కోతి వాళ్ళకు చిక్కలేదు.\n“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!\nకత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!\nమట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!\nఅచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం!\nబూరెలు పోయి గోవు వచ్చే ఢాం ఢాం ఢాం!”\nరోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలిసిపోయింది.\n“ఆబ్బ! చాలా కశ్ట పడ్డాను ఇవాళ, వొళ్ళంతా పులిసిపోయింది. వెణ్ణీళ్ళు కాచు, స్నానం చేసి విశ్రామిస్తాను,” అని గోవును ఆఙాపించింది.\nగోవుకి బాగా కోపమొచ్చింది. సలసలా మరిగించిన నీళ్ళను తీసుకొచ్చి కోతి వంటిమీద భళ్ళున పోసేసింది. కోతి కుయ్యో మర్రో మని ఏడుస్తుంటే; తోలు వూడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 718,
        "IMAGE": "cat_8",
        "NAME": "ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ\nఅమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో\nఅమ్మడానికి వెళ్ళేది.\nవచ్చిన డబ్బులతో\nరోజులు గడుపుకునేది.\nఒక రోజు ఆవు మామూలుగా కన్నా\nకొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి\nఅమ్మాయి చాల సంతోషించింది.\nరోజు తీసుకువెళ్ళే\nబిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని\nతలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.\nదారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో\nఊహలు అల్లటం మొదలెట్టింది.\n“ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే\nనాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.\nఆ వచ్చిన\nఅధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక\nమూటలో దాచేస్తాను.\nకొద్ది రోజులకి ఆ మూటలో చాలా\nడబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని\nకొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా\nఆవులు వుంటాయి.\nఅవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను.\nనేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే\nఅవసరం వుండదు. అప్పుడు నేను కూడ\nతెల్లగా అయిపోతాను.\nవెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త\nపట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను.\nచీరకు తగ్గట్టు సంతలో గాజులు,\nగొలుసు కూడ కొనుక్కుంటాను.\nఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా\nతలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని,\nనగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని\nవెళ్తాను.\nఅక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా\nకనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు.\nకాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది\nఒప్పుకోను”\nనచ్చని\nసంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ\nఅమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది.\nతల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న\nవిషయం మరిచిపోయింది.\nఢడేలుమని బిందె తలనించి పడి\nముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.\nఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ\nడబ్బులూ సంపాదించలేదు,\nఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు,\nపట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు –\nఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి.\nపగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా\nచేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి\nఇంటివైపుకు వెళ్ళి పోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 719,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఆమ్మాయి కలలు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "వొకానొక వూరిలో వొక ఉల్లిపాయ, టమాటో, పర్చిమిరపకాయ, ఐస్ గడ్డ మంచి స్నేహం గా వుండే వాళ్ళు..\nనలుగురు కల్సి పట్నం వెళ్లి బాగా తిరిగి\nసాయంత్రం వేళ బీచ్ కి వెళ్ళారట..\nఅక్కడ ఆడుకుంటుండగా.. పెద్ద అల వచ్చింది.. ఐస్ గడ్డ ఏమో పాపం కరిగిపోయింది.. మిగిలిన\nస్నేహితులేమో అయ్యో మా ఫ్రెండ్ చనిపోయిందే అని\nబాధ పడ్డారు..\nతర్వాత రోజు ఉల్లిపాయ, టమాటో, పర్చిమిరపకాయ\nముగ్గురు కల్సి సినిమా కి వెళ్తారు.. వొక అతనేమో\nచూసుకోకుండా టమాటో మీద కూర్చుండి\nపోతాడు..\nఇంకేముంది అయ్యో మా ఫ్రెండ్\nచనిపోయాడే అని ఉల్లిపాయ, పర్చిమిరపకాయ\nఏడుస్తారు..\nబయటకి వచ్చి రోడ్ పక్కగా నడస్తూ వుంటారు..\nఇంతలో బజ్జీల బండి అతను అరె నా మిరపకాయ\nపడిపోయిందే అని దీనిని తీసే నూనెలో వేసేస్తాడు..పాపం కదా..\nఉల్లిపాయ వోకర్తే ఏడుస్తూ. ఐస్ గడ్డ చనిపోతే\nనేను, టమాటో, పర్చిమిరపకాయ ఎడ్చాము..\nటొమాటో చనిపోతే నేను, పర్చిమిరపకాయ ఎడ్చాము\nపర్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను..\nనేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధ\nపడిందట..\nఅంతే.. దేవుడు అసలే జాలిగుండె కలవాడు కదా..\nనిన్ను చంపిన వాళ్ళే ఏడుస్తారు అని\nవరం ఇచ్చేసాడు..\nఅదీ సంగతి.. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 720,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఉల్లిపాయ కొస్తే కన్నీరు ఎందుకు వస్తుంది..?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "నందగోకులము లోని\nయాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి.\nఈ పర్వతం పై వున్న\nపశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి.\nఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.\nఅందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.\nకాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.\n\nదీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు. ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు. ప్రళయకాల గర్జన్లతో విద్యుత్ సమాన మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడ తెరిపి లేకుండా కురిపిస్తాడు.\n\nకొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది.\nదీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు.\nఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.\nతన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఇంద్రునిగర్వభంగం చేస్తాడు.\nప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.\n\n. . స్థూలంగా భాగవతంలో ఈ ఘట్టంలోని కధ ఇది. మరి మనం కధగా చదువుకొ౦దామా లేక స్వామీ లీల యొక్క విశేషం గ్రహి౦చుదామా?\nఈ విశేషం పై పండిత అంతరార్ధం వేరుగా వున్నది, స్వామీ వారి అనుగ్రహం పై కలిగిన భావనను ఇక్కడ తెలుపుచున్నాను.\nగోవర్ధనం అనేది ఒక అచల పర్వతం.గోవులకు అవసరమైన ఆహరం సమృద్ధిగా లభించు ప్రదేశం. అలాగే కొ౦డ అంటేనే సకల జీవజాలంనకు ఆవాలం.\n\nగోవును కామధేను ప్రతి రూపముగా కొలుస్తాము. కామధేనువు సర్వదేవ ఆవాసం గా కొలుస్తాము.అలాగే గోవు ఆనాటి ప్రజల సిరిస౦పదలకు మూలం. ఎన్ని గోవులు వుంటే అంత సంపద. పురుషుడి వలన వంశం, గోవుల వలన పాడి సమృద్ధిగా పెరుగుతాయని ఆర్యుల నమ్మకం.అదే పౌరాణిక గాధలో నిక్షిప్తం.\n\nఅలాగే ఇంద్రుడు అష్టదిక్పాలకులకు అధిపతి.రాజుతో సమానం. సర్వులు ఆయనకు లోబడి వుండాలి. కాని విశ్వ సంరక్షకుడు విష్ణువు ఈనాడు శ్రీకృష్ణ అవతారంలో నందగోకులం లో వుండి శిష్ట రక్షణ చేస్తున్నాడు.\n\nఅ౦దువలన సర్వ ప్రజలు పరమాత్మను కొనియాడుతున్నారు. కాని కృష్ణుడు ఈ సమయములో ఇంద్రునికి పూజని అడ్డుకోవటము వలన ఇ౦ద్రునిలొ ఈర్ష్యతో రగలి ప్రకృతి నియమ విరుద్ధముగా వర్షము, తన పాలిత ప్రజలపై తానే దాడికి పూనుకొన్నాడు. దీని వలన ప్రాణకోటికి ఇబ్బంది.కాని ఆసమయములో కృష్ణుడు గోవర్ధనమును తన చిటికిన వ్రేలి పై నిలిపి ప్రాణకోటిని,ప్రకృతిని రక్షించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 721,
        "IMAGE": "cat_8",
        "NAME": "గోవర్ధనగిరి - కృష్ణ లీలా విశేషం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక\nకసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది.\nవిషయం తేలక ఇద్దరు బీర్బల్\nదగ్గరకు వెళ్ళారు.తగువు తీర్చమని బీర్బల్ ని\nఅడిగారు.“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్\nఅడిగాడు\n.అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు,\n“నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ\nచమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి\nచమురు పోస్తానన్నాడు.\nపాత్ర తీసుకు రావడానికి\nనేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి\nతీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు.\nనా డబ్బు సంచి నాకు ఇప్పించండి”వెంటనే ఆ\nచమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ\nఅబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి\nతీసి లెక్ఖ పెడుతున్నాను.\nఅది చూసి\nఇతను దురాశతో నా సంచి కాచేయడానికి\nప్రయత్నం చేస్తున్నాడు.న్యాయం చెప్పండి.”\nఅన్నాడు.\nబీర్బల్ యెన్ని సార్లు అడిగినా\nవాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప\nసాగారు.\nఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక\nయుక్తిని అలోచించాడు.ఒక పెద్ద పాత్రలో\nనీళ్ళు తెప్పించాడు.\nఆ నీళ్ళల్లోకి సంచిలో\nనాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా\nనూనె తేలింది.ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి\nచమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.\nబీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి\nఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 722,
        "IMAGE": "cat_8",
        "NAME": "నాణాల సంచి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.\n\nఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతాడు.\n\nరాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.\n\nరాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 723,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఏడు కూజాల వజ్రాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఇంద్రసేన భూపతి విశాలపురి రాజ్యానికి రాజు. అతడు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడు. వారికి కావలసినవన్నీ అడగకుండానే సమకూరుస్తూ ఉండేవాడు. అతని భార్య మాలినీదేవి. ఆమెకు తన భర్తంటే అపారమైన గౌరవం, భక్తి. కానీ ప్రజలు తప్పు చేసినప్పుడు రాజు విధించే దండనలు ఎంతో కఠినంగా ఉండేవి. అలా విధిస్తే ప్రజలు మరొకసారి తప్పుచేయరని రాజు ఆలోచన. మృధుస్వభావురాలైన రాణిమాత్రం ఈ విషయమై ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె గర్భవతి. ఆమె ఒకరోజు కొలువులో వున్నప్పుడు దొంగతనం చేసినందుకు బాలనేరస్థుల చేతులు, కాళ్లు నరికించి వేశాడు. ఆసంఘట నను కనులారా చూచిన ఆమె తట్టుకోలేకపోయింది. ఎంతో విచారంలో మునిగి, ఎవరితో నవ్ఞ్వతూ మాట్లాడకుండా ఏకాంతంగా జీవితం గడుపుతూ ఉండేది.\n\nకొన్నినెలల తర్వాత ఒక ఆడపిల్లను ప్రసవించి మరణించింది. ఆమె మరణ వార్త విని రాజు ఎంతో కృంగిపోయాడు. ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచసాగాడు. ఆమె పేరు కళ్యాణి. ఆమె చిన్న విషయానికి కూడా ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె పుట్టినప్పుడు ఏడిస్తే ఆమె పడుకొని ఉన్న పాన్పు మొత్తం తడిసిముద్దయిపోయేది. కొంచెం పెరిగినపుడు ఏడిస్తే ఆగది నిండిపోయేది. ఈవిధంగా ఆమె వయసు పెరిగేకొలది ఆమె కన్నీరు కాలువలుగా పారేది. ఆమె ఏడుపును ఆపడం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు. రాజుగారి సలహాదారులు, మంత్రులు, అందరూ కలిసి రాకుమారి వయసు పెరిగే కొలది ఆమె కన్నీటితో నగరం కొట్టుకుపోగలదనే భయంతో పరిష్కారమార్గం ఆలోచించారు. రాజుతో కలిసి చర్చించి ఎవరైతే రాకుమారి ఏడ్చినపుడు ఆమె దుఃఖాన్ని ఆపగలుగుతారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేసి, రాజ్యాభిషేకం చేస్తామని దండోరా వేయించారు.\n\nప్రక్క రాజ్యంలో వ్ఞన్న వీరేంద్రవర్మ అనే యువకుడు ఈదండోరా విని, ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకో వడానికి బయలుదేరాడు. అతనికి పక్షుల భాష కూడా తెలుసు. మార్గమధ్యలో ఒక వృద్ధుడు నడవలేక బాధపడు తుంటే తన భుజాలపై మెసుకొని నడచి అతని గమ్య స్థానానికి చేర్చాడు. ప్రతిఫలంగా ఆ వృద్ధుడు నాలుగువైపుల అద్దాలతో తయారు చేయబడిన ఒక పెట్టెను బహు కరించాడు. ఆచిన్న పెట్టెతో అతను విశాలపురి రాజ్యాన్ని చేరాడు.\n\nపోటీ ప్రారంభమైంది. ఎంతోమంది ఎనోన్నకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. వీరేంద్రవర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడ పంజరంలో ఉన్న పక్షులు తమ భాషలో ఈవిధంగా అనుకుంటున్నాయి ..'ఈ యువకుడు చాలా తెలివైనవాడు. ఈ అద్దాల పెట్టెను రాకుమారి కళ్లముందు ఉంచితే దానిమీద పడే ఎండకాంతి వల్ల రాకుమారి కళ్లు మూస్తుంది అని అనుకున్నాయి. వాటి మాటలను అర్థం చేసుకున్న యువకుడు ఆ విధంగానే చేశాడు. ఆకాంతి వల్ల రాకుమారి కళ్లు మూసేసింది. దాంతో ఏడుపు ఆగిపోయింది. అది చూసిన సభికులు, రాజుగారు అందరూ వీరేంద్రవర్మను ప్రశంసించారు, కల్యాణినిచ్చి వివాహం చేసి, పట్టాభిషిక్తుడ్ని చేశారు. వారిరువ్ఞరూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 724,
        "IMAGE": "cat_8",
        "NAME": "మృధుస్వభావురాలైన రాణి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.\n\nయువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.\n\nసైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.\n\nఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 725,
        "IMAGE": "cat_8",
        "NAME": "అందమైన రాకుమారి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు.\n\nకొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్లు పెట్టినవి కావు. రంగయ్యే కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 726,
        "IMAGE": "cat_8",
        "NAME": "రంగయ్య ఉపాయం ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజు గారు వుండేవారు. ఆ రాజు గారికి పిల్లలు పుట్టలేదంట. దానితో తన తరవాత ఆ రాజ్యం ఎవరు పాలించాలా అని దిగులు పడుతూవుండేవారు. ఒక రోజు బాగా ఆలోచించి తన రాజ్యం లోని పిల్లలందరినీ ఒకచోటకి రమ్మని చాటింపు వేయించాడు. పిల్లలందరూ రాగానే వాళ్ళందరికీతలా కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక మాసం లోపు ఎవరి విత్తనాలయితే బాగామొలుస్తాయో వారిని యువరాజు గా చేస్తానని చెప్పాడు.\n\nఅదే రాజ్యం లో అభిమన్యుడు అని ఒక చిన్న పిల్లవాడు వుండేవాడు. అభిమన్యుడు చాలా అమాయకుడు, మంచివాడు. అభిమన్యుడు కూడా రాజు గారి దగ్గర విత్తనాలుతీసుకొని ఇంటికి వచ్చేసాడు.ఒక మాసం తర్వాత అందరు మళ్లీ రాజు గారి దగ్గరకు వెళ్లారు. అందరి దగ్గరమంచి మొక్కలు వున్నాయి. రాజు గారు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వాళ్ళమొక్కలని చూస్తున్నారు. అలా వస్తూ చివరకు అభిమన్యుడు దగ్గరకి వచ్చిమొక్కను చూపించమన్నారు. కానీ అభిమన్యుడు తనకిచ్చిన విత్తనాలు మొక్కమొలవలేదని చెప్పాడు.\n\nరాజు గారు సంతోషించి అందరితో \"నేను ఇచ్చిన విత్తనాలకు అసలుమొక్కలు మొలవవు. కానీ అందరు రాజ్యం కోసం మొక్కలు తెచ్చారు.అభిమన్యుడు ఒక్కడే నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడు. కాబట్టి అభిమన్యుడు ఈరాజ్యానికి కాబోయే యువరాజు.\" అని చెప్పారు. అందరు తప్పు తెలుసుకొని అభిమన్యుడు ని యువరాజుగా అంగీకరించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 727,
        "IMAGE": "cat_8",
        "NAME": "యువరాజు అభిమన్యుడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ లొట్టాయి అని పిలిచేవారుట. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా తోటకూర మొక్కలు \"రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్..\" అని ఊగాయట. వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి కూర వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.\n\nఆ తోటకూర ఉడుకుతూ ఉడుకుతూ \"కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్...\"అందట. వాడికి ఇంకా కోపం వచ్చి కూరoతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడుట. ఆ తోటకూర తిన్న ఆవు పాలు ఇస్తూ \"చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్...\" అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా \"కిర్రు కిర్రు లొట్టాయ్..కిర్రు కిర్రు లొట్టాయ్ ..\" అని అనటం మొదలెట్టాయిట. అప్పుడు వాడు ఆ చెప్పులని దూరంగా విసిరేసాడట.\n\nఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి \"భౌ భౌ లొట్టయ్..భౌ భౌ లొట్టాయ్..\" అని అరవటం మొదలెట్టిండట. ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట. బావిలోంచి \"బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్..\" అని శబ్దo రాసాగిందట. ఇక వాడు ఊరుకోలేక మితిమీరిన కోపంతో బావి లోకి దూకాడుట...\"బుడుంగు లొట్టాయ్..\" అని మునిగిపోయాడట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 728,
        "IMAGE": "cat_8",
        "NAME": "అమ్మ కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ చక్రవర్తి భార్యలలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద అక్బర్‌కు చాలా ఫిర్యాదులు అందాయి.ఒకనాడైతే ఆమె అక్బర్‌తోనే చాలా మొరటుగా మాట్లాడింది. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ‘‘నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో’’ అని ఆజ్ఞాపించాడు. ఆవేశంలో ఏదో అంది కానీ, ఆయన వెళ్ళిపొమ్మనే సరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది. ‘‘నా మాటలకు, చేతలకు సిగ్గు పడుతున్నా. దయచేసి నన్ను క్షమించి మా పుట్టింటికి పంపొద్దు’’ అని వేడుకుందామె.\n\nఅక్బర్‌కు కూడా జాలి కలిగింది. కానీ, ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే, ‘‘నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళొచ్చు’’ అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనని క్షమించాడని తనకి అర్థమైంది. కానీ, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది. కానీ, ఆమె అతణ్ణి కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడుగగలదు? ఏది ఏమైనప్పటికీ ఆమె అతనికి కబురు పంపించగానే వచ్చాడు.\n\n‘‘బీర్బల్! నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ, నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా’’ అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. ‘‘బేగం సాహెబా! గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి’’ అన్నాడు బీర్బల్ సహృదయంతో. ఆమె జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించింది. బీర్బల్ అంతా విని కొంచెం సేపు ఆలోచించి ‘‘....ఇలా చేయండి’’ అని ఆమెకు గుసగుసగా చెప్పాడు. ఆ బేగం ఆ సలహాతో ఎంతో సంతోషించింది. తర్వాత ఆమె ఆ సాయంకాలం ‘తాను ఈ రాత్రికే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని’ అక్బర్‌కు కబురు పంపింది.\n\nఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. ‘‘నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి’’ అని అడిగింది బేగమ్. బేగమ్ తన ఆజ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లై, మత్తుగా నిద్రపోయాడు.\n\nఅప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న బేగమ్ నిద్రపోతున్న అక్బర్‌నూ పల్లకీలోకి చేర్చింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చొని పుట్టింటికి ప్రయాణమైంది. మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్‌కు పరిసరాలన్నీ కొత్తగా కనిపించటంతో ‘‘ఏంటిది? నేను ఎక్కడున్నాను?’’ అన్నాడు ఆశ్చర్యంగా. అతణ్ణి కనిపెట్టుకుని ఉన్న బేగం ‘‘మందిరంలోనే ఉన్నారు ప్రభూ!’’ అంది. ‘‘కానీ, ఇది మా మందిరం కాదే?’’ అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలోంచి బయటికి చూస్తూ. ‘‘ప్రభూ! మీరు నన్ను మా పుట్టింటికి నాకత్యంత ప్రీతిపావూతమైన దాన్ని తీసుకుని పొమ్మన్నారు కదా. నా కత్యంతం ఇష్టమైంది మీరే కాబట్టి, మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను’’ అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది.బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవరూ ఇచ్చి ఉండరని గ్రహించిన ఆయన నవ్వుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 729,
        "IMAGE": "cat_8",
        "NAME": "పరమ గయ్యాళి భార్య ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు ఉదయాన అక్బర్ యువరాజు సలీం మరియు బీర్బల్‌తో కలిసి వాహ్యాళికి వెళ్లాడు. అలా వారు నది ఒడ్డుకు వచ్చారు. అది ఎండాకాలం కావడంతో ఒక చెట్టునీడన కూర్చున్నారు.\n\nకొద్దిసేపయ్యాక అక్బర్, ‘నదిలో స్నానం చేద్దామా?’ అన్నాడు. బీర్బల్ నీళ్లలో చెయ్యిపెట్టి చూసి, ‘అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి. నేను మాత్రం చెయ్యను ప్రభూ’ అన్నాడు. అక్బర్, ‘సరే మంచిది. సలీం, నేనూ స్నానం చేస్తాము. నువ్వు ఇక్కడే ఉండి మా దుస్తులు పట్టుకో’’ అన్నాడు.\n\nఅలా అని అక్బర్, సలీం తమ తమ దుస్తులు విప్పి బీర్బల్‌కు ఇచ్చి నదిలో దిగి స్నానం చెయ్యసాగారు. అక్బర్, సలీంతో ‘‘బీర్బల్ ఒక మూర్ఖుడు. ఎండలో నిల్చుని మన బట్టలు మోస్తున్నాడు. నా కంటికి చాకలివాని గాడిదలా కనిపిస్తున్నాడు.\n\nఇప్పుడొక తమాషా చేస్తా చూడు’’ అని‘‘ఏయ్! బీర్బల్, నువ్వొక గాడిద బరువు మోస్తున్నావు’’ అన్నాడు వ్యంగ్యంగా వెంటనే బీర్బల్, ‘‘కాదు ప్రభూ, రెండు గాడిదల బరువు మోస్తున్నా’’ అన్నాడు. అక్బర్ ముఖం మాడిపోయిoది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 730,
        "IMAGE": "cat_8",
        "NAME": "రెండు గాడిదల బరువు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. \"అరే... మంచి విందు భోజనం దొరికిందే\" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క.\"పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త\" అంటూ పలకరించింది.శుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు. స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క.\n\nకాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క. అరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.నా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.అమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది. అది చూసిన కోడిపుంజు...అదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.నిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా.! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 731,
        "IMAGE": "cat_8",
        "NAME": "కోడిపుంజు తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు. అందరు రాజులకు మల్లే వేట అంటే అతడికి మహాపిచ్చి.వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసమంటే పిచ్చి పిచ్చి ఆ రాజుకి. ఒక రోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్లాడుబంధుమిత్రులు, సైన్య సపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి. రాజు భయపడాల్సిన పనిలేదు మరి. ఓపిక ఉన్నంత వరకూ వేటాడారు. అదేం ఖర్మో గాని ఆరోజు రాజు వేట పారలేదు. ఎంతదూరం పోయినా జంతువు అలికిడి లేదు. పక్షుల జాడలేదు.తిరిగారు తిరిగారు తిరిగారు.. తిరిగి అలసిపోయారు. ఉన్నట్లుండి సింహం అరుపు వినబడింది. రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. కాని రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమ్మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో..ఒక్కసారిగా లంఘించి ముందుకురికింది. అందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగయిపోయింది. రాజభటులు తెప్పరిల్లి వెతికితే..గుర్రమూ లేదు... రాజూ లేడు...వేటమాని అడివంతా రాజుకోసం గాలించడం వారి పనయింది.\n\nతోవతప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు.పాపం. రాజు కదా.. దారి తెలీదు. దార్లూ గట్రా చూసిపెట్టేందుకు సేవకులూ లేరు కదా.. చేసేదేమీలేక గుర్రం మీద పోయాడు పోయాడు పోయాడు.. ఎలాగైతేనే అడివి మార్గంలో పూటకూళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఆరోజుల్లో అడవిలో కూడా బాటసారులకు తిండి గట్రా చూసేందుకు పూటకూళ్లమ్మలు ఉండేవాళ్లులే. రాజు పూటకూళ్లమ్మ ఇంటికి చేరుకున్నాడు. గుర్రాన్ని దాణాకోసం విడిచి దాని దాణా కోసం కాసులిచ్చాడు. తానూ కాళ్లూ చేతులూ కడుక్కుని పూటకూళ్ల ఇంట్లో చక్కాలు ముక్కాలు వేసుకుని కూచున్నాడు.\n\nఅకలితో కడుపు నకనకలాడిపోతోంది. పూటకూళ్లమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారుల్లాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది.వేటకోసం పోయి దారితప్పి డస్సిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో.. ఏం వేసి పచ్చడి రుబ్బారో.. వేరు శనక్కాయల పచ్చడి... ఆపై ఆకలి. దహించుకుపోతున్న జిహ్వ.. రాజు ముందూ వెనుకా చూడలేదు. ఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు... మొత్తానికి రాజుకు ఆకలి తీరింది.నాలుగు వరహాలు పూటకూళ్లమ్మకిచ్చి బయలుదేరాడు. పోగా పోగా పోగా... ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు. వేటకు వెళ్లి తప్పిపోయిన రాజసేవకులూ, సైన్యమూ, సవరివారసమేతమూ తిరిగి వచ్చేసింది.\n\nపాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు. కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు. ఒరేయ్ రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగగింజలతో ఊరుమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు. తలా తోకా లేకుండా రాజు జారీజేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది.పంచభక్ష్యపరమాన్నాలను ఆరగించే రాజు.. మాంసం ముక్క చప్పరించనిదే ముద్ద దిగని రాజు.. ఎక్కడెక్కడినుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసారా సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు... ఊరుమిండి చేసి పెట్టమంటాడేమిటీ.. అయినా.. రాజంటే రాజే..రాజు మాటంటే మాటే మరి.. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా మరి..వంటవాళ్లు రంగంలోకి దిగారు.. రాజ్యంలో పండగా రాజభటులు సేకరించిన మేలు రకం వేరుశనగ్గింజలను తెప్పించుకున్నారు.ఊరుమిండికి కావలసిన పదార్ధాలకు అదనంగా మరికొన్నింటిని కలిపారు.\nఎంతైనా రాజు వంటవాళ్లు కదా..ఊరుమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు.\n\nఆరోజు గడిచింది..తెల్లవారింది.. రాజుకూ, వంటవాళ్లకు కూడా.. రాజు ఎప్పటిలాగే సభకు వెళ్లాడు.వంటవాళ్లు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరుమిండిని తయారు చేశారు.దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏ పోపులు పెట్టారో..ఏ మసాలాలు దట్టింటారో..వంటశాల అంతా ఊరుమిండి వాసనేస్తోంది. వాళ్ల వంటను చూసి వంటవాళ్లు తమకు తామే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆహా. ఓహో.. భలే కుదిరింది.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. మధ్యాహ్నం దాటింది. సభ ముగిసినట్లుగా గంట మోగింది. రాజు బయలుదేరాడు.అంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు. భోజనశాలకు చేరుకున్నాడు.. వంటవాళ్లు సిద్ధంగా ఉన్నారు. రాజు కూర్చున్నాడు. వంటవాళ్లు ఒక్కటొక్కటిగా వడ్డిస్తున్నారు. రాజుకోసం ప్రత్యేకంగా వండిన ఊరుమిండి గుండ తీసి రాజు పళ్లెంలో పెట్టారు.\n\nఊరుమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక వంటశాలనుంచి ఒక ఉరుము ఉరిమింది.ఎవరక్కడ? ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరుగెత్తుకొచ్చారు. చిత్తం ప్రభూ.. ఈ వంటవాళ్లను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి. ఆజ్ఞాపించాడు..వంటవాళ్లు లబలబలాడారు. మొత్తుకున్నారు. తామే పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు. కాని రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి..\n\nవంటవాళ్లది ఇందులో ఏ తప్పూలేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే. ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకూళ్లమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఊరుమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి.... పంచభక్ష్యపరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి.\n\nఅందుకే ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 732,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, \"రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడంవల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు, ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను\" అంటూ ఇలా చెప్పసాగాడు.\n\nనాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో \"పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో\" అన్నారు.నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంతదూరం పరిగెత్తి, ఒకపెంకుటింటి అరుగుమీద తలదాచుకున్నాడు. అయితే ఆ సరికే అతను బాగా తడిసిపోయాడు. \"అయ్యో, బాగా తడిసిపోయావు. లోపలికిరా, బాబూ\" అంటూ కిటికీలోంచి అతణ్ణి చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది.\n\nనాగరాజు మొహమాటపడుతూనే లోపలికి వెళ్ళాడు. \"సంధ్యా, పొడిగుడ్డ తీసుకు రామ్మా. ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు\" అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది. \"అందమైన పేరు!\" అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్ళ గజ్జెల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మందాకా వెళ్ళి, బట్ట అందుకున్నది.నాగరాజు తడిసిన తల తుడుచుకుంటుండగా \"కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్యా\" అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ.తరవాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది; తమను గురించి చెప్పింది; వాళ్ళు ఆ వూరుకు కొత్తగా వచ్చారు. సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కాని, పాలు కూడా గుమ్మందాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో, అతడికి ఆ అవకాశం చిక్కలేదు. మర్నాడు పని గట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, \"మా సంధ్య తోచనప్పుడు యిలా తెరలూ అవీ అల్లుతూ వుంటుంది\" అన్నది.ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమయిన ఫలహారం అందింది కాని, ఆమె దర్శనం మాత్రం కాలేదు.\n\nఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మపళ్ళు తీసుకొని, నాగరాజు, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపలినుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడినుంచి వచ్చిన ముసలావిడను అతడు గమనించలేదు.ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ \"ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలుపెడితే, పరిసరాలు మరచిపోతుంది\" అన్నది.లోపలి గదిలో వున్న సంధ్య, నాగరాజుకు కనపడలేదు. అతడు దానిమ్మపళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి, కాసేపు కబుర్లు చెప్పి, ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా,ఆమెనే పెళ్ళాడాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. మర్నాడు ఎలాగయినా సంధ్యను చూడాలనీ, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలనీ నిశ్చయించుకున్నాడు.\n\nనాగరాజు ఆ మరుసటిరోజున సంధ్యవాళ్ళ ఇంటిని సమీపిస్తుండగా, హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దొకటి, అతణ్ణి పొడిచి పారిపోయింది. నాగరాజు కిందపడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లొంచి బయిటికి వచ్చింది. ఆమె నాగరాజును చూసి \"అయ్యో ఏం జరిగింది? చేతినుంచి రక్తం కారుతున్నది, లోపలికి రా\" అని ఆందోళనపడుతూ వచ్చి, గాయపడిన నాగరాజు చేయి పట్టుకున్నది.\n\n\"మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులోనుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు\" అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, \"సంధ్యా, చెంబుతో నీళ్ళు పట్టుకురా\" అని గట్టిగా కేకపెట్టింది. గది కిటికీవద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖకవళికల్లో జాలి, ఆదుర్దాలాంటి లక్షణాలే లేవు. తీరా తల్లి కేక వేసాక ఆమె కిటికీ దగ్గరనుంచి కదలి, కొంచెం సేపట్లో నీళ్ళ చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్ళతో, నాగరాజు గాయం కడిగింది. ఆ తరవాత పసుపూ, శుభ్రమైన గుడ్డా తెమ్మని చెప్పింది.\n\nసంధ్య పసుపూ, గుడ్డా తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, \"ఇప్పుడు చెప్పు బాబూ! నువు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి?\" అని అడిగింది.వెంటనే నాగరాజు \" మా మేనమామ కూతురితో నా పెళ్ళి జరగబోతున్నది. మీరూ, సంధ్య తప్పకుండా రావాలి\" అని చెప్పి ఇంటికి వచ్చేశాడుబేతాళుడు యీ కథ చెప్పి \"రాజా నాకొక సందేహం! నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరిక్షణంలొ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగులుతుంది\" అన్నాడు.\n\nదానికి విక్రమార్కుడు \"నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతిమనిషికీ కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి. అవి లోపించినపుడు, ఇతర అర్హతలు ఎన్ని వున్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండవలసిన కనీస లక్షణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా వుండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు. సంధ్య నాగరాజు గాయాన్నీ, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏ మాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని యీ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాలరాశిని కాక, కనీసార్హతలయిన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్ళాడడానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు\" అన్నాడు..రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 733,
        "IMAGE": "cat_8",
        "NAME": "సౌందర్యవతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. “ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం” అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. ఈ తోడేలు చాలా జిత్తులమారింది. ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది. దీని మాటలు అసలు నమ్మకూడదు. ఇది నన్ను కూడా మోసం చేస్తుంది. అందుకని దీని వలలో పడకూడదు. కాని పైకి ఇలా అంది “నేను నమ్మను. నీది బాగా చెడు బుద్ది. చాలా జంతువులను మోసం చేశావు. అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు” అంది.\n\nఅది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, “మామా! నేను ఇపుడు చాలా మారాను. అసలు మాంసాహారము ముట్టడం లేదు. నేను శాకాహారమునే తీసుకుంటున్నాను. నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు. నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు. నన్ను నమ్ము. నువ్వు ఎలా చెబితే అలా వుంటాను. అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు. మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను. అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును. ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది. ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది. “నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను”.\n\nఅందుకే తోడేలు “నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను. మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం. కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది. ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది. ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది. వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.\n\nఒకరోజు తోడేలు ఒంటెతో “మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది. నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి, చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!” అని అంది. ఒంటె ఒప్పుకుంది. తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది. ఒంటెకు నోరు ఊరింది. చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి. మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది. ఒంటెకు ఉత్సాహంగా ఉంది. దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి “నీవు నా వీపు మీద కూర్చో”అంది. తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది. రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి. చెఱకు తోటలోకి నడిచినాయి.\n\nఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి “మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది. నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు”అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు. ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది. తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది. తోట యజమానికి వినపడేలా అరిచింది. ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.\n\nతోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు. చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు. అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు. కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది. వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది. అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది. “మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు. ఇంటికి చేరగానే మందు రాస్తాను పద” అంది. ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది. దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది.\n\nఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది. తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది. ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె, నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది. నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. “అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో” అంది. తోడేలుకు అప్పుడు అర్దమైంది. దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది. ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 734,
        "IMAGE": "cat_8",
        "NAME": "జిత్తులమారి తోడేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.\n\nతిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.\n\nరైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.\n\nఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 735,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఉత్తమజ్ఞానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.\n\nకప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.\n\nచెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 736,
        "IMAGE": "cat_8",
        "NAME": "కప్ప చెడు స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది. భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు. తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.\n\nఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది. కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 737,
        "IMAGE": "cat_8",
        "NAME": "గుడ్లగూబ విచక్షణ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.\n\nరంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.\n\nఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 738,
        "IMAGE": "cat_8",
        "NAME": "నక్క రంగులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”. ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.\n\nకొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.\n\n“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం. “ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 739,
        "IMAGE": "cat_8",
        "NAME": "అద్దం ముక్క మెరుపు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో \"నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు\" అంది.\n\n\"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?\" అడిగాడు పనివాడు. \"ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు\" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు \"బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు\" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.\n\nపనివాడు ఆ కుండతో \"కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు\" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 740,
        "IMAGE": "cat_8",
        "NAME": "పగుళ్ళ కుండ భాధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పొలం గట్టుపైన ఉన్న చెట్లలోంచి రెండు గింజలు కిందపడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడటంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ... \"మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి, మొక్కలుగా, వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వర్తించాలి\" అని చెప్పింది మొదటి గింజ. నీకెందుకు అంత తొందర. మొలకెత్తినప్పట్నించీ మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటినుంచీ కష్టాల పరంపర మొదలవుతుంది\" అని వాపోయింది రెండో గింజ. ఇంకా... చిగుర్లెత్తగానే పశువులు తినేస్తాయని భయం, పెద్దయ్యేదాకా అదే బాధ, పండ్లు కాస్తే ఫర్వాలేదుగానీ, లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండెకోతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది.\n\nకాబట్టి... ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే... వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మనదగ్గరకు వచ్చి సేదతీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది. ఇతరులకు సహాయపడటం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇతరులకు అన్నివిధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. నీ సంగతి సరే...! కానీ.. నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ.\"ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను. నీ ఖర్మ అంటూ\" భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి.\n\nమొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్లకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమిలోపల వెచ్చగా దాక్కుంది. అలా గడుస్తుండగా... ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజనుచూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది. ఇంకేముందీ... \"అయ్యో...! తన స్నేహితుడు చెప్పినట్టు చేసిఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని\" ఏడుస్తూ... కోడిపుంజుకు ఆహారమైంది రెండో గింజ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 741,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే పట్టే గతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.\n\nదీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.\n\nనువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. \"నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?\" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 742,
        "IMAGE": "cat_8",
        "NAME": "దొంగ సాధువు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి \"ఊరికామందు\" ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.\n\nదాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది. వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు. వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు. అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు. కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు. దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు. నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు. పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 743,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఆశపోతు ధనయ్య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.\n\nకాకి “యేమిటది” అని అడిగింది.“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.\n\nకాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది. ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది! ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 744,
        "IMAGE": "cat_8",
        "NAME": "మిణుగురు పురుగు సమయస్ఫూర్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు భీముడు వేటనిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి \"నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? \" అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది \" భీమసేనా నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్రపదవిని అధిష్టించాను. కాని ఒకమునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను \" అని దు॰ఖించాడు.\n\nఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచులువ బంధించి ఉన్న భీముని చూసి \" ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడమా? \" అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి \" అయ్యా నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసం సమకూరుస్తాను \" అన్నాడు. ధర్మజా! నేను నీవంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్తఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను.ప్రత్యేకంగా అగత్యుడిని అవమానించి కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆశాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను.\n\nనా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చ్ప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో. ధర్మరాజు \"అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు \" అన్నాడు.కొండచిలువరూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విష్యమేమిటి? \". జవాబుగా ధర్మరాజు \" సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దు॰ఖము ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య \" అన్నాడు.\n\nనహుషుని రెండవ ప్రశ్న \" శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు \" మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం \" అని జవాబిచ్చాడు.\n\nనహుషుని మూడవ ప్రశ్న. \" పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను పొందింది ? \" ధరరాజు \" దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించబడుతుంది \" అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ\n\nభీముని వదిలాడు. తన అజగర రూపం వదిలి దివ్యమైన మానుషరూపం పొందాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 745,
        "IMAGE": "cat_8",
        "NAME": "అపరిమిత బలము కలిగిన భీముడు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.\n\n“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.\n\nరాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.\n\nకొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 746,
        "IMAGE": "cat_8",
        "NAME": "దుష్టులతో స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి.\n\nనక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.\n\nఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి.\n\nతాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయ\n\nఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 747,
        "IMAGE": "cat_8",
        "NAME": "ఐకమత్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.\n\nఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి \"అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా\" అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.\n\n\"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?\" అన్నాయి. \"నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం\" అంది కాకి. \"ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది\" అన్నాయి మరాళాలు.\n\nఅనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.\n\nఅది చూసి హంస \"నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?\" అంది. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. \"ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు\" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ \"కావుమని\" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది. \"ఇంకెప్పుడూ గొప్పలు పోకు\" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస. కాకి లెంపలేసుకుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 748,
        "IMAGE": "cat_8",
        "NAME": "కాకి - హంస ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక చెరువులో కొన్ని చేపలు ఉండేవి. ఒక రోజు ఒక అబ్బాయి ఆ చేపలలో నుంచి చిన్నచేపను పట్టుకున్నాడు. దానిని తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న తొట్టెలో కొంతకాలం పెంచాడు. అది సహజమైన వాతావరణంలో పెరిగితేనే సంతోషంగా ఉంటుందని ఎవరో చెప్పడంతో దానిని తిరిగి అదే చెరువులో వదిలేశాడు. ఆ చేప పిల్ల తిరిగి తనకు స్వేచ్ఛ దొరికినందుకు, తనవాళ్లను కలుసుకున్నందుకు చాలా సంతోషించింది. కానీ అది తిరిగి వచ్చిన కొన్నిరోజులకే ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. వేసవి కాలంలో ఎండలు గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో వేడికి నీరు ఆవిరై చెరువులో నీళ్లు బాగా తగ్గాయి.\n\nచేపపిల్లకు ఆ వేడిని తట్టుకోవడం కష్టమైంది. మిగిలిన చేపలు మాత్రం వేడిని తట్టుకోగలిగాయి. ‘‘నేను నీడ పట్టున హాయిగా ఉండేదాన్ని. అనవసరంగా మళ్లీ ఈ చెరువులో వచ్చి పడ్డాను. అక్కడే ఉంటే చల్లగా, హాయిగా ఉండేదాన్ని’’ అని బాధ పడసాగింది. అది గమనించిన ఒక పెద్దచేప, దాని బాధనంతా ఓపికగా విని అర్థం చేసుకుంది. ‘‘ఏదో ఒక రకంగా నన్ను తిరిగి ఇంతకు ముందు ఉన్న చోటికే పంపించేయండి’’ అని పెద్దచేపను బతిమిలాడింది చిన్నచేప.\n\n‘‘ఈ వేడి ఎంతో కాలం ఉండదు. కొన్నిరోజులు కష్టపడవలసి వస్తుందని నువ్వు జీవితమంతా ఎక్కడో బందీగా ఉంటావా? స్వేచ్ఛ కోసం ఈ మాత్రం ఇబ్బందులను కూడా భరించలేని నువ్వు మా మధ్య ఉండక్కర్లేదు’’ అని చివాట్లు పెట్టింది. అప్పుడు చిన్న చేప ‘‘అయితే నేను వెళ్లను. ఇక్కడే ఉంటాను’’ అంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వర్షాలు కురిశాయి. చెరువులో నీళ్లు పెరిగాయి. వేడంతా తగ్గిపోయింది. తొందరపడి వెళ్లిపోకుండా అక్కడే ఉన్నందుకు చిన్నచేప చాలా సంతోషించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 749,
        "IMAGE": "cat_8",
        "NAME": "చేప పాట్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "రత్నపురి రాజ్య ఆస్థాన పండితుడు వరదాచారి. ఆయన ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో చిత్తు చేసేవాడు. ఎంత గొప్ప పండితుడినైనా తన అమోఘ పాండిత్యంతో అవలీలగా ఓడించేవాడు. దాంతో ఆయన కీర్తి నలుదిక్కులా మారుమోగిపోసాగింది.\n\nవరదాచారి కుమారుడు సుబుద్ధి. అతడికి చదువు మీద ఆసక్తి లేదు. ‘చదువే బంగారు భవిష్యత్తుకు పునాది’ అని ఎవరైనా హితవు పలికితే అతడికి తగని చిరాకు. ‘కష్టపడి చదవవలసిన అవసరం నాకు లేదు. చదువు లేకున్నా నేను హాయిగా, దర్జాగా బతకగలను. మా నాన్న గొప్ప పండితుడు. మా ఇంటి నిండా బంగారు నాణాలు, రత్న మాణిక్యాలు ఉన్నాయి’ అని గొప్పగా చెప్పేవాడు. రోజూ ఆట పాటలతో సమయం వృథా చేసేవాడు. అది గమనించిన ఓ వ్యక్తి ‘‘పండిత పుత్రః పరమశుంఠః’’ అన్నాడు.\n\nఆ మాటలు విన్న సుబుద్ధి పండితుడి పుత్రుణ్ని పరమశుంఠ అని గౌరవంగా పిలుస్తారని భావించి, ఎంతో పొంగిపోయాడు. ఒకరోజు సుబుద్ధి రాజుగారి ఉద్యానవనంలో ఆడుకుంటున్నాడు. అంతలో అటుగా వెళుతున్న మంత్రి, ‘‘ఎవరు బాబూ నీవు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను పండిత వరదాచారి పుత్రుడిని. పరమశుంఠను’’ అని గర్వంగా చెప్పాడు సుబుద్ధి.\n\nఅంతలో ఏదో శబ్దం వినిపిస్తే ఇద్దరూ అటువైపు చూశారు. అక్కడ ఓ చెట్టుపై కొన్ని కోతులు ఉన్నాయి. అవి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నాయి. అంతలో ఓ కోతి పట్టు తప్పి కిందపడింది. వెంటనే మిగిలిన కోతులు దానిని వెలివేసి, అక్కడ నుంచి వెళ్లిపోయాయి.\n\nసుబుద్ధి బాధపడుతూ, ‘‘ఆ కోతులు కింద పడిన కోతిపై ఎందుకు జాలి చూపలేదు?’’ అని అడిగాడు. అందుకు మంత్రి, ‘‘బాబూ! కోతి జాతిలో ఓ పద్ధతి ఉంది. కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకేటప్పుడు కింద పడవు. ఏ కోతైనా పొరపాటున కింద పడితే, అది తమ కోతి జాతికే అవమానంగా కోతులు భావిస్తాయి. అందుకే ఆ కోతిపై జాలి చూపక దాన్ని వెలివేసి వెళ్లిపోతాయి.\n\nఎందుకో తెలుసా? కోతులు దేన్నైనా సహిస్తాయి కాని, చేతకానితనాన్ని మాత్రం సహించలేవు’’ అని చెప్పాడు. అది విన్న సుబుద్ధి, ‘‘అయితే పండితుల పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. కానీ చదువు రాని నేను వాళ్లందరి ముందూ చేతకానివాడిని అవుతాను కదా! మరి అందరూ నన్ను వెలివేస్తారా?’’ అని ఉద్వేగంగా అడిగాడు.\n\nమంత్రి అతడి భుజంపై చెయ్యేసి, ‘‘అవును నాయనా. నీవు చదువుకోకుంటే అందరూ నిన్ను ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అంటారు. పరమ శుంఠ అంటే తెలివితక్కువవాడు అని అర్థం’’ అన్నారు.\nసుబుద్ధి కాసేపు ఆలోచించుకుని, ‘‘నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని అవుతాను. తండ్రిని మించిన కొడుకు అన్న పేరు తెచ్చుకుంటాను’’ అన్నాడు. మంత్రి అతడిని మనసారా ఆశీర్వదించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 750,
        "IMAGE": "cat_8",
        "NAME": "పండిత పుత్రుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ప్రజలు నిప్పు ఉపయోగం తెలుసుకోవడానికి పూర్వం జరిగిన కథ ఇది: ప్రజలకు నిప్పు గురించి తెలుసు కాని, ఆ కాలఘట్టంలోదాన్ని ఎలా త…యారు చేయాలో తెలియదు. ఫిజీ దీవులలోని రోటుమా పర్వతాలలోని ఒక గుహలో టుంబా అనే రాక్షసుడు ఉండేవాడు. భయంకరాకారుడైన టుంబా నోట్లో నిప్పు జ్వాలలు విరజిమ్మే కణకణలాడే కోరపళ్ళు ఉండేవి.\n\nపెద్ద కొలిమినుంచి వెలువడే జ్వాలల్లా వాడు నోరు తెరిచినప్పుడల్లా అగ్నిజ్వాలలు వీచేవి. అదృష్ట వశాత్తు ఆ రాక్షసుడు ఎప్పుడూ తన గుహలో పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతూండేవాడు. అరుదుగానే వెలుపలికి వచ్చేవాడు. అతడు కొండపైనుంచి పెద్ద పెద్ద అంగలతో నడిచేప్పుడు వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెలువడే అగ్నిజ్వాలలకు దాపులనున్న చెట్టు చేమలు భస్మమయ్యేవి.\n\nకొండ పాదతలంలో, సముద్రం ఒడ్డున నివసిస్తూన్న గ్రామస్థులు, రాక్షసుణ్ణి చూసి గడగడలాడేవారు. వాడు గుహను వదిలిరాకుండా నిద్ర పోతూనే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించేవారు.\n\nఆ గ్రామంలో లెకబారు, డకువాకా, మసిలాకా, టువేసీ అనే నలుగురు చురుకైన కుర్రాళ్ళు ఉండేవారు. జ్వాలలు చిమ్మే రాక్షసుణ్ణి చూసినప్పుడల్లా, వాడి నోటినుంచి అగ్నిజ్వాలను లాక్కుంటే ఎంత బావుణ్ణు అని ఆలోచించేవారు.\n\n‘‘మనవద్దే గనక నిప్పు ఉంటే మన జీవితం ఎంత హాయిగా ఉండేది!'' అన్నాడు టువేసీ. ‘‘మనస్ర్తీలు రుచికరమైన వంటలు చేయగలరు!'' అన్నాడు డకువాకా. ‘‘చీకటి రాత్రులలో సైతం మనకు వెలుగూ, వెచ్చదనం లభించేది,'' అన్నాడు మసిలాకా.\n\n‘‘మరి ఆలస్యం దేనికి? రండి ఇప్పుడేవెళ్ళి రాక్షసుడి నుంచి కాస్త నిప్పును దొంగిలించుకుని వచ్చేద్దాం!'' అన్నాడు లెకబారు.\n\nధైర్యవంతులైన ఈ నలుగురు యువకులూ, కొన్ని ఎండిన కొబ్బరి ఆకులను తీసుకుని రాక్షసుడున్న గుహకేసి బయలుదేరారు. వాళ్ళు రాక్షసుడున్న గుహను సమీపించారు\n\nరాక్షసుడు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాడి ఒక్కొక్క శ్వాసతో పాటు, కణకణలాడే దంతాలుగల నోటి నుంచి అగ్నిజ్వాల వెలుపలికి వస్తూ, లోపలికి పోతూ వింతగా కనిపిస్తున్నాయి.\n\nఆ అగ్నిజ్వాలల వెలుతురులోనే యువకులు, ఏమాత్రం చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ గుహలోపలికి వెళ్ళారు. రాక్షసుడికి నిద్రాభంగం కలగకుండా తమ వెంట తెచ్చుకున్న ఎండు కొబ్బరాకులను వాడి నోటి దగ్గర పెట్టారు. వాటికి నిప్పంటుకున్నది. యువకులు అమితోత్సాహంతో వెనుదిరగ బోయారు. అప్పుడు టువేసీ అనే…యువకుడు మితిమించిన ఉత్సాహంతో, గెంతడంతో అతని చేతిలోని మండుతూన్న కొబ్బరాకు టుంబా పెదవులకు తగిలింది. దాంతో వాడు కళ్ళుతెరిచి చూశాడు. నలుగురు …యువకులూ మండుతూన్న కొబ్బరాకులతో, గుహ నుంచి వెలుపలికి పరిగెత్తుతున్నారు.\n\n‘‘నా నిప్పును దొంగిలించే సాహసం చేసిందెవరు?'' అని గర్జిస్తూ లేచి కూర్చున్న రాక్షసుడు, ‘‘ఈ దీవిలో నాదగ్గర మాత్రమే నిప్పు ఉండాలి,'' అంటూ నిప్పులు కక్కుతూ కురవ్రాళ్ళ వెంటబడ్డాడు. కురవ్రాళ్ళు వాడి చేతికి అందకుండా అటుతిరిగి, ఇటుతిరిగి గ్రామసమీపంలో వున్న ఒక కొండగుహలోకి జొరబడి, గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండను పెట్టారు. ‘‘ఆహా! టుంబా నుంచి ఇక మనం తప్పించుకున్నట్లే. వాడికి బరువులెత్తడం అసలు చేతకాదు. ఈ బండను అంగుళం కూడా కదిలించలేడు,'' అన్నాడు డకువాకా.\n\n‘‘అలా అని మనం ఎప్పటికీ గుహలోపలే ఉండిపోలేం కదా?'' అని హెచ్చరించిన వాళ్ళందరిలోకీ తెలివైన లెకబారు, ‘‘టుంబా పీడవదిలించుకుని మన మందరం క్షేమంగా ఇళ్ళకు చేరే మార్గం ఆలోచించాలి,'' అన్నాడు. అంతలో గుహ ద్వారం చేరిన టుంబా అటూ, ఇటూ తిరుగుతూ, వాళ్ళను వెలుపలికి రమ్మని కేకలు పెట్టసాగాడు.\n\nఅయినా, వాళ్ళు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే ఉండిపోయారు. రాక్షసుడికి ఆగ్రహంతో పిచ్చిపట్టినట్టయింది. వాడి ముకుపుటాల నుంచీ, చెవుల నుంచీ మంటలూ, పొగలూ రాసాగాయి. వాడి నుంచి అంటుకున్న మంటల కారణంగా చుట్టు పక్కల అడవిలో కారుచిచ్చు వ్యాపించింది.\n\nఆ వేడి తగలడంతో వాడికి ఓర్పునశించింది. గుహలోపలి యువకులకు కూడా బ…యటి వేడిని భరించడం కష్టమయింది. ఎలాగైనా గుహలోపలి నుంచి బ…యటపడితేనే ప్రాణాలతో తప్పించుకోగలమని భావించారు. టుంబా సైతం అక్కడ నిలబడలేక పోయాడు. గుహకు అడ్డుగా ఉన్న బండ దగ్గర నిలబడి, ‘‘ఒరే, నాయనలారా, చుట్టూ మంటలు. మీరు నన్ను లోపలికి అనుమతిస్తే మీకు నేనొక చక్కని పాట పాడివినిపిస్తాను,'' అన్నాడు మంచిగా.\n\nయువకులు టుంబాను ఆటపట్టించాలనుకుని, బండను కొద్దిగా పక్కకు తోశారు. దాన్నిచూసిన టుంబా, ‘‘ఇంత చిన్న సందులో నేనెలా దూరగలను? బండను ఇంకొంచెం పక్కకు జరపండి,'' అన్నాడు.\n\nలోపల వున్న యువకులలో ఒకడైన లెకబారుకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. దానిని తన మిత్రులకు మెల్లగా చెప్పాడు. నలుగురూ భుజంభుజం కలిపి బండను ఇంకొంచెం పక్కకు నెట్టారు. కొద్ది వెసులుబాటు రాగానే టుంబా అందులోకి తలదూర్చి లోపలికి చూశాడు. అంతే! లెకబారు, ‘‘ఇప్పుడే!'' అని హెచ్చరించాడు. నలుగురూ కలిసి బండను ఒక్కసారిగా ముందుకు తోశారు. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోగానే టుంబా తల నుగ్గు నుగ్గయింది. వాడి నోటి నుంచి దూరంగా పడ్డ నిప్పుపళ్ళు చల్లారి నల్లబడిపోయాయి.\n\nబండను పక్కకు తోసి, …యువకులు గుహనుంచి వెలుపలికి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పిలిచి, ‘‘మేమా రాక్షసుణ్ణి చంపేశాం. వాడి పళ్ళు ఇకపై మంటలు విరజిమ్మవు. అయినా, నిప్పును మాత్రం మేము తీసుకువచ్చాం. ఇక ముందు మనకు రాక్షసుడి బెడద ఉండదు. నిప్పు ఉంది గనక, మన బతుకులు సుఖంగా సాగుతాయి!'' అన్నారు. గ్రామస్థులు ఆ మాటలకు పరమానందం చెందారు. …యువకుల సాహసాన్ని మెచ్చుకున్నారు. నిప్పును తమలో తాము పంచుకుని దుంపలు, చేపలు హాయిగా వండుకోగలిగారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 751,
        "IMAGE": "cat_8",
        "NAME": "సాహసయువకులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.\n\nఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.\n\nఅప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.\n\nకౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు.\n\nకౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.\n\nమనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.\n\nఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 752,
        "IMAGE": "cat_8",
        "NAME": "ధర్మవ్యాధుని కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకనాటి చీకటివేళ ముగ్గురు దొంగలు, తాము నగరంలో దోచిన డబ్బూ, నగలతో అరణ్యం చేరి, అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి, నిర్భయంగా మండపంలో కూర్చుని కబుర్లు చెప్పుకో సాగారు. మాటల మధ్యలో, వాళ్ళల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ``ఒరే, నే చెప్పేది జాగ్రత్తగా వినండి! ఇప్పుడు మనం దాచిన ధనం తలాకాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు.\n\nఅలాకాక, మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే, వాడు ఇకముందు ప్రమాదకరమైన దొంగవృత్తి మాని, ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు?'' అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే, దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయింది. పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి, ``ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది.\n\nఈ తెల్లవారుజాము లోపున, మనలో ఎవరికి ఆ దాచిన సొము్మ సాయంతో కోటీశ్వరుడయినట్టు కల వస్తుందో, వాళ్ళకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బావున్నదంటారా?'' అన్నాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తరవాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కాని, ఎవరికీ నిద్రరావడంలేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు.\n\nరెండోవాడు కూడా తతిమ్మా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకు న్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకుని, మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి, ధనం మూటను తీసుకుపోయి, దాపులనున్న ఒక మర్రిచెట్టు తొరల్రో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తరవాత ముగ్గురు దొంగలూ మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు: ``నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని, నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను.\n\nఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా వున్నది. కాని, విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా వున్నట్టు తెలిసింది. అందువల్ల, డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి, ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కాని, దురదృష్టవశాత్తు, ఆ రాత్రే డబ్బంతా దొంగలపాలయింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను.\n\nరాజు ఎంతో విచారపడిపోతూ, `నాయనా, నువ్వు పరాయిదేశం వాడిలా వున్నావు. నా దేశంలోని గజదొంగలను పట్టినవాడికి, నా కుమార్తెతోపాటు ఆర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కాని, ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు,' అన్నాడు. రాజకుమార్తె, అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే, నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, `మహారాజా, విచారించకండి! నేను, ఆ గజదొంగలందర్నీ పట్టి బంధించగలను,' అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని వుట్టినే అనలేదుగదా! నేను క్షణాల మీద దేశంలోని దొంగలందర్నీ పట్టుకుని, రాజుకు ఒప్పచెప్పాను.\n\nఆయన అన్న మాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి, అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొము్మవలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను.'' రెండవ దొంగ మొదటివాడితో, ``ఫర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు!'' అని తన కొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు: ``నేను డబ్బూ, నగలూ తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూండగా, ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుని బుడుంగున మునిగిపోయింది నేను డబ్బూ, నగలూ వున్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ వున్న వజ్రాలూ, మణులూ చూసి నా కళ్ళు జిగేలు మన్నాయి. కాని, వింత ఏమిటంటే, నాగలోకవాసులు నా వెంటవున్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి, తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి, నగల్ని తన కిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది.\n\nనేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహూకరించాను. నాగదేవి తన చెలికత్తెలు తనకన్న అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి, నా దగ్గిరకు వచ్చి, దీనంగా, `నువు్వ ఏది కోరినా ఇస్తాను. ఆ మిగిలిన నగలన్నీ నా కిచ్చెయ్యి,' అన్నది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో, `నాగదేవీ, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి, ఎన్నో శ్రమలకోర్చి నిన్ను వివాహ మాడేందుకు ఇక్కడి కొచ్చాను.\n\nఈ నగలన్నీ నీవే!' అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహ మాడింది. ఈ విధంగా మనం దాచిన సొము్మవలన నేను నాగయువరాణిని వివాహ మాడి, నాగలోకానికే రాజును కాగలిగాను.'' మొదటి ఇద్దరి కలలూ విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు: ``మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలేకాదు. వినండి! నేను దాచిన ధనం, నగలూ తీసుకుపోయి వ్యాపారంచేసి కోటీశ్వరుణ్ణి కావడమేకాక, మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే, మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో, హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడయి కల చెదిరిపోయి,కళ్ళు తెరిచాను.\n\nనలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయిటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టిలేపుతూ, `దొంగలు! దొంగలు!' అన్నాను. కాని, పెద్దన్న కళ్ళు తెరవకుండానే, `నా రాజ్యంలో దొంగలా? వాళ్ళను ఏనాడో, కాలరాచేశాను!' అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు.\n\nఅప్పుడు చిన్నన్న భుజం తడుతూ, సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, `నాగదేవీ, నేను రాజునై వుండగా, ఈ నాగలోకంలో దొంగలా? అహ్హహ్హ!' అంటూ నవ్వసాగాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాభరాపడుతూ విగ్రహం వెనక్కుపోయి, ధనం మూట కోసం చూశారు; అది అక్కడ కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గిరకు వచ్చి, ``నిజం చెప్పు! దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడడం, అంతా పచ్చి అబద్ధం!'' అన్నారు.\n\nచిన్నవాడు ఏమీ తొణక్కుండా, ``ఇందులో అబద్ధం ఏమీలేదు. మన దురదృష్టం ఏమంటే, ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొము్మ ఎత్తుకుపోతున్నప్పుడు, మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై వుండడం!'' అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ``ఒరే, నిజానికి మేం ఎలాంటి కలలూ కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం. అంతే! ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ ధనం ఎక్కడ దాచావు?'' అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, ``మీకు ఎలాంటి కలలూ రాలేదన్న మాట! బావుంది.\n\nఅందువల్ల, మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది. కనక, ధనం అంతా నాకే చెందాలి,'' అంటూ పోయి మర్రిచెట్టు తొరల్రో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్ళయివుండీ చిన్నవాణ్ణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి, మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, ``ఒరే,తమ్ముడూ! ఈనాటినుంచీ నువ్వు దొంగతనాలు మాని, ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ, తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు,'' అన్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 753,
        "IMAGE": "cat_8",
        "NAME": "తెలివైన దొంగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ మానవధర్మాలు చెబుతూ, పశుత్వంనుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది.\n\nమిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవేగాని కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. ఎందుచేతనంటే కోతి చపలచిత్తం గలది. నక్క జిత్తుల మారిది, మానుపిల్లి దొంగబుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు.\n\nఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆరోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో \"అన్నలారా! ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి, పొద్దూకగానే అతిథులకు ఆహారం పెట్టి, అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను. మీరు కూడా అదేవిధంగా చేయవలసిందని నా కోరిక\" అన్నది.\n\nకోతీ, నక్కా, మానుపిల్లీ తలలు ఊపి, తాము కూడా పగలల్లా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒకదారినా బయలు దేరాయి. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడ లేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది. \"అమ్మయ్యో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా? బతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు\" అని నిశ్చయించి కోతి పళ్లచెట్లకోసం వెతకనారంభించింది. నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్లింది. కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టరాదనుకున్నది. కానీ కొంత దూరం వెళ్లాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది. ఏ పులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచివుంటుంది. తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో, దొరకదో! అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టి పెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది.\n\nమానుపిల్లి సాయంకాలం దాకా పడుకుని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మలలో దానికొక పక్షిగూడూ, పిల్లలూ కనిపించాయి. మానుపిల్లి ఉపవాసం సంగతే మరచిపోయి పక్షిపిల్లలను కాస్తా భక్షించింది. నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయమూ, చంద్రోదయమూ కూడా కాబోతున్నాయి. కుందేలుకు ఒక విచారం పట్టుకున్నది. అతిథి అభ్యాగతులెవరూ కనిపించలేదు. ఒంటరిగా భోజనం చేసేదాని కన్న, అతిథులకు పెట్టి తినడం ఎక్కువ పుణ్యం. అందుచేత కుందేలు అతిథులకోసం ఇంటిముందు నిలబడి ఎదురుచూడసాగింది.\n\nకుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవరూపం ధరించి ఆసమయంలో కుందేలును పరీక్షించటానికి వచ్చాడు. \"పొద్దుటినుండి ఉపవాసం వున్నాను. అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు. కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా?\" అని చందమామ కుందేలును అడిగాడు. \"అయ్యా, నాకు కావలసిన ఆకు అలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కాని, నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకుని నాకు ముక్తి ప్రసాదించు\" అన్నది కుందేలు.\n\n\"కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపను?\" అని అడిగాడు చందమామ \"అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చెయ్యండి. నేను అందులో ఆహుతి అవుతాను. ఆ తరువాత మీరు నన్ను హాయిగా భుజించండి.\" అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది. కాని, చిత్రం! ఆ మంటలు కుందేలును సోకనేలేదు.\"అయ్యా, నన్నీమంటలు దహించకుండా ఉన్నాయి. నేనేం చేసేది. మీ ఆకలి ఎట్లా తీర్చేది?\" అని కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయాయి. చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకుని \"నీ జన్మ ధన్యమైనది. నిన్నునాతో శాశ్వతంగా ఉంచుకుంటాను. రా, పోదాం.\" అన్నాడు. ఆనాటినుంచి కుందేలు చందమామ వెంటనే వుంటోంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 754,
        "IMAGE": "cat_8",
        "NAME": "చందమామలో కుందేలు ఎలా ఉంటోంది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. 'నాన్న నాన్న పులి వచిందీ అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు.\n\nకాని రంగడు నవ్వూతూ 'పులీ లేదు గిలీ లేదు హాస్యానికి కేకలువేశాడు అన్నాడు. సోమయ్య, కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే' అన్నాడు రంగడు. సోమయ్య రంగడ్ని కోప్పడి వేళ్ళి పోయ్యారు.\n\nమరి కొద్ది సేపటికి పులి నిజాంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ 'నాన్నా నాన్నా పులీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరచినా సోమయ్య వాళ్ళు వినిపించుకో లేదు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్ల నొకదాన్ని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుస్తుంచని తెలుసుకున్నాడు.\n\nఈకథలోని నీతి హాస్యానికైనా అబద్దం ఆడరాదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 755,
        "IMAGE": "cat_8",
        "NAME": "హాస్యానికైనా అబద్దం ఆడరాదు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "ఒకరోజు అక్బరు, బీర్బలు కోట ఆవరణలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో అక్బరు ‘‘బీర్బల్, నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేసే వాళ్ళెవరో చెప్పగలవా?’’ అని అడిగాడు.\n\n‘‘వ్యాపారస్తులు ప్రభూ! కల్తీ సరుకులు అమ్ముతుంటారు. బియ్యంలో రాళ్ళు, పాలలో నీళ్ళు కలిపి కొన్ని వేల ప్రజలను మోసం చేస్తారు.’’ అన్నాడు బీర్బల్.‘‘వ్యాపారస్తులందరూ మోసగాళ్ళంటే నేను నమ్మను. కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చుగా!’’ ‘‘ప్రభూ, నాకు తెలిసి అందరూ ఏదో విధంగా ప్రజలను మోసం చేసేవాళ్ళే’’ అన్నాడు ‘‘అలాగని రుజువు చేయగలవా?’’ అని అన్నాడు అక్బరు. ‘‘తప్పకుండా ప్రభూ, నా దగ్గర ఒక పథకం ఉంది. మీరు అనుమతి ఇస్తే రుజువు చేస్తాను’’ అని బీర్బల్ అనగానే తలూపాడు అక్బరు.\n\nమరునాడు ఆగ్రా పట్టణంలోని వ్యాపారస్తులకు అక్బరు చక్రవర్తి ముందు హాజరు కావాల్సిందిగా అదేశాలు వెళ్ళాయి. కారణం తెలియని వ్యాపారస్తులు భయపడుతూ వచ్చారు. వాళ్ళతో అక్బరు ‘‘మంచి కార్యం కోసమే మిమ్మల్ని పిలిపించాము. నేను సర్వమతాలకూ సంబంధించేలా ఒక పండుగ చేయాలని అనుకుంటున్నాను. మీరంతా తలా ఒక చెంబుడు పాలు తేవాలి’’ అన్నాడు.\n\n‘‘చెంబుడు పాలెందుకు ప్రభూ మీరు ఆజ్ఞాపిస్తే ఒక బిందెనిండా తీసుకువస్తాము’’ అన్నారు వ్యాపారస్థులంతా ముక్తకంఠంగా. ‘‘మీరు ఎక్కువ కష్టం తీసుకోకండి. రేపు ఉదయాన్నే ఒక చెంబుతో పాలు తీసుకురండి చాలు’’ మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు బీర్బల్.\n\nబీర్బల్ వారి కోసం ఒక పెద్ద గంగాళాన్ని ఒక గదిలో ఉంచాడు. సూర్యోదయం కాకముందే వ్యాపారస్తులు చెంబులతో బారులు తీరారు. ఒక్కొక్కరిగా వచ్చి తమ చేతిలోని చెంబును కాగులోకి ఒంచి వెళ్ళిపోసాగారు. అందరూ వెళ్ళిపోయాక అక్బరు, బీర్బలు ఆ గదిలోకి వెళ్ళారు. ఎంతో కుతూహలంగా కాగులోకి చూసిన అక్బరు ముఖం తెల్లబడింది. ఆ కాగులో ఒక్క పాల చుక్కలేదు. కాగునిండా నీళ్ళున్నాయి.\n\n‘‘వ్యాపారస్తులందరూ ఒకేలా ఆలోచించారు ప్రభూ! మిగతా అందరు పాలు పోస్తారు. తనొక్కడే నీళ్ళు పోస్తే ఎవరికి తెలుస్తుందని అందరూ నీళ్ళే తీసుకువచ్చారు.’’ అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 756,
        "IMAGE": "cat_8",
        "NAME": "గొప్ప మోసగాళ్ళు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. ఆ స్థలంలో పడిన పుల్లిస్తరాకులన్నీ దాని సొత్తు; వాటిని ఎవ్వరూ ముట్టుకొనడానికి వీలు లేదు. అయినా చీమలు, ఈగలు ఆ ఆకుల మీద ముసురుతూనే ఉంటాయి! ఆ నల్ల కుక్క వాటిని తోలేస్తూనే ఉంటుంది.\n\nఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ పుల్లిస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్లకుక్కకు పండగ ఆనందం కలిగింది. కాని, అంతలోనే పుల్లిస్తరాకులతో పడిన పిండివంటల ముక్కల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీద ఉరికింది పెద్దగా అరుస్తూ! కొత్త కుక్క కోరలు చూపుతూ నల్ల కుక్క మీద తిరగబడింది.\n\nఅరుపులు కరుపులతో పెద్ద కోట్లాట జరిగింది. ఆ దెబ్బలాటతో పుల్లిస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి;అన్నీ మట్టి కొట్టుకొని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాక తరిమేసి, నల్ల కుక్క తిరిగి వచ్చింది. ఒగుర్చుకుంటూ చూస్తే మట్టి, తుక్కు, చెత్తతో నిండిన పుల్లిస్తరాకులలో దానికి అన్నం మెతుకులే కనపడ లేదు. అటూ ఇటూ వెతికి దిగులు పడుతూ కూర్చుంది...!\n\nఆ ఆకుల మీద తిరుగుతూ వున్న ఓ కండ చీమ, నల్లకుక్కను చూసి జాలిగా అంది; \"ఎవరో తిని పారవేసిన పుల్లిస్తరాకులు నీ సొంతం అనుకొంటావు. ఎవరినీ చేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే, మీద పడి అరిచి, కరిచి తరిమి వేస్తావు. చూడు, నీ దెబ్బలాట వల్ల, తిందామనుకున్నదంతా ఎలా మట్టి కొట్టుకు పోయిందో!\" నాకే తప్ప ఎవరికీ వుండకూడదు అనే నీ దుర్బుద్ధి నీకు కూడా లేకుండా చేసింది... చూడు... మా చీమలను! ఎక్కడైనా రవ్వంత తినుబండారం కనపడితే, మా చీమలనన్నిటినీ పిలుచుకు వస్తాము. అందరమూ కలిసి తింటాము; హాయిగా వుంటాము... మా చీమలను చూసి బుద్ధి తెచ్చుకుంటే, నువ్వూ, నీ జాతివాళ్ళు బాగు పడతారు అంటూ చక్కా పోయింది కండ చీమ!\"\n\nఆకలితో, అలసటతో అవస్థ పడుతున్న నల్లకుక్కకు చీమ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. అలాగే పడుకుంది, మట్టి ఆకులను చూస్తూ, కన్నీళ్ళు కారుస్తూ మూలుగుతూ. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 757,
        "IMAGE": "cat_8",
        "NAME": "కుక్క బుద్ధి-చీమ సుద్దు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "జాదవ్‌సింగ్‌ మహారాజుకు ఇద్దరు రాణులు. చిన్నరాణి అంటే రాజుకు అమిత ప్రేమ. కొన్నాళ్ళకు పెద్దరాణి గర్భవతి అయింది. దాంతో చిన్నరాణి చెప్పరాని అసూయకు లోనయింది. పెద్దరాణికి ఎలాగైనా సంతానం లేకుండా చేయూలని ఒక పరిచారికకు డబ్బు ఆశచూపి, కుట్రపన్నింది. ఆ పరిచారిక తల్లి కాబోయే పెద్దరాణి అభిమానాన్ని, నమ్మకాన్ని క్రమక్రమంగా ప్రయత్నించి సంపాదించింది.\n\nనవమాసాలు నిండి, ప్రసవం సమీపిస్తున్న సమయంలో-తల్లి కళ్ళకు గంతలు కట్టుకోవడం ఆచారమనీ, అలా చేయడం సంతానానికి మేలు చేస్తుందనీ చెప్పి, ఆ పరిచారిక పెద్దరాణిని నమ్మేలా చేసింది. కొన్ని రోజులలో రాణి కవలలను ప్రసవించింది. వాటిలో ఒకటి ఆడ; మరొకటి మగ శిశువులు. వెంటనే పరిచారిక ఆ శిశువులను దొంగిలించి మరోచోటికి చేర్చింది. తల్లి పొత్తిళ్ళలో ఒక కొయ్యబొమ్మనూ, గడ్డి బొమ్మనూ పెట్టి రాణి వాటినే ప్రసవించినట్టు చెప్పి నమ్మించింది. రాణి దుఃఖానికి అవధుల్లేకుండా పోయూయి.\n\nఅయినా పెద్దరాణిపట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని రాజు దానిని అంతగా పట్టించుకోలేదు. చిన్నరాణి పట్టరాని ఆనందంతో పరిచారికకు ముత్యాలహారాన్ని బహూకరించింది.\n\nశిశువుల్ని ప్రాణాలతో ఉంచవద్దని చెప్పి, మరిన్ని కానుకలు ఇచ్చింది. అయితే, అమాయకంగా కనిపించిన ఆ పసికందులను చంపడానికి పరిచారికకు చేతులు రాలేదు. పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టువస్త్రాన్ని కప్పి, దాపుల ప్రవహించే నదిలో వదిలిపెట్టింది. అరణ్య ప్రాంతంలో ఆ నదిలో స్నానం చేస్తూన్న ఒక మునికి నీళ్ళపై బుట్ట తేలుతూ రావడం కనిపించింది.\n\nఆయన బుట్టను అందుకుని పైనున్న పట్టు వస్త్రాన్ని తొలగించి చూశాడు. అందమైన శిశువులను చూసి అమితానందం చెందాడు.\n\nఆయన ఆ పిల్లలను తన కుటీరానికి తీసుకువెళ్ళి భార్యకు చూపాడు. పిల్లలు లేని ఆమె ఒక్కసారిగా ఇద్దరు పిల్లల్ని చూడగానే హద్దులు లేని ఆనందం పొందింది. ఆమె ఆ అందమైన శిశువులను తన వెచ్చని చేతుల్లోకి సుతారంగా తీసుకుంటూ, ‘‘వీరు మనకు దేవుడు ప్రసాదించిన అద్భుతమైన కానుకలు!'' అన్నది. ఆ మునిదంపతులు పిల్లలను తన సొంత సంతానంగా భావించి అల్లారు ముద్దుగా పెంచసాగారు.\n\nఎవరైనా వచ్చి వీరు మా పిల్లలు అంటే ఏం చేయడం అనే అనుమానం మునికి అప్పుడప్పుడు వచ్చేది. అప్పుడు భార్య, ‘‘ఎందుకలా భయపడతారు? వీరు నదిలో కొట్టుకువచ్చారు. అంటే కన్నవాళ్ళు వద్దని వదిలిపెట్టిన వారే కదా! అలాంటి వారు మళ్ళీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు? వీళ్ళు ఎప్పటికీ మన పిల్లలే,'' అంటూ భర్తకు ధైర్యం చెప్పేది.\n\nపిల్లలకు మధు, శైలజ అని నామకరణం చేసి; వచ్చీ రాని మాటలతో వాళ్ళు తమను ‘అమ్మా!' ‘నాన్నా!' అని ముద్దు ముద్దుగా పిలుస్తూంటే ఎంతగానో సంతోషించేవారు మునిదంపతులు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయూయి. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పసాగారు. ఒకనాటి రాత్రి మామూలుగానే పడుకున్న ముని తెల్లవారినా పడక నుంచి లేవలేక పోయూడు. ఆయన భార్యాపిల్లలను దగ్గరికి పిలిచి, ‘‘నాకు ఇహలోక యూత్ర చాలించే తుది ఘడియలు సమీపించాయి.\n\nఅంతిమ శ్వాస విడిచేలోగా నేను మీకేం ఇవ్వగలను?'' అన్నాడు గంభీరంగా. మధు, శైలజ ముని పడకను సమీపించి ఆయన చేతులను తమ చేతుల్లోకి తీసుకుని, ‘‘నాన్నా, మీరు మమ్మల్నెంతో ప్రేమాదరాలతో, ఆప్యాయంగా చూసుకున్నారు. అంతకన్నా మాకు కావలసినదేమున్నది?'' అన్నారు సజల నయనాలతో. ముని మౌనంగా తల పంకించి భార్యను తన కొయ్య పెట్టెలో భద్ర పరచిన రజాయ్‌ (బొంత)నీ, బంతినీ తీసుకురమ్మని చెప్పాడు.\n\nఆమె తెచ్చాక వాటిని మధుచేతికిచ్చి, ‘‘వాటికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. ఆ బొంతను మీరు ఒకసారి ఊపినట్టయితే వెండి నాణాలు రాలుతాయి. రెండవసారి ఆడిస్తే బంగారు నాణాలు రాలుతాయి. మీరు ఈ బంతిని విసిరినట్టయితే, మీ శత్రువు ఎక్కడవున్నా వారికి తగిలి గాయపరచి, మీ వద్దకు తిరిగివస్తుంది. వాటిని తెలివిగా ఉపయోగించుకోండి.\n\nఅయితే, ఒక విషయం ఎన్నటికీ మరిచిపోకూడదు,'' అని ఆగాడు. ‘‘ఏమిటి నాన్నా?'' అని అడిగారు అన్నాచెల్లెళ్ళు ఒక్కసారిగా. ముని లేచి తన పడక మీద కూర్చుంటూ, ‘‘మన కుటీరానికి ఉత్తరంగా ప్రవహిస్తూన్న నది మీకు తెలుసుకదా. అది పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తోంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తే, ఎన్నటికీ పడమటి దిక్కు కేసి మాత్రం వెళ్ళకండి,'' అన్నాడు. పిల్లలు, ‘‘అలాగే నాన్నా!'' అని చెబుతూండగా ముని మందహాసంతో కన్నుమూశాడు.\n\nభర్తపోయినప్పటి నుంచే తీవ్ర అస్వస్థతకులోనైన మునిపత్ని ఒకనాడు పిల్లల్ని చేరబిలిచి, వాళ్ళు పసిబిడ్డలుగా తన భర్తకు నదిలో తేలుతూ వస్తూ దొరికిన విషయం చెప్పి, అందుకే అక్కడ ప్రమాదం శంకించి వాళ్ళను పడమర దిశగా వెళ్ళవద్దని ఆయన హెచ్చరించాడని గుర్తుచేసింది. ఆ తరవాత గాఢంగా ఊపిరి పీలుస్తూ, ‘‘మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను,'' అన్నది. ‘‘మమ్మల్ని ఎంతో ఆప్యాయంతో పెంచారు.\n\nమీ అనురాగమే మాకు చాలు. అంతకు మించి ఏదీ వద్దు,'' అన్నారు పిల్లలు. అయినా మునిపత్ని ఒక పాత్రను శైలజ చేతికిచ్చి, ‘‘నువ్వు కోరిన ఆహారం ఈ పాత్ర ఇస్తుంది తల్లీ. నీ జీవితంలో ఆకలి బాధ అంటూ ఎన్నటికీ ఉండదు,'' అని ఆశీర్వదించింది. ఆ తరవాత ఆమె ఒక జత కొయ్యపాదుకలను తీసి మధుకు ఇచ్చి, ‘‘నాన్నా, నువ్వు వీటిని తొడుక్కుని, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, మరుక్షణమే అక్కడికి చేరుకోగలవు.\n\nఅలా వెళ్ళేప్పుడు నువ్వు నీ సోదరిని కూడా ఎలాంటి బరువు లేకుండా తీసుకువెళ్ళవచ్చు,'' అని చెప్పింది. కొన్ని క్షణాల్లోనే ఆమె అంతిమశ్వాస విడిచింది. మధు తండ్రికి చేసినట్టే తల్లికి కూడా అంత్యక్రియలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఆ తరవాత కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపిన మధు ఒకనాడు చెల్లెల్ని పిలిచి, ‘‘మనం ఈ మునివాటికలో ఎన్నాళ్ళని ఉంటాం? ధైర్యం చేసి పశ్చిమ దిశగా వెళితే, మన అసలు తల్లితండ్రులు కనిపించినా కనిపించవచ్చుకదా!'' అన్నాడు.\n\n‘‘నిజమే మనం ఇక్కడే ఉండి సాధించేదేమీ లేదు కదా? ధైర్యంతో పశ్చిమ దిశగా వెళదాం,'' అన్నది శైలజ.\n\nమధు బొంతను అటూ ఇటూ రెండుసార్లు ఊపాడు. అందులో నుంచి వెండి, బంగారు నాణాలు రాలాయి. ఆ నాణాలనూ, బంతినీ మునిపత్ని ఇచ్చిన పాత్రలో వేసి భద్రపరుచుకున్నారు. మధు కొయ్యపాదుకలను తొడుక్కున్నాడు. అవి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడు చెల్లెల్ని పట్టుకుని, పశ్చిమ దిశగా వెళ్ళాలి అనగానే, చెప్పులు అన్నాచెల్లెళ్ళతో పైకి లేచి ఆకాశంలో అటుకేసి ఎగరసాగాయి.\n\nవాళ్ళొక నగరాన్ని చేరగానే మధు కిందికి దిగాలనుకుని పాదుకలను ఒకటిగా చేర్చి బొటనవేళ్ళతో మెల్లగా నొక్కాడు. వాళ్ళిద్దరూ భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపించడంతో, ప్రస్తుతానికి దాన్నే తమ నివాసంగా చేసుకోవాలనుకున్నారు. మరునాడు శైలజ పాత్ర నుంచి కావలసిన ఆహారం తెప్పించింది. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. మధు బంతి తీసుకుని ఆడుకోసాగాడు.\n\nఉన్నట్టుండి అతడు, ‘‘నన్నూ, మా చెల్లెనూ మా అమ్మ నుంచి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే ఈ బంతి వారికి పోయి తగలాలి,'' అంటూ బంతిని విసిరాడు. బంతి వెళ్ళి కొంత సేపటికి అతని వద్దకు తిరిగి వచ్చింది. అది ఎవరికి పోయి తగిలి ఉంటుందా అని మధు ఆలోచించసాగాడు. మరునాడు కూడా అలాగే చేశాడు. అప్పుడు కూడా అది వెళ్ళి కొంతసేపయ్యూక అతని చేతిలోకి తిరిగి వచ్చింది.\n\nచిన్నరాణి పరిచారికలతో రాజోద్యానంలో తిరుగుతూండగా హఠాత్తుగా బంతి వచ్చి ఆమె నుదుటికి ఠఫీమని తగిలి తిరిగి వెళ్ళడం చూసి, ఆమెతో సహా పరిచారికలు దిగ్భ్రాంతి చెందారు. దరిదాపుల్లో మనుషుల జాడ కనిపించలేదు. బంతి తగిలిన చోటు ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పెట్టసాగింది. పరిచారికలు వెళ్ళి రాజుకు విషయం చెప్పారు. అక్కడికి హుటాహుటిగా వచ్చి భార్యను పరామర్శించిన రాజు ఆమెను కొన్ని రోజుల పాటు ఉద్యానవనంలోకి వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు.\n\nమరునాడు నుదుటిపై బొప్పికట్టిన నొప్పి కొద్దిగా తగ్గింది. ఆమె భవన మంటపంలో కూర్చుని ఉండగా బంతివచ్చి మళ్ళీ ఠఫీమని తగిలి వెళ్ళిపోవడం చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఇప్పుడు నుదుటి రెండోవైపున దెబ్బతగిలింది. నొప్పి మరీ ఎక్కువయింది. విషయం తెలియగానే రాజు మళ్ళీ హడావుడిగా వచ్చాడు.\n\nభార్య పడుతున్న బాధను ూసి భరించలేక ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయించాడు. సేనాధిపతిని పిలిచి, జరిగిన విషయం చెప్పి, చుట్టుపక్కల బంతి ఆట ఆడుతూన్న వారందరినీ పట్టి దోషిని శిక్షించమని ఆజ్ఞాపించాడు.సైనికులు ఆ పరిసరాలలో బంతి ఆట ఆడుతూన్న వారికోసం వెదకసాగారు. భవన పరిసరాలలో బంతి అన్నది కనిపించలేదు. నగరం పొలిమేరలో ఒక ఇంటి ముందు మధు బంతి ఆట ఆడుతూ కనిపించాడు.\n\nభటులు అతన్ని సమీపించి, ‘‘నిన్న నువ్వు బంతిని రాజోద్యానం కేసి విసిరావా?'' అని అడిగాడు. ‘‘నాకు రాజోద్యానం ఎక్కడున్నదో కూడా తెలియదు. నేను అందులోకి బంతిని ఎలా విసరగలను?'' అన్నాడు మధు. ‘‘సరే, ఇక్కడి నుంచి మరెక్కడికీ వెళ్ళ వద్దు. రాజభవనం కేసిగాని, రాజభవనం దరిదాపులకు గాని వెళ్ళవద్దు,'' అని హెచ్చరించి వెళ్ళారు భటులు.\n\nవాళ్ళ మాటలు విని ఆలోచనలోపడ్డ మధు ఇంట్లోకి వెళ్ళి, ‘‘ఈ బంతి రాజభవనంలోని ఎవరికో తగులుతున్నది. అది ఎవరై ఉంటారో తెలియడం లేదు,'' అన్నాడు చెల్లెలితో. ‘‘కొన్ని రోజులు ఇక్కడే వేచి ఉండి ఏం జరుగుతుందో చూద్దాం,'' అన్నది శైలజ. మరునాడు, గుర్రం డెక్కల చప్పుడు వినిపించడంతో అన్నాచెల్లెళ్ళు ఇంటి నుంచి వెలుపలికి వచ్చి చూశారు. వాళ్ళను చూడగానే గుర్రం మీది భటుడు, ‘‘ప్రభూ! ఈ పసివాడే నిన్న బంతి ఆట ఆడుతూ కనిపించాడు.\n\nమరెక్కడా బంతి ఆట ఆడేవాళ్ళు కనిపించలేదు,'' అన్నాడు. రాజు గుర్రం పైనుంచి కిందికి దిగి పిల్లల కేసి నడిచాడు. వాళ్ళను చూడగానే నివ్వెరపోయూడు. ఆ పసివాడిలో తన పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. అమ్మాయిలో తన పెద్దరాణి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజుకు కొంతసేపు నోట మాట రాలేదు. ఆ తరవాత తేరుకుని, ‘‘మీరిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారా?'' అని అడిగాడు. ‘‘అవును, ప్రభూ! అరణ్య ప్రాంతంలోని మా తల్లితండ్రులు మరణించడంతో మేము ఇక్కడికి వచ్చేశాము,'' అన్నాడు మధు.\n\n‘‘మేము శిశువులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకు దొరికామట. వాళ్ళే మమ్మల్ని పెంచారు. వాళ్ళు ఇప్పుడు మరణించారు. మా అసలు తల్లితండ్రులు ఎవరో మాకు తెలియదు,'' అన్నది శైలజ. రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యూడు. ‘‘వారెవరో నాకు తెలుసు. నా భవనానికి వచ్చారంటే చూపెడతాను. నేను వెళ్ళి రథం పంపిస్తాను.\n\nభటులు నీవెంట ఉండగలరు,'' అని చెప్పి రాజు గుర్రంఎక్కి వెళ్ళిపోయూడు. రథం వచ్చేలోగా అన్నాచెల్లెళ్ళు బయలుదేరడానికి సిద్ధమయ్యూరు. ‘‘పాత్రనూ, నాణాలనూ వదల వద్దు సుమా. ఎప్పుడు ఏమవుతుందో మనకేం తెలుసు,'' అన్నాడు మధు చెల్లెలితో తను బొంతనూ, ఎగిరే పాదుకలనూ తీసి భద్రపరుచుకుంటూ. అన్నాచెల్లెళ్ళు రథమెక్కారు. రథం కదిలింది. వారి వెనక భటులు గుర్రాలపై బయలుదేరారు.\n\nరాజభవనం ముంగిట మధు, శైలజ రథంలో నుంచి దిగగానే రాజు ఎదురు వెళ్ళి వాళ్ళను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘‘అదిగో మీ తల్లి,'' అంటూ పెద్దరాణిని చూపాడు. పెద్దరాణి సజల నయనాలతో పిల్లలను కౌగిలించుకున్నది. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. తల్లి వెనకే నిలబడివున్న స్ర్తీ నుదుటి మీద రెండు బొడిపెలు ఉన్న విషయం అన్నాచెల్లెళ్ళు గమనించి ఒకరినొకరు చూసుకున్నారు. తమ ‘శత్రువు' ఎవరో గ్రహించారు.\n\nఅయినా, ఆ రహస్యాన్ని తమలోనే దాచుకోవాలని ఇద్దరూ చూపులతోనే నిర్ణయించుకున్నారు. రాజదంపతులు కూడా తమ మనసుల్లోని అనుమానాలను బయట పెట్టకూడదనే భావించారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై హెచ్చరికతో ఉంటే చాలనుకున్నారు. కవలలను కొత్తగా కనుగొనబడ్డ యువరాజు, యువరాణులుగా చూసుకున్నారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 758,
        "IMAGE": "cat_8",
        "NAME": "తిరిగివచ్చిన బంతి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 8
    },
    {
        "DESCRIPTION": "అలెగ్జాండరు చక్రవర్తి భారతదేశమున పంజాబ్‌ ప్రాంతములో ఒకానొక గ్రామముగుండా పయనించుచుండెను. సేనాసమేతుడై అమాత్యశేఖరులతో గూడి ఆ గ్రామమునందు పోవుచుండ ఆనతి దూరమున గ్రామస్థులందరు ఒకచోట గుమిగూడి తీవ్ర వాదోపవాదములు గావించుకొనుచు సంఘర్షణకు దిగుచున్న దృశ్యమును చూచెను. ఇక ప్రయాణమును నిలిపివైచి, మంత్రివర్యుని బిలిచి, ఆ వృత్తాంతమేమియో తెలిసికొనిరమ్మని పంపెను. మంత్రిగారట్లే ఆ గుంపులో జొరబడి అచట జరుగుచున్న విషయమంతయు సాంగోపాంగముగ తెలిసికొని తిరిగి రాజుయొద్దకు వచ్చి ఈ ప్రకారముగ విన్నవించెను.\n\n'మహాప్రభూ! ఆ గ్రామమున ఒక రైతు కలడు. అతనికి ఒక ఎకరము పొలము కలదు. దానిని అతడు సమీప గ్రామమందలి మరియొక రైతునకు అమ్మివేసెను. పొలము కొన్న అసామి దానిని దున్ను కొనుచుండగా నేలలో ఒక బంగారుపాత్ర కనిపించెను. దానిని తీసికొని అతడు నేల అమ్మినరైతు యొద్దకుపోయి, అయ్యా! మీరు నాకమ్మిన నేలను దున్నుకొనుచుండగా అందులో ఈ సువర్ణపాత్ర లభించినది. మీరు నేల అమ్మినారేకాని అందులోని పాత్రను అమ్మలేదు. కావున ఇది మీసొత్తేకాని నాదికాదు. అందుచేత దీనిని మీరు పరిగ్రహించి నాకు మనస్సంతోషమును కలుగజేయుడు అని విన్నవించుకొనెను. ఆ వాక్యములను విని నేల అమ్మినరైతు ఇట్లు సమాధాన మొసంగెను - \"అయ్యా! నేను ఏ క్షణమందు మీకు నా నేలను అమ్మినానో, అందులోని సమస్త పదార్థములున్ను మీవశమే అయిపోయినట్లు లెక్క, ఇక వాటితో నాకు ఎలాంటి సంబంధమును లేదు. కాబట్టి దయచేసి ఈ బంగారు పాత్రను మీరే ఉంచుకొని అనుభవించుడు!\"\n\nకాని నేల కొన్న పెద్దమనిషి అందులకు అంగీకరించలేదు. బలవంతముగ దానిని ఇచ్చివేయ దలంచెను. ఈ ప్రకారముగ ఇరువురి మధ్య వాదోపవాదములు చెలరేగెను. ఇరువురి పక్షములను సమర్థించంటకు వారి వారి అనుయాయులు కూడ చాలమంది అచటికి వచ్చి చేరిరి. కొద్దిసేపటికి గుంపు చేరిపోయెను. ఆ వింత చూచుటకై ఎక్కడెక్కడి జనులో పరుగున వచ్చిచేరిరి. అరుపులు, కేకలు, ఈలలచే ఆ ప్రదేశ మంతయు ప్రతిధ్వనించెను.\n\nఇంతలో కొందరు పెద్దమునుష్యులు అచటికి వచ్చి ఇరువురికి రాజీ కుదర్చ దలంచినవారై పొలము అమ్మినవానిని \"అయ్యా! మీకు సంతానము కలదా? అని ప్రశ్నింప 'నాకొక కుమారుడు కలడు. వివాహమునకు సిద్ధముగా నున్నాడు అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను. అట్లే ఆ మధ్యస్థులు పొలము కొన్నవానిని మీకు సంతానము కలదా? అని ప్రశ్నింప నాకొక కుమార్తె కలదు. వివాహమునకు సిద్ధముగా నున్నది. అని యాతడు పలికెను. అపుడు మధ్యస్థులు ఇరువురి వాక్యములను ఆలకించినవారై ఈ ప్రకారముగ ఇరువురికి రాజీచేసిరి - పొలము కొన్న వాడు తన కుమార్తేను పొలము అమ్మినవాని కొమారున కిచ్చి వివాహము చేసి ఆ బంగారుపాత్రను కట్నముగా నొసంగవలెను. మధ్యస్థుల ఆ సమయోచితమైన తీర్పుచే అ బంగారుపాత్ర ఇరుపక్షములకు చెందిపోయెను. మధ్యస్థుల ఆతీర్పును ఇరువురును సంతోషముగ ఆమొదించి అ ప్రకారముగ కార్యాన్విత మొనర్చిరి.\n\nఇదియే రామరాజ్యము. ప్రజల ఇట్టి మనస్తత్వమే రామరాజ్య చిహ్నము. పరస్పర ప్రేమ, అనురాగము, కరుణ, దయ, పరోపకారము, స్వార్థత్యాగము - ఇట్టి ఉదాత్తగుణము లెచట తాండవించు చుండునో, అదియే రామరాజ్యము, ఏ ప్రజలిట్టి మహోన్నత సద్గుణరాశిని అవలంబించియుందురో వారే రామరాజ్య ప్రజలు. అట్టివారు ఏ క్షోభయులేక పరమసాంతముగ తమతమ జీవితములను కొనసాగించుచుందురు. కావున శాంతి సౌభాగ్యములను వాంఛించు ప్రతిమానవుడును తన హృదయమును పవిత్రముగను, నిర్మలముగను, సచ్ఛీలవంతముగను గావించుకొనవలయును.\n\nనీతి: పవిత్రమగు శీలము, నిర్మలహృదయము, సదాచరణ, పరోపకారభావన, త్యాగశీలత్వము జనులు కలిగి యుండినచో, అదియే రామరాజ్యము కాగలదు. అట్టి రామరాజ్యస్థాపనకే జనులు యత్నించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 759,
        "IMAGE": "cat_9",
        "NAME": "రామరాజ్యము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామములో ఒక రైతు కలడు. అతనికొక కుమారై కలదు. ఆమెకు యుక్తవయస్సు రాగానే సుదూర ప్రాంతమున గల ఒక ఒక పట్టణమందలి యువకున కిచ్చిపెండ్లిచేసెను. పెండ్లి అయిన కొన్ని మాసములకు సంక్రాంతిపండుగ రాగా ఆ రైతు తన అల్లునకు జాబువ్రాసి ఇంటికి పిలిపించుకొనెను. పండుగ చూచుకొని అల్లుడుగారు తిరిగి స్వస్థానమునకు వెడలిపోవునని మామగారు అభిప్రాయపడిరి. కాని అదేమి గ్రహచారమో గాని, సంక్రాంతి పండుగ గడచి ఐదుదినములైనను అల్లుడుగారు ఇంటినుండి కదలలేదు. అతనిని భరించుట అత్తమామలకు ప్రయాసగా నుండెను. చెప్పి పంపివేయుదమా; అది మర్యాదకు లోటు. పోనీ, ఉంచుకుందుమా, భరించుట ప్రయాస అని ఈ ప్రకారముగ తనలో తాను విచికిత్స గావించుకొనుచు ఆ రైతు దినమొక యుగముగ గడుపుచుండెను. ఎన్నిదినములు చూచినను అల్లుడు గడప దాటకుండుట చూచి అల్లునితో నిట్లనెను -\n\n\"అల్లుడుగారు! ఈ ప్రాంతమంతట కరువు కాటకములు వ్యాపించియున్నవి. రోజులు గడచుట కష్టముగా నున్నది\" - మామగారి ఆవాక్యములను విని అల్లుడిట్లనెను - మామగారూ! మీరు చెప్పిన మాట నిజమే ఈ ప్రాంతమంతటా దుర్భిక్షి మావరించియున్నది. కాని దానికి కారణమేమియో తెలియునా? పాపము పండుట వలననే అట్టిస్థితి యేర్పడినది. కాబట్టి పాపపరిహారార్థము ఈ దినము మొదలుకొని నెలరోజుల వరకు రోజుకు 5 వేల చొప్పున మంత్రజపము చేయ సంకల్పించినాను. దానితో ఆ పాపమంతయు తుడిచిపెట్టుకు పోగలదు.\n\nఅల్లుని ఆ వాక్యములను విని రైతు లోలోపల ఇట్లు చింతించెను. అల్లుడుగారు ఇప్పట్లో ఇల్లు వదిలేటట్లు లేడు. ఇంకను నెలరోజులు తిష్ట వేయుటకు ఆలోచించుచున్నాడు - అని విచారించి, కొద్ది రోజులైన పిదప అర్థముకాని వేదంత వాక్యములు చెప్పినచో వినలేక వెళ్ళి పోవునేమోయని భావించి ఒకనాడా రైతు అల్లుని కూర్చొనబెట్టి ఈ మాట, ఆ మాట చెప్పుచు మధ్యలోఈ క్రింది విధముగ వేదంతబోధ నుపక్రమించెను.\n\nఅసారే ఖలు సంసారే సుఖభ్రాంతిః శరీరిణాం |\nలాలాపాన మివాంగుష్ఠే బాలావాం క్షీరవిభ్రమః ||\n\n\"అల్లుడుగారూ! ఈ సంసారము అసారమైనది. ఈ దృశ్యపదార్థము లందు సుఖమున్నదని భ్రాంతిచే మనుష్యుడు తలంచుచున్నాడే కాని వాస్తవముగ పరిపూర్ణమైన సుఖ మిచట లేదు. చంటిపిల్లవాడు తన వ్రేలు జీకుచు, తన ఎంగిలి మ్రింగుచు పాలు త్రాగుచున్నానని ఏప్రకారము భ్రమీంచుచున్నాడో, తన వ్రేలినుండి పాలువచ్చుచున్నవని ఏ ప్రకారము తలంచుచున్నాడో ఆప్రకారమే దృశ్యపదార్థముల నుండి సుఖము కలుగుచున్నదని అజ్ఞాని జీవుడు భ్రాంతిచే తలంచుచున్నాడు. కాబట్టి ఈ సుఖము భ్రాంతిజన్యమే కానీ అన్యముకాదు కదా\" - మామగారు ఈ ప్రకారముగ అవిచ్చిన్నముగ బోధ సల్పుచుండ అల్లుడుగారు మధ్యలో ఆపి \"మామగారూ! నేను చెప్పునది కూడ వినుడూ అని ఈ ప్రకారముగ ముక్తకంఠముతో చెప్పదొడగెను -\n\nఅసారే ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్‌ |\n\nఅసారమైన ఈ ప్రపంచమునందు సారమైనది మామగారిల్లు' అల్లుని ఆ వాక్యములు విని మామగారు విస్తుపోయి ఇక ఈతనిని సాగనంపుట కష్టసాధ్యమని భావించి వేరొక ఉపాయము నాలోచింపదొడగెనట.\n\nఅట్లే జీవుని హృదయ కోశమందు అనేక జన్మార్జిత దుష్టసంస్కారములు ప్రవేశించి ఎంత ప్రయత్నించినను బయటకు సాగకున్నవి. వివేకవంతుడగు మనుజుడు పెద్దల సాంగత్యమును బడసి, శాస్త్రపరిచయము గలిగి, తనయొక్క తీవ్రతర అనుష్ఠానముచేతను, యుక్తి చేతను, ఆత్మవిచారణచేతను, అ పూర్వ జన్మార్జిత వాసనాజాలమును నెమ్మదిగ బయటకు సాగనంపవలెను.\n\nవెడలిపోవుటకు అతడు మొదట సమ్మతింపకున్నను, జీవుడొనర్చు సాధనల చేత కొంతకాలమునకు వివశుడై కాలికి బుద్ధిచెప్పగలడు. దీనికి వివేకము, వైరాగ్యము ఎంతయో అవసరములై యున్నవి. పట్టుదలతో దృఢతర యత్నముతో ఇక్కార్యమును సాధింపవలసియున్నది. పిరికితనము, దుర్బలత్వము, సోమరితనము, అలసత్వము మున్నగువానికి ఏమాత్రం అవకాశ మొసంగక, అచంచల దీక్షతో, అకుంఠిత శ్రద్ధతో బహుజన్మార్జిత దుస్సంస్కారములను, దుర్గుణములను, వాసనలను సాధకుడు జయించివేయవలెను. శాంతికి మార్గమిదియే.\n\nనీతి: దుర్గుణములు దుస్సంస్కారములు అనేక జన్మలనుండియు మనస్సునందు తిష్ఠవేసికొని యుండును. వానిని ప్రయత్నపూర్వకముగ బయటకు సాగనంపవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 760,
        "IMAGE": "cat_9",
        "NAME": "అల్లుడుగారు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామము వెలుపల ఒక మంచినీటి బావి కలదు. ఆ బావిలో నీరు చాల తీపిగా ఉండుట వలన గ్రామస్థులు ఆ బావివద్దకే వచ్చుచుండిరి. ఆ ఊరిలో ఇంకను చాలా బావులు కలవు కాని అందలి నీరు చప్పగా ఉండును. కనుక గ్రామస్థులకు ఊరిబైటగల ఆ బావియే శరణ్యముగా నుండెను. అయితే గ్రామస్థుల అశ్రద్ధ వలన ఆ బావికి పిట్టగోడ గాని, గిలకలు గాని, ఏర్పాటు చేయబడలేదు. కనుక ప్రతి వారును అందలి నీటిని వంగి తోడుకొనుచుండిరి. ఆ బావికి చుట్టు గోడ లేనందువలనను, అది నేలమట్టమునకు సమానముగ ఉన్నందు వలనను చాల ప్రమాదముగ నుండెను.\n\nఒకనాటి అర్థరాత్రి ఒకకుక్క ఆ ప్రాంతమున సంచరించుచు అచట బావి ఉన్నదని తెలియక అమాంతముగ దానిలో పడిపోయెను. రాత్రి అంతయు ఆ నీటిలో గిలగిల కొట్టుకొనుచు పాప మా శునకము తుదకు నీటిలో మునిగిపోయి ప్రాణమును పోగొట్టుకొనెను. ఈ ప్రకారముగ బావిలో కుక్క చచ్చిపడియుండెనను విషయము గ్రామస్థులెవ్వరికిని తెలియదు. ఏలయనగా ఈ సంఘటన అర్థరాత్రి జరిగియుండెను. ఒకరోజు తెల్లవారగానే గ్రామస్థులు మంచినీటి కొరకై త్రాళ్లు, చేదలు, బిందెలు వగైరా తీసికొనివచ్చి మామూలు ప్రకారము నీళ్లు చేదుకొని బిందెలు నింపుకొనుచుండగా ఏదియో దుర్వాసనం నీటి నుండి వెలువడుచుండుటను వారు గమనించిరి. దీనికి కారణమేమి యని వారందరును యోచన చేయదొడగిరి. దుర్వాసన కంపుకొట్టు చుండు ఆ జలమును త్రాగినచో, మరియు దానితో వంటవండుకొని తినినచో ఆరోగ్యము భంగమగునని వారందరును తీర్మానించుకొని, ఇంటికొకరు చొప్పున వచ్చి వంతుల ప్రకారము ఆ నీటిని తోడి పారబోయ దొడగెను.\n\nఈ ప్రకారముగ బావివద్ద జనసముహము చేరి కార్యోన్ముఖమై ఆ నీటినంతను చేదివేయ నారంభించెను. కాని ఎన్ని వందల బిందెలు చేదివేసినను నీటి యొక్క దుర్వాసన ఏమాత్రము తగ్గలేదు. నీటి అడుగున చచ్చిపడియున్న కుక్క విషయము ఎవరికిని తెలియనందున వారు తమ తోడుతను ఆపక అప్రతిహతముగ కొనసాగించుచునే యుండిరి. ఈ ప్రకారముగ ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు తోడిపోసినను దుర్వాసన తగ్గనందున విసుగెత్తిపోయి వారందరును ప్రక్కనేగల ఒక చెట్టుక్రింద కూర్చొని కర్తవ్యమును గూర్చి ప్రశాంతముగ యోచన చేయదొడగిరి. అందొకడు బావిలోపల ఏదైనా మురికి వస్తువు పడియున్నదేమో చూచిన బాగుండునని సూచింప, గ్రామస్థులందరును ఆ సూచనను ఆమోదించి నీటిలో దమ్ముపట్టగల ఒక గజ ఈతగానిని దింపిరి. అతడు బావిలో మునిగి అడుగున అంతయు కలబెట్టి ఆ చచ్చిన కుక్క శరీరమును బయటకు తీసెను. క్రుళ్ళిపోయి కంపుకొట్టుచున్న ఆ శునక దేహమును గ్రామస్థులు దూరముగ పారవైచి దానిని మట్టితో కప్పివైచి వెంటనే బావివద్దకువచ్చి మరల ఆ నీటిని తోడివేయదొడగిరి.\n\nకొంతసేపటికి నీరు స్వచ్చముగా నున్నదై ఏవిధమగు దుర్వాసన లేక పానయోగ్యముగా నుండెను. అమరుసటి దినమే జనులందరును కలిసి ఆ బావికి పిట్టగోడ కట్టించి గిలకలు ఏర్పాటుచేసిరి. అప్పటి నుండియు ఇట్టి అవాంఛనీయ సంఘటన ఏదియు మరల జరుగలేదు. ఆ బావి సర్వులకును మహోపకారిగ నుండుచు గ్రామస్థులకు వరప్రసాదముగ వెలయజొచ్చెను.\n\nనీతి: బావిలో కుక్క యొక్క మృతదేహ మున్నంతవరకు నీరు ఎంతతోడినను వాసన పోనట్లు, అనాది అజ్ఞానము, జన్మాంతర వాసనలు హృదయమున ఉన్నంతవరకును, మనుజుడు పైపైన ఎన్ని ప్రయత్నములు చేసినను శాంతి సుఖములకు నోచుకోలేడు. మూల అజ్ఞానమును ఆత్మవిచారణచే నశింపజేసి; అట్టి అజ్ఞానమును మృతశునక దేహమును హృదయ సరోవరము నుండి తొలగించిననే తప్ప జీవునకు పూర్ణసుఖము కలుగనేరదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 761,
        "IMAGE": "cat_9",
        "NAME": "అజ్ఞాన వినాశనము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము గ్రీస్‌ దేశమునందొక గొప్ప తత్త్వవేత్త ఉండెడివాడు. అతని పేరు సోక్రటిస్‌. అతడు తత్త్వశాస్త్రమందు చక్కటి అనుభూతి బడసినవాడు. సదా ఆలోచనామగ్నుడై యుండును ఏదియో యొక విషయమును గూర్చి చింతించుచుండును. అయితే అతనికి దాంపత్యము మాత్రము సరిగా లేకుండెను. భార్య గయ్యాళి అగుట వలనను, అపుడపుడు కలహించుట వలనను గృహమునందు కొంత అశాంతి కలుగుచుండెను. అయినను సోక్రటిస్‌ దానినంతను లెక్క సేయక తన ఆధ్యాత్మిక చింతనను విడనాడక యుండెను.\n\nఒకనాడు మధ్యాహ్నమాతనిని భార్య భోజనమునకు పిలిచెను. ఆ సమయమున సోక్రటిస్‌ ఏదియో తత్త్వశాస్త్ర విషయమును గూర్చి తదేక నిష్ఠతో తీవ్రముగ యోచన సల్పుచుండెను. భార్య పిలుపు విని నప్పటికిని, తదేక ధ్యాఅసతో దేనినో చింతన చేయుచుండుట వలన, ఆతని మనస్సు భోజనముపై మరలకుండెను. భోజనమునకు రమ్మని పిలిచినను భర్త ఖాతరు చేయనందు వలన భార్యగారికి అమితమైన కోపము జనించినది. మరల రెండవసారి పెద్దగా కేకవేసినది భోజనమునకు రమ్మని. సోక్రటిస్‌ పలుకలేదు. ముడవసారి ఇంకను పెద్దగా అరచినది ఆకాశము చిల్లిపడునట్లు కాని భర్త ఏమాత్రము పలుకకుండెను. అపుడు అమ్మగారికి రోషము ఉబికి ప్రక్కనే ఉన్న పాత్రలోని చల్లటి నీళ్ళను తెచ్చి అతనిపై గుమ్మరించెను. అపుడు సోక్రటిస్‌ మెల్లగా ఈ వాక్యములను పలికెను.\n\n'ఉరిమిన తరువాత వర్షము పడుట సహజము' అమ్మగారు అరిచినది. తరువాత వానవలె నీళ్లు పోసినది. దీనిలో ఆశ్చర్యమేమున్నది?\n\nసోక్రటీసు యొక్క సహనశక్తి అపూర్వము. తత్త్వజ్ఞానమును అనుభూతికి తెచ్చుకొనిన మహానుభావు డతడు. నిందాస్తుతులకు అతీతుడై ప్రవర్తించెను.\n\nనీతి: సహనశీలత గొప్ప సుగుణము. నిందాస్తుతులు, మానావ మానవములు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను జయించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 762,
        "IMAGE": "cat_9",
        "NAME": "అపూర్వసహనము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక తపస్వి ఏకాంతవనమున తపస్సు చేయుచుండెను. తల క్రిందపెట్టి కాళ్ళుపైన పెట్టి ఎండలో శరీరమును తపించజేయుచుండెను. బహుకాలము ఈ ప్రకారముగ ఆచరించుచు శరీరశోషణము గావించుచుండెను. తానొక గొప్ప తపస్విననియు, ఘనకార్య మాచరించు చున్నాననియు తలంచుచు అహంభావము గలిగి యుండెను. ఇట్లుండ ఒకనాడొక గంధర్వుడు ఆకాశమార్గమున పయనించుచు ఎచటికో వెళ్ళు చున్నట్లు గమనించి ఆ తపస్వి అతనిని కేకవేసి పిలిచి - \"మహాత్మా! తమ రెచటికి వెళ్ళుచున్నారని ప్రశ్నింప, వైకుంఠమునకు అని అతడు సమాధాన మొసంగెను. అపుడు తపస్వి 'అయ్యా గంధర్వుడు గారూ! మోక్షం పొందినవారి యొక్కలిస్టు వైకుంఠంలో వ్రేలాడగట్టబడి యుండు నని విని యున్నాను. దయచేసి ఆ లిస్టు చూచి అందులో నాపేరు ఉన్నదేమో పరిశీలించి తిరిగి మీరు వచ్చునపుడు నాకు తెలియజేసిన యెడల ధన్యుడను కాగలను. ఈ చిన్న ఉపకారము నాకు చేసిపెట్ట ప్రార్థన\" అని పలుకగా, అట్లేయని చెప్పి గంధర్వుడు వెడలిపోయెను.\n\nతిరిగి కొన్ని రోజులకు వచ్చి గంధర్వుడు తపస్వితో \"అయ్యా! తమపేరు ఆ లిస్టులో లేదు. అహంభావము కలిగి, తానొక పెద్ద తపస్వినని విర్రవీగు వారికి మోక్షార్హత లేనిదనియు; వినయము, విధేయత, నిగర్వము, నిర్హం భావము గల వారికి మాత్రమే మోక్షమున చోటు గలదనియు, డంబము, దర్పము గలవారి కచట తావు లేదనియు; కేవలము శరీరమును శుష్కింపజేయుట, ఎండవానలలో నానాబాధలుపడుట మోక్షమునకు అవలం బించదగిన పద్ధతి కాదనియూ మనస్సులో దాగియున్న దుస్సంకల్పములు, దుర్వాసనలు, దుర్గుణములు త్యజించుటయే మోక్షమునకు మార్గ\" మనియు చెప్పి వెడలిపోయెను. తపస్వి ఆ వాక్యములను విని తనను సంస్కరించుకొని పరమశాంతిని బొందగల్గెను.\n\nనీతి: మోక్షము నభిలషింప దలంచువారు తమ చిత్తమందేలాటి అవగుణము లేక నిర్మలత్వము, పవిత్రత గలిగియుండ వలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 763,
        "IMAGE": "cat_9",
        "NAME": "మోక్షం లిస్టులో",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామమునందు ఒక రైతు కుటుంబము కలదు. భార్య భర్త ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె గల అ కుటుంబము ప్రశాంతముగా జరిగిపోవుచుండెను. వారిలో ఏ విధమైన వైమనస్యములుగాని, మనఃస్పర్థలు గాని, అభిప్రాయ భేదములు గాని లేకుండెను. కాని ఒక నాడు విధివశాత్తు ఏదియోయొక సమస్యపై భార్యభర్త లిరువురకును తగవు సంభవించెను. ఇరువురును తీవ్రముగ వాదోపవాదములు చేసికొనిరి. అరచుకొనిరి. తత్ర్పభావముగ కుటుంబ కార్యములు కుంటుపడసాగెను. గృహకృత్యములు సరిగా జరుగకుండెను. ఇంటిలో నలువైపుల అశాంతి చెలరేగెను. ఇక్కారణమున రైతునకు మనశ్శాంతి కొరవడెను. హృదయమున ఏమాత్రము స్థిమితము లేక అతడు బాధపడుచుండెను. గృహము కారాగృహముగ అతనికి తోచెను. ఇట్టి అశాంత వాతావరణమును భరించలేక ఒకనాటి అర్థరాత్రి సమయమున ఆ గృహస్థుడు లేచి ఇంటిలో ఎవరికిని చెప్పకుండ, ఎవరికిని తెలియకుండ పరారై పోయెను.\n\nపోయి, పోయి కొన్ని రోజులు పాటు ఏకధాటిగ ప్రయాణము చేసి తుట్టతుదకు ఒకానొక పరిసరమున ఏకాంత ప్రదేశమున గల ఆశ్రమమును చేరుకొనెను. ఆశ్రమాధిపతియగు సాధువుగారికి రైతు వినయపూర్వకముగ సాష్టాంగ నమస్కార మాచరించి తన వృత్తాంతమును ఈ ప్రకారముగ తెలియజేసెను. \"మహాప్రభో! ఈ దీనుని రక్షించుడు! కాపాడుడు! దరికిజేర్చి దీవించుడు! సంసారకూపమున బడి పెక్కు ఇడుమలపాలై నానాయాతనల ననుభవించి, ఆ దుర్భరవేదనలను సహింపలేక, అశాంతికి లోనై తమ సన్నిధానమునకు వచ్చినాను. శాంతిని అనుగ్రహించుడు! తమ పాద పద్మముల చెంతనే యుండునట్లు ఆశీర్వదించుడు. తమ దివ్యబోధామృతధారలచే మదీయసంతప్త హృదయమును చల్లార్చుడు! దేవా! నా మనస్సు శాంతిని నోచుకొనలేక, గృహచ్చిద్రములందు సతమతమై జీవితముపై రోత గలిగియున్నది. శాంతిని ప్రసాదించు సద్గురువుయొక్క అన్వేషణకై నేను బయలు దేరి బహుదూరము ప్రయాణము చేసి తమపాదసన్నిధిని జేరితిని. తమదర్శన భాగ్యముచే నా జన్మ పావనమైనది. ప్రభో! నాకు మనశ్శాంతి కలుగు లాగున ప్రబోధము సలుపుడు! పాహి మాం, పాహి మాం, పాహి!!\"\n\nఇవ్విధముగ ప్రార్థనచేసి ఆ గృహస్థుడు మౌనము వహించి యుండ, సాధువుగారు వైరాగ్యోపేతుడైన ఉత్తమశ్రేణికి జెందిన శిష్యుడేతెంచెనని లొలోన సంతసించి \"నాయనా! అసలు నీకీ వైరాగ్యభావన ఏ కారణముచేత కలిగినది? ధననష్టమేమైన వాటిల్లినదా? లేక ఎవరైన నిన్ను అవమానించిరా? ఉన్నది ఉన్నట్లుగ తెలియజేయును. ఇవ్విషయమున దాపరికము పనికిరాదు. రోగి వైద్యుని వద్ద తన హృదయమును తెరచి చెప్పులాగున నీ హృద్గతభావము లన్నిటిని దాచుకొనక వెల్లడి చేయుము; అని ప్రశ్నింపగా అంతట ఆ గృహస్థుడు తన యనుభమము లన్నిటిని పూసగ్రుచ్చినట్లు ఈ ప్రకారముగ చెప్పివైచెను.\n\n\"గురుదేవా! నాకును నా అర్ధాంగికిని కొన్ని విషయాలపై అభిప్రాయభేదములు కలుగగా ఇరువురిమధ్యను తీవ్రవాదోపవాదములు చెలరేగగా, మనస్సు విసిగి ఆ వాతావరణమే నాకు సరిపడకపోవుటచే ఒకనాటిరేయి ఎవరికి చెప్పకుండా ఇల్లువిడిచి వచ్చి వేసితిని - ఆ వాక్యములను విని గురువు 'అయితే ఇప్పుడు నీ యభిప్రాయమేమి? ఆశ్రమములో ఎప్పటికినీ ఉండదలచితివా? లేక కొద్దిరోజులు మాత్రమే ఉండి మరల ఇంటికి వెళ్ళదలంచితివా?\" అని ప్రశ్నింప అందుల కాతడు జలనిధు లింకుగాక, కులశైలములేడును గ్రుంకుగాక, నేను ఇంటి గడప త్రొక్కనే త్రొక్కను మహాత్మా!' అని విన్నవించుకొని తురీయాశ్రమమగు సన్యాసమును అనుగ్రహించవలసినదిగా వేడుకొనెను.\n\nగృహస్థుని ఆ వాక్యములను వినగానే ఆశ్రమాధిపతియైన ఆ సాధువుగారు అతని అతీత వైరాగ్యమునకు అచ్చెరువొంది ఈ విధముగ వచించెను -\n\n'నాయనా! సన్యాసగ్రహణమను నీ సంకల్పము చాల పవిత్రమైనదే. అయినను తొందర పడరాదు. ఇంటివద్దనే కొంతకాలముండి చక్కగ జపధ్యానాదులను గావించుకొనుము. వైరాగ్యభావన మనస్సు నందు బాగుగ స్థిరపడిన మీదట సన్యాసవిషయమై ఆలోచించుకొన వచ్చును. కాబట్టి ఇపుడు ఇంటికి వెళ్ళి మనస్సును కుదుటపరుచుకొని శాంతముగ నీ ఆధ్యాత్మిక కార్యక్రమమును కొనసాగించు కొనుము'.\n\nగురుదేవుని ఆ వాక్యములు వినగానే గృహస్థునకు గొప్ప ఆవేదన కలిగి తోడనే యిట్లు విన్నవించుకొనెను. 'మహాశయా! నాకు ఇంటికి వెళ్ళుటకు ఏమాత్రము మనస్కరించుట లేదు. దయచేసి నాకు సన్యాసమును అనుగ్రహించి తమ ఆశ్రమముననే స్థానము కల్పించుడు.'\n\nఅది విని సాధువుగారు అతని వైరాగ్యమును పరీక్షించదలంచి \"నాయనా! ఒక వేళ నీకు సన్యాసమిచ్చితి ననుకొనుము. కొన్నాళ్లకు నీధర్మపత్ని నీవిచట ఉన్నట్లు తెలిసికొని ఇచ్చటకు వచ్చి ఇంటికి రమ్మని నిన్ను ప్రాధేయపడినచో అపుడేమి చేయుదువు?\" అని ప్రశ్నింప అప్పటి సంగతి అప్పుడు ఆలోచించుకొనవచ్చులేండి' అని జవాబిచ్చెను ఆ వాక్యములకు గూర్చిన చక్కటి పరిచయమును బొందినవాడై అతనికి భోజనము పెట్టి పంపించివైచెను.\n\nనీతి: వైరాగ్యము బాగుగ దృడపడినపుడు మాత్రమే సన్యాస విషయము యోచించవచ్చునుగాని అంతకు ముందు కాదు. త్వరపడి సన్యసించినచో ఉభయ భ్రష్టత్వము కలుగుటకు అవకాశము ఉండును. శ్మశాన వైరాగ్యమును, పురాణ వైరాగ్యమును ఆశ్రయింపక సాధకుడు దృఢవైరాగ్యమును జేబట్టవలెను. చక్కటి విచారణ ద్వారా దృశ్యవస్తువుల యొక్క నశ్వరత్వమును గుర్తెరింగి నిశ్చలవైరాగ్యము, అచంచల దైవభక్తి కలిగి మోక్షమునకై తీవ్రయత్న మాచరించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 764,
        "IMAGE": "cat_9",
        "NAME": "చంచల వైరాగ్యము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణము నందు మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబము కలదు. అందు ఇంటి యజమానికి ఒక చిన్న ఉద్యోగము. భార్య సదాచారవతి. ఆ యిల్లాలు ప్రతిదినము ఉషఃకాలముననే నిద్రలేచి స్నానాదులను నిర్వర్తించుకొని దైవధ్యానము చేసికొనుచుండును. ఒక జపమాలను తీసుకుని భక్తితో రామనామమును నూటెనిమిదిసార్లు జపించుచుండును. తదుపరి ఒక అధ్యాయమును గీతాపారాయణము చేయుచుండెను. పూర్వ్జజన్మార్జిత సుకృతవశమున ఆమెకు పుట్టుకతోనే చక్కని దైవసంస్కార మేర్పడెను. ప్రార్థన చేయక ఒక్కనాడైనను గంగపుచ్చు కొనదు. అసారమగు ఈ సంసారమున సర్వేశరుడొక్కడే సారమను పూర్ణవిశ్వాసము అమె కలిగియుండుట వలన గృహకృత్యములను యథావిధి జరుపుకొనుచుండినను మనస్సు మాత్రము భగవంతుని పాదపద్మములందే సంలగ్నమై యుండును.\n\nఇక ఆ పై భర్త గారి సంస్కారము వేరుగ నుండెను. భగవంతుని అస్తిత్వమును అతడు కాదనడుకాని 'ఇపుడే ఏమితొందర, నిదానముగా తరువాత ఎపుడైన దైవచింతన చేసికొనవచ్చును' అను ధోరణిని అతడు ప్రదర్శించుచుండును. ఈ పద్దతి భార్యకు నచ్చలేదు. ఒకనాడామె భర్త తీరికగ ఉన్న సమయము చూచి అతనితో నిట్లనెను - \"ఏమండీ! ఒక్కసారైనను రామనామము ఉచ్చరించక, భగవంతుని సేవింపక జీవితమును గడుపుచున్నారే! ఇది ఎంత ప్రమాదము! ఏ సమయమున ఏమి ఆపద సంభవించునో ఎవరికెరుక! ఈ జీవిత సమయమున ఏమి ఆపద సంభవించునో ఎవరికెరుక! ఈ జీవితములు ఏమి శాశ్వతము! ఏ క్షణము ఈ ప్రాణవాయువు దేహమును విడిచిపోవునో ఎవరును చెప్పలేరు. బ్రతికిన నాలుగురోజులు కృష్ణా, రామా యని భగవన్నామము ఉచ్చరించుచు పుణ్యము కట్టుకొనిన మాత్రమే ఈ జీవితము సార్థక మగునుగాని, వ్యర్థముగ ప్రాపంచిక కార్యములందే గడిపివైచినచో మహా ప్రమాదము సంభవింపగలదు. కాబట్టి ప్రతిరోజు కనీసము ఒక్కసారైన భగవంతుని గూర్చి చింతింపుడు. రామనామమును ఉచ్చరింపుడు. రవ్వంత పుణ్యమైనా ప్రతిదినము సంపాదింపుడు. ఇదిగో జపమాల తీసికొని భక్తితో జపము ప్రారంభించుడు!\n\nసహధర్మచారిణి యొక్క భావగర్భితములగు ఆ వాక్యములను విని భర్త ఇట్లనెను. \"ఓసీ! నీవు చెప్పినదంతయు సత్యమే. దేవుని గూర్చి తలంచుట మన ధర్మమని నేను ఒప్పుకొనుచున్నాను. అధి చేయ వలసిన కార్యమే. కాని ఇప్పుడెమి తొందర? ఇప్పుడు నేను ఉద్యోగము చేయుచున్నాను. అది పూర్తి అయిన పిదప, 'రిటైర్‌మెంట్‌' వచ్చిన తరువాత, పిల్లలు పెండిండ్లు అయిన పిదప, అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి తలంచుకొనవచ్చును. అప్పుడిక ఏ గొడవలు ఉండవు\" కాబట్టి శాంతముగా, నిశ్చలముగా ధ్యానము చేసికొనవచ్చును.\n\nభర్తయొక్క ఆ వాక్యములను వినగానే గృహిణికి గొప్ప హృదయా వేదన కలిగి భర్తకు తన మనోనిశ్చయమును గూర్చి నచ్చజెప్పుటకై ఎంతయో ప్రయత్నించెను. కాని ఫలితము లేకపోయెను. భర్త ఈషణ్మాత్రమైనను తన హృదయమును మార్చుకొనలేదు. పాత పద్దతిలోనే తన కార్యక్రమమును నిర్వహించుకొనుచు పోవుచుండెను. భర్త యొక్క మనస్సును దైవమార్గమున ఎట్లు మరలించవలెనో ఆమెకు తోచకుండెను.\n\nఇట్లుండ కొంతకాలమునకు విధివశాత్తు భర్తయొక్క ఆరోగ్యము లోపించెను. అతడు తీవ్రమగు జ్వరముతో బాధపడుచుండెను. డాక్టరుగారు వచ్చి రోగిని పరిశీలించి ఒక సీసాలో మందు పోసియిచ్చి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క జౌంసు చొప్పున ఇచ్చుచుండుమని భార్యకు చెప్పి, ఆ విషయమును భర్తకు కూడ తెలియజేసి వెడలి పోయెను. వైద్యుడు గృహమును వీడిన తదుపరి భార్య ఆ మందును దాచివైచి ఊరకుండెను. భర్తకు ఇవ్వలేదు. ఒకపూట గడచిపోయెను. రెండుపూటలు గడచిపోయెను. కాని భర్తకు ఏమాత్రము మందు ఒసంగలేదు. ఈ విషయము తెలిసికొని భర్త వెంటనే భార్యను పిలిపించి \"డాక్టరుగారు మందు ఇచ్చినది త్రాగుటకా, దాచి పెట్టుకొనుటకా?\" అని ప్రశ్నింప వెంటనే ఆ గృహిణి సమయోచితముగ నిట్లుపలికెను.\n\n'మందు విషయమై ఇపుడు ఎమితొందర? నిదానముగా ఇంకొక వారందినములైన పిదప త్రాగవచ్చును.' ఆ వాక్యములను విని భర్త \"నీకు మతి పోయినట్లుగా ఉన్నదే! రోగము వచ్చినపుడుగదా మందు త్రాగవలె\" అని పలుక అంతట ఆ యిల్లాలు భర్తకు ఈ ప్రకారముగ చక్కతిబోధ సలిపెను -\n\n\"మహాశయా! ఇపుడు మీరు దారికి వచ్చినారు. రోగము వచ్చి నపుడు కదా మందు త్రాగవలె అను మీ వాక్యము చాలా హేతుకమైనది. అయితే పుట్టిన ప్రతిప్రాణి భవరోగముచే బాధపడుచుండగా ఆ రోగమును బాపుకొనుటకు భగవన్నామామృతమును ఔషధమును వెంటనే ఏల త్రాగరాదు? ఆలస్యమేల చేయ్యవలెను? శరీరము క్షణికము కదా! రేపునకు రూపు లేదుకదా! అట్టిచో వార్థక్యము వరకు ఆ భగవచ్చింతనమును పవిత్రకార్యమును వాయిదావేయుట పాడియా! కాబట్టి సంసార రోగము, పుట్టుక చావు అనురోగము తగుల్కొనిన ఈ క్షణమందే ఆ రోగమును తొలగించుటకు రామనామమును, కృష్ణనామమును, భగవన్నామమును స్మరించవలెను. దైవచింతన, భగవద్ధ్యానము చేయవలెను. వార్ధక్యము, మృత్యువు కాచుకొనియున్నవి. రోగములు జీవుని ఆక్రమించుటకు సిద్ధము గానున్నవి. ఇట్టి పరిస్థితి యందు మీనమేషములు లెక్క పెట్టుచు భవరోగ చికిత్సయగు దైవద్ధ్యానామృతమును గ్రోలక ఆలసించుట పాడికాదు. అలసత్వము ప్రమాదహేతువు. కాబట్టి ఇపుడే రామనామమును ఉచ్చరింపుడు,జపించుడు!\"\n\nపత్నియొక్క ఈ చక్కటి బోధను ఆలకించి భర్త వెంటనే రామనామమును భక్తితో జపించసాగెను. వెనువెంటనే భార్య భర్తకు ఔషధమును ఒసంగ అతనిరోగము ఉపశమించెను. ఈ ప్రకారముగ శారీరక, మానసికములను రెండు రోగములున్ను తొలిగిపోయి అతడు పరమ శాంతిని బడసెను.\n\nనీతి: సంసారరోగము తగుల్కొని పుట్టుచు, చచ్చుచు నానా బాధలను పొందుచున్న జీవుడు ఆరోగము తొలగుటకు అవసరమైన ఆత్మజ్ఞానమును ఔషధమును సేవించి శాంతిని బడయవలెను. ఆలస్యము చేయరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 765,
        "IMAGE": "cat_9",
        "NAME": "అలసత్వము ప్రమాదహేతువు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము విశ్రమార్కుడను మహారాజు ఉండెను. అతడొకనాడు తన మంత్రులతోను, సామంతులతోనూ, పురప్రముఖులతోనూ కొలువు తీర్చియుండ, ఆ సభామధ్యమున నొక రాక్షసుడు ప్రవేశించెను. అతని చేతిలో మూడు పుర్రెలుండెను. ఆ భయంకర దృశ్యమును జూచి సభ్యులందరును ఆశ్చర్యచకితులైరి. ఇంతలో నా రాక్షసుడు రాజును సంబోధించి \"ఓ రాజా! ఈ మూడుపుర్రెలలో నెయ్యది శ్రేష్ఠమైనదో మీలో నెవరైనను నాకు తెలుపవలెను. అట్లు తెలుపనిచో మిమ్ముల నందరిని ఈ క్షణములోనే భక్షించివైచెదను అని పలికెను.\n\nఆ వాక్యమును విని సభ్యులు భయభ్రాంతులై ఆలోచనా నిమగ్నులై ఆ పుర్రెల వంకనే చూచు చుండిరి. కాని ఒక్కరును జవాబు చెప్పజాలలైరి. ఇంతలో మంత్రి లేచి ఒక సన్నని ఇనుపతీగెను తెప్పించి ఒక పుర్రె యొక్క చెవిలో దూర్చెను. ఆ తీగ మరియొక చెవినుండి బయటకి వచ్చివేసెను. \"ఓ రాక్షసా! ఈ పుర్రె అధమమైనది, నికృష్టమైనది అని తెలిసికొనుము\" - ఇట్లు పలికి మంత్రి ఆ తీగెను రెండవ పుర్రె చెవిలో దూర్చగా అది నోటిగుండా బయటకి వచ్చెను. అంతట మంత్రి \"ఓ రాక్షసా! ఇది మధ్యతరగతి పుర్రె\" అని చెప్పి ఆ తీగెను మూడవ పుర్రె చెవిలో దూర్చగా అది తత్‌క్షణమే హృదయము లోనికి జొరబడెను. అపుడు మంత్రి \"రాక్షసా! ఇది ఉత్తమమైనదని యెరుగుము\" అని పలుక రాక్షసుడు ఏ ప్రకారముగ నాతడట్లు నిర్ణయించెనో తెలుపుమని వేడ, మంత్రి యిట్లు వివరించి చెప్పెను. 'ఎవడు ఒక చెవిలో ప్రవేశించిన దానిని బోధను మరియొక చెవిగుండా వదలివేయునో అతడు అధముడు (అనగా వివిన దానిని మరచువాడని భావము.). ఎవడు ఒక చెవిలో ప్రవేశించిన నోటితో మాత్రము చెప్పగల్గునో అతడు మధ్యముడు. ఎవడు వినినదానిని హృదయము నందు జేర్చి అనుభూత మొనర్చుకొనునో అతడు ఉత్తముడు. ఆ వాక్యములను విని రాక్షసుడు సంతుష్టుడై వెడలిపోయెను.\n\nఆ ప్రకారముగనే జనులలో మూడుతరగతుల వారుందురు. ఎవరెవరు ఏస్థితి యందున్నది గమనించుకొని ఉత్తమ తరగతిలోనికి ప్రవేశించుటకు యత్నించవలెను. అనగా తాము శ్రవణముచేయు సత్య, ధర్మ, అహింసాదులను అనుభవములోనికి తీసికొనివచ్చి ధర్మమూర్తులు, సత్యమూర్తులు, అహింసామూర్తులు కావలెనని అర్థము.\n\nచిత్తామృతం నామృతమేవ విద్ధి\nచిత్రానలం నానలమేవ విద్ధి|\nచిత్రాజ్గనా నూనమనజ్గనేతి\nవాచావివేకస్త్యవివేక ఏవ ||\n\nకాగితముపై చిత్రింప బడిన అమృతము అమృతము కాదనియే యెరుగుము. కాగితముపై గీయబడిన అగ్నిగాని, స్త్రీకాని, వాస్తవముగ అగ్ని కాదు, స్త్రీకాదు. అట్లే వాచావివేకము అవివేకమే యగును అని వసిష్ఠులు శ్రీరామచంద్రునకు భోధించిన విధముగ వినిన దానిని ఆచరణలో నుంచని వారి యొక్క ప్రజ్న వ్యర్థమేయగును. కాబట్టి ముముక్షువులు తాము గురుముఖతః గాని, శాస్త్రముఖతః గాని యెరుగు ధర్మములన్నిటిని ఆచరణ యందుంచకొని హృదయ పరివర్తనమునొంది ధన్యులు కావలయును. అట్టి ఆచరణశీలురే సర్వోత్తమ మానవులని చెప్పందగును.\n\nనీతి: బోధలను ఆచరణయందుంచువారే సర్వశ్రేష్ఠులు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 766,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఆచరణ శీలుడే సర్వోత్తముడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక పట్టణమున ఒక మహారాజు నివసించుచండెను. అతనికి అహంకారము మెండు. తన్ను మించినవారెవరు లేరను దర్పమతనికి పట్టి పీడించుచుండెను. తనవలననే లోకమున అందరికిని తెల్లవారుచున్నదను భావము అతడు గలిగియుండెను. తాను భూసురుడనని, అందరికంటె గొప్పవాడనని, పలువురితో బింకములు పలుకుచుండును. తన సంపదలు, తన భోగభాగ్యములు, తన రాజప్రసాదములు, తన ఉద్యానవనములు, తన విలాసములు చూచుకొని ఆ రాజు గర్వోన్నతిని బొందుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడాతని దేశమునకు ఒక సాధుపుంగవుడరుదెంచెను. అతడు అనుష్ఠానపరుడు, సత్యనిష్ఠుడు, దైవభక్తి పరాయణుడు అయియుండెను. అతడు ఇహపరవిద్యల రెండింటియందును గొప్ప నిష్ణాతుడు. మంచి వాగ్ధాటికలవాడు తాను నేర్చిన బ్రహ్మవిద్యను ఇతరులకు చక్కగా చెప్పగల స్తోమత గలవాడు. ఏ విద్యయం డతడు పరిపూర్ణ అనుభూతిని బడసెనో అట్టి ఆధ్యాత్మవిద్యను లోకములో బాగుగ ప్రచార మొనర్చి అంధకారబంధురమైన ఆజ్ఞానవాతావరణ మందు నివసించుచచున్న జనావలికి జ్ఞానప్రకాశ మొసంగి కడతేర్చ వలెనను సదుద్దేశ్యమంతో అతడు ఊరూర సంచరించుచు ఉపన్యాసముల నిచ్చుచు, ధర్మబోధను వర్ణించుచుండెను. అతని పవిత్ర జీవితమును, నిరాడంబర వ్యక్తిత్వమును, అనర్గళ వాగ్ధోరణిని, అనుష్ఠాన పద్ధతులను చూచి జనులు అతని దివ్యవాణిని శ్రవణము చేయుటకై తండోప తండములుగ ఏ తెంచుచుండిరి. అతడు ఏ గ్రామమునకు వెళ్ళినను, ఏ పట్టణమున అడుగిడినను వేలసంఖ్యలో జనులు చేరుచుండిరి. ఎంతయో దూరమునుండి శ్రవణాభిలాషులై జనులు అరుదెంచు చుండిరి.\n\nఈ ప్రకారముగ ఒక్క సంవత్సరకాలము గడచెను. సాధువు గారి అఖండ ఆధ్యాత్మిక ప్రచారము యొక్క దివ్యప్రభావముచే ఎందరో జనులు పునీతులగుచుండిరి. పాపులు పుణ్యాత్ములుగ మారిపోవుచుండిరి. దుశ్శీలురు సచ్చీలురగు చుండిరి. దొంగలు తమ దొంగవృత్తిని మాని తమ భూతకాలిక పాపజీవితమును గూర్చి పశ్చాత్తాపడు చుండిరి. భోగులు యోగు లగుచుండిరి. వెయ్యేల దేశమంతయు రామరాజ్యముగ పరిణతి జెందుచున్నదా యనిపించుచుండెను. సాధువుగారి ఖ్యాతి దిగంతముల వ్యాపించెను.\n\nఅత్తరి ఆ దేశపు మంత్రివరేణ్యుడు సాధుమహాత్ముని కీర్తి ప్రతిష్ఠలకు అచ్చెరువొంది, అతని గుణగణములను మిక్కిలి శ్లాషించి, అతనిని ఆహ్వానించి రాజుచే సన్మానము చేయించిన బాగుండునని తలంచి ఆ విషయమున రాజున కెరింగింప ఆతడందులకంగీ కరించెను. ఒక పుణ్యదినమున ఆ అమాత్యశేఖరుడు రాజుగారి తరపున ఆహ్వానపత్రమును గైకొని సాధువుగారి ఆశ్రమమునకు వెళ్లి అతనికి భక్తిపురస్సరముగ సమర్పించి, రాజనగరమునకు వేంచేయులాగున భూపాలుని తరపున అభ్యర్థించెను. అందులకు సాధుపుంగవుడు తన సమ్మతిని తెలుపగా వెంటనే మంత్రివర్యుడు ఒక రథముపై వారిని ఆసీనులుగ జేసి మేళతాళములతో రాజప్రసాదమునకు గొనిపోయెను. రాజ భవనమున ప్రవేశించిన సాధుమహాత్ముని నృపాలుడు గౌరవపుర స్సరముగ లోనికి తీసికొనిపోయి సముచితమగు ఉన్నతాసనముపై గూర్చుండబెట్టి వివిధరీతుల సన్మానించెను.\n\nఇదియంతయు మంత్రియొక్క ప్రోద్బలముచే జరిగినదే గాని రాజునకు స్వతః ఆ మహనీయుని గౌరవించవలెనను ఉద్దేశ్యము లేదు. తన్ను మించినవారు జగత్తులో లేనేలేరను అహంభావము కలవాడు ఒకరిని గౌరవించుటకు ఉద్యుక్తుడగునా? అయినను మంత్రిపై గల సదభిప్రాయమువలన రాజు ఆతని మాట తీసివేయలేక సాధుమహాత్ముని సత్కరించెను.\n\nఇంత గౌరవము తనకు జరుగుచున్నను సాధువు ఆ సన్నివేశమును గొప్పగ తలంచలేదు. దైవమందే మనస్సు నెలకొల్పుకొని బాహ్యదృష్థి లేనివాడై యుండెను. తన్ను సత్కరించుచున్న రాజుపై గాని, తాను ఆసీనుడైయున్న నానాలంకార శోభితమణిమయ దివ్యాసనముపై గాని, నవరత్నములతో తులతూగుచున్న రాజభవనము పై గాని అతడు తన దృష్టిని పరచక కేవలము భగవత్పాదార విందములందే దానిని సంలగ్నము చేసెను. కాని అహంభావ ప్రపూరితుడగు ఆ భూపాలుడు పరిస్థితిని అపార్థము చేసికొని, సాధువు తన్ను కించపరెచనని భావించి పట్టరాని ఆగ్రహావేశముతో కూడినవాడై తత్‌క్షణమే సైనాధికారిని పిలిపించి \"ఓయీ! దేశమునకు ప్రభువైన నన్ను ఈ సాధువు ఉపేక్షచేసి అవమానపరచెను. కాబట్టి ఈతనిని దేశమునుండి బహిష్కరించి వేయు\" మని ఆజ్ఞాపించెను.\n\nరాజుయొక్క ఆ శిక్షాశాసనమును వినగానే సాధువు పకపక నవ్వెను. ప్రకనున్నవారందరు ఆశ్చర్యచకితులైరి. రాజునకు గూడ పరమాశ్చర్యము గలిగి \"సాధువుగారూ! శిక్ష విధించగనే మీరేల నవ్వినారు?' అని ప్రశ్నింప అందులకు సాధువిట్లు విజ్ఞతా పూర్వకముగ సమాధాన మొసంగెను - \"ఓ రాజా! చిన్న దేశమునకు ప్రభువైన నిన్ను ఒక్క క్షణకాలము ఉపేక్షించినపుడే నాకు దేశబహిష్కారణయను ఇట్టి కఠినదండన లభించగా, ప్రభువులకు ప్రభువై, రాజులకు రాజైనట్టి పరమాత్మను జీవితమంతయు ఉపేక్ష చేసిన నీకు ఎట్టి గోరమగు దండనము లభించునో\" యై తలంచుకొని నాకు నవ్వువచ్చినది.\n\nఆ వాక్యమును వినగానే రాజునకు కనువిప్పు కలిగెను. తాను ఒక చిన్న దేశమునకు రాజైనను రేపో మాపో నశించి పోవు నాలుగు మూరలు అస్థిపంజరము కలిగియున్నను వానిని జూచుకొని మరిసిపోయి, అహంకరించి, బ్రహ్మాండమునకు ప్రభువైన శాశ్వతుడై నట్టి పరమాత్మను విస్మరించుట చాల పొరపాటని గ్రహించి, తన తప్పిదమును గుర్తెరింగి సాధువు గారి పాదపద్మములపై తన శిరస్సునుంచి క్షమాపణ వేడుకొని తనకు చక్కని బోధను ప్రసాధించినందులకు, తన నేత్రములను తెరపించినందులకు తనకు వివేకోదయము కలిగించి అంధకారమయమగు తన జీవితమునకు ప్రకాశమందజేసి నందులకు అతనిని వేనోళ్ల పొగడి, తగురీతి సత్కరించి పంపెను.\n\nనీతి: ఎవరును తమతమ సంపదలను జూచుకొని గర్వించరాదు, క్షణికజీవితము గొప్పనితలంచి ప్రభువులకు ప్రభువైన భగవంతుని విస్మరించరాదు. శాశ్వతుడైన పరమాత్మకు వినిర్మలభక్తి భావముతో జోహారు లర్పించి, వినమ్రులై నిరంతర దైవచింతనతో గూడుకొని, జీవితమును పవిత్రముగ నొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 767,
        "IMAGE": "cat_9",
        "NAME": "వివేకోదయము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమున ఒక మహారాజు కలడు. అతనికి లెక్కలేని సంపదలు కలవు. ఆకాశము నంటుచున్న రాజప్రసాదములు పెక్కు గలవు. రాజభోగము లన్నిటిని బాగుగ అనుభవించుచు అతడు హాయిగా కాలక్షేపము చేయుచుండెను. ఇట్లుండ ఒకనా డతని కొక విచిత్ర సంకల్పము కలిగినది. తన చిత్రమును చిత్రకారులచే గీయింపజేసి అద్దానిని చూచుకొని ఆనందించవలెనను కుతూహల మాతనికి జనించెను.\n\nవెనువెంటనే అతడు తన మంత్రిపుంగవుని పిలిపించి తనదేశమందలి చిత్రకారు లందరిని రప్పించి వారితో \"ఓ చిత్రకారులారా! ఇప్పటికి మీ జీవితకాలమున ఎన్నియో చిత్రములను మీరు గీసి అఖండ ఖ్యాతిని బడసినవారైతిరి. ఇపుడు మీరు నాయొక్క చిత్రమును గీయవలసినది. నాస్వరూప మెట్లున్నదో బాగుగ గమనించి అదే విధముగ గీయవలసినది. ఏమాత్రము మార్పుఉండరాదు. ఉత్తమచిత్రమునకు సముచిత పారితోషికము ఒసంగబడగలదు.\n\nఆవాక్యములు వినగానే చిత్రకారు లందరు \"ఓ రాజా! మా ముందు కొద్దిసేపు ఆసీనులై యుండుడు. మీ యొక్క రూపురేఖ లన్నియు మేము జాగ్రత్తగ గుర్తుపెట్టుకొందుము. ఆ తదుపరి ఇండ్లకు వెళ్ళి సావకాశముగ చిత్రమును గీసి తీసికొనివచ్చెదము\" అని పలుకగా రాజు అందులకు సమ్మతించి సింహాసనముపై కొద్దిసేపు నిశ్చలముగ గూర్చుండెను. చిత్రకారులందరు తదేకదృష్టితో అతని వంక చూచుచు ముఖ్యమైన గుర్తులను కాగితముపై వ్రాసికొని వారివారి ఇండ్లకు వెడలిపోయిరి.\n\nకొంతకాలమైన పిదప చిత్రకారులు ఒక్కొక్కరు తాము వ్రాసిన చిత్రమును తీసికొనివచ్చి రాజుకు చూపించదొడగిరి. కాని ఒక్కొక్క చిత్రము చూచినపుడు రాజు తన ముఖమందలి అంగములను ఒకింత కదల్చుచు, వికృతరూపము దాల్చుచుండ రాజుయొక్క ముఖమునకును, చిత్రకారులు చిత్రించిన ముఖమునకును సంబంధము లేకుండెను. \"నా ముఖమును ఉన్నది ఉన్నట్లుగ మీరు వేయలేదు. నేను ఉన్నది ఉన్నట్లు మీరు వేయలేదు. నేను ఉన్నది ఒక రకముగను మీరు చేసినది మరియొక రకముగను ఉండుట వలన మీ చిత్రములు నాకు ఏమాత్రము సంతృప్తి కరములుగ లేవు. కావున పోయి మరల జాగ్రత్తగ వేసికొనిరండు' అని వారందరిని మందలించి పంపివైచెను.\n\nకొంతకాలము గడచిన వెనుక చిత్రకారులు తాము ఎంతయో శ్రద్ధతో, ఓపికతో వేసిన చిత్రములను మరల తెచ్చి రాజుకు చూపించగా అపుడు రాజు పూర్వము వలెనే తన అంగములను ఒకింత మార్పు చేయుచు, కదల్చుచుండ రాజస్వరూపమునకును, చిత్రమునకును పోలికయే లేకుండెను. కావున రాజు వారందరిని మందలించి పంపివేసెను. వారు వ్రాసి తెచ్చిన ఒక్క చిత్రము కూడ పోలిక లేనందున అవి అతనికి రుచించకుండెను. ఈ విషయము తెలిసిన ఒక మహా వివేకవంతుడగు చిత్రకారుడు రాజుకు తగిన పాఠము బోధించవలెనని నిశ్చయించి ఒక అద్దము తీసికొని రాజు యొద్దకు వెళ్ళి 'రాజా! మీచిత్రమును బహురమ్యముగ గీసితిని. మీరెట్లున్నారో అదేవిధముగ చాకచక్యముతో గీసితెచ్చితిని. చూడుడు'. అని అద్దమును చూపెట్టెను.\n\nరాజు మామూలు పద్ధతిలో తన అంగములను మార్పుచేయగా, ఆ మార్పు అద్దములో అదేవిధముగా గోచరించెను. రాజుయొక్క పప్పులు ఆ అద్దమువద్ద ఉడకలేదు. ఈ ప్రకారముగ అ చిత్రకారుడు జితోస్మి అని రాజుచే అనిపించగల్గెను. ఆ చిత్రకారుని తెలివితేటలకు రాజు చాల సంతోషించి తగినరీతి అతనిని సన్మానించి పంపివేసెను.\n\nనీతి: అద్దము అతినిర్మలముగా నుండుటబట్టి ఎదుట నున్న వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూపును. అట్లే మనస్సును అద్దమును రజోగుణ తమోగుణ రహితముగను, దుస్సంస్కార దుర్వృత్తి వర్జితముగను నొనర్చినచో అట్టి అద్దమువంటి శుద్ధమనస్సునందు అధిష్ఠానమగు పరమాత్మ చక్కగ ప్రతిబింబించును. ప్రత్యక్షముగ గోచరించును. అదియే అత్మసాక్షత్కారము. అదియే బ్రహ్మానుభూతి. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కార రూపమోక్షమునకు నిర్మల మనస్సు అత్యావశ్యకమై యున్నది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 768,
        "IMAGE": "cat_9",
        "NAME": "మనోనైర్మల్యము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమున ఒక చిన్న ఉద్యోగి కలడు. అతనికి నూతనముగ వివాహమయ్యెను భార్యగారు కాపురమునకు రాగానే ఒక చిన్న చిక్కు సమస్య ఏర్పడెను. అర్థాంగికి వంటచేయుట రాదు. భర్తకు అసలే రాదు. అట్టి విపత్కర పరిస్థితి యందు ఏమిచేయవలెనో తోచక భర్త ప్రతిదినము పట్టణములోని ఒక హోటల్‌ నుండి భోజనము తెప్పించు సదుపాయము గావించెను. వారిరువురికి సరిపడ బోజనమును ఒక క్యారియర్‌ నిండపెట్టుకుని ఒక పిల్లవాడు హోటల్‌ నుంచి తెచ్చి ప్రతిదినము వారికి అందజేయుచుండెను. ఈ ప్రకారముగ కొద్దిరోజులు గడువగా భోజనపు రేటు విపరీతముగ పెరిగిపోవుట వలన ఆ పద్ధతి అనగా హోటల్‌ నుండి భోజనము తెప్పించుట వారికి చాల దుర్భరముగా తోచెను. ఉద్యోగమా చిన్నది. ఆదాయమా స్వల్పము. భోజనాదికములా అధికము కాజొచ్చెను.\n\nఇట్టి పరిస్థితియందు భార్యాభర్త లిరువురును ఒకరోజు సమావేశమై ఆ చిక్కును అధిగమించుటకు పర్యాలోచనలు చేయదొడంగిరి. ఒక్కొక్కరు కొన్ని కొన్ని సూచనలను గావించిరి. భోజన సదుపాయము చక్కగ సాగిపోవుటకు, వ్యయము తగ్గిపోవుటకు ఏయే సాధన విధానములు కలవో వాటినన్నిటిని గూర్చి ఆ దంపతు లిరువురును కూలం కషముగ చర్చించిరి. తుట్టతుదకు వారిరువురును ఏకగ్రీవముగ ఒక తీర్మానమును గావించుకొనిరి. ఆ తీర్మానప్రకారము ఇక మీదట ఒక నెల రోజులవరకు మాత్రమే హోటల్‌ నుండి భోజనము తెప్పించుటకును, ఆనెల రోజుల లోపల వారిద్దరును పాకశాస్త్రమును క్షుణ్ణముగ నభ్యసించి వంట నేర్చుకొనుటకును, ఆ తదుపరి వారే భోజనసామాగ్రిని పట్టణము నుండి తెప్పించుకొని స్వయముగ వంటచేసికొనుటకును సిద్ధపడిరి. ఆ ప్రకారముగ చేసినచో ఆహారవ్యాయము చాలా తగ్గిపోగలదని వారు అభిప్రాయపడిరి.\n\nమరునాడు ఆ దంపతు లిరువురును ఊరిలోని పుస్తకశాలకు వెళ్లి ఒక పాకశాస్త్రగ్రంథమును కొని తీసికొని వచ్చిరి. రాత్రింబగళ్లు ఇద్దరును దానిని క్షుణ్ణముగా చదివివైచిరి. పుస్తకమంతయు పూర్తిఅయిన పిదప ఒక సుముహూర్త మందు వంటపని ప్రారంభించిరి. ఆ దినమున భార్యాభర్త లిరువురును ఉదయము ముందుగనే నిదుర లేచి స్నానాదికము లను ముగించుకొని పాకశాస్త్ర గ్రంథమును ముందుపెట్టుకొని దానిలో చెప్పబడిన ప్రకారము తు.చ. తప్పకుండ చేయుటకు సంసిద్ధులైరి.\n\nపుస్తకములో \"పొయ్యి అలకవలెను\" అని ఉండుటచే వారిద్దరును ఒక తట్టనిండా పేడతెచ్చి పొయ్యిని బాగుగ అలికిరి. తదుపరి గ్రంథమును చూడగా \"పొయ్యి మీద పాత్రను ఉంచవలెను\" అని దాని యందుండుటచే ఒక పాత్రను శుభ్రముగా తోమి పొయ్యిపై నుంచిరి. పిమ్మట \"ఒకటిన్నర శేర్లు కొలిచి నీరు పోయవలెను\" అని గ్రంథము నందుండుట వలన వారు తమ వీథియందున్న ఒక వర్తకుని యింటిలో గల కొలత పాత్ర తెచ్చి ఒకబొట్టు తక్కువగాని, ఎక్కువగాని లేక సరిసమానముగా ఒకటిన్నర శేర్లు నీరు ఆ పాత్రలో పోసిరి. తరువాత \"ముప్పాతిక శేరు బియ్యం దానిలో పోయవలెను\". అని పుస్తకము నందు వ్రాయడిన యుండుట వలన వారిద్దరును అదేకొలతలో బియ్యమును తెచ్చి బాగుగ కడిగి ఆ పాత్రలో పోసిరి. అరగంట దాటినది. బియ్యము ఉడకలేదు. గంట దాటినది. ఒక్కగింజైనను ఉడకలేదు. ఆ దంపతు లిరువురును ఆశ్చర్యచకితు లగుచుండిరి.\n\nఏకారణము చేత బియ్యము ఉడకలేదు? పుస్తకములో చెప్పిన ప్రకారము పొల్లు పోకుండ చేసినామే! అని వారిద్దరును తమలో తాము భావించుకొనుచుండ ఇంతలో ప్రక్కయింటి స్నేహితుడు డొకడు అచటికి వచ్చి , వారు చేయుచున్న దాని నంతను వీక్షించి ఏమండి! పొయ్యిలో కట్టెలు పెట్టి మంటచేయలేదేమి? అని ప్రశ్నింప, ఆ విషయము పుస్తకమందు తెలుపబడి యుండలేదు' అని వారు ఖచ్చితముగ సమాధానము జెప్పివైచిరి. వారి వాక్యములను విని స్నేహితుడు పకపక నవ్వి 'పుస్తకమునందు తెలుపబడిన దానిని అనుభవజ్ఞుడైన వ్యక్తి యొద్ద నేర్చుకొనుట ఉత్తమము. అపుడు మాత్రమే దానికి సంబంధించిన వివరములు, పద్ధతులు ఆచరణాత్మక ప్రయోగములు చక్కగ తెలియగలవు' అని చెప్పి వెడలిపోయెను. అతడు వెడలిన పిమ్మట భార్యాభర్తలు పొయ్యిలో మంటపెట్టి అన్నమును తయారుచేసికొని భుజించి సంతుష్టులైరి.\n\nనీతి: సామాన్య విద్యలకే గురువు అవసరమైనపుడు ఇక అతి సూక్ష్మమైన ఆధ్యాత్మ విద్యకు అవసరమని వేరుగ తెలుపనక్కరలేదు. గ్రంథములను చక్కగచదివి, వానిలోని విషయములను సద్గురువు ద్వారా బాగుగ నభ్యసించి, అనుష్ఠాన పద్దతులను వారివలన లెస్సగ తెలిసికొని మానవుడు కడతేరవలెను. ఆధ్యాత్మవిద్య అచరణాత్మకమైన విద్యయే కాని వాచావిద్య కాదని ముముక్షువులు జ్ఞప్తియందుంచుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 769,
        "IMAGE": "cat_9",
        "NAME": "అనుభవము లేని విద్య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామమున ఒక పురోహితుడు కలడు. అ గ్రామములోని దేవాలయమున అతడు పూజాకైంకర్యములు జరుపుచుండును. ప్రతిదినము ప్రభాత సమయముననే లేచి స్నానసంధ్యాదులను నిర్వర్తించుకొని దేవాలయమునకు వెళ్లి తన విధులను సక్రమముగా నెరవేర్చుకొని ఇంటికి వచ్చుచుండెను. అతనిది ఒక చిన్న పెంకుటిల్లు. ఆ యిల్లు అతడు కట్టించినదికాదు. అతని వంశములో ఎవరో పూర్వికులు కట్టించినది. దానిని తరతరములనుండియు ఆతని పూర్విజులు అనుభవించుచుండిరి. కొంత కాలము క్రిందట పురోహితుని తండ్రి దానిని అనుభవించుచు రాగా, అతడు పరమపదించిన పిదప ఆ యిల్లు పురోహితుని వశమయ్యెను.\n\nపురోహితుడు స్వయంకృషిచే ఉన్నత విద్యను చక్కగ అభ్యసించి, విరామ సమయములందు విధ్యార్థులకు \"టూషణ్లు\" చెప్పుకొనుచు అచిర కాలములో కొంత సంపదను గడించెను. తనకు పిత్రార్జితముగా సంక్రమించిన ధనముతో అద్దానిని చేర్చి ఆ గ్రామమునందు నూతనముగా ఒక సుందర విశాల ఆధినిక రమణియ భవనమును కట్టించి, ఒకానొక సుముహూర్తమున అందు గృహప్రవేశమును గావించెను . వంశపరంపరగా వచ్చిన తన పాత ఇంటిలోని సామానునంతటిని అపుడు నూతన గృహమునకు వెనువెంటనే అతడు తరలించి వేయ దొడగెను. పాత్రలు, పెట్టెలు, మంచములు, ఒకటన నేల సామాను మొత్తము బండ్లపై నూతన భవంతికి తరలిపోవదొడగెను. ఈ ప్రకారముగ పాతయింటి లోని వస్తువులన్నియు బయటకు వెళ్ళినవి కాని ఒక్క వస్తువు మాత్రము అచటనుండి కదలి రాలేదు. అది ఒక నిలువుటద్దము. చాలాపెద్దది. ఏ పూర్వికులు దానిని తయారు చేయించారో కాని అది ఒక అద్భుతమైన పనితనముతో గూడిన వస్తువిశేషము. ఆ నిలువుటద్దము గదినుండి బయటకు రాలేదు. ఏలయనగా, ద్వారములో అది పట్టలేదు. ద్వారము చిన్నది. అద్దము పెద్దది. కావున ఒక చిక్కుసమస్య ఏర్పడినది. ఆ గ్రామములోను, పరిసర గ్రామములోను గల హేమా హేమీలందరు వచ్చి వారివారి శక్తియుక్తులన్నిటిని ప్రయోగించి చూచిరి. కాని విఫలులైరి. అద్దము బయటకు రాలేదు.\n\nపురోహితునకు ఏమిచేయుటకు తోచలేదు. ఆ ఊరిలో విశేషముగ పలుకుబడిగల వ్యక్తి యగటవలన అతడు దీర్ఘముగ యోచించి ఊరి పెద్దలందరిని ఒకచోట సమావేశపరచి అద్దము ఇంటి నుండి బయటకు వచ్చు మార్గములను అన్వేషింప దొడగెను. ఆ పురజన మహాసభయందు ఒక్కొక్కరు వారివారికి తోచిన సలహాలను ఇచ్చుచుండిరి. సభామధ్యమునుండి ఒక పురప్రముఖుడు లేచి 'సభాసదులారా! నా వాక్యం ఆలకించండి. ఇది చాలా చిక్కుసమస్య. ఈ సమస్యను మనం దీర్ఘంగా , దూరంగా, తీక్షణంగా యోచించి తగుపరిష్కారం చేయవలసి యున్నది. మన గ్రామములో ఇందరు పెద్దలు, ఇందరు విజ్ఞానసంపన్నులు, ఇందరు శేముషీధురంధరులు ఉండగా ఈ సమస్యను విడదీయలేకపోవుట సముచితంగా తోచలేదు. ఇపుడు అద్దము బయటకు రావలసియున్నది. ద్వారమో చాలా చిన్నదిగా ఉన్నది. కాబట్టి పాత ద్వారము కొట్టివైచి కొంత పెద్దదిగా చేసినచో అద్దము అమాంతముగా బయటకి రాగలదు' - అని చెప్పి కూర్చుండెను. వెనువెంటనే మరొయొక పుర ప్రముఖుడు లేచి దాని కీప్రకారముగ ఆక్షేపణ చెప్ప దొడంగెను.\n\nమహాశయా! మీరు చెప్పిన ఉపాయము బాగానే ఉన్నదిగాని, తరతరములనుండి అవిచ్చిన్నముగ వచ్చుచున్న ఇంటిని పగులగొట్టుట న్యాయసమ్మతము కాదు. ఇల్లు యథాప్రకార ముండునట్లు ఉపాయం ఆలోచించండి! అపుడు మరియొక సభ్యుడు లేచి 'అయ్యా! నామాట ఆలకించండి. అద్దం పెద్దది. ద్వారం చిన్నది. కాబట్టి అద్దాన్ని రెండుగా చీలిస్తే సునాయాసంగా బయటకు పోతుంది' - అని విజ్ఞానపూర్వకమగు సలహా నొసంగగా తత్‌క్షణమే ప్రక్కనున్నవాడు లేచి 'మహానుభావా! అంతపని చేయకండి. అద్దాన్ని చీల్చడానికి దానిమీద కత్తిపెడితే అది రెండు ముక్కలు కావచ్చు . పది ముక్కలు కావచ్చు. అది వారి వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది' అని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి ఊరకుండెను.\n\nఈ ప్రకారముగ ఆ సభలో వాదోపవాదములు చెలరేగెను. సమస్యకు తగు నిర్ణయము కుదరలేదు. పూర్వపక్షప్రతిపక్షములు లెక్క లేనన్ని వచ్చిపడెను. వారి వాదవివాదములతో భావసంఘర్షణలతో సభాస్థల మంతయు ప్రతిద్వనింపదొడగెను. కాని సమస్య ఏమాత్రం పరిష్కారము కాలేదు. అట్టి విపత్కర విపరీత పరిస్థితియందు ఒక వృద్ధుడు సభామధ్యము నుండి చివుక్కున లేచి 'అయ్యా! సభాసదులారా! మీలో తగవులాడుకోవద్దు. ఇది ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరిపోసుకునే సందర్భం కాదు. ఒక జటిలమైన , విజ్ఞానవంతమైన సమస్యకు పరిష్కారం ఆలోచించవలసిన సమయమిది. అద్దం బయటికి రావడానికి అందరూ వారి వారి సలహాలు ఇస్తున్నారు. మంచిదే, ద్వారం చిన్నది. లోనగల అద్దం పెద్దది. అని అందరూ ఉద్ఘాటిస్తున్నారు. కాని అసలా అద్దం లోపలికి ఎట్లా రాగలిగిందో ఊహించండి. పెద్ద అద్దం చిన్న ద్వారం గుండా లోపలికి ఎట్లా వచ్చింది? దీని నెవరైనా ఆలోచించారా? ఇపుడా లోచించవలసిన ముఖ్య విషయం అద్దం బయటికి ఎలా పోతుందని కాదు అసలా అద్దం లోపలికి ఎలారాగలిగింది' అని వృద్ధుని సమయోచితమగు వాక్యమును విని సభ్యులెల్లరు భేష్‌ భేష్‌ అని సంతోషముతో చప్పట్లు కొట్టి ఆలోచనానిమగ్నులైరి.\n\nనీతి: లోకములో జనుల 'దుఃఖ మెట్లు తొలగగలదు? దుఃఖము తొలగుటకు మార్గమేమి?' అని ఆలోచించుచున్నారు. కానీ మహర్షులగు వారు 'అసలు దుఃఖమెట్లు వచ్చినది?' అని యోచించి అజ్ఞానము వలననే దేహము, దేహము వలన దుఃఖము వచ్చినదని గుర్తెరింగి ఆ అజ్ఞానమును ముందు తొలగించి వైచినచో దుఃఖము దానంతట అదియే తొలగిపోగలదని నిశ్చయించి అద్దాని నివారణకై జ్ఞానమును, అత్మ విచారణను లోకమున చక్కగ ప్రబోధ మొనర్చిరి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 770,
        "IMAGE": "cat_9",
        "NAME": "దుఃఖమునకు మూలహేతువు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక దేశమును ఒక మహారాజు పరిపాలించుచుండెను. తాను ఒక గొప్పరాజనియు, దేశప్రజ లందరికిని ఏకచ్ఛధిపతి యనియు, తన్ను మించినవారు ఎవరును లేరనియు, తన ఆజ్ఞ సుగ్రీవాజ్ఞవలె చెల్లుబడి అగుచున్నదనియు, ప్రజలందరును తన బానిసలనియు, అందరును తన చెప్పుచేతులలో మెలగుచున్నారనియు భావించుచు కన్నుమిన్ను తెలియక ప్రవర్తించుచుండెను. మూర్తీభవించిన దర్పమా యనునట్లు లోకుల కతడు తోచుచుండెను. తన చండశాసనములను అమలు పరచుచు, శాసనమును అతిక్రమించిన వారిని, దండించుచు, నిద్దాక్షిణ్యముగ హింసించుచు హిరణ్యాక్షుడువలె వ్యవహరించుచుండెను. అతని పరిపాలన యెడల ప్రజలు తీవ్ర అసంతృప్తి గలిగియుండిరి.\n\nఇల్లుండ ఒకనాతడు తన దేశములోనున్న పండితు లందరిని పిలిపించి 'ఓ పండితోత్తములారా! మీరందరు కలిసి నాపై ఒక మహా భారతమును వ్రాయవలెను. ఆరు మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఈ ఆరుమాసములు మీ పోషణకు మీ కుటుంబ పోషణకు నేనే చక్కని ఏర్పాట్లను చేసెదను. మీరేమియు బాధపడ నక్కరలేదు. ఒక వేళ ఈ ఆరునెలలైన పిదప నేను చెప్పిన ఈ కార్యమును అనగా నాపై భారతమును వ్రాయుటను మీరు పూర్తికావింపనిచో నా దేశమునుండి మీరందరిని కుటుంబ సమేతముగా బహిష్కరించివేసెదను. ఈ వాక్యమును బాగుగ జ్ఞాపక ముంచుకొని నేను చెప్పినపని' చేయుడు - అని గద్దించి పలికెను.\n\nఆ వాక్యములను విని పండితవర్యు లందరును భీతిచే విహ్వలురై కిక్కురుమనకుండ వెడలిపోయిరి. రాజుయొక్క దర్పమునకు వారందరును ఆశ్చర్యచకితులైరి. ఏమి చేయుటకును వారికి తోచలేదు. ఒక వ్యక్తిపై భారతము వ్రాయుట ఎట్లు? అది సాధ్యపడని విషయము; కాని రాజాజ్ఞ కావున వ్రాసి తీరవలెను. వ్రాయకున్నచో ఇక గంప నెత్తిన బెట్టుకుని ఊరువదలిపోవలసినదే. ఇట్టి విపరీత విపత్కర పరిస్థితిని ఎదుర్కొన వలసివచ్చిన ఆ పండితు లందరును ఒకచోట సమావేశమై చివరకు ఒక వ్యక్తిపై మహాభారతము వ్రాయుట సాధ్యమగు పని కాదని ఏకగ్రీవముగ తీర్మానించుకొని వారి వారి ఇండ్లకు వెడలిపోయిరి.\n\nకాలము గడవజొచ్చెను. దినములు వారములుగను వారములు నెలలుగను మారుచుండెను. రాజుగారు పండితు లందరికిని భోజన భాజనములను, కావలసిన పదార్థములను బండ్లతో పంపుచుండెను. పండితులకు రాజభోజనములు జరుగుచున్నను మనస్సు మాత్రము దిగులుతో దుఃఖముతో నిండియుండెను. గడవు సమీపించినకొలది వారి చిత్తములు నానావిధములుగ పరిభ్రమణ మొందుచుండెను. కింకర్త వ్యవిమూఢులైన వారు దినగండముగ రోజులను గడవుచుండిరి.\n\nఈ విధముగ ఐదుమాసములు గడచిన వెనుక ఒకనాడు రాజు ఆ పండితు లనందరిని తన ఆస్థానమునకు పిలిపించుకొని 'ఓ పండితులారా! నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చినది? నాపై మీరు వ్రాయుచున్న భారతములో ఇప్పటికి ఎన్ని పర్వములు పూర్తి అయినవి? వ్రాత నిరాటంకముగ కొనసాగిపోవుచున్నదా? మీకు భోజన వసతులు బాగుగ లభించుచున్నావా? వానిలో ఏదైన లోటుబాట్లున్నచో తెలిపిన యెడల ఇంకను చక్కని ఏర్పాట్లు చేయగలను. గడువు ఇంకను పదిరోజులు మాత్రమే యున్నది. కాబట్టి పని చురుకుగా జరుగునట్లు చూడవలసినది' అని పలికెను.\n\nఆ వాక్యములను వినగానే పండితులలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన ఒకాయన రాజుతో ఇట్లు విన్నపించుకొనెను - భూపాలా! మీ ఆజ్ఞను శిరసావహించుటకై మేము సర్వసన్నద్ధులమై యుండి ఒక శుభముహూర్తమున అందరమును కలము కాగితమును తీసికొని శ్రీకారము చుట్టితిమి. కాని వెంటనే మాకొక ధర్మసందేహము ఎదురై నది. భారతములో పంచపాండవులు రాజ్యమును వదలి పండ్రెండు సంవత్సరములు అడవులలో ఉండవలసి వచ్చెను. మరి దేవరవారు రాజ్యమును వదులుటకు సిద్ధముగా ఉన్నారో లేదో యనియు, ఒకవేళ సిద్ధముగా నున్నచో ఎన్నిసంవత్సరములు అరణ్యములో ఉండదలంచిరో అనియు సంశయములు ఉదయింపగా మనస్సు తికమక చెంది వ్రాత నిలిపివైచి మీతో ఆ విషయములు మీతో సంప్రదింప దలంచుచుండగా కాకతాళీయముగా మీరే మమ్ములను కబురుచేసితిరి. భూపాలోత్తమా! మా సంశయములను తీర్చుడు. రాజ్యమును ఎప్పుడు వదిలెదరో, ఏ అరణ్య మునకు బోదలంచిరో, అచటేన్నాళ్ళు ఉండదలంచితిరో వెంటనే తెలుపుడు.\n\nపండితోత్తముని ఆ వాక్యములను వినగానే రాజు స్తంభించిపోయెను. ఏమి ప్రత్యుత్తర మీయవలెనో తోచక 'అట్లయినచో ఓ పండితులారా! నాపై భారతము వ్రాయనక్కరలేదు. వెడలిపొండు' అని చెప్పివేసెను. పండితు లందరును వారి వారి యిండ్లకు పోయి గండము గడచుటచే ఆనందముతో చిందులు త్రొక్కసాగిరి. అంతయు భగవత్కృపయని తలంచి సంతుష్టాంతరంగు లైరి.\n\nదర్పము పనికిరాదు. అది మహాదుర్గుణము. తన్ను మించిన వారు లేరనుకొని అహంకరించి ప్రవర్తించుట మంచిదికాదు. దంభదర్పాదులు కలిగి కన్నుమిన్ను తెలియక ప్రవర్తించిన వారెందరో పతనమైపోయి నట్లు చరిత్ర సాక్ష్యమిచ్చుచున్నది.\n\nనీతి: దర్పమను దుర్గుణము నెవరును దరికి చేర్చరాదు. అసురసంపదను పారదోలి పవిత్రజీవితమును గడపవలెను. శాంతి సుఖములకు మార్గమిదియే. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 771,
        "IMAGE": "cat_9",
        "NAME": "దర్పమునకు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక పట్టణమున ఒక మధ్యతరగతి కుటుంబము నివసించుచుండెను. ఆ కుటుంబములో భర్త, భార్య, కుమారుడు మువ్వురుమాత్రమే కలరు. భర్త ఆ పట్టణములోని ఒక కర్మాగారమున ఉద్యోగిగా నుండెను. కుమారుడు పాఠశాలలో విద్య నభ్యసించుచుండెను. కొంతకాలమునకు కుమారునకు యుక్త వయస్సు రాగా తల్లిదండ్రులు ఆతనికి వివాహము చేసిరి. కోడలు కాపురమునకు వచ్చెను. భర్త భార్య , కొడుకు, కోడలు - అను నలుగురు వ్యక్తులతో గూడిన ఆ చిన్న సంసారము ఏ ఒడిదుడుకులు లేకుండా సవ్యముగా కొనసాగిపోవు చుండును.\n\nకాని కుటుంబములో పరిస్థితులు ఎల్లప్పుడు ఒకేతీరున ఉండవు. జీవయాత్రలో వ్యక్తులమధ్య అపుడపుడు సంఘర్షణలు ఏర్పడు చుండును. అభిప్రాయభేదములు, వైమనస్యములు పొడసూపు చుండును. అపుడు సంసారము సరిగా జరుగక అశాంతికి ఆలవాలమైపోయెను. ఇపుడు విచారించుచున్న ఆ మధ్యతరగతి కుటుంబమునందు కూడా అదే విధముగా జరిగెను. అత్తగారికి, కోడలుగారికీ ఏమియు సరిపడలేదు. ప్రతిరోజు ఇరువురి మధ్య వాగ్వివాదములు, తీక్ష్ణతర సంభాషణలు పలుసార్లు జరుగుచుండెను. కోపము కల్లువంటిది. అది వచ్చునపుడు జనులకు ఒక విధమైన కైపు ఏర్పడును. ఆకైపులో తానెవరో, ఎదుటివాడెవరో, అసలు కలహమెందులకు వచ్చినదో అన్నియు మరచి పోయి యుక్తా యుక్త విచక్షణజ్ఞానము ఇసుమంతయు లేక మహా దుడుకుగా దురుసుగా ప్రవర్తించుచుందురు. తత్ఫలితముగ ఊహింప రాని దారుణ పరిణామములు ఇరుపక్షములందును సంభవించు చుండును.\n\nప్రస్తుత కుటుంబమునందు అత్తగారికిని, కోడలుగారికిని మధ్య ఏర్పడిన భేదాభిప్రాయము దినదినము ప్రబలిపోయి, చిలికి చిలికి గాలివానగ మారినట్లు, భీకరకలహములకు దారితీసెను. వారిరువురిమధ్య రాజీ కుదుర్చుటకు ఇంటి యజమానికి తలప్రాణము తోకకు వచ్చుచుండెను. ఆఖరునకు కోడలిదే పైచేయి అయ్యెను. యుద్ధములో అత్తగారు ఓడిపోయెను. అపుడు వెంటనే కోడలు అత్తగారితో 'అత్తగారూ! ఇకమీదట మీరు ఈ యింటిలో ఒక్కక్షణమైన గడపగూడదు. వేరే ఎక్కడైన ఏర్పాటు చేసికొనవలసినది' అని అల్టిమేటం ఇచ్చివేసెను. ఆ వాక్యములను విని అత్తగారు 'అమ్మా! ఇవి నీ రోజులు, కాబట్టి నీ వాక్యములను శిరసావహించక నాకు తప్పదు. వేరే గత్యంతరము లేదు. నీవు చెప్పినట్లు అక్షరశః పాలించెదను. త్వరలోనే ఇల్లు విడిచిపోయెదను. అయినను అమ్మా! నాకొక చిన్న అభిలాష ఉన్నది. దానిని నెరవేర్చుకొని పోదలించినాను. నీకు మొన్ననే వివాహమైనది. నీకు ఒక బిడ్డ కలిగిన తరువాత వాని ముఖారవిందమును సందర్శించుకొని, తప్పకుండా ఇల్లువిడిచిపోయెదను. అంతవరకు కొంచెము ఓపికపట్టు తల్లీ!\" అని చెప్ప అందులకు కోడలు అంగీకరించెను.\n\nకాలచక్రము రివ్వున తిరుగసాగెను. కొంతకాలమునకు కోడలు గారికి తనయుడు జన్మించెను. మనుమని ముఖసందర్శనముచే అత్తగారి ముఖము చాటంతయింది. పౌత్రసందర్శనానంద తన్మయ అయివున్న అత్తగారి చెంతకు కోడలు వెళ్లి 'అత్తగారు! మనుమడు పుట్టినాడు. కావున ఇక తమరు ఇంటినుండి బయటకు దయచేయండి. మాట తప్పుట మంచిదికాదు' అని పలుక వెంటనే అత్తగారు \"అమ్మా! నేను మాట తప్పను. తప్పక వెళ్లెదను. కాని ఒక్క సంకల్పము బహుకాలము నుండి పీడిస్తున్నది. దానిని కూడ నెరవేర్చుకుని వెళ్లెదను. అ పిదప ఇక నీవు ఉండమని కోరినప్పటికిని నేను ఉండను. నీకు పుట్టిన ఆ బిడ్డ యొక్క వివాహకార్యమును కళ్లారాచూచి ఆనందించి వెళ్ళి పోదలంచినాను. అంతవరకు కొంచెము ఓపికపట్టవమ్మా తల్లీ!\" అని ప్రత్యుత్తర మీయగా కోడలు సంతోషించి ఎటుతిరిగి కొంతకాలమునకై నను ఆమె వదలిపోవునను సంతోషముతో సంతృప్తిని ప్రకటించెను.\n\nరోజులు గడచిపోసాగెను. దినములు మాసములుగను మాసములు వత్సరములగను వేగముగ పరిణమించుచుండెను. క్రమముగ మనుమనునికి యుక్తవయస్సు రాగా, ఒకానొక సుముహుర్తమున అతనికి వివాహము జరిగెను. అనంతరము కొంతకాలమునకు కోడలు అత్తగారి యొద్దకు వచ్చి 'అత్తగారూ! నా కుమారుని యొక్క అనగా మీ మనుమని యొక్క వివాహమును కళ్లారా చూచి ఆనందించారు గదా! ఇక మీ మాట ప్రకారము ఇంటినుండి బయటకు వెళ్లండి!\" అని పలుకగా అత్తగారు రోషారుణితనేత్రయై \"అమ్మా కోడలుగారూ! కోడలు ఇంటికిరాగానే అత్తగారు ఇల్లు విడిచి పోవుట సిద్ధాంతమైనచో, ఇప్పుడు నీకున్ను కోడలు వచ్చినది కాబట్టి అత్తవైన నీవున్ను ఇపుడు ఇల్లువిడిచి పోవలసియున్నావు. కాబట్టి మనమిద్దరమున్ను కలిసి బయటకు వెళ్లిపోవుదము రమ్ము!\" అని గంభీరముగ చెప్పివైచెను. ఆ వాక్యములను వినగానే కోడలు హతాశ అయి సిగ్గుతెచ్చుకుని తన అపరాధమును గ్రహించి అత్తగారితో 'అత్తగారూ! ఇక మీరు వెళ్ళనక్కర లేదు. ఆచంద్రతారార్కము ఇంటియందే ఉండవచ్చును\" అని పలికి ఊరకుండెను.\n\nఎదుటివాడు ఎంత బాధపడుచున్నది సామాన్య పరిస్థితులలో మనుజుడు తెలిసికొనజాలడు. ఆ బాధ తనకు వచ్చినపుడు మాత్రమే దానివలన కలుగు దుఃఖమును అతడు తెలిసికొనగలుగును. కాబట్టి సుఖమందుగాని, దుఃఖమందుగాని తనవలెనే ఇతరులను చూచుకొనుట విజ్ఞుని లక్షణము. ఇదియే గీతాచార్యుడు తెలిపిన 'ఆత్మౌప మ్యత్వము' ఇతరు లెవరికైన ఆకలి కలిగినచో, తనకు ఆకలి కలిగినచో ఎంతబాధ కలుగునో ఊహించుకొని, ఆ ఎదుటవాని ఆకలిబాధ తనబాధగా భావించుకొని, తనకు కలిగిన దానిలో ఒకింత అన్నము వానికి పెట్టి వాని బాధ పోగొట్టవలెను. అట్లే ఇతరులు చలికి బాధపడు చుండినచో ఆ చలి తనకు వేసినచో ఎంతబాధ కలుగునో ఊహించుకొని ఎదుటవాని చలిబాధ తీర్చుటకు తనకున్న దానిలో ఏదైన వస్త్రమును దానము చేయవలెను. అంతియేగాని కథలోని కోడలివలె, ఎదుటవాని ఆర్తిని తెలిసికొనక స్వార్థముగ ప్రవర్తించరాదు. \"ఆత్మౌప మ్యత్వము\" అనగా తనవలె ఇతరలను చూచుకొను అభ్యాసము పరమధర్మము. కావున జనులిద్దానిని తన దైనందిన వ్యవహారమందు కార్యాన్విత మొనర్చుకొని జీవితమును పవిత్రవంతముగ నొనర్చు కొనవలయును.\n\nనీతి: సుఖమందుగాని, దుఃఖమందుగాని, తనవలె ఇతరులను చూచుకొనవలెను. ఇదియే గీత యందు చెప్పబడిన ఆత్మౌపమ్యమను ధర్మము. పరప్రాణి యొక్క సుఖమునే వాంచింపవలెను. ఇతరులకు ఉపకారమునే చేయవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 772,
        "IMAGE": "cat_9",
        "NAME": "నీవలె ఇతరులను చూచుకొనుము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమందు ఒక చిన్న ఉద్యోగస్థుడు కలడు. అతనికి నెల నెల వచ్చు వేతనము కుటుంబ పోషణమునకు సరిపోగా కొద్దిగా మిగులును. ఒకనాడాతని ధర్మపత్ని తన కొక బంగారు గొలుసు చేయించిపెట్టమని భర్తను వినయపూర్వకంగా వేడుకొనెను. చుట్టుప్రక్కల ఉన్న తన స్నేహితురాండ్రులు అందరు ఏదియో ఒక రకము ఆభరణము ధరించి యున్నారనియు, ఒక్క అలంకారమైనను లేక వారిలో తిరుగుట తనకు చిన్నతనముగా నున్నదనియు భర్తతో ఆమె మొరపెట్టుకొని బంగారు గొలుసు కొరకై అభ్యర్థించెను. భర్తపెద్ద ఉధ్యోగుడు కాడు. ధనికుడు కాడు. బంగారు గొలుసు తయారు చేయించవలెనన్న ఒక వెయ్యురూపాయులైనను కావలసియుండును. అందుచే నతడు తన సహధర్మచారిణిపైగల అనురాగముచే ప్రతినెల తనకు వచ్చు జీతములో కొంత కొంత పొదుపుచేసికొని కనకాభరణమునకై ధనమును కూడబెట్ట దొడగెను.\n\nకాలక్రమమున ఆభరణమునకు కావలసిన ద్రవ్యము సమకూడగా వెంటనే అతడు ఒకానొక సువర్ణ కారునితో సంప్రదించి తన ప్రియురాలి కొరకై చక్కని సువర్ణ కంఠాభరణము తయారు చేయించుటకు తగిన ఏర్పాటు చేసెను. స్వర్ణకారుడు తన యావచ్ఛక్తిని వినియోగించి తన కళాకౌశలమునంతను ఉపయోగించి మూడు మాసములలో ఒక రమణీయమైన కనకాభరణమును తయారు చేసి ఉద్యొగి కొసంగెను. ఉద్యోగి బహుకాలము దానికై నిరీక్షించుచున్న తన యర్థాంగికి అందజేసెను. దానిని చూడగానే ఆనందముతో చిందులు త్రొక్కుచు బహుజాగ్రత్తగా దానిని దాచిపెట్టెను. ప్రత్యేక సమయములలో, విశేష సమయములలో, వరపడిదినములలో మాత్రమే దానిని ధరించుచు తక్కినపుడు దానిని భద్రముగా దాచి యుంచుచుండెను.\n\nఇట్లుండగా కొన్నాళ్ళకు దీపావళి పండుగ శుభదినములలో అకస్మాత్తుగ వారికొక తంతి (టెలిగ్రాం) వచ్చెను. తమ సమీప బంధువులలో ఓకరి వివాహము నిశ్చితమైనదనియు దానియందుండెను. తొడనే ఉద్యోగి ఆ వర్తమానమును తన యర్థాంగికి తెలిపి ఆదినం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరు రైలుబండిలో అందరు వివాహమునకు బయలుదేరవలసి యున్నదనియు, త్వరలో సామాను సర్దుకొనవలసిన దనియు తెలియజేసెను.\n\nభర్తయానతి ననుసరించి ఆ గృహిణి వివాహకార్యమునకు తిసికొని వెళ్లవలసిన సామాగ్రినంతా సిద్ధముచేసి తనకు అతి ప్రీతికరమైన కంఠాభరణమును ఆ శుభసమయమున ధరించుకొని వెళ్ళుట ఉత్తమవుని భావించి దానికొరకై బీరువ తెరచెను. కాని అది యేమి విచిత్రమోగాని, ఆ యాభరణము దాచియుంచిన చోటునందులేదు. ఆమె గండె నీరైపోయెను. వంటియందు దడపుట్టేను. సంభ్రమచిత్తముతో భయవిహ్వలమానసముతో ఆమె దానికొరకై ఇంటి యందున్న పెట్టెలు, అలమారలు, బీరువాలు అన్నిటిని తెరచి బాగుగ వెతకెను. కాని కంఠాభరణము ఎక్కడను కానుపించలేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరము చెమటకార్చి సంపాదించిన తన జీవితములో కొంత పొదుపు చేసికొని ప్రియురాలి మనోభీష్టము నెరవేర్చుటకై వెయ్యి రూపాయలు సమకూర్చి తయారు చేయించిన సువర్ణకంఠాభరణము మటుమాయమై పోయిన వార్తను తన భర్తకెరింగినచో అతడెంత పరితాప మొందునో ఆమెకు తెలియని విషయముకాదు. కాని చెప్పక తప్పదు. ప్రయాణ సమయము సమీపించుచున్నది. ఎట్టి కేలకు గుండె నిబ్బరము చేసికొని ఆమె తన భర్తకు కంఠాభరణము కనుపించని విషయమును తెలియజేసెను.\n\nపిడుగువంటి ఆ వార్త సరిగా ప్రయాణసమయములో విని భర్త ఎంతయో కలవరపడెను. ఊహింపరాని ఆవెదన అతని హృదయమును మథించివైచెను. ఏమి చేయుటకును తోచక మరల ఒక పర్యాయముతానే ఇల్లంతయు వెతకి వస్తువు కానిపింపని కారణంగా భార్యను తీవ్రముగ మందలింపదొడగెను. ఏల అంత అజాగ్రత్తగ నుంటివని ఆమెను దురుసుగ అడిగివైచి కోపావేశమున ఆపై వీపుపై ఒకదెబ్బ కొట్టెను. తోడనే ఆమె ఏడుపు ప్రారంభించెను. అది విని చుట్టుప్రక్కల గల జనమంతయు అచట ప్రోగైరి. ఒక్కొక్కరు ఒక్కొక్కమాట చెప్పదొడంగిరి. ఆ వచ్చిన జనములో ఒక ముసలాయన అమ్మా! ఎందుల కేడ్చుచున్నావు' అని ప్రశ్నింపగ ఆమె జరిగిన విషయ మంతయు చెప్పి ఎంతయో ఆప్యాయముగా తన భర్త తనకు చేయించి యిచ్చిన బాంగారపు గొలుసు కనుపించుట లేదనియు దానిని పారవేసుకొని నందులకు తన భర్త కొట్టెననియు తెలుపగా ఆ వృద్ధుడు 'అమ్మా! నీమెడలో ఏదియో వస్తువు మెరయుచున్నది, కొంచెము చూడుము' అని పలికెను. వెంటనే అ యిల్లాలు తన మెడలో చూచుకొనగా అది ఆ కంఠాభరణమనియే తేలెను. ఆభరణము ఎచటను పోలేదు. ఎవరును ఎత్తుకొనిపోయి యుండలేదు. దీపావళి పండుగ కాబట్టి ఆమె దానిని ముందుగనే ధరించి ఆ సంగతి మరచిపోయెను.\n\nకంఠాభరణము గాంచి ఉద్యోగిభార్య అపరిమిత ఆనందమును బొందెను. ఉద్యోగి ఆశ్చర్యమును ఆహ్లాదమును ప్రకటించెను. చుట్టు ప్రక్క ఉన్న జనమంతయు సంతృప్తిని బడసి ఎవరి యిండ్లకు వారు పోయిరి. మరపు వలననే ఇంత కథ నడచినది. మరుపు వలననే అందరికీ బాధ కలిగినది. అట్లే జీవుడు తన నిజస్వరూపమగు ఆత్మను మరచి తాను దేహమని భావించి నానాదుఃఖములను అనుభించుచున్నాడు. ఆప్తుడగు సద్గురువు వచ్చి \"తత్త్వమసి\" మహావాక్యము ద్వారా \"నీవు కేవలము పరమాత్మ స్వరూపుడవు. అత్మ ఎచటను పోలేదు. నీలోనే ఉన్నది. వెతకికొనుము అని బోధించుచున్నాడు. తద్భోధానుసారము జీవుడు చక్కగ సాధన యొనర్పగా ఆత్మదేవుడు తనయందే కలడనియు, తనకు దుఃఖ మేకాలమందును లేదనియు, తాను సచ్చిదానంద స్వరూపుడనియు తెలిసికొని జీవుడు బంధవిముక్తు డగుచున్నాడు.\n\nఅత్మాతు సతతం ప్రాప్తోహ్యప్రాప్తవదవిద్యయా\nతన్మాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా\n\nఆత్మ ఎల్లపుడు పొందబడియే యున్నది. పొందబడలేదని ఆవిద్యవలన తలంచి జీవుడు దుఃఖ మొందుచున్నాడు. జ్ఞానముచే ఆవిద్య తొలగిపోగా, కథలోని కంఠాభరణమును వలె జీవుడు తన ఆత్మ స్వరూపమును తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొని సుఖించుచున్నాడు.\n\nనీతి: పరమానందరూపమగు ఆత్మ తన స్వరూపముగ నున్నప్పటికిని ఆ విషయము తెలియక అజ్ఞానియగు జీవుడు నానాదుఃఖములను పొందుచున్నాడు. సద్గురు, సచ్ఛాస్త్రములద్వారా ఎపుడాసత్య మెరుగునో అపుడు జీవుడు దుఃఖరహితుడై పరమానంద మనుభవించుచున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 773,
        "IMAGE": "cat_9",
        "NAME": "విస్మృత కంఠాభరణము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామము బయట ఒక పర్ణకుటీరమును ఏర్పాటు చేసుకుని ఒక సాధువు ధ్యాననిష్థ సలుపుకొనుచుండెను. పవిత్ర హృదయుడు, అనుష్ఠానపరుడు, నిరంతరం దైవచింతనాపరుడు అగుట బట్టి గ్రామస్థు లందరికిని అతనిపై భక్తివిశ్వాసములు ప్రబలెను. అపుడపుడు వారు సాధువుగారి దర్శనార్థము వచ్చి అతని దివ్యబోధలను ఆలకించి తమ భక్తిప్రపత్తులను ఇనుమడింపజేసికొనుచుండిరి.\n\nఒకనాడొక గృహస్థుడు పరగ్రామము నుండి ఆ సాధువుగారి కంటీరమునొద్దకు వచ్చి గురుదేవులకు సాష్ఠాంగవందన మాచరించి యిట్లు మనవిచేసికొనెను - \"మహాత్మా! ఈ సంసారకూపమునబడి నానా యాతన లనుభవించుచు దిక్కుతోచక యున్నది. ఇసుమంతైనను మనశ్శాంతి లభించుటలేదు. దినదినము సంసారాబాధ్యతలు పెరుగుచూనేయున్నవిగాని తరుగుటలేదు. ఒక దుఃఖము సమసిపోయిన వెంటనే మరియొక దుఃఖము వచ్చి తగుల్కొనుచున్నది. ఆవగింజంత సుఖము కొరకై కొండంత దుఃఖమును మోయుచున్నామా యనిపించుచున్నది. జీవితమే అంధకారబంధురముగా గనపడుచున్నది. ఇట్టి పరిస్థితితో తరుణోపాయ మేదియో తెలియకున్నది. తమవంటి మహనీయులను ఆశ్రయించినచో దారి చూపగలరని తలంచి తమ పాదసన్నిధికి చేరినాను. తండ్రీ! కటాక్షింపుడు! ఏదైన చక్కని మంత్రమును ఉపదేశించినచో దానిని జపించుకొనుచు తరించెదను. అఖండ తపస్సంపన్నులను, అధ్యాత్మతేజో విరాజితులు నగు తమవంటి మహనీయుల ముఖతః వెలువడిన వాక్యములు సంసార తాపోపశమనరూప మహత్తరప్రభావము తప్పక కలిగియుండును. కావున, మహాత్మా! ఏదైన మంత్రమును సెలవిండు, జపించుకొని కడతేరెదను.\n\nపరదేశి యొక్క ఆ వినయ పూర్వక వచనముల నాలకించి గురుదేవులు అతని పరమార్థ జిజ్ఞాసకు లోళోన సంతసించుచు వెంటనే మంత్రోపదేశము చేయక, అతడు యథార్థముగ దైవము కొరకు, మోక్షము కొరకు, బంధవిముక్తి కొరకు తీవ్రముగ పరితపించుచున్నాడా; లేక, తాత్కాలిక ఆవేశముతో శ్మశాన వైరాగ్యముతో ఇచటికి ఏతెంచి నాడా పరీక్షించిన మంచిదని తలంచి 'మంచిరోజు చూచి తరువాత ఉపదేశించెదను, ఇపుడు తిథిసరిగా లేదు' అని చెప్పి ఆతనిని పంపివైచెను. అ వాక్యములు గృహస్థునకు అశనిపాతములవలె తోచెను. ఎపుడెపుడు మంత్రోపదేశము బడసి చక్కగ జపించుకొనుచు తరించెదమా అని ఉవ్విళ్ళూరుచున్న అతనికి గురుదేవుని సమాధానము హృదయ విదారముగ తోచినను, గుర్వాజ్ఞను శిరసావహించదలంచి అచ్చోటు వీడిచనెను.\n\nరోజులు గడచిపోయెను. నెలరోజులైన తరువాత మరల ఆ గృహస్థుడు ఆశ్రమమునకు బోయి \"గురుదేవా! మంత్రోపదేశము లేనందున, రోజులు యుగములుగా గడుచుచున్నవి. జీవితమే భారభూతముగ తోచుచున్నది. దయచేసి వెంటనే మంత్రమును ఉపదేశింప ప్రార్థన\" అని పాదములపై బడి మొరపెట్టుకొనెను. అపుడు దేశికోత్తముడు 'నాయనా! కార్తీక పౌర్ణమి పవిత్రదినమున ఆశ్రమునకు వచ్చినచో నీకు తప్పక మంత్రోపదేశమును చేయుదును' అని చెప్పి పంపివైచెను. అది భాద్రపదమాసము. ఇంకను ఆందోళనపడుచు ఇంటికి వెడలిపోయెను.\n\nచాతక పక్షి వర్షబిందువులకై ఎదురుచూచుచుండు విధమున గృహస్థుడు కర్తీకమాసము ఎప్పుడువచ్చునా యని తహతహపడుచుండెను. కాలచక్రమా రివ్వున తిరిగిపోయెను. ఆశ్వయుజము గడచిపోయెను. కార్తీకము అడుగుపెట్టెను. క్రమముగా చతుర్దశి ఏతెంచెను. గృహస్థుని ఆనందమునకు మేరలేదు. మంత్రోపదేశ సమయము సమీపించుచున్నది గదాయని చిందులు త్రొక్కుచుండెను. చతుర్దశిరాత్రికే అతడు ఆశ్రమమును జేరి మంత్రోపదేశమునకై ఆతురతతో నుండెను. మరుసటి రోజు అనగా పౌర్ణమిదినమున ఉషః కాలమున, బ్రహ్మముహూర్తమున గురుదేవుడు భక్తుని నిద్రలేపి 'నాయనా! సమీపమున ఏరు ప్రవహించుచున్నది. మనమిరువురము అచటికి వెళ్లి స్నానము చేసి వచ్చెదము. అచట నదీతీరముననే నీకు మంత్రోపదేశము చేయబడగలదు' అని పలికి వెంట తీసికొని వెళ్లెను. నదిఒడ్డునకు చేరిన పిదప ముందు గృహస్థుడు స్నానము చేయుటకై నదిలో దిగెను. అతడు తలను నొక్కిపట్టిఉంచెను. శిష్యుడు పైకి లేచుటకు వీలుపడలేదు. క్షణకాలమైన పిదప గురువు తనచేతిని వదిలివేయగా శిష్యుడు నీటిలో నుండి అమాంతముగా పైకి లేచి 'గురుదేవా! మంత్రోపదేశము చేసెదనని పిలుచుకొని వచ్చి ఈప్రకారమేల చేసితిరి?' అని ప్రశ్నింప గురుదేవుడు చక్కని సమాధాన మొసంగెను.\nవారిరువురి మధ్య అపుడీక్రింది విధముగ సంభాషణ నడిచెను.\n\nగురువు : నాయనా! ఒకానొక ఉద్దేశ్యముతో నీతలను నీటిలో అణచిపెట్టితినేగాని నీ కపకారము చెయతలంపుతో కాదు. ఇపుడు నేనడుగు ప్రశ్నలకు సమాధానము చెప్పుము. నీటిలో నీతలను ముంచి యుంచిన సమయమున నీయిల్లు జ్ఞాపకమునకు వచ్చినదా?\nగృహస్థుడు: లేదు.\nగురువు: నీ భార్య జ్ఞాపకమునకు వచ్చినదా?\nగృహస్థుడు : లేదు.\nగురువు: నీబిడ్డలు జ్ఞాపకమునకు వచ్చినారా?\nగృహస్థుడు: లేదు.\nగురువు: నీసంపదలు, ధనధాన్యములు జ్ఞాపకమునకు వచ్చినవా?\nగృహస్థుడు: లేదు.\nగురువు: నీ బంధుమిత్రాదు లెవరైన జ్ఞాపకమునకు వచ్చినారా?\nగృహస్థుడు: రామ, రామ వారిమాటె జ్ఞప్తియందు లేదు.\nగురువు: మరి, నీటిలో ఉన్నప్పుడు నీకేమి జ్ఞాపకమునకు వచ్చినది?\n\nగృహస్థుడు: గురుదేవా! ఎప్పుడు నీటిలో నుంచి బయటకు వచ్చి గాలి పీల్చుదునా అను ఒక్క అభిలాష తప్ప మరేదియు నాకాసమయమున లేదు. ప్రపంచ పదార్థము లేమియు నాకపుడు స్ఫురణకు రాలేదు.\n\nగురువు: నాయనా! ఏ ప్రకారముగ నీటిలో ఉన్నపుడు నీకు ఇల్లుగాని వాకిలిగాని, బిడ్డగాని, ధనముగాని, బంధువులుగాని, కీర్తి గాని, సౌందర్యము గాని, జ్ఞాపకమునకు రాక కేవలము ఒక్క ప్రాణవాయువు మాత్రము జ్ఞాపకమున్నదో, ఏ ప్రకార మపుడు ప్రపంచము నంతను విస్మరించి ఒక్క ఊపిరినిమాత్రము జ్ఞాపకము పెట్టుకొనినావో, అట్లే తీవ్రముముక్షుత్వము కలవాడు తరించవలెనని తీవ్రమైన అభిలాష కలవాడు ఒక దైవమును మాత్రము స్మృతిపథమున నుంచుకొని తక్కిన ప్రపంచము నంతను మరచిపోవును. ప్రాపంచిక వస్తువులను సంస్మరించుచు దైవమును స్మరింప నెంచినచో ఏకాగ్రత కుదరదు. కాబట్టి నీకుపదేశించబోవు మంత్రమును అనన్యభక్తితో జపించవలెను. దృశ్య పదార్థముల వేనిని స్మరింపక, మంత్రజపము చేయుచు కేవలము మంత్రార్థమునే భావించుచుండవలేను. అన్య విషయములను మనస్సునకు రానీయకూడదు. ఇట్టి ఏకాగ్రత, వైరాగ్యము, తీవ్రముముక్షుత్వము లేనందువలననే అనేకులకు మంత్రోపదేశము చేసినను నిరుపయోగమై పోవుచున్నది. కావున తరించవలెనను తీవ్రఅభిలాష, దైవముకొరకై మిక్కుటమగు పరితపన, ప్రాపంచిక పదార్థముల యెడల విరాగము, దైవభక్తి మంత్రజపమునకు చాల అవసరములై యున్నవి. ఇక్కారనముననే మంత్రోపదేశము చేయుటకు పూర్వము నీకీ తత్త్వమును బోధించడమైంది.\n\nగురుదేవు డీప్రకారముగ బోధించి, స్నానానంతర మాగృహస్థుని ఆశ్రమునకు తోడ్కొనివచ్చి మంత్రోపదేశమును గావించెను. గృహస్థుడు పరమానంద భరితుడై దరిద్రునకు పెన్నిధి లభించిన చందమున హర్షోత్ఫుల్లమానసుడై గురుదేవునకు సాష్టాంగ నమస్కార మాచరించిని అతని సెలవు తీసుకొని గృహాభిముఖ్యు డయ్యెను. నాటి నుండి అతడు గురువాక్యానుసారము భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రతతో, తీవ్రముముక్షుత్వముతో మంత్రమును జపించుచు, మంత్రార్థమును స్మరించుచు దైవానుగ్రహమునకు పాత్రుడై పరమశాంతిని బడసెను.\n\nకావున ప్రతివారును ఈ అపారదుఃఖ పారావారము నుండి ఎపుడు తప్పించుకొని భగత్సాన్నిధ్యము చేరి శాంతిని బడయుదుమా యను తీవ్రతర ఆపేక్ష, ముముక్షుత్వము, గలిగి భగవచ్చరణారవిందములను అతిశీగ్రముగ ఆశ్రయించి జీవితమును కడతేర్చుకొన వలయును.\n\nనీతి: తరించవలెనను తీవ్రమైన ఆపేక్ష మనుజునకు ఉండవలేను. సంసారదుఃఖము నుండి బంధనము నుండి త్వరలో, విముక్తి బడయవలెనను తీవ్రఅకాంక్ష ఉండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 774,
        "IMAGE": "cat_9",
        "NAME": "తీవ్ర ముముక్షుత్వము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "(జరా అనగా ముసలితనమందు మనుజుడు ఎదుర్కొను దుఃఖములు కొన్ని ఈ కథయందు తెలుపబడినవి).\n\nపూర్వమొకానొక పట్టణమందు ఒక ధనికుడు కలడు. అతడు కష్టపడి చెమటకార్చి వ్యాపారమందు లక్షలు గడించెను. అచిరకాలములోనే కోటికి పడగెత్తెను. తన నివాసమునకై మహోన్నతమైన గగనచుంబిత భవనము నొకదానిని నిర్మించుకుని హాయిగా నివసించుచుండెను. పరిచారకులు, సేవకులు లెక్కకు మించినవారు ఆతని గృహమున సేవచేయుటకై నియోగించబడిరి. గొప్ప అట్టహాసముగ జీవితము గడుచుచుండెను.\n\nకాని పరిస్థితులు ఎల్లకాలమందూ ఒకేతీరున ఎవరికీ ఉండవు. అవి అపుడపుడు తారుమారగుచుండును. ధనికులకు క్రమముగ వార్దక్యము దాపురించెను. శరీరసౌష్ఠవము తగ్గిపోవదొడగెను. దేహదార్ద్యము సన్నగిలజొచ్చెను. ఎటువంటి భీమబలునకైనను వృద్ధాప్యమందు దేహము శుష్కించక తప్పదుగదా! ఇంద్రియములు అత్తరి పట్టు తప్పిపోవును. శరీరము పలువిధ రుగ్మతలకు అలవాలము కాగా జీవితమే భార భూతముగ పరిణమించును. ఇది యట్లుండ మరియొక పెద్ద ప్రతిబంధకము వార్దక్యమున జనులకు దాపురించుచుండును. ఇంటిలో పుత్రులుగాని బంధువర్గముగాని, పరివారముగాని వృద్ధుడు చెప్పినమాటను సరిగా ఆలకించరు. నిర్లక్ష్యముగ తృనీకారబుద్ధితో, తిరస్కారభావముతో ఉందురు. ఆతనిని పూర్తిగా ఉపేక్ష చేయుదురు. పైగా ఎగతాళి చేయుటకున్ను పూనుకుందురు. ఇంద్రియ పటుత్వము తప్పి శక్తిహీనుడగుట జేసి వయస్సు చెల్లిన ఆవ్యక్తి పుత్రాదుల కేమియు జవాబు చెప్పలేక, దుఃఖమును, ఆక్రోశమును దిగమ్రింగుకొనుచు, గొప్ప మాఅనసిక క్షేశమును అనుభవించుచు, జీవితరథమును బహు భారముతో ఈడ్చుకొని పోవుచుండెను.\n\nకథలోని ధనికుని పరిస్థితియు అట్లే ఏర్పడెను. కుమారునకు యుక్తవయస్సు రాగా తండ్రి అతనికి సంపన్నకుటుంబములోని ఒక కన్యక నిచ్చి వివాహము చేసెను. కొంతకాలము కుటుంబములో ఏ కలతలు, పొరపొచ్చములు లేక సవ్యముగా సాగిపోయెను. కాని తండ్రి వృద్ధుడగుచుండిన కొలది, కుమారునకు ధనమదము పెరిగి పెరిగి కన్ను మిన్నుగానక ప్రవర్తించుచుండెను. తండ్రిని లెక్క చేయకుండెను. ఒకే కుమారుడగుటబట్టి కుమారుడు తనకు పెట్టుబాధలకు తండ్రి ఎవరికి చెప్పుకొనలేక ఓర్పుకొనుచు లోలోన పరమసంతాపము నొందుచుండెను. కష్టపడి చెమటకార్చి, రాత్రింబగళ్లు శ్రమ చేసి దేశదేశములు తిరిగి సంపాదించిన ద్రవ్యమునంతను కుమారుడు నానావిధ దుర్వ్వసనములకు ధారబోయుచుండెను. భోగవిలాసములలో చిక్కుకుని, దుస్సాంగత్యమునకు లోనై అశ్లీలకార్యములో మునిగితేలుచు కుమారుడు తండ్రి సేకరించిన ధనమునంతను వర్ధ్యము చేయదొడగెను. దుర్బలుడగు తండ్రి ఏమియు చేయలేక మిన్నకుండెను.\n\nకుమారుడు తండ్రికి చేయుచుండిన అపచారములు పోనుపోను శ్రుతిమించి రాగాన పడుచుండెను. ఒకనాడు కుమారుడు తల్లితండ్రులను పిలిచి, నాన్నగారూ; అమ్మగారూ, ఇకమీదట మీరిరువురు ఇంటి లోపల భోజనము చేయంటకు వీలుపడదు. బయట వరండాలో కూర్చొని భోజనము చేయువలసినదే!\" అని ఆజ్ఞాపించెను. పాపము, వృద్ధదంపతు లేమి చేయగలరు? సుతుని ఆజ్ఙను జవదాటలేక అంజలిబద్ధులై అట్లే ఆచరింపదొగగిరి. మరి కొంతకాలమునకు గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు తనయుడు తల్లిదండ్రులను పిలిచి మరొయొక తీక్షణమైన శాసనమును ఈప్రకారముగ జారీచేసెను - \"తల్లిదండ్రులారా! ఇకమీదట మీరిరువురూ రెండు వేర్వేరు కంచములలో భోజనము చేయరాదు. ఒకే కంచములో ఇద్దరూ తినవల్సినదే!\" అని యతడు ఆదేశించెను. కఠోరములగు ఆ వాక్యములను వినుటతోడనే మాతాపితరులు హతాశులై గత్యంతరము లేక సుతుని ఆజ్ఞను శిరసావహించి పాలింపదొడగిరి.\n\nఇట్లుండ, ధనికుని మనుమడు, పదునారేండ్ల ప్రాయము గలవాడు తన తాతకు, అవ్వకు తనతండ్రి, పెట్టుచుండీ రాక్షస బాధలను చూచి సహించలేక, ఆ కిరాతక చర్యలను చూడలేక తండ్రికి గుణపాఠము బోధించుటకై అదనుకొరకు వేచియుండెను. ఒకనాడతడు తన తండ్రి ముదుసలివారైన తాత అవ్వలకు పెట్టుచుండిన ఒకే ఒక కంచమును ఎవరికిని తెలియకుండా దాచిపెట్టెను. మధ్యాహ్నమగుసరికి అతనితండ్రి వృద్ధులైన మాతాపితరులకు అన్నము పెట్టుటకై కంచముకొరకు వెతుకగ ఆది ఎక్కడను కనిపించలేదు. ఇల్లంతయు గాలించినను దాని జాడతెలియలేదు. అపుడు తండ్రి కుమారునితో 'ఏమిరా మీ తాతగారికి, అవ్వగారికి పెట్టే కంచం నీవేమైన దాచినావా?\" అని ప్రశ్నింప కుమారుడు 'అవును' అని జవాబిచ్చెను. ఎందులకు దాచితివని ప్రశ్నింప అతడిట్లు తడుముకొనకుండ ప్రత్యుత్తరమిచ్చెను. నాన్నా! నీవు ముసలివాడవైన తరువాత, నీకు అమ్మకు అదే కంచము పెట్టాలని నేను దాచిపెట్టినాను. కుమారుని ఆ వాక్యములను వినగానే తండ్రికి కనువిప్పు కలిగెను. క్షణములో జ్ఞానోదయమయ్యెను. తాను తన తల్లిదండ్రులకు పెట్టు హింసకు పదిరెట్లు హింస తనకు వృద్ధావస్థలో తన కుమారుడు పెట్టనున్నాడని గ్రహించెను. తోడనే యతడు తన వృద్ధజననీజనకులను సగౌరవముగ ఇంటిలోనికి బిలిపించి, వారిని యథోచితముగ ఆదరించి శ్రద్ధాపూర్వకముగ సపర్యలను చేయదొడగెను.\n\nకావున జనులు మహాకష్టతరమైన వార్దక్యావస్థలో తమకు సంభవింపనున్న శారీరక, మానసిక వ్యథలను ముందుగానే ఊహించుకొని, అట్టి భీషణ వార్ధక్యదశ రాకపూర్వమే తాను చేయవలసిన పరమార్థ కార్యములను,ఆధ్యాత్మిక సాధనలను త్వరలో పూర్తిచేసి జీవితమును కృతార్థ మొనర్చుకొనవలయును.\n\nనీతి: ముసలితనమున జీవుడు నానాభాధల ననుభవించును. కావున వార్ధక్యము రాకమునుపే పరమార్థ సాధనలను పూర్తిచేసి ధన్యుడు కావలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 775,
        "IMAGE": "cat_9",
        "NAME": "జరాదుఃఖము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక సాయంసమయమున కృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురును కలిపి వాహ్యాళికై ఊరుబయటకు వెళ్లిరి. సుందరమైన ఉద్యానవనమును దాటి వారొక భీకరారణ్యమున ప్రవేశించిరి. వారు దానిలో కొంతదూరము పయనమగుటయే తడువుగా సూర్యాస్తమయము కాసాగెను. ప్రకాశము పూర్తిగా అంతరించి నలుదెసలు అంధకారము వ్యాపించెను. అపుడు వారు మువ్వురును గాఢారణ్యములో చిక్కుకొనిపోయిరి. ముందుకు పోవుటకుగాని, వెనుకకు వచ్చుటకుగాని అవకాశము లేకుండెను. అపుడు వారందరు ఆ అరణ్యములోనే ఒకానొకచొట ఆరాత్రియంతయు గడిపివేయుటకు నిశ్చయించుకొనిరి.\n\nదట్టమగు అరణ్యమగుటచేతను, భయంకర మృగములు వసించుతావగుట చేతను రాత్రికాలమున ముగ్గురును పరుండి నిదురపోవుట భావ్యము కాదని తలంచి వారిలోవారు ఒక కట్టుబాటు చేసికొనిరి. ఒకొక్కరు కొద్దిసేపు మేలుకొనునట్లును, తక్కిన ఇద్దరు నిదురపోవునట్లును నిర్ణయించుకొనిరి. మేలుకొనుటలో మొట్టమొదటి వంతు సాత్యకికి వచ్చెను. అనగా సాత్యకి మేలుకొనుటయు, కృష్ణబలరాములు నిద్రపోవుటయు సంభవించెను. కృష్ణ బలరాములకు నిద్రాభంగము కలుగకుండు నిమిత్తమై సాత్యకి నలువైపులా తిరిగి పహారాకాచుచుండెను. క్రూరమృగములుగాని, మరి దేనినిగాని వారి దరిదాపునకే రాకుండ ఒడలంతయు కండ్లు చేసికొని బహుజాగరూకతతో అతడు నదుదెసల వీక్షించుచుండెను.\n\nఆ సమయమున దూరమునుండి ఒక భయంకరాకృతి గల రాక్షసుడు వారల సమీపమునకు వచ్చుచుండుటను గమనించి సాత్యకి వాని నెదుర్కొనెను. అపుడు ఇరువురికి భీషణ సంగ్రామము తటస్థించెను. రాక్షసునిపై సాత్యకికి ఎంతెంత క్రోధము జనించుచుండెనో రాక్షసుని శరీరము అంతంత వృద్ధియగుచుండెను. కొంతసేపటికి ఆ నిశాచరుడు పర్వతాకారుడు కాగా సాత్యకి వాని ధాటికి తట్టుకొనలేకపోయెను. పర్వతసముడగు రాక్షసునిచెంత సాత్యకి ఒక పురుగంత ఆకారము కలిగియున్నట్లాయెను. రాక్షసుడు సాత్యకిని లాగి ఆవలపారవైచి తనదారి తాను పోయెను. అత్తరి సాత్యకి శరీరమునకు చిన్న గాయము తగిలెను.\n\nఇట్లుండ సాత్యకి యొక్క పహారా సమయము పూర్తికాగా అతడు వెళ్లి బలరాముని లేపి రక్షణబాధ్యత అతనికి ఒప్పజెప్పి తానుపరుండెను. బలరాముని పర్వవేక్షణ సమయమునకూడా ఆ రాక్షసుడు తారసిల్లెను. వెంటనే బలరాముడు వానితో పోరునకు తలపడి అతనిని పరాజితుని చేయ సమకట్టెను. కాని ఎపుడెపుడు బలరాముడు రౌద్రభావమును వహించుచుండెనో, అపుడపుడు డారాక్షసుడు ద్విగిణీకృత బలశాలియై వృద్ధి నొందిన ఆకారము గలవాడై వర్తించుచుండెను. బలరాముడు రౌద్రమును వహించినకొలది రాక్షసుని ఆకారము పర్వతసమము కాజొచ్చెను. అంతట భీకరాకారుడగు ఆ దైత్యుడు బలరాముని ప్రక్కకు ఈడ్చివైచి తనదారిని తానుపోయెను. ఈ సంఘటనలో బలరాముని శరీరమునకు ఒకింత గాయము తగిలెను.\n\nరాక్షసుడు వెడలిపోయిన పిదప బలరాముడు కృష్ణుని నిద్రలేపి \"కృష్ణా! ఇక నీవంతు వచ్చినది. లేచి పహారా కాయుము\" అనిపలికి తాను నిద్రపోయి రక్షణభాద్యత కృష్ణునకు ఒప్పగించెను. బలరామ సాత్యకులకు నిద్రాభంగము కలుగకుండుటకును, మరియు వన మృగముల బారినుండి వారిని సంరక్షించుటకును కృష్ణుడు దత్తచిత్తుడై బహుజాగరూకతతో పహారా కాచుచుండెను. మరల ఆరాక్షసుడు యథాప్రకారము ఏతెంచి ఉగ్రశరీరుడై కృష్ణునితో యుద్ధమునకు తలపడగా, కృష్ణుడు మందహాసవదనుడై అతని నెదుర్కొనెను. రాక్షసు డెంతెంత క్రోధమును వ్యక్తపరచుచుండెనో, కృష్ణుడు అంతంత శాంతమును వహించుచు హర్షాతిశయముతో కూడి పోరు సల్పుచుండెను. తత్ప్రభావముచే కొలది సమయములోనే రాక్షసుని శరీరము కృశించిపోయెను. అది చిన్నదై ఆవగింజంత అయ్యెను. అణురూపుడుగ మారిన ఆ రాక్షసుని కృష్ణుడు తన వస్త్రపు చెంగున ముడివైచుకొని బలరామసాత్యకులు పరున్న తావునకు వెడలెను. అప్పటికి ఉషఃకాలము సమీపించుచుండెను. ప్రభాత సమయము కాజొచ్చుటచే తక్కిన ఇరువురును నిద్రలేచిరి.\n\nఅత్తరి కృష్ణ, బలరామ, సాత్యకులు ఒకచోట కూర్చొని రాత్రి పహారాసమయములోని వారి వారి అనుభవములను గూర్చి సావకాశముగ మాట్లాడజొచ్చిరి.\n\nసాత్యకి తను మేలుకొనియున్న సమయమున భీషణాకారుడగు రాక్షసుడొకడు వచ్చెననియు, వానిని జూచి కృద్ధుడై అతనితో యుద్ధమొనర్చుట కుపక్రమింపగా క్రమక్రమముగ అతని శరీరము వృద్ధి కాజొచ్చెనని వచించెను. బలరాముడున్ను అట్లే వచించెను. అపుడు కృష్ణుడు తన వస్త్రపు చెంగున ముడివేసియున్న అణురూపుడగు రాక్షసుని జూపి, ఓ అన్నగారూ! ఓ సాత్యకీ! మీరు ముద్ధముచేసిన రాక్షసుడితడే. ఇతడు మూర్తీభవించిన క్రోధము. అనగా క్రోధమను ఆసురగణము ఒక ఆకారమును ధరించి మనయెదుట ప్రత్యక్షమైనది. దానితో యుద్ధము చేయునపుడు మనము క్రోధమును వహించినచో అ రాక్షసునకు ఆహారము నొసంగినట్లగును. అపుడు వాని ఆకారము పెరిగిపోవును. మనము క్రోధమును వహించనిచో అతడు ఆహారములేక ఒక్కచిక్కి పోయి కృశించును. మీరు వానితో యుద్ధము చేయు సమయమున క్రోధావిష్టులై యున్నకారణమున క్రోధమును ఆహారముగ మీనుండి వానికి లభించుటచే అతని శరీరము బలపడిపోయెను. నేనో వానితో యుద్ధము చేయునపుడు నవ్వుచు, హర్షముతో గూడి యుండుట వలన, క్రోధమును జూపకపోవుట వలన క్రోధమను ఆహారము నానుండి అతనికి లభింపనిచే అతడు కృశించి కృశించి అతి సూక్ష్మశరీరుడై పోయెను. ఇదిగో చూడుడు! ఈతడే ఆ రాక్షసుడు.ఇతడు మూర్తీభవించిన క్రోధమను దుర్గుణము. ఆ సంగతిని తెలిసికొంటిని కాబట్టియే నేను బహుజాగరూకడనై క్రోధమును దరిదాపునకు రానీయకయుంటిని. తత్ఫలితముగ అతడు కృశించి అల్పశరీరుడైపోయెను. బలరామ సాత్యకులు జరిగిన సంఘటనను జూచి ఆశ్చర్యచకితులైరి. తదుపరి వారు మువ్వురును ఆ యరణ్యమును దాటి నిజపురంబున కరిగిరి.\n\nఈ సంఘటన ద్వారా క్రోధమును జయించుటకు చక్కటి ఉపాయమును శ్రీకృష్ణుడు లోకమునకు చాటిన వాడాయెను. ఎపుడెపుడు ఎదుటివాడు క్రోధమును ప్రకటించునో అపుడు తద్విరుద్ధముగ శాంత గుణమును మానవుడు కలిగియుండునో, ఆనందమును ప్రకటించునో, అక్రోధమును గలిగియుండునో అపుడు ఎదుటివాడు సిగ్గుపడి తన కోపమును తగ్గించుకొనగలడు. లేక, పూర్తిగా పోగొట్టుకొనగలడు. కాబట్టి కోపమునకు విరుద్ధమైన గుణములగు శాంతాదులను చక్కగ అవలంబించినచో కోపము పలాయనము చిత్తగించుటయేగాక, ఎదుటి వాడు తన తప్పు తాను తెలుసుకొని, సిగ్గుపడి దారికి వచ్చును. క్రోధము వచ్చినపుడు తద్విరుద్ధగుణమగు నవ్వుట నేర్చుకొనినచో, ఇక కోపము ఆవహించుటకు అవకాశమే యుండదు. ఒక్క క్రోధమునే కాదు సమస్తదుర్గుణములను గూడ ఈ యుపాయముచేతనే జయించుటకు వీలుండును. సాధకుడు ఇట్టి ఉపాయముల నవలంబించి తనయందలి అసురగుణంబు లన్నిటిని పారద్రోలి దైవసంపదతో తులతూగుచు జీవితమును పవిత్రవంతముగ ఆనందమయముగ నొనర్చు కొందురు గాక!\n\nనీతి: కోపమునకు విరుగుడు శాంతము. కావున ఎల్లపుడు శాంతభావమును అలవాటుచేసికొనుము. క్రోధమును దరికి చేర్చరాదు. శాంతగుణముచే క్రోధగుణమును జయించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 776,
        "IMAGE": "cat_9",
        "NAME": "క్రోధమును జయించు పద్ధతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామము యొక్క సమీపమున ఒక చిన్న కొండ కలదు. ఆ గ్రామములో కొన్నివేల జనాభా నివసించుచుండెను. రైతాంగమే వారి వృత్తి. వారిలో కొందఱు శ్రీమంతులై, భోగభాగ్యము లతో తులతూగుచు పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని హాయిగా కాలము గడుపుచుండెను.\n\nఒకనాడు ఆ గ్రామమునకు ఒక మల్లుడు (వస్తాదు శాండో) ఏతెంచెను. అతడు ఆజానుబాహువు. కండరములు బలిసి పుష్ఠిగల దేహము కలవాడై తన భయంకర ఆకృతిచే చూపరులకు అశ్చర్యము గొలుపుచుండెను. కలియుగ భీముడా యని అనిపించుచుండెను. అతడు గ్రామములో ప్రవేశించగనే జనమంతయు అతని చుట్టూ మూగిరి. అతని భీమాకృతిని తదేక దృష్టితో వారు చూడదొడంగరి. ఈతడెవడు? ఎందులకీ గ్రామమునకు విచ్చేసెను? అని వారిలో వారు వితర్కించుకొనుచుండిరి. అతనిని సమీపించి అడుగుటకు వారు జంకుచుండిరి. అపుడా మల్లుడు (వస్తాదు) అచటనున్నఒక గ్రామ పెద్దను పిలిచి, ఊరివారికి తాను కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పదలచినాననియు, కాబట్టి అందరిని ఒకచోట సమావేశ పరచవలసిన దనియు చెప్పెను.\n\nవెంటనే ఆ గ్రామపెద్ద ఊరంతయు తిరిగి ప్రతియింటి వారిని తలుపుతట్టి, పిలిచి అందరిని సభకు ఆహ్వానించెను. ఏమివింత జరుగునో చూతమనియు, మల్లుడేమి చెప్పునో విని తీరవలెననియు జనులు తండోపతండములుగ సభకు రాదొడంగిరి. సభకు చోటు నిర్ణ యింపబడినది. స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, చదువు వచ్చినవారు, చదువు రానివారు, ధనవంతులు, బీదవారు - ఒకరని చెప్పనేల, అందరును సభకు హాజరైరి. నేల ఈనినదా యనిపించునంత బ్రహ్మాండమైన జనసందోహ మచట కొద్దిసేపటికి చేరిపోయెను. అ మహాసభలో సభికు లందరిని ఉద్దేశించి ఆ జగజెట్టి ఈ ప్రకారముగ ఉద్ఘోషించెను -\n\nఓ గ్రామస్తులారా! మహానుభావులారా! మీకందరికిని ఈ రోజు కొన్ని అపూర్వమైన, ఆశ్చర్యకరమైన విషయములు చెప్పదలంచినాను. మీగ్రామస్తులపై నాకుదయించిన అకుంఠిత స్నేహభావమే నన్నిచటికి రప్పించి ఇక్కార్యమునకు నన్ను పురికొల్పినది. మీకొక చక్కని వార్తను ఇపుడు బహిర్గత మొనర్చుటకు నిశ్చయించితిని. మీలో ఇంకను ఇచటికి రానివారెవరైనా నున్నచో తత్‌క్షణమే వారికొరకై కబురంపుడు. మీ జీవితములో కనివిని యెరుగని అద్భుతవార్త ఇపుడు చెప్పబోవుచున్నాను - మల్లుని ఈ వాక్యములను వినగనే సభాసదులలో తీవ్రమైన సంచలనము, ఉత్సుకత జనించెను. అతడేమి చెప్పునోయని వారు ఒడలంతయు చెవులు చేసికొని వినుటకు సిద్ధముగ నుండిరి. రానివారందరిని కూడ కబురంపి వెంటనే రప్పించిరి. ఇసుక వేసిన రాలనట్టి అపార జనసంఖ్యతో ఆ సభ కిటకిటలాడుచుండెను.\n\nఅపుడా మల్లుడు సర్వాంగసుందరముగ అలంకరింపబడిన వేదిక పైనెక్కి బల్లగ్రుద్ది ఈ ప్రకారముగ చెప్పదొడెంగెను. \"ఓ గ్రామస్థులారా! అలనాడు త్రేతాయుగమున ఒకమహానుభావుడు అరచేతిలో కొండను మోసి ప్రపంచము నంతను సంభ్రమాశ్చర్యములతో నింపివైచెను. లోకోత్తర బలసంపన్నుడగు ఆ ఆంజనేయుని నేటికిని జనులు భక్తిభావముతో పూజించుచున్నారు. ఈప్రకారముగ ఆంజనేయుడు త్రేతాయుగమునకే ఎనలేని కీర్తిని తెచ్చినవాడాయెను. ఆ తరువాత ద్వాపరముగమున మరియొక మహానుభావుడు చిటెకెన వ్రేలుపై కొండను మోసి జనులకు ఇంకను ఆశ్చర్యమును కలుగజేసెను. గోవర్ధనధారి యగు ఆ కృష్ణమూర్తిని నేటికిని జనులు శ్రద్ధాభక్తులతో సంస్మరించుచున్నారు. ఈ ప్రకారముగ దాదాపు ప్రతియుగమందును ఒక్కొక్క మహానుభావుడు కొండను మోయుచుండగా, ఈ కలియుగమున ఇంతవరకు ఒక్కడైనను అట్టి పనికి పూనుకొనకయుండుట కేవలము హాస్యాస్పదముగ నాకు తోచుచున్నది. కలియుగమునకే అప్రతిష్ఠ యేర్పడినదా యనిపించుచున్నది.\n\nఈ విషయమును గతసంవత్సరకాలము నుండి నేను తీవ్రముగ యోచింప దొడగితిని. 'కలియుగములో కొండను మోయువారు కరువైపోయారా? ఒక్కరైనను ఆ పనికి పూనుకొనలేదే? ఒక్కరైనను యుగ ఖ్యాతిని అర్జించుకొనలేదే? ఏమి ఈ విపరీతము? ఈ యుగమందు బలవంతులు లేరా? దృడకాయులు లేరా? పట్టుదలతో సాధింపదలంచువారికి కొండమోయుట ఒక్కలెక్కలోనిదా? ఏమి ఈ అన్యాయము అని రాత్రింబగళ్లు నేను తీవ్రముగ ఆలోచించి తుట్టతుదకు ఒకానొక నిశ్చయమునకు వచ్చితిని. భగవంతుడు నాకు అమితమైన బలము నిచ్చియున్నాడు. ధైర్యమనునది ఉగ్గుపాలతోనే నాలో ఏర్పడియున్నది. కావున నేనెందులకు ఈ కొండను మోయుపనికై పూనుకొనుకూడదు?' అని యోచించి అందులకై నేను బద్దకంకణుడ నైతిని.\n\nఓ గ్రామస్తులారా! మీ గ్రామమునకు చెంతనే యున్న కొండను మొయుటకు నేనిపుడు కృతనిశ్చయుడనైతిని. ఈ నానిశ్చయమునకు తిరుగులేదు. నే నీ కొండను మోయుటవలన మీకే కాదు, మీ గ్రామమునకే మిక్కుటమగు ఖ్యాతి లభించగలదు. మీ గ్రామముయొక్క పేరు చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడు సమయము ఆసన్నమగుచున్నది. అయితే నేనీ ఘనకార్యమును సాధించినందులకు మీరు మాకేమియు ద్రవ్యము ఈయ నవసరము లేదు. కానుక లీయనక్కరలేదు. నేను పురస్కారములు వాంఛించువాడును కాను. అయితే కొండమోయుటకు ఇప్పుడు నాకున్న ఈ బలము చాలదు. దానిని ద్విగుణీకృతము చేసికొనవలయును. అందుచే నేను కోరునది యేమనగా - ఆరు మాసములు చక్కటి బలవర్ధకమైన ఆహారము, మీరు నాకిప్పించిన చాలును. తదుపరి ఆకొండను అవలీలగ మోసివేయగలను. విట మిన్లతో గూడిన బలిష్ఠఆహారమును ఆరునెలలు నాకిప్పించుడు. ఆరు నెలలు మీగ్రామములోనే ఉండి, మీరిచ్చు ఆ బలవర్ధకమైన ఆహారమును స్వీకరించుచు, తదుపరి ఒక సుముహూర్తమున కొండను అమాంతముగ మోసివేయుదును. నా యీ మాటలను విశ్వసింపుడు. తద్వారా మీకీర్తిని చిరస్థాయిగా చేసికొనుడు.\"\n\nమల్లుని యా హేతుపూర్వకమైన వచనములను విని గ్రామస్థులందరు ఏకగ్రీవముగ అందుల కంగీకరించిరి. వెంటనే ఒక కమిటీ ఏర్పడెను. దానికి 'పర్వతోద్ధరణ మహాక్రతు సహాయకసంఘము' అని పేరు పెట్టబడెను. తదుపరి ఆ సంఘము తరుపున చందాలు వసూలు చేయబడెను. ఆ ద్రవ్యముతో వారు మల్లునకు ఆరునెలలు రాజభోజనము ఏర్పాటుచేసిరి. ఆరునెలలు పూర్తి అయిన తరువాత కొండను మోయుటకై ఒక సుముహూర్తము నిర్ణయింపబడెను. దేశ దేశములకు ఆ వర్తమానము పంపబడెను. కరపత్రములు గ్రామగ్రామమునందును పంచిపెట్టబడెను. అది కలియుగమునకే కీర్తిని తెచ్చిపెట్టు ఘనకార్యము కాబట్టి జనులు నిర్ణీత సమయమునకు సుదూరప్రాంతముల నుండియు తండోపతండములుగ ఆ సమీపమునకు వచ్చి చేరిరి. కొండను మోయు ఆ అపూర్వ దృశ్యమును ఎప్పుడు చూతుమా యని జనులు ఉవ్విళ్లూరుచుండిరి.\n\nసరిగా ముహూర్తసమయము ఏతెంచెను. మల్లుడు ఒక పురోహితునిచే కొండకు పూజచేయించెను. పూజాంతయు పరిసమాప్తి అయిన తరువాత పురోహితుడు 'అయం ముహుర్త స్సుముహూర్తో మస్తు' అని చెప్పి మల్లుడుగారితో 'అయ్యా! ఇక మీరు కొండను మోయుటకు సిద్ధపడవచ్చును. ముహూర్తమింకను ఒక నిమిషము మాత్రమే యున్నది' అనెను. అచట చేరియున్న లక్షలాది జనమంతయు ఏక్షణమున ఏమి జరుగునోయని ప్రాణములను బిగపట్టుకుని గ్రుడ్లప్పగించి చూచుచుండిరి. ఒక నిమిషము దాటినది. ఐదు నిముషములు దాటినది. అరగంట దాటినది. కాని మల్లుడు కొండ విషయమై ఏమియు పట్టించుకొనలేదు. అత్తరి గ్రామపెద్దలు మల్లునకు ఈ క్రింది విధముగ సంభాషణ జరిగెను.\n\nగ్రామపెద్దలు: ఏమండీ మల్లుడుగారూ! ముహూర్త సమయము దాటి అరగంటైనది. ఇంకనూ కొండను మోయలేదేమి? చెప్పినమాట తప్పవచ్చునా?\n\nమల్లుడు: గ్రామస్తులారా! నేను అసత్యములు పలుకువాడను కాను. అన్నమాటను నెరవేర్చుకొనుటలో నాతరువాతనే తక్కిన వారందరును. నేను కొండను తప్పకమోసితీరుతాను.\n\nగ్రా: మరి మోయలేదే?\nమ: తప్పక మోస్తాను.\nగ్రా: మరి మోయండి.\n\nమ: నానెత్తిన ఎత్తిపెట్టండి తప్పక మోస్తాను. నేను మొదటినుండీ మోస్తాననే చెప్తున్నానుగాని ఎత్తుతానని కాదు. జ్ఞాపకమున్నదా?\n\nఆ మాటలు వినగానే గ్రామస్తులందరూ హతాశులై పొయిరి. ఆరు నెలలు అతనిని ఎందుకు మేపితిమా యని వారు దిగులు పడజొచ్చిరి. వెంటనే అచట చేరినవారందరు ఒకరి మొగము ఒకరు చూచుకొని ఏమియు చేయునది లేక వారివారి యిండ్లకు వెడలిపోయిరి.\n\nదీని పేరే వాచాజ్ఞానం. నోటితో చెప్పుటేకాని క్రియశూన్యం. అధ్యాత్మక్షేత్రమున అనుష్ఠానమునకే ఎక్కువ ప్రాధాన్యం కలదు కాని వాచాజ్ఞానమునకు కాదు. వాచావేదాంతము ఏకాలమందును లక్ష్యమును పొందజాలదు. ఒక్కొక్క సత్యమును నిత్యజీవితములో అనుష్ఠానమందుంచుకొని దానిని సాధించినప్పుడే ఫలితములు గోచరించగలవు కాని, కథలోని మల్లునివలె నోటితో మాత్రము ప్రగల్భములు పలుకుచు క్రియయందు మొండిచెయ్యి చూపుటచేగాదు. ముందుగా శాస్త్రమును చక్కగ అధ్యయనము చేసి, గురుముఖతః బాగుగ శ్రవణము చేసి ఆ పిదప తానెరిగిన యా సత్యమును క్రియాన్వితము చేయవలెను. అనుష్ఠించ వలెను. కేవలము వాచా వేదాంతము మనుజుని ముక్తిధామమున కెన్నటికిని చేర్చలేదు. అనుష్ఠానముకూడ జోడించినపుడే అది లెస్సగా రాణించును.\n\nనీతి: దైవానుభూతి అచరణాత్మక మైనది. కావున మాటలతో సంతృప్తి నొందక, సాధనకు గడంగి మనస్సును, ఇంద్రియములను జయించి అత్మసాక్షాత్కారమును బడయవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 777,
        "IMAGE": "cat_9",
        "NAME": "వాచావేదాంతము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "కన్నడ దేశమందలి ఒకానొక పట్టణమున పూర్వమొక ధనికుడు కాపురముండెను. అతడు ఆగర్భశ్రీమంతుడు. పెక్కు భవనములు, క్షేత్రములు అతనికి కలవు. తాను తన కుటుంబము నివసించుటకై ఒక నాలుగంతస్తులు మేడను ప్రత్యేకించి బహుసుందరముగ నిర్మించుకొనెను. అందు సకల భోగభాగ్యములను అనుభవించుచుండెను. అతనికి ప్రాపంచిక సంపద విస్తారముగ నున్నదే కాని దైవసంపద కొంచెమైనను లేదు. భగవంతునిపై విశ్వాసమతనికి ఏమాత్రమును లేదు. భగవన్నామ ముచ్చరించుడని, పుణ్యకార్యము లాచరించుడని ఎవరెన్ని చెప్పినను అతడు లక్ష్యపెట్టక ప్రాపంచిక సంపదే తన్నుకడతేర్చునను నమ్మకము గలిగి భోగలాలసుడై దైవవిముఖుడై కాలము గడుపుచుండెను.\n\nకాలచక్రము వేగముగ పరిభ్రమించుచుండెను, కొంత కాలమున కతనికి వార్దక్యము దాపురించెను. అంగములు క్రమముగ శైథిల్యము నొందజొచ్చెను. శరీరము శుషింపదొడగెను. ఇట్టి పరిస్థితిలో ఒకనాడతనికి తీవ్రమైన వ్యాధియు సంక్రమించెను. గొప్ప గొప్ప వైద్యులు వచ్చి చికిత్సచేయుచుండిరి. కాని వ్యాధి తగ్గుముఖము పట్టలేదు. రుగ్ముత క్రమక్రమముగ అధికము కాజొచ్చెను. భిషగ్వర్యులు నిరాశను ప్రకటింప దొడగెను. అత్తరి అతని బంధువులు, ఆప్తులు అత్యవసర సమావేశమును జరిపి భవనము యొక్క మూడవ అంతస్తులో పరుండి యున్న ఆ రోగిని నెమ్మదిగ క్రిందకు దించి దొడ్డిలో గల పశువుల కొట్టమునందు బరుండ బెట్టిరి.\n\nజీవితములో ఒక్క పుణ్యకార్యమైనను చేయనివాడును, ఒక్క పర్యాయమైనను భగవన్నామమును ఉచ్చరించని వాడును, పై పెచ్చు ఎన్నియో పాపకార్యములను చేసినవాడు నగు ఈతనికి సద్గతి లభించుటెట్లు? అని బంధువర్గము తలపోసి అందులకు మార్గము నన్వేషించుచుండిరి. పూజ్యులగు మహనీయులను, గొప్ప తపస్సంపన్నులను, బ్రహ్మ నిష్ఠులను, అనుభజ్ఞులను ఈ విషయై ప్రశ్నించిరి. 'అయ్యా! మా బంధువర్గములో ఒకడు జీవితమం దేలాంటి పుణ్యకార్యమున్ను చేయలేదు, ఇపుడు వృద్ధుడై, రోగగ్రస్తుడై, కాటికి కాళ్లుజూచుకొని యున్నాడు. ఇట్టి పరిస్థితిలో అతడు తరించుటకు, సద్గతి నొందుటకు ఏదైనా మార్గము కలదా?\" అని వారు ఆ పెద్దలను అడిగిరి. వారందరూ ఏకగ్రీవముగ ఒకే ప్రత్యుత్తరము నిచ్చిరి. - \"ఓ జిజ్ఞాసువులారా! బాల్యమందుగాని, ఏ కాలమందైనను మనుజునకు శ్రేయము నొసంగునది దైవచింతనయే, భగవన్నామస్మరణయే\" - అని వారు తెలిపిరి.\n\nఆ వాక్యములను వినిన వెంటనే ధనికుని బంధువు లందరును రివ్వున పరుగెత్తి రోగియొక్క మంచముచుట్టూ చేరి బావగారు! మామగారు! నాన్నగారు! \"నారాయణ\" అనండి, \"రామరామ\" అనండి, \"కృష్ణ కృష్ణ\" అనండి అని ఎన్ని పర్యయయములు బిగ్గరగా అరచినను, చెవిలో ఊదినను అతడు ఏమియు పలుకలేదు. కండ్లు తెరచి ఎదుటనున్న వారిని మాత్రము చూచుచుండెను. అట్టి విపత్కర పరిస్థితి యందు బంధవుల కేమిచేయుటకు తోచలేదు. \"ఈతడు అభాగ్యుడు. కనీసము అంత్యకాల మందైనను దేవుని స్మరించు పుణ్యమునకు నోచుకొనలేదు. భగవన్నామమును ఉచ్చరించలేదు. ఎట్టి ఘోర నరకమును జెందునో\" అని బంధువర్గము పరితపించుచుండ; అకస్మాత్తుగ రోగియొక్క ముఖమునుండి ఏదియో శబ్దజాలము బయల్వెడలుచునట్లును, అతడేదియో ఉచ్చరించుచున్నట్లును, వారు కనిపెట్టిరి. తక్షణము వారు చెవులు నిక్కపొడుచుకొని అతి నోటి సమీపమునకు బోయి అతడేమి పలుకుచున్నాడో వినజొచ్చిరి. 'క, క, క' అను మూడు అక్షరముల యొక్క శబ్దముమాత్రము వారు వినగల్గిరి. రోగి, \"క, క, క\" అని మాత్రము పలికి ఊరకుండెను.\n\nవెంటనే ప్రజ్ఞావంతులగు బంధువు లందరును ఇట్లు యోచించి - 'క, క, క' అను మూడక్షరముల యొక్క అర్థమేమై యుండును? ఇది ఏదైనా భగవన్నామమా? లేక దేవత లాతనికి చివరి గడియలో ఎదైనా ఇట్టి మంత్రమును ఉపదేశించినారా? లేక అవి ఏవైనా గొప్ప బీజాక్షరములై యుండునా? ఒకవేళ అయియున్నచొ మనము కూడ అంత్యకాలములో ఈప్రకారముగ క, క, క అనినచో మనకుకూడ సద్గతి లభించునుగదా! కాబట్టి దీని అంతర్యమేమియో తెలిసికొనుట మంచిది. అయితే దానిని ఇతరు లెవరును చెప్పలేరు. ఉచ్చారణ చేసిన రోగియే చెప్పగలడు అని నిర్ణయించుకొని బంధువర్గ మంతయు అతని చెవియొద్ద చేరి ఐక్యకంఠముతో \"నాన్న గారు, బావగారు! మీరు పలికిన క, క, క అను మంత్రముయొక్క అర్థమేమిటి? త్వరగా చెప్పండి\" అని బిగ్గరగా అరచిరి, కాని రోగి ప్రత్యుత్తర మీయలేదు, అందరు నిరాశా పరిపూరితులైరి.\n\nకాని ధైర్యయము వీడక వారందరు తత్‌క్షణమే ఆ పట్టణములో గొప్ప ప్రాక్టీసు కలిగి పేరుమ్రోగినట్టి ఒక డాక్టరు నొద్దకు వెళ్ళి \"మహాప్రభో! మహాశ్రీమంతుడైన మాబంధువొకడు చివరి ఘడియలలో ఏదియో బీజాక్షరములు పలికినాడు. బహుళా దేవతలు బోధించిన మంత్రమేమో అది. దాని అర్థము తెలిసికొనవలెనని మేమందరము కుతూహలాయత్త చిత్తులమై యున్నాము. అతడు నోరు తెరచి మాట్లాడుటలేదు. ఇంకను కొద్దిక్షణములు మాత్రమే అతనికి మిగిలియున్నది. తమరు దయచేసి ఏదైనా పటుతరమైన, మహాశక్తివంతమైన ఇంజక్షణ్‌ అతనికి ఇచ్చి కొంచెం మాట్లాడునట్లు చేసితిరా, మీ ఋణము మేము తప్పక తీర్చుకొనగలము, అని చెప్పిరి. తొడనే డాక్టరు తన మందులపెట్టెను చంకనిడుకొని స్టెతస్కోపును మెడలో ధరించి కారులో హుటాహుటి రోగియొద్దకు పయనమయ్యెను. రోగిని సమీపించి, నాడి పరీక్షించి ఇంకను సృహ ఉన్నదని పలికి సద్యః ఫలితము నొసంగు అద్భుతమగు ఇంజక్షన్‌ ఒకటి ఇచ్చెను. వెంటనే ఫలితము చేకూరినది. రోగి కదలజొచ్చెను. మాట్లాడ సాగెను.\n\nఇదియే అదును అని తలంచి బంధువు లందరును అతని చుట్టుచేరి, \"నాన్నగారూ! మీరు పలికిన క, క, క, అను మంత్రము యొక్క బాష్యం కొంచెం సెలవివ్వండి\" అని ప్రార్థించిరి. వెంటనే అతడు \"కరు కసబరికయన్ను కడియుత్తదే\" అని తానుచ్చరించిన బీజాక్షరముల యొక్క వివరణమును తెలియజేసెను. దాని అర్థమేమనగా దూడ చీపురుకట్ట తినివేస్తున్నది - కాబట్టి దానిని తీసి జాగ్రత్త చేయండి - అని అతడు కన్నడ దేశస్డుడు కాబట్టి కన్నడభాషలో చెప్పెను. పసువుల కొట్టములో అతనిని పరుండబెట్టినందున అతని దృష్టి చీపురుకట్ట కొరకి వేయుచున్న దూడపై ప్రసరించగా పై వాక్యము నుచ్చరించెను. అంత్య కాలమున అతనిని తాను సంపాదించిన కొలది ధనము వదలిపోవువున్నది. సుందరభవనము వదలిపోవుచున్నది. భార్య, బిడ్డలు వదలిపోవుచున్నారు. సమస్త భోగభాగ్యములు, సంపదలు వదలిపోవుచున్నావి. ఇది యంతయు పోవుచున్నప్పటికి ఒక్క చీపురుకట్ట పోవుచున్నదే అను దిగులు అతనికి పట్టినది! ఎంత హాస్యాస్పదమైన విషయము! ఎంత శోచనీయైనన దశ! తన్నుచ్చరించినవారిని కడతేర్చునట్టి సర్వేశ్వరుని విస్మరించి, పవిత్రమైన భగవన్నామమును స్మరింపక అంత్యకాలములలో తుచ్చమైన ప్రపంచ వస్తువులనే తలంచుకొనుచు అందును హీనతరమైన ఒకానొక అల్పవస్తువును (చీపురును) భావించుచు ఆ ధనికుడు జీవితమును వ్యర్థపరచుకొనెను.\n\n\"తస్మాత్సర్వేషుకాలేషు మామనుస్మర\" అని భగవానుడు పలికి నట్లు జీవితమం దెల్ల వేళలందును దైవస్మరరణ చేయుచు పవిత్రభావనలను గలిగియుండు వానికే అంత్యకాలమున గూడ అట్టి నిర్మల భావములు వచ్చుచుండెను. కాబట్టి ప్రతివారును తమ జీవితమందలి ప్రతి ఘడియకూడ మహామూల్యవంతమని గ్రహించి, భగవచ్చింతన యందును పరోపకారమందును, పుణ్యకార్యాచరణ యందును దానిని వినియోగించుచు పవిత్రసంసస్కారమును ఏర్పరచుకొనినచో అంత్య కాలమందును అట్టి ఉత్తమభావనలే జనింప భగవత్సాన్నిధ్యము జేరి జీవితమును ధన్యమొనర్చుకొనగలరు.\n\nనీతి: జీవితకాలమంతయు దైవభావన గలిగియుండినచో అంత్య కాలమున అట్టి పవిత్రదైవభావమే కలిగియుండి తరింతుము. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 778,
        "IMAGE": "cat_9",
        "NAME": "అంత్యకాల స్మరణ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక మహారాజు ఉండెడివాడు. అతడు గొప్ప ధార్మిక హృదయము కలవాడు. భగవద్భక్తుడు. శాస్త్రవిచారణయందాతనికి ప్రీతి ఎక్కువ. ఆతని ఆస్థానమున అనేక పండితులు, వేద వేదాంగ పారంగతులు, శస్త్రార్థకోవిదులూ సదా విరాజమానులై యుందురు. ఆతని రాజభవనమున నిరంతరము ఏదియో ఒకమూల దైవచర్చ జరుగుచునే యుండును. ఈ ప్రకారముగ రాజప్రసాదనమున చక్కగ దైవగంధము వ్యాపించియుండెను.\n\nఇట్లున్నప్పటికిని ఆ రాజుగారి మనంబున ఏదియో ఒక కొరత బాధించుచుండెను. ఎన్ని చదివినప్పటికిని. ఎన్ని వినినప్పటికిని అతనికి పూర్ణ సంతృప్తి కలుగలేదు. ఆధ్యాత్మక్షేత్రమున కొన్ని సంశయము లాతనిని వేధించుచునే యుండెను. ఆ సంశయములను పరిపూర్ణముగ నివారించువారుగాని, వారికి తగుసలహా చెప్పువారుగాని ఆస్థానమున గల పండితబృందమునం దెవరును లేకపోయిరి. అందుచే రాజు మిగుల ఖిన్నుడయి స్వకీయసంశయ విచ్ఛేదమునకు దారి ఏదియో యని పరిపరివిధముల ఆలోచించుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడాతని చిత్తకుహరమున అకస్మాత్తుగా పరిష్కార మార్గము మెరపువలె స్ఫురించెను.\n\nరాజు యొక్క ఆస్థానమందు రాజవంశమునకు పౌరోహిత్యమును నెరవునట్టి మహాపండితు డొకడుండెను. అతడు శాస్త్రవిచారణ యందు గొప్ప నేర్పరి. వాదవివాదములందు ప్రతిపక్షులను క్షణములలో కూలద్రోయగల వాక్పటిమ కలవాడు. అయితే అతడు పాండిత్య ప్రకర్ష గలవాడే గాని అనుభవశూన్యుడు. వాచావేదంతియే కాని అనుష్ఠాన తత్పరుడుకాడు. ఈ విషయము రాజుగారికి తెలియదు. అతడు మహాశస్త్ర పండితుడు కావున బహుకాలము నుండి తన్ను బాధించు చున్న సంశయములను తృటిలో తొలగించివేయగల స్తోమత యాతనికి తప్పక ఉండియుండునని, పైగా రాజపురోహితుడు కావున రాజావసరములను తీర్చవలసిన బాధ్యత అతనిపై నున్నదనియు నిశ్చయించి రాజు ఒకనా డాపురోహితుని తన వద్దకు ఏకాంతముగ బిలిచి ఈ ప్రకారముగ నుడివెను -\n\nపండితోత్తమా! చాలాకాలము నుండి మూడు సందేహములు నన్ను పీడించుచున్నవి. ఎన్నియో గ్రంథములను తిరుగవైచితిని. ఎందరో పెద్దలను ప్రశ్నించితిని. కాని సరియైన సమాధానము నాకు దొరకలేదు. అందుచే హృదయమందు గొప్ప ఆందోళన జనింప, మహాబాధితుడనై తుట్టతుదకు నాయాస్థానమందగల మీరొక్కరే తత్సంశయ నివారణమున సమర్థులని ఊహించి మిమ్ముల నిచటికి పిలిపించితిని. మీరు మా రాజకుల పురోహితులు. మీతాతముత్తాత లెందరో మా రాజ వంశమునకు మహత్తరసేవ మొనర్చియుండిరి. రాజునకు గల సంశయములను వారింపవలసినది ఆస్థాన పురోహితుడే యగును. పూర్వము శ్రీ రామచంద్రున కుదయించిన సంశయావళినంతను రఘువంశ పురోహితుడును, కులగురువునగు వసిష్ఠమహర్షి యోగవాసిష్ఠ రూపదివ్య పరమార్థబోధచే విఛ్ఛిన్న మొనర్చి ఏసిన సంగతి మీకు తెలిసినదే కదా. కాబట్టి నన్ను బాధించుచున్న మూడు సంశయములను ఇపుడు మీ ముందు పెట్టుచున్నాను. వానిని మీరు స్వయముగా గాని ఇతరులతో సంప్రదించిగాని, లేక శాస్త్రములను పరిశోధించిగాని, లేక మరి యేవిధముగ నైనగాని బాగుగా విచారించి సరిగా ఆరుమాసములైన పిదప నాకు తగు సమాధాన మొసంగవలసినది. అట్లు మీరు ఆ వ్యవధిలోపల నాకు తగిన ప్రత్యత్తర మొసంగనిచో నాయస్థానము నుండేకాదు. నా దేశము నుండి కూడా మిమ్ములను బహిష్కరించివైచెదను. కాబట్టి బాగుగ యోచించి కార్యమును నెరవేర్చవలసినది. ఆ ప్రశ్న లేమియో వినుడు -\n\n1. దేవుడు ఎచట నున్నాడు?\n2. దేవుడు ఏవైపు చూచుచున్నాడు?\n3. దేవుడు ఏపని చేయుచున్నాడు?\nఈప్రకారముగ రాజు తన పురోహితుని శాసించి పంపివైచెను.\n\nపురోహితుడు రాజుయొక్క ఆ వాక్యములను వినగానే భయకంపితుడయ్యెను. అతడు వాచా వేదాంతియే కాని అనుభవము కలవాడు కాడు. శాస్త్రపాండిత్యము కలవాడే గాని శాస్త్రానుభూతి కలవాడు కాడు, ముఖమునందు సమస్తవిద్యలు కలవాడే కాని హృదయమందు కలవాడు కాడు. రాజడిగిన ప్రశ్నలకు బ్రహ్మానుభూతిగల మహనీయుడే తగిన సమాధానము చెప్పగలడుకాని, పైపైన శాస్త్రపరిశోధన చేసినవాడు చెప్పజాలడు. ఇక్కారణమున ఆ పురోహితుడు వ్యాకులచిత్తుడై భగ్న హృదయుడై ఇంటికివెళ్ళి, అన్నపానములను కూడ స్వీకరించక, దిగులుతో, దుఃఖముతో, తీవ్రవేదనతో మంచముపై పడియుండెను.\n\nఆ పురోహితుని ఇంటియందు గోవులను మేపుచు పనిపాటలు చేసికొనుచుండునట్టి గోపాలబాలు డొకడుండెను. అతడు పదునాల్గు సంవత్సరముల ప్రాయము కలవాడు. పూర్వజన్మసుకృతముచే చిన్న నాటి నుండియు ఆతనికి భక్తి చక్కగ అలవడినది. నిరంతరము ఏదియో భగవన్నామము ఉచ్ఛరించుచు తనపని చేసికొనుచుండును, దైవ కటాక్షము చేతను, భగవద్భక్తి ప్రభావము చేతను అతని హృదయమందొకింత జ్ఞానమున్ను ఆవిర్భవించెను. అయితే ఈ విషయ మెవరికిని తెలియదు. ఇట్లుండు ఒకనాడు తన యజమానుడగు రాజపురోహితుడు వ్యాకులచిత్తుడై పడియుండుటజూచి గోపాలుడతనిని సమీపించి వినయముతో ప్రశ్నించి, ఆతని దీనత్వమునకు కారణ మరసి యతనితో నిట్లనియె -\n\n\"మహాత్మా! మీరిక దిగులుపడవలదు. ఆరునెలలైన పిదప రాజున కిట్లు కబురుచేయుడు (ఒక చీటిమీద వ్రాసి) కారణాంతములచే రాజపురోహితుడు నగు నేను ఆస్థానమునకు రాజాలకున్నాను. నేను చెప్పవలసిన జవాబును నా తరుపున నా ప్రతినిధియైన ఈతడు చెప్పును అని. ఆ చీటిని నేను తీసికొనివెళ్ళి రాజునకిచ్చి తగు సమాధాన మొసంగి అతనిని తృప్తిపరచి వచ్చెదను\" అని చెప్పగా పురోహితుడు మహదానందభరితుడై అందుల కియ్యకొనెను.\n\nఆరుమాసములు ఒక్కక్షణమువలె గడిచిపొయెను. నిర్ణీత సమయ మేతెంచెను మహత్వపూర్ణములైన మూడు గొప్ప ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానము రానుండుటబట్టి తచ్ఛ్రవణమువలన తనకొకనికే గాక అశేషజనానీకమునకు గూడ మేలు కలుగవలెనని యాశించి రాజు నిర్ణిత సమయమునకు ముందుగానే దేశదేశములందు, గ్రామ గ్రామములందు దండోరా వేయించి, పరమార్థ జిజ్ఞాసువులకు సంశయ విచ్ఛేదమున గొప్పతరుణ మేతెంచినది. కావున యావన్మంది సకాలమునకు విచ్చేసి ఆధ్యాత్మజ్ఞానామృతమును తనివితీర పానముచేసి కృతార్థులు కండని ప్రకటించెను. తత్ఫలితముగ ఆ నిర్ణీత దినమున, నిర్ణిత కాలమగు రాత్రి 8గం||ల సమయమున రాజాస్థాన మంతయు భగవద్భక్తులచే ఆధ్యాత జిజ్ఞాసువులచే, భాగవతులచే క్రిక్కిరిసిపోయెను. ఎప్పుడు మూడు ప్రశ్నలకు సమాధానము వచ్చునా యని జనులందరును తీవ్రజిజ్ఞాసతో నొడలంతయును చెవులు చేసికొని కూర్చుండిరి. వారిమధ్యలో ఎతైయిన సింహాసనముపై రాజు ఠీవిగ ఆసీనుడై యుండెను. సరిగా రాత్రి ఎనిమిది గంటలైంది.\n\nఇంతలో ఎవరో ఒక బాలుడు నల్లనివర్ణము, చింపిరిగుడ్డలు, చిరుతప్రాయము గలవాడు ఒక ఉత్తరమును తీసికొని రాజభవనములో ప్రవేశించి పురోహితుని ఉత్తరమును ద్వారపాలకునిద్వారా రాజునకు చేర్చెను. రాజు ఉత్తరము చదువుకొని సంతోషించి ఆ గోపాలుని సగౌరవముగ లోనికి రానిచ్చి ప్రశ్నలకు జవాబులు చెప్పవలసినదిగా కోరెను. వేలకొలది జిజ్ఞాసువులచే కిటకిటలాడుచున్న ఆ రాజప్రసాద మధ్యమున ఎతైన సింహాసనముపై రాజు కూర్చొనియుండ ఆ బాలుడు రాజును సంబోధించి ఇట్లనెను - \"ఓ మహారాజా! లోకములో ఒక సంప్రదాయము కలదు. ఒక గురుశిష్య న్యాయము కలదు. బోధించు వాడు గురువు. బోధింబడు వాడు శిష్యుడు. బోధించు నప్పుడు గురువు ఉన్నతస్థాన మధిష్ఠించి యుండుటయు, శిష్యుడు భక్తిభావముతో క్రిందచేతులు కట్టుకొని యుండుటయు లోకాచారము. తదనుశారమిపుడు బోధించు నేను గురువును, వినునట్టి నీవు శిష్యుడవు అయియున్నావు. గురువు ఉన్నతస్థాన మధిష్ఠించవలెను కావున నేను సింహాసనముపై నెక్కెదను. శిష్యుడు క్రిందచేతులు కట్టుకొని నిలబడవలెను. కాబట్టి మీరు సింహాసనముపై నుండి దిగగోరెదను\" -\n\nగోపాలు డిట్లు పలుక, ఆ వాక్యములు సహేతకములుగాను, యుక్తియుక్తములుగాను ఉండుటబట్టి రాజు సింహాసనము నుండి క్రిందకు దిగి చేతులు కట్టుకుని నిలబడగా, గోపాలుడు సింహాసనము నెక్కి పైన కూర్చుండెను. ఇక ప్రశ్నలకు సమాధానము చెప్పుమని రాజు కోరగా గోపాలుడు \"మహాశయా! ఏదైన శుభకార్యము ప్రారంభించుటకు ముందుగా దీపారాధన చేయవలెను. దేవునకు పూజ, అభిషేకము చేయవలెను. అభిషేకమునకై ఒక గ్లాసులో పాలుపోసి తెప్పించవలెను\" అని చెప్పగా, రాజట్లే కావించెను. తదుపరి పూజాదికములు ఒనర్పబడెను.\n\nగోపాలుడు: ఓరాజా! ఆ పాలపాత్రను పైకెత్తి, జాగ్రత్తగ పరిశీలించి దానిలో వెన్న ఎక్కడ ఉన్నదో ముందుగా నాకు చెప్పుము. అటుపిమ్మట నీ ప్రశ్నలకు నేను సమాధానము చెప్పెదను.\n\nరాజు: (పాలను జాగ్రత్తగా నలువైపుల పరిశీలించి) మహాత్మా! పాలలో వెన్న అంతటను వ్యాపించి యున్నది.\n\nగోపాలుడు: అట్లే దేవుడు సమస్తచరాచరములయందును నిగూఢముగ వ్యాపించి యున్నాడు. అతడు లేని చోటే లేదు.\n\nరాజు: గురుదేవా! చక్కటి సమాధానమును చెప్పినారు. కృతజ్ఞడను. ఇక రెండవ ప్రశ్న. దేవుడు ఏవైపు చూచుచున్నాడు? అనుదానికి సమాధానమును చెప్పప్రార్థన.\n\nగోపాలుడు: ఓరాజా! ఆ ప్రమిదెలోని దీపము ఏవైపు చూచుచున్నదో ముందుగా నాకు చెప్పగోరెదను.\nరాజు: మహాత్మా! దీపము అన్నివైపుల చూచుచున్నది.\nగోపాలుడు: అట్లే దేవుడున్ను ఒక దిక్కనికాక, సర్వదిక్కులను చూచుచున్నాడు, సమస్త ప్రాణులయొక్క హృదయాంతర్విర్తియై సమస్తమును పరికించుచున్నాడు.\nరాజు: భేష్‌! చక్కగా సెలవిచ్చారు. ఇక మూడవ ప్రశ్న - దేవుడు ఏపని చేయుచున్నాడు? అనుదానికి సమాధానము చెప్పవేడెదను.\n\nగోపాలుడు: రాజా! దేవుడు చేయుపని ఇప్పుడే కనిపించలేదా? ఒకరిని సింహాసనముపై నుండి క్రిందకు దించుట, మరియొకరిని సింహాసనముపై కూర్చుండబెట్టుట - ఇదియే, దేవుని పని, అనగా ధనగర్వము, అధికార గర్వము గలిగియున్నవారిని క్రిందకు తోయుట. వినయము, విధేయత, శ్రద్ధ భక్తి గలిగియున్న వారిని పైకి లేపుట, దేవుడు చేయుపని పాపాత్ములను నరకమున ద్రోయుట, పుణ్యాత్ములను, ధర్మాత్ములను మోక్షధామమునకు జేర్చుట ఇదియే దేవుని పని.\n\nఓరాజా! ఈ ప్రకారముగ మీరడిగిన మూడు ప్రశ్నలకును ప్రత్యుత్తరమును చెప్పినాను. నేను ఇకవెడలుచున్నాను. పాలలో వెన్నవలె సర్వత్రా దైవము వ్యాపించియున్నాడు కావునను, దీపమువలె సర్వసాక్షియై దశదిశలు వీక్షించుచున్నాడు కవునను, ధర్మనిష్ఠులను ఉద్ధరించి అధర్మపరాయణులను శిక్షించుచున్నాడు కావునున ఓ రాజా! మీరున్నూ, తదితరులున్ను సర్వత్ర దైవసాన్నిధ్యముననే అనుభవించుచు, ఏ పాపమును చేయక, హృదయమును నిర్మల మొనర్చుకొని దైవ సాక్షాత్కారమును అచిరకాలములోనే పడసి జీవితమును ధన్యమొనర్చు కొందురుగాక! సర్వేశ్వరుడు అనుగ్రహించుగాక!\" అని చెప్పి గోపాలుడు సభాస్థలమును విడిచివెళ్లెను.\n\nసభాసదు లందరును రాజున్ను ఆ బాలుని అఖండప్రజ్ఞకు, పరమార్థానుభవమునకు అచ్చెరువొంది అట్టి దివ్యబోధలను వినగలందులకు తమ జీవితములు ధన్యము లైనవని తలంచి, అతడు బోధించిన ప్రకారమే తమతమ జీవితములం దనుసరించుటకు కృత నిశ్చయులైరి.\n\nనీతి: భగవంతుడు సర్వవ్యాపకుడు - అను విశ్వాసము గలిగి పాపకార్యము లవలేశ మైనను చేయక ధర్మబుద్ధి, పవిత్రాచరణ గలిగి యుండవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 779,
        "IMAGE": "cat_9",
        "NAME": "ముచ్చటైన మూడు ప్రశ్నలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక గ్రామమున ఒక భక్తుడు నివసించుచుండెను. అతడు \"ఓం నమో నారాయణాయ\" అను అష్టాక్షరీ మహా మంత్రమును నిరంతరము జపించుచుండెడివాడు. తన పూజా మందిరములో శ్రీమన్నారాయణుని విగ్రహము నెదుట గూర్చొని భక్తి పూర్వకముగ ప్రతిదినము పై మంత్రమును పునశ్చరణ చేయుచుండెను. ప్రాపంచిక పదార్థములపై అతనికి ఏమాత్రము ఆసక్తి లేకుండెను. వైరాగ్య సంపన్నుడై భోగవస్తుజాలమును లెస్సగా పరిత్యజించి, దృష్టిని బహిర్ముఖముగ ప్రసరింపజేయక, నారాయణుడే తనకు దిక్కని నమ్మినవాడై మనోవాక్యాయములచే ఆయననే హృదయమున సంస్మరించుచు నుండెను.\n\nఇట్లుండ, ఒకనాడతడు ప్రతిదిన పద్ధతి ప్రకారము ఉదయము ననే స్నానాదులను నిర్వర్తించుకొని శుచిర్భూతుడై తన పూజా మందిరమున శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహము నెదుట గూర్చుండి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి తదేక దృష్టితో నారాయణుని భావించుచు అష్టాక్షరీ మంత్రమును జపించుచుండ, ఆతని భక్తికి, అపరిమిత శ్రద్ధకు మెచ్చి వైకుంఠనాథుడు శంఖ చక్ర గదాధారియై ఆకస్మికముగ ఆ పూజా మందిరమున ప్రత్యక్షమయ్యెను. భగవానుని ప్రత్యక్షముగ దర్శింప గల్గు మహద్భాగ్యము ఉదయించుటచే ఇక ఆ భక్తుని ఆనందమునకు మేరయే లేకుండెను. తదేక దృష్టితో ఆనంద పరవశత్వమ్ముతో, ఉత్కంఠిత హృదయముతో అతడు భగవానుని ప్రత్యక్ష రూపము వీక్షించుచుండెను. ఏమి చేయుటకును తోచకుండెను. అది భగవానుని ఆకస్మిక గమనము అగుటవలనను, దేవుని సత్కరించుటకు ముందుగా ఏవిధమైన ఏర్పాట్లు చేసియుంచు కొనకపోవుట వలనను, కడుబీదవాడగుట చేతను భగవంతునికి నివేదించుటకు తగిన వస్తుసంభారములు లేక యుండుటవలనను, ఇంటికి వచ్చిన ఆ లోకోత్తర అతిథిని ఎట్లు సత్కరించవలేనో తోచక తికమకపడుచు తొట్రుపాటు పడుచుండెను.\n\nభగవద్దివ్య స్వస్వరూప సందర్శన జనిత మహదానంద పరిపూరిత హృదయసహితుడగు ఆ భక్తుడు తత్సమయమున తన పూజా మందిర మంతయు తేరిపాడచూడ ఒకమూల ఒక అరటిపండు అతనికి దృగ్గోచర మయ్యెను. తోడనే పరుగెత్తికొని వెళ్ళి దానిని పట్టుకొనివచ్చి, ఆ స్వల్ప ప్రసాదము నైనను భగవంతునకు నివేదింప దలంచి, ఆనంద పారవశ్యముచే ఒడలు గగుర్పాటు నొందుచుండ మనస్సు నారాయణుని దివ్యపాద పద్మములపై సంలగ్న మొందియుండ, తోందరలో ఆ అరటి పండును ఒలిచి లోని గుజ్జును పారవైచి తొక్కను దేవునకు పెట్టెను. భక్తిరసముచే పరిప్లావితమైన ఆ తొక్కును భగవాను డపుడు ఆనందముతో స్వీకరించి, భుజించి అంతర్ధాన మొందెను.\n\nతదుపరి కొద్దిసేపటికి ఆ భక్తుడు తన పొరపాటును గుర్తెరిగి పశ్చాత్తాపతత్పరుడై, భగవానునకు గొప్ప అపచారము చేసితినని తలంచి అత్యంతఖిన్నుడై, ఏమి చేయుటకును తోచక హృదయము వేదనలో గ్రుంకుచుండ గొప్ప పరితాపమును బొందుచుండెను. \"అయ్యో! నేనేల ఇట్లు చేసితిని? సామాన్యమానవుని కైనను అరటితొక్కును ఎవ్వరును ఇవ్వరే? ఇక చతుర్దశ భువనాధిపతి యగు శ్రీమన్నారాయణునికి నేనేల ఇట్టి తుచ్ఛవస్తువు నొసంగితి?\" అని పలువిధముల తలపోయుచు తుదకు గుండె నిబ్బరము కలుగజేసికొని ఈ క్రింది ధృఢనిశ్చయమునకు వచ్చెను. ఇక విచారించిన ప్రయోజనము లేదు. మరల భగవానుని త్వరలోనే నేను ప్రత్యక్ష మొనర్చుకొనెదను. అతడు భక్తవత్సలుడు కావున పరిపూర్ణభక్తితో, అకుంఠిత దీక్షతో అష్టాక్షరీ మహామంత్రమును జపించుచు, అతనిని ధ్యాణించినచో తిరిగి యతడు ప్రత్యక్షము కాగలడు.\n\nఅయితే ఈసారి పూర్వము చేసిన పొరపాటు మరల జరుగకుండు నిమిత్తము ముందుగనే యతడు చాలా జాగ్రత్తపడెను. ఒకగెల అరటిపండ్లు తెప్పించి దేవుని విగ్రహము ముందు పెట్టి \"ఒక వేళ భగవంతుడు అకస్మాత్తుగ ఇచటికి వచ్చినప్పటికిని ఈసారి పండు ఒలిచి గుజ్జుమాత్రమే దేవునకు పెట్టి తొక్కు పారవేసెదను\" అని కృతనిశ్చయుడై ఆ గెలలో ఒక్కొక్కపండు త్రుంచి, తొక్కుతీసి గుజ్జును గట్టిగా చేతితో పట్టుకుని దేవున కిచ్చునట్లుగా అభ్యాసము చేయదొడగెను. ఈ ప్రకారము గెలలోని అన్ని పండ్లను ఒక్కొక్కటిగ త్రుంచి గుజ్జును గట్టిగా పట్టుకొను అభ్యాసము చేసి ఆ పనియందు చక్కని ప్రావీణ్యమును బడసెను. \"ఇక దేవుడు ఎపుడు వచ్చినను పరవాలేదు. ఈసారి గుజ్జుమాత్రమే నివేదింపబడగలదు గాని తొక్కుకాదు\" అని బాగుగ నిశ్చయించుకొని మరల తన పూజా గృహమున ప్రతిదినము పూజచేయదొడెంగెను.\n\nఇట్లుండ ఒకనాడు ఆతని భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు మరల ప్రత్యక్షమయ్యెను. పూర్వపు అభ్యాసము దృఢపడి యుండుటచే వెంటనే ఆతడు ప్రక్కనున్న అరటిపండును పట్టుకుని జాగ్రత్తగ ఒలిచి గుజ్జును గట్టిగ పట్టుకుని తొక్కును పారవైచి, ఆగుజ్జును భగవానుని నోటిలో పెట్టెను\" కాని భగవానుడు దానిని భుజింపక ఊసివేసెను. అపుడాభక్తుడు దుఃఖాక్రాంతుడై విలపించుచు, భగవానుని పాదపద్మములపై పడి, ఏల తాము భుజింపలేదని ప్రార్థింప ఆతడిట్లు నుడివెను; ఓయీ! పూర్వము నీవు నాకు తొక్కను నివేదించినపుడు నీ మనస్సు నా పాదపద్మములపై సంలగ్నమై యుండుటవలన అసారమైన ఆ వస్తువు భక్తిరసముచే తడుపబడి అమృతతుల్యమై యుండుటచే నేను దానిని భుజించితిని, ఈ సారి వచ్చినపుడు నీవు గుజ్జును ఇచ్చి నప్పటికిని నీ మనస్సంతయు అరటిపండుపైననే లగ్నమై యుండుట వలన, వస్తువు మంచిదైనను భక్తిరసహీనమై యుండుట వలన అది విషతుల్యముగ మారినది. అందుచే నే నద్దానిని భుజింపక పారవేసితిని. అని చెప్పి యంతర్ధాన మొందెను.\n\nఅప్పటి నుండియు ఆ భక్తుడు తెలివితెచ్చుకొని భగవన్నివేదనాది కార్యములందు వస్తువుకంటే భక్తికే ప్రాధాన్యత నొసంగుచు వచ్చి క్రమముగ భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగల్గెను. దేవుడు తనకు \"ఏది ఒసంగిరి\" అని చూడడు \"ఎట్లు ఒసంగిరి\" అని చూచును. కాబట్టి జనులు పూజాప్రార్థనాదులందు భక్తికి ప్రాధ్యానత నిచ్చి దానిని బాగుగ అభివృద్ధి నొందించుకొనుచుండవలెను.\n\nఅణ్యప్యుపాహృతం భక్త్యా ప్రేమ్ణాభూర్యేన మే భవేత్‌|\nభూర్యప్యభక్తోపహృతం న మే తోషాయ కల్పతే ||\n\nకొంచెమైనను భక్తితో, ప్రేమతో ఒసంగబడినది కోండంత కాగలదు. కోండంత ఇచ్చినను భక్తితో కూడియుండనిచో అది నాకు సంతుష్టిని కలుగజేయజాలదు. అను ఈ భగవద్వాక్యమును సర్వులును స్మృతిపథమున నుంచుకొని సర్వేశ్వరుని యెడల అనన్య భక్తిభావమును పెంపొందించు కొనుదురుగాక!\n\nనీతి: భక్తితో గూడినప్పుడే వస్తువునకు విలువ ఏర్పడును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 780,
        "IMAGE": "cat_9",
        "NAME": "భక్తితో గూడిన దానికే విలువ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొక ధనికుడుండెడివాడు, ఆతనికి వందల కొలది యెకరముల భూసంపద కలదు. కాని దానితో సంతృప్తిని బొందలేదు, వేలకొలది యకరముల నేల ఎచటనైనను చవుకగా లభంచినచో కిని వేయవలెనను తలంపు గలిగి యుండెను. ఇంతలో హిమవత్పర్వత ప్రాంతమున విశాలమగు పీఠభూమి కలదని, అది అరణ్యమందలి కోయరాజుల వశమందు కలదని అతని కెవరో చెప్పిరి. వెంటనే ధనికుడచటకి ప్రయాణము సాగించెను. పట్టణమందు లభించు విచిత్రము లైన ఆటవస్తువులను, తినుబండారములను ఒక పెద్ద బుట్టలో వేసికొని అతడు హిమవత్పర్వత ప్రాంత్రములకు పయనమయ్యెను.\n\nఅచటకి వెళ్లి, కోయరాజును సమీపించి, వారి బిడ్డలకు తాను తెచ్చిన ఆట బొమ్మలను, ఫలహారములను పంచి పెట్టెను. కోయరాజు మహదానందభరితుడై 'సేట్‌జీ' మీరాక యేలకో వచింపుడు! మీయభీష్టమును నెరవేర్చెదను అని మాటయిచ్చెను. వెంటనే ధనికుడు తనకు ఆ పరిసరమున కొంతనేల కావలెనని కోరగా, అందులకు కోయరాజు, అట్లే ఇచ్చెదను. దానికి మీరేమియు క్రయమును గూడ చెల్లింపనక్కర లేదు. ఎంతయో నేల వ్యర్థముగ ఇచట పడియున్నది. దానిని మీరు సాగుచేసికొని ఉపయోగించు కొనవచ్చును. అయితే ఒక షరతుపై దాని నిచ్చెదను. రేపు ఉదయము సరిగా 6 గంటలకు మీ రిచటనుండి బయలుదేరి మీ యిష్టము వచ్చినంత దూరము నడిచి మరల తిరిగి సామంత్రము 6 గంటలకు ఈ చోటికి చేరవలలెను. \"మీరు నడచినంత దూరపు నేలయంతయు మీదే!\" అని కోయరాజు ధనికునకు చెప్పెను.\n\nఆ వాక్యములను వినగానే ధనికుని యానందమునకు మేరలేదు. తన జీవితము కృతార్థమైనదని తలంచెను. తన ఈప్సితము నెరవేరినదని అనందపరవశు డయ్యెను. మరుసటి రోజు ఉదయం 6 గం||లు ఎప్పుడు వచ్చునాయని వేచియుండెను. తెల్లవారిన పిదప సరిగా నిర్ణిత సమయమునకు కోయరాజు వచ్చి ధనికునకు ఒక స్థలము గుర్తుచూపి 'అచ్చోట నుండి ఎంతదూరమైనను నడిచి వెళ్లవచ్చు ననియు, అయితే సాయంత్రము 6 గంటలకు తిరిగి అక్కడకు చేరుకొనవలసియుండు' ననియు ఆదేశించెను. ధనికుడు బహుస్థూలకాయుడు. పొట్టిమనిషి నడక ప్రారంభించెను. నడిచినచో కొద్దిస్థలమే రాగలదనియు, పరుగెత్తినచో చాల స్థలమును ఆక్రమించు కొనవచ్చుననియు తలంచి ధనికుడు వేగముగ పరుగెత్త నారంభించెను. దారిలో ఒక చిన్నకాలువ అడ్డువచ్చెను. దిగిపోయినచో ఆలస్య మగుననియంచి దానిని ఒక దూకు దూకెను. కాలుజారి పడి ఎట్లనో లేచి మరల కుంటుచు పరుగెత్త నారంభించెను. అది గ్రీష్మఋతువు మధ్యాహ్న సమయము ఎండలో మలమలమాడుచు, చెమటకార్చుకొనుచు, పరుగిడుచున్న ఆ ధనికుని అవస్థ చూసి జాలిపడి ఒకరు \"అయ్యా! ఈ పాత్రలోని మంచినీళ్ళు త్రాగి దప్పిక తీర్చుకొనుడు\" అని పాత్ర చేతికివ్వగా ధనికుడు తృణీకరించి \"ఈ సమయమున నన్నేమియు పలుకరించకుడు. మీరిచ్చు నీళ్ళు త్రాగులోపల ఇంకను కొంత స్థలమును నేను ఆక్రమించుకొనగలను\" అని పలికి తన పరుగును కొనసాగించెను.\n\nఈ ప్రకారముగ ఆహారము లేక, నీళ్లు లేక, మండుటెండలో తల తిరుగుచుండ, కాలి దెబ్బలతో వ్యథపడుచు ఆ ధనికుడు ఎక్కువ నేలను సంపాదించవలెనను పేరాశచే ఆరోగ్యమును, దేహస్థితిని గూడ లెక్కచేయక, తిరుగుదారి పట్టి పరుగెత్తి పరుగెత్తి తుదకు ప్రారంభించిన చోటుకు పది గజముల దూరములోనే శోషచే క్రిందపడిపోయెను. కోయరాజు, తదితరులగు స్థానిక పెద్దలు హుటాహుటి అచ్చోటికి పరుగిడి వచ్చిచూడగా, ధనికుడు సృహతప్పి పడియుండెను. అతనినాడి సన్నగిల్లుచుండెను. రెండు మూడు నిముషములకే ధనికుని ప్రాణపక్షి ఎగిరిపోయెను. అందరును చింతాక్రాంతులైరి. ఇక చేయునదేమియు లేక, కోయరాజు ధనికుడు ఎంత పొడుగు ఉండెనో కొలిపించి ఆంత పొడుగు మాత్రము నేలలో గొయ్యి త్రవ్వించి ధనికుని అందులో పూడ్చి పెట్టి సమాధిచేసెను.\n\nజనుల ఆశకు అంతులేదు. అంతులేని ఆశనే తృష్ణయందురు. అట్టి తృష్ణను ముముక్షువులు తప్పక విడనాడవలెను. దానిచే మనుజునకు శాంతి ఏమాత్రముండనేరదు. భగవంతు డిచ్చినదానితో సంతృప్తి నొంది ఉన్న కొలదికాలము ఆ పరాత్పరుని దివ్యనామోచ్చారణాదులందు అనుభూతులందు గడిపి ధన్యత జెందవలెను. చూచితిరా! ఆ ధనికుడు వేలకొలది ఎకరముల నేలను ఒక దెబ్బతో కొట్టివేయవలెనని సంకల్పించినను, అతని వెర్రి యభిలాష నెరవేరకపోగా, తుదకు అతని పొడుగు ఎన్ని అడుగులో అంతమాత్రము నేలయే ఆతనికి దక్కెను. ఆతనికే కాదు, ఎవనికైనను తుదకు దక్కునది అంతమాత్రపు నేలయే. కాబట్టి ఆశాపాశ శతంబులను విచ్ఛిన్నమొనర్చి, తృష్ణను దూరముగ పారద్రోలి, నిత్యసంతృప్తుడై, భగవద్భక్తి యుతుడై మనుజుడు తన జీవితమును పరిశుద్ద మొనర్చుకొని కృతార్థుడు కావలయును.\n\nనీతి: ఆశను వదలివైచి, భోగజాలమును దూరీకరించి, ఉన్న స్వల్పపదార్థముతో సంతృప్తి నొందియుండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 781,
        "IMAGE": "cat_9",
        "NAME": "అంతులేని ఆశ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామములో సదాచారవంతుడగు ఒక గృహస్థుడు కలడు. ఉదయము లేచినది మొదలు స్నానము సంధ్య, జపము, తపము మున్నగు వానిని నియమ పూర్వకముగ చేయనిదే అతడు గంగ ముట్టడు. ఎన్ని ఆటంకములు వచ్చినను అతడు తన ఆచార విచారములను వదలి పెట్టడు. అతని జీవితములో అంతయు సవ్యముగ జరుగుచుండెనుగాని ఒక్క విషయమును తలంచుకొనిన అతడికి పట్టరాని దుఃఖము కలుగుచుండెను. ఏ పూర్వజన్మ దుష్పరిణామమో కాని అతనికి దాంపత్యము సరిగ లేకుండెను. భార్య పరమగయ్యాళి. అతని పవిత్ర మనస్తత్వమునకును ఆమె దురుసుతనమునకును ఏమాత్రము పొత్తు కుదరకుండెను. అందుచే ప్రతిదినము ఇంటిలో ఏదియో రచ్చ, రగడ సంభవించుచుండెను. అతడు ఎంత ఓర్చుకొని సరిదిద్దుకొని పోవుచుండినను ఆమె అంతంత ఎగిరెగిరి పడుచుండెను. ఇక్కారణమున సంసారము నడపుట అతనికి భారభూతముగ తోచుచుండెను? దినదినగండము - నూరేళ్లాయుస్సు అన్నట్లు అతని జీవితరథము పెక్కు ఆటంకములతొ గూడి బాధాకరముగ సాగుచుండెను. అయినను, శివుడు హాలాహలమును మ్రింగినట్లు, ఆ కష్ట నిష్ఠురము లన్నిటిని దిగమింగి ఎట్లో జీవయాత్ర గడుపుచుండెను.\n\nఇట్లుండ కొంతకాలమున కాతని తండ్రియొక్క తద్దినము వచ్చెను. మామూలు రోజులలోనే ఇల్లాలితో నెట్టుకు వచ్చుట కష్టముగా నుండ ఇక తద్దినము జరిపించుట ఎట్లు? అను సమస్య అతనికి తీవ్రముగా బాధింప జొచ్చెను. మరుసటి దినము తద్దినము రానున్నది. బోలెడన్ని పనులు చేయవలసియున్నవి. ఇల్లు అలకుట, ముగ్గులు పెట్టుట, భోక్తలను పిలుచుట, వంట పెద్ద అంతస్తులో చేయుట, పిండివంటలు తయారుచేయుట, పురోహితుని ఆహ్వానించుట, పూజాదికము నెరవేర్చుట, నీళ్లు తోడిపోయుట ఇత్యాది కార్యములెన్నియో చేయవలసియున్నది. భార్యచేత ఒక్కపని చేయించుట అతనికి బ్రహ్మప్రళయముగా తోచుచుండెను. మామూలు రోజులలోనే పనులు చేయక హఠము వేసికొనుచుండు అగృహిణితో తద్దిన కార్యములెట్లు చేయించగలడు. అందుచే రేపటిదినం పితరుల కార్యమెట్లు సాధించగలవు? అని ఆలోచించి ఆలోచించి తెమలక తుట్టతుదకు ఊరి బయట ఏకాంతముగ ఆశ్రమములో ఉన్న తన గురువుగారి యొద్దకు ఆరాత్రికి రాత్రే పయనమై పోయెను.\n\nఆశ్రమము చేరి గురుదేవునకు దండప్రణామంబాచరించి 'మహాత్మా! పాహి మాం! పాహి మాం!' అనికంట తడిపెట్టుకొని ప్రార్థించెను. గురువుగారు ఆశ్చర్యపడి ఆ నిశీథ సమయములో అతడెందులకు అంత ఆతురతతో వచ్చెనో అర్థముకాక \"నాయనా! జపధ్యానాదులు చక్కగా సలుపుచున్నావా? మనస్సు ఏకాగ్రముగా నిలుచు చున్నాదా? ఏకారణముచేత ఇంతరాత్రి సమయమున వ్యాకులుడవై ఇచ్చటికి వచ్చితివి?\" అని ప్రశ్నింప గృహస్థు డీప్రకారముగ ప్రత్యుత్తర మిచ్చెను.\n\n\"గురుదేవా! ఏమని చెప్పుదును? నాఅవస్థ ఆ పరాత్పరునకే తెలుసును. నాజీవితములో అన్నియు అనుకూలముగా నున్నవి. అమ్మ గారి విషయము తమకు తెలియనిది కాదు. మాఅర్థాంగి గారు అన్నిటికి అడ్డుచెప్పుచునుందురు. ఆమెచేత ఒక్కపనీ సవ్యంగా చేయించలేకుండ ఉన్నాను. మామూలు రోజులలో నైతే ఎటులనో సరిదిద్దుకొని కాలక్షేపము చేయుచు నెట్టుకు వచ్చుచున్నాను. కాని రేపు ఒక ప్రత్యేకమైన కార్యక్రమము కలదు రేపు మా తండ్రిగారి తద్దినము ప్రొద్దున మొదలు కొని రాత్రివరకు ఊపిరి తిరగని పనులు కలవు. మరి ఆ లలనామణితో ఇవన్నియు సాధించుట ఎటులనో నాకు అర్థము కాకున్నది. వేద వేదంతములలొ జటిలతమము లైన సిద్ధాంతముల నెన్నిటిలో విడదీయగలిగిన నాకు ఈ గృహ కల్లోలము ఒక పెద్ద సమస్యయై కూర్చున్నది. మహాత్మా! నాకు ఏమియు తోచుటలేదు. తమరే నాకు దిక్కు' రేపటి తద్దినము సవ్యముగా ప్రశాంతముగా జరుగుట కేదైన ఉపాయమును తమరు నాకు సెలవీయగోరుచున్నాను. ఇదే నావినతి. అనుగ్రహింపుడు. ఆశీర్వదింపుడు, కష్టకాలములో దరికి జేర్చి దీవించుడు!'\n\nగృహస్థుని ఆ దీనవచనముల నాలకీంచి గురుదేవు డతని చెవిలో రహస్యముగా ఏమియో కొన్ని వాక్యములను నుడివి పంపివేసెను. వెంటనే అతడు తన గృహమునకు పోయి భార్యను పిలిచెను. ఆమె రాగా అపుడు వారిరువురికిని ఈక్రింది సంభాషణము నడచెను.\n\nభర్త: కాంతామణి! రేపటిదినం మానాయన తద్దినం విషయం నీకు తెలుసుకదా! ప్రతి సంవత్సరము ఆయనగారి తద్దినం పెడుతున్నాను. కాని ఈ సంవత్సరం మానేద్దామనుకుంటున్నాను.\n\nభార్య: అట్లామానెయ్యటానికి వీలులేదు. తద్దినం తప్పక పెట్టి తీరాల్సిందే.\nభర్త: సరే, ఏదో నీమాట ప్రకారం తద్దినం పెడ్తాను గాని భోక్తలను పిలవ దలంచలేదు.\nభార్య: పిలిచి తీరాల్సిందే.\nభర్త: సరే, ఏదో నీ మాట ప్రకారం పి్లుస్తానుగాని వారికి పిండివంటలేవీ చేయవద్దు. మామూలు భోజనం మాత్రం పెడితేచాలు.\nభార్య: భోజనంతో పాటు పిండివంటలు చేసి తీర్తాను. ఒక్కగారెలే కాదు బూరెలూ చేస్తాను.\n\nఅమ్మగారి ధోరణికి గృహస్థుడు లోలోన పరమ సంతోషమును బొందుచుండెను. 'ఆహా! గురుదేవు డెట్టీయుక్తిని భోధించి కార్య సాఫల్యమునకు దోహద మొనర్చెను.!' అని తనలో తాను భావించుకొని అమందానందమును బొందెను. మరుసటి దినమున తద్దిన కార్యము దివ్యముగా జరిగిపోయెను.\n\nకథలోని ఆడపడుచువలె మనస్సు ఒక గయ్యాళిది. ఏది చేయమని మనము దానికి చెప్పుదొమో దానికి విరుద్దముగ చేయదొడగును. కాబట్టి దానిని బహుజాగ్రత్తగా వశమొనర్చుకొనవలెను. శక్తితోబాటు యుక్తిని కూడ జోడించి దానిని మెల్లగ దారికి తీసికొని రావలెను. అంతియేకాని హఠముగ దానిని లొంగదీయరాదు. హఠము ఉపయోగించినచో అది తిరగబడును. అపుడు సాధకుడు నానా బాధలను పొందవలసివచ్చును. లాలయేత్‌ చిత్త బాలకమ్‌' అని పెద్దలు చెప్పినట్లు మనస్సును లాలించి, పాలించి, బోధించి నయమూగనే అశము చేసికొన వలయును.\n\nనీతి: మనస్సునకు తిరుగబడు స్వభావము కలదు, కావున దానికి నయముగ హితబోధచేసి యుక్తితో జయించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 782,
        "IMAGE": "cat_9",
        "NAME": "గయ్యాళి మనస్సు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "మనస్సు ఊరకున్నచో ఏవేవో వ్యర్థమైన సంకల్పములు చేయుచుండును. కావున దానికి నిరంతరము ఏదైన దైవసంబంధమైన కార్యముగాని, ఉపయోగకరమైన ప్రపంచకార్యము గాని ఇచ్చుచుండవలెను. ఊరకున్నచో మనస్సు తమోగుణమును ఆశ్రయించుటయో, నిరర్థకములైన చింతలుగావించుటయో జరుగుచుండును. కావున అట్టి పరిస్థితికి మనస్సు దిగజారకుండ పుణ్యకార్యములందు, లోకోపకార కార్యములందు అద్దానిని సదా వినియోగించు చుండవలెను. ఊరక నుండి తానేదో విశుద్ధసత్త్వస్థితి యందున్నాననియు, తురీయాతీత పదవిని పొందినాననియు సామాన్యుడు తలంచవచ్చును. కాని అది పొరపాటు. అకర్మణ్యత్వమును నైష్కర్మ్యస్థితిగా ఎవరును భావించరాదు. వాసనలు క్షీణించినపుడే మనస్సు నైష్కర్మ్యస్థాయిని అందుకొనగలదు. వాసనాసహితుడు ఊరకనున్నను కొండంతకర్మను ఆచరించుచున్న వాడే యగును. అది బంధమును తొలగించక పోగా పైపెచ్చు ఇంకను దృఢపరచుచుండును. కావున మనస్సును ఊరకనుంచక ఏవైన దైవకార్యము లందుగాని, పరోపకారయుతములగు ధర్మ పూర్వకములైన ప్రాపంచిక కార్యములందుగాని దానిని ప్రవేశపెట్టి ముందుగ దానిని పవిత్రముగ నొనర్చవలెను. అంతియేకాని ఊరక నుంచరాదు. అట్లు ఊరక నుంచినచో కథలోని రాక్షసునివలె అపకారము చేయగలదు - ఎట్లనిన -\n\nపూర్వమొకానొక గ్రామమున ఒక రైతు కలడు. అతడు ఆగర్భ శ్రీమంతుడు. అతని తండ్రి పెద్దరైతు. అతని తాతయు పెద్దరైతే. అతని వంశస్థులందరు గొప్ప భూస్వాములు, అతనికి కొన్ని వందల ఎకరముల భూస్థితి కలదు. ముప్పది జతల ఎద్దులు కలవు. నూరుమంది సేద్యగాళ్లు నిరంతరము అతనిక్రింద పనిచేయుచుందురు. అంతటి భూస్వామి ఆ చుట్టుప్రక్కల ఎక్కడకుడా లేడని వదంతి.\n\nఇంత ఆర్భాటముతో కూడియున్నప్పటికిని, ఇన్ని సిరిసంపదలతో వెలయుచున్నప్పటికి అతనికి మనశ్శాంతి లేకుండెను. పనులలో రోజంతయు మునిగియుండుట వలన అతనికి కించిత్తైనను విరామము లేకుండుటవలన మనస్సు అశాంతియుతముగ వర్తించుచుండెను. కొన్ని వందల ఎకరముల సేద్యము జరుగవలసి యుండుట వలనను, నమ్మకమైన మనుష్యులు అజమాయిషీ చేయువారు కొరతపడి యున్నందునను, తానే స్వయముగా అన్నిపనులు చూడవలసి వచ్చుట చేతను అతని మనస్సు మిక్కుటముగ ఆందోళన చెందుచుండెను. శాంతిలేదు. సుఖము లేదు, నిద్రలేదు, విశ్రాంతిలేదు. ఈ స్థితిలో పడిపోయి దారి తెన్నుగానక తుట్టతుదకు భగవంతుడే తనకు సహాయము చేయగలడని యెంచి బ్రహ్మదేవుని గూర్చి ప్రార్థన చేయదొడగెను. వ్రతములు, జపములు చేయనారంభించెను.\n\nకొంతకాలమునకు బ్రహ్మదేవుడతనికి ప్రత్యక్షమై ఏదైన వరము కోరుకొనుమని ఆజ్ఞాపించెను. వెంటనే రైతు బ్రహ్మదేవునితో నిట్లు సవినయముగ బల్కెను. \"మహాత్మా! నేనొక ప్రత్యకమైన ఉద్దేశ్యముతో ముమ్ములను ధ్యానించితిని. నాకు లెక్కలేనన్ని పనులున్నవి. వానిని నిర్వర్తించలేకున్నాను. ఈ పనులతో నాకు విసుగు పుట్టుచున్నది. ఎవరైన వీనిని నిర్వర్తించిన గాని, లేక నిర్వర్తించుటలో నాకు సహాయపడిన గాని నేనెంతయో ఆనందించెదను. ఇది యొక్కటియే నాయభీష్టము. అని విన్నవించుకొనెను. వెంటనే బ్రహ్మదేవుడు \"అట్లే యగుగాక! నీ పనులన్నిటిని తృటిలో నెరవేర్చగల సామార్థ్యమున్నట్టి వ్యక్తిని నీయొద్దకు పంపెదను. అతడొక రాక్షసుడు. అతనికి ఎప్పుడును ఏదియో యొక పనిని నీవు ఇచ్చుచునే యుండవలెను. ఎన్ని పనులైన అతడు చేసి వేయగలడు. కాని అతనిని ఖాళీగా నుంచరాదు. అట్లు ఖాళీగా నుంచినచో అనగా నీవు ఏపనియు అతనికి ఇవ్వక ఊరక నుంచినచో అతడు నిన్ను మ్రింగివేయగలడు. ఈ షరతుపై ఆ రాక్షసుని నీకు ఒప్పచెప్పుచున్నాను\" అనెను. బ్రహ్మదేవుని ఆ వాక్యములను విని రైతు ఆనందపడి \"దేవా! నే నతనిని ఖాళీగా పెట్టియుంచను! నాకు వేలకొలది పనులు సిద్ధముగ నున్నవి. ఒక్కొక్కటి అతనికి చెప్పుచుందును. నాజీవిత పర్యంతముగూడ అతనిని ఊరక నుంచను. కావున ఆ రాక్షసుని నాకు దయచేయుడు\" అని ప్రార్థించెను. \"తథాస్తు\" అని పలికి బ్రహ్మదేవుడంతర్ధానము నొందెను.\n\nతత్‌క్షణమే రాక్షసుడు ప్రత్యక్షమై రైతును పనియిమ్మని అడిగెను. రైతు \"ఓయీ! రాక్షసుడా! మాకు ఉన్న మూడు వందల ఎకరముల పొలమును నాలుగుసార్లు చక్కగా దున్నుము!\" అని ఆజ్ఞాపించెను. ఆ వాక్యములను వినుటయే తడవుగా రాక్షసుడు పరుగెత్తికొనివెళ్లి ఆ పొలమునంతను ఒక అరగంటలో దున్నివైచి తిరిగివచ్చి \"పని\" అని గద్దించెను. రైతు ఓయీ! పది అంతస్తులు గల దివ్యమైన భవనము నొకదానిని నిర్మింపుము\" మని ఆజ్ఞాపించెను. వాడు ఒక గంటసేపాటిలో ఉత్తుంగభవన మొకదానిని నిర్మాణము చేసివైచి రైతుతో \"తరువాత పని ఏమి?\" అని అడిగెను. పనుల లిస్టుచూచి రైతు మూడవ దానిని చెప్పెను. కాని వాడు గడియలో దానిని పూర్తిచేసి తిరిగి వచ్చుచుండెను.\n\nఈ ప్రకారముగ ఒక వారము దినములలో రైతుయొక్క పనులన్నిటినీ రాక్షసుడు సమాప్తము చేసివైచెను. ఇక పనులెవ్వియు లేవు. ఖాళీగా నుంచినచో రాక్షసుడు తనను మ్రింగివేయునను భయముతో రైతు ఊరు వెలుపలగల తన గురువు నొద్దకు రివ్విన పోయి సాష్టాంగ నమస్కార మాచరించి \"గురుదేవా! పాహిమాం!\" అని శరణువేడెను. జరిగిన విషయము అంతయు నివేదించి కరాళపదనుడగు ఘోరరాక్షసునకు తన్ను బలికాకుండ కాపాడుమని యతడు తన గురుదేవుని ప్రార్థించెను. తోడనే గురువాతని చెవిలో ఏదియో రహస్యము చెప్పి ధైర్యము గరపి పంపివైచెను.\n\nరైతు ఇంటికి రాగానే రాక్షసుడు అడ్డుపడి \"పని\" అని యడిగెను. రైతు వానిని వూరివెలుపలకు తీసుకొని వెళ్లి అక్కడ గల ఒక పెద్ద తాటిచెట్టును చూపించి దానిని ఎక్కుమనెను. రాక్షసుడు తృటిలో దానిని ఎక్కివైచి \"పని\" అని యడిగెను. చెట్టుపైనుండి దిగు - ఇదియేపని. అని రైతు చెప్పెను. రాక్షసుడు చెట్టు పైనుండి గంతువేసి దిగి \"పని\" అని యడిగెను. చెట్టు ఎక్కు అని రైతు పలికి \"ఓ రాక్షసుడా! ఇకమీదట నన్ను పదేపదే పని అడుగవద్దు. చెట్టు ఎక్కిన పిదప దిగుతూ ఉండు, దిగిన పిదప ఎక్కుతూ ఉండు - ఇదే నీపని\" అని శాసించెను. రాక్షసుడు అట్లే నూరు పర్యాయములు చెట్టు ఎక్కి దిగి తుదకు విసుగుపుట్టి చెప్పకుండా పారిపోయెను. రైతు గుండెబరువు తీరిపోయెను.\n\nకథలోని రాక్షసుడు ఏపనీ లేనిచో ఎట్లు అపకారము చేయునో, అట్లే మనస్సు వూరకనున్నచో లేనిపోని సంకల్పములను గావించుకొనుచు మనుజుని అధోగతికి త్రోసివేయును. కాబట్టి ముముక్షువగు వాడు మనస్సునకు నిరంతరము ఎదైన దైవకార్యముగానీ, సద్గ్రంథ పఠనముగాని, ఆత్మవిచారముగానీ, లోకసేవాది వ్యవహారముగాని, ఒసంగి పవిత్రముగా నొనర్చువలెను. వాసనా రహితముగ గావించవలెను. వ్యర్థముగ సోమరిగ దానిని, ఎన్నటికిని ఉంచరాదు. ఇదియే సాధకుడు గమనించదగిన ముఖ్య విషయము.\n\nనీతి: మనస్సును ఊరకనుంచరాదు. ఏదైన ఆధ్యాత్మిక కార్యక్రమమును దానికివ్వవలెను. ఊరకనున్నచో వ్యర్థమైన సంకల్పములు చేయుచుండును. కాబట్టి ధ్యాన, పఠన సేవాదికార్యములందు దానిని వినియోగించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 783,
        "IMAGE": "cat_9",
        "NAME": "మనస్సును ఊరక నుంచరాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక దేశమున ఒకరాజు కలడు. అతడు తన దేశప్రజల యెడల ఎంతయో దాక్షిణ్యము కలవాడై, దయార్ద్రహృదయముతో వారలను చక్కగా పరిపాలించుచుండెను. ఇట్లుండ కొంతకాలమునకు ఆ రాజునకు తీవ్రమైన నేత్రవ్యాధి సంభవించెను. ఎండలోనికి వచ్చుటయే తడువుగా అతని నేత్రములనుండి నీరు కారజొచ్చెను. ఆ వ్యాధి వలన మిక్కుటమగు బాధనొంది రాజు ఎందరో నిపుణులగు వైద్యులను పిలువనంపించి వారిచే కండ్లను పరీక్షచేయించుకొని, వారి ఇచ్చిన ఔషధములను సేవించుచు బహుకాలము చికిత్స గావించుకొనెను. కాని దురదృష్టవశముచే వ్యాధి ఏమాత్రము శమించలేదు. పైగా కంటి బాధ ఇనుమడింపజొచ్చెను. రాజునకు ఏమిచేయవలేనో తోచలేదు. 'శరీరమాద్యంఖలుధర్మసాధనమ్‌' అని పెద్దలు చెప్పినట్లు దేహము ఆరోగ్యముగ నుండిననే గదా ఏవైనా ధర్మకార్యములు సాధించుటకు వీలుపడును! నేత్రజనిత సంతాపముచే విసుగెత్తి జీవితము పైననే విరక్తిని బొందిన ఆ రాజు ఆరోగ్యముకొరకై మార్గాంతరములను యోచించుచుండెను.\n\n\"సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్‌\" అనునట్లు ఇంద్రియములన్నిటిలో నేత్రము ప్రధానమై యుండుటవలన, నేత్రబాధవలన అన్ని రాచకార్యములందును రాజు నిరుత్సాహమును చూపుచుండెను. మంత్రులతోను సామంతులతోనూ అతడు సరిగా మాట్లాడుటలేదు. ప్రజాప్రతినిధులను తనభవనములోనికి రానిచ్చుటలేదు. ఈప్రకారముగ రాజుగారి నేత్రవ్యాధి రాచక్కార్యము లన్నింటికిని పెద్ద అవరోధముగా పరిణమించెను.\n\nఇట్లుకొంతకాలము గడిచిన పిమ్మట ఒకానొక దినమున ఒక భిషగ్వర్యుడు నృపాలుని సమీపించి, 'మహారాజా! నీ నేత్రబాధను నేను ఉపశమింపజేసెదను. నేను చెప్పినట్లు మీరు తప్పక ఆచరించ వలెను' అని చెప్పగా బాధోపశమనమునకై పరితపించుచున్న భూపతి అందులకు సమ్మతించెను. అపుడు వైద్యశేఖరుడిట్లు సెలవిచ్చెను - మహాత్మా! ఆకుపచ్చరంగు కంటికి చాల ఇంపుగా నుండును. అది కంటికి చలువను కలుగజేయును. కాబట్టి ఓరాజా! మీరు ఉదయము నిద్రలేచినది మొదలు మరల పరుండువరకును ఆకుపచ్చ వస్తువులను తప్ప అన్యమును వేనిని చూడవద్దు. అట్లుచూచితిరా, మరల వ్యాధి ముదిరిపోవును' అని సలహా నొసంగగా రాజు మిగుల సంతసించి వ్యాధీనివారనమునకు చక్కటి సదుపాయము లభించినదికదా యని సంతుష్టాంతరంగుడై తత్‌క్షణమే అమాత్యశేఖరుని పిలిపించి ఆతనితోనిట్లు పలికెను - మంత్రిగారూ! నానొప్పి తగ్గుటకు, నేత్రవ్యాధి ఉపశమించుటకు వైద్యుడు ఆకుపచ్చవస్తువులనే చూచులాగున చెప్పి యుండెను. కాబట్టి ఉదయము నిద్రలేచినది మొదలు రాత్రి పరుండు వరుకును నాదృష్టి పథమున పడు సమస్త పదార్థములకును భవనములకును వాహనములకును ఆకుపచ్చరంగు వేయించుడు. ఇక్కార్య సాధనమున ఎంత ద్రవ్యమును వినియోగించుటకైనను నేను సంసిద్ధముగా నున్నాను. మీరు మాత్రం వెనుకంజవేయకుడు, అన్యథా భావింపకుడు. నేను చెప్పినట్లు చేయుడు.'\n\nరాజుయొక్క ఆ వాక్యములను విని, అతని ఆదేశమును శిరసావహించి మంత్రులు కొన్ని లక్షల రూప్యములను ఖర్చుచేసి బండ్ల నిండుగా ఆకుపచ్చ రంగు తెప్పించి పట్టణములోని ఇండ్లకు, రాజప్రసాదములకు దానిని పూయించుచుండిరి. ఈపని నిమిత్తము సుదూర ప్రాంతముల నుండి కొన్ని వేలమంది కార్మికులు రప్పించబడిరి. వారు అహోరాత్రులు కృషిచేయుచు రంగు పూయుటలో నిమగ్నులై యుండిరి.\n\nసరిగా అదే సమయమున ఒక సాధువుగారు ఆపట్టణమునకు వచ్చుట తటస్థించెను. రంగుపూయుచున్న ఆ దృశ్యమంతయు చూచి అతడు ఆశ్చర్యచకితుడై, దీనికి కారణమేమి? ప్రజల సొత్తును ఈ ప్రకారముగ రాజు దుర్వినియోగ పరచుట న్యాయమేనా? అని యోచించి నేరుగా 'రాజు వద్దకు వెళ్ళి రాజా! ప్రజల ద్రవ్యమును ఈప్రకారముగ వ్యర్థము చేయుట మీవంటి పెద్దలకు తగునా?' అని ప్రశ్నింప అందులకు రాజు తన నేత్రవ్యాధిని గూర్చియు, వైద్యుల సలహాను గూర్చియు చెప్పగా సాధువుగారు ముక్కుమీద వ్రేలు వేసికొని 'రామ రామ, ఎంత అవి వేకముతో గూడిన పనిని మీరు చేసితిరి? వస్తువులకు ఆకుపచ్చరంగు వేయవలెనా? ఆకుపచ్చ అద్దములు గల కండ్లజోడును ధరించినచో ప్రపంచమంతయు ఆకుపచ్చగా కనబడును గదా! ఎంతడబ్బు వృథా చేసితిరి!' అని హితవు చెప్పి వెడలిపోయెను. రాజు సాధువరేణ్యుని సమయస్పూర్తిని మెచ్చుకొని ఆకుపచ్చని కండ్లజోడును ధరించి తన నేత్రవ్యాధిని తొలగించుకొనుటయే కాక రంగుకొట్టుటను ఆపుటచేసి మిగిలిన ధనమును సద్వినియోగపరచి ప్రజల యొక్క మన్ననలకు పాత్రుడయ్యెను.\n\nనీతి: మనుజుడు తన దృష్టిని జ్ఞానమయముగ నొనర్చుకొని ప్రపంచమును బ్రహ్మమయముగ గాంచుచు పరమశాంతిని అనుభవించవలయును.\nదృష్టిం జ్ఞానమయీం కృత్వా\nపశ్యేత్‌ బ్రహ్మమయం జగత్‌\n\nప్రపంచము ఎట్లున్నను తన దృష్టిని పవిత్ర మొనర్చుకొనినచో చాలును; విశ్వమంతయు ఆనందమయముగ గోచరించును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 784,
        "IMAGE": "cat_9",
        "NAME": "జ్ఞానదృష్టి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "దండధరుడనగా యమధర్మరాజు. పూర్వము ఒకానొక భక్తుడు భగవద్ధ్యానమందు మిక్కుటమగు ఆసక్తి కలిగి ఏకాంతస్థలము నభిలషించినవాడై తన గ్రామము వదిలి బహుదూరము పాదచారియై పోవుచుండ ఒకచోట చక్కని నవప్రదేశము, సమీపముననే నిర్మలజలముతో గూడి ప్రవహించుచున్న నది అతనికి దృగ్గోచరమైనది. ధ్యానమునకు దైవచింతనకు అనువైన ప్రదేశము లభించెనుగదా అని అతడు పరమానంద భరితుడై ఆ నదితీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని, వన మందలి ఫలాదులను ఆహారముగ గైకొనుచు తపస్సు చేసికొనిచుండెను.\n\nఒకనాడతని చిత్తఫలకమున అకస్మాత్తుగ ఒక ఆలోచన పొడమెను. బొందితో వైకుంఠమునకు ఎవరును పోలేరా? ఈ శరీరముతోనే భగవంతుని ప్రత్యక్షముగా చూడలేరా? ఏమైనను సరియే! ఆపనిని నేను సాధించి తీరవలెను. ఆరు నూరైనను అక్కార్యమును నేను వదలను. దానిని నెరవేర్చుటకు కంకణము కట్టుకొందును. ప్రయత్నశీలునకు, తీవ్రఅధ్యవసాయము కలవానికి లోబడనిపని ప్రపంచమున ఏదియు నుండజాలదని పెద్దలవాక్యము. కావున భగవంతుని ఈశరీరముతోనే ప్రత్యక్షముగా గావించుటకు యత్నించెదను' అని దృఢనిశ్చయము గావించుకొని, అక్కార్యమును సాధించుటకై అకుంఠిత దీక్షవహించి తపస్సున కుపక్రమించెను.\n\nకొంతకాలము గడచిన మీదట ఒకదినము ఆ భక్తుడు తన నిత్యదైవకార్యక్రమమును పూర్తి చేసికొని ధ్యానమును విరమించి కన్నులను తెరచి చూడగా కట్టెదుట ఒక బ్రహ్మాండాకారము కలిగిన వ్యక్తి చేత గదను ధరించి నిలబడి యుండుటను చూచెను. భక్తునకు అత్యాశ్చర్యము కలిగెను. ఈతడెవడు? ఇట్టి ఏకాంతస్థలమునకు ఏల వచ్చెను?\" అని తనలో వితర్కించుకొని సంభ్రమచిత్తుడై కొంతసేపటికి తెప్పరించుకొని ధైర్యమును కుడకట్టుకొని \"నీ వెవరవు?\" అని భక్తుడు అగంతకుని ప్రశ్నించెను. వెంటనే ఆ పర్వతాకారుడగువ్యక్తి ఓయీ \"నేను యముడను. నీ ఆయుస్సు తీరినది. కాబట్టి నీప్రాణములను అపహరించుకొని పోవుటకు వచ్చినాను, అని గంభీరముగ పలికెను. ఆ వాక్యములను విని భక్తుడు 'మహాత్మా! అట్లేయగుగాక! కాని బహుకాలమునుండి నేనొక ఉద్దేశ్యముతో తపంబొనరించుచున్నాను. దానిని తాము నెరవేర్చగలరని నా నమ్మకము. శరీరముతో భగవంతుని సాక్షాత్తుగా దర్శింపవలెననే నాయభీష్టము. దయచేసి తామట్టివరమును నాకు ప్రసాదించ ప్రార్థన. తమవంటి మహనీయులకిది అలవికాని పని కాదు. భక్తుని మొరయాలకించి దండధరుడు సంతసించినాడై ఓయీ నీ తీవ్రతపస్సునకు నేను మెచ్చినాను. నీ కోర్కెను నెరవేర్చెదను. నా వెంటరమ్ము. ఇపుడే నీకు ఈ తనువుతో భగవద్దర్శనమును గావింపజేసెదను' అని పలికెను.\n\nవైవస్వతుని వాక్యములు భక్తుని కర్ణపుటములందు బడగనే ఆతడు అమితానందముచే ప్రపుల్లహృదయుడై, అట్లే తమ వెంట వచ్చెదననిచెప్పి యమధర్మరాజును అనుసరింపదొడగెను. యముడు గదను ధరించి ముందు చనుచుండ వెనుక భక్తుడు వినయ విధేయతలతో నడచుచుందెను. కొంత దూరమేగిన పిదప భక్తుడు యముని సంబోధించి మహాత్మా! తమచేతిలోని గదను చూచుచుండినకొలది నాగుండె బ్రద్ధలగుచున్నది. భయకారణమున నా నడక తొట్రుపడుచున్నది. కాబట్టి దయచేసి ఆ గదను నాచేతికిచ్చినచో నేను నిర్భయముగ తమవెంట వచ్చుటకు వీలుండును అని వచించెను. భక్తుని వింతధోరణి చూచి యముడు లోలోన నవ్వుకొని, గద అతనికిచ్చినచో వచ్చిన నష్టమేమి అని భావించుకొని, గదను భక్తునకొసంగి తాను ముందు పోవుచుండెను. భక్తుడు గధాధరుడై వెనుక వచ్చుచుండెను.\n\nఇంతలో వైకుంఠము సమీపించెను. యముడు భక్తునితో 'నాయనా! ఇది వైకుంఠము. నీవు పురములోనికి వెళ్ళి భగవంతుని సందర్శించుకొని త్వరితముగా రమ్ము. నేను బయట నీకొరకు కనిపెట్టుకొని ఉందును. జాగుచేయకుము అనిచెప్పి పంపెను. భక్తుడు అట్లే వైకుంఠ పురములోనికి ప్రవేశించి భగవంతుని దర్శించి అతని సన్నిధానమందే కూర్చొనెను. దైవసాన్నిధ్యశ్రీని అనుభవించుచు పరమానందమును బడయుచు అతడు బాహ్యజగత్తునే విస్మరించెను. ఈప్రకారముగ చాలాసేపు గడచినది. భక్తుని కొరకు వేచివేచి యమునకు విసుగెత్తి పోయినది. ఎంతసేపు చూచినను భక్తుడు బయటకు రాడయ్యే. చివరకు యమధర్మరాజు తానే స్వయముగా లోనికేగి చూడ భక్తుడు దైవసన్నిధిలో నిర్భీకుడై కూర్చొని యుండెను. యముడతనిని సంజ్ఞ చేసి పిలిచెను. కాని భక్తుడు యముని వైపు ముఖమైనను త్రిప్పక దైవసాన్నిధ్యజనిత మహదానంద సాగరమున గ్రుంకులిడుచు నుండెను. ఇక లాభము లేదనుకొని యముడు తెగించి లోనికేగి బయటకు రమ్మని సంబోధించెను. ఆ వాక్యమును విని భక్తుడు \"మహాత్మా! ఇంతటి చక్కని వాతావరణమును విడిచి పెట్టి నేను ఏట్లురాగలను? మందారకమకరందమాధుర్యమునుగ్రోలు మధుపంబు దానిని విడిచి పెట్టి నీరసస్థానము లకు చనునా? ఆహా! ఈ వైకుంఠమున భగవత్సాన్నిధ్యమున ఎంతటి ఆనందము! నా జీవితము ధన్యమైనది. ఇట్టి స్థానము విడిచిపెట్టుటకు నా మనస్సు ఒప్పుటలేదు. ఓయమధర్మరాజుగారూ! క్షమించుడు! నేను శ్రీమన్నారాయణుని చరణసాన్నిధ్యమును విడిచి రాజాలను. తమరు దయచేయవచ్చును.\n\nభక్తుని యావాక్యములను విని దండధరుడు ఆశ్చర్యచకితుడై భక్తుని తనవెంట పంపులాగున నేరుగా భగవంతునితోనే మొరపెట్టుకొనెను. శ్రీమహావిష్ణువు యమునితో 'ఓ యమధర్మరాజా! నా లోకమునకు వచ్చి నా శరణ్యమును బొందిన భక్తునకు ఇక మృత్యుభయమెక్కడిది! ఈతడిచటనే శాశ్వతానందము నొందుచుండును. కాబట్టి ఇక మీరు వెళ్లవచ్చును'. అని పలుకగా యముడు గత్యంతరము లేక వెడలిపోయెను. కొంతదూరమేగిన పిదప గదమాట జ్ఞాపకమునకు వచ్చి వెనుకకు తిరిగి వెల్లి యముడు భక్తునితో తన గద ఇచ్చివేయమని యడుగగా 'ఈ గదా మీకిచ్చినచో అందరిని బాధించెదరు. కాబట్టి నేను ఇవ్వనే ఇవ్వను' అని భక్తుడు పలికెను. అంతట విష్ణుభగవానుడు భక్తునకు హితవుచెప్పి ఆగదను దండధురునకు ఇప్పించి \"ఓ యమధర్మరాజా! ఇక మీదట ఎపుడును జనుల ప్రాణములు తీయుటకై మీరు వెడలు నపుడు వారికి కనిపించరాదు. అట్లు కనిపించినందు వలన గదా మీకిట్టి అవమానము తటస్థించినది!\" అని యమునితో పలికెను. ఆ వాక్యములను విని యమధర్మరాజు వైకుంఠమును విడిచెను. అప్పటి నుండియు దండధరుడు ఎవరికిని కనిపించకుండా వచ్చి ప్రాణములు పెకలించుకొని పోవుచుండెను.\n\nనీతి: భగవంతుని ఆశ్రయించినవారికి మృత్యుభయముగాని మరి ఏలాటి ఇతర క్షేశములుగాని ఉండజాలవు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 785,
        "IMAGE": "cat_9",
        "NAME": "దండధరుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామమున విద్వాంసుడు అయిన గృహస్థుడొకడు కలడు. అతనికి పూర్వజన్మ పుణ్యసంస్కారము వలన చక్కని దైవభక్తి ఏర్పడినది. లక్ష్మీ, సరస్వతి, అతని యందు మేళవించి అద్భుతముగ ప్రకాశింపదొడగెను. విద్వత్తు, విద్వత్తుతోబాటు సంపద, సంపదతో బాటు దైవభక్తి అతనియందు చక్కగ విరాజిల్లుచుండెను. ఇట్టి కలయిక లోకములో చాల అపురూపము. కనుకనే ఆ గ్రామస్థు లందరును ఆ గృహస్థునియెడల పూజ్యభావము గలిగి యుండిరి.\n\nప్రతి దినము ఆ గృహస్థునియింట సత్కాలక్షేపములు జరుగుచుండెను. ఆధ్యాత్మిక ప్రవచనములు, పరమార్థగోష్ఠులు అనుదినము అచ్చోట ఏర్పాటు చేయబడుచుండెను. జిజ్ఞాసువులు, ముముక్షువులు, పరమార్థదృష్టి కలవారు, పెక్కురు ప్రతిరోజు అచ్చటికి వచ్చి ఆ సత్కాలక్షేపములందు పాల్గొని సత్సాంగత్యశ్రీని అనుభవించి జన్మ పావనము కావించుకొనుచుండిరి. యజమానుడగు ఆ గృహస్థునకు భాగవతము పై మిక్కుటమగు ప్రీతి కలదు. అందుచే అద్భుతవాక్పటిమ గలిగియున్న ఒకానొక పండితునకు వేతనమిచ్చి తన గృహమందు ప్రతిదినము భాగవతకాలక్షేపము జరిపించుచుండెను. శ్రావ్యమగు కంఠము, వాక్చమత్కృతి, బోధనా నైపుణ్యము, పాండిత్యప్రకర్ష కలిగియున్న ఆ పండితునిచే గావింపబడుచున్న భాగవత ప్రవచనమును వినుటకై జనులు ఆ గృహస్థుని యింటికి బండ్లు కట్టుకుని అనేకులు కుటుంబసమేతముగ వచ్చి భాగవతశ్రవణము చేయుచు మహదానందము ననుభవించి చుండిరి.\n\nఇట్లుండ ఒకనాడు భావగతమునందలి ప్రహ్లాదోపాఖ్యానము కాలక్షేపము జరుగుచుండగ, గృహస్థుని విశాలసదమమంతయు భక్తవరేణ్యులచే కిక్కిరిసియుండ, భక్తిరసము ఉట్టిపడునట్లు పండితోత్తముడు ప్రబోధము సలుపుచుండ సభాసదు లందరు భక్తిపారవశ్యములో మునిగి, తదేకనిష్ఠులై ఆలకించుచుండిరి. వారిలో కొందరి నేత్రముల నుండి ఆనందబాష్పములు రాలుచుండెను. ఆ దృశ్యమంతయు చూచి గృహస్థుడు సంతోషముతో ఉప్పొంగి పోవుచుండెను. 'ఆహా! నాగృహమెంత పావనమై పోయినది. ఒక్కభక్తుడు దైవచింతనా తత్పరుడై నాయింటియందు క్షణకాలము వసించినచో పదితరములవరకు నా వంశమంతయు తరించిపోగలదు. ఒక్క భక్తుడు దైవకథాప్రసంగమున ఆనందపరవశుడై, కంటివెంట ఆనందబాష్పములు కార్చినచో, అట్టి ఆనందాశ్రవుల సంస్పర్శచే నాదేహమంతయు పరమపవిత్రమై యలరారగలదు. ఆహా! నాజన్మము ధన్యమైనది. భగవంతుడు నాకెంతయో సిరిసంపదలను ఒసంగి యుండెను. వానిని సార్థకపరుచుటకై ఇపుడొక చక్కటి ఏర్పాటు కావించెదను' అని నిశ్చయించి యాగృహస్థుడు నాటి కాలక్షేపమంతయు పూర్తి అయున తదుపరి అచ్చోట సమావేశమైన భక్త కోటిని ఉద్దేశించి యిట్లు విజ్ఞప్తి చేసెను -\n\n\"ఓ భాగవతశ్రవణాభిలాషులారా! ఓ పరమార్థ జిజ్ఞాసువులారా! రేపటినుండి ఎవరెవరు ఇచట కథాశ్రవణము చేయునపుడు ఆనందబాష్పములు రాల్చుదురో వారికి నాగృహమందే భోజనము ఏర్పాటు చేయుదును. భోజనార్థము వారు తమయింటికి వెళ్లవలసిన పనిలేదు'. ఈ ప్రకారముగ తానుచేసిన ప్రకటనానుసారము ధనికుడు మరుసటి దినము నుండియు ఆనందబాష్పములు రాల్చినవారి కందరికిని తన యింటియందే షడ్రసోపేతముగ భోజనము పెట్టి పంపుచుండెను. భక్తునకు భగవంతునకు భేదము లేదని నిశ్చయించి అతడు ఆ భక్తశిఖామను లందరిని పరిపరివిధముల మిక్కుటముగ గౌరవించుచుండెను.\n\nఆనందబాష్పములు రాల్చిన వారి కందరికిని ధనికుడు సంతృప్తిగా ముక్కువరకు భోజనము పెట్టుచున్నాడను వార్త ఊరూరా వ్యాపింప ఒక సోమరిపోతు తిండికొరకు కక్కుర్తిపడి ఆ ధనికుని గృహమునకు వచ్చి భాగవత కాలక్షేపమునందు మునిగి ఆనందబాష్పములు కార్చుచుండుటను చూచి ఆ సోమరి తనకున్ను అట్టిస్థితి కలిగిన బాగుండునని యోచించి చుండెను. కాని కఠిన హృదయుడగుటచేతను, దైవభక్తి ఆవంతైనను లేని వాడగుటచేతను అతనికి ఆనందబాష్పములు కారలేదు. కళ్లు నలుపుకుని నలుపు కొని ఎంతయో ప్రయత్నించెను. కాని ఒక్క చుక్కైనను నీరు కారలేదు. రాతివంటి కఠినహృదయమునకు, దయాదాక్షిణ్యములు కొరతపడినవానికి, ఒక రాగాన గుండె కరుగునా? ఆనందాశ్రువులు రాలునా? వెంటనే ఆసోమరి సభాస్థలము వీడి దొడ్డిదారిగుండా ధనికుని వంటశాల యందు ప్రవేశించి అచటనున్న వంటమనిషిని ప్రాధేయపడి రెండిమిరియముల నిప్పించుకొని వాటిని బాగుగ నూరి ఆ పొడిని కండ్లలో పెట్టుకొని సభలోకి వచ్చికూర్చుండ వెంటనే కళ్ళనుండి జలజల నీళ్లు కారజొచ్చెను. గంగా ప్రవాహమువలె ఆశ్రువులు పారదొడగెను.\n\nఅదిచూసి ధనికుడు తనలో 'ఆహా! ఈరోజు వచ్చిన నూతన భక్తుడు ఎట్టి ఆధ్యాత్మిక శిఖరములను అధిరోహించినవాడై యుందునో! ఏలయనగా ఇంతవరకు వచ్చిన వారు కథాసందర్భమున ఏపది పదిహేను బొట్లో ఆనందబాష్పములను మాత్రమే రాల్చుచుండిరి. ఈతడో, చెంబెడునీళ్లు అమాంతముగ కార్చివేసినాడు. ఓహో! ఎంతటి భక్తిరసావేశము! ఎట్టి ఆధ్యాత్మిక ప్రగతి! ఇట్టివారి రాకచే నా గృహము పావనమైపోయినది. అని తలంచి అందరి కంటె ఎక్కువుగా ఆ నూతన వ్యక్తిని ఆదరించి గౌరవించెను. భుక్తికి ఉపాయమును కనిపెట్టిన ఆసోమరి ఊరిలోనికి పోయి మరికొందరు సోమరులకు ఆ వార్త చెప్పగా వారుకూడ మరునాడు ప్రసంగమునకు వచ్చి, ఆనందబాష్పములు రానందుచే, వంటవానియొద్ద కొన్ని మిరియములు తీసి కొని నూరి కంటిలో పెట్టుకొని కూర్చుండిరి. ఈ ప్రకారముగ దినదినము కపటభక్తుల సంఖ్య పెరుగుచుండెను.ఇట్లుండ నెల పూర్తికాక పూర్వమే వంటవాడు ధనికుని యొద్దకు వెళ్లి \"అయ్యా! మిరియాలు అయిపోయినవి. ఇంకొక బస్తావెంటనే తెప్పించండి\" అని చెప్పగా, ధనికుడు, ఇంత త్వరగా మిరియములు అయిపోవుటకు కారణమే మని ప్రశ్నింప పాచకుడు తడుముకొనకుండ ఇట్లు చెప్పివేసెను - \"మహాప్రభో! మిరియాలు అరబస్తా కూరలలోను, పులుసులలోను చారులలోను, వాడివేసినాను. తక్కిన అరబస్తా ఆనందబాష్పాలకు వాడినాను! వంటవానిద్వారా అసలు విషయములు తెలుసుకొని, తనయింటిలో జరుగు కాలక్షేపమునకు వచ్చు మోసగాండ్రను కనిపెట్టి అప్పటినుండియు తుగువిధముగ జాగ్రత్తవహింపదొడగెను.\n\nభగవంతుడు సర్వాంతర్యామి. ప్రతిప్రాణి యొక్క హృదయాంతరాళమునందును సాక్షిగా వెలుగుచున్నాడు. రాత్రింబవళ్లు జనులు చేయు సమస్తకార్యకలాపములను వీక్షించుచున్నాడు. కాబట్టి కపటము పనికిరాదు. మోసకృత్యములకు తావీయరాదు. 'భజతాం ప్రీతి పూర్వకమ్‌\" అని గీతాచార్యుడు సెలవిచ్చునట్లు ఆ జగదేక ప్రభువును ప్రీతిపూర్వకముగ, హృదయపూర్వకముగ సేవించవలెనేకాని, కపట వేషములతో కాదు. నిర్మల హృదయముతో, అనన్యభక్తితో మాత్రమే ఆ పరాత్పరుని సేవించి జీవితమును కడతేర్చుకొనవలెను.\n\nనీతి: భగవంతుడు సర్వాంతర్యామి. సర్వజీవుల హృదయాంతరాళమునందు అధివసించువారు. కాబట్టి మోసము, కపటము మున్నగువానిని వదలివైచి దైవసాక్షిగా పవిత్రకార్యములనే ఆచరించుచు జీవితమును దైవమయముగ నొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 786,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఆనందబాష్పములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమునకు బహుదూరమున గల వనప్రదేశమందు ఒక తపస్వి ఒక చక్కటి కుటీరమును నిర్మించుకొని ధ్యానాది కార్యములను ఒనర్చుకొనుచుండెను. ఆ కుటీరము చుట్టును తలసి మొక్కలు, మారేడు చెట్లు, ఇతర ఫలవృక్షములు విరివిగ నుండుటచే ఆప్రదేశమంతయు పవిత్రముగను శోభాయమానముగను ఒప్పారుచుండెను. ఏకాంతస్థల మగుటవలనను విక్షేపజనకములైన పరిస్థితు లెవ్వియు లేకుండుట చేతను ఆ తపస్వి తన ధ్యానానుష్టానములను నిరాటంకముగ కొనసాగించు కొనుచు, పరమార్థ వాతావరణమునందు ఆనందముగ జీవితమును కొనసాగించుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు మిట్టమధ్యాహ్నము ఒక రాజకుమారుడు ఆరణ్యములలో సంచారము సల్పుచు దప్పికగొని నీరు త్రావుటలై ఆ తపస్వి యొక్క కుటీరమునకు వచ్చెను. తాపసి రాకుమారునికి దాహోదకము నొసంగి ఉపశాంతిని కలుగజేసెను. అనంతరము అతనితో ఆతపస్వి \"మీరెవరు? ఎచటనుండి వచ్చుచున్నారు?\" అని ప్రశ్నింప ఆతడిట్లు ప్రత్యుత్తర మొసంగెను. \"మహాత్మా! నేనొక రాజకుమారుడను. మా తండ్రి ఈ సమీపప్రాంతమున కంతటికిని మహారాజు. మాది జితేంద్రియ వంశము. నాపేరు జితేంద్రియకుమార్‌. మా తండ్రి పేరు జితేంద్రియ మహారాజ్‌, మా తల్లి పేరు జితేంద్రియరాణి. నా ధర్మపత్ని పేరు జితేంద్రియదేవి!\n\nరాజకుమారుని ఆ వాక్యములను వినగానే తపస్వికి ఆశ్చర్యము గలిగి, 'వారి వంశీయులు వాస్తవముగ జితేంద్రియులా! లేక నేతిబీరకయవలె పేరుకుమాత్రము గొప్పగా అట్లు చెప్పుకొనుచున్నారా! పరీక్షింపవలె' నని ఉద్దేశముతో రాజకుమారుని తన కుటీరమందే కొంత తడవు ఉండులాగున చెప్పి తాను హుటాహుటిగ రాజప్రాసాదమునకు పయనమై పోయెను. తదుపరి రాజును సమీపించి, అతనితో నిట్లనెను - ఓ భూసురోత్తమా! నీకు ఒక్కడే కుమారుడు. అతడు భీకరారణ్యములో సంచరించుచున్నాడు. ఒకవేళ హింస జంతువులచే అతనికేదైన ప్రమాదము వాటిల్లి అకసాత్తుగా దేహవియోగ మైనచో మీరేమి చేయుదురు?\" ఆ వాక్యములను విని నృపాలుడు ఏమాత్రము ఆవేదన పడక తపస్వితో గంభీరముగ నిట్లు పలికెను. - 'ఓ తాపసోత్తమా! విధివిలాసమును ఎవరు తప్పించగలరు? పుట్టిన వస్తువునకు చావు తప్పదు. జన్మించిన దాదిగ మృత్యువు జీవుని వెంబడించుచునే యుండును. ఈనాడో, రేపో లేక వత్సరములో ఏనాడైనను పుట్టిన ప్రాణి చావకమానదు.\n\nమృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే |\nఅద్యవాబ్ధశతాంతేషు మృత్యుర్వై ప్రాణినాం ధ్రువమ్‌ ||\n\nజన్మించువారికి మృత్యువు వెనువెంటనే యుండును. ఎప్పటికైనను జీవునకు మరణము ఖాయము. ఇందు దిగులు పొందవలసినదేమియును లేదు. బ్రతికిన నాలుగురోజులు భగవంతుని స్మరించుచు పుణ్యము నార్జించుటయే జీవుని కర్తవ్యము!\n\nభూపాలుని యా విజ్ఞతాపూర్వక వచనములను విని తాపసుడు లోలోన సంతసించి, రాణియొద్దకు వెల్లి \"అమ్మా! నీ కుమారుడు ప్రమాదవశాత్తు ఎపుడైన మరణించినచో ఏమిచేయుదువు? అని ప్రశ్నింప ఆమె జంకుగొంకు లేకుండ ఈ ప్రకారము పలికెను.\n\nజాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రుం జన్మ మృతస్య చ |\nతస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ||\n\nమహాత్మా! పుట్టిన ప్రాణి చావకమానడు. చచ్చిన ప్రాణి కర్మశేషమున్నంత వరకు పుట్టక మానడు. ఇక శోకించుట దేనికి? బ్రతికి యున్న నాలుగు రోజులు రామా, కృష్ణాయని భగవన్నామస్మరణ చేయుచు పుణ్యమును సంపాదించుకొనుటయే మానవుని కర్తవ్యము!\n\nరాణియొక్క మహత్త్వపూర్ణములగు యాతాత్త్విక వచనములను విని తపస్వి ఆనందభరితుడై రాజకుమారుని సతీమణి యొద్దకు వెళ్ళి \"అమ్మా! నీపతి అరణ్యప్రాంతములందు ఏకాకిగ సంచరించుచున్నాడు. ప్రమాద వశాత్తు అతనికి దేహవియోగ మైనచో ఏమి చేతువు?\" అని ప్రశ్నింప, ఆమె గంభీరముగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. మహాశయా! తమకు తెలియని దేమున్నది? ఈ ప్రపంచమున పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సమస్తము ఒకానొక మహత్తరశక్తికి లోబడియే పని చేయుచున్నది. విధిని ఎవరు తప్పించగలరు? బంధువులు, మిత్రులు, కుటింబీకులు ధర్మసత్రమునందు యాత్రికులవలె కలిసికొని మరల విడిపోవునట్లు కొలది కాలము ఒకచోట కలిసికొని మరల ఎవరిదారిన వారు పోవుచుందురు.\n\nఏకవృక్ష సమారూఢా నానాజాతివిహంగమాః |\nప్రభాతే విదిశో యాంతి కా తత్రపరిదేవనా ||\n\nసాయంకాలమున ఒకచెట్టుపై రకరకముల పక్షులన్నియు గుమిగూడి మరల తెల్లవారగనే ఎచటికో ఎగిరిపోవు చందమున ఋణానుబంధముచే జీవులున్ను ఒక కుటుంబమున కలిసికొని మరల ఎవరికి వారు వేరైపోవుచుందురు. ఇది ప్రకృతి ధర్మము. జగన్నియమము. ఇక శోకింపనేల?\"\n\nరాజకుమారిని సహధర్మచారిణి యొక్క యావిజ్ఞతాపూర్వక వాక్యములను విని తపస్వి లోలోన పరమానంద పడుచు తిరిగి తన కుటీరము యొద్దకు వెళ్లి తనకొరకై అచట వేచియున్న రాజకుమారునితో \"నాయనా! మీరాజ్యముపై శత్రువు లెపుడైన దండెత్తి వచ్చి రాజవంశమునంతను చిత్తుగనాశన మొనర్చివైచినచో నీవేమి చేయుదువు?\" అని ప్రశ్నింప, అతడేమాత్రము కినుక వహింపక ధైర్యపూర్వకముగ నిట్లు పలికెను - \"తాపసోత్తమా! ఈ ప్రపంచమున ఏది శాశ్వతము? ఇంతవరకెందరు రాజులు రాలేదు! పోలేదు! వారందరును ఏమైరి? ఎవరైన స్థిరముగ నుండగలిగిరా? కాలప్రవాహమున బడి ఎందరో ప్రాణులు అహర్నిశము కొట్టుకొని పోవుచున్నారు. నదీ ప్రవాహమున కొన్ని కట్టెపుల్లలు ఒకచోట కలిసికొని మరల తరంగముల తాకిడికి వేరైపోవునట్లు ఒక కుటుంబమునగాని, ఒక వంశమునగాని కొందరు జీవులు కలిసికొని కొంతకాలము వ్యవహారము సలిపి మరల మృత్యుముఖమున పడి ఎవరిదారిన వారు పోవుచున్నారు.\n\nఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం వహతి సంగతః |\nసంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరిదేవవా ||\n\nకాబట్టి వియోగమందు దుఃఖపడనేల? బ్రతికిన కొలదిరోజులు జగత్ర్పభువగు పరమాత్మను సేవించి, ధ్యానించి, పవిత్రజీవితమును గడుపుటయే జీవులకు శరణ్యము.\n\nరాజకుమారుని యాగంభీరార్థ బోధకములగు వాక్యములను విని తపస్వి ఆనందడోలికలలో నూగులాడుచు జితేంద్రియ వంశమును పేరునకు తగినట్లుగనే కుటుంభసభ్యు లందరును గొప్ప ఆధ్యాత్మికాను భూతి కలిగియున్నారని సంతసించి రాజకుమారుని ఆశీర్వదించి పంపివైచెను.\n\nనీతి: మానవుడు జితేంద్రియుడై, మనస్సును తనస్వాధీనములో నుంచుకొని, కష్టసుఖములందు సమభావము కలిగి క్షణికములగు దృశ్య వస్తువులపై ప్రాకులాడక, దేహాదులందు బంధ్వాదులందు అభిమానమును వదలి, ధైర్యముతో జీవితలక్ష్యమగు ఆత్మసాక్షాత్కారమునకై తీవ్రతర యత్నము సలుపుచు ఈ జీవితమందే అద్దానినిబడసి కృతకృత్యుడు కావలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 787,
        "IMAGE": "cat_9",
        "NAME": "జితేంద్రియ వంశము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము ఒకానొక మహారాజు అగణిత సిరిసంపదలతో తులతూగుచూ, పెక్కు భోగభాగ్యంబులను అనుభవించుచు తన దేశపు ప్రజలను న్యాయపద్ధతిలో చక్కగా పరిపాలించుచునుండెను. అతనికి నలుగురు భార్యలు కలరు. రాజుకు ఆ రాణులపైనను, రాణులకు ఆ రాజుపైనను అవ్యాజమైన ప్రేమభావము కలిగియుండెను. రాణులందరికిని రాజు వేర్వేరు భవనములను నిర్మింపజేసి వారివారికి కావలసిన పదార్థములను పరికరములను అవసరములను ప్రత్యేకముగ అందజేయుచుండెను. ఆ నలుగురు ధర్మపత్నులయెడల రాజు సమానమైన ప్రేమభావము గలిగియుండుచు, పక్షపాతబుద్ధి లేక అందరి యొక్క మన్ననలను పొందుచుండెను.\n\nఈ ప్రకారముగ సుఖముగ కాలము గడచుచుండ, ఒకసారి అత్యవసర కార్యార్థమై రాజు ఖండాంతరమున కేగుట తటస్థించెను. కొన్ని వేలమైళ్ల దూరమునగల ఒకానొక నూతన ప్రదేశమున కేగి అచట ముఖ్యపట్టణమును చేరుకొనెను. అదికొన్ని లక్షల జనాభా కలిగిన బ్రహ్మాండమైన సుందరనగరము. అనేక ఆధునిక పద్ధతులతో, వస్తుసంపదలతో కూడి, పెక్కు కర్మాగారములతో, గగనచుంబిత ప్రాసాదములతో నిండి నిబిడీకృతమై, నూతన వైభవములకు ఆటపట్తై, అత్యంత ఆకర్షణియముగ ఆ నగరము కనపడుచుండెను. అట్టి రమణీయపురంబును చేరుకుని రాజు ఒక నెలరోజులు తన కార్యమును నిర్వర్తించుకొని తిరిగి స్వదేశమునకు పయన మగుటకు ఉద్యుక్తుడై తన ధర్మపత్నులు నలుగురికి ఈ క్రిందిభావములతో వేర్వేరుగ జాబులు వ్రాసిపంపెను.\n\n\"ఓ అంగనామణులారా! ఇపుడు నేనరుదెంచినది ఒక అత్యద్భుతమైన మహాపట్టణము. దీనితో సమానమైన పురము మన ప్రాంతములో వెతకినప్పటికి కనిపించదు. కండ్లు మిరిమిట్లు గొలుపు దృశ్యము లనేకము లిచట గలవు. చూచిన వారిని మోహనపరవశుల జేయు వస్తుసామాగ్రి లెక్కకుమించి ఇచట గలదు. కాబట్టి ఓ దేవేరులారా! నేనిపుడు కొద్దిరోజులలో గృహోన్ముఖుడ నగుచున్నాను. కాబట్టి మీరు మీమీ అభీష్టవస్తువులను తెలిపినచో, ఎవరికి ఏయే వస్తువులు వాంఛనీయములో ఎరుకపరచినచో నేను వచ్చునప్పుడు ఆయా వస్తువులను తెచ్చి మీకు ఒసంగెదను. ఇట్టి అవకాశము జారవిడుచు కొనకుడు. ఇన్ని వేల మైళ్లదూరము మరల మరల వచ్చుట ఎవరికిని తటస్థించదు. కాబట్టి, తత్‌క్షణమే మీమి అభిలషిత పదార్థములను తెలుపుకొనుడు, - ఈ ప్రకారముగ నృపాలుడు తన నలుగురు భార్యలకును వేర్వేరుగ ఉత్తరములు వ్రాసెను.\n\nపది దినములు గడచినవి నలుగురు భార్యల నుండియు ప్రత్యుత్తరములు వచ్చినవి. వారొక్కక్కరు తమ తమ వాంఛితములను ఈ క్రిందిప్రకారముగ తమ హృదయేశ్వరునకు తెలిపిరి.\n\n1. మొదటి భార్య - నాథా! ఆ మహాపట్టణములను మీరేతెంచుట నాయొక్క మహద్భాగ్యమని తలంచుచున్నాను. ముఖ్యముగ మనవి చేయుట ఏమనగా, నాకు పట్టుచీరలపై మోజు ఎక్కువ. కావున ఆ మహాపుర మంతయు వెదకి వెదకి చతుర్దశ భువనములందు ఇంకెచటను ఎవరికిని లభింపనట్టి సుందరసుకుమార వస్త్రములను కొన్నింటిని మీవెంట తీసుకొనిరండు! వానిని ధరించి ఇక నా జన్మ ధన్యమైనదని తలంచుకొనెదను.\n\n2. రెండవ భార్య - నాథా! నేను ఎన్ని జన్మలలో చేసిన పుణ్యమో ఫలించుట చేతనే మీరట్టి మహాపట్టణమునకు చేరుకొనుట సంభవించుట జరిగినది! ఇపుడు ముఖ్యముగ మనవిచేయుట యేమనగా నాకు ఆభరణములపై మోజు ఎక్కువ. కొత్తకొత్త ఫాషన్లు గల ఆభరణము లన్నచో నేను చెవి కోసికొందును. కాబట్టి హృదయేశ్వరా! ఆ పురమంతయు వెదకి వెదకి నూతన ఫక్కీలో ఉన్న ఆభరణములు కొన్నింటిని మీవెంట తీసికొని రండు!\n\n3. మూడవభార్య - నాథా! నాకు స్వాదిష్టములైన ఫలహారములపై ఆసక్తి మెండు. జిహ్వను తృప్తి పరుచుట నాయొక్క ప్రధాన కార్యక్రమములలో ఒకటి. కాబట్టి ఆ భవ్యనగరమంతయు గాలీంచి గాలీంచి జిహ్వకు ప్రీతికరములైన భోజ్యవస్తువులు కొన్నింటిని మీవెంట తీసికొనిరండు. వానిని ఆరగించి నా జన్మ ధన్యతను గాంచగలదు.\n\n4. నాలుగవభార్య - 'నాథా! మీరు మాకు వ్రాసిన జాబులో మీకిష్టమైన పదార్థములను, ప్రీతికరములైన వస్తువులను కోరుకొనుడు; తెచ్చెదను అని తెలిపితిరి. ప్రాణేశ్వరా! ఈ జగత్తులో నాకు మీకంటె ప్రియతమ పదార్థము వేరొకటి ఏదికలదు? మీరు వెళ్లినది మొదలు నాకు నిముషమొక యుగముగా గడుచుచున్నది. ప్రపంచమంతయు శున్యముగా తోచుచున్నది. ఈ జడమైన పదార్థములతో నాకేమిపని? మీరొక్కరున్నచో అంతయు నాకు ఉన్నట్లే కబట్టి ప్రాణనాథా! మీరు తత్‌క్షణమే బయలుదేరిరండు! సురక్షితముగ ఇల్లు చేరుకొనుడు! నాకదియే పదివేలు!\n\nఈ ప్రకారముగ నలుగురు భార్యలు వ్రాసిన జవాబు రాజునకు అందినది. వెంటనే భూపాలుడు నగరమంతయు చుట్టి తన భార్యలకు కావల్సిన సామాగ్రి నంతను సమకూర్చుకొని స్వదేశమునకు పయనమైపోయెను. అనతికాలములో తన పురమును చేరుకుని సేవకులద్వారా మొదటి భార్యకు చీరలు, రెండవ భార్యకు ఆభరణములు, మూడవ భార్యకు ఫలహారములు పంపి, తాను మాత్రము స్వయముగ నాలుగవభార్య యొద్దకు వెళ్లి ఆమె భవనములోనే కాపురము చేయదొడగెను. తక్కిన వారిండ్లలో అడుగైనను పెట్టలేదు. అది చూసి తక్కిన ముగ్గురు రాణులు రోషారుణిత నేత్రులై, క్రోధా విష్టలై - అగ్నిసాక్షిగ నలుగురుని బెండ్లాడి, చివరకు ఒకరియొద్దనే కాపురము పెట్టుట న్యాయసమ్మతమా? అని కోందరు పెద్దలద్వారా రాజునకు కబురుచేయగా, రాజు వారలకీ ప్రకారముగ వెంటనే కబురుచేసెను.\n\n'ఓ అర్థాంగులారా! మీరు చెప్పినది పరమసత్యము. నేను అగ్నిసాక్షిగనే మిమ్ములను పరిణయమాడితిని. కాని ఇపుడే మీకు కావల్సిన వస్తువుల లిస్టులో నేను జమపడలేదు. మీకు ఏమి కావలయునని ప్రశ్నించినపుడు, ఒకరు వస్త్రములు కావెలనని, ఇంకొకరు ఆభరణములు కావలెనని, వేరొకరు భోజ్యపదార్థములు కావలెనని వ్రాసితిరేకాని నామాట ఎవరును అనుకొనలేదు. మీ కనిష్ఠసోదరి మాత్రము నన్ను కోరుకొనెను. అందువలననే అక్కడికి వెళ్లుట తటస్థించినది. ఇందులో మోసమేమి? కపటమేమి? అన్యాయమేమి? అక్రమమేమి? ఎవరు ఏమి కోరుకుందురో, వారికి అది లభించు చుండునుగదా, చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా!\" రాజుయొక్క ఆ వర్తమానము విని దేవేరులు నిరుత్తరులై తమ చర్యలకు తామే సిగ్గునొందిరి. ఈ ప్రకారముగ రాజు వారలకు చక్కనిగుణపాఠము బోధించి మరల యథాప్రకారముగ అందరితోడను సుఖముగ కాపురము చేయసాగెను.\n\nప్రపంచములో ఇపుడు పెక్కురు జనులు మాయామోహితులై, దృశ్యపదార్థములనే వాంఛించుచున్నారు కాని శాశ్వత పరమాత్మను కాదు. క్షణిక ప్రాపంచిక భోగములను కాంక్షించుచున్నారే కాని, శాశ్వత బ్రహ్మనందమును కాదు. ఎవరెవరు దేనిదేనిని అభిలషించుచుందురో దానినే పొందుచుందురు. అజ్ఞానులు జడము లైన దృశ్యవైభవములను కోరి వానికొరకే ప్రయత్నించి వానినే పొంది తుదకు అతృప్తులై యుందురు కథలోని మొదటి ముగ్గురు రాణులవలె. జ్ఞానులు చైతన్యవంతమై, శాశ్వతమై బ్రహ్మానంద పరిపూర్ణమై, దుఃఖ వర్జితమైనట్టి ఆత్మ కొరకే అభిలషించి, దాని కొరకే యత్నించి దానిని పొంది జననమరణ సంసారక్లేశ వర్జితులై, మోక్షస్వరూపులై, పరమ సంతృప్తులై, పరుగుచుందురు - కథలోని నాల్గవరాణివలె. కావున వివేక వంతులగు వారు దూరదృష్టితో వ్యవహరించి ఆత్మప్రాప్తికొరకై జీవితమును వినియోగించి ధన్యులు కావలెనేకాని క్షణిక దృశ్యవస్తు ప్రాప్తిచే జీవితమును క్లేశవంతమొనర్చుకొనరాదు.\n\nనీతి: ఎవడు ఎట్టి కార్యమును చేయునో దానికి అనుగుణమగు ఫలితమునే పొందును. కాబట్టి వ్యర్థకార్యములను విడనాడి శాశ్వత దైవప్రాప్తికి వలయు సాధనలనే జీవుడు కావింపవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 788,
        "IMAGE": "cat_9",
        "NAME": "చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము గ్రీసుదేశమున అలెగ్జాండరు అను గొప్ప రాజు కలడు. అతడు తన శౌర్యధైర్య పరాక్రమములచే పెక్కు పరిసర రాజ్యములను జయించి తదుపరి ఆసియాదేశముపై దండెత్తెను. ఆసియా ఖండమున గూడ అనేక రాజ్యములను కొల్లగొట్టి, ధన మంతయు దోచుకొని, తాను సంపాదించిన యా సిరిసంపదలను, సువర్ణంబును, రత్నరాసులను గేనెలందు, పెట్టెలందు వైచికొని తిరిగి తన స్వస్థానమగు పశ్చిమ దేశములకు పయనమయ్యెను.\n\nపూర్వకాలమున రైలుబండ్లు గాని, విమానములుగాని లేవు. కావున గుర్రములపై ఏనుగులపై ఆ సామాగ్రినంతను మెల్లగ తరలించు కొని పోవుచుండెను. అక్కడక్కడ కొన్ని మజిలీలు ఏర్పాటుచేసికొని మంత్రులు సైనికులు మొదలైనవారు వెంటరాగా కొన్ని గుడారములు వేసికొని మార్గమధ్యమున సేదదీర్చికొనిచు అలెగ్జాండరు విజయోత్యాహముతో స్వదేశమునకు చనుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు అలెగ్జాండరు చక్రవర్తికి అరోగ్యము క్రమముగ క్షీనింపదొడగెను. అత్తరి అందరును ప్రయాణకార్య క్రమమును నిలిపివైచి తమ ప్రభువు యొక్క స్వాస్థ్య విషయమందే దృష్టిని నిలిపి అతనికి ఆరోగ్యము కలుగుటకై పరిపరివిధముల ప్రయత్నములు చేయదొడంగిరి, గొప్ప గొప్ప వైద్యులను పిలిపించిరి. పేరుగొన్న హకీములను రప్పించిరి. ఒక వైద్యమేమి, అన్నిరకలముల వైద్యములను చేయించిరి. అన్ని మందులను వాడిచూచిరి. కాని విధి బలీయమైనది. ఎంతటి రాజాధిరాజైనను తన కర్మఫలితమును అనుభవించక తీరదుకదా!\n\nరాజుగారికి శరీరములో ఉష్ణము ప్రబలుచుండెను. వైద్యులు నిరాశను ప్రకటింపదొగడిరి. మంత్రులు, సామంతులు కింకర్తవ్య విమూఢులై ఏమిచేయుటకును తోచక రాజుచెంత తదేకదృష్టితో నిలబడియుండిరి. ఇక అవసానకాలము సమీపించినదనియే అందరును తలంచిరి. అత్తరి అలెగ్జాండరు తన మంత్రులను దగ్గరకు పిలిచి ఈ ప్రకారముగ వారల నాదేశించెను - ఓ మంత్రులారా! నా ఆరోగ్యము దినదినము క్షీణించుచున్నది. మీరు నా విషయమై చేయవలసిన కార్యము లన్నిటిని చక్కగా చేయుచున్నారు. కాని నా కర్మఫలితము మరియొక విధముగ నున్నది. జరుగవలసినది జరిగియే తీరును. ఇక నేనెక్కువ దినములు జీవించు అశలేదు. కఫవాత పిత్తములు నాదేహము నాక్రమించి స్మృతిజ్ఞానము లోపింపక పూర్వమే మీకొక చిన్న సలహా చెప్పదలంచినాను.\n\nఏమనగా \"ఈ శరీరము నుండి ప్రాణవాయువు వెడలిపోయిన వెంటనే సంప్రదాయానుసారము దీనిని ఒక పెట్టె (Coffin)లో పెట్టి శ్మశానమునకు తీసికొనివెళ్ళి మీరు ఖననము చేయుదురు. నేను మహారాజును కాబట్టి సామాన్యమానవునివలె కాక పెద్ద ఆటోపముతో ఈ శరీరమును ఊరేగించి శ్మశానమునకు తోసికొని పోవుదురు. ఆ విషయము నాకు ముందుగనే బాగుగ తెలియును. అయితే నేను మీకు చెప్పుసలహా ఏమనగా, నా మృతశరీరమును ఉంచునట్టి పెట్టెను తయారుచేయించునపుడు అందు చేతులు పెట్టుచోట రెండు పెద్ద రంధ్రములను ఏర్పాటుచేయుడు.\"\n\nఆ వాక్యములను వినగానే మంత్రులు సంభ్రమచిత్తులై ఏ కారణముచే రాజిట్లు నుడువుచున్నాడో తెలియక తికమక పడుచుండిరి. పెట్టెలో ఆ ప్రకారముగ రంధ్రములు ఏర్పాటుచేయుడని చెప్పుటలో గల అంతర్యమేమి? దీనియందేదియో గొప్పకారణ మిమిడియుండవలెను. ఆ కారణమును ప్రభువు జీవించియున్నపుడే ఆతని వలన మనము తెలిసికొనుట యుక్తము అని మంత్రులందరు యోచించుకొని ఎట్టకేలకు ధైర్యము వహించి అలెగ్జాండరు చక్రవర్తిని సమీపించి యిట్లడిగివైచిరి -\n\n\"మహాప్రభో! ఇంతవరకు చరిత్రలో కని విని యెరుగని విశేషమును తాము సెలవిచ్చితిరి. ఎవరైనను చనిపోయినచో ఒక పెట్టెలో పరుండబెట్టి శ్మశానమునకు తీసికొనిపోవుదురు. అంతియే కాని ఆ పెట్టెకు చేతులయందు రంధ్రములు వేయించరు. కాని తాము రంధ్రములు వేయుంచులాగున చెప్పిరి. ఇదియొక అపూర్వ విషయము. అట్లెందుల కానతిచ్చిరో సెలవియ్య ప్రార్థన.\"\n\nమంత్రుల ఆ వినయాన్విత వాక్యములను విని అలెగ్జాండ రిట్ల్లు ప్రత్యుత్తర మొసగెను.\n\n\"ఓ మంత్రులారా! ప్రయోజనము లేక ఎవరును కార్యమును చేయుట కుపక్రమించరు. నేను మృతినొందిన వెనుక మీరు నన్ను పెట్టెలో పరుండబెట్టి మూతవేసి ఊరేగించెదరు. వేలకొలది జనులు ఆ ఊరేగింపును తిలకించెదరు. శ్మశానము వరకు కోలాహలముగా నుండును. పెట్టెలో నన్ను పరుండ పెట్టి ఊరేగించునపుడు చేతులుండు చోట పెట్టెకు రంధ్రము లున్నచో ఆ రంధ్రములో గుండ నా చేతులు బయటకు వచ్చి వ్రేలాడును. ఇంతవరకు జనులలో గొప్ప అపోహ ఒకటి వ్యాపించియున్నది. అదియేదనగా, దేశదేశములలో అలెగ్జాండరు కొల్లగొట్టిన ధనమునంతను పరలోకమునకు తీసికొని వెళ్ళుచున్నాడేమో యని జనులు తలంచుచున్నారు. అట్లేమియు తీసికొనివెళ్లుట లేదని నేను వారికి ఋజువుపరచ వలసి యున్నది. నా చేతులు బయటకు కనిపించినచో ఆ రిక్తహస్తములను జూచి జనులందరును ఓహో అలెగ్జాండరు ఒట్టిచేతులతోనే పరలోకమునకు బోవుచున్నాడే కాని ధనమును, సంపదను వెంటగైకొని వెళ్లుటలేదు. కోట్లకొలది ధనరాసులను వజ్రవైడూర్యములను జీవితములో సంపాదించి నప్పటికి అంత్య కాలములో, పరలోక ప్రయాణకాలములో ఒక్క చిల్లిగవ్వైనా వెంట తీసికొని వెళ్లుటలేదు అని నిశ్చయించుకొనగలరు. ఈ ప్రకారము సత్యము నవగత మొనర్చుకొని వారు జీవితమును నావలె ధనకనక వస్తువాహన రాజ్యాది విభవములందు ధారబోయక సత్యవస్తు సంపాదనమున వినియోగింప గలరు\" -\n\nప్రభువు యొక్క ఆ వాక్యములను శిరసావహించి మంత్రులందరు కొద్దిరోజులలో సంభవించిన అలెగ్జాండరు మరణానంతరము ఆ ప్రకారమే చేసిరి. అలెగ్జాండరు తన యీచర్య ద్వారా లోకమునకొక గొప్ప నీతిని బోధించెను. భౌతిక సంపద ఏదియు జీవునకు శాశ్వతము కాదని అతడు ప్రపంచమునకు చాటెను. కావున జనులు సావధాన చిత్తులై తమకు శాశ్వతముగ ఉపకరించునట్టి సత్యదయాధర్మములను జేపట్టి అసత్యములగు దృశ్యపదార్థములందు విరక్తిని, శాశ్వతమగు దైవమందు ఆసక్తిని కలుగజేసికొని జీవితమును ధన్యమొనర్చు కొందురు గాక!\n\nనీతి: మరణించునపుడు ప్రాపంచిక పదార్థమేదియు మనుజుని వెంటరాదు. కాబట్టి విషయభోగముల యెడల విరాగము కలిగి వెంట వచ్చు పుణ్యమును అధిక మొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 789,
        "IMAGE": "cat_9",
        "NAME": "రిక్తహస్తములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "మిథిలా నగరమును జనకమహారాజు పరిపాలించు రోజులవి. జనకభూపాలుడు గొప్ప ధార్మికసంపన్నుడు. ఆధ్యాత్మిక జిజ్ఞాస పరిపూర్ణముగ కలవాడు. అష్టావక్రుడు, యజ్ఞవల్కుడు మొదలైన అనుభూతి పరులగు గురువరేణ్యుల యొద్ద బ్రహ్మజ్ఞానమును బడసినవాడు.\n\nఅట్టి మైథిలేశుడగు జనకుడు ఒకనాడు తన యాస్థానమున బ్రహాండమైన సభ నొకదానిని జరుపుచుండెను. ఆ సభకు గొప్ప గొప్ప పండితులు, కవులు, భాషాప్రవీణులు, శాస్త్రకోవిదులు పలువురు విచ్చేసిరి. పండితప్రకాండులచే, విద్యాధురంధరులచే ఆ సభ కిటకిట లాడుచుండెను. సభ ప్రశాంతముగ జరుగుచుండ, సభ్యులు తమ పాండిత్య ప్రకర్షను వెలిబుచ్చుచుండ, ఒక్కొక్కరు తమతమ విద్యావైదుష్యమును భూపాలునకు పరిచయము చేయుచుండ ఇంతలో ఆ సభాభవనము లోనికి ఒకానొక మహర్షి ప్రవేశించి నేరుగా భూపతియున్న స్థానమున కరుదెంచుచుండెను. అతని పేరు అష్టావక్రుడు, శరీరమున ఎనిమిది వంకరలుండుట వలన అష్టావక్రుడను పేరు కలిగినది. అతడు గొప్ప తపస్సుచేసిన మహనీయుడు, బహుకాలము తత్త్వవిచారణ సలిపి, తీవ్ర సాధనమొనర్చి ఇంద్రియములను, మనస్సును అదుపులోనికి తెచ్చు కొని స్వస్వరూప పరమాత్మ సాక్షాత్కారమును బొందిన మహర్షి సత్తము డతడు. అతని ముఖము బ్రహ్మవర్చస్సుచే దేదీప్యమానముగ ప్రకాశించుచుండెను.\n\nఅట్టి మహానీయుడగు ఋషిసత్తముడు సభాభవనములో ప్రవేశించుటతోడనే, సభలో ఆసీనులైన కవిశేఖరులు పండిత ప్రకాండులు, ఆ మహర్షి యొక్క భౌతిక దేహమందలి వంకరలను చూచి ఒక్కుమ్మడి పకపక నవ్విరి. ఈ ప్రకారముగ సభ్యులందరును తన్నుగాంచి బిగ్గరగ నవ్వుచుండ వారలనుజూచి ఆష్టావక్రుడున్ను పెద్దగా నవ్వెను. ఇంతలో జనకమహారాజు తన సింహాసనము పైనుండి దిగివచ్చి ఆ ఋషి వర్యున కెదురేగి వారిని ఆహ్వానించి సత్కరించి ఉన్నతాసనముపై గూర్చుండ బెట్టెను. తదుపరి సభాకార్యకలాపము లన్నియు ఉచితరీతి నెరవేర్చబడెను. కొంత తడవునకు సభాసమాప్తము కాగా సభ్యులు వారివారి గృహములకు నిష్క్రమించిరి.\n\nసభ్యులందరును వెడలిన పిదప జనకమహారాజు వినయాన్వితుడై అష్టావక్రుని ఈ ప్రకారముగ ప్రశ్నించెను - \"మహాత్మా! తాము సభలో ప్రవేశించగనే ఇచట అసీనులైన వారందరును ఒక్కసారిగా నవ్విరి. ఆ నవ్వునకు కారణమేదియో నాకు తెలియును. తమ శరీరమందలి వంకరలు చూచి వారు నవ్వియుందురు. కాని తమరేల వారిని చూచి నవ్వారో నాకు అర్థమగుటలేదు. మహాత్మా! తాము నవ్వుటకు గల కారణం మేదియో దయచేసి తెలుపప్రార్థన\". ఆ వాక్యములను విని గురుదేవుడీ ప్రకారముగ సముచిత సమాధాన మొసంగెను.\n\nఓ రాజా! \"పండితుల సమావేశము జరుగనున్నది. తాము దయచేయుడు\" - అని మీరు నన్నాహ్వానించారు. అందులకు నేను చాల సంతోషించితిని. అట్టి అపూర్వ అవకాశము లభించెనుగదా అని లోలోన పరమానందపడితిని. కాని తీరా, సభలోనికి ప్రవేశించగనే సభ్యుల యొక్క ప్రవర్తన, వారి వైఖరి చూచి నాకు పట్టరాని నవ్వు వచ్చినది. మాదిగవారి సభలోనికి జనకుడు నన్నేల ఆహ్వానించెనను వితర్కము నాలో కలిగినది.\n\nఋషిపుంగవుని యా వచనములను వినగనే ' జనకుడాశ్చర్యచకితుడై దేవా! ఇట్లేల వచించుచున్నారు? మహామహాపండితులందరును విచ్చేసిన దీనిని మాదిగ సభ అని ఏల వాక్రుచ్చుచున్నారు?' అని ప్రశ్నింప అంతట ఆచార్యుడిట్లు వచించెను.\n\n\"భూపాలా! మనుజులలో ముడు తరగతుల వారుందురు. కొందరికి దేహదృష్టి. కోందరికి మనోదృష్టి. మరికొందరికి ఆత్మదృష్టి యుండును. ఒక ప్రాణిని చూడగానే బాహ్య ఆకారము మాత్రమే కొందరికి గోచరించుచుండెను. వారి రూపురేఖలు, వారి సౌందర్యము, వారి కట్టు, వారి బొట్టు, వారి జాతి, వారి కులము, వారి రంగు - ఇవి మాత్రమే వారి దృష్టికి అగుపడుచుండెను. ఇట్టివారు దేహదృష్టి కలవారు. మరికొందరికి ఒక ప్రాణిని చూడగనే అతని విద్వత్తు, అతని పాండితీ ప్రకర్ష, అతని సాహిత్యసంపద, అతని చదువుసంధ్యలు, గోచరించుచుండెను. ఇట్టివారు మనోదృష్టి కలవారు. మరికొందరు ఒక ప్రాణిని చూడగనే అతని హృదయమందు వెలుగొందుచున్న సర్వభూతాంతర్వర్తియగు పరమాత్మయే గోచరించును. ఇట్టివారు ఆత్మదృష్టి కలవారు. వీరు ఉత్తమోత్తములు. మనోదృష్టి కలవారు మధ్యములు. దేహదృష్టి కలవారు అధములు. ఎన్ని విద్యలు కలిగియున్నను భౌతికదృష్టిని, స్థూలదృష్టిని, దేహదృష్టిని విడనాడనిచో, అత్మదృష్టిని సంపాదించనిచో ఆ విద్యలన్నియు నిరుపయోగములే యగును. ఏనాటికైనను మానవుడు ఆత్మదృష్టని సంపాదించియే తీరవలెను. అదియే జీవిత లక్ష్యము. జన్మ సార్థకత కదియే ఏకైక విధానము.\n\n\"ఓ రాజా! మాదిగవారు సామాన్యముగ చెప్పులు మొదలైనవి కుట్టుచుందురు. చర్మముపైననే వారు తమదృష్టిని సదా ప్రసరించుచుందురు. గొప్ప పండితుడైనను ఎవని దృష్టి చర్మముపైననె యుండునో ఎవడు దేహమును మాత్రమే చూచుచు దేహియగు ఆత్మను విస్మరించు చుండునో ఆతడు మహామేధావియైనను దేహదృష్టి కలిగియుండుట వలన మాదిగవానితో సమానుడే యగును. ఓ రాజా! మీరు సమావేశ పరచినది పండిత మహాసభయని పేర్కొంటిరి. కాని ఆసభలో ఆసీనులైన వారందరు నా దేహమునే చూచిరికాని, నా ఆత్మను గాదు. నా చర్మమునే వీక్షించిరిగాని నాలోని చిత్స్వ రూపమును గాదు. నా దేహ వికారములనే గమనించి నవ్విరి కాని దేహాంతర్గత పరమాత్మను సందర్శించలేదు. తోలుపైననే దృష్టి కలవారు దేహభ్రాంతిని విడనాడని వారు ఎంత చదువు చదువుకొని యున్నను మాదిగవారి చర్యను (చర్మావలోకనమును) అవలంబించిన వారే యగుదురు. జనకమహారాజు నన్ను పండితుల సభకు ఆహ్వానించెం కాని అచట కూర్చొనిన వారందరు మాదిగవారుగ కనిపించు చున్నారే! అని నాకు నవ్వు వచ్చినది.\n\nఈ ప్రకారముగ అష్టావక్ర మునీంద్రుడు చక్కని హితవాక్యములను పలుకగా జనకభూపాలుడు అచ్చెరువొంది, ఆత్మదృష్టి యొక్క ప్రాశస్త్యమును, దేహదృష్టి యొక్క నికృష్టత్వమును గురైరిగినవాడై సదా ఆత్మావలోకన తత్పరుడై జీవితమును చరితార్థ మొనర్చు కొనెను.\n\nకావున జనులు అభ్యాసవశమున దేహదృష్టిని క్రమక్రమముగ విడనాడవలయును. తాము వాస్తవముగ శాశ్వత ఆత్మయేకాని క్షణికమగు దేహము కాదని మరలమరల భావించుచుండవలెను. ఎంతటి విద్యావైదుష్యము కలిగియున్నను తాను దేహమేయని తలంచు వానికి ఏకాలమందును శాంతి కలుగనేరదు. కావున శరీర భావనను వీడి ఆత్మభావనను బలపరచు కొనుచు ఈ జీవితమును పరమానందమయముగ నొనర్చుకొనవలయును.\n\nనీతి: మానవుని యథార్థ స్వరూపము ఆత్మయే కాని దేహము కాదు. కాబట్టి జడమైన దేహముపై అభిమానమును వదలి ఆత్మయే తానని భావించుచు పరమానంద మనుభవించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 790,
        "IMAGE": "cat_9",
        "NAME": "దేహదృష్టిని విడనాడవలెను ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక పట్టణమున ఒక ధనికుడుండెడివాడు. అతడు వ్యాపారముద్వారా లక్షలకొలది ఆస్తిని సంపాదించెను. ఒకనాడతని కొక సంకల్పము జనించెను. అది యేదనగా ఈ ప్రపంచమున ఎందరో చక్కని గృహములను సౌధములను నిర్మించుకొని కాపుర ముండుచున్నారు. నాకు పరమాత్మ కోట్లకొలది ధనమును ప్రసాధించినాడు. అట్టిచో ఈ చిన్న గృహమునందే నా జీవితమును గడపనేల? బ్రహ్మాండమైన ప్రసాదమును, రాజభవనమును ఏల నిర్మీంచుకొని కాపుర ముండరాదు? కావున ఎన్ని లక్షలద్రవ్యము నైనను ఖర్చుపెట్టి ఇంతవరకు కని విని యెరుగునట్టి, అపూర్వభవనమును నిర్మించుకొని అందు నివసించెదను - అని ఈ ప్రకారముగ ఆ ధనికుడు గొప్పగొప్ప మేస్త్రీలను వేలకొలది కార్మికులను వినియోగించి రెండు సంవత్సరములలో రమణీయమగు హర్మ్య మొకదానిని నిర్మింపజేసెను.\n\nఆ ప్రసాదము అత్యంత మనోహరముగ నున్నదై రాజభవనములను గూడ మరపింప జేయుచుండెను. పది అంతస్తులు గల బ్రహ్మాండమైన సౌధమది, ప్రతి అంతస్తునందును నవీనపద్దతులతో ఏర్పాటు చేయబడిన చిత్ర విచిత్ర పరికరము లెన్నియో అమర్చబడి కనుల పండువుగా నుండెను. ముఖ్యముగా అన్నిటికంటె పైనున్న అంతస్తు ప్రత్యేక అలంకారములతో గూడినదై, స్నానపానాది సమస్త సౌకర్యములతో గూడి, చూచువారలకు ముచ్చట గొలుపుచుండెను. కనుకనే అద్దానిని ఎంతయో మనోహరముగ తీర్చిదిద్దెను. ఆ భవనము, అందును ముఖ్యముగ ధనికుడు స్వయముగ వసించు పదవ అంతస్తు చూపరులకు దిగ్ర్భమయు గొలుపుచు మయుని సృష్టిని జ్ఞాపకమునకు దెచ్చుచుండెను.\n\nధనికుడు తాను నిర్మించిన గృహమును జూచి మురిసి పోవుచుండెను. ఆ పట్టణమునకు పెద్దలెవరు విచ్చేసినను, వారిని తన గృహమునకు తీసికొనివచ్చి అంతయు చూపించి పంపుచుండెను. ఒక విజిటర్స్‌ బుక్‌ (Visitors Book) ఏర్పాటుచేసి తన భవనమును గూర్చి ఇతరులచే వారి అభిప్రాయములను అందు లిఖింపజేయుచుండెను. ప్రతివారును తామిట్టి సర్వాంగ సుందరభవనము నింతవర కెచటను కనని విని యుండలేదనియు, ఇది లోకోత్తర సుందర భవనమనియు అందువ్రాసి వెళ్ళుచుండిరి. వారి యా అభిప్రాయములను తిలకించి ధనికుడు పరమానంద భరుతు డగుచుండెను.\n\nఇట్లుండ ఒకనా డాపట్టణమున కొక సాధువు విచ్చేసెను. ధనికుడు ఆ సాధువుగారిని తన యింటికి ఆహ్వానించి భిక్ష ఏర్పాటు చేసి, భోజనానంతరము తన గృమమంతయు అతనికి చూపెను. క్రిందనున్న తొమ్మిది అంతస్తులనను ముందుగా చూపి తుదకు తాను స్వయముగ నివసించుచున్న పదవాంతస్తుకు సాధువుగారిని తీసికొని వెళ్లి, అచటగల ప్రతివస్తువును వివరించి చెప్పుచు అంతయు చూపెట్టేను. సాధువుగారు అచటచట గల ఆధునిక సౌకర్యములను, మిరమిట్లు గొలుపు చిత్రవిచిత్ర వస్తుసామాగ్రిని, అలంకారములను జూచి పరమాశ్చర్యము నొందెను. ఈ ప్రకారముగ అంతయు చూపించన పిదప ధనికుడు 'మహాత్మా! ఈ గృహమును గూర్చి మీయాభిప్రాయమును తెలియజేయుడని కోరగా, అంతట సాధువుగారిట్లు వచించిరి - 'ఓయీ! ఇట్టి దివ్యభవమమము నేనింతవర కెచటను చూచి యుండలేదు. ఇది అపూర్వమగ నున్నదై చూపరులకు మహోల్లాసమును గలుగజేయుచున్నదనుటలో ఏలాంటి సంసయమును లేదు. అయితే ఒక్క విషయమున మాత్రము నాకు చాల దిగులు కలుగుచున్నది. ఈ మిద్దెపై మీరు చనిపోయినపుడు మిమ్ములను దింపుట కష్టము. మీ శవమును పది అంతస్తులనుండి దింపవలెనన్న చాల కష్టము!\n\nఆ వాక్యములను వినగానే ధనికుని గుండె బ్రద్దలయ్యెను. భవిష్యత్తులో తనకు మృత్యువు సంభవించుననిగాని, అపుడు తనకును తన భవనమునకును ఎడబాటు కలుగునని అతడు కలలోనైన ఊహించలేదు. తాను, తన భవనము శాశ్వతమని తలంచి దానిని గాంచి మైమరచి పోవుచుండెను. అట్టి సమయమున సాధువుగారు ధనికునకు కనువిప్పు కలిగించెను. భవిష్యత్తులో జరుగబోవు ఒక మహాప్రమాదము నాతనికి గుర్తునకు వచ్చెను. అదియే మృత్యువు. దానిని మరచి జనులు భోగవిలాసములలో మునిగి, ప్రాపంచిక వ్యవహారములలో నిమగ్నులై, నామరూప జగత్తు సత్యమని నమ్మి విషయముల వెంట పరుగిడిచు తమ సౌందర్యము, తమకీర్తి, తమ అధికారము, తమ ప్రతిష్ఠ, తమ గృహారామాదులు చూచి మురిసిపోవుచున్నారు. సాధువు వచించిన వాక్యముద్వారా ధనవంతునకు ప్రపంచవస్తు స్వరూపము దృగ్గోచర మయ్యెను. బాహ్యవస్తువుల క్షణికత్వము అనుభూత మయ్యెను. అతనికి జ్ఞానోదయము కలిగెను. అప్పటి నుండియు అతడు తన భవనముపై గాని, ఇతర వస్తువులపైగాని మమత్వ ముంచక, అట్టి క్షనిక వస్తుజాలముపై విరక్తి గలిగి శాశ్వతమగు పరమాత్మనే ఆశ్రయించి, జప, ధ్యానపరాయణుడై జీవితమును సద్వినియోగ పరచుకొనెను.\n\nజనులు తమ సంపదలను, వైభవములను జూచి విర్రవీగరాదు.\n'మా కురు ధం జన యౌవనగర్వం\nహరతి నిమేషాత్కాలస్సర్వం '\n\nఅను శంకర భగవత్పాదుల వాక్యానుసారము అవి యన్నియు కాలగర్భమున అంతరించిపోవును. గోవిందు డొకడే శాశ్వతుడు. కావున ఆ పరమాత్మనే భజించవలెను (భజగోవిందం), అతనినే ఆశ్రయించవలెను. బాహ్యవస్తువు లన్నియు, తుదకు దేహముకూడ కాలక్రమమున నశించిపోవునను పరమసత్యమును ఏ కాలమందును మరవరాదు. ఈ ప్రకార మెరింగి, వ్యవహార మాచరించుచున్నప్పటికి దేనియందును తగుల్కొనక, భగవంతుని ఆశ్రయించి కాలము గడుపువాడు ధన్యుడు. అట్టివాడు బాహ్యవస్తువులపై మమత్వ ముంచక తన హృదయస్థ పరమాత్మను ఈ జీవితమందే సాక్షాత్కరించుకొని కృతార్థుడు కాగలడు. అట్టి ఆత్మసాక్షాత్కారమే జీవితపరమార్థమని సర్వులు గుర్తెరిగి అద్దానిని యత్నపూర్వకముగ బడసి ధన్యులు కావలయును.\n\nనీతి: ప్రాపంచిక వైభవములు అశాశ్వతములు. వానిని చూచి మురిసిపోరాదు. తాను చేసిన పుణ్యమే, తాను పొందిన ఆత్మజ్ఞానమే తన్ను రక్షించును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 791,
        "IMAGE": "cat_9",
        "NAME": "జ్ఞానోదయము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక పట్టణ ప్రాంతమున గజదొంగ ఒకడు కాపురముండెను. అతడు దొంగతనమున ఆరితేరినవాడు. ప్రజల సొత్తు క్రమముగ హరించి, దారి దోపిళ్లు చేసి, పలువురను వధించి ఎన్ని పర్యాయములో జైలుశిక్ష అనుభవించినవాడు. ఆతని హృదయమున దయాదాక్షిణ్యములకు చోటేలేదు. అతనికి రాత్రి పగలువంటిది. నిర్భయముగ భీకరారణ్యములందు, నిర్జన పర్వతప్రాంతములందు నిశీథసమయమున సంచరించుచుండెను. అమాయకులను దోచుకొనుటలో అందెవేసినచేయి అతడు. ఈ ప్రకారముగ అతడు తన జీవితమును భ్రష్ఠ మొనర్చుకొనుచు, పాపమును మూటగట్టుకొనుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు ఒకానొక హరికథ జరుగుచుండగా, జనులు తండోపతండములుగ అచటకు వచ్చి నిశ్చలభక్తితో భగవత్కథాశ్రవణము గావించుచుండగా, తాళమృదంగాదులు భక్తుల వీనులకుసోకి తన్మయ మొనర్చుచుండగా, ఆ వేడుక గాంచుటకై వచ్చిన జనులమధ్య ఆ దొంగ కొద్దిసేపు కూర్చుండెను. అత్తరి ధర్మమును గూర్చిన ప్రసంగము నడుచుచుండెను. అమూల్యమైన మానవ జీవితమును పాపభూయిష్టమైన కార్యములందు వ్యర్థము చేసినచో, తత్ఫలితముగ జీవుడు ఘోరయమయాతలను అనుభవించవలసి వచ్చునను సిద్ధాంతమును కథకుడు మనోరంజకముగ ప్రతిపాదించుచుండెను. ఆ వాక్యములు వినగనే తస్కరుని హృదయమందు ఒకింత పరిణామము కలుగ నారంభించెను. \" ఈ పాపపు బ్రతుకేల? జానెడు పొట్టకొరకై అవినీతికరములైన కార్యముల నాచరించుట సిగ్గుచేటు. భవిష్యత్కాలమున ఏది శ్రేయమును ఒనగూర్చునో, ఏది శాశ్వతసుఖమొసంగునో దానినే ఆశ్రయించవలెనుగాని నీచకార్యములకు గడంగి ఒకింత ప్రాపంచిక సుఖమును తాత్కాలికముగ సంపాదించుటకై యత్నింపరాదు. పాపముయొక్క భయంకర పరిణామములను ఇప్పుడే యోచించుకొని సత్ఫథమున జనుటకై కృతనిశ్చయులు కావలయును - అని ఈ ప్రకారముగ ఆ చోరశిఖామణి తనలో తాను వితర్కించుకొనుచుండెను.\n\nకాని మాయ బలీయమైనది. ఘనవాసనలు తొలగుట కష్టము. అవి యున్నచోట మందవైరాగ్యములు పనిచేయవు. బహుకాలము చిత్తమున ఘనీభవించియున్న పాపసంస్కారములు అకస్మాత్తుగ తొలగుట మాటలా? అవి ఒక రాగాన జీవుని వదలవు. పెద్దల సహవాసముచే ఒకింత పరమార్థ గంధము అంటినను అది నిలుచుట కష్టము. వాసనాప్రాబల్యముచే ప్రాతసంస్కారములు జనులందు ఎగిరెగిరి పడుచుండును. అదేవిధముగ మన గజదొంగకును హరికథా శ్రవణముచే ఒకింత ధర్మబుద్ధి ఉదయించినను బహుకాలము చిత్తకుహరమున రూఢిపడియున్న దొంగబుద్ధి అతనిని పూర్తిగ విడువలేదు. అందుచే అతడొక నిశ్చయము కావించుకొనెను. \"ఇప్పటికి నా జీవితమున ఎన్ని వందల పర్యాయములో దొంగతనము చేసితిని. దొంగతనము పాపపు విషయము అని ఇపుడు ఖాయమైపోయినది. ఇకమీదట అట్టి పాపకృత్య మెన్నడును చేయరాదను సంకల్పముకూడ నాయందు కలుగుచున్నది. కాని పొరపాటు బహుకాలగ్రహపాటుచే అలవాటుగా మారి యున్నది. కాబట్టి ఒక్కసారిగా అమాంతముగ ఈ దుర్వ్వసనమును వదలలేకున్నాను. అందుచేత ఇప్పుడు ఒక్క పర్యాయము మాత్రము ఒకానొక పెద్దదొంగతనము చేసి ఇక మీదట దానిని పూర్తిగ మానివేసెదను. లోకమున అందరికంటె శ్రీమంతుడు రాజు. కాబట్టి నేటిరాత్రి రాజుగారి ఇంట్లో దొంగతనము చేసి, అదియే నా జీవితములో చివరి దొంగతనమని భావించి, ఇకమీదట దానికి భరతవాక్యమును పలికెదను.\n\nఅని ఈ ప్రకారముగ నిశ్చయించి ఆ తస్కరశిరోమణి ఒక జ్యోతిష్యుని యొద్దకు వెళ్లి \"మహాత్మా! రాజుగారింటియందు దొంగతనము చేయుటకు ఒక చక్కని ముహూర్తమును, తాము నిర్ణయించి చెప్పవలెను. అందులకు యోగ్యమగు కట్నమును చెల్లించెదను\" - అని పలుకగా జ్యోతిష్యుడు కన్నెర్రచేసి, \"ఓయీ! మేము పెండిండ్లకు, గృహ ప్రవేశములకు లగ్నములు పెట్టువారమే కాని దొంగతనములకు కాదు. నీ వాక్యములను ఎవరైన వినినచో నిన్ను, నన్ను కూడ శ్రీకృష్ణజన్మ స్థానమునకు తీసికొని వెళ్లెదరు. కావున ఇక నీ ప్రసంగమును కట్టిపెట్టి శీ్ఘ్రముగ ఇచ్చోటు వదలి పొమ్ము\" అని గద్దించి చెప్పెను. వెంటనే గజదొంగ జ్యోతిష్యుని చెవిలో ఏదియో రహస్యముగ చెప్పెను. ఆ మాటలు వినగానే జోతిష్యుడు పరమానందముతో చిందులు త్రొక్కుచు తనయొద్దనున్న జ్యోతిష్య గ్రంథము లన్నిటిని తిరుగవేయదొడగెను. జ్యోతిష్యుని చెవిలో దొంగ చెప్పినది - \"చెరిసగము స్వాహా\" అను యుక్తివాక్యము. అనగా \"ఓ జ్యోతిష్కుడు గారూ! రాజుగారింట్లో దొంగలించిన ధనములో నీకు సగం, నాకు సగం.\" ఆ వాక్యము వినగనే సిద్ధాంతి ఆనందడోలికలలో ఊగులాడుచు, తనకు రాజుగారి సంపదలో కొంతభాగము తప్పక రానున్నదని సంతసించి, తిథి వార వర్జ్యములను లెక్కగట్టుచు ఒక చక్కనిముహూర్తమును నిశ్చయించి దొంగకు చెప్పెను. \"నేటిదినము అర్థరాత్రి 12గం||ల 9 నిముషములకు నీవు రాజుగారింట్లో ప్రవేశించినచో అద్భుతమగు కార్యఫల్యము సిద్ధించును.\" అని సిద్ధాంతి పలుకగా దొంగ ఆ సమయమును గుర్తుపెట్టుకొని వెడలిపోయెను.\n\nఅది నిశీథసమయము, అర్థరాత్రి సమీపించుచుండెను. అంధకారము నలుదిసల దట్టముగా వ్యాపించియుండెను. రాజభవనమున అందరును గాఢనిద్రలో నుండిరి. ఆ ముహూర్తబల మేమియోకాని, రాజప్రసాదముయొక్క ద్వారపాలకులు కూడ అత్తరి నిద్రలో తన్మయులై యుండిరి. అందుచే దొంగ నిరాకంటముగ లోనికి ప్రవేశింపగల్గెను. జాగ్రత్ర్పపంచము యొక్క స్పృహయే ఎవరికిని లేనందున దొంగ నిరాఘాటముగ తనపని సాగించుకొని పోవుచుండెను. తాను తెచ్చిన సంచులనిండా బంగారపు పాత్రలను, విలువగల ఆభరణాదులను వేసికొని ముటగట్టుచుండెను. మరల ఇట్టి సుముహూర్తము, ఇట్టి మహదవకాశము దొరకుట దుర్లభమని భావించి దొంగ చాలసేపు దొంగతనను చేయనారంభించెను. ఇంతలో తెల్లవారెను. రక్షకభటులు నిద్రలేచి దొంగను పట్టుకొనిరి. వానిని పాశములచే బంధించివైచి రాజుగరి యొద్దకు గొనిపోయిరి. నృపాలు డంతయు విచారించి వీపుపై బెత్తములతో నూరుదెబ్బలు అతనిని కొట్టునట్లు ఆజ్ఞాపించెను.\n\nరాజాజ్ఞ ననుసరించి భటు లాతనిని దూరముగ తీసికొని వెళ్లి వీపుపై ప్రహారములు సల్పుచు దెబ్బలకు లెక్క పెట్టుచుండిరి. ఏబది దెబ్బలు తినిన మీదట దొంగ భటులతో 'ఓయీ! ఇక నన్ను కొట్టవద్దు. నా భాగస్తుడొకడున్నాడు. తక్కిన యాభైదెబ్బలు అతనిని కొట్ట వలయును. మేము చేసికొనిన ఒడంబడిక ప్రకారము సగము ఆస్తి అతనికి దక్కవలయును!' ఆ వాక్యములను వినినతోడనే భటులు నివ్వెరపోయి, జరిగిన వృత్తాంతమంతయు తెలిసికొని, దొంగతనమునకు లగు పెట్టిన జ్యోతిష్యుని చెవి మెలిపెట్టి అచటకి తీసికొనివచ్చి వీపు వంచి తక్కిన యాభైదెబ్బలు అతనిచే తినిపించిరి. పాపమార్గమును ప్రోత్సహించిన కారణముచే పాపఫలితమగు దుఃఖమును జ్యోతిష్కు డనుభవింప వలసివచ్చెను.\n\nకర్తా కారయితా చైవ ప్రేరకశ్చనుమోదకః |\nపుణ్యకార్యే పాపకార్యే చత్వార స్సమభాగినః ||\n\nఅనునట్లు పుణ్యకార్యమందుగాని, పాపకార్యమందుగాని చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, ఆమోదించినవాడు - నలుగురు కూడ సమానముగ ఫలితమును బొందుదురు. పుణ్యకార్య తత్పరులు సుఖమును సమానముగ పంచుకొందురు. పాపాచరణ శీలురు దుఃఖమును సమానముగ పంచుకొందురు. కథయందు దొంగతనము చేసిన గజదొంగ దొంగతనమును ప్రోత్సహించిన జ్యోతిష్కుడు ఇరువురును శిక్షను సమానముగ అనుభవించిరి. కాబట్టి పాపకార్యముల నెవరును చేయరాదు. వానిని ప్రోత్సహించను రాదు. దుష్కర్మలయొక్క దారుణ ఫలితములను ముందుగనే ఊహించి ఆ పాపకర్మలకు శాశ్వతముగ తిలోదకము లొసంగవలెను. కర్మ సిద్ధాంతము అప్రతిహతమైనది. కావున జీవుడు తాను చేయుకర్మ పవిత్రవంతమై, దైవగంధయుతమై, పాపరహితమై, పరోపకారయుక్తమై యుండులాగున చూడవలెను. అపుడే జీవితము చక్కగ రాణించును. భగవదను గ్రహమున్ను జీవునకు సంప్రాప్తమగును. మానవత్వము సార్థకమగుట కిట్టి సదాచారము జనులాశ్రయించవలెను. దుష్కృత్వములను ఏకాలమందును దరికి జేర్చరాదు. సంసారదుఃఖ మంతరించుట కిదియే ఏకైక మార్గము.\n\nనీతి: పాపము యొక్క ఫలితము దుఃఖమని యెరిగి పాప కర్మను లనలేశమైనను చేయరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 792,
        "IMAGE": "cat_9",
        "NAME": "దుష్కర్మ ఫలితము ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము భోజరాజను గొప్ప నృపాలుడుండెను. ఆతడు దార్మిక హృదయుడు, అద్భుత శీలసంపన్నుడు, మహాపండితుడు నయివిరాజిల్లుచుండెను. లక్ష్మి - సరస్వతి - ఇరువురును ఒక చోటకూడియున్న సందర్భములు ప్రపంచములో చాల అరుదుగ నుండును. భోజరాజునకు సంపదతో పాటు పాండిత్యము ప్రకర్షకుడై ఉండుటవలన అ దేవీద్వయము యొక్క చక్కని సమ్మేళన మాతనియందు గోచరించుచుండెను. ఆతని యాస్థానము సదా పండితప్రకాండులచేత విద్యా వైదగ్ధ్యము తొణికిసలాడు గొప్ప కవిపుంగవులచేతను, కిటకిటలాడుచుండును. ఎందరో కవీశ్వరులను, విద్యావంతులను ఆ భూపాలుడు తన ద్రవ్యముచే పరిపోషించు చుండెను. అష్ట దిగ్గజము లాతని కొలువునందే యధివసించియుండెనను విషయము సర్వులెరింగినదే గదా!\n\nఅట్టి మహిమాన్వితుడైన భోజరాజుయొక్క ఆస్థానమందు, అమ్మహీపతియొక్క పరిపోషణము క్రిందనున్న - వెలయుచున్న పండిత బృందములో వేదశాస్త్రపారంగతుడును, కవిత్వము చెప్పగలుగుటలో మేటియు, ఆశుకవిత్వమునం దారితేరినవాడునగు ఒక విద్వాంసుడుండెను. అతడు ప్రతిదినము రాజభవనమునకు వచ్చుచు, రాజసాన్నిధ్యమందు తన విద్యావైదుష్యమును ప్రకటించుచు మహీపతి యొక్క మన్ననలను బడయుచునుండెను. ఆతని పోషణాదికములను రాజే చూచుచుండెను. ఐతే ఆ పండితునకు ఒక పెద్ద చిక్కువచ్చి నత్తిన పడినది. ఏమనగా వరుంబడి తక్కువ, కుటుంబము పెద్దది. కుటుంబసభ్యులైన భార్య, బిడ్డలు మనుమలు, మనుమరాండ్రు - వీరిసంఖ్య లెక్కకు మీంచి యుండుటబట్టి రాజుగారిచ్చు వేతనము అతని కుటుంబనిర్వహణమునకు ఏ మాత్రము చాలకుండెను. అందుచే కుటుంభపోషణ మతనికి ఒక పెద్ద సమస్య అయి కూర్చుండెను. ఆ సమస్యను పరిస్కరించుట కాతడెన్నియో ఉపాయములను అన్వేషించుచుండెను.\n\nతుట్ట తుద కాతని కొక విచిత్రమైన ఊహ జనించెను. జననింద్యమైన ఒక భావన యతనికి కలిగెను. భోజరాజుగారి ఆస్థానములోను భవనాంతరములందునునేక విలువగలిగిన వస్తువులు అచటచట పడియుండునుగదా! వానిలో ఏ ఒకటి రెండు దొంగలించుకొని పోయినచో కనీసమొక సంవత్సరము వరకైనను కుటుంబభారమును గూర్చిన ప్రశ్నయే యుండదు అను నిట్టి హేయమైన సంకల్ప మాతని హృదయమందు జనించెను. \"ఈ పని చేయవచ్చునా, చేయకూడదా, అను విచక్షణ ఏమాత్రము చేయక, కుటుంబపోషణ రూపలక్ష్యము మాత్రము మనంబున నిడుకొని యాతడు చోరత్వమునకు గడంగెను. ధనాశచే నాతనిమతి భ్రష్టమయ్యెను. 'సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః' అనునట్లు అపుడాతడు యుక్తాయుక్తములను గూర్చిన స్మృతినే కోల్పోయెను.\n\nతన దుస్సంకల్పము కార్యాన్వితము చేయదలంచి ఆ పండితుడొక నాటిరేయి అందరును గాఢనిద్రలో తన్మయులై యుండ భోజరాజుగారి ప్రాసాదమందు దొడ్డిదారిగుండా ప్రవేశించెను. బహుకాలము రాజాస్థానమును కొలువులో నున్న వ్యక్తి కాబట్టి భవనాంతరాళములో ఏవస్తువు వెక్కడున్నది బాగుగ పరిచయము గల వాడు ఆ పండితుడు. అందుచేత ఒకసంచి చేతపట్టుకొని విలువైన వస్తువులను దానిలో వేసికొనుటు సిద్ధపడుచుండెను. మొట్ట మొదట ఒక సువర్ణహారమాతని కంటబడెను. అత్తరి ఆతని ఆనందమును మేరలేకుండెను. అహా! ఆరునెలలు బత్తెము లభించినది కదా యని సంబరపడజొచ్చెను. ఆ యమూల్యహారమును తీసి సంచిలో వేయుచుండగా సర్వశాస్త్ర పారంగతుడైన ఆ పండితునకు తక్షణము గరుడపురాణములోని ఒకానొక శ్లోకము జ్ఞాపకమునకు వచ్చెను. \" సువర్ణమును అపహరించువాడు పదివేల సంవత్సరములు కుంభీపాక నరకములోబడి నానా యాతన లనుభవించవలసివచ్చును\" అని శ్లోకార్థమైయున్నది, చీ, చీ! ఈ చిన్న వస్తువుకొరకు ఇన్ని వేలసంవత్సరములు నరకబాధ ననుభవించ వలసివచ్చునే\" యని భీతిల్లి తోడనే అసువర్ణహారమును క్రింద వదలివేసెను.\n\nవెనువెంటనే మరల కుటుంబ బాధ స్ఫురణకు వచ్చెను. ఏమైనను సరియే ఈ సారి తప్పక ఏదైనా విలువగల వస్తువును అపహరించుకొని పోవలసినదే యని కృతనిశ్చయుడై సమీపముననే ఒక నవరత్నఖచిత ఆభరణము పడియుండుట జుచి దాని నెత్తుకుని సంచిలో వేయదొడగెను. కాని, ఇసారి యతనికి మనుస్మృతిలోని ఒక శ్లోకము జ్ఞాపకమునకు వచ్చెను. దొంగతనం మహాపాపము. అస్తేయము, పరమధర్మము. దొంగతనము గావించువాడు రౌరవాది మహానరక ములను బొందును అని శ్లోకార్థము. పండితుని హృదయఫలకమున ఆ శ్లోకము మెరయగనే, తోడనే యతడావస్తువును క్రింద పారవైచెను. ఈ ప్రకారము ఆరాత్రియంతయు రాజభవనమున ఒక్కొక్క వస్తువును గ్రహించుటయు, వెంటనే శాస్త్రప్రమాణము స్ఫురణకు రగా దానిని వదలివేయుటయు జరుగుచుండెను.\n\nఇంతలో తెల్లవారజొచ్చెను. రాజభటులు తన్ను పట్టుకుందురను భీతిచే అత్తరి ఆ పండితుడు భోజరాజు పరుండిన మంచము క్రిందదూరి దాగెను. తెల్లవారగనే భోజరాజు నిద్రలేచెను. మంచముపై కూర్చుండి నలుదిశలు పరికించెను. ఎదురుగా సుందర స్త్రీలు సేవచేయుటకై నిలబడియుండిరి. భృత్యులు చేతులుకట్టుకుని రాజాజ్ఞకై వేచియుండిరి. కిటికీలగుండా బయటకు దృష్టి ని ప్రసరింప అచట సైనికులు బారులుతీసి నిలబడియుండిరి. ఇదియంతయు గాంచి, భోజరాజు తన రాజవైభవమును తలపోసికొని తలపోసికొని సంబరపడుచు, తన యాభోగభాగ్యములను జూచి మురిసిపోవుచు ఆనందమున తన్మయుడై ఆ తన్మయస్థితి యందీక్రిందిశ్లోకమును అశువుగ జెప్పదొడగెను.- చేతోహరా యువతయః సుహృదోనుకులాః సద్భాంధవాః ప్రణయగర్భగిరశ్చ భృత్యాః గర్జంతి దంతినివహాస్తరల స్తురంగాః\n\nఅని ఈ ప్రకారముగ శ్లోకముయొక్క ముడుపాదములను అందరును వినునట్లు పెద్దగా చెప్పెను. నాలుగవ పాదమును గుడ పెద్దగా చెప్పబోవుచుండెను. ఇంతవరకు చెప్పిన ఆ ముడుభాగముల శ్లోకముయొక్క అర్థమేమనగా..\n\n\"ఆహా! నాభాగ్యమెట్టిది! నాకొలువునందున్న స్త్రీలు మహా సౌందర్యవంతులు, చిత్తమును హరించువారు, నా మిత్రులు అనుకూలురు, మద్భావానుగుణముగ వర్తించువారు. నాబంధువులు చాల ఉత్తములు, సత్పురుషులు, నాసేవకులు నా ఆజ్ఞానువర్తులు, నాసేనయందలి ఏనుగులు ఆనందముతో శబ్ధమొనర్చుచున్నవి. గుర్రములు సకిలించుచు యుద్ధమునకు సన్నద్ధములై యున్నవి.\n\nఈ ప్రకారముగ భోజరాజు తన రాజవైభవమును స్మరించుచు కవీశ్వరుడు కావున తన యాభావములను చందోబద్ధ మొనర్చి శ్లోకరూపముగ చెప్పుచు శ్లోకములలోని మూడు పాదములను పూర్తిచేసి నాల్గవపాదము చెప్పబోవుచుండగా రాజుగారి మంచముక్రింద దాగుకొని అంతయు వినుచున్న కవిశేఖరునకు ఆశుకవిత్వము పొంగి పొరలగా, దానిని ఆపుకొనలేక నాలుగవపాఅదము అతడే ఈ క్రింద ప్రకారముగ పూరించివైచి బిగ్గరగా చెప్పెను. \"సమ్మీలనే నయనయోః న హి కించదస్తి\"\n\nకన్ను మూసిన పిదప ఇవియేవియు ఉండవు - అని పాదము యొక్క అర్థము. అనగా ఓరాజా! నీవైభవమును జూచికొని ఏమియో సంబరపడుచున్నావు. నీకున్న స్త్రీలు , బంధువులు, మిత్రులు, సేవకులు, సైనికులు, ఏనుగులు, గుర్రములు, లొట్టిపిట్టలు .. వీనినన్నింటిని తలంచుకొని మురిసిపోవుచున్నావు. అన్నియేమో గొప్పగా భావించున్నావు? ఇవన్నియు ఎన్నాళ్లుండును? కన్నుమూసిన పిదప అవన్నీ యేమగును? మరణించిన వెనుక నీకూ వానికీ ఏమి సంబంధము? అట్టి తాత్కాలిక, క్షణిక నశ్వరపదార్థములను జూచి చిందులు త్రొక్కనేల?\n\nఇట్టి అపూర్వ అర్థభావనతో గుడి వైరాగ్యోద్ధీపకమై వాక్యము రాజునకు వెంటనే కనువిప్పు గలిగించెను. తన పొరపాటును రాజు గుర్తెరింగెను. అశాశ్వతమైన దానిని శాశ్వతముగ తలంచుటయే ఆ పొరపాటు. ప్రాపంచిక వైభవాలను గొప్పగ భావించుటయే ఆ పొరపాటు. భోగభగ్యములే శరణ్యములని నమ్ముటయే ఆ పొరపాటు. ఇక మీదటను అట్టి దోషము, అట్టి అవివేకము తనకు కలుగ కుండులాగునను శాశ్వరవస్తువగు పరమాత్మనే నమ్ముకొని ప్రవర్తించులాగునను రాజు కృతనిశ్చయు డయ్యెను. ఇట్టి మహత్తర ఉద్భోధక వాక్యమును మంచము క్రిందనుండి ఎవరును చెప్పిరో చూడుడని భృత్యుల కజ్ఞాపించ, ఇంతలో మంచము క్రిందనుండి తన యస్థానమందున్నట్టి కవిశేఖరుడు బయటకు వచ్చెను. రాజు ఆశ్చర్యపడి, జరిగిన వృత్తాంత మంతయు అతనివలన తెలిసికొని పండితుని కుటుంబపోషణార్థము కొంతద్రవ్యమిచ్చి భౌతిక ప్రపంచము సత్యమని నమ్మి యున్న తనకు, ఒకశ్లోక పాదము చేతనే మనస్సు మార్చివేసి, సత్యస్థితిని అవగాహన మొనర్పజేసిన యతనికి తన కృతజ్ఞతలను తెలిపి పంపివైచెను.\n\nకావున జనులు దృశ్యపదార్థములపై మమత్వమును వదలి, వానిని గొప్పగ తలంచక శాశ్వతపరమాత్మనే అన్వేషించి ధన్యులయ్యెదురుగాక!\n\nనీతి: ప్రాపంచిక వైభవములు క్షణికములు, వానిని నమ్ముకొనక సాశ్వత పరమాత్మకొరకే యత్నించుచు, త్వరలో ఆత్మానుభూతిని బడయవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 793,
        "IMAGE": "cat_9",
        "NAME": "వైరాగ్యొద్దీపనము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వ మొకానొక దేశమున ఒక మహారాజు కలడు. అతడు తాను, తన పరివారము నివశించుటకై గొప్పగొప్ప హర్మ్యములను, లావణ్యము తొణికిసలాడు సుందర భవనములను పెక్కింటిని నిర్మింప జేసికొనెను. వందల కొలది పరిచారకులు, రాజప్రాసాదములందు సేవకై వినియోగింపబడిరి. ఆ రజు తనయొక్క కీర్తిని, వైభవమును తలంచు కొనుచు, ఇతరులకు చెప్పుకొనుచు విఱ్ఱవీగుచుండెను. తన్ను మించిన వాడు త్రిభువనములందెవడును లేడను అహంభావము గలిగి యుండెను.ప్రజలందరును తన అదుపు ఆజ్ఞలకు లోబడియుండుట చూచియు, తన పలుకుబడి దేశదేశములందును వ్యాపించియుండుట గాంచియు తన మహోన్నత రాజపదవిని తలంచుకొని ఉబ్బిపోవుచుండెను.\n\nఇట్లుండ కొంతకాలమునకు రాజుగారి దేహమునకు ఏదియో రుగ్మత సంభవించెను. సాధారణముగ జన్మార్జిత సుకృతఫలితముచే జనులకు ఆరోగ్యాది అనుకూల పరిస్థితులును, దుష్కృతఫలితముచే రోగాది ప్రతికూల పరిస్థితులును తటస్థించుచుండెను. ఆరోగ్యము చెడుటవలన రాజుగారికి స్వాస్థ్యమును చేకూర్చుటకై పెద్ద పెద్ద వైద్యులు రప్పించబడిరి. చేయవలసిన ప్రయోగము లన్నియు చేయబడినవి. కాని రోగము తగ్గకపోగా దిన దినము ప్రవేధమాన మగుచుండెను. రాజుగారి భౌతికకాయము నానాటికి కృశించి పోవుచుండెను. అట్టి పరిస్థితిలో ఆ నృపాలుని ధనముగాని, బంధువులుగాని, పరివారముగాని, సేవకులుగాని, కీర్తిగాని, ప్రతిష్ఠగాని, ఆతని దేహస్వాస్థ్యమును కాపాడలేక పోయెను. తుట్టతుదకు ఆ భూపాలుని శరీరము ఒక కంకాళముగా మారిపోయెను. శ్వాసపీల్చుటకుకూడ రాజునకు కష్టమైపోయెను. ఈప్రకారముగ అ భూపాలుడు బహుకాలము దుర్భరవేదన అనుభవించి ఒకనాటిరేయి బంధువు లందఱు చుట్టుమూగి ఏడ్చుచుండ తన భౌతికదేహమును పరిత్యజించెను.\n\nఅపుడు మంత్రులందరును సమావేశమై రాజునకు చేయవలసిన అంత్యక్రియలయొక్క ఏర్పాట్లను, సన్నాహములను గూర్చి చర్చించిరి. తక్షణమే నిపుణులను రప్పించి ఒక బ్రహ్మాండమైన చప్పరమును కట్టించిరి. దానిని సర్వవిధముల పుష్పమాలలచే అలంకరించిరి. మరునాడుదయమున రాజుగారి శవమును దానిలోనూంచి మేళతాళములతో వివిధ వాద్యములతో శ్మశానమునకు గొప్ప ఊరేగింపుతో బయలుదేరిరి. ఆ ప్రాంతమంతటికిని అధినేత కాబట్టి రాజుగారి అంతిమదర్శనమునకై వేలాది జనులు ప్రోగైరి. చుట్టుప్రక్కలనుండి జనులు తండోపతండములుగ వచ్చి రాజుగారి అంతిమ యాత్రలో పాల్గొనిరి. ఊరేగింపు దాదాపు ఒక మైలు దూరము వరకు వ్యాపించెను. జనుల కోలాహలము మిన్నుముట్టుచుండెను. ముందుగ బ్యాండు వాద్యం వారు, వారి వెనుక సన్నాయివాద్యంవారు, వారి వెనుక నాట్యబృందము, వారివెనుక కోలాటముచేయువారు, వారి వెనుక ప్రజలు, వరి వెనుక మంత్రులు, వారి వెనుక రాజబంధువులు, వారి వెనుక రాజుగారి శవము ఉన్న చప్పరము ఈ ప్రకరముగ బ్రహ్మాండమైన ఊరేగింపు రుద్రభూముకి బయలుదేరి పోవుచుండెను.\n\nఇట్లుండ, ఊరేగింపు సగము దూరము పోవుసరికి, అకస్మాత్తుగ అకాశము మేఘవృతము కాగా అత్తరి కుంభవృష్టి కురిసెను. ఊరేగింపులోని వారందరు చప్పగ తడిసిపోవుచుండిరి. ముందుగ నడచుచున్న వారిలో ఒకడు ఆ రోజే క్రొత్త చెప్పులు ధరించి వచ్చెను. ఆ నూతన పాద రక్షలు వానలో తడిసిపోయినచో చెడిపోవునని నిశ్చయించి ఆతాడు వీథి ప్రక్కనేఉన్న ఒక ఇంటిలో దూరి ఆ యింటి యజమానితో 'అయ్యా' , మహారాజుగారి అంతిమయాత్రలో పాల్గొనుటకై వచ్చిన నాకు ఈ వర్షము వలన పెద్ద అటంక మేర్పడినది. నేను తడిసిపోయినను పరవాలేదు. ఈ నా కొత్తచెప్పులు తడసినచో మరల ఎందుకును పనికిరావు. కాబట్టి మీరు కొంత పెద్దమనస్సు చేసి ఈ నా పాదరక్షలకు నేను శ్మశానము నుండి తిరిగివచ్చు వరకు మీ ఇంటిలో ఎక్కడైన ఒకమూల పెట్టియుంచుడు. ఈ చిన్నసహాయము చేసినచో మీకు నేనెంతయో ఋణపడియుందును అని విన్నవించుకొనెను. వెంటనే ఇంటి యజమాని అందులకు సమ్మతించగా, ఆవ్యక్తి తన క్రొత్త చెప్పులను ఆ యింటిలో ఒక మూలదాచి తిరిగి ఊరేగింపులో పాల్గొనెను.\n\nవర్షము ఏమాత్రము తగ్గలేదు. తగ్గకపోగా ఇంకను బలపడెను. హోరున చలిగాలియు వీచుచుండెను. అ వర్షము యొక్క ధాటికి తట్టుకొనలేక ఊరేగింపులోని జనులు చిందర వందరగా పారిపోయి ప్రక్క ప్రక్కనగల ఇండ్లలో తలదాచుకొనిరి. కుంభవర్షము వలన రాజుగారి శవము ముద్దగ తడిసి పోవుచుండెను. అది చూసి మంత్రులందరును, వర్షము నిలుచువరకు రాజుగారి శవమును దింపి ప్రక్కల ఏదైనాఇంటిలో కొద్దిసేపుంచిన బాగుండునని ఏకగ్రీవతీర్మానమును గావించుకొని సరిగా ఇదివరకు చెప్పులు పెట్టిన ఇంటికే వచ్చి ఆయింటి ఆసామి నిట్లడిగిరి - \"ఏమయ్యా మీ ఇంటిలో ఒకమూల రాజుగారి శవమును కొద్దిసేపు ఉంచనిమ్ము. వర్షము ఆగిపోగానే మరల తీసుకొనిపోయెదము.\n\nకాని ఇంటి యజమాని అందులకేమాత్రము అంగీకరించలేదు. భూమి తలక్రిందులైనను ఈ పనికి మేము పూనుకొనము అని యతడు జవాబిచ్చెను. ప్రక్కనే నిలబడియున్న ఒకడు \" ఏమయ్యా! ఇప్పుడే ఎవరివో చెప్పులు మీ ఇంటిలో ఉండనిచ్చితిరికదా! రాజాధిరాజు దేశాధినేత, భువనైకశాస్త అయిన భూపాలుని శవమును ఉంచుకొనుట కేల తిరస్కరించుచున్నావు?\" అని ప్రశ్నింప అందుల కా గృహయజమాని ఇట్లు ప్రత్యుత్తర మొసంగెను.\n\nమహాశయా! మీకు చెప్పునది సత్యమే. రాజు గారు జీవించి యున్నప్పుడే వారి దేహమును అందరు గౌరవించుదరు. కాని మరణించిన తరువాత ఆ దేహమునకు విలువ ఉండదు. దాని నెవరును తమ గృహములందుంచుట కైనను అనుమతించరు. దేనినైనా, తుదకు చెప్పులనైనా తమ యిండ్లయందుంచుటకు జనులు సమ్మతించుదురు కాని, శవమునుమాత్రము పెట్టుకొనుటకు అంగీకరించరు\". ఆ వాక్యములను వినగానే మంత్రులందరును తమలో ఇట్లనుకొనిరి - ఆహా! ఈ రాజత్వమున కేపాటి విలువ! బ్రతికి యున్నప్పుడు సామ్రాజ్యములన్నియు అరచేతిలో నున్నప్పటికిని, చనిపోయిన పిదప పాదరక్షలకంటె హీనమైన స్థితిని బొందుటయా ఓహో! ఏమి ఈ కీర్తులు. ఈ ప్రతిష్ఠలు, ఈ వైభవములు, ఈరాజగౌరవములు? అన్నియు మూన్నాళ్ల ముచ్చటలేకదా ! శరీరములో ప్రాణవాయువు ఉన్నంతవరకే ఈ ఆర్భాట మంతయు. అదికాస్తా ఈ దేహమును వీడిపోయినచో మిగిలిన దానికి విలువలేదు. దానిని ఎవరును గౌరవింపరు. అది శ్మశానములో దొర్లాడుచు శునక శృగాలములకు భక్ష్యమైపోవలసినదే\"\n\nకావున క్షణికములై; అశాశ్వతములై, దేహావసన పర్యంతములై నట్టి దృశ్యవిభవములను, ప్రాపంచిక సంపదలను గొప్పగా తలంచక, వానియెడల వైరాగ్యభావము గలవారై, శాశ్వతమై, నిరతిశయానంద ప్రదమైనట్టి ఆత్మయొక్క అనుభూతిని బడయుటయందే జనులు తమ జీవితములను వినియోగింతురు గాక. యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్చతి కుశలం గేహే గతవతినాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే ||\n\n\" ఈ దేహమందు ప్రాణవాయువుండు నంతవరలకే అందరును ఇంటికి వచ్చి కుశలప్రశ్నలు వేయుచు ఆదరించుచుందురు. ఆ ప్రాణవాయువు శరీరమును వదలిపోయినచో మిగిలిన శవమును జూచి సొంతభార్య కూడ భీతినొందుచుండును. కాబట్టి నశ్వరములగు దేహాదులందు మమత్వమును వీడి శాశ్వతుడగు గోవిందుని భజింపుడు\".\n\nఅను శ్రీ శంకరాచార్యుల మహోపదేశమును జనులు నిరంతరము మననము చేయుచు జీవితములను భక్తిమయములుగ నొనర్చుకొందురు గాక!\n\nనీతి: దేహాభిమానము వదలిపెట్టి ఆత్మయే తానను భావమును మననముచేయుచు పవిత్ర జీవితమును గడుపవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 794,
        "IMAGE": "cat_9",
        "NAME": "ప్రాపంచిక వైభవములు క్షణికములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము శిఖిధ్వజుడను రాజుండెను. అతనికి చూడాలయను భార్య కలదు. పూర్వజన్మ పుణ్య సంస్కారము వలన ఇరువురికిని చక్కని వైరాగ్యముదయించెను. ప్రతిదినము వారుకొంతసేపు అధ్యాత్మిక తత్త్వవిచారణ గావించుకొనుచుండెడివారు. వారిరువురిలో చూడాల హృదయము అతినిర్మలముగను, రాగద్వేషరహితముగను క్రోధాది కషాయ వర్జితముగను నుండుటచే మెత్తటి మట్టియందు నాటబడిన బీజమువలె ఆమెకు శీఘ్రముగ ఆత్మజ్ఞానోదయ మయ్యెను. భర్తయగు శిఖిధ్వజుని చిత్తమింకను పరిపాకమును బొందలేదు. శాస్త్రములందు వైరగ్యమును గూర్చి, సర్వత్యాగమును బోధింపబడిన యంశములను వినుచుండునపుడు ఆతని హృదయమందు ఆవేశము జనించు చుండెను. రాజ్యాధికారములన్నిటిని వదలివేసి ఏకాంతమునకు పారిపోవు సంకల్పము ఉదయించుచుండెను. కాని తన యహృద్గత భావములను భార్య కెరిగింపక లోలోన వాపోవుచుండెను.\n\nఒకనాటిరేయి సరిగా అర్థరాత్రివేల నిద్రలేచి భార్యను, కుటుంబమును, రాజ్యమును పరిత్యగముచేసి ఎవరికి తెలియకుండగనే పట్టణము వెలుపలకు పోయి అరణ్యములగుండ బయనించి బహుదూరమున కేగి తన పట్టు వస్త్రము లన్నియు పారవేసి నారవస్త్రములు ధరించి ఒకానొక నిర్జన వనమున నొక పర్ణకుటీరము నిర్మించుకొని జపమాల, కమండలువు, ఆసనము గ్రహించి అచ్చోట వసించుచుండెను. నాటిరాత్రి చూడాల నిద్రలేచి చూడ పడకపై భర్త శిఖిధ్వజుడు లేడు. రాజభవనము, పట్టణము అంతయు వెతికెను. వెతికించెను. కాని కానరాలేదు. పెక్కుసిద్ధులు సంపాదించి యున్న సాధ్వీమణి కనుక, అమె వెంటనే ఆకాశ మార్గముగుండా చని నలువైపుల బహుదూరము వరకు వెతుకగా ఒకానొక నిర్జనారణ్యమున కుటీరము వేసుకొని కాలము గడుపుచున్న తన భర్తను గావించగలిగెను. కాని అతని కార్యక్రమమునకు అవరోధమును కల్పించుటకు ఇష్టములేక \"కొంతకాల మీతడిట్లే యుండుగాక\" యని తలంచి మింటివీధినే తిరిగిపోయి రాజ్యకార్యములను స్వయముగనే చూచుకొనుచుండెను. కొన్నివత్సరములు గడిచెను. అటుపిమ్మట ఒకనాడు భార్య చూడాల కుంభుడను బ్రాహ్మణ కుమార వేషమును దాల్చి ఆకాశమార్గము గుండా పోయి భర్త శిఖిధ్వజుని పర్ణశాలయందు వ్రాలెను. అత్తఱి ఆ యిరువురి మధ్య ఈక్రింద సంభాషణము నడచెను.\n\n(కుంభుని వేషమున నున్న) చూడాల : మీరెవరు? ఏల యింత నిర్జన ప్రదేశమున నున్నరు?\n\nశిఖిధ్వజుడు : నేను పూర్వము మహారాజును, చూడాల అను పేరుగల భార్య కలదు. వైరాగ్యము జనింప అంతయు విడిచివైచి, కర్మసన్మ్యాసము చేసి ఇచటనున్నాను.\nచూడాల : మీకు మనశ్శాంతి కలుగుచున్నదా?\nరాజు : అది తప్ప తక్కిన వన్నియు కలుగుచున్నవి.\n\nచూడాల : మీరు తప్పుదారి నవలంబించితిరి. కనుకనే మీకు మనశ్శాంతి కలుగుటలేదు. శాస్త్రములు సర్వత్యాగము మోక్షహేతువని వచించినవి. కాన మీరు చేసినది సర్వత్యాగము కాదు. రాజ్యము, పరిజనులు, భార్య, కుటుంబము మొదలగు బాహ్యవస్తువులను మీరు విడనాడితిరే కాని, మనస్సున గల దృశ్య సంకల్పములను, వాసనలను విడనాడలేదు. వానిని వదులుటయే ముఖ్యసన్మ్యాసలక్షణము. అదియే సర్వత్యాగము. అంతియేకాని భార్యను, బిడ్డలను వదలి అరణ్యములకు పరుగెత్తుటకాదు. ఒకవేళ అట్లు పరుగెత్తి పోయినను, మీ నీడ మీ వెంట నుండునట్లు అ దృశ్యవాసనలు కామాది కషాయములు మిమ్ములను వదలిపోవు. అవి ఉన్నంత వరకు ఎంత ఏకాంత ప్రదేశమున నున్నను ప్రశాంత్మి జీవునకు లభ్యముకాదు. అవిలేనపుడు గృహమందున్ననూ, రాజ్యము పాలీంచుచున్నను, ప్రశాంతియే మిమ్ముల వరించును. నిష్కామ బుద్ధితో, అనాసక్తి పూర్వకముగా కర్మలను చేయుచు, రాగా చిత్తము శుద్ధపడి జ్ఞానముదయింప కర్మసస్మ్యసము దాని యంతట నదియే సిద్ధించును. అంతియే కాని మొదటనే కర్మలను వదలి పోరాదు, అని ఈ ప్రకారముగ చక్కని జ్ఞానప్రబోధము గావించి భార్యయగు చూడాల తన భర్తయగు శీఖిధ్వజున కంతట తన నిజరూపమును జూపి రాజధానికి తోడ్కొనిపోయి రాజ్యాధికారములను (నీర్లేపముగ) నిర్వ్రర్తింప జేసెను.\n\nనీతి : సర్వత్యాగ మనగా మనస్సునందలి దుష్టసంకల్పములను వాసనలను త్యజించుటయే యగును. అద్దానినే జీవుడు అవలంబించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 795,
        "IMAGE": "cat_9",
        "NAME": "సర్వత్యాగము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక ధార్మిక చిత్తుడగు రాజుండెను. విశాలమగు తన రాజప్రాసాదము యొక్క మహోన్నత కుడ్యముపై మహాభారత యుద్ధసమయమున శ్రీకృష్ణపరమాత్మ రథముపై గూర్చుండి అర్జునునకు గీతోపదేశము చేయుచుండిన పవిత్రదృశ్యమును చిత్రింపించవలెనని యతనికి అభిలాష జనించెను. ఆ కార్యమునకై యాతడు తన దేశమందలి ధురంధరులగు చిత్రకారు లందరిని రప్పించి వారినందరిని పరీక్షించి అందులో మహాప్రజ్ఞావంతులగు నిరువురిని మాత్రము ఏరుకొనెను. ఆ యిరువురుని తన రాజభవనము యొక్క రెండవ అంతస్తుపైకి తీసుకొనివెళ్ళి \"ఓ చిత్రకారురాలా! గీతపై నాకు మక్కువ జనించినది. గీతాచిత్రమును నిరంతరం నా కళ్లెదుట చూచుకొని ఆనందించవలెనను కుతూహలము కలిగినది. గీతోపదేశము చేయుచుండ పార్థసారథి యొక్క పావన ముఖారవిందమును సదా సర్వకాలములందును సందర్శించి కృతార్థుడను కాదలంచితిని. కావున మీరిరువురును చెరియొక గోడతీసికొని వానిపై గీతోపదేశ చిత్తరువులను లిఖింపుడు. సమయము 6 మాసములు. ఉత్తమ చిత్రమునకు బహుమానము 10వేల రూపాయములు. మీ భోజనము వగైరాలను మేమే భరించెదము, మీరు మాత్రము ఏకాగ్రచిత్తముతో జీవకళ ఉట్టిపడు చుండు విధముగ వానిని చిత్రింపుడు\". అని వారితో పలికెను. వారట్లే యంగీకరించిరి.\n\nవారికివ్వబడిన గోడలు ఎదురెదురుగ నుండెను. మరుసటి రోజు నిర్ణీతసమయమున పోటీ ప్రారంభమయ్యెను. ఇరువురును వారివారి నైపుణ్యమును జూపుటకు కృతనిశ్చయులైరి. ఒకరి చిత్తరువును మరియొకరు 'కాపీ' కొట్టకుండ గోడలపై పెద్ద తెరలు దించబడెను. ఆ తెరల వెనుక వారు తమ కార్యములను దీక్షతో నుపక్రమించిరి. 7 నెలలు గడచెను. బహుమానమును నిర్ణయించుటకై ప్రముఖులగు నిర్ణేతలు రప్పించబడిరి. మొదటి గోడకు తగిలించిన తెర యెత్తబడెను. చిత్తరువు కండ్లకు కొట్టినట్టు అగుపడెను. సాక్షాత్‌ శ్రీకృష్ణమూర్తియే ఆ హర్మ్యమున వెలసెనా అనిపించు నంతటి సహజగాంభీర్య లావణ్యములతో తొణికిసలాడుచుండెను. ఆ చిత్ర రాజము చిత్రకారుడు తన పంచ ప్రాణములను దానియందు ధారబోసెనా యనిపించుచుండెను. అది గాంచి నిర్ణేతలలో చాలమంది 'ఇదియే రెండింటిలో ఉత్తమచిత్రము కావచ్చును' అని మనంబున ఊహాగానము చేసికొనిరి. అయినను తుది నిర్ణయము చేయుటకు రెండవది కూడ చూడవలెను గదా అనియెంచి దానికి ఎదురుగానే ఉన్న రెండవగోడను సమీపించిరి.\n\nఆ రెండవవాని పరిస్థితి యెట్లున్నదనిన, ఆరునెలలు లక్షణముగా మూడుపుటలు రాజభోజనమును ఆరగించుచు చిత్తరువును ఒకింతైనను లిఖింపక ఊరకనేయుండెను. అయితే ఒక గాజుపెంకును తీసుకొని గోడయావత్తును దానితో బాగుగా రుద్దుచుండెను. ఈ ఆరునెలలు అదే పనిగా రుద్దగా రుద్ధగా చివరకు ఆ గోడ నున్నగా అద్దమువలె తయారయ్యెను. ఏ సమయమున ఆ గోడకు తగిలించబడిన తెర యెత్తివేయబడెనో, ఆ సమయముననే అద్దమువలెనున్న ఆ గోడలో ఎదుటవాని చిత్తరువు ప్రతిబింబించెను. నిర్ణేతలందరును ఆశ్చర్యచకితులైరి. ఆహా! ఎట్టి చిత్రము నీతడు లిఖించెను. మొదటివాడు రంగులతో వ్రాసెను. ఈతడు రంగులు లేకనే రంగులను సృష్టించెనే! మొదటివాడు గోడపై గీసెను. ఈతడు గోడలోపల గీసెనే! పైగా చిత్రము అద్దమునందు వలె తళ తళ మెరయుచున్నదే! ఓహో! అద్భుతము! ఎట్టి చాకచక్యము!' అని దానిని మిక్కుటముగ పొగడుచు దానిని లిఖించిన వానికే ప్రథమ బహుమానమును సమర్పించి వైచిరి. చూచితిరా! చిత్రమేమియు లిఖింపకున్న రాజు పారితోషకము బడయగల ఘనత నాతడెట్లు సంపాదింగల్గెనో! ఉన్న వస్తువును శుద్ధమొనర్చుటయే అతడు చేసినపని; క్రొత్తవస్తువును తెచ్చి చేర్చుటకాదు.\n\nఅట్లే ఆత్మసాక్షాత్కారమును బడయుగోరు ముముక్షువు క్రొత్తగా ఒక వస్తువును అది దేవుడైనను సరే తనలో నూతనముగ తీసికొని రావలసిన పనిలేదు. ఆ దేవుడు తనలో సిద్ధముగా నున్నాడు. క్షేత్రజ్ఞ రూపమున వెలయుచున్నాడు. (అహమాత్మా గూడాకేశ! సర్వభూటాశయ స్థితః), కాని జీవుని మలిన మనస్సుచేత కప్పబడి అనుభూతుడు కాకయున్నాడు. అనేక జన్మార్జిత ఘనీభూత వాసనా జాలముచే తిరోహితుడై వర్తించుచున్నాడు. ఎపుడా మనస్సు అభ్యాసవశమున శుద్ధ పడునో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె అట్టి నిర్మలాంతఃకరణమున ఆత్మతేజము లెస్సగా భాసించును. అదియే ఆత్మసాక్షాత్కారము.\n\nనీతి: మనో నిర్మలత్వమే ఆత్మసాక్షాత్కారమునకు ఏకైకమార్గము. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 796,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఆత్మసాక్షాత్కార మెట్లు కలుగును",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామములో ఒక బీదకుటుంబము కాపురము చేయుచుండెను. ఆ యింటి యజమానికి ఒకే ఒక కుమారుడుండెను. అతడు పసిబాలుడు, ఐదుసంవత్సరముల ప్రాయము గలవాడు. ఏకైక పుత్రుడు, కాబట్టి తల్లిదండ్రు లాబిడ్డను ఎంతయో గారాబముగ పెంచుకొనుచుండిరి. ఒకనాడు సాయం సమయమున ఆ బాలుడు ఇంటి ముందు ఆటలాడుకొనుచుండెను. ఇంతలో సూర్యు డస్తమించగా చీకటిపడెను. నలుదెసల గాఢాంధకారము వ్యాపించెను. పిల్లవాడు సమీపమున గల ఒకానొక పొదలో కాలుపెట్టగా అందుగల ఒక నాగుపాము అతనిని కాటువైచెను. బాలుడు బోరుమని ఏడ్వసాగెను. విషము శరీరమంతటను వ్యాపించుటబట్టియు, నాగుపాము విషము మహాప్రమాదకర మగుట బట్టియు, పిల్లవాని వయస్సు చాలా తక్కువగుటచే బాధను తట్టుకొనలేక పోవుట బట్టియు క్రిందపడి విలవిల తన్నుకొనుచు పెద్దరోదనము చేయదొడగెను.\n\nపిల్లవాని యేడ్పు వినగానే తల్లితండ్రులు, చుట్టు ప్రక్కల నున్న జనము, హుటాహుటి అచ్చోటకి పరుగెత్తుకొని వచ్చిరి. పాముకొరకు వెదకిరి. కాని అది కనిపించలేదు. అది యెపుడో పారిపోయినది. అప్పుడు తల్లిదండ్రులు మిక్కిలి అవేదనతో గూడినవారై, ఆందోళనా తత్పరులై, విషగ్రస్తుడగు తమ కుమారుని ఇంటికి తీసికొని వెళ్లి పలువిధములుగు ఉపచర్యలను చేయదొడగిరి. కాని ఫలితము లేకపోయెను. మాంత్రికుని పిలిపించి అతని ద్వారా విషహరణ మంత్రమును గాని, విష నివారణ మూలికను గాని ప్రయోగింప జేసినచో బాధ తగ్గుగలదనియు, ప్రమాదము తొలగిపోగలదనియు అచట సమావేశమైన వారిలో నొకడు సూచింపగా, అది సమంజసమని భావించి కొందరు తత్‌క్షణమే మాంత్రికుని కొరకై పరుగెత్తి కొద్ధిసేపటిలో నతనిని తోడ్కొనివచ్చిరి.\n\nమాంత్రికుడు బాలుని లెస్సగా పరీక్షించి కరిచినది గొప్ప నాగుపామనియు, కరచి చాలసేపగుటచే విషము శరీరమంతయు వ్యాపించి నదనియు, ఇక బాలుడు బ్రతుకుట సందేహాస్పదనియు ఐనను ఒకానొక తీగమొక్క ఆకు రసమును పిండి ఆ పసరు పిల్లవాని నోటిలో పోసినచో అతడు బ్రతకగలడనియు చెప్పగా, వెనువెంటనే ఆ తీగ కొరకై అందరును నలుప్రక్కల వెడకదొడగిరి. రాత్రి సమయమగుటచే చేతిలో దీపములను పట్టుకుని ఆ గ్రామసస్తు లందరు మాంత్రికుని వెంట దీసుకొని గ్రామములోను, గ్రామపరిసరములలోను ప్రతి చెట్టు, ప్రతి తీగె పరీక్షించిరి. కాని అవసరమైనన తీగమాత్రము దొరకలేదు. అపుడందరును తిరగి వచ్చిరి.\n\nఇచ్చట బాలుని పరిస్థితి ప్రమాదస్థాయి చేరుకొనినది విషహరకమగు లతకొరకై బయటకు వెడలిన మాంత్రికుడు, బాలుని తండ్రి తదితరులు ఇంటికి వచ్చునప్పటికి పిల్లవాని ప్రాణములు పోయెను. అందరును దుఃఖసాగరములో మునిగిపోయిరి. తల్లిదండ్రుల కన్నీరు కాల్వలై పారదొడంగెను. ఏకైక పుత్రుడు, బీదకుటుంబమము. ఇక చేయునదేమి కలదు? విధి బలీయైనది.\n\nఇంతలో మాంత్రికుడు ఊరంతయు తిరిగి వచ్చుటచే పద ప్రక్షాళనము చేసికొనదలంచి ఆ యింటి దొడ్డిలోనికి పోగా, అచట నొక చిన్న తీగె అల్లుకొనియుండుట చూచి, దాని సమీపమునకు పోయి పరీక్షించి చూడగా అది ఇంవరకు తాము ఊరంతయు గాలించి వెతుకుచున్నట్టి తీగె అయియుండుటవలన ఆశ్చర్యచకితుడై, ఇంటివారందరిని పిలిచి చూపించి, \"అయ్యో ఎంత పొరపాటు జరిగినది! ఏ తీగకొరకై బయట ఊరంతయు వెదకితియో, ఆ తీగె మీ ఇంటిలోనే యున్నది. కాని ఇప్పడు పరిస్థితి చేయదాటి పోయినది. ఏమి చేయుటకును లేదు. ఈ తీగె యొక్క ఆకులను పిండి రసము తీసి ఆ రసము విషగ్రస్తుని నోటిలో పోసినచో తత్‌క్షణము విషము హరించిపోవును. కావున జ్ఞాపకముంచుకొనుడు\" అని చెప్పి వెడలిపోయెను.\n\nమరునాడుదయమున పిల్లవాని తల్లిదండ్రులు మృతబాలున కొనర్చవలసిన విధి పూర్వక క్రియల నాచరించి, వెనువెంటనే దొడ్డిలోనికి పోయి ఆ లతకు చుట్టు కంపనాటి దానికి పాదుచేసి, నీళ్ళుపోసి, ఎవరును తాకకుండ, త్రుంపకుండ ఉండుటకై తగు జాగ్రత్త వహించిరి. ఇదివరలో ఆ లతనే వారు అజాగ్రత్తగా చేసియుండిరి, కారణమేమి? దాని మహిమ తెలియనందువలన, దానిలో విషహరణశక్తి కలదని యెరుగక పోవుటవలన ఇదివరలో ఆ తీగెను ఉపేక్షించిరి. దాని విషయమై అశ్రద్ధ చేసిరి. ఇపుడు శ్రద్ధవహించుటకు కారణము దాని ప్రభావము మాంత్రికుని ద్వారా తెలిసికొనుటయే.\n\nఅట్లే భగవానుని యొక్కయు, గీతాది సచ్చాస్త్రముల యొక్కము, సద్గురువుల యొక్కయు మహిమను, ప్రభావమును పెద్దలవలన గుర్తెరిగి, వారిపై పరిపూర్ణ విశ్వాసము కలిగి జనన మరణ రూప భవరోగమును బాపుకొని జనులు పరమశాంతిని, సంపూర్ణానందమును అనుభవింతురు గాక!\n\nనీతి: భగవంతుని యెడల, సద్గురువుల యెడల శాస్త్రము యెడల పరిపూర్ణ విశ్వాసము గలిగియుండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 797,
        "IMAGE": "cat_9",
        "NAME": "పరిపూర్ణ విశ్వాసము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వ మొకనాడు కౌరవసభలో ఎందరో పెద్దలు ఆసీనులై యుండగా వారి సమక్షమున దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని ఈడ్చుకొని వచ్చి అవమానము చేయ నుద్యుక్తుడయ్యెను. ఆ విపత్కర సమయమున ద్రౌపదికి ఏమియు దిక్కుతోచకుండెను. తత్‌క్షణమే దైవసహాయమును నపేక్షించెను. శ్రీకృష్ణపరమాత్మను ఈ ప్రకారముగ ఆ లలనామణి ప్రార్థించెను.\n\nగోవింద! ద్వారకావాసిన్‌ కృష్ణ! గోపీజనప్రియ |\nకౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి కేశవ? ||\n\n\"ఓ గోవిందా! ద్వారకావాసీ! కృష్ణా! గోపీజనవల్లభా! కౌరవులచే అవమానింపబడుచున్న నన్నేల నీవు తెలిసికొనుటలేదు? నన్నేల కాపాడకున్నావు?\" కాని శ్రీకృష్ణుని నుండి ప్రత్యుత్తరము రాలేదు. క్షణములు గడిచిపోవుచున్నవి. ప్రమాదము తీవ్రమగుచున్నది. ఇక ఏమిచేయవలెనో ద్రౌపదికి తోచకుండెను. అయినను ధైర్యము తెచ్చుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మరుల ఈ క్రింది విధముగ ప్రార్థన చేయదొడగెను -\n\nకృష్ణ! కృష్ణ! మహాయోగిన్‌! విశ్వాత్మన్‌! విశ్వభావన |\nప్రపన్నాం పాహి గోవింద! కురు మధ్యే వసీదతీమ్‌ ||\n\nకృష్ణా! కృష్ణా! మహాయోగివర్యా! సర్వజగద్వ్యాపకా! విశ్వస్వరూపా! కౌరవుల మధ్య అవమానపడుచు నిన్ను శరణుబొందినట్టి నన్ను రక్షింపుము! రక్షింపుము!\"\n\nఈ రెండవ ప్రార్థన చేసిన మరుక్షణమే ద్రౌపదికి భగవత్సహాయము లభించెను. ఆమె ధరించిన వస్త్రము అక్షయరూపమును దాల్చెను. దుశ్శాసనుడు కింకర్తవ్య విమూఢుడై తలవంచుకొని వెడలిపోయెను. పరిస్థితి అదుపులోనికి వచ్చినప్పటికిని, ఆపత్తు పూర్తిగ తొలగిపోయినప్పటికిని ద్రౌపదికి ఒక్క విషయమందు మాత్రము సంకోచము వదలకుండెను. \"శ్రీకృష్ణ పరమాత్మ అర్తరక్షకుడు గదా! దీన జనబంధువు కదా! మరి, ఆర్తియందుండి హృదయపూర్వకముగ మొరపెట్టుకొనుచున్న ఒక అబలయొక్క దీనాలాపమును విని తక్షణమే అతడేల సహాయము చేయకుండెను? కొంచెమాలస్య మేల చేసెను?\" - అను ఈ సందేహమామెను మనసున బాధింపదొడగెను. అనుకూల సమయమందు ఆ కృష్ణునినే స్వయముగ ప్రశ్నించి తత్సందేహ నివారణము కావించుకొన నిశ్చయించెను ద్రౌపది. ఇట్లుండ కొంత కాలమునకు ఒకనాడు శ్రీకృష్ణుని దర్శనము ఏకాంతమున తటస్థించినపుడు ద్రౌపదీదేవి అదను జూచి ఆమ్మహాత్ముని ఇట్లు ప్రశ్నించెను. దేవా! మీరు భక్తవత్సలురు గదా! దీనులపాలిటి కల్పవృక్షస్వరూపులు కదా! నిండు ప్రమాదములో ఉండి ఆర్తనాదము చేసి \"కృష్ణా! ద్వారకావాసీ!\" అని మిమ్ములను మనసార ప్రార్థించినపుడు నాకు సహాయమును వెంటనే చేయక ఒకింత ఆలస్యము చేసితిరేమి? ఇట్లు చేయుట తగునా?\n\nద్రౌపది యొక్క సముచిత హేతుపూర్వక వాక్యములను విని శ్రీకృష్ణపరమాత్మ యిట్లు ప్రత్యుత్తర మిచ్చెను - \"అమ్మా! నీవు చెప్పినది నిజమే. ఆర్తులను, దీనులను, భక్తితో నన్ను స్మరణ చేసిన వారిని తత్‌క్షణమే రక్షించి కాపాడుట నాయొక్క ధర్మము. కాని నీవు నన్ను మొదట 'ద్వారకావాసీ' అని సంబోధించితివి. నేను ద్వారకావాసినిగదా! ద్వారకలో నివసించువాడను గదా! మరినిన్ను రక్షించుటకు ద్వారకనుండి హస్తినా పురమునకు రావలెను గదా! ద్వారక ఎచట! హస్తినాపుర మెచట! కొన్ని వందలమైళ్ళ దూరము మధ్యలో ఉన్నది కదా! అంత దూరము నడిచి రావలెనన్న ఎంతవేగముగా వచ్చినప్పటికిని ఒకింత ఆలస్యము జరుగును గదా!\n\nకృష్ణమరమాత్మ యొక్క ఆ భావగర్భిత వచనములను విని ద్రౌపది నిరుత్తరమయ్యెను. \"విశ్వవ్యాపకుడగు దేవదేవుని పరిమతాకారవంతునిగ వర్ణించి నేను ప్రార్థించితినే! బ్రహ్మాండమంతటను అణువణువునందును వ్యాపించి విరాడ్రూపుడైచెన్నొందు ఆ మహనీయుని ద్వారకలో పరిమితుడై యున్నట్లు భావించితినే! ఎంత పొరబాటు! కనుకనే నాయొక్క మొదటి ప్రార్థనకు జవాబు రాలేదు. రెండవ ప్రార్థనలో ఆ మహనీయుని \"విశ్వత్మాన్‌\"- (విశ్వరూపా) అని సంబోధించగా తక్షణమే ప్రత్యుత్తరము వచ్చివేసినది. కాబట్టి భగవంతుడు అపరిమితుడు, సర్వవ్యాపి అని ద్రౌపది నిశ్చయించుకొని సంతృప్తిని బొందెను.\n\nకావున, భక్తులు తమకు భక్తిభావము కుదురుటకును, చిత్తైకాగ్రత అలవడుటకును ప్రారంభమున సాకారార్చన కావించినను, దేవుని పరిమితాకారముగ భజించినను, తుదకు ఏనాటికైనను నిరాకార, నిరంజన, నిర్గుణ, సర్వవ్యాపక భగవత్స్వరూపమును వారు అనుభూతమొనర్చు కొనియే తీరవలెను. సకారమునుండి నిరాకారమునకును, సగుణము నుండి నిర్గుణమునకును, పరిమితమునుండి అపరిమితమునకు, సాంతము నుండి అనంతమునకు తప్పక పయనమైపోవలెను. భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వము ఈ జీవితమందే అవగాహన మొనర్చుకొని జనులు ధన్యులు కావలెను.\n\nనీతి: భగవంతుడు సర్వవ్యాపి, అణువణువు నందును వారు వ్యాపించియున్నారు. కాబట్టి పాపకార్యమును చేయక, పుణ్యకార్యముల ద్వారా ఆత్మోన్నతిని సాధించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 798,
        "IMAGE": "cat_9",
        "NAME": "భగవంతుడు పరిమితుడుకాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "(ఈ రైక్వుని వృత్తాంతము చాందోగ్యోపనిషత్తునందు కలదు)\nపూర్వము జానశ్రుతి అను రాజుండెడివాడు. అతడు మహావృషమను రాజ్యమును పాలించుచుండెను. అతడు దయార్ద్ర హృదయుడు. ధర్మయుక్తముగ ప్రజలను పాలించువాడు. దానధర్మములు చేయుటయం దతడు చాలా పేరు బడసెను. ఎన్నియో సత్రములను కట్టించెను. అనాథులకు, పాంథులకు వసతిగృహములను నిర్మించెను. ఈ ప్రకారముగ ఆ రాజు లోకమున గొప్పకీర్తిని వహించెను.\n\nఒకనాటి సాయంసమయమున ఆ రాజు తన ప్రసాదము యొక్క పైభాగమున విశ్రమించియుండ ఆతని నెత్తిపై ఆకాశమున రెండు రాజహంసలు అతి వేగముగ ఎగురుచు బోవుచుండెను. అవి పరస్పరము సంభాషించుకొనుచు ప్రయాణము సాగించుచుండ, రాజు ఆ పక్షుల వాక్యములను వినుచుండెను.\n\nఅందు మగపక్షి ఆడపక్షితో ఇట్లనెను - \"ఓయీ! ఈ జానశ్రుతిరాజు నుండి ఆవిర్భవించుచున్న ప్రకాశవంతమగు జ్యోతిని నీవు చూడలేదా; దానిని దాటకుము. బాధ నొందెదవు. ఆతనికీర్తి రూపప్రాకాశ పుంజము లెస్సగా వ్యాపించియున్నది. ఇక్కాలమున ఆ రాజువలె కీర్తి వహించినవాడు, దానధర్మము లొనర్చినవాడు మఱియొక డెవడును లేడు\". ఆ వాక్యములను వినగానే ఆడపక్షి నవ్వి ఈ ప్రకారము వచించెను - నన్నేల ఇవ్విధముగ భయపట్టెదవు? మన మాకసమున ఎగురవారము కావున లోకములో ఎచటెచట ఎవరెవరు మహనీయులన్నది,తక్కినవారికంటె మనకే బాగుగ తెలియును. బండిక్రిందనున్న రైక్వునికంటే ఈతడేమి గొప్పవాడు? ఆతని కీర్తి చెంత ఈతనికీర్తి ఒకలెక్కలోనిదా? రైక్వుడు తన మహిమచేతను,తన ఆధ్యాత్మిక ఔన్నత్యముచేతను అనేకమంది ప్రజలను తనవైపునకు ఆకర్షించు కొనుచున్నాడు. అతడు పేరుప్రఖ్యాతులను కోరడు. గొప్పవైరాగ్యము కలవాడు. నిరంతర మాత్మస్థితియందున్నవాడై గంభీరముగ వర్తించుచుండును\" ఈ ప్రకారముగ ఆ రెండు పక్షులు తమలో తాము సంభాషించుకొనుచు ఎగిరిపోయెను.\n\nఇంతలో సూర్యుడస్తమింప రాత్రి ప్రవేశించెను. పక్షుల వాక్యములను వినిన జానశ్రుతిరాజునకు ఒకే కలవరము పుట్టెను. \"పక్షులు సూచించిన ఈ రైక్వుడెవరు? నా కంటె ఎంతయో కీర్తిప్రతిష్ఠలను అధికముగ లోకమున ఆతడార్జించెననియు, అతడు గొప్ప మహిమాన్వితుడనియు ఈ పక్షులు పేర్కొన్నవే! ఈ రైక్వుడెచట నున్నాడో కనుగొనవలెను. అందుల కుపాయమేమి?\" అని ఆలోచించుచు రాజు పరుండెను.\n\nమఱునాడుదయమున వందిమాగధులు మథారీతిగా రాజును స్తోత్రము చేయసాగిరి. ఆతడింద్రుడు, చంద్రుడు అని కీర్తింపసాగిరి. ఆ వాక్యము లాతని కేమియు రోచకములుగ గనపడలేదు. తనకంటే గొప్పవా డొకడుండ తనకేల ఈ ప్రశంసలని యతడు తలపోసి ఆ వందిమాగధులను వారించి, రైక్వుడను మహాత్ము డెచట నున్నాడో? తన రాజ్యమంతా వెతికి రమ్మని వారలను పంపెను. వారట్లే వెడలి ఊరూరా ఎంత వెతకినను అట్టి మహనీయు డెవడును ఎచ్చటను గనపడకుండెను. రాజు మరల రెండోవసారి వారలను పంపి గొప్ప ఆధ్యాత్మ విధ్యాసంపన్నులు, బ్రహ్మజ్ఞానులు ఉండుచోట వెతకి రమ్మనెను. వారుపోయి మహావృషరాజ్యమందలి గ్రామగ్రామము వెదకసాగిరి. అత్తఱి ఒకానొక సుదూర గ్రామమున ఒక బండిక్రింద ఒక మహనీయుడు కూర్చునియుండుటను జూచిరి. ఆతడే రైక్వుడుడని తెలిసికొనిరి. పైకిచూచుటకు అతడొక సామాన్య వ్యక్తిగ కనిపించెను. అందువలన రాజసేవకులు అతడే రైక్వుడని మొదట నమ్మలేదు. అయినను జనులందరును పలుకు వాక్యములను విశ్వసించి వెంటనే రైక్వుని వృత్తాంతమును రాజుకడకేగి విన్నవించుకొనిరి.\n\nఅత్తరి జానశ్రుతిరాజు పరమసంతోషమును బొంది ఆ మహాత్ముని సందర్సింప గోరి, అఱువందల చక్కటి పాడియావులను, రథతురగాదులను, పెక్కు బంగారునాణెములను, సైనికులను, పరివారమును వెంటనిడుకొని రైక్వుని యొద్దకు పయనమైరి. అచటికి వెళ్ళి అమ్మహనీయునకు నమస్కరించి, చేతులు జోడించుకొని నిలబడి, తానుతెచ్చిన కానుకలను గ్రహింపవలసినదిగా వేడుకొని పూర్ణశాంతి నొందుటకు మార్గమును బోధింపవలసినదిగా ప్రార్థించెను. కాని రైక్వుడు ఆ రాజధనమును, ఆ పురస్కారములను జూచి ఏ మాత్రము సంతోషించక పైపెచ్చు రాజుతో నిట్లనియె - \"ఓయీ! ఏల ఈ పదార్థము లన్నింటిని నా కొసంగి వ్యర్థము చేయుచున్నావు? ఇవిగాని, వందలకొలది రాజ్యములుగాని, ఆధ్యాత్మ విద్యను కొనలేవు. దైవవిద్య పరమార్థవిద్య. బాహ్యవస్తువులచే లభించునదికాదు. ఇవి నా కవసరము లేదు. తీసుకొనిపొమ్ము?\"\n\nఆవాక్యములను వినగానే రాజు పరమాశ్చర్యపడి, రైక్వుని యొక్క గంభీరత్వమును, వైరాగ్యమును లోలోన కొనియాడి; బోధను, ఉపదేశమును బడయజాలనందులకు చింతించి సపరివారముగ తన స్థానమునకు వెడలిపోయెను. రాజుభవనమునకు వెడలినది మొదలు తిరిగి ఆ బ్రహ్మజ్ఞుని దర్శింపవలెనను అభిలాష రాజునకు తీవ్రముగ కలుగుచుండెను. కొంతకాలమున కతడు మరల రైక్వుని యొద్దకు నిరాడంబరముగ జని, ప్రణామ మాచరించి ఆధ్యాత్మవిద్య నుపదేశింప వేడుకొనెను.\n\nఅపుడు రైక్వుడు రాజుయొక్క నిరాడంబరత్వమునకు పరమార్థ జిజ్ఞాసకు సంతోషించి ఈ ప్రకారముగ నతనికి బోధించెను. ఈ ప్రపంచమున ఆత్మయే సర్వశక్తులకు మూలము సర్వదేవతలకు ఆధారము, సర్వపదార్థములకును అధిష్ఠానము. అభిమానము, గర్వము, డంబము మున్నగువానిని మనుజుడు వదలివేసి విశుద్ధహృదయముతో అట్టి ఆత్మ నన్వేషింపవలెను ఆత్మ నెఱుంగువాడే సమస్తము నెఱుంగును. సకల సుఖములను అనుభవించును! సద్గురువగు రైక్వుని యా దివ్య బోధనాలకించి రాజు పరమానంద భరితుడై తనరాజ్యమునకు వెడలి ఆ ప్రకారమాచరించి కృతార్థుడయ్యెను. రైక్వుడు వసించిన యాగ్రామము అప్పటినుండియు రైక్వపర్ణమని ప్రసిద్ధిచెందెను.\n\nనీతి: సమస్త ప్రపంచమునకు ఆత్మయే ఆధారము, ఆత్మ సాక్షాత్కారమే జీవుని ఏకైకలక్ష్యము. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 799,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఉపనిషత్కథ-రైక్వుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణ పరిసర ప్రాంతమున ఏకాంత ప్రదేశమునందు ఒక పర్ణకుటీరమును నిర్మించుకుని సాధుపుంగవుడొకడు ధ్యానాదులను సలుపుకొనుచుండెను. పట్టణములో జిజ్ఞాసువులైన భక్తులు కొందరు అపుడపుడు ఆ మహాత్ముని యొద్దకు వెళ్ళి అధ్యాత్మక్షేత్రమున తమకు గల సందేహములను అతనికి తెలియజేసి వానిని నివారించు కొనుచుండిరి. అనుభవజ్ఞుడైన ఆ తపస్వి తన దర్శనమునకు వచ్చుచుండిన ఆ ముముక్షువు లందరికిని చక్కని ప్రబోధము గావించుచు పరమార్థపథమున వారి కెంతయో సహాయకారిగ నుండెను.\n\nప్రతిదినము మధ్యాహ్న సమయమున ఆ సాధువు పట్టణమునకు బోయి భిక్షాటనము చేసికొని ప్రసాదమును ఆశ్రమమునకు తీసికొనివచ్చి భుజించుచుండెను. ఈ ప్రకారము భిక్షాటనమునకు ప్రతి నిత్యము ఊరిలోనికి పోవుచుండుటవలనను, తన ఆశ్రమమునకు వచ్చిపోయే వారితో సంభాషణము సలుపుచుండుట వలన జనులయొక్క మనస్తత్వము అతనికి చక్కగా అవగాహన మయ్యెను. ప్రతివారును దైవ దర్శనము చేసుకుని జన్మసాఫల్యమును బడయవలయునని కుతూహలము గలిగియున్నప్పటికినీ, ఆ దైవదర్శనమునకు కావలసిన సాధన సంపత్తిని గలిగియుండక, అజాగ్రత్తగ వహించి యుండుటను అతడు గమనించెను. మరియు పాపభూయిష్టమైన మనస్సు గలిగియుండి, అద్దానిని పునీత మొనర్చుకయు, ఒనర్చుటకు యత్నమైనను చేయకయు దేవుని అమాంతముగ సందర్శింపవలెనని వారు ఉబలాటపడుచున్నట్లు అతడు గుర్తెరిగి, చిత్తము నిష్కల్మషమై, పాపరహితమై యున్నపుడు మాత్రమే భగవంతుడు గోచరించునను పరమసత్యమును వారికి తెలియులాగున చేయుటకై అతడు ఉపాయమును అన్వేషింప దొడగెను.\n\nఒకనాడు ఆ సాధువు పట్టణమునకు బోయి ఒక శ్రీమంతునకు తన అభిమతమును తెలియజేసి అద్దానిని కార్యాన్విత మొనర్చుటకై అతని సహకారమును అభ్యర్థించెను. శ్రీమంతుడు అవ్విషయమున తన చేతనైన సహాయ మంతయు చేసెదనని సాధుపుంగవునితో నుడివెను. శ్రీమంతునకు ఆ నగరమున ఒక దివ్యమైన విశాల భవనము కలదు. ప్రత్తిబెళ్ళు మొదలైన వ్యాపార వస్తువులను నిలువ చేయుటకై అతడు దానిని ఉపయోగించుచుండెను. అది ఖాళీగా ఉండి యుండుటను గమనించి సాధువుగారు ఒక నెల రోజులు పూజా జప హోమాదులు అద్దానియందు జరుపుటకై దానిని తనకు ఒప్పచెప్పు లాగున కోరగా శ్రీమంతుడందుల కంగీకరించెను.\n\nవెనువెంటనే ఒక సుముహూర్తమున సాధువుగారు ఆ భవంతి యందు పూజా జప హోమాదులను ప్రారంభించెను. తలుపులన్నియు మూసివైచి, పెద్దగా మంత్రములను ఉచ్చరించుచు, అప్పుడప్పుడు స్వాహా అని పలుకుచు అగ్ని హోత్రమున ఆహుతులు వేయుచు, దాదాపు ఒక నెలరోజులు కర్మకాండ సంబంధమైన యేవేవో క్రతువులను ఆ సువిశాల భవనమున నిర్వహించెను. మాసాంతమున శ్రీమంతుని ద్రవ్యసహాయముచే అతడు ఒక కరపత్రమును అచ్చువేయించి వేల కొలది ప్రతులను ఆ పట్టణమందును, పరిసర గ్రామములందును జనులకు విరివిగ పంచిపెట్టించెను. ఆ కరపత్రమున ఏమి తెలుపబడెననగా - ఈ నెల 31వ తేది రాత్రి 8 గం||టలకు ఈ పట్టణమందు నెల రోజుల నుండి నిర్విరామముగ జప తప పూజా హోమాదులు జరుపబడిన భవనమునందు దేవుడు ప్రత్యక్షము కాగలడు. కాబట్టి దేవుని చూడదలచిన వారందరును వేళకు సరిగా వచ్చి దైవదర్శన మొనర్చుకొని కృతర్థులు కండు|\n\nఆ వాక్యములను చదువు కొనిన వారందరును భగవద్దర్శన భాగ్యము తమకు తప్పక లభించగలదని సంతోషాంతరంగులై ఆనందడోలికలలో ఊగులాడిరి. ఎప్పుడెప్పుడు ఆ సుదినము వచ్చునాయని జనులందరును వేచియుండిరి. సాధువుగారు ఆ భవనమున పూజా హోమాదులు రోజుల తరబడి చేసినందువలన కరపత్రములలోని దైవదర్శన సంభందమైన వాక్యములపై ప్రజలకు గట్టి నమ్మకము ఏర్పడెను.\n\nచివరికి ఆరోజు రానేవచ్చెను. సాయంత్ర మగుసరికే సుదూర ప్రాంతములనుండి జనులు తండోపతండములుగ ఆ పట్టణమునకు చేరదొడంగిరి. వారివారికి అనుకూలపడిన వాహనములపై వేలకు వేలజనులు భవన సమీపమునకు వచ్చుచుండిరి. భవన మంతయు ముముక్షువులచే, జిజ్ఞాసువులచే, దైవదర్శనాభిలాషులచే క్రిక్కిరిసిపోయెను. సరిగా రాత్రి 8 గంటలయ్యెను. సాధువుగారు ప్రకటించిన దానిని బట్టి సరిగా ఆ సమయమునకు అందరికీ దేవుడు కనిపించవలయును. కాని అట్లు కనుపించలేదు. అరగంట దాటినది. గంటదాటినది. కాని దైవదర్శన మెవరికీని కాలేదు. అపుడు ప్రజలందరును హతోత్సాహులై వేదికపై ఉన్న సాధువుగారితో 'అయ్యా! దేవుడు ఇంకను కనుపించలేదేమీ?' అని ప్రశ్నింప అమహనీయు డున్నత స్వరముతో అచట అసీనులై యున్న జనానీకము నుద్దేశించి యిట్లు పలికెను.\n\n'ఓ మహాజనులారా! దేవుడు తప్పక కనిపించును. నేను ప్రకటించిన దానిలో ఏమాత్రము అసత్యము లేదు. అయితే పాపము లేని వారికి మాత్రమే కనిపించును, కాబట్టి మీమీ హృదయములను ఒకింత పరిశోధించి చూచుకొనుడు. ఏ ఒకింత పాపపంకిలము మీ యందున్నను అది దైవదర్శనమునకు అడ్డుగా నుండును' ఆ వాక్యములను వినగానే ప్రతివారును తమతమ చిత్తములను సంశోధించి చూచుకొనగా పాపరహితమైన స్థితి ఏ ఒకరికి గూడ కానరాదయ్యెను. తమ తమ దోషములను తామే లోలోన వగచుచు అచట చేరినవారందరు ఒక్కొక్కరే తిరోగమనముల సల్ప నారంభించిరి. మనస్సు పాపభూయిష్టముగ నున్నంతవరకు, సచ్చరిత్ర, సన్మార్గావలంబనము లేనంతవరకు దైవదర్శనము దుర్లభమను సత్యమును ప్రజలు గుర్తెరింగి ఆనాటి నుండియు సాధుమహాత్ముని వాక్యములపై అచంచల విశ్వాసము కలవారై, పాపకార్యములను త్యజించి పవిత్రాచరణ కలవారైరి.\n\nనీతి : అపవిత్రహృదయముతో ఎవరును దైవమును గాంచజాలరు, దైవదర్శనమునకై విష్కళంక చిత్తము అత్యావశ్యకమై యున్నది. కావున జనులు పవిత్రాచరణ కలవారై తమ చిత్తము లందలి దోషములను, పాపములను పుణ్యసంపాదనముచే దూరీకృత మొనర్చి, తత్ఫలితముగ దైవసాక్షాత్కార మొంది జీవితమును చరితార్థ మొనర్చుకొనవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 800,
        "IMAGE": "cat_9",
        "NAME": "దైవ దర్శనము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకపుడు ఒకానొక వర్తకుడు కొంత డబ్బును మూట కట్టుకుని యాత్రచేయుటకై బయల్వెడలెను. దారిలో అచటచట సత్రమునందో, దేవాలయమునందో విశ్రమించుచు ప్రయాణము కొనసాగించుచుండెను. వర్తకుని యొద్ధగల డబ్బుమూట జూచి మరియొకనికి దానిని తస్కరించవలెనను దుర్బుద్ధి జనించి స్నేహితునివలె నటించి మెల్లగా ఆతని చెంతచేరెను. ఇరువురును పరమమిత్రులవలె మెలగుచు యాత్రసల్పుచుండిరి.\n\nఒకనాటిరేయి ఇద్దరును ఒక సత్రమునందలి గదిలో పరుండిరి. వర్తకుడు గాఢనిద్ర పోవుచుండ, ఆ కపట మిత్రుడు నెమ్మదిగా లేచి డబ్బుమూటకొరకై గదియంతయు వెతకెను. వర్తకుని పెట్టె, సంచులు, చొక్కా మూటలు అన్నియు విప్పిచూచెను. కాని డబ్బులమూట కనిపించలేదు. మరల మరల వెతకెను. కాని కనిపించలేదు. మరుసటి రోజు ఉదయమున తన స్నేహితునితో మాట్లాడుచు మాటల సందర్భములో \"రాత్రి మీ డబ్బుమూట ఎచట దాచితిరి?\" అని ప్రశ్నింప అతడు 'నీ దిండు కిందనే' అని జవాబిచ్చెను. కపట మిత్రుడు ఆత్యాశ్చర్యపడెను. వర్తకుడు తన మిత్రుని దొంగగా గ్రహించి అతడెట్లయినను తన ధనుమును అపహరించునని తలంచి ఆ మూటను ప్రతిరోజు ఆ మిత్రుని తల (దిండు) క్రిందనే దాచుచుండెను. ఏలయనగా దొంగ అన్నిచోట్ల వెదకునుగాని తన తల (దిండు) క్రింద వెతకడు. వర్తకునకో, దొంగలను మేపు అభ్యాసము కలదు కనుక తన ధనరక్షణ కొరకై యీ చక్కని ఉపాయము అవలంబించెను.\n\nఆ ప్రకారమే జీవుడు బ్రహ్మానందవారాశిని తన హృదయమునందే ఉంచుకుని ప్రపంచమంతయు ఆనందము కొరకు వెతకుచున్నాడు. కానియెంత వెతికినను ఆ శాశ్వతానందమాతనికి బయట ఎచటను లభించుటలేదు. అది అంతరంగముననే కలదు. ఆ రహస్యమతనికి తెలియక అజ్ఞాన వశమున బయట తుచ్చసుఖములకై తిరుగాడు చున్నాడు. \"విందత్యాత్మని యత్సుఖమ్‌\" , \"సుఖమక్షయ మశ్నుతే, 'యోంతః సుఖో' ఇత్యాది వాక్యముల ద్వారా శ్రీకృష్ణపరమాత్మ అక్షయసుఖము లోపలనే కలదని స్పష్టము చేసియున్నాడు.\n\nప్రతిరోజు గాఢనిద్రపోవునపుడు బాహ్యవస్తువు లన్నింటిని మరచి, సంకల్పములను కూడ వదలి జీవుడు అవిచ్చిన్నమగు సుఖము తనయందే అనుభవించుచుండుట చూచుచున్నారము కదా! ఆ సమయమున ఎట్టి దుఃఖము కూడ స్ఫురణకు రాక జీవునకు పరమశాంతి కలుగుచుండును. అజ్ఞానస్థితిలో మనస్సు యొక్క తాత్కాలిక ఉపశమనరూపమగు సుషుప్తియందే ఇంత సుఖము జీవునకు అభ్యంతరమున లభించుచుండ ఇక జ్ఞానస్థితిలో మనస్సు యొక్క శాశ్వత ఉపశమనరూపమగు సమాధిస్థితియం దెంత సుఖము లభించగలదు? కాబట్టి అట్టి అనంతాత్మసుఖప్రాప్తికై బాహ్య అల్పసుఖములను జీవుడు పరిత్యజించవలసి యుండును. దానినే విషయ విరక్తి యందురు. కొంత త్యాగమవలంబించి ఈ కార్యమును సాధించినచో ఫలితము అఖండదైవ ప్రాప్తియే.\n\nకావున విజ్ఞులగువారు తమ అమూల్య మానవజన్మను సార్థక పరచుకొనుటకొరకు ప్రయత్నశీలురై, విషయ సుఖములను పరిత్యజించుచు ఇంద్రియ మనోనిగ్రహమును సాధించుచు, కామక్రోధాదుల వేగమును అణచుచుందురు. జీవితకాలము అతిస్వల్పము. తెలిసికొనవలసిన ధర్మములా పెక్కుగలవు. ఆచరించవలసిన సాధనలా అనేకములున్నవి. విఘ్నములా లెక్కలేనన్ని వచ్చి పైబడుచున్నది. ఇట్టిస్థితిలో జీవుడు ఎంతత్వరితముగ తన లక్ష్యమును సాధింపగల్గునో అంత శ్రేయస్కరము. మృత్యువు ప్రతి నిముషము జీవుని కబలించుటకై ప్రక్కనే వేచియున్నది. వార్ధక్య , రోగాదులు హుంకరించుచు మీదపడబోవుచున్నవి. కావున వానివలన అపకారము కలుగకపూర్వమే, మృత్యువు దాపురించక మునుపే, ఇంద్రియముల శక్తి ఉడుగక పూర్వమే వైరాగ్య శమదమాది సాధనలను అభ్యసించి స్వస్వరూపానుభవమును పొందవలసి యుండును.\n\nమరణించిన పిదప మానవజన్మ వచ్చునను \"గ్యారంటీ\" లేదు. ఆ ప్రకారముగ భగవంతుడు మనకు హామీపత్ర మేదియు నివ్వలేదు. ఒకవేళ ఇతరలోకములందు జన్మించితిమా, అచట పరమార్థసాధనలకు అనుగుణమైన వాతావరణ ముండదు. అవి యన్నియు భోగభూములే గాని యోగభూములు కావు. కర్మభూమి లంత కంటెనుకావు. భూలోకమొకటియే చక్కని కర్మక్షేత్రము. పాపము చేసినచో నరకమునకు, పుణ్యము చేసినచో స్వర్గమునకు, జ్ఞానము పొందినచో మోక్షమునకు ఇక్కడినుండియే జీవునకు నేరులో టిక్కెట్టు దొరుకును. తన గమ్యమును తాను ఇచటనే నిర్ణయించు కొనవచ్చును. కాబట్టి త్వరలో సద్గురువు నాశ్రయించి తరుణో పాయమును ఎరుంగవలెను. అదియేదియో గురోర్గురువైన శ్రీకృష్ణ మూర్తి గీతయందు వెల్లడించియే యున్నాడు.\n\nశక్నోతీహైవ యఃసోఢుం ప్రాక్చరీరవిమోక్షణాత్‌ |\nకామక్రోధోద్భవం వేగం సయుక్తస్ససుఖీనరః ||\n\nపరమార్థసుఖము ఎవనికి లభించును? కామక్రోధాదులను నిగ్రహింపగలిగిన వానికి. వానిని ఎపుడు నిగ్రహించవలెను? ఈ శరీరము పతనము కాకపూర్వమే అనగా మృత్యవాసన్న మగుటకు ముందే ఎచట నిగ్రహించవలెను? ఇచటనే, ఈ మానవజన్మ యందే, ఈ భూలోకముననే (ఇహైవ) - ఇవ్విధముగ పరమాత్మ అధ్యాత్మ సుఖప్రాప్తికై రాజబాటను చూపెను. కోరికలను తగ్గించుకొనవలెను. ఆశలను విడనాడవలెను. విషయసుఖములను పరిత్యజించవలెను. భోగాభిలాషను దూరీకృత మొనర్చుకొనవలెను. కామక్రోధాదులను అణచవలెను. అత్తరి ప్రతిజీవికిని తన హృదయస్థమగు ఆత్మానందరూప అఖండసుఖము చక్కగా అనుభూతమగును.\n\nనీతి : పరిపూర్ణమగు సుఖము తనయందే కలదు. మనస్సును నిగ్రహించి, నిర్మల మొనర్చి అంతర్ముఖముచేసి అట్టి సుఖమును జీవుడు అనుభూత మొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 801,
        "IMAGE": "cat_9",
        "NAME": "సుఖమునకు రాజబాట ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక గ్రామములో ఒక సామాన్య కుటుంబము కలదు. అందు భార్యాభర్త లిరువురు అన్యోన్య ప్రేమానురాగములు కలవారై నివసించుచుండిరి. కుటుంబములో ఏ యిబ్బందులును లేవు. కాని ఒక్క విషయమందు మాత్రము వారికి విపరీతమైన మనస్తాపము కలుగుచుండెను. ఒడుదుడులు లేక సవ్యముగా కాలము గడిచిపోవు చున్నప్పటికిని మనస్సునందు ఒక్క విషయమై వారికి తీవ్రమగు ఆందోళన జనించుచుండెను. వారిరువురి ఆకృతులలో, ముఖ్యముగ ముఖనిర్మాణమందు ఒకింత కురూపత్వము జనులకు దృగ్గోచరమగుచుండెను. ఇద్దరికిని ముక్కులు చట్టిగా నుండుటవలనను, ఆ చట్టి తనముకూడా ఇద్దరికి ఒకే కొలతలో ఏర్పడి యుండుటవలనను, చూచినవారికెల్ల పట్టరాని నవ్వు వచ్చుచుండెను. వారింటికి బంధువులు గాని లేక తదితరులుగాని ఎవరు వచ్చినప్పటికిని ముందుగా వారిద్దరిని జూచి పకపక నవ్వుచుండిరి. ఈ స్థితి ఆ దంపతులకు చాల దుర్భరముగ నుండెను. ఈ అవమానమును భరించలేక వారు లోలోన క్రుంగి కృశించి పోవుచుండిరి. 'భగవంతుడా! ఏల మమ్ముల నీప్రకారముగ సృష్టించి తివి'? అని లోలోన వాపోవుచుండిరి.\n\nఇట్లుండ కొంతకాలమునకు వారొక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని యొద్దకు వెళ్ళి ఈ అవమానము ఎపుడు తొలగగలదనియు, అది తొలగిపోవు ఉపాయమేదియైన కలదాయనియు ప్రశ్నించిరి. అంతట ఆ జ్యోతిష్యుడు - దంపతులారా! ఇది మానవ మాత్రులచే సాధ్యమగు పనికాదు. మీ ముక్కులను ఇంత వికృతముగ ఎవరు సృష్టించారో అట్టి జగన్నిర్మాతయైన బ్రహ్మదేవుడే మీయొక్క ఈదురంత అవమానమును దూరీకరింప సమర్ధుడు. కాబట్టి ఈ రోజు మొదలుకొని మీరా బ్రహ్మదేవుని సాక్షాత్కరించుకొనుటకై జపతప ప్రార్థనాదులను గావించుడు అని వాక్రుచ్చెను.\n\nఅది విని దంపతులు పరమానందభరితులై ఇంటికి తిరిగివచ్చి వ్రతనిష్ఠ కలవారై బ్రహ్మదేవుని గూర్చి తీవ్రమగు తపస్సును ప్రారంభించిరి. ఆహారమును వర్జించి, ఏకపాదంబున నిలబడి, చిత్తమును అన్యత్రపోనీయక కఠోరదీక్షతో వారు బ్రహ్మదేవుని అహర్నిశము ధ్యానింప దొడిగిరి. వారి యా తప్పసునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరము కొరుకొనుమని వచింప, తక్షణమే ఆ దంపతులు \"మహాప్రభో! మాకొక కోరిక కలదు. ఈ చట్టి ముక్కుల వలన మాజీవితము చాలా దుఃఖ భూయిష్టముగ పరిణమించినది. ప్రతివారును జూచి ఎగతాళి చేయుచున్నారు. మేము లోకమున కిపుడు పరిహాసపాత్రులమై పోయితిమి. ఈ అవమానమును మేమిక భరింపలేము. ఈ దుర్భర విపత్తునుండి మమ్ములను కాపాడి గట్టెక్కించు తండ్రీ! మీకు పదివేలు నమస్కారములు. మాకు మంచి ముక్కుల నొసంగి దీవించు మహాప్రభో!\" అని ప్రార్థించిరి. అట్లే యగుగాక! అని పలికి బ్రహ్మదేవు డంతర్ధానము నొందెను.\n\nబ్రహ్మదేవుని వరప్రభావముచే ఆ దంపతులకు మంచి ముక్కులు ఏర్పడెను. అయితే ఒక పెద్ద చిక్కువచ్చి నెత్తిన పడినది. ఏమియనగా \"మాకు మంచి ముక్కులు కావలెనని వారు ప్రార్థించి నందువలనను, \"ముక్కులు\" అని బహువచన ప్రయోగము చేసినందువలనను ఎన్ని ముక్కులు కావాలో స్పష్టముగ తెలుపనందువలనను బ్రహ్మదేవుడు వారి ఒడలంతయును మంచి ముక్కులతో నింపివేసెను. చేతులపై, కాలపై, తలపై, మెడపై, ఎక్కడ చూచినను ముక్కులే! రామ! రామ! ఇక వారి పరిస్థితి ఎట్లుండునో చెప్ప నవసరము లేదు. వారిపని \"మూలిగే నక్కమీద తాటికాయ\" చందమయినది. వారి వికార పరాకాష్ఠను చూచుటకు జనులు తండోపతండముగ రాదొడంగిరి. వచ్చుటయేకాక కడుపు చెక్కలగునట్లు నవ్వుచుండిరి. ఒక చెంప ఆశ్చర్యము, ఒక చెంప పట్టరాని నవ్వు, వీనితోగూడి జనులు తీర్థప్రజగా అచటి కేతెంచుచుండ ఆ దంపతులకు నూతన సమస్య యేర్పడెను. ఆపీడ పడలేక వారు తిరిగి బ్రహ్మదేవుని ప్రత్యక్షము చేసికొనదలంచి అందులకై ఏకంతమున కరిగి తిరిగి ధ్యానాదులను సలుపదొడంగిరి.\n\nకొంతకాలమునకు వారి తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై 'ఓ దంపతులారా! మీయాభీష్టమేమియో వచింపుడ' ని పలికెను. అంతట వారిరువురు, \"మహాత్మా మాకిపుడు ఒడలంతయు మంచి ముక్కులతో నిండిపోయి అసహ్యముగ నున్నది. ఇన్ని ముక్కులను ఎవరు భరించగలరు? కావున దేవా! ఈ ముక్కులు మాకు వద్దు' అని ప్రార్థించిరి. తోడనే బ్రహ్మదేవుడు \"తథాస్తు\" (అట్లేయగుగాక) అని వచించి యంతర్ధాన మొందెను. బ్రహ్మదేవుని యనుగ్రహముచే వారికిపుడు ముక్కులన్నియు తొలగిపోయినవి కాని ఈ సారి ఇంకొక పెద్దచిక్కు వచ్చిపడింది. ఏమనగా 'అన్ని ముక్కులు తొలగిపోవుగాక ' అని బ్రహ్మదేవుడు వరమిచ్చినందువలన ఒక్క ముక్కుకూడ మిగలకుండ అన్నియు మాయమైపోయినవి. కనీసము ఊపిరి సల్పుటకైనను ఒక ముక్కు మిగలలేదు. అపుడు పరిస్థితి ఇంకను విషమించి పోయినది. ఆ దంపతులు ఊపిరిసలుపలేక నానావస్థలు పడుచుండిరి. ఇక గత్యంతరములేక వారు బ్రహ్మదేవుని మరల ధ్యానించి, ప్రత్యక్షము చేసికొని \"దేవా! జగన్నాథా! ఈ లేనిపోని గొడవెందుకు? మా పాతచట్టి ముక్కు మాకిచ్చివేయండి చాలు\" అని ప్రార్థించిరి. బ్రహ్మదేవుడు 'తథాస్తు' అని పలికి అంతర్ధాన మెందెను. దంపతులకు యథాప్రకారము పాత చట్టిముక్కులు ఏర్పడెను. అంతటితో వారు పరితృప్తినొందిరి.\n\nఇంతకథ జరిపియు చివరకు వారు పొందినదేమి? ఇంత కాలము తపస్సు చేసియు వారు సాధించినదేమి? ఏ క్రొత్త వస్తువును వారు సంపాదించగల్గిరి? ఏమియులేదు. వారి మామూలు చట్టి ముక్కులే వారికి దక్కినవి. కోరికలపై కోరికలు పెంచుకొనినప్పటికిని నానావస్థలు పడినప్పటికినీ చివరికి ఏమియు మిగలలేదు. కావున వున్నదానితో సంతృప్తి నొందుటయేజీవితమునకు శోభ. వాంచలు పెంచుకొనుట వలన మనుజునకు అశాంతి, అ తృప్తి పెరిగిపోవుచుండునే కాని తరగవు - కథలోని దంపతులవలె. కాబట్టి జనులు తమ కోరికలను అదుపులో పెట్టుకొని, ఉన్నదానితో సంతృప్తిపడి విషయవాంచారహితులై, శాశ్వతదైవప్రాప్తికై అహర్నిశము కృషిసల్పుదురు గాక!\n\nనీతి : కోరికలను తగ్గించుకొని, మోక్షమును గూర్చియు, మోక్ష సంపాదనకు కావలసిన సాధనలను గూర్చియు లెస్సగ చింతనచేయుచు వానిని అమలు పరచుచు జీవితమును సార్థకమొనర్చవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 802,
        "IMAGE": "cat_9",
        "NAME": "కోరికలు పెంచుకొనరాదు ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక వర్తకుడు పాదచారియై కాశీయాత్రకు బయలుదేరెను. త్రోవలో అచటచట విశ్రాంతి తీసుకొనుచు తన గమనమును కొనసాగించుచుండెను. అది గ్రీష్మఋతువు. మండువేసవి యగుట వలన ప్రయాణము కొనసాగించుట దుర్భరముగా నుండెను. అయినను పట్టుదల విడనాడక అతడు యాత్రచేయుచునే యుండెను. ఊరువిడిచి కొన్ని వందలమైళ్ళు ఈ ప్రకారముగ కష్టములను లెక్కసేయక దాటిపోయెను. ఇంతలో దారిలో నొక ఎడారి ప్రదేశము ఎదురయ్యెను. దానిని గూడ త్వరితముగ దాటివేయ దలంచి వర్తకుడు అందు ప్రవేశించెను. అది మిట్టమధ్యాహ్న సమయము, పాదరక్షలు లేవు. గొడుగు లేదు. కాళ్లక్రింద తాపము, తలపైన తాపము. ఇకవాని యవస్థ చెప్పతరము కాదు. అన్ని బాధలు సహించుకొనుచు నడిచి పోవుచుండెను. ఆ యెడారి ప్రదేశములో విశ్రమించుటకు ఒక్క చెట్టైనా కానుపించకుండెను.\n\nఇంతలో అదృష్టము పండెనా యనునట్లు అనతి దూరమున ఒకానొక వృక్షమాతనికి దృగోచర మయ్యెను. చక చక దానివైపునకు నడిచివెళ్ళెను. ఎట్టకేలకు దానిని చేరి ఆ వృక్షచ్చాయ యందొకింతసేపు విశ్రమించెను. పూర్వమెపుడో ఏ మహనీయుడో, ఏ బ్రహ్మనిష్ఠుడో, ఏ తపస్సంపన్నుడో ఆ చెట్టుక్రింద ద్యాననిష్ఠ సలిపి యుండుటవలన ఆ వృక్షమునకు కల్పవృక్షముయొక్క శక్తి ఆవిర్భవించెను. అనగా ఆ చెట్టుక్రింద ఎవరు ఏది సంకల్పించుదురో అది నెరవేరిపోవుచుండెను. ఎవరు దేనిని అభిలషించుదురో ఆ వస్తువు వారికచట ప్రత్యక్షమగుచుండెను. ఇట్టి అమోఘమైన శక్తి ఆవృక్షమునకు కలదని ఆవర్తకుడెఱుగడు. ఎండలో అలసి అలసి సొమ్మసిల్లి క్రిందపడియున్న ఆ వర్తకుడు ఒడలంతయు చెమట కారుచుండ స్నానము చేయుటకు ఈ ప్రాంతమున నీరు ఒక చుక్కైనను లేదే! నీరుండినచో ఎంత హాయిగా నుండును అని సంకల్పించెను: తోడనే ఆ చెట్టుపైనుండి గంగా ప్రవాహమువలె నీరు జలజల క్రిందకు పడజొచ్చెను. కల్పవృక్షమహిమ ఆ చెట్టు కుండుటచే ఆ విధముగ సంభవించెను, వర్తకునకు ఆ చెట్టు యొక్క కల్పవృక్ష శక్తిని గూర్చిన పరిచయము లేనందుచే ఆ జల ప్రపాతమున కచ్చెరువొందెను. తోడనే వర్తకుడు ఆ జలధారలందు స్నానముచేసి సేదదీర్చికొనెను.\n\nతదుపరి యాతడు ఆకలి మండిపోవుచున్నది, ఎవరైన భోజన మిడినచో నాకెంత హాయిగ నుండును! అని భావించెను. అది కల్పవృక్షమగుట వలన తక్షణ మాతని యాసంకల్పమున్ను నెరవేరెను. పంచభక్ష్య పరమాన్నములతో నిండిన ఒక విస్తరి ఆ చెట్టిక్రింద ప్రత్యక్షమయ్యెను. యాత్రికుని ఆనందము చెప్పనలవికాదు. ఒక చెంప ఆశ్చర్యము, ఒక చెంప సంతోషము అతని మనంబున ప్రాదుర్భవింపజొచ్చెను. ఇది ఏమి యింద్రజాలము? అని అచ్చెరువొంది క్షుద్భాధాపరితప్తుడగు నతడు కాలయాపన చేయక ఆమృష్టాన్నమును ఆరగించివేసెను. తదుపరి యతడు \"జనసంచారము లేని ఈ చోటు నాకు భయమును గొల్పుచున్నది. ఇంటియొద్దనున్న నాభార్య ఇచటికి వచ్చినచో నాకెంతయో సహాయకారిణిగ నుండగలదు\" అని సంకల్పించెను. సంకల్పించుటయే తడువుగా ఆతని భార్య అచ్చోట ప్రత్యక్షమయ్యెను. ఇది యంతయు అ కల్పవృక్షముయొక్క మహిమాతిశయమే కాని అన్యము కాదు. అయినను వర్తకు డారహస్య మెఱగజాల కుండెను. వెయ్యిమైళ్ళ దూరమున నున్న నాభార్య ఇచటికి ఎట్లు అరుదెంచ గలదు? ఈమె నా భార్యయేనా, లేక ఏదైన దయ్యమా? అని అనుకొనెను. తోడనే కల్పవృక్షశక్తిచే దయ్యముగా మారిపోయెను. ఆ దయ్యమును చూచి వర్తకుడు ఇది నన్ను మ్రింగివేయునేమో? అని శంకించెను. తత్‌క్షణమే అ దయ్యము వానిపై బడి మ్రింగివైచెను.\n\nకల్పవృక్షము క్రింద నున్నప్పిటికి వర్తకుడు తన వినాశమును తానే కొనితెచ్చుకొనెను. మహోన్నత అవకాశములను జారవిడుచుకొని పతనము బొందెను. భగవంతుడు కల్పవృక్షము వంటివాడు. ఎవరు దేనిని యభిలషించి తనను ప్రార్థించుదురో దాని నతడు వారికి అందజేయుచుండును. విజ్ఞుడగువాడు శ్రేయస్కరమైన దానినే కోరుకొనును. బంధవిముక్తినే అభిలషించును. భగవానుని పాదపద్మముల సేవాభాగ్యమునే వాంచించును. అజ్ఞాని అల్పములగు ప్రాపంచిక సౌఖ్యములను, సశ్వరములగు భోగ్యపదార్థములను వాంచించి పతనమును తానే కొని తెచ్చుకొనెను (కథలోని వర్తకునివలె). మతిని బట్టియే గతియు ఏర్పడుననుట తథ్యము. సన్మతిచే సద్గతి, దుర్గతిచే దుర్గతి సంభవించుచుండును. భగవానుని యనుగ్రహము లోకమున ఎల్లెడల వ్యాపించియే యున్నది. తదనుగ్రహచ్చాయలందు వసించియున్న జీవుడు ఉన్నతాశయములు గలిగి, ఉదాత్తగుణములతో విరాజిల్లుచు, క్షుద్రప్రాపంచిక వాంచలను పరిత్యజించి, మోక్షకాంక్షియై వర్తించినచో, సర్వేశ్వరుని కృపాకటాక్షముచే మోక్షమాతనికి కరతలా మలకము కాగలదు.\n\nనీతి: నశ్వర ప్రాపంచిక పదార్థములను కోరక, శాశ్వత దైవానుభూతినే వాంచించుచు, అద్దానికొరకై తీవ్రతరయత్న మాచరించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 803,
        "IMAGE": "cat_9",
        "NAME": "మతినిబట్టియే గతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమున ఒక ధనికుడుండెను. అతడు తన నివాసమునకై ఒక గొప్ప భవనమును నిర్మించుకొనెను. అది సర్వాంగ సుందరముగ అలరారుచు చూపరులకు మిక్కుటమగు ఆశ్చర్యమును గొలుపుచుండెను. జనులందరును ఆతని దివ్యభవనమును ప్రస్తుతించుచు అది కనివిని యెరుగని గొప్ప కట్టడమని కొనియాడుచుండిరి. అయినను, ఆ ధనికుడు అంతటితో తృప్తినొందలేదు. తన స్నానగదిలో ఇదివరకు ఎవరును తమ తమ స్నానగదులలో ఏర్పాటుచేయని విధముగ నవరత్న ఖచితమైన ఒక బంగారు కొళాయి (pipe) ఏర్పాటు చేయదలంచెను. సామాన్యముగ అందరును తమ తమ గృహములందు స్నానపుగదులలో ఇత్తడికొళాయిలు, రాగికుళాయిలు అమర్చుకొని వానిక్రిందకూర్చొని స్నానమాచరించుచుందురు. కాని ఆ పద్ధతి ధనికున కిష్టము లేకపోయెను. \"అందరు చేసినట్లే మనముకూడ చేసిన అదేమి విశేషము కలదు? మనయింటికి ఒక ప్రత్యేకత ఉండవలెను. ప్రతివారును, మనయింటిని, ఇంటిలోని పరికరములను జూచి సంభ్రమాశ్చర్యములలో మునిగిపోవలెను. కాబట్టి మన స్నానగదిలో అందరివలె కాక ఒక అమూల్యమైన, రత్నవైడూర్యసమ్మిళితమైన బంగారు కొళాయిని అమర్చెదను. దానిని చుచుటకే జనులు తండోపతండములుగ రాగలరు. అపుడు నాకీర్తి నభోమండలమును చేరుకొనగలదు.\n\nఈ ప్రకారము నిశ్చయించినవాడై ఆ శ్రీమంతుడు కొన్ని లక్షల రూప్యములను వెచ్చించి నవరత్న పరివేష్టితమగు ఒక చక్కని కొళాయిని చేయించి దానిని తన స్నానగదిలో అమర్చెను. దానిక్రింద కూర్చొని స్నానము చేసినచో ఎంతయో హాయిని అనుభవించవచ్చునని తలంచెను. ఆ కొళాయి నిర్మాణము పూర్తిఅయిన వెనుక దానికి ప్రారంభోత్సవము చేయ సంకల్పించి అందులకు తగిన వ్యక్తి ఎవరాయని దీర్ఘముగ యోచించి తుట్టతుదకు ఒక మంత్రిగారిని ఎన్నుకొనెను. వారితో సంప్రదించి వారిని ఒప్పించి వారి కరకమలములచే ఆ బంగారుకొళాయి యొక్క ప్రారంభోత్సవము గావింప నిశ్చయించెను. ఆహ్వాన పత్రికలు అందరికిని పంపబడెను. ఆ పత్రికలపై శీర్షక \"బంగారు కొళాయి ప్రారంభోత్సవము\" అని తాటికాయ అక్షరములలో కొట్టివచ్చినట్లు కానుపించు చుండెను. పెద్దపెద్ద ఉధ్యోగస్తులకు, అధికారులకు, బంధువర్గము వారికి, మిత్రులకు అహ్వానములు పంపబడెను.\n\nలోకములో ఇంతవరకు అనేక ప్రారంభోత్సవములు అన్నిచోట్ల జరుగుచుండెడివి. కొన్ని సంస్థల ప్రారంభోత్సవములు, నూతన గృహముల ప్రారంభోత్సవములు, కర్మాగారముల ప్రారంభోత్సవములు - ఈ ప్రకారముగ అనేకము జరుగుచుండెనుగాని బంగారు కొళాయి ప్రారంభోత్సవము ఇంతవరకు ఎచటను జరిగియుండలేదు. కావున ఆ వేడుకను కన్నులార గాంచుటకై జనులు తండోపతండములుగ ధనికుని గృహమునకు రాజొచ్చిరి. నిర్ణీత సమయము దగ్గరకు వచ్చినది. ధనికుని ప్రసాదము పురప్రముఖులచేతను, విద్వజ్జనులచేతను కిటకిటలాడుచుండెను. ముహూర్తసమయము ఇంకను అరగంట ఉన్నది. అపుడు పురోహితుడు వేదమంత్రముల నుచ్చరించుచు ఆ బంగారు కుళాయికి పూజ నుపక్రమించెను. ధనికుని భవనమంతయు విప్రగణము యొక్క వేధఘోషచే ప్రతిద్వనించుచుండెను.\n\nముహూర్త సమయము సమీపించగా అపుడు పురోహితుడు ధనికునితో 'అయ్యా! ప్రారంభోత్సవము ఎవరిచేత చేయించ దలంచినారో, వారు కొళాయి వద్దకు రావలసినది' అని తెలుపగానే ధనికుడు అచట ఆసీనుడైయున్న మంత్రిగారిని అహ్వానించి కొళాయి వద్దకు తీసికొనివచ్చెను. భజంత్రీలు జోరున మేళము వాయించు చుండిరి. భూసురులు ఉన్నతస్వరములతో మంత్రములను ఉచ్చరించు చుండిరి. ఆ వేదఘోషచే దిక్కులు పిక్కటిల్లుచుండెను. సరిగా ముహూర్తము వేళకాగా పురోహితుడు 'అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు' అని కొళాయిపై అక్షతలను చల్లి మంత్రిగారితో \"అయ్యా! ఇక మీరు కొళాయి త్రిప్పవచ్చును\" అని పలుకగా, మంత్రిగారు ఉల్లాసవదనముతో తన కరకమలములచే కొళాయిని త్రిప్పిరి. కాని ఒకచుక్క నీరు క్రిందపడలేదు. అందరును ఆశ్చర్యచకితులైరి. కరణమేమి యని ప్రతివారును వితర్కింపదొడగిరి. ధనికుని గుండె తీవ్రముగ కొట్టుకొనజొచ్చెను. అతని హృదయము నిర్విణ్ణమై పోయెను. కొళాయిలో నీరు రానందుకు కారణమేమని యని అచట సమావేశమైన పెద్దలందరు తీవ్రముగ అన్వేషింప తుట్టతుదకు కారణము విశదమయ్యెను. ధనికుడు బంగారుకొళాయికి అన్ని ఏర్పాట్లుచేసెను గాని ఒక్క పొరపాటు చేసెను. నీళ్లటాంకుతో దానికి సంబంధము (కనెక్షన్‌) కలుగజేయలేదు. పనుల తొందరలో ఆ విషయము మరచిపోయెను. లక్షలకొలది రూప్యములను వెచ్చించి, రత్నములను వైడూర్యములను పొదిగించి, మేలిమి బంగారమును కరిగించి చక్కని కొళాయిని నిర్మింపజేసెనేగాని, అసలు విషయముపై శ్రద్ధ జూపలేదు. నీళ్లటాంకుతో సంబంధము పెట్టుకొనలేదు. కావున చేసినపని యంతయు వ్యర్థమైపోయెను. ఈ ప్రకారముగ ప్రారంభోత్సవము విఫలముకాగా, అచట సమావేశమైన వారందరును విచారవదనముతో వారి వారి నెలవులకు వెడలిపోయిరి.\n\nఅట్లే, లోకమునందు జనులు పెద్ద పెద్ద భవనములలో నివసించుచున్నారు. పెక్కు సంపదలతో తులతూగుచున్నారు. లెక్కలేనన్ని విలాసములను అనుభవించుచున్నారు. కాని శాంతిమాత్రము వారికి కొరవడుచున్నది. కారణమేమి? దైవముతో వారు సంబంధము పెట్టుకొనుటలేదు. శాంతికి ఆకారము దైవము. ఆనందమునకు నిలయము దైవము. ఆ దైవముతో సంబంధము కలిగియుండువాడే పరిపూర్ణ సుఖమును, శాంతిని అనుభవింపగల్గును. దైవముతో సంబంధము లేనివాడు ఎన్నిప్రాపంచిక వైభవములున్నను శాంతి, సుఖములను నోచుకొనలేడు. సామాన్యమైన ఇత్తడి, రాగి కొళాయిలు పెట్టుకొనువారు నీళ్ల రిజర్వాయర్ తో కనెక్షన్‌ ఏర్పాటుచేసికొనినప్పుడు వానినుండి గంగా ప్రవాహమువలె జలజల నీళ్లు కారుచున్నవి. నవరత్న ఖచితసువర్ణ యుక్తమైనప్పటికిని కొళాయి నీళ్లటాంకుతో సంబంధము కలిగియుండనిచో దానియందు ఒక్కచుక్కైనను నీళ్ళు రానేరావు. ఇదియే పరమరహస్యము. శాంతియే నీరు. భగవంతుడే నీళ్ల రిజర్వాయర్. నవరత్నములే సంపదలు. దైవవిముఖుడగు నాస్తికుడే ఇంటియజమాని.\n\nకాబట్టి ఆనందధామమైన దైవముతో సంబంధము గలవాడు, దైవభక్తి కలిగి జపధ్యాన సంకీర్తన పారాయణాదులు సలుపువాడు, ప్రాపంచిక సంపదలు కలిగియుండక నున్నను శాంతి సుఖములను సదా అనుభవింప గల్గును. అట్టి దైవభక్తి లేనివాడు, దైవముతో కించిత్తైనను సంబంధము కలిగియుండనివాడు గొప్ప రాజధిరాజైనను, ఉన్నతాధి కారియైనను,సకల ప్రాపంచిక సంపదలతో తుతతూగువాడైనను, అంతరంగమున సుఖమునుగాని, శాంతినిగాని అనుభవించలేడు. కావున సర్వులును శాశ్వతపరమాత్మతో, అక్షరదైవముతో సంబంధము లను నెలకొల్పుకుని, ప్రతిదినము ఒకింతైనను జపధ్యాన విచారణాదులు కావించుచు అట్టి దైవాశ్రయముచే జీవితపరమావధియగు అనంతశాంతిని బడయుదురు గాక!\n\nనీతి: దేవునితో సంబంధము కలుగజేసికొనినచో అపారమగు ఆనందమును జీవుడు అనుభవించగలడు. లేకున్న దుఃఖమెన్నడైనను వానిని బాధించగలదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 804,
        "IMAGE": "cat_9",
        "NAME": "దేవునితో సంబంధము ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "అదియొక పుణ్యక్షేత్రము. సుదూర ప్రాంతములనుండి అచటికి వేలకొలది భక్తులు నిరంతరము వచ్చుచు పోవుచునుందురు. ఎప్పుడెప్పుడు దైవదర్శనము దొరకునా, పరమాత్మయొక్క దివ్యమంగళ స్వరూపము నెప్పుడు కనులార వీక్షించి పుణ్యము కట్టుకొందుమా యను తీవ్రతర ఆకాంక్ష పురికొల్ప జనులు తండోపతండములుగ అచ్చోటికి వచ్చుచుందురు. దర్శించిన పిదప 'ఆహా! జన్మము ధన్యమయ్యెను గదా' యని పరితృప్తిని పొంది, హృదయమున భక్తిభావమును పెంపొందింప జేసుకొని, ఆలయమందు లబ్ధమైన దైవప్రసాదమును పెట్టెలందు పదిల పరచుకొని ఆనందముతో తమతమ నెలవులకు బోవుచుందురు.\n\nఆ యూరికొక రైలుస్టేషను కలదు. పుణ్యక్షేత్రము కాబట్టి వచ్చిపోయే యాత్రికుల రద్దీ అచట విశేషముగ నుండును. ఆస్టేషనులో ఎప్పుడును ఏదియో యొకరైలుబండి వచ్చుచు పోవుచు నుండును. ప్లాట్ ఫారం ఎల్లపుడు యాత్రికుల సామానులతోను, యాత్రికులతోను నిబిడీకృతమై యుండును. ప్రయాణికుల కోలాహలముచే అస్థలమంతయు నిరంతరము ప్రతిధ్వనించుచుచండును.\n\nఇట్లుండ ఒకనాడు అచట ఒకరైలుబండి ప్లాట్ ఫారంపై కదులుటకు సిద్ధముగ నుండెను. ఇంకొక పదినిముషములలో అది కదిలిపోవును. ప్రయాణికులు హడావుడిగా లోనికెక్కి కూర్చొనుచుండిరి. ఇంకను కొందరు పరుగు పరుగున వచ్చి ఎక్కుచుండిరి. దాదాపు అన్ని పెట్టెలు యాత్రికులచే కిటికిటలాడిపోయినవి. ఆ సమయమున ఒక కాకీడ్రెస్సు ధరించి యవకుడు రైలులో ఎక్కదలంచి వేగముగ నడుచుచు అన్ని పెట్టెలను ఒక్కసారి పరికించెను. కాని కూర్చొనుటకు ఎక్కడను చోటు దొరకలేదు. అపుడొక ఉపాయ మాతనికి స్ఫురించెను. వెంటనే యతడు చివరి పెట్టెయొద్దకు పోయి అందలి ప్రయాణికులందరితో ఈ పెట్టె స్టేషనులోనే నిలిచిపోవును. ఇది వెళ్ళదు. దీనిని ఇప్పుడే ఊడదీసివేయుదురు. కాబట్టి త్వరగా దిగి ఇతర పెట్టెలలో సర్దుకుని కూర్చొనుడు. మీక్షేమము కొరకు చెప్పుచున్నాను. వినుడు. అని ఏకధాటిగా పలికెను.\n\nఅతడు కాకీడ్రెస్సు వేసికొనియున్నాడు కాబట్టి, అతని వాలకము జూచి అతడెవరో పెద్దరైల్వే ఉద్యోగియని భావించి ప్రయాణీకు లందరును అతని మాటలను నమ్మి గబగబ దిగి తక్కినపెట్టెలో సర్దుకొని కూర్చుండిరి. ఆపుడా యువకుడు ఆనండపడి తాను వేసిన పాచిక పారినదని భావించి ఆ ఖాళిపెట్టెలో ప్రవేశించి కాలిమీద కాలు వేసుకొని హాయిగా పరుండి నిద్రించెను.\n\nఇట్లుండ ఆ ప్లాట్ ఫారంపై అచటనే నిలబడియున్న ఒక పోర్టరు ఆ కాకీడ్రెస్సువాడెవడో పెద్దరైల్వే ఉద్యోగియని భావించి అతడు చెప్పినట్లు ఆ పెట్టెను ఊడదీయకపోయినచో తన డ్యూటీకి భంగము కలుగునని తలంచి తక్షణమే ఆపెట్టెను ఊడదీసి బండినుండి వేరుచేసెను. బండి కదలిపోయెను. కాకీడ్రెస్సు యువకుడు నిద్రలేచి చూడగా ఆ పెట్టె స్టేషనులోనే పడియుండెను. బండిమాత్రము వెడలి పోయెను. అత్తరి యతడు ఆశ్చర్యచకితుడై తాను చేసిన తప్పునకు తగిన ప్రాయశ్చిత్తము జరిగెనని భావించి \"చెరపకురా చెడేవు\" అను సామెత జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి అచ్చోటు విడిపోయెను.\n\nఇచట రైలుబండి యనగా భగవంతుడు. చివరి పెట్టె జీవుడు. జీవుడు భగవంతునితో కలిసియున్నప్పుడు మాత్రమే గమ్యస్థానమగు మోక్షమును చేరగలడు. అనగా నిరంతర దైవస్మృతి, దైవధ్యానము, దైవచింతన గలిగియుండిన మహనీయులు దైవముతో లంకెగలవారై అచిరకాలములో దైవసాన్నిధ్యమును బడయగలరు. అట్లుగాక, దైవ విస్మృతి గలిగి భగవంతుని ఏకాలమందును చింతన జేయక, దేవునితో సంబంధమును విడగొట్టుకొనువారు రైలుబండి నుండి వేరుచేయబడిన పెట్టెవలె ఉన్నచోటనే అనగా సంసారమందే ఉండిపోవుదురు. ఏ మాత్రము కదలరు. ఈ దృశ్యకూపముననే పడి జననమరణ ప్రవాహమందు కొట్టుకొనిపోవుచు ప్రపంచక్షేత్రమందే ఉండిపోవుదురు. శాంతిని, నిర్విషయ ఆనందమును పొందజాలక యుందురు.\n\nనీతి: దేహధారియగు ప్రతిమానవుడు తనలో వెలుగుచున్న దివ్యమగు ఆత్మతో దైవముతో లంకెవేసికొని, దైవవిస్మృతిని దూరీకరించి ధ్యానమును లెస్సగ నభ్యసించుచు తీవ్రతర సాధనచే ఈ జీవితమందే దైవసాక్షాత్కారమును బడసి కృతార్థుడు కావలయును. నిరంతరము దైవస్మృతి కలిగియుండుటను అభ్యసించి ధన్యుడు కావలెను. దైవవిస్మృతి మహాప్రమాదకరమని జ్ఞప్తియందుంచుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 805,
        "IMAGE": "cat_9",
        "NAME": "దైవవిస్మృతి ప్రమాదకరము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక రాజు తన దేశమును చక్కగ పరిపాలించుచుండెను. అతడు పెక్కు సంపదలతో ఐశ్వర్యములతో ధనధాన్య సమృద్ధితో తులతూగుచుండెను. అన్ని హంగులతో కూడిన పెద్ద పెద్ద రాజభవనములు, ఉద్యానవనములు, అపారమగు భూసంపద అతనికి కలదు. ఎందరో అమాత్యశేఖరులు, రాజ్యకార్య నిర్వహణ దక్షులు, నౌకరులు, పరిచారికలు, పరిజనము అతనికి కలరు. వారందరును వారివారికి నిర్దేశింపబడిన కార్యకలాపములను చక్కగ చేయుచునుండిరి. ఆ రాజు నివసించునట్టి రాజప్రసాదము నలువైపుల విస్తరించి చూచుటకు ఒక పెద్ద ఊరువలె కనిపించు చుండెను. తన రాజవైభవము లన్నిటిని చూచుకొని ఆ రాజు మురుసిపోవుచు తనంతటి రాజుగాని, తన రాజ్యమంతటి రాజ్యముగాని మరెచటను లేవను అహంభావము కలిగియుండెను.\n\nఇట్లుండ ఒకనా డానృపాలుడు మృగయావినోదముకై తన పట్టణమునకు సుదూరమున నున్న ఒకానొక అరణ్యమున సంచరించుచుండ ఒక ఏకాంత ప్రదేశమున ఒక వృక్షము క్రింద ఒక మునిపుంగవుడు కూర్చొని యుండుటను చూచెను. అంతటి నిర్జనప్రదేశమున కాతడెందుకు వచ్చెను? అతడెవరు? ఈ మొదలగు విషయములను తెలిసికొనదలంచినవాడై ఆరాజు మునివర్యుని సమీపించి పరికింప అతని శరీరాకృతి యందు ఒక విషయము రాజునకు కండ్లకు కొట్టినట్టు అగపడెను. ఆ ఋషి యొక్క శరీరమంతయు రోమమయముగ నుండి నప్పటికిని మోచేతిమీద చింతగింజంత స్థలము మాత్రము వెంట్రుకలు లేవు. ఆ ఋషిస్వస్వరూపమగు పరబ్రహ్మమునందు నిలుకడ కలవాడై, మహోల్లాసముగ కనపడుచుండెను.\n\nరాజు మహర్షి చెంతకు పోయి, 'మహాత్మా! ఈ ఏకాంత ప్రదేశమున శీతోష్ణాదులను సహించుకొనుచు, ఆహారము కొరకై యిబ్బందులు పడుచు, ఇంత కష్టపడనేల? మా పట్టణమునకు రండు, సకలైశ్వర్యములు మీరు అనుభవించవచ్చును. ఆహార విషయమున గాని వస్త్రవిషయమునగాని, మరే విషయమున గాని, మీకు లోటుండదు. ఎందరో భృత్యులను మీకు వినియోగించెదను. పరుండుటకు చక్కని పానుపులు కలవు. ఈ నిర్జనారణ్యమున ఈ ప్రకారముగ బాధపడక తక్షణమే నా రథముపై కూర్చుండుము. మిమ్ములను నగరమునకు చేర్చి ఆనందింపజేసెదను'.\n\nఈ ప్రకారముగ భూపాలుడు తపస్వితో చెప్పగా, ఆ తాపసి పక పక నవ్వి రాజా! నా కిచట ఆనందమునకు కొదవయుండిన గదా. నీ రాజ్యమునకు వచ్చుట ; దుఃఖము లవలేశముకూడ లేనట్టి అత్మయందు నేను సదా స్థితి గల్గి ఇంద్రాదులు అనుభవించు ఆనందమున కంటె అధికమైన ఆనందమును అనుభవించుచున్నాను. ఇక నీ రాజసుఖముతో నాకేమి పని? అమృతమును త్రాగువాడు అంబలిని ఆశించునా? ఋషీశ్వరుని అ వాక్యములను విని రాజు నివ్వెరపోయెను. ఏ రాజ్యవైభవములను తానింతవరకు ఎంతయో గొప్పగ తలంచు కొనుచుండెనో, ఏ రాజ్య సుఖమును సుఖము లన్నిటికంటె మిన్నయని భావించుచుండెనో - అయ్యది బ్రహ్మానంద సాగరమున ఒక బిందువు వంటిదే యని గ్రహించి ఆశ్చర్యపడెను. అయినను అటునుండి తిరిగి వెళ్ళు సమయమున ఆ రాజు మునీశ్వరుని 'మహాత్మా! మీ మోచేతి పైన కొంత మేర రోమములు లేవేమి అని ప్రశ్నింప మునిపుంగవుడు డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.\n\nరాజా! ఒక్కొక్క కల్పము పూర్తి అయినపుడు నా శరీరముపై ఒక్కొక్క రోమము రాలిపోయెను. ఈ చింతగింజంత స్థలములో ఎన్ని రోమములు ఇప్పటికి రాలిపోయినవో అన్ని కల్పములు నాకిపుడు గడచి పోయినవన్నమాట. స్వల్పకాలము ఉండిపోవు నాకు నీరాజ్య భోగములెందుకు, నీ సంపద లెందుకు? కావున రాజా! నేనిచటనే ఉండి ఆత్మానంద సాగరమున మునుక లిడుచు నుందును. నీవును నీ నిజస్వరూపమగు ఆత్మను గూర్చి సద్గురువుల వలన చక్కగ తెలిసికొని, ధ్యానాదుల ద్వారా అద్దానిని సాక్షాత్కరించుకొని జీవితమును ధన్య మొనర్చుకొనుము. మూణ్ణాళ్ళ ముచ్చట యగు ఈ జీవితమున నశ్వరములగు ఈ ప్రాపంచిక విషయభోగములను చూచి మురిసిపోకుము. రేపో, మాపో ఈ శరీరము పతనమైనపుడు సమస్త ప్రపంచములతోను, సమస్త భోగభాగ్యములతోను వియోగము సంభవించును, అని అ మునీశ్వరుడు భూపాలునకు బోధించి ధ్యాననిష్ఠుడయ్యెను. రాజు ఋషీశ్వరుని దివ్యబోధలను మననము చేసికొనుచు గృహాభిముఖుడై చనెను. కొంత కాలమున కతడు ఆ బోధలచే ప్రభావితుడై, రాజ్యమును కుమారుల కొప్పగించి వైరాగ్యయుతుడై, ఏకాంతమునకు బోయి భగవద్ద్యానాదు లందు కాలమును గడుపసాగెను.\n\nనీతి : ప్రాపంచిక వైభవములు క్షణికములు. వాని యెడల విరాగము కలిగి శాశ్వతమగు దైవము కొరకె జీవుడు ప్రయత్నించ వలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 806,
        "IMAGE": "cat_9",
        "NAME": "ప్రపంచము యొక్క నశ్వరత్వము ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమున ఒక మహారాజు కలడు. అతని రాజ్యము నలువైపుల చాల దూరము విస్తరించి యుండెను. అతడు ప్రజలను ధర్మబుద్ధితో,న్యాయమార్గమున చక్కగా పరిపాలించుచుండెను. ఆ రాజునకు ముగ్గురు కుమారులుండిరి. వారు పెరిగి పెద్దవారై రాజ్యకార్య నిర్వహణమును గూర్చి తండ్రిగారివలన తెలిసికొనుచుండిరి.\n\nకొంతకాలమునకు రాజునకు వృద్ధాప్యము వచ్చెను. శరీరము పంచభూతాత్మకము గనుక అది సహజముగనే షడ్భావవికారములకు లోనగుచుండును. బాల్యము యౌవనముగను, యౌవనము వార్ధక్యముగను పరిణతి జెందుచుండును. ఆత్మవలె అది నిర్వికారమైన వస్తువు కాదు గదా! రాజున కెపుడు తన శరీరముపై వార్ధక్యసూచనలు కనిపించెనో అపుడాతడు నిట్లు వితర్కించుకొనెను.\n\n\"ఈ శరీర మెందుకొరకు వచ్చినది? తరించుటకు, మరి నేను తరించుటకై ఏమైన ప్రయత్నము చేసినానా? లేదు. మానవ శరీరము మరల మరల వచ్చునది కాదు. బహుజన్మ సుకృతమువలననే ఇది సంభవించుచుండును. మరిఇట్టి అనువైన శరీరము లభ్యమైనపుడు మోక్షప్రాప్తికై ఒకింతైనను ప్రయత్నము సలుపకుండుట వెర్రికదా! పడవ చక్కగా ఉన్నప్పుడే నదిని దాటివేయుట ఉత్తమము కదా! ఈ శరీరమను నావ చిల్లిపడక మునుపే, అనారోగ్యము దాపురించక మునుపే వార్ధక్యము రాకపూర్వమే, దాని ద్వారా మోక్షసంపాదనమును గావింపవలెనని పెద్దలు చెప్పుచున్నారు. శాస్త్రములన్నియు ఆవిధముగనే ఉద్ఘోషించుచున్నవి. నేనెంతయో అజాగ్రత్త పడితిని. భగవత్స్మరణ చేయక, మోక్షప్రాప్తికి అవసరమైన ఒక్క సాధనైనను అనుష్ఠించక జీవితమును నిరుపయోగము చేసికొంటిని. ఈ సంపదలే సత్యమనుకొని, ఈ రాజ్యభోగములే స్థిరములని భావించి, ఈ బంధు బాంధవ్యాలే శరణ్యులని తలంచి ఈ క్షణిక సంసార సౌఖ్యములను పట్టుకొని వ్రేలాడి అమూల్యమైన ఈ మానవజీవితమును వ్యర్థము చేసితిని. ఇక నైనను ఈ జంజాటము నుండి విడుదల బొంది, ఈ సంసారమను సుడిగుండము నుండి బయటపడి ఎచటనైన ఏకాంతస్థలమున పరమాత్మనుగూర్చి చింతన జేసి తరించుట ఉత్తమము\".\n\nఈ ప్రకారముగ ఆలోచించుకొని అతడు తన రాజ్యభారమును తన మువ్వురు కుమారులలో ఎవరికైన అప్పజెప్పవలెనని తలంచి ముగ్గురిలో అక్కార్యమునకు ఎవరు సమర్థులో యోచింపదొడగెను. రాజ్యకార్య నిర్వహణములో వారి వారి సామర్థ్యమును పరిశీలింప దలంచి ఆరాజు చక్కని ఉపాయమును అవలంభించెను. ఒకదినమున తన కుమారులందరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక వెయ్యిరూపాయల నిచ్చి \"నాయనలారా! ఈ పైకమును తీసికొని వెళ్ళి దూరదేశముల కేగి దానితో వ్యాపారము చేసి ద్రవ్యమును సంపాదించి ఒక్క సంవత్సరకాలమైన వెనుక మరల ఇచటికి రావలసినది\" అని ఆజ్ఞాపించెను.\n\nతండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని ముగ్గురు రాజకుమారులును ఆ వెయ్యిరూపాయలను వెంటబెట్టుకొని సుదూర ప్రాంతముల కేగి ఒక్కొక్కరు వేర్వేరు ప్రదేశములో స్థిరపడి వ్యాపారమును కొనసాగించిరి. అందులో ఒకడు భోగలాలసుడు. తండ్రి ఇచ్చిన ద్రవ్యమును క్రీడావినోదములకు, భోగావిలాసములకు ఖర్చుపెట్టి కొద్ది పైకమును మిగుల్చుకొని దానితో వ్యాపారము ప్రారంభించగా పెద్దనష్టము సంభవించెను. ఇక రెండవవాడు వ్యాపారమును ప్రారంభించి ఎక్కువ తెలివితేటలు లేనివాడగుటచే లాభమును బడయలేకపోయెను. అయితే ఒకింత విజ్ఞత వలన నష్టము రాకుండ చేసికొనగల్గెను. ఇక మూడువవాడు చిన్నప్పటినుండియు ఎక్కువ ప్రజ్ఞావైభవము కలవాడగుటవలనను, గొప్పపట్టుదల, కార్యదక్షత, కార్యకుశలత్వము కలవాడగుటచేతను వ్యాపారమున అమిత లాభమును సంపాదించగలిగెను.\n\nఈ ప్రకారముగ ముగ్గురు రాజకుమారులును భిన్నభిన్న ప్రాంతములందు తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని వ్యాపారము చేసి సంవత్సర కాలము పూర్తికాగానే తండ్రి వారిని పిలిచి వారివారి కార్యక్రమములను గూర్చి ప్రశ్నింపగా మొదటివాడు వ్యాపారములో నష్టము వచ్చినదని చెప్పెను. రెండవవాడు తనకు లాభము రాలేదు, నష్టము రాలేదు అని చెప్పెను. మూడవవాడు వ్యాపారములో తాను గడించిన లాభమును తీసికొని వచ్చి తండ్రికి సమర్పించి తన విజయగాథను వివరించి చెప్పెను. అపుడు తండ్రియగు మహారాజు మొదటి ఇరువురు ధీశాలురు కానందు వలన రాజ్యపాలనకు అనర్హులని నిర్ణయించి మూడవవానికి రాజ్యాధికార మప్పగించి, పట్టాభిషేకము చేసి తాను ఏకాంత వనమునకేగి తపస్సు చేసి, దైవధ్యాన మాచరించి భగవత్కృపకు పాత్రుడై జన్మసార్థకత నొందెను.\n\nపై చరిత్రలో రాజకుమారులవలె జనులలో మూడు తరగతులవారు కలరు. పుణ్యము సంపాదించక పాపకార్యములనే ఆచరించుచు అధోగతికి పోవుచుందురు. మరికొందరు పుణ్యము నేమియు సంపాదించక పాపములో ప్రవేశించక ఉందురు. కొందరు పాపమును ఏమాత్రము దరికి చేరనీయక పుణ్యమునే సంపాదించుచుందురు. మూడవ తరగతివారు ధన్యులు, కృతార్థులు, కృతకృత్యులు. వారు జన్మమును సార్థకము చేసికొనువారు. ఈ జీవితమందే వారు తమ ప్రయత్నాతిశయముచే ఆత్మజ్ఞానమును బడసి కైవల్యప్రాప్తి నొందగలరు.\n\nనీతి : సత్ప్రయత్నముచే జనులు మూడవ రాజకుమారునివలె పుణ్యధనమును, జ్ఞానధనమును చక్కగ అర్జించి పాపమును, నష్టమును దూరీకరించి, తండ్రియగు పరమాత్మ యొక్క మెప్పును బడసి వారి అనుగ్రహమునకు పాత్రులై తరించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 807,
        "IMAGE": "cat_9",
        "NAME": "సత్ప్రయత్నము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమందు ఒక మహారాజు కలడు. అతడు సంపన్నుడే కాక మహావిద్వాంసుడు కూడను. సకల సౌభాగ్యములచే తులతూగుచున్నను శాస్త్రపఠనము, పండితగోష్ఠులు, విద్వజ్జన సమావేశములు జరుపుచుండెడివాడు. ఆతని యాస్థానమున లక్ష్మీ సరస్వతు లిర్వురును ఒకేచోట కలిసి యున్నట్లు చూపరులకు తోపట్టుచుండును. ఎందరో కవీశ్వరులను పోషించుచు, పండితులకు సాంవత్సరిక భృతులనొసంగును. విద్వాంసుల నాదరించుచు నుండుటవలన జనులా మహారాజును గొప్పగా సంస్తుతించుచు నుండిరి. అతనియందు సద్గుణరాశి మూర్తీభవించి యుండినను దుర్గుణము లన్నియు పలాయనము చిత్తగించినను, ఒక్క వ్యసనము మాత్రము అతనిని అంటిపెట్టుకొని యుండెను. అదియే జూదము. ఎంత ప్రయత్నించినను ఆదుర్గుణమునతడు వదలజాల కుండెను. అతని నిష్కళంక జీవితమున అదియొక మచ్చగా వ్యక్త మగుచుండెను.\n\nప్రతిదినము ఆ రాజు సాయంత్రము 4గంటలకు రాజశకటము నందు గూర్చొని జూదశాలకు పోవుచుండును. ఒకపుడొక సాధువుగారు ఆ పట్టణమునకు వచ్చి రాజుగారి చరిత్రయంతయు తెలిసికొని జూదమను ఆ ఒక్క దుర్గుణమును వదలి వేసినచో బంగారునకు సుగంధము అబ్బినట్లు రాజు ఆదర్శవంతుడై లోకమున వెలయగలడని భావించి నేరుగా రాజుయొద్ధకు వచ్చి పలువిధములుగ నాతనికి బోధింపదొడగెను. చెడ్డ అలవాట్లు ఏ ప్రకారముగ జనులు హృదయకుహరమున చోటు చేసికొనునో, వానిని జాగరూకతతో ఏ ప్రకారము కనిపెట్టి తరిమివేయవలెనో సాధువుగారు అనేక విధముల రాజునకు బోధించి జూదమను ఆ కళంకమును శీఘ్రముగ తొలిగించి వేయలాగున ప్రబోధించెను. కాని పొరపాటు గ్రహపాటుగా మారి, గ్రహపాటు అలవాటుగా పరిణతమై అలవాటు వ్యసనముగా రూపొంది ఆదురభ్యాసము బలపడిపోయి యుండుట వలన రాజు దానిని వదలజాలకుండెను. సాధువుగారు ఎంత చెప్పినప్పటికిని వాసనా ప్రాబల్యముచే రాజు ఆ దురభ్యాసమును వదల లేకుండుట గమనించి సాధువుగారొక చక్కని ఉపాయమును అవలంబించిరి.\n\nప్రతిదినము సాయంత్రము 4గంటలకు నృపాలుడు జూదశాలకు పోవును గావున ఆ సమయమును కనిపెట్టి ఒకనాడు సాధువు రాజ శకటముపోవు దారి ప్రక్కన గల ఒకానొక మాంసపు కొట్టు వద్ద జటా జూటమును ధరించి మెడలో రుద్రాక్షమాలలు వేసికొని పూర్వపు వేషమును మార్చుకొని చేతిలో కమండలువు, దర్భాసనము కలవాడై ఆ మాంసమును కొనుచున్నట్లు నటించెను - సరిగా అదియే సమయమున జూదశాలకు పయనమై పోవుచున్న రాజు అదృశ్యమును వీక్షించి ఆశ్చర్య చకితుడై వెంటనే శకటమును ఆపి క్రిందకు దిగి మాంసమును కొనుచున్న ఆ సాధువును మందలించెను. అపుడు వారిరువురకును ఈ క్రింది సంభాషణము జరిగెను.\n\nభిక్షో మాంసనిషేణం కిముచితం కిం తేవ మద్యం వినా\nమద్యం చాపి తవప్రియం ప్రియమహో వారాంగనాభిస్సహ |\nవారస్త్రీరతయే కుతస్తవధనం చౌరేణ్య ద్యూతేన వా\nచౌర్యద్యూతరపరిశ్రమో స్తి భవతఃభ్రష్టస్య కా వా గతిః ||\n\nరాజు : ఓ సాధువుగారూ! మాంసమును కొనుట మీబోటి పుణ్యాత్ములకు తగునా?\nసాధువు : కల్లుత్రాగునపుడు నంజుకొనుటకై కొంత మాంసము అవసరమై యుండుట వలన కొనవలసివచ్చినది.\nరాజు : కల్లు కూడ మీరు త్రాగుతారా?\nసాధువు : వేశ్యలతో కూడియుండినపుడు మాత్రము త్రాగుదును.\nరాజు : వేశ్యలుకూడనా? మరి వానిని పోషించుటకు మీకు ధన మెక్కడ?\nసాధువు : దొంగతనముద్వారాగాని, జూదమాడుట ద్వారాగాని సంపాదించుకొందును.\n\nఅ వాక్యములను వినగానే రాజునకు కనువిప్పు కలిగినది. తాను స్వయముగ జూదమాడవద్దని ఇతరులకు కెట్లు చెప్పగలడు? కావున రాజు వెంటనే జూద ప్రయత్నమును విరమించి తన సకటమును రాజ ప్రాసాదమునకు మరలించెను. సాధువు వాస్తవముగ మాంసము కొనుట లేదు. మద్యపానాదులను సేవించుటలేదు. రాజునకు గుణపాఠమును బోధించుట కొరకే ఈ నాటక మాడెను.\n\nఅప్పటినుండియు రాజు జూదమును గూర్చిన అలవాటును వదలివైచి జీవితమును సంస్కరించుకొని ఇతరులకు ఆదర్శవంతు డయ్యెను.\n\nనీతి : ప్రతివారును తమ హృదయములను లెస్సగ పరిశోధించు కొనుచు ఏదేని దుర్గుణము, దుస్సంస్కారము, దుర్వ్యాసనము, దుర్వికారము లోన ప్రవేశించినచో వెంటనే దానిని వివేకము యొక్క సహాయముచే బయటకు గెంటివేయవలెను. హృదయశుద్ధియే మోక్షమునకు సోపానము. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 808,
        "IMAGE": "cat_9",
        "NAME": "దురభ్యాసమునకు స్వస్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణము పెక్కురహదారులతోనూ, సుందర భవనములతోనూ, ఆకాశము నంటుచున్న ఉత్తుంగ హర్మ్యములతోను, పుష్పవాటికలతోను విరాజిల్లుచుండెను. ఆ పట్టణము యొక్క రమణియకత్వమును దర్శించుటకును, అచటి విశేషములను ప్రత్యక్షముగా గావించుటకును పరదేశీయు లెందరో వచ్చుచు పోవుచు నుందురు. ఆ పట్టణ మెల్లపుడు పల్లెలనుండి వచ్చు జనములతోను, ఇతర ప్రాంతములనుండి వచ్చు యాత్రికులచేతను కిటకిటలాడుచుండును. ఆ పట్టణమునకు ఒక పెద్ద రైల్వేష్టేషను కలదు. అనేక రైలుమార్గముల కది కూడలియగుట వలన ప్రతి ఐదు నిముషములకు ఏదియో యొక రైలుబండి వచ్చుచునే యుండును. అది పెద్ద స్టేషను అయుయుండుట వలన విశాలమైన ప్లాట్ ఫారం గలిగియుండి వచ్చిపోవు ప్రయాణికులచే సందడిగా నుండును.\n\nఒకనాడు ఆ యూరిలో ఒక మహాపండితుడు, విద్వాంసుడు, పండిత శాలువా కప్పుకుని చేతిలో ఒక సంచి పట్టుకుని హడావిడిగా స్టేషను వైపునకు వచ్చుచుండెను. అతని వాలకము చూడగా ఏదియో ఒక తొందర పనిమీద రైలు బండిని అందుకొనుటకై వచ్చుచున్నట్లు తోచుచుండెను. అతడు మిక్కిలి ఆతురతతో వడివడిగా నడుచుచు స్టేషనులో ప్రవేశించి ప్లాట్ ఫారం మీదకు వచ్చుచుండెను. కాని గేటు వద్దగల టికెట్ కలెక్టరు అతనిని ఆపి \"అయ్యా! టికెట్టు ఉన్నదా?\" అని అడిగెను. అపుడు వారిరువురు మధ్య ఈ క్రింద సంభాషణము నడచెను.\n\nపండితుడు : మహాశయా! నావద్ద టికెట్టు లేదు. అయితే నేనెవరో తెలుసునా? నేను మహా పండితుడను. ఈ యూరిలోనే కాదు చుట్టు ప్రక్కల గల యెవరును విద్వత్తులో నాకు సాటిరారు. ఇటీవలనే కవిసమ్మేళనములో నాకు గొప్పసన్మానము జరిగినది. నేను ఆశుకవిత్వము చెప్పగలను. శాస్త్రవిచారణయందును, వాదవివాదముల యందును నన్ను మించినవారు ఎవరును లేరు. ఈ మధ్యనే అన్ని సంఘములవారు కలిసి పండిత శిరోమణి అను బిరుదును నాకు ఇచ్చియున్నారు.\n\nటికెటె కలెక్టరు : అయ్యా! మీ గొప్పతనమును ఏకరువు పెట్టుటకిది సమయము కాదు. మీ రెంతపండితులైన ఇచట మాత్రము టికెట్టు ఉండితీరవలసినదే. లేనిచో లోన ప్రవేశించుటకు వీలుపడదు.\n\nపండితుడు : నా గండపెండేరములను చూడండి. నాకు ప్రజలిచ్చిన సన్మానపత్రముల కట్ట చూడండి. బిరుదుల లిస్టు చూడండి. కొంచెము ఓపికపట్టినచో నాసర్టిఫికెట్లన్నీ మీకు చూపించెదను. నా ఔన్నత్యము మీకు సరిగా తెలిసినట్లు లేదు.\n\nటికెటె కలెక్టరు : మహానుభావా! మీ ఉపన్యాసము చాలించండి. మీ గొప్పతనము మీ ఊరిలో ఉండుగాక! కాని ఇచట మాత్రము మీరు టికెట్టు కొనవలసినదే. లేనిచో బయటకు దయచేయవలసి యుండును. వేరు గత్యంతరము లేదు.\n\nటి.సి యొక్క ఆ పలుకులు విని పండితుడు విధిలేక తిరుగు దారి పట్టెను. ఇంతలో ఒక మహాబలిష్టుడు, ఆజానుబాహువు, కండలు బలిసినవాడు, వస్తాదు ప్లాటుఫారంలోనికి ఠీవీగ వచ్చుచుండెను. కాని గేటువద్ద టికెట్టు కలెక్టరు ఆపి, అయ్యా! టికెట్టు ఉన్నదా? అని ప్రశ్నింప లేదు అని అతడు బదులు చెప్పి తన వృత్తాంత మీ ప్రకారముగ తెలియ జేయదొడగెను.\n\n\"అయ్యా! టి.సి గారూ! నేనెవరో తమకు సరిగా తెలిసినట్లు లేదు. నేను మల్లయుద్ధ ప్రవీణుడును. నాతో కుస్తీపట్టి జయించువారు ఈ నాలుగు జిల్లాలలోనూ లేడు. నా ఆకారమును చూచి జనులు హడలి పోవుచుందురు. \"జగజెట్టి\" అని \"మల్ల యుద్ధ విశారద\" అని బిరుదము లెన్నియో నాకు కలవు.\n\nటికెట్ కలెక్టరు : మహానుభావా! మీ ఉపన్యాసమును ఇక కట్టి పెట్టండి. మీరు గొప్పవస్తాదు అయుయుండవచ్చు ప్రతిపక్షులను అవలీలగ ఓడించివేయ అనుపమ సామర్థ్యము కలిగి యుండవచ్చు. కాని ఇచట మాత్రము లోనికి పోదలంచినచో టికెట్ ఉండితీరవల్సినదే.\n\nటి.సి గారి అ జంకులేని వాక్యములను విని గత్యంతరము లేక వస్తాదుగారు తిరుగుదారి బట్టిరి. ఒక వృద్ధుడు స్టేషను లోనికి పోవుటకై మెల్ల మెల్లగా నడచి వచ్చుచుండెను. గేటు సమీపించగనే టికెట్ కలెక్టరు అయ్యా! టికెట్టు ఉన్నదా అని అడుగగా అతడు తనజేబులో నుండి టిక్కెట్లు తీసుచూపెను. టి.సి గారు అతనిని సగౌరవముగా లోనికి పోనిచ్చెను.\n\nస్టేషన్‌ ప్లాట్ ఫారం మీదకు పోవుటకు, రైలు ఎక్కుటకు అర్హత ఉండవలెను. టికెట్టు కలిగియుండుటయే ఆ అర్హత. అది కలిగినవాడు ఎటువంటి వాడైనను లోనికిపోవచ్చును. అతడు బీదవాడైనను విద్యా విహీనుడైనను, దుర్బలుడైనను, ఎవరైనను సరియే లోనికేగుటకు ఆక్షేపణ యుండదు. ఆగేటు వద్ద జాతి, మత, కుల,లింగ, వయో విచక్షణగాని, ఇతర కారణములేని అడ్డురావు. టికెట్టు ఉన్నచో చాలు అతడు సగౌరవముగ లోనికేగవచ్చును. అదిలేనివాడు మహాపండితుడుడైనను, ధనవంతుడైనను, బలవంతుడైనను అనర్హుడే యగును. అతడు లోనికి పోలేడు.\n\nనీతి: మోక్షధామములో ప్రవేశించుటకు, మోక్షసౌధ మధిరోహించుటకు పవిత్ర హృదయమే అర్హత; నిర్మల మనస్సే అర్హత; అట్టి అర్హత కలవాడు ఏజాతివడైనను, ఏ కులమువాడైను, విద్యావంతుడైనను, విద్యాహీనుడైనను,స్త్రీ అయినను, పురుషుడైనను, ఎవరైనను సరియే భగవత్సాయుజ్య మొందుటకు, మోక్షధామ మలంకరించుటకు యోగ్యుడై యుండును. కాబట్టి అట్టి అర్హతనుబడ యుటకై సర్వులును యత్నశీలురు కావలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 809,
        "IMAGE": "cat_9",
        "NAME": "మోక్షమునకు అర్హత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొక మహాపట్టణమున ఒక రాజకుటుంబము కలదు. ఆ కుటుంబమునందొక రాజకుమారుడు పాఠశాలలో చదువుకొనుచుండెను. పాఠశాల వార్షికోత్సవ సమయమున విద్యార్థులందరు కలిసి కొన్ని వినోదకార్యక్రమములను ఏర్పాటు చేసుకొనిరి. ఒకటి రెండు నాటకములను కూడ నిర్వహించిరి. విద్యార్థులలో చక్కని నటనాకౌశలము కలిగినవారు వారివారికి తగిన వేషములను వేసుకొని నాటకమాడిరి. రాజకుమారుడు అందు స్త్ర్తీ వేషమును ధరించెను. నాటకము బహుమనోరంజకముగ నడచెను. ప్రదర్శనమునకు వచ్చినవారు అపుడపుడు చప్పట్లు చరచుచు తమ ఆహ్లాదమును వ్యక్తపరచిరి. వేషములు ధరించిన వారిలో స్త్రీ వేషధారియైన రాజకుమారుడు తన నటనా సామర్థ్యముచే ప్రేక్షకుల మన్ననలను లెస్సగ చూరగొనెను. పురుషుడైనను అచ్చట స్త్రీవలెనే అతడు నటించెను. నటనలో సహజత్వము ఉట్టిపడు చుండుటచేతను, బహుశ్రావ్యముగ పాటలు పాడుటచేతను, నాటకమునకు వచ్చిన వారందరును రాజకుమారుని వేనోళ్ళ ప్రశంసించిరి. రాజకుమారుని స్నేహితుడొకడు స్త్రీ వేషముతో నున్న రాజకుమారుడు రంగస్థలిపై నటించు వేళ అతనిని ఫొటో తీసి తనయింటివద్ద భద్రపరుచుకొనెను.\n\nబహుకాలము గడచిపోయెను. కాలచక్రము రివ్వున తిరుగసాగెను. బాలుడుగనుండి పాఠశాలలో విద్యాభ్యాసము చేయుచున్న రాకుమారుడు క్రమముగ యువకుడయ్యెను. దీర్ఘకాలము గడచిపోవుటబట్టి అతడు తన చిన్నతనమున గావించిన పనులను మరచిపోయెను. తోడిపిల్లలతో కలసి నాటకమాడిన వృత్తాంతము అతని స్మృతిపథము నుండి పూర్తిగ జారిపోయెను. ఆ సంగతిని పూర్తిగ మరచిపోయెను ఇట్లుండ అతని తండ్రియైన మహారాజు తన తనయునకు యౌవనము సంప్రాప్తించి నట్లెరింగి వివాహము చేయుటకు నిశ్చయించెను.\n\nమంత్రివర్యులు, సామంతులు, అస్థానమందలి పెద్దలు వధువు కొరకై పలుచోట విచారించి, పెక్కు రాజకుటుంబముల వారిని పరామర్శించి తుట్టతుదకు తమకు నచ్చిన నలుగురు రాజకుమార్తెల విషయము రాజున కెరింగించిరి. నలుగురును రూపలావణ్యము లందేకాక సిరి సంపదలందేకాక విద్యాశీలము లందుకూడ ఎంతయో అధిక్యమును బడసినవారై యుండిరి. ఒకనాడు రాజు తన కుమారుడైన వరుని వెంటబెట్టుకొని, మంత్రిశేఖరులు వెంటరాగా ఆ నలుగురు రాజకుమార్తెలను వారి వారి పట్టణములందు చూచి, కుమారునకున్ను చూపించెను. రూప సౌందర్యాదులందు వారందరు ఒకరిని మించిన వారు మరియొకరై యుండిరి. వానిని చూడగనే రాజునకు అంతరంగమున పరమతృప్తి జనించినది. వారిలో ఒకరిని ఏరికొని తన కుమారునకు వివాహము చేసి వెయుటకు రాజు దృఢనిశ్చయము గావించుకొనెను.\n\nకాని రాజకుమారునకు వారెవరును నచ్చలేదు. వారందరిని చూచి పెదవిని విరచుకొనెను. \"లోకో భిన్నరుచిః\" అనునట్లు ఎవరి దృష్టివారిది. ఆ రాజకుమార్తెలు నలుగురు రూపయౌవన సంపదాదులు ఎన్ని గలిగియున్నప్పటికిని వరుడైన రాజకుమారునకు వారు ఏమాత్రము నచ్చలేదు. ఆ విషయము తెలిసికొని రాజు విహ్వలచేతను డాయెను. ఒకనాడు తన కుమారుని బిలిచి \"నాయనా! ఆ నలుగురిలో ఎవరును నీ కిష్టపడనిచో నీకునచ్చిన పెండ్లికుమార్తెను నీవే అన్యత్ర విచారించుకొనుము. నీ దృష్టికి ఎవరు ఉత్తమురాలుగ తోచునో ఆమెనే వివాహము చేసికొనుము\" - అని చెప్పగా రాజకుమారుడట్లే కావించెదని సమాధాన మొసంగెను.\n\nఇట్లుండ ఒకనాడు రాజకుమారుడు తన మిత్రుని గృహమునకు వెళ్లుట తటస్థించెను. అతని యింటిలోనికి ప్రవేశించగానే చిన్ననాడు తాను పాఠశాల వార్షికోత్సవ సమయమున నాటకమున వేసిన స్త్రీ వేషము యొక్క ఫొటో కనుపించెను. బహుకాలము గడచిన కారణముచే అది తన స్వరూపమే యని అతడు మరచిపోయెను. ఆ స్త్రీయొక్క సుందర సుకుమార రూపమును గాంచి రాజకుమారుడు మోహపరవశుడై ఆ ఫొటోను తీసుకొని వెళ్లి తన తండ్రికి చూపించి ఫొటోయందలి పిల్లను తాను వివాహము చేసికొనెదననియు, ఆమె యెవరో, యెచటనున్నారో విచారించి రాజభవనమునకు రప్పించవలసినదనియు చెప్పెను.\n\nకుమారుని యభీష్టప్రకారము రాజు అమాత్యశేఖరులను సైనికాధికారులను, ఆస్థాన పురోహితులను కబురుచేసి ఆ ఫొటో వారికి అప్పగించి దేశమంతయు గాలించి అ యువతిని ఎట్లైనను తన భవనమునకు గొనిరావలసినదిగ ఆజ్ఞయిచ్చెను వారట్లే పయనమైపోయి, ఊరూరు, పల్లె పల్లె, పురపురములు గాలించి, అట్టి రూపవతి యెచటను సందర్భపడక పోవుటచే నిరాశానిస్పృహలచే పరివేష్టితులై తుట్టతుదకు రాజభవనమునకు తిరిగి వచ్చి రాజునకు ఆ వృత్తాంత మంతయును తెలియజేసిరి. రాజు, రాజకుమారుడు, రాజవంశీయులు అందరును ఆవార్త వినుటతోడనే విషణ్ణవదనులైరి. అత్తరి రాజకుమారుని బాల్య వృత్తాంతమంతయు నెరింగియున్న ఒక ఆస్థాన విద్వాంసుడు ఫొటోయందలి స్త్రీ రాజకుమారుడేయని తెలుపగా అందరును ఆశ్చర్యచకితులైపోయిరి. ఏ స్త్రీ కొరకై రాజకుమారుడు నలుదిక్కులు వెతికింపజేసెనో, దేశదేశములు గాలింపజేసెనో ఆస్త్రీ యెక్కడనో లేదు. తానే అయియున్నాడు. అది తనరూపమే అయియున్నది. తాను చిన్నప్పుడే వేసిన వేషమే అది. ఆ విషయము తెలియక ఇంత శ్రమపడవలసి వచ్చినది. ఎక్కడెక్కడో గాలింపవలసి వచ్చినది.\n\nఅట్లే దేవునికొరకై జనులు ఎచటెచటనో వెతకుచున్నారు. కాని ప్రతివాని హృదయమందే యతడు విరాజిల్లుచున్నాడు. వెతకు వారికి తప్పక గోచరించుచు వైరాగ్యవిచారణాదుల ద్వారా సర్వాంతర్యామియగు ఆ పరమాత్మ జనులకు వారివారి హృదయములందే చక్కగ అనుభూతు డగుచున్నాడు.\n\nనీతి: భగవానుడు సమస్తప్రాణికోట్ల యొక్క హృదయములందు అతి సమీపమున విరాజిల్లుతున్నాడు. కావున ధ్యానవిచారణాదుల ద్వారా వానిని సాక్షాత్కరించుకొని తరించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 810,
        "IMAGE": "cat_9",
        "NAME": "దేవుడెచట నున్నాడు?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒకానొక గ్రామమున గొప్ప ధనికుడు కలడు. అతనికి నూరు ఎకరముల భూమియు,పెద్ద పెద్ద భవనములున్ను, పలువిధములైన ఆస్తిపాస్తులున్నూ కలవు. ఆ పరిసర ప్రాంతములోని శ్రీమంతులలో అతనిదే అగ్రతాంబూలము. ఏజన్మలోనో అతడు పెట్టిపుట్టినవాడు. అతని జీవితము ఏవిధమైన బాధలు, ఓడిదడుకులు లేక సౌమ్యముగ గడచుచు వచ్చెను. కొంతకాలమున కతనికి వార్ధక్యము దాపురించెను. వృద్ధాప్యము వలన శరీరము శుష్కపర్ణమువలె సడలిపోయెను. అవయవము లన్నియు శిథిలములు కాజొచ్చెను. ముదిమి యందు జీవుడనుభవించు ఇడుమలు చెప్పతరమా! అతనికి ఒకే ఒక కుమారుడు కలడు. అతడు పెద్దవాడై తండ్రికి సహాయభూతుడగనుండెను. కాని సహవాస దోషమువలన కొన్ని దురలవాట్లును కొని తెచ్చుకొనెను. త్రాగుడు మొదలైన దుర్వ్యసనములకులోనై అతడు వంశప్రతిష్టను, కుటుంబ ప్రతిష్టను మట్టిపాలు చేయదొడగెను. చెమట కార్చి తండ్రి సంపాదించిన ద్రవ్యమునంతను క్రమక్రమముగ తనయుడు పాడుచేయుచుండెను. దుశ్శీలవంతుని యొద్ద సంపద నిలుచునా?\n\nకొంతకాలమునకు తండ్రి ఈ విషయమును గమనించిన వాడై శేషించిన తన యావదాస్తిని బంగారముగను ఆభరణములుగను మార్పుదలచేసి దానినంతను ఒక బిందెయందుంచి ఒకనాటిరేయి ఇంటిలో అందరును గాఢనిద్రయందుండగా దొడ్డిలోనికి ప్రవేశించి ఒకచోట లోతైన గోయిత్రవ్వి ఆ బిందెను దానియందు పూడ్చి పెట్టెను.\n\nఈ సమాచారము ఇతరులెవ్వరికిని తెలియదు. కాలచక్రము రివ్వున తిరుగసాగెను. కొంతకాలమునకు వార్ధక్య దశయందున్న ఆ శ్రీమంతునకు రుగ్మత సంభవించెను. ఆరోగ్యము దినదినము క్షీణింపదొడగెను. ఒకనాడు వ్యాధి తీవ్రస్వరూపము దాల్చగా ధనికుడు తనలో ఈ ప్రకారముగ వితర్కించుకొనెను 'నా శరీరము ఇక ఎక్కువ కాలము జీవించదు. వ్యాధి తీవ్రమై కాయమును కూకటివ్రేళ్ళతో పడగొట్టుటకు సిద్ధముగా నున్నది. నా ఆస్తియంతయు సువర్ణరత్న వైడూర్య రూపమున దొడ్డిలో దాచబడియున్నది. నాకు ఒకడే కుమారుడు. అతడే నా వారసుడు. నా ఆస్తియంతయు అతనికే దక్కును. దొడ్డిలోని బంగారపు బిందె విషయము అతనికి ముందుగనే తెలిపినచో దుశ్శీలత్వ కారణమున దానిని సర్వనాశనము చేసివేయగలడు. కనుకనే ఇంతదనుక దాని సమాచార మాతని చెవిలో పడకుండచేసితిని. ఇక నేనెక్కువ కాలము జీవించు అవకాశము లేదు కాబట్టియు, నా వారసుడు అతడొక్కడే కాబట్టియు నా ఆస్తివిషయమై అతనికి చెప్పకతప్పదు. రేపటి ఉదయము సూర్యోదయము కాగానే కుమారుని నాయొద్దకు బిలిచి ఉన్నవిషయ మంతయు సాకల్యముగ అతనికి తెలియజెప్పెదను. దొడ్డిలో దాచబడిన లక్షలాది రూప్యముల విలువగల సువర్ణకలశము యొక్క పోవిడి అతనికి ఎరగించెదను'.\n\nఈ ప్రకారముగ తనలో నిశ్చయము గావించుకొని ఆ వృద్ధుడు ఉషఃకాల మెపుడేతెంచునా యని నిరీక్షించుచు పరుండెను. కాని విధి వైపరీత్య మేమియో అర్ధరాత్రి దాటగనే ధనికునకు కఫవాతముల తీవ్ర ప్రకోపముచే కంఠము నిరుద్ధమయ్యెను. నోటి వెంట మాటరాకుండెను. తల గిర్రున తిరుగసాగెను. హృదయస్పందనము సన్నగిల్లెను. ప్రఖ్యాత వైద్యులెందరో క్షణములో రప్పింపబడిరి. కాని వారి సపర్యలేవియు కలిసిరాలేదు. ఒక అరగంట కాలములో శ్రీమంతుని ప్రాణపక్షి వెడలిపోయెను.\n\nతండ్రి మరణించిన వెనుక అతని ఏకైకకుమారుడు తండ్రికి జరుపవలసిన ఔర్ధ్యదైహిక క్రియలను యథావిధి నిర్వహించెను. వారము దినములు గడచిన మీదట ఇంటిలోని భోజనసామాగ్రి యంతయు విలుప్తము కాగా ధనికుని కుమారుడు తినుటకు తిండిలేక, కట్టుకొనుటకు బట్టలేక నానాయాతనలు పడుచుండెను. తండ్రి తన సంపద నంతను రొక్కముగా బంగారముగా మార్చి దొడ్డిలో దాచిపెట్టెను. కాని ఆ లక్షలు ఎక్కడ ఉన్నది తెలియనందున భిక్షాధికారిగా మారిపోయెను. \"అంగడిలో అన్నీ ఉన్నవి కాని -\" అను సామెత అతని విషయములో చరితార్థమయ్యెను. మధ్యాహ్నము పండ్రెండు గంటల సమయమైనది. ధనికుని కుమారునకు కరకర ఆకలి యగుచుండెను. తినుటకు ఒక్క రొట్టె ముక్క కూడలేదు. ఇక ఏమిచేయుటకు తోచక అతడు ఒక పాత్ర పట్టుకొని ఇంటింటికి వెళ్ళి \"భవతీ భిక్షాం దేహి\" అని యాచింప దొడగెను. గ్రామస్థులందరు ఆశ్చర్యచకితులై \"ఏమయ్యా! లక్షాధికారీ! ఈ దుర్గతి నీకేల పట్టినది. అని యాతనిని ప్రశ్నింప,అందుల కతడు \"మహానుభావులారా! నేనేమో లక్షాధికారినే. అందులకు తిరుగులేదు. కాని ఆ లక్షలు ఎక్కడున్నవో నాకు తెలియదు. అదీ వచ్చిన తిప్పలు అందువల్ల ఈ దీనావస్థ నాకు దాపురించినది\" అని ప్రత్యుత్తరము చెప్పుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడతడు తనమిత్రుని యింటికి ఏదియో యొక కార్యార్థము వెడలగా, ఆతని దయనీయావస్థను గాంచి ఆమిత్రుడాతని కిట్లు సూచన చేసెను. 'నాయనా! మీతండ్రి జీవించియున్న కాలములో ఒకనాడు నాతో నా ఆస్తినంతను ద్రవ్యరూపమున ఒక బంగారు బిందె యందుంచి దొడ్డిలో దాచిపెట్టదలచినాను' అని పలికియుండెను. కాబట్టి మీ దొడ్డిలో త్రవ్వి చూచెదము. ఒక వేళ బిందె దొరికినచో నీవు అదృష్టవంతుడవు, మిత్రుని యొక్క ఆ స్నేహపూర్వక వాక్యములను విని అతని సూచనమేరకు ధనికుని కుమారుడు దొడ్డియంతయు త్రవ్వి చూడగా ఒకచోట ఆ బంగారుబిందె ప్రత్యక్షమయ్యెను. అదిగాంచి ధనికుని పుత్రునియొక్క ఆనందమునకు మేరలేకుండెను ఆ ద్రవ్యముతో అతడు తిరిగి సుఖజీవితము గడపదొడంగెను. భిక్షాధికారి దైవకృపచే మరల లక్షాధికారి అయ్యెను.\n\nజీవుడు తనహృదయమున వెలుగుచున్న పరమాత్మయను సంపదకు, బ్రహ్మానందమను సువర్ణ కలశమునకు వారసుడు. కాని ఆ రహస్య మెరుగక అతడు తన ఆత్మస్వరూపమును మైమరచి తాను జడమైన దేహమని భ్రమసి నానా దుఃఖము లనుభవించుచుండ సద్గురుడను మిత్రుడువచ్చి జీవుని హృదయ కమలమందు విరాజిల్లుచున్న ఆత్మను పొందుటకు మార్గమునుజూపి, అతని యథార్థస్వరూపమును బైట పెట్టి అతని వాక్కుభుక్తమగు పరమానందమును తిరిగి అతని కైవసము చేయుచున్నాడు.\n\nనీతి: కలిమి (ఆత్మ) యుండియు దారిద్ర్యము (దుఃఖము) అనుభవించుచున్నాడు అజ్ఞాని. ఆ కలిమి యొక్క ఉనికిని సద్గురు ముఖమున గుర్తెరింగి నిరతిశయసుఖ మనుభవించుచున్నాడు జ్ఞాని. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 811,
        "IMAGE": "cat_9",
        "NAME": "కలిమియుండియు దారిద్ర్యము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామమున కనతిదూరములో ఒక చక్కని ఆశ్రమము కలదు. అందు ఒక గురువు,పదిమంది శిష్యులు నివసించుచుండిరి. ఆశ్రమము చుట్టూ సుందమైన ఉద్యానవనము కలదు. అందు తులసి మొక్కలు, మారేడు మొక్కలు అచటచట నాటబడినవి. తులసిపత్రి, మారేడుపత్రి ప్రతి దినము పూజకు ఉపయోగించబడుచుండును. గురువుగారు వేదాంత విచారణయందు అందెవేసిన చేయి. ఒక సిద్ధాంతమును ప్రతిపాదించుట యందుగాని, ఆ సిద్ధాంతమును వాదముద్వారా,తర్కవితర్కముల ద్వారా సమర్థించుట యందుగాని అతని కతడే సాటి. ఇక్కారణమున వేదాంత తత్త్వమును తెలిసికొననభిలషించు వారు ఆ గురువుగారిని తమ గ్రామమునకు ఆహ్వానించి ఒక వారము దినములుగాని, పది దినములుగాని వారి ముఖతః అధ్యాత్మిక తత్త్వమును శ్రవణము చేయుచుందురు.\n\nబ్రహ్మవిద్యానిష్ణాతు డగుటవలనను, అనుపమ వాగ్ధాటి కలవాడు కావునను ఆ గురువర్యునకు సమీప గ్రామములనుండియు దూర స్థలములనుండియు ఆహ్వానములు అనేకములు వచ్చుచుండెను. ఒకనాడు ఒకానొక గ్రామమునకు చెందిన జిజ్ఞాసువులు గురుబోధ నాలకించదలచినవారై ఆ దేశికోత్తముని తమ గ్రామమునకు ఆహ్వానించిరి. గురుదేవు డందులకు అంగీకరించిరి. రాత్రి భోజనానంతరము ఒక ఎద్దులబండిపై తన సామాగ్రియంతయు నుంచుకొని ఒక శిష్యుని వెంటనిడుకొని గురువు గ్రామాంతరమునకు ప్రయాణమును సాగించెను. కొంతదూర మేగుసరికి గురువునకు నిద్ర రాగా శిష్యునితో 'నాయనా! నిద్రవచ్చుచున్నది. కొద్దిసేపు విశ్రమించెదను. నీవు మేలుకొనియుండి బండిలోని వస్తువులను జగ్రత్తగా చూచుచుండుము. బండి అదురుడుకు ఏవైనా వస్తువులు జారిపడునేమో గమనించుచుండుము' అని పలికి బండిలోనే పరుండెను. బండి నెమ్మదిగా పోవుచుండెను. గుర్వాజ్ఞను పురస్కరించుకొని శిష్యుడు గురువు చెంతనే బండిలో మేలుకొనియే కూర్చుండి వేయికండ్లతో నలువైపుల పరికించుచు సామాగ్రిని బహు జాగ్రత్తగ గమనించుచుండెను.\n\nఇంతలో బండి అదురుకు గురువుగారి కమండలువు జారి క్రింద పడిపోయినది. శిష్యుడు దానిని చూచుచునే యుండెను. కాని ఎత్తలేదు. బండి తన గమనమును సాగించుచుండెను. గురువుగారు గాఢనిద్రలో నుండిరి. ఈ విధముగా దాదాపు అరగంట సేపు గడచిపోయెను. అత్తరి అకస్మాత్తుగా గురువుగారికి మెలకువ వచ్చెను. మేలుకొనగానే గురువు శిష్యునితో నిట్లు సంభాషించెను.\n\nగురువు : నాయనా! ఏవైనా వస్తువులు బండిలోనుండి జారిక్రింద పడినవా?\nశిష్యుడు : తమరి కమండలువు పడినది.\nగురువు : దానిని తీసి బండిలో వేసినావా?\nశిష్యుడు : వేయలేదు.\nగురువు : ఎందులకు వేయలేదు?\n\nశిష్యుడు : తమరు ఆ ప్రకారము ఆదేశించలేదు. \"ఏవైనా వస్తువులు పడునేమో జాగ్రత్తగా చూస్తూ వుండు\" అని మాత్రమే సెలవిచ్చారు. తమ ఆజ్ఞానుసారము ఆ ప్రకారమే చూస్తూ ఉన్నాను.\nగురువు : ఓరి మందమతీ! వస్తువు క్రిందపడితే ఊరికే చూడడం కాదు. తీసి బండిలో వేయవలెను.\nశిష్యుడు : మహాప్రభో! ఇకమీదట అటులే చేసెదను.\n\nఈ ప్రకారముగ శిష్యుని మందలించి గురువు మరల పరుండెను. బండి తన గమనమును కొనసాగించుచుండెను. శిష్యుడు గురుసామిప్యమున బండిలొ కూరుచుండి గురువుగారి ఆదేశమును పదేపదే మననము చేయుచుండెను. ఏదైనా వస్తువు బండిలో నుండి క్రిందపడినచో దానినెత్తి బండిలో వేయవలయును అనునదియే గుర్వాదేశము. ఇట్లుండగా బండిలాగుచున్న ఎద్దులలో ఒక యెద్దు పేడ వేసెను. తోడనే శిష్యుడు బండిపై నుండి క్రిందకు దూకి ఆ పేడను బండిలో వేయదొడగెను. ఆ చప్పుడు విని గురువు నిద్రనుండి లేచి తన ప్రక్కనే పేడ యుండుటను గాంచి అట్లేల చేసితివని ప్రశ్నింప అంతేవాసి యిట్లు ప్రత్యుత్తర మొసంగెను. 'మహాత్మా! నేను గుర్వాజ్ఞను ఇంతవరకెన్నడును ధిక్కరించి యుండలేదు. ఇక మీదట ధిక్కరింపను. తమ వాక్యమే నాకు వేదవాక్యము. తమరెట్లు శాసించుదురో అప్రకారమే ఆచరించువాడును నేను. బండిపై నుండి ఏది పడునో దానిని తీసి బండిలో వేయుమని తాము ఆదేశించి యుండిరి. ఆ ప్రకారమే చేసితిని. ఆ వాక్యమును విని గురువు చిరాకు నొందినవాడై, శిష్యుని మందమతికి లోలోన చింతించుచు అతనితో \"ఇక మీదట ఏదైన సామాగ్రి పడినచో మాత్రము తీయవలెనే గాని పేడ మొదలైనవి తీయరాదు\" అని చెప్పగా అందులకు శిష్యుడు ఏయే వస్తువులు పడినచో తీయవలెనో, ఏవేవి తీయకూడదో నిష్కర్షగా తెలుపుడని ప్రార్థింప గురువు ఆ ప్రకారముగ ఒకలిస్టు తయారు చేసి వానికిచ్చి పరుండెను. శిష్యుడు ఆ లిస్టును కంఠస్థము చేయుచుండెను.\n\nఇంతలో ఒక కాలువ అడ్డముగా వచ్చెను. కాలువలో నీరు బహు వేగముగ ప్రవహించుచుండెను. బండి కాలువను దాటుచుండగా మిట్ట పల్లముల వలన కలిగిన అదురుకు బండిలో పరుండియున్న గురువు గారు క్రిందకి జారి నీటిలో పడిపోయిరి. గురువుగారు నీటిలో కొట్టుకొని పోవుచుండగా శిష్యుడు లిస్టు చుడదొడగెను. పడిపొయిఒన గురువు గారిని తీయవలెనా, లేదా? లిస్టులో ఏమి వ్రాసియున్నది? గురువుగారి ఆజ్ఞ యెట్లున్నది? లిస్టులో గురువుగారి విషయమై ఏమియు తెలుప బడియుండలేదు కాబట్టి శిష్యుడు తటస్థముగా నుండిపోయెను. కొట్టుకొని పోవుచున్న గురువు ఎట్టకేలకు ఒడ్డును చేరి శిష్యుని అవివేకమునకు లోలోన వగచుచు బండియొద్దకు వచ్చి శిష్యుని తీవ్రముగ మందలించి, ఏకార్యమందైనను గ్రుడ్డిగా ప్రవర్తింప వలదనియు, ఒకింత వివేకమును కూడ జోడించి కార్యములను సాధింప వలెననియు బోధించెను.\n\nనీతి: గురుబోధను శిష్యుడు వివేకముతో గూడి చక్కగా చింతనజేయవలెను. గురువు యొక్క హృదయమును శిష్యుడు బాగుగ గ్రహింప వలయును. బోధయొక్క అంతరార్థమును ఎరింగినవాడై శిష్యుడు వివేకముతో దానిని గూర్చి లెస్సగ యోచించిన తదుపరి కార్యమున కుపక్రమింప వలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 812,
        "IMAGE": "cat_9",
        "NAME": "మతిలేని శిష్యుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామములో ఊరిబయట ఒక మంచినీళ్ళ బావికలదు. ఆ ఊరిలో అదొకటియే మంచినీటిబావి. తక్కిన బావులందరి నీరు చప్పగ నుండుటచే గ్రామస్థు లందరును త్రాగుటకొరకు ఆ మంచి నీటి బావినే ఉపయోగించుకొనుచుండిరి. ఇక్కారణమున ప్రతి దినము ఉదయము 5 గంటలు మొదలుకొని చీకటిపడువరకును ఆ బావియొద్దకు జనులు ఎడతెరపిలేకుండ వచ్చును పోవుచు నుందురు. గ్రామపంచాయతీ వారు ఆ బావికొక పిట్టగోడ కట్టించి బావిచుట్టును క్రిందిభాగమున సిమెంటుతో కాంక్రీటు వేయించిరి. నాలుగు గిలకను బావికి అమర్చిరి. ఈ ఏర్పాట్ల వలన ప్రజలకు చక్కని సౌకర్యములు ఏర్పడెను.\n\nఒకనాటి సాయం సమయమున ఒక యువతి బిందె, బొక్కెన, త్రాడు తీసుకొని మంచినీటి కొరకై ఈ బావిని సమీపించుచుండెను. సూర్యుడస్తాద్రి గ్రుంకుటచే అత్తరి నలుదెసల అంధకారము వ్యాపించి దొడగెను. ఆ చీకటిలో బావి సమీపమున ఒక పెద్ద నాగుపాము చుట్ట చుట్టుకొని పగడ పైకెత్తి యుండుటను ఆ యువతి దూరమునుండియే గమనించి భయభీతయై వెనుకకు మరలి కేకలిడుచు ఊరిలో ప్రవేశించి కనుపించిన వారికందరికిని ఆ పాము వృత్తాంతమును చెప్పసాగెను. 'ఓ జనులారా! ఆ బావియొద్దకు ఎవరు పోవలదు. అచట ఒక బ్రహ్మాండమైన నాగుపాము చుట్ట చుట్టుకొని పడగెత్తి ఆడుచున్నది. దానిని సమీపించినచో ఘోరవిపత్తు సంభవించగలదు'. పడతియొక్క ఆ వాక్యములను వినగానే గ్రామస్థు లెల్లరు భీతావహము జెందినవారై, కర్రలు , కట్టెలు, బరిసెలు, తుపాకులు, ధనస్సులు మొదలైన వాటి కొరకై ఇటునటు వెతకసాగిరి. కొందరు మాంత్రికుల కొరకై పరుగిడజొచ్చిరి. అది గ్రామస్థు లందరికిని ఉపయోగపడు బావి కాబట్టి చీకటిలో ఎవరైన రాత్రిపూట నీరు తోడుకొనుటకు అచటికి వెళ్ళినచో ప్రాణపాయము కలుగగలదు. కాబట్టి ఆ సర్పమును ఎట్లైనను తుదముట్టించవలెనని ఊరివారందరును కృతనిశ్చయులైరి. ఒక్కొక్క ఆయుధమును జేపట్టి బావి దిశగా పయనమై పోదొడంగిరి. భుజంగవార్త ఆ గ్రామములో ఒక గొప్ప సంచలనమును కలుగ జేసినదాయెను. కాని విచిత్ర మేమనగా వందలమంది వందలకొలది కట్టెలు తీసుకొని బయలు దేరినను బావి సమీపమునకు పోగలిగిన నాథుడు ఒకడును లేడయ్యెను. అందరును బావికి పది గజముల దూరమున వలయాకారముగ నిలబడి చిత్రమును వీక్షించుచుండిరే కాని ఎవరును చెంతకు పోవుటకు సాహసింపరైరి. 'బ్రతికుంటేం బలుసాకు' అను సామెతను మననము చేసి కాబోలు ప్రాణముపై తీపిచే వారెవరును దగ్గరకు పోకయే నిలబడి యుండిరి. అందరి యొక్క గుండెలు దడదడ లాడుచుండెను.\n\nఅత్తరి ఆ నిశీథ సమయమున ఒక ముసలమ్మ చేత దీపము గైకొని ఆ గుంపు నంతను నెట్టుకొనుచు బావియొద్దకు పోవుచుండెను. అందరు ఆశ్చర్యచకితులైరి. కొందరు ముసలమ్మను వెనుకకు లాగి \"అవ్వా! అక్కడకు పోయినావా! చావుకొని తెచ్చుకుంటావు. అక్కడ పెద్దనాగుపాము ఉంది. మేమంతా పోలేకనా ఇక్కడ నిలబడినది? ఇంకా కొన్నాళ్లు ఈలోకంలో ఉండేటట్టు చూడు!\" అని హితవు చెప్పబొడగిరి. కాని ముసలమ్మ వారెవరి మాటలకు లొంగలేదు. అందరిని నెట్టుకొని, విదిలించుకొని \"మీకేమైనా బుద్ధి ఉన్నదా? నా కోడలు మంచినీళ్ళు తోడుకొని బావిదగ్గర తాడు వదలేసి వచ్చింది. అ తాడుకోసం నేను వచ్చినాను\" అని వారితో చెప్పుచు బావిని సమీపించి ఆ దీపపు కాంతితో అందరికిని, ఆ త్రాటిని చూపించెను.\n\nఅందరును ఆశ్చర్యచకితులైరి. చీకటిలో త్రాటిని చూచి పామనుకొని వారందరును నానాభాదలను పొందిరి. కాని ఇపుడు దీపకాంతితో యథార్థమును తెలిసికొనుటచే వారి గుండె బరువు తగ్గిపోయెను. వారి దుఃఖము లన్నియు సమసిపోయెను. మొదటినుండియు అచట నున్నది త్రాడేకాని పాముకాదు. పాము ఏకాలమందును లేదు. కాని భ్రాంతిచే త్రాటిని పామని భావించి గ్రామస్థులు నానావికారములను దుఃఖములను, వేదనలను పొందినవారైరి. దీప ప్రకాశమునందు సత్యము సత్యముగ గోచరము కాగా దానిచే అందరికిని గొప్ప ఉపశాంతి లభించెను.\n\nనీతి: ఈ ప్రపంచమున ఒకటే పరబ్రహ్మము సత్‌ చిత్‌ ఆనందము తప్ప మరియొకటియు లేదు. అజ్ఞానముచే మానవుడు నామరూపములను ఆ పరమాత్మపై ఆరోపించి భ్రాంతిచే ఈజగత్తును వీక్షించుచు అధిష్ఠానమగు సచ్చిదానందాత్మను విస్మరించి నానా దుఃఖములను, జన్మ పరంపరలను బొందుచున్నాడు. సద్గురూపదేశమను దీపకాంతిచే యథార్థవస్తువు గోచరింప, అజ్ఞానరూప అంధకారము మటుమాయమై పోగా జీవుడు స్వస్వరూపాత్మను సందర్శించి ఆత్యంతిక దుఃఖరాహిత్యమును పరమానందప్రాప్తిని బడయుచున్నాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 813,
        "IMAGE": "cat_9",
        "NAME": "భ్రాంతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకాశ్రమములో ఒక గురువు ఒక శిష్యుడు నివసించుచుండిరి. ఇరువురుకును వేరు వేరు కుటీరములు కలవు. ఆ కుటీరములు తాటియాకుతో బాగుగ కప్పబడియుండెను. ఒకనాడు సాయం సమయమున గొప్ప పెనుగాలి వీచగా గురువుగారి కుటీరముపై గల తాటియాకులలో రెండు ఊడి గాలికి కొట్టుకొనిపోయెను. గురువు వెంటనే శిష్యుని పిలిచి \"ఒరే నాయనా! కుటీరముపై తాటియాకులలో రెండు లేచిపోయినవి. ఎక్కడ పోయినవో చూచి తెచ్చి వాటిని యథా స్థానములో పెట్టరా\" - అనెను. శిష్యుడు ఏఘడియలో పుట్టెనో గాని సోమరితనమును బాగుగ అలవాటు చేసికొనెను. మూర్తీభవించిన మహాబద్ధకమే అతడు. తమోగుణము అతనికి ఒడలంతా వ్యాపించి యుండెను. కూర్చున్నవాడు లేవలేడు. గీతలో చెప్పిన \"దీర్ఘసూత్రి\" కి వాడు ప్రబలదృష్టాంతము. ఇట్టి స్థితిలో అతడు గుర్వాజ్ఞను పాలించునా? వెంటనే యతడు గురువుగారికీ సమాధానమును చెప్పివైచెను - \"మహాప్రభో! ఇపుడు చీకటిపడింది. చీకటిలో ఎక్కడ వెదకుదును? వెదకినా అవి కనిపించునా? కనిపించినా వాటిని తెచ్చి కుటీరముపై పెట్టుట ఎట్లు? ఎచట చూసినా అంధకార బంధురముగా నున్నది. కాబట్టి రేపు ప్రొద్దున తప్పకుండా తెచ్చి కప్పెదను క్షమించండి!\"\n\nఆరోజు రాత్రి ఎట్లో గడచిపోయెను. రాత్రంతయు చలిగాలి చేతను, వర్షపు తుంపరల చేతను గురువుగారు చాల బాధపడిరి. తాటియాకులు లేచిపోవుటచే ఏర్పడిన బిలమునుండి వర్షజాలము లోనికి పడుట వలన గురువుగారి కుటీరములోని పుస్తకములు, దర్భాసనము, కమండలువు, జపమాల మొదలైనవన్నీ తడిచిపోయెను.\n\nతెల్లవారగనే గురువు శిష్యుని కేకవేసెను. కాని వాడు అతినిద్రలో ఉండుట వలన పలుకలేదు. మూడు కేకలు వేసినప్పటికినీ రానందుచే గురువు తానే శిష్యుని కుటీరము వద్దకు పోయి ఆ కలియుగ కుంభకర్ణుని నిద్రలేపి తన కుటీరమునకు గొనివచ్చి \"ఒరే శంభూ! ఆ రెండు తాటాకులు కప్పరా?\" అనెను. వెంటనే శిష్యుడు కండ్లు నలుపు కొనుచు \"స్వామీ! వర్షము జోరున కురియుచున్నది. ఈ సమయమున కప్పుటకు సాధ్య పడదు. వర్షము ఆగిన వెంటనే తమ ఆజ్ఞ పాలింప గలవాడను\" అని చెప్పి మరల పరుండెను.\n\nకొంతసేపటికి దైవము అనుకూలించుటచే వర్షము క్రమముగ తగ్గుచువచ్చి మరికొంతసేపటికి పూర్తిగా నిలిచి పోయెను. వెంటనే గురుదేవుడు శిష్యునిలేపి ఈ ప్రకారముగ చెప్పెను. 'ఒరే శంభూ! వర్షము ఆగిపోయినది. ఆ రెండు ఆకులు కప్పరా?' - ఆ వాక్యములను విని శిష్యుడు ఆలోచనలోపడెను.\n\nశిష్యుని ఆలోచన చూచి గురువు అతడు కార్యమున కుపక్రమింప బోవుచున్నాడని పరమానందపడెను. ఇక తన కుటీరము బాగు పడెనేయని ఉవ్విళ్ళూరెను. కాని ఎంతసేపు వేచిచూచినను శిష్యుడు కదలలేదు. అంతట గురువు ఆశ్చర్య సంభరితమానసుడై శిష్యుని నిట్లు ప్రశ్నించెను. \"ఏమిరా! శంభూ! వర్షము ఆగిపోయి చాలాసేపయినది! తాటాకులు కప్పవేమి?\" వెంటనే శిష్యుడు ఈ ప్రకారముగ ప్రత్యుత్తర మిచ్చెను. మహాప్రభూ! తమ ఆజ్ఞను శిరసావహించవలెననియే నా అభిప్రాయము. కాని ఇప్పుడు వర్షము ఆగిపోయినది. కాబట్టి కప్పవలసిన అవసరము నాకు కనిపించుటలేదు. చక్కటి ఎండ కాయుచున్నది. ఈ సారి వర్షము వచ్చినచో అని చెప్పి నెమ్మదిగా తన కుటీరమునకు వెడలిపోవుచుండ గురువు వానిని అపి కూర్చుండబెట్టి 'ఒరే శంభూ! ఇంత సోమరిగా ఉన్న నీవు ఎప్పుడు కడతేరతావు? ఎపుడు చేయవలసిన పనిని అపుడే చేయవలెను. ఈ దైవ మార్గములో, పరమార్థ మార్గములో సోమరి తనమునకు ఏమాత్రము చోటీయగూడదు. తెలిసినదా?' అని అడుగగా శిష్యుడు బ్రహ్మాండంగా తెలిసినదని జవాబు చెప్పి హృదయ పరివర్తన గావించుకొని తోడనే వెళ్ళి ఆ రెండు ఆకులు తెచ్చి కప్పివైచెను.\n\nచిన్న వయస్సులో ఉన్నవారిని \"ధ్యానము చేసికొనుడు\" అని చెప్పినచో 'ఇప్పుడు దాని అవసరమేమి?' అనియు వార్ధక్యము వచ్చిన పిదప \"ధ్యానము చేసికొనుడు\" అని చెప్పినచో 'ఈ దుర్భర స్థితిలో ధ్యానము ఎటుల చేసికొనగలము?' అని ప్రత్యుత్తరము చెప్పుదురు. వారి వాక్యములు కథలోని సోమరిశిష్యుని వాక్యములనే పోలియుండును. కావున అట్టి అలసత్వమును దులిపివైచి బాల్యము నుండియే జనులు భగవద్ధ్యాన పరాయణులై తరించుదురుగాక!\n\nనీతిః ఏ క్షేత్రమందును సోమరితనమునకు లవలేశమైనను చోటీయరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 814,
        "IMAGE": "cat_9",
        "NAME": "సోమరి శిష్యుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము తుకారాం అను పరమభక్తుడు కలడు. పండరి నాథుడగు విఠలదేవుని అతడు సదా కీర్తించుచుండెను. భజన, సంకీర్తన అనిన అతనికి పరమ ప్రీతి. జైవిఠల్ జైవిఠల్ అని నిరంతరం మాతడు విఠలనాథుని భజించుచుండెను. ఆతడు గ్రామగ్రామమున సంచరించుచు ప్రజలకు భక్తిప్రభోధము గావించుచు నామస్మరణ, భగవత్సంకీర్తనాదుల యొక్క మహిమలను ప్రజలకు తేటతెల్ల మొనర్చుచు నుండెను.\n\nఒకనాడతడు ఒక గ్రామమునకు విచ్చేసెను. ఆ గ్రామస్తులందరును ఆతనిని సగౌరవముగ ఆహ్వానించి ఆదరించి నాటిరేయి తుకారాం గారిచే సంకీర్తనమును ఏర్పాటుచేసిరి. తత్సంకీర్తనమును ఆలకించుటకు భజనాదులందు పాల్గొనుటకు గ్రామములోని వారు పెక్కురు వచ్చిరి. రాత్రి తుకారాం సంకీర్తనము ఆరంభించుసరికి ప్రజలు కొన్ని వేలమంది హాజరై ప్రశాంతచిత్తులై భగవన్నామామృతము యొక్క మాధుర్యమును గ్రోలుటకు ఉత్సకతను ప్రదర్శించిరి. సభయంతయు పరమ ప్రశాంతముగ నుండెను. అత్తరి తుకారాం తన సంకీర్తనమును ఉపక్రమించెను.\n\nజనులు ఆనందపరవశు లగుచుండిరి. భగవన్నామమును బిగ్గరగా ఉచ్చరించుచు తుకారాం బ్రహ్మానందవారాశిలో నిమగ్నుడగుచుండెను. ఆ దృశ్యము వర్ణనాతీతము. ఈ ప్రకారముగ తుకారాం తన సంకీర్తనమును కొనసాగించుచుండ ఇంతలో సమయము 11 గంటలు దాటింది. సభలో ఒక్కొక్కరు లేచి తమ ఇండ్లకు పోసాగిరి. అర్ధరాత్రి యగుసరికి సగముమంది లేచిపోయిరి. కాని తుకారాం అకుంఠితదీక్షతో భగవత్తన్మయత్వములో తన భజనను కొనసాగించుచునే యుండెను. ఇంతలో తెల్లవారెను. అప్పటికిని సభలో వారందరును తత్థ్సానమును విడిచి వెళ్లిపోయిరి. ఒక్కడు మాత్రము కూర్చొనియే యుండెను.\n\nతెల్లవారిన పిదప తుకారాం తన సంకీర్తనమును విరమించి కండ్లు తెరచి చూచుసరికి అందరునూ వెళ్లిపోయి యుండుటను ఒక్కడు మాత్రము అచట ఆసీనుడై యుండుటయు గమనించెను. వెంటనే తుకారాం ఆ కూర్చున్నవానిని తన యొద్దకు పిలిచి, \"నాయనా! నీవు ధన్యుడవు! పుణ్యాత్ముడవు. ఏమియనిన, గ్రామస్థు లందరునూ వెడలి పోయినప్పటికిని, భగవన్నామ శ్రవణాసక్తిచే నీ వొకడవు ఇచటనే యుంటివి. సరియేగాని, క్రిందటి రాత్రి నేను భజనచేయు సమయమున అర్థరాత్రి వేళ సాక్షాత్‌ పండరినాథుడగు విఠలదేవుడు నా ప్రక్కనే యుండి నాతో బాటూ నృత్యము చేసెను. నివు చూచితివా?\" అని యడిగెను. నేను చూడలేదని యాతడు ప్రత్యుత్తరించెను. నీ నేత్రముల కేదైన వ్యాధియున్నదా యని యడిగెను. లేదనియు దృష్టి చక్కగా నున్నదనియు అతడు జవాబొసంగెను. అట్టిచో నా ప్రక్కనేయున్న పండరినాథుని అపుడు నీవేల చూడకుంటివి? అసలు నీ వెందుల కిచట కూర్చొనియున్నావు? అని తుకారాం ప్రశ్నింప, అతడు \"తమరు కూర్చొనిన చాప నాది, తమరు లేచిన పిదప దానిని తీసికొని వెళ్లు నిమిత్తమే ఇచట కూర్చొనియున్నాను\" అని చెప్పెను.\n\nఅపుడు తుకారాం పరమాశ్చర్యపడి \"ఆహా! జనులు ప్రాపంచిక వస్తువులపై ప్రీతిచే ప్రత్యక్షముగ నున్న భగవానుని కూడ చూడలేకున్నారు. ఈ గ్రామస్థుడు చాపపై ప్రీతిచే \"చాప చాప\" యని కలవరించుచు సాక్షాత్‌ దైవము ఎదుటపడి నప్పటికిని చూడజాలకుండెను. ఎంత ఘోరము! ప్రాపంచిక దృష్టిచే దైవదృష్టి మూతపడి పోయెను\" అని విస్తుపోయెను. మరియు జనులకు ప్రాపంచిక పదార్థములపై గల ప్రీతిలో ఏకొంత భాగమైనను దైవము యెడల నున్నచో వారెప్పుడో మోక్షము పొందియుండెడివారు\" అనియు తలంచెను.\n\n(కాబట్టి జనులారా! దృష్టిని పవిత్ర మొనర్చుకొనుడు. నశ్వర పదార్థములపై ఆసక్తిని తగ్గించుకొని శాశ్వత పరమాత్మ యెడల ఆసక్తిని పెంపొందించుకొనుడు. భగవద్భక్తి, వైరాగ్యమును అభివృద్ధి చేసుకొనుడు అని మహనీయులు ప్రబోధించుచున్నారు.)\n\nనీతి: దృష్టిని పవిత్ర మొనర్చుకొనవలెను. దైవదృష్టి ఆత్మదృష్టి విశాలభావము గలిగియుండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 815,
        "IMAGE": "cat_9",
        "NAME": "దృష్టిని పునీత మొనర్చుకొనవలెను",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామ సమీపమున ఒక నది ప్రవహించుచుండెను. గ్రామస్థు లనేకులు ఆ నదిలో నిత్యము స్నానమాచరించు చుందురు. ఒకనాటి ప్రాతఃకాలమున ఒక సాధువు ఆ నదిలో స్నానముచేయుట కేతెంచును. అతడు పాదచారియై తీర్థయాత్ర చేయుచు సరిగా ఆ దినమున తద్ర్గామసమీపమునకు వచ్చియుండుటచే స్నానార్ధ మానది చెంతకు వచ్చెను. ఆ సమయమున గ్రామస్థు లనేకులు ఆ నదిలో స్నానము చేయుచుండిరి.\n\nసాధువు నీటిలో దిగగానే నదీప్రవాహములో ఒక లేతు కొట్టుకొని పోవుచుండుట చూసెను. వెంటనే అతని హృదయము కరిగి దాని నెట్లైనను కాపాడవలెనని తలంచి దానిని దోసిటితో పట్టుకొనెను. తక్షణమే ఆ తేలు సాధువును కుట్టెను. ఆ బాధకు తట్టుకొనలేక సాధువు తేలును నీటిలో విడిచిపెట్టెను. నదీప్రవాహమున అది కొట్టుకొనిపోవుట చూచి సాధువు దయార్ద్రహృదయుడై మరల దానిని రక్షింపనెంచి మరల పెట్టుకొనెను. కాని ఈ పర్యాయము కూడ అది కుట్టుటచే దానిని నీటిలో వదలివైచెను. కాని మూడవ పర్యాయము దాని నెట్లైనను కాపాడనెంచి సాధువు నీటి ప్రవహములో కొట్టుకొనిపోవుచున్న తేలును పరుగెత్తి వెంబడించు చుండ, స్నానముచేయుచున్న ప్రజలు సాధువు యొక్క వింత చర్యలు చూచి అవహేళన చేయసాగిరి.\n\n\"ఓ సాధువుగారు! తేలు మీకు అపకారము చేసినది. ఒక పర్యాయము కాదు. రెండుసార్లు ఈ ప్రకారముగ అపకారము చేసిన ప్రాణిని మీరేల అవస్థపడి కాపాడదలంచుచున్నారు? మీమతి ఏమైనా భ్రమించినదా?\" అని తీర్థప్రజలు సాధువును ప్రశ్నింప సాధువు అ తేలు నెట్లో కాపాడి తీరమున వైచి వారితో నిట్లనియె -\n\n\"నాయనలారా! నామతి ఏమత్రము చెడలేదు. ఆ తేలు నాకొక పాఠమును బోధించినది. తేలు యొక్క నైజము అపకారము చేయుట. మనుజుని యొక్క నైజము ఉపకారము చేయుట. తేలు తన స్వభావమగు అపకారమును వదలలేదు. అట్టిచో ఇక మనుజుడు తన స్వభావమును ఏల వదలవలయును? నైజగుణమును వదలరాదని తేలు తనచర్య ద్వారా నాకు బోధించినది. కాబట్టి మనుజులు తమ ప్రేమస్వభావమును, తమ పరోపకార భావమును ఏకాలమందును త్యజించరాదు.\n\n'పరప్రాణులందు దయ గలిగియుండుట, చేతనైనంతవరకు పరులకు ఉపకారము, సహాయము చేయుట, దయార్ద్రహృదయులై వర్తించుట, దయాదాక్షిణ్యములను మానవకోటికే కాక జంతుకోటికి కూడ విస్తరింపజేయుట - జనులు నేర్చుకొనవలెను. ఇదియే అనుష్ఠాన వేదాంతము. ఇదియే వాస్తవ దేవతార్చన. ఇదియే సర్వేశ్వరునకు పరమ ప్రీతికరమైన ధర్మము.\n\nఈ ప్రకారముగ ఆ సాధువు అచట చేరిన అశేషజనావళికి చక్కని హితబోధ కావించి, వారలను ఆశ్చర్యచకితులుగను, ధర్మ మార్గావలంబులుగను గావించెను.\n\nనీతి: మానవుని స్వభావము ఉపకారమేకాని అపకారము కాదు. కాబట్టి చేతనైనంత వరకు పరప్రాణికి మానవుడు ఉపకారమే చేయుచుండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 816,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఉపకారమే మానవుని స్వభావము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణము నందొక ఉద్యోగి కలడు. అతడు ఆంగ్లభాష యందు పట్టబద్రుడు. ఒకనాడతనికి దూరప్రాంత మందున్న తన బంధువుల యొద్దనుండి ఒక శుఖలేఖ వచ్చెను. బంధువులలో ఒకరి వివాహము నిశ్చయమైనందు వలన తచ్చుభకార్యమునకు వెంటనే బయలుదేరి రావలసినదిగా అతనికి వర్తమానము అందెను. తోడనే యతడు ప్రయాణమునకు సంసిద్ధుడయ్యెను. కుటుంబ సమేతముగా పయనమైపోవుటకు నిశ్చయించుకొని రైలుబండి ఎన్నిగంటలకు స్టేషనుకు వచ్చునో, ఎప్పుడు బయలుదేరునో ఆ వివరముల నన్నింటిని రైల్వేగైడు చూసి వ్రాసియించుకొనెను. రైలు సరిగా మధ్యాహ్నము 12గంటలకు స్టేషనకు రాగలదు. కావున ఒక అరగంట ముందుగానే వెళ్లి స్టేషను ప్లాటుఫారం పై కుటుంబ సమేతముగా అతడు కూర్చొనియుండెను. అంతలో అతని హృదయ ఫలకమున ఒక చక్కని సంకల్పము మెరిసెను. \"రైళ్ళు సకాలమునకు వచ్చుచున్నవా? లేక ఆలస్యముగ వచ్చుచున్నవా? చూడవలెను. ఈ రోజు నేను ప్రయాణము చేయుచున్న రైలు సరిగా 12గంటలకు రావలెనుకదా! ఇపుడెన్ని గంటలకు వచ్చునో పరీక్షించెదను' అని భావించినవాడై తన చేతి గడియారముపైననే దృష్టిని కేంద్రీకరించి యుండెను.\n\n11-30గం||లు దాటినది. 11-45 అయినది. రైలు ఇంకను రాలేదు. 11-59 అయినది. ఇంకను రాలేదు. సరిగా 12గం||లు కాగానే రైలు ఖచ్చితముగ వచ్చిప్లాటు ఫారంపై నిలిచినది, ఒక్కసెకండైనను లేడా లేదు. ఆ ఘటన చుడగనే ఉద్యోగియొక్క అనందమునకు మేరలేదు. 'ఆహా! ఈడ్రైవరు ఎంత చాకచక్యముతో, ఎంత క్రమశిక్షణతో రైలుబండిని నడుపుకొనుచు వచ్చెను! ఇట్టి అనుభవజ్ఞులగు డ్రైవర్లు ఉండినచో రైళ్ళు ఎంత చక్కగ నడువగలవు!' అని తలంచు కొనుచు,ఒక్కక్షణమైనను వ్యత్యాసము లేకుండ రైలు నడుపుచున్న ఆడ్రైవరును ప్రత్యేకముగ సత్కరించిన బాగుండునని యోచించి, వెంటనే పరుగెత్తుకొని వెళ్లి ప్లాటుఫారంపై పుష్పముల నమ్ముచుండిన ఆసామి యొద్దకేగి ఒక పెద్ద పుష్పమాలను కొని ఆడ్రైవరు చెంతకు వచ్చెను. డ్రైవరు గారికి అభివాదము సల్పి 'అయ్యా! డ్రైవరుగారూ! ఇంజనులో నుండి తమరు క్రిందకు దిగండి. తమకు సన్మానము చేయ సంకల్పించాను. తమవంటి సుశిక్షుతుడైన సారథిని ఇంతవరకు జగత్తులో నేను చూడలేదు. ఒక్క సెకండు కూడ తేడా లేక తమరు ఈ రైలుబండిని నడుపుచున్నారు. ఇది ప్రయాణ చరిత్రలోనే చెప్పుకొనదగిన విషయము. మాబోటివారు గర్వించదగిన విషయము కూడను. కాబట్టి మిమ్ములను సత్కరించుట మాయొక్క కర్తవ్యము. విధ్యుక్త ధర్మము. దయచేసి ఇంజను దిగండి. ఈ పుష్పములచే మిమ్ములను సమలంకృతులుగ చేయవలసియున్నది.\n\nప్రయాణికుని ఆ హర్షోత్ఫుల్లిత వచనములను ఆలకించిన డ్రైవరు ఆశ్చర్యపడి, ఆతనితో 'మహాప్రభో! క్షమించండి. నేను మీ సత్కారమును స్వీకరించుటకు యోగ్యుడను కాను. ఏలయనగా ఇది నిన్న మధ్యాహ్నం 12గం||లకు రావలసిన బండి. 24 గంటలు లేటుగా వచ్చినది' అని చెప్పివైచెను. ప్రయాణికుడు స్తబ్ధుడైపోయెను. 'రామ రామ! ఇతడు నిర్ణీత సమయమునకు 24 గంటలు వెనుకున్నాడే!' అని తలంచి హతాశుడై పోయెను.\n\nజీవుడా! ముందుచూపు కలిగియుండుము. కథలోని డ్రైవరువలె అలసత్వము వెనుకచుపు కలిగియుండకుము. ఇప్పటికే దీర్ఘ ప్రయాణము జరిగినది. దానియందింకను విలంబనము జరుగులాగున చేయకుము. ప్రయాణమును త్వరలో పూర్తిచేసికొనుము. జనన మరణ రూప ఈ ఘోరసంసృతి నుండి శీఘ్రముగ బయటపడుము. రేపు చేయవలసిన దైవకార్యమును ఈరోజే పూర్తిచేయుము. సాయంత్రము చేయువలసిన పరమార్థ కార్యమును ఉదయముననే పూర్తిచేయుము. అలసత్వము, బద్దకము, దీర్ఘసూత్రత్వము, సోమరితనము - వీనికి ఏమాత్రము తావొంసగరాదు. ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటు లేదు. దూరదృష్టి కలిగియుండుము. ముందుచూపు ఏర్పరుచుకొనుము. రేపు ఎట్లుండునో! కావున ఈనాడే తరించుటకు తగిన సాధనోపాయము లను అన్వేషింపుము?\n\nనీతి: భవిష్యత్తును గూర్చి ఇపుడే ఆలోచించుకొని మృత్యువు రాకపూర్వమే ఆత్మజ్ఞానమును బడసి జన్మను సార్థక మొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 817,
        "IMAGE": "cat_9",
        "NAME": "ముందుచూపు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామమున ఒక ఉపాధ్యాయుడు కలడు. అతడు హూణభాషయందు ఎమ్‌ ఎ ప్యాసయి గణితమున ప్రత్యేక ప్రావీణ్యమును కూడ బడసెను. అతనిది బట్టతల. ఒకరోజున అతడు దూరమున నున్న మరియొక గ్రామమునకు పాదచారియై పోవు చుండెను. అది మిట్టమద్యాహ్న సమయము. ఎండ మలమల మాడుచుండెను. చేతిలో గొడుగులేదు. పైగా బట్టతల. విశ్రమించుటకు దారిలో ఒక్క చెట్టుకూడ కనిపించలేదు. ఈ పరిస్థితిలో నాతనికి ఒక అరమైలు దూరములో బ్రహ్మాండమైన మర్రి చెట్టు గోచరించెను. సేద తీర్చుకొను నిమిత్త మతడు త్వరితముగ ఆ చెట్టుయొద్దకు సమీపించిన వాడై కొంతసేపు అద్దాని చాయయందు విశ్రమింపదలంచి అచట నొక గుడ్డపరచి దానిపై వెల్లకిల పరుండెను.\n\nఅట్లు పరుండి విశాలముగ శాఖోపశాఖలతో విస్తరించి యున్న ఆ వటవృక్షమునంతను బాగుగ పరికించుచుండెను. ఇంతలో నాతని దృష్టి అతిసూక్ష్మముగ నున్న మర్రి కాయలపై బడెను. వెంటనే ఈ ప్రకారముగ ఆలోచింప మొదలిడెను. 'ఈ చెట్టును సృష్టించిన దెవరు? దేవుడు గదా! మరి దేవునకు లెక్కల విషయములో అనుభవము లేదా? దేవుడు గణితశాస్త్రము చదువుకొనలేదా? లేనిచో ఇంత బ్రహ్మాండమైన మర్రి చెట్టునకు ఇంత సన్నకాయలు పెట్టునా? రామరామ! చిన్నగుమ్మడి తీగకే దాదాపు 30 పౌనులు పెద్ద గుమ్మడి కాయను ఏర్పాటుచేసిన భగవంతుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఎంత పెద్ద మర్రికాయను తగిలించవలెను? దాదాపు అరటన్నుకాయ ఉండవలెను. లెక్కలలో నిష్పత్తి, అనుపాతము అను పాఠమును భగవంతుడు చదువలేదేమో? చదివియుండినచో ఈ ప్రకారము సృష్టిచేయడు. అల్పుడనగు నాకే నిష్పత్తిని గూర్చిన విజ్ఞాన మెంతయో కలదే, ఇక దేవున కేల లేకున్నది?' అని ఈ ప్రకారముగ అహంకార వశమున ఏమియో ప్రేలుచుండెను.\n\nఇంతలో ఒక చిన్న సంఘటన జరిగెను. గాలి జోరున విచగా ఒక చిన్న మర్రికాయ చెట్టుపైనుండి వ్రాలి సరిగా గురిపెట్టి కొట్టినట్టు ఆ లెక్కల మాష్టారు గారి బట్టతలపై సూటిగ వచ్చిపడెను. వేగముగా పడుటలో, కాయ చిన్నదైనను చురుకైన దెబ్బతీసెను. మాష్టారుగారి బుర్ర గింగురుమనెను. భగవద్విమర్శనారూప మనోవీథులలో విహరించుచున్న ఆ మాష్టారుగారు తోడనే తెప్పరించుకొని తల గీరుకొనుచు \"ఎంతటి ప్రమాదము తప్పినది! ఈ చిన్నకాయ దెబ్బకే నా తల గింగురుమన్నది. నేను ఊహించినట్లు అరటన్నుకాయ గనుక ఈ చెట్టునకు ఉండియున్నచో ఇక నా ప్రాణపక్షి మృత్యులోకమునకు దారి పట్టెడిది. ఆహా! భగవంతు దెంతటి కరుణామయుడు! మహావృక్షము కాబట్టి ఎందరో బాటసారులు దాని క్రింద తలదాచుకొనుటకై వత్తురని తలంచి ఆ పరాత్పరుడు వారికి బాధ కలుగకుండులాగున చిన్న కాయను ఆ చెట్టునకు ఏర్పాటు చేసెను. ఓహో! భగవానునకు లెక్కలే కాదు నీతి శాస్త్రమును తెలుసును! అని కేక వేసి దైవ విషయమై తానూహించి నది శుద్దతప్పని గ్రహించి భగవంతుని క్షమాపణ వేడుకొనెను. ఆ పిమ్మట మరల తలగీరుకొనుచు తన దారిని తాను పోయెను.\n\nకావున, జనులారా! గర్వము పనికిరాదు. అహంకారము పనికి రాదు. తన చదువులు, తన సంపదలు, తన కీర్తులు చూసుకొని మురిసిపోరాదు. వాని నాధారముగ తీసికొని భగవంతుని, సృష్టిని విమర్శింపరాదు. విద్యతో పాటు వినయము, భక్తి, సౌశీల్యము వృద్ధినొందవలెను. అల్పజ్ఞుడగు జీవుడెచట! పరిమితమగు ఆతని బుద్ధిశక్తి యెచట! సర్వజ్ఞుడగు ఈశ్వరుడెచట! ఈ అనంత సృష్టి విలాసమెచట! కావున \"దాసోహం\" భావన గల్గి, ఆ దివ్యతేజస్సంపన్నునియెడ, ఆ పరాత్పరునియెడ విధేయులై జనులు భక్తి ప్రవత్తులతో గూడి మెలగవలెను. ఏనాటికైనను భగవదనుగ్రహమే జీవులను కడతేర్చునదియని యెరుగవలెను. అహంకారము, గర్వము, దర్పమును పారద్రోలి సర్వేశ్వరుని యెడల పరిపూర్ణ భక్తిభావమును శీఘ్రముగ అలవరచుకొనవలెను.\n\nనీతి: విద్యతోబాటు వినయము, భగవంతునిపై పూర్ణవిశ్వాసము గలవారై యుండవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 818,
        "IMAGE": "cat_9",
        "NAME": "అహంకారమునకు తగిన ప్రాయశ్చిత్తము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామములో ఒక రైతు కలడు. అతనికి ఒక ఎకరము ద్రాక్షతోట కలదు. అదియే వాని కుటుంబమునకు జీవనాధారము. ఆ తోటలో పండునట్టి ద్రాక్షను పట్టణమునకు ఎగుమతి చేసి దానివలన లభించు ద్రవ్యముతో అతడు తన కుటుంబ పోషణము చేసికొను చుండెను. ఇట్లుండ ఒకనాడు ఆ గ్రామములోని వారికి కొన్ని కక్షలేర్పడి, వారిలో వారు రెండు పార్టీలుగా చీలిపోయి పరస్పరము కలహించుకొనదొడగిరి. వారి వైమనస్యములు క్రమక్రమముగ ముదురిపోగా, మనఃస్పర్థలు దొమ్మికి దారితీయ ఇరుకక్షలవారు ఒకరినొకరు తిట్టుకొనుచు, కొట్టుకొనుచు నుండిరి. మన రైతు కూడ ఆ దొమ్మిలో పాల్గొని ఆవలిపక్షము వారిపై దౌర్జన్యమునకు గడంగెను. తత్ఫలితముగ పోలీసువారు అతనిని మరి కొందరిని అరెష్టుచేసి, మేజిస్ట్రేటు కోర్టులో హాజరు పరచి చార్జిషీటు దాఖలు చేసిరి. మేజిస్ట్రేటు వారందరిని విచారించి, ఒక్కొక్కరికి రెండేసి సంవత్సరముల కఠిన కారాగారవాస శిక్షను విధించెను.\n\nతదనుసారము మనరైతు జైలులో నిర్భంధించబడగా ఆచట నానాబాధల ననుభవించుచుండెను. ఇంటి వద్ద కుటుంబపోషణము ఒక సమస్య అయి కూర్చుండెను. భార్యా, బిడ్డలు దుఃఖ భారముతో క్రుంగి, కృశించి పోవుచుండిరి. ఇట్లుండ ఒకనాడు రైతు భార్య జైలు నందున్న తన భర్తకు ఈ ప్రకారముగ ఉత్తరము వ్రాసెను - ఏమండీ! ఈ ప్రకారముగ మీరు జైలునందు కాలక్షేపము చేయుచుండినచో మాయొక్క గతియేమి కాగలదు? బిడ్డలను పోషించుట ఎట్లు? దినమొక యుగముగ గడచుచున్నది. బాగుగ అక్కరకు వచ్చిన ద్రాక్షతోట త్రవ్వటము లేనందు వలన ఎండిపోవుచున్నది. ఈ సమయములోఒకసారి తోట అంతయు లోతుగ త్రవ్వి నీళ్లు కట్టినచో ద్రాక్షపంట పుష్కలముగ లభించగలదు. తద్వారా కుటుంబ పోషణము చక్కగా జరుగగలదు. కాబట్టి ఇందులకేదైన ఉపాయమును ఆలోచించ వలసినది, వెంటనే ప్రత్యుత్తరము వ్రాయుగోరుచున్నాను.\n\nభార్యయొద్ద నుండి ఈ ప్రకారముగ వర్తమానము చేరగనే రైతు తక్షణమే జైలునండి ఈ క్రింది విధముగా జవాబు వ్రాసివైచెను. \"అర్ధాంగి! ద్రాక్షతోట త్రవ్వకము విషయమై నీవేమియు కలవర పడవద్దు. ఆ తోటలో ఒకానొక చోట బంగారపు పాత్రను నేలలో దాచి యుంచినాను. దానిని త్రవ్వి వెలికితీసి అమ్ముకుని ఆ డబ్బుతో ద్రాక్షతోటను త్రవ్వించి వేయుము. పని తీరిపోవును. ఆలస్యము చేయవలదు\". సామాన్యముగ జైలులో దొంగలు వ్రాయు ఉత్తరముల నన్నిటిని అధికారులు పర్యవేక్షించి సవ్యమైనవాటినే పోష్టులో వేయుదురు. రైతు ఇంటికి వ్రాసిన ఉత్తరమును జైలు అధికారులు చదువగనే అతడెక్కడనో అ బంగారపు చెంబును అపహరించి యుండవచ్చునని భావించి, వారే స్వయముగా పదిమంది కూలీలను వెంటబెట్టుకుని పోయి రైతుయొక్క ద్రాక్షతోట నంతను అడుగులోతు బాగుగ త్రవ్వివైచిరి. కాని బంగారపు పాత్ర దొరకనందున హతాశులై తిరిగి వెళ్లిపోయిరి. ఏది యెట్లున్ననూ రైతు యొక్క ద్రాక్షతోట జైలు అధికారులు త్రవ్వకము వలన ఆ సంవత్సరము విరగకాసెను. పుష్కలమగు పంట లభించెను. తత్ఫలితముగ రైతు కుటుంబమునకు ఏ కొరతయు లేక చక్కగా గడిచిపోయెను.\n\nపొలముగాని, తోటను గాని ఎంతెంత చక్కగ దున్నుదురో, అంతంత అధిక ఫలితమును రైతులు అనుభవింపగలరు. అట్లే హృదయ క్షేత్రమును చక్కగా పరిశోధించి (దున్ని)దానియందు గల దుస్సంస్కారములు, దుర్వాసనలు, దురభ్యాసములు, దుర్వృత్తులు మొదలైన కలుపు మొక్కలను ఊడబెరకి, నిర్మూలించి, సుక్షేత్రముగ మార్చుకొని నపుడే జ్ఞానబీజము చక్కగ మొలకెత్తి మోక్షరూప ఫలమును కలుగ జేయగలదు. కాబట్టి ముముక్షువు లెల్లరు తమ అభ్యాసముచే హృదయములను సుక్షేత్రములుగ పరిణత మొనర్చుకొని జ్ఞానబీజములను లెస్సగ పోషించి ఆత్మసాక్షాత్కారమను పంటను అనుభవించు దురుగాక!\n\nనీతి: నేలను బాగుగ దున్నినచో పైరు పంటలు చక్కగ పండునట్లు, హృదయ క్షేత్రమును సద్గుణవంతముగ నొనర్చినచో మోక్షమను ఫలము చేకూరగలదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 819,
        "IMAGE": "cat_9",
        "NAME": "సుక్షేత్రము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక గ్రామమునందు ఇరువురు వ్యక్తులు ఉండిరి. వారికి ఒకరిపై మరియొకరికి పరమద్వేషము, ఈర్ష్య అసూయ ఉండుచుండెను. ఒకరిని చూచి మరియొకరు ఓర్వలేరు. ఒకడు వృద్ధినొందు చుండిన, మరియొకడు దానిని చూచి బాధపడుచుండెను. ఒకనికి కష్టము కలిగిన మరియొకడు ఆనందముతో చిందులు త్రొక్కుచుండెను. ఈ ప్రకారము వారిలో ఒకనిపై మరియొకనికి అసూయ తాండవించుచుండెను.\n\nఅసూయ అనునది ఒక మహాదుర్గుణము. ఎన్ని సుగుణములున్న ప్పటికిని అసూయ అను ఈ ఒక్క దుర్గుణ మున్నచో తక్కిన గుణము లన్నియు నిర్వీర్యములై శోభావిహీనములై యుండును. కళాయి లేని పాత్రలో వండిన పప్పుపులుసు చెడిపోవునట్లు అసూయాగ్రస్తుని యందు ఏ యితర సుగుణమున్ను శోభించదు. రాణించదు. దుర్యోధనునకు బలము, ఉత్సాహము, శక్తి, సామర్థ్యము, ప్రజ్ఞ మొదలైనవి ఎన్నియో ఉన్నప్పటికిని, అసూయ అను ఒక్కదుర్గుణము వానియన్నింటిని నాశనము చేసివైచి అతని జీవితమునకే ఎసరు తెచ్చిపెట్టిన విషయము లోకవిదితమేకదా! భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుని సంబోధించునపుడు \"అనసూ యవే\" అను పదమును ప్రయోగించి \"అసూయ లేని ఓ అర్జునా! నీకు ఈ అతి రహస్యమైన జ్ఞానమును ఉపదేశించుచున్నాను\" అని పలికి యుండుట గమనింపదగినది. అసూయ లేనివానికే చక్కని జ్ఞానోపదేశము లభించును. అసూయ అను ఈ ఘోరమైన దుర్గుణములకు ముముక్షువులు ఎంత దూరముగ నుండిన అంత మంచిది.\n\nకథలోని ఆ యిరువురు వ్యక్తులు అసూయాగ్రస్తులై ఒకరిపై ఒకరు కారములు, మిరియములు నూరుకొనుచు, కనుపించిన చోట్లనెల్ల ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసికొనుచు కాలము గడుపుచుండిరి. ఇట్లుండ ఒకనాడు వారిలో నొకనికి బ్రహ్మదేవుని ఉపాసించి కొన్నిసిద్ధులు సంపాదించవలెనను కోరిక జనింపగా అతడు ఊరిబయట గల ఒకానొక ఏకాంత ప్రదేశమునకు పయనమై ఒక చెట్టు క్రింద కూర్చొని ఆహారమును వర్జించి తీవ్రముగా తపముచేయ నారంభించెను. ఈ సంగతి తెలిసికొని ఆతని శత్రువు \"వాడు తపస్సు చేసినచో నేను మాత్రము అతనికి తీసిపోవుదునా? నాకు తపస్సుచేయ తాహతు లేదా? అని భావించి ఆ గ్రామము బయట మరియొక చోటుకుపోయి ఒక చెట్టు క్రింద కూర్చొని మొదటివాని వలె బ్రహ్మదేవుని గూర్చి తపము ప్రారంభించెను. ఈ సంగతి మొదటివానికి ఎట్లో తెలిసిపోయెను.\n\nకొంతకాలమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారల తపస్సునకు మెచ్చి వరముల నొసంగటకై మొదటివాని యొద్దకు వచ్చి 'ఓయీ! నీ తపస్సున కానందించితిని. ఏదైన వరము కోరుకొనుము' అని పలుకగా నతడు 'మహాత్మా! ఈ గ్రామము బయట వేరొక చోట నాకు గిట్టనివాడొకడు తపస్సుచేయుచున్నడు. ముందు వానివద్ద కేగి అతడేమి కోరుకొనునో తెలిసికొని ఆతడు కోరినదానికి రెట్టింపు నాకు దయచేయుడు' అని ప్రార్థించెను. బ్రహ్మదేవు డందుల కంగీకరించి రెండవ వానియొద్దకు వెళ్ళీ 'ఓయీ! నీ తపస్సునకు మెచ్చితిని. ఏదైన వరము కోరుకొనుము' అని పలుక, అందుల కారెండవవాడు 'మహాత్మా! తాము మొదటివాని యొద్దకు వెళ్లితిరా! ఆతడేమి కోరుకొనెను?\" అని ప్రశ్నించెను. బ్రహ్మదేవుడు \" అతడేమియు కోరుకొనలేదు. ముందు నీయొద్దకు వెళ్లి నీవు కోరుదానిని తెలిసికొని దానికి రెట్టింపు ఇచ్చిన చాలును అని పలికె\" ననగా, అపుడా రెండవవాడు \"అట్లైనచో మహాత్మా! నాకు ఒక కన్ను పోగొట్టుము\" అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు తథాస్తూ అని చెప్పి అంతర్ధాన మయ్యెను. తోడనే ఆ రెండవవానికి ఒక కన్ను గ్రుడ్డి అయ్యెను. అతడు కోరినదానికి రెట్టింపు ఫలితము మొదటివానికిన్ని లభ్యమయ్యెను అనగా మొదటివానికి రెండు కండ్లు గ్రుడ్డిఅయ్యెను. అతడు పూర్తి గ్రుడ్డివాడుగా మారిపోయెను.\n\nఅసూయ యొక్క నగ్నతాండవము ఇచ్చోట చక్కగా దృగ్గోచరమగుచున్నది. మొదటివానిపై అసూయచే వాని నెట్లైన బాధించవలెనని తలంచి, వానిని పూర్తి గ్రుడ్డివానిగ చేయదలంచి రెండవవాడు తన ఒక కంటిని గూడ వదలుకొని, ఏకాక్షుడగుటకు సిద్ధపడెను. అవతల వానిని బాధించు నిమిత్తము తానుకూడ బాధపడుటకై సంసిద్ధుడయ్యెను. ఇది యెంత హేయమైన స్థితియో విజ్ఞులు యోచించవలెను. ఒక్కప్రాణికి అపకారము తలపెట్టినచో అది సాక్షాత్‌ భగవంతునికి చేయు అపచారమే కాగలదని ఎంత శీఘ్రముగ మనుజుడు గ్రహించ గల్గిన అంతమంచిది. కాబట్టి పరప్రాణికి హితమునే వాంచించుచు, ప్రాణికోట్లయెడల దయ కలిగి, జీవకారుణ్యము కలవాడై, ఎల్లడల భగవంతుని అస్తిత్వమును అనుభూత మొనర్చుకొనుచు జీవుడు పరమార్థ పథమున అగ్రసరుడు కావలయును. అసూయ అను ఘోర దుర్గుణమును మొదలంట పెరికి వైచి హృదయమును నిష్కంటక మొనర్చుకొనవలెను. పవిత్ర హృదయమే దైవనిలయమని జనులు సదా జ్ఞప్తియందుంచు కొందురు గాక!\n\nనీతి: అసూయ నీచమైన దుర్గుణము. దానిని మానవుడు ఏ కాలమందును దరికి చేర్చరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 820,
        "IMAGE": "cat_9",
        "NAME": "అసూయను త్యజించవలెను",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "అరేబియా దేశములో ఎడారి ప్రదేశము ఎక్కువుగా కలదు. అందుచేత అచట వస్తుసామాగ్రీని ఒక చోట నుండి మరియొక చోటికి చేరవేసి కొనుటకు గాడిదలను ఎక్కువుగా వాడుచుందురు. ఆ దేశమున మార్కెట్టులో గాడిదల వ్యాపారము ముమ్మరముగా సాగుచుండును. ఒకనాడు ఒకానొక వృద్ధుడు తన మనుమని వెంటబెట్టుకొని వారి యింటి అవసరము కొరకై ఒక గడిదను కొని తెచ్చుటకై తన గ్రామములోని మార్కెట్టుకు వెళ్ళెను. అతడు తనకు నచ్చిన ఒక గాడిదను ఖరీదు చేసికొని దానిని నడిపించుకొనుచు ఇంటికి తిరిగి వెళ్లుచుండెను.\n\nత్రోవలో కొందరు జనులు దానిని జూచి వృద్ధునితో నిట్లనిరి - \"తాతా! ఎంతయో డబ్బు ధారబోసి గాడిదను కొనుక్కుని, దానిని ఉపయోగించుకొనకుండా ఊరక నడిపించుకొని పోవుచున్నావేమి? నీవు వయస్సు చెల్లినవాడవు. నీ మనుమడు చాలా పసివాడు. గాడిదను ప్రక్కన బెట్టుకొని ఇరువురునూ నడిచిపోవలసిన గ్రహచారమేమి? ఇద్దరును దానిపై నెక్కి ఇంటికి పోయిన బాగుగా నుండును!\" ఆ వాక్యములను వినిన తత్‌క్షణమే వృద్ధుడు, తన మనుమని గాడిదపై గూర్చుండ బెట్టి తాను గూడ ఆతని సరసన పైన గూర్చుండి ప్రయాణమై పోవుచుండెను.\n\nకొంత దూరమేగిన పిదప మరికొందరు కనిపించి, వృద్ధునితో నిట్లనిరి - \"ఓయీ! వెర్రివాడా! చిన్నగాడిదపై ఇద్దరు ఎక్కి కూర్చొనినచో దానికి భారము కాదా! కాబట్టి నీవు దిగు. పసిపిల్లవాడు ఒక్కడు దానిపై ఎక్కిపోయిన చాలును?\" ఆ వాక్యములను వినగానే వృద్ధుడు వారు చెప్పినది సమంజసముగానే ఉన్నదని తలంచి తాను దిగి మనుమని గాడిదపైనే ఉంచి గాడిదను నడిపించుకొని పోవుచుండును.\n\nఇట్లు కొంతదూర మేగగా, త్రోవలో ఇక కొందరగుపించి \"ఓయీ వెర్రితాతా! ఇదేమి పని! వృద్ధుడవై, బలహీనుడవై కాటికి కాళ్లు జాచుకొని అశక్తుడవై యున్న నీవు నడుచుట యేమి? ఆరోగ్యవంతుడుగా నున్న నీ మనుమడు పైకెక్కి కూర్చొనుట యేమి? ఇదెక్కడి న్యాయము! కాబట్టి అతనిని క్రిందకు దింపి నీవు పైకెక్కి ప్రయాణించుము. లేకున్న దారిలోనే అలసటవచ్చి పడిపోదువు\" అని పలికిరి. ఆ వాక్యములను వినగానే వృద్ధుడు తన దౌహిత్రుని క్రిందకు దింపి తాను పైకెక్కి ప్రయాణించు చుండెను.\n\nఇంతలో మరికొందరగుపించి తాతగారూ! 'ఎంతో ఖర్చు పెట్టి గాడిదను కొనుక్కొని ఇద్దరూ పైకెక్కి కూర్చొనకుండా ఒకరిని క్రింద నడిపించుకొని పోవుచున్నావేమి? మీ ఇద్దరి బరువు దానికొక లెక్కా?' అని చెప్పి వెడలిపోయిరి. తోడనే వృద్ధుడు తన మనుమనికూడా పైకెక్కించుకొని పయనమై పోవుచుండెను.\n\nకొంతసేపటికి దారిలో కొంద రాదృశ్యమును జూచి \"తాతా! గాడిద చాలాసేపు మీ యిద్దరిని మోసింది. కాబట్టి మీరున్ను దానిని కొంతసేపు మోయుట న్యాయము, ధర్మము\" అని చెప్పి వెళ్లిపోయిరి. ఆ వాక్యములోని సారాంశమును గమనించిన వృద్ధుడు వెంటనే క్రిందకు దిగి మనుమనికూడా దింపి, గాడిదను క్రిందపడవేసి కాళ్ళుకట్టి ఒక కర్రకు వ్రేలాడదీసి యిరువురును దానిని మోసుకొని పోవదొడంగిరి. జనులది చూసి పకపకా నవ్వసాగిరి.\n\nఈ విధముగ దారి పొడుగునా ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యము చెప్పుచుండ దాని ప్రకారము ఆచరించుచు పోయిన ఆ గ్రామస్తుడగు వృద్ధుడు చివరకు జనులలో నగుబాటు పాలయ్యెను.\n\nకావున ఆధ్యాత్మక్షేత్రమున చరించు సాధకుడు దారిన పోవు జనులందరి యొక్క సలహాలను పాటించుచు పోయినచో, తుదకు అశాంతిపాలై పోవును. కావున అనుభవజ్ఞుడగు సద్గురువు యొక్కయు, సచ్చాస్త్రముల యొక్కయు ఆదేశము ప్రకారము నడుచుకొనిన మాత్రము చాలును. లోకులందరిని ఎవరును మెప్పించలేరు. మహర్షుల వాక్యమే, సచ్చాస్త్రముల ఆదేశమే ముముక్షువులకు శరణ్యము.\n\nనీతి: లోకులు భిన్న భిన్న భావములు కలవారై యుందురు. కాబట్టి ముముక్షువగు సాధకుడు మహాత్ముల ఆదేశము ప్రకారమే నడచుకొనవలెనేకాని జనసామాన్యము యొక్క దృష్టి ననుసరించి కాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 821,
        "IMAGE": "cat_9",
        "NAME": "లోకో భిన్నరుచి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమందు ప్రసూతి వైద్యాలయ మొకటి కలదు. ఉదారవంతుడగు ఒక ధనికుడు తన విరాళము చేత ఆ వైద్యాలయమును కట్టించెను. ఆధునిక వైద్య సదుపాయమును ఇతర సౌకర్యములు ఎన్నియో అచట ఉండుట వలన మహిళా లోకమున కది వరప్రసాదముగ నుండెను. ఆ వైద్యాలయమున ఒకనాడు ప్రసవమునకై వచ్చిన ఒక లలనామణికి మగపిల్లవాడు పుట్టెను. పుట్టిన కొద్దిరోజులకు తల్లిపాలు చాలనందున ఆ వైద్యాలయములోని ఒక నర్సు చంటిపిల్లవానికి పాలిచ్చుచు జాగ్రతగ సాకుచుండెను. అదేమి చిత్రమో కాని ఒకరోజున ఆ పసివానికి చేతివ్రేళ్ళు గట్టిగా ముడుచుకుపోయినవి. పిల్లవాడు తన చేతిని తెరవ లేకుండెను. తల్లి యొక్క మనస్సు ఆందోళనలో పడిపోయెను. పుట్టకపుట్టక చాలాకాలమునకు పుట్టిన పిల్లవానికి పుట్టుకతోనే వ్యాధి సంక్రమించెను గదా యని తల్లి చింతాగ్రస్తమయ్యెను.\n\nపిల్లవాని వ్యాధి సమాచారము వైద్యాలయ మంతయు ప్రాకెను. కొందరు డాక్టర్లు వచ్చి పిల్లవాని చేయి ముడుచుకొనిపొయి యుండుట చూచి తద్రోగ నివారణకై ఏవేవో చికిత్సలు చేసిరి. కాని పిల్లవాడు తన చేతివ్రేళ్లను తెరవలేదు. తల్లికి ఆందోళన ఎక్కువగుచుండెను. అంతలో తల్లి వైద్యాలయము యొక్క ప్రధాన వైద్యురాలియొద్దకు పరుగున వెళ్ళి తన కుమారుని దీనావస్థను ఆమెకు విశదపరచి , పిల్లవాని వ్యాధి నివారణకై తగు చికిత్స శీఘ్రముగ ఒనర్పవలసినదిగా ప్రాధేయపడెను. తల్లియొక్క ఆర్తనాదము విని వైద్యురాలు తగిన పరికరములను తీసికొని, పరివారమును వెంటబెట్టుకొని సర్వ సన్నాహముతో రోగి కడకు బయలుదేరెను. రోగి ఉన్న గదిలోకి ప్రవేశించి ప్రధాన వైద్యురాలు తన పరికరములలో సున్నితమైన ఒక దానిచే పిల్లవాని చేతివ్రేళ్లను బలవంతముగ ఒక్కొక్క దానిని తెరచెను. వ్రేళ్లన్నియు తెరుచుకొన్నవి. పిల్లవాని చేతిలో ఒక ఉంగరము కానుపించెను. ప్రక్కనున్న వారందరును ఆశ్చర్యచకితులైరి, వైద్యురాలి విస్మయమునకు అంతులేకుండెను. తీరా విచారించి చూడగా ఆ ఉంగరము పిల్లవానికి పాలిచ్చిన నర్సుదని తేలిపోయినది. ఆ నర్సు పిల్లవానికి పాలిచ్చుచుండగా పిల్లవాడు దానిని చల్లగ దొంగలించి తన పిడికిలిలో నుంచుకొనెను. అదీ జరిగినకథ. అంతేకాని పిల్లవానికే జబ్బూలేదు, మరేమీ లేదు. వెంటనే వైద్యురాలు నర్సును పిలిపించి ఆపై యంగుళీయకమును ఆమెకు తిరిగి ఇప్పించి పిల్లవానికి వ్యాది ఏమియు లేదని తల్లికి దైర్యముచెప్పి వెడలిపోయెను.\n\nపిల్లవానికి పుట్టుకతోనే దొంగబుద్ధి ఏర్పడెను. ఆ బుద్ధి ఈ జన్మలో వచ్చినది కాదు. పూర్వజన్మలో అతడొక గజదొంగ అయి ఉండవచ్చును, ఆ దొంగ బుద్ధియే ఈ జన్మలో పుట్టుకతోనే సంక్రమించినది. దీనినే పూర్వజన్మ వాసనయని చెప్పుదురు. జీవితములోని అనుభవము లన్నియు జనులలో సంస్కారరూపమున బీజరూపేణ చిత్తమున నిగూఢముగ నుండును. తగిన అదును చూచుకొని అయ్యవి ఆయా సమయములందు ప్రకోపించుచుండును. కొందరికి సత్యము, శాంతము, దయ, పరోపకారము మొదలగు మంచి సంస్కారములుండును, మరికొందరికి హింస, అపకారము, దొంగతనము మొదలగు చెడ్డ సంస్కారము లుండును. విజ్ఞుడగు వాడు వానిని జాగరూకతతో కనిపెట్టి దుస్సంస్కారములను ప్రయత్న పూర్వకముగ రూపుమాపి, సత్సంస్కారములను అభివృద్ధి పరచుకొనవలెను.\n\nనీతి: ప్రతివారు తమ మనస్సును బాగుగా పరిశోధించి దుష్టవాసనలను దుశ్శీలమును పోగొట్టుకొని, సద్వాసనలను, సచ్చీలమును పెంపొందించుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 822,
        "IMAGE": "cat_9",
        "NAME": "పుట్టుకతో వచ్చిన బుద్ధి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "కుళింగ పక్షియను చిన్న పక్షి యొకట కలదు. (దానినే సంస్కృతంలో టిట్టిభమని పేర్కొందురు). అది యొకనాడు సముద్రతీరమున గ్రుడ్లుపెట్టి ఎచటికో పోయెను. తిరిగి వచ్చి చూచుసరికి అవిలేవు. సముద్ర తరంగములు వానిని లోనికి ఈడ్చుకుని పోయినవి. ఇక పక్షి యొక్క శోకము నెవరు వర్ణింపగలరు? దుఃఖము పొంగి పొరలెను. మనుష్యజాతి యైనను, పక్షి జాతియైనను మాతృహృదయము ఒకటియేకదా! ఎట్టకేలకు గుండె నిబ్బరము చేసికొని ఇక కర్తవ్యమునకు గడగెను. 'ఈ పాడు సముద్రపు నీరంతరము నాముక్కుతో తోడివైచి నాగ్రుడ్లను నేను తీసికొందును. బ్రహ్మదేవుడు అడ్డు వచ్చినను సరే, ఈ పని జరిగి తీరవలసిందే' అని ఘోరప్రతిజ్ఞను బూని తన ముక్కుతో ఒకొక్క బొట్టు సముద్రపు నీటిని పీల్చి బయట పుక్కిలించి వేయుచుండెను.\n\nఆ సమయమున త్రిలోకసంచారి యగు నారదుడు ఆ దారిన పోవుచు అ పక్షియొక్క విచిత్రచర్యను గమనించి సంభ్రమ చేతస్కుడై అచటనే నిలిచి ఒకింతసేపు చూచుచుండెను. కాని పక్షి అతని వైపు ముఖము త్రిప్పలేదు. తన పనిలో తాను నిమగ్నమై యుండెను. కొంతసేపటికి నారదుడు దానిని పలుకరించి 'ఏల యిట్లు నీటిని పుక్కిలించి వేయుచున్నా' వని ప్రశ్నింప, జరిగిన సమాచార మంతయును పక్షి చెప్పెను . నారదు డాశ్చర్యపడి 'ఓ పిచ్చిదానా! ఇది ఎప్పటికైనను సంభవించునా? నీవెచట సముద్ర మెచట? ఎన్ని యుగములకైనను నీవాసముద్రపు నీరంతయు తోడివేయగలవా? అసాధ్యమైన కార్యమును తలపెట్టకు' అని హితము చెప్ప, అంతట నాపక్షి 'మహాత్మా! కోటియుగము లగుగాక! భూమి తల్లక్రిందులగుగాక! సూర్యుడస్తాద్రి యందుదయించుకాగ! ఈ పనిని మాత్రము నేను విడువను. ఈ దుష్ట సముద్రమును హతమార్చువరకు , నా గ్రుడ్లను నేను తిరిగి తీసికొనువరకు అన్నాహారములు లేక, కంటిపై కునుకు లేక నీటిని సాధించివైచెదను' అని బదులు చెప్పెను.\n\nపక్షియొక్క ఆ వాక్యములను విన్న నారదుడు ఒడలు గగుర్పాటు నొందెను. ఆహా! ఎంతటి సాహసము ఎట్టి ధీరత్వము! ఎటువంటి పట్టుదల! మనుష్య జాతిలోనే ఇట్టి దృఢ వ్యవసాయశీలురు లేరే! ఇక పక్షిజాతిలో నెట్లేర్పడెనో! ఓహో! ముముక్షువులకు చక్కని ఆదర్శమును జూపినది? ఈ పట్టుదలలో నూరవ భాగమైనను గలిగియుండినచో మానవు లందరును ఎపుడో ముక్తినొంది యుండెడివారు'. అని మనంబున తలపోసికొని నారదుడు తన తపశ్శక్తిచే క్షణకాలము సముద్రము నెండింపజేయ, వెంటనే పక్షి తన గ్రుడ్లను తీసుకొని వెడలిపోయెను. కనుకనే శాస్త్రములందు ఆ \"టిట్టిభ\" పక్షియొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయెను.\n\nఉత్సేక ఉదధేర్యద్వత్కుశాగ్రేణైకబిందునా |\nమనసో నిగ్రహస్తద్వద్భవేదపరిఖేదతః ||\n\n\"కుళింగపక్షి తన ముక్కుతో ఒక్కొక్క నీటిబొట్టును పుక్కిలించి వేయుచు సముద్రజలము నంతను రిక్తమొనర్చు ధీర సంకల్పము నెట్లు గావించెనో, అట్లే సాధకుడు అఖిన్నుడై తన మనోనిగ్రహమును గూర్చిన నిశ్చయమును గావింపవలయును - అని శాస్త్రములు పేర్కొన్నవి. అధ్యాత్మక్షేత్రమున విజయము గావించవలెననిన మనుజుడు \"పవిత్రత, సహనము, పట్టుదల\" అను శీలత్రయము చెక్కబడియున్న పతాకమును ధరించి ముందుకు సాగిపోవలెను.\n\nనీతి: లక్ష్యసాధనకై గొప్ప పట్టుదల అవసరము. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 823,
        "IMAGE": "cat_9",
        "NAME": "పట్టుదల",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఉత్తుంగ తరంగ తాడితమగు మహా సముద్రము యొక్క తీరమున ఒకానొక ఓడరేవు (Harbour) కలదు. అచట పెక్కు నావలు ఒడ్డున లంగరు వేసికొని నిశ్చలముగ నుండెను. కొన్ని సముద్రములోనికి పోవుచుండెను. మరికొన్ని సముద్రములోని సుదూర ప్రాంతముల నుండి వచ్చుచుండెను. అది గొప్ప వ్యాపారస్థల మగుటచే నిరంతరము ఏవియో కొన్ని ఓడలు వచ్చుచు పోవుచునే యుండును. కొన్ని ఒడ్డున స్థిరముగ నుండును. ఈ ప్రకారముగ ఒడ్డున నున్న ఒకానొక పడవ మధ్యమున జండా కట్టుటకై ఒక పొడవైన గడకర్ర ఉండియుండెను. అది చాలా ఎత్తుగ నుండెను. పడవ సముద్రపు ఒడ్డున నిశ్చలముగ ఉండుట వలన ఒక కాకి ఎగురుచు వచ్చి ఆ కర్రపైన వ్రాలెను.\n\nకాకి కర్రపై కూర్చొని ఏదియో చింతన చేయుచుండెను. ఇంతలో పడవలోనికి నావికు లందరును ప్రవేశించి, దానిలో నున్న మోటరు యంత్రమును నడిపించిరి. తోడనే పడవ సముద్రములోనికి పోజొచ్చును. క్రమక్రమముగ అది వేగమును పుంజుకొని సముద్రములోనికి కొన్ని మైళ్ళు చొచ్చుకొనిపోయెను. కాకి మాత్రము ఆ కర్రపైననే కూర్చుని యుండెను. పడవ సముద్రములోనికి కొన్ని మైళ్ళు పోయిన తరువాత కర్రపై కూర్చొనియున్న ఆ కాకి ఎగిరి పోవలెనను సంకల్పము జనింపగా అది లేచి రివ్వున ఒకానొక దిసయందు ఎగిరిపోయెను. కాని ఎంతదూరము ఎగిరిపోయినప్పటికిని వ్రాలుటకు చెట్టు ఎచట? పుట్ట్ ఎచట? అ ఇల్లు ఎచట? అంతయు ఒకేజలార్ణవము! ఏవైపు చూచినను అగాధమైన మహాసముద్రము.\n\nకాకి ఎగిరిపోయి, పోయి వ్రాలుట కెచటను ఆస్కారము లేనందు వలన తిరిగి ఆకర్రపైకే వచ్చి వ్రాలుచుండెను. కొంతసేపు ఆ కర్రపైన కూర్చొని మరల ఎగిరి, ఎగిరి వ్రాలుట కెచటను తావులేనందున విసిగి వేసారి చిట్టచివరకు ఆ కర్రపైననే వ్రాలుచుండెను. దీనినే నౌకాగ్రకాకన్యాయమని శాస్త్రములందు పేర్కొనిరి.\n\nసాధకుని మనస్సు వైరాగ్య పరిపూరితమై సముద్ర మధ్యమున గల నౌకపై కూర్చొనిన కాకి చందమున ఉండవలెను. మనస్సును కాకి దృశ్యవిషయముల పైకి ఎగిరినను అవి నశ్వరములని, క్షణికములని, దుఃఖప్రదములని దానికి బాగుగ బోధించినచో అది వానిపై వ్రాలక ఆత్మయను కర్రపైకి వచ్చి వ్రాలుచుండును. అట్లు కాక ప్రాపంచిక పదార్థములు శాశ్వతములనియు, సౌఖ్యదాయకము లనియు తలంచి వాని వెంట పరుగెత్తినచో మనస్సు దృశ్యజాలమున తగుల్కొని కర్మబంధమును పెంచుకొని సంసార కూపమున పడి పుట్టుట,చచ్చుట అనురొంపిలో దిగబడిపోవును. కాబట్టి సముద్రమున ఉన్న కాకివలె మనస్సును దృశ్య విషయములపై వ్రాలనీయక ఈ ప్రకారముగ వైరాగ్యమును చక్కగ బోధించవలెను. \"ఓ మనస్సా! ఎన్ని జన్మలు ఈ విషయ సుఖముల ననుభవించితివి? నీకేమైన తృప్తిగాని ఆత్మ శాంతిగాని కలిగినదా? ఈ అమూల్యమైన మానవజన్మను భగవదాయత్తము చేయక ఏల వ్యర్థము చేసెదవు? క్షణికానందము కొరకై అర్రులు చాచక కాలమును వ్యర్థపుచ్చక, శాశ్వతమగు దైవ సాన్నిధ్యము కొరకై యత్నించుము. దృశ్యముపై గాక ఆత్మపైననే దృష్టిని కేంద్రీక రింపుము.\n\nఇవ్విధముగ మనస్సునకు హితబోధ సల్పి సముద్ర మధ్యమున గల నౌకపై నున్న కాకి వలె దానిని ఎచటికిని ఎగురనీయ ఆత్మయను కర్రపైననే స్థాపించవలయును. ఒకవేళ ఎగిరినను వైరాగ్యమును బోధించి సముద్ర మధ్యమున గల కాకి వలె దృశ్యవిషయములపై వ్రాలకుండ చేయవలెను. అత్తరి వ్రాలుట కెచటను అవకాశము లేనందున తిరిగి ఆత్మయొద్దకే అది వచ్చిచేరును.\n\nనీతి: మనస్సు దృశ్యవిషయముల నుండి విరతిజెంది నౌకాగ్ర కాకివలె ఆత్మయను కర్రపై ఎపుడు వచ్చి చేరునో అపుడు జీవునకు కలుగు అనుభూతియే జీవిత పరమాధి. ఆదియే జీవిత లక్ష్యము. అదియే మోక్షస్థితి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 824,
        "IMAGE": "cat_9",
        "NAME": "నౌకపైకాకి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక ఏకాంత ప్రదేశమున ఒక చక్కని ఆశ్రమము కలదు. అది పట్టణ ప్రాంతమునకు సుదూరముగా నుండుటచే జనసమూహములు ఎక్కువగా చేరుటగాని, కేకలు వేయుటగాని, వాహనముల శబ్దము వినిపించుట గాని ఏమియు అచట లేదు. వాతావరణము కలుషితముకాక నిర్మలముగా నుండెను. ఒకవైపు గగన చుంబితములగు ఎత్తేన పర్వతములు, ఒకవైపు స్వచ్చమైన జలముతో గూడిన గొప్ప సరోవరము ఆ అశ్రమమునకు శోభను కల్పించుచుండెను. ఫలపుష్పాదులతో గూడిన మహావృక్షములు కనులకు ఇంపుగా నుండెను. భక్తులు ధ్యానాదులను శీలించుటకును, ఆధ్యాత్మిక సాధనలు కావించుటకును అచటచట వృక్షచ్చాయలందు చక్కని అరుగులు కట్టబడియుండెను. సాధకులు వానిపై కూర్చుండి దృశ్యము వైపునకు దృష్టిని మరలించక మనస్సును అంతర్ముఖ మొనర్చి పరమాత్మయందు కేంద్రీకరించు చుందురు. ఆకలి అయినపుడు కండమూలములు,ఫలములు భక్షించుచు అచట సాధకులు ప్రాపంచిక వ్యామోహములపై ఏమాత్రము మనస్సును పరుగిడనీయక అహర్నిశములు ఆత్మచింతన , ధ్యానాద్యనుష్ఠానములను శిలించుచు కాలమును సద్వినియోగ పరచుచుందురు.\n\nధ్యానాదులు విరమించిన పిదప ఇక స్వాధ్యయనమందు ప్రవేశించి ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన సద్గ్రంథములను పరిశీలించు చుందురు. ఆ తదుపరి ఆశ్రమవాసు లందరు ఒకచోట సమావేసమయి ఆధ్యాత్మిక విషయములను గూర్చి పరస్పరము చర్చించుకొనుచు నుందురు. ఏవైన తెలియని అంశములను అడిగి తెలిసికొందురు. ఇట్టి సత్కాలక్షేపముల వలన వారి మనస్సు అన్యత్ర పోవుటకు అవకాశమే లేనందున శాశ్వత పరమాత్మయందే లగ్న మగుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు సాయంత్ర సమయమున శిష్యులందరిని సమావేశ పరచి గురుదేవుడు,సాధనయందు సామాన్యముగ జనులకు ఏయే ప్రతిబంధకములు కలుగుచుండునో వానిని అధిగమించుటకు అవలంబించవలసిన పద్దతు లేవియో చక్కగా విశదపరచెను. కొందరు భక్తులు గురువు చెప్పిన కీలక విషయములను పుస్తకములోనికి ఎక్కించుకొనిరి. గోష్ఠి అంతయు పూర్తికాగానే శాంతిమంత్రముల ఉచ్చారణతో ఆనాటి సమావేశము విసర్జింపబడెను.\n\nఅపుడు గురుదేవుడు అంతేవాసులతో \"నాయనలారా! ప్రకృతి సౌందర్యమును వీక్షించుటకును, భగవంతుని చిద్విలాసమును చూచి ఆనందించుటకును ఉద్యానవనమునకు బోదము రండు\" అని చెప్పి ఆ శిష్యులందరిని ఆశ్రమసమీపమున గల ఉద్యానవనమునకు తీసికొని పోయెను. అచట రకరకములైన పుష్పములు చక్కగా వికసించి సుగంధమును వెదజల్లుచుండెను. తులసి వనమునుండి పవిత్రమైన పరిమళము నలువైపుల ప్రసరించుచుండెను.\n\nఅత్తరి గురుదేవుడు వికసించిన ఒక గులాబి పువ్వును చూచి, దాని రచనావైచిత్ర్యమును గాంచి ముగ్దుడై, సృష్టికర్త యొక్క అపారశక్తి సామర్థ్యమును తలంచుకొని విస్మితుడై ఆ పుష్పమును మెల్లగ కోసెను. ఆ కోయుటలో పొరపాటున దానికి ఉన్న ముల్లు గ్రుచ్చుకొనుటచే వ్రేలినుండి రక్తము కారదొడగెను. అది చూసి శిష్యులలో కొందరు గుడ్డపీలికతో ఆ వ్రేలికి కట్టుకట్టదలంచి పాత గుడ్డ కొరకై ఆశ్రమమునకు పరుగెత్తిరి. కాని సమీపముననే యున్న ఒక శిష్యుడు తనపై కప్పుకొనిన అంగవస్త్రమును చింపి ఆ పీలికతో తత్ క్షణము దేశికేంద్రుని వ్రేలికి కట్టుకట్టెను. రక్తస్రావము ఆగిపోయెను. కొలది సమయములో గురుదేవునకు నొప్పి తగ్గిపోయి స్వస్థత చేకూరెను. అపుడు గురువు తన మనంబున \"ఈతడుగదా నిజమైన గురుభక్తుడు! తక్కినవారు గుడ్డకొరకై ఇటునటు పరుగెత్తిరి. కాని ఇతడు ఒరుల బాధను గుర్తెరింగి ఆచార్యునిపై గల అపారభక్తిని క్రియారూపమున ప్రకటించియున్నాడు\" అని ఈ ప్రకారముగ తలంచుకొనుచు ఆశ్రమము వైపునకు మెల్లగా నడువజొచ్చెను.\n\nనీతి: భక్తిగాని, జ్ఞానముగాని నోటివరకే పరిమితముకాక హృదయమందు కూడ ప్రవేశించవలెను. వాచాజ్ఞానముతో పరితృప్తి నొందక అనుష్ఠానమందు కూడ దానిని ప్రవేశపెట్టవలెను. గురుదేవుని ఈ బోధను కార్యాన్విత మొనర్చువాడే నిజమైన గురుభక్తుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 825,
        "IMAGE": "cat_9",
        "NAME": "గురుభక్తుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక గ్రామములో ఒక తిండిపోతు కలడు. అతనికి కడుపే కైలాసము. ఎక్కడ విందులు జరుగునా, పెండ్లి భోజనములు ఎక్కడ తటస్థించునా యని అహర్నిశములు ఆలోచించు వాడతడు జిహ్వపై సంయమము లేక భోజ్యపదార్థ మేదేది కనిపించినా, వేళాపాళా లేక దానిని ఆరగించువాడు. ఈ ప్రకారముగ అధిక భోజనమును సేవించుచు శరీరము యొక్క స్థౌల్యమును పెంచుకొని, పనిపాటలు లేక, ఇంటివద్ద కూర్చొని గోళ్ళుగిల్లుకొనుచు, తిండినిగూర్చి రాత్రింబవలు చింతించుచు కాలమును వెళ్ళబుచ్చుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు అతడు అకస్మాత్తుగ ఇంటినుండి బయలు దేరి ఊరిబయట దూరముగ గల ఒకచెట్టు క్రింద కూర్చుని జపములు, వ్రతములు చేయుచు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయ మొదలుపెట్టెను. అది చూసి ఊరివారందరు ఆశ్చర్యచకితులై ఈ తిండిపోతున కింతభక్తి వైరాగ్యమేల కలిగెనని సంశయవిష్టులై యుండిరి. ఈ తపస్సునకు కారణమేమి? యని ఆతని నడుగుటకు వారు సహసించలేక యుండిరి.\n\nఈ ప్రకారముగ కొంతకాలము గడిచిన పిమ్మట ఒకానొక దినమున బ్రహ్మదేవుడు డతనికి ప్రత్యక్షమై 'ఓయీ! నీ తపస్సుకు మెచ్చితిని. ఎదైనా వరము కోరుకొనుము ' అని పలుకగా తిండిపోతు 'మహా ప్రభో! నాకు వరమేదియు అవసరము లేదు. వరము కొరకై నేనీ తపస్సు చేయలేదు. ఒకానొక ధర్మ సందేహము నాకు కలుగగా, దానిని తీర్చు వారు తమరే యని ప్రగాఢముగ విశ్వసించి ఈ ప్రకారముగ తమ్ము గూర్చి తపస్సు చేసితిని. మహాత్మా! నాసందేహమును తీర్చి నాకు చిత్తభ్రాంతిని కలుగ జేయవలసినదిగా ప్రార్థించుచున్నాను - అని విన్న వించుకొనెను. తదుపరి వారిరువురి మధ్య ఈ క్రింద విధముగా సంభాషణ నడచెను -\n\nబ్రహ్మదేవుడు: నాయనా! ఏ విధమగు అభ్యంతరము లేక నీవడుగ దలంచినది అడుగుము. నీ సంశయమును దీర్చెదను.\nతిండిపోతు: దేవా! ఈ సృష్టియంతయు గావించినది ఎవరు?\nబ్రహ్మ: నేనే\nతిండిపోతు: అయితే మనుష్యుని సృష్టించినది ఎవరు?\nబ్రహ్మ: నేనే\nతిండిపోతు: మనుష్యుని తల ఎవరు సృష్టిచేసినది?\nబ్రహ్మ: నేనే కదా!\n\nతిండిపోతు: మహాప్రభో! ఆ తలలో రెండు కండ్లు పెట్టినారు. చాలా బాగున్నది. రెండు చెవులు పెట్టినారు. చాలా బాగున్నది. రెండు ముక్కురంద్రాలు పెట్టినారు. ఇంకను చాలా బాగున్నది. కాని ఒక్కనోరా! రామ, రామ! అన్నీ రెండు పెట్టి నోరు మాత్రము ఒక్కటి మాత్రమే పెట్టుట నా దృష్టికి సమంజసముగ తోచుటలేదు. ఒకేచోట నెలకొల్పబడిన వస్తువులు సరిసమానముగ ఉండుట భావ్యము కదా! అయినదేమిటో అయినది. కనీసము రాబోవు సృష్టియందైనను ఈ విషయమును తమరు జ్ఞప్తియందుంచుకొని తలలో రెండు నోళ్ళుపెట్టి ఈ చిన్న మార్పును తలయందు చేసిన బాగుండునని తోచుచున్నది. అప్రకారముగ రెండు నోరులుండినచో నా బోటి అధిక భోజనపరులకు చాల అనుకూలముగా నుండునని నామనవి. మహాత్మా! ఈ విషయము నా దృష్టిలో అత్యధిక ప్రాధాన్యత గలదిగా నుండటబట్టి దానిని తమ దివ్యచిత్తమునకు తేవలెనని బహుకాలము నుండియు తలంచుచున్నాను. నేటి కా శుభఘడియ తటస్థించినది కాబట్టి మహాశయా! నేను సూచించిన ఈ విషయమును తమరు దీర్ఘముగ యోచించి ఆ ప్రకారముగ చేయ ప్రార్థన.\n\nబ్రహ్మ: ఓయీ! ఈ సంగతి నాకు తెలియక పోలేదు. బాగుగ యోచించియే ఒక్కనోరు పెట్టితిని. ఒక్క నోరున్నప్పుడే ఊపిరి తిరగకుండ జనులు తినుచుండగా ఇక రెండు నోరులున్నచో చెప్పవలెనా? ఒక్క నోరున్నప్పుడే చెడువాగుడు వాగుచుండగా ఇక రెండు నోరులున్నచో వేరుగ చెప్పవలెనా? కాబట్టి మితహారము సేవించవలెనని, మితభాషణము గావింపవలెనని ప్రజలకు ఉద్బోధము చేయుటకొరకే ఒక్కనోరు ఏర్పటుచేసితిని. ఇప్పటికైనా తెలిసికొని బాగుపడుము. అధిక భోజనము ఎవరికినీ మంచిదికాదు. దానివలన అరోగ్యము చెడుటయే కాక, పరప్రాణి యొక్క అహారమును తస్కరించినట్లు కాగలదు.\n\nతిండిపోతు: మహాత్మా! చక్కగా సెలవిచ్చితిరి. ఇక మీదట తమరు సెలవిచ్చిన ప్రకారము మితభోజనమే అలవాటు చేసికొనెదను.\n\nఆ వాక్యములను విని బ్రహ్మదేవుడు సంతోషించి అంతర్ధానమయ్యెను. తిండిపోతు ఇంటికివెళ్ళి మితాహారమును అభ్యసించి బాగుపడెను.\n\nనీతి: ఆహారమును అధికముగ భుజింపరాదు. మితాహారమును సేవించుచు ఆరోగ్యమును జాగ్రత్తగ కాపాడుకొనుచు దైవచింతన చేయుచు జీవితమును ఆనందమయముగ చేసికొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 826,
        "IMAGE": "cat_9",
        "NAME": "తిండిపోతు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఉత్తరప్రాంతమున ఒక పెద్ద పట్టణము నందు లక్షాధికారి ఒకడు కలడు. అతడు పెక్కు పారిశ్రామిక సంస్థలను నిర్వహించుచుండెను. అతని ఆధిపత్యము క్రింద ఎన్నియో మిల్లులు ఫాక్టరీలు నడుచుచండెను. ఉత్తరదేశప్రజలు గోధుమరొట్టె విశేషముగా వాడుచుందురు కావున గోధుమపిండి జనులకు చాలా అవసరమని భావించి ఆ 'సేటు' గారు ఒక పెద్ద పిండిమరను ఏర్పాటుచేసిరి. ప్రతిదినము జనులు తండోపతండములుగా ఆ మిల్లుయొద్దకు వచ్చి గోధుమలను పిండి చేయించుకుని వెడలచుందురు. ఆ పిండిమర వలన సేటుగారికి ప్రతి సంవత్సరము కొన్నివేల రూపాయల వరుంబడి వచ్చుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు ఆ పట్టనమునందలి ఒకానొక దేవాలయము నందు ఒక హరిదాసు హరికథ చెప్పుచుండ జనులు, సేటుగారు శ్రవణాభిలాషులై అచటికి పయనమైరి. ఆ దినము ప్రహ్లాదోపాఖ్యానము హరికథ జరుగుచుండెను. జనులు భక్తి భావముతో తన్మయులై తదేక చిత్తులై వినుచుండిరి. భాగవతారుగారు తమ యావచ్చక్తిని వినియోగించి, పెక్కు హవభావములను మనోరంజకముగ వెల్లడించుచు కల కంఠముతో శ్రావ్యముగ గీతములను ఆలాపించుచు బహు ఆకర్షణీయముగ హరికథ చెప్పుచుండిరి. సందర్భవశమున ఆ హరికథయందు అన్నదాన ప్రసక్తి వచ్చెను. అన్నదానము మహా పుణ్యప్రదమైన కార్యమనియు, ఒక్క ప్రాణికి అన్నము పెట్టినచో ఎంతయో పుణ్యమును జీవుడు అర్జించగల డనియు, కావున అన్నదానము ద్వారా దరిద్రనారాయణులకు సేవచేయుట పరమధర్మమనియు ప్రబోధించెను. అవాక్యమును శ్రద్దతో నాలకించిన లక్షాధికారి తానుకూడ అట్లు దీనజనులకు అన్నదానము చేసి పుణ్యభాగ్యము నొందవచ్చునని తలంచి మరునాడు అన్నదానము చేయ నిశ్చయించుకొనెను.\n\nఉత్తర దేశమునందు అందరును భోజనమునందు రొట్టెలనే ఉపయోగించుదురు. కాబట్టి ఆసేటుగారు రొట్టెల కొరకై తన పిండి మరలో నిలువ యున్న గోధుమపిండిని తెప్పించి రొట్టెలను చేయించుటకై తన అనుచరులకు ఆజ్ఞ యొసంగెను. బహుకాలము అమ్ముడుబోక నిలువయుండుటచే ఆపిండి పురుగుపట్టి దుర్గంధమును వెడలగక్కు చుండెను. సేటుగారికి ఆ విషయము తెలిసియుండినను ఏదియో విధముగా అది విడుదల యగుటయే ప్రధానముగ భావించినవాడై దానినే రొట్టెలు చేయించి బీదవారికి పంచి పెట్టించెను. ఇక్కార్యము ద్వారా తనకు రెండు మేలులు చేకూరగలవని అతడు నిశ్చయించుకొనెను. 1) బహుకాలము నుండియు ఖర్చుకాకయున్న గోధుమపిండి ఏదియో యొక కార్యమునకు వినియోగపడుటయు, 2) బీదలకు పెట్టుటవలన పుణ్యము లభించుటయు.\n\nగోధుమపిండి పుచ్చుపోయి యుండుటవలనను, దుర్గంధ భూయిష్టముగ నుండుటవలనను వానితో చేయబడిన రొట్టెలు భుజించుటకు యోగ్యము కావు.\n\nగోధుమపిండి పుచ్చిపోయి యుండుటవలనను, దుర్గంధ భూయిష్టముగ నుండుటవలనను దానితో చేయబడిన రొట్టెలు భుజించుటకు యోగ్యములుగా నుండనప్పటికిని బీదలు ఆకలిచే వాటిని ఎట్లో తినివైచి వాంతిచేసికొనుచు అతృప్తితో వెడలిపోయిరి. ఈ చిత్రమంతయు గాంచి సేటుగారు ధర్మపత్ని పరమచింతాక్రాంతురాలై తన భర్త యొద్దకు పరుగిడి \"ఏమండీ! అన్నదానము వలన పుణ్యము లభించునను విషయము నిజమేకాని పాచిపోయిన అన్నము, ముక్కి పోయిన రొట్టెలు, పుచ్చి పోయిన వస్తువులు తినుటకు ఒకరికి పెట్టవచ్చునా? మనము మంచి రొట్టెలు తినుచు నారాయణ స్వరూపులగు ఆబీదవారికి ఆ దరిద్ర నారాయణులకు వాసన కొట్టు చున్న ఆ పాడురొట్టెలు పెట్టవచ్చునా? భగవంతుడు మనకేమియు లోటు చేయలేదు కదా! కావలసినంత మంచి గోధుమపిండి మన మిల్లులో ఉన్నది కదా! దాని నెందుకు ఉపయోగించ రాదు? హేయమై అపవిత్రమైనట్టి వస్తువును దానము చేసినందు వలన పుణ్యము లభించునా?\"- అని అడుగగా షావుకారు ఏమియు ప్రత్యుత్తర మీయక వెడలిపోయెను.\n\nఅప్పుడు సేటుగారి భార్య భర్తకు తగిన పాఠము బోధించి అతని హృదయమునందు పరివర్తనము తెచ్చుట ఎటులా యని యోచించి బీదలకు వడ్డించిన ఆ పుచ్చిపోయిన రొట్టెలు నాలుగు తీసి దాచిపెట్టెను. మధ్యాహ్నము 12గం||లు అగుసరికి భర్తగారు భోజనమునకై ఇంటికి రాగా, భార్య తాను దాచిపెట్టిన ఆ చెడిపోయిన రొట్టెలనే భర్తకు వడ్డించెను. అపుడు సేటుగారు ఏల అట్లు చేసితివని భార్యను మందలించగా ఆమె యిట్లు బదులు చెప్పెను - \"ఏమండీ! ఈ లోకములో ఒకరు ఏవస్తువును ఇతరులకు దానము చేసెదరో ఏ పదార్థమును ఇతరులకు పెట్టెదురో ఆ వస్తువునే పరలోకములో కర్మదేవతలు వారికి ఒసంగెదరని పెద్దలు చెప్పుచుందురు. ఇపుడు మీరు పుచ్చిపోయిన వాసన రొట్టెలను ఇతరులకు పెట్టినారు కాబట్టి ఆపాడు రొట్టెలే మీకు పరలోకములో తినుటకు లభింగలవు. కాబట్టి వాటిని తినుటకు ఇప్పటినుండియే అభ్యాసము చేసినచో అప్పటికి బాగుగా అలవాటుపడగలదు. అకస్మాత్తుగా మీకు వాటిని వడ్డించినాను. అంతియే కాని చెడుభావనతో కాదు!\"\n\nభార్యయొక్క ఆ హితవాక్యములను వినగానే భర్తకు కనువిప్పు కలిగి తాను చేసినది గొప్ప పొరపాటని గ్రహించినవాడై వెంటనే తన యనుచరులను పిలిపించి మంచి గోధుమపిండితో రొట్టెలను చేయించి బీదవారికి తిరిగి వడ్డించెను. ఆ బీదలందరును అపుడు పరమానందపడి సంతుష్టాంతరంగులై వెడలిపోయిరి.\n\nనీతి: ఒకరికి తానేది యొసంగునో అదియే తనకు లభించును కావున అపవిత్రమైన దానిని పరుల కీయరాదు. అపవిత్ర భోజనమును ఇతరులకు పెట్టరాదు. మంచివస్తువులనే ఈయవలెను. మంచి భోజనమునే పెట్టవలెను. ఎదుటి వాడు నారాయణ స్వరూపుడని భావించియే దానధర్మములు చేయవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 827,
        "IMAGE": "cat_9",
        "NAME": "పరుల కిచ్చినదే తనకు లభించును",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వము అవధూత చక్రవర్తియగు దత్తాత్రేయుల వారు దేశాటనము చేయుచు ఒకానొక మార్గముపై పయనించుచుండిరి. ఆ మార్గము ఒకచోట రెండుగా చీలిపోయెను. ఎటు పోయినచో తాను వెళ్లవలసిన గ్రామము వచ్చునో దత్తాత్రేయునకు తెలియలేదు. అందుచే నతడు ఆ రెండు మార్గముల కూడలి యొద్ద నిలబడి దిక్కులు పరికించుచు దారి తెలిసిన వ్యక్తి యెవరైనా అటువైపు వచ్చునేమోయని బహుకాలము వేచియుండెను. కాని ఒకడును ఆవైపురాలేదు. అది నిర్జన ప్రదేశముగ గనిపట్టెను. సమీపముననే ఒక నది ప్రవహించుచుండెను. ఆ నది ఒడ్డున ఒక బెస్తవాడు నీటిలో గాలము వైచి చేపలు పట్టుకొనుచుండెను. దత్తాత్రేయులు ఆ చేపలవాని జూచి అతడు తనకు మార్గము తెలుపగలడేమో యని భావించి అతనిని బిగ్గరగా కేక వేసెను. కాని అతడు పలుకలేదు. \"ఓయి! ఏమార్గముద్వారా వెడలినచో నేను వెళ్లవలసిన గ్రామము వచ్చునో చెప్పుమా! అని అతనిని గూర్చి దత్తాత్రేయులు మరల పెద్దగా అరచెను. కాని ఫలితము లేకపోయెను. మరల మూడవసారి కేకవేసెను. ఫలితము పూజ్యము.\n\nఇక గత్యంతరము లేక దత్తాత్రేయులు తానే ఆ బెస్తవాని యొద్దకుపోయి అతని వీపుతట్టి 'నాయనా! మూడు పర్యాయములు బిగ్గరగా కేకవేసి నిన్ను పిలిచితినే, పలుకలేదేమి? నీకు వినికిడి శక్తి ఏమైనా లోపించినదా? ఇంత సమీపమునుండి పెద్దగా అరచినను నీకు అ శబ్దము వినిపించకుండుట ఆశ్చర్యముగానున్నది. ఏ కారణముచేత నీవు పలుకలేదు? - అని యడుగగా బెస్తవాడీ ప్రకారముగా ప్రత్యుత్తర మిచ్చెను.\n\n\"మహాప్రభో! తామెవరో నాకు తెలియదు. నాకు వినికిడి శక్తి చాలా చక్కగా ఉన్నది. చెవుడు ఏ మాత్రము లేదు. అయితే తాము బిగ్గరగా కేక వేసినను నాకు వినిపించకపోవుటకు కారణము కలదు. నేను నీటిలో గాలముపై దృష్టితో దాని వైపు చూచుచున్నాను. చేప పడునేమోయని ఆతురతతో వీక్షించుచున్నాను. 'బెండు ఇంకను మునగ దేమి? - అను విచికిత్స ఒకటి తప్ప తక్కినభావము లెవ్వియు నాయంతఃకరణమున మెదలలేదు. నేను దాదాపు జగత్తునే మరచి పోయితినని చెప్పవచ్చును. ఒక్క చేప భావనయే నా యంతరంగమున తిరుగాడుచున్నది. ఇక్కారణమున తమరు వచించినది నాకు శ్రవణ గోచరము కాకయుండెను. మహాశయా! క్షమించుడు. నా వలన గొప్ప అపచారము కలిగినది. తమ వంటి మహాత్ములకు శ్రమ కలుగ చేసిన వాడనైతిని.\n\nబెస్తవాని హేతుపూర్వక వాక్యములను విని దత్తాత్రేయులు ఆశ్చర్యమును బొంది ఆహా! సర్వమును మరచి 'ఒక చేపకొరకు ఈతడెట్టి ఏకాగ్రతను అవలంబించెను! ప్రపంచమునే మరచి పోవునంతటి తీవ్ర ఏకాగ్రతను ఈతడు సాధించెను. ఇట్టి చక్కటి ఏకాగ్రత ధ్యాననిష్ఠులకు ఉండినచో ఇక మోక్షము పొందబడి నట్లేకదా! ఏ ఏకాగ్రత ఏదృశ్య ప్రపంచ విస్మరణ ఈ బెస్తవాడు ఒకచిన్న చేపకొరకై అవలంబించెనో, అట్టి ఏకాగ్రతలో ఒకానొక భాగమైనను భగవంతుని యొక్క పాదపద్మముల ధ్యానమునందు వినియోగింపబడినచో మనుజుడు మహోన్నత ఆధ్యాత్మిక శిఖరమును చేరుకోగలడు!' ఈ ప్రకారముగ బెస్తవాడు నాకు చక్కని పాఠమును నేర్పిన వాడాయెను - అని దత్తాత్రేయులు తనలో పర్యాలోచించుకొని ఆ చేపలవానిని తన గురువుగా భావించుకొనెను. ప్రపంచములో ఎచటెచట ఏయేపదార్థము నుండి గాని,ఏయే వ్యక్తి నుండి గాని గుణపాఠము లభించుచుండునో, ఆ యా పదార్థమును, ఆ యా వ్యక్తిని తన గురువుగా దత్తాత్రేయులు పరిగణించుకొనుచుండెను. ఈ ప్రకారముగ ఇరువది నలుగురు గురువులు దత్తాత్రేయులకు వారి జీవితకాలమునందు ఏర్పడిరి.\n\nనీతి: ఏ ఏకాగ్రత, ఏ కార్యదక్షత, ఏ నియమనిష్ఠ ప్రాపంచిక జనులు తమ తమ అభిలషితకార్యములను సాధించుట యందు విని యోగించుచున్నారో అద్దానిని దైవధ్యానమందు, మోక్ష సంపాదన యందు వినియోగించినచో అచిరకాలములోనే మనుజుడు ముక్తిధామమును నిశ్చయముగ చేరుకొనగలడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 828,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఏకాగ్రత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకనాటి చంద్రగ్రహణ సమయమున సముద్రస్నాన మాచరించుటకై వేలకొలది జనులు సముద్రతీరమున చేరిరి. కొందరు స్నానమాచరించుచుండిరి మరికొందరు ఒడ్డున తిరుగాడుచుండిరి. సముద్రతీర మంతయు జనసందోహముచే కోలాహలముగ నుండెను. ఆ సమయమున నొకానొక సాధువు స్నానార్థమేతెంచి ఒడ్డున నిలబడి ఏదియో ఆలోచించుచుండెను. ఆతనియొద్ద ఒక రాగి చెంబు ఉండెను. దానిని చేతగైకొని నీళ్ళలో దిగినచో తరంగముల తాకిడికి అది కొట్టుకొనిపోవచ్చును. పోనిండు,ఒడ్డున ఎచ్చటనైనా ఉంచెదమా యనిన, స్నానముచేసి వచ్చులోపల దాని నెవరైనా ఎత్తుకొని పోవచ్చును. ఈ డోలాయమాన పరిస్థితులలో ఆ సాధువు అచ్చోట స్నానము చేయక, దూరముగ పోయి సముద్రపుటొడ్డున ఎవరును లేనిచోటును చేరుకొనెను. అచ్చోట తీరమున ఒక చిన్నగోతిని త్రవ్వి అందులో తన రాగిచెంబును ఉంచి దానిపై ఇసుకతో ఒక కుప్పచేసి స్నానము చేయుటకు పోయెను.\n\nసాధువుగారు తాను చేసినపని ఎవరును చూడలేదని భావించి సంతుష్టు డయ్యెను. కాని దూరమునుండి ఒక వ్యక్తి అది యంతయూ గమనించుచుండెను. ఆ వ్యక్తి తనలో ఇట్లు వితర్కించుకొనెను - \"సాధువు సామాన్యుడు కాడు. ఎంతయో తపస్సు చేసిన మహాత్ముడు ఎన్నియో శాస్త్రములను తిరుగవేసినవాడు, అట్టివాడు ఏది చేసినను ప్రమాణపూర్వకముగనే చేయును. చంద్రగ్రహణ సమయమున సముద్ర తీరమున ఇసుకలో శివలింగము చేసినచో ఏదియో గొప్ప పుణ్యము ఉండును గనుకనే ఈ గ్రహణ సమయమున అతడు లింగమును నిర్మించెను. మఱియు అతడు లింగమును నిర్మించిన స్థలమున్ను ఏదియో మహిమతో కూడియుండును. లేనిచో ఆ చోటుననే లింగ నిర్మాణమున కాతడెందులకు ఎన్నుకొనియుండును? కాబట్టి ఆ పుణ్యభాగ్యమును నేనును పొందెదను\" అని తలంచి ఆ లింగము ప్రక్కన అదేకొలతలో నతడు మఱియొక లింగమును ఇసుకతో చేసి స్నానము చెయుటకు వెడలెను.\n\nఇంతలో మఱియొకడు దానిని చూసి గ్రహణ సమయమున ఆ పుణ్యమును తానెందులకు పోగొట్టుకొనవలెనని తలంచి దాని ప్రక్కన ఇంకొక లింగమును చేసెను. ఈ ప్రకారముగ ఒకరిని చూచి మఱియొకరు ఆ సముద్రమున ఇసుకతో లింగములను చేయమొదలిడిరి. సాధువుగారు స్నానము చేసి తిరిగి వచ్చుసరికి అచట కొన్నివందల లింగములు ఏర్పడియుండెను. ఇక తన రాగి చెంబు ఏలింగములో ఉన్నదో అతనికి అంతుపట్టలేదు. ఆశ్చర్యచరితుడై, జనులయొక్క అంధపరంపరను గూర్చి ఖేదమొంది అత డీ శ్లోకమును చెప్పదొడగెను.\n\nగతానుగతికో లోకో న లోకః పారమార్థికః |\nసేతౌ సైకతలింగేన వినష్టం తామ్రభాజనమ్‌ ||\n\nఅనగా, జనులలో పెక్కురు యుక్తాయుక్తములను విచారించక గ్రుడ్డిగా పనులాచరించుచుందురు. ఒకరుచేసిన పని ఎందుకాయని ఆలోచించకనే వారు చేసిన దానిని అనుకరించుదురు. ఏదియెట్లున్నను సముద్రస్నానమునకు వచ్చిన ఇసుకకుప్పను చేయుటవలన నా రాగి చెంబు గల్లంతు అయినది. అహా! జనులది ఎట్టి అంధపరంపర\" అని వాపోవదొడగెను.\n\nఅదే విధముగ, జనులలో పెక్కురు తమ పూర్వికులు ఏ ప్రకారము బహిర్ముఖదృష్టి కలవారై, ప్రపంచవ్యవహార నిమగ్నులై, దృశ్యవ్యామోహమునబడి కొట్టుకొనిపోయిరో,ఆ ప్రకారము తామున్ను అచరించుచున్నారే కాని, \"తామెవరు? తన నిజస్వరూపమేమి, ఎచ్చటనుండి వచ్చినారు. ఎచట కేగవలెను, జీవితపరమావధి యేది\" అని పరమార్థ మును విచారించువారు చాల అరుదు. కనుక అట్టి అంధపరంపరను విడనాడి జగద్వ్యవహారములతో బాటు తానెవరో, జగత్తేమియో, దైవమును పొందుటెట్లో చక్కగా విచారించి, మానవజీవితమును సార్థకమొనర్చుకొనుట శ్రేయస్కరము.\n\nనీతి: దేనినీ గ్రుడ్డిగ అనుకరించగూడదు. అదియుక్తమా, అయుక్తమా అని వివేకముతో యోచించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 829,
        "IMAGE": "cat_9",
        "NAME": "అంధపరంపర",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక పట్టణమున ఒక వైద్యుడు కలడు. అతడు తన వృత్తియందు గొప్ప ప్రావిణ్యము గలిగి యుండుటవలనను, తాను చేపట్టిన కేసులన్నిటిని జయప్రదముగ నెరవేర్చుచుండుట వలనను, జనులనేకులు చికిత్సార్థము అతని యొద్దకే వచ్చుచుండిరి. ప్రతిదినము అతని వైద్యాలయము రోగులచేతను,ఆరోగ్యవిషయమై సంప్రదింపులకు వచ్చువారిచేతను కిటకిటలాడుచుండును. పేరుమ్రోగిన భిషగ్వర్యుడగుట వలన చుట్టుప్రక్కల పల్లెలనుండి కూడా బండ్లుకట్టుకుని ఎందరో అతని కడక వచ్చుచుందురు.\n\nఒకనాడు రాత్రి 8 గంటలకు అతడు తన కార్యక్రమమంతయు పూర్తిచేసుకొని, రోగుల నందరిని పంపివేసి వైద్యాలయమునకు తాళము వేసి అరమైలు దూరమున నున్న తనయింటికి ప్రయాణమైపోవ నుద్యుక్తుడై గడప దిగగనే ఒకరోగి పరుగుపరగున వచ్చి 'మహాప్రభో! కడుపునొప్పిగా ఉన్నది. మందు దయచేయుడు ' అని ప్రార్థించెను. అపుడు డాక్టరుగారు \"నాయనా! ఇప్పుడే వైధ్యాలయము మూసివేసినాను. మూసిన ఆసుపత్రిని మరల ఉదయము లోపల తెరుచు అలవాటు నాకులేదు. ఈ ప్రకారముగ గత ముప్పది సంవత్సరములనుండియు జరుగుచున్నది. తలుపు మూసిన తరువాత ఎవరు వచ్చినను వారిని నాయింటికి తీసుకొనివెళ్లి అచట మందు ఇచ్చుచుందును. కాబట్టి మీరునూ నావెంట వచ్చినచో ఇంటివద్ద తగినమందు ఇవ్వగలను. ఇపుడు మాత్రము మీరు నాకు చెప్పినప్పటికి నేను తలుపు తెరవనే తెరవను. మందు ఇవ్వనే ఇవ్వను. దయచేసి ఇంటికి రండు. మీకు కావలసిన చికిత్స చేసెదను\" అని పలికెను.\n\nఅపుడు వెంటనే రోగి 'మహాత్మా! నాబాధ గమనించి, ఇదియొక అత్యవసర పరిస్థితిగా భావించి తలుపు తీయుడు. ఇందు అనౌచిత్య మేమియులేదు. ఎట్టి త్యాగమైనా చేసి లోకములో మహనీయులు పరోపకారము చేయుచుందురు. కావున ఈ చిన్నసహాయమును మాకు చేయుడు. తలుపు తెరిచి నన్ను విపరీతముగా బాధించుచున్న ఈ కడుపునొప్పికి ఏదైన మందు శీఘ్రముగా దయచేయుడు ' అని వచించెను.\n\nఅతని వాక్యములను విని వైద్యనాథుడు రోగితో \"అయ్యా! మీరు చెప్పినది బాగుగనేయున్నది. కాని ముప్పది సంవత్సరములనుండి తప్పకుండ పాలించుచున్న ఈనియమమును ఇపుడు మీ ఒక్కరి కొరకు మార్చుటకు నాకు మనస్సు ఒప్పుటలేదు. కాబట్టి వేసిన తలుపులును ఉదయములోపల తెరువను. నావెంట వచ్చినచో మీబాధ తొలగుటకు ఇంటియొద్ద మందు తప్పక ఇవ్వగలను\" అని పలికి రోగిని తన వెంటబెట్టు కొని ఇంటికి పయనమై పోవుచుండెను.\n\nఅది రాత్రి సమయము. పట్టణవీథులు విద్యుద్ధీపకాంతులచే శోభించుచుండెను. రోగి వెంటరాగా భిషగ్వర్యుడు ముందు నడచుచుండెను. కాని వారిరువురు పదిగజములు దాటిరో లేదో రోగి వైద్యునకు అడ్డుతగిలి 'డాక్టరుగారూ! నొప్పి తీవ్రముగానున్నది. ఇక తట్టుకొనలేను. త్వరలో ఏదైనా మందు ఇవ్వండి' అని ప్రాధేయపడెను. అపుడు వైద్యుడు రోగియొక్క ధాటికి తట్టుకొనలేక తన కోటుజేబులో ఏదియో మాత్రవంటిది తీసి రోగిచేతిలో పెట్టి \"నాయనా! దీనిని సేవించుకొనుము దీనిని నోటిలో వేసికొని చప్పరించుము. నమలవద్దు\" అని ఆదేశించెను. రోగి పరమానందముతో దానిని స్వీకరించి నోటిలోవేసుకొని చప్పరించుచు డాక్టరుతో రోగి 'నాయనా! తమ దయవలన సగము నొప్పి తగ్గిపోయినది అని బదులు చెప్పెను. అంతట డాక్టరు రోగితో ఇక మీరు మీయింటికి వెళ్ళవచ్చును' అని పంపివేసెను.\n\nదీపప్రభలచే పగలువలె తోచుచున్న ఆపట్టణ వీథులగుండా చనుచు వైద్యునిచే ఒసంగబడిన మాత్రనువిడువకుండ చప్పరించుచు రోగి తన బాధ శమించుచుండ పరమానందభరితుడై గృహాభిముఖుడగుచు పోవుచుండెను. కాని ఎంతసేపు చప్పరించినను మాత్ర కరగనందున రోగి ఆశ్చర్యచకితుడై 'తనలో ఇదియేమి విలక్షణమైన మాత్ర! అరగంటసేపు చప్పరించినను కరగదే! ఉన్నది ఉన్నట్లే ఉన్నదే! కారణమేమి?' అని సంభ్రమచిత్తుడై ఒకానొక వీథిదీపముక్రింద ఆ మాత్రను తన అరచేతిలో ఊసుకొని చూచెను. రామ! రామ! అది మాత్రకాదు. కోటుగుండీ! వైద్యుడు అతనిపోరు పడలేక తన కోటుజేబులో ఉన్న గుండీని తీసి అతనికిచ్చెను అంతియే.\n\nసామాన్యమైన ఒకకోటుగుండీ రోగియొక్క కడుపునొప్పిని సగము తగ్గించి వైచుట జరిగినది. యథార్థముగ గుండీ అంతపని చేయగలదా? లేదు. రోగికి డాక్టరు పైగల అకుంఠితవిశ్వాసమే అంతపని చేసినది.\n\nకావున విశ్వాసము ఎంతటిపని నయినను సాధించగలదు. ఒక గ్రంథముపైగాని, ఒక గురువుపైగాని, ఒక వైద్యునిపైగాని, ఒక మంత్రముపైగాని మనుజునకు ఎంతెంత విశ్వాసముండునో అంతంత అధిక ఫల మతనికి కలుగుచుండును. కావున దైవవిశ్వాసము, గురువిశ్వాసము, మంత్రవిశ్వాసము, ఆత్మవిశ్వాసము ముముక్షువునకు తప్పక ఉండవలెను. అపుడు మాత్రమే ఆధ్యాత్మక్షేత్రమున గొప్పగొప్ప ఫలముల నాతడు సాధింపగల్గును. అట్టి విశ్వాసము లేనివాడు ఏక్షేత్రమందును పురోభివృద్ధిని బడయజాలడు. కాబట్టి సాధకుడు తాను జపించు మంత్రమునెడల, తనకుపదేశించిన గురువునెడల తన్ను సృష్టించిన ఈశ్వరునియెడల తాను పఠించు గ్రంథముయొక్క రచయితయెడల,తన యెడల, గొప్పవిశ్వాస ముంచుకొని పరమార్థరంగమున ముందునకు సాగిపోవలెను.\n\nనీతి: విశ్వాసము గొప్పఫలితములను కలుగజేయును. కాబట్టి దైవవిశ్వాసము, గురువిశ్వాసము, శాస్త్రవిశ్వాసము, ఆత్మవిశ్వాసము గలిగి యుండి ఆధ్యాత్మిక అభ్యున్నతిని సాధించవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 830,
        "IMAGE": "cat_9",
        "NAME": "విశ్వాసమును బట్టియే ఫలితము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక సాధువు తీర్థయాత్రపరాయణుడై పుణ్యక్షేత్రములను దర్శించుచు, పుణ్యతీర్థములందు స్నానమాచరించుచు పాదచారియై పోవుచుండెను. గ్రామములగుండా, పట్టణములగుండా తీర్థప్రదేశములందు మాత్రము ఒకటి రెండు రోజులు నిలిచి స్నాన, దేవదర్శన, పూజాదికార్యములు నొనర్చుకొనుచు మరల తన ప్రయాణమును కొనసాగించుచుండెను. ఒక మహాపట్టణముగుండా పోవుచుండెను. అచ్చట ఒక గొప్ప వ్యాపారి నివసించుచుండెను. అతడు శ్రీమంతుడు బ్రహ్మాండమైన సుందర భవనము అతనికి కలదు. సిరిసంపదలతో బాటు చక్కని శీలము, భగవద్భక్తి అతనియందు విరాజిల్లుచుండెను. అతడు సాధు సత్పురుషుల యెడల ఎంతయో వినయ విధేయతలు గలిగి వారిని ఆదరించుచు,వారికి భిక్షాదికములను సమకూర్చుచు నుండెను.\n\nఇట్లుండ ఒకనాడా ధనికునకు పైనదెల్పిన యాత్రికుడైన సాధువు పట్టణమున కనుపించెను. సాధువు యొక్క ముఖవర్చస్సు , బ్రహ్మతేజము అతని నెంతయో ఆకర్షించెను. వెంటనే ధనికుడు ఆ సాధుమహాత్మునకు సాష్టాంగదండప్రణామ మాచరించి తన ఇంటికి భిక్షకై ఆహ్వానించి తీసికొని వెళ్లెను. మహాతపస్సంపంన్నుడగు సాధువు తనగృహమున కేతెంచుటచే శ్రీమంతుని ఆనందమునకు మేరయే లేకుండెను. ఆ మహానీయుని సాక్షాత్ నారాయణమూర్తిగనే భావించి, వారి పాదరజముచే తన గృహము పావనమైనదని అతడు తలంచెను. అట్టి పరమ పవిత్రుని రాక మహాఅదృష్టకరమైనదని యెంచి ధనికుడు ఆరోజు గొప్ప విందు చేసెను. రుచిరకములగు ఫలహారములను వండించెను. మధుర రసభరిత ములగు పానీయములను ఏర్పాటుచేసెను. మహాస్వాదిష్టమగు పాయసమును వండించెను.\n\nభిక్షా సమయమున సాధుమహాత్ముడు ధనికుడు ఇరువురునూ ప్రక్క ప్రక్కనే భోజనమునకు గూర్చుండిరి. ప్రసంగవసాత్తు ధనికుడు సాధువుగారితో 'మహాత్మా! తమరాకను పురస్కరించుకొన ఈ దినము మహారుచికరమైన పాయసమును ప్రత్యేకముగ చేయించితిని. అది త్రాగినచో సాక్షాత్ అమృతమును త్రాగిన చందముననే యుండును. దానిలో వేయవలసిన పదార్ధము లన్నిటిని వేయించితిని. కొన్ని సుగంధ ద్రవ్యములనుగూడా చేర్పించితిని. అతి స్వాదిష్టముగ, అతి మధురముగ,అత్యానందకరముగ నుండగలదు. ఇంతవరకు తామెచటను ఇటు వంటి దానిని రుచిచూచి యుండరు అని ఈ ప్రకారముగ వర్ణించుచుండ సాధువు ఓహో! అట్లనా! అంత రుచువంతముగ నుండునా!\" అని పలికి భోజనమున కుపక్రమించెను. ఇరువురును రెండు ముద్దలు తినగానే వడ్డించువాడు రెండుగ్లాసుల నిండుగా పాయసమును తెచ్చి ఒక గ్లాసును సాధువుముందు; మఱియొక దానిని ధనికుని ముందు పెట్టెను.\n\nఅత్తఱి సాధువుగారు ఇంటి యజమానితో \"ఏమండీ! మీరు తయారు చేయించిన పాయసము ఎట్లుండెను?\" అని ప్రశ్నింప \" అమృత సమానముగ నుండును\" అని అతడు ప్రత్యుత్తర మిచ్చెను. వెంటనే సాధువుగారు ఒక తెల్లకాగితము, పెన్ను తెప్పించి ధనికునిచే ఆ కాగితముపై \" పాయసము అమృత సమానముగానుండును\" అని వ్రాయించి చేవ్రాలు పెట్టించెను. తదుపరి ఇరువురును వారి వారి విస్తరిముందు పెట్టబడిన గ్లాసులలోని పాయసమును త్రాగివైచిరి. అపుడు సాధువుగారు మరల పాయసమును వడ్డించులాగున చేసి ఆ పాయసమును కూడ త్రాగుడని యజమానిని బలవంతము చేసెను. సాధువుగారి ఆజ్ఞను పురస్కరించుకొని ఆతిధేయుడగు ఆ శ్రీమంతుడు పాయసమును త్రావ మొదలిడెను. కాని మొదటి లోటా త్రాగినంత వేగముగ త్రాగ కుండెను.అది చూసి సాధువు గారు \"ఏమండీ!నెమ్మదిగా త్రాగుచున్నారేమి? పాయస మెట్లున్నది?\" అని ప్రశ్నింప, ఇంటి యజమాని పాయసపు రుచి కొంచెము తగ్గినది అని ప్రత్యుత్తరమిచ్చెను. తోడనే సాధువుగారు ఆ వాక్యమును కాగితముపై వ్రాయించి చేవ్రాలు పెట్టించెను.\n\nఆ పిదప సాధువుగారు వంటవానితో చెప్పి ఆఖాళీ గ్లాసునిండా మూడవసారి పాయసమును పోయించి దానిని కూడా త్రాగులాగున యజమానిని ప్రోత్సహించెను. ధనికుడు మూడవసారి ఆ పాయసమును త్రాగబోగా అది నోటిలోనికి ఎక్కకుండెను. అపుడు సాధువుగారు \"ఏమండీ!పాయసమెట్లున్నది? అని ప్రశ్నింప - విషమువలె తోచుచున్నది\" అని సమాధానము చెప్పెను. ఆ వాక్యమును సాధువుగారు కాగితముపై వ్రాయించి చేవ్రాలు పెట్టించెను.\n\nభోజనాంతరము సాధువుగారు ఇంటియజమానితో ఇష్టాగోష్టిగ ప్రసంగించుచు యజమానిగారూ! పాయసము అమృతముతో సమానమని భోజనమునకు ముందు పలికితిరి గదా, మూడు లోటాలు పాయసము త్రాగగానే పాయసము విషమని చెప్పితిరేమి? నిజముగా పాయసము అమృతమైనచో ఎల్లకాలములందును అట్లే యుండవలేనుగదా! అట్లు ఉండలేదు! కాబట్టి సుఖము బాహ్యవస్తువులలో లేదు. మానవుని భావమే వస్తువులలో సుఖమును కల్పించుకొనుచున్నది. వాస్తవసుఖము ఆత్మయందే కలదు. అది ఏకాల మందును తరగదు, మారదు. అది పరిపూర్ణమైనది. కావున అట్టి అభ్యంతర ఆత్మసుఖము కొఱకే మానవుడు ప్రయత్నించవలెనుగాని చంచల బాహ్యవిషయ సుఖముల కొఱకు గాదు అని చక్కగా బోధించెను.\n\nనీతి: సుఖము బయట వస్తువులలో లేదు. ఆత్మయందే కలదు. జీవుడు బాహ్యవస్తువుల యెడల విరాగము గలిగి ఆత్మసాక్షాత్కారమునకై యత్నించి ఆత్మయందే స్థితి గలిగి జీవితమును పరమానందమయముగ నొనర్చుకొనవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 831,
        "IMAGE": "cat_9",
        "NAME": "సుఖము బయట లేదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక పట్టణమున ఒక బీద గృహస్థుడు కలడు. అతని కుటుంబము పెద్దది. రాబడి తక్కువ. కుటుంబ పోషణార్ధము అతడు పడరాని పాట్లు పడుచుండెను. సంసారనిర్వహణము అతనికి ఎంతయో భార భూతముగా తోచుచుండెను. ఇట్లుండ ఒకనాడాతని ఇంటిముందుగా ఒక సాధువు పోవుచుండెను. మహాత్ముల ఆశీర్వచన ప్రభావముచే కార్య సిద్ధి కలుగునని నిశ్చయించి ఆ గృహస్థుడు అమాంతముగ ఆ సాధువు కాళ్ళపైబడి \"పాహి మాం పాహి మాం\" అని విలపించెను. మఱియు \"మహాత్మా! నేను కడుబీదవాడను. కుటుంబము చాలాపెద్దది, పోషించుటకు నాకు శక్తి లేదు. తత్ఫలితముగ యమయాతనల ననుభవించుచున్నాను. తమరు నాపై దయదాల్చి నాకు సిరి సంపదుల ననుగ్రహింప వేడుకొనుచున్నాను\" అని దీనముగ అతనిని ప్రార్థించెను.\n\nసాధువు అతని మొర ఆలకించి దయార్ద్రహృదయుడు కావున తనచేతియందున్న స్పర్శవేదిని అతని కొసంగి \"నాయనా! దీనిని తీసికొని నీ దారిద్ర్యమును రూపుమాపుకొనుము. బహుకాళము నుండియు నీవు లేమిచే బాధల నొందుచుంటివి. ఇది స్పర్శవేధియను మహత్తర పదార్థము. దీనిని ఇనుపవస్తువునకు తాకించినచో ఇనుము బంగారము కాగలదు. ఆ బంగారము అమ్ముకొని నీవు సంపన్నుడవు కమ్ము. దీని ప్రభావముచే నీ దారిద్ర్యము పలాయనము చిత్తగించగలదు. అయితే ఒక్క సంవత్సరకాలము వరకే దీనిని నీయొద్ద ఉంచుటకు వీలుకలదు. ఆ పిదప నేను మరల వచ్చి ఈస్పర్శవేధిని తీసికొనిపోవుదును. కాబట్టి ఈలోపుగానే నీవు దీనిని ఉపయోగించు కొనవలెను. ఆ పిదప ఇది నీకు దక్కదు\" అని వచించి వెడలిపోయెను. సాధువు పలికిన వాక్యములను విని గృహస్థుడు పరమానంద భరితుడయ్యెను. స్పర్శవేదిని బడయుటచే నతడు ఆనందమున చిందులు ద్రొక్కుచుండెను. బహుకాలము తన్ను బాధించిన దారిద్ర్యము తొలగెనుకదాయని సంతసించుచుండెను. నతడు తన ఇంటి కేగి మొట్టమొదట ఒక ఇనుపమేకునకు ఆ స్పర్శవేధిని తాకించదలంచెను. కాని వెనువెంటనే ఆతనికొక ఆలోచన తట్టెను. \"ఈ చిన్న చిన్న వస్తువులకు తాకించినచో కొద్ది బంగారము మాత్రమే రాగలదు. ఊరిలో ఇనుపవస్తువులు అమ్ము వర్తకుని యొద్ద వెలకొలది ఇనుప వస్తువులు కలవు. వాని యన్నింటిని కొనివైచి తాకించినచో కోట్లకొలది రూప్యముల విలువగల బంగారము లభించగలదు\".\n\nఅని ఈ ప్రకారముగ ఆలోచించి ఆ గృహస్థుడు తనయింటిలో దేనికిని తాకించక, నేరుగా ఊరిలోనికివెళ్ళి ఇనుప వర్తకునితో \"అయ్యా! మీ అంగడిలోని ఇనుపవస్తువు లన్నిటిని కొనదలచినాను. ఖరీదు ఎంత? అని యడుగగా వర్తకుడు \"మహాశయా! ఇపుడు ధరలు చాలా విపరీతముగ నున్నవి. మీరు కొనలేరు. ఇంకొక ఆరునెలలైన పిదప తగ్గవచ్చును అప్పుడు వచ్చి విచారించవచ్చును\" అని బదులు చెప్పెను. చక్కని సలహా చెప్పెనని తలంచి గృహస్థుడు ఆరునెలలైన పిదప తిరిగి విచారించగా వర్తకుడు 'ఇంకను ధరలు తగ్గలేదు; ఇంకొక ఆరునెలలైన పిదప తగ్గు ముఖము పట్టవచ్చును ' అని ప్రత్యుత్తర మిచ్చెను. గృహస్థుడట్లే ఇంకొక ఆరునెలలు ఓపికపట్టి తిరిగి వర్తకుని యొద్దకు పోవుచుండగా మార్గమధ్యములో సాధువు కనిపించి \"అయ్యా! సంవత్సరకాలము గడువు పూర్తి అయినది. నా స్పర్శవేదిని ఇచ్చివేయుము\" అని పలికి ఆ స్పర్శవేదిని గృహస్థునియొద్ద నుండి పెకలించుకొనిపోయెను. పాపము గృహస్థుడు నిర్వీర్యుడై, స్తబ్ధుడై అట్లే నిలబడిపోయెను. తన అజాగ్రత్తకు తానే వాపోవదొడగెను. సంవత్సరకాలము స్పర్శవేది తనయొద్ద ఉన్నప్పటికిని అతడు దానిని ఉపయోగించుకొనక వ్యర్థముగ కాలక్షేపము చేసెను. తత్ఫలితముగ అతని దారిద్ర్యము ఏమాత్రము తొలగక అట్లే ఉండెను. బాధలు ద్విగుణీకృతము లయ్యెను. చక్కని అవకాశము నతడు జారవిడిచి వేసెను.\n\nఅమూల్యమగు ఈమానవజన్మయే స్పర్శవేది. జీవుని ఆయుర్ధాయమే సంవత్సరపు గడువు. ఆయుర్ధాయము పూర్తిగాక పూర్వమే జీవుడు ఈ మానవదేహము ద్వారా ఆత్మసాక్షాత్కారమును ప్రయత్నపూర్వకముగ బడసి జన్మ సార్ధక మొనర్చుకొనవలెను. అట్లుగాక కాలయాపన చేసినచో యమధర్మరాజు వచ్చి ఈ శరీరమును కబళించుకొనిపోయి నచో మఱల ఇట్టి మహోత్కృతమైనదియు, బ్రహ్మావలోకన సమర్థమైనదియు నగు మానవజన్మ లభించుట దుస్తరము. కాబట్టి స్పర్శవేధి వలె అఖండ శక్తి సామర్థ్యములు కల ఈ మానవజన్మ సమాప్తము కాక పూర్వమే బ్రహ్మసాక్షాత్కారమను చరమ లక్ష్యమును జీవుడు సాధించివేయవలసి యున్నది. అందులకై తగు యత్నముల నతడు శీఘ్రముగ ఇప్పటినుండియే ఆచరించుట కుద్యుక్తుడు కావలయును.\n\nనీతి: మానవజన్మ చాల దుర్లభమైనది కావున ఆ జన్మ పూర్తి కాకమునుపే తీవ్రతర ఆధ్యాత్మిక సాధనల నొనర్చి ఆత్మసాక్షాత్కారమును బడయవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 832,
        "IMAGE": "cat_9",
        "NAME": "మహోన్నత మానవజన్మ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక అరణ్యమున అనేక మృగములు నివసించుచు చక్కగా కాలక్షేపము చేయుచుండెను. ఒకనాడొక నక్కకు ఆకస్మితముగా నొక ఊహ తట్టెను. బ్రహ్మదేవుడు ఎనుబదినాలుగు లక్షల జీవరాసులను విశ్వమున సృజింప ఒక్క మానవుడే ప్రాణు లందఱిలోనూ గొప్ప వాడుగా ఏల చలామణి యగుచున్నాడు? బలములోగాని, అకారములోగాని, ఊహాపోహలలోగాని, తిండిలోగాని, మోసములోగాని, మానవుని మించిన శక్తియుక్తులు గల ప్రాణికోట్లు యెన్నియో యుండ మానవుడు తానే గొప్పయని తలంచుటవెఱ్ఱి! శాస్రాదు లాప్రకారము ఆదేశించుటయు, అందులకు సమ్మతించుటయు చాల ఘోరము,అది కేవలము పక్షపాతమే యగును. కావున నిజానిజములు తేలవలెను. ప్రపంచములో మానవుని యాధిక్యతను నేనిపుడు 'సవాల్‌' చేయగలను. ఈ విషయము తాడో పేడో తేలువఱుకు నేనిక నిదురపోను అని నిశ్చయించి అదేపని గట్టుకొని అరణ్యమంతయు తిరిగి తిరిగి ప్రతీమృగమునకును తనకు గల్గిన అభిప్రాయమును నచ్చజెప్పి, వానిని రెచ్చగొట్టి, వానికి రోషావేష ములను గల్పించి తన వెనుక వేసుకొనగల్గెను. ఈ ప్రకారముగ అరణ్యములలో జంతుజాల మంతటిని నక్క ఒకచోట సమావేశపరచి, ఆ చతుష్పద మహాసభ యందిట్లు ఉపన్యాసింపదొడగెను.\n\n\"సోదరులారా! మన మృగ జాతియొక్క చరిత్రయందు నేడు సువర్ణాక్షరములతో లిఖింపదగిన సుదినమై యున్నదని మీరందరునూ జ్ఞాప్తియందుంచుకొనవలెను. ఏలననగా ఈనాడొక మహత్తర నిర్ణయము గావింపబడుచున్నది. ఈ అనంత విశ్వమందు కోట్లకొలది ప్రాణికోటులుండ, ఒక్క మానవుడు స్వార్థచింతనచే ప్రేరితుడై తన్ను సర్వోపరిస్థానమున నిలబెట్టుకొని యున్నాడు. అతని యభిప్రాయమునకు శాస్త్రములున్ను తాళముకొట్టినవి. ఇది సహింపరాని విషయము. దీనిని చులకనగా వదలివేయుట మన మృగజాతికే తీరని కళంకము. బలమందా, యోచనయందా, ఆకారమందా దేనియందు వానికంటె మనము తక్కువ? సోదరులారా! తీవ్రముగా యోచింపుడు! మనజాతిపై అభిమానము గల్గియుండు! మన జాతిలోగల అమానుషశక్తులను ఢంకా మ్రోగించి నలుగురికిని చాటుడు. 'సృష్టిలో మానవుడు కాదు, ఒకానొక జంతువే సర్వోపరిస్థాన మలంకరించుచున్నది' అని తీర్మానమును ఏకగ్రీవముగ సర్వులును ఆమోదించు నంతవఱకును మనకర్తవ్యము అపూర్ణముగనే యుండునని మరువకుడు. ఇక్కార్యసాధనమునకై మన మందరమును ఇపుడు సమీపమున గల ఒకానొక మహర్షి సత్తముని యొద్దకుబోయి విషయమంతయు సాకల్యముగ అతనికి మనవి చేసెదము. మీమీ శక్తులను, స్వభావములను అతని సమ్ముఖమున వ్యక్తము చేయుడు\" అని గంభీరముగ బలికి ఆ జంతువుల నన్నిటిని అటకు గొనిపోయెను.\n\nమహర్షి యొక్క అధ్యక్షతక్రింద జంతునివహ మంతయు సమావేశ మయ్యెను. అన్నియు నిశ్చలముగ గూర్చుండినవి. ఇంతలో ఏనుగు లేచి, \"మహాత్మా! నాకు గల బలములో నూరవవంతైనను మనుష్యనకు లేదు. ఆకారము చూతమా నామోకాలంత స్వరూపము కూడా అతనికి లేదు. అట్టిచో మానవుడేల గొప్పవాడగును? అని రోషముతో బల్కి కూర్చుండెను. ఇంతలో సింహము లేచి తన పరాక్రమమును చాటుకొని మానవుని యల్పత్వమును ఋజువు చేసెను. ఇట్లు అన్ని జీవరాసులున్ను తమ విలక్షణ గుణములను ఉగ్గడించి, జంతువుల శ్రేష్ఠత్వమును చాటుకొనెను. మఱియు ఆమహర్షిని తీర్పునివ్వవలసినదిగా వేడుకొనెను. అత్తఱి మహర్షి వానివాదములన్నిటిని ప్రశాంతముగా నాలకించి తుదకిట్లు పలికెను - \"ఓ మృగసత్తములారా! మీరు చెప్పినది యంతయు పరమసత్యము!! మీ శక్తులముందు మానవుడు గణకనే రాడు. కాని ఒక్క విషయములో మాత్రము మానవుడు మిక్కిలి యధికుడు. పుట్టుకతో వచ్చిన దుష్టసంస్కారములను మీరు మార్చుకొనలేరు. మానవుడు మార్చుకొనగలడు. ఇదియే అతని ఆధిక్యమునకు కారణము. ఇదియే మీకును అతనికి గల భేదము. ఋషిసత్తముని గంభీర విజ్ఞాన పూరితములగు ఆ పలుకులను విని నక్క తత్ క్షణమే లేచి 'అయ్యా! మహానుభావా! పుట్టుకతో వచ్చిన దుష్టసంస్కారమును మార్చుకొననిచో?' అని ప్రశ్నించెను. 'మార్చుకొననిచో మీరందఱికంటెను మనుజుడు నీచాతినీచుడే' అని యాతడు తేల్చి చెప్పివేసెను. న్యాయపరిపూర్ణములును, పక్షపాత రహితములు నగు అమ్మహర్షి వాక్యములును విని జంతువు లన్నియు 'భేష్ భేష్' అని సంస్తుతించుచు అచ్చోటు వీడి చనెను.\n\nనీతి: తమయందలి దుష్టసంస్కారములను జనులు ప్రయత్న పూర్వకముగ తొలగించుకొని సత్యసంస్కారములను కలుగజేసి కొనవలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 833,
        "IMAGE": "cat_9",
        "NAME": "సృష్టియందు మానవుని ప్రత్యేకత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "శ్రీ కృష్ణమూర్తి తన నిత్యజీవిత వ్యవహారమందు అనేక వస్తువులను ఉపయోగించుకొనుచున్నను, ఒక వస్తువును మాత్రం నిరంతరము తనయొద్దనే ఉంచుకొనుచుండెను. అదియే మురళి. దానిని శ్రీకృష్ణుడు ఏకాలమందును వదలక అహర్నిశము తన చెంతనే పెట్టుకొనుచుండెను. కొద్దిసేపు ఆహ్లాదకరముగ, శ్రోతలు తన్మయులగునట్లు ఆ మురళిని వాయించి, తదుపరి అ పిల్లనగ్రోవిని తన చెవిపైననో, బొడ్డునందో అతడు దోపుకొనుచుండెను. అంతియేకాని ఆ మురళిని దూరముగ ఎన్నడును ఉంచుటలేదు.\n\nఈ పరిస్థితి రుక్మిణీదేవి గమనించి ఒకప్పుడు తనలో నిట్లు వితర్కించుకొనెను - ఈ పిల్లనిగ్రోవి నిరంతరము శ్రీకృష్ణునకు అతి సమీపముగ వర్తించుచున్నది. శ్రీకృష్ణుడు దానిని వదులుటలేదు. దాని పుణ్యమేమియో! సతతము శ్రీకృష్ణుని సాన్నిధ్యశ్రీని అనుభవించు సౌభాగ్యము లభించుట సామాన్యమా? ఎన్ని జన్మముల తపఃఫలితమో అది. నేను కూడా శ్రీకృష్ణునకు ఒకింత దూరముననే యున్నాను గాని అంతసమీపమున లేను. నాకంటె మురళి ఎంతయో సన్నిహితత్వమును అనుభవించుచున్నది. భగవంతుడు దానిని వదలుట లేదు. ఆహా! ఎంతటి అదృష్టము! అట్టి సద్గతి లభించుటకు ఏమిపుణ్యము చేయవలెనో? నిరంతర శ్రీకృష్ణసాన్నిధ్యభాగ్యము కలుగుటకు ఎట్టి వ్రతముల నాచరించవలయునో! ఏవిధమైన తపము సల్పవలయునో! మురళి ఈ జన్మములో ఈ ప్రకారముగ శ్రీకృష్ణునకు అతి సన్నిహితముగ రాగల్గుటకు పూర్వజన్మపుణ్యమే కారణమై ఉండును. కాబట్టి ఆ పుణ్యమేదియో తెలిసికొనిన యెడల నేనుకూడ ఈజన్మలో అట్టి పుణ్య మాచరించి భావికాలమున ఆలోకైక ప్రభువునకు ఇంకను సమీపముగ వర్తింపగల్గుదును.\n\nఈ ప్రకారముగ చింతన చేసి రుక్మిణీదేవి ఆ మురళితో తద్విషయమునుగూర్చి చర్చించుటకై సమయము కొఱకు వేచియుండెను. శ్రీకృష్ణుడు ఆ మురళిని ఎపుడైన దూరముగ పెట్టియుంచినచో అపుడు దానితో ఏకాంతముగ మాట్లాడి అన్నియు తెలిసికొనవచ్చునని తలంచు చుండెను. రుక్మిణి యొక్క ఆంతర్యమును గ్రహించి శ్రీకృష్ణు డొకనాడు తాను నిదురబోవుచున్నట్లు నటించి ఆ మురళిని దూరముగ విసరివైచెను. సమయము కొఱకు నిరీక్షించుచున్న రుక్మిణి తక్షణమే దానిని తీసికొని ఒకానొక ఏకాంతస్థలమున కరిగి,దానికి ప్రాణప్రతిష్ఠచేసి మాట్లాడుశక్తిని ప్రసాదించి దానితోనిట్లు సంభాషించెను.\n\nఓ మురళీ! నీవు పూర్వజన్మలో ఏమిపుణ్యము చేసినావు? ఏయే వ్రతములను సలిపినావు? ఎట్టి దానధర్మములను కావించినావు? ఏయే తీర్థములను సేవించినావు? ఏ దేవతల నారాధించినావు? ఈ జన్మలో నీవు జగత్ర్పభువైన శ్రీకృష్ణుని దివ్యసాన్నిధ్యశ్రీని నిరంతరము అనుభవింపగల్గుట పూర్వజన్మలో నీవుచేసిన అలౌకిక పుణ్యముయొక్క ప్రభావమేయగును. కాబట్టి ఓ మురళీ! ఆ పుణ్యకార్యము లేవియో ఇపుడు నాకు తెలియజేసినచో నేనును వానిని ఆచరించి నీవలెనే శ్రీకృష్ణునకు అతిసమీపమున చేరగల్గుదును. కావున తొందరగా చెప్పుము. నీవు పూర్వజన్మములో ఏమిపుణ్యము చేసినావు?\n\nరుక్మిణీదేవి యొక్క యా పలుకులను విని మురళి - 'అమ్మా నాకేమియు తెలియదు. పుణ్యమునుగూర్చి గాని, పాపమునుగూర్చి గాని పరిజ్ఞానము నాకిసుమంతైనను లేదు. అసలు పూర్వజన్మలో నేనెవరోకూడ నాకు తెలియదు. క్షమించు తల్లీ!' అని సమాధానము చెప్పగా, రుక్మిణీ దేవి అందుల కంగీకరించలేదు. ఏదియో మహత్తర పుణ్యమును అది ఆచరించియే యుండునను నమ్మకము రుక్మిణీదేవికి కలదు. అందుచే మరల ఆమె ఆ మురళిని అవ్విషయమై నొక్కినొక్కి ప్రశ్నింప,చివరకు ఆ మురళి - 'అమ్మా! నాస్వరూప మెట్టిదో ఒక్కసారి చూడుము! నాలోపల ఏమియున్నదో బాగుగ పరికీంపుము. తదుపరి నీకే తెలియగలదు ' అని సమాధానమిచ్చెను. వెంటనే రుక్మిణి ఆ మురళిని పైకెత్తి లోన ఏమియున్నదో జాగ్రత్తగా పరీక్షించెను. కాని ఆ మురళి లోపల ఏమియు లేదు. వట్టి ఆకాశము(Vacuum)మాత్రము గోచరించెను.\n\nఅపుడు రుక్మిణీదేవి మురళితో - 'అమ్మా! నీలోపల చూచినాను. ఏమియులేదు. కేవలము ఖాళీగ నున్నది' అని పలుక అంతట మురళి \" ఆ ప్రకారము నాలో ఖాళీగ ఉండుటయే నాయొక్క విశేషము. నాలో ఏవిధమైన సరుకును నేను పెట్టుకొనలేదు. వస్తు జాలమునంతటిని పరిత్యజించి నాయంతరంగమును దృశ్యరహితముగ నొనర్చుకొంటిని. కనుకనే నేను శ్రీకృష్ణునకు సన్నిహితుడనైతిని. నావలెనే ఎవరైనను సరియే తమ యంతఃకరణమునందలి వాసనాజాలమును, దుస్సంస్కారములను, ప్రాపంచిక విషయ సంకల్పములను తొలగించి వైచి, మనస్సును నిర్విషయముగ గావించి నిస్సంకల్పస్థితిని బడయుదురో అట్టివారు భగవంతునకు అతిసమీపముగ వర్తింపగల్గుదురు. మనశ్శుద్ధియే, అంతఃకరణము యొక్క నిర్మలత్వమే దైవప్రాప్తికి హేతువు\" - అని గంభీరముగ పలికెను.\n\nమురళియొక్క ఆ హేతువాద సమన్వితవచనములను విని రుక్మిణి పరమానందభరితయై తన యంతఃకరణమును గూడ అట్లు సునిర్మల మొనర్చుటకును, నిస్సంకల్పముగ, చిదాకాశమయముగ గావించుటకును కృతనిశ్చయమయ్యెను.\n\nభగవత్ర్పాప్తికి మనోనిర్మలత్వమే ఏకైక కారణమని ఈ యితిహాసము ద్వారా స్పష్టమగుచుండుట వలన ముముక్షువులు తమ చిత్త శుద్ధికై తీవ్రకృషి సల్పి ఈ జన్మమునందే దైవసాన్నిధ్యమును అనుభవించుదురుగాక!\n\nనీతి: మనస్సును వాసనారహితముగ, దుర్గుణ దుస్సంకల్ప రహితముగ నొనర్చినచో, ఆత్మసాక్షాత్కారము తక్షణమే కలుగగలదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 834,
        "IMAGE": "cat_9",
        "NAME": "మనశ్శుద్ధిచే దైవప్రాప్తి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 76,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక ఆశ్రమమునందు ఒక గురువు,పదిమంది శిష్యులు కలరు. శిష్యులకు చక్కని ఆధ్యాత్మ విషయములను బోధించి వారిని తరింపజేయవలెనను కాంక్ష గురువునకు మిక్కుటముగ నుండెను. తదనుసార మతడు సమయము దొరికినపుడెల్ల వారందరిని ఒకచోట సమావేశపరచి నిగూఢములైన పరమార్థ సత్యములను వారికి బోధించుచుండెను. ముఖ్యముగా \"భగవంతుడు సర్వవ్యాపి\" అను సత్యమును అతడు నెలదినముల నుండి శిష్యులకు నూరిపోయుచుండెను. ఆబోధ వారి హృదయములందు ప్రవేశించు నిమిత్త మాదేశికోత్తముడు ఎన్నియో ఉపమానములను, దృష్టాంతములను గైకొని చక్కగ బోధసల్పు చుండెను. దివ్యమైన యా బోధనాలకించుచు అంతేవాసులు ఆనందడోలికలలో నూగుచుండిరి. వారి సంతోషమునకు మేరలేదు. అనుభవజ్ఞుడగు ఆచార్యుడు లభించెనుగదా యని వారు తమ అదృష్టమును కొని యాడుచుండిరి.\n\nఇట్లుండ కొంతకాలమునకు గురుదేవుడు తాను తన శిష్యులకు గావించిన పరమార్థబోధ వారికి సరిగా జీర్ణమైనదో లేదో తెలిసికొనుటకై ఒక పరీక్ష గావింపనెంచెను. ఒక దినమున అతడు తన పదిమంది శిష్యులను పిలిచి ఒక్కొక్కరికీ ఒక్కొక్క అరటిపండునిచ్చి వారితో నిట్లనెను - ఓ అంతే వాసులారా! నెలదినములనుండి మీకొక గంభీరమగు పరమార్థ సత్యమును గూర్చి వివరించి చెప్పుచున్నాను. ఆ తత్త్వము మీకందరికిని అవగతమైనదో లేదో నేను తెలిసికొనదలంచినాను. ఆధ్యాత్మ విద్యను అనుభవముతో మేళవించినపుడే శోభించును. వాచావేదాంత మునకు విలువలేదు. ఏ సత్యమైనను అనుభూత మొనర్చుకొనినపుడే పూర్ణఫలిత మొసంగ గల్గును. కాబట్టి నెలదినముల నుండి మీకు బోధించుచున్న 'భగవంతుని సర్వవ్యాపకత్వ' సిద్ధాంతము మీకు హృదయస్థమైనదో, లేదో పరీక్షింపదలంచినాను. ఇదిగో, ఇపుడు మీకందరికిని ఒక్కొక్క అరటిపండు ఇవ్వబడినది కదా! దానిని మీరు తీసికొనిపోయి ఎవరును చూడకుండ తిని మరల నాయొద్దకు రావలసినది.\n\nఆచార్యుని యావాక్యములను విని శ్రద్ధాళువులైన ఆ శిష్యులందరునూ గుర్వాజ్ఞను శిరసావహించుటకై ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు చేరిరి. మొదటివాడు ఒకానొక గృహములో ప్రవేశించి అందొక ఏకాంత ప్రదేశమున నున్న గదిలో దూరి తలుపు గడియవైచి, కిటికీలు బంధించి రెండవ ప్రాణి ఎవరును చూడకుండ గురుదేవు డిచ్చిన అరటి పండును తినివైచెను. ఇక రెండొవవాడు సుదూరప్రాంతమున గల ఒక పాడుబడిన సత్రములో జొరబడి అందొక గదిలో తలుపువైచి నేలమీద చీమలుండుట జూచి, అవికూడా ప్రాణులే కాబట్టి అవి చుచినచో గురువాజ్ఞను మీరినట్లగునని భావించి తడిగుడ్డతో వాటినన్నింటిని అద్ది బయట పారవైచి లోన ఏ ప్రాణియు చూడకుండ అరటిపండును అమాంతముగ ఆరగించి వైచెను.\n\nఇక ముడవవాడు భూమిపై ఎవరో ఒకరు చూచుచునే యుందురని నిశ్చయించి, నీళ్లలో మునిగి, అందుగల చేపలను దూరముగ నెట్టి వేసి అరటిపండును తినివైచెను. ఈ ప్రకారముగ ఒకొక్కరు ఒకొక్క చోటునను ఎవరు చూడకుండ ఆ అరటిపండు భక్షించివైచి గురువాజ్ఞను చక్కగా పాళించి సాయంసమయమునకు అందరును గురువు చెంతకు వచ్చిచేరిరి. కాని విచిత్రమేమనగా, ఆ పదిమందిలోనూ తొమ్మిదిమంది గురువిచ్చిన అరటిపండును తినివేసి రాగా, పదియవ వాడు మాత్రము దానిని తినకుండ తిరిగి గురువునొద్దకు దానిని తీసికొనివచ్చెను. వారందరును చేరినపిదప గురువు ఒక్కొక్కరిని వారెక్కడెక్కడ ఏయే విధముగా పండును భక్షించినది వివరముగా తెలుపమని చెప్పగా అంతేవాసు లొక్కక్కరు తాము ఏ ప్రకారము రెండవప్రాణి చూడకుండా ఫలమును భుజించినది వివరించి చెప్పిరి. కాని చివరివాడు \"మహాత్మా! గురుదేవా! తాము నెలదినముల నుండి భగవంతుడు సర్వవ్యాపి అనియు, చరాచర జగత్తునం దంతటను బహ్యాభ్యంతరములందును అణువణువునందును ఆ పరాత్పరుడు వ్యాపించియున్నాడనియు, అతడు లేని చోటే లేదనియు బోధించి యున్నారు గదా! మఱి అట్టి భగవంతుడు నాప్రక్కనే ఉండి చూచు చుండనేనెట్లు అరటిపండును తినగలను? అందుచే దానిని తినకుండ తిరిగి తీసికొని వచ్చితిని\" అని వినయముతో బలికెను.\n\nఆ వాక్యములు నాలకించి గురుదేవుడు పరమానందపడి తక్కిన శిష్యులతో \"ఓయీ! ఈతడొక్కడే నేను బోధించిన దానిని చక్కగ జీర్ణ మొనర్చుకొనినాడు. మీరందరును నాబోధను పైపైన తెలిసి కొనిరే గాని అనుభవపూర్వకముగా తెలిసికొనలేదు. భగవంతుడు అణువణువు నందున వ్యాపించియుండ, సర్వసాక్షియై జీవుల సమస్త వ్యవహారమును పరికించుచుండ, నా ప్రక్కన ఎవరులేరని భావించి మీరెట్లు ఫలమును భుజించగలరు? కావున మీరందరిలోకి నేను చెప్పిన బోధను చక్కగా గ్రహించినవాడు ఈతడొక్కడే. ఇక మీదటనైనను మీరందరూ జాగ్రత్తగా వహించి నేను చెప్పుదానిని సరిగా, ఆచరణలో నుంచుకొని అనుష్ఠించి ధన్యులు కండు!\" అని బోధించాను. శిష్యులందరు అట్లే అని వచించి తమతమ జీవితములను గురుబోధచే సంస్కరించుకొని కృతార్థులైరి.\n\nకావున భగవానుడు సర్వసాక్షియై బాహ్యామునకేగాక అంతరంగమున జీవుల సంకల్పములను గూడ బహుజాగ్రత్తగ పరిశీలించుచుండునని నిశ్చయించి ఏపాపమును చేయక, భగవద్భక్తి, జీవకారుణ్యము, సర్వభూతదయ కలిగి పవిత్రజీవితమును గడిపి భగవత్కృపకు పాత్రులగుదురుగాక!\n\nనీతి: భగవానుడు ఆకాశముకంటెను మహాసూక్ష్మమైనవాడు. అతడు చిదాకాశ స్వరూపులు. అతడు సర్వత్ర వెలయుచున్నాడని తెలిసికొని పాపకార్యములను చేయక దైవసాక్షాత్కారము కొఱకై యత్నించ వలయును. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 835,
        "IMAGE": "cat_9",
        "NAME": "భగవంతుడు సర్వాంతర్యామి ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 77,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకానొక పట్టణమున ఒక బీదవాడు నివసించుచుండెను. అతడు ఇంటింటికి వెళ్లి భిక్షాటనము చేయుచు జీవించుచుండెను. అతనికి ఒక సెంటు నేల తప్ప ఇతరములగు ఆస్తిపాస్తు లెవ్వియు లేవు. ఆ కొంచెము నేలయే అతనికి అధారము. అయితే అ నేలలో వచ్చు ఒరుంబడి చాలనందున అతడు భిక్షాటనమును జేపట్టెను. ప్రతిదినము 'భవతీ భిక్షాం దేహి ' అను వాక్యమును పలుకుచు ఇంటింటికి వెళ్లి వారిచ్చు తృణమో పణమో స్వీకరించుచు కాలమును గడుపుచుండెను.\n\nఇట్లుండ ఒకనాడు భిక్షాటనమునకు బయలుదేరిన కొద్దిసేపటికే అదృష్టవశాత్తు ఒక ఇంటిలో అతనికి పుష్కలముగ భోజనము లభించెను. దానిని ఆ యింటిముందే కూర్చొని అతడు చక్కగా ఆరగించెను. కడుపు నిండుటచే అతడు పరమానందపడెను. \"ఆహా! ఈ రోజు ఏమాత్రము ప్రయాసపడక, ఇంటింటికి తిరుగకనే భగవంతుడు నాకు చక్కని ప్రసాదము లభించునట్లు చేసెను\" అని అనుకొనుచు ఆ బీదవాడు ఇంటికి దారిబట్టెను.\n\nమార్గమధ్యమున ఒక యింటివారు అతడు దరిద్రుడని గ్రహించి దగ్గరకు పిలిచి పేలపిండిగల ఒక పిడతను ఇచ్చి అందలి పిండిని భుజించమని చెప్పిరి. బీదవారు సామాన్యముగ పేలపిండిలో బెల్లము వేసుకొని కలిపి తినుచుండు వాడుక గలదు. అయితే ఇంతకు మునుపే కడుపార భుజించినందువలన, దరిద్రుడా పిడతను తీసుకొని ఇంటికి చనుచు మధ్యాహ్నసమయ మగుటచే ఎండవేడిమికి తట్టుకోలేక ఒక ఇంటి అరుగుపై కొంతసేపు విశ్రమించెను.\n\nఆరుగుపై పడుకొని పేలపిండి గల పిడతను కాలిదగ్గర పెట్టికొని ఆ దరిద్రుడు కొంతసేపు సుఖముగ నిద్రింపదల్చెను. కాని నిద్రపట్టనందున ఏవేవో ఆలోచనలు చేసికొనుచుండెను. ఈ క్రింది విధముగ అతడు తనలో తాను భావించుకొనుచు కాలక్షేపము చేయదొడగెను.\n\n\"ఇపుడు నాకు కడుపు నిండినది. ఇక భోజనముతో పనిలేదు. కాని ఎవరో పేలిపిండితో గూడిన పిడతను ఇప్పుడే నాకిచ్చిరి. కావున ఈ పిడతను బజారుకు తీసుకుని వెళ్లి అందలి పిండితోసహా ఎవరికైనా అమ్మివైచెదను. 20 పైసలు రావచ్చును. ఆ 20 పైసలతో నువ్వులు కొందును. ఆ నువ్వులను నాకు ఉన్న కొద్దినేలలో చల్లివేయుదును. అపుడు కొన్నాళ్ళకు చక్కని నువ్వులపంట వచ్చును. దానిని పరిపక్వ దశలో కోసివైచి నువ్వులను ఒక గోతాములో పోయుదును, ఒక బస్తా నువ్వులు రావచ్చును. వాటిని వెంటనే మార్కెట్టులో అమ్మివేయుదును. నూరు రూపాయలు రావచ్చును. వెంటనే ఆ పైకమును వడ్డీకి ఇచ్చుదును. పది సంవత్సరాలలో వడ్డీ, కాంపౌండు వడ్డీ పెరిగి పెరిగి ఒక వెయ్యి రూపాయలు మొత్తం కావచ్చును. అప్పటికి నాకు వివాహ వయస్సు కూడ దాపురించును. ఎపుడు అంత పైకము నా దగ్గర ఉన్నదని జనులు తెలిసికొందురో అపుడు పెండ్లి చేయుటకై నా పిల్ల నిచ్చెదను, నా పిల్ల నిచ్చెదను అని జనులు ముందుకు వచ్చుదురు. వారందరిలో మంచిపిల్లను ఏరుకొని నాకు నచ్చినదానినే నేను వివాహము చేసికొందును.\n\nవివాహమైన తరువాత భార్య కాపురమునకు వచ్చును. సుఖముగ సంసార జీవితమును గడపుచుందును. ఎప్పుడైన నా భార్య నాతో పోట్లాడినచో, ఆమె నన్ను తట్టినచో నేను మాత్రము ఊరుకొనను. కోపముతో దానిని కాలితో తన్నివేయుదును - అని ఆ దరిద్రుడు తన కాలిని జోరుగ విదిలించెను. తోడనే కాలిక్రిందనున్న పేలపిండి పిడత పగిలిపోయి, అందలి పిండి గాలికి కొట్టుకొనిపోయెను.\n\nచూచితిరా! ఆ దరిద్రుని పేరాశ! ఏ పేలపిండి పిడతను అమ్మి ఇంత నాటకము జరుపదలంచెనో అది కాస్తా నాశనమైపోయెను. అతని ఆశలన్నియు నిరాశలైపోయెను. అతడు కట్టిన గాలిమేడలన్నియు చితికిపోయినవి. అజ్ఞానదశలో మానవు డీప్రకారమే కోరికపై కోరికను పెంచుకొని తుదకు అసలుకే మోసము తెచ్చుకొనును. ముముక్షువైనవాడు ఆశలను పెంచుకొనుచు పోరాదు. ఉన్నవాటినే క్రమముగా తగ్గించుకొనుచు రావలెను. 'ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్‌ ' అని గీతాచార్యు లానతిచ్చిన ప్రకారము ఏనాటికైనను కోరిక లన్నిటినీ పూర్తిగా విడనాడినప్పుడే మనుజునకు పూర్ణశాంతి కలుగగలదు. ఈ రహస్యమెఱింగి మానవుడు తృష్ణాపరవశుడు కాక, అవసరములను మాత్రము తీర్చుకొనుచు వైభవమును తిరస్కరించుచు, జీవితమును గడుపవలెను. ఏదియైన దృశ్యసంబంధమైన కోరిక మనస్సునందు ఉద్భవించినచో దానిని వివేకముచే మొదలంటనే త్రుంచివేయవలెను. అట్లు కానిచో అది వృద్ధినొంది, వృద్ధినొంది చిలవలు పలువలు వేసి, ఇంకను క్రొత్త క్రొత్త కోరికలను జనింపజేసి మానవుని అధోగతికి త్రోసివేయును.\n\nకావున ముముక్షువగునాడు ఆశకు లోనుకాక, తృష్ణకు తన జీవితములో ఏమాత్రము అవకాశ మొసంగక కడుజాగరూకుడై మెలగవలెను. కథలోని దరిద్రునివలె ఆశలు పెంచుకొని శోకవిహ్వలుడు కారాదు. తృష్ణను చేదించివైచి జీవితమును ఆనందమయముగ నొనర్చుకొనవలెను.\n\nనీతి: మనుజుడు ఆశకు లోబడక, ఉన్నదానితో తృప్తినొంది శేషించిన సమయమును దైవధ్యానాదులందు వినియోగించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 836,
        "IMAGE": "cat_9",
        "NAME": "పేరాశ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 78,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున పశ్చిమదేశమునందు ఒకానొక మల్లయుద్ధ ప్రవీణు డుండెను. అతడు ఆజానుబాహుడు, భీమబలుడు, గొప్ప వస్తాదు. కుస్తీయందు ఎందరినో ఒక్కపెట్టున ఓడించివైచి జగద్విఖ్యాతి నొందెను. భూమండల మంతటను సంచరించి మల్లులందరిని పరాజితులుగ చేసి జగదేకవీరుడు అని ప్రఖ్యాతిని బడసెను. అతని శరీరము చూచుటకు చాల సుందరము గను, ఆరోగ్యవంతముగను నుండెను. తన భజబలమును, తన సౌంధర్యమును తన జగద్విఖ్యాతిని జూచి అతడు మురిసిపోవుచుండెను.\n\nఒకనా డామల్లున కొక ఊహ జనించెను. అతడు తనలోతానిట్లు వితర్కించుకొనెను - \"నేను మహాబలవంతుడను, శక్తిశాలిని. నా బలము, నా ఉత్తేజము, నా పరాక్రమము ఇంకను వృద్ధికావలెననిన ఉపాయమేమి? ప్రపంచములో అత్యంత పరాక్రమశాలియైన ప్రాణి యేదైనా నున్నచో, దానిని నిరంతరము స్మరణ చేయుచున్నచో నాకు ఉత్సాహము, సాహసము ఇనుమడించును. అట్టి ప్రాణి ఒకటేకలదు. అదియే సింహము. దాని పరక్రమమునకు, ధైర్యమునకు అంతులేదు. పెద్ద పెద్ద గజరాజములను కూడ తృటిలో పడగొట్టివైచును. కాబట్టి అది నిరంతరము స్మరణకు వచ్చుటెట్లు? నాచేతిపై సింహపుబొమ్మను పచ్చపొడిపించుకొనినచో, అది ఎల్లప్పుడు నాకు దృష్టిగోచర మగుచుండును. కావున దాని దర్శన మాత్రముచే నాకు అపరిమిత ధైర్యస్థైర్యములు గలుగగలవు.\n\nఈ ప్రకారముగ తనలో తాను సమాలోచించుకొని ఆ మల్లయుద్ధప్రవీణుడు పచ్చపొడుచువాని కొకనిని తనయింటికి పిలుచుకొనివచ్చి తనచేతిపై సింహముయొక్క బొమ్మను వేయవలెనని ఆదేశించి అందులకు ధర నిర్ణయించుకొనెను. వెంటనే పచ్చ పొడుచువాడు సూది మొదలైన తన పరికరములను దెచ్చి మల్లునితో \"ఓయీ! నీచేయి జూపుము. నీవు నావంక చూడవద్దు. ఒకింతబాధగా ఉన్నను ఓర్చుకొనుము. కొద్దిసేపు ఓర్చుకొనినచో సింహపుబొమ్మ శాశ్వతముగా నీచేతిపై వేలయుగలదు\" అని చెప్పి తన పనికి ఉపక్రమించెను.\n\nఎంత యోధాగ్రేసరుడైనను సూదితో పొడుచుచునప్పుడు నొప్పి కలుగక మానదు. ఆ సూదిపోట్లను భరించలేక మల్లుడు పచ్చపొడుచు వానితో నిట్లనెను - \"అయ్యా! సింహమును ఎక్కడ ప్రారంభించినారు? పచ్చపొడుచువాడు - తోకదగ్గర\n\nమల్లుడు - సరేగాని, నాకు వేసే సింహానికి తోకలేకపోయినా ఫరవాలేదు. తోక మినహాయించి మిగతా సింహం వేయండి.\nఅంతట పచ్చపొడుచువాడట్లే కావించెను. అయినను మరల కొంతసేపటికి ఆ సూదిపోట్లను భరించలేక మల్లుడు వానితో ఇట్లనెను -\nఅయ్యా! మరల ఎక్కడ ప్రారంభించినారు?\nపచ్చపొడుచువాడు - పొట్టదగ్గర\nమల్లుడు - అయ్యా! దయచేసి నా సింహానికి పొట్ట ఎగరకొట్టండి. ఏమీ ఫరవాలేదు. ఈ బాధ భరించలేకుండా ఉన్నాను.\n\nపచ్చపొడుచువాడట్లే కావించెను. మఱి కొంతసేపటికి మల్లుడు ఆబాధయు సహించలేక, మహాప్రభో! ఇప్పుడెక్కడ మొదలు పెట్టినారు? అని అడుగగా \"తలదగ్గర\" అని జవాబు వచ్చెను. క్షమించండి. నా సింహానికి తలలేకపోయినా పరవాలేదు. మిగతాది వేయండి?\" అని మల్లుడు శాసించెను. ఆ వాక్యములను వినగానే పచ్చవేయువానికి రోషము మండిపోయెను, విసుగుపుట్టెను. ఇదెక్కడి పచ్చయ్యా! తలలేదు, తోకలేదు, పొట్టలేదు. ఇక ఆసింహానికి నామరూపాలే ఎక్కడ? ఇట్టి సింహం వేయుంచుకుంటే ఏమి. వేయించుకొనకపోతే ఏమి? ఈ పని నాకు గిట్టదు అనిపలికి ధుమధుమలాడుచు, చీదరించుకొనుచు వెడలి పోయెను.\n\nకొద్దిసేపు ఓర్చుకొనినచో యావజ్జీవితము సింహచిత్రమును దర్శించు సౌభాగ్య మాతనికి అబ్బియుండెడిది. అల్పసుఖమును త్యజించినచో అధికసుఖము కలిగియుండెడిది. కాని అతడట్లు కావింప లేదు. కనుకనే నిరంతర సింహదర్శన లబ్ధమహోత్సాహమును అనవసరముగ గోల్పోయెను.\n\nఅట్లే అపారమగు ఆత్మానందమును, బ్రహ్మానందమును అను భవింపవలె ననిన విషయజనితమగు ఒకింత అల్పసుఖమును మానవుడు త్యాగము చేయవలసి యున్నాడు. బహుజన్మార్జిత స్వభావ ప్రాబల్యము వలన మనుజుడాయల్పసుఖమును, విషయానందమును, దృశ్యసౌఖ్యాదులను వదలలేకున్నాడు. తత్ఫలితముగ చిత్తమునకు ఏకాగ్రత, పవిత్రత లేమి అనంతమగు బ్రహ్మానందమును గోల్పోవుచున్నాడు. కాబట్టి విజ్ఞుడగువాడు సాధనయందు ఇంద్రియ నిగ్రహాదులందు ఎన్ని కష్టముల నైనను ఓర్చుకొని, ఒకింత నిబ్బరముతో విషయసుఖమును త్యాగమొనర్చి, భగవత్కృపకు పాత్రుడై, అపారమగు ఆత్మానందమును బడసి జీవితమును ధన్యమొనర్చుకొనవలెను.\n\nనీతి: అనంతమగు ఆత్మసుఖమును బడయదలంచువారు విషయ సుఖమును దూరముగ నుంచవలెను. కష్టసహిష్ణుత గలిగి దైవముకొఱకై అనవరతము యత్నించవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 837,
        "IMAGE": "cat_9",
        "NAME": "అనంత సుఖమునకు బాట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 79,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొక అమాయకుడగు పల్లెటూరి మనిషి మూడుమైళ్ళు దూరములోనున్న తన గ్రామమునకు బోవుచుండెను. సాయం సమయమైనది. చీకటి పడుచుండెను. క్రమముగ దట్టమైన అంధకారము నలుదెసల వ్యాపించెను. వెనువెంటనే అతడు తన చేతియందున్న లాంతరు వెలిగించి ఏదియో ఒక భావన అకస్మాత్తుగా మనంబునావరింప అట్లే చతికిలబడి కూర్చుండి ఏడ్చుచుండెను. సమీపముననే పోవుచున్న ఒకానొక పాంథుడతని దీనస్థితి జూచి దగ్గరకు వచ్చి \"ఏమయ్యా ఏడ్చుచున్నావు?\" అని యడుగ నాతడిట్లు ప్రత్యుత్తరం ఒసంగెను. \"బాబూ! ఏమని చెప్పుదును గొప్ప సంకట మేర్పడినది. నేను పోవలసిన గ్రామ మింకను రెండుమైళ్ళు దూరములో నున్నది. కాటుకవలె దట్టమైన చీకటి యావరించినది. చేతిలో ఈ చిన్నలాంతరు కలదు. దీనిప్రకాశము పదిగజముల దూరమువరకు మాత్రము పోవుచున్నది. రెండుమైళ్లు ఎచట! పదిగజము లెచట! రెండుమైళ్ళు చీకటి పోగొట్టగల బ్రహ్మాండమైన లైటుండిననే నేనిపుడు ఊరు చేరగలను, లేకున్న నాగతి యింతే. ఈ దౌర్భాగ్యపు లాంతరుకు అంతశక్తి లేకపోయెనే! ఏమి చెయుదును? ఘోరవిపత్తువచ్చి మీద పడినది మహాప్రభూ\" అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్వదొడగెను. ఈ వాక్యములను విని పాంథుడు పక పక నవ్వి \"ఓయి వెఱ్ఱివాడా! లెమ్ము, లాంతరు చేతిలో బట్టుకొని నడకసాగింపుము. దాని కాంతి అల్పమైనను, పది గజములు దూరమే పోగలిగినను, దానిని చేతబూని నడువసాగినచో పదిగజములు,మరల పదిగజములు - ఈ ప్రకారముగ దారియంతయు వెలుగును జిమ్మును. ఒకచోట కూర్చునినచో మాత్రము ఈ పని సాధ్య పడదు. కాబట్టి కార్యశీలుడవు కమ్ము. సోమరితనమును దూరీకరింపుము\". అని హితవు చెప్పి వెడలిపోయెను. ఆతడట్లే ఆచరించి గమ్యస్థానము చేరి సుఖించెను.\n\nకావున ఏ ఒకింత భక్తికాని, వైరాగ్యముకాని, విచారణగాని యున్నప్పటికిని ఆ చిన్న ప్రకాశమును ఆలంబనగా దీసికొని సాధనను ప్రతినిత్యము విడువకుండ చేయుచున్నచో విశాల సాంద్ర అజ్ఞానాంధ కారమంతయు పటాపంచలై జీవునకు మోక్షస్థితి కలుగగలదు.\n\n'దైవసాక్షాత్కారము నేనెట్లు పొందగలను?' అని ఎవరును నిరుత్సాహ పడవలసిన పనిలేదు. దైవత్వము మహర్షుల ఒక్కరి సొత్తుకాదు. అది ప్రతిజీవియొక్కయు జన్మహక్కు. తన జన్మహక్కు కొఱకై ప్రతివాడును పాటుపడవచ్చును కూడ. తాను ఆధ్యాత్మిక రంగమున ఎక్కువ అనుభవము, ప్రవేశము లేని వాడైనప్పటికిని ప్రయత్నము విడువక శ్రద్ధతో ఒకింతైనను ప్రతిదినము సాధన చేయుచుండినచో గమ్యస్థానము తప్పక చేరగలడు. దుఃఖించవలసిన పనిలేదు. అధైర్య పడవలసిన అవసరము లేదు. \"నేను చేయునది స్వల్పసాధనకదా, ఇంతగొప్ప సంసారసాగరమును ఎట్లు తరించగలను? ఇంత దట్టమైన అజ్ఞానంధకారమును ఎట్లు చేదించగలను?\" అని గృహస్థులు మున్నగువారు దిగులుపడవలసిన పనిలేదు. అయితే పరిశ్రమ వదలగూడదు. సాధన విరమించగూడదు.\n\nయోజనానాం సహస్రాణి యాతి గచ్చన్‌ పిపీలికాః |\nఅగచ్చన్‌ వైనతేయో పి పదమేకం న గచ్చతి ||\n\n'నడక సాగించుచుండినచో చీమకూడ వేలకొలది మైళ్ళ దూరమును దాటిపోగలదు. నడక సాగించనిచో గరుత్మంతుడై నప్పటికిని ఒక్క అడుగైనను దాటలేడు '. కాబట్టి ఎవరికైనను శక్తి,యుక్తి, విజ్ఞానము, శాస్త్రపాండిత్యము, అల్పమైనప్పటికి దానివలన భయపడనవసరము లేదు. ఆ ఉన్న ఒకింతశక్తితోనే ప్రారంభించి తనపైన అచంచల విశ్వాసము గల్గియుండి సాధనను విడువకుండ ఆచరించు చుండినచో అచిరకాలములోనే మహామహా ధురంధరులు పొందిన లక్ష్యమును అతడు కూడ పొందగల్గును.\n\n\"నమే భక్తః ప్రణశ్యతి\" నా భక్తుడు చెడడు - అని భగవానుడు హామీ ఇచ్చిఉన్నాడు కదా! ఇక భయమేల?\n\nనీతి: ఓకింత సాధన యైనను విడువకుండ ప్రతినిత్యము ఆచరించుచుండినచో జీవుడు లక్ష్యమును చేరగల్గును. నిరుత్సాహము పనికిరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 838,
        "IMAGE": "cat_9",
        "NAME": "నిరంతరసాధన",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 80,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "అదియొక మహాపట్టణము. పట్టణ మధ్యభాగమున పురపాలకమందిరము కలదు. బ్రహ్మాండమైన సౌధమది. అందు తఱచు మహాత్ముల యొక్క ఉపన్యాసములు జరుగుచుండును. ఆ పట్టణమునకు ఏ మహనీయుడు ఏతెంచినను వారి భాషణము అచ్చోటనే ఏర్పాటు చేయబడుచుండును. కొన్ని వందలమంది చక్కగ కూర్చొని వినుటకు అచట అవకాశము కలదు.\n\nఒకనాడొక గొప్ప తపస్వి, విద్యావంతుడు ఆధ్యాతిక అనుభూతిని బడసినవాడు నగు మహానీయు డాపట్టణమును విచ్చేయ, ఊరి పెద్ద లాతనిని గౌరవించి, ఆదరించి నాటిరేయి ఆ పురపాలక భవనము నందు వారి ఉపన్యాసము నేర్పరచిరి. వారి భాషణమును వినుటకు ప్రజలు తండోపతండములుగ వచ్చిరి. విశాలమగు ఆ సభాభవన మంతయు జనులచే క్రిక్కిరిసిపోయెను. రాత్రి 7 గంటలకు వక్త ఇంగ్లీషులో తన ప్రసంగమును ప్రారంభించి సరిగా 8 గంటలకు ముగించెను. ముగించుటకు ముందుగా అతడు శ్రోతలందరిని ఉద్దేశించి ఇట్లె పలికెను.\n\n\"ఓ ముముక్షువులారా! జిజ్ఞాసువులారా! మీరందరునూ ఇప్పుడు శ్రద్ధాభక్తులతో కూడి ఒక గంటసేపు అనేక పారమార్థిక విషయములను గూర్చి వింటిరి. మీకందరికి అవియన్నియు జ్ఞాపకమున్నవో లేవో నాకు తెలియదు. అయినను మీ యొక్క అనుకూలముకొఱకై నేనిపుడు చెప్పిన గంటసేపు ఉపన్యాసము యొక్క సారాంశము నంతను ఒక్క వాక్యములో చెప్పెదను వ్రాసికొనుడు\" - అని వచింప వెంటనే సభలో నున్న వారందరును తమ తమ జేబులలో నున్న నోటుపుస్తకములను, కలములను తీసి ఆ సారభూతమగు వాక్యమును వ్రాసుకొనుటకై సిద్ధపడిరి. అతడు ఏమి చెప్పునో యని ఒడలంతయు చెవులుచేసుకొని కాచుకొనియుండిరి. అపుడు ధర్మప్రబోధకు డిట్లు తన ఉపన్యాస సారమును ఒక్క వాక్యములో గంభీరముగ చెప్పివైచెను.\n\n\"God first, World next, Myself last\" మొదట దేవుడు, పిదప ప్రపంచము, చివరికి నేను\" దాని యర్థమేమనగా ప్రతిదినము నిద్రలేవగానే మొట్టమొదట దేవుని స్మరింపుము. ఆ పిదప లోకములో ఎవరికైన ఉపకారము చేయుము. ఆ తరువాతనే నీ వ్యవహారము, నీ భోజనాదులు మున్నగువానిని గూర్చి పట్టించుకొనుము.\n\nఈ చక్కనివాక్యమును ఉపన్యాసకుని ఆదేశము ననుసరించి సభలో వారందరును శ్రద్ధతో వ్రాసుకొని వారివారి ఇండ్లకు వెళ్లిరి. కాని ఆ సభలో ఒక్కనియొద్ద మాత్రము పుస్తకముగాని, కలముగాని లేదు. అయినను ఇంటికి వెళ్లగానే వ్రాసుకొందునని తలంచి ఆ వాక్యమును దారిలో చక్కగా మననము చేసుకొనుచు పోవుచుండెను. కాని, అదియొక మహాపట్టణ మగుటచే త్రోవలో బస్సులు ,లారీలు , బండ్లు మున్నగు వానిని తప్పించుకొని పోవలసివచ్చుటచే అతని ఏకాగ్రత కుంటు పడుచుండెను. తత్ఫలితముగ తాను వినిన వాక్యము World first, God next, Myself last - అని మననము చేయుచుండెను. తీరా, ఇంటికి చేరుసరికి త్రోవలోని విక్షేపముల వలన చిత్తైకాగ్రత ఇంకను చెడిపోగా, పుస్తకము తీసుకొని తాను వినిన వాక్యము Myself first, World next, God last - నేను మొదట, ప్రపంచము తరువాత , దేవుడు చివరికి - \" అని వ్రాసికొనెను.\n\nఇపుడు ప్రపంచములో పెక్కురు అజ్ఞానవశమున ఇట్టి నిర్ణయమే కలిగియున్నారు. ఉదయము నిద్రలేవగనే మొట్టమొదట తన శరీరాదుల విషయమే పట్టించుకొనుచు దైవమును విస్మరించుచున్నారు. ఇది చాలా ఘోరము. తన్ను సృష్టించి, పాలించి, పోషించునట్టి హృద్గతపరమాత్మను మఱచి ప్రవర్తించుట భయంకర పాపము. కాబట్టి దైవమునకు తన నిత్య జీవితములో ప్రథమస్థాన మొసంగ వలెను. పురుపాలక భవనములో ఉపన్యాసకుడు చెప్పిన అంతిమ వాక్యము.\n\n\"దేవుడు మొదట, ప్రపంచము తరువాత, ఆఖరికి నేను\" చాల సారవంతమైనది. కావున ముముక్షువు లెల్లరు ఆ కార్యమును కంటస్థము చేసి, అర్థమును మననము చేయుచు నిత్యజీవిత వ్యవహారములో అద్దానిని కార్యాన్విత మొనర్చుచు నుండవలెను. ఈ ప్రకారముగ భగవదాశ్రయము వలనను, లోకోపకారము వలనను, దేహాభిమాన రాహిత్యము వలనను, మానవునకు మహత్తరశ్రేయ మొనగూడగలదు.\n\nనీతి: జీవిత కార్యములలో, దైనందిన వ్యవహారములలో భగవంతునకు ప్రధమస్థాన మొసంగవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 839,
        "IMAGE": "cat_9",
        "NAME": "దేవునకు ప్రథమస్థానము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 81,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వమొకప్పుడు కర్ణుడు తన గృహమున అభ్యంగ స్నానము చేయుచుండెనట. నవరత్న ఖచితమగు నొకపాత్రలో నూనె, మఱియొక పాత్రలో సున్నిపిండి మొదలుగునవి ప్రక్కనుంచుకొని ఒక చోట కూర్చుని నూనెతో స్వయముగా తలంటుకొనుచుండెను. సరిగా అదే సమయమున శ్రీ కృష్ణమూర్తి అతని గృహమునకు విచ్చేసెను. కర్ణుడు తలంటుకొనుచుండుటయు, ప్రక్కనే మరకతమాణిక్యములు పొదగ బడిన విలువైన పాత్ర యుండుటయు చూచి, ఆ నటనసూత్రధారి కర్ణునితో తనకాపాత్ర కావలయునని అడిగెను. ఇంద్రునకు తన కవచ కుండలములనే దానమొసంగివైచి 'దానకర్ణుడని ' లోకమున విఖ్యాతి నొందిన అమ్మహావీరుడు సాక్షాత్ పరమాత్మయే వచ్చి అడిగినప్పుడు ఇక వెనుకకు తగ్గునా? వెంటనేయతడు ( కుడిచేతితో తలంటు కొను చుండెను గనుక) తన ఎడమ చేతితోనే దానిని పరిగ్రహించి శ్రీకృష్ణున కివ్వ దొడగెను. కాని శ్రీకృష్ణుడద్దానిని స్వీకరింపక, \"కర్ణా! ఎడమ చేతితోనా నాకు సమర్పించుట? శిష్టాచారము నీకు తెలియదా? అనియడుగ నంతట కర్ణు డిట్లు సమాధాన మొసంగెను-\n\nక్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోః |\nయమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః ||\n\nఓ కృష్ణా! ఇప్పుడున్న ధనము మఱుక్షణమున మాయమై పోవచ్చును. ఇప్పుడున్న జీవితము ఉత్తరక్షణమున అంతమైపోవచ్చును. యమధర్మరాజు ఎవరినైనను విచక్షణ చూపడు. జీవుల ధర్మబుద్ధి త్వరితగతిని మార్పునొందుచుండును! కాబట్టి తలంటుకొనుచున్న కుడిచేతిని (నూనె చేతిని) కడుగుకొని దానితో నీకు ఆ పాత్ర నిచ్చులోపల నా బుద్ధి ఏమి మారిపోవునో! అంతవరకు నాజీవిత ముండునో లేదో! అని విచికిత్స నాలో కలుగ, తత్ క్షణమే నేను ఎడమచేతితో దానిని నీకిచ్చి వేయ దొడంగితిని. అంతియే కాని తెలియక కాదు. - కర్ణుని అధ్యాత్మ భావ పరిపూర్ణములగు ఆ వాక్యములను విని శ్రీ కృష్ణుడు లోలోన చాల సంతసించెను.\n\nలుబ్ధత్వము మహాప్రమాదకరమైన గుణము. కామ,క్రోధ, లోభములను 'అగ్రదుష్టత్రయము' లో అది స్థానమును సంపాదించు కొనగల్గినది.\nత్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |\nకామక్రోధస్తథాలోభ స్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||\n\n'కామ క్రోద లోభములు మూడును నరకద్వారములు. ఆత్మవినాశ కరములు. కావున వానిని త్యజించి వేయవలెన\"ని శ్రీ కృష్ణభగవానుడు ఆనతిచ్చియుండలేదా? కావున త్యాగశీలురై మెలగవలెను. దాన పరత్వము నలవరచు కొనవలెను. ఈనాడు లోకములో ఎందఱో దరిద్రులను మనము చూచుచున్నాము. కూటికి గుడ్డకు కఱువైపోయి నానాబాధలను పొందుచు వీధులలో తిరుగాడుచుండు ఈ దరిద్రులెవరు? ఇట్టి దీనస్థితి వీరి కేల సంబవించినది? భగవంతునకు వీరిపై ఏమైన పక్షపాతము కలదా? లేదు. \"న మే ద్వేష్యోస్తి న ప్రియః \" - నా కెవనిపైనను ద్వేషము లేదని అతడు చెప్పనే చెప్పెను. కొందరు తిని త్రాగి లక్షణముగ ఆనందించుచుండ పాపము వీరికి మాత్రమేల ఇట్టి శోచనీయస్థితి ఘటిల్లినది? ఏనాడో దానధర్మములు చేయనికారణము చేతనే ఇట్టివారికీ దీనత్వము సంభవించినది.\n\nఅదానదోషేణ భవేద్ధరిద్ర:\nఅని శాస్త్రము లైక్యకంఠముతో బలుకుచున్నవి. కావున 'దానము చేయని దోషముచే జీవుడు దరిద్రుడై జన్మించును '. తా మనుభవించు దానిలో తృణమో పణమో మఱియొకరి కిచ్చుట నేర్చుకొనవలెను. ఈ శరీర నిర్మాణములు జూడుడు. భగవంతుడు ఒకరికిచ్చు పద్ధతిలో చేతిని సృష్టించెను. చేతులు క్రిందకువాల్చి యున్నప్పుడు వానితీరు గమనించినచో ఈ సత్యము బోధపడగలదు. ఇమ్ము , ఇమ్ము ఇదియే జీవిత రహస్యము.\n\nThe Less I have the more I am అను నానుడి ప్రకారము ఇతరులకు దానధర్మములు చేయుచు తన స్వంతమునకై మనుజుడు ఎంతెంత తక్కువ వినియోగించుకొనుచున్నాడో అంతంత గొప్పవాడుగ నాతడు పరిగనింపబడు చుండును.\n\nనీతి: దానధర్మములను వెనువెంటనే చేయవలెను. జీవితము క్షణభంగురమని గుర్తెఱిగి ధర్మకార్యములను విరివిగ చేయవలెను. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 840,
        "IMAGE": "cat_9",
        "NAME": "దానశీలత్వము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 82,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలమున ఒక గురువుండెడివాడు. అతనికొక శిష్యుడుండెను. గురువున కాతడు సేవాశుశ్రూషలు గావించుచుండెను. ఇట్లుండ కొంతకాలమున కా గురువుయొద్ద మరియొక శిష్యుడు వచ్చి చేరెను. ఇరువురును భక్తితో గురువును సేవించుచుండిరి. ఒకనాడు మధ్యాహ్నా సమయమున గురువు దూరప్రదేశము నుండి తిరిగివచ్చి బడలికచే చాపపై ఒకింత సేపు విశ్రమించెను. పరుండబోవునప్పుడు తన మొదటి శిష్యుని పిలిచి 'ఒరే! నాయనా! కాళ్లునొప్పిగా నున్నవి. కొంచెము సేపు ఒత్తరా!' యని ఆదేశించెను. అతడట్లే గురువును సేవించుటకు వచ్చుచుండగా, ఇంతలో రెండవ శిష్యుడు ఒక ఆక్షేపణ తెచ్చెను. అతడు గురువుతో \"మహాత్మా! ఇతడు పాతవాడు. చాలాకాలము నుండియు తమ సేవ చేయుచున్నాడు. తత్ఫలితముగా ఇప్పటికే బండెడు పుణ్యమును ముటకట్టుకొని వేసెను. నేనింతవరకు గురుసేవాలభ్యమగు రవ్వంత పుణ్యమునైనను నోచుకొన లేదు. ఉన్న కాస్త పుణ్యమును,ఇరువురును పంచుకొనవలెనే కాని అంతయు అతని పాలిటనే పడుట న్యాయవిదూరము. కాబట్టి నేటి కతని నిలిపివైచి నాకే ఈ అవకాశము నిప్పించవేడెద!' అని ప్రార్థించాడు.\n\nమొదటి శిష్యుడు ఏమియు తక్కువ తినినవాడు కాడు. అతడు వెంటనే ఉగ్రుడై \"స్వామీ! గురువర్యా! అతని వాక్యములను వినకుడు. క్రొత్తగా వచ్చెను కనుక కాళ్లు పిసుకుట అతనికి సరిగా తెలియదు. అనవసరముగా తమరు బాధకు గురియగుదురు. ఏ ఉద్యోగము నందైనను అనుభవమునకే ఎక్కువ ప్రాధాన్య మొసంగుట లోకధర్మము. తమకు తెలియనిది ఏమున్నది?\" యని చెప్పి యూకకుండెను. ఈ ప్రకారముగా ఆ యిద్దరు శిష్యులు గురువునకు లేనిపోని ఒక సమస్యను తెచ్చిపెట్టిరి. మాయాబంధము భేదించి వేయుట గూడ ఆ గురువునకు సులభమనిపించెను గాని ఈ పరమానంద శిష్యులిరువురికిని రాజీ చేయుట మాత్రము మహాదుస్తర మనిపించింది.\n\nఏమి చేయుటకు తోచక, తుదకొక మధ్యేమార్గ మవలంబింప నిశ్చయించి, ఇరువురిని దగ్గరకు పిలిచి 'ఒరే నాయనలారా! తగవులాడు కొనకుడు. భగవంతుడు నాకు రెండుకాళ్లు ఇచ్చియిన్నాడు. కనుక చెరియొక కాలు పంచుకొని సేవించుడు. ఈ పీడకు ఇదియే విరుగుడు' అని చెప్పి పరుండెను.\n\nశిష్యులిద్దరున్ను భేష్ భేష్ అని సంతోషించి అట్లే చెరియొక కాలు పంచుకొని సేవించుచుండిరి. వైమనస్యము అసలు ఉండరాదు. ఉండినచో అది యేదియో ఒక రూపమున బయటకు వెడల గ్రక్కబడుచునే యుండును. ఈ శిష్యుల విషయ మట్లే అయినది. పొరపాటున ఒకరు పిసుకుచుండిన కాలు మరియొక దానికి కొద్దిగ తగిలెను. అవతలివాడు కోపగించి, \"ఏమిరా! ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచెయ్యి \" అని మందలించి, ప్రతీకారచర్యగా తాను ఒత్తుచుండిన గురువుకాలు ఎత్తి అమాంతముగ అవతలిదానిమీద విసరివేసెను. వాడున్ను రుద్రాకారమును ధరించి \"ఒరే! నాకాలిని కొట్టెదవా? నీకాలు పనిపట్టెదను చూడు\" అని రోషారుణిత నేత్రుడై దగ్గరనేయున్న గురువుగారి కమండలమును తీసుకొని దానితో అవతలి కాలిమీద బలవంతముగ కొట్టెను. వాడున్ను ప్రళయాకృతి వహించి, గురువుగారి యోగదండము తీసికొని ఇవతలికాలిని చావమోదెను.\n\nఈ 'గలాటా' అంతయు చూచి, గురువుగారు నిద్రలేచిరి. శిష్యుడు శిష్యుడు పోట్లాడుకొని, గురువుకాళ్ళు చప్పగా నాశనము చేసిరి. గురువు బాధతో \"ఏమిట్రా ఈ గల్లంతు!\" అని అరవగా ఆ శిష్యులిరువురును, 'మహాత్మా! తాము పరుండుడు! ఇది మా అంతరంగ వ్యవహారము ఇదేదో తేలవలె. వాడి కాలు గొప్పో, నాకాలు గొప్పో, అని పలికిరి. అంతట గురువు \"ఓరే నీకాలు, వాడి కాలు ఏమిట్రా? ఆ రెండును నా కాళ్లేకదరా! ఎంత తెలివితక్కువ వారురా మీరు?' అని తిట్టి ఇరువురిని దూరముగా పంపివేసెను.\n\nఅట్లే ప్రపంచమందలి జీవరాసులందరును పరమాత్మయొక్క అవయవములు వేరువేరుగా కనిపించినను, \"అవయవ\" దృష్ట్యా వానియన్నింటియందును ఏకత్వమే కలదు. దృష్టాంతమందలి గురువు గారి ఒకకాలు మరియొక కాలిని దన్నుట ఎంత హాస్యాస్పద మయిన విషయమో, ఒక ప్రాణి మరియొక ప్రాణితో పోట్లాడుట, అతనిని ద్వేషించుట హింసించుట అంత హాస్యాస్పదమే యగును.\n\nనీతి: ప్రపంచమంతయు భగవత్స్వరూపమని యెంచి సర్వుల యెడ ప్రేమ దయ కలిగియుండుము. ఎవరినీ ద్వేషింపరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 841,
        "IMAGE": "cat_9",
        "NAME": "ఏకత్వానుభూతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 83,
        "TYPE_ID": 9
    },
    {
        "DESCRIPTION": "పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి?\n\nభూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం ఖూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి.\n\nకొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు.\n\nఅలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞా పించాడు. ఐతే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది. ఇంతకీ ఆరోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు \"ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్ప వారేలేరా?\" అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి \"ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించవలసిందని\" కోరాడు.\n\nఅందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయనీనగరాన్ని చేరుకుని \"రాజా నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది\" అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి \"కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు.\n\nవిక్రమార్కుని సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయరత్నఖచితమైన సింహాసనమ్మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. \"ఓ నరనాథా! ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్పనాట్యగత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవటమం మాతరంకాలేదు. నీవు సకలవిద్యా పారంగతుడవు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు\" అని విన్నవించాడు.\n\nఅంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వ గానంతో శరీరము మెరుపుతీగవలె శృంగారము వర్షించునట్లు గా నాట్యం చేసింది. మరునాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యము చేసింది. ఇద్దరినీ పరిశీలించినమీదట \"ఊర్వశి\"నే నేర్పరిగా నిర్ణయించాడు .\n\n\"అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?\" అని ప్రశ్నించాడు ఇంద్రుడు.\n\nఅందుకు \"ఓ దివిజేశా! కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశినాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరింది\" అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతోపాటు నవరత్నఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు.\nఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 842,
        "IMAGE": "cat_10",
        "NAME": "విక్రమార్కుడు ఎవరు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "ధారాపురం అనే మహా నగరానికి రాజు భోజరాజు. అతను గొప్ప పరాక్రమమం కలవాడు. అంతటి సద్గునవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు. అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు.\n\nక్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టనష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో బయల్దేరారు భోజరాజు నీతిమంతుడు. అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు పులులు, సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు. చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు. వాళ్ళు ఓ చోట జొన్న చేను పక్కగా వెళుతున్నారు. అక్కడ మంచెపై కూర్చుని ఉన్న ఆచేను యజమాని ఐన ఓ బ్రాహ్మణుడు వీళ్ళను చూసి “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు అలసిపోయి ఉన్నారు, జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం” అంటూ ప్రార్థించాడు.\n\nరాజు ఆ బ్రాహ్మడి ఔదర్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు.\n\nరైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచెపైనుండి దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది. సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు, నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు. ఇది నీకెలా న్యాయంగా తోచింది? నేను పేదవాడిని కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను. ఇదే నా ఆధారం. కంచే చేను మేసినట్టుగా ఇతరులకు చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది? ఇప్పుడు నేనూ నాకుటుంబం జీవించేదెలా?” అంటూ విలపించసాగాడు.\n\nఅతడి మాటలు వింటూ ‘అందరినీ పిలిచి తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి! తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటీ’ అనుకుంటూ తన వాళ్ళనందరినీ కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ రైతు దుఖం చూడలేక అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.\n\nఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మంచె మీదకు చేరాడు. వెళ్ళిపోతున్న రాజు గారి పరివారాన్ని చూసి “ఎందుకు వెళ్ళిపోతున్నారు? విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా, కడుపార తిని కావలసినన్ని పట్టుకుపొండి. రాజా మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృదా” అన్నాడు.\n\nఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది. చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. సరే కానిమ్మని తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు. రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటితరువాత మంచె దిగివచ్చిన రైతు “ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సాహించటమేమిటి? నా పంట నాశనం చేస్తున్నారు నేనేం నేరం చేసానని నాకీ శిక్ష.” అంటూ భోరాజు ను నిలదీసి అడిగాడు.\n\nభోజ రాజు ఆశ్చర్యంతో తన మంత్రియైన నీతిమంతుని తో “ఈ రైతు ప్రవర్తన విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒకమాదిరిగా, మంచె దిగిన తరువాత మరొక విధముగా ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు మంచె దిగగానే అంతా మచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది?” అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి రాజా “ఇతడి ఈ ప్రవర్తనకి కారణం తప్పకుండా ఆ మంచెయే ననిపిస్తున్నది. మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి గానీ ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు.” అన్నాడు.\n\nరాజు వెంటనే బ్రాహ్మణుతో “ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైన్నా కొనుక్కొనేంత ధనం ఇస్తాను” అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి, “ రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే, మీ దయ వలన ఆ ధనంతో నేనూ నా కుటుంబం సుఖంగా ఉంటాము” అని చెప్పాడు.\n\nరాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచెఉన్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుత మైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసమ్నం ఒకటి కనిపించింది. దానికి ముఫైరెండు బంగారు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసన్నాని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇంత అద్భ్త సింహాసనాన్ని అధిష్టించిన రాజు ఈ భూమినంతటినీ ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్నచోట మంచె పై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు అని గ్రహించారు.\n\nఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా నగరానికి తీసుకుపోయి తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 843,
        "IMAGE": "cat_10",
        "NAME": "విక్రమార్కుడి సింహాసనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "భోజరాజుపండితులచే ఒక శుభముహుర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో సింహాసనానికి పూజలు జరిపించి మంచి ముహుర్తం లో ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు. వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగింది. మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి. ఆ మెట్టుపైనున్న రత్నఖచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది. రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు.\n\n“రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అదిరోహించటం అంత సులువైన విషయంకాదు. శౌర్య ప్రతాపాలు, సకల గుణవంతుడు ఐన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మాన నిర్మితంకాదు, స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలనుకునే వారు అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలూ మాట్లాడతాయి దానికి కారణం ముందు ముందు నీకే తెలుస్తుంది.\n\nసకల ప్రావీణ్యుడూ, దిక్‍దిగాంతాలవరకూ ఖ్యాతి గాంచినవాడు.సుగుణ వంతుడూ ఐన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసన్నాని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో.” అంది.\n\nభోజరాజు ఆ బొమ్మమాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు “విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్రఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు” అన్నాడు.\n\nదానికి ఆ బొమ్మ బదులిస్తూ “అతడి గుణగణాలు వర్ణించడం అంతసులభంకాదు, నా శక్తి మెరకు చెపుతాను” అంటూ ఇలా చెప్పసాగింది.\n\nఅందుకు మొదటి మెట్టులోని ప్రతిమ \" మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం\" అన్నది.\n\nఅందుకు భోజరాజు \"ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి\" అని వేడుకున్నాడు.\n\nఅలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు \"భట్టి విక్రమార్క\" కథలు గా \"భేతాళ\" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.\n\nఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :\n\n1. వినోదరంజిత\n2. మదనాభిషేక\n3. కోమలవల్లి\n4. మంగళ కళ్యాణి\n5. మంత్ర మనోరమ\n6. శృంగార మోహనవల్లి\n7. జయ\n8. విజయ\n9. మలయవతి\n10. ప్రభావతి\n11. విద్వత్శిరోమణి\n12. శాంతగుణవల్లి\n13. సూర్యప్రకాశవల్లి\n14. పూర్ణచంద్రవల్లి\n15. అమృతసంజీవివల్లి\n16. కృపాపరిపూర్ణవల్లి\n17. కరుణాకరవల్లి\n18. పరిమళమోహనవల్లి\n19. సద్గుణవల్లి\n20. సుందరవినోదవల్లి\n21. కనకరంజితవల్లి\n22. పంకజవల్లి\n23. అపరాజితవల్లి\n24. మనోరంజితవల్లి\n25. స్వర్ణకాంతవల్లి\n26. సకలకళావల్లి\n27. మాణిక్యవల్లి\n28. మనునీతివల్లి\n29. సంప్రదాయవల్లి\n30. రుక్మిణీవల్లి\n31. నీతివాక్యవల్లి\n32. ఙ్ఞానప్రకాశవల్లి ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 844,
        "IMAGE": "cat_10",
        "NAME": "భోజరాజు సింహాసనం అదిరోహించా లనుకోవడం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడని కదా చెప్పుకున్నాము, ఐతే ఒక రోజు ఆ భర్తృహరి విక్రమార్కుని పిలిచి \"తమ్ముడూ ! ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరపుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై బుద్ధి మంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్య భారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు\" అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు.\n\nఅప్పటినుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధనకనక వస్తు వాహనాలతో తుల తూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు.\n\nఇలా ఉండగా కొంత కాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు \"మరణ మనేది లేకుండా ఉండే వరమీయమని\" అడిగాడు.\n\nఅందుకు శివుడు \"ఓ ! రాజా ! మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరమేదైనా కోరుకో\" అన్నాడు.\n\nఅందుకు విక్రమార్కుడు \"సరిగ్గా ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు మాత్రమే వయసు గల అమ్మాయికి పుట్టిన కొడుకువలన నాకు మరణం సంభవించేలా వరమీయమని\" కోరాడు.\n\nశివుడు దానికి \"సరే తధాస్తు\" అని వరమిచ్చి \"నువ్వు ఇంకా వెయ్యేళ్ళు రాజ్య సుఖం అనుభవించగలవు\" అని దీవించి మాయమయ్యాడు.\n\nతన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి తన మంత్రి ఐన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు. అది విన్న భట్టి చాలా తెలివిగలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే \"రాజా నీకు భగవంతుడు వెయ్యేళ్ళు బ్రతకమని వరమిచ్చాడు కదా, పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా, కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే నీవు రాజ్య పాలన చేసి మిగిలిన ఆరు నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపౌతుంది. అందువలన రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతావు. ఒక్క ఆరు నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి. నీ జీవిత కాలం పెరుగుతుంది\" అని సలహా ఇచ్చాడు.\n\nఅది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలు పరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒక నాడు ఒక యోగి వచ్చి తనతో స్మశానానికి రమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోమాలు మంత్ర తంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుని బలి ఇవ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకుని ఆ యోగిని బేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుని మెచ్చి \"ఓ రాజా !నీకు అవసర మైనప్పుడు ఆపద సమయములోను నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను. నీకు అస్టసిద్ధులూ లభ్యమగు గాక\" అని దీవించి మాయమయ్యాడు. బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్న మాట.\n\nఅదే సమయాన బ్రహ్మాది దేవతలు \"నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదని\" దీవించారు. పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు, సత్రములు, సంతత యాగములతో అనేక పుణ్యకార్యములతొతో నిత్యమూ దానధర్మాలతో తేలి యాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయనీ పురాన్ని పరిపాలించి విక్రమార్క శకకర్తగా పేరు పొందాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 845,
        "IMAGE": "cat_10",
        "NAME": "విక్రమార్కుడికి శివుడి వరం ఎలా లబించింది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "విక్రమార్కుడి మరణం\nరాజులు రాజ్యాలు అంతరించినా, శకాలు మారినా, యుగాలు గడచినా, శక కర్తలుగా యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు, మంచి మంచి పురాణ కధలూ తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వాటిలో అణు మాత్రమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ విక్రమార్కీయము.\n\nఇంతవరకు విక్రమార్కుడు శివుని వలన వరం పొందాడని చెప్పు కున్నాం కదా! ఐతే ఆ వరము ఎలా నిజమయ్యిందో , ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు, దారి పొడవునా పూలూ ముళ్ళూ ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి. వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు.\n\nఅందుకు మంత్రి ఐన భట్టి \"రాజా! మేడ మీద కాకులు గుడ్ల గూబలూ చేరి అరవటం, పట్టపుటేనుగు మరణించటం, గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి. ఏదో కీడును సూచిస్తున్నాయి. ఎందుకో భయంగా ఉంది\" అన్నాడు.\n\nఅందుకు విక్రమార్కుడు నవ్వి \"పూర్వము నాకు పరమ శివుడు ఇచ్చిన వరం గుర్తులేదా? ఒక్క సంవత్సరము మీద ఒక్క రోజు మాత్రమే వయస్సు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది? అట్టి కొడుకు వల్ల నాకు మరణమెలా సంభవిస్తుంది? వింతగా లేదా? ఇదంతా కల్ల, ఇది జరిగే అవకాశమే లేదు. నీవేమీ విచారించకు\" అని ధైర్యం చెప్పాడు.\n\nఅందుకు భట్టి \"మహరాజా! మీరు పొరబడుతున్నారు. అది శివుడిచ్చిన వరం. అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు, సంభవములు అసంభవములు కావచ్చు. ఇది ఈశ్వరేచ్ఛ. ఒకప్పుడు ఉగ్ర నరసింహుడు ఉక్కు స్థంభములో ప్రత్యక్షమవలేదా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు ముఖములు గల వారెవ్వరితోను చావు రాని తారకాసురుని షణ్ముఖుడు చంపలేదా? రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా? కావున రాజా, అట్టి బాలుడు పుట్ట వచ్చును అని నా నమ్మకం. అందువలన మన వేగుల వారిని నలు దిశలా పంపి ఎప్పడి కప్పుడు వార్తలను సేకరించుకుని రమ్మనటం శ్రేయస్కరం\" అని సలహా ఇచ్చాడు.\n\nఅప్పుడు విక్రమార్కుడు తనకీ పని సక్రమంగా చేయగల సమర్ధుడెవరా? అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు. తననీ ఆపదనుంచి కాపాడగల సమర్ధుడు బేతాళుడు ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనస్సులో తలచుకున్నాడు. అంతే, తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. రాజు కోరిక తెలుసుకుని వెంటనే మాయమై స్వర్గ మత్స పాతాళ లోకాలని గాలించటనికి వెళ్ళిపోయాడు.\n\nఅన్ని లోకాలు చుట్టి వచ్చి \"మహరాజా! మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టి వచ్చాను. ఐతే నాకు మార్గ మధ్యాన ఒక వింత కనిపించింది. అదేమిటంటే ఓ కుమ్మరి వాని ఇంటిముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్నపిల్ల వాడు కూర్చుని ఉన్నాడు. వాడు మట్టి తో చేసిన సైన్యము తో ఆడుకుంటున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట గలిపి ఈ ' బాలుడెవడు? ' అని అడిగాను. అందుకు ఆ విప్రుడు ' వీడు నా మనుమడు. ఇదిగో ఈమె వాడి తల్లి. ఈమెకు సరిగ్గా ఒక సంవత్సరమ్మీద ఒక రోజు వయస్సు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృపవలన వీడు జన్మించాడు. ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు ' అని చెప్పాడు. కావున నీ రాజ భోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలుని ఎలాగైనా చంపగల ప్రయత్నం చేయి\" అని చెప్పి మాయ మయ్యాడు.\n\nఅదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయి పడింది. \"ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీలేదు\" అనుకుని ధైర్యం తెచ్చుకుని \"ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి\" అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్య భారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనిడుకొని ప్రతిస్టానపురానికి ప్రయాణం సాగించాడు.\n\nఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు. ఇంతకీ ఆ బాలుని పేరు \"శాలివాహనుడు\". అతనికి నాగేంద్రుని మంత్ర శక్తి వలన నాగులు, గుర్రములు, రథములు, భటులు అందరు యుద్ధానికి తరలివచ్చారు.\n\nఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టు ముట్టి చంపసాగాయి. శాలివాహనునికీ విక్రమార్కునికీ ముఖా ముఖీని భయంకర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది. కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదరైపోయాయి. ఐనా సరే \"ఆ సర్వేశ్వరుడే కాలఖర్మాన్ని తప్పించుకోలేనప్పుడు, మానవ మాత్రులం మనమనగా ఎంత?\" అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు శాయశక్తులా ఫోరాడాడు. ఐనా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురియై మరణించాడు.\n\nఅప్పుడు అతని శరీరంనుంచి అఖండ ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహా జ్యోతిలా వెలుగొందుతూ పైకెగసి సూర్యునిలో లీనమైపోయింది. అంటే అసాధ్యమనుకొన్న విక్రమార్కుడి మరణం ఈ విధంగా జరిగిందన్న మాట. అటు పిమ్మట శాలివాహనుడు విజయుడై ప్రతిస్టాన పురానికి రాజయ్యాడు. అప్పడికి విక్రమార్కుడి భార్య గర్భవతిగా ఉంది. ఆమె ఈ వార్త విని, మంత్రులు పౌరులు ఎందరు ఎంత చెప్పినా వినకుండా పొట్ట కోసి పాపడిని తీసి మంత్రుల కప్పగించి తాను అగ్నిప్రవేశం చేసి అమరలోకాన్ని చేరింది.\n\nఒక వైపు భట్టి రాజ్య భారం వహిస్తూ, మరొక వైపు ఆ పసివాణ్ణి పెంచుతూ, ఇతడు తేజో బల సంపన్నుడూ తండ్రిని మించిన తనయుడూ కాగలడని ఎంచి యుక్త వయస్సు రాగానే ప్రశాంతుడనే పేరుతో రాజ్యాభిషేకం చేసి విక్రమార్కుడి రత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చో బెట్టబోయారు. అంతలో అశరీరవాణి \"ఓ మంత్రి వర్యులారా! ఇంతటి మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్టించగల అర్హత ఈ బాలునికి లేదు, మరెవ్వరికీ కూడా లేదు. కనుక మీ ప్రయత్నం మాని ఈ సింహాసనాన్ని భూమిలో పాతి పెట్టించండి\" అని పలికింది. అలా చేయక పోతే మరే ప్రమాదమొస్తుందో అని భయపడి ఆ సింహాసనాన్ని వెంటనే భూస్తాపితం చేసారు. ఆ పైన ఎత్తుగా గట్టులా కట్టించారు.\n\nకొంత కాలానికి ఆ రాజు, ఆ రాజ్యం అంతరించి ఒక దిబ్బగా మిగిలి పోయింది. అది కాలక్రమేణ ఒక విప్రుని వశమైంది. ఆ విప్రుడే అక్కడ జొన్నలు, సజ్జలు, అగిశెలు, గోధుమలు, దోస పాదులు పండించు కుంటూ ఒక మంచె మీద కూర్చుని అందరినీ అభిమానంగా పలకరిస్తూ, మంచె దిగాక వారిని తిడుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇక ఆ సింహాసనం భోజ రాజును ఎలా చేరిందో చూద్దాం. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 846,
        "IMAGE": "cat_10",
        "NAME": "విక్రమార్కుడి మరణం ఎలా సంభవించింది ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవ రూపంలోని భేతాళుడు రాజా..అచంచలమైన నీ దీక్ష ప్రశంసించదగినదే... కానీ ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రం నాకు నిగూఢంగా ఉన్నది. నన్ను మోస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను...’’\n\nఎన్ని భేతాళకథలు చదివినా ప్రారంభం ఇదే. కథ మొదలవ్వడంతోనే విక్రమార్కుడు భేతాళున్ని భుజాన వేసుకొని నడవటం తో ప్రారంభమౌతుంది. ఇంతకీ విక్రమార్కుడు ఎవరు? భేతాళుడికి అతనికి సంబంధం ఏంటి? అసలు ‘విక్రమార్క-భేతాళ’ కథలకు ప్రారంభం ఏంటి... మరుగున పడ్డ ఆ మూల కథ ఏంటి?\n\n‘భేతాళ కథల’ ఆధారంగా మూలాలను శోధిస్తే...\nభేతాళకథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు గుణాడ్యుడి సంకలనం ప్రకారం తెలుస్తోంది. ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని పరిపాలించేవాడు. తన పరిపాలనదక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకొంటాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి వంటి భూపాలుడు చిరకాలం ధరిత్రిని పాలించాలని, వెయ్యి సంవత్సరాల పాటు పాలించే వరాన్ని అనుగ్రహిస్తుంది ఆమె.\n\nవిక్రమార్కుని మంత్రి భట్టి. ఇతడు విక్రమార్కుడి సోదరుడు కూడా. భట్టి తెలివితేటలతో రాజుగా విక్రముడి ఆయుష్షును రెండు వేల సంవత్సరాలకు పెంచుతాడు. భట్టి యుక్తితో విక్రమార్కుడు ఆరునెలలు రాజ్యపాలన, ఆరు నెలల దేశ సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేవాడు. ఇది విక్రమార్కుడి నేపథ్యం.\n\nఉజ్జయినికి కొంత దూరంలో ఒక సన్యాసి ఘోర తపస్సు చేస్తుంటాడు. కఠోర దీక్షతో అతడు దేవీ అనుగ్రహాన్ని సంపాదిస్తాడు. లోకంలోని రాజులంతా తనకు సామంతులవ్వాలనేది అతని కోరిక. చావు లేకుండా తలచిందళ్లా జరిగేటట్లుగా చూడమని ఆమెను కోరతాడు. కాళికామాత అతని దురాశను మన్నిస్తూ భూత ప్రేతాదులకు అధిపతి అయిన భేతాళున్ని వంశం చేసుకొంటే నీ కోరిక తీరుతుందని చెబుతుంది. భేతాళున్ని వశం చేసుకోవడానికి వందమంది రాజకుమారులను యజ్ఞంలో బలి ఇచ్చి తనకు సంతుష్టి కలిగించమంటుంది. వారిలో వందో వాడు బహుపరాక్రమంతుడై ఉండాలని కాళిక చెబుతుంది. ఆ సన్యాసి హోమం ప్రారంభించి మాయ మాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయానికి తీసుకొచ్చి బలిస్తుంటూ ఉంటాడు. అలా 99 మంది పూర్తవుతారు. వందోవాడి అన్వేషణలో ఉన్న సన్యాసికి విక్రమార్కుడి గురించి తెలుస్తుంది.\n\nవిక్రమార్కుడి గురించి తెలుసుకొన్న మాంత్రికుడు ఉజ్జయినికి మకాం మారుస్తాడు. దేశ సౌభాగ్యం కోసం తాను యాగం చేస్తున్నానని దానికి ఒక వీరుడి సహాయం అవసరమని, తమ నుంచి ఆ సాయం ఆశిస్తున్నానని విక్రమార్కుడిని కోరతాడు. సన్యాసికి అభయం ఇస్తాడు విక్రమార్కుడు. తన యాగం పూర్తవ్వాలంటే భూత ప్రేతాలకు నిలయమైన మర్రిచెట్టుపై శవాకారంలో ఉన్న భేతాళున్ని హోమం వద్దకు తీసుకురావాలని సన్యాసి కోరతాడు. దీనికి విక్రమార్కుడు సమ్మతిస్తాడు. భే తాళుడిని తీసుకెళ్లడానికి వచ్చిన విక్రమార్కుడిని చూసి మర్రి చుట్టూ ఉన్న భూతప్రేతాలన్నీ యుద్ధం మొదలు పెడతాయి. వాటి నుంచి ఎంత పోరాటం ఎదురైనా పట్టువదలకుండా చెట్టుపై ఉన్న భేతాళుడిని భుజాలపై వేసుకొంటాడు...\n\nఇది భేతాళుడి కథ...\nశాపవశాత్తూ భేతాళుడు శవ రూపంలో చెట్టుపై ఉండిపోతాడు. ఇతడు పూర్వ జన్మలో తపఃసంపన్నుడైన బ్రాహ్మణుడు. కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి ఒక కోరిక కోరుతుందట. తనకు కథలు చెప్పమని, అవి ఇంతవరకూ ఎవరికీ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని పార్వతీ దేవి తన నాథుడిని కోరుతుంది. తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలను చెబుతాడు మహాశివుడు. పార్వతీ పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రహ్మణుడు. ఎంతో ఉత్కంఠత ను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకు చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతు కూడా పెడతాడు. అయితే ఆమె బ్రహ్మణుడి వలే తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేక మందిలో ఈ కథలకు ప్రాచుర్యం వస్తుంది.\n\nఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఈ కథలు చివరకు పార్వతీ దేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె. భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించావని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడనే కోపంతో, విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే వరకూ భేతాళుడిగా ఉండిపొమ్మని శపిస్తాడు. అలా బ్రహ్మణుడు భేతాళుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురుచూస్తుంటాడు. తనను గుహలోని మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లడానికి విక్రమార్కుడు భుజం మీద వేసుకోగానే... ‘రాజా నీకు శ్రమ తెలీకుండా ఒక కథ చెబుతాను, ఆలకించి నా సందేహాన్ని నివారించు.\n\nనీకు తెలీకపోతే సమాధానం ఇవ్వనక్కరలేదు కానీ, తెలిసీ సమాధానమీయకపోతే నీ తల పగిలి నూరు వక్కలవుతుంది’ అనే హెచ్చరికతో కథలు మొదలుపెడతాడు. ఇక్కడ మరో షరతు ఉంది. మాంత్రికుడి కోరిక మేరకు భేతాళుడిని భుజం మీద వేసుకొన్నాక విక్రమార్కుడు మౌనంగా ఉంటేనే ఆ శవాన్ని గుహ వద్దకు చేర్చగలడు. అయితే భేతాళుడు అడిగే ప్రతి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెప్పగలడు. దాంతో నోరు తెరవక తప్పదు. దీన్నే అవకాశంగా తీసుకొన్న భేతాళుడు తనకు శాపంగా ఉన్న కథలన్నింటినీ విక్రమార్కుడి చెప్పేస్తాడు. అంతేగాక మాంత్రికుడి నిజ స్వరూపం తెలిసింది భేతాళుడికి మాత్రమే. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 847,
        "IMAGE": "cat_10",
        "NAME": "విక్రమార్కుడు ఎందుకు పట్టు వదలలేదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "\"32 సాలభంజికలు 32 కథలు\" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం.\n\nవిక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే?\n\nఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను \"అశ్వవేదినౌతాను\"\n\nరెండక్షరాలు వదిలిపెడితే \"నాట్యకర్తనౌతాను\"\n\nమూడక్షరాలు తీసేస్తే \"గతవిదుడనౌతాను\"\n\nనాలుగక్షరాలు విడిచి పెడితె \"నేర్పరినౌతాను\"\n\nఐదు అక్షరాలు వదిలిపెడితే \"బుధుడనౌతాను\"\n\nఅన్ని అక్షరాలు కలిపి చదివితే \"బుద్ధిబలమున్న వాడినౌతాను\"\n\nఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడిగాడు.\n\nఅందుకు సకల విద్యా పారంగతుడైన విక్రమార్కుడు నవ్వి \"ఓ కవీంద్రా !మీ పేరు \"చతురంగతజ్ఞుడు\" అని చెప్పాడు.\n\nఅందుకు ఆ కవీశ్వరుడు విక్రమార్కుని మేధా శక్తికి అబ్బురపడి \"ఓ రాజా! తారతమ్యాలు తెలియకుండా నీ ముందు ఎవరైన పండితులమని భ్రమించటం హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసినట్టే అవుతుంది. అందుచేత నన్ను మన్నించు. నీ కీర్తి ప్రతిస్టలు భూనభోంతరాలల్లో ప్రతిధ్వనిస్తున్నాయి\" అని వేనోళ్ళ పొగడగా అందుకు విక్రమార్కుడు సేవకులను పిలిచి ఆ పండితుని పలుకులకు, కవిత్వానికి, మాటలకు, నవ్వులకు వేలు లక్షలు కోట్ల కొలది దానధర్మాలిచ్చి పంపించాడు. ఈ విధంగా తన ఔదార్యాన్ని నిరూపించుకుని రాజ్యమేలాడు.\n\nఐతే మనం అతని పేరులోని ఒక్కొక్క అక్షరమే తీసేసి చూద్దాము.\n\nమొదట \"చ\" తీసేస్తే \"తురంగతజ్ఞ\" (అశ్వవేది).\n\nఇప్పుడు \"తు\" తీసేస్తే \"రంగతజ్ఞ\"(నాట్య కర్త).\n\nఇప్పుడు \"రం\" తీసివేస్తే \"గతజ్ఞ\" (గతవిదుడు).\n\nమళ్ళీ \"గ\" తీసేస్తే \"తజ్ఞ\" (నేర్పరి).\n\nఇక \"జ్ఞ\" అంటే బుధుడు.\n\nఅన్ని కలిపి చదివితే \"చతురంగతజ్ఞ\" అన్న మాట.\n\n'ఓ భోజరాజా! నీవు విక్రమార్కుడి మేధాశక్తికి సరి సమానమయినవాడివని అనుకుంటే, ఈ సింహాసనాన్ని అధిరోహించు! \"అంది. భోజ రాజు మౌనంగా వెనుదిరిగాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 848,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్టించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది. \"ఓ! భోజరాజా! మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్యసాహసాలు నీకు లేవు. కావున ఈ గద్దె నెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే, ఉజ్జయనిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణు మూర్తి రాజ్యం కంటే గొప్పది. కావున విను, మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు, కుత్సిత బుద్ధి కలవాడు, నీరసాత్ముడు, దూషకుడు, దుర్మార్గుడు, అనాచారుడు, అబద్ధాలు చెప్పేవరు, అవినీతి పరులు, బద్ధ కస్తులు, దుర్భలులు, మదాంధులు, మదన వికారం చెందిన వారు, స్తిరత్వం లేని వారు, ఇలాంటివారు మచ్చుకైన ఉండరు. ఐతే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక విదీశీయుడు ప్రవేశించాడు\" అని ఆ సాలభంజిక చెప్పసాగింది.\n\nరాజ దర్శనం కాగానే, రాజుకు నమస్కరించి తాను దేశ దేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా విదేశీయుడు.\n\nఅందుకు రాజు \"దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక, నీవు చూసిన వింతలేమైనా చెప్పు\" అని అడిగాడు.\n\nఅందులకా సిద్ధుడు \"నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పు కొండల ప్రాంతంలో ఒక భాగ్య వంతమైన నగరం చేరుకున్నాను. అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా లోతైనది. ఒక మడుగులా ఉంటుంది. ఐతే ఆ నది ఒడ్డున సూర్యమండలాన్ని పోలి ప్రకాశించే బంగారు గుడి ఒకటి ఉంది. ఆ ప్రాంతంలోనే పాపనాశనం అనే పుణ్య తీర్ధం కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ అంత విశేషం కాదు కానీ రాజా, నేనిప్పుడు చెప్పేది మాత్రం శ్రద్ధగా విను. అదేమిటంటే , సూర్యోదయం వేళ ఆ తీర్ధం మధ్యలో చక్కని పీఠం ఉన్న స్థంభం ఒకటి పుడుతుంది. సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చేసరికి ఆ పీఠం కూడా ఎత్తుగా పెరిగి పెరిగి సూర్యబింబాన్ని తాకుతుంది. తిరిగి ప్రొద్దు కృంకే సమయానికి మెల్ల మెల్లగా దిగజారి మాయమైపోతుంది. ఇది చిత్ర విచిత్ర మైన విశేషం ఇంతకు ముందు నేనెన్నడూ కనీ వినీ ఎరుగనిది. బ్రహ్మ సృష్టి రహస్యం మానవుల మైన మనకెలా తెలుస్తుంది?\" అని చెప్పాడు.\n\nఅంతా విని ఆశ్చర్యపడిన రాజు ఆ సిద్ధుని ఘనంగా సత్కరించి పంపి వేసాడు. పిమ్మట ఆ వింత స్థం భాన్ని ఎలాగైనా చూడాలన్న పట్టుదలతో, రాత్రికి రాత్రి కత్తి చేత పట్టి ఒంటరిగా అరణ్య మార్గంలో బయలు దేరాడు. చివరికి సిద్ధుడు చెప్పిన బంగారు నగరం చేరుకుని సూర్యోదయాన ఆ స్థంభం మొలిచే అద్భుతాన్ని చూసాడు. ఏముంది? అలా అలా చూస్తుండగానే పై పైకి సూర్యబింబంతో పోటీ పడుతూ ఎదిగి పోతున్న స్థంభాన్ని చూసి ఆశ్చర్య పోయాడు. ఆ రోజుకి మాత్రం అక్కడే ప్రవహిస్తున్న సూర్యప్రభా నదిలో స్నానం చేసి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా సూర్య భగవానుని దైవ ధ్యానంలో గడిపాడు.\n\nమర్నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి పాపనాశ తీర్ధంలో స్నానం చేసి సంధ్యా వందనం చేసుకుని సూర్యో పాసన మొదలు పెట్టాడు. అంతలో తూర్పు కొండ మీద సూర్యబింబం పొడ చూపింది. అదే సమయాన, తీర్ధం మధ్యలో స్థంభం దివ్య పీఠంతో బంగారు తీగ మీద మొలచిన కలువ పువ్వులా పుట్టి, పైపైకి పెరగసాగింది. అ వింత చూసిన విక్రమార్కుడు ఈ గంభీరమైన తీర్ధాన్ని ఈదుకుంటూ వెళ్ళాలంటే సమయం సరిపోదు\" అనుకుని, ఒక్క సారిగా పైకి చేరాలని ఒడ్డునుంచే ఆ స్థంభం పై నున్న పీఠం మీదకి దూకాడు. అందువలన ఆ పీఠం ఎంత మాత్రం చలించలేదు సరికదా అలా పెరుగుతూనే ఉంది. ఎండ ఎక్కువైన కొలదీ ఆ స్థంభం ఆకాశంలోకి దూసుకు పోతోంది.\n\nఐతే ఆ వేడిమికి ఏ మాత్రమూ చలించని విక్రమార్కుని ధైర్యానికి సూర్యుడు వెరగు పడి \"ఓ! రాజా! లక్ష యోజనాల దూరంలో ఉన్న సామాన్య మానవులు నా ఎండ వేడిమికి తట్టుకోలేక గిలగిల మాడి పోతారు, నన్ను సమీపించిన వారెవరైనా బూడిద కాక తప్పదు. అటువంటిది నీవు ఎంత మాత్రము చలించలేదు సరికదా, భగవంతుని దయవలన బ్రతికి పోయావు. నీ ధైర్య సాహసాలకి అబ్బుర పడుతున్నాను, అందుకు గాను నిన్ను మెచ్చి ఈ కుండలాలు నీకు బహుమతి గా ఇస్తున్నాను. ఇవి నాకు అను నిత్యము బంగారాన్ని ప్రసాదిస్తాయి. నాలుగు మాడలెత్తు = ఒక కర్షం, నాలుగు కర్షములు = ఒక పలము, నూరు పలములు = ఒక తులము, అలాంటివి ఇరవై తులాలు ఒక మితి భారము\" అని చెప్పి ఆ కుండలాలు విక్రమార్కునికి ఇచ్చాడు.\n\nవిక్రమార్కుడు వాటిని భక్తితో స్వీకరించి సూర్య భగవానునికి ప్రణామం చేసాడు. ఇంతలో అపరాహ్నం దాటింది. స్థంభం మెల్లగా కృంగ సాగింది. సాయంత్రానికి మడుగు ఒడ్డుకు చేరింది. అప్పుడు మన విక్రమార్కుడు స్థంభంపై నుంచి దిగి ఒడ్డుకు చేరి నిలబడగానే ఆ స్థంభం మాయమైపోయింది. ఇక విక్రమార్కుడు ఆ రాత్రి అక్కడే గుడి లో గడిపి ఉదయాన్నే స్నాన పానాదులు శివ పూజ ముగించుకుని తిరిగి తన రాజ్యం వైపు బయలుదేరాడు.\n\nదారిలో అతనికొక ముదుసలి కనిపించి రాజును దీవించి \"ఓ వీరాగ్రణీ! నేనెంతో ఆకలితో ఉన్నాను. ఆహారం కోసం నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకో\" అని వేడు కున్నాడు.\n\nఅప్పుడు విక్రమార్కుడు తన వద్ద ఏమీ ఆహారం లేనందువలన మిక్కిలి బాధపడి ఆ ముదుసలికి సాయపడాలన్న ఉద్దేశ్యంతో తన వద్దనున్న సూర్య భగవానుడిచ్చిన కుండలాలను ఇచ్చి వేసాడు.\n\nఈ విధము గా మా విక్రమార్కుడు మహోన్నత మైన దాన ధర్మాలు చేసి తీర్ధ యాత్రలు చేసి అనేక రకములైన చోద్యములు చూసి జగన్నాధుడైన సూర్య భగవానుని దర్శన భాగ్యం ఫోందిన పుణ్యాత్ముడు.బీద సాదలకు ఆప్త బంధువు\" అని సాల భంజిక చెప్పి \"ఓ! భోజరాజా! నీ కంతటి గొప్పతనం దయా హృదయం లేవు కావున, సింహాసనానికి తగవు\" అని వారించింది.\n\nఇంకేముంది మన భోజరాజు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 849,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "విక్రమార్కుడు గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన రాజు. క్షణంలో కరిగి పోయే కలిమిని సైతం తన మంచితనంతో కట్టి పడేయగల సమర్ధుడు.\n\nఐతే, అంత ధనం ఉన్నప్పుడు తగినంత దాన గుణం ఉండాలి కదా!? అందుకని అశ్వమేధ యాగం చేయాలని తల పెట్టాడు. అందుకు తగినట్టుగా బంధు మిత్ర సపరివారాన్నందరిని ఆహ్వానించాడు.\n\nచేసేది పుణ్య కార్యం గనుక \"గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, యక్షులు\" తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు. సరే! వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేసాడు. ఐతే, వారిలో సముద్రుడు లేక పోవటంతో చింతించి, ఒక పురోహితున్ని కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు.\n\nఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు, తిమింగలములు, అనేక సుడిగుండములు ఉండే సముద్రాన్ని చేరాడు. దానికి సమీపంలో నిలబడి సముద్రుడిని పిలిచి పిలిచి అలసి పోయాడు. అప్పుడు తనలో తను \"సరసత్వము సన్మానము లేని చోట స్నేహం పనికి రాదను కున్నాడు. దారి దోపిడి వారికి దాన ధర్మాలు చూపించటం లాంటిది.\" అని ఎంచి మరలి పోవాలనుకుని ఆఖరి సారిగా ఎలుగెత్తి ఇలా పిలిచాడు. \"ఓ సముద్రుడా! నేను రాజునాజ్ఞను నిర్వర్తించటం కోసం నిన్ను పిలుస్తున్నాను. యాగానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. కాని, నీవు కనబడ లేదు, గనుక తిరిగి వెళ్ళి పోతున్నాను.\" అని మరొక సారి గట్టిగా అరిచాడు. అది విన్న సముద్రుడు ఆ రాజ పురోహితుని ముందు ప్రత్యక్షమై అతనికి నాలుగు దివ్యమైన రత్నాలు ఇచ్చి ఇలా చెప్పాడు.\n\n\"నేను యాగానికి రాలేదని మీరు మీ రాజు చింతించవద్దు. అసలైన స్నేహం మనసులో ఉండాలి. నాకు మీ రాజు ఎంతో ప్రీతి పాత్రుడు. మా స్నేహం అజరామరం. అది మీ అందరికి జయమగుగాక! మీ రాజు చేసే ఈ గొప్ప యాగానికి బహుమతి గా ఈ నాలుగు రత్నాలు ఇస్తున్నాను. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహత్తు ఉంది.\" అని ఇలా చెప్పాడు.\n\n\"ఒకటి సైన్యము.... ఒకటి ధనము... మరొకటి మంచి వస్త్రాభరణములు... ఇంకోటి ప్రీతి కరమైన భోజన పదార్ధములు కోరిన వెంటనే ఇస్తాయి.\" అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఇచ్చి అంతర్ధాన మయ్యాడు.\n\nఆ పురోహితుడు ఎంతగానో సంతోషించి ఆ కానుకలు తీసుకుని వెనుదిరి గాడు. ఉజ్జయని చేరే సరికి యాగము, దానధర్మాలు ముగిసి పోయాయి. అందుకు కొంత విచారించాడు. అదే సమయంలో తాను కూడా ఇక్కడ ఉండి ఉంటే తన బీదరికం పోయేది కదా! అన్నవస్త్రాదులు దొరికేవి కదా! అని తన దురదృష్టాన్ని నిందించుకుని రాజదర్శనం చేసుకుని ఆ నాలుగు రత్నాలు రాజుకి సమర్పించి వాటి యొక్క గొప్ప తనాన్ని వివరించాడు. అప్పుడు రాజు \"ఈ అమూల్యమైన నాలుగు రత్నాలలో ఏదో ఒకటి ఏరుకుని నీవు తీసుకో\" అని బ్రాహ్మణుడికి చెప్పాడు. అందుకు ఆ బాపడు సంతసించి ఏది మంచిదో తనంత తానుగా ఎన్నుకోలేక, ఇంటికి వెళ్ళి ఇంట్లో వారినడిగి వస్తానని చెప్పి, వెళ్ళి పోయాడు.\n\nఇదంతా ఇంట్లో చెప్పే సరికి కొడుకు \"నాన్నా! సైన్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. జగమంత మన చెప్పు చేతల్లో ఉంటుంది కనుక, మొదటి రత్నాన్ని అడుగు!\" అన్నాడు. ఇక తండ్రి \"ధనకనక వస్తు వాహనాలిచ్చే రెండో రత్నాన్ని కోరుకోమన్నాడు. ఎందుకంటే ధన మూలం ఇదం జగత్తు అన్నారు కదా!\" అన్నాడు. ఇక పోతే భార్య \"ప్రతి నిత్యం ప్రీతి కరమైన భోజనం చేయవచ్చు. కనుక, మూడో రత్నం అడుగు\" అంది. \"ఇవేవి వద్దు మంచి వస్త్రాభరణాలిచ్చే నాలుగో రత్నం కావాలి\" అని కోడలు కోరుకుంది.\n\nఅన్నీ విన్న విప్రుడు - ఈ నలుగురి వివాదం ఇంతటితో తీరదనుకుని విసుగు చెంది, రాజదర్శనం చేసుకుని \"ఓ రాజా! వీటిలో ఏదో ఒకటి తమరే ఇచ్చి పుణ్యం కట్టుకోండి\" అని ప్రార్థించాడు. అందుకు రాజు నవ్వి, అంతా గ్రహించటంతో \"మీ తగవు నేను తీరుస్తాను. మీ కుటుంబంలోని నలుగురు సభ్యుల కోర్కెలు తీర్చు!\" అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఆ పురోహితునికి ఇచ్చి వేసాడు.\n\nఅంటే, \"మా విక్రమార్కుడు అంతటి దానగుణం కలిగిన దయా శీలుడు\" అని సాలభంజిక కథ చెప్పేసరికి ఇంకేముంది? మన భోజరాజు సింహాసనం ఎక్కకుండా వెనుదిరిగి వెళ్ళాడు . ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 850,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 3",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "పూర్వము సూర్యవంశంలో పుట్టిన సుదర్శనుడనే రాజు అయోధ్యాపురం రాజధానిగా చేసుకుని పరి పాలిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాలు చేస్తూ మిక్కిలి పేరు పొందాడు.\n\nఐతే ఒకనాడు సరయూ నదీతీరంలో యజ్ఞం చేస్తూండగా, త్రిలోక సంచారి ఐన మన నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సుదర్శనుడు నారదుని భక్తితో పూజించి అర్ఘ్య పాద్యాదులనర్పించి సవినయంగా \"ఓ మహాను భావా! మీ రాకవల్ల కృతార్ధుడనయ్యాను, మారాజ్యము పావనమైంది, తమరింకా ఏఏ ప్రదేశాలు చూచి వచ్చారో సెలవీండి\" అని ఎంతో వినయ విధేయతలతో అడిగాడు.\n\nఅందుకు మన నారదుడు అతని సేవలకు మెచ్చి \"పరమ ధర్మ శీలుడవైన ఓ రాజా! నీ కీర్తి బ్రహ్మ లోకంలో నలుదిశల పొగడబడు తున్నది. నీ దాన ధర్మాల గురించి నీ ప్రాశస్త్యం గురించి విని నిన్ను చూడాలని వచ్చాను\" అని అన్నాడు.\n\nఅందుకు సుదర్శనుడు \"స్వామీ నాపై దయతో మీరిలా వచ్చారుగానీ నేనెంతటి వాడను?\" అని ఎంతో వినయంగా నమస్కరించాడు. అందుకు ముని \"ఓ ధరణీశా! నీ చరిత్ర బ్రహ్మ లోకంలో చర్చించ బడుతోంది. అంత కంటే ఏం కావాలి? నీవంటి వారికి సాధ్యంకానిదేది లేదు. స్వధర్మాన్ని త్యాగం చేయకుండా నిర్మల జీవితాన్ని గడిపే వారికి దుస్సాధ్యమైన దేదీ ఉండడు\" అని చెప్పి \"ఋషి పత్నులు ఇసుకతో చేసిన కలశాల్లో నీళ్ళు నింపుకోవడం నీకు తెలుసుకదా? కావాలంటే దీనికి నిదర్శనంగా, ఇదుగో నీవు కూడా ఈ ఇసుకతో కుండను చేసి నీళ్ళు నింపి చూడు. నీరు నిలబడుతుంది\" అని ఇంత ఇసుక తీసి రాజుకిచ్చాడు.\n\nసరే అని రాజు ఆ ఇసుకతో కుండను చేసి నీరు నింపాడు. అందులో ఆ నీరు నిలబడేసరికి పరమానంద భరితుడయ్యాడు. అప్పుడు నారదుడు \"ఈ విధముగా పుణ్య చరితుడవై కీర్తి ప్రతిష్టలతో చిరకాలం వర్థిల్లు\" అని దీవించి తన దారిన తాను వెళ్ళి ఫొయాడు.\n\nఆ రోజు మొదలు సుదర్శనుడు మట్టి కుండల్లో కాక ఇసుక కుండల్లో అన్ని పదార్ధాలు వండించి చక్కగా రకరకములైన పదార్ధములతో అన్న దానం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు తన వంటశాలలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని ఇసుక కుండలలో వండబడే సామాగ్రిని చూసి ఉబ్బి తబ్బై \"ఆహా నేనెంతటి ఘనుడను?\" అని గర్వముతో పొంగిపోయాడు. అంతె తక్షణం ఆ కుండలన్ని కరిగి పోయి ఇసుక పోగులుగా మారిపోయాయి. కారణం తెలియక రాజు చింతా క్రాంతుడ్య్యాడు. \"అయ్యో నావల్ల ఏ పొరపాటు జరిగిందో? లేదా భోక్తలు అనర్హులా? ఏ చెడు జరిగిందో\" అని వాపోయాడు. అదే సమయంలో మన నారదుడు ఆకాశ మార్గాన వెడుతూ సంగతి తెలుసుకుని \"ఓ రాజా! గర్వత్కార్యం వినశ్యతి అన్న పెద్దల వాక్యం వినలేదా? పర్వత సానువుల్లో రథము, గర్వము వల్ల ధర్మ కార్యము, భూమి మీద నావ, స్త్రీ సాంగత్యము వలన బ్రహ్మ చర్యము సక్రమము గా నడవవు. నీ గొప్పతనానికి నీవే గర్వపడేసరికి నీ మహిమ నీరు గారి పోయింది\" అని చెప్పాడు.\n\nఅందుకు రాజు చింతించి తన తప్పు తెలుసుకుని తన అపరాధానికి నివారణ చెప్పమని ప్రార్ధించాడు. అందుకు నారదుడు \"రాజా నువ్విలాగే దాన ధర్మాలు చేస్తు ఉండు. గర్వం ఆగ్రహం లాంటి చెడ్డ గుణాలు చెంత చేరకుండా యజ్ఞ యాగాదులు చేస్తు ధర్మ పరిపాలన చేస్తూ ఉండు. కొంత కాలానికి నీకు మునపటి మహిమ లభిస్తుంది\" అని చెప్పి వెళ్ళిపోయాడు.\n\n\"కనుక గర్వము, పౌరుషము, మనని మనమే పొగుడుకోటము లాంటివి ఉత్తమ లక్షణము కాదు\" అని సాలభంజిక భోజరాజుకి సుదర్శనుని కథ చెప్పి మళ్ళీ సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకుంది. ఈ విధంగా భోజరాజు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళి పోయాడు.\n\nఅంచేత మనిషికి గర్వము, అహము లాంటి చెడ్డ గుణాలు పనికి రావన్నమాట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 851,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 4",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "విక్రమార్కుడి రత్న సింహాసనం మీద మోజు తీరని భోజరాజు ఒక నాడు, శ్రీకృష్ణుడిని పూఇంచి, తిరిగి సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు. ఇంతలో అక్కడున్న బొమ్మ, \" ఓ రాజా, మేము యెంత చెప్పినా, నీవు మరలా, మరలా సింహాసనం ఎక్కే ప్రయత్నం చేస్తున్నావంటే, అది కేవలం నీకు విక్రమార్కుడి గుణగణాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప, మరేమీ కాదు. విక్రమార్కుడి సాహస, దాతృత్వ లక్షణాలను గురించి చెప్తాను, విను, \" అంటూ ఇలా చెప్పసాగింది.\n\nవిక్రమార్క మహారాజు ఒక మారు దేశాటనం చేస్తూ, గంగా తీరం చేరుకొని, అక్కడ ధర్మపురం అనే నగరంలో, ఒక సత్పురుషుడి ఇంట్లో బస చేసాడు. ఉదయాన్నే లేచి, సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి, గంగా నదికి ప్రణమిల్లి, స్నానం ముగించుకుని, పుర వీధుల్లో సంచరించసాగాడు . ఇంతలో అక్కడికి ఒక ముసలిది , భయంతో పెడబొబ్బలు పెడుతూ, ఏడుస్తూ వచ్చి, \" అయ్యలారా! నా మొగుడు నదిలో సంధ్య వారుస్తుండగా, ఒక మొసలి పట్టుకుంది. మీలో ఎవరయినా, నా భర్తకి ప్రాణ భిక్ష పెట్టండి,\" అని మొరపెట్టుకుంది.\n\nఅప్పుడు నివురుగప్పిన నిప్పు లాంటి విక్రమార్కుడు ముందుకు వచ్చి, \" అమ్మ, నువ్వు బాధపడకు. నీ భర్తను నేను రక్షిస్తాను,\" అని, ఆమె వెంట వెళ్ళాడు. నదిలో దూకి, ఒక్క కత్తి వేటుతో మొసలిని చంపి, ఆమె భర్తను కాపాడాడు.\nఅప్పుడా బ్రాహ్మణుడు, \" ఆహా! నీవు మహావీరుడవు. గజేంద్రుడిని కాపాడ వచ్చిన విష్ణుమూర్తి లాగా నీవు నన్ను కాపాడావు. నాకు ప్రాణ భిక్ష పెట్టిన నీకు మారుగా నేనొక సహాయం చేస్తాను. గోపాల మంత్రోపాసన ద్వారా, నాకు మరణ సమయంలో రత్నమయమయిన దివ్య విమానం ప్రాప్తిస్తుందని, ఆ గోపాలుడి వరం పొందాను. నా తపః ఫలమయిన ఆ దివ్య విమానం నీకు ఇచ్చి, నీ ఋణం తీర్చుకుంటాను.\" అన్నాడు.\nఅందుకు విక్రమార్కుడు, \" ఆపదలో ఉన్న మిమ్మల్ని కాపాడాలన్న సంకల్పంతో ఈ సాహసం చేసాను కాని, మీ నుంచీ ప్రతిఫలం ఆశించలేదు. ఇది క్షత్రియ ధర్మం. మీ దానం గ్రహించే అర్హత నాకు లేదు, \" అంటూ నిరాకరించాడు.\n\nవెంటనే అతడు విక్రమార్కుడిని గుర్తించి, \" ఓ రాజా! ఇంతటి ధైర్య సాహసాలు, నిరాడంబరత కల నీవు ఖచ్చితంగా విక్రమార్కుడివే . బ్రహ్మ క్షత్రియులకు ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పులేదు. కనుక నీవు కాదనక, నా దానాన్ని గ్రహించు,\" అంటూ విమానాన్ని దానం ఇచ్చాడు. అప్పుడు విక్రమార్కుడు దాన గ్రహణం చేసి, విప్రుడికి మొక్కి, తిరిగి దేశాటనకు బయలుదేరాడు....అప్పుడు....\n\nవిక్రమార్కుడు అలా దేశాటనం చేస్తూ వింధ్యాటవి చేరుకున్నాడు. అక్కడ అతనికి శూన్యమయిన ఒక గుడి, దగ్గరలో ఒక రావి చెట్టు, ఆ చెట్టుకింద వికృతాకారుడయిన ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించారు. అతడిని సమీపించి, 'నువ్వెవరు ? ఈ నట్టడవిలో, భూతంలా ఎందుకు తిరుగుతున్నావు?' అని అడిగాడు.\nఅందుకు ఆ రాక్షసుడు, ' నేనొక గొప్ప పండితుడిని. మాళవ రాజ పురోహితుడిని. ఒక విప్రుని అకారణంగా బాధించినందుకు, శాప గ్రస్తుడనై ఇలా తిరుగుతున్నాను. నీ వంటి మహావీరుడే నన్ను ఉద్ధరించగలడు,' అన్నాడు.\n\nఅంతా విన్న విక్రమార్కుడు, దయతో, ' నీకేమి కావాలో కోరుకో. అవసరమయితే, నా ప్రాణమయినా ఇచ్చి, నిన్ను కాపాడతాను ' అన్నాడు.\n'గంగలో నువ్వు కాపాడిన విప్రుడు ఇచ్చిన దివ్య విమానం నాకు ఇస్తే, నాకు ముక్తి కలుగుతుంది' అన్నాడు రాక్షసుడు.\nదానికి విక్రమార్కుడు ఆనందంగా ఆమోదించి, తనకు బ్రాహ్మణుడు దానం చేసిన విమానాన్ని, బ్రహ్మరాక్షసుడికి ఇవ్వగా, అతడు బ్రహ్మను మించిన బ్రహ్మ పధాన్ని చేరుకున్నాడు.\n' ఓ భోజ రాజా! విన్నావుగా...ఇంతటి సాహసం, దయాగుణం కల ఈ విక్రమార్కుడి సింహాసనం ఎక్కేందుకు నీకు అర్హత ఉందని అనుకుంటున్నావా?' అని ప్రశ్నించింది సాలభంజిక.\nచేసేది లేక, నిరాశగా వెనుదిరిగాడు భోజ రాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 852,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 5",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "భోజ రాజు సింహాసనం మీద మమకారాన్ని చంపుకోలేక, మళ్ళి ఒక శుభ దినాన సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు.\n\nఅక్కడ కాపలా ఉన్న బొమ్మ కోపించి, ' రాజా! నీకు మర్యాద తెలియదా ? విక్రమార్కుడి ధైర్యసాహసాలు ఎక్కడా? నీవెక్కడ?' అని ప్రశ్నించింది.\n\nగతుక్కుమన్న భోజుడు, ఆ గుణగణాల గురించి వివరించమని అర్ధించాడు.ఆ బంగారు బొమ్మ చెప్పడం మొదలుపెట్టింది.\n\nవిక్రమార్కుని రాజ్యంలో వేదవేది అయిన శుశ్రుతుడు అనే ధర్మజ్ఞుడు ఒకడు ఉండేవాడు. అతడు రాజాజ్ఞ మేరకు అనేక తీర్ధ యాత్రలు చేసి, వెనుదిరిగి వెళ్తూ , మార్గ మధ్యంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్న నగరానికి చేరుకున్నాడు. చక్కని ప్రాకారాలతో విరాజిల్లే ఆ నగరంలో, ఆశ్చర్యంగా, పురుషులనే వారే లేరు. దానిని పాలించేది కూడా ఒక సుందర కన్య మాత్రమే! ఆ పట్టణంలో ఒక దేవాలయం పక్కన ఒక ఉక్కు నూనె బావి, చక్కగా అలంకరించబడిన బంగారు వివాహ వేదిక అమర్చబడి ఉన్నాయి. అంతేకాక, దగ్గరలో ఉన్న ఫలకం మీద ఇలా రాసి ఉంది...\n\n\" ఏ నరుడయితే ఈ మరిగే నూనె బావిలో దూకే ధైర్యం చేస్తాడో, అతనికి ఈ రాజ్యము, అందాల భరిణె అయిన ఈ రాజకుమారి లభిస్తాయి...\"\n\nఅది చదివిన శుశ్రుతుడు ఆశ్చర్యపోయి, ' ఈ మరుగు నూనె బావిలో పడినవాడు , బ్రతికి బయటకు ఎలా వస్తాడు ? తిరిగి బ్రతికి బయటపడితే కదా, అతడికి ఆ భాగ్యం దక్కేది. అటువంటి మానవుడు ఉంటాడా ?' అని ఆలోచిస్తూ, తన ప్రయాణం కొనసాగించి, ఉజ్జయిని చేరుకున్నాడు. తాను చూచిన ఆ చోద్యం గురించి విక్రమార్కుడికి వివరించాడు. అన్నీ విన్న విక్రమార్కుడు చాలా కుతూహలాసక్తుడై, అతడిని వెంట బెట్టుకుని, ఆ పట్టణానికి చేరుకున్నాడు.\n\nశుశ్రుతుని వెంటబెట్టుకుని విక్రమార్కుడు కారడవుల వెంట ప్రయాణించి, అతడు చెప్పిన పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి కళ్యాణ మంటప వైభవాన్ని చూసి ముగ్ధుడై, ఆ రాకుమార్తె ఇంకా యెంత అందమయినదో, అనుకున్నాడు. పక్కనున్న శాసనాన్ని చూసి మరింత ఉత్సాహభరితుడయ్యాడు.\n\nఇక ఆలస్యం చెయ్యకుండా, ప్రక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి, లక్ష్మి నారాయణులకు మ్రొక్కి, సలసల కాగుతున్న నూనె బావిలోకి దూకాడు. వెంటనే, సంధ్యారాగ కాంతులను ప్రసరిస్తూ, కందర్ప సంజీవని రాజ పుత్రిక అక్కడ ప్రత్యక్షం అయ్యి, తన మహిమతో, విక్రమార్కుడిని తిరిగి బ్రతికించింది.\n\n\" ఓ సాహస వీరుడా! ఇకపై నేను నీ దాసిని. నన్ను, నా రాజ్యాన్ని గ్రహించి, నన్ను కరుణించు. నువ్వు ఇకపై ఏది చెప్పినా తప్పక పాటిస్తాను.\" అంది.\n\nఆ మాటలు విన్న విక్రమార్కుడు ,\" సుందరీ! నువ్వంటున్నది నిజమయితే, దైవసమానుడయిన ఈ శుశ్రుతుడిని వివాహం చేసుకో, \" అన్నాడు.\n\nవెంటనే ఆమె సిగ్గుతో తల వంచుకుని, ఆమె శుశ్రుతుని వరించింది. విక్రమార్కుడు తనకు లభించిన రాజ్యాన్ని, రాకుమారిని శుశ్రుతుడికి అప్పగించి, సంతోషంగా ఉజ్జయినికి తిరిగి వచ్చాడు.\n\nకనుక ఓ భోజ రాజా! యెంత ప్రయత్నించినా, నీవు ఈ సింహాసనం ఎక్కే అర్హత సంపాదించలేవు. తిరిగి వెళ్ళిపో!, అన్న బొమ్మ మాటలకు సిగ్గుతో భోజుడు తిరుగు ముఖం పట్టాడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 853,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 6",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "ధారా నగరాధిపతి మరొక సుముహూర్తాన ఉమామహేశ్వరుల ఆరాధన చేసి, పరివారం వెంట రాగా, సింహాసనం యెక్క వచ్చాడు. అక్కడున్న సాలభంజిక, 'నిలు, నిలువు ' మని వారించి, ' నువ్విలా మాటిమాటికీ ఇక్కడికి రావడమే తప్పు. విక్రమార్కుడికి సరిసమానమయిన ఉపకార బుద్ధి లేక, నీవు ఈ సింహాసనం ఎక్కడం తగదు సుమా!' అని వారించింది.\n\nఆ మాటలకు సిగ్గు, ఆశ్చర్యము కలిగిన భోజ రాజు, ' మీ మహారాజు ఎంతటి పరోపకార శీలియో చెప్పు, ' అని అడిగాడు.\n\nసాలభంజిక ఇలా చెప్పా సాగింది.\n\n\" మా విక్రమార్కుడు పాలించే రోజుల్లో, రాజధానిలో, ' విలోచనుడు ' అనే విప్రుడు ఉండేవాడు.అతడి భార్య విలోచన. వారికి చిరకాలము సంతానం కలుగాకపోవడంతో, విశ్వేశ్వరారాధన చెయ్యసాగారు. కొన్నాళ్ళకు ఈశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి, శనిత్రయోదశి పూజలు చేస్తే, సంతానం కలుగుతుందని చెప్పాడు. శివాజ్ఞానానుసారంగా భక్తితో పూజలు చేసిన వారికి చక్కటి పుత్రుడు కలిగాడు. వారు అతనికి 'దేవదత్తుడు' అని నామకరణం చేసారు. ఆ కుమారుడు బుద్ధిమంతుడై, చక్కటి విద్యావంతుడయ్యాడు . యుక్తవయస్సు రాగానే , పెళ్లి చేసుకుని, గృహస్త ధర్మాలను పాటించ సాగాడు. ప్రతి నిత్యం దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి, పూజకు కావలసిన పత్రం, పుష్పం, ఫలం, తోయం తెచ్చుకుని, పంచయజ్ఞాలు చేస్తూ కాలం గడపసాగాడు.\n\nఒకనాడు విక్రమార్కుడు వినోదార్ధం అడవికి వేటకు వెళ్లి, ఒక పందిని వెంబడిస్తూ, దారి తప్పాడు. తిరిగి వెళ్ళే ఉపాయం తోచక అక్కడే తిరగసాగాడు. ఇంతలో....\n\nఅలా అడవిలో దారి తప్పిన విక్రమార్కుడికి, చెట్టెక్కి, పళ్ళు కోసుకుంటున్న దేవదత్తుడు కనిపించాడు. అమితానందంతో అతడిని పలుకరించి, దారి చూపమని కోరతాడు. కీకారణ్యం లోని మార్గాలన్నీ తెలిసిన దేవదత్తుడు రాజును తిరిగి సైన్యం వద్దకు చేర్చాడు. అందుకు బదులుగా రాజు అతడికి ఒక గ్రామాన్ని దానం చేసాడు.\n\nఇదిలా ఉండగా, విక్రమార్కుడి చిన్న రాణి, గర్భవతియై, ఒక శుభ ముహూర్తాన పండంటి మగ శిశువుకు జన్మనిస్తుంది. మీనరాశి లో జన్మించిన ఆ బాలుడికి చంద్రుడు అని నామకరణం చేసారు. తేనె వంటి బాలుడి ముద్దు మాటలు, ఆటపాటలు చూసి ఆనందిస్తూ, ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచసాగారు రాజదంపతులు.\n\nబాలుడి విద్యాభ్యాసం నిమిత్తం గురువులను నియమించి, బాలుడికి పరీక్షాధికారిగా దేవదత్తుడిని నియమించాడు విక్రమార్కుడు. ఇలా బాలుడు చక్కగా విద్యాభ్యాసం చేస్తుండగా, ఒక రోజు ఇంటికి వెళుతూ, తనతో పాటు రాకుమారుడిని చెప్పకుండా తీసుకువెళ్ళాడు దేవదత్తుడు.\n\nచంద్రుడి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి, వాటిని అమ్మమని ఒక భటుడికి పురమాయించాడు. ఆ భటుడు నగలు అమ్ముతుండగా, వేగుల ద్వారా ఆ సంగతి విక్రమార్కుడికి తెలిసింది. దేవదత్తుడిని పిలిపించి, నిండు సభలో నిలతీసాడు. తాను నగలపై వ్యామోహంతో చంద్రుడిని చంపి , నగలు దొంగిలించినట్లు వప్పుకుంటాడు దేవదత్తుడు. సభికులంతా, దిగ్బ్రమ చెంది, దేవదాత్తుడి తల నరికి వెయ్యాలని తీర్మానించారు. కాని, విక్రమార్కుడు, ఒకప్పుడు, అడవిలో దేవదత్తుడు చేసిన ఉపకారాన్ని గురుతుకు తెచ్చుకుని, తనను తాను నిగ్రహించుకుని, ' నువ్వు ఇదివరకు చేసిన ఉపకారానికి బదులుగా, ఈ ధనాన్ని స్వీకరించు, ' అంటూ, అతడికి మరింత దానం ఇచ్చి పంపేశాడు. ఇది చూసిన పరాలు రాదూషణ చేస్తుండగా, దేవదత్తుడు ఇంటికి వెళ్లి, తన వద్ద ఉన్న చంద్రుడిని వెంటబెట్టుకు వచ్చాడు. 'రాజా! ఎట్టి పరిస్థితుల్లోనూ, రాజు సంయమనం కోల్పోకూడదని, నిదర్శన పూర్వకంగా యువరాజుకు బోధించెందుకే ఇలా చేసాను. దయ ఉంచి నన్ను క్షమించండి.' అని వేడుకున్నాడు. మహాదానంద భరితుడయిన రాజు, దేవదత్తుడికి, కంచిని మించే పట్టణాన్ని దానం చేసాడు.\n\nకనుక ఓ భోజ రాజా, ఒక్క మారు ఆలోచించు, ఇటువంటి సంయమనం, పరోపకార బుద్ధి, నీలో ఉన్నాయా?' అంటూ ముగించింది బొమ్మ. సిగ్గుతో తలవంచుకుని, వెనుదిరిగాడు భోజుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 854,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 7",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "శ్రీమహావిష్ణువును భక్తితో ధ్యానించి, తన వారందరూ వెంట రాగా, మళ్ళి, సింహాసనాన్ని ఎక్కలనే కోరికతో వచ్చాడు భోజ రాజు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న సాలభంజిక, మహారాజు పట్టుదలను మెచ్చి, ఇలా అంది.\n\n\" రాజా! ఇలా రోజూ వచ్చి వెళ్ళిపోవడం, నీ వంటి వాడికి తగదు. అలాగని నీకు గద్దెనెక్కే అర్హత కూడా లేదు. ఉజ్జయినీ పతికి కల అత్యుపకార, సాహస గుణాల గురించి చెప్తాను, విను...\"\n\nదానగుణం రాజులకు పేరు తెస్తుంది. దాన గుణం ఉన్న వాడే చతురుడు, శూరుడు అవుతాడు. అట్టి ఉదారమయిన దాతృత్వం కల విక్రమార్కుడు రాజ్యం చేసే సమయంలో, ఒక నాడు రాజు కొలువు తీరి ఉండగా, ఒక భట్టు వచ్చి, ఆ రాజు వైభవాన్ని గొప్పగా కీర్తించాడు. దానితో, సామంత రాజులకు అసూయ కలిగి, వారిలో ఒకడు, ' ఇతనితో సరిపోల్చగల రాజు మరెవ్వరూ లేరా ?' , అని అడిగాడు. దానికా, భట్టు నెమ్మదిగా నవ్వి, ' ఈ మహారాజు దైవ ప్రసాదం వల్ల పుట్టిన సిద్ధపురుషుడు. ఇతని దానాగుణానికి కర్ణుడే సరిపోలడు , ఇక మనమెంత?' అన్నాడు.\n\nఅది విన్న సామంత రాజు తనకు కలిగిన సిగ్గు, అహంకారం, మనసులోనే దాచుకుని, ఎలాగయినా విక్రామార్కుడిని మించిన కీర్తిని సంపాదించుకోవాలని సంకల్పించాడు. ఇలా ఉండగా, ఒక సిద్ధుడు ఆ రాజదర్శనం కోసం వచ్చాడు. అప్పుడు సామంతుడు అతడిని ఆదరించి, 'ఎలాగయినా, దానగుణం లో విక్రమార్కుడిని మించే ఉపాయం చెప్పండి...' , అని వేడుకున్నాడు.\n\nఅప్పుడా సిద్ధుడు, 'రాజా ! సాహస యజ్ఞం అనేది ఒకటి ఉంది. అది చేస్తే, నీ కోరిక నెరవేరుతుంది. అదెలాగంటే, యోగినీ చక్రం వేసి, తన శరీరాన్ని అర్పించాలి. అప్పుడు, ఆ అగ్ని ప్రభావం వల్ల బ్రతికి, వైభవాన్ని పొందగలవు. ఇదొక్కటే మార్గం ,' అని చెప్పాడు. రాజు అది విని, చాలా సంతోషించి, ఆ రాత్రికే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.\n\nఅప్పుడు....\n\nసామంత రాజు సాహస యజ్ఞానికి కావలసిన సామాగ్రి సమకూర్చుకుని, మొదట సర్వ దేవతలనూ ప్రార్ధించాడు . కీలక మంత్రం భక్తితో జపించాడు . యజ్ఞకుండంలో ఆహుతులు అర్పించాడు . తెగించి, తన శరీరాన్ని ఆహుతి చెసాడు . నిత్య దానం వాళ్ళ వచ్చే కీర్తి, శాశ్వతంగా నిలబడుతుంది కదా ! అతడు చేసిన సాహసానికి మెచ్చి, దేవతలు అతడిని తిరిగి బ్రతికించి, దర్శనం ఇచ్చి, ఎటువంటి వరం కావాలన్నా, కొరుకొమన్నారు.\n\nఆ రాజు వారికి ప్రణామం చేసి, \" ప్రతి నిత్యం ధనధాన్యాలతో నా భాండాగారాలు ఏడూ నిండి ఉండేలా వరం ప్రసాదించండి , ' అని కోరాడు . దానికి వారు , ప్రతి రోజూ, నీవిలా నీ శరీరాన్ని హోమ గుండంలో అర్పిస్తే, నీ కోరిక తీరుతుంది, ' అని చెప్పరు. రాజు అందుకు ఇష్టపడి, తన ఇంట నిండిన ధన ధాన్యాలను క్షణం కూడా వృధా చెయ్యకుండా దానం చెసాడు . ఈ విధంగా భాండాగారం నిండుకోగానే ప్రాణాలు ఇవ్వడం, తిరిగి పునర్జీవితుడయ్యి దానాలు చెయ్యడం, చెయ్యసాగాడు .\n\nఈ చోద్యం ఏవిటో చూడాలని, ఉజయినీపతి ఒక నాడు ముని వేషంలో, అక్కడకు వెళ్ళాడు . రాజు చేస్తున్న త్యాగాన్ని కళ్ళారా చోసాదు. మర్నాడు రాజు కంటే ముందుగానే యజ్ఞ స్థలానికి చేరుకొని, దేహాన్ని యజ్ఞకుండానికి ఆహుతి చెయ్యబొయాదు. దేవతలు అతడిని వారించి, విక్రమార్కుడి కోరిక ఏవిటని అదిగారు. అప్పుడు విక్రమార్కుడు తన సామంతుడు, రోజూ ఇలా దేహాన్ని ఆహుతి చెయ్యకుండానే, అతని భాండాగారం నిత్యం సిరిసంపదలతో నిండి ఉండేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు . ఈ విషయం తెలుసుకున్న సామంత రాజు, విక్రమార్కుడి ఔన్నత్యానికి పరవశించి, తన దురభిమానం విడిచి, అతడికి కృతఙ్ఞతలు చెప్పి, తన భవంతికి వెళ్ళిపోయాడు .\n\n'కనుక ఓ భోజ రాజా, నీవు ఆ సామంత రాజులా, తిరిగి వెళ్ళిపోవడం మంచిది, ' అని ముగించింది బొమ్మ. గృహోన్ముఖుడయ్యాడు భోజ రాజు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 855,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 8",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "యెంత మరచిపోదామన్నా మరపురాని సింహాసన శోభ మనసుని వేధించగా, మళ్లీ భోజుడు ఇంకొక ప్రయత్నం చెయ్యబొయాడు .\n\nఅప్పుడు అక్కడ ఉన్న బొమ్మ , రాజా! నీవేలాగూ ఈ సింహాసనం యెక్కలెవు. చూస్తుంటే, అతని కదామృతం వినగోరి నీవు మరలా మరలా ఇక్కడకు వస్తున్నట్లు ఉంది . నీకొక కదా చెబుతాను, విను, ' అంటూ ఇలా చెప్పసాగింది ...\n\nవిక్రమార్కుడు దేశాటనం చేస్తూ యోగి వేషలో అడవిలో ప్రయాణిస్తుండగా, అతడికి నట్టడవిలో, 'అంబా, ' అన్న అరుపు వినవచ్చింది . క్రూరమృగాలు సంచరించే అడవిలోకి, ఆవు ఎలా వచ్చిందా, అని ఆశ్చర్యపోతూ అతడు ఆ దిక్కుగా వెళ్ళాడు . అక్కడి రేగడి మడుగులో, నాలుగు కాళ్ళు కూరుకుపోయి పైకిరాలేక అవస్థ పడుతున్న గోమాత కనిపించింది . కరుణార్ద్ర హ్రుదయుడయిన విక్రమార్కుడు ఆవు పరిస్థితి చూసి చలించిపోయాడు. అయినా, దానిని రక్షించడం తనవంటి వీరుడికి యెంత పని, అనుకుంటూ నెమ్మదిగా మడుగులోకి దిగాడు. కాళ్ళు నెలకి అదిమి పట్టి, ఆవు తోకను పట్టుకు లాగబోయాడు. ఆవు కొంచమయినా కదలలేదు. ఎంతగా ప్రయత్నించినా, ఆవును బయటకు లాగడం విక్రమార్కుడికి సాధ్యపడలేదు. చూస్తుండగానే, నలుదిశలా చీకట్లు అలముకున్నాయి. గుడ్లగూబలు గుహలలో నుంచి బయటకు వచ్చాయి. ఆకాశమంతా మబ్బులతో నిండి, గాలివానతో పాటు పిడుగులు పడసాగాయి. నీరు ఏరులయ్యి పారసాగింది. ఇంతటి భయంకర స్థితిలో ఏ మనిషయినా, భయపడి పారిపోతాడు. కాని, విక్రమార్కుడు బెదరక, తన బొంతను ఆవు మీద కప్పి, రాత్రంతా వర్షంలో గడిపాడు.\n\nతెల్లవారింది. విక్రమార్కుడు మరలా ఆవును బయటకు లాగేందుకు తన ప్రయత్నం కొనసాగించాడు. ఆవు కదలలేదు. ఇంతలో ఎదురుగా, నిప్పులు చెరిగే కళ్ళతో, ఒక పెద్దపులి, గోరుచుట్టు మీది రోకలిపోటు లాగా ఎదురయ్యింది. సమయం చూసి వారి మీద పడాలని చుట్టూ తిరుగుతూ, పెద్దగా గాండ్రించింది.\n\nసమయం చూసి పులి వారి మీదకి దుమికింది, దాని దారికి అడ్డుపడ్డాడు విక్రమార్కుడు. ప్రాణాలకు తెగించి, పులితో పోరాడి, కత్తితో దాని తల నరికేసాడు విక్రమార్కుడు. క్షణకాలంలో పులి అక్కడి నుంచీ అదృశ్యం అయ్యింది. అంతలో ఆవు కూడా, మామూలుగా మడుగు నుంచీ బయటకు వచ్చి, 'రాజా! నేను కామదేనువును. నీ ధైర్యానికి జోహార్లు. నీకేమి కావాలో కోరుకో! ' అంది.\n\nవిక్రమార్కుడు కామధేనువుకు నమస్కరించి, ' మాతా! నీవు అన్ని లోకాలకూ తల్లి వంటిదానవు. అట్టి నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది?' అని ప్రశ్నించాడు. అప్పుడు సురభి, ' రాజా! ఒక నాడు ఇంద్ర సభలో బృహస్పతితో నారదుడు ఎందరో మహారాజులు ఉన్నారు కాని, విక్రమార్కుడంతటి ధీరుడు, కృపాళువు , లేడు, ' అని చెప్పాడు. అందులోని నిజాన్ని తెలుసుకునేందుకు, నిన్ను పరీక్షించమని దేవేంద్రుడు నాకు ఆజ్ఞను ఇచ్చాడు. ఇదంతా దైవమాయే. ఈ పరీక్షలో నీవు విజయం సాధించావు. నీకు ఏమి కావాలో చెప్పు, ' అంది.\n\nఅందుకు విక్రమార్కుడు, 'దేవీ, నీ దర్శనం పొందడం వల్ల నాకు స్వర్గ ప్రాప్తి కలిగింది. నాకు సకల సంపదలూ ఉన్నాయి. వేరేమే కోరికలు లేవు, ' అన్నాడు.\n\nఅతని గొప్పతనానికి మెచ్చుకుని, రాజా, ఇంద్రుని ఆజ్ఞ మేరకు నేను నీకు వశం అయ్యాను. నన్ను నీతో తీసుకుపో, అంది సురభి. అలా వారిరువురూ వెళుతుండగా, దీనావస్థలో ఉన్న ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అందుకు కారణం అడుగగా, అతడు 'రాజా, పెద్ద కుటుంబం పోషించలేక, విరక్తితో చావడానికి వేలుతున్నాను, ' అన్నాడు. విక్రమార్కుడి హృదయం కరిగిపోయింది. అతడిని వోదార్చి, తన వెంటనున్న సురభిని అతడికి దానం చేసాడు.\n\n'ఇంద్రాది దేవతలంతా, వేనోళ్ళ పొగిడే వితరణ గుణం విక్రమార్కుడిది. కనుక అతని సింహాసనాన్ని నీవు కోరుకోవడం తగదు. వెళ్ళిపో, ' అంది బొమ్మ.\n\nవిక్రమార్కుడి గొప్పతనానికి మనసులోనే ఆశ్చర్యపోతూ, వెనుదిరిగాడు భోజుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 856,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 9",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "ఆ భాద్రాసనం మీద మోజు తీరక మళ్ళి ఒక రౌ మెరుపు తీగల వంటి కాన్తామనులు వెంట రాగా, మండపం చేరుకున్నాడు మహారాజు .\n\nఅప్పుడు అతడిని అడ్డుపెట్టి ఆ బొమ్మ ఇలా అంది.\n\n\" ఓ రాజా! ఆశ వదలక నీవు యెంత కాలం ఇలా నీ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటావు ? విక్రమార్కుడంతటి ఉదారత, సాహసం లేక ఈ సింహాసనం ఎక్కడం ఎవరి తరం ? ఆ మాహారాజు గొప్పతనం ఏమిటో నువ్వు విని విని తీరాలి.\" అని ఇంకా ఇలా చెప్పింది .\n\nవిక్రమార్కుడు ఒక మండు వేసవిలో దేశాటనం చేస్తున్నాడు. అలా ప్రయాణిస్తూ, విదర్భ రాయంలో కుండిన పురాన్ని చేరుకున్నాడు. అక్కడి ఉప వనంలో చక్కని దుర్గాలయం ఉంది. ప్రక్కనే ఉన్న కొలను లో స్నానం చేసి , కలువ పూలు తెచ్చి, దుర్గను పూఇంచి, తరువాత అక్కడే కాసేపు విశ్రమించాడు. ఇంతలో అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. అతడు విద్యావంతుడు కనుక, మారువేషంలో ఉన్న రాజును పసిగట్టి, ' నీలో రవి తేజం ఉత్తి పడుతోంది. నీ రూపం చక్రవర్తి లక్షణాలను తలపిస్తోంది. నీవెవరు ? ఎందుకిలా ఒంటరిగా తిరుగుతున్నావు?,' అని అడిగాడు.\n\nఅందుకు విక్రమార్కుడు, 'పండితోత్తమా! నీ ఊహ సరి అయినదే, నేను క్షత్రియుడను. అవంతీపుర వాసిని. విక్రమార్కుడనువాడను. వింతలూ విడ్డూరాలు తెలుసుకునేందుకు ఇలా దేశాటనం చేస్తుంటాను,' అన్నాడు.\n\nఅది విన్న పండితుడు ఆశ్చర్యపోయి, ' పిసరంత భాగ్యం కలిగితే, నా వంటి సామాన్యుడే సుఖాలను కోరుకుంటాడు. నీకెందుకయ్యా ఈ కష్టాలు ? నన్ను చూడు, పెద్ద కుటుంబాన్ని పోషించలేక, ఏదయినా రస సిద్ధిని పొందాలని కంచికి పోయాను. నిద్రాహారాలు మాని, పన్నెండేళ్ళు కామాక్షి అమ్మ కటాక్షం కోసం తపస్సు చేసాను. అయినా, దేవి ప్రసన్నం కాలేదు. అందుకే, విసుగెత్తి, భిక్షాటనం చేస్తూ జీవిస్తున్నాను. నీ వంటి మహారాజుకు ఈ కష్టాలు తగవు, నా మాట విని నీవు ఇంటికి తిరిగి పోయి, సుఖంగా రాజ్యం చెయ్యి, 'అన్నాడు.\n\nపండితుడి మాటలు వింటున్న విక్రమార్కుడిని, అతడి తపస్సు విఫలమయ్యింది అన్న విషయం ఎక్కువగా ఆకర్షించింది. వెంటనే అతనితో, ' స్వామి, మీకు మారుగా నేను తపస్సు చేసి, రస సిద్ధిని సాధిస్తాను. నన్ను కంచి తీసుకుని వెళ్ళండి, ' అని అర్ధించాడు.\n\nఅలా అతని వెంట కాంచీపురం వెళ్లి, కామాక్షి దర్శనం చేసి, దేవతారాధన మొదలుపెట్టాడు. మూడు రోజులు తదేక దీక్షతో తపస్సు చేసాకా, దేవి కలలో కనిపించి, ' విక్రమార్కా! నీవు యెంత తపస్సు చేసినా, వ్యర్ధమే! నీవు కోరే రస సిద్ధి లభించాలంటే, ముప్పై రెండు శుభ లక్షణాలు ఉన్న చక్రవర్తిని తల కొట్టి బాలి ఇవ్వాలి. ఇది అసాధ్యం కనుక నీ ప్రయత్నం మానుకో!' అంది.\n\nమర్నాడు విక్రమార్కుడు దేవికి మోకరిల్లి, 'తల్లి, నీవు చెప్పిన శుభ లక్షణాలు కల చక్రవర్తిని అయిన నేను, నన్ను నేనుగా నీకు బాలి ఇస్తున్నాను. దయతో, ఆ పండితుడికి రస సిద్ధిని కలిగించు, ' అని ప్రార్ధించి , తల నరుక్కోబోయాడు. వెంటనే, దేవి ప్రత్యక్షమయ్యి, విక్రమార్కుడి వితరణ గుణాన్ని పొగిడి, పండితుని కోరిక తీర్చి మాయం అయ్యింది.\n\nఆ పండితుడు విక్రమార్కుడి వింత ప్రవర్తనకు, పరోపకార బుద్ధికి ఆశ్చర్య పోయి, అతడిని దీవించి, వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు కూడా ఆనందంగా, తన రాజ్యానికి చేరుకున్నాడు.\n\nఓ రాజా! అట్టి ప్రసిద్ధ గుణములు కల విక్రమార్కుడితో పోలడం నీ తరం కాదు, నలుగురిలో నగుబాటు చెందక, తిరిగి పో, ' అంది బొమ్మ. వంచిన తల ఎత్తకుండా, వెనుదిరిగాడు భోజుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 857,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 10",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "ఇలా కొన్నాళ్ళు జరిగాకా, మనసుండ బట్టలేక, మల్లి సింహాసనం ఎక్కే కోరికతో వచ్చాడు భోజుడు. ముప్పై ఒకటవ సోపానం వద్ద ఉన్న బంగారు బొమ్మ అతడిని అడ్డగించింది.\n\n\" రాజా! అష్టభోగాల్లో ఇంద్రుడిని మించినవాడు, ధైర్యసాహసాల్లో సాటి లేని వాడు విక్రమార్కుడు. నీవు మరలా మరలా సింహాసనం యెక్క కోరడం అందని మ్రాని పళ్లకు ఆశించడమే! నీకొక కదా చెపుతాను విను, ' అంటూ ఇలా చెప్పసాగింది.\n\nఅవంతీ నాధుడు ఆరునెలలు రాజ్య పాలన, ఆరు నెలలు దేశాటనం చేస్తాడు కదా! ఒకసారి దేశాంతరం వెళ్లి పద్మాలయం అనే పట్టణం చేరుకున్నాడు . అక్కడ తెల్లని గృహ పంక్తుల మధ్య రత్నం లాగా ప్రకాశించే దేవాలయాన్ని చూసాడు. సాయంత్రం అవగానే, సంధ్య వార్చి, దైవ ప్రార్ధన చేస్తూ గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలా మాట్లాడుకోసాగారు .\n\n\" మనం భూలోకం అంటా చుట్టి వచ్చాము. కాని, హిమాలయ పర్వత ప్రాంతం లోని సర్పవనం మాత్రం చూడలేక పోయాము. అక్కడ కఠోరమయిన తపస్సు చేసే యోగీంద్రుడయిన త్రికాలనాధుని దర్శనం మాత్రం చేసుకోలేక పోయాము, ఆ దారిలోని ప్రమాదాలకు, భయంకర సర్పాలకూ భయపడ్డాము. ప్రాణాల మీద తీపి యెంత గొప్పదో కదా, దేనికయినా రాసి ఉండాలి...\" అనుకున్నారు.\n\n\n\nవిక్రమార్కుడు సాహసి కదా! ఎలాగయినా ఆ యోగి దర్శనం చేసుకోవాలని తీర్మానించుకుని, తెల్లవారగానే ఉత్తర దిక్కుగా బయలుదేరాడు.\n\nచెట్లూ చేమలూ దాటుకుంటూ , భయంకరమయిన అడవుల గుండా ప్రయాణించి, సర్పవనం చేరుకున్నాడు. ఆ వనంలో రకరకాల నాగులు ఉన్నాయి. నల్ల నాగులు, ఉర్లు పెంజరాలు, కొండిగాడు, అరియకొక్కు, జెర్రి పోతులు , రెండు తలల పాములు వంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మీదికి యెగిరి పడుతున్నా, లెక్క చేయక విక్రమార్కుడు ముందుకు సాగిపోయాడు.\n\nఅలా వెళ్ళగా, వెళ్ళగా, కొన్నాళ్ళకి ఎదురుగా వంటినిండా భస్మం పూసుకుని, పులితోలు కప్పుకుని, చేతిలో అక్షమాల, మరో చేతిలో యోగ దండం పట్టుకుని, స్వస్తికాసనంలో నాసికాగ్రం మీద దృష్టి నిలిపి యోగ సాధన చేస్తున్న త్రికాలనాదుది దర్శనం లభించింది. విక్రమార్కుడు మొక్కిన వెంటనే ఆ సిద్ధుడు కళ్ళు తెరచి, దయాదృష్టితో రాజును చూసాడు. వెంటనే అతడిని చుట్టుకున్న పాములన్నీ వదిలిపోయాయి.\n\nవిక్రమార్కుడి సాహసానికి, వినయ శీలతను చూసి ప్రసన్నుడయిన యోగి, విక్రమార్కుడికి ఒక బలపాన్ని, నాగ బెత్తాన్ని, బొంతను ఇచ్చి, వాటి గురించి ఇలా వివరించాడు.\n\n'రాజా! ఈ బలపంతో కావలసినవి రాసి, కుడి చేత్తో నాగ బెత్తం పట్టుకుని, వాటిని ముట్టుకుంటే అవి నీ వద్దకు వస్తాయి. వద్దనుకున్నప్పుడు ఎడమ చేత్తో తుడిచేస్తే, అవి మాయమవుతాయి. ఇక ఈ బొంతని ఎప్పుడు దులిపినా కావలసినంత డబ్బు వస్తుంది, ఇవి తీసుకు వెళ్ళు, ' అన్నాడు.\n\nవిక్రమార్కుడికి తిరుగు ప్రయాణంలో దీన స్థితిలో చితి మంటలు పేర్చుకుని ,చావడానికి సిద్ధం అవుతున్న ఒక రాకుమారుడు కనిపించాడు. అతడు ' మా తండ్రి చనిపోతే, దాయాదులు మా రాజ్యం కాజేసి, నన్ను ఇలా తరిమేశారు. అవమాన భారంతో ఇలా బంటును వెంటబెట్టుకు వచ్చి, ఈ మంటల్లో దూకి చావాలని నిర్ణయించుకున్నాను, ' అన్నాడు.\n\nవిక్రమార్కుడు అతడిని ఎలాగయినా రక్షించాలని అనుకుని, 'వీర పుత్రా! క్షత్రియుడు ఎన్ని కష్టాలు ఎదురయినా ధైర్యంగా ఎదుర్కుని గెలవాలి కాని, పిరికితనంతో చావకూడదు. నీ రాజ్యం తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను, విను,' అంటూ తన వద్ద ఉన్న వస్తువులను అతడికి ఎలా వాడాలో చెప్పి ఇచ్చాడు. తరువాత ఆ రాకుమారుడు ఆ వస్తువుల సాయంతో రాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు.\n\nవిక్రమార్కుడు, 'మంటల్లో పడి చావబోతున్న రాకుమారుడిని రక్షించాను. ఈ యాత్ర వలన మంచి మిత్రుడు లభించాడు. ఇంతకంటే కావలసింది ఏముంది?' , అనుకుంటూ తృప్తిగా తన రాజ్యం చేరుకున్నాడు.\n\nకనుక ఓ రాజా! అటువంటి మహారాజుకు నీవు ఏ విధంగానూ సాటి రావు. ఇంటికి తిరిగి పో,' అంది. సిగ్గుతో వెనుదిరిగాడు భోజుడు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 858,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 11",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "ఆఖరికి ముప్పై రెండవ బొమ్మ అయినా కరుణించక పోతుందా అన్న ఆశతో, భోజుడు పరమేశ్వర ప్రార్ధన చేసి, మణి పీఠం ఎక్కేందుకు వచ్చాడు. అప్పుడు ఆ బొమ్మ ఇలా అంది .\n\n\" రాజా ! విక్రమార్కుడిని మించిన ధర్మపాలన చెయ్యగల వాడు లేడు . రామ శకం, యుధిష్టర శకం లాగా, విక్రమార్క శకం చరిత్రలో నిలిపాడు ఉజ్జయినీ పతి . ఇంతకాలం పట్టుదలతో వస్తున్నా మీకు అతని కధలు వినిపించాము. నీవు మాకు శాప విమోచనం కలిగించేందుకు విష్ణు అంశతో పుట్టిన కారణ జన్ముడవు . \"\n\n\" ఓ భోజరాజా ! మేము పూర్వ జన్మలో ఫార్వతీదేవిని సేవించే చెలి కత్తెలము. ఒకనాడు ఉద్యానవనంలో పూజకోసమై పూలు కోస్తున్నాము. అప్పుడు అదే సమయంలో మనోహరమైన అందచందాలతో మన్మధుని మించిన సోయగముతో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ దివ్య సుందర మూర్తిని చూసిన మేము చేస్టలుడిగి ప్రతిమల్లా ఉండిపోయాము. అతడి అందచందాలకి పరవశించి వలపు కోర్కెలతో మనోవికారమునకు లోనయ్యాము. మనసులు వశం తప్పి మైమరచి చూపులను మరల్చలేక మత్తు మందు జల్లినట్టు చూడసాగాము. ఆ వింత పార్వతి గ్రహించి కారణం తెలుసుకుని మామీద కోపంతో ' మీరు భూలోకంలో ప్రతిమలుగా పడి ఉండండి అని మమ్మల్ని శపించింది '.\n\nఅప్పుడు మా తప్పు తెలుసుకుని ఆమె కాళ్ళమీదపడి ' తల్లీ మమ్మల్ని క్షమించి మాకు శాపవిముక్తిని కలిగించు ' అని వేడుకన్నాము. అప్పుడు దయకలిగిన దేవి ' మీరు బంగారు బొమ్మలుగా ఉండగానే ,మీ వద్దకు ఒకానొక మహానుభావుడు పుణ్య పురుషుడు వచ్చి మీకు శాప విముక్తి కలిగిస్తాడు ' అని చెప్పి అదృశ్యమైంది. ఈ విధంగా శాపవిముక్తిని కలిగించింది. అప్పుడు మేము వెంటనే భూలోకానికి రాలేక విశ్వకర్మనిర్మితమైన ఈ సింహాసనాన్ని ఆక్రమించి ఇలా భూమిమీదకి వచ్చాము.\n\nఐతే మా విక్రమార్కుడి ధైర్య శాహసాల్ని గుణగణాల్ని ఎంతటి మహత్తరమైనవో నీకు చెప్పాలని నిన్ను వారించి సింహాసనం అధిష్టించకుండా కథలు చెప్పి అడ్డుకున్నాము. ఇంతకీ నీవు మాత్రం తక్కువ వాడివికాదు. సరస్వతీదేవి ప్రోద్భలంవల్ల బ్రహ్మశరుని రాజుగా పుట్టించాడు. అతడే నీవు. నరనారాయణులకు అభేదం గనుక నీవే విష్ణువు. నీ దర్శనభాగ్యము వలన మాకు శాపవిమోచనం కలిగింది. మేము ధన్యులమయాము, నీకేం వరం కావాలో కోరుకో మేము నెరవేరుస్తాము\" అని చెప్పాయి.\n\nఅందుకు సంతసించిన భోజరాజు \"నాకు సకల సంపదలు ఉన్నాయి మీ దర్శన భాగ్యమే నాకు చాలు\"అన్నాడు.\n\nఅందుకు అతని ఆదర్శానికి మెచ్చుకుని \"మాకు ప్రాణదానం చేసిన దాతవు, నీకు ఏవిధంగా ప్రత్యుపకారం చేయగలము? నీవు సకలకళా కోవిదుడవు, సజ్జన రక్షకుడవు, దాన వినోదివి. సాక్షాత్తు నీవే విష్ణుమూర్తివి. నీ దర్శన భాగ్యంవల్ల సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. నీ కీర్తి ప్రతిస్టలు ఆచంద్ర తారార్కమై నిలుస్తాయి. ఈ కధలన్నీ విన్న వారికి ఔదార్యం , సాహసం, గాంభీర్యం వంటి సద్గున్నాలు అలవడుతాయి ,\" అని దీవించి అదృశ్యమైపోయాయి.\n\nతనకు ఆ సింహాసనం ఎక్కే అర్హత లేదని భావించిన భోజ రాజు, ఈశ్వరుడిని ఆ సింహాసనం మీద ప్రతిష్టించి, ఆ దేవుడిని పూజిస్తూ ధర్మంగా రాజ్యం చేయ్యసాగాడు . ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 859,
        "IMAGE": "cat_10",
        "NAME": "సాలభంజిక కధలు - 12",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 10
    },
    {
        "DESCRIPTION": "* అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది.\n\n* అంగట్లో అరువు, తలమీద బరువు.\n\n* అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం (అష్ట దరిద్రం).\n\n* అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది.\n\n* అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం.\n\n* అంగడిలో అమ్మి గొంగడి (కప్పు) కొన్నట్టు.\n\n* అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను.\n\n* అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు.\n\n* అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు.\n\n* అంచు డాబే గాని, పంచె డాబులేదు.\n\n* అంటే ఆరడి అవుతుంది, అనకపోతే అలుసవుతుంది.\n\n* అండలుంటె కొండలు దాటవచ్చు.\n\n* అంతంత కోడికి అర్థసేరు మసాలా.\n\n* అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?\n\n* అంతకు ఇంతయింది, ఇంతకెంతవుతుందో, ఇంతకింతే!\n\n* అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.\n\n* అంతనాడులేదు, ఇంతనాడూలేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.\n\n* అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.\n\n* అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.\n\n* అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.\n\n* అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.\n\n* అంతా తడిసిన తరువాత చలేమిటి.\n\n* అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.\n\n* అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.\n\n* అంతా బావలే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?\n\n* అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.\n\n* అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.\n\n* అందని ద్రాక్షపళ్ళు పుల్లన.\n\n* అందని ఫూలు దేవికర్పణ.\n\n* అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.\n\n* అందఱికన్న తాడిచెట్టు పెద్ద.\n\n* అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.\n\n* అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.\n\n* అందరికి అన్నం పెట్టేవడు రైతు.\n\n* అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.\n\n* అందఱిని మెప్పించటం అలవిగానిపని.\n\n* అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?\n\n* అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?\n\n* అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.\n\n* అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.\n\n* అందితే సిగ, అందకపోతే కాళ్ళు.\n\n* అందిన తియ్యన, అందకుంటె పుల్లన.\n\n* అంధునికి అద్దం చూపినట్లు.\n\n* అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.\n\n* అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.\n\n* అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.\n\n* అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.\n\n* \"అ ఆ \" లు రావు అగ్రతాంబూలం కావాల\n\n* అక్క ఆరాటమె కాని, బావ బతకడు.\n\n* అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.\n\n* అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.\n\n* అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.\n\n* అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.\n\n* అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.\n\n* అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.\n\n* అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.\n\n* అగ్గువ అయితే అంగడికి వస్తుంది.\n\n* అగ్గువ అయితే అందరూ కొంటారు.\n\n* అగ్నికి వాయువు తోడైనట్టు.\n\n* అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.\n\n* అగ్నిలో ఆజ్యం పోసినట్లు.\n\n* అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.\n\n* అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.\n\n* అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.\n\n* అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.\n\n* అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.\n\n* అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.\n\n* అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.\n\n* అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).\n\n* అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.\n\n* అటునుంచి నరుక్కురమ్మన్నారు.\n\n* అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.\n\n* అడక్కుండ చెప్పులిచాడు, అడిగితే గుఱ్రమిస్తాడని అనుకొన్నట్లు.\n\n* అడగనిదే అమ్మయినా పెట్టదు.\n\n* అడవిపంది చేనుమేసిపోతే, ఊరపంది చెవులు కోసినట్లు.\n\n* అడవిని గాచిన వెన్నెల, ముదిమిని చేసున పెండ్లి.\n\n* అడిగితే చిరాకు, అడుగకపోతే పరాకు.\n\n* అడిగినట్లు ఇస్తే, కడిగినట్టు పోతుంది. (బేరంలో).\n\n* అడిగేవాడికి చెప్పేవాడులోకువ.\n\n* అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.\n\n* అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.\n\n* అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.\n\n* అతుకుల బొంత, గతుకుల బాట.\n\n* అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.\n\n* అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?\n\n* అత్తకు అల్లుడాశ, బాపనికి పప్పాశ.\n\n* అత్తకు మొగుడల్లుడు.\n\n* అత్తకు లేక అటికలు నాకుతుంటే, అల్లుడు వచ్చి దీపావళిపండుగ అన్నడుట.\n\n* అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?\n\n* అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.\n\n* అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.\n\n* అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.\n\n* అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.\n\n* అత్తని కొట్టి అటకెక్కింది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది.\n\n* అత్తని కొడితే కోడలేడ్చినట్లు.\n\n* అత్త పెట్టే ఆరళ్ళు కనపడతాయి కాని, కోడలు చేసే కొంటెపనులు కనపడవు.\n\n* అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు.\n\n* అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.\n\n* అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.\n\n* అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.\n\n\n* అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.\n\n* అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).\n\n* అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.\n\n* అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.\n\n* అత్తవారింటి లేమి అల్లుడెరుగు.\n\n* అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.\n\n* అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).\n\n* అత్తది అల్లుడు దానం చేసినట్లు.\n\n* అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.\n\n* అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).\n\n* అత్తింటి కాపురం కత్తిమీది సాము.\n\n* అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.\n\n* అదిగోపులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.\n\n* అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.\n\n* అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.\n\n* అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.\n\n* అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.\n\n* అదృష్టం చాలని ఆడుబిడ్డను అక్కఱలెని అల్లునికిచ్చి, అమావాస్య ఆదివారం నాటి ఆరుద్రానక్షత్రాన అతివైభవంగా వివాహం జరిపినట్లు.\n\n* అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.\n\n* అదృష్టం పండితే ఆరునూరవుతాయి.\n\n* అదృష్టం అందల మెక్కిస్తాను అంటే, బుధ్ధి బురదలోకి లాక్కెళిందంట.\n\n* అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.\n\n* అద్దం ఉంది అందమడుగనేల?\n\n* అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.\n\n* అద్దం లో నీడకు ఆశ పడరాదు.\n\n* అద్దెకు వచ్చిన గుఱ్ఱాలు అగడ్తలు దాటునా?\n\n* అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.\n\n* అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.\n\n* అధర రసము చూచి అన్నీ మరచును.\n\n* అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.\n\n* అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.\n\n* అధికాశ లోకదరిద్రం.\n\n* అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.\n\n* అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.\n\n* ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.\n\n* అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.\n\n* అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.\n\n* అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.\n\n* అనుమానం ప్రాణసంకటం.\n\n* అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.\n\n* అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.\n\n* అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?\n\n* అనువుగాని చోట అధికులమనరాదు.\n\n* అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.\n\n* అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.\n\n* అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.\n\n* అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.\n\n* అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కరలేదు.\n\n* అన్నం ఊడికినాక పొయ్యి మండుతుంది.\n\n* అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.\n\n* అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.\n\n* అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.\n\n* అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.\n\n* అన్నం లేకపోయిన పట్టుబట్ట.\n\n* అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.\n\n* అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.\n\n* అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.\n\n* అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.\n\n* అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.\n\n* అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.\n\n* అన్నరసం కన్న, ఆదరణ రసం మేలు.\n\n* అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.\n\n* అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.\n\n* అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.\n\n* అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.\n\n* అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.\n\n* అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.\n\n* అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.\n\n* అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.\n\n* అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.\n\n* అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.\n\n* అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.\n\n* అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.\n\n* అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.\n\n* అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.\n\n* అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.\n\n* అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.\n\n* అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.\n\n* అపుత్రస్య గతిర్నాస్తి.\n\n* అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.\n\n* అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.\n\n* అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?\n\n* అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.\n\n* పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?\n\n* అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.\n\n* అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.\n\n* అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.\n\n* అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.\n\n* అప్పు చేసి పప్పు కూడు.\n\n* అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.\n\n* అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.\n\n* అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.\n\n* అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.\n\n* అప్పులేనివాడు అధిక బలుడు.\n\n* అబద్ధం అంటే అతుకుల మాట\n\n* అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.\n\n* అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.\n\n* అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.\n\n* అబధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.\n\n* అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.\n\n\n* అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.\n\n* అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.\n\n* అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.\n\n* అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.\n\n* అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?\n\n* అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.\n\n* అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.\n\n* అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.\n\n* అబ్బాయి పోతురాజు, అమ్మయి గంగానమ్మ.\n\n* అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.\n\n* అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.\n\n* అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.\n\n* అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.\n\n* అభ్యాసం కూసువిద్య.\n\n* అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.\n\n* అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.\n\n* అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.\n\n* అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.\n\n* అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.\n\n* అమ్మతాపెట్టదు, అడుక్కుతినా నివ్వదు.\n\n* అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.\n\n* అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.\n\n* అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.\n\n* అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు.\n\n* అమ్మ పెట్టేవి నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.\n\n* అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.\n\n* అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.\n\n* అమ్మయినా అడగందే పెట్టదు.\n\n* అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.\n\n* అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.\n\n* అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?\n\n* అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.\n\n* అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.\n\n* అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.\n\n* అయితే అమీరు, కాకుంటే గరీబు.\n\n* అయిన పెండ్లికి మేళమా?\n\n* అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.\n\n* అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?\n\n* అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.\n\n* అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.\n\n* అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.\n\n* అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.\n\n* అయినవాళ్ళను అవతలకి నెట్టి కానివాళ్ళ కాళ్ళు పట్టుకొన్నట్లు.\n\n* ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.\n\n* అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.\n\n* అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.\n\n* అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.\n\n* అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.\n\n* అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.\n\n* అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.\n\n* అయ్య తిరుపతి, అమ్మ పరపతి.\n\n* అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.\n\n* అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం.\n\n* అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.\n\n* అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.\n\n* అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.\n\n* అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.\n\n* అయ్య సవాసేరు, లింగమరవీసెడు.\n\n* అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.\n\n* అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.\n\n* అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.\n\n* అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.\n\n* అరఘడియ భోగం, ఆరునెలల రోగం.\n\n* అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?\n\n* అరిచే కుక్క కరవదు.\n\n* అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.\n\n* అరచేతిలో వైకుంఠం చూపినట్లు.\n\n* అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు.\n\n* అరటికాయ ఆరునెలల రోగం.\n\n* అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?\n\n* అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?\n\n* అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.\n\n* అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.\n\n* అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.\n\n* అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.\n\n* అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.\n\n* అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.\n\n* అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.\n\n* అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.\n\n* అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.\n\n* అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.\n\n* అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.\n\n* అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.\n\n* ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.\n\n* అలంకారం కంటె, అయిదవతనం మేలు.\n\n* అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.\n\n* అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.\n\n* అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.\n\n* అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.\n\n* అలవి మీరితే అమృతం అయినా విషమే.\n\n* అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.\n\n* అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.\n\n* అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.\n\n* అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి.\n\n* అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?\n\n* అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.\n\n* అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.\n\n* అల్పనరులకెల్ల నతివలపై చింత.\n\n* అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.\n\n* అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.\n\n\n* అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.\n\n* అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.\n\n* అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.\n\n* అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.\n\n* అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ అన్నడుట.\n\n* అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.\n\n* అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.\n\n* అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.\n\n* అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.\n\n* అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?\n\n* అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!\n\n* అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.\n\n* అవ్వా కావాలి బువ్వా కావాలి.\n\n* అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.\n\n* అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.\n\n* అసత్యమాడుట పిరికిపందల గుణం.\n\n* అసలుకంటే వడ్డి ముద్దు.\n\n* అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.\n\n* అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.\n\n* అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.\n\n* అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.\n\n* అసాద్యమ్మనేమాట సత్యహీనులది.\n\n* అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.\n\n* అసూయ ముందు, ఆడది వెనుక.\n\n* అస్తమానం అరచే పిల్లి ఎలుక పట్టలేదు.\n\n\n\n* * * * * * * * * * :: ఆ ::* * * * * * * * * *\n\n* 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.\n\n* 'ఆఁ' అంటె ఆరునెలలు.\n\n* 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.\n\n* ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.\n\n* ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.\n\n* ఆ ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.\n\n* ఆ ఉరుముకు ఈ చినుకులేనా?\n\n* ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.\n\n* ఆకలని రెండు చేతులతో తింటారా?\n\n* ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.\n\n* ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.\n\n* ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.\n\n* ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.\n\n* ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.\n\n* ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.\n\n* ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.\n\n* ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.\n\n* ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.\n\n* ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.\n\n* ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.\n\n* ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.\n\n* ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.\n\n* ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.\n\n* ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.\n\n* ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.\n\n* ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.\n\n* ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.\n\n* ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.\n\n* ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.\n\n* ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.\n\n* ఆడబిడ్డ అర్థ మొగుడు.\n\n* ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.\n\n* ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.\n\n* ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.\n\n* ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.\n\n* ఆడలేక అంగణం వంకర అన్నట్లు.\n\n* ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.\n\n* ఆడింది ఆట, పాడింది పాట.\n\n* ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?\n\n* ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.\n\n* ఆ తండ్రి కొడుకు కాదా?\n\n* ఆ తానులోదే ఈ పీలిక.\n\n* ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.\n\n* ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.\n\n* ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.\n\n* ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.\n\n* ఆదిలోనే హంసపాది (దు).\n\n* ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.\n\n* ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.\n\n* ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?\n\n* ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.\n\n* ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.\n\n* ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.\n\n* ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.\n\n* ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.\n\n* ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.\n\n* ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.\n\n* ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.\n\n* ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.\n\n* ఆరాటమే గానీ పోరాటం లేదు.\n\n* అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.\n\n* ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.\n\n* ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.\n\n* ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.\n\n* ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.\n\n* ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.\n\n* ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.\n\n* ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.\n\n* ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.\n\n* ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.\n\n* ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.\n\n* ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం\n\n* ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?\n\n* ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు\n\n* ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.\n\n\n* ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.\n\n* ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ.\n\n* ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?\n\n* ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.\n\n* ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.\n\n* ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.\n\n* ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.\n\n* ఆలి శుచి ఇల్లు చెపుతుంది.\n\n* ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు.\n\n* ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.\n\n* ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.\n\n* ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.\n\n* ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.\n\n* ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.\n\n* ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.\n\n* ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.\n\n* ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).\n\n* ఆలుమగని సందు ఆరామడల దూరం.\n\n* ఆలు లేత, నారు ముదురు కావాల.\n\n* ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.\n\n* ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.\n\n* ఆలు సొత్తు, అత్త తొత్తు.\n\n* ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.\n\n* ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)\n\n* ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.\n\n* ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.\n\n* ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?\n\n* ఆవు తొలిచూలు, గేదె మలిచూలు\n\n* ఆవు నలుపైతే పాలు నలుపా?\n\n* ఆవునిచ్చి పలుపు దాచినట్లు.\n\n* ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.\n\n* ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.\n\n* ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.\n\n* ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?\n\n* ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?\n\n* ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.\n\n* ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.\n\n* ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.\n\n* ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.\n\n* ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.\n\n* ఆవులేని ఇంట అన్నమే తినరాదు.\n\n* ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.\n\n* ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.\n\n* ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?\n\n* ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.\n\n* ఆశ ఆలిమీద, పడక చాపమీద.\n\n* ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.\n\n* ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.\n\n* ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.\n\n* ఆశకుపోతే గోచీ ఊడిందట.\n\n* ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.\n\n* ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.\n\n* ఆశకు దరిద్రానికి లంకె\n\n* ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.\n\n* ఆశకలిగిన చోట ఆడినదే సరసం.\n\n* ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.\n\n* ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.\n\n* ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.\n\n* ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.\n\n* ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.\n\n* ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.\n\n* ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.\n\n* ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.\n\n* ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.\n\n* ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.\n\n* ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.\n\n* ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.\n\n* ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.\n\n* ఆశ్లేష వర్షం అందరికీ లాభం.\n\n* ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.\n\n* ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).\n\n* ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.\n\n* ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.\n\n* ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.\n\n* ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.\n\n* ఆసలు విడిస్తే అటమట లేదు.\n\n* ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.\n\n* ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.\n\n* ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.\n\n* ఆస్థికొక పుత్రుడు, ప్రేమకొక పుత్రిక.\n\n* ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొగమాటం (సంకోచ) పడరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 860,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-అ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.\n\n* ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.\n\n* ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).\n\n* ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.\n\n* ఇంట గెలిచి రచ్చ గెలువు.\n\n* ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.\n\n* ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?\n\n* ఇంటికన్నా గుడి పదిలం.\n\n* ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.\n\n* ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.\n\n* ఇంటికి ఆడపిల్ల ముప్పు, దోడ్డికి వారసప్రం ముప్పు.\n\n* ఇంటికి ఆడుబిడ్డ చేటు, మిద్దెకు పూరిపంచ చేటు.\n\n* ఇంటికి ఇత్తడి చిలుక, బయటకి బంగారు చిలుక.\n\n* ఇంటికి ఈలకత్తి, పొరుగుకు బంగారు కత్తి.\n\n* ఇంటికి ఏబ్రాసి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.\n\n* ఇంటికి గుప్పెడు బియ్యం, ఇల్లాలికి పదిపుట్లు (పూటలు).\n\n* ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికోక దండ.\n\n* ఇంటికి గుట్టు, మడికి గట్టు.\n\n* ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.\n\n* ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.\n\n* ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.\n\n* ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.\n\n* ఇంటికూడుతిని ఱంకు మొగుళ్ళ వెంటపడినట్లు.\n\n* ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.\n\n* ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.\n\n* ఇంటిగుట్టు లంకకు చేటు.\n\n* ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.\n\n* ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.\n\n* ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.\n\n* ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.\n\n* ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.\n\n* ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.\n\n* ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.\n\n* ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.\n\n* ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.\n\n* ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.\n\n* ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.\n\n* ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?\n\n* ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.\n\n* ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.\n\n* ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.\n\n* ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.\n\n* ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.\n\n* ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.\n\n* ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.\n\n* ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.\n\n* ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.\n\n* ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.\n\n* ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.\n\n* ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.\n\n* ఇంటెద్దుకు బాడిగలేదు.\n\n* ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)\n\n* ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు.\n\n* ఇంట్లో ఈగపులి (పిల్లి) బయట (పెద్ద) పులి.\n\n* ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.\n\n* ఇంట్లో కందిరీగలు తిట్టెలు పెడితే, ఇల్లాండ్రు గర్భవతులౌతారట.\n\n* ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుడికి మొక్కినట్లు.\n\n* ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.\n\n* ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.\n\n* ఇంట్లో పులి బయట పిల్లి\n\n* ఇంట్లో పుష్టి ఒంట్లో పుష్టి\n\n* ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.\n\n* ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.\n\n* ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.\n\n* ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.\n\n* ఇక పుట్టెనా పెరిగేనా, పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.\n\n* ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.\n\n* ఇక్కడా అక్కడా ఇంటే ఈడేరిపోతావు, నా ఇంటికి రావే నవసిపోదూగాని.\n\n* ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.\n\n* ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.\n\n* ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.\n\n* ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.\n\n* ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.\n\n* ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.\n\n* ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.\n\n* ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.\n\n* ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.\n\n* ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.\n\n* ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.\n\n* ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.\n\n* ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.\n\n* ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.\n\n* ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.\n\n* ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.\n\n* ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.\n\n* ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.\n\n* ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.\n\n* ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.\n\n* ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.\n\n* ఇచ్చే గొడ్డునే పితికేది.\n\n* ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)\n\n* ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.\n\n* ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.\n\n* ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.\n\n* ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.\n\n* ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.\n\n* ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.\n\n* ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.\n\n* ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.\n\n* ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.\n\n* ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.\n\n* ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?\n\n* ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.\n\n* ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).\n\n* ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.\n\n* ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.\n\n* ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.\n\n* ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.\n\n* ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.\n\n* ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.\n\n* ఇద్దరు పెద్ద మనుషులు ఎదురుపడితే మూడుదారులు, ఒకపెద్దమనిషి ఇంకొక మూర్ఖుడు ఎదురుపడితే రెండుదార్లు, ఇద్దరూ మూర్ఖులైతే ఒకేదారి.\n\n* ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.\n\n* ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.\n\n* ఇనుము కరగేచోట ఈగలకేమి పని?\n\n* ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.\n\n* ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.\n\n* ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?\n\n* ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?\n\n* ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.\n\n* ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.\n\n* ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.\n\n* ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.\n\n* ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.\n\n* ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).\n\n* ఇఱుకులో సరుకు దించినట్లు.\n\n* ఇఱుకులో సరుకు మంత్రం.\n\n* ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.\n\n* ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.\n\n* ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.\n\n* ఇల్లలుకగానే పండుగౌతుందా?\n\n* ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.\n\n* ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.\n\n* ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.\n\n* ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.\n\n* ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.\n\n* ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.\n\n* ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.\n\n* ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.\n\n* ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.\n\n* ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.\n\n* ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.\n\n* ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?\n\n* ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.\n\n* ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.\n\n* ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.\n\n* ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.\n\n* ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.\n\n* ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.\n\n* ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.\n\n* ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.\n\n* ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.\n\n* ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.\n\n* ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.\n\n* ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.\n\n* ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.\n\n* ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.\n\n* ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.\n\n* ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.\n\n* ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.\n\n* ఇల్లు పీకి పందిరి వేసినట్లు.\n\n* ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.\n\n* ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?\n\n* ఇల్లు విడ్చిన ఆదది, చెట్టు విడ్చిన కోతి.\n\n* ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.\n\n* ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.\n\n* ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.\n\n* ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.\n\n* ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?\n\n* ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?\n\n* ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?\n\n* ఇష్టం లేని పెళ్ళాన్ని 'ఒసే' అన్నా తప్పే, 'అమ్మా' అన్నా తప్పే.\n\n* ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.\n\n* ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.\n\n* ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.\n\n* ఇసుకతో తాడు పేమినట్లు.\n\n* ఇసుక బావి తవ్వ ఎవరి వశం?\n\n* ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.\n\n* ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.\n\n* ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).\n\n* ఇస్తే వరం, పెడితే శాపం.\n\n* ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.\n\n* ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.\n\n* ఇహం మన్ను, పరం పైడి.\n\n* ఇహమూ పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?\n\n**********:: ఈ ::**********\n\n* 'ఈ' (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.\n\n* ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?\n\n* ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.\n\n* ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు, దాతలెవరంటే చాకళ్ళు.\n\n* ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.\n\n* ఈ కంటికి రెప్ప దూరమా?\n\n* ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.\n\n* ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు.\n\n* ఈకలు లేవుఇగానీ, వింజమూరి పుంజే.\n\n* ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.\n\n* ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.\n\n* ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.\n\n* ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.\n\n* ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.\n\n* ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.\n\n* ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.\n\n* ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?\n\n* ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.\n\n* ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.\n\n* ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.\n\n* ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.\n\n* ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.\n\n* ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.\n\n* ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.\n\n* ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.\n\n* ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.\n\n* ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.\n\n* ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.\n\n* ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.\n\n* ఈతవచ్చిన వానికే జలగండం.\n\n* ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?\n\n* ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.\n\n* ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.\n\n* ఈనిన పులికి ఆకలెక్కువ.\n\n* ఈనాడు ఇంటిలో, రేపు మంటిలో.\n\n* ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.\n\n* ఈపిలేని చోట పేలు వెతికినట్లు.\n\n* ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.\n\n* ఈ ముడ్డి ఇట్లాంటి ఏర్లను ఎన్ని చూడలేదంటే, ఈ ఏరు ఇట్లాంటి ముడ్లను ఎన్నిటిని చూడలేదు అన్నట్లు. (కప్ప ఎగిరితే నీటిమీద అలిగి ముడ్డి కడుక్కోకుండ వచ్చిన వాడు అని, అనిపించుకొన్న మాట.)\n\n* ఈ మొహానికా సేరు పసుపు?\n\n* ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.\n\n* ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.\n\n* ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.\n\n* ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది.\n\n* ఈవేళ చస్తే రేపటికి రెండు.\n\n* ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 861,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ఇ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.\n\n* ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.\n\n* ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.\n\n* ఉంటే అమీరు లేదా పకీరు.\n\n* ఉంటే ఉగాది లేదా శివరాత్రి.\n\n* ఉంటే ఊరు, లేదా పాడు.\n\n* ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.\n\n* ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.\n\n* ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.\n\n* ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.\n\n* ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.\n\n* ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.\n\n* ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.\n\n* ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.\n\n* ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.\n\n* ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.\n\n* ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.\n\n* ఉండేది గడ్డి, పోయేది పొట్టు.\n\n* ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.\n\n* ఉండ్రాళ్ళు ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకు ఒక మొగుడేనా?\n\n* ఉండృఆళ్ళు పిండివంటా కాదు, ఊదర ధాన్యమూ కాదు.\n\n* ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?\n\n* ఉగ్గుతో చేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదు.\n\n* ఉచితానికి ఊళ్ళు, లెక్కలకి కాసులు.\n\n* ఉ(చ్చ)కుండ ఉట్టికెత్తి నేతికుండ నేలను బెట్టినట్లు.\n\n* ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు.\n\n* ఉచ్చపోసి గొరిగించారు అంటే ఎన్ని ముంతలు అన్నట్టు.\n\n* ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?\n\n* ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.\n\n* ఉట్టికి చట్టికి రెంతికి చెడ్డట్టు.\n\n* ఉట్టిమీద కూడు, ఊరిమీద నిద్ర.\n\n* ఉట్టిమీద వెన్న పెట్టుకొని ఊరంతా నెయ్యికి దేవులాడినట్లు.\n\n* ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకున్నట్లు.\n\n* ఉడికిన మెతుకులు తిని ఊళ్ళో ఉండేవాణ్ణి, నాకు ఎవరితో ఏమి పని ఉంది?\n\n* ఉడికినా తంతా ఉడకకపోయినా తంతా అన్నట్లు.\n\n* ఉడుత ఊపులకు కాయలు రాలునా?\n\n* ఉడుత ఊపులకు మాకులు ఊగునా?\n\n* ఉడుత ఊపులకు ఏపులు ఊగునా?\n\n* ఉడుము కొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నదట.\n\n* ఉడుముని చంకలో పెట్టుకొని ఊళ్ళో ప్రవేశించినట్లు.\n\n* ఉడుముపోతే పోయింది నా చెయ్యి వస్తే చాలు.\n\n* ఉడుములలో తల, పాములలో తోక.\n\n* ఉతికే వానికే గానీ చాకలి ఉతకడు.\n\n* ఉత్తకుండకు ఊపులెక్కువ.\n\n* ఉత్తదొడ్డుకు అరపులు మెండు.\n\n* ఉత్తచెవికన్నా చెవ్వాకు (ఒక ఆభరణం) చెవి మేలు.\n\n* ఉత్త చేతులతో మూర వేసినట్టు.\n\n* ఉత్త పుణ్యానికి మొత్తుక సచ్చిందంట.\n\n* ఉత్తమమైన ఇల్లాలు ఊరేగి వెళ్ళితే, ఉత్తరేణి కాలి ఊళ్ళన్ని కాలిపోయినవట.\n\n* ఉత్తముండ కన్నా అత్తముండమేలు.\n\n* ఉత్తముండ వచ్చి అత్తముండని 'ధూత్ ' అన్నదిట.\n\n* ఉత్తముల మహిమ నీరుకొలది తామర(వంటిది).\n\n* ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా కురవక-కరవక మానవు.\n\n* ఉత్తర ఉరిమినా, రాజు పాడితప్పినా, చెదల పురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.\n\n* ఉత్తరచూచి ఎత్తర గంప, విశాఖ చూసి విడవర కొంప.\n\n* ఉత్తర పదను, ఉలవకు అదను.\n\n* ఉత్తరపు వాకిలి ఇల్లు ఊరకే ఇచ్చినా వద్దు.\n\n* ఉత్తరలో ఊడ్చేకంటే, గట్లమీద కూచోని ఏడ్చేది మేలు.\n\n* ఉత్తరలో చల్లిన పైరు, కత్తెరలో నరికిన కొయ్య.\n\n* ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు.\n\n* ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకో అన్నట్లు.\n\n* ఉద్దత్తులమధ్య పేదలకుంద తరమే?\n\n* ఉద్దర(అప్పు, ఊరికే వస్తే ) అయితే ఊళ్ళుకొంటరు. నగదు ఐతే నశ్యం కూడా కొనరు.\n\n* ఉద్దర ఐతే నాకిద్దరు అన్నాడుట.\n\n* ఉద్దర సొమ్ము దుడ్డుకు పంచేరు.\n\n* ఉద్దరసొమ్ము నిద్దుర చేటు.\n\n* ఉద్ధరిణెడు నీళు ఉంగరపు వేలు దర్భ.\n\n* ఉద్యోగం గట్టిపడుతుంది, ఉన్న పుస్తె తేవే!\n\n* ఉద్యోగం పురుష లక్షణం, అదిపోతే అవలక్షణం.\n\n* ఉద్యోగం పురుష లక్షణం, గొడ్డలితేరా నిట్రాడు తెగనరుకుదాం.\n\n* ఉద్యోగికి ఒక ఊరులేదు, ముష్టివానికి ఒక ఇల్లు లేదు.\n\n* ఉద్యోగికి దూరభూమిలేదు.\n\n* ఉన్న అమ్మ గాదె (పాతర) తీసేప్పటికి లేని అమ్మ ప్రాణం లేచిపోయింది.\n\n* ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు.\n\n* ఉన్న ఊరువాడికి వెలుతురు భయం, పొరుగూరివాడికి నీడ(ళ్ల) భయం.\n\n* ఉన్న ఊరు కన్నతల్లి వంటిది.\n\n* ఉన్నది అంతా ఉండగా, ఊపాధ్యాయులవారి భార్య సమర్తాడిందిట.\n\n* ఉన్నది ఉండగా, ఉయ్యూరిమీద మేడూరు వచ్చిపడ్డట్టు.\n\n* ఉన్నది ఉలవకట్టె, పోయింది పొలికట్టె.\n\n* ఉన్నది ఒక్క కూతురు, ఊరంతా అల్లుళ్ళు.\n\n* ఉన్నది ఒక్క బిడ్డ, ఊరంతా మొగుళ్ళు.\n\n* ఉన్న ఒక్కమెతుకు కాస్తా గంజిలో పోయినట్లు.\n\n* ఉన్నదున్నట్లు చెప్పమంటె, తిన్నదేమి చేసేనూ- అన్నదట లంజ.\n\n* ఉన్నదిపోదు లేనిది రాదు.\n\n* ఉన్నదిపోయే ఉంచుకున్నదీ పోయె.\n\n* ఉన్ననాడు ఉగాది పండుగ, లేని నాడు కాముని పండుగ.\n\n* ఉన్నమాట అంటే, ఉండే ఊరు అచ్చిరాదు.\n\n* ఉన్న మాట అంటే ఉలుకెక్కువ.\n\n* ఉన్న మాట అంటే ఊరికే చేటు.\n\n* ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె.\n\n* ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టును, లేనివాడూ ఉన్నవానికే పెట్తును.\n\n* ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద.\n\n* ఉన్నవాడు ఖర్చు పెట్తకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు.\n\n* ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు.\n\n* ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు.\n\n* ఉపకారానికి పోతే అపకారం వెంటవచ్చినట్లు.\n\n* ఉపకారపు మొగుడు వుంటే, మనువిచ్చాడుట.\n\n* ఉపనయనము నాటిమాట ఉన్నది సుమతి. (భవతీ భిక్షాందేహి అనుట).\n\n* ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు.\n\n* ఉపాయం లేని వాణ్ణి ఊళ్ళోనుంచి వెళ్ళకొట్టమన్నారు.\n\n* ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట.\n\n* ఉపాయం ఉన్నవాడు ఊరిమీద (పడి) బ్రతుకుతాడు.\n\n* ఉపాయం ఎరుగని దాసరయ్యా, ఊళ్ళ ఉపాసం ఉండవయ్య.\n\n* ఉపాయవంతుడు ఊరికి ఉరవడి.\n\n* ఉప్పరసన్యాసం ఉభయ భ్రష్టత్వం.\n\n* ఉప్పు ఊరగాయ కాదు.\n\n* ఉప్పుకు నిప్పువలే.\n\n* ఉప్పుతిని ఉపతాపమందనేల?\n\n* ఉప్పుతిన్న కోడే ఊరిపోయింది, పప్పు తిన్న కోడే పాలిపోయింది.\n\n* ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు.\n\n* ఉప్పుతిన్న వాడు నీరు తాగక తప్పదు.\n\n* ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది.\n\n* ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము.\n\n* ఉప్పు మిరపకాయ ఊరికే రాగా ఆలినికొట్ట చేతులు తీటా?\n\n* ఉప్పు ముల్లెను నీటిలో ముంచినట్లు.\n\n* ఉప్పులేదు కారంలేదు, అమ్మతోడు! కమ్మగుంది.\n\n* ఉప్పులేని పప్పు, ఊరగాయలేని సద్ది.\n\n* ఉప్పువాడు ఏడిసాడు, పప్పువాడూ ఏడిసాడు, బోండాపు కాయలవాడు పొర్లి పొర్లి ఏడిసాడు.(ఎవరిసొమ్ము వారికి ఎక్కువ అనుట).\n\n* ఉప్పువాడూ చెడె, పప్పువాడు చెడె, తామలపాకులవాడు తమాము చెడె.\n\n* ఉప్పువేసి పొత్తు కలిపినట్లు.\n\n* ఉప్పోడు పప్పోడు ఊరుకుంటే, టెంకాయల వాడు పొర్లి పొర్లి ఏడ్చాడుట.\n\n* ఉబుసుపోకకు పిండిబొమ్మనుచేసి పీట మీద కూర్చోపెడితే, ఆడబిడ్డతనాన అదిరి అదిరి పడిందట.\n\n* ఉబ్బుమొగంవాడు ఊరువెలదామంటే, రెప్పలేనివాడు రేపువెల్దామన్నాడుట.\n\n* ఉభయపవిత్రాలు తిని, ఉద్దెరిణ నీళ్లు తాగి 'ఊహూ' అంటావా ఉత్తమాశ్వమా?\n\n* ఉభయబ్రష్టత్వం, ఉపరి(ఉప్పరి) సన్యాసం.\n\n* ఉమ్మడికి (పనికి) బడుగు, సొంతానికి పిడుగు\n\n* ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి.\n\n* ఉమ్మడిగొఱ్ఱె పుచ్చి చస్తుంది.\n\n* ఉమ్మడిబేరం, ఉమ్మడిసేద్యం ఇద్దరికీ చేటు.\n\n* ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు.\n\n* ఉరికిఉరికి పసూలు కాస్తే ఎన్నాళ్లు కాస్తావు?\n\n* ఉరికిఉరికి ఊరిపిడుగు పోలిసెట్టి బుడ్డమీద పడ్డట్టు.\n\n* ఉరిమిన మబ్బు కురవక మానదు.\n\n* ఉరిమిన మబ్బు తరిమిన పాము ఊరకే పోవు.\n\n* ఊరిసినచోట (కాలినచోట) ఉడుకులు చల్లినట్లు.\n\n* ఉరిసిన పుండుపై ఉప్పుచల్లినట్లు.\n\n* ఉరుకు ఉరుకు అనే సవతేగానీ, తోడు ఉరికే నా సవతే లేదు.\n\n* ఉరుకు తొత్తుకు విటుడుండనేల?\n\n* ఉర్సులకుపోతే కర్సులకు కావాలి.\n\n* ఉలవకాని పొలం ఊసర క్షేత్రం.\n\n* ఉలవలచేను పెట్టిన మగడురకుండక పత్తిచేనుపెట్టి ప్రాణం మీదికి తెచ్చినాడు.\n\n* ఉలవలు తింటావా బసవన్నా? అంటే 'ఊ ' అన్నట్లు (తలాడించినట్లు).\n\n* ఉలవలుతిన్నమ్మకు ఉలుకు, సజ్జలు తిన్నమ్మకు సలుకు.\n\n* ఉలవలెత్తమంటే ఊళ్ళడిగినట్లు.\n\n* ఉలిపికట్టెకేలరా ఊళ్ళో పెత్తనాలు? (ఉలిపికట్టె=పనిలేనివాడు).\n\n* ఉలుకున్నమ్మకు అలుకెక్కువ, గూద ఉన్నమ్మకు బాధ ఎక్కువ.\n\n* ఉల్లాసంబట్టి ఊరికరణాన్ని (కరణంతో) పోతే, దొమ్మరిపట్టి తొంబై యియ్యమన్నదిట.\n\n* ఉల్లి ఉంటే మల్లికూడా వంటలక్కే.\n\n* ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే.\n\n* ఉల్లిగడ్డంత కోడలువస్తే వల్లికలోఉన్న అత్త ఉలికి ఉలికి పడిందట. (వల్లిక=స్మశానం).\n\n* ఉల్లి చేసినమేలి తల్లి ఐనా చెయ్యదు.\n\n* ఉల్లితిన్న కోమటి ఊరుకొన్నట్టు. (నోరు తెరిస్తే కంపని).\n\n* ఉల్లిని నమ్మి తల్లిని నమ్మి చెడినవాడులేడు.\n\n* ఉల్లి పదితల్లుల పెట్టు.\n\n* ఉల్లి పువ్వు ఉల్లిపువ్వే, మల్లెపువ్వు మల్లెపువ్వే.\n\n* ఉల్లి మల్లి అవుతుందా? ఉంచుకున్నది పెళ్ళాం అవుతుందా?\n\n* ఉల్లి మల్లికాదు, కాకి కోకిల కాదు.\n\n* ఉల్లి ముట్టనిదే వాసన రాదు.\n\n* ఉసురు (ఊపిరి) ఉంటే, ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతుకవచ్చు.\n\n**********:: ఊ ::**********\n\n* 'ఊ' అంటే తప్పు 'ఆ \" అంటే తప్పు; నారాయణా అంటే బూతు (మాట).\n\n* ఊక ఊకే నూక నూకే!\n\n* ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుంది.\n\n* ఊట వేసిన మడి, వాత వేసిన పశువు (కొరగావు).\n\n* ఊదరకూ డెన్నాళ్ళు, ఉద్యోగం ఎన్నాళ్ళు.\n\n* ఊదర ఒక ధాన్యమా? ఉండ్రాళ్ళొక పిండివంటా? (ఊదర=వరిచేలలోని ఒక కలుపు మొక్క).\n\n* ఊదువేయనిదే పీరు లేవదు. (ఊదు= సంబ్రాణి ధూపం).\n\n* ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?\n\n* ఊబ నామొప్గుడు, ఊళ్ళో ఉన్నా ఒకటే, దండులో ఉన్నా ఒకతే. (ఊబ=నపుంసకుడు).\n\n* ఊబనామొగుడు ఉండీ ఒకటే లేకా ఒకటే.\n\n* ఊరంతా ఉత్తరం చూస్తే, దాసరిపుల్లయ్య దక్షిణం చూసాడట.\n\n* ఊరంతా ఉల్లి: నీవెందుకే తల్లి.\n\n* ఊరంత ఉల్లిపూస్తే మాలపల్లి మల్లె పూసె.\n\n* ఊరంతా ఊరిముఖం, దాసరి తాళ్ళముఖం (తాళ్ళు=తాటిచెట్ల తోపు).\n\n* ఊరంతా ఒకటైతే చేనంతా ఒకమేర.\n\n* ఊరంతా ఒక త్రోవ, ఉలిపికట్టెది ఇంకొక త్రోవ.\n\n* ఊరంతా ఒక త్రోవ, ఊదుదోకది ఇంకొకదోవ. (ఉడుదోక=విడిచిన ఆడది; అప్రయోజకురాలు).\n\n* ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు.\n\n* ఊరంతా చుట్టాలు, ఉచ్చపోసుకోను చోటులేదు.\n\n* ఊరంతా మేనమామలు ఉచ్చపోసుకోను చోటులేదు.\n\n* ఊరంతా నాన్నకు లోకువ, నాన్న అమ్మకు లోకువ.\n\n* ఊరంతా వడ్లెండబెట్టుకుంటే, నక్క తోక ఎందబెట్టుకున్నదట.\n\n* ఊరక 'మామా' అనక, 'పెళ్ళాం తండ్రీ' అన్నట్లు.\n\n* ఊరకరారు మహానుభావులు (మహాత్ములు).\n\n* ఊరకుండటం కంటే ఊగులాడటం మేలు.\n\n* ఊరకుండలేక ఉప్పరిని తగులుకుంటే, తట్టకొక తన్ను తగిలిస్తున్నాడు.\n\n* ఊరకుండలేక ఒళ్ళు ఉమ్మెత్తాకుతో (దురదగొండెతో) రుద్దుకొన్నట్టు.\n\n* ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?\n\n* ఊరకున్న ప్రాణానికి ఉచ్చుతాళ్ళు తెచ్చుకున్నట్లు.\n\n* ఊరకున్న ప్రాణానికి ఉరిపోసుకున్నట్లు.\n\n* ఊరకున్నవాడే ఉత్తమయోగి\n\n* ఊరకున్నవాడీని ఊరేమీ చెయ్యలేదు.\n\n* ఊరకున్నవాడికి ఊహలు రావు.\n\n* ఊరకున్నవాడికి ఉల్లిమిరియం పెట్టినట్లు.\n\n* ఊరపందికి పన్నీరు, చెవిటికి వీణ వంటిది.\n\n* ఊరపిచ్చుకకు గుమ్మడికాయంత గూద.\n\n* ఊరపిచ్చుకకు తాటికాయంత గూద\n\n* ఊరపిచ్చుకమీద తాటికాయ పడినట్లు.\n\n* ఊరపిచ్చుకమీద వాడి చంద్రాయుధమా?\n\n* ఊరంతా ఊరించి ఊగాదినాడు బూరె ఇచ్చెనట.\n\n* ఊరికంతా ఒక బోగముదైతే ఆ బోగముది ఎవరివద్ద ఆడును?\n\n* ఊరికళ గోడలే తెలుపుతాయి.\n\n* ఊరికి అమాసే లేదు అన్నట్లు.\n\n* ఊరికి ఉపకారంగా ఆలికి ఒక కోక కొనిపెడతాను, ఇంటింటికొక డబ్బివ్వండి అన్నట్లు.\n\n* ఊరికి వచ్చినమ్మ నీరుకు రాదా?\n\n* ఊరకుక్కా, సింహం ఒకటి అగునా?\n\n* ఊరకే ఉండక ఉల్లంకలు (తగాదాలు) పెట్టి చెప్పుదెబ్బలు సేవకులకి ఇప్పించారట.\n\n* ఊరకే పెట్టె అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు.\n\n* ఊరకే వస్తే మావాడు ఇంకోడున్నాడు అన్నట్లు.\n\n* ఊరికొకవానా, ఊదరకింకొకవానా కురుస్తుందా?\n\n* ఊరిజబ్బు చాకలి ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును.\n\n* ఊరిదగ్గఱి చేనుకు అందరూ దొంగలే.\n\n* ఊరిన పుండు మీద ఉప్పుకారం చల్లినట్లు.\n\n* ఊరినిండా అప్పులు, తలనిండా బొప్పెలు.\n\n* ఊరినిండా అప్పులు, నోటి నిండా పళ్ళు.\n\n* ఊరి పిడూగు పోలిసెట్టి బుడ్డమీడ పడిందిట.\n\n* ఊరి ముందరికి వచ్చి నా పెళ్ళాం పిల్లా ఎట్లున్నారని అడిగినాడట.\n\n* ఊరి ముందరి చేను, ఊళ్ళో వియ్యం కొరగావు.\n\n* ఊరి ముందరి చేను ఊరపిచ్చుక పాలు.\n\n* ఊరిముందరి సేద్యం, మద్దెకాడి బద్దెల పలుపు ఉంటే, ఆరేండ్లు సేద్యంచేస్తా అన్నదిట ఎద్దు.\n\n* ఊరిముందు ఉరుకులాట, మగని ముందు గంతులాట.\n\n* ఊరిలో కుంటి, అడవిలో లేడి.\n\n* ఊరివరకూ వచ్చి ఊరిగమిని ముందు పరుగెత్తినట్లు.\n\n* ఊరివారి పసుపు, ఊరివారి కుంకుమ, ఎవరిదేమిపోయే.\n\n* ఊరివారి బిడ్డను నగరివారు కొడితే, నగరివారి బిడ్డను నారాయణుడు కొడతాడు.\n\n* ఊరివారి బిడ్దను రాజుగారు కొడితే, రాజు గారిబిడ్డను దేవుడు కొట్టును.\n\n* ఊరివారి వడ్ల పుణ్యాన్ని, మా అత్త ముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజనం దొరికింది.\n\n* ఊరిశని వచ్చి వీరిసెట్టిని కొట్టినదట.\n\n* ఊరుంటే మాదిగ గేరి (వాడ) ఉండదా?\n\n* ఊరుంటే మాలపల్లి (మాలాడ) ఉండదా?\n\n* ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత.\n\n* ఊరు ఉస్తికాయంత, సిద్ధాంతం తాటికాయంత.\n\n* ఊరుకాలిన మంటకు కూడుడుకునా?\n\n* ఊరుకోమని ఉరెట్టుకున్నదిట.\n\n* ఊరు తిరిగిరమ్మంటే రోలు తిరిగివచ్చినట్లు.\n\n* ఊరు దూరము, కాడు దగ్గిర.\n\n* ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు.\n\n* ఊరుపండితే ఊకైనా దొరుకుతుంది.\n\n* ఊరు పుట్టినప్పుడే, ఉగాది పుట్టింది.\n\n* ఊరు పుట్టినప్పటినుండి ఎన్ని ఉగాదులు రాలేదూ, ఎన్ని ఉగాదులు పోలేదూ?\n\n* ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది.\n\n* ఊరుమాసినా పేరు మాయదు.\n\n* ఊరులేక పొలిమేర ఉండునా?\n\n* ఊరువిడిచి పొరుగూరుపోయినా పూనిన కర్మపోదు.\n\n* ఊరేలినా తా పండుటకు మూడు మూరల తావే.\n\n* ఊళ్ళు చేసిన బాకీ కూళ్ళుచేస్తే తీరుతుందా?\n\n* ఊళ్ళేలని వారు రాజ్యాలేలుతారా?\n\n* ఊళ్ళేలే కొడుకు కన్నా ఊపాదానమెత్తే పెనిమిటి మేలు.\n\n* ఊళ్ళో అధికారమైనా ఉండాల, ఊరంచు పొలమైనా ఉండాల.\n\n* ఊళ్ళో ఇల్లులేదు, పొలంలో చేను లేదు.\n\n* ఊళ్ళో పెండ్లయితే ఱంకుముండలకు రాగిసంకటి దిగదు.\n\n* ఊళ్ళోకి రాజుగారు వస్తున్నారంటే, పెండ్లమువంక అనుమానంగా చూసినట్లు.\n\n* ఊళ్ళోకి రవొద్దు రౌతా అంటె గుఱ్ఱాన్ని ఎక్కడ కట్టేసేది అన్నాడట.\n\n* ఊళ్ళో (పెళ్ళికి)పెళ్ళైతే కుక్కలకు హడావుడి.\n\n* ఊళ్ళో ముద్ద గుళ్ళో నిద్ర.\n\n* ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు.\n\n* ఊళ్ళోవాళ్ళకి పనిచేసి ఒళ్ళంతా దుమ్ము చేసుకొన్నట్లు.\n\n* ఊసరవిల్లి వలే రంగులు మార్చేవాడు.\n\n* ఊసరక్షేత్రంలో అలికితే ఉల్లికోపుల పంట.\n\n* ఊసరక్షేత్రంలో దూసరి తీగ.\n\n* ఊసరక్షేత్రంలో పైరు, ణిరులేని చెరువుకింద సేద్యము.\n\n* ఊహ ఊళ్ళేల మంటే, వ్రాత (రాత) రాళ్ళుమోయమన్నది.\n\n* ఊహలు ఊళ్ళేలుతుంటె, ఖర్మం కట్టెలు మోయిస్తున్నది.\n\n**********:: ఋ ::**********\n\n* ఋణము, రణము ఒకటే.\n\n* ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు.\n\n* ఋషిమూలం, నదిమూలం, స్త్రీమూలం విచారించరాదు.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 862,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ఉ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట.\n\n* ఎంగిలికి ఎగ్గులేదు, తాగుబోతుకు సిగ్గులేదు.\n\n* ఎంగిలిచేత (తితో) కాకిని తోలనివాడు (అదల్చనివాడు) భిక్షంపెట్టునా?\n\n* ఎంగిలితిండికి ఆపోశనం ఎత్తవలెనా?\n\n* ఎంగిలిబూరెను కడిగినట్లు.\n\n* ఎంచకురా పంచుకుంటావు.\n\n* ఎంచబోతే మంచమంతా కంతలే.\n\n* ఎంచిన ఎరువేదిరా అంటే, యజమాని పాదమే.\n\n* ఎంచివేస్తే ఆరి తరుగుతుందా?\n\n* ఎండ్రకాయ కొవ్వితే కలుగులో నిలువదు.\n\n* ఎండ్రకాయ కొవ్వినా, యానాది కొవ్వినా కలుగులో ఉందరు.\n\n* ఏండకాచిన నాడు ఏకులు వడికి, వానకురిసిన నాడు పత్తి పట్టుకున్నట్లు.\n\n* ఎండకు పెట్టీన టోపీ, వడగండ్లకాగునా?\n\n* ఎండకాసిన చోటే, వెన్నెల కూడా కాసేది.\n\n* ఎండబడితే ఉండబడుతుంది, ఉండబడితే వండబడుతుంది, వండబడితే తిండిపడుతుంది, తిండిపడితే కండపడుతుంది.\n\n* ఎండమావుల్లో నీరు ఎందుకెక్కినట్లు?\n\n* ఎండ మిడిసికాసినా చీకట్లకి గుహలుండనే ఉండును.\n\n* ఎండాకాలంలో ఏకులువడికి వానాకాలంలో వడ్లుదంచినట్లు.\n\n* ఎండావానా కలిస్తే కుక్కలకు నక్కలకు పెండ్లి.\n\n* ఎండావానా వస్తే నక్కలపెళ్ళి.\n\n* ఎండితే తరుగుతుందని పచ్చిదే తినేవాడు.\n\n* ఎండిన ఉళ్ళగోడు ఎవడికి కావాలి? పండిన ఊళ్ళకు అందరూ ప్రభువులే.\n\n* ఎండినమోడుకు ఎఱ్ఱనిపూలు తగిలిచినట్లు.\n\n* ఎండునేలమీద ఎండ్రకాయ కనపడితే వాన తప్పదు.\n\n* ఎండు పండు లేకుండా ఉంటుందా?\n\n* ఎండు మామిడి టెంకలు ఒళ్ళో పెట్టుకొని, ఎవరి త్రాడు తెంప వచ్చావోయి వీరన్నా అన్నదిట.\n\n* ఎంత ఉన్నవాడైనా ఒక్కసారి ఒకే ముద్ద మింగగలడు.\n\n* ఎంత ఉప్పుతింటే అంత దాహం.\n\n* ఎంత కఱవు ఐనా పులి పూరీ మేస్తుందా?\n\n* ఎంత చెట్టు కంత గాలి.\n\n* ఎంత చెట్టు కంత పాటు.\n\n* ఎంత చేసినా ఎడమచేతి కడియం కుద(దు)వే.\n\n* ఎంత దరిగిన మిరియాలు జొన్నలు సరిపోవే?\n\n* ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు.\n\n* ఎంత దయో దాసులపై అన్నట్లు.\n\n* ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే.\n\n* ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే.\n\n* ఎంతపెద్ద చెట్టు ఎక్కినా ముడ్డి నేలనే చూస్తుంది.\n\n* ఎంత పెద్దవారికైనా ముడ్డి పీతికంపే.\n\n* ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక.\n\n* ఎంత పొద్దుండగా లేచినా తుమ్మగుంటవద్దనే తెల్లారుతుంది.\n\n* ఎంత పొద్దుకాడ లేచినా చింతగుంటపాలెం దగ్గరే తెల్లవారుతుంది.\n\n* ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే.\n\n* ఎంత ప్రాప్తో అంత ఫలం\n\n* ఎంతమంచి కత్తి అయినా తన పిడిని గంటు చేయదు.\n\n* ఎంత మంచి గొల్లకయినా వేపకాయంత వెఱ్ఱిలేకపోలేదు.\n\n* ఎంత మంచి పంది అయినా అమేధ్యం (అశుద్ధం) తినక మానదు.\n\n* ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడుట.\n\n* ఎంతలావు మొగుడైనా ఆడదానికి లోకువే.\n\n* ఎంతవారలైనా కాంత దాసులే.\n\n* ఎంత వెలుగుకు అంత చీకటి.\n\n* ఎంత సంపదో అంత ఆపద.\n\n* ఎంత స్వామి ప్రసాదమైతే మాత్రం, ఇంత చేదా?\n\n* ఎందరో మహానుభావులు (వ్యంగ్యంగా కూడ ప్రయోగం).\n\n* ఎందరో మహానుభావులు, వారందరికి వందన మన్నారు.\n\n* ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా? అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడుట.\n\n* ఎందుకు పుట్టావు ఏకా అంటే, ఎదుటివాళ్ళని వెక్కిరించటానికే అన్నదిట.\n\n* ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమమైన వాళ్ళను వెక్కిరించను అన్నదిట.\n\n* ఎందునైనా ముఖరాసి (జన్మరాశి) బాగుండాలన్నారు.\n\n* ఎందుకొచ్చినావే ఎల్లమ్మా అంటే, అందుకు కాదులే అగ్గికొచ్చాను అన్నదిట.\n\n* ఎందులో పుట్టిన పురుగు అందులోనే చస్తుంది (బ్రతుకుతుంది).\n\n* ఎందులో పెట్టినా ఎడారే.\n\n* ఎక్కగా ఎక్కగా పొడవు.\n\n* ఎక్కడ ఉన్నావే కంబళీ అంటే, వేసిన చోటనే గొంగళీ అన్నదిట.\n\n* ఎక్కడ కడితేనేమి, మన మందలో ఈనితే చాలు.\n\n* ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది.\n\n* ఎక్కడైనా బావ అనుకానీ వంగతోటలో (కాడ) బావా అనకు.\n\n* ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు.\n\n* ఎక్కడ నుంచి వస్తున్నావోయ్ నత్తాయనా అంటే, రె రెడ్డొరించిను నుంచోయ్ చోయ్ న నంగాయనా అన్నాడట.\n\n* ఎక్కడమేసినా మనింట్లో పాలిస్తే చాలు.\n\n* ఎక్కడా దొరక్కపోతే అక్కమొగుడే గతి.\n\n* ఎక్కడాలేకపోతే అక్క మొగుడే దిక్కు.\n\n* ఎక్కడీకిపోతావు విధవమ్మా అంటే, వెంటవస్తాను పదవమ్మా అన్నదిట.\n\n* ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు.\n\n* ఎక్కడీకిపోయినా కర్మం ఎదురుగుండానే వస్తుంది.\n\n* ఎక్కడిదక్కడె ఉంచి ఎల్లమ్మ ఇల్లలికి నట్లు.\n\n* ఎక్కడిదిరా ఈ పెత్తనం? అంటే, మూలనుంటే నెత్తిన వేసుకున్నా అన్నాడట.\n\n* ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది (పారుతుంది).\n\n* ఎక్కమంటే ఎద్దుకు కోపం, దిగమంటే కుంటికి కోపం.\n\n* ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు.\n\n* ఎక్కి కాయపట్టిచూసి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.\n\n* ఎక్కిరించబోయి వెలకిత్తలా (వెల్లికింతలా) పడ్డట్లు.\n\n* ఎక్కువగా తిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్టి చిరుగవు.\n\n* ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం.\n\n* ఎక్కువయిన సొమ్ము బ్రహ్మలకిత్తునా? బట్లకిత్తునా?\n\n* ఎగతాళి అంటే ఏడువ వస్తాడు, కోడిగ మంటే కొట్టవస్తాడు.\n\n* ఎగతాళి చేసేవారిముందు జారిపడినట్లు.\n\n* ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య.\n\n* ఎగవేసే వాడి ఇల్లెక్కడా? అంటే ఊరికడపట అన్నట్లు.\n\n* ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు.\n\n* ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి.\n\n* ఎగిరే ఎద్దే గంత మోసేది.\n\n* ఎగరబోయి బోర్లపడి, ఊరు అచ్చివచ్చిందికాదు అన్నాడట.\n\n* ఎగ్గును అనక, వినక, కనక కవి కావ్యం వ్రాయలేడు.\n\n* ఎచ్చులకు (డంబములకు) ఏటపోతును కోస్తే, ఒళ్ళంతా బొచ్చు అయ్యింది.\n\n* ఎచ్చులకు ఏలేశ్వరంపోతే పక్కతోలు కుక్కలెత్తుకు పోయినవి.\n\n* ఎచ్చులకు వేటపాలెంపోతే, తన్ని తలగుడ్ద తీసుకున్నారట..\n\n* ఎచ్చులకు ఏమారం పోతే, తన్ని తలగుడ్ద పెరుక్కున్నారుట.\n\n* ఎట్లా (ఎట్లాంటి)చిరుబోణికైనా వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.\n\n* ఎట్లా వచ్చిందో అట్లే పోతుంది, తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది.\n\n* ఏడదిడ్డమంటే, పెడదిడ్డ మన్నట్లు.\n\n* ఎడపిల్ల ఏరాలితో సమానం.\n\n* ఎడమచేత్తో చేసింది కుడిచేత్తో అనుభవించవలె.\n\n* ఎడ్డెమంటే, తెడ్డెమన్నట్లు.\n\n* ఎతలున్నమ్మకు కతలు రావు.\n\n* ఎత్తివచ్చిన కాపురానికి ఏకాలూనినా ఒకటే.\n\n* ఎత్తుకున్న చంకనుండదు, దించిన దిగువనుండదు. (బిడ్డ)\n\n* ఎత్తుక తిన్నవాణ్ణి పొత్తులో పెట్టుకుంటే, అంతాతీసి బొంతలోపెట్టుకున్నాడుట.\n\n* ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు.\n\n* ఎత్తుకొని తిన్న బోలె ఎదురుగా వస్తే, చంకనున్న బోలె సలాంచేసిందిట.\n\n* ఎత్తుబడిన గొడ్డు పులికి జడుస్తుందా?\n\n* ఎత్తుభారపు పెళ్ళికి ఏకాలుపెట్టినా ఒకతే. (ఎత్తుభారం=వ్యర్ధమైన, పనికి మాలిన).\n\n* ఎత్తుభారం మొత్తుకోళ్ళు.\n\n* ఎత్తుమరిగిన బిడ్డ, వెలుగుదాటే గొడ్డు ఏమిచేసినా వినవు.\n\n* ఎత్తువారి బిడ్డ. (ఎవరిచంకనున్న వారిమాట వినును).\n\n* ఎత్తెత్తి అడుగు వేస్తే పుల్లాకు మీద పడిందిట.\n\n* ఎత్తెత్తిపోసినా ఇత్తడి బంగారమగునే?\n\n* ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే.\n\n* ఎదలో కత్తెర నాలుకలో బెల్లం.\n\n* ఎదిగినదానిని వెంటేసుకు తిరిగినట్లు.\n\n* ఎదుట అన్నది మాటా, ఎదాన్న పెట్టినది వాత.\n\n* ఎదుట ఉన్నవాడు పెండ్లికొడుకు.\n\n* ఎదుట బ్రాహ్మడు లేకపోతే వెయ్యి యఙ్ఞాలు చెయ్యవచ్చు.\n\n* ఎదుట లేకుంటే ఎదలో ఉండదు.\n\n* ఎదురింటి పొయ్యిమండితే, తన పొయ్యిలో నీళ్ళుపోసుకొన్నట్లు.\n\n* ఎదుటివారి సొమ్ము ఎల్లవారికీ తీపు.\n\n* ఎదురుగుండా అద్దముంటే ఎక్కిరించుకో బుద్దవుతుంది.\n\n* ఎదురు తిరిగిన కుక్కను ఏదీ కరువలేదు.\n\n* ఎదురు తిరిగిన కుక్కా ఏదుపంది ఒకటే.\n\n* ఎదురుపడినవాడే నా మొగుడన్నట్లు.\n\n* ఎదురుపెట్టి కుదురు కొట్టించుకొన్నట్లు.\n\n* ఎదురుపెట్టి చదరంగ మాడినట్లు.\n\n* ఎద్దు అంత కుప్పయితే ఏడు పుట్ల చోళ్ళు (సజ్జలు, రాగులు).\n\n* ఎద్దు అడుగులో ఏడు గింజలుపడితే పైరు పలుచన.\n\n* ఎద్దు (దున్న) ఈనిందంటే గాటా కట్టేయమన్నట్లు.\n\n* ఎద్దు ఉన్నవాడికి బుద్ది ఉండదు, బుద్ది ఉన్నవాడికి ఎద్దు ఉండదు.\n\n* ఎద్దు ఎండకులాగా, దున్నపోదు నీడకు లాగా.\n\n* ఎద్దునెక్కున తీరుకాదు, సద్ది తిన్న నోరు కాదు.\n\n* ఎద్దునెక్కున వాడే లింగడు, గద్దెనెక్కిన వాడే రంగడు.\n\n* ఎద్దు ఏమెరుగురా అటుకుల రుచి, గాడిదేమెరుగురా గంధపు పొడి వాసన.\n\n* ఎద్దుకాలిలో ముల్లంత లేకపోయినా, ఏడూళ్ళ పెత్తనానికి తక్కువ లేదు.\n\n* ఎద్దుకు ఎనుబోతుకు లంకె వేసినట్లు.\n\n* ఎద్దుకు కొబ్బరికాయ ఇస్తే ఏమి చేస్తుంది?\n\n* ఎద్దుకు చొప్పవేసి ఆవుని పాలివ్వ మన్నట్లు.\n\n* ఎద్దుకు తూలాలని ఉంది, గంతకు పడాలనీ ఉంది.\n\n* ఎద్దుకెగవేయ, బఱ్ఱెకు సగవేయ.\n\n* ఎద్దుకేమి తెలుసు అటుకుల చవి (రుచి).\n\n* ఎద్దుకొద్ది సేద్యం, సద్ది కొద్దీ పయనం.\n\n* ఎద్దు కొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు.\n\n* ఎద్దుగా ఏడది బ్రతికేకంటే ఆబోతుగా (ఇరు) ఆరునెలలే చాలు.\n\n* ఎద్దు చచ్చినా వాత బాగా పడింది.\n\n* ఎద్దు చేనుమేసిపోతే గాడిదకు చెవులుకోసినట్లు.\n\n* ఎద్దు తన్నుతుందని గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.\n\n* ఎద్దు తన్నుతుందని గుఱ్ఱంచాటు చేరినట్లు.\n\n* ఎద్దుతో వ్యవసాయం, ఆలితో సంసారం.\n\n* ఎద్దుని అడిగా గంత కట్టేది?\n\n* ఎద్దును కొద్దిలో కొనరాదు, బట్టను భారీలో కొనరాదు.\n\n* ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడ్పుచూస్తే ఏడ్పు వస్తుంది.\n\n* ఎద్దును ముద్దుపెట్టబోతే, ఎడమకాలితో తన్నింది.\n\n* ఎద్దునోటికి చొప్ప అందించినట్లు.\n\n* ఎద్దున్న వాడి వ్యవసాయం చూడు, మంది ఉన్నవాడి మారుబలం చూడు.\n\n* ఎద్దు పుండు కాకికి ముద్దా?\n\n* ఎద్దుపుండు కాకికి రుచి.\n\n* ఎద్దు పొడుస్తుందని తన్నే గుర్రం చాటున చేరినట్లు.\n\n* ఎద్దు బీదదయితే చేను బీద\n\n* ఎద్దు మంచిదైతే వేరూరికి పోతుందా?\n\n* ఎద్దు మోసినంత, గోనె పట్తినంత.\n\n* ఎద్దురొమ్ములో ముల్లుకఱ్ఱ పొడిచినట్లు.\n\n* ఎద్దులవెంటనే తాళ్ళు.\n\n* ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.\n\n* ఎద్దులు కాసినందుకు, ముద్దలు మింగినందుకు సరిపోయిందిపో అన్నాడట.\n\n* ఎద్దులు చేయును, గుఱ్ఱాలు మొయ్యను (మేయును).\n\n* ఎద్దులెప్పటివేగానీ గోనెలుమాత్రం కొత్తవి.\n\n* ఎద్దువలే ఉన్నావే తేలుమంత్రం తెలియదా?\n\n* ఎద్దువలే కుక్కనుపెంచి రెడ్డి తానే (ఆలుమొగలు తామే) మొరిగినాడ(ర)ట.\n\n* ఎద్దువలే తిని మొద్దువలే నిద్రపోయినట్లు.\n\n* ఎద్దయినా ఏడాదికి నేర్చును, మొద్దు ముప్పై ఏళ్ళయినా నేర్వడు.\n\n* ఎనుబోతు పేదల యశముగోరు.\n\n* ఎనుబోతు బలిసి ఏనుగవలెనున్న భ్రమరములకు మదప్రాప్తి లేదు.\n\n* ఎనుబోతుమీద వానకురిసినట్లు.\n\n* ఎనుము గొప్పదయినా ఏనుగును బోలునా?\n\n* ఎనుము ముసలి, ఏనాది ముసలి లేవు.\n\n* ఎనుముకు మేతవేసి ఆవుని పితికినట్లు.\n\n* ఎన్నడూ గానని మొగానికి ఇప్పపూత బెల్లమంట.\n\n* ఎన్నడులేని కల్మి కల్గెనా వెన్నున కద్దమడుగు, కొనవేళ్ళకు ముచ్చెలు తొడుగు.\n\n* ఎన్నడూ ఎక్కని రెడ్డి గుఱ్ఱమెక్కితే వెనుక ముందయిందట.\n\n* ఎన్నడూ ఎఱుగని వానిని ఎద్దుల బేరానికి పంపితే ఎఱ్ఱెద్దుకు ఎనభై, నల్లెద్దుకు నలభై అన్నడట.\n\n* ఎన్నడు దొరకనమ్మకు ఏగాణి దొరికితే, ఏడు ముళ్ళు వేసిందట.\n\n* ఎన్నడూ నా మొగుడు 'ఎల్లి, ఎల్లి,' అనలేదుగానీ ఇల్లు కాలిననాడు ఎల్లి ఎల్లి అన్నాడు.\n\n* ఎన్ని పూటులేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.\n\n* ఎన్నిబూతులైనా పిడికెడు కొఱ్ఱలతో సరికావు.\n\n* ఎన్ని ముట్టుపాతలైతే ఒక కట్టుకోక అవుతుంది?\n\n* ఎన్ని విద్యలైనా కులవిద్యకు సాటిరావు.\n\n* ఎన్ని సూదులైతే ఒక గడ్డపారగానూ?\n\n* ఎన్నో వ్రణాలు కొసానుగానీ నా వ్రణమంత తీపులేదు అన్నాడుట.\n\n* ఎప్పుడూ ఎరగనోడు ఏతాము తొక్కితే ఏటా ఆరుబారల అప్పు.\n\n* ఎప్పుడూ పెట్టే నాలుగూపెట్టి (చీవాట్లు)కొఱ్ఱలచేట బయటపెట్టు అన్నాడుట.\n\n* ఎప్పుడూ యోచిస్తుండేవాడు అభాగ్యుడు, ఎన్నడూ యోచించనివాడు అవివేకి.\n\n* ఎప్పటి అమ్మకు నిప్పటే గతి. (నిప్పటి=అరిసె).\n\n* ఎముక కొరికే కుక్క ఇనుము కొరుకునా?\n\n* ఎముకలేని నాలుక ఎత్లాతిప్పినా తిరుగుతుంది.\n\n* ఎరవుల కంచమని ఎదో పెట్టుకు తిన్నట్లు.\n\n* ఎరువుల సొమ్ములు బరువుచేటు, తియ్యను పెట్టను తీపులచేటు, దానిలో ఒకటిపోతే అప్పుల చేటు.\n\n* ఎరువు ఉంటే, వెఱ్ఱివాడూ సేద్యగాడే.\n\n* ఎరువును నమ్మి బొంతను పొయ్యిలో పెట్టుకున్నట్లు.\n\n* ఎరువుపెట్టిన పొలము, ఏలుబడి అయిన కోడలు.\n\n* ఎరువులేని పైరు, పరువులేని రైతు.\n\n* ఎరువులేని పొలము, వేగంలేని ఏరు.\n\n* ఎరువులేని సేద్యం కరువుదేవతకు వాద్యం.\n\n* ఎరువు వేయగానే (ఊసర) క్షేత్రం ఫలించునా?\n\n* ఎరువు స్థిరం కాదు బరువు తేలిక కాదు.\n\n* ఎరువూ వెంపలిస్తే ఎదిగిందే పైరు.\n\n* ఎఱిగి ఎఱిగి చేసిన పాపం, ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవలె.\n\n* ఎఱుక తేలిన (ఏలిన) ఏడుఘడియలకు వాన.\n\n* ఎఱ్ఱకోమటిని, నల్ల బ్రాహ్మణుడిని నమ్మరాదు.\n\n* ఎఱ్ఱమాదిగను, నల్ల బాపని నమ్మరాదు.\n\n* ఎఱ్ఱని ఆకాశానికి బఱ్ఱున వానలు.\n\n* ఎఱ్ఱనేలవంట ఒకనాటి వంట.\n\n* ఎలమఱ్ఱుకు ఎద్దునివ్వరాదు, పామఱ్ఱుకు పడుచునివ్వరాదు.\n\n* ఎలుక ఎప్పుడూ తన దిక్కుకే తవ్వుకుంటుంది.\n\n* ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి కనికరిస్తుందా?\n\n* ఎలుక ఏట్లోపోతేనేమి? పులి బోనున పడితేనేమి.\n\n* ఎలుకకు పిల్లి సాక్షి (సాక్ష్యం).\n\n* ఎలుక చావుకు పిల్లి మూర్చ పోతుందా?\n\n* ఎలుక తోలు ఎంత తోమినా నలుపే.\n\n* ఎలుక నోట్లో నుంచి ఏనుగు దంతాలు రావు.\n\n* ఎలుకమీద కోపంతో ఇంటికి చిచ్చుపెట్టుకొన్నట్లు.\n\n* ఎలుక సంసారం చూసి పిల్లి మూర్చపోయిందిట.\n\n* ఎల్లపాములు తలెత్తితే, ఎలికపామూ తలెత్తిందిట.\n\n* ఎల్లమ్మ పెళ్ళిలో పులమ్మ శోభనం.\n\n* ఎల్లమ్మ బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది.\n\n* ఎల్లయ్యకు ఎడ్లులేవు, మల్లయ్యకు మనుష్యులు లేరు.\n\n* ఎల్లయ్యకెడ్లు లేవు, మల్లయ్యకు బండిలేదు, తెల్లవార్లు బాడుగే.\n\n* ఎల్లవారమ్మల బ్రతుకు తెల్లారితే తెలుస్తుంది.\n\n* ఎల్లినదానికి ఏగాని తార్చినదానికి టంకం.\n\n* ఎల్లిని మల్లి చేయి, మల్లిని ఎల్లి చేయు.\n\n* ఎల్లి మీద పుల్లి, పుల్లి మిద ఎల్లి\n\n* ఎల్లిసెట్టి లెక్క ఏకలెక్క.\n\n* ఎవడబ్బ సొమ్మని వెక్కి వెక్కి ఏడవటం.\n\n* ఎవడికంపు వాడికి ఇంపు.\n\n* ఎవడి జందెం వాడికి ముప్పు.\n\n* ఎవడి నోటికంపు వాడికి తెలియదు.\n\n* ఎవడు తవ్వుకొన్న గోతిలో వాడే పడతాడు.\n\n* ఎవరి ఇంటి దోసెకైనా తూట్లే.\n\n* ఎవరి ఏడుపు వాళ్ళకే ఎదురు తగులుతుంది.\n\n* ఎవరి కంతికోస్తే వారికే నొప్పి.\n\n* ఎవరి పిచ్చి వారికి ఆనందం.\n\n* ఎవరికి పుట్టిన బిడ్దవురా ఎక్కి ఎక్కి ఏడ్చేవు?\n\n* ఎవరికి పెట్టావే దండము? అంటే మీలో బుద్దిహీనుడికి అన్నదిట సాని.\n\n* ఎవరికి వారే యమునా తీరే.\n\n* ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని ఎగిరెగిరి ముద్దుపెట్టుకున్నట్లు.\n\n* ఎవరి జానతో వారు ఏడు జానల బెత్తెడే (పొడవు).\n\n* ఎవరి నీళ్ళలో వారు మునగాలి.\n\n* ఎవరి పాపాన వాళ్ళు పోతారు.\n\n* ఎవరిపిచ్చి వాళ్లకు ఆనందం\n\n* ఎవరి ప్రాణం వాళ్ళకు తీపి.\n\n* ఎవరి బిడ్డ వారికి ముద్దు.\n\n* ఎవరి ముడ్డికిందికి నీళ్ళు వస్తే వాళ్ళే చేస్తారు.\n\n* ఎవరివల్ల చెడ్డవోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డానోయి పేరన్నా అన్నాడుట.\n\n* ఎవరు ఇచ్చింది ఈ మాన్యం అంటే, నేనే ఇచ్చుకున్నాను అన్నాడట.\n\n* ఎవరు ఎంతచేసినా ఇంటికి ఆలు అవుతుందా? దొంతికి కడవ అవుతుందా?\n\n* ఎసటిలో మెతుకులన్ని పట్టిచూడాలా?\n\n**********:: ఏ ::**********\n\n* ఏ అన్నమైతే ఏం? వరి అన్నమే వడ్డించమన్నాడుట.\n\n* ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.\n\n* ఏవూరు ఏతామా? అంటే దూవూరే దూలామా అన్నదిట.\n\n* ఏవూరు రెడ్డీ అంటే ఏట్లో మోకాలిలోతు అన్నాడట.\n\n* ఏ ఎండకా గొడుగు పట్టినట్లు.\n\n* ఏకచక్రంగా ఏలిన రాజైనా కడకు ఏడు జానల కాటికే.\n\n* ఏకదంతుండిచ్చు నీకింత బొచ్చు.\n\n* ఏ కఱ్ఱన నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.\n\n* ఏకాదశి ఇంటికి శివరాత్రి పోయినట్లు.\n\n* ఏకాదశినాడు తల అంటుకుంటున్నావేమీటీ అంటే అది నిత్యవ్రతం, నేడే ఆరంభించాను అన్నాడట; మర్నాడు తల ఎందుకు అంతుకోలేదంటే, నిన్నటితో వ్రతం సమాప్తి అయినది అన్నాడుట.\n\n* ఏకాదశినాడు పేలపిండి తినకపోతే రాక్షసులై పుడతారు.\n\n* ఏకాదశి మరణమని ఈతకొయ్యలలో పడతానా?\n\n* ఏకాల వచ్చి, మేకాల తేలినట్లు.\n\n* ఏకాలు జారినా పిఱ్ఱకే మోసం.\n\n* ఏకాలు జారినా మోపుకే మోసం.\n\n* ఏకుతో తాకితే మోకుతో మోదుతారు.\n\n* ఏకు దారము, ఏగాని పుస్తె.\n\n* ఏకులు పెడితే బుట్టలు చిరుగునా?\n\n* ఏకులు లేని రాటము, మొగుడులేని పోరాటము.\n\n* ఏకులు వడికినట్టూ కాదు, మొగుడి దగ్గర తొంగునట్టూ కాదు.\n\n* ఏకైకరధులు ప్రత్యేక పాలెగాండ్రు.\n\n* ఏగాని ముండకు డబ్బున్నర క్షౌరం.\n\n* ఏగాలి కాఊపు ఊగినట్లు.\n\n* ఏగాలి కాచాప ఎత్తినట్లు (పడవ తెరచాప).\n\n* ఏగిలి (దుక్కి బాగా ఎండుట) చేస్తే ఏలనివానికైనా పండుతుంది.\n\n* ఏగిలి దున్నితే, వెఱ్ఱిమాలకైనా పండుతుంది.\n\n* ఏ గుంటలో నీరు ఆ గుంటలోనే ఇంకుతుంది.\n\n* ఏ గుఱ్ఱానికి తోక ఉంటే, ఆ గుఱ్ఱమే ఊపుకుంటుంది.\n\n* ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకు.\n\n* ఏ గూటి పక్షి ఆ గూటికే చేరును.\n\n* ఏ గ్రహము పట్టినా ఆగ్రహము పట్తరాదు.\n\n* ఏ చంకనాకినా ఏమీ లేదుగానీ, ఏకు చంకనాకితే ఏగాని ఉంది.\n\n* ఏ చెట్టులేని చోట వెంపలి చెట్టు (ఆముదపు చెట్టు) మహావృక్షం.\n\n* ఏటికవతల ఇచ్చేకన్నా ఏట్లో పడేస్తే నయం.\n\n* ఏటి అవుతలు మిరియాలు మా తాటికాయంతేసి అంటే, మా ఇడుమాకులే పట్టలేదన్నదిట. (ఇడుమాకులు= ఇంటి ముందరి ప్రాంగణము).\n\n* ఏటి ఈతకు బీటి మేతకు సరి.\n\n* ఏటి ఒడ్డు చేను ఏరు వస్తే నిలుస్తుందా?\n\n* ఏటి కాడ నక్కకు పాటి రేవేమి తెలుసు.\n\n* ఏటికి ఎప్పుడు పోయినావు? ఇసుక తెచ్చావు? అంటే ఆడవారు తలిస్తే అదెంత సేపు అన్నదిట; మొగవారు తలిస్తే ఇదెంతసేపు అని నాలుగు బాదినాడుట.\n\n* ఏటి కాల్వ జూడ ఎక్కి తగ్గిన రీతి.\n\n* ఏటికి ఎదురీదినట్లు.\n\n* ఏటికి ఎన్ని నీళ్ళూ వచ్చినా, కుక్కకు గతుకు నీళ్ళే.\n\n* ఏటికి పోయి జారిపడి ఊరు అచ్చిరాలేదన్నాడుట.\n\n* ఏటికి లాగితే కోటికి, కోటికి లాగితే ఏటికి అన్నట్లు.\n\n* ఏటి కట్టున కూటి గట్టున ఓపిక పట్టలేరు.\n\n* ఏటిదరి మ్రానుకు ఎప్పుడూ గండమే.\n\n* ఏటిమీద దేవరకు కూటిమీదే చింత.\n\n* ఏటివంక లెవరు తీస్తారు, కుక్కతోక ఎవరు సరిచేస్తారు?\n\n* ఏటి వరద, నోటి దురద.\n\n* ఏటుకు ఏటు, మాటకు మాట.\n\n* ఏట్లో కలిసిన చింతపండు లాగా.\n\n* ఏట్లో పడ్డవానికి ఎన్నో ఎన్నికలు.\n\n* ఏట్లో పారేనీరు ఎవరు తాగితేనేమీ?\n\n* ఏట్లో వేసినా ఎంచి వేయవలెను.\n\n* ఏడవ గలిగితే ఏడ్చినకొద్ది వ్యవసాయం.\n\n* ఏడాటం (ఇబ్బంది) మొగుడికి ఎత్తుభారం పెళ్ళాం.\n\n* ఏడు ఎందల విన్ననాలు ఎంతవరకైనా ఆగుతాయి.\n\n* ఏడు కరువులు వస్తున్నాయిరా అంటే, తొలి కరువులోనే పోతే మిగతా ఆరు ఎంచేస్తాయి అన్నాడుట.\n\n* ఏడుకాంపులమ్మకు మూడు కాంపులమ్మ ముక్క నేర్పినట్లు.\n\n* ఏడుగురిని మారిస్తే పెద్ద గౌడసాని.\n\n* ఏడునెలలకు ఎందుకు నడకాలు అన్నట్లు.\n\n* ఏడుపు ఏడింటి కనర్ధం.\n\n* ఏడుపులో ఏడుపు ఎడమచేయి చూపెట్టు అన్నట్లు.\n\n* ఏడుమనువులు పెళ్ళైనా ఏకులరాట్నం తప్పలేదు.\n\n* ఏడుమాటలు మాట్లాడినా, ఏడు అడుగులు నడిచినా గుణం తెలుస్తుంది.\n\n* ఏడు మారినా, ఈడు ముదిరినా ఏమీమారదు ఈ లోకంలో.\n\n* ఏడుమాసికాల చీర, ఎదురు బాసింగాల రవిక, జరుగుతూ జరుగుతూ నేను సారె కట్టుక వచ్చినాను.\n\n* ఏడుమెతుకులు తింటే ఏనుగంత సత్తువ.\n\n* ఏడుసార్లు పాసిన చేల్లో పండిన కంకితో ఏడుగుర్ని చంపవచ్చు.\n\n* ఏడుస్తావు ఏమి ఎలుకా? అంటే నా బాధ నీకే మెఱుక అన్నదిట.\n\n* ఏడుస్తున్న వాణ్ణి దాని(న)మ్మకాయలు కావాలా అంటే, దానికాయలే కావాలి అన్నాడుట.\n\n* ఏడుస్తూన్నావెందుకు బ్రాహ్మడా? అంటే ఒకనాడు నామొగం నవ్వి చచ్చిందా అన్నాడట.\n\n* ఏడుస్తూ ఏరువాక సాగిస్తే, కాడిమోకు దొంగలు దోచుకుపోయారుట.\n\n* ఏడూళ్ళు తిరిగినా, ఎఱ్ఱకఱ్ఱిదాన్ని కొనమన్నారు.\n\n* ఏడ్చి ఎంకటసామీ అనిపించుకొన్నట్లు.\n\n* ఏడ్చి మొహం కడుకున్నట్లు.\n\n* ఏడ్చేదాని ఎడమచేతి కిందా కుట్టెవాని కుడిచేతికిందా కూర్చోరాదు.\n\n* ఏడ్చేదాని బిడ్డకు అరటిపండ్లు చూపినట్లు.\n\n* ఏడ్చేదాని బిడ్డను ఆమే కనవలెను అన్నట్లు.\n\n* ఏడ్చేదాని మొగుడు వస్తే, ఏకు వడికే దాని మొగుడూ వస్తాడు.\n\n* ఏడ్చేదాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు.\n\n* ఏతానులో పీలిక ఆ తానుకు చెందినట్లు.\n\n* ఏతాము ఎంతవంగినా తిరిగి లేచేదానికే కదా.\n\n* ఏతాము పాటకు ఎదురులేదు.\n\n* ఏదారి అంటే గోదారి అన్నట్లు.\n\n* ఏది పట్టినా దెయ్యం పట్టినట్లు.\n\n* ఏదీకాని వేళ గేదె ఈనినట్లు.\n\n* ఏ దేముడు వరమిచ్చినా పెనిమిటిలేనిదే పిల్లలు పుట్టరు.\n\n* ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి ఉండేది మేలు.\n\n* ఏనుగ ఎక్కినవాడు, దొడ్డికంత దూరగలడా?\n\n* ఏనుగు ఎత్తిపడితే (చతికిలపడితే) ఏనుగే లేవాలికానీ ఎవరు లేవతీయగలరు?\n\n* ఏనుగు ఎత్తుబడినా గుఱ్ఱమంత ఎత్తు.\n\n* ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు, చీమ ఒళ్ళు చీమకు బరువు.\n\n* ఏనుగకు ఎలక్కాయలు లొటలొట.\n\n* ఏనుగకు ఒక సీమ, గుఱ్ఱానికొక ఊరు, బఱ్ఱెకొక బానిస.\n\n* ఏనుగకు కాలువిరగటం, దోమకు రెక్కవిరగటం సమము.\n\n* ఏనుగకు సీళ్ళు చూపినట్లు (సిడి=అంకుశం).\n\n* ఏనుగ తన నెత్తిన తానే మన్ను పోసుకున్నట్లు.\n\n* ఏనుగ తొండము, యావ బట్టిన ముండ ఊరుకోవు.\n\n* ఏనుగు దాహానికి చూరునీళ్ళా?\n\n* ఏనుగుది ఎందరు కుడిస్తే తరుగుతుంది?\n\n* ఏనుగునైనా ఎంటితో కట్తవచ్చు (ఎంటి=గడ్డిపరకలతో నేసిన త్రాడు).\n\n* ఏనుగును ఇచ్చి అంకుశం దాచినట్లు.\n\n* ఏనుగును ఎక్కినవాడు, కుక్క కూతకు జడియడు.\n\n* ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు.\n\n* ఏనుగును తెచ్చి ఏకులబుట్టలోపెట్టి అది తన నెత్తిన పెట్టి, తనను ఎత్తుకోమన్నట్లు.\n\n* ఏనుగునేక్కి రంకుకు పోయినట్లు.\n\n* ఏనుగు పురుడోసుకొన్నట్లు.\n\n* ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటవి.\n\n* ఏనుగు పోయేదారి ఎరుగడుగానీ, దోమలు పోయేదారిలో తొంగున్నాడు.\n\n* ఏనుగు బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి.\n\n* ఏనుగు మదిస్తే నెత్తిన మన్ను పోసుకుంటుంది.\n\n* ఏనుగు మింగిన వెలగపండువలె (కరిమింగిన వెలగపండు).\n\n* ఏనుగు మీద ఎండ కాసినట్లు.\n\n* ఏనుగుమీద దోమ (ఈగ) వాలినట్లు.\n\n* ఏనుగుమీద పొయేవాణ్ణి సున్నమడిగినట్లు.\n\n* ఏనుగు మోత, ఏనుగు మేత.\n\n* ఏనుగు రొంపిలో కూరుకుపోతే కాకికి కూడా లోకువే.\n\n* ఏనుగులను అప్పుగా ఇస్తున్నారంటే, రెండు తోలుకొని వచ్చి కట్టివేయమన్నాడట.\n\n* ఏనుగులెగిరిపోతుంటే దోమలొక లెక్కా?\n\n* ఏనుగులు ఏట కొట్టుకొనిపోతుంటే, పిల్లి పాటి రేవడిగిందట.\n\n* ఏనుగులు ఏట గ్రుంకితే నక్క పాటిరేవడగ వచ్చిందట.\n\n* ఏనుగులు మింగిన ఎల్లమ్మకు పీనుగలు పిప్పళ్ళు.\n\n* ఏపట్లా చావకపోతే బాపట్లకు పంపండి.\n\n* ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.\n\n* ఏపుట్టలో ఏ పామో? ఏ గుళ్ళో ఏ మహత్యమో.\n\n* ఏ పూజ తప్పినా పొట్ట[పూజ తప్పదు.\n\n* ఏబ్రాసికి పని ఎక్కువ, లోభికి ఖర్చెక్కువ.\n\n* ఏబ్రాసి పెళ్ళికెడుతూ ఉంటే ఏకులరాట్నం ఎదురయిందట.\n\n* ఏమండీ కరణం గారు గోతిలో పడ్డారే? అంటే, కాదు మషాకత్తు చేస్తున్నా అన్నాడట.\n\n* ఏమందలో కట్టినా మన మందలో ఈనితే సరి.\n\n* ఏమయ్యా మా వారు బాగున్నారా? అంటే, అమ్మా బాగానే ఉన్నారు; విత్తనాలు వడ్లు తింటున్నారు, దాపుడు బట్టలు కడుతున్నారు ఆన్నడట.\n\n* ఏమి అప్పాజీ అంటే కాలం కొద్ది రాయాజీ అన్నట్లు.\n\n* ఏమిచేసి బ్రతుకుతున్నావమ్మా? అంటే నోరుచేసుకు బ్రతుకుతున్నా బిడ్డా అన్నదిట.\n\n* ఏంచేస్తున్నావురా? అంటే ఒలకపోసి ఎత్తుకుంటున్నా అన్నట్లు.\n\n* ఏమిట్రా మేనమామ ముడ్డిలో కట్టె పెడతావు? అంటే, చిన్నాయన అనుకున్నాను అన్నడట.\n\n* ఏమిపెట్టుక తిన్నావు? అంటే, ఆకలెట్టుక తిన్నానందిట.\n\n* ఏమిరా వెఱ్ఱిమొగమా? అంటే, ఏమి చిన్నాయనా అన్నాడట.\n\n* ఏమి పోలిసెట్టి? అంటే, ఎప్పటి మొత్తుకోళ్ళే అన్నడట.\n\n* ఏమిరా కోటా? అంటే, ఎప్పటిదే ఆట అన్నడట.\n\n* ఏమీ ఎరుగనోడు ఏకాశిన చస్తే అన్నీ తెలిసినోడు అమావాశ్యనాడు చచ్చాడట.\n\n* ఏమీ ఎరుగని ఎల్లి పాయె, దొంతులేస్తే దొల్లిపోయె.\n\n* ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట.\n\n* ఏమీ తోచకపోతే ఎక్కిరించాడట.\n\n* ఏమీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట.\n\n* ఏమీ లేదంటగానీ ఎల్లుండి పెండ్లంట.\n\n* ఏమీ దొరకనమ్మకు ఏగాణి దొరికితే ఎందులో పెట్టనే ఎంకాయమ్మా అన్నదిట.\n\n* ఏమీలేనమ్మకు ఏడ్పులు శృంగారం.\n\n* ఏమీ లేనమ్మకు ఏతులు లావు, ఉన్నమ్మకు ఆశలు లావు (ఏతులు=ఎచ్చులు, డంబాలు).\n\n* ఏమీ లేనిదానికి ఏతులు లావు, స్వాములవారికి జడలు లావు.\n\n* ఏమే వాడి దగ్గర పడుకున్నావు? అంటే, అంత పెద్దమనిషి చెయ్యిపట్టుకుంటే కాదనే దెట్లా? అన్నదిట.\n\n* ఏమోయి నీకూతురలా తిరుగుతున్నది? అంటే, అలవాటుపడిన ముండను అట్లానే పోనీస్తూ అన్నాడట.\n\n* ఏమోయి సెట్టి ఏట్లో కొట్టుకుపోతున్నావు? అంటే గడ్డిమోపు అమ్మటానికి అన్నాడట.\n\n* ఏమోయి నారాయణా, విధవగమనా అంటే, అది చిన్ననాటి మాట ఊరుకో అన్నాడట. (వి=పక్షి, ధవుడు=భర్త, విధవగమన=పక్షిపై పయనించేవాడు, నారాయణుడు).\n\n* ఏ యీకలపక్షి ఆ గుంపులో చేరుతుంది.\n\n* ఏ ఎండ కా గొడుగు పట్టినట్లు.\n\n* ఏ రాజ్యానికి ఏ రాజో అన్నట్లు.\n\n* ఏ రాయి ఐతేనేమి పండ్లు ఊడగొట్టుకోవటానికి.\n\n* ఏరుక తినే వాడి వెంబడి గీరుక తినేవాడు పడ్డాడుట.\n\n* ఏరుకుని తినే పక్షికి ముక్కున ముల్లు విరిగినట్లు.\n\n* ఏరూరి వ్యవసాయం ఊండూరి వైద్యం.\n\n* ఏరువస్తే వాన వెలుస్తుంది.\n\n* ఏ రోటి దగ్గర ఆపాట పాడాలి.\n\n* ఏరు ఏడామడ లుండగానే చీరవిప్పి చంకనేట్టు కుందిట.\n\n* ఏరు నిండిపారినా పాత్రకు తగురీతి నీరువచ్చు.\n\n* ఏరుదాటి తెప్ప తగుల బెట్టినట్లు.\n\n* ఏరుదాటే వరకు ఎంకన్న, ఏరు దాటినాక సింగన్న.\n\n* ఏరు పోయిందే పోక, ఏలిక చెప్పిందే తీర్పు.\n\n* ఏలడానికి ఊళ్ళు లేకపోవుగానీ, ఎత్తుకతినడానికి (అడుక్కతినను)ఊళ్ళు లేవా?\n\n* ఏలి మీద గోరు మొలిచింది ఏంజేతు మొగుడా అన్నదట.\n\n* ఏలేటి పురుషునికి ఏడ్గురు భార్యలు.\n\n* ఏలేవానికి ఎద్దుపోతేనేమి? కాచేవానికి కన్ను పోతేనేమి?\n\n* ఏవాడ చిలుక ఆ వాడ పలుకు పలుకుతుంది.\n\n* ఏ వన్నె సులోచనం పెట్టుకుంటే ఆవన్నే కనిపించేది.\n\n* ఏ వేషం వచ్చినా దివిటివానికే చేటు. (వీధిభాగవతాలలో)\n\n**********:: ఐ ::**********\n\n* ఐదు శిఖలకంటే మూడు కొప్పులు చేరితేనే మోసం.\n\n* ఐశ్వర్యదేవత హలంలోనే ఉంది.\n\n* ఐశ్వర్యానికి అంతంలేదు, దారిద్ర్యానికి మొదలు లేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 863,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ఎ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* ఒంటరివాని పాటు ఇంటికి రాదు.\n\n* ఒంటి కంటే జంట మేలు.\n\n* ఒంటికి ఓర్వలేనమ్మ, రెంటికి ఓర్చునా?\n\n* ఒంటి చేతి దాహం, ఒకనాలి పొందు తనివి తీరవు.\n\n* ఒంటెలుకు పోతే రెండేళ్ళకు వచ్చిందట.\n\n* ఒంటేలుకు పోయి ఇంతసేపేమిటిరా అంటే రెండేళ్ళకు వచ్చింది అన్నడుట.\n\n* ఒక ఈగ బండి చక్రం మీదవాలి ' నేనెంతదుమ్ము రేగకొడుతున్నానబ్బా' అని మురిసిపోయిందట.\n\n* ఒక ఊరికాపు ఇంకొక ఊరి మాల.\n\n* ఒక ఊరి రాజు, ఇంకొక ఊరికి రైతు.\n\n* ఒక ఒరలో రెండు కత్తులిముడునా?\n\n* ఒక కంటిలో సున్నం, ఇంకో కంటిలో వెన్న.\n\n* ఒక కన్ను కన్నూ కాదు, ఒక కొడుకు కొడుకూ కాదు.\n\n* ఒక కల కనగానే తెల్లారుతుందా?\n\n* ఒక కొడుకు కొడుకూ కాదు, ఒక చెట్టు తోపూ కాదు.\n\n* ఒక చంట పాలు, ఒక చంట నెత్తురు.\n\n* ఒక చెంపకొడితే పాలు, ఇంకొక చెంప కొడితే తేనె.\n\n* ఒక చెయ్యి తట్టితే చప్పుడగునా?\n\n* ఒక చేత పసుపు, ఇంకోచేత ముసుగు.\n\n* ఒక చేతి వేళ్ళే ఇకలా ఉందవు.\n\n* ఒకటె దెబ్బతో రెండు కాయలు కొట్టినట్లు.\n\n* ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకొడిని చూస్తే మొట్టబుద్ధి.\n\n* ఒకడి పాటు, పదిమంది సాపాటు.\n\n* ఒకడు అగ్గిరాముడు, ఇంకొకడు మైరవణుడు.\n\n* ఒకడు అహిరాముడు, ఇంకొకడు మహిరావణుడు.\n\n* ఒకడు తిమి. ఇంకొకడు తిమింగలం.\n\n* ఒకడూ పినతల్లికి తప్పినవాడూ, ఇంకొకడు తల్లికి తప్పినవాడు.\n\n* ఇక తీగలాగితే పొదంతా కదిలినట్లు.\n\n* ఒక దొడ్డి గొడ్లు పొడుచుకోవా?\n\n* ఒకనాటి అదను, ఏడాది బ్రతుకు.\n\n* ఒకనాటి పెళ్ళికి ముఖమంతా కాటుక.\n\n* ఒకనాటి భోగం, ఆరునెలల రోగం.\n\n* ఒకనాటి విందు, మరునాటి కుందు (మందు).\n\n* ఒకనాటి వేషానికి (భోగతానికి) మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.\n\n* ఒకనాటి సుఖం ఆరునెలల కష్టం.\n\n* ఒకనాతి సుఖం, ఒక ఏటి కష్టం.\n\n* ఒకనాడు ధారణ, ఒకనాడు పారణ\n\n* ఒకని ఆలి, ఒకని కన్నతల్లి.\n\n* ఒకనికి ఇగురుకూర ఇష్టం, ఇంకొకనికి పులుపు కూర ఇష్టం.\n\n* ఒకని సంపాదన పదిమంది పాలు.\n\n* ఒక పాము చేత రెండుసార్లు కరిపించుకుంటామా?\n\n* ఒకపూట తిన్నమ్మ ఓర్చుకుంటే, ముప్పూట తిన్నమ్మ మూర్చ (శోష) పోయిందట.\n\n* ఒకరి అమృతం ఇంకొరికి హాలాహలం.\n\n* ఒకరి కలిమి ఇంకొకరి ఏడ్పుకు కారణం.\n\n* ఓకరి కలిమికి ఏడిస్తే ఒక కన్ను పోయింది, తనలేమికి ఏడిస్తే రెండో కన్ను పోయింది.\n\n* ఒకరితో ఊరు పావనం, ఒకరితో గౌరి పావనం.\n\n* ఒకరిదైతే ఓపినంత, తనదైతే తగరమంత.\n\n* ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడుకాడు.\n\n* ఒకరిని కోస్తే పాలు, ఇంకొకరిని కోస్తే నెత్తురు వస్తుందా?\n\n* ఒకరు ఏటికి తీస్తే, ఒకరు కాటికి తీసినట్లు.\n\n* ఒక వ్యక్తి క్రీనీడే ఒక సంస్థ.\n\n* ఒకూరికి వెయ్యి దోవలు.\n\n* ఒకే కోకిల వసంతాన్ని కొనిరాదు.\n\n* ఒకే చెప్పులజోడు అందరికీ సరిపోతుందా?\n\n* ఒకే తొడిమకు రెండు కాయలు.\n\n* ఒకే చెట్టుకాయలే ఒకలా ఉందవు.\n\n* ఒకే మద్దెలను చెరి కాసేపూ వాయించుకొన్నట్టు.\n\n* ఒకే మద్దెలను చెరిఒకప్రక్క వాయించుకొన్నట్లు.\n\n* ఒక్క గుడ్డు మురిగిపోగానే పొరుగు గుడ్లన్ని పాడగునా?\n\n* ఒకే కొడుకని వరికూడు పెడితే మీట్రిచ్చి మిండగాడయినాడట.\n\n* ఒక్కతే కూతురని వరి అన్నంపెడితే, మిద్దెనెక్కి మిండల పిలిచిందిట.\n\n* ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.\n\n* ఒక్క పుస్తె తెగితే వేయిపుస్తె లల్లాడతవి.\n\n* ఒక్క ప్రొద్దుమాట కుక్క ఎరుగునా?\n\n* ఒకరున్న దెవులాట, ఇద్దరున్న తన్నులాట.\n\n* ఒక్కక్క చినుకే వాన అవుతుంది.\n\n* ఒక్కక్క రాయి తీస్తుంటే కొండైనా తరుగుతుంది.\n\n* ఒగిచేవారే గానీ ఓదార్చే వారుండరు.\n\n* ఒజ్జలే కంకులతో కాలం గడుపుతూ ఉంటే శిశ్యులకు ఊచబియ్యమా?\n\n* ఒట్టుపోయి గట్టెక్కే, తానుపోయి చెట్టెక్కే.\n\n* ఒడిలో బెట్టుదునా? బడిలో బెట్టుదునా? అన్నట్లు.\n\n* ఒడుపుచేత కడుపు చేసికొన్నట్లు. (ఒడుపు=తొందరపాటు, లాఘవము).\n\n* ఒడ్డున నిలబడే సముద్రాన్ని పొగడాల.\n\n* ఒత్తిపలకవే వసనాభ్పిల్లి అంటే మ్రావ్ మ్రావ్ అన్నదిట.\n\n* ఒత్తు పొత్తును చెరచును.\n\n* ఒరపు కోరుస్తారుగానీ, తడుపుకోర్వరు.\n\n* ఒల్లని మగనికి తలంబ్రాలు పోసినట్లు.\n\n* ఒల్లని వనికి పెరుగులో రాయి.\n\n* ఒల్లీఒల్లని చుట్టం వచ్చాడు, ఉడుకే ఉలవపప్పా ఉగాదిదాకా.\n\n* ఒళ్ళంతా తడిసినవెనుక ఓపలేనివారికైనా చలిలేదు.\n\n* ఒళ్ళెరుగని శివము, మనసెరుగని కల్ల ఉందా?\n\n* ఒళ్ళుబలిసిన గంగానమ్మ పేడకుడుములు అడిగిందట.\n\n* ఒళ్ళు వంగనమ్మ కాలి మట్టెలకు కందిపోయిందట.\n\n* ఒళ్ళువంగని వాడు దొంగలతో కలిసినాడట.\n\n* ఒళ్ళో గింజలు ఉన్నా, వద్ద భార్య ఉన్నా ఊరుకో బుద్ధి కాదు.\n\n**********:: ఓ ::**********\n\n* ఓంకారములేని మంత్రం, అదికారములేని ప్రఙ్ఞ\n\n* ఓ కన్ను పువ్వుకన్ను ఇంకోకన్ను కాయకన్ను.\n\n* ' ఓ ' కు ఎన్ని వంకరలో తెలియని వానికే వయ్యారం.\n\n* ఓనామాలు రానివాడు వడ్డీలు (వడ్లు) గుణించినట్లు.\n\n* ఓగల ముసలిది దొంగనుకట్టుకు ఏడ్చిందట.\n\n* ఓగు కడుపున వజ్రం పుట్టినట్లు.\n\n* ఓగును ఓగే మెచ్చును, అఙ్ఙానిని అఙ్ఞానే మెచ్చును.\n\n* ఓటికుండలో నీరుపోసినట్లు.\n\n* ఓటికుండలోన ఉండునా నీరంబు.\n\n* ఓటి తెప్పను నమ్ముకొని నీట్లో దిగినట్లు.\n\n* ఓడేక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగగానే బోడిమల్లయ్య.\n\n* ఓడలు బండ్లవచ్చు, బండ్లు ఓడలవొచ్చు.\n\n* ఓడిన గుఱ్ఱం జీనుపై సొడ్డుబెట్టిందట.\n\n* ఓడుఓడు అంటే, కంచమంతా ఓడనట్లు.\n\n* ఓదార్చే కొద్ది ఏడ్చే బిడ్డవంటివి కష్టాలు.\n\n* ఓనామాలు చదివారేకానీ ఆనవాలు చూపించలేరు.\n\n* ఓనామాలే ఋక్కులు, ఒకరెండే లెక్కలు.\n\n* ఓవనివాడు కోరనిది, ఒల్లనివాడు ఆడనిది లేదు.\n\n* ఓవనివానికి ఒద్దన్నవారే తల్లితండ్రులు.\n\n* ఓవలేని అత్త, వంగలేని కోడలు.\n\n* ఓబీ! ఓబీ! నీవు వడ్లుదంచు నేను పక్కలెగరేస్తా అన్నట్లు.\n\n* ఓరీ రజక చక్రవర్తీ అంటే, ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా! మీకే ఉండనీయండి అన్నడట.\n\n* ఓర్చలేనమ్మ ఒడిని నిప్పులు కట్టుకుంటే, ఒడీ, దడీ కాలిందట.\n\n* ఓర్చలేని రెడ్డి ఉండీ చెఱచెను, చచ్చీ చెఱచెను.\n\n* ఓలి ఇచ్చిన మొగుడికంటే, కూలి ఇచ్చిన మొగుడెక్కువ (ఓలి=కన్యాశుల్కం).\n\n* ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, దొంతి కుండలన్ని పగులకొట్టినట్లు.\n\n* ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, నెలకు ముఫై కుండలు నీళ్ళాడుతాయి.\n\n**********:: ఔ ::**********\n\n* ఔననటానికి కాదనటానికి అత్తకధికారం గానీ, కోడలికేముంది?\n\n* ఔను-కాదు అనే మాటలెంత చిన్నవో, వాటిని అనటం అంత కష్టం.\n\n* ఔషధం కానిది అవనిలో లేదు.\n\n* ఔషధానికి అపధ్యానికి చెల్లు, రోగం పైపెచ్చు.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 864,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ఒ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* కంకణాల చెయ్యి ఆడితే, కడియాల చెయ్యీ ఆడుతుంది.\n\n* కంకి ఎఱ్ఱనయితే, కన్నెఱ్ఱనవుతుంది.\n\n* కంచం అమ్మి మట్టెలు (మెట్టెలు) చేయించినట్లు.\n\n* కంచం ఇచ్చి మెట్టె పెట్టించుకున్నా కానలేడు మొగుడు.\n\n* కంచం చెంబు బయటపారవేసి రాయి రప్ప లోన వేసుకునంట్లు.\n\n* కంచంత (కంచి+అంత) బలగమున్నా, కంచంలో కూడు వేసే దిక్కులేదు.\n\n* కంచం పొత్తేగానీ, మంచంపొత్తు లేదు.\n\n* కంచంలో కూడూ కుడువనే గానీ కాలదన్నను కాదు.\n\n* కంచరి దానింటి పిల్లలు తాటాకు చప్పుళ్ళకి బెదరరు.\n\n* కంచానికి ఒకడు, మంచానికి ఇద్దరు.\n\n* కంచి అంత కాపురం గడ్డలైనట్లు.\n\n* కంచి మేకకువలే కడుపెడు బిడ్డలు.\n\n* కంచిలో దొంగిలించేదానికి, కాళహస్తి నుంచి వంగిపోయినట్లు.\n\n* కంచు మట్టే, మంటిగాజు ఉంటే కావలిసినదేముంది?\n\n* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?\n\n* కంచువట్టల ఆడుది. (గయ్యాళి ఆడుది అనుట).\n\n* కంచె మంచిదికాకపోతే కొయ్య కొల్లబోతుంది.\n\n* కంచలేని చేను, కన్నతల్లి లేని బిడ్డవంటిది.\n\n* కంచ వేసినదే కమతము.\n\n* కంచే చేను మేస్తే, కాపేమి చేయగలడు?\n\n* కంటికి ఇంపైతే, కడుపుకూ ఇంపు.\n\n* కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగమన్నారు.\n\n* కంటికి రెప్పా, కాలికి చెప్పు.\n\n* కంటికి రెప్ప ఆసరా, పులికి మల (కొండ) ఆసర.\n\n* కంటి రెప్పలుపోయాక, కాటుక, పూలు ఉంటే ఏమాయె?\n\n* కంటివంటి ప్రకాశంలేదు, మంటివంటి ఆధారంలేదు.\n\n* కంటే సుంకం, కానకుంటే బింకం.\n\n* కండ్లు ఆర్చినమ్మ ఇండ్లు ఆర్చును.\n\n* కండ్లు ఉంటేనే కాటుక.\n\n* కండ్లు కావాలంటవి, కడుపు వద్దంటుంది.\n\n* కండ్లు చెడిపిన దేవుడు మతిని ఇచ్చినట్లు.\n\n* కండ్లు పెద్దవి, కడుపు చిన్నది.\n\n* కండ్లు పోగొట్టిన దేవుడు ఇండ్లు చూపక మానడు.\n\n* కండ్లు పోయినతరువాత సూర్యనమస్కారాలు.\n\n* కండ్లు మూయించవచ్చును గానీ, కలలు కనేటట్లు చేయగలమా?\n\n* కంతి (కణిత) బలుపు కాదు, చింత తిరిక గాదు.\n\n* కంతి తలగడకాదు, కల నిజంకాదు.\n\n* కందం చెప్పిన వాడు కవి, పందిని పొడిచినవాడు బంటు.\n\n* కందకు లేదు, చేమకు లేదు, తోటకూరకు దురద ఎందుకు?\n\n* కందకు లేని దురద కత్తిపీటకా?\n\n* కందకు లేని దూల చేమకెందుకు?\n\n* కందకు లేని నస బచ్చలికేల?\n\n* కందిగింజను, కాపువానిని వేచనిదే చవిగావు.\n\n* కందిచేల్లో కర్రు పోగొట్టుకొని, పప్పు పెట్టిలో వెతికినట్లు.\n\n* కంది పండితే కఱవు తీరును.\n\n* కందెన పెట్టనిదే పరమేశ్వరు బండియైనా పారదు.\n\n* కందెన వేయని బండికి కావలసినంత సంగీతం.\n\n* కంప తొడుగు ఈడ్చినట్టు.\n\n* కంపలో పడ్డ ఈగవలె.\n\n* కంపుచూడను పువ్వు నలుపవలెనా?\n\n* కంపునోటికి అల్లం పచ్చడా?\n\n* కంపునోటివాడు కూడబెడితే, మంచినోటివాడు మాయం చేసినట్లు.\n\n* కంపు పెట్టుకొని, గంపెడు తిన్నట్లు.\n\n* కంబళిలో తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.\n\n* కంబారీ పశువులుపోయినా, మారటతల్లికి బిడ్డలు పోయినా బాధలేదు.\n\n* కంభం చెరువు చూసి, దున్నపోతు ఆ నీళ్ళన్నీ తానేదున్నాలనుకొని గుండెపగిలి చచ్చిందట.\n\n* కంసాలివాని ఇంటికి వెళితే బంగారం అంతదుగానీ, కుమ్మరి వాని ఇంటికి వెళితే మాత్రం మట్టి అంటుకుంటుంది.\n\n* కంసాలి కూడు కాకులు కూడా ముట్టవు.\n\n* కంసాలి గోటు, కరణం తేటు.\n\n* కంసాలి పెళ్ళికి ఇల్లంతా పొయ్యిలే.\n\n* కంసాలి బఱ్ఱె నమ్ముతున్నాడు, లోపల లక్క లేకుండా చూడరా అన్నాడట.\n\n* కంసాలి మాయ కంసాలికి గానీ తెలియదు.\n\n* కంసాలి లేకుండా చూసి కధ చెప్పమన్నారు.\n\n* కంసాలి వద్దనైనా ఉండాలి, కుంపటిలోనైనా ఉండాలి (తగ్గిన బంగారం).\n\n* కంసాలి వారు కాలానికి పెళ్ళికొడుకులు, కరువుకు కాటిపీనుగలు.\n\n* కక్కదింటే (కక్కేదాకా తింటే) గారెలు చేదంట.\n\n* కక్కిన కుక్కవద్దకు, కన్న కుక్కవద్దకు కానివాణ్ణయినా పంపరాదు.\n\n* కక్కిన కూటికి ఆశించినట్లు.\n\n* కక్కిన బిడ్డ దక్కుతుంది.\n\n* కక్కూర్తి మొగుడు కడుపునొప్పి బాధ ఎరుగడు.\n\n* కక్కూర్తి పడ్డా కడుపు నిండాల.\n\n* కక్కూర్తి పడ్డా సుఖం దక్కాలి.\n\n* కచ్చితానికి కాసులు, ఉచితానికి ఊళ్ళు.\n\n* కటకట ఉన్న ఇంట కలిమి ఉండదు.\n\n* కటకటా అనే ఇంట కట్ట బట్టా, తిన తిండి ఉండవు.\n\n* కటికవానికి కత్తి అందించినట్లు.\n\n* కట్టకింద కఱ్ఱలాడితే, మాలదాని పిఱ్ఱ లాడుతాయి.\n\n* కట్టనిలువని చెరువు గడియలోపలనిండు, బ్రతుకలేని బిడ్డ బారెడుండు.\n\n* కట్టిన ఇంటికి వంకరలు (వణుకులు) చెప్పేవారు వెయ్యిమంది.\n\n* కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.\n\n* కట్టిన ఇంటికి కణుకులు మెండు.\n\n* కట్టినవానికొక ఇల్లైతే, అద్దెకున్నవాని కన్నీ ఇండ్లే.\n\n* కట్టిన వారు ఒకరైతే, కాపురం చేసేది ఇంకొకరు.\n\n* కట్టివేసిన బఱ్ఱెకు కావలి కాచినట్లు.\n\n* కట్టుకున్న ఆపే, పెట్టుకున్న ఆమే ఉండగా, ఎదురుపడ్డ ఆపె ఎండిపోయిందట.\n\n* కట్టుకున్న పెండ్లామే చేయవలె, కన్న తల్లే చెయవలె.\n\n* కట్టుకున్న మొగుడు, పెట్టెనున్న నగలు.\n\n* కట్టుకున్న వాడికంటే, పెట్టుకున్న వాడిమీదనే ప్రేమ.\n\n* కట్టుచీర లేనినాడు పట్టుచీర బయటకు వస్తుంది.\n\n* కట్టులేని ఊరు, గట్టులేని చెరువు.\n\n* కట్టె గొడ్డలిలో దూరి, కులానికి చేటు దెచ్చు.\n\n* కట్టె దేవుని దగ్గర, కన్ను లంజ పైన.\n\n* కట్టెలు ఆటని ఇంట్లో కనకము కూడా ఆటదు (ఆట= ఆగు, నిలుచు).\n\n* కట్టెలు తేరా తిమ్మా అంటే, కడుపునొస్తదే అమ్మా అన్నట్లు.\n\n* కట్టెలోన నగ్ని పుట్టిన విధమున.\n\n* కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.\n\n* కట్టేయస్వాహా, కంపాయస్వాహా, నీకూ నాకూ చెరి సగాయస్వాహా.\n\n* కట్టెలేదు, కంపలేదు, కాచీపోయా నీళ్ళూ లేవు, పదవోయి అల్లుడా బావి గట్టుకు.\n\n* కట్టేవాడు అవివేకి, ఇంట్లో బాడిగకు ఉండేవాడు వివేకి.\n\n* కట్టేవి కాషాయాలు దూరేవు దొమ్మరి గుడిశలు.\n\n* కఠినచిత్తు మనసు కరిగింపగారాదు.\n\n* కఠినమైనా కన్నతల్లి, వట్టిదైనా వరికూడు.\n\n* కడగా ఉన్న గొడ్డలిని కాలిమీద వేసుకున్నట్లు.\n\n* కడాగా పోయే శనేశ్వరుడా మా ఇంటిదాకా వచ్చి మరీ పొమ్మన్నట్టు.\n\n* కడచి బ్రతికిన దెవ్వరు?\n\n* కడచి బ్రతికినామని గంతులు వేయరాదు.\n\n* కడచినదానికి వగచిన లాభమేమి?\n\n* కడజాతికానీ, కాసులు కలవాడే రాజు.\n\n* కడపటి మడివాని కటారిపోటు కంటే, ఎదుటి మడివాని ఏకుపోటు మేలు.\n\n* కడలిలో ఉప్పుకు, అడవిలో ఉసిరికకు లోకువా?\n\n* కడవంత గుమ్మడికాయైనా, కత్తిపీటకు లోకువే.\n\n* కడవ వెళ్ళి కడముంతలో దూరినట్లు.\n\n* కడివెడు పాలకు ఒక్క మజ్జిగ బొట్టు.\n\n* కడ వేరు మిగిలినా గరిక చిగర్చక మానదు.\n\n* కడి అంటే నోరు తెరచి, కళ్ళెమంటే మూసినట్లు.\n\n* కడి గండం కాచును, వత్తి మిత్తి కాచును.\n\n* కడిగిన మొగముంటే ఎందుకైనా మంచిది.\n\n* కడియాలవారు వచ్చారు అంటే కడియాలు కావాలా అన్నడుట.\n\n* కడుగు తాగినవాని కడుపేమి నిండురా? (కడుగు=కుడితి, బియ్యం కడిగిన నీరు).\n\n* కడుగు త్రగిన కాకి కఱ్ఱని కూయదా?\n\n* కడుపా కళ్లేపల్లి చెరువా?\n\n* కడుపా కొల్లేరు మడుగా?\n\n* కడుపా చెరువా?\n\n* కడుపుకాలి ఏడుస్తుంటే, మనవర్తి ఏమిస్తావు అన్నదిట.\n\n* కడుపుకు పెట్టిందే కన్నతల్లి.\n\n* కడుపు కూటి కేడిస్తే, ఇంకొకత్తి కొప్పుపూల కేడ్చిందట.\n\n* కడుపు చించుకుంటే పేగులు కాళ్ళమీద పడును.\n\n* కడుపు చించుకున్నా గారడి విద్యే అన్నట్లు.\n\n* కడుపు చేసినవాడే కాయము, పిప్పళ్ళు తెస్తాడు (కాయము=తినబెట్టే మందు).\n\n* కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండినమ్మ తినక మానదు.\n\n* కడుపున పుట్టిన బిడ్ద- కొంగున కట్టిన రూక.\n\n* కడుపు నిండితే కడవలు మోయు, లేకపోతే పగులవేయు.\n\n* కడుపు నిండినవానికి గారెలు కనరు.\n\n* కడుపు రాతిలోని కప్పకు కలుగదా?\n\n* కడుపులో కాపాడినవాడు కాలాన కాపాడడా?\n\n* కడుపులో తిప్పందే కక్కొస్తుందా?\n\n* కడూపులో ఎట్లాఉంటే, కాపురమలా ఉంటుంది.\n\n* కడుపులో చల్ల కదలకుండా.\n\n* కడుపులో మంట కానరాని మంట.\n\n* కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా?\n\n* కడుపులో లేని ప్రేమ కావాలంటే వస్తుందా?\n\n* కడుపు వస్తే కనే తీరవలెను.\n\n* కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.\n\n* కతకు కాళ్ళు, ముంతకు చెవులు కల్పించినట్లు.\n\n* కలతమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పులకూటి మొగుడు అమ్ముకతిన్నాడు.\n\n* కత్తి తీసి కంపలో వేసి, ఏకుతీసి పొడుచుకుంటానన్నాడట.\n\n* కత్తిపీటకు పళ్ళు పులుస్తాయా?\n\n* కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.\n\n* కత్తిమీద సాము కడతేరబోదయా.\n\n* కత్తిమీద సాము కానివాడికైనా తగదు.\n\n* కత్తిమీది సాము, కొత్తి మీది కూడు.\n\n* కత్తి మెత్తన, అత్త మంచి లేదు.\n\n* కత్తు కలిస్తే పొత్తు కలుస్తుంది.\n\n* కత్తెరలో వాన కనకపు పంట. (కత్తెర= కృత్తిక కార్తె).\n\n* కత్తేస్తావా? బత్తేస్తావా? అన్నట్లు.\n\n* కథ అడ్డంగా తిరిగింది.\n\n* కథ కంచికి, మనమింటికి.\n\n* కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు.\n\n* కదళి మింగువాడు గరళంబు మ్రింగునా?\n\n* కదిపితే కందిరీగల తెట్టు.\n\n* కదిలిస్తే గచ్చపొద.\n\n* కదుటిలో పడదు, దిండులోనూ పడదు.\n\n* కదురు కవ్వము ఆడితే కఱవే లేదు.\n\n* కనక తరుణు లాసలేని సంసారులు కలలోనైనా కలరా?\n\n* కనపడినప్పుడల్లా దండాలు పెడతావెందుకు? అంటే చేతులు ఊరకే ఉండి ఏంచేస్తాయిలే అన్నడట.\n\n* కని గుడ్డి, విని చెవుడు.\n\n* కని పెంచినవాడు కాలుజారినట్లు.\n\n* కనిపెంచిన నాడు కొడుకులు గానీ, కోడాళ్ళు వచ్చాక కొడుకులా?\n\n* కనుక్కున్నానండోయ్ కంబట్లో వెంట్రుకలు అన్నట్లు.\n\n* కనుమనాడు కాకినైనా కదలనీయరు.\n\n* కనుమనాడు మినుము కొరకాల.\n\n* కనుమల మీద మెయులొస్తే, కళ్ళముందర వాన.\n\n* కనుమకు కాకర, భోగికి పొట్ల.\n\n* కనుమనాడు కాకి కూడా మునుగుతుంది.\n\n* కనుసైగకు రాని కాంతను బలిమిడి కరమిడ వశమగునా?\n\n* కన్నతల్లికి కడుపు కాలితే, పిన్న తల్లికి పిఱ్ఱ కాలిందట.\n\n* కన్నతల్లికైనా కనుమరుగుండాల.\n\n* కన్నపుదొంగ వాడలేదని ముంత ఇంటివానిని వదలి పోవునా?\n\n* కన్నామేగానీ, కడుపులోపెట్టుకొని ఉంటామా?\n\n* కన్నెఱికానికి కాసులేని ఆయన కలకాలం కాపాడుతాడా?\n\n* కన్నెనిచ్చిన వానిని, కన్నిచ్చినవానిని (దృష్టి, ఙ్ఞానము) కడవరకు మరువరాదు.\n\n* కన్నీరు కిందికి కారుతుంది, పన్నీరు పైకి చిమ్ముతుంది.\n\n* కన్ను ఉండా, కనుపాపను కొన్నట్లు.\n\n* కన్ను ఎరుగకున్నా, కడుపు ఎరుగుతుంది.\n\n* కన్ను ఎఱ్ఱబడ్డా, మిన్ను ఎఱ్ఱబడ్డా కారక మానదు.\n\n* కన్ను కైకలూరులో, కాపురం డోకిపఱ్ఱులో.\n\n* కన్ను గుడ్డిదైతే కడుపు గుడ్డిదా?\n\n* కన్ను గుడ్డిదైనా నిద్రకేంలోటు?\n\n* కన్నుచూసి కాటుక, పిఱ్ఱచూసి పీట.\n\n* కన్ను చూసినదాన్ని నమ్మితే, చెవి విన్నదాన్ని నమ్ముతుంది.\n\n* కన్ను పోయేటంత కాటుక పెట్టుకుంటారా?\n\n* కన్ను మనదే, వేలూ మనదే అని పొడుచుకుంటామా?\n\n* కన్నులు కంచాలమీద నోరు రామరామ\n\n* కన్నులు పెద్దవైతే కనుపాపలు పెద్దవవుతాయా?\n\n* కన్నేలపోయెనోయి కనకలింగమా? అంటే, చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నట్లు.\n\n* కన్నులెంత పెద్దవైనా కలిమే, చన్నులెంత పెద్దవైనా జవ్వనమే.\n\n* కన్ను వంటి ప్రకాశం లేదు, మన్నువంటి ఆధారం లేదు.\n\n* కన్నెరుగకున్న కడుపెరుగు.\n\n* కన్నొకటిలేదుగానీ (కా)కంతుడు కాడా?\n\n* కన్నొకటిలేదు గానీ కవాటంలాంటి బిడ్డ.\n\n* కన్యలో (కన్యామాసం=ఆశ్వయిజం) చల్లితే ఊదుకొని తినటానికి ఉండవు.\n\n* కన్యలో చల్లితే కనుగంతులకైనా చాలవు.\n\n* కపటము బయట దేవుడు, ఇంత దెయ్యము.\n\n* కప్ప కాతులేదు, బాపన పోటులేదు.\n\n* కప్ప కూతలు కూయు కాలభుజంగము.\n\n* కప్పలు అరుస్తూనే ఉంటవు, దరులేమో (గట్లు) పడుతూనే ఉంతవి.\n\n* కప్పలు ఎఱుగునా కడలిలోతు.\n\n* కప్పలు కూస్తే వర్షం కురిసినట్లు.\n\n* కప్పి పెట్టేస్తే కంపు కొట్టకుండా ఉంటుందా?\n\n* కప్పుర మిచ్చి ఉప్పు కొన్నట్లు.\n\n* కమలాసనుని కలహంసకు తూటికాడలే తిండి.\n\n* కమ్మ అండగాదు, తుమ్మ నీడకాదు.\n\n* కమ్మకు వరుసలేదు, కప్పకు తోకలేదు.\n\n* కమ్మ (కాపు) గుట్టు కడప దాటదు.\n\n* కమ్మని రోగాలు, తియ్యని మందులు.\n\n* కమ్మ నీచు కడిగినాపోదు, కాకిచిప్ప పెట్టి గోకినా పోదు.\n\n* కమ్మత్యాగంబు భువిలోన నమ్మకమ్మ.\n\n* కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు.\n\n* కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు.\n\n* కమ్మించి (ప్రోత్సాహించి) కడగా తొలిగేవాడు.\n\n* కమ్ముల దుప్పటికి కొమ్ముల బఱ్ఱె.\n\n* కయ్యానికైనా, వియ్యానికైనా, నెయ్యానికైనా సమత ఉండాలి.\n\n* కరక, తురక రెండూ భేదికారులే; ఒకటి లోపలికి పోవాలి; ఇంకొకటి దగ్గఱకు వస్తే చాలు.\n\n* కరక్కాయ కన్నతల్లి.\n\n* కరచీ కాటుబడనట్లు.\n\n* కరడి కాటు పడినవాడు కంబళి చూచినా భయపడును.\n\n* కరణం, కంసాలి కపటం మరువరు (విడువరు).\n\n* కరణం కాపు నా పక్కనుంటే, కొట్టరా మొగుడా, ఎట్లా కొడ్తావో-అన్నదట.\n\n* కరణం గంటమెత్తితే కంఠానికి రావాలిగానీ, లేకుంటే శంఠానికి రాదు.\n\n* కరణంతో కంటు, కాటికి పోయినా తప్పదు.\n\n* కరణంతో కంటు పడితే, కాడి కదలదు.\n\n* కరణం సాధుకాదు, కాకి తెలుపు కాదు.\n\n* కరణము గ్రామ దండుగ గోరు, జంబూకంబే వేళ శవము గోరు.\n\n* కరణముల ననుసరింపక విరసంబున తిన్నతిండి వికటించును.\n\n* కరణానికి కాపుకే జత, ఉలికి గూటానికే జత.\n\n* కరణానికి తిట్టుదోషం లేదు, చాకలికి ముట్టుదోషం లేదు.\n\n* కరణాన్నీ, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు.\n\n* కరణాలు కాపులు ఏకమయితే కాకులు కూడా ఎగురవు.\n\n* కరవగ వచ్చునే బలిమి గాడిదకున్ పులితోలు కప్పినన్.\n\n* కరవమంటే పామైనా కరవదు.\n\n* కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.\n\n* కరికి ప్రాణము తొండము, సిరికి ప్రాణాము మగువ.\n\n* కరి గుట్టులో కాలుపెట్టదు, అంబటిలో వేలు పెట్టదు.\n\n* కరిని గాంచిన కుక్క మొరిగిన సామ్యమౌ.\n\n* కరువు కాలంలో ఒల్లని మొగుడు, పంతకాలంలో పంపమని వచ్చాడట.\n\n* కరువుకు గ్రహణాలెక్కువ.\n\n* కరువుకు చింతలు, కాలానికి మామిళ్ళు.\n\n* కరువుకు తోడు ఆవపంట కలిగినట్లు.\n\n* కరువుకు దాసరులైతే, పదాలెక్కడ వస్తాయి?\n\n* కరువుకు మామిళ్ళు, కాలానికి నేరేళ్ళు.\n\n* కరువునాటి కష్టలుండవు కానీ, కష్టాలనాటి మాటలుంటాయి.\n\n* కరువులో అధిక మాసం.\n\n* కరువులో అరువు.\n\n* కరువులో బిడ్డను అమ్ముకొన్నట్లు.\n\n* కరువు వస్తుందని సద్ది కట్టిపెట్టినట్లు.\n\n* కర్మకంతం లేదు, కాలానికి నిశ్చయం లేదు.\n\n* కర్మ చండాలుని కంటే, జాతి చండాలుడు మేలు.\n\n* కర్మంగాలి మొగుణ్ణి కంబట్లో కట్టి, భుజం మీద వేసుకుంటే, జారి వీధిలో పడ్డట్టు.\n\n* కర్కాటకం బిందిస్తే కాటకం ఉండదు (కర్కాటక మాసం=శ్రావణం).\n\n* కర్కాటకం వర్షిస్తే, కాడిమోకు కూడా తడవదు.\n\n* కర్ణుడులేని భారతం, శొంఠిలేని కషాయం ఒక్కటే.\n\n* కర్ణుని తల భారత మన్నట్లు.\n\n* కర్ణునితో ఉందమ్మా భారతయుద్దం అంతా అన్నట్లు.\n\n* కర్ణునితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి.\n\n* కఱకుల కళ్ళెం కల్యాణికి కాక గాడిదకేల? (కల్యణి=పంచ కల్యణి, గుఱ్ఱం).\n\n* కఱిచే కుక్కకు కఱ్ఱ అడ్డం.\n\n* కఱిచేది చెఱుకు, పట్టేది అనుము.\n\n* కఱ్ఱకు పెట్టినా, గొఱ్ఱెకు పెట్టినా చెడదు.\n\n* కఱ్ఱ చేతలేనివాణ్ణి గొఱ్ఱెకూడా కఱుస్తుంది.\n\n* కఱ్ఱ విరగకుండా, పామూ చావకుండా కొట్టు.\n\n* కఱ్ఱికుక్క కపిలగోవు అవుతుందా?\n\n* కఱ్ఱు అరిగితేగాని, గరిసె విఱగదు.\n\n* కఱ్ఱు అరిగితేనే కాపు బ్రతుకు.\n\n* కఱ్ఱుగొట్టిన గంపెడు సూదులు.\n\n* కలక వేసిన చేప వలకు రాకుండాపోతుందా? (కలక వేయు=నీటిపై ఎగిరిపడు).\n\n* కలకాలం బ్రతికినా కాటికి పోక తప్పదు.\n\n* కలకాలం బ్రతికే బ్రతుకులు, కుడికాలు పెట్టవే కూతురా అన్నట్లు.\n\n* కలకాలపు దొంగ ఒకనాడు దొరకును.\n\n* కలగక ఆడుమాట లయకాలునినైనా శమింపచేయును.\n\n* కలగన్న చోటికి గంపనెత్తినట్లు.\n\n* కలబంద ఎండు, కోడలి కొత్త లేదు.\n\n* కలలో మూత్రం తాగినట్లు వస్తే, ఎవరితో చెప్పుకోను?\n\n* కలలో కనిపించిన లంకెబిందెలు రాకపోయినా, పెరికి పెరికి పరువంతా నీళ్ళచాయ మాత్రం అయ్యింది. (నీళ్ళచాయ=చేబొంట్లకు, దొడ్డికి).\n\n* కలలో కాంత నీటిలో నీడతో సమానం.\n\n* కలలో జరిగింది ఇలలో జరుగదు.\n\n* కలలోని కౌగిలికి కడుపులొస్తాయా?\n\n* కలలో భోగం కలతోనే సరి.\n\n* కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు.\n\n* కలిగింది తినేసి, కట్టుకున్నది విప్పేసి వెళ్ళమన్నట్లు.\n\n* కలిగి ఉంటేనే కామితఫలములు కలిగేది.\n\n* కలిగి ఉన్నవాడు రాజ్యాన్ని సున్నానికి తీసుకుంట అన్నట్లు.\n\n* కలిగి తిననేర నివ్వదు గంపకమ్మ.\n\n* కలిగితే కాళ్ళు ముయ్యా, లేకపోతే మోకాళ్ళు ముయ్యా.\n\n* కలిగినది చెపితే కంట్లో పుల్ల పెట్టినట్లు.\n\n* కలిగినమ్మ గాదె తీసేప్పటికి లేనివాని ప్రాణంపోయింది.\n\n* కలిగినమ్మ గాడిదతో పోతే అదొక వ్రతం, లేనమ్మ మొగుడితో పోతే మోహం (గుల).\n\n* కలిగినమ్మ ఱంకు, కాషాయ బొంకు.\n\n* కలిగిన మాత్రం తిని, కరణం గారి కమతం చేయమన్నట్లు.\n\n* కలిగినయ్య కలిగినవాడికే పెడతాడు, లేనయ్యా కలిగిన వారికే పెడతాడు.\n\n* కలిగినవానికి అందఱూ చుట్టాలే.\n\n* కలిగిన వారింట కడగొట్టు కోడలయే కంటే, పేదవారింట పెద్దకోడలయ్యేది మేలు.\n\n* కలిగిన వారి కోడలు కులుకు మానదు.\n\n* కలిగెరా కయ్యం, దింపరా గంప.\n\n* కలిపి కొట్టరా కావేటిరంగ (కస్తూరిరంగ).\n\n* కలిపోసి పెట్టినా ఉట్టివంకే చూపు.\n\n* కలిమి ఉన్నంతసేపు బలగం, కండ ఉన్నంతసేపు మిండడు.\n\n* కలిమికి పొంగరాదు, లేమికి కుంగరాదు.\n\n* కలిమి లేకుంటే కులం గవ్వ చేయదు.\n\n* కలిమి లేములు, కావడి కుండలు.\n\n* కలిమి వచ్చిన తలుపు మూసినట్లు.\n\n* కలిసివచ్చే కాలానికి నట్టింటికే కుందేలు వస్తుంది.\n\n* కలిసివచ్చే కాలానికి కుందేలు వంటింటికి వస్తుంది.\n\n* కలిసివచ్చే కాలానికి నడిచివచ్చే పిల్లలు (పుడతారు).\n\n* కలుపుతీతకు తిల్లిక కావలేనా? (తిల్లిక=దీపం).\n\n* కలిపు తీయని మడి, దేవుడులేని గుడి.\n\n* కలుపు తీయువాడు కోత కోయడు.\n\n* కలుపు తీయువానికి కసవే మిగులుతుంది.\n\n* కలుపు తీసేవాడు కండ్లకు రానీ, కోతకోసేవాడు గోటికి రానీ, అంతలో మా అమ్మ అంపమని రానీ! (ఆడపడుచు కోరిక).\n\n* కల్పతరువు క్రింద గచ్చ చెట్లున్నట్లు.\n\n* కల్పవృక్షం క్రింద గచ్చపొదలున్నట్లు.\n\n* కల్పవృక్షం దగ్గరకువెళ్ళి, కాయలడిగినట్లు.\n\n* కల్పవృక్ష్ మెంచి, కలివి చెట్లెంచుట.\n\n* కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు.\n\n* కల్యాణానికి ఒకడువస్తే, కన్నం వెసేదానికి ఇంకొకరు వస్తారు.\n\n* కల్లం దగ్గర కరణీకం, కంచందగ్గర రెడ్డిరికం.\n\n* కల్లాకపటం లేనివారికి కష్టలు తప్పవు.\n\n* కల్ల పసిడికి కాంతి మెండు.\n\n* కల్ల పడికి కఱకులు మెండు.\n\n* కల్లమున్న చోటికే కంకి పోవును.\n\n* కల్లరి నాలిక కోడెత్రాచు కోర వంటిది.\n\n* కల్లలాడి కడుపు పల్లము నింపుకొన నేల?\n\n* కల్లుకుండ కాడిదే కయ్యం, జుట్టు ఊడిపోయేదే దెయ్యం.\n\n* కల్లు లొట్టెడి త్రాగి కైపెక్కి వదరిన శాస్త్రవాది కాడు.\n\n* కల్లరికి మంచి ఙ్ఞాపక శక్తి అవసరం.\n\n* కల్తీ విత్తనం వెల్తీ గాదెలు.\n\n* కళాసు బ్రతుకు గాలివానతో సరి.\n\n* కళ్ళం (కల్లం) పళ్ళెం పెద్దవిగా ఉండాలి.\n\n* కళ్ళం వెళ్ళిన తరువాత కంది గుగ్గిళ్ళు.\n\n* కళ్ళుకానని పెళ్ళికూతురు, కమతగాని వెంటపోయిందట.\n\n* కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దంటుంది.\n\n* కళ్ళు రెండున్నా కనిపించే వస్తువొక్కటే.\n\n* కళ్ళూ కలిగినప్పుడే చళ్ళువస్తే, మదపుటేనుగును మంచానికి కట్టేద్దును, నీదాకా రానిద్దునా అన్నదట.\n\n* కవికి కంసాలికి సీసం తేలిక.\n\n* కవితకు మెప్పు, కాంతకు కొప్పు.\n\n* కవి యను నామంబు నీరుకాకికి లేదా?\n\n* కవిత నేర్పు యతి కూర్పే తెలుపుతుంది.\n\n* కవిత్వం గడ్డి అనుకొని గాడిదలన్నీ పడి మేయసాగినవట.\n\n* కవిలి (కలే) చెట్లు కాస్తే, కారు (రెండవ పైరు) వరి పండుతుంది.\n\n* కవిలి (కలే) చెట్లు పండితే కఱ(రు)వు తప్పదు.\n\n* కవ్వం కదురు తిరిగిన ఇంట కరువు లేదు.\n\n* కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగులబెట్టినట్లు.\n\n* కష్టపడి సుఖపడమన్నారు.\n\n* కష్టసంపాదనము, ఇష్టభోజనము.\n\n* కష్టాలు కలకాలం కాపురముండవు.\n\n* కష్టలు నిన్ను కష్టపెట్టేవరకు నీవుగా వాటిని కలయబెట్టకు.\n\n* కష్టలు మానవులకు కాక మానులకా?\n\n* కసవులేనుదే పశువులేదు, పశువులేనిదే పెంటలేదు, పెంటలేనిదే వంట లేదు.\n\n* కరువులో పనసకాయ తరిగినట్లు.\n\n* కసిపోనమ్మ మసిపూసుకున్నదట.\n\n* కసాయివాడికి కత్తి అందించినట్లు.\n\n* కసువుకు పోరా కమ్మా అంటే, కడుపునొప్పే నా అమ్మా; బొచ్చె ఎత్తుకరా బొమ్మ అంటే అట్లా చెప్పవే నా యత్తా అన్నాడుట.\n\n* కస్తూరీ నలుపే, తెలకపిండీ నలుపే.\n\n**********:: కా ::**********\n\n* కాంచనం కర్మ విమోచనం.\n\n* కాంతల భ్రమలు కనుగట్టు మాయలు.\n\n* కాంతా కనకం కాశ్యపులే కయ్యాలకు మూలం. (కాశ్యపి=భూమి)\n\n* కాకరకాయకు కంతలు (గంట్లు) ఎన్ని? అంటే, ములగ కాయకు ముండ్లెన్నీ? అన్నాడట.\n\n* కాకరబీకర కాకు జాతారే? అంటే దూబగుంటకు దూదేకను జాతారే అన్నాడట ఇంకో దూదేకుల సాహేబు. (ఉరుదు వచ్చిరాని దూదేకులవారి సంభాషణ).\n\n* కాకి కఱ్ఱుమన్న కడుపాయె వదినా; కత్తవ బావికి పోతే కరిగిపోయె వదినా! (కత్తవ = ఏటికి కట్టిన అడ్డకొమ్మ (కట్ట)).\n\n* కాకి కఱ్ఱుమంటే, మొగుణ్ణి అప్పా అనెనట.\n\n* కాకి కావుమంటే, మొగుణ్ణి కౌగిలించుకొన్నట్లు.\n\n* కాకికి కంకెడులేదు, పిట్టకు పిడికెడులేదు.\n\n* కాకికూత బోలు కర్మ బంధుల కూత.\n\n* కాకి కూయగాలేచి, కాటుకమాదిరి అన్నం కాకరకాయ మిరియం చేసి, పసువులొచ్చే వేళకు పరుగెత్తి పరుగెత్తి వడ్డించిందట.\n\n* కాకి గూటిలో కోకిలపిల్ల వలె.\n\n* కాకి గూడు పెడితే కడపటి వర్షం.\n\n* కాకి చిక్కిన గొడ్డు డొక్కచీల్చునుగానీ, బలిసిన వసరం పొంత పోగలదా?\n\n* కాకిని కొడితే గద్ద చచ్చిందట.\n\n* కాకినితెచ్చి పంజరంలో పెడితే చిలుకపలుకు పలుకుతుందా?\n\n* కాకిపిల్ల కాకికి ముద్దు.\n\n* కాకిముక్కున దొండపండు వలె.\n\n* కాకి ముక్కెర తన్నుకొనిపోయి డొంకలపాల్చేయుగానీ తినగలదా?\n\n* కాకి సోమాల కుతురు-అంకమ్మకళల అల్లుడు (కాకిసోమాలు=వెఱ్ఱిచేష్టలు; అంకమ్మకళలు=అవ్యక్త చేష్టలు).\n\n* కాకులు అరుస్తూనే ఉంటవి, కరవాడ ఎండుతూనే ఉంటుంది. (కరవాడ=ఉప్పు పట్టించి ఎండపెట్టిన ఉప్పునీటి చేప).\n\n* కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు.\n\n* కాకుల మధ్య కోకిల.\n\n* కాకులు రోకళ్ళెత్తుకు పోయినవి అన్నట్లు.\n\n* కాకై కలకాలం ఉండేకంటే, హంసై ఆరునెలలున్నా చాలు.\n\n* కాగల కార్యం గంధర్వులే తిరుస్తారు.\n\n* కాచిన చెట్టుకు కఱకు రాళ్ళు.\n\n* కాచినచెట్టుకే కఱ్ఱదెబ్బలు.\n\n* కాచినగంజి తాగనిస్తే నేను కమ్మనాయుడనే (కాపు) నే కాదు అన్నాడట.\n\n* కాటికి కాళ్ళుజాచి, తిండికి చేతులు జాచినట్లు.\n\n* కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.\n\n* కాటిపోయినా కాసు తప్పదు.\n\n* కాటికి పోయిన పీనుగు, కట్టెలపాల్గాక ఇంటికి వస్తుందా?\n\n* కాటి దగ్గఱి మాటలు కూటిదగ్గర ఉండవు.\n\n* కాతిలో పండినవి, కాకులు తిన్నవి-ఒకటి.\n\n* కాడికిందకి వచ్చిన గొడ్డు, చేతికిందకు వచ్చిన బిడ్డ.\n\n* కాడిన పోట్లలో కత్తితో గీకినట్లు. (కాడిన=గుచ్చుకొనిన, తెగిన)\n\n* కాడు కాలుతూ ఉంటే, కన్నె ఎదుగుతూ ఉంటుంది.\n\n* కాదు అంటే కళ తక్కువ, అవును అంటే ఆయుస్సెక్కువ.\n\n* కాదు అన్నవాడే కరణం.\n\n* కాదు కాదు అంటే, నాది నాది అన్నడట.\n\n* కాదనకుండా కట్టెనిచ్చెను గానీ వినబడకుండ వీరణాలు వాయించగలవా?\n\n* కానకుండ మాట్లాడే మాటా, కడగని గుద్ద ఒకటే.\n\n* కానని ముఖానికి గంధము అక్షతలు.\n\n* కానవచ్చే కొండలను గట్టెక్కి చూడటం ఎందుకు?\n\n* కాని కాలాన ఆలే పెండ్లం (వ్యంగ్యం).\n\n* కాని కాలానికి కంది అయినా కాయదు.\n\n* కాని కాలానికి కఱ్ఱే పామై కాటేస్తుంది.\n\n* కానికాలానికి పైబట్టను పక్షులెత్తుకు పోతాయి.\n\n* కానీకి టెంకాయ ఇస్తారని కాశీకి పోయినట్లు.\n\n* కానిచోట కందైనా కాయదు.\n\n* కాని దానికి కంతలు మెండు.\n\n* కానిపనులు సేయ ఘనులాస పడుదురా?\n\n* కానిదానికి కష్టం మెండు, చెల్లని కాసుకు గీతలు మెండు.\n\n* కానివాడు లేనివానితో జత.\n\n* కానివేళకు కందులే గుగ్గిళయినట్లు. (వ్యంగ్యం).\n\n* కానుగ నీడ-కన్నతల్లి నీడ\n\n* కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు.\n\n* కానుపుతో కూడా తల్లి చేసినట్లు.\n\n* కాపుకు నెనరు (విశ్వాసం) లేదు, కందికి చమురు లేదు.\n\n* కాపు చేసిన పాపం కళ్ళంతో తీరుతుంది.\n\n* కాపు జాడ, గొఱ్ఱె జాడ.\n\n* కాపుతోనే కఱువూ వచ్చింది.\n\n* కాపు మంత్రులలో కటేరిదైవము. (కటేరి=క్షుద్రదేవత).\n\n* కాపురం ఎట్లచేసావే కమ్మతిమ్మక్కా? అంటే, నువ్వు చెప్పినట్లు చేస్తినే బొచ్చుతిమ్మక్క అందట.\n\n* కాపురం గుట్టు, రోగం రట్టు.\n\n* కాపురం చేసే కళ, కాలుతొక్కేటప్పుడే కనపడుతుంది.\n\n* కాపరానికి కడగండ్లు, మొగనికి రేజీకట్లు.\n\n* కాపుల కష్టం భూపుల సంపద.\n\n* కాపుల చదువులు కాసులు నష్టం, బాపల సేద్యం భత్యం నష్టం.\n\n* కాపుల జాతకాలు కరణాలకెరుక.\n\n* కాపువాడి పస కావడి పంటే చెపుతుంది (పంటి=మట్టికుండ).\n\n* కాపువాళ్ళింట్లో పందిటి గుంజలుకూడా పనిబెట్టుతారు.\n\n* కామము కాలమెరుగదు.\n\n* కామమ్మ మొగుడంటె కామోసు అనుకున్నాను, కాకుంటే కావడి కుండలు పడేయండి.\n\n* కామరాజు గాదెలు, భీమరాజు పాదులు.\n\n* కామాతురాణాం న భయం న లజ్జా.\n\n* కామాతురుడు అర్ధకాంక్ష వీడడు.\n\n* కామానికి కళ్ళు లేవు, గుడీసేటికి గుణం లేదు (గుడిసేటి=లంజ, దేవదాసి).\n\n* కామిగాక మోక్షకామి గాడు.\n\n* కామినీ వేషధారికి సాధ్వి నడతలేమి తెలియును?\n\n* కామిరెడ్డి అనే భూతానికి, రామిరెడ్డి అనే రక్షరేఖ.\n\n* కామెర్ల రోగికి కనబడేదంతా పచ్చనే.\n\n* కాయ కొడవలి నీ చేతికిచ్చినా, నీ ఇష్టంవచ్చినట్లు చేసుకో.\n\n* కాయతిన్నా కంపే, గడ్డి తిన్నా కంపే.\n\n* కాయని కడుపు-కాయని చెట్టు.\n\n* కాయలో పత్తి కాయలో ఉండగానే-కామన్న కారు మూళ్ళు, నాకు మూడు మూళ్ళు (గుడ్డ).\n\n* కారణం లేక కార్యం పుట్టదు.\n\n* కారణం లేని కార్యం, పూరణం లేని బూరి, వీరణం లేని పెండ్లి ఉండవు (వీరణం=వాద్యవిశేషం).\n\n* కారణ గుణమ్ము కలుగదా కార్యమునకు?\n\n* కారములేని కూర, ఉపకారము లేని మనుష్యుడు.\n\n* కారాకు వలే కర్మం కాలిపోతుంది. (కారాకు=పండుటాకు).\n\n* కారాని కాలానికి రారాని పాట్లు.\n\n* కారాని కాలానికి కప్ప దెయ్యమవుతుంది.\n\n* కార్చిచ్చుకు గాడ్పు తోడయినట్లు.\n\n* కారుజొన్న మేసే కోడెకు కైలాసం కావాలా?\n\n* కారువరికి గొఱ్ఱెలమంద, పిషాణాలకు రొట్ట ఎరువు.\n\n* కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి.\n\n* కార్యం నాడు తలవంచుకొని, కలకాలం తలెత్తుకొని తిరుగ వచ్చు.\n\n* కార్తీకం కలకాశ, వైశాఖం పులకాశ.\n\n* కార్తీకం రానీ, కమ్మలు కడియాలు చేయిస్తానన్నాడట వైద్యుడు.\n\n* కార్తీకంలో కలవారి అమ్మాయి, కడవనీళ్ళు తెచ్చే పొద్దుకూడా ఉండదు.\n\n* కార్తీక పున్నానికి కలకపంతలు.\n\n* కార్తీక మాసానికి కాకులు తొక్కుతాయి.\n\n* కార్తీక మాసాన్న కడవలు కడుగ పొద్దుండదు.\n\n* కార్తీక మాసానికి కుదురంత ఉందునా, మాఘమాసానికి నా మహిమ చూపిస్తాను.\n\n* కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదిరినా (వదరినా) చెడుతుంది.\n\n* కార్తెమూల మెరుపు కార్తెకు బలం (కార్తెమూల= ఈశాన్యము, కృత్తిక నక్షత్రపు దిక్కు).\n\n* కార్తెమూల మబ్బు కారక మానదు.\n\n* కాలంతో కరవులేదు, మగనితో దరిద్రంలేదు.\n\n* కాలం కర్మం కలిసి రాకుంటే, కమలబాంధవునికైనా కష్టలు తప్పవు.\n\n* కాలం కానప్పుడు, ఆలే తేలై కరుస్తుంది.\n\n* కాలం గడచిపోవును, మాట నిలిచిపోవును.\n\n* కాలం తప్పినవాడిని పై (మీద) బట్టే పామై కరుస్తుంది.\n\n* కాలం తీరిందంటే, పమిటచెంగే పామై కరుస్తుంది.\n\n* కాలం నాటి కందిగింజ, పెద్దలనాటి పెసరగింజ.\n\n* కాలం పోతుంది, మాట నిలుస్తుంది.\n\n* కాలం మారి కంచు పెంకైనట్లు.\n\n* కాలం మూడిన వ్యక్తికి కాశీకిపోయినా సేగితప్పదు.\n\n* కాలంలో విత్తనాలు కలలోనైనా చల్లాలి.\n\n* కాలం వస్తే, గాడిదకాళ్ళు తిన్నన.\n\n* కాల కర్మగతుల కనిపెట్టవలెనయా.\n\n* కాలక్షేపంలేకపోతే, కంచిమేకను కొనుక్కోమన్నారు.\n\n* కాలతంతే పెరిగేది పుచ్చకాయ, కుళ్ళేది గుమ్మడీకాయ.\n\n* కాలను పాతకొయ్య, తాగను పాతకల్లు, నమ్మను పాత స్నేహితుడు, చదవను పాత పుస్తకాలు శ్రేష్టములు.\n\n* కాలమందు చేస్తే దేవతలకు ప్రీతి, అకాలమందు చేస్తే అసురులకు ప్రీతి; ఇద్దరివాతా మన్నుకొడతాను అన్నట్లు.\n\n* కాలమా ? యాలమా? కడకు చూడె పెళ్ళామా?\n\n* కాలమొక్కరీతి గడిపినవాడే గడచి బ్రతికినవాడు.\n\n* కాలానికి కడగండ్లు, దేశానికి (ముప్పు) తిప్పలు.\n\n* కాలికి చుట్టుకున్న పాము కఱవక మానదు.\n\n* కాలికి దూరమైతే కంటికి దూరమా?\n\n* కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.\n\n* కాలికి బలపం కట్టుకొని కడప ముగ్గులు పెడతాడు.\n\n* కాలికి రాని చెప్పును కంచెలో వేయమన్నారు.\n\n* కాలికి రాని చెప్పు కడగా ఉంచు.\n\n* కాలికోసం చెప్పులు ఒళ్ళో పెట్టుకోవాలి?\n\n* కాలినట్టి మ్రాకు కడురమ్యమై ఉండును.\n\n* కాలితో కదుపుకోవటం, చేతితో జుఱ్ఱుకోవడం.\n\n* కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగానీ, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా?\n\n* కాలిది తీసి నెత్తికి రాసుకున్నట్లు.\n\n* కాలిన గుడిసెకు పీకిన వాసమే లాభం.\n\n* కాలిన మన్నూ,కాలని మన్నూ అంటవు (అతకవు).\n\n* కాలి మెట్లు తలకెక్కినట్లు.\n\n* కాలి కడుగ ముంత లేదు, కల్లుకు కళాయి గిన్నె.\n\n* కాలికాలిన పిల్లి వలె (తిరుగాడుట).\n\n* కాలూ చెయ్యీ ఉన్నంతకాలం కాలం గడుస్తుంది.\n\n* కాలు జారితే గంగానమ్మదే మహిమ - అన్నట్లు.\n\n* కాలి జారితే తీసుకోగలం కానీ నోరుజారితే తిసుకోగలమా?\n\n* కాలి జారితే పడి, నేల అచ్చివచ్చిందికాదు అన్నట్లు.\n\n* కాలు జారినా మాట సాగినా పడమన్నారు.\n\n* కాలు జారితే పట్టుకోవచ్చును గానీ మాటజారితే పట్టుకోగలమా?\n\n* కాలు తొక్కినవేళ, కంకణం కట్టినవేళ.\n\n* కాలు తొక్కిన మొగుడేనుగంత, కనిపెంచని బిడ్డ బారెడంత.\n\n* కాలు పట్టుకొని లాగితే చూరు పట్టుకొని వ్రేలాడినట్లు.\n\n* కాలు వంగిన కానీ గంగానమ్మయినా పట్టదు.\n\n* కాలువ దాటలేని వాడు కడలి దాటగలడా?\n\n* కాలు విరిగిన ఎద్దే గట్టెక్కితే, కొమ్ము విరిగిన ఎద్దెక్కదా?\n\n* కాలే కడుపుకు మండే గంజి.\n\n* కాల్చిన పందికొక్కులకు కొట్లాట పెట్టేవాడు.\n\n* కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.\n\n* కాళ్ళకు చుట్టుకొన్న పాము కరవక మానునా?\n\n* కాళ్ళకు మొక్కేవాడుపోయి, కంఠాన్ని పట్టుకునేవాడు వచ్చినట్లు.\n\n* కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం, కాశీకి పోయినా దొరకదు.\n\n* కావడీ ఎన్ని వంకలు తిరిగితేనే? ఇల్లు చేరితే సరి.\n\n* కాశీకి పోగానే కఱ్ఱి కుక్క గంగిగోవు అవుతుందా?\n\n* కాశీకి పోయి కుక్కపిల్లను తెచ్చినట్లు.\n\n* కాశీకిపోయి కొంగరెట్ట తెచ్చినట్లు.\n\n* కాశికి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే.\n\n* కాశికి పోయినా కర్మం తప్పలేదు.\n\n* కాశికి పోయినా కావడి బరువు తప్పలేదు.\n\n* కాశికి పోయి వచ్చింది మొదలుకొని, కామిశెట్టి ఒక్కడే గుద్దకడీగేది మావూళ్ళొ అన్నాడట.\n\n* కాశిలో కన్ను మూసినా రాని పుణ్యం, కాళహస్తిలో కాలు పెడితే వస్తుంది.\n\n* కాశిలో కాసుకొక లంజ.\n\n* కాశిలో బెండను వదిలినాడుగానీ, ముండను వదలలేదు.\n\n* కాశివాసులైనా కానలేరు మోక్షంబు.\n\n* కాసిచ్చేదే గొప్ప కలిలో రాజులకు.\n\n* కాసీ పూసే చింతా, గన్నారపు సంత, నీళ్ళకడవముంత, నిద్రకేమి పుచ్చుకుంటావే?\n\n* కాసుకు కాలెత్తే దానికి కాశీయాత్ర కావలెనా?\n\n* కాసుకు గతిలేదు, కోటికి కొడి ఎత్తినాడు. (కొడి=పతాకము).\n\n* కాసుగలమ్మ కట్టవిప్పా, వీసంగలమ్మ విడవా మడవా.\n\n* కాసు గొడ్డుకు రూక బందె.\n\n* కాసును వెతుకగా రత్నము గన్న రీతి.\n\n* కాసుకు మూతినాకబోతే మూడు నూర్ల ముంగర పోయిందట.\n\n* కాసులకును దిరుగ కలుగునా మోక్షంబు.\n\n* కాసులేనివాడు కడు బ్రహ్మచారియౌ.\n\n**********:: కి ::**********\n\n* కించిత్తు నల్లి గరచిన మంచమునకు పెట్లు వచ్చు.\n\n* కింద ఒకబొంత, మీద ఒకబొంత, నాకేమి చింత?\n\n* కింద పడినా మీసాలకు మన్ను కాలేదన్నట్లు.\n\n* కిందపడ్డా, పీటికి మన్ను కాలేదు (పీట=వీపు)\n\n* కిందపెట్టిన పంటలుండవు, పైన పెట్టిన వానలుండవు.\n\n* కిందబెట్టిన పంటెలుండవు, పైన పెట్టిన బానలుండవు.\n\n* కింద పడ్డా, పైచేయి నాదే అన్నట్లు.\n\n* కింద మట్ట రాలుతుంటే, పైమట్ట నానవేస్తుంది.\n\n* కిఱ్ఱులో కిఱ్ఱు కలిస్తే కంపేడకు పోతుంది?\n\n**********:: కీ ::**********\n\n* కీలెంచి మేలెంచవలెను.\n\n* కీర్తిమార్గం కాటికే దారిచూపును.\n\n* కీలూడిన యంత్రం-తొండములేని ఏనుగు.\n\n* కీలెఱిగి వాత పెట్టలి.\n\n**********:: కు ::**********\n\n* కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు (తల్లికి).\n\n* కుంచంలో కుదుళ్ళు పోసినట్లు.\n\n* కుంచాలమ్మ కూడువేస్తే, మంచాలమ్మ మాయం చేసిందట.\n\n* కుంచెడుంటే కుడికొప్పు, అడ్డెడుంటే ఎడమకొప్పు.\n\n* కుంచెడు గింజలకు కూలిపోతే, తూమెడు గింజలు దూడలు తినిపోయినవట.\n\n* కుంచెడున్నమ్మకు కూర్కు పట్టదు.\n\n* కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చినట్లు.\n\n* కూంజరాశి ఉన్న గుహ ప్రవేశించునే, సత్యహీనమైన జంబూకంబు?\n\n* కుంటి ఎద్దు రానిదే దూలమెత్తరు.\n\n* కుంటికులాసం, ఇంటికి మోసం.\n\n* కుంటి గాడిదకు జారిందే సాకు.\n\n* కుంటి గుఱ్ఱానికి జారిందే సాకు.\n\n* కుంటి గుఱ్ఱాలు, తోలు కత్తులు.\n\n* కుంటివానికి కుయుక్తులెక్కువ.\n\n* కుంటి వాని తిప్పలు కుంటివానికి, గూనివాని తిప్పలు గూనివానికి.\n\n* కుంటివాని పారుపత్తెము ఇంటి ముందఱే.\n\n* కుంటి సాకులు-కొంటె మాటలు.\n\n* కుంటోడైనా ఇంటోడు మేలు.\n\n* కుండ ఎప్పుడు వేఱో, కుదురు అప్పుడే వేఱు.\n\n* కుండమార్పు మనువులు కూడైనావస్తవి, కుమ్మయినా అవుతవి.\n\n* కుండను మూయను మూకుడున్నది గానీ, లోకుల నోరు మూయనేమున్నది?\n\n* కుండల దుమ్మును రోకళ్ళతో దులిపినట్లు.\n\n* కుండలు, చేటలు లేవని వండుకతినటం మానుకుంటామా?\n\n* కుండలు దాచినా, కండలు దాచలేము.\n\n* కుండలోకి కూడూ, గుదములోకి గూటాము తా తెచ్చుకుంటేనే గానీ రావు.\n\n* కుండలో కూడుంటే, ముండకు నిద్ర రాదు.\n\n* కుండలో కూడు కదలకుండా ఉండాల, బిడ్డలు మాత్రం పెరగాల.\n\n* కుండలో కూడుమాత్రం కుండలో ఉండాల, బిడ్డ గుండ్రాయి మాదిరి కావాల.\n\n* కుండలో గుఱ్ఱాలు తోలినట్లు.\n\n* కుండలో మెతుకులన్ని పట్టిచూడవలెనా?\n\n* కుండలో లేనిది నా సిండలోనుండి తెచ్చిపెట్టనా అన్నదిట.\n\n* కుండవెళ్ళి బిందెకు తగిలినా, బిందె వచ్చి కుండకు తగిలినా కుండకే మోసం.\n\n* కుండ వేరైతే, కులం వేరా?\n\n* కుందేటి కొమ్ము సాధించినట్లు.\n\n* కుందేలు దొరికే వేళకు కుక్కకు బయటికి వచ్చిందట.\n\n* కుందేళ్ళతో గూడా పరుగెత్తి, కుక్కలతో గూడా వేటాడినట్లు.\n\n* కుంపట్లో తామర మొలచినట్లు.\n\n* కుంభకర్ణుని నోటికి అరకాసు మజ్జిగా?\n\n* కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదకదా?\n\n* కుక్క అతిమూత్రవ్యాధి, బంధువైరం లేకుంటే, గంటకు ఆమడదూరం పోతాఅన్నదిట (చూచినదాని మీదంతా కాలెత్తి ఉచ్చపోస్తు, కనబడ్డకుక్కలతో కలహిస్తూ పోతుంటుంది).\n\n* కుమ్మ ఉట్టిచెర్లు తెంచగలదుకానీ, పాలకుండ పడకుండా పట్టగలదా?\n\n* కుక్క ఎక్కలేక కాదు చచ్చేది, పెరుక్కోలేక.\n\n* కుక్క గోవుకాదు, కుందేలు పులి కాదు.\n\n* కుక్క కాటుకు చెప్పుదెబ్బ.\n\n* కుక్కకు ఏమితెలుసు మొక్కజొన్న రుచి.\n\n* కుక్కకు ఏవేషం వేసినా మొరగక మానదు.\n\n* కుక్కకు కూడా కలిసివచ్చే కాలం ఉంటుంది.\n\n* కుక్కకు కూడు వేస్తే కూటికుండకు ముప్పు.\n\n* కుక్కకు జలతారు టోపీ పెట్టినట్లు.\n\n* కుక్కకు నెయ్యికూడు పెట్టడం, చెడ్డజాతికి విద్య చెప్పినట్లు.\n\n* కుక్కకున్న గుణము గురునకు లేదయా.\n\n* కుక్కకు పులితోలు కప్పగానే కరవనేరుస్తుందా?\n\n* కుక్కకు పుట్టేదంతా గొక్కిరిపండ్లే.\n\n* కుక్కకు పెత్తనమిస్తే కుండలు కెలకదా?\n\n* కుక్కకు పెత్తనమిస్తే చెప్పులన్ని కొరికి పెట్టిందట.\n\n* కుక్క చింపిన విస్తరైనట్లు.\n\n* కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే.\n\n* కుక్క కూయనేమి గుఱ్ఱమునకు లెక్క.\n\n* కుక్కతోక గట్ట కుదురునా చక్కగా.\n\n* కుక్కతోక వంకర తీర్చలేని వారు, ఏటివంకల తీర్చగలరా?\n\n* కుక్కతోక పట్తుకొని గోదారి ఈదినట్లు (దాటినట్లు).\n\n* కుక్కదానం పట్టి అయినా కుటుంబాన్ని పోషించాలి.\n\n* కుక్కను అమ్మితే డబ్బు మొరుగుతుందా?\n\n* కుక్కని ఎక్కితే సుఖమూ లేదు, కూలబడీతే దుఃఖము (నష్టమూ) లేదు.\n\n* కుక్కను కొట్ట బచ్చనకోల కావలెనా?\n\n* కుక్కను తెచ్చి అందలంలో కూర్చోబెడితే, కుచ్చులన్ని తెగకొరికిందట.\n\n* కుక్కను గుఱ్ఱం వలె సాకి దొంగవస్తే రెడ్డే మొరిగినాడంట.\n\n* కుక్కను పెంచితే గండాయె, కూటికుండకు చేటాయె.\n\n* కుక్కను పందివలే పెంచి, దొంగవస్తే ఆలుమగలే మొరిగినారట.\n\n* కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినా వెనకటి గుణం మానదు.\n\n* కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.\n\n* కుక్కనోటికి టెంకాయ అబ్బునా?\n\n* కుక్కపైన గొంగళి వేయగానే గంగిరెద్దు అవుతుందా?\n\n* కుక్క బతుకు-నక్క చావు.\n\n* కుక్క బలిస్తే గోనెలు మోస్తుందా?\n\n* కుక్కబుద్ది దాలికుంటలో ఉన్నంతసేపే.\n\n* కుక్క ముట్టిన కుండ అక్కఱకు వస్తుందా?\n\n* కుక్క మొరిగితే జంగం పరపతి పోతుందా?\n\n* కుక్క అరుపు ఊరిదారి చూపితే, నక్క అరుపు కాటి దారి చూపుతుంది.\n\n* కుక్కల రంది ఏమిటంటే, చిత్తాకర్తె పెట్టిందేమో చూడు అన్నాడట.\n\n* కుక్కలకు కులం పంచాయతా?\n\n* కుక్కలు ఏకులు వడికితే, గుఱ్ఱాలు చీరలు కడతాయి.\n\n* కుక్కలూ కుక్కలూ పోట్లాడుకొని, కూట్లో దుమ్ముపోసుకున్నాయట.\n\n* కుక్కలు చెప్పులు వెదుకును, నక్కలు బొక్కలు వెతుకును, తక్కిన నా లంజాకొడుకు తప్పే వెదకున్.\n\n* కుక్కలు మొరుగుతూనే ఉంటవి, సాతు (బిడారు) సాగిపోతూనే ఉంటుంది.\n\n* కుక్కవంటి మనసు కూర్చుండనిచ్చునా?\n\n* కుక్కవస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు.\n\n* కుక్క సంతకు పోయి వచ్చినట్లు (కొనదు-అమ్మదు).\n\n* కుక్క సింహమగునే గోదావరికి బోవ.\n\n* కుక్క స్వారీకి కుచ్చుల జీనా?\n\n* కుక్కి చక్రమే (బండి) గోల చేసేది.\n\n* కుచ్చి (గ్రుచ్చి) కుదుటిలో పెడితే, విచ్చికొని వీధిలోకి వచ్చినట్లు.\n\n* కుచ్చెలక్రింద త్రాచువలె (కుచ్చెల=పేర్చిన పిడకల గుట్ట, పావడ).\n\n* కుజనుడౌ వైద్యండు ప్రజకు రోగము గోరు, సామాన్య విప్రుండు చావు గొరు.\n\n* కుటులమానవులకు గుణమేల కలుగురా.\n\n* కుట్టని రవిక చేతిలో ఉన్నాసరె, ఏలని మొగుడు ఊరిలో ఉన్నా సరె.\n\n* కుట్టికుట్టి గుంజాగానికి దుప్పటి నేయించినట్లు.\n\n* కుడితే తేలు, కుట్టకుంటే కుమ్మరి పురుగు.\n\n* కుట్టిన ఏడు కుట్టెండ, మరోఏడు మట్టెండ, మూడో ఏడు మొదలెండె.\n\n* కుట్టిన చెవికి బుడగలు లేవు, మధ్యాహ్నం సద్దికి ఉప్పులేదు.\n\n* కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినమ్మ కుక్కముండ.\n\n* కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినముండ రాళుగాయి ముండ.\n\n* కుట్టిన తేలు గోడకెక్కె, కూసులంజ రచ్చకెక్కె.\n\n* కుట్టినమ్మ కుదుట్లో ఉంటే, కూసినమ్మ గయ్యాళి.\n\n* కుట్టేవాడికి కుడి తట్టు, చీదేవాడికి ఎడమతట్టు ఉండరాదు.\n\n* కుట్టేవారు చెవులు కుడీతే నొప్పెట్టవు.\n\n* కుడికన్ను కుదేయ్యటం, ఎడమకన్ను ఎగురేయటం.\n\n* కుడికాలు పెడితే కుల క్షయం, ఎడమకాలు పెడితే వంశ క్షయం.\n\n* కుడిచి కూర్చుని గుదంలోకి మేకు తెచ్చుకున్నట్లు.\n\n* కుడిచెయ్యి చేసే దానం ఎడమచెయ్యి ఎఱుగరాదు.\n\n* కుడీచేతికున్న మన్నన ఎడమచెయ్యి కేది?\n\n* కుడి చేతితో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లు.\n\n* కుడితి కుండలో (తొట్టిలో) పడ్డ ఎలుకవలె.\n\n* కుడితి పులుపే బఱ్ఱె బలుపు.\n\n* కుడితి మరుగు బఱ్ఱె కూసిన చేపునా?\n\n* కుడితి మరుగు బఱ్ఱె విడినీరు త్రాగునా?\n\n* కుడుపు మంచిదైనా కడుపు మంచిది కాదు.\n\n* కుడుము చేతికిస్తే పండుగనే వాడు. (అల్పసంతోషి)\n\n* కుడుము మింగేవానికి అప్పడాలొక లెక్కా?\n\n* కుడుములు వండని ఆడుదీ, కూనిరాగం తీయని మగవాడూ ఉండరు.\n\n* కుడువబెట్ట కంచ మారడి గొనినట్లు.\n\n* కుడువబోతూ కూరల రుచి అడగడమెందుకు?\n\n* కుడువబోతూ కూరాకు రుచి అడిగినట్లు.\n\n* కుడువ మంటే, పొడవ వచ్చినట్లు.\n\n* కుత్సితునకు నేల గురు దేవతా భక్తి.\n\n* కుదిర్చినదే వైద్యం, మాన్పినదే మందు.\n\n* కుదిరెకు గుర్రమంటే, పూనెకు పుఱ్ఱమన్నాడట(కుదిరై=తమిళంలో గుఱ్ఱం).\n\n* కుదువ సొమ్ముకు కొంత హాని.\n\n* కుదురు (కుదుట) పడ్డ కాపురం కూలగొట్టకపోతే నీకు ఱంకు మొగుడినే కాదన్నాడట.\n\n* కనప్పండగనాడు కంచంలో ఎముక ఘల్లుమంటే కాశీలో గంట మ్రోగించినంత పుణ్యం.\n\n* కునికిపాట్లు పడేవానికి కూలబడి తన్నేవాడే తండ్రి.\n\n* కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకొన్నట్లు.\n\n* కుప్ప పీకే దొంగ పరిగ ఏరుకొనేవానిని బెదిరించినట్లు.\n\n* కుప్పపై పండుకొని ఉప్పరిగా కలగన్నట్లు.\n\n* కుప్పలో కేడిగింజ, కులంలో కులాల కోడలు.\n\n* కుప్పలో ధాన్యమున్నట్లు.\n\n* కుప్ప విత్తనాలు-చప్పనారు.\n\n* కుమ్మక్కు నాది, ఫజీతు నీది. (ఫజీతు=అవమానము).\n\n* కుమ్మరపురుగుకు మన్ను ఒంటబట్టునా?\n\n* కుమ్మర వీధిలో కుండలమ్మినట్లు.\n\n* కుమ్మరావంలో గచ్చకాయ వేసినట్లు.\n\n* కుమ్మరావంలో రాగిముంతలేరగలమా?\n\n* కుమ్మరికి ఒక ఏడు, గుదియకు ఒకఏటు (దెబ్బ).\n\n* కుమ్మరికి కుండ కఱవా? కమ్మరికి తెడ్డు కఱవా?\n\n* కుమ్మరికి కుండ కఱవు, సాలెకు బట్ట కఱవు ఉండునా?\n\n* కుమ్మరికి కుండల కఱవు, మాదిగకు చెప్పుల కఱవు ఉండవు.\n\n* కుమ్మరిలేకుండా కుండ పుట్టునా?\n\n* కుమ్మరివారి కోడలు ఆవం దగ్గరైనా కనుపించదా?\n\n* కుమ్మరివారింటి కోడలు ఆవంకట్టకు రాకుండా ఎక్కడీకిపోతుంది?\n\n* కుమ్మకాదా కూతురా? అంటే ముసలి మొగుడే అమ్మా అన్నదిట.\n\n* కుమ్ము చెప్పుకొనేదానికి గూడూరుపోతే, ఏడూళ్ళ కుమ్ము ఎదురుగా వచ్చిందట.\n\n* కుమ్మెతక్క పూలుగుచ్చితే, కురిమెళ్ళ కామాక్షమ్మ కులికి వస్తుంది.\n\n* కుమ్మేమిటే కూతురా? అంటే, అవ్వకు ఱంకుమొగుడే అన్నదిట.\n\n* కురవోళ్ళ పిల్ల బాయిలో పడితే ఎలిగోళ్ళ పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చిందట (కురవళ్ళ పిల్ల=గొల్ల కురవజాతి పిల్ల).\n\n* కురూపి పొత్తు కంటే, సురూపి తిట్టు మేలు.\n\n* కురూపీ ఏంచేస్తున్నావంటే, సురూపాల వెక్కిరిస్తున్నాను అన్నట్లు.\n\n* కుఱ్ఱవాడి గుణగణాలు తెలుసుగానీ, చెవులకమ్మల సంగతి మాత్రం తెలీదు అన్నట్లు.\n\n* కులం కన్నా గుణం ప్రధానం.\n\n* కులం కొద్ది గుణం.\n\n* కులంగాదు, తలంగాదు, కురవోళ్ళపిల్ల దెయ్యమై పట్టిందట.\n\n* కులంలో ఒద్దికుండి, నిరుడురోగం లేకుంటే, కుక్క ఆమడదూరం పోయివస్తా అన్నదిట.\n\n* కులటబిడ్డ కొడూకగునా? మెఱపు దీపమగునా?\n\n* కులనాశకుడైన కొడుకు దీర్ఘాయువైన నేమి లేకున్న నేమి?\n\n* కులమింతి కోతి అయినా మేలు.\n\n* కులముకన్నా నెన్న కలిమి ప్రధానంబు.\n\n* కులము కాదు, స్ఠలము కాదు, కుమ్మరివారిపిల్ల కోరి దెయ్యమై పట్టిందట.\n\n* కులము చెడ్డా సుఖం దక్కవలె.\n\n* కులము చెఱిచేవారే గానీ కూడు పెట్టేవారు లేరు.\n\n* కులము తక్కువ వాడు కూటికి ముందు.\n\n* కులము తక్కువదానికి నీటు (టెక్కులు) ఎక్కువ.\n\n* కులము తప్పిన వాడు బంతికి ముందు, కూరగాయలవాడు సంతకు ముందు.\n\n* కులము వాళ్ళను చూస్తే కుక్కకు కోపం గుఱ్ఱానికి సంతోషం (కుక్క మొరుగుతుంది, గుఱ్ఱం సకిలిస్తుంది).\n\n* కులమెఱిగి కోడలినీ, ఆణెమెరిగి ఆవును తీసుకోవాలి (ఆణెము=మంచి జాతి).\n\n* కులమెఱిగి చుట్టము స్ఠలమెఱిగి వాసము.\n\n* కులవిద్యకు సాటిరావు గువ్వల చెన్నా.\n\n* కులహీనం ఐనా వరహీనం కారాదు.\n\n* కులానికి ఇంత అంటే, తలా గోరంత అన్నట్లు.\n\n* కులానికి కులం తెగులు. నీటికి పాచి తెగులు.\n\n* కులానికి సొడ్డు అంటే, చిన్నప్పుడే వేఱుపడ్డాను అన్నట్లు.\n\n* కులికే దాన్ని ఒలికిలో పెడితే, ఒలికంతా చెడ కులికిందట.\n\n* కుళ్ళి కుళ్ళి కాయనష్టి, కాలి కాలి కట్టెనష్టి.\n\n* కుళ్ళుబోతువాడు గుడిసె కడితే, కూలినదాకా ఒకటే పోరు.\n\n* కుళ్ళుముండకి అల్లంపచ్చడి అన్నట్లు.\n\n* కుళ్ళేవాని ముందు గునిసినట్లు.\n\n* కుళ్ళేవాళ్ళ ముందే కులకమన్నారు.\n\n* కుసివెళ్ళి గొడ్డలిలో దూరి కులానికే చేటు తెచ్చినట్లు.\n\n**********:: కూ ::**********\n\n* కూకున్న కూతురు కూలిపోయింది, చేసిన కోడలు చేవదేలింది.\n\n* కూచం ఇంటికి బరువైతే, మీసం రోషానికి బరువౌతుందా?\n\n* కూచమ్మ కూడబెడితే, మాచమ్మ మాయం చేసిందట.\n\n* కూచిపూడి దొంగతనానికి కఱ్ఱ చెప్పులు కావలెనా?\n\n* కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే.\n\n* కూచుంటే లేవలేడు, కూరకట్టలమ్మ లేడు, కొట్టొస్తాడమ్మా! నాకు నవ్వొస్తాది.\n\n* కూచుంటే లేవలేడు, కూరకచట్టి దించలేడు, మా బావ కొట్టొస్తాడే! నాకు నవ్వొస్తాదే.\n\n* కూటికి గతిలేదుకానీ కుంటెనలకు ముత్యాలు.\n\n* కూటికి గింజలు, పనికి కొరముట్లు లేక చేసే సేద్యం రోత.\n\n* కూటికి జరిగితే కోటికి జరిగినట్లు.\n\n* కూటికి తక్కువైతే కులానికి తక్కువా?\n\n* కూటికి పేదైతే కులానికి పేదా?\n\n* కూటికియ్యని విటకాని పోటు మెండు.\n\n* కూటికి లేకున్నా కాటుక చుక్క మానదు.\n\n* కూటికి లేని నాబట్టా, గుడ్డకులేని నా బిడ్డ వెంటబడ్డావా?\n\n* కూటికుంటే కోటికున్నట్లు.\n\n* కూటికుండ కుక్క ముట్టినట్లు.\n\n* కూటిపేద తోడు పోగొట్టుకుంటాడు.\n\n* కూటిమీదా ఆశ, మీసం మీదా ఆశ.\n\n* కూటిలోని రాయి తీయలేనివాడు ఏటిలోని రాయి తియ్యగలడా?\n\n* కూడబెట్టినవాడు కుడువ నేర్చునా?\n\n* కూడబెట్టిన సొమ్ము కుడూవను రాదు.\n\n* కూడలి కాపురం కుతకుతలు, వేరడి కాపురం వెతవెతలు.\n\n* కూడా తిని కులమెంచినట్లు.\n\n* కూడినకొద్దీ కుండలమ్ముకొని తినినట్లు.\n\n* కూడి యాడెడువాడె పో గోవిందుడు.\n\n* కూడుండగానే కులాలవాళ్ళ కుడిపైట మారదు.\n\n* కూడు ఐతే కద్దుగానీ కులస్థులకు వెరచి వచ్చినాను.\n\n* కూడు ఉంటే కులగోత్రాలెందుకు?\n\n* కూడు ఉడకలేదని కుండట్టుక కొట్టాడట.\n\n* కూడు ఉడీకిన వెనుక పొయ్యి మండును, కులం చెడ్డవెనుక బుద్ధి వచ్చును.\n\n* కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ (కువ్వాడం=ఓర్వలేనితనం).\n\n* కూడు ఒల్లనమ్మను కఱవేమి చేస్తుంది?\n\n* కూడు గుడ్డ తానుగోరునా దైవంబు.\n\n* కూడు కలుగగానే కులం మరచిపోతారు.\n\n* కూడు గుండెకాయ, మెతుకు మేనమామ.\n\n* కూడు చీర లేని చోటు కొరగానిది.\n\n* కూడు పారవేసి కొప్పెర నాకినట్లు.\n\n* కూడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, నామీద ప్రాణమే అన్నట్లు.\n\n* కూడు పెట్టినామెను తొడవిందు అడిగినట్లు.\n\n* కూడులేక కూరదిన్న ఆకలి తీరునా?\n\n* కూడు లేనమ్మకు గుడ్డలేని వాడు జత పడ్డట్లు.\n\n* కూడు వండని ఆడది, మంచం అల్లని మగవాడూ ఉండరు.\n\n* కూడూవండుట గంజి కొరకా?\n\n* కూడు వేడైతే కూరాకు నంజినట్లు.\n\n* కూడూ, గుడ్డా అడక్కపోతే, బిడ్డని సాకినట్లు సాకుతా అన్నాడట.\n\n* కూడేకూడే కాపురం తియ్యకపోతే నీ ఱంకు మొగుణ్ణి కాదన్నాడట.\n\n* కూతలార్భాటమే కానీ కుప్పలో ఇత్తులు లేవు.\n\n* కూతును గుత్తరూకలమ్మేవాడు అల్లునికి అరణమిచ్చునా?\n\n* కూతురికి దొరికేదంతా కుళాయి మిండగాళ్ళే.\n\n* కూతురుకి మంగళవారం, శుక్రవారం కోడలికి దివ్వెలు దివ్వెలు.\n\n* కూతురి పురుడు కుండల్లో, కోడలి పురుడు కొందల్లో.\n\n* కూతురు అని కుంచడిస్తే, కన్న తల్లి అని కంచెడు పెట్టిందట.\n\n* కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.\n\n* కూతురు చెడితే తప్పు తల్లిది.\n\n* కూతురు బిడ్డవని కోరితెచ్చుకుంటే కానే కొరివైనావా నా మనమరాలా?\n\n* కూతుళ్ళ కన్నమ్మకు కుర్చీపీటలు, కొడుకులు కన్నమ్మకు గోడపంచలు.\n\n* కూతుళ్ళుకన్నమ్మ కుశలేసులలో, కొడుకులు కన్నమ్మ లబ్బీసులో.\n\n* కూనపులికి లేడి దేటా?\n\n* కూనలమ్మ సంగీతం వింటే పుణ్యమూలేదు, వినకపోతే పాపమూ లేదు.\n\n* కూనలు కూటికేడుస్తుంటే, అవ్వ ఱంకు మొగుడికేడ్చిందట.\n\n* కూర ఎంతైనా కూడు కాదు.\n\n* కూరకుండ మొదలుంటే, కూసుముండైనా చేస్తుంది కాపురం.\n\n* కూరకు తాళింపు, చీరకు జాడింపు.\n\n* కూరగాయలు చెడిపోయినవంటే, బఱ్ఱెలకు వేయమన్నాడట, అవి తినవంటే, పిలిచి బ్రాహ్మడి కివ్వమన్నాడట.\n\n* కూరలేని తిండి కుక్క తిండి.\n\n* కూరలో కసవేరినట్లు.\n\n* కూరిమి కలిగిన దినములలో నేరములెన్నడును కలుగ నేరవు.\n\n* కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు.\n\n* కూర్చుంటే కుంటి, లేస్తే లేడి.\n\n* కూర్చుంటే కుక్కైనా కఱవదు.\n\n* కూర్చుండి కూర వందలేను, వంగుండి తీర్ధం వస్తాను అన్నట్లు.\n\n* కూర్చుండి చేసినపాపం గుడి కట్టినా పోదు.\n\n* కూర్చుండి తింటూ ఉంటే కొండయినా కరిగిపోతుంది.\n\n* కూర్చుండి తింటే, గుళ్ళుగోపురాలు ఆగవు.\n\n* కూర్చుండి లేవలేని వాడు, ఎగసి తాటికాయ తంతానంటాడు.\n\n* కూర్చుండి లేవలేనమ్మ వంగుని శివరాత్రికి వస్తానన్నదిట.\n\n* కూర్చున్నవానికి కుప్పలు, తిరిగిన వానికి తిప్పలు.\n\n* కూర్చోమంటే గుద్దకు, తినమంటే నోటికి తెగులు.\n\n* కూలబడీన కుండా కుదురుట అరుదయా.\n\n* కూటికి ఏడిస్తే కొలుకులు తడౌతవా?\n\n* కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు.\n\n* కూలి కుండకు రాదు, ఱంకు పన్నుకు రాదు.\n\n* కూలి కూటికి రాదు, లేకి చేతికి రాడు.\n\n* కూలి చేస్తే కుండకాలె, లేకుంటే పొట్టకాలె.\n\n* కూలికి వచ్చినవాడు పనిగొనక మానునా?\n\n* కూలిబంటు కొక మాలబంటు, మాలబంటు కొక మద్దెలకాడు.\n\n* కూలీనాలీ చేసి కుదురాల ఉండక, మొగుణ్ణి కట్టుకొని సగమై పోతినే అందిట.\n\n* కూలివాడి ప్రొద్దా, క్రుంకవే పొద్దా.\n\n* కూశమ్మ కూడబెడితే మాశమ్మ మాయం చేసిందట.\n\n* కూసుముండ నొరు కుట్టిపెట్టితే అయ్యవారా ఏం టెంకాయకు పసుపు పూయలేదు అన్నదిట.\n\n* కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెఱచిందట (చెఱచినట్లు).\n\n* కూసీకూసీ గుంటనక్క గూదెల్లి చచ్చిందట.\n\n**********:: కృ ::**********\n\n* కృతఘ్నత ప్రతిదేశంలో ప్రతివాతావరణంలో మొలిచే కలుపుమొక్క.\n\n* కృతమెఱుంగని వానికి మిత్రద్రోహ మెంత?\n\n* కృత్తికలో కుతికె పిసుకుడు.\n\n* కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు.\n\n**********:: కె ::**********\n\n* కెంపు నేనెఱుగనా? (కుంపటివలె) కోతికివలె రెండు కొమ్ములుండు.v\n\n**********:: కై ::**********\n\n* కైకపుట్టి చెరచెగా రాము(ని) పట్టంబు.\n\n**********:: కొ ::**********\n\n* కొంగ కన్నులు మూసుకోగానే దేవతల ధ్యానమగునా?\n\n* కొంగకొక చెఱువనీ లేదు, కోమటికొక ఊరనీ లేదు.\n\n* కొంగ జపము చేపల కొఱకే.\n\n* కొంగలు గుమికూడి కొరకవా బోదెలు.\n\n* కొంగ వంటి ధ్యానముచే తన కోర్కెలు నెరవేరునా?\n\n* కొంగు తగిలినా కొంత మేలే.\n\n* కొంగు తాకితే కోటివరహాలు.\n\n* కొంచెమైనను పంచి కుడువ మేలు.\n\n* కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే ఏంచలి?\n\n* కొంగు తడీస్తే వగకానీ, కోకంతా తడిస్తే వగపేమి?\n\n* కొంటిమి, తింటిమి, కోలాటమెందుకు?\n\n* కొంటే రానిది కొసరితే వస్తుందా?\n\n* కొండంత తనతప్పు గోరంత, గోరంత ఒరుతప్పు కొండంత.\n\n* కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు.\n\n* కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?\n\n* కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టగలమా?\n\n* కొండంత దేవునికి గోరంత బెల్లం నైవేద్యం.\n\n* కొండంత మదపుటెనుగకి తొండము లేకపోతే జంత్రము కీలూడినట్లు.\n\n* కొండంత రాగంతీసి పిచ్చికుంట్ల పాట పాడినట్లు.\n\n* కొండంత రెడ్డి కొంగుపట్టుకుంటే లేదనేదెట్లా అన్నదిట.\n\n* కొండంత మొగుడేపోగా పిడికెడు బొచ్చుకెందుకు ఏడ్పు?\n\n* కొండ అద్దమందు కొంచమై ఉండదా?\n\n* కొండ ఎక్కేవాని ముడ్డీలో కొడవలి చెక్కినట్లు.\n\n* కొండ ఎక్కేవాని ముడ్డిలో (గుద్దలో) కొడవలి చెక్కి వచ్చేటప్పుడు పచ్చిగడ్డి తెమ్మన్నట్లు.\n\n* కొండకు కట్టెలు, కోనేటికి నీళ్ళు మోసినట్లు.\n\n* కొండకింద మెరక, తూము కింద మెరక మంచిది.\n\n* కొండకు వెంట్రుక ముడీవేస్తే, వస్తే కొండే వస్తుంది, పోతే వెంట్రుకే పోతుంది.\n\n* కొండతో తగరు ఢీ కొన్నట్లు.\n\n* కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక కాస్తా ఊడి (ఊడ్చుకొని) పోయిందట.\n\n* కొండను చదరపెట్టి, ఉలవ చల్లినట్లు.\n\n* కొండను తలకింద పెట్టుకొని రాళ్ళను వెతికినట్లు.\n\n* కొండను తవ్వి ఎలకను పట్టినట్లు.\n\n* కొండమంగలి గొరిగినట్లు.\n\n* కొండలు మింగేవానికి గోపురాలడ్డమా? గుడి మింగేవానికి లింగమడ్డమా?\n\n* కొండమిరపకాయ కారం జాస్తీ, పొట్టివానికి బుద్దులు జాస్తి.\n\n* కొండమీద గోల ఏమంటే కోమట్ల గుసగుసలన్నట్లు.\n\n* కొందమీంచి పడ్డవానికి గాయాలెన్ని- అన్నట్లు.\n\n* కొండమీదికి భక్ష్యాలకి పోతే కొండకింద పాయసం పోయిందట.\n\n* కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు.\n\n* కొండలు పడ్డ కొన్నాళ్ళకి కోనలూ పడూను.\n\n* కొండలు పిండి కొట్టినట్లు.\n\n* కొండవలేవచ్చి మంచువలే తేలినట్లు.\n\n* కొండవలే వచ్చి బెండువలే తేలినట్లు.\n\n* కొండవీటి చేంతాడు.\n\n* కొండవీటి దండుముండా, కుండలిటు తేవే.\n\n* కొండీ! కొండీ ! కుండలిటు తేవే అంటే, చస్తి నీ కాళ్ళకు మొక్కుతా, దీపమిటుతే అందిట.\n\n* కొండూరు జంగాలు, తరుణాయి సన్నాసులు.\n\n* కోండ్రను నమ్మిన వారికి కొదువలేదు.\n\n* కొందరిని కొంతకాలం ఏమార్చవచ్చునుగానీ, అందరినీ అంతకాలమూ ఏమార్చలేము.\n\n* కొంప అంటుకపోతూ ఉంటే నీళ్ళబాన నిప్పు దగ్గర పెట్టిందట.\n\n* కొంపచెరుపకురా సుపుత్రా!\n\n* కొక్కిరాయీ! కొక్కిరాయీ ! ఎందుకు పుట్టావే ? అంటే చక్కని వాళ్ళని వెక్కిరించటానికి అన్నదట.\n\n* కొక్కిరాయుళ్ళలో కొంగ ఘనము.\n\n* కొక్కొరొక్కో అనగానే తెల్లవారినట్లా?\n\n* కొక్కు బోనులోన చిక్కి చచ్చినరీతి.\n\n* కొట్టకముందే ఏడుస్తావేంటే? అంటే, ముందు కొట్టబోతావని ఏడుస్తున్నా అన్నట్లు.\n\n* కొట్టావద్దు తిట్టావద్దు వట్టలు పిసికితే వాడే చస్తాడు.\n\n* కొట్టినా వంగని కొడుకు, తిప్పినా తిరగని మీసం.\n\n* కొడితే కొట్టాడు కానీ కొత్త కోక పెట్టాడు.\n\n* కొడుకు ఏడ్చిన ఏడ్పుకు అబ్బ బందరాకు మోయలేక చచ్చాడుట.\n\n* కొడుకు కలిగినంత కులముద్దరించునా?\n\n* కొడుకు పెళ్ళిసంగతి యోచించేప్పుడు మనమళ్ళ మనవర్తి సంగతిగూడా మనసులో పెట్టుకోవాల.\n\n* కొడూకు బాగుండాల (చల్లంగుండాల) కోడలు ముండమోయాల.\n\n* కొడుకు బిడ్డకు, కూతురు బిడ్డకు తాత ఒకడే.\n\n* కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?\n\n* కొడుకు మర్మం కన్నతల్లి కెరుకగాక, అడవిలోతిరిగే అయ్యకేమి తెలుసు?\n\n* కొడుకు ముద్దు, కోడలు మొద్దు.\n\n* కొత్త అప్పుకుపోతే పాత అప్పు పైనపడ్డదట.\n\n* కొత్త ఆవకాయ, కొత్తపెళ్ళాము రుచి.\n\n* కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాది ఎత్తినట్లు.\n\n* కొత్త ఒక వింత, పాత ఒక రోత.\n\n* కొత్త కలిమి సేవ కత్తిమీద సాము.\n\n* కొత్త కృషికి పాత తరినేల.\n\n* కొత్త కదరా కొమ్మా ! అంటే, మరగనీరా ఇరగ (విరగ) తందాం అన్నట్లు.\n\n* కొత్తగా సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.\n\n* కొత్తగుడ్డకు రంగు పట్టినట్లు పాతగుడ్డకు పట్టదు.\n\n* కొత్త చింతకాయతొక్కు, కొత్త చుట్టరికం రుచి.\n\n* కొత్త చీపురు బాగుగా ఊడ్చు. (చిమ్మునట్లు).\n\n* కొత్త జవ్వనమునకు గురుతలేదు.\n\n* కొత్తది గొఱ్ఱెల మడుగు (ఉచ్చగుంత), పాతది బఱ్ఱెల మడుగు.\n\n* కొత్తది నేర్వలేదు, పాతది మరువలేదు.\n\n* కొత్తదొక వింత, కోడీకల బొంత.\n\n* కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకపోయినట్లు.\n\n* కొత్తనీళ్ళకు చేప లెదురెక్కినట్లు\n\n* కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు.\n\n* కొత్త భక్తురాలు ఉడుకు ఊబిది పూసుకొని, నొసలు కాలెనే పేరమ్మా అన్నదట.\n\n* కొత్త మురిపెము కొమ్మన్నా ! తెల్లగా కొట్టరా మడేలా (మడేలు=చాకలి).\n\n* కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు.\n\n* కొత్త సేద్యగాడు పొద్దెరుగడు.\n\n* కొద్ది కొద్దిగా తీస్తే కొండయినా కరిగి (తరిగి) పోతుంది.\n\n* కొద్ది వానలకే రెక్కల పురుగులు.\n\n* కొనగా తీరనిది కొసరితే తీరునా?\n\n* కొనజాలకు కోతిపుడితే కులమువాళంతా కుంటికుక్క అని పేరు పెట్టారు.\n\n* కొనలేదు, అనలేదు, కొడుకుపేరు సోమలింగం.\n\n* కొని తింటూ ఉంటే కోమటి నేస్తం, ఇచ్చి తీసుకుంటా ఉంటే ఈడిగ నేస్తం.\n\n* కొనేది కొయ్యగూర, తినేది చెంచలకూర.\n\n* కొనేవాడికి కోటి కళ్ళయితే అమ్మేవాడీ అవిటిదొక్కటే చాలు.\n\n* కొనైనా కొసకు నూనె రాయాలి.\n\n* కొన్న అంగడిలోనే మారు బేరమా?\n\n* కొన్న కాంతలు, వన్నె చీరలు, దైవలోక మగునా?\n\n* కొన్న దగ్గర కొసరుకానీ, కోరిన దగ్గర కొసరా?\n\n* కొన్నది వంకాయ, కొసరింది గుమ్మడికాయ.\n\n* కొన్నవాడికన్నా తిన్నవాడే మేలు.\n\n* కొన్నాక తినక మానదు.\n\n* కొన్నాళ్ళు చీకటి , కొన్నాళ్ళు వెన్నెల.\n\n* కొప్పుకు సగరం (సవరం) అందం, చెప్పుకు తగులం అందం.\n\n* కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే.\n\n* కొమ్ము మాడ కూలుస్తుంది.\n\n* కొమ్ములు చూసి బేరమాడినట్లు (నీటనున్న పశువును).\n\n* కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా?\n\n* కొయ్యరా కొయ్యరా కోటిగాడా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నాడుట.\n\n* కొఱకబోతే పడికట్లు ఉరికి మీద పడినట్లు.\n\n* కొఱతనపడేవాడు ఒకడు, కూర్పులు లెక్కపెట్టెవాడొకడు.\n\n* కొఱివితో తల గోక్కున్నట్లు.\n\n* కొఱివి పెట్టెవాడు కొడుకు, కూడుపెట్టేది కూతురు.\n\n* కొఱ్ఱకు నక్క కొఱ్ఱ.\n\n* కొఱ్ఱగింజంత కోడలిని చూస్తే కొండంత జ్వరం వచ్చిందట.\n\n* కొఱ్ఱల సేవ్యం (సేద్యం) కూటికైనా రాదు.\n\n* కొఱ్ఱు ఇంటికంబమగునా?\n\n* కొలని హంసలకడ కొక్కెరలుండునా?\n\n* కొలిమి వీధిలో సూదులమ్మినట్లు.\n\n* కొలుచు దంచుట పొట్టకొరకా? (కొలుచు=ధాన్యము).\n\n* కొలువు కన్నా గోపాలనే నయం.\n\n* కొల్లకు పోయి పైచీర కోల్పోయినట్లు.\n\n* కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనా మునుగుతుంది.\n\n* కొల్లేటి పంట కూటికే చాలదు.\n\n* కొల్లేటి బ్రహ్మహత్య కాపు మీదుగా కొట్టుకపోయినట్లు.\n\n* కొల్లేటిలో పండే పంట పంటలో లెక్కేకానీ, చచ్చే దున్నపోతులకు లెక్కేలేదు.\n\n* కొల్లేటి వ్యవసాయానికి కోతకూలి దండుగ.\n\n* కొల్లేటి వ్యవసాయం గొడ్ల వినాశం.\n\n* కొవ్విన ఎండ్రకాయ కలుగులో నిలువనట్లు.\n\n* కొసరిన కూరలోగానీ పస ఉండదు.\n\n**********:: కో ::**********\n\n* \"కో\" అంటే కోటిమంది.\n\n* కోకకు పెట్టిన గంజి కూడి రాదు.\n\n* కోకడాపుతో కోరికలీడేరేనా?\n\n* కోకలు వెయ్యున్నా కట్టుకొనుట ఒకటే.\n\n* కోటగోడల ఇల్లు, తాటాకుల పందిరి.\n\n* కోటచక్కదనము గమిడి చెప్పినట్లు.\n\n* కోటలో పాగా వేసినట్లు.\n\n* కోటవరకు, ఏటివరకు సాగనంపవలె.\n\n* కోటికి పడగలెత్తినవాణ్ణి పదివేల కాపవై బ్రతుకమన్నట్లు.\n\n* కోటికి లాగితే బిళ్ళకు, బిళ్ళకు లాగితే కోటికి.\n\n* కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టించారో తెలియదుకానీ, అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు అన్నాడట.\n\n* కోటివిద్యల కంటే కోరుకు పొలం దున్నటం మేలు.\n\n* కోటివిద్యలు కూటికొరకే.\n\n* కోతివిద్యలు కొండ్రకు లోకువ.\n\n* కోటివిద్యలు వచ్చినా కొల అచ్చితే కొలవలె కాదు.\n\n* కోడలా! కోడలా! కొడుకు కోడూరు పోయెనే, నీకు కోకెక్కడిదే? అంటే, అత్తా! అత్తా! మామ మడమనూరు పోయెనే, నీకు మట్టెలెక్కడివే అన్నదిట.\n\n* కోడలా నీ భోగం ఎంతసేపే? అంటే, మా అత్త మాలవాడకు పోయి వచ్చేదాకా అన్నదిట.\n\n* కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిందట.\n\n* కోడలికి బుద్ధిచెప్పి అత్తే ఱంకు పోయిందట.\n\n* కోడలిదాని మొగుడు కొట్టం పట్టుకొని ఏడ్చాడట.\n\n* కోడలి కొట్టిన కుండ కొత్తకుండ, అత్త కొట్టిన కుండ అడుగోడు(టి) కుండ.\n\n* కోడలి కొడుకును కంటాను అంటే వద్దనే అత్త ఉన్నదా?\n\n* కోడలు గృహప్రవేశం, అత్త గంగా (అగ్ని) ప్రవేశం.\n\n* కోడలి నలుపైతే కులమంతా నలుపగునా?\n\n* కోడలు వచ్చినవేళ, కోడెలు వచ్చినవేళ.\n\n* కోడి అడుగులో కోటివర్ణాల భూమి.\n\n* కోడికి ఉన్న కోర్కెలతో పిల్లికేమి అక్కఱ?\n\n* కోడికి కులాసం లేదు, కోమటికి విశ్వాసం లేదు.\n\n* కోడికి గజ్జలు కడితే కుప్ప కుళ్ళగించదా?\n\n* కోడికి పుట్టిన పిల్ల కొక్కొరొక్కో అనక ఏమంటుంది?\n\n* కోడి కుళ్ళగించేదంతా (గెలికేదంతా) పెంటకుప్పలే.\n\n* కోడి, కుంపటి లేకపోతే తెల్లవారదా?\n\n* కోడి కూతా, కాడి పూత.\n\n* కోడి కొత్త అప్పులు, పండి పాత అప్పులు తీర్చును.\n\n* కోడిగుడ్డంత సంసారంలో కోరికలేలా?\n\n* కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు.\n\n* కోడిగుడ్డును కొట్టను గుండ్రాయి కావాలా?\n\n* కోడిగుడ్డుతో కొండలు బద్దలు కొట్టగలమా?\n\n* కోడితొక్కుడు, గాడిద ఎక్కుడు.\n\n* కోడి నలుపైనా గుడ్డు తెలుపే.\n\n* కోడిపియ్యి మందంటే కొఱ్ఱెక్కి ఏరిగిందిట.\n\n* కోడిని అడిగి మసాలా నూరుతారా?\n\n* కోడిని కోసి, గోత్రానికంతా పగ ఐనట్లు.\n\n* కోడిని కోసే ఇంట్లో కొరకొర తప్పదు.\n\n* కోడిని తిట్టిన తిట్టు కోడలి కెఱుక.\n\n* కోడిపిల్లకు గొఱ్ఱెపిల్లను బలాదూరు (దిష్టి) తీసినట్లు.\n\n* కోడిపెట్ట ఎక్కడున్నా మనసు గుడ్లమీదే.\n\n* కోడి ఱెక్కారవేస్తే గొప్పవాన కురుస్తుంది.\n\n* కోడు ఒకడు తీస్తే, కొమ్ము ఒకడు తీస్తాడు.\n\n* కోడెల పోట్లాట మధ్య లేగల కాళ్ళు విరిగినట్లు.\n\n* కోతల కాలంలో ఎలకన్నకు ఏడుపెళ్ళాలుంటే మాత్రం ఏమీ?\n\n* కోడెలు కోడెలు పోట్లాడి, దూడల కాళ్ళు విరగకొట్టినట్లు.\n\n* కోతలకు ఉత్తరకుమారుడు.\n\n* కోతలున్నన్నాళ్ళూ కోతీ బతికింది, తరువాత బతికిందే బతుకు.\n\n* కోతల్లో కునికిపాట్లు పడి, కొత్త అమావాశ్యకు కొంపగోడి అనుకున్నట్లు.\n\n* కోతల్లో కూడదీసుకుంటే, కూటికి కొరత ఉండదు.\n\n* కోతికి అద్దం చూపినట్లు.\n\n* కోతికి కల్లు తాగించినట్లు.\n\n* కోతికి టెంకాయ దొరికినట్లు.\n\n* కోతి చస్తే గోడవతల పారేసినట్లు.\n\n* కోతికి తేలు కుట్టినట్లు.\n\n* కోతికి జల్తారు కులాయి పెట్టినట్లు.\n\n* కోతికి పుండైతే, గోకా, నాకా.\n\n* కోతికి పెత్తనమిస్తే, గోదావరి కడ్డంగా ఈదిందట.\n\n* కోతికి పెత్తనమిస్తే, తలంతా చెడ గొరిగిందట.\n\n* కోతికి బెల్లం చూపరాదు, కోమటికి ధనం చూపరాదు.\n\n* కోతి గెంతడం, సాయబు సంపాదించడం.\n\n* కోతిగుంపుల పాడు కొడవలూరు.\n\n* కోతి చావు, కోమటి ఱంకు.\n\n* కోతిచేతి పాము వలె.\n\n* కోతిచేతి పూలదండ.\n\n* కోతి టెంకాయ తుంచగలదు కానీ నీరు తాగగలదా?\n\n* కోతి పంచాయతి కొంపలారుస్తుంది.\n\n* కోతి పిల్లలకు రొట్టె పంచినట్లు.\n\n* కోతిపుండు బ్రహ్మండమైనట్లు.\n\n* కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లు.\n\n* కోతి పులి కాదు, కోమటి దొర కాడు.\n\n* కోతిముండకైనా గీత బాగుండవలె.\n\n* కోపం గొప్పకు ముప్పు, అల్లరికి హంగు ముప్పు.\n\n* కోపం పాపమునకు పొత్తు.\n\n* కోపం పొంగు క్రుంగు కొన్నాళ్ళే.\n\n* కోపం రాను కారం తిన్నట్లు.\n\n* కోపము ఎదుటు గొప్పగొద్దు లెరుగదు.\n\n* కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు.\n\n* కోమటి ఇల్లు కాలినట్లు.\n\n* కోమటి ఏవేళా క్షేమామే కోరును, ధరణీపతి ధనము కోరు.\n\n* కోమటికి, కోతికి ముల్లెచూపరాదు.\n\n* కోమటితో మాట, కోతితో సయ్యాట.\n\n* కోమటిని చూచి నక్క శొంఠి అడిగిందట.\n\n* కోమటి భక్తుడు కాడు, తగరం కత్తి కాదు.\n\n* కోమటి లేమి, కంసాలి కలిమి ఉండవు.\n\n* కోమటి సాక్ష్యం, బాపన వ్యవసాయం.\n\n* కోమటి వైష్ణవము, ఉప్పర సన్యాసము.\n\n* కోమట్ల కోట్లాట, గోచీల ఊగులాట.\n\n* కోమలి విశ్వాసము పాములతో చెలిమి వంటిది.\n\n* కోరి అడిగితే కొమ్మెక్కుతారు.\n\n* కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టాలు అడుగంటుతుంటవి.\n\n* కోరికోరి బావతో పోతే కుంటివాడు పుట్టాడట.\n\n* కోరినంత పెట్టెనమ్మా కోతికి శివుడు\n\n* కోరి పిల్ల ఇస్తామంటే, కులం తక్కువ అన్నట్లు.\n\n* కోరి, వీగీ కొడుకును కంటే, మూగ చెవుడు ముంచుకు వచ్చినవట.\n\n* కోరుకున్న కోడలు వస్తే కొప్పులో చెప్పు పెడుతుంది.\n\n* కోరుకొండ తీర్ధానికి కోడిగుడ్డంత మామిడిపండ్లగును.\n\n* కోరు గింజలు కొంగులోకే సరి.\n\n* కోల ఆడితే కోతి ఆడును.\n\n* కోలలేని పెట్టు, తాడులేని కట్టు.\n\n* కోళ్ళను తింటారా? అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు.\n\n* కోళ్ళ బేరానికి వెళ్ళి కోటలో కబుర్లడిగినట్లు.\n\n* కోళ్ళు కూయగా లేచినా, కాళ్ళు కాలేవఱకే అవుతుంది.\n\n* కోళ్ళుసాకిన పొంతలో రెట్టవేసినట్లు.\n\n* కోర్టుకెక్కి గెలిచినవాడు ఇంట్లో ఏడిస్తే, ఓడినవాడు వీధుల్లో ఏడుస్తాడు.\n\n* కోర్టుకెక్కిన వారు, ఒకరు ఆవుకొమ్మును, ఇంకొకరు తోకను పట్టుకుంటే, మధ్య వకీలు పొదుగు దగ్గర కూర్చుంటాడు.\n\n**********:: ఖా ::**********\n\n* ఖాజా (ఖొజ్జా) మొగుడు ఒడిలో ఉంటేనేమి, దడిలో ఉంటే నేమి?\n\n* ఖాజీని ఫాజీ గానూ, ఫాజీని ఖాజీగాను మార్చినట్లు.\n\n* ఖానాకు నహీ, ఎల్లీకి బులావ్ అన్నట్లు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 865,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* గంగ ఈతకు, గరిక మేతకు సరి.\n\n* గంగ కిద్దరి మేలు, అద్దరి కీడునుం గలదే?\n\n* గంగకు, సొంగకు, పంగకు తప్పులేదు.\n\n* గంగిగోవు పాలు గంటెడైన చాలు, కడివడైననేమి ఖరము పాలు?\n\n* గంగను పడ్డ కాపురం గట్టున పడుతుందా?\n\n* గంగమ్మ గయ్యాళైతే, సింగరాజేమి చేస్తాడు?\n\n* గంగలోని ఓడను నమ్మితే భవసాగరమీదవచ్చునా?\n\n* గంగలో మునిగినా కాకి హంస అవుతుందా?\n\n* గంగానమ్మ తెత్తిమీద తురకాడు కాలుపెడితే, కాపువాణ్ణి తీయమన్నదట.\n\n* గంగా స్నానం, తుంగాపానం.\n\n* గంగిరెద్దును బండికి కడితే వాడవాడ, గంగిరావును బండికి కడితే ఇల్లిల్లూ.\n\n* గంజాయి తోటలో తులసి మొక్కవలె.\n\n* గంజాయి పీకకు, కల్లు రేకకు అంటులేదు (ఎంగిలి లేదు).\n\n* గంజి తాగినా లంజ కావాలి.\n\n* గంజి తాగేవానికి మీసాలెగపెట్టె వాడొకడు.\n\n* గంజిలోకి ఉప్పులేకుంటే పాలలోకి పంచదారట.\n\n* గంటెలు పండిన ఇంట, కణుజు పండిన ఇంట కఱవులేదు.\n\n* గంటైనా బలవాలి, గాదైనా తిరగాలి.\n\n* గండం గడిచి పిండం బయటపడినట్లు.\n\n* గంత కట్టేదా? బసవన్నా అంటే, ఊహూ అని, గుగ్గిళ్ళు తింటావా అంటే, అహా అన్నదిట.\n\n* గంతకు తగిన బొంత దొరకనే దొరుకుతుంది.\n\n* గంతకు పడాలని ఉంది, ఎద్దుకు తూలాలనీ (తోయాలనీ) ఉంది.\n\n* గంతలో బావ ఉన్నాడని, సంతలో కాల్మడిచిందట. (కాల్మడుచు=ఒంటికి పోవు).\n\n* గంత బొంత కలిసి గాడిద మోతైనట్లు.\n\n* గంధపు చెక్కలు మోసిన గాడిద వాటి వాసన అనుభవించలేదు.\n\n* గంధం అమ్మినచోటే కట్టెలమ్ముట.\n\n* గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదే.\n\n* గంధంలో కూసు కల్పినట్లు.\n\n* గంధం సమర్పయామీ అంటే, గొడ్డలి నూరరా అన్నాడట.\n\n* గంధపు పొడిలో బూరగ పట్టినట్లు (ఊదినట్లు).\n\n* గంధమలద మేని కంపు తగ్గినయట్లు.\n\n* గంపదింపుడు ఘనమాయె, పూర్వపు బుద్ధులు పోవాయె.\n\n* గంపదింపులు ఘనమాయే, పూర్వాలు బుగ్గాయె.\n\n* గంపలాభం చిల్లి తీసినట్లు.\n\n* గంప సిడి (సిరి) కాదు, గాలపు సిడి (సిడి=వేదన).\n\n* గచ్చకాయంత బెల్లానికైనా గానుగ కట్టాలి.\n\n* గచ్చకాయల కుండ వలె.\n\n* గచ్చకాయలకు కొన్న గుఱ్ఱం కందకం దాటునా?\n\n* గచ్చపొద పట్టుకొన్నట్లు.\n\n* గచ్చపొద మీద ఇసుకవేసి కయ్యానికి పిలిచినట్లు.\n\n* గచ్చముండ్ల మీద తగులుకొన్న బట్ట గ్రక్కున తీయ వశమా?\n\n* గజముపై చౌడోలు గాడిదకెత్తిన కూయునేగానీ మోయదు.\n\n* గజమూ మిథ్య, పలాయనమూ మిథ్య అన్నట్లు.\n\n* గజశాస్త్రవేత్తలకు గజారోహణం వస్తుందా?\n\n* గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు.\n\n* గట్టిగా ఆయూష్యముంటే గఱిక నూరిపోసినా బతుకుతాడు.\n\n* గట్టీగా తిట్టినా గాలికి పోవును.\n\n* గట్టిని విడిచి పొట్టుకు పోరాడినట్లు.\n\n* గట్టి గింజలు విడిచి పొట్టుకు పోరాడినట్లు.\n\n* గట్టు చేరిన వెనుక పుట్టివానితో పోట్లాడినట్లు.\n\n* గట్టు మీదవానికి గప్పాలెక్కువ.\n\n* గట్టెక్కితి, పుట్టెక్కితి, మేటి మెట్టెక్కితి అన్నట్లు.\n\n* గడేక్కు తిమ్మన్నా! గంతులు వేయి తిమ్మన్నా!\n\n* గడనుడుగు మగని జూచిన నడపీనుగ వచ్చినట్లు నగుదురు.\n\n* గడించేది ఒకడు, అనుభవించే దింకొకడు.\n\n* గడించే వాడొకడు, గుణించే వాడొకడు.\n\n* గడీ ఎక్కా నేనే, గంతులు వేయా నేనే.\n\n* గడియ పురుసత్తూ లేదు, గవ్వ ఆదాయం లేదు.\n\n* గడియారం చూచి గడాలు కట్టిస్తారా? (గడాలు= అరకలు, నాగళ్ళు).\n\n* గడుసురాలు మగని గంపతో నమ్మురా!\n\n* గడుసువాడు మూడందాల చెడును.\n\n* గడ్డెము కట్టిన గొడ్డెము విడుస్తుంది.\n\n* గడ్డం కాలి ఏడుస్తుంటే, చుట్టకు నిప్పివ్వమని వెంట పడ్డాడుట.\n\n* గడ్డ గడ్డకూ గ్రుక్కెడు నీళ్ళు తాగినా రెడ్డే వ్యవసాయం చెయ్యాల.\n\n* గడ్డ తిన్నా కంపే, (ఉల్లి) పాయ తిన్నా కంపే.\n\n* గడ్డపలుగు మింగి, శొంఠికషాయం తాగినట్లు.\n\n* గడ్డపార గాలికి పోతుంటే ఉల్లిపాయనా జంబులీకం చూడమన్నదిట.\n\n* గడ్డపార తినేవానికి శొంఠికషాయం ఏమి చేస్తుంది?\n\n* గడ్డపారలు గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా గతి ఏమీ అన్నదిట.\n\n* గడ్డపారలకు పగులని బండలు, చెట్ల వేళ్ళకు చెప్పకుండా పగులుతాయి.\n\n* గడ్డింత లేక ముడ్డింత ఎండి, వేంచేసెనే గుఱ్ఱం దేవలోకము?\n\n* గడ్డివామిలో సూది వెతికినట్లు.\n\n* గడ్డివెంటిబట్టి కట్టరే ఏనుంగు.\n\n* గడ్డివేయ పోట్ల గొడ్డు తలాడిస్తుంది.\n\n* గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా?\n\n* గణనాయకుని చేయకోరగా, కడు వానరుడైన తీరు.\n\n* గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.\n\n* గతజల సేతు బంధనం.\n\n* గతికితే అతకదు.\n\n* గతి చెడినా మతి చెడరాదు.\n\n* గతిమాలిన వాడికి కుతి(క) లావు.\n\n* గతిలేనమ్మకు గంజే పాయసం.\n\n* గతిలేనమ్మకు మతిలేని మొగుడు.\n\n* గతిలేని ఊరికి మతిలేని గంగానమ్మ.\n\n* గతిలేని వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.\n\n* గతిలేనివాడికి కనపడిందే కూడు.\n\n* గతుకులకు పోతే బతుకులు పోయినవి.\n\n* గదరింటిలో పెండ్లి, గడియకింత తిండి.\n\n* గదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు.\n\n* గద్దకు సంక్రంతి ముందు సంకెళ్ళు.\n\n* గద్దించే అత్త, మర్ధించే మామ.\n\n* గద్దెకు పోయిన సుద్దులు తక్కువా?\n\n* గప్పాల పోతిరెడ్డికి ముప్పైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.\n\n* గబగబా అరిచేవాడి పంచ చేరవచ్చును గానీ, నేలముచ్చోడి కడప తొక్కరాదు.\n\n* గబ్బరీడు కార్తె వర్షాలకు దిబ్బలు కూడా కరుగుతాయి.\n\n* గబ్బిలము ఆకాశాన్ని పడకుండా పట్టుకుని ఉన్నానన్నట్లు.\n\n* గబ్బిలం వలే అటు పక్షి కాదు ఇటు జంతువూ కాదు.\n\n* గబ్బిలాయి మొగం నవ్వినా ఒకటే, ఏడ్చినా ఒకటే.\n\n* గబ్బుకు గంపెడు ఈగలు.\n\n* గబ్బువాడూ, గదరువాడు వియ్యమందితే, మురికివాడు వచ్చి ముద్దాడినాడట.\n\n* గయ్యాళి, గచ్చపొద ఒకటి.\n\n* గయ్యాళి రచ్చకెక్కితే, సంసారి దొంతుల సందున దాక్కుంది.\n\n* గరిసె విత్తనాలు పోసి, గంపెడు విత్తనాలు తెచ్చుకొన్నట్లు.\n\n* గఱిక చేను గాడిద పాలు.\n\n* గఱిక మేసిన గాడిద చస్తుందిగానీ గఱిక చావదు.\n\n* గరుడాయ లెస్సా? అంటే శేషాయ లెస్సా అన్నాడట.\n\n* గరుత్మంతుడిని చూసిన పాము వలె.\n\n* గర్భదానం అంటే వడలు తినటమనుకున్నానే, గుద్దదిరే పనే అన్నదిట కొత్త పెండ్లికూతురు.\n\n* గర్భదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు.\n\n* గర్భదానానికి రమ్మని జాబు రాస్తే, రాను తీరికలేదు, నేనున్నట్లే పనిజరిపించండి అని వ్రాసినాడట.\n\n* గవ్వన్నరకు గడ్డం గొరుగుతా అంటే, వెంట్రుకున్నరకు ఎంతా? అన్నాడట\n\n**********:: గా ::**********\n\n* గాజుకుప్పెలో దీపంవలె.\n\n* గాజుపూసల గనిలో మణి దొరకునా?\n\n* గాజులబేరం భోజనానికి సరి.\n\n* గాజుల చెయ్యి గల గలలాడితే, ఇల్లు కలకల లాడుతుంది.\n\n* గాటాలు తిన్న కోడె గాటికి రానట్లు (గాటాలు=కష్టాలు).\n\n* గాటి పిచ్చి గూటి పిచ్చి లేగితే అణిగేది కష్టం.\n\n* గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు.\n\n* గాడి తప్పిన బండి వలె.\n\n* గాడిదకు గడ్డివేసి ఆవును పాలివ్వమన్నట్లు.\n\n* గాడిదకు తనకూత కమ్మగానే ఉంటుంది.\n\n* గాడిదకు పులితోలు కప్పితే కఱవ గలదా?\n\n* గాడిదకు భోగి నీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట.\n\n* గాడిద కేమితెలుసు గంధపు పొడి వాసన.\n\n* గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు మేము బిడ్డలము అన్నాడట.\n\n* గాడిద గుడ్డు కప్ప తలకాయ\n\n* గాడిద గుడ్డు, గరుడ భంగం.\n\n* గాడిద గుడ్డు గంధపు సాన.\n\n* గాడిద చంటిలో కడివెడు పాలు.\n\n* గాడిదలతో సేద్యం చేస్తూ, కాలి తన్నులకు దడిస్తే ఎలా?\n\n* గాడిదతో స్నేహం కాలి తన్నులకే.\n\n* గాడిద పిల్ల కోమలం.\n\n* గాడిద పుండుకు బూడిద మందు.\n\n* గాడిద పూర్వ వంశగౌరవం గానీ, భవిష్యత్సంతతిపై గానీ ఆశలేని జీవి.\n\n* గాడీద ముండా ! ఏటేటా కంటావేమిటే? అంటే నాకు కోపం వస్తే నడుంగల కూడా కంటా అన్నదిట.\n\n* గాడిద మోయదా గంధపు చెక్కలు.\n\n* గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్.\n\n* గాడిదల మోత గుఱ్ఱాల మేత\n\n* గాడిదలెన్ని మేసినా గరిక తరుగుతుందా?\n\n* గాడిదలే దున్నితే, దొమ్మరులు పంత కాపులు కారా?\n\n* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.\n\n* గాడిదలా పరుగెత్తినావేమంటే, గుంపులో చేరబట్టి బెదురు తీరిందన్నాడట.\n\n* గాడుపట్టిన గంగానమ్మ పూజారితో పోయినట్లు.\n\n* గాఢాలింగన సౌఖ్యం ప్రౌఢాంగన ఎరుగుగాక బాలేమెరుగున్?\n\n* గాడుపుకు గడ్డపార కొట్టుకపోగా, ఉల్లిపొట్టు నాగతి ఏమీ? అన్నదిట.\n\n* గాదెకింద ఎలుక గాదెకిందే బతకాలి.\n\n* గాదెకింద పందికొక్కు వెలె.\n\n* గాదెడు కొఱ్ఱులు తిన్నా, కౌజు మూడేకాసులు (కానులు).\n\n* గాదెడు దోసకాయలలో చేటడు కొఱ్ఱలు పట్టవా?\n\n* గాదెనిండా బియ్యముంటే, కఱువునా, కాలనా నా భార్యను పిల్లలను నేనే రక్షిస్తాను అన్నాడట.\n\n* గాదెలో గింజలు గాదెలోనే ఉండాలి, బిడ్డలు గారకాయలులా ఉండాలి.\n\n* గానుగెద్దు ఒక్కసారిగా దిక్కిటెద్దు అవుతుందా?\n\n* గానుగరోట్లో చెయ్యిపెట్టి పెరుమాళ్ళ కృప అన్నట్లు.\n\n* గానుగ రోలు సెద్దె కుడుపేడయింది.\n\n* గానుగల(లో) నూ(పు)గులుపోసి గానుగకింద సిద్ది పెట్టిందట.\n\n* గానుగాపే, గానుగాపే, నీవు కూర్చున్న పనేగా నూనెపోయటం.\n\n* గాము సోకినట్లు.\n\n* గారాబం గంజికేడిస్తే, ముసలివాడు ముండ కేడ్చాడట.\n\n* గారాబం గారెలకేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.\n\n* గారాము గుర్రాని కేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.\n\n* గారాల బిడ్డపుడితే, గడ్డపారతో చెవులు కుట్టినట్లు.\n\n* గారువాల బిడ్డకు గడ్డపారతో చెవులుకుట్టి సలికెపారలు తీగలేసిందట. (సలికెపార=మన్ను చెలిగే పార).\n\n* గారెలు వండాలే పెళ్ళామా అంటే, వేలు చూపించినట్లు.\n\n* గాలి ఇరవు గాలికే తెలుసు.\n\n* గాలి ఉన్నప్పుడే తూర్పాన పట్టాల.\n\n* గాలి చిన్నదీపాన్ని ఆర్పి, మంతను పెద్ద చేస్తుంది.\n\n* గాలికి పుట్టి, (దుమ్ముకు) ధూళికి పెరిగినట్లు.\n\n* గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు.\n\n* గాలికి పోయిన పేలాలు కృష్ణార్పణం.\n\n* గాలికి పోయిన పేలాలు రామార్పణం (కృష్ణార్పణం) అన్నట్లు.\n\n* గాలికి పోయేదానిని కాలిమీదకు దోచుకొన్నట్లు.\n\n* గాలితో తాడు పేనినట్లు.\n\n* గాలిని మూట కట్టీనా, గయ్యాళి నోరు కట్టలేడు.\n\n* గాలిపాటు, కలిమి తేట.\n\n* గాలిమేడలు గురివింద సామ్యం.\n\n* గాలి లేనిదే దుమారం లేచునా?\n\n* గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు.\n\n* గాలిలో మేడలు కట్టినట్లు.\n\n* గాలీవానా కలిస్తే కధ మాసింది.\n\n**********:: గి ::**********\n\n* గిరిపూను భారము కరిపూన గలదా?\n\n* గిరాకి కొననివ్వదు, మందం అమ్మనివ్వదు.\n\n* గిరాకి కోమట్ల పాలు, మందం మూలల (మాలల) పాలు.\n\n**********:: గు ::**********\n\n* గుంటక పురాణం, గంప శతకం.\n\n* గూంతకాకి వింటి దెబ్బ ఎరుగదు.\n\n* గుంటలో బిడ్డా, కడుపులో బిడ్డ.\n\n* గుంటూరు పొగాకు గుట్లో ఉన్నా ఒకటె, నోట్లో ఉన్నా ఒకటె.\n\n* గుండి (గుండ్రాయి) మింగేవాడికి తలుపులు అప్పడాలు.\n\n* గుండ్రాయి దాస్తే కూతురి పెండ్లి అగునా?\n\n* గుండ్లకమ్మ నిండి దరిచేరనీయదు, గంపకమ్మ కలిగి తిననీయదు.\n\n* గుండ్లు తేలి, బెండ్లు మునిగినట్లు.\n\n* గుంతకు వస్తే మరదలి, మెట్టకు వస్తే వదిన.\n\n* గుగ్గిలం వెయ్యకపోతే పోయినావుగానీ గుళ్ళో పిత్తవద్దు.\n\n* గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?\n\n* గుగ్గిళ్ళకు నోరు తెరిచి, కళ్ళానికి నోరు మూసినట్లు.\n\n* గుట్టకు మొరిగిన కుక్క గ్రుడ్లువెళ్ళి చచ్చిందట.\n\n* గుట్టు మీరువారు గురువునకు గురువురా.\n\n* గుడగుడ ఆలోచన గుడిశకు చేటు.\n\n* గుడగుడ శబ్ధం కుండకు నష్టం (మోసం).\n\n* గుడారంలో గూని బతుకు.\n\n* గుడి అంతా దేముడైతే గుదమెక్కడ పెట్టేది?\n\n* గుడి ఉమ్మడి గంతలకు గుట్టు ఉంటుందా?\n\n* గుడీ కట్టేవాడొకడు, గుళ్ళో దీపం పెట్టేవాడొకడు.\n\n* గుడికొట్టి ఇటికల తులసి తిన్నెలు గట్టిన ధర్మాత్ముడగునా?\n\n* గుడి చిన్నదైనా గుళ్ళో దేవుని మహిమ మిన్న.\n\n* గుడి చుట్టూ తిరిగి బొడ్డులో వేలు పెట్టుకొన్నట్లు.\n\n* గుడి దెగ్గరైతే గురుత్వం దూరమౌతుంది.\n\n* గుడి నుండి గుడిరాళ్ళు తీసేవారు.\n\n* గుడీరాళ్ళు కరచినట్లు, గంగిగోవు పొడిచినట్లు.\n\n* గుడి మింగేవానికి గుడిలో లింగం ఉట్రవడియం.\n\n* గుడీ మింగేవాడొకడైతే, గుడీని లింగాన్ని మింగేవాడింకొకడు, గుడీని గోపురాన్ని మింగేది మరిఒకడు.\n\n* గుడి మింగేవానికి నంది పిండి మిరియం.\n\n* గుడిమీదనుండి పడినా, గుండాములో పడినా ఒకతే.\n\n* గుడి ముఖం ఎరుగని దాసరి గుడివెనుక దండం పెట్టినాడట.\n\n* గుడీమేళం కాదు గుద్ద త్రిప్పను, ఇది నగరిమేళం నడుము విరుగుతుంది.\n\n* గుడీలో ఉండి, గుడీరాళ్ళు తీసిందట.\n\n* గుడిలో దేవునికి గుడ్డ లేకుంటే, వాకిట్లో దేవునికి వన్నెచీర అట.\n\n* గుడీలో లింగంపోతే, నంబి శఠం పోయినట్లు.\n\n* గుడిలో లింగంపోతే నడుమ నంబికేం నష్టం?\n\n* గుడిసెకు చందిని, గుడ్డికి అద్దము ఏల?\n\n* గుడిసేటికి ఇల్లాలు, గుత్త లంజ.\n\n* గుడ్డకు జాడింపు, కూరకు తాలింపు, కోడలికి సాధింపులేకున్న ఇంపులేదు.\n\n* గుడ్లమీద కోడిపెట్ట వలె.\n\n* గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్లు\n\n* గుడ్డికంటికి కాటుక పెట్టినట్లు.\n\n* గుడ్డికంటికి కుంచెడు కాటుకా?\n\n* గుడ్డికంటికి గుదంచూపినా ఒకటే, అద్దంచూపినా ఒకటే.\n\n* గుడ్డికంటికి పగలైతేనేమి? రాత్రైతేనేమి?\n\n* గుడ్డికంటికి రెండు గూటాలు, మెల్లకంటికి రెండు మేళాలు.\n\n* గుడ్డికన్నా మెల్ల మేలు.\n\n* గుడ్డికన్ను చారడైతేనేమి? చిన్నదైతేనేమి?\n\n* గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.\n\n* గుడ్డికేమి కుందనపు చాయ?\n\n* గుడ్డి గుణమెరుగదు, వడ్డి మొదలెరుగదు.\n\n* గుడ్డి గుఱ్ఱము తట్ట గుగ్గిళ్ళు తిన పెద్ద.\n\n* గుడ్డి గుఱ్ఱమెక్కి గుడి చుట్టనగునా?\n\n* గుడ్డి గుఱ్ఱానికి గుగ్గిళ్ళు చేటు.\n\n* గుడ్డి గుఱ్ఱానికి దారి ఒకటే.\n\n* గుడ్డిగేదెలలో గూనిగేదె శ్రీమహాలక్ష్మి.\n\n* గుడ్డిదానితో పోతే గుడిసెదాకా సాగనంపాల.\n\n* గుడ్డిది బెదిరిస్తే, బిత్తరపోయి బావిలో పడినాడంట.\n\n* గుడ్డిది నీళ్ళకుపోతే ముగ్గురికి చేటు.\n\n* గుడ్డినక్క ఊరినపడినట్లు.\n\n* గుడ్డి పెండ్లానికి చెవిటి మగడైనట్లు.\n\n* గుడ్డి మామగారు! నమస్కారమయ్యా అంటే రంధికి మూలమా ఱంకు కోడలా అన్నాడట.\n\n* గుడ్డి మొగుడికి రేజీకటి పెండ్లం.\n\n* గుడ్డివాడెరుగునా గురుతైన రత్నంబు.\n\n* గుడ్డివాడి ఉపాయం గుడ్డివానిది, గూనివాని ఉపాయం గూనివానిది.\n\n* గుడ్డివాని కన్ను రాగోరునా? పోగోరునా?\n\n* గుడ్డివాని కాలు కుంతివాని కాధారమైనట్లు.\n\n* గుడ్డివాడి చేతినూలు కదుట్లో పడుతుందో దిండులో పడుతుందో?\n\n* గుడ్డివాడు అలావు తొక్కినట్లు.\n\n* గుడ్డివాడు ఎటు రువ్వినా గురే.\n\n* గుడ్డివాడు కోట కోల్పోయినట్లు.\n\n* గుడ్డివాళ్ళ రాజ్యంలో ఒంటికన్నువాడే రాజు.\n\n* గుడ్డివాళ్ళు ఏనుగు అంగాన్ని పట్టూకొని ఒక్కొక్క విధంగా వర్ణించినట్లు.\n\n* గుడ్డివేటు గువ్వకి తగిలినట్లు.\n\n* గుడ్డీ! రావే గుడీకిపోదామూ అన్నట్లు.\n\n* గుడ్డుపెట్టబోయే కోడి కేరినట్లు.\n\n* గుడ్డు పెట్టలేక పెట్ట చస్తుంటే, తొక్కను పుంజు చూస్తుండినట్లు.\n\n* గుడ్డువచ్చి పెట్టను గోరడాలాడిన విధము.\n\n* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.\n\n* గుడ్డేద్దు చేల్లో(గడ్డిలో) పడినట్లు.\n\n* గుడ్లగూబను చంకలోబెట్టుకొని బయలుదేరినట్లు.\n\n* గుడ్లు తిన్నదికాక గూడెక్కి అరచినట్లు.\n\n* గుణముమానవే గూటాలపోలీ అంటే, నా మనువైనా మానుతాను గానీ నాగుణం మాననన్నదట.\n\n* గుణము కొఱకా గునుగు కొఱకా వచ్చింది.\n\n* గుణములేకయున్న గుణహీనురాలయా.\n\n* గుణములేకయున్న కుదురునా యూహలు?\n\n* గుణమేమి చేసిందే గునక కడ్డీ? అంటే, ఎప్పటి నాపేరు పంగలకడ్డీ అందట.\n\n* గుత్తికి పోయి గూటాం తెచ్చుకున్నట్లు.\n\n* గుద్ద ఒక్కటి గూటాలు పది.\n\n* గుద్ద నొప్పి గుడ్డుపెట్టే పెట్టకి తెలుసు.\n\n* గుద్దకు కళ్ళెం పెట్టినట్లు.\n\n* గుద్దులాడిన ఇంట్లో గుప్పెడు గింజలు నిలువవు.\n\n* గుప్పిలి మూసి ఉన్నంతవరకే, తెరిస్తే అంతా హుళక్కి.\n\n* గుబలకమ్మ చళ్ళుచూసి సన్యసిగాడు సంబరపడినాడు.\n\n* గుమ్మగట్టు జోగులు అమ్మకి ఇల్లు కట్టినట్లు.\n\n* గుమ్మడికాయంత తెలివి కంటే, గురిగింజంత అదృష్టం మేలు.\n\n* గుమ్మడికాయ దొరికిన నాడే తర్పణం వదిలినట్లు.\n\n* గుమ్మడికాయ పోయిన తావు గుర్తులేదుగానీ, ఆవగింజపోతే అద్దుక తిన్నందట.\n\n* గుమ్మడికాయ పోయేదారి తెలియక ఆవగింజకు అల్లలాడినట్లు.\n\n* గుమ్మడీకాయల దొంగ అంటే, బుజాలు తడుముకొన్నట్లు.\n\n* గుమ్మడీకాయలో ఆవగింజంత.\n\n* గుమ్మలో గింజలు గుమ్మలో ఉండాలి, పిల్లలు పిడుకల్లాగా ఉండాలి.\n\n* గుమ్మళ్ళు కుళ్ళినవి, ఆవాలు అల్లినవి.\n\n* గురికాడు నక్కను కొడుతాడా?\n\n* గురి కుదిరితే, గుణం కుదురుతుంది.\n\n* గురుగింజకి ఎన్నివన్నెలున్నా గొప్పలేదు.\n\n* గురిగింజ తన గుద్దకింద నలుపెరుగదు.\n\n* గురితప్పిన ములికి, బరితెగిన కలికి.\n\n* గురువుకన్నా గుడ్డు మంచిది.\n\n* గురువుకే కంకి దొరకకపోతే శిష్యుడికి ఊరబియ్యమా?\n\n* గురువుకి తగిన (మించిన) శిష్యుడు.\n\n* గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు.\n\n* గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టెది కష్టం.\n\n* గురువు కెగ్గుచేసినవానికి కృతఘ్నత్వమెంత?\n\n* గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరిగెత్తుతూ తాగుతాడు.\n\n* గురువు మాట ంఇరరాదు, గడ్డపార మింగరాదు.\n\n* గురువులు వస్తున్నారంటే, గోచులు విప్పి తోరణాలు కట్టమన్నారట.\n\n* గురువులేని విద్య గుడ్డివిద్య.\n\n* గుఱ్ఱం ఎక్కిన తిరు కాదు, సద్దితిన్న నోరు కాదు.\n\n* గుఱ్ఱం ఎక్కి మూట నెత్తిన పెట్టుకున్నట్లు.\n\n* గుఱ్ఱం ఎక్కేవాడే పడేది.\n\n* గుఱ్ఱం, గాడిదను ఒకటిగా చూచినట్లు (చేసినట్లు).\n\n* గుఱ్ఱం చవలం, జీను ముచ్చవలం. (చెవలం=ఒకనాణెం, పావలాలో 1/4 భాగం).\n\n* గుఱ్ఱం కడుపులో గాడిదపిల్ల పుట్టునా?\n\n* గుఱ్ఱము గుగ్గిళ్ళు తింటుంటే, గాడిదకు కడుపునొప్పి వచ్చిందట.\n\n* గుఱ్ఱము చచ్చిందికాక, గుంత తవ్వను ఒక రూక.\n\n* గుఱ్ఱము పేరు గోడా అయితే, గోడపేరు గుర్రం గాదా, ఇంకనాకు ఉరుదూ అంతా తెలుసు అన్నాడట.\n\n* గుఱ్ఱము పోతూ గూటాము పీకుకొని పోయినట్లు.\n\n* గుఱ్ఱము అశ్వమూ కలిసి గుశ్వమైనట్లు.\n\n* గుఱ్ఱానికి కొమ్ములు మొలిస్తే ఒక్కరినీ ఉండనీయదు.\n\n* గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తిన నేర్పవలెనా?\n\n* గుఱ్ఱానికి గుద్దలో కాలితే అరిగగడ్డికూడా మేస్తుంది.\n\n* గుఱ్ఱానికి సకిలింత, సంగీతానికి ఇకిలింతా ఉండాల.\n\n* గుఱ్ఱానికి, సన్యాసికి, విధవకు, బ్రహ్మచారికి ఎప్పుడూ మైధున చింతే.\n\n* గుఱ్ఱానికి తోక ఉండటం తనమటుకు తాను విసురుకోనేగానీ కడమ గుఱ్ఱాలకు విసురునా?\n\n* గుఱ్ఱాన్ని గుగ్గిళ్ళకు అమ్మినట్లు.\n\n* గుఱ్ఱాన్ని చూచి కుంట నారభించినట్లు.\n\n* గుఱ్ఱాన్ని చూస్తే కాళ్ళు నొప్పి.\n\n* గుఱ్ఱాన్ని తొట్టిదగ్గరకు ఈడ్చుకుపోగలమే గానీ త్రాగించలేము.\n\n* గుళ్ళోదేవునికి అంగట్లో బెల్లం నైవేద్యం.\n\n* గుళ్ళో దేవునికి నైవేద్యం లేకుంటే, పూజారి పులిహోర కేడ్చాడట.\n\n* గుళ్ళో పిత్తకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యం.\n\n* గువ్వకూర్చిన్న టెంకాయి, గూబకూర్చున్న కొంప కొరగావు.\n\n* గువ్వ గూడేక్కెను, అవ్వ మంచమెక్కెను.\n\n* గువ్వ గూడెక్కె, రాజు మేడెక్కె.\n\n* గుసగుసలు వచ్చి గుడీసెకు దాడితెచ్చె.\n\n* గుసగుస యోచనలు గుడిసెలు తీయటానికి కారణం.\n\n**********:: గూ ::**********\n\n* గూటి గూటంతో గుండెలు గుద్దుకొన్నట్లు.\n\n* గూట్లో దీపం, నోట్లో ముద్ద.\n\n* గూట్లో మిరపకాయ, గుంటలో బువ్వ.\n\n* గూట్లో మిరపకాయ చూస్తూ అన్నం తినమన్నట్లు.\n\n* గూదదిగిన పేరంటాలు అత్తగారింట ఉన్నా ఒకటే, అమ్మగారింట ఉన్నా ఒకటే.\n\n* గూనికి తోడు దొబ్బుడు వాయువు.\n\n* గూని గుగ్గిరిచ్చె, దండు దగ్గరొచ్చె.\n\n* గూని దున్నకంటే, గుడ్డిదున్న మేలు.\n\n* గూనివాని ఒడుపు పడుకొన్నప్పుడు చూడాలి.\n\n* గూనువీపు కుదురు అవుతుందా?\n\n* గూబ ఎక్కిన కొంప చెడును.\n\n* గూబ ఎక్కిన గృహము కూలు.\n\n**********:: గృ ::**********\n\n* గృహప్రవేశానికి వెడుతు గుడ్లగూబను చంకనబెట్టుకొని పోయినట్లు.\n\n**********:: గె ::**********\n\n* గెలువని రాజుకు గొప్పాలు మెండు.\n\n**********:: గే ::**********\n\n* గేదె ఉండగా, దూడ ఉండగా, గుంజకు వచ్చెరా గుఱకవాయువు అన్నట్లు.\n\n* గేదెదూడ ఉండగా గుంజ అరచిందట.\n\n**********:: గొ ::**********\n\n* గొంగట్లో అన్నం తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.\n\n* గొంగట్లో గుద్దులాట (ముసుగులో గుద్దులాట).\n\n* గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లు.\n\n* గొంతుకోసేవాడు కత్తి ఏమారునా?\n\n* గొంతు చిన్నది, గోలెము పెద్దది (గోలెము=కడుపు).\n\n* గొంతులో పుస్తెబొట్టు, గుంతనక్కంత మొగుడు.\n\n* గొంతెమ్మ కోర్కెలు, ఎండమావుల నీళ్ళు.\n\n* గొంతెమ్మ కోర్కెలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్కా పక్కా?\n\n* గొడారిబేరం గొడ్డుకు లాభం (గొడారి=మాదిగ).\n\n* గొడారి వద్ద తోలు కొన్నట్లు.\n\n* గొడుగు పట్టితే పిడుగుకు అడ్డమా?\n\n* గొడ్డెము తెగిన గ్రాసము పట్టదు.\n\n* గొడ్డలి ఎక్కడపెట్టినావురా? అంటే, కొట్టే చెట్టుదగ్గర; కొట్టె చెట్టు ఎక్కడుందిరా? అంటే, గొడ్డలిదగ్గర అన్నాడుట.\n\n* గొడ్డలిలో దూరినకఱ్ఱ కులానంతా కూలుస్తుంది.\n\n* గొడ్డావు పాలు గొద్రాలి కిచ్చినట్లు.\n\n* గొడ్డుకు ఎక్కువ డబ్బు, గుడ్డకు తక్కువ డబ్బు పెట్టాలి.\n\n* గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట.\n\n* గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి.\n\n* కొడ్డు కొఱికిన కొయ్యకాలు గొఱ్ఱెకు చాలు.\n\n* గొడ్డుటావు (గొడ్డుపోతు) పాలు పితికినట్లు.\n\n* గొడ్డుటావు గోకిన చేపునా?\n\n* గొడ్డును కొని తలుగుకు (వలుపుకు) ఏడుస్తాడు.\n\n* గొడ్డుపోతేమి ఎఱుగురా బిడ్డ చలి.\n\n* గొడ్డు బలిస్తే పాటుకి, మనిషి బలిస్తే కాటికి.\n\n* గొడ్డుపోతు ఆవు గోకితే పాలిస్తుందా?\n\n* గొడ్డు రైతు బిడ్డ.\n\n* గొడ్డులేని వాడు, బిడ్డలేనివాడు ఒకటే.\n\n* గొడ్డు వచ్చినవేళ, బిడ్డ (కోడలు) వచ్చినవేళ.\n\n* గొడ్డువాడు గొడ్డుకేడిస్తే, గొడావివాడు తోలుకేడ్చాడుట.\n\n* గొడ్డోడు గొడ్డుకేడిస్తే, మాలచచ్చినోడు చియ్య కేడ్చినాడుట.\n\n* గొడ్రాలికేమితెలుసు కాన్పునొప్పులు.\n\n* గొడ్రాలి ముండకు గొంతు పెద్ద.\n\n* గొడ్లు కాచేవాణ్ణి కొట్టనివాడు, గొర్రెలు కాచేవాడిని తిట్టనివాడు ఉండడు.\n\n* గొడ్డుకు పెత్తనమిస్తే గోదవరంతా తేలియాడిందట.\n\n* గొప్పగా తెలిసినవారే గోతిలోపడతారు.\n\n* గొప్ప సత్యాలు గొప్పవారివలనే నిరాడంబరంగా ఉండును.\n\n* గొప్పలేని బుద్ధి కొంచమైపోవురా\n\n* గొరగంగా మిగిలిందే జుట్టు.\n\n* గొరిగించి గోపినామం పెట్టినట్లు.\n\n* గొఱ్ఱు గుచ్చిన నేలకు కొఱత ఉండదు.\n\n* గొఱ్ఱె ఎంత ఎదిగినా తోక బెత్తెడే.\n\n* గొఱ్ఱె ఏడిస్తే తోడేలుకు కనికరమా?\n\n* గొఱ్ఱె కటికవాణ్ణి నమ్మినట్లు గొల్లవాణ్ణి నమ్మదు.\n\n* గొఱ్ఱెకు ఎదురు, గుఱ్ఱానికి వెనుక పోరాదు.\n\n* గొఱ్ఱె ఏడుస్తే తోడేలుకు విచారమా?\n\n* గొఱ్ఱె కొవ్వి సెలకట్టె కొరికిందట.\n\n* గొఱ్ఱె కొవ్వేదంతా కొల్లవానికే లాభం.\n\n* గొఱ్ఱెదాటు, ఏలంవెఱ్ఱి.\n\n* గొఱ్ఱెను అడిగి గొంతు కోస్తారా?\n\n* గొఱ్ఱెను తినేవాడు పోతే, బఱ్ఱెను తినేవాడు వచ్చినట్లు.\n\n* గొఱ్ఱె పడుకున్న చోట బొచ్చెంత రాలిందని చూచినట్లు.\n\n* గొఱ్ఱె పెంట ఏడాది, ఆవులపెండ ఆరేండ్లు.\n\n* గొఱ్ఱె బలిసి చింత కొరికినట్లు.\n\n* గొఱ్ఱె మంద కంటే, లోతు దుక్కి మేలు.\n\n* గొఱ్ఱెల మందలో తోడేలు పడినట్లు.\n\n* గొఱ్ఱెలు కాచినందుకు, లొడుగు తాగినందుకు సరి.\n\n* గొల్లకంపు గాలి కొట్టింది అత్తగారు అంటే, అంటు అయినది కుండలో నీరు పారబోయి కోడాలా అన్నదిట.\n\n* గొల్ల చల్ల పుల్లన, గున్న చింత నల్లన.\n\n* గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు.\n\n* గొల్ల మెండు ఇల్లు పట్టదు.\n\n* గొల్లల యిరదాళ్ళు (వీరత్రాళ్ళు) లేని గంగమ్మ కొలువు వలె.\n\n* గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెఱుక, గొఱ్ఱెల గోత్రాలు గొల్లలకెఱుక.\n\n* గొల్లవాడా ! గొల్లవాడా! ధాన్యం ఎక్కడుందీ? అంటే, నా గొఱ్ఱె ముడ్డిలో ఉంది అన్నాడట.\n\n* గొల్లవాడి ఇంట పెండ్లి తెల్లవారుతుంది.\n\n* గొల్లవాడి కొమ్ము హెచ్చనూ హెచ్చదు, తగ్గనూ తగ్గదు.\n\n* గొల్లవాడు గొఱ్ఱెపిల్లను చంకనుబెట్టుకొని, అడవంతా వెతికినట్లు.\n\n* గొల్ల సుద్దులు, గోవింద రొట్టెలు.\n\n* గొల్ల సుద్దులు, పిల్ల ముద్దులు.\n\n* గొల్లింట గుఱ్ఱాలు, కుక్కపిల్లలు, ఆవులు ఆడుబిడ్దలు.\n\n* గొళ్ళెంలేని తలుపు, కళ్ళెంలేని గుఱ్ఱము.\n\n**********:: గో ::**********\n\n* గోంగూరలో చింతకాయ వేసినట్లు.\n\n* గోకి దురద తెచ్చుకొన్నట్లు.\n\n* గోకుడుకు గోకుడే మందు.\n\n* గోకులాష్టమికి పీర్ల తిరునాళ్ళకు (పండుగకు) సంభందమేమి?\n\n* గోగు పెళు(డు)సు, గొల్ల బిరుసు.\n\n* గోచీకి ఎక్కువ కోకకు తక్కువ.\n\n* గోచీకి పెద్దా, కోకకు చిన్న.\n\n* గోచీకి పెద్ద, గవాంచాకు చిన్న.\n\n* గోచీకి మించిన దరిద్రం లేదు, ఈతకు మించిన లోతులేదు.\n\n* గోచిపాతల రాయడు దొంగలకు మిండడు.\n\n* గోచీలో గొంగడి చించుతాడు.\n\n* గోచీ విప్పి పాగా చుట్టినట్లు.\n\n* గోటితో పోయే మనికి (త్రుంచేపనికి) గొడ్డలి ఎందుకు?\n\n* గోడ ఉంటే చిత్రం వ్రాయవచ్చు.\n\n* గోడకుపూసిన సున్నము విడెములోనికి వచ్చునా?\n\n* గోడకు పెట్టిన సున్నము, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు.\n\n* గోడపై సున్నం గోకితే రాదు.\n\n* గోడదూకిన వాడెవడంటే, ఆలుచచ్చిన వాడన్నట్లు.\n\n* గోడనుబెట్టి త(డి)డక తన్నాలిగానీ, తడకగట్టి గోడను తన్నరాదు.\n\n* గోడపట్టుకో, కూలి అడిగివస్తాను.\n\n* గోడమీది పిల్లివాటము, కోమటి సాక్ష్యము.\n\n* గోడలకు చెవులుంటాయి, నీడలకు నోళ్ళుంటాయి.\n\n* గోతిని త్రవ్వినవాడే అందులో పడేది.\n\n* గోదావరి పారినా, కుక్కకు గతుకు నీళ్ళే గతి.\n\n* గోదావరి పారిందీ, గొద్దెలేరూ పారింది.\n\n* గోధుమలు వేస్తే బాదములు పండునా?\n\n* గోనెల కంటే గోతులు మెండు.\n\n* గోనెలే కొత్తవి, కోడె లెప్పటివే.\n\n* గోప్రదక్షిణము, భూప్రదక్షిణ ఫల మిచ్చినట్లు.\n\n* గోముఖ వ్యాఘ్రం.\n\n* గోరంత ఆలశ్యం, కొండంత నష్టం.\n\n* గోరంత నీరైనా గోతులు చేస్తుంది.\n\n* గోరంతను కొండంత చేయడం.\n\n* గోరీకాడ నక్కవలె.\n\n* గోరుచుట్టుపై రోకలిపోటు.\n\n* గోరువాచిన వేలంత, వేలువాచిన కాలంత, కాలువాచిన రోలంత, రోలువాచిన ఎంత?\n\n* గోల గోవిందుడిది, అనుభవం వేంకటేశ్వరునిది.\n\n* గోలుకొండ ఉద్యోగం గొఱ్ఱెతోక ఒకటి.\n\n* గోవధ కావించి గోరోజనం రోగార్తులకిచ్చిన పుణ్యాత్ముడగునా?\n\n* గోవును గోలెం (తొట్టి) దగ్గరకు తీసుకు వెళ్ళగలం కానీ, కుడితి తాగించగలమా?\n\n* గోవులకు కోసి చెప్పులు దానం చేసినట్లు.\n\n* గోవులేని ఊళ్ళో గోడుగేదే శ్రీమహాలక్ష్మి.\n\n* గోవే తల్లి, ఎద్దే తండ్రి.\n\n**********:: గ్ర ::**********\n\n* గ్రహచారం చాలకపోతే వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట.\n\n* గ్రచారం చాలక రాచారంపోతే, జన్మనక్షత్రంజూచి నెత్తి గొరిగినదట.\n\n**********:: గ్రా ::**********\n\n* గ్రామంలో ఒక కోమటి ఉంటే వెయ్యి రూపాయలు నష్టం, ఒక ఆబోతు ఉంటే వెయ్యి రూపాయలు లాభం.\n\n* గ్రామమిచ్చిన దాత ఇల్లు కట్టించి ఇవ్వలేడా?\n\n* గ్రామశాంతికి బోడితల.\n\n* గ్రాసం లేని కొలువు-మీసంలేని బ్రతుకు.\n\n* గ్రాసం లేని కొలువు- రసంలేని కావ్యం.\n\n* గ్రాసం లేని బంతుకు రోసం ఎక్కువ.\n\n**********:: ఘ ::**********\n\n* ఘంటాకర్ణునికి అష్టాక్షరి ఉపదేశం చెయ్యబోయినట్లు.\n\n* ఘటము లెన్నియైన గగనంబదేకమౌ.\n\n* ఘడీయకు హాజీ, ఘడియకు ఫాజీ\n\n* ఘడియ తీరుబాటు లేదు, దమ్మిడి ఆదాయం లేదు.\n\n* ఘడియ పురుసత్తు లేదు, గవ్వ సంపాదన లేదు.\n\n* ఘనమగు పులి గోరూపము కాగానే బిడ్డకు పాలు కల్గునా?\n\n**********:: ఘో ::**********\n\n* ఘోటక బ్రహ్మచారి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 866,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-గ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* చంకకు ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు.\n\n* చంకజోలి చిల్లి పోలేదు, చందలూరు కాలిపోలేదు.\n\n* చంక దుడ్డుకు దండం అన్నట్లు.\n\n* చంకదుడ్డు శరణార్ధి.\n\n* చంకన పిల్ల కడుపులో పిల్ల.\n\n* చంకలోతుకు దిగిన వానికి చలి ఏమి?\n\n* చంకలో పిల్లనుంచుకొని, ఊరంతా గాలించినట్లు.\n\n* చంకలో పిల్లనుంచుకొని, సంతలో వెదకినట్లు.\n\n* చంకలో పిల్లను పట్టుకొని, లంకలన్ని వెదకినట్లు.\n\n* చంటిలో ఎముకలు ఏరినట్లు.\n\n* చండామార్కుల విద్య చేతులు కావు కాళ్ళు.\n\n* చందమామకు తోకవచి, 'ఈ' కు ఇఱకాటమైనట్లు.\n\n* చంద్ర పరివేషము, వర్షయోగము.\n\n* చంద్రుడు క్రుంకిన వెన్నెల నిలుచునా?\n\n* చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్లు.\n\n* చంద్రునికి ఒక నూలుపోగు.\n\n* చంద్రునిలో కందు వెన్నెలలో గలదా?\n\n* చక్కగా కూకోరా చాకలి నాయడా ! అంటే, విన్నవటోయ్ ఈడిగనాయడా ! మంగలి నాయడి సరసం అన్నాడట.\n\n* చక్కదనానికి లొట్టపిట్ట, సంగీతానికి గాడిద.\n\n* చక్కనమ్మ చిక్కినా చక్కనే (అందమే).\n\n* చక్కని రాజమార్గముండగ సందుల దూరనేల?\n\n* చక్కనివాళ్ళు చిక్కినా బాగుంటారు, సన్నచీర మాసినా బాగుంటుంది.\n\n* చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.\n\n* చక్కిలాలు తింటావా? చల్ది తింటావా? అంటే, చక్కిలాలూ తింటాను, చల్ది తింటాను, అయ్యతోగూడా అవతల అన్నమూ తింటాను అన్నదిట.\n\n* చక్కెర తిని చేదు అన్నట్లు.\n\n* చక్కెర తిను నోరు చవిగొనునే చేదు.\n\n* చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు.\n\n* చక్కెర పూసిన విషమువలె.\n\n* చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు.\n\n* చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలి చేస్తే వ్యభిచారం.\n\n* చచ్చిన ఆవుమీద చెప్పు లుంచినట్లు.\n\n* చచ్చిన గొడ్డుకు బొరవలు, పుండుకు ఈగలు కనిపెట్టుకు ఉంటవి.\n\n* చచ్చిన చారమేకపాలు, పోయిన బోసిముంతెడు.\n\n* చచ్చిన తరవాత తెలుస్తుంది (బయటపడుతుంది) సెట్టి భండారం.\n\n* చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళకింద.\n\n* చచ్చినట్టు కలవచ్చినా మేలుకోక తప్పదు.\n\n* చచ్చిననాటి దుఃఖం మరునాడు ఉంటుందా?\n\n* చచ్చినపామును కొట్టడానికి అందరూ బంట్లే.\n\n* చచ్చినపామును చావగొట్టినట్లు.\n\n* చచ్చిన బిడ్డకు చారెడు కండ్లు.\n\n* చచ్చిన మొగుడు చనుబాలు మీద, బతికిన మొగుడు మంచం మీద.\n\n* చచ్చినవాడి కండ్లు పత్తికాయలంత.\n\n* చచ్చినవాని కండ్లు చారెడేసి.\n\n* చచ్చినవాడి తల తూర్పున ఉంటేనేమీ? పడమటనుంటే నేమి?\n\n* చచ్చినవాని పెండ్లికి వచ్చిందే లాభం.\n\n* చచ్చినవాని పెండ్లికి వచ్చినంతే కట్నం.\n\n* చచ్చినవారు వత్తురే ఏడ్చినంత.\n\n* చచ్చినా పైకం తప్పదు అచ్చమ్మా! ఇక తిట్టకు.\n\n* చచ్చినోడి గద్ద తక్కెడో, బిక్కెడో.\n\n* చచ్చినోడు చాటెడంత.\n\n* చచ్చిపోయిన బఱ్ఱె పగిలిపోయిన ముంతెడు పాలిచ్చేది.\n\n* చచ్చేకాలానికి సత్యభామ వేషం వేసినట్లు.\n\n* చచ్చేటప్పుడు సంధ్య మంత్రమా?\n\n* చచ్చేటప్పుడు సారె కావిళ్ళు.\n\n* చచ్చేదాకా బ్రతికితే పెళ్ళిచేస్తానన్నట్లు.\n\n* చచ్చెదాకా వైద్యుడు వదలడు, చచ్చినా పంచాగం బ్రాహ్మడు వదలడు.\n\n* చచ్చే పెళ్ళాన్ని ' అమ్మా ' అంటే బ్రతుకుతుందా?\n\n* చచ్చే రోగికి మందు పట్టదు.\n\n* చచ్చేవానికి సముద్రం మోకాలిబంటి.\n\n* చట్టిలోకి కూరాకు, ముడ్డిలోకి మేకు తెచ్చుకుంటేగానీ రావు.\n\n* చట్టిలో ఉంటే అబకకు వస్తుంది (అబక=కొబ్బరి చిప్పతో చేసిన గరిట).\n\n* చట్టుబొమ్మకు గిలిగింత పెట్టినట్లు.\n\n* చట్రాతిన వార తీసినట్లు.\n\n* చట్రాతిలో నీరు, చండాలవాటికలో బ్రాహ్మణగృహం ఉంటుందా?\n\n* చతురతకు జాణగాడే కానీ, చేతిలో చిల్లిగవ్వ లేదు.\n\n* చనవిచ్చిన ఆలి చంకకెక్కు.\n\n* చదివింది, చదువనిది ఒకటిగా ఉండడమే పండితలక్షణం.\n\n* చదివిన కూతలుంటే, ఉణ్ణీగానీ, సంచులుమాత్రం ముట్టవద్దు.\n\n* చదివి నతని కంటే చాకలి సతిమేలు.\n\n* చదివినవాడికన్నా చాకలివాడు మేలు.\n\n* చదివేది రామాయణం, పడకొట్టేది దేవాలయం.\n\n* చదవక ముందు కాకరకాయ, చదివిన వెనుక కీకరకాయ.\n\n* చదివిన ముందు పెసలంటు, చదివిస్తే పిసలన్నట్లు.\n\n* చదవక ముందు వరవర అంటే, చదివిన వెనుక వడవడ అన్నడట.\n\n* చదువనేర్చిన ఆడవారితోనూ, వంటనేర్చిన మొగవారితోనూ ఓపలేము.\n\n* చదువ నేర్తువా? వ్రాయనేర్తువా? అంటే, చదువ నేరను, చించ నేర్తును అన్నాడట.\n\n* చదువరి మతికన్నా చాకలి మతి మేలి.\n\n* చదువేస్తే ఉన్న మతి పోయినట్లు.\n\n* చదువాలేదు మరువా లేదు.\n\n* చదువుకున్న వాడికీ సేద్యగాడే అన్నం పెట్టవలె.\n\n* చదువుకు ముదురు, సాముకు లేత.\n\n* చదువుకోనన్నాళ్ళు పసులు పసులు అని, చదువుకొన్నాక పచులు పచులు అన్నాడట.\n\n* చదువు, చన్ను విడిచి చన్ను పట్టుకునేలోపల రావాల.\n\n* చదువు చారెడు, బలపాలు దోసెడు.\n\n* చదువు మా ఇంట లేదు, సంధ్య మావంశాన లేదు.\n\n* చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు\n\n* చదువుల చెట్టుకు వేళ్ళు చేదుగానీ పండ్లు తీపు.\n\n* చదువు చదివెడి అయ్యలు పదవులు పొందంగలేరు.\n\n* చదువు సంధ్య లేకుండా మాదిగ వెధవవుతున్నావన్నది విని, మాదిగ- అరె అత్తాలేకుండా బ్యామ్మణ గాడిద అవుతున్నా వన్నాడట.\n\n* చదు సన్నమయ్యె, అయ్య లావాయె.\n\n* చదువు లేదు సంధ్య లేదు, సంతానం మాత్రం మెండు.\n\n* చద్ది కంటే ఊరగాయ ఘనం.\n\n* చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలెరుగదు.\n\n* చద్ది తెచ్చుకున్న బ్రహ్మణుడా! భోజనం చెయ్యి.\n\n* చద్ది నాకు పెట్టమ్మా, ఆకలికాకుండా నీకు మందిస్తా అన్నాడుట.\n\n* చద్ది పురిసెడు, ఊరగాయ దోసెడు.\n\n* చద్ది మూటలో సారం చాకలి ఎరుగును.\n\n* చద్దెన్నం మీద వెన్న చంద్రుడౌతుందా?\n\n* చన విస్తే చంక కెక్కినట్లు.\n\n* చనువు చేసిన ఆలి చంక కెక్కు.\n\n* చన్ను కుడిచి, రొమ్ము గ్రుద్దినట్లు.\n\n* చన్ను, తోటకూరా చెయ్యి తగలనిదే పెరుగవు.\n\n* చమురు దండుగ భాగవతం (భాగోతం).\n\n* చమురు నష్టియే గానీ పిల్ల బ్రతుకదు.\n\n* చమురున్న పెంకు ఎప్పుడూ పేలదు.\n\n* చరిత్ర పునరావృత్తు నొందును.\n\n* చరిత్ర వివేకులకు దారిచూపి, అవివేకులను వెంట ఈడ్చుకొనిపోవును.\n\n* చలాకి లేకపోయినా సలాకిలా ఉండాలి.\n\n* చలికి జడిసి కుంప టెత్తుకొన్నట్లు.\n\n* చలిజ్వరము: అన్నంలో చెయ్యి తియ్య బుద్ధికాదు.\n\n* చలి దూరందే బీర పూయదు.\n\n* చలిబడనేల, సీతుగాయనేల?\n\n* చలివేంద్ర కుండలకు తూట్లు పొడిచినట్లు.\n\n* చల్లకుండకు, చంటిబిడ్డకు చాటుండాలి.\n\n* చల్లకు వచ్చి ముంత దాచనేల?\n\n* చల్లకేంగానీ, గొల్లది బాగుందన్నాడట.\n\n* చల్లకు బాలును గలసిన చల్లకు దోడంటినట్లు.\n\n* చళ్ళు చూచుకొని సంబరపడితే సరా? ముందరి పాటు చూసుకో అన్నాడట (ముడ్డిపడే పాటు చూసుకో).\n\n* చళ్ళు జారిన ముండకు, వట్టలు జారిన విటకాడు.\n\n* చవి ఎరిగిన కుక్క చావకొట్టినా పోదు.\n\n* చవితి చంకనాకి నట్టే ఉంది ఏకాదశి అన్నాడట.\n\n* చవిటి ఉప్పు కందచక్కెరవలేనున్నా, అనుభవసుఖం లేదు.\n\n* చవిలేని కూడు కుడిచినట్లు.\n\n* చవిసారం లేని కూర చట్టి నిండా, ఆంగంపాగంలేని మొగుడు మంచం నిండా.\n\n* చవిసారం లేనివాడు సంచారంపోతే, ముసలినక్కలన్నీ గుసగుస లాడినవట.\n\n* చవుక (చౌక) కొననివ్వదు, ప్రియం అమ్మనివ్వదు.\n\n* చస్తానని చద్దెన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందట.\n\n* చస్తూ ఉంటే సంద్యమంత్రం చెప్పమన్నట్లు.\n\n* చస్తే చచ్చాడుగానీ, చలిజ్వ్రం చప్పగా వదిలింది.\n\n* చస్తేగానీ బఱ్ఱెపాడి బయటపడదు.\n\n**********:: చా ::**********\n\n* చాకలి అత్త, మంగలిమామ. కొడుకు సాలోడైతేనేమి? సాతానోడైతేనేమి?\n\n* చాకలి కట్టని గుడ్డ, సైను ఎక్కని గుఱ్ఱము లేదు (సైను=గుఱ్ఱము కాపరి).\n\n* చాకలి కొత్త, మంగలి పాత.\n\n* చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప, అయ్యదగ్గర ఏమీలేదు.\n\n* చాకలిదాని చక్కదనానికి సన్యాసులు గుద్దుకొని చచ్చారుట.\n\n* చాకలిదానితో సహవాసం చేస్తే, గాడిద వచ్చి గర్వపడిందట.\n\n* చాకలిది సందెఱుగదు, మాలది మంచమెఱుగదు.\n\n* చాకలిని క్షవరం చెయ్యమంటే, చెక్కుతీసి చేతిలో పెట్టినాడట.\n\n* చాకలిమంగలి పొత్తు, ఇంటికి రాదు విత్తు.\n\n* చాకలివాడి భార్యకు మంగలివాడు విడాకులిచ్చినట్లు.\n\n* చాకిరిచేసే చాకలికి లేదుగానీ, గొరిగే కొండయ్యకిస్తారు.\n\n* చాకిరేవు ఒకచోట, ఏలపాట ఇంకొకచోట.\n\n* చాటెడు తిని చెడితి, వాకిలిదాటి పడితి.\n\n* చేదను చూచి బొక్కెనబాయిలో ఏసిందట.\n\n* చాదస్తం అంటే, చెరిసగం అన్నట్లు.\n\n* చాదస్తం మొగుడా, నీ చారెడు వేరే వండుకో అన్నట్లు.\n\n* చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు.\n\n* చాదస్తపు మొగుడు చెపితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.\n\n* చాదస్తపు మొగుడు చెపితే వినడు, కొడితే ఏడుస్తాడు.\n\n* చాప చిరిగినా చదరంత కాదు.\n\n* చామలి చల్లి చేనువిడవాల.\n\n* చామచేలకు వరిగకు పోయినట్లు.\n\n* చాలకపోతే బలాదూరు అన్నట్లు.\n\n* చాలని బట్టకొంటే చినిగేవరకు దుఃఖము, చాలని మొగుని చేసుకుంటే చచ్చేవరకు దుఃఖము.\n\n* చాలమ్మా ! నీ ఇరుస రాగుల గద్దె.\n\n* చాలీచాలని దానికి చాకలి సంతు అన్నట్లు.\n\n* చాలుపై చాలు ది=ఉన్నితే చచ్చుచేనైనా పండుతుంది.\n\n* చాలులో చాలులేకపోతే నాపాలెక్కడికిపోతుంది?\n\n* చావడిముందరి కొంప కదపాపుల్లకు సరి.\n\n* చావతీరనంత పని అయినా చారెడూ గంజికి దోవలేదు.\n\n* చావా చావడూ, చాపా ఇవ్వడు.\n\n* చావాలని సన్యాసం తీసుకొంటే గంత బొంత గాడిదమోత అయినదట.\n\n* చావుకంటే గండంలేదు, గోచికంటే దరిద్రం లేదు.\n\n* చావుకబురు చల్లగా చెప్పమన్నారు.\n\n* చావుకాలానికి సమర్త కట్నాలు.\n\n* చావుకు చావు ఉన్నదా?\n\n* చావుకు పెడితేగానీ లంఖణాలకు తేలదు.\n\n* చావుకు ముదురు-లేత ఉన్నదా?\n\n* చావుకు వెరచి చాటుకుపోతే, మిత్తి వచ్చి ముందర కూర్చున్నదట.\n\n* చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.\n\n**********:: చి ::**********\n\n* చింతకాయల కాఙ్ఞగానీ, గ్రుక్కిళ్ళ కాఙ్ఞా?\n\n* చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకరటింకరవి ఏమికాయలు అన్నదట.\n\n* చింతకాయలు ఎరుగని దొరసాని, చింతకాయలనుచూసి, కొడవళ్ళా అన్నదిట.\n\n* చింతకాయలు తిన్ననోర కొఱ్ఱలు తిననగునా?\n\n* చింతకాయలు బేరం చేస్తు, వంకరటింకర కాయలేమి అన్నట్లు.\n\n* చింత చచ్చినా పులుపు చావలేదు.\n\n* చింతజిక్కిన మనసు, అగ్గిపొంత వెన్న.\n\n* చింతదూత తూతిందే అన్నదట ఒకతె, తూతేకాలం వస్తే తూతదా అన్నాడట ఇంకొకాయన. దొందూ దొందే అన్నాడట మూడో ఆయన.\n\n* చింతపండితే, జీడి పండదు.\n\n* చింతపండు అంటే, సొంతకుండ తెస్తాడు.\n\n* చింత లేదు, చింతలేకపోతే పులుసు లేదు.\n\n* చింతలేని అంబలి చారెడే చాలు.\n\n* చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట.\n\n* చింతాకంత బంగారం- మెడచుట్టు తీగె కావాలన్నట్లు.\n\n* చింత చిగిరింత ఏపు (చిగిరింత=ఒక విధమైన బీటిగడ్డి).\n\n* చింతపులుసు కన్నా చిక్కగ, పచ్చిపులుసుకన్న పలుచగ.\n\n* చింతలు పూస్తే సిరులు, మామిళ్ళు పూస్తే మరణాలు.\n\n* చిక్కని పాలు మీగడలుండగ చీయను గంగాసాగర మేల? (గంగాసాగరం=కల్లు).\n\n* చిక్కానికి చేరులు తీసినట్లు.\n\n* చిక్కి చికిలించేకన్నా, వెళ్ళీ వెక్కిరించేది మేలు. (చికిలించు=చింతించు).\n\n* చిక్కితే దొంగ, చిక్కకుంటే దొర.\n\n* చిక్కిన తగువా? చిక్కని తగువా?\n\n* చిక్కినవాడు సిగ్గెరుగడు, బలసినవాడు వావి ఎరుగడు.\n\n* చిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా కఱుస్తుంది.\n\n* చిక్కుడు గింజకు తన పాదే తెలియదు.\n\n* చిక్కుడు తీగకు బీరకాయ కాస్తుందా?\n\n* చిక్కుదీసి కొప్పు పెట్టినట్లయింది.\n\n* చిక్కుల గుఱ్ఱానికి కక్కుల కళ్ళెము.\n\n* చిగిరింత మొక్క చింతచెట్టుతో ఢీకొన్నదట.\n\n* చిగిరించే కోరిక చేతిలో దాగదు.\n\n* చిచ్చు అంటుకొంటే చేతులతో ఆపగలమా?\n\n* చిచ్చు ఉఱుకంగబోతూ చీర సవరించుకొన్న దానివలె.\n\n* చిచ్చుకు తోడు కరువలి.\n\n* చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి, బావిగలవారి కోడలు పనిమంతురాలు.\n\n* చిచ్చుని ఒడిగట్టి తెచ్చినట్లు.\n\n* చిచ్చుని కౌగిలించుకుంటే చిమిడించు.\n\n* చిటికినవ్రేలు శ్రీపతి.\n\n* చిటికలో పందిరి వేసినట్లు.\n\n* చిట్టెడు నూనె తెచ్చి, చిన్నింట్లో దీపం, పెద్దింటిలో దీపం; వత్తికి, వదిన నెత్తికి; మంగలివాని కత్తికి, మాబావ జుత్తుకు.\n\n* చితి చచ్చినవానిని, చింత బ్రతికినవానిని కాలుస్తుంది.\n\n* చిత్తం చెప్పులమీద, ధ్యానం దేవునిమీద.\n\n* చిత్తం మంచిదైతే, చేదూ (తీపు) మంచిదవుతుంది.\n\n* చిత్తం శివుడిమీద, భక్తి చెప్పులమీద.\n\n* చిత్తం శివుడిమీద, భక్తి పెరుమాళ్ళమీద.\n\n* చిత్త ఎండకు పిట్టల తలలు పగులును.\n\n* చిత్తకార్తె కుక్కల్లాగా.\n\n* చిత్తకు చిఱుపొట్ట (వరి).\n\n* చిత్త కురిస్తే చింతలు కాయును.\n\n* చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే, అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.\n\n* చిత్త చిత్తగించి, స్వాతి చల్లగా చూచి, విశాఖ విసరకుంటే, వీసానికి పుట్టెడు పండుతాను అన్నదట జొన్న.\n\n* చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడుతుంది.\n\n* చిత్త జల్లు- చిత్త ఉబ్బ (ఉబ్బ=ఉక్క).\n\n* చిత్త జల్లు-స్వాతి వాన.\n\n* చిత్తరమైన మొగుడు ఉత్తరం వేస్తే, చింతలతోపులోకి వెళ్ళి చదివించుకొంటే ఇంకా చిత్తరంగా ఉందట.\n\n* చిత్తరు చెడియుండ రొత్త ఒడలన్ చవిచేరునా?\n\n* చిత్తరువునకు జీవం వచ్చినట్లు.\n\n* చిత్తలో చల్లితే, చిట్టెడు కాపు.\n\n* చిత్తలో చల్లితే చిత్తుగా పండును-ఉలవ.\n\n* చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు.\n\n* చిత్తశుద్ధికలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువకాదు.\n\n* చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?\n\n* చిత్త స్వాతి సంధించినట్లు (ఎక్కువ వానలు).\n\n* చిత్త స్వాతులు కురవకపోతే చీమకు కూడా నాంబ్రం.\n\n* చిత్త స్వాతులు చిత్తగించి, విశాఖ ఒక విసరు విసరితే, మొదలు తంతే ఏడుగింజలు రాలతాయి.\n\n* చిత్రం చూడండి చీమ గుడ్డు పెట్టింది; బూటకం చూడండి బురక గుడ్లు పెట్టింది (బురక=గువ్వజాతి పిట్ట).\n\n* చిత్రప్రభందము లల్లగలిగినవాడే కవి, అనిలో నరుక గలిగినవాడే అవనీశుడు.\n\n* చిత్రినెలలో దుక్కి, పుటం పెట్టిన (వేసిన) పుత్తడి (చిత్రి=చైత్రము).\n\n* చిదంబర రహస్యం (ఆకాశలింగం, ఏమీ లేదని).\n\n* చిదికి చిదికి చిన్నవాని పెండ్లి చేసేవఱకు, పెద్దవాని పెండ్లాము పెద్దలలోకి పోయిందట.\n\n* చిన్న పేరి తాడు తెగితే పెద్దపేరి తాడు అప్పుడే తెగుతుంది (పేరి=తమిళంలో శివుడు).\n\n* చినికి చినికి గాలివాన అయినట్లు.\n\n* చినిగిన బట్ట బరువుకు వెరుస్తుందా?\n\n* చినిగిన వానిదే చిరుగుతుంది గానీ, చాకలివాని కొడుకు చందమామ.\n\n* చినుకులకు చెరువు నిండునా?\n\n* చిన్నక్కను పెద్దక్కను, పెద్దక్కను చిన్నక్కను చేసినట్లు.\n\n* చిన్న ఇల్లు కట్టుకొని పెద్ద కాపురం చేయవలె.\n\n* చిన్నచేపను పెద్దచేప మింగితే, పెద్దచేపను బేస్తావాడు మింగుతాడు.\n\n* చిన్ననాడులేవు, చంద్రశేఖరుడినాడు పోగులా?\n\n* చిన్న నోటికి పెద్ద మాట.\n\n* చిన్నన్న గుఱ్ఱం చిట్లికి పోయె, పెద్దన్న గుఱ్ఱం పెండ్లికి పోయే.\n\n* చిన్నపామైనా పెద్ద కఱ్ఱతో కొట్టవలె.\n\n* చిన్న పునర్వసు కార్తెలో చిట్టెడు విత్తితే గరిసెడు పండును.\n\n* చిన్నపుల్లైనా పల్లుగుచ్చ పనికివస్తుంది.\n\n* చిన్నప్పటినుంచి చింతకాయలు అమ్మి, ఆ వంకరటింకరకాయల పేరేమి రాజా? అన్నదిట.\n\n* చిన్నమూ కావెలె, చిదరా కావలె, మేలిమీ కావలె, మెడా తిరుగవలె.\n\n* చిన్నమ్మకు (పిన్నమ్మకు) మీసాలుంటే చిన్నాయన.\n\n* చిన్నమ్మ సిందేస్తే, చీరదారి చీరది, సింగారందారి సింగారానిది.\n\n* చిన్నమ్మ సింహద్వారాన్న వస్తే, పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది.\n\n* చిన్న రాతితో ముడ్డీ తుడుచుకొని చేయ్యంతా పీయి చేసుకొన్నట్లు.\n\n* చిన్నవాళ్ళు తింటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే పలహారం.\n\n* చిన్న నా పొట్టాకు శ్రీరామరక్ష.\n\n* చిప్పతెచ్చుకోరా తిమ్మా అంటే, అట్లా చెప్పు మాయమ్మా అన్నాడట.\n\n* చిమ(మ్మ)టను చీరేమి చేసింది? చీడపురుగును చేనేమి చేసింది?\n\n* చిమ(మ్మ)ట సింగమా? గాజు రత్నమా?\n\n* చిమడకే చినడకే ఓ చింతకాయ, నీవెంత చిమిడినా నీ పులుపు పోదు.\n\n* చియ్యబువ్వ చీకులాట, గొల్లాడువస్తే గోగులాట.\n\n* చియ్యోడొచ్చి, బువ్వోడిని తీసుకుపోయినట్లు.\n\n* చిఱుతపులి కడుపున పెద్దపులి పుట్టినట్లు.\n\n* చిలుంపట్టెవాడికి చిత్తం కుదరదు.\n\n* చిలుంవదిలితేగానీ ఫలం దక్కదు.\n\n* చిలుం వదిలితే చిద్రం (చిద్రం) వదులుతుంది.\n\n* చిలుకకు చెక్కెర, చీమకు పంచదార.\n\n* చిలుకకూన బ్రహ్మాస్త్రమునకు తగునా?\n\n* చిలుక తనముద్దేకానీ ఎదుటిముద్దును కోరదు (ఎరుగదు).\n\n* చిలుకని పెంచి బావురుగానికి అప్పచెప్పినట్లు.\n\n* చిలుక పంజరంలో గూబను పెట్టిన ఉలుకు గానీ పలుకునా?\n\n* చిలుకబోయిన పంజరమేమి చేయును?\n\n* చిలుక ముక్కున దొండపండు ఉన్నట్లు.\n\n* చిల్లర దేవతలకు మొక్కి, చిత్తం చెడగొట్టుకొన్నట్లు.\n\n* చిల్లర శ్రీమహాలక్ష్మి.\n\n* చిల్లి పేరే తూటు.\n\n* చిల్లి బాగాలేదని బెజ్జం వేసాడట.\n\n* చివికు పోవ, చేప దొరికినట్లు.\n\n**********:: చీ ::**********\n\n* చీకటింటికి పోతే సిగ్గాయితది అంటే, అట్లయితే సంసార మెట్లయితది? అన్నాడట.\n\n* చీకటింట్లో సివాలాడినట్లు.\n\n* చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు.\n\n* చీకటి తన నల్లదుప్పటితో అందరినీ సమానంగా కప్పును.\n\n* చీకటిలోనే తాంబూలం.\n\n* చీకటి లేకుంటే దీప మేమిటికి?\n\n* చీకితే లేనిది నాకితే వస్తుందా?\n\n* చీడ అంటుతుందేకానీ, సిరి అంటదు.\n\n* చీడ సిగ్గెరుగదు.\n\n* చీదితే ఊడేముక్కు ఎన్నాళ్ళు నిలుస్తుంది? (ఉంటుంది?)\n\n* చీద్రానికి చీరపేలు, దరిద్రానికి తలపేలు.\n\n* చీపురుకట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు.\n\n* చీపురుకట్టకు సిరివస్తే, కోడిఈక గొడుగుపట్టెనట.\n\n* చీమ ఒళ్ళు చీమకు బరువు, ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు.\n\n* చీమలు చెట్టెక్కితే, భూములు పండును (వానలుపడును).\n\n* చీమరు పాకిన రాళ్ళు అరుగునా?\n\n* చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవగును.\n\n* చీర కట్టినమ్మ శృంగారం చూడు, గుడ్డకట్టినమ్మ కులుకు చూడు.\n\n* చీరకు కండె మొదలు, చిన్నవాడికి ఉపనయనం మొదలు.\n\n* చీరకట్టినమ్మ సింగారం ఏమి చూస్తావు? ఏలికలు కట్టినమ్మ ఎగిరింతలు చూడు.\n\n* చీర చిత్తారు, రవిక జల్తారు.\n\n* చీర చిరుగును, పయ్య పెరుగును.\n\n* చీరపేల బొంత ఎప్పుడైనా కాలవేసేదే.\n\n* చీరపోగా నాకో మొగుడు.\n\n* చీరపోతుకు సిరివస్తే, గోలకొండకాడికి గొడుగు తెమ్మన్నదట.\n\n* చీరపోతు లేరివేయటంకన్నా, బొంతను కాల్చివేయటం నిమ్మళం (మేలు).\n\n* చీర సింగారించేప్పటికి, పట్నమంతా చూర (కొల్ల) పోయిందట.\n\n* చీర సింగారించేప్పటికి, ఊరు మాటుమణిగింది.\n\n* చీరే స్త్రీకి శృంగారం.\n\n* చీలమడిమలదాకా చీర ఉంటే, మోకాలుదాకా సిరి ఉంటుందనుకొన్నట్లు.\n\n**********:: చు ::**********\n\n* చుక్కలూళ్ళో చక్కిలాలు.\n\n* చుట్టం ఆకలి మంచాని కెరుక.\n\n* చుట్టంగా వచ్చి దెయ్యమై పట్టుకొన్నాడట.\n\n* చుట్టకాలిస్తే మాట్లాడనీయదు.\n\n* చుట్టం వచ్చాడంటే, చెప్పులు ఎక్కడవదిలాడో చూసిరా అన్నట్లు.\n\n* చుట్టతాగి చూరులో పెడితే ఇల్లుకాలి వెళ్ళవలసి వచ్చిందట.\n\n* చుట్టము చేప మూన్నాళ్ళకు మురుగుకంపు కొట్టును.\n\n* చుట్టమై చూడవస్తే దెయ్యమై పట్తుకున్నాడట.\n\n* చుట్టరికం, పేరంటం కలిసివచ్చినట్లు.\n\n* చుట్టాలకు పెట్టినిల్లు చూఱపోయింది, వేల్పులకు పెట్టినిల్లు హెచ్చిపోయింది.\n\n* చుట్టు అయినా మెట్టదారి మేలు. (దారిన పొమ్మన్నారు).\n\n* చుట్టు అయినా సుఖంగా పొయేదిమేలు.\n\n* చుట్టు అయినా సుళువుదారి మేలు.\n\n* చుట్టుకపోయే చాప, మూసుకుపోయే తలుపు, అలిగిపోయే పెండ్లాము.\n\n* చుట్టుడు చాప, విసురుడు తలుపు, పెడసరపు పెండ్లాము.\n\n* చుట్టూ చూరుమంగళం, నడుమ జయమంగళం.\n\n* చుట్టూరా శ్రీవైష్ణవులే, చూస్తే కల్లుకుండ లేదు.\n\n**********:: చూ ::**********\n\n* చూచింది పాము, కఱచింది మామిడిటెంక.\n\n* చూచిందెల్లా సుంకము, పాసిందెల్లా పంకము.\n\n* చూచిగానీ తాగవలదు, చదివిగానీ వ్రాలుంచవలదు.\n\n* చూచినమ్మ కళ్ళు శూలాలు, మా అమ్మ కళ్ళు పేలాలు.\n\n* చూచి మురుసుకొని, చెప్పి ఏడ్చుకొని.\n\n* చూచిరమ్మంటే కాల్చివచ్చినాడట.\n\n* చూచిరమ్మంటే పెండ్లాడి వచ్చినట్లు.\n\n* చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి, చేసే వారుంటే పిల్లలు కనాలి.\n\n* చూడగా చుట్టము లేడు, మ్రొక్కగా దైవము లేడు.\n\n* చూడగా చూడగా గుఱ్ఱం గాడిద అయిందట.\n\n* చూడను చుంచెలుక, గోడలు తవ్వను పందికొక్కు.\n\n* చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు.\n\n* చూడబోతే చుండెలుక (చుంచెలుక) తెంచేదేమో తోలుమోకులు.\n\n* చూడబోతే వెండిగిన్నె, తాగబోతే వెలితిగిన్నె.\n\n* చూడవచ్చిన వారికి శుక్రవారమేమి?\n\n* చూడవమ్మా సుతారాం! ఇంటావిడ అవతారం.\n\n* చూపనిదే చూపెనయ్య నూరవరాజా.\n\n* చూపితే మానం పోయె, చూపకపోతే ప్రాణం పోయె.\n\n* చూపులకు గుఱ్ఱమే కానీ, మఱుకుతనం లేదు (చుఱుకుతనానికి గాడిద).\n\n* చూపులకి చుంచు, పనికి పర్వతం.\n\n* చూపులకు మొగుడే కానీ సుఖానికి మొగుడు కాదు.\n\n* చూపుల పసేగానీ చేపుల పస లేదు.\n\n* చూరులో నిప్పు పెట్టి, కొప్పులో పెట్టనా అన్నట్లు.\n\n* చూస్తూ ఊరకుంటే, మేస్తూ పోయిందట.\n\n* చూస్తే చుక్క, లేస్తే కుక్క.\n\n* చూస్తే నీది, చూడకుంటే నాది.\n\n* చూస్తే పొరపాటు, చూడకుంటే సాపాటు.\n\n* చూస్తే సుంకం, చూడకుంటే బింకం.\n\n* చూస్తే సూది మాదిరి ఉంది, లేస్తే గాలి మాదిరి ఉంది.\n\n* చూపులకు గుర్రమేగానీ, చురుకుదనానికి దున్న.\n\n* చూరుకత్తి తెగుతుందిగానీ, చూపుడుకత్తి తెగుతుందా?\n\n**********:: చె ::**********\n\n* చెంత దీపమిడక చీకటి పోవునా?\n\n* చెంపలు నెరసిన వెనుక, చామ (చాన) పతివ్రత.\n\n* చెంబు అమ్మి తప్పేలా, తప్పేలా అమ్మి చెంబు.\n\n* చెంబు ఎక్కడపెట్టి మరచిపోయినావురా? అంటే నీళ్ళచాయ (చెంబట్లకు) కూర్చున్న చోటికి ఇటు అన్నాడు; నీళ్ళచాయ ఎక్కడ కూర్చున్నావంటే, చెంబుబెట్టిన దానికి అటు అన్నాడట.\n\n* చెంబు కంచం పోతే, ముఖంమీద కొట్టినట్లు ముంత మూకుడు తెచ్చుకోలేదా?\n\n* చెట్టబట్టని నా భీతి, బొట్టు గట్టని కన్య రీతి.\n\n* చెట్టడిచిన చేటెడన్ని, నిటలాంబక మూర్తులు (లింగాలనుట).\n\n* చెట్టుఎక్కి, కాయపట్టిచూచి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.\n\n* చెట్టుఎక్కేవానికి ఎంతదాకా ఎక్కుడు పెట్టగలము?\n\n* చెట్టు ఎక్కిందని నిచ్చన తీసినట్లు.\n\n* చెట్టు ఎక్కేవాడిని ఎంతదాకా తొయ్యగలము?\n\n* చెట్టుకు (మానుకు) కరువు, కోమటికి బరువు లేవు.\n\n* చెట్టుకు చావ నలుపు, మనిషికి చావ తెలుపు.\n\n* చెట్టుకు తగినగాలి (ఎంతచెట్టో అంత గాలి).\n\n* చెట్టుకు పుట్టకు వరుసగానీ, మనిషికేమి వరుసరా మాల నాయాలా?\n\n* చెట్టుకు మడిగుడ్డ కట్టి ఉన్నదిలే, దొంగ చెట్టెక్కడు అన్నదిట సోమిదేవమ్మ.\n\n* చెట్టుకు విస్తళ్ళు కట్టినట్లు.\n\n* చెట్టు చచ్చినా చేప చావదు.\n\n* చెట్టు చెడేకాలానికి కుమ్మమూతి పిందెలు పుట్టును.\n\n* చెట్టునరికి పండ్లు దానము చేయగానే సుకృతి అగునా?\n\n* చెట్టుపెట్టి నాటినవాడు నీళ్ళు పోయడా?\n\n* చెట్టు నాటే దొకడు, ఫలమనుభవించే దొకడు.\n\n* చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి పడ్డట్లు.\n\n* చెట్టును తేరా అంటే గుట్టను తెచ్చినట్లు.\n\n* చెట్టుపట్టించి చేతులు వదిలినట్లు.\n\n* చెట్టు పెరగటం మొదలు నరుకుడికే.\n\n* చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు.\n\n* చెట్టును బట్టే కాయ.\n\n* చెట్టుమీదనుండి పడ్డవానికి గాయాలెన్నేమిటి?\n\n* చెట్టుమీదిది చేతికి వచ్చినట్టెగానీ, ఇక తొమ్మిదయితే పదవుతాయి.\n\n* చెట్టుమీది వాడు జుట్టుమీదికెక్కె.\n\n* చెట్టుమీది విరులైనా చేతుల కోయక రావు.\n\n* చెట్టులేని చేను, చుట్టము లేని ఊరు.\n\n* చెట్టులేని చోట ఆముదము చెట్టే మహావృక్షము.\n\n* చెట్టు ముదరనిచ్చి చిదిమిన పోవునా?\n\n* చెట్టు మొండి ఐతే చేరికలో వాన.\n\n* చెట్టెక్కి చేతులు విడిచినట్లు.\n\n* చెట్టెఱుగువానికి ఆకులు చిదుమనేల?\n\n* చెడదున్ని సెనగలు చల్లమన్నారు.\n\n* చెడిందిరా పిల్ల అంటే, చేరిందిరా తెనాలి అన్నట్లు.\n\n* చెడి కాపు పొరుగు చేరు, బ్రతికి కమ్మ పొరుగు చేరు.\n\n* చెడి చెన్నపట్నం చేరు.\n\n* చెడిన కాపురానికి ముప్పేమిటి చంద్రవంకలు వండే పెళ్ళామా? అంటే, అయిన అప్పుకి అంతేమిటి? అవే వండుతాను మగడా! అన్నదిట.\n\n* చెడిన చేను చెరుకు, రాజనాలు పండునా?\n\n* చెడిన చేనుకు ఇంటివడ్లు పొంగలా?\n\n* చెడిన చేలుకి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి?\n\n* చెడిన శ్రాద్ధం చెడనే చెడ్డది, పిత్తరా పీట పగుల.\n\n* చెడినా పడినా చేసుకున్న మొగుడు తప్పడు.\n\n* చెడినా సెట్టి సెట్టే, చిరిగినా పట్టు పట్టే.\n\n* చెడిపోయిన బ్రహ్మణుడికి చచ్చిపోయిన ఆవు దానం.\n\n* చెడిపోయెపో గుడిపాడని కోడలంటే, పచ్చరాగులపాడు పాడు పాడాయెపో అన్నదట అత్త.\n\n* చెడి బతికినమ్మ చేతులు చూడు, బతికి చెడ్డమ్మ చెవులు చూడు.\n\n* చెడి బ్రతికినవాడికి శౌర్యమెక్కువ, బ్రతికి చెడినవాదికి బదవలు ఎక్కువ.\n\n* చెడి బ్రతికిన వాని చెంపలు చూడు, బ్రతికి చెడినవాని బట్టలు చూడు.\n\n* చెడి స్నేహితునింటికి పోవచ్చునుకానీ, చుట్టాలింటికి (చెల్లెలింటికి) పోరాదు.\n\n* చెడుకాలానికి చెడు బుద్ధులు.\n\n* చెడుకాలమైన ఎవ్వరి దెస నే వికారము వచ్చునో?\n\n* చెడు చెడు అనగానే చెడేవారు లేరు.\n\n* చెడు చెడు మనేవారేగానీ, చేతిలో పెట్టేవారే లేరు.\n\n* చెడ్డచేనుకు ఇన్ని మంచెలా?\n\n* చెడ్డచేనుకు ఇంట్లో పొంగళ్ళా?\n\n* చెడ్డసొమ్ము చెరి సొగం.\n\n* చెడ్డాపడ్డా చేబ్రోలే గతి.\n\n* చెడ్డాపడ్డా శ్రీకాకుళమే గతి.\n\n* చెదలుకాళ్ళవాడు క్షణ మొకచోట నిలువడు.\n\n* చెన్నంపల్లి పంచాయతి చెరిసొగం.\n\n* చెప్పంత పొలం చెప్పినట్లు కొనాలి.\n\n* చెప్పకపోయినా దుప్పికొమ్ముల ఎద్దునే కొను.\n\n* చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం.\n\n* చెప్పనేర్చిన మాట సెబాస్ మాట.\n\n* చెప్పింది చేయబోకురా! చేసేది చెప్పబోకురా.\n\n* చెప్పి చెప్పి చెప్పుతో కొట్టించుకో, మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో.\n\n* చెపితే పాపంగానీ, తిరగేసి పొడిస్తే చస్తుంది అన్నట్లు.\n\n* చెపితే సిగ్గు దాస్తే దుఃఖం.\n\n* చెప్పినంత చేసేవారు శివుడికన్నా లేరు.\n\n* చెప్పిన కొద్ది చెవుడు పడిపోతారు.\n\n* చెప్పిన బుద్ధి, కట్టిన సద్ది ఎంతకాలం నిలుచును?\n\n* చెప్పిన మాట విని వచ్చేవాడిని చెవు బట్టుకొని లాక్కొచ్చి, ఎదురు తిరిగిన వాడికి సాక్ష్యం బెట్టి వచ్చినా.\n\n* చెప్పుకాలు నెత్తిన బెట్టి శఠగోపుర మంటాడు.\n\n* చెప్పు కింద తేలువలె.\n\n* చెప్పు కొరికినామని సిద్ది కొరుకుతామా?\n\n* చెప్పటం కంటే చెయ్యటం మేలు.\n\n* చెప్పుడూ మాటలకన్నా తప్పుడు మాటలు నయం.\n\n* చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్లు.\n\n* చెప్పు తినెడి కుక్క చెఱుకు తీపెరుగునా?\n\n* చెప్పు పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు.\n\n* చెప్పులవానికి చేనంతా తోలుతో కప్పినట్లుంటుంది.\n\n* చెప్పులు ఉన్నవాడితోనూ, అప్పులున్నవాడితోనూ పోరాదు.\n\n* చెప్పులు చిన్నవని కాలు తెగకోసుకుంటారా?\n\n* చెప్పులు ఉన్నా, చెప్పులు తెగినా చుట్ట(ట్టి)రికం తప్పదు.\n\n* చెప్పులోని రాయి- చెవిలోని జోరీగ-ఇంటిలోని పోరు.\n\n* చెప్పుడుమాటలు చేటు.\n\n* చెప్పేది చెవిదగ్గఱ, వినేది రోటిదగ్గఱ.\n\n* చెప్పేవానికి చేదస్తమయితే, వినేవానికి వివేకం వద్దా?\n\n* చెప్పేవానికి వినేవాడు లోకువ.\n\n* చెప్పేవి నీతులు, చేసేవి గోతులు.\n\n* చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.\n\n* చెయ్యగానని వారికి నీతులు మెండు, చెల్లని రూపాయికి గీతలు మెండు.\n\n* చెయ్యా పెట్టాలేనాతడికి దిశ పన్నెండామడ.\n\n* చెయ్యి అలసిన వేళ తెప్ప దొరికినరీతి (ఈది అలసినప్పుడు).\n\n* చెయ్యి కాలినప్పుడల్లా కుండ వదిలిపెడతామా?\n\n* చెయ్యిచూపి అవలక్షణ మనిపించుకొన్నట్లు.\n\n* చెయ్యి దాచుకుంటాము గాని, కులం దాచుకుంటామా?\n\n* చెయ్యి పుచ్చుకుని లాగితే రాలేదుగానీ, ఇంటికి చీటీ వ్రాసాడుట.\n\n* చెరు(ఱు)కా ! బెల్లం (పెట్టు) అంటే పెడుతుందా?\n\n* చెరుకు అని వేళ్ళతో పెరకకూడదు.\n\n* చెరుకు ఉండేచోటుకి చీమలు తామే వస్తవి.\n\n* చెరుకుకు చెఱువు సూలంగి.\n\n* చెరుకు కొనఏమి, మొదలేమి?\n\n* చెరుకు తియ్యనని వేళ్ళతో గూడా తిన్నట్లు.\n\n* చెరుకుతోటలో ఏనుగు పడినట్లు.\n\n* చెరుకు నమలడానికి కూలీ అడిగినట్లు.\n\n* చెరుకు పిప్పికి ఈగలు మూగినట్లు.\n\n* చెరుకు వంకరబోతే, తీపి చెడుతుందా?\n\n* చెఱకుతోటలోన చెత్తకుప్పుండిన కొంచమైన దాని గుణము చెడదు.\n\n* చెఱకుదిన్న నోరు చేదారగించునా?\n\n* చెఱకురసము కన్న చెలిమాట తీపురా.\n\n* చెఱకువిల్తుడు విరహిణులపాలిటి పచ్చితురక.\n\n* చెఱపకురా చెడేవు, ఉరకకురా పడేవు.\n\n* చెఱపటానికి చేట పెయ్య చాలును.\n\n* చెఱపటానికి చేతులు వస్తాయిగానీ, నిలవడానికి మతులు రావు.\n\n* చెఱువు ఎండితే చేపలు బయటపడతాయి.\n\n* చెఱువు ఎండిపోయి, చేను బీడైతే కరణం పెండ్లానికి కాసులదండట.\n\n* చెఱువు వోడు, ఊరు పాడు.\n\n* చెఱువుకు చేరువగానూ, చుట్టాలకు దూరముగాను ఉండవలె.\n\n* చెఱువుకు నీటి ఆశ, నీటికి చెఱువు ఆశ.\n\n* చెఱువు తెగగొట్టి చేపలు వండిపెట్టాగానే మాన్యుడగునా?\n\n* చెఱువు నిండితే కప్పలు చేరవా?\n\n* చెఱువును చూడబోయిన తూటితీగ (తూడు) తిరిగివచ్చునా?\n\n* చెఱువును మూకుడుతో మూయనగునా?\n\n* చెఱువును విడిచి కాలువను పొగిడినట్లు.\n\n* చెఱువును విడిచి వరవను పొగిడినట్లు.\n\n* చెఱువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా పోయినట్లు.\n\n* చెఱువు మీద కొంగ అలిగినట్లు.\n\n* చెఱువు ముందు చలివేంద్రమా?\n\n* చెఱువులు తెంచి, చేపలు వండినట్లు.\n\n* చెఱువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూచి బేరం చేసినట్లు.\n\n* చెలమకు పిట్టలు చేరినట్లు.\n\n* చెలిమాత చెఱకు ఊట.\n\n* చెలిమిని చేదు తినిపించవచ్చు గానీ, బలిమిని పాలు త్రాగించలేము.\n\n* చెల్లని కాసుకు గరుకులు (గీతలు) మెండు.\n\n* చెల్లని కాసు-వ(వొ)ల్లని మొగుడు.\n\n* చెల్లని దాన్ని చేనుకాడ పెడితే, అయినకంకులన్నీ అమ్మగారింటికి పంపింది.\n\n* చెల్లీ చెల్లడములకు (పుట్టచాటున) సెట్టిగారున్నారు (దారిదోపుడుగాండ్రతో).\n\n* చెల్లెలి మగని చూచుకొని చెయ్యి విఱుగ బడ్డదట.\n\n* చెల్లెలి వరుస చెడి చేసుకోవాలి, తల్లి వరుస తప్పి చేసుకోవాలి.\n\n* చెవికోసిన మేక, కరివేపాకు కోసే ఎరుకలవాడు ఊరకుండరు.\n\n* చెవికోసిన మేకవలే అరుస్తాడు.\n\n* చెవిటి చెన్నప్పా! అంటే సెనగల మల్లప్పా అన్నాడట.\n\n* చెవిటి చెన్నారమా? అంటే చెనిగలు పదకొండు అందిట.\n\n* చెవిటిదానా సేసలు పట్టమంటే- బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అన్నదట.\n\n* చెవిటి పెద్దమ్మా! చేంతాడు తేవే అంటే, చెవులపోగులు నా జన్మలో ఎఱుగనన్నదట.\n\n* చెవిటివానికి శంఖమూదినట్లు, మూగవానికి ముక్కు గీరుకున్నట్లు.\n\n* చెవిటివాని ఎదుట శంఖం ఊదితే, అది కొరకటానికి నీ తండ్రి తాతల తరము కాదన్నాడట.\n\n* చెవిలో చెప్పిన మాట గానీ, అరచి చెప్పినమాట గానీ వినదగియుండవు.\n\n* చెవిటివానికి వినిపించాలంటే శంఖచక్రాలవాడు దిగిరావాలి.\n\n* చెవిదగ్గర కందురీగ (కంతిరీగ) వలె.\n\n* చెవుడు, చెవుడూ అంటే, తవుడు తవుడూ అన్నట్లు.\n\n* చెవులు కోసుకు పోతుంటే, కుట్టుకాడలకు ఏడ్చినట్లు.\n\n* చెవులపిల్లి ఎదురైతే చేటు వస్తుంది.\n\n* చెవులో గుమి(బి)లికి ఏపుల్ల ఐతేనేమి గెలుక్కోను.\n\n* చెవ్వాకు పోయినమ్మకు దుఃఖమూలేదు, దొరికినమ్మకు సంతోషమూ లేదు.\n\n**********:: చే ::**********\n\n* చేటను కొట్టి పిల్లిని బెదరించినట్లు.\n\n* చేటభారతము - కంప రామాయణము.\n\n* చేటలో వెలగకాయల వలె.\n\n* చేటు ఎరుగని చేడె మొగుడికి పెళ్ళి చేసిందట.\n\n* చేటుకాలమయిన చెరువ నల్పుడే చాలు.\n\n* చేటుకాలానికి చెడ్డ బుద్ధులు.\n\n* చేటు మూడినప్పుడు మాటలు దోపవు.\n\n* చేటూ పాటూ ఎఱుగనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట.\n\n* చేటూ పాటూ ఎఱుగనమ్మ మగని పెళ్ళి కెళ్ళిందట.\n\n* చేటెడు తిని చెడితి, వాకిలి దాటి పడితి.\n\n* చేతకానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.\n\n* చేతకానమ్మకు శౌర్యమెక్కువ.\n\n* చేతనైన మగోడు (మగవాడు) చాలాపొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకొకచోట వండుకొన్నాడట.\n\n* చేత వెన్నయుండ నేతికేడ్చెడి వారె.\n\n* చేతికలుపు - వైద్యునిచేతి తళుకు.\n\n* చేతికి అందినది వాతి కందదు.\n\n* చేతికి దొరికిన రత్నం నాచుక పోయినట్లు.\n\n* చేతికిబట్టిన జిడ్డు లెక్కకు రాదు.\n\n* చేతిచమురు భాగవతం చెప్పుకొన్నట్లు.\n\n* చేతిమల్లెపూవు గుండ్రాతికి ఓర్వజాలునా?\n\n* చేతిలో ఉంటే అర్ధం, చేరువలో ఉంటే పెళ్ళాం.\n\n* చేతిలో కఱ్ఱ చేదోడు, వాదోడు.\n\n* చేతిలోది లేత, చేలోది ముదురు.\n\n* చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యినాకి చెరువు నీళ్ళు తాగినట్లు.\n\n* చేతిలో లేనిది చేలోకి ఎలావస్తుంది?\n\n* చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యికోసం ఊరంతా వెతికినట్లు.\n\n* చేతివేళ్ళు అయిదు ఒకరీతిగా ఉంటాయా?\n\n* చేతిసొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.\n\n* చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు.\n\n* చేతులు చెయ్యవు, నోరుతినదు.\n\n* చేతులు పొడుగని మూతులు పొడుస్తారా?\n\n* చేదతాడు (చేంతాడు) కురుచైతే బావి పూడ్చుకుంటారా?\n\n* చేదు తింటారా? చెట్టు కొడతారా?\n\n* చేనికి ఎరువు, మడికి మంద.\n\n* చేనికి గట్టు, ఊరికి కట్టు ఉండాలి.\n\n* చేసినపాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయి హరహరా అన్నాడుట.\n\n* చేసినపాపం చెపితే తీరుతుంది.\n\n* చేసినపాపం చెఱగున కాశీకిపోతే కడతేరుతుందా?\n\n* చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి.\n\n* చేసినమ్మ చేవ, చేయనమ్మ చెదలు.\n\n* చేసినవాడు (చేసినోడు) చేసిపోగా, నిలుచున్నోడికి నీళ్ళు కారిపోయినట్లు.\n\n* చేసినవారికి చేసినంత మహదేవ!\n\n* చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు.\n\n* చేసుకున్న కర్మమోయి శంభులింగమా! అంటే, అనుభవించక తీరదోయి అబ్బులింగమా! అన్నాడట.\n\n* చేసుకున్న తరవాత వండిపెట్టక తప్పుతుందా?\n\n* చేసుకున్నదానుకి మూసుకోను లేదు, ఉంచుకున్నదానికి ఉభయరాగాల చీర.\n\n* చేసుకున్న కడుపు దించుకోక తప్పదు.\n\n* చేసేది బీద కాపురం, వచ్చేవి రాజభోగాలు.\n\n* చేసేది శివపూజ, కుడిచేది మాలకూడు.\n\n* చేసేది శివపూజ, దూరేది దొమ్మరి గుడిసె.\n\n* చేసేపని వదలి నేసేవాని వెంట పోయినట్లు.\n\n* చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు.\n\n* చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు.\n\n* చేసేవి లోపాలు, చెపితే కోపాలు.\n\n* చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్ధాలు.\n\n**********:: చై ::**********\n\n* చైత్ర వైశాఖలలో పెండ్లి కావిళ్ళు (సారెకావిళ్ళు), శ్రావణ భాద్రపదాలలో దినం కావిళ్ళు.\n\n**********:: చొ ::**********\n\n* చొప్పవామిలో నిప్పు దాచుకొన్నాట్లు.\n\n* చొల్లంగి తీర్ధానికి చోడిగింజలంతేసి (మామిడిపిందెలు).\n\n**********:: చో ::**********\n\n* చోటే లేదంటే మూల ఎక్కడ వెదుకుదును అన్నాడట.\n\n* చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట.\n\n* చోద్యాల సోమిదేవమ్మకు వాద్యారి మొగుడు.\n\n* చోళ్ళు చల్లితే జొన్నలు పండునా?\n\n* చోళ్ళు విసరే తిరగలి, జొన్నలు విసరునా?\n\n* చోళ్ళు విసరే తిరగలి ఆళ్ళు విసరునా?\n\n**********:: చౌ ::**********\n\n* చౌక దూబరతిండికి కారణం.\n\n* చౌటినేల వల్ల జలమెల్ల చెడిపోయె.\n\n* చౌడోలు గాడిదపై గట్టినట్లు.\n\n* చౌదంతి నెక్కగానే చక్రవర్తి అగునా?\n\n**********:: ఛీ ::**********\n\n* ఛీ! కుక్కా అంటే, ఏమక్కా ! అన్నదట.\n\n* ఛీ! ఛీ! అనేదీ ఈ నోరే, శివశివా అనేదీ ఈ నోరే. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 867,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-చ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* జంగమైన వెనుక జాతినెంచగరాదు.\n\n* జంగానికి పిల్లలు పుడితే, ఊరివారి గోడు పోసుకున్నాడట.\n\n* జంగానికి బిడ్దలు ఊరికి ఉపాధి.\n\n* జంగాలపాలు దేవాంగుల విత్తము, కాపు విత్తం పంజుగాని పాలు (పంజుగాడు=దివిటిలు పట్టేవాడు).\n\n* జంగాలో! దాసర్లో ! ముందూరుని బట్టి.\n\n* జగడమెట్లా వస్తాది లింగమయ్యా అంటే, బిచ్చంపెట్టవే బొచ్చుముండా అన్నాడట.\n\n* జగ బిరుదు, ముండమొఱ్ఱ.\n\n* జగమెరిగిన బ్రాహ్మడికి జందె మెందుకు?\n\n* జడరాశిలో దాగని జడబానలమా?\n\n* జడ్డిగములోనే మిడతపోటు.\n\n* జన మర్లు, జాతర మర్లు.\n\n* జనవాక్యం కర్తవ్యం.\n\n* జనుములో పాము పోతే పాతిక నష్టం.\n\n* జన్మానికంతా శివరాత్రి అన్నట్లు.\n\n* జన్నెరోగికి బఱ్ఱెజున్ను పెట్టినట్లు, పిల్లి నెత్తిన వెన్న పెట్టినట్లు.\n\n* జపం వదిలి లొట్టల్లో పడినట్లు.\n\n* జబ్బబలిమి మీద బలాత్కార గానవినోదమన్నట్లు.\n\n* జమ్మి ఆకుతో విస్తర కుట్టినట్లు.\n\n* జనముండేవరకూ భయము లేదు.\n\n* జయాపజయంబు లెవరి సొమ్ము?\n\n* జరిగితే జల్లెడతో నీళ్ళు మోస్తారు.\n\n* జరిగేమటుకు జయభేరి, జరక్కపోతే రణభేరి.\n\n* జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు.\n\n* జరుగుబాటు తక్కువ, అదరి(రు)పాటు ఎక్కువ.\n\n* జలుబు మందుతింటే వారం దినాలుంటుంది, తినకపోతే ఏడుదినాలుంటుంది.\n\n* జలుబు విచారణ లేని జబ్బు.\n\n* జవ్వాది పూసుకొని చంక లెత్తినట్లు.\n\n* జ్వర జిహ్వకు పంచదార లేదు.\n\n**********:: జా ::**********\n\n* జాణకు మూడుతావు లంటును.\n\n* జాణలకు పురాణాగమశాస్త్రవేదజప ప్రసంగ త్రాణకల్గి ప్రయోజనమేమి?\n\n* జాతికొద్దీ బుద్ధి, కులంకొద్దీ ఆచారం.\n\n* జాతినాగుల చంపుతూ, ప్రతిమనాగులకు పాలుపోసినట్లు.\n\n* జాబు వ్రాసిపెట్టమంటే, కాళ్ళు నొప్పులంటే, వాటితో పనేమంటే, నేను రాసింది నేనే చదవాలన్నాడట.\n\n* జామాతా దశమగ్రహం.\n\n* జారతోడి పొందు చావునకే యగు.\n\n* జారితే పడమన్నారు, జరిగితే (సాగితే) పడమన్నారు.\n\n**********:: జి ::**********\n\n* జింక కన్నీరు వేటగానికి ముద్దా?\n\n* జింకకు కొమ్ములు బరువా?\n\n* జిలిబిలి పలుకుల వెలది నకారగుళ్ళ పాలైనట్లు (నకారగుళ్ళు=నియోగులు).\n\n* జిల్లేడు పూలకు తుమ్మెద లాశించినట్లు.\n\n* జిల్లేళ్ళకు మల్లెలు పూయునా?\n\n* జివ తక్కువ, జీత మెక్కువ.\n\n* జిహ్వ కొక రుచి, పుఱ్ఱె కొక బుద్ధి.\n\n* జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా.\n\n**********:: జీ ::**********\n\n* జీతంబెత్తం లేకుండా తోడేలు గొఱ్ఱెలను కాస్తానన్నదిట.\n\n* జీతంలేని నౌకరు, కోపంలేని దొర.\n\n* జీతగాడికి, నేతగాడికి చావులేదు.\n\n* జీతగాడు అతగాడైనట్లు.\n\n* జీలకఱ్ఱా సింగినాదం.\n\n* జీలుగు (జీలగ) పెఱిగిన మాలెకు కంబము కాదు.\n\n* జీలగ బెండ్లు చెవుల పెంచుతాయిగానీ కుండలాలిస్తాయా?\n\n* జీవరత్నాన్ని ఇత్తడిలో పొదిగితే రత్నానికేమి లోటు?\n\n* జీవితమొక వ్యాధి, నిద్రావస్థ ఉపశమనము, మరణమే ఆరోగ్యము.\n\n**********:: జు ::**********\n\n* జుట్టుంటే ఎన్ని జడలైనా వెయ్యవచ్చు.\n\n* జుట్టుకాలి ఏదుస్తుంటే, చుట్ట నిప్పడిగినట్లు.\n\n* జుట్టు ఉన్న అమ్మ ఏకొప్పయినా పెట్టవచ్చు.\n\n* జున్ను రుచి వెన్నకబ్బునా?\n\n**********:: జె ::**********\n\n* జెముడుకు కాయలూ లేవు నిలువ నీడాలేదు.\n\n* జెముడు కంచెకు శ్రేష్టం, రేగడ చేనికి శ్రేష్టం.\n\n**********:: జే ::**********\n\n* జేనెడు ఇంట్లో మూరెడు కఱ్ఱ.\n\n* జేనెడు దొరకు మూరెడు బంటు.\n\n* జేనెడు పిట్టకు మూరెడు తోక.\n\n* జ్యేష్ట చెడకురియును, మూల మురుగ కురియును.\n\n**********:: జై ::**********\n\n* జైనవాని చేతి పేనువలె. (చంపడనుట).\n\n**********:: జొ ::**********\n\n* జొన్న పెరిగితే జాడు, వరిపెరిగితే వడ్లు.\n\n**********:: జో ::**********\n\n* జోగీ జోగీ రాసుకుంటే, బూడిద రాలిందట.\n\n* జోడులేని బ్రతుకు, త్రాడులేని బొంగరం.\n\n* జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు.\n\n* జోలి పల్కులు తీసేలోగా బిక్షపు వేళ పోయిందట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 868,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-జ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* టంకం పెట్టిన గుడిసె దెబ్బ కొడితే వడిసె.\n\n* టంగుటూరు పెద్దమాలను తగవుతీర్చమంటే, తనకు ఇద్దరున్నారన్నాడట.\n\n**********:: టా ::**********\n\n* టాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రుడికి సద్దెన్నం.\n\n**********:: టె ::**********\n\n* టెంకాయ చెట్టెందుకు ఎక్కినావురా అంటే దూడగడ్డి కన్నాడట, గడ్డి చెట్టుపైన ఉంటుందా? అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నా అన్నాడుట కాయలదొంగ.\n\n* టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే దొంగ కడ్డమా?\n\n**********:: డ ::**********\n\n* డంబము ఎప్పుడూ పూవులు పూయుచుండునే గానీ కాయలు కాయదు.\n\n* డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.\n\n* డబ్బిచ్చి తేలు కుట్టించుకొన్నట్లు.\n\n* డబ్బు ఇవ్వనివాడు పడవ ముందర ఎక్కును.\n\n* డబ్బు ఉంటే, కొండమీద కోతికూడా దిగివస్తుంది.\n\n* డబ్బుకు ప్రాణానికి లంకె.\n\n* డబ్బుకు వచ్చిన చెయ్యే వరహాకు వస్తుంది.\n\n* డబ్బు (దస్తు) దస్కం లేదుగానీ, దవాలు బంట్రోతు.\n\n* డబ్బు పాపిష్టిది.\n\n* డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు.\n\n* డబ్బురాని విద్య దరిద్రానికే.\n\n* డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు.\n\n* డబ్బు లేనివానికి బోగముది తల్లివరుస.\n\n* డబ్బు సభ కట్టును, ముద్ద నోరు కట్టును.\n\n* డఱ్ఱుబుఱ్ఱు డాలుకత్తి, చూరులోన చురుకత్తి.\n\n**********:: డా ::**********\n\n* డాగుపడిన పండు బాగులేదందురు.\n\n* డాబుసరి బావా! అంటే డబ్బులేదు మరదలా అన్నాడట.\n\n**********:: డి ::**********\n\n* డిందుపడినవాని నెందునూ లెక్కింపరు.\n\n**********:: డూ ::**********\n\n* డూడూ బసవన్నా అంటే తలూపినట్లు.\n\n**********:: డొం ::**********\n\n* డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా?\n\n* డొంకలో షరాబున్నాడు, నాణెము చూపుకోవచ్చును అన్నాడట దొంగలచేజిక్కిన వాడు.\n\n**********:: డౌ ::**********\n\n* డౌలు దస్తు పెండ్లాము పస్తు (డౌలు=భూమి సిస్తు, దస్తు=వసూలు చేసిన పైకము ఖజానాకు చెల్లించుట).\n\n* డౌలు చూపితే దరిద్రం పోతుందా? (డౌలు=డంభము, డాబు).\n\n**********:: ఢి ::**********\n\n* ఢిల్లీకి ఢిల్లే, పల్లెకు పల్లే.\n\n* ఢిల్లీపాచ్చా కూతురైనా పెండ్లికొడుకుకు లోకువే.\n\n* ఢిల్లీకి పోయి ఉల్లిగడ్డ తెచ్చినట్లు.\n\n* ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 869,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ట ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* తంగేటి జుంటిని దాప ఎందుకు? (దాచుటెందుకు?)(జున్ను= తేనెతుట్టె).\n\n* తంగేడు పూచినట్లు.\n\n* తంటాలమారి గుఱ్ఱానికి తాటిపట్ట గోఱపము (గోఱపము=కోకుడు దువ్వెన).\n\n* తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది.\n\n* తండ్రికదా అని తలాటి కీడ్చినట్లు.\n\n* తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది, తల్లి చస్తే కాపురం తెలుస్తుంది.\n\n* తండ్రి తవ్విన నుయ్యి అని దానిలో దూకవచ్చునా?\n\n* తండ్రిని చంపబోయిన పాపం, అత్తవారింటికి పోయి, అంబటికట్ట తెగేవఱకు ఉంటే పోవును.\n\n* తండ్రి వంకవారు దాయాది వర్గమే.\n\n* తండ్రి సేద్యం కొడుకు వైద్యం కూడు మధ్యం.\n\n* తంతే దూదిపరుపు మీద పడ్డట్లు.\n\n* తంతే బూర్ల (గారెల) గంపలో పడ్డట్లు.\n\n* తంబళి అనుమానం తలతిక్కతో సరి.\n\n* తంబళి తన లొటలొటె గానీ, ఎదుటి లొటలొట ఎరుగడు.\n\n* తంబళ్ళ అక్కయ్య మొదుమూడి వెళ్ళను వెళ్ళాడు, రానూ వచ్చాడు.\n\n* తక్కువజాతికి (వానికి) ఎక్కువకూడైతే తిక్క తెగులు.\n\n* తక్కువనోములు నోచి, ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?\n\n* తక్కువవాడికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి పొంగెక్కువ.\n\n* తక్కువ వానికి నిక్కులు లావు.\n\n* తగపండిన పండు తనంత తానే పడుతుంది.\n\n* తగవు చెప్పు ధర్మరాజా! అంటే, దూడా, బఱ్ఱె నాదే అన్నాడట.\n\n* తగవు ఎలావస్తుంది జంగమదేవరా అంటే, బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడట.\n\n* తగవున ఓడినా,ముదిమిది చచ్చినా బంది లేదు.\n\n* తగినట్లు కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ.\n\n* తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడం కష్టం.\n\n* తగిలిన కాలికే తగులును, నొగిలిన కొంపే నొగులును.\n\n* తగు దాసరికీ, మెడపూసలకీ, అమ్మకన్న కాన్పుకు, అయ్య ఇచ్చిన మానవుకూ సరి.\n\n* తగునే కఱకుట్లును జంక పొత్తమున్.\n\n* తగులుకున్న మొగుడు, తాటిచెట్టు నీడ నిలకడలేనివి.\n\n* తట్టాలో కాపురం బుట్టలోకి వచ్చె, బుట్టలో కాపురం బూడిదలో కలిసె.\n\n* తట్టుకు తగాడినట్లు (తట్టుకు=నడుస్తున్నప్పుడు కాలికి తగిలే చిన్న దెబ్బ, తగాడు= తగవు చెప్పు, న్యాయం తీర్పు చేయు).\n\n* తట్టెడు గుల్లల కొక దుడ్డుపెట్టు.\n\n* తడిక కుక్కకు అడ్డం కానీ మనిషికి అడ్డమా?\n\n* తడ(డి)క కొంపలో దీపాలు వెలుగవా?\n\n* తడ(డి)క గట్టు గోడను తన్నరాదు.\n\n* తడిక తీసినవాడిదే తప్పు.\n\n* తడవకుండానే తెంచే అచ్చన్న కంటే తడిపితెంచే బుచ్చన్న కొంతమేలు.\n\n* తడిక దాసరివలే. (తడిక=చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం).\n\n* తడిక దొబ్బింది ఎవరంటే ఆలులేనివాడు అన్నట్లు.\n\n* తడికలేని ఇంట్లో కుక్క దూరినట్లు.\n\n* తడి గుడ్డలతో గొంతు కోసినట్లు.\n\n* తడిగుడ్డలో పేలాలు వేయించినట్లు.\n\n* తడిసిగానీ గుడిసె కట్టడు, (కప్పుడు) తాగి(కి)గానీ మొగ్గడు.\n\n* తడిసిగానీ గుడిసె వేయడు, తగిలికానీ ఎత్తు చేయడు.\n\n* తడిసిల తక్కెడ, ఎండిన ధడా.\n\n* తడిసిన (మంచపు) కుక్కి బిగిసినట్లు.\n\n* తడిసి ముప్పందుము మోసినట్లు.\n\n* తడిసి ముప్పందుము మోసేకంటే, తడవక పందుం మోసేది మేలు.\n\n* తణుకుపోయి మాచారం వెళ్ళినట్లు.(చుట్టు దారిన పోవుటకు).\n\n* తత్సమయానికి తడి ఇసుకే సరి- అని పలుదోమినట్లు.\n\n* తద్దినం కొని తెచ్చుకొన్నట్లు.\n\n* తద్దినం నాటి జందెం వలె.\n\n* తద్దినం పెట్టెవాని తమ్ముని వలె.\n\n* తద్దినానికి తక్కువ, మాసికానికి ఎక్కువ.\n\n* తద్దినానికి భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట.\n\n* తనాన్నం తాను తింటూ, తనగుడ్డ తాను కట్టుతూ, ఊరికి భయపడవలెనా?\n\n* తన కంట్లో దూలం పెట్టుకొని, పరుల కంట్లో నలుసులెంచినట్లు.\n\n* తనకంపు తన కింపు, ఒకరికంపు ఒకరింపు.\n\n* తన కంపు తనకింపు, పెఱకంపు తను జంపు.\n\n* తన కలిమి ఇంద్రభోగం, తనలేమి స్వర్గలోకదారిద్ర్యం, తన చావు జలప్రళయం- అనుకొన్నట్లు.\n\n* తనకాళ్ళకు తానే మొక్కుకొన్నట్లు.\n\n* తనకు అని తవ్వెడూ ఉంటే, ఆకటివేళకు భుజించవచ్చు.\n\n* తనకుగానిది గూదలంజ(బోడిముండ).\n\n* తనకుగాని రాజ్యం పండితేనేమీ? మండితే (ఎండితే) నేమి?\n\n* తనకుగాని ఆలు దానవురాలురా.\n\n* తనకుచెప్ప తడికెల చాటు, ఒకరికిచెప్ప ఒప్పులకుప్ప.\n\n* తనకు తోచకున్న మొకాటుతోనైనా ఆలోచించమన్నారు.\n\n* తనకు పాసిన వెంట్రుకలు ఏరేవులో పోతేనేమీ?\n\n* తనకు బుట్టినిల్లు తనరు కైలాసంబు.\n\n* తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం.\n\n* తనకు ముక్తిలేదు తలపులు మెండైన.\n\n* తనకు రొట్టె, ఇతరులకు ముక్క.\n\n* తనకులేక తంటాలు పడుతుంటే, తొంటికాళ్ళ పిల్లి వెంటపడినట్లు.\n\n* తనకు లేదని ఏడ్చి ఒక కన్నుపోతే, ఎదుటివారికున్నదని ఏడ్చి ఇంకొక కన్ను పోయిందట.\n\n* తన కొంగున కట్టిన రూక, తన కడుపున పుట్టిన బిడ్డ.\n\n* తనకోపమె తన శత్రువు.\n\n* తన గుణము మంచిదైతే, సానివాడలో కూడా కాపురం చెయ్యవచ్చును.\n\n* త గుద్దకింద నలుపు గురిగింజ కేమితెలుసు?\n\n* తనగుద్ద కాకుంటే కాశీదాకా దేకమన్నారు.\n\n* తన గుద్ద గాయం కాకుంటే, తాటియీనెలకు ఎదురు దేకమన్నారు.\n\n* తన చల్ల పుల్లనిదని తానే చెప్పుకుంటాడా?\n\n* తన చావు జలప్రళయం.\n\n* తన చెయ్యి కాలుతుందని, సవతిబిడ్ద చేతితో కలియబెట్టిందట.\n\n* తన తనయ ప్రసవ వేదనకోర్వలేకుంటే, తన అల్లునిపై అహంకారపడనేల?\n\n* తనతప్పు తప్పుకాదు, తనబిడ్ద దుడుకుకాదు.\n\n* తన తలుపుతీసి పొరుగింటికి పెట్టి రాత్రంతా కుక్కలను తోలుతూ కూర్చున్నట్లు.\n\n* తనదని తవ్వెడు తవుడూన్నా ఆకటివేళకు తినవచ్చు.\n\n* తనదాకా వస్తేకానీ, తలనొప్పి బాధ తెలియదు.\n\n* తనదూడ పొదుగుకుమ్మి పాలుతాగితే ఊరుకుంటుందికానీ, పరాయిదూడ పాలుతాగితే ఊరకుంటుందా?\n\n* తనదాకా వస్తే తగవే లేదు.\n\n* తనది తాటాకు, ఇవతలవాళ్ళది ఈతాకు.\n\n* తన దీపమని ముద్దుపెట్టుకుంటే, మూతిమీసాలన్ని కాలినాయట.\n\n* తనదు కాలిగోయ తనతమ్ముడేడ్చునా?\n\n* తనదు మేలుకీడు తనతోడనుండురా.\n\n* తననీడ తప్పితే, తరుగునొక వన్నె.\n\n* తననీడ తానే తొక్కుకున్నట్లు.\n\n* తనను కట్ట త్రాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.\n\n* తననోటికి తవుడు లేదు, లంజనోటికి పంచదారట.\n\n* తనపిల్ల గంజికేడిస్తే, లంజపిల్ల దాని రేక కేడ్చిందట (రేక=తాటిఆకుతో కట్టిన పెద్దదొప్ప).\n\n* తనపుట్టి పిచ్చగా ఉంటే, పొరుగుపందుంతో అపరాలు కొలిచినాడట (పిచ్చ=తక్కువ కొలత కలిగిన కొలపాత్ర, అపరాలు=కాయధాన్యాలు).\n\n* తన పెరటిచెట్టు మందుకు పనికిరానట్లు.\n\n* తన బలిమికన్నా స్థానబలిమి మిన్న.\n\n* తన బుద్ధి మంచిదైతే, లంజగేరిలో ఇల్లు కడితేనేమి? (లంజగేరు=నాగవాసం, బోగమువాడ).\n\n* తనభార్య విరహవేదన జారుడెరుగునా?\n\n* తనలో తప్పులేకపోతే, గురువుతో గుద్దులాడవచ్చును.\n\n* తనముడ్డి కాకపోతే గంగదాకా దేకమన్నట్లు.\n\n* తనముడ్డి(కి) కాకపోతే తాటిపట్టుకు ఎదురుడెక మన్నట్లు.\n\n* తనయుని పుట్టుక తల్లి ఎఱుగును.\n\n* తనవృఇ కెంతకలిగిన తనభాగ్యమే తనది.\n\n* తనవారిని ఎఱుగని మొఱ్ఱి తెడ్డున్నదా?\n\n* తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు (గట్టుకు) తీతురు.\n\n* తనవాసి తప్పితే తన వన్నె తరుగుతుంది.\n\n* తనసొమ్ము అయినా దాపుగా తినవలె.\n\n* తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం.\n\n* తన సొమ్ము కాసుబెట్టడు కానీ పరులసొమ్ము హరింప (కాజేయ) బ్రహ్మకాయ.\n\n* తనసొమ్ము తను దిని, తన బట్ట తను కట్టి, సావిట్లో వానితో చావు దెబ్బలు తిందిట.\n\n* తన సొమ్ము సోమవారం, మందిసొమ్ము మంగళవారం.\n\n* తనుగాక తన కొక పిల్లట.\n\n* తనువు తాను కాదనువానికి తపసుచేయనేల?\n\n* తనువులు నిత్యం కావు మా వారిని ఓలిపైకం ఖర్చు పెట్టవద్దని చెప్పమన్నట్లు.\n\n* తనువు వెళ్ళినా దినము వెళ్ళదు.\n\n* తన్ని తల్లే గుంజుకుపోతే, చెప్పున కొట్టి చిప్ప తెచ్చుకోవాలి.\n\n* తన్నితే తల పగులుతుంది, కొడితే కొప్పెర పగలాలి అంటాడు.\n\n* తన్నితే పోయి బూరెల గంపలో పడీనట్లు.\n\n* తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.\n\n* తన్ను తప్పించి, ఆకాశమంత పిడుగు పడమన్నట్లు.\n\n* తన్నుదా పొగడుకుంటే, తన్నుకొని చచ్చినట్లుంటుంది.\n\n* తన్నే కాలికి రోకలి అడ్డమైనట్లు.\n\n* తపము పండినమీద జడలు తాల్చడమెందుకు?\n\n* తప్పతాగి కులము మఱచినట్లు.\n\n* తప్పించబోయి తగిలించుకొన్నట్లు.\n\n* తప్పు చేసినవానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు.\n\n* తప్పుడు దండుగకు తలో యింత.\n\n* తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు.\n\n* తప్పులెన్నువారు తండోపతండాలు.\n\n* తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.\n\n* తప్పులేనివానిని ఉప్పులో వెయ్యమన్నట్లు.\n\n* తప్పులేనివారు ధరణిలో లేరు.\n\n* తప్పూ ఒప్పూ దైవమెఱుగును, పప్పూ కూడూ బాపడెరుగును.\n\n* తప్పెటకొట్టిన వాడు దాసరి, శంఖమూదినవాడు జంగము.\n\n* తప్పెట కొట్టినా పెండ్లే, చప్పెటకొట్టినా పెండ్లే.\n\n* తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులగుట.\n\n* తమలంలో సున్నమంతటివాడు, తక్కువైనా ఎక్కువైనా బెడదే.\n\n* తమ వంశగౌరవాన్ని గుర్తుంచుకొననివి గాడిదలు మాత్రమే.\n\n* తమంలేకున్న తల్లినిపిల్లలే పరిహాస మాడుకుంటారు.\n\n* తమాం లేదంటే, తవ్వెడైనా ఇవ్వమన్నట్లు.\n\n* తము(మ)లపాకుతో తా నిట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లంటి.\n\n* తము(మ)లము వేయని నోరు, కమలము లేని కోనేరు.\n\n* తమ్ముడు తనవాడైనా, ధర్మం సరిగా చెప్పవలె.\n\n* తరవాణి తల్లి (తరవాణి=పుల్లనీళ్ళు, కలికుండ).\n\n* తరి ఉంటే, వరి అంటారు (తరి=మాగాణి, మబ్బు).\n\n* తరి పట్టిన కఱ్ఱ, చెరపట్తిన కుఱ్ఱ.\n\n* తరి మెడకు ఉరి.\n\n* తఱిమి చల్లితే తవ్వెడే.\n\n* తలంత బలగమే కానీ తలలో పెట్టువారు లేరు.\n\n* తల ఊపినందుకు తంబూరా బుఱ్ఱ ఇచ్చిపొమ్మన్నట్లు.\n\n* తలకాయ లోపలికి దూర్చిన తాబేలు వలె.\n\n* తలకింది కొఱవి వలె.\n\n* తలకు చెప్పులడిగినట్లు.\n\n* తలకు దాకకున్న, తనకేమి తెలియదు.\n\n* తలకు దారిలేదు, బుడ్డకు అటకలి.\n\n* తలకు మించిన శిక్ష, గోచికి మించిన దారిద్ర్యం లేవు.\n\n* తలకు వచ్చిన భాదను తలపాగా మోసినట్లు.\n\n* తలకోసి ఇచ్చినా పుచ్చకాయ అనేవాడు.\n\n* తలకోసి ముందర పెట్టినా గారడివిద్యే అన్నట్లు.\n\n* తలకోసుకుపోగా తమ్మపోగుల కేడ్చినట్లు.\n\n* తలగడ కింద త్రాచుపాము వలె.\n\n* తలగడ తిరుగవేస్తే తలనొప్పి తీరునా?\n\n* తలగొట్టేవానికైనా మూడు మనవు లుంటాయి.\n\n* తల గొరిగించుకున్న తరువాత తిధి నక్షత్రం చూచినట్లు.\n\n* తలగోసి మొల వేసినట్లు.\n\n* తలచినప్పుడే తాత పెళ్ళి.\n\n* తల చుట్టం, తోక పగ.\n\n* తల తడవి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు.\n\n* తల తడిపిన మట్టుకు గొరిగి తీరవలె.\n\n* తల తిరిగి ముద్ద నోటికి వచ్చినట్లు.\n\n* తల దన్నేవాడు పోతే, తాడి దన్నేవాడు వస్తాడు.\n\n* తలదాచుకొన చోటిచ్చిన వానికే తావు లేకుండా చేసినట్లు.\n\n* తల నరకడంలో, మొల నరకడంలో తారతమ్యమేమిటి?\n\n* తల నరికె వానికి తలవారిచ్చినట్లు (తలవారు=పెద్ద కత్తి, తల్వార్-హింది).\n\n* తలనొప్పి తగిలిందని తలగడ మార్చినట్లు.\n\n* తల పడేచోటికి కాళ్ళు ఈడ్చుకొనిపోవును.\n\n* తలపాగా చుట్టలేక తలవంకర అన్నట్లు.\n\n* తలప్రాణం తోకకు వచ్చినట్లు.\n\n* తలంబ్రాలకు తద్దినాలకి ఒకే మంత్రమా.\n\n* తలంబ్రాలనాటి త్రాడు తానుపోయిన నాడే పోతుంది.\n\n* తల మాసినవాడెవడంటే ఆలి(లు)చచ్చినవాడు అన్నట్లు.\n\n* తలరాత(వ్రాత) తప్పించుకోరానిది.\n\n* తలరాతేగాని, తనరాత ఎక్కదు.\n\n* తలలు బోడులైన తలపులు బోడులా?\n\n* తలపులు బోడులైన దక్కునా తత్వంబు.\n\n* తలలో నాలుక, పూసలలో దారము వలె\n\n* తలవంచుకుంటే, ఏడు గోడల చాటు.\n\n* తలవరిదగు పొందు తలతోడ తీరురా.\n\n* తల విడిచి మోకాలికి బాసికం కట్టినట్లు.\n\n* తల వెంట్రుకలంత బలగమున్నా తల కొఱవి పెట్టె దిక్కులేదు.\n\n* తల వెంట్రుకలున్నమ్మ ఏకొప్పు అయినా పెట్టవచ్చు.\n\n* తలాతోకా లేని కత, ముక్కు మొగము లేని పిల్ల.\n\n* తలారి దుప్పటి రెడ్డి బహుమానం చేసినట్లు.\n\n* తలారి పగ తలతో తీరును.\n\n* తలారి రుమాలు రెడ్డి చదివించినట్లు.\n\n* తలుగు తెంచుకున్న బఱ్ఱె, తాడు తెంచుకున్న గుఱ్ఱం.\n\n* తలుగు దొఱకిందని ఎనుమును కొన్నట్లు.\n\n* తలుగు పెట్టి తంతూ ఉంటే, కొలువు పెట్టి కొలిచినట్లు.\n\n* తలుచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎలాగు?\n\n* తలుపు పెట్టి చెబుతుంటే, కొలుపు పెట్టి అడుగుతాడు (కొలుపు=పశుబలి లేని జాతర, గలాబా).\n\n* తలుపులు మింగేవానికి అప్పడాలు లొటలొట.\n\n* తలుపొకరింటికి తీసిబెట్టి తా కుక్కలు దోలినట్లు.\n\n* తలుపేల చాపగుడిసెకు.\n\n* తలుము-తక్కువవాడు పనికిముందు వంగి, పనికాగానే నిగుడుకొంటాడు (తలుము=ఏతము).\n\n* తల్లి అయినా ఏడవందే పాలివ్వదు.\n\n* తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?\n\n* తల్లి కడుపు చూచును, పెళ్ళాం వీపు(జేబు) చూచును.\n\n* తల్లి కడుపులోచోరక ముందు దెయ్యాల దేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత.\n\n* తల్లి కాకపోతే తిళ్ళికకు దణ్ణం పెట్టమన్నారు.\n\n* తల్లికి కానినాడు దాదికవునా?\n\n* తల్లికి కూడుపెట్టనివాడు తగుదునని తగవు తీర్చవచ్చాడట.\n\n* తల్లికి కూడు పెట్టనివాడు తగవు చెప్పేడు (చెప్పును), పెళ్ళానికి చాలనివాడు పెత్తనం చేసేడు (చేయును).\n\n* తల్లికి కూడు పెట్టనివాడు పినతల్లికి చీరపెట్టాడుట.\n\n* తల్లిని కొట్టరా వసంతం అన్నట్లు.\n\n* తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి.\n\n* తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్పసమానం(శష్ప మర్యాద).\n\n* తల్లికి బొల్లి ఉంటే, పిల్లకు చుక్కయినా ఉంటుంది.\n\n* తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?\n\n* తల్లికి వంచగలిగిన పిల్లకు బొక్క కలుగుతుంది (బొక్క=మూలుగ ఎముక).\n\n* తల్లి కొద్ది బొల్లి కోడె.\n\n* తల్లిగండం, పిల్లగండం ఉన్నదికానీ, మధ్యన మంత్రసాని గండమున్నదా?\n\n* తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా.\n\n* తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?\n\n* తల్లి గూనిదయితే తల్లిప్రేమ గూనిదవుతుందా?\n\n* తల్లిగుణము కూతురే బయటపెడుతుంది.\n\n* తల్లి చచ్చినా మేనమాముంటే చాలు.\n\n* తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానము.\n\n* తల్లిచస్తే కడుపు పెద్ద, తలలు మాస్తే కొప్పు పెద్ద.\n\n* తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణంబాసె.\n\n* తల్లి చస్తే నాలిక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళుపోయినట్లు.\n\n* తల్లి చాలి పిల్లకు తప్పుతుందా?\n\n* తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు).\n\n* తల్లి చెవులు తెంపినవానికి, పినతల్లి చెవులు బీరపువ్వులు.\n\n* తల్లి చేను మేస్తే, పిల్ల మేర మేస్తుందా?\n\n* తల్లి చేల్లో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా?\n\n* తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండప్రదానమట.\n\n* తల్లితండ్రీ లేని బాల తననాధునే కోరును.\n\n* తల్లితండ్రులు, అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొదవే.\n\n* తల్లిదే సంరక్షణ, ధరణిదే వలపక్షం.\n\n* తల్లి దైవము, తండ్రి ధనము.\n\n* తల్లిని చూచి పిల్లను, పల్లును చూచి పశువును కొనవలె.\n\n* తల్లిని చూచి పిల్లను, తరిని జూచి బఱ్ఱెను (తరి= వెన్న ఎక్కువగా కలిగిన పాలు).\n\n* తల్లిని చూచి పిల్లను, పాడిని (పొదుగును) జూచి బఱ్ఱెను.\n\n* తల్లిని తిట్టకురా నీయమ్మనాయాల అన్నట్లు.\n\n* తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు.\n\n* తల్లిబట్టి పిల్ల, విత్తునిబట్టి పంట.\n\n* తల్లిబట్టి పిల్ల, నూలునుబట్టి గుడ్డ.\n\n* తల్లిపాలు దూడ చెప్పును.\n\n* తల్లి పిత్తి పిల్లమీద పెట్టిందట.\n\n* తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్ట దిక్కులేదు.\n\n* తల్లి పుట్టిల్లు మేనమామ వద్ద పొగడినట్లు.\n\n* తల్లి పుస్తి బంగారమైనా అగసాలి దొంగిలించకుండా ఉండలేడు.\n\n* తల్లి పెంచవలె, ధరణి పెంచవలె గానీ పెరవారు పెంచుతారా?\n\n* తల్లి పైచేయిజూచు తగు పంటలల్లూరు.\n\n* తల్లిమాటలే గానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది).\n\n* తల్లి ముఖం చూడని బిడ్డ, వానముఖం చూడని పైరు.\n\n* తల్లిమీది కోపం పిల్లమీద పోతుంది.\n\n* తల్లిలేక పెరిగి ధాత్రి నెట్లేఎరా?\n\n* తల్లిలేని పిల్ల - ఉల్లి లేని కూర.\n\n* తల్లిలేని పిల్లలు, అల్లులేని తీగలు.\n\n* తల్లిలేని పుట్టిల్లు, ఉల్లిలేని కూర.\n\n* తల్లి విషం, పెండ్లాం బెల్లం.\n\n* తల్లి వెనుక మేనమామ అన్నారు.\n\n* తల్లి సారం పిల్ల, దాకసారం సక్కు.\n\n* తల్లిలేని పిల్ల దెయ్యాల పాలు.\n\n* తల్లీ, బిడ్డా ఒకటైనా, నోరు కడుపు వేరు.\n\n* తల్లె కొట్టినా పెండ్లే, తప్పెట కొట్టినా పెండ్లే.\n\n* తల్లే రోసిన దాది రోయదా?\n\n* తవిటికి వచ్చిన చెయ్యే ధనానికి వస్తుంది.\n\n* తవుటికి ఱంకాడబోగా కూటితపిలె కోతిగొంపోయినట్లు.\n\n* తవుడు తాతా! అంటే, నూకలా ముసలమ్మా? అన్నట్లు.\n\n* తవుడు తింటూ ఒయ్యారమా?\n\n* తవుడుతిని చచ్చేవానికి విషంపెట్టేవాడు వెఱ్ఱి.\n\n* తవుడు నోముపట్టిన అమ్మకు తరగని ఐదవతనము.\n\n* తవుడూబొక్క తహసిల్దారుడు, మీసాలెగబెట్ట మాసూలుదారుడు (మాసూలు దారుడు= రైతుల దగ్గర ధాన్యరూపకంగా శిస్తు వసూలుచేయు ఉద్యోగి).\n\n* తవుడు బొక్కినంతవరకే దక్కినట్లు.\n\n* తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుంది.\n\n* తవ్వి మీద తోసుకున్నట్లు.\n\n**********:: తా ::**********\n\n* తాకట్ల మొగుడా! తంటాల మొగుడా! నీ తనువుండగానే నన్ను మనువిచ్చి పోరా.\n\n* తాకబోతే తగులుకున్నట్లు.\n\n* తాకున కాలికే బుడుసు(పు), తెగిన తాటికే ముడుసు (బుడుసు=బొబ్బ, ముడుసు=ముడి).\n\n* తాకిన వేలికే తట్టు తగులుతుంది.\n\n* తాకితే తగరు, ఈనితే గొఱ్ఱె.\n\n* తాకి నేలకు తడిబ(బొ)ట్టు కానీదు, వంగి నేలకు ఇంగువ కానీదు.\n\n* తాకి మొగ్గి తడిసి గుడిసె కప్పు (తాకి=అనుభవం కలిగి).\n\n* తాకి మ్రొగ్గిన తనువంత ఒకటి, దీపము నులిపిన దినుసంత ఒకటి.\n\n* తాగటానికి దప్పిక (గంజి) లేదుగానీ గుంటడికి గుండుజోడు.\n\n* తాగనేరని పిల్లి బోర్ల పోసుకొన్నట్లు.\n\n* తాగబోతే దప్పికకు లేదుకానీ, తలకు అటకలి (అటకలి=తలస్నానానికి మేలైన చమురు).\n\n* తాగబోతే మజ్జిగలేదంటే, పెరుగుకు చిట్టి వ్రాయమన్నాడట.\n\n* తాగితేగానీ మొగ్గడు, తడిస్తేగానీ కప్పడు.\n\n* తాగిన దుక్కి తప్పక పండును (తాగిన=నీరుబాగా పీల్చిన)\n\n* తాగినవాడి తప్పుకు తగవు లేదు.\n\n* తాగినవాడు తప్పినవాడు ఒకటే.\n\n* తాగినవానిదే పాట, సాగినవానిదే ఆట.\n\n* తాగినవానిమాట దబ్బరగాదు.\n\n* తాగిన రొమ్మే గుద్దినట్టు.\n\n* తాగుటకు ముందు, వ్రాతకు వెనుక చూడవలె.\n\n* తాగుబోతు తోడు కోరతాడు.\n\n* తాగేది దమ్మిడి గంజాయి, ఇల్లంతా చెడ ఉమ్ములు.\n\n* తాగేవాడే తాళ్ళపన్ను కట్టుతాడు.\n\n* తాగేది గంజైనా స్నానమాడి తాగు; కట్టేది చింపైనా ఉతికికట్టు.\n\n* తాచుపాము తామసము, జఱ్ఱిపోతు పిరికితనము కలవాడు.\n\n* తాచెడ్డకోతి వనమెల్లా చెరిచె.\n\n* తాచెడ్డ ధర్మం, మొదలుచెడ్డ బేరం.\n\n* తాటంత వానిని తలదన్ను వాడుంటాడు\n\n* తాటాకు చప్పుళ్ళకు కుండేళ్ళూ బెదరునా?\n\n* తాటికాయ తింటావా? తలకొట్లు పడాతావా?\n\n* తాటికాయ వన్నె తప్పుడిది.\n\n* తాటిచెట్టు ఎక్కలేవు, తాటిగెల కోయాలేవు. తాతా నీకెందుకోయ్ పెండ్లాము.\n\n* తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.\n\n* తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్న ముండా పెండ్లాం కాదు.\n\n* తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్నవాడు మొగుడూ కాదు.\n\n* తాటిచెట్లకు గంధం పూసినట్లు.\n\n* తాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రునికి గంజన్నము (గంజికూడు).\n\n* తాటిఎత్తు ఎగిరినానంటే తారాజు(చు)వెత్తు ఎగురు అన్నట్లు.\n\n* తాడినెక్కేవాడిని ఎంతదాకా ఎగసనదోత్తారు?\n\n* తాడికి తలబంటి అయితే (వె)ఎంపలికి ఎంతబంటి? అన్నట్లు.\n\n* తాడి తన్నివానిని తలతన్నే వాడుకూడా ఉంటాడు.\n\n* తాడు అని ఎత్తిపారేయకూడాదు, పాము అని దాటనూకూడదు.\n\n* తాడుకు పట్టలేదు, తలుగుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజలాత?\n\n* తాడుతెంచను ముహూర్తమెందుకు?\n\n* తాడుతో దబ్బనము.\n\n* తాడూలేదు, బొంగరమూ లేదు.\n\n* తాడులేకుండా బొంగరం తిప్పేవారు.\n\n* తాత కట్టిన చెరువని దూకుతారా?\n\n* తాతకు దగ్గులు నేర్పినట్లు.\n\n* తాతా తాత! తంగెడుపుల్ల, ధు(ద)సినీ యక్క, కుందేలుపిల్ల.\n\n* తాతదిన్న బొచ్చె తరతరా లుంతురా?\n\n* తాతపోతే బొంత నాది.\n\n* తాడుతెగిన గాలిపటం.\n\n* తాడులేకుండా బొంగరం ఆడించేవాడు.\n\n* తాతను చూపుతావా? తద్దినం పెడతావా?\n\n* తాతలనాటి బొచ్చె తరతరాలకు.\n\n* తాతలనాటి మూకుడు తరతరాలు మనాలన్నట్లు.\n\n* తాతలనాడు నేతులుతాగాం, మూతులు వాసన చూడు.\n\n* తాతాచార్ల తద్దినానికి, పీర్లపండుగకు ఏమి సంభందం?\n\n* తాతాచార్యులవారి ముద్ర భుజంతప్పినా వీపు తప్పదు.\n\n* తాతాచార్యు లేం జేస్తున్నారంటే, తప్పులు (వ్రాసి0 చేసి దిద్దుకుంటున్నారు.\n\n* తాతా పెండ్లాడుతావా అంటే, నా కెవరిస్తారురా అబ్బాయి అన్నాడట.\n\n* తాతా సంక్రంతి పట్టు పట్టు.\n\n* తాతా సంధ్య వచ్చునా? అంటే, ఇప్పుడు చదువుకొన్న నీకే రాకపోతే అరవైఏళ్ళక్రితం చదువుకొన్న నాకు వచ్చునా అన్నాడట.\n\n* తా త్రవ్విన గోతిలో తానే పడతాడు.\n\n* తా దిన తవుడులేదు, వారాంగనకు వడియాలట.\n\n* తాదూర సందులేదు, మెడకొక డోలు అన్నట్లు.\n\n* తాను ఆడుదై గూడ నానబ్రాల కేడ్చిందట (నానబ్రాలు=బియ్యం నానబెట్టి బెల్లం, కొబ్బెర కలిపి తిను తినుబండారం)\n\n* తాను ఆడుదై నానబ్రాల కేడ్వవలెనా?\n\n* తాను ఉండేది దాలిగుంట పట్టు, తలచేవి మేడమాళిగలు.\n\n* తాను ఎఱుగని కల్ల లేదు, తల్లి ఎఱుగని కులం లేదు.\n\n* తాని ఒకటి తలిస్తే దైవ మింకొకటి తలచినట్లు.\n\n* తానుగాక పిల్లి కూడానా?\n\n* తాను చావడం జగం క్రుంగడ మనుకున్నదట ఒకనక్క.\n\n* తాను చేసిన పాపం తనువుతో, తల్లి చేసినపాపం ధరణితో.\n\n* తాను చొక్కమైనట్లు, తడక భద్రమైనట్లు.\n\n* తాను దూరనే కంత లేదు, మెడకొక డోలా?\n\n* తాను దొంగై, ఇంటిపై అనుమానపడినట్లు.\n\n* తను దొంగైతే, ఇరుగు పొరుగును నమ్మడు.\n\n* తాను పతివ్రత అయితే, సాని ఇంత కాపురముంటే మాత్రమేమి?\n\n* తాను పెంచిన పొట్టేలు తనచేతనే చచ్చినట్లు.\n\n* తాను పెంచిన పొట్టేలు తన్నే తఱిమి పొడిచినట్లు.\n\n* తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.\n\n* తాను మింగేదాన్ని, తన్ను మింగేదాన్ని చూచుకోవలె.\n\n* తాను మెచ్చ తినాలి, ఒకరు మెచ్చ నడవాలి.\n\n* తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ.\n\n* తానే తుమ్మి, తానే దీవించుకొన్నట్లు.\n\n* తానే తుమ్మి, తానే శతాయుస్సు అనుకొన్నట్లు.\n\n* తానే శెట్టి అంటే, మూడే గిద్దలంటాడు.\n\n* తానే సెట్టి అంటే, మూడే సోలలు అమ్మినాడట.\n\n* తానై మాగని కాయ, తంతే మాగునా?\n\n* తానొకటి తలచిన దైవమొకటి తలచు.\n\n* తాపుల గొడ్డుకు రోలడ్డమా?\n\n* తా బెట్టుకోనిది భిక్షమా?\n\n* తా బోతూ బొల్లెద్దుకు కుడితి అన్నట్లు.\n\n* తా బోతే తాడు దొరకదుగానీ రాయరా సన్నాలకు చీటీ అన్నాడట.\n\n* తా బోతే మజ్జిగ చుక్కకు గతిలేదు, చీటీవస్తే పెరుగు పంపుతారన్నట్లు.\n\n* తామరాకుపై నీటిబొట్టు వలె\n\n* తామసంబు నెంచు ధరలోన నధముండు.\n\n* తాయిత్తులకే పిల్లలు పుడితే తా నెందుకు?\n\n* తార్చినదానికి టంకము, వెళ్ళినదానికి ఏగాని.\n\n* తాలిమి తన్ను కాచును, ఎదరినీ కాచును.\n\n* తాలుకంకి గింజలోయి దాసరీ ! అంటే రాలినవఱకే గోవిందా ! అన్నాడట (తాలు=నీళ్ళులేక ఎండిపోయిన వరి కర్ర, అదివేయి తరకగింజల వెన్ను).\n\n* తాలువడ్లకు నీళ్ళ కల్లుకు సరి.\n\n* తాళపుచెవి లేక తలుపెట్టు లూడురా?\n\n* తాళము నీవద్ద, చెవి నావద్ద.\n\n* తాళ(చెవి)ము పోయినంత మాత్రాన పెట్టి తెరువలేమా?\n\n* తాళిదెంచను శుభలగ్నము కావలెనా?\n\n* తాళిబొట్టు బలంవలన తలంబ్రాలవరకు బ్రతికినాడు.\n\n* తాళ్ళకు తలబంటి అంటే, వెంపలికి ఎంతబంటి అన్నాడట.\n\n* తాళ్ళకు తలను చండ్లు, మేకలకు మెడను చండ్లు.\n\n* తాళ్ళపాక చిన్నన్న రోమములు కాగానే తంబూరా దండెకు తంతులగునా?\n\n* తాళ్ళపాకవారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత.\n\n**********:: తి ::**********\n\n* తింటే ఆయాసం, తినకుంటే నీరసం.\n\n* తింటే కదలలేను, తినకుంటే మెదలలేను.\n\n* తింటేగానీ రుచి తెలియదు, దిగితేగానీ లోతు తెలియదు.\n\n* తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి.\n\n* తింటే బఠాణ, వింటే అఠాణ (రాగం).\n\n* తింటే భుక్తాయాసం, నడీస్తే మార్గాయాసం.\n\n* తింటే నారసం, తినకపోతే నీరసం.\n\n* తింటే మీగడ తినాల, వింటే బేగడ వినాల (రాగం).\n\n* తిండికి ఏనుగు, పనికి పీనుగు.\n\n* తిండికి చేటు, నేలకు బరువు.\n\n* తిండికి ఠికాణా లేదు, ముండకు బులాకి అట.\n\n* తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.\n\n* తిండికి తీటకు మేరలేదు.\n\n* తిండికి పిడుగు, పనికి బుడుగు.\n\n* తిండికి ముందు కోపు, పనికి వెనుక కోపు (కోపు=పార్శ్వము, ప్రవేశము).\n\n* తిండికి ముండు, దండుకు వెనుక.\n\n* తిండికి ముందెత్తు, పనికి వెనకెత్తు.\n\n* తిండికి లేకపోయినా తిక్కకేమి లోటు?\n\n* తిండికి వచ్చినట్లా? తీర్ధానికి వచ్చినట్లా?\n\n* తిండి చింత, దండి చింత.\n\n* తిండిబోతు సంగతి పెండ్లామేరుగు.\n\n* తింత్రిణీక మహిమ తినువా డెరుంగును.\n\n* తిండిలేనమ్మ తిరనాళ్ళకు పోతే ఎక్కా దిగా సరిపోయింది.\n\n* తిక్కపిల్ల తీర్ధంపోతూ, అక్కమొగుడిని వెంటబెట్టుకు పోయిందట.\n\n* తిక్కప్ల్లా! తిక్కపిల్లా! మా అక్కపిల్లను చూస్తివా అంటే, చూస్తి- శుక్రవారమని కావలించుకొంటి, మాటలాడుదామంటే మఱచిపోతి అన్నదిట.\n\n* తిక్కలవాడు తిరనాళకు పోతే, ఎక్కాదిగా ఏడునాళ్ళు పట్టిందట.\n\n* తిట్టకురా తత్తుకొడుకా అన్నట్లు.\n\n* తిట్టబోతే అక్కబొడ్డ, కొట్టాబోతే వేకటి మనిషి (వేకటి మనిషి=గర్భిణి).\n\n* తిట్టితే చచ్చినవాడు లేడు, దీవించితే బ్రతికినవాడు లేడు.\n\n* తిట్టితే కోపం, కొట్టితే నొప్పి.\n\n* తిట్టితే గాలికి పోతవి, తింటే లోనికి పోతవి.\n\n* తిట్టుకొక శృంగారమా?\n\n* తిట్టే నోరు కొ(కు)ట్టినా ఊరకుండదు.\n\n* తిట్టె నోరు, తినే నోరు, తిరిగే కాలు ఊరకుండవు.\n\n* తిత్తికాసులు జెల్లె, తిడునాళ్ళ జెల్లె.\n\n* తినక చవి, చోరక లోతు తెలియవు.\n\n* తినకుండా రుచులు, దిగకుండా లోతులు తెలియవు.\n\n* తిన కూటికి దారిలేదు కానీ,; తనవారికి తద్దినాలట.\n\n* తినగతినగ వేము తియ్యనై యుండును.\n\n* తినగల అమ్మ తిండి తీర్ధాలలో బయటపడుతుంది.\n\n* తినగా తినగా గారెలు చేదు.\n\n* తినబెట్తమంటే, వినబెట్ట మన్నట్లు.\n\n* తినబోతూ రుచులడిగినట్లు.\n\n* తిననేర్చినమ్మ పెట్టనేరుస్తుంది.\n\n* తిమమంటే పులివల్లదు.\n\n* తినమరిగిన కుక్క రేవు కాసిందట.\n\n* తినమరిగిన కుక్క అలమరిగి చచ్చిందట.\n\n* తినమరిగిన కోడి అలమరిగినదట. (అలమరుగు= అలమటించు)\n\n* తిమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట.\n\n* తినమరిగిన ప్రాణం అల్లాడి చచ్చిందట.\n\n* తిమమరిగినమ్మ వరిమడి దోవ పట్టినట్లు.\n\n* తినా కుడువా తీర్ధం పోవాలి, తిండికి మాడ పెండ్లికి పోవాలి.\n\n* తినాలేదు పట్టాలేదు బొట్టైనా పెట్టుకో.\n\n* తిని ఉండలేను, తీసి బొందవెట్టు.\n\n* తిని ఉండలేక, తాగి బొందను పడినట్లు.\n\n* తిని కుడువ వలె, ఋణాలు పోవలె, పనిజేయి పెండ్లికి పోవలె.\n\n* తినేకూటిలో మన్ను పోసుకొన్నట్లు.\n\n* తినేది కుడుచేది తిమ్మక్క, మోసుకు తిరిగేది మొఱ్ఱెక్క.\n\n* తినేది కుడిచేది (పెట్టేది) రెడ్డిసాని, (కనేది) కట్టేది గుడ్డిపోలి (కట్టుట= పశువుల గర్భధారణ).\n\n* తినేది గొడ్డుమాంసం, చేసేది దేవతార్చన.\n\n* తినేవరకు ఆకలికుట్టు, తిన్నతర్వాత దండికుట్టు.\n\n* తినేవి తిప్పకాయలు, వెళ్ళగ్రక్కేవి వెలగకాయలు.\n\n* తిన్న ఇంటి వాసాలు (లెక్కపెట్టు) ఎంచుతావేమిరా? అంటే పొరుగింటి సంగతి నాకేమి తెలుసు అన్నాడట.\n\n* తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.\n\n* తిన్న ఇల్లు గుద్దలించా వేమిరా? అంటే, తినని ఇంట్లోకి రానిస్తారా అన్నాడట.\n\n* తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కను కట్టేసినారంట.\n\n53 తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కకు కాలు విరిగకొట్టినట్లు.\n\n* తిన్నవాడే మన్నవాడు, మన్నవాడే మహరాజు.\n\n* తిన్నోడికి తిండిబెట్టడాం, బోడిగుండోడికి తలకుబోయడం సులభం.\n\n* తిప్పులాడీ! మా అవ్వను చూచినావా? అంటే, తీర్ధంలో మా బావను చూచినావా అన్నదిట.\n\n* తిమ్మన బంతికి తియ్యని చారు-అన్నము (తిమ్మన్న=తిరుమల అన్న, వేకటేశ్వరుడు; కోతి).\n\n* తిమ్మన్న బంతికి రమ్మంటారు కాబోలు.\n\n* తిమ్మన్న! తిమ్మన్న! నమస్కారమంటే, నా పేరు నీకెలా తెలిసింది అంటే, నీ ముఖం చూడగానే తెలిసింది అన్నాడట.\n\n* తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు.\n\n* తియ్యగా తియ్యగా రాగం, మూల్గగా మూల్గగా రోగం.\n\n* తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెతీగ కుట్టేది.\n\n* తిరిగి ఆడుది, తిరుగక మగవారు చెడుదురు.\n\n* తిరిగితే వరిపొలం, తిరుగకపోతే అడవిపొలం.\n\n* తిరిగి రైతు, తిరుగక బైరాగి చెడుదురు.\n\n* తిరిగివచ్చిన భార్య, తిరుగబోత (తిరుగమూత) వేసిన కూర బహురుచి (తిరుగబోత=తిరుగమాత=పోపు).\n\n* తిరిగేకాలు తిట్టె నోరు ఊరుకోవు.\n\n* తిరిపం పెట్టె అమ్మను మగనితోపాటు పెట్టమన్నట్లు.\n\n* తిరివపుకూడు బర్కతు లేదు, తిన్నవఱకు నమ్మిక లేదు (బర్కతు=క;అసివచ్చుట).\n\n* తిరివపు మజ్జిగకు వచ్చి, పాడిగేదెను బేరమాడినట్లు.\n\n* తిరిప మెత్తేవానికి పెఱుగన్నం కరవా?\n\n* తిరిపెపు అనుభవం తమి దీరదు.\n\n* తిరిపెపు తిండి తింటే, మిట్టచేనుకు ఒడ్డువేసినట్లుండాల (ఎగదన్ని ఉండును).\n\n* తిరిపెమున లేమి తీరుతుందా?\n\n* తిరునాళ్ళకు (తీర్ధం) పోతూ తీసిపొమ్మన్నారు. పెండ్లికిపోతూ పెట్టుకో పొమ్మన్నారు.\n\n* తిరుగనేర్చినవాడు ధీరుడై యుండురా.\n\n* తిరుగ మరిగిన కాలు, తినమరిగిన నోరు ఊరుకోవు.\n\n* తిరునాళ్లకు పోయివచ్చిన మొగం మాదిరి (అలసి సొలసి వచ్చును).\n\n* తిరుపతి పోగానే తురక దాసరి కాడు.\n\n* తిరుపతిలో పుట్టగానే దున్న గోవిందా అంటుందా?\n\n* తిరుమణి పెట్టనేరిస్తే తీర్థాలు గడచినట్లు.\n\n* తిరుమల్లయ్య సలహా, తిరుపతి వెంకన్న మ్రొక్కు.\n\n* తిలాపాపం తలో పిడికెడు.\n\n**********:: తీ ::**********\n\n* తీగంటి (తీగవంటి) బిడ్డంటే, తెగ తెమ్మని ఏడ్చినదట.\n\n* తీగ కదిలిస్తే, పొదంతా కదులుతింది.\n\n* తీగకు కాయ బరువా?\n\n* తీగ పెట్టినమ్మ మాట తియ్యగా, కమ్మపెట్టినమ్మ మాట కమ్మగా, విచ్చుటాకులున్నమ్మా! నీమాట విన సహించదు అన్నదట.\n\n* తీగై వంగంది, మానై వంగుతుందా?\n\n* తీటగలదానికి, తోటగలవానికి తీరిక ఉండదు.\n\n* తీటబుట్టినవాడే గోక్కుంటాడు.\n\n* తీటమ్మా! తీటమ్మా! నీ నొసలేమయ్యింది అంటే, తిరుమణి పెడితే పొక్కింది అందిట.\n\n* తీట సిగ్గెరుగదు.\n\n* తీతువపిట్ట కాళ్ళు తలక్రిందులుగా పెట్టి ఆకాశం పడకుండా చూస్తానన్నదిట (పట్టుకున్నానందట).\n\n* తీతువపిట్ట రాయబారం (దుశ్శకునం).\n\n* తీపి ఏదంటే- ప్రాణం.\n\n* తీపునంటి ఈగ తెగువతో నీల్గును.\n\n* తీపుల మాటలకు వీపులు గుంజుతవి.\n\n* తీయడం పెట్తడం తీపులచేటు కనటం, కూచోవటం నొప్పులచేటు.\n\n* తియ్యని నోర చేదు మేసినట్లు.\n\n* తీరుతీరు గుడ్డలు కట్టుకొని తిరునాళ్ళకుబోతే, ఊరికొక గుడ్డ ఊసిపోయిందట.\n\n* తీరోటి (తీరైన) మొగమని తిరిపానికి బోతే, తడవిచూసాడట.\n\n* తీర్థము స్వార్థము కలసివచ్చినట్లు.\n\n* తీర్థయాత్రతోడ దివ్యుండు కాడయా.\n\n* తీసినవారు బాగానే ఉంటారు, తీయించుకున్నవారూ బాగానే ఉంటారు, ఎదురైనవారికి తగులుతుంది ఎదురుమిత్తి.\n\n**********:: తు ::**********\n\n* తుంగభద్రలో మునుగను తాతం భట్టాఙ్ఞా?\n\n* తింగలో పిత్తితేమీ? తూటాకులో పిత్తితేమి?\n\n* తుంటిమీద కొడితే నోటిపళ్ళు రాలాయట.\n\n* తుప్పరల వస్తేగానీ మంత్రాల పసలేదు.\n\n* తుట్టెపురుగు రెక్కలు వచ్చినా, ముసలివాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గాలుండవు.\n\n* తుడుము కాడి(డ) నుంచి దేవతార్చనదాకా ఒకటే మాట (తుడుము=నగారా).\n\n* తుడుము మొదలు దేవతార్చనదాకా ఒకేమాట (మంత్రం).\n\n* తుదను దండుగనిడి మొదలుచెడు నరుండు.\n\n* తుది దాకునే లోక విరుద్ద వృత్తముల్\n\n* తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు.\n\n* తుమ్మ ఉన్నచోటునే కమ్మ ఉండును.\n\n* తుమ్మగుంతలో ఇచ్చి పోగొట్టుకొన్నవాడు, దండిగుంటలో ఇచ్చి రాబట్టుకున్నవాడు.\n\n* తుమ్మతోపుల్లో కొత్తకోలాటం.\n\n* తుమ్మ దుడ్డువలె, కాపు కదురువలె.\n\n* తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది?\n\n* తుమ్ముకు తమ్ముడులేడు గానీ, ఆవలింతకు అన్న ఉన్నాడు.\n\n* తుమ్ము తమ్ముడై చెప్పు.\n\n* తుమ్మెదలాడితే వాన తప్పదు.\n\n* తురక ఎంత గొప్పవాడైనా, ఇంతికి పేరు లేదు, తలకు జుట్టులేదు, మొలకు తాడు లేదు.\n\n* తురక కరక భేదికారులే, మొదటిది దగ్గరకు వస్తే చాలు, రెండోది లోపలికి పోవాల.\n\n* తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా?\n\n* తురక దెయ్యము మంత్రించినట్లు.\n\n* తురక దాసరికి ఈత మజ్జిగ.\n\n* తురక మెచ్చు, గాడిద తన్ను సంకటమే.\n\n* తురకలలో మంచి ఎవరంటే, తల్లి కడుపులో ఉన్నవాడు, గోరీలో ఉన్నవాడు.\n\n* తురకల సేద్యం, పెరికల పాలు. (పెరిక= విశాఖ ప్రంతంలో ఒక జాతి).\n\n* తురకలు తప్పించుకుంటే ఈదులలో, మేకలు తప్పించుకుంటే తుమ్మలలో (ఈదులు=ఈత చెట్ల తోపులు).\n\n* తురకలు లేణు ఊళ్ళో దూదేలులవాడే ముల్లా.\n\n* తురకలవాడకు గంగిరెద్దు పోతే, కోసుకొని తిన్నారట.\n\n* తురకవీధిని సన్యాసి భిక్ష వలె.\n\n* తురక వీఢిలో విప్రునికి పాదపూజ చేసిఏమి? చేయకేమి?\n\n* తురకా దూదేకుల పొత్తులో మురిగీ మర్దార్.\n\n* తురకా (బ)మరకా తిరగేసి నరకా.\n\n* తురాయి పెట్తినవాడి కొలువు, పరాయివాడి పాంపు.\n\n* తులము నాలికకు తొంభై రుచులు.\n\n* తులసి కడుపున దురదగొండి పుట్టినట్లు.\n\n* తులసికోటలో ఉమ్మేసినా వేమిరా? అంటే, యఙ్ఞవేదిక అనుకున్నాను అన్నాడట.\n\n* తులసివనంలో గంజాయి మొక్కవలె.\n\n* తులువనోటికి ఉలవపప్పు.\n\n* తువ్వన వేసిన ఎఱువు, బాపనికి పోసిన నెయ్యి (తువ్వ=ఇసకతెర, ఎర్రనేల).\n\n* తుళ్ళే ఎద్దే గోనె మోసేది.\n\n**********:: తూ ::**********\n\n* ' తూ ' అంటే బలా అన్నదంట.\n\n* తూగి ముందుకు పడడు, తాగి వెనుకకు పడడు.\n\n* తూట్లు మూసి తూములు తెరచినట్లు.\n\n* తూనీగలాడితే తూమెడు వర్షం (వాన).\n\n* తూమెడువడ్లు తూర్పార(న) బట్టేటప్పటికి ఏదుమువడ్లు ఎలుకలు తినిపోయినవి.\n\n* తూర సందులేదు, తోడ నొకడోలు.\n\n* తూరిన డేగేటు (వేటు), విడిచిన కోలేటు (కోల) తప్పవు (తూరుట=ఆకాశం నుండి భూమికి మహావేగంతో దిగి హటాత్తుగా పైబడి మరల ఎగిరిపోవుట).\n\n* తూరిన గుద్ద దెబ్బ, నీతిపట్తు పులిదెబ్బ తప్పవు.\n\n* తూరుపు తలాపి (తలదాపి) దున్నపోతు గూడా పెట్టదు.\n\n* తూరుపు తొమ్మిది, పడమట పది.\n\n* తూర్పున ఇంద్రధనుస్సు, దూరాన వర్షం.\n\n* తూర్పున ఇంద్రధనుస్సు వేస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనస్సు వేస్తే బండమీదను పశువులను కట్టాలి.\n\n* తూర్పున కొఱ్ఱువేస్తే దుక్కిటెద్దు ఱంకె వేస్తుంది (కొఱ్ఱు=ఇంద్రధనుస్సు).\n\n* తూర్పున తెరవేసింది, తుంగభద్రలో దొడ్డికట్టరా గొల్లోడా. (తెర=వరదగూడు).\n\n* తూర్పున ధనస్సు వేస్తే, తుంగగడ్డకూడా తడవదు, పరమట వేస్తే పల్లాలన్నీ (పెంటగుంటలన్నీ) నిండుతవి.\n\n* తూర్పున వరదగూడు వేస్తే, తుంగపోచయినా తడవదు.\n\n**********:: తృ ::**********\n\n* తృణము మేరువు, మేరువు తృణము.\n\n**********:: తె ::**********\n\n* తెంపులతాళ్ళు, చిల్లుల కడవ.\n\n* తెగబలిసిన ఆబోతెద్దు తా నెక్కదు, ఇంకొకదానిని ఎక్కనీయదు.\n\n* తెగించి దానంచేస్తాను తేరా పిడికెడు డాళ్ళు అన్నట్లు.\n\n* తెగించినదానికి సగుడు మోకాలిబంటి.\n\n* తెగించినవాడికి తెడ్డేలింగం, విదిచినదానికి వీరేశలింగం.\n\n* తెగితే లింగడు ఱాయి (శివలింగము స్థానభ్రష్టమైతే రాయితో సమానం అనుట).\n\n* తెగిన చేను తేమ నోర్చును.\n\n* తెగిన వ్రేలికి సున్నంగూడా పెట్టడు.\n\n* తెగువదారికి తేలు కుట్టితే తెల్లవార్లు కోడి కూసిందట.\n\n* తెగువ దేవేంద్ర పదవి.\n\n* తెగేదాకా బిగించకూడదు (లాగరాదు).\n\n* తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా ! లేకుంటే ఊరకుండు లోకనాయక.\n\n* తెచ్చుకొన్న చద్ది, తెచ్చుకొన్నవాడిని తిననిస్తే, మన కమ్మతన మెందుకు కాల్చనా?\n\n* తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు.\n\n* తెడ్డు ఉండగా చేతితో తాకనేల?\n\n* తెడ్డు ఏదీ? అంటే కొయ్య ఏదీ? అన్నట్లు.\n\n* తెడ్డుకేమి తెలుసు కూరల రుచి.\n\n* తెడ్డు నాకి, వ్రతం చెడకొట్టుకున్నట్లు.\n\n* తెనుగు తేట, అరవం అధ్వాన్నం.\n\n* తెరవాటు గాడు కట్టిన బట్టాలాగి మానభంగమని మానునా?\n\n* తెర్లు వదలిన జీదలు వదులుతాయి.\n\n* తెలకపిండి తిన్న కుక్క తోకాడించక మానదు.\n\n* తెలగాన్యపు టెక్కు, నియోగపు నిక్కు (నియోగినిక్కు).\n\n* తెలిక వానికి నువ్వు వండినట్లు.\n\n* తెలియని దెయ్యమికన్నా, తెలిసిన దెయ్యం మేలు.\n\n* తెలిసినవారు ఎదురైతే మనిషి పండ్లికిలిస్తాడు, గుఱ్ఱం సకిలిస్తుంది.\n\n* తెలివి ఒకరి అబ్బసొమ్మా తోటసుబ్బమ్మా?\n\n* తెలివి ఒకరి సొమ్మా గొల్ల గురవమ్మా?\n\n* తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట ఉంది.\n\n* తెలివి మూలం, తెచ్చెర ఘోరం.\n\n* తెలివిగలిగిన పెండ్లాం తెల్లవారిన తరవాత ఏడ్చిందట.\n\n* తెలివిగలిగిన వాళ్ళాను తెలివిగలవాళ్ళ దగ్గరకు పంపి నన్ను నీ దగ్గరికి పంపినారు.\n\n* తెలివితక్కువ, ఆకలెక్కువ.\n\n* తెలివిలేని పట్టుదల, పొయ్యిలో ఇమడని నిప్పు, కళ్ళెంలేని గుఱ్ఱం.\n\n* తెలిసి తెలిసి బొందను పడ్డట్టు.\n\n* తెలిసినవానికి తెలకపిండి, తెలియనివానికి గానుగ పిండి.\n\n* తెలిసినవారికి ముందరనే ఉంది మోక్షం.\n\n* తెలిసేవరకు బ్రహ్మవిద్య, తెలిసిన తర్వాత కూసివిద్య.\n\n* తెల్లగుర్రపు శారవ, నగిరికొలువు కష్టము (శరవ=(చారవ) చాకిరి).\n\n* తెల్లగుర్రాన్ని పల్లనం చేసినట్లు (పల్లనం= జీనువేసి సిద్ధపరచుట, మాలీసుచేయుట)\n\n* తెల్లనివన్నీ పాలా? నల్లనివన్నీ నీళ్ళా?\n\n* తెల్లబియ్యము, పాటి మానిక.\n\n* తెల్లవారితే ఎల్లవారమ్మల బ్రతుకు ఒకటే.\n\n* తెల్లవారిన సంగతి నీకెట్ల తెలిసిందని ఒక రసికుడడిగితే - బయటకి పోవల్సివచ్చింది- అన్నదట పల్నాటి పడుచు, దీపం వెలవెల బారింది- అన్నదట పాకనాటిసీమ వెలయాలు; తాంబూలం అరుచి అయ్యింది - అన్నదట నెల్లూరు నెరజాణ.\n\n* తెల్లవారి లేచినందుకు దోవ తప్పినందుకు సరి.\n\n* తెల్లవార్లు సరసాలాడి తేరకంటే, నా మొగుడనుకొంటానుపో అన్నదట (ఱంకుటాలు).\n\n* తెల్లవార్లూ సరసమాడినా గొల్లవాడే పుట్టె\n\n* తెల్లవారితే చూడు ఎల్లాయి బతుకు.\n\n**********:: తే ::**********\n\n* తేభ్యమెక్కడ తెత్తునయ్యా? తెల్లవారింది. (తేభ్యం=తిండి).\n\n* తేనె అంతా ఒకచోత తెట్టేంతా ఇంకొకచోట.\n\n* తేనె ఉన్నచోట ఈగలుంటాయి.\n\n* తేనెగూర్చియీగ తెరువరులకు నీదె.\n\n* తేనెటీగ తేనె తెరవరి పాలు.\n\n* తేనెటీగలకు తీరుబడిలేని పని.\n\n* తేనె తీసినవాడు చేయి నాకకపోవునా?\n\n* తేనెతుట్టె పున్నానికి పూజ, అమావాశ్యకు ఆరగింపు.\n\n* తేనెతుట్టను రేపి, తియ్యని తేనెను వదలిపోదురా?\n\n* తేనెబోసి పెంచినా ముష్టిచెట్టుకు విషముపోదు.\n\n* తేనెబోసి పెంచినా వేపకు చేదుపోదు.\n\n* తేనెలో బడ్డ ఈగవలె.\n\n* తేరకు దొబ్బరా బూరగబుచ్చన్నా.\n\n* తేరగాడికేమి తెలుసు తెల్లజొన్న నూగు.\n\n* తేరగాడికేమి తెలుసు లంజ ముడ్డినొప్పి.\n\n* తేరగా వచ్చింది తినితిని, మా తమ్ముడూ ఒకడున్నాడన్నట్లు.\n\n* తేర గుఱ్ఱం, తంగెడు బఱికె.\n\n* తేరకు వచ్చింది ఊరకే పోతుంది.\n\n* తేరసొమ్ము, బీరపీచు.\n\n* తేరుండేదాకానే తిరునాళ్ళు.\n\n* తేరుతీసిన నాటి తీర్థంవలె.\n\n* తేలుకు ఎవరు అపకారం చేసినారు?\n\n* తేలుకుట్టిన దొంగవలె.\n\n* తేలుకు పెత్తనమిస్తే, తెల్లవార్లు తెగకుట్టిందట.\n\n* తేలుకు వెరచి పరుగెత్తి, పాముపై బడినట్లు.\n\n* తేలుచూడిమోసి (పిల్లలగని) చచ్చినట్లు.\n\n* తేలు తేలండి అని అరిస్తే మొగవాళ్ళని పిలవ్వే అన్నాడట. మీరు మొగవారు కారా అని పెండ్లామంటే, సమయానికి ఙ్ఞాపకం చేశావు, కఱ్ఱ తెమ్మన్నాడట.\n\n* తేలుమంత్రమైనా రాకున్నా, పాము పదగపై చేయి పెట్టినట్లు.\n\n* తేలువలే కుట్టిపోయినాదు (కొండెములు చెప్పి).\n\n* తేలేనమ్మకు తీపులు మెండు.\n\n* తేళ్ళలో కొండి, పాములలో పడగ (విషం).\n\n**********:: తై ::**********\n\n* తైమాసం (రేయి) తెగబారెడు.\n\n**********:: తొ ::**********\n\n* తొంగున్న సుంకరీ తలమూట దింపమన్నట్లు.\n\n* తొండకు వెలుగు సాక్షి (వెలుగు=కంచె).\n\n* తొండ పరుగు కంపదాకానే.\n\n* తొండ ముదిరితే ఊసరవెల్లి, గొల్ల ముదిరితే పిళ్ళ.\n\n* తొందరకు ఆలశ్యం మొగుడు.\n\n* తొందరగా రమ్మంటే, తిరుగమూత వేసి వస్తానన్నట్లు.\n\n* తొంభై తొమ్మండుగురు పోగై తోలు తెగగోసినారట.\n\n* తొక్కలేనమ్మ తొక్కులో నీళ్ళుపోసిందట.\n\n* తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా అన్నట్లు (పామును).\n\n* తొడ పలుచనదానికి తూటు పెద్ద.\n\n* తొట్టిలో ఊచినట్లు, తొడ గిల్లినట్లు.\n\n* తొట్ల అర్భకుల నూతువు, మరి తోచినట్లు గిల్లుదువు.\n\n* తొడ పలుచనగు నింతికి నడిగండిగలు పెద్ద.\n\n* తొడబలం ఉంటే తొంభైమంది ఉన్నట్లు.\n\n* తొడగిల్లి తొట్ల ఊచినట్లు.\n\n* తొడిమ ఊడిన పండు పడకుండా ఉంటుందా?\n\n* తొత్తు కింద తొత్తు, దొప్ప కింద దొప్ప.\n\n* తొత్తు కింద బడితొత్తు.\n\n* తొత్తుకు సివమెత్తినా మ్రొక్కక తీరుతుందా?\n\n* తొత్తుకో మాఱుతొత్తంట.\n\n* తొత్తుక్క బొల్లిమేక (తొత్తుకొక బొల్లిమేకా?).\n\n* తొత్తుది నగలెన్ని ఇడిన దొరసానగునా?\n\n* తొత్తును ఇంటబెట్టి దొరసానిని చెరగొందురా?\n\n* తొత్తువలే పాటుపడి, దొరవలే తిరుగవలె (తినవలె).\n\n* తొడరి ఆలినమ్మి తొత్తును గొన్నట్లు.\n\n* తొఱ్ఱి మెచ్చేది ఉప్పుపిండి.\n\n* తొఱ్ఱోడు మెచ్చేది ఊరిబిండి (ఊరిబిండి=పచ్చడి).\n\n* తొలకరిలో చెరువు నిండినా, తొలిచూలు కొడుకుపుట్టినా మేలు.\n\n* తొలకరి వానలు మొలకలకు తల్లి.\n\n* తొలి ఏకాదశికి తొలి తాటిపండు.\n\n* తొలిగండం తప్పితే తొంభై ఏళ్ళ ఆయుస్సు.\n\n* తొలిచేసిందానికి తల ఎత్తుకోలేకుంటే, వావిలి చెట్టుక్రింద వాడెవడమ్మా?\n\n* తొలిపెండ్లాం తోటకూర, మలిపెండ్లాం మామిడిపండు, మూడోపెండ్లాం ముంతమామిడిపండు (ముంతమామిడి=జీడిపండు).\n\n* తొలిపిల్లకు తొంబై అంగీలు, మలిపిల్లకు మారుదొడగ లేదు.\n\n* తొలి సమర్తకే గూద దిగినట్లు.\n\n**********:: తో ::**********\n\n* తోకకు తొంభై, నాకు నలభై అన్నట్లు.\n\n* తోకతెగిన నక్కవలె.\n\n* తోక ముడుచుకొన్నట్లు.\n\n* తోకలేదుగానీ హనుమంతునంత బంటు.\n\n* తోకలేని గాలిపటం వలె.\n\n* తోకవడ్లు పంటకు వెన్నుకోత నేస్తం (తోకవడ్లు=ఒకవిధమైన అడవిపంట).\n\n* తోకవెంట పెరుమాళ్ళు అన్నట్లు.\n\n* తోకవెంబడి నారాయణా అన్నట్లు.\n\n* తోచీ తోచనమ్మ తోడికోడలు చెల్లెలి పెండ్లికి పోయిందట.\n\n* తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే, అదీ తోచనమ్మ ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్ళిందట.\n\n* తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే చూచీ చూడనట్లు చూశారట.\n\n* తోటకూరకు చంద్రహారము దెత్తునా?\n\n* తోటకూర నాడైనా చెప్పనైతినిరా కొడుకా అన్నట్లు.\n\n* తోట మూడుబారలు, కాయ ఆరుబారలు.\n\n* తోటలమీద వారికి, పే(పీ)తలమీద బారికి మొగమాట ముండదు.\n\n* తోడంగ తోడంగ తోడెంగ దొరికె.\n\n* తోడిపిల్లను తోడేలు వేసుకపోతే, ఆమడపిల్ల కచ్చివచ్చిందట.\n\n* తోడున్న తొంబదితడవలు.\n\n* తోడేలును గొఱ్ఱెలను కాయబెట్టినట్లు.\n\n* తోడులేక వెళ్ళదు రాచపీనుగ (రాచపీనుగ తోడులేనిదే పోదు).\n\n* తోరణం కట్టగానే పెండ్లి పూర్తి అయినట్లా?\n\n* తోరణము వీరణము లేని పెండ్లి బాజాలు.\n\n* తోలు తియ్యకుండానే తొనలు మింగినట్లు.\n\n* తోలు తొబక దిని కుక్క పెద్దపులైందట.\n\n* తోలు కొరికేవాడు పోతే, బొమికలు నమిలేవాడు వస్తాడు.\n\n**********:: తౌ ::**********\n\n* తౌడు తింటు ఒయ్యారమా?\n\n* తౌడుతిన్నా మూతి తుడుచుకొన్నట్లుండాలి.\n\n* తౌడు తినేవాడికి మీసాలెగబెట్టే వాడొకడు.\n\n**********:: త్రా ::**********\n\n* త్రాగనేరని పిల్లి ఒలకబోసుకున్నదట.\n\n* త్రాగను గంజిలేదు, తలకు ఆటికలి.\n\n* త్రాడు చాలదని బావి పూడ్చుకుంటారా?\n\n**********:: త్రో ::**********\n\n* త్రోయనేర్చుకున్న కుక్క దొంతులు చేర్చునా? (పేర్చునా?)\n\n* త్రోవ దొరతన మెరుగదు, నిద్ర సుఖమెరుగదు.\n\n* త్రోవలో పెట్టి తొక్కేవురా జాణా అన్నట్లు.\n\n**********:: త్యా ::**********\n\n* త్యాగి గానివాని ధర్మ మడుగవచ్చు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 870,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-త ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* దంచలేనమ్మ ఊదూది చూచిందట.\n\n* దంచినమ్మకు బొక్కిందే కూలి.\n\n* దంచినమ్మకు బొక్కిందే దక్కినట్లు.\n\n* దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.\n\n* దందమయ్యా బాపనయ్యా! అంటే మీతండ్రినాటి పాతబాకీ ఇచ్చిపొమ్మన్నాడట.\n\n* దండి అమావాశ్యకు వాన తాదు తెంపుకొనిపోతుంది.\n\n* దండించే దాత లేకుంటే, తమ్ముడు చందప్రచండుడు.\n\n* దండిపైరు పంటకు పనికిరాదు.\n\n* దండుకు పోయినవాడి పెళ్ళాం ఎక్కడౌన్నా ముండే (ఏనాటికైనా ముండే).\n\n* దండుకు మంచాలు వాల్చగలమా?\n\n* దండుగకు ఒప్పుదురుగానీ, పందగ కొప్పరు.\n\n* దండుగకు రూపాయిలు, తద్దినానికి కూరలూ దొరకకుండాపోవు\n\n* దండగలో పండగ.\n\n* దండుగైన పెట్టు (ఈవి) ధర్మానికోర్వదు.\n\n* దండులో గుండు పడితే ఎవనాలి ముంద మోస్తుందో?\n\n* దండులోని పోతే రెంటిలో ఒకటి (చావో, బ్రతుకో).\n\n* దండువెడదాము అంటే, వండుక తిని వెడదాము అన్నట్లు.\n\n* దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు.\n\n* దంభోళహతికి తరువొక ఎదురా?\n\n* దగ్గఱకు పిలిచి దాసరీ! నీ కన్ను లొట్ట అన్నట్లు.\n\n* దగ్గఱకుపోతే దొగ్గలకూరకైనా కొరగాదు (దొగ్గలి కూర= ముండ్ల తోటకూర వంటిది).\n\n* దగ్గఱకు వస్తే ఎగ్గులెంచినట్లు.\n\n* దగ్గఱవాళ్ళకే దగ్గులెక్కువ.\n\n* దగ్గితే నిలవని ముక్కు, తుమ్మితే నిలుస్తుందా?\n\n* దగ్గుతూపోతే శొంఠి కూడా ప్రియము.\n\n* దగ్గు సిగ్గు దాచినా దాగవు.\n\n* దగ్గేవాని దగ్గర డొక్కలు ఎగురవేసినట్లు.\n\n* దత్తతమీది ప్రేమ- దాయాది మీద ప్రేమ.\n\n* దప్పికి నెయ్యిత్రాగినట్లు.\n\n* దప్పిగొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.\n\n* దప్పికి నీళ్ళీక తరిమి నాతడు ఇష్టన్న మివ్వగలడా?\n\n* దబ్బుర పాటకు తలత్రిప్పుటలు మెండు.\n\n* దమ్మున్న దాడి పొమ్మన్న పోదు\n\n* దమ్మిడీ ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు.\n\n* దమ్మిడీ కల్లుకు 9తాగి) ఊరంతా గెంతులు.\n\n* దమ్మిడీ పెళ్ళికి ఏగాని భోగం మేళం.\n\n* దమ్మిడీ పెళ్ళికి రూపాయి బాణాసంచా.\n\n* దమ్మిడీ ముండకి ఏగాణి క్షవరం.\n\n* దయగల దేవరా! నామగని వెదకి వానిని పట్టు, నన్ను పట్టకు.\n\n* దయగల మొగుడు దండుకుపోతూ, రోలుతీసి రొమ్మున వేళాడవేసి పోయాడట.\n\n* దయతలచి దాహ మిస్తే, ఊళ్ళోకెళ్ళి ఉడుకు అన్నట్లు.\n\n* దయ తుఱ్ఱుమంటే, నెత్తి చుఱ్ఱుమంటుంది.\n\n* దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.\n\n* దయ దండిది, గుణం మొండిది.\n\n* దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే, ఊరకున్నా తప్పే.\n\n* దయ్యం బెదిరికి వరమిచ్చు.\n\n* ద్వయపు కంతికి పేలగింజ పెద్ద.\n\n* దయ్యము కొట్టనూ, బిడ్డ బ్రతకనూనా?\n\n* దయ్యము పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి.\n\n* దయ్యాలతో నెయ్యాలు చేసినట్లు.\n\n* దయ్యాల ముందర బిడ్డలు బ్రతుకుతారా?\n\n* దరిద్రాన్నయినా ఏడేండ్లు దాచిపెట్టితే అక్కరకు రావచ్చు.\n\n* దరిద్రానికి దైవ కొండాటకం.\n\n* దరిద్రానికి మాట లెచ్చు, తద్దినానికి కూర లెచ్చు.\n\n* దరిద్రుడికి ఏరేవు వెళ్ళినా ముళ్ళపరిగే.\n\n* దరిద్రుడికి పిల్లలెక్కువ.\n\n* దరిద్రుడికి సద్ది కట్టి ఇస్తే, ఊరివెలుపల కుంటకాడనే భోంచేసి పోయినాడట.\n\n* దరిద్రుడి చేనికి వడగండ్ల వాన.\n\n* దరిద్రుడీ సంగీతానికి భూమ్యాకాశాలే తాళపు చిప్పలు.\n\n* దరిద్రుడు తల కడుగబోతే వడగండ్ల వాన వచ్చిందట (కురిసిందట).\n\n* దరిద్రునికి దైవమే తోడు.\n\n* దరిలేని బావి, వితరణలేని ఈవి.\n\n* దర్శనంబులారు దైవంబు ఒకటి.\n\n* దర్శనంబులు వేరు దైవమౌనొకటి.\n\n* దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం.\n\n* దలారికి దండుగ భయం - మశీదుకు దొంగ భయం లేదు.\n\n* దలాలుకోరు వాడు కందూరు చేస్తే తిన్నవరకు నమ్మకం ఉండదు. (దలాలు కోరు= మాట నమ్మిక లేని వాడు, కందూరు= ఉరుసు).\n\n* దశకొద్దీ దొరికాడు దిసమొల మొగుడు.\n\n* దశకొద్దీ దొరికాడు పుసికళ్ళ మొగుడు.\n\n* దశకొద్దీ మొగుడు, దానం కొద్దీ బిడ్డలు.\n\n* దశ దానాలకు తోటకూర కట్ట (మట్ట).\n\n* దశవస్తే దిశ కుదురుతుంది (వాస్తు).\n\n* దశా! దశా! రావే అంటే దరిద్రాన్ని పిలవ మన్నదట.\n\n* దవడ రేగినా దబ్బర రేగినా నిలవవు.\n\n* దక్షిణపు కొమ్ము హెచ్చు ఐతే ధాన్యపు ధర హెచ్చు, ఉత్తరపు కొమ్ము హెచ్చు అయితే ఉప్పుధర హెచ్చు (నెలవంకకు).\n\n\n\n**********:: దా ::**********\n\n* దాగబోయి, తలారి ఇంట్లో దూరినట్లు.\n\n* దాగబోయి తలారి ఎదుట దూకిట్లు.\n\n* దాగబోయిన చోట దెయ్యాలు పట్టుకొన్నట్లు.\n\n* దాచినాను మగడా! వేరుండ మన్నట్లు.\n\n* దాడిగుఱ్ఱం మాదిరి దౌడి తీసి దడిలో దూరినాడట.\n\n* దాణాకు నోరు తెరిచి, కళ్ళానికి (కళ్ళెమునకు) నోరు మూసినట్లు.\n\n* దాణాకొద్ది లద్ది\n\n* దాణా దండుగే గానీ, దమ్మిడీ పనికాదు.\n\n* దాతలిచ్చిన పాలుకంటే, ధరణి (ధారుణి) ఇచ్చిన పాలు మేలు.\n\n* దాతలు లేక కాదు మాకు వ్రాత లేక.\n\n* దాత లేని ఊరు దెయ్యాల పేటరా.\n\n* దాది ఱొమ్ము దూది పాంపుగ.\n\n* దానం చేయకున్నా, దక్షిణం తలజేసి పండాలి.\n\n\n* దానం చేయ్యని చేయి- కాయలు గాయని చెట్టు.\n\n* దానము చేసిన ఆవుకు దవడపళ్ళు ఎంచబోకు.\n\n* దాన మీని వాడు ధన్యుండు కాడయా.\n\n* దానములేని విత్తము సంతానం లేని స్త్రీ వంటిది, కలుజు (తూము) లేని చెరువు వంటిది.\n\n* దానాలలోకెల్ల గర్భదా(ధా)నం పుణ్యం.\n\n* దానాలలోకెల్ల నిదానం శ్రేష్టం.\n\n* దాన్ని నమ్ముకొని ధర్మవరం పోతే, అదిపోయి బుక్కపట్టణం చేరిందట.\n\n* దాపున గుడి కట్టితే దూరాన వర్షం (గుడి= చంద్రుని చుట్టు వేసిన వలయం).\n\n* దాయ కట్టని ఆవు తన్నక మానదు (దాయ=బంధము).\n\n* దాయాది ఉంటే నిప్పెందుకు?\n\n* దారికి సుంకం చెల్లించమన్నట్లు.\n\n* దారిద్ర్యము ఆరవ ఇంద్రియము.\n\n* దారిద్ర్యము ఐశ్వర్యము తరతమ భేదాలుగల కలుషములు.\n\n* దారిద్ర్యము నాగరికత సృష్టించినదే.\n\n* దారిద్ర్యమున నుండి తన పూర్వ సంపద లూరక తలచువాడుత్త వెధవ.\n\n* దారిద్ర్యానికి సానుపు పంట.\n\n* దారినపోయే తగులాటాన్ని దాపుకు కొనితెచ్చుకొన్నట్లు.\n\n* దారినపోయే తద్దినమా! (దరిద్రమా) మా ఇంటికి రా అన్నట్లు\n\n* దారినపోయే మారెమ్మా! మా ఇంటిదాకా వచ్చిపో అన్నట్లు.\n\n* దారినపోయ్యే శనిని నా నెత్తిమీదుగా పొమ్మన్నట్లు.\n\n* దారినపొయ్యే శనేశ్వరాన్ని కొనకొచ్చుకొన్నట్లు.\n\n* దారిలో దొరికింది ధర్మానికి పోయింది.\n\n* దాలిగుంటవారు తామరగుంటకు, తామరగుంటవారు దాలిగుంటకు వచ్చినట్లు.\n\n* దాలిగుంటలో కుక్క మాదిరి.\n\n* దాష్టికపు ముష్టి (నియోగిది).\n\n* దాష్టికానికి ధర్మం లేదు, కాయకంటికి చూపులేదు.\n\n* దాసరికి తగిన పూసలు.\n\n* దాసరయ్య తప్పు దండంతో సరి.\n\n* దాసరి తిప్పలు పెరుమాళ్ళ కెఱుక.\n\n* దాసరి పాటకు ముష్టి ముద(జ)రా.\n\n* దాసరి పాట్లు దైవాని కెఱుక.\n\n* దాసరివా జంగానివా అంటే, ముందూరును బట్టి అన్నాడట.\n\n* దాసి కొడుకైనా, కాసులు కలవాడే రాజేంద్రుడు.\n\n* దాసికి శిక్ష తలగొరిగింపు, భార్యకు దండన పడక వెలివెత.\n\n* దాస్యం ప్రతి ఆత్మలో పెరిగే కలుపు మొక్క.\n\n* దాసుని తప్పు దండముతో సరి.\n\n* దాక్షారామం భీమన్నలా ఎంత పొడుగు?(భీమేశ్వరాలయంలో లింగము పొడవైనది, రెండంతస్తుల ఆలయం).\n\n\n\n**********:: ది ::**********\n\n* దింపుడు కళ్ళ మాశ (కడపటి ఆశ).\n\n* దిక్కులన్నీ ఒక్క దిక్కుకు తెచ్చినట్లు.\n\n* దిక్కులేని ఇంట్లో దెయ్యాల కాపురం.\n\n* దిక్కులేని నాడు ఊరికి నక్కే పోతురాజు.\n\n* దిక్కులేని వారికి దేవుడే దిక్కు.\n\n* దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి?\n\n* దిగితే గానీ లోతు తెలియదు.\n\n* దిగు దిగు మనే నాసవతే గానీ, దిగే నా సవతే లేదు (ఒక సవతి లేదు).\n\n* దినదినగండం నూరేండ్లాయుస్సు.\n\n* దినము మంచిదని తెల్లవార్లు దోచినట్లు.\n\n* దినమూ చచ్చేవానికి ఏడ్చేదెవరు?\n\n* దినమూ ప్రయాణం చద్దెన్నం చేటు (తినుటేగానీ ప్రయాణం సాగుటలేదు).\n\n* దినవెచ్చం దివిటి వెలుగు - పూటబత్తెం పుల్ల వెలుగు.\n\n* దిబ్బాలమ్మకి దీపం పెడితే, పందిమగడు వచ్చి పడదోసిపోయే.\n\n* దిమాకి ఎక్కినవాడు దిక్కులు చూస్తే, పలాకి ఎక్కినవాడు ప్రక్క చూచినాడట.\n\n* దివాణంలో దిక్కు లేదు, అంబటిలో ఉప్పు లేదు.\n\n* దివిటి ముందు దీపం పెట్టినట్లు.\n\n* దివ్వె తీసిన గూడు వలె.\n\n* దిసమొలవాడా! కాళ్ళకట్టువాని కప్పు మన్నట్లు.\n\n* దిసమొల వానికి దిగంబరుడు బట్ట కట్టినట్లు.\n\n* దిసమొలవాణ్ణి గోచిపాతగాడు బట్ట అడిగినట్లు.\n\n\n\n**********:: దీ ::**********\n\n* దీపము ఆరినతరువాత దినుసంతా ఒక్కటె.\n\n* దీప ముండగానే ఇల్లు చక్కవెట్టుకోవలె.\n\n* దీపముండగానే నిప్పుకు దేవులాడినట్లు.\n\n* దీపం పేరు చెపితే చీకటి పోతుందా?\n\n* దీపం ముడ్డికిందనే చీకటి.\n\n* దీపాన వెలిగించిన దివిటీ పెద్దదైనట్లు.\n\n* దీపావళికి దీపమంత చలి.\n\n* దీపావళి వర్షాలు దీపాంతరాలు దాటుతాయి.\n\n* దీప్తభానుని గని తిమిరంబు నిలుచునా?\n\n* దీవించువారు ఏండ్లేల ఇస్తారు?\n\n\n\n**********:: దు ::**********\n\n* దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు.\n\n* దుక్కం (దుఃఖం) లేనోడు దూడను గడిచ్చుకొన్నాడట (గడిచ్చు= సంపాదించు).\n\n* దుక్కంగా పోయి దులువంగ వచ్చు (దులుపుట=ధాన్యం రాల్చుట, కుప్ప నూర్పిళ్ళ సమయం).\n\n* దుక్కి ఉంటే దిక్కు ఉంది.\n\n* దుక్కి కొద్దీ పంత, బుద్ది కొద్ది సుఖం\n\n* దుక్కిగల భూమి, దిక్కుగల మనుజుడు చెడడు.\n\n* దుక్కి చలువే చలువ - తల్లి పాలే పాలు.\n\n* దుక్కుటెద్దుకు పంచదార అటుకులు కావలెనా?\n\n* దుక్కిటెద్దు చావు, పక్కలో పెళ్ళాంచావు వంటిది.\n\n* దుక్కిటెద్దు దేశాంతరం పోయినట్లు.\n\n* దుక్కిటెద్దు బుట్టమేపువేళ గాటికి లాగినట్లు.\n\n* దుక్కిటెద్దు దేశాంతరం వెళ్ళితే పట్టీ దున్నించారట.\n\n* దుక్కిటెడ్లు పోట్లాడి దూడల కాళ్ళు విరిచినట్లు.\n\n* దుడ్డూకఱ్ఱా దుడ్డుకఱ్ఱా ఎవరి మాట వింటావే? అంటే, ఎవరిచేతిలో ఉంటే వారిమాట అన్నదిట.\n\n* దుక్కినాగలి చెక్కే వడ్రంగికి మేడలుకట్టు నేర్పుండునా?\n\n* దుడ్డుకఱ్ఱ అనగానే బుఱ్ఱ బద్దలవుతుందా?\n\n* దుడ్డుకు ఒక్కడైనా దూదేకులవాణ్ణి జీతాని కుంచుకోకు.\n\n* దుడ్డు దుగ్గనిలేని నాబట్ట దువ్వింది దువ్విందే.\n\n* దుత్తకు పాల రుచి తెలుసునా?\n\n* దున్నంగపోయి దులపంగ వచ్చు.\n\n* దున్న ఈనినదంటే, దూడను గాట కట్టి వేయమన్నట్లు.\n\n* దున్నక చల్లితే కొయ్యక పండును.\n\n* దున్నని వానికి గుడ్డ ఎందుకు? ఏలనివానికి పెండ్లామెందుకు?\n\n* దున్నక వేసిన ఆముదాలు, ఆసాది కిచ్చిన అప్పు తిరిగిరావు.\n\n* దున్న తగిలితే మన్ను ముట్టవలెను.\n\n* దున్న దగ్గర వీణ వాయించినట్లు.\n\n* దున్నపోతు తన వీపు తోముకోలేదు, వాడు తోముకోగలడు, అంతే భేదం.\n\n* దున్నపోతు ఈనిందంటే చెంబుతేరా పాలుపితుకుదా మన్నట్లు.\n\n* దున్నపోతు మీద వాన కురిసినట్లు.\n\n* దున్నపోతులా ఉన్నావు తేలుమంత్రం తెలియదా? అన్నాడట.\n\n* దున్నబోతే దూడలలోను, మేయబోతే పోతులలోను.\n\n* దున్నలా కష్టపడి దొరలా తినవలె.\n\n\n* దున్నిన పొలానికి తాగిన గంజికి సరి.\n\n* దున్నే అదనులో దూరదేశం పోయి, కోతలకాలంలో కొడవలిపట్ట వచ్చినాడట.\n\n* దున్నే ఎద్దునే పొడిచేది (ములుకర్రతో).\n\n* దున్నేవాడు లేక్కచూస్తే నాగలి కూడా మిగలదు.\n\n* దున్నేవాళ్ళకు వేళ్ళు (లేళ్ళు) చూపించినట్లు.\n\n* దుప్పి కాలంగాక చిక్కును గానీ కాళ్ళు లేకగాదు.\n\n* దురదృష్టము ననుభవించ లేనివాడు అదృష్టమును అనుభవించలేడు.\n\n* దురదృష్టం పదనువాదరగల కత్తివంటిది. పిడిని పట్టుకొనిన ఉపయోగపడును, వాదర పట్టుకొనిన తెగును.\n\n* దుర్గంధ కుసుమంకంటే, నిర్గంధ కుసుమం మేలు.\n\n* దువ్వును చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు (దువ్వు=పులి).\n\n* దుష్టుడు కలహించటమంతా శిష్టులకే మేలు.\n\n* దుష్టునిచూచి దూరంగా ఉండమన్నారు.\n\n* దుఃఖమును అణుచుకోగలిగిన వానికంటే సంతోషాన్ని అణచుకోగలిగిన వాడే ఘనుడు.\n\n* దుఃఖము సుఖమును వెన్నుదన్నే వెన్నాడుచుండును.\n\n\n\n**********:: దూ ::**********\n\n* దూకుదూకు మనేవాళ్ళేగానీ, దూకే లంజాకొడుకు ఒక్కడూ లేడు.\n\n* దూడ కుడిచినట్టా? దుత్తలో పడ్డట్టా?\n\n* దూడ కుడిస్తే గానీ ఆవు చేపదు.\n\n* దూడ కుడిస్తేనే గానీ దుత్త నానదు (తడవదు).\n\n* దూడ-తల్లి ఉండగా గుంజ అరచిందన్నట్లు.\n\n* దూడపాలు దుత్తకే సరిపోయె.\n\n* దూడ పొదుగును కుమ్మితే గానీ ఆవు చేపదు.\n\n* దూడ మేసి గంటసేపైనా, దురిసెండ్ల నడతమాత్రం పోలేదు.\n\n* దూడలేని పాడి దుఃఖపు పాడి.\n\n* దూడ వగచునె భువి తోడేలు చచ్చిన.\n\n* దూదేకులవాడికి తుంబ తెగులు (తుంబతెగులు=దూది ఏకేటప్పుడు కలిగే చప్పుడు).\n\n* దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (దూదేకుల సిద్దప్ప= బ్రహ్మంగారి శిష్యులలో మహాజ్ఞాని).\n\n* దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు.\n\n* దూబరతిండికి దూండ్లు బతకవు, ఆణి మొద్దుకు ఆండ్లు బతకవు.\n\n* దూరం గుడికట్టితే (చంద్రుని చుట్టు) దగ్గరవాన, దగ్గర కడితే దూరపువాన.\n\n* దూరదర్శనితో చూచినకొండ చిన్నదిగా కంపించును, భూతద్దములో చూచిన పెద్దదిగా కంపించును.\n\n* దూరపు కొండలు నునుపు.\n\n* దూరపు దండం కోటి లాభం.\n\n* దూల పెట్టేచోట దుడ్డుకోల పెట్టినట్లు.\n\n* దూస్తే దోసెడు, ఊడితే హుళక్కి.\n\n\n\n**********:: దె ::**********\n\n* దెప్పె ఎక్కినట్లు, దేవుడికి మొక్కినట్లు.\n\n* దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.\n\n* దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంది.\n\n* దెసబత్తెలవానికి బరిబత్తలవాడు బావమరిది (దెసెబత్తలు=దిసమొల).\n\n\n\n**********:: దే ::**********\n\n* దేవతలకు దుమ్ము, రాక్షసులకు మన్ను.\n\n* దేవతలు నాశంచెయ్యాలనుకున్న వానికి ముందు పిచ్చి పట్టిస్తారు.\n\n* దేవర చిత్తం, దాసుడి భాగ్యం.\n\n* దేవర చిత్తం, దీనుడి భాగ్యం.\n\n* దేవర సవాసేరు, లింగం సేరు.\n\n* దేవళం మింగేవాడికి ధ్వజస్తంభం లొటలొట.\n\n* దేవాంగులలో వా దించరాదు (వా అనే అక్షరం కొట్టివేయరాదు).\n\n* దేవియున్న గృహము దేవార్చన గృహము.\n\n* దేవుడని మొక్కితే, దెయ్యమై పట్టుకొన్నట్లు.\n\n* దేవుడికి ముడుపు, దెయ్యానికి మంత్రం.\n\n* దేవుడి పట్టుకంటే, దెయ్యపుపట్టు ఎక్కువ.\n\n* దేవుడీ పెళ్ళికందరూ పెత్తనగండ్లే (పెద్దలే).\n\n* దేవుడిస్తాడు గానీ వండి వార్చి వాత కొడతాడా?\n\n* దేవుడు కూరగాయలిస్తే దెయ్యం వంటవాని నిచ్చింది.\n\n* దేవుడు చెఱుపని ఇల్లు దేవాంగి చెరుపుతాడు.\n\n* దేవుడు తలిస్తే దెబ్బలకు కొదువా?\n\n* దేవుడులేని ఊళ్ళో మంచపుకోడే పోతురాజు.\n\n* దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు.\n\n* దేవునికి చూపులు, మనకు మేపులు.\n\n* దేవునితేరు ఈడ్వలేకున్న ధర్మకర్త-నంబినాయాలు బరువైనాడుగానీ దేవుడే అయితే నా వెంట్రుకకు కట్టి లాగనా అన్నడట.\n\n* దేశమెవ్వరు ఏలుతున్నా, ధాన్యం దంచితేనే బియ్యం అవుతాయి.\n\n* దేసూరురెడ్ల పొందు (పొత్తు) దయ్యపుపొందు (పొత్తు) (దేసూరు రెడ్లు=రెడ్లలో ఒక శాఖ).\n\n* దేహము గొడవల కాపురము.\n\n\n\n**********:: దై ::**********\n\n* దైవబలము కలుగని వేళ కలహించి గొఱ్ఱెకరచు.\n\n\n\n**********:: దొ ::**********\n\n* దొంగ అండీ అంటే, ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నట్లు.\n\n* దొంగకుక్కను పుట్టించినవాడే యతిమతం ముండను పుట్టించినాడు.\n\n* దొంగకు చేను వచ్చి అయితేమాత్రమేమి?\n\n* దొంగకు తలుపుతీసి, గొరను లేపినట్లు.\n\n* దొంగకు తేలు కుట్టినట్లు.\n\n* దొంగకు తోడు, దొరకు సాక్షి.\n\n* దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి.\n\n* దొంగకు దొరికిందే చాలు.\n\n* దొంగకు భయము, లంజకు సిగ్గు పనికిరావు.\n\n* దొంగగొడ్డుకు గుడి కట్టినట్లు.\n\n* దొంగగొడ్డు మెడను దుడ్డుగట్టినయట్లు.\n\n* దొంగగొడ్లకు గుదికఱ్ఱలు (కట్లు) కట్టినట్లు.\n\n* దొంగచేతికి తాళమిచ్చినట్లు (తాళంచెవి).\n\n* దొంగచేయి దోపన బెడితే, అమావాస్యనాడు అల్లల లాడినట్లు.\n\n* దొంగతనానికి పోతూ, డోలు చంకన బెట్టుకొని పోయినట్లు.\n\n* దొంగ(వాని) తల్లికి ఏడువ భయం.\n\n* దొంగతో కూడా దయ్యం వెంబడే వచ్చును.\n\n* దొంగను దోస్తే దాదులేదు, ఫిర్యాదు లేదు.\n\n* దొంగపోటు కంటే, లింగపోటు ఎక్కువ.\n\n* దొంగపోయి తలారివాని ఎదుట దాగినట్లు.\n\n* దొంగ మగని భక్తిమీర పూజించగానే మంచిత్రోవ చూపగలడా?\n\n* దొంగల సొమ్ము దొరలపాలు.\n\n* దొంగలు తోలిన గొడ్డూ ఏరేవు దాటినా ఒకటే.\n\n* దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినవట.\n\n* దొంగలూ, దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్లు.\n\n* దొంగ వస్తాడని ముందు చెప్పిఉంటే సాక్షులను సంపాదించి ఉందునే అన్నాడట.\n\n* దొంగ వాకిట మంచం వేసినట్లు.\n\n* దొంగవాడి దృష్టి మూట మీదనే.\n\n* దొంగవాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే.\n\n* దొంగ సంగతి దొంగ ఎఱుగును.\n\n* దొంగిలబోటే మంగలం దొరికిందట.\n\n* దొంగిలించేంత దొరతనముండగా, అడుక్కతినేటంత అదవతన మేల?\n\n* దొంతుల కోపని గుదియలుండునా?\n\n* దొంతులజేరి నాయి దోర్చుగానీ కూర్చునా? (నాయి=కుక్క, దోర్చు=త్రోయు)\n\n* దొడ్డికిపోయే వాని కొఱకై ఒడ్డుకు పడవ పట్టించినట్లు.\n\n* దొడ్డినిండా గొడ్లు,ఇంటినిండా బిడ్డలు! ఇంకేమికావాలి ఇరకటానికి?\n\n* దొడ్డిలో కామధేనువుంటే, గొడ్డును పితుకను కుండను గొంపోయినట్లు.\n\n* దొడ్డివాకిట, దెయ్యాన్ని తరిమేస్తే, తలవాకిట వచ్చి నిలబడిందట.\n\n\n* దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకపోతే, గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి.\n\n* దొబ్బను దేవుడంతటి వాడు (దేవుడే).\n\n* దొబ్బనేర్చు కుక్క దుత్తలు మోచునా?\n\n* దొమ్మలన్నిటిలోనూ మిడిదొమ్మ మిండడు (దొమ్మ=పశురోగము)\n\n* దొమ్మతగిలి మన పశువులు రెండు చచ్చినవంటే, మనవాళ్ళవి ఎన్ని చచ్చినవని అడిగినాడట.\n\n* దొరకని పూలు దేవునికర్పణం.\n\n* దొరకు పండుకునే మంచంలేకపోతే దాసీదానికి పట్టుపరుపా?\n\n* దొరసానికి వల్లే దొరకకపోతే తొత్తుకు తొగరు చీరా?\n\n* దొరికితే దొంగ, దొరకకపోతే దొర.\n\n* దొరికిన సొమ్ముకు దొంగవుతాడా?\n\n* దొరకు తొంగను మంచం లేదు, బంటుకు పట్టుపరుపట.\n\n* దొరను పేద అనరాదు, ఎద్దును సాధువు అనరాదు.\n\n* దొరబిడ్డ అయినా ఒకని ఆలే.\n\n* దొరల చిత్తం, చెట్లనీడ నిలకడలేనివి.\n\n* దొరలు ఇచ్చిన పాల కన్నా, ధరణి ఇచ్చిన పాలు మేలు.\n\n* దొరసానికి దుప్పటిలేదు, తొత్తుకు తొగరు చీరట.\n\n* దొరాల తగులుకొంటున్నావు, ఏమిస్తావో దొరా, అంటే- నీ మనసు మెప్పించి తలకేదో పాత (పాతగుడ్డ) సంపాదించుకోవాలను కొన్నానమ్మా అన్నాడట.\n\n* దొరువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూపి బేరమాడినట్లు (దొరువు= తవ్విన నీటి గుంట).\n\n* దొరే దొంగైతే బంట్రోతు కన్నగాడగును.\n\n* దొలుపుడు ముద్దకు నలుపుడు కారం (దొలుపుడూ=దొర్లు, (గుండ్రని)).\n\n\n\n**********:: దో ::**********\n\n* దోచపండు నెట్టుబ్రోచు ఇనుపకట్టు.\n\n* దోచుకొనిపోయిన వాడు దొర, దొరికినవాడు దొంగ.\n\n* దోత్రం పెద్దదయితే గోత్రం పెద్దదగునా?\n\n* దోనె చేయబోయి సోల చేసాడట.\n\n* దోమలు తగ్గితే చేమలు ఊరును.\n\n* దోర కజ్జం, రామానుజం పొడి.\n\n* దోవను పోయేదెవరయ్యా అంటే, దొబ్బులు తినే నేనయ్యా అన్నట్లు.\n\n* దోవను పోయేదొకడు, దొబ్బులు (దొబ్బలు) తినేదొకడు.\n\n* దోవలో కూర్చుండి దొబ్బలు తిన్నట్లు.\n\n* దోసకాయలు తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఒకటే.\n\n\n\n**********:: దౌ ::**********\n\n* దౌలతున దిరిగినా గులాము గులామే (దౌలతు=సంపద).\n\n* దౌర్భాగ్య దామోదరుడు (నిర్భాగ్య దామోదరుడు).\n\n\n\n**********:: ద్ర ::**********\n\n* ద్రవ్యం దాచినవాడికి తెలుసు లెక్క వ్రాసినవాడికి తెలుసు.\n\n* ద్రావిడ ప్రాణాయామం.\n\n* ద్వారపూడి పచ్చెపువాడు.\n\n\n\n**********:: ద్వి ::**********\n\n* ద్విపదకావ్యం ముదిలంజ దొడ్డికంత.\n\n\n\n**********:: ధ ::**********\n\n* ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును.\n\n* ధనము లెచటికేగు, దానేఘు నెచటికి?\n\n* ధనపతి సఖుడైనా శివుడు బిచ్చమెత్తవలసి వచ్చింది.\n\n* ధనానికి దాపరికం (గుట్టు) సేద్యానికి వెల్లడి (రట్టు).\n\n* ధనికిని చెఱకుపంట, దరిద్రునికి నువ్వు పంట.\n\n* ధనియాలజాతి (చెప్పుతో రాసి బద్దలు చేస్తేగాని మొలవవు- భయానగానీ పనిచేయరు అని).\n\n* ధరకు దొర ఎవడు?\n\n* ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ.\n\n* ధరించేదే శాటి, వరించేదే బోటి.\n\n* ధర్మం దరిబేసి నడిగితే ఇచ్చునా? తన్నుక చచ్చునుగాని.\n\n* ధర్మపురిలో దొంగిలించబోతూ, ధార్వాదనుండి వంగుని పోయాడట.\n\n* ధర్మానికి దండుగ లేదు, వెట్టికి పైసా లేదు.\n\n* ధర్మానికి దట్టీ ఇస్తే, ఇంటివెనుకకు పోయి మూరవేసిందట.\n\n* ధర్మానికి పోతే కర్మం చుట్టుకొన్నదట\n\n* ధర్మోదకాలలో రాని పితురుడు తర్పణాలలో వచ్చినట్లు.\n\n\n\n**********:: ధా ::**********\n\n* ధారలేని తిండి దయ్యపు తిండిరా.\n\n* ధారోష్టం, అమృతోత్తమం, దాచినమగడా! వేరుండుమన్నట్లు.\n\n\n\n**********:: ధీ ::**********\n\n* ధీరుడయినా కావాలి, దీనుడయినా కావాలి.\n\n\n\n**********:: ధూ ::**********\n\n* ధూపం వేస్తే పాపం పోతుంది.\n\n\n\n**********:: ధై ::**********\n\n* ధైర్యలక్ష్మి-ధనలక్ష్మి.\n\n* ధైర్యంలేని రాజు, యోచనలేని మంత్రి.\n\n\n\n**********:: ధ్వ ::**********\n\n* ధ్వంసం నారాయణుడు కమతం చేస్తే, పాలికి పందుం- పల్లేరు కాయలు.\n\n* ధ్వంస పారాయణం దంతు మంట. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 871,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* నంగతుంగ నీళ్ళకు పోతే, నీళ్ళన్నీ ఒక రేవుకు వచ్చాయిట.\n\n* నంగనాచి చీర నడివీధిలో ఊడిందట (నంగనాచి=ఏమీ ఎరుగనట్లు నటించుట).\n\n* నంగనాచి- తుంగబుఱ్ఱ (తుంగకు బుఱ్ఱ ఏర్పడదు).\n\n* నంగనాచి- వంగముల్లు.\n\n* నంగనాచులు శరణనగానే అనంగుడు ఙ్ఞానోపదేశం చేయునా?\n\n* నంగి వంగలు మేస్తుంటే, నారికేళాలు దూడలు మేసినవట (నంగి=దూడ కలిగిన ఆవు).\n\n* నంగీ! నమిలి మింగవే అంటే, ఉడికిన చేపలు కరుస్తవి అన్నదట. (నంగి=నంగనాచి, మాటలు వచ్చిరానట్లు ముక్కుతో మాట్లాడేవాడు).\n\n* నందనవనంలో కుందుగడ్డి పెరుగవచ్చు.\n\n* నందనవనంలో నాగుబాముండటం మృగనాభికి పిప్పితగిలినట్లు.\n\n* నందరాయని భాగ్యము నక్కలకూ కుక్కలకూ.\n\n* నందనమ్మలు బాగాపండితే, నారాయణుని చూచినట్లే.\n\n* నంది అంటే నందే, పంది అంటే పందే (పట్టుదల).\n\n* నందిని చేయబోయి పందిని చేసినట్లు.\n\n* నందిని పంది, పందిని నందిని చేయగలవాడు.\n\n* నంది వంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేయవా?\n\n* నంద్యాలవారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత.\n\n* నంబి కవిత్వం, తంబళ్ళ జోస్యం.\n\n* నంబి పెట్టినదే ప్రసాదం.\n\n* నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.\n\n* నంబివాడు ఎదురైనా, నాగుబాము ఎదురైనా కలిసిరాదు.\n\n* నంబి వారికి, తంబళి వారికి ఒకటే కుంచకోల అన్నట్లు.\n\n* నంబీ! నంబీ! నా పెండ్లికేమి సహాయం చేస్తావంటే, నీ పెండ్లికి నేను ఎదురు రాను పో అన్నాడట.\n\n* నంబీ, నంబీ, నీ పుణ్యాన పెండ్లయిందంటే, నేనేమి చేసినాననగా, తరలి పోయేవేళ, తమరు ఎదురుపడకపోవటమే అన్నాడట.\n\n* నక్క ఎక్కడ? నాగ(క)లోక మెక్కడ?\n\n* నక్క ఒకచోట ఊలవేసి, ఇంకొకచోట గౌరీకల్యాణము పాడునా?\n\n* నక్క కడుపున సింగము పుట్టునా?\n\n* నక్కకు నవ్వు-ఎండ్రకాయకు గండం.\n\n* నక్కకూత నాకలోకం ముట్టునా?\n\n* నక్క కూసి నాశం తెచ్చు.\n\n* నక్క కూసి పిల్లలకు దోవచూపు.\n\n* నక్కకొమ్ము తొక్కి వచ్చినాడు (అదృష్టవంతు డనుట).\n\n* నక్క చావ గొఱ్ఱె లేడ్చునా?\n\n* నక్కజిత్తులన్నీ (తంతులన్నీ) నావద్ద ఉండగా తప్పించుకు(క) పోయెరా తాబేటిబుఱ్ఱ అన్నదట.\n\n* నక్కజిత్తులు నారాయణు డెఱుగు.\n\n* నక్కతోక పట్టుకొని నాకలోక మెక్కినట్లు.\n\n* నక్క నడుము తొక్కి వచ్చినాడు (అదృష్టమనుట).\n\n* నక్క నారాయణునికైనా నామం పెడుతుంది.\n\n* నక్క నారాయణు డెక్కడనో, తోకనారాయణు డక్కడనే.\n\n* నక్కను చూచిన వాడెల్లా వేటగాడే.\n\n* నక్క పీనుగును పీకును గానీ బ్రతికిన జంతువు పైకి పోదు.\n\n* నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు, ఇంత గాలివాన ఎన్నడూ చూడలేదు అన్నదిట.\n\n\n* నక్క బోయిన వెనుక బొక్క కొట్టుకొన్నట్లు.\n\n* నక్క ముదిరితే వఱడు, తొండ ముదిరితే ఊసరవెల్లి.\n\n* నక్క రేలకాయ తినినట్లు.\n\n* నక్కలలో నక్కగా నటించవలె.\n\n* నక్కలు బొక్కలు వెదకును, తక్కిన నాలంజకొడుకు తప్పేవెదకున్.\n\n* నక్కలు మరవలు పారితే కుక్కలు కూటికొల్లవు.\n\n* నక్కలెరుగని బొక్కలు, నాగులెరుగని కోవ(మ)లు (పుట్టలు) గలవా? (కోవలు=పుట్టల శిఖరాలు).\n\n* నక్క వచ్చి కుక్కతోక సవరించినట్లు.\n\n* నక్కవాత మున్ను గొట్టినాడు (చావక బ్రతికినాడనుట).\n\n* నక్క వినయము! కొంగ జపము.\n\n* నక్కా! నక్కా! నా నామం చూడు, తిరిగి చూస్తే తిరుమణి చూడు.\n\n* నగ(గి)రి పేదా? ఉప్పు చేదా?\n\n* నక్షత్రాలు శాశ్వతజ్యోతులైనా చీకటి పడినప్పుడే వెలిగేది.\n\n* నగిరికి ఎంతైనా పెడతాడు కానీ,పెద్దకోడలికి కూడుబెట్టను ఏడుస్తాడు.\n\n* నగుబాట్ల పెండ్లికి నాడే నాగవల్లి.\n\n* నలుగు ముదిరితే తెగులు\n\n* నట్టింట ఉండి నా భాగ్యమంటే, ఉట్టిమీదు నుంచి ఊడి పడుతుందా?\n\n* నట్టేట పుట్టిముంచినట్లు (మునిగినట్లు) (పుట్టి=పేళ్ళతో చేసిన గుండ్రని బుట్టవంటి చిన్న పడవ).\n\n* నట్టేటిలో చేయి విడిచినట్లు.\n\n* నట్టేటిలో పడ్డ సొమ్ము నట్టింటికి వచ్చినట్లు.\n\n* నడిచే కొద్ది డొంక, పెట్టే కొద్ది కుదురు.\n\n* నడిచే దారిలో గడ్డి మొలవదు.\n\n* నడిచేవాడే పడేది.\n\n* నడమంత్రపు దాసరి పొద్దుమాన మెరుగడు.\n\n* నడమంత్రపు వైష్ణవానికి నామాలు మెండు.\n\n* నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.\n\n* నడమంత్రపు సిరి, నరంమీది పుండు భరింపరానివి.\n\n* నడమంత్రాన సిరివస్తే, నడిరేయి గొడుగు పట్టమన్నాడట.\n\n* నడవంగా నడవంగా పైగుడ్డే బరువైనట్లు.\n\n* నడవడికలు చక్కబెట్టేది నాటకము.\n\n* నడవలేనమ్మకు నాలుగు పక్కలా సవారి.\n\n* నడిస్తే మార్గాయాసం, తింటే భుక్తాయాసం- తిమ్మావధానికి.\n\n* నడుమ దిరిగే కుంటెనగాడికి చెన్నపట్నం రైలుబండి.\n\n* నడుమ దిరిగే కుంటెనగాడికి కందూరు, కఫాయి (కైపు) సార.\n\n* నడుము మినిగేదాకానే చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.\n\n* నత్తగుల్లలన్నీ ఒక రేవున, ముత్యపుచిప్పలన్నీ ఒక రేవున (చేరును).\n\n* నత్తగుల్లలో ముత్యాలు పుట్టునా?\n\n* నత్తి నాలిగింటి కర్ధం.\n\n* నది నాల్గామడ ఉండగా, చీరవిప్పి చేతపట్టు కున్నదట.\n\n* ననకూడి నార తలకెక్కినట్లు.\n\n* నన్ను ఎఱిగినవాడు లేకపోతే, నా బడాయి చూడమన్నట్లు.\n\n* నన్ను కొడితే కొట్టావుగానీ, మా బావను కొట్టు చూస్తాం అన్నట్లు.\n\n* నన్ను చూస్తే, నిన్ను కాస్తా.\n\n* నన్ను నేనే ఎఱుగను, నేను నిన్నేమి ఎఱుగుదును?\n\n* నన్ను పెంచితే, నిన్ను ముంచుతా.\n\n* నన్ను ముట్టుకోకు నా మాల కాకి.\n\n* నపుంసకుని చెంతనా నవలా సరసం?\n\n* నపుంసకుని చేతికి రంభ దొరికినట్లు.\n\n* నమలక, మింగక నానవేసినట్లు.\n\n* నమాజు చేయబోతే మసీదు మీద పడ్డట్లు.\n\n* నమిలేవాడికన్నా, మింగే వాడే ఘనుడు.\n\n* నమ్మించి గొంతుకోసినట్లు.\n\n* నమ్మితి రామన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా అన్నట్లు.\n\n* నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ణి చేస్తానన్నట్లు.\n\n* నమ్మిన ఇమ్ము, నమ్మకున్న అమ్ము.\n\n* నమ్మిన ఎనుము పోతు అయ్యిందట.\n\n* నమ్మి నడివీధిలో వేసిన వారెవరు?\n\n* నమ్మి నానబోస్తే, పులిసి బూరటిల్లిందట.\n\n* నయముంటే భయమేమి?\n\n* నయము నష్టకారి, భయము భాగ్యకారి.\n\n* నయాన పాలు తాగరు, భయాన విషమైనా తాగుతారు.\n\n* నయాన కానిపని భయాన అవుతుంది.\n\n* నరంవంటి వాడికి జ్వరం వస్తే, చేయి చూచినవాడు బ్రతుకడు.\n\n* నరకములో కరుణ లేదు, నాకంలో మరణం లేదు.\n\n* నరకములో నారాయణుడుండునా?\n\n* నరకానికి నవద్వారాలు, నాకానికి ఒకటే.\n\n* నరాలు లేని నాలుక నానావిధాల పలుకుతుంది.\n\n* నరుకలేని బంటు, కత్తి చుఱుకు లేదన్నట్లు.\n\n* నరునకు నరుడు, తరువుకు వేరు సహాయం (అండ).\n\n* నరునికి నాలు గంశలు.\n\n* నరునికి సుద్దంబద్దంలేదు, గుంజుగుంజు నడేటిలోనికి- అన్నదట మొసలి.\n\n* నర్మదలో మునిగినా కర్మం తప్పదు.\n\n* నలపాకము, భీమపాకము. (మగవాడు చేసే వంట)\n\n* నలసారము, సంసారము.\n\n* నలిగి ఉన్నప్పుడు తొలిగి ఉండమన్నారు.\n\n* నలుగురితో చావు పెండ్లితో సమానం\n\n* నలుగురితో పాటు నారాయణా! కులముతో పాటు గోవిందా.\n\n* నలుగురు చేతులువేస్తే గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారు.\n\n* నలుగురి తరవాత పుడితే నట్టిల్లు బంగారమవుతుంది, ముగ్గురి తర్వాత పుట్టితే ముయ్య మూకుడుండదు.\n\n* నలుగురు నడిచే దారిన నాచుగూడా మొలవదు* నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట.\n\n* నలుగురు నవ్వినట్లే ఉంది, నామాట కుదిరినట్లే ఉంది.\n\n* నలుపు నాలుగు వంకరలు తెలుపుతుంది, ఎఱుపు ఏడువంకరలు దాస్తుంది.\n\n* నలుపు నారాయణమూర్తి.\n\n* నలుపు సరుకులో (రంగులో) నాణ్యము లేదా?\n\n* నల్లంబి దురాయి పెట్టితే నిలుస్తుందా? (నల్లంబి= ఒక చిన్న నల్లపిట్ట, దురాయి=ఆంక్ష, ఆక).\n\n* నల్లావు పాలైనా తెల్లనే.\n\n* నల్ల కోడికైనా తెల్లగుడ్డే.\n\n* నల్ల చీరలు కట్టినవాళ్ళంతా నా పెళ్ళాలే అన్నట్లు.\n\n* నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు (అనుకునేంత అమాయకుడు).\n\n* నల్లనేలకు నువ్వులు, ఎఱ్ఱనేలకు కందులు.\n\n* నల్లబాపడు నాభికంటే విషము.\n\n* నల్ల బాపనయ్యను ఎఱ్ఱ మాదిగను నమ్మరాదు.\n\n* నల్లనివాడికి నాభిలో విషము.\n\n* నల్ల రేగడిలో చల్లినా తెల్లజొన్నలే పండేది.\n\n* నల్లికాటు, నారి పోటు.\n\n* నల్లిని గూర్చి మంచానికి పెట్లు. (కించిత్తు నల్లిగరచిన మంచమునకు పెట్లువచ్చు).\n\n* నల్లులకు వెఱచి ఇల్లు విడచినట్లు.\n\n* నల్లేరుమీద బండి పోయినట్లు.(సులభమని).\n\n* నవరత్నములుండినా నరరత్న (నారీరత్నము) ముండవలె.\n\n\n* నవరత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లలన్నీ ఒకచోట.\n\n* నవాబుతల బోడితల అయితే, నా తలగూడా బోడి అని వితంతు విఱ్ఱవీగిందట.\n\n* నవాబు పొట్టా, తాములపాకుల కట్టా తడుపుతూ ఉండవలె.\n\n* నవాబెంత దరిద్రుడో, పులి అంత సాధువు.\n\n* నవ్వలేని వారిని నమ్మరాదు.\n\n* నవ్వితే ఊడే ముక్కు తుమ్మితే ఉంటుందా?\n\n* నవ్విన ఊళ్ళే నగరాలవుతాయి.\n\n* నవ్విన నాపచేనే పండుతుంది. (నాపచేను= నాము అనగా పైరుకోసిన తర్వాత కొయ్యకాలునుండి ఎదిగిన కర్రలు. నాము ఎదిగిన చేను నాపచేను).\n\n* నవ్వుతూ కోసిన ముక్కు ఏడ్చినా రాదు.\n\n* నవ్వు నాలుగందాల (నానందాల) చెరువు.\n\n* నవ్వులతోటలో నాగులు తిరుగును.\n\n* నవ్వే ఆడుదాన్నీ, ఏడ్చే మగవణ్ణి నమ్మరాదు.\n\n* నవ్వేవారి ముందు జారిపడినట్లు.\n\n* నష్టపడినా భ్రష్టు కారాదు.\n\n\n\n**********:: నా ::**********\n\n* నాంచారమ్మ వంట, నక్షత్రదర్శనము ఒక్కమారే (ఆలస్యమగునని).\n\n* నా ఇంటికి నేను పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామాలు అన్నట్టు.\n\n* నాకిన్ని గంజినీళ్ళు పోస్తావా, నీ కాకలి కాకుండా మందిస్తానన్నాడట. (మంత్రం చెపుతాను అన్నట్లు).\n\n* నాకు ఆయుష్యమస్తు, నాకు ఆరోగ్యమస్తు అని దీవించుకొన్నట్లు.\n\n* నాకు తెలియకుండా నంబికిష్టయ్యకు కనికెడు (కమికెడు) జుట్టా?\n\n* నా పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా?\n\n* నాకు బెబ్బెబ్బే అంటే, నీకు బెబ్బెబ్బే, నీ అబ్బకు బెబ్బెబ్బే అన్నాడట.\n\n* నాకులకు లోక భయమేల?\n\n* నాకు లేక నాకుతుంటే, నీకు నైవేద్యమా?\n\n* నాకు లేక నాకుతుంటే, నీకెక్కడ దెత్తునే దేకులాడి.\n\n* నాకు లేక నాకుతుంటే, మూతులు నాకను వచ్చావా?\n\n* నా కూడు, నా కల్యాట్లు నాకు తప్పవు (కల్యాట్లు= అగసాట్లు, కష్టాలు).\n\n* నాకు నాపిల్లకూ నూరేండ్లాయుస్సు, నా పెనిమిటికి లోకంతో పాటు.\n\n* నాకూ లేదు, నీకూ లేదు, ఊరుకో దేవరా.\n\n* నాకు సిగ్గులేదు, రేపు వచ్చే అమావాస్యకూ సిగ్గు (ఎగ్గు) లేదు.\n\n* నాకే కుక్కకు, లింగమేమి? పానపట్టమేమి?\n\n* నా కోడీ, కుంపటీ లేకపోతే ఎట్లా తెల్లవారుతుందో - ఎట్లా నిప్పు దొరుకుతుందో చూస్తాను అందిట ఒక అవ్వ.\n\n* నాగరికం లేని మాట, నాలుకపై తీట.\n\n* నాగలిఉన్న ఊళ్ళో ఆకలి చేరదు.\n\n* నాగలి మంచిది కాకపోతే, ఎడ్లేమి చేస్తాయి?\n\n* నా గర్భదానం నేనున్నట్లే జరపండి, నాకు రానుతీరిక లేదు అన్నాడట.\n\n* నాగసముద్రం పిల్ల, నగారు మీద పుల్ల.\n\n* నాగుబాము చిన్నదనవద్దు, పాలివాడు సన్నమనవద్దు.\n\n* నా చెయ్యి నొస్తున్నది, నీ చేతితో మొత్తుకో అన్నట్లు.\n\n* నా చెవులూ కంసాలే కుట్టాడు.\n\n* నా చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నాడట వైద్యుడు. (చేతివాసి లేని వైద్యుని మాట).\n\n* నాజూకు నక్కలు దేకితే, నెరసిన గడ్డం కుక్కలు పీకినవి.\n\n* నాత్యం త్రొక్కిన కాలు, రోసి రోటిక్రింద పెట్టినా ఊరుకోదట.\n\n* నాడు ఉంటే నవాబుసాహెబు, అన్నముంటే అమీరు సాహెబు, చస్తే పీరు సాహెబు.\n\n* నాడు కట్టాలేదు, నేడు చింతాలేదు.\n\n* నాడు నులువబడా లేదు, నేడు ఎత్తుబడా లేదు.\n\n* నాడుపోయి, నేడొస్తివా మగడా! నా తప్పేమి చెప్పు?\n\n* నాడు లెంచేవారేగానీ, గోడు చూచేవారు లేరు.\n\n* నాడు వ్రాసినవాడు నేడు చెఱపి మళ్ళీవ్రాస్తాడా? (నుదుటివ్రాత).\n\n* నాతి బలము నాలుకపైన.\n\n* నాథుడులేని రాజ్యం నానా దారులు.\n\n* నాదగ్గర ధనమున్నంతవరకు నన్ను అందరూ ' అన్నా ' అని పిలిచినారు.\n\n* నాదముంటే గంట, వాదముంటే తంట.\n\n* నాదయలో నీ గంజి త్రాగు అన్నట్లు.\n\n* నాదికాదు, నా అత్త సొమ్ము అన్నట్లు.\n\n* నాదుక్కటీ, నారెడ్డివి (మారెడ్డోరివి) కలిసి నూటొక్క ఎద్దన్నట్లు (ఇతనిది ఒకటే).\n\n* నాదెంత గడ్డం, ఉమ్మి పూసి గొరగ మన్నాడట.\n\n* నా దెబ్బ గోలకొండ అబ్బా అన్నట్లు.\n\n* నానబాలు పట్టమ్మా అంటే, ఏచేని సజ్జలు అన్నదట.\n\n* నానాకూళ్ళవాళ్ళు నాయుళ్ళు అయినట్లు.\n\n* నానాటికి తీసికట్టు నాగంభొట్టు.\n\n* నానారుచులు పారితే నాలుకమీద కొఱివి పెట్టుకొన్నట్లుంది.\n\n* నానిన భూమి నవధాన్యాలు పండును.\n\n* నా నోట్లో (నీవు) వేలు పెట్టు, నీకంట్లో (నేను) వేలు పెడతానన్నట్లు.\n\n* నాన్చి నాన్చి వేస్తివో, నా కొంప తీస్తివో.\n\n* నాన్పుడుగాడు నా పెండ్లికి నేనూ వెళ్ళాలా? అన్నట్లు.\n\n* నాపప్పు కలిసిందంతా నేనే తింటాను.\n\n* నా పాతివ్రత్యం నా మొదటి పెనిమిటికి తెలుసు.\n\n* నాపాపము నాతోనుంటే శ్రీపతిబిరుదమునకేమి బ్రతుకు?\n\n* నా పెండ్లాన్ని లేవదీసుకు పోతేపోయినాడుకానీ పదిమందిలో ఉసే అంటాడేమో అను భయంగా ఉన్నదన్నాడుట.\n\n* నా పెండ్లి సగమైన దంటే, ఎట్లానయ్యా అంటే, నేను పెండ్లికొడుకుగా సిద్ధంగా ఉన్నాను; మిగతా సగానికి పెండ్లికూతురే కావాలన్నాడట.\n\n* నాభిలో పుట్టిన పురుగు నాభిలోనే పెరుగును.\n\n* నామము నియమము చేటు.\n\n* నామనుము నమ్మకంలేదు, మా అమ్మను రాట్నం అమ్మబాక (వద్దు) మను.\n\n* నామము హెచ్చిన కామము తగ్గునా?\n\n* నా మాట నమ్మింది నల్లకుక్క, ఏమాఱిపోయింది ఎఱ్ఱి(ఱ్ఱ)కుక్క.\n\n* నామాట నమ్ముకోకు, నాలుగెడ్లమ్ముకోకు.\n\n* నామాల వారేగానీ నీమాల (నియమాల) వారుగారు.\n\n* నాముందఱ బానెడు గంజా?\n\n* నామొగనికి నాపైని ప్రాణం, నాకు తెచ్చెర మెడకు ఊనం (ఉరి).\n\n* నా మొగుడికి నిలకడలేదంటే, మాయమ్మ ఏకులరాట్నం, అమ్మవద్దని చెప్పిపంపింది-అన్నది.\n\n* నాయనకు పెండ్లి సంబడం, అమ్మకు సవతి సంకటం.\n\n* నాయనమ్మ ఏంచేస్తొంది? అంటే, ఒలకపోసి ఎత్తుకుంటోంది అన్నట్లు.\n\n* నాయారాలంటే, ఏకులొడికి పోషిస్తాను అన్నదట.\n\n* నారతడప అని పారవేస్తే, నాగుబామై కఱచిందట.\n\n* నారికి రెండెల్లలు, తల్లికి రెండు పిల్లలు.\n\n* నారి తెగినా నారి తెగినా అతకటం కష్టం. (నారి=వింటి అల్లెత్రాడు, స్త్రీ).\n\n* నారు, నీరు, నోరు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక్కటే.\n\n* నారు పోసిన వాడు నీరు పోయక మానడు.\n\n* నారే నరునకు రత్నము.\n\n* నాలిముచ్చు వాణ్ణి, నీళ్ళునమిలేవాణ్ణి నమ్మరాదు.\n\n* నాలుక ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరుగగలడు.\n\n* నాలుక కటువు, ఎద మెత్తన.\n\n* నాలుక తీపి, లోన (అంగిట) విషము.\n\n* నాలుక తేనె, మనసు విషము.\n\n* నాలుక దాటితే నరకము.\n\n* నాలుకలో నారాయణ, చంకలో చురకత్తి.\n\n* నాలుకా! నాలుకా! (నా) వీపుకు దెబ్బలు తేకే.\n\n* నాలుగు ఈతలు ఈనేసరికి నక్క నాంచారి అయ్యింది.\n\n* నాలుగు ఈతల పీత పాతాళగంగ అయ్యింది.\n\n* నాలుగు ఏర్లు కుక్కకు తడుపుతడుపే (గతుకు నీళ్ళే).\n\n\n* నాలుగుకాళ్ళ జీవాలలో మేక మెత్తన, రెండుకాళ్ళ జీవాలలో కోమటి మెత్తన.\n\n* నాలుగు వర్షాలు కురిస్తే, నత్తకాయ (గుల్ల) నాయకురాలు.\n\n* నాలుగేళ్ళు నంజుకొని, నడిమేలు గుంజుకో.\n\n* నాళ్ళలోకెల్ల చిన్ననాడే మేలు.\n\n* నా వీపు నీవుగీరు, నీ వీపు నేను గీరుతా నన్నట్లు. (ఒకరినొకరు పొగడికొనుట).\n\n* నా వ్రేలితో నా కన్నే పొడిచాడు.\n\n* నాశనం - నల్లబొగ్గులు.\n\n* నా సద్ది తెచ్చి నీ ఇడుపున పెట్టుకొని తినడమెందుకు? (ఈదుపు=పని నడుమ సేదతీర్చుకునే చోటు).\n\n\n\n**********:: ని ::**********\n\n* నిండా మునిగినవానికి చలి ఏమి? గాలేమి?\n\n* నిండి దరిచేర నీయదు గండ్లకమ్మ, కలిగి తిననీయదు గంపకమ్మ.\n\n* నిండిన కడుపుకు అన్నం, బట్టతలకు నూనె\n\n* నిండిన కడుపు నిక్కి మాట్లాడును.\n\n* నిండిన కడుపు నీతి వినదు (ఎరుగదు).\n\n* నిండుకుండ తొణకదు.\n\n* నిండుటేరు నిలచి పాఱును.\n\n* నిండుబండికి (పేడ) చేటగూడా బరువే.\n\n* నింద లేనిదే బొందె పోదు.\n\n* నిక్కు నీలపల్లెలో, బ్రతుకు మాలపల్లెలో.\n\n* నిగాదారుని పెళ్ళం నీళ్ళకొస్తుంది, సావిట్లోవాళ్ళు చాటుకు జరగండి అన్నదిట.\n\n* నిజమాడితే ఉండూరు అచ్చిరాదు.\n\n* నిజ మాడితే నిష్టూరం\n\n* నిజము కుఱచ, బొంకు పొడవు.\n\n* నిజము చెప్పేది పసిబిడ్డలు, తప్ప తాగినవాళ్ళు.\n\n* నిజము దేవు డెఱుగు, నీరు పల్ల మెఱుగు.\n\n* నిజమునకు నింద వచ్చును గానీ, అవమానము రాదు.\n\n* నిజము నిలకడమీద తెలుస్తుంది.\n\n* నిజమైన బంగారు నిప్పుకు వెరువదు.\n\n* నిజమైన ఱంకులాడికి నిష్టలు మెండు.\n\n* నిట్టలు ద్రొక్కకు పిల్లా! అంటే, నా మగనికి నేను రెండో సంబంధం అన్నదట.\n\n* నిట్రాళ్ళ యిల్లయినా నిర్వంశంగా ఉండరాదు. (నిర్వంశం=వెదురు లేకుండా, నిస్సంతుగా నని పైకి అర్ధం).\n\n* నిడదవోలు తీర్పు (రామాయపట్నం మధ్యస్తం).\n\n* నిత్యకల్యాణం, పచ్చతోరణమన్నట్లు.\n\n* నిత్య దరిద్రుడు - నిశ్చింత పురుషుడు.\n\n* నిత్యదుఃఖికి నిమిత్త లుండవు.\n\n* నిత్యము లేని మగడు నిత్యము బాస చేసాడట.\n\n* నిత్యమూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు?\n\n* నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?\n\n* నిద్రపోయేవాడి గోచి పెట్టుకుంటే, వాడు లేచినంతవరకే దక్కినట్లు.\n\n* నిద్రపోయేవాడిని లేపవచ్చును గానీ, మేలుకొన్న వాడికి ఏవడు లేపగలడు?\n\n* నిద్ర పోయేవాడిది కుడిచినంత వరకే దక్కుట.\n\n* నిద్ర సుఖ మెఱుగదు, ఆకలి రుచి ఎఱుగదు.\n\n* నిధి అబద్ధం, బుడ్డ నిబద్ధం\n\n* నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా?\n\n* నిన్న ఉన్నవాడు నేడు లేడు.\n\n* నిన్న కుప్పా, నేడు ఆళ్ళు, రేపు కూడు.\n\n* నిన్న చస్తే రేపటికి మూడు, నేడు చస్తే రేపటికి రెండు.\n\n* నిన్నటి పరమ మిత్రుడే, నేటి పరమ శత్రువు.\n\n* నిన్నా మొన్నా వచ్చిన అల్లుని (మగని) తల పగిలినందుకు కాదు, నాళ్ళ నాళ్ళ రోకలి విరిగినందుకు ఏడుస్తున్నాను అన్నదిట.\n\n* నిన్ను శ్రీవైష్ణవుడు నమిలి తినా!\n\n* నిప్పుకు నిప్పుకు ఉన్నంత స్నేహం (వాళ్ళిద్దరికి).\n\n* నిప్పుకు చెదలంటునా?\n\n* నిప్పుకు నీళ్ళకు ఉన్నంత స్నేహం.\n\n* నిప్పు త్రొక్కిన కోతివలె.\n\n* నిప్పుకోడి తల ఇసుకలో దాచి వేటకానికి తాను కనపడ ననుకొన్నట్లు.\n\n* నిప్పు నడుమ బెట్టిన పూరి కాలకుండునా?\n\n* నిప్పును కొడీతే రెందగును కానీ నీటిని కొడీతే రెండగునా?\n\n* నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు.\n\n* నిప్పు బంగారుని పరీక్షించును, దౌర్భాగ్యము ధీరచిత్తుల పరీక్షించును.\n\n* నిప్పు రగిలించి నీళ్ళను వెదకినట్లు.\n\n* నిప్పు రాజినా, మొగము రాజినా మండక మానవు.\n\n* నిప్పుల బుఱ్ఱకు నీళ్ళ బుఱ్ఱ.\n\n* నిప్పు లేనిదే పొగ రాజదు (ఉండదు).\n\n* నిప్పులో ఉప్పు వేసినట్లు (నిప్పుకు ఉప్పు).\n\n* నిప్పులో నెయ్యి పోసినట్లు.\n\n* నిప్పులో మొలిచింది ఎండకు చస్తుందా?\n\n* నిమ్మకు నీరెత్తినట్లు (ఎప్పుడూ మొదలంటా నెమ్ము ఆరరాదు).\n\n* నియోగిజాతి నిమ్మ కొయ్య జాతి.\n\n* నియోగి నిక్కులు.\n\n* నియోగి ముష్టికి బెనారసు సంచి.\n\n* నియ్యతెంతో బర్కతంత. (నియ్యతి= నడవడి, బర్కతు=కలసివచ్చుట).\n\n* నియ్యోగిలేని చావడి దయ్యాల కిరవుగాక దాతల కిరవా?\n\n* నిరక్షరకుక్షి విరూపాక్ష దీక్షితులవారికి, ఇరువదియొక్క భక్ష్యమొక లక్ష్యమా?\n\n* నిర్ధనుడు మనుపీనుగ.\n\n* నిర్భాగ్య దామోదరుడికి, అభాగ్యపు అల్లుడు.\n\n* నిర్భాగ్యునకు నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.\n\n* నిర్వాహకానికి నిముషాలు చాలవుహానీ, చెర్వాకమునకు క్షణం పట్టదు.\n\n* నిలబడ్డమ్మా! నీకేమమ్మ, కుందనపు బొమ్మ! కూర్చోవమ్మ!\n\n* నిలకడ నీళ్ళకే నాచు పట్టేది.\n\n* నిలకడ లేని మాట, నీళ్ళ మూట.\n\n* నిలకడలేని లింగారెడ్డి పెళ్ళా, కొప్పులో నిప్పుబెట్టుకొని కొరివి పెల్లి అంగడికి వెళ్ళిందట.\n\n* నిలువడానికి చోటుదొరికితే కూర్చోను దొరికినట్లే.\n\n* నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు.\n\n* నిలువ నీడలేదు, పట్ట కొమ్మా లేదు.\n\n* నివాళిపళ్ళాలు పట్టేవాళ్ళంతా నిషేక ముహూర్తపు పెండ్లికూతుళ్లవుతారా?\n\n* నివురుకప్పిన నిప్పు వలె (నీఱు గప్పిన నిప్పువలె).\n\n* నిశ్చితార్ధము నాడే నీలగవలసింది, నాగవల్లి దాకా ఉండటం నా అదృష్టం కాదా అన్నదట (నా మహిమ అన్నదట).\n\n* నిష్ఠ నీళ్ళపాలు, మంత్రం మాలపాలు.\n\n\n\n**********:: నీ ::**********\n\n* నీ ఎడమచెయ్యి తియ్యి నా పుఱ్ఱచెయ్యి పెడతాను అన్నట్లు.\n\n* నీ కంటి నుండే దూలంమరచి ఎదుటివాని కంట నలుసు ఎన్నకు.\n\n* నీకత్తికి రెండుపక్కలా పదును (రెండువాదరులు).\n\n* నీకు ఆయన ఏమికావలె? అని అడిగితే, త్రోవలో పోతే \" వారు \" కావలె అన్నదట.\n\n* నీకెక్కడ అనుమానమో నాకూ అక్కడనే సందేహం.\n\n* నీకెక్కడ సంశయమో నాకూ అక్కడనే సందేహం.\n\n* నీకు ఒక దండం, నీ బువ్వ కొకదండం.\n\n* నీకు ఓపిక ఉండాలేగానీ నేను కనలేకపోతానా అన్నదట.\n\n* నీకు నాకు పడదు, రోలెక్కి తలంబ్రాలు పోయి.\n\n* నీకు బెబ్బెబ్బే, నీయబ్బకూ బెబ్బెబ్బే.\n\n* నీకు మూతికి మీసాలుంటే నాకు ముంజేతికి వెంట్రుకలున్నవన్నదట (పల్నాటి నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయకునితో).\n\n* నీకు రానిది, నేను విననిది, లోకములో లేనిది చెప్పమన్నట్లు.\n\n* నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గు లేదు, ఎప్పటిమాదిరే వచ్చిపోతుండ మన్నదిట (మిండని).\n\n\n* నీ కూడు తిని, నీ బట్టకట్టి, నాకు కాపురం చేయమన్నాడట.\n\n* నీ చంకనేమిటోయీ? అంటే నాచంక నాకయ్యా (చంకన- ఆకు) అన్నాడట.\n\n* నీకులానికి సొడ్డంటే, చిన్నప్పుడే వదలివేసినా అన్నదట.\n\n* నీ చెవులకు రాగిపోగులే అంటే, అవీ నీకు లేవే అన్నట్లు.\n\n* నీకేమీ తేరగాడవు! నూకేవే గానీ, కడుపు నొప్పెరుగవు. (నూకుట= దొబ్బుట అనుట, నూకులు= ఎత్తులు, ప్రయత్నాలు, పీకెలు అనిగూడా)\n\n* నీచుకాడ చూడరా పాచుగాడి గుణాం (మంసము, చేపల పంపకంలో పట్టింపులు ఎక్కువ).\n\n* నీటికాకి మీను మునుగ నిరతము దయ స్నానమగునా?\n\n* నీటికి కలువ, మాటకు చలువ.\n\n* నీటికి నాచు తెగులు, నాతికి రంకు తెగులు.\n\n* నీటికి (నాచు) పాచితెవు(గు)లు, మాటకు మాట తెవులు, కులానికి కులం తెవులు.\n\n* నీటికొలది తామరతూడు (తామరలకు).\n\n* నీటిపైన గుండు నిలుచునా మునగక.\n\n* నీటిలో జాడలు వెదకినట్లు.\n\n* నీటిలో కప్ప నీరు త్రాగకుంటుందా?\n\n* నీ తలమీద తేలు ఉన్నదంటే, నీ చేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.\n\n* నీతిలేనివాడు కోతికంటే బీడు.\n\n* నీతివర్తనమును, కీర్తి దాని క్రీనీడవలె వెంటాడుచుండును.\n\n* నీతిహీనులవద్ద నిర్భాగ్యులుందురు.\n\n* నీదుండే తీరుకు చూపాలనా? బట్ట బాగేసుకో.\n\n* నీ దున్నడంలో ఏముంది? ఉండేదంతా నా చల్లడంలో ఉంది.\n\n* నీ పత్తుపణం పాడుగాను, నా ఒరుపణం కుప్పలు పెట్టు (పత్తు=పది, ఒరు=ఒకటి తమిళంలో).\n\n* నీ పప్పూ, నా పొట్టు కలిపి ఊదుకతిందాం అన్నట్లు.\n\n* నీ పీకెలు సాగవు.\n\n* నీ పెండ్లాం ముండమోస్తే, నీకు అన్నం ఎవరు వండిపెడతారు అని అన్నాడట.\n\n* నీ పెండ్లి పాడాలాఉంది, నా పెండ్లికి వచ్చి కాగడా (మషాల్జి) వెయ్యి అన్నట్లు (మషాల్జి= చాకలి, దివిటీలు పట్టేవాడు).\n\n* నీ పెండ్లి పాడైయింది, నా పెండ్లికి తాంబూలానికి రమ్మన్నాడట.\n\n* నీ పెండ్లి పాసుగాల, నాతద్దినం చూదమన్నట్లు (పాసు=ఏపు;దుంపతెగ అన్నట్లు).\n\n* నీ పెండ్లి పాసుగాలిందిలే, నా పెండ్లికి దివిటీలు పట్టమన్నాడట.\n\n* నీ పేరంటమే అక్కఱలేదంటే, కరకంచుచీర కట్టుకొని వస్తానందట.\n\n* నీపై ఎసలేదు, నాపై ఎసలేదు, ఏడుసేర్ల తప్పేలా కెసరుపెట్టమను.\n\n* నీ బఱ్ఱెగొడ్డును ఎవరు కాస్తారు చూస్తాను అంటే, నా తిత్తిలోని డబ్బే కాస్తుంది అన్నాడట.\n\n* నీ బిచ్చానికి ఒక దందముకానీ, నీ బేపిని కట్టేయి (బేపి= కుక్క).\n\n* నీ బిచ్చానికి తోడు ఏడు జోలెలా?\n\n* నీమం కోసం నామం పెడితే నామం నా కొంప తీసింది (నామంచూసి భోజనం చేసినాడనుకొని అన్నానికి పోతూ పిలువలేదట).\n\n* నీ మగనికి రాగిపోగులే అంటే, నీమగనికి అవీ లేవే అందట.\n\n* నీమాలకత్తె నిష్టతో మడిగుడ్డ ఆరవేయబోతే, మడత వీడి మాదిగవాడ (మాదిగాడ) కుక్కమీద పడిందట.\n\n* నీ ముక్కున చీమిడేమమ్మా అంటే, నీ చేతితోనే అటు తుడిచి పొమ్మన్నదట.\n\n* నీ మొగాన పొద్దుపొడిచినట్లు నిక్కుతావు.\n\n* నీర మోటికుండ నిలువని చందాన.\n\n* నీరధికి నీరు మోసినట్లు.\n\n* నీరుండేదాకా మీను మిట్టిపడుతుంది\n\n* నీరు ఉంటే ఊరు లేదు, ఊరు ఉంటే నీరు లేదు.\n\n* నీరు ఉంటే నారు ఉండవలె.\n\n* నీరు ఉంటే పల్లె నారి ఉంటే ఇల్లు.\n\n* నీరు ఉన్నచోటనే బురద.\n\n* నీరుకట్టువా(గా)డు తన మడి ఎండబెట్టుకోడు.\n\n* నీరు, నీరువంకకే పాఱునుగానీ మిట్టల కెక్కునా?\n\n* నీరు నూనె కలుస్తాయా?\n\n* నీరు పల్ల మెఱుగు, నిజము దేవుడెఱుగు.\n\n* నీరులేని తావున మెట్ట అని ఇల్లు కట్టుకొన్నట్లు.\n\n* నీరులేని పైరు, నూనెలేని ఒత్తి (జుట్టు).\n\n* నీరుల్లి నీటిలో కడుగితే కంపేడ పోతుంది?\n\n* నీరువిడచిన మొసలి- నీరు విడచిన చేప.\n\n* నీరు సొరక నికరము తెలియదు.\n\n* నీరెంతపోసి పెంచినా నేలవేము కూరకాదు.\n\n* నీఱు గప్పిన నిప్పు (నీఱు= బూడిద, మసి).\n\n* నీలి నీళ్ళకు పోతే, నీరు లోతుకు పోయింది.\n\n* నీలి మాటలు, గాలి మూటలు (నీలిమాట = నిందలు).\n\n* నీళ్ళపట్టున నేయి మందా?\n\n* నీళ్ళమూట, వంచకుడిమాట ఒకరీతి.\n\n* నీళ్ళలో నిప్పు పెట్టి కాలకుంటే కడుపు కొట్టుకొన్నట్లు.\n\n* నీళ్ళలో నిమ్మలు బ్రతికినవి, అడవిలో తుమ్మలు బ్రతికినవి.\n\n* నీళ్ళలో మునిగి ఉన్నవానికి నిప్పు భయం లేదు.\n\n* నీళ్ళాటని చేతికి విధానా లాటవు (ఆటు = ఆగు; మాను)\n\n* నీళ్ళాటని ఇంట నిధానాలాటవు.\n\n* నీళ్ళూ తాగే వానికి (వాని మాటకు) నిలకడలేదు (నీళ్ళు= కల్లు).\n\n* నీ వగలమాటలకు నా మగని చంపుకొంటి.\n\n* నీవు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగుతున్నాను.\n\n* నీవుకాదు, నీ తల్లో పేనుగూడా మాట వింటుంది.\n\n* నీవు క్షుద్రకీటకమువలె ప్రవర్తిస్తూ ఇతరులు కాళ్ళక్రింద తొక్కినారనుట ఎందుకు?\n\n* నీవు చస్తే లోకమంతా ఎముకలా?\n\n* నీవు దంచు నేను పక్క (రెక్కలు) ఎగురవేస్తాను.\n\n* నీవునేర్పిన విద్యయే నీరజాక్ష.\n\n* నీవు పాడినదానికి, నేను విన్నదానికి సరిపోయింది; తలూపినదానికి తంబూరా బెట్టిపో.\n\n* నీవు పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపు.\n\n* నీవు వెడితే బూతులు తిట్టివస్తావు, నేను వెడితే అమ్మను ఆలిని తిట్టివస్తాను.\n\n* నీవెక్కు-నీవెక్కు అన్న మర్యాదలు జరిగేలోపలే బండి వెళ్ళిపోయినదట. (హైదరాబాదు మర్యాదల తీరు).\n\n* నీసరి వేల్పులు లేరు, నాసరి దాసులు లేరు.\n\n* నీ సాకు చట్టుబండలు కాను, నాలుగు బేకులు బేక మన్నాడట (అన్నం వడ్డనలో0 ( సాకు = చాలు, బేకు =కావాలి, కన్నడములో)\n\n* నా సోకే సొఱాకు, నీ ముఖమే బీరాకు, నావంక చూడబోకు, నాకసలే చిరాకు.\n\n\n\n**********:: ను ::**********\n\n* నుచ్చు గట్టిన రొమ్ము- కంపలో గాచినకాయ ఒకటే (ఉపయోగపడవు; నుచ్చు = గొఱ్ఱెల మేకల పాలు పొలాలలో త్రాగకుండా చన్నులకు కట్టు గుడ్దపీలిక).\n\n* నుదుట వ్రాయనిదే నోట పలుకదు.\n\n* నుదురు బత్తుడు, నోరు తోడేలు.\n\n* నుయ్యి తీయబోతే దెయ్యం బయటపడినట్లు.\n\n* నుయ్యి దాటేవానికి చింతాకంత ఎడమైనా ఎడమైనట్లే.\n\n* నువ్వుకు నూరు రోగాలు (తెగుళ్ళు).\n\n* నువ్వు చస్తే బొబ్బర్లు.\n\n* నువ్వులకు ఏడు దుక్కులు, ఉలవలకు ఒకే దుక్కి.\n\n* నువ్వులకు తగిన నూనె.\n\n* నువ్వులూ నూనె ఒకటి, నూనె (గాండ్ల) గమళ్ళవాడే వేరు.\n\n* నువ్వులు వేసి ఆవాలు పండమన్నట్లు.\n\n\n\n**********:: నూ ::**********\n\n* నూకల కేడ్చి యేడ్చి, తవుడు కేడ్చినాడట.\n\n* నూక సంకటికి నూనెధార.\n\n* నూటికి నూలుపోగు, కోటికి గోవుతోక.\n\n* నూటికి పెట్టి, కోటికి గొరిగించినట్లు.\n\n* నూటిని పొడిచి సెలగ అన్నట్లు.\n\n* నూటివఱకు నన్ను కాపాడితే, ఆతరువాత నిన్ను కాపాడుతా.\n\n* నూత పడెదవా, పాతర పడెదవా?\n\n* నూతి కప్పల విధానం (కూపస్థ మండూకం).\n\n* నూతి కప్పకు సముద్రం సంగతేమి తెలుసును?\n\n\n* నూతి దరిచేరి, నోట గొణిగితే ఈత వస్తుందా?\n\n* నూతిలో నీరు తోడుకోవాలి గానీ, తనంతటతానే పైకివస్తుందా?\n\n* నూతిలో పడబోయి తాప వెదకినట్లు (తాప=తెప్ప).\n\n* నూనె అన్నంతిని, నూతికి కాళ్ళు జాపిందట.\n\n* నూనె కొలిచిన గిద్దకు జిడ్డు కాదా?\n\n* నూనెతో మండే దీపం నువ్వులతో మండునా?\n\n* నూనెలేని వత్తి ఎగదోస్తే నేమి? దిగదోస్తే నేమి?\n\n* నూరి భరించలేనమ్మ, తాగి భరిస్తుందా?\n\n* నూరు అప్పడాలకు ఒకటే సొడ్డు.\n\n* నూరు ఆవులలో ఒక ఆవు ఈచుకపోతే లెక్కేమిటి? (ఈచుకబోవుట = చచ్చిన దూడను వేయుట).\n\n* నూరు కల్లలాడి అయినా ఒక ఇల్లు నిలుపమన్నారు.\n\n* నూరు కాకులలో ఒక కోకిల.\n\n* నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు.\n\n* నూరు గుడ్లుతిన్న రాబందుకైనా ఒకతే గాలిపెట్టు.\n\n* నూరు గుఱ్ఱాలకు అధికారి, ఇంటభార్యకు ఎండుపూరి.\n\n* నూరు గోవిందలు పెట్టవచ్చు కానీ ఒక్క దాసరికి పెట్టడం కష్టం.\n\n* నూరు తిట్టినా ఒక గుమ్మడికాయ (బద్ద) ఇస్తే సరి.\n\n* నూరు నోములు ఒక ఱంకుతో సరి (వ్యర్థమైపోవును).\n\n* నూరు పూసలకు ఒకే కొలికి.\n\n* నూరు భక్షణములున్నా నోటి కబ్బినంతే.\n\n* నూరుమంది గుడ్డివాళ్ళు నూతిన బడితే, కన్నున్న వాడొకడు గడ్డకు ఎత్తును.\n\n* నూరుమంది మొండిచేతులవాళ్ళు పోగై, గొడ్డూగేదె పాలు పితికినట్లు.\n\n* నూరుమందిలో నూనెబిడ్ద ముద్దు.\n\n* నూరుమాటలు ఒకవ్రాతకు ఈడుకావు.\n\n* నూరు వరహాలకు నూలుపోగన్నట్లు.\n\n* నూరేండ్లు చింతించినా నొసటి వ్రాలే గతి.\n\n* నూలుబట్ట నూరేండ్లు కడతామా?\n\n\n\n**********:: నె ::**********\n\n* నెగడాశే గానీ మగుడాశ లేదు (నెగడు = చలి కాచికొనుటకు వేసిన మంట. ఇది ఆరిపోదు).\n\n* నెత్తి కాలనిదే జోలె నిండదు.\n\n* నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది.\n\n* నెత్తిన మూటకు సుంక మడిగినట్లు.\n\n* నెప్పరగత్తి పప్పులొండితే, వడిగలమ్మ ఒళ్ళో బెట్టుకొని పోయిందట.\n\n* నెమలికంటి నీరు వేటగానికి ముద్దా?\n\n* నెమలి కూసినట్లు పికిలి కూయబోయి పిత్తుక చచ్చిందట.\n\n* నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు.\n\n* నెయ్యానికైనా, కయ్యానికైనా సమత ఉండాల.\n\n* నెయ్యి అని అరచి, నూనె అమ్మినట్లు.\n\n* నెరిధనమును దాయల (దాయాదుల) కిచ్చితే నెనరు మాటలు కలుగునా?\n\n* నెఱజాణ నేరననును, నేర్తు ననువాడు నింద పాలగును.\n\n* నెఱ ఱంకులాడికి నిష్ఠ మెండు.\n\n* నెల తక్కువైనా రాజుఇంట పుట్టమన్నారు (కాపింట; కోమటింట).\n\n* నెల తక్కువైనా మొగపిల్లవాడే మేలు.\n\n* నెల బాలుడికి నూలుపోగు.\n\n* నెలవు దొంగ ప్రాణం చుట్టు.\n\n\n\n**********:: నే ::**********\n\n* నేటి కవులు సిరాలో ఎక్కువ నీళ్ళు కలిపి వ్రాస్తున్నారు.\n\n* నేటి బిడ్డే రేపటి తండ్రి.\n\n* నేటి విత్తే రేపటి చెట్టు.\n\n* నేడు గంత వేసి, రేపు ఎక్కినట్లు.\n\n* నేడు నవ్వు, రేపు (మరునాడు) ఏడ్పు.\n\n* నేడు నిప్పు, రేపు నీఱు (నీఱు= నివురు, బూడిద).\n\n* నేతికుండ నేలబెట్టి, ఉత్తకుండను ఉట్టిమీద పెట్టినట్లు.\n\n* నేతిగూన (గిన్నె) చేతబూని, నిచ్చెన ఎక్కినట్లు.\n\n* నేతిబీరకాయ; విభూతిపండు; జీలకర్ర (సామ్యము; బీరలో నెయ్యి లేనట్లు).\n\n* నేనాడేదే బండిసిరి ఆట, మా పెదబావ చూస్తాడంటే ఎలా?\n\n* నేను పుట్టకపోతే నీకు పెండ్లానే లేకపోవునే అంటే, నీవు పుట్టకపోతే నీ తల్లినే పెళ్ళాడి ఉందు నన్నాడట.\n\n* నేనుపోతే మజ్జిగనీళ్ళకు దోవలేదు గానీ, నా పేర చీటీపోతే పెరుగు పంపుతారు అన్నాడట.\n\n* నేను మందు తింటా, నీవు పథ్య ముండు మన్నట్లు.\n\n* నేను లేకపోతే ఎవణ్ణి పెళ్ళాడువంటే, నీ అబ్బంటోడు ఇంకొకడు పుట్టిఉంటా డన్నదట.\n\n* నేను ఒకపొద్దే, నా మగడు ఒక్క పొద్దే, పిండీ, బియ్యం లేక పిల్లలూ ఇక పొద్దే.\n\n* నేనూ బండెద్దునని గుద్దకు పేడ రాసుకొన్నట్లు.\n\n* నేములు కాచిన భూములు పండును.\n\n* నేయిచెడి నూనెచెడి పొగమాత్రం మిగిలింది (హోమం).\n\n* నేరక నేరక నేరేళ్ళు తినబోతే, నేరాలు ఒడిగట్టినట్లు.\n\n* నేరము గలిగినచోటనే కారుణ్యము.\n\n* నేరేళ్ళు నెగ్గేది, మారేళ్ళు (మామిళ్ళు) మగ్గేదీ- మంచికాలానికి లక్షణం.\n\n* నేరేళ్ళు పండితే నేలలు పండును.\n\n* నేర్చి చెప్పిన మాట నెరవాది మాట.\n\n* నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటుంది.\n\n* నేర్చిన బుద్ధి ఏర్చినా పోదు.\n\n* నేర్చి బ్రతికినవాడు, నేర్వక చెడ్డవాడూ లేడు.\n\n* నేర్పు కలిగినమ్మ చేతితో అతిరసాలు కాలిస్తే, ఓర్పుగలమ్మ ఒడిలో గట్టుకొని పోయిందట.\n\n* నేర్చుబో చంకల బిడ్డలాడిపడ సారసలోచన మాటలాడగన్.\n\n* నేర్పులేనివాని నెరయోధుడందురా?\n\n* నేలది తీసి నెత్తికి రుద్దుకొన్నట్లు.\n\n* నేలమీద వ్రాసిన బూరెను ఇంత తింటావా? అంత తింటావా? అన్నట్లు.\n\n* నేలమునగకు నిచ్చెన వేసేవాడు.\n\n* నేల మెత్తనిదని మోచేత త్రవ్వినట్లు.\n\n* నేల విడిచిన సాము - తాళం విడిచిన పాట.\n\n* నేల విడిచిన సాము - నీరు విడచి ఈత.\n\n* నేల విడిచిన సాము - మతి విడిచిన మాట.\n\n* నేసేవాణ్ణి నమ్ముకొని పొలిమేర జగడం ఒప్పుకొన్నట్లు.\n\n\n\n**********:: నై ::**********\n\n* నైజ గుణానికి, గుడ్డికంటికి మందులేదు.\n\n\n\n**********:: నొ ::**********\n\n* నొచ్చినవాడా నువ్వులు చల్లమన్నట్లు.\n\n* నొచ్చి నొసట పలుకదు, వచ్చినవాని విడువదు.\n\n* నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు.\n\n* నొప్పు లెత్తుకున్నప్పుడే మంత్రసానికి దెప్ప సందు.\n\n* నొయ్యకుండా చేస్తే కొయ్యకుండా పండును.\n\n* నొసట పళ్ళు లేవు, నోట్లో కళ్ళు లేవు.\n\n* నొసట నామాలు, నోట బండబూతులు.\n\n* నొసటమీది వ్రాత నులిమిన పోవునా?\n\n* నొసట వ్రాసిన వ్రాత నులిమితే చెడదు.\n\n* నొసట వ్రాసిన వ్రాలు (వ్రాత) చెఱిపేదెవరు?\n\n* నొసట వ్రాసిన వ్రాలు కన్నా కలదా వెయ్యేళ్ళు చింతించినన్.\n\n* నొసలు భక్తుడు నోరు తోడేలయా.\n\n\n\n**********:: నో ::**********\n\n* నోచిన వారి సొమ్ములు నో(య)మనివారికి వచ్చునా?\n\n* నోటిఆయి రొమ్ముకు తగులుతుంది.\n\n* నోటికి చేతికి చీకటి లేదు.\n\n* నోటికి తీపు, ముడ్డికి చేటు.\n\n* నోటికి మీరిన కడి మింగరాదు.\n\n* నోటికీ చేతికి ఎంగిలి లేదు.\n\n\n* నోటి జిగటేగానీ, చేతికి జిగట లేదు.\n\n* నోటితో లేదనేది చేతితో లేదంటే సరి.\n\n* నోటిమీద కొడితే పెడతల వాచిందట.\n\n* నోటి వక్రం గంజి పెడమూట.\n\n* నోటి పట్టం, గంజి పెడ పూట.\n\n* నోటిలో చెక్కెర, కడుపులో కత్తెర.\n\n* నోట్లో నూవుగింజ (అయినా) నానదు.\n\n* నోట్లో ముద్ద, గూట్లో దీపం (జైనులు దీపం పెట్టేదానికి ముందరే భోజనం చేస్తారనుట).\n\n* నోట్లో వేలుపెడితే కరవనేరని నంగనాచి.\n\n* నోరంతా పళ్ళు, ఊరంతా అప్పులు.\n\n* నోరు అంబాలపు (అప్పాలపు) పండు, చెయ్యి (బ)బులుసు ముల్లు.\n\n* నోరు ఉంటే ఊరు ఉంటుంది.\n\n* నోరు ఉంటే పోరు గెలుస్తుంది.\n\n* నోరు ఉన్న తల గాచును.\n\n* నోరు ఉన్నవాడిదే రాజ్యం (ఊరు).\n\n* నోరు కల్లపుట్ట, పేరు హరిశ్చంద్రుడు.\n\n* నోరు చేసే అఘాయిత్యానికి ముడ్డి ఉంది గనక భరిస్తున్నది.\n\n* నోరు నవ్వడం, నొసలు వెక్కిరించడం.\n\n* నోరు పెట్టుకొని గెలవవే ఊర గంగానమ్మ\n\n* నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.\n\n* నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు.\n\n* నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే ఱాగ (ఱాగ=గయ్యాళి).\n\n* నోరు మూస్తే నొసలు మాట్లాడినట్లు (వాగినట్లు).\n\n* నోరు మూస్తే పెడతల మాట్లాడినట్లు.\n\n* నోరు లేని దయ్యం ఊరు ఆర్పిందట.\n\n\n\n**********:: న్యా ::**********\n\n* న్యాయ మమ్మువాడు, దోవలు దోచువాడు ఒకటి.\n\n* న్యాయము చెప్పు నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దఱు పెళ్ళాలే అన్నాడట.\n\n* న్యాయము తప్పినవానికి ఆచార్య కటాక్ష మెందుకు? ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 872,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-న ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* పంచపాండవులంటే నాకు తెలియదా? మంచపుకోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.\n\n* పంచమినాడు పల్లకి ఎక్కనూ లేదు, అష్టమి నాడు జోలి పట్టనూ లేదు.\n\n* పంచశుభం పంచాశుభం.\n\n* పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా?\n\n* పంచాగ్ని మధ్య మందున్నట్లు.\n\n* పంచినవాళ్లకు పళ్ళు నోరు.\n\n* పంచ కేలరా పత్తి ధర.\n\n* పంజకు ధైర్యము, కల్లుముంతకు ఎంగిలి లేవు.\n\n* పంజరం అందంగా ఉంటే, పక్షికి సంతోషమా?\n\n* పంజరంలో కాకిని పెట్టగానే పంచమస్వరం ఆలపిస్తుందా?\n\n* పంటకు రాని చేలు, పరిభావ మెరుంగగలేనిని ఆలు.\n\n* పంటకు పెంట, వంటకు మంట.\n\n* పంటచేను విడచి పరిగ ఏరినట్లు.\n\n* పంట పెంటలో ఉన్నది, పాడి పురిలో ఉన్నది.\n\n* పంటిపాచి పోయిన యింటిహీనం పోతుంది.\n\n* పండని ఏడు పాటు ఎక్కువ.\n\n* పండని కోర్కెలే బొంకులు.\n\n* పండని నేల పందుం కంటే పండే నేల కుంచెడే చాలు.\n\n* పండని నేల పుట్టెడుకంటే, పండే నేల పందుం చాలు.\n\n* పండాకును చూచి పసరాకు (పచ్చాకు) నవ్వినట్లు.\n\n* పండాకు రాలుతుంటే, కొత్తాకు నన వేస్తుంటుంది.\n\n* పండాకు రాలుతుంటే, పసరాకు నల్లబడుతుంది.\n\n* పండించేవాడు పస్తుంటే, పరమాత్మకూ పస్తే.\n\n* పండిత పుత్రుడు శుంఠ.\n\n* పండితమ్మన్యునకు పాదుకా పట్టాభిషేకం.\n\n* పండిన దినమే పండుగ.\n\n* పండినా, ఎండినా పని తప్పదు.\n\n* పండియు పొల్లు బోయిన పంట.\n\n* పండు కాయుండగా, కసుగాయ తెంచినట్లు (కోసినట్లు).\n\n* పండుగ తొలినాడు గుడ్డల కఱవు, పండుగనాడు కూటికఱవు, పండుగ మఱునాడు మజ్జిగ కఱవు.\n\n* పండుగనాడు కూడా పాత మొగుడేనా? అన్నదట.\n\n* పండుగనాడు కూడా పాత పెళ్ళామేనా?\n\n* పండుగ పైన దండుగ.\n\n* పండుజారి పాలలో పడ్డట్టు.\n\n* పండు (పండుకొను) పడకకు చెప్పకుండా పోయినాడు.\n\n* పండుపండిన చెట్టు పట్టంగ నేర్చునా?\n\n* పండేపంట పైరులోనే తెలుస్తుంది.\n\n* పండ్ల చెట్టు కింద ముళ్ళకంప ఉన్నట్లు.\n\n* పండ్లు ఉన్నవానికి పప్పులు లేవు, పప్పులున్నవానికి పండ్లు లేవు.\n\n* పండ్లు చెట్లకు భారమా?\n\n* పండ్లూడ గొట్టుకోను ఏరాయైతే నేమి?\n\n* పండ్లూడిన కుక్క పసరాన్ని కరవదా?\n\n* పండ్లూడిన కుక్కను పసరమైనా కరచును.\n\n* పంతులకు కట్నాలు, మాకు పట్నాలు.\n\n* పంతులు గింతులు, పావుశేరు మెంతులు, ఎగరేసి కొడితే ఏడు గంతులు.\n\n* పంతులు పెండ్లాము మెంతులులేక, గంతులు వేసిందట.\n\n* పంది ఎంత బలిసినా నంది కాదు.\n\n* పందికి పారులేదు, తవిదకు తప్పులేదు.\n\n* పందికేమి తెలుసురా పన్నీరు వాసన?\n\n* పంది కేలరా పన్నీరు బుడ్డి.\n\n* పందికొక్కును పాతరలో పెడితే ఊరుకుంటుందా?\n\n* పందికొక్కు మీద బండికల్లు (చక్రం) పడ్డట్టు.\n\n* పందిగా పదేళ్ళు బ్రతికేకన్నా నందిగా నాలుగేండ్లు (బతికేది మేలు) బతికితే చాలు.\n\n* పందిని పొడిచినవాడే బంటు.\n\n* పంది పందిగూడి పడుగదా రొంపిలో.\n\n* పంది పాత అప్పులు తీరుస్తుంది, కోడి కొత్త అప్పులు తీరుస్తుంది.\n\n* పందిపై ఎక్కి పీతికి రోస్తే ఎట్లా?\n\n* పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?\n\n* పందిమాదిరి కుక్కను మేపి, దొంగలొస్తే ఆలుమగలే అరచినారట.\n\n* పందిరి ఇల్లు కాదు, పరదేశి మొగుడు కాదు.\n\n* పందిరి పడి చచ్చినవారు, ఇల్లు పడి బ్రతికినవారు లేరు.\n\n* పందిరే పర్వతము, ఇల్లే ఇంద్రలోకము.\n\n* పందిలాగా కని, పరగళ్ళమ్మ పాలు చేసినట్లు.\n\n* పందిళ్ళు పైన పరువు లెత్తనా?\n\n* పందులు తినేవాని పక్కనే ఏనుగులు గుటకేసే వాడుంటాడు.\n\n* పందుము తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాదశే!\n\n* పక పక నవ్వేవాడు, గబగబ అరచేవాడు కపటమెఱుగరు.\n\n* పకీర్లను కొట్టి పఠానులకు పెట్టినట్లు.\n\n* పక్క ఇంటి పోరు పండుగంత వేడుక.\n\n* పక్కవాటుగా నడిచే ఎండ్రకాయను చక్కగా నడిచేట్లు ఎవ్వరు చేయగలరు?\n\n* పక్కలో బల్లెము.\n\n* పగ గలిగి బ్రతకటం, పామున్న ఇంట్లో పడుకోవటం ఒక్కటే.\n\n\n* పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు.\n\n* పగటి మాషాజీకి (మషాల్జి) అనుమతి ఎవరిచ్చారు? అంటే, నా ఆముదపు చేను ఇచ్చింది అన్నాడట (మషాజి=దీపములు దివిటీలు పట్టేవాడు).\n\n* పగడములేని ఇల్లు, జగడము లేని ఇల్లు ఉండవు.\n\n* పగతో పొరుగిల్లు కాల్చవచ్చును గానీ, తన ఇల్లు కాపాడ తరముగాదు.\n\n* పగపట్టిన త్రాచు కాటు వేయక మానుతుందా?\n\n* పగలు ఎండ, రేయి చీకటి, ఎప్పుడు దున్నుతావే దిన్నపోతా?\n\n* పగలు కొంగులాగితే చీ! అంటే రాత్రి చీకటిలో కన్ను గీటాడట.\n\n* పగలు చస్తే వాతికి లేదు (వాతబియ్యం), రాత్రికి చస్తే దీపానికి లేదు.\n\n* పగలు చెయ్యూపితే రానిది (ఆడుది) రాత్రి కన్నుగీటితే వస్తుందా?\n\n* పగలు చూస్తే రాత్రి కలలో వస్తుంది అన్నట్లు.\n\n* పగలు దాని గుణం చూసి, రాత్రి దాని వెంట వెళ్ళాలి.\n\n* పగలు నిద్ర పనిచేటు, మాపు జాగారణపై చేటు.\n\n* పగలు పక్కచూచి మాట్లాడు, రాత్రి అదీ మాట్లాడవద్దు.\n\n* పగలు పప్పేసిన పయ్యెందుకు పగులు పెండ్లామా? నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడుదు పెండ్లామా? (పై= శరీర పై భాగము, వీపు).\n\n* పగలు పాతరలుండవు (పగలు=స్పర్ధలు, విరోధాలు).\n\n* పగలు ఉపస్థ వెడల్పు, రాత్రి నీళ్ళు వెడల్పు.\n\n* పగలు బట్టలే కంపించకున్న రాత్రి గొఱ్ఱెలు కనిపిస్తాయా?\n\n* పగలు చత్వారి, రాత్రి రేజీకటి.\n\n* పగలెల్లా బారెడు నేసినాను, దివ్వె తేవే దిగనేస్తాను అన్నదట.\n\n* పగవాణ్ణి పంచాంగ మడిగితే, మధ్యహ్నానికి మరణ మన్నాడట.\n\n* పగవాని ఇంట ఫది బిచ్చాలు పోయినా పోయినవేను.\n\n* పగవారిని చెరబట్టక ముద్దాడవత్తురా?\n\n* పచ్చగా ఉంటే పారాడేది, వెచ్చగా ఉంటే వెళ్ళిపోయేది.\n\n* పచ్చగా ఉన్నవాళ్ళకు, ఎదుటివారి వెచ్చన తెలియదు.\n\n* పచ్చగా ఉన్న దగ్గఱ మేసి, వెచ్చగా ఉన్నదగ్గఱ పండు.\n\n* పచ్చడ మున్నంత కాళ్ళు చాచు.\n\n* పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచి ఎక్కడికీ పోదు.\n\n* పచ్చని పైకము గుఱ్ఱము చచ్చినదాకానే.\n\n* పచ్చని వరహా కంటే, పుచ్చిన గింజే మేలు.\n\n* పచ్చికంకులే దాసరీ, అంటే రాలినకాడికే గోవిందా అన్నాట్ట!\n\n* పచ్చికంకులోయి దాసరీ అంటే రాలినకాడికే రామార్పణం అన్నాడట.\n\n* పచ్చికాయ తుంచిన పండవుతుందా?\n\n* పచ్చికుండలో నీళ్ళుపోయి, నీ పాతివ్రత్యం తెలుస్తుంది అన్నట్లు.\n\n* పచ్చిపేడను తంతే, పదహారు వక్కలయ్యే ప్రాయం.\n\n* పచ్చివెలగకాయ గొంతులో పడ్డట్లు.\n\n* పటేలువారి వడ్లపుణ్యాన్నా, మా యత్త ముడ్డి పుణ్యాన్నా తింటినమ్మా పుల్లటికూర మెతుకులు.\n\n* పట్టణానికి పోయిన గాడిద, పల్లెకు పోయిన గాడిదని కఱచిందట.\n\n* పట్టపగలు కన్న మేస్తావేమిరా? అంటే, నా కడుపు కక్కూర్తి నీకేమి తెలుసును? అన్నాదట.\n\n* పట్టపు రాజు చేపట్టగానే గుడిసేటి ముండకు గుణము రాదు (గుడిసేటి=గుడికి చేటి-దేవదాసి. ఇప్పుడు విడిచినది వ్యభిచారిణి).\n\n* పట్టినదెల్లా బంగారం, ముట్టినదెల్లా ముత్యం.\n\n* పట్టినవాడు (పట్టుకొన్నవాడు) తాబేలు అంటే, గట్టునున్నవాడు కుందేలు అన్నట్లు.\n\n* పట్టినవాడు పక్కి అంటే, గట్టునున్నవాడు జెల్ల అన్నట్లు (పక్కి=చిన్న వెడల్పు చేప, జెల్ల=తేలువలే కుట్టే చిన్నచేప).\n\n* పట్టినవాడు వరిగపిల్ల అంటే, పట్టనివాడు మట్టపిల్ల అన్నాడట.\n\n* పట్టినవాడు మట్టగుడిసె అంటే, ఒడ్డునున్నవాడు జల్లపిల్ల అన్నట్లు (మట్టగుడిసె=నల్లటి చిన్న చేప).\n\n* పట్టిపట్టి పంగనామం పెడితే గోడచాటుకెళ్ళి గోకేసుకున్నాడట.\n\n* పట్టివిడిచిన ముండకు పటొటాపం జాస్తి.\n\n* పట్టివిడిచిన ముండ (మొగుడు విడిచిన ముండ) మబ్బు విడిచిన ఎండ.\n\n* పట్టి విడుచుటకంటే ప్రాణం విడుచుట మేలు.\n\n* పట్టిసం తీర్ఠానికి పత్తిగింజలంత మామిడిపిందెలు.\n\n* పట్టు కత్తిరించినట్లు మాట్లాడినా మనసేమో పలుగురాయి.\n\n* పట్టుకొమ్మను నరుకు కొన్నట్లు.\n\n* పట్టుగుడ్డకు, భ్రష్టుముండకు అంటులేదు.\n\n* పట్టుచీర ఎరవిచ్చి, పీటపట్టుక వెంట తిరిగినట్లు.\n\n* పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.\n\n* పట్టుపట్టు మనేవాళ్ళేగానీ, పట్టేవాళ్ళూ ఒక్కరూ లేరు.\n\n* పట్టుపుట్టము తొత్తుకు కట్టబెట్టిన పేడమరకలతో పాడుచేయును.\n\n* పట్టెడు బొట్టుంటే పదిలక్షలు.\n\n* పటనం దగ్గరకు వచ్చి పల్లెలో రత్నపరీక్ష చేయించినట్లు.\n\n* పట్నం పోయి పుట్నం గింజ తెచ్చాడన్నట్లు.\n\n* పఠానులకు నేను బాకీ, ఫకీరులు నాకు బాకీ.\n\n* పడుచువాని పెండ్లాము ప్రణయిని, నడిప్రాయం వానిభార్య సహధర్మచారిణి, ముసలివాని ఇల్లాలు దాసి.\n\n* పడతులకు బుద్ధి పెడతల నుండు.\n\n* పడతుక, వంకాయ, సమూలమధురములు.\n\n* పడబోయి పూపాన్పుపై పడినట్లు.\n\n* పడమట క్రుంకిన పొద్దు తూర్పున లేవదా?\n\n* పడమట కొఱడువేస్తే పాడుగుంటలన్నీ నిండును; తూర్పున వేస్తే తుంగగడ్డి కూడా మొలవదు (కొఱడు, కొఱ్ఱు=ఇంద్ర ధనుస్సు).\n\n* పడమట కొఱ్ఱుఒడ్డితే (వేస్తే) పందిళ్ళమీద రాజనాలు పండుతాయి.\n\n* పడమట కొఱ్ఱువేస్తే పాడిఆవు ఱంకె వేస్తుంది.\n\n* పడమట పావురాపిట్టంత (పూరేడుపిట్టంత) మబ్బు నడీతే, పాతాళందాకా వాన.\n\n* పడమట మెరిస్తే, పంది అయినా నీళ్ళకు దిగదు.\n\n* పడమటివీధి అమ్మ సరిగ పెట్టుకుంటే, ఉత్తరవీధి అమ్మ ఉరి పెట్టుకుందట.\n\n* పడవ ఒడ్డు చేరితే పడవవాని మీద ఒక సొడ్డు.\n\n* పడిన గోడలు పడ్డట్లుండవు, చెడిన కాపురం చెడి నట్లుండదు.\n\n* పడిలేస్తే పాతరలోతు తెలుస్తుంది.\n\n* పడిశము పది రోగాల పెట్టు.\n\n* పడుకోవడం పాతగోడలలో, కలవరింతలు మిద్దెటిండ్లలో.\n\n* పడుగు పేకా కలిస్తే గుడ్డ, ఆలుమగడు కలిస్తే ఇల్లు.\n\n* పడుగూ పేకా గుడ్డకు, మంచి చెడ్డా మనిషికి.\n\n* పడుచుకొన్న ఇల్లు తుడుచుకు పోతుంది. (పడుచుకొనుట=ఱంకు చేయుట).\n\n* పడుచుగుంట, కడుపుమంట.\n\n* పడుచు(తో) పశువులు ఉంటేనే సేద్యం.\n\n* పడుచుతో సయ్యాట, పాముతో చెలగాటం (చెర్లాట).\n\n* పడుచు పొందు ఫలం లేదు.\n\n* పడుచుల కాపురం - చిగురుల మంట.\n\n* పడుచు సేద్యం పాకానికి రాదు.\n\n* పడ్డకు, పడుచుకు పలుపు కడితే వెంటపడతారు.\n\n* పడ్డవారు చెడ్డవారు కాదు.\n\n* పణ్యారం పట్టు దాసప్పా! అంటే, ఏ చేని సజ్జలు? అన్నాడట. (పణ్యారం= పందేరం, దేవాలయాలలో పంచిపెట్టు ప్రసాదం).\n\n* పతికి మోహములేని జవ్వనము, పరిమళించని సుమము.\n\n* పతిభక్తి చూపిస్తాను మొగడా, చెప్పులు తే, నిప్పులు తొక్కుతాను.\n\n* పత్తికి పది చాళ్ళు, ఆముదాలకు ఆరు చాళ్ళు.\n\n* పత్తిగింజల గంత కట్టనా బసవన్నా! అంటే ఊహూ అన్నాడట.\n\n* పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట.\n\n* పత్రి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద.\n\n* పత్రిలేని పూజ, పత్రం లేని అప్పు.\n\n* పథ్యం చెడరాదు, సత్యం తప్పరాదు.\n\n* పద(దు)ను తప్పినా, అద(దు)ను తప్పినా పన్ను దండుగే.\n\n* పద(దు)ను పోయిన కత్తి, అద(దు)నుపోయిన సేద్యం.\n\n* పదము తప్పినా ప్రాస తప్పరాదు.\n\n* పదమొక బానిస, రాగం ఒక రంభ.\n\n\n* పదలం నూలుపాగాలేనిది పంతులుకాడు.\n\n* పది ఆమడల వర్షంతో పరగడ గుఱ్ఱం పరుగెత్తలేదు.\n\n* ఫది పణాలకన్నా ఫది ఎకరాలు మేలు.\n\n* పది భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా?\n\n* పదిమంది కలవాడు పంద అయినా సేద్యం చేస్తాడు.\n\n* పదిమంది కలవానిదే పాటు.\n\n* పదిమంది చేరిన పని పాడు.\n\n* పదిమందితో చావు పెండ్లితో సమానం.\n\n* పదిమంది నడిచింది బాట, పదిమంది పలికింది మాట.\n\n* పదిమందిలో పడ్డ పాము చావక పోతుందా?\n\n* పదియవనాటి ముత్తైదువ వలె (పసుపు కుంకుమ తీసిన తరువాత).\n\n* పదిరాళ్ళు వేస్తే ఒకరాయైనా తగులదా?\n\n* పది వేస్తే పచ్చిపులుసు, లేకపోతే పాడుపులుసు.\n\n* పదురురాడుమాట పాడియై ధర చెల్లు, ఒక్కడాడుమాట ఎక్క దెందు.\n\n* పద్మరాగాల గనిలో గాజుపెంకులుంటాయా? (అన్నట్లు).\n\n* పద్మాసం వేసి కూర్చుండగానే పరమాన్నం వడ్డిస్తారా?\n\n* పద్మినీరతివేడ్క పాంచాలుండుగాక షండుడు తెలుయగలడా?\n\n* పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నట్లు.\n\n* పనసపండు తెచ్చి పళ్ళేంలో పెడితే, తినలేని బ్రాహ్మణుడు దిక్కుదిక్కులు చూసాడట.\n\n* పనసపండ్లలో మామిడిపండ్ల రసముండునా?\n\n* పనాపాటా, పండుకో మగుడా అన్నదట.\n\n* పనాపాటా పెండ్లామా అంటే, పండుకొందాం రమ్మన్నదట.\n\n* పని అంటే నా ఒళ్ళు భారకిస్తుంది, బువ్వ అంటే నా ఒళ్ళు పొంగి వస్తుంది.\n\n* పనికి పరాకు, తిండికి హుషారు.\n\n* పనికి పీనుగు, తిండికి ఏనుగు.\n\n* పనికిమాలు తొత్తు బత్తెంబు చేటయా.\n\n* పనికి బడుగు, తిండికి పిడుగు.\n\n* పని గలవాడు పందిరి వేస్తే, కుక్కతోక తగిలి కూలిపోయిందట.\n\n* పని గలవారింట్లో పైసల ఏట్లాట, పని లేనివారింట్లో పాపోసుల ఏట్లాట.\n\n* పని చేయనివాడు ఇంటికి దొంగ, పన్నివ్వనివాడు దివాణానికి దొంగ.\n\n* పని చేయనివానికి ప్రగల్భా లెక్కువ.\n\n* పని తక్కువ, ప్రాకులాట ఎక్కువ.\n\n* పని పాతరబెట్టి, గంప జాతరకు పోయినట్లు.\n\n* పని ముద్దా? పాటు ముద్దా?\n\n* పని లేక పటేలు ఇంటికి పోతే, పాతగోడకు పూత పెట్టమన్నాడట.\n\n* పని లేకుంటే పంటకాపింటికి (పంటోళ్ళింటికి) పో, పందిరి గుంజకు గూడా పని చెప్పుతారు.\n\n* పని లేకుంటే పంటకాపింటికి పోతే, పందిటిగుంజలుగూడా పని చెప్పతవి.\n\n* పనీ లేదు పాటా లేదు, ఇట్లన్నా మళ్ళు నీ వెంట్రుకలు సరిదీస్తా నన్నట్లు.\n\n* పనీ లేదు, పాటా లేదు, పట్టత్త! నీకాళ్ళకైనా మొక్కుతాను అన్నట్లు.\n\n* పనిలేని పాపరాజు ఎంచేస్తున్నాడంటే, కుందేటికొమ్ముకు రేకలు తీస్తున్నడు అన్నట్లు.\n\n* పని లేని మంగలి పిలిచి తల గొరిగినాడట.\n\n* పని లేని మంగలి పిల్లితల గొరిగినాడట.\n\n* పనిలేని మాచకమ్మ పిల్లిపాలు పితికిందట.\n\n* పని వాడు పందిరివేస్తే, పిచ్చుకలు వచ్చి పడతోసిన వట.\n\n* పన్నీరుపువ్వును ఏ పేర పిలిచినా సువాసనలనే వెదజల్లుచుండును.\n\n* పన్నులు (పండ్లు) లేక బెన్నులు పెట్టినారు, పన్నులుంటే పందుం తిననా అన్నట్లు. (బెన్నులు=పెట్టుడు పండ్లు).\n\n* పన్నెండు ఆమడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యఙ్ఞం చేయిస్తా నన్నాడట.\n\n* పన్నెండూండ్ల పారుపత్తెం గాడికి పనితీరికే ఉండదు (పారుపత్తెంగాడు=పెత్తనం చేసేవాడు).\n\n* పప్పుకూటికి పది ఆమడలైనా వెళ్లమన్నారు.\n\n* పప్పుకూటికి ముందు, వెట్టిమూటకు (చాకిరికి) వెనుక వెళ్ళమన్నారు.\n\n* పప్పుచారు అడుగడుగుది - పరమాన్నం పైపైది రుచి.\n\n* పప్పుతో పది కబళాలు తింటే, పులుసెందుకు బుగ్గిలోకా?\n\n* పప్పు దప్పళానికి నీవు; పాపోసు దెబ్బలకు నేనా?\n\n* పప్పు పైత్యం, చారు సీత్యం.\n\n* పప్పు బానలమీది బడబాగ్నులారా, పిండివంటమీది పిడుగులారా, ఏలబుట్టిరి వెలనాటి స్వాములారా?\n\n* పప్పులు పెట్టి పోరు మాంపినట్లు.\n\n* పప్పు లేని పులగం, ఉప్పు లేని దప్పళం.\n\n* పప్పు లేని పెండ్లి, ఉప్పు లేని కూర.\n\n* పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పేయమంటే, చెప్పువేసి తీసి అత్తకు అంచుకు పెట్టిందట.\n\n* పప్పు వంటకత్తెను బండిమీద వేస్తే ఎసు(స)రుకు ఎన్ని ముంతలు పెట్టేది? అన్నదట.\n\n* పప్పు శబ్ధంబునకు ఘృతశబ్ధంబు పరమగునపుడు అపాన వాయువు ఆదేశంబగు.\n\n* పప్పే పస బాపనులకు, ఉప్పే పస రుచులకెల్ల, ఉవిదలకెల్లన్ కొప్పేపస.\n\n* పయి బడ్డ మాట, మడిబడ్డ నీళ్ళు పోవు.\n\n* పయిసా ఇచ్చి, పాపం కొనుక్కొన్నట్లు.\n\n* పయోముఖ విషకుంభము.\n\n* పరకాంత లెందరైనను కులకాంతకు సాటిరారు.\n\n* పరచు గుఱ్ఱపు తోకబట్టి ఈడ్వగ వచ్చు గానీ తప్పించుకోరాదు దాని తన్ను.\n\n* పరనింద గృహక్ష్యం, యతినింద కులక్షయం.\n\n* పరమవంధ్యకు పాలుపెరుగు పోయగానే చంటిపాలు కలుగనేర్చునా?\n\n* పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు.\n\n* పరమానందయ్యగారి శిష్యుడు\n\n* పరాయిపిల్ల గాజులు పెడితే పైకానికి చేటు.\n\n* పరాశికాల బాపనయ్యకు పాముకరిస్తే, మందులేక మరణమైనాడు (పరాశికాల=పరిహాసాల).\n\n* పరిగేరుకొనేదానికి ఓదె దొరికినట్లు. (పరిగె=పైరుకోసిన చేల్లో జారిపడిన వెన్నులు; ఓదె=పైరుకోసి ఎండుటకు చాళ్ళు చాళ్ళుగా వేసినది, పన).\n\n* పరిగనేరిన పాతట్లోకి ఆగునా?\n\n* పరిగేరిన గింజలు కరువు కడ్డం రావు.\n\n* పరిచయానికి ప్రథమచుంబనానికి మధ్య నున్న కాలాన్ని ఆదర్శ ప్రేమ అంటారు.\n\n* పరిహాసం పైన వేసుకొని, జాణతనం చేతపట్టుకొని జాతరకు పోయినాడట.\n\n* పరుగెత్తి పాలు తాగేకన్నా, నిలబడి (నిలుచుండి) నీళ్ళు తాగేది మేలు.\n\n* పరుగెత్తి పసూలుకాస్తే పొద్దు కూకుతుందా? (కునుకుతుందా?)\n\n* పరుగెత్తు పందకు కాంతలతోడి చింతయా?\n\n* పరుగెత్తే పాముకు పాదములు కల్పించుట, అల్లనేరేడుపండ్లను తెల్లచేయుట వంటిది.\n\n* పరుగెత్తే ఎద్దునే తరిమేది\n\n* పరుగెత్తే వాణ్ణి చూస్తే, తరిమేవాడికి లోకువ.\n\n* పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము\n\n* పరుల సొమ్ము పేలపిండి, తన సొమ్ము దేవుడి సొమ్ము.\n\n* పరు విచ్చి పరువు తెచ్చుకొ.\n\n* పరువుకీ, కరువుకీ డబ్బు.\n\n* పరువు తప్పిన బ్రతుకు రోత, సతికిచాలని పురుషుని బ్రతుకు రోత.\n\n* పరువులేని నడపీనుగకు ఊరేమి? పాడేమి?\n\n* పలకమ్మ పున్నానికి పడమటికొమ్మ పూస్తుంది. (పలకమ్మ=పున్నమ, మార్గశిర పూర్ణిమ).\n\n* పలకమ్మ పున్నానికి పడుగులు పడతాయి.\n\n* పలుకని వాళ్లతో పదిఊళ్ళ వాళ్ళయినా గెలువలేరు.\n\n* పలుకు తేనెపట్టు, పిడకిలి కోతిపట్టు.\n\n* పలుకులేమో పంచదార, నిలువెల్లా బొంకులపుట్ట.\n\n* పలుకులు బంగారం, గుణము పాలకన్నా పలుచదనము.\n\n* పలుగాకులకు తల్లి పార్లపల్లి.\n\n* పలుగాకులకు మేలు లేదు, పంజగొడ్డుకు పాలులేవు (పంజ=గొడ్డుబోతు (పిరికి)).\n\n* పలుగులు కాల్చి పక్కలో వేసినట్లు.\n\n* పలుచన పంట వేడుక, ఒత్తు చూపుల వేడుక.\n\n\n* పలుచన పాతళ్ళు కోరు, ఒత్తు వాముల గోరు.\n\n* పలుచని గొడ్డు పాలెక్కువ, పిండని ఆవుకు పొదుగెక్కువ.\n\n* పలుదని పైరు పాతరలు నింపు.\n\n* పలుపు దీసుకొని కొట్టరా మొగుడా, పదాలు పాడుతా నన్నదిట.\n\n* పలువతో సరసము ప్రాణ హాని.\n\n* పలువురు నడచిన తెరువే పదిలమైనది.\n\n* పలువురు నడిచిన తెరువున పులుమొలవదు, మొలిచెనేని పొదలదు.\n\n* పల్నాటిలో పోకకు పుట్టెడు దొరికితే, ఆ పోక దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.\n\n* పల్లం వైపుకే నీళ్ళు పారేది.\n\n* పల్లము దున్నినవాడు పల్లకి ఎక్కుతాడు.\n\n* పల్లమునకు ఏడు దిక్కులు, మెఱకకు నాలుగు దిక్కులు.\n\n* పల్లాన్న పోయినా ఏనుగే, మిట్టన పోయినా ఏనుగే.\n\n* పల్లికమ్మ (పలకమ్మ) గడిస్తే, తల్లితో కలుస్తాను.\n\n* పల్లెటూరికి పదిదారులు (డొంకలు).\n\n* పల్లెతిరిగినా ఏడేచీరలు, పట్నం తిరిగినా ఏడేచీరలు.\n\n* పల్లెదాని దగ్గర పొలుసుకంపు అన్నట్లు (చేపలకంపు).\n\n* పశువుల పాలు మేపును బట్టి.\n\n* పశువుల రొచ్చు గుంట, పంటకాపు గచ్చు పాతర.\n\n* పశువులు కాచేవాడు పనిబాట కక్కఱకు రాడు.\n\n* పశువులు జస్తే బొరగలు వాలినట్లు (బొరగలు=రాబంధులు).\n\n* పశువులు, శిశువులు గానరసం బెరిగినట్లు.\n\n* పశువు వచ్చిన వేళ, పడుచు వచ్చిన వేళ.\n\n* పస చెడి అత్తింట పడియుండుట రోత.\n\n* పసరం ఒంటిపూట పడ్డా, బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా మానెడు.\n\n* పసరం పంజైతే పసులకాపరి తప్పు.\n\n* పసిపిల్లలు, త్రాగుబోతులు నిజం చెబుతారు.\n\n* పసిమిరోగపు తొత్తుకు మిసిమి మెండు.\n\n* పసరం లేత, పైరు ముదురు.\n\n* పసిపిల్లకు పాలకుండకు దృష్టి తగలకుండా చూడాలి.\n\n* పసిరికలవాని కండ్లకు లోకమంతా పచ్చనే (పసిరికలు=కామెర్లు).\n\n* పసుపు ఇదిగో అంటే ముసుగు ఇదిగో అన్నట్లు.\n\n* పసుపు కుంకుమ కోసం పదామడలైనా పరుగెత్తాల.\n\n* పసుపుకొమ్ము పెట్టని కోమటి పట్టణమంతా చూరవదిలాడట (వసారమంతా కొల్ల లిచ్చాడట)(చూర=కొల్ల).\n\n* పసుపూ బొట్టు పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్ళక, పెంకు పట్టుకొని పులుసుకు వెళ్ళిందట.\n\n* పసుపేమే? అంటే పెండ్లి; ముసుగేమే? అంటే ముండ అన్నట్లు.\n\n* పక్షిమీద గురిపెట్టి పందిని ఏసినట్లు (కొట్టినట్లు).\n\n\n\n**********:: పా ::**********\n\n* పాండవులవారి సంపాదన ధుర్యోధనులవారి పిండాకూళ్ళకు సరి\n\n* పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహంకారమున్నది. వివేకానికి తనకేమి తెలియదన్న వినమ్రత ఉన్నది.\n\n* పాకనాటి పతివ్రత లాగ.\n\n* పాకలపాటివారి రణకొమ్మువలె.\n\n* పాకాల చెరువు జూచి, ఆ నీళ్ళన్నీ తానే దున్నాలని దున్నపోతు గుండె పదిలి చచ్చిందట.\n\n* పాకీదానితో సరసం కంటే, అత్తరుసాహేబుతో కలహం మేలు.\n\n* పాగా, పంచకట్టు చూచి భద్రిరాజు వనుకున్నానే! వీర్రాజువటోయి పేర్రాజా.\n\n* పాచికూట్లో కలిపోస్తే పదునుకు వచ్చునా?\n\n* పాచిపండ్ల దాసరికి కూటిమీదనే ఆలాపన.\n\n* పాచిపండ్ల వాడు పేర్చి పెడితే, బంగారు పండ్ల వాడు బరుక్కతిన్నాడట.\n\n* పాచిపెత్తనం పల్లెలో పది గడియలు. (పలుదోముకోకుండానే పెత్తనాలు చేస్తారు).\n\n* పాచిముండ పర్వతం బోతే (శ్రీశైలం) ఎక్కనూ దిగనూ దప్ప ఏమీ మిగలలేదట.\n\n* పాచిముఖాన ఎప్పుడైతేనేం భూపాళాలు చదవటానికి.\n\n* పాచ్చాసాహేబు కూతురైనా, పెండ్లికొడుక్కి పెండ్లామే.\n\n* పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం.\n\n* పాటిమీద దేవరకు కూటిమీదనే ఆలాపన.\n\n* పాటిమీది వ్యవసాయం కూటికైనా రాదు.\n\n* పాటు కలిగితే కూటికి కొదువా?\n\n* పాటుకు కోడెదూడ, కూటికి పాడిదూడ (పాటుకు=పనికి).\n\n* పాటు చేతగానివాడు మాటలకు మొనగాడు.\n\n* పాట్లెల్లా పట్టేడు కూటి కొరకే.\n\n* పాడగా పాడగా పాట, మూల్గగా మూల్గగా రోగం.\n\n* పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి.\n\n* పాడి ఆవును దానం చేసి, పాలు తాను పితుక్కొన్నట్లు.\n\n* పాడికి పంట తమ్ముదు.\n\n* పాడికి పసిబిడ్డలకు దిష్టి (దృష్టిదోషం) ఉండదు.\n\n* పాడికుండ పగులకొట్టు కొనినట్లు.\n\n* పాడి గుట్టు-పంట రట్టు.\n\n* పాడితో పంట ఓపదు.\n\n* పాడి దాచవలె, పంట పొగడవలె.\n\n* పాడి పసరము, చంటిబిడ్డ ఒకటి.\n\n* పాడి లేని ఇల్లు, పాడుబడ్డ బీడు.\n\n* పాడి లేని ఇల్లు, పేడ లేని చేను.\n\n* పాడి లేని గొడ్డు, బిడ్డ లేని ఆలు.\n\n* పాడు ఊరిలో పొగిడేవారు లేరు, నాకు నేనే పొగుడుకుంటానని అనుకున్నట్లు.\n\n* పాడు ఊరికి మంచపుకోడే పోతురాజు.\n\n* పాడు గోడకైనా పూత చక్కన, కోతి ముండకైనా రాత చక్కన.\n\n* పాడుబడిన ఊరికి నక్క తలారి.\n\n* పాడుబడిన ఇంట్లో పంజులు ఎత్తినట్లు (పంజులు=దివిటీలు).\n\n* పాణి యాహార కబళంబు పారవైచి, కర్పూరము నాకు పినవెర్రికూన.\n\n* పాత ఒక రోత, కొత్త ఒక వింత.\n\n* పాతగుడ్డ కుట్టు నూలు చేటు.\n\n* పాడుగోడకు పూత చక్కన, పాతముండకు కోక చక్కన.\n\n* పాత చుట్టం- పాత చింతకాయ పచ్చడి.\n\n* పాతచేటకు పూత అందం (పూత=అలుకుట)\n\n* పాతతంగెడు పూవు పండగనాటికైనా పనికివస్తుంది.\n\n* పాతది పనికిరాదు, కొత్తది కొరగాదు.\n\n* పాతపని పట్టకురా! పల్లెకు దొంగవి కాకురా.\n\n* పాతబావి నీరు, మేకలపాడి రోత (ప్రాకొన్న నూతి ఉదకము, మేకలపాడియును రోత).\n\n* పాతముండ కలవరిస్తే, కొత్తముండకు దయ్యం పట్టినట్లు.\n\n* పాతముండ లందఱూ పోగై, కొత్తముండ తాడు తెంచినట్లు.\n\n* పాతరలో పడ్డ కుక్క తీయబోతే కరవ వచ్చినట్లు.\n\n* పాత రోత, కొత్త వింత.\n\n* పాత లంజ కెప్పుడు భయము లేదు.\n\n* పాత లంజ వీరమాత అయినట్లు.\n\n* పాతిక కోతి ముప్పాతిక బెల్లం తిన్నదట.\n\n* పాతిక గల అమ్మకు పాతిపెట్ట-లేవదియ్య (పాతిక=పావు).\n\n* పాతిక వట్టం, పరక లాభం (వట్టం=అడితి, కమీషను).\n\n* పాతూరు బుల్లివెంకమ్మ మొగుడు అన్నట్లు.\n\n* పాత్ర మెఱిగి దానము, గోత్ర మెఱిగి బిడ్డని ఇవ్వవలె.\n\n* పాత్ర మెఱిగి దానము, క్షేత్ర మెఱిగి విత్తనము.\n\n* పాదపానికి పండ్లు బరువా?\n\n* పానకంలో పుడక వలె.\n\n* పానకంలో పుడక, పంచదారలో కట్టె.\n\n\n* పానెం పాడైపోయినా, ప్రాణం కుదుట పడదు (పానెం=భూస్థితి).\n\n* పాంపుచూచి పసరాన్ని కట్టు.\n\n* పాంపు సెబ్బరైతే, పసరానికీ సెబ్బరే.\n\n* పాపటం(ణం)పది సేద్యాల పట్తు.\n\n* పాపటకాయ కొఱక నెంత? యాకపెట్ట నెంత? (పాపటకాయ=వెఱ్ఱిపుచ్చకాయ).\n\n* పాపటలో వెంట్రుక నెరిస్తే పత్తిత్తు.\n\n* పాపదోషానికి పోతే, పట్టి చూచినట్లు.\n\n* పాపభీతికంటె ప్రజాభీతికే వెరుస్తారు.\n\n* పాపమని పక్కటెముక ఇస్తే, పీక్కోలేక ఫిర్యాదు చేసినట్లు.\n\n* పాపమని పట్టెడంబలి పోస్తే, ఉప్పులేదని అలిగి పోయినాడట.\n\n* పాపమని పాతచీర ఇస్తే, గోడ చాటుకు పోయి మూర వేసిందట.\n\n* పాపమని పాలు పోస్తే, ఉడుకని ఉఱుకులాడిందట.\n\n* పాపమని పాలు పోస్తే, పలుచనని పారబోసి నాడట.\n\n* పాపమని పాలు పోస్తే, వద్దని వలకబోసినాడట.\n\n* పాపలేని ఇంట్లో, తాత తడివెళ్ళాడినట్లు.\n\n* పాపాలకు భైరవుడు పాపన్న.\n\n* పాపజాతి నరుడు పరసతి గోరు.\n\n* పాపి చిరాయువు, సుకృతికి గతాయువు.\n\n* పాపి పర్వతం బోతే, దీపాలన్ని పెద్దవైనవట.\n\n* పాపి సముద్రానికి పోతే, అరికాలు తేమ కాలేదట.\n\n* పాపిసొమ్ము పరులపాలు, ద్రోహిసొమ్ము దొరలపాలు.\n\n* పామనగ వేరే పరదేశమున లేదు.\n\n* పామరజనానికి ఎన్నో తలలున్నవి గానీ, ఒకమెడైనా లేదు.\n\n* పాముకన్నా లేదు పాపిస్టిదగు జీవి.\n\n* పాము కరచును, అరవ చెరచును.\n\n* పాముకాటు చీరతో తుడిచిన పోవునా?\n\n* పాముకాళ్ళు పాముకే ఎఱుక.\n\n* పాముకు బదనిక చూపినట్లు.\n\n* పాముకు విషం పండ్లలో, ఙ్ఞాతికి విషం కండ్లలో.\n\n* పాము చుట్టము: పడగ పగ.\n\n* పాము చెలిమి, రాజు చెలిమి ఒకటే.\n\n* పాముతో చెలిమి కత్తితో సాము వంటిది.\n\n* పాము పగ, తోక చుట్టము.\n\n* పాము పడగ క్రింద కప్ప ఉన్నట్లు. (సర్పంబు పడగనీడను కప్పవసించినట్లు).\n\n* పాము మాదిరి కడకు గామైనట్లు.\n\n* పాములలో మెలగవచ్చునుగానీ సాములలో మెలగటం కష్టం.\n\n* పాములు లేనివాడు, వానపామును పట్టుకొన్నట్లు.\n\n* పాము వంటిదానికే విరుగుడుంటే, పంతుల కుండదా?\n\n* పాము వరటకపోతే, దాని విషం వరటకపోతుందా?\n\n* పాము చావకుండా, బడితె విరగకుండా.\n\n* పాయసంలో నెయ్యి ఒలికినట్లు.\n\n* పారవేసిన పుల్లాకు బండి కల్లైనట్లు.\n\n* పారిజాతముతో ప్రబ్బిళ్ళు సరితూగునా?\n\n* పారినవాని పౌరుషం ఎన్నాలనా?\n\n* పారుబోతు గొడ్డుకు పగ్గం చాటైతే చాలు.\n\n* పారేనీటికి పాటినలేదు.\n\n* పారేబంద్లకు కాళ్ళు చాచిన నిలుచునా?\n\n* పాలకంకు లోయి దాసరీ అంటే రాలిన మట్టుకే గోవిందా అన్నడట.\n\n* పాల కోసరం పొదుగు కోసినట్లు.\n\n* పాలకు కాపల, పిల్లికి తోడు.\n\n* పాలకడలి లంకలో బుట్టినా కొంగకు తిండి నత్తగుల్లలే.\n\n* పాలతోగూడా విషము పెట్టినట్లు.\n\n* పాలను చూడనా? విషాన్ని చూడనా?\n\n* పాలపొంగు - పడుచుపొంగు.\n\n* పాలపొంగు - మీలపొంగు.\n\n* పాలలో పంచదార ఒలికినట్లు.\n\n* పాలలో పడ్డ బల్లివలె.\n\n* పాలసముద్రంలోని హంస పడియనీటి కాసపడుతుందా?\n\n* పాలికివచ్చింది పంచామృతము.\n\n* పాలివాడు చస్తే పారెడు మన్నెక్కువ.\n\n* పాలివానికి చేసినమేలు - పీనుగకు చేసిన శృంగారం.\n\n* పాలివారిని చెరచితివో, పాడైతివో.\n\n* పాలుఇచ్చే బఱ్ఱెను అమ్మి, పైన ఎక్కే దున్నను తెచ్చుకొన్నట్లు.\n\n* పాలు ఒల్లని పిల్లి ఉన్నడా?\n\n* పాలు కుడిచి ఱొమ్ము గ్రుద్దినట్లు.\n\n* పాలు చిక్కనైతే వెన్న వెక్కసము.\n\n* పాలు పిండగలము గానీ, తిరిగి చంటిలోకి ఎక్కించగలమా?\n\n* పాలు పిందని గొడ్డు బఱ్ఱెల కదుపులు మెండు.\n\n* పాలు పిందను బఱ్ఱె పలు మేతలకు పెద్ద.\n\n* పాలు పొంగడమంతా పొయ్యి పాలుకే.\n\n* పాలు బోసి పెంచినా పాము కఱవక మానదు.\n\n* పాలు బోసి పెంచినా పాముకు విషము పోదు.\n\n* పాలు బోసి పెంచినా ముష్టిచెట్టుకు విషము పోదు.\n\n* పాలు బోసి పెంచినా వేపకు చేదు పోదు (తీపిరాదు).\n\n* పాలుమాలితివో, ఆర్చుకొంటివో!\n\n* పాలేరు దున్నినవాడు అప్పులపాలు.\n\n* పాలేరువానికి పశువు పోయినా, మారుతల్లి బిడ్డపోయినా దిగులులేదు.\n\n* పాళ్ళు పన్నెండు, దెబ్బలు చెరి సగం.\n\n* పావలాకు పడుకుంటే, పందుం బియ్యం బేపి తినిపోయిందట.\n\n* పావులా సంపాదనగాడికి వరహా లంజ వరుస గాదు.\n\n* పాసిన కూడు పక్వానికి వస్తుందా?\n\n* పాసిన కూట్లో కలిపోస్తే పదునుకు వస్తుందా?\n\n* పాసిన గుమ్మడికాయ బాపనయ్యకు దానం ఇమ్మన్నట్లు.\n\n* పాసు ముండా! అంటే, పట్టుతల్లి అన్నట్లు.\n\n\n\n**********:: పి ::**********\n\n* పింగు తెరచిన ఈగలదాడి.\n\n* పింజారి మందు, లంజ పొందు.\n\n* పింజారి పితుకులాట, కురువ గుద్దులాట (పింజారి=దూదేకుల, కురువ=గొఱ్ఱెల మేకల పెంచు ఒక జాతి).\n\n* పిండానికి గతిలేకపోయినా, పెగ్గెలకు లోటులేదు.\n\n* పిండికి తగ్గ పిడచ.\n\n* పిండి కొద్దీ నిప్పటి (నిప్పటి=అరిసె).\n\n* పిండి కొద్ది రొట్టె, తిండికొద్ది పసరం.\n\n* పిండి గొన్నవానివద్ద రొట్టె గొన్నట్టు.\n\n* పిండీ బెల్లం ఇచ్చి, పిన్నమా నీ ప్రసాదం అన్నట్లు.\n\n* పిండి బొమ్మను చేసి పీతమీద కూర్చుండబెడితే, ఆడబిడ్డతనాన అదిరదిరి పడిందట.\n\n* పిండీ, ప్రోలు లేనిదే పెండ్లవునా?\n\n* పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది.\n\n* పిందెలో పండిన పండు.\n\n* పిక్కలెగేయ బలిసినా దున్న ఏనుగు కాదు.\n\n* పిచ్చి కుదురింది, రోకలి తలకు చుట్టమన్నాడట.\n\n* పిచ్చి కుదిరితేగానీ పెళ్ళికాదు, పెళ్ళి ఐతేగానీ పిచ్చికుదరదు.\n\n\n* పిచ్చివాడికి లోకమంతా పిచ్చే!\n\n* పిచ్చివానికి పింగుమీదనే ఆలాపన\n\n* పిచ్చివాని చేతి రాయి తగిల్తే తగులుతుంది, తప్పితే తప్పుతుంది.\n\n* పిచ్చివానికి పిల్లనిస్తే వేలుబెట్టి ఎడం జేసినాడట.\n\n* పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.\n\n* పిచ్చుకకుంటుమీద భాగీరథి వచ్చినట్లు.\n\n* పిచ్చుగుంటవాని పెండ్లి ఎంత? వైభవమెంత? (పెడాకు లెంత?)\n\n* పిట్టకు పట్టే దెంత?\n\n* పిట్ట కొంచము కూత ఘనము.\n\n* పిట్టపిడుగున మీయింటిలో విందుకు చస్తావు, బిల్లపిడుగున మాయింటిలో చావకు.\n\n* పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.\n\n* పిఠాపుతం వెళ్ళి పిడతెడు నీళ్ళు తెచ్చినట్లు.\n\n* పిడక పొగకే సిగమెక్కితే, గుగ్గిలం పొగ కెట్లూగవలె?\n\n* పిడకలు తీసుకరారా సువ్వా అంటే, నా పిక్కలు నొచ్చె అవ్వా అన్నాడట.\n\n* పిడతలో నూనె పిడతలోనే ఉండాలి, బిడ్డలు బీరగింజల్లా ఉండాలి.\n\n* పిడికెడు బిచ్చం పెట్టలేనాతడు అడిగిందంతా యిచ్చునా?\n\n* పిడుగుకు గొడుగు అడ్డమా?\n\n* పిడుగుకు, బియ్యానికి ఒకటె మంత్రమా?\n\n* పిడుగుకు, బుడ్డకు ఒకటే మంత్రమా?\n\n* పిడుగు దాకిన పిదప కొరవి చూడినట్లు (కాల్చినట్లు).\n\n* పిడుగుకు వారశూలా?\n\n* పిడుగు పడినవాని కొఱవిని చూసినట్లు.\n\n* పిడుగుపాటుకు టొప్పి (టోపి) యాగునా?\n\n* పిడుగు బాఱిన డొంకవలె పెంపడగి.\n\n* పిడుగు పడితే తలనొప్పి యాగునే?\n\n* పిత్త సత్తువలేదు పాసనాలకు మందట.\n\n* పిత్తి కంచం (నేల) గోకినట్లు.\n\n* పిత్తి, పిల్ల నెందుకు కొడతావమ్మా! మళ్ళీవచ్చి నా నెత్తి కొట్టగలవు.\n\n* పిత్తిన ముత్తయిదువలె.\n\n* పిత్తి పీట నేలకు రాసినట్లు.\n\n* పితు పిత్తు మంటే బియ్యానికి సరిసరి అన్నదట.\n\n* పిత్తులకు దడిసి పప్పు వండటం మానివేసినట్లు.\n\n* పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు.\n\n* పిన్న చేతదివ్వె పెద్దగా వెలుగదా?\n\n* పిన్నమ్మ పెట్టకపోయినా, పోయకపోయినా నా మీద భలే ప్రాణం.\n\n* పినతల్లి పెట్టు - పిచ్చిదాని ఒట్టు.\n\n* పిఱికి బంటుకు తుమ్మాస్తి.\n\n* పిఱికి వాని బింకం పిసరులో ఇంకు.\n\n* పిఱికి వారికే పిడికెడంత మీసాలు.\n\n* పిఱ్ఱమీద కొడితే ఫిర్యాదు లేదు.\n\n* పిఱ్ఱల చప్పుడేగానీ దారి జరుగలేదు.\n\n* పిఱ్ఱలు చూచి పీట వేసినట్లు.\n\n* పిఱ్ఱలు చూచి పీట వెయ్యి, ముఖం చూచి బొట్టు పెట్టు.\n\n* పిల(లు)వకుండా పోయినప్పుడు, గెంటకుండా పొమ్మనటమే కట్నం.\n\n* పిలవని పేరంటము, చెప్పని ఒక్క పొద్దు.\n\n* పిలవని పేరంటానికి వెళితే పీటకోళ్ళ దెబ్బ.\n\n* పిలిచి పిల్లనిస్తా మంటే, కులం (తక్కువ) లేత అన్నట్లు.\n\n* పిలిచి పిల్లనిస్తా మంటే, మెల్ల అన్నాడట.\n\n* పిలిచి పెద్దపులికి పేరంటం పెట్టినట్లు.\n\n* పిలిచేవారుంటే బిగిశేవారు శానామంది.\n\n* పిలిస్తే పలుకుతుంది కరవు-రాయలసీమలో, పిలవకుండానే పలుకుతుంది అనంతపురంలో.\n\n* పిలిస్తే బిగిస్తే సరికాని, వస్తే వాడి అబ్బతరమా?\n\n* పిలువని పేరంటము, వలవని చెలిమి వంటిది.\n\n* పిల్ల ఉన్నమ్మకు పిడికెడు చోటెక్కువ.\n\n* పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ.\n\n* పిల్లకాకి కేమి తెలుసు వింటిలిదబ్బ యేటు (వింటిలిదబ్బ = ఉండేలు దబ్బ).\n\n* పిల్లకాయలకు, పీటకోళ్ళకు చలిలేదు.\n\n* పిల్లకు ఏమిపెట్టి పంపినారు శాస్త్రిగారు అంటే- పేదవాళ్ళము ఏమి పెట్టగలము? మీబోటి మహరాజులైతే వేలుబెట్టి పంపుతారు అన్నాడట.\n\n* పిల్ల కుదిరినా కుదరకపోయినా వచ్చే నెలలో పెండ్లి నిజమన్నాడట.\n\n* పిల్లకు సొమ్ము పెట్టిచూడు, గోడకు సున్నము కొట్టి చూడు.\n\n* పిల్ల గలవాడు పిల్ల కేడిస్తే, కాతిగలవాడు కాసు కేడ్చాడట.\n\n* పిల్ల చచ్చినా పురిటికంపు (పీతికంపు) పోలేదు.\n\n* పిల్ల నిచ్చిన చోటికి, పీతిరిదొడ్డీకి పోక తప్పుతుందా?\n\n* పిల్ల నిచ్చినవాడు ఈగ, పుచ్చుకున్న వాడు పులి.\n\n* పిల్ల పిడికెడు, గూను గంపెడు.\n\n* పిల్ల పుట్టకముందే కుల్లగుట్టినట్లు.\n\n* పిల్ల పుట్టగానే పాలు పడ్డట్లు.\n\n* పిల్ల పెత్తనం, పల్లెటూరి సావాసం.\n\n* పిల్ల బావిలో పడ్డదిరా అంటే, ఉండు! అంబలి తాగివస్తానన్నట్లు.\n\n* పిల్లని గిల్లి పైన పప్పర గొట్టినట్లు.\n\n* పిల్ల పిచ్చుకంత, పింగు మద్దెలంత.\n\n* పిల్ల ముడ్డి గిల్లి (ఉయ్యాల ఊచినట్లు) జోలపాడినట్లు.\n\n* పిల్ల ముద్దుగానీ పియ్య ముద్దా?\n\n* పిల్లలున్న వాడికి, పసులున్నవాడికి సిగ్గుండరాదు.\n\n* పిల్లలు లేని ఇంట్లో తాత తడుము లాడినట్లు.\n\n* పిల్లలు లేని ఇంట్లో ముసలోడు దోగాడిండంట (దోగాడట).\n\n* పిల్లలు లేనిది ఇల్లు కాదు, పిట్టలు లేనిది తోపు కాదు.\n\n* పిల్ల వాడని పక్కలో వేసుకుంటె, పెద్దోడు (పెద్దవాడు) కొట్టినట్లు కొట్టినాడని (మేనత్త మాట).\n\n* పిల్లవాడు మూలా నక్షత్రంలో పుడితే, మూల పీకివేసుకుపోతాడట.\n\n* పిల్లవానికి పీట వేసి, పిల్లకు చేట వేసినట్లు.\n\n* పిల్లా పిలగానికి పెళ్ళిచేస్తే, ఎలేసి (వెలివేసి) ఎడం చేశాడట.\n\n* పిల్లా! పిల్లా! నువ్వుల చెట్టుకు నూనె ఎక్కడిదంటే, మాఅమ్మ తొలి సమర్తకీ, మలి సమర్తకీ ఎక్కడున్నావు అందట.\n\n* పిల్లా! పిల్లా! పెట్టనిస్తావా? అని రావూరు రసికు డడిగితే, నీకు అమ్మనయ్యా అన్నదట నెల్లూరి నెరజాణ.\n\n* పిల్లా! నీదేమిపోతుంది? మా యమ్మకు కాసేపు కోడలు కాలేవా? అన్నాడట.\n\n* పిల్లి ఉట్టిచేరులు తెంచగలదు గానీ పాలకుండ పడకుండా (పట్ట)చేయగలదా?\n\n* పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు రాగోరును.\n\n* పిల్లి కండ్లుమూసుకొని పాలుతాగుతు, ఎవరూ తన్ను చూడలేదని ఎంచుకొన్నదట.\n\n* పిల్లికి ఎలుక సాక్ష్యం.\n\n* పిల్లిగూడా బిక్షం పెట్టదు.\n\n* పిల్లికి చెలగాటం (చెర్లాటం) ఎలుకకు ప్రాణసంకటం.\n\n* పిల్లి నెత్తిన వెన్న (పేరిననెయ్యి) బెట్టినట్లు.\n\n* పిల్లికి రొయ్యలమొలతాడు కట్టినట్లు.\n\n* పిల్లికి మెడలో రొయ్యలు గట్టినట్లు (అందక వదలలేక బాధ పడుట).\n\n* పిల్లి గుడ్డిది అని ఎలుక ముడ్డి చూపిందట.\n\n* పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకదు.\n\n* పిల్లి తోక ఎద్దు ముట్టితే, ఎలుక దిక్కు ఎఱ్ఱగించి చూచిందట.\n\n* పిల్లితోక (కాలు) బఱ్ఱెతొక్కితే, ఎలుకమీద మీసాలు దువ్విందట.\n\n* పిల్లిని చంకలో పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు.\n\n* పిల్లిని చంపిన పాపం నీది, బెల్లంతిన్న పాపం నాది.\n\n* పిల్లిని చంపిన పాపం నీకు, బెల్లమీయని పాపం నాకు.\n\n\n* పిల్లి పట్టిన ఈరువు వలె (ఈరువు=మాంసం)\n\n* పిల్లి బ్రహ్మణుడు, పీట ముత్తైదువ.\n\n* పిల్లి ముడ్డిలో మల్లెపందిరి.\n\n* పిల్లి లేనప్పుడే కలుగులోనుండి ఎలుకలు బయటకు వచ్చి గంతులేసేది.\n\n* పిల్లి లేని పిసిని, వానలేని వరద.\n\n* పిల్లి వలస త్రిప్పినట్లు (పిల్లలను).\n\n* పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?\n\n\n\n**********:: పీ ::**********\n\n* పీకుడుగానికి బియ్యపురొట్టె, మూతి కడుగ నేతిబొట్టు.\n\n* పీకులాట పెండ్లికిపోయి, పిల్లా నేను సగమై వచ్చినా మన్నదటా.\n\n* పీటకు పిఱ్ఱకు వైరం.\n\n* పీటకోడుకు పసిపిల్లలకు చలిలేదు.\n\n* పీట పగిలేటట్లు, మొలత్రాడు తెగేటట్లు తింటేనే ప్రీతైన తిండి.\n\n* పీతాంబరము కట్టినమ్మ పీట చంకనే పెట్టాలి.\n\n* పీనుగ ఎక్కడో గద్దలూ అక్కడే.\n\n* పీనుగకు చేసిన జాగారం - గొడ్డావుకు వేసిన ఆహారం.\n\n* పీనుగకు చేసిన శృంగారం - నగరికి చేసిన కొలువు.\n\n* పీనుగను పొడిచిన బల్లెమువాడు.\n\n* పీనుగమీద పిండాకుడు అన్నట్లు.\n\n* పీయి తినెడి కాకి పితరుండు ఎట్లౌను?\n\n* పీయి తినే వాడింటికి చుట్టంపోతే, ఏరిగినదాకా తన్నినాడట.\n\n* పీరుసాహేబు పింగు నాకుతుంటే అల్లీసాహేబుకు బెల్లమట.\n\n* పీర్ల పండుగకు గోకులాష్టమికి ఏమి సంబంధము?\n\n* పీర్లు బచ్చాని కేడిస్తే, ముల్లా పంచదార కేడ్చినాడట.\n\n\n\n**********:: పు ::**********\n\n* పుంగనూరు సంస్థానం (వెఱ్ఱిబోగలది -అని).\n\n* పుంజం పెట్టితే బట్ట, లంచం పెట్టితే పని.\n\n* పుంజు కూతనుండి ప్రొద్దెరిగిన యట్లు.\n\n* పుంజులూరు శ్రోత్రియందారు (యతిమతం).\n\n* పుంటికూత తిన్నా పుట్టిల్లు, పాయసం తిన్నా పరాయిగడ్డ.\n\n* పుంటికూరలో పుడక రుచి, మాంసంలో (చిగిరెపు) ఎముక రుచి.\n\n* పుండంత మానింది, చేటంత ఉంది.\n\n* పుండు ఒక చోట, మందు ఇంకొక చోట.\n\n* పుండుకు పుల్ల మొగుడు.\n\n* పుండున్న వ్రేలికే పుల్ల తగులుతుంది.\n\n* పుండు పొడిచే కాకికి ఎద్దునొప్పి తెలుస్తుందా?\n\n* పుండు మానినా బెండు మానదు (బెండు=మచ్చ).\n\n* పుండు మీద కారం చల్లినట్లు.\n\n* పుండు మీద కొరవి పెట్టినట్లు.\n\n* పుండు మీదకు నూనె లేదంటే, బూరెలొండవే పెళ్ళామా అన్నట్లు.\n\n* పుక్కిటి పురాణాలతో ప్రొద్దుపుచ్చే (పొట్టబోసికొనే) వాడు పురాణాలు చెప్పగలడా?\n\n* పుచ్చకాయల (గుమ్మడికాయల) దొంగా అంటే, భుజాలు తడుముకొన్నట్లు.\n\n* పుచ్చిన మిరియాలకైనా జొన్నలు సరిరావు.\n\n* పుచ్చిన విత్తులు చచ్చినా మొలువవు.\n\n* పుచ్చుకున్నప్పుడు పుత్రుడు పుట్టినంత సంతోషం, ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినంత దుఃఖం.\n\n* పుచ్చు వంకాయలు, బాపని బయ్యాలు.\n\n* పుట్టంగ పురుడు, పెరగంగ పెళ్ళి.\n\n* పుట్టకు ధ్వనెత్తితే పుట్టెడు, మొగుడికి ధ్యాసెత్తితే పుట్టెడు.\n\n* పుట్టని బిడ్డకు (పిల్లకు) పూసలు కుట్టినట్లు.\n\n* పుట్టపై బాదిన పాము చస్తుందా?\n\n* పుట్టనివాడు, గిట్టనివాడు, గోడబొమ్మలో ఉన్నవాడే (ద్రావిడులలో మహాత్ముడు).\n\n* పుట్టమన్ను ఎరువైతే పుట్లకొద్ది పంట.\n\n* పుట్టమీద తేలుకుట్టినా నాగుబాము కరచినట్లే.\n\n* పుట్టమీద గొట్ట భుజంగంబు చచ్చునా?\n\n* పుట్టలో చేయిపెట్టితే కుట్టక మానుతుందా?\n\n* పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?\n\n* పుట్టల్లో తారికాడేది ఎవరంటే అంజీకివచ్చిన అంకడు అన్నాడట (అంజి=గ్రామ సముదాయక కార్యములకు గ్రామస్థులందరు వంతుల ప్రకారం పంపినవారు చేసేపని).\n\n* పుట్టించినవాడు పూరి మేపడా?\n\n* పుట్టిచచ్చినా పుత్రుడే మేలు.\n\n* పుట్టినదానికి పెట్టిందే సాక్షి (పూర్వజన్మలో దానంచేసింది).\n\n* పుట్టిననాటి (పుట్టుకతో వచ్చిన) గుణం పుడకలతో గానీ పోదు.\n\n* పుట్టిననాటి గుణం పులిఆకులలో వేసినా పోదు.\n\n* పుట్టిననాటి పుల్లగాడే మొగుడా?\n\n* పుట్టినప్పుడే గిట్టేవ్రాత వ్రాసినాడు.\n\n* పుట్టిన పిల్లలు బువ్వ కేడిస్తే, అవ్వ మొగుడికేడ్చిందట.\n\n* పుట్టిన బిడ్డ బువ్వకేడిస్తే, కడుపులో బిడ్డ శనగలు కావాలన్నదట.\n\n* పూట్టిన బిడ్డల్లా చచ్చేదానికంటే మగడే చచ్చేది మేలు.\n\n* పుట్టినవాడు గిట్టకపోడు (మానడు).\n\n* పుట్టినవానికి తమ్ముడు, పుట్టేవానికి అన్న.\n\n* పుట్టిని చిట్టితో గొలిచినట్లు.\n\n* పుట్టినిల్లు ఏకాదశి, మెట్టినిల్లు గోకులాష్టమి.\n\n* పుట్టినిల్లు పుణ్యలోకం, మెట్టినిల్లు ఆరళ్ళలోకం.\n\n* పుట్టుకకో గుణము, పుఱ్ఱెకో బుద్ధి.\n\n* పుట్టుకచూస్తే గరుత్మంతుడు, గుణం చూస్తే పీతిరిగద్ద.\n\n* పుట్తుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగానీ పోదు.\n\n* పుట్టుచాయే గానీ పెట్టుచాయ వచ్చునా? (నిలుచునా?)\n\n* పుట్టుట గిట్టుటకొఱకే, పెఱుగుట విఱుగుటకొఱకే, ధరతగ్గుట హెచ్చుట కొఱకే.\n\n* పుట్టునత్తా? పెట్టునత్తా? (నత్తి).\n\n* పుట్టు వాసనా? పెట్టు వాసనా?\n\n* పుట్టు శాగలేనిది పెట్టు శాగ ఎం ప్రయోజనం? (శాగ=చేవ)\n\n* పుట్టు శాస్త్రులా? పెట్టుశాస్త్రులా?\n\n* పుట్టెడు అప్పు గడ్డపార మింగినట్లు.\n\n* పుట్టెడు అప్పయినా కాయవచ్చునుగానీ పుప్పి(పిప్పి) మాటలు ఎవడుపడతాడు?\n\n* పుట్టెడు ఆముదము రాసుకొని పొర్లాడినా, అంటేదే అంటుతుంది, అంటంది అంటదు.\n\n* పుట్టెడు నువ్వుల్లో పడ్డా అతికేవే అతుకుతవి.\n\n* పుడుతూ పుత్రులు, పెరుగుతూ శత్రువులు.\n\n* పుడుతూ సోదరులు, పెరుగుతూ దాయాదులు.\n\n* పుణ్యం కలిగిన మగని చేసుకుంటే, పూసలలోనికొక రుబ్బుడురాయి.\n\n* పుణ్యంకొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డ.\n\n* పుణ్యంకొద్ది పురుషుడు, విత్తంకొద్దీ వైభవము.\n\n* పుణ్యం పుట్టెడు, పురుగులు తట్టెడు.\n\n* పుణ్యానికంటే మా చిన్నాయనను తోలుకొస్తాను అన్నట్లు.\n\n\n* పుణ్యానికి పట్టేడిస్తే (పుట్టెడాళ్ళిస్తే) పిచ్చకుంచమని పారబోసినాడట.\n\n* పుణ్యానికి పుట్టినదే సాక్షి, బావికి నీళ్ళే సాక్షి.\n\n* పుణ్యానికి పోతే పాప మెదురు వచ్చిందట.\n\n* పుతపుతల మారెమ్మకు పొడికూడే కానీ గడ్డకూడు రాదు.\n\n* పుత్తికి పురచేయి లోకువైనట్లు.\n\n* పుత్రసంతతిలేని పురుషుని కలిము కలహంసలేని కలనువంటిది.\n\n* పుత్రుడై వేధింతునా? శత్రుడనై వేధింతునా? పేరులేని దెయ్యమునై వేధింతునా?\n\n* పుదుచ్చెరిలో వీధులు సక్రమమే గానీ, బుద్ధులు వక్రం.\n\n* పునర్వసు, పుష్యాలకు పూరేడు అడుగైనా తదవదు (పూరేడు(లు)= కముజు జాతి అడవిపిట్ట).\n\n* పునశ్చరణమే అపవాదానికి పెంపు.\n\n* పునుగు చట్టము పిండినట్లు.\n\n* పున్నమినాటి పురుషుడు, అమావాశ్యనాటి ఆడబడుచు.\n\n* పున్నమ్మ పెళ్ళికి చంద్రుడుదయించినట్లు.\n\n* పున్నానికి పూజ, అమావాశ్య కారగింపు (తేనెతుట్టె).\n\n* పున్నెపుచింతల పులుసు, పొగాకిత్తుల పొగుసు.\n\n* పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా గుబ్బచ్చి చెట్టుకింద నానదు.\n\n* పుబ్బ కెరలితే, భూతం కెరలినట్టు.\n\n* పుబ్బ రేగినా బూతు రేగినా నిలువవు.\n\n* పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు.\n\n* పుబ్బలో చల్లేది మబ్బుతో మొత్తుకొనేది.\n\n* పుబ్బలో పుట్టి, మఖలో మాడినట్లు.\n\n* పుబ్బలో పుట్టెడుకంటే, మఖలో పానెడు మేలు.\n\n* పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలలో అడ్డెడు చల్లేది మేలు.\n\n* పురాణంలో ఏమి చెప్పినారే అంటే, అక్కడా నీమొగాననే మొద్దులు బెట్ట (నిప్పులుబోయ) మన్నారన్నదట పెండ్లాము.\n\n* పురాణంలోని వంకాయలు పులుసులోకి రావు.\n\n* పురాణం విన్నప్పుడు పుట్టెడు బుద్ధులు, అవతలపోతే అదవ (అపర) బుద్ధులు.\n\n* పురిటాలికి పుట్టెడైనా చాలదు (ఆకలి ఎక్కువట).\n\n* పురిటిలోనే కాటేరి సంధించినట్లు (స్త్రీలు రక్త స్రవంవల్ల గుడ్డలు ఈడ్చే వ్యాధి).\n\n* పురిటిపిల్లకు చమురులేదు, పూర్ణపుబూరెలు (కడుములు) వండుకుందామా అన్నట్లు.\n\n* పురిటిలోనే సంధి కొట్టినట్లు.\n\n* పురుగుచేరిన పన్ను పలవింపజేయదా.\n\n* పురుషుడు బలుపైన పుత్రుడు బలుడయా.\n\n* పురుషుని భాగ్యం అనుకూలమైన భార్య.\n\n* పురుషులందు పుణ్యపురుషులు వేరయా.\n\n* పురోగమనానికి అత్రుప్తే సోపానం.\n\n* పుఱ్ఱుకారుతుంటే పోతరాజు సివమాడినట్లు.\n\n* పుఱ్ఱెకో బుద్ధి, జిహ్వకొక రుచి.\n\n* పులగము తిన్నవాడు పుణ్యాత్ముడు, పాయసం తాగినవాడు పాపాత్ముడు.\n\n* పులగము మీద పప్పు.\n\n* పులి ఆవును చంపడం నక్కను మేపనా?\n\n* పులి ఎత్తుబడితే నలుగురు నాలుగురాళ్ళు వేస్తారు.\n\n* పులి కడుపున పిల్లులు (చలిచీమలు) పుడతాయా?\n\n* పులి కడుపున మేక పుడుతుందా?\n\n* పులి కడుపున పుట్టి మేక అరుపు అరచినట్లు.\n\n* పులి కాకలైతే పూరీ తింటుందా?\n\n* పులికి ఏ అడవైతే నేమి?\n\n* పులికి తన కాడని, పర కాడని లేదు (కాడు=అడవి).\n\n* పులికి పారణం, పశువుకు మారణం.\n\n* పులిగాడికి గిలిగాదు మొగుడు.\n\n* పులిగాడు కంటే గిలిగాడు గొప్ప.\n\n* పులిగొన్న మృగము పెట్టున పడుతుందా?\n\n* పులి గోకటమూ అయ్య బ్రతకటమూనా?\n\n* పులి చచ్చినా పొడలు మాయవు.\n\n* పులిచారలు వేశాయి అత్తయ్యా! అంటే, పుడిసెడు వెనక్కుతియ్యవే కోడలా అన్నదట (మబ్బు).\n\n* పులి దాసర్లకు పెట్టుతుందా?\n\n* పులినాకి విడుచు దైవము గలవానిని.\n\n* పులిని కోల వేసినట్లు.\n\n* పులినిచూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు.\n\n* పులిని జూచి నక్క పూతలు బూసినయట్లు.\n\n* పులి నలిబడితే, పుల్;ఇచారలు నలిబడతవా? (నలి=వ్యాధిచే చిక్కుట).\n\n* పులిపేదవడిన పసులవాండ్రే యెక్కాడిరను కధ.\n\n* పులి బక్కచిక్కితే చారలు బక్కపడునా?\n\n* పులి బోను చుట్టు ఉండే కమ్మలు దాని పరిరక్షణకు కాదని అందరికీ తెలిసిందే.\n\n* పులి మలకు అండ, మల పులికి అండ.\n\n* పులిమీద పుట్ర.\n\n* పులిమీసాల నుయ్యాల నూగదగునా?\n\n* పులి మీసాలు కుందేలు మేసినట్లు.\n\n* పులివాత పడ్డ మేక, అప్పారావుకిచ్చిన అప్పు తిరిగి రావు.\n\n* పులుసు వచ్చి మెతుకు కొట్టుకుపోయినట్లు.\n\n* పుల్ల నీళ్ళకే పుణ్యమనేవాడు (పుల్లనీళ్ళు=కలినీళ్ళు; తరవాణి నీళ్ళు).\n\n* పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు.\n\n* పుల్లాకు లెత్తమంటే మందిని లెక్కాడిగినాడట (లెక్కబెట్టినట్లు).\n\n* పుల్లావు పాలైనా తెల్లగానే ఉంటవి (పుల్లావు=లేత ఎరుపు చాయ ఆవు).\n\n* పుల్లిశెట్టి పెండ్లి, ఎల్లిశెట్టి చావుకు వచ్చినట్లు.\n\n* పువ్వు ముడిచిన పురవీధి భూమియందు కట్టె మోవగ వలసె.\n\n* పువ్వు లమ్మిన అంగటె కట్టెలమ్ముట.\n\n* పువ్వుల వగరే తేనె అయ్యేది.\n\n* పువ్వులు వేడుకైన గడివోయిన వాళ్ముడువంగ వచ్చునే.\n\n* పూశాలలో (పుష్యమీకార్తె) పూరిపిట్ట తడువదు.\n\n* పుష్యమాసంలో పూసలు గుచ్చ పొద్దుండదు.\n\n* పుష్యమాసానికి పూసంత వేసంగి.\n\n* పుష్యమి కురిస్తే పూరిపిట్టకూడా తడువదు.\n\n* పుసుకుడా పుసుకుడా పువ్వులు తెమ్మంటే, తటకు తటకున పోయి తంగేడు పువ్వులు తెచ్చినాడంట.\n\n* పుస్తకములు చదువ పొందునా మోక్షంబు.\n\n* పుస్తె, పూస, పసుపు పునిస్త్రీకి.\n\n\n\n**********:: పూ ::**********\n\n* పూచింది ఒక ఎత్తు, కాచింది మరొక ఎత్తు.\n\n* పూచింది పుడమంత, కాచింది గంపంత.\n\n* పూచిన తంగెడు వేసినా, కాచిన వెంపలి వేసినా, నేను వండుతానన్నదట వరి.\n\n* పూచిన పూలెల్లా కాయలైతే చెట్టు మనునా?\n\n* పూచిన వెన్నెలంటే పుప్పొడి వెదకమన్నట్లు.\n\n* పూచే పూతను బట్టి కాచే కాపుండును.\n\n* పూజకన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం.\n\n* పూజకొద్ది పురుషుడు, దానంకొద్ది బిడ్డలు.\n\n* పూజకొద్ది బిడ్డలు, అదృష్టం కొద్ది ఆలు.\n\n* పూజ పునస్కారాలు లేక బూజెక్కి ఉన్నానుగానీ, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను.\n\n* పూజారి బలిసి పోలేరమ్మ చండ్లు పట్టుకొన్నాడట.\n\n* పూటకూళ్ళకు వచ్చిన వాళ్ళకు పుట్లధర ఎందుకు?\n\n* పూటకూళ్ళమ్మ పుణ్య మెఱుగదు.\n\n* పూటకూళ్ళింట పాత్రకు ఎంగిలి లేదు.\n\n* పూట గడుస్తుంది గానీ, మాట నిలిచిపోతుంది.\n\n\n* పూట బత్తెము -- పుల్ల వెలుగు.\n\n* పూటలు మూడు భోజనం ఒకటి.\n\n* పూడ్చలేనంత గొయ్యి, తీర్చలేనంత అప్పు చెయ్యరాదు.\n\n* పూతకు ముందే పురుగు పట్టినట్లు.\n\n* పూబోడి అంటే ఎవర్రా బోడి? నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అన్నదట.\n\n* పూరణంలేని బూరె వీరణంలేని పెండ్లి వ్యర్థము.\n\n* పూరి గుడిసెకు చాందినీ మంచం కావలెనా?\n\n* పుర్ణిమనాడు కొంగుపట్టుక పిలిస్తే రానిది, అమావాశ్యనాడు కన్ను గీటితే వస్తుందా?\n\n* పూర్వజన్మ కృతముల్ కాబోలు ఈ నెయ్యముల్.\n\n* పూర్వోత్తరమీమాంసలకు బాబూ అమ్మగారు వ్యాఖ్యానం వ్రాసినట్లు.\n\n* పూర్వోత్తరా లెరిగి పొత్తు చేసికోవలె.\n\n* పూల చేరెత్తినట్లు.\n\n* పూలతో గూడ నార తలకెక్కినట్లు.\n\n* పూల వాసన నారకు పట్టినట్లు.\n\n* పూలమ్మి బ్రతికిన వారిని పుల్లలమ్మ బిలువరాదు.\n\n* పూవు పుట్టగానే పరిమళం వెదజల్లుతుంది.\n\n* పూవు పుట్టగానే వాసన.\n\n* పూవు లమ్మిన అంగడిలోనే కట్టెలు అమ్మినట్లు.\n\n* పూస, పోగు ఉంటే భుజ మెక్కవలెనా?\n\n* పూసలలో దారమువలె\n\n* పూసుకురావే బూరెముక్కా అంటే, నేనూ వస్తానే నేతిచుక్కా అన్నట్లు.\n\n\n\n**********:: పె ::**********\n\n* పెంటకుప్ప పెరిగితే, పేదరైతు పెద్దవాడగును.\n\n* పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా?\n\n* పెంట తినే బఱ్ఱెపాలు పనికిరాకుండా పోతున్నవా?\n\n* పెంటదినెడు కాకి పితరుండెట్లాయె?\n\n* పెంటదినెడు కాకి పెద్ద యేలాగయ్యె?\n\n* పెంటమీద చెట్టు ప్రబలం, నిరుపోసిన చెట్టు నిర్మలం.\n\n* పెంటమీద పంట, మంటమీద వంట.\n\n* పెంటమీద రాయివేస్తె, తనపైనె పడుతుంది.\n\n* పెండ్లాన్ని కొట్టడం ఎప్పుడు మానినావు అని అడిగినట్లు.\n\n* పెండ్లాము కొట్టితే చస్తామనుకుంటె, చావటం అలవాతు లేకపోయెనే అని అఘోరించాడట.\n\n* పెండ్లాము (భార్య) పాలిండ్లు రిక్తకుంభములు, రాయివెలది చనుదోయి పూర్ణకుంభములు (రాయివెలది=వెలయాలి).\n\n* పెండ్లాము బెల్లము, తల్లి దయ్యము.\n\n* పెండ్లి అయిన ఇంటిలో ఆరునెలలు కఱవు.\n\n* పెండ్లికి చేసిన పప్పు, పేరంటాండ్రు చవిచూడను సరిపోయింది.\n\n* పెండ్లికి ముందు బాగా కండ్లు తెరచుకొని చూచి, పెండ్లికాగానే కండ్లు సగం మూసుకొని చూచీ చూడనట్లుండాల.\n\n* పెండ్లికి వచ్చినవాళ్ళంతా పెళ్ళాలేనా?\n\n* పెండ్లికి వెడుతూ పిల్లిని చంకన పెట్టుక వెళ్ళినట్లు.\n\n* ఓండ్లికూతురు పిత్తినట్లు.\n\n* పెండ్లి కొచ్చినమ్మ పెదవు లెండినాయి అంటే, నీ వెన్నడొచ్చినావమ్మ నిలువుకండ్లు పడినాయి అన్నదట.\n\n* పెండ్లి కొచ్చినవారు వారే చేస్తారు, పెండ్లామా! నీ ఒళ్ళు అలిపించుకోకు.\n\n* పెండ్లికొడుకు కుంటి కుడికాలుచూచి అత్త ఏడుస్తుంటె ఏడ్పులో ఏడ్పు ఎడమకాలుగూడా చూపమన్నాడట-తోటిపెండ్లికొడుకు.\n\n* పెండ్లికొడుకు మనవాడేగానీ చెవులపోగులు మాత్రం మనవిగావు.\n\n* పెండ్లినాటి పప్పుకూడు దినమూ రమ్మంటే వస్తుందా?\n\n* పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాడు తలచుకొన్నట్లు.\n\n* పెండ్లినాడే పరగడుపైతే పైని పిల్లలు కూడానా?\n\n* పెండ్లిని చూస్తు ఒకడుంటే పెండ్లాన్ని చూస్తూ ఒకడున్నాడు.\n\n* పెండ్లి మర్నాడు పెండ్లికొడుకు ముఖాన్న పెద్దమ్మ వేలాడుతుంది.\n\n* పెండ్లివారికి పెండ్లి సందడి, అడుసుకాళ్ళ వాదికి దోమల సందడి.\n\n* పెండ్లి సందడిలో పుస్తె కట్ట మరచాడట.\n\n* పెగ్గెలకోసం పెళ్ళాడాను కానీ, కూడుపెట్టటం మా కులాన లేదు.\n\n* పెట్టక కీర్తి రాదు, నలపింపక ఇంతికి నింపురాదు.\n\n* పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపమన్నారు.\n\n* పెట్ట కేరితే, పుంజు కూస్తుంది.\n\n* పెట్టగతులు లేకున్న, పుట్టగతులు ఉండవు.\n\n* పెట్టగల బచ్చలిపాదు(ది) కొనగల గేదె మేసిపోయింది.\n\n* పెట్టదు పిన్నాం, పోయది పిన్నాం, పిన్నానికి నాకు ప్రాణం-ప్రాణం.\n\n* పెట్టనమ్మ పెట్టనే పెట్టదు, పెట్టేముండ కేమొచ్చింది పెద్దరోగం?\n\n* పెట్టనమ్మా! పెట్టే ఇల్లయినా చూపించు.\n\n* పెట్టనేరని రండ పెక్కు నీతులకు పెద్ద.\n\n* పెట్టనేరని విభుడు కోపింప పెద్ద.\n\n* పెట్టితే తింటారుగానీ, తిడితే పడతారా.\n\n* పెట్టితే తినేవారేగానీ, తిడితే పడేవారు లేరు.\n\n* పెట్టితే పెండ్లి, పెట్టకుంటే పెడాకులు (తీరాలు=అపక్రియలు).\n\n* పెట్టి దెప్పితివో, పెద్దల తిడితివో.\n\n* పెట్టినదంతా పైరు కాదు, కడుపులన్ని కాంపులు కావు.\n\n* పెట్టిన పెళ్ళిగోరు, పెట్టకున్న చావు గోరు.\n\n* పెట్టిన పైరంతా మట్టిపాలైతే, రాఇతు బ్రతుకు కట్ట తెగిన చెఱువు.\n\n* పెట్టినమ్మకు ప్రాణహాని, పెట్టనమ్మకు జన్మహాని.\n\n* పెట్టినమ్మ పుణ్యాన పోదు, పెట్టనమ్మ పాపాన పోదు.\n\n* పెట్టినవానికి తెలియునునిక్షేపము (ఉన్నచోటు)\n\n* పెట్టినదానికి పుట్టిందే సాక్షి.\n\n* పెట్టిపొయ్యనమ్మ కొట్టటనికి వచ్చిందట.\n\n* పెట్టిపోయని పెద్దమ్మా కుట్టుబార గుద్దవే\n\n* పెట్టిపోయని మొగుడు కుట్లువెడల పొడిచినాడట.\n\n* పెట్టిపోయని వట్టి బెరములేల?\n\n* పెట్టిపోసిన నాడే చ్ట్టాల రాకడ, కలిమిగలిగిననాడే వారకాంత వలపు.\n\n* పెట్టుకు ఆయం లేదు, తిట్టుకు సింగారం లేదు.\n\n* పెట్టు చుట్టం, తిట్టు పగ.\n\n* పెట్టు చుట్టము, పొగడ్త సిరి.\n\n* పెట్టుతానంటె ఆశ, తిట్టుతానంటే భయం.\n\n* పెట్టుపోతలు లేని వట్టి కూతలు - పువ్వుపిందె లేని వట్టిచెట్టు.\n\n* పెట్టేమ్మ బుద్ధిలో ఉంటే, ఏ బంతినైనా పెడుతుంది.\n\n* పెట్టేవి రెండు (చివాట్లు) పెందలాడే పెట్టు, దూడ గడ్డికి పోవాలన్నాడట.\n\n* పెడతల దురద పేనుకేమి తెలుసు.\n\n* పెడద్రానికి, పెద్దరోగానికి మందులేదు (పెడద్రం=మొండి పట్టుదల; పెద్దరోగం=కుష్టురోగం).\n\n* పెడమోము బెట్టుట ప్రీతిలేక.\n\n* పెడితే శాపం, ఇస్తే వరం.\n\n* పెత్తనం చేసేవాడు, పెంటి సంతానం కలవాదు అందరికీ లోకువే.\n\n* పెత్తనానికి పోతే దుత్త చేతికివస్తుంది.\n\n* పెత్తర అమావాశ్యకు పెద్దరొట్టె ఇస్తా నన్నాడు (పెత్తర అమావాశ్య=మహాశయ అమావాశ్య).\n\n* పెద్దబావగారు ఆడంగులతో సమానం.\n\n* పెదవికి మించిన పల్లు-ప్రమిదకు మించిన వత్తి.\n\n* పెదవిదాటితే పెన్న దాటుతుంది, పెన్న దాటితే పృథివి దాటుతుంది.\n\n* పెదవిపై మందహాసం, ఎదలో చంద్రహాసం.\n\n* పెద్ద ఇంటి బొట్టె(ట్ట) - ఎద్దులున్న వ్యవసాయం.\n\n* పెద్ద ఇంటి బొడ్డి(ట్టె) అయినా కావాల, పెద్ద చెఱువు అయినా కావాల (బొడ్డి= ఇల్లాలు, స్త్రీ).\n\n* పెద్ద ఇంటి ఱంకు, పెద్దచెఱువు కంపు తెలియవు.\n\n* పెద్ద ఇంటి ఱంకు, పెద్దమనిషి బొంకు తెలియవు.\n\n* పెద్ద కత్తి పెరుమాళ్ళు (మాటలకు అడ్డులేనివాడనుట).\n\n\n* పెద్దక్క ఓలి తెగితే, చిన్నక్క ఓలి తెగుతుంది. (తెగితే=నిర్ణయమయితే).\n\n* పెద్దకోడలికి పెత్తనమిస్తే ముడ్డి కడుక్కోకుండా (పీతిగుద్దతో) ఇంట్లోకి వచ్చిందట.\n\n* పెద్దచెట్టుకు సుడిగాలి పెనుభూతం వంటిది.\n\n* పెద్దతల లేకుంటే పెద్దరికం చాలదు.\n\n* పెద్దతల లేకపోతే పొట్టేలు (ఎద్దు) తలన్నా తెచ్చి పెట్టుకోమన్నారు.\n\n* పెద్దపులి ఎదుటయినా పడవచ్చునుగాని, నగరివారి ఎదుట పడరాదు.\n\n* పెద్దపులి చాటుకు చేరిన ఎలుకకు, నమిలే గండుపిల్లి నల్లితో సమానం.\n\n* పెద్దపులి తరుముకువచ్చినా కంసాలి అంగడిలోకి పోరాదు (దూరరాదు).\n\n* పెద్దపులి తరిమినా, దేవిడిముందుకు పోరాదు.\n\n* పెద్దపులి పేరంటం పెట్టునా?\n\n* పెద్దపులిమీద స్వారీ చేసేవాడు భూమిమీద నడవలేడు అన్నట్లు.\n\n* పెద్దమనిషిని పేరంటానికి పిలిస్తే అర్థసేరు పసుపు ముడ్డికే సరిపెట్టినాడంట.\n\n* పెద్దమనిషి, ప్రజాపతి పనికిముందు విజృంభించి పనికాగానే శాంతిస్తారు.\n\n* పెద్దముత్తైదువు సద్దుచేయదు, చిన్నపిల్లే చిందులుతొక్కేది.\n\n* పెద్దమ్మా! నీవెక్కడికంటే, చిన్నమ్మా నీవెనుకే ఉంటానన్నదట.\n\n* పెద్దరికానికి పెద్దబావ చస్తే, ఇంటిల్లిపాది ఈడ్వలేక చచ్చిందట.\n\n* పెద్దరెడ్డి కొంగు పట్టుకుంటే, కాదనేదెట్లా? అన్నదట.\n\n* పెద్దల ఉసురు పెనుబామై తగులును.\n\n* పెద్దలకు పెట్టరా పేచీల తలపాగ.\n\n* పెద్దలతో వాదు, పితరులతో పోరు.\n\n* పెద్దలమాట చద్దిమూట.\n\n* పెద్దలమాట పెన్నిధిమూత.\n\n* పెద్దలమాట పెఱుగుకూటి మూట.\n\n* పెద్దలు లేని ఇల్లు, ఎద్దుల కొటిక.\n\n* పెద్దలు లేని ఇల్లు, సిద్ధులులేని మఠము.\n\n* పెద్దలేకపోతే గొఱ్ఱె (దున్నపోతు) తలనైనా తెచ్చుకోమన్నారు.\n\n* పెద్దలేని ఊరుకి పోతురాజే పెద్ద.\n\n* పెద్దవాన పెళపెలా పడితే, చిన్నవాన నానుడు పడుతుంది.\n\n* పెద్దుభోట్లూ, పెద్దుభోట్లూ! సన్యాసంతీసుకుంటావా? అంటే, పెండ్లాము చెప్పుతో మాడున కొడితే తీసుకోక తప్పుతుందా? అన్నాడట.\n\n* పెనములోనుంచి పొయ్యిలో పడినట్లు.\n\n* పెన మే మెఱుగును పెసరట్టు రుచి.\n\n* పెనుగాలికి, కాచినమాను వెరచునుగానీ పెనుమొద్దు వెరచునా?\n\n* పెనుగొండకు పిల్లనివ్వరాదు, రోద్దానికి ఎద్దునివ్వరాదు (రోద్దం=అనంతపురం జిల్లాలో ఒక ఊరు).\n\n* పెను రంకుబోతు కూతురుతో బాటు దుందుడుకు కొడుకు బుట్టినట్లు.\n\n* పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ.\n\n* పెన్నరావడం వెన్న కరిగే లోపలనె.\n\n* పెన్నలో మాన్యం కాశీలో దానం చేసినట్లు.\n\n* పెన్నీరు జిల (గిల)క్కొట్టి వెన్న దీసినట్లు, ఆకాశాన్ని పిడికిట బట్టినట్లు.\n\n* పెమ్మకట్లవారి మంత్రం దెబ్బ అంటే, కమ్మకట్ల పాముకాటైనా పోతుంది.\n\n* పెయ్యను కాపాడమని (కాచమని) పెద్దపులికి అప్పచెప్పినట్లు.\n\n* పెయ్యను పెంచితే పేదరికంలేదు.\n\n* పెరటికి పోయినవానిని తన్నలేక పెంటను తన్నినట్లు.\n\n* పెరటిచెట్టు ముందుకు రాదు.\n\n* పెరుగగా పెరుగగా పెదబావగారు కోతి అయినట్లు.\n\n* పెరుగగా పెరుగగా పెదబావ గుఱ్ఱం గాడిదయినట్లు అయునాడట.\n\n* పెరుమాళ్ళకైనా పెట్టువాడే చుట్టం.\n\n* పెఱుగుట విఱుగుట కొఱకే, ధర తగ్గుట హెచ్చుట కొరకే.\n\n* పెఱుగుకు పులికడుగుకు పెనకువ అయినట్లు.\n\n* పెఱుగు పెత్తనం చెఱచును.\n\n* పెఱుగూ వడ్లు కలిపినట్లు.\n\n* పెళ్ళాం పోతే పెళ్ళికొడుకు అయినట్లు.\n\n* పెళ్ళాం బెల్లం ముక్క, తల్లి మట్టిబె(గ)డ్డ.\n\n* పెళ్ళి కెళ్ళిన యింటిన వలసవెళ్ళ బుద్ధయినదట.\n\n* పెళ్ళికిపోతూ పిల్లిని చంకలో బెట్టుకొని పోయినట్లు.\n\n* పెళ్ళికిముందు కండ్లు బాగా తెరచుకొని ఉండి, పెండ్లికాగానే సగం మూసుకోవాల.\n\n* పెళ్ళే బాగుంది, పప్పువండితే మరీ బాగుంటుంది.\n\n* పెసరకు పైరుగాలి, పసరానికి నోటిగాలి ప్రమాదం (పైరు(ర)గాలి=దక్షిణపు గాలి; నోటిగాలి= పశువులనోటికి తగులు పుండ్లవ్యాధి).\n\n\n\n**********:: పే ::**********\n\n* పేగు చుట్టమా? పెట్టు చుట్టమా?\n\n* పేచీకి పెదబాబు.\n\n* పేడకుప్పకు దిష్టి (దృష్టి) దీయాలనా?\n\n* పేడదిన్న పురుగు బెల్లమే మెరుగురా.\n\n* పేడలో పొదిగిన ఉల్లిగడ్డవలె.\n\n* పేడా, బెల్లం ఒకటి చేసినట్లు.\n\n* పేడు ముదిరి పెండ్లికొడుకగు.\n\n* పేద కడుపు నింపను అన్నం వెదకును, మహారాజు అన్నం నింపను కడుపు వెదకును.\n\n* పేదకు తగిలే బ్రహ్మహత్య అన్నట్లు.\n\n* పేదకు పెన్నిధి దొరికినట్లు.\n\n* పేదపేద గూడి పెనగొనియుందురు.\n\n* పేదతెవులు అంగడి బెట్టకున్న తీరదు.\n\n* పేదబడ్డవెనుక పెండ్లము మతిచూడు.\n\n* పేదలకు చేతనయినది కలలు గనుట మాత్రమే.\n\n* పేదల కోపం పెదవికి చేటు.\n\n* పేదల బిగువు, సాధుల తగవు.\n\n* పేదయింటగానీ రాచయింటగానీ ఎద్దు తినేది గడ్డే.\n\n* పేదవాడు పెంత తింటే ఆకలికని, మారాజు తింటే మందుకని.\n\n* పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి.\n\n* పేదవానికి పెండ్లామే ఆస్తి.\n\n* పేదవాని యింట పెండ్లయిన ఎరుగరు.\n\n* పేదవానికి పెండ్లామే లంజ.\n\n* పేదవాని పెళ్ళాం వాడకెల్ల వదిన.\n\n* పేదవానిపైనే పడెరా పెద్దపిడుగు.\n\n* పేదవానివెంట పడెనమ్మా జోరీగ.\n\n* పేదవాని స్నేహం, మహారాజువిరోధం సహింపరానివి.\n\n* పేను కుక్కమంటే చెవి కరచినట్లు.\n\n* పేనుకు పెత్తనమిస్తే, ఈపిని యిరవైచోట్ల యీనిందట.\n\n* పేనుకు పెత్తనమిస్తే, తలంతా తెగకొరికి పెట్టిందట. * పేనేమెఱుగును పెడతల కండూతి?\n\n* పేరంటానికి వచ్చి, పెండ్లికొడుకు వరస ఏమన్నట్లు.\n\n* పేరంట్రాండ్లు పదిమందిచేరి పాకం చెడగొట్టినట్లు.\n\n* పేరితే పాలే పెరుగు.\n\n* పేరిశాస్త్రికి కలిగెరా పెదవిపాటు.\n\n* పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిది.\n\n* పేరు ఒకరిది, నోరు ఇంకొకరిది.\n\n* పేరు కమలాక్షి, కండ్లేమో చీపురివి.\n\n* పేరు కమలాక్షి, చూపులు కాకి చూపులు.\n\n* పేరుకు మోపూరు, పెనులోభులు వారు.\n\n* పేరు గంగాభవాని, తాగబోతే నీటిచుక్క లేదు.\n\n* పేరు గురులింగ మంటే, ఉండే మూడులింగాలు (పురుషాది) గాక ఇదెక్కడ దన్నాడట.\n\n* పేరు జీలకఱ్ఱ, చూడబోతే కఱ్ఱ లేదు.\n\n* పేరు ధర్మరాజు, పెనువేప విత్తయా.\n\n\n* పేరు పెండ్లివాండ్లది, తిండి ఇంటివాండ్లది.\n\n* పేరు పెత్తనం చెఱచును.\n\n* పేరు గొప్ప ఊరు దిబ్బ.\n\n* పేరు పెద్దఱింకం, చెప్పులమోత.\n\n* పేరు పెనిమిటిది, అనుభవం మామ గారిది (ఊరివారిది).\n\n* పేరు పెన్న మోసినది, ఒళ్ళు నేల మోసినది.\n\n* పేరు పెరుమాళ్ళది, నోరు తనది (పేరంటాలిది).\n\n* పేరు పేరయ్యది, పిల్ల ఉమ్మడిది.\n\n* పేరు నేతిబీరకాయ, చీరిచూస్తే నేతిచుక్క లేదు.\n\n* పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ మందు.\n\n* పేలాలు చల్లి దెయ్యల లేపినట్లు.\n\n* పేలికైనా పిండి కట్టమన్నారు.\n\n\n\n**********:: పై ::**********\n\n* పైఆకు రాలితే, కిందిఆకు పైకి వచ్చినట్లు.\n\n* పైకం భాగవతం వారికి, తిట్లు చాకలి మంగలివాళ్ళకు.\n\n* పైచట్టంలో పరమాన్నం, పాపరా నన్ను లేపరా అన్నట్లు.\n\n* పైచాలు లేని పైరు, ఏగలి అంబలి లేని మనిషి.\n\n* పైడికొండలో బచ్చు (బొచ్చు) బేరాలా?\n\n* పైతళ్ళుక్కయితే పడరానిపాట్లు పడవచ్చును గానీ, మొగం ముడతలుపడితే చేసే దేమున్నది?\n\n* పైత్యం లేదు, శైత్యం లేదు, పచ్చడంబట్ట ఇటు పారవేయండి.\n\n* పైత్యరోగికి పంచదార చేదు.\n\n* పైన పండ్లు, లోపల పుచ్చుకొమ్మ చెట్టు (దుష్టుడు).\n\n* పైన పటారం, లోన లొటారం.\n\n* పైన పడ్డ మాట, మడిని పడ్డ నీరు.\n\n* పైన పోయే పక్షియీకలు ఎన్ని అన్నట్లు.\n\n* పైన మంట, కింద మంట, కడుపులో మంత, కాలు నిలిపితే ఖామందు తంట.\n\n* పైపై నెరిమించు కేసరికి పక్కెర వేయవచ్చునా? (పక్కెర=జీను).\n\n* పైరుకు రాగులు, భాగ్యానికి మేకలు.\n\n* పైరుగాలి తగిలితే పంట ఉరవు (పైరుకు కోపు) (కోపు=అదనుకు తగిన ఏపు).\n\n* పైరు పలుచనైతే పాతళ్ళు నిండతవి, మెండైతే వాములు దండి (నిండు).\n\n* పైరు నిడినవాడు బహుసౌఖ్యవంతుడే.\n\n* పైరు మార్చిన పంట పెంపు.\n\n* పైరుకు ముదురు, పసరానికి లేత కావాల.\n\n* పరుకి విత్తితే గాదం మొలచినట్లు.\n\n* పైసా! పైసా! ఏం జేస్తావంటే, ప్రాణంవంటి మిత్రుణ్ణి పగ చేస్తానందిట.\n\n* పైసా లేనివాడు పరస్ర్తీ వర్జితుడు.\n\n* పైసాలో పరమాత్ముడున్నాడు.\n\n\n\n**********:: పొ ::**********\n\n* పొంకణాల పోతిరెడ్డికి ముప్ఫైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.\n\n* పొంగినదంతా పొయ్యి పాలే.\n\n* పొంగిన పాలు పొయ్యి పాలు.\n\n* పొంగే కాలానికి బలుసు, మ్రగ్గే కాలానికి మామిడి.\n\n* పొంగే పాలు,వెలిగేదీపం ఆర్చరాదు.\n\n* పోకటి రాళ్ళకు పోట్లాడినట్లు.\n\n* పొగచుట్టకు సవిమోతికి ఎంగిలి లేదంటారు.\n\n* పొగడ్తకు పెరుగరాదు, తెగడ్తకు తరుగరాదు.\n\n* పొగతోటకు పొడినేల (పాటినేల).\n\n* పొగలోనుండి సెగలోకి వచ్చినట్లు (సెగలో పడినట్లు).\n\n* పొగాకు అడుక్కోవాలి, అందలం బయటపెట్టరా అన్నట్లు.\n\n* పొట్టయినా (పొట్టు అయినా) తిని పుట్టింట కాపురం చేయాల.\n\n* పొట్ట కరుకు(గు)లు తిన్నవారికి ఊచబియ్యాలు ఎట్లా వస్తాయి?(కరుకు=వెన్ను మొదటవేసి, పాలతో నున్న గింజలు; ఈచబియ్యం=ముదిరిన పచ్చిబియ్యం).\n\n* పొట్టకిచ్చినా బట్టకిచ్చినా భూదేవే.\n\n* పొట్టకు పుట్టెడు తిని, అట్లకు ఆదివారం రమ్మన్నట్లు.\n\n* పొట్టతిప్పలకు జేరి పోతులాడించాలి.\n\n* పొట్టనిండా చీరికలు - వట్టికాళ్ళ కురుపులు (వట్టికాలు=పాదము, మీగాలు).\n\n* పొట్టపైరుకు పుట్టెడు నీరు.\n\n* పొట్టి గట్టి, పొడుగు లొడుగు.\n\n* పొట్టి తోకగల కోడె పొడిచినా నడవదు (కదలదు).\n\n* పొట్టిదాని గట్టిదనం పట్టెమంచం ఎక్కినప్పుడు చూడు.\n\n* పొట్టి పోతరాజు కొలువువలె.\n\n* పొట్టివానికి పుట్టెడు బుద్ధులు.\n\n* పొట్టివానికి మితిలేని పొలతి వాంఛ.\n\n* పొట్టివాని నెత్తి పొడుగువాడు కొట్టె, పొడుగువాని నెత్తి దేవుడు కొట్టె.\n\n* పొట్లకాయకు రాయికడితే చక్కనగును గానీ, కుక్కతోకకు గడితే ఫలమేమి?\n\n* పొట్లపాదికి పొరుగు గిట్టదు.\n\n* పొడుగు గాలికి చేటు, పొట్టి నీటికి చేటు.\n\n* పొడు మెక్కించే ముక్కు, పొగపీల్చే నోరు శుభ్రంగా ఉండవు.\n\n* పొడువలేని బంటు చేతిది ఈటైతే నేమి? తెడ్డైతే నేమి?\n\n* పొడవులకు (పరువుకు) రోకలి మింగితే, పొన్నొచ్చి (పన్ను) ముడ్డిన యిరుక్కునదిట.\n\n* పొత్తుకు మళయాళం, సంభందానికి సాంబారు (తమిళుడు ఆంధ్రుని గోంగూర అన్నట్లు).\n\n* పొత్తుమాట పొసగని మాట.\n\n* పొత్తుల పనిలో పిత్తుక చచ్చినట్లు.\n\n* పొత్తుల మగడు పుచ్చి చచ్చెను.\n\n* పొదుగు కోసి పాలు తాగినట్లు.\n\n* పొదుగు చింపిన పసరం పోతు నీనుతుందా?\n\n* పొదుగులేని ఆవు పాలిస్తుంటే, నాలికలేని పిల్లి నాకేసిందట.\n\n* పొదుగులో ఉన్నా ఒక్కటే, దుత్తలో ఉన్నా ఒక్కటె (పాలు) అన్నట్లు.\n\n* పొదుగెంత జారినా కుక్క గోవు కాదు.\n\n* పొద్దుకలుగ (ప్రొద్దుండగా) లేచినందుకు, బాట తప్పినందుకు సరిపోయింది.\n\n* పొద్దుగాని పొద్దులో పెద్దిగాని పెళ్ళి.\n\n* పొద్దు పోదు, నిద్ర రాదు, పద్మాక్షీ! ఒక్క పాటైనా పాడవే అన్నట్లు.\n\n* పొద్దుట లేవని కాపుకి పొలం ఇచ్చేది గడ్డే.\n\n* పొద్దుటిది పొట్టకు, మాపటిది బట్టకు.\n\n* పొద్దు తిరుగుడు, డొంక తిరుగుడు.\n\n* పొద్దుతిరుగు పువ్వు బుద్ధికి, పొద్దుకు నిలకడ లేదు.\n\n* పొద్దుపొడుపున వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు.\n\n* పొద్దేమో గడచిపోతుందిగానీ, మాట మాత్రం నిలచిపోతుంది.\n\n* పొమ్మనలేక పొగ బెట్టినట్లు.\n\n* పొయింది పోగా, పిడకల కుచ్చెల బట్టుకొని ఏడ్చినట్లు.\n\n* పొయ్యలు చెడ్డదినంలో వేయాలి, పెండ్లిండ్లు మంచిదినంలో చేయాలి.\n\n* పొయి అరిస్తే బంధువుల రాక - కుక్క అరిస్తే కఱవు రాక.\n\n* పొయ్యి ఊదమంటే కుండ బద్దలు కొట్టాడట.\n\n* పొయ్యి ఊదలేనమ్మ ఏడుమనువులు పోయిందట.\n\n* పొయ్యి ఊదినమ్మకు బొక్కెడు .... బూడిద.\n\n* పొయ్యిప్రక్క కెన్నముద్ద వలె.\n\n* పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు (వంటను ప్రారంభించను వసతి లేకుండుట).\n\n* పొయ్యి సెగ పొంతకుండకు తగలకపోదు.\n\n* పొరుగమ్మ సరిపెట్టుకుంటే, ఇరుగమ్మ ఉరిపెట్టుకుందట.\n\n* పొరుగింట చూడరా నా పెద్దచెయ్యి.\n\n* పొరుగింటి అట్లకు తిమ్మనం కాచుకుందట.\n\n* పొరుగింటి అట్లకు నెయ్యి కాచినట్లు.\n\n* పొరుగింటి కలహం విన వేడుక.\n\n\n* పొరుగింటి నెయ్యి, పెండ్లాము చెయ్యి (వడ్డించేటప్పుడు).\n\n* పొరుగింటి పొయ్యి మండుతున్నదని తన పొయ్యిలో నీళ్ళు పోసుకుకొన్నట్లు.\n\n* పొరుగింటి బాన(బానెడు) పాడి కంటే తనైంటి గిద్ద (గిద్దెడు) పాడి మేలు.\n\n* పొరుగింటి బిడ్డను దింఛి, నీటిలోతును చూచినట్లు.\n\n* పొరుగుది అట్లు పోసితే, ఇంటిది పోరెలు పోస్తుంది.\n\n* పొరుగూరును నమ్ముకోగాక (బాక) పొద్దుమునగ పండుకోబాక.\n\n* పొరుగూరికి పోతే పోతుందా పాపం?\n\n* పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.\n\n* పొరుగూరు పోగానే పోవునా దుర్దశ?\n\n* పొర్లించి, పొర్లించి కొట్టినా, మీసాలకు మన్ను కాలేదు అన్నాడట.\n\n* పొలములోని ఆబోతును పులి గొన్నట్లు.\n\n* పొల్లు కట్ట దంచి పోగుచేసుకొన్నట్లు (పొల్లు= తరగలు, గల్ల).\n\n* పొల్లు దంచిన బియ్యము, తెల్లని కాకి లేవు.\n\n\n\n**********:: పో ::**********\n\n* పోకముడి విప్పుతూ, కోక వెల అడిగినట్లు.\n\n* పోకల కుండ చట్రాతి మీద పగుల కొట్టినట్లు.\n\n* పోకలు నమలుచు ఆకులు చేబూని సున్న మడుగువాడు శుద్ధవెధవ.\n\n* పోకిరికి పోలీసు, చదువురానివానికి సర్వే.\n\n* పోగాపోగా పైబట్ట బరువవుతుంది.\n\n* పోచమ్మకు, కందూరు పీర్లకు బోనాలు (బోనాలు=అన్నము, పొంగలి)\n\n* పోట్లడే కోళ్ళు పొడిచినా పోవు.\n\n* పొడమిగలనాడే పొరుగింటి పొందు (పొడిమి=సంపద).\n\n* పోతా, పోతా అన్నోళ్ళకు పోకడ లేదు, చస్తా, చస్తా అన్నోళ్ళకు చావు లేదు.\n\n* పోతురాజు ఇష్టమా? పొట్టేలు ఇష్టమా? (కోయుటకు)\n\n* పోతూ పారవేస్తూ పోయి, వస్తూ ఏరకతినే (ఏరుకొనే) రకం.\n\n* పోతున్నా నంటే, నీయంత పోతుకు మేతేడ తెచ్చేది అన్నాడట.\n\n* పోతేపల్లి వారికి పప్పే సంభావన.\n\n* పోయిన కంటికి మందు వేయబోతే, ఉన్న కన్ను ఊడ్చుక (ఊడి) పోయిందట.\n\n* పోయిన చోటెల్లా పొగాకే అడిగితే?\n\n* పోయినది ఒర, ఉండేది కత్తి.\n\n* పోయిన నీళ్ళకు కట్ట బెట్టినట్లు (గతజల సేతుబంధనము).\n\n* పోయిన మొగుడు పోయినా, పొన్నకాయలా గుండు కుదిరింది.\n\n* పోయే కాలానికి అపరబుద్ధి.\n\n* పోరాని చుట్టము వచ్చాడు, బొడ్డువంచి తామలపాకులు కొయ్యమన్నట్లు.\n\n* పోరాని చోట్లకు పోతే రారాని నిందలు రాక మానవు.\n\n* పోరు(డు) గాలితో దీపంబెట్టి నా పాతివ్రత్య మహిమ (దేవుని మహిమ) అన్నట్లు.\n\n* పోరు చాలక పొయ్యిదగ్గఱ పండుకుంటే, బొంతకాలిపోయె నారాయణా!\n\n* పోరు నష్టం, పొందు లాభం.\n\n* పోరులేని గంజి పు(రి)డిసెడైనా చాలు.\n\n* పొలనాటిలో పోకకు పుట్టెడు అమ్మితే, ఆ పోకా దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.\n\n* పోలికి వచ్చిన భోగానికి, పొట్టేలుకు వచ్చిన రోగానికి తిరుగులేదు.\n\n* పోలీ, పోలీ, నీ భోగమెన్నాళ్ళే? అంటే, మా అత్త మాలపల్లి నించి (మాలాడ) వచ్చేదాకా అన్నదిట.\n\n* పోలుగాడి చెయ్యి బొక్కలో పడ్డట్టు.\n\n* పోలేరమ్మకు పోయేది లేదు, పోతురాజుకు వచ్చేదీ లేదు.\n\n* పోలేరమ్మ దిగివచ్చితే పొలంకాపు కేమిభయం?\n\n* పోలేరమ్మది చినగదు, పోతురాజుది విరుగదు.\n\n* పోలేరమ్మ పెండ్లిలో పోతురాజు పెత్తనం.\n\n\n\n**********:: పౌ ::**********\n\n* పౌరుషం (పురుషకారం) లేక దైవం అనుకూలించదు.\n\n* పౌరుషానికి (సనికలు) పొత్రం మెడకు కట్టుకున్నట్టు.\n\n* పౌర్ణమికి పూజించి, అమావాశ్యకు ఆరగిస్తవి (తేనెటీగలు తేనెతుట్టెను).\n\n\n\n**********:: ప్ర ::**********\n\n* ప్రజల మాటే ప్రభువు కోట.\n\n* ప్రఙ్ఞలేని శౌర్యం - పదునులేని ఖడ్గం.\n\n* ప్రతిష్ఠకు పెద్దనాయడు చస్తే, ఈడవలేక ఇంటిల్లిపాదీ చచ్చారట.\n\n* ప్రథమ కబళంలోనే మక్షికాపాతం.\n\n* ప్రథమ చుంబనం - దంత భగ్నం. (మొదటి ముద్దుకే మూతిపండ్లు రాలినవి).\n\n* ప్రదక్షిణలు చేస్తే, బిడ్డలు పుడుతారంటే, చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట.\n\n* ప్రపంచమంతా ధర్మపరాయణమైతే శౌర్యానికి తావుండదు.\n\n* ప్రభగిరిపట్నం తాడిచెట్టు వలె (పొడుగు).\n\n* ప్రయాణాల వారి హడావుడికంటే, పెట్టెలు మోసేవారి హడావుడి ఎక్కువ.\n\n* ప్రయాణాలు అబద్ధం, ప్రసాదాలు నిబద్ధం.\n\n* ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం.\n\n* ప్రసాదానికి ముందు, పనికి వెనుక.\n\n* ప్రసూతి వైరాగ్యం ఒంటిపచ్చి ఆరేవరకే.\n\n* ప్రసుతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఆభావ వైరాగ్యం.\n\n\n\n**********:: ప్రా ::**********\n\n* ప్రాక్టీసు లేని ప్లీడరు దేశాభిమాని అయినట్లు.\n\n* ప్రాణముంటే ఉప్పుగల్లమ్ముకొని బ్రతుకవచ్చు.\n\n* ప్రాణముంటే బలుసాకు తిని బ్రతుకవచ్చు.\n\n* ప్రాణముండే వరకు భయం లేదు.\n\n* ప్రాణం పోయినా మానం దక్కించుకోవలె.\n\n* ప్రాణం పోయేటప్పుడు కూడా త్రాచు పడగ దించదు.\n\n* ప్రాణం మీదకి వచ్చినప్పుడు పంచాంగం చూచి మందు పోస్తారా? (త్రాగిస్తారా?)\n\n* ప్రాణమున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి.\n\n* ప్రాణములేనివానికి బంగారు తలపాగాజుట్టిన ప్రయోజనమేమి? అణివజ్ర భూషణ మురమున బెట్టనేమి?\n\n* ప్రాతదొంగ పట్టుబడక పోడు.\n\n* ప్రాతబడ్డ బావినీరు, మేకలపాడి రోత (బొచ్చుపడునని, మేకను వెనుక గుండ పితుకుటచే పెంటికలు పడునని రోత).\n\n* ప్రాయము వస్తే పందిపిల్లకూడా బాగుంటుంది.\n\n* ప్రాయాన బెట్టిన పంట - ప్రాయాన గన్న కొడుకు.\n\n* ప్రాసకేడ్చానే కూసుముండా (పాసుముండా) అన్నట్లు.\n\n\n\n**********:: ప్రి ::**********\n\n* ప్రియం మహాలక్ష్మి, చౌక శనేశ్వరం.\n\n* ప్రియములేని కూడు పిండపు కూడురా.\n\n\n\n**********:: ప్రీ ::**********\n\n* ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.\n\n* ప్రీతిలేని కూడు పిండాకూడు.\n\n* ప్రీతిలేని లంజ ఘాతకియై తోచు\n\n\n\n**********:: ప్రే ::**********\n\n* ప్రేమ అమ్మేది కాదు కొనేది కాదు, ప్రేమ వెల ప్రేమే.\n\n* ప్రేమ గుడ్డిది.\n\n* ప్రేమలేని మాట పెదవిపైనే ఉండును.\n\n\n\n**********:: ప్రో ::**********\n\n* ప్రోలులోనే లేకపోతే, పొడుగునా ఉంటుందా?\n\n\n\n**********:: ఫ ::**********\n\n* ఫకీరువాణ్ణి తెచ్చి పరుపులో కూర్చుండ బెడితే, లేచి లేచి మసీదులోనికి పోయాడట.\n\n* ఫణివాత బడని ప్రభంజనమా?\n\n* ఫరవాలేని చుట్టం వచ్చింది, పాతచేత గొడుగు పట్టమన్నట్లు.\n\n* ఫలానికి తగిన బీజం.\n\n\n\n**********:: ఫా ::**********\n\n* ఫాల్గుణమాసపు వాన పదిపనులకు చెఱుపు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 873,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ప",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* బంకచెక్కలు, జింక తోలు,పాయిల కూర.\n\n* బంగారం కొద్దీ సింగారం.\n\n* బంగారం పోయిన తర్వాత బట్ట చుట్టమా?\n\n* బంగారం పట్టితే మన్ను; మన్ను బట్టితే బంగారం అయినట్లు (దురదృష్ట అదృష్టముల స్థితి).\n\n* బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పుండ వలెను.\n\n* బంగారముంటే సింగారాని కేమి (కొదువ) తక్కువ?\n\n* బంగారమునకు తావి అబ్బినట్లు.\n\n* బంగారు కరుగను వెలిగారం తప్పనట్లు.\n\n* బంగారుకే రంభ చిక్కుతుందా?\n\n\n* బంగారు గాలానికి బంగారు చేపలు పడవు.\n\n* బంగారు చెప్పులైనా (ముచ్చెలైనా) కాళ్ళకే తొడగాలి.\n\n* బంగారు పొల్లునది గానీ, మనిషి పొల్లు లేదు.\n\n* బంగారు బాగుగా పది వన్నెగాకుంటే అంగలార్చుచు బొచ్చు (కోమటి) వాడుకోనేల?\n\n* బంగారు మనిషి ఊరేగటానికి వెడితే, ఇదే సందని భజంత్రీలు పారిపోయారట.\n\n* బంగారు వంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్.\n\n* బంగు తిన్న కోతి వలె.\n\n* బండకొయ్యకు గుద్ది చెప్పినట్లు.\n\n* బండ తీసి, గుండు పెట్టినట్లు.\n\n* బండన్న పెండ్లికి బడితే బాజా.\n\n* బండ్రవాండ్రు ముందు దండంబు లిడుదురు.\n\n* బండవానికి పిండి యోచన ఏమిటి?\n\n* బండారంలేని కోమటి బాటలు బుద్దిచ్చుకున్నాడట.\n\n* బండివాటు బడ్డోడు వెఱ్ఱోడు.\n\n* బండెక్కి సివాలాడుతూ బావగారు చూస్తారని భయపడ్డట్లు.\n\n* బండెడు ధనమిచ్చినా బావమరది లేని చుట్టరికం పనికిరాదు.\n\n* బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు.\n\n* బంతిలో చిక్కింది భైరనలోకి.\n\n* బందరు నాయాళ్ళ బడాయేగానీ, అడపంలో (సంచీలో) ఆకువక్క లేదు (పోక పలుకే లేదు).\n\n* బందరు బడాయి, గుంటూరు లడాయి.\n\n* బందరు మూల మెరిస్తే బక్కగొడ్డును అమ్మిస్తుంది (వాన లెక్కువగును).\n\n* బందిపోటు తరిమినా, గొఱ్ఱెలమంద లోనికి పోరాదు.\n\n* బందిపోటుదొంగ ప్రాణమునో ధనమునో హరిస్తే, పెండ్లి ఈ రెంటినీ హరిస్తుంది.\n\n* బందెలో పాయసం కంటే బయట సజ్జరొట్టె మేలు.\n\n* బందెడు పచ్చి, కోడలు కొత్తా లేదు (బందెడు, బందారు= ఒక అడవి గుబురుచెట్టు, వాపులకు కట్టుదురు).\n\n* బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?\n\n* బంధువుడవు సరెగానీ పైరులో చేయి పెట్టవద్దు.\n\n* బంధువుతోనైనా పాలి వ్యవసాయం కూడదు.\n\n* బంధువులంతా ఒక దిక్కు, బావమరిది ఇంకొక దిక్కు.\n\n* బంధువులకు దూరం - బావికి చేరువ.\n\n* బక్కనాగు పయనం బోతే నక్కలన్ని గుస గుసలాడె.\n\n* బక్కవానికి బలిసినవాడు బావ, బలిసిన వాడికి బక్కవాడు బావ.\n\n* బగబగమను వాని పంచన నుండవచ్చును గానీ, నాలిముచ్చు నట్టింట నుండరాదు.\n\n* బగుళ్ళపనికి బరంతు లేదు.\n\n* బచ్చన కోలలు, రిచ్చన గిల్లలు.\n\n* బజారున పోయేవాడిని అమ్మా అంటే, ఎవరికి పుట్టావురా కొడుకా అన్నట్లు.\n\n* బజారు బత్తెం, బావి నీళ్ళు.\n\n* బజారులో కోట్లాడాలి, బంతిలో భుజించాలి.\n\n* బట్ట కాలితే సెట్టి విడుస్తాడా?\n\n* బట్టా చాటు పుండు బావగారి వైద్యం.\n\n* బట్టతలకు పేలు పట్టినవన్నట్లు.\n\n* బట్టతలకు మోకాళ్ళకు ముడి వేసినట్లు.\n\n* బట్టతలమ్మ పాపిట తీయమన్నట్లు.\n\n* బట్టప్పు, పొట్టప్పు నిలువవు.\n\n* బట్టలో పేలాలు వేయించినట్లు.\n\n* బట్టవిప్పి నీళ్ళుపోసుకుంటూ, బావగారు వచ్చారని నిటారున నిల్చుందట.\n\n* బట్టా(పా)బాతా డౌలే కానీ, నా బట్టదగ్గర బొట్టుకూడా లేదన్నట్లు (డౌలు=డంభము).\n\n* బడాయి ఏమి బాపనమ్మా అంటే, అమలుదారు నా అల్లుడాయెగదా అన్నదట.\n\n* బడాయి ఏమిరా అన్నయ్యా? అంటే, పైసా లేదుర తమ్మయ్యా అన్నాడట.\n\n* బడాయికి బచ్చలికూర, తినకపోతే తోటకూర.\n\n* బడాయికి బయట పడుకుంటే, బక్క నరాలు యిక్కలాక్కు వచ్చాయంట.\n\n* బడాయికి బావగారు చస్తే, ఈడ్వలేక ఇంటివారందరు (ఇంటిల్లిపాది) చచ్చారు.\n\n* బడాయికోరు బచ్చే, కూటికిలేక చచ్చే.\n\n* బడాయి గాలికి పోతే, గుడ్డు నేలకు ఆనిందట.\n\n* బడాయి బండిమీద పోవడమేగాని, బత్తా (బత్తెమునకు) నికి నూకలు లేవు.\n\n* బడాయి బండెడు, బట్టలు సందెడు.\n\n* బడాయి బండెడు, బత్తెం గిద్దెడు.\n\n* బడాయి బత్తెన్న కూడులేక చచ్చెన్న.\n\n* బడాయి బచ్చలి కూరకు ధడా చింతపండు.\n\n* బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.\n\n* బడికి బత్తెం, మడికి గెత్తెం (గెత్తెం=ఎరువు).\n\n* బడితె గలవానిదే బఱ్ఱె.\n\n* బడిలేని చదువు - వెంబడిలేని సేద్యం.\n\n* బడివారపు నక్క కుక్కల పొలానికి పోయిందట.\n\n* బడి(బరి) విడిచిన ముండ బజారుకు పెద్ద.\n\n* బడేసాయిబు గడ్డం బారెడైతే నేమి? మూరెడైతే నేమి?\n\n* బడేసాయిబును జోస్యులు, తొలిఏకాశి ఎప్పుడు అని అడిగినట్లు.\n\n* బతకలేక బడిపంతులు.\n\n* బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట.\n\n* బతకలేని వాడు బావిలో పడితే, తియ్యబోయినవాడు కయ్యలో పడ్డాడట.\n\n* బతికి(బ్రతికి)ఉంటే గరిటెడు పాలు లేవుగానీ, చస్తే సమాధిపై ఆవును కట్టేస్తా అన్నట్లు.\n\n* బతికిచెడిన వారితో బందుత్వం చేయవచ్చును గానీ, చెడిబ్రతికిన వారితో చేయరాదు.\n\n* బతికితే బలిజోడు, లేకపోతే బోగమోడు.\n\n* బతికిన (బ్రతికిన) బతుక్కి భగవద్గీత పారాయణమా?\n\n* బతికిన బతుక్కు ఒక పంది సాకుడా?\n\n* బతికితే అతిసారం, చస్తే కలరా అన్నట్లు.\n\n* బతికితే భూదానం, చస్తే గోదానం.\n\n* బతికితే వైద్యుడు బ్రతుకుతాడు, చస్తే బ్రహ్మణుడు బ్రతుకుతాడు.\n\n* బతికి పట్నం చూడాలి, చచ్చి స్వర్గం చూడాలి.\n\n* బతికే బిడ్డయితే పాసుకంపు కొడుతుందా?\n\n* బతుకంత (బ్రతుకంత) భాగ్యం లేదు.\n\n* బతుక నేరని బిడ్డ బారెడుండు.\n\n* బతుక లేక బాగోతం (భాగవతం).\n\n* బతుకలేనమ్మ నీళ్ళులేని బావిలో నిచ్చన వేసుకొని దూకిందట.\n\n* బతుకు తక్కువైనా బడాయి ఎక్కువ.\n\n* బతుకు లెన్నాళ్ళు? భాగ్యా లెన్నాళ్ళు?\n\n* బత్తె మున్నన్ని నాళ్ళు బ్రతుకులు.\n\n* బత్తెమెక్కడో సత్య మక్కడ.\n\n* బదులు మనిషి ఉంటే, పగలు తలనొప్పి.\n\n* బనగానపల్లి ఉరుసు, నా వెంట రావే సరసు.\n\n* బయట తన్ని, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు.\n\n* బయట పులి, ఇంట్లో పిల్లి (భార్య ఎదుట)\n\n* బయటకి ఇంపు, లోపలికి కంపు.\n\n* బయటకి పోయిన చోట గుద్ద (ముడ్డి) మరచివచ్చినట్లు.\n\n* బయటి కొకటి, లోపలి కొకటి (మాట).\n\n* బయటివాడు చూడుగేదంటే, ఇంటివాడు గొడ్డుగేదె అంటాడు.\n\n* బయల చిత్రము వ్రాసినట్లు.\n\n* బయిలున్నంత చదివె బయ్యన్న (బయిలు=పుస్తకాలు).\n\n* బయిలో ఉన్నంత బయ్యన్న గీకె.\n\n* బరిగ పంట - కడుపు మంట.\n\n\n* బఱక సేద్యం - తురక నేస్తం.\n\n* బఱ్ఱె పెంట తిన్నా, పాలు కంపు కొట్టవు.\n\n* బఱ్ఱెకొమ్ము అంటే, ఇఱ్ఱి కొమ్ము అన్నట్లు.\n\n* బఱ్ఱెకో బాంచ, గుఱ్ఱానికో సైను (బంచె= బానిస; సైను= మాలీషు చేసేవాడు).\n\n* బఱ్ఱె చవలం, బందె ముచ్చెవలం.\n\n* బఱ్ఱ్ ఎచస్తే పాడి బయట పడుతుంది.\n\n* బఱ్ఱె-దూడ ఉండగా గుఱక గుంజకు వస్తుందా? (గుఱక=పశురోగం).\n\n* బఱ్ఱెదూడ వద్ద, పాత అప్పులవాడి వద్ద ఉండరాదు.\n\n* బఱ్ఱె పాతిక, బందె ముప్పాతిక.\n\n* బఱ్ఱె పిల్లికాలు తొక్కితే, పిల్లి ఎలుకపై మీసాలు దువ్వుందట (కళ్ళెఱ్ఱ జేసిందట).\n\n* బఱ్ఱె పిల్లకు బనారసు చీర\n\n* బఱ్ఱెలు తినని కూరగాయలు బాపలకు దాన మన్నట్లు.\n\n* బలం ఉడిగినా, పంత ముడగరాదు.\n\n* బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చచ్చినట్లు.\n\n* బలవంతాన పిల్లనిస్తామంటే, కులమేమి? గోత్రమేమి అని అడిగినాడట.\n\n* బలవంతుడు సొమ్ముగాక బాపడి సొమ్మా? (సొత్తా).\n\n* బలవంతుని చెయ్యి పడితే, బావి ఐనా చూసుకోవాలి, చంక అయినా చేరాలి.\n\n* బలవంతపు మాఘస్నానం.\n\n* బలవంతపు బ్రాహ్మణార్థం.\n\n* బలిజ చుట్టంకాడు, బడ్డు అయుధం కాదు.\n\n* బలిజ పుట్టుక పుట్టవలె, బతాయిబుడ్డి కొట్టవలె.\n\n* బలిజవారి పెండ్లికి జుట్టుతో సహా ఎరువు.\n\n* బలిజల విత్తము పట్టెదాసరి పాలు, గొల్ల విత్తము పిచ్చుగుంత పాలు.\n\n* బలిమిలేని వేళలో పంతం చెల్లదు.\n\n* బలిస్తే గోకి చంపుతారు, చిక్కితే నాకి చంపుతారు.\n\n* బలుసు పండితే గొలుసుల్లా కంకులు (వరి).\n\n* బలుసు లేని తద్దినము, బులుసు లేని యఙ్ఞమున్ను లేవు (బలుసు=ఒక ఆకుకూర; బులుసు=బులుసు పాపయ్య, బులుసు అచ్చయ్య శాస్త్రులు వేదవేదాంత వేత్త, విశ్రుతులు).\n\n* బల్లి పలికిందని బావ పక్కలో చేరిందట.\n\n* బసవ దేవునికి బడితె పూజ.\n\n* బహుతిండి బహునాశనం అన్నారు.\n\n* బహు నాయకము, బాల నాయకము, స్త్రీ నాయకము (చెడుపు).\n\n\n\n**********:: బా ::**********\n\n* బాంచెను వెంకటమ్మా అనాలి కాలం తప్పినప్పుడు.\n\n* బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు.\n\n* బాగైన సొమ్ములెన్ని ఉన్నా మంగళసూత్రమగునా?\n\n* బజారు రంకుకు పంచాయతీ చెప్పు లంజలు వీరమాతలైరి.\n\n* బాజాల సందడిలో మంగళ సూత్రాన్ని మరచారట.\n\n* బాడి(డు)గ గుఱ్ఱానికి సుడులు పట్టిచూచినట్లు.\n\n* బాతాకానీ వానికి బారనా, నాకూ బారనానేనా? (బారనా=పన్నెండణాలు).\n\n* బాదరాయణ సంభందం.\n\n* బాదేపల్లి సేట్లు, లెక్కలు చూస్తే తూట్లు.\n\n* బాధకొక కాలము, భాగ్యాని కొక కాలము.\n\n* బాపనవాడి కొలువు, తెల్లగుఱ్ఱపు కొలువు కష్టం.\n\n* బాపన వావి బందవావి.\n\n* బాపన సేద్యం బడుగుల నష్టం.\n\n* బాపన సేద్యం బత్తెం చేటు, కాపుల చదువులు కాసులు చేటు.\n\n* బాపన సేద్యం బ్రతకటానికీ కాదు, బ్రతికించటానికీ కాదు.\n\n* బాపన సేద్యం - బాల వైద్యం.\n\n* బాపనోళ్ళ కోపం - వరిగడ్డి శాకం.\n\n* బాపలలో చిన్న, బేస్తలలో పెద్ద.\n\n* బాపలు తప్పినా వేపలు తప్పవు, వేపలు తప్పినా ఏరువాక పున్నమ తప్పదు.\n\n* బాబుకు లేక బఱ్ఱెతో ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పెళ్ళో అని అఖోరించాడట.\n\n* బారకల్ల మీద బట్ట పడ్డట్టు.\n\n* బారకావడివలె పడ్డావు, నీవెవడురా, మా ఇంటి దేవరకు మ్రొక్కను?\n\n* బారతకతలోన బాలరాజొకడు కుంబకర్నునిబట్టి (కుత్త) గుద్దసించిన వైనం తెలియదా అన్నాడట.\n\n* బారు బంగాళా, కొంప దివాళా.\n\n* బారెడు చుట్టు అయినా బాటన పొమ్మన్నారు.\n\n* బాల పొంగు - పాలపొంగు.\n\n* బాలల తుమ్ము, బాలెంత తుమ్ము మంచివి.\n\n* బాల వాక్కు(వాక్యం) బ్రహ్మ వాక్కు(వాక్యం).\n\n* బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు.\n\n* బావకు మరదలు పిల్లపై ఆశ.\n\n* బావమరిదికంటే మించిన బంధువు లేడు.\n\n* బావమరిది బ్రతుక గోరును, దాయాది చావ గోరును.\n\n* బావమరుల ప్రక్కన కూర్చోవటం ఎట్లా అని, దూరంగాపోయి తురకోడి పక్కన కూర్చున్నదట -కొత్త పెండ్లికూతురు.\n\n* బావలేని కోడలు బహుభాగ్యశాలి, మరి(ఱ)ది లేని కోడలి మరీమంచిది.\n\n* బావా! అని చూడబోతే, రావా అని కొంగుపట్టుకున్నాడట.\n\n* బావా! నీభార్య ముండమోసిందంటే, మొఱ్ఱో అని ఏడ్చాడట.\n\n* బావా బావా అంటే పక్కలోకి రమ్మనాడట.\n\n* బావికింద దిన్ని బ్రతికినవాడు, చెఱువుకింద దున్ని చెడినవాడు లేడు.\n\n* బావి తప్పినవాడు, బడిం దిరిగినవాడు ఒకటే.\n\n* బావి త్రవ్వగా భూతం బయట పడినట్లు.\n\n* బావిలో ఏరిగేవాడికంటే బావిపక్కన (అంచున) ఏరిగేవాడు మేలు.\n\n* బావిలోతు చూడగలంగాని, మనిషి మనసులోతు చూడగలమా?\n\n* బావిలోని కప్పకు, గానుగ ఎద్దుకు అవే లోకాలు.\n\n* బావురుపిల్లికి చిలుకపై మొగమాటమా?\n\n* బాషికం మొదలు భజంత్రీల వరకు బదులుతో పెండ్లి జరిపినట్లు.\n\n* బాస(బావి) బిస తప్పిలే పట్టరా తంగేళ్ళు.\n\n* బాహ్య ధార్మికుడు, అంతరంగిక పిశాచము.\n\n\n\n**********:: బి ::**********\n\n* బిగువులేని కచ్చ, బీగములేని ఇల్లు.\n\n* బిగువైన ఎద్దుకే బిగువైన సేద్యం.\n\n* బిచ్చం బిడబిడ, కుండలు లొడలొడ.\n\n* బిచ్చగాణ్ణి పొమ్మన్నా అత్త చెప్పాలి, కోడలు పంపాలి.\n\n* బిచ్చగాని గుడిసె, మా అక్క చూచి మురిసె.\n\n* బిచ్చపు కూటికి పేదరికమా?\n\n* బిచ్చపు కూటికి శనేశ్వరం అడ్డం పడ్డట్లు.\n\n* బిచ్చము వేయకున్న మానె, కుక్కని కట్టివేయమన్నట్లు.\n\n* బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా వల్లెవాటు తప్పలేదు.\n\n* బిచ్చానికి వచ్చినవాడు, అచ్చంగా కాకపోయినా ఆ పూటకు చుట్టమే.\n\n* బిడుగుచెడ్డ ముండ చీటికి ముగ్గు పెట్టిందంట.\n\n* బిడ్డయినా పడ్డయినా పుట్టాక విడిచిపెడతామా?\n\n* బిడ్డ ఎదిగితే కుండ ఎదుగుతుంది (వంటకుండను పెద్దది చేయాలనుట).\n\n* బిడ్డ చచ్చినా తొట్లమర్లు ఉడుగలేదు.\n\n* బిడ్డ చచ్చినా పీతికంపు (పురిటికంపు) పోలేదు.\n\n* బిడ్డ చచ్చినా బారసాల బాగా జరిగింది.\n\n* బిడ్దను దించి లోతు చూసినట్లు.\n\n* బిడ్డ, పాము కఱచి చచ్చి ఏడుస్తుంటే, విషపురుగులం - మా జోలికివస్తే కరవక మానుతామా - అన్నదట అప్పుడే బయటపడిన ఏలికపాము.\n\n* బిడ్డ బావిలో పడ్డాడంటే చద్దికూడు తినివస్తానన్నాడట.\n\n* బిడ్డ ముద్దయితే పియ్యి ముద్దవుతుందా?\n\n* బిడ్డలను కన్నమ్మా, బిక్షము పెట్టినమ్మా చెడరు.\n\n* బిడ్డలేని ఇంటికి ఆవుదూడ ముద్దు, ఏమీలేని ఇంటికి ఎనుముదూడ ముద్దు.\n\n\n* బిడ్డలేని ముద్దు, వానలేని వరద.\n\n* బిడ్డ వచ్చినవేళ, గొడ్డూ వచ్చినవేళ. (బిడ్డ=కోడలు).\n\n* బిడ్డసంగతి మీగాళ్ళ వాపే తెలుపుతుంది.\n\n* బిడ్డలుగల తండ్రు లెందరో ఉన్నారుగానీ, తండ్రిగల బిడ్డలు చాలా తక్కువ.\n\n* బిత్తరి బిడ్దను కంటే, ఎలుక ఎత్తుకపోయి వెన్నుకుప్పలో (వెన్నుగాడిలో) పెట్టిందట.\n\n* బియ్యం దంచినదానికి బొక్కిందే దక్కుట.\n\n* బియ్యం దంచినమ్మకు బొక్కిందే కూలి.\n\n* బియ్యపు బస్తాలు పోతుంటే లేదుగానీ, చవిటి చేటలకు వచ్చిందా?\n\n\n\n**********:: బీ ::**********\n\n* బీడున కురిసిన వాన - అడవిన కాచిన వెన్నెల.\n\n* బీదకూటికి బిక్క దేవుడు.\n\n* బీదలకేల బోగుగుడి పెద్దరికము, పెట్టబీరము? (బోగుబడి=వితరణలేని వ్యయంతో సంసారి తిరులేనివాడు; పెట్టబీరము=స్త్రీల (పెంటి) పౌరుషము).\n\n* బీద బలిసి బందికా డయినట్లు.\n\n* బీదమొగంవాడా! నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడంటే, మొద్దుమొగంవాడా మొన్ననే అయ్యింది అన్నాడట.\n\n* బీదవాడు బిచ్చపువానికి లోకువ.\n\n* బీదవానికి మాట ఈరాదు, కలిగినవానికి చోటు ఈరాదు.\n\n\n\n**********:: బు ::**********\n\n* బుక్కెడు తిన్నమ్మ బూరుగు (బూరగ) మ్రాను, చారెడు తిన్నమ్మ చెక్కపేడు.\n\n* బుగతోరింట్లో పెళ్ళి, బుగ్గలు తిప్పకు మల్లి.\n\n* బుచ్చిరెడ్డి అనె భూతానికి రామిరెడ్డి అనే రక్షరేకు (రేఖ).\n\n* బుట్టలో పామువలె (కుండలో పామువలె).\n\n* బుడ్డ ఎంతపెద్దదైనా ముక్కాలుపీట కాదు, బడ్డు ఆయుధం కాదు.\n\n* బుడ్డకు, భూతానికి ఒకే మంత్రమా?\n\n* బుడ్డగోచి కన్నా మించిన దారిద్ర్యంలేదు, చావుకన్నా మించిన కష్టం లేదు.\n\n* బుడ్డది చిక్కినా కష్టమే, బలిసినా కష్టమే. (బుడ్డది=మరుగుజ్జుది)\n\n* బుడ్డను నమ్మి ఏటిలో దిగినట్లు.\n\n* బుడ్డోడి మంత్రము, బూడిదలో ఉచ్చ ఒకటి.\n\n* బుధవారం పుట్టినదున్న భూమిని దున్నినా, తొక్కినా పొంగి పొంగి పండుతుంది.\n\n* బుధవారమ్నాడు పులిగూడా బయలుదేరదు (బయటకి తలబెట్టదు).\n\n* బుద్ధిగల (బుద్ధిమంతుల) జుట్టు భుజాలు దాటదట.\n\n* బుద్ధి సెప్పువాడు గుద్దిన మేలయా.\n\n* బుద్ధి భూములేలా లంటే, కర్మ (రాత) గాడిదలను కాస్తానంటుంది.\n\n* బుద్ధి భూములేలుతుంటే అదృష్టం అడుక్కతింటున్నది.\n\n* బుద్ధిమంతుడని సద్ది కడితే, బొండ్రాయి దగ్గఱనే భోంచేసినాడట.\n\n* బుద్ధి మరలకున్న రద్దె కెక్కును.\n\n* బురదగుంటలో పంది వెలె.\n\n* బురద మెచ్చే పంది పన్నీరు మెచ్చునా?\n\n* బురదలో దిగబడ్డ ఏనుగును బొంతకాకి అయినా పొడుస్తుంది.\n\n* బులుపు తీరినగాని వలపు తీరదు.\n\n* బుఱ్ఱుపిట్ట ఏడుగాండ్ల ఎద్దులను నిలిపేసినట్లు (నిలవేసినట్లు) (బుఱ్ఱుపిట్ట=చిన్నపిట్ట).\n\n\n\n**********:: బూ ::**********\n\n* బూకటికి బుద్ధిలేదు, వేకటికి సిగ్గులేదు.\n\n* బూచీలకు బెదరునా బుగుడూరు సంత.\n\n* బూటకానికి బుడ్డ దిగితే, ఆవిలిస్తే అవిసిపోయిందట.\n\n* బూటాలకం దాసరికి బుఱ్ఱనిండా నామాలే. (మధ్య వైష్ణవునికి నామములు పెద్ద).\n\n* బూడిదలో చేసిన (పోసిన) హోమం వలె.\n\n* బూడిదలో పోసిన పన్నీరు బుడబుడ (వలె).\n\n* బూతులేకున్న నీతి లేదు.\n\n* బూనాచి మాటలు బూడిదకు కూడా రావు.\n\n* బూబులు నాకుతుంటే నవాబుకు నాట్యాలా?\n\n* బూబులే నాకుతుంటే పీర్లకు మహానైవేద్యమా?\n\n* బూరుగ చెట్టంత పొడవుగా ఎదిగినా చిలుకకు ఫలవృత్తి కలుగబోదు.\n\n* బూరె దర్శనం బువ్వ కోసమే.\n\n* బూరు(ర)గ పండును నమ్ముకొనిన చిలుకకు దూదే దక్కినట్లు.\n\n* బూర్లెగంప కాడ పొర్లు దండాలు.\n\n\n\n**********:: బె ::**********\n\n* బెండ్లు మునిగి గుండ్లు తేలినట్లు.\n\n* బెడసి ముందుకు పడడు, జడిసి వెనక్కు పడడు.\n\n* బెత్తలకు బేడల చారు, మాయింటిలో చింతగుగ్గిళ్ళు.\n\n* బెద(ది)రించి బెండకాయ పులుసు పోసినట్లు.\n\n* బెదరించి బెదరించి బెల్లపు కుండకు తూటు పొడిచిందట.\n\n* బెల్లం అని అరచేత వ్రాసి నాకిన తీపగునా?\n\n* బెల్లమున్న చోటే ఈగలు ముసిరేది.\n\n* బెల్లపు పిళ్ళారికి ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.\n\n* బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం.\n\n* బెల్లపు వినాయకుని ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.\n\n* బెల్లమని అరచేత వ్రాసి నాకితే నోటికి తీపి కలుగునా?\n\n* బెల్లము ఉందని మోచేతిదాకా నాకినట్లు.\n\n* బెల్లము ఉండా అంటే అల్లము ఉంది అన్నట్లు.\n\n* బెల్లము ఉన్నంతసేపే ఈగలు ముసిరేది.\n\n* బెల్లము కొట్టిన గుండ్రాయి వలె.\n\n* బెల్లము పారవేసి చెయ్యి నాకినట్లు.\n\n* బెల్లము వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ.\n\n* బెస్త పెగ్గెలు - ఊబమగని విరదాళ్ళు (విరదాళ్ళు=వీరత్రాళ్ళు).\n\n\n\n**********:: బే ::**********\n\n* బేగడరాగం మీగడతో సమానం.\n\n\n\n**********:: బొ ::**********\n\n* బొంక నేర్చి, ఱంకు నేర్వాల.\n\n* బొంకరా గురవా అంటే, గురజాల దోమలు గురిగింజ లంతేసి అన్నాడట.\n\n* బొంకరా బొంకరా పోలుగా అంటే, ఎద్దు గిట్టలో ఏడు చావిడాలు (చవిడాలు) అన్నాడట. (చవిడాలు=తాటిఆకు చేపలు ఎండబెట్టిన సముద్రపు చేపలు).\n\n* బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంటేసి అన్నాడట.\n\n* బొంగలు తిన్న నోరు, ఆడిపోసుకున్న నోరు ఊరుకోవు.\n\n* బొంగు లొట్టయినా, క(గ)ణుపు గట్టి.\n\n* బొండు (బొద్దు) మల్లెలు బోడిముండ కెందుకు?\n\n* బొంత కుట్టుకున్నవాడు కప్పుకోలేడా?\n\n* బొందల కుంటకు నల్లేరు మోసినట్లు.\n\n* బొక్కలో (బొరియలో) నిద్రబోయే నక్క కలలో తనవాతబడే కోళ్ళను లెక్కబెట్టుకొన్నట్లు.\n\n* బొక్కలో పిల్ల, డొక్కలో పిల్ల.\n\n* బొక్కినలో కొఱకంచు వలె.\n\n* బొగ్గు పాలుగడుగ పోవునా నైల్యంబు.\n\n* బొగ్గులకై కల్పతరువు పొడిచినట్లు.\n\n* బొగ్గులలో మాణిక్యం వలె.\n\n* బొగ్గులలో రామచిలుక వలె.\n\n* బొచ్చు కాలిస్తే బొగ్గులగునా? (బూడిద అగునా?)\n\n* బొటనివేలికి సున్నమైన దేమయా? అంటే, బోర్ల పడినానులే అన్నాడట.\n\n* బొట్టి కట్టితేగానీ ముండ మోయదు.\n\n* బొట్టు పసే గానీ బోనం పస లేదు.\n\n* బొట్టుబొట్లాకొండ, బోనీలకొండ. నెమిలమ్మ గ్రుడ్లయితే నేనెరుగనమ్మ.\n\n* బొద్దాకు తింటే బుద్ధి పెరుగునన్నట్లు.\n\n* బొమ్మకు మ్రొక్కినా నమ్మక ముండవలె.\n\n\n\n**********:: బో ::**********\n\n* బోగంవీధి ఈటుబోయిందంటే కోమట్లంతా గోచులు సర్దుకున్నారట.\n\n* బోగంవీధి కొల్లబోయిందంటే, సన్నాసులు గోచులు విప్పుకొని బయలుదేరినారట.\n\n* బోగందాని చళ్లకు, సంత సొరకాయకు గోటిగాట్లు ఎక్కువ.\n\n* బోగందాని తల్లు చస్తే అందఱూ పరామర్శించే వాళ్ళేగానీ, బోగందే చస్తే తొంగిచూచేవాళ్ళుండరు.\n\n* బోగముదాని వలపు, బొగ్గు తెలుపు లేదు.\n\n* బోటికి నీటూ - కూటికి చాటు.\n\n\n* బోడితలకు బొండు (బొద్దు) మల్లెలు ముడిచినట్లు.\n\n* బోడితలకు, బొటనివేలికి ముడి పెట్టినట్లు.\n\n* బోడి పెత్తనం - కోడి కునుకు (ఎంతోకాలం సాగవనుట).\n\n* బోడి పెత్తనం - తంబళ్ళ దొరతనం.\n\n* బోడినెత్తిన టెంకాయ కొట్టినట్లు.\n\n* బోడిమాను గాలికి మిండడు.\n\n* బోడిముండకు తలసుళ్ళు వెదకినట్లు.\n\n* బోడెద్దుకు పోట్లు మప్పినట్లు (మరపినట్లు).\n\n* బోదనం కొట్టితే రాజసం పండును.\n\n* బోనులో పడ్డ సింహం వలె.\n\n* బోయవాది కొక్కడే ప్రభువా/ బోగందానికి ఒక్కడే మగడా?\n\n* బోలెడు తిట్లయినా బొక్కెడు కొఱ్ఱలు కావు.\n\n* బోసినోటివానికి పేలపిండి ప్రీతి.\n\n* బోసిపంతికి దోకెడు నూనె, ఎట్లా తెత్తును ఏగాని?\n\n\n\n**********:: బ్ర ::**********\n\n* బ్రతకని బిడ్డ బారెడు.\n\n* బ్రతికి ఉంటే బలుసాకు ఏరుకొని తినవచ్చు.\n\n* బ్రతికి బావగారిని, చెడి స్నేహితుని చేరాలి.\n\n* బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది.\n\n* బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాము, బయట ఎవరు లేకుండా చూడమన్నాడట.\n\n* బ్రతికిన బ్రతుక్కి భగవద్గీత పారాయణమా?\n\n* బ్రతుకలేని వాడా బడి పెట్టుకోరా!\n\n* బ్రతుకలేని వాడు బడిపంతులైనట్లు.\n\n* బ్రతుకుటకు తినవలెను గానీ తినుటకై బ్రతుకరాదు.\n\n* బ్రతుకు లెన్నాళ్ళు? భాగ్యాలెన్నాళ్ళు?\n\n* బ్రమిసి బాపనయ్యని పోతే, శుక్రవారం చూపరా దన్నాడట.\n\n* బ్రహ్మంవంతి గురువుంటే సిద్ధయ్యవంటి శిష్యుడు ఉండనే ఉంటాడు.\n\n* బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు (రిమ్మ=పిచ్చి).\n\n* బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా, లంజ ముదిరినా పనికిరాదు.\n\n* బ్రహ్మచారి శతమర్కటః\n\n* బ్రహ్మఙ్ఞానులవారు వచ్చారు, పట్టుబట్టలు భద్రం.\n\n* బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొదువా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదువా?\n\n* బ్రహ్మయాలితాడు పంది రేవున దెంచ.\n\n* బ్రహ్మ వ్రాసిన వ్రాత చెఱిపేవాడు లేడు (తప్పునా?)\n\n* బ్రహ్మ వ్రాసిన వ్రాలుకు ఏడువనా? రాగుల సంకటికి ఏడువనా?\n\n\n\n**********:: బ్రా ::**********\n\n* బ్రాహ్మడా! బ్రాహ్మడా! నీ ఆచారమెంత? అంటే నీటికొద్ది అన్నాడట.\n\n* బ్రాహ్మడికీ బఱ్ఱెగొడ్డుకి చలేమిటి?\n\n* బ్రాహ్మణింటిలో పుట్టితి, భట్టింటిలో పెరిగితి, కోమటింటిలో చస్తి.\n\n* బ్రాహ్మణ పాలేరుతనం చేస్తావా? పల్లకీ ఎక్కుతావా? అంటే పల్లకి ఎక్కితే ఒళ్ళు కదులుతుంది, బ్రాహ్మణ పాలేరుతనమే చేస్తాను అన్నాడట.\n\n* బ్రాహ్మణ సేద్యం - శూద్రతర్పణం (సంతర్పణ).\n\n* బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా పసరము వంటిపూట పడ్డా మానెడు.\n\n* బ్రాహ్మణుని చేయి (నోరు) ఏనుగు తొండము ఊరుకోవు.\n\n* బ్రాహ్మణుని మీద సంధ్య, కోమటిమీద అప్పు నిలువవు.\n\n* బ్రాహ్మణులలో చిన్నకు బేస్తలలో పెద్దకు అవస్థలు.\n\n\n\n**********:: భ ::**********\n\n* భంగు(గి) తాగేవానికి హంగుగాళ్ళు పదిమంది.\n\n* భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు.\n\n* భక్తిలేని పూజ, పత్రి చేటు. (బత్తిలేని పూజ పత్తిచేటు).\n\n* భక్తివచ్చినా పట్టలేరు, పగ వచ్చినా పట్టలేరు.\n\n* భగవంతా నాకేం చింత అంటే, పొద్దున్నే లేస్తే పొట్టదే చింత.\n\n* భగవద్గీత పుచ్చుకుంటారా అంటే, కడుపు నిండింది ఇంక తినలేను అన్నాడట.\n\n* భటుడు వెంటలేక ప్రభుడు శోభింపడు.\n\n* భట్టాచార్యుల వట్టలు కాగానే తిరుచూర్ణపు బుఱ్ఱలగునా?\n\n* భజన చేయువాడు భక్తుండు కాడయా.\n\n* భయంగల బల్లి, బావచాటుకు పోయి బుఱ్ఱుమంది.\n\n* భయంగల మరదలు బావముందు బుఱ్ఱుమందట.\n\n* భయపడి పరుగెత్తేవానికి వారశూల అడ్డమా?\n\n* భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి.\n\n* భయానికి తగినట్లు కోట కట్టుకోవలె.\n\n* భరణీకార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.\n\n* భరణీకార్తెలో చల్లిన నువ్వుచేను కాయకు బరిగెడు గింజలు.\n\n* భరణి కురిస్తే ధరణి పండును.\n\n* భరణిలో పుడితే ధరణి ఏలును.\n\n* భరణిలో (ఎండలకు) బండలు పగులును, రోహిణిలో రోళ్ళు పగులును.\n\n* భరతుడికి పట్టాభిషేకం, రాముడికి రాజ్యం.\n\n* భరతుడు పట్నం - రాముడి రాజ్యము.\n\n* భర్త బడాయి భార్య మీదనే.\n\n* భర్త లోకం తన లోకం, కొడుకు లోకం పరలోకం.\n\n* భర్త వర్తనంబే సతికి గ్రాహ్యం.\n\n\n\n**********:: భా ::**********\n\n* భాంచేదు దేవుడికి మాదర్ చోద్ పత్రి.\n\n* భాగీరథీ పిచ్చుగుంతమీద పారినట్లు.\n\n* భాగ్యముంటే బంగారం తింటారా?\n\n* భాగ్యవశముగాని బ్రతుకులు లేవయా.\n\n* భాగ్యహీనునకు ఫలము లభించునా?\n\n* భానునరయ దివ్వెపట్టి వెదకురీతి.\n\n* భామల వలపు వేముల తియ్యదనము లేవు.\n\n* భారంలేని బావ చస్తే, దూలం పడ్డా దుఃఖం లేదు.\n\n* భారం పైన పడినప్పుడే బరువు తెలిసేది.\n\n* భార్య అనుకూలవతి అయితే సుఖి అగును, లేకుంటే వేదాంతి అగును.\n\n* భార్యచేతి పంచభక్ష్య పరమాన్నం కన్నా, తల్లి చేతి తవిటిరొట్టె మేలు.\n\n* భార్య మాట బ్రతుకు బాట.\n\n* భావాయ పున్నమకు పరగళ్ళు పచ్చబడతాయి.\n\n* భాస్కరాచార్య్ల (భాష్యకారుల) వెంట్రుకలైతే మాత్రం, వీనకు తంతు లవతవా?\n\n* భాషకు తగిన వేషముండాలి.\n\n* భాషలెల్ల వేరు పరతత్వమొక్కటే.\n\n\n\n**********:: భి ::**********\n\n* బిక్షం బిడబిడా అంటే, దొంతులు లొడాలొడా అన్నాయట.\n\n* భిక్షాధికారైనా కావాలి, లక్షాధికారైనా కావాలి.\n\n\n\n**********:: భూ ::**********\n\n* భూతాలకు బుద్ధిలేదు, నరునకు బద్ధం లేదు.\n\n* భూదేవి అల్పసంతోషి, కాస్త కఱ్ఱుతో గిలిగింత (చక్కిలగిలి) పెట్టగానే నిండుపంటతో కలకల లాడుతుంది.\n\n* భూమి కొత్త అయితే భోక్తలు కొత్తా?\n\n* భూమి కొత్తదైన భూమేలు కొత్తవా?\n\n* భూమిని చూర్ణం చేస్తే, పట్టెడెరువే పుట్టెడు పండిస్తుంది.\n\n* భూనిని రాజుని కాచుకున్నవాడు చెడడు.\n\n* భూములిచ్చినట్లు భూపతు లీయగలరా?\n\n\n\n**********:: భో ::**********\n\n* భోగములకెల్లను నెచ్చెలి జవ్వనంబు.\n\n* భోగాపురం బొల్లి మేఘాలు అక్షయపాత్ర కనుగ్రహమా?\n\n* భోజనం చేసిన వానికి అన్నంపెట్ట వేడుక, బోడితలవానికి వెంట్రుక వేడుక.\n\n* భోజనానికి నేను, మా బొప్పడు, లెక్క చెప్పను నేనొక్కడనే అన్నాడట.\n\n* భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు.\n\n* భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకొని వస్తానన్నట్లు.\n\n* భోజునివంటి రాజుంటే, కాళిదాసువంటి కవి ఉండనే ఉంటాడు.\n\n\n\n**********:: భ్ర ::**********\n\n* భ్రమరంబు తనరూపు క్రిముల కిచ్చినరితి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 874,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-బ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* మంగలంబుచేయి మంగలి హీనుడా?\n\n* మంగలములోని పేలాల వలె.\n\n* మంగలికత్తికి మాకులు తెగునా?\n\n* మంగలికత్తి వాయిని (వాదరను) నాలికతో నాకినట్లు.\n\n* మంగలి కొండోజి మేలు మంత్రులకంటెన్\n\n* మంగలి గొరిగి నేర్చుకుంటే, వైద్యుడు చంపి నేర్చుకుంటాడు.\n\n* మంగలిని చూచి ఎద్దు కాలు కుంటిందట.\n\n* మంగలిపని అనుకున్నావా తడిపి దిగ గొరగడానికి? (ఎగ గొరగడానికి?)\n\n* మంగలి పాత, చాకలి కొత్త.\n\n* మంగలివాని కత్తికి తన చేతిలోనూ విశ్రాంతి ఉండదు, ఇతరుల చేతిలోనూ విశ్రాంతి ఉండదు.\n\n* మంగలివాని దిబ్బ తవ్వేకొద్దీ బొచ్చే.\n\n* మంగలివాళ్ళ పెళ్ళికి మఱొక దెబ్బ (డోలు).\n\n* మంగళోళ్ళ ఇంటెనక బొచ్చుదిబ్బకాక మరేముంటుంది?\n\n* మంగళగిరి మూల మాడంత మబ్బు ఏలితే ఈమని జంపనల్లో ఈతలు మోతలు.\n\n* మంగళవారం నాడు మండెలు వేయకూడదు.\n\n* మంచము అల్లలేని మగవాడు - మజ్జిగ చిలకలేని ఆడది.\n\n* మంచము కోళ్ళకు, మాతామహులకు ముడివేసినట్లు.\n\n* మంచ మున్నంతవరకు కాళ్ళు చాచుకోవాల.\n\n* మంచ మున్న దగ్గఱే నీళ్ళాడమన్నట్లు.\n\n* మంచముపై ముసుగులు, మనసులో విసుగులు.\n\n* మంచముపై ఉన్నంతసేపు మగడు, కిందకి దిగితే యముడు.\n\n* మంచ మెక్కిన మీదట మర్యాదలేల?\n\n* మంచమెక్కి వరుస లడిగినట్లు.\n\n* మంచమెక్కి వావి తడవినట్లు.\n\n* మంచి ఉల్లిగడ్డకు మంచి బొడ్డు.\n\n* మంచికాలానికి మామిళ్ళు, చెడుకాలానికి చింతలు (కాయుట).\n\n* పంచి పగడాలు చూపి, మాయ పగడాలు అమ్మినట్లు.\n\n* మంచికి పోతే చెడ్డ ఎదురైనట్లు.\n\n* మంచికి పోతే మంచినీళ్ళు కూడా పుట్టవు.\n\n* మంచి కొంచమైనా చాలు, విత్తనం చిన్నదైనా చాలు.\n\n* మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగాలేకుంటే మావాడు చేశాడనుకో.\n\n* మంచిగొడ్డు కొక దెబ్బ, మంచి మనిషి కొక మాట.\n\n* మంచిచెడ్డలు దేవును కుడి ఎడమ చేతులు.\n\n* మంచిచెడ్డలు పడుగు పేకలు.\n\n* మంచి చేసిన ముంగికి ముప్పు వచ్చినట్లు.\n\n* మంచి దున్నపోతయినా మందకొడి ఎద్దుకు సరిరాదు.\n\n* మంచినోరు చేదు మింగినట్లు.\n\n* మంచి పెంపు, చెడ్ద లోతు అన్ని దేశాలలో అన్ని జాతులలో సమానం.\n\n* మంచి ప్రాణానికి మండలం వఱకు భయం లేదు (మండలం=40 దినాలు).\n\n* మంచి మంగలైనా, ఎగ గొరిగితే మంటే.\n\n* మంచి మంచి ముహూర్తాలు మీఇంట్లోనూనా? మాచకమ్మ సమర్తలు మాఇంట్లోనూనా?\n\n* మంచి మంచి వారంతా మడుగులో మునిగితే, కోణంగిదాసరి కోనేటిలో మునిగెనట.\n\n* మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.\n\n* మంచివాడు మంచివాడంటే, మంచమంతా ఏరిగి పెట్టినాడట.\n\n* మంచివాడు మంచివాడంటే, మంచమంతా కంతలు చేసినాడట.\n\n* మంచివాడు మంచివాడంటే, మంచమెక్కి గంతులు వేశాడట.\n\n* మంచివాడు మంచివాడంటే, మదురెక్కి ఉచ్చ పొశాడట.\n\n* మంచివాడైనందుకు మరణమే శిక్ష.\n\n* మంచివాని కొకమాట, మొరకు కొక వ్రే(ఏ)టు.\n\n* మంచివాని చావు మరణంలో తెలుస్తుంది.\n\n* మంచివాని గుణం మాంసం దగ్గఱ, సత్యవంతుడి గుణం చావు దగ్గఱ తెలుస్తుంది.\n\n* మంచివానికి మాటే మందు.\n\n* మంచివాని దగ్గఱకు మంచివారిని పంపినారు, నీదగ్గరకు నన్ను పంపినారు.\n\n* మంచు కుంచాల కొలిచినట్లు.\n\n* మంచుకు పెట్టిన పందిళ్ళు ముసారాకు అగునా?\n\n* మంచుకు వేసిన పందిళ్ళు వాన కాగునా?\n\n* మంజులాలాపము లేని కావ్యము, విలాసములేని వధూటి.\n\n* మంటి ఎద్దయినా మా ఎద్దే గెలవాలి.\n\n* మంటిదేవునికి మజ్జనమే సాక్షి.\n\n* మంటిపనికైనా ఇంతివాడే వెళ్ళాలి.\n\n* మంటిలో మానెడు, ఇంటిలో పుట్టెడు.\n\n* మంత్రం చెప్పను మల్లుభట్లు, తినేదానికి తిప్పంభట్లు.\n\n* మంత్రం లేని తీర్థం మరి బుక్కెడు.\n\n* మంత్రం లేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు.\n\n* మంత్రంలో పసలేకపోయినా తుంపర్లకు తక్కువ లేదు.\n\n* మంత్రజలము కంటే మంగలి జల మెచ్చు.\n\n* మంత్రసాని తనానికి ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి.\n\n* మంత్రసాని దెప్పులు, అత్తగారి సాధింపులు.\n\n* మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు, బిడ్డ వచ్చినా పట్టాల, పియ్య వచ్చినా పట్టాల.\n\n* మంత్రసాని ముందట మర్మం దాచినట్లు.\n\n* మంత్రాలబువ్వ కడుపులోనికిపోతే యంత్రాలు చేయిస్తుంది, యంత్రాలున్న బువ్వ కడుపులోనికి పోతే తంత్రాలు చేయిస్తుంది.\n\n* మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా?\n\n* మంత్రాలు తక్కువ, తుంపరు లెక్కువ.\n\n* మందగుది ఎద్దు నడక, నత్తిమాటలు - మొదటసాగవు.\n\n* మందబలం చూచి కుక్క మొరుగుతుంది.\n\n* మందలింపు బెడిస్తే ముప్పు.\n\n* మందికి చెప్పానుగానీ మనకు చెప్పానా?\n\n* మందిని ముంచి మసీదు కట్టినట్లు.\n\n* మంది పలుచనైతే, గంజి చిక్కన అవుతుంది.\n\n* మంది మాటవిని మనువుపోతే, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది.\n\n* మంది యెక్కువయితే (మోపయితే) మజ్జిగ పలుచన.\n\n* మంది యెక్కువయితే 9లావయితే) మఠానికి చేటు.\n\n* మందు పథ్యం, మాటకు సత్యం.\n\n* మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు.\n\n* మందుగానీ మాకు లేదు గానీ కూర్చువా డొక్కడే కొదువ.\n\n* మందుమాకిడి గండమాల మాంపగలేడు చక్కచేయగలడే నక్కమొర (గండమాల=మెడచుట్టు మేహగ్రంధులు లేచు వ్యాధి).\n\n* మందూ లేదు గుండూ లేదు, తుపాకీ పట్టుక కాల్చమన్నట్లు.\n\n* మందైనా కావాలి, ముండైనా కావాలి.\n\n* మకరందపానంబు మధుకరాలికిగాక జోరీగలు జుఱ్ఱగలవా?\n\n* మకురాంకు కేళికోర్చిన ముకురానన మల్లయుద్ధమున కెట్లు ఓపు.\n\n* మక్కాకు పోయి కుక్క (బొచ్చు) మలం తెచ్చినట్లు.\n\n* మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.\n\n* మక్కువపడి ముక్కాలిపీటా చేయించుకుంటే, డోరియాకోక కత్తిరించుక పోయిందట.\n\n* మగడు విడిచిన ముండ, మబ్బు విడిచిన ఎండ.\n\n* ముఖాపంచకము సదా వంచకము.\n\n* మగడు ఒల్లనమ్మను మారీ ఒల్లదు.\n\n* మగడు చచ్చిన తర్వాత ముండకు బుద్ధివచ్చినట్లు.\n\n* మగడు లేని మనువున్నదా?\n\n* మగడు చిన్నకాగానే ముండమోపితనం తప్పునా?\n\n* మగడు నబాబైనా బూబమ్మకు కుట్టుపోగులే (కాడలే).\n\n\n* మగడు శయ్యకు పిలిచిన రాని మగువ, మిండడు వలుకులమిట్ట కీడ్చినా పోవును (వలుకులమిట్ట=వల్లకాడు).\n\n* మగని చుట్టాలు చెప్పులు ముంగిట విడిస్తే. ఆలిచుట్టాలు అరపరమటింట్లో విడుస్తారు.\n\n* మగని తిట్టినాపె, మరదిని మన్నించునా?\n\n* మగనిసొమ్ము తిని, మిండని పాట పాడినట్లు.\n\n* మగ బయిసి లేని మీసమెందుకంటే, ఎరువు నీళ్ళు లేకుండా అట్టే ఎదిగే వాటికి నేనేమి చేసేది అన్నాడట.\n\n* మగవాడు తిరుగక చెడును, ఆడది తిరిగి చెడును.\n\n* మగవాని పెండ్లా? ఆడదాని పెండ్లా? అంటే, అదేమో నాకు తెలియదు, గాడిపొయ్యిదగ్గర కాస్త వేస్తే గతికి వచ్చినాను అన్నాడట.\n\n* మగవాని బ్రతుకు చిప్పనిండ మెతుకు, ఆడదాని బ్రతుకు గంజిలో మెతుకు.\n\n* మొగాళ్ళ మెరుగులు మొగాలపైనే కనిపిస్తవి.\n\n* మగ్గం గుంతలో పాముంది, మగాళ్ళుంటే పిలవ్వే అన్నాడట.\n\n* మగ్గాని కొకరాయి మరవకుండా పట్టండి.\n\n* మాఘకు మానికంత చెట్టయితే, కార్తీకానికి కడవముంతంత గుమ్మడికాయ.\n\n* మాఘ తిమిరితే మదరుమీద కఱ్ఱైనా పండును (తిమురు=ఉఱమక మెఱయు).\n\n* మాఘపుబ్బలు వరపయితే, మహత్తర క్షామం.\n\n* మాఘపుబ్బలు వరపయితే,మీఅన్నసేద్యం, నాసేద్యం మన్నే.\n\n* మాఘలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి.\n\n* మాఘలో పుట్టి, పుబ్బలో మాడినట్లు (గిట్టినట్లు).\n\n* మాఘలో మానెడు చల్లుటకంటె ఆశ్లేషలో అడ్డెడు చల్లుట మేలు.\n\n* మాఘలో మానెడు, పుబ్బలో పుట్టెడు.\n\n* మచ్చనాలుక వానికి మాట నిలకడలేదు.\n\n* మచ్చాలు (మత్యాలు) దినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి? అన్నాడట.\n\n* మజ్జిగకు వచ్చి బఱ్ఱెను బేరమాడినట్లు.\n\n* మజ్జిగకు వచ్చి, ముంత దాచినట్లు.\n\n* మట్టికుండలో ఉంటే మనోవ్యాధి, తోలుపొట్టలో ఉంటే తోచి ఉంటుంది.\n\n* మట్టిగడ్డలో కప్ప కూస్తే ఒక జాములో వాన.\n\n* మట్టిగుఱ్ఱాన్ని నమ్మి, ఏట్లో దిగినట్లు.\n\n* మట్టిగోడ కడితే రొంపే.\n\n* మట్టు మీరు మాటకు మారు లేదు.\n\n* మట్టేద్దయినా మా ఎద్దే మంచిది.\n\n* మడత కుడుములు, శేషపాంపులు.\n\n* మడికి గట్టు, ఇంటికి గుట్టు.\n\n* మడికి గట్టు, మాటకు గుట్టు.\n\n* మడికి మంద, చేనుకు ఎరువు.\n\n* మడిచారుమీద మనుపోయ, అటికెడు చారు బోర్ల పోయెనే.\n\n* మడి దున్ని మనినవాడు, చేను చేసి చెడినవాడు లేడు.(మడీ=మాగాణి; చేను=మెట్ట).\n\n* మడి దున్ని మహారాజైనవాడు, చేనుదున్ని చెడ్డవాడు లేడు.\n\n* మడిన పడ్డనీరు, పైపడ్డ దెబ్బ పోవు.\n\n* మడిమల్లేసి బిదాణం పీకేసి సరువ కోసేసి.(బిదాణం=తులసికోట; సరువ=బిందె; చెరవ=చేదుటకు ఉపయోగించునది).\n\n* మడి బీదకాదు, రైతు పేద గాని.\n\n* మడుగు చీరకు మసి తాకినట్లు (మడుగు=చలువచేసి మడతపెట్టిన గుడ్డ).\n\n* మడ్డిముండకు మల్లెపూలిస్తే, మడిచి ముడ్డికింద పెట్టుకున్నదట.\n\n* మణిని మణితో కోయవలె (వజ్రం వజ్రాన్ని భేదిస్తుంది).\n\n* మణుం గొట్టగా మాసం చిక్కినాడు.\n\n* మణుగు సగము, మైలా సగమే.\n\n* మణులు చెక్కిన సంకెళ్ళ వలె.\n\n* మతి ఎంతో గతి అంత.\n\n* మతిమరపువాడు నీళ్ళచాయకు (చెంబొట్లకు) పోయినచోట ముడ్డి మరచివచ్చినాడట.\n\n* మతిమరుపుల వానికి ముల్లిరుపుల వాడు.\n\n* మతిమరుపులో నీళ్ళలో బడి, ఈదను మరచిపోయినాడట.\n\n* మతిమీద మన్ను పోతు, ఉప్పుకు పోయి నిప్పు తెత్తు.\n\n* మతి లేనమ్మకు గతిలేని మగడు.\n\n* మతి లేని మాట - శృతిలేని పాట.\n\n* మతిలెన్ని చెప్పినా మంకుబుద్ధి మానదు.\n\n* మతు లెన్ని చెప్పినా మామపక్కనే గానీ తొంగోనన్నదట (పడుకుంటా నన్నదట).\n\n* మదికాశ ఘటింపని మోవి, గుత్తలంజల పరమైన దీవి.\n\n* మదిలోన నొకటి, మాటలాడు టొకటి.\n\n* మదురుమీది పిల్లి వాటము (వలె, మాదిరి) (సమయానుకూలంగా అటొ ఇటో దూకును).\n\n* మదురు వారమడియైనా కావలె, మాటకారి మగడైనా కావలె (వార =ఎడము, ప్రక్కన).\n\n* మద్దులు మునిగి పార, వెంపళ్ళు తమకెంత బంటి యన్నట్లు.\n\n* మద్దికాయలు మాటిడ్డ మాడ్కి.\n\n* మద్దిమాను చేల్లో ఎద్దులు మేస్తే, మాముద్దలు మానునా?\n\n* మద్దెల తాళగతులు దెలియకనే మర్ధించుట సుఖమా?\n\n* మద్దెల బోయి రోలుతో మొరబెట్టుకొన్నట్లు.\n\n* మద్దెలలోని ఎలుక వలె.\n\n* మద్యపానం చేయను మడిగుడ్డ కావలెనా?\n\n* మద్యపాయికి అనరాని మాట లేదు.\n\n* మధ్యవైష్ణవుడు నామములకు పెద్ద.\n\n* మనకు పులి భయం, పులికి మన భయం.\n\n* మన గుమ్మడికాయలు మంచివైతే, బజార్లో ఎందుకు దొర్లుతుంటాయి?\n\n* మన చల్ల మనమే పలుచన చేసుకుంటామా? (అనుకుంటామా?)\n\n* మనదికాని పట్నం మహాపట్నం.\n\n* మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుంటుందా?\n\n* మన నువ్వులలో నూనె లేకపోతే, గానుగవాణ్ణి అంటే ఏమిలాభం?\n\n* మన బంగారం మంచిదైతే, కంసాలి ఏమిచేయగలడు?\n\n* మన మెఱుగని చెవులకు మద్దికాయలా?\n\n* మనసిచ్చీ మనసివ్వక (మనసురాక) మనువుకుబోతే నిలుచున్నట్లే నిద్రవచ్చిందట.\n\n* మనసుకు నచ్చినవాడు మగడుగానీ మంగళసూత్రం కట్టగానే మగడుగాడు.\n\n* మనసు విరిగితే అతుక్కోవచ్చునిగానీ కుండపగిలితే అతుకరాదు.\n\n* మనసుంటే మార్గముంటుంది.\n\n* మనసు కుదిరితే మల్లి, మనసు కుదరకుంటే ఎల్లి.\n\n* మనసు దిద్దరాదు మహిమీద నెవనికి.\n\n* మనసు మండిగెలు చేసుకుంటే గోధుమ లేవడిస్తాడు?\n\n* మనసు మహామేరువు దాటును, కాలు కందకం దాటదు (గడప దాటలేదు).\n\n* మనసున నాటిన మాటలు చెరపలేరు.\n\n* మనసునిల్ప శక్తిలేకపోతే మంచివిరుల పూజేమి చేయును?\n\n* మనసులేని మనువు వలె.\n\n* మనసులేనివాని మంత్రంబు లేలయా?\n\n* మనసులోని వెతకు మందు లేదు.\n\n* మనసులోని మర్మం చాటుకొనే మానవుడు మాతలు నేర్చినాడు.\n\n* మనసులోని మర్మం నీళ్ళలోని లోతు ఎరుగలేరు.\n\n* మనసులోని మర్మం ముఖమే వెల్లడించును.\n\n* మనసు విరిగెనేని మరియంట నేర్చునా?\n\n* మనసెఱుగని కల్లా, ఒళ్ళెరుగని సివమా? (ఉండవనుట).\n\n* మనసో మామగారి తద్దినమో అన్నారు.\n\n* మనస్సుకు మనస్సే సాక్షి.\n\n* మనస్సులో ఎంత ఉంటే, సోదెలో అంతే వస్తుంది.\n\n* మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రములేల?\n\n* మన ఉన్న ప్రాణాన్ని మంట గలిపినట్లు.\n\n* మనిషి ఉన్ననాడు మజ్జిగ లేదు, ఒలికమీద కట్టివేయను పాడిఆవు (ఒలికి=స్మశానము).\n\n* మనిషి కాటుకు మందులేదు.\n\n\n* మనిషి కోతి అయ్యే దెప్పుడంటే తానద్దం చూచుకొనేటప్పుడు\n\n* మనిషి మంచిచెడ్డలు తెలుసుకోవాలంటే అతనిని అధికారపీఠంలో పెట్టాలి.\n\n* మనిషికి ఉన్నది పుష్టి, పసరానికి తిన్నది పుష్టి.\n\n* మనిషికి ఒకమాట, పండు కొక రుచి (పశువు కొక దెబ్బ).\n\n* మనిషికి గాక కష్టాలు మాకులకు వస్తవా?\n\n* మనిషికి మాటే అలంకారము.\n\n* మనిషి కొక తెగులు మహిలో వేమ అన్నారు.\n\n* మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ.\n\n* మనిషి గబ్బు మారుమారు, నా గబ్బు తీరుతీరు.\n\n* మనిషి చస్తే మాట మిగులుతుంది, ఎద్దు చస్తే ఎముక మిగులుతుంది.\n\n* మనిషి తిండిమోయన దున్నపోతు తిండి-దెయ్యపు తిండి మధ్యన.\n\n* మనిషి పేదయితే, మాటకు పేదా?\n\n* మనిషి పోచికోలు కాడు (పోచికోలు=వృద్ధుడు).\n\n* మనిషి బొమ్మవ్రాసి క్రింద మనిషి అని ఎందుకు వ్రాసావంటే, లేకుంటే కోతి అనుకుంటా రన్నాడట.\n\n* మనిషి మంచిదే కానీ గుణం గుడిసేటిది.\n\n* మనిషి మర్మము, మాని చేవ బయటకి తెలియవు.\n\n* మనిషి మీద పీడ మహిమీద పోయింది.\n\n* మనుగ(గు)డుపు పెండ్లికొడుకు వలె.\n\n* మనుగుడుపు నాటి మాటలు మనివిన నాడుండవు.\n\n* మనుజుడొకటి తలంప దైవమొకటి తలంచు.\n\n* మనువు చెడి ముండ బుద్ధిమంతురాలయింది\n\n* మనువు నిత్యం కాదు, ఏకులరాట్నం అమ్మబోకు అన్నట్లు.\n\n* మనువును నమ్ముకొని బొంత బోర్ల (పొయ్యిలో) వెసుకొన్నట్లు.\n\n* మను వొక్కచోట మనసు ఇంకొకచోట.\n\n* మనుషు లందరి తలపైనా మంగలి చేయ్యి.\n\n* మనుషులు పోయినా మాటలు నిలుస్తాయి.\n\n* మనోవ్యాధికి మందు లేదు.\n\n* మన్ననలేని మహీపతి కొలువు, లాలన లేని లంజ పొందు ఒకటే.\n\n* మన్ను తిని మంచినీళ్ళు త్రాగినట్లు.\n\n* మన్ను తిన్న పాము వలె.\n\n* మన్నును నమ్మి దున్నినవాడే మన్నీడు.\n\n* మన్ను పట్టితే బంగారం, బంగారం పట్టితే మన్ను.\n\n* మన్ను, మిన్ను మెత్తనయితే మనుష్యులకు బ్రతుకు.\n\n* మన్ను వెళ్ళకుండా దున్నితే, వెన్ను వెళ్ళకుండా పండును.\n\n* మన్మథవేదనకు, మందబుద్ధికి మందులేదు.\n\n* మన్మధుడే పురుషుడైనా మాయలాడి తన మంకుబుద్ధి మానదు.\n\n* మన్యం మఱిగిన మనిషి, మాదిగాడ (మాదిగపల్లి) మఱగిన కుక్క వెనక్కి రావు.\n\n* మప్పడం (మరపడం) తేలికే గానీ తిప్పడం కష్టం.\n\n* మబ్బును వెతుక్కుంటూ పైరుపోదు, ఆవును వెతుక్కుంటూ దూడపోదు.\n\n* మబ్బులు చెదిరిపోయినా వాననీరు నిలిచే ఉంటుంది.\n\n* మబ్బులో పొద్దు మాయమైపోతే, కోడళ్ళ ప్రాణాలు కొలికిళ్ళకొచ్చె.\n\n* మప్పులో పొద్దు మగడాలిని చెఱచును.\n\n* మమత విడువకున్న మానునా మానంబు.\n\n* మరుగుజ్జు మహామేరువు ఎక్కినా మరుగుజ్జే.\n\n* మరుదండపు మిడిసిపాటు మననీయదు.\n\n* మరుదండమునకు విలసనములు మెండు\n\n* మఱచిపోయి చచ్చినాను, ప్రాణమా! రమ్మంటే వస్తుందా?\n\n* మఱచిపోయి మజ్జిగలో చల్లపోశాను అన్నట్లు\n\n* మఱచిపోయి మజ్జిగలో చేమిరి వేసినట్లు (చేమిరి=తోడు పెట్టుట).\n\n* మఱచిపోయి మారుబొట్టులో మజ్జిగ పోసినానన్నట్లు (మారుబొట్టు=మజ్జిగ).\n\n* మరుగుభాషపై మన్నుపొయ్యి, గంజిలో ఇంత ఉప్పెయ్యి.\n\n* మరులున్న వాడే మగడు.\n\n* మరువముతోనే పరిమళము.\n\n* మర్యాదకుపోతే మానం దక్కదు.\n\n* మర్యాదరామన్న మాట తప్పినా, నా వేటు తప్పదు.\n\n* మఱ్ఱిచెట్టుక్రింద మొక్కలు మొలవవు, అయ్యక్రింద ఎవ్వరు ముందుకురారు.\n\n* మల నల్లబడితే వాన, చన్ను నల్ల బడితే బిడ్డ.\n\n* మలప గేదే మానెడు ఇచ్చును.\n\n* మలపసన్యాసికి మాచకమ్మకు జత.\n\n* మలబారులో చెవులు కుడుతారని మాయవరం నుంచి చెవులు మూసికొని పోయినట్లు.\n\n* మలలు మింగే మహదేవునికి తలుపొక అప్పడం.\n\n* మలుగులు క్రుంగితే (గుంజితే) మావటికి ఈనును (చూడుపసరం) (మలుగు= ముడ్డికీలు భాగం).\n\n* మల్ల తెచ్చుకో అయ్యా! అంటే మఱింత బువ్వెట్టు అన్నట్లు.\n\n* మల్లిని చెయ్యబోతే పిల్లి అయినట్లు.\n\n* మల్లీ! మల్లీ! మంచానికి కాళ్ళెన్ని? అంటే, మూడున్నొకటి అన్నదట.\n\n* మల్లె పట్టిన చేమవలె (మల్లె= ఒక చీడ వంటి కలుపు).\n\n* మసిపాతలో మాణిక్య మట్లు.\n\n* మసిపూసి మారేడును నేరేడు చేసినట్లు.\n\n* మసిబొగ్గు కస్తూరి మహిమ దీపించినా పరిమళానంద సౌభాగ్య మీదు.\n\n* మసి మొగము వాడు, చమురు కాళ్ళ వాడు పోగయినట్లు.\n\n* మసీదికాలె మదార్ సాబ్ అంటే, సందెడు బొంతలు చంకనున్నాయి అన్నాడట.\n\n* మహాంతమైన లొల్లి మానెడు వడ్లు అలుకదు.\n\n* మహాభారంలో ఆదిపర్వతం అన్నట్లు.\n\n* మహామహావాళ్ళు మడుగులో పడుతుంటే కోణంగి దాసరి కోనేటిలో పడెనంట.\n\n* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే పుల్లాకు నా గతేమి అన్నదట.\n\n* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే, గోడ చాటు వారికి శరణు శరణు.\n\n* మహామహావాళ్ళు మన్ను మూకుళ్ళు అయిత్యే, నీవొక జల్లిమూకుడివి.\n\n* మహారాజావారని మనవిచేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట.\n\n* మహారాజుకైనా మన్ను నమ్మిన వాడే అన్నం పెట్టాలి.\n\n* మహారాజు పెంతదింటే మందుకు, పేదవాడు తింటే కూడులేక అన్నట్లు.\n\n* మహారాజులమే కాని, పొయ్యి రాజదు.\n\n* మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి.\n\n* మహావృక్షం క్రింద మొక్కలు పెఱుగవు.\n\n\n\n**********:: మా ::**********\n\n* మాంసం తింటామని ఎముకలు మెడకు కట్టుకుంటామా?\n\n* మాంసం తింటాడని పేగులు మెడలో వేసుకుంటాడా?\n\n* మాంసం తినేవాడు పోతే, బొమికెలు తినేవాడు వస్తాడు.\n\n* మాంసం మాంసాన్ని పెంచుతుంది.\n\n* మాంసమంటే సైసుయ్ పైసలంటే కైకుయ్\n\n* మా ఆయనే ఉంటే, మంగలివాణ్ణి అయినా పిలుచుకు వచ్చేవారు కదా.\n\n* మా ఇంటాయనకు మగతనముంటే, పొరుగింటాయన పొందెందుకు?\n\n* మా యింటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?\n\n* మా కాయుష్యమస్తు! మా కారోగ్యమస్తు! అని దీవించుకొనినట్లు.\n\n* మాకు కుడుము, మీకు వక్క (మూకుడు).\n\n* మాగి చెడ్డ గొడ్డు మాదిగింటికైనా తగదు.\n\n* మాగి పొద్దు మాటాడ దీరదు.\n\n* మాగిలి దున్నితే మరింత పంట.\n\n* మాగిలి దున్నితే మాలవానికైనా పైరగును.\n\n* మాఘ(ఖ) ,మాసపు చలి మంటలో పడ్డా తీరదు.\n\n* మాఘమాసపు వాన - మగడులేని చాన.\n\n* మాఘమాసంలో మ్రాకులు సైతం వణకును.\n\n\n* మాచకమ్మ సమర్త మఖయితే నేమి? పుబ్బయితే నేమి? మఱి పునర్వసైతే నేని?\n\n* మాచకమ్మకు మరునింట నాచు మెండు; వంధ్యకు మైథునేచ్చ మెండు.\n\n* మాచకమ్మకు ముత్యాలసర మదేల?\n\n* మా చక్కెరతో మీ పొంగ లెందుకు వండాలి?\n\n* మాచర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.\n\n* మాటంటే మహరాజుగూడ నిలబడతాడు.\n\n* మాటకారి నీటుకాడు.\n\n* మాటకు పడిచస్తాము కానీ, మూటకు పడి చస్తామా?\n\n* మాటకు ప్రాణము సత్యము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము వ్రాలు.\n\n* మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి.\n\n* మాటకు మాట తెగులు, నీటికి నాచు (పాచి) తెగులు.\n\n* మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం.\n\n* మాటకు ముందు ఏడ్చె మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు.\n\n* మాటకు సొంపు, పాటకు ఇంపు.\n\n* మాటగొప్ప చెప్ప మాటలు చాలవు.\n\n* మాట గొప్ప మానిక పిచ్చ.\n\n* మాట చుట్టమే గానీ, పూట చుట్టం కాదు.\n\n* మాట చూదనిదే మనసీయరాదు.\n\n* మాత మాటకు తప్పు, జోడి నెత్తిన ముప్పు.\n\n* మాటలకు మల్లి, చేతలకు ఎల్లి.\n\n* మాటలకు మా ఇంట్లో, మాపటికి మీ ఇంట్లో.\n\n* మాటలకు ఆ-లకు పేదరికం లేదు.\n\n* మాటల తేటలు(తీపి) మా ఇంటికాడ, మాపటితిండి మీ ఇంటికాడ.\n\n* మాటలచేత భూపతులు మన్ననలిత్తురు.\n\n* మాటలచేత మన్ననలు పొందవచ్చును.\n\n* మాటలచేత మహాకాళిని నవ్వించవచ్చు.\n\n* మాటలచేత మహారాజుబిడ్డను మనువు తెచ్చుకోవచ్చు.\n\n* మాటలచేత మాన్యాలు సంపాదించవచ్చు.\n\n* మాటలతో మూటలు కొనవచ్చు.\n\n* మాటల పసేగానీ చేతల పస లేదు.\n\n* మాటలలోనే మనుబోలువారు పిడూరు దాటినట్లు.\n\n* మాటలలోపడి మగనిని మఱచినట్లు.\n\n* మాటల సత్రానికి నాదో పల్లా (నాదొక బస్తా) (పల్లా= ఒక కొలమానిక).\n\n* మాటలు ఆకులు, చేతలు పండ్లు (కాయలు).\n\n* మాటలు ఎప్పుడు నిలుపాలనో తెలియనివాడే వదరుబోతు (వాయాడి).\n\n* మాటలు కోటలు దాటును, కాలు గడప దాటదు.\n\n* మాటలుచెప్పే మొనగాండ్లేగానీ, పూట బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు.\n\n* మాటలు తల్లిమాటలు, పెట్టు సవతితల్లి పెట్టు.\n\n* మాటలు నేరకున్న నవమానము అన్యము మానభంగమున్.\n\n* మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే ఇసుకో అన్నదట.\n\n* మాటలు నేర్చినమ్మ ఏడ్చినా ఒక సొంపే (బాగుంటుంది).\n\n* మాటలు నేర్వలేకపోతే, పూటలు గడువవు.\n\n* మాటలు పోయినాక, మూటలు పనికిరావు.\n\n* మాటలు మంచి, చేతలు చెడ్డ.\n\n* మాటలేగానీ చొరనీదు మాచకమ్మ.\n\n* మాటలే మంత్రాలు, మాకులే మందులు.\n\n* మాటలో నీటుంది, మాటలో పోటుంది, మాటలో సూటి ఉంది.\n\n* మాట వెండి, మౌనం బంగారం.\n\n* మాటే లేకుంటే చోటే లేదు.\n\n* మాట్లాడ నేరిస్తే, పోట్లాడరాదు (పోట్లాడ పనిలేదు).\n\n* మాట్లాడితే మరామేకు (మరచీల).\n\n* మాట్లాడితే మల్లెలు, కాట్లాడితే కందు(తి)రీగలు.\n\n* మాట్లాడుతుంటే వచ్చేవి మాటలు, గోరాడుతుంటే వచ్చేవి వెంట్రుకలు (బొచ్చు).\n\n* మాట్లాడే వానికి వినే వానికి అర్థం కానిదే వేదాంతం.\n\n* మాడపన్ను కొరకు మహిషంబు నమ్మితి, మడమనూరి వృత్తి మాలవృత్తి.\n\n* ' మాణవా ధీశర, మణువు నాలికవాడు ' అని సెట్టిగారు పురాణం చదివితే, ' అబ్బో! అంత పెద్ద నాలిక ఎవరికుంది? ' అని ప్రశ్నించగా, ' ఇనుము యిదర్భదేశమున యీరుడికుండెను ' అన్నాడట ఇంకొక శ్రోత.\n\n* మానిక్యం పోయి, పసిపాత దొరికినట్లు.\n\n* మాణిక్యానికి మసి పూసినట్లు.\n\n* మాతకు గజ్జలాడితే, మాదిగకు సివమెత్తుతుంది.(మాత= పెండ్లి లేకుండా జాతరలో సిందువేయు మాదిగ స్త్రీ).\n\n* మాతాతలు నేతులు తాగారోయి, మా మూతులు వాస్న చూడండొయ్.\n\n* మాదాకవళమమ్మా! అంటే మా ఇంటాయన నీకు కనుపించలేదా? అన్నదట.\n\n* మాదిగ మంచానికి కాళ్ళవైపూ ఒకటే, తలవైపూ ఒకటే.\n\n* మాదిగ మంపు మాపటిదాక, కాపు మంపు కపిల వేళదాక (మంపు=మాంద్యము, మత్తు; కపిల=మోట).\n\n* మాదిగ మల్లి, కంసాలి ఎల్లి (మల్లి=మళ్ళీ రమ్మనుట; ఎల్లి=రేపు రమ్మనుట).\n\n* మాదిగవాని బ్రతుకు ముదురుమీద గడ్డి ఒకటే.\n\n* మాదిగవాని ఆలయినా, మాడే కాలికి చెప్పు లేదు.\n\n* మాదేవుని సత్యం మాకు తెలియదా?\n\n* మా దొబ్బే రెడ్డి వచ్చాడు, కోళ్ళ గూటిలో మంచంచేయి అన్నత్లు.\n\n* మాధవభట్లకు పడిశము ఏటా రెండుమార్లు రావటమూ, వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలుండటము.\n\n* మాధుకరం వానింటికి ఉపాదానం వాడు పోయినట్లు.\n\n* మాధ్వులకు భుక్తి, వైష్ణవులకు భక్తి, అద్వైతులకు యుక్తి.\n\n* మానంది (మహానంది)తిరుణాళ్ళమన్నాయె గాని, ఏట్లో పడుకుంటే నోట్లో చేసిపోయినారు.\n\n* మానం పోయిన వెనుక ప్రాణ మెందుకు.\n\n* మానవ సేవే మాధవ సేవ.\n\n* మానవ జీవితాన్ని పాలించేది విధేగానీ విఙ్ఞానం కాదు.\n\n* మానవుడు తాను చేసిన పనిముట్టుకే పనిముట్టయి పోతున్నాడు.\n\n* మానవు లుందరు గానీ, మాటలు ఉండి (నిలచి) పోతవి.\n\n* మానికకు కరవు లేదు, కోమటికి పరువు లేదు.\n\n* మానిన పుండును మళ్ళీ రేపినట్లు.\n\n* మానిన పుండు మళ్ళి సెలపోసినట్లు (సెలపోయు=తిరిగి చీము పోయు).\n\n* మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంత ఉన్నది వైద్యుడా! అన్నాడట.\n\n* మానిన పండ్లు మాని కిందనే పడును (రాలును).\n\n* మాన్పిందే మందు, మాంపినవాడే వెజ్జు.\n\n* మాన్పిందే మందు, బ్రతికిందే ఊరు.\n\n* మానుకొద్దీ చెక్కు తీయాలి.\n\n* మానుగొట్టి మీద ద్రోసికొన్నట్లు.\n\n* మానుపిల్లి అయినా మట్టిపిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి.\n\n* మానుమాను దిరుగు మహికోతి కైవడి.\n\n* మానెడు గింజలకు పనికి బోతే కుంచెడు గింజలు దూడ తినిపోయిందట.\n\n* మానెడు పిండవచ్చును గానీ, చిట్టెడు తిరిగి ఎక్కించలేము.\n\n* మానెడు మంటిలో పోసుకుంటే, ఇద్దుము యింటిలో పోసుకుంటారు.\n\n* మానేదానికి మండేలా? మానని దానికి మందేలా?\n\n* మా పిల్లవానికి ముప్ఫైరెండు గుణాలున్నవిగానీ, రెండుమాత్రం తక్కువ.\n\n* మా బావ వామహస్తానికి తోడు చాదస్తం.\n\n* మాబఱ్ఱె చస్తే చచ్చింది గానీ, పెద్దాయన బఱ్ఱె పాలివ్వకపోతే చాలు.\n\n* మాబూసాహేబ్ పెండ్లామైతేనేమి? బాబూసాహేబ్ పెండ్లామైతే నేమి? మన ఇంట్లో పాచిపని మతకం లేకుండా చేస్తే చాలు.\n\n* మామతో కూడా మంచమల్లి, తాతతో కూడ తడక కట్టటానికి వచ్చిందట.\n\n* మామతో గూడ వేడన్నంతిని, అక్కతో గూడ పైటన్నం తిని, అమ్మతో గూడ అంబలి తాగేవాడు.\n\n* మామ బంతికి కూర్చొని, అత్తబంతికి లేస్తాడు.\n\n* మామా ఒక ఇంటి అల్లుడే! అత్తా ఒక ఇంటి కోడలే.\n\n\n* మాచకమ్మ సమర్త మఖయితే నేమి? పుబ్బయితే నేమి? మఱి పునర్వసైతే నేని?\n\n* మాచకమ్మకు మరునింట నాచు మెండు; వంధ్యకు మైథునేచ్చ మెండు.\n\n* మాచకమ్మకు ముత్యాలసర మదేల?\n\n* మా చక్కెరతో మీ పొంగ లెందుకు వండాలి?\n\n* మాచర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.\n\n* మాటంటే మహరాజుగూడ నిలబడతాడు.\n\n* మాటకారి నీటుకాడు.\n\n* మాటకు పడిచస్తాము కానీ, మూటకు పడి చస్తామా?\n\n* మాటకు ప్రాణము సత్యము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము వ్రాలు.\n\n* మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి.\n\n* మాటకు మాట తెగులు, నీటికి నాచు (పాచి) తెగులు.\n\n* మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం.\n\n* మాటకు ముందు ఏడ్చె మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు.\n\n* మాటకు సొంపు, పాటకు ఇంపు.\n\n* మాటగొప్ప చెప్ప మాటలు చాలవు.\n\n* మాట గొప్ప మానిక పిచ్చ.\n\n* మాట చుట్టమే గానీ, పూట చుట్టం కాదు.\n\n* మాట చూదనిదే మనసీయరాదు.\n\n* మాత మాటకు తప్పు, జోడి నెత్తిన ముప్పు.\n\n* మాటలకు మల్లి, చేతలకు ఎల్లి.\n\n* మాటలకు మా ఇంట్లో, మాపటికి మీ ఇంట్లో.\n\n* మాటలకు ఆ-లకు పేదరికం లేదు.\n\n* మాటల తేటలు(తీపి) మా ఇంటికాడ, మాపటితిండి మీ ఇంటికాడ.\n\n* మాటలచేత భూపతులు మన్ననలిత్తురు.\n\n* మాటలచేత మన్ననలు పొందవచ్చును.\n\n* మాటలచేత మహాకాళిని నవ్వించవచ్చు.\n\n* మాటలచేత మహారాజుబిడ్డను మనువు తెచ్చుకోవచ్చు.\n\n* మాటలచేత మాన్యాలు సంపాదించవచ్చు.\n\n* మాటలతో మూటలు కొనవచ్చు.\n\n* మాటల పసేగానీ చేతల పస లేదు.\n\n* మాటలలోనే మనుబోలువారు పిడూరు దాటినట్లు.\n\n* మాటలలోపడి మగనిని మఱచినట్లు.\n\n* మాటల సత్రానికి నాదో పల్లా (నాదొక బస్తా) (పల్లా= ఒక కొలమానిక).\n\n* మాటలు ఆకులు, చేతలు పండ్లు (కాయలు).\n\n* మాటలు ఎప్పుడు నిలుపాలనో తెలియనివాడే వదరుబోతు (వాయాడి).\n\n* మాటలు కోటలు దాటును, కాలు గడప దాటదు.\n\n* మాటలుచెప్పే మొనగాండ్లేగానీ, పూట బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు.\n\n* మాటలు తల్లిమాటలు, పెట్టు సవతితల్లి పెట్టు.\n\n* మాటలు నేరకున్న నవమానము అన్యము మానభంగమున్.\n\n* మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే ఇసుకో అన్నదట.\n\n* మాటలు నేర్చినమ్మ ఏడ్చినా ఒక సొంపే (బాగుంటుంది).\n\n* మాటలు నేర్వలేకపోతే, పూటలు గడువవు.\n\n* మాటలు పోయినాక, మూటలు పనికిరావు.\n\n* మాటలు మంచి, చేతలు చెడ్డ.\n\n* మాటలేగానీ చొరనీదు మాచకమ్మ.\n\n* మాటలే మంత్రాలు, మాకులే మందులు.\n\n* మాటలో నీటుంది, మాటలో పోటుంది, మాటలో సూటి ఉంది.\n\n* మాట వెండి, మౌనం బంగారం.\n\n* మాటే లేకుంటే చోటే లేదు.\n\n* మాట్లాడ నేరిస్తే, పోట్లాడరాదు (పోట్లాడ పనిలేదు).\n\n* మాట్లాడితే మరామేకు (మరచీల).\n\n* మాట్లాడితే మల్లెలు, కాట్లాడితే కందు(తి)రీగలు.\n\n* మాట్లాడుతుంటే వచ్చేవి మాటలు, గోరాడుతుంటే వచ్చేవి వెంట్రుకలు (బొచ్చు).\n\n* మాట్లాడే వానికి వినే వానికి అర్థం కానిదే వేదాంతం.\n\n* మాడపన్ను కొరకు మహిషంబు నమ్మితి, మడమనూరి వృత్తి మాలవృత్తి.\n\n* ' మాణవా ధీశర, మణువు నాలికవాడు ' అని సెట్టిగారు పురాణం చదివితే, ' అబ్బో! అంత పెద్ద నాలిక ఎవరికుంది? ' అని ప్రశ్నించగా, ' ఇనుము యిదర్భదేశమున యీరుడికుండెను ' అన్నాడట ఇంకొక శ్రోత.\n\n* మానిక్యం పోయి, పసిపాత దొరికినట్లు.\n\n* మాణిక్యానికి మసి పూసినట్లు.\n\n* మాతకు గజ్జలాడితే, మాదిగకు సివమెత్తుతుంది.(మాత= పెండ్లి లేకుండా జాతరలో సిందువేయు మాదిగ స్త్రీ).\n\n* మాతాతలు నేతులు తాగారోయి, మా మూతులు వాస్న చూడండొయ్.\n\n* మాదాకవళమమ్మా! అంటే మా ఇంటాయన నీకు కనుపించలేదా? అన్నదట.\n\n* మాదిగ మంచానికి కాళ్ళవైపూ ఒకటే, తలవైపూ ఒకటే.\n\n* మాదిగ మంపు మాపటిదాక, కాపు మంపు కపిల వేళదాక (మంపు=మాంద్యము, మత్తు; కపిల=మోట).\n\n* మాదిగ మల్లి, కంసాలి ఎల్లి (మల్లి=మళ్ళీ రమ్మనుట; ఎల్లి=రేపు రమ్మనుట).\n\n* మాదిగవాని బ్రతుకు ముదురుమీద గడ్డి ఒకటే.\n\n* మాదిగవాని ఆలయినా, మాడే కాలికి చెప్పు లేదు.\n\n* మాదేవుని సత్యం మాకు తెలియదా?\n\n* మా దొబ్బే రెడ్డి వచ్చాడు, కోళ్ళ గూటిలో మంచంచేయి అన్నత్లు.\n\n* మాధవభట్లకు పడిశము ఏటా రెండుమార్లు రావటమూ, వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలుండటము.\n\n* మాధుకరం వానింటికి ఉపాదానం వాడు పోయినట్లు.\n\n* మాధ్వులకు భుక్తి, వైష్ణవులకు భక్తి, అద్వైతులకు యుక్తి.\n\n* మానంది (మహానంది)తిరుణాళ్ళమన్నాయె గాని, ఏట్లో పడుకుంటే నోట్లో చేసిపోయినారు.\n\n* మానం పోయిన వెనుక ప్రాణ మెందుకు.\n\n* మానవ సేవే మాధవ సేవ.\n\n* మానవ జీవితాన్ని పాలించేది విధేగానీ విఙ్ఞానం కాదు.\n\n* మానవుడు తాను చేసిన పనిముట్టుకే పనిముట్టయి పోతున్నాడు.\n\n* మానవు లుందరు గానీ, మాటలు ఉండి (నిలచి) పోతవి.\n\n* మానికకు కరవు లేదు, కోమటికి పరువు లేదు.\n\n* మానిన పుండును మళ్ళీ రేపినట్లు.\n\n* మానిన పుండు మళ్ళి సెలపోసినట్లు (సెలపోయు=తిరిగి చీము పోయు\n\n* మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంత ఉన్నది వైద్యుడా! అన్నాడట.\n\n* మానిన పండ్లు మాని కిందనే పడును (రాలును).\n\n* మాన్పిందే మందు, మాంపినవాడే వెజ్జు.\n\n* మాన్పిందే మందు, బ్రతికిందే ఊరు.\n\n* మానుకొద్దీ చెక్కు తీయాలి.\n\n* మానుగొట్టి మీద ద్రోసికొన్నట్లు.\n\n* మానుపిల్లి అయినా మట్టిపిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి.\n\n* మానుమాను దిరుగు మహికోతి కైవడి.\n\n* మానెడు గింజలకు పనికి బోతే కుంచెడు గింజలు దూడ తినిపోయిందట.\n\n* మానెడు పిండవచ్చును గానీ, చిట్టెడు తిరిగి ఎక్కించలేము.\n\n* మానెడు మంటిలో పోసుకుంటే, ఇద్దుము యింటిలో పోసుకుంటారు.\n\n* మానేదానికి మండేలా? మానని దానికి మందేలా?\n\n* మా పిల్లవానికి ముప్ఫైరెండు గుణాలున్నవిగానీ, రెండుమాత్రం తక్కువ.\n\n* మా బావ వామహస్తానికి తోడు చాదస్తం.\n\n* మాబఱ్ఱె చస్తే చచ్చింది గానీ, పెద్దాయన బఱ్ఱె పాలివ్వకపోతే చాలు.\n\n* మాబూసాహేబ్ పెండ్లామైతేనేమి? బాబూసాహేబ్ పెండ్లామైతే నేమి? మన ఇంట్లో పాచిపని మతకం లేకుండా చేస్తే చాలు.\n\n* మామతో కూడా మంచమల్లి, తాతతో కూడ తడక కట్టటానికి వచ్చిందట.\n\n* మామతో గూడ వేడన్నంతిని, అక్కతో గూడ పైటన్నం తిని, అమ్మతో గూడ అంబలి తాగేవాడు.\n\n* మామ బంతికి కూర్చొని, అత్తబంతికి లేస్తాడు.\n\n* మామా ఒక ఇంటి అల్లుడే! అత్తా ఒక ఇంటి కోడలే.\n\n\n* మామా! మామా! గోచి ఊడిందేమి? అని వదినె మరదళ్ళు అంటే, మిమ్మల చూచే లేండి, ఊరుకొండి- అన్నాడట.\n\n* మామిడికాయలు తరిగితే, కత్తిపీట వాదర పులుస్తుందా?\n\n* మామిడిచెట్టుకు మడిగుడ్డ కట్టి, దొంగలు ఎక్కరులే అన్నట్లు.\n\n* మామిడి మగ్గితే సజ్జలు పండును.\n\n* మామిళ్ళ కాఙ్ఞ గానీ, గుగ్గిళ్ళకు ఆఙ్ఞా?\n\n* మామిళ్ళకు మరణాలు, చింతలకు సిరులు (మామిడికాపు ఎక్కువైన సంవత్సరం అరిష్టము, చింతకాపు ఎక్కువైన సంపద అని).\n\n* మామిళ్ళు కాస్తే మశూచికాలు మెండు.\n\n* మామిళ్ళకు మంచు చెఱుపు, కొబ్బరికి కుడితి చెఱుపు.\n\n* మామిళ్ళు నరికి మోదుగలు నాటినట్లు (పువ్వులకు మురిసి).\n\n* మాయలవాడు మహితాత్ము సాటియా?\n\n* మా యింటాయన కెంత మతిమరుపంటే నీళ్ళలోబడి ఈదను మరచిపోయినాడు.\n\n* మా యింటాయన వ్రసింది మా యింటాయెనే చదువాలంటేం మా యింటాయన రాసింది మా యింటాయూనే చదువలెడన్నదట ఇంకొకతె.\n\n* మాయింటిమగవారు మమ్ము దొబ్బుటేగాని పొరుగింటి పోరుల పొంత పోరు.\n\n* మా ఇంట్లో తిని మీ ఇంట్లో చేయి కడుక్కో మన్నట్లు.\n\n* మాయ సంసారం- మంటి దొంతులు.\n\n* మారకం మొన్నటి మాదిరే, తిండి ఎప్పటి మాదిరే.\n\n* మారికి వారశూలా?\n\n* మారిన తనయింటికి రమ్మనినవానిని ఏమనాల?\n\n* మారుచీర లేక మేలుచీర కట్టుకొన్నట్లు.\n\n* మారుమనువు చేసుకొని, మొదటిమొగని సుద్దులు చెప్పినట్లు.\n\n* మారు పెట్టించుకోక (పోసుకోకుండాపోతే) మరల రాదు (మారు=మజ్జిగ, మరల పెట్టించుకొనుట).\n\n* మారు లేని తిండి మాల తిండి, దొరలేని తిండి దయ్యపు తిండి.\n\n* మారులోకానికి వెళ్ళినా, మారు తల్లి వద్దు.\n\n* మార్గశిరంలో మాట్లాడటానికి పొద్దుండదు.\n\n* మార్గశిరాన మామిడి పూత.\n\n* మార్జాలస్వప్నాలు మాంసం మీదనే.\n\n* మాలకు మాంసం గొడారికి తోలు (గొడారి=మాదిగ).\n\n* మాలకూటికి పోయినా నీళ్ళపప్పే.\n\n* మాలకూటికి లోబడ్డా పప్పుబద్ద దొరకలేదు.\n\n* మాలజంబం మల్ల (మూకుడు) మీద, వానజంబం ఊసరం మీద.\n\n* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మదురెక్కి నీళ్ళచాయ కూర్చున్నదట (నీళ్ళచాయ=చెంబట్లు, దొడ్డికిపోవుట, నీటివైపుపోవుట అనుట\n\n* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మరికాస్త ముందరింట్లోకి వచ్చిందట.\n\n* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మఱింత బిగుసుకొన్నదట.\n\n* మాలపల్లెలో మంగళాష్టకాలు.\n\n* మాలపున్నమ ముందర మాదిగవాడైనా చల్లడు.\n\n* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?\n\n* మాలబింకె(కా)లు మందబయలున, వానబింకాలు బొల్లిచవుళ్ళలోను.\n\n* మాలముద్దు వెన్నగాల్చి పెట్టబోయిందట.\n\n* మాలలకు మంచాలు, బావలకు పీటలా?\n\n* మాలవాడ కుక్క మఱి అన్న మెఱుగునా?\n\n* మాలవాడ(ను) కుక్క మరగిన చందంబు.\n\n* మాలవాడి పెళ్ళి మహసూల్ తో సరి (మహసూల్ = కుప్పనూర్పిళ్ళు).\n\n* మాలవాడు చేసినట్లు ఉండాల, సంసారి చెడ్డట్లే ఉండాల.\n\n* మాలాయగారికి తోలాయ గారు గురువు.\n\n* మాలీషు చేసినట్లూ ఉణ్దవలె, కాపు చెడ్డట్లూ ఉందవలె.\n\n* మాలోడికి నాకెందు కింతపెద్ద వాలగ అన్నాడట (వాలగ =ఒక రకమైన చేప).\n\n* మావాడు దెబ్బల కోరుస్తాడు అంటే, విడిపించే దిక్కులేక అన్నట్లు.\n\n* మావాళ్ళు వద్దన్నందుకు, మంగళగిరి తిరునాళ్లకు వెళ్ళినందుకు నాపని ఇంటే కావాలి- అన్నదట.\n\n* మావళ్ళు వద్దన్నదానికి, నేను వచ్చినదానికి, ఇతణ్ణపుదానికి, యిట్లానే కావాల కొట్టుకో మన్నదట.\n\n* మావి మాకిస్తే, మడిమాన్యా లిచ్చినట్లు.\n\n* మాస(ష) మెత్తు బంగారు మనిషిని గాడిద చేస్తుంది.\n\n* మాసికలేసిన గుడ్డ, దాసిదాని బిడ్డ.\n\n* మాసికలేసిన బొంత - లిద్ది వేసిన బండికుండ.\n\n* మాసికానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ.\n\n* మాసినతలకు మల్లెపూల అలంకారమా?\n\n* మాసేమో పెద్దమాసి, బుద్ధేమో గాడిద బుద్ధి (మాసి=మనిషి).\n\n\n\n**********:: మి ::**********\n\n* మింగను మెతుకులేకుంటే, లంజకు లత్తుకట\n\n* మింగను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అట.\n\n* మింగిన పిడసకు రుచి ఏమన్నట్లు.\n\n* మించినదానికి మంచి లేదు.\n\n* మింటికన్నా పొడుగు, నగరికన్నా ధాష్టీకం లేవు.\n\n* మింటికి మంటికి ముడివేసినట్లు.\n\n* మిండగాని జూచి గుందములో పడతాను అన్నదట.\n\n* మిండగాడు డబ్బివ్వకపోతే, మొగుడితో పోయినట్లనుకుంటాను పొమ్మన్నదట.\n\n* మిండడి ఈవి ఎంతో, లంజ మక్కువా అంతే.\n\n* మిండని నమ్ముకొని జాతరకు పోయినట్లు.\n\n* మిండల కొడుకుల సంపద దండుగలకే గాక (ఱండలకే గాక) దానధర్మము లగునా?\n\n* మిండలను మరిగినమ్మా, మీగడతిన్నమ్మా ఊరకుండరు.\n\n* మిగిలితే మిండడౌతాడు అన్నట్లు.\n\n* మిగిలిన సున్నాన్ని, మిగిలిన రాజును ఊరకే వదలరాదు.\n\n* మిట్టానువారి సైతాను మిడ్డెక్కి అదిలించినా పోదు.\n\n* మిట్టిపడును నరుడు చేటెరుగక.\n\n* మిడి(ణి)కి చచ్చేదాని ముందు కులికి చావాలి.\n\n* మిడిమేలపు మిండని ఉంచుకునేకంటే గట్టుకు మంచం మోయవచ్చు.\n\n* మిడుగురులు చీకట్ల నడచునా?\n\n* మిడుతంభట్లు జోస్యం వలె.\n\n* మిడుతంభట్లు తైతుల మిత్తి.\n\n* మితం తప్పితే, అమృతమైనా విషమే.\n\n* మితం తప్పితే, హితం తప్పుతుంది.\n\n* మిథునంలో పుట్టిన మొక్క, మీసకట్టులో పుట్టిన కొడుకు అక్కరకు వస్తారు.\n\n* మిద్దె ఉన్నవాడు బ్రతికి, గుడిసె ఉన్నవాడు చావడు.\n\n* మిద్దె మీద పఱుగు, మీసాలమీద మెఱుగు.\n\n* మినుములు తింటూ, అనుములు చేతిలో పెట్టినట్లు.\n\n* మిన్ను కలిగినా, కన్ను కలిగినా కారక మానవు (కలుగు=ఎఱ్ఱనగు).\n\n* మిన్నుపై బడినా మెలపుతో నఱచేతులొగ్గ జాలినవాడు.\n\n* మిన్ను విఱిగి మీదపడితే అరచేతితో అడ్డగలమా?\n\n* మిన్ను విఱిగి మీదపడ్డట్లు.\n\n* మిరపకాయ చిన్నదని మేల మాడరాదు.\n\n\n\n**********:: మీ ::**********\n\n* మీఇంటి గేదె, మాఇంటి దూడ, తీసుకురా తిమ్మక్కా వీసెడు నెయ్యి.\n\n* మీ ఇంట్లో తినివచ్చి మాఇంట్లో చేయి కడుక్కోమన్నట్లు.\n\n* మీ ఊరు మా ఊరికెంత దూరమో, మా ఊరూ మీ ఊరికి అంతేదూరం.\n\n* మీకు మాట, మాకు మూట.\n\n* మీగడ మింగేవానికి వెన్న ఎట్లా వస్తుంది?\n\n* మీగాలి మీద పడిన మెతుకు మిట్టి మిట్టి పడ్డట్లు.\n\n* మీగాళ్ళు వాచినమ్మా! ంఈ ఇంట్లో ఓండ్లి ఎప్పుడూ? అంటే, మోకాళ్ళు వాచినమ్మా! మొన్ననే అయిపోయింది అన్నదట.\n\n* మీ గొడ్డు కింత నున్న అంటే, మా బిడ్డ కింత వెన్న అన్నట్టు.\n\n* మీద మిల మిల, లోన లొటలొట.\n\n* మీద మెరుగులు, లోన పురుగులు.\n\n* మీనమేషాలు లెక్క బెట్టినట్లు.\n\n* మీను మ్రింగిన గ్రుక్కెడుతో మున్నీటికి కొరత ఏర్పడుతుందా?\n\n\n* మీబిడ్ద కింత తవుడంటే, మీబిడ్డ కిన్ని పాలు అన్నట్లు.\n\n* మీర లేని చుట్టం వస్తే, మిడకక తెల్లారదు.\n\n* మీసం పస మగ మూతికి.\n\n* మీసాల పసేగానీ, కోస నా బట్ట.\n\n* మీసాలు వడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటవని నమ్మక మేమి?\n\n* మీసాలెందుకు రాలేదురా? అంటే, మేనత్త (చాలు) చీలిక అని, గడ్డం వచ్చిందేమిరా? అంటే, అది మేనమామ పోలిక అన్నాడట.\n\n\n\n**********:: ము ::**********\n\n* ముంజ ముదిరినా, లంజ ముదిరినా కొరగావు.\n\n* ముంజలు తిన్నవానికంటే, మోరులు తిన్నవానికే తంటా.\n\n* ముంజేతి కంకణానికి అద్ద మెందుకు?\n\n* ముంజేతిలో సత్తువ ఉంటే, మణికట్టులతో వడ్లు మొదుగుతాయి.\n\n* ముంజేయి ఆడితే, మోచేయి ఆడుతుంది.\n\n* ముంజేయి మళ్ళితేనే మోచేయి మళ్ళేది.\n\n* ముండకు దొరికేది మొరటు (మోటు) మొగుడే.\n\n* ముండాకొడుకే కొడుకు, రాజు కొడుకే కొడుకు.\n\n* ముండ చావనూ చావదు, ముట్టు తప్పనూ తప్పదు\n\n* ముండ పెంచిన కొడుకు - ముకుదారం (తాడు) లేని కోడె.\n\n* ముండ ముప్పావుకు చెడ్డది, నరకుడు పావుకు చెడ్డాడు (నరకుడు=నరుడు).\n\n* ముండ మొయ్యవచ్చును గానీ, నింద మొయ్యరాదు.\n\n* ముండమోపి కాళ్ళకు మ్రొక్కితే, నీవూ నావలనే వర్థిల్లమని దీవించిందట.\n\n* ముండమోపి కేల ముత్యాల పాపిట.\n\n* ముండమోపి బలుపు - పాండురోగి తెలుపు.\n\n* ముండాకొడుకు మూటికి జెడితే, ముండ నూటికి జెడుతుంది.\n\n* ముండపై వలపుతో మోవి అనగానే జొల్లు, జుంటితేనె గాదు.\n\n* ముండ్లమీద పడ్డ బట్ట మెల్లిగా తీసుకోవలె.\n\n* ముండా కాదు ముత్తైదువా కాదు.\n\n* ముంత మూతికట్టు, సంచి సభ కట్టు.\n\n* ముంతెడు నీళ్ళకు ఉలిక్కి పడితే, బానెడు నీళ్ళు నీబావ పోసుకుంటాడా?\n\n* ముంతెడు పాలకు ముత్యమంత చేమిరి (మజ్జిగ).\n\n* ముందటివానికి ముంతం బలి, వెనకటివానికి తెడ్డెం బలి.\n\n* ముందరికాళ్ళకు బంధాలు వేసి, ముండల తాళ్ళు తెంపినట్లు.\n\n* ముందరికి వచ్చి కాలు విరుగపడ్డట్లు.\n\n* ముందరేరు పోతే, ఆరేరే ముందరే రౌతుంది.\n\n* ముందు అరకకు మొనగాళ్ళను కట్టవలె.\n\n* ముందు ఆకు (విస్తర) వేయించుకుంటే, రరువాత ఎప్పుడైనా తినవచ్చు.\n\n* ముందు(కుపోతే) గొయ్యి, వెనుక(కుపోతే) నుయ్యి.\n\n* ముందుకుపోతే మురికిముండ, వెనుకకుపోతే వెఱ్ఱిముండ.\n\n* ముందువచ్చే చండ్లను వెనుకకు నెట్టితే పోతవా?\n\n* ముందు చచ్చింది ముత్తైదువ, వెనుక చచ్చింది విధవ.\n\n* ముందు చూస్తే అయ్యవారి గుఱ్ఱంగా ఉంది. వెనుకచూస్తే సాహేబు గుఱ్ఱంగా ఉంది.\n\n* ముందుచేసిన తప్పు మూలను ఉంటే, వెనుకచేసిన తప్పు మంచం కాడికి వచ్చినట్లు.\n\n* ముందు నడిచే ముతరాచువాణ్ణి, వెనుకవచ్చే ఏనాదివాణ్ణి నమ్మరాదు.\n\n* ముందు నడిచే ముతరాచువాణ్ణి, ప్రక్కన వచ్చే పట్రాతివాణ్ణి నమ్మరాదు.\n\n* ముందు నడిపించి, కొంకులు కొట్తినట్లు.\n\n* ముందున్నది ముసళ్ళ పండుగ.\n\n* ముందున్నది ముసార్ల పండుగ\n\n* ముందు పెళ్ళాం బిడ్డలు ముంత ఎత్తుక తిరుగుతూ ఉంటే, లంజకు బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.\n\n* ముందు పోటు, వెనుక తన్ను (ఎద్దు చేసే పని).\n\n* ముందుపోయేది ముండ్లకంప, వెనుకపోయేది వెన్నముక్క.\n\n* ముందు ముచ్చట్లు, వెనుక తప్పట్లు (చప్పట్లు).\n\n* ముందు మునగ, వెనుక వెలగ (ఇంటికి కూడదు).\n\n* ముందు మురిసినమ్మ పండుగ గుర్తెరుగదు.\n\n* ముందు ముల్లు త్రొక్కి, వెనుక భద్రం అన్నట్లు.\n\n* ముందు వచ్చినందుకు మున్నూరు వరహాలు దండుగ, మళ్ళీ ఏలవస్తివే? మాయదారి తొత్తా?\n\n* ముందు వచ్చిన చెవులకంటే, వెనుక వచ్చిన కొమ్ములు (వాడి) ఎక్కువ.\n\n* ముందు వచ్చినదానికి మూగుళ్ళు, వెనుక వచ్చినదానికి వేగుళ్ళు.\n\n* ముందువాగికి ముందోపులు, వెనుకవారికి దొప్పదోపులు.\n\n* ముందు వాళ్ళకి మూకి(కు)ళ్ళు, వెనుక వాళ్ళకు నాకి(కు)ళ్ళు.\n\n* ముందు సంతకి అరవు ఏడ్చింది.\n\n* ముందే ముక్కిడి పైన పడిశం.\n\n* ముక్కిడికి తోడు పడిశము.\n\n* ముక్కిడి కిచ్చిన నత్తు, విత్తిన మొలువని వితు.\n\n* ముక్కిడి తొత్తుకు ముత్యపు నత్తేల?\n\n* ముక్కిడిదాని పాటకు ముండోడి మెచ్చుకోలు.\n\n* ముక్కు ఉండేవరకు పడిశ ముంటుంది.\n\n* ముక్కు ఏదిరా? అంటే, తలతిప్పి చూపించాడట.\n\n* ముక్కు కోసినా, ముందటి మొగుడే మేలు.\n\n* ముక్కుకోస్తే మూడ్నాళ్లకొస్తుంది, కొప్పకోయరా కుమ్మరిమగడా.\n\n* ముక్కు చిన్నది, ముత్యం పెద్దది (ముక్కెర పెద్దది).\n\n* ముక్కు చొచ్చి కంట్లో ప్రవేశించినట్లు.\n\n* ముక్కు డుస్సిన పసరం లాగు.\n\n* ముక్కు దాటితే ముఱికి, నాలుక దాటితే నరకం.\n\n* ముక్కు నలిపి దీపం పెట్టమంటే, మొగుడి (మామ) ముక్కు నలిపిందట.\n\n* ముక్కు పట్టని ముత్యం, చెవు పట్టని కమ్మ.\n\n* ముక్కు పట్టిన వానిచేత చీదించినట్లు.\n\n* ముక్కు పట్టుకుంటే ప్రాణం పోతుంది (దుర్బలుడనుట).\n\n* ముక్కు మూరెడు, సిగ బారెడు.\n\n* ముక్కు మూసుకుంటే, మూడు ఘడియలు.\n\n* ముక్కు మొగం లేని బిడ్డ, మొదలు తుది లేని పాట.\n\n* ముక్కులో ఏవేలు పెట్టినా సరిపోతుంది.\n\n* ముక్కులో చీమిడొయ్! అంటే, నీచేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.\n\n* ముక్కులోని వెంట్రుక కొప్పులోనికి వచ్చి, మూగవాడు అమ్మా! అన్ననాటికి చూతాంలే.\n\n* ముక్కెడి ముక్కుకు తక్కెడు బంగారమట.\n\n* ముఖం అందం, ముడ్డికి చేటు.\n\n* ముఖము చూస్తే కనబడదా మీగాళ్ళ వాపు?\n\n* ముఖము తేట, ముడ్డి తీట.\n\n* ముఖము బాగోలేదని అద్దం పగులగొట్టినట్లు.\n\n* ముఖము మాడుపు దీపమింటికి కొరగాదు, ఱంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు, ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు.\n\n* ముఖములో సుఖంలేదు, మోకాళ్ళలో బిగువులేదు.\n\n* ముఖస్తుతి, చేసినవానిని చేయించుకొనినవానిని ఇద్దరిని చెరచును.\n\n* ముఖానికి ముక్కాసర, దండకు కొలికాసర.\n\n* ముఖాలు చూచి బొట్టు పెడతారు, పిఱ్ఱలు చూచి పీటవేస్తారు.\n\n* ముగ్గిరి మధ్య ముంత దాగింది.\n\n* ముగ్గుపిండి అట్లకు పనికి వచ్చునా?\n\n* ముగ్గురికి తెలిస్తే మూడులోకాలకు పాకుతుంది.\n\n* ముగ్గురిని కూల్చెరా ముండదైవం.\n\n* ముగ్గురు ఆడవాళ్ళు కూడితే, పట్టపగలే చుక్కలు పొడుస్తాయి.\n\n* ముగ్గురు బిడ్దలను కంటే, ముసలివానికైనా కొరగాదు.\n\n* ముగ్గురు మూడు లోకాలయితే, ముసలిది మాయలోకం.\n\n* ముగ్గురెక్కిన బండి పొలిమేర దాటదు.\n\n* ముచ్చు ముండకేల ముంజేతి కడియాలు?\n\n\n* ముట్టుకుంటే ముత్యం, పట్టుకుంటే బంగారం.\n\n* ముట్టుకున్న మూడు దండుగలు.\n\n* ముట్లుడిగిన తర్వాత సమర్త సారె పెట్టినట్లు.\n\n* ముట్లుడిగిన దానికి (సతికి) మగబిడ్డ పుట్టినాడన్నట్లు.\n\n* ముడిబియ్యం తింటే, ముప్పు గడుస్తుందా?\n\n* ముడి మూరెడు సాగదు.\n\n* ముడివాటు సవాలుకు బ్రహ్మవాటు జవాబు.\n\n* ముడి వేసాక ముండైనా ముతకయినా తప్పదు.\n\n* ముడుపులు వెంకటేశ్వరుడికి, కేకలు గోవిందుడికి.\n\n* ముడ్డికాల్చి మూతికి వెన్న రాచినట్లు.\n\n* ముడ్డికిందకు నీళ్ళు వస్తే లేవక మానదు.\n\n* ముడ్డికి పేడ ఉన్నదెల్ల, బండి ఎద్దేనా?\n\n* ముడ్డిగిల్లి జోల పాడినట్లు.\n\n* ముడ్డి మీద తన్నితే మూతి (నోటి) పండ్లు రాలినట్లు.\n\n* ముడ్డిలో కారం చల్లి, విసనకఱ్ఱతో విసరినట్లు.\n\n* ముడ్డిలో జబ్బో, ముద్దలో జబ్బో తేలితేనే మందు.\n\n* ముడ్డిలో పుండుకు మేనమామ వైద్యం\n\n* ముతకో సతకో మూడుబట్టలు, కుంటో గుడ్డో ముగ్గురు పిల్లలు.\n\n* ముత్తెమంటి ముతరాచకులం చేపలు దిని చెడిపోయినట్లు.\n\n* ముత్తిని విడిచి సత్తిని తగిలించుకొన్నట్లు.\n\n* ముత్యమంత పదునుంటే, మూలాకార్తెలో చల్లినా ఉలవచేను కాయును.\n\n* ముత్యాలు పగడాలు, ముట్టుకున్న జగడాలు.\n\n* ముత్యపుచిప్ప లన్నిటికి ఒక రేవు, నత్తగుల్ల లన్నిటికి ఇంకొక రేవు.\n\n* ము(మొ)దలియారి జంభం ఆముదానుకి చేటు.\n\n* ము(మొ)దలియారుకు ఏమున్నదంటే, ఒక గుఱ్ఱపుబండి, యిద్దరు ముండలు, ఇంత బుడ్డ అన్నాడట.\n\n* ముదికొమ్మ, ముదిమాను చేవ.\n\n* ముదికొమ్మ వంగదు, ముదికొమ్మ కనదు.\n\n* ముదికొమ్మ వంగదు, ముదిగొడ్డు ఈనదు.\n\n* ముదిత చను మెత్తదైనా అధికారం మెత్తనైనా రోతురు.\n\n* ముదిముప్పున (ముసలి ముప్పందాన) అంగటి ముల్లు.\n\n* ముది మదితప్పిన మూడు గుణాలు.\n\n* ముదిముండ పాతివ్రత్యమునకు జొచ్చినట్లు (వృద్ధనారి పతివ్రత)\n\n* ముదిమికి ముచ్చట్లు లావు.\n\n* ముదియగా ముదియగా మోహము లావు.\n\n* ముదిరి చచ్చినా, ఎండి ఇడిసినా వగపులేదు.\n\n* ముదురున వెసిన పైరు, ముదిమిన పుట్టిన కొడుకు.\n\n* ముద్ద తలతిరిగి నోటికి వచ్చినట్లు.\n\n* ముద్ద ముద్దకీ బిస్మిల్లానా?\n\n* ముద్దరాలు మగడు ముదుసలి(ని) మెచ్చునా?\n\n* ముద్దవేసిన తట్టు, మూతినాకుడు మాటలు\n\n* ముద్దు చేసిన కుక్క మూతి నాకును, చనువు చేసిన భార్య చంక కెక్కును.\n\n* ముద్దున పేరు చెడె, మురిపాన నడక చెడె.\n\n* ముద్దులయ్య పోయి, మొద్దులయ్య అయినాడు.\n\n* ముద్దులాడితే ముక్కు నొక్కినట్లు.\n\n* ముద్దు మురిపం మావంతు, ముడ్డి దొడ్డి మీవంతు.\n\n* ముద్ర ముద్రగానే ఉండగా, ముగ్గురు బిడ్డల తల్లి అయినట్లు.\n\n* ముద్రలందు లేదు మూలమందేగాని.\n\n* మునగ చెట్టుకు మున్నూరు రోగాలు.\n\n* మునిగింది ముర్దారు, తేలింది హలాలు (ముర్దారు=అపవిత్రము; హాలాలు=పవిత్రము).\n\n* మునిగితే గుండు, తేలితే బెండు.\n\n* మునిగేవానికి తెలుసు నీటి లోతు.\n\n* మునిమాపటిమాటలు ముందుకు రావు.\n\n* మునుపుచెడ్డ ముత్తెమ్మా, గరిగబుడ్డి సమంగా బెట్టు.\n\n* మున్నీరుచే యీత నీదినట్లు.\n\n* మున్నూట అరవైనాలుగు శిగములున్నా ఒకటే, ముఫైఆరు గుల్లికొప్పు లున్నా ఒకటే.\n\n* మున్నూటరువది రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి.\n\n* మున్నూటికులానికి ముప్పు లేదు, మొండికాలికి చెప్పు లేదు.\n\n* మున్నూరు కాపత్తకు ముష్టికోడలు.\n\n* మున్నూరు రూపాయలిచ్చి అయినా, ముసలిదానిని కొనాల.\n\n* మున్నూరు వరహాలు పోయె, మూతి మీసాలు పోయె, నంబి సోమయాజులు అన్నమాట తప్పదాయె.\n\n* మున్నూరు శిఖలైనా కూదవచ్చును గానీ, మూడు కొప్పులు కూడరాదు.\n\n* ముప్పదిమూడుకోట్ల దేవతలు ముక్కు పట్టించగలరుగానీ, నారాయణా అనిపించగలరా?\n\n* ముప్పదిమూడు దున్నపోతులు కడిగేవాడికి, మూడు సాలగ్రామాలు ఒక లెక్కా?\n\n* ముప్పదియారు (ముప్ఫైయారు) జట్లు కూడుతాయిగానీ, మూడు కొప్పులు కూడవు.\n\n* ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు.\n\n* ముప్ఫై తట్టల పేడ మోసే పోలికి, మూడు పుంజాలదండ బరువా?\n\n* మురగన్న సందేహం, నిస్సందేహం.\n\n* మురికి భాండమునకు ముసరు ఈగల రీతి.\n\n* మురికిముండ ముచ్చట పేలపిండి చేటు.\n\n* మురికి మురికి ముత్తైదువకంటే, వెల్లడియైన విధవ మేలు.\n\n* మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు దీపం చేటు.\n\n* మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు ప్రాణం చేటు.\n\n* మురిపెమునకు మూడు నల్లపూసలు, కొలికికి ఒక తిరగలిరాయి.\n\n* ముంగ కాయకు ముండ్లెన్ని? అంటే, కాకరకాయకు గంట్లెన్ని? అన్నట్లు.\n\n* ముల(లు)గ కాయకు తగిన ముండ్లు, కాకరకాయకు తగిన కరకులు.\n\n* ములగ చెట్టుమీద కాకి గూటి వలె.\n\n* ముల్లాలు తిండికిలేక మొత్తుకుంటుంటే, పీర్లకు పంచదారా?\n\n* ముల్లును తీయను ముల్లే కావాల - దొంగను పట్టను దొంగే కావాల.\n\n* ముల్లుగట్టి (కట్టె; కోల) ఎడుగండ్ల ఎద్దులను నిలిపివేసినట్లు.\n\n* ముల్లుతీసి (పుచ్చి) కొఱ్ఱడచిన చందము.\n\n* ముల్లుతీసి గూటం కొట్టుకొన్నట్లు.\n\n* ముల్లును ముల్లుతోగాక రోకట దీయుదురా?\n\n* ముల్లు ముంతనేగాని పోదు.\n\n* ముల్లు వచ్చి అరటాకు మీదపడ్డా, అరటాకు వచ్చి ముల్లుమీద పడ్డా ఆకుకే మోసం (అపాయం).\n\n* ముషిణిచెట్టు అయినా, పచ్చని చెట్టు కొట్టరాదు (ముషిణి=ముష్టి; విషవృక్షం).\n\n* ముష్టికి నష్టి ఏమి?\n\n* ముష్టికి పోయి, తుష్టి లేదని ఏడ్చినట్లు.\n\n* ముష్టికి మూడు సంచులా?\n\n* ముష్టి మూడువిధాల (అందాల) సేద్యం.\n\n* ముష్టిలో ముష్టి, ధర్మముష్టి.\n\n* ముసలమ్మా! బుఱ్ఱ వణికిస్తావేమి? అంటే, ఊరకుండి నేనేమి చేస్తా నన్నదిట.\n\n* ముసలాడికి వగలాడి ఆలైనా, ఆత్రపు విటకానికి అతిభాషి లంజైనా వెతలే.\n\n* ముసలాపె (ముసలి ఆపె)తో వసంతా లాడినట్లు.\n\n* ముసలి ఆవు (పసరం) పేడ ముడ్డిలో ఉన్నా ఒకటే, దొడ్లో (చేటలో) ఉన్నా ఒకటే.\n\n* ముసలి కాలానికి ముప్పతిప్పలు.\n\n* ముసలికి ముఱ్ఱాట, బేపికి తొగురాట (ముఱ్ఱాట=మూల్గుట).\n\n* ముసలి కుక్కలు ఊరకె మొరగవు.\n\n* ముసలి ముండకేల ముసిముసి నగవులు?\n\n* ముసలిదానికి పెట్టినది, ముండకు పెట్టినది ఒకటే.\n\n* ముసలిదానికి ముండ ముద్దు.\n\n\n* ముసలి ముప్పందాన కుసుమరోగం వచ్చినట్లు.\n\n* ముసలి ముప్పున తొలిసమర్త.\n\n* ముసలివాడయినా బసిరెడ్డే మేలు.\n\n* ముసలివాని మాట, ముళ్ళులేని బాట.\n\n* ముసుగు మూడువేలు, ముసుగులో బొమ్మ మూడు దుగ్గాళ్ళు (దుగ్గాని= రెండు దమ్మిడీలు (దువ్వలు)).\n\n* ముసుగులో గుద్దులాట.\n\n* ముహూర్తం మంచిదైతే, ఎట్లా ముండ మోసెరా? అన్నట్లు.\n\n* ముళ్ళుండగానే పన్నీరుపువ్వు పనికి రాకుండా పోతుందా? (పువ్వుకు పరువు తగ్గిందా?)\n\n\n\n**********:: మూ ::**********\n\n* మూగవాని ముందర ముక్కు గోక్కున్నట్లు (గీరుకొన్నట్లు).\n\n* మూటికి ముడివేస్తే ఏమీలేదు (పెండ్లి అయిన తర్వాత).\n\n* మూడుకాసుల దానికి ముప్పావులా బాడుగ.\n\n* మూడుకొప్పులు ఒకటైతే ముల్లోకాలు ఏకమవుతవి.\n\n* మూడుజన్మల సంగతి చెప్పగలను, పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు, కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు, కనుక ముందు జన్మలో నాకేమీ ఉండదు.\n\n* మూడుతరాల దరిద్రుడు ముష్టికి వచ్చినట్లు.\n\n* మూడు దినాలుంటే మురికి చుట్టం.\n\n* మూడు దుగ్గానులకు మూతిమీసం గొరిగించుకొన్నట్లు.\n\n* మూడు దుగ్గానుల కోతి, ఆరు దుగ్గానుల బెల్లం తిన్నట్లు.\n\n* మూడు నాకి, ఆరు అతికినట్లు.\n\n* మూడునాళ్ళ ముచ్చటకు ఆరుజోళ్ళ చెప్పులా?\n\n* మూడునాళ్ళ ముచ్చటకు మురిసేవు ముందుగతి కానవు.\n\n* మూడునాళ్ళ భాగవతానికి మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.\n\n* మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కాకులు.\n\n* మూడు నెలలు సాముచేసి, మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు.\n\n* మూడు పావులాల గుడ్డ, ముప్ఫై రూపాయల కుట్టు.\n\n* మూడుపుట్ల చెవిటిదానికి ఆరుపుట్ల చెవిటివాడు ఆలోచన చెప్పినట్లు\n\n* మూడు బోనాలు సిద్ధమైనవి, దివ్వెకట్టె ముడికి వచ్చినది, దొరగారు సువారునకు రావచ్చును (సువారము= కోటలో కొలువు).\n\n* మూడు మనువులు వెళ్ళినా, పొయ్యి ఊదమన్నారు.\n\n* మూడు మాటలలో ఆరు తప్పులు.\n\n* మూడు మారులు తప్పిన, ఏడు దూరాలు.\n\n* మూడు మూరా ఒకచుట్టే, ముప్ఫైమూరా ఒకచుట్టే.\n\n* మూడు మూసి ఆరు అతికినట్లు\n\n* మూడువందలు పెట్టి గేదెను కొని, మూడణాలు పెట్టి తాడు కొనలేనట్లు.\n\n* మూడో తరగతిలో ఎందుకు ప్రయాణం చేసావంటే, నాల్గో తరగతి లేదు కాబట్టి అన్నాడట\n\n* మూడో పెండ్లివాడికి ముహూర్తం కావలెనా?\n\n* మూతి పెట్టినవాడు మేత పెట్టడా?\n\n* మూతి ముద్దుల కేడిస్తే, వీపు గుద్దుల కేడ్చిందట.\n\n* మూతులు నాకేవాడికి మీసాలెత్తే వాడొకడా?\n\n* మూరెడు ఇంట్లో బాఱెడు కఱ్ఱ, ఎట్లా కొడతావో కొట్టరా మొగుడా.\n\n* మూరెడు పొంగటం ఎందుకు? బారెడు కుంగటం ఎందుకు?\n\n* మూరె డేక్కే దెందుకు? బారెడు కుంగే(దిగే)దెందుకు?\n\n* మూరెడు ముందుకు పోనేల? బారెడు వెనక్కు రానేల?\n\n* మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద.\n\n* మూర్ఖు డెపుడు గోరు ముదితలతో పొందు.\n\n* మూర్ఖునకును బుద్ధి ముందుగానే పుట్టు.\n\n* మూర్తి కొంచమైనా, కీర్తి దొడ్డది (పెద్దది\n\n* మూల ఉండే వాళ్ళను ముంగిట్లోకి లాగినట్లు.\n\n* మూలాకార్తెకు వరి మూల చేరుతుంది.\n\n* మూలాకార్తెలో కురిస్తే, ముంగారు పాడు.\n\n* మూల ముంచును, జ్యేష్ట చెరచును (కురిసి).\n\n* మూలలో చల్లిన ఉలవలు మూడు పువ్వులు ఆరు కాయలు.\n\n* మూలవాన ముంచక తీరదు.\n\n* మూలవిగ్రహాలు ముష్టి ఎత్తుకుంటూ ఉంటే, ఉత్సవ విగ్రహాలకు దధ్యోదనమట.\n\n* మూలవిరాట్టు తిరిపమెత్తుకుంతుంటే, (మొత్తుకుంటుంటే) ఉత్సవ విగ్రహాలకు తెప్పతిరునాళ్ళట.\n\n* మూలిగిన మూతికేసి రాస్తారు.\n\n* మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు.\n\n* మూలుగులు మునుపటిలాగే, భోజనాలు మాత్రం ఎప్పటిలాగే.\n\n* మూసిచూడను కాసులేదు, ముండను చూస్తే ముద్దొస్తుంది.\n\n* మూసిన ముత్యం, మాయని పగడం.\n\n* మూసిన ముత్యము, పాసిన పగడము.\n\n* మూసిన వాయనం ముత్తైదువవలె.\n\n* మూసిపెట్టితే పాచిపోయిందట.\n\n\n\n**********:: మృ ::**********\n\n* మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును.\n\n* మృగశిర కురిస్తే ముసలిఎద్దు ఱంకె వేయును.\n\n* మృగశిరతో గూడా ముల్లోకాలు చల్లబడును.\n\n* మృగశిర బిందిస్తే ఇరుకార్తెలు ఎలుగిస్తవి.\n\n* మృగశిరలో బెట్టిన పైరు, మీసకట్టున బుట్టిన కొడుకు మేలు.\n\n* మృగశిర వర్షిస్తే, మఖ(ఘ) గర్జిస్తుంది.\n\n* మృగశిర కురిస్తే, ముంగాలి(రు) పండును.\n\n* మృతి దగ్గరకు వచ్చినా, సతి దగ్గరకు వచ్చినా మతి ఉండదు.\n\n* మృత్యువు పంచాంగం చూచి పనిచేయదు.\n\n* మృదు శబ్దానికి మధుశబ్దానికి భేదమేమిరా? అంటే, వట్లల్లో సుడి (వట్రుసుడి) అన్నాడట.\n\n\n\n**********:: మె ::**********\n\n* మెచ్చి మేకతోలు, కోరి గొఱ్ఱెతోలు కప్పుతారు.\n\n* మెట్ట దున్నినవాడు, లొట్టె త్రాగినవాడు ఒకటే.\n\n* మెట్ట నున్నా ఏనుగే, పల్లాన ఉన్నా ఏనుగే.\n\n* మెట్టను మాత, పల్లాన భార్య.\n\n* మెట్టరైతు లొట్టెపిట్ట.\n\n* మెట్టినిండ్లనుండి కాన్పుకు పుట్టినిండ్లు చేరినట్లు.\n\n* పెట్ల చప్పుడే గానీ, దోవ జరుగదు.\n\n* మెడ తడవటం పూసల కొఱకే.\n\n* మెడనూతు(కు)ల వారింట్లో పిడిగుద్దుల సమారాధన.\n\n* మెడపూసలకు సమ్మసరిపోయిన బొమ్మలాట ఆడినట్లు\n\n* మెడబట్టి నెట్టితే చూరుబట్టుకొని వ్రేళ్ళాడినట్లు.\n\n* మెడలో రుద్రాక్షలు, మదిలో మదిరాక్షులు.\n\n* మెతుకుపోతే బ్రతుకుపోతుంది.\n\n* మెతుకులు చల్లితే కాకులకు కొదువా?\n\n* మెత్తగా ఉంటే మొత్త బుద్ధివేస్తుంది.\n\n* మెత్తటి పులి, సాదు పలవ.\n\n* మెత్తటి పులి ధర్మ సూతి.\n\n* మెత్తనాళ్లు పోయినవి, చెత్తనాళ్ళు వచ్చినవి.\n\n* మెత్తని చోటనే గుద్దలి వాడి.\n\n* మెత్తని మట్టిని మోచేతితో త్రవ్వినట్లు.\n\n* మెత్తనిమాట లాడరా అంటే, దూది వెన్నపూస అన్నాడట.\n\n* మెత్తనివాడిని చూస్తే మొత్త బుద్ధివేసినట్లు.\n\n* మెత్తలు ఎందకువేస్తే, మెడల నొప్పులు పోతాయా?\n\n* మెఱుగు వేయనిదే మృదువు రాదు (మెఱుగు=చమురు, నెయ్యి).\n\n* మెఱుగు వేయనిదే మెఱుగు రాదు.\n\n* మెఱుపుకొద్దీ వర్షము.\n\n* మెఱుపు దీపంగాదు, మబ్బు గొడుగు కాదు.\n\n\n\n**********:: మే ::**********\n\n* మేక ఆకులు మేయగానే ఉపవాస మగునా?\n\n* మేకకు ఙ్ఞాపకముండేది మేత ప్రసంగమే (సంగతే).\n\n\n* మేకకు తెలిసిందంతా మేత సంగతే\n\n* మేకకు మెడచన్నులు, తాళ్ళకు (తాడిచెట్లకు) తలచన్నులు.\n\n* మేకపిల్లను చంకలో బెట్టుకొని ఊరంతా వెదకినట్లు.\n\n* మేక పెంటిక ఎక్కడున్నా ఇక్కటే.\n\n* మేక(పో)బోతు గాంభీర్యం - మాచకొమ్మ సౌందర్యం.\n\n* మేక మెడచన్ను కుడిస్తే ఆకలితిరునా?\n\n* మేక మెడచన్నులకు పాలు, మేడికి పూలు లేవు.\n\n* మేక మెడచన్నులు పిసుకను పిండను పనికిరావు.\n\n* మేక మెడచన్నులు (నిష్ప్రయోజనములు అనుట - అజాగళస్తనాలు).\n\n* మేక మేయని ఆకు ఏదంటే - బండి ఆకు, రాట్నపు ఆకు.\n\n* మేకలు తప్పించుకొంటే తుమ్మలు, మాలలు తప్పించుకొంటే ఈదులు (ఈదులు= ఈతచెట్ల తోపులు).\n\n* మేకలే మడకలు దున్నితే, ఎద్దులు ఎవరికి కావాల?\n\n* మేకవన్నె పులి.\n\n* మేకశిరం మెత్తగా ఉన్నదని మఱికాస్త లాగాడట.\n\n* మేఘాలు నలుపైతే వాననీళ్ళు నలుపగునా?\n\n* మేడలు గుడిసెలు కావడం కన్నా, గుడిసెలు మేడలు కావడం మేలు.\n\n* మేడిపండు జూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.\n\n* మేడసిరి కీడు చేయదు (మేడసిరి = అత్తిబాగా కాలి పేలుట).\n\n* మేతకన్నా మసలితేనే బలం.\n\n* మేతకరణమే గానీ కూతకరణం గాదు.\n\n* మేతకేగాని చేతకు (కూతకు) కొరగాడు.\n\n* మేదరసాల దుర్గంమీద మేకకాలంత మొయిలువేస్తే, తుల్లూరు దొందపాడు కాయ దూడకట్టు అయినా కాదు.\n\n* మేనత్తపోలిక, మేనమామ చీ(చా)లిక.\n\n* మేనత్త మూతికి మీసాలు ఉంటే చిన్నాయన అవుతాడు\n\n* మేనమామకైతే ఇవ్వడు, పోలుబొందలలో పెడతాడు.\n\n* మేపే రూపు.\n\n* మేమే అంటే మెడలెక్కి కూర్చున్నాడట.\n\n* మేయబోతే ఎద్దుల్లోకి, దున్నబోతే దూడల్లోకి.\n\n* మేయబోయి మెడకు తగిలించుకొన్నట్లు.\n\n* మేలుమేలంటే, మెడ విరగబడ్డట్లు.\n\n* మేలోర్చలేని అబ్బకుతోడు మూగతల్లి దొరికినట్లు.\n\n* మేసేగాడిదను కూసేగాడిద (వచ్చి) చెఱచిందట.\n\n* మేసేజన్మలు మేతలు మానినవి, పలుకులు మానండఱ్ఱా పంజరాల చిలుకల్లారా అన్నట్లు.\n\n* మేస్త్రీలు మేడకట్టితే, కుక్కకాలు తగిలి కూలిపోయిందట.\n\n* మేహజాడ్యం, తోట సేద్యం.\n\n\n\n**********:: మై ::**********\n\n* మైనపుగోడలను గురించి కంచుగోడలు కాలిపోయినవట\n\n* మైనపు ముక్కువాడు (ఏవైపంటే ఆవైపుకు తిరుగుతాడు).\n\n\n\n**********:: మొ ::**********\n\n* మొండి ఈతకు (యీనితే) మోపుడు జూక లన్నట్లు.\n\n* మొండికి తగ్గ మిండడు.\n\n* మొండికి సిగ్గులేదు, మొరడకు (మొరటుకు) గాలిలేదు.\n\n* మొండికీ, బండకు నూరేండ్లాయుస్సు.\n\n* మొండి కెక్కినదాన్ని మొగుడేమి చేయు? రచ్చ కెక్కినదాన్ని రాజేమి చేయు?\n\n* మొండికెత్తితే మొగుడేమి చేస్తాడు? బండ కెత్తితే బావేమి చేస్తాడు?\n\n* మొండి గురువు, బండ శిష్యుడు.\n\n* మొండిచెట్టు గాలికి మిండడు, మొలకులేనివాడు దొంగలకు మిండడు.\n\n* మొండిచేతితో మొత్తుకున్నట్లు.\n\n* మొండిచేతితో మూరవేసినట్లు.\n\n* మొండిచేతి వానికి నువ్వులు తిననేర్పినట్లు.\n\n* మొండిచేతుల పెండ్లానికి మోదకాళ్ళ మొగుడు.\n\n* మొండితోక గొడ్డు రాగోరును, గుడ్డిగొడ్డు పోగోరును.\n\n* మొండిదానా! నీ మొగుడేమి చేసినాడంటే, అటుకొట్టి ఇటుకొట్టి వాడే పోయాడు అన్నదిట.\n\n* మొండిమొగుడి పెండ్లికెళ్ళి, అర్థరాత్రివేళ అడ్డగోడ చాటునుండి అర్థరూపాయి కట్నం చదివించిందట.\n\n* మొండిముక్కున ముక్కెర ఉంటే, మూతి తిప్పడమే ముచ్చట అనుకొన్నదట.\n\n* మొండివాడు రాజుకంటే బలవంతుడు.\n\n* మొండివాని హితుడు బండవాడు.\n\n* మొక్క అయి వంగనిది మ్రానై వంగునా?\n\n* మొక్కజొన్న కండె (కంకి) ముక్కలై మీదపడ్డట్లు.\n\n* మొక్కబోయిన దేవర ఎదురు వచ్చినట్లు.\n\n* మొక్కుబడే లేదంటే, ఒక్క దాసరికైనా పెట్టమన్నట్లు.\n\n* మొక్కేవారికి వెఱవనా? మొట్టేవారికి వెఱవనా?\n\n* మొగంవాచిన మొగుడికి పాచిన కూడు పెట్టితే, పాయసమని బుఱ్ఱు బుఱ్ఱున జుఱ్ఱుకున్నాడట.\n\n* మొగ (మగ) పిల్ల బంగారు పుల్ల.\n\n* మొగపిల్లలున్న యిల్లు, మోదుగలున్న అడవి అందము.\n\n* మొగబుద్ధి మోటుబుద్ధి, ఆడుబుద్ధి అపరబుద్ధి.\n\n* మొగమాటమునకు, మోక్షమునకు దూరము.\n\n* మొగమాటానికి పోతే, ముండకు కడుపైనట్లు.\n\n* మొగము మాడ్పుది మొగుడికి చేటు, ఈడ్పుకాళ్ళది ఇంటికి చేటు.\n\n* మొగవాని మూతిపై ఉంటే, నాకు ముంజేతిపై ఉన్నవి వెంట్రుకలు అన్నదట ఒక మగరాయడు.\n\n* మొగవారి కాలుసేయి తాకితే, ఆడువారు పెకల్లుతారట.\n\n* మొగిళ్ళు చూచి మోట చాలించినట్లు.\n\n* మొగడంటే మొద్దులుబెట్టి, మిండ డంటే ముద్దులు పెట్టును.\n\n* మొగుడికి మోదుగాకు, అల్లుడికి అరటాకు.\n\n* మొగుడికే (మగడికే) మొగతనంఉంటే, అగసాలాయనతో అవసరమేమి? (అకోరించటంఎందుకు?)\n\n* మొగుడికే మగతనం ఉంటే, తంబళ్ళవారి తగులాట మేమి?\n\n* మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు.\n\n* మొగుడినిచూస్తే పైసా లేదు, ముండను చూస్తే ముచ్చటౌతుంది.\n\n* మొగుడిమీది కోపం పొద్దు మునిగేవరకే.\n\n* మొగుడు అంటే ఘోష, డబ్బు అంటే ఆశ.\n\n* మొగుడు ఈయని గౌరము, తల్లిచేయని గారాబము.\n\n* మొగుడు ఒగ్గినా మామ ఒగ్గడు.\n\n* మొగుడు కొట్టినందుకు కాదుగానీ, తోడికోడలు నవ్వినందుకు.\n\n* మొగుడు కొట్టిన కొట్లు ఊరెల్ల రట్లు, మిండడు కొట్టిన కొట్లు ముత్యాలకట్లు.\n\n* మొగుడు కొట్టితే కొట్టినాడు గానీ, ముక్కుచీమిడి బాగా వదిలింది.\n\n* మొగుడు కొట్టినాడని మొల్లవాని దగ్గఱకుపోతే, మొల్లవాడు తెల్లవార్లు కొట్టినాడట.\n\n* మొగుడు కొద్దీ వన్నెలు, సిరికొద్దీ చిన్నెలు.\n\n* మొగుడు చచ్చిన వెనుక ముండకు బుద్ధి వచ్చిందట.\n\n* మొగుడు చచ్చి మొత్తుకుంటుంటే, మిండమగడు వచ్చి రాళ్ళు రువ్వాడట (వేశాడట).\n\n* మొగుడుని చూచిన దండగ, మిండని చూచిన పండగ.\n\n* మొగుడు పెండ్లాం పోట్లాడి, యాయావారం బ్రాహ్మణ్ణి చావకొట్టినట్లు.\n\n* మొగుడు లేకపోతే అప్పమొగుడు, కూర లేకపోతే పప్పుకూర.\n\n* మొగుడు లేనిదానికి గూడా మంత్రసాని తప్పదు.\n\n* మొగుడే ముండా అంటె ముష్టికి వచ్చినవాడు గూడా ముండా అంటాడు.\n\n* మొగుడొల్లక ముప్ఫై యేడ్లు, ఆలొల్లక అరవై ఏండ్లు, బాలప్రాయం పదేండ్లు.\n\n* మొగునితో పెళ్ళికి, పిల్లలతో తీర్థానికి వెళ్ళరాదు.\n\n* మొగుని పెత్తనం, మొండి మేనత్త.\n\n* మొగునిమీద కోపంచేత మాదిగవాని వెంట పోయినట్లు.\n\n* మొగుళ్ళ పొద్దు మోసపుచ్చె, కోడలిప్రాణం కొలుకులోకి వచ్చె.\n\n* మొట్టేవాడికి వరమిస్తాడు గానీ, మొక్కేవారికి వరమీయడు.\n\n* మొత్తుకోళ్ళోయి ముత్తయ్య సెట్టి.\n\n* మొదట మానెడు, దూడ చస్తే దుత్తెడు.\n\n\n\n**********:: టా ::**********\n\n* మొదటికే మోసమైతే, లాభానికి గుద్దులాట.\n\n* మొదటికే మోసమైతే, వడ్డి ముట్టలేదన్నాడట.\n\n* మొదటి చూపుకే కలిగిన వలపుకు కాలయాపన లేదు.\n\n* మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కల్యాణమట.\n\n* మొదటి పెండ్లి అవసరము, రెండోపెండ్లి అవివేకము, మూడోపెండ్లి అపస్మారకము.\n\n* మొదటిముద్దుకే మూతిపండ్లు రాలినట్లు.\n\n* మొదలుంటే పిలకలు పెడుతుంది.\n\n* మొదలు మునిగితే వడ్డి మునుగదా?\n\n* మొదలు చేవలేక తుద నెట్లు కలుగురా?\n\n* మొదలు మోదుగ పూస్తే, కొన సంపెంగ పూస్తుందా?\n\n* మొదలు లేదు శ్రీరామా! అంటే, మొలతాడు లేని పాతగోచి అన్నాడట.\n\n* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ఒక్కదేవరకైనా మొక్కాక్కా అన్నదట.\n\n* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ముంతేది పెద్దక్కా అన్నదట.\n\n* మొదళ్ళు మీకు, మోసులు మాకు.\n\n* మొదలు విడిచి కొనలకు నీళ్ళు బోసినట్లు.\n\n* మొదలే కుంటికాలు, దానికితోడు పక్షవాతం.\n\n* మొదలే కోతి, పైగా కల్లు తాగినట్లు.\n\n* మొదలే మన్ను, కఱవు వస్తే గడ్డలు.\n\n* మొద్దు (మోటు) ముందకు దొరికేదంతా మోటు శిశినాలు.\n\n* మొద్దు మొగానికి తోడు, గరుడసేవా?\n\n* మొప్పెకు మూరెడు నోరు.\n\n* మొప్పెకు మొగిలిపువ్విస్తే, మడిచి (ముడ్డి) గుద్దలో పెట్టుకున్నదట.\n\n* మొయిలువిడిచిన యెండ, మొగుడువిడిచిన ముండ, పట్టివిడిచిన మండ, ఎత్తివిడిచిన కుండ.\n\n* మొఱకకు సివమెత్తిన మ్రొక్కక తప్పదు.\n\n* మొఱిగే కుక్క కఱవదు (అరిచే కుక్క).\n\n* మొఱ్ఱలో మొఱ్ఱ మొండిచెయ్యి చూపించేయి.\n\n* మొఱ్ఱో! మొఱ్ఱో! వద్దనగా, లింగం కట్టేరుగానీ మొక్కచేతులు తేగలరా?\n\n* మొలది విప్పి తలకు చుట్టినట్లు.\n\n* మొలబంటి దుఃఖంలో, మోకాలిబంటి సంతోషం.\n\n* మొలిచేచెట్టు మొలకలోనే తెలుస్తుంది.\n\n* మొసలిబావా! కడిమిచెట్టు వేరాయెగానీ, కాలైనా ఇంతేకదా.\n\n\n\n**********:: మో ::**********\n\n* మోకాటిలో మెడనరం పట్టిందంటే, మీద పట్టి వేయమన్నట్లు.\n\n* మోకాలు ముణిగింది అని ముక్కు మూసుకుంటారా?\n\n* మోకాలెత్తు విగ్రహముంటే, మొలలోతు కూడు.\n\n* మోకాలెత్తు ముందుకు, మోచేతులు వెనక్కు.\n\n* మోచినమోపును ఇందరు మోయవలెనా?\n\n* మోచేతిదెబ్బ చూడక, ఱాచిప్పకు అతుకు పెట్టబోయినట్లు.\n\n* మోచేతి దెబ్బ - మొగుడింటి కాపురం.\n\n* మోచేయిపోయి మొకరానికి తగిలినట్లు (మొకరము=స్థంభము).\n\n* మోటుకు కోపం ముక్కు మీద.\n\n* మోతకు పొమ్మంటే, ఆటకు పెట్టినాడు.\n\n* మోటువాడికి మొదటిచోట కంపు, వన్నెగాడికి మూడుచోట్ల కంపు.\n\n* మోటువాడి కేమితెలుసు మొగలిపువ్వు వాసన.\n\n* మోట్లుకొట్టగా మగనితో గూడలేస్తే, గుడ్డబట్టలు దులుపేవఱకే కూటివేళాయె.\n\n* మోతచేటేగానె మోక్షంబు లేదయా.\n\n* మోతనీటిలో యీత యీదినట్లు.\n\n* మోదుగపువ్వు అందము - పసిమిరోగము మిసిమి.\n\n* మోపూరువాళ్ళ మొగుళ్ళు చస్తే, తలమంచివాళ్ళు తాళ్ళు తెంచుకొన్నట్లు.\n\n* మోసేవానికి తెలుసు (కావడి) బరువు.\n\n* మోక్షానికిపోతే మొసలి యీడ్చుక (ఎత్తుకొని) పోయిందట.\n\n* మోహభ్రమని జిక్కి మొనగాడు నీల్గడా?\n\n\n\n**********:: మౌ ::**********\n\n* మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి.\n\n* మౌనం మర్ధంగీకారం\n\n* మౌల్వీలు మదురు మేస్తుంటే, పీర్లకు పిండివంటలా?\n\n\n\n**********:: మ్రా ::**********\n\n* మ్రానిపండ్లు మ్రానుక్రిందనే రాలును.\n\n\n\n**********:: మ్రు ::**********\n\n* మ్రుగ్గు వేయనివారిని యముడు, జాంబవంతుని వెంత్రుకలు పెరక బెడతాడట.\n\n\n\n**********:: మ్రొ ::**********\n\n* మ్రొక్కబోయిన గుడి ముక్కలై మీదపడ్డట్లు.\n\n* మ్రొక్కబోయిన దేవు డెదురైనట్లు.\n\n* మ్రొక్కిన మ్రొక్కు చక్కనై, మగనికండ్లు రెండూపోతే, ఆరుగాళ్ళ జీవాన్ని దేవునకు అర్పితం జేతు నన్నదిట (ఆరుగాళ్ళ జీవం=ఈగ). ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 875,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-మ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* యజమాని చూడని చేను ఎంత పెరిగినా నష్టమే.\n\n* యజమాని చూదని చేను ఏడుగాడు. (ఏడుగాడు=చెడిపోవుట).\n\n* యఙ్ఞంచేసి రంకు తెలుపుకొన్నట్లు.\n\n* యఙ్ఞానికి ఏమి యత్నమంటే, కత్తులు, కటార్లు అన్నట్లు.\n\n* యఙ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.\n\n* యతి అంటే, ప్రతి అన్నట్లు.\n\n* యతికొఱకు పోతే, మతి పోయింది.\n\n* యతిమతం మగనికి ఎత్తుబారపు పెండ్లాం (యతిమతం=వెఱ్ఱివాలకం, యతివలె నుండుట).\n\n* యత్రజంగం తత్ర బిక్షమన్నట్లు.\n\n* యథార్థవాది లోకవిరోథి.\n\n* యథార్థానికి ఏడుచుట్ల తెరలు అక్కఱలేదు.\n\n* యమునికి, శివునికి వెరువనివాడు.\n\n* యముడు ఒక్కణ్ణిచంపితే, ఏతాము ముగ్గురిని చంపుతుంది.\n\n\n\n**********:: యా ::**********\n\n* యాదవకులంలో ముసలం పుట్టినట్లు.\n\n* యాచమనాయని త్యాగము గోచులకేగాక కట్టుకోకల కగునా?\n\n* యానాదివాదు గుద్ద కడిగినట్లు.\n\n* యానాది లగ్నానికి ఏనాడైతే ఏమి?\n\n\n\n**********:: యు ::**********\n\n* యుగయుగాలనాటి యుదిష్టిరుడు వలె.\n\n\n\n**********:: యె ::**********\n\n* యెట్టు (వెట్టు) గొట్టిన రూక, గట్టు విడిచిన లంజ.\n\n\n\n**********:: యో ::**********\n\n* యోగమందు గలదె భోగమందున్నట్లు.\n\n* యోగికి, రోగికి, భోగికి నిద్ర లేదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 876,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* రంగడా విభీషణునికి పంగనామ మిడినరితి\n\n* రంగడికి లింగడికి స్నేహం, రొట్టెకాడ గిజగిజలు.\n\n* రంగము సొమ్ము, ఱంకుసొమ్ము నిలువదు (రంగము=రంగూను).\n\n* రంగుల దుప్పట్లు వీగొంగడికి సరిపోలవన్న గువ్వలచెన్న.\n\n* రండ కొడుకైనా కావలె, రాజు కొడుకైనా కావలె.\n\n* రండ తుపాకీ కాలిస్తే, గుండు గాలికి పోయిందట.\n\n* రండ రాతకు పెండ సిరా (పెండ=పేడ).\n\n* రండరాజునకు గొండడు దళవాయి.\n\n* రందిగాడికి రేయింబవలు తెలియదు.\n\n* రంభ చెక్కిలి నొక్కి రాట్నం తెచ్చినట్లు.\n\n* రంభయైన తన కుచకుంభముల్ తనచేత తాబట్టుకొనిన సుఖము లేదు.\n\n* రక్కసి ఆలుకు అనదమగడు.\n\n* రక్షచాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు.\n\n* రచ్చకెక్కిన సభలో రాయబార మేల?\n\n* రజకుని గానము, రండా ప్రభుత్వము.\n\n* రట్టూ, రవ్వా రావిపాటి వారిది, పుస్తే పూసా పూసపాటి వారిది.\n\n* రతిలేని నాతి (పరుగు) గతిలేని గుఱ్ఱము రాణించవు.\n\n* రతిలో సిగ్గు, రణములో భీతి కొరగావు.\n\n* రత్నం బొరునిచే నన్వేషింపబడును గానీ, యెరు నన్వేషించునే?\n\n* రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు.\n\n\n* రత్నాన్ని రువ్వి గాజును కోరినట్లు.\n\n* రత్నాలన్ని ఒక చోటికి, రాళ్ళన్నీ ఒక చోటికి.\n\n* రత్నాలు తినే పక్షికి రత్నాలు, రాళ్ళు తినే పక్షికి రాళ్ళు.\n\n* రత్నాలున్న గనిలోనే రాళ్ళుండేది.\n\n* రమాపతే, సీతాపతే, పొద్దున లేస్తే పొట్టేగతి.\n\n* రమ్మన్నారు తిమ్మన్న బంతికి - అన్నట్లు.\n\n* రవిక, పగలు బిడ్డ కడ్డము, రాత్రి మగని కడ్డము.\n\n* రవికలోనే చీర మిగిలించాలంటే ఎలాగు?\n\n* రవి గాననిచో కవిగాంచనేర్చు నెయ్యెడన్.\n\n* రవ్వ రవ్వతో తెగుతుందికానీ, రాతితో తెగుతుందా?\n\n* రసం ముదిరితే రాగం, పాకం ముదిరితే పాట.\n\n* రహస్యమేమిటంటే, (విశేషమేమిటంటే) వడ్లగింజలోది బియ్యపుగింజ అన్నట్లు.\n\n* రక్షలు పోతే మచ్చలు పోతాయా? (రక్షలు=రక్ష కోసం వాతలు).\n\n\n\n**********:: రా ::**********\n\n* రా అమ్మేగానీ పో అమ్మ లేదు.\n\n* రాకుండా చూచి పోకుండా కొట్టినట్లు.\n\n* రాకు, పోకు బంగారు చిలక.\n\n* రాగం లేని భోగం, త్యాగం లేని ఈవి.\n\n* రాగం తియ్యనివాడు, రోగం రానివాడు లేడు.\n\n* రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు.\n\n* రాగిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారంటే, చుట్టుచుట్టుకు పొట్ట చూచుకొన్నదట.\n\n* రాగిపైసా చల్లగుంటే, రాచబిడ్డగూడా దిగివస్తుంది.\n\n* రాగిపోగులు తగిలించుకున్నావేమిరా? అంటే, నీకు అవైనా లేవుకదా అన్నాడట.\n\n* రాగిపైరులచెంత రమ్యమౌ వరిమొలక రాజిల్ల నేర్చునా?\n\n* రాగి రాగోరును.\n\n* రాగులరాయి తిరుగుతూ ఉంటే రాజ్యమంతా చుట్టాలే.\n\n* రాఘవా! స్వస్తి. రావణా స్వస్తి. (అందరికి మంచిగా ఉండుట).\n\n* రాచతనానికి జందెపుపోచా గుర్తు?\n\n* రాచపగ - త్రాచు (పాము) పగ.\n\n* రాచపీనుగు తోడులేకుండా పోదు.\n\n* రాచబిడ్డ స్మరాలయము కాగానే పూజకు దాసాని పువ్వగునా?\n\n* రాచవారి పసులకు బందిలేదు.\n\n* రాచవారి భోగం రైతుల త్యాగం.\n\n* రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు, ఐశ్వర్యం ఆనందమును కొనిపెట్టలేదు.\n\n* రాజరాజులకు రాజదండం, కాపుకు కరుకోల (కరుకోల=కఱ్ఱు).\n\n* రాజు ఎంతో, ప్రజలూ అంతే.\n\n* రాజులు ఎవరైనా రాగులు విసరేది తప్పదు.\n\n* రాజుకంటే మొండివాడు బలవంతుడు.\n\n* రాజు కత్తికి రెండువైపులా పదునే (వాదరే).\n\n* రాజుకన్నా చిన్న, మంత్రి కన్నా పెద్ద.\n\n* రాజుకు కంటను, పాముకు పంటను విషం.\n\n* రాజు కూతురైనా ఒకని ఆలే.\n\n* రాజుగారి కొడుకైనా కావాలి, సానిదాని తమ్ముడైనా కావాలి.\n\n* రాజుగారి గుఱ్ఱమైతే మాత్రం తొక్కితే కాలు నొవ్వదా?\n\n* రాజుగారి పెద్దభార్య పతివ్రత అన్నట్లు.\n\n* రాజుగారి పెళ్ళాం మేడ ఎక్కితే, కుమ్మరివాడి పెళ్ళాం ఆవ మెక్కిందట.\n\n* రాజుచేసిన కార్యాలకు, రాముడు జేసిన కార్యాలకు ఎన్నికలేదు.\n\n* రాజుతలిస్తే గాజుకంబాల కేమి కొదువ?\n\n* రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొరవా?\n\n* రాజు దృష్టికి రాయి పగులును.\n\n* రాజు నీతి తప్పితే, నేల సారం తప్పుతుంది.\n\n* రాజుని చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్ట బుద్దయింది.\n\n* రాజపాపం పురోహితుని కొట్టుకపోవును.\n\n* రాజు పెద్దకూతురిని పెండ్లి చేసుకోను నాకేమి అభ్యంతరం లేదన్నట్లు.\n\n* రాజు పోతులాగే ఉన్నాడు, రాజుపెండ్లం రంభలాగే ఉంది.\n\n* రాజు మెచ్చింది మాట, మొగుడు మెచ్చింది రంభ.\n\n* రాజు రాకడ లేదు! నూకుడు లేదు (నూకుడు=కొట్టుట, చిమ్ముట).\n\n* రాజులకు పిల్లనిస్తే రాళ్ళ కిచ్చినట్లే.\n\n* రాజుల చనవు ఎన్నాళ్ళు?\n\n* రాజుల సొమ్ము రాళ్ళ పాలు.\n\n* రాజుల సొమ్ము లంజల పాలు.\n\n* రాజులు పోతే రాజ్యాలు పోతవా?\n\n* రాజు లేని ఊళ్ళు, పూజలేని గుళ్ళు.\n\n* రాజులేని రాజ్యం, కాపులేని గ్రామం.\n\n* రాజు వలచిన రంభ, రాజు విడిచిన తుంబ.\n\n* రాజ్యము వీరభోజ్యం.\n\n* రాజ్యాలు ఉడిగినా లక్షణాలు ఉడగలేదు.\n\n* రాజ్యాలు పోయినా, రాచరికాలు (రాజసాలు) పోలేదు.\n\n* రాట్నం వచ్చింది, బండి అడ్డం తీయరా అన్నాడట.\n\n* రాట్నానికి రెండు చెవులు, నాకూ రెండు చెవులు.\n\n* రాణివాసం వచ్చి మూలవాసం పీకిందట (రాణివాసం=రాజభోగం, మూలవాసం= ప్రధానమైన ఇంటివాసం).\n\n* రాతకు (వ్రాతకు) మించిన లొతు లేదు (రాత=నొసటివ్రాత).\n\n* రాత బొడిచినా చావు లేదు.\n\n* రాతికట్ట, పంత చెరువుకు గాక గండి గుంట కేల?\n\n* రాతి కుండకు ఇనుప తెడ్డు.\n\n* రాతి పశువును పూజిస్తారు, చేతిపశువును బాదుతారు.\n\n* రాతిబొమ్మకు చక్కిలిగింతలు పెట్టినట్లు.\n\n* రాతిలో కప్ప, రాతిలోనే బ్రతికినట్లు.\n\n* రాత్రి అంతా రభసైతే, రక్తి ఎప్పుడు?\n\n* రాత్రికి వెన్నెల, పైరుకు వెన్నులు పస.\n\n* రాత్రి పడ్డ గొతిలో పగలు పడతారా?\n\n* రాదన్న పని రాజుపని, వస్తుందన్నపని తొత్తు పని.\n\n* రాని అప్పు (సొమ్ము) రాతితో సమానమన్నాడట.\n\n* రానిపాట పాడ వేడుక, బోడితల అంట వేడుక.\n\n* రానివాడి మీద ఱాయి.\n\n* రాని వానినిఉ పిలువ వేడుక.\n\n* రానురాను గుఱ్ఱం గాడి దయిందట.\n\n* రానూవచ్చె, పోనూపోయె, రాగులువిసరి సంకటి చేయమన్నాడట.\n\n* రాబందుకు, రాజుకు తేడాలేదు.\n\n* రామక్క దేమిపోయె? రామన్న దేమిపోయె? రాసిలోనిదే దోసెడుపోయె.\n\n* రామనామధారి రాక్షసుండు.\n\n* రామాండ కతలెల్ల మే మెఱుంగని పనే? కాటమరాజుకు కర్ణుడోడె - అన్నట్లు.\n\n* రామాయపట్నం మధ్యస్థం. (న్యాయం చెప్పమంటే, చెరిసగం చేసుకోమన్నట్లు).\n\n* రామాయణం అంటే ఏమో అనుకున్నానుగానీ, మాశి బరువుంది అన్నాడట.\n\n* రామాయణం అంటే సామాన్యంగాదు, గాడిద మోతంత ఉందే, అన్నాడట.\n\n* రామాయణం ఱంకు, భారతం బొంకు.\n\n* రామాయణంలో పిడకల (పిటకల) వేట్లాట (కాట్లాట, కొట్లాట).\n\n* రామాయణం అంతా విని, రాముడికి సీత ఏంకావాలని అడిగాడట.\n\n* రాముడినాడు లేదు, భరతుడినాడూ లేదు, శత్రుఘ్నునినాడు చెవుల వాదులు అన్నట్లు.\n\n* రాముడులేని రాజ్యం లాగా.\n\n* రాముని పాదాలు తగిలితే, రాళ్ళు రమణులవుతవి.\n\n\n* రామునివంటి రాజుంటే, హనుమంతునివంటి బంటూ ఉంటాడు.\n\n* రామునివంటి రాజు, రావణుని వంటి వైరి లేరు.\n\n* రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు (వదలలేదు).\n\n* రామేశ్వర వెళ్ళినా ఱంకుమగడు తప్పలేదట.\n\n* రాయలవారి ఏనుగు పిత్తుతుంది అని మూటకూళ్ళు కట్టుకొనిపోతే, అది తుస్సున పోయిందట.\n\n* రాయంగ రాయంగ కరణం - దగ్గంగ దగ్గంగ మరణం.\n\n* రాయుడిది తలది, చాకలిది మొలది.\n\n* రాల రువ్వదగినవాని పూల రువ్వరు.\n\n* రాలిన పూవు రెమ్మకు అతుక్కుంటుందా?\n\n* రాళ్ళకోపని గుద్దలిని వాడిచేసే వాళ్ళుందురా?\n\n* రాళ్ళ చెలుక - రండబిడ్ద, కాపువానికి కలిసివస్తాయట.\n\n* రాళ్ళచేను రత్నాలు పండుతుంది.\n\n* రాళ్ళచేల్లో గుంటక తోలినట్లు (గుంటక=చదునుచేయు సాధనం).\n\n* రాళ్ళు తినే పక్షి రాళ్ళు తింటుంది, రత్నాలు తినే పక్షి రత్నాలు తింటుంది.\n\n* రావణాసురుడి కాష్టం వెలె (ఎడతెగనిది).\n\n* రావేమయ్యా తిండివేమయ్యా! అంటే వెన్నక్కే పోయానన్నాడట.\n\n* రాష్ట్రం దాగినా (దాటినా) రంకు దాగదు.\n\n\n\n**********:: రి ::**********\n\n* రిక్తమనసు కోర్కెలకు పెద్ద.\n\n\n\n**********:: రీ ::**********\n\n* రీతికి వస్తే కదా రంగానికి వచ్చేది?\n\n\n\n**********:: రు ::**********\n\n* రుచిమరిగిన పిల్లి ఉట్టిమీదకు ఎగిరినట్లు.\n\n* రుచీపచీలేని కూర కంచానికి చేటు, అందం చందంలేని పెళ్ళాం మంచానికి చేటు.\n\n* రుద్రాక్షిపిల్లి (వంటివాడు, కపటసన్యాసి).\n\n\n\n**********:: రూ ::**********\n\n* రూక యివ్వని విటకాని పోటు మెండు.\n\n* రూకలు పదివేలున్నా చారెడు నూకలే గతి.\n\n* రూకలేని వాడు పోక చేయలేడు.\n\n* రూపంచేత స్త్రీలు, పరాక్రమంచేత పురుషులు రాణింతురు.\n\n* రూపాన పాపిష్టి, గుణాన పాపిష్టి.\n\n\n\n**********:: రె ::**********\n\n* రెంటికి చెడ్డ రేవడు వలె (రేవడు=చాకలి).\n\n* రెండావుల పాలు తాగిన దూడ.\n\n* రెండావుల పాలు దాగేవాడు (కుడిచేవాడు) (ఉభయపక్షాలకు చెందినవాడు అనుట).\n\n* రెండు ఊళ్ళ వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం.\n\n* రెండు ఏండ్లవరపు, మూడు ఏండ్ల మురుగు ఉండదు.\n\n* రెండుచేతులు కలిస్తేనే చప్పుడు అయ్యేది.\n\n* రెండు తప్పులెప్పుడూ ఒక ఒప్పు కాలేవు.\n\n* రెండు నలుపులు కలిసి ఒక తెలుపు కానేరదు.\n\n* రెండు నాలుకలవాడు. (మాట నిలకడ లేనివాడు).\n\n* రెండు పడవలలో కాళ్ళు బెట్టినట్లు (పెట్టినవాడు). (ఉభయపక్షాలకు ప్రీతిపాత్రుడు కాదలచువాడు).\n\n* రెండ్ వేదంతయుక్తులు వాగగానే రాజయొగి కాడు.\n\n* రెండువేళ్ళతో నాటవచ్చునుగానీ, అయిదువేళ్ళతో పెరకరాదు.\n\n* రెండూ రెండే, కొండప్పా.\n\n* రెడ్డి కరణం లేని ఊళ్ళో, చాకలివాడే పిన్నా పెద్ద.\n\n* రెడ్డి మడ్డి రోమాల ముడ్డి.\n\n* రెడ్డి మడ్డి బంగారు కడ్డి.\n\n* రెడ్డి వచ్చాడు మొదలెత్తుకో (పురాణం).\n\n* రెడ్డివారి ఆబోతు (రెడ్డోళ్ళ)తా ఎక్కదు ఇంకొకదానిని ఎక్కనియ్యదు.\n\n* రెడ్డేమి చేస్తున్నాడురా, అంటే - పైన పండుకొను ఉన్నాడు: అమ్మో - క్రింద పండుకొని ఉన్నది; ఎప్పుడూ ఇంతేనా? అప్పుడప్పుడు అమ్మగూడా పైన పండుకొంటుంది అన్నాడట.\n\n* రెడ్లకు -వడ్లకు పేర్లు చెప్పలేము.\n\n* రెడ్లలో తెగలకు, వడ్లలో తెగలకు లెక్కలేదు.\n\n* రెడ్లున్న ఊరిలో, రేచులున్న కొండలో ఏమీ బతకవు.\n\n* రెప్పలార్చేవాళ్ళు కొంపలారుస్తారు.\n\n\n\n**********:: రే ::**********\n\n* రేగడి భూమిని, రెడ్డినీ చేవిడువరాదు.\n\n* రేగుకంపపై గుడ్డవేసి తీసుకొన్నట్లు.\n\n* రేగుచెట్టు కింద గుడ్డివాని సామ్యము.\n\n* రేగుచెట్టు కింద ముసలామెవలె.\n\n* రేగుపండ్లకు ముత్యాలమ్ముకొన్నట్లు.\n\n* రేజీకటి మొగుడికి గుడ్డి పెండ్లాము.\n\n* రేపటికి కూటికిలేదని రేయింబవలు వ్యసనమందనేల?\n\n* రేపటి నెమలికంటే, ఈనాటి కాకి మేలు.\n\n* రేపల్లెవాడలో పాలమ్మినట్లు.\n\n* రేపు అనే మాటకు రూపులేదు\n\n* రేవతి వర్షం రమణీయం.\n\n* రేవులోని తాడి అడ్డుచేటు.\n\n\n\n**********:: రై ::**********\n\n* రైతు పాడు, చేను బీడు.\n\n* రైతు బీద గానీ, చేను బీద గాదు.\n\n* రైతు లెక్క చూస్తే, నాగలి కూడా మిగలదు.\n\n* రైతు క్షేమం రాజు భాగ్యం.\n\n\n\n**********:: రొ ::**********\n\n* రొండూ రొండే, ఱొంటికి పుండ్లే (ఱొంటికి=నడుముకు).\n\n* రొంపికఱువు రోతబుట్టించి, వరపుకఱవు ఒరగబెట్టుతుందా?\n\n* రొక్క మిచ్చినవాడే రేవెలదికి మన్మధుడు.\n\n* రొట్ట కట్టె దేశంలో పుట్టగోచీవాడే భాగ్యవంతుడు (రొట్ట=పచ్చిఆకు ఎరువు).\n\n* రొట్టెకు ఏరేవైతేనేమి? (కొరకను).\n\n* రొట్టె తిని, రోసినావుకానీ, నానివంకచూడు నా తమాషా.\n\n* రొట్టెలవాడి పనికంటే, ముక్కలవాడి పని మేలు.\n\n* రొట్టెలేదు గానీ, నెయ్యిఉంటే అద్దుకు తిందును- అన్నాడట.\n\n* రొట్టె విఱిగి నేతిలో పడ్డట్టు.\n\n* రొయ్యకు లేదా బారెడు మీసం.\n\n\n\n**********:: రో ::**********\n\n* రోకట చిగుళులు కోసినట్లు.\n\n* రోకలి చిగురు పెట్టినట్లు.\n\n* రోకలి తూలితే చుట్టాలు వస్తారు.\n\n* రోకలి పోటు - దాసరి పాట.\n\n* రోగమంటే వచ్చింది గానీ, పాలు ఎక్కడనుంచి వస్తవి?\n\n* రోగము ఒకటి, మందు ఇంకొకటి.\n\n* రోగానికి మందుగానీ, ఆయుర్దాయానికి మందులా?\n\n* రోగాలలో గురక ప్రమాదం (గురక=పశువ్యాధి).\n\n* రోగాలు మనుషులకు గాక మాకులకు వస్తవా?\n\n* రోగికి కోప మెక్కువ.\n\n* రోగికోరింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే.\n\n* రోగిష్టికి పాపిష్టి కావాలి.\n\n* రోజులు మంచివని పగలే దొంగతనానికి బయలుదేరినట్లు.\n\n* రోటిని చూచి పాట పాడాలి.\n\n* రోటి పాట రోకటి పాట (మార్పు లేని వనుట).\n\n* రోటిలో తలదూర్చి, రోకటిపోటుకు వెఱచినట్లు.\n\n* రోతలకు రోత ముదిమి.\n\n* రోలు కఱ వెఱుగదు.\n\n* రోలుకు ఒకవైపు, మద్దెల కిరువైపుల దెబ్బలు.\n\n* రోలు పగిలినా లిద్దె బాగా బిగిసినది అన్నట్లు.\n\n* రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లు.\n\n* రోళ్ళు పాడినట్లా? రోకళ్ళు పాడినట్లా?\n\n* రోసంలేని బంటుకు మోసం లేదు.\n\n* రోసంలేని మూతికి మీసం ఎందుకు?\n\n\n* రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట.\n\n* రోసి వేసినది రాశికి వచ్చింది.\n\n* రోసానికి పోయిన రొండ్లెగుసవు.\n\n* రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.\n\n* రోహిణి ఎండకు రోళ్ళు పగులును.\n\n* రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.\n\n* రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.\n\n* రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.\n\n* రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.\n\n* రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.\n\n\n\n**********:: రౌ ::**********\n\n* రౌతు కొద్ది గుఱ్ఱము.\n\n* రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.\n\n* రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 877,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ర ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* ఱంకాడ నేర్చినమ్మ బొంకాడ నేర్వదా?\n\n* ఱంకు చదువు చదివి ఱంకున జెడుదురు.\n\n* ఱంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు.\n\n* ఱంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు.\n\n* ఱంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది.\n\n* ఱంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు.\n\n* ఱంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ.\n\n* ఱంకుమగడు వీపుమన్ను దులిపిపోవునా?\n\n* ఱంకులసాని రాగంతీస్తే, రల్లిబండ రాతిలింగం కడకు నడుస్తుంది.\n\n* ఱంకు సాగితే పెళ్ళెందుకు?\n\n* ఱంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ.\n\n\n\n**********:: ఱా ::**********\n\n* ఱాతిలో నార తీసినట్లు.\n\n* ఱాతికంటే గట్టి రాయలసీమ కోడి.\n\n* ఱాతి టెంకాయ వలె.\n\n* ఱారిబొమ్మకు చక్కిలిగింతలా? (గిలిగింతలా?)\n\n* ఱాయి గుద్దనేల? చెయ్యి నొవ్వనేల?\n\n* ఱాయివోలె ఉంటే రాసికొందుము, పువ్వువోలె ఉంటే పూసికొందుము.\n\n* ఱాల (కొట్టిన) రువ్విన వానిని పూల దువ్వుతారా?\n\n* ఱాళ్ళు తిని ఇళ్ళు ఆరగించుకుంటారు.\n\n\n\n**********:: ఱె ::**********\n\n* ఱెక్క ఆడితేగానీ డొక్క ఆడదు.\n\n* ఱెక్కల కష్టం, బొక్కల పులుసు.\n\n* ఱెక్కలు పెరికిన పెట్ట (కోడి)వలె. (ఈకలుపెరికిన కోడి వలె).\n\n* ఱెక్కలు విఱిగిన పక్షి వలె.\n\n* ఱెప్పలతో దీపాలు ఆర్పినట్లు.\n\n\n\n**********:: ల ::**********\n\n* లంక కాల్చినవాడు రాముడి లెంక.\n\n* లంక(ఘ)నాలలో మనుగుడుపులు తలచుకొన్నట్లు.\n\n* లంక మేతకు, ఏటి ఈతకు సరి (ఏరుదాటి మేసి, తిరిగి యీది దాటే లోపల తిన్నగడ్డి జీర్ణమై పోయినట్లు).\n\n* లంక మేత, గోదావరి ఈత\n\n* లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే.\n\n* లంఖ(ఘ)ణానికి పెడితే పథ్యానికి దిగితుంది.\n\n* లంఖణాలకు పెడితేగానీ పైత్యం వదలదు.\n\n* లంచం పెట్టినది మాట, పుంజం పెట్టినది బట్ట (పుంజం= కొన్ని నూలుపోగుల మొత్తం).\n\n* లంచం లేనిదే మంచం ఎక్కదు.\n\n* లంచమనే చెట్టుకొమ్మలు నలుప్రక్కలా ప్రాకియుండును.\n\n* లంజకు ఒకడే మొగుడా?\n\n* లంజకు నిగ్గు, సంసారికి సిగ్గు ఉండాలి.\n\n* లంజకు బిడ్డ తగలాటము.\n\n* లంజకు పిల్ల తెగులు, దూదేకులవాడికి దూది తెగులు.\n\n* లంజకు పెట్టిన పెట్టు, గోడకు పూసిన సున్నం తిరిగి రావు.\n\n* లంజకు మొగమాటం లేదు, పంజకు ధైర్యం లేదు.\n\n* లంజకు సిగ్గున్నా, ఇల్లాలుకు సిగ్గులేకపోయినా చెడుతారు.\n\n* లంజ కొండెక్కి చూస్తే, మిండగాడు మిణుకురుబూచి మాదిరి కనబడ్డాడట.\n\n* లంజాకొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్లు.\n\n* లంజ చెడి ఇల్లాలయినట్లు.\n\n* లంజదాని కొడుకు లంజల కిచ్చును.\n\n* లంజదాని మాటలు పట్టుకొని ముందలి వాగులో పండితే, వాగొచ్చి వాడు కొట్టుకుపోయాడట.\n\n* లంజను లంజా అంటే, రచ్చకెక్కుతుంది, ఇల్లాలిని లంజ అంటే ఇంట్లో దూరుతుంది.\n\n* లంజ పితాళ్ళకు పెట్టి, ఆకాశం చూసిందట.\n\n* లంజ పుంజాయె, మిందడు లుష్టాయె.\n\n* లంజ బిడ్డకు తండ్రెవరు?\n\n* లంజ మంచానికి తలతట్టేమి? (తలదాపేమి) కాళ్ళ తట్టేమి?\n\n* లంజ ముదిరినా, ముంజ ముదిరినా, బీర ముదిరినా పనికిరావు.\n\n* లంజ మెత్తనైతే, పోతూ పినతండ్రిని లేవగొట్టి పోయినాడట.\n\n* లంజల కలువాయి, రంకుల కుల్లూరు మధ్య, తయిదిపాటి రెడ్లొచ్చి తగువులు తీర్చినారట.\n\n* లంజ లగ్గం (లగ్నం) చెరిస్తే, మాలెత (మాలది) మగ్గం చెరచిందట.\n\n* లంజ లజ్జుండి (లజ్జ ఉండి) చెడితే, ఆలు లజ్జ లేక చెడుతుంది.\n\n* లంజ లేకపోతే గుడి రంజిల్లదు, ప్రజల మనసు రంజిల్లదు. (లంజ=దేవదాసి, గుడిచేటి).\n\n* లంజా ! అంటే లక్ష్మీదేవి అన్నట్లగునా? (లంజ లం = నీటియందు, జ = పుట్టినది - లక్ష్మి అని).\n\n* లంజ కుచాలింగనాలకంటే లికుచాపాదతాడనం మేలు.\n\n* లక్క జొచ్చిన నగ - కుక్క జొచ్చిన ఇల్లు.\n\n* లక్కలేని నగ, బొక్కలేని మాంసం.\n\n* లక్కవంటి తల్లి, ఱాయివంటి బిడ్డ.\n\n* లగ్గ పగ్గం పెట్టు చిక్కింది.\n\n* లగ్గ మంటే పగ్గ మన్నట్లు.\n\n* లగ్నంలో తుమ్మినట్లు.\n\n* లచ్చ ఉంటే కోటి లక్షణాలు.\n\n* లచ్చి గాజులకు సంతకు చీటీ వ్రాసినట్లు.\n\n* లాడాయి వచ్చినప్పుడా కత్తులు చేసికోవడం?\n\n* లద్దిలో మాణిక్యం (దొరికినట్లు).\n\n* లక్షణం చెడితే అవలక్షణం.\n\n* లక్షణం పలుకరా పెండ్లికొడుకా ! అంటే అయిరేని కుండ పదహారు వక్కలు అన్నట్లు (అయిరేని=అరివేణి).\n\n* లక్షణాలుగల బావగారికి రాగి మీసాలు, అవలక్షణాలు గల బావగారికి అవీలేవు.\n\n* లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడుగాడు.\n\n* లక్షబుద్ధులు చెప్పినా, లంజబుద్ధి మానదు (మారదు).\n\n* లక్ష్యభక్ష్యాలు భక్షించే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా?\n\n\n\n**********:: లా ::**********\n\n* లాకు ఏత్వము, దాకు కొమ్ము - అననివాడు (లేదు అనుట).\n\n* లాడం దొరకగానే గుఱ్ఱం దొరికినట్లా?\n\n* లాభం గూబలలోకి వచ్చింది.\n\n* లాభంలేని శెట్టి వరదకు పోడు.\n\n* లావుమీద వంపు తెలియదు.\n\n* లావు లేని చేను - లేగ లేని ఆవు.\n\n\n\n**********:: లి ::**********\n\n* లింగధారికన్న దొంగలు లేరయా.\n\n* లింగధారులతో సంబంధం గంగలో దూకినట్లే.\n\n* లింగం కట్టగానే పిడుగు అన్నట్లు.\n\n* లింగిపెళ్ళీ మంగి చావుకు వచ్చినట్లు.\n\n\n\n**********:: లె ::**********\n\n* లెక్కలు చూచిననాడు తిక్కలు తిరుగుతాయి.\n\n* లెక్కలు చూచిననాడు బొక్క పగులును.\n\n\n\n**********:: లే ::**********\n\n* లేకలేక ఒక కూతురుపుడితే అదీ బసివి అయినదట.\n\n* లేకలేక ఒక లోకాయపుడితే, లోకాయ కన్ను లొట్టపోయింది.\n\n* లేకుండా చూసి, పోకుండా పట్టు.\n\n* లేచినాడండోయ్ మగధీరుడు అంటే, అందుకుకాదులే అల్పాచమానాని కన్నాడట.\n\n* లేచిపోతూ, అత్తా! నీకొడుకు ఆకలితో ఉన్నాడు అన్నదట.\n\n* లేది కడుపున పులి పుట్టునా?\n\n* లేడికి లేచిందే ప్రయాణం.\n\n* లేడికి లేచిందే పొద్దు.\n\n* లేడి దొరికేది కాళ్ళు లేకగాదు, కాలంగాక.\n\n* లేడిని చూచిన వాళ్ళంతా వేటగాళ్ళే.\n\n* లేదంటే పోతుందా పేదల మునుక?\n\n* లేనమ్మకు ఊపిరిపోతుంటే, ఉన్నమ్మ నీట్లు వెళ్ళబోసిందట.\n\n* లేని దాతకంటే, ఉన్నలోభి నయము.\n\n* లేనిదానికి పోగా, ఉన్నది ఊడి (ఊడ్చుక) పోయిందట.\n\n* లేనిపోని పీకులాట, చావడిదాకా గుంజులాట.\n\n* లేని బావకంటే, గుడ్డి బావే మేలు.\n\n* లేనివాడు లేక ఏడిస్తే, ఉన్నవాడు తినలేక ఏడ్చాడట.\n\n* లేనివానికి తెంపు, ఉన్నవానికి మొండి. (పిసినారితనం).\n\n* లేబరముకదె బిడ్డలు లేని బ్రతుకు.\n\n* లేవదీయరా తంతాను అన్నాడట.\n\n* లేవలేని అత్తకు వంగలేని కోడలు.\n\n* లేవలేని గొడ్డు బోరగలకు (రాబంధులు) అలుసు.\n\n* లేస్తే మనిషినిగాను మూతబెట్టి పొమ్మన్నాడట.\n\n\n\n**********:: లొ ::**********\n\n* లొట్టిపిట్ట శూల రోకళ్ళతోగానీ పోదు.\n\n* లొల్లిలో మల్లిగాని పెండ్లి.\n\n\n\n**********:: లో ::**********\n\n* లోకము మూయను మూకుడున్నదే.\n\n* లోకాన్ని (లోకపునోరు) మూయను మూకుడున్నదా?\n\n* లోకులు కాకులు.\n\n* లోకులు పలు(ల)గాకులు (పలుగాకి=పోకిరి).\n\n* లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళు బోదురు.\n\n* లోకువదానికి నూకల జావ.\n\n* లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.\n\n* లోన వికారం, బయట శృంగారం.\n\n* లోపల ఊబి, పైన పూరికమ్మిన పాడునూయి.\n\n* లోపల కంపు, వెలుపల సొంపు.\n\n* లోపల లొటలొట, మీద (బయట) మిటమిట.\n\n* లోభికి ధర్మచింత, వెఱ్ఱివానికి వివేకము దూరము.\n\n* లోభికి నాలుగందాల నష్టము.\n\n* లోభికి మూట నష్టి.\n\n* లోభి గడన సుంకరులకు వర్నసంకరులకు.\n\n* లోభి బీదకంటే బీడు.\n\n* లోభి సొమ్ము లోకుల పాలు.\n\n* లోలోపల లొట్టి, నామొగుడు విన్న కొట్టి.\n\n* లోవి మూయవచ్చును గానీ లోకమునోరు మూయలేరు (లోవి=అన్నమువండు వెడల్పు మూతిగల మట్టికుండ). ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 878,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-ఱ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* వంకరకట్టే కింగలమే మందు.\n\n* వంకరటింకర కాయలేమిటి? అంటే, చిన్ననాడు అమ్మిన చింతకాయలు అన్నట్లు.\n\n* వంకరో టింకరో వయసే చక్కన.\n\n* వంకాయ తమ్ముడు వాకుడు కాయ.\n\n* వంకాయ దొంగిలించినవాడు టెంకాయకు రాడా?\n\n* వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ రుచి రాజెరుగును.\n\n* వంకాయలేనమ్మ డొంకపట్టుక వేళ్ళాడిందట.\n\n* వంకాయవంటి కూర లేదు, శంకరునివంటి దైవమూ లేడు (లంకాధిపువైరివంటి రాజు లేడు).\n\n* వంగకు ముదురు నాటు, అరటికి లేత నాటు.\n\n* వంగతోటకాడ మాత్రం వదినా (బావా) అనవద్దు అన్నట్లు.\n\n* వంగతోటలో గ్రుడ్డివాని భాగవతం వలె.\n\n* వంగతోట వానికి కన్నుగ్రుడ్డి, ఆకుతోటవానికి చెముడు.\n\n* వంగ ముదురు - -వరి లేత.\n\n* వంగలేనమ్మ టొంక పట్టూకొని ఏడ్చిందట (టొంక=టంకం).\n\n* వంగనములో పుట్టినది, పొంగలిపెడితే పోతుందా? (వంగనము=వంశము, వంగడము).\n\n* వంగితే తెలుస్తుందమ్మా! వరిమడి కలుపు, నిలబడినవానికి నీళ్ళు కారుతాయా?\n\n* వంగినవాని కింద మఱీ వంగినవానికి వట్టలే తగులును.\n\n* వంగుని వంకాయ, తొంగుని దోసకాయ తిన్నాడు అన్నట్లు.\n\n* వంచని కాలి ధర్మం నా ఒడిలో ఉన్న దత్తా! కానక నా కాళ్ళు తగిలి నీ కళ్ళు పోయినవి.\n\n* వంటంతా అయినదికానీ, వడ్లు ఒక (వాటు) పొలుపు ఎండవలె.\n\n* వంట ఇంటి కుందేలు ఎక్కడికిపోతుంది?\n\n* వంట ఇంటిలో చిలుకకొయ్య మినహాయింపు.\n\n* వంట ఇల్లు కుందేలు సొచ్చినట్లు.\n\n* వంట చేయ కెట్లు వంతక మమరురా?\n\n* వంట ముగిసిన తరువాత పొయ్యి మండుతుంది.\n\n* వంటలక్కను వయలుబండిమీద తెచ్చి, తోటకూరకు ఎసరెంత? అంటే, చంకచేతెడు పెట్టమన్నదట.\n\n* వంటాపె అని తెచ్చుకుంటే ఇంటాపై కూర్చున్నదట.\n\n* వండ నింటికి అగ్గిబాధ.\n\n* వండని కూడు, వడకని బట్ట. (చాకలిది).\n\n* వండమని అక్కకాళ్ళకు మొక్కవలె, వినుమని (తినమని) బావ కాళ్ళకు మొక్కవలె.\n\n* వండలేనక్కకు వగపులు మెండు, తినలేనన్నకు తిండి మెండు.\n\n* వండవే పెండ్లి కూతురా! అంటే, మందిని చూస్తూ మంచినీళ్ళు తెస్తానన్నదిట.\n\n* వండా లేదు, వార్చాలేదు, ముక్కున్న మనసెక్కడిదే అన్నట్లు.\n\n* వండింది తినెనో, గంజితోనే పోయెనో?\n\n* వండినంతలోనే కుండకు దొరయగు.\n\n* వండినంతవరకుండి, వార్చేలోపల పోయినట్లు.\n\n* వండిన కుండలో ఒక్క మెతుకే పట్టి చూసేది.\n\n* వండినమ్మ కంటే, దండుకున్నమ్మ మేలు.\n\n* వండుకున్నమ్మకు ఒకటే కూర, అడుక్కుతినే అమ్మకు ఆరు కూరలు.\n\n* వండుతూ ఉండగా వాంతి వస్తున్నది అంటే, ఉండి భోజనం చేసి పొమ్మన్నదట.\n\n* వండేది అడ్డెడు, ఓగెంగా తిను అల్లుడా! అంటే, అన్నంపై ద్వేషమెందుకు? ఉన్నదంతా ఊడ్చిపెట్టత్తా అన్నాడట.\n\n* వంతుకు మా పక్కవాడు, పాలికి మా బక్కవాడు.\n\n* వంతుకు గంతేస్తే, ఒరు(రి)బీజం దిగిందట.\n\n* వంతు పెట్టుకున్నా, వాత వేసుకొనేదాని కిచ్చి పెట్టుకోవాల.\n\n* వంద మాటలు మాటలాడవచ్చు, వక్కనికి పెట్టేది కష్టం.\n\n* వంపున్న చోటికే వాగులు పోతాయి.\n\n* వంశం బొట్లంతమ్మా! కడివెడు కల్లెట్లమ్మా! వడబోసి అక్కడ పెట్టమ్మా1 వడవకున్న ఒట్టుబెట్టమ్మ! అందట.\n\n* వంశమెఱిగి వనితను, వన్నె నెఱిగి పశువును కొనవలె.\n\n* వక్క కొఱికి ఒక్కప్రొద్దు చెడుపుకొన్నట్లు.\n\n* వక్క పేడిత్తునా, వనము దాటింతునా? చెక్క పేడితున్నా చేను దాటింతునా/\n\n* వక్కలింత తప్పిన వగిరింత, వగిరింత తప్పిన వగిరింత. (వక్కలింత=వేవిళ్ళు).\n\n* వక్రమా! వక్రమా! ఎందుకు పుట్టినావంటే, సక్రమైన వాళ్ళను వెక్కిరించను అన్నదట.\n\n* వగచనట్టే ఉండాల, వాడి ఆలి తాడు తెగినట్లే ఉండాల.\n\n* వగిచినట్టూ ఉండవలె, వాత పెట్టినట్టూ ఉండవలె.\n\n* వగలమారి వంకాయ సెగలేక ఉడికినదట.\n\n* వగలాడికి ముసలాతడు మగడైతే దాని వంత యింతింతా?\n\n\n* వగలాడీ! నీకు మగలెందరే? అంటే, తొలి మగనితో తొంభైమంది అందిట.\n\n* వగలాడీ! నీకు మగలెందరే? అంటే,తోలాడిగాడితో తొంభైమంది అన్నదట.\n\n* వగలు ఎందుకంటే, పొగాకు కోసం అన్నట్లు.\n\n* వగలేని మొగుడా పగ లెందుకు వచ్చినా వంటే, అందుకు కాదులే అగ్గికి వచ్చినా అన్నాడట.\n\n* వగలేని వాడు లంజరిక మాడితే, ఇంటికి దుగ్గాని పంపకం.\n\n* వగ్గు కోతికి సివమెత్తినట్లు.\n\n* వచ్చింది క్రొత్త, వదిగి ఉండు అత్త.\n\n* వచ్చిన కర్మం వద్దంటే పోతుందా?\n\n* వచ్చిన కోడలు నచ్చితే, ఆడబిడ్డ అదిరిపడిందట.\n\n* వచ్చిన వాడు పరాచుట్టము, మరునాడు మాడచుట్టము, మూడవనాడు ముఱికిచుట్టము.\n\n* వచ్చిన పేరు చచ్చినా పోదు.\n\n* వచ్చినమ్మకు ఒయ్యారము, రానమ్మకు రాగాలు.\n\n* వచ్చినవారికి వరమిస్తాను, రానివారికి రాయి వేస్తాను.\n\n* వచ్చిపోతూ ఉంటే బాంధవ్యము, ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారము.\n\n* వచ్చీపోయేవాళ్ళు సత్రం గోడకు సున్నం కొడతారా?\n\n* వచ్చీరాని చన్ను - పేరీ పేరని పెరుగు.\n\n* వచ్చీరాని మాటలు, ఊరీఊరని ఊరగాయ రుచి.\n\n* వచ్చీరాని మాట వరహాల మూట.\n\n* వచ్చు కీడు వాక్కే చెప్పును.\n\n* వచ్చేటప్పుడు ఉలవ, పోయేటప్పుడు నువ్వు.\n\n* వచ్చేటప్పుడు తీసుకరారు, పొయ్యేటప్పుడు తీసుకపోరు.\n\n* వచ్చేవారికి తట్టదింపి, పోయేవారికి తట్ట ఎత్తుట మంచిపని.\n\n* వచ్చేవారికి స్వాగతం, వెళ్ళేవారికి ఆసీమాంతం.\n\n* వజ్రానికి సాన - బుద్ధికి చదువు.\n\n* వట్టల నొప్పి చీమ కేమి తెలుసు?\n\n* వట్టలు గీరుకొన్నంత సుఖం, వైకుంఠంలో కూడా ఉండదు.\n\n* వట్టలు వాసిన వీరారెడ్డీ! వడ్ల ధర ఎంతంటే, అవి ఉంటే ఇవి ఎందుకు వాస్తవి? అన్నాడట.\n\n* వట్టింటికి పోచిళ్ళూ చల్లినట్లు.\n\n* వట్టి అమ్మి కెందుకురా నిట్టూర్పులు?\n\n* వట్టి గొడ్డుకు (గేదెకు) అరుపులెక్కువ, వానలేని మబ్బుకు ఉఱుము లెక్కువ.\n\n* వట్టి గొడ్డుకు అఱ్ఱు లావు.\n\n* వట్టిచేతులతో మూరవేసి ఏమి లాభం?\n\n* వట్టి నిందలు చెప్పితే గట్టి నిందలు వచ్చును.\n\n* వట్టి నేలలో కప్ప అఱచినా, నల్లచీమ గుడ్డుమోసినా వాన తప్పదు.\n\n* వట్టి మాటలవల్ల పొట్టలు నిండునా?\n\n* వట్టీ మట్టి అయితే మాత్రం ఉట్టినే (ఊరక) వస్తుందా?\n\n* వట్టి విశ్వాసంతోనే ఏ పని కాకపోయినా, అది లేకపోతే మాత్రం ఏ పనీ కాదు.\n\n* వడగండ్లు పడితే వఱపు.\n\n* వడికిందంతా పత్తి అయినట్లు.\n\n* వడ్డించి సద్ది తీసుకో.\n\n* వడ్డించేవాడు (వారు) మనవారైతే కడపటి బంతిన కూర్చున్నా ఒకటే (మేలు).\n\n* వడ్డి ఆశ మొదలు చెఱచును.\n\n* వడ్డి, ఉప్పర సభామధ్యే, వైదికః పండితోత్తమః (సాలి జాండ్ర సభామధ్యే సాతానిః పండితోత్తమః).\n\n* వడ్డికి చేటు, అసలుకు పట్టము.\n\n* వడ్డి ముందఱ వడిగుఱ్ఱాలుగూడా పాఱవు.\n\n* వడ్డెవానికి బిడ్డ అయి పుట్టేదానికంటే ధరణీపతికి దాసి అయి పుట్టేది మేలు.\n\n* వడ్డోడికి పెండ్లాము పెద్దది కావాల (తట్ట ఎత్తి పనిచేయును), కాపోడికి గొడ్డు పెద్దది కావాల.\n\n* వడ్లగాదిలో పందికొక్కు వలె.\n\n* వడ్లగింజలోది బియ్యపుగింజ (అనుకొన్నంత రహశ్యం కాదనుట).\n\n* వడ్లతో కూడా దాగర (తట్ట) ఎండినట్లు (దాగర=పెద్ద చేట).\n\n* వడ్లరాసి వరదకు పోతుంటే, పాలోణ్ణి కనిపెట్టి ఉండమన్నాడట.\n\n* వడ్లరాసి వరదకు పోయినా, వానకు కఱవు రాదు.\n\n* వడ్లవాండ్ల పిల్లేమి చేస్తున్నది అంటే, వలకపోసి ఎత్తుకుంటున్నది అన్నాడట.\n\n* వడ్లు ఏదుం, పిచ్చుకలు పందుం.\n\n* వడ్లు, గొడ్లు ఉన్నవానిదే వ్యవసాయం.\n\n* వత్తు పొయిలో పెట్టి తీనెపొయిలో తీసినట్లు (వత్తుపొయి=పొంతకుండ పొయ్యి; తీనెపొయి=తిన్నెపొయ్యి, ప్రక్కన గట్టుతో వేసినది).\n\n* వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి.\n\n* వదినాలు పాడకుంటే, వరిబువ్వ (కూడు) ఎవరు పెడతారు?\n\n* వదినెకు ఒకసరి, గుంజకు బిదిసరి.\n\n* వదినె చందాన వచ్చి పావడ వదిలించిపోయినట్లు.\n\n* వద్దన్న పని వాలాయించి చేస్తారు.\n\n* వనం విడిచిన పక్షి, జనం విడిచిన మనిషి.\n\n* వనవాసం చెయ్యలేరు, వంగి వంగి తిరుగాలేరు.\n\n* పని(లి)కెం పట్టు విత్తితే వజ్రాల పంత కంత చూస్తాము.\n\n* వనితగానీ, కవితగానీ వలచి రావాలి.\n\n* వనిత లేనప్పుడు విరక్తి మంచిదనినట్లు.\n\n* వన్నెకాని గంజి ఈగలపాలు.\n\n* వన్నెకు సున్నం పెడితే వమ్మక పుండయిందట (వమ్మక=పరిహాసం).\n\n* వన్నెచీర కట్టుకున్న సంబరమేకానీ, వెఱ్ఱికుక్క కఱిచిన సంగ తెఱుగదు.\n\n* వన్నెబట్టలమ్మ వలపుడు కన్న, గుడ్డబట్తలమ్మ కులుకుడే లావు.\n\n* వన్నె మాదిరే వన్నెపుడుతుంది, ఒళ్ళు వాచేది ఎఱుగదు.\n\n* వన్నెలమ్మను ఎండబెట్టిన, ఇంటిరాజులను పండబెట్టిందట.\n\n* వయసు కలిగిన నాడే వనిత వలపు.\n\n* వయసు కురకుర, బాతు కురకుర.\n\n* వయసు తప్పినా వయ్యారం తప్పలేదు.\n\n* వయస్సు ముసలెద్దు, మనసు కోడెదూడ.\n\n* వరదలు వస్తాయని వర్షా లాగవు.\n\n* వరమైన పేరు గలిగిన గంగరావికి వందనమొనర్చగానే వరమొసగునా?\n\n* వరపుకు వారధు లింకునా?\n\n* వరవుడి ఇల్లాలౌనా, వాపు బలుపగునా? (వరవుడి=దాసి).\n\n* వరహాకన్నా వడ్డీ ముద్దు, కొడుకుకన్నా మనుమడు ముద్దు.\n\n* వరహాను ముప్పావు చేసుక వచ్చినా, మా యింటాయన ఎద్దుల బేరగాడైనా డంతేచాలు! అన్నదట.\n\n* వరికి ఒక వాన, ఊదరకు ఒక వాన కురుస్తుందా? (ఊదర=వరిపైరులో మెలచే కలుపు మొక్క, దీని గట్టిగింజలు ధాన్యంలో కలిసి ఎంతచెరిగినా పోవు.)\n\n* వరికి వాక, దొరకు మూక.\n\n* వరి చెడి ఊదర బలిసినట్లు.\n\n* వరి పందని ఊరు - దొర యుందని ఊరు ఒకటి.\n\n* వరిపట్టు కడితే వర్షం (వాన) గొప్ప.\n\n* వరిపొట్టకు పుట్టెడు నీళ్ళు (కావలె).\n\n* వరిమొలక, మగమొలకా ఒకటి.\n\n* వరి వడ్డు కేసి, తుంగ నాటు పెట్టినట్లు.\n\n* వరుగుతో దాగరగూడా ఎండవలసినట్లు. (వరుగు= పండిన వంకాయ మెదలగు వానిని బద్దలుగా కోసి ఎండబెట్టినది; వంగ వరుగు).\n\n* వరుసను దునితే వజ్రాలిస్తా నంటుంది భూమి.\n\n* వరుసలెల్ల వల్లకాటిలో పెట్టి, వదినె పిన్నమ్మ ! గంపెత్తు.\n\n* వర్లి వర్లి వాడు పోయె, వండుకతిని వీడు పోయె.(వరలు=వదరు).\n\n* వఱపుకు మెఱుపులు, వట్టిగొడ్డుకు అఱపులు మెండు.\n\n* వఱ్ఱేట ఓడ ఉండగా, వర దూదినట్లు (వఱ్ఱు=వెల్లువ, వఱద).\n\n* వలకంటే ముందు రాళ్ళు విసరినట్లు.\n\n* వలచివస్తే, మేనమామ కూతురు వావికా దన్నట్లు.\n\n* వలపుకు పలుపు దెబ్బలు, వ(ఒ)య్యారికి చెప్పు దెబ్బలు.\n\n* వలలోజిక్కిన మెకము చూడుదని వేటకాడు వదలునా?\n\n\n* వల్లకాటి వైరాగ్యం, పురిటాలి వైరాగ్యం (స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం).\n\n* వసుక వేయబోయిన, వాతప్పులవాడు తగిలినాడు.\n\n* వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట (చాలని కాలానికి).\n\n* వస్తా ఏమి తెస్తావు, పోతా ఏమి ఇచ్చి పోతావు?\n\n* వస్తా నన్నదాన్ని, ఇస్తానన్న వాణ్ణి నమ్మరాదు.\n\n* వస్తానయ్యా! బాపనయ్యా! అంటే, వద్దే! ముండా! వర్జముంది అన్నాడట.\n\n* వస్తావు పోతావు నా కొఱకు, వచ్చి కూర్చున్నాడు నీకొఱకు.\n\n* వస్తుగుణం తెలియనివాడు వైద్యంలో మొనగాడే.\n\n* వస్తూ ఇళ్ళు నింపుతుంది, పోతూ పెరళ్ళు నింపుతుంది (అరికె).\n\n* వస్త్రహీనము విస్తరహీనము పనికిరావు.\n\n* వసిష్టుని వాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవలె.\n\n\n\n**********:: వా ::**********\n\n* వాంతి వస్తే పెదవు అడ్డమా?\n\n* వాకిలి దాటగానే వారణాసి ఎంతదూర మన్నట్లు.\n\n* వాక్చాతుర్యములేని వేశ్య, గుణకారము లేని లెక్క.\n\n* వాగార్త చేలకు సొనలే వరవలు (వాగార్త=సముద్రతీరము).\n\n* వాగు నీళ్ళు, వనం పత్రి.\n\n* వాగులో పోతున్నావే సెట్టి? అంటే, లాభం లేందే పోతానా అన్నట్లు.\n\n* వాగ్దానం ఎందరు అవివేకులనో తృప్తి పరుస్తుంది.\n\n* వాగ్దానం చేసేవాడు వాటిని మరచిపోవడం గూడా నేర్చుకొని ఉంటాడు.\n\n* వాచినమ్మకు పాచి(సి)నకూడు పెడితే, మాఅత్త పరమాన్నం పెట్టిందని ఇరుగింట పొరుగింట చెప్పుకున్నదట.\n\n* వాడవదిన కేల వావివరుసలు?\n\n* వాడికి నలభై జరిగింది (నలభై=40వ సంవత్సరం పరాభవ అంటే అవమానం జరిగింది).\n\n* వాడికి వీడికి నిప్పుకు ఉప్పుకు (వలె ఉన్నది).\n\n* వాడి కేడట్ఠాలే గ్రంథమయింది గానీ, మనకి పై అట్ఠలు కూడావచ్చు.\n\n* వాడి తండ్రి, మాతండ్రి సయాం మగవాళ్ళు-అన్నట్లు.\n\n* వాడిపోయిన పూవులు ముడుచువారుందురా?\n\n* వాడు వట్టి ఇరవై ఐదు ఇరవైఆరు ( ఇరవై ఐదు =25వ సంవత్సరం ఖర, 26వది నందన, గాడిదకొడుకని).\n\n* వాతికి వెరతునా, పీతికి వెరతునా అన్నట్లు.\n\n* వాతాపి జీర్ణం - వజ్రశరీరం.\n\n* వాద బ్రష్టుడు, వైద్య శ్రేష్టుడు (వాద= రసవాదం చేసినవాడు).\n\n* వాది నాశం, ప్రతివాది మృతనష్టం, ప్లీడర్ల అదృష్టం, కోర్టువారి ఇష్టం.\n\n* వాదు తెచ్చుకోవాలంటే, అప్పు ఇవ్వమన్నారు.\n\n* వాదులేక ప్రాణం, దాదిలేక రాణి పోరు.\n\n* వాదులేక వల్లూరికి పోతున్నాను, ఇరుగుపొరుగు నాసవతుల్లారా! ఇల్లు భద్రం (గంప ఎత్తండి) అన్నదట .\n\n* వాదు సుమీ! అప్పిచ్చుట.\n\n* వాన ఉంటే కఱవు, పెనిమిటి ఉంటే పేదరికం లేదు.\n\n* వాన ఎక్కువైతే రొంపికరువు, వాన తక్కువైతే వరపు కరువు.\n\n* వానకన్నా ముందే వరదనా?\n\n* వానకు ఎచ్చయిన తేగి వెరచుగానీ ఎనుబోతు వెరచునా?\n\n* వానకు ముందు ఉఱిమినా, మాటకు ముందు ఏడ్చినా తుదముట్టదు.\n\n* వాన కురుస్తున్నది నాయనా, అంటే కురవనీలే అనగా, అట్లానే కురవనిస్తాలే అన్నాడట.\n\n* వానతోడ వచ్చు వడగండ్లు నిలుచునా?\n\n* వాననాటి వరద, పెళ్ళినాటి పప్పుకూడు.\n\n* వానపొటుకుకంటే మ్రానుపొటుకు ఎక్కువ (పొటుకు అనే శబ్దంతో చినుకు పడుట).\n\n* వాన బడాయి చవిటిమీద, మాల బడాయి పాటిమీద, మొగుడి బడాయి ఆలిమీద.\n\n* వానరాకడ, ప్రాణం పోకడ ఎవఱెరుగుదురు?\n\n* వానలకు మఖ(కార్తె) కుక్కలకు చిత్త(కార్తె).\n\n* వానలుంటే పంటలు, లేకుంటే మంటలు.\n\n* వానలు కురిస్తే వసుంధర.\n\n* వానలు కురిస్తే వాతలు మాసిపోవు, బిడ్డలు పుడితే ఱంకులు మఱచిపోరు.\n\n* వానలు ముంచతవోయ్ ! ముంచతవోయ్! అన్నాడట జ్యోతీష్కుడు (ఎగగొట్టినా ముంచుటే, ఎక్కువైనా ముంచుటే).\n\n* వాన లెక్కడా? అంటే దానధర్మాలున్న ధరణిలో అన్నట్లు.\n\n* వానలేని వట్టి పిడుగు వలె.\n\n* వానవచ్చినందుకు వంక పారిందే గుర్తు.\n\n* వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు (ఆడేవాళ్ళందరూ మారి మారి వాయించుచుందురు).\n\n* వాపును చూచి బలుపను కొన్నట్లు.\n\n* వాపు బలుపు గాదు - వాత అందము గాదు.\n\n* వాపు మానునుగాని వాతలు మానునా?\n\n* వాములు మింగే స్వాములవారికి పచ్చిగడ్డిమోపులు పలహారము (బరోబరు).\n\n* వామ్ము తింటావా, మామా? అంటే, వామ్ముపోసకు సందుంటే ఒక వడతునకే తిననా అన్నాడట.\n\n* వాయిపట్టే సందే ఉన్న, ఒక భక్ష్యమైనా తినేవాడిని.\n\n* వారకాంత జనంబులకు వావి గలదె?\n\n* వారకాంతలేల వలచెదూరక?\n\n* వారవనిత ధనికు చేరదీయగోరును.\n\n* వారాశి దాటినను శని మారకుడై పట్టి చంపు.\n\n* వాలుపై (వాదరపై) నడిచినట్లు (సాము).\n\n* వాళ్ళు పిల్లనివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.\n\n* వావివరుసదప్పి వర్తించి చెడుదురు.\n\n* వాసానికి తగ్గ కూసం.\n\n* వాసి తరిగితే, వన్నె తరుగుతుంది.\n\n* వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల కామక్క వంకాయలభారం తూగిందట.\n\n* వాస్తుగలవారి కోడలు వరహా ఇచ్చి క్షవరం చేయించుకుందట.\n\n\n\n**********:: వి ::**********\n\n* వింటే బేగడ (రాగం) వినాల, తింటే మీగడ తినాల.\n\n* వింటే భారతం వినాల, తింటే వడలు (గారెలు) తినాల.\n\n* వింతలమారికి చండ్లు వస్తే మేనమామకు కండ్లు పోయినవట.\n\n* వింతలేనిదే ఆవులింత పుట్టదు.\n\n* విందు అయినా మున్నాళ్ళు, మందు అయినా మున్నాళ్ళు (మూడ్నాళ్ళు).\n\n* విందు భోజనం చేస్తే, మిట్టచేనుకు ఒడ్డు (మడవ) వేసినట్లుండాల (బిఱ్ఱుగా ఉబ్బిపారును).\n\n* విందు మర్నాడు మందు (కుందు).\n\n* వికారంవాడు దుకాణం పెడితే, వచ్చే గిరాకీ అట్టే మరలిపోయిందట.\n\n* వికిరాలలో లేడు, పిండాలలో లేడు (వికిర=పక్షి).\n\n* విక్రమార్కునివంటి రాజు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు.\n\n* విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి.\n\n* విఘ్నేశ్వరుని పెండ్లికి వేయి విఘ్నాలు.\n\n* విచిత్రపు పచ్చిపులుసు ఈగలగొట్టి, తాలింపుపెట్టి ఇద్దరిని రమ్మంటే ముగ్గురు వచ్చారట.\n\n* విచిత్రం, విన బూటకం! ఆలుగొట్ట మగడేడువ.\n\n* విచిత్రపు పులుసుకూర విస్తరను మింగిందట.\n\n* విజయుం డనువుదప్పి విరటుని గొలువడా.\n\n* విజరానికి తగవు లేదు.\n\n* విటుని పచ్చ జూచి తాళలేక తానిటు నిలను దిరుగుట. (పచ్చ=బంగారు).\n\n* విడిచిన ఎద్దు కొట్టందారి చూచును.\n\n* విడిచిన గుద్ద వీధికి పెద్ద.\n\n* విడిచినది వీధికి పెద్ద, బరితెగించినది (విడిచినది) బజారుకు పెద్ద.\n\n* విడిచిన ముండకు వీరేశలింగం, తెగించినవాడికి తెడ్డే లింగం.\n\n* విడిచిన ముండలకు విడవలూరు (విడవలూరు=నెల్లూరు జిల్లాలో ఒక సంపన్న గ్రామం).\n\n* విడిచిన ముండ వీధికి పెద్ద, బడివిడిచినముండ బజారుకు పెద్ద.\n\n* విడిచిన లంజ వీధికెక్కితే, చావిట్లోవాళ్ళు చాటుకు పోయినారట.\n\n* విడిచిపెట్టిన ఇంటిలో మఱచిన మంగలు (మంగ=అలమేలుమంగ)\n\n* విడిపించబోయిన పాముకు పగ, విడిపించకున్న కప్పకు పగ (వగ).\n\n* విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానం.\n\n\n* విత్తంకొద్దీ విభవము! విద్య కొద్ది వినయము.\n\n* విత్తకుండానే కోస్తా మన్నట్లు.\n\n* విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?\n\n* విత్తనం మళ్ళితే, విడవకుండా ఏడేండ్లు సేద్యం చెయ్యమన్నారు.\n\n* విత్తనముకొద్ది మొక్క.\n\n* విత్తనములో లేనిది విశ్వంలో లేదు.\n\n* విత్తనము వేసి, పొత్తు కలిపినట్లు.\n\n* విత్తనానికి దాపరికం (గుట్టు), విద్యకు వెల్లడి (రట్టూ) అవసరం.\n\n* విత్తనాలకు పోయిన రెడ్డి, ఓదెలెత్తగా వచ్చినాడట (ఓదె=పైరుకోసి ఎండుతకు కయ్యలో బారులు బారులుగా వేసినవి).\n\n* విత్తనాల సంచులు మంచివయితే, విత్తపుసంచులు నిండును.\n\n* విత్తనా లుంటేనే పెత్తనాలు.\n\n* విత్తహీనుడు ధర్మవృత్తి దలచు.\n\n* విత్తిన కొలది పైరు.\n\n* విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకొకటి మొలచునా?\n\n* విత్తుకన్నా క్షేత్రం మెరుగు.\n\n* విత్తుకు వేయి విత్తులు.\n\n* విత్తుటకు శుక్రవారం, కోతకు గురువారం.\n\n* విత్తు మంచిదయితే కాయా మంచిదగును.\n\n* విత్తు మంచిదయితే రైతుకు మంచిదగును.\n\n* విత్తు ముందా? చెట్టు ముందా?\n\n* విత్తులు దీసిన కోడె - యీకలు పెరికిన కోడి.\n\n* విత్తే చెట్టయ్యేది.\n\n* విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తనకు తానే కనబడతాడు.\n\n* విద్యాప్రసంగముల్విన రసఙ్ఞతలేని రసికుల సభ, సభగాదు గ్రామరచ్చ గాని.\n\n* విధవకు తలసుళ్ళు వెదకినట్లు.\n\n* విధవకు మ్రొక్కితే ' నావలనే వెయ్యేళ్ళు వర్థిల్ల ' మన్నది, రెండోసారి దండం బెట్టితే, 'నా మొగుడు మాదిరే బ్రతుక ' మన్నదిట.\n\n* విధవకు విరజాజి పూదండ కావలెనా? (లేల?)\n\n* విధవైన మేలు, మగనికి తిథిబెట్టును, కథలు వినును, తీర్థము లాడున్.\n\n* విధి వస్తే పొదలడ్డమా?\n\n* వినకు, అనకు, కనకు (చెడ్డవి).\n\n* వినయోక్తులు లేని ఈవి వ్యర్థము.\n\n* వినరాదు, కనరాదు, అనరాదు (చెడ్డ).\n\n* వినని బంటుకు వెన్నపూస కూడానా?\n\n* వినను కనను రెండేసి ఇచ్చి, అనను ఒకటే ఇచ్చినాడు - దేవుడు (చెవులు, కన్నులు, నాలుక; అంటే ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాల అనుట).\n\n* వినయం లోకవశీకరం, విద్య రాజవశీకరం.\n\n* వినాయకుడిమీద భక్తా, ఉండ్రాళ్ళమీది భక్తా?\n\n* వినాయకుని చేసియిస్తావా కుమ్మరీ అంటే, వాడి అబ్బను చేసిస్తానని లింగం చేసి యిచ్చినాడట.\n\n* విని రమ్మంటే తిని వచ్చినట్లు.\n\n* వినేవాటికి (చెవులకు) కనేవాటికి (కంద్లకు) బెత్తెడే దూరం.\n\n* విన్న మాటకంటే చెప్పుడు మాటలు చెడ్డవి.\n\n* విన్నమాట కన్నంత నమ్మదగింది కాదు.\n\n* విన్నమ్మ వీపు కాలింది, కన్నమ్మ కడుపు కాలింది.\n\n* విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించినవన్నీ వెలిబుచ్చవద్దు.\n\n* విప్రహస్తము వేదాండ హస్తము ఊరుకోవు.\n\n* వీభూది పట్టెలు పెట్టుకుంటే, విష్ణుమూర్తి వనుకున్నానే, ఆంజనేయుడివటోయ్! వెంకటేశ్వర్లు.\n\n* వియ్యంకునికి వీపుదెబ్బలు, వియ్యపురాలికి వీపుదెబ్బలు.\n\n* వియ్యపురాలికి వీపుదెబ్బ, నాకు తోపుదెబ్బ.\n\n* వియ్యపురాలి పేరు విసరమ్మ, నాపేరు దంచమ్మ (విసరు+అమ్మ; దంచు+అమ్మ).\n\n* వియ్యపువారింట జాడ్యాలు ఇకిలించినా పోవు.\n\n* వియ్యానికి కయ్యం తోబుట్టువు.\n\n* వియ్యానికయినా, కయ్యానికయినా సాటి ఉండాల.\n\n* వియ్యానికి కయ్యానికి సమతవలయు.\n\n* వియ్యాలందితే కయ్యా లందుతవి.\n\n* వియ్యాలవారింటికి పోతే వీపులమీదనే వస్తుంది (స్పొటకం).\n\n* విరచుకొని విరచుకొని వియ్యపురాలింటికి పోతే, పలుగురాళ్ళతో నలుగు పెట్టిందట.\n\n* విరామం లేని పశువుకు ఊరట లావు.\n\n* విరాలికి ఆమనివంటి చుట్టము లేదు.\n\n* విరిగిన వేలుమీద ఉచ్చ పోయనివాడు, వినాయకుడికి టెంకాయ కొడతాడా?\n\n* విరిగేదాని కంటే వంగేదే మేలు.\n\n* విరజాజి పూదంద విధవకేల?\n\n* విరి దాస్తే తావి దాగుతుందా?\n\n* విరుగుబాటు పైని నూనెబొట్టు, విరచికట్లపైని పెరుగుబొట్టు.\n\n* విరోధికి అపశకునం కలిగించను, తనముక్కు కోసుకొని ఎదురుపడినాడట.\n\n* విలుచుటకు ముందే విక్రయించే సులువు చూడాలి.\n\n* విల్లమ్ములు కలవారికి చల్లకడవలవారు తోడా?\n\n* విశాఖ (కార్తె) కురిసిన, విషము పెట్టినట్లు.\n\n* విశాఖ చూచి విడువర కొంప (ఉత్తరజూచి ఎత్తర గంప).\n\n* విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లు.\n\n* విశాఖ్స్యో మబ్బులు, మజ్జిగతో భోజనం సరి.\n\n* విశాఖతో మేఘాలు, ప్రసూతితో యవ్వనము సరి.\n\n* విశాఖ వరదలు - సంక్రాంతి మబ్బులు.\n\n* విశేషము లేనిది వింతెలా పుడుతుంది?\n\n* విశ్వాసం తప్పిన పీనుగు మోసినవాడిని పట్టిందట.\n\n* విషపాళపు విత్తు, నేపాళపు గింజ.\n\n* విషములో పుట్టిన పురుగుకు విషమే ఆహారం.\n\n* విషములో పుట్టిన పురుగు విషములోనే జీవిస్తుంది.\n\n* విషయం లేని వక్తకు వాగాడంబరం ఎక్కువ.\n\n* విషానికి విషమే విరుగుడు.\n\n* విసరగా, విసరగా ఒక రాయి, తిట్టగా తిట్టగా ఒక తిట్టు తగులును.\n\n* విసిరిన రాయి గాలికి పోయినట్లు.\n\n* విసరురాయి గాలికికొట్టుకపోతే, విస్తరాకు సంగతి చెప్పాలనా?\n\n* విస్తరి(ర) కొదవా, సంసారపు కొదవా తీర్చేవారెవరు?\n\n* విస్తరి చిన్నది, వీరమ్మ చెయ్యి పెద్దది.\n\n* విస్తళ్ళు ఎత్తమంటే, భోంచేసిన వారెందరని లెక్కబెట్టినాడట.\n\n* విస్సన్న చెప్పినదే వేదం.\n\n\n\n**********:: వీ ::**********\n\n* వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకొన్నట్లు.\n\n* వీధిలోన దిరుగ వెలది పురుషుడౌనె?\n\n* వీపు గుద్దరా శిష్యా అంటే, నీకంటే తక్కువ తిన్నదెవరు అన్నాడట.\n\n* వీపు తోమరా! అంటే, ఇక్కడొక బొక్క ఉన్నదే అన్నాడట.\n\n* వీపున తన్నుతుంటే, యింటివెనుక చప్పుడన్నట్లు.\n\n* వీపుమీద కొట్టవచ్చును గానీ, కడుపుమీద కొట్టరాదు.\n\n* వీరక్క పెండ్లిలో పేరక్క శోభనం.\n\n* వీరన్న ముందు బసవన్న, గౌరి ముందు గణేశుడు.\n\n* వీరభద్రపళ్ళెమునకు హనుమ త్పళ్ళెము.\n\n* వీరభోగ్య వసుంధర.\n\n* వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.\n\n* వీలెరిగి మాట, కీలెరిగి వాత.\n\n* వీసం ఇచ్చి, వాసానికి ఒడ్డినట్లు.\n\n* వీసం ఖర్చు లేకుండా నోము నోముతాను, ఆశపడకండి అడవ నా బిడ్డల్లారా!\n\n* వీసం గల అమ్మి విడువా ముడువా, కాసుగల అమ్మి కట్టా, పెట్టా.\n\n\n* వీసం గల రెడ్డికి విడువా, ముడువా సరిపోయింది.\n\n* వీసానికి వాసిన్నర అయితే, దూలన్నర ఎంత?\n\n* వీసెడు చింతపండు పాసంగానికే సరిపోయింది. (పాసంగం=పడికట్టుట, దాళా,తక్కెడ తూకం మొదట సరిచేయుట).\n\n\n\n**********:: వృ ::**********\n\n* వృథా బోడ (సన్నాసి) వైతివి, పొందవైతివి.\n\n* వృధనారి పతివ్రత.\n\n* వృధ వైద్యం - బాల జోస్యం.\n\n* వృష్టికి ప్రమాణం ఉత్తరహస్తలు (కార్తెలు).\n\n\n\n**********:: వె ::**********\n\n* వెంకటరెడ్డే కంకి కొరికితే, వెంటవచ్చినవాండ్లూ రకుంటారా?\n\n* వెంకన్న తిండి జూచిన అంకాళ్ళమ్మకును సైతమరగుండె పడున్.\n\n* వెంకయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు, రానూ వచ్చాడు.\n\n* వెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది.\n\n* వెంట పోయినా వెనుక పోరాదు.\n\n* వెంటపోయైనా చూడాలి, యింట ఉండైనా చూడాలి.\n\n* వెంట రావద్దంటే, ఎత్తుకోమని ఏడ్చాడట (బిడ్డ).\n\n* వెంట్రుకకన్నా ఏడుపాళ్ళు సన్నం, రోకలికన్నా ఏడుపాళ్ళు లావు.\n\n* వెంట్రుక పట్టుకొని ప్రాకులాడినట్లు.\n\n* వెంట్రుకలు పెరికివేయగానే పీనుగు తేలిక అవుతుందా?\n\n* వెంట్రుక లున్నమ్మ ఏకొప్పైనా పెట్టుతుంది.\n\n* వెండి బేరమాడుతూ బంగారు కొసరినట్లు.\n\n* వెంపలి పూస్తేనేమి, కాస్తేనేమి?\n\n* వెంపలి చెట్లకు దోట్లు వేసినట్లు.\n\n* వెక్కిరించబోయి బోర్లపడినట్లు.\n\n* వెచ్చంగా ఉంటే ఏరుకతింటారు, పచ్చంగా ఉంటే పారిపోతారు.\n\n* వెట్టికి కని వెలుగులో పాఱవేసినట్లు.\n\n* వెట్టికి గదరా పోలా! అంటే, ఏడవక తప్పడే అయ్యా! అన్నట్లు.\n\n* వెట్టికి చెపితే వేగుదాకా చెప్పమన్నట్లు.\n\n* వెట్టికి పుట్టినబిడ్డ నెత్తికి లేక ఏడ్చిందట.\n\n* వెట్టి గుఱ్ఱం, తంగెడు బఱ్ఱె.\n\n* వెట్టి గొలువరాదు విభుడెంత ఘనుడైన.\n\n* వెట్టి మూటకీ, పంక్తి భోజనానికి ముందుగా వెళ్ళాలి.\n\n* వెట్టికి వెల ఏది?\n\n* వెతకివెతకి వెయ్యి బళ్ళమీద వంటలక్కను తెస్తే, తగిలేని మిగిలేని తోటకూరకి తొడలోతు ఎసరు పెట్టిందట.\n\n* వెదకి వెదకి యతడు వెఱ్ఱియై చెడిపోయె.\n\n* వెదకు అదను అయితే, వెలుగులో చల్లినా మంచిదే (వెద=విత్తనము చల్లుట).\n\n* వెదుక బోయిన తీగ కాలికి తగిలినట్లు.\n\n* వెదుక బోయిన తీర్థ మెదురైనట్లు.\n\n* వెధవ ముండకైనా వేవిళ్ళు తప్పవు.\n\n* వెధవముండా! వేరుంద మన్నట్లు.\n\n* వెనుక గుద్దరా శిష్యా! అంటే, వెనుక గుద్దగాక మొగం ఉంటుందా స్వామి- అన్నాడట.\n\n* వెనుక తుమ్ము ముందుకు మంచిది.\n\n* వెన్నకు పండిచ్చి, దూలాలు కంకిననాడు.\n\n* వెన్నకు కళ్ళువచ్చి, ఏకులు కమికిన నాటికిగద!\n\n* వెన్న కత్తి దెబ్బకోర్చునా?\n\n* వెన్న కొద్దీ నెయ్యి.\n\n* వెన్న చేతబట్టుకొని నేతికి వెదకినట్లు.\n\n* వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే, చల్ల దాగినవాని చావమోదినట్లు.\n\n* వెన్నతో కొట్టిన వానిని రాయితో కొట్టినట్లు.\n\n* వెన్న దగ్గఱ ఉంచుకొని, నేతికి తడుముకొన్నట్లు.\n\n* వెన్నను సన్నగా నూరినట్లు.\n\n* వెన్న పెట్టితే మింగలేడు, వేలు పెడితే కఱవలేడు (కొఱకలేడు).\n\n* వెన్నబడే సమయానికి బాన పగిలినట్లు (బాన=తరికుండ).\n\n* వెన్నముద్ద కేల వేడినీరపు పొందు?\n\n* వెన్నముద్ద పారవేసి వేళ్ళు నాకినట్లు.\n\n* వెన్నయుండ నేతికెవరైన వ్యసనపడుదురా?\n\n* వెన్నలా దున్నితే వెన్నులకేమి కొదువ? (వెన్నులు కొండలాది).\n\n* వెన్నలో వెంట్రుక తీసినట్లు.\n\n* వెన్ను మీద గువ్వ (గూబ; అరిష్టము) (వెన్ను=ఇంటివెన్నుగాడి).\n\n* వెన్ను ముదిరి పొర్లిన గొడ్డు ఎక్కువ పాలిస్తుంది.\n\n* వెన్ను మూరెడు, దంటు బారెడు.\n\n* వెన్నెల దినాల్లోనే అల్లో(ల్ల)నేరేడి పళ్ళు.\n\n* వెయ్యి ఆవులు కలవానికి ఒకటి (పాలి ఇవ్వక) తన్నిననేమి?\n\n* వెయ్యి ఆవు లున్నవానికి ఒకటి ఎగజేసితే నేమి?\n\n* వెయ్యి ఇండ్ల పూజారి వెతికినా దొరకడు.\n\n* వెయ్యి కన్నులు రేయికుంటే, పగటికేమో ఒకతే (చుక్కలు, సూర్యుడు).\n\n* వెయ్యి కాకుల కొకే రాయి.\n\n* వెయ్యి పుట్ల వడ్లకు ఒక చిలుకపురుగు చాలు.\n\n* వెయ్యి మోపులు వేకువజాము కట్టకు లోకువే.\n\n* వెయ్యి మోపులు మంచుమోపుకు లోకువే.\n\n* వెయ్యి రూపాయిలు కావలెనా? వెధవ తోడబుట్టువు కావలెనా?\n\n* వెయ్యి రూపాయలు పెట్టి ఎద్దును కొన్నా, ముల్లుకఱ్ఱ ఉండాల.\n\n* వెయ్యి రూపాయిలు పెట్టి ఏనుగును కొని, అరవీసం అంకుశానికి పాలు మాలినట్లు.\n\n* వెరపింపగాబోయి వెరచినట్లు.\n\n* వెఱ్ఱి కుక్కను బట్టి వేటాడవచ్చునా?\n\n* వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట.\n\n* వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, దూడా బఱ్ఱె దూసుక తిన్నవట.\n\n* వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, ఊరి బఱ్ఱెగొడ్లన్ని వెంటబడినవట.\n\n* వెఱ్ఱిది వెంకటమ్మ మనువుపోయి మళ్ళీ వచ్చింది.\n\n* వెఱ్ఱిదైన కుక్క వేసారి దిరుగురా.\n\n* వెఱ్ఱిపెయ్యకు తొఱ్ఱిపెయ్య తోడు.\n\n* వెఱ్ఱిముండ వేడుక చూడబోతే, వెతక నిద్దరు, ఏడువ నిద్దరు.\n\n* వెఱ్ఱిమొద్దుకేల వేదశాస్త్రాలు?\n\n* వెఱ్ఱివాడి పెళ్ళాం వాడకల్లా వదినే.\n\n* వెఱ్ఱివాడు ఏతాం తొక్కినట్లు.\n\n* వెఱ్ఱివాడు వెఱ్ఱివాడు అంటే, వెక్కి వెక్కి ఏడ్చినాడట.\n\n* వెఱ్ఱివాని చేతిరాయి తగిలెనా తగులును, తప్పెనా తప్పును.\n\n* వెఱ్ఱి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.\n\n* వెలమ నీల్గు, బరపట గంజి, తెడ్డు తేరా దేవుకతిందాం.\n\n* వెలమ మెచ్చిన ముచ్చట జెప్పు - అలిగిన ప్రాణహాని దెచ్చు.\n\n* వెలమ చెలిమి కలలోకన్నా కలిమి వంటిది.\n\n* వెలమ పొందు వెయ్యేండ్లు చేసినా కాసు వీసమైనా కానరాదు.\n\n* వెలమల వితరణ, సాతాని శాస్త్రవాదము.\n\n* వెలమలున్న ఊరు - కొంగలున్న మఱ్ఱి - ఒకటి.\n\n* వెలమవారి పెండ్లికొడుకు మారడుగానేరడు, ఉన్నదంతా ఊడ్చిపెట్టు.\n\n* వెలయాలి మాట - కలలోని మూట.\n\n* వెల సులభం, ఫల మధికం.\n\n* వెలిగొండవంటి తండ్రికంటే, ఏకులబుట్టవంటి తల్లిమేలు.\n\n* వెలిచవుల్ గొనుకాంత వెరువదు నిందుకు.\n\n* వెలిపొలమును, వెధవపిల్లను వదలకూడదు.\n\n* వెలుగుకన్న దిక్కు వేరెవరున్నారు?\n\n* వెలివాడలో వేదఘోష ఉంటుందా?\n\n\n* వెలుగు నీడ, గ్రామం తోడు.\n\n* వెలుగు లేకున్న చీకటి లేదు, చీకటి లేకున్న వెలుగు లేదు.\n\n* వెలుగే చేనుమేస్తే కాచేవా రెవరు? (వెలుగు=కంచె, కర)\n\n* వెలుతురుకట్టెల (పుల్లల) వెలుగని వెలిగించు కొంటారా? (వెలుతురుకట్టె= ఒక అడవిచెట్టు పుల్లలు, బెరడుతీసి వెలిగించిన చమురుబోసిన దివిటీవలె వెలుగుచుండును).\n\n* వెలుపల వేడుక, లోపల కసపు.\n\n* వెల్లకిత్తలా పడుకుని ఉమ్మివేస్తే (ముఖం)మీద పడుతుంది.\n\n* వెల్లకిలా వేసి పొడిస్తే ఒక్క దెబ్బకే చస్తున్నదని సన్యాసుల మయిన మేమెందుకు చెప్పడం.\n\n* వెల్లటూరిలో ఎద్దును, పరుచూరులో పడుచును ఇవ్వకూడదు.\n\n* వెల్లుల్లి వనానికి జోరీగ, పాడూరికి దరిబేసి రాజులు (దరిబేసి= దర్ వేష్ అను ముస్లిం సన్న్యాసి గణము; నలుచదరపు రంగురంగుల పేలికలతో బొంత కుట్టుకొందురు. భిక్షగాడు లేక దరిద్రుడని భావము).\n\n* వెళ్ళిపొమ్మంటే, పెళ్ళికి వెళ్ళుదా మన్నట్లు.\n\n* వెళ్ళిపొమ్మంటే చూరుపట్టుకొని వ్రేళ్ళాడినట్లు.\n\n\n\n**********:: వే ::**********\n\n* వేగీవేగనమ్మ వేకువజామున ముట్టయితే, తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట.\n\n* వేగీవేగని పెసరపప్పు, వెనుకవచ్చిన పెండ్లాము రుచి.\n\n* వేగుకు ముందు చీకట్లు దట్టమైనట్లు.\n\n* వేటకాని ఇల్లు వెఱవక కుందేలు సొచ్చినట్లు.\n\n* వేచని కందిపప్పు, అవివేకుని మెప్పు.\n\n* వేటుకు వేటు, మాటకు మాట.\n\n* వేడికోర్వలేనమ్మ సహగమనం చేస్తానన్నదిట.\n\n* వేడినీళ్ళకు ఇల్లు కాలునా?\n\n* వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్లు.\n\n* వేసేవి పులిగురకలు, మేసేవి గడ్డిపరకలు.\n\n* వేస్తివిరా కన్నం అంటే, చేస్తివిలే కాపురం అన్నట్లు.\n\n* వేస్తే మునగకొయ్య, తీస్తే చండ్రకొయ్య (చండ్ర=చాలా బాగ కాలేకొయ్య).\n\n* వేళ్ళపై నీళ్ళుపోసినా కొసలకే (చెట్లకు).\n\n\n\n**********:: వై ::**********\n\n* వైదీకపు పిల్లీ! వ్రత్తిపలకవే అంటే, మ్ర్యావ్ మ్ర్యావ్ అన్నదట.\n\n* వైదీకుని చేతి విడిమాయె వనిత బ్రతుకు.\n\n* వైదీకి వైద్యంలో చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే.\n\n* వైద్యం నేర్వనివాడు, వానకు తడియనివాడు లేడు.\n\n* వైద్యుడా! నీ సంచీలో వేడినీళ్ళు ఉన్నవా అన్నట్లు.\n\n* వైద్యుడి పెండ్లాముగూడా ముండమోసేదే అన్నాడట.\n\n* వైద్యుడు మొదట తన వ్యాధిని పోగొట్టుకోవాల.\n\n* వైద్యుడు రోగాలు కోరు, వైశ్యుడు కరువు కోరు.\n\n* వైద్యుని పేరుచెప్పితే వ్యాధిపోవునా?\n\n* వైద్యుని భార్యకే భగంధర రోగము.\n\n* వైరాగ్యం ముదిరితే, వారవనితకూడా తల్లితో సమానం.\n\n* వైరికి గానీ వడ్లు మొదగవు.\n\n* వైష్ణవుని మెడలో రుద్రాక్షలు కట్టినట్లు.\n\n* వైశ్యుల పెండ్లిలో వితరణలేదు.\n\n* వైష్ణవులలో రామభద్రయ్య, శైవులలో వీరభద్రయ్య, స్మార్తులలో వట్టి భద్రయ్య.\n\n* వైష్ణవులలో లింగయ్య ఉండడుగానీ, శైవులలో రామలింగయ్య ఉంటాడు (పేర్లు).\n\n\n\n**********:: వ్య ::**********\n\n* వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల చేరురా.\n\n* వ్యవసాయం వెఱ్ఱివాని (గుడ్డివాని) చేతి రాయి.\n\n* వ్యవసాయం ఏలిననాటి శని, భార్య జన్మశని.\n\n\n\n**********:: వ్యా ::**********\n\n* వ్యాది దెలియలేని వైద్యుడేరికినేల?\n\n* వ్యాధి పీడితుడు దైవచింతనచేయు.\n\n* వ్యాధి రట్టు సంసారం గుట్టు.\n\n* వ్యాధి వచ్చినవాడు వెఱ్ఱిబట్టినవాడు ఒకటి.\n\n* వ్యాపారం చమురు వంటిది, కాబట్టే దాంట్లో మరేదీ ఇమడదు.\n\n* వ్యాధికి మందుగానీ విధికి మందా?\n\n* వ్యాధిహీనునికి పరవైద్యుని చెలిమేల?\n\n* వ్యాపారం జోరుగా సాగిపోతున్నది, రెండోబఱ్ఱెను అమ్మి డబ్బు పంపమన్నట్లు.\n\n* వ్యాపారి విత్తంబు వారకాంతలపాలు, కల్జువిత్తము రుంజుకాని పాలు (రుంజు=చర్మ వ్యాపారి).\n\n* వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోకతమా? అన్నట్లు.\n\n\n\n**********:: వ్ర ::**********\n\n* వ్రతం చెడ్డా సుఖం (ఫలం) దక్కవలె.\n\n\n\n**********:: వ్రా ::**********\n\n* వ్రాత కరణమా? మేత కరణమా?\n\n* వ్రాతగదే కూతురా! అంటే, కోతిమొగుడే అమ్మా అన్నట్లు.\n\n* వ్రాత దైవమండ్రు, చేత పౌరుషమండ్రు.\n\n* వ్రాత బలి గోరును.\n\n* వ్రాత రాజ్యమేలాలని ఉంటే, గ్రహచారం (కర్మం) గాడిదల నేలమన్నదట (మేపమన్నదట).\n\n* వ్రాత రానివాడు కోత (స)కరణం, వ్రాతా కోతా రానివాడు మేతకరణం.\n\n* వ్రాత వెంతగాని వరమీదు దైవంబు.\n\n* వ్రాసే వాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 879,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-వ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* శంకులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు.\n\n* శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థం కాదు.\n\n* శకునంవేళ ఎక్కడికని అడుగకూడదు గానీ ఎక్కడికో చెప్పిపో అన్నట్లు.\n\n* శక్తి ఎవరిసొమ్ము యుక్తిచే సాధింప.\n\n* శక్తిచాలనివాడు సాధుత్వము వహించు.\n\n* శఠగోపం లేకుంటే నా శంఠంపోయేగానీ ఇంట్కిపోయి గంటె బోర్లించుకుంటాను.\n\n* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.\n\n* శతాపరాధములకు సహస్త్రదండనములు లేవు.\n\n* శనగలు తిని చేయి కడుగుకొన్నట్లు.\n\n* శని పట్టితే ఏడేళ్ళు, నేను పట్టితే పద్నాలుగేళ్ళు.\n\n* శనిపీనుగా తనిగా పోదు (తనిగా=ఒంటరిగా)\n\n* శనివారం వాన శనివారమే విడుచును.\n\n* శని విఱగడ, పని ఒబ్బిడి.\n\n* శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలెక్కువ.\n\n* శయనైకాదశి తెలిసినవాడే శాస్త్రకారుడు.\n\n* శరణార్థిని లింగప్పా! అంటే, కందులు మూడుమాడలు అన్నాడట; చిన్నాపెద్దా బాగున్నారా? అంటే, పప్పు లక్కవలే ఉడుకుతుంది అన్నాడట.\n\n* శరత్కాలవర్షం, గృపణుని ఔదార్యం వంటిది.\n\n* శరము చాటేడు, చెప్పులు మూటెడు.\n\n* శరము తప్పిన చెవులు వినరావు, గుణము తప్పిన కళ్ళు కానరావు.\n\n* శల్య సారథ్యం.\n\n* శవం బరువని శష్పాలు బెరికి వేసినట్లు.\n\n* శవానికి చేసిన అలంకారం వలె.\n\n\n\n**********:: శా ::**********\n\n* శాంతము లేక సౌఖ్యము లేదు, దాందునికైనా, వేదాంతునికైనా.\n\n* శాగరోకలి యిరుగు పెట్టినట్లు.\n\n* శాపాలకు చచ్చినవాడు, దీవనలకు బ్రతికినవాడు లేడు.\n\n* శాఫాళు ఊత్సవాలవంటివి, అవి ఊరేగి ఊరేగి బయలుదేరిన చోటుకే వచ్చిచేరును.\n\n* శాస్త్రం తప్పు, చచ్చేది నిజం.\n\n* శాస్త్రప్రకారం విషయిస్తే కుక్కమూతి బిడ్డలు పుట్టినట్లు.\n\n* శాస్త్రులవారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడరేణమని (పేడని) ఎఱుగనా? అన్నదట.\n\n* శాస్త్రులవారు కొడుకు బ్రతికి నిర్వాహకుడే, చచ్చీ నిర్వాహకుడే (నిర్వాహకుడు= మోసెవారు లేరని, బాగా నిర్వహించుకొనేవాడని అర్ధాంతరము).\n\n\n\n**********:: శి ::**********\n\n* శింగిడి లేస్తే పదిహేనుదినాల వర్షం (శింగిడి= ఇంద్రధనుస్సు).\n\n* శుఖి శిఖిల మీద మిడతలు చెనసి(గి)నట్లు.\n\n* శిర సుందగ మోకాటికి సేనలు బోసినట్లు.\n\n* శిలాభోగం, స్థలభోగం, నరా(ర)భోగం అన్నారు.\n\n* శివరాత్రికి చలి శివశివా! అనిపోతుంది.\n\n* శివరాత్రికి చంక లెత్తనీయదు (చలి).\n\n* శివరాత్రికి చింతగింజలంత చలి.\n\n* శివరాత్రికి చింతాకంత వెట్ట.\n\n* శివరాత్రికి జీడిపిందె, ఊగాదికి ఊరుగాయ.\n\n\n* శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ.\n\n* శివరాత్రికి శివలింగాలంత మామిడికాయలు.\n\n* శివరాత్రి వాడింటికి ఏకాదశి వాడొచ్చినట్లు.\n\n* శివు డియ్యకున్న సిద్ధలింగ మిచ్చునా?\n\n* శివిడు పురుషుడైన శ్రీలకు జిక్కునా?\n\n* శివిని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.\n\n* శిశువుకు దక్కని స్తన్యం వలె.\n\n* శిష్యా! శిష్యా! నా కాళ్ళకు చెప్పులున్నవా? అంటే, నక్ష్త్ర మందలం మధ్య ఎక్కడా కనపడలేదు అన్నాడట. (బిఱ్ఱుగా తిని తల వంచలేక).\n\n* శిష్యా వెనుక గుద్దరా అంటే, వెనుక గుద్దగాక మొగముంటుందా? స్వామీ అన్నాడట శిష్యుడు.\n\n* శిష్యున కెక్కడ సందేహమో, గురువు కక్కడే అనుమానం.\n\n\n**********:: శీ ::**********\n\n* శీలములేని సౌందర్యము తావిలేని పువ్వు వంటిది.\n\n\n\n**********:: శు ::**********\n\n* శుద్ధ మనసులేక పూజసేయుటే సూకరవేత్తి.\n\n* శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే పెళ్ళికూతురుముండ ఎక్కడున్నదన్నాడట.\n\n* శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే - పెండ్లికి వచ్చిన ముత్తైదువలంతా నా పెద్దపెండ్లాలు అన్నాడట.\n\n* శుభం పలకరా మంకెన్నా అంటే, పెండ్లికూతురుముండ ఎక్కడ చచ్చింది అన్నాడట.\n\n* శుభం పలకరా మంకెన్నా అంటే, ఎవడాలితాడు తెగితే నాకేమి? నాకువేసే పిండాకుడు నాకేస్తే, అయిరేని కుండలకాడ చచ్చినట్టే తొంగుంటా నన్నాడట.\n\n* శుభం పలకరా మంకెన్నా అంటే, చెల్లిముండకు పెళ్ళెప్పుడు అన్నాడట.\n\n* శుభాలు ముంచి, దీపాలు ఆర్పినట్లు.\n\n* శుష్కప్రియాలు, శూన్య హస్తాలు.\n\n\n\n**********:: శూ ::**********\n\n* శూద్రపొట్టా తాములపాకుకట్టా, పొగాకుపట్టా, ఎప్పుడు తడుపుతూ ఉండాలి.\n\n* శూద్ర సంతర్పణ, బ్రహ్మణ సేద్యము.\n\n\n\n**********:: శె ::**********\n\n* శెట్టిగారు సింగారించుకునే లోపల ఊరంతా కొల్లబోయిందట.\n\n* శెట్టిగారూ, తుమ్మితే ఏమనుకుంటారు? అని త్రిమూర్తులు మారు వేశంలో వచ్చి అడిగితే, జలుబు చేసిందని అనుకుంటాను-అన్నాడట.\n\n* శెట్టిగారూ, మాలో ఎవరు బాగుంటారు? అని లక్ష్మీదేవి, దరిద్రదేవి వచ్చి అడిగితే, చినక్క లోపలికి వస్తే బాగుంటుంది, పెద్దక్క బయటకిపోతే బాగుంటుంది - అన్నాడట.\n\n\n\n**********:: శే ::**********\n\n* శేరుదొరకు మణువుబంతు.\n\n* శేషాయలెస్స అంటే, గరుడాయలెస్స అన్నట్లు.\n\n\n\n**********:: శొ ::**********\n\n* శొంఠి లేని కషాయమా?\n\n\n\n**********:: శో ::**********\n\n* శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు తలచినట్లు.\n\n\n\n**********:: శ్మ ::**********\n\n* శ్మశానానికి పోయిన శవం తిరిగిరాదు.\n\n\n\n**********:: శ్యా ::**********\n\n* శ్యామలాకారుడమ్మా! ఈ బిడ్డ శానాళ్ళు బతుకడమ్మా.\n\n* శ్యామలకోరల పున్నానికి కోటొక్కపుఱ్ఱె బొట్టి నోముతుండట.\n\n\n\n**********:: శ్రా ::**********\n\n* శ్రార్ధానికి అంటు లేదు, యఙ్ఞానికి ఎంగిలి లేదు.\n\n* శ్రావణంలో శనగల జోరు, భాద్రపదంలో బాధలపోరు.\n\n\n\n**********:: శ్రీ ::**********\n\n* శ్రీవైష్ణవుడు ముడ్డి చెరువులో కడగగానే అది సదాచారమగునా\n\n* శ్రీయుతులు నన్నూట యిరవై (420) (420=భారత శిక్షాస్మృతిలో 420-వ నిబంధన మోసమునకు శిక్ష విధించునది. అంటే మోసగాడు.\n\n* శ్రీరంగం రోకలి చేతులమీద నిలువదు.\n\n* శ్రీరంగంలో పుట్టిన బిడ్డకు తిరువాయిమొళి నేర్పాలా? (తిరువాయిమోళి = నాలాయిరం (నాలుగువేలు) అను ద్రావిడ ప్రభందంలోని పాచురములు (పద్యములు)).\n\n* శ్రీరంగనీతులు చెప్పేవారేగానీ, చేసేవారు లేరు.\n\n* శ్రీరామరక్ష నూరేండ్లాయస్సు.\n\n* శ్రీరామ లంకలో బోడికోతి.\n\n* శ్రీరాముడు మానవాడైతే, చీడపురుగు లేమిచేస్తవి?\n\n* శ్రీవైష్ణవుడు ముడ్డి కడిగితే, రెండుచేతులకూ పని. ( కుడిచేతితో నీళ్ళు ఎడమచేతిలో పోసుకొని కడుగుకొందురు, పురచేయి నీళ్ళను తాకి మయిల చేయరాదని).\n\n\n\n**********:: శ్రు ::**********\n\n* శ్రుతిమించి రాగాన పడినట్లు.\n\n* శ్రుతిలేని పాట, సమ్మతిలేని మాట.\n\n* శ్రుతిలేని పాట, మతిలేని మాట.\n\n\n\n**********:: శ్వా ::**********\n\n* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.\n\n\n\n**********:: ష ::**********\n\n* షండున కబ్బిన చాన వలె.\n\n* షండునికి రంభ దొరకినట్లు.(నపుంసకునికి) ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 880,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-శ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* సంకటాల విత్తు - సానిదాని పొత్తు.\n\n* సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏమవుతుంది?\n\n* సంక నాకేవాణ్ణి సంభావన అడిగితే, పొర్లించి పొర్లించి ముడ్డి నాకినాడట.\n\n* సంకురాత్రి మబ్బులు మాలవాళ్ళ ఉబ్బులు.\n\n* సంక్రాంతికి చంకలెత్తకుండా చలి.\n\n* సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోని వాళ్ళూ వస్తారు.\n\n* సంగాం కొమ్మ చక్కగా ఎత్తినట్లు. (సంగాం కొమ్మ= సంగములో పెద్దరాతి స్థంభమును ఎత్తి తిరునాళ్ళ ప్రారంభింతురు. పెన్నలో బొగ్గారు, బీరావుటెరు కలిసే సంగమం ఇది).\n\n* సంగీతం, పురుషుని హృదయంలో అగ్నిని రగుల్కొల్పాల - స్త్రీనేత్రంలో భాష్పముల నింపాల.\n\n* సంగీతము చేత సెట్టి బేరసారము లుడిగెన్ (బంగారువంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్\n\n* సంగీత విద్యకు చాకలెల్లి.\n\n* సంచిలాభం చిల్లి కూదతీసినది.\n\n* సంచీ విప్పేవఱకు చల్లబడితే, మూత విప్పేవఱకు మాటలు పోతవి.\n\n* సంజకు, లంజకు రాగము నిలకడగా నిల్చునా? (రాగము=ఎరుపు, ప్రేమ).\n\n* సంతకు దొంగయితే చీరలమ్మే దెక్కడ?\n\n* సంతకు దొంగలయితే, చోళ్ళెక్కడ అమ్ముకోను?\n\n* సంతకు పోయివచ్చిన ముఖం మాదిరి (వాడిపోయి వత్తురు - తిరునాళ్ళకు పోయి వచ్చినట్లు).\n\n* సంతన లేని ఇల్లు చావడికొట్టం.\n\n* సంత పాతతొత్తు సన్యాసి నెఱుగునా?\n\n* సంత మెఱ్గు సాని ఎఱుగును.\n\n* సంతలో కొడితే సాక్షులెవరు?\n\n* సంతళొ బేరము లచ్చికి గాజులకు సరి.\n\n* సంతానానికని సప్తసాగరయాత్ర వెడితే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడ్చుక పోయిందట.\n\n* సంతోషం సగం సత్తువ\n\n* సంతోషము సగం బలం.\n\n* సంతోషానికి సాకు లేదు, ఆలోచన కంతులేదు.\n\n* సందడిలో సడేమియా, నీకూ నాకూ లడేమియా.\n\n* సందడిలో సమారాధన! (చేసినట్లు).\n\n* సందాయ సందాయ అంటే చిచ్చాయ చిచ్చాయ అన్నదట.\n\n* సందుజూచి పెట్టెలు దించినట్లు (పీర్ల పెట్టెలు).\n\n* సందు దొరికితే, చావడికొట్టం చంక బెట్టినట్లు.\n\n* సంధ్య వార్చినావురా? అంటే, ఊరివెలుపల గుంటలో వార్చినా నన్నాడట. అయితే ఆ గుంటలో నీళ్ళు లేవే? అంటే, చాకలి సుబ్బుడు ఉన్నవని చెప్పినాడు నాయనా! అన్నాడట.\n\n* సంపద గలదేని సన్నిపాతము పూను.\n\n* సంపదగలిగినవాని సన్నిపాతం వలె.\n\n* సంపదగలిగిన్ తల్లికి వేకటిగాని తీరదు.\n\n* సంపదలున్న నాడే బంధువుల రాక, చెరువు నిండినవాడే కప్పల చేరిక.\n\n* సంపదలో మరపులు, ఆపదలఓ అఱపులు.\n\n* సంపద స్నేహితులను కల్పించును, దరిద్రము వారిని ఒకటిగా బంధించును.\n\n* సంపద ఒకరిది, అనుభవం ఇంకొరరిది.\n\n* సంబరపు చలిగాలికి ఎదురువాకిలి వలె.\n\n* సంబరానికి సోకి పోసికుంటే, కిక్క జమిడికే ఏనుకపోయిందట (జమిడికే=జంటాయికే).\n\n* సంభావనలో వచ్చిన పావలా లోటు, నేతిలో తీస్తా నన్నట్టు.\n\n* సంసారం గట్టి, మెడ ఒట్టి.\n\n* సంసారం గుట్టు, వ్యాధి రట్టు.\n\n* సంసారం జానెడు, ఖర్చు బారెడు.\n\n* సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే, బూడిద బుఱ్ఱకాయ గాడిద బరువైనాయట.\n\n* సంసారం లేనివారికి సరసాలెక్కువ.\n\n* సంసారం సాగనిది ఆడదాని వ్రాత, పిల్లలు బ్రతకనిది మొగవాని వ్రాత.\n\n* సంసారికి సాగు వాటు, సన్యాసికి జోగు వాటు.\n\n* సంసారి తిరిగి చెడును, సన్యాసి (జోగి) తిరుగక చెడును.\n\n* సంసారి దుఃఖి, సన్యాసి సుఖి.\n\n* సంసారి బీద గానీ చేను బీద గాదు.\n\n* సంసారి సైయ్ - సన్యాసి సైయ్ అన్నాడట చలికిచచ్చే సన్యాసి.\n\n\n* సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టువంటిది\n\n* సకలశాస్త్రాలు, నిలబడి మూత్రాలు.\n\n* సకలసబ్బండు గోత్రానాం, పుల్లమ్మ పుత్రానాం.\n\n* సక్కీలు పలికెవానికి సేలు(రు), మొద్దుగొట్టేవానికి దుడ్డు.\n\n* సగం ఈడుకు సమర్తకట్నాలు.\n\n* సగం చచ్చి పురాణం, అంతాచచ్చి సంగీతం.\n\n* సగం పెట్టి, మేనత్త అన్నట్లు.\n\n* సగం సాలె నేత, సగం మాల నెత.\n\n* సజ్జనుండు తిట్ట శపంబదేను.\n\n* సద్దంత ఊర్రగాయ; ఇల్లంత పందిలి, తల్లంత పిల్ల.\n\n* సతాకోటి (శతకోటి) జంగాలలో, నాబోడిలింగ మెక్కడన్నాడట.\n\n* సతిపతులు చక్కగాఉంటే, సంతలో పిల్లచింత లేదు.\n\n* సత్కార్యాలకు కార్యరంగం అంతరాత్మ.\n\n* సత్యము నావద్ద చాలా ఉన్నది. చెప్పులుతేరా మగడా! నిప్పులో దూకుతాను.\n\n* సత్యములు పొత్తు కుడుచునా? బాసలు కలసివచ్చునా?\n\n* సత్యహరిశ్చంద్రుడు పుట్టిన మరునాడు పుట్టినా డన్నట్లు.\n\n* సత్రం కూటికి అయ్యగారి ఆఙ్ఞా\n\n* సత్రం కూటికి అయ్యగారి సెలవెందుకు?\n\n* సత్రంలో ఉచ్చబోస్తున్నవేమిరా? అంటే - దేవాలయం అనుకొన్నలే అన్నాడట.\n\n* సత్రా భోజనం - మఠా నిద్ర\n\n* సత్యాఢ్యులమీదబోవు జడమూర్తులు గెల్పువాటింతురే?\n\n* సదా కపటమతిన్ దొరంగు మహికాంతులకేడ పరోపకారముల్.\n\n* సద్దలు(సజ్జలు) వండితే సుద్దు లెక్కువ.\n\n* సద్దిబువ్వపై వెన్నపూస బెట్టినట్లు.\n\n* సన్నపని చేయబోతే సున్నం సున్నం అయ్యిందట.\n\n* సన్నబియ్యం, చాయపప్పు.\n\n* సన్నబువ్వ చిన్నచేపలు, కొఱ్ఱబువ్వ గోడిచారు.\n\n* సన్నమో, ముతకో, సంతలో తేలిపోతుంది.\n\n* సన్న సన్నంగా కాపుతనం వచ్చింది, సన్నబియ్యం వండవే అన్నాడట.\n\n* సన్నెక(లు)ల్లు కడుగరా సయ్యదాలీ! అంటే, కడగినట్లే నాకినా, ఖుదా తోడు; అన్నాడట.\n\n* సన్నెకల్లు దాచితే పెండ్లికాదా?\n\n* సన్యాసం చివర కష్టం, సంసారం మధ్య కష్టం.\n\n* సన్యాసం పుచ్చుకున్నా, కావడిబరువు తప్పలేదు.\n\n* సన్యాసికి దొంగల భయమేమి?\n\n* సన్యాసి పెళ్ళాం అటు విధవా కాదు, ఇటు పునిస్త్రీ కాదు.\n\n* సన్యాసి పెళ్ళికి జుట్టుదగ్గరనుంచి ఎరవే (అరవె).\n\n* సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట.\n\n* సన్యాసులమధ్య కల్లుకుండలు మాయమైనట్లు.\n\n* సభమధ్య సాలె చాకలి, పండితులమధ్య పాగదాసరి.\n\n* సభాపిరికిదానా! యింతిలో లేడనిచెప్పవే!\n\n* సమయంతప్పితే కాళ్ళు, సమయంవస్తే రాళ్ళు.\n\n* సమయము కాదనుట జరుపు నేర్పు.\n\n* సమయమెరుగ(ని) నతడు సరసుండుకాడయా.\n\n* సమయానికి లేనిది చంకనాకనా?\n\n* సమయానికి లేని పాక చచ్చినాకా?\n\n* సమర్తయీడు చాకలిదాన్ని కొట్టింది.\n\n* సముద్రం నడుమ ఉన్నా, త్రాగునీటికి కరవే.\n\n* సముద్రంపై ఉఱిమితే, వన తప్పదు (గాలివాన).\n\n* సముద్రమయినా ఈదవచ్చుగానీ, సంసారం ఈదలేము.\n\n* సముద్రము చంకలో ఓట్టుకొని, చెలమకు చేయి చాచినట్లు.\n\n* సముద్రములో ఇంగువ కలిపినట్లు.\n\n* సముద్రంలో పెట్ట రెట్ట వేసినట్లు.\n\n* సముద్రములో కెరటాలు అణిగిన తరువాత స్నానం చేదామనుకున్నాడట.\n\n* సముద్రములో కొఱవి అద్దినట్లు.\n\n* సముద్రములో వాన పడినట్లు.\n\n* సముద్రములో వేసిన కాకిరెట్ట వలె.\n\n* సముద్రానికి ఏతాము వేసినట్లు.\n\n* సముద్రానికి లవణదర్శనమన్నట్లు.\n\n* సముద్రాన్ని బయటనుంచే పొగుడుతాము.\n\n* సమ్ముఖానికి రాయబార మేల?\n\n* సరదాకి సమర్తాడితే చాకలిది కోక దొబ్బింది.\n\n* సరసమాడుటెల్ల చావుకు మూలంబు.\n\n* సరసము విరసము కొరకే, పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబు అధిక భాధల కొరకే.\n\n* సరసానికైనా సమయ ముండాలి.\n\n* సరిపడనివారు చచ్చినవారితో సమానం.\n\n* సరివీ, పిల్లలూ లేస్తే సహస్త్రంమంది లేచినట్లు.\n\n* సరువ తప్పేల పోయె, బరువు అలకనాయె.\n\n* సరసమునందు, సమరమునందు సర్వము న్యాయసమ్మతమే.\n\n* సర్వరోగాలకు సారాయి మందు.\n\n* సర్కారుకు చాటుగా ఉండాలి, సావుకారి కెదురుగా ఉండాలి.\n\n* సర్రాజు పెళ్ళిలో గుర్రాజుకో పోచ.\n\n* సర్వజనీనమైన భాష సంగీతము.\n\n* సర్వవిషయములలో మానవుడుగా మనుము.\n\n* సర్వేజనా స్సుఖినోభవంతు అంటే, సర్వేవాళ్ళేనా? మనసంగతేమి? అన్నారట - రెవెన్యూ వాళ్ళు.\n\n* సలిలం కమ్మ లంజలం (సలిలం-కం-లం-జలం) అని, అమరం చదివితే, కమ్మలంజలేం? కాపులంజ లెందుకు కాకూడదు? అన్నాడట.\n\n* సవతాలి కుండనైనా ఉడుకుతానన్నది గాని, తోడికోడలి కుండను ఉడుకనన్నదిట.\n\n* సవతితల్లికి బిడ్డలు పోతేనేమి? సొమ్ముల కాపువానికి బక్కలు (బక్కగొడ్లు) పోతేనేమి?\n\n* సవతికి సంకెళ్ళు, నాకు పిల్లెండ్లు.(పిల్లెండ్లు=ఆభరణాలు, కాలివేళ్ళను పెట్టుకొనేవి).\n\n* సవతి సాగనీయదు, ఏరా లెచ్చనీయదు.\n\n* సవరణ సంతకుపోతే, ఏకులబుట్ట ఎదురుగా పోయిందట.\n\n* సవరదీసినకొద్దీ నిక్కినట్లు.\n\n* సవాసేరులో బోడిపరాచకమా?\n\n* సస్యాధిపతివా? సామ్రాజ్యాధిపతివా?\n\n* సహనముంటే పశ్చాత్తాపానికి చోటులేదు.\n\n\n\n**********:: సా ::**********\n\n* సాకు (సాకులు) మేకవుతుంది.\n\n* సాకులు చెప్పినవానికి కాసు, ఇల్లుకప్పిన వానికి దుగ్గాని.\n\n* సాగింది నిజము, సాగనిది దబ్బఱ (కల్ల).\n\n* సాగితే చాపకిందికి ఆరు కుంపట్లు, తొమ్మిది నెగళ్ళు.\n\n* సాగితే నియోగం, సాగకపోతే చచ్చేయోగం.\n\n* సాగితే పాకనాటివారు, సాగకున్న మోటాటివారు.\n\n* సాగితే బండి, సాగకపోతే మొండి.\n\n* సాగితే బొంకు, సాగకపోతే రంకు.\n\n* సాగితే సాగించుకోమన్నారు, జారితే పడమన్నారు.\n\n* సాగినప్పుడు పడుదునా? త్రాగినప్పుడు పడుదునా?\n\n* సాగినమ్మ చాకలితో సరసం ఆడితే తప్పులేదు, సాగనమ్మ సంసారితో మాట్లాడినా తప్పే.\n\n* సాగినమ్మ చాకలివాడితో పోతే అది వ్రతమేమో అనుకున్నారట.\n\n* సాగువాటు చాలనాళ్ళాయె, గొగుకూర తెండమ్మా గోక్కు తిందామన్నదిట.\n\n* సాటీమ్మ సరిగా పెట్టుకుంటే, ఊరి అమ్మ ఉరిపెట్టుకున్నదట.\n\n* సాటివారితో సరిగంగ స్నానాలు చేస్తుంటే, ముసలి మొగుణ్ణి కాస్తా మొసలెత్తుక పోయిందట.\n\n* సాతానికీ, జంగానికీ సయ్యోధ్యత కుదురుతుందా?\n\n\n* సాతాని గర్భదానం.\n\n* సాతాని జుట్టుకు, సన్యాసి జంధ్యానికి ముడివేసినట్లు.\n\n* సాతాని నుదుట విభూదిరాయడం సురభి బదనిక పాముకు చూపినట్లు.\n\n* సాతుముడికి సత్తువేటు పడితే, సచ్చిన తాతయినా లేచివస్తాడు అన్నట్లు.\n\n* సాదు పలు(ల)వ.\n\n* సాదు రేగితే తల పొలానగాని నిలువదు. (తల పొలము=ఊరి పొలిమేర).\n\n* సాదు రేగినా బూతు రేగినా సవసవ పోవు.\n\n* సాదెద్దు సీదుకు రేగిన కంచెంత పాడు.\n\n* సాధ్వి మహిమ నెట్లు స్వైరిణి ఎరుగురా?\n\n* సానక్రింద దీపము వలె.\n\n* సానక్రింద వెన్నెల వలె.\n\n* సానపై యిరవై, సంచికట్నం ముప్ఫై, ఇంటికి యాభై పంపించండి, కరకర ప్రొద్దెక్కేవఱకు కాటిలో పొగలేపుతాను.\n\n* సానికి ఱంకులు నేర్పాలనా?\n\n* సానిదాని సళ్ళు సంత సొరకాయలు (గోటగిచ్చి ముదురు లేత చూచిపోతారు).\n\n* సాని నీతి - సన్నాసి జాతి (తెలియవు).\n\n* సానులలో సంసారి, సంసారులలో సాని.\n\n* సామజము చెఱకు మేసిన, దోమలు పదివేలు చేరి తోలంగలవా?\n\n* సాము నేర్చినవానికే చావు గండం.\n\n* సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు.\n\n* సాయంకాలం భూపాలరాగం అన్నట్లు (భూపాల=మేలుకొలుపు రాగం).\n\n* సాయబు సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి.\n\n* సయబూ! చిక్కిపోయినా వేమంటే? ఇంకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసూవస్తే చచ్చిపోతాం మీకేమి? అన్నాడట.\n\n* సాలెకు, జంగానికి సాపత్యం కుదురుతుందా?\n\n* సాలె జాండ్ర సభామధ్యే, సాతానిః పండితోత్తమః\n\n* సాలెవాని భార్య సరిమీద పడ్డది (సరి=గంజి).\n\n* సాలెవాని ఎంగిలి ముప్ఫదిమూడుకోత్ల దేవతలు మెచ్చారట (నాకితేగానీ పడుగు అతకలేడు)\n\n* సాలెవానికి కోతిపిల్ల తగులాట మైనట్లు.\n\n* సాలోడికి కోడిపుంజు తగలాటం.\n\n* సావడి (చావడి) కాలెరా సన్నాసీ, అంటే సా(చా)వసింపు నా సంకలోనె ఉన్న దన్నాడట.\n\n* సావుకారు చతికిలబడితే, పీట వెల్లకిల బడిందట.\n\n* సాహసంలేని వాడికి కత్తి సరిగా తెగదు.\n\n* సాహెబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే.\n\n* సాహెబులా! సెదాములు, సలాము లేవయ్యా? అంటే దొరలు దాతలు పట్టంచు ధోవతు లిచ్చిన ఇనాములేవయ్యా? అన్నాడట.\n\n* సాహెబ్ కు సాడే తీన్. నాకు మూడున్నర.\n\n* సాక్షికాళ్ళు పట్టుకోవడం కన్న, వాదికాళ్ళు పట్టుకోవడం మేలు.\n\n\n\n**********:: సి ::**********\n\n* సింగడికేల పత్తి బేరము? (సింగడు=దిశమొలవాడు; బిత్తలి).\n\n* సింగన్నా! అద్దంకి పోయినావా? అంటే, పోనూపోయా, రానూవచ్చా అన్నాడట.\n\n* సింగారం జూడరా బంగారు మొగుడా.\n\n* సింగి కంటే (నీళ్ళాడితే)- సింగడు పథ్యం చేసినట్లు (ఇంగువ తిన్నట్లు).\n\n* సింగినాదం, జీలకఱ్ఱ.\n\n* సింగి నీళ్ళాడితే సింగడు ఇంగువదిన్నట్లు.\n\n* సింహంగూడ చీమకు భయపడే (తలకే) అదును వస్తుంది.\n\n* సింహంలో చీరి ఊడ్చడమున్నూ, కన్యలో కంగా పింగా ఊడ్చడమున్నూ.\n\n* సింహాసనంపై దున్నపోతు, లంజలలో పతివ్రత, ముత్తైదువులలో ముండమోపి.\n\n* సిగ్గంత పోయె చిన్న పెండ్లామా! పెండ్లికన్న పోదాం పెద్ద పెండ్లామా! అన్నాడట.\n\n* సిగ్గు చాటెడు, చెప్పులు మూటెడు.\n\n* సిగ్గు చిన్ననాడే పోయె, పరువు పందిట్లో పోయె, కొరవా సరవా ఉంటే గదిలో పోయె.\n\n* సిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలును.\n\n* సిగ్గు తోటకూరవంటిది (చాలా సుకుమారము).\n\n* సిగ్గు దప్పిన చుట్టం వన్నెచీర కేడ్చిందట.\n\n* సిగ్గుపడితే సిద్దె కట్టిపడుతుంది.\n\n* సిగ్గుబోవు వేళ చీర లబ్బినట్లు.\n\n* సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకించిందట.\n\n* సిగ్గులేని అత్తకు మోరతోపు అల్లుడు.\n\n* సిగ్గులేని చిన్నాయనా, విడిచిన చిన్నమ్మను ఇంకా కొడుతావా?\n\n* సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం.\n\n* సిగ్గులేని రాత్రికి ఏటా జాగారమే!\n\n* సిగ్గు విడిస్తే రాయలకూడు, తిరుపతికి పోతే బోడితల.\n\n* సిగ్గువిడిస్తే శ్రీరంగము, అంతకూ విడిస్తే బోడితల.\n\n* సిగ్గు సిబ్బిన కొడితే, శరము చేటన కొడుతుంది (శరము=సిగ్గు, షరం)\n\n* సిగ్గూ, శరము లేనమ్మ మొగుడిపెళ్ళికి పేరంటానికి వెళ్ళి, అడ్డగోడ చాటునుండి అర్ధరూపాయి కట్నం ఇచ్చిందట! (చదివించిందట).\n\n* సిగ్గెందుకు లేదురా జగ్గా? అంటే నల్లనివానికి నాకేమి సిగ్గన్నాడట.\n\n* సిగ్గేమే సిగదాకమా అంటే, నాకేమి సిగ్గే తలదారమా అన్నదట.\n\n* సిగ్గే స్త్రీకి సింగారం.\n\n* సిడి పడితే మూన్నెల్ల (మూడేండ్ల) వఱపు.\n\n* సిద్దప్పవంటి శిష్యుడూ లేడు, బ్రహ్మంగారి వంటి గురువూ లేడు, వేమనవంటి యోగీ లేడు.\n\n* సిద్దారెడ్డోరి చద్దన్నం తిని, శివారెడ్డోరి ఆవులు మేపినట్లు.\n\n* సిరికొద్ది చిన్నెలు, మగనికొద్ది వన్నెలు.\n\n* సిరిపంచి కుడువ మేలు.\n\n* సిరిపోయినా చిన్నెలు పోలేదు.\n\n* సిరి రా మోకా లొడ్డినట్లు.\n\n* సిలార్! పిల్లలు, నేను తయార్.\n\n\n\n**********:: సీ ::**********\n\n* సీతకు వ్రాసింది సీమకు వ్రాయవలెన?\n\n* సీత పుట్టుక లంక చేటుకే.\n\n* సీతా పతే సిరిచాపే గతి.\n\n* సీతారామాబ్యాం నమః అంటే, మా ఇంటాయన ఎదురుకాలేదా? అన్నదట (భిక్షానికి వచ్చిన వానితొ).\n\n* సీదుకు రేగితే చిచ్చుబుడ్డి, కోపమొస్తే కొరివికట్టె.\n\n* సీలమందలంవరకు చీర కడితేగానీ, సాలెమిందని కెక్కడ తెచ్చియిచ్చేది?\n\n\n\n**********:: సు ::**********\n\n* సుంకరమోటుకు మాట నిలకడలేదు.\n\n* సుంకరివద్ద సుఖదుఃఖాలు చెప్పుకొన్నట్లు.\n\n* సుండు చూడనీయదు, మండి మాననీయదు (సుండు= చిన్నకురుపు, మండి=పెద్దపుండు).\n\n* సుకవి తిట్లకు దొరబిడ్డ వెరచు గానీ మోటగాడు వెరచునా?\n\n* సుఖం మరిగినమ్మ మొగుణ్ణి అమ్ముకుని తినిందట.\n\n* సుఖం మరిగిన దాసరి పదం మరచినాడట.\n\n* సుఖమెరుగని బ్రతుకు సున్నమేయని విడెము.\n\n* సుఖవాసి దేహానికి మెత్తని చెప్పు.\n\n* సుఖాలు పువ్వుల వంటివి, అనుభవించగానే అంతరించిపోతవి.\n\n* సుతారం, సూదిలోని దారం.\n\n* సుతులు లేనివారికి గతులు లేవు.\n\n* సుధను గోరువాడు సుడిబడి చచ్చునా?\n\n* సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.\n\n* సున్నము పుట్టని ఊళ్ళో అన్నము పుట్టునా?\n\n* సున్నాలో ఉన్నది సూఖం, సూఖంలో ఉన్నది మోక్షం.\n\n* సుపుత్రా! కొంప తీయకు (పీకకు)రా అన్నట్లు.\n\n* సుబ్బడిది చుట్టాల రంధి, రాముడిది తామర రంది.\n\n* సుబ్బు పెళ్ళిలో సూరి సమర్త.\n\n* సుబ్బు పెళ్ళి వెంకి చావుకు వచ్చింది.\n\n* సురకు నిచ్చినట్లు, సుధకును నీయరే.\n\n* సురియ బట్టవచ్చు శూరుండు కాలేదు.\n\n* సువాసిని కొప్పుకేకాక బొండుమల్లెలు బోడిముండకేల?\n\n\n* సువ్వి అంటే తెలియదా? రోకలిపోటు.\n\n* సుళ్ళు చూడమంటే గుద్దలో వేలుబెట్టినాడంట.\n\n\n\n**********:: సూ ::**********\n\n* సూతిగల జంత రోటివద్ద మాతు పెట్టెనట.\n\n* సూడిద బూడిద పాలు, యిల్లాలు ఇతరుల పాలు.\n\n* సూత్ర మెఱుగని మైథునశూరులు.\n\n* సూదికి రెండుమొనలు గలవా?\n\n* సూది కుతికె, దయ్య పాకలు.\n\n* సూదికోసం దూలం మోసినట్లు (పరమానందయ్య శిష్యులు).\n\n* సూదికోసం సోదెకు పోతే, పాతఱంకులు బయట పడ్డాయి.\n\n* సూదికోసం సోదెకు వెడితే, కుంచెడు బియ్యం కుక్క ముట్టుకుందట.\n\n* సూది గొంతు, బాన కడుపు.\n\n* సుది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా?\n\n* సూదిబెజ్జంలో ఒంటె దూరవచ్చును గానీ భాగ్యవంతుడు స్వర్గం చేరలేడు\n\n* సూదిబెజ్జం చూచి జల్లెడ వెక్కిరించినట్లు.\n\n* సూదిని మూత గట్టినట్లు.\n\n* సూదిలావచ్చి గడ్డపారలా తేలినట్లు.\n\n* సూదివలే వచ్చి, దబ్బనం మాదిరి తేలినట్లు.\n\n* సూదేటువాణ్ణి, సుత్తేటువాణ్ణి, కండేటువాణ్ణి నమ్మరాదు (కుట్టె జంగం, కంసాలి, సాలి).\n\n* సూరన్న చిన్నవాడు, పేరన్న పెద్దవాడు, అయ్య కెత్తర కోళ్ళగంప.\n\n* సూర్యడు తనోడైతే, చుక్కలన్ని తన కక్కలంట.\n\n* సూర్యుని మొగాన దుమ్ము చల్లితే, ఎవరి కంట బడుతుంది?\n\n* సూర్యుని మొగాన ఉమ్మేస్తే తనమీదనే పడుతుంది.\n\n* సూక్షంలో మోక్షం.\n\n\n\n**********:: సె ::**********\n\n* సెంటుభూమి లేని వాని కెందుకు సెంటువాసన లన్నట్లు.\n\n* సెగలేనిదే కూడుండదు.\n\n* సెగలేనిదే పొగ రాదు.\n\n* సెట్టి బ్రతుకు గిట్టినగాని తెలియదు.\n\n* సెట్టి సేరు, బుడ్డ సవాసేరు.\n\n* సెట్టి సింగారించుకొనేలోపల ఊరు కొల్లబోయిందట.\n\n* సెనగల గాదెమీద కుక్క పండుకొన్నట్లు (గాటిలో కుక్క)\n\n* సెంగలు తిని, చెయ్యి కడుకున్నట్లు.\n\n* సెభాష్ మద్దెలగాడా! అంటే, ఐదువేళ్ళు పగలగొట్టు కున్నాడట.\n\n\n\n**********:: సే ::**********\n\n* సేరుకాయ నీటాయె, ఉల్లెం గడ్డ మోటాయె.\n\n* సేరుకు సవాసేరు (వడ్డించినాడన్నట్లు) అన్నట్లు.\n\n* సేరు దొరకు మణుగు బంటు.\n\n* సేవకునిలాగా చెయ్యాలి, రాజులాగా అనుభవించాలి.\n\n\n\n**********:: సై ::**********\n\n* సైంధవుడు అడ్డు పడినట్లు.\n\n* సై అనే కలువాయి, అవిశలగల యిల్లు జూపే కలువాయి, బిళ్ళకుడుము మాదిరి రూపాయి తట్టేసి బిగిసికునే కలువాయి. (కలువాయి గ్రామంలో ఱంకుటాలు చేసిన మోసము గురించి).\n\n* సైదాపురం రాచ్చిప్ప (రాతిచిప్పవలె మొద్దు అనుట)\n\n* సైవలేని వాడు నెయ్యి నాకినట్లు.\n\n* సైరా మాలోడా అంటే, పరమెత్తి పైన వేసుకున్నాడట (సై అను=ఉబ్బించు; పరము=బండిపై చట్టములో ఇరుప్రక్కల ఉండే పొడుగు నిలువు కొయ్యలు).\n\n\n\n**********:: సొ ::**********\n\n* సొంతానికి ఏనుగు, ఉమ్మడికి పీనుగు.\n\n* సొంతానికి పిడుగు, ఉమ్మడికి బడుగు.\n\n* సొగసుగానికి (షోగ్గానికి) మూడుచోట్ల అంతు.\n\n* సొగసు సోమవారం పోతే, మొగుడు ఆయవారం పోయాడట.\n\n* సొగసైన బూరుగను పెంచితే సురస ఫలముల నిచ్చునా?\n\n* సొగసైన లేమకు సెగరోగ మున్నట్లు.\n\n* సొమ్ము ఒకచోట, అపనమ్మిక ఇంకొకచోట.\n\n* సొమ్ము ఒకదిది సోకు ఇంకొడిది.\n\n* సొమ్మొకడిది, సోకొకడిది.\n\n* సొమ్ము పోగా దిమ్ము పట్టినట్లు.\n\n* సొమ్ము పోయేటప్పుడు, తట్టు తగిలేటప్పుడు మతి ఉండదు.\n\n* సొమ్ము సొమ్ములోనే ఉండె, సోమయ్య మందిలోనే ఉండె.\n\n\n\n**********:: సో ::**********\n\n* సోదించడ మెందుకు. సొడు పెట్టడమెందుకు?\n\n* సోమరితనం, చిగిర్చని పూయని కాయని చెట్టువంటిది.\n\n* సోమర్లకు స్వయంపాకం చేసిపెట్టి, పందులకు పక్క వేసినట్లు.\n\n* సోమరికి షోకు లెక్కువ.\n\n* సోమిదమ్మ సొగసుకాంద్ర కోరితే, సోమయాజి స్వర్గార్హు డగునా?\n\n* సోయిదప్పిన వాడా? సొంగ ఎక్కడ పెట్టినావురా? అంటే, త్రాగి తమ్మళ్ళ బాలమ్మ గుడిసెకు చెక్కినా నన్నాడట.\n\n\n\n**********:: సౌ ::**********\n\n* సౌందర్యమే శాశ్వతానందం.\n\n\n\n**********:: స్త ::**********\n\n* స్తంభం చాటున ఏంది? అంటే, కుంభ మన్నారట! అయితే నాకేనా మూడు మెతుకులు?\n\n* స్తంభం చాటుగాడు ఒకడు, అదే పోతగాడు ఇంకొకడు, పోతే రానివాడు మరియొకడు.\n\n* స్తనశల్య పరిక్ష చేసినట్లు.\n\n\n\n**********:: స్త్రీ ::**********\n\n* స్త్రీలనేర్పు మగల చీకాకు పరచురా!\n\n\n\n**********:: స్థా ::**********\n\n* స్థాన బలిమి కానీ తన బలిమి కాదు.\n\n\n\n**********:: స్థి ::**********\n\n* స్థిరాస్తి ఆయన, చరాస్థి ఆయన గుడ్డలు.\n\n\n\n**********:: స్థూ ::**********\n\n* స్థూలం కనుగుడ్డు, సూక్షం కనుపాప.\n\n\n\n**********:: స్నా ::**********\n\n* స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.\n\n* స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు.\n\n\n\n**********:: స్నే ::**********\n\n* స్నేహితునకు అప్పు ఇస్తే రెండూ పోతవి.\n\n\n\n**********:: స్వ ::**********\n\n* స్వకుచమర్ధనం (తన్ను తాను పొగడుకొనుట)\n\n* స్వకుచమర్ధనంవల్ల రంభకైనా సుఖంలేదు.\n\n* స్వధనంబులకై బండపంచాంగమేల? (బండపంచాంగం=రచ్చబండ దగ్గర చెప్పే పంచాంగం).\n\n* స్వయం రాజా, స్వయం మంత్రి, స్వయం చాకలి, స్వయం మంగలి.\n\n* స్వర్గానికి పోతూ, చంకన ఏకులరాట్నం ఎందుకు?\n\n* స్వర్గానికి పోయినా విడాకులు తప్పలేదట.\n\n* స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పిందికాదు అన్నట్లు.\n\n\n\n**********:: స్వా ::**********\n\n* స్వాతంత్ర్యం స్వర్గం, పరతంత్ర్యం ప్రాణసంకటం\n\n* స్వాతి కురిస్తే చట్రాయిగూడా పండును.\n\n* స్వాతి కురిస్తే, చల్ల పిడతలోకిరావు - జొన్నలు.\n\n* స్వాతి కురిస్తే భీతి కలుగుతుంది.\n\n* స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.\n\n* స్వాతికొంగ, పంతకాపు, నీళ్ళున్నచోటే ఉంటారు.\n\n* స్వాతికొంగల మీదికి సాళువం పోయినట్లు.\n\n* స్వాతి వర్షం చేనుకు హర్షం.\n\n* స్వాతివానకు సముద్రాలు నిండును.\n\n* స్వాతివాన ముత్యపు చిప్పకుగానీ నత్తగుల్ల కేల?\n\n* స్వాతివిత్తనం, స్వాతి కోపులు (కోపు=సరియైన అదను, నివదల్ల ఏర్పడే ఏపు).\n\n* స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.\n\n* స్వాతీ! నేను జవురు కొస్తాను, విశాఖా! నీవు విసురుకురా.\n\n* స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 881,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-స",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "* హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె.\n\n* హక్కు హనుమంతరాయనిది, అనుభవం చెన్నారాయనిది.\n\n* హద్దులో ఉంటే ఆడుది, హద్దు దాటితే గాడిది.\n\n* హనుమంతుడు సువేలాంద్రినిం కనిదాఇపైనెక్కి, అని సాతాని పురాణం చదివితే, సాతానిదానిపై ఎందుకు ఎక్కకూడదు? అన్నాడట సభలో ఉన్న కనివాడు. (కనివాడు=భత్రాజు, సువేలాంద్రి కని-చూచి అని).\n\n* హనుమంతుని ముందు కుప్పిగంతులా?\n\n* హనుమంతుని మోర ఉంటే అదృష్టవంతుడు.\n\n* హరిదాసుకు అమరావతి అడ్డమా?\n\n* హరిదాసున కందరూ తనవారే.\n\n* హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు, నా నోట నిజం రాదు.\n\n\n* హరుని ఎరుకలేక ఆకులల్లాడునా?\n\n* హర్షుణ్ణి నమ్ముకొని, పురుషుణ్ణి పోగొట్టుకొన్నట్లు.\n\n* హసేను, హుసేను సేద్యంచేస్తే, ముచ్చెలతో పంచుకొన్నారట -పంటను.\n\n* హస్తా ఆదివారం వచ్చింది, చచ్చితిమయ్యా గొల్లల్లారా! చల్లపిడతల కాసులుతీసి సాలలు వేయించండి.\n\n* హస్తా ఆదివారం వచ్చింది, చస్తిమోయి గొల్లల్లారా! కాసుకొక దాన్ని కాలు పట్టి ఈద్వండి (అన్నవట గొఱ్ఱెలు).\n\n* హస్త ఆదివారం వస్తే, చచ్చేటంత వాన.\n\n* హస్తకార్తెలో చల్లితే అక్షింతలకైనా కావు.\n\n* హస్తకు అనకు (అణుగు) పొట్ట, చిత్తకు చిఱుపొట్ట.\n\n* హస్తకు ఆదివంటా, చిత్తకు చివఱి వంటా!\n\n* హస్తకు ఆరుపాళ్ళు, చిత్తకు మూడుపాళ్ళు.\n\n* హస్తచిత్తలు వఱవయితే అందఱి సేద్యం ఒకటే.\n\n* హస్త పోయిన ఆరుదినాలకు అడగకుండా విత్తు.\n\n* హస్తలో అడ్డెడు చల్లేకంటే, చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.\n\n* హస్తలో ఆకు అల్లాడితే, చిత్తలో చినుకు పడదు.\n\n* హస్తలో చల్లితే, హస్తంలోకి రావు.\n\n\n\n**********:: హా ::**********\n\n* హాస్యగాడు బావిలో పడిన తంతు.\n\n* హాస్యగానికి తేలు కుట్టినట్లు (హాస్యమనుకొని నమ్మరు), కోతికి దయ్యం పట్టినట్లు.\n\n\n\n**********:: హీ ::**********\n\n* హీనజాతి ఇల్లు జొచ్చినా, ఈగ కడుపు జొచ్చినా నిలవవు.\n\n* హీనస్వరం పెళ్ళాం ఇంటికి చేటు.\n\n\n\n**********:: హె ::**********\n\n* హెచ్చుగా పేలున్నవాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురద లేదు.\n\n\n\n**********:: హే ::**********\n\n* హేమాహేమీలు ఏతివెంత కొట్టుకపోతుంటే, నక్క పాటిరేవు అడిగిందట.\n\n\n\n**********:: హో ::**********\n\n* హోరుగాలిలో దీపం పెట్టి, ఓరిదేవుడా! నీ మహాత్మ్యమన్నట్లు (మహిమ అన్నట్లు).\n\n\n\n**********:: క్ష ::**********\n\n* క్షణం చిత్తం - క్షణం మాయ.\n\n\n\n**********:: క్షే ::**********\n\n* క్షేత్ర మెఱిగి విత్తనము, పాత్ర మెఱిగి దానము.\n\n* క్షేమంగా పోయి, లాభంగా రమ్మన్నట్లు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 882,
        "IMAGE": "cat_11",
        "NAME": "తెలుగు సామెతలు-హ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 11
    },
    {
        "DESCRIPTION": "1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.\nజ. దీపం\n\n2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.\nజ. నిప్పు\n\n3. ఎందరు ఎక్కిన విరగని మంచం.\nజ. అరుగు.\n\n4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.\nజ.దీపం వెలుగు.\n\n5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?\nజ. పొగ\n\n6. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?\nజ. మేఘం\n\n7. తలపుల సందున మెరుపుల గిన్నె.\nజ. దీపం\n\n8. తల్లి దయ్యం, పిల్ల పగడం.\nజ. రేగుపండు\n\n9. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర\nజ. కొవ్వొత్తి\n\n10. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.\nజ. వేరుశనగ\n\n11. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.\nజ. ఉల్లిపాయ\n\n12. నల్లకుక్కకు నాలుగు చెవులు\nజ. లవంగం\n\n13. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.\nజ. అత్తి చెట్టు\n\n14. తొడిమ లేని పండు, ఆకులేని పంట.\nజ. విభూది పండు, ఉప్పు\n\n15. తన్ను తానే మింగి, మావమౌతుంది.\nజ. మైనపు వత్తి\n\n16. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.\nజ. అద్దం\n\n17. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?\nజ. టెంకాయ\n\n18. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?\nజ. రైలు\n\n19. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?\nజ. నీడ\n20. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?\nజ. చింతపండు\n\n21. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?\nజ. మద్దెల\n\n22. తోలు నలుపు, తింటే పులుపు.\nజ. చింతపండు\n\n23. తొలు తియ్యన, గుండు మింగన్నా?\nజ. అరటి పండు\n\n24. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?\nజ. కుండలో గరిటె.\n\n25. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?\nజ.తాటిచెట్టు\n\n26. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?\nజ. కొబ్బరి కాయ\n\n27. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?\nజ. నత్త\n\n28. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?\nజ. పత్తి కాయ.\n\n29. నూరు పళ్లు, ఒకటే పెదవి.\nజ. దానిమ్మ\n\n30. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.\nజ. సూది\n\n31. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.\nజ. వల\n\n32. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.\nజ. ఉంగరం\n\n33. పొడవాటి మానుకి నీడే లేదు.\nజ. దారి\n\n34. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.\nజ. పొయ్యి\n\n35. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.\nజ. అత్తిపత్తి\n\n36. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.\nజ. కళ్లజోడు.\n\n37. పైడిపెట్టెలో ముత్యపు గింజ\nజ. వడ్లగింజ\n\n38. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.\nజ. కడవ, చెంబు\n\n39. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.\nజ. మొగలిపువ్వు.\n\n40. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?\nజ. తమలపాకు\n\n41. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.\nజ. ఆబోతు మూపురం.\n\n42. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.\nజ. పెదవులు\n\n43. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.\nజ. నిచ్చెన\n\n44. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.\nజ. గొడుగు.\n\n45. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు\nజ. సూర్యుడు, చంద్రుడు.\n\n46. బంగారు చెంబులో వెండి గచ్చకాయ\nజ. పనసతొన.\n\n47. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.\nజ. తాళం.\n\n48. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?\nజ. ముళ్ల మొక్క\n\n49. బండకు కొడితే వెండి ఊడుతుంది?\nజ. కొబ్బరికాయ\n\n50. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ\nజ. రామచిలుక.\n\n51. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.\nజ. తాళం కప్ప\n\n52. అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.\nజ. చందమామ\n\n53. అరటిపండుకి పదే విత్తులు\nజ. బొగడగొట్టం\n\n54. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది\nజ. గొడ్డలి\n\n55. అరచేతి కింద అరిసె\nజ. పిడక\n\n56. అలాము కొండకు సలాము కొట్టు\nజ. గొడ్డలి\n\n57. అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?\nజ. పెదవులు\n\n58. అంక పొంకలు లేనిది.\nజ. శివలింగం\n\n59. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?\nజ. ఈతచెట్టు\n\n60. అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది\nజ. పెద్ద పొయ్యి\n\n61. అరచేతిలో 60 నక్షత్రాలు\nజ. జల్లెడ\n\n62. అరచేతి పట్నంలో 60 వాకిళ్లు\nజ. అద్దం\n\n63. అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు\nజ. మీగడ\n\n64. అడ్డ గోడ మీద పూజారప్ప\nజ. తేలు\n\n65. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.\nజ. కవ్వం\n\n66. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?\nజ. ఆకలి\n\n67. అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.\nజ. మేనక\n\n68. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.\nజ. పుట్ట\n\n69. అరం కణం గదిలో 60 మంది నివాసం\nజ. అగ్గిపెట్టె, పుల్లలు\n\n70. ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు.\nజ. తాళం\n\n71. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.\nజ. తేనెపట్టు\n\n72. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.\nజ. అరిటాకు\n\n73. ఆలుకాని ఆలు.\nజ. వెలయాలు\n\n74. అందంకాని అందం\nజ. పరమానందం, బ్రహ్మానందం\n\n75. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.\nజ. చీమలదండు\n\n76. ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న\nజ. వెలగపండు\n\n77. ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.\nజ. చింతకాయలు\n\n78. ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది\nజ. నాలుక\n\n79. ఆకాశాన పటం.. కింద తోక.\nజ. గాలిపటం\n\n80. ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.\nజ. విమానం\n\n81. ఆకాశంలో పాములు\nజ. పొట్లకాయ\n\n82. ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు\nజ. జిల్లేడు\n\n83. ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.\nజ. దువ్వెన\n\n84. ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?\nజ. విద్యత్తు తీగ\n\n85. ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది?\nజ. మీసం\n\n86. ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి\nజ. కుక్కపిల్ల\n\n87. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు\nజ. కొబ్బరి కాయ\n\n88. ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర\nజ. పుట్టగొడుగులు\n\n89. ఇక్కడ విచిన కోడి ఇందూరు పోయింది\nజ. లేఖ\n\n90. ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను\nజ. మొగలిపువ్వు\n\n91. ఇల్లుకాని ఇల్లు\nజ. బొమ్మరిల్లు\n\n92. ఇంటికి అందం\nజ. గడప\n\n93. ఇంటింటికీ ఒక నల్లోడు\nజ. మసిగుడ్డు\n\n94. ఇంటికి అంత ముండ కావాలి\nజ. భీగము\n\n95. ఇల్లంతాఎలుక బొక్కలు..\nజ. జల్లెడ\n\n96. ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది\nజ. చీపురుకట్ట\n\n97. ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు\nజ. పొగ\n\n98. ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ\nజ. అప్పడం\n\n99. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం\nజ. ముక్కు\n\n100. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు\nజ. కల్లు కుండలు\n\n101. ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే\nజ. ఉల్లిపాయ\n\n102. గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.\nజ. బూరె\n\n103. అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.\nజ. కవ్వం\n\n104. దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.\nజ. దీపం\n\n105. జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.\nజ. నీడ\n\n106. నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.\nజ. ఉడుత\n\n107. సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.\nజ. మన వాఇనం\n\n108. అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం\nజ. గోరింటాకు\n\n109. ఆకు చిటికెడు. కాయ మూరెడు.\nజ. మునగకాయ\n\n110. ఆకు బారెడు. తోక మూరెడు.\nజ. మొగలిపువ్వు\n\n111. అమ్మ తమ్ముడిని కాదు. నేను మీ అందరికీ మేనమామనే?\nజ. చందమామ\n\n112. అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది.\nజ, గొడ్డలి\n\n113. అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు?\nజ. ఆకలి\n\n114. అనగనగా ఓ అప్సరస. పేరు మధ్యలో అక్షరం తీసేస్తే మేక\nజ. మేనక\n\n115. హస్త ఆరు పాళ్లు, చిత్త మూడు పాళ్లు\nజ. వర్షం\n\n116. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది.\nజ. ఉప్పు\n\n117. హస్త ఆరు పాళ్లు, చిత్త మూడు పాళ్లు?\nజ. వర్షం\n\n118. హరీ అనేలోపుగా ఒక్కసారే విచారం పాడుతుంది?\nజ. హంసపాదు\n\n119. హనుమంతుడు అందగాడు?\nజ. బ్రహ్మచారం\n\n120. హద్దు లేని పద్దు?\nజ. అబద్దం\n\n121. హంస ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది?\nజ. ప్రమిద\n\n122. హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు. తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది.\nజ. కొర్రకంకి\n\n123. సన్నజాజులు కన్న చక్కని పూలు, సన్న తీగలు జల్లుగా పూయును.\nజ. కాకరపూలు\n\n124. సంధ్యవేళలో విచ్చుకుంటుంది. గుభాళిస్తుంది\nజ. మల్లెపూవు\n\n125.సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టుమీద గంగరాయుడు\nజ. విభూది పండు\n\n126. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.\nజ. త్రాసు\n\n127. శివరాత్రికి శివ శివా అంటూ పోయేది?\nజ. చలి\n\n128. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?\nజ. మామిడి పిందె\n\n129. వడకాని వడ\nజ. ఆవడ, పావడ, దవడ\n\n130. వాలు కాని వాలు\nజ. ఆవాలు, కోవాలు, ఆనవాలు, ఏటవాలు\n\n131. రసం కాని రసం\nజ. నీరసం, సరసం, విరసం\n\n132. రంగం కాని రంగం\nజ. శ్రీరంగం, వీరంగం, కురంగం\n\n133. రాయి కాని రాయి\nజ. కిరాయి, తురాయి, షరాయి, కీచురాయి\n\n134. రణం కాని రణం\nజ. కరణం, శరణం, చరణం\n\n135. యంత్రం కాని యంత్రం\nజ. సాయంత్రం\n\n136. మాను కాని మాను\nజ. కమాను\n\n137. మత్తు కాని మత్తు\nజ. గమ్మత్తు.. కిమ్మత్తు\n\n138. మతి కాని మతి\nజ. దిగుమతి, శ్రీమతి\n\n139. బోది కాని బోది\nజ. కబోది\n\n140. బారు కాని బారు\nజ. సాంబారు\n\n141. బాడి కాని బాడీ\nజ. కబడి, లంబాడీ\n\n142. బండ కాని బండ\nజ. రోకలి బండ\n\n143. బంతి కాని బంతి\nజ. పూబంతి\n\n144. బొట్టు కాని బొట్టు\nజ. తాళి బొట్టు, పచ్చబొట్టు\n\n145. మందు కాని మందు\nజ. కామాందు\n\n146. పెట్ట కాని పెట్ట\nజ. లొట్టి పెట్ట\n\n147. పేడ కాని పేడ\nజ. దూద్ పేడ\n\n149. పురం కానిపురం\nజ. కాపురం, గోపురం\n\n150. పాలు కాని పాలు\nజ. పాపాలు, పీపాలు, కోపాలు, తాపాలు, శాపాలు, మురిపాలు, లోపాలు, దీపాలు\n\n151. పాప కాని పాప\nజ. కనుపాప\n\n152. పది కాని పది\nజ. ద్రౌపలి\n\n153. పతి కాని పతి\nజ. తిరుపతి, పరపతి",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 883,
        "IMAGE": "cat_12",
        "NAME": "పొడుపు కథలు - 1 ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 12
    },
    {
        "DESCRIPTION": "* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.\nజ. వల\n\n* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.\nజ. ఉంగరం\n\n* పొడవాటి మానుకి నీడే లేదు.\nజ. దారి\n\n* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.\nజ. పొయ్యి\n\n* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.\nజ. అత్తిపత్తి\n\n* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.\nజ. కళ్లజోడు.\n\n* పైడిపెట్టెలో ముత్యపు గింజ\nజ. వడ్లగింజ\n\n* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.\nజ. కడవ, చెంబు\n\n* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.\nజ. మొగలిపువ్వు.\n\n* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?\nజ. తమలపాకు\n\n* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.\nజ. దీపం\n\n* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.\nజ. నిప్పు\n\n* ఇల్లుకాని ఇల్లు\nజ. బొమ్మరిల్లు\n\n* ఇంటికి అందం\nజ. గడప\n\n* ఇంటింటికీ ఒక నల్లోడు\nజ. మసిగుడ్డు\n\n* ఇంటికి అంత ముండ కావాలి\nజ. భీగము\n\n* ఇల్లంతాఎలుక బొక్కలు..\nజ. జల్లెడ\n\n* ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది\nజ. చీపురుకట్ట\n\n* ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు\nజ. పొగ\n\n* ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ\nజ. అప్పడం\n\n* ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం\nజ. ముక్కు\n\n* ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు\nజ. కల్లు కుండలు",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 884,
        "IMAGE": "cat_12",
        "NAME": "పొడుపు కథలు - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 12
    },
    {
        "DESCRIPTION": "* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.\nజ. ఆబోతు మూపురం.\n\n* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.\nజ. పెదవులు\n\n* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.\nజ. నిచ్చెన\n\n* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.\nజ. గొడుగు.\n\n* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు\nజ. సూర్యుడు, చంద్రుడు\n\n* బంగారు చెంబులో వెండి గచ్చకాయ\nజ. పనసతొన.\n\n* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.\nజ. తాళం.\n\n* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?\nజ. ముళ్ల మొక్క\n\n* బండకు కొడితే వెండి ఊడుతుంది?\nజ. కొబ్బరికాయ\n\n* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ\nజ. రామచిలుక.\n\n1 .చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు .ఏమిటది ?\nజ :మొక్కజొన్నపొత్తు.\n\n2. కిటకిట తలుపులు కిటారి తలుపులు తియ్యావేయ్యా తీపులు లేవు . ఏమిటది ?\nజ :కనురెప్పలు .\n\n3.అడవిలో పుట్టింది ,అడవిలో పెరిగింది మాయింటి కొచ్చింది ,తైతక్కలాడింది . ఏమిటది ?\nజ ;కవ్వం .\n\n* కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.\nజ. ఉల్లిపాయ\n\n* నల్లకుక్కకు నాలుగు చెవులు\nజ. లవంగం\n\n* తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.\nజ. అత్తి చెట్టు\n\n* తొడిమ లేని పండు, ఆకులేని పంట.\nజ. విభూది పండు, ఉప్పు\n\n* తన్ను తానే మింగి, మావమౌతుంది.\nజ. మైనపు వత్తి\n\n* చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.\nజ. అద్దం\n\n* చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?\nజ. టెంకాయ\n\n* తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?\nజ. రైలు\n\n* నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?\nజ. నీడ\n\n* దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?\nజ. చింతపండు",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 885,
        "IMAGE": "cat_12",
        "NAME": "పొడుపు కథలు - 3",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 12
    },
    {
        "DESCRIPTION": "* ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.\nజ. తేనెపట్టు\n* ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.\nజ. అరిటాకు\n\n* ఆలుకాని ఆలు.\nజ. వెలయాలు\n\n* అందంకాని అందం\nజ. పరమానందం, బ్రహ్మానందం\n\n* ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.\nజ. చీమలదండు\n\n* ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న\nజ. వెలగపండు\n\n* ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.\nజ. చింతకాయలు\n\n* ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది\nజ. నాలుక\n\n* ఆకాశాన పటం.. కింద తోక.\nజ. గాలిపటం\n\n* ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.\nజ. విమానం\n\n* ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే\nజ. ఉల్లిపాయ\n\n* గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.\nజ. బూరె\n\n* అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.\nజ. కవ్వం\n\n* దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.\nజ. దీపం\n\n* జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.\nజ. నీడ\n\n* నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.\nజ. ఉడుత\n\n* సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.\nజ. మన వాఇనం\n\n* అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం\nజ. గోరింటాకు\n\n* ఆకు చిటికెడు. కాయ మూరెడు.\nజ. మునగకాయ\n\n* ఆకు బారెడు. తోక మూరెడు.\nజ. మొగలిపువ్వు\n\nమా ఊరెద్దు మీ ఊరు పోదు ,మీ ఊరెద్దు మా ఊరు రాదు ?\nజ : మైలు రాళ్లు .\n\n* . మెడ ఉంటుంది కానీ తల ఉండదు , చేతులు ఉంటాయి కానీ వేల్లుండవు ?\nజ : చొక్కా\n\n* . అర చేతికింద అరిసె ?\nజ : పిడక .",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 886,
        "IMAGE": "cat_12",
        "NAME": "పొడుపు కథలు - 4",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 12
    },
    {
        "DESCRIPTION": "*.మూడు కాళ్ళ ముసలమ్మ నీళ్లు తాగి కొయ్య మింగుతుంది .ఏమిటది ?\nజ:సాన.\n\n* . ఊరికంతా ఒకటే దుప్పటి . ఏమిటది ?\nజ :ఆకాశం .\n\n*. లోకమంతా చాప వేసి , నిద్ర పోకుండా తిరుగుతూ ఉంటాడు . ఎవరతను ?\nజ :సముద్రం .\n\n* అరచేతిలో 60 నక్షత్రాలు\nజ. జల్లెడ\n\n* అరచేతి పట్నంలో 60 వాకిళ్లు\nజ. అద్దం\n\n* అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు\nజ. మీగడ\n\n* అడ్డ గోడ మీద పూజారప్ప\nజ. తేలు\n\n* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.\nజ. కవ్వం\n\n* అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?\nజ. ఆకలి\n\n* అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.\nజ. మేనక\n\n* అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.\nజ. పుట్ట\n\n* అరం కణం గదిలో 60 మంది నివాసం\nజ. అగ్గిపెట్టె, పుల్లలు\n\n* ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు.\nజ. తాళం\n\n* పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.\nజ. తాళం కప్ప\n\n* అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.\nజ. చందమామ\n\n* అరటిపండుకి పదే విత్తులు\nజ. బొగడగొట్టం\n\n* అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది\nజ. గొడ్డలి\n\n* అరచేతి కింద అరిసె\nజ. పిడక\n\n* అలాము కొండకు సలాము కొట్టు\nజ. గొడ్డలి\n\n* అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?\nజ. పెదవులు\n\n* అంక పొంకలు లేనిది.\nజ. శివలింగం\n\n* అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?\nజ. ఈతచెట్టు\n\n* అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది\nజ. పెద్ద పొయ్యి\n\nప్ర : కారం కాని కారం ?\nజ : ఆకారం .\n\nప్ర : ఇదొస్తే ఎవరైనా నోరు తెరిచి దారి ఇవ్వాల్సిందే ?\nజ : ఆవలింత .\n\nప్ర : దీని పళ్ళు ఊడితే మళ్ళీ రావు ?\nజ : దువ్వెన .\n\nప్ర : కూత కూస్తే కాని పరుగు తీయదు ?\nజ : రైలు .\n\nప్ర : మనిషి కాదు. జ్ఞానం లేదు. కాని , తన వేయి కళ్ళతో మంచి చెడ్డలను వేరు చేస్తుంది. ఏంటది ?\nజ : జల్లెడ .\n\nప్ర : మొండెం వుంటుంది . కాని , తల , కాళ్ళు , చేతులు లేవు . ఏంటది ?\nజ : సీసా .\n\nప్ర : అందర్నీ చూడగలదు . తనను తాను చూడలేదు ?\nజ : కన్ను .\n\nప్ర : వంటి నిండా గాయాలు . కడుపు నిండా రాగాలు . ఏంటది ?\nజ : పిల్లనగ్రోవి .\n\nప్ర : నాలుగు కాల్లునాయి . నిలబడగలదు . కానీ , నడవలేదు . ఏంటది ?\nజ : కుర్చీ .\n\nప్ర : రెక్కల్లేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్నచోట నుండి కదలదు . ఏంటది ?\nజ : జెండా .\n\n* ఆకాశంలో పాములు\nజ. పొట్లకాయ\n\n* ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు\nజ. జిల్లేడు\n\n* ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.\nజ. దువ్వెన\n\n* ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?\nజ. విద్యత్తు తీగ\n\n* ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది?\nజ. మీసం\n\n* ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి\nజ. కుక్కపిల్ల\n\n* ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు\nజ. కొబ్బరి కాయ\n\n* ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర\nజ. పుట్టగొడుగులు\n\n* ఇక్కడ విచిన కోడి ఇందూరు పోయింది\nజ. లేఖ\n\n* ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను\nజ. మొగలిపువ్వు\n\n* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.\nజ. ఆబోతు మూపురం.\n\n* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.\nజ. పెదవులు\n\n* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.\nజ. నిచ్చెన\n\n* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.\nజ. గొడుగు.\n\n* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు\nజ. సూర్యుడు, చంద్రుడు.\n\n* బంగారు చెంబులో వెండి గచ్చకాయ\nజ. పనసతొన.\n\n* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.\nజ. తాళం.\n\n* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?\nజ. ముళ్ల మొక్క\n\n* బండకు కొడితే వెండి ఊడుతుంది?\nజ. కొబ్బరికాయ\n\n* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ\nజ. రామచిలుక.\n\nప్ర : పై పచ్చ ,లో తెలుపు , గులకరాళ్ళు , తేటనీళ్ళు ఏంటది ?\nజ : కమలాపండు .\n\nప్ర : కర్రకాని కర్ర ఏంటది ?\nజ : జీలకర్ర .\n\nప్ర : బంగారు భరిణలో రత్నాలు.పగలగొడితేగాని రావు ?\nజ : దానిమ్మ పండు .\n\nప్ర : ఒక వైపు తిప్పితే దారి మూస్తుంది .మరో వైపు తిప్పితే దారి తెరుస్తుంది . ఏంటది ?\nజ : తాళంచెవి .\n\nప్ర : గాజు పంజరంలో మిణుగురు పురుగు.పగలు నిద్ర , రాత్రి జాగారం చేస్తుంది . ఏంటది ?\nజ : బల్బు .\n\nప్ర : నల్లని పైరు . ఎంత కోసినా పెరుగుతుంది . ఏంటది ?\nజ : జుట్టు .\n\nప్ర : నిమ్మ కాని నిమ్మ ?\nజ : దానిమ్మ .\n\nప్ర : జనం కాని జనం ?\nజ : భోజనం .\n\nప్ర : వనం కాని వనం ?\nజ : భవనం .\n\nప్ర : పాలు కాని పాలు ?\nజ : విన్నపాలు / మురిపాలు / జులపాలు .\n\n* తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?\nజ. మద్దెల\n\n* తోలు నలుపు, తింటే పులుపు.\nజ. చింతపండు\n\n* తొలు తియ్యన, గుండు మింగన్నా?\nజ. అరటి పండు\n\n* జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?\nజ. కుండలో గరిటె.\n\n* కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?\nజ.తాటిచెట్టు\n\n* కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?\nజ. కొబ్బరి కాయ\n\n* కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?\nజ. నత్త\n\n* పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?\nజ. పత్తి కాయ.\n\n* నూరు పళ్లు, ఒకటే పెదవి.\nజ. దానిమ్మ\n\n* సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.\nజ. సూది\n\n* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.\nజ. దీపం\n\n* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.\nజ. నిప్పు\n\n* ఎందరు ఎక్కిన విరగని మంచం.\nజ. అరుగు.\n\n* దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.\nజ.దీపం వెలుగు.\n\n* ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?\nజ. పొగ\n\n* కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?\nజ. మేఘం\n\n* తలపుల సందున మెరుపుల గిన్నె.\nజ. దీపం\n\n* తల్లి దయ్యం, పిల్ల పగడం.\nజ. రేగుపండు\n\n* తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర\nజ. కొవ్వొత్తి\n\n* ఒకటే తొట్టి, రెండు పిల్లలు.\nజ. వేరుశనగ\n\n* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.\nజ. వల\n\n* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.\nజ. ఉంగరం\n\n* పొడవాటి మానుకి నీడే లేదు.\nజ. దారి\n\n* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.\nజ. పొయ్యి\n\n* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.\nజ. అత్తిపత్తి\n\n* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.\nజ. కళ్లజోడు.\n\n* పైడిపెట్టెలో ముత్యపు గింజ\nజ. వడ్లగింజ\n\n* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.\nజ. కడవ, చెంబు\n\n* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.\nజ. మొగలిపువ్వు.\n\n* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?\nజ. తమలపాకు",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 887,
        "IMAGE": "cat_12",
        "NAME": "పొడుపు కథలు - 5",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 12
    },
    {
        "DESCRIPTION": "1. 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.\n\n2. అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.\n\n3. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.\n\n4. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.\n\n5. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.\n\n6. అందం అన్నది సత్యం యొక్క శోభ.\n\n7. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.\n\n8. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.\n\n9. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.\n\n10. అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.\n\n11. అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.\n\n12. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.\n\n13. అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.\n\n14. అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.\n\n15. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.\n\n16. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.\n\n17. అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.\n\n18. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.\n\n19. అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.\n\n20. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.\n\n21. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.\n\n22. అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.\n\n23. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.\n\n24. అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.\n\n25. అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.\n\n26. అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.\n\n27. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.\n\n28. అనుభవమే అన్ని విజయాలకూ మూలం.\n\n29. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.\n\n30. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.\n\n31. అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.\n\n32. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్\n\n33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.\n\n34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం\n\n35. అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.\n\n36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.\n\n37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.\n\n38. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.\n\n39. అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.\n\n40. అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.\n\n41. అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.\n\n42. అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.\n\n43. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.\n\n44. అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.\n\n45. అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.\n\n46. అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.\n\n47. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.\n\n48. అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.\n\n49. అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.\n\n50. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 888,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 1 ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.\n\n2. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.\n\n3. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.\n\n4. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.\n\n5. అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.\n\n6. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.\n\n7. అసూయ ఆత్మకు పచ్చకామర్లు.\n\n8. అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.\n\n9. అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.\n\n10. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.\n\n11. ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.\n\n12. ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.\n\n13. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.\n\n14. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.\n\n15. ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.\n\n16. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.\n\n17. ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.\n\n18. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.\n\n19. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.\n\n20. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.\n\n21. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.\n\n22. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.\n\n23. ఆదర్శవాదికి అందరూ విరోధులే.\n\n24. ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.\n\n25. ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.\n\n26. ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.\n\n27. ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.\n\n28. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.\n\n29. ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.\n\n30. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.\n\n31. ఆరాధన భావంతో సేవను చేయండి.\n\n32. ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.\n\n33. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.\n\n34. ఆరోగ్యం పరమ ప్రయోజనం.\n\n35. ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.\n\n36. ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.\n\n37. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.\n\n38. ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.\n\n39. ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.\n\n40. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.\n\n41. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.\n\n42. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.\n\n43. ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.\n\n44. ఆశ జీవితం జీవితమే ఆశ.\n\n45. ఆశలేని వాని కగచాట్లులేవు.\n\n46. ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.\n\n47. ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.\n\n48. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.\n\n49. ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.\n\n50. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 889,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.\n\n2. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.\n\n3. ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.\n\n4. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.\n\n5. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.\n\n6. ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.\n\n7. ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.\n\n8. ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.\n\n9. ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్.\n\n10. ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.\n\n11. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.\n\n12. ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.\n\n13. ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.\n\n14. ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.\n\n15. ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.\n\n16. ఇతురుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.\n\n17. ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.\n\n18. ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.\n\n19. ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.\n\n20. ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.\n\n21. ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.\n\n22. ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.\n\n23. ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.\n\n24. ఉత్తమ గ్రంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం.\n\n25. ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .\n\n26. ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.\n\n27. ఉత్సాహం క్రియాశీలతలను వెయ్యి రెట్లు పెంచుతుంది.\n\n28. ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.\n\n29. ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.\n\n30. ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.\n\n31. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.\n\n32. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.\n\n33. ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.\n\n34. ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.\n\n35. ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.\n\n36. ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు.\n\n37. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.\n\n38. ఎంత పంచుకుంటే అంత పొందగలం.\n\n39. ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.\n\n40. ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.\n\n41. ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.\n\n42. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.\n\n43. ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.\n\n44. ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.\n\n45. ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.\n\n46. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.\n\n47. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.\n\n48. ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.\n\n49. ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.\n\n50. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 890,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 3",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.\n\n2. ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.\n\n3. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.\n\n4. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.\n\n5. ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.\n\n6. ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.\n\n7. ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.\n\n8. ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.\n\n9. ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.\n\n10. ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.\n\n11. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.\n\n12. ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.\n\n13. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.\n\n14. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.\n\n15. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.\n\n16. ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.\n\n17. ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.\n\n18. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.\n\n19. ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.\n\n20. ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.\n\n21. ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.\n\n22. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.\n\n23. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.\n\n24. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.\n\n25. ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.\n\n26. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.\n\n27. ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.\n\n28. ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.\n\n29. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.\n\n30. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.\n\n31. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.\n\n32. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.\n\n33. ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.\n\n34. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.\n\n35. ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.\n\n36. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.\n\n37. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.\n\n38. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.\n\n39. ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.\n\n40. ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.\n\n41. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది.\n\n42. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.\n\n43. ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.\n\n44. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.\n\n45. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.\n\n46. ఓర్పుకు మించిన తపస్సు లేదు.\n\n47. కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.\n\n48. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.\n\n49. కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.\n\n50. కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 891,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 4",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.\n\n2. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.\n\n3. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.\n\n4. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.\n\n5. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.\n\n6. కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.\n\n7. కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.\n\n8. కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.\n\n9. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.\n\n10. కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.\n\n11. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.\n\n12. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.\n\n13. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.\n\n14. కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.\n\n15. కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.\n\n16. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.\n\n17. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.\n\n18. కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.\n\n19. కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.\n\n20. కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.\n\n21. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.\n\n22. కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.\n\n23. క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.\n\n24. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.\n\n25. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.\n\n26. గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.\n\n27. గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.\n\n28. గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.\n\n29. గతమే వర్తమానానికి మార్గం.\n\n30. గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.\n\n31. గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.\n\n32. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.\n\n33. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.\n\n34. గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు - ధామస్ ఫుల్లర్\n\n35. గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.\n\n36. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.\n\n37. గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.\n\n38. గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.\n\n39. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.\n\n40. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.\n\n41. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.\n\n42. గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.\n\n43. గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.\n\n44. గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.\n\n45. ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.\n\n46. ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.\n\n47. ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.\n\n48. ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు\n\n49. చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.\n\n50. చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 892,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 5",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.\n\n2. చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.\n\n3. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.\n\n4. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.\n\n5. చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.\n\n6. చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది\n\n7. చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.\n\n8. చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.\n\n9. చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.\n\n10. చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.\n\n11. చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.\n\n12. చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.\n\n13. చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.\n\n14. చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.\n\n15. చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది\n\n16. చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి.\n\n17. చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.\n\n18. చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.\n\n19. చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.\n\n20. చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు\n\n21. చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.\n\n22. చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?\n\n23. చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.\n\n24. చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.\n\n25. చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.\n\n26. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.\n\n27. చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.\n\n28. చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.\n\n29. చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.\n\n30. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.\n\n31. చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.\n\n32. చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.\n\n33. జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.\n\n34. జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.\n\n35. జాలి లేనివారే నిజమైన అంటరానివారు.\n\n36. జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.\n\n37. జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.\n\n38. జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.\n\n39. జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.\n\n40. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.\n\n41. జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.\n\n42. జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.\n\n43. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.\n\n44. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.\n\n45. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.\n\n46. జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.\n\n47. జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.\n\n48. జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.\n\n49. జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.\n\n50. జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 893,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 6",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.\n\n2. తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు\n\n3. తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.\n\n4. తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.\n\n5. తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.\n\n6. తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద\n\n7. తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.\n\n8. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.\n\n9. తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.\n\n10. తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.\n\n11. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.\n\n12. తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.\n\n13. తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.\n\n14. తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు.\n\n15. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.\n\n16. తప్పు చేయని వారు ధరణిలో లేరు.\n\n17. తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.\n\n18. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.\n\n19. తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.\n\n20. తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.\n\n21. తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు.\n\n22. తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.\n\n23. తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.\n\n24. తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.\n\n25. తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.\n\n26. తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.\n\n27. తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.\n\n28. తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.\n\n29. తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.\n\n30. తీర్మానాలు చేస్తే చాలదు. వాటిని ఆచరణలో పెట్టాలి.\n\n31. తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.\n\n32. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.\n\n33. తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.\n\n34. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.\n\n35. తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.\n\n36. తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.\n\n37. తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.\n\n38. తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.\n\n39. తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.\n\n40. తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.\n\n41. తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.\n\n42. తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.\n\n43. త్యాగమయ జీవితం మహత్తర జీవితం.\n\n44. త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.\n\n45. దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.\n\n46. దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.\n\n47. దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.\n\n48. దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.\n\n49. దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.\n\n50. దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 894,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 7",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. దూరపు కొండలు నునుపుగా తోచు.\n\n2. దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.\n\n3. దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.\n\n4. దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది\n\n5. దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?\n\n6. దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.\n\n7. దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.\n\n8. దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.\n\n9. దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.\n\n10. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.\n\n11. దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.\n\n12. దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.\n\n13. దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.\n\n14. ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.\n\n15. ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.\n\n16. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.\n\n17. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.\n\n18. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.\n\n19. ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.\n\n20. ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.\n\n21. ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.\n\n22. నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.\n\n23. నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.\n\n24. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.\n\n25. నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట.\n\n26. నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.\n\n27. నవ్వని దినం పోగొట్టుకున్న దినం.\n\n28. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.\n\n29. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.\n\n30. నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.\n\n31. నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.\n\n32. నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.\n\n33. నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.\n\n34. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.\n\n35. నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.\n\n36. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.\n\n37. నిజం కానిది నిజంగా గొప్పది కాదు.\n\n38. నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.\n\n39. నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.\n\n40. నిజము నిలకడ మీద తెలియును.\n\n41. నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.\n\n42. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.\n\n43. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.\n\n44. నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.\n\n45. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.\n\n46. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.\n\n47. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.\n\n48. నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.\n\n49. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.\n\n50. నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 895,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 8",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.\n\n2. నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.\n\n3. నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.\n\n4. నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.\n\n5. నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.\n\n6. నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.\n\n7. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.\n\n8. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.\n\n9. నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.\n\n10. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.\n\n11. నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.\n\n12. నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీతల్లి తండ్రులను ప్రేమించు.\n\n13. నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.\n\n14. నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి.\n\n15. నీతిగల వానికి నిందాభయం లేదు.\n\n16. నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.\n\n17. నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.\n\n18. నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.\n\n19. నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.\n\n20. నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.\n\n21. నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.\n\n22. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.\n\n23. నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను\n\n24. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.\n\n25. పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్\n\n26. పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.\n\n27. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.\n\n28. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.\n\n29. పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.\n\n30. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.\n\n31. పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.\n\n32. పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.\n\n33. పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.\n\n34. పనిచేయని వాడికి తినే హక్కులేదు.\n\n35. పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.\n\n36. పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.\n\n37. పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.\n\n38. పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.\n\n39. పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ\n\n40. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.\n\n41. పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.\n\n42. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.\n\n43. పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్\n\n44. పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహా విజేత\n\n45. పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.\n\n46. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.\n\n47. పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతి అభివృద్ధి పరచుకోవాలి - బాబా.\n\n48. పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.\n\n49. పాలల్లో వెన్నవలే, ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు.\n\n50. పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 896,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 9",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. పిరికి మాటలు మాట్లాడకండి. వినకండి.\n\n2. పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.\n\n3. పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధరణంగా మనకు లభిస్తుంది.\n\n4. పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.\n\n5. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.\n\n6. పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.\n\n7. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.\n\n8. పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.\n\n9. పెరిగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ అపాయకరం.\n\n10. పెరుగుతున్న వయస్సుతో కాదు. చేసే సత్క్రియలతో జీవితం సార్ధకం అవుతుంది.\n\n11. పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.\n\n12. పైన సమజాంలో కులమత బేధాలు శాంతిని దూరం చేస్తాయి.\n\n13. పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం.\n\n14. పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది.\n\n15. పొగిడే ప్రతివాడు, పొగడ్తను వినేవాడి ఖర్చుతో జీవిస్తాడు.\n\n16. పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.\n\n17. పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.\n\n18. పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.\n\n19. పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.\n\n20. ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.\n\n21. ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం.\n\n22. ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.\n\n23. ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగో\n\n24. ప్రజాసమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కానీ వివేకంతో కాదు.\n\n25. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.\n\n26. ప్రతి ఒక్కరు చాలాకాలం జీవించాలనుకుంటారే కానీ ఏ ఒక్కరూ ఎదగాలని కోరరు.\n\n27. ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని వెక్కిరిస్తూ ఉంటుంది.\n\n28. ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది.\n\n29. ప్రతి మందలోనూ, ఒక మోసగాడు ఉంటాడు.\n\n30. ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.\n\n31. ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.\n\n32. ప్రపంచ శాంతిని, తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలను నాటుతున్నాయి.\n\n33. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.\n\n34. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు.\n\n35. ప్రపంచంలో ప్రతి మనిషీ ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి జీవితానికి ఓ అర్ధం ఓ ప్రయోజనం ఉండి తీరుతాయి.\n\n36. ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.\n\n37. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.\n\n38. ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.\n\n39. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.\n\n40. ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.\n\n41. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.\n\n42. ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.\n\n43. ప్రార్ధన చేసే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్న.\n\n44. ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.\n\n45. ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.\n\n46. ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.\n\n47. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.\n\n48. ప్రేమ ద్వారా ప్రేరేపింపబడినదీ, చదువు ద్వారా దారి చూపబడినదే మంచి జీవితం.\n\n49. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును - గురజాడ.\n\n50. ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 897,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 10",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.\n\n2. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.\n\n3. ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.\n\n4. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కానీ ద్వేషం చేయలేదు - బుద్ద.\n\n5. బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.\n\n6. బందిపోటు దొంగలకంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది.\n\n7. బలమే జీవనం, బలహీనతే మరణం.\n\n8. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు.\n\n9. బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.\n\n10. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.\n\n11. బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది.\n\n12. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.\n\n13. బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.\n\n14. బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.\n\n15. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు.\n\n16. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.\n\n17. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్‌స్టన్ చర్చిల్.\n\n18. బావి లోతుకన్న మనసు లోతు మిన్న.\n\n19. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.\n\n20. భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.\n\n21. భగవంతుడు + కోరిక = మనిషి, మనిషి - కోరిక = భగవంతుడు.\n\n22. భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.\n\n23. భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.\n\n24. భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది.\n\n25. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.\n\n26. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.\n\n27. మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.\n\n28. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.\n\n29. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.\n\n30. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.\n\n31. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.\n\n32. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.\n\n33. మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.\n\n34. మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.\n\n35. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.\n\n36. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.\n\n37. మంచి పనే మంచి ప్రార్ధన.\n\n38. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.\n\n39. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.\n\n40. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.\n\n41. మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.\n\n42. మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.\n\n43. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.\n\n44. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.\n\n45. మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.\n\n46. మంచితనానికి మించిన మతమే లేదు.\n\n47. మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.\n\n48. మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.\n\n49. మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.\n\n50. మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 898,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 11",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.\n\n2. మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.\n\n3. మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.\n\n4. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.\n\n5. మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.\n\n6. మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.\n\n7. మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.\n\n8. మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.\n\n9. మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.\n\n10. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.\n\n11. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.\n\n12. మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.\n\n13. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.\n\n14. మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.\n\n15. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.\n\n16. మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.\n\n17. మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.\n\n18. మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.\n\n19. మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.\n\n20. మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.\n\n21. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.\n\n22. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.\n\n23. మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.\n\n24. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.\n\n25. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.\n\n26. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.\n\n27. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము\n\n28. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.\n\n29. మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.\n\n30. మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.\n\n31. మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.\n\n32. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.\n\n33. మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.\n\n34. మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.\n\n35. మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.\n\n36. మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.\n\n37. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.\n\n38. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.\n\n39. మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.\n\n40. మనిషి ముసలివాడై చావుకు సిద్దమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.\n\n41. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం.\n\n42. మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.\n\n43. మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.\n\n44. మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.\n\n45. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.\n\n46. మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.\n\n47. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.\n\n48. మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.\n\n49. మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.\n\n50. మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 899,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 12",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.\n\n2. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.\n\n3. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం.\n\n4. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు\n\n5. మాట ఇవ్వటానికి తొందరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.\n\n6. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.\n\n7. మాటలు కాదు మనసు ముఖ్యం.\n\n8. మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.\n\n9. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.\n\n10. మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.\n\n11. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.\n\n12. మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.\n\n13. మితము తప్పితే అమృతమైనా విషమే.\n\n14. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.\n\n15. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.\n\n16. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.\n\n17. మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.\n\n18. మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.\n\n19. మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.\n\n20. మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.\n\n21. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.\n\n22. మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.\n\n23. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.\n\n24. మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.\n\n25. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.\n\n26. మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.\n\n27. మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి.\n\n28. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి.\n\n29. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి.\n\n30. మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.\n\n31. మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.\n\n32. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.\n\n33. మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.\n\n34. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.\n\n35. మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.\n\n36. మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.\n\n37. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.\n\n38. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.\n\n39. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.\n\n40. మేథశక్తిని చూపగానే సరికాదు. హృదయ వైశాల్యం కూడా కనబరచాలి.\n\n41. మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.\n\n42. యదార్థవాది లోకవిరోధి.\n\n43. యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.\n\n44. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.\n\n45. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.\n\n46. యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.\n\n47. రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.\n\n48. రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.\n\n49. రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.\n\n50. రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 900,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 13",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.\n\n2. రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.\n\n3. రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.\n\n4. రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.\n\n5. లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.\n\n6. లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.\n\n7. లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.\n\n8. లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.\n\n9. లోభికి నాలుగు దిక్కులా నష్టం.\n\n10. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.\n\n11. వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.\n\n12. వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.\n\n13. వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.\n\n14. వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.\n\n15. వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.\n\n16. వస్తువ విలువ అవసరాన్ని బట్టితెలుస్తుంది.\n\n17. వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.\n\n18. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.\n\n19. వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.\n\n20. వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.\n\n21. వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.\n\n22. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.\n\n23. వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.\n\n24. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.\n\n25. విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.\n\n26. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.\n\n27. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.\n\n28. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.\n\n29. విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.\n\n30. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.\n\n31. విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.\n\n32. విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.\n\n33. విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.\n\n34. విద్య లేని వారికి కీర్తి లేదు.\n\n35. విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.\n\n36. విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం\n\n37. విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.\n\n38. విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.\n\n39. విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.\n\n40. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.\n\n41. వినయం నీవు ధరించే విలువైన వజ్రం.\n\n42. వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.\n\n43. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.\n\n44. విరగడం కంటే వంగడం మంచిది.\n\n45. వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.\n\n46. వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.\n\n47. వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.\n\n48. వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.\n\n49. విశ్వాసం పరమ బంధువు.\n\n50. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 901,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 14",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "1. విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.\n\n2. విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.\n\n3. విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.\n\n4. వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.\n\n5. వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.\n\n6. వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.\n\n7. వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.\n\n8. వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.\n\n9. వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.\n\n10. వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.\n\n11. శక్తి అన్నిటిని జయిస్తుంది. కానీ ఆవిజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి.\n\n12. శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.\n\n13. శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.\n\n14. శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.\n\n15. శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.\n\n16. శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.\n\n17. శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.\n\n18. శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.\n\n19. శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.\n\n20. శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.\n\n21. శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.\n\n22. శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.\n\n23. సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.\n\n24. సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.\n\n25. సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.\n\n26. సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.\n\n27. సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.\n\n28. సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు\n\n29. సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది\n\n30. సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.\n\n31. సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమి సాధించలేము.\n\n32. సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.\n\n33. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.\n\n34. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ - ఈ ఆరే ఆప్తులైన బంధువులు.\n\n35. సత్యదేవతకు మనం చూపగల భక్తి, ఆ వెలుగులో నడవగలగడమే.\n\n36. సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.\n\n37. సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు.\n\n38. సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.\n\n39. సత్యాన్ని గూర్చిన సిద్దాంతాలు మారిన అసలు సత్యం ఎప్పటికీ మారదు.\n\n40. సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.\n\n41. సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.\n\n42. సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము.\n\n43. సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.\n\n44. సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.\n\n45. సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.\n\n46. సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.\n\n47. సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.\n\n48. సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.\n\n49. సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.\n\n50. సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్ధించండి, మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు.\n\n51. సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.\n\n52. సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.\n\n53. సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్ధం.\n\n54. సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.\n\n55. సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.\n\n56. సాహసించని వాడు గెలుపును సాధించలేడు.\n\n57. సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.\n\n58. సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.\n\n59. సుగుణమే నిజమైన గొప్పదనం.\n\n60. సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి.\n\n61. సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.\n\n62. సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.\n\n63. సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.\n\n64. సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.\n\n65. సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.\n\n66. స్ధిరమైన మీ న్యాయబుద్ది మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది\n\n67. స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి.\n\n68. స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.\n\n69. స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.\n\n70. స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.\n\n",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 902,
        "IMAGE": "cat_13",
        "NAME": "తెలుగు సూక్తులు - 15",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 13
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరి లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, మూగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించేవారు.\r\n\r\nఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు.\r\n\r\nమరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహ! చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు.\r\n\r\nప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి, బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.\r\n\r\nఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి, నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడనుకోండి!\r\n\r\nఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు.\r\n\r\nవిగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది? అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపాయి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు.\r\n\r\nఅప్పుడు రాముడికి అర్ధమయ్యింది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 903,
        "IMAGE": null,
        "NAME": "ఎద్దు గర్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది.\r\n\r\nగొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది.\r\n\r\nఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు. అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది.\r\n\r\nఅలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది: “ఎందుకు అంత గోల పెడుతున్నావు? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము”\r\n\r\nవెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి.\r\n\r\nదానికి పంది ఇలా జవాబు చెప్పింది. “మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి, మేతకు తీసుకువెళ్లి, మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా? నన్ను వొండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో? నా భయం నాకు ఉంటుంది కదా!” నిజమే. ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహస మంతుల లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 904,
        "IMAGE": null,
        "NAME": "పంది భయం పందిది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.\r\n\r\nమనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.\r\n\r\nపిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.\r\n\r\nఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.\r\n\r\nకాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.\r\n\r\n“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.\r\n\r\nఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 905,
        "IMAGE": null,
        "NAME": "పిచుక గుణం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.\r\n\r\nఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు.\r\n\r\nఅలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది.\r\n\r\nఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.\r\n\r\nఅందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”\r\n\r\nఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు.  ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.\r\n\r\nకొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.\r\n\r\nఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.\r\n\r\nకాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.\r\n\r\nచలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.\r\n\r\n“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.\r\n\r\nదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.\r\n\r\nపూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.\r\n\r\nకొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.\r\n\r\nపూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 906,
        "IMAGE": null,
        "NAME": "దేవుడే కాపాడుతాడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.\r\n\r\n“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.\r\n\r\nవెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.\r\n\r\nమొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.\r\n\r\nరాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.\r\n\r\nవ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.\r\n\r\n“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.\r\n\r\nరాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.\r\n\r\nఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.\r\n\r\nముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.\r\n\r\nమహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.\r\n\r\nఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.\r\n\r\nమొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.\r\n\r\nసభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.\r\n\r\nరాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.\r\n\r\nసభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.\r\n\r\nఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.\r\n\r\nసభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.\r\n\r\nఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 907,
        "IMAGE": null,
        "NAME": "రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "శీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా జేరాడు.\r\n\r\nఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికి అతను యెంతో ధనవంతుదని, ప్రపంచమంతా చూసాడని తెలియాలని బాగా తపన పడేవాడు.\r\n\r\nఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శీను ని పిలిచి, “శీను, వెళ్లి దుర్భిణి పట్టుకురా!” అన్నాడు. దుర్భిణి అంటే బైనాక్యులర్స్. శీను లోపలి వెళ్లి అడిగినట్లే దుర్భిణి తెచ్చి ఇచ్చాడు.\r\n\r\nవచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఆ ధనవంతుడు శీనూను పిలిచి తిట్టాడు. “దుర్భిణి తెమ్మంటే తెచ్చేయడం కాదు! యే దుర్భిణి, లండన్ దా అమెరికా దా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుదినో అందరికి తెలిసేది?” అన్నాడు.\r\n\r\nశీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేస్తాను సారూ” అన్నాడు.\r\n\r\nకొన్ని రోజుల తరవాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్ లో వున్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు.\r\n\r\nధనవంతుడికి అలవాటే కదా, బడాయిలు చెప్పుకుంటూ, “ఇది మా నాన్న గారు వేట కి వెళ్లి చంపిన పులి!” అంటూ, శీనుని పిలిచి, “మా నాన్నగారి ఫోటో వుండాలి తీసుకుని రా!” అన్నాడు.\r\n\r\nవెంటనే అమాయకపు శీను, “యే నాన్నగారు సారూ, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?” అని అడిగాడు!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 908,
        "IMAGE": null,
        "NAME": "లండన్ దా, అమెరికాదా?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి.\r\n\r\nఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.\r\n\r\nఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.\r\n\r\nయుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.\r\n\r\nఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.\r\n\r\nయుద్ధం ముగిసి పోయింది.\r\n\r\nకాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.\r\n\r\nపోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కారించాయి.\r\n\r\nయే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 909,
        "IMAGE": null,
        "NAME": "యే జాతికీ చందలేని గబ్బిలాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది! ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది.\r\n\r\nఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి.\r\n\r\nమొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా!\r\n\r\nఅలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది.\r\n\r\nఅయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది.\r\n\r\nకాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది.\r\n\r\nఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 910,
        "IMAGE": null,
        "NAME": "కాకి హంస కాగలదా?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.\r\n\r\nదారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి!\r\n\r\n“నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు.\r\n\r\n“నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు.\r\n\r\n“అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు.\r\n\r\nరాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు.\r\n\r\nఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు!\r\n\r\n“అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు.\r\n\r\n“మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.\r\n\r\nమనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 911,
        "IMAGE": null,
        "NAME": "బాటసారుల అదృష్టం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు.\r\n\r\nఅప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, విద్యాదికుదివైన నువ్వు, భీతగోల్పే ఈ స్మశానంలో, నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మసఖ్యం కాకుండా వున్నది. ఇంతకూ దీనికి కారకులు, నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్న కుత్సిత మనస్కులై వుండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి, కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తనమేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్పసాగాడు:\r\n\r\nపూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు, సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు.\r\n\r\nగురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.\r\n\r\nఅయితే, విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడూ కావడంతో, అనంతుడి మీద అప్పుడప్పుడూ అధికారం చలాయించేవాడు. అయినప్పిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుది పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు.\r\n\r\nవిరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకేక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక, తీరిక సమయాలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా ఒకటికి నాలుగు సార్లు భోదించే వాడు.\r\n\r\nఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పున్జుకోగానే, గురువు గోబిలుడు దాన్ని గమనించి, అతడికి మరింత ప్రోత్సాహజనకంగా వుండడం కోసం, అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్ట మొదటిసారి గురువు ప్రస్నించ గానే విరజుడు, అనంతుడితో, “అనంతా! ఈ రోజు గురువుగారు నన్ను ప్రస్నిన్చారంటే, ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను!” అన్నాడు.\r\n\r\nవిరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి, విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, “నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి! నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో” అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు.\r\n\r\nఅయితే, ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ, నానాటికీ అహంకారం పెంచుకుని, అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంత కాలం గడిచి, ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి, విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది.\r\n\r\nఅనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే, గురువు గోబిలుడితో, “స్వామీ! నాకింకా విద్యా తృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే, ఆరావళీ పర్వత పాదాల వడ్డన వున్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని వుంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే, విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను.” అన్నాడు.\r\n\r\nగోబిలుడు, అనంతుడు కోరిన దానికి సంతోషంగా, “ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్లిరా నాయనా, శుభస్య శీఘ్రం!” అంటూ ఆశీర్వదించి పంపించాడు.\r\n\r\nఆ తర్వాత, విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి, రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే, తనకు పూర్తీ అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధానసలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో, ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది.\r\n\r\nసుప్రతీకుడు, రాజూ కలిసి వినూత్న పరిపాలన పేరిట, పరిపాలనలో అనేక మార్పులూ, సంస్కరణలూ ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థ లో పడి, తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు, విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారులవల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి, సుప్రతీకుడిని సంప్రదించాడు.\r\n\r\nసుప్రతీకుడు తేలిగ్గా, “భయం ఎందుకు, ప్రభూ! మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని, మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవసమైతే, తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి!” అన్నాడు.\r\n\r\n“నువ్వు చెప్పెదీడీ చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని, నీకు తెలియనిదా?” అన్నాడు.\r\n\r\nదానికి సుప్రతీకుడు నవ్వి, “మన ఖజానా నింపేందుకు, ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా?” అన్నాడు.\r\n\r\nవిరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగావున్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలం గా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీదవున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర, దేవనాగారలిపిలో వున్న ఒక శిలా శాసనం వుంది. అందులో, ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసీ, నిస్వార్థ పరుడూ అయిన యువకుడు, ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయిన్చినట్లయితే, అతడికి అష్ట సిద్ధులూ, నవనిదులూ లభిస్తాయి, పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయ బాదుతాడు, అని వున్నది.\r\n\r\nసుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, “యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి, ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు!” అన్నాడు.\r\n\r\nఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, “అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు, ప్రభూ! అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళీ ప్రవత ప్రాంతంలోని కృష్ణ చంద్రుడనే గురూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంట ఆతిధ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అనీ, ఎన్నదగ్గ నేస్వార్తపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి, రాజ్య క్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే, అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు?” అని అడిగాడు.\r\n\r\nఅనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు, ఒక్క క్షణం ఆలోచించి, సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది.\r\n\r\nఅనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేసాడు. తర్వాత, యక్షిణిశైలాన్ని గురించి చెప్పిన దంతా శ్రద్ధగా విన్న అనంతుడు, “ప్రభూ! మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణిశైలానికి తప్పక వెళతాను,” అన్నాడు.\r\n\r\nఅన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణిశైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు.\r\n\r\nఅనంతుడిటో బాటే వెళ్లి, కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి, చాలా సేపు గడిచిన తర్వాత, అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ, కోనేటి నుంచి బయటకిరావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృత గా, “అనంతా! నిధి దొరికిందా, ఏదీ?” అంటూ ప్రశ్నించాడు.\r\n\r\nఅనంతుడు మందహాసం చేసి, “రండి, చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు!” అని విరజుది చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవ రత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్దుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, “ప్రభు! నేను సాధించిన ఈ అమూల్యమైన నిదినిక్షేపాల్ని, మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమంకోసం వినియోగించేందుకు, ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా, మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు!” అన్నాడు.\r\n\r\nఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, “మరేమి కావాలి?” అని ప్రశ్నించాడు? మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం, నన్ను మీ ప్రదానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు   కావలసింది!” అన్నాడు అనంతుడు గంభీరంగా.\r\n\r\nవిరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా వుండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్ళు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, “మహానుభావా! నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంఛీ నువ్వే నా ప్రధాన మంత్రివి! నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను!” అన్నాడు.\r\n\r\nబేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, నిధి సంపాదనలో, విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే వుంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడూ, సాహసీ అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్లి పోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీ గాక ఇదీ గాక, విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి, మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించు కుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావా, నీ తల పగిలి పోతుంది!” అన్నాడు.\r\n\r\nదానికి విక్రమార్కుడు, “అనంతుడు మొదటి నుంఛీ రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు, భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థ పరుడు కావచ్చు. కాని, అప్పటి పరిస్థితుల్లో, ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండ యాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పగ్నుడి సలహాలు – వీటన్నిటి కారణంగా దేసరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకం తోనే, అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేసభాక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్నీ చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏ మాత్రం లేదు!” అన్నాడు.\r\n\r\nరాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 912,
        "IMAGE": null,
        "NAME": "అనంతుడి కోరిక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది.\r\n\r\nఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది.\r\n\r\nపక్కన నుంచుని ఇటూ అటూ చాలా ఆత్రుతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు, వారిని చూసి భయ పడుతున్నట్టు  నటించింది.\r\n\r\nఅడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది.\r\n\r\nమొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, “ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే?” అని చిరునవ్వుతో అడిగింది.\r\n\r\nఅడవి పంది చాలా కూల్ గా, “ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు” అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది.\r\n\r\nనిజమే. మనలోని బలహీనతే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు.\r\n\r\nయుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 913,
        "IMAGE": null,
        "NAME": "అడవిపంది దంతాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒక సారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువు గా దొరికేది కాదు. అందుకనే కష్ట పడి, విత్తనాలు సంపాదించి, అవి నాటి, కాకర పాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని, జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు.\r\n\r\nఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి, వాటిని ఉల్లిపాయతో కూరి, బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు.\r\n\r\nమొన్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్లి పోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లి ఖారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే వుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ వున్నాడు.\r\n\r\nఇలా ఉండగా అతని పెళ్ళం బూర్లుముక్కుడు లో మంచిగా నూని వేసి, ఉల్లిఖారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనిలో భుసభుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండ పట్ట లేక పోయింది. “రుచి ఎలా ఉందొ చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము” అనుకుని ఒక కాకరకాయ తినేసింది.\r\n\r\nకొంత సేపటికి ఆకలి వేస్తోంది, నా వొంతు కూర, అన్నం తిందాము, అనుకుని రెండో కాయ కూడా తినేసింది.\r\n\r\nమొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు.\r\n\r\nభోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది.\r\n\r\n“ఇదేంటి, ఒకటే ఉంది, మిగిలిన రెండూ యేవి?” అని అడిగాడు.\r\n\r\n“ఒకటి రుచి ఎలా ఉందొ అని తిని చూసాను. రెండోది నా వాటా, అందుకే అన్నంతో తినేసాను” అని చెప్పింది.\r\n\r\nరైతుకి కోపం వచ్చింది. “అలా ఎలా తినేసావు?” అన్నాడు.\r\n\r\n“ఇలా!” అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది! కాకరకాయ రుచి అలాంటిది మరి!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 914,
        "IMAGE": null,
        "NAME": "కాకరకాయ రుచి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు. వారు రోజు అడవిలో చెట్లు నరికి, చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాన్నం దెగ్గిర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు.\r\n\r\nఒక రోజు అలాగే మధ్యాన్నం అయ్యింది. అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దెగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు.\r\n\r\nఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది. కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ, దుంగ మధ్యలో చీలిక చూసింద. కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు.\r\n\r\nకుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది. రెండు చేతులతో లాగింది. అలా లాగ గానే చీలిక బయటికి వచ్చేసి, దుంగ లో చేసిన రంద్రం ఠక్కుమని దేగ్గిరపడి మూసుకుపోయాయి.\r\n\r\nఅందులో కోతి తోక ఇరుక్కు పోయింది. కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది. భరించలేని నొప్పి కదా! ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయ పడి పారి పోయాయి.\r\n\r\nశ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి, కోతి చేసిన పని చూసారు. కోతి తోకను విడిపించారు.\r\n\r\nపరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 915,
        "IMAGE": null,
        "NAME": "కోతి కుతూహలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానోక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంట పడ్డారు.\r\n\r\nపరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి, తనూ దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు.\r\n\r\nమళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు.\r\n\r\nకాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు.\r\n\r\nఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయ పడ్డారు. గంట కొడుతున్నది ఎవరు? అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.\r\n\r\nచివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. గ్రామంలో వాళ్ళు భయ పడి అడవి వైపు వెళ్ళడం మానేశారు. కాని ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాత కాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు. పొయ్యిలోకి కట్టలు కావాలన్న, వేట ఆడాలన్నా, చాపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లక పొతే గ్రామస్తులకి ఇవన్ని ఉండవు. అది ఇబ్బందే కదా!\r\n\r\nమాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది. గంట మొగి నప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకో లేనంత భయం. తట్టుకో లేక కొంత మంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు.\r\n\r\nఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ “అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను!” అనుకుంది. అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది.\r\n\r\nమొన్నాడు అలాగే వెళ్లి చూసింది. గంట చప్పుడు ఎటు వైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంత సేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది.\r\n\r\nగంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు వున్నాయి. గాలి తగిలినా, కోతి తగిలినా, గంట ఊగి కొట్టుకుంటోంది.\r\n\r\nఅవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్లి ఊరి పెద్దను కలిసి, “నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో, ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే, నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇంక ఎవ్వరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు” అని చెప్పింది.\r\n\r\nఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాతిదేదో తెలుసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు.\r\n\r\nమొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని, బజారులోకి వెళ్లి అరిటి పళ్ళు, మామిడి పళ్ళు, వేరుసెనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వ యే పూజ చేస్తుందో అనుకున్నారు.\r\n\r\nఅవ్వ, తన కొడుకు, ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున ఎదురు చూసారు.\r\n\r\nఅడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగి పోయాడు.\r\n\r\nఅవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు.\r\n\r\nయేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు.\r\n\r\nఅవ్వ జరిగినదంతా చెప్పింది. ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని, తెలివి తేటలని మెచ్చుకున్నారు. “అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే!” అని అనుకున్నారు.\r\n\r\nఅప్పటి నుంచి గ్రామంలో అందరు ప్రశాంతంగా వున్నారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 916,
        "IMAGE": null,
        "NAME": "గంట మొగించేది ఎవరు?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయిన చాలా లోభి. అంటే యెంత పీనాసితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జార నిచ్చే వాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్ట నిచ్చే వాడు కాదు. పైసా పైసా కూడ పెట్టి, ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్ఖ పెట్టుకోవడం ఒక సరదా.\r\n\r\nఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి, ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి, ఆ సంచీ అందులో కప్పెట్టాడు.\r\n\r\nఅప్పుడప్పుడు గొయ్యి తీసి, సంచీ చూసుకుని, నాణాలు లెక్ఖ పెట్టుకుని, మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు.\r\n\r\nఇలా కొంత కాలం బాగానే గడిచింది. కాని ఒక రోజు ఇలాగే సంచీ తీసి నాణాలు లెక్ఖ పెట్టుకుంటుంటే ఒక దొంగ చూసాడు. ఇంకేముంది? రాత్రికి రాత్రి వచ్చి, గొయ్యి తీసి, సంచీ దోచేసాడు.\r\n\r\nమొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచీ కోసం తవ్వితే అది అక్కడ లేదు!\r\n\r\nభోరు భోరు మని ఎడిచాడు. కానీ ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుని ఏమి లాభం. పోయిన ధనం తిరిగి రాదు కదా?\r\n\r\nఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గిరకి వెళ్లి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు.\r\n\r\nస్వామీజీ, “బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసారినికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా?” అని అడిగారు.\r\n\r\n“ఖర్చు పెట్టడమా! నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను! అందులోంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు!” అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేసాడు.\r\n\r\nఅప్పుడు స్వామీజీ నవ్వి, “ఒక సంచీలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో, నీకు బంగారు నాణాలన్నా, రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్ఖ పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి వుండదు. ఇంకది పోయిందని బాధెందుకు?” అని సలహా ఇచ్చి పంపించేసారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 917,
        "IMAGE": null,
        "NAME": "లోభి నిధి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది.\r\n\r\nఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది.\r\n\r\nకోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది. కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది.\r\n\r\nరాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది.\r\n\r\nఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గిర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి.\r\n\r\nఅందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 918,
        "IMAGE": null,
        "NAME": "రాజుగారి కోతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "చిన్నప్పుడు మా అమ్మ ఎన్ని కథలు చెప్పినా, “ఇంకో కథ చెప్పమ్మా!” అని బ్రతిమాలే వాళ్లము. “ఏ కథ చెప్పమంటారు?” అని మా అమ్మ అంటే, “గోంగూర నాడే కథ చెప్పమ్మా!” అని ఆడిగే వాళ్లము. ఈ కథంటే నాకు, మా చెల్లెలికి చాలా ఇష్టం. మళ్ళీ మళ్ళీ చెప్పించుకునే వాళ్లము. ఈ కథకూడా ఒక తల్లికి తన బిడ్డలపై ఉండే ప్రభావం గురించి. “తల్లికి పిల్లల మీద యెంత ప్రేమ ఉన్నా అది కడుపులో పెట్టుకుని పిల్లలని బాధ్యతగా పెంచాలి” అని ఈ కథ చివర్లో మా అమ్మ చెప్పేది. ఈ కథ ఆ మాటకు చాలా మంచి ఉదాహరణం. \r\n\r\nకథ:\r\n\r\nఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.\r\n\r\n“అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు.\r\n\r\nఅమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది.\r\n\r\n“నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు.\r\n\r\nచేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు.\r\n\r\nకొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు.\r\n\r\nఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది.\r\n\r\nఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి, “నా కొడుకు అలాంటి పనులు చేయడు! నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో!” అని పాలేరుని తిట్టి పంపించేసింది.\r\n\r\nపిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు.\r\n\r\nకాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కోరలు దొంగాలించే పిల్లాడు, పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు, డబ్బులు దొంగాలించడం మొదలెట్టాడు. పిల్లాడు పెద్ద వాడైపోయాడు, ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు.\r\n\r\nఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి, దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది.\r\n\r\n“ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా! నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా!” అని కొడుకు జైలుకి వెళ్ళాడు.\r\n\r\nపిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే, అవే తప్పులు ముందు ముందు అలవాట్లు, తరవాత గ్రహపాటు అవుతాయి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 919,
        "IMAGE": null,
        "NAME": "గోంగూర నాడే",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకనోక్క కాలంలో ఒక స్వగ్రామములో ఒక విక్రేత ఉండేవాడు. ఆ విక్రేత అన్ని రకాల సామాన్లూ అమ్మేవాడు. చెప్పులు, బట్టలు, గాజులు, పళ్ళు, గిన్నెలు – బజారులో చవక గా కొని, ఊళ్ళో ఇంటింటికి వెళ్లి అమ్ముకునే వాడు.\r\n\r\nఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది. సామాన్లన్నీ మోట కట్టి, గాడిద మీద వేసి, బజారు నుంచి ఊళ్ళో, ఊళ్లోనుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు.\r\n\r\nరోజంతా బరువైన మోటలు మోసి ఆ గాడిద అలిసిపోతూ వుండేది.\r\n\r\nఒక రోజు విక్రేత బజారులో ఉప్పు కొన్నాడు. ఉప్పు మూటలు మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా వున్నాయి. గాడిద పాపం బరువుని మోసుకుంటూ విక్రేత వెనుక నడిచింది.\r\n\r\nమిట మధ్యాన్నం అయ్యింది. ఎండ బాగా ముదిరింది. గాడిద అలిసి పోయింది. కాళ్ళు లాగడం మొదలెట్టాయి. వీపు నొప్పెట్టేస్తోంది. దాహం వేస్తోంది. ఇంతలో కాలువ ఎదురయ్యింది. గాడిద గబ గబా కాలవ వైపు వెళ్ళింది. అంత పెద్ద మోట తో వంగడం కష్టంగా వుంది. వీలైనంత ముందరికి వంగి నీళ్ళు తాగడానికి గాడిద ప్రయత్నం చేసింది.\r\n\r\nకాలవ గట్టు తడిగా, జారిపోతూ వుంది. సంతులం తప్పి గాడిద ఒప్పు మోట తో సహా నీళ్ళల్లో పడిపోయింది.\r\n\r\nములిగి పోతుందేమో అన్న భయంతో కాళ్ళు, చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది.\r\n\r\nకానీ, అనుకోకుండా గాడిద తేలడం మొదలెట్టింది. వీపు మీద మోట తెలికయిపోయింది. కాలవలోంచి గట్టు మీదకు ఎక్కి నీళ్ళు దులుపుకుంది. మోట మాయం! బరువు లేదు! వీపుకి చాలా ఉపశమనం కలిగింది.\r\n\r\nఆ రోజు రాత్రి ఇంట్లో గాడిద ఈ అద్భుతం ఎలా జరిగిందని ఆలోచించింది. దానికి నీళ్ళల్లో ఉప్పు కరిగి పోయిందని తెలీదు. ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది.\r\n\r\nఇక పైన ఎప్పుడైనా మోట బరువుగా అనిపిస్తే మళ్ళీ నీళ్ళల్లో దుంక వచ్చు అని నిశ్చయించుకుంది.\r\n\r\nమొన్నాడు విక్రేత బట్టలు కొన్నాడు. ఆ బట్టలను గాడిద మీద వేసి ఊళ్లోకి బయలుద్యారేడు.\r\n\r\n“నిన్న ఏమి సంపాదించుకోలేదు. ఈ రోజైనా మంచి లాభం సంపాదించాలి” అనుకుంటూ విక్రేత మామూలుగా కొనే సరుకు కన్నా ఎక్కువ కొన్నాడు. మళ్ళీ గాడిద మీద బరువు ఎక్కువ వేసాడు.\r\n\r\nగాడిదకి మళ్ళీ కాళ్ళూ, వీపు నొప్పి పెట్టడం మొదలెట్టింది. మళ్ళీ కాలవ దెగ్గిర పడింది. కాలవ వైపు గబ గబా వెళ్లి మళ్ళీ నీళ్ళు తాగుతున్నట్టు నటించి, నీళ్ళల్లోకి దుంకేసింది. మోట మొత్తం తడిసేలా కాళ్ళు చేతులూ కొట్టుకుంది.\r\n\r\nకాని, బరువు తగ్గే బదులు ఇంకా ఎక్కువ అయిపొయింది! ఇది ఉప్పు కాదు కదా కరిగి పోవడానికి! బట్టలు! తడిసిన కొద్దీ బరువు ఎక్కుతాయి.\r\n\r\nఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. బరువు ఎక్కువయ్యే సరికి గాడిద నీళ్ళల్లో ములిగిపోవడం మొదలెట్టింది. చాలా భయ పడిపోయింది. విక్రేత నీళ్ళల్లోకి దుంకి జాగ్రత్తగా గాడిదని బయటికి లాగాడు.\r\n\r\nఆ రాత్రి గాడిద చాలా బాధ పడింది. డబల్ బరువు మోయడంతో వీపు, కాళ్ళూ మామూలుగా కన్నా ఎక్కువ నొప్పెట్టడమే కాకుండా, అంత సేపు తడిసిన బట్టలు మోయడం వల్ల జలుబు కూడా చేసింది. ఇంకెప్పుడు పని తగ్గించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కో కూడదని నిశ్చయించు కుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 920,
        "IMAGE": null,
        "NAME": "గాడిద మేటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీంచి కిందికి తోల్తుంటే, ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా, తన దారిని తను వెళ్లాలని నిశ్చయించుకుంది.\r\n\r\nకొండ కింద వున్న ఇల్లు కనిపిస్తోంది.\r\n\r\n“యజమానికి ఏమీ తెలీదు – ఇంత సేపటినుంచి తోల్తున్నాడు కాని ఇంటి వైపుకి కాకుండా ఈ కొండా చుట్టూరా నడుస్తున్నాము. యజమాని యెంత మూర్ఖుడు!” అనుకుంది గాడిద. “ఒక్క గెంతు వేస్తె ఆ కొండ దిగిపోతాము కదా!” అనుకుంది.\r\n\r\nఅంచున నుంచుని దుంక పోతుంటే యజమాని వెనక్కి లాగాడు, కానీ మొండి గాడిద వినే మూడ్ లో లేదు. యజమాని యెంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందరికి లాగింది.\r\n\r\nచివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది. “నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను! పొ! నీ ఖర్మ!” అని తిట్టుకున్నాడు.\r\n\r\nయజమాని వదల గానే గాడిద ఒక గెంతు వేసింది. ఇంకేముంది? కొండ అంచు మీంచి డొల్లుకుంటూ కింద పడి ప్రాణాలు కాలిపోయింది.\r\n\r\nశ్రేయోభిలాషుల మాట వినకుండా, వారి సలహాలను నిరాకరించి, మొండిగా ముందుకు వెళ్ళే వాళ్ళు గమ్యం చేరుకోలేరు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 921,
        "IMAGE": null,
        "NAME": "మొండి గాడిద",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక పక్షుల గుంపు వుండేది. గంతులు వేస్తూ, కిచ కిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడు కలిసి ఎగురుతూ ఉండేవి.\r\n\r\nఒక రోజు అలాగే కలిసి ఎగురుతుంటే, నేల మీద బోలెడన్ని ధాన్యపు గింజలు కనిపించాయి.\r\n\r\nపక్షులంతా ధాన్యం తిందామని నేల దిగంగానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వల వేసి పట్టేశారు.\r\n\r\nపక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వలలోంచి బయట పడలేక పోయాయి.\r\n\r\nపక్షుల రాజు, “ఇలా కాదు! ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు. అందరం కలిసి, వలను మన పక్షి ముక్కులతో పట్టుకుని, ఒకటే సారి రెక్కలు ఆడిద్దాము. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు.” అని ఆదేశించాడు.\r\n\r\nపక్షులంతా ఐకమత్యం తో రాజు చెప్పినట్టు చేసారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయారు.\r\n\r\nమనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండి పోయారు. కాస్సేపటికి తరవడం మొదలెట్టారు కానీ అప్పటికీ పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి.\r\n\r\nపక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గిరికి ఎగురుకుంటూ వెళ్లి, ఎలుకలను సహాయం కోరాయి. ఎలుకలు చక చక వలను పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేసాయి.\r\n\r\nఇలా పక్షులు అన్నీ ప్రాణాపాయ స్థితి లోంచి బయట పడి పది కాలాల పాటు సంతోషంగా వున్నాయి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 922,
        "IMAGE": null,
        "NAME": "పక్షుల ఐక్యత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక పెద్ద చెరువు దెగ్గిర ఒక కొంగ వుండేది. ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి, తింటూ వుండేది. కాని ఆ కొంగ కాల క్రమేణ ముసలిది అయిపోయి, ముందరిలా చేపలు పట్టలేక పోయేది. కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే వుండిపోయే పరిస్థితి వచ్చేసింది.\r\n\r\n“ఇలా అయితే కష్టం, నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను,” అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది.\r\n\r\nచెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది.\r\n\r\nఅదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా వుండే ఒక పీత ఉండేవాడు. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, “ఎందుకు ఇలా వున్నారు?” అని అడిగింది.\r\n\r\n“ఏమి చెప్పమంటావు?” అంది కొంగ. “నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది.”\r\n\r\n“అదేమిటి” అని పీత ఆరాటంగా అడిగాడు.\r\n\r\n“ఈ రోజు చెరువు దెగ్గిర ఒక జ్యోతిష్యుని చూసాను. అయిన ఈ ప్రాంతంలో పన్నిండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండి పోతుంది. మనం అందరం పోతాము. నాకు నా గురించి బెంగ లేదు, నేను ఎలాగా ముసలి దాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చినా వాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖం గా వుంది.” అంది కొంగ.\r\n\r\nపీత వెళ్లి విషయం చాపలుకు చెప్పాడు. చేపలన్నీ ఏడవడం మొదలెట్టాయి, “అయ్యో! ఎలాగా! మనం అందరం చచ్చి పోతామా?”\r\n\r\n“పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు వుంది, కావాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒక్కొక్కటి గా తీసుకుని వెళ్తాను” అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలూ ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి.\r\n\r\nఅలా రోజు కొంగ ఒక చాపను పక్షి ముక్కులో పెట్టుకుని  యెగిరి పోయేది. కానీ వేరే చెరువు దేగ్గిరకి కాదు. కొంత దూరంలో కొన్ని బండల దెగ్గిర ఆగి, చాపను చంపి తినేసేది. సాయంత్రానికి అలిసి పోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది.\r\n\r\nఇలా కొన్ని రొజూ గడిచాయి. ఒక రోజు పీత, “నన్నూ తీసుకుని వెళ్ళవా, నాకు ప్రాణం కాపాడ్కునే అవకాశం వస్తుంది” అని కొంగను ప్రాధేయ పడ్డాడు.\r\n\r\nకొంగ, “రోజు చాపలు తిని బోర్ కొడుతోంది, ఈ రోజు పీతని తినచ్చు” అనుకుని, “దానిదేముంది, ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను” అంది.\r\n\r\nకానీ పీత చాలా పెద్దగా వున్నాడు. కొంగ పక్షిముక్కులో పట్టడు. అందుకే పీత కొంగ వేపుమీద ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ ప్రయాణం మొదలెట్టారు. కొంత సేపటికి పీతకి అసహనం పట్టలేక, “ఇంకా యెంత దూరం?” అని అడిగాడు.\r\n\r\n“మూర్ఖుడా! నిన్ను ఏ చెరువు దేగ్గిరకీ తీసుకుని వెళ్ళటం లేదు! నిన్నూ ఆ చేపల లాగా బండల దేగ్గిరకు తీసుకుని వెళ్లి తినేస్తాను” అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది.\r\n\r\nపీతకి పిచ్చ కోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకుని పీక నొక్కి చంపేసాడు. అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువుకి వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు.\r\n\r\nఇకపై  మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటలలో స్వార్తముందా, అని ఆలోచించాలి, అని చేపలు, పీత నిశ్చయించుకున్నాయి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 923,
        "IMAGE": null,
        "NAME": "గుడ్డి నమ్మకం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.\r\n\r\nఅది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.\r\n\r\n\r\nఅక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.\r\n\r\nఅందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.\r\n\r\n“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.\r\n\r\nఅనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.\r\n\r\nబీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.\r\n\r\nమిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు  చీదరించుకుని, “ఛీ! ఛీ! ధందా చేసుకునే టైం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.\r\n\r\nబీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.\r\n\r\nమిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.\r\n\r\nబీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.\r\n\r\nఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు.\r\n\r\nఅలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.\r\n\r\n“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.\r\n\r\nఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.\r\n\r\nఅతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.\r\n\r\nభోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.\r\n\r\n\r\nఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.\r\n\r\nతిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సఖ్త హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.\r\n\r\nఅక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.\r\n\r\nఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 924,
        "IMAGE": null,
        "NAME": "స్వభావానికి తగ్గట్టు వృత్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 22,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది.\r\n\r\nవెతకగా, వెతకగా, ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి, చిన్న కన్నం ఏర్పడి వుంది – అది కనిపించింది.\r\n\r\n“అమ్మయ్య!” అనుకుని, ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్లి, బోకా బోకా పొత్తులు తినడం మొదలెట్టింది.\r\n\r\nఅంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే వుంది. కొంచం సేపటికి కడుపు ఉబ్బి, బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంక చాలు, బయట పడదాము అని ఎలుక మళ్ళీ కన్నం లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది.\r\n\r\nలోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేక పోయింది. ఎందుకంటే వెళ్ళే డప్పుడు సన్నంగా వుంది. ఇప్పుడు తిని, తిని, కడుపు ఉబ్బి లావయి పోయింది. ఆ కన్నంలో ఇంక పట్టటం లేదు.\r\n\r\n“ఇప్పుడెల?” అని ఖంగారు పడుతూ చాలా ఆలోచించింది.\r\n\r\nఅప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలుని సహాయం అడిగింది.\r\n\r\nకుందేలు, “ఇంకేం చేస్తావు, తిన్నదంతా అరిగి, మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు అదే విధంగా సునాయాసంగా బయటి వస్తావు” అని సలహా ఇచ్చింది.\r\n\r\nఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు వున్నా, తిన కుండా, బాగా ఆకలి వేసి, పొట్ట మళ్ళీ లోపలి వెళ్ళే దాకా ఆగి, ఆ రంద్రంలోంచి బయట పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది.\r\n\r\nఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసారినికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 925,
        "IMAGE": null,
        "NAME": "ఎలుక ఆకలి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 23,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకని కొనుక్కుని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు.\r\n\r\nదారిలో ఒక శూన్యమైన ప్రదేశం. జాగ్రత్తగా వెళ్తుంటే హటాత్తుగా ఒక దొంగ చేతిలో కర్ర పట్టుకుని అడ్డు పడ్డాడు.\r\n\r\nబాటసారిని కర్రతో బెదిరించాడు. దగ్గిరున్న సొమ్ము, నగలూ దోచుకున్నాడు.\r\n\r\nఅది సరిపోక మేకను కూడా ఇచ్చేయ మన్నాడు.\r\n\r\nబాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి, దొంగతో, “బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా?” అని అడిగాడు.\r\n\r\nదొంగ, “ఎందుకు?” అని ఆశ్చర్యంగా అడిగాడు.\r\n\r\nబాటసారి, “నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధ పడుతుంది. కనీసం ఈ కర్ర తీసుకుని వెళ్తే సంత నించి తెచ్చాననుకుని సంతోషిస్తుంది.” అని బదులు చెప్పాడు.\r\n\r\nఅన్నీ తీసుకున్నాను కదా, కర్రదేముంది అనుకుని, దొంగ బాటసారికి తన కర్రను అందించాడు.\r\n\r\nఇంకేముంది. బాటసారి కర్రతో దొంగని ఠపీ ఠపీ ఇటో నాలుగు అటో నాలుగు దెబ్బలు తగిలించి, తన సొమ్ము, నగలు, మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు.\r\n\r\nదెబ్బలు తిన్న దొంగ వీలు దొరకగానే పారి పోయాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 926,
        "IMAGE": null,
        "NAME": "తెలివైన బాటసారి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 24,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు.\r\n\r\nఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్ట పడేవారు, కాని యెంత కష్ట పడ్డా బీదరికం తప్పలేదు.\r\n\r\nఒక రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది.\r\n\r\nఏంతో కాలంగా రాయి లో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి మూడు వరాలు ప్రసాదించింది.\r\n\r\nభార్య రైతుతో, “డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సద్దుకుంటాయి” అంది.\r\n\r\nరైతు, “వద్దు! హటాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళి పోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము” అన్నాడు.\r\n\r\nఅలాగే దేవత వాళ్లకు ఒక్క రోజు గడువు ఇచ్చింది.\r\n\r\nఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళం రైతుతో, “డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే యెంత బాగుండేది!” అని నిట్టూర్పుతో అంది.\r\n\r\nవెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండి పోయాయి.\r\n\r\nరైతు కోపంగా, “అనవసంగా ఒక వరం పాడు చేసావు! ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో!” అని తిట్టాడు.\r\n\r\nవెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరు భయ పడి పోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి.\r\n\r\nఅలా ఆలోచించ కుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు మూడు వరాలనీ వేస్టు చేసుకున్నారు. ఆ తరువాత తల పట్టుకుని బాధ పడితే మట్టుకు ఏమి లాభం!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 927,
        "IMAGE": null,
        "NAME": "మూడు వరాలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 25,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు.\r\n\r\nఒ రోజు రాత్రి పూట ఆ పాలేరుకి దాహం వేసింది. మంచినీళ్ళు తాగుదామని నూతి దెగ్గిరకి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్ళు తోడుదామని తాడుకి బిందె కట్టి, నీళ్ళల్లోకి దింపుతుంటే నీళ్ళల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది.\r\n\r\n“అయ్యో! నూతిలో చంద్రుడు పడిపోయాడు!” అని పాలేరు అనుకున్నాడు. ఎలాగైనా చంద్రుడిని నీళ్ళల్లోంచి తీసి మళ్ళీ ఆకాశం లోకి పంపించాలి అనుకున్నాడు.\r\n\r\nబిందె మళ్ళీ మళ్ళీ నూతిలోకి దింపి నీళ్ళు తీస్తూనే వున్నాడు. కాని చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే వుంది, బైటికి రావటం లేదు.\r\n\r\nచివరికి ఇన్ని సార్లు తాడుని కిందకి పైకి లాగడంతో తాడు ఠప్పు మని తెగి బిందె నీళ్ళల్లో పడి పోయింది. ఒకటే సారి తాడు తెగడంతో పాలేరుకూడా వెనక్కి పడ్డాడు.\r\n\r\nవెన్నుమీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది. పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది.\r\n\r\nపాలేరు తనే కష్టపడి నూతిలోంచి నెలవంకని మళ్ళీ ఆకాశం లోకి చేర్చాడని చాలా సంతోష పడ్డాడు!\r\n\r\nఆ తరువాత ఆ పాలేరు చాలా మందికి ఈ విషయం చెప్పాడు. కానీ అందరు “వెర్రి పాలేరు!” అనుకుని నవ్వి ఊరుకున్నారు. ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 928,
        "IMAGE": null,
        "NAME": "నూతిలో నెలవంక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 26,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజుగారు యుద్ధం అయిపోయాకా తన సైన్యంతో తిరిగి రాజధానికి వెళ్తుంటే, తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, భోజన సామగ్రి అయిపోయాయి.\r\n\r\nమొదలే యుద్ధంలో అలిసి పోయిన సైనికులు ఆకలి తట్టుకునే పరిస్థితిలో లేరు.\r\n\r\nరాజుగారు ఈ విషయం గ్రహించి కొంత మంది భటులను దెగ్గిర ఉన్న ఊళ్లోకి వెళ్లి, ఏదైనా పొలం లోంచి ధాన్యం, కూరలు తీసుకు రమ్మని ఆదేశించారు.\r\n\r\nభటులకు విషయం సగం అర్ధమైంది, సగం అర్ధం కాలేదు. రాజు గారు ధాన్యం, కూరలూ బలవంతంగా తీసుకో మన్నారని భటులు అపోహ పడ్డారు. అప్పటి దాకా యుద్ధం చేసి వచ్చిన వారికి అంత కన్నా ఏమి తోచుతుంది!\r\n\r\nఊళ్లోకి వెళ్లి కనిపించిన మొదటి రైతుని “ఈ ఊళ్ళో అన్నిటి కన్నా మంచి పొలం యేది?” అని అడిగారు. ఆ రైతు వాళ్ళను తీసుకుని వెళ్లి ఒక మంచి పొలం చూపించాడు. పొలం పెద్దగా వుంది. వరి, కూరలు, పళ్ళ చెట్లు, కొబ్బరకాయలు, అన్నీ వున్నాయి.\r\n\r\nవెంటనే భటులు పొలంలోని ధాన్యం పంటకోత మొదలెట్టారు. చూసి హడిలి పోయిన రైతు “ఇక్కడ వద్దు! ఇక్కడ వద్దు! నేను వేరే చోటు చూపిస్తాను!” అన్నాడు.\r\n\r\nభటులను మరో పొలం లోకి తీసుకుని వెళ్ళాడు. ఈ పొలం అంత పెద్దగా లేదు కాని ఇందులోనూ భటుల అవసరానికి తగ్గవి అన్నీ వున్నాయి.\r\n\r\nభటులు కావాల్సిన వన్నీ తీసుకుని, ఆ రైతుని “ఈ పొలంలోకి ఎందుకు తీసుకుని వచ్చావు?” అని అడిగారు.\r\n\r\nరైతు, “మీకు ముందు చూపించిన పొలం నాది కాదు, వేరే వారిది. నా మూలంగా వారికి నష్టం రావడం నాకు ఇష్టం లేదు. ఈ పొలం నాది. ఇందులోంచి మీకు ఏదైనా ఇచ్చే హక్కు నాకు వుంది” అని సమాధానం చెప్పాడు.\r\n\r\nరైతు మంచితనం భటులను ఆకట్టుకుంది. ఈ విషయం రాజుగారికి కూడా చెప్పారు.\r\n\r\nరాజు గారు “భటులను ఆదేశించినప్పుడు కొంచం వివరంగా చెప్పాల్సింది,” అనుకున్నారు.\r\n\r\nఆ రైతుని పిలిపించి, అతని మంచితనాన్ని మెచ్చుకుని, నష్ట పరిహారం చెల్లించి, పైన మంచి బహుమానం కూడా ఇచ్చి సత్కరించారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 929,
        "IMAGE": null,
        "NAME": "రైతు మంచితనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 27,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక రోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చుని బాగా బోర్ అయిపొయింది. చేయడానికి ఏమి పని లేదు.\r\n\r\nకొంచం సేపు కొమ్మలు పట్టుకుని ఊగింది, చెట్టుమీద వెళ్ళాడింది; అరిటి పండు తిన్నది; చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది, ఇలా రక రకాలగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాని అలాగే రెస్ట్ లెస్ గా వుంది.\r\n\r\nఇంతట్లో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరిని ఫాలో చేసింది.\r\n\r\nవారిద్దరూ ఒక చెరువు గట్టు కి వెళ్ళి, చేపలు పట్టడానికి వల వేసారు. కొన్ని నిమిషాలలోనే చాలా చేపలు పట్టారు. చేపలను వలలోంచి తీసి, కడిగి, శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు. ఇంతలో భోజనం సమయమైంది. ఇద్దరు లంచ్ తినడానికి వెళ్ళారు. మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో వల అక్కడే వదిలేసారు.\r\n\r\nఇదంతా చాలా కుతూహలంగా చూస్తున్న కోతి, “ఓస్! చేపలు పట్టడం ఇంత సులువా?” అనుకుంది.\r\n\r\nనేలమీద పడున్న వల తీసి నీళ్ళల్లోకి వేయ బోయింది. కాని అది కనిపించినంత సులువు కాదు. చేపలు పట్టే వాళ్ళు సమత్సరాల తరపడి కృషి చేస్తే వచ్చే విద్య. ఇలా చూసి, అలా చేసేసేది కాదు కదా!\r\n\r\nవల వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వలలో తానే చిక్కుకుంది. అందులోంచి బయట పడాలని చిందులేస్తుంటే డుబుక్కు మని చెరువులో పడిపోయింది!\r\n\r\nకాళ్ళూ చేతులూ వలలో చిక్కుకు పోయాయి, ఈదడం రాదు, కోతి గోల గోల పెట్టేసింది. ఇది విన్న చేపల వాళ్ళు ఏమి జరుగుతోందా అని చూడడానికి వచ్చారు.\r\n\r\nకోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీళ్ళలోంచి లాగి వలలోంచి విడిపించారు.\r\n\r\nఎవ్వరి పని వారే చేస్తే మంచిదని తెలుసుకుని, కోతి తల వంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.\r\n\r\nఆ రోజు తరువాత యెంత బోర్ కొట్టిన చేపలు పట్టాలని మట్టుక్కు అనుకోలేదు!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 930,
        "IMAGE": null,
        "NAME": "వల వేసిన కోతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 28,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితేకాని పొరుగూరికి చేర లేరు. అడవిలో రక రకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు.\r\n\r\nఅనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగూరికి బయలుద్యారారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే, హటాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది.\r\n\r\nవెంటనే ఇద్దరూ భయ పడిపోయారు.\r\n\r\n“ఏం చేద్దాం?” అనుకున్నారు.\r\n\r\nమొదటివాడు “చెట్టు ఎక్కేద్దాము,” అని సలహా ఇచ్చాడు.\r\n\r\n“కాని నాకు ఎక్కడం రాదే!” అని రెండో వాడు అన్నాడు.\r\n\r\n“నాకు వచ్చు కదా” అని మొదటి వాడు చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు.\r\n\r\nరెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? మొదటి వాడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు!\r\n\r\nవెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుక్కున్నాడు. చడి చప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు.\r\n\r\nఎలుగుబంటి దగ్గిరకి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకుని అలాగే స్థిరంగా వున్నాడు. ఎలుగుబంటి చని పోయిన జీవులని తినదు. అలా కదలకుండా పడివున్న రెండో వాడు చనిపోయాడనుకుంది. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసి కొంత సేపటికి వదిలి వెళ్ళిపోయింది.\r\n\r\nఎలుగుబంటి వెళ్ళిపోయాక రెండో వాడికి ఉపశమనం కలిగింది. హమ్మయ్య! అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు.\r\n\r\nమొదటి వాడు చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటి వాడు అపోహ పడ్డాడు.\r\n\r\n“ఎలుగుబంటి నీకు అంత సేపు చెవిలో ఏమి చెప్పింది” అని అడిగాడు.\r\n\r\n“అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు, అని నాతొ ఎలుగుబంటి చెప్పింది” అని రెండో వాడు జవాబు చెప్పాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 931,
        "IMAGE": null,
        "NAME": "ఎలుగుబంటి చెప్పిన రహస్యం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 29,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను అన్ని ఊళ్లూ తిరుగుతూ, అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు.\r\n\r\nఒక రోజు అలాగే వ్యాపార పరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది. మండుతున్న సూర్యుడు, భగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి.\r\n\r\nదారిలో ఒక చెట్టు నీడలో ఆగి, తెచ్చుకున్న భోజనం తిని, మంచినీళ్ళు తాగి, తన టోపీల బస్తా పక్కన పెట్టుకుని, చెట్టు నీడ లో హాయిగా నిద్రపోయాడు.\r\n\r\nకొంచం సేపటికి లేచి చూస్తే బస్తా లో ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేసారు. ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఊరికే ఉన్నాయా? ఒకొక్క కోతి తల మీదా ఒకొక్క టోపీ వుంది.\r\n\r\nఓహో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను “నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి” అని కోతులతో అన్నాడు.\r\n\r\nఅవి మాట వినే రకమా? గమ్మున కూర్చున్నాయి.\r\n\r\nకోపంగా అతను అరిచాడు.\r\n\r\nఅవీ తిరిగి అరిచాయి.\r\n\r\nచప్పట్లు కొట్టాడు.\r\n\r\nఅవీ కొట్టాయి.\r\n\r\nఒక రాయి విసిరాడు.\r\n\r\nకోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి.\r\n\r\nకొడతానని బెదిరించాడు.\r\n\r\nకోతులు నవ్వాయి.\r\n\r\nచివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి, ఇంకో చేత్తో తల గోక్కున్నాడు.\r\n\r\nకోతులూ అలాగే చేసాయి.\r\n\r\nఠప్పున ఐడియా వచ్చి, తన చేతిలో వున్న టోపీ నేల మీదకి విసిరే సాడు.\r\n\r\nవెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న తోపీలను నేల మీదకు విసిరేశాయి.\r\n\r\nటోపీలు అమ్ముకునే అతను గబ గబా ఆ టోపీలన్నీ మళ్ళి బస్తాలో వేసేసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 932,
        "IMAGE": null,
        "NAME": "కోతుల టోపీలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 30,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీదా అమ్మవలసిన సరుకులు వేసుకుని పోరుగూరిలోని సంతకి బయలుద్యారాడు.\r\n\r\nదారి సరిగ్గా లేదు. చాలా గోతులు, గుంటలు వున్నాయి. వాన మూలంగా వాటిల్లో నీళ్ళు నిలిచి పోయాయి. జాగ్రత్త గా, నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు. అందు మూలంగా అనుకున్నంత వేగంగా వెళ్ళలేక పోతున్నారు. ఇలా ఆలస్యం అయితే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకక పోవచ్చని, సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా వున్నాడు.\r\n\r\nఉన్న కష్టాలు సరిపోవు అన్నట్టు హటాత్తుగా బండికున్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కు పోయింది.\r\n\r\nవ్యాపారస్తుడు ఎద్దులని ముందుకు నెట్టిన కొద్ది చక్రం ఇంకా ఇంకా కూరుకుపోతోంది. ఉన్న సమయం తక్కువ. మధ్యలో ఈ గొడవ.\r\n\r\nవ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుడిని ప్రార్థించాడు.\r\n“దేవుడా! ఎలాగైనా ఈ ఆపాద నుంచి కాపాడు తండ్రి!” అని మొక్కుకున్నాడు.\r\n\r\nదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ప్రతి చిన్న దానికి నన్ను తలుచు కోవడం ఎందుకు? నువ్వు బండి మీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తోయ్యండి, మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి.” అని సలహా ఇచ్చి అదృశ్యం అయిపోయాడు.\r\n\r\nపనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోసాడు. వ్యాపారస్తుడు అదే సమయాన్న యెద్దులను ముందుకు నెట్టాడు. చక్రం గుంటలోంచి బయట పడి బండి మళ్ళీ కదలడం మొదలెట్టింది.\r\n\r\nఅలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకీ వెళ్ళాడు, సరుకు అమ్ముకున్నాడు, లాభాలూ సంపాదించుకున్నాడు.\r\n\r\nసమస్య వచ్చినప్పుడల్లా “దేవుడా! కాపాడు!” అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆ పై భగవంతుడు ఎలాగా అడగ కుండానే సహాయం చేస్తాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 933,
        "IMAGE": null,
        "NAME": "దేవుడా! కాపాడు!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 31,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవేరో దొంగ రోజు దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్ట పడే వారు.\r\n\r\nగుమ్మడికాయ దొంగ ఊళ్లోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దెగ్గరకు వెళ్ళారు.\r\n\r\nపెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మోర విని, “ఓస్! ఇంతేనా! గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది” అన్నాడు.\r\n\r\nఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.\r\n\r\nపెద్దాయన వెంటనే ఇది గమనించి, “దొంగ ఇతనే!” అని అందరికి చెప్పారు. “మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము” అని వివరించారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 934,
        "IMAGE": null,
        "NAME": "గుమ్మడికాయ దొంగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 32,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక తండ్రికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఆ ఏడుగురూ ఎప్పుడూ దెబ్బలాడు కుంటూనే ఉండేవారు.\r\n\r\nతండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూసాడు. కొడుకులకు సద్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి – అన్నీ చేసాడు – కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆప లేదు.\r\n\r\nఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధ పడ్డాడు.\r\n\r\nకొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. ఏడుగురూ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయ్యారు చేసారు.\r\n\r\nతండ్రి ఒకొక్క కొడుకునీ ముందుకి పిలిచి ఆ కట్టని విరక్కోట్టమని ఆదేశించాడు. వంతులు వంతులు గా ఏడుగురూ ఆ కట్టను విరక్కోట్టడానికి ప్రయత్నం చేసారు, కానీ విరక్కొట్ట లేక పోయారు.\r\n\r\nఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేసాక, ఎవరి కర్రను వాళ్ళు విరక్కొట్ట మన్నాడు. కొడుకులు సునాయాసంగా విరక్కోట్టేసారు.\r\n\r\nఅప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు: “మీరందరూ ఈ కట్టలా కలిసి వుంటే మీరు బలంగా వుంటారు – మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ విడి విడిగా ఈ కర్రలలా వుంటే మట్టుకు మీకు యే బలము వుండదు.”",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 935,
        "IMAGE": null,
        "NAME": "కర్రల కట్ట",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 33,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక చెరువులో రెండు కొంగలు, ఒక తాబేలు ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు పడక పోవడం వల్ల చెరువులోని నీళ్ళు ఎండి పోయాయి.\r\n\r\nకొంగలు రెండూ ఒక రోజు ఎగురుతుంటే ఒక కొత్త చెరువుని చూసాయి. అందులో నీళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టూరా పచ్చగా వుంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు, అలా నీళ్ళల్లో వుండే వేరే జీవులు వున్నాయి.\r\n\r\nకొంగలు వుండే పాత చెరువు నుంచి పెట్టీ, బేడా సద్దుకుని, కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఈ విషయం చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వింది.\r\n\r\n“మీ తో పాటు నన్నూ తీసుకుని వెళ్ళండి, నేను ఒక్కర్తిని ఇక్కడ ఉండలేను.” అని బ్రతిమాలింది.\r\n\r\nకొంగలు జాలి పడి తాబేలుని తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నాయి. కాని ఎలా? తాబేలు ఎగర లేదు. అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళ లేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా. పోనీ మోసుకుని తీసుకెళ్ళి పోదామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు.\r\n\r\nచివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలు ఒక కర్రను నోట్లో గట్టిగా పట్టుకుంటే, ఆ కర్రను తలోవైపు కొంగలో పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు. తాబేలుకి చాలా ఉత్తేజం కలిగింది.\r\n\r\n“ఎట్టి పరిస్థితిలోను నువ్వు నోరు తెరవకూడదు, గట్టిగా నోటితో కర్రని పట్టుకునే వుండాలి!” అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది.\r\n\r\nమొన్నాడు తెల్లారగానే అనుకున్న ప్రకారం కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి. తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది. కాని కొంచం సేపు ఎగిరాకా కింద భూమి మీద కొంత మంది పిల్లలు కనిపించారు.\r\n\r\nపిల్లలు ఈ దృశ్యాన్ని చూసి, ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని నోరు తెరిచింది.\r\n\r\nఇంకేముంది. ధమ్మన కింద పడిపోయింది. దాని గుల్ల పగిలిపోయి పాపం ప్రాణాలు కోలిపోయింది.\r\n\r\nమనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటి వారు, మన మంచికి ఏదైనా చెప్తే, అది మనం పరిగణలోకి తీసుకుని, సమయానుకూలంగా అనుసరించాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 936,
        "IMAGE": null,
        "NAME": "కొంగలు, తాబేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 34,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దెగ్గిర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు.\r\n\r\nఇంట్లో ఖిడికి లోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని ఖిడికి లోపలకి తొంగి చూసింది.\r\n\r\nఅక్కడ పాపని తల్లి ఎత్తుకుని, భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు. చివరికి కొంచం విసుక్కుంటూ, “ఊరుకో పాపా, ఊరుకో – లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటుందే, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను! అది నిన్ను తినేస్తుంది!” అని తల్లి పాపని మందలించింది.\r\n\r\nఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంత సేపు ఖిడికి బైట కూర్చుని ఎదురు చూస్తూనే వుంది.\r\n\r\nకొంత సేపటికి పాప ఇంకా ఏడుపు ఆపక పొతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, “ఊరుకో పాప, ఊరుకో. తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను” అని బుజ్జగించడం మొదలెట్టింది.\r\n\r\nఈ మాట విన్న తోడేలు హడిలి పోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. పరుగో పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది.\r\n\r\nమనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 937,
        "IMAGE": null,
        "NAME": "విన్నవన్నీ నిజం కాదు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 35,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక మగ జింక చెరువులో నీళ్ళు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడై పోయాడు.\r\n\r\nనా కొమ్ములు యెంత అందంగా వున్నాయి, నా తలపై కిరీటంలా వున్నాయి, అనుకుంటూ చాలా సేపు చూసుకున్నాడు.\r\n\r\nచివరికి కాళ్ళు కూడా ప్రతిబింబం లో కనిపించాయి.\r\n\r\n“ఛీ! ఇంత అందంగా వున్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు!” అని తన కాళ్ళను తనే అసహ్యించుకున్నాడు.\r\n\r\nకొంత సేపు అయ్యాక చెరువు దేగ్గిరకి నీళ్ళు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది.\r\n\r\nభయంతో పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోయాడు.\r\n\r\nఅప్పుడు ఆ మగ జింకకి అర్ధం అయ్యింది. అందంగా వున్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని.\r\n\r\nమనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 938,
        "IMAGE": null,
        "NAME": "జింక కొమ్ములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 36,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.\r\n\r\nఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.\r\n\r\nచూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.\r\n\r\nఅలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.\r\n\r\nమధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.\r\n\r\nక్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.\r\n\r\nఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.\r\n\r\nఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 939,
        "IMAGE": null,
        "NAME": "కొంగ కోరికలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 37,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రెండు మేకలు, ఎవరి దారిన వారు వెళ్తూ ఒక కాలవకు ఇరువైపూ చేరాయి.\r\n\r\nకాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అందులో చాలా రాళ్ళూ, రప్పలు వున్నాయి. అందులోంచి ఈదుకుంటూ అవతల వడ్డుకి చేరడం కష్టం.\r\n\r\nకాలవపై ఎవరో మనుషులు ఒక చక్క ముక్క అడ్డంగా వేసారు. అదే ఆ కాలవపై వంతెన అన్న మాట. వంతెన సన్నంగా, ఇరుకుగా వుంది. ఒక సమయంలో ఒక మేక దాట డానికే స్థానం వుంది. రెండు ఉడతలు కూడా ఒకటిని ఒకటి దాటలేక జారిపోతాయేమో అని భయం వేసే అంత సన్నంగా వుంది.\r\n\r\nరెండు మేకలూ ఒకటే సారి వంతెన మీదకి అడుగు పెట్టాయి. ఒకరిని ఒకరు చూసుకున్నాయి కాని, అహంభావంతో దేనికి వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి.\r\n\r\nముందు నేను ఎక్కాను, నువ్వు వెనక్కి వెళ్ళూ, అంటే ముందు నేను ఎక్కాను నువ్వే వెనక్కి వెళ్ళూ అంటూ రెండూ ఘర్షణ పడ్డాయి.\r\n\r\nకొట్టుకోవడం మొదలెట్టాయి.\r\n\r\nఇంకేముంది. రెండూ కాలవలో పడి కొట్టుకు పోయాయి.\r\n\r\nఒక్కొక్క సారి మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే మనకు మంచిది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 940,
        "IMAGE": null,
        "NAME": "అహంభావి మేకలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 38,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక అడవిలో రెండు గొర్రెపోతులు ఏదో కారణంగా కొట్టుకుంటున్నాయి. ఆ కారణం ఏమిటో ఎవ్వరికీ తెలీదు.\r\n\r\nఒకరిని ఒకరు కొమ్ములతో కుమ్ముతున్నాయి. చాలా తీవ్రంగా పోట్లాడుకుంటున్న గొర్రెపోతులకు బాగా దెబ్బలు తగిలాయి. గాయాలలోంచి రక్తం కారడం మొదలైంది. రక్తపు చుక్కలు నేలమీదకి కారుతున్నా పట్టించుకోకుండా గొర్రెపోతులు దెబ్బలాడుతూనే వున్నాయి.\r\n\r\nఇంతలో అటువైపు ఒక గుంటనక్క వచ్చింది. రక్తం వాసన తగిలి విషయం చూద్దామని ఆగింది. దెబ్బలాడుతున్న గొర్రెపోతులు, కారుతున్న రక్తం చూసింది. నేల మీద పడ్డ రక్తం నాకడం మొదలెట్టింది.\r\n\r\nనాకుతూ, నాకుతూ, చూసుకో కుండా గొర్రెపోతుల మధ్యలో తల పెట్టింది.\r\n\r\nగొర్రెపోతులూ చూసుకోలేదు. వాటి గొడవలో అవి నిమగ్నమై కొమ్ములతో గుంట నక్కని కుమ్మేసాయి. ఇంకేముంది? గుంట నక్కకి బాగా గాయాలు  తగిలాయి. ఎలాగో గొర్రెపోతుల మధ్యలోంచి బైట పడి,  ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి పారిపోయింది.\r\n\r\nఇద్దరు దెబ్బలాడు కుంటుంటే ఏదో మనకి లాభం ఉంటుందేమో అని మధ్యలో మూడో వాళ్ళు తల దూర్చడం అవివేకమే కదా! అదే గుంటనక్కకి గుణపాఠం!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 941,
        "IMAGE": null,
        "NAME": "గుంటనక్కకు గుణపాఠం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 39,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఇద్దరు మిత్రుల ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వుంది. ఉక్క పోస్తోంది. ఇద్దరు మిట మధ్యాన్నం ఎండలో బాగా అలిసిపోయారు.\r\n\r\nకొంత సేపు అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు.\r\n\r\nదారిలో ఒక సికామోర చెట్టు (అశ్వత్ధ వృక్షము) కనిపించింది. ఆ చెట్టు విశాలంగా వుంది. పెద్ద పెద్ద శాఖలు, వాటికి ఒత్తుగా ఆకులు, ఆ చేట్టుకింద మంచి నీడ. ఎండ లోంచి ఆ చెట్టు నీడలోకి రాగాని హాయిగా, చల్లగా, ప్రశాంతంగా అనిపించింది.\r\n\r\nఇద్దరు మిత్రులు చెట్టుకింద ఒక దుప్పటి వేసుకుని వారితో తెచ్చుకున్న భోజనం తిని, కాస్సేపు హాయిగా కునుకు పాట్లు పట్టారు. సాయంత్రానికి కొంచం ఎండ తగ్గి చల్లారాక, వారి దారిని బయలుద్యారుతూ, “ఈ చెట్టుకి అస్సలు పూలు కాని, పళ్ళు కాని ఏమి లేవు. అసలు ఇలాంటి చెట్టు దేనికి పనికొస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోయారు.\r\n\r\nఇది విన్న చెట్టు బాధ పడింది. ఇంత సేపు ఆశ్రయము, నీడని ఇచ్చి, తన ఆకులతో గాలి అందించినా ఆ ఇద్దరికీ కృతజ్ఞత లేదు అనుకుంది చెట్టు.\r\n\r\nమనకి మేలు చేసిన వారిని మెచ్చుకో గలగడం కూడా ఒక గుణం. అది అందరిలో వుండదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 942,
        "IMAGE": null,
        "NAME": "సికమోర చెట్టు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 40,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక జమిందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు.\r\n\r\nఆ రైతు మన్నాడు నూతిలోంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే జమిందారు ఆపేసాడు. “నేను నీకు నుయ్యి అమ్మాను కానీ, అందులోని నీళ్ళు అమ్మలేదు, అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్ళు తోడుకో!” అన్నాడు.\r\n\r\nరైతుకి జమిందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమిందారుకి, రైతుకి గొడవ మొదలైంది.\r\n\r\nమధ్యవర్తిగా బీర్బాల్ ని సమాధానం చెప్పమన్నారు.\r\n\r\nబీర్బల్ కొంచం సేపు ఆలోచించి, జమిందారు తో ఇలా అన్నాడు, “సరే, నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాము. కాని అలా అయితే నీకు నూతిలో నీళ్ళు పెట్టుకునే అరహత లేదు. నీ నీళ్లన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చోకో. లేదా, రైతుకి నువ్వే నూతిలో నీళ్ళు పెట్టుకుంటున్నందుకు అద్దె ఇవ్వాలి.” ఇలా బీర్బల్ తీర్మానం ఇచ్చాడు.\r\n\r\nబీర్బల్ తెలివి తేటల మూలంగా తన దగా విఫలం అయ్యిందని జమీందారు కి అర్ధం అయ్యింది. గొడవ మానేసి నూతిలోని నీళ్ళు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 943,
        "IMAGE": null,
        "NAME": "నూతిలోని నీళ్ళు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 41,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఎద్దు మైదానంలో గడ్డి మేస్తోంది. పచ్చని గడ్డి తింటూ, తన పని తను చేసుకుంటూ, యే ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా వుంది.\r\n\r\nఇలా హాయిగా వున్న ఎద్దు చుట్టూ కాస్సేపటికి ఒక ఈగ ముసరడం మొదలెట్టింది. ఎద్దు కొమ్ములపై వాలింది.\r\n\r\nకొంతసేపటికి అలసట తీరాక ఈగ తన దారిని తను వెళ్తూ ఎద్దుతో, “ఇప్పుడు నేను బయలుద్యారుతున్నాను, నీ మీద వాలి అలసట తీర్చుకో నిచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు హాయిగా ఉందేమో” అంది.\r\n\r\nఎద్దు ఆశ్చర్యంగా ఈగవైపు చూస్తూ “అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే నాకు తెలీదు” అంది.\r\n\r\nకొంతమంది వాళ్ళని వాళ్ళే చాలా గొప్ప అనుకుంటారు. కాని ఇతర్ల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాముఖ్యత వుండదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 944,
        "IMAGE": null,
        "NAME": "ఎద్దు కొమ్ముపై ఈగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 42,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబా గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది.\r\n\r\nనొప్పి తో విలవిలలాడి పోయింది. గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించ లేము. అలాగే తోడేలు కూడా ఆ ఎముకను మింగలేక, కక్క లేక, బాగా బాధ పడింది.\r\n\r\nకొంగను వెతుక్కుంటూ వెళ్ళింది. “నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది. అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను” అని ప్రమాణం చేసింది.\r\n\r\nకొంగ బహుమానం మాట విని, ఆశ పడి, తన తల తోడేలు నోట్లో పెట్టి, పొడుగు పక్షి ముక్కుతో ఎముకని బైటికి లాగింది.\r\n\r\nఎముక బైట పడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలెట్టింది.\r\n\r\nకొంగ తోడేలుని పిలిచి, “మరి నా బహుమానం యేది?” అని అడిగింది.\r\n\r\n“నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కోరికేయకుండా నిన్ను మళ్ళి బయటికి తీసుకోనిచ్చాను. అదే నీ బహుమానం.” అని తోడేలు తుర్రుమంది.\r\n\r\nదుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత వుండదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 945,
        "IMAGE": null,
        "NAME": "తుర్రుమన్న తోడేలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 43,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక నక్క తన దారిన పోతూ ఒ తీగపై గుత్తులు గుత్తులగా నిగ నిగాలాడుతున్న ద్రాక్షపళ్ళు చూసింది.\r\n\r\nవాటిని చూడగానే నక్కకి నోరు ఊరింది. సరదాగా కొన్ని తినదామని అనుకుంది. ద్రాక్షపళ్ళు అందుకుందామని చేతులు జాపింది, కాని గుత్తులున్న తీగ చాలా ఎత్తుగా వుంది. ద్రాక్షపళ్ళు అందలేదు.\r\n\r\nఒక్క సారిగా ఎత్తుగా గెంతి చూసింది. ఐనా అందలేదు. కొంచం దూరం నుంచి పరిగెత్తుకుంటూ దుంకి చూసింది. ఐనా అందలేదు.\r\n\r\nఇలా చాలా సేపు రకరకాలగా ప్రయత్నించింది. ఎన్ని విధాలగా చూసినా ద్రాక్ష పళ్ళు అందలేదు.\r\n\r\nఅలిసి పోయి నిరాశ తో నక్క, “ఏముంది ద్రాక్షల్లో? ఎలాగా పుల్లగా ఉండుంటాయి. అందుకే చెట్టుకి ఇంకా వేళ్ళాడుతున్నాయి” అనుకుంటూ వెళ్ళిపోయింది.\r\n\r\nకొంత మందికి ఏమైనా దొరకకపోతే దాని గురించి అలుసుగా మాట్లాడడం అలవాటు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 946,
        "IMAGE": null,
        "NAME": "పుల్లని ద్రాక్షపళ్ళు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 44,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో సాహు, శీను, అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని రెండు భాగాలగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి, మధ్యాన్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటి పడక్కరలేదు.\r\n\r\nఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుదేసలో ఒక అవ్వ, ఆవిడ మనవరాలు ఉండే వారు. మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ – అంత డబ్బు పాపం అవ్వ దెగ్గిర లేదు.\r\n\r\n“నా దెగ్గిర ఒక పాత పళ్ళం ఉంది, డానికి మసి పట్టుకుంది, కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా?” అని అవ్వ సాహుని అడిగింది.\r\n\r\nసాహు పళ్ళం తీసుకుని చూసాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం! చాలా విలువైనది. సాహుకి దురాశ కలిగింది. “ఈ పళ్ళమా! ఇది దేనికి పనికొస్తుంది! పూర్తిగా మసి పట్టుకు పోయింది! దీనికి గాజులు రావు కాని, కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో!” అన్నాడు.\r\n\r\nఅవ్వ పాపం పళ్ళం తీసుకుని వెళ్లి పోయింది. సాహు మళ్ళీ మొన్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోక పొతే ఇంకొంచం ధర పెంచి తీసుకోవచ్చు, అనుకుని వెళ్ళిపోయాడు.\r\n\r\nఒప్పందం ప్రకారం మధ్యాన్నం అటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళం తీసుకుని గాజులివ్వమని అడిగింది. శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళం అని తెలుసుకున్నాడు. కానీ శీను మంచి వాడు. వెంటనే అవ్వతో, “ఇది బంగారు పళ్ళం అమ్మా! ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దేగ్గిరా లేదు. కాని మన సామంత రాజు దేగ్గిరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దెగ్గిర గాజులు కొనుక్కుని, మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు, నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు”, అని చెప్పాడు.\r\n\r\nఅవ్వ ఒప్పుకుంది.\r\n\r\nవిషయమంతా సామంత రాజుకి చెప్పారు. సామంత రాజు అవ్వ దెగ్గిర పళ్ళం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శీను నిజాయితిని మెచ్చుకుని, కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు.\r\n\r\nఇక సాహు సంగేంటంటే, ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి, అతని దెగ్గిర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్ట పడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేస్సాడు కాని కిట్టుబాటు కా లేదు. వ్యాపారం లో నష్టము వచ్చి, మరే ఉద్యోగమూ దొరకక, ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది.\r\n\r\nఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగు పడరు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 947,
        "IMAGE": null,
        "NAME": "బంగారు పళ్ళం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 45,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టిన ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటి లో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేది కాదు.\r\n\r\nఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు, వారి భట్లతో డేరా వేసారూ.\r\n\r\nమగ కాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ రాజకుమార్తె, తన చెలికర్తలు, నది వొడ్డున బట్టలు, నగలు పెట్టుకుని స్నానం చేస్తూ కనిపించారు.\r\n\r\nఅది చూసి కాకికి తన బద్ధ శత్రువైన పాము ని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకుని ఎగిరి పోయింది. అది గమనించిన భట్లు తమ ఆయుధాలతో వెంట పడ్డారు.\r\n\r\nకాకి ఎగురు కుంటూ తన గూటికి చేరి, చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది.\r\n\r\nహడావిడి ఏంటా అని చూడ డానికి పాము బయటికి వచ్చింది.\r\n\r\nవెంట పడ్డ భటులు కింద పడున్న గొలుసు తెస్సుకోవడానికి వెళ్లి నప్పుడు ఆ పాము కనిపించింది.\r\n\r\nపాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు పాముని చంపేశారు. గొలుసు తీసుకుని రాజకుమార్తె కి తిరిగి ఇచ్చేసారు.\r\n\r\nఆ తరువాత కాకి జంట హాయిగా ఉన్నారు.\r\n\r\nబలం కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలని కూడా చిన్న ఉపాయంతో తొలిగించవచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 948,
        "IMAGE": null,
        "NAME": "పెద్ద అపాయం, చిన్న ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 46,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ సంతోషంగా ఒప్పుకుంది.\r\n\r\nసాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలు పెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికి పిలిచింది కాని కొంగ ఎక్కువ తినేస్తుందేమో అని భయం. అందుకనే ఒక ప్లాన్ వేసింది.\r\n\r\nనిర్దారించుకున్న సమయానికి కొంగ తలుపు తట్టింది. నక్క ఇంట్లోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. కొంగకు నోరూరింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు.\r\n\r\nనక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళాలలో తీసుకుని వచ్చింది. పళ్ళం అలా ఫ్లాట్ గా వుంటే కొంగ పక్షిముక్కుతో ఎక్కువ తినలేక పోయింది. పాపం ఏదో కష్ట పడుతూ కొంచం కొంచం తినగలిగింది. నక్క మట్టుకు పళ్ళం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది. కొంగ ఆకలితోనే ఇంటికి వెళ్లి పోయింది.\r\n\r\nకొద్ది రోజులు గడిచాయి.\r\n\r\nఈ సారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నక్క వస్తానని మాట ఇచ్చింది.\r\n\r\nఅనుకున్న సమయానికి నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఇల్లు వంట సువాసనలతో ఘుమ ఘుమలాడి పోతోంది. కొంగ డిన్నర్ కి సూప్ చేసింది. చేసిన సూప్ని రెండు కూజాలలో తీసుకుని వచ్చింది. కూజా మెడ పొడూగ్గా వుంటుంది కదా? అందులోని సూప్ నక్క ఎలా తింటుంది. తిన లేక పోయింది. కాని కొంగ మట్టుకు పక్షిముక్కు కూజలోకి ముంచుకుని హాయిగా సూప్ అంతా లాగించేసింది. అలా ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.\r\n\r\nమనం ఇతర్లతో ఎలా ఉంటామో, వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 949,
        "IMAGE": null,
        "NAME": "నక్క ఆహ్వానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 47,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దెగ్గిరకు   తీసుకుని వెళ్ళారు.\r\n\r\nన్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకో మన్నాడు – ఒకటే సారి దొంగలించిన ఉల్లిప్పాయలన్నీ తినడమా; వంద కొరడా దెబ్బలు భరించడమా, జురుమానా చెల్లించడమా?\r\n\r\nఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించ కుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు.\r\n\r\nఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి గా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కు లోంచి నీళ్ళు కారడం మొదలైంది. ఐనా మొండి గా ఇంకో రెండు తిన్నాడు, కాని ఇక వీలు కాలేదు.\r\n\r\nసరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు. కొరడా దేబ్బాలంటే మాటలా? నొప్పి తట్టుకో లేక పోయాడు.\r\n\r\nబాబోయి! బాబోయి! జరిమానా కట్టేస్తాను, ఆపండి! అని ఏడుపు మొదలెట్టాడు.\r\n\r\nఏడుస్తూనే జరిమానా చెల్లించాడు.\r\n\r\nఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్ధం అయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని, వేరే టప్పుడు పనులు కాని చేయలేదు.\r\n\r\nకొంత మంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి, ప్రత్యామ్నాలు పరిశీలించాలీ. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 950,
        "IMAGE": null,
        "NAME": "ఉల్లిపాయి దొంగ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 48,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది.\r\n\r\nచెట్టు మీద కోతిని అడిగింది, “కోతి, కోతి, నాతొ స్నేహం చేయవా?”\r\n\r\n“నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడ లేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను?” అంటూ కోతి వెళ్లి పోయింది.\r\n\r\nఏనుగు చెట్టు మొదల్లో వున్న కుందేలుని అడిగింది, “కుందేలు, కుందేలు, నా తో స్నేహం చేస్తావ?”\r\n\r\nకుందేలేమో, “నువ్వు నా లాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను?” అంది.\r\n\r\nఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. “కప్పా, కప్పా, నా తో స్నేహం చేయవ?” అని అడిగింది.\r\n\r\n“నువ్వు నా లాగా గెంత లేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను?” అని కప్ప కూడా స్నేహం చేయలేదు.\r\n\r\nఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ, అన్నిటిని స్నేహం చేయమని అడిగింది. కాని అన్నీ ఏనుగు ని కాదని వెళ్లి పోయాయి. ఏనుగు పెద్దగా, నిదానం గా వుంటుంది కదా, వేరే జంతువుల లాగ ఎగర లేదు, గెంత లేదు, పరిగెత్త లేదు. అందుకని ఏ జంతువూ ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడ లేదు.\r\n\r\nఏనుగు పాపం వంటరి గానే వుండి పోయింది.\r\n\r\nఒక రోజు అడవిలో జంతువులన్నీ గబ గబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయం కనుక్కుంది.\r\n\r\n“అడవిలోకి ఒక పులి వచ్చింది, ఆ పులి అన్ని జనువులని తినేస్తోంది, అందుకనే పారిపోతున్నాము” అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది.\r\n\r\nఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే “పులి గారు, ఈ జంతువులను తినకండి, ప్లీజ్” అని అడిగింది.\r\n\r\nపులి వికటంగా నవ్వి, “నీ పని చూసుకో పో!” అంది.\r\n\r\nఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగా బడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది.\r\n\r\nఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులూ ఏనుగు మిత్రులై పోయాయి. అందరు కలిసి ఆడుకున్నారు.\r\n\r\nమనలా లేని వాళ్ళను మనము ఎప్పుడు చిన్న చూపు చూడ కూడదు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ వుంటుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 951,
        "IMAGE": null,
        "NAME": "ఎనుగ తో స్నేహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 49,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది.\r\n\r\nబావి చాలా లోతుగా వుంది. యెంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేక పోయింది. తెలారేదాక అలాగే నూతిలో ఉండిపోయింది.\r\n\r\nమొన్నాడు ఆ బావి దేగ్గిరకి ఒక మేక వచ్చింది.\r\n\r\n“అమ్మయ్య! మనం బయట పడచ్చు”, అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది.\r\n\r\nమేక బావిలోకి చూసింది. చూస్తే అక్కడ నక్క కనిపించింది.\r\n\r\n“ఇదేంటి? బావిలో ఎం చేస్తున్నావు?” అని అమాయకంగా అడిగింది మేక.\r\n\r\n“ఈ బావిలో నీళ్ళు యెంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్ళు తాగడానికే ఇక్కడికి వచ్చాను. అసలు చక్కర కలిపినంత తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పింది నక్క.\r\n\r\n“అవునా! నిజమా?” అని అడిగింది మేక.\r\n\r\n“కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అంది నక్క.\r\n\r\nఅమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచిన్కాకుండా నూతి లోకి దున్కేసింది. నీళ్ళు తాగింది. కొంత సేపటికి నక్క లానే మేక కూడా ఇరుక్కు పోయింది.\r\n\r\n“ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా?” అని నక్కని అడిగింది.\r\n\r\n“ఓస్! దానిదేముంది! ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్లి, తరువాత నిన్ను పైకి లాగెస్తాను!” అని ఐడియా ఇచ్చింది నక్క.\r\n\r\nసరే బాగానే ఉంది అనుకుని మేక ఒప్పుకుంది.\r\n\r\nనక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతి లోంచి బయట పడింది! “బ్రతుకు జీవుడా!” అనుకుంది.\r\n\r\nమేక బయటికి రావడానికి చేయి అందించ మని అడిగింది. “నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా వుంది, నువ్వు బరువుగా వున్నావు” అని నవ్వుకుంటూ నక్క వెళ్లి పోయింది.\r\n\r\nమేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది. కాని ఏమి లాభం? నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాల్సింది కదా?",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 952,
        "IMAGE": null,
        "NAME": "నూతిలో నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 50,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ (ఎడారిలో ఏర్పడే జలాశయము) దెగ్గిర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి, ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు.\r\n\r\nఎడారిలో పగటి పూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది.\r\n\r\nఆ చలిలో వొణుకుతు షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు.\r\n\r\nబయట వున్న ఒంటేకి చాలా చలి వేసింది. చివరికి డేరా లో ముక్కు దూర్చి, “షేకు, ఇవాళ చాలా చల్లగా వుంది, నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను నా ముక్కు మట్టుకు పెట్టుకుంటాను” అని దీనంగా అడిగింది.\r\n\r\nషేకు కి జాలి వేసింది. అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు.\r\n\r\nకొంత సేపటికి ఒంటె షేకుని మళ్ళి నిద్ర లేపింది. ముక్కోకటే పెట్టుకుంటే చలికి ఆగట్లేదని, అలాగే తల దాచుకోవడానికి చోటు ఇవ్వమని అడిగింది. షేకు ఒప్పుకున్నాడు.\r\n\r\nతల పెట్టు కున్నాక కొంత సేపటికి ఒంటె షేకు ని మళ్ళి నిద్ర లేపి, తల దాచుకున్నాక మెడకు మట్టుకు యెంత స్థలం కావాలి, మెడ కూడా పెట్టుకొనా అని అడిగింది. షేకు మళ్ళి ఒప్పుకున్నాడు.\r\n\r\nఅక్కడతో ఆగిందా? ఇలా కొంచం కొంచం దేరలోకి దూరి, ముందు కాళ్ళు, వొళ్ళు, తోక కూడా దేరలోకి దూర్చింది.\r\n\r\nఒక్క మనిషి కోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఒంటె ఎలా పడుతుంది? కొంచం కొంచంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేకుని డేరా బయటికి తోసేసింది. ఆ షేకు యెంత ప్రయత్నించినా కొంత చోటు కూడా ఇవ్వలేదు. అసలు ఆ షేకుని మళ్ళీ దేరలోకి కాలు పెట్టనివ్వలేదు.\r\n\r\nపాపము, ఆ షేకు ఒంటెకు మంచి చేయబోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది.\r\n\r\nమన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదటిలో ఇది చిన్న విషయమే కదా, మనం కంట్రోల్ చేయచ్చు అనిపిస్తుంది, కానీ ఆ అలవాటు మనకి తెలీకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించు  కుంటుంది. మొదటిలో అలవాటే, కాని రాను రాను గ్రహపాటు అవుతుంది. అందుకే చిన్నదే అయినా సరే, దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 953,
        "IMAGE": null,
        "NAME": "డేరా లో ఒంటె",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 51,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా? అది ఎవరికి తెలీదు. ఎలాగో పరిచయం అయ్యింది.\r\n\r\nకోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది, అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి. కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది.\r\n\r\nఒక రోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది.\r\n\r\n“ఏంటిది, నిజామా? నీకు ఒక కోతి తో స్నేహముందా?” అని ఒక రోజు మొసలిని అడిగింది.\r\n\r\nమొసలి ఒప్పుకుంటూ, “అవును, చాలా రోజులు గా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది” అన్నాడు.\r\n\r\nమొసలి భార్య, “కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుందేకాయిని  పంచుకుని తినచ్చు” అంది.\r\n\r\nమొసలి కి భార్యమీద పిచ్చి కోపం వచ్చింది. “కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది. స్నేహితుడిని ఎలా చంప మంటావు?” అని కోపంగా అడిగాడు.\r\n\r\nభార్య మూతి ముడుచుని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లి పోయాడు.\r\n\r\nమొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదల కుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి, ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది.\r\n\r\nచివరికి నస భరించలేక ఒక రోజు మొసలి ఒప్పుకున్నాడు. “సరే, ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ” అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుద్యారాడు.\r\n\r\nకోతిని చెట్టు మీంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పడకం వేసాడు.\r\n\r\nచెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది.\r\n\r\nమొసలి కోతితో,”మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకి చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకు రమ్మంది,” అని ఆహ్వానించాడు.\r\n\r\nకోతి సంబర పడింది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్లి, తిరిగి తీసుకు వస్తాను అంది.\r\n\r\nకోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది.\r\n\r\nమొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్ళాడు.\r\n\r\nదారిలో మొసలి ఏడవడం మొదలట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఎడుస్తున్నాడని మొసలి ని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆప లేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ళ మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు.\r\n\r\nభోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి, తన భార్యా కోతిని తిందామని ఈ పడకం వేసారని నిజం చెప్పేసాడు మొసలి.\r\n\r\nఈ మాట విన్న కోతికి ఒక్క సారి గుందేలాగి పోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క, బుర్రోలో ఒకటే సారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన, ఎన్ని రక రకాల భావాలు ఒకటే సారి కలిన్గుంతాయో మీరు ఆలోచించ గలరు.\r\n\r\nకాని కోతి చాలా తెలివైనది. అంత సులువు గా ప్రాణాలు వాదులు కుంటుంద? ఈ భావాలేమి మొసలికి తెలీయనివ్వ లేదు. గట్టిగా నవ్వడం మొదలిట్టింది.\r\n\r\nమొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగి పోయాయి. ఇది ఊహించలేని రియాక్షన్ కదా.\r\n\r\nకోతి మొసలితో అంది, “ఓస్! ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చే వాడిని. కాని ఇప్పుడు అది నా దెగ్గిర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళి ఇంటికి తీసుకుని వెళ్తే, చేట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీ గా తినచ్చు” అంది కోతి.\r\n\r\nమొసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి “అమ్మయ్య!” అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మీంచి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్లి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది.\r\n\r\nమొసలి చాలా సేపు ఎదురు చూసి మొత్తానికి కోతి ని పిలిచింది.\r\n\r\nకోతి కొమ్మ మీదే కూర్చుని, “గుండె లేదు ఏమి లేదు! అసలు నీ లాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు” అని కోపంగా చెప్పింది.\r\n\r\nమొసలి తల దించుకుని వెళ్ళిపోయింది.\r\n\r\nచేడువాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడె చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 954,
        "IMAGE": null,
        "NAME": "మొసలి కన్నీళ్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 52,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్ట పడిన పాపం ఎక్కువ సంపాదించలేక పోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసి పోతూ ఉండేవాడు.\r\n\r\nఒక రోజు అలాగే పొలం నుంచి అలిసి పోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ వుండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని, ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్ర పోవటానికి అనుమతిని కోరాడు.\r\n\r\nశివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇన్న ఓకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేసాడు. తన దుప్పటి, తలగడ కూడా మంచం మీద వేసాడు. తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజల తోనే అన్నం వండి, బాటసారికి వడ్డించి, తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేసాడు.\r\n\r\nకృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు.\r\n\r\n“ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు.” అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు.\r\n\r\nఆరోజు నుంచి శివకాశి దాస మారింది. రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని, దానితో జీవితం కొనసాగాడు. వంటి మీద ఉన్న పాత, చిరిగి పోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచ పక్ష పరవాన్నాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేసాడు.\r\n\r\nపరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది. ఆలోచనా మారుతుంది. పని తక్కువా, డబ్బు ఎక్కువా ఉండే సరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్క సారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి యెంత డబ్బూ సరిపోదు. ఇంకా, ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే.\r\n\r\nఇదే శివకాశి కి కూడా అయ్యింది. ఒకప్పుడు ఏమి లేకపోయినా సంతోషంగా వున్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదిన్చేయాలనే కాంక్ష మొదలైంది. గతం మర్చి పోయాడు.\r\n\r\nరోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటే సారి కోడిలోంచి గుడ్లున్ని తీసేస్తే, ఒకటే సారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది.\r\n\r\nఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేసాడు. పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశి కి ఒక  షాక్ తగిలింది. కోడి పొట్టలో ఏమి లేదు. లోపల మామూలు కోడి లానే వుంది.\r\n\r\nమొదటికే మోసం వచ్చింది.\r\n\r\nఅయ్యో! ఎందుకు దురాశ పడ్డాను! అని శివకాశి అప్పుడు బాధ పడ్డాడు. కాని ఏమి లాభం? రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 955,
        "IMAGE": null,
        "NAME": "బంగారు గుడ్లు పెట్టే కోడి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 53,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టి ముక్క దొరికింది.\r\n\r\nకాకి చాలా సంతోషంగా ఆ రొట్టి ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంది.\r\n\r\nనోట్లో రోట్టిముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టి ముక్క కావాలనుకుంది. కానీ ఎలా? కకేమో చెట్టు మీద వుంది. నక్కేమో చెట్టు యెక్క లేదు. ఇప్పుడు నక్క ఏమి చేయాలి?\r\n\r\nఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది.\r\n\r\n“ఓహో కాకి! యెంత బాగున్నావు ఇవాళ? నిగ నిగాలాదిపోతున్నావు!” అంది నక్క.\r\n\r\nపొగడ్త వినగానే కాకి పొంగి పోయింది. ఈ విషయం నక్క గమనించింది. పొగడ్త కొనసాగించింది.\r\n\r\n“ఆ మిల మిల మెరిసిపోతున్న కళ్ళు, సూటిగా వున్న ముక్కు, బ్రహ్మాండమైన నీ రెక్కలు, అసలు యెంత సేపైనా రెప్ప వాల్చ కుండా చూడవచ్చు. నీ శరీరం ఇంత అందంగా వుంటే ఇంక నీ గొంతు యెంత అదిరి పోతుందో ఊహించుకుంటేనే … ఆహ! అసలు ఒక్క సారి నువ్వు పాడితే వినాలని వుంది. ఒక్క పాట పాడవా?”\r\n\r\nపొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే “కావు! కావు!” అని నోరు తెరిచి పాట మొదలెట్టింది. నోట్లోని రొట్టి ముక్క జారి కింద పడిపోయింది.\r\n\r\nవెంటనే నక్క రొట్టి మిక్కను నోట్లోవేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది.\r\n\r\nరొట్టి ముక్క కోసమే తనని నక్క పోగిడిoదన్న విషయము గ్రహించిన కాకి బాధ పడింది. ఇంకెప్పుడు పొగిడే వాళ్ళను నమ్మ కూడదని సంకల్పించుకుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 956,
        "IMAGE": null,
        "NAME": "పొగడ్తలతో పడగొట్టిన నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 54,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది.\r\n\r\n“ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది.\r\n\r\nపులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం.\r\n\r\nసంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది.\r\n\r\n“అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు.\r\n\r\n“విషయం ఏమిటో చెప్పు” అంది పులి.\r\n\r\n“నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి!” అని ఆవు అడిగ్గింది.\r\n\r\nపులి నవ్వడం మొదలెట్టింది. “బాగానే చెప్పావు కథ. నా నుంచి తప్పించుకోవడానికే కదా?” అంది.\r\n\r\n“లేదు, పొద్దున్నే వచ్చేస్తాను కదా, నన్నూ నమ్మండి” అంది ఆవు.\r\n\r\nపులికి ఆవు మాట నమ్మాలో, నమ్మ కూడదో అర్ధం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితి కనిపించింది. కాని ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక సారి పులిని తప్పించుకున్న వాళ్ళు మాళ్ళి ఆ పులి దేగ్గిరకి వెళతారా? అసలు సాధ్యమా?\r\n\r\nయేది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకో వలసిందే. సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము, ఆవుని వదిలేద్దాము అని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసినా ఊరికే “సరే వెళ్ళు, రేపు పుద్దున్నే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను” అని ఆవుతో అంది.\r\n\r\nఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి.\r\n\r\nఆవు, “నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి” అని ఇంటికి బయలుద్యారింది.\r\n\r\n—\r\n\r\nఇంట్లో దూడకి పాలు ఇచ్చి, జరిగింది చెప్పింది. అమ్మ లేకపోయినా పరవాలేదు, నీకు అందరు సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి, అని దూడకి ధైర్యం చెప్పింది.\r\n\r\nగ్రామంలోని తన బంధువులు, మిత్రులు అయిన ఇతర ఆవుల కి కూడా జరిగిన సంగతి చెప్పి, “నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డ లాగా చూసుకోండి,” అని కోరింది.\r\n\r\nఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేసాయి. “పులినుంచి తప్పించుకుని మళ్ళి వేలతానంతావేంటి? అసలు ఇందులో అర్ధముందా?” అని చాలా నచ్చ చెప్పడానికి చూసాయి. కాని మన ఆవు, “లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకి పాలు ఇచ్చి, ఎవరికైన అప్ప చెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను” అని చెప్పింది.\r\n\r\nపొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఎడిచాయి. మరొక సారి ఆలోచిన్దుకోమని బంధు మిత్రులు చెపుతున్నా తన మాట మీద నిలపదాలని ఆవు అడవిలోకి వెళ్ళింది. కాని మనసు మట్టుకు భారంగానే వుంది. బాగా భయ పడుతూ అడవి చేరుకుంది.\r\n\r\nఅడవిలో పులికి ఆవు వస్తుందని ఏ మాత్రం నమ్మకం లేదు! అయినా ఎందుకో ఒక ఉత్సుకత. ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి. అందుకని అనుకున్న సమయానికి మళ్ళి ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది.\r\n\r\nఅక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్య పోయింది. “నువ్వు నిజంగా వస్తావనుకో లేదు! నీ దూడకి చెప్పావా?” అని అడిగింది.\r\n\r\nఆవు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా, ధైర్యంగా సమాధానము చెప్పింది, “మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అండి – నేను దూడకి పాలిచ్చి, జరిగినది చెప్పి, సెలవు తీసుకుని వచ్చాను.”\r\n\r\n“మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఏవరు పడతారు?” అని పులి అడిగింది.\r\n\r\n“నా బంధు మిత్రులకు అప్ప చెప్పి వచ్చాను” అంది ఆవు.\r\n\r\n“మరి వాళ్లకి ఏం చెప్పావు?” అంది పులి.\r\n\r\n“నిజమే చెప్పాను,” అంది ఆవు.\r\n\r\n“వాళ్ళు నిన్ను ఆపలేద? వెళ్ళద్దని అనలేదా?” అని ఆశ్చర్యంగా అడిగింది పులి.\r\n\r\n‘అన్నారుకాని, నేను మీకు మాట ఇచ్చాను కదా. అందుకే అందరికి సద్ది చెప్పి వచ్చాను” అంది ఆవు.\r\n\r\nపులికి ఆవు నిజాయితి చాలా నచ్చింది. “ఇంత వరకు నేను నీ లాంటి జంతువును ఎప్పుడు కలవ లేదు. నీ లాగా ఇలా మాట మీద నిలపడ డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీ లాంటి మంచి ఆవుని నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళచ్చు” అని చెప్పి, ఆవుని ఏమి చేయకుండా వెళ్ళిపోయింది.\r\n\r\nఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం, అన్ని టప్పున తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళి ఇంటికి వెళ్లి దూడని గట్టిగా వాటేసుకుంది.\r\n\r\nమనం నిజం చెబుతూ, నిజాయితీగా వుంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదురుకో గలము.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 957,
        "IMAGE": null,
        "NAME": "నిజాయితి గల ఆవు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 55,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "భారత దేశంలో, ఒకానొక గ్రామంలో, చాలా రోజుల క్రితం గోవిందరాజు అనబడే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు.\r\n\r\nఅతనికి చిన్నప్పుడు ఎప్పుడో ఎదో గుడిలో ప్రవచనలో, “మరణించేటప్పుడు ఆఖరి శ్వాసతో దేవుడిని తలుచుకున్న వారికి స్వర్గం ప్రాప్తం అవుతుంది” అని విన్న మాట మనసులో నిలిచిపోయింది.\r\n\r\nకాల క్రమేణా అతనికి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురి కొడుకులకి కేశవ, నారాయణ, మాధవ అని పేర్లు  పెటుకున్నాడు. కొడుకులందరికి దేవుడి పేర్లు పెట్టుకుంటే మరణించేటప్పుడు వాళ్ళని పిలిచినా దేవుళ్ళని తలుచు కున్నట్లుంటుంది అని అనుకున్నాడు.\r\n\r\n“ఎలాగా మరణించేటప్పుడు దేవుడిని తలుచు కుంటాను కదా, రోజు పుణ్యం సంపాదించడానికి ఆరాట పడక్ఖర్లేదు” అని గోవిందరాజు అనుకునేవాడు. వ్యాపారంలో మోసాలు చేయటం మొదలు పెట్టాడు. బాగా డబ్బు సంపాదించిన ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు. గుడి, గోపురం, పూజ, పునస్కారం ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే వెంటనే పెడసరిగా జవాబు చెప్పే వాడు.\r\n\r\nఅతని భార్య మట్టుకు చాలా మంచిది. అందరితో మంచిగా ప్రవర్తించి, మంచి పనులు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది.\r\n\r\nఇలా రోజులు గడిచాయి. అమ్మ ప్రభావం వల్ల ముగురు కొడుకులు సద్బుద్ధితో పెద్ద వాళ్ళయ్యారు. వ్యాపారంలో గోవిందరాజు కి సహాయం చేయడం మొదలు పెట్టారు. గోవిందరాజు కూడా వృద్ధుడు అయ్యాడు. వయసుతో పాటు జబ్బులు కూడా వచ్చాయి. మంచాన్న పడ్డాడు.\r\n\r\nఇక గోవిందరాజుకి ఆఖరి సమయం వచ్చింది. వైద్యుడుని ఇంట్లోనే వుండి, సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు. ఇప్పుడు కూడా మరణించేటప్పుడు దేవుడిని తలచుకుంటే చాలు, అన్ని పాపాలు కడిగి పోయి స్వర్గం ప్రాప్తం అవుతుందని గట్టి నమ్మకంతో వున్నాడు, గోవిందరాజు.\r\n\r\nసమయం వచ్చింది. వైద్యుడు గోవిందరాజుకు చెప్పాడు. వెంటనే గోవిందరాజు “కేశవ! నారాయణ! మాధవ!” అన్నాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న తండ్రి పిలుస్తున్నాడు అనుకుని ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుంటూ అతని మంచం దేగ్గిరకి వచ్చారు.\r\n\r\nముగ్గురు కొడుకులని చూసి వెంటనే గోవిందరాజు తన ఆఖరి శ్వాసతో, “మీరు ముగ్గురూ ఇక్కడే వుంటే వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు? ఏ మాత్రం శ్రద్ధ లేదు” అని తిడుతూ కన్ను మూసాడు.\r\n\r\nఅలాగా చివరి మాట దేవుడి పేరు కాక పోవడంతో, జీవితాంతం చేసుకున్న పాపాల కారణంగా అతనికి స్వర్గం చెందలేదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 958,
        "IMAGE": null,
        "NAME": "కేశవ! నారాయణ! మాధవ!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 56,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో చాలా మంది గొర్రెల కాపర్లు ఉండేవారు. రోజు ఆ కాపర్లు అందరు కలిసి గోరీలనిటిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళే వారు. ఆ గొర్రెలు అక్కడ గడ్డి మీసేవి. కాపర్లు రోజంతా అక్కడ వుండి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు.\r\n\r\nఇలా ఉండగా ఒక రోజు ఒక కాపరి అబ్బాయి “నాన్న నన్నూ నీతో తీసుకు వెళ్ళవా, నేను వస్తాను” అని ఆడిగాడు. గొర్రె కాపరి, “వద్దురా అక్కడ నీకు ఏమి ఉండదు, అస్సలు తోచదు” అని యెంత చెప్పినా విన కుండా పంతం పట్టి మొండి చేసాడు ఆ అబ్బాయి. మొత్తానికి పోరు పడలేక “సరే, రా!” అని ఆ గొర్రె కాపరి ఆ రోజు కొడుకుని కూడా తోడుగా తీసుకుని వెళ్ళాడు.\r\n\r\nమొదట్లో అబ్బాయి కి చాలా నచ్చింది. తెల్లవార గానే బయలుద్యారారేమో, ఆ చల్లటి వాతావరణం, చుట్టూరా గొర్రెలు, ఆ కొండ, కొండమీద సూర్యోదయం, అన్ని అందంగా, ఆహ్లాదకరంగా అనిపించాయి. అబ్బాయి చాలా సంబర పడుతూ, సంతోషంగా వున్నాడు.\r\n\r\nఅదే మధ్యానం అయ్యే సరికి, మండే సూర్యుడు, పెద్దలందరూ గొర్రెలు కాస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో ఆ పిల్లాడికి ఏమి తోచ లేదు. అక్కడ వాళ్ళ నాన్న చెప్పినట్టే అతనికి ఏ పని లేదు.\r\n\r\nకొంత సేపు ఏదో కాలక్షేపం చేసుకున్నాడు, కాని ఆ తరువాత అంతా చాలా బోరింగ్ గా అనిపించింది. ఏదైనా జరిగితే బాగిండును అనిపించింది.\r\n\r\nఆకస్మికంగా ఓక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మంచి, చెడు ఆలోచించ కుండా, గట్టి గా, “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని కేకలు పెట్టడం మొదలెట్టాడు.\r\n\r\nకేకలు విన్న గొర్రె కాపర్లందరూ చేతికి దొరికిన రాళ్ళు, రప్పలు, కత్తులు, కర్రలూ తీసుకుని ఆత్రుతగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే అక్కడ ఏ పులి లేదు. అందరు ఆ అబ్బాయి వంక కోపంగా చూసారు. వాళ్ళని అలా చూస్తే అబ్బాయికి బాగా నవ్వొచ్చింది. పెద్దలు తల ఒప్పుకుంటూ వెళ్లి పోయారు.\r\n\r\nఇదేదో బాగందని, అందరు మళ్ళి పనుల్లో బిజీగా అయిపోయాక, మళ్ళి గట్టిగా “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరుపులు మొదలెట్టాడు.\r\n\r\nమళ్ళీ అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, రాళ్ళు రప్పలు, కత్తులు, కర్రలు, వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఏ పులి లేదని చూడగానే ఈ సారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అబ్బాయిని బాగా తిట్టి, మళ్ళీ ఇలా చేయొద్దని బాగా మందలించారు. వాళ్ళ కోపం చూసి, హెచ్చరిక విన్న అబ్బాయి భయ పడ్డాడు. మళ్ళీ ఇలా చేయకూడదని అనుకునాడు.\r\n\r\nకొంత సేపటికి నిజంగా అక్కడకి పులి వచ్చింది. అబ్బాయి చాల భయ పడ్డాడు. గట్టిగా మళ్ళి “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరిచాడు.\r\n\r\nకపర్లంతా ఆ అబ్బాయి మళ్ళీ ఊరికే అరుస్తున్నడు అనుకున్నారు. ఈ సారి ఎవ్వరు సహాయానికి రా లేదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టించుకో లేదు.\r\n\r\nఆ అబ్బాయి దేగ్గిరున్న చెట్టు ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు. పులి మట్టుకు దేగ్గిరలో ఉన్న ఒక గొర్రెను చంపేసింది. యెంత తినాలో అంత తిని వెళ్లి పోయింది.\r\n\r\nభయంతో ఆ అబ్బాయి మట్టుకు రోజంతా చెట్టు మీదే ఉన్నాడు. ఆకలి, దాహం అన్ని మరిచిపోయి ఏడుస్తూ రోజంతా గడిపాడు.\r\n\r\nసూర్యాస్తమం అవుతుంటే కాపర్లంతా తిరిగి వెళ్తూ ఆ అబ్బాయిని కూడా తీసుకు వెళ్దామని వెతుకుతూ వుంటే చెట్టు మీంచి దిగి జరిగినది అంతా చెప్పాడు. ఆ పులి చంపిన గొర్రెను చూపించాడు.\r\n\r\nరాత్రి ఇంటి కి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పుకున్నాడు. “యెంత పిలిచినా ఎవ్వరు రాలేదమ్మా! చాలా భయమేసింది!” అని చెప్పుకున్నాడు.\r\n\r\n“ఒక్క సారి నువ్వు అబద్ధాలూ ఆడతావని అనుకుంటే, తరవాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు నామారు బాబు” అని చెప్పింది వాళ్ళ అమ్మ.\r\n\r\nఆ రోజు తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు అబద్ధాలూ ఆడలేదు, కాని అతని కథ మట్టుకు ఈ రోజుకీ మనం అనాదరం చెప్పుకుంటున్నాము.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 959,
        "IMAGE": null,
        "NAME": "నాన్నా! పులి!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 57,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండే వారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళే వారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించే వారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు.\r\n\r\nఒక రోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్ళారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరు ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది, అంటే నాది అని దేబ్బలాడుకున్నారు.\r\n\r\nహోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకుని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకుని ఉన్న శక్తంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు.\r\n\r\nఇలాలాగుతుంటే, తాడు పాతదేమో ఠప్పు మని విరిగి పోయింది. ఇద్దరు ఒకటే సారి ధమ్మని తలోక వైపు పడ్డారు. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి.\r\n\r\nఆ విరిగి పోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్ళారు.\r\n\r\nకంది పోయిన మొహాలు, మాసి పోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటి మీద గాయాలు వేసుకుని వెళ్ళిన ఇద్దరికీ ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి.\r\n\r\nమొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడూ దక్కలేదు, దెబ్బలూ తగిలాయి; ఇంట్లోను చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దేబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకుని వుంటే ఇద్దరు వంతులేసుకుని స్కిప్పింగ్ చేసేవారని బాధ పడ్డారు.\r\n\r\nఇద్దరు అనుకున్నారు: అవును, గొడవ పడి ఏమి లాభము?",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 960,
        "IMAGE": null,
        "NAME": "గొడవ పడి ఏమి లాభం?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 58,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి. ఆ సరిహద్దు ప్రాంత వాసులు ఎవరికి పన్నులు కట్టాలో తెలీక కట్టడం మానేశారు. ఆదాయాం తగ్గిపోవడంతో సామంతరాజులు ఇద్దరూ మహారాజుని ఆశ్రయించారు. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు నా దాకు తీసుకురాకండి, మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజుగారు తేల్చేశారు.\r\n\r\nపెద్దల సహకారంలో ఇద్దరు సామంత రాజులు ఒక అంగీకారానికి వచ్చేరు.\r\n\r\nఇరువైపు రాజ్యాలనుంచి ఇద్దరు బలశాలురు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమం దాక ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు. మంచి రోజు నిర్ధారించుకున్నారు. రెండు రాజ్యాల వళ్ళూ తమ తమ బలశాలులని యెంచుకున్నారు.\r\n\r\nపందెం ముందు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండొవ రాజ్యం కోడిని బాగా మేపేరు. తిని, తినీ ఆ కోడి బద్దకంతో బాగా నిద్రపోయి పొద్దున్న లేవలేదు, కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి, కోడిని లేపి, కూత పెట్టించే లోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేసాడు. పొరుగు రాజ్యం పొలిమేరల దాక పరిగెట్టాడు.\r\n\r\nఅతన్ని బ్రతిమాలుకుంటే, నన్ను ఎత్తుకుని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అన్నాడు. ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకుని నడవడం మొదలెత్తాడు కానీ ఎంతో దూరం వెళ్ళకుండానే తెల్లారిపోయింది.\r\n\r\nరెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలయ్యింది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేసారు.\r\n\r\nఆ ప్రాంతం ఎవరిదో ఇప్పతికి తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ “పందెం పాలెం” అంటారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 961,
        "IMAGE": null,
        "NAME": "పందెం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 59,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంతాలోచించినా పేరు గుర్తు రాలేదు.\r\n\r\nఇంట్లో వున్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది.\r\n\r\n“పెద్దమ్మా, నా పేరేంటి?” అంది.\r\n\r\n“నాకేమి తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే వుంటాను, అడవిలో వున్న నా కొడుకునడుగు” అంది పెద్దమ్మ.eega-peddamma\r\n\r\nఈగ అడవిలోకి వెళ్ళింది.\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకా, నా పేరేంటి?” అంది.\r\n\r\n“నాకేంతెలుసు, నేను నరుకుతున్న చెట్టునడుగు, నాకన్నా బలంగా వుంది” అన్నాడు పెద్దమ్మ కొడుకు.\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి?” అంది ఈగ.\r\n\r\n“నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు”, అంది చెట్టు.\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, నా పేరేంటి?” అంది ఈగ.\r\n\r\n“నాకన్నా పెద్దది, ఈ నదినడుగు” అంది గొడ్డలి.\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నా పేరేంటి?” అంది ఈగ.\r\n\r\n“నా నీళ్ళన్నీ తాగేస్తున్న ఈ రాజుగారి గుఱ్ఱముంది కద, దీనిని అడుగు” అంది నది.\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, నా పేరేంటి?” అంది ఈగ.\r\n\r\n“నాకు తెలీదు, నా కడుపులోని బిడ్డనడుగు” అంది గుఱ్ఱం\r\n\r\n“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, గుఱ్ఱం కడుపులో బిడ్డా, నా పేరేంటి?” అంది ఈగ.\r\n\r\nగుఱ్ఱం పిల్ల, “ఇహి ఇహి ఇహి ఇహి ఇహి ఈగ!” అంటూ నవ్వింది!\r\n\r\nఅయోమొహం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 962,
        "IMAGE": null,
        "NAME": "ఈగ పేరు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 60,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.\r\n\r\nఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు.\r\n\r\nఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, “అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”\r\n\r\n“నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.\r\n\r\nఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.\r\n\r\nఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.\r\n\r\nసాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు. “ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు.\r\n\r\nపెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడ అందరి లాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు.\r\n\r\nపప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించ మన్నారు.\r\n\r\nచిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు.\r\n\r\nఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి పెరుగు నిండిపోయింది.\r\n\r\nఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు.\r\n\r\nవేరే వాళ్ళంతా, “యేది, మాకు వడ్డించండి, మేమూ చూస్తాము”, అన్నారు.\r\n\r\nఅయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా, అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.\r\n\r\nవచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ “యేది, అన్నా! గోపాలా! అని పిలూ, మేమూ చూస్తాము!” అన్నారు.\r\n\r\nఅయ్యవారు అందరిని మందలించారు. “మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.\r\n\r\nఅందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృశ్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 963,
        "IMAGE": null,
        "NAME": "అన్నా గోపాలా!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 61,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక వూళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వేరే వాళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది.\r\n\r\nఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ.\r\n\r\nసూరమ్మ పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.\r\n\r\nపెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది.\r\n\r\nమీకేమైన తెలిసిందా?\r\n\r\nసూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 964,
        "IMAGE": null,
        "NAME": "అలవాటు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 62,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు.\r\n\r\nదారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు.\r\n\r\nఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క యెండా, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్ట లేక పోయాడు.\r\n\r\nజమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పళ్ళు తినేసాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీసాడు.\r\n\r\nయేమి ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని, బుట్టనెత్తుకుని బయలుదేరాడు.\r\n\r\nజమీందారు కూతురు బుట్టనీ, లేఖనీ తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్ఖబెట్టించింది.\r\n\r\n“నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి?” అని నిలదీసింది. “నువ్వేమైన తిన్నావ?”\r\n\r\n“అయ్యో! అయ్యో! ఇదెక్కడ విడ్ఢూరం తల్లీ! నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది?” అని లబో దిబో మని తల కొట్టుకున్నాడు.\r\n\r\nజమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది.\r\n\r\nకాని, చూసారా పిల్లలు, మూర్ఖుడైన ఆ నౌకర్కి చదువు కూడా రాకపోతే ఎంత అనర్ఘమో?",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 965,
        "IMAGE": null,
        "NAME": "నిరక్షర కుక్షి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 63,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది.\r\n\r\nఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది.\r\n\r\nపిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది.\r\n\r\nఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది.\r\n\r\nతల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?”\r\n\r\n“ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.\r\n\r\n“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.\r\n\r\n“ఊహూ” అని మళ్ళి అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.\r\n\r\n“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అంటూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 966,
        "IMAGE": null,
        "NAME": "అఙ్నానం, మూర్ఖత్వం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 64,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "చాలా, చాలా, చాలా ఏళ్ళ క్రితం, వందల వేలు, లక్షలు, కోట్లు యేళ్ళ క్రితం ఆకాశం ఇంకా దెగ్గిరగా వుండేది మనకి. ఇంత దూరంగా వుండేది కాదు.\r\n\r\nఆకాశం కాప్లాదారులు సూర్య చంద్రులు, వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ.\r\n\r\nసూర్యుడు వేకువనే లేచి వేడి వేడి అన్నం అవ్వ వండగానే తినేసి, ఆకాశం మీదకు వెళ్ళి, పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి, మళ్ళి అవ్వ వండిన వేడి అన్నం తినేసి పడుక్కునేవాడు.\r\n\r\nచంద్రుడు ఇంకా పొద్దు వుండంగానే చల్ల అన్నం తినేసి రాత్రంతా కాపల కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళి చల్ల అన్నం తినేసి పడుక్కునేవాడు.\r\n\r\nఒక రోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు. గబ గబా  చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళి పోయాడు.\r\n\r\nఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు. ఈ లోగా అవ్వ ఒక పని అయినట్టుంటుందని, చీపురు తీసుకుని ఇల్లు ఊడవడం మొదలెట్టింది. తుడుస్తూ తుడుస్తూ వీపు యెత్తింది. యేదో తగిలినట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపుకు తగులుతోంది. చీపురు తీసుకుని కోపంగా, గట్టిగా, ఒక్క తోపు తోసింది.\r\n\r\nబాధలో, ఉక్రోశంలో, ఆకాశం దూరంగా, ఇంకా దూరంగా, చాలా దూరంగా జరిగిపోయింది.\r\n\r\nఅంత యెత్తునుంచి సూర్య చంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలోనే వుండి పోయారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 967,
        "IMAGE": null,
        "NAME": "ఆకాశం కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 65,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.\r\n\r\nయమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.\r\n\r\nమరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.\r\n\r\nసభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.\r\n\r\nబీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.\r\n\r\nఅక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.\r\n\r\nరాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.\r\n\r\nవిషయమర్ధమయ్యింది.\r\n\r\n“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.\r\n\r\nసభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 968,
        "IMAGE": null,
        "NAME": "అత్తారింటికి దారేది?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 66,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక సారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదు.\r\n\r\nఅప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి, “బీర్బల్, నా ఉంగరం కనిపించటం లేదు. సేవకులు కోటంతా వెతికేరు, ఐన దొరకలేదు. ఎవరో దొంగలించారని నా అనుమానం. దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయ్యుండాలి, ఎవరో కనిపెట్ట గలవా?” అని అడిగారు.\r\n\r\nబీర్బల్ ఒక నిమిషం అలోచించాడు. “ఇది చాలా సులువైన పని మహారాజా! దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపుగింజ వుంటుంది, అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టచ్చు!” అన్నాడు.\r\n\r\nవెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడువుకున్నాడు. ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు.\r\n\r\nఅక్బర్ చాలా ఆశ్చర్యపోయారు. “బీర్బల్, నీకెలా తెలిసింది, దొంగ గెడ్డంలో బియ్యపుగింజ వుందని?” అని అడిగారు.\r\n\r\n“మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ వుంటుంది. దొంగతనం చెయ్యనివాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే, తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు” అని బీర్బల్ వివరించాడు.\r\n\r\nఇలా బీర్బల్ మరొక్క సారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 969,
        "IMAGE": null,
        "NAME": "మనస్సాక్షి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 67,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది.\r\n\r\nఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాల సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.\r\n\r\nదారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.\r\n\r\nఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను.\r\n\r\nకొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా ఆవులు వుంటాయి.\r\n\r\nఅవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను. నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే అవసరం వుండదు. అప్పుడు నేను కూడ తెల్లగా అయిపోతాను.\r\n\r\nవెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు, గొలుసు కూడ కొనుక్కుంటాను.\r\n\r\nఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని వెళ్తాను.\r\n\r\nఅక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది ఒప్పుకోను”\r\n\r\nనచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న విషయం మరిచిపోయింది.\r\n\r\nఢడేలుమని బిందె తలనించి పడి ముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.\r\n\r\nఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ డబ్బులూ సంపాదించలేదు, ఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు, పట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు – ఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి.\r\n\r\nపగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకు వెళ్ళి పోయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 970,
        "IMAGE": null,
        "NAME": "అమ్మాయి కలలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 68,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.\r\n\r\nపాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.\r\n\r\nకప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.\r\n\r\nకాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.\r\n\r\nచెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 971,
        "IMAGE": null,
        "NAME": "కప్పా, పాము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 69,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "లక్ష్మాపురం అనే ఊరిలో కామాక్షి మీనాక్షి అనే వారు ఇరుగుపొరుగు ఇళ్ల వారు. మీనాక్షి పొదుపు గల ఇల్లాలు కామాక్షి బద్దకస్తురాలు. మీనాక్షి కి రెండు పాడి గేదెలు ఉండేవి ఆ పాలతో పెరుగు నెయ్యి చేసుకుంటూ కుటుంబానికి సహాయపడేది.\r\n\r\nకామాక్షి ఆరు పాడి గేదలు ఉండేవి కానీ ఆ పాలతో పెరుగు నెయ్యి చేసేది కాదు. ఒకరోజు కామాక్షి ఇంటికి బంధువులు వచ్చారు వారికి నెయ్యి వడ్డీ ఇద్దామనుకుంటే  ఇంట్లో నెయ్యి లేదని పొరుగింటి మీనాక్షి వద్దకు వెళ్లింది. వదిన మా ఇంటికి బంధువులు వచ్చారు కొంచెం నెయ్యి బదులు ఇవ్వు నాలుగు రోజుల్లో తిరిగి ఇస్తానంది కామాక్షి. సరే వదినగారు అని ఒక గిన్నెడు నెయ్యి తెచ్చి ఇచ్చింది మీనాక్షి.\r\n\r\nవారం రోజులు గడిచినా కామాక్షి నెయ్యి ఇవ్వలేదు సరికదా ఆరు గేదలు ఉన్న నేను రెండు గేదెలు ఉన్న నీ దగ్గరికి నెయ్యి కి వచ్చాన అని బదలాయించింది కామాక్షి. వెంటనే కామాక్షి ఆ ఊరి కరణం గారి వద్దకు వెళ్లి మీరే తీర్పు చెప్పాలి అని మీనాక్షి నెయ్యి అడిగిన విషయం చెప్పింది.\r\n\r\nఅప్పుడు కరణంగారు ఇద్దరినీ పిలిపించి నాకు జ్వరంగా ఉంది నాలుగు రోజుల తర్వాత ఇద్దరు రండి, వచ్చేటప్పుడు పాతచింతకాయ పచ్చడి తీసుకుని రండి అని ఒక గాజు పాత్ర ఇచ్చారు కరణం గారు. సరేనని ఇద్దరూ వెళ్లి నాలుగు రోజుల తర్వాత మీనాక్షి గాజుపాత్రలో పాత చింతకాయపచ్చడి తెచ్చింది, కామాక్షి వేరొక పాత్రలో కొత్త చింతకాయ పచ్చడి తో వచ్చింది.\r\n\r\nకరణం గారు ఇద్దరినీ పిలిచి ఆ పాత్రను చూపిస్తూ మీనాక్షి పొదుపుతో పాత చింతకాయ పచ్చడి దాచి పెట్టింది, గాజు పాత్రలో జాగ్రత్తగా తెచ్చింది. నీలో పొదుపు లేదు అజాగ్రత్తతో గాజు పాత్ర పగిలినది కొత్త పచ్చడి తెచ్చావు. నీకు ఆరు గేదెలు ఉన్న పొదుపు చేయలేదు, కాబట్టి నీ వద్ద నెయ్యి లేదు అన్నాడు కామాక్షి తో. మీనాక్షి కి నెయ్యి ఇప్పించాడు ఆ కరణం గారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 972,
        "IMAGE": null,
        "NAME": "కామాక్షి మీనాక్షి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 70,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచం పెద్డ  మొక్క, మూడవది దానికన్న కొంచం పెద్దది. నాల్గవది చాలా పెద్ద చెట్టు.\r\n\r\nగురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి ధానిని కూడా లాగేసాడు. మూడవదానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు “చూడు నాయినా! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మనై వంగునా? అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు” అన్నాడు గురువుగారు.\r\n\r\nగురుసందేశం నీతి: మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 973,
        "IMAGE": null,
        "NAME": "గురుసందేశం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 71,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది. బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత  కంప్లైంటు ఇస్తుంది. \r\n\r\nఅప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయ అంత అమీనును తోలుకొని లవంగమంత లాటి తీసుకొని పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడిలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేస్తాడు. \r\n\r\nమునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 974,
        "IMAGE": null,
        "NAME": "చిలిపి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 72,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక బుల్లి పిట్టా సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసుకుని మురిసిపోయింది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది.\r\n\r\nఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను అలలే లా గు కపోయాయి అని అర్థమైంది పిచ్చుకు.\r\n\r\nవాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకొంది పిచ్చుక.\r\n\r\nసముద్రుడు చెలిచకపోవడంతో పిట్ట కోపంగా “నీ నీళ్లన్నీ తో డేస్తా అని శపధం చేసింది పిట్ట”. వెంటనే పిట్టా తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది.\r\n\r\nఅది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపక నవ్వాయి. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు.\r\n\r\nఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది. ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్య పడ్డాడు తన వంతు సహాయం చేద్దామని పిట్ట వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు.\r\n\r\nపిల్లల కోసం సముద్రుడి తో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను నేను నీకు సహాయం చేయాలనుకుంటున్న అని చెప్పాడు గరుత్మంతుడు.\r\n\r\nఅతని మాటలకు సంతోషించింది పిచ్చుక, గరుత్మంతుడు భీకర స్వరంతో “మిత్రమా! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించాడు. దీంతో సముద్రుడు భయపడ్డాడు.\r\n\r\nగరుత్మంతుని తరుపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అని అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పిట్ట ఆనందముతో ఎగిరింది.\r\n\r\nనీతి:\r\n\r\nచిన్నదైనా ధైర్యంతో పని చేసింది ఫలితం వచ్చింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 975,
        "IMAGE": null,
        "NAME": "పిచ్చుక సాహసం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 73,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా దరిక అనే రాజ్యానికి చంద్రసేనుడు మహారాజు గా ఉండేవారు. ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి. వీరికి ఇద్దరు సంతానం, యువరాజు కార్తికేయుడు మరియు యువరాణి మహానిక.\r\n\r\nఒకరోజు రాజుగారు తన కుమారుడైన కార్తికేయుడు తో కలిసి వేటకు బయలు దేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు.  అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి“మీరు వయసులో పెద్దవారు గా కనిపిస్తున్నారు, మీరు ఎవరు ఇలా ఎందుకు దీనంగా కూర్చున్నారు” అని అడిగాడు.\r\n\r\nయువరాజు వారిని గమనించిన ఆ ముసలి వ్యక్తి ” నా పేరు రామయ్య నేను రోజు అడవిలో చెట్లు కొట్టి వారం వారం పట్టణంలో కట్టెలు అమ్మి ఇల్లు నడిపించాను ఈరోజు కట్టెలు కొడుతుండగా దాహం వేసి నదీ తీరానికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను ఇంతలో నా కట్టెలమోపును ఎవరో ఎత్తుకెళ్లారు దీంతో ఈ వారం ఆదాయాన్ని కోల్పోయాను. అయితే ఈ వారం ఇల్లు ఎలా నడపాలో తెలువక ఖాళీ చేతులతో కూర్చున్నాను”\r\n\r\nఅప్పుడు ఆ ముసలి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న యువరాజు ఇలా అన్నాడు ”దిగులు చెందకు నేను దరిక  రాజ్యానికి యువరాజును నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉండటం నేను చూడలేదు మీరు మాతోని రండి  మీకు రాజ్యంలో వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇస్తాము ఇక మీరు వ్యవసాయం చేసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు”\r\n\r\nయువరాజు గారి మాటలు విన్న రామయ్యా ఎంతో సంతోషించాడు. తన కుమారుని చూసి భవిష్యత్తులో ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటాడని  రాజుగారి గుండె ఎంతో గర్వం తో నిండి పోయింది. అప్పుడు రాజు వెంబడి ఉన్న సైనికులు యువరాజు గారి కి జేజేలు పలికారు.\r\n\r\nఅన్నట్టుగానే యువరాజు గారు రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే రామయ్యకి పొలం ఇచ్చారు. దీంతో రామయ్య కుటుంబం మొత్తం రాజ్యంలో సంతోషంగా ఉండసాగారు.\r\n\r\nఈ కథలోని నీతి\r\n\r\nకష్టాల్లో ఉన్న వారికి బాధ తీర్చడం రాజు యొక్క మొదటి లక్షణం.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 976,
        "IMAGE": null,
        "NAME": "మంచి యువరాజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 74,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం ఇష్టముండేది కాదు. ఏదో విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు, రకరకాల జంతువుల శబ్దాలు చేస్తూ రాత్రిలో ఊరంతా తిరిగేవాడు. అతని గోలకి ఎవరూ సరిగా నిద్ర పోయే వారు కాదు.\r\n\r\nరామయ్యకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని ఊరివారంతా నిర్ణయించుకున్నారు, ఒకరోజు ఊరివారు రామయ్యకు సన్మాన సభకు రావలసినదిగా కబురు పంపారు. ఆ విషయం రామయ్యకు అర్థం కాక ఆలోచనల నిమగ్నమయ్యాడు.  అదే దారి గుండా పింకీ అనే పాప వెళుతుండగా రామయ్య సన్మాన సభ గురించి చెప్పాడు.\r\n\r\nఅప్పుడు పింకీ రామయ్యతో నీవు చేసే జంతువుల శబ్దాలవలన ఎలాంటి దొంగల భయం లేకుండా ప్రశాంతంగా నిద్ర పోతున్నారు అని అందుకే నీకు సన్మానం చేయాలని అనుకున్నారు అని చెప్పింది.\r\n\r\nఎదుటి వారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని రామయ్య ఆరోజు నుండి ఎలాంటి శబ్దాలు చేయడం లేదు, దీనితో ఊరివారు ప్రశాంతంగా నిద్రపో గలిగారు.\r\n\r\nఈ కథలోని నీతి:  ఆలోచన తో ఏ పనైనా సులువుగా చేయవచ్చు అని తెలుసుకున్నాము.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 977,
        "IMAGE": null,
        "NAME": "ఉపాయం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 75,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు. ఎప్పటి లాగానే ఆ రోజు కూడా వేటకు బయలు దేరాడు.  కానీ ఆ రోజు ఏ జంతువు తన వేటకు చుక్కలేదు. రోజంతా తిరిగి తిరిగి అలసి పోయిన వేటగాడు. సాయంత్రానికి ఒక ఆలోచన చేసాడు.\r\n\r\nఒక చెట్టు దగ్గర్లో సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలను చల్లాడు.  తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు.\r\n\r\nఇంతలో అటునుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి. వెంటనే గుంపంతా ఇటు వైపు రావడం మొదలుపెట్టాయి.\r\n\r\nహాయిగా కింద పడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి.  వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు సంతోషించాడు.\r\n\r\nమరోవైపు, భయముతో ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి. అప్పుడు ఆ పక్షులు లోని ఒక పక్షి ఇలా అన్నది ” మనమందరం వేటగాడి వలలో పడ్డాము ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నము. ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి”\r\n\r\nఇప్పుడు మిగతా పక్షులు ఎన్టీ ఆ నిర్ణయం అని అడిగాయి. వీటికి సమాధానం మరో పక్షి ఇలా చెప్పండి. “ఒంటరిగా ఎగరలేని మనం, అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చు”\r\n\r\nవెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి. అనుకున్నట్టుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతో పాటు గాలిలోకి ఎగిరి పోయాయి. దీంతో తమ ప్రాణాలను రక్షించు కున్నాయి పక్షులు.\r\n\r\nవెంటనే ఆ పక్షులు ఎగరడం గమనించిన వేటగాడు. ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా వేటగాడు బారినుండి తప్పించుకుని పక్షులు.\r\n\r\nనీతి:\r\nఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 978,
        "IMAGE": null,
        "NAME": "ఐక్యత ఒక బలం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 76,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని సీతయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు.\r\n\r\nదానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు. నేను మాత్రం బానిస లాగా బతకాల్సి వస్తోంది.\r\n\r\nఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు.\r\n\r\nజరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది. యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళుతున్న దొంగను, “అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పండి” అన్ని బతిమిలాడింది గుర్రం.\r\n\r\nనీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది.\r\n\r\nదానికి దొంగ నవ్వుతూ “నేను దొంగను, దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీ లాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు”.\r\n\r\n“యజమాని పైన విశ్వాసం లేని వారు ఇప్పటికైనా ముంపు” అన్నాడు దొంగ.\r\n\r\nవెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది. అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది.\r\n\r\nనీతి:\r\n\r\nనమ్మకము విశ్వాసము మనలను కాపాడును",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 979,
        "IMAGE": null,
        "NAME": "దొంగ – గుర్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 77,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో కొన్ని మేకలు మేత మెస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పై నుండి మెల్లగా వెళ్లాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటు వైపు వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చినాను అంటే నేను వచ్చినని అని రెండు పోట్లాడుకుంటున్నాయి. మోదటి మేకకు చినప్పుడు తల్లిమేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తువచ్చింది. వెంటనే మోదటి మేక, రెండవ మేకతో “ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. కావున ఇద్దరం క్షేమంగా కలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నాపై నుంచి దాటి వెళ్ళు” అని చెప్పింది. రెండవ మేక సరేనని మేకపైనుండి దూకివెళ్లింది. రెండు మేకలు క్షేమంగా కలువ దాటాయి.\r\n\r\nనీతి: ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 980,
        "IMAGE": null,
        "NAME": "తెలివైన మేక",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 78,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ధాన, ధర్మాలు చేసేవారు. వారు ఎంతో దయగలవారు. వారికి కొంత కాళం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. \r\n\r\nఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ముంగిస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. “దీనిని మనం పెంచుకుందాం” అని చెప్పాడు. “అవును, అవును మన బిడ్డకు కాపలాగా కూడా వుంటుంది” , అనుకున్నారు. ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భాస్కర శర్మ “పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత” అని చెప్పి వెళ్ళాడు. కమలమ్మ కొంత సేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగీసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది. \r\n\r\nమంచి నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రతగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలు దేరింది కమలమ్మ. సరే అనట్టు తల ఊపింది ముంగీస. ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస. కొద్ది సేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది. ముంగీస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డని కాపాడిన సంతోశంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి, వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటు ఆవేశంలో నీటి బిందెను ముంగీస పై విసిరింది. ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడ్తున్నాడు. పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది. అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు.\r\n\r\nనీతి: ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనార్థాలకు దారి తీస్తుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 981,
        "IMAGE": null,
        "NAME": "పాము ముంగీస ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 79,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలు దేరింది నక్క. ‘ఇప్పుడు కడుపునిండా తింటే కానీ నా ఇంటికి సరిపడా శక్తి రాదు’ అనుకుంటూ వేగంగా నడుస్తోంది. \r\n\r\nఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది. ‘హమయ్య… ముందు దీన్ని తినేస్తే… కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది’ అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్లింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునేమార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే… ‘నక్క బావా… బాగున్నావా…?’ అంటూ ఎదురు వెళ్లింది. ‘ఆపు… నీ కబుర్లు! ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా’ అంది నక్క. ‘నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా! కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు, సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు’ అంది కుందేలు. ‘అయితే ఇప్పుడెమిటీ?’ అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే… నన్నూ, దాన్నీ కూడా తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకూ ఒకరికి ఒకరం లేమనే బాధా తప్పుతుంది’ అంది. ‘నీ మాటలు నిజమేనా?’ అంది నక్క. ‘ నీ మీద ఒట్టు, పద’ అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే.. దాని వెనకే వెళ్లసాగింది. \r\n\r\nకొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్దపులి కనిపించింది. వెంటనే కుందేలు ‘పులి రాజా… ఈ మూడో నక్కను కూడా తినేస్తే…మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి’ అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. ‘గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా… ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా  ఉంది’ అనుకుని వెనక్కి పరుగు అందుకుంది. తర్వాత కుందేలూ తనదారిన తాను వెళ్లిపోయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 982,
        "IMAGE": null,
        "NAME": "కుందేలు తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 80,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఉండేవి అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకొని తినేది. ఎవరైనా అడిగితే  కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది. ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ.\r\n\r\nపక్షులు జంతువులు అన్నీ కొంగ ను మెచ్చుకునే వి, ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ లోలోపల కొంగ పై అనసూయ పెంచుకున్నది. దానిని ఎలాగైనా బంగా పరచాలని  అనుకున్నది నక్క.\r\n\r\nఒకరోజు కొంగ వద్దకు వెళ్లి రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను కాదనకు మిత్రమా! అంటూ ప్రేమగా నటించింది నక్క.\r\n\r\nసరే మిత్రమా నీవు ఇంతగా పిలిస్తే కాదంటానా, అని ఒప్పుకున్నది కొంగ.  మరుసటి రోజు కొంగ వెళ్లేసరికి పాయసం, చేపల పులుసు కొన్ని రకాల వంటకాలు అన్నీ చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తున్నది నక్క.\r\n\r\nకొంగ ను చూడగానే, రా మిత్రమా రా అంటూ ఆహారాన్ని చూపించింది. తిను అని చెప్పింది, నక్క తినడం ప్రారంభించింది. కానీ కొంగకు కానీ కొంగకు వెడల్పాటి పాత్రలో ని ఆహారం తిన రాలేదు.\r\n\r\nఅప్పుడు నక్క హేళనగా ఇలా తినాలి మిత్రమా చూడు అంటూ మొత్తం తినేసింది.\r\n\r\nకొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది. పొడవాటి పాత్రలో పాయసం పోసి  తాగు మిత్రమా పాయసం చాలా బాగుంది అంటూ ఇలా తాగాలి చూడు నేను చూపిస్తాను అని తన ముక్కును పొడవాటి పాత్రలో పెట్టి పాయసం అంతా తాగేసింది కొంగ.\r\n\r\nఇంత రుచికరమైన పాయసం తాగలేక పోయావు మిత్రమా అంటూ హేళనగా నవ్వింది కొంగ.\r\n\r\nనేను చేసిన దానికి సరిగా బుద్ధి చెప్పినది అనుకున్నది నక్క లోలోపల.\r\n\r\nఈ కథలోని నీతి:\r\nఎదుటివారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 983,
        "IMAGE": null,
        "NAME": "కొంగ జిత్తులమారి నక్క",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 81,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు, రోజూ అలానే జరిగేది.\r\n\r\nఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపైనుండి తమ గుడ్లు ఏమై తున్నాయని గమనించాయి. అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట. తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని పిల్లలను చేయాలని దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు.\r\n\r\nఒకరోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబుగారి పిల్లలు వచ్చారు. వాళ్లు ఒంటి పైన ఉన్న నగలను తీసి చెరువు గట్టు పైన పెట్టి చెరువులోకి దిగారు ఆ పిల్లలు. ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించాయి. వారు చూస్తుండగా నగల దగ్గరికి వచ్చి ఒక కాకి కావ్ కావ్ మని అరిచి ఒక బంగారు నగను నోట్లోపెట్టుకొని పుట్టలోకి విడిచింది. వెంటనే ఆ పిల్లలు వెళ్లి మునసబు గారి తో కాకి నగను పుట్టలోకి విడిచిన విషయం చెప్పారు.\r\n\r\nవెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టని తవ్వి, నగ తీసుకు రమ్మని చెప్పాడు. ఆ పని వాళ్లు పలుగు పార పట్టుకొని వెళ్లారు. ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటకు వచ్చింది. దానిని వెంటనే చంపారు ఆ పని వాళ్ళు.  చెట్టు పైన ఉన్న కాకుల పామును చంపడం చూసి సంతోష పడ్డాయి.\r\n\r\nఈరోజు నుండి మనము గుడ్లు పెట్టి పిల్లలను చేయవచ్చు అనుకున్నాయి కాకులు. ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండ సాగాయి.\r\n\r\nనీతి:\r\nఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 984,
        "IMAGE": null,
        "NAME": "తెలివైన కాకి మరియు పాము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 82,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు. \r\n\r\nనలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే  విధ్యను సాధించాడు. ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వాద్ధ సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. \r\n\r\nవూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ‘ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది’ అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు ‘మనము దీన్ని బ్రతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు’ అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. \r\n\r\nఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.\r\n\r\nనీతి: తెలివి లేని బలం, విద్యా అనర్ధాలకు దారి తీస్తుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 985,
        "IMAGE": null,
        "NAME": "ఆలోచన లేని తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 83,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఏండి, వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. ఐనా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు, ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం. \r\n\r\nకొద్ది రోజులకు వానా కాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో “ఎందుకు ఇంత బాధ పడుతున్నావు , గుడిసెను బాగుచేయించుకోవచ్చు కదా” అన్నాడు మల్లయ్య. “మల్లయ్య! నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది, ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను” అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండా కాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందునుండి వెళుతుండగా వానా కాలంలో జరిగిన విషయం గుర్తుకువచ్చి “పుల్లయ్య! గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు, ఎండా కాలం వచ్చింది కదా!” అన్నాడు. \r\n\r\n“మల్లయ్య! ఎండా కాలం ఇల్లు ఎలా ఉన్నాఒకటే నాకు, ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పాడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు” అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు, నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సారి గాలితోకూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక, కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు లోభికి అత్యాశ ఎక్కువ.\r\n\r\nనీతి: లోభికి నాలుగు విధాల నష్టం.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 986,
        "IMAGE": null,
        "NAME": "పిసినారి పుల్లయ్య",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 84,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒక రోజు పనిమీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు.\r\n\r\nఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచే సరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించినది. దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరు దాము అనుకున్నాడు.\r\n\r\nఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది, దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి, అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు వైపు వెళ్లాడు.\r\n\r\nఅక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంతా చిన్న కాయల.\r\n\r\nఇది మరీ అన్యాయం అనుకొని కన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడి కాయలు కా ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన చెట్టు నీడన.\r\n\r\nఇంతలో గాలికి మర్రిచెట్టు కోమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తల పై పడింది వెంటనే, ఉలిక్కిపడి. దేవుడు చాలా తెలివైనవాడు. కాబట్టి అలా సృష్టించాడు.\r\n\r\nలేకపోతే మర్రిచెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలు అయిపోయింది అనుకున్నాడు. దేవుడిని తప్పు పట్టడం ఆ తెలివి తక్కువ తనం అనుకున్నాడు.\r\n\r\nనీతి:\r\nప్రకృతిని, సృష్టిని ఎవరు తప్పు పట్టరాదు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 987,
        "IMAGE": null,
        "NAME": "దేవుడు సృష్టి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 85,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రామాపురం అనే ఊరిలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మాట్లాడే చిలుకలు పెంచుకోవాలనే కోరిక ఉండేది. ఒక రోజు పక్క ఊరిలోని సంతలో చిలుకలను అమ్ముతారు అని తెలిసి కొనడానికి వెళ్ళాడు విష్ణుశర్మ. సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలకలను పెట్టుకున్నాడు ఒక వ్యాపారి. విష్ణుశర్మ అక్కడికి వెళ్లి 500 రూపాయలు ఇచ్చి ఒక చిలుకను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.\r\n\r\nఆ చిలుక ఏమి అడిగినా “అవునండి” అనే మాట తప్ప వేరొక మాట రాలేదు. వ్యాపారి మోసం చేశాడని, ఆ చిలుకను తీసుకొని వచ్చేవారం సంతకు వెళ్ళాడు విష్ణుశర్మ.\r\n\r\nవ్యాపారి వద్దకు వెళ్లి ఈ చిలుకను కొన్న రోజు నీకు నేను రూపాయలు 1000 ఇచ్చాను. చిల్లర లేవని 500 వచ్చేవారం సంతలో ఇస్తాను అని అన్నావు, ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు విష్ణు శర్మ.\r\n\r\nఅప్పుడు వ్యాపారి నీవు 500 ఇచ్చావు నీకు ఏమీ ఇచ్చేది లేదన్నాడు. అప్పుడు ఇద్దరూ గొడవ పడడం చూసి చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అందులో ఒక పెద్ద మనిషి, వ్యాపారి విష్ణుశర్మకు పైసలు ఇవ్వాలని చిలుక అని అడిగాడు.\r\n\r\nఅప్పుడు చిలుక “అవునండి” అంది. వ్యాపారి చిలుకకు అవునండి అనే మాట తప్ప వేరే మాట రాదని చెబితే మోసం చేసిన విషయం తెలుస్తుందని. 500 ఇచ్చాడు వ్యాపారి విష్ణుశర్మకు.\r\n\r\nవిష్ణు శర్మ మరో చిలుకను కొనుక్కొని రెండు చిలకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.\r\n\r\nనీతి:\r\nఆలోచనతో ఆనందంగా ఉండొచ్చు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 988,
        "IMAGE": null,
        "NAME": "చిలుకల మాటలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 86,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పంచమ అనే ఒక రాజ్యం కలదు, ఆ రాజ్యములోని అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక హంస ఉండేది. మిగతా ఏ ప్రాణులు ఉండేవి కావు.\r\n\r\nఆ సరస్సులోని హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి గత జన్మ రహస్యాలన్నీ తెలుసు.\r\n\r\nపక్కనే ఉన్న ఊరు నుండి ఓ పేద రాలు కట్టెలు ఎరుకోవడానికి అడవికి వచ్చింది. దూప కావడం వలన ఆ పేదరాలు సరస్సు దగ్గరికి వెళ్ళింది.\r\n\r\nఆమెను చూసిన హంస వెంటనే నీకు ఒక రహస్యం చెబుతాను నీవు ఇక్కడకు రా! అని పిలిచింది.\r\n\r\nపేదరాలి తో హంసా ఇలా చెప్పింది నేను నీ భర్తని చనిపోయాక హంస జన్మ ఎత్తినట్లు చెప్పింది.\r\n\r\nభార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస, రోజుకు ఒక బంగారు ఈకను సృష్టించి ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది హంస పేదరాలి తో.\r\n\r\nఅలానే తీసుకుంది పేదరాలు కొద్దిరోజుల్లోనే ఆమె ధనవంతురాలు అయిపోయింది. పెద్ద ఇల్లు కట్టుకుని బిడ్డలతో సంతోషంగా ఉంది.\r\n\r\nకొన్ని రోజులకు ఒక దురాశ కలిగింది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది. అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మళ్లీ కొత్త ఈకలు పుడతాయి అనుకుంది మనసులో.\r\n\r\nవెంటనే హంస ఎంత చెప్పినా వినకుండా ఈ ఈకలన్నీ తీసుకుంది. ఆ ఈకలు బూడిదలా మారాయి, బంగారం సృష్టించే శక్తిని కోల్పోయింది హంస మళ్లీ ఆమె పేదరాలి గా మారింది.\r\n\r\nనీతి:\r\nదురాశ వలన గొప్పవారు కాలేరు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 989,
        "IMAGE": null,
        "NAME": "దురాశ కథ ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 87,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "కామశీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలి స్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండితగోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఘూర్జరదేశం నుంచి వచ్చిన ఒక పండితుడు, తాను సంస్కృతంలో రచిం చిన ఒక శ్లోకాన్ని వినిపించాడు. అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం.\r\n\r\n“ఎప్పుడు, ఏ పని చేయాలో తెలుసుకుని చేస్తే, ఆ పనులు నెరవేరుతాయి. అలాకాక, అదును తప్పి చేసినపనులు వ్యర్థమవుతాయి,” అని ఆ పండితుడు రచించిన శ్లోకభావం. రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు. పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సభనుద్దేశించి ఒక ప్రశ్నవేశాడు: “ఏపని అయినా ఫలానా సమయానికి చేయాలి అని తెలుసుకోవడం ఎలా ?”\r\n\r\nసభలో వున్న జ్యోతిష పండితుడు లేచి, గ్రహగతులను బట్టి తెలుస్తుంది అన్నాడు. మరొక పండితుడు లేచి, అనుభవంగల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు. సభలోని తక్కిన పండితులు కూడా, ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు.\r\n\r\nపండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానమూ, విక్రసేనుడికి సంతృప్తి కరంగా లేదు. ఆయన పండితులతో, “దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాం,” అని, సభను ఆ రోజుకు ముగించాడు.\r\n\r\nకొంతకాలం గడిచింది. విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం పోగా, అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది. దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు. రాజు, ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు.\r\n\r\n“మహానుభావా! తపస్సంపన్నులైన తమరు, నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి,” అన్నాడు రాజు సాధువుతో.\r\n\r\nసాధువు తల ఎత్తి, రాజుకేసి ఒక్కక్షణం చూసి, ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు.\r\n\r\nఅప్పుడు రాజు వినయంగా, “మరేమీ లేదు. సమయ మెరిగి పని చెయ్యాలంటారు గదా! ఆ సమయాన్ని తెలుసుకోవడం ఎలాగు? అదీ నా సందేహం,” అన్నాడు.\r\n\r\nసాధువు, రాజుకేసి మరొకసారి చూసి, మరొక నవ్వు నవ్వాడు. సాధువు ఏదో దీక్షలో వున్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు.\r\n\r\nఆ మర్నాడు పెద్దవాన కురిసింది. విక్రమసేనుడు, ఆశ్రమానికి వెళదామనుకుని వెళ్ళ లేకపోయాడు. ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా, ప్రశాంతంగా వుంది. ఈసారి రాజు ఒక్కడే బయలుదేరి, అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి, మొక్కలు నాటుతున్నాడు.\r\n\r\nవిక్రమసేనుడు, ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి, “స్వామీ! ఈసారయినా తమరు ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను. లోగడ వచ్చినప్పుడు తమరిని, ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఎలా తెలుస్తుంది? అని అడిగాను,” అన్నాడు.\r\n\r\nసాధువు తన పని తను చేసుకుంటూ, రాజు మొహంలోకి చూసి, “మహారాజా! మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను. ఐతే, మీరు గ్రహించలేదు,” అన్నాడు.\r\n\r\n“అలాగా, స్వామీ! కాస్త వివరంగా చెప్పం డి,” అన్నాడు విక్రమసేనుడు.\r\n\r\n“ఇదీ, ఆ వివరం!” అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు.\r\n\r\nసాధువు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది: సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలుపెడితే, సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం ‘తోడయినట్లుగా, చేసేపనికి కాలం కలిసి వస్తుంది, అన్న యథార్థం!  సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుదిరిగాడు విక్రమసేనుడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 990,
        "IMAGE": null,
        "NAME": "సమయజ్ఞత",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 88,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అనగా అనగా వొకవూళ్లో రామయ్య, సోమయ్య అని యిద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు; తెలివిగలవాడు. సోమయ్య చిన్న వాడు; అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతులబిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. సోమయ్య భార్య బీదయింటి పిల్ల. అందుచేత కొంచెం అణకువగా వుండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతాకాజేసి తాతలనాటి చిన్న పాతయిల్లూ, నాలుగెకరాల మెట్టచేను మాత్రం అతనికి యిచ్చాడు. పెద్దమేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం, సోమయ్య దాంతో నేతృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిం దాంట్లో తను కొంత తిని, మిగతాది ధర్మంచేస్తూ వుండేవాడు.\r\n\r\nఇలా వుండగా వొకనాటి రాత్రి ఎవరో సన్యాసి, రామయ్య యింట్ కొచ్చి తలుపుతట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి ” ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడ్తావు?” అని గద్దించాడు.\r\n\r\nఅప్పుడు సన్యాసి “బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరంపోతూ యిటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్లిపోతాను” అన్నాడు.\r\n\r\n” ఏంటి, మాయింట్లో వల్లగాదు పో, పో. అదుగో, ఆ వున్నాడు షాహుకారు. వాడి దగ్గిరికి పో. దోవన యేసన్యాసిపోతున్నా పిలిచి అన్నం పెడతాడు.” అన్నాడు రామయ్య.\r\n\r\nయోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని యింట్లోకి తీసుకుపోయి, భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు.\r\n\r\nసన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసుర్తూ కూచున్నాడు.\r\n\r\nసన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యనూ అతని భార్యనూ పిలిచి “మీకు మూడు వరాలిస్తాను. కోరుకోండి” అన్నాడు.\r\n\r\nసోమయ్య “స్వామీ, నాకు, నలుగురు ఇంటికివస్తే, ఉండటానికి పెద్ద యిల్లూ, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బూ యివ్వండి. అదిచాలు” అన్నాడు.\r\n\r\nసోమయ్య పెళ్లాం “స్వామీ, నాకేమీ వద్దు; యితరులకు లేదనకుండా ధర్మం చెయ్యటానికి నాకు బుద్ధి పుట్టించు” అని రెండో వరం అడిగింది.\r\n\r\nమూడో వరంగా, సోమయ్య “స్వామీ, మాకు యెప్పుడూ యితరులకు మేలు చెయ్యాలనే బుద్ధి వుండేట్టుగా వర మివ్వండి” అని అడిగాడు.\r\n\r\nసన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని యింటి ముందు పెద్ద మేడవుంది. రామయ్య దబదబ పెళ్లాన్ని పిలుచుకుని మేడ దగ్గిరకి పరుగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడూ తమ్ముడి భార్యా వున్నారు. రామయ్య “యిది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.\r\n\r\nఇక రామయ్య పెళ్లానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకు రమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది.\r\n\r\nప్రకటనలు\r\n\r\nReport this ad\r\nరామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంతదూరం పోయేవరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, రోజుతూ “స్వామీజీ! రాత్రి మావల్ల చాలా నేరం జరిగింది. ఈమాటు మా యింటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్యకూడా మిమ్మల్నితీసుకురమ్మన్నది” అని బ్రతిమాలాడు.\r\n\r\n“బాబూ! ఏదో నాదోవను నేను తీర్థ యాత్రలకు పోతున్నాను; నేను రాలేను.” అన్నాడు సన్యాసి.\r\n\r\n“అలాగైతే ఎట్లా స్వామీ ! నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన మూడు వరాలైనా ఇచ్చి వెళ్లండి.” అన్నాడు రామయ్య.\r\n\r\nసన్యాసి రామయ్య వదలడని అనుకొని- “సరేలే నీకూ నువ్వుకోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తయి” అన్నాడు.\r\n\r\nరామయ్య పట్టరాని సంతోషంతో, గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటి వేపుకు బయలుదేరాడు. గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ, భూమిమీద కాళ్లు ఆనకుండా దౌడుతీస్తున్నది.\r\n\r\nయింతలో రామయ్యకి వొక దుర్బుద్ధి పుట్టింది. “గుఱ్ఱం ఇంత త్వరగా పరుగెత్తు తున్నదే వొకవేళ చచ్చిపోతే ఎట్లాగా ?” అనుకున్నాడు. అనుకోవటంతోటే, గుఱ్ఱం క్రిందపడి చచ్చింది.\r\n\r\nరామయ్య గుఱ్ఱంతోపాటు కిందపడ్డాడు. పడి, లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుఱ్ఱాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుఱ్ఱాన్ని వొదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. ఐనా ఏమిచేస్తాడు. వెళ్లకతప్పదు. “గుఱ్ఱం చావనేచచ్చింది. ఈ జీను వొదిలి పెట్టటం ఎందుకా” అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు.\r\n\r\nకొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్లాం మాటలు విని యింత దూరం వచ్చినందుకు అతను విసుక్కు న్నాడు. విసుక్కుని “పాపమని, నన్ను యోగికోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం!” అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటీ వొక్కసారే జరిగినై.\r\n\r\nరామయ్య మూడింట్లో రెండు వర్గాలు యిలా వూరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చు కుంటూ యింటికివచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునివున్నది. ఆమె నెత్తిమీద జీను ఆమె రామయ్యని చూడగానే మండి పడుతూ, ‘ఏమిటిదీ ? ఎట్లావచ్చింది నీ జీను నా. నెత్తిమీదికి ?” అని అడిగింది.\r\n\r\nరామయ్య కప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ” ఇదుగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు వోర్పుగా జీను మోస్తూవుండు. మనదగ్గిర యింకోవరం మిగిలివున్నది. దీంతో మనం యేదైనా మంచివరం కోరుకుని ధనవంతులమయి హాయిగా వుందాం.” అన్నాడు.\r\n\r\nఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. ” నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీది జీను దించు. లేకపోతే బాగుండదు చెప్తున్నాను” అన్నది.\r\n\r\nపాపం రామయ్య పెళ్ళానికి భయపడి “జీను వూడిపోవాలి” అని కోరుకున్నాడు. జీను వూడి క్రిందపడ్డది.\r\n\r\nచూశారా! రామయ్య దుర్భుద్ధితో యింత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు యిట్లా మట్టిలో కలిసిపోయినై.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 991,
        "IMAGE": null,
        "NAME": "అన్నదమ్ములు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 89,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రంగాపురంలోని హనుమంతు తన ఇరవై యవ యేట ఒక పడవ ప్రమాదంలో తల్లి దండ్రులను పోగొట్టుకున్నాడు. బతుకు తెరు వుకు దిక్కుతోచక నిలబడ్డ హనుమంతును, అతడి తండ్రి స్నేహితుడు నాగయ్య చేరదీసి ఆదరించాడు.\r\n\r\nనాగయ్య సలహా ప్రకారం యన దగ్గరే అప్పుతీసుకుని హనుమంతు నాలుగు మేక పిల్లల్ని కొన్నాడు. వాటికి బాగా తిండిపెట్టి మేపాడు. అవిపెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పు తీర్చేయడమే గాక, మరొక పది మేకపిల్లల్ని కొని మేపడం మొదలు పెట్టాడు. తిండికీ, బట్టకూ ఎలాంటి లోటూ లేకుండా రోజులు గడవసాగాయి. కొన్నాళ్ళకు హనుమంతు పేరు మేకల హను మంతుగా మారిపోయింది.\r\n\r\nరెండు మూడేళ్ళలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఒక పేదింటి అమ్మాయి మంగమ్మను పెళ్ళిచేసుకున్నాడు. ఆమెకు జంతువులన్నా, పక్షులన్నా ప్రాణం. భర్త చేస్తూన్న మేకల వ్యాపారం ఆమెకు అసలు నచ్చలేదు. కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక, తనూ సర్దుకుపోలేక సతమతమ వుతూ చాలా ఇబ్బంది పడసాగింది.\r\n\r\nకొన్ని రోజులు గడిచాక ఒకనాడు ధైర్యం చేసి, భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది. అయితే అతడు, “ఇది వ్యాపారం, తప్పదు,” అని ముక్తసరిగా జవాబివ్వడంతో మరేమీ మాట్లాడలేకపోయింది.\r\n\r\nఒకనాడు సంతకువెళ్ళి వచ్చిన భర్త స్నానానికి నీళ్ళు తోడి, అన్నం వడ్డిస్తూ, “అంత ప్రేమగా పెంచిన ఆ మేకను కసాయివాడికి ఎలా అప్పగించావయ్యా? నీకు మనసెలా ఒప్పింది?” అని అడిగింది మంగమ్మ.\r\n\r\n“అది అంత లావుగా, బొద్దుగా ఉంది గనకే మంచి ధర పలికింది,” అన్న భర్త మాటకు అడ్డు తగులుతూ, “ఇలాంటి కసాయిపని చేస్తున్నావు గనకే, ఇంకా మనకు పిల్లలు పుట్టలేదు. అయినా బతకడానికి ఎన్ని మార్గాలు లేవు? రెండెకరాల పొలం కౌలుకు తీసుకుందాం. దాంతో పాటు రెండు గేదెలు కొనుక్కుంటే, పాలవ్యాపారం చేసుకుంటూ హాయిగా బతకవచ్చు,” అన్నది మంగమ్మ.\r\n\r\n“చాలు నీ బోడిసలహా, సంపాయించి తెచ్చి ఇస్తున్నాను కదా. ఇంట్లో కూర్చుని ఎన్నయినా చెప్పగలవు. నోరు మూసుకుని వెళ్ళి పడుకో,” అంటూ ఇంత తిని వెళ్ళి పడుకున్నాడు హనుమంతు.\r\n\r\nమరునాడు నిద్రలేస్తూనే హనుమంతు’ భార్యతో, “గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకలు తీస్తున్నారట. గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి మేకపిల్ల కావాలని కబురు చేశారు. తెల్లవారేసరికి బలి ఇవ్వాలట. రాత్రికి రాత్రే తోలుకు రమ్మన్నారు. మంచి బేరం. కొట్టంలో సరైన మేకపిల్ల లేదు. నువ్వు మేపుతున్నావు కదా. దాన్ని సాయంకాలం తోలుకుపోతాను,” అన్నాడు.\r\n\r\nఆ మాట వినగానే మంగమ్మ మనసు విలవిలలాడింది. ఒక కంటి చూపు సరిగా లేదని ఆ మేకపిల్లపై కనికరంతో మంగమ్మ దాన్ని బిడ్డలా పెంచుతున్నది. ఇప్పుడు దాన్ని అమ్ముతానంటున్నాడు భర్త. వద్దని బతిమలా డింది. కానీ హనుమంతు ఏమాత్రం పట్టిం చుకోలేదు. “కావాలంటే నువ్వు మరొక మేక పిల్లను పట్టి సాకు,” అంటూ ఆ సాయంకాలం మేకపిల్లను తోలుకుని గంగాపురం బయలుదేరాడు.\r\n\r\nఇంతకు ముందు ఇలా రాత్రి వేళ రెండు మూడుసార్లు మాత్రమే వెళ్ళాడు. మామూ లుగా ఉదయమే వెళుతూ ఉంటాడు. ఆ రోజనగా హఠాత్తుగా ఉరుములు మెరుపు లతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది. మామూలు దారిగుండా వెళితే, ఎక్కువ సమయం పడుతుందని అడ్డుదారి గుండా నడవసాగాడు. అంత చీకటి దారిలో నడు స్తూన్న అతడికి మొదటిసారిగా భయం వేసింది. అడుగుల వేగం పెంచాడు.\r\n\r\nమార్గ మధ్యంలో దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉంది. తొందరగా వెళ్ళాలన్న ఆదు ర్దాలో, హనుమంతు ఆ బావి సంగతి మరి చాడు. దాని పక్కగా వెళుతూ కాలుజారి ఆ బావిలో పడిపోయాడు. భయంతో కేకలు వేశాడు. లోతుబావి కావడంతో అతడి గొంతు దాటిన కేకలు బయటకు వినిపించలేదు.\r\n\r\nహనుమంతు వెంట అంతదూరం వచ్చిన మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ, బావిలోకి తొంగి చూస్తూ, తన యజమాని కోసం అరవసాగింది. తన కోసం మేకపిల్ల పడుతూన్న ఆరాటం గమనించిన హను మంతు మనసు కలుక్కుమన్నది. బావి లోపల ఏదో పట్టు దొరికితే, దాన్ని పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపాడు.\r\n\r\nతెలతెలవారుతూండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి, ఇద్దరు ముగ్గుర్ని వెంటబెట్టుకు వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది. దాన్ని చూసి మరికొందరు పోగ య్యారు. పరిస్థితిని గ్రహించి, వాళ్ళందరూ కలిసి హనుమంతును బయటకు తీశారు.\r\n\r\nబయటకు వచ్చీ రాగానే హనుమంతు మేకపిల్లను కౌగిలించుకుని భోరున ఏడ్చాడు. తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకుని వుండవచ్చు. అయినా, అది అలా చేయలేదు. తనను కాపాడాలనుకున్నది. దాన్ని గురించి ఆలోచి స్తూంటే హనుమంతుకు కన్నీళ్ళు ఆగలేదు. తనను బావి నుంచి బయటకు తీసినవారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి, మేకపిల్లను ప్రేమగా నిమిరి వెనుదిరిగి ఇంటిదారి పట్టాడు. \r\n\r\nమేకపిల్లతో తిరిగి వచ్చిన భర్తను ఆశ్చ ర్యంగా చూసింది మంగమ్మ.\r\n\r\n“ఎప్పటినుంచో పొరుగూరు వెంకటసామి వీటన్నిటినీ అమ్మమంటున్నాడు. అతడు ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడట. రేపే వీటిని అమ్మేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకు తీసుకుందాం. పాల వ్యాపారం చేసుకుందాం. దీన్ని మాత్రం నాతోపాటే ఉంచు కుంటాను. ఇప్పటికి ఇదే నా సంతానం, ” అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు. మంగమ్మకు ఏదీ అంతు బట్టక, “ఇంతకూ ఏం జరిగింది?” అని భర్తను విస్మయంతో అడిగింది. మేకనే కళ్ళ నిండా చూసుకుంటూ రాత్రి జరిగిన విషయం భార్యకు వివరించాడు హనుమంతు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 992,
        "IMAGE": null,
        "NAME": "మేకల హనుమంతు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 90,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహార యాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్ది మంది సైనికులు, ఆ నోద్యోగులు కూడా ఉన్నారు. విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గము ధ్యంలో వారికో పెద్ద పులి ఎదురుపడింది. దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థాణువులై నిల్చుండిపోయారు. తేరుకున్న మహారాజు ఆ క్రూరమృగాన్ని ఎదిరించడా నికి ఇద్దరు సైనికుల్ని నియుక్తపరచవలసిందిగా సేనాధిపతిని ఆదేశించాడు.\r\n\r\nఅదివిన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్లతో వారించి మహారాజుతో ఏకాంతంగా, ‘ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదిరించడం ఉత్తమం,’ అని సలహా ఇచ్చాడు. మహామంత్రి సలహా వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్దపులిని ఎదిరించడానికి ఉద్యుక్తుడై ఓ సైనికుని చేతిలోంచి బల్లెం తీసుకున్నాడు. వీరుడైన చంద్రహాసుని ధాటికి ఎక్కువ సమయం నిలువలేక తోకముడిచి అడవి లోకి పారిపోయింది గాయపడ్డ మృగం.\r\n\r\nతమని కాపాడేందుకు మహారాజు ప్రద ర్శించిన ధైర్యసాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరు కున్న తర్వాత తమ బంధుమిత్రులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు. అలా ఆనోటా, ఈనోటా ఈ సాహస కృత్యం జను లందరి నోళ్లలోనూ నాని మహారాజు కీర్తి ఇనుమడించింది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకి దక్కింది.\r\n\r\nకొంతకాలానికి పొరుగునున్న వంగదేశా నికి రాజైన శూరసేనుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు. సంధి ప్రయత్నాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమైంది.\r\n\r\nమొదటి రోజు పోరు భీకరంగా సాగింది. మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని చీల్చి చెండాడాడు. మరునాటి యుద్ధతంత్రాన్ని రచించాలనుకున్న పద్మ సంభవుడు సేనాధిపతితో ఆరోజు యుద్ధ విశేషాలు చర్చించసాగాడు. అప్పుడు సేనాని మంత్రితో, ‘మహామంత్రీ! ఈ రోజు యుద్ధ భూమిలో మహారాజు పరాక్రమాన్ని కను లారా చూడవలసిందే గానీ వర్ణించనలవి కాదు. సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం, మనకు విజయం తథ్యం!’ అని వ్యాఖ్యానించాడు.\r\n\r\nసేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సాలోచనగా తలపంకిస్తూ మహారాజుని కలవడానికి అతని ఏకాంత మందిరానికి వెళ్ళాడు. చంద్రహాసుని కలిసి, ‘మహారాజా, యుద్ధరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో, ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించ వలసిన బాధ్యత మన సేనకూ ఉంది. కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవ హరిస్తూ ముందు ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి,’ అంటూ సూచించాడు.\r\n\r\nప్రకటనలు\r\n\r\nReport this ad\r\nఆ రోజు అడవిలో క్రూరమృగాన్ని ఎది రించడానికి సైనికులను పంపబోతే వద్దని వారించి, తనని పోరాడమని చెప్పిన మహా మంత్రే ఇప్పుడు తను యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించడం అసహజంగా తోచింది చంద్రహాసునికి. అదే విషయాన్ని ఆయనతో చెప్పి, ‘ఒకే విధమైన రెండు సందర్భాల్లోనూ ప్రతిస్పందించే తీరులో ఈ భేదం ఎంతవరకూ సమంజసం మంత్రి వర్యా?’ అంటూ సందేహం వెలిబుచ్చాడు.\r\n\r\nఅందుకు మహామంత్రి పద్మసంభవు డిలా సమాధానం చెప్పాడు. ‘మహారాజా! సందర్భాలు రెండూ ఒకేలాంటివైనా వాటి మధ్య సూక్ష్మభేదం ఉంది. ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు. దానికంటూ నియమిత పోరాట రీతులూ, యుద్ధనియమాలూ లేవు. కానీ మన సైని కులుమాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సుశిక్షితులు క్రూర జంతువును ఎదుర్కొవాలంటే వీరు పొందిన శిక్షణ, ధరించిన ఆయు ధాలుంటే సరిపోదు. దాన్నెదిరించే గుండె ధైర్యం కూడా ఉండాలి. అది ఆక్షణంలో మన సైనికుల్లో లోపించింది. మీ ఆజ్ఞను ధిక్క రించలేక ఆ మృగాన్ని వాళ్లు ఎదిరించ పూను కున్నా, మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు ఫణంగా పెట్టారన్న అపఖ్యాతి మీకు పర్యవ సానంగా దక్కి ఉండేది. అలా కాకుండానే మిమ్మల్నే ఎదిరించమని సూచించాను.\r\n\r\nనేను ఊహించినట్లే ఆనాటి మీ సాహసం నేటికీ ప్రజలనోట వీరగాధగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇనుమడింపజేస్తోంది. ఇక ఈనాటి యుద్ధం విషయానికొస్తే మన సైనికులు తలపడాల్సింది, తమలాంటివారే అయిన శత్రుసైనికులతో, కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు. అందునా ఆనాటి సంఘటనల వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది. ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి, విశ్వాసా లనే కాదు, ప్రభువుగా ప్రేమాభిమానాలను పెంచుకునేలా చేసింది. మీవంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణా లను సైతం లెక్కచేయరు. అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి. మీ ప్రాణాలెంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రువు పన్నిన వలలో మీవంటి వారు చిక్కుకుని ఆపదలు కొని తెచ్చుకోవడం సైన్యానికీ, రాజ్యానికీ శ్రేయ స్కరం కాదు. కాబట్టి సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత. మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం’ అంటూ విడమర్చి చెప్పాడు.\r\n\r\nమహామంత్రి సూచనలు, సలహాలు వెనుక ఇంతటి అర్థమున్నదని తెలుసుకున్న చంద్రహాసుడు, ‘మంత్రివర్యా, మా క్షేమాన్ని చూసుకోడానికి మీ వంటి విజ్ఞులుండటం మా అదృష్టం,’ అంటూ నమస్కరించాడు.\r\n\r\nయుద్ధం ముగిసింది. పద్మసంభవుడి యుద్ధతంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవ్వగా విజయలక్ష్మి చంద్రహాసుని వరించింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 993,
        "IMAGE": null,
        "NAME": "యుద్ధతంత్రం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 91,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఇంద్రప్రస్థనగరంలో ఒక గొప్ప ధనికుడుండేవాడు. కొంత కాలం సుఖాలలో మునిగి తేలినాక, ఆయనకు రోజులు కలిసిరాక, ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్తా ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు.\r\n\r\nఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, ‘నువు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్లు. అక్కడ నీకు డబ్బు దొరు కుతుంది. దానితో నువు తిరిగి ధనికుడవై సుఖపడగలవు!’ అని చెప్పాడు.\r\n\r\nకలలో శ్రీమహావిష్ణువు చెప్పిన మాట లలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంట రిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవే శించేసరికి బాగా చీకటి పడింది. అమా వాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు.\r\n\r\nఅందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మంటపంలో పడుకుని కొద్ది సేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవే శించారు. ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి, ‘ దొంగలు! దొంగలు!’ అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్ట యింది. వారు గోడమీదినుంచి గుడి ఆవ రణ లోకి దూకి మంటపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్థానమైనారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవ రణ అంతా వెతికి, చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు.\r\n\r\nదూరప్రయాణం చేసి మట్టికొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు. ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు! ఎవరు నీవు? ఎందుకు దొంగతనానికి వచ్చావు?’ అని అడిగాడు.\r\n\r\n‘అయ్యా, నేను దొంగను కాను. మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బతి కిన వాణ్ణి. భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధన మంతా పోగొట్టాడు. అంతటితో తృప్తితీరక, శ్రీమన్నారాయణ మూర్తి రూపంలో కలలో కనిపించినన్నీ పాటలీపుత్రానికి వెళ్లమనీ, ఇక్కడ నాకు ధనం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమ పడి ఇంద్రప్రస్థనుంచి ఇక్కడిదాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి నాలుగు ఘడి యలైనా కాకముందే తమచేత తన్నులు తిన్నాను!’ అన్నాడు పరదేశి.\r\n\r\nఈ మాటలు విని తలారి నవ్వి,’ ఓయి పిచ్చివాడా! ఎవరైనా కలలను నమ్ముతారా! కొద్ది కాలం కిందట నాకుకూడా కలలో శ్రీమన్నారాయణ మూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలాని ఇంటివెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుం దన్నాడు. నేనా మాటలు నమ్మి ఇంద్ర ప్రస్థం వెళ్లలేదే! కనుక నువు ఇలాటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్లు!’ అని సలహా ఇచ్చాడు.\r\n\r\nడబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టుకింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధన వంతుడై సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 994,
        "IMAGE": null,
        "NAME": "నమ్మదగిన కల",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 92,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు తీసుకుని రా’ అని చెప్పింది.\r\n\r\nరాము పళ్లు కొరుక్కుంటూ, చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు. తోటి గ్రామీణులకు మల్లే అతడు కష్టజీవి కాదు. అడ్డదారుల్లో డబ్బు సాధించడం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు.\r\n\r\nపట్టణానికి వెళ్లేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది. ఏటికి ఆవ తల ఒడ్డున గట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి. చెట్లవరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింతచెట్టు చూశాడు. అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి. కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని, మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఈ చింతచెట్టు ఏటికి సమీపంలో గట్టుపై ఉంది. అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే, కలప గిడ్డం గికి తీసుకుని పోతే భారీగానే డబ్బు ముట్ట వచ్చు. తాను పట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి, అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు.\r\n\r\nఈ పనికోసం తన స్నేహితుడు గోపీ సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడూ భాగం పంచుకునేవాడు. చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసు కోవాలని అతడు భావించాడు. రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు. గోపీ ఎద్దుల బండిని, కూలీని పిలుచుకు వస్తాడు. చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారకముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు. కలపవ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు. ఈ పనిలో సాయపడినవారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు.. అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము. అనంతరం పట్టణం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు. తాను తెచ్చి ఇచ్చే కలపకోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత గోపీని, ఇతరులను సంప్రదిం చాడు. తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు. వారందరూ చేరి మాట్లాడుకుని చేయవ లసిన పనిని ఖరారు చేసుకున్నారు.\r\n\r\nసమయం రానే వచ్చింది. రాముకు మనసులో ఉత్సాహం పొంగి పొరలుతోంది. చింతచెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకు న్నాయి. చీకటిపడేవేళకు మెరుపులు మెరి సాయి. త్వరలోనే వర్షం ధారగా కురవసా గింది. రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింతచెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. చెట్టు కొట్టే కాలయ్య చెట్టువద్దే అతడిని కలుసుకుంటాడు. ఇత రులు కూడా అర్థరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు. అలా ఆలోచించుకుంటూ, వర్షాన్ని లెక్కచేయకుండా రాము నదికేసి బయలుదేరాడు. నది సమీపంలో కను చూపు మేరలో ఎవరూ కనపడలేదు. రాము పెద్దగా నిట్టూర్చాడు. ఎవరయినా తను చేస్తున్న పని చూసి గ్రామపెద్దకు చెపితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి.\r\n\r\nవర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతోంది. మెల్లగా అతడు నదిని దాటసాగాడు. నదిలో మోకాటిలోతు నీళ్లు పారుతున్నాయి. సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది. రాము ఎడమవైపు తిరిగి చూశాడు. నది ఎగువ నుంచి నీళ్లు తన్ను కొస్తున్నాయి.\r\n\r\n‘దేవుడా, అది అటవీ ప్రాంత నది. ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది’ ఈ విషయం తల్చుకో గానే రాము వణికిపోయాడు. ప్రాణం కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు. నది గట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు. నీళ్ళు ఒక్క సారిగా ఎత్తి కుదేశాయి. రాము పెనుకేక పెట్టాడు. ‘దేవుడా! నన్ను కాపాడు.’\r\n\r\nఉన్నట్లుండి దూలంవంటి వస్తువుపై పోయిపడ్డాడు. దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. అమ్మయ్య. వరద ప్రమా దంనుంచి గట్టెక్కినట్లే… కాస్సేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థ మయింది. వరదనీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి. నెమ్మదిగా అతడు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపో యాడు.\r\n\r\nకనుచూపుమేరా ఎవరూ కనపడలేదు. తన మిత్రుడు గోపీ, చెట్లు కొట్టే కాలయ్య, పనివాడు ఎక్కడా కనపడలేదు. వాళ్లు తెలి విగా ఉండి నది దాటి రాకుండా ఉండిపో యారేమో! ఆ రాత్రంతా తను చెట్టుమీదే ఉండాలని రాము గుర్తించాడు. వేరే మార్గం లేదు. కాస్సేపయ్యాక వరదనీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు. అత డొక అబ్బాయి. ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు. త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రాము వాటిని కూడా కాపా డాడు. ఆ అబ్బాయి గొర్రెల కాపరి. నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరదనీ టిలో కొట్టుకుపోయింది.\r\n\r\nరాము, గొర్రెల కాపరి, మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు. వరద నీరు మరికాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది. కాస్సేపయ్యాక, వర్షం ఆగిపోయింది. వరద కూడా తగ్గుముఖం పట్టింది. తర్వాత తెల్లారిపోయింది. రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు. ఆశ్చర్యం. తాను నరికివేయాలనుకున్న చింతచెట్టు మీదే ఉన్నాడతను. ఆ చెట్టుకొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకమేశాడు తను. మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది? భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది, ప్రాణం కాపాడింది. అతడి కను కొనుకుల నుంచి కన్నీళ్లు కారాయి. అతడు మెల్లగా గొణుక్కొన్నాడు.\r\n\r\n‘వృక్షరాజమా! నేను నీపట్ల క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించాను. నన్ను క్షమించు!’ సహజసిద్ధంగానే తను సోమరీ, స్వార్థపరు డూనూ. కాని ఆ కాళరాత్రి తను ఒక అబ్బా యిని’, మేకలను కాపాడాడు. నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని. తనవంటి క్రూరుడికి ఆశ్రయమిచ్చిన చింతచెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాడు. ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది. చింత చెట్టును కావిలించుకుని గొణిగాడు. ‘కృత జ్ఞతలు. ఇన్నాళ్ళూ పశువులా వ్యవహరిం చాను. నన్ను మనిషిగా మార్చావు!’\r\n\r\nఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి. తన భార్య అంజలి, మరి కొందరు గ్రామస్తులు చెట్టువద్దకు పరుగెత్తి వస్తుండటం చూశాడు. రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడి పోయింది. కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది. అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది. గత రాత్రి తాను చావుబతుకుల మధ్య ఎలా కొట్టుకులాడిందీ రాము వివరించి చెప్పాడు. వరద ముంపునుంచి బయటప డ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు. అంజలి చెప్పింది.\r\n\r\n‘అవును భవానీ మాత దయవల్లే నీవు బతికి బయట పడ్డావు. మనం ఆ తల్లికి మొక్కుకుందాము. ‘\r\n\r\n‘వద్దు అంజలీ, ఈ దేవతే నన్ను కాపా డింది,’ అంటూ రాము చింతచెట్టు కేసి చూపించాడు. ‘ఇది సజీవరూపంలోని దేవుడు. నేను బతికి బట్టకట్టడానికి ఎవరిక యినా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి. ఇకపై నేను పచ్చనాకు చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇతరులు ఎవరయినా చెట్లు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను.\r\n\r\nతర్వాత అతడు చింతచెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 995,
        "IMAGE": null,
        "NAME": "సజీవ దేవుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 93,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో, నిర్వా సుడనే కోపిష్టి ముని వుండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు. వెనకాముందూ చూడకుండా పెద్ద శాప మివ్వడం ఆయన అలవాటు,\r\n\r\nఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి, రాక్షసుడివి కమ్మని శపిం చాడు నిర్వాసుడు. సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు.\r\n\r\nసుదీపుడి మంత్రి సుకాముడు. ఆయనకు జరిగిన విషయం తెలిసింది. వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసుణ్ణి కలుసుకుని, “మునివర్యా! సుదీపుడు మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా వుండేవారు. మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై, ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు. సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురుపెట్టడం తమకు భావ్యంకాదు. దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పండి.” అని వేడు కున్నాడు.\r\n\r\nనిర్వాసుడు మంత్రి వంక జాలిగా చూసి, “ఒకానొకప్పుడు బ్రహ్మదేవు డిచ్చిన వరాలవల్ల, ఎందరో రాక్షసులు అమిత బలవంతులై ప్రపంచాన్ని బాధిం చారు. అంటే, దేవుడివల్ల తప్పు జరిగిందనా? ప్రజలు తమ కర్మఫలం అనుభ వించవలసి వచ్చినప్పుడు, దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు; మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. నన్నూ, నిన్నూ, అందర్ని నడిపించేవాడు ఆ పైన వున్నాడు.” అని చెప్పాడు.\r\n\r\n“మునివర్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా దేశ ప్రజల కర్మఫలం తిరిపోయే సమయం వచ్చిందేమో, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. సర్వ శక్తి మంతులైన తమరు, నాకేదైనా నివారణో పాయం సెలవిచ్చి పంపండి.” అని సుకాముడు, నిర్వాసుణ్ణి మరీ మరీ వేడు కున్నాడు.\r\n\r\nచివరకు నిర్వాసుడు, “నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది. కాబట్టి నీకొక రహస్యం చెబుతున్నాను, విను. ఇక్కడికి ఆమడ దూరంలో కాళికాలయ మొకటి వున్నది. అందులో నిలువెత్తు కాళీ విగ్రహం సామాన్యుల గుండెలు జలదరింప చేసేటంత భయంకరంగా వుంటుంది. నీవు, ఆ విగ్రహం ముందు నిలబడి, నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైనభాగాన్ని అర్పిస్తే, మనసులోని కోరిక తీరుతుంది. వెళ్ళు!” అని చెప్పాడు.\r\n\r\nసుకాముడు ఆమడ దూరం. ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు. అక్కడ కాళికా విగ్రహం భయంకరంగా వున్నప్పటికీ చలించక, “మాతా! నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి. అందుకుగాను, నా శరీరంలో నా కెంతో ఇష్టమైన శిరస్సును నీకు సమర్పించు కుంటున్నాను.” అంటూ ఒరలోంచి కత్తి తీసి తలను నరుక్కోబోయాడు.\r\n\r\nఅప్పుడక్కడ కనులు గొలిపే వెలుగు వచ్చింది. సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ మరు క్షణం, మానవా ! నీ దేశ భ క్తికి, సాహసానికి మెచ్చాను. నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి, అందరికీ అర్థ మయ్యే విధంగా వేయి పుటల కథను వ్రాయి. ఆ కథను చదవడం మొదలు పెడితే, మధ్యలో మానాలనిపించకూడదు. అప్పుడా కథను రాజు సుదీపుడికి వినిపించు. అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు.” అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి.\r\n\r\nసుకాముడు కంగారుగా, మాతా ! నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంథాలు చదివాను. ప్రజోపయోగకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలు అభ్యసించాను. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో వైద్యం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు సాహిత్యంపట్ల అభిరుచి లేదు. ఒక్కగా నొక్క మహాకావ్యం కూడా చదవలేదు. ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు. నావంటి వాడివల్ల కథ వ్రాయడం వీలవుతుందా ?” అని అడిగాడు కళ్ళు మూసుకునే.\r\n\r\n“నీకు వింటున్నకొద్దీ వినాలనిపించే లాగా కబుర్లు చెప్పడం చేతనవును కదా ! అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలని పించేలాగా పెద్దకథగా వ్రాయి . నీకథను -అన్ని వయసులవాళ్ళూ చదివి ఆనందిస్తారు. ఆ కథవల్లనే నీ రాజుకు శాప విమోచన మవుతుంది. ఇది నేనిచ్చిన వరంగా భావించి, నేను చెప్పినట్లు చెయ్యి.” అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి.\r\n\r\nసుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి, రాత్రింబవళ్ళు కష్టించి ఒక మాసం రోజుల్లో వేయిపుటల కథను వ్రాశాడు. తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు.\r\n\r\nరాక్షసరూపంలో వున్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుకాముడి మీదికి వచ్చాడు. సుకాముడు చలించకుండా తన గ్రంథాన్ని తెరిచి చదవడం ప్రారం భించాడు.\r\n\r\nఅంతే! సుదీపుడు మంత్రం వేసినట్లాగి పోయాడు.\r\n\r\nసుకాముడు పుట తర్వాత పుటను చదువుతూంటే, సుదీపుడు శిలా ప్రతిమలా నిలబడి వినసాగాడు. అలా ఏకబిగిని సుకాముడు గ్రంథాన్ని చదివాడు, సుదీపుడు విన్నాడు.\r\n\r\nచివరిపుటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి, సుకాముడి కళ్ళముందు రాక్ష సుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు. ఆయన అప్పుడు మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు.\r\n\r\nఆ తర్వాత రాజూ, మంత్రీ అంతఃపురా నికి వెళ్ళారు. అప్పుడు సుదీపుడు, మంత్రితో, “నువ్వు రాసిన గ్రంథం గొప్పగా వుంది. ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు వ్రాసి మమ్మల్ని ఆనంద పరుచు.” అన్నాడు.\r\n\r\nదానికి మంత్రి, “మహాప్రభూ ! గ్రంథ రచన నావల్లకాదు. మీకు శాపవిమోచనం కలిగించాలన్న కోరికతో ఇది వ్రాశాను. ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడాలని మాత్రమే ఉపయో గించనివ్వండి. ఇలాంటి గ్రంథాలను వేరే ఎవ్వరిచేతనైనా వ్రాయించండి,” అన్నాడు.\r\n\r\nపరిపాలనలో తనకు మంత్రి అవసరం వున్నదని గ్రహించి, సుదీపుడు తన ఆస్థానంలోని కవి, పండితులను రప్పించి సుకాముడి గ్రంథం లాంటి గ్రంథాలు వ్రాయమని కోరాడు.\r\n\r\nవాళ్ళందరూ ఆ గ్రంథాన్ని చదివి, రాజుతో, “మహాప్రభూ! మేమేకాదు. సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్త లెవ్వరూ, ఇటువంటి గ్రంథాలను వ్రాయ డానికి ఒప్పుకోరు.” అని చెప్పారు.\r\n\r\nఇది విని సుదీపుడికి కోపం వచ్చింది. ఆయన సుకాముడి గ్రంథానికి వేలకొద్దీ ప్రతులు వ్రాయించి ప్రజలకు పంచి పెట్టాడు. అంతేకాక, అలాంటి గ్రంథాలు వ్రాసినవారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తానన్నాడు.\r\n\r\nసాహితీవేత్తలెవరూ పదివేల వరహాలకు ఆశపడలేదు. కానీ కబుర్లు చెప్పడం బాగా వచ్చినవాళ్ళు మాత్రం చాలామంది ముందుకు వచ్చారు. క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి. ప్రజ లకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి. వ్రాసేవాళ్ళకవి డబ్బులు తెచ్చిపెట్టాయి. చదివేవాళ్ళకవి వినోదాన్నిస్తున్నాయి.\r\n\r\nఇలా కొంతకాలం జరిగేసరికి, ఆ దేశంలో కవి, పండితులకు, సాహితీవేత్త లకుఆదరణలేకుండాపోయింది. వాళ్లంతా కలిసి ఒకచోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగ డానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు.\r\n\r\n“ఆ ముని మహా కోపిష్టి. ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి ?” అని ఒక పండితుడు అడిగాడు.\r\n\r\nఅందుకు మిగతా పండితులు ఏక కంఠంగా, “ఈ దేశంలో వుండి పనికిరాని గ్రంథాలు చదవడం కంటే, నిర్వాస మహాముని శాపానికి గురికావడమే మేలు,” అన్నారు.\r\n\r\nవాళ్ళు సుకాముడి గ్రంథాన్ని తీసుకుని నిర్వాసమహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి తదేక ధ్యానంతో తపస్సు చేసుకుంటున్న నిర్వాస మహామునికి, వాళ్ళ కోలాహలానికి తపో భంగమయింది. ఆయన కళ్ళు తెరిచి ప్రసన్నవదనంతో వాళ్ళవంక చూసి, వచ్చిన కారణమడిగి తెలుసుకుని, సుకాముడి గ్రంథాన్ని తీసుకుని దివ్యశక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి, “సాహితీవేత్తలారా! మీ కార ణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది. నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను. కానీ కోపాన్ని విడిచి పెట్టలేక పోవడంవల్ల, నాకు మోక్షం సిద్ధించడం లేదు. నా కోపంతో నేను కొందరిచేత వాళ్ళ కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను. కానీ కొంత కాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది. అందుకు కారణం, ఈ గ్రంథమేనని ఇప్పుడర్థమవుతున్నది!” అన్నాడు.\r\n\r\n“మహామునీ! అదెలాగో కొంచెం వివరించండి,” అని కోరాడొక పండితుడు.\r\n\r\n“పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను. సరే, సుకాముడు వ్రాసిన ఈ గ్రంథాన్ని చదవడం రాక్షస జన్మకంటే ఘోరమైనది. అందు వల్లనే, ఏ ప్రయోజనమూలేని ఈ గ్రంథం లోని చప్పిడిమాటలు విన్న సుదీప మహా రాజు రాక్షస రూపం నుంచి విముకు డయ్యాడు. మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి, ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు; ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు! ఇక నుంచి ప్రపంచంలో మునులు, వాళ్ళ శాపాలు వుండవు—వాటిబదులు ఇలాంటి గ్రంథాలే వుంటాయి.” అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ.\r\n\r\nఆ క్షణంలోనే కవి పండిత సాహితీ వేత్తలందరూ చూస్తూండగా, ఆకాశం నుంచి విమానమొకటి అక్కడ దిగింది. అందులో వున్న దేవదూతలు, నిర్వాస మహామునిని ఆహ్వానించారు. ముని అక్కడ వున్నవారితో, “ఈ గ్రంథం ధర్మమా అని, నా కర్మఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను. సెలవు!” అంటూ విమానం ఎక్కాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 996,
        "IMAGE": null,
        "NAME": "నిర్వాసుడి మోక్షప్రాప్తి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 94,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు.\r\n\r\nఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోదలచలేదు,” అన్నాడు ఆవేశంగా.\r\n\r\nఆ మాట విన్న భూషయ్య, “ఇంతకూ ఏం జరిగింది? కావాలంటే ఇప్పుడే వెళదాం, రా. నేనే అతనితో మాట్లాడుతాను,” అన్నాడు సానుభూతిగా.\r\n\r\n“జరిగిన అవమానం చాలు. తిరగదోడి మళ్ళీ బాధ పడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహిముఖం చూడను,” అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు భద్రయ్య.\r\n\r\nఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో భూషయ్య ఊహించలేక పోయాడు. తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తనూ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోకూడదనుకున్నాడు.\r\n\r\nవారం రోజులు గడిచింది. ఆరోజు సాయంకాలం భూషయ్య కనకదుర్గ గుడికి వెళుతూండగా- భద్రయ్య, కనకయ్య గుడి నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి నిర్ఘాంతపోయాడు.\r\n\r\nరాత్రి భోజనం ముగించి మౌనంగా పడుకోబోయిన భూషయ్యను భార్య, “ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?” అని అడిగింది.\r\n\r\nభూషయ్య భద్రయ్య గురించి చెప్పాడు. అంతా విన్న అతని భార్య, “ఇందులో వింతే ముంది! మనసెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపొచ్చాలు పాలపొంగులాంటివే కదా. \r\n\r\nతొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదయింది,” అన్నది నవ్వుతూ.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 997,
        "IMAGE": null,
        "NAME": "స్నేహం!",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 95,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక పేరుమోసిన వస్తాదు ఉండేవాడు. తన పరాక్రమానికీ, ఖ్యాతికి తగినట్టుగా తన రెండు చేతులమీదా సింహంబొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది.\r\n\r\nఅందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు “నా చేతులమీద సింహాల బొమ్మలు పచ్చ పొడుస్తావా ఏమిటి? అసలు నేను సింహ లగ్నంలో పుట్టినవాణ్ణు, వల్లమాలిన ధైర్యసాహసాలు గలవాణ్ణి కూడానూ,” అని చెప్పాడు.\r\n\r\nమంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతిమీద పొడవసాగాడు. వస్తాదుకు సూది పోట్లు చాలా బాధ కలిగించాయి. రెండు మూడు పోట్లకే వాడు ఎక్కడలేని చిరా కుతో, “ఉండు, ఉండు! ఏం పొడుస్తు న్నావు?” అని అడిగాడు.\r\n\r\n“సింహం తోక పొడుస్తున్నాను.” అన్నాడు మంగలి.\r\n\r\n“సరిపోయింది! గొప్పవాళ్ళంతా తమ పెంపుడు కుక్కలకూ, గుర్రాలకూ తోకలు కత్తిరించేస్తారు, తెలుసా? తోకలేని సింహా నికి పౌరుషం మహా జాస్తి. అంచేత తోక మానేసి మిగిలిన సింహం పొడు, చాలు!” అన్నాడు వస్తాదు.\r\n\r\nమంగలి సరేనని మళ్ళీ పొడవసాగాడు. “ఆగు, ఆగు! ఇప్పుడేం పొడుస్తున్నావు?” అన్నాడు వస్తాదు, సూదిపోటు కొంచెంకూడా భరించలేక.\r\n\r\n“సింహం చెవులు పొడుస్తున్నాను,” అన్నాడు మంగలి.\r\n\r\n‘ఏడిచినట్టే ఉంది! కుక్కలను పెంచే వాళ్లు ఏం చేస్తారో నీకు తెలీదా? వాటి చెవులు కత్తిరించేస్తారు. పొడుగాటి చెపు లుండే కుక్కలను ఎవరూ పెంచరు. సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్ఠం!” అన్నాడు వస్తాదు.\r\n\r\n“సరే, అయితే చెవులు లేని సింహాన్నే పొడుస్తాను,” అంటూ మంగలి మళ్లీ తన పని సాగించాడు.\r\n\r\nవాడు చేతిమీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతున్నది.\r\n\r\n“తొందరపడకు, కొంచెం ఆగు! ఇప్పుడేం పొడుస్తున్నావు?” అని వస్తాదు మంగలిని అడిగాడు.\r\n\r\n“సింహం నడుము పొడుస్తున్నాను,” అన్నాడు మంగలి,\r\n\r\nఅఘోరించినట్టే ఉన్నది! నువు ఏ జన్మానా కావ్యాలు కూడా చదువుకున్నట్టు లేదు. సింహాలకు నడుములే ఉండవని కవులు ఘోషిస్తున్నారు. ఒకవేళ ఉన్నా ఉండీ లేనట్టుంటాయిట. అందమైన ఆడ వాళ్ల నడుములను సింహాల నడుములతో పోలుస్తారు. అదికూడా నీకు తెలిసినట్టు లేదు. అందుకే ఆడదాన్ని సింహేంద్ర మధ్యమ అంటారు. అంచేత నువు సింహానికి నడుము లేకుండానే చెయ్యి. అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా వుంటుంది,” అని వస్తాదు వుపన్యాసం దంచేశాడు.\r\n\r\nఇంత లావు వస్తాదుకూ సూదితో పొడి పించుకునే శక్తి లేదనీ, ఇది చివరెళ్లా పచ్చ పొడిపించుకునే మేళం కాదనీ మంగలికి తెలిసిపోయింది. వాడు సూదినీ, రంగులనూ అవతల పెట్టి, “వస్తాదుగారూ, మీరు పచ్చ పొడిపించుకోనూ వద్దు, నేను పొడవావద్దు. నన్ను ఆపే బాధించక వచ్చిన దారినే దయ చెయ్యండి!” అన్నాడు.\r\n\r\nఈ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగటానికి మారుగా ప్రాణం లేచి వచ్చిన ట్టయింది. “నీకు చాతకాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పకపోయావా?” అని వాడు మీసం మెలివేసుకుంటూ చల్లగా ఇంటి దారి పట్టాడు. ఆరంభశూరత్వం ఇలాగే వుంటుంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 998,
        "IMAGE": null,
        "NAME": "బాధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 96,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయంశక్తితో ఆరెకరాల మాగాణీ సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికీ, కూతురు లక్ష్మీదేవికీ పెళ్లిళ్లు ఐపోయాయి. పండుగలకు పబ్బాలకూ అత్తమామలు కూతురికీ కొత్త బట్టలవీ పెడుతుండటం, రామచంద్రం భార్య కాంతామణికీ ఇష్టముండేది కాదు. ‘చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలుగబోయే సంతానానికి ఏమీ మిగలదు. ఏదో వంకతో మీరూ మీ నాన్న దగ్గరనుండి కొద్దో గొప్పో వసూలు చేసుకోవడం మంచిది,’ అంటూ భర్తకు సలహా ఇచ్చింది.\r\n\r\nరామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో, నష్టం వచ్చిందనో, అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గరనుండి పెద్ద మొత్తాలనే తీసుకుపోతూండేవాడు. పొలం తాకట్టు పెట్టో, కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కి ఇస్తూండేవాడు వీరయ్య. ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు. ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే, ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు ఐపోయినట్లు తేలింది.\r\n\r\nఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తూంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బైటకు తీయించారు రామచంద్రం, అతని భార్యాను. అందులో ఇలా ఉంది. ‘ఆస్తంతా నా స్వార్జితం.. అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలివున్న పొలాన్ని నా భార్య రాజలక్ష్మికి, నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను. ఇంటిని నా భార్యకు. నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గరనుండి తీసుకున్న సొమ్మంతా అతనికీ.. మనస్పూర్తిగా రాసి ఇస్తున్నాను.’\r\n\r\nఅతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి, వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ది చెప్పడంతో లబోదిబోమంది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 999,
        "IMAGE": null,
        "NAME": "వీరయ్య వీలునామా",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 97,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడుండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువునుంచి నేరుగా ఇంటికి వచ్చే వాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం వేసుకుని, బాగా పొద్దు పోయింతర్వాత ఇల్లు చేరుకునేవాడు.\r\n\r\nధవళముఖుడి భార్య ఒక రోజు తన భర్తను “మీరు ప్రతిరోజూ ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు? ఎందుకు పెడతారు?” అని అడిగింది.\r\n\r\nధవళముఖుడు భార్యతో, “నాకు ఇద్దరు మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కల్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండో వాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ప్రాణస్నేహితు డంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు” అన్నాడు.\r\n\r\nతన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నా రని విని ధవళముఖుడి భార్య చాలా సంతో షించింది. “నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా?” అని భర్తనడిగింది.\r\n\r\n“దానికేం భాగ్యం? రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకూ వెళ్లివద్దాం,” అన్నాడు ధవళ ముఖుడు.\r\n\r\nమర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కల్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పినదానిలో అతిశయోక్తి లేదని ధవళ ముఖుడి భార్య తెలుసుకున్నది.\r\n\r\nతరవాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. చదరంగం ఆడుతున్న వీరబాహు, ధవళ ముఖుడి కేసి ఒకసారి చూసి “ఏమోయ్, వచ్చావా? కూచో” అని తిరిగి ఆటలో నిమగ్నుడ య్యాడు.\r\n\r\nభార్యాభర్తలు కొంచెంసేపు కూచుని ‘వెళ్లివస్తాం,’ అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే, ‘మంచిది’ అన్నాడు.\r\n\r\nధవళముఖుడితో భార్య, ‘కల్యాణవర్మ కన్న వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారుగదా, ఇతనికన్న అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే?’ అన్నది.\r\n\r\n‘వారిద్దరి మధ్యా గల వ్యత్యాసం చూడా లంటే, రేపు నువు ఇద్దరిదగ్గరికి వెళ్ళి, నామీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు,’ అన్నాడు ధవళముఖుడు భార్యతో.\r\n\r\nఆమె మర్నాడు ముందుగా కల్యాణ వర్మ ఇంటికి వెళ్లి అతనితో, ‘అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు. మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా?’ అని అడిగింది. కల్యాణవర్మ హడలిపోయి, ‘అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను. నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది.” అన్నాడు.\r\n\r\nధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్లి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలూ, కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, ‘మిత్రమా నీమీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు! వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను!’ అన్నాడు ఆవేశంతో.\r\n\r\nధవళముఖుడు నవ్వుతూ, ‘కూచో వోయ్. మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుణ్ణి చేశారులే!’ అన్నాడు. అతడు వెళ్లిపోయాక, ధవళముఖుడు భార్యతో, ‘చూసావు గదా, నా ఇద్దరు మిత్రులలో గల వ్యత్యాసం!’ అన్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1000,
        "IMAGE": null,
        "NAME": "వ్యత్యాసం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 98,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక వూల్లో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట.\r\n\r\nమరి, ఇంత గొప్ప విద్వాంసుడు మారు మూల పల్లెటూరిలో ఉండటంచేత, ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినయి. అందుకని, దగ్గరనే పట్టణంలో వుండే రాజుగారి దర్శనం చేసుకొని, పాటకచేరీ పెట్టించి, గొప్ప బహుమతీ పొందుదామని ఆయన బయలుదేరాడు.\r\n\r\nదారిలో ఒక అడవి ఉన్నది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా వుంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టుక్రింద కూర్చున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటువచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది: “ఈయనచాలా ధనవం తుడై ఉండాలి. లేకుంటే అబ్బో, ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాయించ గలడు? మచ్చుకి రెండు రాగాలు పాడి, ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు ” అని ఆశపడి, విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు.\r\n\r\nవిద్వాంసుడు పాడుతూవుంటే, సంతో షించటానికి బదులు, గొర్రెలకాపరి ఏడుపు మొదలెట్టాడు. ఇది చూచి విద్వాంసుడు “ఈయన శ్రీమంతుడే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను. కనుకనే నాపాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొంటున్నాడు ” అని తలిచి యింకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడినకొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది.\r\n\r\nఈ యేడుపేమిటో అర్థంగాక, విద్వాంసుడు పాడటం ఆపివేశాడు. “ఏమండి స్వామీ! నేను పాడిన పాటవల్లనే మీకు హృదయం కరిగి, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం ? ” అని గొర్రెల కాపరిని అడిగాడు.\r\n\r\nగొర్రెలకాపరి యేడుపు దిగమింగి, “అది కాదయ్యా. నువు పైకి లక్షణంగానే కనపడుతున్నావు. ఏ లోటూ లేని ఇటువంటి వాడు ఇందాకటినుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నీతోపాటు నేనూ ఏడుస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.\r\n\r\n“నాకు ఏ లోటూ లేదంటారా ? డబ్బు లేక నేను ఎంతబాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏదో గొప్పవారు, పండితులు, రెండు రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి యిస్తారని నే నాశపడుతూ వుంటే, ఇదేమీ ఏడుపండి, అర్థంలేని యేడుపూ?” అని విద్వాంసుడు మనస్సులో బాధ బయటపెట్టాడు.\r\n\r\nఅప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే ” అర్థంగాక పోవడ మేమిట స్వామీ! నిన్నటి రోజు న నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రి కేకలు పెట్టి చచ్చిపూరుకుంది. నీపని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి, యేడుస్తున్నానయ్యా” అని బదులు చెప్పాడు.\r\n\r\n“అయ్యో, నా తెలివి కాలా! నా సంగీత మంతా చివరికి అడవికాచిన వెన్నెల మోస్తరు అయిందే! ఈ మూర్ఖుడికి నాపాట వినిపించి గొంతుకంతా పాడుచేసికొన్నాను” అని గొణుగుకొంటూ, విద్వాంసుడు తన దారిని తను పోయాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1001,
        "IMAGE": null,
        "NAME": "గొల్లవాడు-విద్వాంసుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 99,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పూర్వకాలంలో, ప్రతిష్ఠాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకొని తిరుగు తున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా, పట్టు తప్పి ఆ కుండ నేల పై పడింది. వెంటనే తేనెచుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపురిం చింది. సాలీణ్ణి కబళించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది. బల్లిని మ్రింగడానికి, పిల్లి రానేవ చ్చింది. దాంతో రాజ సేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనున్న వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒక వేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు వర్తకుడు, తన పెంపుడు కుక్కను చంపితే, అతని తల నరకడం కోసం, రాజసేవకుడు కత్తినెత్తాడు.\r\n\r\nఇంతలో సాలీడు, తేనెటీగను మింగేసింది. తరువాత బల్లి, సాలీడును తినేసింది. పిల్లి, బల్లిని గుటకాయ స్వాహా అంది. కుక్క, పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగి పోతూ కర్రనెత్తి కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడెపోయి కత్తినెత్తి వర్త కుడిని యమపురికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడైన వర్తకుణ్ణి చూసి, ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి మట్టుబెట్టారు. ప్రజల కింత పొగరా? అని రాజుకళ్ళెర్ర చేసి, ప్రజలపెక్షి సెన్యాన్ని పంపబోయాడు.\r\n\r\nఅప్పుడు మంత్రి, “మహారాజా! ఇప్పటికే జరగకూడని రక్తపాతం జరిగిపోయింది. తేనెచుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగడం.. అంతా ప్రకృతి సహజం. అయితే, తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు, వర్తకుణ్ణి వధించాడు. ప్రజలు వర్తకుడి మీది అభిమానం కొద్దీ, తమ సేవకుడి మీద పగ సాధించారు. ఇప్పుడు తమరు అదే ఆవేశం లో, ప్రజలందరి మీదికీ సెన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇం గిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహావేశాలే, అన్ని అరిష్టాలకూ మూలం అన్న సంగతి, తమకు తెలియంది కాదు!” అన్నాడు. రాజుకు, మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరుగనున్న మరింత వినాశం ఆగిపోయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1002,
        "IMAGE": null,
        "NAME": "తేనెచుక్క తెచ్చిన ప్రమాదం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 100,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తూండగా ఎక్కడినుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్లు పెట్టి లేచి నిలబడింది. అది చూసి అతను పిల్లిని తరుమబోయాడు. పిల్లి వెనక్కు దూకింది. కుండ అరుగుమీద నుంచి కింద పడి రెండే రెండు ముక్కలయింది.\r\n\r\nకుండ అరువు తెచ్చినవాడు తడువుకోకుండా రెండు ముక్కలూ జిగురు పెట్టి అంటించి, పొరుగువాడి వద్దకు తీసుకుపోయి, ‘ఇదుగో నీ కుండ’ అని ఇచ్చేశాడు.\r\n\r\nపొరుగువాడు పగులు గమనించి ‘ఏమిటిది?’ అన్నాడు.\r\n\r\nఆసామి, ‘నాకు తెలియదు’ అంటూ ఇంటికి వచ్చాడు.\r\n\r\nపొరుగువాడు న్యాయస్థానంలో పిర్యాదు చేశాడు. ఆసామి న్యాయవాది వద్దకు వెళ్లి సలహా అడిగాడు. న్యాయవాది అంతా విని, ‘జరిగినదానికి సాక్షులెవరూ లేరు గనక నువు మూడు విధాలుగా సమర్థిచుకోవచ్చు. నువు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదనవచ్చు. లేదా, నువు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమోననవచ్చు; అన్నిటికన్నా భేషయినదేమంటే, అసలు నువు కుండ తీసుకోలేదనవచ్చు,’ అన్నాడు. కుండ ఖరీదు పావలే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు.\r\n\r\nమర్నాడు న్యాయస్థానంలో విచారణలో, ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకు న్నాడు. ‘అయ్యా, నేనా కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి. ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో నాకా సంగతి తెలియదండి. అన్నిటికన్న ముఖ్యమే మంటే నేనసలు ఆ కుండను అరువు తీసుకోనే లేదండి!’ న్యాయవాది సలహా ఇంత బాగా పాటించినా న్యాయాధికారి తనకు రెండు రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు. ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదులను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1003,
        "IMAGE": null,
        "NAME": "అతితెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 101,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడటం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది.\r\n\r\nఒకసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర, ధనం ఫణంగా పెట్టి మేక-పులి జూదం ఆడుతుండగా రక్షక భటులు వాళ్లను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు.\r\n\r\n‘అయ్యా నేనసలు జూదం ఆడలేదు. ఆడుతున్న వాళ్లను చూస్తూ, అక్కడ ఉన్నాను అంతే. సత్యప్రమాణంగా’ అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి వినమ్రంగా.\r\n\r\nఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు.\r\n\r\n‘అయ్యా, నేను మన సేనాధిపతి గారి దగ్గరి బంధువునండి, ఈసారికి క్షమించి వదిలే యండి.’ అని మరో వ్యక్తి ప్రాధేయపడగా అతన్ని కూడా విడుదల చేశాడు న్యాయాధికారి.\r\n\r\nమూడో వ్యక్తి న్యాయాధికారి మిత్రుడి కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు.\r\n\r\nన్యాయాధికారి, నాలుగోవ్యక్తి వైపు తిరిగి ‘ధనంతో జూదమాడటం నేరమని నీకు తెలియదా? నీకు మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను, ‘ అన్నాడు తీవ్రంగా.\r\n\r\n‘అయ్యా, అసలు నేను ఎవరితో జూదమాడేనో చెప్పగలరా?’ అని ప్రశ్నించాడు ఆ నాలుగో వ్యక్తి.\r\n\r\nన్యాయాధికారి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. నాలుగో వ్యక్తి కూడా విడు దలయ్యాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1004,
        "IMAGE": null,
        "NAME": "ఎవరు జూదగాడు?",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 102,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గిర మల్లవిద్య నేర్చుకు నేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసు. వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించినవాడి కొకడికి నేర్పాడు. కొన్నాళ్ల తరవాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరకు పోయి, ‘మహారాజా! రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు. ఆఖరికి నాకు విద్య చెప్పిన గురువునైనా సరే ఓడించగలను. కాని, ఆయన ముసలివాడు కావడం వల్లా, నాకు విద్య నేర్పిన వాడవటం వల్లా కృతజ్ఞత కొద్దీ ఆయనమీద సవాలు చేయదలచలేదు,’ అన్నాడు.\r\n\r\nశిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది. అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతణ్ణి కోప్పడి, ‘అయినా, నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోతుంది. మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేశాను, అన్నాడు.\r\n\r\nగురుశిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు. యువకుడూ, బల శాలీ అయిన శిష్యుడు ఏనుగుపిల్లలా ముసలి గురువు మీదికి దూకాడు. గురువుకు తను బలంలో శిష్యుడికి తీసికట్టని తెలుసు. అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీపట్టు ప్రయోగించి, అతణ్ణి గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు.\r\n\r\n‘ఈ పట్టు నువ్వు నాకు నేర్పలేదు. ఇది అన్యాయం!’ అన్నాడు శిష్యుడు, పడ్డ చోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ.\r\n\r\n‘ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు,’ అన్నాడు ముసలిగురువు. రాజూ, చూడవచ్చిన ప్రజలూ గురువును మెచ్చుకున్నారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1005,
        "IMAGE": null,
        "NAME": "చెడ్డ శిష్యుడు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 103,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేకమంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు. ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది. అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు ఏరుకురావటానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు.\r\n\r\nఈ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతు. వాడు తప్పనిసరి అయితేనేగాని పని చేసేవాడు కాడు. ఒకవేళ పని చేయ వలిసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు.\r\n\r\nశిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పనిచేసినదీ ఎవరికీ తెలిసేది కాదు.\r\n\r\nదానికితోడు వాడు తెలివైన వాడు కనుక, తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగర్త పడుతుండేవాడు. అడివిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతటా వెతుకుతూ, పనికివచ్చే కట్టెలూ, పుల్లలూ ఏరి ఒకచోట పోగువేస్తూ పనిలో నిమగ్నులయారు. సోమరిపోతుకు ఇదంతా వృధా శ్రమ అనిపించింది. వాడు మిగిలిన వాళ్లకి ఎడంగా వెళ్లాడు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ. వాడు కొంత దూరం వెళ్లాక వాడికి కావలిసిన చెట్టు దొరకనే దొరికింది. ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు. చెట్టు బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు.\r\n\r\nఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు, ఎంతకాలమైనా పనికివస్తుంది! అనుకుని సోమరిపోతు మంచి నీడ చూసు కుని నిద్రపోయాడు. వాడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలూ, నవ్వులూ వినిపిస్తూనే ఉన్నాయి. కాని తీరా వాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దు కూడా చాలావరకు వాలిపోయింది. దీంతో సోమరి పోతుకు కంగారెత్తింది. తన తోటి శిష్యులు వంటచెరుకు మోపులు కట్టుకుని వెళ్లి పోయారని వాడు గ్రహించాడు. ఎదురుగా కనబడే మొండిచెట్టు కొమ్మలు గబగబా విరిచి, ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకు ముందే మిగిలిన వాళ్లు ఇల్లు చేరటమూ, తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వెయ్యటమూ కూడా అయింది.\r\n\r\nసోమరిపోతు రోజుకుంటూ వచ్చి వాళ్లు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు. అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు.\r\n\r\nఆ రాత్రి గురువుగారు తన శిష్యులంద రితో, ‘ఒరే, పలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు. మనకందరికీ పిలుపు వచ్చింది. నాకు వేరే పని ఉంది. కాని మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి. మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు!’ అని అన్నాడు. శిష్యులంతా సంతోషించారు.\r\n\r\nతెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని, కిందటి సాయంత్రం వాళ్లు తెచ్చివేసిన కుప్పమీది నుంచి కట్టెలు తీసుకుపోయి, పొయి రాజేసింది. అయితే అవన్నీ పచ్చి కట్టెలు… సోమరిపోతు తెచ్చినవి. అందుచేత ఏ వేళకూ పొయి రాజలేదు. అన్నం ఉడికే సరికి సూర్యోదయం కూడా అయి పోయింది. శిష్యులు సకాలంలో అన్నం తినలేక, ప్రయాణమై సంతర్పణకు వెళ్ల లేక పోయారు. తాజెడ్డ కోతి వనమెల్ల చెరి చిందన్నట్లు ఒక్క సోమరిపోతు మూలంగా, శిష్యులందరికీ సంతర్పణ లేకుండాపోయి ఆశాభంగమయింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1006,
        "IMAGE": null,
        "NAME": "తాజెడ్డకోతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 104,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు.\r\n\r\nతమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య ఐదు మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూటకట్టి ఇచ్చింది.\r\n\r\nఅతను ఆ మూట కర్రకు తగిలించుకొని, కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెడురుపొద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి, భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్ర పోయాడు.\r\n\r\nకొంత పొద్దెక్కినాకాగానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచే సరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండి ఎదురుగడ ఎందుకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండలు మూట కూడా పైకి వెళ్ళింది. మళ్లీ సాయంకాలం అయితే గానీ మూట కిందకు రాదని గ్రహించి అతని ఆకలి తోటే మళ్ళీ నిద్ర పోయాడు.\r\n\r\nఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండలు వాసన తగిలింది. వెదురు గడకు వేలాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు మినపసున్ని ఉండలు ఐదుగురు తిన్నారు.  చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూచి అతను బీద స్థితికి జాలిపడి సున్నిఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్లిపోయారు.\r\n\r\nఅతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకు పోతుండడంవల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గాంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు.\r\n\r\nఅతను భోజనం చేసి, సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి, పెట్టె సహాయంతో వచ్చిన వారందిరికీ షడ్ర సోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు.\r\n\r\nతమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడివల్ల తెలుసుకున్నాడు. భార్య  ప్రోద్బలంవల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్యచేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్లిన దారినే బయలుదేరాడు.\r\n\r\nవెళ్లి వెళ్లి ఇతనుకూడా చెరువు దగ్గరకి చేరుకున్నాడు. వెదురు పాదకు మూట తగిలించి పడుకొని నిద్ర పోయాడు.\r\n\r\nఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్లుతూ సున్నిఉండల వాసన పసిగట్టి మూటవిప్పి చూశారు. “ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్లీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే” అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్లిపోయారు.\r\n\r\nమర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె వుంది. తనపని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి హద్దు లేదు.\r\n\r\nమరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందిరిని విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచే సరికి అందులో నుండి అతిధికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిధినీ ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి. తర్వాత మంగలి వాళ్లంతా పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు.\r\n\r\nఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1007,
        "IMAGE": null,
        "NAME": "రెండు విందులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 105,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "తెల్లారింది, బెడ్ మీద కామేశ్వరం కళ్లు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతృతతో టేబుల్ మీద ఉండే ఫోన్ కోసం వెతికాడు. అది కనబడలేదు. పొరపాటున బ్యాగ్ లో గాని పెట్టానేమో అని బ్యాగ్ తెరచి చూసాడు, కనబడలేదు. ఆశ్చర్యం కలిగి చిన్న చిన్న శబ్దంతో ఒకటి ఒకటి వెదకడం మొదలు పెట్టాడు.\r\n\r\nఆ శబ్దానికి కావేరి నిద్ర లేచి, “ఏంటండీ అలా వెతుకుతున్నారు?” అని బద్ధకంగా అంది.\r\n\r\n“ఏమౌతుంది, ఏమిటి? రాత్రి ఫోన్ టేబుల్ మీద పెట్టింది బాగా గుర్తు. ఇప్పుడు చూస్తే కనబడడం లేదు. ఈ ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడ పెట్టింది, అక్కడ ఉండి చావదు కదా! నేను ఎప్పుడూ చెబుతుంటాను సీరియల్స్ చూడటానికి వచ్చి పోయే పిల్లల మీద ఒక కన్నేసి ఉంచు అని. పట్టించుకుంటేగా!” ఆవేశంగా అన్నాడు.\r\n\r\nకావేరికి వళ్లు మండింది. “బాగుంది వరస. ఎక్కడ ఏది కనపడకపోయినా బాగా నా మీద విరుచుకుపడటం మీకు అలవాటు అయిపోయింది. బాగా వెతకండి. ఎన్నిసార్లు నా మీద విరుచుకుపడిన సామానులు మీకు దొరికి సారీ చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి!” అని తిరిగి ముసుగుతన్ని పడుకుంది. అప్పుడే మడి బట్టలతో చేరిన బామ్మ కామేశ్వర రంతో “ఒరేయ్ కాము! కోవెలలో ఆచార్యులుగారు ఉంటారు. ఒక్కసారి ఈ నెంబర్ కి ఫోన్ చేసి మా బామ్మ సీరియల్ చూసి వస్తుంది. అంతవరకూ అభిషేకాలు కొంచెం ఆపమను” అని చిన్న కాగితం మీద ఉన్న నెంబరు అందించింది.\r\n\r\nకామేశ్వరం ఒక్క సారి ఉలిక్కి పడి “కాలం ఎంత మారిపోయింది అనుకొని, బామ్మ ఫోన్ కనబడక, లేచింది మొదలు వెతుకుతున్నాను. నువ్వు గాని చూసావా?” ఆతృతగా అడిగాడు. బామ్మ ఒక్కసారి ఖంగుతిని “అదేమిట్రా అలా అంటావు, రాత్రి నేను నీ ఫోన్లో కామాక్షమ్మతో ఓ పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఠక్కున ఆగిపోయింది. బాలన్స్ నొక్కి చూస్తే జీరో అని వస్తే ఇక్కడే పెట్టేసాను, ఇంతలో ఎలా మాయం అయింది” అని బామ్మ కూడా ఆశ్చర్యపోయింది.\r\n\r\nఅప్పుడే అక్కడకు చేరిన పేపర్ బాయ్ అంతా విని తన ఫోన్ తీసి “సార్.. దీనితో మీ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి. రింగ్ అయితే ఏ మూల ఉందో తెలిసిపోతుంది” అని ఫోను చేతికి ఇచ్చాడు.\r\n\r\nకామేశ్వరం “గుడ్ ఐడియా!” అని ఆ అబ్బాయిని మెచ్చుకుని తన ఫోన్ నెంబర్ కి రింగ్ చేసి ఆతృతగా ఫోన్ చెవి దగ్గర పెట్టాడు. నిదానంగా అది బాత్రూంలో నుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్ళి తలుపు తీశాడు. గడియపెట్టి ఉంది. “అరేయ్… చంటి…” అన్నాడు కోపంగా.\r\n\r\nగడియ ఠక్కున వీడింది. వాడి చేతిలో ఫోను చూసి, “ఇక్కడ ఏం చేస్తున్నావ్? నీ చేతిలో ఫోన్ ఏమిటి?” అన్నాడు.\r\n\r\nచంటి ఒక్కసారి బిక్కుబిక్కుమంటూ “కోప్పడకండి నాన్న. నిన్న స్కూల్ కి వెళ్ళలేదు కదా! హోంవర్క్ ఏమి ఇచ్చారో తెలీదు. కవ్యని అడిగి తెలుసుకొని చేయాలని ఫోన్ తీసుకొని వచ్చాను. టీచర్ హోంవర్క్ చేయలేదంటే అస్సలు ఒప్పుకోదు” అన్నాడు. కామేశ్వరం ఒక్కసారి “అంతా కాల మహిమ… ఈ రోజుల్లో తొమ్మిది సంవత్సరంలోని పిల్లల నుండి తొంబై సంవత్సరం వారికి సైతం ఫోన్ ఎంతో అవసరం అయిపోయింది” అనుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1008,
        "IMAGE": null,
        "NAME": "తొమ్మిది నుండి తొంభై",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 106,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్లి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తను ఉంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు.\r\n\r\nఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బు ఇచ్చాడు.\r\n\r\nకానీ భద్రయ్య అంటే పడను గోపయ్య ఆ ఇంటి వాస్తు సరిగా లేదని, కొంటె అరిష్టమని భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఇల్లు కొనలేనని ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు.\r\n\r\nభద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి వాయిదా వేయమని కోరాడు. ఇల్లు అమ్ముడు అయితే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు.\r\n\r\nఅప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి,  “నాన్న! కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్లయిన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు. నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను” అన్నాడు.\r\n\r\n“ఆ ఇల్లు చాలా పాత పడింది కదా?” అనే సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య.\r\n\r\n“ఆ ఇల్లు ఉన్న స్థలం మన గ్రామం మధ్యలో ఉంది నాన్న! నేను దాన్ని పడగొట్టి ఇంటితోపాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది” అని తండ్రికి నచ్చజెప్పారు శివయ్య.\r\n\r\nధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్లయిన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళి పోయాడు.\r\n\r\nతర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు. కొత్త ఇల్లు, దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే, లంకెబిందెల దొరికింది. దాన్నిండా బంగారు కాసులు ఉన్నాయి.\r\n\r\nశివయ్య పట్నం వెళ్లి మామ గారిని కలుసుకొని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు. “మావయ్య! ఆ లంక బిందె మీ పూర్వీకులది ఉంటుంది. అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి” అన్నాడు శివయ్య.\r\n\r\nభద్రయ్య నవ్వి “అదంతా నీ అదృష్టం అల్లుడు. అదే నా ఇల్లు శాంతయ్య కు అమ్మి ఉంటే, లంకె బిందె బయటపడినా, నాకు చెప్పేవాడా? తిరిగి వచ్చే వాడా? ఇల్లు కొనడానికి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే, మా పెద్దల ఆస్తి బయటకు పోకుండా ఉండటానికి అనుకుంటాను. ఇదంతా ఆ దేవుని దయ. నీ అదృష్టం కాబట్టి ఆ బంగారం నీదే” అని లంక బిందె తీసుకోవడానికి తిరస్కరించాడు. శివయ్య సంతోషంతో గ్రామానికి వెనుదిరిగాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1009,
        "IMAGE": null,
        "NAME": "అల్లుడి అదృష్టం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 107,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "“రాజు! ఈ రోజు మన ఊరిలో బంద్ చేయమని నాయకుడు చెప్పాడు” అని శ్రీనివాస్ చెప్పాడు. “బంద్ ఎందుకు చేయమన్నాడు” అని అడిగాడు రాజు.\r\n\r\n“ఆ సంగతి మనకెందుకు సాయంత్రానికి మన నాయకుడు మనకి డబ్బులు ఇస్తాడు” అని శ్రీనివాస్ చెప్పాడు. దాంతో రాజు కొందరు మిత్రులతో కలిసి, బయట తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను బలవంతంగా మూయించసాగారు. ఆ సమయంలో ఒక వ్యక్తి స్కూటర్ పై అటు రాసాగాడు. అది గమనించిన రాజు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని ఆపి “ఈ రోజు బంద్ వెనక్కి తిరిగి వెళ్ళండి” అన్నాడు.\r\n\r\nఆ వ్యక్తి తాను అవసరంగా వెళ్లాలని వారిని ఎంతో బ్రతిమాలినా వాళ్ళు వినలేదు. రాజు కోపంతో ఆ స్కూటర్ టైర్లకు గాలిని తీసి, “మంచిగా చెబితే వినడం లేదు, ఇప్పుడు స్కూటర్ ని తోసుకుంటూ ఇంటికి వెళ్ళు” అనడంతో ఆ వ్యక్తి బాధతో వెళ్ళాడు.\r\n\r\nమధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలకు ఇళ్లకు వెళుతున్నారు. రాజు తాను గొప్ప పని చేసిన వాడిలా సంతోషంగా గెంతుతూ ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట కంగారుగా ఉన్న చెల్లి,  “అన్నయ్య! అమ్మ కి జ్వరం ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కి వెళ్లాలంటే బంద్ వలన ఏ వాహనం లేదు. నువ్వు వెళ్లి డాక్టర్ ని తీసుకురా, ఆలస్యం అయితే కష్టం” అనడంతో రాజు అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తాడు.\r\n\r\nరాజు ఊరంతా తిరిగాడు. డాక్టర్లు ఉన్నారు, కానీ బంధువల్లె బయటకు రావడానికి భయపడ్డారు. ఆఖరికి ఒక చిన్న ఇంటి ముందు డాక్టర్ ప్రకాష్ అన్న బోర్డు కనిపించడంతో, ఆయన తప్పక తన ఇంటికి వస్తాడు అన్న ఆశతో ఆ ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలాయన తలుపు తెరిచి, రాజు ద్వారా సంగతి తెలుసుకొని “భయపడకు. మా వాడు చాలా మంచివాడు. అర్థరాత్రి అయినా రోగి ఇంటికి వెళతాడు, ఉండు పిలుస్తాను” అంటూ లోపలికి వెళ్ళాడు.\r\n\r\nలోపల నుండి డాక్టర్ బయటికి వచ్చారు. ఆయన్ని చూడటంతో రాజు నిర్ఘాంతపోయాడు. ఆయన ఎవరో కాదు, ఉదయం స్కూటర్ మీద వస్తుంటే తాను అడ్డుపడి టైర్ గాలి పీకి పంపిన వ్యక్తి. ఆయన ఎందుకు తనకు సహాయం చేస్తాడు, అని బాధపడుతూ రాజు వెనుదిరిగాడు. అంతలో డాక్టర్ రాజు ను పిలిచి విషయం అడగడంతో రాజు ఏడుస్తూ ఆయన కాళ్ళపై పడి తల్లి సంగతి చెప్పాడు.\r\n\r\nవెంటనే డాక్టర్ తన మందులు పెట్టె తీసుకొని, కాలినడక మీద రాజు ఇంటికి వచ్చి, అతని తల్లిని పరీక్షించి, తగిన మందులు ఇచ్చాడు. కొంతసేపటికి ఆమె జ్వరం తగ్గింది.\r\n\r\nరాజు, డాక్టర్ చేతులు పట్టుకొని “నన్ను క్షమించండి. ఉదయం మిమ్మల్ని అంత అల్లరి చేసినా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకు వైద్యం చేశారు. నిజంగా మీరు దేవుడు” అన్నాడు.\r\n\r\nడాక్టర్ అతని భుజంపై తట్టుతూ, “బంద్ అన్నది ఎందుకు చేయాలి. ఆ నాయకులు వారి స్వార్థం కొరకు మీ లాంటి వారితో ఇలా చేపిస్తుంటారు. కానీ దాని వలన ఎందరో నష్టపోతారు, అన్నది ఎవరూ ఆలోచించరు. ఈరోజు నీకు వచ్చిన కష్టం ఇంకా ఎందరికీ వచ్చిందో, మరి వారి పరిస్థితి ఆలోచించావా? ఇకపై ఎవరి మాటలు విని ఇలా బందులు చేయకు. చక్కగా చదువుకో. నలుగురికీ ఉపయోగపడు. నువ్వే కాదు మీ స్నేహితులు మారాలి, అప్పుడు మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది” అని వెళ్ళిపోయాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1010,
        "IMAGE": null,
        "NAME": "బంద్",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 108,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "అక్బర్ చక్రవర్తి చాలా మంది భార్యలు ఉండేవారు, వారిలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద చాలామంది అక్బర్ ఫిర్యాదులు కూడా చేశారు. ఒక నాడు అయితే ఆమె అక్బర్ తో చాలా మొరటుగా మాట్లాడింది. దానితో ఆయనకు విపరీతంగా కోపం వచ్చి “నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో” అని ఆజ్ఞాపించాడు.\r\n\r\nఆయన వెళ్లిపొమ్మంటే సరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది, “నా మాటలకు, చేతలకు సిగ్గు పడుతున్నా దయచేసి క్షమించండి. నన్ను మా పుట్టింటికి పంపొద్దు” అని వేడుకుందామె. అక్బర్ కి కూడా జాలి కలిగింది, కానీ ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే, నువ్వు వెళ్లేటప్పుడు నీకు అన్నింటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్లొచ్చు అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనను క్షమించాడని ఆమెకు అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలి అనుకుంది. కానీ ఆమె అతన్ని కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ మొహం పెట్టుకొని అడగగలదు?.\r\n\r\nఏది ఏమైనప్పటికీ ఆమె అతని కోసం కబురు పంపగానే వచ్చాడు బీర్బల్.\r\n\r\n“బీర్బల్, నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా” అని పశ్చాత్తాపం నిండిన స్వరంతో.\r\n\r\n“బేగం సాహెబ్, గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి” అన్నాడు బీర్బల్ సహృదయంతో.\r\n\r\nఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతావిని, కొంచెం సేపు ఆలోచించి, “… ఇలా చేయండి” అని ఆమెకు గుసగుసగా చెప్పాడు.\r\n\r\nఆ బేగం ఆ సలహాకు ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ఆమె ఆ సాయంకాలం, తాను మర్నాడే వెళ్లిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన స్వీకరించమని అక్బర్ కి కబురు పంపింది ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్.\r\n\r\n“నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి” అని అడిగింది బేగం. బేగం తన ఆజ్ఞ ప్రకారం వెళ్లి పోతున్నందుకు సంతోషించిన అక్బర్, ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లు మత్తుగా నిద్రపోయాడు.\r\n\r\nఅప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న బేగం, నిద్రపోతున్న అక్బర్ ను పల్లకిలో కి చేర్పించింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చుని పుట్టింటికి ప్రయాణం అయింది.\r\n\r\nమర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్ కు పరిసరాలన్నీ కొత్తగా తోచడంతో, “ఏంటిది! నేను ఎక్కడున్నాను” అని అన్నాడు ఆశ్చర్యంగా.\r\n\r\nఅతన్ని కనిపెట్టుకొని ఉన్న బేగం “మందిరంలోనే ఉన్నారు ప్రభూ!” అంది.\r\n\r\n“కానీ ఇది మా మందిరం కాదే?” అన్నాడు అక్బర్ సందేహంగా, కిటికీలోంచి బయటికి చూస్తూ.\r\n\r\n“ప్రభూ! మీరు నన్ను మా పుట్టింటికి నాకు అత్యంత ప్రీతి పాత్రమైన దాన్ని తీసుకొని పొమ్మన్నారు కదా. నాకు అత్యంత ఇష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను” అంది\r\n\r\nఆ మాటలకు ఆయన కోపం పోయింది. బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవ్వరు ఇచ్చి ఉండరని ఆయనకు తెలిసి నవ్వుకున్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1011,
        "IMAGE": null,
        "NAME": "అన్నింటికంటే ఇష్టమైనది",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 109,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "పాండు రంగాపురంలో రంగయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. చిల్లర కొట్టు వ్యాపారం ఉండేది. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ అతిధి, అభాగ్యగులను ఆదరిస్తూ భగవంతుడి యందు భక్తి కల్గివుండేవాడు. \r\n\r\nఒకనాడు ఆయన ఇంటికి ఒక యోగి వచ్చాడు. వచ్చిన అతిథికి చక్కని భోజనం పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు. ఆ యోగి శెట్టి గారి ధైవభక్తికి అతిధి మర్యాదలకు ముచ్చట పడి “నాయనా! నీ ధైవభక్తికి ఆనందం కలిగింది. నీకు ఈ జన్మలోనే మోక్షం కలిగించాలని అనుకుంటున్నాను” అన్నాడు. \r\n\r\n“స్వామి! మీరు మహానుభావులు, మోక్షం ఇప్పిస్తామంటున్నారు. అంత కంటే నాకు కావాల్సింది ఏముంది. కానీ నాదో మనవి. నా బిడ్డలు ఇప్పుడిప్పుడే ఎక్కివస్తున్నారు. పిల్లా పాపలతో వారు సుఖంగా ఉంటే చూచి ఆనందించి వస్తాను. దయచేసి మరోసారి రండి” అన్నాడు. \r\n\r\nయోగి, “సరే! అలాగే మరోసారి వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు. శెట్టిగారు కొడుకులకు వివాహాలు అయిపోయాయి. ఇద్దరికి కొడుకులు పుట్టారు. వ్యాపారాలు చూసుకుంటున్నారు. హాయిగా కాలం గడుపుతున్నాడు. అయిదేళ్ల తరువాత యోగి మళ్లీ వచ్చి “ఏం నాయనా! మరి వెళ్దామా! మోక్షం ఇప్పిస్తాను” అన్నాడు. \r\n\r\nశెట్టిగారు “యోగీంద్రా! నా భార్య గతించింది. ఆమె తిరిగి మా ఇంటిలో మహాలక్ష్మిలా పుడుతుందట. ఆ ముచ్చటా చూచి వస్తాను. తమరు మళ్లీ రండి” అన్నాడు.”సరే! నాయనా ఈసారి మళ్లీ వస్తాను. అప్పుడు మాత్రం కాదనకుండా రావాలి” అంటూ వెళ్ళిపోయాడు. \r\n\r\nఅలా వెళ్లిన యోగి మరో పది ఏళ్ళ తరువాత మల్లి వచ్చాడు. శెట్టిగారు కన్పించలేదు. శెట్టి గారు ఎక్కడ అని అడిగితే అయన ఎప్పుడో చనిపోయాడు, ఇదిగో! ఆ పూరి ఇంట్లో శెట్టిగారు పెద్ద కుమారుడు వుంటున్నాడు అంటూ ఒక తోటలోని పూరిపాకను చూపించారు. యోగి ఆ ఇంటివద్దకు వెళ్లి, కొట్టంలో ఎద్దు ఒకటి ఎండుగడ్డి నములుతూ కనిపించింది. యోగి ఎద్దు వద్దకు వెళ్లి దివ్య దృష్టితో అంతా తెలుసుకొని తన కమండలంలోని నీళ్లు ఎద్దుపై జల్లాడు. ఉలిక్కిపడి ఆ ఎద్దు తల ఎత్తి చూచింది. ” ఏం నాయనా! వస్తావా వెళదాం” అన్నాడు యోగి. ఆ ఎద్దు “అయ్యా నమస్కారం, నా కొడుకులు తగాదాలతో ఆస్థిపాస్థులు అన్నీ పోగొట్టుకున్నారు. బ్రతకడానికి పెద్ద కొడుకు ఒక ఎద్దుబండి తోలుకుంటూ దానిపై వచ్చే కొద్దీ రాబడితో భారంగా బతుకు ఈడుస్తున్నాడు. రెండో కొడుకు బర్రెగొడ్డును పెట్టుకొని పాలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. అలా చనిపోయిన నేను నా పెద్ద కొడుకు పంచలో ఎద్దుగా పుట్టి వాడి జీవనోపాధికి ఆధారమయ్యాను. \r\n\r\nనా భార్య నా చిన్న కొడుకు ఇంట్లో బర్రెగొడ్డుగా పుట్టి వాడి బతుకు తెరువుకి పాలిస్తూ వాడిని బతికిస్తుంది. ఇలా చాలీ చాలని సంపాదనతో నా కొడుకులు ఐదార్రో బతుకు బండి లాగుతున్నారు. వారి జీవనాధారానికి ఆధారమైన నేను నీతో వస్తే వారి బ్రతుకులు ఏంకాను! చూస్తూ చూస్తూ వారిని వదిలి ఎలా రాగాలను స్వామి! నన్ను క్షమించండి” అన్నాడు కన్నీరు కారుస్తూ. \r\n\r\n“ఆహ! వ్యామోహం ఎంత చెడ్డది. ఎవరి కర్మకు, ఎవరు కర్తలు, ఎంత వారికైనా విధిని దాటడం అసాధ్యం అనుకుంటూ వెళ్ళిపోయాడు యోగి. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1012,
        "IMAGE": null,
        "NAME": "వ్యామోహం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 110,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రంగనాథపురంలో ఉండే రఘుపతి, సరళ దంపతులకి హేమంత్ ఒక్కడే కొడుకు. చదివేది ఏడో తరగతి. పచ్చని ప్రకృతి, పరిసరాలను గమనించడం అతని అభిరుచి. చదువులో కూడా చురుకే.హేమంత్ అమ్మానాన్నలు విద్యావంతులు కావడంతో తనకి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. రఘుపతి ప్రశాంత జీవనం ఇష్టం. అందుకే పట్నం వాతావరణానికి దూరంగా స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు, చుట్టూ ప్రహరీ, కనుచూపు మేరలో కొండలు, అక్కడక్కడా ఇల్లు ఇదీ అక్కడి వాతావరణం. హేమంత్ బడి నుంచి రాగానే చేసే మొదటి పని పెరట్లోకి వెళ్లడమే. ఎందుకంటే… అక్కడ అన్ని రకాల పళ్లు, పూల చెట్లు, పొదలతో చిన్నపాటి అడవిని తలపించేది. తోట పనంటే హేమంత్ కి ఎంతో ఇష్టం. పనయ్యాక పెరట్లో ఓ చాపేసుకొని అక్కడే కూర్చొని చదువుకునే వాడు. చెట్టు చెట్టునూ పరిశీలించి వాటితో కబుర్లు చెప్పేవాడు. \r\n\r\n\tపక్షుల అరుపుల్ని అనుకరిస్తూ, చీమల బారుల్ని ఆసక్తిగా గమనించే వాడు. సీతాకోక చిలుకల్ని, ఉడుతల కదలికల్ని కన్నార్పకుండా చూసేవాడు. సాలీల్ల గూటి నిర్మాణం చూసి ఆశ్చర్యపోయే వాడు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించి పోతున్నాయి అని కలత చెందుతూ ఉండేవాడు. అందుకే వాటి కోసం తోటలో అక్కడక్కడా గూళ్ళు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేశాడు. పిచ్చుక ల కిచకిచలు తోటంతా ప్రతి ధ్వని స్తుంటే పులకిస్తుంటాడు. \r\n\r\n‘ ఎప్పుడూ ఆ తోటలోనేనా! మరో ప్రపంచం లేదా నీకు? ‘ అని తల్లితండ్రులు సున్నితంగా మందలించినా తోటని వదిలి రావడానికి ఇష్టపడేవాడు కాదు. \r\n\r\nఆదివారం హేమంత్ పెరట్లో చదువుకుంటూ ఉండగా ఎండిన ఆకుల చప్పుడయింది. చూస్తే ఏం లేదు. మళ్లీ చదువులో నిమగ్నమయ్యాడు. ఈసారి చప్పుడుతో పాటు హిస్.. హిస్ మనే బుసలు కొడుతున్న శబ్ధం వచ్చింది. హేమంత్ లేచి ఆ వైపు వెళ్లి పరిశీలించాడు. అక్కడో.. పెద్ద కొండచిలువ కనిపించింది. భయంతో కపించిపోయాడు. అది అటూఇటూ కదులుతోంది. హేమంత్ భయం నుండి తేరుకొని ఇంట్లోకి పరిగెత్తాడు. \r\n\r\n‘ ఏమైందిరా? అలా వణుకుతున్నావు?’ అని వాళ్ళమ్మ అడిగేసరికి ‘ అమ్మా… తోటలో పెద్ద కొండచిలువ ‘ రొప్పుతూ చెప్పాడు. ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసింది. రఘుపతి కంగారుగా ఇంటికొస్తూ వెంట నలుగుర్ని తీసుకొని వచ్చాడు. వాళ్ల చేతిలో పెద్ద కర్రలున్నాయి. అందరూ కొండచిలువను వెతుకుతూ తోటలోకి అడుగుపెట్టారు. వాళ్ళతో పాటు హేమంత్ కూడా వెళ్లాడు. తోటలో ఓ గోడ మూలకు చుట్టచుట్టుకొని కనిపించింది. \r\n\r\n‘ అదిగో.. అక్కడ వుంది! అమ్మో… ఎంత పెద్దదిగా వుందో! ‘ అని అరుస్తూ కర్రలు లేపారు వాళ్లంతా. కొండచిలువ ఆ అలికిడికి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తోంది. హేమంత్ కంగారుగా ‘ నాన్నా! పాపం ఆ కొండచిలువ ఏం చేసింది. దాన్ని ఎందుకు చంపుతున్నారు? అడవుల్ని నాశనం చేస్తుంటే ఆహారం వెతుక్కుంటూ జంతువులు, కొండచిలువలు ఊరిలోకి వస్తున్నాయి. తప్పు మనం చేసి వాటిని శిక్షించడం ఎందుకు నాన్న! వద్దు దాన్ని చంపకండి. అటవీశాఖ అధికారులకు అప్పగించండి ‘ అన్నాడు బాధగా మొహం పెట్టీ. \r\n\r\nరఘుపతికి హేమంత్ ఆవేదన అర్థమై చంపుదామని వచ్చిన వాళ్ళను పంపించేసాడు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్ళు గంటలోనే అక్కడికి వచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు. వెళ్తూ హేమంత్ ని అభినందించారు. ఆ తరువాత దాన్ని భద్రంగా అడవిలో విడిచిపెట్టారు. హేమంత్ ఆనందంతో నాన్నను కౌగిలించుకొని, కృతజ్ఞతలు చెప్పాడు. హేమంత్ మంచి మనసుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1013,
        "IMAGE": null,
        "NAME": "నా తోటలో",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 111,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని “మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను. ఇప్పుడు నాకు ఈ అంతిమ దశలో వాటి గురించి భయం పట్టుకున్నది. నేను చేసిన దాని మూలముగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరములవారు నరకములో ఘోర పాపములను అనుభవించెదవేమో! దీనికి తమరే తరుణోపాయమును సెలవియ్య వలెనని” వేడుకున్నాడు.\r\n\r\nఅతడి ప్రార్థన విన్న మునీశ్వరుడు అతడి పట్ల జాలితో “నాయనా! అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక. నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అనునిత్యం పేదలకు అన్నదానం చేయించు దానితో నీ యొక్క పాపములు పరిహారమవుతాయని తెలిపాడు.\r\n\r\nమునీశ్వరుని సలహా నచ్చిన ఆతడు ఆయనకు నమస్కారము చేసి తన ఇంటికి చేరుకుని వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఇందు నిమిత్తంగా కొద్దిగా కలప అవసరమైనది. దానితో కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలు తీసుకువచ్చి మంటప నిర్మాణానికిగాను వాటిని రంపాలతో కోయసాగారు. దానితో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉండసాగింది.\r\n\r\nఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడివద్ద ఉంటున్న కోతులమందలోని ఒక కోతి చూచినది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషులతో మనకు పనేమిటంటూ దానిని హెచ్చరించాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం చూసిన కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుమమేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తరువాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండటానికిగాను పెడతారు.\r\n\r\nఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. ఎంతకి రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి దానితో బలవంతంగా కొట్టింది. ఆ రాయి దెబ్బకు ఆ మేకు క్రిందకు జారి పోవడం దూలం దగ్గరగా చేరడం మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిల తన్నుకుని మరణించడం జరిగింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1014,
        "IMAGE": null,
        "NAME": "తెలివి తక్కువ కోతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 112,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో\r\nపనిచేయలేక పోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు.\r\n\r\nకొంత కాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య,\r\nతెలివైనవాడు. వంటలుకన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు\r\nకాఫీ కోపాలో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగేముందు\r\nదాని మీద మూత తీసివేసి. చాలాసేపు పేపరు చదువుతూ కొద్దికొద్దిగా కాఫీ\r\nపుచ్చుకుంటోంది.\r\n\r\nఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది.\r\n\r\nఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు.\r\nఅయితే తన అజాగ్రత్తవల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు\r\nసుతారమూ ఇష్టంలేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని\r\nనిశ్చయించుకుందామె.\r\n\r\nవెంటనే మారయ్యని పిలచి ‘ఏమోయ్! ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ\r\nకోపాలో ఈగపడింది’ అంది కోపంగా..\r\n\r\nదానికి వెంటనే మారయ్య తడుముకోకుండా “అమ్మా! కాఫీలో ఈగ పడకపోతే\r\nఏనుగు పడుతుందా?” అన్నాడు..\r\n\r\n“ఏనుగు పడదని నాకు తెలుసుకొని ఈగపడేలాగు పాలమీద మూత లేకుండా\r\nవుంచి, ఇంకా పెంకిమాటలు మాట్లాడతావేం” అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ.\r\n\r\n“అమ్మా! ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివికావు. అందువల్ల\r\nఇంత అవస్థ వచ్చి పడింది’ అని చమత్కరించాడు.\r\n\r\nదానికి రంగమ్మ నొచ్చుకుంటూ “పని బాగా చేయమంటే కథలు చెబుతా\r\nవేమిటి? మర్యాదగా తప్పు ఒప్పుకో…” అంది.\r\n\r\nఆ మాటలకు మారయ్య “అమ్మా నీ దగ్గర పనిచేయడం నావల్ల కాదు.. అంటూ\r\nఅక్కడినుంచి వెళ్ళిపోయాడు.”\r\n\r\nరంగమ్మకు నోటమాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి.\r\nపనివాడే మానేసేసరికి ఇబ్బంది పడిందామె.\r\n\r\nఅయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర\r\nపనిచేయడానికి రాలేదు.\r\n\r\nఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికిగాని, వంట\r\nచేయడానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో, అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద\r\nకాఫీ పెట్టుకోబోయి పొయ్యిమీదపడి కాలిపోయి మరణించింది.\r\n\r\nతన కోపమే తన శత్రువనడానికి ఇదొక ఉదాహరణ.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1015,
        "IMAGE": null,
        "NAME": "కోపం తెచ్చే అనర్ధం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 113,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలుపెట్టి, వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి, రాజకుమారులను దేశబ్రష్టులను చేసి తానే రాజు అయ్యాడు.\r\n\r\nముగ్గురు రాజకుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు.\r\n\r\nఇంతలో దేవుడు, “ప్రపంచంలోకల్లా విలువైనది సంపద, అది ఉంటే ఇంక దేన్నైనా సాధించవచ్చు” అన్నాడు.\r\n\r\n“కాదు, సైనికబలం. అది ఉండబట్టే మన సేనాని మనని దేశబ్రష్టులను చేశాడు” అన్నాడు శంఖుడు.\r\n\r\n“కానే కాదు, వాడు సైనికులను డబ్బుతో కొన్నాడు. అంచేత డబ్బే ప్రధానం” అన్నాడు దేవుడు.\r\n\r\nఇలా వాదులాడుతూ “మనం ముగ్గురం మూడు దిక్కులకు వెళ్ళి, మనకు అమూల్యమైనవి తోచిన వాటిని సంపాదించి తిరిగి పదేళ్లకు ఇక్కడే కలుద్దాం!” అన్నాడు శంఖుడు. మర్నాడు దేవుడు తూర్పుగా, శంఖుడు పడమరగా బయలుదేరాడు. ఉత్తరంగా బయలుదేరిన అమందుడు కొద్దిసేపటికి వెనక్కి తిరిగి వచ్చి, పెదరాసి పెద్దమ్మ కూతుర్ని పెళ్లాడి అక్కడే సుఖ సంతోషాలతో అక్కడే ఉండిపోయాడు.\r\n\r\nపదేళ్లు గడిచాయి, దేవుడు తూర్పు నుండి అంతులేని బంగారం తీసుకొని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు. పడమటి నుండి శంఖుడు పెద్ద సైన్యంతో వచ్చాడు.\r\n\r\n“చూశావా? నా బంగారంతో నీ సేననంతా కొనగలను” అన్నాడు దేవుడు. “అసంభవం, నేను శంఖం పూరించానంటే నా సైనికులు నీ బిడారుని క్షణంలో రూపు మాపేస్తారు” అన్నాడు శంఖుడు. ఇంతలో ఇంట్లో ముందు అమందుడు బయటికి వచ్చాడు.\r\n\r\nఅమందుడుని చూసి “నీవు సంపాదించిన అమూల్య వస్తువేంటి?” అని అడిగారు అన్నలిద్దరూ. “సంతృప్తి!” అని సమాధానం ఇచ్చాడు అమందుడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1016,
        "IMAGE": null,
        "NAME": "అమూల్యమైన వస్తువు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 114,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో  అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక రోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. \r\n\r\nవాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు  పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు   పరుగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి.\r\n\r\n” నీళ్ళతో గొంతు తడుపుకొకపోతే నా ప్రాణం పోయేలా ఉంది ” దీనంగా అంది ఒక కోతి.\r\n\r\n” ఏం చేద్దాం… నీళ్ళు కనబడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు. ఇదేమి మాయో…” అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటోంది. ఆ  కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. \r\n\r\n“ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోండి” అని చెప్పింది. ఇది విని కోతులకి చాలా కోపం వచ్చింది.\r\n\r\n“మేం తెలివితక్కువ వాళ్ళమా? ” అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. “నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి” భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం విడిచింది.\r\n\r\nనీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే వుంటుంది. ",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1017,
        "IMAGE": null,
        "NAME": "హితవు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 115,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరక వచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇకమీదట జంతువులన్నీ కలసి మెలసి స్నేహితులు లాగా జీవించాలంట. అందుచేత కిందకు రా! మనం ఇద్దరం స్నేహితుల్లాగ మసలుకొందాం!” అంది.\r\n\r\nఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజం ఎంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది “అవును, ఆ వార్త నేను కూడా విన్నాను” అంది. లోలోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరికి కోడిపుంజు ఇలా అంది “అదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు, వాళ్లను కూడా రాని అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం!”\r\n\r\n“ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే!  ఇంతకూ ఎవరు వస్తున్నారు?” అని అడిగింది నక్క.\r\n\r\nవేట కుక్కలు, వాటి స్నేహితులు” అని జవాబిచ్చింది పుంజు.\r\n\r\nవేట కుక్కలు పేరు వినగానే నక్క హడలెత్తి పోయి వణకడం మొదలుపెట్టింది, వాటి కంటపడితే చావడం ఖాయం అనుకున్నది నక్క.\r\n\r\n“అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు?” అని అడిగింది కోడిపుంజు.\r\n\r\nఅందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటి వార్త విన్న లేదేమో అనుకొంటాను” అని అక్కడి నుండి పరిగెత్తి పారిపోయింది.\r\n\r\nమోసాన్ని మోసంతోనే జయించాలి.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1018,
        "IMAGE": null,
        "NAME": "నక్క – కోడిపుంజు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 116,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు. వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాపురం వెళ్లాలంటే ఒక పెద్ద అడవి దాటి వెళ్ళాలి. ముగ్గురు స్నేహితులు ఊరు నుండి ఉదయం బయలు దేరారు, రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. పోతూ పోతూ ఉంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది. మళ్లీ పోతూ పోతూ మరొకరికి చాట దొరికింది. అలాగే మరొకరికి గడ్డపార దొరికింది. వారు ముగ్గురు ఒక గుడిలో నిద్ర పోయారు.\r\n\r\nఅంతలో ఒక రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ రాక్షసునికి నరవాసన వచ్చింది, ఆ వాసనను బట్టి గుడి దగ్గరకు చేరుకున్నాడు. నరవాసనను గుర్తు పట్టి ఆ గుడిలో మనుషులు ఉన్నారని, ఒరేయ్! మానవా, నేనెవరో తెలుసా… రాక్షసుడిని! రారా బయటకి నమిలి మ్రింగేస్తా” అని పెద్దగా అరుస్తూ అన్నాడు రాక్షసుడు. ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో “ఒరేయ్ రాక్షసుడా! నేనెవరో తెలుసా? నేను రాకాసుల గాంచిన గూకాసినిరా!” అన్నాడు కోపంగా అరుస్తూ.\r\n\r\n“అయితే బయటికి రా నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం” అన్నాడు రాక్షసుడు. నేను రావడం ఏమిట్రా నా గోరు చాలు నిన్ను పొడి చంపడానికి అని గడ్డపార చూపాడు. అమ్మో ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. నా చెవి చూడరా, నా చెవిని ఆడించాలి అంటే గాలికే కొట్టుకుపోతావ్ అని చాటను బైట అటూ ఇటూ ఊపాడు. గూకాసుని చెవిని చూసి వణికిపోయాడు రాక్షసుడు. నా తోక చూడరా అని త్రాడును బయటకు విసిరాడు. అంతే ఆ దెబ్బతో ఆ రాక్షసుడు వణుకుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్ర పోయి, తెల్లవారుజామున లేచి నడవడం మొదలు పెట్టారు.\r\n\r\nతెలివి ఉంటే ఏ పనినైనా తేలికగా సాధించవచ్చు",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1019,
        "IMAGE": null,
        "NAME": "తెలివి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 117,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "రామనాథం మాస్టారు చక్కని ఉపాధ్యాయులు మాత్రమే కాదు, సమయోచితమైన సలహాలతో అందరి మంచిని పెంచే మహా మనిషి. ఒకరోజు రామనాథం మాస్టర్ గారు గోపి అనే విద్యార్థి జన్మదినం సందర్భంగా భగవద్గీత పుస్తకం ఇచ్చాడు. భగవద్గీత పుస్తకాన్ని చూసి గోపితో సహా అతని స్నేహితులు గొల్లున నవ్వి “వృద్ధులకు ఉపయోగపడే భగవద్గీత యువకుడినైన నాకెందుకు ఇచ్చారు” అని అడిగాడు గోపి.\r\n\r\nఅప్పుడు రామనాథం మాస్టారు అక్కడి వారిని ఉద్దేశించి ఇది వృద్ధులు మాత్రమే చదివే పుస్తకం కాదు మానసిక పరివర్తన చెందిన యువకులు చదవాల్సిన మహాగ్రంథం. ఎందుకంటే నేటి సమాజంలో యువతకు మంచి చెడుకు మధ్య తేడా తెలియడం లేదు. మహా వీరుడైన అర్జునుడు సంశయ మనస్కుడై కర్తవ్యాన్ని విస్మరించి మోహనసముద్రంలో పడిపోతున్న సమయంలో అతడికి సత్యం వివరించి విషాదం నుండి బయటకు లాగి కార్యోన్ముకుడిని చేసింది భగవద్గీత. అందుకే ఈ గ్రంథం ప్రపంచంలోని అన్ని భాషలలోనూ తర్జుమా చేయబడింది. అలాగే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చావే శరణ్యమని భావించే వారికి, సముద్రంలో దిక్కు తెలియని దిక్సూచి భగవద్గీత. కనుక పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ చదవాల్సిన అద్భుత గ్రంథం భగవద్గీత అని వివరించాడు\r\n\r\nరామనాథం చెప్పిన మాటల్లో సత్యం ఉన్నట్లు అక్కడ ఉన్న వారందరూ గ్రహించి చప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు.\r\n\r\nపుస్తక పఠనం మించిన విజ్ఞానం ఎక్కడా లేదు",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1020,
        "IMAGE": null,
        "NAME": "భగవద్గీత – బహుమానం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 118,
        "TYPE_ID": 14
    },
    {
        "DESCRIPTION": "నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు:\r\n\r\n“ఆమె మహాశక్తి. ఆమెయే విద్య. అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టిస్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు. బ్రహ్మ విష్ణు నాభి నుంచి పుట్టాడు; విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు; ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు; ఆ జలానికే ఆధారం ‘మహాశక్తి; లోకమాత. అలాంటి దేవికి సంబంధించినది దేవీభాగవతం.”\r\n\r\nసూతుడివల్ల దేవీభాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల పక్షాన శౌనకుడు సూతుడితో, “ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒకచక్రం ఇచ్చి, దాని నేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదనీ, అక్కడ కలి ప్రవేశించదనీ చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిశం అనే పేరు వచ్చింది. మేం ఇక్కడే ఉండి పోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి, కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వుమాకు పుణ్యప్రదమైన దేవీభాగవత పురాణం వినిపించు,” అన్నాడు.\r\n\r\nతిరిగి సూతుడు ఇలా చెప్పాడు:\r\n\r\n“వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలా నేను మీకు దేవీభాగవతం చెబుతాను. ఇప్పటికి ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి, ఇరవై ఎనిమిదో ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి, పురాణాలు రచించిన సాత్యవతేయుడు అనే వ్యాసుడు (సత్యవతి కొడుకు) మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీభాగవతం చెప్పుతూంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. ‘అల్లుడి వెంట తిను; కొడుకు వెంట చదువు’ అంటారుగద పెద్దలు. ఈ దేవీభాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యంకాదు.”\r\n\r\nఇది విని మునులు సూతుణ్ణి, “శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు? అతను అరణిలో పుట్టాడనిగదా చెబుతారు?” అని అడిగారు. అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మవృత్తాంతం ఇలా చెప్పాడు:\r\n\r\nఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీతీరాన తపస్సు చేసుకుంటూ, పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటమూ, వాటి నోటికి ఆహారం అందించి, అవి తింటుంటే చూసి ఆనందించటమూ గమనించి, తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్ళిచేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు. కొడుకులను కనవచ్చు. కొడుకులు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు.\r\n\r\nఅలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చెయ్యటానికి కాంచనాద్రికి వెళ్ళి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తూండగా, ఆయన ఉన్నచోటికి నారదుడు వచ్చాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, “స్వామీ, సమాయానికి వచ్చావు. నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావు,” అన్నాడు.\r\n\r\n“సర్వజ్ఞుడివి. నీకు ఒకరి సహాయం అవసరమా? ఏమయినా నీ కోరిక ఏమిటో చెప్పు,” అన్నాడు నారదుడు.\r\n\r\n“కొడుకులేనివాడికి పరలోకం ఉండదుట. ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు? చెప్పు, నారదా?” అని వ్యాసుడు అడిగాడు.\r\n\r\nఅప్పుడు నారదుడు ఇలా అన్నాడు:\r\n\r\n“ఒకానొకప్పుడు, నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణు లోకానికి వెళ్లి, విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడవనుకుంటున్నాను. నీకన్న గొప్పవాడుంటే చెప్పు,” అని అడిగాడు.\r\n\r\nదానికి విష్ణువు, “నువ్వు సృష్టించేవాడివనీ, నేను పెంపొందించేవాడిననీ, శివుడు హరించేవాడనీ జనం అనుకుంటారు. ఇది పొరపాటు. తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితిలయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సూ, నాకు సత్త్వమూ, శివుడికి తమస్సూ తోడ్పడుతున్నాయి. లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా? నేను ఈ శేషతల్పంమీద పడుకున్నా, లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దయవల్లనే గదా? వెనక నేను మదుకైటభులనే దానవులతో అయిదువేల ఏళ్లు పోరాడి, చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా? నేను స్వతంత్రుడనని ఒక్కనాటికీ అనుకోకు. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే, నువ్వు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యానుగదా. అందుచేత నేను శక్తికి అధీనుణ్ణి. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను, అన్నాడు.\r\n\r\nఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, “నువ్వు ఆదిశక్తిని వేడుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది,” అన్నాడు.\r\n\r\n“వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు,” అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు, “విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు” అని సూతుణ్ణి అడిగారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1021,
        "IMAGE": "cat_15",
        "NAME": "సూతుడూ – శౌనకాది మునులూ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 1,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "వెంటనే మునులు, “విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు” అని సూతుణ్ణి అడిగారు.\r\n\r\nపూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధంచేసి, అలసిపోయి, ఎక్కుపెట్టి ఉన్న వింటి మొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు. ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి, విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి, అతను నిద్రలో ఉండటం చూసి, ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడ్డారు. అప్పుడు శివుడు బ్రహ్మతో, “నువ్వు ఒక పురుగును తయారుచేసి, దానిచేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి. నారి తెగగానే వింటి మొన పైకి లేస్తుంది. వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది,” అన్నాడు. బ్రహ్మ పురుగును సృష్టించి, విష్ణువు వింటి నారిని కొరకమన్నాడు.\r\n\r\nదానికా పురుగు, “మహాత్మా, ఎలా చేసేది ఈ పని? మహాపాపం కాదా? తల్లీ పిల్లలను విడదీయటమూ, భార్యాభర్తలకు ఎడబాటు చేయటమూ, నిద్రాభంగం కలిగించటమూ బ్రహ్మహత్యలాటి మహాపాపాలు. ఈ పని నన్నుచేయమన్నారా?” అని అడిగింది.\r\n\r\n“నువ్వేమీ విచారించకు. యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం,” అని బ్రహ్మ పురుగుతో అన్నాడు.\r\n\r\nపురుగు సంతోషించి వింటి నారిని కొరికింది. అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది. భూమి అదిరింది. వింటి కొన చప్పున పైకి తన్నటంతో విష్ణువు తల కాస్తా ఎగిరిపోయింది. అది చూసి దేవతలు దిమ్మరపోయి, ఏంచెయ్యాలో తెలీక, “నువ్వే సర్వేశ్వరుడివి గదా, అన్ని లోకాలనూ భరించేవాడివిగదా! నీగతి ఇలా అయిందేమిటి? ఏ రాక్షసులూ చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు? నువ్వు మాయకు కూడా అతీతుడివే. మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా?” అని విలపించారు.\r\n\r\nదేవగురువైన బృహస్పతి వారితో, “ఇలా ఏడుస్తూ కూచుంటే ఏమవుతుంది? జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి,” అన్నాడు.\r\n\r\n“దేవతలంతా చూస్తూండగానే విష్ణువు తల తెగి, ఎగిరిపోయిందిగదా! మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది? దైవబలం వల్లనే ఏమైనా జరగాలి,” అన్నాడు ఇంద్రుడు.\r\n\r\nఅప్పుడు బ్రహ్మ, “దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి. ఆవిడే సృష్టి స్థితి కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి,” అన్నాడు. దేవతలు ఆదిశక్తిని ప్రార్థనచేశారు. వారిని కరుణించి దేవి ప్రత్యక్షమయింది.\r\n\r\n“తల్లీ, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది? అతని తల ఏమయింది?” అని దేవతలు దేవిని అడిగారు.\r\n\r\nదేవి వారితో ఇలా చెప్పింది:\r\n\r\n“కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు. అది చూసి లక్ష్మి కంగారుపడింది. విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు? తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా? తనకన్న అందగత్తెను ఎవతెనైనా చూశాడా? ఇలా అనుకుని లక్ష్మి సవతిపోరును తలచుకుని క్షణకాలం విలవిలలాడింది. తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది. ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది ఇలా ఉండగా, హయగ్రీవుడనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నాకోసం తపస్సు చేశాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఎవ్వరి చేతా తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనక మరేదన్నా వరం కోరుకోమన్నాను. అందుకు వాడు తాను హయగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగ వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. మూడు లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. కనక మీరు ఒక గుర్రం తల తెచ్చి, విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి. అలాచేస్తే విష్ణుహయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు.”.\r\n\r\nఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే, దేవతలు దేవశిల్పిని పిలిచి, గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతకమన్నారు. దేవశిల్పి అలాగే చేశాడు.\r\n\r\nవిష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుణ్ణి చంపి, లోకాలకు ఆనందం చేకూర్చాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1022,
        "IMAGE": "cat_15",
        "NAME": "హయగ్రీవావతారం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 2,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "తరవాత మునులు సూతుణ్ణి మధుకైటభులు కథ చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు వారికా వృత్తాంతం ఇలా చెప్పాడు:\r\n\r\nపాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి, నీటిలో ఈతలు కొట్టుతూ, తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు. వారిలో కైటభుడు అనేవాడు మధువుతో, “మహాసముద్రానికీ, మనకూ ఏదో ఆధారం ఉండి ఉండాలి,” అన్నాడు. వాడు అలా అనగానే ఆకాశంనుంచి ఒక మాట వినిపించింది.\r\n\r\nమధుకైటభులు ఆ మాట పట్టుకుని జపించసాగారు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. రాక్షసులు దాన్ని చూసి, అది శక్తి తేజస్సే అని నిశ్చయించి, తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి, వెయ్యేళ్లు తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చుకుని దేవి వారిని వరం కోరుకోమన్నది. వాళ్ళు స్వేచ్ఛా మరణం కోరారు. ఆమె వారు కోరిన వరం ఇచ్చింది.\r\n\r\nతరవాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ, ఒకచోట బ్రహ్మను చూసి, తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు.\r\n\r\n“మాతో యుద్ధంచెయ్యి, యుద్ధం చెయ్య లేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి, ఎక్కడికైనా వెళ్ళిపో,” అన్నారు వాళ్ళు బ్రహ్మతో.\r\n\r\nబ్రహ్మ భయపడి, యోగసమాధిలో ఉన్న విష్ణువుతో, ‘మేలుకో, నాయనా! ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు. నన్ను కాపాడు, అని వేడుకున్నాడు.\r\n\r\nఈ మాటకు విష్ణువు యోగనిద్ర నుంచి లేవలేదు. అప్పుడు బ్రహ్మ ఆదిశక్తియైన యోగనిద్రనే ప్రార్థనచేశాడు:\r\n\r\n“తల్లీ, ఈ రాక్షసులనుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా, నువ్వే నన్ను కాపాడు,” అన్నాడు బ్రహ్మ..\r\n\r\nవెంటనే యోగనిద్ర విష్ణువును విడిచి వెళ్ళిపోయింది. విష్ణువు నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు.\r\n\r\nబ్రహ్మ ప్రార్ధన ప్రకారం, యోగనిద్ర విడిచి వెళ్ళగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డంవచ్చి, “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులనీ, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడనీ విన్నాం. అలాటి విష్ణువును యోగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి, తేజస్సూ ఏమయ్యాయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం. నువ్వు శక్తి మాత్రమే అన్ని శక్తులకూ మూలకారణం అంటున్నావు. నిజం ఏదో మాకు తెలియటం లేదు, అన్నారు.\r\n\r\nదానికి సూతుడిలా అన్నాడు:\r\n\r\n“మునులారా, మీరడిగినదానికి సమాధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైన వారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక, విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవమనీ, మరికొందరు సూర్యుడనీ, మరికొందరు అగ్ని అనీ, ఇంకా కొందరు చంద్రుడనీ, ఇంద్రుడనీ, కొందరు ఏదో అనీ, మాయలోపడి, రకరకాలుగా అభిప్రాయపడతారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా, అన్ని ప్రమాణాలకూ అతీతమైన పరశక్తిమాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వాయువులో, అగ్నిలో కనబడుతూంటుంది.”\r\n\r\nఅలా శక్తిచేత మేల్కొల్పబడిన విష్ణువు బ్రహ్మను చూసి, “నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి?” అని అడిగాడు.\r\n\r\n“ఇంకనేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవులనుంచి ఇద్దరు రాక్షసులు, మధుకైటభులనేవాళ్ళు పుట్టి, నన్ను చంపుతామంటూ యుద్ధానికి పిలిచారు.” అన్నాడు బ్రహ్మ,\r\n\r\n“దీనికే భయపడతావా? నేను ఎంతలేసి రాక్షసులను చంపానుకాను?” అని విష్ణువు అంటున్నంతలోనే, ఆ రాక్షసులు వచ్చిపడి, బ్రహ్మతో, “పారిపోయివచ్చి, ఇక్కడ దాక్కున్నావా? మేం కనుక్కోలేమనే? నిన్ను ఇతను రక్షిస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక, ఇతన్ని తోడు చావమంటావా?” అని మీదికివచ్చారు.\r\n\r\nవిష్ణువు బ్రహ్మను తనవెనక్కు రమ్మని, రాక్షసులతో, “తెగ వదరుతున్నారు, మదమెక్కింది కాబోలు? తొందరపడకండి, ఇప్పుడే మీ మద మణుస్తాను,”అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు.\r\n\r\nదేవి ఆకాశం నుంచి చూస్తూండగా విష్ణువూ, మధుడూ యుద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలిసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్లయుద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది.అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. రాక్షసులను ఎలా జయించాలి? దానికి ఉపాయం ఏమిటి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అనుకుంటుంటే రాక్షసులు అతనితో, “యుద్ధం చెయ్యటానికి శక్తి చాలకపోతే, మాకు దాసుణ్ణని దణ్ణం పెట్టు, లేకపోతే నిన్ను చంపి, తరవాత బ్రహ్మను చంపేస్తాం,” అన్నారు.\r\n\r\nవిష్ణువు సౌమ్యంగా వారితో, “అలసిపోయిన వారినీ, వెనక్కుతిరిగినవారినీ, భయపడిన వారినీ,యుద్ధంలో పడిపోయినవారినీ ఎదుర్కోవటం వీరధర్మంకాదు. అది అలా వుంచి, మీరు ఇద్దరున్నారు. నేనేమో ఒక్కణ్ణి! ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధంచేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకుమాత్రం యుద్ధ ధర్మం తెలియదా?” అన్నాడు.\r\n\r\n“సరే, విశ్రమించు. ఈలోగా మేమూ విశ్రమిస్తాం,” అన్నారు రాక్షసులు.\r\n\r\nఅప్పుడు విష్ణువు దివ్యదృష్టితో, ఆ రాక్షసులు వరం పొందినవారని గ్రహించి, “ఈ దుర్మారులతో అనవసరంగా యుద్ధం చేస్తినే! వీరు పరాశక్తినుంచి స్వేచ్ఛా మరణం వరంగా సంపాదించారు. వీరిని ఎలా చంపటం?” అని ఆందోళన పడసాగాడు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు:\r\n\r\n“తల్లీ, నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీదుమిక్కిలి వాళ్ళే. నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు.”\r\n\r\nదీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, “రాక్షసులమీద నా మాయ కప్పుతాను. వారిని జయించు,” అన్నది.\r\n\r\nరాక్షసులు విష్ణువుతో, “ఓడిపోతానని ఎందుకు భయపడతావు? శూరులకు జయాపజయాలు రెండూ సంప్రాప్తమవుతాయి. నీచేత ఎందరు రాక్షసులు ఓడారుకారు? అయినా ఎప్పుడూ జయమే కలుగుతుందా?” అని ఎత్తి పొడిచారు.\r\n\r\nఈ మాటకు విష్ణువు మండిపడి, రాక్షసులతో తలపడి, వాళ్ళను పిడికిలితో పొడిచాడు. వాళ్ళు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టియుద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి, రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు.\r\n\r\nఅదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మథుడి బాణాలలాటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు యుద్ధంమాట మరచి మోహ పాశానికి చిక్కుపడ్డారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, “ఎంతమంది రాక్షసులనైనా చూశానుగానీ, యుద్ధవిద్యలో మీతో సమానులను చూడలేదు. మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమయింది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను,” అన్నాడు.\r\n\r\nదేవీ ప్రభావంచేత మాయామోహితులై ఉన్న రాక్షసులు, విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని, విష్ణువును తూస్కారంగా చూస్తూ, “మేం నిన్ను అడిగేవాళ్ళమూ, నువ్వు మాకు ఇచ్చేవాడివీనా? కావాలంటే నువ్వే కోరు, మేం ఇస్తాం!” అన్నారు.\r\n\r\n“నేను కోరినది ఇస్తారా? అదే నిజమైన వీరుల గుణం. చాలా సంతోషం! నా యుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నాచేత ఇప్పుడే చచ్చిపొండి, మరి ఇచ్చినమాట నిలుపుకోండి! “అన్నాడు విష్ణువు.\r\n\r\nరాక్షసులు కళవళపడి, కొంచెం ఆలోచించి, “నువ్వు మాటమీద నిలబడే వాడివైతే, మాకు వరం ఇస్తానన్నమాట గుర్తుంచుకుని, నీరులేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చిపోతాం,” అన్నారు.\r\n\r\nవిష్ణువు నవ్వి, తన తొడలు పెంచి, “రాక్షసులారా రండి,” అన్నాడు.\r\n\r\nరాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలనూ, రాక్షసులు తమ శరీరాలనూ ఇలా పెంచగా, చిట్టచవరకు రాక్షసుల శరీరాలకన్న విష్ణువు తొడలే పెద్దవి అయ్యాయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ళ మెదడు, నీటిలోపడి, పెద్దమిట్ట తయారయింది. అది మొదలు భూమికి మేదిని’ అనే పేరువచ్చింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1023,
        "IMAGE": "cat_15",
        "NAME": "మధు కైటభుల వధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 3,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు, “ప్రసంగవశాన ఇతర విషయాలు చాలా విన్నాం. కాని కొడుకుకోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది,” అన్నారు. మునులతో సూతుడు, వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు:\r\n\r\nనారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరిమీద, కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తూంటే, భూమ్యాకాశాలు కంపించాయి. ఇంద్రుడు భయపడి, దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి, “వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. గొప్ప ప్రమాదం వచ్చిపడింది. మమ్మల్ని కాపాడు!” అని ప్రార్థించాడు.\r\n\r\n“తపస్సుచేసుకునేవారికి కీడు తలపెట్టరాదు. వాళ్ళు ఇతరులకు చెరుపు చెయ్యరు. వ్యాసుడు కొడుకును కోరి, శక్తితోకూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు,” అని శివుడు దేవతలతో చెప్పి, వ్యాసుడి ముందు ప్రత్యక్షమై, అతని కోరిక తీరేలాగు వరమిచ్చాడు. వ్యాసుడు, తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.\r\n\r\nఅతను అరణి మధించి అగ్నిచేసి, “ఇలాటి అగ్నివంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతి బంధకం,” అని అనుకుంటుండగా, ఆకాశంలో ఘృతాచి కనబడింది. సమీపంలోనే మన్మథుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మథుడి ప్రభావానికి గురి అయికూడా, “ఇది నన్ను మోసగించటానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో? లేక, పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా?” అనుకున్నాడు.\r\n\r\nపురూరవుడి లాగే తానూ బాధపడవలసి వస్తుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచికూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని, ఆడ చిలుకగామారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు అగ్నికోసం మధించుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు.\r\n\r\nవ్యాసుడు శుకుణ్ణి చూసి, “ఏమిటీ అద్భుతం! ఇది శివుడి మహిమ కావాలి,” అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి, స్నానంచేయించి, జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందుభులు మోగాయి. భూమిమీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైనవారు పాడారు. రంభమొదలైన అప్సరసలు ఆడారు.\r\n\r\nచిలుకరూపం ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కు శుకుడు అనే పేరువచ్చింది. కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. శుకుడికోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండమూ, కమండలమూ పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపనయనం చేసి, బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు.\r\n\r\nశుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి, తండ్రివద్దకు తిరిగి వచ్చాడు.\r\n\r\n“చదువు పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడు ఎంతో సంతోషించి, అతనికి వివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుకుడుఅందుకు అంగీకరించక, వైరాగ్యం పూనితత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు.\r\n\r\n“మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం. అంతేకాని మరేవీ ముక్తికి బంధాలుకావు. న్యాయంగా ధనం సంపాయిస్తూ, అబద్ధమాడక, శౌచం విడవక, అతిథులను ఆదరిస్తూ, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ, గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వసిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు; నువ్వుకూడా ఒక కన్యను పెళ్ళాడి, నాకు సంతోషం కలిగించి పితృ దేవలకు తృప్తినివ్వు,” అన్నాడు వ్యాసుడు.\r\n\r\nఇంతచెప్పినా శుకుడి బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు మళ్ళీ, “నాయనా ఒకప్పుడు నేను ముక్తినివ్వగల దేవీభాగవతం రచించాను. దాన్ని చదివి జ్ఞానివికమ్ము, “అని దానిని గురించి చెప్పడం ప్రారంభించాడు.\r\n\r\nవైరాగ్య చిత్తంతో వివాహంచేసుకోనని పట్టుబట్టిన శుకుడికి, వ్యాసుడు తాను రచించిన దేవీ భాగవతం చెప్పాడు:\r\n\r\nవిష్ణువు మర్రి ఆకు మీద పిల్లవాడుగా ఉండి, “నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను? నన్ను ఎవరు సృష్టించారు? ఈ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి?” అని విచారిస్తూంటే, అతన్నిచూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకంచెప్పి, “ఇదే సమస్త మూనూ. దీన్ని తెలుసుకుంటే నన్నెరిగినట్టే,” అన్నది.\r\n\r\nవిష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడుగానీ, అర్థం చేసుకోలేకపోయాడు.\r\n\r\nఅతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు. అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదాదులు ధరించి, మేలిమి బంగారు బట్టలు కట్టి, తనలాటివారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదట ప్రత్యక్షమయింది.\r\n\r\nవిష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపోయాడు. అప్పుడామె అతనితో, “మాయ మూలంగా నన్ను మరిచావు. ఇప్పుడు నువ్వు సగుణుడివి. నేను సత్త్వశక్తిని, నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి, రజోగుణంగలవాడై అన్ని లోకాలూ సృష్టి చేస్తాడు. అతను చేసిన సృష్టికి నువ్వు పాలకుడవుగా ఉంటావు. ఆ బ్రహ్మదేవుడి కనుబొమ్మల మధ్య నుంచి, క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు. ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి, దాని మూలంగా తామసగుణం కలిగినవాడై, ప్రళయకాలంలో, బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. నువ్వు నా సహాయంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనక సత్త్వశక్తినైన నన్ను గ్రహించు. నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను,” అన్నది.\r\n\r\nఆమెతో విష్ణువు, “నాకు ఒక అర శ్లోకం వినబడింది. దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు అన్నాడు.\r\n\r\n“నన్ను సగుణగా నువ్వు చూస్తున్నావు. నీకా అరశ్లోకం చెప్పినది నిర్గుణస్వరూపి అయిన పరదేవత. ఇది భాగవతమనే పేరుగల మంత్రం. దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి,” అన్నదామె.\r\n\r\nవిష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైటభులను చంపి, వారికి భయపడి తనకు శరణుజొచ్చిన బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికీ, నారదుడు వ్యాసుడికీ ఉపదేశించారు. వ్యాసుడు మహిమాన్వితమైన ఆ మంత్రాన్ని శుకుడికి ఉపదేశించి, “దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరించి రచించాను,” అన్నాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1024,
        "IMAGE": "cat_15",
        "NAME": "శుకుడి జననం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 4,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించమన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు:\r\n\r\nకోసలదేశపు రాజధాని అయోధ్యా నగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు సుదర్శనుడనీ, లీలావతికి శత్రుజిత్తు అనీ కొడుకులు కలిగారు.\r\n\r\nధ్రువసంధి ఒకనాడు వేటాడుతూండగా సింహం ఒకటి అతని మీద పడింది. సింహము, ధ్రువసంధీ హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరూ చనిపోయారు.\r\n\r\nమనోరమ తండ్రి కళింగదేశపు రాజు వీరసేనుడు, తన అల్లుడు చనిపోయిన వార్తవిని మనమడైన సుదర్శనుడి క్షేమం చూడడానికి వచ్చాడు. అలాగే ఉజ్జయిని నుంచి శత్రుజిత్తు మాతామహుడైన యుధాజిత్తు కూడా వచ్చాడు.\r\n\r\nసుదర్శనుడు, శత్రుజిత్తు ఇరువురిలో ఎవరిని రాజు చేయడమా అన్న విషయంలో ఇద్దరు మాతామహుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఘర్షణపడ్డారు. ఆ పోరాటంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి చంపేశాడు.\r\n\r\nమనోరమ బిడ్డగావున్న సుదర్శనుణ్ణి వెంటబెట్టుకుని భరద్వాజాశ్రమం చేరింది. భరధ్వాజుడు ఆమెనూ, బిడ్డనూ ఆదరించి, శత్రువుల బారి నుంచి కాపాడి, సుదర్శనుడికి విద్యాబుద్ధులు నేర్పాడు. యుక్తవయస్కుడైన సుదర్శనుడికి ఒకరోజు మహాదేవి కలలో కనిపించి అస్త్రవిద్య ప్రసాదించింది.\r\n\r\nకాశీరాజు సుబాహుడి కూతురు శశికళ, అద్భుత సౌందర్యవతి అని విని, సుదర్శనుడు ఆమెను పెళ్ళాడ గోరాడు. అదేవిధంగా శశికళ కూడా సుదర్శనుణ్ణి పెళ్ళాడ నిశ్చయించింది.\r\n\r\nసుబాహుడు తన కుమార్తె శశికళ స్వయంవరం ప్రకటించాడు. నానాదేశాల రాజులూ కాశీకి వచ్చారు. అయితే శశికళ సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టుపట్టింది!\r\n\r\nరాణి తన కుమార్తె వద్దకు వెళ్ళి, “అమ్మా, నిన్ను పెళ్ళాడాలని అంతమంది రాజులు వచ్చి ఉండగా సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టు బట్టి, మన ప్రాణాలమీదికి ఎందుకు తెస్తావు? స్వయంవర సభకు పద. నువ్వు సుదర్శనుణ్ణి వరిస్తానంటే, యుధాజిత్తు ఆ సుదర్శనుడితో పాటూ నిన్నూ, నన్నూ, నీ తండ్రినీకూడా చంపేస్తాడు!” అని హెచ్చరించింది.\r\n\r\nఎన్ని చెప్పినా, శశికళ మరొకరిని పెళ్ళాడనన్నది. ఆమె తండ్రితో, “నీకు ఈ రాజులంటే భయం అయితే నన్ను సుదర్శనుడి కిచ్చి, రథంలో మమ్మల్ని పొలిమేర దాటించు. యుద్ధం జరిగితే అతను శత్రువులను తానే చంపేస్తాడు,”అన్నది.\r\n\r\n“చూడు తల్లీ! అనేకమందితో విరోధం తెచ్చుకోవటం ఎవరి తరమూ కాదు. మిమ్మల్ని పొలిమేర బయట వదిలినంత మాత్రాన ఆ దుర్మార్గులు మిమ్మల్ని చుట్టుముట్టితే మీరు చెయ్యగలిగినదేమున్నది? నాకొక పద్ధతితోస్తున్నది. సీత పెళ్ళికి పెట్టినట్టుగా నీ పెళ్ళికి ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గినవాణ్ణి పెళ్ళాడు,” అన్నాడు సుబాహుడు.\r\n\r\n“అందువల్ల సమస్య తీరుతుందా? పందెంలో ఎవడో గెలిచి నన్ను పెళ్ళాడతాడు. అప్పుడు మిగిలినవాళ్ళు ఊరుకుంటారా? ఎలాగూ యుద్ధం తప్పదు. మహాదేవిని నమ్ముకుని నన్ను సుదర్శనుడికిచ్చి పెళ్ళిచెయ్యి,” అన్నది శశికళ.\r\n\r\nఆమె నిర్ణయించిన పథకాన్ని ఆమోదించాడు సుబాహుడు.\r\n\r\nసుబాహుడు రహస్యంగా వివాహ ప్రయత్నాలు జరిపించి, సుదర్శనుణ్ణి రప్పించి, తన కూతుర్ని అతనికి శాస్త్రోక్తంగా కన్యాదానం చేశాడు. ఆ సందర్భంలో ఆయన తన అల్లుడికి రెండు వందల రథాలూ, కొన్ని వేల గుర్రాలూ, కొన్ని వందల మంది దాసీలూ, ఇతర కానుకలూ ఇచ్చాడు. అతను మనోరమతో, “అమ్మా, ఇక నా కూతురు నీ కొడుకు సొత్తు, నీసొత్తు. దాన్ని ప్రేమగా చూసుకో,” అని నమస్కారం చేశాడు.\r\n\r\nమనోరమ ఎంతో సంతోషంతో, “అయ్యా, మహారాజువై ఉండి కూడా రాజ్యహీనుడైన నా కొడుక్కు నీ కూతుర్ని పెళ్ళిచేశావు! నీవంటి ఉత్తముడు ముల్లోకాలలో ఎక్కడా ఉండడు. నీ కుమార్తె భారం మాది అయితే, మా భారం నీది!” అన్నది.\r\n\r\nదానికి సుబాహుడు, “అమ్మా, నీ కొడుకు రాజ్యవిహీనుడని ఎందుకు అనుకోవాలి? నా రాజ్యం అతనిది కాదా? నా సేన అంతా ఇస్తాను. మనం నీరక్షీర న్యాయంగా ఉండేటప్పుడు ఒకడు రాజనీ, ఇంకొకడు సేవకుడనీ విచక్షణ అండ ఉండగా విచారం దేనికి?” అన్నాడు.\r\n\r\n“ఎంత చల్లనిమాట అన్నావు, బాబూ! నీకు శుభం కలుగుతుంది. నీ రాజ్యాన్ని నువ్వూ, నీ కొడుకులూ సుఖంగా ఏలుకోండి. జగన్మాత అనుగ్రహంతో నా కొడుకు తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. గ్రహచారం సరిగా ఉన్నవాడు మట్టి పట్టుకుంటే, బంగారమవుతుంది. ఏది చేసినా కలిసివస్తుంది. అందరూ సహాయపడతారు. ఇప్పుడు నా కొడుకు రోజులు మంచివి. కీడు రాదు, అన్నది మనోరమ.\r\n\r\nసుబాహుడు పెళ్ళితంతు పూర్తిచేసి, తన కూతురికి, అల్లుడికి అప్పగింతలూ, అంపకాలూ జరుపుతూండగా, కొందరు వచ్చి, “రాజా, వధూవరులను ఇప్పుడు పంపకండి. దారిలో శత్రువులు రాక్షసులలాగా కాపువేసి ఉన్నారు, అని చెప్పారు.\r\n\r\nరాజుల సంగతి ఎరిగినవాడు కావటంచేత సుబాహుడు ఆ మాట నమ్మి, అంపకాలు చెయ్యటానికి సంశయించాడు.\r\n\r\nఅప్పుడు సుదర్శనుడు అతనితో, “రాజా, నువ్వేమీ సంకోచించవద్దు, దేవి నా పక్షాన ఉండగా ఈ రాజులు నన్నేం చెయ్యగలరు?” అన్నాడు.\r\n\r\nకాశీరాజు తన అల్లుడికి అంతులేని ధనం ఇచ్చి సాగనంపుతూ, సైన్యంతో సహా తాను కూడా తోడు బయలుదేరాడు.\r\n\r\nదారులు కాచివున్న రాజులు దూరం నుంచి చూసి, “అదుగో రథం! వాడే సుదర్శనుడు! పెళ్ళాంతో సహాపోతున్నాడు. పట్టుకుని కొడదాం పట్టండి! అంటూ విజృంభించారు.\r\n\r\nసుబాహుడు వారికి అడ్డుపడ్డాడు. సుదర్శనుడు మంత్రం జపిస్తూ, అంబను ధ్యానించాడు. ఆ సమయంలో శత్రుజిత్తూ, యుధాజిత్తూ అతనిపైకి వచ్చారు. సుబాహుడు వీరావేశంతో శంఖం పూరించి, యుధాజిత్తు మీద వరసగా బాణాలు వేశాడు. ఇద్దరికీ తీవ్రంగా యుద్ధం సాగింది.\r\n\r\nఅంతలో జగదంబ దివ్యమైన ఆకారంతో, అనేక మహాయుధాలతో, పూలమాలలతో, సింహంమీద ప్రత్యక్షమయింది. సుదర్శనుడు ఆనందంతో శరీరం పులకరిస్తూండగా దేవిని తన మామకు చూపి, “ఇంకమనకు భయమేమిటి?” అని చెప్పి, రథం దిగి, తన భార్యనూ, మామనూ వెంటబెట్టుకుని దేవి కాళ్ళకు ప్రణామం చేశాడు.\r\n\r\nఏనుగులు సింహాన్ని చూసి భయపడి ఘీంకారాలు చేస్తే, సింహం వాటిని చూసి గర్జించింది. అదే సమయంలో దారుణంగా గాలి వీచి బీభత్సం చెలరేగింది. రాజులందరికీ కంపరం పుట్టింది. వాళ్ళు దిక్కు తెలియనట్టుగా నిశ్చేష్టులై చూడసాగారు.\r\n\r\nఅప్పుడు సుదర్శనుడు సేనాపతితో, “మహాదేవి మనకు అండగా వచ్చింది. నువ్వు సంశయించక, రాజుల మీదికి సేనలు నడిపించు,” అన్నాడు.\r\n\r\nకాశీరాజు సేనలు రాజులపైకి విజృంభించాయి.\r\n\r\nఅప్పుడు, తెల్లబోయి చూస్తున్న రాజులతో యుధాజిత్తు, “ఎవరో ఆడది సింహంమీద వచ్చేసరికి మీకు మతులుపోయాయేమిటి? ఒక అర్భకుడు ఒక ఆడదాన్ని తోడు తెచ్చుకుంటే ఇందరు రాజులూ కొయ్యబారిపోతారా? క్షణంలో వాణ్ణి చంపి, రాజు కూతుర్ని వశపరుచుకుందాం, పట్టండి!” అని, తన మనమడైన శత్రుజిత్తును వెంటబెట్టుకుని, సుదర్శనుడి మీద యుద్ధం సాగించాడు.\r\n\r\nఅప్పుడు అంబ అందరి రాజులకూ అన్ని రూపాలలో కనబడి, అందరితోనూ ఒక్కసారే యుద్ధం చేసింది. క్షణంలో యుధాజిత్తూ శత్రుజిత్తు బాణాలు తగిలి చచ్చారు. సుబాహుడు ఆనందబాష్పాలు రాల్చుతూ, ఆ పరాశక్తిని స్తోత్రం చేశాడు. తరవాత అతను ఆమెతో, “తల్లీ, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపో! ఈ కాశిలోనే ఉండిపో. నాకు మరెవరి అండా అవసరంలేదు. భూమి ఉన్నంత కాలమూ ఈ కాశీ ఉంటుందంటారు. కాశీ ఉన్నంత కాలమూ నువ్వు ఇక్కడే ఉండి, మాకు శత్రుభయం లేకుండా చెయ్యి. ఇదే నేను నిన్ను కోరే వరం,” అన్నాడు.\r\n\r\nమహాదేవి అందుకు ఒప్పుకున్నది.\r\n\r\nతరువాత సుదర్శనుడు మహాదేవిని స్తోత్రంచేశాడు. అతను ఆమెను, “తల్లీ, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేనెక్కడికి పోవాలి? నేను స్వయంగా అసమర్థుడనైనప్పటికీ, నీ అండ ఉంటే ఏమైనా సాధించగలను. అందుచేత నా కర్తవ్యం తెలిపి, నన్ను అనుగ్రహించు,” అని వేడుకున్నాడు.\r\n\r\nదానికి దేవి, “ఇంక చేసేదేమున్నది? నీ భార్యతో సహా అయోధ్యకు వెళ్ళి, సింహాసనం ఎక్కు; తగిన విధంగా రాజ్యం చేసుకో. నిన్ను నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను. ప్రతి అష్టమి, నవమి, చతుర్దశికీ నన్ను పూజ చెయ్యి. నాకు శరత్కాలం ఇష్టం. నవరాత్రి పూజలు చెయ్యి. మాఘ, చైత్ర, ఆశ్వయుజ, ఆషాఢ మాసాలు నాకు ఉత్సవాలు జరిపించు,” అని హెచ్చరించి అదృశ్యమయింది.\r\n\r\nతరవాత రాజులు ఒక్కరొక్కరే వచ్చి, ఇంద్రుడికి దేవతలు మొక్కిన విధంగా సుదర్శనుడికి మొక్కి, అంబను స్తుతించారు. వాళ్ళు అతన్ని తమ చక్రవర్తిగా ఆమోదించారు.\r\n\r\nసుదర్శనుడు అయోధ్యకు చేరే లోపునే వార్తలు చేరాయి. అందుచేత మంత్రులు మంగళవాద్యాలతో సహా ఎదురువచ్చి, సుదర్శనుణ్ణి, అతని భార్యనూ నగరంలోకి తీసుకుపోయారు.\r\n\r\nసుదర్శనుడు తన సవతి తల్లి వద్దకు పోయి, కొడుకు చచ్చి ఏడుస్తున్న లీలావతికి నమస్కరించి ఓదార్చి, “అమ్మా, నీ తండ్రినీ, నీ కొడుకును చంపినది నేనుకాదు, మహాశక్తి! నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. ఎవరో చేసిన కర్మకు నువ్వెందుకు బాధపడాలి? నన్ను నీ కొడుకులాగే చూసుకో. నీకు ఎల్లప్పుడూ మాతృసేవలు చేస్తాను. నేను పసివాణ్ణి అయి ఉండగా నీ తండ్రి దురుద్దేశంతో నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే, అది నా ప్రారబ్ధం అనుకున్నాగాని, దుఃఖించలేదు. నీ తండ్రి నా తాతను చంపేస్తే, నా తల్లి పుట్టెడు దుఃఖంతో నన్ను తీసుకుని అడవిదారిన పోతుంటే, మమ్మల్ని దొంగలు దోచారు. తరువాత గంగాతీరాన ఋష్యాశ్రమంలో తలదాచుకున్నాం. వాళ్ళ అనుగ్రహంవల్ల ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఇప్పటికీ కూడా నాకు ఎవరిమీదా ద్వేషం లేదు,” అన్నాడు.\r\n\r\nఅతని మాటలు విని లీలావతి సిగ్గుపడుతూ, “నేను వద్దంటున్నా వినకుండా నా తండ్రి నీకు ద్రోహంచేసి, తాను చావటమేగాక, నా కొడుకునుకూడా చంపాడు. నీ తల్లి నా అక్క, నువ్వు నా కొడుకువు! నేను విచారించవలసిన పనేమిటి? నా వాళ్ళు చావటానికి కారణం నువ్వు కాదని నాకు తెలియదా?” అన్నది.\r\n\r\nతరువాత సుదర్శనుడు తన మంత్రులచేత ఒక బంగారు సింహాసనం తయారు చేయించి, దాని మీద జగదంబను యథావిధిగా స్థాపించి, రోజూ పూజిస్తూ, పట్టాభిషేకం చేసుకుని, సుఖంగా చాలాకాలం రాజ్యం చేశాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1025,
        "IMAGE": "cat_15",
        "NAME": "సుదర్శనుడి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 5,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేశారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు.\r\n\r\nఇంద్రుడు మొసలి రూపంలో పంచ నదంలో ప్రవేశించి, కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు.\r\n\r\nఅప్పుడు అగ్ని ప్రత్యక్షమై, “ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా, పరమా? నీ తపస్సు చూసి నేను సంతోషించాను. కోరుకో, వరం ఇస్తాను.” అన్నాడు.\r\n\r\n“దేవా, నీకు నామీద అనుగ్రహం ఉంటే నాకు అజేయుడైన ఒక కొడుకును ఇయ్యి! వాడు కామరూపి, దేవతలకుగానీ, దానవులకుగానీ, జయించరానివాడుగా ఉండాలి,” అన్నాడు రంభుడు.\r\n\r\n“అలాగే అవుతుంది,” అని అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడు.\r\n\r\nరంభుడు తిరిగి వస్తూ, యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు. ఆ మహిషి అతని వెంట పాతాళానికి వచ్చేసింది.\r\n\r\nఅక్కడ ఆ మహిషిని మరొక మహిషం వెంబడించింది. అదిచూసి రంభుడు ఆగ్రహావేశంతో దాన్ని కొట్టాడు. ఆ మహిషం(దున్నపోతు) రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి, చంపేసింది. అది చూసి మహిషి రంభుడితో పాటు చితిమంటలలో కాలి పోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు. ఒకడు మహిషుడు, ఇంకొకడు రక్తబీజుడు.\r\n\r\nరాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు. మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సుచేసి, బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, “మహాత్మా, నాకు చావు లేకుండా చెయ్యి,” అని వరం కోరాడు.\r\n\r\nదానికి బ్రహ్మ, “పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు, చచ్చినవాళ్ళు పుట్టకా తప్పదు. చావకుండా నీకు వరం ఎలా ఇయ్యగలను? భూమికీ, సముద్రానికీ, కొండలకు సైతం నాశనం ఉన్నది గదా! చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరంకోరుకో, అలాగే ఇస్తాను,” అన్నాడు.\r\n\r\nఅప్పుడు మహిషుడు, “ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనక, దేవతలలోగాని, దానవులలోగాని, మానవులలోగాని ఏ పురుషుడి చేతా నాకు చావు లేకుండా అనుగ్రహించు,” అని బ్రహ్మను కోరాడు.\r\n\r\n“అలాగే, కాని నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది,” అని బ్రహ్మ వెళ్ళిపోయాడు.\r\n\r\nఈ వరంపొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఒక సేవకుణ్ణి పిలిచి, హెచ్చరించి రమ్మని పంపాడు. వాడు వెళ్ళి ఆమాట ఇంద్రుడికి చెప్పాడు.\r\n\r\nఇంద్రుడు ఆవేశంతో దిక్పాలకులను సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు:\r\n\r\n“రంభుడికొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధంచేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడు స్వర్గాన్ని జయిస్తాడట. మహిషుడికి సేవకుడివిగా ఉంటావో, యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడిదూత వచ్చి చెప్పి పోయాడు. అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చండి. శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు. జయాపజాయాలు దైవాధీనమే అయినా ప్రయత్నం మానరాదు. సంధి చేయటం మంచిదే. కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది. యుద్ధం చెయ్యాలన్నా మన బలాలూ, శత్రుబలాలూ సరిగా అంచనా వెయ్యవలసి ఉంటుంది. అందుకు ఒక మనిషిని పంపుదాం.”\r\n\r\nఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి, మహిషుడి బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది, తన పురోహితుడైన బృహస్పతిని, “మహిషుడు అంతులేని సేనలతో మనమీదికి యుద్ధానికి వస్తున్నాడు. ఏమిటి ఉపాయం?” అని అడిగాడు.\r\n\r\nఇంద్రుడి కంగారు చూసి బృహస్పతి, “అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచి పెట్టరాదు. ధైర్యంగా ఉండు. అయ్యేది కాకుండా ఉండదు. అయినా శాయశక్తులా ప్రయత్నం చెయ్యవలసిందే! అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు? అచ్చగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు. మనం ప్రయత్నంచేసినా ఫలితం కలగకపోతే అది దైవికం,” అన్నాడు.\r\n\r\nదానికి ఇంద్రుడు, “దేవా, ప్రయత్నించక పని జరగదు. యతులకు విజ్ఞానమూ, బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగు. నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే, నేను యుద్ధ యత్నం చేస్తాను. నాకు నువ్వూ, వజ్రాయుధమూ, హరి హరులూ సహాయులు,” అన్నాడు.\r\n\r\nబృహస్పతి ఇంద్రుడితో, “నేను నిన్ను యుద్ధం చెయ్యమనిగానీ, వద్దనిగానీ సలహా చెప్పను. మీమీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి,” అన్నాడు.\r\n\r\nఅప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు జొచ్చి, “మహిషుడు అనేవాడు మదించి స్వర్గంమీదికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు. వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతున్నది. నా దురవస్థ చూడు!” అన్నాడు.\r\n\r\nఇంద్రుడి మాటలు విని బ్రహ్మ, “మనం శివుణ్ణి, విష్ణువునూ వెంటబెట్టుకుని యుద్ధం చెయ్యటం మంచిది. ముందు కైలాసానికి పోదాం,” అన్నాడు.\r\n\r\nఇద్దరూ కలిసి శివుడివద్దకు వెళ్ళి సంగతి చెప్పారు. తరువాత ముగ్గురూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. అందరూ కలిసి మహిషుడితో యుద్ధం చెయ్యటానికి నిర్ణయం జరిగింది. హంసమీద బ్రహ్మా, గరుత్మంతుడి పైన విష్ణువూ, ఎద్దుమీద శివుడూ, నెమలిమీద కుమార స్వామీ, ఏనుగు మీద ఇంద్రుడూ ఎక్కి యుద్దానికి బయలుదేరారు. దేవసేనలూ, రాక్షససేనలూ ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి.\r\n\r\nయుద్ధం భయంకరంగా సాగింది. ఎంత శౌర్యపరాక్రమాలు ప్రదర్శించినా దిక్పాలకులూ, ఇంద్రుడూ, త్రిమూర్తులూ మహిషుడి ధాటికి తట్టుకోలేక చివరకు పారిపోయారు. స్వర్గం మహిషుడి వశమయింది. మహిషుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని, పదవులన్నిటా తన రాక్షసులను నిలిపి, దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకుని, స్వర్గసుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు. దేవతలు కొండలూ, గుట్టలూ పట్టి పోయి, అష్టకష్టాలూ పడ్డారు.\r\n\r\nఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి, “ఒక్క మహిషానురుడు మమ్మల్నందరినీ జయించి, మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడు, తండ్రివంటి వాడివి, మా దుస్థితి ఎందుకు చూడవు? సర్వజ్ఞుడివి, మా గతి ఏమిటి?” అని వాపోయారు.\r\n\r\n“నన్నేం చెయ్యమంటారు? వాడు తనను ఏ పురుషుడూ చంపకుండా వరం పొందాడు. వాణ్ణి చంపితే ఆడదే చంపాలి. మనం ముందు శివుడితోనూ, తరువాత విష్ణువుతోనూ ఆలోచిద్దాం,” అన్నాడు బ్రహ్మ.\r\n\r\nదేవతలందరూ బ్రహ్మవెంట శివుడి వద్దకు వెళ్ళారు.\r\n\r\n“ఏం పనిమీద వచ్చారు?” అని శివుడు వారిని అడిగాడు.\r\n\r\n“నీకు తెలియనిదేమున్నది? మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి, దేవతలనూ అష్టకష్టాలపాలు చేశాడు. వాళ్ళు తమ గతి ఏమిటని అడుగుతున్నారు,” అన్నాడు బ్రహ్మ.\r\n\r\nశివుడు చిరునవ్వు నవ్వి, “దేవతలకు ఈ అనర్థం కలిగించినది నువ్వేకదా! నీ వరంవల్ల వాణ్ణి ఏ మగవాడూ చంపలేడు, మరి వాణ్ణి చంపటానికి ఏ ఆడదాన్ని పంపుదాం? నీ భార్యను పంపుతావా? నా భార్యను పంపనా? లేక ఇంద్రుడి భార్య పోతుందా? మన భార్యలలో ఒకతె కూడా యుద్ధం చెయ్యగలది కాదే! అందుచేత ఏంచేస్తే బాగుంటుందో విష్ణువును అడుగుదాం. అతను నాకన్న తెలివిగలవాడు,” అన్నాడు.\r\n\r\nఅందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు, “మనమందరమూ మహిషుడితో యుద్ధంచేసి ఓడిన వాళ్ళమే గదా! వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి, ఆమెకు మన ఆయుధాలిచ్చి, ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి,” అన్నాడు.\r\n\r\nవిష్ణువు ఇలా అంటూండగానే దేవతలందరి నుంచీ రకరకాల తేజస్సు వెలువడి, అది క్రమంగా ఏకమై, పద్ధెనిమిది చేతులు గల స్త్రీ మూర్తిగా తయారయింది. దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలు ఉంచారు. ఆమె దేవతలతో, “భయపడకండి. ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను!” అంటూ సింహనాదం చేసింది.\r\n\r\nదాన్ని విని మహిషుడు, “ఎవడు ఈ ధ్వని చేసినది? వెళ్ళి, వాణ్ణి పట్టి తీసుకురండి! నా చేత చావు దెబ్బతిన్న దేవతలకు ఇంత సాహసం ఉండదే!” అన్నాడు తన వాళ్ళతో.\r\n\r\nవాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి, మహిషుడితో, “ఎవరో సింహం ఎక్కి వచ్చింది. ఒంటినిండా ఆభరణాలు, పద్ధెనిమిది చేతులలో ఆయుధాలు!” అని చెప్పారు. మహిషుడు తన మంత్రితో, “ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా! నా పట్టమహిషిగా చేసుకుంటాను!” అన్నాడు.\r\n\r\nమంత్రి వచ్చి, దూరంగా నిలబడి దేవితో, “అమ్మా, నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సర్వలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను పెళ్ళాడ కోరుతున్నాడు,” అన్నాడు.\r\n\r\nదేవి చిన్నగా నవ్వి, “వాణ్ణి చంపటానికే వచ్చాను. నువ్వు మంచివాడివిలాగున్నావు. నిన్ను చంపను. మీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు!” అన్నది.\r\n\r\nమహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక, రాయబారానికి తన సేనాపతిని తామ్రుణ్ణి పంపాడు. దేవి వాణ్ణి చంపింది. అంతటితో మహిషుడి ప్రేమఘట్టం అంతమయింది. అతను దేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు. అందరూ దేవిచేత చచ్చారు. తరవాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. మహిషుడు కామరూపి కావటంచేత, అనేక రూపాలు ధరించి దారుణ యుద్ధం చేశాడు. చివరకు దేవి వాణ్ణి చక్రాయుధంతో తల నరికి చంపేసింది. దేవతలు పరమ సంతోషం పొంది, దేవిని స్తోత్రం చేశారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1026,
        "IMAGE": "cat_15",
        "NAME": "మహిషాసుర వధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 6,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "పూర్వం త్వష్టృ ప్రజాపతి దేవతలందరిలోకీ గొప్పవాడూ, గొప్ప తపస్సు చేసినవాడూనూ. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ, మూడు తలలతోనూ మూడు వేరువేరు పనులు చేస్తూంటే మునులందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేదపఠనం చేసేవాడు. మరొక నోటితో సోమపానం చేసేవాడు. మూడో ముఖంతో ప్రపంచంలో జరుగుతున్నదంతా గమనించేవాడు.\r\n\r\nఅలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటికాలి మీద; చలికాలం నీటిలోనూ, వేసవిలో అగ్నుల మధ్యా నిలబడి, నిరాహారుడై తపస్సు చెయ్యటం చూసి, అతను తన పదవి కాజెయ్యటానికి చూస్తున్నాడనుకుని, అతని తపస్సు భగ్నంచేయ నిశ్చయించి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. అయితే వాళ్ళ శృంగార చేష్టలు వృత్రుడి మీద ఏమాత్రం పనిచేయలేదు. వాళ్ళు ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి, వృత్రుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు.\r\n\r\nఇంద్రుడు మహాత్ముడైన ఆ విశ్వరూపుణ్ణి చంపటానికి నిశ్చయించాడు. అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు. అతను ఐరావతాన్నెక్కి, విశ్వరూపుడు తపస్స మాధిలో ఉన్న చోటికి వెళ్ళి, ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు.\r\n\r\nతన పుత్రుణ్ణి ఇంద్రుడు హత్య చేశాడనివిని త్వష్టృ ప్రజాపతి మండిపడి, అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వ్రేల్చేసరికి, అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు పుట్టుకొచ్చాడు. అతన్ని చూసి త్వష్ట, “నీ పేరు వృత్రుడు. వేదతత్వం తెలిసినవాడూ, మూడుతలలు గలవాడూ అయిన మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి హతమార్చటానికి నువ్వు పుట్టావు. ఆ పని చెయ్యి, అని వృత్రుడితో అని, రకరకాల ఆయుధాలు తయారుచేసి ఇచ్చి, రథం కూడా ఇచ్చి, మంచి ముహూర్తాన, బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపటానికి పంపాడు.\r\n\r\nదేవేంద్రుణ్ణి హతమార్చటానికి వృత్రుడు వస్తున్నాడని విని, మునులూ, యక్షులూ, దేవతలూ కంగారుగా పారిపోయారు. అలా ఇళ్లూ, వాకిళ్లూ విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి, “రుద్రులనూ, ఆదిత్యులనూ, వసువులనూ, దిక్పాలకులనూ విమానాలమీద యుద్ధానికి రమ్మని పిలవండి,” అన్నాడు.\r\n\r\nఇలా బృహస్పతిని కూడా తన ఏనుగుమీద ఎక్కించుకుని, యుద్ధానికి తరలాడు. అతని వెనక ఆయుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు. వృత్రుడు కూడా దానవసేనలను వెంటబెట్టుకుని వచ్చాడు. ఉభయపక్షాలూ మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి.\r\n\r\nనూరు సంవత్సరాలపాటు యుద్ధం సాగింది. దాని మూలంగా లోకాలన్నీ బాధపడ్డాయి. ముందు వరుణుడు పారిపోయాడు. తరవాత క్రమంగా వాయుగణాలూ, యముడూ, కాంతి నశించిన అగ్నీ నిష్క్రమించారు. ఇంద్రుడు పలాయనం చెయ్యక తప్పలేదు; దేవతలనందరినీ జయించి, వృత్రుడు తండ్రి వద్దకు వెళ్ళి, నమస్కారం చేసి, “అందరూ ఓడి, భయపడి పారిపోయారు. భయపడ్డ వాళ్ళు అని ఎవరినీ చంపలేదు. ఇంద్రుడు కాలి సత్తువకొద్దీ పరిగెత్తిపోతే, అతని ఏనుగును తెచ్చాను. దీన్ని నువ్వు కానుకగా తీసుకో. ఇంకా ఏం చెయ్యాలో చెప్పు, ఎంత కష్టమైనా చేస్తాను,” అన్నాడు.\r\n\r\nత్వష్ట తన కొడుకును చూసి చాలా సంతోషించి, “నాయనా, నీ పరాక్రమం సాటిలేనిది. మళ్ళీ నలుగురిలో తల ఎత్తుకు తిరగగలను. నా మనోవేదన పోయి, జీవితం ఫలించింది. నాకు స్థిమితం కలిగింది. ఇక నువ్వు చెయ్యవలసిన పని చెబుతాను, విను. ఇంద్రుణ్ణి నమ్మరాదు. అతను చేసే ఇంద్రజాలాన్ని లక్ష్యపెట్టక, బ్రహ్మను గురించి తపస్సు చేసి, చావులేని వాడిపై, ఇంద్రుణ్ణి పరిమార్చు. తపస్సుతో సాధించరానిది ఏదీలేదు. ఆ దుర్మార్గుడు అకారణంగా నా కొడుకును చంపాడన్న సంగతి మనసులో నుంచి పోకుండా ఉన్నది. ఆ ఇంద్రుణ్ణి అంతం చెయ్యి,” అన్నాడు.\r\n\r\nవృత్రుడు తండ్రివద్ద సెలవు పుచ్చుకుని, క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదికి వెళ్ళి, గంగలో స్నానాలు చేస్తూ, దర్భచాప మీద ఉండి, అన్నిరకాల ఆహారమూ త్యజించి, యోగం అవలంబించి, మునులకు అద్భుత మనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. వృత్రుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి, ప్రత్యక్షమై, “ఇంక నీ తపస్సు చాలించి, నీకు ఏం కావాలో అడుగు,” అన్నాడు.\r\n\r\nవృత్రుడు బ్రహ్మకు చేతులు జోడించి, “దేవా, ఇదివరకే ఇంద్రపదవి సంపాదించి ఎంతో సంతోషించాను. ఇవాళ నీ దర్శనభాగ్యం లభించటం అంతకంటె ఎంతో ఎక్కువకదా! ధన్యుణ్ణి! నేను కోరిన వరం ఇయ్యదలిస్తే, లోహాలవల్లగాని, కర్రలవల్ల గాని, ఎండిన, ఎండని వెదురు వస్తువులతోగాని, ఇతర ఆయుధాల చేతగాని నాకు చావులేకుండా వరం ఇయ్యి. యుద్ధం సాగినకొద్దీ నా శక్తి పెరిగేటట్టు వరం ఇయ్యి, అన్నాడు.\r\n\r\nబ్రహ్మ అతను కోరినవరం ఇచ్చి వెళ్ళి పోయాడు.\r\n\r\nవృత్రుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగివెళ్ళి, జరిగినదంతా ఆయనకు చెప్పాడు.\r\n\r\n“నాయనా, నీకు శుభం! నీ అన్న విశ్వరూపుణ్ణి, అకారణంగా చంపి, బ్రహ్మ హత్యా పాతకం మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి ఇప్పుడు నిర్భయంగా చంపెయ్యి.” అన్నాడు త్వష్ట.\r\n\r\nఇంద్రుణ్ణి నిర్మూలించమని త్వష్ట చెప్పిన మీదట వృత్రుడు రథం ఎక్కి, గొప్ప సేనను వెంటబెట్టుకుని, యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడు మరొకసారి వృత్రుడితో యుద్ధం చెయ్యటానికి సిద్ధపడ్డాడు.\r\n\r\nఇంద్రుడికీ, వృత్రుడికీ గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం చాలా దీర్ఘకాలం సాగిన మీదట ఇంద్రుడు పూర్తిగా ఓడి, దిక్కులేని వాడయ్యాడు. వృత్రుడు అమరావతికి వచ్చి, అక్కడి సకల సంపదలనూ స్వాధీనం చేసుకున్నాడు.\r\n\r\nతన కొడుకు స్వర్గానికి రాజు కావటం చూసి త్వష్ట ఎంతో సంతోషించాడు. దేవతలు యజ్ఞభాగాలు పోగొట్టుకుని, చెట్టులూ, పుట్టలూ పట్టి పోయారు. దేవనగరం రాక్షస నగరమయింది.\r\n\r\nదేవతలు శివుడికి తమగోడు చెప్పుకున్నారు.\r\n\r\n“తమ శరణుజొచ్చాం, మమ్మల్ని కాపాడాలి,” అన్నారు వాళ్ళు.\r\n\r\nశివుడు మామూలు ధోరణిలో దేవతలతో, “మనం బ్రహ్మను వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు పోదాం. అతనే వృత్రుణ్ణి చంపుతాడు,” అన్నాడు.\r\n\r\nఅందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువు వారికి దర్శనం ఇచ్చి, “మీరంతా ఇలా వచ్చారు, ఏమిటి విశేషం?” అని అడిగాడు.\r\n\r\nదేవతలు తమ కష్టం చెప్పుకున్నారు. వారితో విష్ణువు ఇలా అన్నాడు:\r\n\r\n“అవును, మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. వృత్రుడికీ, ఇంద్రుడికీ స్నేహం కలిగించండి. నేను వజ్రాయుధంలో అదృశ్యంగా ఉండి మీకు సహాయపడతాను. సమస్త కోరికలూ తీర్చగల జగజ్జననిని ప్రార్థించినట్టయితే, ఆమె తన యోగమాయతో సహాయపడుతుంది. ఆమె మాయకు లోబడి వృత్రుడు ఇంద్రుడి చేతిలో చస్తాడు. మీరు కూడా ఆమె సహాయంతో వృత్రుణ్ణిచంపండి.”\r\n\r\nదేవతలు కల్పవృక్షాలతో కూడిన మేరు పర్వతం మీదికి వెళ్ళి, మహాదేవిని ధ్యానించారు. వాళ్ళు మహాదేవి తమకు లోగడ సహాయపడి, మహిషాసురుణ్ణి, శుంభ నిశుంభులనూ, ఇతర రాక్షసులనూ ఎలా చంపినదీ చెప్పి, “తల్లీ, ఈ వృత్రుడు నీకు కూడా శత్రువే అయి ఉండాలి. లేకపోతే, నీ భక్తులమైన మమ్మల్ని ఇలా ఎందుకు హింసలపాలు చేస్తాడు?” అన్నారు.\r\n\r\nవారి పొగడ్తలకు సంతోషించి దేవి వివిధ ఆభరణాలతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దివ్యమైన ఆయుధాలతో రక్తచందనం రంగుగల వస్త్రాలు ధరించి, వారి ఎదట ప్రత్యక్షమయింది.\r\n\r\nఆమె వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చి అంతర్ధానమయింది. దేవతలు కూడా తృప్తిపడి తిరిగివచ్చి, ఇంద్రుడితో స్నేహానికి ఒప్పించటానికి మునులను వృత్రుడి వద్దకు పంపారు.\r\n\r\nమునులు వృత్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు.\r\n\r\n“వృత్రా! నువ్వు మహాయోగ్యుడవే. ఇంద్రుడు కూడా గొప్పవాడు అనిపించుకున్న వాడే. అలాంటప్పుడు మీరిద్దరూ స్నేహంగా ఉంటే వేరేచెప్పాలా? ఇంద్రుడు నీతో స్నేహ ప్రమాణం చేస్తాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి. మునులు మీకు మధ్యవర్తులుగా ఉంటారు.”\r\n\r\nదానికి వృత్రుడు, “మీరంటే నాకు గౌరవమే. మీ మాట తీసివేయలేను. అయితే, పాపాత్ముడూ, బ్రహ్మహుతకుడూ అయిన ఇంద్రుణ్ణి ఎలా నమ్మగలను,” అన్నాడు.\r\n\r\nదానికి మునులు, “ఎవడి ద్రోహం వాణ్ణే కట్టికుడుపుతుంది. ఘోరమైన బ్రహ్మహత్యా పాతకానికీ, కల్లు తాగిన పాపానికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. కాని మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదే! అందుచేత నువ్వూ, ఇంద్రుడూ ప్రమాణ పూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు, ” అన్నారు.\r\n\r\n“తడిదానితోగాని, పొడిదానితోగాని, రాతితోగాని, కర్రతోగాని, కఠినమైన వజ్రంతోగాని, పగలుగాని, రాత్రిగాని దేవతలూ, వారి అధిపతి అయిన ఇంద్రుడూ నన్ను చంపకూడదు. ఇందుకు అభ్యంతరం లేకపోతే, మీరు కోరినట్టు ఇంద్రుడితో స్నేహం చేయగలను,” అన్నాడు వృత్రుడు.\r\n\r\nమునులు ఈ మాట తీసుకుపోయి ఇంద్రుడితో చెబితే అతను సరేనన్నాడు. ఇంద్రుడు వృత్రుడి నియమానికి అగ్నిసాక్షిగా ఒప్పుకున్నానన్న మీదట, ఆ మాట నమ్మి వృత్రుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు.\r\n\r\nఇద్దరూ స్నేహంగా కలిసి తిరిగారు. సముద్రతీరానా, నందనవనంలోనూ సంచరించారు. వృత్రుడు తృప్తిపడ్డాడు. కాని ఇంద్రుడు మాత్రం వృత్రుణ్ణి చంపడానికి సరైన అవకాశం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు.\r\n\r\nఒకనాటి సంధ్య వేళ ఇంద్రుడూ, వృత్రుడూ సముద్రతీరాన తిరుగుతున్నారు. అది రాత్రికాదు, పగలూ కాదు; అంతేగాక వృత్రుడు ఒంటరిగా ఉన్నాడు. అందుచేత ఇంద్రుడు వృత్రుణ్ణి చంపటానికి అదే అదను అనుకుని, విష్ణువును తలచుకున్నాడు. విష్ణువు వచ్చి, అదృశ్యంగా వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది; అది తడిదీకాదు, పొడిదీకాదు; ఏవిధమైన ఆయుధమూ కాదు. ఇంద్రుడు దేవిని కూడా తలచుకున్నాడు. ఆమె తన అంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుదాన్ని నురుగుతో కప్పి, వృత్రుడిమీద బలంగా విసిరాడు. ఆ దెబ్బతో వృత్రుడు కొండ విరిగిపడినట్టు పడి, అప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు.\r\n\r\nశత్రుభయం తీరిపోయిన ఇంద్రుడు ఆనందంగా అమరావతికి తిరిగి వచ్చి, మునుల నుంచి స్తోత్రాలు పొందుతూ, మహాదేవికి ఉత్సవం చేయించి, నందనోద్యానంలో రత్నమయమైన ఆలయాన్ని దేవికి కట్టించి, ప్రతిష్ఠించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1027,
        "IMAGE": "cat_15",
        "NAME": "వృత్రుడి కథ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 7,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శ ప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా, ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే ఉంటూవుండేది.\r\n\r\nఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యవంలో పుత్రకామేష్టియాగం చేయించాడు.\r\n\r\nఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను, ఋషులను నానా హింసలు పెడుతూండేవాడు. ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలసి, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో – “మహాప్రభో! ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు” అని మొరపెట్టుకున్నారు. అందుకు శ్రీమహావిష్ణువు మందహాసంతో… “సరే! నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి, రావణుని సంహరిస్తాను” అని అభయం ఇచ్చాడు.\r\n\r\nఋష్యశృంగ ముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి, దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, “నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్యపాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు. నీ కోరిక ఈడేరుతుంది” అన్నాడు.\r\n\r\nదశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇచ్చాడు. కాలక్రమాన దైవాంశ సంభూతులైన నలుగురు పుత్రులు వారికి కలిగారు. శ్రీమహావిష్ణువే రాముడుగా అవతరించి కౌసల్యకు జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడుగా సుమిత్రకు జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయింది. సుమిత్రకు శత్రుఘ్నుడు రెండో కుమారుడు.\r\n\r\nశ్రీరాముడు జన్మించిన ఆ రోజును ‘శ్రీరామనవమి’ అనే పండుగదినంగా ప్రజలు నేటికీ వేడుకతో జరుపుకుంటారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1028,
        "IMAGE": "cat_15",
        "NAME": "శ్రీరామ జననం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 8,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు.\r\n\r\nఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. దశరథుడు సముచితరీతిన అర్ఘ్య పాద్యాలిచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. “మీ రాక వల్ల నేను ధన్యుడి నయ్యాను. ఏ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం కలిగితే చరితార్థుడినవుతాను” అన్నాడు.\r\n\r\nఅప్పుడు విశ్వామిత్రుడు, “మహారాజా! మంచిది. కొంతమంది రాక్షసులు నా యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని హత మార్చడానికి రాముణ్ణి నాతోపాటు పంపాలి” అన్నాడు.\r\n\r\nఆ మాటలకు మూర్ఛపోయినంత పనయింది దశరథుడికి! ‘ముక్కు పచ్చ లారని రాముడినా ఆ క్రూర రాక్షసులను చంపడానికి పంపడం! బాలరాముడు ఇలాంటి పనికి ఎలా సమర్థుడౌతాడు? అని ఆలోచించ సాగాడు.\r\n\r\nకాని విశ్వామిత్రుడు తన పట్టు వదలలేదు. చివరికి వసిష్ఠుడు జోక్యం చేసుకుని, రాముడు క్షేమంగా విశ్వామిత్రుడితో తిరిగి రాగలడని భరోసా ఇచ్చి, దశరథుడి మనస్సు కుదుట పరిచాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1029,
        "IMAGE": "cat_15",
        "NAME": "అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 9,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "తండ్రి దశరథుడి ఆశీస్సులతో, రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, “రామా! దండకారణ్యం! ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి, తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది.\r\n\r\nఈ తాటకకు వెయ్యి ఏనుగుల బలం ఉంది. దాని భయంతో ఎవ్వరూ ఈ దారిన వెళ్ళడానికి సాహసించరు. ముందు ఈ రాక్షసిని వధించు” అన్నాడు. స్త్రీ కదా అని రాముడు సంకోచిస్తూండగా, విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలన్న తండ్రి మాటను పాటిస్తూ, ధనుష్టంకారం చేశాడు.\r\n\r\nఈ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూ యిటూ పారి పోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక, ‘తనను కవ్వించగల ధైర్యశాలి ఎవడా?’ అని ఆశ్చర్యపోయింది. పెడబొబ్బలు పెడుతూ అది రాముడి మీదకి వచ్చిపడింది. మాయా యుద్ధంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశిలలు, వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తిమంతమైన బాణంతో తాటకను వధించాడు. విశ్వామిత్రుడు మహదానంద భరితుడయ్యాడు. తాను కఠోర తపస్సు ద్వారా సంపాదించిన మహిమాన్వితమైన దివ్య అస్త్రాలన్నింటిని రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ, ఉపసంహార మంత్రాలు నేర్పించాడు.\r\n\r\nతరువాత ముగ్గురూ కలిసి విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి చేరుకొన్నారు. అక్కడున్న ఋషులు రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు మౌనవ్రతం దాల్చి, ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఋషుల ప్రార్థన మేరకు రామలక్ష్మణులు ధనుర్భాణాలు చేతపట్టి రాత్రింబవళ్ళు యాగరక్షణకు పూనుకొన్నారు. ఇలా ఆరు రోజులు నిర్విఘ్నంగా గడిచిపోయాయి. చివరి రోజైన ఏడవనాడు యజ్ఞం సంపూర్ణమయ్యే సమయంలో ఆకాశంలో పెద్దపెద్ద చప్పుళ్ళు వినబడ్డాయి. రాముడు తల ఎత్తి చూసేసరికి క్రూరరాక్షసులైన మారీచ, సుబాహులు తమ అనుచరులతో ఆకాశంలో నిలబడి కనిపించారు. వారు రక్తం, మాంసం మొదలైన అశౌచ్యాలను యజ్ఞకుండంలో పోసి యజ్ఞాన్ని పాడు చెయ్యడానికి తయారై వున్నారు. వాళ్లను ఎదుర్కోవడానికి రామలక్ష్మణులు సిద్ధపడ్డారు. రాముడు ఒక దివ్యాస్త్రాన్ని వాళ్ళపై ప్రయోగించి వారి ప్రయత్నాన్ని భంగపరిచాడు. రాముని ఒక బాణం మారీచుణ్ణి సహస్రయోజనాల సుదూరానికి నెట్టి సముద్రంలోకి పారవేసింది; మరోబాణంతో సుబాహుని ప్రాణాలు తీశాడు. ఈలోపుగా లక్ష్మణుడు మిగిలిన రాక్షస అనుచరులందరినీ కడతేర్చాడు. విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తిగావించి, రామ లక్ష్మణులను ఆశీర్వదించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1030,
        "IMAGE": "cat_15",
        "NAME": "తాటక వధ",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 10,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "కామ్యకవనంలో పాండవులు వనవాసక్లేశం అనుభవిస్తూ వుండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్ళాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించారు.\r\n\r\n“పాంచాలి వలె పరాభవాలు పొందిన రాకుమారిగాని, నావలె కారడవులలో కష్టాలు అనుభవించిన రాజపుత్రుడు గాని ఏకాలంలోనైనా వున్నారా మహర్షీ?” అంటూ ధర్మరాజు దుఃఖించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి రఘురాముడి కథ చెప్పాడు.\r\n\r\nఅయోధ్యా నగరంలో ఇక్ష్వాకు వంశం అనే ఒక గొప్ప వంశం వుంది. కోసల దేశానికి రాజధాని ఆ నగరం. దశరథుడు పరిపాలిస్తుండేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వారిలో కౌసల్యకు శ్రీరాముడు, కై కేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శతృఘ్నులనే కవల పిల్లలు జన్మించారు.\r\n\r\nశ్రీరాముణ్ణి గురించి తెలియని వారెవ్వరూ వుండరు. బుద్ధిమంతుడు. నీతి తప్పనివాడు. ధర్మాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. చాలా బలవంతుడు. చేసిన మేలు మరిచిపోనివాడు. సత్యసంధుడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా మాట్లాడటం బహుశః అతనికొక్కడికే తెలుసేమో! అతను పలికినంత మృదువుగా, చక్కగా ఎవరూ మాట్లాడలేదు. గొప్ప తేజశ్శాలి. అసూయ లేనివాడు. రుజువర్తనం కలిగిన\r\nవాడు. సంగీత ప్రియుడు, వీరాధి వీరుడు, ధీరుడు, శూరుడు, విలువిద్యలో నేర్పరి. అతని వక్షస్థలం చాలా విశాలం. చేతులు చాలా పొడుగు. అతను మాట్లాడితే ఖంగున మోగుతుంది స్వరం, సుందర వదనం. విశాలమైన నుదురు. చెంపకి చారడేసి కళ్ళు అతనివి.\r\n\r\nగొప్ప జ్ఞాని అతను. శుచిగా, శుభ్రంగా వుంటాడు ఎప్పుడూ. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చెయ్యవలసిన పని చేయక మానడు. చేయరానిని ససేమిరా చెయ్యడు. ఎవరినీ ధర్మం తప్ప నివ్వడు. గాంభీర్యం చెప్పవలసివస్తే సముద్రమే సాటి. అతనికి కొండంత ధైర్యం. కోపం వచ్చిందా ఆగ్గయిపోతాడు. సకల సద్గుణాభిరాముడు. ఇన్నెందుకు – అతన్ని చూసి ముచ్చటపడాల్సిందే తప్ప చెబితే తనివి తీరదు.\r\n\r\nఆ రాముడంటే తండ్రికి ప్రాణం. రాముణ్ణి చూడకుండా క్షణం కూడా వుండలేడాయన. కొడుకుని తన తరువాత తన అంతటి వాణ్ణి చెయ్యాలనుకున్నాడు దశరథుడు. అందుకోసం రాముణ్ణి ముందు యువరాజును చెయ్యాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. ముహూర్తం స్థిరపరిచాడు. కైకేయి ఆంతరంగిక సేవకురాలు మందరకీ విషయం తెలిసింది. దుష్టబుద్ధి గలది. వెంటనే కైకేయి దగ్గరకు వెళ్ళి\r\n“మహారాజుకు నువ్వంటే ఇష్టమై వుండి కూడా ఆ కౌసల్య కొడుకుకే పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీకూ, నీ భరతుడికీ కష్టాలే గతి. మహారాజు నిన్ను ప్రేమతో మోసం చేశాడు. అవేవీ తెలియక తెల్లనివన్నీ పాలనీ, నల్లనివన్నీ నీళ్ళనీ నువ్వు భ్రమపడ్డావు” అని దుర్బోధ చేసింది.\r\n\r\nకై కేయి నిజమే అనుకుంది.\r\n\r\nవిసవిస పడకగదిలోకి వెళ్ళి అలంకారాలూ, ఆభరణాలూ తీసేసి, జుట్టు విరబోసుకుని, పాత నూలు చీర చుట్టపెట్టుకుని రాని ఏడుపు ఏడుస్తూ పడుకుంది.\r\n\r\nకాసేపటికి దశరథుడు వచ్చాడు. కోప కారణం చెప్పమని అడిగాడు. “రాముడికి పట్టాభిషేకమా? వల్లకాదు” అంది.\r\n\r\nఆ మాటలు వినగానే దశరథుడు నేల కొరిగాడు.\r\n\r\nఅదివరలో దశరథుడు కైకకు రెండు వరాలిచ్చి వున్నాడు. అవి వుపయోగించుకునేందుకు తగిన సమయం వచ్చిందనుకుంది కైక.\r\n\r\nనా వరాలు నాకు తీర్చమని కూర్చుంది.\r\n\r\n“ఒకటి—రాముణ్ణి అడవులకు పంపేయడం” అంది. రాముడు పధ్నాలుగేళ్ళు అడవిలో వుండాలని ఆక్ష విధించింది.\r\n\r\n“రెండోది నా కొడుకయిన భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం” అంది. ఇలా చెయ్యకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను” అని చెప్పేసింది గట్టిగా.\r\n\r\nదశరథుడు చాలా బ్రతిమాలాడా మెని.\r\n\r\nరాముడు లేకుండా తను బ్రతకలేనన్నాడు. లోకం రామరాజ్యం కోసం ఎదురుచూస్తోందన్నాడు. మంచి చెడ్డలు వివరించాడు. ధర్మాలు చెప్పాడు.\r\n\r\n“ఇది తప్ప మరే కోరిక కోరినా క్షణాలమీద తీరుస్తాన”న్నాడు.\r\n\r\nమాట్లాడక ముఖం ముడుచుకు నిలబడితే కసిరాడు. మళ్ళీ సాదరంగా అనునయించాడు. తన మాట కాదనేసరికి నిందించాడు. దూషించాడు. చేతులు జోడించి అర్ధించాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. కాని లాభం లేక పోయింది. తనమాటే చెల్లాలంది కైక. మంకుపట్టు పట్టింది.\r\n\r\nఇంతలో రాముడికీ విషయం తెలిసింది. తండ్రిని సత్యసంధునిగా నిలపడం తన కర్తవ్యమనుకున్నాడు. తన మూలంగా తల్లికిచ్చిన వరాలు తీర్చలేక తన తండ్రి నిందల పాలవడం యిష్టంలేక పోయింది రాముడికి.\r\n\r\nఅడవులకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.\r\n\r\nలక్ష్మణుడు వెళ్ళక్కర్లేదన్నాడు ఎవరైనా నోరు మెదిపితే పీక నొక్కేస్తా నన్నాడు. ఆయుధం పడితే నాకు అడ్డేమిట్టన్నాడు. కౌసల్య గుండె పగిలేలా ఏడ్చింది. అయినా వెళ్తానన్నాడు రాముడు. ఇది విన్నది సీత, “నేను కూడా మీ వెంట అడవులకు వస్తా” అంది భర్తతో. రాముడు వద్దన్నాడు. “రాకుండా వుండను. నేను చిన్న పిల్లగా వున్నప్పుడే నన్ను పెళ్ళి చేసుకున్నారు మీరు. అప్పటి నుంచి మీ దగ్గిరే వున్నాను నేను. మీ సఖ్యం లేకుండా వుండలేను. ఎక్కడికైనా వెళ్ళండి. నాకు అభ్యంతరం లేదు. కాని మీ వెంటే వుంటాను నేను” అంది.\r\n\r\n“అడవుల్లో తిరగడం కష్టం” అన్నాడు రాముడు. “మిమ్మల్ని విడిచి వుండటమే పెద్ద కష్టం నాకు” అంది సీత. చేసేది లేక సరేనన్నాడు రాముడు.\r\n\r\nఇదంతా చూశాడు లక్ష్మణుడు. “నేనూ మీతోనే వస్తా” అన్నాడు. అన్న కాదనేవరికి పాదాలు పట్టుకున్నాడు. “నా బతుకంతా నీతోనే ముడిపడి వుంది. నీవు లేని అయోధ్య నాకు వల్లకాడు. దేవలోకమైనా నాకు అక్కరలేదు” అన్నాడు.\r\n\r\n“సరే, నువ్వు కూడా రా” అనుమతించాడు రాముడు లక్ష్మణుణ్ణి, ముగ్గురూ కట్టుబట్టలతో బయలుదేరారు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1031,
        "IMAGE": "cat_15",
        "NAME": "వందే వాల్మీకి కోకిలం – 1",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 11,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "త్రిజటుడని పేద బ్రాహ్మణుడు పుండేవాడు. చాలా మంచివాడు. శాస్త్రం తెలిసినవాడు. కాని బహు కుటుంబీకుడు. అడవులకు వెళ్ళి పళ్ళూ, దుంపలూ ఏరి తెచ్చుకుంటుండేవాడు. రాముడు తనకున్న సర్వస్వం విప్రులకు దానం చేస్తున్నాడని తెలిసి ఆదరాబాదరా ఆయన దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి “రామయ్య తండ్రీ! నేను ఆగర్భ దరిద్రుణ్ణి, పిల్లలు గలవాణ్ణి, నాకేమైనా ఇచ్చి పుణ్యం గట్టుకో”\r\nఅని అడిగాడు.\r\n\r\n“బ్రాహ్మణో త్తమా! ఇప్పటివరకూ ఎన్నోవేల ఆవులిచ్చాను. నీకొక్కటీ దక్కలేదా?” అని అడిగాడు రాముడు.\r\n\r\nలేదని తల అడ్డంగా వూపాడు బ్రాహ్మణుడు. “అయితే ఒక పని చెయ్యి. ఈ కర్ర పుచ్చుకుని నీ శక్తికొద్దీ విసురు. అది ఎంత దూరాన పడితే అంతమేరా వున్న ఆవులు నీకు దానమిస్తాను అన్నాడు దాశరథి.\r\n\r\nవిప్రుడు తుండుగుడ్డ నడుముకు బిగించి పళ్ళు బిగబట్టి ఆ కర్ర విసిరేశాడు. ఇక్కడా అక్కడా కాదు- అది వెళ్ళి సరయూ నది ఒడ్డున పడింది. రాముడు నవ్వి ఆ ప్రాంతాన వున్న గోవులన్నీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అలా అందరికీ దాన ధర్మాలు చేసి వారిని తృప్తిపరిచాక పురజనుల దగ్గర సెలవు పుచ్చుకుని సీతారామలక్ష్మణులు అడవులకు ప్రయాణమయ్యారు.\r\n\r\nఅయోధ్యా నగర వాసులందరూ కంటకడి పెట్టారు. రథం బయలుదేరింది. వెళ్ళి వెళ్ళి గంగానది చేరుకుంది.\r\n\r\nఅక్కడో చెట్టు వుంది. దాని నీడన రాముడూ, సీతా, లక్ష్మణుడు కూర్చున్నారు. కిరాతకులకు రాజైన గుహుడికీ సంగతి తెలిసింది. అతనికి రాముడే దైవం . రాముడే ప్రాణం. రాముడికి తెలుసా సంగతి. గబగబ వెళ్ళి రాముడి పాదాలు అంటి, ఫలహారం ఆర్పించాడు గుహుడు. ఆ తరువాత వారిని తన పడవలోకి ఎక్కించి గంగానది దాటించాడు. వాళ్ళు చిత్రకూట పర్వతం చేరుకున్నారు.\r\n\r\nతాతగారింట్లో వున్న భరతుడికి విషయమంతా తెలిసింది. ధర్మమూర్తి అయిన శ్రీరాముడికి వచ్చిన కష్టం తలుచుకుని దుఃఖపడ్డాడు. అన్నగారి కష్టాలకు కారకులైన తన తల్లిని పలువిధాల నిందించాడు. తమ్ముడు శతృఘ్నుణ్ణి తోడు తీసుకుని రాముడ్ని వెతుకుతూ అరణ్యాలకు వెళ్ళాడు. చిత్రకూటంలో వున్న అన్నా వదినలను దర్శించాడు.\r\n\r\n“అయోధ్యకు నువ్వే రాజుని. నీ ప్రజలను నువ్వే పాలించుకో. వచ్చి పట్టాభిషేకం చేసుకో. నా తల్లి మాట విని మన తండ్రి ఈ పాపపు పని చేశాడు. నువ్వు అడవులకు రాగానే ఆయన కాస్తా కన్నుమూశాడు. నా\r\nతల్లి ఇంత దుర్మార్గానికి ఎందుకు పూనుకుందో ఇప్పటికీ నాకు తెలీటంలేదు. కాని, నా మాట విను. నీ రాజ్యం మీద నాకు అధికారం లేదని చెప్పటానికి వచ్చాను. నీ రాజ్యం నువ్వేలుకో” అని బ్రతిమాలాడు.\r\n\r\nపితృ వాక్య పరిపాలన తన కర్తవ్యమనీ, అయోధ్యకు రాననీ రాముడు కరాఖండీగా తమ్ముడితో చెప్పాడు.\r\n\r\n“పోనీ, నీ పాదుకలియ్యి. అవే రాజ్యం ఏలుకుంటాయి” అని కోరాడు భరతుడు. వీల్లేదన్నాడు రాముడు.\r\n\r\nఎన్ని చెప్పినా వినకపోయేసరికి చివరికి తన పాదుకలు ఇచ్చాడు శ్రీరాముడు. అవి నెత్తిన పెట్టుకుని నందిగ్రామం వెళ్ళి వాటిని సింహాసనం మీద వుంచి రాముడి ప్రతినిధిగా భరతుడు పరిపాలన చేయసాగాడు.\r\n\r\nరామభద్రుడు సీతాలక్ష్మణులతో చిత్రకూటం నుండి దండకారణ్యానికి వెళ్ళాడు అక్కడ విరాధుడనే రాక్షసుడు కనిపించాడు. రాముడికీ వాడికీ యుద్ధం జరిగింది. విరాధుడు చిత్తుగా ఓడిపోయాడు. తరువాత రాముడు శరభంగ మహర్షినీ, సుతీష్ణ మహర్షినీ, అగస్త్య మహర్షినీ దర్శించి పూజించాడు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని సతీ సోదర సమేతంగా అక్కడ ఉంటూ వచ్చాడు.\r\n\r\nరావణాసురుని చెల్లెలు శూర్పణఖ దండకలో తిరుగుతూ ఒక రోజు రాముణ్ణి చూసి అతని అందచందాలకు ముగ్ధురాలై తనను పెళ్ళి చేసుకోమని కోరింది. శూర్పణఖ చాలా వికృత స్వభావి. బుద్ధిని అనుసరించే రూపం పున్నదామెకు. ఏ రూపు కావాలంటే ఆ రూపం పొందగలదు. రాముడు ఆమెను తిరస్కరించాడు.\r\nఅన్న ఆనతి మేరకు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. అడవంతా గగ్గోలు పెట్టేస్తూ పారిపోయిందామె. ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే ముగ్గురు రాక్షసులు దండకారణ్యం ఏలుతున్నారు. వాళ్ళ చేతికింద పధ్నాలుగు వేలమంది రాక్షసులున్నారు. శూర్పణఖ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. వాళ్ళు రాముడి మీదకు యుద్ధానికి వెళ్ళి హతులయ్యారు.\r\n\r\nతనకు పరాభవం జరగడం, తన వాళ్ళందరూ చనిపోవడంతో ఆ దుఃఖం భరించలేక శూర్పణఖ తన పెద్దన్న రావణుడి దగ్గర మొర పెట్టుకుంది.\r\n\r\n“దండకారణ్యంలో నాకు ఒక స్త్రీ కనబడింది. పక్కన ఆమె భర్త కూడా పున్నాడు. ఆమె అప్సరస. అంత అందగత్తె పృధ్విమీద మరి లేదు. ఆమె నీకు తగినది. నువ్వు చేపట్టిననాడే ఆ అందానికి అర్థం. ఆమెను నీ దగ్గరకు తీసుకువద్దామని వెళ్తేనే ఆమె భర్తా, మరిదీ నన్నిలా చేశారు. నన్ను రక్షించబోయిన వాళ్ళందర్నీ కూడా చంపేశారు” అని కల్పించి విషయాన్ని వక్రీకరించి చెప్పింది. లంకేశ్వరుడు ఉగ్రుడయ్యాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1032,
        "IMAGE": "cat_15",
        "NAME": "వందే వాల్మీకి కోకిలం – 2",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 12,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "రావణాసురుడు వీరుడు. గొప్ప శివభక్తుడు. చెల్లెలు చెప్పిన మాటలు విని రాముణ్ణి నమిలి మింగెయ్యాలన్నంత మండిపడిపోయాడు. వెంటనే మారీచుడనే మరో రాక్షసుడి దగ్గరికి వెళ్ళి “ఎవరో రాముడట. ఈ అడవుల్లోనే వున్నాడు. నా చెల్లెలిని పరాభవించాడు. అతని మీదకు యుద్ధానికి వెళ్తున్నాను. నువ్వు నాకు సాయం చెయ్యాలి” అని కోరాడు. మారీచుడు వద్దన్నాడు. “నువ్వీపని చెయ్యవద్దు. రాముణ్ణి గురించి నీకు తెలీదు. మహావీరుడతను. అతణ్ణి నువ్వు జయించలేవు. అతనితో వైరం నీకు చేటు తెస్తుంది. నువ్వు చెడిపోరాపు” అని గట్టిగా చెప్పాడు. అయినా రావణుడు వినిపించుకోలేదు. “నువ్వు నాకు సాయం చేసి తీరవల్సిందే. లేకపోతే నీ తల తెగవేస్తా” అన్నాడు. రాక్షసులందరికి రావణుడు రాజు. అందుచేత అతను చెప్పినట్టు చెయ్యడానికి సిద్ధపడ్డాడు మారీచుడు. ఇద్దరూ ఆలోచించారు.\r\n\r\nమారీచుడు బంగారు లేడిలా మారిపోయాడు. చుక్కలు చుక్కల లేడిలా తయారయ్యాడు. సూది కొమ్ముల లేడి అయిపోయాడు. వయ్యారాలు పోతూ రాముడున్న పర్ణశాల దగ్గరికి వెళ్ళాడు. ఆ కాంచనమృగాన్ని చూసింది సీత. “నాకా లేడి కావాలి” అంది. తెస్తానని బయలుదేరాడు రాముడు. వెళ్ళిన మనిషి ఎంత సేపటికీ తిరిగి రాకపోయేసరికి “వెళ్ళి మీ అన్న ఎక్కడున్నాడో చూసి తీసుకు రా” అని లక్ష్మణుడ్ని పంపింది సీత. అదే సరైన సమయమనుకొని రావణుడు సన్యాసి వేషం ధరించి సీతను అపహరించుకు పోవాలన్న చెడ్డతలంపుతో పర్ణశాలను సమీపించాడు.\r\n\r\nసీత అతన్ని చూసి “అయ్యా! మా యింటికి అతిథిగా వచ్చారు. నేను ఇచ్చే అర్ఘ్య పాద్యాలు అందుకుని కంద మూలాలు స్వీకరించండి” అంది. కపట సన్యాసి వికటాట్టహాసం చేశాడు. తన నిజరూపం చూపి సీతను ఆకాశ మార్గాన ఎత్తుకుపోయాడు.\r\n\r\nజటాయువు అని ఒక గద్ద చాలా పెద్దది. చాలా ముసలిది. కాని బాగా బలమైనది. అది సీత నెత్తుకు పోతున్న రావణుణ్ణి చూసింది. అతన్ని అడ్డుకుంది. ముక్కుతో పొడిచి, రెక్కలతో కొట్టి, కాళ్ళతో తన్ని, గోళ్ళతో రక్కి, రావణుని శరీరమంతా గాయపరిచింది. అతను కోపం పట్టలేక తన ఖడ్గంతో జటాయువు రెక్కలు తెగ్గొట్టాడు. అది కాస్తా నేలకొరిగింది. రావణుడు సీత నెత్తుకుని వెళ్ళి పోయాడు.\r\n\r\nఅక్కడ మాయలేడి అయివచ్చిన మారీచుణ్ణి చంపి పర్ణశాలకు తిరిగి వెళ్ళాడు రాముడు. లక్ష్మణుడు మార్గ మధ్యంలో ఎదురు పడ్డాడు. సీత మాత్రం కనిపించలేదు. ఎంతో సేపు వెతికారిద్దరూ. ఎక్కడా కనిపించక పోయేసరికి రాముడు సీత కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అలా దుఃఖపడుతూనే సీతను వెతుకుతూ\r\nముందుకు వెళ్ళారు రామ లక్ష్మణులు.\r\n\r\nకొంచెం దూరం వెళ్ళేసరికి నెత్తుటి మడుగులో కొనవూపిరితో కొట్టుకుంటూన్న జటాయువు కనిపించింది వాళ్ళకి. రావణుడు సీతను ఎత్తుకుపోయాడని చెప్పి ప్రాణాలను విడిచిందది. రామలక్ష్మణులు దానికి అగ్ని సంస్కారం చేసి సీతను అన్వేషిస్తూ మరికొంత దూరం వెళ్ళేటప్పటికి కబంధుడనే మరో రాక్షసుడు ఎదురైనాడు. వాడికి తల మెడమీద లేదు. కడుపు మీద వుంది. చేతులు దూలాల్లా పొడుగ్గా వున్నాయి. రాముడు వాణ్ణి హతమార్చాడు. వాడు చనిపోతూ “రామా! నేను విశ్వాసుడనే గంధర్వుణ్ణి. నీవల్ల శాప విముక్తి కలిగింది నాకు. మాతంగ పర్వతాన సుగ్రీవుడని ఒక దానవ వీరుడున్నాడు. అతనితో స్నేహం చేసుకో. అతను నీకు చాలా సహాయం చేస్తాడు” అని చెప్పాడు.\r\n\r\nరామలక్ష్మణులు పంపా సరస్సు చేరుకున్నారు. చాలా చక్కని సరస్సది. హనుమంతుడు మొట్టమొదట రాముణ్ణి అక్కడే కలుసుకున్నాడు. హనుమంతుణ్ణి సాయం తీసుకుని రాముడు మాతంగపర్వతం వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు.\r\n\r\nవాలీ సుగ్రీపుడూ వానరులు. గొప్ప వీరులు. ఇద్దరూ అన్నదమ్ములు. వాలి వానరులకు రాజు. అతను తన తమ్ముణ్ణి చాలా బాధించాడు. తమ్ముడి భార్యను చెరబట్టాడు. ఇదంతా సుగ్రీవుడు రాముడితో చెప్పుకున్నాడు. సాయం చేయమని అర్ధించాడు. సరేనన్నాడు రాముడు.\r\n\r\n“వాలిని సంహరిస్తా. నీ భార్యను నీ కప్పగిస్తాను. వానర రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను” అని మాట ఇచ్చాడు. కాని సుగ్రీవుడికి నమ్మకం కుదరలేదు. తన అన్నగారి ముందు ఎవరూ నిలబడలేరని అతని నమ్మకం. సుగ్రీవుడి అనుమానం పసిగట్టేశాడు రాముడు.\r\n\r\nచిన్నగా నవ్వాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1033,
        "IMAGE": "cat_15",
        "NAME": "వందే వాల్మీకి కోకిలం – 3",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 13,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "దుందుభి అని ఒక రాక్షసుడు పుండేవాడు. ఒకప్పుడు వాలితో యుద్ధానికి తలపడ్డాడు.\r\n\r\nవాలి వాడిని అవలీలగా చంపి అల్లంత దూరానికి కళేబరాన్ని విసిరేశాడు. అది వెళ్ళి మాతంగ పర్వతం మీద పడింది. ఆ ఎముకల గుట్ట అలాగే వుంది. సుగ్రీవుడు వెంటరాగా రాముడు మాతంగ పర్వతం మీదకు వెళ్ళి ఆ ఎముకల గుట్టను వామపాదపు బొటన వేలితో ఆకాశంలోకి విరజిమ్మాడు. అప్పుడు సుగ్రీవుడికి దాశరథి శ క్తి అర్థమయింది.\r\n\r\nసుగ్రీవుడూ, రాముడూ కిష్కింధకు బయలుదేరారు. కొండంత అండగా కోదండ రాముడున్నాడన్న ధైర్యంతో పురద్వారం బయట నుంచుని పెద్దగా అరిచాడు సుగ్రీవుడు. ఆ గావుకేకకి నగరమంతా దద్దరిల్లింది. ఉలికిపడ్డాడు వాలి.\r\n\r\n“ఎవడపురా నువ్వు?” అని గద్దిస్తూ బయటకు వచ్చాడు.\r\n\r\nఅన్నదమ్ములిద్దరూ యుద్ధానికి దిగారు.\r\n\r\nవాలి సుగ్రీవులకు భయంకరంగా పోరాటం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ఒకే రూపురేఖలు కలవారవడం చేత వాలి ఎవరో ఎంత ప్రయత్నించినా గుర్తించలేక పోయాడు రాముడు.\r\n\r\nఅప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి మెడలో పూలహారం వేశాడు. హారం లేనివాడు వారి అని రాముడికి చెప్పాడు. వెంటనే ఆయన వింటిని ఎక్కు పెట్టి ఒక్క బాణం సంధించి విడిచాడు. ఆ ఘాతానికి వాలి ప్రాణాలు వదిలాడు. సుగ్రీవుడు తన భార్య రునును తిరిగి పొంది వానర రాజ్యం చేపట్టాడు. అప్పుడు మైథిలి ఎక్కడ ఉందొ చూసి రమ్మని కోట్లకొద్దీ వానర వీరులను నాలుగు దిక్కులకూ పంపించాడు.\r\n\r\nహనుమంతుడూ, అంగదుడూ, జాంబవంతుడూ, నీలుడూ మొదలైన వానర వీరులు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల వెతికారు. ఫలితం లేకపోయింది. విసిగిపోయారు. అప్పుడు వారికి జటాయువు అన్నగారు సంపాతి కనిపించింది. సీత లంకలో వుందన్న సంగతి అది చెప్పింది వానర వీరులకి.\r\n\r\nదక్షిణ సముద్రంలో ఒక దీవి వుంది. లంక అని పేరు దానికి. రాక్షసరాజు రావణుడి రాజ్యమది. ఆ రావణుడే సీతను మోసగించి అపహరించుకు పోయాడు. లంకలో ఆశోక వనం వుంది. చాలా అందమైన పూదోట అది. అందులో లేని పూల మొక్కలూ, తీగలూ, పళ్ళచెట్లూ మరెక్కడా లేవు. సీతను ఆ చెట్ల మధ్య బంధించాడు రావణుడు. అహర్నిశలూ రాముణ్ణి తలుస్తూ నిద్రాహారాలు లేక చిక్కి శల్యమై క్షణమొక యుగంగా గడుపుతోంది సీత. భయంకర రాక్షస స్త్రీలు ఆమెకు కాపలా కాస్తున్నారు.\r\n\r\nహనుమంతుడు లంకలో ప్రవేశించాడు. రావణుని పురవైభవం అంతా ఇంకా కాకుండా వుంది. సీత కోసం రావణుని అంతఃపురమంతా కలయచూశాడు. ఆ రాచ నగరి శోభ సౌందర్యప్రియుడైన ఆంజనేయుని అబ్బుర పరిచింది. పురమంతా గాలించాడు. చివరికి అశోక వనంలో రాముడి ధర్మపత్ని కనిపించింది.\r\n\r\nప్రభువు ఇచ్చిన ఉంగరం ఆమెకు ఆసనాలుగా యిచ్చి “నేను రామదూతను. సుగ్రీవుని బంటును. హనుమంతుడు నా పేరు. త్వరలోనే రాముడు వచ్చి నిన్ను తనతో తీసుకు వెళ్తాడు. నా మాట నమ్ము” అని ధైర్యం చెప్పి రఘురాముడి గుణగణాలు వర్ణించాడు. రాముడు క్షేమంగా వున్నాడనీ, తనకోసం చింతిస్తున్నాడని, తనను తీసుకు వెళ్ళేందుకు వస్తున్నాడనీ తెలిసి సంతోషించింది సీత. తన గుర్తుగా రాముని కిమ్మని చూడామణి అన్న తన నగ ఒకటి హనుమంతుడికి ఇచ్చింది.\r\n\r\nతరువాత హనుమంతుడు అశోకవనం అంతా పాడు చేశాడు. అది చూసి అక్కడ కాపలా వాళ్ళు అతని మీద పడ్డారు. వాళ్ళనందరినీ హనుమంతుడు చిత్తు చిత్తు చేశాడు. రావణుని సేనాధిపతులనూ, మంత్రుల కొడుకులనూ చంపాడు. రావణుని కొడుకుల్లో ఒకడైన అక్షుణ్ణి కూడా హతమార్చాడు. లంకాపట్నం అంతా\r\nగగ్గోలెత్తింది. ఒక కోతి రాక్షస సంహారం చేయడం వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించింది.\r\n\r\nరావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు హనుమంతుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రావణుడికి ప్రత్యక్షంగా బుద్ధి చెప్పాలనిపించింది రామ బంటుకి. స్వయంగా లంకేశుని శక్తి సామర్ధ్యాలు చూడాలనుకున్నాడు. అతడు చేసిన పని ఎంత నీచమైనదో తెగబడి చెప్పాలనుకున్నాడు. ఓటమిని నటిస్తూ రాక్షస మూకకి లొంగిపోయాడు. రాక్షసులు హనుమంతుణ్ణి తాళ్ళతో కట్టి రావణుని సన్నిధికి తీసుకుపోయారు. హనుమంతుణ్ణి చూసి మండిపడ్డాడు రావణుడు.\r\n\r\n“నిన్ను దేవేంద్రుడు పంపాడా?”\r\n\r\n“ఊహు”\r\n\r\n“యముడు? వరుణుడు? విష్ణుమూర్తి?”\r\n\r\nతల అడ్డంగా తిప్పాడు హనుమంతుడు.\r\n\r\n“మరి ఎవరు పంపించారు?”\r\n\r\n“నా పేరు హనుమంతుడు.”\r\n\r\n“నీ పేరు కాదు నేను అడిగింది. నిన్నెవరు వంపారని?”\r\n\r\n“నేను రాముని దూతను. నేను వానరుణ్ణి. సుగ్రీపుడు పంపాడు నన్ను. వాలి తమ్ముడు సుగ్రీవుడు తెలుసనుకుంటాను నీకు. వాలి రాముని చేతిలో చచ్చిపోయాడు. రాముడు వేసిన ఒకే ఒక్క బాణంతో\r\nహరీ అన్నాడు. రాముడే సుగ్రీవుడికి వానర రాజ్యం అప్పగించాడు. రుమను సుగ్రీవునికి కూర్చాడు. ఆ రాముని ఆజ్ఞమీద సుగ్రీవుడు నన్ను ఇక్కడకు పంపాడు.”\r\n\r\nఅంతా విని రావణుడు వికటాట్టహాసం చేశాడు.\r\n\r\n“రాముడి సంగతి తెలీదు నీకు. ఆయన భార్య సీతను అపహరించి తెచ్చాపు నువ్వు. సీత సామాన్య స్త్రీ కాదు. ఆమె నీ పాలిటి యమపాశం. ఆ పాశాన్ని కంఠాన తగిలించుకుని తిరుగుతున్నావు. రాముని భార్యను రాముడికి ఇచ్చెయి. అతని కాళ్ళ మీద పడు. క్షమించమని వేడుకో. బ్రతికిపోతావు. ఇది ప్రార్థన కాదు. హెచ్చరిక కూడా కాదు. నీ మంచికోరి హితవు చెబుతున్నాను. గొప్ప రాజువు నువ్వు. చాలా గొప్ప రాజ్యం నీది. మంచి వంశం నీది. గొప్ప శూరుడపు నువ్వు. ఒక్క స్త్రీ కోసం సర్వనాశనం పొందడం నీ వంటి వాడికి మంచిది కాదు” అని చాలా గట్టిగా చెప్పాడు హనుమంతుడు. అప్పుడు రావణుడు అరిచిన అరుపుకి భూమి గజగజలాడింది. భృత్యులను పిలిచి “వీణ్ణి నరికెయ్యండి” అని ఆజ్ఞాపించాడు రావణుడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1034,
        "IMAGE": "cat_15",
        "NAME": "వందే వాల్మీకి కోకిలం – 4",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 14,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "విభీషణుడు రావణుని తమ్ముడు. చాలా మంచివాడు. హనుమంతుడి మీదకు కాలు దువ్వటం మంచిది కాదని అన్నకు హితవు చెప్పాడు. “దూత లేకపోతే ఏ రాజూ రాజ్యం చెయ్యలేడు. నువ్వూ అంతే. దూతలూ, రాయబారులూ లేకపోతే రాచకార్యాలన్నీ నిలిచిపోతాయి. హనుమంతుడు రాముని దూత. దూతని సంహరించటం మంచిది కాదని పెద్దలు చెబుతారు” అన్నాడు.\r\n\r\nఆ మాట మీద కొంచెం నిదానించాడు లంకేశ్వరుడు. కాని కోపం పూర్తిగా పోలేదు. “వీడి తోకకు నిప్పంటించి నగర వీధుల్లో వీడ్ని తిప్పండి” అని ఆజ్ఞాపించాడు చివరికి.\r\n\r\nరాక్షస భటులు హనుమంతుడ్ని చుట్టుముట్టారు. అతని తోకకు నూనెతో తడిపిన గుడ్డలూ, గోనె సంచులూ చుట్టారు. నిప్పంటించారు. వీథుల్లో తిప్పారు. వెక్కిరించారు. గేలి చేశారు.\r\n\r\nరాక్షస స్త్రీలకూ, పిల్లలకూ ఇదంతా ఓ వినోదంగా వుంది. ఒకర్నొకరు తోసుకుంటూ విరగబడి చూశారు. హనుమంతుడు అదంకా సహించాడు. ఇంతలో తోకకు నిప్పు అంటుకుంది. మంటలు బాగా లేచాయి. కోపంతో ఒక్క వురుము వురిమాడు ఆంజనేయుడు. దభీమని అంతెత్తుకు ఎగిరి మేడలు, మిద్దెలు, గోపురాలు అన్నిటికీ నిప్పంటించాడు. దొరికిన వాళ్ళను దొరికినట్టు ఆ మంటల్లోకి తోశాడు. విభీషణుడి ఇల్లు, సీత వున్న చోటు మినహా లంకావురి అంతా ఎర్రటి మంటల్లో కాలి బూడిదవుతోంది.\r\n\r\nఅది చూసి హనుమంతుడు విజయోత్సాహంతో సింహనాదాలు చేసి తిరుగు ప్రయాణం కట్టాడు. అవలీలగా మళ్ళీ సముద్రం దాటేశాడు. సుగ్రీవుడ్ని కలుసుకుని లంకలో జరిగిన కథంతా చెప్పాడు. వానర రాజు సంతోషించాడు. తరువాత అందరూ రాముడి దగ్గరకు వెళ్ళి “సీతమ్మ జాడ తెలిసింది. లంకను ముట్టడించాలి. నువ్వు రావణుని సంహరించాలి” అని తొందర పెట్టారు.\r\n\r\nకోదండ రాముడు వానర వీరులను వెంట పెట్టుకుని బయలు దేరాడు. కాని మార్గమధ్యంలో సముద్రం అడ్డొచ్చింది. సముద్రుడ్ని దారి ఇమ్మన్నాడు రాముడు. వీల్లే దన్నాడతను. తాను చీలిపోతే ప్రపంచం తలకిందులవుతుందని చెప్పాడు. “జగత్కల్యాణం కోసం బయలుదేరావు నువ్వు. నిన్నెవరూ ఆపలేరు. నీ దగ్గర వున్న వానర వీరుల్లో నలుడనేవాడు గొప్పవాడు. గడ్డిపోచగాని, కొయ్యగాని, రాయిగాని అతను\r\nనీటిలో వేస్తే అది తేలుతుంది. వంతెన కట్టమని ఆతన్ని నువ్వు ఆజ్ఞాపించు. నేను అండగా వుంటాను. నీ పని సులువవుతుంది” అని సలహా కూడా ఇచ్చాడు.\r\n\r\nరాముడు ఆజ్ఞాపించాడు.\r\n\r\nవారధి పని ప్రారంభమైంది.\r\n\r\nఇంతలో లంకా నగరం నుంచి రావణుని తమ్ముడు విభీషణుడు వచ్చి రాముడ్ని ఆశ్రయించాడు. రాముడు అతన్ని చేరదీశాడు ·\r\n\r\nఅందరూ వంతెన మీదగా వెళ్ళి లంక చేరుకున్నారు. విభీషణుడు నగర రహస్యాలన్నీ రాముడికి చెప్పాడు. రాక్షసులని ఎన్నెన్ని ఉపాయాలతో చంపవచ్చో వివరించాడు.\r\n\r\nయుద్ధంలో రామ లక్ష్మణులు తమ పరాక్రమమంతా చూపారు. సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, అంగదుడు, జాంబవంతుడు, విభీషణుడు సాయం చేశారు. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధంలో మరణించారు. యోధాను యోధులైన రాక్షస వీరు లెందర్నో వానరులు తెగటార్చారు. చివరికి రాముడు రావణుడ్ని సంహరించాడు. లంకా రాజ్యానికి విభీషడ్ని రాజు చేశాడు.\r\n\r\nఅనింద్యుడు అనే వృద్ధ రాక్షసుడు అశోక వనం నుండి సీతాదేవిని తోడ్కొని వచ్చి దాశరథికి చూపుతూ “మహాత్మా! పరమ సాధ్వి అయిన నీ దేవిని పరిగ్రహించు” అని ప్రార్ధించాడు. అక్కర్లేదన్నాడు రాముడు. ధూళి దూసరితాంగి, జటాధారిణి, మలిన వస్త్రధారిణి అయిన జానకితో చాలా పరుషంగా మాట్లాడాడు.\r\n\r\n“నా శక్తి చూపడానికి, నా శౌర్యం ప్రదర్శించడానికి, పరస్త్రీలను చెరబట్టిన వాళ్ళ బతుకు ఇలా కడతేరుతుందని చెప్పడానికి రావణునిమీద దండెత్తి వచ్చాను. నేను నీకోసం కాదు. కనుక నీ యిష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళిపోవచ్చు” అన్నాడు కఠినంగా.\r\n\r\nసీత దుఃఖపడింది.\r\n\r\nచితి పేర్చమని మరిదికి ఆజ్ఞ ఇచ్చింది. జ్వాలల మధ్యకు దూకింది. చప్పున మంటలు వేడిమిని కోల్పోయాయి. అగ్నిదేవుడు ఆమెను స్వయంగా తీసుకువచ్చి రాముడికి అప్పగించాడు.\r\n\r\n“రామచంద్ర ప్రభూ! సీతమ్మ నిర్దోషి, నిష్కల్మష. ఏ పాపమూ ఎరుగదు. మహా పతివ్రత. నీ నామస్మరణతోనే ఇన్నాళ్ళూ బతికి వుంది. నువ్వు లేక ఆమె జీవించదు. సీతను స్వీకరించు” అని చెప్పాడు. భూజాత పావిత్య్రన్ని లోకమంతా గుర్తించాలన్న వుద్దేశ్యంతోనే నిందించాడు రాముడు. అగ్నిదేవుని మాటలు విని\r\nఅందరూ హర్షించగా సీతను స్వీకరించాడు.\r\n\r\nపుష్పక విమానంలో సీతను, లక్ష్మణుడ్ని కూర్చోబెట్టుకుని అయోధ్యకు బయలు దేరాడు. వానరులు జయజయ ధ్వానాలు చేశారు. నగరమంతా రాముడికి ఎదురు వచ్చింది. నందిగ్రామం నుంచి అన్న పాదరక్షలు నెత్తిమీద వుంచుకుని భరతుడు వచ్చాడు.\r\n\r\nతరువాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది.\r\n\r\nఆబాల గోపాలమూ ఆనందించారు.\r\n\r\n“ఇదీ రామకథ! ధర్మజా! నీ వలె అడవుల్లో అష్టకష్టాలు పడిన రాకుమారుడు రాముడు పున్నాడు, అవమానాల పాలైన ద్రౌపదివంటి సాద్వి సీతమ్మ తల్లి వున్నది. రాకుమారులకు, రాగ ద్వేష రహితులకు కూడా కాలం ఎదురు తిరిగినపుడు కష్టాలు వస్తాయి సుమా!” అంటూ ముగించాడు మార్కండేయ మహర్షి.\r\n\r\nరఘురాముని దివ్య చరితాన్ని ఆలకించిన పాండవుల మనస్థయిర్యం రెట్టింపయింది. పులకించిన కామ్యకవనం పూలజల్లు కురిసింది.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1035,
        "IMAGE": "cat_15",
        "NAME": "వందే వాల్మీకి కోకిలం – 5",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 15,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తరుషుల్లో ఒకడిగా ప్రసిస్థుడు. అష్ట ప్రకృతుల్లో అద్వితీయుడు.\r\n\r\nవశిష్ఠునికి, విశ్వామిత్రుడికీ మధ్య విభేదాలు తల ఎత్తి ఒకరంటే మరొకరికి బొత్తిగా సరిపడకుండా పోయింది. ఒక రోజు కల్మశపాదుడనే రాజు జంతువులను వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా వశిష్ట మహర్షి కుమారుడు “శక్తి”ని రాజు గారు కలుసుకున్నాడు. కానీ, రాజుగారు ముని కుమారుణ్ణి ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ఆయనపట్ల అగౌరవంగా ప్రవర్తించాడు. అందుకు శక్తి ఆగ్రహించాడు, రాక్షసుడిగా మారిపొమ్మని రాజుని శపించాడు. కల్మశపాదుడు నరమాంస భక్షకుడిగా మారిపోయాడు. వెంటనే శక్తిని సంహరించి పొట్టన పెట్టుకున్నాడు. ఇది తెలిసి విశ్వామిత్రుడు పరమానంద భరితుడయ్యాడు. పైగా కల్మశపాదుడి దగ్గరకు వెళ్ళి “వశిష్ఠుడి సంసారాన్ని నాశనం చేయడానికి కావలసిన సాయమంతా చేస్తాను” అని అభయం కూడా ఇచ్చాడు. ఆ రకంగా వశిష్ఠ మహర్షి కుమారులు నూరుగురిని రాక్షసుడు హతమార్చాడు.\r\n\r\nవశిష్ఠుడు కొడుకుల్ని పోగుట్టుకొని భరించలేని దుఃఖంలో వున్నాడు. శక్తి చనిపోయేనాటికి అతని భార్య అదృశ్యంతి నిండు గర్భిణీ. ఆమె దినా రాత్రులు నిద్రాహారాలు మాని భర్తకోసం పరితపించింది. పలకరిస్తే చాలు గుండె పగిలేలా ఏడ్చేది. అడవిలో ఆశ్రమంలో మూగగా బ్రతికింది. కొన్నాళ్ళకు ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతనే పరాశరుడు.\r\n\r\nపెద్దయ్యాక పరాశరుడికి తన తండ్రిని ఒక రాక్షసుడు చంపి భక్షించాడని తెలిసింది, ఉగ్రుడాయ్యాడు. మొత్తం రాక్షస జాతిని తుదముట్టించేందుకు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం సాగుతోంది, క్రమేపీ వాడివేడి పుంజుకుంది. రాక్షసులు భయభ్రాంతులై పిచ్చిగా పరిగెత్తారు. దేవతలు, మునులు, పరాశరుడి తీవ్ర కోపానికి, యాగశక్తికి విస్తుపోయారు. ఆ సమయంలో అత్రిమహర్షి, మరి కొందరు మునులు పరాశరుని బ్రతిమాలి, నచ్చజెప్పి యాగం విరమించుకునేలా చేశారు. మహాభారతం ఆదిపర్వంలో ఈ కథ ఉంది.\r\n\r\nమరొకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అసురుల శస్త్రాగ్నికి సూర్యచంద్రులు తేజం కోల్పోయారు. సర్వత్రా చీకట్లు అలముకున్నాయి, చీకట్లను పారద్రోలమని దేవతలు అత్రి మహర్షిని వేడుకున్నారు. మహర్షి వారి కోరికను మన్నించి సూర్యచంద్రుల్లో విలీనం అయ్యాడు. వెంటనే చంద్రుడు వెన్నెల వెలుగులని దేవతలకు అందించాడు. ప్రచండ సూర్య తేజానికి అసురులు మలమలమాడి పోయారు. అత్రిమహర్షి వల్ల ఈ విధంగా దేవతలు రక్షింపబడినట్టు వాయుదేవుడు అర్జునుడికి చెప్పాడు. అనుశాసన పర్వములో ఈ కథ ఉంది\r\n\r\nకశ్యపుడు, అత్రి, వశిష్టుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, మరో ఇద్దరు మునిపత్నులు ప్రపంచ పర్యటనకు బయలుదేరారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా కరువుకాటకాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. శిబి చక్రవర్తి కుమారుడు వృష ధర్బి ప్రపంచ పర్యటనలో ఉన్న ముని పుంగవులు పిలిచి గోవులు, బంగారం, వెండి ఆభరణాలను ఇచ్చి సత్కరించాలి అనుకున్నారు.\r\n\r\nవెంటనే వాళ్ళ ఆహ్వానాలు పంపాడు. కానీ ఆ ఆహ్వానాన్ని మన్నించి తిరస్కరించారు.\r\n\r\nహోమం చేసి అగ్నిగుండం నుండి ఒక రాక్షసిని సృష్టించాడు. అత్రిమహర్షి, ఇతర మునులను హతమార్చవలసిందిగా వృష ధర్బి రాక్షసిని ఆదేశించాడు. అది వెళ్లి మారువేషంలో అడవిలో ఒక తామర కొలను దగ్గర నిలబడి ఉండగా అత్రి, ఇతర మహర్షులు అటుగుండా వెళ్లడం జరిగింది. మహర్షులు రాక్షసిని గుర్తించి, త్రిదండి తో దానిని చావబాదారు. తదనంతరం వాళ్లు బ్రహ్మలోకం వెళ్లారు.\r\n\r\nఅత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయ కుమారుడిని నిమి. నిమి కుమారుడు వెయ్యేళ్లు బ్రతికి ఆ తర్వాత తనువు చాలించాడు. తాతగారి ఆనతి మేరకు కుమారుడికి శ్రాద్ధకర్మలు జరిపించాడు నిమి. అప్పుడు అత్రి మహర్షి శ్రాద్ధకర్మల ప్రాముఖ్యాన్ని వివరించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1036,
        "IMAGE": "cat_15",
        "NAME": "అత్రి మహర్షి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 16,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది.\r\n\r\nఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంస నలుది దగ్గర విదర్భదేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలూ, గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది.\r\n\r\nఆ తరువాత ఆ హంస విదర్భకు వెళ్లి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు, గుణగణాలను పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మొహం కలిగింది. ఈ హంస రాయభారం ఫలితంగా నల దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.\r\n\r\nఇంతలో విదర్భ దేశపురాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం చాటించాడు. ఆ చాటింపు విని నానాదేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరుకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమా, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించిన వాడు గనక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు.\r\n\r\nదారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకుని అతన్ని పరీక్షించటానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేందుకు నలుణ్ణి రాయబారం వెళ్లమన్నారు. మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్లి దిక్పాలకులు కోరిక ఆమెకు తెలియచేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుణ్ణి ప్రేమించింది.\r\n\r\nస్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకొని దమయంతి సభలోకి వచ్చింది.  ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజుని ధాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒక చోట చెలికత్తెకు వరుసగా అయిదుగురు నలమహారాజులు కనిపించాయి. అందులో నిజంగా ఒకడే నలుడు. మిగిలిన నలుగురూ ఇంద్రాగ్ని యమ వరుణులు.\r\n\r\nఈ అయిదుగురినీ చూడగానే దమయంతి దిగ్భ్రమ చెంది, నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యధార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెళ్లోవేసింది.\r\n\r\nకొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు. కట్టుబట్టలతో నల దమయంతులు అడవులు పట్టి పోయినారు. ఆ సమయంలో వారు అష్ట కష్టాలూ పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమన్నాడు. కానీ దమయంతి భర్తతో పాటు కస్టాలు పడటానికే నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటంవల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రివేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు.\r\n\r\nదమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. యీనో ప్రయాసలుపది ఆఖరుకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుణ్ణి వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది.\r\n\r\nదమయంతిని విడిచిన తరువాత నలుడు అరణ్యంలో పోతూవుండగా ఒక పాము కరిచింది. ఆ విషయానికి అతని శరీరమంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఈ అవకాశం చూసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడిగా చేరాడు. నలుడు వంట చేయడంలో కూడా నేర్పరి. నలపాకం, భీమపాకం మాటలు వినేవుంటారు.\r\n\r\nదమయంతి పంపినవారిలో ఒక బ్రాహ్మడు రుతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బాహుకుణ్ణి చూసాడు. అతను నలుడే అయివుంటాడని పసిగట్టాడు. ఈ వార్త తీసుకొని విదర్భ చేరాడు.\r\n\r\nబాహుకుడు నలుడో కాదో తెలుసుకోవడం ఎలా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి “అశ్వ హృదయం” అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాలవ్యవధి లేకుండా రుతుపర్ణుణ్ణి విదర్భకు రప్పించితే రథాన్ని తోలటానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో “దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నాననీ స్వయంవరానికి రావాల్సిందని రుతుపర్ణుడికి కబురు పంపింది.\r\n\r\nమర్నాడే స్వయంవరం. రుతుపర్ణుడు ఎక్కడోవున్న విదర్భకు ఒక్క రోజులో ఎలా వెళ్తాడు? రాజు గారి విచారించడం చూసిన బాహుకుడు తాను సారధ్యం చేసి రుతుపర్ణుణ్ణి ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను సారధ్యానికి ఒప్పుకున్నాడు.\r\n\r\nబాహుకుడి సారద్యంవల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్దమని, బాహుకుడే నలుడని రుజువు చెయ్యటానికే ఈ ఎత్తు వేశారని రుతుపర్ణుడు తెలుసుకున్నాడు.\r\n\r\nఇంద్రుడి దయ వాళ్ళ నలుడు తన పూర్వ రూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడంవల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్ళి ఎప్పటిలాగే రాజ్యం పాలించామని ప్రార్థించారు. నలుడు వారికోరిక ప్రకారం తిరిగి నిషధదేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు.",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1037,
        "IMAGE": "cat_15",
        "NAME": "నల దమయంతి",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 17,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "మధురము \r\n\r\nనీ నామమే రామా \r\n\r\nమదినిండా \r\n\r\nనెరపుకొందు రామా \r\n\r\nమనిషిగ మహి \r\n\r\nవెలసిన రామా \r\n\r\nమానవ ధర్మము \r\n\r\nనెరపినావు రామా \r\n\r\nమహి అసురుల \r\n\r\nమర్ధించి నీవు రామా \r\n\r\nమహితాత్ముడవయినావు \r\n\r\nరామా ... ! \r\n\r\nచైత్రశుద్ధ నవమిన \r\n\r\nవెలసిన ఓ రామా\r\n\r\nచైతన్యమూర్తి వే \r\n\r\nనీవు రామా \r\n\r\nవిశ్వామిత్రుని వెంట \r\n\r\nనడచి రామా \r\n\r\nఅడవుల యాగములే \r\n\r\nకాచినావు రామా \r\n\r\nమిథిలా పురికి నడచి నీవు \r\n\r\nసీతను పరిణయ మాడి రామా \r\n\r\nసీతారాముడ వైనావు \r\n\r\nరామా ... ! \r\n\r\nఅయోధ్య ఆశల \r\n\r\nహరివిల్లు వై రామా \r\n\r\nఇక్ష్వాకుల కీర్తి \r\n\r\nనిలిపి నావు రామా \r\n\r\nసూర్య వంశ\r\n\r\nశౌర్యవుడవై రామా \r\n\r\nఇన కుల \r\n\r\nతిలకుడవైనావు రామా \r\n\r\nఇల ధర్మము \r\n\r\nనెరపిన నీవు రామా \r\n\r\nదశరథతనయుడవై రామా \r\n\r\nదశ దిశల మెరసినావు రామా \r\n\r\nనీ నామ గానమున \r\n\r\nగోపన్న రామా \r\n\r\nరామదాసుడై \r\n\r\nఖ్యాతి నొందె రామా \r\n\r\nనీ నామ కీర్తనముల \r\n\r\nత్యాగయ్య రామా \r\n\r\nఇల శాశ్వత కీర్తి \r\n\r\nనొందె రామా \r\n\r\nనీ నామ ఫలమున \r\n\r\nగద రామా \r\n\r\nహనుమ చిరంజీవి \r\n\r\nఅయినాడు రామా \r\n\r\nవెరసి నీ నామమే \r\n\r\nమా రాతల రామా \r\n\r\nశ్రీకారపు చుట్ట యాయె రామా ! \r\n\r\nరమ్యము \r\n\r\nనీ నామము రామా \r\n\r\nభవ్యము \r\n\r\nనీ గుణములు రామా \r\n\r\nనవ్యము \r\n\r\nనీ నడతలు రామా \r\n\r\nరామాయణ చరిత మాయె రామా \r\n\r\nనీ నామ జపము చేసి \r\n\r\nశివుడు రామా \r\n\r\nపరమశివుడే \r\n\r\nఅయినాడు రామా \r\n\r\nవెరసి నీ నామమే గదా \r\n\r\nరామా \r\n\r\nజగతికి తారక మంత్రమాయె \r\n\r\nరామా...!",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1038,
        "IMAGE": "cat_15",
        "NAME": "మధురము రామ నామము",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 18,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "తెలుగువారి సాంప్రదాయ ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి ఒక సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ సంవత్సరాల్లో తెలుగు పంచాంగం ని అనుసరించి ఉంటాయి.\r\n\r\nప్రతి 60 ఏళ్లకు ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది.  ప్రతిఏటా ఉగాది రోజున ఓ సంవత్సరం మరో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.\r\n\r\nఅలా చూసుకుంటే ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం వికారి నామ సంవత్సరం ముగిసి శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.\r\n\r\nఅలా 2020 లో ముగిసిన ప్రకారం వికారి నామ సంవత్సరం మళ్లీ 60 సంవత్సరాల తర్వాత అంటే 2079 వస్తుంది. ఈ కింద ఉన్న జాబితాను చదివితే మీకు మరింత అర్థం అవుతుంది.\r\n\r\nSNo\tTelugu_Year_Name\tTelugu_Translation\tFalling_Years\r\n1\tPrabhava\tప్రభవ\t1867, 1927, 1987, 2047\r\n\r\n2\tVibhava\tవిభవ\t1868, 1928, 1988, 2048\r\n\r\n3\tShukla\tశుక్ల\t1869, 1929, 1989, 2049\r\n\r\n4\tPramodyutha\tప్రమోద్యూత\t1870, 1930, 1990, 2050\r\n\r\n5\tPrajothpathhi\tప్రజోత్పత్తి\t1871, 1931, 1991, 2051\r\n\r\n6\tAngeerasa\tఅంగీరస\t1872, 1932, 1992, 2052\r\n\r\n7\tShreemukha\tశ్రీముఖ\t1873, 1933, 1993, 2053\r\n\r\n8\tBhaava\tభావ\t1874, 1934, 1994, 2054\r\n\r\n9\tYuva\tయువ\t1875, 1935, 1995, 2055\r\n\r\n10\tDhatha\tధాత\t1876, 1936, 1996, 2056\r\n\r\n11\tEashwara\tఈశ్వర\t1877, 1937, 1997, 2057\r\n\r\n12\tBhahudhanya\tబహుధాన్య\t1878, 1938, 1998, 2058\r\n\r\n13\tPramadi\tప్రమాది\t1879, 1939, 1999, 2059\r\n\r\n14\tVikrama\tవిక్రమ\t1880, 1940, 2000, 2060\r\n\r\n15\tVrusha\tవృష\t1881, 1941, 2001, 2061\r\n\r\n16\tChitrabhanu\tచిత్రభాను\t1882, 1942, 2002, 2062\r\n\r\n17\tSwabhanu\tస్వభాను\t1883, 1943, 2003, 2063\r\n\r\n18\tThaarana\tతారణ\t1884, 1944, 2004, 2064\r\n\r\n19\tPaarthiva\tపార్ధివ\t1885, 1945, 2005, 2065\r\n\r\n20\tVyaya\tవ్యయ\t1886, 1946, 2006, 2066\r\n\r\n21\tSarvaJithhu\tసర్వజిత్తు\t1887, 1947, 2007, 2067\r\n\r\n22\tSarvadhaari\tసర్వధారి\t1888, 1948, 2008, 2068\r\n\r\n23\tVirodhi\tవిరోధి\t1889, 1949, 2009, 2069\r\n\r\n24\tVikruthi\tవికృతి\t1890, 1950, 2010, 2070\r\n\r\n25\tKhara\tఖర\t1891, 1951, 2011, 2071\r\n\r\n26\tNandana\tనందన\t1892, 1952, 2012, 2072\r\n\r\n27\tVijaya\tవిజయ\t1893, 1953, 2013, 2073\r\n\r\n28\tYaja\tజయ\t1894, 1954, 2014, 2074\r\n\r\n29\tManmadha\tమన్మధ\t1895, 1955, 2015, 2075\r\n\r\n30\tDurmukhi\tదుర్ముఖి\t1896, 1956, 2016, 2076\r\n\r\n31\tHevalambhi\tహేవళంబి\t1897, 1957, 2017, 2077\r\n\r\n32\tVilambhi\tవిళంబి\t1898, 1958, 2018, 2078\r\n\r\n33\tVikari\tవికారి\t1899, 1959, 2019, 2079\r\n\r\n34\tSharvari\tశార్వరి\t1900, 1960,2020, 2080\r\n\r\n35\tPlava\tప్లవ\t1901, 1961, 2021, 2081\r\n\r\n36\tShubhakruthu\tశుభకృతు\t1902, 1962, 2022, 2082,\r\n\r\n37\tShobhakruthu\tశోభకృతు\t1903, 1963, 2023, 2083\r\n\r\n38\tKrodhi\tక్రోధి\t1904, 1964, 2024,2084\r\n\r\n39\tVishvavasu\tవిశ్వావసు\t1905, 1965, 2025, 2085\r\n\r\n40\tParabhava\tపరాభవ\t1906, 1966, 2026, 2086\r\n\r\n41\tPlavanga\tప్లవంగ\t1907, 1967, 2027, 2087\r\n\r\n42\tKeelaka\tకీలక\t1908, 1968, 2028, 2088\r\n\r\n43\tSowmya\tసౌమ్య\t1909, 1969, 2029, 2089\r\n\r\n44\tSadharana\tసాధారణ\t1910, 1970, 2030, 2090\r\n\r\n45\tVirodhikruthu\tవిరోధికృతు\t1911, 1971, 2031, 2091\r\n\r\n46\tPareedhavi\tపరీధావి\t1912, 1972, 2032, 2092\r\n\r\n47\tPramadeecha\tప్రమాదీచ\t1913, 1973, 2033, 2093\r\n\r\n48\tAananda\tఆనంద\t1914, 1974, 2034, 2094\r\n\r\n49\tRakshasa\tరాక్షస\t1915, 1975, 2035, 2095\r\n\r\n50\tNala\tనల\t1916, 1976, 2036, 2096\r\n\r\n51\tPingala\tపింగళ\t1917, 1977, 2037, 2097\r\n\r\n52\tKalayukthi\tకాళయుక్తి\t1918,1978, 2038, 2098\r\n\r\n53\tSidhharthi\tసిద్ధార్ధి\t1919, 1979, 2039, 2099\r\n\r\n54\tRoudri\tరౌద్రి\t1920, 1980, 2040, 2100\r\n\r\n55\tDurmathi\tదుర్మతి\t1921, 1981, 2041, 2101\r\n\r\n56\tDundubhi\tదుందుభి\t1922, 1982, 2042, 2102\r\n\r\n57\tRudhirodhari\tరుధిరోద్గారి\t1923, 1983, 2043, 2103\r\n\r\n58\tRakthakshi\tరక్తాక్షి\t1924, 1984, 2044, 2104\r\n\r\n59\tKrodhana\tక్రోధన\t1925, 1985, 2045, 2105\r\n\r\n60\tAkshaya\tఅక్షయ\t1926, 1986, 2046, 2106",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1039,
        "IMAGE": "cat_15",
        "NAME": "తెలుగు సంవత్సరం పేర్లు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 19,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "English\tTelugu\tPronunciation\r\n\r\nSpring\tవసంత రుతువు\tVasantha Ruthuvu\r\n\r\nSummer\tగ్రీష్మ రుతువు\tGreeshma Ruthuvu\r\n\r\nRainy\tవర్ష రుతువు\tVarsha Ruthuvu\r\n\r\nAutumn\tశరద్ రుతువు / శరదృతువు\tSharad Ruthuvu\r\n\r\nWinter\tహేమంత రుతువు\tHemantha Ruthuvu\r\n\r\nWinter & Fall\tశిశిర రుతువు\tSisira Ruthuvu",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1040,
        "IMAGE": "cat_15",
        "NAME": "తెలుగు ఋతువులు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 20,
        "TYPE_ID": 15
    },
    {
        "DESCRIPTION": "English Month\tTelugu_Month\tTelugu_Pronunciation\r\n\r\nMarch/April\tచైత్రము\tChaithramu\r\n\r\nApril/May\tవైశాఖము\tVaisaakhamu\r\n\r\nMay/June\tజ్యేష్ఠము\tJyeshtta\r\n\r\nJune/July\tఆషాఢము\tAashaadhamu\r\n\r\nJuly/August\tశ్రావణము\tSraavanamu\r\n\r\nAugust/September\tభద్రపదము\tBhaadhrapadamu\r\n\r\nSeptember/October\tఆశ్వయుజము\tAasveeyujamu\r\n\r\nOctober/November\tకార్తికము\tKaarthikamu\r\n\r\nNovember/December\tమార్గశిరము\tMaargaseershamu\r\n\r\nDecember/January\tపుష్యము\tPushyamu\r\n\r\nJanuary/February\tమాఘము\tMaakhamu\r\n\r\nFebruary/March\tఫాల్గుణము\tPhaalgunamu",
        "DESCRIPTION_ADD": "",
        "ID": 1041,
        "IMAGE": "cat_15",
        "NAME": "తెలుగు నెలలు",
        "STATUS": 1,
        "SUB_TYPE_ID": 21,
        "TYPE_ID": 15
    }
]